
వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్ తమ కార్యకలాపాలకు సంబంధించి కీలకంగా ఎదుగుతోందని జర్మన్ సెమీకండక్టర్ల సంస్థ ఇన్ఫినియోన్ టెక్నాలజీస్ సీఎంవో ఆండ్రియాస్ ఉర్షిజ్ తెలిపారు. తమకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 58,000 మంది, భారత్‌లో 2,500 మంది పైగా ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. భారత్‌లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్న నేపథ్యంలో 2030 నాటికి ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేసుకోనున్నట్లు ఆయన వివరించారు.
దేశీయంగా ఇతర భాగస్వాములతో కలిసి పని చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆండ్రియాస్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి తమ గ్రూప్ ఆదాయంలో భారత్ వాటా సింగిల్ డిజిట్ స్థాయిలోనే ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరగనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, సమీప భవిష్యత్తులో ఇక్కడ తయారీ ప్లాంటు ఆలోచనేదీ లేదని వివరించారు. మరోవైపు, కొత్త ఆవిష్కరణలను వేగవంతం చేసే దిశగా ఎల్రక్టానిక్స్, మైక్రో ఎల్రక్టానిక్స్ విభాగాల్లో స్టార్టప్‌లకు సహాయం అందించేందుకు వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆండ్రియాస్ చెప్పారు.
ఇదీ చదవండి: బీమా సలహా కమిటీలోకి కొత్త సభ్యులు.. ఏం చేస్తారంటే..
సెమీకండక్టర్ పరిశ్రమలో ఇన్ఫినియాన్ టెక్నాలజీస్‌తోపాటు విభిన్న కంపెనీలు యువతకు అవకాశాలు కల్పిస్తుంది. ఈ పరిశ్రమలో ప్రధానంగా హార్డ్ వేర్ డిజైన్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, చిప్ డిజైన్, క్వాలిటీ అస్యూరెన్స్, డిజైన్ అండ్ డెవలప్‌మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ వంటి విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. ఇంటెల్, మైక్రాన్, ఇన్ఫినియన్ టెక్నాలజీస్, గ్లోబల్‌ఫౌండ్స్.. వంటి కంపెనీలు భారత్‌లో చురుకుగా నియామకాలు చేపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment