రాజస్థాన్‌కు చెందిన 'సహస్ర సెమీకండక్టర్స్' (Sahasra Semiconductors) మెమరీ చిప్‌లను ఉత్పత్తి చేసిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ నెల ప్రారంభంలో భివాడి జిల్లాలోని సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ అండ్ ప్యాకేజింగ్ యూనిట్‌లో ఉత్పత్తిని ప్రారంభించి.. వివిధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు ఇప్పటికే మొదటి షిప్‌మెంట్ చేసింది.
2023 చివరి నాటికి కంపెనీ భివాడి యూనిట్ 30 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని, 2024లో ఇది మరింత ఎక్కువగా ఉండనున్నట్లు సహస్ర గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'అమృత్ మన్వానీ' వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా మైక్రో ఎస్‌డి కార్డ్‌లను విక్రయించే మొదటి కంపెనీగా మారినందుకు ఆనందంగా ఉందని, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో మంచి స్పందన లభిస్తోందని మన్వానీ ఈ సందర్భంగా చెప్పారు.
సహస్ర సెమీకండక్టర్స్ రెండు ప్రముఖ ప్రభుత్వ కార్యక్రమాల (PLI, SPECS) నుంచి ఆమోదం పొందింది. అంతే కాకుండా కంపెనీ తన తయారీ సౌకర్యాన్ని విస్తరించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.
ఇదీ చదవండి: పండుగ సీజన్‌లో గొప్ప ఆఫర్స్.. టూ వీలర్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి!
సెమీకండక్టర్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్లోబల్ చిప్‌మేకర్ మైక్రాన్, గుజరాత్‌లో కొత్త అసెంబ్లీ అండ్ టెస్ట్ సదుపాయాన్ని స్థాపించడానికి 825 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అనుకున్న విధంగా అన్నీ జరిగితే 2024 నాటికి ఉత్పత్తి అధికమవుతుందని, తద్వారా కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment