
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో వికెట్ కీపర్‌గా ధోని తన 150వ క్యాచ్‌ను అందుకున్నాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ నేహల్ వధేరా క్యాచ్‌తో ధోని ఈ ఫీట్ సాధించాడు.
తద్వారా ఐపీఎల్‌లో 150 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్ కీపర్‌గా ధోని రికార్డులకెక్కాడు. ఈ ఫీట్‌ను ఇప్పటివరకు ఎవరూ సాధించలేకపోయారు. ధోని ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 154 క్యాచ్‌లు తీసుకున్నాడు. అందులో నాలుగు క్యాచ్‌లు ఫీల్డర్‌గా తీసుకున్నాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో ధోని తర్వాతి స్ధానంలో దినేష్ కార్తీక్(137) ఉన్నాడు.
ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్లు వీరే..
ఎంఎస్ ధోని-150 క్యాచ్‌లు
దినేష్ కార్తీక్-137
వృద్దిమాన్ సహా-87
రిషబ్ పంత్-76
క్వింటన్ డికాక్-66
ఆర్య సూపర్ సెంచరీ..
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాన్ష్ ఆర్య(7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 103) సెంచరీతో చెలరేగగా.. శశాంక్ సింగ్(52), జాన్సెన్(34) పరుగులతో రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా రెండు వికెట్లు సాధించగా.. నూర్, ముఖేష్ చెరో వికెట్ సాధించారు.
చదవండి: IPL 2025: ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా