Semiconductors
-
డేటా సెంటర్లకు రాజధాని: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ త్వరలోనే డేటా సెంటర్లకు రాజధానిగా అవతరిస్తుందని, సింగపూర్‌కు చెందిన ఎస్టీ టెలి మీడియా భారీ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకురావడం దీనిని చాటి చెబుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు, ప్రపంచస్థాయి అనుకూలతలు ఉన్నాయని చెప్పారు. సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజు శనివారం సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఎస్టీ టెలి మీడియా కేంద్ర కార్యాలయాన్ని సందర్శించింది. ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడితో ‘గ్లోబల్ డేటా సెంటర్’ ఏర్పాటుకు ఎస్టీ టెలి మీడియా ముందుకొచ్చింది. ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్పేటలో ఏఐ ఆధారిత అత్యాధునిక డేటా సెంటర్ క్యాంపస్ స్థాపించేందుకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమల శాఖ ముఖ్య కార్య దర్శి జయేశ్ రంజన్, ఎస్టీటీ గ్రూప్ ప్రెసిడెంట్, సీఈఓ బ్రూనో లోపెజ్ సంతకాలు చేశారు. భారతదేశంలోని అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా నిలిచే ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ తెలంగాణలో ఏర్పాటు కానుండటం... ఇక్కడి మౌలిక సదుపాయాలు, ప్రపంచస్థాయి అనుకూలతలను చాటి చెప్తుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత రంగాల్లో వస్తున్న మార్పుల్లో హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఇక తెలంగాణలో మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ఉన్నాయని ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ప్రెసిడెంట్, సీఈవో బ్రూనో లోపెజ్ ప్రశంసించారు. భారీగా విస్తరణ దిశగా.. ఇప్పటికే హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్‌ను నిర్వహిస్తున్న ఎస్టీ టెలీమీడియా కొత్త క్యాంపస్ ఏర్పాటుతో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. వంద మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటయ్యే కొత్త క్యాంపస్ సామర్థ్యాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పెంచనుంది. వచ్చే పదేళ్లలో భారత్‌లో తమ డేటా సెంటర్లను ఒక గిగావాట్ సామర్థ్యానికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా వచ్చే పదేళ్లలో ఎస్టీ టెలీమీడియా సుమారు 3.2 బిలియన్ డాలర్లను (సుమారు రూ.27 వేల కోట్లు) పెట్టుబడిగా పెడుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు: సీఎం రేవంత్ సింగపూర్ వాణిజ్య, పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హెయిన్తో సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం భేటీ అయింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సింగపూర్ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. నగరాలు, పట్టణాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటి వనరుల నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్ల తయారీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో.. తెలంగాణ, సింగపూర్ ప్రభుత్వాలు కలసి పనిచేసేందుకు ఉన్న అనుకూలతలను సీఎం రేవంత్ వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై సింగపూర్ మంత్రి గ్రేస్ ఫు హెయిన్ స్పందిస్తూ.. వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యంపై అందిన ఆహ్వానాన్ని పరిశీలిస్తామని, తెలంగాణకు తగిన సహకారం అందిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, నీటి వనరుల నిర్వహణ, సుస్థిరాభివృద్ధి ప్రణాళికలపై ఆసక్తి చూపడంతోపాటు పలు ప్రాజెక్టుల్లో పరస్పరం కలసి పనిచేసేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా ఉమ్మడిగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, వాటిపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు, వివిధ రంగాల్లో సింగపూర్ అనుభవాలను పంచుకోవడంపై చర్చించారు. సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడికి సింగపూర్ ఆసక్తి సింగపూర్ పర్యటనలో భాగంగా శనివారం సింగపూర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఎస్ఎస్ఐఏ)తో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. తెలంగాణలో సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడికి అనుకూల వాతావరణం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పెట్టుబడిదారులకు అందించే సహకారం, ప్రోత్సాహకాలు, ఇతర అనుకూలతలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ కీలక కేంద్రంగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన ఎస్ఎస్ఐఏ ప్రతినిధులు... సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడులపై ఆసక్తి చూపారు. ఈ ఏడాది చివరిలో తమ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌ను సందర్శిస్తుందని ప్రకటించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్ఎస్ఐఏ చైర్మన్ బ్రియాన్ టాన్, వైస్ చైర్మన్ టాన్ యూ కాంగ్, సెక్రటరీ సీఎస్ చుహ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడికి ఉన్న అవకాశాలు, ఆధునిక మౌలిక వసతులు, విధానాలు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించాయని ఈ భేటీ అనంతరం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
చిప్ చిప్ హుర్రే
అడవుల సంరక్షణ కోసం చేసిన ‘చిప్కో’ ఉద్యమం గురించి విన్నాం... అయితే ఇప్పుడు టెక్నాలజీ రంగంలో భారత్‌ను పవర్‌హౌస్‌గా నిలిపేలా మరో ‘చిప్’కో ఉద్యమం నడుస్తోంది. దేశాన్ని సెమీకండక్టర్స్ శకంలోకి నడిపించేందుకు అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు పారిశ్రామిక అగ్రగాములు రంగంలోకి దూకడంతో ప్రపంచ దిగ్గజాలన్నీ భారత్‌లో చిప్స్ తయారీకి సై అంటున్నాయి. టాటా నుంచి అదానీ వరకు టాప్ కార్పొరేట్ గ్రూప్‌లన్నీ సెమీకండక్టర్ ఉద్యమంలో తలమునకలయ్యాయి. అమెరికా దిగ్గజం మైక్రాన్ నుండి తొలి మేక్ ఇన్ ఇండియా చిప్ కొత్త ఏడాది ఆరంభంలోనే సాక్షాత్కరించనుంది. ఈ భారీ ప్రణాళికల నేపథ్యంలో కొంగొత్త కొలువులకు ద్వారాలు తెరుచుకున్నాయి. రాబోయే రెండేళ్లలో ఏకంగా 10 లక్షల ‘చిప్’ జాబ్స్ సాకారమవుతాయనేది విశ్లేషకుల అంచనా!నిర్మాణంలో ఉన్న చిప్ ప్లాంట్లు...మైక్రాన్ టెక్నాలజీస్ఎక్కడ: గుజరాత్–సాణంద్ మొత్తం పెట్టుబడి: 2.75 బిలియన్ డాలర్లు. తొలి దశ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 2025 నాటికి ఈ ప్లాంట్ నుంచి తొలి మేక్ ఇన్ ఇండియా చిప్ కల సాకారం కానుంది.టీటీపీఎల్–పీఎస్ఎంసీ ఎక్కడ: గుజరాత్–ధోలేరా మొత్తం పెట్టుబడి: రూ. 91,000 కోట్లు. తైవాన్‌కు చెందిన చిప్ తయారీ దిగ్గజం పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్ప్ (పీఎస్ఎంసీ) భాగస్వామ్యంతో టాటా ఎల్రక్టానిక్స్ (టీఈపీఎల్) ఈ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌ను నిర్మిస్తోంది. అదానీ–టవర్ (ఐఎస్ఎం ఆమోదం లభించాల్సి ఉంది)ఎక్కడ: పన్వేల్–మహారాష్ట్ర మొత్తం పెట్టుబడి: రూ.84,000 కోట్లుఇజ్రాయెల్ చిప్ తయారీ సంస్థ టవర్ సెమీకండక్ట్టర్, అదానీ భాగస్వామ్యంతో దీన్ని నెలకొల్పనుంది. టీశాట్ ఎక్కడ: అస్సాం–మోరిగావ్ మొత్తం పెట్టుబడి: రూ.27,000 కోట్లు. టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ్ల అండ్ టెస్ట్ (టీశాట్) ఈ చిప్ ఏటీఎంపీ యూనిట్‌ను నెలకొల్పుతోంది. అత్యాధునిక స్వదేశీ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ టెక్నాలజీలను టీశాట్ అభివృద్ధి చేస్తోంది.కేన్స్ సెమికాన్ ఎక్కడ: గుజరాత్–సాణంద్ మొత్తం పెట్టుబడి: రూ. 3,307 కోట్లు. మైసూరుకు చెందిన ఈ కంపెనీ రోజుకు 63 లక్షల చిప్‌ల తయారీ సామర్థ్యం గల ఓశాట్ (అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్) యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది.సీజీ పవర్, రెనెసాస్ ఎల్రక్టానిక్స్, స్టార్స్ మైక్రోఎల్రక్టానిక్స్ఎక్కడ: గుజరాత్–సాణంద్ మొత్తం పెట్టుబడి: రూ.7,600 కోట్లు. జపాన్‌కు చెందిన రెనెసాస్, థాయ్‌లాండ్ సంస్థ స్టార్స్ భాగస్వామ్యంతో సీజీ పవర్ ఈ చిప్ ఏటీఎంపీ యూనిట్‌ను నెలకొల్పుతోంది.భారత్‌ను సెమీకండక్టర్ తయారీ హబ్‌గా మార్చేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలతో విదేశీ చిప్ దిగ్గజాలు దేశంలో ల్యాండవుతున్నాయి. దేశీ కంపెనీలతో జట్టుకట్టి ఇప్పటికే భారీ పెట్టుబడులను కూడా ప్రకటించాయి. గుజరాత్ అయితే దేశంలో ప్రత్యేక సెమీకండక్టర్ పాలసీ తీసుకొచి్చన తొలి రాష్ట్రంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ స్కీమ్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)లో ప్రకటించిన రూ.76,000 కోట్ల ప్రోత్సాహకాల చలవతో ఇప్పటికే రూ.1.52 లక్షల కోట్ల విలువైన 5 భారీ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాయి. దీంతో చిప్ డిజైన్ నుంచి ఫ్యాబ్రికేషన్ వరకు పలు ప్రాజెక్టుల నిర్మాణ పనులు జోరందుకున్నాయి.ఈ స్కీమ్ ద్వారా కంపెనీల ప్రాజెక్ట్ వ్యయంలో కేంద్రం 50 శాతం సబ్సిడీ అందిస్తోంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక సదుపాయాలు కలి్పస్తున్నాయి. కాగా, మరో 20కి పైగా ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉన్నాయి. దీంతో రెండు మూడు నెలల్లోనే మరింత భారీ స్థాయిలో ఐఎస్ఎం 2.0 స్కీమ్‌ను ప్రకటించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం దేశంలో 5,000కు పైగా కంపెనీలు సెమీకండక్టర్ పరిశ్రమ పరిధిలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ డేటా క్లౌడ్ సంస్థ చెబుతోంది.ఇందులో ప్రత్యక్ష చిప్ తయారీ సంస్థలు, పరికర (కాంపొనెంట్) ఉత్పత్తిదారులతో పాటు ఎల్రక్టానిక్స్ డిజైన్, తయారీ, డి్రస్టిబ్యూషన్ డిస్ప్లే డిజైన్, ఎల్రక్టానిక్స్, ఇన్నోవేషన్ ఇలా మొత్తం సమగ్ర వ్యవస్థ (ఎకో సిస్టమ్)కు సంబంధించిన కంపెనీలు పాలు పంచుకుంటున్నాయి. 2023–24లో భారత్ దిగుమతి చేసుకున్న సెమీకండక్టర్ల విలువ అక్షరాలా 33.9 బిలియన్ డాలర్లు. 2030 నాటికి ఈ డిమాండ్ 148 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందనేది నోమురా అంచనా. ఇక చిప్ డిజైన్ జోరు.. త్వరలో కేంద్రం ప్రకటించనున్న సెమికాన్ 2.0 స్కీమ్‌లో చిప్ డిజైనింగ్‌తో పాటు సెమికండక్టర్ పరిశ్రమ ఎకో సిస్టమ్ వృద్ధికి పెద్ద పీట వేయనుంది. దిగ్గజ సంస్థలకూ ప్రాజెక్టుల వ్యయంలో సబ్సిడీ అందించే అవకాశముంది. ప్రస్తుత స్కీ మ్ (రూ.1,000 కోట్లు) చిప్ డిజైన్ స్టార్టప్‌లకు మాత్రమే 50 శాతం సబ్సిడీ (రూ.15 కోట్ల పరిమితితో) అమలవుతోంది. తదుపరి స్కీమ్‌లో ఈ పరిమితి పెంపుతో పాటు బడా కంపెనీలకూ వర్తింపజేయనున్నట్లు సమాచారం. ఎల్అండ్టీ సెమీకండక్టర్ టెక్నాలజీస్, క్వాల్కామ్, మీడియాటెక్, ఎన్ఎక్స్పీ వంటి కంపెనీలు రెడీగా ఉన్నాయి. అయితే, చిప్ మేధోసంపత్తి హక్కులు (ఐపీ) భారత్‌లోనే ఉండేలా షరతు విధించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.నిపుణులకు ‘చిప్’కార్పెట్! భారత్‌ను సెమీకండక్టర్ పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దాలంటే నిపుణులైన సిబ్బందే కీలకం. అందుకే అటు ప్రభుత్వం, ఇటు పరిశ్రమవర్గాలు ఈ రంగంలో నైపుణ్యాలు పెంచేపనిలో పడ్డాయి. ఎన్ఎల్బీ సరీ్వసెస్ డేటా ప్రకారం 2026 నాటికి భారత సెమీకండక్టర్ పరిశ్రమ 10 లక్షల కొత్త కొలువులను సృష్టించనుందని అంచనా. ఇందులో చిప్ ఫ్యాబ్రికేషన్‌లో 3 లక్షలు, అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ (ఏటీఎంపీ)లో 2 లక్షల జాబ్స్ లభించనున్నాయి.ఇంకా చిప్ డిజైన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సిస్టమ్ సర్క్యూట్స్, తయారీ సరఫరా వ్యవస్థ నిర్వహణ తదితర రంగాల్లో దండిగా ఉద్యోగాలు రానున్నట్లు ఎన్ఎల్బీ నివేదిక పేర్కొంది. ‘సెమీకండక్టర్ పరిశ్రమకు అవసరమైన సిబ్బందిని అందించడంలో రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. భారీ డిమాండ్‌ను తీర్చాలంటే కనీసం ఏటా 5 లక్షల నిపుణులను పరిశ్రమకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది’ అని ఎన్ఎల్బీ సరీ్వసెస్ సీఈఓ సచిన్ అలుగ్ అభిప్రాయపడ్డారు.ప్రధానంగా ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ కంట్రోల్, మెటీరియల్ ఇంజనీరింగ్ వంటి విభాగాల్లో ఇంజనీర్లు, ఆపరేటర్లు, టెక్నీషియన్లు, స్పెషలిస్టులకు ఫుల్ డిమాండ్ ఉంది. కొన్ని చిప్ తయారీ కంపెనీలు ఇప్పటికే నైపుణ్యాభివృద్ధి చర్యలు మొదలుపెట్టాయి. ఏఎండీ, మైక్రాన్ ఇండియా, ఎల్ఏఎం రీసెర్చ్ తదితర కంపెనీలు కొత్త నియామకాల కోసం టెక్నికల్ బూట్క్యాంపులు, యూనివర్సిటీల్లో రీసెర్చ్ ల్యాబ్‌ల ఏర్పాటు, మెంటార్షిప్ అవకాశాల కల్పనకు నడుంబిగించాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారత్‌లో జపాన్ సెమీకండక్టర్ యూనిట్లు!
న్యూఢిల్లీ: భారత్‌లో సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు జపాన్ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్టు డెలాయిట్ సంస్థ వెల్లడించింది. ఈ రంగంలో జపాన్ కంపెనీలకు ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయని, అవి భారత్‌లో భాగస్వామ్యాలకు ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలిపింది. నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు, నిధుల లభ్యత, ప్రభుత్వం నుంచి మద్దతు భారత్‌లో ఈ రంగం వృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు అనుకూలించనున్నట్టు పేర్కొంది.జపనీస్ కంపెనీలు భారత మార్కెట్ పట్ల ఎంతో ఉత్సాహం చూపిస్తున్నట్టు డెలాయిట్ ఏపీ, డెలాయిట్ జపాన్ ఎస్ఆర్టీ లీడర్ షింగో కామయ తెలిపారు. భారత్‌లో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి చేతులు కలిపిన వాటిల్లో యూఎస్ తర్వాత రెండో క్వాడ్ భాగస్వామి జపాన్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. సెమీకండక్టర్ డిజైన్, తయారీ, ఎక్విప్మెంట్, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి భారత్, జపాన్ మధ్య అవగాహన ఒప్పందాలు కుదరడాన్ని ప్రస్తావించారు. 100 సెమీకండక్టర్ ప్లాంట్లతో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ కలిగిన టాప్ 5 దేశాల్లో జపాన్ ఒకటిగా డెలాయిట్ పేర్కొంది.చిప్‌ల తయారీలో వాడే వేఫర్లు, కెమికల్, గ్యాస్, లెన్స్‌ల తయారీలో జపాన్ టాప్‌లో ఉన్నట్టు వివరించింది. భారత్ 10 ఏళ్లలో 10 సెమీకంక్టర్ కంపెనీల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుందని.. ఈ దిశగా జపాన్ మెరుగైన భాగస్వామి అవుతుందని అంచనా వేసింది. సెమీకండక్టర్ పరంగా జపాన్ కంపెనీలకు ఉన్న టెక్నాలజీ, ప్రత్యేక నైపుణ్యాలను ప్రస్తావించింది. ఏదో ఒక ఫ్యాక్టరీ ఏర్పాటుతో సెమీకండక్టర్ లక్ష్యం నెరవేరదని, మొత్తం ఎకోసిస్టమ్ (సమగ్ర వ్యవస్థ) ఏర్పా టు చేయాల్సి ఉంటుందని డెలాయిట్ పేర్కొంది. -
ఐటీ కంపెనీల స్టార్టప్ వేట!
ఇప్పుడు ఏ రంగంలో చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా ఎనలిటిక్స్, క్లౌడ్ వంటి అధునాతన సాంకేతికతల వినియోగం అంతకంతకూ జోరందుకుంటోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందున్న ఐటీ కంపెనీలు.. ఆయా విభాగాల్లో తమ సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడం కోసం స్టార్టప్ కంపెనీలను బుట్టలో వేసుకుంటున్నాయి. దేశంలో సెమీకండక్టర్ల (చిప్) తయారీ ఊపందుకోవడంతో చిప్ డిజైన్, స్పేస్ టెక్నాలజీ పైగా దృష్టి సారిస్తున్నాయి. ఈ వేటలో యాక్సెంచర్, ఇన్ఫోసిస్, ఐబీఎంతో వంటి దిగ్గజాలతో పాటు మధ్య తరహా ఐటీ సంస్థలైన పర్సిస్టెంట్, సైయంట్, గ్లోబల్ లాజిక్ కూడా ముందు వరుసలో ఉన్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ప్రావీణ్యం కలిగిన చిన్న, స్టార్టప్‌లను దక్కించుకోవడం వల్ల ఐటీ కంపెనీల ఆదాయం, వేల్యుయేషన్లు కూడా పుంజుకోవడానికి వీలుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. జోరుగా.. హుషారుగా... గత నెలలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ యాజ్–ఎ–సర్విస్ (సాస్) స్టార్టప్ ప్రెసింటోను ఐబీఎం కొనుగోలు చేసింది. ఇదే నెలలో హైదరాబాద్ ఐటీ ఇంజినీరింగ్ సర్విసుల సంస్థ సైయంట్ అమెరికాకు చెందిన భారతీయ స్టార్టప్ అజిమత్ ఏఐలో 27.3 % వాటాను చేజిక్కించుకుంది. ఇందుకోసం దాదాపు 7.25 మిలియన్ డాలర్లను వెచి్చంచింది. సెమీకండక్టర్ పరిశ్రమలో సైయంట్ సామర్థ్యాల విస్తరణకు ఈ కొనుగోలు దోహదం చేయనుంది.ఇక మరో మిడ్‌క్యాప్ ఐటీ కంపెనీ పర్సిస్టెంట్ సిస్టమ్స్... పుణేకు చెందిన డేటా ప్రైవసీ మేనేజ్మెంట్ సంస్థ ఆర్కాను రూ.14.4 కోట్లకు దక్కించుకోనున్నట్లు ప్రకటించింది. టాప్–2 ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం స్పేస్ టెక్ స్టార్టప్ గెలాక్స్ఐలో రూ.17 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచి్చంది. కంపెనీలో ఇన్నోవేషన్ ఫండ్‌లో భాగంగా ఈ పెట్టుబడి పెడుతోంది. తద్వారా ఆ స్టార్టప్‌లో 20 శాతం ఇన్ఫోసిస్‌కు చిక్కనుంది. మరో అగ్రగామి యాక్సెంచర్ ఈ ఏడాది జూలైలో చిప్ డిజైన్ స్టార్టప్ ఎక్సెల్‌మ్యాక్స్ టెక్నాలజీస్‌ను దక్కించుకుంది. ఫిబ్రవరిలో ఇన్ఫోగెయిన్ కూడా యూఎస్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్ ఇంపాక్టివ్ను కైవసం చేసుకుంది. బడా ఐటీ కంపెనీలు ఇప్పుడు స్టార్టప్ కంపెనీల వెంట పడుతున్నాయి. టెక్నాలజీ సామర్థ్యాలతో పాటు ఆదాయాలు, వేల్యుయేషన్లను పెంచుకోవడమే లక్ష్యంగా దేశీ స్టార్టప్ సంస్థల కొనుగోలుకు తెరతీశాయి. ఏఐ వంటి అధునాతన సాంకేతికతల్లో అంతరాన్ని పూడ్చుకోవడానికి కూడా ఈ వ్యూహం బాగానే పనిచేస్తోంది. మరోపక్క, నిధుల కటకటను ఎదుర్కొంటున్న స్టార్టప్‌లకు ఇది దన్నుగా నిలుస్తోంది.తాజా కొనుగోళ్లు ఇలా...⇒ యాక్సెంచర్ – ఎక్సెల్‌మ్యాక్స్ (చిప్ డిజైన్) ⇒ ఇన్ఫోసిస్ – గెలాక్స్ఐ (స్పేస్ టెక్) ⇒ ఐబీఎం – ప్రెసింటో (సాస్) ⇒ జోరియంట్ – మ్యాపిల్ల్యాబ్స్ (క్లౌడ్ మేనేజ్మెంట్) ⇒ సైయంట్ – అజిమత్ ఏఐ (సెమీకండక్టర్) ⇒ పర్సిస్టెంట్ సిస్టమ్స్ – ఆర్కా (డేటా ప్రైవసీ) -
రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు
భారతదేశంలో సెమీకండక్టర్ రంగంలో 2026 నాటికి దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు అవసరమవుతారని నివేదికలు వెలువడుతున్నాయి. టాలెంట్ సొల్యూషన్స్ కంపెనీ ఎన్ఎల్బీ సర్వీసెస్ నివేదిక ఈమేరకు వివరాలు వెల్లడించింది. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్‌లో మూడు లక్షల ఉద్యోగాలు, చిప్ ఏటీఎంపీ (అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్)లో రెండు లక్షల ఉద్యోగాలు, ఇతర విభాగాల్లో మరిన్ని కొలువులు సృష్టించబడుతాయని ఎన్ఎల్బీ నివేదించింది.నివేదికలోని వివరాల ప్రకారం.. దేశంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్‌లకు పెద్ద ఎత్తున అనుమతులు లభిస్తున్నాయి. తాజాగా దాదాపు రూ. 32,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఉత్తరప్రదేశ్‌లో ఆమోదం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం త్వరలో ప్రత్యేకంగా సెమీకండక్టర్ పాలసీను తీసుకురావాలని యోచిస్తోంది. గుజరాత్‌లోని ధొలేరా ప్రాంతంలో టాటా ఎలక్ట్రానిక్స్-పీఎస్ఎంసీ చిప్ ప్రాజెక్ట్, అస్సాంలో టాటా అసెంబ్లింగ్, టెస్ట్ యూనిట్‌ను నిర్వహిస్తోంది. సీజీ పవర్, కేన్స్, అదానీ వంటి ప్రైవేట్ కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. అమెరికాకు చెందిన మైక్రోటెక్ సంస్థ గుజరాత్లో ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం లభించింది.రూ.166 లక్షల కోట్లు ఖర్చుఎలక్ట్రానిక్ భాగాలు, తయారీ, సేవలకు సంబంధించి ఈ రంగంలో గ్లోబల్‌గా దాదాపు రెండు ట్రిలియన్ డాలర్లు(రూ.166 లక్షల కోట్లు) ఖర్చు చేయబోతున్నట్లు ఎలక్ట్రానిక్స్ సప్లై చైన్ ప్లాట్‌ఫామ్ లుమినోవో వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సెబాస్టియన్ స్కాల్ అంచనా వేశారు. సెమీకండక్టర్ పరిశ్రమలో ప్రాసెస్ ఇంటిగ్రేషన్ ఇంజినీర్, సెమీకండక్టర్ వేఫర్ ఇన్స్పెక్టర్, టెక్నికల్ స్పెషలిస్ట్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ (పీఎం) టెక్నీషియన్, డిజైన్ ఇంజినీర్, ప్రాసెస్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్ స్పెషలిస్ట్ వంటి కీలక పోస్టుల కోసం మానవ వనరుల అవసరం ఉందని చెప్పారు.ఇదీ చదవండి: నాలుగు లైన్ల పోస్ట్‌కు స్పందించి జాబ్ ఆఫర్!ఏటా ఐదు లక్షల మందిఎన్ఎల్బీ సర్వీసెస్ సీఈఓ సచిన్ అలుగ్ మాట్లాడుతూ..‘ఈ రంగంలో మానవ వనరుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను తయారు చేయాల్సి ఉంది. భారతదేశం సెమీకండక్టర్ హబ్‌గా మారాలంటే 2026 నాటికి 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అవసరం. కాబట్టి ఈ రంగంలో ఉపాధి కొరతను తీర్చాలంటే ఏటా ఐదు లక్షల మంది ప్రతిభావంతులను తయారు చేయాల్సి ఉంటుంది’ అన్నారు. -
చిప్ ప్రాజెక్టుల కోసం మాతోనే టాటా గ్రూప్ జట్టు ..
ముంబై: సెమీకండక్టర్ల తయారీ ప్రణాళికల్లో ఉన్న టాటా సన్స్ తమ దేశాన్ని కీలక భాగస్వామిగా ఎంచుకుంటుందని సింగపూర్ ధీమా వ్యక్తం చేసింది. అంతర్జాతీయ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ దేశంగా తమకు పేరుండటం ఇందుకు దోహదపడగలదని తెలిపింది. శుక్రవారం టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో భేటీ అనంతరం సింగపూర్ హోమ్ అఫైర్స్ శాఖ మంత్రి కె. షణ్ముగం ఈ విషయాలు తెలిపారు. సమావేశంలో సెమీకండక్టర్లపై విస్తృతంగా చర్చించినట్లు వివరించారు. సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలకు అంతర్జాతీయంగా సెమీకండక్టర్ పరికరాల ఉత్పత్తిలో 20 శాతం వాటా ఉందని షణ్ముగం పేర్కొన్నారు. చిన్న దేశమే అయినప్పటికీ తమ దేశంలో 25 సెమీకండక్టర్ల ఫౌండ్రీలు ఉన్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో, దాదాపు అయిదు దశాబ్దాలుగా సింగపూర్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న టాటా గ్రూప్ తమతో జట్టు కట్టగలదని షణ్ముగం చెప్పారు. టాటా గ్రూప్ రూ. 91 వేల కోట్లతో గుజరాత్లో, రూ. 27,000 కోట్లతో అస్సాంలో సెమీకండక్టర్ల ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఇందుకోసం తైవాన్‌కి చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్‌తో (పీఎస్ఎంసీ) చేతులు కలిపింది. -
ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!
పెట్రోలియం, జెమ్‌స్టోన్ (రత్నాలు), చక్కెర, ఆగ్రోకెమికల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ పాత్ర అంతర్జాతీయంగా బలోపేతం అవుతోంది. గడిచిన ఐదేళ్లుగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ రంగాల నుంచి భారత్ ఎగుమతుల వాటా పెరుగుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2018 నుంచి 2023 మధ్య కాలంలో వీటితోపాటు ఎలక్ట్రికల్ గూడ్స్, న్యూమాటిక్ టైర్లు, ట్యాప్‌లు, వాల్వ్‌లు, సెమీకండక్టర్ పరికరాల ఎగుమతులు సైతం పెరుగుతున్నాయి.వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం..2023లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 85 బిలియన్ డాలర్ల(రూ.7.09 లక్షల కోట్లు)కు పెరిగాయి. ఈ రంగంలో అంతర్జాతీయంగా భారత్ వాటా 2018 నాటికి 6.45 శాతంగా ఉంటే, 2023 నాటికి 12.59 శాతానికి పెరిగింది. 2018లో పెట్రోలియం ఉత్పత్తుల పరంగా ఐదో అతిపెద్ద దేశంగా ఉండగా, 2023 నాటికి మూడో అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది.విలువైన రాళ్లుప్రీషియస్, సెమీ ప్రీషియష్ (విలువైన రాళ్లు) స్టోన్స్ ఎగుమతుల పరంగా 2018 నాటికి భారత్ వాటా 16.27 శాతం కాగా, 2023 చివరికి 36.53 శాతానికి పెరిగింది. ఈ విభాగంలో అంతర్జాతీయంగా భారత్ నంబర్1 స్థానానికి చేరింది. 2023లో 1.52 బిలియన్ డాలర్ల విలువైన తర్నాలను భారత్ ఎగుమతి చేసింది. 2018లో ఎగుమతులు కేవలం 0.26 బిలియన్ డాలర్లుగానే (అంతర్జాతీయంగా రెండో స్థానం) ఉన్నాయి.చక్కెర ఎగుమతులుచెరకు లేదా చక్కెర ఎగుమతుల పరంగా అంతర్జాతీయంగా భారత్ వాటా 2018 నాటికి ఉన్న 4.17 శాతం నుంచి 2023లో 12.21 శాతానికి చేరింది. చక్కెర ఎగుమతుల్లో భారత్ అంతర్జాతీయంగా రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ఆగ్రోకెమికల్, పురుగు మందులుఆగ్రోకెమికల్, పురుగు మందుల ఉత్పత్తుల ఎగుమతులతో అంతర్జాతీయంగా భారత్ వాటా 8.52 శాతం నుంచి 10.85 శాతానికి పెరిగింది. 2023 చివరికి ఎగుమతులు 4.32 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి. అంతర్జాతీయ వ్యవసాయ, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాలు భారత్‌కు కలిసొస్తున్నాయి. ఈ విభాగంలో అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానానికి ఎగబాకింది. ఇదీ చదవండి: అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?రబ్బర్ టైర్ల ఎగుమతులురబ్బర్ న్యూమాటిక్ టైర్ల ఎగుమతులు 2018లో 1.82 బిలియన్ డాలర్లుగా ఉంటే 2023 చివరికి 2.66 బిలియన్ డారల్లకు పెరిగాయి. అంతర్జాతీయంగా భారత్ వాటా 2.34 శాతం నుంచి 3.31 శాతానికి చేరింది.సెమీకండక్టర్లుసెమీకండక్టర్, ఫొటోసెన్సిటివ్ పరికరాల ఎగుమతులు 2018లో కేవలం 0.16 బిలియన్ డాలర్లుగానే ఉండగా, 2023 నాటికి 1.91 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందినట్టు వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. -
ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!
ప్రముఖ సెమీకండక్టర్ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ తమ ఉద్యోగులకు అందిస్తున్న ఉచిత సర్వీసులను నిలిపేసినట్లు ప్రకటించింది. పని ప్రదేశాల్లో సిబ్బందికి అందించే టీ, కాఫీ సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. ఈ పరిణామంతో సంస్థలో పని చేస్తున్న మరింత మంది తమ కొలువులను కోల్పోయే ప్రమాదం ఉందని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇజ్రాయెల్‌లోని ఇంటెల్ కంపెనీ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు టీ, కాఫీ, పండ్లు వంటి సర్వీసులను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. కాస్ట్‌కటింగ్ పేరిట ఇప్పటికే దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు కొలువుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రకటనతో కంపెనీ పరిస్థితిపై ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. ఉద్యోగులకు కాంప్లిమెంటరీగా అందించే కాఫీ, టీ, పండ్లకు పెద్దగా ఖర్చవ్వదు. అలాంటిది సంస్థ వాటిని అందించేందుకు కూడా ఇంతలా ఆలోచిస్తుందంటే పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు. రానున్న రోజుల్లో మరింత మందికి లేఆఫ్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. ఇప్పటికే కంపెనీలోని మొత్తం శ్రామికశక్తిలో 15 శాతానికిపైగా ఉద్యోగులను కాస్టకటింగ్ పేరిట లేఆఫ్స్ పేరుతో తొలగించారు.కొత్తగా మళ్లీ ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన లేఖలను జారీ చేయడానికి మేనేజర్లు సమావేశాలను షెడ్యూల్ చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఈ వారం నుంచి తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ప్యాకేజీలను సైతం అందించే యోచనలో ఉన్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!ఇదిలా ఉండగా, సిస్కో కంపెనీ సుమారు 6000 మంది ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది. ఈ సంఖ్య కంపెనీ మొత్తం ఉద్యోగులలో 7శాతంగా ఉంది. సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ మీద దృష్టిపెట్టాలని యోచిస్తోంది. ఇది కంపెనీని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి సహాయపడుతుందని సంస్థ సీఈఓ చక్ రాబిన్స్ గతంలో వెల్లడించారు. ఐబీఎం కంపెనీ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలను చైనా నుంచి ఉపసంహరించుకున్న తరువాత సుమారు 1000 మంది కంటే ఎక్కువ ఉద్యోగులను తొలగించింది. జర్మన్ చిప్ తయారీ సంస్థ ఇన్ఫినియన్ కూడా 14000 మందిని తొలగించనున్నట్లు సమాచారం. ఇదే బాటలు డెల్, షేర్‌చాట్ వంటి దిగ్గజాలు కూడా అడుగులు వేస్తున్నాయి. -
బిహార్‌లో కంపెనీ పెట్టి తప్పు చేశాను.. సీఈవో ఆవేదన
బిహార్‌లో తొలి సెమీకండక్టర్ కంపెనీ సురేష్ చిప్స్ అండ్ సెమీకండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్. నాలుగేళ్ల క్రితం ఈ సంస్థ ఏర్పాటైంది. అయితే బిహార్‌లో కంపెనీ పెట్టడం తన జీవితంలో "అత్యంత చెత్త నిర్ణయం" అని వాపోతున్నాడు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన చందన్ రాజ్. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు.బిహార్‌ను "ల్యాండ్ ఆఫ్ ఫ్రస్టేషన్"గా పేర్కొన్న చందన్ రాజ్ అక్కడ సెమీకండక్టర్ కంపెనీ నడపడానికి అష్టకష్టాలు పడుతున్నట్టు వాపోయారు. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తన కంపెనీతో కలిసి పనిచేయడానికి క్లయింట్స్ ఎవరూ ముందుకు రావడం ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు, మౌలిక సదుపాయాల కోసం గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నానని, ఎవరూ సహాయం చేయలేదన్నారు. బిహార్ ప్రభుత్వం సెమీకండక్టర్ పరిశ్రమలను అర్థం చేసుకోలేదని రాసుకొచ్చారు. స్థానిక గ్యాంగ్‌స్టర్ బెదిరిస్తే పోలీసులు కూడా పట్టించుకోరంటూ చందన్ రాసుకొచ్చారు.ఎవరీ చందన్ రాజ్?సెమీకండక్టర్ స్టార్టప్ వ్యవస్థాపకుడైన చందన్ రాజ్.. తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఒడిషాలోని బిజూ పట్నాయక్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీతో 2009లో పట్టభద్రుడయ్యారు.శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, మలేషియా, ఇజ్రాయెల్‌లోని ఇంటెల్, రొమేనియాలోని సిలికాన్ సర్వీస్ ఎస్ఆర్ఎల్, షాంఘైలో నోకియా బెల్ ల్యాబ్స్, ఎన్ఎక్స్పీలతో సహా వివిధ సాంకేతిక సంస్థలలో ఇంజనీరింగ్, నిర్వాహక పాత్రలలో పనిచేశారు. 2020 డిసెంబర్లో బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో సురేష్ చిప్స్ అండ్ సెమీకండక్టర్ సంస్థను ఏర్పాటు చేశారు.Bihar - The land of frustration. Lots of problems and struggle to survive here as a semiconductor/VLSI Company.Worst decision of my life to start a company in Bihar— Chandan Raj (@ChandanRaj_ASIC) October 9, 2024 -
2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యా న్ని నిర్దేశించుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి, ఇంధనశాఖ మంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. ఈ నేపథ్యంలో సెమీకండక్టర్ల పరిశ్రమలకు తెలంగా ణలో మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్ల డించారు. జపాన్ పర్యటనలో భాగంగా ఆయన గురువారం క్విటో నగరానికి సమీపంలో ఉన్న ప్రముఖ సెమీకండక్టర్ల పరిశ్రమ రోహ్మ్ను సందర్శించి, నిర్వాహకులతో మాట్లాడారు. భట్టికి రోహ్మ్ కంపెనీ ప్రెసిడెంట్ ఇనో, కంపెనీ ఉన్నతాధి కారులు తకహసి, అండో, కాత్సునో, తనాక తకా షీ తదితరులు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భిన్న రంగాల్లో సెమీకండక్టర్ల ఆవశ్యకత ఎంతో ఉందని భట్టి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని విడిగా కానీ ఉమ్మడి భాగస్వామ్యంతో కానీ తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని రోహ్మ్ యాజమాన్యానికి భట్టి విక్రమార్క పిలుపుని చ్చారు. భారతదేశంలో ఇప్పటికే మూడు చోట్ల తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న సౌకర్యాలు వ్యాపార అభివృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని రోహ్మ్ సంస్థ తెలిపింది. సాయంత్రం క్విటో నగరానికి సమీపంలో ఉన్న పానసోనిక్ కంపెనీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రికి ఆ కంపెనీ ప్రెసిడెంట్ నబి నకానీషి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల గురించి వివరించారు. తాము ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు సరఫరా చేస్తున్నామని భారతదేశంలోనూ ఒక ప్లాంట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. తెలంగాణలో పానసోనిక్ ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చని, ప్రభుత్వం ద్వారా పూర్తి సహకారం అందిస్తామని భట్టి హామీ ఇచ్చారు. భట్టికి బౌద్ధ గురువు ఆశీర్వచనాలు క్విటో నగరానికి సమీపంలో ఉన్న టోజీ బౌద్ధ ఆలయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర ఉన్నతాధికారులు గురువారం ఉదయం సందర్శించారు. వారికి బౌద్ధ గురువు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ పర్యటనలో భట్టితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఇంధనశాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు. -
SEMICON India 2024: ప్రపంచమంతా ఇండియా చిప్‌లు
గ్రేటర్ నోయిడా: దేశంలో సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఈ రంగంలో భారీగా పెట్టుబడులు రాబట్టడానికి చర్యలు ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బుధవారం నోయిడాలో ‘సెమీకాన్–2024’ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇండియాలో ఎలక్ట్రానిక్స్ రంగం విలువ 150 బిలియన్ డాలర్లకు చేరిందని తెలిపారు. ఈ దశాబ్దం ఆఖరు నాటికి దీన్ని 500 బిలియన్ డాలర్లు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయని స్పష్టం చేశారు. ఈ రంగంలో వృద్ధితో సెమీకండక్టర్ రంగం లబ్ధి పొందుతుందని ఉద్ఘాటించారు. దేశంలో ఉపయోగించే ఎల్రక్టానిక్స్ పరికరాలు వంద శాతం ఇక్కడే తయారు కావాలన్నది తమ ధ్యేయమన్నారు. 85 వేల మందికి శిక్షణ భారత్‌లో అమలవుతున్న సంస్కరణలు, స్థిరమైన ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు ఊతం ఇస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ల తయారీ రంగంలో అద్భుత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో చిప్‌లకు డిమాండ్ తగ్గినా, భారత్‌లో మాత్రం పెరుగుతూనే ఉంటుందని స్పష్టంచేశారు. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ప్రతి ఎల్రక్టానిక్ పరికరంలో భారత్‌లో తయారైన చిప్ ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. సెమీకండక్టర్ల డిజైనింగ్, తయారీ కోసం 85 వేల మందిని నిపుణులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వీరిలో సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, ఆర్అండ్డీ నిపుణులు ఉంటారని వెల్లడించారు. ప్రపచంలో ఎక్కడా కనిపించని 3డీ పవర్(త్రి–డైమెన్షనల్ పవర్) ఇండియాలో ఉందని ప్రధానమంత్రి మోదీ తెలియజేశారు. -
‘ప్రపంచ డిమాండ్‌ను తీర్చే భారత్’
భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే సెమీకండక్టర్ల డిమాండ్‌ను భారత్ తీరుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ విభాగంలో భారత్‌లో పెట్టుబడి పెట్టే విదేశీ కంపెనీలకు ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్‌లో జరిగిన ‘సెమీకాన్ ఇండియా 2024’ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.‘సమీప భవిష్యత్తులో భారత కంపెనీలకు సెమీకండక్టర్ల కొరత తీరనుంది. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వీటికి ఏర్పడే డిమాండ్ భర్తీ చేసే సత్తా భారత్‌కు ఉంది. విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలి. ఈ రంగంలో ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు ప్రభుత్వం ఇన్ని విధాలా సహకరిస్తుంది. దేశవ్యాప్తంగా సెమీకండక్టర్ల తయారీ విభాగంలో దాదాపు 85,000 మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లు, ఆర్ అండ్ డీ నిపుణులు పనిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. చిప్‌ల తయారీకి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెడుతున్నాం. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. దేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) పెరుగుతోంది. భవిష్యత్తులో ఇది మరింత ఎక్కువవుతుంది’ అని ప్రధాని మోదీ తెలిపారు.సెమీకండక్టర్ తయారీలో దేశాన్ని గ్లోబల్ హబ్‌గా మర్చే లక్ష్యంతో ‘సెమీకాన్ ఇండియా 2024’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఈవెంట్‌ను 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గ్లోబల్ సెమీకండక్టర్ తయారీ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని వారి ఆవిష్కరణల గురించి తెలియజేస్తారు. దాంతో స్థానికంగా చిప్‌ల తయారీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సదస్సులో 250 మందికి పైగా వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని అంచనా.భారత సెమీకండక్టర్ మార్కెట్ ప్రస్తుతం సుమారు 23.2 బిలియన్ డాలర్ల(రూ.1.93 లక్షల కోట్లు) విలువను కలిగి ఉంది. 2028 నాటికి ఇది దాదాపు రూ.6 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఈ విభాగం 17.10% వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఇన్వెస్ట్ ఇండియా సంస్థ నివేదించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) రెండో దశలో భాగంగా సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. దాంతోపాటు కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్, సిలికాన్ ఫోటోనిక్స్‌లో ప్రత్యేకత కలిగిన మరిన్ని కంపెనీలను ఆకర్షించడంపై దృష్టి సారిస్తోంది.ఇదీ చదవండి: ఈయూ కోర్టులో గూగుల్‌కు చుక్కెదురు!దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దానివల్ల ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే సెమీకండక్టర్లకు గిరాకీ ఏర్పడింది. స్థానికంగా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు సెమీకండక్టర్ల దిగుమతిపై ఆధారపడుతున్నాయి. అందుకు భిన్నంగా స్థానికంగా వీటిని అభివృద్ధి చేసి వినియోగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)ను డిసెంబర్ 2021లో ప్రతిపాదించింది. మొదటి దశలో భాగంగా ఔట్సోర్స్డ్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్(ఓఎస్ఏటీ)తోపాటు అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్(ఏపీఎంపీ) కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించింది. మరికొన్ని నెలల్లో ఈ కంపెనీలు సెమీకండక్టర్ల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఐదు కంపెనీలకు వీటి తయారీ కోసం కేంద్రం అనుమతులు జారీ చేసింది. అందులో టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ ఫ్యాబ్, మైక్రాన్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్, టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్, సీజీ పవర్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్, కేన్స్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ కంపెనీలున్నాయి. -
సెమీకండక్టర్ మిషన్‌కు రూ.83 వేలకోట్లు..?
ఇండియన్ సెమీకండక్టర్ మిషన్(ఐఎస్ఎం) రెండో దశకు 10 బిలియన్ డాలర్లు(రూ.83 వేలకోట్లు) కేటాయించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశీయంగా సెమీకండక్టర్ తయారీ, ప్యాకేజింగ్, డిజైనింగ్ కోసం ఈ నిధులను ఉపయోగించబోతున్నట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. టవర్ సెమీకండక్టర్, అదానీ గ్రూప్ సంయుక్తంగా చిప్ తయారీ ప్లాంట్‌ను తయారు చేయాలని ప్రతిపాదించాయి. అందుకోసం ఈ నిధుల్లో కొన్నింటిని వాడుకోనున్నట్లు తెలిసింది.దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దానివల్ల ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే సెమీకండక్టర్లకు గిరాకీ ఏర్పడింది. స్థానికంగా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు సెమీకండక్టర్ల దిగుమతిపై ఆధారపడుతున్నాయి. అందుకు భిన్నంగా స్థానికంగా వీటిని అభివృద్ధి చేసి వినియోగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)ను డిసెంబర్ 2021లో ప్రతిపాదించింది. మొదటి దశలో భాగంగా ఔట్సోర్స్డ్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్(ఓఎస్ఏటీ)తోపాటు అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్(ఏపీఎంపీ) కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించింది. మరికొన్ని నెలల్లో ఈ కంపెనీలు సెమీకండక్టర్ల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: మూడు గనుల్లో 40,560 మందికి ఉపాధిఐఎస్ఎం రెండో దశలో భాగంగా రూ.83 వేలకోట్ల ప్రోత్సాకాలు అందించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌కు చెందిన టవర్ సెమీకండక్టర్ సంస్థ, అదానీ గ్రూప్ సంయుక్తంగా మెగా సెమీకండక్టర్ చిప్ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌ను సిద్ధం చేయాలని యోచిస్తున్నాయి. ఈమేరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇప్పటికే టాటా గ్రూప్ సెమీకండక్టర్ల ఉత్పత్తి కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. -
భారత్‌లోనూ ‘సింగపూర్లు’ సృష్టిస్తాం
సింగపూర్: అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఒక మోడల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సింగపూర్ ప్రగతి ప్రయాణం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భారత్‌లోనూ ‘సింగపూర్లు’ సృష్టించాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్–సింగపూర్ మధ్య సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేర్చాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. సింగపూర్‌ను పరిపాలిస్తున్న నాలుగో తరం నాయకత్వంలో దేశం మరింత వేగంగా అభివృద్ధికి పథంలో దూసుకెళ్తుందన్న విశ్వాసం ఉందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సింగపూర్ కేవలం ఒక భాగస్వామ్య దేశం మాత్రమే కాదని, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సింగపూర్ భాగస్వామ్యంతో భారత్‌లోనూ సింగపూర్లు సృష్టిస్తామన్నారు. నాలుగు నెలల క్రితం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన లారెన్స్ వాంగ్‌కు మోదీ అభినందనలు తెలియజేశారు. వేగం పుంజుకున్న పరస్పర సహకారం భారతదేశ ‘తూర్పు కార్యాచరణ విధానం’లో సింగపూర్ పాత్ర చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నైపుణ్యాభివృద్ధి, డిజిటలైజేషన్, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ(ఏఐ), అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆరోగ్య సంరక్షణ, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల్లో సింగపూర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయానికొచ్చామన్నారు. తాము నమ్ముతున్న ప్రజాస్వామ్య విలువలు భారత్, సింగపూర్‌ను అనుసంధానిస్తున్నాయని వివరించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం గత పదేళ్లలో రెండు రెట్లకుపైగా పెరిగిందన్నారు. భారత్‌లో సింగపూర్ పెట్టుబడులు మూడు రెట్లు పెరిగి, 160 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. రెండు దేశాల ప్రజల మధ్య యూపీఐ చెల్లింపుల సదుపాయం అందుబాటులోకి వచి్చందని తెలిపారు. త్వరలో తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రం భారత్–సింగపూర్ మధ్య సంబంధాలకు 2025లో 60 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ వేడుకలను రెండు దేశాలు కలిసి నిర్వహించుకోవాలని, ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని మోదీ సూచించారు. మొట్టమొదటి తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాన్ని త్వరలో సింగపూర్‌లో ప్రారంభించబోతున్నామని చెప్పారు. భారత్‌లో పర్యటించాలని లారెన్స్ వాంగ్‌ను మోదీ ఆహా్వనించారు. 4 అవగాహనా ఒప్పందాలు సెమీ కండక్టర్ల తయారీ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, సింగపూర్ తీర్మానించుకున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిని నరేంద్ర మోదీ, లారెన్స్ వాంగ్ సమీక్షించారు. సెమీ కండక్టర్లు, డిజిటల్ సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ రంగంలో పరస్పర సహకారం కోసం భారత్, సింగపూర్ నాలుగు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత్‌లో పెట్టుబడులు పెట్టండి ప్రధాని మోదీ గురువారం ప్రఖ్యాత సింగపూర్ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. తమ దేశంలో వైమానిక, ఇంధనం, మౌలిక సదుపాయాలు, తయారీ, నైపుణ్యాభివృద్ధితోపాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు, వ్యాపార అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని సూచించారు. సెమీ కండక్టర్ కంపెనీ సందర్శన సింగపూర్‌లో ప్రఖ్యాతిగాంచిన సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్‌ను నరేంద్ర మోదీ, లారెన్స్ వాంగ్ కలిసి సందర్శించారు. భారత్–సింగపూర్ మధ్య సంబంధాల్లో సెమీ కండక్టర్లు, టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యం ఉందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉగ్రవాదం పెను ముప్పుప్రపంచ శాంతి, స్థిరత్వానికి ఉగ్రవాదం పెద్ద ముప్పుగా మారిందని భారత్, సింగపూర్ ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఈ మేరకు ఇరు దేశాలు గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా సరే అంతం చేయాల్సిందేనని పేర్కొన్నాయి. ఇందుకోసం అన్ని దేశాలు అంకితభావంతో కృషి చేయాలని సూచించాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం దక్షిణ చైనా సముద్రంలో నౌకలు, గగనతలంలో విమానాల స్వేచ్ఛా విహారానికి అవకాశం ఉండాలని ఇరుదేశాలు ఉద్ఘాటించాయి. -
కేంద్ర ప్రోత్సాహకాలు కొనసాగింపు
ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) రెండో దశలో భాగంగా సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. దాంతోపాటు కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్, సిలికాన్ ఫోటోనిక్స్‌లో ప్రత్యేకత కలిగిన మరిన్ని కంపెనీలను ఆకర్షించడంపై దృష్టి సారిస్తోంది.దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దానివల్ల ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే సెమీకండక్టర్లకు గిరాకీ ఏర్పడింది. స్థానికంగా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు సెమీకండక్టర్ల దిగుమతిపై ఆధారపడుతున్నాయి. అందుకు భిన్నంగా స్థానికంగా వీటిని అభివృద్ధి చేసి వినియోగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)ను డిసెంబర్ 2021లో ప్రతిపాదించింది. మొదటి దశలో భాగంగా ఔట్సోర్స్డ్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్(ఓఎస్ఏటీ)తోపాటు అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్(ఏపీఎంపీ) కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించింది. మరికొన్ని నెలల్లో ఈ కంపెనీలు సెమీకండక్టర్ల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: పేమెంట్ ఆలస్యమైతే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారా?ఐఎస్ఎం రెండో దశలో భాగంగా సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ నియమాల ప్రకారం సెమీకండక్టర్లు ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్ యూనిట్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 50 శాతం రాయితీ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయబోయే కంపెనీలకు పన్ను, విద్యుత్ బిల్లులో రాయితీలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్‌లోని సనంద్ ప్రాంతంలో రెండు సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లను ఏర్పాటు చేశారు. మరో రెండింటినీ అస్సాంలోని మోరిగావ్‌లో సిద్ధం చేశారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.1.48 లక్షల కోట్లు వెచ్చించారు. వీటి ద్వారా మరికొద్ది నెలల్లో ఉత్పత్తి ప్రారంభించనున్నారు. -
నిజమవుతున్న రతన్ టాటా కల.. ఇక చైనా అవసరం లేనట్లే!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన తరువాత చాలా దేశాలు సెమీకండక్టర్ చిప్ కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు కొంత డీలా పడ్డాయి. ఈ తరుణంలో దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' స్వదేశీ సెమీకండక్టర్ చిప్ తయారీ సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ఇప్పుడు నిజం కాబోతోంది.భారతదేశంలో సెమీకండక్టర్ చిప్‌లను తయారు చేస్తే.. మన దేశం చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. రతన్ టాటా అనుకున్న విధంగానే చిప్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మోరిగావ్ జిల్లాలోని జాగిరోడ్‌లో ప్లాంట్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ భూమి పూజ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సమక్షంలో జరిగింది.అస్సాంలో నిర్మించనున్న ఈ ప్లాంట్ నిర్మాణానికి రూ. 27 వేలకోట్లు ఖర్చవుతుందని సమాచారం. నిర్మాణం పూర్తయిన తరువాత సుమారు 27000 కంటే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. సెమీకండక్టర్ తయారీలో అగ్రగామిగా ఉన్న చైనా మీద.. భారత్ ఆధారపడటం తగ్గుతుంది. దీనికోసం టాటా కంపెనీ కోట్లాది సెమీకండక్టర్లను తయారు చేయడానికి సిద్ధమైంది. రాబోయే రోజుల్లో భారత్ సెమికండక్టర్ చిప్ ఎగుమతిదారుగా కూడా నిలిచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: తులం బంగారం కేవలం రూ.63.. మరి ఇప్పుడో..!టాటా సెమీకండక్టర్ తయారీ ప్లాంట్ 2025 నాటికి సిద్ధమవుతుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. 2024 ఫిబ్రవరి 29న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఆమోదం పొందిన ఐదు నెలల వ్యవధిలోనే ప్లాంట్ నిర్మాణం ప్రారంభించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. -
సెమీకండక్టర్స్ తయారీలోకి జోహో
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల సంస్థ జోహో తాజాగా సెమీకండక్టర్ల తయారీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీనిపై 700 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే యోచనలో సంస్థ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి కంపెనీ ప్రోత్సాహకాలు కోరుతోందని పేర్కొన్నాయి. ప్రస్తుతం జోహో ప్రతిపాదనను ఐటీ శాఖ కమిటీ పరిశీలిస్తోందని, వ్యాపార ప్రణాళికలపై మరింత స్పష్టతనివ్వాలని కంపెనీని కోరిందని వివరించాయి. జోహో ఇప్పటికే టెక్నాలజీ భాగస్వామిని కూడా ఎంచుకున్నట్లు తెలిపాయి. 1996లో ఏర్పాటైన జోహో .. గత ఆర్థిక సంవత్సరం 1 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం నమోదు చేసింది. తమిళనాడులో చిప్ డిజైన్ తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్ వెంబు మార్చిలో వెల్లడించిన నేపథ్యంలో తాజా వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశీయంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్, సీజీ పవర్ తదితర సంస్థలకు కేంద్రం ఫిబ్రవరిలో గ్రీన్ సిగ్నల్ ఇచి్చన సంగతి తెలిసిందే. భారత్‌లో సెమీకండక్టర్ల మార్కెట్ 2026 నాటికి 63 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. -
సెమీకండక్టర్లను ఎగుమతి చేస్తున్న భారత్.. ప్రధాన స్టార్టప్‌లు ఇవే..
సెమీకండక్టర్లను దిగుమతి చేసుకునే దశ నుంచి వాటిని తయారుచేసుకుని ఇతర దేశాల్లోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేసే స్థాయికి భారత్ చేరుతోంది. దాంతో దేశీయంగా ఉన్న లిస్టెడ్ కంపెనీలు ఇప్పటికే వీటి తయారీలో దూసుకుపోతున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ రంగం మరింత వృద్ధి చెందుతుందని భావించి చాలా స్టార్టప్ కంపెనీలు ఈ సెమీకండక్టర్ల తయారీకి సిద్ధం అవుతున్నాయి. అందులో ప్రధానంగా ఈ కింది కంపెనీలు దేశీయంగా సెమీకండక్టర్ చిప్‌లను తయారుచేస్తున్నాయి.సాంఖ్యల్యాబ్స్మైండ్గ్రోడ్టెర్మినస్ సర్క్యూట్స్మార్ఫింగ్ మిషన్ఫెర్మియానిక్ఓక్టర్ఆగ్నిట్ఇన్కోర్సైన్ఆఫ్సిలిజియం సర్క్యూట్స్ఔరసెమిసెమీకండక్టర్ విభాగంలో అంకుర సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో టి-హబ్, నీతి ఆయోగ్‌తో కలిసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద కోహర్ట్-2 కార్యక్రమాన్ని గతంలో చేపట్టాయి. ఈ కార్యక్రమం కింద అంకుర సంస్థలను ఎంపిక చేసి, 6 నెలల పాటు వాటి ఎదుగుదలకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తాయి. దీని కోసం ఇప్పటికే అంకుర సంస్థలను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇందులో ఫేస్‌ఇంటెల్ సిస్టమ్స్, క్లూపే సైంటిఫిక్, డీప్ గ్రిడ్ సెమి, సెగో ఆటోమొబైల్ సొల్యూషన్, స్పైడెక్స్ టెక్నాలజీస్, జియోకాన్, ఛిపెక్స్ టెక్నాలజీస్, జీలీ స్మార్ట్ సిస్టమ్ ఉన్నాయి. -
ప్రముఖ భారత కంపెనీతో టెస్లా ఒప్పందం
టెస్లా తన కార్యకలాపాల కోసం సెమీకండక్టర్ చిప్‌లను కొనుగోలు చేయడానికి టాటా ఎలక్ట్రానిక్స్‌తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈమేరకు కొన్ని వార్తామీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. కొన్నినెలల కొందట టాటా గ్రూప్ సెమీ కండక్టర్ విభాగంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా దాదాపు రూ.40వేల కోట్ల పెట్టుబడితో అస్సాంలో సెమీకండక్టర్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ యోచిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. సెమీకండక్టర్ తయారీ నేపథ్యంలో టాటాగ్రూప్ గ్లోబల్ క్లయింట్లను సంపాదించే పనిలో పడింది. అందులో భాగంగా టెస్లాతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇప్పటికే టెస్లా భారత్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేసింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఈవీపాలసీ నిబంధనలతో దాదాపు ఆ సంస్థ భారత్ ప్రవేశానికి లైన్ క్లియరైంది. ఈ తరుణంలో ఇండియాలో తమ తయారీ ప్లాంట్ పెట్టేందుకు టెస్లా సిద్ధపడుతోందని తెలిసింది. ఈనెల 21న ఎలొన్‌మస్క్ ఇండియా రానున్నారు. ఈమేరకు దానిపై కీలక నిర్ణయం వెలువడనుందని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదీ చదవండి: ‘తప్పు చేశాం.. మళ్లీ తప్పు చేస్తాం..’ 10వేల డాలర్లు ఆఫర్.. ఈ పరిణామాల నేపథ్యంలో టాటాగ్రూప్ టెస్లాతో సెమీకండక్టర్ల విషయంలో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇరు కంపెనీల మధ్య ఎంత విలువ చేసే డీల్ కుదిరిందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. మస్క్ భారత్ పర్యటనలో భాగంగా దాదాపు 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రకటించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అమెరికన్ ఈవీ దిగ్గజ సంస్థ దేశంలో తమ ఉత్పత్తుల తయారీకోసం రిలయన్స్‌తో జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని పరిశీలిస్తున్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. -
సెమీ కండక్టర్ల రంగంలో గ్లోబల్ పవర్‌గా ఇండియా
గాందీనగర్: సెమీ కండక్టర్ల రంగంలో మన దేశం కీలక పాత్ర పోషించబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రంగంలో భారత్ గ్లోబల్ పవర్‌గా ఎదిగే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. ఇండియాలో రూ.1.25 లక్షల కోట్లతో స్థాపించనున్న మూడు సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్లకు ప్రధాని మోదీ బుధవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో రెండు గుజరాత్లో, ఒకటి అస్సాంలో రాబోతున్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు దేశీయంగా సెమీ కండక్టర్ల తయారీని పట్టించుకోలేదని పరోక్షంగా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అభివృద్ధి పట్ల అంకితభావం లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు. దేశ శక్తి సామర్థ్యాలను, ప్రాధాన్యతలను, భవిష్యత్తు అవసరాలను గుర్తించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యా యని ఆక్షేపించారు. మన దే శాన్ని సెమీ కండక్టర్ల తయారీ హబ్‌గా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని వెల్లడించారు. దేశీయంగా చిప్‌ల తయారీతో యువతకు ఎన్నెన్నో ఉ ద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి ఈ రంగం దోహదపడుతుందని వివరించారు. సెమీ కండక్టర్ మిషన్‌ను రెండేళ్ల క్రితం ప్రకటించామని, తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఈరోజు మూడు పరిశ్రమలకు శంకుస్థాపన చేశామని వ్యాఖ్యానించారు. అనుకున్నది సాధించే శక్తి భారత్‌కు, ప్రజాస్వామ్యానికి ఉందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పీఎం–సూరజ్ నేషనల్ పోర్టల్ ప్రారంభం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎస్సీ, ఎస్టీలు, బీసీలే అత్యధికంగా లబ్ధి పొందుతున్నారని ప్రధాని మోదీ చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయా వర్గాలను విస్మరించాయని ఆరోపించారు. దేశాభివృద్ధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీల పాత్రను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ గుర్తించలేదని విమర్శించారు. దళిత, గిరిజన వర్గాలకు చెందిన రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపదీ ముర్మును తాము రాష్ట్రపతులను చేశామని అన్నారు. అణగారిన వర్గాలను అత్యున్నత పదవుల్లో నియమిస్తున్నామని, ఇది ఇకపైనా కొనసాగుతుందని వివరించారు. ప్రధానమంత్రి సామాజిక్ ఉత్థాన్, రోజ్‌గార్ ఆధారిత్ జన్‌కల్యాణ్(పీఎం–సూరజ్) నేషనల్ పోర్టల్‌ను మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా ఎస్టీలు, ఎస్సీలు, వెనుకబడిన తరగతులతోపాటు పారిశుధ్య కార్మికులు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. -
అదానీతో క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో భేటీ
న్యూఢిల్లీ: చిప్‌ల తయారీ దిగ్గజం క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో ఆర్ ఎమోన్, అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ సోమవారం సమావేశమయ్యారు. కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు మొదలైన వాటి పాత్ర గురించి ఈ సందర్భంగా చర్చించినట్లు సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో అదానీ పోస్ట్ చేశారు. చెన్నైలో రూ. 177 కోట్లతో ఏర్పాటు చేసిన కొత్త డిజైన్ సెంటర్‌ను మార్చి 14న ఎమోన్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. వై–ఫై టెక్నాలజీలకు అనుబంధ ఆవిష్కరణలు లక్ష్యంగా కొత్త సెంటర్ వైర్లెస్ కనెక్టివిటీ సొల్యూషన్స్‌ను ఈ సెంటర్ రూపొందించనుంది. మరోవైపు, తమ సొంత పోర్టులు, లాజిస్టిక్స్, విద్యుదుత్పత్తి తదితర విభాగాల అవసరాల కోసం స్వల్ప మొత్తంలో తీసుకున్న 5జీ స్పెక్ట్రంనకు సంబంధించి ఉపయోగపడే సొల్యూషన్స్ కోసం అదానీ అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో క్రిస్టియానో, అదానీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
చిప్‌ల తయారీలో అంతర్జాతీయ స్థాయికి భారత్
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో సెమీ కండక్టర్ల తయారీలో భారత్ అంతర్జాతీయ స్థాయికి చేరగలదని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. చిప్‌ల విభాగంలో తైవాన్ ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా దేశీయంగా కొత్త ఫ్యాబ్రికేషన్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు ఇందుకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో ప్లాంట్లు పెట్టేందుకు, సంబంధిత రంగాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు తయారీ సంస్థలు ముందుకొచ్చేలా ప్రభుత్వ విధానాలు ఆకర్షిస్తున్నాయని మంత్రి చెప్పారు. చైనాకి ప్రత్యామ్నాయంగా, ప్రజాస్వామ్య టెక్నాలజీ హబ్‌గా భారత్ నిలుస్తోందని ఆయన తెలిపారు. ‘భారత్‌కి ఎప్పుడు వెళ్లాలి.. అసలు వెళ్లొచ్చా అని గతంలో అంతా అలోచించే వారు. కానీ ఇప్పుడు వీలైనంత ముందుగా వెళ్లాలి అనుకుంటున్నారు. అటువంటి మార్పు కనిపిస్తోంది. ప్రతి పెద్ద సంస్థ భారత్‌లో పెట్టుబడులు పెట్టే ఆలోచనల్లో ఉంది‘ అని పేర్కొన్నారు. కేంద్రం ఇటీవలే దాదాపు రూ. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే మూడు సెమీకండక్టర్ ప్లాంట్ల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. వీటిలో టాటా గ్రూప్ తలపెట్టిన మెగా ఫ్యాబ్ కూడా ఉంది. -
సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌పై మంత్రి వీడియో
భారతదేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను వివరిస్తూ సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నాలుగు నిమిషాల నిడివిగల వీడియో, దేశంలో పటిష్ఠమైన సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను రూపొందించడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. ఇటీవల మూడు సెమీకండక్టర్ ప్లాంట్ల స్థాపనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత ఈ వీడియో వైరల్ మారుతుండడం విశేషం. అందులో టాటా గ్రూప్ 2 ప్లాంట్లు ఏర్పాటు చేయనుండగా.. జపాన్‌కు చెందిన రెనెసాస్ భాగస్వామ్యంతో సీజీ పవర్ ఒక ప్లాంటు నిర్మించనుంది. ఇవి రాబోయే 100 రోజుల్లో నిర్మాణాన్ని ప్రారంభించనున్నాయి. వీటి వల్ల మొత్తం రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఇదీ చదవండి: 3000 ఎకరాల్లో కృత్రిమ అడవిని నిర్మించిన కొత్త పెళ్లికొడుకు మంత్రి సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ గురించి వివరిస్తున్న వీడియోలో డిజైన్, ఫ్యాబ్రికేషన్, ఏటీఎంపీ (అసెంబ్లీ-టెస్టింగ్-మార్కింగ్-ప్యాకేజింగ్) సర్క్యూట్ వంటి ముఖ్యమైన విభాగాల గురించి మాట్లాడటం గమనించవచ్చు. సెమీకండక్టర్ ఎకోసిమ్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ప్రభుత్వం దృష్టిసారించినట్లు చెప్పారు. అందుకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్(ఏడీఏ) టూల్స్ చాలా ఖరీదైనవన్నారు. కేవలం ఒక లైసెన్స్ కోసం రూ.10-15 కోట్ల వరకు ఖర్చవుతుందని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఈ ఈడీఏ సాధనాలను దేశంలోని 104 యూనివర్సిటీలకు పంపిణీ చేసిందని తెలిపారు. #WATCH | Delhi | During his media interaction after the cabinet approval of 3 more semiconductor units, Union Minister Ashwini Vaishnaw explains the development of India’s semiconductor ecosystem on the whiteboard in his office. pic.twitter.com/D9RHfhAryE — ANI (@ANI) March 1, 2024 -
ఈ ఏడాదే చిప్ ప్లాంటు నిర్మాణం షురూ
న్యూఢిల్లీ: పీఎస్ఎంసీ భాగస్వామ్యంతో గుజరాత్‌లోని ధోలెరాలో తలపెట్టిన రూ. 91,000 కోట్ల సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ మెగా యూనిట్ నిర్మాణం ఈ ఏడాదే ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాటా ఎల్రక్టానిక్స్ తెలిపింది. దీనితో ఆ ప్రాంతంలో 20,000 పైచిలుకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరగగలదని పేర్కొంది. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ విభాగంలో భారత్ ఎంట్రీకి సారథ్యం వహించగలగడం తమకెంతో గర్వకారణమని టాటా ఎల్రక్టానిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సెమీకండక్టర్ల ప్లాంటులో పవర్ మేనేజ్మెంట్ ఐసీలు, డిస్ప్లే డ్రైవర్లు, మైక్రోకంట్రోలర్లు మొదలైన వాటికి అవసరమైన చిప్స్ తయారు చేయనున్నారు. నెలకు సుమారు 50,000 వేఫర్ల తయారీ సామర్ధ్యంతో ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. -
త్వరలో భారత మొబైల్ ఫోన్ బ్రాండ్
దేశంలో భారీస్థాయిలో మొబైల్ ఫోన్ల తయారీని నెలకొల్పడంలో ఎన్నో విజయాలు సాధించినట్లు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. ఆ క్రమంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు. భారత్ తయారీరంగంలో దూసుకుపోతుందన్నారు. ఫోన్‌పే ఆధ్వర్యంలో తీసుకొచ్చిన ఇండస్ యాప్ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. భారత మొబైల్ ఫోన్ బ్రాండ్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. త్వరలోనే రెండు లేదా మూడు సెమీకండక్టర్ ప్లాంట్లకు ఆమోదం తెలుపనున్నట్లు చెప్పారు. ‘మొబైల్ ఫోన్ల తయారీతో పరిశ్రమలో విశ్వాసం నెలకొంది. ఈ ఎకోసిస్టమ్‌లో భాగస్వాములు భారత్‌పై మొగ్గుచూపేలా కృషిచేసేలా చర్యలు ఉన్నాయి. వచ్చే ఐదేళ్లూ ఇదే ప్రయాణం కొనసాగుతుంది’అని చెప్పారు. దేశంలో సెమీకండ్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి వచ్చే 20 ఏళ్ల కాలానికిగాను ప్రధాని మోదీ స్పష్టమైన కార్యాచరణ సూచించారని చెప్పారు. -
సెమీ కండక్టర్ తయారీలో టాటా గ్రూప్.. 40వేల కోట్ల పెట్టుబడులతో
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. సెమీ కండక్టర్ విభాగంలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో భాగంగా అస్సాంలో దాదాపు రూ. 40వేల కోట్ల పెట్టుబడితో అస్సాంలో సెమీకండక్టర్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ యోచిస్తోందని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఈ సందర్భంగా హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ‘‘ఇది మాకు శుభపరిణామం. టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జాగీరోడ్‌లో ఎలక్ట్రానిక్ సెంటర్ ఏర్పాటు కోసం దరఖాస్తును సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత తుది ఆమోదం కోసం కేంద్రాన్ని సంప్రదించాం. త్వరలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది’’ అని శర్మ చెప్పారు. ‘‘టాటా కంపెనీ అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో సుమారు రూ.40 వేల కోట్లతో చిప్ కంపెనీని ఏర్పాటు చేసేలా కేంద్రానికి ప్రతిపాదనను పంపించింది.సెమీకండక్టర్ అసెంబ్లీ, ప్యాకేజింగ్ ప్లాంట్‌పై టాటా గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రాథమిక చర్చలు జరిపిందని, ఇక్కడ చర్చల అనంతరం కేంద్రాన్ని సంప్రదించాం. అన్నీ సవ్యంగా సాగితే రాష్ట్రంలో భారీ పెట్టుబడులు వచ్చేలా చూస్తామని, పారిశ్రామికీకరణకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, ఒకట్రెండు నెలల్లో తుది ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చెప్పారు. -
India-US CEO Forum: ఫార్మా బంధం బలోపేతం
న్యూఢిల్లీ: ఫార్మా, సెమీకండక్టర్లు, కీలక లోహాలు, వర్ధమాన టెక్నాలజీలు తదితర అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించుకున్నాయి. అలాగే, పర్యవరణ అనుకూల సాంకేతికతలను కలిసి అభివృద్ధి చేయడం, క్రిటికల్ టెక్నాలజీల్లో భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడం వంటి అంశాలపై చర్చించాయి. భారత్–అమెరికా సీఈవో ఫోరం వర్చువల్ భేటీలో భాగంగా కేంద్ర వాణిజ్య మంత్రి పియుష్ గోయల్, అమెరికా వాణిజ్య మంత్రి జినా రైమండో సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచి్చనట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఫోరం సభ్యులు సూచించిన సిఫార్సుల అమలుపై దృష్టి పెట్టాలని సీఈవో ఫోరంనకు రైమండో సూచించారు. అలాగే ఫోరంలో అమెరికాకు చెందిన దిగ్గజాలు హనీవెల్, ఫైజర్, కిండ్రిల్, వయాశాట్ చేరికను ప్రకటించారు. సెమీకండక్టర్ సరఫా వ్యవస్థ, ఇన్నోవేషన్ హ్యాండ్õÙక్ వంటి వేదికల ద్వారా పరిశ్రమ అవకాశాలను అందిపుచ్చుకోవాలని గోయల్ పేర్కొన్నారు. 2014లో ఫోరంను పునరుద్ధరించిన తర్వాత నుంచి ఇది ఎనిమిదో సమావేశం. వచ్చే ఏడాది తొలినాళ్లలో తదుపరి భేటీ నిర్వహించనున్నారు. భారత్, అమెరికా దిగ్గజ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు సభ్యులుగా ఉన్న ఈ ఫోరంనకు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, లాక్‌హీడ్ మారి్టన్ ప్రెసిడెంట్ జేమ్స్ టైస్లెట్ సారథ్యం వహిస్తున్నారు. -
సెమీకండక్టర్ల రంగంలో.. భారత్ అవకాశాల గని
శాన్ ఫ్రాన్సిస్కో: దేశీయంగా సెమీకండక్టర్ల రంగం గణనీయంగా వృద్ధి చెందుతోందని, ఈ విభాగంలో పుష్కలంగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మెహ్రోత్రాతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. ‘మైక్రాన్‌టెక్ సీఈవో మెహ్రోత్రాతో భేటీ అయ్యాను. భారత్‌లో సెమీకండక్టర్ల రంగం వృద్ధి చెందుతున్న తీరు, కంపెనీకి గల వ్యాపార అవకాశాలు మొదలైన అంశాలను చర్చించాము‘ అని సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అటు యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్‌తో కూడా గోయల్ సమావేశమయ్యారు. -
మెమరీ చిప్ ఉత్పత్తిలో సహస్ర.. తొలి భారతీయ కంపెనీగా రికార్డ్
రాజస్థాన్‌కు చెందిన 'సహస్ర సెమీకండక్టర్స్' (Sahasra Semiconductors) మెమరీ చిప్‌లను ఉత్పత్తి చేసిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ నెల ప్రారంభంలో భివాడి జిల్లాలోని సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ అండ్ ప్యాకేజింగ్ యూనిట్లో ఉత్పత్తిని ప్రారంభించి.. వివిధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు ఇప్పటికే మొదటి షిప్మెంట్ చేసింది. 2023 చివరి నాటికి కంపెనీ భివాడి యూనిట్ 30 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని, 2024లో ఇది మరింత ఎక్కువగా ఉండనున్నట్లు సహస్ర గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'అమృత్ మన్వానీ' వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా మైక్రో ఎస్డి కార్డ్‌లను విక్రయించే మొదటి కంపెనీగా మారినందుకు ఆనందంగా ఉందని, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో మంచి స్పందన లభిస్తోందని మన్వానీ ఈ సందర్భంగా చెప్పారు. సహస్ర సెమీకండక్టర్స్ రెండు ప్రముఖ ప్రభుత్వ కార్యక్రమాల (PLI, SPECS) నుంచి ఆమోదం పొందింది. అంతే కాకుండా కంపెనీ తన తయారీ సౌకర్యాన్ని విస్తరించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇదీ చదవండి: పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్.. టూ వీలర్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి! సెమీకండక్టర్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్లోబల్ చిప్‌మేకర్ మైక్రాన్, గుజరాత్లో కొత్త అసెంబ్లీ అండ్ టెస్ట్ సదుపాయాన్ని స్థాపించడానికి 825 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అనుకున్న విధంగా అన్నీ జరిగితే 2024 నాటికి ఉత్పత్తి అధికమవుతుందని, తద్వారా కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. -
ఏడాదిలోగా తొలి సెమీకాన్ ప్లాంటు
న్యూఢిల్లీ: దేశీయంగా ఎల్రక్టానిక్ చిప్ తయారీ తొలి ప్లాంటు ఏడాదిలోగా ఏర్పాటయ్యే వీలున్నట్లు కేంద్ర టెలికం, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశంలో వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటుసహా.. సెమీకండక్టర్ తయారీ ఎకోసిస్టమ్(వ్యవస్థ)ను నెలకొల్పే బాటలో తొలిగా ప్రభుత్వం 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలకు తెరతీసినట్లు తెలియజేశారు. అన్ని రకాల హైటెక్ ఎల్రక్టానిక్ ప్రొడక్టులలో వినియోగించే ఫిజికల్ చిప్స్ తయారీకి వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లను తొలి దశ బ్లాకులుగా వ్యవహరిస్తారు. అంతర్జాతీయంగా నాయకత్వ స్థాయిలో ఎదిగేందుకు కొన్ని ప్రత్యేక విభాగాలపై దృష్టి పెట్టినట్లు అశ్వినీ వెల్లడించారు. ప్రధానంగా సెమీకండక్టర్లకు టెలికం, ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) అతిపెద్ద విభాగాలుగా ఆవిర్భవించినట్లు వివరించారు. వెరసి ఈ విభాగాలలో వినియోగించే చిప్స్ అభివృద్ధి, తయారీలపై దృష్టి పెట్టడం ద్వారా టెలికం, ఈవీలకు గ్లోబల్ లీడర్లుగా ఎదిగే వీలున్నట్లు తెలియజేశారు. ఈ రెండు విభాగాలపై ప్రత్యేక దృష్టితో పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. రానున్న కొన్ని నెలల్లో చెప్పుకోదగ్గ విజయాలను అందుకోనున్నట్లు అంచనా వేశారు. వేఫర్ ఫ్యాబ్రికేషన్, డిజైన్, తయారీ ద్వారా పూర్తి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. దేశీయంగా చిప్ తయారీ యూఎస్ దిగ్గజం మైక్రాన్ పెట్టుబడుల విజయంతో ప్రపంచమంతటా దేశీ సామర్థ్యాలపై విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. మైక్రాన్ గత నెలలో గుజరాత్‌లోని సణంద్‌లో సెమీకండక్టర్ అసెంబ్లీ ప్లాంటు నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ ప్లాంటుతోపాటు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు జూన్‌లో మొత్తం 2.75 బిలియన్ డాలర్ల(రూ. 22,540 కోట్లు) పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. వీటిలో మైక్రాన్ 82.5 కోట్లు ఇన్వెస్ట్ చేయనుండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలిన పెట్టుబడులను సమకూర్చనున్నాయి. -
చైనా కంపెనీ సీక్రెట్ ఆపరేషన్.. రహస్యంగా చిప్‌ల తయారీ!
అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనాకు చెందిన టెక్నాలజీ కంపెనీ హువాయి టెక్నాలజీస్ ( Huawei Technologies ) చైనా అంతటా రహస్యంగా సెమీకండక్టర్ తయారీ కేంద్రాలను నిర్మిస్తున్నట్లుగా వాషింగ్టన్ కేంద్రంగా ఉన్న సెమీకండక్టర్ అసోసియేషన్ హెచ్చరించినట్లు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ తాజాగా నివేదించింది. ఈ చైనీస్ టెక్ దిగ్గజం ఏడాది క్రితమే చిప్‌ల ఉత్పత్తి చేపట్టిందని, ఇందు కోసం ఆ దేశ ప్రభుత్వం నుంచి 30 బిలియన్ డాలర్ల నిధులను సైతం పొందిందని సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెబుతోంది. దేశంలో ఇప్పటికే రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసిన హువాయి మరో మూడు ప్లాంట్లను నిర్మిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. భద్రతాపరమైన సమస్యల కారణంగా 2019లో యూఎస్ వాణిజ్య విభాగం తమ ఎగుమతి నియంత్రణ జాబితాలో హువాయి కంపెనీని చేర్చింది. సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెప్పినట్లుగా ఇతర కంపెనీల పేర్లతో హువాయి తయారీ కేంద్రాలను నిర్మిస్తుంటే యూఎస్ ఆంక్షలను అధిగమించి అమెరికన్ చిప్ తయారీ పరికరాలను పరోక్షంగా కొనుగోలు చేస్తుండవచ్చని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ పేర్కొంది. యూఎస్‌లో హువాయి కంపెనీని ట్రేడ్ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు. దీంతో ఆ కంపెనీకి ఇక్కడి కంపెనీలు విడిభాగాలు, సాంకేతికతను అందించేందుకు వీలు లేదు. సెమీకండక్టర్ చిప్‌లను తయారు చేయకుండా హువాయి కంపెనీ కట్టడి చేసేందుకు యూఎస్ అధికారులు నియంత్రణలను కఠినతరం చేస్తున్నారు. ఇదీ చదవండి: సంపదకు సరికొత్త నిర్వచనం.. వారెన్ బఫెట్! ఆస్తుల్లో కొత్త మైలురాయి.. -
భారత్‌లో సెమీకండక్టర్ల తయారీకి కంపెనీలు పోటాపోటీ
గాంధీనగర్: భారత్‌లో సెమీకండక్టర్ల తయారీపై దేశ, విదేశ కంపెనీలు పోటీపడుతున్నాయి. సెమీకాన్ సదస్సు వేదికగా తమ ప్రణాళికలను వెల్లడించాయి. తాము తలపెట్టిన చిప్ ఫ్యాక్టరీ తొలి దశ రెండున్నరేళ్లలో సిద్ధమవుతుందని వేదాంత చీఫ్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు. ఇప్పటికే భాగస్వాములను ఎంపిక చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. తొలి దశపై 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. ‘రెండున్నరేళ్లలో 2.5 ఏళ్లలో వేదాంత తయారు చేసిన మేడిన్ ఇండియా చిప్‌ను అందించబోతున్నాం‘ అని అగర్వాల్ చెప్పారు. 20 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్ల ప్లాంటు కోసం వేదాంతతో కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ నుంచి తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ తప్పుకున్న నేపథ్యంలో అగర్వాల్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అటు భారత్‌లో చిప్‌ల తయారీ వ్యవస్థలోకి ప్రవేశించాలంటే ’అత్యంత సాహసికులై’ ఉండాలని ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు పేర్కొన్నారు. వేదాంత జాయింట్ వెంచర్ గురించి ప్రస్తావించకుండా, ఇక్కడ ఎదురయ్యే ప్రతి అనుభవం.. కంపెనీలను మరింత దృఢంగా మారుస్తాయని ఆయన చెప్పారు. ఏఎండీ డిజైన్ సెంటర్.. మరోవైపు, వచ్చే అయిదేళ్లలో భారత్‌లో 400 మిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు అమెరికన్ చిప్ తయారీ దిగ్గజం అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ (ఏఎండీ) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మార్క్ పేపర్‌మాస్టర్ తెలిపారు. బెంగళూరులో తమ కంపెనీకి సంబంధించి అతి పెద్ద డిజైన్ సెంటర్‌ను 5,00,000 చ.అ. విస్తీర్ణంలో ఈ ఏడాది ఆఖరు నాటికి ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అయిదేళ్ల వ్యవధిలో 3,000 పైచిలుకు ఇంజనీరింగ్ ఉద్యోగాలను కల్పించనున్నట్లు పేపర్‌మాస్టర్ పేర్కొన్నారు. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో భారత్‌లో తమ కార్యకలాపాలు పది ప్రాంతాలకు విస్తరించినట్లవుతుందని చెప్పా రు. భారత్‌లో ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ డిజైన్, ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించడంలో ఏఎండీ ప్రణాళికలు కీలకపాత్ర పోషించగలవని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విటర్లో ట్వీట్ చేశారు. చిప్ ప్లాంటుకు జోరుగా కసరత్తు: మైక్రాన్ గుజరాత్లో తమ చిప్ ప్లాంటు ఏర్పాటుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు అమెరికన్ సెమీకండక్టర్ల తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్ సంజయ్ మెహరోత్రా తెలిపారు. దీనితో రాబోయే రోజుల్లో ప్రత్యక్షంగా 5,000, పరోక్షంగా 15,000 మందికి ఉపాధి లభించగలదని ఆయన పేర్కొన్నారు. -
సెమీకండక్టర్ ప్లాంటు.. వారి ప్రతిపాదనలు వేర్వేరుగా పరిశీలిస్తాం...
న్యూఢిల్లీ: భారత్‌లో సెమీకండక్టర్ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి వేదాంత, ఫాక్స్‌కాన్ సంస్థలు వేర్వేరుగా ప్రతిపాదనలను సమర్పించేంత వరకు ప్రభుత్వం వేచి చూస్తుందని, తర్వాత తగు విధంగా వాటిని మదింపు చేస్తుందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. గతంలో ఇరు సంస్థలు జాయింట్ వెంచర్‌గా ప్రతిపాదనలు ఇచ్చాయని, ప్రస్తుతం అవి వేర్వేరుగా ప్రపోజల్స్ ఇచ్చే యోచనలో ఉన్నాయని పేర్కొన్నారు. సెమీకాన్ ఇండియా 2023 కార్యక్రమంలో భాగంగా అధునాతన సెమీకండక్టర్ టెక్నాలజీల ఎగ్జిబిషన్ ప్రారంభంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. సెమీకండక్టర్ రంగంలో 70 ఏళ్లలో లేనంత పురోగతిని గత 15 నెలల్లో సాధించగలిగామని పేర్కొన్నారు. -
చిప్ ప్లాంటుకు భాగస్వామి సిద్ధం..
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ ప్లాంటు ఏర్పాటు కోసం భాగస్వామిని సిద్ధం చేసుకున్నట్లు వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. ఈ ఏడాదే చిప్‌ల తయారీని ప్రారంభించనున్నట్లు కంపెనీ 58వ షేర్‌హోల్డర్ల సమావేశంలో వివరించారు. అయితే, భాగస్వామి పేరు మాత్రం ఆయన వెల్లడించలేదు. రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ ప్లాంటు నెలకొల్పేందుకు వేదాంతతో కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ నుంచి ఫాక్స్‌కాన్ తప్పుకున్న నేపథ్యంలో అగర్వాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమ అనుబంధ సంస్థ ఎవాన్్రస్టేట్.. గ్లాస్ సబ్్రస్టేట్స్ తయా రీలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉందని, సొంత పేటెంట్లు కూడా ఉన్నాయని అగర్వాల్ చెప్పారు. మరోవైపు, భారత్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడాన్ని వేదాంత కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 35 బిలియన్ డాలర్ల పైగా (దాదాపు రూ. 2.9 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. కార్యకలాపాల విస్తరణ కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 1.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 14,000 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. -
ఫాక్స్‌కాన్ సంచలన నిర్ణయం: లక్షల కోట్ల ప్రాజెక్ట్ నుంచి వెనక్కి
తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ ఫాక్స్‌కాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీయ మెటల్స్-టు-ఆయిల్ వేదాంత కంపెనీతో 19.5 బిలియన్ డాలర్ల సెమీ కండక్టర్ జాయింట్ వెంచర్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఫాక్స్‌కాన్ నిర్ణయించుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు సంస్థ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది దీనికి గల కారణాలను వివరించలేదు. (మ్యారేజ్ డే ఏమోగానీ, 24 లక్షల ఉబెర్ బిల్లు చూసి గుడ్లు తేలేసిన జంట) గ్లోబల్ కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్‌కాన్ , వేదాంత గత ఏడాది గుజరాత్లో సెమీకండక్టర్. డిస్ప్లే ప్రొడక్షన్ ప్లాంట్లను నిర్మించడానికి సుమారు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కానీ ప్రాజెక్ట్‌పై ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పనిచేసినప్పటికీ ఈ జాయింట్ వెంచర్‌ను ముగించాలని ఇరుపక్షాలు పరస్పరం నిర్ణయించుకున్నాయన్న తాజా ప్రకటన సంచలనం రేపుతోంది. ఆ కంపెనీతో ఫాక్స్‌కాన్‌కు ఎలాంటి సంబంధం లేదని, భవిష్యత్‌లో భాగస్వాములు ఎలాంటి గందరగోళానికి గురవ్వకుండా ఒరిజినల్ పేరునే కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు హోన్ హయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) ప్రకటించింది. ఈ ఒప్పందం 'మేక్ ఇన్ ఇండియా' పుష్‌కు ఖచ్చితంగా ఎదురుదెబ్బ అని కౌంటర్‌పాయింట్‌లోని రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ షా వ్యాఖ్యానించారు. (ITR Filing: గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు) కాగా 2026 నాటికి సెమీకండక్టర్ మార్కెట్ విలువ 63 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్న కేంద్రం, గతేడాది 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహక పథకం కింద ప్లాంట్ల ఏర్పాటుకు మూడు దరఖాస్తులు అందుకుంది. ఇందలో వేదాంత-ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ ఒకటి, సింగపూర్‌కు చెందిన IGSS వెంచర్స్ , టవర్ సెమీకండక్టర్‌ను టెక్ భాగస్వామిగా పరిగణించే గ్లోబల్ కన్సార్టియం ఐఎస్ఎంసీ నుండి వచ్చాయి. -
చిప్ ప్లాంట్‌కు వేదాంత ఫాక్స్‌కాన్ మళ్లీ దరఖాస్తు
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్లకు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలను ప్రకటించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా తమ దరఖాస్తును మళ్లీ దాఖలు చేసినట్లు వేదాంత ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ సంస్థ వెల్లడించింది. 2027 నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా రూ. 1.5 లక్షల కోట్లతో ఎలక్ట్రానిక్ చిప్ ప్లాంటును నెలకొల్పనున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశీయంగా చిప్ తయారీని ప్రోత్సహించే దిశగా సెమీకండక్టర్ ఫ్యాబ్‌ల ఏర్పాటుకు ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహకాలను కేంద్రం 30 శాతం నుంచి 50 శాతానికి ఇటీవల పెంచింది. దీంతో గతంలో సమర్పించిన దరఖాస్తును ఉపసంహరించుకుని వేదాంత ఫాక్స్‌కాన్ తాజాగా మరోసారి దాఖలు చేసింది. 2027 ప్రథమార్ధంలో 5,000 వేఫర్లతో ప్రారంభించి .. నెలకు 40,000 వేఫర్ల స్థాయికి ఉత్పత్తిని పెంచుకోనున్నట్లు వేదాంత ఫాక్స్‌కాన్ సంస్థ సీఈవో డేవిడ్ రీడ్ వెల్లడించారు. -
విబేధాలే కారణమా? గుజరాత్లో 1.54 లక్షల కోట్ల ప్రాజెక్ట్‌కు అడ్డంకి!
మైనింగ్ కంపెనీ వేదాంతా లిమిటెడ్‌కు భారీ షాక్ తిగిలింది.సెమీకండక్టర్ల తయారీ కోసం వేదాంతాతో కదుర్చుకున్న ఒప్పందం నుంచి తైవాన్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు ఫాక్స్‌కాన్ తప్పుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రెండేళ్ల క్రితం ఫాక్స్‌కాన్ భారత్‌లో సెమీ కండక్టర్ తయారీ విభాగంలో అడుగు పెట్టాలని అనుకుంది. ఇందుకోసం వేదాంతాతో చేతులు కలిపింది. 67శాతం షేరుతో వేదాంత - ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచ్ర్లో గుజరాత్ దోలేరా ప్రాంతంలో వెయ్యి ఎకరాల్లో రూ.1.54 లక్షల కోట్లతో సెమీకండక్టర్ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నాయి. తాజాగా, ఫాక్స్కాన్క, వేదాంతా సెమీ కండక్టర్ ప్రాజెక్ట్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఇరు సంస్థల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా సెమీ కండక్టర్ల తయారీ కోసం వేదాంతాను వద్దనుకొని కొత్త భాగస్వామి కోసం ఫాక్స్‌కాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వేదాంత గ్రూప్ ఆర్థిక ఇబ్బందులతో ఫాక్స్‌కాన్ వేరే భాగస్వామిని చూసుకోవాలని సూచించిందని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. దీంతో, ఫాక్స్‌కాన్ మరో భాగస్వామికోసం ఇప్పటికే అనధికారిక చర్చలు జరిపినట్లు సమాచారం. వాటిల్లో రెండు కార్పొరేట్ దిగ్గజాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ రెండు కంపెనీలు ఏంటీ? ఫాక్స్‌కాన్‌కు, వేదాంతాల మధ్య ఎందుకు విబేధాలు తలెత్తాయనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి👉 భారత్‌లో ఆఫీస్‌ను అమ్మేస్తున్న ఇంటెల్.. వేలాది మంది ఉద్యోగుల్ని.. -
29 ఏళ్ల తర్వాత.. ఇంటెల్ ఇండియా హెడ్ నివృతి రాయ్ రాజీనామా!
ప్రముఖ టెక్ దిగ్గజం, అమెరికా చిప్ తయారీ సంస్థ ఇంటెల్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంటెల్ ఇండియా అధినేతగా, వివిధ హోదాల్లో 29 ఏళ్ల పాటు నిర్విరామంగా సేవలందించిన నివృతి రాయ్ ఇంటెల్‌కు రాజీనామా చేశారు. త్వరలో, ‘ఇన్వెస్ట్ ఇండియా’ అధినేతగా బాధ్యతలు చేపట్టనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కొంత కాలం క్రితం ఇన్వెస్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట్‌గా కొనసాగుతున్న దీపక్ బగ్లా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానాన్ని రాయ్ భర్తీ చేయనున్నారు. ఇక రాయ్ రాజీనామాని ఇంటెల్ యాజమాన్యం ధృవీకరించింది. ‘రాయ్ నాయకత్వంలో ఇంటెల్ ఇండియా గణనీయమైన వృద్దిని సాధించిందని కొనియాడింది. ఆర్ధిక సేవల విభాగంలో చేరడంపై అభినందనలు తెలిపింది. రాయ్ 1994లో అమెరికా ఇంటెల్‌లో డిజైన్ ఇంజినీర్‌గా తన కెరియర్ను ప్రారంభించారు. 2005లో భారత్‌కు తిరిగి వచ్చిన ఆమె ఆ సంస్థ చిప్సెట్ ఇంజినీరింగ్ అండ్ ఐపీ డెవెలప్మెంట్ గ్రూప్ సీనియర్ డైరెక్ట్‌గా బాధ్యతలు చేపట్టారు. వ్యాపార మెళుకువలు, అపారమైన అనుభవం కారణంగా 2016 నాటికి ఇంటెల్ ఇండియా అధినేత స్థాయికి చేరుకున్నారు. తాజాగా, ఇంటెల్‌కు రాజీనామా చేసి ఇన్వెస్ట్ ఇండియాలో చేరనున్నారు. నారీ శక్తి పురస్కారం.. ఇంటెల్ హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే.. 2021 నుంచి ఇంటెల్ ఇండియా స్కిల్ ట్రైనింగ్, రూరల్ కనెక్టివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటు కోసం ప్రయత్నాలను ప్రారంభించింది. ముఖ్యంగా, 20లక్షల మంది పిల్లలకు, 5,000 మంది ప్రభుత్వ ఉన్నతాధికారులకు స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను నిర్వహించింది.ప్రపంచ స్థాయిలో మహిళా వ్యవస్థాపకత, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన అత్యుత్తమ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమెకు నారీ శక్తి పురస్కారాన్ని అందజేశారు. Congrats to @rnivruti of @IntelIndia on being awarded the #NariShaktiPuraskar by Hon’ble President Shri Ramnath Kovind ji for developing power efficient semiconductor chips & new rural connectivity solutions for cost-effective & high-speed broadband connection.@rashtrapatibhvn https://t.co/e4AKR3rEHH — Basavaraj S Bommai (@BSBommai) March 8, 2022 రాజీనామా.. ఇంటెల్‌లో చర్చాంశనీయం కోవిడ్-19తో పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరగడం.. వర్క్ ప్రం హోం.. లెర్నింగ్ ఫ్రం హోం సంస్కృతి అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొబైల్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో చిప్ కొరత నెలకొంది. చిప్‌లు, సెమీ కండక్టర్ల కొరతతో స్మార్ట్ ఫోన్ల లాంచింగ్, కార్ల ఆవిష్కరణలు.. జాప్యం అవుతున్నాయి. కార్ల డెలివరీ కూడా ఆలస్యం అవుతున్నది. ఇలా ఆటోమొబైల్, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ విభాగాలతో పాటు మొత్తం 169 రకాల పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు ఇంటెల్ లాంటి చిప్ తయారీ సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ తరుణంలో నివృతి రాయ్ ఇంటెల్ ఇండియాకు రాజీనామా చేయడం చర్చాంశనీయంగా మారింది. చదవండి👉 మోదీ ‘హై - టెక్ హ్యాండ్ షేక్’.. భారత్‌కు పెట్టుబడుల వరద! -
భారత్‌లో మైక్రాన్ సెమీకండక్టర్ ప్లాంట్
న్యూఢిల్లీ: కంప్యూటర్ స్టోరేజీ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ ‘సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ప్లాంట్’ను గుజరాత్లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు రూ.2.75 బిలియన్ డాలర్లు (సుమారు రూ.22,550 కోట్లు) పెట్టుబడులు అవసరం కానున్నాయి. ఇందులో మైక్రాన్ సొంతంగా 825 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుండగా, మిగిలిన మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చనున్నాయి. స్థానికంగా సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ (తయారీ, వ్యాల్యూ చైన్) ఏర్పాటుకు భారత్ తీసుకుంటున్న చర్యలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నట్టు మైక్రాన్ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహరోత్రా పేర్కొన్నారు. భారత్‌లో ప్లాంట్ ఏర్పాటుతో స్థానిక కస్టమర్లకు సేవలు అందించడంతోపాటు, అంతర్జాతీయంగా తయారీ సామర్థ్యం పెరుగుతుందని ప్రకటించారు. సర్కారు నుంచి భారీ సాయం మైక్రాన్ ప్లాంట్‌కు కేంద్ర సర్కారు ‘మోడిఫైడ్ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ (ఏటీఎంపీ)’ పథకం కింద ఆమోదం లభించడం గమనార్హం. ఈ పథకం కింద మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 50% కేంద్ర సర్కారు నుంచి లభిస్తుంది. ప్రాజెక్టు వ్యయంలో 20% మేర ప్రోత్సాహకాల రూపంలో గుజరాత్ సర్కారు అందిస్తుంది. మైక్రాన్ తన వంతు 30% వెచ్చిస్తే సరిపోతుంది. దశలవారీగా.. గుజరాత్లో మైక్రాన్ సెమీకండక్టర్ అసెంబ్లింగ్, టెస్టింగ్ ప్లాంట్ దశల వారీగా కార్యకలాపాలు చేపట్టనుంది. ‘‘తొలి దశ నిర్మాణం ఈ ఏడాదిలోనే ప్రారంభం అవుతుంది. ఇందులో 5 లక్షల చదరపు అడుగుల క్లీన్‌రూమ్ స్పేస్ ఉంటుంది. 2024 చివరికి కార్యకలాపాలు మొదలవుతాయి’’అని మైక్రాన్ ప్రకటించింది. ఈ ప్లాంట్‌తో 5,000 మందికి ప్రత్యక్షంగా, 15,000 మందికి పరోక్షంగా వచ్చే కొన్నేళ్లలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఫేస్ 2 నిర్మాణం ఈ దశాబ్దం ద్వితీయార్ధంలో ఉంటుందని పేర్కొంది. సెమీకండక్టర్ రంగానికి ఊతం మైక్రాన్ ఏర్పాటు చేయబోయే సెమీకండక్టర్ అసెంబ్లింగ్, టెస్ట్ ప్లాంట్ భారత సెమీకండక్టర్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుంది. వేలాది హైటెక్ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. దేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ వర్థిల్లడానికి ఈ పెట్టుబడి కీలక పునాది అవుతుంది. –అశ్వని వైష్ణవ్, ఐటీ, టెలికం మంత్రి అవకాశాల కోసం చూస్తున్నాం.. భారత్‌లో గొప్ప అవకాశాల కోసం చూస్తున్నాం. మెమొరీ, స్టోరేజీలో మైక్రాన్ ప్రపంచ దిగ్గజంగా ఉంది. డేటా సెంటర్లు, స్మార్ట్ఫోన్లు, పీసీలకు మేము కీలక సరఫరాదారుగా ఉన్నాం. – సంజయ్ మెహరోత్రా, మైక్రాన్ సీఈవో -
భారత్‌లో అవకాశాలు అపారం
సిడ్నీ: భారత్‌లో డిజిటల్ ఇన్ఫ్రా, టెలికం, సెమీ కండక్టర్లలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అక్కడి ప్రముఖ కంపెనీల సీఈవోలతో ప్రధాని ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌లో అవకాశాల గురించి తెలియజేశారు. మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఇన్ఫ్రా, ఐటీ, ఫిన్‌టెక్, టెలికం, సెమీకండ్టర్, అంతరిక్షం, పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రీన్ హైడ్రోజన్, విద్య, ఫార్మా, హెల్త్‌కేర్, వైద్య ఉపకరణాల తయారీ, మైనింగ్, టెక్స్టైల్, వ్యవసాయం, ఆహార శుద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. భారతీయ కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. టెక్నాలజీ, నైపుణ్యాలు, శుద్ధ ఇంధనాల విషయంలో భారత కంపెనీలతో సహకారం ఇతోధికం చేసుకోవాలని కోరారు. నిబంధనల అమలును సులభతరం చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. పీఎల్ఐ ప్రోత్సాహకాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సరళతరం చేసినట్టు వివరించారు. హాన్కాక్ ప్రాస్పెక్టింగ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గినా రైన్‌హార్ట్, ఫార్టెస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆండ్య్రూ ఫారెస్ట్, ఆస్ట్రేలియా సూపర్ సీఈవో పౌల్ ష్రోడర్ ప్రధానితో సమావేశంలో పాల్గొన్నారు. 2000 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు 1.07 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరు దేశాలు మధ్యంతర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 29 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. భారత్‌కు ఆస్ట్రేలియా 13వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. -
త్వరలో సెమీ కండక్టర్ల హబ్‌గా భారత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో భారత్ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. త్వరలో ప్రకటించబోయే సెమీకండక్టర్ ఫ్యాబ్, తొలి ప్యాకేజింగ్ యూనిట్లతో పాటు 2024 నాటికి 100 డిజైన్ స్టార్టప్‌లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాల ఊతంతో భారత్ సెమీకండక్టర్ల హబ్‌గా మారగలదని ఆయన పేర్కొన్నారు. చిప్‌ల తయారీ కోసం రూ. 76,000 కోట్ల ప్రోత్సాహక పథకం, విరివిగా నిపుణుల లభ్యత, నైపుణ్యాలను పెంచే శిక్షణా కార్యక్రమాలు మొదలైనవి ఇందుకు దోహదపడగలదని చంద్రశేఖర్ చెప్పారు. ఐఐటీ ఢిల్లీలో జరిగిన మూడో సెమీకాన్ఇండియా ఫ్యూచర్డిజైన్ రోడ్‌షోలో పాల్గొన్న సందర్భంగా చంద్రశేఖర్ ఈ విషయాలు వివరించారు. దేశీయంగా ఏడాదిన్నర క్రితం సెమీకండక్టర్ డిజైన్ స్టార్టప్‌లనేవి దాదాపు శూన్యమని, కానీ ప్రస్తుతం 27–30 డిజైన్, సెమీకండక్టర్ అంకుర సంస్థలు పని చేస్తున్నాయని మంత్రి తెలిపారు. 2024 నాటికి ఈ విభాగంలో 100 పైచిలుకు అంకుర సంస్థలు ఏర్పాటయ్యే దిశగా ముందుకు వెడుతున్నామన్నారు. యాపిల్, సిస్కో, శాంసంగ్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ ఆవిష్కరణలకు భారత్ కేంద్రంగా నిలవగలదని.. తయారీ రంగం ఇప్పటికే ఊపందుకుందని చంద్రశేఖర్ తెలిపారు. ఇన్‌కోర్‌లో సెకోయా పెట్టుబడులు.. రోడ్‌షో సందర్భంగా ఇన్‌కోర్ సెమీకండక్టర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సెకోయా క్యాపిటల్ ఇండియా ప్రకటించింది. ఇన్‌కోర్ ఇప్పటి వరకూ సెకోయా నుంచి 3 మిలియన్ డాలర్లు సమీకరించింది. సెమీకండక్టర్ల విభాగంలో సెకోయాకు ఈ ఏడాది ఇది రెండో పెట్టుబడి. ఈ మధ్యే మైండ్‌గ్రోవ్ అనే సంస్థలో ఇన్వెస్ట్ చేసింది. -
కొద్ది వారాల్లో తొలి సెమికండక్టర్ ఫ్యాబ్
న్యూఢిల్లీ: దేశీయంగా తొలి సెమీకండక్టర్ ఫ్యాబ్‌ను వచ్చే కొద్ది వారాల్లోనే ప్రకటించనున్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రభుత్వ అనుకూల విధానాల తోడ్పాటుతో చిప్ పరిశ్రమ వచ్చే 3–4 ఏళ్లలో గణనీయంగా వృద్ధి చెందగలదని సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పదేళ్ల క్రితం ప్రతి 100 ఫోన్లలో 99 శాతం మొబైల్స్‌ను దిగుమతి చేసుకోగా .. నేడు భారత్‌లో వినియోగిస్తున్న 99 శాతం మొబైల్ ఫోన్లు దేశీయంగానే తయారవుతున్నాయని మంత్రి చెప్పారు. మొబైల్ ఫోన్ల తయారీ లో భారత్ రెండో స్థానంలోనూ, ఎగుమతుల్లో మూడో స్థానంలోనూ ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది మొబైల్ ఫోన్ల ఎగుమతులు 9.5–10 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలవని వైష్ణవ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే సెమీకండక్టర్ల పరిశ్రమకు అనువైన పరిస్థితులను కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని ఆయన పేర్కొన్నారు. -
India-US: సెమీకండక్టర్లపై భారత్‌తో ఒప్పందం
న్యూఢిల్లీ: సెమీ కండక్టర్లకు సంబంధించి భారత్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు అమెరికా రక్షణ మంత్రి గినా రైమాండో తెలిపారు. ఈ రంగంలో అపార అవాకాశాలున్నాయంటూ, ఇరు దేశాల మధ్య సహకారానికి ఒప్పందం తోడ్పడుతుందన్నారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లకు సంబంధించి యూఎస్ కంపెనీలు తమ సరఫరా వ్యవస్థను వివిధ దేశాల మధ్య విస్తరించుకోవాలనే (వైవిధ్యం) బలమైన ఆకాంక్షతో ఉన్నట్టు రైమాండో తెలిపారు. భారత్ పర్యటనకు వచ్చిన ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లడారు. ‘‘రెండు దేశాల మధ్య సెమీ కండక్టర్లు, వాటికి సంబంధించి వాణిజ్య అవకాశాలపై మాట్లాడుకున్నాం. సెమీకండక్టర్ల ఎకోసిస్టమ్‌లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కావాల్సిన విధానాలపై చర్చలను ఏ విధంగా కొసాగించాలనే అంశంపైనా మాట్లాడాం. జాయింట్ వెంచర్లు లేదా టెక్నాలజీ భాగస్వామ్యాలకు సంబంధించి ఈ చర్చలు జరిగాయి’’అని రైమాండో వివరించారు. స్వల్పకాల అవకాశాలతోపాటు, దీర్ఘకాల వ్యూహాత్మక అవకాశాలను కోరుకుంటున్నట్టు చెప్పారు. ఎలక్ట్రానిక్స్ సరఫరా వ్యవస్థలో అమెరికా, భారత్ పెద్ద పాత్రను పోషించగలవన్నారు. రెండు దేశాలూ వేటికవే సెమీకండక్ట్ రాయితీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయంటూ.. ఈ విషయంలో రెండు దేశాలు ఏ విధంగా సహకారం ఇచ్చిపుచ్చుకోగలవనే దానిపై మాట్లాడినట్టు చెప్పారు. భారత్–అమెరికా వాణిజ్య చర్చా కార్యక్రమం, భారత్–అమెరికా సీఈవోల ఫోరం సమావేశం కోసం రైమాండో భారత్‌కు వచ్చారు. ఆమె వెంట అత్యున్నత స్థాయి వాణిజ్య బృందం కూడా ఉంది. -
త్వరలోనే భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ
న్యూఢిల్లీ: దేశీయంగా సెమీకండక్టర్ల తయారీ త్వరలోనే ప్రారంభం కాగలదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అల్కేశ్ కుమార్ శర్మ తెలిపారు. చిప్‌ల తయారీలో టాప్ 6–7 భాగస్వాముల్లో ఒకటిగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. తిరువనంతపురంలోని సీ–డీఏసీ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా శర్మ ఈ విషయాలు చెప్పారు. భారతీయ ప్రమాణాలకు, అధునాతన మీటరింగ్ విధానానికి అనుగుణంగా ఉండే స్మార్ట్ ఎనర్జీ మీటర్‌ను సీ–డీఏసీ తయారు చేసింది. వీటితో విద్యుత్ వినియోగం తగ్గుతుందని, బిల్లింగ్ సక్రమంగా ఉండటంతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రయోజనకరంగా ఉంటుందని శర్మ వివరించారు. -
హైదరాబాద్‌లో మైక్రోచిప్ ఆఫీసు
సాక్షి, సిటీబ్యూరో: కార్యాలయ స్థలాల లావాదేవీలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ ఆఫీసు స్పేస్‌ను కొనుగోలు చేసింది. అమెరికాకు చెందిన సెమీకండకర్ల తయారీ కంపెనీ మైక్రోచిప్ టెక్నాలజీ కోకాపేటలోని వన్ గోల్డెన్ మైల్ టవర్‌లో 1.68 లక్షల చదరపు అడుగుల గ్రేడ్-ఏ ఆఫీసు స్థలాన్ని కొనుగోలు చేసింది. డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. ఈ లావాదేవీలకు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సలహాదారుగా వ్యవహరించింది. అమెరికాలోని ఆరిజోనా ప్రధాన కేంద్రంగా ఉన్న మైక్రోచిప్‌కు మన దేశంలో హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నైలలో డెవలప్మెంట్ సెంటర్లున్నాయి. తాజా పెట్టుబడులు వచ్చే 10 ఏళ్లలో కంపెనీ సామర్థ్యాల విస్తరణ, నియామకాలు, అభివృద్ధి ప్రణాళికలకు సరిపోతాయని మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ శ్రీకాంత్ శెట్టికెరె అన్నారు. 66 మీటర్ల ఎత్తయిన వాణిజ్య సముదాయంలో సుమారు 5 లక్షల చ.అ. గ్రేడ్-ఏ ఆఫీసు స్థలం ఉంది. ఆరియన్, ఎస్కార్, టెర్మినస్‌లు ఈ ప్రాపర్టీని కో-ప్రమోటర్లుగా ఉన్నాయి. యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్జీబీసీ) నుంచి ఎల్ఈఈడీ గోల్డ్ రేటింగ్ సర్టిఫికెట్‌ను దక్కించుకుందని వన్ గోల్డెన్ మైల్ మేనేజింగ్ పార్టనర్ పుష్కిన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఆర్ధిక మాంద్యం, లేఆఫ్‌లు వంటి వ్యాపార ఒత్తిడి నేపథ్యంలోనూ హైదరాబాద్‌లో ప్రీమియం ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడం సానుకూల దృక్పథమని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ హైదరాబాద్ ఎండీ వీరాబాబు తెలిపారు. -
2022లో.. 37.93 లక్షల ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు
ముంబై: దేశీయంగా 2022లో మొత్తం 37.93 లక్షల ప్యాసింజర్ వాహన విక్రయాలు జరిగాయి. 2021తో పోల్చితే 23% వృద్ధి నమోదైంది. మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, స్కోడా ఇండియా కార్లు రికార్డు సేల్స్ నమోదు చేసుకున్నాయి. కరోనా ప్రేరేపిత సవాళ్లు, సెమీ కండక్టర్ల కొరత తగ్గడంతో కార్లకు, ముఖ్యంగా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)లకు గిరాకీ పెరిగింది. -
వాహనాలకు పండగొచ్చింది
న్యూఢిల్లీ: తయారీ సంస్థల నుంచి డీలర్లకు సరఫరా మెరుగుపడటంతో పండుగల సీజన్లో వాహన పరిశ్రమ కళకళ్లాడుతోంది. కస్టమర్లకు డెలివరీలూ పుంజుకుంటున్నాయి. దీంతో గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ సెప్టెంబర్‌లో దేశీయంగా ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 11 శాతం వృద్ధి చెందాయి. 13,19,647 యూనిట్ల నుంచి 14,64,001 యూనిట్లకు పెరిగాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పండుగల సీజన్ కావడంతో అక్టోబర్‌లో విక్రయాలు మరింత పుంజుకోగలవని అంచనా వేస్తున్నట్లు ఎఫ్ఏడీఏ ఆశాభావం వ్యక్తం చేసింది. ‘దశాబ్దకాలంలోనే ఈ పండుగ సీజన్ అత్యుత్తమమైనదిగా ఉండగలదని డీలర్లు అంచనా వేస్తున్నారు‘ అని పేర్కొంది. ట్రాక్టర్లు, కొన్ని రకాల త్రిచక్ర వాహనాలు మినహా మిగతా అన్ని ప్యాసింజర్, వాణిజ్య వాహనాలు.. ద్విచక్ర వాహనాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెరుగైన అమ్మకాలు నమోదు చేశాయని ఎఫ్ఏడీఏ తెలిపింది. ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 2,37,502 యూనిట్ల నుంచి 10 శాతం వృద్ధి చెంది 2,60,556 యూనిట్లకు చేరాయి. ‘సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడి కార్ల లభ్యత పెరగడం, వినూత్న ఫీచర్లతో కొత్త వాహనాలను ఆవిష్కరించడం తదితర అంశాల కారణంగా కస్టమర్లు తమకు నచ్చిన వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు‘ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. మరోవైపు, సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో అమ్మకాలకు ఊతం లభించేలా డిమాండ్‌కి అనుగుణంగా వాహనాలను అందించడంపై మరింతగా దృష్టి పెట్టాలని తయారీ సంస్థలను కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలు.. ► సెప్టెంబర్‌లో ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు 9 శాతం పెరిగి 9,31,654 యూనిట్ల నుంచి 10,15,702 యూనిట్లకు చేరాయి. ఎంట్రీ స్థాయి బైక్‌ల అమ్మకాలు గణనీయంగా దెబ్బతినడంతో మొత్తం టూవీలర్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడింది. ► వాణిజ్య వాహనాల విక్రయాలు 59,927 యూనిట్ల నుంచి 19 శాతం వృద్ధితో 71,233 యూనిట్లకు పెరిగాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 53,392 నుంచి 52,595 యూనిట్లకు తగ్గాయి. ► ప్యాసింజర్ వాహనాల విభాగంలో కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ అమ్మకాలు 99,276 యూనిట్ల నుంచి 1,03,912 యూనిట్లకు పెరిగాయి. హ్యుందాయ్ 39,118, టాటా మోటార్స్ 36,435 కార్లు విక్రయించాయి. ► ద్విచక్ర వాహనాల విభాగంలో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అత్యధికంగా 2,84,160 యూనిట్లు విక్రయించింది. హీరో మోటోకార్ప్ 2,50,246 వాహనాల అమ్మకాలు నమోదు చేసింది. త్రిచక్ర వాహనాలకు సంబంధించి 19,474 యూనిట్లతో బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిల్చింది. -
సెప్టెంబర్.. టాప్ గేర్
న్యూఢిల్లీ: సెమీ కండక్టర్ల సరఫరా మెరుగుపడిన నేపథ్యంలో ఉత్పత్తి పెరగడం, పండుగల డిమాండ్ తోడు కావడంతో దేశీయంగా కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్యాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు సెప్టెంబర్‌లో 3,55,946 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 91 శాతం అధికం. చిప్‌ల కొరత సమస్య తగ్గి ఉత్పత్తి మెరుగుపడటంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ మొదలైన ఆటోమొబైల్ దిగ్గజాలు తమ డీలర్లకు మరిన్ని కార్లను సమకూర్చగలిగాయి. సెప్టెంబర్‌లో మారుతీ సుజుకీ అమ్మకాలు 63,111 యూనిట్ల నుంచి 1,48,380 యూనిట్లకు పెరిగాయి. గత 42 నెలల్లో అమ్మకాలపరంగా ఇది తమకు అత్యుత్తమమైన రెండో నెల అని సంస్థ సీనియర్ ఈడీ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. చివరిగా 2020 అక్టోబర్‌లో మారుతీ సుజుకీ దేశీ మార్కెట్లో ఏకంగా 1,63,000 వాహనాలు విక్రయించింది. కంపెనీ మార్కెట్ వాటా తాజాగా సెప్టెంబర్‌లో దాదాపు 8 శాతం పెరిగి 42 శాతానికి చేరింది. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో పరిశ్రమ తొలిసారిగా 10 లక్షల వాహనాల విక్రయాల మార్కును దాటిందని శ్రీవాస్తవ చెప్పారు. మరోవైపు, హ్యుందాయ్ అమ్మకాలు 50 శాతం పెరిగి 49,700గా నమోదయ్యాయి. టాటా మోటార్స్ 47,654 కార్లను, కియా ఇండియా 25,857, టయోటా కిర్లోస్కర్ మోటార్ 15,378, హోండా కార్స్ 8,714 వాహనాలను విక్రయించాయి. ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ 5,07,690, టీవీఎస్ మోటర్ కంపెనీ 2,83,878 యూనిట్లను విక్రయించాయి. -
వేదాంత దూకుడు: గుజరాత్లో సెమీకండక్టర్ ప్లాంటు
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెమీకండక్టర్ ప్లాంటును గుజరాత్లో ఏర్పాటు చేయాలని పారిశ్రామిక దిగ్గజం వేదాంత నిర్ణయించింది. అహ్మదాబాద్‌లో తలపెడుతున్న ఈ ప్రాజెక్టులో డిస్ప్లే, సెమీకండక్టర్ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై వేదాంత ప్రతినిధులు కానీ, ఫాక్స్‌కాన్ వెంటనే స్పందించ లేదు. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌తో కలిసి 20 బిలియన్ డాలర్ల జాయింట్ వెంచర్‌గా వేదాంత తలపెట్టిన ఈ మెగా ప్రాజెక్టు కోసం తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటక కూడా పోటీపడ్డాయి. కానీ ఇటీవల ముగిసిన తుది చర్చల్లో మహారాష్ట్రను పక్కకు నెట్టి గుజరాత్ ఆ ప్రాజెక్టును దక్కించుకుంది. కాగా భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2020లో 15 బిలియన్ డాలర్లనుంచి 2026 నాటికి 63 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. -
100 బిలియన్ డాలర్ల సంస్థగా వేదాంత
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం వేదాంత లిమిటెడ్ వచ్చే ఎనిమిదేళ్లలో 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8 లక్షల కోట్లు) కంపెనీగా ఎదగాలని నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఇది 18 బిలియన్ డాలర్ల (రూ. 1.3 లక్షల కోట్లు) సంస్థగా ఉంది. వృద్ధి ప్రణాళికలను దూకుడుగా అమలు చేయడంపైనా, వివిధ వ్యాపార విభాగాల్లో సామర్థ్యాలను పెంచుకోవడంపైనా మరింతగా దృష్టి పెట్టనున్నట్లు బుధవారం వేదాంత వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ చైర్మన్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు. సెమీకండక్టర్లు, డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ విభాగాల్లోకి వ్యూహాత్మకంగా ప్రవేశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత నెలకొంది. భారత్ 100 శాతం దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటున్నందున ఇది సమస్యగా మారింది. దేశీయంగా సెమీకండక్టర్ల వినియోగం 2026 నాటికి 80 బిలియన్ డాలర్లకు, ఆ తర్వాత 2030 నాటికి 110 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి‘ అని అగర్వాల్ వివరించారు. దేశీయంగా సమగ్ర సెమీకండక్టర్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు వేదాంత ఇప్పటికే దిగ్గజ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపింది. దేశ వృద్ధిలో సహజ వనరుల కీలక పాత్ర.. భారతదేశ ఆర్థిక వృద్ధిలో సహజ వనరుల రంగం కీలక పాత్ర పోషిస్తోందని అనిల్ అగర్వాల్ అన్నారు. ఒక చిన్న విధానపరమైన మార్పు ఈ రంగం ‘నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తుంది‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘భారత్ స్వావలంబన దిశలో వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో దేశ వృద్ధి, ఉపాధి కల్పనలో సహజ వనరుల రంగం కీలక పాత్ర పోషిస్తోంది. చిన్న విధాన సంస్కరణలు కూడా సహజ వనరుల విభాగ నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తాయి’’ అని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా చైనాను మాత్రమే కాకుండా భారత్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ► ‘చైనాతోపాటు మరొక దేశం వ్యూహాన్ని’ అవలంబిస్తున్న అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ‘భారత్ ఖచ్చితంగా ఒక ఆకర్షణీయమైన ప్రదేశంగా కనబడుతుంది. తమ పెట్టుబడులకు కేవలం చైనానే కాకుండా, ప్రత్యామ్నాయంగా మిగిలిన దేశాలవైపూ చూడటం ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం. ► మహమ్మారి కోవిడ్–19, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. అయితే ఈ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ చాలా దేశాల కంటే మెరుగ్గా పనిచేస్తోంది. ► భారత్ దాదాపు ఏడు శాతం వృద్ధి రేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికా, బ్రిటన్లు దాదాపు రెండంకెల స్థాయిల్లో ద్రవ్యోల్బణం సవాలును ఎదుర్కొంటుండగా, ఆయా దేశాలతో పోల్చితే భారత్‌లో ఒక మోస్తరు ద్రవ్యోల్బణమే కొనసాగుతోంది. -
వాహన విక్రయాలు జూమ్
ముంబై: అంతర్జాతీయంగా సెమీ కండెక్టర్ల కొరత ప్రభావం తగ్గడంతో.., దేశీయంగా జూలైలో వాహన విక్రయాలు వృద్ధి బాటపట్టాయి. వార్షిక ప్రాతిపదికన మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రాఅండ్‌మహీంద్రా, కియా ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్, స్కోడా ఆటో అమ్మకాలు పురోగతిని సాధించాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ ఊపందుకోవడంతో ఈ ఏడాదిలోకెల్లా జూలైలో అత్యధికంగా అమ్ముడయ్యాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా సరుకు రవాణా అవసరాలు పెరగడంతో వాణిజ్య వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. -
ఆర్డర్లున్నాయి.. కానీ చిప్స్ కొరత
న్యూఢిల్లీ: సెమికండక్టర్ల కొరత వాహన పరిశ్రమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వెల్లువలా ఆర్డర్లు ఉన్నప్పటికీ వాహనాలను తయారు చేయలేని పరిస్థితి ఉంది. ప్యాసింజర్ వెహికిల్స్ ఒక్కటే 6.5 లక్షల యూనిట్లకు ఆర్డర్లు ఉన్నాయి. చిప్ సరఫరా మెరుగుపడితేనే ఇవి రోడ్డెక్కేది. దీంతో తాము బుక్ చేసుకున్న కారు కోసం నెలల తరబడి కస్టమర్లు వేచిచూడక తప్పడం లేదు. ఒక్క మారుతి సుజుకీ 3.4 లక్షల యూనిట్లకుపైగా పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి. హ్యుండై, మహీంద్రా కలిపి దాదాపు 3 లక్షల యూనిట్లు ఉంటుంది. ప్యాసింజర్ కార్ల మార్కెట్లో మొత్తం పెండింగ్ ఆర్డర్లు సుమారు 6.5 లక్షల యూనిట్లు ఉంటుందని మారుతి సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. మోడల్, వేరియంట్‌నుబట్టి వెయిటింగ్ పీరియడ్ 4–12 వారాలు ఉందని టాటా మోటార్స్ ప్రతినిధి వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఇది 6 నెలల వరకు ఉందన్నారు. చిప్ సరఫరా సరిగా లేక ఏడాదిగా డెలివరీలు తీవ్ర ఆలస్యం అవుతున్నాయని హోండా కార్స్ ఇండియా ప్రతినిధి వివరించారు. వేచి ఉండే కాలం మోడల్‌నుబట్టి 2–9 నెలలు ఉందన్నారు. చదవండి: Elss Scheme: అదీ సంగతి.. ఈ స్కీమ్‌లో ఏ విభాగమైనా, పీపీఎఫ్ కంటే రెట్టింపు రాబడులు! -
Semicon India 2022: సెమికండక్టర్ల హబ్‌గా భారత్
బెంగళూరు: పారిశ్రామికవేత్తలు, తయారీదార్లకు కేంద్రం విధానపరంగా పూర్తి అనుకూల వాతావరణం కల్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశాన్ని ప్రపంచ సెమికండక్టర్ల హబ్‌గా మార్చాలని పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు. అత్యున్నత సాంకేతికత, నాణ్యత, విశ్వసనీయతకు పెద్దపీట వేయాలన్నారు. శుక్రవారం బెంగళూరులో ‘సెమికాన్ ఇండియా–2020’ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాని మాట్లాడారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో, సవాళ్లను స్వీకరించే విషయంలో భారత్ ముందంజలో ఉంటుందన్నారు. 2026 నాటికి దేశీయంగా 80 బిలియన్ డాలర్ల విలువైన, 2030 నాటికి 110 బిలియన్ డాలర్ల విలువైన సెమికండక్లర్ల అవసరమన్నారు. మరిన్ని ప్రోత్సాహకాలు గత ప్రభుత్వాలు సెమికండక్టర్ల డిజైనింగ్ పరిశ్రమను ప్రోత్సాహించలేదని మోదీ ఆక్షేపించారు. ‘‘ఈ పరిశ్రలో దేశంలో ప్రతిభకు కొదవ లేదు. ప్రపంచంలో సెమికండక్టర్ల డిజైన్ ఇంజనీర్లలో 20 శాతం మన దగ్గరే ఉన్నారు. భారత్‌ను సెమికండక్టర్ హబ్‌గా మార్చడానికి ఆచరణ యోగ్యమైన సలహాలు, సూచనలివ్వండి. 130 కోట్ల మంది భారతీయులను అనుసంధానించడానికి డిజిటల్ మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 6 లక్షల గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్‌తో కలుపుతున్నాం’’ అని తెలిపారు. 5జీ టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రాబోతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. సిక్కులపై ప్రధాని ప్రశంసలు న్యూఢిల్లీ: విదేశాలతో బంధాల బలోపేతానికి సిక్కు వర్గీయులు అనుసంధానంగా ఉన్నారంటూ మోదీ కొనియాడారు. ఇందుకు యావత్ దేశం గర్వపడుతోందన్నారు. సిక్కు ప్రతినిధి బృందానికి శుక్రవారం తన నివాసంలో ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా ఎర్ర తలపాగా చుట్టుకొని ఆకర్షించారు. -
అమెరికా సంచలన నిర్ణయం..! చైనాకు చావు దెబ్బే..?
చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. సెమికండక్టర్ విభాగంలో డ్రాగన్ కంట్రీను ఢీ కొట్టేందుకుగాను అమెరికా ఒక సెమీకండక్టర్ పరిశ్రమ కూటమిని ఏర్పాటుచేసేందుకు పావులను కదుపుతోంది. 4 దేశాల సెమీకండక్టర్ కూటమి..! అమెరికా, తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ దేశాలతో సెమీకండక్టర్ పరిశ్రమ కూటమిని ఏర్పరచాలని అమెరికా ప్రతిపాదించినట్లు సమాచారం. సెమికండక్టర్ పరిశ్రమలో ఆధిపత్యాన్ని చెలాయిస్తోన్న చైనాకు ఆగడాలకు నిరోధించేందుకుగాను అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అమెరికా ప్రతిపాదనపై దక్షిణ కొరియా పూర్తిగా అంగీకరించలేదని తైవాన్ న్యూస్ నివేదించింది. దక్షిణకొరియాకు యూఎస్ సహకారం మొదటి ప్రాధాన్యతగా ఉన్నప్పటీకి, సెమికండక్టర్ వ్యాపారంలో అతి పెద్ద కస్టమర్‌గా చైనా నిలుస్తోండడంతో..అమెరికా నిర్ణయంపై దక్షిణకొరియా తడబడే అవకాశం లేకపోలేదని తైవాన్ న్యూస్ వెల్లడించింది. చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన విదేశీ ఈ-కామర్స్ కంపెనీ... గట్టి కౌంటర్ ఇచ్చిన మీషో..! సెమికండక్టర్ పరిశ్రమలో చైనా హావా..! ప్రపంచంలోని అత్యధిక కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లను చైనా తయారు చేస్తోంది. కాగా ఈ గాడ్జెట్లను నిర్మించేందుకు ఆయా దేశాల సెమికండక్టర్లను దిగుమతి చేసుకుంటుంది. ఇక మరోవైపు దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ తన భారీ మౌలిక సదుపాయాలను చైనాలో కల్గింది. దీంతో దక్షిణకొరియా వెనకడుగు వేసే అవకాశం లేకపోలేదు. ఇక సెమీ కండక్టర్ పరిశ్రమలో అగ్రగణ్యుడుగా ఉన్న తైవాన్ను చైనా తన అధీనంలోకి తీసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అదే జరిగితే..! నాలుగు దేశాలతో సెమికండక్టర్ కూటమిను అమెరికా ఏర్పరిస్తే చైనాకు భారీ నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. ఇక తైవాన్ విషయంలో చైనా అవలంభిస్తోన్నతీరును చెక్ పెట్టవచ్చునని అమెరికా భావిస్తోంది. సెమికండక్టర్ పరిశ్రమలో రారాజు అయ్యేందుకుగాను చైనా తన కుటీల బుద్దిని ప్రదర్శిస్తోంది. తైవాన్‌కు చెందిన వాణిజ్యరహస్యాలను దొంగిలించడం, ఆ దేశ ఉద్యోగులపై గూఢాచర్యం వంటి ఆరోపణలను చైనా ఎదుర్కొంటుంది. ఇప్పటికే తైవాన్ దేశ న్యాయస్థానం చైనాకు చెందిన పలు కంపెనీలను విచారణ కూడా చేసింది. సాంకేతిక ఆవిష్కరణలు, ఆర్థికాభివృద్ధిలో సెమీకండక్టర్లు లేదా 'చిప్స్' ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్స్‌గా నిలుస్తాయి.వీటి విషయంలో ఈ నాలుగు దేశాలు ఒక్కటైతే చైనా ఆగడాలకు చెక్ పెట్టే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ఇది కేవలం అమెరికా చేసిన ప్రతిపాదన మాత్రమే. ఈ నిర్ణయంపై కాలమే సమధానం చెప్పనుంది. చదవండి: భారత్ నుంచి నిష్క్రమణ..యాక్సిస్ బ్యాంకులో విలీనమైన దిగ్గజ బ్యాంకు..! -
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం..భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ,ఎలక్ట్రిక్ కార్ల ధరలు?!
Smartphones And Laptops Become More Expensive: రష్యా - ఉక్రెయిన్ ల యుద్ధం ఇతర ప్రపంచ దేశాలపై వాణిజ్యంపై ప్రభావం పడనుంది. ఆయిల్, నిత్యవసర ధరలతో పాటు ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌లు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు భారీగా పెరగన్నాయని ఆర్ధిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్ -డీజిల్ ధరలు, నిత్యవసర వస్తువుల ధరలు పెరుగనున్నాయని వెలుగులోకి వస్తున్న రిపోర్ట్‌లతో ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. తాజాగా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌ల ధరలు పెరుగుతుండడం సామాన్యులపై మరింత భారం పడనుంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లకు అవసరమైన చిప్సెట్ల కొరత తీవ్రంగా ఉండనుంది. ఎందుకంటే? పలు నివేదికల ప్రకారం..ఉక్రెయిన్ యూఎస్‌కు 90శాతం సెమీకండక్టర్ గ్రేడ్ నియాన్‌ను, సెమీకండక్టర్లను తయారు చేసేందుకు ఉపయోగించే అరుదైన లోహం పల్లాడియంను రష్యా అమెరికాకు 35శాతం ఉత్పత్తి చేస్తుంది. అత్యంత ఖరీదైన పల్లాడియం లోహం రష్యాలో లభ్యం కావడంతో.. యుద్ధం కారణంగా రష్యా పల్లాడియం ధరల్ని పెంచే అవకాశం ఉంది. ప్రపంచ చిప్సెట్ సరఫరాలో రష్యా వాటా 45 శాతం. ఉక్రెయిన్, రష్యా నుండి నియాన్, పల్లాడియం సరఫరా ఆ ప్రభావం సెమీకండక్టర్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇదే విషయంపై జపాన్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఉత్పత్తుల సరఫరా తక్కువగా ఉందని, ఈ పరిస్థితుల్లో యుద్ధం మరింత సంక్షోభం తలెత్తుతుందని జపాన్ చిప్ తయారీదారు తెలిపారు. -
5 కంపెనీలు..రూ.1.53 లక్షల కోట్ల పెట్టుబడులు,1.35లక్షల ఉద్యోగాలు!!
మనదేశంలో 1.53 ట్రిలియన్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్ చిప్, డిస్ప్లే తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఐదు కంపెనీల నుండి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయని కేంద్రం తెలిపింది. వేదాంత ఫాక్స్‌కాన్ జేవీ, ఐజీఎస్ఎస్ వెంచర్స్, ఐఎస్ఎంసీలు 13.6 బిలియన్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్ చిప్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. రూ.76,000 కోట్ల సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ కింద కేంద్రం నుండి 5.6 బిలియన్ల సహాయాన్ని కోరినట్లు కేంద్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. "నెలకు దాదాపు 120,000 వేఫర్ల సామర్థ్యంతో 28 నానోమీటర్ (ఎన్ఎమ్) నుండి 65 ఎన్ఎమ్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లను ఏర్పాటు చేయడానికి దరఖాస్తులు అందాయని తెలిపిన కేంద్రం..28 ఎన్ఎమ్ నుండి 45 ఎన్ఎమ్ వరకు ఉన్న చిప్‌లకు 40 శాతం వరకు, 45 ఎన్ఎమ్ నుండి 65 ఎన్ఎమ్ వేఫర్ల కోసం తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి 30 శాతం వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు హామీ ఇచ్చింది. కాగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన వాటిలో ఉపయోగించే డిస్ప్లే తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని వేదాంత, ఎలెస్ట్ సంస్థలు ప్రతిపాదించాయి. 6.7 బిలియన్ల అంచనా పెట్టుబడితో. భారత్‌లో డిస్ప్లే ఫ్యాబ్‌ల ఏర్పాటు కోసం కేంద్రం నుంచి 2.7 బిలియన్ డాలర్ల మద్దతు కోరినట్లు ఆ ప్రకటన తెలిపింది. ఎలక్ట్రానిక్ చిప్,డిస్ప్లే ప్లాంట్లు కాకుండా 4 కంపెనీలు ఎస్‌పీఈఎల్ సెమీకండక్టర్,హెచ్‌సీఎల్, సిర్మా టెక్నాలజీ, వాలెంకని ఎలక్ట్రానిక్స్ సంస్థలు సెమీకండక్టర్ ప్యాకేజింగ్ కోసం నమోదు చేసుకున్నాయి. రట్టోన్షా ఇంటర్నేషనల్ రెక్టిఫైయర్ సైతం సెమీకండక్టర్ల కోసం నమోదు చేసుకుంది. మూడు కంపెనీలు టెర్మినస్ సర్క్యూట్స్, ట్రిస్పేస్ టెక్నాలజీస్, క్యూరీ మైక్రో ఎలక్ట్రానిక్స్ లు డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద దరఖాస్తులను సమర్పించాయి. కాగా, క్యాబినెట్ ఆమోదించిన సెమీకండక్టర్లకు ప్రోత్సాహక పథకం కింద వచ్చే నాలుగేళ్లలో దాదాపు రూ.1.7 ట్రిలియన్ల పెట్టుబడులు,1.35 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. -
ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీ కోసం వేదాంత గ్రూపు భారీగా పెట్టుబడులు..!
మన దేశంలో ఎలక్ట్రానిక్ చిప్స్ తయారు చేయడం కోసం వేదాంత గ్రూపు 15 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే, ఈ పెట్టుబడిని 20 బిలియన్ డాలర్లకు పెంచాలని యోచిస్తున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వేదాంత గ్రూపుకు చెందిన అవన్ స్ట్రేట్ సంస్థ 2025 నాటికి భారతీయ తయారీ ప్లాంట్ల నుంచి ఎలక్ట్రానిక్ చిప్స్ & డిస్ప్లేలను విడుదల చేయాలని ఆశిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. "సెమీకండక్టర్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాపారం. మేము డిస్ప్లే తయారీ రంగంలో సుమారు 10 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాము. ప్రస్తుతం మేము ఈ సెమీకండక్టర్ రంగంలో 7 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నాము, ఆ తర్వాత ప్లాంట్ విస్తరణలో భాగంగా ఈ పెట్టుబడి మరో 3 బిలియన్ డాలర్లు కూడా పెరగవచ్చు. మొదటి 10 సంవత్సరాల మేము 15 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాము. తదుపరి దశలో మరిన్ని పెట్టుబడులను పెడుతాము" అని అవన్ స్ట్రేట్ మేనేజింగ్ డైరెక్టర్ అకర్ష్ హెబ్బర్ చెప్పారు. సెమీకండక్టర్ ప్లాంట్ & డిస్ప్లే తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి అవన్ స్ట్రేట్ ఇప్పటికే దరఖాస్తు చేసింది. భారతదేశంలో సెమీకండక్టర్ల తయారు కోసం జాయింట్ వెంచర్ కింద కంపెనీని ఏర్పాటు చేయడానికి వేదాంత గ్రూప్, ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీ సంస్థలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం 10 బిలియన్ డాలర్ల(రూ.76,000 కోట్లు) పథకాన్ని ప్రకటించిన తర్వాత సెమీకండక్టర్ తయారీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించిన సంస్థలలో మొదటి సంస్థ వేదాంత గ్రూప్. (చదవండి: ఎన్ఎస్ఈ కేసులో చిత్రా రామకృష్ణకు లుక్ఔట్ నోటీసులు..!) -
సెమీకండక్టర్ల కొరత.. భారీగా పడిపోయిన కార్ల అమ్మకాలు!
సెమీకండక్టర్ల కొరత కారణంగా కార్ల తయారీ కంపెనీలు డిసెంబర్ 2021 నాటికి 7 లక్షల కార్లను సమయానికి అందించలేక పోయినట్లు నేడు కేంద్రం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వే 2021-22 తెలిపింది. సరఫరాలో ఆలస్యం కారణంగా 2021లో వాహన డెలివరీ సగటు సమయం(ఆర్డర్ తేదీ నుంచి డెలివరీ చేయడానికి గల మధ్య అంతరం) సుమారు 14 వారాలుకు చేరుకున్నట్లు తెలిపింది. ఈ ఎకనామిక్ సర్వే 2021-22లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేసింది. 2021 డిసెంబరులో కార్ల తయారీదారులు దేశీయ మార్కెట్లో 2,19,421 ప్యాసింజర్ వాహనాలను విక్రయించారని, ఇది 2020తో పోలిస్తే అమ్మకాలు 13% తగ్గిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్(సీఐఏఎమ్) నివేదించింది. దేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఎకనామిక్ సర్వే తెలిపింది. సెమీకండక్టర్, డిస్ ప్లే తయారీ రంగాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.76,000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సెమీకండక్టర్ల కొరతకు కారణమవుతున్న సమయంలో ఈ పరిశ్రమను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వ జోక్యం చేసుకోవాల్సి వచ్చినట్లు సర్వే తెలిపింది. సరఫరా గొలుసుల్లో విచ్ఛిన్నం కారణంగా అనేక విభిన్న పరిశ్రమలకు చెందిన కంపెనీలు ఉత్పత్తిని తగ్గించడం లేదా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు నివేదిక తెలిపింది. (చదవండి: దేశంలోనే తొలి 3డీ గృహం.. 21 రోజుల్లో నిర్మాణం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తి!) -
ఒకపక్క దిగ్గజాల ఏడుపు.. మరోపక్క ఎన్నడూ లేనంతగా కాసుల వర్షం!
Chip Shortage Still Record Level Business In 2021: చిప్ కొరత.. ఇది ఒక్క కంపెనీ సమస్య కాదు. మొత్తం గ్లోబల్ ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్య వల్లే ప్రొడక్టివిటీ బాగా తగ్గింది. పైగా టెస్లా లాంటి తోపు కంపెనీలు తాము కొత్త మోడల్స్‌ను తేలేకపోతున్నామంటూ ప్రకటనలు సైతం ఇచ్చుకుంటోంది. మరి అంత పెద్ద సమస్య.. ఊహకందని రేంజ్లో బిజినెస్ చేసిందంటే నమ్ముతారా?.. చిప్ కొరత(సెమీ కండక్లర్ల కొరత).. గత ఏడాది కాలంగా సెల్‌ఫోన్, ఆటోమొబైల్స్ రంగంలో ప్రముఖంగా వినిపిస్తున్న పదం. దీనిని వంకగా చూపిస్తూనే వాహనాలు, మొబైల్స్ రేట్లు నేలకు దిగడం లేదు. పైగా పోను పోనూ మరింత పెంచుకుంటూ పోతున్నాయి కంపెనీలు. ఈ తరుణంలో కిందటి ఏడాది సెమీకండక్టర్ సెక్టార్ చేసిన బిజినెస్ ఎంతో తెలుసా? అక్షరాల 583.5 బిలియన్ డాలర్లు. అవును.. సెమీకండక్టర్ సెక్టార్లో ఒక ఏడాదిలో ఇన్నేళ్లలో ఈ రేంజ్లో భారీ బిజినెస్.. అదీ 500 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటడం ఇదే ఫస్ట్‌టైం. ఈ మేరకు సోమవారం వెలువడిన గార్ట్నర్ నివేదిక సెమీకండక్టర్ బిజినెస్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ► 2018 నుంచి శాంసంగ్-ఇంటెల్ మధ్య చిప్ బిజినెస్‌లో పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో.. మూడేళ్ల తర్వాత శాంసంగ్ ఇంటెల్‌కు రాజేసి మొదటి పొజిషన్‌ను ఆక్రమించుకుంది. ఓవరాల్ మార్కెట్లో ఒక్కసారిగా 34.2 శాతం రెవెన్యూను శాంసంగ్ పెంచుకోవడం గమనార్హం. ► ఇంటెల్‌కు కేవలం 0.5 శాతం పెంచుకుని.. టాప్ 25 కంపెనీల్లో అతితక్కువ గ్రోత్ రేట్ సాధించిన కంపెనీగా పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ► 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకున్నప్పటికీ.. సెమీకండక్టర్ సప్లయ్ చెయిన్ కొరత.. ప్రత్యేకించి ఆటోమోటివ్ పరిశ్రమలో వీటి కొరత స్పష్టంగా కనిపించింది. ► ఫలితంగా బలమైన డిమాండ్, లాజిస్టిక్స్, ముడిసరుకు ధరల కలయిక సెమీకండక్టర్ల సగటు అమ్మకపు ధరను (ASP) ఒక్కసారిగా పెంచేసిందని, చిప్ కొరత-స్ట్రాంగ్ డిమాండ్ 2021లో మొత్తం ఆదాయ వృద్ధికి దోహదపడిందని గార్ట్నర్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ నార్వుడ్ చెప్తున్నారు. ► రిమోట్ వర్కింగ్, లెర్నింగ్, ఎంటర్టైన్మెంట్ అవసరాలను తీర్చడానికి హైపర్‌స్కేల్ క్లౌడ్ ప్రొవైడర్ల ద్వారా పెరిగిన సర్వర్ డిప్లాయ్‌మెంట్‌ల కారణంగా, అలాగే PCలు, అల్ట్రా మొబైల్స్ కోసం ఎండ్-మార్కెట్ డిమాండ్ పెరగడం వల్ల ‘మెమరీ’ మళ్లీ అత్యుత్తమ పనితీరును కనబరుస్తోంది. ► 2020లో ఆదాయం కంటే 42.1 బిలియన్లు డాలర్లు పెరగ్గా.., ఇది 2021లో మొత్తం సెమీకండక్టర్ మొత్తం ఆదాయ వృద్ధిలో 33.8 శాతం కావడం కొసమెరుపు. ► మెమరీతో పాటు డ్రామ్(DRAM) కూడా 2021 ఆదాయం పెరగడంతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. 40.4 శాతం రాబడి వృద్ధితో.. 2021లో 92.5 బిలియన్ డాలర్ల ఆదాయం తీసుకొచ్చింది. సర్వర్స్, పీసీల నుంచి బలమైన డిమాండ్ కారణంగా డ్రామ్ డబుల్ డిజిట్‌కు చేరుకోగలిగింది. ► 2021లో 555 మిలియన్ల యూనిట్ల 5జీ స్మార్ట్ఫోన్లు ఉత్పత్తి అయ్యాయి. 2020లో ఇది కేవలం 250 మిలియన్ యూనిట్లుగా మాత్రమే ఉంది. ఈ లెక్కన 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కూడా సెమీకండక్టర్ రెవెన్యూ గణనీయంగా పెరగడానికి కారణమైంది. ► హవాయ్ మీద అమెరికా విధించిన ఆంక్షలు కూడా ఒక కారణమైంది. చైనా యేతర కంపెనీలకు కాసుల పంట పండించింది. హువాయ్ చిప్ సబ్సిడరీ.. 2020లో 8.2 బిలియన్ డాలర్ల బిజినెస్ చేయగా.. 2021లో కేవలం ఒక బిలియన్డాలర్ల బిజినెస్ చేయడం గమనార్హం. చదవండి: లాభాల్లో కింగూ.. అయినా ఇలాంటి నిర్ణయమా? రీజన్ ఏంటంటే.. -
హైదరాబాద్‌లో మరో దిగ్గజ కంపెనీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు
దాదాపు వందకు పైగా పేటెంట్లు కలిగి, కొన్ని దశాబ్దాలుగా ఐటీ పరిశ్రమలో మేటిగా ఉన్న సెరీమోర్ఫిక్ సంస్థ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్(ఎంఎల్), హై పవర్ కంప్యూటింగ్(హెచ్పీసీ), ఆటోమోటివ్ ప్రాసెసింగ్, డ్రగ్ డిస్కవరీ, మెటావర్స్ ప్రాసెసింగ్... వీటన్నింటికీ అనువుగా ఉండే పూర్తిస్థాయి సిలికాన్ సిస్టమ్‌ను అందించే ప్రణాళికలో ఉన్నట్లు ప్రకటించింది. అత్యాధునిక సిలికాన్ జామెట్రీ(టీఎస్ఎంసీ 5ఎన్ఎం నోడ్)తో డిజైన్ చేసిన ఈ కొత్త ఆర్కిటెక్చర్ ను సెరీమోర్ఫిక్ రూపొందించింది. కొత్తతరంలోని హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సమస్యలను పరిష్కరించి, ఎక్కువ డిమాండు ఉన్న మార్కెట్ సెగ్మెంట్లకు సేవలందించేందుకు దీన్ని రూపొందించారు. ఒక అల్ట్రాలో పవర్ ట్రైనింగ్ సూపర్ కంప్యూటింగ్ చిప్ డిజైన్ చేసేందుకు ఇక్కడి బృందం తమ నైపుణ్యాన్ని, పేటెంటెడ్ టెక్నాలజీని ఉపయోగించి కష్టపడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సెమికండక్టర్ పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను పరిష్కరించాలనే నిబద్దతకు సెరీమోర్ఫిక్ వేసిన ముందడుగు మరో నిదర్శనం. ఇంకా, చిప్ తయారీ కోసం మొత్తం పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, ఈ విభాగాన్ని మరింత అనుకూలంగా చేయడానికి భారత ప్రభుత్వం ఇటీవల చేసిన పరిణామాలతో, భారతీయ సెమీకండక్టర్ మార్కెట్ ను పెంచడంలో సహాయపడటానికి వివిధ సంస్థలతో కలిసి పనిచేయడానికి ఈ సమయం సరైనది. సెమీకండక్టర్ డిజైన్‌లో ఉత్తమ ప్రతిభకు భారతదేశం నిలయం కావడంతో ఇది శుభశకునం అవుతుంది. హైదరాబాద్‌లోని సెరీమోర్ఫిక్ ఇండియా డెవలప్ మెంట్ సెంటర్ భారతదేశాన్ని తదుపరి గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మార్చడంలో ఒక అడుగు ముందుకు వేసింది. సెరీమోర్ఫిక్ ప్రస్తుతం 150 మందికి ఉపాధి కల్పిస్తోంది. 2024 చివరి నాటికి, తన హైదరాబాద్ డెవలప్ మెంట్ సెంటర్ ద్వారా 400 మందికి ఉపాధి కల్పించాలని యోచిస్తోంది. సెరీమోర్ఫిక్ను 2020 ఏప్రిల్ నెలలో రెడ్ పైన్ సిగ్నల్స్ వ్యవస్థాపక సీఈఓ, ఇండస్ట్రీ పెద్ద డాక్టర్ వెంకట్ మట్టెల స్థాపించారు. ఇది తన వైర్ లెస్ ఆస్తులను సిలికాన్ ల్యాబ్స్, ఇంక్ కు 2020 మార్చిలో 308 మిలియన్ డాలర్లకు, విక్రయించింది. ఆయన నాయకత్వంలో రెడ్ పైన్ సిగ్నల్స్ లోని బృందం పురోగామి ఆవిష్కరణలు, పరిశ్రమలో తొలిసారి ఉత్తమ ఉత్పత్తులను అందించింది. వీటిద్వారా అల్ఞా-లోపవర్ వైర్లెస్ సొల్యూషన్ అభివృద్ధికి అడుగులు పడ్డాయి. అవి అప్పటికే పరిశ్రమలోని పెద్ద సంస్థల నుంచి వచ్చిన ఉత్పత్తుల కంటే ఇంధనాన్ని 26 రెట్లు తక్కువగా వినియోగించుకుని, వాటన్నింటినీ తోసిరాజైంది. (చదవండి: కొత్త ఓటర్లకు భారత ఎన్నికల సంఘం శుభవార్త..!) -
చైనాకు కోలుకోని దెబ్బ, శరవేగంగా కేంద్రం కీలక నిర్ణయాలు!!
దేశంలో సెమీకండక్టర్ల తయారీలో కేంద్రం వడివడి అడుగులు వేస్తుంది. చైనా కోలుకోలేని విధంగా షాకిస్తూ కేంద్రం మరో రెండేళ్ల తర్వాత దేశంలో చిప్‌లు తయారయ్యే దిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దేశీయ టెక్ కంపెనీలు వేలకోట్లు పెట్టుబడులు పెట్టేలా కేంద్రం ప్రోత్సహిస్తుంది. కేంద్రం దేశీయంగా సెమీకండెక్టర్లు, డిస్ప్లే తయారీకి రూ.76వేల కోట్ల విలువైన ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకానికి ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంలో భాగంగా సెమీకండక్టర్ల తయారీ కోసం దేశీయ టెక్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూకడుతున్నాయి. మొబైల్ హ్యాండ్సెట్స్ మొదలుకుని ఆటోమొబైల్స్ దాకా అనేక ఉత్పత్తుల్లో సెమీ కండక్టర్లు(చిప్) కీలకంగా ఉంటున్నాయి. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, వాషింగ్ మెషీన్ల వంటి అనేక ఉత్పత్తుల్లో వీటిని వినియోగిస్తున్నారు. ఎక్కువ శాతం ఈ చిప్‌లు విదేశీ కంపెనీలు తయారు చేస్తుంటే..వాటిని కొనుగోలు చేస్తున్నాం. అయితే ఇకపై అలాంటి సమస్య లేకుండా కేంద్రం పీల్ఐ స్కీం అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా కేంద్రం ప్రపంచ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీలో 10% వాటా లక్ష్యంగా పెట్టుకుంది.సెమీకండక్టర్లలో రూ.90వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. చిప్ కొరత సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చిప్ ఉత్పత్తి తయారీ సంస్థలతో మాట్లాడుతోందని ఐటీ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. ఇక దేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తి విషయానికొస్తే మరో రెండేళ్ల తర్వాత సాధ్యమవుతుంది" అని గౌర్ చెప్పారు. అంతేకాదు ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐ స్కీమ్‌లో హెచ్‌పీ, డెల్, యాక్సర్ వంటి టెక్ సంస్థలు వేల పెట్టుబడులు పెట్టనున్నాయని గౌర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. చైనాకు గట్టి ఎదురుదెబ్బ! చిప్స్ కొరత సమస్య భారతదేశంలోని ఆటో, స్మార్ట్ ఫోన్, వైట్ గూడ్స్ పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రభావితం చేసింది. సెమీకండక్టర్ తయారీదారులను ఆకర్షించడానికి అమెరికా వంటి దేశాలు భారీ సబ్సిడీలను నిలిపివేయడంతో భారతదేశం వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చీప్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగలనున్నట్లు నిపుణులు అంటున్నారు. కొరియన్ దిగ్గజం శామ్ సంగ్ ఇటీవల అమెరికాలోని టెక్సాస్ లో 17 బిలియన్ డాలర్ల చిప్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చదవండి: మీరు ఈ టెక్నాలజీలో ఎక్స్‌పర్టా? అయితే మీకు జాబులే జాబులు!! -
భారత్‌కు రానున్న అమెరికన్ దిగ్గజ కంపెనీ..!
అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ భారత్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిప్సెట్ మేకర్ ఇంటెల్ భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమాన్ని బలోపేతం చేస్తూ...సెమికండక్టర్స్ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు తయారీని కూడా పెంచే సెమీకండక్టర్లపై ఇటీవల కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎస్ ఆధారిత చిప్సెట్ దిగ్గజం ఒక ప్రకటనను చేసింది. వెల్ కమ్ టూ ఇండియా..! దేశీయంగా సెమీకండక్టర్ పరిశ్రమ విస్తరణకు, దిగుమతులను తగ్గించి, స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో కేంద్ర సర్కారు ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రణధీర్ ఠాకూర్ ట్విటర్లో అభినందించారు. సెమీకండక్టర్ డిజైన్, తయారీకి భారత్ ప్రోత్సాహకాలు ప్రకటించడం, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ హబ్ గా చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు భారత ప్రభుత్వానికి, అశ్విని వైష్ణవ్ కు అభినందనలు. సరఫరా చైన్ లో భాగమైన.. నైపుణ్యం, డిజైన్, తయారీ, టెస్ట్, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ ఇలా అన్ని అంశాల కలయికల ప్రణాళికలు చూసి సంతోషిస్తున్నామని రణధీర్ ఠాకూర్ ట్వీట్లో వెల్లడించారు. దీనికి జవాబుగా ‘ఇంటెల్-వెల్ కమ్ టు ఇండియా’ అంటూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. చైనా, తైవాన్లపైనే ఆధారం..! చిప్స్ తయారీ విషయంలో భారత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు చైనా, తైవాన్ దేశాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పటి వరకు దేశీయంగా సెమీకండక్టర్ల తయారీ యూనిట్లు ఏర్పాటు కాలేదు. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఊపందుకున్నాయి. వీటికి చేయూతగా చిప్స్ తయారీ కేంద్రాలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. భారత్ గ్లోబల్ హబ్‌గా.. చిప్ తయారీలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్దం చేసింది. అందులో భాగంగా గత వారం దిగ్గజ చిప్ కంపెనీలను ఆకర్షించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం రూ. 76,000 కోట్ల పథకాన్ని ఆమోదించింది. దీంతో భారత్‌లో సెమీకండక్టర్, డిస్ప్లే తయారీని పెంచడానికి ఊతమిచ్చినట్లూ ఉంటుందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో స్వావలంబన సాధించడం, భారీ పెట్టుబడులు తీసుకురావడం, లక్ష మందికి పరోక్ష ఉపాధితో పాటు 35,000 ప్రత్యేక ఉద్యోగాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ భారీ ప్రణాళిక కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసిందని, కాంపౌండ్ సెమీకండక్టర్ యూనిట్లు, డిజైన్, ప్యాకేజింగ్ కంపెనీలు వచ్చే 3-4 నెలల్లో ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నట్లు వైష్ణవ్ తెలిపారు. Intel - welcome to India. https://t.co/1Wy90HfAjy — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 28, 2021 చదవండి: మోదీ ప్రభుత్వం భారీ స్కెచ్..! వచ్చే మూడేళ్లలో..! -
ఎలక్ట్రిక్ వాహనకొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్..!
మీరు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేయాలని చూస్తున్నారా..! అయితే వెంటనే కొనేయండి..అది కూడా 2021లో కొంటేనే బాగుంటుంది. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సంప్రాదాయ వాహనాలతో పాటుగా ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు అమాంతం పెరిగేలా కన్పిస్తోంది. చిప్స్ తెచ్చిన చిచ్చు...! కరోనా-19 రాకతో ప్రపంచదేశాలు లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా పరిశ్రమల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. కరోనా ఉదృతి కాస్త నెమ్మదించడంతో పరిశ్రమలు మళ్లీ తిరిగి మొదలయ్యాయి. కరోనా-19 ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ కంపెనీలకు భారీ దెబ్బ తగిలింది. చిప్స్ కొరత భారత కంపెనీలపై కూడా పడింది. సెమికండక్టర్స్ (చిప్స్) కొరతతో ఉత్పత్తి రేటు పడిపోయింది. డిమాండ్-సప్లైకు అనువుగా ఆయా కంపెనీలు వాహనాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అధిక ద్రవ్యోల్భణం, ముడి సరుకుల ధరలు అధికమవ్వడంతో ధరలు పెంపు అనివార్యమైందని ఆయా ఆటోమొబైల్ కంపెనీలు వెల్లడించాయి. దీంతో వచ్చే ఏడాది నుంచి వాహనాల ధరలు భారీగా పెరగనున్నాయి. వీటితో పాటుగా వచ్చే ఏడాది నుంచి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా పెరిగే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ధరల పెరుగుదలకు కారణాలు ఇవే..! ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు చిప్స్ కొరతను ఎదుర్కొంటున్నాయి. వీటితో పాటుగా ఆయా తయారీ సంస్థలకు బ్యాటరీల తయారీ కూడా పెను సవాలుగా మారినట్లు తెలుస్తోంది. లిథియం-అయాన్ బ్యాటరీల కొరతను ఎదుర్కొంటున్నాయి. బ్యాటరీల తయారీలో వాడే ప్రధాన లోహాలైన లిథియం, నికెల్, కోబాల్ట్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. దాంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా సప్లై చైయిన్ రంగాల్లోని సమస్యలు కూడా ఈవీ వాహనాల ధరలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. 2021 ప్రారంభం నుంచి..! 2021 ప్రారంభం నుంచి ప్రతి త్రైమాసికంలో బ్యాటరీ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఒక ‘సెల్’ల ధర గరిష్టంగా 30 శాతం పెరిగింది. బ్యాటరీల తయారీకయ్యే ఖర్చులో 70 శాతం సెల్స్ కోసమే. ప్రపంచవ్యాప్తంగా ఆయా బ్యాటరీలకు వాడే ముడి పదార్థాలను కాంగో నుంచే సరఫరా అవుతున్నాయి. కరోనా రాకతో అక్కడి గనుల్లో కార్యకలాపాలు నెమ్మదించాయి. దీంతో 2022లో ఒక్క కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ధర 2.3 శాతం పెరిగి 135 డాలర్ల(సుమారు ధర రూ. 10,000పైగా )కు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఆయా కంపెనీలు బ్యాటరీ కొరత కారణంగా రీసైక్లింగ్‌పై దృష్టిసారించాయి. ఇది కాస్తమేరకు ఊపశమనం కల్పించేలా కన్పిస్తున్నాయి. ధరల పెరుగుదల అనివార్యం..! వచ్చే ఏడాది నుంచి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని గతంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం స్టెల్లాంటిస్ ఎన్.వి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్లోస్ టావరెస్ ఎలక్ట్రిక్ వాహన రంగంపై రాయిటర్స్ నెక్ట్స్ కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి ఆటోమేకర్లపై పడుతున్న బాహ్య ఒత్తిడి వల్ల భవిష్యత్ లో ఈవీ వాహనాల ధరలు పెరగడంతో పాటు, ఉద్యోగాలు కూడా కోల్పోయే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయా కంపెనీలకు పెట్రోల్, డీజిల్ వాహనాల ధరలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి 50 శాతం అధిక ఖర్చు అవుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో కచ్చితంగా పెరిగిన ఖర్చు ఎలక్ట్రిక్ వాహనాల ధరల పెంపుకు అనివార్యమని అన్నారు. చదవండి: కోవిడ్ ఎఫెక్ట్, భారీగా పెరగనున్న ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు -
మోదీ ప్రభుత్వం భారీ స్కెచ్..! వచ్చే మూడేళ్లలో..!
నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో భారీ ప్రణాళికకు సిద్దమైంది. వచ్చే రెండు మూడేళ్లలో భారత్‌ను సెమికండక్టర్ చిప్స్ తయారీ కేంద్రంగా మలిచే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. వచ్చే మూడేళ్లలో డజను పైగా... రాబోయే 2-3 సంవత్సరాలలో కనీసం డజను సెమీకండక్టర్ తయారీ కర్మాగారాలను భారత్‌లో స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోందని కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం బ్లూమ్‌బెర్గ్‌తో అన్నారు. చిప్‌ల తయారీ పరిశ్రమ కోసం అందుకు అనువైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. భారత్ గ్లోబల్ హబ్‌గా.. చిప్ తయారీలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్దం చేసింది. అందులో భాగంగా గత వారం దిగ్గజ చిప్ కంపెనీలను ఆకర్షించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం రూ. 76,000 కోట్ల పథకాన్ని ఆమోదించింది. దీంతో భారత్‌లో సెమీకండక్టర్, డిస్ప్లే తయారీని పెంచడానికి ఊతమిచ్చినట్లూ ఉంటుందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో స్వావలంబన సాధించడం, భారీ పెట్టుబడులు తీసుకురావడం, లక్ష మందికి పరోక్ష ఉపాధితో పాటు 35,000 ప్రత్యేక ఉద్యోగాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ భారీ ప్రణాళిక కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసిందని, కాంపౌండ్ సెమీకండక్టర్ యూనిట్లు, డిజైన్, ప్యాకేజింగ్ కంపెనీలు వచ్చే 3-4 నెలల్లో ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నట్లు వైష్ణవ్ తెలిపారు. కోవిడ్-19 రాకతో వెంటాడిన సమస్య..! ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 రాకతో పలు దేశాల్లో తీవ్రమైన చిప్ కొరత ఏర్పడింది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను చిప్స్ కొరత అనూహ్యమైన దెబ్బ తీశాయి. వచ్చే ఏడాది చివరి వరకు చిప్ కొరత ఉండే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలు కొంటె భారీగా పన్ను మినహాయింపు.. ఎంతో తెలుసా? -
హిప్.. చిప్.. భారత్!
న్యూఢిల్లీ: భారత్‌ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా మలిచే లక్ష్యంతో కేంద్ర సర్కారు మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సెమీ కండక్టర్ల తయారీ (చిప్‌లు), డిస్ప్లే తయారీ ఎకోసిస్టమ్‌కు రూ.76,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా స్వీయ సమృద్ధి సాధించడమే కాకుండా, చైనా మార్కెట్‌పై ఆధారపడడం తగ్గుతుందని కేంద్ర సర్కారు భావిస్తోంది. సెమీ కండక్టర్లు, డిస్ప్లే తయారీ, డిజైన్ కంపెనీలకు అంతర్జాతీయంగా ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ఈ పథకం కింద అందించడం వల్ల.. ఎలక్ట్రానిక్స్ తయారీలో కొత్త శకానికి దారితీస్తుందని కేంద్రం పేర్కొంది. కేబినెట్ సమావేశం వివరాలను ఐటీ, టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిత్య జీవితంలో ఎలక్ట్రానిక్స్ ముఖ్య పాత్ర పోషిస్తుంటే.. ఎలక్ట్రానిక్స్ తయారీలో సెమీ కండక్టర్లకు కీలక పాత్ర ఉందన్నారు. లక్ష్యాలు..: మూలధన, సాంకేతిక సహకారాన్ని ఈ పథకం కింద కంపెనీలు పొందొచ్చు. అర్హులైన దరఖాస్తులకు ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం నిధుల సహకారాన్ని ప్రభుత్వం అందించనుంది. సిలికాన్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు, డిస్ప్లే ఫ్యాబ్‌లు, కాంపౌండ్ సెమీకండక్టర్లు, సిలికాన్ ఫోటోనిక్స్, సెన్సార్ ఫ్యాబ్‌లు, సెమీకండక్టర్ ప్యాకేజింగ్, సెమీ కండక్టర్ డిజైన్లకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాల (భూమి, నీరు, విద్యుత్తు, రవాణా, పరిశోధన సదుపాయాలు) ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి కేంద్రం పనిచేయనుంది. కనీసం రెండు గ్రీన్‌ఫీల్డ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్‌లు, రెండు డిస్ప్లే ఫ్యాబ్‌లను ఏర్పాటు చేయాలన్నది కేంద్రం లక్ష్యంగా ఉంది. ఈ ప్రతిపాదిత పథకం కింద కనీసం 15 కాంపౌండ్ సెమీకండక్టర్లు, సెమీకండక్టర్ల ప్యాకేజింగ్ యూనిట్లు ఏర్పాటవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. డిజైన్ అనుసంధాన ప్రోత్సాహక పథకం (డీఎల్ఐ) కింద ప్రాజెక్టు ఏర్పాటు వ్యయంలో 50 శాతాన్ని ప్రోత్సాహకంగా ప్రభుత్వం సమకూర్చనుంది. అలాగే, ఐదేళ్లపాటు విక్రయాలపై 6–4 శాతం మేర ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. ‘‘దేశీయంగా 100 వరకు సెమీకండక్టర్ డిజైన్ ఫర్ ఇంటెగ్రేటెడ్ సర్క్యూట్స్, చిప్సెట్లు, సిస్టమ్ ఆన్ చిప్స్, సెమీకండక్టర్ డిజైన్ కంపెనీలకు మద్దతు లభించనుంది. వచ్చే ఐదేళ్లలో రూ.1,500 కోట్ల టర్నోవర్ సాధించిన కంపెనీలకు ప్రోత్సాహకాలు లభిస్తాయి’’ అని ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రకటన తెలిపింది. ఈ పరిశ్రమ దీర్ఘకాల వృద్ధికి వీలుగా అంతర్జాతీయ నిపుణులతో సెమీకండక్టర్ మిషన్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. 1.35 లక్షల మందికి ఉపాధి వచ్చే నాలుగేళ్లలో ఈ పథకం కింద దేశంలోకి 1.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.35 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినివైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతానికి దేశంలో 75 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ తయారీ ఆరేళ్లలో 300 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. టాటా గ్రూపు ఇప్పటికే సెమీకండక్టర్ల తయారీలోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించగా.. వేదాంత గ్రూపు సైతం ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తితో ఉంది. రెండు అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ చిప్ తయారీ కంపెనీలు, రెండు డిస్ప్లే తయారీ కంపెనీలు ఒక్కోటీ రూ.30,000–50,000 కోట్ల స్థాయి పెట్టుబడులతో వచ్చే నాలుగేళ్లలో ముందుకు రావచ్చని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ అంచనా వేస్తోంది. ఆవిష్కరణలు, తయారీకి ఊతం: ప్రధాని మోదీ సెమీకండక్టర్లకు సం బంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఈ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకు, తయారీకి ఊతమిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తుందంటూ ప్రధాని ట్వీట్ చేశారు. డిజిటల్ చెల్లింపులకు మరింత మద్దతు న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు ఇప్పటికే గరిష్టాలకు చేరుకోగా.. వీటిని మరింత ప్రోత్సహించాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. యూపీఐ, రూపే డెబిట్ కార్టులతో చేసే చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూ.1,300 కోట్ల పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. వ్యక్తులు వర్తకులకు చేసే డిజిటల్ చెల్లింపులకు అయ్యే వ్యయాలను ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రూపే డెబిట్ కార్డు, భీమ్ యూపీఐతో రూ.2,000 వరకు చెల్లింపులపై అయ్యే వ్యయాలను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. వచ్చే ఏడాది కాలంలో ప్రభత్వం రూ.1,300 కోట్లను ఖర్చు చేయడం వల్ల మరింత మంది డిజిటల్ చెల్లింపులకు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నవంబర్‌లో 7.56 లక్షల కోట్ల విలువైన 423 కోట్ల డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు నమోదైనట్టు వెల్లడించారు. -
చైనాకు గట్టి షాక్!.. కీలక స్కీమ్‌కు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: దేశీయంగా సెమీకండెక్టర్లు, డిస్ప్లే తయారీకి రూ.76 వేల కోట్ల విలువైన ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రి వర్గం పచ్చజెండా ఊపినట్లు అనురాగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ కేంద్రంగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద వచ్చే 6 ఏళ్లలో రూ.76,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. భారత్‌లో సెమీకండెక్టర్ల తయారీకి అవసరమైన వ్యస్థలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పలు రకాల రాయితీలను ఇవ్వనున్నట్లు టెలికాం & ఐటీ మంత్రి అశ్వినీ వైష్నావ్ తెలిపారు. సెమీకండెక్టర్ వేఫర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఏర్పాటుకు అయ్యే మూలధన వ్యయంలో 25శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. అదే విధంగా అసెంబ్లింగ్, ప్యాకింగ్,టెస్టింగ్, చిప్ డిజైన్ వంటి వాటికి ఇటువంటి రాయితీలనే ఇవ్వనున్నారు. కేంద్రం ఈ తీసుకున్న నిర్ణయంతో సెమీకండెక్టర్ల తయారీలో అగ్రగామిగా ఉన్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. కేంద్రా క్యాబినెట్ ఆమోదం తెలపడంతో త్వరలో పాలసీ విధి విధానాలను పూర్తి స్థాయిలో రూపొందించడం, ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం మొదలైన ప్రక్రియను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) ప్రారంభించనుంది. (చదవండి: రూపే డెబిట్ కార్డు, భీమ్ యూపీఐ యూజర్లకు కేంద్రం తీపికబురు!) ఉత్పాదన ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాల ద్వారా దేశీయంగా తయారీ, ఎగుమతుల పరిధిని కేంద్రం గణనీయంగా విస్తరించింది. తాజా సెమీకండక్టర్ విధానంతో దేశీయంగా తయారీ కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ముందుగా డిస్ప్లేల కోసం ఒకటి లేదా రెండు ఫ్యాబ్ యూనిట్లు, అలాగే విడిభాగాల డిజైనింగ్..తయారీ కోసం 10 యూనిట్లు ఏర్పాటవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించాయి. అన్నింటికీ కీలకంగా చిప్.. మొబైల్ హ్యాండ్సెట్స్ మొదలుకుని ఆటోమొబైల్స్ దాకా అనేక ఉత్పత్తుల్లో సెమీ కండక్టర్లు(చిప్) కీలకంగా ఉంటున్నాయి. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, వాషింగ్ మెషీన్ల వంటి అనేక ఉత్పత్తుల్లో వీటిని వినియోగిస్తున్నారు. సాధారణంగా శాంసంగ్, ఎన్ఎక్స్పీ, క్వాల్కామ్ వంటి చిప్ తయారీ సంస్థల కోసం తైవానీస్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్(టీఎంఎస్సీ)లాంటి కంపెనీలు వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇలా తయారైన చిప్‌లను ఆయా కంపెనీలు పరీక్షించి, ప్యాకేజ్‌గా చేసి.. సిస్కో, షావొమీ వంటి పరికరాల ఉత్పత్తి కంపెనీలకు విక్రయిస్తున్నాయి. చిప్‌ల తయారీ ప్లాంట్లను ఫ్యాబ్స్ లేదా ఫౌండ్రీలుగా వ్యవహరిస్తారు. (చదవండి: సర్వీసు చార్జీల పేరుతో ఎస్బీఐ భారీగా వడ్డీంపు..!) -
వాహన విక్రయాలకు చిప్ సెగ
న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ పరిశ్రమను సెమీకండక్టర్ల కొరత వెంటాడుతోంది. చిప్‌ల సమస్య కారణంగా ఉత్పత్తి.. డెలివరీలు దెబ్బతినడంతో నవంబర్‌లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలు 19 శాతం క్షీణించాయి. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ శుక్రవారం ఈ విషయాలు వెల్లడించింది. సియామ్ గణాంకాల ప్రకారం గత నెల డీలర్లకు కార్ల వంటి ప్యాసింజర్ వాహనాల సరఫరా 2,15,626కి పరిమితమైంది. గతేడాది నవంబర్‌లో నమోదైన 2,64,898 యూనిట్లతో పోలిస్తే 19 శాతం క్షీణించింది. అటు ద్విచక్ర వాహన విక్రయాలు ఏకంగా 34 శాతం పడిపోయాయి. 16,00,379 యూనిట్ల నుంచి 10,50,616 యూనిట్లకు తగ్గాయి. మోటర్‌సైకిళ్ల అమ్మకాలు 10,26,705 నుంచి 6,99,949 యూనిట్లకు పడిపోయాయి. స్కూటర్ల విక్రయాలు 5,02,561 యూనిట్ల నుంచి 3,06,899 యూనిట్లకు క్షీణించాయి. ఇక మొత్తం త్రిచక్ర వాహనాల అమ్మకాలు 7 శాతం క్షీణించి 24,071 యూనిట్ల నుంచి 22,471 యూనిట్లకు పరిమితమయ్యాయి. వివిధ కేటగిరీల్లో మొత్తం ఆటోమొబైల్ అమ్మకాలు గత నెల 12,88,759 యూనిట్లకు తగ్గాయి. గతేడాది నవంబర్‌లో ఇవి 18,89,348 యూనిట్లుగా నమోదయ్యాయి. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ అమ్మకాలు 1,35,775 యూనిట్ల నుంచి 1,09,726 యూనిట్లకు పడిపోయాయి. అలాగే హ్యుందాయ్ మోటర్ ఇండియా విక్రయాలు 48,800 నుంచి 37,001 యూనిట్లకు క్షీణించాయి. 7 ఏళ్ల కనిష్టానికి పీవీ విక్రయాలు.. ‘అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత కారణంగా పరిశ్రమ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. పండుగ సీజన్లో కొంతయినా కోలుకోవచ్చని ఆశించింది కానీ ఈ ఏడాది నవంబర్‌లో ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏకంగా ఏడేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు 11 ఏళ్లు, త్రిచక్ర వాహనాల అమ్మకాలు 19 ఏళ్ల కనిష్టాలకు క్షీణించాయి‘ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఉద్యోగుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూనే, సరఫరా వ్యవస్థపరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. -
భారత్ భారీ ప్లాన్.. చైనాకు గట్టి ఎదురుదెబ్బ!
న్యూఢిల్లీ: భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మార్చే ప్రయత్నంలో భాగంగా రాబోయే ఆరేళ్లలో 20 సెమీకండక్టర్ డిజైన్, కాంపోనెంట్ల తయారీ & డిస్ ప్లే ఫ్యాబ్రికేషన్(ఫ్యాబ్) యూనిట్లను ఏర్పాటు చేయడానికి రూ.76,000 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. "వివిధ పీఎల్ఐ(ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక) పథకాల ద్వారా భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు" ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలపినట్లు ఎకనామిక్ టైమ్స్ తెలపింది. క్యాబినెట్ సమావేశం: డిస్ ప్లే ఫ్యాబ్రికేషన్(ఫ్యాబ్) తయారీ కోసం 2 యూనిట్లు, సెమీకండక్టర్ డిజైన్, కాంపోనెంట్ల తయారీ కోసం 20 యూనిట్లు ఏర్పాటు చేయలని చూస్తున్నట్లు ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈ పథకం ఆమోదం కోసం వచ్చే వారం క్యాబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ కేంద్ర క్యాబినెట్ సమావేశం తర్వాత ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ వీధి విధానాలను రూపొందించి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది అని అన్నారు. "దాదాపు అన్ని పరిశ్రమల్లో ఉత్పత్తి లక్ష్యాలను ప్రభావితం చేసే సెమీకండక్టర్ చిప్స్ కొరతతో ప్రపంచం కొట్టుమిట్టాడుతోంది. కార్లు నుంచి టీవీలు, ల్యాప్ టాప్స్, ఈయర్ బడ్స్, వాషింగ్ మెషిన్లు ఇలా ఒకటి అంటే ఇప్పుడు ప్రతి దానిలో సెమీకండక్టర్లను వినియోగిస్తున్నారు. కాబట్టి, ఈ ఎలక్ట్రానిక్ పాలసీ సరైన సమయంలో వస్తోంది" అని ప్రధాన పరిశోధన విశ్లేషకుడు కనిష్కా చౌహాన్ చెప్పారు. (చదవండి: విదేశాలకు చెక్కేస్తున్న దేశ మిలియనీర్లు..!) శామ్ సంగ్, ఎన్ఎక్స్ పి, క్వాల్ కామ్ వంటి చిప్ తయారీదారులతో పాటు తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ(టిఎంఎస్ సి) వంటి కంపెనీలను ఆకర్షించేలా ఈ పాలసీ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం 40% మూలధన సబ్సిడీని ఇచ్చినప్పటికి కంపెనీలను ఆకర్షించడంలో విఫలం అయ్యింది. ముఖ్యంగా, చిప్స్ కొరత సమస్య వల్ల ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బ తింటున్న తరుణంలో కేంద్రం ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. చైనాకు గట్టి ఎదురుదెబ్బ! చిప్స్ కొరత సమస్య భారతదేశంలోని ఆటో, స్మార్ట్ ఫోన్, వైట్ గూడ్స్ పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రభావితం చేసింది. సెమీకండక్టర్ తయారీదారులను ఆకర్షించడానికి అమెరికా వంటి దేశాలు భారీ సబ్సిడీలను నిలిపివేయడంతో భారతదేశం వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చీప్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగలనున్నట్లు నిపుణులు అంటున్నారు. కొరియన్ దిగ్గజం శామ్ సంగ్ ఇటీవల అమెరికాలోని టెక్సాస్ లో 17 బిలియన్ డాలర్ల చిప్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. (చదవండి: అభ్యంతరకర భాష..అడ్డుకోవడమే లక్ష్యం: కూ యాప్) -
చిప్‌ల కొరతతో వాహన డిమాండ్‌కు భారీ దెబ్బ!
న్యూఢిల్లీ: సెమీకండక్టర్లు (చిప్) సరఫరాలో తీవ్ర జాప్యం వల్ల ఉత్పాదన దెబ్బతింటోందని కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. దీనివల్ల కార్ల డిమాండ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతానికైతే మార్కెట్లో డిమాండ్ బాగానే ఉందని, బుకింగ్‌లు కూడా మెరుగ్గానే ఉన్నాయని శ్రీవాస్తవ పేర్కొన్నారు. అయితే, కార్ల లభ్యత సమస్యగా మారిందని, వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా పెరిగిపోయిందని వివరించారు. ‘ఇలా సుదీర్ఘ సమయం పాటు వేచి ఉండాల్సి రావడం వల్ల డిమాండ్ ధోరణులపై ప్రతికూల ప్రభావాలు పడవచ్చేమో అన్న ఆందోళన నెలకొంది‘ అని శ్రీవాస్తవ పేర్కొన్నారు. అయితే, తాము ఎప్పటికప్పుడు కస్టమర్లతో మాట్లాడుతూనే ఉన్నందువల్ల బుకింగ్లేమీ రద్దు కావడం లేదని ఆయన చెప్పారు. ‘పరిస్థితి ఏమిటి, ఎప్పట్లోగా వాహనం అందుకోవచ్చు వంటి విషయాల గురించి ప్రతీ వారం దాదాపు ప్రతీ కస్టమర్‌ను సంప్రదించి, వివరిస్తున్నాం. చాలా మటుకు కస్టమర్లు అర్థం కూడా చేసుకుంటున్నారు‘ అని శ్రీవాస్తవ తెలిపారు. మోడల్, వేరియంట్‌ను బట్టి వెయిటింగ్ పీరియడ్ అనేది కొద్ది వారాలు మొదలుకుని నెలల దాకా ఉంటోంది. ప్రస్తుతం సెమీకండక్టర్ల సరఫరా కాస్త మెరుగుపడుతోందని శ్రీవాస్తవ వివరించారు. మారుతీకి ప్రస్తుతం 2.5 లక్షల యూనిట్ల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. నవంబర్‌లో కంపెనీ ప్లాంట్లు .. ఉత్పత్తి సామర్థ్యాల్లో దాదాపు 80 శాతం మేర పనిచేశాయి. (చదవండి: 900 మంది ఉద్యోగుల తొలగింపుపై హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు!) -
అనుకోని అతిథిలా వచ్చి..! మారుతి సుజుకిపై అనూహ్యమైన దెబ్బేసింది..!
కోవిడ్-19 రాకతో అనుకోని అతిథిలా వచ్చిన చిప్స్(సెమికండక్టర్స్) కొరత ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలకు భారీ నష్టాలనే మిగిల్చాయి. ఆయా కంపెనీల ఉత్పత్తి పడిపోవడంతో అమ్మకాల సంఖ్య భారీగా పడిపోయింది. చిప్స్ కొరతతో సతమతమవుతోన్న కంపెనీలో మారుతీ సుజుకీ కూడా చేరింది. చిప్స్ కొరతతో ఉత్పత్తి అంతంతే..! మారుతీ సుజుకీ ఈ ఏడాది నవంబర్‌లో మొత్తం 1,39,184 యూనిట్లను విక్రయించగా..గత ఏడాది నవంబర్ నెలలో 1,53,223 యూనిట్లను విక్రయించిన్నట్లు మారుతి సుజుకీ ఒక ప్రకటనలో పేర్కొంది. గ్లోబల్ చిప్ కొరత కారణంగా ఉత్పత్తి మందగించడంతో అమ్మకాల్లో 9.16 శాతం తగ్గుదల వచ్చిన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్ నెలలో ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత వాహనాల ఉత్పత్తిపై స్వల్ప ప్రభావం చూపిందని కంపెనీ పేర్కొంది.గత నెలలో జరిగిన మొత్తం అమ్మకాలలో... దేశీయ విక్రయాల సంఖ్య 113,017 యూనిట్లుగా ఉండగా, ఇతర ఓఈఎమ్లకు 4774 యూనిట్లును విక్రయించినట్లు మారుతి సుజుకీ తెలిపింది. చదవండి: దుమ్మురేపిన టాటా మోటార్స్..! కంపెనీకి కాసుల వర్షమే..! మినీ, కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లో...అల్టో, ఎస్ ప్రెసో, బాలెనో, సెలెరియో, డిజైర్, ఈగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వాగనార్ వంటి కార్లపై పలు ఆఫర్లను కలిగి ఉన్న నవంబర్ 2021లో 74,492 యూనిట్లను విక్రయించింది, గత ఏడాది నవంబర్ నెలలో 98,969 యూనిట్లను అమ్మకాలను జరిపింది. మొత్తంగా చూసుకుంటే ప్యాసింజర్ కార్ల విక్రయాలు 100,839 యూనిట్ల నుంచి 75,581 యూనిట్లుగా వరకు క్షీణించాయి. యుటిలిటీ వాహనాల విభాగంలో అమ్మకాలు పరవాలేదనిపించింది. ఎర్టిగా, జిప్సీ, ఎస్-క్రాస్ , విటారా బ్రెజ్జా, ఎక్స్ఎల్ఆర్తో సహా గత నెలలో 24,574 యూనిట్లను విక్రయించింది. మరోవైపు నాన్ కార్గో ప్యాసింజర్ ఈకో వ్యాన్ విక్రయాలు నవంబర్‌లో 9,571 యూనిట్లకు పడిపోయింది. గత ఏడాది క్రితం నవంబర్ నెలలో 11,183 యూనిట్లను మారుతి విక్రయించింది. చదవండి: వినియోగంలో లేని బ్యాంక్ అకౌంట్లు, మగ్గుతున్న రూ.26,697 కోట్లు -
టాటా గ్రూప్ భారీ ప్లాన్.. చైనాకు వేల కోట్ల నష్టం!
దేశంలో సెమీకండక్టర్ల తయారీ కోసం టాటా గ్రూప్ భారీ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చీప్ కొరత ఉంది. ఈ అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని టాటా చూస్తుంది. సెమీకండెక్టర్ల అసెంబ్లీ & టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు కోసం 300 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టడానికి టాటా గ్రూప్ మూడు రాష్ట్రాలతో చర్చలు జరుపుతోందని సమాచారం. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో టాటా గ్రూప్ చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల తెలిపాయి. సెమీకండెక్టర్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నట్లు కొన్నాళ్ల క్రితం టాటా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్చలు గనుక సఫలం అయితే, ఈ 3 రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ సెమీకండక్టర్ అసెంబ్లీ & టెస్టింగ్ (ఓఎస్ఏటీ) ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ ఓఎస్ఏటీ ప్లాంట్‌లో తయారైన సిలికాన్ వేఫర్లను అసెంబ్లింగ్, పరీక్షలు, ప్యాకింగ్ వంటివి చేస్తారు. ఇక్కడే అవి పూర్తి స్థాయి సెమీకండెక్టర్లు రూపొందుతాయి. వచ్చే నెల చివరి నాటికి ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి ప్రదేశాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని కొన్ని వర్గాలు తెలిపాయి. టాటా ఎలక్ట్రానిక్స్ తయారీ ప్రాజెక్టు భారత ప్రధాని నరేంద్ర మోడీ 'మేక్ ఇన్ ఇండియా' డ్రైవ్‌ను బలపరుస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల దక్షిణాసియా దేశాన్ని స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలో రెండవ అతిపెద్ద సెమీకండెక్టర్స్ తయారీదారుగా మార్చడానికి సహాయపడింది. చైనాకు వేల కోట్లలో నష్టం ప్రస్తుతం చైనాలో భారీగా సెమీకండెక్టర్ చిప్స్ తయారు అవుతున్నాయి. ఇక్కడి నుంచి అనేక దేశాలకు చిప్స్ ఎగుమతి అవుతున్నాయి. అయితే, టాటా గ్రూప్ చేపట్టబోయే ప్రాజెక్టు వల్ల చైనాకు వేల కోట్లలో నష్టం కలిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. టాటా ఓఎస్ఏటీ వ్యాపారం కోసం ఇంటెల్, అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్(ఎఎమ్డి), ఎస్ టి మైక్రోఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలతో చర్చలు జరుపుతుంది. ఈ కర్మాగారం వచ్చే ఏడాది చివరలో కార్యకలాపాలను ప్రారంభిస్తుందని, 4,000 మంది కార్మికులను నియమించుకొనున్నట్లు సమాచారం. -
భారత్ దెబ్బకు చైనా భారీగా నష్టపోనుందా?
Semiconductor Manufacturing: కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చైనాకు భారీగా నష్టాలు కలిగించే అవకాశాలు ఉన్నాయా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా సెమీకండక్టర్ చిప్‌ల కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కొరతను అధిగమించడానికి భారత్ ప్రయత్నిస్తుంది. దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి భారతదేశం మెగా మల్టీ-బిలియన్-డాలర్ క్యాపిటల్ సపోర్ట్, ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ ప్లాన్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా చిప్ కొరత కారణంగా అన్నీ రంగాలలోని పరిశ్రమలు భారీ ఉత్పత్తి కోతలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి. టీఓఐ నివేదికప్రకారం, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు దేశంలో సెమీకండక్టర్ల పరిశ్రమలను ఏర్పాటు చేయాలని తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ), ఇంటెల్, ఎఎమ్‌డీ, యునైటెడ్ మైక్రోఎలక్ట్రానిక్స్ కార్ప్, ఫుజిట్సు వంటి కొన్ని అగ్ర సెమీకండక్టర్ తయారీదారులతో చర్చలు జరుపుతున్నారు. సెమీకండక్టర్ తయారీదారులను వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకురావాలనే ప్రధానమంత్రి కార్యాలయం ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. కంపెనీలను దేశంలోకి తీసుకురావడానికి ఆకర్షణీయమైన విధానంతో ముందుకు రావాలని బహుళ మంత్రిత్వ శాఖలు ఆదేశించింది. ప్రత్యేక ప్రోత్సాహకాలు సెమీకండక్టర్ తయారీదారులకు దిగుమతి వస్తువులపై సుంకం రాయితీ ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ & సెమీకండక్టర్(ఎస్ఎసీఎస్), తయారీని ప్రోత్సహించే పిఎల్ఐ స్కీం వంటి పథకాల నుంచి కూడా ప్రభుత్వం అదనపు ప్రయోజనాలను అందించాలని చూస్తుంది. దేశంలో సెమీకండక్టర్లను తయారు చేయకపోవడంతో దేశంలోని డిమాండ్ తీర్చడం కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. భారతదేశంలో సెమీకండక్టర్ల డిమాండ్ 2025 నాటికి ప్రస్తుతం ఉన్న 24 బిలియన్ డాలర్ల నుంచి సుమారు 100 బిలియన్ డాలర్లకు చేరుకొనున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. చైనాకు దెబ్బ సెమీకండక్టర్ తయారీదారులను దేశానికి ఆకర్షించడానికి ఇంతకు ముందు చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, రక్షణ & ఆటో వంటి ఇతర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అవసరాలు కంపెనీలను భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పిస్తుందని ప్రభుత్వం నమ్మకంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆశించిన మేరకు దేశంలో పెట్టుబడులు వస్తే మాత్రం చైనాకు దెబ్బ పడే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ల ఎగుమతి దేశంగా చైనా ఉంది. మన దేశంలో ఏర్పాటు కాబోయే ఈ పరిశ్రమ వల్ల ఆ దేశానికి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. -
ఆపిల్ కొంపముంచిన చిప్స్...!
ప్రపంచవ్యాప్తంగా సెమికండక్టర్స్(చిప్) కొరత పలు కంపెనీలను తీవ్రంగా వేధిస్తోంది. చిప్స్ కొరతతో పలు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. తాజాగా చిప్స్ కొరత ఆపిల్‌ను కూడా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఆపిల్‌కు భారీ దెబ్బ...! గత నెలలో ఆపిల్ ఐఫోన్13 స్మార్ట్ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.కాగా ఇప్పుడు సెమికండక్టర్ కొరత ఐఫోన్13 స్మార్ట్ఫోన్ల తయారీపై పడనుంది. దీంతో ఆపిల్‌కు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. చిప్ కొరతతో సుమారు 10 మిలియన్ల ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లపై తయారీ భారీ ప్రభావం పడనుంది. ఈ ఏడాది చివరినాటికి సుమారు 90 మిలియన్ల ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఉత్పతి చేయాలని ఆపిల్ భావించింది. ఆపిల్ చిప్స్‌ను అందిస్తోన్నబ్రాడ్కామ్, టెక్సాస్ ఇన్స్ట్రూమెంట్స్ చిప్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి.దీంతో ఐఫోన్13 స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిపై భారీ ప్రభావమే చూపనున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. చదవండి: సౌరవ్ గంగూలీపై కోకాకోలా కీలక నిర్ణయం..! ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో పోలిస్తే బెటర్...! ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో పోలిస్తే ఆపిల్‌పై చిప్స్ కొరత ప్రభావం తక్కువగా ఉన్నట్లు ఆపిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. చైనా, తైవాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో కరోనా కారణంగా టెక్ దిగ్గజం ఆపిల్‌తో సహా ఇతర టెక్ కంపెనీలకు అందించే ఫోన్ విడి భాగాల(కాంపోనెంట్స్)పై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో ఊహించిన దానికంటే చిప్ సెట్ల కొరత చాలా ఎక్కువ ఉందని పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. చదవండి: భారత్ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం..! ఇండియన్స్‌తో మామూలుగా ఉండదు..! -
పండుగ సందడికి చిప్‌ల సెగ.. నో డిస్కౌంట్స్?
న్యూఢిల్లీ: పండుగ సీజన్ వస్తోందంటే చాలు ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్, మొబైల్స్ తదితర రంగాల సంస్థలు అమ్మకాలపై ఆశావహ అంచనాలతో ముందు నుంచే కాస్త ఉత్పత్తి పెంచుకుని, విక్రయాలకు సన్నాహాలు చేసుకుంటాయి. అటు కస్టమర్లు కూడా మంచి డిస్కౌంట్లు లభిస్తాయనే అంచనాలతో ఉంటారు. కానీ, కీలకమైన సెమీ కండక్టర్ చిప్‌ల కొరతతో ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. చిప్‌ల సరఫరాలో సమస్యల కారణంగా వివిధ ఉత్పత్తుల తయారీ పడిపోయింది. ఒక్క ఆటోమొబైల్ పరిశ్రమలోనే ఏకంగా 5 లక్షల పైచిలుకు ఆర్డర్లు పేరుకుపోయినట్లు అంచనా. సాధారణంగానైతే పండుగల సీజన్లో భారీ డిస్కౌంట్లు పొందే కొనుగోలుదారులు ప్రస్తుత సందర్భంలో మాత్రం మొబైల్ హ్యాండ్సెట్స్ మొదలుకుని టీవీలు, కార్ల దాకా మరింత ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. డిమాండ్‌కి తగ్గట్లుగా ఉత్పత్తులు అందుబాటులో లేకపోతుండటంతో ఆటోమోటివ్ షోరూమ్‌లలో ఉచిత ఆఫర్లు కనిపించడం లేదు. ‘బుకింగ్స్ లేదా ఎంక్వైరీలను బట్టి చూస్తే డిమాండ్ బాగానే ఉంది. కానీ సెమీకండక్టర్ల సమస్యతో ఈసారి దురదృష్టవశాత్తు సరఫరాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో బుకింగ్స్ పేరుకుపోతున్నాయి .. ఉత్పత్తుల సరఫరా ఆ స్థాయిలో ఉండటం లేదు‘ అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఈడీ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘పరిశ్రమలో 4.5 లక్షల నుంచి 5 లక్షల దాకా పెండింగ్ బుకింగ్‌లు ఉన్నాయని అంచనా. మారుతీ సుజుకీ ఆర్డర్లే దాదాపు 2.15 లక్షల నుంచి 2.2 లక్షల యూనిట్ల దాకా ఉన్నాయి‘ అని ఆయన వివరించారు. గృహోపకరణాల నుంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, కార్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటి తయారీలోను సెమీకండక్టర్ చిప్‌లు కీలకంగా ఉంటున్నాయి. ఆగస్టు నుంచే..: చిప్‌ల కొరత, పెండింగ్ ఆర్డర్ల సమస్య అక్టోబర్‌లో కొత్తగా వచి్చంది కాదని.. ఆగస్టు నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోందని శ్రీవాస్తవ తెలిపారు. సరఫరాపరమైన పరిమితుల కారణంగా ఈసారి డిస్కౌంట్లు, బొనాంజా ఆఫర్లు అంతంత మాత్రంగానే ఉండొచ్చని పేర్కొన్నారు. నవరాత్రులు, దీపావళి వంటి పండుగల సీజన్లో ఒక్కసారిగా పెరిగే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని డీలర్లు సాధారణంగా 40 రోజులకు సరిపడ నిల్వలను అట్టే పెట్టుకుంటూ ఉంటారని.. కానీ ఈసారి ఇది 15 రోజుల కన్నా తక్కువ స్థాయిలోనే ఉందని శ్రీవాస్తవ వివరించారు. గతేడాది అక్టోబర్ 1 నాటికి డీలర్ల దగ్గర స్టాక్ నిల్వలు 3.35 లక్షల యూనిట్లుగా ఉండగా.. ఈసారి అక్టోబర్ 1న ఇది 1.75 లక్షల యూనిట్లకే పరిమితమైనట్లు అంచనా. సెప్టెంబర్ 1న నిల్వలు 2.25 లక్షల యూనిట్లుగా నమోదైయ్యాయి. విడిభాగాల సరఫరాదారులను సెమీ కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో.. ఇంజిన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు, కీ లెస్ ఎంట్రీ, ఏబీఎస్ సిస్టమ్స్ వంటి భాగాల సరఫరా తగ్గిపోయి వాహనాల తయారీ సంస్థలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. (చదవండి: Diwali Offers: స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఎయిర్‌పాడ్స్ ఉచితం...!) ఎల్రక్టానిక్స్ రేట్లకు రెక్కలు... ఇప్పటిదాకానైతే చిప్‌ల కొరత తక్షణ ప్రభావాలు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ సరఫరాపై మరీ ఎక్కువగా లేకపోయినప్పటికీ.. కొత్త సంవత్సరంలో మాత్రం స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని ఎల్రక్టానిక్స్, ఉపకరణాల తయారీ సంస్థల సమాఖ్య సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. చిప్‌ల కొరతతో సరఫరా తగ్గి, అంతిమంగా ఉత్పత్తుల రేట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే ఈ ధోరణి కనిపిస్తోందని, దేశీ మార్కెట్లోను ఇది జరగవచ్చని బ్రగాంజా పేర్కొన్నారు. పండుగ సీజన్ తర్వాత దేశీయంగా తయారీ రంగంపై ప్రభావం కనిపించవచ్చని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ సీనియర్ అనలిస్ట్ ప్రాచిర్ సింగ్ అభిప్రాయపడ్డారు. గత కొన్ని నెలలుగా వివిధ ఉత్పత్తుల ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే కొన్ని త్రైమాసికాల్లో కూడా ఈ ధోరణి కొనసాగవచ్చన్నారు. ధరలను ప్రత్యేకంగా పట్టించుకునే దేశీ మార్కెట్లో విడిభాగాల కొరతతో రేట్లు పెరుగుతూ పోతే .. అంతిమంగా డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని సింగ్ చెప్పారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో టీవీల ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉందని థామ్సన్, కొడక్, బ్లౌపంక్ వంటి బ్రాండ్లను విక్రయించే సూపర్ ప్లాస్ట్రోనిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. రాబోయే త్రైమాసికంలో ఉత్పత్తి 20–30 శాతం మేర మందగించవచ్చని, 2022 ఆఖరు దాకా ఇదే ధోరణి కొనసాగవచ్చని చెప్పారు. సరఫరా పడిపోవడంతో ఉత్పత్తుల రేట్లు పెరుగుతున్నాయన్నారు. గత త్రైమాసికంలోనే హై డెఫినిషన్, ఫుల్ డెఫినిషన్ టీవీల రేట్లు 35 శాతం దాకా పెరిగాయని.. వచ్చే త్రైమాసికంలో మరో 30 శాతం మేర పెరిగే అవకాశం ఉందని మార్వా పేర్కొన్నారు. (చదవండి: మెర్సిడెజ్ బెంజ్.. మేడిన్ ఇండియా.. ధర ఎంతంటే?) -
జియోకు కొత్త చిక్కులు,పెరగనున్న 'జియో నెక్ట్స్' ఫోన్ ధరలు?
సెమీ కండక్టర్ల కొరత రిలయన్స్ జియోకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుందా? ప్రపంచంలో అత్యంత చవకైన 'జియో నెక్ట్స్' ఫోన్ ధర మరింత పెరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంచనా ప్రకారం..ఈ ఫోన్ ధర రూ.5వేలు ఉండగా.. ఫోన్లో తప్పనిసరిగా ఉండాల్సిన సెమీకండక్టర్ ధర పెరగడంతో..ఆ ప్రభావం జియో నెక్ట్స్ ధరపై పడనున్నట్లు తెలుస్తోంది. గూగుల్-జియో ఆధ్వర్యంలో వినాయక చవితికి విడుదల కావాల్సిన జియో ఫోన్..దీపావళికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఫోన్ విడుదల వాయిదా వేయడంతో ధర మరింత పెరగనున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈటి టెలికామ్ రిపోర్ట్ ప్రకారం..ఫోన్లో వినియోగించే సెమీ కండక్టర్లతో సహా వివిధ భాగాలు ( కాంపోనెంట్స్) ధర సుమారు 20శాతం పెరిగింది. పెరిగిన ధరతో సెమీకండక్టర్ల లభ్యత లోటు 8 నుండి 20 వారాల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో పెరిగిన చిప్ ధరలతో జియో ఫోన్ పై ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న ధరకే వచ్చే అవకాశం లేదని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. దీంతో దిపావళికి జియో ఫోన్ విడుదలైనా విస్తృతంగా కాకుండా పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉండన్నుట్లు తెలుస్తోంది.కాగా,ధర పెరుగుదల, పూర్తి స్థాయిలో ఫోన్ అందుబాటులోకి తెస్తుందా? లేదంటే పరిమిత సంఖ్యలోనే విడుదల చేస్తుందా' అన్న ప్రచారంపై జియో స్పందించాల్సి ఉంది. చదవండి : జియోకి పోటీగా విడుదల కానున్న నోకియా బడ్జెట్ ఫోన్ -
చిప్‌ల కొరత, కలవరంలో కార్ల కంపెనీలు
ముంబై:అంతర్జాతీయంగా సెమీకండక్టర్ చిప్‌ల కొరత భారత్‌లో వాహనాల తయారీకి ప్రతికూలంగా మారుతోంది. దీంతో ఆగస్టు–సెప్టెంబర్ హోల్‌సేల్ అమ్మకాలపై ప్రభావం పడొచ్చని ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ ఒక నివేదికలో తెలిపింది. ‘మారుతి, బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి కంపెనీలపై సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ ప్రభావం ఉండవచ్చు‘ అని వివరించింది. మలేషియాలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్డౌన్ కూడా చిప్‌ల కొరతకు కారణంగా ఉంటోందని జెఫ్రీస్ తెలిపింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బ నుంచి డిమాండ్ క్రమంగా పుంజుకుంటున్న తరుణంలో ఈ పరిస్థితులు ఆటోమొబైల్ కంపెనీలను కలవరపరుస్తున్నాయి. చదవండి : ఆపిల్ 'థింక్ డిఫరెంట్'..వీళ్లకి మూడింది! విరివిగా సెమీకండక్టర్ల వినియోగం.. వాహనాలు మొదలుకుని కంప్యూటర్లు, సెల్ఫోన్లతో పాటు ఇతరత్రా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో సెమీకండక్టర్లుగా వ్యవహరించే సిలికాన్ చిప్‌లను వాడుతున్నారు. ఆయా ఉత్పత్తులు వివిధ పనులను సక్రమంగా నిర్వర్తించేందుకు (కంట్రోల్, మెమొరీ మొదలైనవి) చిప్‌లు ఉపయోగపడతాయి. ఇటీవలి కాలంలో బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్ అసిస్ట్, నేవిగేషన్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్స్ వంటి అధునాతన ఎలక్ట్రానిక్ ఫీచర్లతో కొత్త వాహనాల రూపకల్పనలో సెమీకండక్టర్ల వాడకం గణనీయంగా పెరిగింది. కీలకమైన చిప్‌లకు కొరత నెలకొనడంతో అంతర్జాతీయంగా ఆటోమోటివ్ సహా ఇతర పరిశ్రమలపైనా ప్రభావం పడుతోంది. దీంతో అవి ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. నివేదికలోని ఇతర వివరాలు.. 2019 ఆగస్టుతో (కరోనాకి పూర్వం) పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో ప్యాసింజర్ వాహనాలు, ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ 41–44 శాతం పెరిగింది. ట్రక్కుల రిజిస్ట్రేషన్ 15 శాతం తగ్గినప్పటికీ క్రమంగా మెరుగుపడుతోంది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు మాత్రం ఆగస్టులో ఏకంగా 19 శాతం పడిపోయాయి. ►2019 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్లు 29 శాతం తగ్గాయి. కోవిడ్ సెకండ్ వేవ్ పరిణామాలు ఇందుకు కారణం. డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది. జులై ద్వితీయార్థంలో ఆటోమొబైల్ కంపెనీల కోసం ఆన్లైన్లో సెర్చి చేయడం కాస్త తగ్గినప్పటికీ ప్రస్తుతం మళ్లీ పెరుగుతోంది. కన్జూమర్ సెంటిమెంట్ మెరుగుపడుతోందనడానికి ఇది నిదర్శనంగా జెఫ్రీస్ తెలిపింది. ►ఇక 2019తో పోలిస్తే 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టూవీలర్ల రిజిస్ట్రేషన్లు 46 శాతం పడిపోయినప్పటికీ క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. ►జులై–ఆగస్టు మధ్య కాలంలో ట్రాక్టర్ల విభాగంలో రిజిస్ట్రేషన్లు 2019తో పోలిస్తే 44 శాతం పెరిగాయి. ట్రక్కులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ►ఆటోమొబైల్ కంపెనీల స్థూల మార్జిన్ ఒత్తిళ్లలో అత్యధిక భాగం సెప్టెంబర్ త్రైమాసికానికి తగ్గిపోవచ్చని జెఫ్రీస్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో కంపెనీలు సీక్వెన్షియల్ ప్రాతిపదికన మెరుగైన మార్జిన్లు నమోదు చేసుకోవచ్చని వివరించింది. సెప్టెంబర్‌లో మారుతీ ఉత్పత్తి డౌన్..? చిప్‌ల కొరత కారణంగా సాధారణ స్థాయితో పోలిస్తే సెప్టెంబర్‌లో ఉత్పత్తి 40 శాతానికి తగ్గిపోవచ్చని దేశీ దిగ్గజం మారుతీ సుజుకీ అంచనా వేస్తోంది. హర్యానా, గుజరాత్‌లోని ప్లాంట్లలో ఉత్పత్తి ప్రభావం పడవచ్చని సంస్థ తెలిపింది. హర్యానాలోని గుర్గావ్, మానెసర్ ప్లాంట్ల వార్షిక తయారీ సామర్థ్యం 15 లక్షల యూనిట్లుగా ఉంది. దీంతో పాటు గుజరా త్‌లోని సుజుకీ మోటర్ గుజరాత్ (ఎస్ఎంజీ) ప్లాంటు స్థాపిత సామర్థ్యం వార్షికంగా మరో 7.5 లక్షల యూనిట్ల స్థాయిలో ఉంది. జులైలో మారుతీ సుజుకీ మొత్తం ఉత్పత్తి 58 శాతం పెరిగి 1,70,719 యూనిట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రిక్‌లోనూ దూసుకెళ్తాం: మారుతీ
న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ ఎదుర్కొంటున్న సెమికండక్టర్ల కొరత సమస్య తాత్కాలికమేనని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి.భార్గవ అన్నారు. వచ్చే ఏడాది ఇది సమసిపోతుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. కంపెనీపై కొరత ప్రభావం స్వల్పమేనని వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా వాటాదారులను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగంలోకి ప్రవేశిస్తాం. ధర విషయంలో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చినప్పుడు, అలాగే కంపెనీ నష్టపోకుండా ఉన్నప్పుడే ఎంట్రీ ఇస్తాం. సంప్రదాయ కార్ల పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్నాం. ఈవీ రంగంలోనూ తొలి స్థానంలో నిలవాలన్నదే మా ధ్యేయం’ అని ఆయన చెప్పారు. -
5జీ కోసం కీలక ఒప్పందం చేసుకున్న జియో!
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల తయారీ కంపెనీ ఎన్ఎక్స్ పీ, జియో ప్లాట్ ఫారమ్ భారతదేశంలో 5జీ సేవలను వేగంగా విస్తరించడం కోసం ఒప్పందం చేసుకున్నట్లు ఒక ప్రకటన వెలువడింది. ఈ ఒప్పందం వల్ల ఓ-ఆర్ఏఎన్(ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్ వర్క్ ఆర్కిటెక్చర్) టెక్నాలజీతో 5జీ వేగం విస్తృతంగా పెరగనుంది. దీనివల్ల ఇండస్ట్రీ 4.0, ఐఓటి(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) అప్లికేషన్లలలో, టెలి మెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, ఆగ్యుమెంటెడ్/వర్చువల్ రియాలిటీ, డ్రోన్ ఆధారిత వ్యవసాయ మానిటరింగ్ వంటి అనేక వాటిలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని అని ఎన్ఎక్స్ పీ ఒక ప్రకటనలో తెలిపింది. జియో ప్లాట్ ఫారమ్ తన కొత్త 5జీ ఎన్ఆర్ సొల్యూషన్స్ లో ఎన్ఎక్స్ పీ లేయర్ స్కేప్ ప్రాసెసర్లు అధిక పనితీరు కనబరిచాయి. "ఈ కలయికలో భాగంగా 3.5 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌లో 100 మెగాహెర్ట్జ్ ఛానల్ బ్యాండ్ విడ్త్ వద్ద 1 జీబీపీఎస్ కంటే ఎక్కువ ఇంటర్నెట్ వేగాన్ని పరీక్షించినట్లు" ఎన్ఎక్స్ పీ తెలిపింది. స్మార్ట్ సిటీలు, స్మార్ట్ హోమ్ లు, ఆరోగ్యం, విద్యలో సృజనాత్మక అప్లికేషన్లను ఎనేబుల్ చేస్తుంది. మొబైల్ యూజర్లు డేటా డౌన్ లోడ్ విషయంలో గణనీయమైన మార్పును గమనిస్తారు. ఇండోర్, అవుట్ డోర్ గణనీయంగా 5జీ సామర్ధ్యం పెరగనుంది. -
T Works: ‘ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్’ సమస్యలకు చెక్
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి చిరునామాగా ఉన్న రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ రంగంలోనూ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి సాగిస్తోంది. హార్డ్‌వేర్ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం అవసరమైన ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు, సెమీకండక్టర్లు స్థానికంగా లభించడం లేదు. అదీగాక ఆవిష్కర్తలు తమ డిజైన్లకు అవసరమైన ఎలక్ట్రానిక్స్ కాంపోనెట్స్ కోసం విదేశీ తయారీదారులపై ఆధారపడుతున్నా కస్టమ్స్ సమస్యలు, నాణ్యతలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటినీ అధిగమించేందుకు ప్రభుత్వం చొరవతో ఏర్పాటైన ‘టీ వర్క్స్’అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, సెమీకండక్టర్ల పంపిణీలో పేరొందిన ‘మౌసర్ ఎలక్ట్రానిక్స్’తో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఆవిష్కర్తల ఆలోచనలకు ‘టీ వర్క్స్’రూపం హార్డ్‌వేర్ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ ‘టీ వర్క్స్’ను ఏర్పాటు చేస్తోంది. 78 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ‘టీ వర్క్స్’250 రకాల పరిశ్రమలకు అవసరమయ్యే అత్యాధునిక ఉపకరణాలు అందుబాటులోకి తెస్తోం ది. 3డీ ప్రింటర్లు, యంత్రాల నిర్వహణలో ఉపయోగపడే సీఎన్సీ మెషీన్లు, లేజర్ కట్టర్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు తయారీ (పీసీబీ ఫ్యాబ్రికేషన్) వంటి అత్యాధునిక ఉపకరణాలు ‘టీ వర్క్స్’లో ఉంటాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు), స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు తమ ఆలోచనలకు రూపమిచ్చేందుకు ‘టీ వర్క్స్’ ఉపయోగపడనుంది. హార్డ్‌వేర్ ప్రోటోటైపింగ్‌కు అవరోధాలు ‘టీ వర్క్స్’నిర్వహించిన ఇండియా స్టార్టప్ హార్డ్‌వేర్ సర్వే ప్రకారం హార్డ్‌వేర్ ప్రొటోటైపింగ్ రంగం అభివృద్దికి కస్టమ్స్ నిబంధనలు, విడి భాగాల కొనుగోలు ప్రధాన అవరోధాలుగా ఉన్నాయి. మౌసర్తో భాగస్వామ్యం ద్వారా నాణ్యమైన, నమ్మకమైన విడిభాగాలు దొరకడంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారం లభిస్తుంది. దీంతో స్టార్టప్‌లు, తయారీదారులు, ఎంఎస్ఎంఈలు సులభంగా ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు, సెమీకండక్టర్లను కస్టమ్స్ సమస్యలు లేకుండా కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. తక్కువ సమయంలో తక్కువ ధరకు స్థానికంగా లభ్యం కాని సంక్లిష్ట విడిభాగాలనూ కొనుగోలు చేయొచ్చు. మరోవైపు ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు, సెమీకండక్టర్ల తయారీదారులను ఒకే వేదిక మీదకు తీసుకురావడంతోపాటు వినియోగదారులకు తయారీదారులను చేరువ చేస్తుంది. వినియోగదారుల డిజైన్లకు అవసరమైన డేటా షీట్లు, డిజైన్ల వివరాలు, సాంకేతిక, ఇంజనీరింగ్ సమాచారాన్ని మౌసర్ ఎలక్ట్రానిక్స్ తన ‘టెక్నికల్ రిసోర్స్ సెంటర్’ద్వారా అందుబాటులోకి తెస్తుంది. మౌసర్ 223 దేశాల్లో 1,100 మంది ఉత్పత్తిదారులకు చెందిన 50లక్షల ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 6.30లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఈ సంస్థతో భాగస్వామ్యం ద్వారా స్థానిక ఆవిష్కర్తలు ఎదుర్కొనే సవాళ్లకు పరిష్కారం దొరుకుతుందని ‘టీ వర్క్స్’సీఈఓ సుజయ్ కారంపూరి ‘సాక్షి’కి ధీమా వ్యక్తంచేశారు. చదవండి: Telangana: లాక్డౌన్ గైడ్‌లైన్స్ విడుదల చేసిన టీ సర్కార్ విమానం ఎక్కాలంటే ‘యాంటిజెన్’ మస్ట్ -
చిప్స్ కంపెనీలకు క‘న్నీటి’ కష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటివరకు చిప్స్ కొరత ప్రపంచవ్యాప్తంగా వాహన తయారీదార్లను ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పుడు ఈ సమస్య ఇతర పరిశ్రమలకూ పాకింది. మొబైల్స్, ల్యాప్టాప్స్, ఏసీలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, యంత్రాలు, సర్వర్స్, బొమ్మలు.. ఇలా ఒక్కటేమిటి. వందలాది విభాగాలపై సెమికండక్టర్స్ కొరత తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు మొదలుకొని స్టార్టప్స్ వరకూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో అంతిమంగా కస్టమర్లపైనే భారం పడుతోంది. వస్తువుల ధర పెరగడంతోపాటు వీటిని అందుకోవడం కోసం వినియోగదార్లు వేచి చూడాల్సి వస్తోంది. దుకాణాల్లో నిల్వలు నిండుకుంటున్నాయి. స్వచ్ఛమైన నీటి కొరతతో.. చిప్స్ ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉన్న తైవాన్ వాటా 70 శాతముంది. క్వాల్కామ్ సహా పలు దిగ్గజాలకు చిప్స్‌ను సరఫరా చేస్తున్న తైవాన్ సెమికండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ) వాటా పరిమాణం పరంగా ఏకంగా 55 శాతం ఉందని కౌంటర్‌పాయింట్ తెలిపింది. యునైటెడ్ మైక్రోఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్, వాన్గార్డ్ ఇంటర్నేషనల్ సెమికండక్టర్ కార్పొరేషన్, పవర్షిప్ సెమికండక్టర్ వంటి కంపెనీలూ ఇక్కడివే. అయితే వర్షాలు లేక 56 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర కరువు పరిస్థితులు తైవాన్ను చుట్టుముట్టాయి. సెమికండక్టర్స్ ఉత్పత్తి ప్రక్రియలో అత్యంత స్వచ్ఛమైన మంచి నీటిని వాడతారు. ఇప్పుడీ నీటికి కరువు ఏర్పడడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. రెండు దశాబ్దాల్లో.. చిప్ కొరతతో పలు దేశాల్లో ప్యాసింజర్ కార్ల రంగంలో కొన్ని కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేయగా, మరికొన్ని తయారీ తగ్గించాయి. దీంతో ఈ సంస్థల అమ్మకాలూ తక్కువ నమోదయ్యాయి. సెమికండక్టర్ల కొరత కొన్నేళ్లు ఉంటుందని ఇంటెల్ కార్పొరేషన్ సీఈవో ప్యాట్ జెల్సింగర్ తెలిపారు. కొరత కారణంగా వ్యాపార అవకాశాలు మందగిస్తున్నాయని కంపెనీలు అంటున్నాయి. ఎలక్ట్రానిక్స్ ముడిసరుకు ధర మార్చిలో భారీగా పెరిగింది. ఈ పెరుగుదల గడిచిన రెండు దశాబ్దాల్లో ఇదే అత్యధికమని మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఐహెచ్ఎస్ మార్కిట్ వెల్లడించింది. ఇళ్లలో వినియోగించే గ్యాడ్జెట్స్ కోసం కస్టమర్లు గతేడాది ఎగబడడంతో కంపెనీలకు చిప్స్ అవసరం మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ కోసం డిమాండ్ విపరీతంగా ఉంది. భారత్‌లో ల్యాప్టాప్స్, ఏసీలకు కొరత ఏర్పడింది. డిమాండ్‌తో పోలిస్తే ల్యాప్టాప్స్ 10 శాతమే సరఫరా అవుతున్నాయని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. అన్ని కంపెనీలకూ సమస్యే.. తాజా పరిస్థితుల నేపథ్యంలో హార్డ్‌వేర్ అమ్మకాలు తగ్గాయని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ప్రస్తుత త్రైమాసికంలో ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్ విక్రయాలు తగ్గే అవకాశం ఉందని యాపిల్ ఫైనాన్స్ చీఫ్ లూకా మాయెస్ట్రీ తెలిపారు. గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్ నివేదిక ప్రకారం యూఎస్‌లో బోట్ బిల్డింగ్, బ్రూవరీస్, ఫాబ్రిక్ మిల్స్ వంటి సుమారు 170 పరిశ్రమలు ప్రత్యక్షంగా సమస్యను ఎదుర్కొంటున్నాయట. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా చిప్ కొరత ప్రభావం ఉంటోందని నివేదిక వెల్లడించింది. చిప్స్, ఇతర ముడిసరుకు కొరత కారణంగా ఉత్పత్తుల ధరను 5–12 శాతం పెంచుతున్నట్టు వర్ల్‌పూల్ సీఈవో మార్క్ బిజర్ తెలిపారు. ఏడాది చివరికల్లా పరిస్థితుల్లో మార్పు రావొచ్చని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ హోమ్ అప్లయెన్సెస్, ఎయిర్ సొల్యూషన్స్ బిజినెస్ యూనిట్ హెడ్ డాన్ క్వాక్ వెల్లడించారు. హోమ్ అప్లయెన్సెస్ తయారీలో 1,000కిపైగా విభిన్న సెమికండక్లర్టను వినియోగిస్తున్నట్టు చెప్పారు. ఇదీ సెమికండక్టర్స్ పరిశ్రమ.. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సెమికండక్టర్ల పరిశ్రమ విలువ సుమారు రూ.32.7 లక్షల కోట్లు ఉంది. ప్రస్తుత సంవత్సరం 1.13 ట్రిలియన్ యూనిట్ల సెమికండక్టర్లు అమ్ముడవుతాయని అంచనా. 2020తో పోలిస్తే ఇది 13 శాతం వృద్ధి అని ఈ రంగంలో ఉన్న రీసెర్చ్ సంస్థ ఐసీ ఇన్సైట్స్ తెలిపింది. 2019తో పోలిస్తే గతేడాది అమ్మకాల వృద్ధి కేవలం 3 శాతమే. ఇక యూఎస్‌కు చెందిన ఇంటెల్ ప్రీమియం చిప్స్ తయారీలో ఉంది. శామ్సంగ్, ఎస్కే హైనిక్స్, బ్రాడ్‌కామ్, క్వాల్కామ్, మైక్రాన్ వంటి కంపెనీలు ఈ రంగంలో ఉన్నాయి. చదవండి: ఆటో, ఐటీ, మెటల్ మెరుపులు: లాభాల ముగింపు