employees
-
జీవో 16పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్ : జీవో 16పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. క్రమబద్దీకరణ (రెగ్యూలరైజ్) ద్వారా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారి తొలగింపునకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.విద్య, వైద్య శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యూలరైజ్ చేసింది. 2016లో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ జీవో 16ను సవాల్ చేస్తూ నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ జీవోను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ సుజోయ్‌పాల్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా.. సుప్రీం కోర్టు తీర్పుకు, రాజ్యాంగంలోని 14, 16, 21 ఆర్టికల్‌కు ప్రభుత్వ నిర్ణయం విరుద్ధమన్న పిటిషనర్ల వాదనపై జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అనంతరం, క్రమబద్దీకరణ ద్వారా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారి తొలగింపునకు ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది.దీంతో పాటు మిగిలిన ఖాళీలను చట్టప్రకారం భర్తీ చేయాలని సర్కార్‌కు ఆదేశించింది. పూర్తి వివరాలను ఆర్డర్ కాపీలో పేర్కొంటోమని వెల్లడించింది. ఇప్పటికే క్రమబద్ధీకరణ అయిన ఉద్యోగులకు తొలగించొద్దన్న హైకోర్టు.. ఇకముందు భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్టప్రకారం చేయాలని ఆదేశించింది. ఇప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ కాకుండా నోటిఫికేషన్ల ద్వారా చేయాలని కోర్టు తీర్పును వెలువరించింది. -
మీటింగ్‌కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓ
సంస్థ నిర్వహించిన సమావేశానికి హాజరుకాలేదని.. దాదాపు ఉద్యోగులందరినీ సీఈఓ తొలగించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన మ్యూజిక్ కంపెనీలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఉదయం ఉద్యోగులందరీ సమావేశానికి హాజరుకావాలని కంపెనీ సీఈఓ వెల్లడించారు. కానీ ఈ సమావేశానికి 99 మంది హాజరుకాలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన సీఈఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరందరిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఆ కంపెనీలో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 110 మంది మాత్రమే. 99 మందిని తీసేస్తూ సీఈఓ నిర్ణయం వల్ల ఆ సంస్థలో 11 మంది మాత్రమే మిగిలారు.ఉద్యోగులను తొలగించడం మాత్రమే కాకుండా.. కంపెనీకి సంబంధించిన వస్తువులు మీ దగ్గర ఏవైనా ఉంటే తిరిగి ఇచ్చేయండి. అన్ని అకౌంట్స్ నుంచి లాగ్ అవుట్ అవ్వండి అంటూ సీఈఓ పేర్కొన్నారు. సమావేశానికి హాజరుకాలేదనే కారణంతో జాబ్ నుంచి తొలగించిన సీఈఓపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పని పూర్తి చేయడంలో నిమగ్నం కావడం వల్లనే, సమావేశానికి హాజరు కాలేదని ఉద్యోగులు చెబుతున్నారు.ఇదీ చదవండి: భర్తకు తెలియకుండా చేసిన పని.. బెంజ్ కంపెనీ బతికేలా చేసిందిఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక్క సమావేశానికి హాజరు కాలేదని సుమారు 90 శాతం మందిని తొలగించడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మిగిలిన 11 మంది ఉద్యోగులను సీఈఓ పీల్చి పిప్పి చేస్తాడు అని అన్నారు. ఇంకొందరు.. ఇలాన్ మస్క్ నుంచి ఆయన పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. -
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. వందలాది మందికి నోటీసులు
అమెరికన్ దిగ్గజ విమాన తయారీ సంస్థ 'బోయింగ్'.. 438మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేసింది. గతంలోనే ఈ సంస్థ ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన విషయాన్ని వెల్లడించినప్పటికీ.. ఎట్టకేలకు లేఆఫ్ నోటీసులను జారీ చేసింది. యూఎస్‌లోని సియాటెల్ ప్రాంతంలో కంపెనీకి చెందిన 33వేల మంది ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడంలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది.ఆర్ధిక పరమైన సమస్యలను రూపుమాపుకోవడానికి మాత్రమే కాకుండా.. ఉత్పత్తిలో జరిగిన ఆలస్యాలను దృష్టిలో ఉంచుకుని బోయింగ్ 438 మందికి లేఆఫ్ నోటీసులు అందించింది. ఇందులో 218 మంది ఇంజనీర్లు, సొసైటీ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ ఎంప్లాయీస్ ఇన్ ఏరోస్పేస్ (SPEEA) యూనిట్‌లోని సభ్యులు, మిగిలినవారు టెక్నీకల్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కంపెనీ తన ఉద్యోగులను తొలగించినప్పటికీ.. అర్హత కలిగిన వారికి మూడు నెలల వరకు కెరీర్ ట్రాన్సిషన్ సేవలు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందించనున్నట్లు సమాచారం.సమ్మె ఎఫెక్ట్సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులు సమ్మె చేయడం వల్ల.. 737 మ్యాక్స్, 767, 777 జెట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది. బోయింగ్ ఉన్న పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని కంపెనీ సీఈఓ గత నెలలోనే పేర్కొన్నారు. -
విశాఖ ఉక్కు కార్మికులకు అందని జీతాలు
-
ఆపద్భాంధవులకే ఆపద.. సమ్మె బాటలో 108 ఉద్యోగులు
సాక్షి, విజయనగరం జిల్లా : అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడే 108 ఉద్యోగులకు ఇప్పుడు పుట్టెడు కష్టాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 108 ఉద్యోగులు తరచూ వేతనాలు సకాలంలో అందక నానా అవస్థలు పడుతున్నారు. కుటుంబ భారాన్ని మోయలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ తరుణంలో తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ 108 ఉద్యోగులు రోడ్డెక్కనున్నారు. నవంబర్ 25 నుంచి సమ్మె చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు సమ్మె నోటీసులు అందించారు. జీతం బకాయిలు వెంటనే చెల్లించాలి. 108లను ప్రభుత్వమే నిర్వహించాలి. ఉద్యోగులను ఆరోగ్య శాఖ సిబ్బందిగా గుర్తించడంతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. -
EPFO: 7.66 లక్షల కంపెనీలు.. 7.37 కోట్ల మందికి పీఎఫ్
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో సభ్యత్వం గడిచిన ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. ఉద్యోగులకు చందా కట్టే కంపెనీల సంఖ్య 6.6 శాతం మేర పెరిగింది. దీంతో వీటి మొత్తం సంఖ్య 7.66 లక్షలకు చేరింది. అలాగే ఉద్యోగుల చేరికలు సైతం 7.6 శాతం పెరిగి ఈపీఎఫ్‌వో మొత్తం సభ్యుల సంఖ్య 7.37 కోట్లకు చేరినట్టు కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు విడుదల చేసింది.2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను ఈ నెల 8న జరిగిన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 109వ సమావేశం పరిగణనలోకి తీసుకున్నట్టు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. ఈపీఎఫ్‌వో కింద చందాలు జమ చేసే సంస్థలు 6.6 శాతం పెరిగి 7.66 లక్షలకు చేరాయి. చందాలు జమ చేసే సభ్యులు 7.6 శాతం పెరిగి 7.37 కోట్లుగా ఉన్నారు. మొత్తం 4.45 కోట్ల క్లెయిమ్‌లకు పరిష్కారం లభించింది.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!2022–23లో ఇవి 4.13 కోట్లుగా ఉన్నాయి. కొత్త కారుణ్య నియామక ముసాయిదా విధానం, 2024ను సైతం ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్టు కార్మిక శాఖ ప్రకటించింది. ఐటీ, మెరుగైన పరిపాలనా, ఆర్థిక సంస్కరణలపై చర్చించినట్టు.. వచ్చే కొన్ని నెలల పాటు ప్రతి నెలా సమావేశమైన సంస్కరణల పురోగతిని సమీక్షించాలని నిర్ణయించనట్టు తెలిపింది. -
కంపెనీ దురాశే.. ఉద్యోగుల తొలగింపు: శ్రీధర్ వెంబు ట్వీట్ వైరల్
కరోనా సమయంలో చాలా కంపెనీలు ఆర్థికంగా నష్టపోవడంతో.. ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. అయితే ఇప్పుడు సంస్థలు ఆర్థికంగా కుదుటపడుతున్నాయి, లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కూడా ఉద్యోగుల తొలగింపులు జరుగుతూనే ఉన్నాయి. దీనిపైన మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ.. జోహో ఫౌండర్ 'శ్రీధర్ వెంబు' కీలక వ్యాఖ్యలు చేశారు.100 కోట్ల రూపాయల క్యాష్ ఉన్న కంపెనీకి.. వార్షిక ఆదాయం 1.5 రెట్లు కంటే ఎక్కువ వచ్చింది. ఇప్పటికీ 20 శాతం లాభాలను గడిస్తోంది. మూడో త్రైమాసికంలో ఏకంగా రూ.18 కోట్ల ఆదాయం వచ్చింది. అంతే కాకుండా రూ. 40కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడానికి కూడా సంస్థ సిద్ధమైంది. ఇంత లాభాలతో ముందుకు సాగుతున్న కంపెనీ.. ఉద్యోగులలో 12 నుంచి 13 శాతం తొలగింపులు చేపట్టడం అంటే.. ఇది పెద్ద దురాశే అని శ్రీధర్ వెంబు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న 'ప్రెష్‌వర్క్స్' కంపెనీని ఉద్దేశించి శ్రీధర్ వెంబు ఈ వ్యాఖ్యలను చేసినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ కొన్ని రోజుల క్రితమే సుమారు 660 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు.ఇదీ చదవండి: ఏ హామీ లేకుండానే లోన్: నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనకంపెనీలు లాభాల్లో ఉన్నప్పటికీ.. ఉద్యోగులను తొలగించే సంస్కృతి కొన్ని అగ్రదేశాల్లో ఉంది. దానిని మనం భారతదేశానికి దిగుమతి చేసుకుంటున్నాము. ఇది ఉద్యోగులకు కంపెనీ మీద ఉన్న నమ్మకాన్ని చెరిపివేస్తుంది. సంస్థలో ఎప్పుడూ.. కస్టమర్లను, ఉద్యోగులను మొదటి స్థానంలో ఉంచాలి. ఆ తరువాత స్థానంలో వాటాదారులు ఉండాలని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.A company that has $1 billion cash, which is about 1.5 times its annual revenue, and is actually still growing at a decent 20% rate and making a cash profit, laying off 12-13% of its workforce should not expect any loyalty from its employees ever. And to add insult to injury,…— Sridhar Vembu (@svembu) November 7, 2024 -
ఇంటెల్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ సౌకర్యాలు మళ్లీ..
ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సిబ్బందికి ఉచితంగా కాఫీ, టీ వంటి పానీయాలు అందించే సౌకర్యాన్ని తిరిగి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. శ్రామికశక్తిని ఉత్తేజపరిచే ఈ నిర్ణయం అంతర్గత సందేశాల ద్వారా షేర్ చేసినట్లు తెలుస్తోంది.వ్యయ నియంత్రణ, నిర్వహణ సమస్యలతో సతమవుతున్న ఇంటెల్ దాదాపు ఏడాది తర్వాత తమ కార్యాలయ సంస్కృతిని మెరుగుపరచడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రోజువారీ జీవితంలో చిన్న సౌకర్యాల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నట్లు అంతర్గత సందేశంలో ఇంటెల్ పేర్కొంది."ఇంటెల్ ఇప్పటికీ ఖర్చు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, చిన్న సౌకర్యాలు మన దినచర్యలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మేము అర్థం చేసుకున్నాము. ఇది ఒక చిన్న అడుగు అని మాకు తెలుసు, కానీ మన కార్యాలయ సంస్కృతికి మద్దతు ఇవ్వడంలో ఇది అర్ధవంతమైనదని మేము ఆశిస్తున్నాము." అని వివరించింది.ఫ్రీ ఫ్రూట్స్‌కు నోఉచిత పానీయాల సౌకర్యాన్ని తిరిగి ప్రారంభిస్తున్నప్పటికీ, ఒకప్పుడు ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ఉచితంగా పండ్లు అందించే సౌలభ్యాన్ని మాత్రం కంపెనీ పునఃప్రారంభించడం లేదు. కంపెనీ నిరంతర వ్యయ-తగ్గింపు ప్రయత్నాలలో భాగంగా ఈ వసతిని మళ్లీ కల్పించేందుకు ఇంటెల్ సిద్ధపడలేదు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం
-
విశాఖ ఉక్కు కార్మికుల కఠిన నిర్ణయం..
-
ఉద్యోగుల ఉద్యమ బాట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై పది నెలలవుతున్నా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీ జేఏసీ) ఆవేదన వ్యక్తం చేసింది. కొత్త ప్రభుత్వమని ఇన్నాళ్లూ వేచి చూశామని తెలిపింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ప్రతి మంత్రి గడప తొక్కామని, తమ సమస్యలు సీఎం వద్దకు తీసుకెళ్లాలని విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొంది. తమ డిమాండ్లు దృష్టికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అపాయింట్మెంట్ కోరుతున్నా ఇవ్వడం లేదని వాపోయింది. సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రకటించింది. మంగళవారం టీఎన్జీవో కార్యాలయంలో టీజీ జేఏసీ (తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లతో కూడిన సంయుక్త కార్యాచరణ కమిటీ) విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల మొత్తం 51 డిమాండ్లు, అతి ముఖ్యమైన ఆరు డిమాండ్లకు సంబంధించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం జేఏసీ చైర్మన్, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. డీఏలు, హెల్త్‌కార్డులు ఏమయ్యాయి? ‘ఉద్యోగుల డిమాండ్లు, పెండింగ్ బిల్లులు, జీపీఎఫ్, ఇతర సమస్యలపై సమావేశంలో చర్చించాం. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఈ నెల 26న జరిగే కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మంత్రివర్గ భేటీలో ఉద్యోగుల సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకోకుంటే నిరసనలతో కూడిన కార్యాచరణతో ముందుకెళ్తాం. ప్రత్యేక తెలంగాణలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులు నేడు తమ సమస్యలకు సంబంధించి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి వస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఐదు డీఏలు ఇస్తామన్న హామీ ఏమైంది? జీపీఎఫ్‌లో ఉన్న డబ్బులను కూడా తీసుకునే పరిస్థితి లేదు. పీఆర్సీ ముచ్చటే లేదు. ఉద్యోగుల భాగస్వామ్యంతో హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరినా దాని ఊసేలేదు. హెల్త్‌కార్డులు ఇస్తామని తెచ్చిన జీవో ఏమైందో చెప్పాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలో వరదలు వస్తే ఉద్యోగులమంతా ఏకమై ప్రభుత్వానికి (సీఎంఆర్ఎఫ్) రూ.130 కోట్లు ఇచ్చాం. అప్పుడు రెండురోజుల్లో సమావేశం పెడతామన్నారు. ప్రభుత్వానికి చేదోడువాదోడుగా ఉంటున్న ఉద్యోగులకు, ప్రభుత్వం కూడా అదే విధంగా ఉండాలి. జేఏసీ ఏ పారీ్టకీ కొమ్ముకాయదు. ఉద్యోగుల సమస్యలపై మాత్రమే పోరాటం ఉంటుంది..’ అని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. సీఎం పేషీ ఉద్యోగులే సమస్యలపై ప్రశ్నిస్తున్నారు ‘మా సమస్యలపై ఎక్కని గడప లేదు. సీఎం దగ్గరకు వెళదామంటే పేషీ అధికారులు అపాయింట్మెంట్ లేదని చెబతున్నారు. కానీ అక్కడి ఉద్యోగులే డీఏ ఏమైంది? హెల్త్‌కార్డులు ఏమయ్యాయి? అని అడుగుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒకసారి కూర్చుని మాట్లాడితే మా సమస్యలు సగం వరకు పరిష్కారమవుతాయి. ఆయనపై విశ్వాసం ఉంది. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తూ ఉద్యోగులకు ఊరటనిచ్చారు. ప్రమోషన్లు, బదిలీలు చేపట్టి మా పక్షాన నిలిచిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి. ప్రజా ప్రభుత్వంలో భాగం చేయాలి..’ అని జేఏసీ నేతలు కోరారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లివీ.. 1. 2022 జూలై 1 నుంచి పెండింగ్‌లో ఉన్న ఐదు కరువు భత్యాలు (డీఏ)లు వెంటనే విడుదల చేయాలి. బకాయిలను నగదు రూపంలో చెల్లించాలి. 2. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేయాలి, ఇ–కుబేర్ వ్యవస్థను రద్దు చేయాలి. ట్రెజరీ విభాగం ద్వారా బిల్లులను క్లియర్ చేసే పాత విధానాన్ని పునరుద్ధరించాలి. 3. అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు/చర్చలు ఇప్పటికే పూర్తయినందున ధరల పెరుగుదల ప్రకారం 51 శాతం ఫిట్మెంట్తో 2వ పీఆర్సీ సిఫార్సుల నివేదిక తెప్పించుకుని అమలు చేయాలి. 4. ప్రభుత్వం, ఉద్యోగులు/ పెన్షనర్లు సమాన సహకారంతో ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అమలు చేయాలి. 5. కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్– యూపీఎస్ ) స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్ ( ఓపీఎస్) పథకాన్ని పునరుద్ధరించాలి. 6. జీవో–317 సమీక్షించాలి.317 జీవో బాధితులు కోరుకునే చోటకు బదిలీ చేయాలి. ఖాళీల లభ్యత కోసం అడగకుండా, వీలైనంత త్వరగా వెబ్సైట్ ద్వారా లేవనెత్తిన అన్ని ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించాలి. ఉద్యోగుల కార్యాచరణ ఇలా... – ఈ నెల 23 నుంచి 30 వరకు టీజీ జేఏసీ జిల్లా కమిటీల ఏర్పాటు – 28న సీఎం, సీఎస్‌లకు కార్యాచరణ లేఖ అందజేత – నవంబర్ 2న జేఏసీ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలతో జిల్లా కలెక్టర్లకు కార్యాచరణ లేఖ అందజేత – 4, 5 తేదీల్లో ర్యాలీలతో జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులకు వినతిప్రతాల సమర్పణ – 6న టీజీ జేఏసీ కార్యవర్గ సమావేశం – 7 నుంచి డిసెంబర్ 27 వరకు ఉమ్మడి పది జిల్లాల్లో ఉద్యోగుల పెండింగ్ సమస్యల సాధన సదస్సులు – జనవరి 3, 4 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు. భోజన విరామ సమయంలో ప్లకార్డులతో నిరసన – 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మౌన ప్రదర్శనలు, – 23న రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు, 30న రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు -
గూగుల్‌లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్
టెక్ దిగ్గజం సుందర్ పిచాయ్.. గూగుల్ కంపెనీలో ఉచిత భోజనం మీద ఎందుకు ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారనే విషయాన్ని వెల్లడించారు. 'ది డేవిడ్ రూబెన్‌స్టెయిన్ షో'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావించారు.సంస్థలో ఉచిత భోజనం అందించడం అనేది కేవలం ప్రోత్సాహకం మాత్రమే కాదు, దీని వెనుక లోతైన గొప్ప ప్రయోజనం ఉందని పిచాయ్ పేర్కొన్నారు. నేను గూగుల్‌లో చేరిన మొదట్లో కేఫ్‌లకు వెళ్ళినప్పుడు.. మరికొందరిని కలుసుకునేవాడిని. ఆలా కలుసుకున్నప్పుడు ఏదో మాట్లాడుతున్న సమయంలో కొత్త విషయాలు తెలుస్తాయి, అద్భుతమైన కొత్త ఆలోచనలు పుడతాయని అన్నారు.ఉచిత భోజనం అందించడం వల్ల ఉద్యోగులు కలిసే భోజనం తింటారు. అలా ఉద్యోగులు భోజనం తినే సమయంలో ఆవిష్కరణలు పెంపొందించడానికి కావాల్సిన ఆలోచనలు పుట్టుకొస్తాయి. దీని నుంచి వచ్చే ప్రయోజనంతో పోలిస్తే.. ఆహారం కోసం పెట్టే ఖర్చు చాలా తక్కువని పిచాయ్ పేర్కొన్నారు. ఉచిత భోజనం ఆర్థిక భారం కాదని.. సృజనాత్మకతకు, సమాజ నిర్మాణానికి దీర్ఘకాలిక పెట్టుబడి అని అన్నారు. ఉచిత భోజనం మాత్రమే కాకుండా.. కంపెనీ ఉద్యోగుల కోసం స్నేహపూర్వక కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుందని ఆయన అన్నారు.గూగుల్‌లో జాబ్ కోసం..ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలో 1,82,000 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగులలోని టాలెంట్‌ను గుర్తించి అలాంటి వారికి జాబ్ ఆఫర్స్ అందిస్తుందని సుందర్ పిచాయ్ అన్నారు. గూగుల్ కంపెనీలో జాబ్ కావాలంటే మారుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని కావలసిన నైపుణ్యం, అడాప్టబుల్ వంటివి పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు వేగంగా.. టెక్నాలజీకి అనుకూలంగా మారే సూపర్ స్టార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసం కంపెనీ ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటుందని అన్నారు.ఇదీ చదవండి: పండక్కి ముందే ధరల మోత.. ఇలా అయితే బంగారం కొనడం కష్టమే!క్రియేటివిటీ, ఇనోవేషన్స్ వంటి వాటిని పెంపొందించడంలో గూగుల్ కంపెనీ కీలక పాత్ర పోషిస్తుంది. ఉచిత భోజనాన్ని అందించే కంపెనీ సంప్రదాయాన్ని గురించి పిచాయ్ వివరిస్తూ.. ఇది సమాజాన్ని నిర్మించడంలో, కొత్త ఆలోచనలను రేకెత్తించడంలో సహాయపడుతుందని అన్నారు. -
ఇలా చేస్తున్నావేంటి పవన్?.. ఉద్యోగుల బైఠాయింపు
సాక్షి, విజయవాడ: వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినా పట్టించుకోరా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరుపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మండిపడుతున్నారు. నిన్నటి(సోమవారం) నుంచి పవన్ ఆఫీస్ వద్ద ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. పవన్ అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాస్తున్నారు.పవన్ కలవడం కోసం కటిక నేల మీదే కూర్చొని నిన్నంతా మహిళ ఉద్యోగులు కష్టాలు పడ్డారు. వినతిపత్రం ఇవ్వడానికి ఉద్యోగులు రాగా, పవన్ వారిని కలకుండా వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ కలవరు.. వెళ్ళిపొమంటూ సిబ్బంది చెప్పారు. నిన్నంతా జనసేన ఆఫీసే దగ్గరే మహిళా ఉద్యోగులు ఉన్నారు. పవన్‌ను కలిసేంత వరకు వెళ్లబోమంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జనసేన ఆఫీస్ దగ్గరే బైఠాయించారు.పిఠాపురం కూటమిలో కుంపట్ల రచ్చమరోవైపు, పిఠాపురం కూటమిలో కుంపట్ల రచ్చ సాగుతోంది. ‘పల్లె పండుగ’ సాక్షిగా టీడీపీ-జనసేన మధ్య విభేదాలు బయటపడ్డాయి. దళిత సర్పంచ్‌లకు విలువ ఇవ్వడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవఖండ్రవాడ పల్లె పండుగలో ఇరుపార్టీల నేతల మధ్య రగడ నెలకొంది. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌పై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పొత్తు ధర్మాన్ని పాటించని శ్రీనివాస్‌ను తక్షణమే ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించాలని.. ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు.ఇదీ చదవండి: పచ్చపార్టీలో కొత్త చిచ్చు -
EPFO: 18.53 లక్షల మందికి కొత్తగా పీఎఫ్
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో (ఈపీఎఫ్‌వో) ఆగస్టులో నికరంగా 18.53 లక్షల మంది కొత్త సభ్యులు జతయ్యారు. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఇది 9.07 శాతం అధికం. ఉద్యోగావకాశాలు, ఉద్యోగులకు లభించే ప్రయోజనాలపై అవగాహన పెరుగుతుండటం, ఈపీఎఫ్‌వో ప్రచార కార్యక్రమాలు మొదలైనవి ఇందుకు దోహదపడినట్లు కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.కొత్తగా చేరిన వారిలో 18–25 ఏళ్ల వయస్సు వారి వాటా గణనీయంగా ఉన్నట్లు పేర్కొంది. ఉద్యోగాల్లో తొలిసారి చేరేవారు, యువత సంఖ్య పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని వివరించింది. దాదాపు 13.54 లక్షల మంది ఉద్యోగాలు మారి, తిరిగి ఈపీఎఫ్‌లో చేరినట్లు పేర్కొంది.రాష్ట్రాలవారీగా చూస్తే నికరంగా కొత్తగా చేరిన సభ్యుల సంఖ్యను బట్టి మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. కర్ణాటక, తమిళనాడు, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి చేరిన వారి సంఖ్య తలో అయిదు శాతం పైగా ఉంది. -
400 మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేశాడు!
సాధారణంగా కంపెనీల అధినేతలు తమ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు. ఉద్యోగులను ప్రయోజనాలను పట్టించుకోరు. కానీ ఓ కంపెనీ ఫౌండర్ తీసుకున్న నిర్ణయం ఆ సంస్థలోని 400 మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేసింది.భారతీయ సంతతికి చెందిన జ్యోతి బన్సల్ తన మొదటి సాఫ్ట్వేర్ స్టార్టప్ యాప్‌డైనమిక్స్‌ను 2017లో విక్రయించినప్పుడు తన కెరీర్లో అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తన స్టార్టప్‌ను 3.7 బిలియన్ డాలర్లకు (ప్రస్తుత విలువ రూ. 31,090 కోట్లు) సిస్కోకు విక్రయించడం అప్పుడు సరైన నిర్ణయమేనని ఆయన భావించారు. కంపెనీలో 14 శాతానికి పైగా వాటా ఉన్న బన్సల్‌కు కూడా ఈ ఒప్పందం ఆర్థికంగా ముఖ్యమైనది. సిస్కో ఆఫర్‌ను అంగీకరించిన తర్వాత 400 మంది యాప్‌డైనమిక్స్ ఉద్యోగుల షేర్స్ విలువ ఒక మిలియన్ డాలర్లకు ఎగబాకినట్లు బన్సల్ ప్రతినిధి తెలిపారు. దీంతో వీరందరూ కోటీశ్వరులయ్యారు.అప్లికేషన్స్ అండ్ బిజినెస్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన యాప్‌డైనమిక్స్‌ను జ్యోతి బన్సల్ 2008లో స్థాపించారు. ఈ స్టార్టప్ సరిగ్గా ఐపీఓకి వచ్చే ఒక రోజు ముందు విక్రయించారు. ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన బన్సాల్ ప్రస్తుతం ట్రేసబుల్, హార్నెస్ అనే మరో రెండు సాఫ్ట్వేర్ స్టార్టప్‌లకు సీఈవో, కో ఫౌండర్.ఎవరీ జ్యోతి బన్సల్?జ్యోతి బన్సల్ రాజస్థాన్‌లోని ఒక చిన్న పట్టణంలో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి నీటిపారుదల యంత్రాలను విక్రయించే వ్యాపారం చేసేవాడు. 1999లో ఢిల్లీ ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీ అభివృద్ధిలో మక్కువ ఉన్న జ్యోతి బన్సల్ 2017లో ఆయన బిగ్ ల్యాబ్స్‌ను ప్రారంభించారు. 2018లో జాన్ వ్రియోనిస్తో కలిసి అన్‌యూజవల్ వెంచర్స్‌ను సహ-స్థాపించారు. జ్యోతి బన్సల్ ప్రస్తుతం యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు. -
సమ్మె ఎఫెక్ట్.. 17వేల ఉద్యోగాల కోత
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్.. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో సుమారు 10 శాతం మందిని తొలగించడానికి సన్నద్ధమైంది. సీఈఓ కెల్లీ ఓర్ట్బర్గ్ ప్రకారం.. ఏరోస్పేస్ దిగ్గజం 17,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె కారణంగా 737 మ్యాక్స్, 767, 777 జెట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది.ప్రస్తుతం బోయింగ్ ఉన్న పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. బోయింగ్ తొలగించనున్న ఉద్యోగులలో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్స్ ఉండనున్నట్లు సమాచారం. అయితే ఏ విభాగంలో ఎంతమందిని తొలగించనున్నారు అనే వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.ఇదీ చదవండి: గూగుల్‌లో జాబ్ కోసం ఇవి తప్పనిసరి: సుందర్ పిచాయ్బోయింగ్ ఉద్యోగుల సమ్మె కారణంగా విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో 777ఎక్స్ జెట్ డెలివరీలు ఆలస్యం కానున్నాయి. ఈ జెట్ డెలివరీలు 2026లో జరగాల్సి ఉంది. కానీ ఉత్పత్తి ఆలస్యం కావడం వల్ల డెలివరీలు మరింత ఆలస్యమయ్యాయి. దీనివల్ల సంస్థ షేర్స్ కూడా 1.1 శాతం క్షీణించాయి. ప్రస్తుతం కంపెనీ ఆర్థికంగా నిలబడటానికి ఉద్యోగుల తొలగింపు చాలా అవసరం. -
పని చేసిన సంస్థకే కన్నం.. రూ.6 కోట్ల విలువైన నగలతో ఉడాయించిన ఉద్యోగులు
సాక్షి,హైదారాబాద్ : పని చేసిన సంస్థకే కన్నం వేశారు ఉద్యోగులు. రూ.6 కోట్ల విలువైన నగలతో ఉడాయించారు. నగల్ని మాయం చేసిన ప్రబుద్ధుడితో పాటు అతనికి సహకరించిన సిబ్బంది గురించి పోలీసులు ఆరాతీస్తున్నారు. బంజారాహిల్స్ శ్రీ కృష్ణ జ్యువెలర్స్ షోరూంలో భారీ చోరీ జరిగింది. రూ.6 కోట్ల విలువైన బంగారు నగలు మాయమయ్యాయి. అయితే అదే షోరూంలో ప్రస్తుతం, గతంలో పనిచేసిన ఉద్యోగులకు దుర్బుద్ది పుట్టి అందరూ ఓ ముఠాగా ఏర్పడ్డారు. భారీ చోరీకి పాల్పడ్డారు. చోరీ జరిగినప్పటి నుంచి మేనేజర్ సూకేతు షా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మేనేజర్ సుకేతు షాతో పాటు ఉదయ్ కుమార్, చింటు, సత్య, అజయ్, టింకు, చంద్ర, శ్రీకాంత్ బబ్బూరిలపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. కేసులో ట్విస్ట్..మరోవైపు రూ..6 కోట్ల నగల మాయం కేసులో కీలక పాత్రపోషించిన మేనేజర్, తన భర్త సూకేతు షా కనిపించడం లేదంటూ అతని భార్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ మేనేజ్మెంట్ వేధింపుల కారణంగానే తన భర్త అదృశ్యం అయ్యాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. లెటర్‌తో పాటు,ఓ వీడియోను సైతం పోలీసులకు అందించారు. -
మానసిక ఆరోగ్యంతోనే అభివృద్ధి
మానవ సమాజంలో పని అనేది ఒక అంత ర్భాగం. మానవుడు ఆహా రం కోసం చేసే వెదుకు లాట/ వేట మొట్టమొదటి పనిగా చెప్తారు. 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం పని గంటలు, పని ‘సంస్కృతి’లో అనేక మార్పులు తీసుకువచ్చింది. పరిశ్రమలు, కార్మికులు కలసి ఒక సంస్థాగత వ్యవస్థగా ఏర్ప డ్డారు. టెక్నాలజీ అభివృద్ధి చెందడం, ఇంటర్నెట్ ప్రవేశంతో కొత్తకొత్త ఉద్యోగాల రూపకల్పన జరగడం ప్రారంభమయింది. యాంత్రికీకరణ, కృత్రిమ మేధ అభివృద్ధితో ఇది మరింత కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక మనిషి తన జీవిత కాలంలో సుమారుగా తొంభైవేల నుండి ఒక లక్ష గంటల పాటు పని ప్రదేశంలోఉంటాడని అంచనా. అంటే యుక్త వయసు నుండి రిటైరయ్యే వరకు ఉన్న జీవిత కాలంలో ఇది సుమారు మూడు వంతుల సమయం. ఒక ఉద్యోగస్థుడు తన సహ చరులతో ఇంతకాలం గడపడం వలన వారితో ప్రత్యేక అనుబంధం ఏర్పరుచుకుంటాడు. ఈ బంధాలు, పనిచేసే వాతావరణం, యాజమాన్యంతో ఉండే సంబంధం... ఇవన్నీ ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని చాలావరకు ప్రభావితం చేస్తాయి. కనుకనే ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ‘పని చేసే ప్రదేశంలో మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి’ అనే నినాదంతో ఈ సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపు కుంటోంది. పని ప్రదేశాల్లో ఒత్తిడి అనేది అత్యంత సహజ మైన విషయం. అయితే ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోతే పలు రకాల శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. ఒక సర్వే ప్రకారం ప్రతీ పదిమందిలో ఎనిమిది మంది ఏదో ఒక రకమైన ఒత్తిడిని ఎదు ర్కొంటున్నట్లు తేలింది. ప్రతి నలుగురిలో ఒకరు చికిత్స అవసరం అయిన మానసిక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలా బాధపడే వారిలో కేవలం నలభై శాతం మంది మాత్రమే సరైన వైద్య సహాయం పొందుతున్నారు. అయితే ఇది ఉద్యోగి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం ద్వారా ఉత్పాదకతను కూడా తగ్గిస్తుంది. ఇది మిగిలిన ఉద్యోగుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక ఉద్యోగితో పాటుగా యాజమాన్యాలు / సంస్థలు తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద తగిన జాగ్రత్తలు తీసు కోవలసిన అవసరం ఉంది. సరైన సమయపాలన పాటించడం, ఒత్తిడికి గురైనపుడు సహచరుల, యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళి సహాయం పొందడం; పనికి, వ్యక్తిగత జీవితానికి హద్దులు పెట్టుకొని కొంత సమయం తనకోసం మాత్రమే కేటాయించుకోవడం, వారాంతాల్లో కుటుంబ సభ్యులతో సమయం గడపడం, పనిలో అప్పుడప్పుడు కొంత విరామం తీసుకోవడం లాంటివి చేయడం ద్వారా ఉద్యోగి ఒత్తిడిని కొంత వరకు తగ్గించవచ్చు. విభిన్న షిఫ్ట్ సిస్టవ్ులో పనిచేసే దంపతులు కలిసి ఉండే సమయం తక్కువ అవడంవల్ల కలిసి క్వాలిటీ టైవ్‌ు గడిపే అవకాశాలు సన్నగిల్లి వీరి మధ్య కొన్ని మనస్పర్థలు, అనుమా నాలు తలెత్తే అవకాశముంది. సమర్థంగా పనిచేసే వారిని యాజమాన్యం ఎప్పటికప్పుడు ప్రోత్సహించి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల వీరిలో మానసిక స్థైర్యం పెంపొందుతుంది. మహిళా ఉద్యోగులు, ఒకవైపు ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ; మరోవైపు ఉద్యోగ బాధ్యతల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. అలాంటి వారి ఎడల సంస్థలు కొన్ని వెసులుబాట్లు ఇస్తే, వీరు ఒత్తిడికి లోను కాకుండా ఉండగలరు. కంపెనీలు కూడా ఈ మధ్య కాలంలో ‘వర్క్ ఫ్రమ్ హోవ్‌ు’ను ప్రోత్సహించడం వలన ఉద్యో గుల్లో ఉత్పాదకత పెరిగినట్లు గణాంకాలు చెబు తున్నాయి. ప్రతి సంస్థ అర్హత కలిగిన మానసిక వైద్యులు లేదా క్లినికల్ సైకాలజిస్టుల సేవలు తమ ఉద్యోగులకు కల్పించాలి. యోగా, ధ్యానం, ఒత్తిడి గురించి వర్క్‌షాప్స్ వంటి కార్యక్రమాలు తరచుగా తమ సంస్థల్లో జరిగేలా ఏర్పాట్లు చేయాలి. ఒక క్రమ పద్ధతిలో నైపుణ్య పరీక్షలు జరిపి అర్హులైన వారికి ఇంక్రిమెంట్లు, పదోన్న తులు, ఇతర వసతులు కల్పించడం ద్వారా ఉద్యోగస్థుల్లో సంతృప్తి శాతాన్ని పెంచవచ్చు. ఎప్పుడైతే ఉద్యోగస్థులు తమ పనిపట్ల తృప్తితో ఉంటారో వారు మరింత పాజిటివ్ ధృక్పథంతో, సంస్థ అభివృద్ధికి కృషిచేస్తారు. వారు మిగిలిన వారికి ఒక మంచి ఉదాహరణగా నిలిచి, ఒక చక్కని పని సంస్కృతి అనేది సంస్థలో అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని సంస్థలు పని ప్రదేశాల్లో ఉద్యోగుల, కార్మికుల మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. జీవితంలోగాని,వృత్తిలో గాని విజయం సాధించాలంటే మనసును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకోవడమనేది చాలా ముఖ్యమని అందరూ గుర్తించాలి. డా‘‘ ఇండ్ల రామసుబ్బారెడ్డి వ్యాసకర్త ప్రముఖ మానసిక వైద్యనిపుణులు(రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం) -
సారూ..జీతాలెప్పుడు?
-
కేంద్రం శుభవార్త: ఆ ఉద్యోగులకు రూ.2,029 కోట్ల బోనస్
దసరా, దీపావళి వచ్చిందంటే.. ఉద్యోగుల్లో ఆనందం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో చాలా కంపెనీలు బోనస్, ఇంక్రిమెంట్స్ వంటివి అందిస్తాయి. మరికొన్ని ప్రైవేట్ సంస్థలైతే ఖరీదైన కార్లు, బైకులను శాతం గిఫ్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా కేంద్రం రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.రైల్వే ఉద్యోగులకు రూ. 2,029 కోట్ల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది 11,72,140 మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అర్హత కలిగిన ఉద్యోగులందరికీ.. రూ. 7000 కనీస వేతనం కింద 78 రోజులకు బోనస్ అందించనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఎస్బీఐ చైర్మన్ కీలక ప్రకటన: ఈ ఆర్థిక సంవత్సరంలో..రైల్వే శాఖలో ట్రాక్ మెయింటెనెర్స్, స్టేషన్ మాస్టర్స్, టెక్నీషియన్స్, సూపర్ వైజర్స్, పాయింట్స్ మెన్, గార్డ్స్, లోకో పైలెట్స్, మినిస్టీరియల్ స్టాప్, గ్రూప్-సీ విభాగాలకు చెందిన ఉద్యోగులు బోనస్ పొందనున్నారు. 58,642 ఖాళీల భర్తీ ప్రక్రియ కూడా కొనసాగుతుందని, రిక్రూట్మెంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అశ్విని వైష్ణవ్ అన్నారు.रेलवे इम्प्लॉईज़ के लिए 2 हजार 29 करोड़ रुपये का प्रोडक्टिविटी लिंक्ड बोनस माननीय प्रधानमंत्री जी की अध्यक्षता में कैबिनेट में अप्रूव हुआ है-माननीय रेल मंत्री @ashwinivaishnaw जी#ShramevJayate pic.twitter.com/15bHeQufpZ— Ministry of Railways (@RailMinIndia) October 3, 2024 -
మూడో రోజుకు ఉక్కు ఉద్యమం.. సీఎండీ ని కలవనున్న కార్మిక నేతలు
-
నేడు స్టీల్ ప్లాంట్ సీఎండీని కలవనున్న పోరాట కమిటీ నేతలు
-
స్టీల్ ప్లాంట్ కార్మికుల సమరం
-
ఉద్యోగులను తొలగించేందుకు ట్రైనింగ్!!
ఉద్యోగంలో చేర్చుకోవడం ఎంత ముఖ్యమో.. తొలగించడం కూడా అంతే ముఖ్యం అంటూ, టెక్ కంపెనీ జర్నీ సీఈఓ 'ఆండ్రియాస్ రోట్ల్' (Andreas Roettl) చెబుతున్నారు. దీనికోసం నైపుణ్యం అవసరమని తమ మేనేజర్లను, టీమ్ లీడర్లకు సంస్థలే ట్రైనింగ్ ఇవ్వాలని అన్నారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఫోటో ప్రింటింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్న టెక్ సంస్థ జర్నీ సీఈఓ ఆండ్రియాస్ రోట్ల్.. నాయకులంటే ఉద్యోగులను నియమించుకోవడం మాత్రమే కాదు, తొలగించడంలో కూడా కొంత నైపుణ్యం కలిగి ఉండాలని పేర్కొన్నారు. అంతే కాకుండా నేను ఉద్యోగులను తొలగించడంలో చాలా మంచివాడినని ఆండ్రియాస్ పేర్కొన్నారు.జర్నీ సంస్థలో ఉద్యోగులను ఎలా తొలగించాలో మా లీడ్‌లకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెడతాము. మీరు కూడా అలా చేయాలని ఆండ్రియాస్ వెల్లడించారు. ఉద్యోగి పనితీరును అంచనా వేయడానికి తొలగింపు విధానాలను తప్పకుండా నేర్చుకోవాలి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఉపయోగించడం వంటివి కూడా తెలుసుకోవాలి. పనితీరు ఎక్కువగా ఉన్న సిబ్బందికి మద్దతు ఇవ్వడం అత్యంత ప్రాధాన్యం అని అన్నారు.తొలగించడానికి సంబంధించిన విధానాన్ని ఆండ్రియాస్ రోట్ల్ ఫుట్‌బాల్ ఆటతో పోల్చారు. ఇక్కడ ఆటగాళ్లకు హెచ్చరికగా పసుపు కార్డు అందుతుంది. దీనిని మొదటి హెచ్చరికగా వెల్లడించాలి. పనితీరును మెరుగుపరచుకోవాలి, కష్టపడుతున్న ఉద్యోగులతో సంభాషణలు జరపాలని చెప్పాలి.ఇదీ చదవండి: పోయిన రూ.5 కోట్ల కారు: పట్టించిన ఎయిర్‌పాడ్స్ - ఎలా అంటే?మొదటిసారి పసుపు కార్డు అందుకున్న వ్యక్తి పనితీరులో ఎలాంటి పురోగతి కనిపించకపోతే.. రెండవ పసుపు కార్డును ఇవ్వాలి. ఇది వారు తమ ఉద్యోగానికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని తెలియజేస్తుందని అన్నారు. రెడ్ కార్డు ఇవ్వాల్సిన సందర్భాలు వస్తే.. అది వేరే కథ. దానికి వేరే ప్రాసెస్ ఉంటుందని అన్నారు. ఆండ్రియాస్ రోట్ల్ చేసిన పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. అయితే ఆండ్రియాస్ ఫాలో-అప్ సందేశాన్ని పేర్కొన్నారు. నా సందేశం వల్ల బాధ కలిగి ఉండే క్షమాపణలు కోరుతున్నా అని అన్నారు. -
ఉద్యమాన్ని ఉధృతం చేసిన విశాఖ ఉక్కు కార్మికులు