
ఐపీఎల్-2025 తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోని (Ms Dhoni).. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు విడ్కోలు పలకనున్నాడా? అంటే అవునానే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఈ ఏడాది సీజన్ అనంతరం 43 ఏళ్ల ధోని తన రిటైర్మెంట్‌ను ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే తలపడుతోంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ధోని కుటంబ సభ్యులు స్టేడియం వచ్చారు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు అతడి తల్లిదండ్రులు కూడా స్టేడియంకు రావడం గమనార్హం. దీంతో ధోని ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్నడంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపుందుకుంది.
ధోని తల్లిదండ్రులు మ్యాచ్‌ను వీక్షించేందుకు మైదానం రావడం చాలా అరుదు. ధోని ఫ్యామిలీ మ్యాచ్ చూస్తున్న సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ధోని తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 267 మ్యాచ్‌లు ఆడి 39.18 సగటుతో 5,289 పరుగులు చేశాడు. ఈ లెంజడరీ వికెట్ కీపర్ చెన్నై సూపర్ కింగ్స్‌కు 237 మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించాడు. సీఎస్‌కే తరపున 40.30 సగటుతో 4,715 పరుగులు చేశాడు. అంతేకాకుండా సారథిగా సీఎస్‌కేను ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలిపాడు.