సాక్షి, విజయవాడ: వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినా పట్టించుకోరా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరుపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మండిపడుతున్నారు. నిన్నటి(సోమవారం) నుంచి పవన్ ఆఫీస్ వద్ద ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. పవన్ అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు కాస్తున్నారు.
పవన్ కలవడం కోసం కటిక నేల మీదే కూర్చొని నిన్నంతా మహిళ ఉద్యోగులు కష్టాలు పడ్డారు. వినతిపత్రం ఇవ్వడానికి ఉద్యోగులు రాగా, పవన్ వారిని కలకుండా వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ కలవరు.. వెళ్ళిపొమంటూ సిబ్బంది చెప్పారు. నిన్నంతా జనసేన ఆఫీసే దగ్గరే మహిళా ఉద్యోగులు ఉన్నారు. పవన్‌ను కలిసేంత వరకు వెళ్లబోమంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జనసేన ఆఫీస్ దగ్గరే బైఠాయించారు.
పిఠాపురం కూటమిలో కుంపట్ల రచ్చ
మరోవైపు, పిఠాపురం కూటమిలో కుంపట్ల రచ్చ సాగుతోంది. ‘పల్లె పండుగ’ సాక్షిగా టీడీపీ-జనసేన మధ్య విభేదాలు బయటపడ్డాయి. దళిత సర్పంచ్‌లకు విలువ ఇవ్వడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవఖండ్రవాడ పల్లె పండుగలో ఇరుపార్టీల నేతల మధ్య రగడ నెలకొంది. పిఠాపురం జనసేన ఇన్‌ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌పై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పొత్తు ధర్మాన్ని పాటించని శ్రీనివాస్‌ను తక్షణమే ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తొలగించాలని.. ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఇదీ చదవండి: పచ్చపార్టీలో కొత్త చిచ్చు
Comments
Please login to add a commentAdd a comment