jobs
-
ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలు
గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో.. ప్రముఖ టెక్ కంపెనీ 'టీసీఎస్' కీలక ప్రకటన చేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో భారీ రిక్రూట్మెంట్స్ ఉంటాయని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 'మిలింద్ లక్కడ్' పేర్కొన్నారు.వచ్చే ఏడాది సుమారు 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉందని.. మిలింద్ లక్కడ్ అన్నారు. అంతే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జనరేటివ్ ఏఐ (GenAI)తో సహా అత్యాధునిక సాంకేతికతలలో ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.కేవలం ఫ్రెషర్లను మాత్రమే కాకుండా.. హయ్యర్ క్యాడర్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచుకోకున్నట్లు సమాచారం. సుమారు ఏడాది తరువాత కంపెనీ నియమాలను గురించి వెల్లడించింది. కరోనా మహమ్మారి తరువాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడ్డారు.ఏఐ వంటి లేటెస్ట్ టెక్నాలజీలు పెరుగుతున్న క్రమంలో ఐటీ కంపెనీలు.. ఈ రంగంలో అభివృద్ధి చెందడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే తమ ఉద్యోగులకు ఈ టెక్నాలజీలలో శిక్షణ ఇవ్వడానికి ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నాయి.ఇదీ చదవండి: టెక్ దిగ్గజం కీలక నిర్ణయం: 10 శాతం ఉద్యోగులు బయటకువారానికి ఐదు రోజులుకరోనా తరువాత ఉద్యోగులందరూ ఆఫీసు నుంచే పనిచేయాలని, వారానికి ఐదు రోజులు ఆఫీసులో ఉండాలని పలు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ జాబితాలో టీసీఎస్ కూడా ఉంది. ఈ విధానాన్ని అమలు చేయడానికి.. కంపెనీ ప్రోత్సాహకాలతో ముడిపెట్టింది. కార్యాలయ సంస్కృతిని బలోపేతం చేయడానికి, సహకారాన్ని మెరుగుపరచడానికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మళ్ళీ మొదలుపెట్టింది. -
కొత్త సంవత్సరంలో జాబ్స్ పెరుగుతాయా? తగ్గుతాయా?
వచ్చే ఏడాదిలో నియామకాలు జోరుగా సాగనున్నాయి. 9 శాతం మేర నియామకాలు పెరగనున్నట్టు జాబ్ ప్లాట్‌ఫామ్ ఫౌండిట్ (గతంలో మాన్స్టర్ ఏపీఏసీ) వెల్లడించింది. ముఖ్యంగా ఐటీ, రిటైల్, టెలికం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో నియామకాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేసింది. ఈ ఏడాది మొత్తం మీద 10 శాతం మేర ఉపాధి అవకాశాల్లో వృద్ధి ఉంటుందని, రానున్న రోజుల్లో ఈ ధోరణి వేగాన్ని అందుకుంటుందని తెలిపింది.కొత్త టెక్నాలజీలు, మారుతున్న వ్యాపార సంస్థల ప్రాధాన్యతలు 2025లో ఉద్యోగ మార్కెట్ తీరును నిర్ణయించనున్నట్టు ఫౌండిట్ పేర్కొంది. ఎడ్జ్ కంప్యూటింగ్, క్వాంటమ్ అప్లికేషన్స్, అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ సిస్టమ్‌లు.. తయారీ, హెల్త్‌కేర్, ఐటీ రంగాల్లో మార్పును తీసుకురానున్నట్టు వివరించింది. 2023 జనవరి నుంచి 2024 నవంబర్ వరకు ఫౌండిట్ ప్లాట్‌ఫామ్‌పై డేటా విశ్లేషణ ఆధారంగా ఈ వివరాలను విడుదల చేసింది. రిటైల్ మీడియా నెట్‌వర్క్‌లు, ఏఐ ఆధారిత విశ్లేషణ టూల్స్‌తో ఈ–కామర్స్, హెచ్ఆర్, డిజిటల్ సేవల్లో నిపుణుల అవసరాల తీరును మారుతుందని పేర్కొంది. డిజిటల్ మార్కెటింగ్, యాడ్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ అనలైటిక్స్‌లో నిపుణులను సంస్థలు నియమించుకుంటాయని తెలిపింది. ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై పన్ను మినహాయించేనా?ఈ ఏడాదీ నియామకాల్లో జోరు..2023తో పోల్చి చూసినప్పుడు ఈ ఏడాది అన్ని రంగాల్లో, అన్ని పట్టణాల్లో జాబ్ మార్కెట్ బలమైన వృద్ధిని చూసినట్టు ఫౌండిట్ తెలిపింది. తయారీలో 30 శాతం, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో 29 శాతం, రియల్ ఎస్టేట్‌లో 21 శాతం చొప్పున నియామకాలు పుంజుకున్నట్టు పేర్కొంది. అధికంగా కోయింబత్తూర్‌లో 27 శాతం, జైపూర్‌లోనూ 22 శాతం మేర నియామకాల్లో వృద్ధి కనిపించినట్టు తెలిపింది. చురుకైన పారిశ్రామిక కార్యకలాపాలు, డిజిటలైజేషన్‌కు మళ్లడం, పట్టణీకర సానుకూలించినట్టు వివరించింది. -
2030 నాటికి ఈ రంగంలో 2.5 కోట్ల ఉద్యోగులు: నితిన్ గడ్కరీ
2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దేశ ఆర్థిక వ్యవస్థ పెంపుకు కావాల్సిన కీలక నిర్ణయాలు, ఆటోమొబైల్ రంగం అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. దేశం అభివృద్ధి చెందాలంటే ఉపాధి కూడా తప్పనిసరి. కాబట్టి యువతకు ఉద్యోగాలు చాలా అవసరం. ఉద్యోగ కల్పనకు ఫుడ్ డెలివరీ సంస్థలు కీలకమని కేంద్రమంత్రి 'నితిన్ గడ్కరీ' అన్నారు.జొమాటో నిర్వహించిన 'సస్టైనబిలిటీ అండ్ ఇన్‌క్లూజివిటీ - రోల్ ఆఫ్ ప్లాట్‌ఫామ్ ఎకానమీ' సమావేశంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతదేశంలో 77 లక్షల మంది డెలివరీ కార్మికులు ఉన్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 2.5 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.దేశంలో ఏకంగా 2.5 కోట్ల మందికి ఉపాధి కల్పించడం చాలా పెద్ద విషయమే. ప్రస్తుతం దేశంలో ఉద్యోగ కల్పన చాలా అవసరం అని గడ్కరీ పేర్కొన్నారు. దేశంలోని చాలా మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నందుకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోను.. మంత్రి అభినందించారు.ఉద్యోగాల కల్పినలో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాల సంఖ్యపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్‌లు పరిమిత సమయంలో వస్తువులను డెలివరీ చేయవలసి ఉన్నందున ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.ఇదీ చదవండి: అంబానీ, అదానీ కంటే సంపన్నుడు: ఇప్పుడు నిలువ నీడ లేక.. భారతదేశంలో గంటకు 45 ప్రమాదాలు, 20 మరణాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలిపారు. ఇందులో 18 నుంచి 45 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ద్విచక్ర వాహనదారుల సంఖ్య 80,000 కాగా.. ఇందులో హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణించినవారి సంఖ్య 55,000 కావడం గమనార్హం. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల 10,000 మరణాలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. సరైన శిక్షణ అందించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని.. జొమాటో సుమారు 50వేలమంది డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నందుకు అభినందనలు తెలిపారు. -
ఉద్యోగాల పేరుతో ఎమ్మెల్యే భర్త మోసాలు
రంపచోడవరం: అధికారం లేనప్పుడే ఉద్యోగాల పేరుతో గిరిజన యువతను మోసం చేసిన రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, ఆమె భర్త మఠం విజయ భాస్కర్ అధికారంలోకి వచ్చిన తరువాత మరింతగా రెచ్చిపోతున్నారని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం రంపచోడవరంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే, రంపచోడవరం ఎమ్మెల్యే తీరుపై అంతకు పదిరెట్లు వ్యతిరేకత ఏజెన్సీ ప్రజల నుంచి వ్యక్తమవుతోందని ఆమె విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ అనుకూల మీడియా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో ఎమ్మెల్యే భర్త విజయభాస్కర్‌పై ప్రసారం చేసిన కథనాన్ని ప్రదర్శించారు. బహుశా టీడీపీకి నష్టం జరుగుతుందనే ఇలా ప్రసారం చేసుంటారని ఆమె చెప్పారు. అధికారం లేనప్పుడే విజయభాస్కర్‌పై ఎనిమిది పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఎన్నికల ముందు రాజవొమ్మంగికి చెందిన టీడీపీ నేతలు వీరి చేతిలో ఎలా మోసపోయారో బహిరంగంగానే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యే భర్త ప్రవర్తనతో అధికారులు, ఉద్యోగులు హడలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా 2023లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని విజయభాస్కర్ డబ్బులు తీసుకున్న ఫోన్‌పే స్క్రీన్ షాట్లను మీడియాకు చూపించారు. బాధితులు మాట్లాడిన వాయిస్‌లను వినిపించారు. విజయభాస్కర్‌పై గుండాట, పేకాట కేసులు ఉన్నాయని తెలిపారు. 2022లో అనంతగిరిలో రికార్డింగ్ డ్యాన్సులు చేయిస్తుండగా ఇద్దరు అమ్మాయిలను పట్టుకున్నారని, ఆ కేసులో భాస్కర్ ఏ–1 నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. డ్వాక్రా మహిళకు చెందిన సొమ్ము నేరుగా అతని అకౌంట్‌కు పంపించుకోవడం విజయభాస్కర్ అక్రమాలకు పరాకాష్ట అన్నారు. తిమ్మాపురంలో ఇసుక తవ్వుకునేందుకు కాలువకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ఎమ్మెల్యే, ఆమె భర్తకు సంబంధం లేదా? అని ప్రశ్నించారు. రంగురాళ్ల క్వారీలను తిరిగి తవ్వేందుకు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్‌శాఖలో బదిలీల కోసం రేట్లు ఫిక్స్ చేశారనే ఆరోపణలూ ఉన్నాయన్నారు. విజయభాస్కర్ మాట వినని అధికారులను గంజాయి కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. -
జీవన గమనం.. పట్నం పయనం!
పల్లెలు మెల్లిమెల్లిగా ఖాళీ అవుతున్నాయి. కుటుంబాలకు కుటుంబాలే గ్రామాలు వదిలి వెళ్తుండటంతో జనం లేక కళతప్పుతున్నాయి. మారిన జీవన గమనంలో వివిధ అవసరాల నిమిత్తం పల్లెజనం పట్నం బాట పడుతున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నదాంట్లోనే సర్దుకుపోతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రజల మొగ్గు పట్టణాల వైపే కనిపిస్తోంది. పట్టణాల్లో స్థిరపడేందుకే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కొన్నేళ్ల క్రితంతో పోలిస్తే జిల్లాలోని పట్టణాల్లో జన సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. పల్లెల నుంచి వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. రూ.15 వేలు అంతకంటే తక్కువ వేతనం ఉన్న ప్రైవేటు ఉద్యోగులు సైతం పట్టణాల్లో స్థిరపడుతున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే తమ పిల్లలను పట్టణాల్లో చదివించేందుకు ఎక్కువమంది తల్లిదండ్రులు వస్తున్నట్లు తేలింది. పదేళ్లలోనే లక్షన్నర మంది.. అనంతపురం జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం వీటి పరిధిలో 6.27 లక్షల మంది మాత్రమే నివసించేవారు. తాజా అంచనాల ప్రకారం ఈ సంఖ్య సుమారు 7.72 లక్షలకు చేరింది. ఒక్క అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 80 వేలకు పైగా జనాభా పెరిగినట్టు తేలింది. తాడిపత్రి, గుంతకల్లు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పల్లెల్లో ఉపాధి కరువై.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో ఎక్కువ మంది పట్టణాలకు వలస వస్తున్నట్టు తేలింది. ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది కూలి పనులకు వచ్చి పట్టణ ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. మరికొంతమంది పల్లెల్లో వ్యవసాయం చేసుకుంటూనే పిల్లల చదువుల కోసం పట్టణాలకు వస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి లాంటి పట్టణాల్లో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి. ప్రభుత్వాలు జనాభాకు అనుగుణంగా వసతులు కల్పించలేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. సమస్యలెన్నో.. మున్సిపాలిటీల్లో జనాభా పెరుగుతున్న కొద్దీ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. రోజు రోజుకూ ప్లాస్టిక్ వాడకం ఎక్కువై అనర్థాలకు దారి తీస్తున్నాయి. చిన్న చిన్న మున్సిపాలిటీల్లో నిధులు సమకూరకపోవడంతో వ్యర్థాల నిర్వహణ చాలా అధ్వానంగా తయారైంది. ఇంటింటికీ కొళాయి కనెక్షన్లు ఇవ్వడం సాధ్యపడటం లేదు. ఆరు మున్సిపాలిటీల పరిధిలో 1.88 లక్షల గృహాలుండగా ఇంకా 80 వేల గృహాలకు నీటి కొళాయి కనెక్షన్ అందించాల్సి ఉంది. రోడ్లు, నీటి కొళాయిలు, డ్రైనేజీ వ్యవస్థలు కూడా సరిగా లేక పట్టణ పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వనరులు చాలడం లేదు ప్రజలు పల్లెటూళ్ల నుంచి పట్టణాలకు రావడానికి ప్రధాన కారణం ఉద్యోగాలు, పిల్లల చదువులే. దీంతో పట్టణ జనాభా విపరీతంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టు మున్సిపాలిటీల్లో వసతులు సమకూర్చాలంటే ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరులు సరిపోవడం లేదు. మున్సిపాలిటీలు ఆదాయ మార్గాలను చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. –నాగరాజు, మున్సిపల్ కమిషనర్, అనంతపురంజీవనం కష్టంగా మారిందినా భార్యతో కలిసి రెండున్నరేళ్ల క్రితం కళ్యాణదుర్గం వచ్చా. ప్రస్తుతం పట్టణంలోని శంకరప్ప తోట కాలనీలో నివాసముంటున్నాం. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. పట్టణంలో ఇంటి బాడుగలు అధికమయ్యాయి. ఇటీవల ప్రభుత్వం కరెంటు చార్జీలను సైతం పెంచేసింది. మా లాంటి వారు జీవించాలంటే కష్టంగా ఉంది. – మోహన్, శెట్టూరు పల్లెల్లో పనులు లేవు..మా స్వగ్రామం గుమ్మఘట్ట మండలం కలుగోడు. మొదట్లో గ్రామంలోనే ఉండేవాళ్లం. అక్కడ పనులేవీ దొరక్క పదేళ్ల కిత్రం రాయదుర్గం పట్టణానికి వలస వచ్చాం. నా భార్య టైలరింగ్ పనులు చేస్తుంది. నేను హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. నాలాగే చాలామంది పల్లెలు వదిలి పట్టణాల్లో జీవనం సాగిస్తున్నారు. – షమీవుల్లా, రాయదుర్గంటీ కొట్టుతో జీవనం మాది కణేకల్లు మండలం ఎర్రగుంట గ్రామం. నా చిన్నప్పుడే ఊరు వదిలి బళ్లారిలోని ఓ హోటల్లో కారి్మకుడిగా చేరా. ఆదాయం సరిపోక రాయదుర్గం వచ్చి టీ కొట్టు ప్రారంభించా. 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా. నా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉంటున్నారు. పల్లెల నుంచి పట్నం చేరే వారి సంఖ్య క్రమంగా ఎక్కువైంది. అనేక కారణాలతో ప్రజలు గ్రామాలను వీడుతున్నారు. – రంగప్ప, రాయదుర్గం -
మోదీకిదే నా సవాల్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గత 75 ఏళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ, ఏ ప్రభుత్వం, ఏ సీఎం కూడా తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇవ్వలేదని.. దీనిపై తాను సూటిగా ప్రధాని మోదీకే సవాల్ విసురుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మోదీ పాలనలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇస్తే లెక్క చూపాలని... ఢిల్లీ నడిబజార్లో క్షమాపణ చెప్పి తలవంచుకొని వస్తానని సవాల్ చేశారు. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదా, కేసీఆర్ ఎందుకు బయటికి రావడం లేదని సీఎం ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం నల్లగొండ జిల్లా కేంద్రంలోని గంధంవారిగూడెంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ’’కేసీఆర్, బీఆర్ఎస్ వారు మాట్లాడిన ప్రెస్మీట్ల కాగితాలు తీసుకెళ్లి ఈటల రాజేందర్, కిషన్‌రెడ్డి అవే నకలు కొడుతున్నారు. కిషన్‌రెడ్డి, ఈటల మారాలి. ఆ దొంగల సోపతి పడితే మీరు కూడా దొంగల బండి ఎక్కుతారు. అటే పోతారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. అడ్డగోలుగా మాట్లాడవద్దు. ఏది పడితే, ఎలా పడితే అలా మాట్లాడితే చెల్లదు. మీరు కేసీఆర్‌లా తయారుకాకండి. మోదీ పాలనలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇస్తే లెక్క చూపండి. మోదీకి సవాల్ చేస్తున్నా.. ఢిల్లీ నడిబజార్లో మీకు క్షమాపణ చెప్పి తలవంచుకొని వస్తా. లేకపోతే నా లెక్క అప్పజెబుతా. మీ నాయకులు, మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించండి. అప్పుడే ఈ దేశ ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది. అంతేకాదు మేం తొలి ఏడాదే 25.50 లక్షల మంది రైతుల రుణమాఫీ చేశాం. రూ.21 వేల కోట్లు వారి ఖాతాల్లో వేశాం. మోదీ, కేసీఆర్ మీరు ఎప్పుడైనా చేశారా? సవాల్ విసురుతున్నా. మోదీ అధికారంలో ఉన్నప్పుడైనా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనైనా ఒక్క ఏడాదిలోనే ఇలా రుణమాఫీ చేస్తే.. నేను మా మంత్రులతో సహా వచ్చి క్షమాపణ చెబుతాం. కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోండి.. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదా? కేసీఆర్ ఎందుకు బయటికి రావడం లేదు? ఎందుకు మాట్లాడటం లేదు? అధికారంలో ఉంటే చలాయిస్తాం, ఓడిపోతే ఫామ్‌హౌస్‌లో పడుకుంటామంటే ఎలా? దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? మేం ఎన్నికల్లో పోటీ చేయలేదా? ఓడినా, గెలిచినా ప్రజల్లో ఉండలేదా? రెండుసార్లు మీరు గెలిచారు. మేం ఓడిపోయాం.. అయినా జానారెడ్డిలాంటి పెద్దలు ప్రజల్లో ఉండి, అసెంబ్లీలో పాలకపక్షానికి సూచనలు, సలహాలు ఇస్తూ, తప్పిదాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.మా ఎమ్మెల్యేలను గుంజుకున్నా, సీఎల్పీ హోదాను తొలగించినా మొక్కవోని ధైర్యంలో భట్టి విక్రమార్క కొట్లాడారు. ఇప్పుడు సంవత్సరం పూర్తయినా మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీ పాత్ర పోషించారా? అసెంబ్లీకి వచ్చారా? ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, పదేళ్లు సీఎంగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్కరోజైనా వినియోగించారా? ఆలోచించాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉంచడం పట్ల తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెబుతారు? గాలి బ్యాచ్‌ని ఊరి మీదకు వదిలారు.. ప్రభుత్వ నిర్ణయాలు మీకు నచ్చకపోతే, ప్రజలకు కష్టం వస్తే ప్రజలపక్షాన మాట్లాడాల్సింది పోయి ఒక గాలి బ్యాచ్‌ను తయారు చేసి ఊరి మీదికి వదిలారు. వారేం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో ఎప్పుడైనా విన్నారా? ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వొద్దన్నప్పుడు, గ్రూప్–4, గ్రూప్–1 పరీక్షలు పెట్టవద్దన్నప్పుడు, డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేయాలన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళుతుంది? కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉంటే.. కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పుతో మాకు అప్పగించారు. అప్పులకు ప్రతి నెలా రూ.6,500 కోట్ల చొప్పున ఏడాదికి రూ.65 వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తోంది. నాడు ‘ఔటర్’ రోడ్డు.. ఇప్పుడు ‘రీజనల్’ రోడ్డు నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు వేశారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రీజనల్ రింగు రోడ్డు తీసుకువచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. 50వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీగా కొత్త నగరాన్ని నిర్మించుకుని, పెట్టుబడులు తెచ్చి.. నిరుద్యోగులకు, ఇంజనీర్లకు, డాక్టర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మాదే. మూసీ కాలుష్యంతో మనుషులు జీవించలేని పరిస్థితి నల్లగొండ ప్రాంతానికి రాబోతోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. అందుకే మూసీలో గోదావరి జలాలను పారించేందుకు, పారిశ్రామిక కాలుష్యం నుంచి కాపాడేందుకు ప్రక్షాళన చేపట్టాం. అడ్డం వచ్చే వారి సంగతి ప్రజలే చూసుకోవాలి..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ ఇచ్చింది వైఎస్సార్ కాదా? ‘‘వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెప్పినప్పుడు.. కొందరు కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందన్నారు.ఆ మాటలు తప్పు అని నిరూపించి రైతులకు ఉచిత కరెంటును ఇచ్చారు. దేశంలోనే మొదటిసారిగా రైతులకు ఉచిత కరెంటు ఇస్తూ, వారి రూ.1,200 కోట్ల కరెంటు బిల్లులను మాఫీ చేస్తూ, వేల మంది రైతులపై విద్యుత్ చౌర్యం కేసులను ఎత్తివేస్తూ.. ఒక్క సంతకంతో హామీలు అమలు చేశారు. మేం ఆయనను ఆదర్శంగా తీసుకుని వ్యవసాయానికి 24 గంటల ఇస్తున్నాం. ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. వైఎస్సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీని అమల్లోకి తెస్తే... కేసీఆర్ వచ్చి నిరీ్వర్యం చేశారు. మేం వచ్చాక ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. వరి వేస్తే ఉరేనని కేసీఆర్ అన్నారు. మేం వరి సాగు చేయాలని చెప్పడమేకాదు సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నాం.’’ తెలంగాణను దేశానికే రోల్‌మోడల్‌గా చేస్తాం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి నల్లగొండ: రాబోయే నాలుగేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే రోల్ మోడల్‌గా నిలబెడతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్లగొండ ప్రజాపాలన విజయోత్సవ సభలో వారు మాట్లాడారు. తమ ప్రభుత్వం ఓవైపు రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తూనే, మరోవైపు అప్పులు తీర్చుకుంటూ ముందుకుసాగుతోందని భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలను పెట్టిందే తప్ప నిర్వహణను పట్టించుకోలేదని.. తాము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ గురుకులాలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మిస్తున్నామని చెప్పారు. గత సర్కారు యాదాద్రి పవర్ ప్లాంట్ మొదలుపెట్టిందే తప్ప పర్యావరణ అనుమతులు తీసుకోలేకపోయిందని.. తాము అనుమతులు తెప్పించి, నిధులిచ్చి పనులు వేగవంతం చేశామని తెలిపారు. నల్లగొండ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం: ఉత్తమ్ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం సొరంగ మార్గాన్ని ప్రారంభిస్తే బీఆర్ఎస్ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టును పూర్తిచేసి మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. కార్యకర్తల కష్టం, త్యాగంతో తాము ఈ స్థాయిలో ఉన్నామని.. వారికి ఏ కష్టం వచి్చనా అండగా ఉంటామని చెప్పారు. ఎస్ఎల్బీసీ.. ఇక ఆర్ఆర్ ప్రాజెక్టు: కోమటిరెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని ఇక నుంచి ఆర్ఆర్ (రాజశేఖర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి) ప్రాజెక్టుగా పేరు పెట్టుకున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. నాడు వైఎస్సార్ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి శంకుస్థాపన చేస్తే.. ఇప్పుడు సీఎం రేవంత్ ఆ ప్రాజెక్టు పూర్తికి నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కాళేశ్వరం పేర కూలేశ్వరం ప్రాజెక్టు కట్టారని.. నల్లగొండ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసినందుకే జిల్లా ప్రజలు బీఆర్ఎస్ను పాతాళానికి తొక్కారని వ్యాఖ్యానించారు. -
ఉద్యోగమని నమ్మించి చేపలు పట్టిస్తున్నారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి యువకుల్ని తీసుకువెళ్లి.. వారితో కృష్ణా నదిలో చేపలు పట్టిస్తూ బందీలుగా మార్చుకుంటున్న వైనం వెలుగు చూసింది. ఈ ముఠా ఉచ్చులో చిక్కుకుని గుంటూరు జిల్లాకు చెందిన యువకుడు ప్రాణాలు అరచేత పట్టుకుని బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన ఆరిఫ్ అనే యువకుడు పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. ఉద్యోగ వేటలో ఉన్న ఆరిఫ్‌కు గుంటూరు నాజ్ సెంటర్‌కు చెందిన మొహిద్దీన్ పరిచయమయ్యాడు. వినుకొండలో చేపల అక్వేరియంలో ఉద్యోగం ఉందని.. వారానికి రూ.15 వేలు ఇస్తారని ఆరిఫ్‌ను మొహిద్దీన్ నమ్మించాడు. ఆ ఉద్యోగం కావాలంటే తనకు రూ.10 వేలు ఇవ్వాలన్నాడు. దీంతో ఆరిఫ్ తన బైక్ తాకట్టు పెట్టి రూ.10 వేలు ఇచ్చాడు. గత నెల 23న మొహిద్దీన్ కలిసి వ్యాన్‌లో బయలుదేరగా, గుంటూరులో మరో ఇద్దరిని, నరసరావుపేటలో మరో ముగ్గురిని ఎక్కించిన తర్వాత వ్యాన్‌లో ఖాళీలేదని, తాను వెనుక వస్తానని మొహిద్దీన్ మధ్యలో దిగిపోయాడు. రాత్రి నంద్యాల జిల్లా కొత్తపల్లి అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ కృష్ణా నదిలో పడవ ఎక్కించి సంగమేశ్వర వద్ద దింపారు. ఇక్కడకెందుకు తీసుకొచ్చారని అడగ్గా.. ఇక్కడ చేపలు పట్టాలని చెప్పి ఆరిఫ్ వద్ద ముఠా సభ్యులు ఫోన్ లాగేసుకున్నారు. ఎవరైనా వెళ్లిపోవడానికి ప్రయ త్నిస్తే ముఠా సభ్యులు చితకబాదుతుండటంతో ఆరిఫ్ బిక్కుబిక్కుమంటూ గడిపాడు. తన సెల్‌ఫోన్‌ను ఎలాగో దక్కించుకున్న ఆరిఫ్ ఇంకో వ్యక్తితో కలిసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. రోజంతా కొండల్లో నుంచి నడిచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. ఛార్జింగ్ అయిపోవడంతో ఫోన్ కట్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై నల్లపాడు పోలీసుల సహాయంతో లొకేషన్ కనుక్కుని అక్కడికి వెళ్లారు. స్థానికులను విచారించగా.. ఇక్కడకు పనుల కోసం వచ్చిన వారిలో చాలామంది గల్లంతయ్యారని చెప్పడంతో ఆందోళన చెందారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే గుంటూరులో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకురావాలన్నారు. దీంతో ఆరిఫ్ కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణంలో మార్కాపురం రాగా.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఆరిఫ్ ఇంటికి ఫోన్ చేసి కర్నూలు బస్టాండ్‌లో ఉన్నానని చెప్పడంతో వారు మార్కాపురం బస్ ఎక్కి రావాలని సూచించారు. అతను వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు మంగళవారం గుంటూరు చేరుకున్నారు. ముఠా వలలో చిక్కి పదుల సంఖ్యలో యువకులు అక్కడ ఉన్నారని, పోలీసులు వారిని కాపాడాలని ఆరిఫ్ ‘సాక్షి’కి తెలిపాడు. -
టీజీపీఎస్సీ ఉద్యోగాల అర్హుల జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నిక ల్ ఆఫీసర్, డ్రిల్లింగ్ సూపర్వైజర్ ఉద్యోగాల కు అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జా బితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. ఎలక్ట్రికల్ కే టగిరీలో 50 పోస్టులు, మెకానికల్ కేటగిరీలో 97 పోస్టులకు టీజీపీఎస్సీ అభ్యర్థులను ఎంపి క చేసింది. ఈ జాబితాలు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు కార్యదర్శి నవీన్నికో లస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
అంబానీ, టాటా, అదానీ.. వీళ్లు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా?
భారతదేశంలో ప్రతి ఏటా ధనవంతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మన దేశంలోని కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, శివ్ నాడార్, సావిత్రి జిందాల్, దిలీప్ సాంఘ్వీ, కుమార మంగళం బిర్లా మొదలైనవారు ఉన్నాయి. వీరిలో కొందరు వారసత్వంగా ధనవంతులైనప్పటికీ.. కొందరు మాత్రం కష్టపడి చిన్న ఉద్యోగాలు చేస్తూ ఎదిగారు. ఈ కథనంలో అలాంటి వాళ్ళ గురించి తెలుసుకుందాం.ధీరూబాయ్ అంబానీ (Dhirubhai Ambani)రిలయన్స్ సంస్థ ఏర్పడటానికి కారణమైన ధీరూబాయ్ అంబానీ.. తన తొలినాళ్లలో కుటుంబ పోషణ కోసం అనేక పనులు చేశారు.కానీ అవి నచ్చకపోవడంతో మిడిల్ ఈస్ట్ ఆసియా దేశమైన యెమెన్‌కు వలస వెళ్లి పెట్రోల్ బంకులో పని మొదలు పెట్టారు. అప్పట్లో ఆయన సంపాదన రూ. 300 మాత్రమే. కొంతకాలం పెట్రోల్ బంకులో పనిచేసి.. స్వదేశానికి వచ్చి చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభించారు. అదే ఇప్పుడు ఇంతపెద్ద రియలన్స్ ఇండస్ట్రీస్‌గా మారింది.సుధామూర్తి (Sudha Murthy)ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి చదువు పూర్తయిన తరువాత.. టాటా మోటార్స్ (TELCO)లో ఉద్యోగం చేశారు. ఆ కంపెనీ మొదటి మహిళా ఇంజినీర్ సుధామూర్తి కావడం గమనార్హం. ఈ రోజు ఇంజినీరింగ్ రంగంలో కూడా మహిళలు ముందుకు వెళ్తున్నారంటే.. అది సుధామూర్తి కారణంగానే.రతన్ టాటా (Ratan Tata)దివంగత రతన్ టాటా.. ప్రారంభంలో టాటా కంపెనీలో ఉద్యోగిగా చేరారు. అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ 'ఐబీఎమ్' నుంచి మంచి శాలరీ ప్యాకేజీతో వచ్చిన జాబ్ వదులుకున్నారు. టాటా స్టీల్ కంపెనీలోనే పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి సంస్థా చైర్మన్ స్థాయికి ఎదిగారు.కిరణ్ మజుందార్ షా (Kiran Mazumdar Shaw)బయోకాన్ వ్యవస్థాపకురాలైన.. కిరణ్ మజుందార్-షా ప్రారంభంలో ఆస్ట్రేలియాలో బ్రూవర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె బ్రూయింగ్ పరిశ్రమలో లింగ వివక్షను ఎదుర్కొన్నారు. ఆ తరువాత క్రమంగా వ్యాపార సామ్రాజ్యంలో అంచెలంచెలుగా ఎదిగారు.ఇంద్రా నూయి (Indra Nooyi)పెప్సికో మాజీ సీఈఓ అయిన.. ఇంద్రా నూయి 18 సంవత్సరాల వయస్సులో బ్రిటిష్ టెక్స్టైల్ సంస్థలో వ్యాపార సలహాదారుగా తన వృత్తిని ప్రారంభించారు. ఇప్పుడు ఈమె వేలకోట్ల సామ్రాజ్యానికి అథినేత్రిగా నిలిచారు.గౌతమ్ అదానీ (Gautam Adani)ఈ రోజు భారతదేశంలో రెండవ అత్యంత ధనవంతుడిగా ఉన్న గౌతమ్ అదానీ.. డైమండ్ సార్టర్‌గా తన మొదటి ఉద్యోగాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఈ రంగంలో కొంత అనుభవం తెచ్చుకున్న తరువాత ముంబైలోని జవేరీ బజార్లోనే సొంతంగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారు. నేడు వివిధ రంగాల్లో ఎదుగుతూ.. కుబేరుడిగా నిలిచారు. -
ఆరు నెలల్లో భారీగా ఉపాధి అవకాశాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల కాలంలో (2024 అక్టోబర్ నుంచి 2025 మార్చి వరకు) ఉపాధి అవకాశాలు మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. ఈ కాలంలో సిబ్బందిని పెంచుకోనున్నట్టు 59 శాతం సంస్థలు తెలిపాయి. దీంతో ద్వితీయ ఆరు నెలల్లో 7.1 శాతం మేర సిబ్బంది పెరగనున్నట్టు టీమ్‌లీజ్ సర్వీసెస్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్’ వెల్లడించింది. ప్రస్తుత స్థాయిలోనే సిబ్బంది సంఖ్యను కొనసాగించనున్నట్టు టీమ్‌లీజ్ సర్వేలో 22 శాతం కంపెనీలు తెలిపాయి. 23 రంగాల్లోని 1,307 కంపెనీల అభిప్రాయాలను టీమ్‌లీజ్ సర్వేలో భాగంగా తెలుసుకుంది. లాజిస్టిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), ఈవీ సదుపాయాలు, వ్యవసాయం, ఆగ్రోకెమికల్స్, ఈ–కామర్స్ రంగాల నుంచే ప్రధానంగా ఎక్కువ ఉపాధి అవకాశాలు రానున్నాయని, ఇవి మౌలిక వసతులు, ఆధునిక టెక్నాలజీపై ఎక్కువగా వ్యయం చేస్తున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక తెలిపింది. రంగాల వారీగా..లాజిస్టిక్స్ రంగంలో 14 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా రానున్నాయి. ఉద్యోగులను పెంచుకోనున్నట్టు 69 శాతం లాజిస్టిక్స్ కంపెనీలు వెల్లడించాయి. ఆ తర్వాత అధికంగా ఈవీ, ఈవీ ఇన్ఫ్రా కంపెనీలు 12 శాతం మేర సిబ్బందిని పెంచుకోనున్నాయి. వ్యవసాయం, ఆగ్రో కెమికల్స్ కంపెనీల్లో 10.5 శాతం మేర, ఈ–కామర్స్ రంగంలో 9 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా రానున్నాయి. ఆటోమోటివ్ రంగంలో 8.5 శాతం, రిటైల్ రంగంలో 8.2 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా ఏర్పడనున్నాయి.ఇదీ చదవండి: 30 లక్షల యూనిట్లు ఎగుమతి!ప్రాంతాల వారీగా..కోయింబత్తూర్, గురుగ్రామ్ ఉపాధి కల్పన కేంద్రాలుగా మారుతున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక తెలిపింది. అత్యధికంగా బెంగళూరు 53.1 శాతం, ముంబై 50.2 శాతం, హైదరాబాద్ 48.2 శాతంతో ఉపాధి కల్పన పరంగా ముందున్నాయి. ఉపాధి కోరుకుంటున్న వారికి చిన్న పట్టణాలు ప్రత్యామ్నాయ కేంద్రాలుగా మారుతున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక పేర్కొంది. గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) టెక్నాలజీ, ఆర్అండ్డీలో అధిక నైపుణ్య ఉద్యోగాలను సృష్టిస్తున్నట్టు తెలిపింది. జాతీయ పారిశ్రామిక నడవాల ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి పరోక్షంగా 30 లక్షల మందికి ఉపాధి కల్పించనుండడం, సెమీకండక్టర్ పాలసీ ద్వారా 2025 నాటికి 80,000 ఉద్యోగాల కల్పన తదితర కీలక విధానాలను ప్రస్తావించింది. -
ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం: వందలాది ఉద్యోగులపై ఎఫెక్ట్
దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) 500 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు సమాచారం. ఇందులో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు.భారతీయ విఫణిలో.. ప్రారంభం నుంచి అనేక విమర్శలకు గురవుతూ వస్తున్న ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పటికి కూడా విక్రయానంత సేవలు అందించడంలో అంతంత మాత్రంగానే ఉందని.. చాలామంది కస్టమర్లు విమర్శిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఉద్యోగులను తొలగించడం అనేది కంపెనీ తీసుకున్న కఠినమైన నిర్ణయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఓలా ఎలక్ట్రిక్ లేఆఫ్స్ ప్రక్రియ జులై నుంచి కొనసాగుతున్నట్లు, ఇందులో భాగంగానే దశల వారీగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ లేఆఫ్స్ ప్రక్రియ ఈ నెల చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగులతో కంపెనీ లాభాలను గడించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
రఘువంశీ ఏరోస్పేస్ విస్తరణతో 1200 కొత్త ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు
విమాన ఇంజన్ల కీలక విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో గణనీయ వృద్ధిని సాధించిన రఘువంశీ ఏరోస్పేస్ భారీ విస్తరణపనులకు శ్రీకారం చుట్టింది. గురువారం నాడు శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో ఈ సంస్థ కొత్త కర్మాగారం నిర్మాణానికి ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసారు. రూ.300 కోట్ల వ్యయంతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ పరిశ్రమ రానున్న మూడేళ్లలో 1200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు వెల్లడించారు.రఘువంశీ ఏరోస్పేస్ చేతిలో ఉన్న రూ.2 వేల కోట్ల ఆర్డర్లకు సంబంధించిన పరికరాలు ఈ నూతన సదుపాయంలో ఉత్పత్తి అవుతాయని ఆయన తెలిపారు. ఎయిర్ బస్ ఏ320, బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల ఇంజన్లకు, జిఇ ఏరోస్పేస్, రోల్స్ రాయిస్, ప్రాట్ అండ్ విట్నీ, సఫ్రన్, హానీవెల్ విమాన ఇంజన్లను తయారు చేసే సంస్థలకు రఘువంశీ కీలకమైన విడిభాగాలను సరఫరా చేస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు.2002లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమగా ప్రారంభమైన రఘువంశీ ప్రస్థానం ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థలకు ఫ్యూయల్ పంపులు, ల్యాండింగ్ గేర్ల లాంటి ముఖ్య పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరి ఏరోస్పేస్ రంగంలో రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేసిందని శ్రీధర్ బాబు ప్రసంసించారు. డిఆర్ డిఓ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ , భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లాంటి ప్రభుత్వరంగ సంస్థలకు పరికరాలు, విడిభాగాలను అందజేస్తోందని ఆయన వివరించారు.ముడి చమురు, సహజవాయువును వెలికితీసే పరిశ్రమలకు, ఆరోగ్య రంగంలో వినియోగించే పరికరాలను తయారు చేస్తోందని వెల్లడించారు. హైదరాబాద్ ఏరోస్పేస్ ఎస్ ఇ జెడ్ లో టాటా, భారత్ ఫోర్జ్, ఆదానీ లాంటి ప్రఖ్యాత కంపెనీలు కూడీ వైమానిక, రక్షణ, అంతరిక్ష వాహనాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ ఏరోస్పేస్ సంస్థలకు రకరకాల విడిభాగాలను అందించే 1500 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని ఆయన చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఎంఎస్ ఎమ్ఇ పాలసీ ప్రకారం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు. కార్యక్రమంలో రఘువంశీ ఏరోస్పేస్ డైరెక్టర్ వంశీ వికాస్, డిఆర్ డిఓ క్షిపణి, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్ రాజబాబు, సిఐఐ ఛైర్మన్ డా.సాయి ప్రసాద్, టిజిఐఐసి ఎండీ డా. ఇ. విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర ఏరోస్సేస్, డిఫెన్స్ విభాగం డైరెక్టర్ పిఏ ప్రవీణ్, టిజిఐఐసి సిఒఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు చేరే రంగం!
దేశీయ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) పరిశ్రమ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల(రూ.84.38 లక్షల కోట్లు)కు చేరనుంది. అందులో పనిచేసే ప్రొఫెషనల్స్ సంఖ్య 25 లక్షలకు పెరగనుంది. భారత్‌లో జీసీసీలపై రూపొందించిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దాని ప్రకారం ప్రస్తుతం దేశీయంగా 1,700 పైచిలుకు జీసీసీలు ఉన్నాయి. వీటి మొత్తం వార్షిక ఆదాయం 64.6 బిలియన్ డాలర్ల పైగా ఉండగా, 19 లక్షల మంది ప్రొఫెషనల్స్ వివిధ హోదాల్లో పని చేస్తున్నారు.‘భారతీయ జీసీసీలు సంఖ్యాపరంగానే కాకుండా సంక్లిష్టత, వ్యూహాత్మక ప్రాధాన్యతపరంగా కూడా ఎదుగుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో సగానికి పైగా సెంటర్స్, సాంప్రదాయ సర్వీసుల పరిధికి మించి సేవలు అందిస్తున్నాయి’ అని నివేదిక పేర్కొంది. ‘గ్లోబల్ కార్పొరేషన్ల వ్యూహాత్మక కార్యకలాపాలకు కీలక కేంద్రంగా భారత్ ఎదుగుతోంది. ఈ నేపథ్యంలోనే జీసీసీ మార్కెట్ 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరనుంది. అలాగే సిబ్బంది సంఖ్య 25 లక్షలకు చేరనుంది’ అని పేర్కొంది. ఇదీ చదవండి: మీటింగ్‌కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓనివేదిక ప్రకారం.. 70 శాతం సెంటర్లు 2026 నాటికి అధునాతన కృత్రిమ మేథ సామర్థ్యాలను సంతరించుకోనున్నాయి. వీటిలో ఆపరేషనల్ అనలిటిక్స్ కోసం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ మొదలుకుని ఏఐ ఆధారిత కస్టమర్ సపోర్ట్, ఆర్అండ్డీ కార్యకలాపాల వరకు వివిధ సామర్థ్యాలు ఉండనున్నాయి. తూర్పు యూరప్‌తో పోలిస్తే నిర్వహణ వ్యయాలు సగటున 40 శాతం తక్కువగా ఉండటం వల్ల నాణ్యత విషయంలో రాజీపడకుండా కార్యకలాపాలను పటిష్టం చేసుకోవడానికి అంతర్జాతీయ సంస్థలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారింది. భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న 100 పైగా జీసీసీ దిగ్గజాలపై సర్వే, పరిశ్రమ నిపుణులతో ఇంటర్వ్యూలు, అధ్యయనాలు మొదలైన అంశాల ప్రాతిపదికన ఈ నివేదిక రూపొందింది. -
ఈ పాటికి సీఎంగా వైఎస్ జగన్ ఉండి ఉంటే..
సాక్షి,అమరావతి: చంద్రబాబు మోసాలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. ‘‘సూపర్‌సిక్స్ ఒక మోసం. సూపర్ సెవెన్ ఒక మోసం. నీ బడ్జెట్ ప్రజెంటేషన్ ఒక మోసం. రోజూ డైవర్షన్ టాపిక్స్. వీటన్నింటినీ ప్రశ్నిస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 680 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు నోటీసులు ఇచ్చారు. 147 మందిపై కేసులు పెట్టారు. 49 మందిని అరెస్టు చేశారు’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాటికి సీఎంగా తాను ఉండి ఉంటే.. ప్రజలకు పథకాలన్నీ వచ్చి ఉండేవని వివరించారు.ఏప్రిల్‌లో వసతి దీవెన, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు.మే లో విద్యాదీవెన, ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా, మత్స్యకారులకు డీజిల్‌పై సబ్సిడీ.జూన్‌లో బడులు తెరవగానే జగనన్న అమ్మ ఒడి.జూలైలో విద్యాకానుక, వాహనమిత్ర, కాపునేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు. వివిధ పథకాల్లో మిగిలిపోయిన లబ్ధిదార్లకు చెల్లింపు.ఆగస్టులో విద్యాదీవెనలో మరో త్రైమాసిక చెల్లింపు. వాహనమిత్ర.సెప్టెంబరులో వైఎస్సార్ చేయూత.అక్టోబరులో వైయస్సార్ రైతు భరోసా రెండో విడత.నవంబరులో జగనన్న విద్యాదీవెన. రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాలు.. బాబు రాకతో అవన్నీ క్లోజ్.డిసెంబరులో చూస్తే.. ఈబీసీ నేస్తం. లా నేస్తం. వివిధ పథకాల్లో మిగిలిపోయిన లబ్ధిదార్లకు చెల్లింపులు.జనవరిలో వైయస్సార్ రైతు భరోసా, వైయస్సార్ ఆసరా, జగనన్న తోడు, వైయస్సార్ పెన్షన్ కానుక.ఫిబ్రవరిలో జగనన్న విద్యాదీవెన, జగనన్న చేదోడు.మార్చిలో జగనన్న దీవెన, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు.పద్ధతి ప్రకారం క్యాలెండర్ ఇచ్చి, అన్నీ పక్కాగా అమలు చేశాంవివిధ పథకాల ద్వారా ఈ 5 ఏళ్లలో రూ.2.73 లక్షల కోట్ల నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఇచ్చాం.మరి చంద్రబాబు ఈ బడ్జెట్లో చూపారా?ఇదే చంద్రబాబు సూపర్‌సిక్స్‌లో ఏమన్నాడు? యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి. అంటే రూ.7,200 కోట్లు. ఎక్కడైనా బడ్జెట్లో కనిపించిందా?వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు:👉అదే మా హయాంలో అధికారంలోకి వచ్చిన 6 నెలలకే అక్టోబర్ 2 గాంధీ జయంతికి ముందే 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. 58 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం.👉2.60 లక్షల మంది వాలంటీర్లను నియమించి, ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ చేశాం. అదే కాకుండా 5 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో వివిధ కేటగిరీస్‌లో అక్షరాలా 6.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.👉లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్‌లో లక్షా 2 వేల ఉద్యోగాలు ఇచ్చాం. దాదాపుగా 80,400 కోట్ల ఇన్వెస్ట్ మెంట్లలో ఉద్యోగాలు ఇప్పించగలిగాం. ఎంఎస్ఎంఈలు 2019–24 మధ్య గ్రౌండ్ అయినవి 3.94 లక్షలు అయ్యాయి. ఒట్టి ఎంఎస్ఎంఈల ద్వారానే 23.65 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం.👉గవర్నమెంట్ రంగంలో ఇచ్చిన 6.31 లక్షల ఉద్యోగాలకు తోడు, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ లో ఇచ్చిన 1.02 లక్షల ఉద్యోగాలకు తోడు ఎంఎస్ఎంఈలలో ఇచ్చి 23 లక్షల ఉద్యోగాలు.. ఇవన్నీ కలిపితే 30,99,476 మందికి ఆ 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వగలిగాం.బాబు వచ్చే.. జాబు పోయేమరి చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? 2.60 లక్షల మంది వాలంటీర్లను రోడ్డుపై పడేశారు. ఉద్యోగాలు కట్. 15 వేల మంది ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో పని చేస్తున్న వారిని ఉద్యోగాల్లోంచి తీసేశారు104, 108 ఎంప్లాయీస్‌కు 2 నెలల జీతం రాకపోతే గొడవ చేస్తే మొన్న ఇచ్చారు. ఆపరేటర్‌కు అయితే అది కూడా ఇవ్వలేదు. ఆర్పీలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్లు ఫిర్యాదులు. టాయిలెట్ మెయింటెనెన్స్‌లో ఆయాలకు జీతాలు ఇవ్వడం లేదని కంప్లయింట్స్. ఇవన్నీ ఆరు నెలల చంద్రబాబు పాలనలో చూస్తున్న విచిత్రాలు’ అని చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు. -
నాలుగేళ్లలో 45.7 కోట్లకు శ్రామికశక్తి
ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న టెక్నాలజీకి అనుగుణంగా మానవ వనరుల అవసరాలు పెరుగుతున్నాయి. దాంతో రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగ కల్పన జరుగుతుందని కొన్ని సంస్థలు నివేదికలు విడుదల చేస్తున్నాయి. 2028 నాటికి దేశంలోని ఉద్యోగుల సంఖ్య సుమారు 45.7 కోట్లకు చేరుతుందని సర్వీస్‌నౌ పరిశోధన సంస్థ అంచనా వేసింది. అందులో కొత్తగా 27.3 లక్షల టెక్ ఉద్యోగాలు పుట్టుకొస్తాయని తెలిపింది. ఈమేరకు విడుదల చేసిన నివేదికలో కొన్ని అంశాలు పంచుకుంది.దేశంలో 2023 నాటికి మొత్తం శ్రామికశక్తి 42.3 కోట్లుగా ఉంది.2028 నాటికి అది 45.7కోట్లుకు చేరుతుంది.వచ్చే నాలుగేళ్లలో కొత్తగా 27.3 లక్షల టెక్ ఉద్యోగాలు సృష్టించబడుతాయి.ఉపాధి వృద్ధికి చాలామంది రిటైల్ రంగాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.వివిధ విభాగాల్లో సుమారు 69.6 లక్షల మంది సిబ్బంది రిటైల్ రంగంలో పనిచేసేందుకు అవసరం అవుతారు.తయారీ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు, విద్యా రంగంలో 8.4 లక్షల ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణలో 8 లక్షల మంది ఉపాధి పొందే అవకాశం ఉంది.టెక్ సంబంధిత ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఏఐ ఆధారిత కొలువులకు ఆదరణ పెరుగుతుంది. వచ్చే నాలుగేళ్లలో 1,09,700 మంది సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలపర్లు కావాల్సి ఉంది.48,800 మంది సిస్టమ్స్ సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా ఇంజినీర్లు 48,500 మంది అవసరం.వెబ్ డెవలపర్లు, డేటా అనలిస్ట్‌లు, సాఫ్ట్వేర్ టెస్టర్లకు గిరాకీ ఉంది. ఈ విభాగంలో వరుసగా 48,500, 47,800, 45,300 మందికి కొలువులు లభించనున్నాయి.అదనంగా డేటా ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్‌లు, డేటాబేస్ ఆర్కిటెక్ట్‌లు, డేటా సైంటిస్టులు, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజర్లు వంటి హోదాల్లో 42,700 నుంచి 43,300 మందికి అవకాశాలు లభించనున్నాయి.ఇదీ చదవండి: దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్.. వచ్చే నెలలోనే పట్టాలపైకి..అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉపాధికి కొదువలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే కంపెనీలకు అవసరమయ్యే సరైన నైపుణ్యాలు నేర్చుకోవడం ముఖ్యమని చెబుతున్నారు. గ్రాడ్యుయేషన్‌లో చేరిన సమయం నుంచే పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యాలు కావాలో తెలుసుకుని ఆ దిశగా స్కిల్స్ అలవరుచుకోవాలని సూచిస్తున్నారు. -
‘వారంలో ఏడు రోజులు ఫ్రీగా పని చేస్తాను’
యూకేలో ఉండడానికి ఉచితంగా పని చేయాడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ఓ భారతీయ విద్యార్థిని తెలిపింది. గ్రాడ్యుయేషన్ చేసేందుకు యూకే వెళ్లిన ఆమె అక్కడే ఉండేందుకు ఉచితంగా పని చేస్తానని లింక్డ్ఇన్ పోస్ట్‌లో తెలియజేశారు. 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు శ్వేత చెప్పారు. తాను రోజు 12 గంటలపాటు వారంలో ఏడు రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈపోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.‘నా పేరు శ్వేత. నేను గ్రాడ్యుయేషన్ చేసేందుకు యూకే వచ్చాను. నా గ్రాడ్యుయేట్ వీసా మూడు నెలల్లో ముగియనుంది. నేను యూకేలో వీసా అందించే కంపెనీల్లో ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 2022లో నా గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి 300 కంటే ఎక్కువగానే ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్సీ పట్టా పొందాను. వీసా స్పాన్సర్డ్ డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాల కోసం చూస్తున్నాను. మీరు యూకేలో కంపెనీ నిర్వహిస్తూ డిజైన్ ఇంజినీర్ల కోసం వెతుకుతున్నట్లయితే నన్ను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోండి. వారంలో ఏడు రోజులపాటు రోజువారీ 12 గంటలు పని చేస్తాను. ఒక నెలపాటు నాకు ఎలాంటి జీతం అవసరం లేదు. నా పనితీరు గమనించండి. నచ్చితే కొనసాగించండి. లేదంటే ఎలాంటి వివరణ ఇవ్వకుండా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించండి. ఈ పోస్ట్‌ను అంతర్జాతీయ విద్యార్థులు చదువుతుంటే దీన్ని రీపోస్ట్ చేయండి’ అని తెలుపుతూ దానికి సంబంధించిన ఇమేజ్ను కూడా శ్వేత షేర్ చేశారు.ఇదీ చదవండి: ‘నవంబర్ 8న సెలవులో ఉంటాను.. బై’!మిమ్మల్ని మీరు నమ్మండిఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘మీరు వెళ్లిన దేశంలో ఉండటానికి ఉచితంగా పని చేయడం లేదా అన్నేసి గంటలు పనిచేయడం అసంబద్ధం. మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. ‘యూకేలో ఉండడం కోసం ఇలా చేయనవసరం లేదు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు తెలివైనవారు. ప్రపంచంలో ఎక్కడైనా గుర్తింపు పొందుతారు’ అని మరొకరు రిప్లై ఇచ్చారు. -
భారత్‌లో ఎస్ఏపీ అపార పెట్టుబడులు
న్యూఢిల్లీ: జర్మనీ సాఫ్ట్వేర్ దిగ్గజం ఎస్ఏపీ భారత్‌లో అపారమైన పెట్టుబడులతో పాటు భారీగా ఉద్యోగాలను కలి్పంచే ప్రణాళికల్లో ఉందని కంపెనీ సీఈఓ క్రిస్టియన్ క్లీన్ చెప్పారు. తమకు అత్యంత వేగవంతమైన వృద్ధిని అందించడంతో పాటు భవిష్యత్తులో అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా కూడా భారత్ నిలుస్తుందన్నారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ బోర్డు బెంగళూరు పర్యటనలో భాగంగా ఆయన విషయాలను వెల్లడించారు. ‘భారత్ టాప్–10 మార్కెట్లలో ఒకటి. ఈ ర్యాంక్ అంతకంతకూ ఎగబాకుతోంది. ఈ నేపథ్యంలో ఆర్అండ్డీ కార్యకలాపాలపై భారీగా వెచ్చించనున్నాం. జర్మనీ తర్వాత ఇక్కడే కంపెనీకి అత్యధిక సిబ్బంది ఉన్నారు. ఇతర ఎస్ఏపీ ల్యాబ్‌లతో పోలిస్తే అసాధారణ రీతిలో నియమాకాలను చేపట్టనున్నాం. అతి త్వరలోనే అతిపెద్ద హబ్‌గా భారత్ ఆవిర్భవిస్తుంది. ఏఐ భారీ అవకాశాలను అందించనుంది. భారత్‌లోని ఏఐ నిపుణుల పనితీరు అద్భుతం’ అని క్లీన్ చెప్పారు. కాగా, భారత్‌లోని ఎస్ఏపీ ఆర్అండ్డీ సెంటర్లలో 15,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. మరో 15,000 కొలువులు కల్పించే ప్రణాళికల్లో కంపెనీ ఉంది. -
వ్యవసాయ రంగమే ఉపాధికి ఊతం
నగర ప్రాంతాలకు తరలి వస్తోన్న లక్షలాదిమంది ప్రధానంగా ఉపాధిని పొందుతోంది, నిర్మాణ రంగంలోనే. సాఫ్ట్వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధికి రఘురావ్‌ు రాజన్ వంటి వారు కూడా సేవారంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు? నేటి ప్రపంచ పరిస్థితులలో సరుకు ఉత్పత్తి రంగం గానీ, సేవా రంగం గానీ కోట్లాది మంది నిరుద్యోగులకు బతుకుతెరువును చూపగల స్థితి లేదు. మిగిలిందల్లా, వ్యవసాయ రంగమే. వ్యవసాయం లాభసాటిగా ఉంటే గ్రామీణులు నగరాలకు రారు. అప్పుడు కారుచవకగా కార్పొరేట్లకు కార్మికులు దొరకరు. అందుకే వ్యవసాయం లాభసాటిగా లేకుండా ‘జాగ్రత్తపడటమే’ ఇప్పటి విధానం.దేశంలోని సుమారు 65% జనాభా 35 ఏళ్ల లోపువారు. వీరికి నిరుద్యోగం, చదువుకు తగిన ఉద్యోగం లేకపోవడం ప్రధాన సమస్యలు. కోవిడ్ అనంతరం సమస్య మరింత జఠిలం అయ్యింది. 2016లో మోదీ తెచ్చిపెట్టిన పెద్ద నోట్ల రద్దు, 2017లో హడావుడిగా ఆరంభమైన జీఎస్టీ వంటివి చిన్న, మధ్యతరహా పరిశ్రమలను దెబ్బతీసి నిరుద్యోగ సమస్యను మరింత పెంచాయి.దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనే వాగ్దానం ఆసరాగా 2014లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఇదే నేపథ్యంలో, మోదీ ప్రభుత్వం సరుకు ఉత్పత్తి రంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక ఉపాధి కల్పనా రంగంగా... దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 25% స్థాయికి చేర్చే పేరిట ‘మేకిన్ ఇండియా’ కార్య క్రమాన్ని ఆరంభించింది. దశాబ్ద కాలం తర్వాత, వెనక్కిచూసుకుంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా 15– 17 శాతం మధ్య ఎదుగూ బొదుగూ లేకుండా మిగిలిపోయింది. 2020లో ఆరంభమైన ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల’ పథకం కూడా సాధించింది నామ మాత్రమే.మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతం అయ్యే అవకాశాలు లేవంటూ అప్పట్లోనే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురావ్‌ు రాజన్ చెప్పారు. చైనా ప్రపంచం యావత్తుకూ సరిపోయే స్థాయిలో, చవకగా సరుకులను ఉత్పత్తి చేస్తోంది గనుక ప్రపంచానికి మరో చైనా అవసరం లేదంటూ సున్నితంగా హెచ్చరించారు. ఈ రచయిత కూడా 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం, అంతర్జాతీయంగా డిమాండ్ పతనం వంటి వివిధ కారణాలను పేర్కొంటూ మేకిన్ ఇండియా, దేశ సమస్య లకు పరిష్కారం కాదంటూ ఒక వ్యాసం రాసివున్నారు.దేశంలో నిరుద్యోగం పరిష్కారానికీ, వృద్ధి రేటు పెంపుదలకూ దారి ఏమిటనే చర్చ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే, ఈ మధ్య రఘురావ్‌ు రాజన్ ‘బ్రేకింగ్ ద మౌల్డ్: రీ ఇమేజింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్’ పేరిట రోహిత్ లాంబా అనే పెన్సి ల్వేనియా విశ్వవిద్యాలయ ఆచార్యునితో కలిసి ఒక పుస్తకం రాశారు. దీనిలో భాగంగా మేకిన్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక విధానాలు ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువగా తయారయ్యాయని పేర్కొన్నారు. ఈ సరుకు ఉత్పత్తి రంగంపై దృష్టిని కాస్తంత తగ్గించు కొని, భారతదేశం ఇప్పటికే ‘బలంగా’ వున్న సేవా రంగంపై దృష్టి పెట్టాలన్నారు. తద్వారా మెరుగైన ఉపాధి కల్పన, వృద్ధి రేటులను సాధించవచ్చనేది వారి వాదన. దీని కోసమై యువజనుల నిపుణతల స్థాయిని పెంచి వారిని సేవా రంగ ఉపాధికి సిద్ధం చేయాలన్నారు.రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొరియా, జపాన్... అలాగే చైనా వంటి దేశాలు అనుసరించిన ఆర్థిక వృద్ధి నమూనా అయిన మొదటగా వ్యవసాయ రంగం నుంచి సరుకు ఉత్పత్తి రంగం దిశగా సాగడం... అనంతరం మాత్రమే సేవా రంగం వృద్ధి దిశగా పయనించడం అనివార్యం కాదని రాజన్ వాదిస్తున్నారు. అనేక ధనిక దేశాలలో ఇప్పటికే సేవా రంగం వాటా జీడీపీలో 70% మేర ఉందనీ, ఈ రంగంలో జీడీపీ వాటా సుమారు 60% పైన వున్న భారత్ కూడా పాత నమూనాని పక్కన పెట్టి మరింతగా సేవా రంగంలోకి వెళ్ళాలనేది రాజన్ తర్కం. సేవా రంగం వృద్ధి చెందాలంటే యువజనుల విద్యా నిపుణతల స్థాయి సరుకు ఉత్పత్తి రంగంలో కంటే అధికంగా ఉండాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా సేవా రంగం తాలూకు సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించగలగడంలో ఎదుర్కొంటున్న సాఫ్ట్ స్కిల్స్ లోటును చూస్తున్నాం. సేవా రంగంలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం అవసరం తెలిసిందే. దేశంలోని ఎంతమంది యువజనులకు ఈ రంగంలో ప్రవేశించగల స్థాయి ఆంగ్ల భాషా ప్రావీణ్యం ఉంది? దేశంలోని మొత్తం కార్మికులలో 70% మంది మాత్రమే అక్షరాస్యులు. వీరిలో కూడా 25% మంది ప్రాథమిక స్థాయి విద్యలోపే పాఠశాల చదువు మానివేసిన వారు. దేశంలోని 20% సంస్థలు మాత్రమే తమ ఉద్యోగులకు తగిన శిక్షణను ఇచ్చుకునే ఏర్పాట్లను కలిగి వున్నాయి (ప్రపంచ బ్యాంకు పరిశోధన). ఈ స్థితిలో, గ్రామీణ యువజనులను సేవా రంగం దిశగా ఇప్పటికిప్పుడు తీసుకెళ్ళగలమా? నేడు సాఫ్ట్వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో, ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి కోసం రఘురావ్‌ు రాజన్ వంటి వారు కూడా సేవా రంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు?దీనికి కారణం ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘బీయింగ్ డిటర్మిన్స్ కాన్షియస్నెస్’ (మన అస్తిత్వమే మన ఆలోచనలను నిర్ణయిస్తుంది) అనే కార్ల్ మార్క్ ్స ఉద్బోధన. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలో 2003 నుంచి 2007 వరకూ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేసిన రాజన్ కూడా దాటుకుని రాలేని నిజం. ఆయన అస్తిత్వం తాలూకు పరిమి తులే, ఆయనను వాస్తవాన్ని చూడనివ్వడం లేదు. నేటి ప్రపంచ పరిస్థితులలో అటు సరుకు ఉత్పత్తి రంగం గానీ, ఇటు సేవా రంగం గానీ, కోట్లాది మంది నిరుద్యోగ యువతకు బతుకుదెరువును చూప గల స్థితి లేదు. మిగిలిందల్లా, మన వ్యవసాయ రంగమే. ఈ రంగంలో ఇప్పటికే, అవసరాన్ని మించి మానవ వనరులు చిక్కుకు పోయి ఉన్నాయన్నది నిజం. ప్రస్తుత ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల ‘సంస్కరణల’ యుగంలో వ్యవసాయ రంగంపై చిన్న చూపు పెరిగింది. గ్రామీణ వ్యవసాయ రంగం, నగర ప్రాంత పారిశ్రామిక రంగాల మధ్యన ఉన్న సమీకరణం గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకంగా ఉంది. వ్యవసాయ రంగ సరుకులను కారు చవుకగా, నగర ప్రాంతాలలో అందుబాటులో ఉంచడమనేది పారిశ్రామిక కార్పొరేట్ వర్గాల అవసరం. గ్రామీణ రైతాంగానికి లాభసాటి ధరలను కల్పిస్తే ఆ సరుకుల ధరలు, నగర ప్రాంత మార్కెట్లలో అధికంగా ఉంటాయి. నగర ప్రాంత కార్మికులు, ఉద్యోగులకు అవి ఖరీదైనవి అవుతాయి. అప్పుడు వేతనాల పెంపుదల కోసం యజమానులపై ఒత్తిడి తెస్తారు. ఇది పారిశ్రామిక అశాంతిగా మారవచ్చు. ఒక మోస్తరు వేతనాలతోనే పని చేయించుకోగలగాలంటే రైతాంగ ఉత్పత్తులకు తక్కువ ధరలు ఉండేలా జాగ్రత్తపడడం కార్పొరేట్లకు అవసరం. గ్రామీణ రైతాంగానికి వ్యవసాయం లాభసాటిగా ఉంటే వారు నగరాలకు రారు. అప్పుడు నగర ప్రాంతాలలో కార్మికుల సరఫరా తగ్గుతుంది. కార్మికులకు డిమాండ్ పెరుగుతుంది. దీని వలన, పారిశ్రామికవేత్తలు అధిక వేతనాలను చెల్లించి పనిలో పెట్టుకోవలసి వస్తుంది. దీనికి కూడా పరిష్కారమే గ్రామీణ వ్యవసాయం లాభ సాటిగా లేకుండా ‘జాగ్రత్తపడడం’. ఈ కథలో సూత్రధారులు ప్రపంచీకరణ వంటి నయా ఉదారవాద విధానాaలను మన మీద రుద్దుతోన్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధులు. ఆ ఆలోచనా విధానం తాలూకు ప్రతినిధిగా రఘురావ్‌ు రాజన్ వ్యవసాయం ఊసు ఎత్తలేరు. దాన్ని దేశానికీ, ఉపాధి కల్పనకూ దారిగా చూపలేరు. రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటే అది అతని కొనుగోలు శక్తిని పెంచి తద్వారా నగర ప్రాంత పారిశ్రామిక సరుకులకు డిమాండ్‌ను కల్పిస్తుంది. దేశ జనాభాలోని 55% పైన ఉన్న రైతాంగం బాగుంటే, విదేశాలలోని డిమాండ్, కొనుగోలు శక్తి, ఎగుమతులతో నిమిత్తం లేకుండా దేశంలోనే డిమాండ్‌ను సృష్టించవచ్చు. ఈ పరిష్కారాన్ని చెప్పలేని మేధా దుర్బలత్వంతో రఘురావ్‌ు రాజన్ వంటివారు మిగిలిపోతున్నారు. డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
బెంగళూరులో మరో ఆఫీస్: 300 మంది ఉద్యోగులకు అవకాశం
కరోనా సమయంలో భారీ నష్టాలను చవి చూసిన దిగ్గజ కంపెనీలు కోలుకుంటున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఐటీ కంపెనీ 'యూఎస్టీ' తన కార్యకలాపాలను విస్తరించడంతో భాగంగా.. బెంగళూరులో రెండవ ఆఫీస్ ప్రారంభించింది. సుమారు 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న యూఎస్టీ కొత్త కార్యలయం 300 మంది ఉద్యోగులు విధులు నిర్వహించడానికి అనుకూలంగా ఉంది.కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడంలో భాగంగానే.. ఈ కొత్త ఆఫీస్ ప్రారంభించినట్లు సమాచారం. యూఎస్టీ తన కొచ్చి ప్రధాన కేంద్రంలో వచ్చే ఐదేళ్ల నాటికి సుమారు 6,000 మందికి పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ 2,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. కాగా కేరళలోని తిరువనంతపురం కేంద్రంలో సుమారు 7,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: రూ. 34కే బియ్యం.. మళ్ళీ భారత్ బ్రాండ్ సేల్స్2012లో తన కార్యకలాపాలను ప్రారంభించిన యూఎస్టీ.. బెంగళూరులో ప్రస్తుతం 6000 కంటే ఎక్కువమంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ కంపెనీ సెమీకండక్టర్, హెల్త్‌కేర్, టెక్నాలజీ, లాజిస్టిక్స్, హైటెక్, రిటైల్, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ భారతదేశం అంతటా 20000 మంది కంటే ఎక్కువ ఉద్యోగులను కలిగి ఉంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా 30000 కంటే ఎక్కువ ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. -
కంపెనీని వీడి తిరిగి సంస్థలో చేరిన 13 వేలమంది!
యూఎస్ ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గతంలో వివిధ కారణాలతో కంపెనీని వీడిన ఉద్యోగుల్లో దాదాపు 13,000 మంది తిరిగి సంస్థలో చేరినట్లు కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్ రవికుమార్ తెలిపారు. మూడో త్రైమాసికంలో మొత్తం 3,800 మంది ఉద్యోగులు కొత్తగా సంస్థలోకి వచ్చినట్లు చెప్పారు.ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికుమార్ మాట్లాడుతూ..‘కంపెనీలో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గతంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో అదనంగా 3,800 మంది కొత్తగా సంస్థలో చేరారు. అయితే ఏడాది ప్రాతిపదికన చూస్తే 6,500 ఉద్యోగులు తగ్గినట్లు కనిపిస్తుంది. ఆగస్టులో కంపెనీ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. బెల్కన్ కంపెనీలో మేజర్ వాటాను కాగ్నిజెంట్ కొనుగోలు చేయడంతో ఆ సంస్థ ఉద్యోగులు కూడా సంస్థ పరిధిలోకి వచ్చారు. దాంతో ఈ సంఖ్య పడిపోయినట్లు కనిపిస్తుంది. కొంతకాలంగా వివిధ కారణాలతో కంపెనీని వీడిన దాదాపు 13,000 మంది తిరిగి సంస్థలో చేరారు. కంపెనీ ఉద్యోగుల అట్రిషన్ రేటు(ఉద్యోగులు సంస్థలు మారే నిష్పత్తి) కూడా 14.6 శాతానికి తగ్గిపోయింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అలెక్సా చెబితే టపాసు వింటోంది!అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రాజకీయ భౌగోళిక పరిణామాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా క్లయింట్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలకు కాంట్రాక్ట్‌లు ఇవ్వడం ఆలస్యం చేశాయి. దాంతో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. క్రమంగా యుద్ధ భయాలు, ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండడంతో తిరిగి పరిస్థితులు గాడినపడుతున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేరుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
కొత్త హోదాలతోనే ఉద్యోగాలు.. ఇదే సరికొత్త ట్రెండ్
టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో.. దానికి తగ్గట్లే వ్యాపార ధోరణి మారుతోంది. ముఖ్యంగా ఉత్పత్తి, సేవా రంగాల్లో పుట్టగొడుగుల్లా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అలాగే.. ఉద్యోగాలలోనూ విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2024లో పలు ఉద్యోగాలలో నియామకాలు పొందిన ప్రతి 10 మందిలో ఒకరు.. గత పాతికేళ్లలో వినిఎరుగని కొత్త హోదాలతో ఉద్యోగాలు పొందినట్లు లింక్డ్ఇన్ సర్వే వెల్లడించింది. గత 25 ఏళ్లలో ఏనాడూ వినని పొజిషన్లను పలువురు ఉద్యోగులకు ఆ కంపెనీలు అప్పగించాయని, వాటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజనీర్, సస్టైనబిలిటీ మేనేజర్.. లాంటివి ఉన్నాయని లింక్డ్ఇన్ విభాగం ‘వర్క్ చేంజ్ స్నాప్‌షాట్’ తెలిపింది.‘‘ఉద్యోగాలలో మార్పులు వేగంగా పెరుగుతున్నాయని యూకేకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొత్త పొజిషన్లు, నైపుణ్యాలు, సాంకేతికతలకు ఎక్కువ డిమాండ్ ఉందని.. ప్రతీ నలుగురిలో ముగ్గురు ఉద్యోగులు నమ్ముతున్నారు. అలాగే కంపెనీలు సైతం ఆ కొత్త హోదా ఉద్యోగులపైనే అధికంగా అంచనాలు పెంచుకుంటున్నాయి’’ అని ఆ నివేదిక తెలిపింది. ఇందుకోసం చేపట్టిన అధ్యయనంలో.. సుమారు 51 శాతం మంది హెచ్ఆర్ నిపుణులు ఈ అభిప్రాయం వెల్లడించారట. ఇక ఏఐతో సహా కొత్త టెక్నాలజీల వేగంగా అభివృద్ధి చెందటంతో.. యూకే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు 2016 నుంచి 2030 వరకు 65 శాతం వరకు మారవచ్చని లింక్డ్ఇన్ సర్వే డేటా తెలియజేస్తోంది. ఏఐని ఉపయోగిస్తూ బిజినెస్ చేయడానికి సిద్ధమైనవారికి భారీ అవకాశాలు ఉన్నాయని చెప్పింది. తమ సర్వేలో పాల్గొన్న యూకే వ్యాపారవేత్తల్లో అత్యధికులు (80 శాతం) మంది టీం పనితీరును మెరుగుపరచటంలో ఏఐ సామర్థ్యాన్ని గుర్తించారని తెలిపింది. అయితే.. కేవలం 8 శాతం కంపెనీలను మాత్రామే ఏఐ తమను ముందువరసలో ఉంచుతోందని అభిప్రాయపడినట్లు పేర్కొంది. మరోవైపు.. హెచ్ఆర్ నిపుణులపై ఒత్తిడి మేరకు ప్రతి ముగ్గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ప్రతిరోజూ వారు తీసుకోవలసిన నిర్ణయాల పట్ల నిరుత్సాహంగా ఉన్నారని తెలిపింది. 15శాతం మంది.. వారంలో పావు వంతు వరకు అవసరమైన తమ పని చేస్తున్నారని వెల్లడించింది.‘‘ప్రస్తుతం సమయంలో వర్క్ ప్లేస్‌లో మార్పులు వస్తున్నాయి.నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఏఐ వంటి కొత్త సాంకేతికతలు మన రోజువారీ వర్క్‌ను మెరుగుపరచడానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏఐ సామర్థ్యాన్ని వాడుకోవటం ఎలా పెంచుకోవాలో కొన్ని బిజినెస్‌లు పరిశీలన చేస్తున్నాయి’ అని లింక్డ్ఇన్ (యూకే) మేనేజర్ జానైన్ చాంబర్లిన్ అభిప్రాయడ్డారు. -
20 ఏళ్ల యువతకు ఏఐ గాడ్‌ఫాదర్ సలహా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శకం కొనసాగుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాదాపు ప్రతి రంగంలోకి ఏఐ ప్రవేశిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ రంగంలో తమ కెరియర్ పెంపొందించేకోవాలనే వారికి ‘ఏఐ గాడ్‌ఫాదర్’గా పరిగణించబడే ఫ్రెంచ్-అమెరికన్ శాస్త్రవేత్త యాన్ లెకున్ సూచనలిచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల వయసు గల యువత తమ కెరియర్ను ఉజ్వలంగా మలుచుకోవాలంటే ఏం చేయాలో చెప్పారు.‘ప్రపంచంలో దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వేగంగా విస్తరిస్తోంది. 20 ఏళ్ల వయసుగల వారు తమ భవిష్యత్తు కోసం నన్ను ఏం చేయాలో చెప్పమని అడిగితే ఒక సలహా ఇస్తాను. ఎక్కువగా గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. తరువాతి తరం ఏఐ సిస్టమ్‌లను అర్థం చేసుకోవడానికి ఇవి ఎంతో అవసరం. వీటికి భవిష్యత్తులో ఎక్కువ ఆదరణ ఉంటుంది. అదే మొబైల్ యాప్ డెవలప్మెంట్ వైపు తమ కెరియర్ మలుచుకోవాలనుకునే వారికి భవిష్యత్తులో పెద్దగా అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రంగం ‘షెల్ఫ్‌లైఫ్’(అధిక ఆదరణ ఉండే సమయం) మూడేళ్లుగా నిర్ధారించారు. 30-40 ఏళ్ల వారు చిప్ తయారీ రంగంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే వచ్చే ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: వంటనూనె ధరలు మరింత ప్రియం?యాన్ లెకున్ ప్రస్తుతం మెటా సంస్థలో చీఫ్ ఏఐ సైంటిస్ట్‌గా పని చేస్తున్నారు. మెటా ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్ (ఫెయిర్) ల్యాబ్‌ను ఏర్పాటు చేసిందని లెకున్ గుర్తు చేశారు. ఇది లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల(ఎల్ఎల్ఎం) కంటే తదుపరి తరం ఏఐ సిస్టమ్‌లపై పరిశోధనలు చేస్తుందన్నారు. ప్రపంచంలోని ప్రధాన కంపెనీలు ఇప్పటికే వాటి ఏఐ ఉత్పత్తులను పరిచయం చేశాయి. నిత్యం అందులో కొత్త అంశాలను అప్డేట్ చేస్తున్నాయి. గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపిలట్, ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ, మెటా మెటాఏఐ..వంటివి ప్రత్యేకంగా ఏఐ సేవలందిస్తున్నాయి. -
ఆఫీస్‌లో తక్కువ స్థాయి పనైతే ఏం చేయాలి..?
‘‘అది నా పని కాదు’’.. అనే మాటను ఆఫీసులలో తరచు వింటుంటాం. తప్పేం లేదు. ఏ పని చేయటానికైతే ఉద్యోగంలో చేరామో ఆ పనే కదా చేయాలి! అయితే కొన్నిసార్లు మనకు మించిన పనినో, మనం చేస్తున్న పని కన్నా తక్కువ స్థాయి పనినో అత్యవసరంగా చేయవలసి వస్తుంది. అంటే.. పనే మనల్ని వెతుక్కుంటూ రావటం అన్నమాట. (మొదట్లో పని కోసం మనం వెతుక్కుంటూ వచ్చినట్లుగా). అప్పుడేం చేయాలి? ఏదైనా చెయ్యొచ్చు. మించిన పనైతే ‘‘బాబోయ్.. నా వల్ల అవుతుందా!’’ అని తప్పించుకోవచ్చు. తక్కువస్థాయి పనైతే ‘‘అది నా పని కాదు’’ అని ముఖం తిప్పేసుకోనూ వచ్చు. ఈ రెండూ కాకుండా... ‘‘ఎస్, ఐ కెన్’ అని ఏ పనికైనా ఉత్సాహంగా చేయందించవచ్చు. సినిమాల్లోకి రాకముందు పరిణీతి చోప్రా కూడా ఒక సాధారణ ఉద్యోగే. రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ, రాణి ముఖర్జీ వంటి సినీ సెలబ్రిటీలకు పీఆర్‌గా పని చేశారు. వారి షెడ్యూళ్లు చూసుకోవటం, ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయటం ఆమె పని. అయితే ఆ పనులు మాత్రమే చూసుకోలేదు పరిణీతి. అవసరం అయినప్పుడు, బాయ్స్ అందుబాటులో లేనప్పుడు అనుష్క శర్మ, రాణి ముఖర్జీ, దీపికా పడుకోన్, నీల్ నితిన్ ముఖేశ్‌లకు కాఫీలు కూడా అందించారట! ‘‘తప్పేముంది? మనం చేయగలిగిన పనే కదా!’’ అంటారు పరిణీతి.అక్టోబర్ 22 పరిణీతి పుట్టిన రోజు. ఆ సందర్భంగా రాజ్ షమానీకి ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో.. తన తొలినాళ్ల ఉద్యోగ బాధ్యతల్ని, అదనంగా వచ్చి పడిన పనులను తనెంత ఇష్టంగా నిర్వహించిందీ గుర్తు చేసుకున్నారు పరిణీతి. ‘‘అవసరమైనప్పుడు పనిలో స్థాయీ భేదాలు చూసుకోనక్కర్లేదని నా ఉద్దేశం..’’ అంటారు ప్రస్తుతం స్టార్ నటిగా వెలిగిపోతున్న పరిణీతి. -
ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీ
కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, పర్యాటక ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు పెంచితే.. పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. తద్వారా కొత్త ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల మంత్రి 'నితిన్ గడ్కరీ' (Nitin Gadkari) పేర్కొన్నారు. గోవాలో ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FHRAI) నిర్వహించిన సదస్సులో గడ్కరీ ఈ విషయాలను వెల్లడించారు.ఆర్థికాభివృద్ధికి ఆతిథ్య రంగం ఎంతో కీలకమని నితిన్ గడ్కరీ సూచించారు. వ్యాపార కార్యకలాపాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచాలని మంత్రి హాస్పిటాలిటీ రంగానికి తమ బలమైన మద్దతును వ్యక్తం ప్రకటించారు. ఇది విస్తారమైన ఉద్యోగ అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: రూ.80 లక్షల జీతం: సలహా ఇవ్వండి.. టెకీ పోస్ట్ వైరల్కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నవాటితో పాటు మరో 18 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టులు త్వరలోనే పూర్తవుతాయి. ఇది పర్యాటకాన్ని మరింత మెరుగుపరుస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం చాలామంది ప్రజలు పుణ్యక్షేత్రాలను సందర్శించాడని మాత్రమే.. ఆధునిక నగరాలు, ప్రత్యేకమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి సుముఖత చూపిస్తున్నారని ఆయన అన్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో రూ.26 లక్షలకు కుచ్చుటోపీ
బంజారాహిల్స్: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.26 లక్షలు వసూలు చేసి ముఖం చాటేసిన భార్యాభర్తలపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని వెంకటగిరి స్రవంతినగర్‌లో నివసించే ఆరెవరపు వాసు టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గత ఏడాది జనవరిలో అక్కడే పనిచేస్తున్న చల్లా శ్రీరామ్ కిరణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాసుకు పరిచయం అయ్యాడు. తనకు పెద్ద పెద్ద కంపెనీల్లో పరిచయాలు ఉన్నాయని, ఐబీఎం కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో వాసు తన స్నేహితులను సంప్రదించి ఒక్కొక్కరి నుంచి రూ.2– 2.5 లక్షల వరకు 17 మంది దగ్గర రూ.26 లక్షలు వసూలు చేసి చల్లా శ్రీరామ్కిరణ్కు ఇచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ 17 మందికి ఆఫర్ లెటర్లు ఇవ్వగా వీరంతా ఆయా కంపెనీల్లో జాయిన్ కావడానికి వెళ్లినప్పుడు అవి బోగస్ ఆఫర్ లెటర్లు అని తేలింది. లబోదిబోమంటూ బాధితులు చల్లా శ్రీరామ్‌కిరణ్, ఆయన భార్య సంధ్యారాణిని సంప్రదించారు. అయితే మరో కంపెనీలో జాబ్‌లు ఇప్పిస్తానని, తనను నమ్మాలని చెప్పాడు. నెలలు గడుస్తున్నా వీరికి జాబ్‌లు ఇవ్వకపోగా డబ్బులు తిరిగి ఇవ్వమంటే ముఖం చాటేశాడని బాధితుడు వాసు పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాక్‌డోర్ జాబ్స్ పేరుతో ఉద్దేశపూర్వకంగా తమ వద్ద నుంచి రూ.26 లక్షలు వసూలు చేసి మోసగించిన శ్రీరామ్‌కిరణ్, ఆయన భార్య సంధ్యారాణిలపై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఇద్దరి పైనా ఐపీసీ సెక్షన్ 406, 420 కింద చీటింగ్ కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.