న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెమీకండక్టర్ ప్లాంటును గుజరాత్‌లో ఏర్పాటు చేయాలని పారిశ్రామిక దిగ్గజం వేదాంత నిర్ణయించింది. అహ్మదాబాద్‌లో తలపెడుతున్న ఈ ప్రాజెక్టులో డిస్‌ప్లే, సెమీకండక్టర్ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై వేదాంత ప్రతినిధులు కానీ, ఫాక్స్‌కాన్ వెంటనే స్పందించ లేదు.
తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌తో కలిసి 20 బిలియన్ డాలర్ల జాయింట్ వెంచర్‌గా వేదాంత తలపెట్టిన ఈ మెగా ప్రాజెక్టు కోసం తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటక కూడా పోటీపడ్డాయి. కానీ ఇటీవల ముగిసిన తుది చర్చల్లో మహారాష్ట్రను పక్కకు నెట్టి గుజరాత్ ఆ ప్రాజెక్టును దక్కించుకుంది. కాగా భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2020లో 15 బిలియన్ డాలర్లనుంచి 2026 నాటికి 63 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment