దాదాపు వందకు పైగా పేటెంట్లు కలిగి, కొన్ని దశాబ్దాలుగా ఐటీ పరిశ్రమలో మేటిగా ఉన్న సెరీమోర్ఫిక్ సంస్థ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్(ఎంఎల్), హై పవర్ కంప్యూటింగ్(హెచ్‌పీసీ), ఆటోమోటివ్ ప్రాసెసింగ్, డ్రగ్ డిస్కవరీ, మెటావర్స్ ప్రాసెసింగ్... వీటన్నింటికీ అనువుగా ఉండే పూర్తిస్థాయి సిలికాన్ సిస్టమ్‌ను అందించే ప్రణాళికలో ఉన్నట్లు ప్రకటించింది. అత్యాధునిక సిలికాన్ జామెట్రీ(టీఎస్‌ఎంసీ 5ఎన్‌ఎం నోడ్)తో డిజైన్ చేసిన ఈ కొత్త ఆర్కిటెక్చర్ ను సెరీమోర్ఫిక్ రూపొందించింది.
కొత్తతరంలోని హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సమస్యలను పరిష్కరించి, ఎక్కువ డిమాండు ఉన్న మార్కెట్ సెగ్మెంట్లకు సేవలందించేందుకు దీన్ని రూపొందించారు. ఒక అల్ట్రాలో పవర్ ట్రైనింగ్ సూపర్ కంప్యూటింగ్ చిప్ డిజైన్ చేసేందుకు ఇక్కడి బృందం తమ నైపుణ్యాన్ని, పేటెంటెడ్ టెక్నాలజీని ఉపయోగించి కష్టపడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సెమికండక్టర్ పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను పరిష్కరించాలనే నిబద్దతకు సెరీమోర్ఫిక్ వేసిన ముందడుగు మరో నిదర్శనం. ఇంకా, చిప్ తయారీ కోసం మొత్తం పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, ఈ విభాగాన్ని మరింత అనుకూలంగా చేయడానికి భారత ప్రభుత్వం ఇటీవల చేసిన పరిణామాలతో, భారతీయ సెమీకండక్టర్ మార్కెట్ ను పెంచడంలో సహాయపడటానికి వివిధ సంస్థలతో కలిసి పనిచేయడానికి ఈ సమయం సరైనది.
సెమీకండక్టర్ డిజైన్‌లో ఉత్తమ ప్రతిభకు భారతదేశం నిలయం కావడంతో ఇది శుభశకునం అవుతుంది. హైదరాబాద్‌లోని సెరీమోర్ఫిక్ ఇండియా డెవలప్ మెంట్ సెంటర్ భారతదేశాన్ని తదుపరి గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మార్చడంలో ఒక అడుగు ముందుకు వేసింది. సెరీమోర్ఫిక్ ప్రస్తుతం 150 మందికి ఉపాధి కల్పిస్తోంది. 2024 చివరి నాటికి, తన హైదరాబాద్ డెవలప్ మెంట్ సెంటర్ ద్వారా 400 మందికి ఉపాధి కల్పించాలని యోచిస్తోంది.
సెరీమోర్ఫిక్ను 2020 ఏప్రిల్ నెలలో రెడ్ పైన్ సిగ్నల్స్ వ్యవస్థాపక సీఈఓ, ఇండస్ట్రీ పెద్ద డాక్టర్ వెంకట్ మట్టెల స్థాపించారు. ఇది తన వైర్ లెస్ ఆస్తులను సిలికాన్ ల్యాబ్స్, ఇంక్ కు 2020 మార్చిలో 308 మిలియన్ డాలర్లకు, విక్రయించింది. ఆయన నాయకత్వంలో రెడ్ పైన్ సిగ్నల్స్ లోని బృందం పురోగామి ఆవిష్కరణలు, పరిశ్రమలో తొలిసారి ఉత్తమ ఉత్పత్తులను అందించింది. వీటిద్వారా అల్ఞా-లోపవర్ వైర్‌లెస్ సొల్యూషన్ అభివృద్ధికి అడుగులు పడ్డాయి. అవి అప్పటికే పరిశ్రమలోని పెద్ద సంస్థల నుంచి వచ్చిన ఉత్పత్తుల కంటే ఇంధనాన్ని 26 రెట్లు తక్కువగా వినియోగించుకుని, వాటన్నింటినీ తోసిరాజైంది.
Comments
Please login to add a commentAdd a comment