development centre
-
హైదరాబాద్‌లో మరో దిగ్గజ కంపెనీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు
దాదాపు వందకు పైగా పేటెంట్లు కలిగి, కొన్ని దశాబ్దాలుగా ఐటీ పరిశ్రమలో మేటిగా ఉన్న సెరీమోర్ఫిక్ సంస్థ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్(ఎంఎల్), హై పవర్ కంప్యూటింగ్(హెచ్పీసీ), ఆటోమోటివ్ ప్రాసెసింగ్, డ్రగ్ డిస్కవరీ, మెటావర్స్ ప్రాసెసింగ్... వీటన్నింటికీ అనువుగా ఉండే పూర్తిస్థాయి సిలికాన్ సిస్టమ్‌ను అందించే ప్రణాళికలో ఉన్నట్లు ప్రకటించింది. అత్యాధునిక సిలికాన్ జామెట్రీ(టీఎస్ఎంసీ 5ఎన్ఎం నోడ్)తో డిజైన్ చేసిన ఈ కొత్త ఆర్కిటెక్చర్ ను సెరీమోర్ఫిక్ రూపొందించింది. కొత్తతరంలోని హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సమస్యలను పరిష్కరించి, ఎక్కువ డిమాండు ఉన్న మార్కెట్ సెగ్మెంట్లకు సేవలందించేందుకు దీన్ని రూపొందించారు. ఒక అల్ట్రాలో పవర్ ట్రైనింగ్ సూపర్ కంప్యూటింగ్ చిప్ డిజైన్ చేసేందుకు ఇక్కడి బృందం తమ నైపుణ్యాన్ని, పేటెంటెడ్ టెక్నాలజీని ఉపయోగించి కష్టపడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సెమికండక్టర్ పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను పరిష్కరించాలనే నిబద్దతకు సెరీమోర్ఫిక్ వేసిన ముందడుగు మరో నిదర్శనం. ఇంకా, చిప్ తయారీ కోసం మొత్తం పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, ఈ విభాగాన్ని మరింత అనుకూలంగా చేయడానికి భారత ప్రభుత్వం ఇటీవల చేసిన పరిణామాలతో, భారతీయ సెమీకండక్టర్ మార్కెట్ ను పెంచడంలో సహాయపడటానికి వివిధ సంస్థలతో కలిసి పనిచేయడానికి ఈ సమయం సరైనది. సెమీకండక్టర్ డిజైన్‌లో ఉత్తమ ప్రతిభకు భారతదేశం నిలయం కావడంతో ఇది శుభశకునం అవుతుంది. హైదరాబాద్‌లోని సెరీమోర్ఫిక్ ఇండియా డెవలప్ మెంట్ సెంటర్ భారతదేశాన్ని తదుపరి గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మార్చడంలో ఒక అడుగు ముందుకు వేసింది. సెరీమోర్ఫిక్ ప్రస్తుతం 150 మందికి ఉపాధి కల్పిస్తోంది. 2024 చివరి నాటికి, తన హైదరాబాద్ డెవలప్ మెంట్ సెంటర్ ద్వారా 400 మందికి ఉపాధి కల్పించాలని యోచిస్తోంది. సెరీమోర్ఫిక్ను 2020 ఏప్రిల్ నెలలో రెడ్ పైన్ సిగ్నల్స్ వ్యవస్థాపక సీఈఓ, ఇండస్ట్రీ పెద్ద డాక్టర్ వెంకట్ మట్టెల స్థాపించారు. ఇది తన వైర్ లెస్ ఆస్తులను సిలికాన్ ల్యాబ్స్, ఇంక్ కు 2020 మార్చిలో 308 మిలియన్ డాలర్లకు, విక్రయించింది. ఆయన నాయకత్వంలో రెడ్ పైన్ సిగ్నల్స్ లోని బృందం పురోగామి ఆవిష్కరణలు, పరిశ్రమలో తొలిసారి ఉత్తమ ఉత్పత్తులను అందించింది. వీటిద్వారా అల్ఞా-లోపవర్ వైర్లెస్ సొల్యూషన్ అభివృద్ధికి అడుగులు పడ్డాయి. అవి అప్పటికే పరిశ్రమలోని పెద్ద సంస్థల నుంచి వచ్చిన ఉత్పత్తుల కంటే ఇంధనాన్ని 26 రెట్లు తక్కువగా వినియోగించుకుని, వాటన్నింటినీ తోసిరాజైంది. (చదవండి: కొత్త ఓటర్లకు భారత ఎన్నికల సంఘం శుభవార్త..!) -
హైదరాబాద్‌లో మైక్రాన్ డెవలప్మెంట్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన సెమీకండక్టర్ల తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ తాజాగా హైదరాబాద్‌లో గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ (జీడీసీ)ని ఆవిష్కరించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ శుక్రవారమిక్కడ దీన్ని ప్రారంభించారు. మైక్రాన్ వంటి దిగ్గజ సంస్థ హైదరాబాద్‌లో తమ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ ఉన్నాయని, ఈ విభాగంలో పెట్టుబడులకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయన్నారు. సెమీకండక్టర్స్ తయారీ యూనిట్‌ను కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. మరోవైపు, సుమారు 3,50,000 చ.అ. విస్తీర్ణంలో ఈ సెంటర్ ఏర్పాటు చేసినట్లు సంస్థ సీఈవో సంజయ్ మెహ్రోత్రా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇటీవలే ప్రారంభించిన బెంగళూరు కార్యాలయంతో పాటు హైదరాబాద్ జీడీసీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 700 దాకా ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దీన్ని 2,000 దాకా పెంచుకోనున్నట్లు, ఇందులో ఎక్కువగా నియామకాలు హైదరాబాద్ కేంద్రంలోనే ఉండనున్నట్లు మెహ్రోత్రా వివరించారు. ప్రస్తుతం తమకు జపాన్, చైనా సహా ఆరు దేశాల్లో తయారీ కార్యకలాపాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. డేటా విప్లవంతో ఈ రంగంలో అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అమితాబ్ కాంత్ చెప్పారు. -
హైదరాబాద్‌లో జెడ్ఎఫ్ టెక్నాలజీస్ సెంటర్
హైదరాబాద్, సాక్షి: ఆటోమోటివ్ టెక్నాలజీ దిగ్గజం జెడ్ఎఫ్ టెక్నాలజీస్... భారత్‌లో తన తొలి డెవలప్మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ సందర్భంగా ఇక్కడి హోటల్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యాపార పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా మార్చేందుకు కృషి చే స్తున్నామని చెప్పారు. డిజిటల్ రంగం దినదినాభివృద్ధి చెందనుందని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలియజేశారు. జడ్ఎఫ్ పెడుతున్న ఈ పెట్టుబడిని హైదరాబాద్‌లో ఎకో సిస్టమ్ బిల్డర్‌గా చూస్తున్నామన్నారు. భారతదేశంలో తమ తొలి సెంటర్‌కు తెలంగాణను జడ్ఎఫ్ ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయంగా పలు కంపెనీలకు హైదరాబాద్ అత్యంత ప్రాధాన్యత కలిగిన కేంద్రంగా నిలుస్తోందని చెప్పారు. అక్షయ పాత్ర పౌండేషన్లో జెడ్ఎఫ్ సంస్థ భాగస్వామి అవుతున్నందుకు సంతోషం వ్యక్తంచేశారు. చిన్నారులకు మధ్యాహ్నం భోజనం అందించే ప్రపంచంలోనే అతిపెద్ద లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ అక్షయపాత్ర అని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్ఎఫ్ సీఈవో డాక్టర్ స్టీఫా సొమ్మర్, ఇండియా టెక్నాలజీ సెంటర్ ఎగ్జిక్యూటీవ్ లీడ్, డిజిటల్ ఆఫీసర్ మమతా చామర్తి తదితరులు పాల్గొన్నారు. -
అమరావతికి టెక్ దిగ్గజం
అమరావతి : దేశంలోనే నాలుగో అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేస్తోంది. తన అతిపెద్ద డెవలప్మెంట్ సెంటర్లలో ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించాలని ప్లాన్స్ వేస్తోంది. దీని కింద మొత్తం రూ.1000 కోట్ల పెట్టుబడులను హెచ్‌సీఎల్ టెక్ పెట్టనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఈ విషయంపై ఓ అగ్రిమెంట్ కుదుర్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటి అమరావతిలో దీన్ని నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చర్చలు తుది దశలో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే ఓ ఐటీ దిగ్గజం పెట్టబోతున్న అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇదే.అయితే ఈ వార్తలపై హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ స్పందించడం లేదు. ఈ డెవలప్ మెంట్ సెంటర్ కోసం అమరావతి పరిసర ప్రాంతాల్లో 30 ఎకరాలకు పైగా భూములు కావాల్సి ఉన్నట్టు తెలుస్తోంది.