కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న యూనిఫైడ్ పెన్షన్ పథకంపై ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సెటైర్లు వేశారు. యూపీఎస్‌లో ‘యూ’ అంటే.. యూటర్న్స్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. అయితే ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత రవి శంకర్ ప్రసాద్ కాంగ్రెస్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. పెన్షన్ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారని అన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీని నేను ఒక్కటే అడగాలనుకుంటున్నా..ఎన్నికల ప్రచారంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌పై హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల హామీని అమలు చేస్తారా? అని ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పేరుతో ప్రచారం చేసింది. అది అమలు చేయడం సాధ్యం కాదని తెలుసుకుని లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చే ధైర్యం చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసమే అవికాని హామీలు ఇచ్చింది. ఇప్పుడు వాటిపై ప్రజల్లో నమ్మకం పోయిందని రవి శంకర్ ప్రసాద్ నొక్కాణించారు.
కాగా,కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయనుంది. ఏప్రిల్ 2025 నుండి అమల్లోకి వచ్చే యునైటెడ్ పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూటరీ స్కీమ్ అవుతుంది. ఈ పథకంలో ఉద్యోగులు 10 శాతం చెల్లించాల్సి ఉండగా..ప్రభుత్వం 18.5 శాతం చెల్లించనుంది.
Comments
Please login to add a commentAdd a comment