
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన వయాకామ్18.. ది వాల్ట్ డిస్నీ కో. ఇండియా యూనిట్ మధ్య కొత్తగా ఏర్పడిన జాయింట్ వెంచర్ విలీనం తర్వాత 'జియోస్టార్' (Jiostar) ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తొలగింపులు ప్రక్రియ మొదలైనట్లు.. లేఆప్స్ జూన్ వరకు కొనసాగుతాయని చెబుతున్నారు.
జియోస్టార్ లేఆప్స్ ప్రభావం సుమారు 1100 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. ఇందులో ఎంట్రీ లెవల్ ఉద్యోగులు, సీనియర్ మేనేజర్లు, సీనియర్ డైరెక్టర్లు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు.
అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీ, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వంటి అనేక హై-ప్రొఫైల్ టోర్నమెంట్ల ప్రసారాన్ని నిర్వహిస్తున్నందున, మీడియా దిగ్గజం క్రీడా విభాగంలో పనిచేసే ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది.
ఐపీఎల్ 2025 సమయంలో భారీ లాభాలను చవిచూడటమే లక్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి పూనుకుంది. లేఆప్స్ ప్రభావానికి గురైన ఉద్యోగులకు.. వారి పదవీకాలాన్ని బట్టి 6-12 నెలల జీతంతో సహా ఇతర ప్యాకేజీలను అందించనున్నట్లు సమాచారం.
జియోస్టార్ నవంబర్ 2024లో రిలయన్స్ నేతృత్వంలోని వయాకామ్18, స్టార్ ఇండియా మధ్య జాయింట్ వెంచర్‌గా ఏర్పడింది. దీంతో 8.5 బిలియన్ డాలర్ల మీడియా దిగ్గజం అవతరించింది. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ దిగ్గజాలను ప్రత్యర్థిగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment