Chennai Super Kings
-
సీఎస్కేకు భారీ షాక్.. జట్టును వదిలి వెళ్లిపోయిన కెప్టెన్!
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సన్నద్దమవుతోంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం(ఏప్రిల్ 26) చెపాక్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో సీఎస్కే తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు చెన్నై జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కుటుంబ అత్యవసర పరిస్థితి (Family Emergency) కారణంగా సీఎస్కే జట్టును వీడి పుణేకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అతడు జట్టుతో పాటు చెన్నైకి ప్రయాణించలేదు. అయితే అతడు తిరిగి ఎప్పుడు జట్టుతో చేరుతాడన్న విషయంపై క్లారిటీ లేదు. కానీ సీఎస్కే అభిమానులు మాత్రం వీలైనంత త్వరగా రుతురాజ్ జట్టుతో కలవాలని కోరుకుంటున్నారు.మరోవైపు సీఎస్కే లెజండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆడనున్నట్లు సమాచారం. సీఎస్కే హెడ్ కోచ్ మైఖల్ హస్సీ సైతం ధోని రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.ఒకవేళ రుతురాజ్ గుజరాత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే ఎంఎస్ ధోని మరోసారి జట్టు పగ్గాలు చేపట్టే అవకాశముంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన సూపర్ కింగ్స్.. మూడింట విజయం సాధించి పాయింట్ట పట్టికలో ఐదో స్ధానంలో కొనసాగుతోంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్ చేయండి! -
బ్యాటింగ్ రాదు.. బౌలింగ్ రాదు! నీకు కెప్టెన్సీ అవసరమా?
ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా పేలవ ఫామ్ కొనసాగుతోంది. కెప్టెన్‌గా, వ్యక్తిగత ప్రదర్శన పరంగా హార్దిక్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు.తొలుత బౌలింగ్‌లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 38 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన హార్దిక్.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ర్యాష్ షాట్ ఆడి తన వికెట్‌ను వికెట్‌ను కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ పరంగా కూడా హార్దిక్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.చెత్త నిర్ణయాలు తీసుకుంటూ జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ పాండ్యా కేవలం 97 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో కూడా కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో హార్దిక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.బ్యాటింగ్ రాదు, బౌలింగ్ రాదు.. కెప్టెన్సీ అవసరమా హార్దిక్ అంటూ ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది.సీఎస్కే ఘన విజయంఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 103 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. సీఎస్కే స్పిన్నర్ అకిల్ హుస్సేన్ నాలుగు వికెట్లు పడగొట్టి ముంబై పతనాన్ని శాసించాడు. అతడితో పాటు నూర్ అహ్మద్ రెండు, గుర్జప్నీత్, కాంబోజ్, ముఖేష్ చౌదరి, కాంబోజ్ తలా వికెట్ సాధించారు. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(36), తిలక్ వర్మ(37) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ విజయంతో సీఎస్కే పాయింట్ల పట్టికలో ఐదో స్దానానికి చేరుకుంది. -
ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన సీఎస్కే
ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సంజూ 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్ బ్రెవిస్(21), గైక్వాడ్(22) రాణించారు. ఈ ఏడాది సీజన్లో సంజూకు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్, అశ్విని కుమార్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, శాంట్నర్ చెరో వికెట్ సాధించారు.అకిల్ మ్యాజిక్‌అనంతరం 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. సీఎస్కే స్పిన్నర్ అకిల్ హోస్సేన్ 4 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. అతడితో పాటు నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(36), తిలక్ వర్మ(37) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు. ముంబై ఇండియన్స్‌కు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం. -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి శతక్కొట్టాడు. ఈ ధనాధన్ లీగ్‌లో భాగంగా వాఖండే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ముంబై బౌలర్లను తనదైన శైలిలో ఉతికారేశాడు.కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజూకు ఇది 5వ ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో ఇది అతడికి ఎనిమిదివ సెంచరీ. ఈ క్రమంలో శాంసన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.సంజూ సాధించిన రికార్డులు ఇవేముంబై ఇండియన్స్‌పై సెంచరీ చేసిన మొట్టమొదటి సీఎస్కే బ్యాటర్‌గా శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో సంజూ కంటే ముందు ఈ సీఎస్కే బ్యాటర్ కూడా ముంబైపై మూడంకెల స్కోరును అందుకోలేదు.అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఒకే సీజన్లో రెండు సెంచరీలు చేసిన మొదటి భారత బ్యాటర్‌గా సంజూ రికార్డు నెలకొల్పాడు.ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో కెఎల్ రాహుల్‌తో కలిసి నాలుగో స్థానంలో శాంసన్ నిలిచాడు.టీ20 క్రికెట్లో భారత తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ సరసన శాంసన్ నిలిచాడు. వీరిద్దరూ ఇప్పటివరకు 8 టీ20 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి(9), అభిషేక్ శర్మ(9) సంయుక్తంగా అగ్రస్ధానంలో ఉన్నారు.చదవండి: IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి విధ్వంసకర ప్లేయర్ What composure. What striking 💛𝐒𝐚𝐧𝐣𝐮 𝐒𝐦𝐚𝐬𝐡𝐢𝐧𝐠 𝐒𝐚𝐦𝐬𝐨𝐧 🔥Scorecard ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK | @ChennaiIPL | @IamSanjuSamson pic.twitter.com/2Hr9Ui0UEn— IndianPremierLeague (@IPL) April 23, 2026 -
ముంబై ఇండియన్స్‌పై సీఎస్కే ఘన విజయం
Chennai super kings vs Mumbai indians Live updates: ముంబై ఇండియన్స్‌పై 103 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. సీఎస్కే స్పిన్నర్ అకిల్ హుస్సేన్ నాలుగు వికెట్లు పడగొట్టి ముంబై నడ్డివిరిచాడు.అతడితో పాటు నూర్ అహ్మద్ రెండు, గుర్జప్నీత్, కాంబోజ్, ముఖేష్ చౌదరి, కాంబోజ్ తలా వికెట్ సాధించారు. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(36), తిలక్ వర్మ(37) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ విజయంతో సీఎస్కే పాయింట్ల పట్టికలో ఐదో స్దానానికి చేరుకుంది.ముంబై ఏడో వికెట్ డౌన్‌సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ ఏడో వికెట్ కోల్పోయింది. ముంబై విజయానికి 41 బంతుల్లో 121 పరుగులు కావాలి.కష్టాల్లో ముంబై13 ఓవర్ వేసిన నూర్ అహ్మద్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో ముంబై ఇండియన్స్ రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి హార్దిక్ పాండ్యా(1), రెండో బంతికి షెర్ఫేన్ రూథర్ ఫర్డ్(0) పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 86/6ముంబై ఐదో వికెట్ డౌన్తిలక్ వర్మ రూపంలో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన తిలక్.. అకీల్ హొసేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ముంబై మూడో వికెట్ డౌన్‌ముంబై మూడో వికెట్ కోల్పోయింది. అకిల్ హుస్సేన్ బౌలింగ్‌లో నమన్ ధీర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.ముంబై రెండో వికెట్ డౌన్‌ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన క్వింటన్ డికాక్.. ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 11/2ముంబై తొలి వికెట్ డౌన్‌ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. యువ ఓపెనర్ దానిష్ మలేవార్ మరోసారి డౌకటయ్యాడు. అకిల్ హోస్సేన్ బౌలింగ్‌లో మలేవార్ ఔటయ్యాడు. సంజూ శాంసన్ సూపర్ సెంచరీవాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ అజేయ సెంచరీతో చెలరేగాడు. సంజూ 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్ బ్రెవిస్(21), గైక్వాడ్(22) రాణించారు.దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్, అశ్విని కుమార్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, శాంట్నర్ తలా వికెట్ సాధించారు.సీఎస్కే ఐదో వికెట్ డౌన్కార్తీక్ శర్మ రూపంలో సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన కార్తీక్ శర్మ.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 166/5. క్రీజులో సంజూ శాంసన్(78) ఉన్నాడు.12 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 128/412 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. క్రీజులో సంజూ శాంసన్(57), కార్తీక్ శర్మ(2) ఉన్నారు.సీఎస్కే రెండో వికెట్ డౌన్సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్.. శాంట్నర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 73/2సీఎస్కే తొలి వికెట్ డౌన్32 పరుగుల వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. గజన్ఫర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న రుతురాజ్2 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్(17), సంజూ శాంసన్(5) ఉన్నారు.ఐపీఎల్-2026లో మరో కీలక పోరుకు తెరలేచింది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌కు కూడా ముంబై, సీఎస్కే లెజెండరీ ప్లేయర్లు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని దూరమయ్యారు. వీరిద్దరూ గాయాలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా సీఎస్కే జట్టులోకి ఆయూశ్ మాత్రే స్ధానంలో యువ ఆటగాడు కార్తిక్ శర్మ వచ్చాడు.తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్ : సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ముఖేష్ చౌదరిముంబై ఇండియన్స్: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), తిలక్ వర్మ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా, క్రిష్ భగత్, అల్లా మహ్మద్ గజన్ఫర్, అశ్వనీ కుమార్ -
సీఎస్కే జట్టులోకి యార్కర్ల కింగ్
ఐపీఎల్-2026 సీజన్ మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మధ్యలోనే వైదొలిగిన యువ ఆటగాడు ఆయుష్ మాత్రే స్ధానాన్ని సీనియర్ పేసర్ ఆకాశ్ మధ్వాల్‌తో సీఎస్కే భర్తీ చేసింది. ఈ విషయాన్ని సీఎస్కే ఎక్స్ వేదికగా గురువారం ప్రకటించింది. రూ.30 లక్షల బేస్‌ప్రైస్‌కు మధ్వాల్‌ను చెన్నై జట్టులోకి తీసుకుంది.మధ్వాల్‌కు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. గతంలో అతడు ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో దిట్ట. ఇప్పటివరకు 17 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మధ్వాల్ 23 వికెట్లు పడగొట్టాడు. 32 ఏళ్ల మధ్వాల్‌కు దేశవాళీ క్రికెట్లో ఆడిన అనుభవం కూడా ఉంది.ఇక సీఎస్కే విషయానికి వస్తే.. ఈ ఏడాది సీజన్లో కూడా తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేలవ ఫామ్ జట్టుకు భారంగా మారింది. అంతకుతోడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మాత్రే కూడా గాయం కారణంగా దూరం కావడం జట్టుకు కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది.రూ.28 కోట్లు ఖర్చు పెట్టి జట్టులోకి తీసుకున్న యువ ఆటగాళ్లు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో గత రెండు మ్యాచ్‌లకు వారిని సీఎస్కే బెంచ్‌కే పరిమితం చేసింది. గురువారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో ప్రశాంత్ వీర్ తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.చదవండి: SRH: కమిన్స్‌కు షాక్.. కెప్టెన్‌గా ఇషాన్ కొనసాగింపు! -
సీఎస్కే శిబిరంలో తీవ్ర విషాదం
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కష్టకాలం కొనసాగుతోంది. గాయాలు, ఫామ్ సమస్యలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న ఆ జట్టుకు.. తాజాగా మరో సాడ్ న్యూస్ తెలిసింది. జట్టు పేసర్ ముకేశ్ చౌదరి తన తల్లిని కోల్పోయాడు. ఆతడి తల్లి ప్రేమ్ దేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.ఈ వార్తతో సీఎస్కే శిబిరం విషాదంలో మునిగిపోయింది. జట్టు యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా ముకేశ్ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేసింది. కష్ట సమయంలో ముకేశ్‌తో ఉన్నామని భరోసా ఇచ్చింది.The CSK family mourns the passing of Mukesh Choudhary’s mother. We stand with Mukesh and his family, keeping them in our thoughts and prayers during this incredibly difficult time.— Chennai Super Kings (@ChennaiIPL) April 23, 2026మ్యాచ్‌కు దూరం కానున్న ముకేశ్తల్లి అంత్యక్రియల కోసం ముకేశ్ తన స్వస్థలానికి వెళ్లడంతో, ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 23) జరగనున్న కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇప్పటికే గాయాల కారణంగా బలహీనపడిన సీఎస్కే బౌలింగ్ విభాగానికి ఇది మరో భారీ దెబ్బగా మారింది.ఈ సీజన్ ప్రారంభం నుంచే సీఎస్కేను సమస్యలు వెంటాడుతున్నాయి. ధోని ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. బ్రెవిస్ ఆరంభంలో పలు మ్యాచ్‌లు మిస్ అయ్యాడు. మంచి టచ్‌లో ఉన్న ఆయుశ్ మాత్రే, ఖలీల్ అహ్మద్ గాయాల కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యారు.ఖలీల్ స్థానాన్ని గత మ్యాచ్‌లో భర్తీ చేసిన ముకేశ్ కూడా ఇప్పుడు వ్యక్తిగత కారణంగా జట్టుకు దూరం కావడంతో సీఎస్కే బౌలింగ్ కూర్పులో మార్పులు అనివార్యమయ్యాయి. మ్యాట్ హెన్రీని జట్టులోకి తీసుకుంటే విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. టోర్నీ కీలక దశలో సీఎస్కేకు ఈ పరిస్థితి రావడం, ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను భారీగా ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే ఆ జట్టు ఆడిన 6 మ్యాచ్‌ల్లో రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ఈ దశలో ఉన్నపాటి అడపాదడపా వనరులు కూడా దూరం కావడంతో సీఎస్కే పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
స్టార్స్ ఆడతారా?
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరు మ్యాచ్‌లు ఆడినా మహేంద్ర సింగ్ ధోని ఇంకా బరిలోకి దిగలేదు. గాయం నుంచి కోలుకుంటున్న అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరోవైపు ముంబై ఇండియన్స్ ఆరు మ్యాచ్‌లు ఆడగా... తొలి నాలుగు మ్యాచ్‌లలో బరిలోకి దిగిన రోహిత్ శర్మ గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య వాంఖెడే మైదానంలో జరిగే మ్యాచ్‌లో వీరిద్దరు బరిలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు భారత స్టార్లు బుధవారం సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. అయితే గత మ్యాచ్‌కు ముందు కూడా సాధన చేసినా... చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఈసారి వారి పునరాగమనం మళ్లీ ఆసక్తిగా మారింది. టోర్నీలో ఇరు జట్లు ప్రస్తుతం చెరో నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా ముంబై ఏడో స్థానంలో, చెన్నై ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాయి. నాలుగు వరుస పరాజయాల తర్వాత తిలక్ వర్మ మెరుపులతో గత మ్యాచ్‌లో నెగ్గిన ముంబై సొంతగడ్డపై అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. డికాక్, నమన్ ధీర్‌లతో పాటు సూర్యకుమార్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా రాణిస్తే భారీ స్కోరుకు అవకాశం ఉంది. బౌలింగ్‌లో బుమ్రా ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం కాగా, అశ్వని కుమార్ కూడా ఆకట్టుకున్నాడు. ఇద్దరు విదేశీ స్పిన్నర్లు సాంట్నర్, ఘజన్ఫర్ ప్రత్యర్థిని కట్టడి చేయగలరు. మరోవైపు వరుసగా రెండు విజయాలతో కోలుకున్నట్లు అనిపించిన చెన్నై గత పోరులో హైదరాబాద్ చేతిలో ఓడి మళ్లీ వెనుకబడింది. సంజూ సామ్సన్ ఫర్వాలేదనిపిస్తున్నా, కెప్టెన్ రుతురాజ్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. పైగా సత్తా చాటిన యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రే గాయంతో టోర్నీకి దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ. టాపార్డర్‌లో అతని స్థానంలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి. -
సీఎస్కేకు భారీ షాక్.. టోర్నీ నుంచి అతడు అవుట్
వరుస ఓటములతో నిరాశలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్న ఏకైక ఆటగాడు ఆయుశ్ మాత్రే టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇందుకు సంబంధించి సీఎస్కే మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.టోర్నీ మొత్తానికి దూరం‘‘సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఏప్రిల్ 18 నాటి మ్యాచ్ సందర్భంగా ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) తొడ కండరాలు పట్టేశాయి. ఆయుశ్ ఈ గాయం నుంచి కోలుకోవడానికి సుమారు 6-12 వారాల సమయం పడుతుంది. కాబట్టి ఐపీఎల్-2026లో మిగిలిన సీఎస్కే మ్యాచ్‌లన్నింటికీ అతడు దూరమయ్యాడు’’ అని సీఎస్కే తమ ప్రకటనలో పేర్కొంది.కాగా తాజా ఎడిషన్‌లో సీఎస్కే తరపున వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆయుశ్ మాత్రే.. ఆరు మ్యాచ్‌లు ఆడి 201 పరుగలు సాధించాడు. అత్యధిక స్కోరు 73. ముంబైకి చెందిన ఆయుశ్ మాత్రే భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఇటీవలే వరల్డ్‌కప్ అందించాడు.గతేడాది రీప్లేస్మెంట్ ప్లేయర్‌గా సీఎస్కేలో చేరిన ఆయుశ్ మాత్రే ఓపెనర్‌గా రాణించాడు. ఈ ఏడాది సంజూ శాంసన్- రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా రాగా.. ఆయుశ్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి అదరగొట్టాడు. చివరగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లోనే 30 పరుగులతో దుమ్ములేపాడు.ఆయుశ్ స్థానంలో ఎవరు?అయితే, ఆ సమయంలోనే అతడి తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ కాసేపు క్రీజులో ఉన్న ఆయుశ్.. ఆ తర్వాత నొప్పి తాళలేక మైదానం వీడాడు. ఇక మంచి ఫామ్‌లో ఉన్న ఆయుశ్ సేవలను కోల్పోయిన సీఎస్కేకు.. అతడి బ్యాటింగ్ స్థానాన్ని భర్తీ చేయడం అంత తేలికేమీ కాదు. ఆయుశ్ స్థానంలో ఉర్విల్ పటేల్ లేదంటే కార్తిక్ శర్మను తుదిజట్టులో ఆడించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఎంఎస్ ధోని ఫిట్నెస్ లేక ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరోవైపు ఖలీల్ అహ్మద్ కూడా జట్టుకు దూరమయ్యాడు. ఇలాంటి తరుణంలో ఆయుశ్ కూడా జట్టును వీడటంతో సీఎస్కేకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికి ఈ సీజన్లో సీఎస్కే.. ఆరు మ్యాచ్‌లు ఆడి రెండే గెలిచింది.చదవండి: టీమిండియాలోకి సంచలన ఫాస్ట్ బౌలర్! -
అతడు కాదా!.. నిర్ణయం మార్చుకున్న CSK?
గతేడాది కాలంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు కలిసి రావడం లేదు. ఐపీఎల్-2025లో ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో చిట్టచివరగా పదో స్థానంలో నిలిచిన చెన్నై.. ఈ ఏడాది కూడా వైఫల్యాలు కొనసాగిస్తోంది.గాయాల బెడద ఇప్పటికి ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ సేన.. కేవలం రెండు మాత్రమే గెలిచి.. నాలుగు ఓడిపోయింది. మరోవైపు.. మూలిగే నక్కమీద తాటిపండు పడినట్లు గాయాల బెడద కూడా సీఎస్కేకు తలనొప్పిగా మారింది. దిగ్గజ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఫిట్నెస్ సమస్యల వల్ల ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.ఆయుశ్ దూరంసన్రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా ఫామ్‌లో ఉన్న ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) గాయపడ్డాడు. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడుతున్న సమయంలో ఆయుశ్ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ‘ఇది చాలా బాధాకరం. ఆయుశ్ చక్కటి ఫామ్‌లో ఉన్నాడు. అతడు జట్టుకు దూరం కావడం చాలా ఇబ్బందికరం. అయితే గాయం తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంది. ఎప్పటిలోగా కోలుకుంటాడనేది ఇప్పుడే చెప్పలేం’ అని చెన్నై బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ ఇప్పటికే స్పష్టం చేశాడు.ఇక ఆయుశ్ కంటే ముందు సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ కూడా గాయపడి జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్‌తో అతడి స్థానం భర్తీ చేయాలని సీఎస్కే యాజమాన్యం తొలుత భావించినట్లు సమాచారం. ఇందుకోసం అతడిని ట్రయల్స్‌కు పిలిపించినట్లు తెలుస్తోంది.అతడు కాదా!.. నిర్ణయం మార్చుకున్న CSK?దీంతో ఆకాశ్ ఆగమనం ఫిక్సైపోయిందనే వార్తలు రాగా.. తాజా సమాచారం ప్రకారం తమ మాజీ బౌలర్ రాజవర్దన్ హంగర్గేకర్ను కూడా చెన్నై యాజమాన్యం ట్రయల్స్‌కు పిలిచినట్లు క్రిక్‌బజ్ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ కంటే కూడా రాజవర్దన్ వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ధోని కోలుకుంటున్నాడని.. అయితే, అతడు ఎప్పుడు బరిలోకి దిగుతాడనే విషయంపై తనకు కూడా స్పష్టత లేదని సీఎస్కే కోచ్ మైక్ హస్సీ పేర్కొనడం గమనార్హం.చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్‌ట్రాలు వద్దు.. పాక్ బోర్డుకు ఘాటు కౌంటర్ -
సన్‌రైజర్స్ మ్యాచ్‌లో బ్లాక్ మ్యాజిక్..! అందుకే సీఎస్కే ఓడిపోయింది?
ఐపీఎల్-2026 సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్ మైదానం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ గెలుపొందింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానానికి చేరుకుంది. ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది.అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే.. సీఎస్కే ఇన్నింగ్స్ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సీఎస్కే బ్యాటర్ దూబే క్రీజులో ఉన్నప్పుడు గ్యాలరీలో ఉన్న ఒక ఎస్ఆర్హెచ్ అభిమాని నిమ్మకాయ చేతిలో పట్టుకుని ఏవో మంత్రాలు చదువుతున్నట్లు కెమెరా కంటికి చిక్కాడు.వెంటనే శివమ్ దూబే.. సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో సదరు అభిమాని సంబరాల్లో మునిగితేలిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బ్లాక్ మ్యాజిక్ కారణంగానే దుబే ఔట్ అయ్యాడని సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.మరి కొంతమంది మంత్రాలకు చింతకాయలు రాలవంటూ మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సంఘటనపై సీఎస్కే యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసిందంటూ ఓ లెటర్ హెడ్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.చదవండి: BCCI: అజిత్ అగార్కర్ భవితవ్యంపై బీసీసీఐ సంచలన నిర్ణయంpic.twitter.com/u3BSpB3sXa— gocvideo (@gocvideo) April 19, 2026 -
ఆ మూడు ఓవర్లే కొంపముంచాయి: రుతురాజ్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్లు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను కట్టడి చేసినప్పటికీ.. ఆతర్వాత బ్యాటర్లు లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. ఒక్క బ్యాటర్ కుదురుగా క్రీజ్‌లో నిలబడినా, ఈ మ్యాచ్‌లో సీఎస్కే గెలిచేదే.ఛేదనలో సగం మ్యాచ్ వరకు పట్టు నిలుపుకున్న సీఎస్కే, ఆతర్వాత అనూహ్యంగా ఒత్తిడికి చిత్తై లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 195 పరుగుల ఛేదనలో సీఎస్కే స్కోర్ 10 ఓవర్ల తర్వాత 111-3గా ఉండింది. ఈ దశలో ఆ జట్టు గెలుపు నల్లేరుపైనడకే అనుకున్నారు. అయితే ఆతర్వాత మూడు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయి. 11, 12, 13 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆ ఓవర్లలో సీఎస్కే కేవలం 9 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది.ఆతర్వాత ఓవర్లలోనూ సీఎస్కే బ్యాటర్లు అడపాదడపా పరుగులు చేసి గెలుపుపై ఆశలు సజీవంగానే ఉంచారు. అయితే చివరి ఓవర్లలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కే బ్యాటర్లను కట్టడి చేశారు. ఛేదించదగ్గ లక్ష్యమే (6 బంతుల్లో 18 పరుగులు) కళ్ల ముందు ఉన్నా, సీఎస్కే బ్యాటర్లు దాన్ని అందుకోలేకపోయారు. ఫలితంగా సునాయాసంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో సీఎస్కే ఓడింది.ఈ ఓటమి అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇలా అన్నాడు. ఇలాంటి పిచ్‌పై 195 పరుగుల లక్ష్యం ఏ రోజైనా సాధ్యమే. తొలుత 220–230 స్కోరు వచ్చేలా అనిపించింది. కానీ మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి 30-40 పరుగులు నిరోధించగలగారు. 10 ఓవర్ల తర్వాత 80 పరుగులు మాత్రమే అవసరం. 6 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఒక్క భాగస్వామ్యం నెలకొల్పగలిగినా మ్యాచ్ మాదే. కానీ ఆతర్వాత 3 ఓవర్లలో కేవలం 9 పరుగులే రావడం మ్యాచ్ స్వరూపాన్ని మర్చేసింది. డెత్ ఓవర్లలో 12–13 రన్స్ ఛేజ్ చేయడం కష్టంగా మారింది.మా బౌలింగ్ యూనిట్‌ను ప్రశంసించాలి. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. పవర్‌ప్లేలో అభిషేక్ శర్మ బాగా ఆడినా, ఆతర్వాత మొమెంటమ్ తిరిగి పొందాం. జేమీ ఓవర్టన్, గుర్జప్నీత్ సింగ్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్.. అందరూ బాగా బౌలింగ్ చేశారు.ముఖ్యంగా అన్షుల్ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇందు కోసం అతను చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. చాలా స్పష్టంగా తన ప్లాన్స్ చెప్పి, కెప్టెన్ నేను ఇలా చేస్తానని నమ్మకంగా చెప్పే బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు. మొత్తంగా అన్షుల్ ప్రతిరోజూ మెరుగుపడుతున్నాడు. రుతురాజ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఈ మ్యాచ్‌లో ఓడినా, అతని బౌలర్లపై సంతృప్తిగానే ఉన్నాడు. ఛేదించదగ్గ లక్ష్యమే అయినా, కొద్ది ఓవర్లు కొంపముంచాయని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా సీఎస్కే హ్యాట్రిక్ ఓటములు, రెండు వరుస విజయాల తర్వాత మరో ఓటమిని మూటగట్టుకొని పాయింట్ల పట్టికలో ఏదో స్థానంలో కొనసాగుతుంది. -
సన్‌రైజర్స్ అదరహో
సన్‌రైజర్స్ బ్యాటింగ్ మొదలైన తీరును బట్టి జట్టు కనీసం 220కు పైగా స్కోరు చేస్తుందని అనిపించింది. అయితే చివర్లో బ్యాటర్ల వైఫల్యంతో స్కోరు 200 కూడా దాటలేదు. చెన్నై ఇన్నింగ్స్‌లో ఆయుశ్ మాత్రే ఆటను చూస్తేసునాయాసంగా ఆ జట్టు లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. కానీ రైజర్స్ బౌలర్లు ఒక్కసారిగా చెలరేగిపోయారు. బంతిపై పట్టు చేజారనీయకుండా ప్రత్యర్థిని కట్టిపడేశారు. ఐదుగురు బౌలర్లు కనీసం ఒక వికెట్ తీయడంతో చెన్నై చతికిలపడింది. హైదరాబాద్ ఖాతాలో మూడో గెలుపు చేరింది. అంతకుముందు అభిషేక్ శర్మ, క్లాసెన్ మెరుపులతో చెన్నైపై హైదరాబాద్ తమ అత్యధిక స్కోరును నమోదు చేసింది. సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జోరును ప్రదర్శిస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో వరుస విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో చివరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో రైజర్స్ 10 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (22 బంతుల్లో 59; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), క్లాసెన్ (39 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... అన్షుల్ కంబోజ్, ఒవర్టన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులకే పరిమితమైంది. మాథ్యూ షార్ట్ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు), ఆయుశ్ మాత్రే (13 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా, ఇషాన్ మలింగకు 3 వికెట్లు... నితీశ్ కుమార్ రెడ్డికి 2 వికెట్లు దక్కాయి. ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరం రాగా, ప్రఫుల్ హింగే 7 పరుగులే ఇచ్చాడు. కెప్టెన్ విఫలం... షార్ట్ వేసిన తొలి ఓవర్లో 4 పరుగులే రావడంతో రైజర్స్ ఇన్నింగ్స్ ప్రశాంతంగా మొదలైంది. అయితే ఆ తర్వాత అభిషేక్ శర్మ దూకుడు మొదలైంది. తర్వాతి రెండు ఓవర్లలో ఒక్కో సిక్స్ బాదిన అభిషేక్... కంబోజ్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అయితే మరో ఎండ్‌లో ముకేశ్ ఓవర్లో 3 ఫోర్లు బాది ధాటిని పెంచినట్లు కనిపించిన ట్రవిస్ హెడ్ (20 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. హెడ్‌ను అవుట్ చేసిన ముకేశ్ తర్వాతి బంతికే కెప్టెన్ ఇషాన్ కిషన్ (0) వికెట్ కూడా తీయడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 75 పరుగులకు చేరింది. కొద్దిసేపటికే ఒవర్టన్ తన తొలి ఓవర్లోనే అభిషేక్‌ను వెనక్కి పంపించాడు. ఈ దశలో క్లాసెన్ కొన్ని చక్కటి షాట్లతో స్కోరు పెంచే బాధ్యత తీసుకున్నాడు. మరోవైపు అనికేత్ వర్మ (2) ప్రభావం చూపలేకపోగా, ఉప్పల్‌లో గత రెండు మ్యాచ్‌లలో రాణించిన నితీశ్ కుమార్ రెడ్డి (12; 1 సిక్స్) ఈసారి విఫలమయ్యాడు. నూర్ అహ్మద్ ఓవర్లో భారీ సిక్స్ కొట్టిన క్లాసెన్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. చివర్లో సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేసి ప్రత్యర్థిని నిలువరించడంలో సఫలమయ్యారు. ఆఖరి 4 ఓవర్లలో రైజర్స్ 31 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు చేజార్చుకుంది. మాత్రే మినహా... ఛేదనలో చెన్నై ఆరంభంలోనే సంజు సామ్సన్ (7) వికెట్ కోల్పోయింది. తొలి బంతికే సిక్స్ కొట్టినా అతను ఎక్కువసేపు నిలవలేకపోయాడు. సున్నా వద్ద తాను ఇచ్చిన క్యాచ్‌ను క్లాసెన్ వదిలేయడంతో బతికిపోయిన మాత్రే ఆ తర్వాత దూకుడు ప్రదర్శించాడు. హింగే ఓవర్లోనే అతను 4 ఫోర్లు, 1 సిక్స్ బాది 22 పరుగులు రాబట్టడం విశేషం. అయితే క్లాసెన్ అద్భుత క్యాచ్‌తో మాత్రే ఇన్నింగ్స్ ముగియగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (19) వైఫల్యం ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. పవర్‌ప్లేలో జట్టు 76 పరుగులు చేసింది. ఆ తర్వాత ఒక్క బ్యాటర్ కూడా బాధ్యతతో జట్టును నడిపించలేకపోయాడు. సర్ఫరాజ్ ఖాన్ (19 బంతుల్లో 25; 3 ఫోర్లు) తడబడుతూనే ఆడగా, షార్ట్ కూడా దూకుడు చూపించలేదు. హైదరాబాద్ మెరుగైన బౌలింగ్‌తో ఒత్తిడి పెరిగి జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. శివమ్ దూబే (16 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్)పై ఆశలు ఉండగా... 20 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుట్ కావడంతో గెలుపు దారులు మూసుకుపోయాయి. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) సామ్సన్ (బి) ఒవర్టన్ 59; హెడ్ (సి) రుతురాజ్ (బి) ముకేశ్ 23; ఇషాన్ కిషన్ (సి) రుతురాజ్ (బి) ముకేశ్ 0; క్లాసెన్ (బి) కంబోజ్ 59; అనికేత్ (సి) నూర్ (బి) ఒవర్టన్ 2; నితీశ్ రెడ్డి (సి) షార్ట్ (బి) ఒవర్టన్ 12; అరోరా (సి) బ్రెవిస్ (బి) గుర్జప్నీత్ 13; లివింగ్‌స్టోన్ (సి) బ్రెవిస్ (బి) కంబోజ్ 1; శివాంగ్ (సి) గుర్జప్నీత్ (బి) కంబోజ్ 12; హింగే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–75, 2–75, 3–93, 4–112, 5–147, 6–177, 7–179, 8–193, 9–194. బౌలింగ్: షార్ట్ 3–0–38–0, ముకేశ్ చౌదరి 2–0–21–2, కంబోజ్ 3–0–22–3, నూర్ 4–0–33–0, ఒవర్టన్ 4–0–37–3, గుర్జప్నీత్ 4–0–34–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) క్లాసెన్ (బి) నితీశ్ రెడ్డి 7; రుతురాజ్ (సి) అరోరా (బి) మలింగ 19; మాత్రే (సి) క్లాసెన్ (బి) నితీశ్ రెడ్డి 30; షార్ట్ (సి) అనికేత్ (బి) మలింగ 34; సర్ఫరాజ్ (సి) నితీశ్ రెడ్డి (బి) మలింగ 25; బ్రెవిస్ (సి) లివింగ్‌స్టోన్ (బి) శివాంగ్ 0; దూబే (బి) సాకిబ్ 21; ఒవర్టన్ (సి) లివింగ్‌స్టోన్ (బి) హింగే 16; కంబోజ్ (నాటౌట్) 13; నూర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–15, 2–66, 3–66, 4–112, 5–113, 6–148, 7–154, 8–182. బౌలింగ్: ప్రఫుల్ హింగే 4–0–60–1, నితీశ్ రెడ్డి 4–0–31–2, సాకిబ్ 4–0–32–1, ఇషాన్ మలింగ 4–0–29–3, శివాంగ్ 3–0–18–1, అభిషేక్ 1–0–13–0.షార్ట్‌పై అభిషేక్ దాడి... ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన మాథ్యూ షార్ట్ బ్యాటర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 3 బంతులాడిన అభిషేక్ 2 పరుగులే చేయగలిగాడు. అయితే ఆ తర్వాత అభిషేక్ తానేంటో షార్ట్‌కు చూపించాడు. అతని రెండో ఓవర్లో ఒక సిక్స్ కొట్టిన అతను... మూడో ఓవర్లో చెలరేగిపోయాడు. తొలి బంతికి హెడ్ సింగిల్ తీయగా... తర్వాతి ఐదు బంతుల్లో వరుసగా 4, 4, 4, 6, 6 బాది 20 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 15 బంతుల్లోనే అభిషేక్ అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాత 51 పరుగుల వద్ద దూబే అతని క్యాచ్‌ను వదిలేసినా...దాని వల్ల ఎక్కువ ప్రయోజనం కలగలేదు.ధోని ఆడలేదు... భారత స్టార్ మహేంద్ర సింగ్ ధోని ఆటను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులకు నిరాశ తప్పలేదు. గాయం కారణంగా టోర్నీ ఆరంభం నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోని టీమ్‌తో పాటు హైదరాబాద్‌కు వచ్చాడు. శుక్రవారం ప్రాక్టీస్‌లో కూడా అతను పాల్గొన్నాడు. దాంతో బరిలోకి దిగవచ్చని అనిపించింది. అయితే మరోసారి ధోని పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. 2025 సీజన్ షెడ్యూల్లో భాగంగా ఉప్పల్‌లో హైదరాబాద్, చెన్నై మధ్య మ్యాచే జరగలేదు. ఈసారి ఆ మ్యాచ్ వచ్చినా... ధోని ఆట మాత్రం నగర ఫ్యాన్స్ చూడలేకపోయారు. 2024లో ఆడిన మ్యాచ్‌లో ధోని 2 బంతులే ఎదుర్కొన్నాడు! -
ఎస్ఆర్హెచ్ను గెలిపించిన బౌలర్లు
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం సీఎస్కేతో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీ త 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 3 వికెట్లతో ఆకట్టుకోగా, నితీశ్ కుమార్ 2 వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (59) మెరుపు అర్థసెంచరీతో ఆకట్టుకోగా, క్లాసెన్ (59) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మినహా మిగతావారు పరుగులు చేయడంలో విఫలం కావడంతో ఎస్ఆర్హెచ్ 200 స్కోరు మార్కును దాటలేకపోయింది. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్, జేమి ఓవర్టన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా, ముకేశ్ చౌదరీ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఛేదనను సీఎస్కే ధాటిగానే ఆరంభించింది. ఆరంభంలోనే ఓపెనర్ సంజూ శాంసన్ ఔటైనప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన ఆయుశ్ మాత్రే 13 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 30 పరుగులు సాధించాడు. మిడిలార్డర్లో సర్ఫరాజ్ ఖాన్ (25), మాథ్యూ షార్ట్ (34) పరుగులతో పర్వాలేదనిపించారు. ఆఖర్లో ఓవర్టన్ (16) కాస్త ప్రతిఘటించినప్పటికీ ఎస్ఆర్హెచ్ బౌలర్లు కఠినంగా బంతులేయడంతో సీఎస్కే ఓటమి దిశగా పయనించింది. -
సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం సీఎస్కేతో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 3 వికెట్లతో ఆకట్టుకోగా, నితీశ్ కుమార్ 2 వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (59) మెరుపు అర్థసెంచరీతో ఆకట్టుకోగా, క్లాసెన్ (59) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.150 పరుగుల వద్ద సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయింది. 34 పరుగుల చేసిన మాథ్యూ షార్ట్ ఇషాన్ మలింగ బౌలింగ్‌లో అనికేత్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 14 ఓవర్లలో సీఎస్కే 135/514 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే ఐదు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ 32, శివమ్ దూబే 10 పరుగులతో ఆడు తున్నారు.బ్రెవిస్ డకౌట్113 పరుగుల వద్ద సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను శివాంగ్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు.ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో సీఎస్కే 112 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఇషాన్ మలింగ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 11 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే నాలుగు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. 66 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. ఇషాన్ మలింగ బౌలింగ్‌లో కెప్టెన్ రుతురాజ్ (19) వెనుదిరిగాడు. అంతకముందు ధాటిగా ఆడుతున్న ఆయుశ్ మాత్రే నితీశ్‌రెడ్డి బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.దంచికొడుతున్న సీఎస్కేఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో సీఎస్కే దంచికొడుతుంది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (30), రుతురాజ్ (14) క్రీజులో ఉన్నారు.195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన శాంసన్ నితీశ్‌కుమార్ రెడ్డి బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సీఎస్కే టార్గెట్ 195 పరుగులుసీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) అర్థసెంచరీలతో రాణించారు. వీరిద్దరు రాణించినప్పటికీ మిగతావారు విఫలం కావడంతో ఎస్ఆర్హెచ్ 200 స్కోరును దాటలేకపోయింది. సీఎస్కే బౌలర్లలో జేమి ఓవర్టన్, అన్షుల్ కంబోజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.ఏడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్సీఎస్కేతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 179 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన సాహిల్ అరోరా గుర్జప్నీత్ సింగ్ బౌలింగ్‌లో డెవాల్డ్ బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఎస్ఆర్హెచ్ 177 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది. 18వ ఓవర్లో క్లాసెన్ (59) కంబోజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఎస్ఆర్హెచ్ 150 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయింది. 13వ ఓవర్లో నితీష్‌కుమార్ (12) ఓవర్టన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.12 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. క్లాసెన్ 30, నితీశ్‌రెడ్డి 4 పరుగులతో ఆడు తున్నారు.సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 59 పరుగులు చేసిన అభిషేక్ శర్మ జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ముకేశ్ చౌదరీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన ఇషాన్ రుతురాజ్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.అభిషేక్ హాఫ్ సెంచరీ..సీఎస్కేతో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 75 పరుగులు చేసింది. 22 పరుగులు చేసిన హెడ్ ముకేశ్‌చౌదరీ బౌలింగ్‌లో రుతురాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 26, హెడ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్ తలపడు తున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. ఐపీఎల్ చరిత్రలో ముఖాముఖి పోరులో ఇరుజట్లు 22 సార్లు తలపడ్డాయి. ఇందులో సీఎస్కే 15 విజయాలలు, ఎస్ఆర్హెచ్ 7 విజయాలు సాధించాయి. చివరి ఐదు మ్యాచ్‌ల విషయానికొస్తే ఎస్ఆర్హెచ్ 3, సీఎస్కే రెండింట నెగ్గాయి.సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగచెన్నై సూపర్ కింగ్స్ : సంజు శాంసన్ (వికెట కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్ -
సన్‌రైజర్స్ జట్టులోకి యార్కర్ల కింగ్?
ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్దమైంది. శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. గత మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ఘన విజయం సాధించిన ఎస్ఆర్హెచ్.. ఇప్పుడు అదే జోరును సీఎస్కేపై కొనసాగించాలని పట్టుదలతో ఉంది.అయితే ఫిట్నెస్ టెస్టు క్లియర్ చేసి ఎస్ఆర్హెచ్ జట్టుతో కలిసిన కెప్టెన్ పాట్ కమ్మిన్స్.. ఈ మ్యాచ్‌కు మాత్రం అందుబాటులో లేడు. ఏప్రిల్ 25న రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో కమ్మిన్స్ ఆడనున్నాడు. కాగా సీఎస్కేతో మ్యాచ్‌కు ఎస్ఆర్హెచ్ తుది జట్టులో ఓ కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.భారీగా పరుగులు సమర్పించుకుంటున్న పేసర్ ఇషాన్ మలింగను పక్కన పెట్టాలని సన్‌రైజర్స్ మేనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. గత సీజన్లో తన అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న మలింగ.. ప్రస్తుత సీజన్లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు.ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన మలింగ.. 10.40 ఏకానమీతో ఏకంగా 156 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే అతడి స్ధానంలో మరో శ్రీలంక స్పీడ్ స్టార్ దిల్షాన్ మధుశంకకు అవకాశమివ్వాలని ఎస్ఆర్హెచ్ భావిస్తుందంట. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన మధుశంకకు అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. ముఖ్యంగా అతడు పిన్ పాయింట్ యార్కర్లు బౌలింగ్ చేయగలడు. మధుశంక ఇటీవలే బ్రైడన్ కార్స్ స్ధానంలో జట్టులోకి చేరాడు. గత మ్యాచ్‌లో సత్తాచాటిన ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్‌తో మధుశంక బంతిని పంచుకునే అవకాశముంది. ఒకవేళ నలుగురు పేసర్లతో ఎస్ఆర్హెచ్ ఆడాలని భావిస్తే మలింగకు బదులుగా స్పిన్నర్ హర్ష్ దూబేను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది.సీఎస్కేతో మ్యాచ్‌కు ఎస్ఆర్హెచ్ తుది జట్టు(అంచనా)ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్( కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, దిల్షాన్ మధుశంక, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే(ఇంపాక్ట్ సబ్)చదవండి: BAN vs PAK: పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఒకేసారి నలుగురికి! -
ఉప్పల్‌లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
సన్‌రైజర్స్ x సూపర్ కింగ్స్
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. నేడు (శనివారం) జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. సొంత మైదానంలో గత మ్యాచ్‌లో చెలరేగి రాజస్తాన్‌ను చిత్తు చేసిన రైజర్స్ అదే జోరును కొనసాగించి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరో వైపు తొలి మూడు మ్యాచ్‌లలో ఓటముల తర్వాత కోలుకున్న సీఎస్కే వరుస రెండు విజయాలతో ఫామ్‌లోకి వచ్చింది. ఇరు జట్లు ఐదు మ్యాచ్‌ల తర్వాత రెండేసి విజయాలతో సమంగా ఉన్న నేపథ్యంలో పైచేయి ఎవరు సాధిస్తారనేది చూడాలి. 2025 సీజన్లో హైదరాబాద్, చెన్నై మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగలేదు. కుర్రాళ్లు మళ్లీ చెలరేగేనా... గత మ్యాచ్‌లో యువ బౌలర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ పదునైన బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌ను గెలిపించారు. ఉప్పల్ స్టేడియంలో వీరిద్దరు మళ్లీ అదే తరహా ప్రదర్శనను పునరావృతం చేయాలని జట్టు కోరుకుంటోంది. స్పిన్నర్లు శివాంగ్, హర్ష్ దూబే కూడా ప్రత్యర్థిని నిలువరించగలరు. అయితే మెరుగైన బౌలింగ్ వనరులు కనిపిస్తున్నా...టీమ్ మళ్లీ తమ బ్యాటింగ్ బలాన్నే నమ్ముకుంది. ఈ సీజన్లో సొంతగడ్డపై రెండు మ్యాచ్‌లలో ‘డకౌట్’ అయిన అభిషేక్ శర్మ ఈ సారైనా చెలరేగాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. హెడ్ కూడా ఇంకా తన స్థాయి ప్రదర్శనను చూపించలేదు. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. రెండు మ్యాచ్‌లలో కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్న క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి మళ్లీ సత్తా చాటాల్సి ఉంది. ముఖ్యంగా క్లాసెన్ స్ట్రయిక్‌రేట్‌లో గతంతో పోలిస్తే తక్కువగా ఉంటోంది. దీనిని అతను అధిగమిస్తే భారీ ఇన్నింగ్స్ ఖాయం. నితీశ్ మాత్రం ప్రతీ మ్యాచ్‌లో అంచనాలను అందుకుంటున్నాడు. రుతురాజ్ రాణించేనా... చెన్నై గత రెండు విజయాల్లో ఓపెనర్‌గా సంజు సామ్సన్ కీలక పాత్ర పోషించగా, యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రమే చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడాడు. బ్రెవిస్, సర్ఫరాజ్ కూడా అంచనాలకు అనుగుణంగా దూకుడుగా ఆడుతున్నారు. టాప్–5లో ఈ నలుగురు బ్యాటింగ్‌తోనే సీఎస్కే మెరుగైన ఫలితాలు రాబట్టగలిగింది. అయితే జట్టును ఆందోళనపరుస్తున్న అంశం కెప్టెన్ రుతురాజ్ ఫామ్ మాత్రమే. ఐదు మ్యాచ్‌లలో రుతురాజ్ వరుసగా 6, 28, 7, 15, 7 పరుగులు మాత్రమే సాధించాడు. ఇలాంటి స్థితిలో కెప్టెన్‌నుంచి ఒక మంచి ఇన్నింగ్స్‌ను జట్టు కోరుకుంటోంది. చివర్లో దూబే, ఒవర్టన్ కూడా ధాటిగా ఆడితే చెన్నై భారీ స్కోరు చేయడం ఖాయం. బౌలింగ్‌లో సీఎస్కే కొంత బలహీనంగానే కనిపిస్తోంది. స్పిన్నర్లు నూర్, అకీల్ మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నా...పేసర్లు గుర్జప్నీత్ సింగ్, ఒవర్టన్, కంబోజ్ భారీగా పరుగులిస్తున్నారు. ఈ సీజన్లో మెరుగ్గా ఆడిన ఖలీల్ అహ్మద్ గాయంతో టోర్నీకి దూరం కావడం చెన్నైని ఇబ్బంది పెట్టే అంశం. అతని స్థానంలో ఎవరికి చోటిస్తారనేది చూడాలి. ఐపీఎల్లో నేటి మరో మ్యాచ్బెంగళూరు X ఢిల్లీ వేదిక: బెంగళూరుమధ్యహ్నం 3: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ధోని వచ్చేశాడు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ అమితాసక్తిని రేపుతోంది. గత మ్యాచ్‌లో గెలిచిన హైదరాబాద్ అదే జోరును కొనసాగించాలని భావిస్తుండగా...వరుసగా రెండు విజయాల తర్వాత చెన్నై కూడా అమితోత్సాహంతో బరిలోకి దిగనుంది. అయితే స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్‌లోనైనా ఆడతాడా లేదా అనేదే అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. గాయంతో బాధపడుతున్న ధోని ఇప్పటి వరకు సీఎస్కే ఆడిన ఐదు మ్యాచ్‌లలో కూడా బరిలోకి దిగలేదు. కోల్‌కతాతో జరిగిన గత మ్యాచ్‌కు ముందు ధోని సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. మ్యాచ్ ఆడకపోయినా పూర్తి ఫిట్‌గా కనిపించాడు. చెన్నైలో ఆగిపోకుండా అతను హైదరాబాద్‌కు రావడంతోనే మ్యాచ్ ఆడతాడనే అంచనాలు పెరిగాయి. గురువారం ఫ్యామిలీతో కలిసి నగరానికి వచ్చిన ధోనిని చూసేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. -
హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ధోని!
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆరంభంలో తడబడినప్పటికీ వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన సీఎస్కే గాడిన పడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), సీఎస్కే మధ్య ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ధోని బరిలోకి దిగుతాడా లేదా అనేది స్పషత రాలేదు. కానీ ధోని మాత్రం జట్టుతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతకముందు చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన సీఎస్కే జట్టు ఫొటోలు, ధోని వీడియోనూ చెన్నై సూపర్‌కింగ్స్ ప్రత్యేకంగా పంచుకుంది. ‘మేము వస్తున్నాం, హైదరాబాద్’ అని తెలుగులో క్యాప్షన్ జత చేసింది. ఆ వీడియోలో ధోని సింహంలా నడుచుకుంటూ రాగా.. ధోని ముందు, వెనుక సెక్యూరిటీ బందోబస్తు గట్టిగా కనిపిస్తోంది. ఇక ఎస్ఆర్హెచ్, సీఎస్కే మ్యాచ్‌కు సంబంధించి టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. కేవలం ధోనిని చూసేందుకే అభిమానులు భారీగా తరలిరానున్నారు. మ్యాచ్‌లో ఆడినా ఆడకపోయినా తలా ఒక్కసారి మైదానంలో దర్శనమిస్తే చాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మాత్రం ధోని బరిలోకి దిగనున్నట్లు అధికారికంగా సమాచారం అందింది. ఒకవేళ ధోని జట్టులోకి వస్తే మాత్రం సర్ఫరాజ్‌ఖాన్ డగౌట్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక సీఎస్కే ఈ సీజన్లో 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, మూడు ఓటములతో 8వ స్థానంలో ఉంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ కూడా 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో ఉన్నప్పటికీ, మెరుగైన రన్‌రేట్ కారణంగా పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది.🚨 IT'S OFFICIAL MS DHONI IS TRAVELING TO HYDERABAD WITH THE CSK TEAM pic.twitter.com/lXc4qHavBp— ` (@WorshipDhoni) April 16, 2026𝙈𝙚𝙢𝙪 𝙫𝙖𝙨𝙩𝙪𝙣𝙣𝙖𝙢, Hyderabad 🥳🦁#WhistlePodu #Yellove pic.twitter.com/oIT9uwxnTm— Chennai Super Kings (@ChennaiIPL) April 16, 2026చదవండి: ఎంసీఏ కీలక నిర్ణయం.. క్రికెట్ చరిత్రలో తొలిసారి! -
సీఎస్కేకు ఘోర అవమానం.. ఆర్సీబీపై బీసీసీఐకి ఫిర్యాదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఉన్న రైవలరీ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా మైదానం హాస్ ఫుల్ అవ్వాల్సిందే. అయితే ఈ వైర్యం ఇప్పుడు మైదానం దాటి భారత క్రికెట్ బోర్డు వరకు వెళ్లింది.ఐపీఎల్-2026లో భాగంగా ఏప్రిల్ 5న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, సీఎస్కే జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఫలితం పక్కన పెడితే.. స్టేడియంలో తమ ఆటగాళ్లను, తమిళ సంస్కృతిని కించపరిచేలా ప్రవర్తించారంటూ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసింది.ఏమి జరిగిందంటే?సీఎస్కే ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు ’దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ’ అంటూ ఓ ట్రాక్‌ను డీజే ప్లే చేశారు. అయితే ఇవి దక్షిణాదికి చెందిన ప్రజలు ఎక్కువగా తినే ఆహార పదార్థాలు. ఈ ట్రాక్‌పై సీఎస్కే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. "దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ" అనే పదాలను వాడుతూ తమిళనాడు గుర్తింపును ఎగతాళి చేశారని సీఎస్కే తమ ఫిర్యాదులో పేర్కొంది.సాధారణంగా డీజేలు హోమ్ టీమ్‌కు మద్దతుగా ఉంటారు. ఆ విషయాన్ని నేను తప్పు పట్టడం లేదు. కానీ చిన్నస్వామి స్టేడియంలో పరిస్థితి భిన్నంగా ఉంది. మా ఆటగాళ్లు అవుట్ అయినప్పుడు డీజే కించపరిచాడు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఈ విషయం పై మేము బీసీసీఐకి లేఖ రాశాము" అని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ తెలిపాడు. కాగా ఈ "దోశ, ఇడ్లీ" పాట వివాదం గత ఏడాది నుంచే నడుస్తోంది. గత సీజన్లో ఆర్సీబీ ప్లేయర్ జితేష్ శర్మ ఈ పాట పాడటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అప్పట్లో చెపాక్ స్టేడియంలో జితేష్ అవుట్ అయినప్పుడు అదే పాటను ప్లే చేసి సీఎస్కే డీజే బదులిచ్చారు. కానీ సీఎస్కే మేనెజ్మెంట్ జోక్యం చేసుకుని ప్రత్యర్థి ఆటగాళ్లను టార్గెట్‌గా చేసుకుని కించపరచొద్దని ఆదేశాలు ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు ఈ పాట వివాదం వెలుగులోకి వచ్చింది.చదవండి: సీఎస్కేకు కోలుకోలేని దెబ్బ.. ఐపీఎల్ నుంచి రూ. 4 కోట్ల ప్లేయర్ అవుట్ -
సీఎస్కేకు కోలుకోలేని దెబ్బ.. ఐపీఎల్ నుంచి రూ. 4 కోట్ల ప్లేయర్ అవుట్
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్నాడు. ఈ టోర్నీలో భాగంగా ఏప్రిల్ 14న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖలీల్ గాయపడ్డాడు.17వ ఓవర్ చివరి బంతిని వేయడానికి రన్-అప్ తీసుకుంటున్న సమయంలో అతడి కుడి తొడ కండరాలు పట్టేశాయి. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడికి నొప్పి తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో ఖలీల్ మైదానాన్ని వీడాడు. ఆ ఓవర్లోని మిగిలిన బంతిని గుర్జాపనీత్ సింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అతడిని స్కానింగ్‌కు తరలించారు.అయితే వైద్య పరీక్షలలో ఖలీల్ అహ్మద్‌కు గ్రేడ్ 2 క్వాడ్రిసెప్స్ టియర్ (కండరాల పగుళ్లు) అయినట్లు నిర్ధారణ అయింది. అతడు తన గాయం నుంచి కోలుకోవడానికి కనీసం 10 నుండి 12 వారాల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో అతడు మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు ఖలీల్ స్ధానాన్ని మరో ఫాస్ట్ బౌలర్‌తో సీఎస్కే భర్తీ చేయనుంది.ఇప్పటికే ఎంఎస్ ధోని సేవలను కోల్పోయిన సీఎస్కే నిజంగా ఇదొక భారీ షాక్ అనే చెప్పాలి. ఖలీల్ తన పేస్ బౌలింగ్‌తో పవర్‌ప్లే స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఖలీల్ ఈ ఏడాది సీజన్లో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టినప్పటికి.. తన అద్భుత బౌలింగ్‌తో పవర్‌ప్లేలో పరుగులు రాకుండా కట్టడి చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు ఖలీల్‌ను రూ.4.8 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది.చదవండి: గాయంపై అప్డేట్ ఇచ్చిన కోహ్లి -
ధోని ఆగమనం.. అతడిపై వేటు తప్పదా!
ఐపీఎల్ 2026 సీజన్లో రెండు వరుస విజయాలతో జోష్ మీద కనిపిస్తున్న చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తన్న ధోని ఎంట్రీకి సంబంధించి సీఎస్కే యాజమాన్యం కీలక అప్డేట్ ఇచ్చింది. తాజా సమాచారం మేరకు అనుకున్నదానికంటే ముందుగానే ధోని సీఎస్కే జట్టుతో జాయిన్ అవ్వనున్నాడు. ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ధోని బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కండరాల గాయంతో టోర్నీలో సీఎస్కే ఆడిన తొలి మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ధోని కేకేఆర్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని అంతా భావించారు. ధోని ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు కూడా బయటికి వచ్చాయి. కానీ ధోని కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆడలేదు. కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ధోని ఏప్రిల్ 18న సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఆడతాడా లేదా అన్నది స్పష్టంగా తెలియదు. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు సంబంధించి టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడైపోయాయి. అయితే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మాత్రం కచ్చితంగా బరిలోకి దిగనున్నాడు.సర్ఫరాజ్ స్థానానికి ఎసరు?అయితే ధోని జట్టులోకి రానుండడంతో ఎవరు తమ స్థానాన్ని త్యాగం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. శాంసన్, ఆయుశ్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబేలను పక్కనబెట్టే సాహసం చేయకపోవచ్చు. కాబట్టి సీఎస్కే ముందున్న ఆప్షన్ సర్ఫరాజ్ ఖాన్ మాత్రమే. ఈ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. పరుగులు సాధిస్తున్నప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. దీంతో ధోని జట్టులోకి వస్తే సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సీఎస్కే సీజన్లో ఐదు మ్యాచ్‌లాడి రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది.చదవండి: బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెటర్! -
చెన్నై గెలుపు చమక్
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగిన పోరులో చెన్నై సూపర్‌కింగ్స్‌దే పైచేయి అయింది. సొంతగడ్డ చెపాక్‌లో అసాధారణ ప్రదర్శన లేకపోయినా... ప్రత్యర్థితో పోలిస్తే మెరుగైన ఆటతీరు కనబర్చిన సీఎస్కే మరో రెండు పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. సామ్సన్, బ్రెవిస్ తమ బ్యాటింగ్‌తో చెప్పుకోదగ్గ స్కోరును అందించగా, బౌలింగ్‌లో నూర్ అహ్మద్ మూడు వికెట్లతో జట్టు విజయానికి బాటలు వేశాడు. మరోవైపు కోల్‌కతా ప్రతీ మ్యాచ్‌కు దిగజారుతున్న ఆటతో అట్టడుగున తాము నిలిచిన స్థానాన్ని మరింత స్థిరపర్చుకున్నట్లయింది. అన్ని రంగాల్లో విఫలమైన మాజీ చాంపియన్ ఐదు మ్యాచ్‌ల తర్వాత కూడా ఒక్కటీ గెలవలేక చతికిలపడింది. చెన్నై: వరుసగా మూడు ఓటముల తర్వాత కోలుకొని గత మ్యాచ్‌లో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు ఐపీఎల్ 19వ సీజన్లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో చెన్నై 32 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (32 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), బ్రెవిస్ (29 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 38; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నూర్ అహ్మద్ (3/21) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. కెప్టెన్ మళ్లీ విఫలం... అరోరా వేసిన ఇన్నింగ్స్ తొలి మూడు బంతులను ఫోర్లుగా మలచి సామ్సన్ శుభారంభం అందించగా, మరోవైపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (7) వైఫల్యం కొనసాగింది. ఆ తర్వాత గ్రీన్ ఓవర్లో మాత్రే చెలరేగిపోయాడు. రెండో బంతికి ఫోర్ కొట్టిన అతను, చివరి మూడు బంతుల్లో వరుసగా 4, 6, 6, బాదాడు. అరోరా ఓవర్లో కూడా తొలి మూడు బంతుల్లో వరుసగా ఫోర్లు కొట్టిన మాత్రే అదే ఓవర్ చివరి బంతికి వెనుదిరిగాడు.పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరు 72/2కు చేరింది. ఈ దశలో సామ్సన్, బ్రెవిస్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే త్యాగి బౌలింగ్‌లో అద్భుత సిక్స్ కొట్టిన సామ్సన్ 148.1 కిలోమీటర్ల వేగంతో దూసుకొచి్చన తర్వాతి బంతికే బౌల్డయ్యాడు. అనంతరం వరుణ్, అరోరా ఓవర్లలో కలిపి సర్ఫరాజ్ ఖాన్ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు), బ్రెవిస్ 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35 పరుగులు రాబట్టడంతో జట్టు కోలుకుంది. అయితే వీరిద్దరు 9 పరుగుల వ్యవధిలో అవుట్ కాగా... సీఎస్కే చివరి 4 ఓవర్లలో కేవలం 3 ఫోర్లతో 30 పరుగులు మాత్రమే సాధించగలిగింది! టపటపా... ఛేదనలో కోల్‌కతా పూర్తిగా తడబడింది. ఫిన్ అలెన్ (1) మళ్లీ విఫలం కాగా, సునీల్ నరైన్ (17 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రం కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. పవర్‌ప్లేలో కేకేఆర్ 36 పరుగులు మాత్రమే సాధించింది. ప్రత్యర్థి పవర్‌ప్లేతో పోలిస్తే ఇవి సగం పరుగులు మాత్రమే! ఇక్కడే జట్టు విజయావకాశాలకు దెబ్బ పడింది. ఆ తర్వాత కూడా టీమ్ ఏమాత్రం కోలుకోలేకపోయింది. నూర్ వరుస బంతుల్లో రహానే (22 బంతుల్లో 28; 2 సిక్స్‌లు), గ్రీన్ (0)లను అవుట్ చేశాడు. నూర్ తర్వాతి ఓవర్లో రింకూ సింగ్ (6) కూడా డగౌట్ చేరడంతో కోల్‌కతా గెలుపు ఆశలు ముగిసిపోయాయి. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: సామ్సన్ (బి) త్యాగి 48; రుతురాజ్ (సి) పావెల్ (బి) రాయ్ 7; మాత్రే (సి) రమణ్‌దీప్ (బి) అరోరా 38; బ్రెవిస్ (సి) అరోరా (బి) త్యాగి 41; సర్ఫరాజ్ (బి) నరైన్ 23; దూబే (నాటౌట్) 13; ఒవర్టన్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–25, 2–72, 3–111, 4–162, 5–171. బౌలింగ్: అరోరా 4–0–55–1, గ్రీన్ 2–0– 30–0, అనుకూల్ 3–0–21–1, నరైన్ 4–0–21–1, వరుణ్ 3–0–26–0, త్యాగి 4–0–35–2. కోల్‌కతానైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: అలెన్ (సి) దూబే (బి) కంబోజ్ 1; నరైన్ (సి) గుర్జప్నీత్ (బి) ఖలీల్ 24; రహానే (సి) రుతురాజ్ (బి) నూర్ 28; రఘువంశీ (సి) బ్రెవిస్ (బి) హొసీన్ 27; రింకూ (సి) దూబే (బి) నూర్ 6; గ్రీన్ (బి) నూర్ 0; పావెల్ (నాటౌట్) 31; రమణ్‌దీప్ (సి) సర్ఫరాజ్ (బి) కంబోజ్ 35; రాయ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–13, 2–29, 3–79, 4–85, 5–85, 6–90, 7–153. బౌలింగ్: ఖలీల్ 3.5–0–24–1, కంబోజ్ 4–0– 32–2, హొసీన్ 4–0–26–1, నూర్ 4–0– 21–3, గుర్జప్నీత్ 1.1–0–23–0, ఒవర్టన్ 3–0–32–0. -
IPL 2026: నల్ల రిబ్బన్లతో బరిలోకి.. కారణమదే!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా 22వ మ్యాచ్‌లో సీఎస్కే, కేకేఆర్ తలపడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్‌కు ఇరుజట్ల ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగడం ఆసక్తి కలిగించింది. అయితే ఇరుజట్ల ఆటగాళ్లు ఏకకాలంలో నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగడం వెనుక ఒక కారణముంది. గత వారం (ఏప్రిల్ 9న) భారత అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్, చెన్నై క్రికెట్ దిగ్గజం దొరైస్వామి గోపీనాథ్ (96) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సంతాపంగా సీఎస్కే, కేకేఆర్ ఫ్రాంచైజీలు నివాళి ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే గోపీనాథ్ మరణం పట్ల గౌరవసూచకంగా ఆటగాళ్లంతా నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. కాగా 1951లో ఇంగ్లండ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గోపీనాథ్ తన కెరీర్లో భారత్ తరపున 8 టెస్టులు ఆడారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మద్రాస్ తరపున ఆడన 83 మ్యాచ్‌లు ఆడారు. గోపీనాథ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే మెరుపుగలు మెరిపించాడు. తన అరంగేట్ర టెస్టులో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మొదటి ఇన్నింగ్స్‌లో 50 (నాటౌట్), రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మొత్తంగా ఆయన 8 మ్యాచ్‌లలో 242 పరుగులు చేశారు. .@ChennaiIPL and @KKRiders are wearing black armbands as a mark of respect to former India cricketer C.D. Gopinath, who breathed his last on April 9.#TATAIPL | #CSKvKKR pic.twitter.com/Zv9NxNjAp6— IndianPremierLeague (@IPL) April 14, 2026 -
ఐపీఎల్ షెడ్యూల్లో కీలక మార్పు!
ఐపీఎల్ 2026 సీజన్లో షెడ్యూల్‌కు సంబంధించి బీసీసీఐ కీలక మార్పు చేసింది. అహ్మదాబాద్‌లో మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లకు సంబంధించి మ్యాచ్ వేదికలను స్వాప్ చేస్తూ బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఒక ప్రకటన విడుదల చేశారు. విషయంలోకి వెళితే.. సీజన్ తొలి దశలో ఏప్రిల్ 26న అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈ మ్యాచ్ వేదికను చెన్నై చిదంబరం స్టేడియానికి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మ్యాచ్ సమయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇక మే 21 ఈ రెండు జట్లు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మరోసారి తలపడాల్సి ఉంది. తాజాగా ఈ వేదికను అహ్మదాబాద్‌కు మారుస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఐపీఎల్ 19వ సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ 4 మ్యాచ్‌ల్లో ఒక విజయంతో పట్టికలో 9వ స్థానంలో ఉండగా, గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతుంది.చదవండి: తిక్క కుదిరింది.. ఆర్సీబీ బ్యాటర్‌కు షాక్! -
ఢిల్లీపై చెన్నై అద్భుత విజయం
-
‘నా సెంచరీ వెనుక ఆ 50 సెకన్లు.. అతడికే అంకితం’
ఐపీఎల్ 2026 సీజన్లో ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్‌కింగ్స్ ఎట్టకేలకు బోణీ చేసింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత గెలుపు రుచి చూసింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 23 పరుగుల తేడాతో గెలుపొందింది. సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మూడు వరుస ఓటముల తర్వాత సెంచరీతో జట్టును గెలిపించడం సంతోషంగా ఉందన్నాడు. వరుసగా విఫలమైనప్పటికీ జట్టు మేనేజ్మెంట్ తనపై నమ్మకం ఉంచడం గొప్ప విషయమన్నాడు. తన సెంచరీని సీఎస్కే కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్‌కు అంకితమిస్తున్నట్లు శాంసన్ తెలిపాడు. శాంసన్ మాట్లాడుతూ.. ‘ఈసెంచరీ నాకు ఎంతో ముఖ్యం. నిజాయితీగా చెప్పాలంటే నాపై నమ్మకంతో చెన్నై ఫ్రాంచైజీ ట్రేడింగ్‌లో నన్ను దక్కించుకుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనప్పుడు వారి నమ్మకాన్ని కోల్పోతున్నానేమోననిపించింది. కానీ ఇవాళ బాధ్యతా యుతంగా ఆడి సెంచరీ చేయడంతో పాటు వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాను. ఇంతకాలం ఒక ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించి ఇప్పుడు మరో కొత్త ఫ్రాంచైజీకి ఆడడం కొంత కష్టమే. కానీ నాకు చెన్నై విషయంలో అది ఏనాడు కనిపించలేదు. చెన్నైకి ఆడుతుంటే నేను మరో సొంత ఇంటికి వచ్చానన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. అందరూ ప్రశాంతంగా కనిపిస్తున్నారు. అయితే వరుసగా మూడు ఓటములు చవిచూసినప్పటికీ ఇవాళ మ్యాచ్‌కు ముందు మేమంతా కేవలం 50 సెకన్లు మాత్రమేమీటింగ్ పెట్టుకున్నాం. ఆ యాబై సెకన్లు నేను ఒక టీమ్‌తో ఎంత కనెక్ట్ అయ్యాననేది చూపించింది. నేను గతంలో చాలాసార్లు విఫలమయ్యాను. అలాంటప్పుడు మనసు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. కానీ నా బేసిక్స్ ఏంటో తెలుసుకొని వాటిని పాటించడమే ముఖ్యం. అందుకోసం మా సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి కొన్ని మంచి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నాను. మ్యాచ్‌లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడం చాలా అవసరం. ఆయుష్ చాలా పరిణతితో ఆడాడు. మా కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కోసమే నా సెంచరీని సెలెబ్రేట్ చేసుకున్నాను. పరిస్థితులు ఎంత సవాలుగా ఉంటాయో నాకు తెలుసు. అందుకే ఈ ఇన్నింగ్స్‌ను ఆయనకు అంకితం చేయాలనుకున్నాను.’ అని తెలిపాడు.🗣️🗣️ 𝙄𝙩 𝙛𝙚𝙚𝙡𝙨 𝙡𝙞𝙠𝙚 𝙘𝙤𝙢𝙞𝙣𝙜 𝙩𝙤 𝙖𝙣𝙤𝙩𝙝𝙚𝙧 𝙝𝙤𝙢𝙚 🏠Sanju Samson reflects on his match-winning knock and the love from the Chennai crowd 💛 Updates ▶️ https://t.co/BzGc6O65jX #TATAIPL | #KhelBindaas | #CSKvDC | @IamSanjuSamson | @ChennaiIPL pic.twitter.com/H4X2sug3sB— IndianPremierLeague (@IPL) April 11, 2026#CSK fans, bring out the whistles 💛A first win of the season for the 5⃣-time #TATAIPL champions 👏Scorecard ▶️ https://t.co/BzGc6O65jX #KhelBindaas | #CSKvDC | @ChennaiIPL pic.twitter.com/tS2xyOWgdj— IndianPremierLeague (@IPL) April 11, 2026చదవండి: చరిత్ర సృష్టించిన శాంసన్.. ధోని కూడా సాధ్యం కాలేదు -
చరిత్ర సృష్టించిన శాంసన్.. ధోని కూడా సాధ్యం కాలేదు
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు తన రిథమ్‌ను అందుకున్నాడు. శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.తొలి మూడు మ్యాచ్‌లలో విఫలమైన సంజూ.. ఢిల్లీపై మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు. శాంసన్ కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున సెంచరీ బాదిన మొట్టమొదటి వికెట్ కీపర్-బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.2008 నుండి సీఎస్కే పూర్తిస్థాయి కీపర్‌గా ఉన్న ఎంఎస్ ధోనికి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. ధోనీ అత్యధిక స్కోరు 84 పరుగులుగా ఉంది. అయితే ధోని దాదాపుగా లోయార్డర్‌లోనే బ్యాటింగ్‌కు రావడంతో ఒక్కసారి మూడంకెల స్కోర్‌ను అందుకోలేకపోయాడు. కానీ సంజూ మాత్రం సీఎస్కే తరపున తొలి ఎడిషన్‌లో సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు.చదవండి: ఆ తప్పే మా కొంపముంచింది: సన్‌రైజర్స్ కెప్టెన్🚨 SANJU SAMSON SCORED THE FIRST HUNDRED IN IPL 2026 🚨Chetta at Chepauk. 🔥 pic.twitter.com/XXWiX1P3nP— Johns. (@CricCrazyJohns) April 11, 2026 -
శతక్కొట్టిన సంజూ.. బోణీ కొట్టిన సీఎస్కే
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్(60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫాథుమ్ నిస్సాంక(41), అశుతోష్ శర్మ(19) రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లలో జేమీ ఓవర్టన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్ మూడు, నూర్ అహ్మద్, ఖలీల్ తలా వికెట్ సాధించారు.సంజూ సూపర్ సెంచరీఅంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సంజూ కేవలం 52 బంతుల్లోనే తన నాలుగో ఐపీఎల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా సంజూ 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఆయూశ్ మాత్రే(59) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఓ వికెట్ సాధించాడు.చదవండి: IPL 2026: చెలరేగిన శాంసన్.. చెపాక్‌లో సూపర్ సెంచరీ -
చెలరేగిన శాంసన్.. చెపాక్‌లో సూపర్ సెంచరీ
ఐపీఎల్-2026లో తొలి సెంచరీ నమోదైంది. చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. తొలి మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన సంజూ.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలర్లను తన ట్రేడ్ మార్క్ షాట్లతో సంజూ ఉతికారేశాడు.కేవలం 52 బంతుల్లోనే నాలుగో ఐపీఎల్ సెంచరీ మార్కును సంజూ అందుకున్నాడు. సీఎస్కే జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ త్వరగా కోల్పోయినప్పటికి.. సంజూ మాత్రం యువ ఆటగాడు ఆయూశ్ మాత్రేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వారిద్దరూ రెండో వికెట్‌కు 100కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగినప్పటికి, సంజూ మాత్రం తన జోరును కొనసాగించాడు.మొత్తంగా 56 బంతుల్లో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. అక్షర్ పటేల్ ఒక్కడే ఓ వికెట్ సాధించాడు.అయూశ్ మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. కాగా ఐపీఎల్-2026 వేలానికి ముందు సంజూ శాంసన్‌ను రూ. 18 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ నుంచి సీఎస్కే ట్రేడ్‌చేసుకుంది. అయితే తొలి మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే (6, 7, 9 పరుగులు) అవుట్ అయ్యి విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు తన సూపర్ సెంచరీతోనే విమర్శలకు సమాధనమిచ్చాడు.చదవండి: ఆ తప్పే మా కొంపముంచింది: సన్‌రైజర్స్ కెప్టెన్ -
ఢిల్లీపై సీఎస్కే గ్రాండ్ విక్టరీ
Chennai super kings vs delhi capitals live Updates: ఢిల్లీపై సీఎస్కే గ్రాండ్ విక్టరీఐపీఎల్-2026లో సీఎస్కే తొలి విజయాన్ని నమోదు చేసింది. చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్(60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫాథుమ్ నిస్సాంక(41), అశుతోష్ శర్మ(19) రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లలో జేమీ ఓవర్టన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్ మూడు, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.ఓటమి దిశగా ఢిల్లీఢిల్లీ విజయానికి చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు కావాలి. క్రీజులో స్టబ్స్(60), కుల్దీప్ యాదవ్(3) ఉన్నారు.ఢిల్లీ ఆరో వికెట్ డౌన్అశుతోష్ రూపంలో ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన అశుతోష్.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 30 బంతుల్లో 60 పరుగులు కావాలి.ఢిల్లీ ఐదో వికెట్ డౌన్డేవిడ్ మిల్లర్ రూపంలో ఢిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన మిల్లర్.. ఓవర్టన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. క్రీజులో స్టబ్స్(34), అశుతోష్ శర్మ(9)ఉన్నారు.10 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 91/410 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో ట్రిస్టన్ స్టబ్స్(11), డేవిడ్ మిల్లర్(6) ఉన్నారు. ఢిల్లీ విజయానికి 57 బంతుల్లో 121 పరుగులు కావాలి.ఢిల్లీ నాలుగో వికెట్ డౌన్ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన అక్షర్ పటేల్.. గుర్జప్నీత్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు స్కోర్: 73/3ఢిల్లీ రెండో వికెట్ డౌన్పాథుమ్ నిస్సాంక రూపంలో ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన నిస్సాంక.. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్61 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో నిస్సాంక(41), రిజ్వీ ఉన్నారు.సంజూ సూపర్ సెంచరీ.. సీఎస్కే భారీ స్కోర్చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సంజూ కేవలం 55 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 పరుగులు చేశాడు. అతడితో పాటు అయూశ్ మాత్రే(59), దూబే(10 బంతుల్లో 20) రాణించారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. అక్షర్ పటేల్ ఒక్కడే ఓ వికెట్ సాధించాడు. అయూశ్ మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు.సంజూ శాంసన్ సెంచరీ17వ ఓవర్లో సంజూ శాంసన్ ఫోర్ బాది సెంచరీ నమోదు చేశాడుఈ సీజన్లో 52 బంతుల్లో తొలిసెంచరీ చేశాడుఢిల్లీపై 3సిక్స్‌లు,14 ఫోర్లతో సంజూ సెంచరీ పూర్తి చేశాడు ఆయూష్ ఔట్ 17వ ఓవర్లో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది17వ ఓవర్ నటరాజన్ బౌలింగ్‌లో సీఎస్కే బ్యాట్స్‌మెన్ ఆయూష్ ఔటయ్యాడు 55 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం సంజు, ఆయుష్ రెండో వికెట్‌కు 55 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు క్రీజులో సంజు 95, ఆయుష్ 55 17 ఓవర్లకు చెన్నై స్కోర్ 174/1 12 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 119-1, క్రీజులో సంజూ శాంసన్(77), ఆయూష్ మాత్రే(25) ఉన్నారు.శాంసన్ హాఫ్ సెంచరీఐపీఎల్-2026 సీజన్లో సీఎస్కే సూపర్ స్టార్ సంజూ శాంసన్ తొలి హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 52 పరుగులతో సంజూ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 8.5 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 77/1సీఎస్కే తొలి వికెట్ డౌన్సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6.2 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 62/. క్రీజులో సంజూ శాంసన్(46), అయూశ్ మాత్రే ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న సంజూసంజూ శాంసన్ ఎట్టకేలకు తన రిథమ్‌ను అందుకున్నాడు. 22 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 3 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 27/1టాస్ గెలిచిన ఢిల్లీ..ఐపీఎల్-2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ రెండు మార్పులతో బరిలోకి దిగింది. తుది జట్టులోకి అకిబ్ నబీ, అశుతోష్ శర్మ తుది జట్టులోకి వచ్చారు.జమ్మూ కాశ్మీర్ పేసర్ అకిబ్ నబీకి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. సీఎస్కే కూడా రెండు మార్పులు చేసింది. విధ్వంసకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ తిరిగి పునరాగమనం చేశాడు. అదేవిధంగా గుర్జప్నీత్ సింగ్ సీఎస్కే తరపున ఐపీఎల్ డెబ్యూ చేశాడు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఔకిబ్ నబీ, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్ -
బుమ్రా, హార్దిక్‌లను గుర్తించింది అతడే.. చెన్నైకి ఎవరున్నారు?
చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సరైన ఆటగాళ్లను ఎంచుకోవడంలో సీఎస్కే విఫలమైందని విమర్శించాడు. గతేడాది నుంచి సీఎస్కే వైఫల్యాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఐపీఎల్-2025 సీజన్లో పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచి పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది చెన్నై. తమ చరిత్రలో ఇంతటి ఘోర పరాభవం పొందడం ఇదే తొలిసారి. ఇక తాజాగా ఐపీఎల్-2026లో ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలైంది. ఒక్కొక్కరికి రూ. 14 కోట్లా?ఇదిలా ఉంటే.. మినీ వేలంలో భాగంగా ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలకు ఒక్కొక్కరికి రూ. 14 కోట్లకు పైగా చొప్పున సీఎస్కే ఖర్చు చేసింది. వీరి ప్రదర్శన మాత్రం ధరకు తగ్గట్లుగా లేదు. వీరిద్దరు ఇప్పటికే అరంగేట్రం చేసినా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇక సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో సుబ్రమణ్యం బద్రీనాథ్ మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ కోసం ఆటగాళ్లను వెదికేందుకు హేమంగ్ బదానీ, వేణుగోపాల్ రావు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లీగ్‌లలో ప్రతి మ్యాచ్ చూస్తూ ఆటగాళ్లను వెలికి తీస్తారు.సీఎస్కే కోసం ఈ పని చేసేందుకు ఎవరున్నారు? ఎవరో ఇచ్చిన సలహాలను పాటించి ఒక్కొక్కరికి రూ. 14 కోట్ల చొప్పున ఇద్దరు ఆటగాళ్ల కోసం డబ్బంతా ధారపోశారు. ప్రతిభావంతులైన ఆటగాళ్ల కోసం సీఎస్కే అసలు ప్రయత్నిస్తోందా?’’ అని చెన్నై మేనేజ్మెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.బుమ్రా, హార్దిక్‌లను గుర్తించింది అతడేఈ సందర్భంగా టీమిండియా స్టార్, దిగ్గజ పేస్ బౌలర్‌గా ఎదిగిన జస్ప్రీత్ బుమ్రా గురించి సుబ్రమణ్యం బద్రీనాథ్ ప్రస్తావించాడు. ‘‘అన్ని జట్లకు మంచి స్కౌట్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్‌కు మహేళ జయవర్దనే, రిక్కీ పాంటింగ్ కోచ్‌లుగా ఉన్నా.. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాల ప్రతిభను గుర్తించింది మాత్రం జాన్ రైట్. ఇలాంటి విషయాల్లో సీఎస్‌కు చాలా వెనుకబడి ఉంది. స్కౌటింగ్ విషయంలో వాళ్లకు అసలు సరైన విధానమే లేదు’’ అని సుబ్రమణ్యం బద్రీనాథ్ విమర్శించాడు.చదవండి: చారిత్రక ద్వైపాక్షిక సిరీస్‌ను ప్రకటించిన పాకిస్తాన్ -
శాంసన్ మంచి మనసు.. సెల్ఫీ అడిగిన అభిమానికి ఊహించని సర్ప్రైజ్
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన మంచి మనసు చాటుకున్నాడు. సంజూ తన అభిమానికి మర్చిపోలేని బహుమతిని అందించాడు. ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సంజూ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎస్కే తమ చివరి మ్యాచ్‌లో ఏప్రిల్ 5న ఆర్సీబీతో తలపడంది. అయితే చెన్నై ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు వారం రోజుల గ్యాప్ లభించడంతో సంజూ తిరువనంతపురంకు వెళ్లాడు. ఈ క్రమంలో సంజూ మంగళవారం ముండూరు-తూత రోడ్డులో ఫోన్ కాల్ మాట్లాడటం కోసం రోడ్డు పక్కన తాను కారు ఆపాడు. అయితే అదే సమయంలో కేబుల్ టెక్నీషియన్‌గా పనిచేసే శబరీష్, తన స్నేహితుడు మణికంఠన్‌తో కలిసి బైక్‌పై క్రికెట్ ఆడటానికి వెళ్తున్నాడు. కార్లో సంజూ ఉండడంతో చూసి తన బైక్‌ను అతడు ఆపాడు. శాంసన్ తన ఫోన్ కాల్ ముగించిన తర్వాత శబరీష్‌తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడు. ఫొటో దిగుదామా అని సంజూనే స్వయంగా అడిగాడు. శబరీష్ తన ఫోన్ తీసి సెల్ఫీ తీసుకున్నాడు. అయితే ఆ ఫోన్ డిస్ప్లే పూర్తిగా పగిలిపోయి ఉండటాన్ని సంజూ గమనించాడు. దీంతో వెంటనే సంజూ తన వద్ద ఉన్న రూ. 40,000 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను శబరీష్‌కు బహుమతిగా ఇచ్చాడు. సదరు అభిమాని సంతోషంలో మునిగితేలిపోయాడు. కాగా టీ20 ప్రపంచకప్‌లో దుమ్ములేపిన సంజూ శాంసన్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు.చదవండి: IPL 2026: జోస్ బట్లర్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 23 పరుగులు! వీడియో -
చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్!
మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాది కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐదు మ్యాచ్‌లు ఆడి గాయం వల్ల దూరం కాగా.. దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని మరోసారి పగ్గాలు చేపట్టాడు. అయితే, జట్టు సమిష్టి వైఫల్యం కారణంగా ధోని కెప్టెన్సీపై కూడా మచ్చ పడింది.గతేడాది సీఎస్కే ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. సీఎస్కే చరిత్రలో ఇంతటి ఘోర ప్రదర్శన నమోదు చేయడం ఇదే తొలిసారి.ధోనితో పాటు అతడూ దూరంఇక ఐపీఎల్-2026లోనూ చెన్నైకి ఏదీ కలిసిరావడం లేదు. ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ రుతురాజ్ సేన పరాజయం పాలైంది. ఫినిషర్ ధోని (MS Dhoni)తో పాటు పవర్ హిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. వీరిద్దరు లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది.PC: BCCIకాగా చెన్నై తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. సీఎస్కే సొంతమైదానం చెపాక్ స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్‌కు ధోని అందుబాటులోకి వస్తాడని మేనేజ్మెంట్ తొలుత సంకేతాలు ఇచ్చింది. అతడు ఫిట్నెస్ టెస్టుకు హాజరుకాబోతునట్లు తెలిపింది.ఢిల్లీతో మ్యాచ్‌కు కూడా రాలేడు!అయితే, తాజా సమాచారం ప్రకారం ఢిల్లీతో మ్యాచ్‌కు కూడా ధోని దూరం కానున్నట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. ధోని పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించడానికి ఇంకో వారం రోజులు పట్టనున్నట్లు సమాచారం. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఏప్రిల్ 14న జరిగే మ్యాచ్ నాటికి ధోని అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.ధోని, బ్రెవిస్‌ల గురించి సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘ధోని రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాడు. అతడు ఎప్పటికి కోలుకుంటాడో స్పష్టంగా చెప్పలేము. ఇక బ్రెవిస్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే, అతడు పూర్తిగా కోలుకుంటేనే మైదానంలో దిగుతాడు’’ అని తెలిపాడు. చదవండి: అతడి గురించే మా చర్చ.. అస్సలు భయమేలేదు: హార్దిక్ పాండ్యా -
అన్నింటా విఫలం.. ‘తలా’ లేక సీఎస్కే ఆగమాగం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు (సీఎస్కే) అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుంది. ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలవడంతో పాటు 12 సార్లు ప్లేఆఫ్స్ చేరిన జట్టుగా చెన్నై రికార్డు సొంతం. ధోని నేతృత్వంలో అద్భుత ఆటను ప్రదర్శించిన సీఎస్కే 2023లో చివరిసారి ఐపీఎల్ టైటిల్ అందుకుంది. ఆ తర్వాతి సీజన్ నుంచి సీఎస్కే ఆటతీరు దారుణంగా పడిపోతు వస్తోంది. గత నాలుగేళ్లుగా ధోనీ జట్టులో ఉన్నా అతడి పాత్ర అంతంతమాత్రమే. ఇక ఈ సీజన్లో సీఎస్కే ఆటతీరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త ఆటతీరుతో హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది.దారుణమైన నెట్ రన్‌రేట్‌తో పట్టికలో సీఎస్కే ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. అయితే గతంలో ఇలా వరుస ఓటములు చవిచూసినప్పటికీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయిన సీఎస్కేకు ఈసారి మాత్రం ఆ చాన్స్ లేదనిపిస్తోంది.గతంలో సీఎస్కే అంటే వయసు మీరిన ఆటగాళ్లే ఎక్కువగా కనిపిస్తుండేవారు. దీంతో ఆ జట్టుకు వృద్ధాప్య జట్టుగా పేరుండేది. కానీ అదే వెటరన్ టీంతోనే ధోని ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిపెట్టాడు. కానీ ఈసారి సీఎస్కే కూడా గేర్ మార్చింది. జట్టును మొత్తం యువ ఆటగాళ్లతో నింపే ప్రయత్నం చేసింది. అందుకు జడేజా, సామ్ కరన్ వంటి సీనియర్లను విడుదల చేసిన సీఎస్కే ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ లాంటి కుర్రాళ్ల కోసం అధిక మొత్తంలో ఖర్చు చేసి జట్టులోకి తీసుకొచ్చింది. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. యువ రక్తంతో నిండిన జట్టు ఈసారి అద్భుతాలు చేస్తుందని ఆశించారు చెన్నై అభిమానులు. కానీ ఆ జట్టు తొలి మూడు మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో చతికిలపడింది. రాజస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో 127 పరుగులకే కుప్పకూలిన సీఎస్కే.. రెండో మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ లాంటి కుర్రాళ్ల ప్రదర్శనతో 209 పరుగులు చేసి కూడా పంజాబ్ బ్యాటర్లను నిలువరించలేక ఓటమి చవిచూసింది. ఇక మూడో మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్లను ఆర్సీబీ బ్యాటర్లు ఒక ఆట ఆడుకున్నారు. 251 పరుగుల కొండంత లక్ష్యం ఛేదించే క్రమంలో చతికిలపడి హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది.కెప్టెన్‌గా రుతురాజ్ విఫలం..2024 సీజన్లో సీఎస్కే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్ వైఫల్యం కూడా సీఎస్కేను ఇబ్బందుల్లో పడేసింది. 2024 సీజన్లో 583 పరుగులు సాధించి రెండో టాప్ స్కోరర్‌గా నిలిచిన రుతురాజ్ 2026 సీజన్లో మాత్రం అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా దారుణంగా విఫలమవుతున్నాడు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిలువున్న రుతురాజ్ ఆర్సీబీతో మ్యాచ్‌లో ఓటమికి తానే బాధ్యత తీసుకుంటున్నట్లు చెప్పడం ఆసక్తి కలిగించింది. గత సీజన్లలో కెప్టెన్సీ ఎలా ఉన్నా బ్యాటర్ రాణించేవాడు రుతురాజ్. కానీ ఈసారి అదీ లేదు. 6, 28, 7.. ఇవీ మూడు ఇన్నింగ్స్ ల్లో అతడి స్కోర్లు. వేగంగా ఆడలేని బలహీనతను అతను అధిగమించలేకపోతున్నాడు. కెప్టెన్‌గా జట్టును సమష్టిగా నడిపించడంలోనూ రుతురాజ్ విఫలమవుతున్నాడు. బౌలింగ్, ఫీల్డింగ్ పకడ్బందీగా సాగలేదు. ధోనిలా అందుబాటులో ఉన్న బౌలింగ్ వనరులను రుతురాజ్ సమర్థంగా ఉపయోగించుకోలేకపోతున్నాడనే వాదన గట్టిగా వినిపిస్తోంది.సంజూకు ఏమైంది?రాజస్తాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌కు ట్రేడ్ అయిన సంజూ శాంసన్ ఈసారి సీఎస్కే తలరాతను మారుస్తాడని అంతా ఊహించారు. కానీ టీ20 ప్రపంచకప్‌లో సంచలన ఇన్నింగ్స్‌లతో హీరో మారిన శాంసన్ ఐపీఎల్‌కు వచ్చేసరికి మాత్రం జీరో అయిపోయాడు. శాంసన్ బ్యాటింగ్‌లో నిలకడలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ఓపెనింగ్ భాగస్వామ్యం ఏ జట్టుకైనా అత్యంత కీలకం. కానీ శాంసన్, రుతురాజ్‌లు ఏకకాలంలో విఫలం కావడం కూడా సీఎస్కేను దెబ్బతీస్తోంది. సంజూ శాంసన్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ 6,7,9.. సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఓపెనర్లిద్దరూ ఆరంభంలోనే ఔటవ్వడంతో తర్వాత వచ్చేవారిపై ఒత్తిడి పెరిగి సరిగ్గా ఆడలేకపోతున్నారు. మిడిలార్డర్లో ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. కోట్లు ఖర్చు చేసిన ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలు దారుణంగా విఫలమవుతున్నారు. ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఎప్పుడు ఎలా ఆడతాడో అర్థం కాని స్థితి నెలకొంది.పసలేని బౌలింగ్..బ్యాటింగ్‌లో సమస్యలు ఇలా ఉంటే బౌలింగ్‌లో పరిస్థితి మరోలా ఉంది. అన్షుల్ కాంబోజ్ మినహా చెన్నైకి చెప్పుకోదగ్గ బౌలర్లు పెద్దగా కనిపించడం లేదు. జేమీ ఓవర్టర్, నూర్ అహ్మద్‌లు ఉన్నా వారు పెద్దగా ప్రభావం చూపడం లేదు. శివమ్ దూబే బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకప్పుడు సీఎస్కే బౌలింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో సమానత్వం కనిపించేది. కానీ ఇప్పటి జట్టులో అది కరువైంది.అదంతా గతం..ఇక కెప్టెన్‌గా సీఎస్కేకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ధోని జట్టుకు దూరమవ్వడం కూడా సీఎస్కేను డీలా పడేలా చేసింది. ధోని ఆడకున్నా సరే అతడు జట్టుతో పాటు ఉంటే అదే కొండంత బలం. బ్యాటింగ్‌లో ఊపు తగ్గినప్పటకీ వికెట్ల వెనుక ఉండి అతడిచ్చే సలహాలు జట్టుకు ఎన్నోసార్లు ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు అదంతా గతం. ధోని ఇప్పటికిప్పుడు జట్టులోకి వచ్చినా సీఎస్కేకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే గత రెండు సీజన్లలో ధోని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ సీఎస్కే లీగ్ దశకే పరిమితమైంది. మరి ఇప్పుడు ధోని వచ్చినా జట్టును ఏం మార్చగలడు అనే అభిప్రాయయాలు బలంగా వినిపిస్తున్నాయి.చదవండి: ‘తప్పు చేశావ్.. కెప్టెన్‌గా అదొక చెత్త నిర్ణయం’ -
రూ. 28 కోట్లు దండగేనా? చీప్‌గా దొరికాడు.. చితక్కొడుతున్నాడు!
ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ఈ ఏడాది సీజన్లో సీఎస్కే హ్యాట్రిక్ ఓటములను మూట కట్టుకుంది. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో చెన్నై పరాజయం పాలైంది. అయితే రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమవుతున్న చోట ఒక్కడు మాత్రం సత్తా చాటుతున్నాడు. అద్భుత ప్రదర్శనలతో సీఎస్కే మేనెజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. రెడ్ బాల్ క్రికెట్లోనూ కాదు టీ20ల్లో కూడా రాణించే సత్తా ఉందని నిరూపించుకుంటున్నాడు. అతడే ముంబై మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్.ధర తక్కువ.. క్వాలిటీ ఎక్కువగతేడాది జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో సర్ఫరాజ్ ఖాన్‌ను కేవలం రూ.75 లక్షలకు మాత్రమే సీఎస్కే కొనుగోలు చేసింది. కానీ కోట్ల ధర పలికిన సంజూ శాంసన్, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ కంటే సర్ఫరాజ్ అద్భుతమైన ప్రదర్శనమైన కనబరుస్తున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అనుహ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఖాన్.. 17 పరుగులు చేసి ఫర్వాలేదన్పించాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 12 బంతుల్లోనే 32 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కూడా సర్ఫరాజ్ బ్యాట్ ఝులిపించాడు. కేవలం 25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 పరుగులు చేశాడు. శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, అయూశ్ మాత్రే సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔట్ అయితే.. ఈ ముంబైకర్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సర్ఫరాజ్ ప్రస్తుతం 99 పరుగులతో సీఎస్కే లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. వేలంలో ఇతడిని వదిలేసిన జట్లు ఇప్పుడు ఖచ్చితంగా పశ్చాత్తాపపడుతుంటాయి.28 కోట్ల ఆటగాళ్లు విఫలంకాగా ఐపీఎల్-2026 మినీ వేలంలో సీఎస్కే ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లపై భారీ మొత్తం ఖర్చుచేసిన సంగతి తెలిసిందే.కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌లను తలా రూ.14.20 కోట్లు వెచ్చించి సీఎస్కే కొనుగోలు చేసింది. కానీ భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన వీరిద్దరూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్లో భారీ హిట్టర్‌గా పేరొందిన కార్తీక్ శర్మ.. ఐపీఎల్లో మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. దేశవాళీ ఫామ్‌ను చూసి స్కౌటింగ్ టీమ్ అతడిపై అతిగా అంచనా వేసిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జడేజాకు ప్రత్యామ్నయంగా ప్రశాంత్ వీర్‌ను సీఎస్‌ఎకే జట్టులోకి తీసుకుంది. అయితే అతడితో ఇప్పటివరకు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండు మ్యాచ్‌లు ఆడి 49 పరుగులు చేశాడు. ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ప్రశాంత్ వీర్ 29 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 రన్స్ చేసి రాణించాడు. కానీ అతడు తీసుకుంటున్న జీతానికి ఇది ఏ మాత్రం సరిపోదు.చదవండి: CSKకు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు! -
CSKకు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. గతేడాది అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచింది సీఎస్కే. పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి.. తమ చరిత్రలో తొలిసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.హ్యాట్రిక్ పరాజయాలుఇక ఐపీఎల్-2026ను కూడా చెన్నై ఓటమితోనే ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడిన సీఎస్కే.. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌కు మ్యాచ్‌ను చేజార్చుకుంది. తాజాగా ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ రుతురాజ్ గైక్వాడ్ సేన విఫలమైంది. ఈ నేపథ్యంలో చెన్నై ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.ధోని, బ్రెవిస్ దూరంఇదిలా ఉంటే.. దిగ్గజ కెప్టెన్, చెన్నైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన మహేంద్ర సింగ్ ధోని గాయం వల్ల ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో టీమిండియా టీ20 స్టార్, వరల్డ్‌కప్ విజేత సంజూ శాంసన్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.ఇక ధోనితో పాటు యువ ఆటగాడు, పవర్ హిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్ కూడా ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం సీఎస్కే తదుపరి మ్యాచ్‌కి ధోని అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ధోని ఫిట్నెస్ పరీక్షకు సిద్ధంగా ఉన్నాడు.ఇద్దరూ వచ్చేస్తున్నారుఅదే విధంగా డెవాల్డ్ బ్రెవిస్ కూడా ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా బ్రెవిస్ జట్టులో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మధ్య ఓవర్లలో విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడగల సత్తా ఈ సౌతాఫ్రికా ప్లేయర్‌కు ఉంది. ఇక ఆర్సీబీతో మ్యాచ్‌లో ఓటమి తర్వాత సీఎస్కే హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ..‘‘తదుపరి మ్యాచ్ వరకు అంతా సర్దుకుంటుందనే అనుకుంటున్నాం. తర్వాతి మ్యాచ్‌కు మాకు ఐదు రోజుల సమయం ఉంది. ఈ ఓటమి బాధించింది. అయితే, మా ప్రణాళికలకు అనుగుణంగా తదుపరి మ్యాచ్‌లో ముందడుగు వేయగలమనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నాడు. ఒకవేళ ధోని, బ్రెవిస్ తిరిగి వస్తే సీఎస్కే గాడిన పడుతుందని చెప్పవచ్చు. కాగా తదుపరి మ్యాచ్‌లో సొంత మైదానం చెపాక్ వేదికగా చెన్నై ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.చదవండి: ‘అప్పట్లో ఒకడు ఉండేవాడు వికెట్ల వెనుక!.. చిల్లర బుద్ధి’ -
‘ఇష్టం లేకపోతే తప్పుకో’.. సీఎస్కే ఫ్యాన్స్ ఆగ్రహం
టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో ఓపెనర్ సంజూ శాంసన్‌ది కీలకపాత్ర అని చెప్పొచ్చు. సూపర్-8లో వెస్టిండీస్‌తో మ్యాచ్ ద్వారా ఫామ్‌లోకి వచ్చిన సంజూ ఆ తర్వాత సెమీస్, ఫైనల్స్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అదే సూపర్‌ఫామ్‌ను ఐపీఎల్ 19వ సీజన్లోనూ కొనసాగిస్తాడని అంతా భావించిన వేళ సీన్ మొత్తం రివర్స్ అయింది.రాజస్తాన్ రాయల్స్ నుంచి ఏ ముహూర్తంలో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ట్రేడ్ అయ్యాడో కానీ దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో సీఎస్కే ఓటమి చవిచూస్తే.. శాంసన్ ఆడకపోవడం కూడా జట్టును బాగా దెబ్బతీస్తోంది. శాంసన్ ఈ సీజన్లో సీఎస్కేకు బలమవుతాడనుకుంటే దారుణ ఆటతీరుతో బలహీనంగా మారిపోయాడు. శాంసన్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ 6,7 9 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సీఎస్కే అభిమానులు సంజూ శాంసన్ ఆటతీరుపై గుస్సా అవుతున్నారు. టీ20 ప్రపంచకప్‌లో హీరోగా నిలిచిన శాంసన్ ఐపీఎల్లో జీరో అయిపోయాడంటూ ట్రోల్స్‌కు గురి చేస్తున్నారు. రాజస్తాన్ కెప్టెన్‌గా అదరగొట్టిన శాంసన్ సీఎస్కేకు వచ్చేసరికి మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా ఆడాలనే పట్టుదల శాంసన్‌లో ఏమాత్రం కనిపించడం లేదని సీఎస్కే అభిమానులు పేర్కొంటున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమైన పరుగులు చేయాల్సిన చోట విఫలమవుతుండడం చూసి ఆసక్తి లేకపోతే జట్టు నుంచి తప్పుకుంటే బాగుంటుందేమోనని సోషల్ మీడియా వేదికగా శాంసన్‌కు సలహాలు ఇస్తున్నారు. మానసికంగా సిద్ధంగా లేకపోతే మాత్రం కొన్ని మ్యాచ్‌లకు జట్టు నుంచి తప్పుకోవడమే మేలని పేర్కొన్నారు. కెమెరాలన్నీ శాంసన్వైపు తిరిగిన ప్రతీసారి ఏదో కోల్పోయినట్లుగా శాంసన్ ఫీలవుతున్నాడని, సీఎస్కేలోకి వచ్చాకా ఇప్పటివరకు అతడు నవ్వడం తాము చూడలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచకప్‌లో కనిపించిన శాంసన్ మాకు కావాలని, ఆ కసి ఎక్కడా కనిపించడం లేదని, ఇప్పటినుంచైనా కాస్త శ్రద్ద పెడితే బాగుంటుందని వాపోయారు. ఐదుసార్లు ఐపీఎల్లో చాంపియన్‌గా నిలిచిన సీఎస్కే ఈ సీజన్లో హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసి విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూడాల్సి వస్తోంది.మ్యాచ్ విషయానికొస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది. రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, పడిక్కల్‌లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.Dear @IamSanjuSamson,If you’re not mentally in it, then step aside for a few games. This isn’t just about runs anymore. Your body language is screaming disinterest. Every time the camera’s on you, you look frustrated and disconnected. Honestly, I’ve never seen you smiling even… pic.twitter.com/L7bFl0uJbf— Madras Man (@newbatsman) April 5, 2026చదవండి: ఇరగదీస్తున్న ఇద్దరు మొనగాళ్లు.. రీఎంట్రీ ఇవ్వాల్సిందే! -
ఆర్సీబీతో మ్యాచ్.. ఓటమికి పూర్తి బాధ్యత నాదే!
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతూనే వస్తోంది. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో పరాజయం పాలైన సీఎస్కే హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది. అంతేకాదు పరమ చెత్త ఆటతీరుతో (-2.157) దారుణమైన నెట్ రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్ ఓటమిపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. మ్యాచ్ ఓటమికి తానే మొత్తం బాధ్యత తీసుకుంటానని రుతురాజ్ పేర్కొన్నాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా విఫలమయ్యానని, అందుకే ఓటమికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. రుతురాజ్ మాట్లాడుతూ.. ‘బిగ్ టార్గెట్ మన కళ్లముందు ఉన్నప్పుడు బాధ్యతగా ఆడాల్సిన అవసరముంది. టాపార్డర్‌లో నేను ఎక్కువ పరుగులు చేయాల్సింది. మా బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, జేమీ ఓవర్టన్తో పాటు శివమ్ దూబే తమ పోరాటం చేశారు. కానీ నేను బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. అందుకే ఓటమిని నన్ను నేను బాధ్యుడిగా చేసుకుంటున్నా. అన్షుల్ కాంబోజ్ దాదాపుగా అతడి వికెట్ తీశాడు. మేం ఆనందంలో ఉన్నాం. అయితే.. ఆ బాల్ నోబాల్ కావడం మా దురదృష్టకరం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మైదానం నలువైపులా బంతిని బాదాడు. అతడు బ్యాటింగ్ చేసిన విధానానికి ఖచ్చితంగా హ్యాట్సాఫ్. గతంలో భారీ స్కోర్లను ఛేదించిన సందర్భాలున్నాయి. హ్యాట్రిక్ ఓటములు బాధ కలిగిస్తున్నప్పటికీ తర్వాతి మ్యాచ్‌ల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటాం’ అని పేర్కొన్నాడు. కాగా మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 3 బంతుల్లో ఏడు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. గత సీజన్లో కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన రుతురాజ్ అప్పటి నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమవుతూనే వస్తున్నాడు. కెప్టెన్సీ అనే బాధ్యత రుతురాజ్‌ను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నట్లుగా అనిపిస్తోంది. మ్యాచ్ విషయానికొస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది. రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, పడిక్కల్‌లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.చదవండి: భువనేశ్వర్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి -
బెంగళూరు వీరంగం
బెంగళూరు: టాపార్డర్ దుమ్మురేపడంతో... ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండో విజయం సాధించింది. ఐదుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 43 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (25 బంతుల్లో 70 నాటౌట్; 3 ఫోర్లు, 8 సిక్స్‌లు), కెప్టెన్ రజత్ పాటీదార్ (19 బంతుల్లో 48 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... దేవదత్ పడిక్కల్ (29 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఫిల్ సాల్ట్ (30 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. కొండంత లక్ష్యఛేదనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చెన్నై చివరకు 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటై ఈ సీజన్లో వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. సర్ఫరాజ్ ఖాన్ (25 బంతుల్లో 50; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సత్తా చాటగా... కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (7), సంజూ సామ్సన్ (9), ఆయుశ్ మాత్రే (1), కార్తీక్ శర్మ (6), శివమ్ దూబే (18) విఫలమయ్యారు. ప్రశాంత్ వీర్ (29 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్), జేమీ ఓవర్టన్ (16 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే పరిమితమైంది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ 3 వికెట్లు పడగొట్టాడు. 10 ఓవర్లలో 91/1 ఇన్నింగ్స్ ఆరంభంలో బంతి బ్యాట్ మీదకు రాకపోవడంతో బెంగళూరు నెమ్మదిగా ఆడింది. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లి (18 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 51 పరుగులు చేసిన బెంగళూరు... సగం ఇన్నింగ్స్ ముగిసేసరికి 91/1తో నిలిచింది. కాసేపటికే సాల్ట్ కూడా అవుట్ కాగా... ఆ తర్వాత ఆర్సీబీ విధ్వంసం మొదలైంది. చివరి 5 ఓవర్లలో 97 పరుగులు నూర్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో పాటీదార్, పడిక్కల్ చెరో సిక్స్‌తో 16 పరుగులు రాబట్టగా... దూబే వేసిన తదుపరి ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్ అవుట్ కాగా... టిమ్ డేవిడ్ రాకతో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. ఒకవైపు పాటీదార్ సిక్స్‌ల వర్షం కురిపిస్తుంటే... మరోవైపు డేవిడ్ బౌలర్లపై యుద్ధం ప్రకటించాడు. నూర్ అహ్మద్ వేసిన 17వ ఓవర్లో ‘హ్యాట్రిక్’ సిక్స్‌లు బాదిన అతడు... తదుపరి ఓవర్లో 4, 6 కొట్టాడు. 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డేవిడ్ క్లీన్ బౌల్డ్ కాగా... అన్షుల్ వేసిన ఆ బంతి నోబాల్ కావడంతో బతికిపోయాడు. ఓవర్టన్ వేసిన 19వ ఓవర్లో డేవిడ్ వరుసగా 6, 2, 4, 6, 6, 6 కొట్టడంతో స్టేడియం మోత మోగిపోయింది. డేవిడ్ 21 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ మార్క్ చేరాడు. చివరి ఓవర్లో మరో 6, 4తో బెంగళూరు ఈ సీజన్లో తొలిసారి 250 పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. పాటీదార్, పడిక్కల్ మూడో వికెట్‌కు 21 బంతుల్లో 58 పరుగులు జోడించగా... పాటీదార్, డేవిడ్ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 36 బంతుల్లో 99 పరుగులు జతచేశారు. బెంగళూరు చివరి 5 ఓవర్లలో 97 పరుగులు రాబట్టడం విశేషం. 202 ఐపీఎల్లో భువనేశ్వర్ కుమార్ తీసిన వికెట్లు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చాహల్ (224) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భువీ రెండో స్థానంలో ఉన్నాడు.స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) నూర్ (బి) దూబే 46; కోహ్లి (సి) దూబే (బి) అన్షుల్ 28; పడిక్కల్ (బి) ఓవర్టన్ 50; పాటీదార్ (నాటౌట్) 48; టిమ్ డేవిడ్ (నాటౌట్) 70; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 250. వికెట్ల పతనం: 1–37, 2–93, 3–151. బౌలింగ్: ఖలీల్ 4–0–37–0; హెన్రీ 3–0–36–0; అన్షుల్ 4–0–52–1; నూర్ 4–0–49–0; ఓవర్టన్ 3–0–42–1; శివమ్ దూబే 2–0–30–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) పడిక్కల్ (బి) డఫీ 9; రుతురాజ్ (సి) పడిక్కల్ (బి) డఫీ 7; ఆయుశ్ (సి) పాటీదార్ (బి) భువనేశ్వర్ 1; సర్ఫరాజ్ (స్టంప్డ్) జితేశ్ (బి) కృనాల్ 50; కార్తీక్ (సి) అభినందన్ (బి) కృనాల్ 6; శివమ్ దూబే (సి) జితేశ్ (బి) అభినందన్ 18; ప్రశాంత్ (సి) పాటీదార్ (బి) భువనేశ్వర్ 43; ఓవర్టన్ (సి) (సబ్) బెథెల్ (బి) సుయాశ్ 37; అన్షుల్ (నాటౌట్) 19; నూర్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 8; హెన్రీ (సి) సాల్ట్ (బి) అభినందన్ 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 207. వికెట్ల పతనం: 1–9, 2–10, 3–30, 4–77, 5–84, 6–108, 7–165, 8–178, 9–190, 10–207. బౌలింగ్: డఫీ 4–0–58–2; భువనేశ్వర్ 4–0–41–3; అభినందన్ 3.4–0–30–2; కృనాల్ 3–0–36–2; సుయాశ్ 4–0–21–1; షెఫర్డ్ 1–0–19–0; ఐపీఎల్లో నేడుకోల్‌కతా X పంజాబ్ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సీఎస్కేపై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 250 పరుగులు చేసింది.బెంగళూరు బ్యాటర్లలో టిమ్ డేవిడ్(25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 70) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్‌సాల్ట్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), దేవ్‌దత్త్ పడిక్కల్(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50), పాటిదార్(19 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్స్‌లతో 48) విధ్వంసం. సీఎస్కే బౌలర్లలో ఓవర్టన్, కాంబోజ్, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు.సంజూ మళ్లీ ఫెయిల్..251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు సంజూ శాంసన్(9), రుతురాజ్ గైక్వాడ్(7) మరోసారి విఫలమయ్యారు. అయితే సర్ఫరాజ్ ఖాన్(25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50), ప్రశాంత్ వీర్(29 బంతుల్లో 43), జేమీ ఓవర్టన్ మాత్రం(16 బంతుల్లో 37) ఆకట్టుకున్నారు.ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాకబ్ డఫీ, కృనాల్ పాండ్యా, అభినందన్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా సీఎస్కేకు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.చదవండి: ఓడిపోయినా.. వారిద్దరూ మాత్రం అద్భుతం: సన్‌రైజర్స్ కెప్టెన్ -
బోణీ కొట్టిన లక్నో.. ఎస్ఆర్హెచ్కు రెండో ఓటమి
ఐపీఎల్-2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి విజయం నమోదు చేసింది. ఆదివారం ఉప్పల్ మైదానం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అయితే 26 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సన్‌రైజర్స్‌ను హెన్రిచ్ క్లాసెన్(62), నితీశ్ కుమార్ రెడ్డి(56) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి స్టార్ బ్యాటర్లు మాత్రం విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ తలా రెండేసి వికెట్లు చొప్పున పడగొట్టారు.పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్..ఇక 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆరంభంలోనే మిచెల్ మార్ష్(14) వికెట్‌ను కోల్పోయింది. అయితే ఐడైన్ మార్క్రమ్(45), కెప్టెన్ రిషబ్ పంత్(68 నాటౌట్) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మార్క్రమ్ ఔటైనప్పటికి.. పంత్ మాత్రం అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. 19.5 ఓవర్లలో టార్గెట్‌ను లక్నో చేధించింది.ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్ష్ దూబే రెండు వికెట్లు సాధించగా.. ఎషాన్ మలింగ, శివాంగ్ కుమార్ తలా వికెట్ పడగొట్టారు. అయితే సీనియర్ పేసర్ జయ్‌దేవ్ ఉనద్కట్ మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఉనద్కట్ 3.5 ఓవర్లలో ఏకంగా 50 పరుగులిచ్చాడు. చివరి ఓవర్లో 9 పరుగులు కావాల్సిన సమయంలో ఉనద్కట్ తేలిపోయాడు. ఎస్ఆర్హెచ్కు ఇది రెండో ఓటమి.చదవండి: IPL 2026: సూపర్ డెలివరీ.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది -
సీఎస్కేపై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ
Rcb vs csk live updates and highlights: ఐపీఎల్-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, సీఎస్కే జట్లు తలపడతున్నాయి.ఆర్సీబీ ఘన విజయంచిన్నస్వామి స్టేడియం వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 251పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. సీఎస్కే బ్యాటర్లలో సర్ఫరాజ్ ఖాన్(25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రశాంత్ వీర్(29 బంతుల్లో 43), జేమీ ఓవర్టన్ మాత్రం(16 బంతుల్లో 37) ఆకట్టుకున్నారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాకబ్ డఫీ, కృనాల్ పాండ్యా, అభినందన్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.సీఎస్కే ఏడో వికెట్ డౌన్సీఎస్కే ఏడో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన ఓవర్టన్.. సుయాష్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు సీఎస్కే స్కోర్:178/7సీఎస్కే ఆరో వికెట్ డౌన్సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన శివమ్ దూబే.. అభినందన్ సింగ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 11 ఓవర్లకు సీఎస్కే 6 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది.సీఎస్కే ఐదో వికెట్ డౌన్సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన కార్తీక్ శర్మ.. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో ఔటయ్యాడు.సీఎస్కే నాలుగో వికెట్ డౌన్సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన సర్ఫరాజ్.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.సర్ఫరాజ్ హాఫ్ సెంచరీసర్ఫరాజ్ ఖాన్ దూకుడుగా ఆడుతున్నాడు. అతడు కేవలం 24 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.5 ఓవర్లకు సీఎస్కే స్కోరెంతంటే?5 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్(18 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) దూకుడుగా ఆడుతున్నాడు.సీఎస్కే మూడో వికెట్ డౌన్సీఎస్కే స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. కేవలం 9 పరుగులు చేసి శాంసన్ ఔటయ్యాడు. సీఎస్కే రెండో వికెట్ డౌన్అయూశ్ మాత్రే రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన మాత్రే.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.సీఎస్కే తొలి వికెట్ డౌన్251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే అదిలోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. జాకబ్ డఫీ బౌలింగ్‌లో రుతురాజ్ పెవిలియన్‌కు చేరాడు.ఆర్సీబీ భారీ స్కోర్చిన్నస్వామి స్టేడియం వేదికగా సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 250 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో టిమ్ డేవిడ్(25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 70) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్‌సాల్ట్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), దేవ్‌దత్త్ పడిక్కల్(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50), పాటిదార్(19 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్స్‌లతో 48) మెరుపులు మెరిపించారు. సీఎస్కే బౌలర్లలో ఓవర్టన్, కాంబోజ్, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు.టిమ్ డేవిడ్ విధ్వంసంఆర్సీబీ స్టార్ టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. జేమీ ఓవర్టన్ వేసిన 19 ఓవర్లో డేవిడ్ ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. కేవలం 23 బంతుల్లోనే 65 పరుగులు చేసి తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.19 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 237/3భారీ స్కోర్ దిశగా ఆర్సీబీ17 ఓవర్లకు ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. రజిత్ పాటిదార్(40), టిమ్ డేవిడ్(26) దూకుడుగా ఆడుతున్నారు.ఆర్సీబీ మూడో వికెట్ డౌన్ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన దేవ్‌దత్త్ పడిక్కల్.. ఓవర్టన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 15 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీరెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. ఫిల్స్సాల్ట్ ఔట్శివం దూబే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్‌కి దొరికిపోయిన ఫిల్స్సాల్ట్7 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 66/17 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 66 పరుగలుఉ చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్(33), దేవ్‌దత్త్ పడిక్కల్(3) ఉన్నారు.విరాట్ కోహ్లి ఔట్‌విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన కోహ్లి.. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 44-13 ఓవర్లకు ఆర్సీబీ స్కోరెంతంటే?3 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(9), ఫిల్ సాల్ట్(8) ఉన్నారు.ఐపీఎల్-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.ఈ మ్యాచ్‌కు కూడా సీఎస్కే లెజెండ్ ఎంఎస్ ధోని, యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ దూరమయ్యాడు. ధోని త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నట్లు సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ స్పష్టం చేశాడు. మరోవైపు ఆర్సీబీ స్టార్ జోష్ హాజిల్‌వుడ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికి, ఈమ్యాచ్‌కు మాత్రం అందుబాటులో లేడు.తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ -
సీఎస్కే అంటే కోహ్లీకి పూనకమే!
టీమిండియా సీనియర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. చేజింగ్ మాస్టర్, కింగ్ కోహ్లీ, విరాట్ కింగ్ వంటి బిరుదులు అతడి సొంతం. చేజింగ్‌లో కోహ్లీని కొట్టే మొనగాడు లేడంటే అతిశయోక్తి కాదు. అది అంతర్జాతీయ మ్యాచ్ అయినా, ఐపీఎల్ మ్యాచ్ అయినా చేజింగ్‌లో కోహ్లీ బరిలో ఉన్నాడంటే ఆ జట్టు గుండెలపై హాయిగా చేయి వేసుకొని నిద్రపోతాయి. టీమిండియా తరఫున ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ఇక ఐపీఎల్లో 19 సీజన్లుగా ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ చేజింగ్‌లో లెక్కలేనన్ని సార్లు గెలిపించాడు. అయితే ఐపీఎల్లో కూడా కోహ్లీకి ఒక ఫేవరెట్ జట్టు ఉంది. ఆ జట్టు పేరు చెబితే చాలు బ్యాటింగ్‌లో పూనకం వచ్చేస్తుంది. ఆ జట్టు పేరే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే). ఐపీఎల్ 2026 సీజన్లో ఆదివారం డబుల్‌హెడర్‌లో భాగంగా ఇవాళ ఆర్సీబీ తమ హోంగ్రౌండ్లో సీఎస్కేతో తలపడనుంది. తమ తొలి మ్యాచ్‌లో నెగ్గిన ఆర్సీబీ రెండో విజయంపై కన్నేయగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటములతో పట్టికలో చివరి స్థానంలో ఉన్న సీఎస్కే ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ఖాతా తెరవాలని చూస్తోంది. కాగా సీఎస్కేపై కోహ్లీకి అదిరిపోయే రికార్డులున్నాయి. ఐపీఎల్లో సీఎస్కేతో 35 మ్యాచ్‌లాడిన కోహ్లీ 34 ఇన్నింగ్స్‌ల్లో 1146 పరుగులు సాధించాడు. చెన్నైపై అత్యధిక స్కోరు 90 నాటౌట్‌గా ఉంది. ఇందులో 10 అర్థసెంచరీలున్నాయి. మరో 14 పరుగులు చేస్తే ఒకే జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా తన రికార్డును తానే బద్దలుకొట్టనున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై కోహ్లీ 1159 పరుగులు సాధించాడు.చదవండి: ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! -
అతడిని వదిలి సీఎస్కే తప్పు చేసిందా?
ఐపీఎల్ 2026 సీజన్లో సమీర్ రిజ్వీ సంచలన ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించడమే గాక రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌ను లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌లో రిజ్వీ (47 బంతుల్లోనే 70 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి లక్నో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. తాజాగా శనివారం ముంబై ఇండియన్స్‌పై అదే తరహాలో రెచ్చిపోయాడు. ఈసారి కాస్త డోసు పెంచిన సమీర్ రిజ్వీ (Sameer Rizvi) 51 బంతుల్లోనే 90 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ హీరోగా నిలిచాడు. నిజానికి సమీర్ రిజ్వీ క్రీజులోకి వచ్చే సమయానికి ఢిల్లీ 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఈ సమయంలో క్రీజులో అడుగుపెట్టిన రిజ్వీ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. రెండు మ్యాచ్‌లు కలిపి 160 పరుగులు చేసిన సమీర్ రిజ్వీ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా 2024 ఐపీఎల్ సీజన్‌కు ముందు సమీర్ రిజ్వీని చెన్నై సూపర్‌కింగ్స్ రూ.8.40 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్లో రిజ్వీకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. అయితే 2025 సీజన్‌కు ముందు రిజ్వీని విడుదల చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ రిజ్వీని కేవలం రూ. 95 లక్షలకే దక్కించుకుంది. కానీ ఇప్పుడు రిజ్వీ మాత్రం తక్కువ ధరకే ఎక్కువ లాభాలు చూపిస్తున్నాడు. దీంతో సీఎస్కే అభిమానులు ఆ జట్టు యాజమాన్యాన్ని ట్రోల్స్‌తో ముంచెత్తారు. ‘చెన్నై జట్టులో ఉన్నప్పుడు అవకాశాలు ఇవ్వలేదు.. ఇప్పుడేమో ఢిల్లీ తరఫున విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ అవార్డులు కొల్లగొడుతున్నాడు’.. ‘సమీర్ రిజ్వీని వదిలేసి సీఎస్కే దిద్దుకోలేని తప్పు చేసింది’ అని కామెంట్లు పెట్టారు. ఇక లక్నోతో జరిగిన మ్యాచ్ లోనూ 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను సమీర్ రిజ్వీ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో గెలిపించడం విశేషం.Sameer Rizvi's last 3 knocks for Delhi Capitals:vs PBKS - 58(25)vs LSG - 70(47)vs MI - 90(51)& u know what? CSK let him go to DC for just 95 lakhs when he showed glimpses of his unlimited potential in very 1st game. CSK is worse team for youngsters!pic.twitter.com/zmDEOe9SMB— Rajiv (@Rajiv1841) April 4, 2026🚨 BIG BLUNDER FROM CSK> CSK bought Sameer Rizvi in 2024 for 8.40 CR> Played him mostly at No.6> Didn't give him chances> Released him in 2025> Delhi Capitals bought him for just ₹95 lakh> Backed him at No. 4 and now he’s winning matches for thempic.twitter.com/bjZBi0KipG— Tejash (@Tejashyyyyy) April 4, 2026చదవండి: కార్ల్సన్ వింత ప్రవర్తన.. తోటి ప్లేయర్‌కు అవమానం! -
‘హోం’లో పోరుకు రెడీ!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2026 సీజన్లో హైదరాబాద్ వేదికగా మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. హోం టీమ్ సన్‌రైజర్స్ ఉప్పల్ మైదానంలో నేడు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌తో హైదరాబాద్ తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓడినా... ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించి రైజర్స్ జోరు మీదుంది. మరో వైపు లక్నో తాము ఆడిన ఒకే ఒక మ్యాచ్‌లో సొంతగడ్డపైనే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిపాలైంది. 2025 సీజన్లో ఇరు జట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. మార్పుల్లేకుండా... తిరుగులేని బ్యాటింగ్ బలగం ఉన్న సన్‌రైజర్స్ మరోసారి అదే విధ్వంసక ఆటను సొంత గడ్డపై చూపించాలని పట్టుదలగా ఉంది. హెడ్, అభిషేక్ మెరుపు బ్యాటింగ్‌లో చెలరేగితే జట్టుకు తిరుగుండదు. హైదరాబాద్ ఓపెనర్లను లక్నో ఏమాత్రం నిలువరించగలదనేదే ఆసక్తికరం. వీరి తర్వాత అదే ధాటిని కొనసాగించేందుకు ఇషాన్ కిషన్, క్లాసెన్ సిద్ధంగా ఉన్నారు. గత మ్యాచ్‌లో విఫలమైనా...అనికేత్ వర్మ ప్రతిభావంతుడైన బ్యాటర్. వీరికి తోడు లోకల్ బాయ్ నితీశ్ కుమార్ రెడ్డి ఫామ్‌లోకి రావడం మరో సానుకూలాంశం. కోల్‌కతాలో పోరులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన నితీశ్ తన జోరును కొనసాగించాలని కొనసాగించాలని భావిస్తున్నాడు. ఏడో స్థానంలో వచ్చే సలీల్ కూడా ధాటిగా ఆడగల సమర్థుడు. అన్నింటికి మించి హైదరాబాద్ పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్‌కు బాగా అనుకూలమే. పరుగుల విషయంలో ఎన్నో రికార్డులు ఈ మైదానంలో బద్దలయ్యాయి. ఈ నేపథ్యంలో రైజర్స్ బ్యాటింగ్ ఏ స్థాయికి చేరుతుందనేది చూడాలి. అయితే బ్యాటింగ్‌తో పోలిస్తే సహజంగానే రైజర్స్ బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. డేవిడ్ పేన్ ప్రధాన పేసర్ కావడం కాస్త ఆశ్చర్యపరుస్తుండగా...ఉనాద్కట్, మలింగ, దూబే ఏమాత్రం ప్రభావం చూపిస్తారనేది చర్చనీయాంశం. పంత్‌పై తీవ్ర ఒత్తిడి... గత సీజన్లో అంతంతమాత్రంగానే ఆడిన లక్నోకు ఈసారి కూడా సరైన ఆరంభం లభించలేదు. తొలి మ్యాచ్‌లో కేవలం 141 పరుగులకే పరిమితమైన ఆ జట్టు ఢిల్లీ చేతిలో పరాజయం చవిచూసింది. టీమ్ మేనేజ్మెంట్ కూడా ఆటగాళ్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కోలుకొని మళ్లీ దారిలో పడటం టీమ్‌కు ఎంతో కీలకం. ఓపెనర్‌గా వచ్చిన పంత్ రనౌట్‌గా వెనుదిరిగాడు కాబట్టి ఈ సారి కూడా అతను ఓపెనర్‌గా మరో ప్రయత్నం చేయవచ్చు. మార్‡్ష, మార్క్రమ్ తమ స్థాయికి తగినట్లు దూకుడుగా ఆడాల్సి ఉంది. రెండు అగ్రశ్రేణి జట్ల టి20 కెపె్టన్లు అయిన వీరిద్దరు ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సమర్థులు. పూరన్ ఐదో స్థాయిలో బరిలోకి దిగడం జట్టుకు ఏమాత్రం మేలు చేయదు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో బదోని కంటే ముందు నాలుగో స్థానం అతను ఆడే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో ఆదుకున్న సమద్ తమ మాజీ జట్టుపై మరో మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. లక్నో పేస్ దళం చాలా పటిష్టంగా ఉంది. షమీ, మొహసిన్, నోర్జే, ప్రిన్స్ జట్టు భారం మోస్తున్నారు. నాణ్యమైన స్పిన్నర్ లేని లోటును టీమ్ ఎలా అధిగమిస్తుందో చూడాలి.స్వదేశానికి కమిన్స్ సన్‌రైజర్స్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆ్రస్టేలియాకు పయనమయ్యాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న అతను దానికి స్కానింగ్ చేయించుకునేందుకు స్వదేశానికి వెళ్లాడు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పర్యవేక్షణలో ఈ పరీక్ష జరుగుతుంది. దీని తర్వాత అతని ఫిట్‌నెస్‌పై స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే ఐపీఎల్ రెండో దశ పోటీల్లో ఆడతాడా లేదా తేలుతుందని ఆసీస్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.చెన్నై X బెంగళూరు సా.7:30నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రసారం బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్లో తమ విజయపరంపరను కొనసాగించేందుకు సిద్ధమైంది. నేడు చిన్నస్వామి స్టేడియంలో జరిగే పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌తో బెంగళూురు తలపడుతుంది. సీజన్ తొలి పోరులో సన్‌రైజర్స్‌ను ఓడించి అమితోత్సాహంతో మొదలు పెట్టిన ఆర్సీబీ సొంత గ్రౌండ్లో అభిమానులకు మళ్లీ గెలుపు సంబరం అందించాలని భావిస్తోంది. మరో వైపు వరుసగా రెండు పరాజయాల తర్వాత తీవ్ర ఒత్తిడిలో ఉన్న చెన్నై ఎలా రాణిస్తుందనేది చూడాలి. ఆటగాళ్ల వైఫల్యంతో పాటు మైదానంలో ధోని మార్గనిర్దేశనం లేక సీఎస్కే తడబడుతోంది. -
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచ రికార్డు
పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనత సాధించింది. పొట్టి ఫార్మాట్లో అత్యధికసార్లు 200 పరుగులకు పైగా స్కోరు ఛేదించిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో తన పేరిట ఉన్న ప్రపంచ రికార్డును పంజాబ్ తానే బద్దలు కొట్టింది.ఐపీఎల్-2026 టోర్నీలో తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన పంజాబ్ కింగ్స్.. రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది.209 పరుగులుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. ఆయుశ్ మాత్రే (73), శివం దూబే (45 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (32) రాణించారు. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు తీయగా.. జేవియర్ బార్ట్లెట్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.పంజాబ్ బ్యాటర్ల ధనాధన్‌ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 18.4 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది. తద్వారా ఐదు వికెట్లతేడాతో జయకేతనం ఎగురవేసింది. ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 39), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (43), కూపర్ కన్నోలి (36), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 50) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించారు.ప్రపంచంలోనే తొలి జట్టుగా పంజాబ్పంజాబ్ కింగ్స్ 200కు పైగా పరుగుల స్కోరును ఛేదించడం ఇది తొమ్మిదోసారి. పొట్టి క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా పంజాబ్ నిలిచింది. టీ20 క్రికెట్లో అత్యధికసార్లు 200కు పైగా పరుగుల స్కోరు ఛేదించిన జట్లు ఇవే🏏పంజాబ్ కింగ్స్ (ఐపీఎల్)-తొమ్మిది సార్లు🏏ఆస్ట్రేలియా- ఏడుసార్లు🏏ముంబై ఇండియిన్స్ (ఐపీఎల్)- ఆరు సార్లు🏏టీమిండియా- ఆరు సార్లు🏏రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఐపీఎల్)- ఆరు సార్లు🏏సౌతాఫ్రికా- ఆరుసార్లు చదవండి: IPL 2026: అంపైర్ తప్పిదం.. కసితీరా బాదిన ఆయుశ్!🔙 to 🔙 victories ✌️@PunjabKingsIPL complete the chase in an authoritative fashion ❤️A win by 5⃣ wickets in Chennai 🥳Updates ▶️ https://t.co/riWrE2EZiF#TATAIPL | #KhelBindaas | #CSKvPBKS pic.twitter.com/S9EEawsaZk— IndianPremierLeague (@IPL) April 3, 2026 -
‘ఏదీ కలిసిరావడం లేదు.. ఓటమికి అదే కారణం’
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏదీ కలిసి రావడం లేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓడిపోయింది. బౌలర్ల వైఫల్యం కారణంగానే పంజాబ్‌తో మ్యాచ్‌లో ఓడిపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. మ్యాచ్ ఓటమి అనంతరం రుతురాజ్ మాట్లాడాడు.‘ఇది చాలా కఠినమైన మ్యాచ్. అయినప్పటికి కూడా ఈ మ్యాచ్ నుంచి ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. మా బ్యాటర్లు చాలా బాగా ఆడారు. ముఖ్యంగా ఆయుష్ మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అలాగే శివమ్ దూబే కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా బ్యాటింగ్ విభాగం బాగా ఆడింది. మా బౌలింగ్ విభాగం మెరుగుపడాల్సి ఉంది. జట్టుకు ఏది అవసరమో, ఆ పాత్రకు అనుగుణంగా మారడమే ముఖ్యం. ఈరోజు వికెట్ కొంచెం గ్రిప్ అవుతున్నందున, బహుశా మరికొంత సేపు క్రీజులో నిలదొక్కుకోవాలని నాకు అనిపించింది. ఆ తరువాత వేగంగా ఆడాలని అనుకున్నాను. అయితే.. దురదృష్టవశాత్తు తప్పుడు సమయంలో ఔట్ అయ్యాను. నిజానికి 209 అనేది చాలా మంచి స్కోరు. పిచ్ నుంచి పేసర్లకు మంచి సహకారం అందింది. రాహుల్ చాహర్‌ను ఇంపాక్ట్‌గా తీసుకోవడంపై నేను ఒక్కటే ఆలోచించాను. ముగ్గురు సీమర్లు ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లతో ఆడాలని అనుకున్నాము. ఈ కాంబినేషన్ జట్టుకు ఉపయోగపడుతుందనుకున్నా. కానీ మా స్పిన్నర్లకు ఈ రోజు అసలు కలిసిరాలేదు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచలేకపోయాము. అయితే మాది యువ జట్టు. అనవసరమైన అంచనాలతో ఒత్తిడి పెంచుకోకూడదని భావిస్తున్నాం’ అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఎంతపని చేశావ్ అయ్యర్.. పంజాబ్ జట్టుకు షాక్! -
దూసుకెళ్తున్న పంజాబ్
-
అంపైర్ తప్పిదం.. కసితీరా బాదిన ఆయుశ్!
గెలిచినోడి కంటే ఓడిపోయినవాడి మీదే సానుభూతి ఎక్కువగా ఉంటుంది. జట్టును గెలిపించినోడు హీరో అవుతాడన్నది కాదనలేని మాట. కానీ అదే సమయంలో ఓడిపోయిన జట్టు నుంచి మంచి ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడు అభిమానుల మనసులు గెలుచుకుంటాడు. ఇది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయుశ్ మాత్రేకు సరిగ్గా నప్పుతుందని చెప్పొచ్చు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే ఇన్నింగ్స్ సమయంలో ఆయుశ్ మాత్రే వాడిన బ్యాట్ విషయంలో అంపైర్ అడ్డుపడడం, ఆ తర్వాత అదే బ్యాట్‌తో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి అందరిని మెప్పించడం విశేషం. గతేడాది అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టిన ఆయుశ్ మాత్రే ఈ సీజన్‌కు వచ్చేసరికి జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. చెన్నైకి ఓటమి ఎదురైనా ఆయుశ్ మాత్రే రూపంలో సక్సెస్ లభించిందని చెప్పొచ్చు.ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ వరుసగా రెండో పరాభవాన్ని మూటగట్టుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే చెన్నై ఓటమి చవిచూసినప్పటికీ ఆ జట్టు ఆటగాడు ఆయుశ్ మాత్రే మాత్రం సూపర్‌సక్సెస్ అయ్యాడు. ఆయుశ్ మాత్రే గతేడాది చెన్నై జట్టు తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ముందుగా టీమ్‌లో లేకపోయినా...రుతురాజ్ గాయంతో తప్పుకోవడంతో జట్టుకు ఎంపికయ్యాడు. ముంబైకి చెందిన మాత్రే ముంబైలోనే ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్ ఆడి 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆ తర్వాత బెంగళూరుపై కూడా 48 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 94 పరుగులు సాధించి సత్తా చాటాడు. గత సీజన్‌ను ఘనంగా ముగించిన మాత్రే 2026 ఐపీఎల్ సీజన్‌ను ఘనంగా ఆరంభించాలని భావించాడు. కానీ ఈ సీజన్ తొలి పోరులో మొదటి బంతికే వెనుదిరిగి నిరాశపర్చిన అతను ఈ మ్యాచ్‌లో తన కసిని ప్రదర్శించాడు. బార్ట్లెట్ ఓవర్లో వరుసగా 3 ఫోర్లతో అతను తన పరుగుల ఖాతా తెరిచిన అతను యాన్సెన్ ఓవర్లో 2 సిక్స్‌లు బాదాడు. ఆపై స్టొయినిస్ ఓవర్లో సిక్స్‌తో 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్న అతను తర్వాతి బంతినీ సిక్స్‌గా మలిచాడు. 59, 67 పరుగుల వద్ద చహల్ బౌలింగ్‌లో వైశాక్, శశాంక్ క్యాచ్‌లు వదిలేయడం అతనికి కలిసొచ్చింది.అంపైర్ పొరపాటు..సీఎస్కే ఇన్నింగ్స్ సమయంలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. గ్జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ ఔటయ్యాకా మూడో స్థానంలో ఆయుశ్ మాత్రే క్రీజులోకి వచ్చాడు. అయితే మొదట తీసుకొచ్చిన బ్యాట్ కాస్త అనుమానంగా ఉండడంతో అంపైర్ దానిని పరిశీలించాడు. కానీ బ్యాట్ గేజ్ నుంచి పాస్ కాకపోవడంతో వేరే బ్యాట్‌ను తీసుకొని వచ్చాడు. కానీ ఈసారి కూడా బ్యాట్ గేజ్‌ను దాటకపోవడంతో టెస్టులో మరోసారి ఫెయిల్ అయ్యాడు. అయితే మాత్రే తొలుత తీసుకొచ్చి బ్యాట్‌ను అంపైర్ మరోసారి చెక్ చేశాడు. అయితే ఇక్కడ అంపైర్ తన పొరపాటు వల్లే బ్యాట్‌కు గేజ్‌ను సరిగ్గా పెట్టడంలో విఫలమైనట్లు గుర్తించాడు. ఆ తర్వాత మాత్రే తన ఫస్ట్ బ్యాట్‌తోనే ఇన్నింగ్స్ కొనసాగించాడు.ఎవరీ ఆయుశ్ మాత్రే?జూలై 16, 2007లో మహారాష్ట్రలోని నల్లసొపారా జిల్లాలో ఆయుశ్ మాత్రే జన్మించాడు. ఆరేళ్ల వయసులో క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన ఆయుశ్ మాత్రేకు టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని ఆరాధ్య క్రికెటర్. అతని ఆటను చూస్తూ పెరిగిన ఆయుశ్ మాత్రే పదిహేనేళ్ల వయసులో ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన కలను నెరవేర్చుకునేందుకు ముంబైలోని విరార్ నుంచి చర్చ్‌గేట్ వరకు రోజు 80 కిలోమీట్లరు ప్రయాణం చేసి ప్రాక్టీస్ కొనసాగించాడు. ఆయుష్ 2024-25 లో ఇరాని ట్రోఫీలో ముంబై తరఫున ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన ఆయుష్ 660 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో ఇటీవల సంచలనం చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో భారత క్రికెటర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ముంబై బ్యాటర్ ఆయుష్ మాత్రే బద్దలు కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత పిన్న వయసులో (17 ఏళ్ల 168 రోజులు)లో 150 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా మాత్రే రికార్డులకెక్కాడు. 2024 అండర్-19 టీ 20 ప్రపంచకప్ గెలిచిన యంగ్ ఇండియా జట్టులో ఆయుశ్ మాత్రే సభ్యుడిగా ఉన్నాడు. ఇక 2025లో అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన ఆయుశ్మాత్రే ఆసియాకప్‌లో భారత్‌ను రన్నరప్‌గా నిలిపాడు. ఈ ఏడాది జరిగిన అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించిన ఆయుశ్ మాత్రే టీమిండియా టైటిల్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో 214 పరుగులు సాధించాడు. అంతేకాదు ఆయుశ్ మాత్రే సారథ్యంలోనే యంగ్ ఇండియా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లను వారి సొంతగడ్డపైనే ఓడించి సిరీస్‌లు కైవసం చేసుకోవడం విశేషం. View this post on Instagram A post shared by IPL (@iplt20)చదవండి: చెస్‌లో అద్భుతాలు సృష్టిస్తోన్న చిచ్చరపిడుగు -
పంజాబ్ బల్లే బల్లే...
చెన్నై సూపర్‌కింగ్స్‌కి కోట లాంటి చెపాక్ మైదానంలో ఒక్క పంజాబ్‌కు మాత్రమే చెన్నైని ఎక్కువ సార్లు ఓడించిన ఘనమైన రికార్డు ఉంది. గత మూడు సీజన్లలో ఇక్కడ సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించిన పంజాబ్ ఈసారీ దానిని కొనసాగించింది. ముందుగా చెన్నై 209 పరుగుల భారీ స్కోరు చేసినా... మరో 8 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ గెలుపు సొంతం చేసుకుంది. స్పిన్నర్ చహల్ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి స్కోరును నియంత్రించగా, ఛేదనలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీతో పంజాబ్ కింగ్స్ జట్టును విజయం దిశగా నడిపించాడు. చెన్నై: గత ఏడాది ఐపీఎల్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (43 బంతుల్లో 73; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా...శివమ్ దూబే (22 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) సర్ఫరాజ్ ఖాన్ (12 బంతుల్లో 32; 6 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. అనంతరం పంజాబ్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 210 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయగా... ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్), ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కూపర్ కనోలీ (22 బంతుల్లో 36; 6 ఫోర్లు) మెరిపించారు. సర్ఫరాజ్ జోరు... వరల్డ్ కప్ హీరో సామ్సన్ (7) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ప్రభావం చూపకపోగా... కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు) విఫలమయ్యాడు. అయితే మరోవైపు ఆయుశ్ మాత్రే జోరుతో స్కోరు దూసుకుపోయింది. పవర్‌ప్లేలో జట్టు 57 పరుగులు చేసింది. మాత్రేతో రెండో వికెట్‌కు రుతురాజ్ గైక్వాడ్ 55 బంతుల్లో 96 పరుగులు జోడించగా... అతని వాటా 22 పరుగులు మాత్రమే! ఆ తర్వాత తక్కువ వ్యవధిలో మాత్రే, కార్తీక్ (1) అవుట్ కాగా, అర్ష్ దీప్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతోసర్ఫరాజ్ చెలరేగాడు. ఆ తర్వాత వైశాక్ ఓవర్లో వరుసగా 4, 4, 4 కొట్టిన అతను తర్వాతి బంతికి వెనుదిరిగాడు. అర్ష్ దీప్ వేసిన ఆఖరి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి దూబే జట్టు స్కోరును 200 దాటించాడు. సమష్టి ప్రదర్శన... ఛేదనలో పంజాబ్ టాప్–4 తమ వంతు పాత్ర పోషించారు. తాను ఆడిన తొలి 6 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్‌లతో ప్రియాన్ష్ దూకుడుగా మొదలుపెట్టగా, కంబోజ్ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ 3 ఫోర్లు బాదాడు. పవర్‌ప్లేలో స్కోరు 68 పరుగులకు చేరింది. ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత కనోలీ, శ్రేయస్ అదే ధాటిని కొనసాగించారు. చహర్ ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టిన శ్రేయస్... హెన్రీ ఓవర్లో వరుసగా 4, 6 బాదాడు. 26 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయానికి 24 పరుగుల దూరంలో అతను అవుటైనా, ఇతర బ్యాటర్లు లాంఛనం పూర్తి చేశారు. ప్రశాంత్ వీర్ అరంగేట్రం... గత మ్యాచ్‌లో రూ.14.20 కోట్ల విలువైన ఆటగాడు కార్తీక్ శర్మతో అరంగేట్రం చేయించిన చెన్నై... ఈ మ్యాచ్‌లో మరో రూ.14.20 కోట్ల ప్లేయర్ ప్రశాంత్ వీర్‌కు తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం ఇచ్చింది. ప్రధానంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన 20 ఏళ్ల ప్రశాంత్ లోయర్ ఆర్డర్లో భారీ షాట్లు ఆడగల సమర్థుడు. బీసీసీఐ అండర్–23 టోర్నీతో పాటు సీఎస్కే ట్రయల్స్‌లో ఆకట్టుకోవడంతో రవీంద్ర జడేజా తరహా ఆటగాడైన వీర్‌ను జట్టు ఎంచుకుంది. యూపీ టి20 లీగ్‌లో 155 స్ట్రయిక్‌రేట్‌లో 320 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీసి ప్రశాంత్ అందరి దృష్టినీ ఆకర్షించాడు.6-చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును అత్యధికసార్లు (6) ఓడించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ గుర్తింపు పొందింది. ముంబై ఇండియన్స్ (21 సార్లు) తర్వాత ఐపీఎల్లో చెన్నై జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టు పంజాబ్ (17 సార్లు). బెంగళూరు (16 సార్లు) మూడో స్థానానికి వెళ్లింది. 36-ఐపీఎల్ టోర్నీ చరిత్రలో అత్యధికసార్లు 200 పరుగులకు పైగా స్కోరు చేసిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించింది. ఇప్పటి వరకు చెన్నై జట్టు 36 సార్లు 200 మార్క్‌ను దాటింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 35 సార్లు... పంజాబ్ కింగ్స్ 33 సార్లు, ముంబై ఇండియన్స్ 32 సార్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ 30 సార్లు ఈ ఘనత సాధించాయి. స్కోరు వివరాలుచెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) బార్ట్లెట్ 7; రుతురాజ్ (సి) వధేరా (బి) చహల్ 28; ఆయుశ్ (సి) మాత్రమే (బి) వైశాక్ 73; దూబే (నాటౌట్) 45; కార్తీక్ (ఎల్బీ) (బి) యాన్సెన్ 1; సర్ఫరాజ్ (సి) వధేరా (బి) వైశాక్ 32; ప్రశాంత్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–14, 2–110, 3–123, 4–130, 5–168. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–41–0, బార్ట్లెట్ 4–0–48–1, యాన్సెన్ 4–0–43–1, వైశాక్ 4–0–38–2, చహల్ 3–0–21–1, స్టొయినిస్ 1–0–17–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (బి) హెన్రీ 39; ప్రభ్‌సిమ్రన్ (రనౌట్) 43; కనోలీ (సి) హెన్రీ (బి) కంబోజ్ 36; శ్రేయస్ (సి) చహర్ (బి) కంబోజ్ 50; వధేరా (సి) నూర్ (బి) హెన్రీ 10; శశాంక్ (నాటౌట్) 14; స్టొయినిస్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–61, 2–95, 3–127, 4–186, 5–186. బౌలింగ్: ఖలీల్ 3–0–28–0, హెన్రీ 4–0–54–2, కంబోజ్ 3.4–0–43–2, నూర్ 4–0–38–0, రాహుల్ చహర్ 4–0–46–0. -
చరిత్ర సృష్టించిన చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్లు చేసిన జట్టుగా అవతరించింది. 2026 ఎడిషన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసిన ఆ జట్టు.. 36వ సారి 200 ప్లస్ మార్కును తాకింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు సీఎస్కే, ఆర్సీబీ (35) పేరిట సంయుక్తంగా ఉండేది.ఈ విభాగంలో సీఎస్కే, ఆర్సీబీ తర్వాతి స్థానాల్లో పంజాబ్ కింగ్స్ (32), ముంబై ఇండియన్స్ (31), కేకేఆర్ (29) ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉంది. 2024 ఎడిషన్‌లో ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే ఆయుశ్ మాత్రే (73) అర్ద సెంచరీతో సత్తా చాటడంతో భారీ స్కోర్ చేసింది. శివమ్ దూబే (45 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (32) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. రుతురాజ్ గైక్వాడ్ (28) పర్వాలేదనిపించాడు. సంజూ శాంసన్ (7), కార్తీక్ శర్మ (1) నిరాశపరిచారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ 2, చహల్, జన్సెన్, బార్ట్లెట్ తలో వికెట్ తీశారు.అనంతరం 210 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ సైతం ధాటిగా ఆడుతుంది. 8 ఓవర్లలోనే ఆ జట్టు వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. ప్రియాంశ్ ఆర్య (39) విధ్వంసం సృష్టించి ఔట్ కాగా.. ప్రభ్‌సిమ్రన్ (38), కూపర్ కన్నోల్లీ (7) క్రీజ్‌లో ఉన్నారు. ప్రియాంశ్ ఆర్యను మ్యాట్ హెన్రీ క్లీన్ బౌల్డ్ చేశాడు. -
సొంతగడ్డపై సత్తా చాటేనా!
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. గువాహటిలో ఆడిన గత మ్యాచ్‌లో ఓడిన చెన్నై... సొంతగడ్డపై పాయింట్ల ఖాతా తెరవాలని భావిస్తోంది. రాజస్తాన్ రాయల్స్‌తో పోరులో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో పేలవ ప్రదర్శనతో ఘోర పరాజయం చవిచూసిన సూపర్ కింగ్స్... ఆ ఓటమిని పక్కనపెట్టి సమష్టిగా సత్తా చాటేందుకు సిద్ధమైంది. గాయం కారణంగా ధోనీ ఈ మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగడం లేదు. అయితే అతడు డగౌట్ నుంచి సూచనలు ఇవ్వనుండటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. టి20 వరల్డ్‌కప్ హీరో సంజూ సామ్సన్‌పై భారీ అంచనాలు ఉండగా... కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆయుశ్ మాత్రే, షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ కలిసి కట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో ఖలీల్, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, హెన్రీ కీలకం కానున్నారు. మరోవైపు గత మ్యాచ్‌లో గుజరాత్‌పై కష్టపడి గెలిచిన పంజాబ్ కింగ్స్ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఆసీస్ ప్లేయర్ కూపర్ చక్కటి ఫామ్‌లో ఉండగా... కెప్టెన్ శ్రేయస్, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్, నేహల్, శశాంక్, స్టొయినిస్, యాన్సెన్ రాణించాల్సి ఉంది. అర్ష్‌దీప్, జేవియర్, యాన్సెన్, వైశాఖ్, చాహల్ బౌలింగ్ భారం మోయనున్నారు. చెన్నై పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్ష సూచనలేదు. ఐపీఎల్లో ఇప్పటి వరకు చెన్నై, పంజాబ్ మధ్య 32 మ్యాచ్‌లు జరిగాయి. ఇరు జట్లు చెరో 16 మ్యాచ్‌ల్లో గెలిచి సమంగా ఉన్నాయి. పంజాబ్‌పై చెన్నై అత్యధిక స్కోరు 240 కాగా... అత్యల్ప స్కోరు 120. చెన్నైపై పంజాబ్ అత్యధిక స్కోరు 231 కాగా, అత్యల్ప స్కోరు 92గా ఉంది. -
చెన్నై ఓటమి వెనుక తప్పులెన్నో!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్‌కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి. ఐపీఎల్లో ఐదు టైటిల్స్ కొట్టిన సీఎస్కే ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఐపీఎల్ 19వ సీజన్లో సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పేలవ ఆటతీరుతో చెన్నై సూపర్‌కింగ్స్ దారుణ ఓటమిని ఎదుర్కొంది. సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ లేకపోవడం, అన్నింటికీ మించి ఎంఎస్ ధోని గాయంతో జట్టుకు దూరమవ్వడం సీఎస్కేను ఒత్తిడిలోకి నెట్టేసినట్లయింది. సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. అయితే ఒక్క మ్యాచ్‌లో ఓటమితోనే సీఎస్కేను తప్పు బట్టాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కూర్పు గందరగోళం..కానీ మ్యాచ్ ఫలితం క్షణాల్లో మారిపోయే ఐపీఎల్లో ఫస్ట్ హాఫ్ సీజన్లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలవడమే అన్ని జట్లు టార్గెట్‌గా పెట్టుకుంటాయి. దీంతో సీజన్ తొలి మ్యాచ్ నుంచే అన్ని జట్లు గెలవాలనే సంకల్పంతోనే ఆడుతుంటాయి. వాస్తవానికి సీఎస్కే జట్టు కూర్పు కొంత గందరగోళంగానే కనిపిస్తుంది. డెవాల్డ్ బ్రెవిస్ గాయంతో మ్యాచ్‌కు దూరమవ్వడంతో సర్ఫరాజ్‌ఖాన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా కాకుండా ఓపెనర్‌గా బరిలోకి దింపితే వేరుగా ఉండేది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో సర్ఫరాజ్ ముంబై తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఒకవేళ సీఎస్కే సర్ఫరాజ్ సేవల్ని ఉపయోగించుకోవాలనుకుంటే బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి ఓపెనింగ్ లేదా మూడో స్థానంలో ఆడిస్తే బాగుండేది.మిడిలార్డర్ ఫెయిల్సాధారణంగా మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైనప్పుడు మిడిలార్డర్ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది.కానీ కెప్టెన్ రుతురాజ్ 11 బంతుల్లో ఆరు పరుగులకే పరిమితం కావడం, అండర్-19 టీమిండియా కెప్టెన్ ఆయుష్ మాత్రే డకౌట్ కావడం, మాథ్య షార్ట్ కూడా 2 పరుగులకే పెవిలియన్ చేరడం సీఎస్కేను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. జట్టులో రుతురాజ్, సంజూ శాంసన్, దూబే మినహా మిగతావారంతా జూనియర్లే. దూబే విఫలం..ఈ నేపథ్యంలో బాధ్యతగా ఆడాల్సిన సీనియర్లు నిర్లక్ష్య ఆటతీరుతో వికెట్లు పారేసుకోవడం కూడా సీఎస్కే కొంపముంచింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో శివమ్ దూబే ఫినిషర్‌గా అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. అదే సీన్‌ను ఇప్పుడు ఐపీఎల్లో సీఎస్కే తరఫున పునరావృతం చేస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. వచ్చీ రాగానే సిక్స్ కొట్టి దూకుడు ప్రదర్శించినప్పటికీ.. అప్పుడున్న పరిస్థితుల్లో సిక్సర్లు బాదడం కంటే ఇన్నింగ్స్ నిర్మించడంపై దూబే దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే దూబే తర్వాత బ్యాటర్లు పెద్దగా లేరు. అయితే సీఎస్కే తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన జేమీ ఓవర్టన్కు దూబే నుంచి సహకారం అంది ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. దూబే బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి ఉంటే కనీసం 170 పరుగులైనా చేసి ఉండేది. ధోని గైర్హాజరీలో దూబే నిలబడి సాధికారికంగా బ్యాటింగ్ చేసి ఉంటే అతడి విలువ అమాంతం పెరిగిపోయేది. ఇక సీఎస్కే లో స్కోరింగ్ మ్యాచ్‌లను కూడా కాపాడుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కనిపించిన ధోని లోటు!అయితే అప్పుడు ధోని మాస్టర్ మైండ్‌లా వ్యవహరించి వ్యూహాలు పన్ని ప్రత్యర్థి జట్లను చిత్తు చేయడంలో సలహాలు, సూచనలు చేసేవాడు.కానీ ఇప్పుడు ధోని దూరం కావడంతో ఆ ప్రభావం కనిపించింది. ధోని ఉన్నప్పుడు కూడా సీఎస్కే మ్యాచ్‌లు ఓడిపోలేదా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమే కావొచ్చు.కానీ ధోని కేవల సీఎస్కే ఆటగాడు మాత్రమే కాదు. రెండు మూడు సీజన్లుగా చివర్లోనే బ్యాటింగ్ వస్తున్నాడు. కాని అతడిచ్చి సలహాలు సీఎస్కే కెప్టెన్లు తప్పకుండా పాటించి ఫలితాలు సాధించేది. కానీ ఈసారి ధోని లేకపోవడం జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు. చెన్నై సూపర్‌కింగ్స్ ఫీల్డింగ్ విషయంలో అప్రమత్తంగా ఉంటుంది. కానీ నిన్నటి రాజస్తాన్ మ్యాచ్‌లో ఆటగాళ్లలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రమాదకర సూర్యవంశీ క్యాచ్‌ను కార్తిక్ శర్మ విడిచి పెట్టడం, ఆ తర్వాత బౌండరీ వెళ్లకుండా బంతిని కనీసం ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలు అన్నట్లు రాజస్తాన్‌తో మ్యాచ్‌లో సీఎస్కే ఓటమికి కూడా కారణాలు చాలానే ఉన్నాయి. అయితే ఇది సీజన్లో తొలి మ్యాచ్ మాత్రమే కావడంతో రాబోయే మ్యాచ్‌ల్లో తప్పులను సరిదిద్దుకొని ఆడాల్సిన అవసరం సీఎస్కేకు ఉంది. ఇక డెవాల్డ్ బ్రెవిస్, ధోని ఎప్పుడు ఆడతారన్న దానిపై స్పష్టత లేదు. కాబట్టి వీరిద్దరు జట్టులోకి వచ్చేలోపూ తొలి హాఫ్‌లో కనీసం నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే టాప్-4లో నిలిచేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పొచ్చు.చదవండి: రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు! -
రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్లో 17 ఏళ్ల తర్వాత తన సొంత గూటికి చేరాడు. తనను వెలుగులోకి తీసుకొచ్చిన రాజస్తాన్ రాయల్స్ జట్టులోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా సోమవారం సీఎస్కేతో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే జడేజా అదుర్స్ అనిపించాడు. ఇన్నాళ్లు తాను ఆడిన జట్లే తనకు ప్రత్యర్థిగా మారిన వేళ బంతితో మెరిశాడు. మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసిన జడేజా 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రాజస్తాన్ మ్యాచ్ గెలవడంలో తన వంతు పాత్రను సమర్థంగా పోషించాడు. ‘నాకు పింక్ జెర్సీ బాగుంటుందనిపిస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సీఎస్కే జట్టుతో ఎన్నో ఏళ్ల అనుబంధముంది. ఆ జట్టులో ఏ ఆటగాడు ఎలా ఆడుతాడనే దానిపై స్పష్టత ఉంది. ముఖ్యంగా సీఎస్కే ఆల్రౌండర్శి శివమ్ దూబేకు నెట్స్‌లో చాలాసార్లు బౌలింగ్ చేశాను. కాబట్టి అతడు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటా డనేది నాకు తెలుసు. అందుకే సీఎస్కేకు బౌలింగ్ చేయడంలో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఆఫ్ స్టంప్ ఆవల బంతులు వేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. అలా అయితే దూబే భారీ షాట్లు ఆడతాడని నాకు తెలుసు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉందన్న మాట నిజమే,. పిచ్ కాస్త పచ్చికగా ఉండడం, బంతి టర్న్ అవుతుండడంతో బౌలింగ్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. మొత్తంగా 17 ఏళ్ల తర్వాత నన్ను తొలిసారి వెలుగులోకి తీసుకొచ్చిన జట్టుతో (రాజస్తాన్ రాయల్స్) కలవడం సంతోషంగా అనిపిస్తోంది. 128 పరుగుల టార్గెట్ తక్కువే కదా అని నిర్లక్ష్యం చేసి ఉంటే మొదటికే మోసం వచ్చేది. కానీ మా బ్యాటర్లు జైస్వాల్, సూర్యవంశీలు దూకుడైన బ్యాటింగ్‌తో పని సులువు చేశారు. లోస్కోరింగ్, హై స్కోరింగ్ ఏదైనా సరే మనం వంద శాతం కష్టపడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి.’ అని చెప్పుకొచ్చాడు. అయితే జడేజా కామెంట్స్‌పై అభిమానులు ఫన్నీ కామెంట్లు పెట్టారు. ‘జడేజా ఒక ఊసరవెల్లి.. జెర్సీ మారిందో లేదో వెంటనే మాట మార్చాడు’ అని పేర్కొన్నారు.ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన రవీంద్ర జడేజా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ సీజన్లో రాజస్తాన్ తొలి ఐపీఎల్ టైటిల్ గెలవడంలో జడేజా కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాతి సీజన్లోనూ ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేశాడు. 2010లో ఐపీఎల్‌కు దూరంగా ఉన్న జడేజాను 2011 సీజన్‌కు కొచ్చి టస్కర్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆ జట్టుపై నిషేధం పడడంతో జడేజా కోసం 2012 వేలంలో ఎస్ఆర్హెచ్, చెన్నై పోటీ పడ్డాయి. చివరికి చెన్నై సూపర్‌కింగ్స్ అప్పట్లోనే రూ. 9.8 కోట్లకు జడేజాను దక్కించుకుంది. మధ్యలో చెన్నైపై రెండేళ్ల నిషేదం పడడంతో గుజరాత్ లయన్స్‌కు ఆడిన జడేజా ఆ తర్వాత 2025 సీజన్ వరకు మళ్లీ చెన్నై జట్టుతోనే కొనసాగాడు. తాజాగా 2026 సీజన్‌కు ముందు ట్రేడింగ్‌లో శాంసన్‌ను దక్కించుకున్న సీఎస్కే జడేజాను రాజస్తాన్‌కు బదలాయింపు చేసింది. ధోని కెప్టెన్సీలో 2018, 2021, 2023లో టైటిల్ గెలిచిన సీఎస్కే జట్టులో జడేజా సభ్యుడిగా ఉన్నాడు.జడ్డూ ఎమెషనల్2012 నుంచి 2025 వరకు సీఎస్కే జట్టులో కొనసాగిన రవీంద్ర జడేజా సోమవారం మ్యాచ్‌లో భాగంగా సీఎస్కే ఇన్నింగ్స్ సమయంలో ఎమెషనల్ అయినట్లు తెలుస్తోంది. 9వ ఓవర్లో బౌండరీ లైన్ వద్ద నిలబడిన జడేజాను చూస్తూ అభిమానులు సీఎస్కే.. సీఎస్కే అంటూ అరవడం కనిపించింది. ఇదే సమయంలో కెమెరాలు జడేజా వైపు తిప్పగా, జడ్డూ ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకున్నట్లుగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు జడేజా సీఎస్కే వదిలి వెళ్లినప్పటికీ తమ మనసులో మాత్రం ఎప్పటికీ ఉంటాడు* అని కామెంట్లు పెట్టారు. ఓవరాల్‌గా జడేజా ఐపీఎల్లో 255 మ్యాచ్‌లాడి 3,260 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 172 వికెట్లు పడగొట్టాడు.Jadeja was seen emotional when crowd starts to chant CSK...CSK pic.twitter.com/oPRvmU2wAm— rocket.jadeja (@sherjedeja) March 30, 2026చదవండి: ‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’ -
‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’
ఐపీఎల్ 19వ సీజన్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) ఓటమితో ప్రారంభించింది. పేలవమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో రాజస్తాన్ రాయల్స్ చేతిలో సీఎస్కే 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అయితే రాజస్తాన్‌తో మ్యాచ్ ఓటమి మాకు గుణపాఠం లాంటిదని, తప్పులతో సీజన్‌ను ప్రారంభించినప్పుడే రాబోయే మ్యాచ్‌ల్లో ఎలా ఆడాలన్న దానిపై స్పష్టత వస్తుందని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రుతురాజ్ మీడియాతో మాట్లాడాడు. ‘మ్యాచ్ ఓటమి పెద్దగా నిరాశ కలిగించలేదు. అయితే మా ఇన్నింగ్స్ ఆరంభంలో రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, నండ్రీ బర్గర్లను ఎదుర్కొన్నప్పుడు పరిస్థితులు కఠినంగా ఉన్నాయనిపించింది. నిజానికి రాజస్తాన్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేశారు. ఆరంభంలో పేసర్లు, మధ్యలో స్పిన్నర్లకు పిచ్ సహకరించినట్లు అనిపించింది. కానీ మేము బ్యాటింగ్ మరింత మెరుగ్గా చేసినట్లయితే 150 నుంచి 160 స్కోరు చేసేవాళ్లం. వికెట్ కఠినంగా ఉన్నప్పుడు పరుగులు రావడం కష్టమైపోతుంది. అందుకే ఫలితంపై పెద్దగా నిరాశ చెందడం లేదు. ఈ మ్యాచ్ గురించి ఇక్కడే మరిచిపోయి ముందుకు సాగుతాము. మరో మూడు రోజుల్లో ఇంకో మ్యాచ్ ఉందని, దీంతో జట్టులో అందరూ సానుకూల దృక్పథంతో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. మా జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామం. మ్యాచ్‌లో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటాం. మాది బలమైన బ్యాటింగ్ లైనప్. భారీ స్కోర్లు చేయగల సత్తా మాకు ఉంది.’ అని చెప్పుకొచ్చాడు. అయితే సీఎస్కే భారీ అంచనాలు పెట్టుకున్న సంజూ శాంసన్, శివమ్ దూబే పూర్తిగా విఫలం కావడం, గాయాలతో ధోని, డెవాల్డ్ బ్రెవిస్ దూరం కావడం కూడా సీఎస్కేను ఒత్తిడిలోకి నెట్టేసింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. జేమీ ఓవర్టన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 12.1 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.చదవండి: ఒక్క ఇన్నింగ్స్‌తో నలుగురికి చెక్! -
‘దొరికితే అంతే సంగతి.. అందుకే తప్పించుకున్నా’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ శుభారంభం చేసింది. సోమవారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లోస్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ రాజస్తాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర ఆటతీరుతో అభిమానుల్లో జోష్ నింపాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న సూర్యవంశీ సీఎస్కేతో మ్యాచ్ ముగిసిన అనంతరం దూకుడైన బ్యాటింగ్ వెనుక ఉన్న రహస్యాన్ని పంచుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ..‘ నా బర్త్ డే సెలబ్రేషన్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే కేక్ కటింగ్ నుంచి తప్పించుకోవడానికి త్వరగా నిద్రపోయాను. ఇక సీఎస్కేతో మ్యాచ్ విషయానికొస్తే పవర్ ప్లేలో దూకుడుగా ఆడాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను. అయితే మొదట్లో బ్యాటింగ్ కాస్త కష్టమనిపించింది. కానీ బంతి పాతబడేకొద్దీ నా పని సులువయింది. డిఫెన్స్ గురించి ఆలోచిస్తాను కానీ సీఎస్కే విధించిన లక్ష్యం చిన్నది కావడంతో పవర్ ప్లేలో వీలైనంత స్కోర్ చేయాలని భావించాం. ఒకవేళ స్కోర్ ఎక్కువగా ఉండి ప్రత్యర్థి బౌలర్లు మమ్మల్ని కట్టడి చేసి ఉంటే పరిస్థితి ప్రమాదకరంగా మారి ఉండేది. కానీ నేను ఎక్కడా ఆ అవకాశం తీసుకోలేదు. మా కోచ్‌లు కూడా ప్రతి బౌలర్పైనా అటాకింగ్ గేమ్ ఆడమని చెప్పారు. నేను వాళ్ల మాటలను తూచా తప్పకుండా పాటించాను. ఇక ప్రతీ బంతి తర్వాత జైస్వాల్‌తో మాట్లాడుతూనే వచ్చాను. అతను ఎక్కువగా సింగిల్స్ తీసి నాకు స్ట్రైకింగ్ ఇచ్చి ప్రోత్సహించడంతో స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడగలిగాను’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది.చదవండి: ఒక్క ఇన్నింగ్స్‌తో నలుగురికి చెక్! -
ఒక్క ఇన్నింగ్స్‌తో నలుగురికి చెక్!
ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ తన ఆట మొదలుపెట్టేశాడు. అండర్-19 టీ20 ప్రపంచకప్ ఫామ్‌ను కంటిన్యూ చేసిన సూర్యవంశీ ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున తన తొలి మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్ అర్థసెంచరీ సాధించాడు. తద్వారా ఒక్క ఇన్నింగ్స్‌తో నలుగురి రికార్డులకు చెక్ పెట్టాడు ఈ బీహార్ చిన్నోడు. మ్యాచ్‌లో 15 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించిన సూర్యవంశీ 17 బంతుల్లో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో గత ఐపీఎల్ సీజన్లలో 16 బంతుల్లో అర్థసెంచరీలు సాధించిన సురేశ్ రైనా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ల రికార్డులు కనుమరుగయ్యాయి. చెన్నై విధించిన టార్గెట్ చిన్నది కావడంతో చప్పగా సాగుతున్నమ్యాచ్ను సూర్యవంశీ తన ఇన్నింగ్స్‌తో అభిమానుల్లో జోష్ నింపాడు. అంతేకాదు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున తక్కువ బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన జాబితాలో రెండు సూర్యవంశీ పేరిటే ఉండడం విశేషం. 2025లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 17 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న వైభవ్.. తాజాగా సీఎస్కేపై 15 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకొని తన రికార్డును తానే సవరించుకున్నాడు. కాగా 2023లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లోనే అర్థశతకం సాధించిన జైస్వాల్ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. 2018లో జాస్ బట్లర్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 18 బంతుల్లో అర్థశతకం సాధించాడు. అంతేకాదు లోస్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ మరికొన్ని రికార్డులు కూడా మ్యాచ్‌లో నమోదయ్యాయి. First ball of IPL 2025: SIX 😮💨Second ball of IPL 2026: SIX 😮💨pic.twitter.com/oJjCeUhf5p— Rajasthan Royals (@rajasthanroyals) March 30, 2026మ్యాచ్‌లో నమోదైన రికార్డులు..ఐపీఎల్లో సీఎస్కేపై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్లలో రాజస్తాన్ రెండో స్థానానికి చేరుకుంది. పంజాబ్ కింగ్స్‌తో కలిసి సంయుక్తంగా ఉన్న రాజస్తాన్ సీఎస్కేపై తాజా దానితో కలిపి 16 విజయాలు నమోదు చేసింది. తొలి స్థానంలో ముంబై (21 విజయాలు) ఉంది. 13 విజయాలతో ఆర్సీబీ మూడో స్థానంలో, 12 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో స్థానంలో, 11 విజయాలతో కేకేఆర్ ఐదో స్థానంలో ఉన్నాయి.2020 నుంచి చూసుకుంటే సీఎస్కేతో ఆడిన 11 మ్యాచ్‌ల్లో రాజస్తాన్ రాయల్స్ 9 విజయాలు సాధించి స్పష్టమైన ఆధిక్యంలో నిలవడం విశేషం.ఐపీఎల్లో 120 ప్లస్ స్కోర్లను అత్యంత తక్కువ ఓవర్లలో ఛేదించిన నాలుగో జట్టుగా రాజస్తాన్ నిలిచింది. గతంలో ఎస్ఆర్హెచ్ (9.4 ఓవర్లలో), పంజాబ్ కింగ్స్ (11.1 ఓవర్లలో), డెక్కన్ చార్జర్స్ (12 ఓవర్లలో) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.చదవండి: రాయల్స్ రాజసం -
రాయల్స్ రాజసం
ఐపీఎల్లో గత ఏడాది రాజస్తాన్, చెన్నై జట్లు చివరి రెండు స్థానాల్లో నిలిచాయి. తాజా సీజన్లో పలు మార్పులతో కొత్తగా మొదలు పెట్టేందుకు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. ఈ పోరులో చివరకు రాజస్తాన్‌దే పైచేయి అయింది. బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శనతో చెన్నైని స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన రాయల్స్ ఆ తర్వాత మరో 47 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాది మరో సీజన్‌ను ఘనంగా మొదలు పెట్టడం విశేషం. గువాహటి: ఐపీఎల్లో రెండు భారీ స్కోర్ల మ్యాచ్‌ల తర్వాత మూడో మ్యాచ్‌లో బౌలర్ల ప్రభావం కనిపించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. పవర్‌ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయిన టీమ్ ఒకదశలో 82/8 వద్ద నిలిచింది. అయితే జేమీ ఒవర్టన్ (36 బంతుల్లో 43; 2 ఫోర్లు, 2 సిక్స్) జట్టు స్కోరును 100 దాటించాడు. అనంతరం రాజస్తాన్ 12.1 ఓవర్లలో 2 వికెట్లకు 128 పరుగులు చేసి గెలిచింది. వైభవ్ సూర్యవంశీ (17 బంతుల్లో 52; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగడంతో రాయల్స్ గెలుపు లాంఛనంగా మారిపోయింది. యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రెండు కీలక వికెట్లు తీసిన బర్గర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. వరల్డ్ కప్ స్టార్లు విఫలం... భారత్‌కు టి20 ప్రపంచ కప్ అందించిన జోష్‌లో ఉన్న సంజు సామ్సన్‌కు ఐపీఎల్ కొత్త జట్టుతో సరైన ఆరంభం లభించలేదు. 11 సీజన్ల పాటు రాజస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన సామ్సన్ ఇప్పుడు తొలిసారి చెన్నై తరఫున తన పాత జట్టుపై ప్రత్యరి్థగా బరిలోకి దిగాడు. అయితే బర్గర్ అద్భుత బంతికి సామ్సన్ (6) బౌల్డ్ కాగా, మరో వరల్డ్ కప్ విజేత శివమ్ దూబే (6) ఆట ఒక సిక్స్‌కే ముగిసింది. ఈ ఏడాది భారత్‌కు కెప్టెన్‌గా అండర్–19 వరల్డ్ కప్ అందించిన ఆయుశ్ మాత్రే (0) తొలి బంతికే అవుటయ్యాడు. గత రెండు సీజన్లు ఐపీఎల్లో ఆడే అవకాశం రాని సర్ఫరాజ్ ఖాన్ (12 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్) ఇప్పుడు బరిలోకి దిగినా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కార్తీక్ శర్మ అరంగేట్రం... ఐపీఎల్ వేలంలో రూ.14.20 కోట్లకు అమ్ముడుపోయి అందరి దృష్టినీ ఆకర్షించిన 20 ఏళ్ల కార్తీక్ శర్మకు చెన్నై తొలి మ్యాచ్‌లో అవకాశం కలి్పంచింది. అయితే కార్తీక్ (15 బంతుల్లో 18; 1 సిక్స్) కూడా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. చెన్నై టీమ్‌లోనే ఉన్న మరో రూ.14.20 కోట్ల ప్లేయర్ ప్రశాంత్ వీర్‌కు మ్యాచ్ చాన్స్ లభించలేదు. మరోవైపు బెంగాల్ ప్రొ టి20 లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన పేసర్ బ్రిజేశ్ శర్మతో రాజస్తాన్ ఐపీఎల్లో అరంగేట్రం చేయించింది. ఏ స్థాయిలోనైనా ప్రొఫెషనల్ క్రికెట్లో అతనికి ఇదే తొలి మ్యాచ్. 277 మ్యాచ్‌ల అనంతరం... చెన్నై జట్టుకు కర్త, కర్మ, క్రియవంటి ధోని మాత్రమే కాకుండా సురేశ్ రైనాకు కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. ధోని, రైనాలు రామలక్ష్మణుల్లా సుదీర్ఘ కాలం ఆ జట్టును నడిపించారు. అయితే ధోని, రైనాలలో ఏ ఒక్కరు కూడా తుది జట్టులో లేకుండా 277 మ్యాచ్‌ల తర్వాత చెన్నై టీమ్ బరిలోకి దిగడం (చాంపియన్స్ లీగ్‌తో కలిపి) విశేషం. వైభవ్ సూపర్... తనపై ఉన్న అంచనాలను అందుకుంటూ వైభవ్ సూర్యవంశీ మళ్లీ చెలరేగిపోయాడు. ‘సున్నా’ వద్ద కార్తీక్ కష్టసాధ్యమైన క్యాచ్‌ను వదిలేయడంతో బతికిపోయిన అతను ఆ తర్వాత దూసుకుపోయాడు. కంబోజ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన వైభవ్... నూర్ బౌలింగ్‌లో వరుసగా 2 సిక్స్‌లతో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 6158 రోజుల తర్వాత... భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 17 ఏళ్ల తర్వాత తన మొదటి ఐపీఎల్ జట్టు రాజస్తాన్ తరఫున మ్యాచ్ ఆడాడు. 2008లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగి 20 మే, 2009న చివరిసారిగా ఆ జట్టుకు అతను ప్రాతినిధ్యం వహించాడు. 6158 రోజుల తర్వాత అతను మళ్లీ రాజస్తాన్‌కు ఆడటం విశేషం. ఈ మధ్య కాలంలో అతను కొచ్చి తరఫున ఒక సీజన్, గుజరాత్ లయన్స్ తరఫున రెండు సీజన్లు, చెన్నై తరఫున 12 సీజన్ల పాటు ఆడాడు.స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: సామ్సన్ (బి) బర్గర్ 6; రుతురాజ్ (బి) ఆర్చర్ 6; మాత్రే (సి) జురేల్ (బి) బర్గర్ 0; షార్ట్ (సి) జైస్వాల్ (బి) సందీప్ 2; సర్ఫరాజ్ (ఎల్బీ) (బి) జడేజా 17; కార్తీక్ (ఎల్బీ) (బి) బ్రిజేశ్ 18; దూబే (సి) బిష్ణోయ్ (బి) జడేజా 6; ఒవర్టన్ (రనౌట్) 43; నూర్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 1; హెన్రీ (సి అండ్ బి) బిష్ణోయ్ 5; కంబోజ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 127. వికెట్ల పతనం: 1–14, 2–19, 3–19, 4–38, 5–51, 6–57, 7–74, 8–82, 9–94, 10–127. బౌలింగ్: ఆర్చర్ 4–0–19–2, బర్గర్ 4–0–26–2, బ్రిజేశ్ 3–0–17–1, సందీప్ 2.4–0–22–1, రవి బిష్ణోయ్ 3–0–16–1, జడేజా 3–0–18–2. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 38; వైభవ్ (సి) సర్ఫరాజ్ (బి) కంబోజ్ 52; జురేల్ (బి) కంబోజ్ 18; పరాగ్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (12.1 ఓవర్లలో 2 వికెట్లకు) 128. వికెట్ల పతనం: 1–75, 2–99. బౌలింగ్: హెన్రీ 3–0–40–0, ఖలీల్ 3–0–17–0, కంబోజ్ 3–0–27–2, నూర్ 2–0–24–0, ఒవర్టన్ 1–0–14–0, షార్ట్ 0.1–0–1–0.ఐపీఎల్లో ఇప్పటి వరకు 254 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కేవలం 12 సార్లు మాత్రమే ఆలౌటైంది. ముంబై ఇండియన్స్ అత్యధికంగా 5 సార్లు చెన్నైను (2012, 2013, 2015, 2019, 2022లో) ఆలౌట్ చేయగా... రాజస్తాన్ రాయల్స్ (2008, 2026లో), పంజాబ్ కింగ్స్ (2022, 2025లో) రెండుసార్లు చొప్పున ఈ ఘనత సాధించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ (2009లో), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2009లో), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2025లో) ఒక్కోసారి చెన్నైను ఆలౌట్ చేశాయి.ఆరు ఐపీఎల్ సీజన్ల తర్వాత (2020లో 74; 2021లో 119; 2022లో 55; 2023లో 55; 2024లో 82 నాటౌట్; 2025లో 66) సంజూ సామ్సన్ తన ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో రెండంకెల స్కోరు చేయకుండా సింగిల్ డిజిట్‌కే అవుటయ్యాడు. -
వరల్డ్‌కప్ హీరో సంజూ అట్టర్ ఫ్లాఫ్.. తొలి మ్యాచ్‌లో ఫెయిల్
టీ20 ప్రపంచకప్-2026 హీరో సంజూ శాంసన్ ఐపీఎల్ తాజా ఎడిషన్ తొలి మ్యాచ్‌లోనే నిరాశపరిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున భారీ అంచనాలతో బరిలోకి దిగాడు ఈ కేరళ స్టార్. ఐపీఎల్-2026లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో సోమవారం నాటి మ్యాచ్ సందర్భంగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి సీఎస్కే ఇన్నింగ్స్ ఆరంభించాడు సంజూ.క్లీన్‌బౌల్డ్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) రాయల్స్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించగా.. సంజూ ఐదో బంతికి ఫోర్ బాది ఖాతా తెరిచాడు. అయితే, ఆ తర్వాత బ్యాట్ ఝులిపించలేకపోయిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. రెండో ఓవర్ ఆఖరి బంతికే పెవిలియన్ చేరాడు.రాయల్స్ పేసర్ నండ్రీ బర్గర్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ (Sanju Samson) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో మొత్తంగా ఏడు బంతులు ఎదుర్కొన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. సీఎస్కే తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే సంజూ విఫలం కావడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.𝐒𝐨𝐮𝐧𝐝𝐬 𝐨𝐟 𝐓𝐢𝐦𝐛𝐞𝐫 🎶Nandre Burger 🤝 Jofra Archer #RR fans, how was that for a start? 😉 Updates ▶️ https://t.co/UzbuFk5G26#TATAIPL | #KhelBindaas | #RRvCSK | @rajasthanroyals pic.twitter.com/iqLU8yIgcX— IndianPremierLeague (@IPL) March 30, 2026వరల్డ్‌కప్ హీరో సంజూకాగా స్వదేశంలో టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు ఫామ్ కోల్పోయిన సంజూ శాంసన్‌కు.. అదృష్టవశాత్తూ సూపర్-8 మ్యాచ్‌ల సందర్భంగా తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం దక్కింది. ఈ క్రమంలో సూపర్-8 నాకౌట్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 97 పరుగులతో రాణించిన సంజూ.. ఆ తర్వాత కూడా భీకర ఫామ్ కొనసాగించాడు.ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో, న్యూజిలాండ్‌తో ఫైనల్లో వరుసగా 89, 89 పరుగులు చేసిన సంజూ.. భారత్ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇదే జోరులో చెన్నై తరఫునా చెలరేగుతాడని అభిమానులు కొండంత ఆశతో ఎదురుచూడగా.. తొలి మ్యాచ్‌లోనే సంజూ తడబడ్డాడు.కకావికలంకాగా తాజా సీజన్లో తమ తొలి మ్యాచ్‌లో చెన్నై రాజస్తాన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు మైదానంలో దిగింది. గౌహతి వేదికగా టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇక గాయం కారణంగా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని దూరంకాగా.. అతడి స్థానంలో సంజూ వికెట్ కీపర్‌గా సేవలు అందించనున్నాడు.కాగా రాయల్స్ పేసర్ల విజృంభణతో చెన్నై టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు సంజూ (6), రుతు (6) విఫలం కాగా.. ఆయుశ్ మాత్రే డకౌట్ అయ్యాడు. మాథ్యూ షార్ట్ రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. ఫలితంగా పవర్ ప్లే (6 ఓవర్లు)లో చెన్నై నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 41 పరుగులే చేసింది.చదవండి: బంగ్లాదేశ్‌కు బ్యాడ్‌న్యూస్!.. షాకిచ్చిన జియోస్టార్! -
IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో తొలిసారి ఇలా..!
చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ విచిత్రం జరిగింది. 277 మ్యాచ్‌ల ఈ ఫ్రాంచైజీ ప్రస్తానంలో తొలిసారి ఓ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని, సురేశ్ రైనా ఇద్దరూ లేరు. సీఎస్కే చరిత్రలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇలా జరగలేదు. ఐపీఎల్ 2026లో భాగంగా గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఇవాళ (మార్చి 30) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘట్టం చోటు చేసుకుంది. తలా, చిన్న తలా అని పిలుచుకునే ధోని-రైనా లేకపోవడాన్ని సీఎస్కే అభిమానులు ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు.రైనా కొంతకాలం కిందటే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. ధోని లీగ్‌లో కొనసాగుతున్నప్పటికీ గాయం కారణంగా ఈ సీజన్ తొలి రెండు వారాలకు దూరంగా ఉండనున్నాడు. ధోని-రైనా జోడీ సీఎస్కే విజయ ప్రస్తానంలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నారు. ధోని సీఎస్కే సాధించిన ప్రతి విజయంలో కీలకంగా వ్యవహరించగా.. రైనా మిస్టర్ ఐపీఎల్‌గా పేరుగడించాడు.ఇదిలా ఉంటే, రాజస్థాన్‌తో నేటి మ్యాచ్‌లో సీఎస్కే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. రాయల్స్ పేసర్ల ధాటికి సీఎస్కే టాపార్డర్ పేకమేడలా కూలింది. నండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే బంతులతో సీఎస్కే బ్యాటర్లను పెవిలియన్‌కు పంపారు. రెండో ఓవర్ చివరి బంతికి తొలిసారి సీఎస్కే తరఫున ఆడుతున్న సంజూ శాంసన్‌ను (6) బర్గర్.. మూడో ఓవర్ చివరి బంతికి సీఎస్కే సారధి రుతురాజ్ గైక్వాడ్‌ను (6) ఆర్చర్ అద్భుతమైన బంతులతో క్లీన్ బౌల్డ్ చేశారు. ఆ మరుసటి బంతికే (3.1 ఓవర్) యువ ఆటగాడు ఆయుశ్ మాత్రేను బర్గర్ మరో అద్భుతమైన బంతితో డకౌట్ చేశాడు. ఆతర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ వరుసగా బౌండరీ, సిక్సర్ బాది జోరును ప్రదర్శిస్తున్నాడు. 5 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 36-3గా ఉంది. సర్ఫరాజ్ ఖాన్ (14), మాథ్యూ షార్ట్ (1) క్రీజ్‌లో ఉన్నారు. తుది జట్లు..సీఎస్కే: సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(సి), ఆయుష్ మ్హత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ(w), జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ఇంపాక్ట్ ప్లేయర్స్ ఆప్షన్స్: సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, రాహుల్ చాహర్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(సి), ధృవ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మఇంపాక్ట్ ప్లేయర్స్ ఆప్షన్స్: డొనొవన్ ఫెరియెరా, లుహాన్ డ్రి ప్రిటోరియస్, సుషాంత్ మిశ్రా, రవి సింగ్ -
సీఎస్కేపై రాయల్స్ ఘన విజయం
సీఎస్కేపై రాయల్స్ ఘన విజయంఐపీఎల్ 2026లో భాగంగా సీఎస్కేతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే, రాయల్స్ బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలగా.. రాయల్స్ 12.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.రెండో వికెట్ కోల్పోయిన రాయల్స్.. జురెల్ ఔట్8.3వ ఓవర్- 99 పరుగుల వద్ద రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో ధృవ్ జురెల్ (18) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వైభవ్ ఔట్17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసిన అనంతరం వైభవ్ సూర్యవంశీ ఔటయ్యాడు. అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు.127 పరుగులకు సీఎస్కే ఆలౌట్సీఎస్కే ఇన్నింగ్స్ 127 పరుగుల వద్ద ముగిసింది. ఓవర్టన్ (43) అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించడంతో సీఎస్కే 100 పరుగుల మార్కును దాటగలిగింది. ఓవర్టన్కు (7 నాటౌట్) అన్షుల్ కంబోజ్ సహకరించాడు. రాయల్స్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, రవీంద్ర జడేజా తలో 2.. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. సీఎస్కే ఇన్నింగ్స్‌లో ఓవర్టన్తో పాటు కార్తీక్ శర్మ (18, సర్ఫరాజ్ ఖాన్ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఎనిమిదో వికెట్ డౌన్12.5వ ఓవర్- 82 పరుగుల వద్ద సీఎస్కే ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్ ఇచ్చి నూర్ అహ్మద్ (1) ఔటయ్యాడు.ఏడో వికెట్ కోల్పోయిన సీఎస్కేబ్రిజేశ్ శర్మ బౌలింగ్‌లో కార్తిక్ శర్మ (18) ఎల్బీడబ్ల్యూ. బ్రిజేశ్ ఖాతాలో తొలి ఐపీఎల్ వికెట్. స్కోరు: 74-7(11). ఓవర్టన్ తొమ్మిది పరుగులతో ఉండగా.. నూర్ అహ్మద్ క్రీజులోకి వచ్చాడు.ఆరో వికెట్ డౌన్జడేజా బౌలింగ్‌లో శివం దూబే రవి బిష్ణోయికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులు చేసి నిష్క్రమించాడు. స్కోరు: 57-6 (8). కార్తిక్ శర్మ 14 పరుగులతో ఉండగా.. జేమీ ఓవర్టన్ క్రీజులోకి వచ్చాడు.సగం వికెట్లు కోల్పోయిన సీఎస్కేరవీంద్ర జడేజా బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. 12 బంతుల్లో 17 పరుగులతో ఆడుతున్న సర్ఫరాజ్‌ను జడ్డూ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శివం దూబే క్రీజులోకి రాగా.. కార్తిక్ శర్మ 11 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 57-5(7.5).కుప్పకూలిన సీఎస్కే టాపార్డర్రాజస్థాన్ పేసర్ల ధాటికి సీఎస్కే టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. బర్గర్.. సంజూ శాంసన్ (6), మాత్రే (0)ను ఔట్ చేయగా.. ఆర్చర్ రుతురాజ్‌ను (6), సందీప్ శర్మ షార్ట్‌ను (2) పెవిలియన్‌కు పంపారు. 6 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 41-4గా ఉంది. కార్తీక్ శర్మ (3), సర్ఫరాజ్ ఖాన్ (15) క్రీజ్‌లో ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో సీఎస్కేటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న సీఎస్కే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 19 పరుగులకే 3 వికెట్లు (3.1 ఓవర్లలో) కోల్పోయింది. ఆర్చర్, బర్గర్ వరుస బంతుల్లో రుతురాజ్ (6), ఆయుశ్ మాత్రేను (0) ఔట్ చేశారు. సంజూ క్లీన్ బౌల్డ్1.6వ ఓవర్- నండ్రే బర్గర్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 30) రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. గౌహతిలోని బర్సపరా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్కు ముందు వర్షం పడటంతో 5 నిమిషాలు ఆలస్యమైంది. మ్యాచ్ సమయంలో కూడా వరుణుడి ఆటంకాలు తప్పకపోవచ్చు. ప్రస్తుతానికి వాతావరణం క్లియర్‌గా ఉంది.తుది జట్లు..సీఎస్కే: సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(సి), ఆయుష్ మ్హత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ(w), జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ఇంపాక్ట్ ప్లేయర్స్ ఆప్షన్స్: సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, రాహుల్ చాహర్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(సి), ధృవ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మఇంపాక్ట్ ప్లేయర్స్ ఆప్షన్స్: డొనొవన్ ఫెరియెరా, లుహాన్ డ్రి ప్రిటోరియస్, సుషాంత్ మిశ్రా, రవి సింగ్ -
IPL 2026: రాజస్థాన్-సీఎస్కే మ్యాచ్ జరిగేనా..? గౌహతిలో వర్షం
ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాల్టి (మార్చి 30) మ్యాచ్ జరగాల్సి ఉంది. గౌహతిలోని బర్సపరా వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 🚨 ITS RAINING AT GUWAHATI 🚨 pic.twitter.com/kMxhiDENqx— Johns. (@CricCrazyJohns) March 30, 2026ఎందుకంటే, మ్యాచ్ ప్రారంభానికి ముందు గౌహతిలో వర్షం మొదలైంది. పిచ్‌ను, కొంత భాగం మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరలవడంతో, నేటి మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. వాతావరణ సమాచారం ప్రకారం, మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం 20 శాతంగా ఉంది. ఇప్పటికే వర్షం మొదలైన నేపథ్యంలో టాస్ కూడా ఆలస్యమవ్వవచ్చు. కాగా, రాజస్థాన్ రాయల్స్ తమ మూడు హోం మ్యాచ్‌లను గౌహతిలో ఆడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ రద్దైతే ఇరు జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. కానీ, పరిస్థితి అంత వరకు వెళ్లకపోవచ్చని అంచనా. మ్యాచ్ సమయానికి వాతావరణం కుదురుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. హీన పక్షంలో కొన్ని ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందని అనుకుంటున్నారు. మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాకూడదని ఇరు ఫ్రాంచైజీల అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. -
సీఎస్కే తుది జట్టు ఇదే.. రూ. 14 కోట్ల ఆటగాడికి ఛాన్స్?
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో సీఎస్కే తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని, విధ్వసంకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ గాయం కారణంగా సీఎస్కే ఆడే కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యారు. దీంతో జట్టు బాధ్యత మొత్తం సంజూ శాంసన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పైనే పడింది. ఈ క్రమంలో రాజస్తాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలా ఉండబోతుందో ఓ లుక్కేద్దాం. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు ప్రశాంత్ వీర్ అరంగేట్రం చేసే అవకాశముంది.గతేడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో ప్రశాంత్ వీర్‌ను రూ. 14.2 కోట్ల భారీ ధర వెచ్చించి మరి సీఎస్కే కొనుగోలు చేసింది. ఈ 20 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్‌రౌండర్‌ను రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయంగా తీసుకున్నారు. ఈ ఏడాది సీజన్‌కు ముందు జడేజా సీఎస్కే నుంచి రాజస్తాన్‌కు ట్రేడ్ అయిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మథ్యూ షార్ట్, ఇంగ్లండ్ పేసర్ జేమీ ఓవర్టన్ సీఎస్కే తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశముంది. అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నారు. స్పిన్నర్లగా నూర్ అహ్మద్, రాహుల్ చాహర్ తుది జట్టులో చోటు దక్కించుకునే సూచనలు కన్పిస్తున్నాయి. సీఎస్కే బ్యాటింగ్‌ను సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ప్రారంభించనున్నారు.సీఎస్కే తుది జట్టు(అంచనా) సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జామీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, రాహుల్ చాహర్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్రాజస్తాన్ తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, దాసున్ షనక, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, ఆడమ్ మిల్నే -
కింగ్స్ X రాయల్స్
గువాహటి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. సీజన్ ఆరంభానికి ముందే ప్లేయర్ల బదిలీతో వార్తల్లో నిలిచిన మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ సోమవారం గువాహటి వేదికగా తలపడనున్నాయి. గతేడాది ఇరు జట్లు పేలవ ఆటతీరు కనబర్చాయి. చెన్నై పట్టికలో అట్టడుగున నిలవగా... రాయల్స్ తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. దశాబ్ద కాలానికి పైగా రాయల్స్‌కు కీలక ఆటగాడిగా ఉన్న సంజూ సామ్సన్ ఈసారి చెన్నై ఓపెనర్‌గా దర్శనమివ్వనుండగా... చెన్నై స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తన పాత జట్టు రాజస్తాన్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇటీవల టి20 ప్రపంచకప్‌లో దంచికొట్టిన సామ్సన్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది కీలకం. గాయం కారణంగా ధోనీ రెండు వారాల పాటు అందుబాటులో లేకపోవడంతో... వికెట్ల వెనుక పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యత కూడా సామ్సన్‌పై ఉంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి సంజూ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా... శివమ్ దూబే, ఆయుశ్ మాత్రే, కార్తీక్ శర్మతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే ఉంది. హిట్టర్ బ్రెవిస్ గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. వేలంలో రూ. 14.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న 20 ఏళ్ల స్పిన్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బౌలింగ్‌లో ఖలీల్, నూర్ అహ్మద్, అకీల్ హుసేన్, హెన్రీ కీలకం కానున్నారు. మరోవైపు రాజస్తాన్ జట్టుకు రియాన్ పరాగ్ సారథ్యం వహించనున్నాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, హెట్‌మైర్, ధ్రువ్ జురెల్ రూపంలో జట్టు నిండా హిట్టర్లు ఉన్నారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో జడేజా అనుభవం అక్కరకు రానుంది. ఆర్చర్ ప్రధాన పేసర్ కాగా... జడ్డూతో కలిసి రవి బిష్ణోయ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. మ్యాచ్‌కు వర్ష సూచన ఉంది. -
సీఎస్కేకు మరో భారీ షాక్.. విధ్వంసకర వీరుడికి గాయం
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. సోమవారం గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో సీఎస్కే తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ గాయం కారణంగా సీఎస్కే ఆడే తొలి మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.రెవ్‌స్పోర్ట్స్ నివేదిక ప్రకారం.. బ్రెవిస్ పక్కటెముకల కండరాల నొప్పి తో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి దాదాపు రెండు వారాల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఐపీఎల్-2025 సీజన్ మధ్యలో సీఎస్కేతో బ్రెవిస్ చేరాడు. గత సీజన్లో బ్రెవిస్ దుమ్ములేపాడు. కేవలం 6 మ్యాచ్‌ల్లోనే 225 పరుగులు చేసి సత్తాచాటాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా లీగ్ 2025-26లో కూడా అతడు తన పవర్ చూపించాడు. ప్రిటోరియా తరఫున 12 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేశాడు. అటువంటి విధ్వంసకర ప్లేయర్ గాయం బారిన పడడం సీఎస్కేకు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. మరోవైపు ఎంఎస్ ధోని కూడా కండరాల గాయంతో సతమతవుతున్నాడు. అతడు దాదాపు సీఎస్కే ఆడే ఆరు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు ఈ జాబితాలో బ్రెవిస్ కూడా చేరాడు. అంతకంటే ముందు ఆసీస్ స్పీడ్ స్టార్ నాథన్ ఎల్లీస్ ఏకంగా సీజన్ మొత్తానికే దూరమయ్యాడు.ఐపీఎల్-2026 సీఎస్కే జట్టురుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజు శాంసన్, ఆయుష్ మాత్రే, శివమ్ దూబే, ఉర్విల్ పటేల్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, శ్రేయాస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, రామకృష్ణ ఘోష్, ఓవర్సీస్, ముకేష్మీ చౌద్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అకేల్ హోసేన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, మాట్ హెన్రీ, రాహుల్ చాహర్, జాక్ ఫౌల్కేస్. -
ధోని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందే ఎంఎస్ ధోని రూపంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పిక్క కండరాల గాయంతో ధోని.. తొలి రెండు వారాల్లో జరిగే మ్యాచ్‌లకు దూరం కానున్నాడని సీఎస్కే మేనెజ్మెంట్ ఇప్పటికే స్పష్టం చేసింది. అతడికి రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఎంఎస్ కోలుకోవడానికి నాలుగు నుంచి వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో అయితే మిస్టర్ కూల్ ఇప్పుడు ఏప్రిల్ చివరి వారం వరకు అందుబాటులో ఉండకపోవచ్చు అని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.అంటే ధోని దాదాపు 6 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. ధోని తిరిగి మళ్లీ ఏప్రిల్ 23న వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశముంది. ధోని స్ధానంలో సంజూ శాంసన్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. ధోనికే ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అయ్యే అవకాశముంది. దీంతో అతడు త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.ధోనీ దూరమయ్యే మ్యాచ్‌లు ఇవే: రాజస్థాన్ రాయల్స్ (మార్చి 30), పంజాబ్ కింగ్స్ (ఏప్రిల్ 3), ఆర్సీబీ (ఏప్రిల్ 5), ఢిల్లీ క్యాపిటల్స్ (ఏప్రిల్ 11). కేకేఆర్(ఏప్రిల్ 14), ఎస్ఆర్హెచ్(ఏప్రిల్ 18) -
IPL 2026: కుర్ర క్రికెటర్లపైనే అందరి దృష్టి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో అనామక క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. ఇవాళ టీమిండియా స్టార్లుగా చెలామణి అవుతున్న రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ సహా ఎందరో క్రికెటర్లకు లైఫ్ ఇచ్చింది కూడా ఐపీఎల్లే అనడంలో సందేహం లేదు. 2008 నుంచి 18 సీజన్ల పాటు నిరంతరాయంగా సాగుతూ వస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి మరో కొద్ది గంటలే మిగిలి ఉంది. గత సీజన్లో బీహార్ చిన్నోడు వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రె రూపంలో కొత్తనీరు భారత క్రికెట్లోకి వచ్చి చేరింది. ఇక ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న 19వ సీజన్లోనూ అలా రాణించగల సమర్థులెవరన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.జూనియర్ మిల్లర్ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ డేవిడ్ మిల్లర్ తరహా బ్యాటింగ్ శైలిని పోలి ఉండే 20 ఏళ్ల అమేథీ కుర్రాడు ప్రశాంత్ వీర్‌పై ఈ సీజన్లో భారీ అంచనాలున్నాయి. గత రెండేళ్లుగా ఆశించినంతంగా ఫలితాలు రాకపోవడంతో జట్టులో యువ ఆటగాళ్లను నింపేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే వేలంలో ప్రశాంత్ వీర్‌ను ఏకంగా రూ. 14.20 కోట్లు పెట్టి దక్కించుకోవడం ఆశ్చర్యపరిచింది. దేశవాలీ క్రికెట్లో సంచలన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన ప్రశాంత్ వీర్ గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అంచనాలకు మించి రాణించాడు. ఆ టోర్నీలో 320 పరుగులు చేయడంతో 8 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా మాదిరిగానే స్లో లెఫ్టార్మ్ స్పిన్, ఎడమచేతివాటం బ్యాటింగ్ కావడంతో జడ్డూ స్థానాన్ని ప్రశాంత్ భర్తీ చేస్తాడని సీఎస్కే భారీ ఆశలు పెట్టుకుంది. ‘జూనియర్ మిల్లర్’గా గుర్తింపు పొందిన ప్రశాంత్ అంచనాలను అందుకుంటాడా అన్నది చూడాలి.సిక్సర్లకు పెట్టింది పేరు..చెన్నై సూపర్‌కింగ్స్‌కే ఆడనున్న మరో విధ్వంసక వీరుడు కార్తిక్ శర్మ. రాజస్థాన్‌కు చెందిన కార్తిక్ శర్మ అవలీలగా సిక్సర్లు కొట్టగలడు. అందుకే వేలంలో సీఎస్కే ఇతడిని రూ. 14.2 కోట్లు పెట్టి దక్కించుకుంది. విజయ్‌హజారే ట్రోఫీతో పాటు 2025-26 రంజీ సీజన్లో అత్యధిక సిక్స్‌లు కొట్టినవారిలో కార్తిక్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు.ఇక వేలంలో కార్తిక్ శర్మ కోసం ఐదు ఫ్రాంచైజీలు పోటాపోటీగా బిడ్ వేశాయంటేనే మనోడి టాలెంట్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా 11 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 28 సిక్స్‌లు కొట్టిన కార్తీక్ చెన్నై జట్టుకు కీలక బ్యాటర్‌గా మారే అవకాశముంది.ఢిల్లీ ఆశాకిరణం..ఇటీవల కాలంలో దేశవాళీ క్రికెట్లో బాగా వినిపిస్తున్న పేరు అకిబ్ నబీ. ఈ జమ్మూకశ్మీర్ పేసర్ కొద్దిరోజుల క్రితం ముగిసిన రంజీ సీజన్లో ఏకంగా 60 వికెట్లు పడగొట్టి తన జట్టు చరిత్రాత్మక రంజీ ట్రోఫీ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నబీని వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 8.40 కోట్లకు సొంతం చేసుకుంది.ఐపీఎల్ ద్వారా జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే పేర్కొన్నాడు. భారీ అంచనాలు పెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆకిబ్ నబీ టైటిల్ అందిస్తాడేమో చూడాలి. ఒకవేళ నబీ ఆ ఫీట్‌ను సాధిస్తే మాత్రం టీమిండియాలోకి పిలుపు రావడం లాంఛనమే అవుతుంది.ఆ కొరత తీరినట్లే!భారత జట్టుకు లెఫ్టార్మ్ పేసర్ల కొరత ఎప్పట్నుంచో ఉంది. జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా తర్వాత చాలా రోజులకు పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. అతడి మార్గంలోనే యువ పేసర్ నమన్ తివారి అదరగొడుతున్నాడు. 2024 అండర్-19 ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చిన నమన్.. ఆ టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. యూపీ టీ20 లీగ్‌లో అతడు పది మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. 145 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా బౌలింగ్ చేయడం అతడి ప్రత్యేకత. అందుకే వేలంలో లక్నో జట్టు అతడికి కోటి రూపాయల ధరకు దక్కించుకుంది. నమన్ సత్తాచాటితే టీమ్ఇండియాకు మరో లెఫ్టార్మ్ పేసర్ దొరికేసినట్లే.దంచుడే లక్ష్యంగా..ఈ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడబోతున్న తేజస్వీ దహియా కూడా విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన ఈ ఢిల్లీ కుర్రాడు బరిలోకి దిగిందే తడవు దంచుడే లక్ష్యంగా బ్యాటింగ్ చేయడం అతడి నైజం. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ గత ఎడిషన్‌లో తేజస్వీ దహియా 10 ఇన్నింగ్స్‌ల్లో 190 సగటుతో 339 రన్స్ సాధించాడు. ఆ సీజన్లో దహియా 29 సిక్స్‌లు బాది టోర్నీలో అత్యధిక సిక్స్‌లు కొట్టినవారిలో రెండో స్థానంలో నిలిచాడు. కీపర్‌గాను అద రగొడుతున్నాడు. వీళ్లే కాదు ఇంకా చాలా మంది యువ క్రికెటర్లు ఈసారి ఐపీఎల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.చదవండి: ధోనికి గాయం.. ఐపీఎల్‌కు దూరం! -
ధోనికి గాయం.. ఐపీఎల్‌కు దూరం!
ఐపీఎల్ అభిమానులకు సీఎస్కే యాజమాన్యం షాకింగ్ వార్త చెప్పింది. సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. చెన్నై యాజమాన్యం విడుదల చేసిన అధికారిక ప్రకటనతో ఈ వార్త ఒక్కసారిగా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చెన్నై యాజమాన్యం వివరాల ప్రకారం.. ‘ధోనీ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతను ప్రస్తుతం రీహాలిటేషన్ కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో రెండు వారాల పాటు ఐపీఎల్ 19వ సీజన్‌కు దూరమయ్యే అవకాశముంది. ‘తలా’ తొందరగా కోలుకోవాలి!’ అని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసింది. దీంతో సీజన్ ఆరంభంలోనే చెన్నై జట్టు పెద్ద పరీక్షను ఎదుర్కొనాల్సి వస్తోంది. అయితే ధోని ఆడకపోయినప్పటికీ సీఎస్కేకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే గత రెండు, మూడు సీజన్లుగా ధోని జట్టులో పెద్దన్న పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. బ్యాటింగ్‌లో ఎక్కువగా లోయర్ ఆర్డర్‌లోనే వస్తున్న ధోని ఫీల్డింగ్‌లో మాత్రం తన మాస్టర్‌మైండ్‌కు పని చెబుతున్నాడు. కెప్టెన్‌కు విలువైన సలహాలు, సూచనలు చేస్తూ మార్గదర్శకుడి పాత్రకు ధోని మారిపోయాడు. 2023లో చివరిసారి ధోని సారథ్యంలోనే చెన్నై సూపర్‌కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను దక్కించుకుంది. ప్రస్తుత సీజన్ ధోనికి ఆఖరిదని ప్రచారం జరుగుతున్న వేళ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సీఎస్కే ఆరోసారి టైటిల్ గెలిచి ధోనికి కానుకగా ఇవ్వాలని భావిస్తోంది. ఐపీఎల్ 19వ సీజన్‌కు ముందు సీఎస్కే జట్టులో భారీ మార్పులు చేసింది. ‘డాడీస్ ఆర్మీగా’ పేరు పొందిన సీఎస్కే మినీ వేలంలో యువ ఆటగాళ్ల కొనుగోలుకు ప్రాధాన్యత చూపింది. కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ లాంటి అన్‌క్యాప్ ప్లేయర్లను చెరో 14.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇక ట్రేడింగ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శామ్సన్ను దక్కించుకున్న సీఎస్కే జడేజా, సామ్ కరన్‌లను వదిలేసింది. మొత్తంగా ఈసారి సరికొత్తగా కనిపిస్తున్న సీఎస్కే తన తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.చదవండి: అభిమానులకు గుడ్‌న్యూస్!Official StatementMS Dhoni is currently undergoing rehabilitation for a calf strain. As a result, he is likely to miss the first two weeks of TATA IPL 2026.Get well soon, Thala! 💛🦁 pic.twitter.com/4dgmt5EWFi— Chennai Super Kings (@ChennaiIPL) March 28, 2026 -
CSK స్కెచ్ అదుర్స్.. ఇక చెన్నైకి ధోని అవసరం లేదు
-
ధోనికి హ్యాట్సాఫ్.. మరో పదేళ్లు ఆడాలి: యోగ్ రాజ్ సింగ్
ఐపీఎల్-2026కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శనివారం(మార్చి 28) ఈ నుంచి ధానాధన్ క్రికెట్ లీగ్ షూరు కానుంది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే అందరి దృష్టి టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోనిపైనే ఉంది.42 ఏళ్ల ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ కానుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని 100 శాతం ఫిట్‌గా ఉన్నాడని, తన రిటైర్మెంట్ గురించి అనవసర చర్చలు పెడుతున్నారని యోగ్రాజ్ మండిపడ్డాడు."ధోని ఫిట్‌గా కన్పిస్తున్నాడు. ప్రతీ సీజన్లోనూ సరైన క్రమశిక్షణ, అంకితభావంతో తన ఫిట్నెస్ను నిరూపించుకుంటున్నాడు. ఇప్పటికీ అతడిలో ఏ మాత్రం పవర్ తగ్గలేదు. అతడి మోచేతి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ధోని ఒక అద్భుతం. అతడు రిటైర్ అవ్వాలని చెప్పడానికి అసలు వీళ్లెవరు? అనవసర చర్చలు పెడుతున్నారు. అతడు మరో పదేళ్లు ఆడాలి. క్రికెట్ పరంగా ధోనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే" అని ఇన్సైడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్రాజ్ పేర్కొన్నాడు. అయితే వీలు చిక్కినప్పుడల్లా ధోనిపై విమర్శలు గుప్పించే యోగ్రాజ్.. ఈసారి మిస్టర్ కూల్‌కు మద్దతుగా నిలవడం గమనార్హం.మరోవైపు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ధోని భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ నుంచి సీఎస్కేకు వచ్చిన సంజూ శాంసన్ధో.. ధోనికి సరైన వారసుడని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. సీఎస్కే తమ తొలి మ్యాచ్‌లో మార్చి 30న రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. సీఎస్కే జట్టు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనున్నాడు.చదవండి: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ సిరీస్‌తో ఎంట్రీ? -
ధోనిపై మాజీ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో గురువారం ఐపీఎల్ 19వ సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ కూడా విడుదలైంది. ఇక ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ లెజెండరీ ఆటగాడు ఎంఎస్ ధోనికి ఇదే చివరి సీజన్ అనే ప్రచారం జోరుగా సాగుతుంది. 2025 సీజన్‌కు ముందు ఈ టీమిండియా మాజీ వికెట్ కీపర్‌ను చెన్నై ఫ్రాంచైజీ రూ. 4 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. గత రెండు మూడు సీజన్లుగా చూసుకుంటే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వస్తున్న ధోని కేవలం జట్టులో పెద్దన్న పాత్ర పోషిస్తూ జూనియర్లకు మార్గనిర్దేశనం చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో సీఎస్కే మాజీ ఆటగాడు సబ్రమణ్యం బద్రీనాథ్ ధోని వయసు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక యూట్యూట్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన బద్రీనాథ్ మాట్లాడుతూ.. 'ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున 18వ ఓవర్ లేదా 19వ ఓవర్లో ఎంఎస్ ధోని బ్యాటింగ్‌కు వచ్చి సిక్సర్లు బాదడం చూడటానికి ఉత్సాహంగా ఉండవచ్చు. కానీ వయసును దృష్టిలో పెట్టుకుని చూస్తే మాత్రం ధోని అన్ని మ్యాచ్‌లు ఆడే సత్తా ఉండకపోవచ్చు. ఒక ఇంపాక్ట్ ప్లేయర్‌గా జట్టులో కొనసాగే అవకాశముంది.ఎందుకంటే ఇప్పటికీ సీఎస్కేలో బ్యాటర్లు, వికెట్ కీపర్లు చాలా మందే ఉన్నారు. ఫీల్డింగ్ సమయంలోనూ ధోని ఎక్కువగా మైదానంలో కనిపించకపోవచ్చు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఒక అనుభవజ్ఞుడి స్థానంలో ధోని సలహాలు, సూచనలు ఇస్తాడా లేదా అన్నది చూడాలి. లేదంటే రుతురాజ్ స్వయంగా ధోనిని సూచనలు అడిగి వాటిని అమలు చేసే అవకాశం కూడా ఉంది. వాస్తవానికి మైదానంలో ధోని చాలా తక్కువగా మాట్లాడుతాడు.అలాగే జట్టులోకి ట్రేడింగ్ రూపంలో వచ్చిన సంజూ శాంసన్ కూడా గతంలో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించినవాడే. కాబట్టి అతడి సలహాలు కూడా రుతురాజ్ తీసుకునేందుకు చాన్స్ ఉంటుంది. గత సీజన్‌ను పరిగణలోకి తీసుకొని చూసుకున్న తర్వాత ధోని విలువ అలాగే ఉందా అన్నది చూడాలి. అయితే ఒకసారి బరిలోకి దిగుతున్నా అని ధోని చెప్పాడంటే సీజన్ ఆఖరి వరకు మైదానంలో ఉంటాడని భావిస్తున్నా'అని చెప్పుకొచ్చాడు.ఇక ధోని 2026 సీజన్‌కు తన ప్రాక్టీస్‌ను ఎప్పుడో ఆరంభించాడు. గత సీజన్లో ఎక్కువగా 7, 8 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని 14 మ్యాచ్‌ల్లో 196 పరుగులు చేశాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.చదవండి: మిక్స్డ్ టీమ్ ఫైనల్లో రజత్ జోడీ -
ఐపీఎల్ ప్రారంభానికి ముందు సీఎస్కే స్పిన్నర్‌కు భారీ డీల్
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఐపీఎల్ 2026లో ఆడబోయే స్పిన్నర్ రాహుల్ చహర్, సర్రే కౌంటీ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐపీఎల్ 2026లో తన బాధ్యతలు ముగిసిన తర్వాత జూన్ 7 నుంచి కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడనున్నారు. ఈ ఒప్పందంలో చాహర్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడతాడు.చాహర్ 2025లో కూడా సర్రే తరఫున ఆడాడు. అదే అతనికి కౌంటీల్లో అరంగేట్రం సీజన్. చాహర్ తన తొలి కౌంటీ మ్యాచ్‌లోనే 10 వికెట్లు (రెండో ఇన్నింగ్స్‌లో 8/51తో) తీసి, సర్రే తరఫున అరంగేట్రంలోనే అత్యుత్తమ గణాంకాలు నమెదు చేసిన ఆటగాడిగా 166 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో ఈ రికార్డు విలియం మూడీ పేరిట ఉండింది. 1860లో అతను సర్రే తరఫున అరంగేట్రంలో 7/61 సాధించాడు.ఇదిలా ఉంటే, సీఎస్కే ఈ సీజన్ మినీ వేలంలో రాహుల్ చహర్‌ను రూ. 5. 20 కోట్లకు కొనుగోలు చేసింది. చాహర్ సీఎస్కే తరఫున దేశీయ ప్రధాన స్పిన్నర్‌గా బరిలో ఉంటాడు. గతంలో వివిధ ఫ్రాంచైజీలకు ( MI, PBKS, SRH) ఆడిన చాహర్ ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 79 మ్యాచ్‌ల్లో 75 వికెట్లు సాధించాడు. ఈ సీజన్‌ను సీఎస్కే మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభిస్తుంది.2026 ఐపీఎల్ సీజన్ కోసం సీఎస్కే జట్టు..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎం.ఎస్. ధోనీ, సంజు సాంసన్, డెవాల్డ్ బ్రెవిస్, అయుష్ మాఠ్రే, కార్తిక్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్, ఉర్విల్ పటేల్, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, జాక్ ఫౌల్క్స్, శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, అంషుల్ కాంబోజ్, ముకేశ్ చౌధరి, శ్రేయాస్ గోపాల్, గుర్జప్నీత్ సింగ్, అకీల్ హొసేన్, మ్యాట్ హెన్రీ, రాహుల్ చహర్, స్పెన్సర్ జాన్సన్ -
చెన్నై చెలరేగేనా!
ఏ సీజన్లోనైనా ఐపీఎల్ టైటిల్ ఫేవరెట్స్ ప్రస్తావన వస్తే కచ్చితంగా అందులో ఉండే జట్టు చెన్నై సూపర్‌కింగ్స్. నిషేధం కారణంగా మధ్యలో రెండేళ్లు మినహాయిస్తే 16 సీజన్లలో 12 సార్లు టాప్–4లో నిలిచిన ఏకైక జట్టు చెన్నై సూపర్ కింగ్స్. 12 పర్యాయాల్లో ఐదుసార్లు విజేతగా... ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచి చెన్నై తమ సత్తా చాటుకుంది. అయితే గత రెండేళ్లలో చెన్నై జట్టు పరిస్థితి మారింది. ‘కెప్టెన్ కూల్’ ధోని సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం... రుతురాజ్ గైక్వాడ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం జరిగింది. 2023లో ధోని సారథ్యంలోనే ఐదోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన చెన్నై ఆ తర్వాత తడబడింది. రుతురాజ్ సారథ్యంలో 2024లో ఐదో స్థానంలో నిలిచిన ఆ జట్టు 2025లో అనూహ్యంగా చివరిదైన పదో స్థానంతో సరిపెట్టుకొని తమ లీగ్ చరిత్రలోనే పేలవమైన ప్రదర్శన నమోదు చేసింది.సూపర్ కింగ్స్‌లో నాణ్యమైన ఆటగాళ్లే కాదు... పొట్టి ఫార్మాట్‌కు అవసరమైన స్పెషలిస్ట్ ప్లేయర్లు కూడా ఉన్నారు. ఒకప్పటిలానే ఇప్పుడు కూడా ఈ జట్టు విదేశీ మెరుపుల కంటే భారత ఆటగాళ్లు, వారి బలాబలాలనే నమ్ముకుంది. అయితే దీనికి విదేశీ ఆటగాళ్లు మెరుపులు జోడిస్తే అది అదనపు బలమే అవుతుంది. ఫ్రాంచైజీల మధ్య జరిగిన అంతర్గత ట్రేడింగ్‌లో రవీంద్ర జడేజాను వదిలేసి అతని స్థానంలో సంజూ సామ్సన్ను కొనుగోలు చేసింది. పలువురు దేశవాళీ కుర్రాళ్లను తీసుకోవడం ద్వారా జట్టులోకి యువ రక్తాన్ని ఎక్కించినట్లయ్యింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే చెన్నై కీలక ఆటగాళ్లు కాగా... క్రికెట్ దిగ్గజం ధోని తుది జట్టుకు ఆడుతున్నప్పటికీ అతని పాత్ర మాత్రం ఆటకంటే కూడా మార్గదర్శనంతోనే పరిమితమనే మాట జగమెరిగిన సత్యం. వయసు పైబడిన అతను ఇప్పటికీ ఫ్రాంచైజీ ఆశాకిరణంగా ఉన్నాడు. అప్పుడప్పుడు ఫినిషర్‌గా బ్యాటింగ్‌కు దిగే అవకాశమైతే ఉంది! కానీ అన్ని మ్యాచ్‌ల్లో మాత్రం కాదు. మరోసారి ధోనికిది ఫేర్వెల్ ఐపీఎల్ కాగలదని క్రికెట్ విశ్లేషకులంతా భావిస్తున్నారు. దీంతో చెన్నై సహచరులంతా తమ అభిమాన భారత దిగ్గజానికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. బ్రెవిస్, హెన్రీలు సత్తా చాటితే చెన్నైకి భారత ఆటగాళ్లే కొండంత బలమైనప్పటికీ విదేశీ ఆటగాళ్లలో బ్రెవిస్, నూర్ అహ్మద్, హెన్రీలను కూడా నమ్ముకుంది. గత సీజన్లో సత్తా చాటుకున్న బ్రెవిస్, నూర్ అహ్మద్ రాణిస్తే చెన్నై మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. అలాగే పవర్‌ప్లేలో ప్రత్యర్థి బ్యాటింగ్ వెన్ను విరిచే సత్తా ఉన్న మ్యాట్ హెన్రీ కూడా చెలరేగితే చెన్నై జోరుకు ఎదురుండదు. వేలంలో ఎవరి ఊహకి అందని విధంగా భారీ మొత్తం వెచ్చించి మరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌లను చెన్నై తీసుకుంది. ఈ ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లపై ఎవరికి ఎలాంటి అంచనాలున్నా... లేకున్నా... ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం పెద్ద నమ్మకాన్నే పెట్టుకుంది. లేకుంటే కేవలం ఇద్దరిపైనే రూ. 28.40 కోట్లనయితే ఖర్చు చేయదుగా! సర్ఫరాజ్ ఖాన్ కూడా సూపర్‌కింగ్స్ జట్టు ద్వారా అందరికంటా పడాలని తెగ ఆరాటపడుతున్నాడు. అందివచ్చే అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు. సామ్సన్ ‘కింగ్స్’ రాత మార్చేనా... సంజూ సామ్సన్ అంటే ఒకప్పుడు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టే గుర్తొస్తుంది. ఇప్పుడు అలా కాదు. 2026 టి20 ప్రపంచకప్ కూడా గుర్తుంటుంది. నిజానికి ఈ మెగా ఈవెంట్ మొత్తం మ్యాచ్‌లు కూడా ఆడని ప్లేయర్... మొత్తం ప్రపంచకప్ కథనే మార్చిన ఆటగాడయ్యాడు. వెస్టిండీస్‌తో క్వార్టర్ ఫైనల్స్‌ను తలపించిన సూపర్–8 చివరి మ్యాచ్‌లో సామ్సన్ (97 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత సెమీఫైనల్లో 89, ఫైనల్లో 89 స్కోర్లు భారత్‌ను ప్రపంచకప్‌ను నిలబెట్టుకునేలా చేశాయి. అలా ఇప్పుడు ఐపీఎల్ ప్లేయర్ కాస్తా టీమిండియా స్టార్ అయ్యాడు. గెలిచిన కప్, ఆడబోయే లీగ్ రెండూ టి20 ఫార్మాటే కావడంతో ఈ ఫార్మాట్లో సూపర్ ఫామ్‌లో ఉన్న సామ్సన్ ఇప్పుడు ధోని జట్టుకు బంగారు కొండలా కనిపిస్తున్నాడు. రుతురాజ్, శివమ్ దూబేలాంటి హిట్టర్లున్న కింగ్స్‌కు పూర్వవైభవం తేవాలన్నా... జట్టు రాత మారాలన్నా అది సామ్సన్ ఒక్కడి మెరుపులపైనే ఆధారపడి ఉంది. ధోని తుది జట్టుకు ఆడుతున్నాడనే ధైర్యం కూడా చెన్నైకి అదనపు బలం కాగాలదు. ఈ నేపథ్యంలో అన్ని అనుకున్నట్లు జరిగితే చెన్నై ఖాతాలో ఆరో టైటిల్ చేరడం సాధ్యమే. ఇదే జరిగితే ఫ్యాన్స్ ‘విజిల్ పొడు’తో సందడి చేసుకుంటారు. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెపె్టన్), ధోని, సంజూ సామ్సన్, ఆయుశ్ మాత్రే, బ్రెవిస్, రామకృష్ణ ఘోష్, శివమ్ దూబే, ఉరి్వల్ పటేల్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ చౌధరీ, నూర్ అహ్మద్, శ్రేయస్ గోపాల్, గుర్జప్నీత్ సింగ్, ఓవర్టన్, అకీల్ హోసీన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, సర్ఫరాజ్, హెన్రీ, రాహుల్ చహర్, జాక్ ఫౌక్స్. -
60 ఏండ్లు వచ్చేదాకా ఆడుతా!
తనకు 60 ఏండ్లు వచ్చే వరకు ఐపీఎల్ ఆడతానని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేర్కొనడం చెన్నై సూపర్‌కింగ్స్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ప్రస్తుతం 44 ఏండ్లు ఉన్న ధోనికి ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరిదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన సీఎస్కే ఈసారి ఎలాగైనా టైటిల్ గెలిచి ధోనికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ధోని వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. విషయంలోకి వెళితే.. ఆదివారం సీఎస్కే ఫ్యాన్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళ హీరో శివకార్తికేయన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ధోని రిటైర్మెంట్ విషయమై శివకార్తికేయన్ మాట్లాడాడు. ‘ధోని సార్ మీరు రిటైర్ అవ్వొద్దు. అలా చేస్తే చెన్నై సూపర్‌కింగ్స్ అభిమానులు బాధపడతారు. 44 ఏళ్ల వయసులోనూ మీరు యంగ్‌గానే కనిపిస్తున్నారు.కనీసం 60 సంవత్సరాల వరకైనా క్రికెట్ ఆడి మమ్నల్ని అలరించాలి’ అని పేర్కొన్నాడు. దీనిపై మహేంద్ర సింగ్ ధోని వెంటనే స్పందించాడు. ‘రోజురోజుకు ఆరోగ్యంతో పాటు ఫిట్నెస్ కూడా తగ్గుతూ వస్తోంది. అయినా సరే 60 ఏళ్లు వచ్చే వరకు ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని ధోని చమత్కరించాడు. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే యాజమాన్యం తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసుకోవడంతో అది వైరల్‌గా మారింది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతూ వస్తోన్న ధోనికిది 19వ సీజన్. ఇప్పటివరకు ధోని ఐపీఎల్లో 278 మ్యాచ్‌లాడి 5,349 పరుగులు సాధించాడు. 2024లో సీఎస్కే కెప్టెన్‌గా వైదొలగడానికి ముందు ఆ జట్టు సాధించిన ఐదు టైటిల్స్ అందించి జట్టు ప్రయాణంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో ధోని పూర్థిస్థాయిలో అందుబాటులో ఉంటాడా లేదా అన్నది మున్ముందు తేలనుంది. అయితే సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాత్రం ఈ సీజన్‌కు ధోని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడని పేర్కొన్నారు. అయితే ఫ్రాంచైజీ ట్రేడింగ్‌లో సంజూ శాంసన్ సీఎస్కేకు రావడంతో కీపింగ్ బాధ్యతలు అతడే తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధోనికిది చివరి సీజన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే సీఎస్కే ట్రేడింగ్‌లో ఏరికోరి శాంసన్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.A CSK fan at heart, Our star SK in the house 🥳#Roar26 #WhistlePodu pic.twitter.com/Sl8aG0xmGH— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2026చదవండి: Delhi Capitals: ‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని’ -
IPL 2026: అభిమానుల కన్నీటిపర్యంతం!
ఎంఎస్ ధోని.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. టీమిండియాకు రెండుసార్లు ఐసీసీ వరల్డ్‌కప్‌లు అందించిన ధోనికి అభిమాన గణం కూడా ఎక్కువే. ధోని నడిచినా, నవ్వినా, బ్యాటింగ్ చేసినా అతడి మైకంలో మునిగితేలిన అభిమానులు ఎందరో ఉన్నారు. అతడు మైదానంలోకి దిగుతున్నాడంటేనే ఏదో తెలియని అనుభూతికి లోనయ్యే ఫ్యాన్స్ తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కష్టంగా మారిపోతుంది. అచ్చం అలాంటి సంఘటనే చెపాక్ స్టేడియంలో మరోసారి జరిగింది. ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా సీఎస్కే తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్న ధోని ఆదివారం అలా చెపాక్ స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చాడో లేదో అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. విషయంలోకి వెళితే.. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో మునిగితేలారు. మ్యాచ్ జరగనప్పటికీ చెపాక్ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. దీనికి ప్రధాన కారణం ధోనినే అన్న సంగతి తర్వాతి క్షణంలోనే తెలిసొచ్చింది. సీఎస్కే ప్లేయర్లంతా ప్రాక్టీస్‌లో మునిగిన సమయంలో ధోని అలా మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. పెవిలియన్ ఎండ్ నుంచి చిన్నగా నడుచుకుంటూ గ్రౌండ్ మధ్యలోకి చేరుకున్నాడు. ఆ సమయంలో స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మార్మోగిపోయింది. ప్రేక్షకులంతా లేచి నిలబడి ‘ధోని.. ధోని.. ధోని’.. ‘తలా.. తలా’ అంటూ అరుపులు, కేకలతో స్టేడియం దద్దరిల్లింది. ఇదే సమయంలో కొంతమంది అభిమానులు ధోనిని చూసి ఎమోషన్‌ను అదుపు చేసుకోలేక కన్నీటిపర్యంతమవ్వడం కనిపించింది. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లో వీడ్కోలు పలలికినప్పటికీ ఐపీఎల్లో మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. కానీ ఈసారి ధోనిని చూడగానే అభిమానుల్లో దుఃఖం బయటికి రావడానికి ‘ధోనికి బహుశా ఇదే చివరి సీజన్’ అనే కారణం కూడా ఉండొచ్చు. కొంతకాలంగా ధోనికి ఇదే చివరి సీజన్ అనే ప్రచారం కూడా గట్టిగా సాగుతుంది. దీనికి సంబంధించిన వీడియోనూ సీఎస్కే యాజమాన్యం తన ‘ఎక్స్’లో షేర్ చేసుకోవడంతో వైరల్‌గా మారింది. ఇక 2023లో విజేతగా నిలిచిన సీఎస్కే ఈ సీజన్లో మరోసారి టైటిల్ సాధించి ధోనికి ఘనమైన వీడ్కోలు పలకాలని భావిస్తోంది. ఈసారి సీఎస్కేకు సంజూ శాంసన్ రాకతో జట్టుకు అదనపు బలం చేకూరినట్లయింది. ఇక ఐపీఎల్ 19వ సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.Thala Dharisanam 🦁#Roar26 #WhistlePodu pic.twitter.com/RST5EpXKct— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2026చదవండి: 21 సిక్సర్లతో ఆర్సీబీ మాజీ ఆటగాడి విధ్వంసం! -
‘సంజూకు మామయ్యలాంటి వాడిని’
భారత జట్టు స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను తర్వాతి ధోనీగా పోల్చాల్సిన అవసరం లేదని టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. ఇటీవల తమ మధ్య జరిగిన ఒక సంభాషణలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు శశిథరూర్ వెల్లడించారు. అయితే సంజూ శాంసన్‌తో బంధం ఈనాటిది కాదని, అతడికి తాను మామయ్యలాంటి వాడినని తెలిపారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్ 2026లో సంజూ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీలో 321 పరుగులు చేసిన శాంసన్ ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో శశిథరూర్ సంజూ శాంసన్‌తో తనకున్న అనుబంధాన్ని, సంజూ విషయంలో గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నాడు. ‘సంజూని మొదటిసారి 14 ఏళ్ల వయసులో చూశాను. ఆ సమయంలో అతడికి నేను ఎందుకో అంకుల్‌గా ఫీలయ్యాను. ఆ సమయంలోనే శాంసన్ టాలెంట్ స్పష్టంగా కనిపించింది. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ అసాధారణ ప్రతిభ ఉంది. అప్పుడు నేను నువ్వు తర్వాతి ధోనీ అవుతావని శాంసన్‌కు చెప్పాను. కానీ తర్వాత గంభీర్‌తో ఈ విషయమై చర్చకు వచ్చినప్పుడు, ఆయన ‘లేదండీ శాంసన్ తర్వాతి ధోనీ కాదు..వన్ అండ్ ఓన్లీ సంజూ శాంసన్’ అని చెప్పినట్లు గుర్తుంది. ఇవాళ గంభీర్ మాటలు నిజమయ్యాయి.సంజూ మరెవరికీ ప్రతిరూపం కావాల్సిన అవసరం లేదు. అతడిని అతడిలానే ఉండనిద్దాం. సంజూ శాంసన్ ఎంతో వినయంగా ఉంటాడు.మంచి నాయకుడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌ను సమర్థంగా నడిపించాడు. ఇప్పుడు చెన్నై జట్టులోనూ తనకంటే ప్రత్యేకతను సాధించుకుంటాడు. జట్టుకు అవసరమైనప్పుడు స్వార్థం లేకుండా ఆడతాడు. శతకం కోసం ఆడకుండా టీమ్ కోసం పెద్ద షాట్లు ఆడాడు. అదే అతని గొప్పతనం. శాంసన్‌ను అన్యాయంగా జట్టు నుంచి తప్పించిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు వరుసగా మూడు మ్యాచుల్లో అద్భుతంగా రాణించడం అతని స్థిరత్వానికి నిదర్శనం. సంజూ శాంసన్‌కు మున్ముందు మరిన్ని అవకాశాలివ్వాలి. వన్డేల్లోనూ రెగ్యులర్‌గా ఆడించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది’ అని శశిథరూర్ వెల్లడించారు. ఇంతకాలం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంజూ శాంసన్ ఈ సీజన్ నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడనున్నాడు. తన ఫెవరెట్ క్రికెటర్ అయిన ఎంఎస్ ధోనితో కలిసి ఆడనుండడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని శాంసన్ ఇటీవలే సీఎస్కే ప్రాక్టీస్‌లో జాయిన్ అయిన సందర్భంగా వెల్లడించాడు.చదవండి: 24 ఏళ్ల తర్వాత మ్యాచ్.. సంచలనం రిపీటయ్యేనా? -
సీఎస్కేకు భారీ షాక్!.. మాకు నిజంగా ఎదురుదెబ్బే!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ తీవ్రంగా గాయపడ్డాడు. తొడకండరాల గాయం కారణంగా అతడు ఐపీఎల్-2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.పతిరణను వదిలేసి..కాగా 2026 మినీ వేలానికి ముందు శ్రీలంక స్టార్, తమ విజయాల్లో కీలకమైన యువ పేసర్ మతీశ పతిరణను సీఎస్కే విడిచిపెట్టింది. దీంతో పేస్ దళం బలహీనపడగా.. రూ. 2 కోట్లకు ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ (Nathan Ellis)ను మాత్రం సీఎస్కే అట్టిపెట్టుకుంది.అయితే, సీజన్ ఆరంభానికి సమయం సమీపిస్తున్న వేళ ఎల్లిస్ గాయపడ్డాడు. గాయం తీవ్రత కారణంగా సీజన్ మొత్తానికి అతడు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని సీఎస్కే సీఈఓ కేఎస్ విశ్వనాథన్ ధ్రువీకరించారు.మాకు ఇది భారీ ఎదురుదెబ్బ‘‘మాకు ఇది భారీ ఎదురుదెబ్బ. ఎల్లిస్ జట్టులో కీలక బౌలర్. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడు ప్రభావం చూపగలడు. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడి కోసం వెదుకుతున్నాము’’ అని విశ్వనాథన్ స్పోర్ట్స్‌స్టార్‌కు తెలిపారు. దీనిని బట్టి త్వరలోనే ఎల్లిస్ రీప్లేస్‌మెంట్‌ను సీఎస్కే ప్రకటించనున్నట్లు స్పష్టమైంది.ఇదిలా ఉంటే.. సీఎస్కే పేస్ విభాగంలో ప్రస్తుతం ఇద్దరు న్యూజిలాండ్ బౌలర్లు ఉన్నారు. మ్యాట్ హెన్రీని రూ. 2 కోట్లు, ఫౌల్క్స్‌ను రూ. 75 లక్షలకు సీఎస్కే మినీ వేలంలో కొనుగోలు చేసింది. ఇక ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ కూడా ఈ జట్టులో ఉన్నాడు.ఐపీఎల్-2026 టోర్నీకి సీఎస్కే జట్టుMS ధోని (వికెట్ కీపర్), అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, సంజూ శాంసన్ (ట్రేడింగ్ ద్వారా, వికెట్ కీపర్), గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ చౌదరి, శివమ్ దూబే, ఆయుష్ మాత్రే, నాథన్ ఎల్లిస్, శ్రేయాస్ గోపాల్, ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), ఖలీల్ అహ్మద్, అకీల్ హొసేన్, ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, జాక్ ఫౌల్క్స్, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ చహర్, మ్యాట్ హెన్రీ.చదవండి: వాటిని తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్ -
CSK డెన్ లోకి చెట్టా గ్రాండ్ ఎంట్రీ
-
సీఎస్కే వైస్ కెప్టెన్‌గా అతడే సరైనోడు: అనిల్ కుంబ్లే
టీ20 ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచిన భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్.. ఇప్పుడు ఐపీఎల్-2026లో సత్తాచాటేందుకు సన్నద్దమవుతున్నాడు. ఈ ఏడాది సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సంజూ ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఐపీఎల్-19వ సీజన్ వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ నుంచి సీఎస్కే శాంసన్ ట్రేడ్ అయ్యాడు.అందుకోసం చెన్నై ఫ్రాంచైజీ రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్ వంటి స్టార్ ఆల్రౌండర్లను వదులుకోవాల్సి వచ్చింది. 11 సీజన్ల పాటు రాజస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన శాంసన్.. ఇప్పుడు ఎల్లో జెర్సీలో మెరవనున్నాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశారు. శాంసన్‌ను ట్రేడ్ డీల్‌ను కుంబ్లే సమర్ధించాడు. ఎంఎస్ ధోనీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సంజూకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయని కుంబ్లే అభిప్రాయపడ్డాడు."భారత క్రికెట్లో సునీల్ గవాస్కర్ నుంచి సచిన్ టెండూల్కర్, ఆపై ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి వరకు వారసత్వం ఎలా కొనసాగిందో.. ఇప్పుడు ధోని నుంచి ఆ బాధ్యతను శాంసన్ అందుకోబోతున్నాడు. సంజూను జట్టులోకి తీసుకోవడం సీఎస్కే వ్యూహత్మక నిర్ణయంగా చెప్పుకోవాలి. సంజూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.బ్యాటింగ్‌తో పాటు వికెట్ల వెనక కూడా బాధ్యతలు నిర్వర్తించగలడు. టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడు సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఇప్పుడు అదే జోరును సీఎస్కే తరపున కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. అతడి రాకతో సీఎస్కే ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరగనుంది. సీఎస్కే వైస్ కెప్టెన్సీ రోల్‌కు సంజూ సరిగ్గా సరిపోతాడు. అతడికి కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో జడేజా కెప్టెన్సీ తప్పుకున్నప్పుడు, రుతురాజ్ గైక్వాడ్ గాయపడినప్పుడు మళ్ళీ ధోనీ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సంజూ రాకతో రుతురాజ్ అందుబాటులో లేని సమయంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే లీడర్ జట్టుకు దొరికినట్లయింది" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.చదవండి: ఆ విషయంలో స్వార్థపరుడినే: సంజూ శాంసన్ -
అలా చేస్తే ధోనితో ప్రయోజనముండదు!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్రాండ్‌ను కేవలం జట్టుకు ఉపయోగిస్తే సరిపోదని, అతన్ని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి ముందుకు పంపితేనే ప్రయోజనం ఉంటుందని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు సంజూ శాంసన్ లాంటి క్రికెటర్ సీఎస్కేలో చేరడం ఆ జట్టుకు అదనపు బలాన్ని చేకూర్చనుందని, ధోని స్థానంలో ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగల సత్తా శాంసన్‌కు ఉందని తెలిపాడు. ‘సీఎస్కేకు ధోని పేరు అదనపు బ్రాండ్ అని చెప్పొచ్చు. సీఎస్‌ేపేరు చెప్పగానే అందరి నోటి నుంచి వచ్చే మొదటి పేరు ధోనిదే. అయితే గత కొన్నేళ్లుగా ధోని తూతూమంత్రంగానే జట్టులో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో లోయర్ ఆర్డర్ లోరావడంతో ఎక్కువగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ధోని బ్యాట్‌తో ఇప్పటికీ ప్రభావం చూపగలడు. కానీ బ్యాటింగ్ ఆర్డర్లో 8,9వ స్థానంలో ధోని బ్యాటింగ్‌కు దిగితే జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో ధోని బ్యాటింగ్ ఆర్డర్లో కచ్చితంగా ముందుగానే క్రీజులోకి రావాలి. కనీసం ఆరో స్థానంలో అయినా బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుంది.నేనైతే మాత్రం ధోని నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నా. గత సీజన్ల మాదిరి ఈసారి అలా జరగకూడదని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ తన తొలి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 3న ఆర్సీబీతో, ఏప్రిల్ 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.చదవండి: పెషావర్‌కు వెళ్లొద్దు.. ఆసీస్ ఆటగాళ్లకు హెచ్చరిక! -
అక్కడ ముగింపు.. ఇక్కడ ప్రారంభం!
టీ20 ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్న సంగతి తెలిసిందే. 2018 నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న సంజూ శాంసన్ 2025 నవంబర్‌లో ట్రేడింగ్‌లో భాగంగా జడేజా, సామ్ కరన్‌లను రిలీజ్ చేసిన చెన్నై శాంసన్‌ను దక్కించుకుంది. మరో 10 రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా రాజస్థాన్‌తో బంధం ముగిసిందని, ఈ సీజన్ ద్వారా చెన్నై సూపర్‌కింగ్స్‌తో ప్రయాణం ప్రారంభమైందని పేర్కొ న్నాడు. శాంసన్ మాట్లాడుతూ..‘నేను ఆ జట్టులో సమయం ముగిసిందని భావించా.. అందుకే రాజస్థాన్ రాయల్స్ నుంచి బయటకు వచ్చా. నేను రాజస్థాన్ రాయల్స్‌కు ప్రత్యర్థిగా ఆడడం ఇదే తొలిసారి అనుకుంటా. ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. కానీ ఒకసారి మైదానంలోకి వచ్చాక మ్యాచ్ గురించే తప్ప వేరే దాని గురించి ఆలోచించను. రాజస్థాన్ జట్టులో చాలా మంది ఆటగాళ్లతో కలిసి నేను ఆడాను. మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్ అంతా తెలిసినవాళ్లే. వారు ప్రేమ, గౌరవభావాలు కలిగి ఉన్నారు. కానీ ప్రతీ ఒక్కరికీ ఒక సమయం అనేది ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్‌తో నా సమయం ముగిసింది. నేను ముందుకు సాగాను. ఇది నాకు కొత్త ప్రయాణం. ప్రస్తుతం నేను రాజస్థాన్‌పై కూడా చాలా ఆనందంగా ఆడాలనుకుంటున్నా.’ అని చెప్పుకొచ్చాడు. ఇక సంజూ శాంసన్ తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభం నాటి నుంచి ఎక్కువగా రాజస్థాన్ రాయల్స్‌కే ఆడాడు. మధ్యలో వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడినప్పటికీ రాజస్థాన్‌తోనే శాంసన్‌కు అనుబంధమెక్కువ అని చెప్పొచ్చు. 2022లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన శాంసన్ ఆ సీజన్లో రాజస్థాన్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. 2023 సీజన్లో రాజస్థాన్ ప్లేఆఫ్‌కు చేరడంలో విఫలమైనప్పటికీ బ్యాటర్‌గా మాత్రం శాంసన్ విజయవంతమయ్యాడు. ఆ తర్వాత 2024లో శాంసన్ నేతృత్వంలో రాజస్థాన్ జట్టు మరోసారి రెచ్చిపోయింది. తొలి 9 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట గెలిచిన రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అయితే క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్‌చేతిలో ఓటమిపాలైంది. ఈ సీజన్ సంజూ శాంసన్ బెస్ట్ అని చెప్పొచ్చు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 5 హాఫ్‌సెంచరీల సాయంతో 531 పరుగులు సాధించి కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేశాడు. 2025 సీజన్లో గాయాల సమస్యలతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. శాంసన్ స్థానంలో రియాన్ పరాగ్ జట్టును నడిపించాడు.Sanju Samson just casually dropped a reality check for the professional language warriors.Knowing Hindi and Tamil along with Malayalam didn't make him less of a South Indian, it made him a better teammate. While the keyboard activists are busy gatekeeping, Sanju is busy winning… pic.twitter.com/AsggCsz7fP— Smita Deshmukh🇮🇳 (@smitadeshmukh) March 17, 2026చదవండి: సౌతాఫ్రికా అమ్మాయిలదే పైచేయి -
ధోనీ ఆ విషయం అప్పుడే చెప్పాడు!
ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభానికి మరో 15 రోజుల సమయం మిగిలి ఉంది.ఇప్పటికే లీగ్‌లోని ఆయా జట్ల ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను మ్యాచ్‌లు ఆడేందుకు సన్నద్ధం చేస్తున్నాయి. అయితే సీఎస్కే కెప్టెన్‌గా రుతురాజ్‌గైక్వాడ్ పేరును ఆ జట్టు మేనేజ్మెంట్ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. దీంతో ధోనీకి ఈ సీజన్ చివరిదని భావిస్తున్న అభిమానులు కెప్టెన్‌గా ఒక్క మ్యాచ్‌కైనా నాయకత్వం వహిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. కానీ ధోనీ కెప్టెన్సీ విషయమై వేరే వాళ్లకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని మేనేజ్మెంట్కు ఇది వరకే స్పష్టం చేశాడు. దీంతో ధోనీని ఈసారి కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. అయితే ఈసారి ఐపీఎల్లో అన్ని మ్యాచ్‌లు ఆడతాడా లేదంటే కొన్నింటికే పరిమితమవుతాడా అన్నది చూడాలి. కాగా ధోనీ కెప్టెన్సీ విషయమై ఇది వరకే తనకు ఒక సందేశాన్ని పంపించాడని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.‘ఐపీఎల్ ప్రారంభమవు తుందంటే అందరి కళ్లు సీఎస్కే మీదకే మళ్లుతాయి. ఎందుకంటే భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న ధోనీ ఐపీఎల్‌లోనూ నాయకుడిగా అంతే సక్సెస్ రేట్‌ను కలిగి ఉన్నాడు. ఈసారి కెప్టెన్సీకి ధోనీ దూరమైనప్పటికీ అతడి సలహాలు మాత్రం జట్టుకు ఉంటాయనడంలో సందేహం లేదు. కెప్టెన్‌గా కొనసాగడానికి బదులు ఆటగాడిగా ఉండేందుకు ఇష్టపడుతున్నట్లు ధోనీ ఇది వరకే నాతో పేర్కొన్నాడు.’ అని పఠాన్ తెలిపాడు. ఇక ధోనీకి ఇదే చివరి సీజన్ అని భావిస్తున్న తరుణంలో అటు సీఎస్కే యాజమాన్యం కూడా మాజీ వికెట్‌కీపర్ విషయంలో భారీగానే ప్లాన్ చేస్తుంది. ఎలాగైనా టైటిల్ కొట్టి ధోనీకి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని సీఎస్కే భావిస్తోంది. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026లో భాగంగా తొలి విడతలో 20 మ్యాచ్‌లు జరగనున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం పేర్కొంది. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను కూడా ఇప్పటికే విడుదల చేసింది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూర్తి షెడ్యూల్‌ను తర్వాత విడుదల చేస్తామని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.చదవండి: IPL 2026: ‘ప్రపంచం అతడిని మర్చిపోయింది’ -
IPL 2026: సీఎస్కేను కోర్టుకీడ్చిన కావ్యా మారన్!
ఐపీఎల్-2026 ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)- సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిమానుల మధ్య సోషల్ మీడియా యుద్ధం మొదలైపోయింది. మైదానంలో ఎస్ఆర్హెచ్కు చెన్నై కచ్చితంగా ‘సినిమా’ చూపిస్తుందంటూ సీఎస్కే ఫ్యాన్స్ సవాలు విసరుతుండగా.. తమ జట్టు సత్తా ఏమిటో మైదానంలోనే చూస్తారంటూ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు.అసలేం జరిగిందంటే.. సీజన్ ఆరంభానికి ముందు ఫ్రాంఛైజీలు తమ కొత్త జెర్సీల ఆవిష్కరణ, కొత్తగా వచ్చిన ఆటగాళ్లకు ఆహ్వానం పలికే క్రమంలో వినూత్న రీతిలో వీడియోలు రూపొందించడం పరిపాటి. సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసేందుకు, అభిమానులను అలరించేందుకు ఇలాంటి వీడియోలు ఉపయోగపడతాయి.హుకుమ్, అల్తోప్పా, డిస్కో రీమిక్స్సీఎస్కే సైతం దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రాజస్తాన్ నుంచి సీఎస్కేలోకి వచ్చిన సంజూ శాంసన్ సహా కీలక ఆటగాళ్లపై వీడియోలు రూపొందించింది. అయితే, ఇందులో సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలకు సంబంధించిన జైలర్, కూలీ, జైలర్-2ల మ్యూజిక్ వాడుకుంది.ముఖ్యంగా హుకుమ్, అల్తోప్పా, డిస్కో రీమిక్స్ వంటి ట్రాక్స్‌ను తమ ఆటగాళ్లకు హైప్ ఇచ్చే క్రమంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌గా వాడుకుంది. ఈ పాటలు, సంగీతానికి అనిరుద్ రవిచంద్రన్ రూపకర్త. ఈ నేపథ్యంలో సీఎస్కే తమ ఆటగాళ్ల హీరో ఎడిట్స్‌కు ఈ సంగీతం వాడుకోవడంపై సన్ టీవీ గ్రూపు ఆగ్రహం వ్యక్తం చేసింది.అనుమతి లేకుండానేఈ పాటలు తమకు చెందేలా అనిరుద్ రవిచంద్రన్ రాత పూర్వక ఒప్పందం కుదుర్చుకున్నారని.. అయితే, సీఎస్కే మాత్రం తమ వాణిజ్య లాభం కోసం అనుమతి లేకుండానే మ్యూజిక్‌ను వాడుకుంటోందని కోర్టుకెక్కింది. ఇందుకు సంబంధించి మార్చి 13న సన్ టీవీ నెట్వర్క్ మద్రాస్ హైకోర్టులో కాపీరైట్ ఉల్లంఘన కింద సీఎస్కేపై పిటిషన్ దాఖలు చేసింది.లైసెన్స్ వచ్చేదాకాఈ విషయంపై సీఎస్కే న్యాయవాది పీఎస్ రామన్ వాధిస్తూ.. గత మూడేళ్లుగా చెన్నై జట్టు ఈ మ్యూజిక్‌ను వాడుకుంటోందని.. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకని ప్రశ్నించారు. సన్ టీవీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని తాము అస్సలు ఊహించలేదన్నారు. ఏదైమైనా సన్ పిక్సర్చ్ లేదంటే ఫొనోగ్రాఫిక్ పెర్ఫామెన్స్ లిమిటెడ్ నుంచి లైసెన్స్ వచ్చేదాకా తాము జైలర్, కూలీ, జైలర్ 2 మ్యూజిక్‌ను వాడబోమని స్పష్టం చేశారు. అదే విధంగా.. ఇప్పటికే ఈ మ్యూజిక్‌తో కూడిన వీడియోలను డిలీట్ చేసిన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.కావ్యా మారన్‌పై నెట్టింట ట్రోలింగ్ఈ క్రమంలో జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి ఈ కేసును మార్చి 16కు వాయిదా వేశారు. పిటిషన్‌దారుకు సంబంధించిన ఆడియో మెటీరియల్‌ను తాము వాడటం లేదన్న విషయాన్ని ధ్రువీకరిస్తూ సీఎస్కే అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం.కాగా ‘ది హండ్రెడ్ లీగ్’- 2026 వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసినందుకు సన్‌రైజర్స్ లీడ్స్ యజమాని, సన్ టీవీ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్యా మారన్‌పై నెట్టింట విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎస్కేను కోర్టుకు ఈడ్చటంపై కూడా దుమారం రేగుతోంది. చదవండి: IPL 2026: తొలి విడతలో సన్‌రైజర్స్ షెడ్యూల్ ఇదే..! -
'ధోని, రుతురాజ్ కాదు.. అతడే సీఎస్కే బ్యాక్ బోన్'
టీ20 వరల్డ్‌కప్-2026లో సంచలన ప్రదర్శన కనబరిచిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్.. ఇప్పుడు ఐపీఎల్లో సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. తన అరంగేట్రం నుంచి గత సీజన్ వరకు రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంజూ, ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు సీఎస్కే ఫ్రాంచైజీ సంజూను రాజస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకుంది. అందుకోసం చెన్నై ఏకంగా స్టార్ ప్లేయర్లు రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్‌లను వదులుకుంది. ఈ నేపథ్యంలో శాంసన్‌పై భారత మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శాంసన్ రాకతో సీఎస్కేలో మరో కొత్త శకం మొదలవుతుందని అతడు అభిప్రాయపడ్డాడు."సీఎస్కే ఒక పెద్ద ఫ్రాంచైజీ. ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు రాజస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంజూ శాంసన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సీఎస్కేలో ఇక శాంసన్ శకం మొదలు కానుంది. అతడు ఆ జట్టుకు వెన్నెముకలా మారబోతున్నాడు. దీర్ఘకాలిక ప్రణాళికలలో భాగంగా సంజూను సీఎస్కే జట్టులోకి తీసుకుంది.అతడు భవిష్యత్తులో కెప్టెన్ అయ్యే అవకాశముంది. అయితే అందుకు ఇంకా చాలా సమయం ఉందని" బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. సీఎస్కే తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29న గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనున్నాడు.చదవండి: సన్‌రైజర్స్‌లోకి పాక్ ఆటగాడు.. బీసీసీఐ స్పందన ఇదే -
IPL 2026: ధోనికిదే చివరి సీజన్!
ఎంఎస్ ధోనీ లేకుంటే చెన్నై సూపర్‌కింగ్స్(సీఎస్కే) లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభంమైనప్పటి నుంచి ధోనీ సీఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ధోనీ కెప్టెన్సీలోనే సీఎస్కే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచింది. మధ్యలో రెండు సీజన్లు (2016, 2017) మినహా మిగతా సీజన్లలో సీఎస్కే కనీసం ప్లేఆఫ్ చేరిన జట్టుగా నిలిచింది. 2025 సీజన్‌కు తొలుత రుతురాజ్ కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ గాయం కారణంగా మధ్యలోనే వైదొలగడంతో మరోసారి ధోనీనే జట్టును నడిపించాడు. తాజాగా ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 28 నుంచి షురూ కానున్న నేపథ్యంలో సీఎస్కే ఈసారి టైటిల్ కొట్టాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ధోనీ లేకుండా సీఎస్కేను ఊహించడం కష్టంగా ఉంటుంది. అలాగే ధోనీ లేకపోతే ఐపీఎల్ కూడా ఏదో వెలితి ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. బహుశా ధోనీకిదే చివరి ఐపీఎల్ సీజన్ కావొచ్చు. సంజూ శాంసన్ జట్టులో చేరడం, రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉండడంతో ఈసారి ధోనీ వారికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఎందుకంటే సంజూతో పాటు రుతురాజ్ చాలాకాలం పాటు సీఎస్కేలో కొనసాగే అవకాశముంది. అయితే ఈ సీజన్లో ధోనీ ఎన్ని మ్యాచ్‌లు ఆడుతాడన్నది సరిగ్గా తెలియనప్పటికీ జట్టుతో ఉంటే చాలు డ్రెస్సింగ్ రూమ్‌లో కొండంత బలం ఉంటుంది. ముఖ్యంగా చెన్నై భవిష్యత్తు కెప్టెన్‌గా సంజూ శాంసన్ ఎదిగేందుకు ధోనీ సలహాలు చాలా వరకు ఉపయోగప డనున్నాయి. అంతేకాదు రుతురాజ్ ఇప్పటికే కెప్టెన్‌గా చేసిన అనుభవం ఉండడం కూడా కలిసొచ్చే అంశం. ఇక ధోనీ ఫిట్నెస్, బ్యాటింగ్ విషయంలో కొన్ని అనుమానాలున్నాయి. ఫిట్నెస్ పరంగా చూస్తే ధోనీ అన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చు. పైగా ఇదే సీజన్ అతనికి చివరిది కూడా అయ్యే చాన్స్ ఉంది. అందుకే ఈ సీజన్లో కప్ గెలిచి ధోనీకి ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లుగా ఉంది’ అని పఠాన్ పేర్కొన్నాడు. అయితే ప్రతీ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ధోనీకి ఇదే లాస్ట్ సీజన్ అనే మాట వినిపించడం చూస్తూనే వస్తున్నాం. అయితే ఈ సీజన్లో ధోనీ సీఎస్కే తరఫున కెప్టెన్‌గా ఆడతాడా లేదంటే ఆటగాడిగా కొనసాగుతాడా అనే దానిపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పష్టతనిచ్చారు. ఈ సీజన్లో ధోనీ అన్ని మ్యాచ్‌లు ఆడుతాడని, కానీ అతని రోల్ ఏంటనేది టీమ్ మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుందని స్పష్టం చేశారు.చదవండి: ‘సౌతాఫ్రికా ఒక తెలివితక్కువ టీమ్’ -
ధోని అలా బ్యాటింగ్ చేయడంలో అర్థం లేదు: పుజారా
గత పద్దెమినిదేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొనసాగుతున్నాడు టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్‌గా.. ఆ జట్టుకు ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ అందించాడు. ఇక నలభై నాలుగేళ్ల వయసులోనూ తలా ఐపీఎల్-2026 బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు.ఎనిమిదో స్థానంలోటోర్నీ ఆసాంతం ధోని ఆడతాడని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. గతేడాది ఐదు మ్యాచ్‌ల తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన నేపథ్యంలో ధోని పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక బ్యాటర్‌గా ఎనిమిదో స్థానంలో వచ్చిన ధోని.. 135కు పైగా స్ట్రైక్‌రేటుతో 14 మ్యాచ్‌లలో కలిపి కేవలం 196 పరుగులే చేశాడు.ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చెన్నై జట్టు పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్, కామెంటేటర్ ఛతేశ్వర్ పుజారా ధోనిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయడం అర్థం లేని విషయం అని అభిప్రాయపడ్డాడు.ధోని అలా బ్యాటింగ్ చేయడంలో అర్థం లేదు‘‘ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఎంఎస్ ధోని (MS Dhoni) సొంతం. సీఎస్కే జట్టులోనూ ఎవరూ ఆయనకు సాటిరారు. అలాంటి ధోని ఎనిమిది లేదంటే తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంలో అర్థం లేదు.ఒకవేళ ఆయన కేవలం ఐదు లేదంటే పది బంతుల్లోనే పరుగులు రాబట్టగలిగినపుడు.. కనీసం 25 నుంచి 30 బంతులు ఎదుర్కొంటే ఫలితం ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఫినిషర్‌గా గొప్ప పేరున్న ధోని మరీ లోయర్ ఆర్డర్లో రావడం ఏమాత్రం సరికాదు’’ అని పుజారా జియోస్టార్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.విశ్వసనీయత ఎక్కువఅదే విధంగా సీఎస్కేతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘నేను గతంలో చెన్నైకి ఆడాను. ఆ జట్టులో వాతావరణం ఎంతో బాగుంటుంది. ఆటగాళ్లంతా సొంత కుటుంబంలా కలిసి ఉంటారు. ఆటగాడిగా మన నుంచి ఫ్రాంఛైజీ ఏం కోరుకుంటుందో ప్రతీ ఆటగాడికి తెలసు.సీఎస్కే ఫ్రాంఛైజీకి విశ్వసనీయత ఎక్కువ. ఫ్రాంఛైజీ పట్ల ఆటగాళ్లకు అభిమానం మెండు. ధోని మాత్రమే కాకుండా ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఆ జట్టుతో చాన్నాళ్లు కొనసాగిన తీరే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ఆ జట్టులో మార్పులు జరుగుతున్నాయి. వెటరన్ ప్లేయర్లకు బదులు యువ ఆటగాళ్లతో జట్టును నింపేశారు’’ అని పుజారా పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2026 తొలి విడత షెడ్యూల్ బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎస్కే మార్చి 30న రాజస్తాన్ రాయల్స్‌తో, ఏప్రిల్ 3న పంజాబ్ కింగ్స్‌తో, ఏప్రిల్ 5న ఆర్సీబీతో, ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.ఐపీఎల్-2026 సీఎస్కే జట్టుఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజు శాంసన్ (RR నుండి ట్రేడింగ్), ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రూయిస్✈️, శివమ్ దూబే, ఉర్విల్ పటేల్, నూర్ అహ్మద్✈️, నాథన్ ఎల్లిస్✈️, శ్రేయాస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, రామకృష్ణ ఘోష్, జేమీ ఓవర్టన్✈️, గుర్జప్నీత్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అకేల్ హోసేన్✈️, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్✈️, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, మాట్ హెన్రీ✈️, రాహుల్ చాహర్, జాక్ ఫౌల్క్స్✈️చదవండి: పాకిస్తాన్‌కు ఘోర పరాభవం.. షాహిన్ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు -
ఎంఎస్ ధోనికి భారీ ఊరట
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు సీఎస్కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనికి భారీ ఊరట లభించింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉల్లంఘించాడంటూ అతనిపై నమోదైన ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్ కమిటీ కొట్టిపారేసింది. ఈ కేసులో ఎథిక్స్ కమిటీ అధికారి అరుణ్ మిశ్రా (రిటైర్డ్) ధోనికి క్లీన్ చిట్ ఇచ్చారు. టీమిండియా ఆటగాడిగా ఉంటూనే, 'ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్' అనే క్రికెట్ అకాడమీతో అనుబంధం (యజమానిగా) కొనసాగించడని ధోనిపై 2024 ఫిబ్రవరిలో ఫిర్యాదు నమోదైంది. ఇలా వ్యవహరించడం బీసీసీఐ నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొనబడింది. 2018లో సవరించిన రూల్ 38(4)(a), 38(4)(p) ప్రకారం ఇది తప్పు అని ఫిర్యాదుదారు వాదించారు. అదనంగా, ధోని తప్పనిసరి డిస్క్లోజర్ బాధ్యతలను కూడా నిర్వర్తించలేదని ఆరోపించారు.ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన జస్టిస్ మిశ్రా.. ధోని ఎలాంటి తప్ప చేయలేదని క్లీన్ చిట్ ఇచ్చారు. అతనికి వ్యతిరేకంగా ఎలాంటి విరుద్ధ ప్రయోజనాల కేసు నిలబడదని స్పష్టం చేశారు. ధోని 2017లో ఆర్కా సంస్థతో ఒప్పందం చేసుకున్నారని, బీసీసీఐ సవరించిన నిబంధనలు 2018 సెప్టెంబర్‌లో అమల్లోకి వచ్చాయని గుర్తుచేశారు. అందువల్ల, ధోని ఆటగాడిగా ఉన్న సమయంలో ఎలాంటి విరుద్ధ ప్రయోజనం లేదని తేల్చారు. ఫిర్యాదుదారుడు వ్యక్తిగత కారణాలతోనే ఈ కేసు వేసినట్లు తీర్పులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ధోనిని 2026 ఐపీఎల్ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. సీఎస్కే సీఈవో ఇటీవల చెప్పిన దాని ప్రకారం.. ధోని ఈ సీజన్లో అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు. వయసు పైబడిన రిత్యా ధోని ఈ సీజన్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండరని తొలుత ప్రచారం జరిగింది. తాజాగా సీఈవోనే స్పష్టత ఇవ్వడంతో ఉహాగానాలకు తెరపడింది.2026 సీజన్‌కు సంబంధించి తొలి విడత షెడ్యూల్‌ను నిన్ననే విడదల చేశారు. ఈ విడతలో అన్ని ఫ్రాంచైజీల్లాగే సీఎస్కే కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.తొలి దశలో సీఎస్కే షెడ్యూల్ - మార్చి 30: CSK vs RR – గౌహటి - ఏప్రిల్ 3: CSK vs PBKS – చెన్నై - ఏప్రిల్ 5: CSK vs RCB – బెంగళూరు - ఏప్రిల్ 11: CSK vs DC – చెన్నై కాగా, ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. -
నిబంధనలు ఉల్లంఘించిన ధోని.. జరిమానా
నియమ నిబంధనల విషయంలో ఎప్పుడూ నిక్కచ్చిగా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తాజాగా ఓ నిబంధనను ఉల్లంఘించి వార్తల్లోకెక్కాడు. కొద్ది రోజుల కిందట ధోని పేరిట రిజిస్టర్ అయిన ఓ వాహనం రాంచీలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు రికార్డైంది. సదరు వాహనం వేగ పరిమితిని మించి ప్రయాణించినట్లు ఆటోమేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ గుర్తించడంతో మోటార్ వెహికిల్స్ యాక్ట్ సెక్షన్ 183 కింద రూ.1000 జరిమానా విధిస్తూ ఈ-చలాన్ జారీ చేశారు. ఈ ఘటన ధోని నివాసం సమీపంలో జరిగింది. ఇలాంటి ఘటనలు సర్వసాధారణమే అయినా, ధోని పేరు రావడంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఇంతకుముందే మరో వివాదందీనికి ముందే ధోని మరో వివాదంలో చిక్కుకున్నాడు. రాంచీలోని హార్ము రోడ్లో ఉన్న ఆయన పాత నివాస స్థలాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించారని ఆరోపిస్తూ, ఝార్ఖండ్ స్టేట్ హౌసింగ్ బోర్డు నోటీసులు జారీ చేసింది. ఆ స్థలం కేవలం నివాస ప్రయోజనాల కోసం మాత్రమే కేటాయించబడిందని అధికారులు పేర్కొన్నారు. బిజీగా ధోనిట్రాఫిక్ చలాన్లు, ఇతర వివాదాలపై అవగాహన లేని ధోని ప్రస్తుతం ఐపీఎల్ 2026 సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు. 44 ఏళ్ల ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఈ సీజన్‌కు కూడా రీటైన్ చేసుకుంది. అన్క్యాప్డ్ ప్లేయర్ కోటాలో (రూ. 4 కోట్లు) అతను ఎంపికయ్యాడు. గత సీజన్లో సీఎస్కే 14 మ్యాచ్‌ల్లో 10 ఓటములు ఎదుర్కొని చివరి స్థానంలో నిలిచింది. అయితే ధోని వ్యక్తిగంతా రాణించాడు (135.17 స్ట్రైక్ రేట్‌తో 196 పరుగులు). ధోనికి వయసు మీదపడినప్పటికీ.. ఆయన వ్యూహాత్మక అవగాహన, జట్టుపై నియంత్రణ CSKకి కీలకంగా మారాయి. ఈసారి జట్టు పునర్నిర్మాణ దశలో ఉన్నందున ధోని చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. సంజూ శాంసన్ లాంటి చాలామంది కీలక ఆటగాళ్లను జట్టులో చేర్చుకోవడంలోనూ ధోనిదే కీలకపాత్ర. -
ట్రోఫీస్ గెలవాలంటే..సంజు కోసం ధోనీ చెప్పిందే నిజమైంది
-
MS Dhoni: ధోనికి భారీ షాక్!
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వివాదంలో చిక్కుకున్నాడు. జార్ఖండ్ స్టేట్ హౌజింగ్ బోర్డు అతడికి నోటీసులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే... మైదానంలో వివాదరహితుడగా, మిస్టర్ కూల్ కెప్టెన్‌గా పేరొందాడు ధోని.దిగ్గజ సారథితన అద్భుతమైన సారథ్య నైపుణ్యాలతో టీమిండియాకు ఏకంగా మూడు ఐసీసీ టైటిళ్లు అందించాడు. ఈ ఘనత సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా నేటికీ కొనసాగుతున్నాడు ధోని (MS Dhoni). ఇక ఐపీఎల్‌లోనూ తిరుగులేని సారథిగా ఈ మిస్టర్ కూల్‌కు రికార్డు ఉంది.చెన్నై సూపర్ కింగ్స్‌ను రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ధోని.. ప్రస్తుతం కేవలం ఆటగాడిగా జట్టుకు సేవలు అందిస్తున్నాడు. ఈ దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ 44 ఏళ్ల వయసులోనూ ఐపీఎల్-2026 బరిలో నిలిచేందుకు ఇప్పటికే సన్నద్ధమమ్యాడు.ఆస్తికి సంబంధించిన వివాదంఇక మైదానంలో ధోని మెరుపుల కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా.. అతడు ఓ ఆస్తికి సంబంధించి తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. ఇండియా టుడే కథనం ప్రకారం..దుర్వినియోగం చేస్తు న్నారనే ఆరోపణలుజార్ఖండ్లోని హర్మూ రోడ్లో గృహ అవసరాల నిమిత్తం ధోని రెసిడెన్షియల్ ప్లాట్ సొంతం చేసుకున్నాడు. దీనిని కేవలం నివాస స్థలంగా మాత్రమే ఉపయోగించాలని జార్ఖండ్ స్టేట్ హౌజింగ్ బోర్డు స్పష్టం చేసింది. అయితే, ఈ ప్లాట్‌లో డయాగ్నస్టిక్ సెంటర్ నడుపుతున్నారనే ఆరోపణలు వచ్చాయి.ధోని రింగ్ రోడ్డులోని కొత్త నివాసానికి మారిన తర్వాతే ఈ ప్రచారం ఊపందుకోగా.. హౌజింగ్ బోర్డు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ధోనికి నోటీసులు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకు ఇదే ఆఖరి అవకాశం అని పేర్కొన్నట్లు సమాచారం.నిజమని తేలితే కేటాయింపులు రద్దుఈ విషయం గురించి హౌజింగ్ బోర్డు చైర్మన్ సంజయ్ లాల్ పాశ్వాన్ మాట్లాడుతూ.. గృహ అవసరాల నిమిత్తమే ఈ ప్లాట్‌ను ధోనికి కేటాయించామని.. అయితే, అక్కడ వాణిజ్యపరమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అందుకే ధోనికి నోటీసులు జారీ చేశామన్నారు.అయితే, ధోని ఒక్కడికే కాకుండా హర్మూ రోడ్డులో ప్లాట్లు సొంతం చేసుకున్న మరి కొందరు సీనియర్ అధికారులపై కూడా ఇలాంటి ఆరోపణలే రాగా.. వారిని కూడా వివరణ కోరినట్లు పాశ్వాన్ తెలిపారు. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే వారికి కేటాయించిన ప్లాట్లను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: T20 WC 2026 SL vs PAK: పాకిస్తాన్‌కు చావోరేవో.. గెలిస్తే సరిపోదు! -
చరిత్ర సృష్టించిన బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ
బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ పెర్త్ స్కార్చర్స్ ఫ్రాంచైజీ టీ20 లీగ్‌ల చరిత్రలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2025-26 ఎడిషన్ విజేతగా నిలవడం ద్వారా ఆరోసారి బీబీఎల్ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన ఈ ఫ్రాంచైజీ.. ఓ టీ20 లీగ్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన ఫ్రాంచైజీగా చరిత్ర సృష్టించింది. తాజా టైటిల్‌కు ముందు స్కార్చర్స్ ఐదు టైటిళ్లతో ఐపీఎల్ ఫ్రాంచైజీలైన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌తో సమంగా ఉండింది. సీఎస్కే 2010, 2011, 2018, 2021, 2023 ఎడిషన్ల ఐపీఎల్ టైటిళ్లు సాధించగా.. ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 ఎడిషన్లలో ఐపీఎల్ టైటిళ్లు ఎగరేసుకుపోయింది.స్కార్చర్స్ విషయానికొస్తే.. తాజా బీబీఎల్ టైటిల్‌తో ఈ ఫ్రాంచైజీ గుర్తింపు పొందిన టీ20 లీగ్‌ల చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ 2014, 2015, 2017, 2022, 2023, 2026 ఎడిషన్లలో బీబీఎల్ టైటిళ్లు సాధించింది. జనవరి 25 జరిగిన ఫైనల్లో స్కార్చర్స్ సిడ్నీ సిక్సర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.టీ20 లీగ్‌ల చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలు పెర్త్ స్కార్చర్స్ (బిగ్‌బాష్ లీగ్)- 6ముంబై ఇండియన్స్, సీఎస్కే (ఐపీఎల్)- 5కొమిలా విక్టోరియన్స్ (బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్)- 4జాఫ్నా కింగ్స్ (లంక ప్రీమియర్ లీగ్)- 4ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్ (పాకిస్తాన్ సూపర్ లీగ్)- 3ఓవల్ ఇన్విన్సిబుల్స్ (హండ్రెడ్ లీగ్)- 3సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ (సౌతాఫ్రికా టీ20 లీగ్)- 3ముంబై ఇండియన్స్, సీఎస్కే (ఛాంపియన్స్ లీగ్ టీ20)- 2ఎంఐ న్యూయార్క్ (మేజర్ లీగ్ క్రికెట్)- 2బిగ్‌బాష్ లీగ్ 2025-26 ఫైనల్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్.. జై రిచర్డ్స్ (4-0-32-3), డేవిడ్ పేన్ (4-0-18-3), మహ్లి బియర్డ్‌మన్ (4-0-29-2), ఆరోన్ హార్డీ (3-0-16-1), కూపర్ కన్నోల్లీ (3-0-14-0) ధాటికి 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. సిక్సర్స్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్, జోష్ ఫిలిప్, కెప్టెన్ మోసస్ హెన్రిక్స్ తలో 24 పరుగులు చేయగా.. జోయల్ డేవిస్ 19, లచ్లాన్ షా 14 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను స్కార్చర్స్ ఆచితూచి ప్రారంభించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (44), ఫిన్ అలెన్ (36) నిదానంగా ఆడినా, లక్ష్యానికి దగ్గర చేశారు. మిగతా కార్యక్రమాన్ని జోష్ ఇంగ్లిస్ (29 నాటౌట్) పూర్తి చేశాడు. ఇంగ్లిస్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. మరో 15 బంతులు మిగిలుండగానే స్కార్చర్స్ విజయతీరాలకు చేరింది. సిక్సర్స్ బౌలర్లలో సీన్ అబాట్ (4-0-19-2), మిచెల్ స్టార్క్ (4-0-33-1), జాక్ ఎడ్వర్డ్స్ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. -
సీఎస్కే బౌలర్ సంచలన ప్రదర్శన
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో మహారాష్ట్ర ఆటగాడు, సీఎస్కే బౌలర్ రామకృష్ణ ఘోష సంచలన ప్రదర్శనలతో చెలరేగిపోతున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లతో విజృంభించిన ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్.. తాజాగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో ఊహకందని గణాంకాలు నమోదు చేశాడు.ప్రత్యర్ది గెలుపుకు చివరి 3 ఓవర్లలో 11 అవసరమైన దశలో 48వ ఓవర్, 50వ ఓవర్‌ను మెయిడిన్ చేసి, తన జట్టును అపురూప విజయాన్ని అందించాడు. ఘోష్ నమోదు చేసిన ఈ గణాంకలు చూసి సీఎస్కే అభిమానులు ఔరా అంటున్నారు. తమ ఫ్రాంచైజీకి మరో మ్యాచ్ విన్నర్ దొరికాడంటూ సంబరపడిపోతున్నారు.ఘోష్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 2026 వేలానికి ముందు రీటైన్ చేసుకుంది. ఘెష్‌ను సీఎస్కే 2025 వేలంలో 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. 28 ఏళ్ల ఘోష్ గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.అయినా సీఎస్కే యాజమాన్యం అతనిపై నమ్మకం పెట్టుకొని తిరిగి రీటైన్ చేసుకుంది. యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకానికి ఘోష్ న్యాయం చేస్తున్నాడు. ఘోష్ లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను 11 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు. లిస్ట్-ఏ ఫార్మాట్లోనూ అతను ఓ మోస్తరుగా రాణించాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో ఓ హాఫ్ సెంచరీ చేశాడు.ఆదుకున్న రుతురాజ్మహారాష్ట్ర-గోవా మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 52 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. 131 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతనికి విక్కీ ఓస్త్వాల్ (53), రాజవర్దన్ హంగార్గేకర్ (32 నాటౌట్) సహకరించారు. ఫలితంగా మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 249 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది.ఛేదనలో విజయం దిశగా సాగిన గోవా.. రామకృష్ణ ఘోష్ ధాటికి చివర్లో చిత్తైపోయింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 244 పరుగులకే పరిమితమై 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఘోష్ సహా ప్రశాంత్ సోలంకి (10-1-56-4) సత్తా చాటి గోవాను ఇరుకున పెట్టాడు. -
10 ఓవర్లలో 123 పరుగులు.. సీఎస్కే బౌలర్ అత్యంత చెత్త రికార్డు
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరి కెప్టెన్, ఆల్‌రౌండర్ అమాన్ ఖాన్ కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అయితే ఇది దురదృష్టవశాత్తూ చెప్పుకోవడానికి ఇష్టపడని అవమానకరమైన రికార్డు కావడం గమనార్హం. జార్ఖండ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అమాన్ 10 ఓవర్లలో ఏకంగా 123 పరుగులు సమర్పించుకున్నాడు. దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు కలిపి (లిస్ట్–ఎ క్రికెట్)లో ఒక మ్యాచ్‌లో బౌలర్ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. ఇదే టోర్నీలో ఈ నెల 24న బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుణాచల్‌ప్రదేశ్ బౌలర్ మిబోమ్ మోసూ 9 ఓవర్లల ఇచ్చిన 116 పరుగుల రికార్డు ఇప్పుడు తెరమరుగైంది.ఐపీఎల్లో రెండు సీజన్ల పాటు కోల్‌కతా, ఢిల్లీ జట్లకు కలిపి 12 మ్యాచ్‌లలో ఆడినా ఒకే ఒక ఓవర్ బౌలింగ్ చేసే అవకాశం వచ్చిన అమాన్ ఖాన్ ఇటీవల జరిగిన 2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ.40 లక్షలకు సొంతం చేసుకుంది. పుదుచ్చేరితో మ్యాచ్‌లో 50 ఓవర్లలో 7 వికెట్లకు 368 పరుగులు చేసిన జార్ఖండ్...ఆ తర్వాత పుదుచ్చేరిని 235 పరుగులకే ఆలౌట్ చేసి 133 పరుగులతో విజయాన్నందుకుంది.చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్‌కప్ సెమీస్ చేరే జట్లు ఇవే! -
7 వికెట్లతో చెలరేగిన సీఎస్కే ఫాస్ట్ బౌలర్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర బౌలర్ రామకృష్ణ ఘోష్ చెలరేగిపోయాడు. 9.4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇది పదో అత్యుత్తమ ప్రదర్శన. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇద్దరు 8 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయగా.. ఘోష్‌తో పాటు 10 మంది 7 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.తాజా మ్యాచ్‌లో ఘోష్ చెలరేగడంతో హిమాచల్ ప్రదేశ్ 49.4 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. పుఖ్రాజ్ మన్ (110) సెంచరీ చేయడంతో హెచ్‌పీ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. హెచ్‌పీ ఇన్నింగ్స్‌లో మన్కు వైభవ్ అరోరా (40), అమన్‌ప్రీత్ సింగ్ (30), నితిన్ శర్మ (21) ఓ మోస్తరుగా సహకరించారు.అనంతరం ఛేదనలో మహారాష్ట్ర కూడా తడబడుతుంది. 11.3 ఓవర్లలో 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, అంకిత్ బావ్వే (4) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వైభవ్ అరోరా, ధలివాల్ తలో వికెట్ తీశారు.కాగా, ఈ మ్యాచ్‌లో బంతితో చెలరేగిన రామకృష్ణ ఘోష్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 2026 వేలానికి ముందు రీటైన్ చేసుకుంది. ఘెష్‌ను సీఎస్కే 2025 వేలంలో 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. కుడి చేతి వాటం ఫాస్ట్ మీడియం బౌలర్ అయిన 28 ఏళ్ల ఘోష్ గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా సీఎస్కే యాజమాన్యం అతనిపై నమ్మకం పెట్టుకొని తిరిగి రీటైన్ చేసుకుంది. ఘోష్ లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను 11 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు. లిస్ట్-ఏ ఫార్మాట్లోనూ అతను ఓ మోస్తరుగా రాణించాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో ఓ హాఫ్ సెంచరీ చేశాడు. -
నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు.. ఇప్పుడిలా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తెచ్చింది. క్యాష్ రిచ్ లీగ్‌లోని ఫ్రాంఛైజీలు తమ జట్లను పటిష్ట పరచుకునే క్రమంలో మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి.. ఒక రకంగా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశాయి. ఐపీఎల్-2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది.రూ. 14.20 కోట్లుఅన్క్యాప్డ్ ఆటగాళ్లు అయిన కార్తిక్ శర్మ (Kartik Sharma), ప్రశాంత్ వీర్ (Prashant Veer)లపై చెరో రూ. 14.20 కోట్లు కుమ్మరించి మరీ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ప్రపంచంలోని టాప్ టీ20 లీగ్‌లో వీరిద్దరు నయా సెన్సేషన్లుగా నిలిచారు. ఇద్దరిదీ మధ్య తరగతి కుటుంబమే. తల్లిదండ్రుల త్యాగాలతోనే ఆటగాళ్లుగా ఎదిగిన కార్తిక్, ప్రశాంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన అన్క్యాప్డ్ ప్లేయర్లుగా చరిత్ర సృష్టించారు.వీరిద్దరిలో కార్తిక్ శర్మ కుటుంబం ఒకానొక దశలో దయనీయ పరిస్థితులు ఎదుర్కొంది. ఈ విషయాన్ని అతడి కుటుంబమే స్వయంగా IANSకు తెలిపింది. పందొమ్మిదేళ్ల కార్తిక్ స్వస్థలం రాజస్తాన్‌లోని భరత్పూర్. అతడి తల్లిదండ్రులు మనోజ్ శర్మ, రాధ. వారిది సాధారణ మధ్యతరగతి కుటుంబం.అయితే, కుమారుడిని క్రికెటర్ చేయాలన్నది కార్తిక్ తల్లిదండ్రుల కల. ముఖ్యంగా అతడి తల్లి రాధ కొడుకు ఏదో ఒకరోజు కచ్చితంగా ఆటగాడిగా ఎదుగుతాడని బలంగా నమ్మేవారు. అందుకోసం భర్తతో కలిసి ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. ఈ విషయం గురించి కార్తిక్ తండ్రి మనోజ్ శర్మ మాటల్లోనే..నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు‘‘మా ఆదాయం అంతంతమాత్రమే. అయితే, నా భార్య రాధకు మాత్రం ఓ కల ఉండేది. ఎట్టిపరిస్థితుల్లోనైనా కార్తిక్‌ను క్రికెటర్ చేయాలని ఆమె అంటూ ఉండేది. ఎంత ఖర్చు అయినా పర్లేదు.. మా కుమారుడు క్రికెటర్ అయితే చాలు అనుకునేది.కార్తిక్ శిక్షణ కోసం మేము మాకున్న చిన్నపాటి ప్లాట్లు, బరేనా గ్రామంలో మాకున్న పొలం అమ్మేశాము. రాధ తన నగలు కూడా అమ్మేసింది. మా జీవితాల్లో అదొక అత్యంత కఠినమైన దశ. అయితే, ఆర్థిక ఇబ్బందుల ప్రభావం కార్తిక్‌పై పడకుండా మేము చూసుకున్నాము.గ్వాలియర్‌లో టోర్నమెంట్ ఆడేందుకు కార్తిక్‌ను నేను అక్కడికి తీసుకువెళ్లాను. నాలుగైదు మ్యాచ్‌లలోనే జట్టు ఇంటిబాట పడుతుందని అనుకున్నాము. అయితే, కార్తిక్ ప్రదర్శన కారణంగా జట్టు ఫైనల్ చేరింది. అయితే, ఆ మ్యాచ్ అయ్యేంత వరకు గ్వాలియర్లోనే ఉండేందుకు మా దగ్గర సరిపడా డబ్బు లేదు.ఖాళీ కడుపుతోనేఅప్పుడు మేము ఓ నైట్ షెల్టర్‌లో ఉన్నాము. తినడానికి ఏమీ లేదు. ఖాళీ కడుపుతోనే ఆరోజు నిద్రపోయాము. తర్వాత ఫైనల్లో మ్యాచ్ గెలిచిన తర్వాత కార్తిక్‌కు వచ్చిన ప్రైజ్‌మనీతోనే మేము తిరిగి ఇంటికి చేరుకోగలిగాము’’ అని తాము పడిన కష్టాలను గుర్తు చేసుకున్నారు.అదే విధంగా.. ‘‘రెండున్నరేళ్ల వయసులోనే నా కుమారుడు బ్యాట్‌తో బంతిని బాది రెండు ఫొటోఫ్రేములను పగులగొట్టాడు. అది మాకెంతో ప్రత్యేకం. ఆరోజే మేము తన భవిష్యత్తు గురించి ఓ అంచనాకు వచ్చేశాము. నిజానికి క్రికెటర్ కావాలని నేనూ కలగన్నాను. అయితే, నా కోరిక తీరలేదు. నా కుమారుడి రూపంలో ఇప్పుడు ఆ కల నెరవేరింది’’ అని మనోజ్ శర్మ తెలిపారు.చదువునూ కొనసాగిస్తాకాగా దేశీ క్రికెట్లో సత్తా చాటిన వికెట్ కీపర్ బ్యాటర్ కార్తిక్ శర్మ కోసం వేలంలో గట్టి పోటీ ఎదురైనా చెన్నై మాత్రం అతడిని వదల్లేదు. భారీ ధరకు అతడిని సొంతం చేసుకుంది. పన్నెండో తరగతి పూర్తి చేసిన కార్తిక్.. క్రికెట్‌తో పాటు చదువునూ కొనసాగిస్తానని చెబుతున్నాడు. ఇక కార్తిక్ పెద్ద తమ్ముడు చదువుపైనే ఎక్కువగా దృష్టి పెట్టగా.. చిన్న తమ్ముడు మాత్రం క్రికెట్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.సంకల్పం బలంగా ఉంటే.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరవచ్చని ఇప్పటికే ఎంతో మంది యువ క్రీడాకారులు నిరూపించారు. ఇప్పుడీ జాబితాలో కార్తిక్ శర్మ కూడా చేరాడు. తల్లిదండ్రుల త్యాగాలకు ప్రతిఫలంగా.. టీమిండియా అరంగేట్రానికి బాటలు వేసే ఐపీఎల్‌కు అతడు సెలక్ట్ అయ్యాడు. చెన్నై వంటి చాంపియన్ జట్టు అతడిని ఏరికోరి కొనుక్కోవడం అతడి ప్రతిభకు నిదర్శనం.చదవండి: IND vs SA: 'ఇంతకంటే దారుణ పరిస్థితుల్లో ఆడాను.. అంపైర్ల నిర్ణయంతో షాకయ్యాను' -
మరోసారి ఐపీఎల్లో.. సర్ఫరాజ్ స్పందన ఇదే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎట్టకేలకు తిరిగి అడుగుపెట్టాడు టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2023లో చివరి సారిగా ఐపీఎల్ ఆడిన ఈ ముంబైకర్.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ క్యాష్ రిచ్లో పునరాగమనం చేయనున్నాడు.ఐదుసార్లు చాంపియన్ జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్.. సర్ఫరాజ్ ఖాన్‌ను కొనుక్కుంది. అబుదాబి వేదికగా మంగళవారం నాటి మినీ వేలంలో కనీస ధర రూ. 75 లక్షలు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.సర్ఫరాజ్ స్పందన ఇదేసోషల్ మీడియా వేదికగా తన భావాలను పంచుకుంటూ.. ‘‘కొత్త జీవితం ఇచ్చినందుకు ధన్యవాదాలు సీఎస్కే’’ అంటూ సర్ఫరాజ్ ఖాన్ చెన్నై యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో నాని ‘జెర్సీ’ సినిమాలోని ఎమోషనల్ సీన్‌కు సంబంధించిన దృశ్యాలను జతచేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేలంలో తిరిగి అమ్ముడుపోవడంపై స్పందించిన తీరు వైరల్‌గా మారింది.కాగా దేశవాళీ క్రికెట్లో రన్ మెషీన్‌గా గుర్తింపు పొందినా కూడా భారత టెస్టు జట్టుకు కూడా దూరమయ్యాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం జరుగుతున్న ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు భాగమయ్యాడు. ఇక ఇప్పటికి.. సర్ఫరాజ్ 7 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 203.08 స్ట్రయిక్‌రేట్‌తో 329 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఐపీఎల్ వేలంలో ముందుగా రూ.75 లక్షల కనీస ధరకు అతడిని ఎవరూ తీసుకోలేదు. మళ్లీ అతడి పేరు వచ్చినప్పుడు ఇదే మొత్తానికి చెన్నై ఎంచుకుంది. కాగా సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటి వరకు ఐపీఎల్లో యాభై మ్యాచ్‌లు ఆడి.. 585 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. మరోవైపు.. సర్ఫరాజ్ మిత్రుడు పృథ్వీ షాను కూడా ఢిల్లీ తీసుకోవడం విశేషం. అతడిని ఢిల్లీ కనీస ధర రూ. 75 లక్షలకే కొనుక్కుంది.అమ్ముడుపోని స్టార్లు వీరేఐపీఎల్లో గతంలో ఆడిన లేదా అంతర్జాతీయ క్రికెట్లో గుర్తింపు ఉన్న పలువురు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. ఈ జాబితాలో ఉన్న ప్రముఖ విదేశీ క్రికెటర్లలో డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్, గస్ అట్కిన్సన్, జేమీ స్మిత్, గెరాల్డ్ కొయెట్జీ, ముజీబుర్ రహమాన్, మహీశ్ తీక్షణ, స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్, షాయీ హోప్... టామ్ కరన్, అల్జారీ జోసెఫ్, నవీన్ ఉల్ హక్, రహ్మనుల్లా గుర్బాజ్, వియాన్ ముల్డర్, జానీ బెయిర్‌స్టో, ఫజల్హఖ్ తదితరులు ఉన్నారు. భారత క్రికెటర్లలో ఉమేశ్ యాదవ్, దీపక్ హుడా, మయాంక్ అగర్వాల్, కరణ్ శర్మ, మనన్ వోహ్రాను ఎవరూ పట్టించుకోలేదు. Sarfaraz Khan’s emotional Instagram story after being sold for ₹75 lakh to Chennai Super Kings in the auction for IPL 2026.🥹❤️This shows that if you work hard, you will definitely get the reward for it. God never disappoints those who work hard. pic.twitter.com/X3Z81AmB0g— Mention Cricket (@MentionCricket) December 16, 2025 -
ఒకప్పుడు ‘డాడీస్ ఆర్మీ’.. ఇప్పుడు కుర్రాళ్లకు కోట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తీసుకున్న నిర్ణయాలు సంచలనాత్మకంగా మారాయి. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై ఈసారి మినీ వేలంలో ఓ రకంగా ప్రకంపనలు సృష్టించింది. సాధారణంగా అనుభవానికి పెద్దపీట వేసే సీఎస్కే ... ఈసారి మాత్రం భవిష్యత్తుపై భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టింది.ఐపీఎల్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా... అన్క్యాప్డ్ ఆటగాళ్ల కోసం చెన్నై ఫ్రాంచైజీ కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టింది. ఒకప్పుడు ‘డాడీస్ ఆర్మీ’గా ముద్రపడ్డ చెన్నై సూపర్ కింగ్స్... ఐపీఎల్ వేలంలో ప్రశాంత్ వీర్ (Prashant Veer), కార్తీక్ శర్మను రూ. 14.20 కోట్ల చొప్పున వెచ్చించి కొనుగోలు చేసుకుంది.రంజీ ట్రోఫీ, ముస్తాక్ అలీ టోర్నీ, భారత్ ‘ఎ’, అండర్–19, అండర్–23 ఇలా ఏ స్థాయిలోనూ పెద్దగా ఆకట్టుకోకపోయినా... కేవలం నైపుణ్యాన్ని నమ్మి యువ ఆటగాళ్ల కోసం భారీగా వెచ్చిచండం విశేషం. ప్రతిభకు పెద్ద పీట వేసే చెన్నై జట్టు ఇంత భారీ ఖర్చు పెట్టడంతో... కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ల గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా వీరిద్దరి నేపథ్యాలను పరిశీలిస్తే...ధోనీకి ప్రత్యామ్నాయమా! ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం నుంచి... ఏవో కొన్ని మ్యాచ్‌లు తప్ప... దాదాపు అన్నీ సమయాల్లో మహేంద్ర సింగ్ ధోనినే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వికెట్ కీపర్‌గా దర్శనమిచ్చాడు. అయితే గత కొన్నాళ్లుగా బ్యాటింగ్ ఆర్డర్లో ఆఖర్లో వస్తున్న ధోని... ఇంకెంతో కాలం ఐపీఎల్లో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో వికెట్ల వెనక సమర్థవంతంగా విధులు నిర్వర్తించడంతో పాటు... లోయర్ ఆర్డర్లో ధాటిగా షాట్లు ఆడగల ప్లేయర్‌ను ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో చెన్నై ఫ్రాంచైజీ వేలంలో అడుగు పెట్టింది.అంతకుముందే టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్(Sanju Samson)ను ట్రేడింగ్‌లో తీసుకున్నా... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యువకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో రాజస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ శర్మ కోసం కోట్లు కుమ్మరించింది. జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు... ఐపీఎల్ వేలానికి ముందే ట్రేడింగ్‌లో రవీంద్ర జడేజాను వదిలేసుకున్న చెన్నై జట్టు అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల ప్రశాంత్ వీర్‌ను ఎంపిక చేసుకుంది. ఎడంచేతి వాటం స్పిన్నర్ అయిన ప్రశాంత్... లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడగల సమర్థుడు. ఉత్తర ప్రదేశ్ లీగ్‌లో మంచి ప్రదర్శనలు కనబర్చిన ప్రశాంత్... ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 2 మ్యాచ్‌లాడి 2 వికెట్లు తీశాడు. ఇక టి20ల్లో 9 మ్యాచ్‌లాడి 160కి పైగా స్ట్రయిక్ రేట్‌తో 112 పరుగులు చేయడంతో పాటు 12 వికెట్లు పడగొట్టాడు. ప్రాధమిక ధర రూ. 30 లక్షలతో వేలంలో అడుగపెట్టిన ప్రశాంత్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14.20 కోట్లు ఖర్చు చేసింది. చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు -
సంచలనం.. 19 ఏళ్ల కుర్రాడికి రూ.14.20 కోట్లు! ఎవరీ కార్తీక్ శర్మ?
అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్-2026 మినీ వేలంలో అన్క్యాప్డ్ ప్లేయర్ కార్తీక్ శర్మకు జాక్ పాట్ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన కార్తీక్ శర్మను రూ. 14.20 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ప్రశాంత్ వీర్ రికార్డును కార్తీక్ సమం చేశాడు. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన కార్తీక్ శర్మ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బిడ్డింగ్ వార్ నెలకొంది. కేకేఆర్, ఎస్ఆర్హెచ్ పోటీ నుంచి తప్పుకోవడంతో అతడు సీఎస్కే సొంతమయ్యాడు. ఈ క్రమంలో కార్తీక్ శర్మ గురుంచి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తిచూపుతున్నారు.ఎవరీ కార్తీక్ శర్మ?రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ శర్మ.. పవర్ హిట్టింగ్‌కు పెట్టింది పేరు. అతడికి అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. దేశవాళీ క్రికెట్లో తన సంచలన బ్యాటింగ్‌తో రాజస్తాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కార్తీక్‌కు తన చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. స్ట్రీట్ క్రికెట్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన కార్తీక్.. ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ టీ20 లీగ్ అయిన ఐపీఎల్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. కార్తీక్ శర్మ ఆఖరిలో వచ్చి తన బ్యాట్‌తో మెరుపులు మెరిపించగలడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో (SMAT) ఐదు మ్యాచ్‌ల్లో 160.24 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 133 పరుగులు చేశాడు. సీఎస్కే అతడిని ఫినిషర్‌గా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. వేలానికి ముందే అతడిని సీఎస్కే ట్రయల్స్‌కు పిలిచింది. కార్తీక్ ఇప్పటివరకు రాజస్తాన్ తరపున 12 టీ20లు ఆడి 164 స్ట్రైక్ రేట్‌తో 334 పరుగులు చేశాడు. అంతేకాకుండా 8 మ్యాచ్‌లు ఆడి 479 పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే ఉత్తరాఖండ్‌పై సెంచరీతో సత్తాచాటాడు. లిస్ట్ ఏ క్రికెట్లో 9 మ్యాచ్‌లు ఆడి 445 పరుగులు సాధించాడు. ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకునే అతడిపై భారీ మొత్తాన్ని సీఎస్కే వెచ్చించింది. అదేవిధంగా మరో యువ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను సైతం రూ.14.20 కోట్లకు సీఎస్కే కొనుగోలు చేసింది. ఈ ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసమే సీస్కే రూ.28 కోట్లపైన ఖర్చు చేసింది.చదవండి: IPL 2026: రూ.30 లక్షలతో ఎంట్రీ.. కట్ చేస్తే! ఏకంగా రూ.14.20 కోట్లు -
రూ.30 లక్షలతో ఎంట్రీ.. కట్ చేస్తే! ఏకంగా రూ.14.20 కోట్లు
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఓ 20 ఏళ్ల యువ ఆటగాడిపై కాసుల వర్షం కురిసింది. అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి దిగ్గజ ఫ్రాంచైజీల సైతం పోటీ పడ్డాయి. రూ. 30ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆ యువ ఆల్‌రౌండర్.. నిమిషాల వ్యవధిలోనే కోటీశ్వరుడిగా మారిపోయాడు.రికార్డు ధర దక్కించుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. అతడే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రశాంత్ వీర్. దుబాయ్ వేదికగా జరుగుతున్న మినీ వేలంలో ప్రశాంత్ వీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఏకంగా రూ. 14.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఎస్ఆర్హెచ్తో పోటీ పడి మరి అతడిని సీఎస్కే సొంతం చేసుకుంది. తొలి బిడ్ నుంచి పోటీలో ఉన్న సీఎస్కే ఆఖరి వరకు వెనక్కి తగ్గలేదు. రచిన్ రవీంద్ర, లైమ్ లివింగ్‌స్టోన్ వంటి విధ్వంసకర ఆల్రౌండర్లను కాదని మరి ఈ యువ ఆటగాడిని సీఎస్కే దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ప్రశాంత్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా పేసర్ అవేష్ ఖాన్(రూ. 10 కోట్లు) పేరిట ఉండేది. తాజా వేలంతో అవేష్ రికార్డును ప్రశాంత్ బ్రేక్ చేశాడు. దీంతో ఎవరీ ప్రశాంత్ వీర్ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ ప్రశాంత్ వీర్..?యూపీలోని అమేథీకి చెందిన ప్రశాంత్ వీర్.. అద్భుతమైన బ్యాటింగ్ ఆల్‌రౌండర్. 20 ఏళ్ల ప్రశాంత్‌కు బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించే సత్తా ఉంది. మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడడం అతడి స్పెషాలిటీ. అతడు లెఫ్మ్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. యూపీ టీ20 లీగ్-2025లో నోయిడా సూపర్ కింగ్స్ తరపున ఆడిన ప్రశాంత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్‌లు ఆడిన వీర్.. 320 పరుగులతో పాటు ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఈ టీ20 లీగ్‌లో అతడి బ్యాటింగ్ స్ట్రైక్ రేటు 169.69 ఉంది. ఈ ప్రదర్శనలతో అతడు సీఎస్కే స్కౌట్ల దృష్టిలో పడ్డాడు. దీంతో అతడిని వేలానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ ట్రయల్స్‌కు పిలిచింది. ట్రయల్స్‌లో కూడా ప్రశాంత్ అద్భుతంగా రాణించాడు. రవీంద్ర జడేజాకు దీర్ఘకాలిక ప్రత్యామ్నాయంగా ఈ యువ ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలని సీఎస్కే అప్పుడే ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కోసం సీఎస్కే భారీ ధర వెచ్చించింది. అయితే అంత భారీ ధర కేటాయిస్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అతడు దుమ్ములేపాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో 112 పరుగుల (స్ట్రైక్ రేట్ 170)తో పాటు 9 వికెట్లు పడగొట్టాడు. ఓ మ్యాచ్‌లో కేవలం 10 బంతుల్లోనే 37 పరుగులు చేసి ఔరా అన్పించాడు. కాగా ప్రశాంత్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.🚨 Prashant Veer🚨A 20 year-old all-rounder from UP left-handed batter and economical left-arm spinner. He impressed in UPT20 with 320 runs and 8 wickets in 10 matches (SR 155.34). A flexible middle-overs option with both bat and ball.Let’s see which team shows interest in him pic.twitter.com/Ei1cdvOZ85— Neeraj (@NeerajY00859341) December 15, 2025చదవండి: IPL 2026 Auction: సీఎస్కే వదిలేసింది.. కట్ చేస్తే! వేలంలో కోట్ల వర్షం -
సీఎస్కే వదిలేసింది.. కట్ చేస్తే! వేలంలో కోట్ల వర్షం
ఐపీఎల్-2026 మినీ వేలంలో శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరానాకు జాక్ పాట్ తగిలింది. అతడిని రూ. 18 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన పతిరానా కోసం తొలుత ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడ్డాయి. ఆ తర్వాత ఢిల్లీ పోటీనుంచి తప్పుకోవడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ జూనియర్ మలింగ కోసం కేకేఆర్, లక్నో మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. లక్నో అతడిని దక్కించుకునేందుకు ఆఖరివరకు ప్రయత్నాలు చేసింది. కానీ కేకేఆర్ మాత్రం బిడ్‌ను పెంచుకుంటూ పోతుండడంతో లక్నో వెనక్కి తగ్గింది. దీంతో ఈ యార్కర్ల కింగ్ కేకేఆర్ సొంతమయ్యాడు.పతిరానా తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే నాలుగు సీజన్ల పాటు తమ జట్టుకు ఆడిన పతిరానాను సీఎస్కే.. ఐపీఎల్-2026 వేలంకు ముందు రిటైన్ చేసుకోలేదు. దీంతో వేలంలోకి వచ్చిన పతిరానాపై కాసుల వర్షం కురిసింది. గత సీజన్లో సీఎస్కే నుంచి రూ.13 కోట్లు అందుకున్న పతిరానా.. ఇప్పుడు కేకేఆర్ నుంచి రూ.18 కోట్లు అందుకోనున్నాడు. కాగా పతిరానా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచాడు. పతిరానా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచాడు. పతిరానా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పటికి.. సీఎస్కే లెజెండ్ ధోని సారథ్యంలో ఎంతగానో రాటుదేలాడు. మిడిల్ ఓవర్లలో కూడా తన పేస్ బౌలింగ్ బ్యాటర్లను కట్టడి చేయగలడు. అంతేకాకుండా ఈ జూనియర్ మలింగా యార్కర్లను కూడా అద్భుతంగా సంధించగలడు. ఈ కారణంతోనే అతడిపై కేకేఆర్ కోట్ల వర్షం కురిపించింది. మతీషా పతిరానా ఐపీఎల్లో ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు ఆడి 47 వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2026: కామెరూన్ గ్రీన్‌కు భారీ ధర.. ఐపీఎల్ చరిత్రలోనే! ఎన్ని కోట్లంటే? -
పొడిచేశావ్ కట్టప్పా!.. ఎందుకిలా చేశావు!.. పాపం మన కెప్టెన్!
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేశాడు రుతురాజ్ గైక్వాడ్. సౌతాఫ్రికాతో వన్డేలకు ఈ మహారాష్ట్ర ఆటగాడిని ఎంపిక చేసిన భారత జట్టు యాజమాన్యం.. రాంచిలో తుదిజట్టులోనూ ఆడే అవకాశం ఇచ్చింది.ఎట్టకేలకు ఓ అవకాశంఇటీవల సౌతాఫ్రికా-‘ఎ’ జట్టుతో అనధికారిక వన్డే సిరీస్‌లో రుతు (Ruturaj Gaikwad) సత్తా చాటిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో 129 బంతుల్లో 117 పరుగులు సాధించిన రుతురాజ్.. రెండో మ్యాచ్‌లో అజేయ అర్ధ శతకం (68)తో సత్తా చాటాడు. ఈ క్రమంలోనే జాతీయ జట్టు నుంచి అతడికి పిలుపు వచ్చింది. కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) గాయం వల్ల దూరం కావడం వల్ల రుతుకు సెలక్టర్లు మరో అవకాశం ఇచ్చారు.అయితే, ప్రస్తుత భారత వన్డే జట్టు కూర్పు దృష్ట్యా తుదిజట్టులో రుతురాజ్‌కు చోటు దక్కుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అనూహ్యంగా రిషభ్ పంత్‌కు మొండిచేయి చూపిన నాయకత్వ బృందం రుతుకు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం కల్పించింది. ఈ క్రమంలో మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఈ కుడిచేతి వాటం ఆటగాడు బ్యాటింగ్‌కు వచ్చాడు.ఊహించని రీతిలో షాక్నెమ్మదిగానే తన ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రుతురాజ్‌కు ఊహించని రీతిలో షాక్ తగిలింది. భారత ఇన్నింగ్స్‌లో 27వ ఓవర్‌ను సఫారీ పేసర్ ఒట్నీల్ బార్ట్‌మన్ వేశాడు. అతడి బౌలింగ్‌లో మూడో బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో రుతు గాల్లోకి లేపాడు. అంతే.. ఇన్సైడ్ సర్కిల్ లోపల ఇంతలో బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి పాదరసంలా దూసుకవచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ నమ్మశక్యం కాని రీతిలో... ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు.కోహ్లి సైతం.. నోరెళ్లబెట్టాడుబ్రెవిస్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకోవడంతో రుతు కథ ముగిసిపోయింది. మొత్తంగా 14 బంతుల్లో కేవలం 8 పరుగులే చేసి అతడు నిష్క్రమించాడు. నిజానికి బ్రెవిస్ ఆ క్యాచ్ అలా పడతాడని ఎవరూ ఊహించలేదు. అంతెందుకు రుతుకు తోడుగా మరో ఎండ్‌లో ఉన్న దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం.. ఆ క్యాచ్ చూసి నోరెళ్లబెట్టాడు.అలా బ్రెవిస్ అద్భుత ఫీల్డింగ్ కారణంగా రుతు రీఎంట్రీలో దురదృష్టవశాత్తూ పెద్దగా స్కోరు చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో బ్రెవిస్ సింగిల్ హ్యాండ్ క్యాచ్ హైలైట్ కాగా.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేసిన పోస్టు వైరల్‌గా మారింది. హృదయం ముక్కలైన ఎమోజీని షేర్ చేసిన సీఎస్కే.. ‘‘ఎందుకిలా చేశావు డీబీ? ఎందుకు?’’ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.Why, Brevis… why?Ruturaj was settling in so beautifully, playing with such calm and class —and then you flew in the air and snatched that catch out of nowhere.Brevis, you just broke the hearts of countless Rutu fans today. 💔pic.twitter.com/qEfyTuhfHC— Mahi Patel (@Mahi_Patel_07) November 30, 2025 పొడిచేశావు కదా కట్టప్పాతమ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో తమకూ బాధ మిగిల్చాడనే ఉద్దేశంతో సీఎస్కే ఈ మేరకు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఇందుకు బదులుగా.. ‘‘పాపం.. రుతును పొడిచేశావు కదా కట్టప్పా’’ అంటూ నెటిజన్లు బాహుబలి స్టైల్ మీమ్స్‌తో ఇద్దరినీ ట్రోల్ చేస్తున్నారు. కాగా బేబీ ఏబీడీగా పేరొందిన బ్రెవిస్.. ఐపీఎల్లో రుతు కెప్టెన్సీలో సీఎస్కేకు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈసారి 2026 వేలానికి ముందు బ్రెవిస్‌ను సీఎస్కే అట్టిపెట్టుకుంది కూడా!భారత్ భారీ స్కోరుఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. రోహిత్ శర్మ (57), కెప్టెన్ కేఎల్ రాహుల్ (60), రవీంద్ర జడేజా (32) రాణించగా.. కోహ్లి (120 బంతుల్లో 135) శతక్కొట్టాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది.కష్టాల్లో సౌతాఫ్రికాలక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 134 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (7), ర్యాన్ రికెల్టన్ (0), క్వింటన్ డికాక్ (0) దారుణంగా విఫలమయ్యారు. టోనీ డి జోర్జి (39), డెవాల్డ్ బ్రెవిస్ (37) ఓ మోస్తరుగా రాణించారు. ఇలాంటి దశలో నాలుగో నంబర్ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే అర్ద శతకం పూర్తి చేసుకుని సఫారీల ఆశాకిరణంగా నిలిచాడు.అన్నట్లు హర్షిత్ రాణా బౌలింగ్‌లో బ్రెవిస్ ఇచ్చిన క్యాచ్‌ను రుతురాజ్ పట్టడం విశేషం. కాగా భారత పేసర్లు హర్షిత్ రాణా మూడు, అర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ తీయగా.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో 25 ఓవర్ల ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. విజయానికి 188 పరుగుల దూరంలో నిలిచింది. మరోవైపు.. భారత్ గెలుపునకు ఐదు వికెట్లు కావాలి!!చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్‌ను దాటేసి తొలి ప్లేయర్‌గా.. 7000వ సెంచరీఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్ రియాక్షన్ వైరల్!Need a breakthrough? Call Harshit Rana! 📞A fine catch by Ruturaj as the dangerman Dewald Brevis departs 👏#INDvSA 1st ODI, LIVE NOW 👉 https://t.co/BBkwein9oF pic.twitter.com/w4PAuCIgUR— Star Sports (@StarSportsIndia) November 30, 2025 -
IPL 2026: ‘పెంచి, పోషించి.. అతడిని ఎలా వదిలేశారు?’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ పన్నెండు మంది ఆటగాళ్లను వదిలేసింది. క్యాష్ రిచ్ లీగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) జట్టును వీడగా.. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర వంటి ప్లేయర్లను వదిలించుకుంది.అయితే, సీఎస్కే ‘బేబి మలింగ’, శ్రీలంక పేసర్ మతీశ పతిరణను కూడా వేలంలోకి వదలడం విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. చెన్నైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) ప్రియ శిష్యుడిగా పేరొందాడు పతిరణ. ధోని నాయకత్వం, మార్గదర్శనంలో అంచెలంచెలుగా ఎదిగి సీఎస్కే ప్రధాన పేసర్లలో ఒకడిగా మారాడు.రూ. 20 లక్షలతో చేరి.. 13 కోట్లకు..ఐపీఎల్-2022 సీజన్ సందర్భంగా రీప్లేస్మెంట్ ప్లేయర్‌గా రూ. 20 లక్షలతో సీఎస్కేలో చేరాడు పతిరణ. ఆ మరుసటి ఏడాది అంటే.. 2023లో రూ. 20 లక్షలకు జట్టుతో ఉన్న ఈ యువ పేసర్.. చెన్నై ఐదోసారి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 12 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 19 వికెట్లు కూల్చి సత్తా చాటాడు.ఇక గతేడాది రూ. 20 లక్షలకు పతిరణను రిటైన్ చేసుకోగా.. గాయం వల్ల ఆడలేకపోయాడు. అయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఏకంగా రూ. 13 కోట్లు వెచ్చించి చెన్నై అతడిని అట్టిపెట్టుకుంది. అయితే, ఈసారి పతిరణ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 12 మ్యాచ్‌లు ఆడి కేవలం 13 వికెట్లు తీశాడు. ఎకానమీ 10.13.పెంచి, పోషించి.. అతడిని ఎలా వదిలేశారు?ఈ నేపథ్యంలోనే చెన్నై పతిరణను విడిచిపెట్టడం గమనార్హం. ఈ విషయంపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సబా కరీం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘పతిరణ కోసం సీఎస్కే చాలా ఖర్చు చేసింది. అతడిని పెంచి, పోషించి.. తీర్చిదిద్దింది.అతడు కూడా జట్టు కోసం శ్రమించాడు. విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. నిజానికి పతిరణ ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్‌లలో ఆడుతున్నాడు. వేర్వేరు వికెట్లపై ఎలా బౌలింగ్ చేయాలో అతడికి అవగాహన ఉంది. నైపుణ్యం గల బ్యాటర్లను కూడా పతిరణ బోల్తా కొట్టించగలడు.అలాంటి బౌలర్‌ను.. ముఖ్యంగా తాము పెద్ద చేసిన బౌలర్‌ను సీఎస్కే ఎలా వదిలేసిందో నాకైతే అర్థం కావడం లేదు. గతేడాది కాస్త వెనుకబడినా అతడు తిరిగి పుంజుకోగలడు. అతడిపై మరోసారి నమ్మకం ఉంచాల్సింది’’ అని సబా కరీం అభిప్రాయపడ్డాడు.సీఎస్కేలోకి సంజూ శాంసన్ఇదిలా ఉంటే.. సుదీర్ఘకాలంగా తమతో ఉన్న రవీంద్ర జడేజాతో పాటు.. సామ్ కర్రాన్‌ను వేలానికి ముందే రాజస్తాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసింది సీఎస్కే. ఇందుకు బదులుగా రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను తమ జట్టులోకి చేర్చుకుంది. ఇక ఐపీఎల్-2026 సీజన్లోనూ రుతురాజ్ గైక్వాడ్నే తమ కెప్టెన్‌గా కొనసాగిస్తామని ఇప్పటికే సీఎస్కే స్పష్టం చేసింది.చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ లిస్టుమతీశ పతిరణ, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా, వన్ష్ బేడి, సి ఆండ్రీ సిద్దార్థ్, షేక్ రషీద్, కమ్లేశ్ నాగర్కోటి, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్).చదవండి: IPL 2026: ‘కేకేఆర్ కాకపోతే.. ఇంకో జట్టుకు ఆడతా’ -
IPL 2026: ‘అతడొక డమ్మీ కెప్టెన్.. చేసేదంతా వేరొకరు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 సీజన్ సందడి మొదలైపోయింది. ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు రిటెన్షన్, రిలీజ్ జాబితాలు విడుదల చేసి వేలానికి సిద్ధమైపోయాయి. అబుదాబి వేదికగా డిసెంబరు 16న జరుగనున్న వేలం పాటలో పాల్గొనేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎనిమిది జట్లు తమ కెప్టెన్లను ఖరారు చేశాయి. ఇందులో ప్రధానంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)నే తమ సారథిగా కొనసాగిస్తానని చెప్పడం విశేషం. రవీంద్ర జడేజాను ఇచ్చేసి.. రాజస్తాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంజూ శాంసన్ (Sanju Samson)కు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే, యాజమాన్యం మాత్రం రుతు వైపే మొగ్గుచూపింది.ఇప్పుడే జట్టులో చేరిన సంజూ శాంసన్‌ను ప్రస్తుతానికి వైస్ కెప్టెన్‌గా నియమించాలని సీఎస్కే మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడొక డమ్మీ కెప్టెన్.. రుతురాజ్ గైక్వాడ్ కేవలం పేపర్ మీద మాత్రమే సారథిగా కనిపిస్తాడని.. అతడొక డమ్మీ కెప్టెన్ అని అభిప్రాయపడ్డాడు. మహేంద్ర సింగ్ ధోనినే మైదానం లోపల, వెలుపల నిజమైన సారథిగా వ్యవహరిస్తాడని కైఫ్ పేర్కొన్నాడు.‘‘ధోని బ్యాటింగ్ చేయడానికి తుదిజట్టులోకి రాడు. 20 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేయడానికి.. 20 ఓవర్ల పాటు కెప్టెన్సీ చేయడానికి మాత్రమే జట్టులో ఉంటాడు. మిగతా ఆటగాళ్లు ఎలా ఆడాలో మైదానంలోనే మార్గదర్శనం చేస్తాడు.అంతా ధోని కనుసన్నల్లోనేగైక్వాడ్ను గైడ్ చేయడానికే ధోని మైదానంలో ఉంటాడు. మెంటార్‌గా, కెప్టెన్‌గా మాత్రమే ధోని మైదానంలో దిగుతాడు. పేపర్ మీద మాత్రం గైక్వాడ్ పేరు కెప్టెన్‌గా ఉంటుంది. అయితే, మైదానంలో, మైదానం వెలుపల అంతా ధోని కనుసన్నల్లోనే నడుస్తుంది.కాబట్టి ధోని ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తాడని అనుకోవడం పొరపాటే. తనకు తానుగా ధోని ఈ నిర్ణయం తీసుకుంటే తప్ప.. అతడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే అవకాశమే లేదు’’ అని కైఫ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ధోని వారసుడిగాకాగా చెన్నైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన దిగ్గజ కెప్టెన్ ధోని. అయితే, 2022లో తన వారసుడిగా రవీంద్ర జడేజాను ధోని ప్రకటించగా.. వరుస మ్యాచ్‌లలో ఓటమి నేపథ్యంలో జడ్డూ మధ్యలోనే వైదొలిగాడు. దీంతో మళ్లీ ధోనినే పగ్గాలు చేపట్టాడు. ఆ తర్వాత 2024లో రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. కానీ 2025లో గాయం వల్ల రుతు కూడా మధ్యలోనే దూరం కాగా.. మళ్లీ ధోనినే సారథిగా వ్యవహరించాడు. చదవండి: IPL 2026: రసెల్, మాక్సీ ఒకే జట్టులో.. వీళ్లతో మామూలుగా ఉండదు! -
సంజూ ఎంట్రీ.. అదిరిపోయే వీడియో షేర్ చేసిన సీఎస్కే
టీమిండియా టీ20 స్టార్ సంజూ శాంసన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఘన స్వాగతం పలికింది. అదిరిపోయే వీడియోతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను తమ జట్టులోకి ఆహ్వానించింది. ఇందులో మలయాళీ డైరెక్టర్, నటుడు బాసిల్ జోసెఫ్ (Basil Joseph) కూడా కనిపించడం విశేషం.రూ. 18 కోట్లు చెల్లించిఐపీఎల్-2026 వేలానికి ముందే సీఎస్కే సంజూ శాంసన్ (Sanju Samson)ను తమ ఫ్రాంఛైజీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. రూ. 18 కోట్లు చెల్లించి మరీ రాజస్తాన్ రాయల్స్ నుంచి సంజూను సీఎస్కే సొంతం చేసుకుంది. రాయల్స్ కెప్టెన్‌ను తమ జట్టులో చేర్చుకునేందుకు.. దాదాపు పదమూడేళ్లుగా తమతో కలిసి ప్రయాణం చేస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను చెన్నై వదులుకుంది.వైస్ కెప్టెన్‌గా సంజూ!జడ్డూతో పాటు.. సామ్ కర్రాన్‌ను కూడా రాజస్తాన్ రాయల్స్‌కు ఇచ్చేసి.. సంజూను ట్రేడ్ చేసుకుంది సీఎస్కే. అంతేకాదు.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు డిప్యూటీగా.. వైస్ కెప్టెన్‌గా సంజూను నియమించే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. ఇక సంజూకు స్వాగతం పలుకుతూ.. ‘‘చేటా ఈజ్ హియర్ (అన్న వచ్చేశాడు)’’ సీఎస్కే షేర్ చేసిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది.భారీ కటౌట్ఇందులో బాసిల్ జోసెఫ్.. ‘‘సోదరా.. సమయం వచ్చింది. పని మొదలుపెట్టండి.. ఎలాంటి తప్పిదాలు జరగకూడదు. మన వాళ్లందరినీ తీసుకురండి. సమయానికల్లా అంతా సిద్ధమైపోవాలి’’ అని చెప్పగా ఓ బృందమంతా కలిసి రాత్రీపగలు కష్టపడి సంజూ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేస్తాయి. ఈ క్రమంలోనే సంజూ కూడా ఎల్లో జెర్సీ వేసుకుని రెడీ అయిపోతాడు. ఆఖర్లో విక్రమ్ మూవీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సంజూ ఎంట్రీకి మరింత హైప్ ఇచ్చారు. ‘‘రావాలనుకున్నపుడే.. సరైన సమయంలోనే వచ్చా’’ అన్న క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సంజూ శాంసన్ చాలా ఏళ్లుగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. 2022లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయితే, గతేడాది ఫిట్నెస్ సమస్యల వల్ల ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఇందుకు తోడు మేనేజ్మెంట్తో విభేదాలు తలెత్తాయనే వార్తలు రాగా.. సంజూ సీఎస్కేకు మారడం గమనార్హం. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు 172 ఇన్నింగ్స్ ఆడిన సంజూ 4704 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: IPL 2026: రసెల్, మాక్సీ ఒకే జట్టులో.. వీళ్లతో మామూలుగా ఉండదు! View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
IPL 2026: జడేజా జెర్సీ మారింది
ముంబై: ఐపీఎల్ ‘ఫైవ్ స్టార్’ చాంపియన్లలో ఒకటైన చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) పెనుమార్పే చేసింది. గత రెండు సీజన్లుగా చెత్త ప్రదర్శనతో చతికిలబడిన ఈ జట్టు వచ్చే సీజన్‌కు ముందు పతాక శీర్షికలకెక్కే నిర్ణయం తీసుకుంది. అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను అనూహ్యంగా బదిలీ చేసేసింది. సీఎస్కే దిగ్గజ కెప్టెన్ ధోని స్వయంగా ‘సర్ రవీంద్ర జడేజా’ అంటూ నెత్తిన పెట్టుకున్న సహచరుణ్ని... టాపార్డర్ డాషింగ్ బ్యాటర్ సంజూ సామ్సన్ కోసం రాజస్తాన్ రాయల్స్‌కు ట్రేడ్ ట్రాన్స్ఫర్ చేసింది. రాయల్స్ జడేజాను తీసుకోగా, సామ్సన్ చెన్నై చెంత చేరాడు. మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) తమ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌ను విడుదల చేసింది. రెండుసార్లు రిటెయిన్ చేసుకున్న ఫ్రాంచైజీ ఎట్టకేలకు కరీబియన్ ఆల్‌రౌండర్‌తో 11 ఏళ్ల బంధాన్ని తెంచుకుంది. రూ.23.75 కోట్లు వేలంలో పాడి మరీ కొనుక్కొన్న వెంకటేశ్ అయ్యర్‌ను వెంటనే ఒక సీజన్‌కే సాగనంపింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) వెటరన్ సీమర్ మొహహ్మద్ షమీని లక్నో సూపర్ జెయంట్స్ ట్రేడ్‌లో తీసుకుంది. మొత్తం పది ఫ్రాంచైజీల్లో అత్యధిక పర్స్ మొత్తం కోల్‌కతా వద్దే ఉంది. కేకేఆర్ పర్స్‌లో రూ. 64.30 కోట్లుండగా, 6 విదేశీ ఆటగాళ్లు సహా 13 మందిని వేలంలో కొనాలి. అత్యల్ప పర్స్ ముంబై జట్టులో ఉంది. ముంబై ఇండియన్స్ వద్ద కనీసం మూడు కోట్లయినా లేవు. చేతిలో ఉన్న రూ.2.75 కోట్లతో ఒక విదేశీ ప్లేయర్ సహా ఐదు మందిని కొనుగోలు చేయాలి. చెప్పుకోదగ్గ మార్పులు చెన్నై ఒక్క జడేజాతో సరిపెట్టలేదు. విదేశీ స్టార్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, స్యామ్ కరన్లాంటి హిట్టర్లతో పాటు ‘యార్కర్ స్పెషలిస్ట్’ పతిరణను వదులుకుంది. కేకేఆర్ రసెల్, అయ్యర్, డికాక్, మొయిన్ అలీలాంటి బ్యాటర్లతో పాటు సఫారీ పేసర్ నోర్జేని సాగనంపింది. పంజాబ్ కింగ్స్ మేటి విదేశీ హిట్టర్లను విడుదల చేసింది. మ్యాక్స్‌వెల్, ఇన్గ్లిస్లను వదిలేసుకుంది. తొలి సీజన్ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ తమ తురుపుముక్క, నాలుగు సీజన్లు జట్టును నడిపించిన సంజూ సామ్సన్‌నే కాదు హసరంగ, తీక్షణ, నితీశ్ రాణాలను వద్దనుకుంది. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను వేలంలో ఏ జట్టు కన్నెత్తి చూడకపోయినా ప్రాథమిక ధరకే కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ ఈసారి అర్జున్ను లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడింగ్‌లో కొనేందుకు సమ్మతించింది.పాత గూటికి... సీఎస్కేతో జడేజా బంధం సుదీర్ఘమైందే కానీ... మొదలైంది మాత్రం రాజస్తాన్ రాయల్స్‌తోనే! లీగ్ మొదలైన ఏడాదే (2008) తొలి చాంపియన్‌గా నిలిచిన రాయల్స్ జట్టు సభ్యుడు జడేజా ఆ మరుసటి ఏడాది కూడా రాజస్తాన్తోనే ఉన్నాడు. కానీ కాంట్రాక్టు ఒప్పందం ఉల్లంఘన కారణంతో 2010లో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతనిపై ఏడాది నిషేధం విధించింది. 2011లో కొత్తగా వచ్చిన ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్ కేరళ (ఇప్పుడు లేదు)కు ఆడాడు. 2012 నుంచి ఈ సీజన్ వరకు మధ్యలో రెండేళ్లు (2016, 2017లో సీఎస్కేపై నిషేధం కారణంగా గుజరాత్ లయన్స్) తప్ప సూపర్‌కింగ్స్‌లో విజయవంతమైన ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు.ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాచెన్నై: రవీంద్ర జడేజా, ఆండ్రీ సిద్ధార్్థ, దీపక్ హుడా, కాన్వే, రచిన్ రవీంద్ర, పతిరణ, స్యామ్ కరన్, కమలేశ్ నాగర్కోటి, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, వంశ్ బేడీ, విజయ్ శంకర్. ఢిల్లీ: డొనోవాన్ ఫెరీరా, దర్శన్, డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్, మన్వంత్, మోహిత్ శర్మ, సిద్దీఖుల్లా. గుజరాత్: రూథర్‌ఫర్డ్, షనక, కొయెట్జీ, కరీమ్, కుల్వంత్, మహిపాల్ లామ్రోర్. కోల్‌కతా: రసెల్, వెంకటేశ్ అయ్యర్, నోర్జే, చేతన్ సకారియా, సిసోడియా, మొయిన్ అలీ, డికాక్, గుర్బాజ్, జాన్సన్. లక్నో: శార్దుల్ ఠాకూర్, డేవిడ్ మిల్లర్, రవి బిష్ణోయ్, ఆకాశ్‌దీప్, షామర్ జోసెఫ్, ఆర్యన్, యువరాజ్, రాజ్యవర్ధన్. ముంబై: అర్జున్ టెండూల్కర్, జాకబ్స్, కరణ్ శర్మ, లిజాద్, ముజీబుర్ రహ్మాన్, టోప్లీ, శ్రీజిత్, సత్యనారాయణ రాజు, విఘ్నేశ్. పంజాబ్: మ్యాక్స్‌వెల్, ఇన్‌గ్లిస్, ఆరోన్, జేమీసన్, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దూబే. రాజస్తాన్: సామ్సన్, నితీశ్ రాణా, ఆకాశ్, అశోక్, ఫజల్హక్, కార్తీకేయ, కునాల్ రాథోడ్, తీక్షణ, హసరంగ. బెంగళూరు: లివింగ్‌స్టోన్, ఇన్‌గిడి, మయాంక్ అగర్వాల్, మనోజ్, స్వస్తిక్ చికారా, మోహిత్ రాఠి. హైదరాబాద్: షమీ, అథర్వ, సచిన్ బేబీ, అభినవ్ మనోహర్, ముల్డర్, ఆడమ్ జంపా, సిమర్జీత్, రాహుల్ చహర్. -
IPL 2026: కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కే
ఐపీఎల్-2026 మినీ వేలానికి (IPL 2026 Auction) ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కీలక నిర్ణయం తీసుకుంది. పదమూడేళ్లుగా తమతో ఉన్న రవీంద్ర జడేజాను రాజస్తాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసింది. జడ్డూకు బదులుగా రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson)ను జట్టులోకి చేర్చుకుంది.ఏకంగా రూ. 18 కోట్లుసంజూ కోసం సీఎస్కే ఏకంగా రూ. 18 కోట్లు చెల్లించగా.. రాయల్స్ మాత్రం జడ్డూ ధరను రూ. 18 కోట్ల నుంచి రూ. 14 కోట్లకు తగ్గించింది. జడేజాతో పాటు సామ్ కర్రాన్‌ను సీఎస్కే నుంచి ట్రేడ్ చేసుకుంది. ఇక కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు సీఎస్కే ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కేఈ నేపథ్యంలోనే సంజూకు సీఎస్కే కెప్టెన్సీ అప్పగిస్తారనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. అయితే, ఈ ఊహాగానాలకు సీఎస్కే ఫ్రాంఛైజీ స్వయంగా తెరదించింది. రుతురాజ్ గైక్వాడ్నే తమ కెప్టెన్‌గా కొనసాగిస్తామని శనివారం స్పష్టం చేసింది. ‘‘ముందుకు నడిపించే సారథి.. మా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ధ్రువీకరించింది.వైస్ కెప్టెన్‌గా?అంతేకాదు.. సంజూను వికెట్ కీపర్‌గానూ ఉపయోగించుకునేందుకు సీఎస్కే సిద్ధంగా లేనట్లే. దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ఉండగా.. కీపింగ్ సేవలు వేరే ఎవరి చేతికి ఇచ్చేందుకు ఫ్రాంఛైజీ ఆసక్తి చూపదన్నది బహిరంగ రహస్యమే. కాబట్టి సంజూ సీఎస్కేలో ఓ సాధారణ క్రికెటర్‌గా మాత్రమే ఉంటాడు. అయితే, టాపార్డర్‌లో అతడు కీలక ఆటగాడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రుతుకు డిప్యూటీగా వైస్ కెప్టెన్‌గా నియమితుడైనా ఆశ్చర్యం లేదు.కేవలం నాలుగే గెలిచికాగా గత నాలుగు సీజన్లుగా రాజస్తాన్ రాయల్స్ సారథిగా ఉన్న సంజూ.. 2022లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఇదిలా ఉంటే.. 2024 సీజన్లో ధోని నుంచి పగ్గాలు అందుకున్న రుతురాజ్ కెప్టెన్‌గా ఇంత వరకు తనదైన ముద్ర వేయలేదు. తాజా ఎడిషన్‌లో గాయం కారణంగా అతడు మధ్యలోనే నిష్క్రమించగా.. మళ్లీ ధోనినే జట్టును ముందుకు నడిపించాడు.అయితే, ఈసారి సీఎస్కే ప్రదర్శన మరీ దారుణంగా ఉంది. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్టచివరన పదోస్థానంలో నిలిచింది. అందుకే ఐపీఎల్-2026కు ముందే చాలా మంది ఆటగాళ్లను వదిలించుకున్న సీఎస్కే.. వేలంలో మెరికల్లాంటి ప్లేయర్లను కొనుగోలు చేయాలనే వ్యూహంతో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు (CSK Retention List)రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్), శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్ చౌదరి.చెన్నై సూపర్ కింగ్స్ విడిచిపెట్టిన ఆటగాళ్లుమతీశ పతిరణ, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా, వన్ష్ బేడి, సి ఆండ్రీ సిద్దార్థ్, షేక్ రషీద్, కమ్లేశ్ నాగర్కోటి, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్).చదవండి: వెంకటేశ్ అయ్యర్‌కు భారీ షాక్.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే -
అందుకే రాజస్తాన్‌ను వీడాను: సంజూ శాంసన్ పోస్ట్ వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీ ట్రేడ్ డీల్స్ పూర్తి చేసుకున్నాయి. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసేందుకు శనివారమే (నవంబరు 15) ఆఖరి తేదీ కావడంతో తాము ట్రేడ్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడిస్తున్నాయి.జడ్డూ అటు.. సంజూ ఇటుఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- రాజస్తాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన భారీ ట్రేడ్ వార్తల్లో నిలిచింది. ముందుగా ఊహించినట్లే సీఎస్కే.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను.. రాజస్తాన్‌కు ఇచ్చేసి.. ఆ జట్టు సారథి సంజూ శాంసన్‌ను తమ చెంతకు చేర్చుకుంది.ధరలో మార్పుఅయితే, ఈ ఒప్పందంలో భాగంగా సీఎస్కే సంజూకు రాజస్తాన్ గతంలో చెల్లించిన మొత్తాన్ని ఇచ్చి రూ. 18 కోట్లకు తీసుకోగా.. రాజస్తాన్ మాత్రం జడ్డూ ధరను రూ. 18 కోట్ల నుంచి రూ. 14 కోట్లకు తగ్గించింది. జడ్డూతో పాటు సామ్ కర్రన్ (రూ. 2.4 కోట్లు)ను కూడా సీఎస్కే నుంచి తీసుకుంది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్‌ను వీడిన నేపథ్యంలో సంజూ శాంసన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. సమయం వచ్చింది గనుకే తాను జట్టును వీడానంటూ అతడు స్పష్టతనిచ్చాడు.నా సర్వస్వం ధారబోశానుఈ మేరకు.. ‘‘మనం ఇక్కడ (ప్రపంచంలో) కొన్నాళ్ల పాటే ఉంటాము. ఫ్రాంఛైజీ కోసం నా సర్వస్వం ధారబోశాను. క్రికెట్‌ను గొప్పగా ఆస్వాదించాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, బంధాలు పోగు చేసుకున్నాను. ఫ్రాంఛైజీలోని ప్రతి ఒక్కరిని నా కుటుంబ సభ్యుడిగానే భావించాను. ఇప్పుడు సమయం వచ్చింది.. అందుకే నేను ఈ జట్టును వీడి వెళ్తున్నా.నాకు ఇక్కడ లభించిన దానికి నేను ఎల్లప్పుడూ రుణపడే ఉంటాను’’ అంటూ సంజూ శాంసన్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా రాయల్స్‌తో చేరిన తొలి నాళ్లలో దిగిన ఫొటోను సంజూ షేర్ చేశాడు. కాగా 2013లో రాజస్తాన్ రాయల్స్ జట్టులో చేరిన కేరళ స్టార్ సంజూ.. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారాడు. రెండేళ్లు అదే జట్టుకు ఆడాడు.ఫైనల్‌కు చేర్చిన సారథిఆ తర్వాత మళ్లీ 2018లో రాయల్స్‌లోకి తిరిగి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 2025 వరకు జట్టుతో కొనసాగాడు. కెప్టెన్‌గా రాజస్తాన్‌ను ముందుకు నడిపించిన సంజూ 2022 సీజన్లో ఫైనల్‌కు చేర్చాడు. అయితే, గుజరాత్ టైటాన్స్‌తో టైటిల్ పోరులో ఓడిన రాజస్తాన్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో ఇప్పటి వరకు 176 మ్యాచ్‌లు ఆడిన సంజూ.. 4704 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు ఉండటం విశేషం.చదవండి: IPL 2026: సచిన్ తనయుడికి ముంబై ఇండియన్స్ షాక్ -
సీఎస్కేలోకి శాంసన్, రాజస్తాన్‌లోకి జడేజా..
ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య స్వాప్ ట్రేడ్ డీల్ అధికారికంగా పూర్తి అయింది. రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను సీఎస్కే ట్రేడ్ చేసుకుంది. అందుకు బదులుగా సీఎస్కే స్టార్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్‌లను రాజస్తాన్‌కు పంపింది.గత సీజన్‌కు ముందు జడేజాను రూ.18 కోట్ల భారీ వెచ్చించి సీఎస్కే రిటైన్ చేసుకుంది. ఇప్పుడు జడేజా ధరను రూ.14 కోట్లకు తగ్గించి రాజస్తాన్ ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్లో రవీంద్ర జడేజా రూ.14 కోట్లు అందుకోబోతున్నాడు. సామ్ కుర్రాన్‌ను మాత్రం రూ. 2.4 కోట్ల ప్రస్తుత ధరకే రాయల్స్ తమ జట్టులోకి తీసుకుంది. అయితే సంజూ శాంసన్ మాత్రం ధర మారలేదు. అతడు సీఎస్కే నుంచి రూ.18 కోట్లు అందుకోనున్నాడు. ఈ ట్రేడ్ డీల్‌ను సీఎస్కే సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. తమ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించినందుకు సీఎస్కే యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. జడేజా 12 సీజన్ల పాటు సీఎస్కే తరపున ఆడాడు.లక్నోకి సచిన్ తనయుడు..ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను సమర్పించడానికి నేడే ఆఖరి రోజు కావడంతో మరికొన్ని ముఖ్యమైన ట్రేడ్ డీల్స్ జరిగాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి స్టార్ పేసర్ మహ్మద్ షమీని రూ.10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది.అదేవిధంగా లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి ముంబై ఇండియన్స్ రూ.30 లక్షల బెస్ప్రైస్కు ట్రేడ్ చేసుకుంది. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను అతడి ధర రూ.30 లక్షలకు లక్నో ట్రేడ్ చేసుకుంది.Aaj rumour nahi, headline likhna. Ravindra 𝑻𝒉𝒂𝒍𝒂𝒑𝒂𝒕𝒉𝒚 Jadeja is coming home ⚔️🔥 pic.twitter.com/XJT5b5plCy— Rajasthan Royals (@rajasthanroyals) November 15, 2025ఇప్పటివరకు జరిగిన ట్రేడ్ డీల్స్ ఇవే..1.రవీంద్ర జడేజా- చెన్నై సూపర్ కింగ్స్ టూ రాజస్థాన్ రాయల్స్ 2. సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్ టూ చెన్నై సూపర్ కింగ్స్3. సామ్ కుర్రాన్ -చెన్నై సూపర్ కింగ్స్ టూ రాజస్థాన్ రాయల్స్4. మహ్మద్ షమీ- సన్‌రైజర్స్ హైదరాబాద్ టూ లక్నో సూపర్ జెయింట్స్5. నితీష్ రాణా- రాజస్థాన్ రాయల్స్ టూ ఢిల్లీ క్యాపిటల్స్ 6.అర్జున్ టెండూల్కర్- ముంబై ఇండియన్స్ టూ లక్నో సూపర్ జెయింట్స్ 7. మయాంక్ మార్కండే- కోల్‌కతా నైట్ రైడర్స్ టూ ముంబై ఇండియన్స్8. డోనోవన్ ఫెరీరా - ఢిల్లీ క్యాపిటల్స్ టూ రాజస్థాన్ రాయల్స్9. శార్దూల్ ఠాకూర్ - లక్నో సూపర్ జెయింట్స్ టూ ముంబై ఇండియన్స్ -
'అతడొక గన్ ప్లేయర్.. కచ్చితంగా రిటైన్ చేసుకోవాలి'
ఐపీఎల్-2026కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్తాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసేందుకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. జడేజాకు బదులుగా రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను సీఎస్కే తీసుకోవాలని నిర్ణయించినట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.ఈ నేపథ్యంలో సీఎస్కే మాజీ బ్యాటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కే కచ్చితంగా జడ్డూను తమతో పాటు అట్టిపెట్టుకోవాలని రైనా సూచించాడు. జడేజా ఐపీఎల్-2011 సీజన్ నుంచి సీఎస్కే జట్టులో కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2023 సీజన్ విజేతగా సీఎస్కే నిలవడంలో జడ్డూది కీలక పాత్ర. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు ఐదో టైటిల్‌ను అందించాడు. అంతకుముందు 2019, 2017 సీజన్లో సీఎస్కే ఛాంపియన్‌గా నిలవడంలో జడ్డూ తన వంతు పాత్ర పోషించాడు. అటువంటి ప్లేయర్‌ను వదులుకోవడానికి సీఎస్కే సిద్దమైందంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు.రవీంద్ర జడేజాను సీఎస్కే రిటైన్ చేసుకోవాలి. అతడొక గన్ ప్లేయర్. గత కొన్ని సీజన్లగా సీఎస్కే ఎన్నో విజయాలను అందించాడు. కాబట్టి 'సర్ రవీంద్ర జడేజా' జట్టులో కచ్చితంగా ఉండాలి అని రైనా పేర్కొన్నాడు. అదేవిధంగా సీఎస్కే జట్టులో చేయాల్సిన మార్పులు కూడా అతడు సూచించాడు."చెన్నై డెవాన్ కాన్వేను జట్టు నుంచి విడుదల చేయాలి. సీఎస్కే కచ్చితంగా మినీ వేలంలో ఒక లోకల్ ఓపెనర్ కొనుగోలు చేసుకోవాలి. ఇక విజయ్ శంకర్, దీపక్ హుడాను కూడా రిలీజ్ చేయాలి. వీరిద్దరికి ఇప్పటికే చాలా అవకాశాలు లభించాయి. కానీ వాటిని వారు అందిపుచ్చుకోలేకపోయారు. ఈసారి కొత్త ఆటగాళ్లకు అవకాశమివ్వాలని" రైనా చెప్పుకొచ్చాడు. -
సీఎస్కే కెప్టెన్‌గా సంజూ శాంసన్..! రాజస్తాన్‌లోకి జడేజా?
ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య సంచలన ట్రేడ్ డీల్ జరగనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్ సంజూ శాంస్న్ను రాజస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకునేందుకు సీఎస్కే సిద్దమైనట్లు సమాచారం.ఐపీఎల్-2025 నుంచి శాంసన్, రాయల్స్ మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో రాజస్తాన్ ఫ్రాంచైజీని వీడాలని సంజూ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టులోకి తీసుకోవాలని భావించింది. కానీ రాజస్తాన్, ఢిల్లీ మధ్య ట్రేడ్ డీల్ కుదరకపోయినట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు సీఎస్కే ఎంట్రీ ఇచ్చింది. సంజూ శాంసన్‌కు బదులుగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఇచ్చేందుకు సీఎస్కే ప్రాంఛైజీ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. కానీ అందుకు రాజస్తాన్ ఒప్పుకోలేదంట. జడేజాతో పాటు సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను కూడా ఇవ్వాలని రాయల్స్ యాజమాన్యం డిమాండ్ చేసింది.అందుకు సీఎస్కే కూడా అంగీకరించింది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే రాజస్తాన్ తమ మనసు మార్చుకుంది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకారం.. రాజస్తాన్ ఇప్పుడు బ్రెవిస్‌ను కాకుండా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ను జడేజాతో పాటు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.రాజస్తాన్ మాస్టర్ ప్లాన్..ఒకే దెబ్బకు ఇద్దరు వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్లను సొంతం చేసుకోవాలని రాజస్తాన్ ప్లాన్ చేసింది. అయితే అందుకోసం సీఎస్కే రూ. 2.40 కోట్లు చెల్లాంచాల్సి ఉంటుంది. శాంసన్, జడేజా ఇద్దరూ జీతం కూడా రూ. 18 కోట్లే. కాబట్టి ఇది సరిసమాన ట్రేడ్(స్వాప్ డీల్) అవుతోంది. కానీ కుర్రాన్ సీఎస్కే నుంచి రూ. 2.40 కోట్లు అందుకుంటున్నాడు. దీంతో ఆ మొత్తాన్ని రాజస్తాన్ సీఎస్కే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సీఎస్కే-రాజస్తాన్ మధ్య డీల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. అంతేకాకుండా సీఎస్కే యాజమాన్యం తమ జట్టు పగ్గాలను శాంసన్‌కు అప్పగించే యోచనలో కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇక ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ ఆఖరిలో జరిగే ఛాన్స్ ఉంది. ఆయా ఫ్రాంచైజీలు నవంబర్ 15 లోపు తమ రిటెన్షన్ జాబితాను బీసీసీఐ సమర్పించాల్సి ఉంది.ఐపీఎల్ చరిత్రలో భారీ ట్రేడ్ డీల్స్ ఇవే..కామెరూన్ గ్రీన్-2024 సీజన్- ముంబై ఇండియన్స్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రూ. 17.5 కోట్లుహార్దిక్ పాండ్యా- 2024 సీజన్- గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ (MI)-రూ. 17.5 కోట్లుశిఖర్ ధావన్- 2019 సీజన్- సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ (DC)- రూ. 12.5 కోట్లుచదవండి: ఆ ఓవరాక్షనే వద్దనేది.. అదేమైనా వరల్డ్ కప్ ట్రోఫీనా? -
సీఎస్కే అభిమానులకు శుభవార్త
2026 ఐపీఎల్ (IPL) సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఎగిరే గంతేసే శుభవార్త అందింది. ఆ ఫ్రాంచైజీ లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని (MS Dhoni) వచ్చే సీజన్ కూడా ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ స్పష్టం చేశాడు. ధోనికి ఇప్పట్లో రిటైరయ్యే యోచన కూడా లేదని తెలిపాడు.కాగా, ధోని రిటైర్మెంట్పై ఊహాగానాలు ప్రతి సీజన్‌కు ముందు పరిపాటిగా మారాయి. అయితే ధోని మాత్రం ఏయేటికాయేడు వాటిని పటాపంచలు చేస్తూ బరిలోకి దిగుతున్నాడు. 2026 సీజన్‌కు ముందు కూడా ఇదే సీన్ కొనసాగింది. ధోని వచ్చే సీజన్లో బరిలోకి దిగడని ప్రచారం జరిగింది. తాజాగా కాశీ విశ్వనాథ్ వ్యాఖ్యలతో ధోని రిటైర్మెంట్పై ప్రచారానికి తెరపడింది.ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగి, ఇప్పటికీ ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ధోని ఇంకెంత కాలం ఐపీఎల్ ఆడతాడని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏయేటికాయేడు ఈ సీజనే ధోనికి లాస్ట్ అని అనుకున్నా, అతను మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ కెరీర్‌ను పొడిగిస్తున్నాడు.2026లోనూ ధోనిని మైదానంలో చూడబోతున్నామన్న వార్త అతని అభిమానులను పిచ్చెక్కిస్తుంది. సింహం మరోసారి బరిలోకి దిగబోతుందంటూ వారు సంబరాలు చేసుకుంటున్నారు.ఆల్‌టైమ్ గ్రేట్ఐపీఎల్ ప్రారంభం నుంచి (మధ్యలో రెండు సీజన్లు మినహా) సీఎస్కేతోనే ఉన్న ధోని.. ఆ ఫ్రాంచైజీకి ఐదు టైటిళ్లు (2010, 2011, 2018, 2021, 2023)అందించాడు. గత సీజన్లో మాత్రం సీఎస్కే ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. కెప్టెన్ రుతురాజ్ గాయపడటంతో ధోనినే కెప్టెన్సీ బాధ్యతలు మోశాడు. ఆ సీజన్లో సీఎస్కే 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో తొలిసారి ఆఖరి స్థానంలో నిలిచింది.మోకాలి సమస్యరిటైర్మెంట్కు (అంతర్జాతీయ క్రికెట్‌కు) ముందు నుంచి ధోనిని గాయాల సమస్య వేధిస్తుంది. ముఖ్యంగా కెరీర్ మధ్య నుంచి ధోని మోకాలి సమస్యతో బాధ పడుతున్నాడు. 2023లో అతని ఎడమ మోకాలికి ప్రధాన శస్త్రచికిత్స జరిగింది. ఆతర్వాత అతను knee brace ధరించి, పెయిన్ కిల్లర్స్ వాడుతూ అన్ని బాధ్యతలను సమర్థంగా నిర్వహించాడు. 44 ఏళ్ల వయసులోనూ ధోని ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, ఆటపై తన ప్రేమను కొనసాగిస్తున్నాడు.చదవండి: సౌతాఫ్రికాతో రెండో టెస్ట్.. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా -
పెళ్లి కాకుండానే ముగ్గురు పిల్లలు.. వారితో ఇప్పటికీ టచ్‌లోనే..
వెస్టిండీస్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేర్లలో డ్వాన్ బ్రావో (Dwayne Bravo) పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇక పొట్టి క్రికెట్లో తనకు తానే సాటి అనిపించుకున్న బ్రావో.. ఏకంగా పదిహేను ఫ్రాంఛైజీ లీగ్‌లలో ఆడాడు. తనకు తానే సాటికేవలం ఆటకే పరిమితం కాకుండా.. మైదానం వెలుపల సంగీతం, నృత్యంతో ఆ ఆల్‌రౌండర్ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. క్రికెట్ హిస్టరీలో తన కంటూ ప్రత్యేక పుటల్ని లిఖించుకున్న బ్రావోకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.ఆల్‌టైమ్ రికార్డుఈ సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. టీ20 చరిత్రలో 500 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా ఆల్‌టైమ్ రికార్డు సాధించాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్టు అయిన బ్రావో.. బ్యాటర్‌గా పవర్ హిట్టింగ్ చేయగలడు. ఆల్‌రౌండర్‌గా అద్భుతమైన నైపుణ్యాలు కలిగి ఉన్న బ్రావో.. గాయాల బెడద, వెస్టిండీస్ బోర్డుతో విభేదాల కారణంగా అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు.సీఎస్కే బౌలింగ్ కోచ్గానూఅయితే, ఫ్రాంఛైజీ క్రికెట్లో ముఖ్యంగా ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర వేశాడు బ్రావో. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దీర్ఘకాలం ప్రాతినిథ్యం వహించిన బ్రావో.. 2015, 2016 సీజన్లలో వరుసగా 32, 26 వికెట్లు తీసి సత్తా చాటాడు. తర్వాత సీఎస్కే బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన బ్రావో.. 2025 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చేరాడు.పెళ్లి కాకుండానే ముగ్గురు పిల్లలు..అలుపెరుగని ఆల్‌రౌండర్‌గా పేరొందిన బ్రావో క్రికెట్ విజయాల గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, అతడి వ్యక్తిగత జీవితం గురించి మాత్రం కొందరికే తెలుసు. 42 ఏళ్ల బ్రావో ఇంత వరకు అధికారికంగా వివాహ బంధంలో అడుగుపెట్టలేదు. అయితే, ముగ్గురు పిల్లలకు మాత్రం తండ్రి అయ్యాడు. వేర్వేరు మహిళల ద్వారా ముగ్గురు సంతానానికి జన్మనిచ్చాడు. బ్రావోకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె డ్వేనిస్ కాగా.. పెద్ద కుమారుడి పేరు డ్వేన్ బ్రావో జూనియర్. మూడో పిల్లాడి పేరు ఇంత వరకు బహిర్గతం కాలేదు. View this post on Instagram A post shared by Dwayne Bravo aka SIR Champion🏆🇹🇹 (@djbravo47) వారితో ఇప్పటికీ టచ్‌లోనే..లౌ అనే మహిళతో తాను మొదటి కుమారుడికి జన్మనిచ్చినట్లు బ్రావో సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలియజేశాడు. ఆమె పుట్టినరోజు సందర్భంగా గతంలో ఆమెతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇక ఖితా గోన్సాల్వ్స్‌తో పాటు.. మరో మహిళతో కలిసి బ్రావోకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.ఆమెకు బ్రేకప్ఇక 2017 నుంచి మిస్ బార్బడోస్ వరల్డ్ రెజీనా రమ్జిత్తో ప్రేమలో ఉన్న బ్రావో.. ఇటీవలే ఆమెతో విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించాడు. ఏదేమైనా తన ముగ్గురు పిల్లల తల్లులతో బ్రావో ఇప్పటికీ మంచి అనుబంధమే కలిగి ఉన్నాడు. వివిధ కార్యక్రమాలకు తన మాజీ భాగస్వాములు పిల్లలతో కలిసి హాజరయ్యే అతడు.. మదర్స్ డే సందర్భంగా ముగ్గురితో కలిసి ఉన్న ఫొటోలు పంచుకున్నాడు. View this post on Instagram A post shared by Dwayne Bravo aka SIR Champion🏆🇹🇹 (@djbravo47)సంస్కృతిలోనే అదొక భాగం అనుకుంటాకాగా.. బ్రావో గురించి సీఎస్కేలో అతడి మాజీ సహచర ఆటగాడు దీపక్ చహర్ అప్పట్లో సరదాగా చేసిన వ్యాఖ్యలు తాజాగా తెర మీదకు వచ్చాయి. ‘‘ప్రతీ ఐపీఎల్ సీజన్ తర్వాత బ్రావో కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ను కలిగి ఉంటాడేమో!.. వెస్టిండీస్ సంస్కృతిలోనే అదొక భాగం అనుకుంటా’’ అని జోక్ పేల్చాడు. కాగా విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్.. బాలీవుడ్ నటి నీనా గుప్తాతో కుమార్తె మసాబాను కలిగి ఉన్న విషయం తెలిసిందే.అయితే, వీరి ప్రేమకథ సుఖాంతం కాలేదు. నీనాను పెళ్లి చేసుకోకుండానే బిడ్డను కన్న రిచర్డ్స్.. తర్వాత ఆమెను వదిలేశాడు. సింగిల్ మదర్‌గా మసాబాను పెంచిన నీనా.. ఆమెను ఫ్యాషన్ డిజైనర్‌గా తీర్చిదిద్దింది.చదవండి: మా అమ్మకి 19 ఏళ్లు.. నాన్నకు 60 ఏళ్లు.. నా కూతురే నా పరువు.. హద్దు దాటితే అంతే! -
‘ధోని సహనం కోల్పోయాడు.. నా మీద గట్టిగా అరిచాడు.. వికెట్ తీసినా సరే’
మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. అభిమానులు అతడిని ముద్దుగా ‘కెప్టెన్ కూల్ (Captain Cool)’ అని కూడా పిలుచుకుంటారు. మైదానంలో సంయమనం కోల్పోకుండా.. అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలో ధోని దిట్ట. హడావుడి లేకుండా.. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేసి మ్యాచ్‌ను తమ జట్టు వైపునకు తిప్పడంలో తను తానే సాటి.ఏదేమైనా మైదానంలో ధోని సహనం కోల్పోయిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పవచ్చు. అయితే, తన విషయంలో మాత్రం తలా.. తన స్వభావానికి భిన్నంగా ప్రవర్తించాడని భారత మాజీ క్రికెటర్ మోహిత్ శర్మ (Mohit Sharma) అంటున్నాడు.చేదు అనుభవంవన్డే వరల్డ్‌కప్-2015 సందర్భంగా టీమిండియాతో పాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించే క్రమంలో మోహిత్ శర్మ.. ధోనితో డ్రెసింగ్‌రూమ్ పంచుకున్నాడు. తలా సారథ్యంలో మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో ధోనితో తనకు మంచి అనుబంధం ఉందంటూనే మోహిత్ శర్మ.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని కూడా పంచుకున్నాడు.చాంపియన్స్ లీగ్ టోర్నీలో సీఎస్కే తరఫున కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో ధోని సారథ్యంలో ఆడాడు మోహిత్ శర్మ. నాడు జరిగిన ఘటనను గుర్తుచేసుకుంటూ.. ‘‘మహీ భాయ్‌తో నాకెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కూల్ అండ్ కామ్ అని ఆయనకు పేరు. ఆయన సహనం కోల్పోతాడని మనం ఊహించలేము కూడా!నాపై గట్టిగా అరిచాడు.. వికెట్ తీసినా తిడుతూనేఅయితే, ఓ యువకుడిపై ఆయన సహనం కోల్పోయి అరిస్తే.. నా విషయంలోనే ఇది జరిగింది. చాంపియన్స్ లీగ్ టీ20లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్ జరుగుతున్నపుడు.. మహీ భాయ్ ఈశ్వర్ పాండేని బౌలింగ్‌కు పిలిచాడు.నేనేమో నన్నే పిలిచాడనుకుని.. బౌలింగ్ చేసేందుకు రన్ కూడా మొదలుపెట్టాను. దాంతో మహీ భాయ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నన్ను తిట్టేశాడు. అయితే, ఆరోజు మొదటి బంతికే నేను యూసఫ్ పఠాన్ భాయ్ వికెట్ తీశాను.దీంతో గట్టిగా సెలబ్రేట్ చేసుకున్నా. అప్పటికి ఇంకా మహీ భాయ్ నా మీద అరుస్తూనే ఉన్నాడు (నవ్వులు). భాయ్‌తో నాకు మైదానం వెలుపలా మంచి అనుబంధం ఉంది.కేవలం ఆట గురించే కాదు..కేవలం ఆట గురించే కాకుండా జీవిత పాఠాలను కూడా చక్కగా చెప్తాడు. క్రికెట్ కారణంగా ఓ ఆటగాడు మంచి వ్యక్తిగా కూడా ఎలా మారవచ్చో వివరిస్తాడు. ఆయనతో కలిసి కూర్చుంటే సమయమే తెలియదు’’ అని మోహిత్ శర్మ క్రిక్‌ట్రాకర్‌కు వెల్లడించాడు.కాగా హర్యానాకు చెందిన 36 ఏళ్ల మోహిత్ శర్మ.. రైటార్మ్ పేసర్. 2013లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ బౌలర్.. 2015లో తన చివరి మ్యాచ్ ఆడేశాడు. రెండేళ్లకాలంలో అంతర్జాతీయ స్థాయిలో 26 వన్డేలు, 8 టీ20 మ్యాచ్‌లు ఆడిన మోహిత్ శర్మ.. 31, ఆరు వికెట్లు తీశాడు.చదవండి: ‘ది హండ్రెడ్’లో ఇరగదీశారు.. ఆ నలుగురికి ఐపీఎల్లో భారీ ధర! -
ఇంగ్లండ్ స్టార్ కీలక నిర్ణయం.. ఇకపై..
లండన్: ఇంగ్లండ్ పేసర్ జేమీ ఓవర్టన్ (Jamie Overton) సంప్రదాయ క్రికెట్‌కు విరామం ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నానని... అందుకే టెస్టులకు నిరవధిక విరామం ప్రకటిస్తున్నట్లు చెప్పాడు. అయితే ఐదు రోజుల ఆటకు ఇది రిటైర్మెంట్ కాదు. 31 ఏళ్ల ఇంగ్లండ్ క్రికెటర్ ఇటీవల భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొన్నాడు. 2–2తో సమమైన ఆ సిరీస్‌లో అతను రెండు టెస్టులు ఆడాడు.నాకిది ఇబ్బందికరం‘కెరీర్ జోరుగా సాగిపోతున్న ఈ దశలో ఏడాదిలో 12 నెలలు అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉండాలంటే కుదరదు. అలా ప్రతీ ఫార్మాట్‌కు న్యాయం చేయలేను. శారీరకంగా, మానసికంగానూ నాకిది ఇబ్బందికరం. అందుకే బాగా ఆలోచించాకే టెస్టులకు విరామం ప్రకటిస్తున్నాను. అప్పుడు నేను పూర్తిగా పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువ దృష్టిపెట్టొచ్చు. సుదీర్ఘకాలం పాటు వన్డేలు, టీ20లు ఆడేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదం చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా’ అని ఓవర్టన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యంకాగా 2022లో పరిమిత ఓవర్ల క్రికెట్లోప ప్రయాణం మొదలుపెట్టిన ఓవర్టన్.. ఇప్పటివరకు ఓవర్టన్ కేవలం 6 వన్డేలు, 12 టీ20లే ఆడాడు. ఐపీఎల్లో అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక లండన్‌లో ఇటీవల జరిగిన ‘ది హండ్రెడ్’ టోర్నీలో లండన్ స్పిరిట్‌కు ఆడాడు. ఓవర్టన్ అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో జరిగే టీ20 లీగ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా ప్రణాళిక చేసుకుంటున్నాడు. చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రషీద్ ఖాన్.. సరికొత్త చరిత్ర -
ఐపీఎల్ ‘ముడేసిన బంధం’.. అప్పుడే ప్రేమ బయటపడింది!
ఇద్దరూ క్లాస్మేట్స్.. ఆ అబ్బాయేమో గుంభనంగా ఉంటాడు.. పుస్తకాల పురుగు.. ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతాడు.. ఆ అమ్మాయి మాత్రం చలాకీ.. హుషారైన పిల్ల.. చుట్టూ ఉన్నవాళ్లతో ఇట్టే కలిసిపోతుంది.. మూడీగా ఉన్నవాళ్ల ముఖంలో చిరునవ్వులు తెప్పించగలదు..ఇలా భిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఆ ఇద్దరు.. పెద్దయ్యాక ప్రేమలో పడ్డారు.. చిన్ననాటి నుంచి అతడు ఆమెపై పెంచుకున్న ఇష్టాన్ని తెలిపేందుకు ‘ఐపీఎల్’ అవకాశాన్ని ఇచ్చింది. ఇద్దరూ కలిసి ఒకే జట్టుకు పనిచేశారు.. అతడేమో ఆటగాడు.. ఆమె ఆ జట్టు సోషల్ మీడియా అకౌంట్ మేనేజర్.మాటలు, మనసులు కలిశాయి.. పెళ్లి బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు.. ఇద్దరు చక్కటి, ముత్యాల్లాంటి పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.. ఇప్పుడతడు ఆటకు వీడ్కోలు పలికాడు.. ఐపీఎల్ నుంచీ వైదొలిగాడు.. ఇక అతడి సమయమంతా మాతోనే అని ఆమె సంబరపడిపోలేదు.‘‘లవ్ యూ.. నువ్వు నీ కొత్త ప్రయాణంలో మరింత గొప్పగా ముందుకు సాగాలి.. శిఖరాగ్రాలను అధిరోహించాలి’’ అని భర్తను ప్రోత్సహించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానంటూ ప్రేమను చాటుకుంది. టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)- ప్రీతి నారాయణన్ (Priti Narayanan) గురించే ఈ ఉపోద్ఘాతమంతా!చెన్నైకి చెందిన అశ్విన్- ప్రీతి క్లాస్మేట్స్. ఒకే స్కూళ్లో చదివారు. అయితే, క్రికెట్లో రాణించే క్రమంలో అశూ స్కూల్ మారినా.. ప్రీతితో మాత్రం టచ్‌లోనే ఉన్నాడు. ఆమె ఈవెంట్ మేనేజర్‌గా కెరీర్ నిర్మించుకుంటే.. అశూ టీమిండియా కీలక స్పిన్నర్‌గా ఎదిగాడు.ఈ క్రమంలోనే అశ్విన్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరగా.. ప్రీతి అదే జట్టు సోషల్ మీడియా అకౌంట్ మేనేజర్‌గా వచ్చింది. అప్పుడే ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది. ప్రీతిని కలిసిన పదేళ్ల తర్వాత అశూ తన ప్రేమను తెలపగా.. అందుకు ఆమె సమ్మతించింది.కపుల్గోల్స్పెద్దల అంగీకారంతో ఆ జంట 2011లో పెళ్లిపీటలు ఎక్కింది. అశూ- ప్రీతిలకు కుమార్తెలు అకీరా, ఆధ్య సంతానం. పద్నాలుగేళ్లుగా ఒకరికొకరు అండగా ఉంటూ కలిసి అడుగులు వేస్తున్న ఈ జంట కపుల్గోల్స్ సెట్ చేయడంలో ముందుంటారు. ఇక అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పేశాడు. తదుపరి విదేశీ లీగ్‌లలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో అతడిని చీర్ చేస్తూ ప్రీతి ఉద్వేగపూరిత పోస్ట్ పెట్టగా.. వీరి ప్రేమకథ మరోసారి తెరమీదకు వచ్చింది.అందుకే ఐపీఎల్‌కూ వీడ్కోలుకాగా గతేడాది చివర్లో టెస్టు రిటైర్మెంట్ తర్వాత 2025 సీజన్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. తన సొంత టీమ్వంటి సీఎస్కేతో మరికొంత కాలం లీగ్‌లో సాగాలని అతను భావించాడు. అయితే పరిస్థితులు మారిపోవడంతో లీగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వేలంలో రూ.9.75 కోట్లతో చెన్నై అశ్విన్‌ను ఎంచుకోగా 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను పూర్తిగా విఫలమయ్యాడు. ఏకంగా 9.12 ఎకానమీతో 7 వికెట్లు మాత్రమే తీశాడు.సీఎస్కే యాజమాన్యం కూడా యువకులతో జట్టును పునర్నిర్మించే ప్రయత్నంలో భాగంగా అశ్విన్‌ను కొనసాగించే ఉద్దేశం లేదని పరోక్షంగా చెప్పేసింది. 39 ఏళ్ల వయసులో కొత్త ఫ్రాంచైజీ ఎంచుకునే అవకాశాలు కూడా తక్కువగా ఉండటంతో అతను లీగ్ నుంచి రిటైర్ అయ్యాడు. 2009లో తొలిసారి లీగ్‌లోకి అడుగు పెట్టిన అతను వరుసగా ఏడు సీజన్ల పాటు సీఎస్కే తరఫునే బరిలోకి దిగాడు.ఆ విదేశీ లీగ్‌లలో కనిపించే అవకాశంఆ తర్వాత పుణే సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ టీమ్‌ల తరఫున కూడా ఆడాడు. 221 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 7.20 ఎకానమీతో 187 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో అతను ఐదో స్థానంలో నిలిచాడు. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటన చేయడంతో ఇకపై అశ్విన్ ఇతర విదేశీ లీగ్‌లలో ఆడేందుకు బీసీసీఐ అనుమతిస్తుంది. మున్ముందు బిగ్‌బాష్, ఎస్ఏటి20, సీపీఎల్, హండ్రెడ్ తదితర టోర్నీలలో అతను కనిపించే అవకాశం ఉంది. చదవండి: ఆమెతో పెళ్లి, విడాకులు.. తొలిసారి స్పందించిన షమీ -
ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్
టీమిండియా స్పిన్ లెజెండ్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం రవి చంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బుధవారం సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని అశ్విన్ వెల్లడించాడు."నా కెరీర్లో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. ఐపీఎల్ క్రికెటర్‌గా నా ప్రయాణ ఈ రోజుతో ముగిసింది. కానీ ప్రతీ ముగింపునకు ఒక కొత్త ప్రారంభం ఉంటుంది. ఇకపై వివిధ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడేందుకు నా అన్వేషణను మొదలు పెట్టనున్నాను.ఈ 16 ఏళ్ల ఐపీఎల్ జర్నీలో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు సపోర్ట్‌గా నిలిచిన అన్ని ఫ్రాంచైజీలకు, బీసీసీఐకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని తన రిటైర్మెంట్ నోట్లో అశ్విన్ రాసుకొచ్చాడు. ఈ ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్.. ఇప్పుడు ఐపీఎల్ నుంచి కూడా తప్పుకొన్నాడు.2009లో సీఎస్కే తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అశ్విన్.. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో తనకంటూ ఓ పత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మొత్తంగా 221 ఐపీఎల్ మ్యాచ్‌లలో 187 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా బ్యాటింగ్‌లో కూడా 833 పరుగులు సాధించాడు. 38 ఏళ్ల అశ్విన్ ఐపీఎల్లో ఐదు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. సీఎస్కే, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముందు వరకు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో అశ్విన్ భాగంగా ఉన్నాడు. అయితే ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అశూను రాజస్తాన్ విడిచిపెట్టడంతో రూ. 9.75 కోట్ల భారీ ధరకు సీఎస్కే కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ కేవలం 7 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో వచ్చే ఏడాది సీజన్‌కు ముందు అశ్విన్‌ను సీఎస్కే విడిచిపెట్టేందుకు సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి. అంతలోనే రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు. అశ్విన్ ఇక బిగ్ బాష్ లీగ్, సౌతాఫ్రికా టీ20, మేజర్ లీగ్ క్రికెట్ వంటి విదేశీ ఫ్రాంచైజీ లీగ్స్‌లో ఆడే అవకాశముంది. కాగా భారత ఆటగాడు విదేశీ లీగ్స్‌లో ఆడాలటే భారత క్రికెట్‌కు సంబంధించి అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలి.చదవండి: విజయ్ శంకర్ సంచలన నిర్ణయం.. 13 ఏళ్ల బంధానికి ముగింపు? -
నిబంధనల ప్రకారమే తీసుకున్నాం!
చెన్నై: దక్షిణాఫ్రికా సంచలన బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను ఐపీఎల్–2025 సీజన్ మధ్యలో జట్టులో తీసుకోవడం గురించి వివాదంపై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వివరణ ఇచ్చిoది. సీజన్ మధ్యలో గాయపడిన పేస్ బౌలర్ గుర్జప్నీత్ సింగ్ స్థానంలో అతను జట్టులోకి వచ్చాడు. దీని కోసం సీఎస్కే బ్రెవిస్‌కు రూ.2.20 కోట్లు చెల్లించింది. సీజన్ ఆరంభానికి ముుందు రూ.75 లక్షల కనీస విలువతో వచ్చిన బ్రెవిస్‌ను ఐపీఎల్ వేలంలో ఎవరూ తీసుకోలేదు. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20లో బ్రెవిస్ 56 బంతుల్లోనే 125 పరుగులు బాది వార్తల్లో నిలిచాడు. ఈ నేపథ్యంలో సీఎస్కే టీమ్ సభ్యుడైన సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ చానల్లో బ్రెవిస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 6 మ్యాచ్‌లు ఆడిన బ్రెవిస్ 180 స్ట్రైక్‌రేట్‌తో 225 పరుగులు సాధించి చెన్నై గెలిచిన మ్యాచ్‌లలో కీలక పాత్ర పోషించాడు. ‘బ్రెవిస్ అద్భుతమైన బ్యాటర్. అయితే కనీస ధర ఎక్కువ కావడంతో అతడిని ఎవరూ తీసుకోలేదు. సీజన్ మధ్యలో ఏ జట్టయినా తీసుకుంటే అతని కనీస ధరనే చెల్లించాలి. కానీ నేను ఫలానా మొత్తం ఇస్తేనే వస్తానంటూ బ్రెవిస్ ఏజెంట్ల ద్వారా డిమాండ్ చేశాడు. అయినా సరే సీఎస్కే తీసుకుంది’ అని అన్నాడు. దీనిపై సీఎస్కే తాజాగా స్పందించింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారమే తాము బ్రెవిస్‌ను తీసుకున్నామని చెప్పింది. ‘గాయపడిన ఆటగాడి స్థానంలో ఎవరినైనా తీసుకుంటే ఆ ప్లేయర్‌కు ఇచ్చే మొత్తమే కొత్త ఆటగాడికి ఇవ్వాలని నిబంధనల్లో ఉంది. మేం దీనిని ఎక్కడా ఉల్లంఘించలేదు’ అని సీఎస్కే పేర్కొంది. వచ్చే సీజన్ కోసం చెన్నైను వీడేందుకు అశ్విన్ దాదాపుగా సిద్ధమైన తరుణంలో ఇది చర్చనీయాంశమైంది. -
చెన్నైతో అశ్విన్ కటీఫ్!
చెన్నై: సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్–2026కు ముందు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. తన సొంత జట్టులాంటి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) నుంచి అతను తప్పుకోవాలనే యోచనలో ఉన్నాడు. ఈ విషయాన్ని అతను సీఎస్కే మేనేజ్మెంట్తో ఇప్పటికే చర్చించాడు. ఆటగాళ్లను అట్టిపెట్టుకునే కటాఫ్ తేదీకి ముందు సాధారణంగా అన్ని జట్లూ తమ ఆటగాళ్లతో భేటీ అవుతాయి. ఇందులో భాగంగానే జరిగిన సమావేశంలో అశ్విన్ తన మనసులో మాటను చెప్పాడు. అతని నిర్ణయం వెనుక కారణాలు తెలియకపోయినా... త్వరలోనే దీనిపై సీఎస్కే స్పష్టతనివ్వనుంది. మరో సమాచారం ప్రకారం వచ్చే ఏడాది కోసం జట్టు పునర్నిర్మాణంలో భాగంగా అశ్విన్‌ను తప్పించాలని మేనేజ్మెంట్ స్వయంగా భావిస్తోంది. దీంతో అశ్విన్ కూడా మరో జట్టు వైపు చూస్తున్నాడు. ‘కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రస్ట్’ సమస్య రాకూడదని సీఎస్కే ఆధ్వర్యంలోని అకాడమీ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ పదవికి కూడా అశ్విన్ రాజీనామా చేసే అవకాశం ఉంది. 2025 సీజన్లో చెత్త ప్రదర్శనతో చెన్నై చివరి స్థానంలో నిలిచింది. 9 మ్యాచ్‌లే ఆడిన అశ్విన్ ఏకంగా 9.12 ఎకానమీతో 7 వికెట్లే తీయగలిగాడు. సీఎస్కే దిద్దిన స్టార్... చెన్నై సూపర్ కింగ్స్ అతి పెద్ద మ్యాచ్ విన్నర్లలో ఒకడిగా అశ్విన్ గుర్తింపు పొందాడు. తొలిసారి అతను 2009లో సీఎస్కే టీమ్ ద్వారానే లీగ్‌లో అడుగు పెట్టాడు. రెండు సీజన్లు నిలకడైన ప్రదర్శన, ధోని అండతో అతనికి భారత జట్టులో స్థానం దక్కింది. 2010, 2011లో సీఎస్కే టైటిల్స్ సాధించడంలో అతను కీలకపాత్ర పోషించాడు. వరుసగా ఏడేళ్ల పాటు 2015 వరకు చెన్నైకి ఆడిన అనంతరం ఆ తర్వాత ఎనిమిది సీజన్లు వరుసగా రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లకు అశ్విన్ ప్రాతినిధ్యం వహించాడు. 2025 వేలంలో రూ.9 కోట్ల 75 లక్షల మొత్తానికి చెన్నై అతడిని మళ్లీ సొంతం చేసుకుంది. సూపర్ కింగ్స్ తరఫున 106 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 6.68 ఎకానమీతో 97 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో అతను 221 మ్యాచ్‌లలో 7.20 ఎకానమీతో 187 వికెట్లు పడగొట్టాడు. 39 ఏళ్ల అశ్విన్ గత డిసెంబర్లో ఆ్రస్టేలియాపై అడిలైడ్‌తో టెస్టు మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. -
IPL 2026: నన్ను విడిచిపెట్టండి.. వెళ్లిపోతా!.. సీఎస్కేకు గుడ్‌బై?
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందే ట్రేడింగ్ రూపంలో జట్లలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సంజూ శాంసన్ (Sanju Samson). రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా రాణించిన ఈ కేరళ బ్యాటర్.. వచ్చే ఎడిషన్‌లో ఈ ఫ్రాంఛైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.తాను ఫిట్‌గా ఉన్నా రియాన్ పరాగ్ (Riyan Parag)కు కెప్టెన్సీ ఇవ్వడం, మెగా వేలంలో జోస్ బట్లర్‌ను విడిచిపెట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో సంజూ.. రాయల్స్‌ను వీడేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.సీఎస్కేకు అశ్విన్ గుడ్‌బై?ఈ క్రమంలో తెరమీదకు వచ్చిన మరో ఆసక్తికర వార్త ఇందుకు బలం చేకూరుస్తోంది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin).. తనను విడిచిపెట్టమని సీఎస్కేను కోరాడని దాని సారాంశం. దీనిని బట్టి సీఎస్కే అశూను రాయల్స్‌కు ఇచ్చి.. వారి నుంచి సంజూను ట్రేడ్ చేసుకోనుందనే ప్రచారం ఊపందుకుంది.కాగా 2009లో అశ్విన్ సీఎస్కేతోనే తన ఐపీఎల్ కెరీర్ ఆరంభించాడు. ఆ తర్వాత రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ (ఇప్పుడు మనుగడలో లేదు), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. ఇక 2022లో రాజస్తాన్ రాయల్స్‌లో చేరిన అశ్విన్.. గతేడాది వరకు అక్కడే విజయవంతంగా కొనసాగాడు.రూ. 9.75 కోట్లకు కొనుగోలుఅయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రాయల్స్ అతడిని విడుదల చేయగా.. సీఎస్కే రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ.. ఈ సీజన్లో అశ్విన్‌కు తొమ్మిది మ్యాచ్‌లలో ఆడే అవకాశం మాత్రమే దక్కింది. అయితే, అందులోనూ అతడు నిలకడగా రాణించలేకపోయాడు. కేవలం ఏడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. వేరే జట్టుకు మారతాడా?యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇచ్చే క్రమంలో మేనేజ్మెంట్ అశూను పలు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో 38 ఏళ్ల ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ సీఎస్కేను వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, రాయల్స్ అతడిని తిరిగి తీసుకుంటుందా? లేదంటే వేరే జట్టుకు మారతాడా? అనేది త్వరలోనే తెలుస్తుంది. కాగా ఐపీఎల్లో అశ్విన్ మొత్తంగా 220 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు కూల్చాడు.ఇక గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడే అశూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీమిండియా తరఫున 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ చెన్నై ప్లేయర్.. టెస్టుల్లో 537, వన్డేల్లో 156, టీ20లలో 72 వికెట్లు కూల్చాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 3503, 707, 184 పరుగులు సాధించాడు.చదవండి: అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయర్.. ఆసియాకప్‌లో ఆడాల్సిందే: గంగూలీ -
గైక్వాడ్‌పై వేటు.. సీఎస్కే కెప్టెన్‌గా టీమిండియా స్టార్! అతడిపై కూడా కన్ను?
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ టి నటరాజన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడా? అంటే అవునానే అంటున్నారు క్రికెట్ నిపుణులు. వచ్చే ఏడాది సీజన్ ముందు నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి సీఎస్కే ట్రేడ్ చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ తమిళనాడు ఫాస్ట్ బౌలర్ సీఎస్కే క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతుండడం ట్రేడ్ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. సీఎస్కే ట్రైనింగ్ జెర్సీని నటరాజన్ ధరించి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఐపీఎల్-2025 వేలంలో నటరాజన్‌ను రూ. 10.75 కోట్ల భారీ ధరకు ఢిల్లీ కొనుగోలు చేసింది.దీంతో అతడికి కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే ఆడే అవకాశం లభించింది. మిచెల్ స్టార్క్, చమీరా, ముఖేష్ కుమార్ వంటి స్టార్ పేసర్లు ఉండడంతో అతడు ఎక్కువ భాగం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని ఢిల్లీ కూడా వదులుకోవడానికి సిద్దంగా ఉంది.2017లో అరంగేట్రం..ఈ తమిళనాడు పేసర్ 2017లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర సీజన్లో ఆరు మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా 2018, 2019 సీజన్లకు నట్టు దూరమయ్యాడు. తిరిగి మళ్లీ ఐపీఎల్-2020 ఎస్ఆర్హెచ్తో జతకట్టాడు. ఆరెంజ్ ఆర్మీతో ఐదేళ్ల పాటు తన ప్రయణాన్ని కొనసాగించాడు.అయితే గత సీజన్ మెగా వేలానికి ముందు అతడిని సన్‌రైజర్స్ విడిచిపెట్టింది. దీంతో అతడు ఢిల్లీ జట్టులోకి వచ్చాడు. ఇప్పటివరకు 63 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన నటరాజన్.. 67 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. నటరాజన్ గత నాలుగేళ్లగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. టీమిండియా తరపున 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గాయాల కారణంగా అతడు భారత జట్టులో చోటు కోల్పోవల్సి వచ్చింది.కేఎల్ రాహుల్‌పై కన్ను..?అదేవిధంగా మరో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై కూడా సీఎస్కే కన్నేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు రాహుల్‌ను సీఎస్కే ట్రేడ్ చేసుకోవాలని భావిస్తుందంట. రుతురాజ్‌పై వేటు వేసి రాహుల్‌కు తమ జట్టు పగ్గాలను అప్పగించాలని సీఎస్కే యాజమాన్యం యోచిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రాహుల్ రూ.14 కోట్ల భారీ ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది. రాహుల్ తన ధరకు తగ్గ న్యాయం చేశాడు. గత సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడి 539 పరుగులతో ఢిల్లీ తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: అతడొక లెజెండ్.. కానీ అలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు: భారత స్టార్ బౌలర్ -
నా కూతురు కూడా అంతే.. ఫిట్నెస్ లేకుంటే కష్టం: ధోని
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయు ప్రమాణం గురించి మాట్లాడుతూ.. ఫిట్నెస్ ఆవశ్యకతను వివరించాడు. శారీరక శ్రమ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారని.. కానీ యువతరం ఈ విషయంలో అంతగా శ్రద్ధ తీసుకుంటున్నట్లు కనిపించడం లేదన్నాడు. 44 ఏళ్ల వయసులోనూభారత్కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోని 44 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు సారథిగా ఐదు ట్రోఫీలు అందించిన తలా.. ప్రస్తుతం ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన నేపథ్యంలో మరోసారి కెప్టెన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా పేరొందిన ధోని.. నాలుగు పదుల వయసు దాటిన తర్వాత కూడా మైదానంలో పాదరసంలా కదలడం విశేషం. వికెట్ల మధ్య పరుగులు తీయడంలోనూ యువ ఆటగాళ్లకు అతడు పోటీ ఇస్తాడంటే అతిశయోక్తి కాదు.నా కూతురు కూడా అంతేకాగా.. తాజాగా ధోని తన స్వస్థలం రాంచిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫిట్నెస్ ప్రాముఖ్యత గురించి వివరించాడు. ‘‘ఈ రోజుల్లో శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. ఫలితంగా ఆయు ప్రమాణం కూడా తగ్గిపోతోంది.భారతీయుల సగటు ఆయు ప్రమాణం క్షీణిస్తోంది. నా కూతురు కూడా ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేసేందుకు ఇష్టపడదు. తనకు ఆటలాడటం పెద్దగా ఇష్టం ఉండదు. పిల్లలు బయటకు వెళ్లి ఆడకపోతే శారీరకంగా ఎలా చురుగ్గా ఉండగలరు?కచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. అందుకోసం ప్రతి తల్లిదండ్రులు వాళ్లను కొత్త ఆటలు ఆడేలా వారిలో స్ఫూర్తి నింపాలి’’ అని ధోని చిన్ననాటి నుంచే ఫిట్నెస్ మీద అవగాహన అవసరమని చెప్పుకొచ్చాడు.కాగా 2010లో సాక్షి సింగ్ రావత్‌ను పెళ్లాడాడు ధోని. ఈ జంటకు 2015లో కుమార్తె జన్మించగా.. జీవాగా నామకరణం చేశారు. పదేళ్ల జీవా కాస్త బొద్దుగా ఉండేది. తల్లి సాక్షితో కలిసి ధోనీ మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే జీవా.. తండ్రి ఆటను ఆస్వాదిస్తూ కరతాళ ధ్వనులతో అతడిని ఉత్సాహపరచడంలో ముందే ఉంటుంది. చదవండి: రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదెలా సాధ్యమైందంటే? -
ICC: చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీకి గ్రీన్ సిగ్నల్!
దాదాపు దశాబ్దం క్రితం రద్దయిన చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ (Champions League T20)ని మళ్లీ ప్రారంభించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) యోచిస్తోంది. దీనిని సమర్థవంతంగా నిర్వహించేందుకుకొత్తగా ప్రణాళికలు రూపొందించేందుకు సిద్ధమైంది. సింగపూర్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో చాంపియన్స్ లీగ్‌పై వచ్చిన ప్రతిపాదనకు అన్ని బోర్డులూ మద్దతు పలికినట్లు సమాచారం.అందుకే పక్కన పెట్టారుకాగా వేర్వేరు దేశాలకు చెందిన క్లబ్ టీమ్‌లు బరిలోకి దిగుతూ 2009–2014 మధ్య నిర్వహించిన ఈ టోర్నీని పలు కారణాలతో రద్దు చేశారు. ఐపీఎల్‌లాంటి టోర్నీలతో పోలిస్తే ప్రేక్షకాదరణ చాలా తక్కువగా ఉండటంతో పాటు వాణిజ్యపరంగా కూడా సరైన స్పందన లభించకపోవడంతో లీగ్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది.అంత ఈజీ ఏం కాదుఅయితే ఇప్పుడు కూడా దీనిని నిర్వహించడం అంత సులువు కాకపోవచ్చు. టీ20 స్టార్ ఆటగాళ్లంతా ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు జట్ల తరఫున ఆడుతున్నారు. చాంపియన్స్ లీగ్ జరిగితే వారు ఏ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తారనే విషయంలో నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదు.మరోవైపు టెస్టు క్రికెట్‌ను రెండు వేర్వేరు స్థాయిల్లో (2 టియర్ సిస్టం) నిర్వహించాలనే ఆలోచనతో ఉన్న ఐసీసీ దీనిపై సాధ్యాసాధ్యాల కోసం ప్రత్యేకంగా వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎనిమిది మంది సభ్యుల ఈ కమిటీకి ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా నాయకత్వం వహిస్తారు. చాంపియన్స్ లీగ్ టీ20 (2009-2014) విజేతల జాబితా ఇదే👉2009- న్యూ సౌత్ వేల్స్ బ్లూస్- కెప్టెన్ సైమన్ కటిచ్ (బిగ్‌బాష్ లీగ్)👉2010- చెన్నై సూపర్ కింగ్స్- కెప్టెన్ ఎంఎస్ ధోని (ఐపీఎల్)👉2011- ముంబై ఇండియన్స్- కెప్టెన్ హర్భజన్ సింగ్(ఐపీఎల్)👉2012- సిడ్నీ సిక్సర్స్- కెప్టెన్ బ్రాడ్ హాడిన్ (బిగ్‌బాష్ లీగ్)👉2013- ముంబై ఇండియన్స్- కెప్టెన్ రోహిత్ శర్మ (ఐపీఎల్)👉2014- చెన్నై సూపర్ కింగ్స్- కెప్టెన్ ఎంఎస్ ధోని (ఐపీఎల్).చదవండి: IND vs ENG: కరుణ్‌పై వేటు.. అతడి అరంగేట్రం?.. తుదిజట్టు ఇదే! -
సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సురేశ్ రైనా.. ప్రకటన విడుదల
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. సినిమా నటుడిగా అవతారం ఎత్తేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని రైనా స్వయంగా వెల్లడించాడు. తాను కోలీవుడ్‌లో నటించనున్నట్లు తెలిపాడు.ఇందుకు సంబంధించి తమిళ సినిమా నిర్మాణ సంస్థ నుంచి శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. డ్రీమ్ నైట్ స్టోరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో రైనాకు స్వాగతం పలుకుతున్న వీడియోను క్రికెటర్ శివం దూబే చేతుల మీదుగా విడుదల చేశారు.క్రికెట్ మైదానం నుంచి.. కోలీవుడ్ ఫ్రేమ్స్ దాకా..ఈ నేపథ్యంలో సురేశ్ రైనా స్పందిస్తూ.. ‘‘క్రికెట్ మైదానం నుంచి.. కోలీవుడ్ ఫ్రేమ్స్ దాకా.. చెన్నై నాలో నిండి నన్ను ముందుకు నడిపిస్తోంది. నా ఈ కొత్త ప్రయాణంలో డీకేఎస్ సంస్థతో జట్టుకట్టడం ఎంతో గర్వంగా ఉంది’’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేశ్ రైనా.. 2005 నుంచి 2018 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.అంతర్జాతీయ స్థాయిలో 226 వన్డేలు, 78 టీ20లు, 18 టెస్టులు ఆడిన రైనా.. ఆయా ఫార్మాట్లలో 5615, 1604, 768 పరుగులు సాధించాడు. ఇక ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు ఐపీఎల్లో ఘనమైన రికార్డు ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తంగా 205 మ్యాచ్‌లు ఆడిన రైనా.. 5528 పరుగులు సాధించి మిస్టర్ ఐపీఎల్‌గా గుర్తింపు పొందాడు.చిన్న తలాగా అభిమానుల హృదయాల్లో చోటుఇక ఐపీఎల్ కెరీర్లో చాలా ఏళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సురేశ్ రైనా.. చిన్న తలాగా గుర్తింపు పొందాడు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత అంతటి స్థాయిలో చెన్నై అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచే తన సినీ ప్రయాణం కూడా మొదలుపెట్టనున్నాడు.సంతోషంగా ఉందితాను తమిళ సినిమా ద్వారా అరంగేట్రం చేయడం గురించి సురేశ్ రైనా మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు నా దగ్గరకు వచ్చి కథ చెప్పినపుడు అది నా మనసుకు ఎంతో దగ్గరగా అనిపించింది. క్రికెట్‌కు సంబంధించిన ఈ సినిమాలో నటించడం గర్వకారణం.అది కూడా ఎన్నో ఏళ్లుగా సీఎస్కేకు ఆడి.. తమిళనాడు నుంచి నా సినిమా ప్రయాణం మొదలుపెట్టడం మరింత సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను కురిపించారు’’ అని పేర్కొన్నాడు. కాగా సురేశ్ రైనా నటిస్తున్న తమిళ చిత్రానికి లోగాన్ దర్శకుడు కాగా.. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా మరో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా కోలీవుడ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అదే విధంగా.. కేరళకు చెందిన మాజీ పేసర్ శ్రీశాంత్ కూడా తమిళ సినీ రంగంలో నటుడిగా అడుగుపెట్టాడు. నయనతార, సమంతలతో కలిసి విజయ్ సేతుపతి నటించిన కాతువాకుల రెండు కాదల్ సినిమాలో శ్రీశాంత్ మోబీ అనే పాత్రలో నటించాడు.చదవండి: వేలంలో రికార్డులు బద్దలు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ శాంసన్ -
IPL 2026: సీఎస్కేలోకి సంజూ.. బదులుగా రాజస్తాన్‌కు రుతురాజ్?!
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) వచ్చే ఏడాది ఐపీఎల్ జట్టు మారనున్నాడా? రాజస్తాన్ రాయల్స్‌ను వీడి చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరనున్నాడా? అంటే అందుకు అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌పై సీఎస్కే ఒక్కటే కాదు.. ఇంకో రెండు-మూడు ఫ్రాంఛైజీలు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.కేరళ స్టార్ సంజూ శాంసన్ 2013లో ఐపీఎల్ (IPL)లో అరంగేట్రం చేశాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన అతడు.. ఆ తర్వాత జట్టుపై నిషేధం పడటంతో 2016-17 సీజన్లలో ఢిల్లీ ఫ్రాంఛైజీకి మారాడు. అయితే, 2018లో తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు.ఫైనల్ చేర్చిన సారథిఈ క్రమంలో అంచెలంచెలుగా ఎదిగిన సంజూ.. 2021లో కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. సారథిగా అత్యుత్తమంగా 2022లో రాజస్తాన్‌ను అతడు ఫైనల్‌కు చేర్చాడు. 2008లో షేన్ వార్న్ కెప్టెన్సీలో టైటిల్ గెలిచిన రాజస్తాన్.. మళ్లీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఇక 2023లో ఐదోస్థానంతో ముగించిన సంజూ సేన.. 2024లో ప్లే ఆఫ్స్ చేరినా ఫైనల్‌కు వెళ్లలేకపోయింది.ఇక ఈ ఏడాది సంజూ ఫిట్నెస్ సమస్యల కారణంగా ఎక్కువసార్లు ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి దిగగా.. రియాన్ పరాగ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈసారి రాజస్తాన్ మరీ దారుణంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే... కొత్త హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు సంజూకు మధ్య విభేదాలు ఉన్నట్లు గతంలో వార్తలు రాగా.. ద్రవిడ్ వాటిని ఖండించాడు. మరోవైపు.. రియాన్ పరాగ్‌ను పూర్తిస్థాయి కెప్టెన్‌ను చేయాలనే యోచనలో రాజస్తాన్ మేనేజ్మెంట్ ఉందనే రూమర్లు వస్తున్నాయి.సంజూపై సీఎస్కే ఆసక్తి నిజమేఇలాంటి తరుణంలో సంజూ శాంసన్ రాజస్తాన్‌ను వీడే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు క్రిక్‌బజ్ కథనం పేర్కొంది. సీఎస్కే ఈ రేసులో ముందున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎస్కే వర్గాలు మాట్లాడుతూ.. ‘‘సంజూ భారత బ్యాటర్. వికెట్ కీపర్. ఓపెనింగ్ కూడా చేయగలడు.కాబట్టి కచ్చితంగా అతడిని జట్టులో చేర్చుకోవాలని మాకూ ఆసక్తి ఉంది. ఒకవేళ అతడు అందుబాటులో ఉంటే కచ్చితంగా తీసుకుంటాం. ట్రేడ్ చేసుకునైనా అతడిని దక్కించుకుంటాం. అయితే, విషయం అంతవరకు రాలేదు కానీ మాకు మాత్రం అతడిని తీసుకోవడం పట్ల కచ్చితంగా ఆసక్తి ఉంది’’ అని పేర్కొన్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది.రుతును ఇచ్చేస్తారా?ఒకవేళ చెన్నై జట్టు గనుక సంజూను దక్కించుకోవాలంటే రాజస్తాన్ ప్లేయర్-టు- ప్లేయర్ ట్రేడ్ వైపే మొగ్గు చూపవచ్చు. అలా అయితే, 2025 మెగా వేలానికి ముందు రాజస్తాన్ సంజూను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. జట్టుకు అతడే కెప్టెన్.మరోవైపు.. సీఎస్కే తమ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను అట్టిపెట్టుకునేందుకు రూ. 18 కోట్లు కేటాయించింది. కాబట్టి ఒకేస్థాయి ఆటగాళ్ల మార్పిడి జరగాలంటే సంజూ- రుతులను ఎక్స్చేంచ్ చేసుకోవాల్సి ఉంటుంది.అయితే, సీఎస్కే హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇప్పటికే చాలాసార్లు రుతు గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అతడిని సారథిగా నియమించినట్లు తెలిపాడు. మరి అలాంటపుడు సంజూను ఎవరితో మార్చుకుంటారు?.. అసలు అతడిని వదులుకునేందుకు రాజస్తాన్ సిద్ధంగా ఉందా??.. అంటే మినీ వేలం సమయంలోనే తేలుతుంది. -
రూ. 27 కోట్ల విలువ చేసే లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసిన శివమ్ దూబే
టీమిండియా విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే ముంబైలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలోని ఓషివరాలో రెండు లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేశాడు. స్క్వేర్యార్డ్స్ సమీక్షించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. ఈ అపార్ట్మెంట్ల ధర రూ. 27.50 కోట్లని తెలుస్తుంది. ఈ రెండు అపార్ట్మెంట్లు DLH ఎన్క్లేవ్ అనే నివాస ప్రాజెక్ట్‌లోని 17 మరియు 18వ అంతస్తులలో ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం 9,603 చదరపు అడుగులు (నివాస ప్రాంతం 4,200, బాల్కనీ 3,800 చదరపు అడుగులు).అపార్ట్మెంట్లతో పాటు మూడు పార్కింగ్ స్థలాలను దూబే దేవ్ ల్యాండ్ అండ్ హౌసింగ్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేశాడు. ఈ లావాదేవీ జూన్ 20, 2025న నమోదు చేయబడింది. దీనికి మొత్తం రూ. 1.65 కోట్ల స్టాంప్ డ్యూటీ మరియు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించబడ్డాయి. DLH ఎన్‌క్లేవ్‌లో ఇదివరకే పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. బాలీవుడ్ హాస్యనటుడు కపిల్ శర్మ, గాయకుడు మికా సింగ్, దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుటుంబం ఇక్కడే నివాసముంటుంది.31 ఏళ్ల శివం దూబే (లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్) భారత టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉండటంతో పాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. దేశీయ క్రికెట్లో అతను ముంబైకి ఆడతాడు. 2019 నవంబర్‌లో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన దూబే.. 2024 టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. దూబే ఇప్పటివరకు టీమిండియా తరఫున 4 వన్డేలు, 35 టీ20లు ఆడి 574 పరుగులు చేశాడు. అలాగే 14 వికెట్లు పడగొట్టాడు. దూబే ఐపీఎల్లో 79 మ్యాచ్‌లు ఆడి 10 హాఫ్ సెంచరీల సాయంతో 1859 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీశాడు. -
చెలరేగిన నూర్ అహ్మద్.. వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ సిస్టర్ ఫ్రాంచైజీ టెక్సాస్ సూపర్ కింగ్స్ మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (జూన్ 17) ఉదయం జరిగిన మ్యాచ్‌లో టీఎస్కే సీయాటిల్ ఓర్కాస్‌ను 93 పరుగుల తేడాతో మట్టికరిపించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఓర్కాస్‌ను టీఎస్కే బౌలర్లు బెంబేలెత్తించారు. ముఖ్యంగా నూర్ అహ్మద్ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. నూర్‌తో (4-0-18-3) పాటు జియా ఉల్ హక్ (3-0-16-3), నండ్రే బర్గర్ (3.5-1-10-3), మార్కస్ స్టోయినిస్ (2-0-4-1) చెలరేగడంతో ఓర్కాస్ 13.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. ఓర్కాస్ ఇన్నింగ్స్‌లో ఆరోన్ జోన్స్ (17), జస్దీప్ సింగ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అంతలా టీఎస్కే బౌలర్లు ఓర్కాస్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఓర్కాస్ ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్లు డేవిడ్ వార్నర్ (9), కైల్ మేయర్స్ (0), స్టీవెన్ టేలర్ (4), హెన్రిచ్ క్లాసెన్ (0), సికందర్ రజా (4), సుజిత్ నాయర్ (5) హర్మీత్ సింగ్ (0), ఓబెద్ మెక్కాయ్ (3) దారుణంగా విఫలమయ్యారు.అంతకుముందు సాయితేజ ముక్కామల్ల (30), మార్కస్ స్టోయినిస్ (28), డారిల్ మిచెల్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో టీఎస్కే గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. టీఎస్కే ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే (13), డుప్లెసిస్ (7), సావేజ్ (9) నిరాశపరిచారు. ఆఖర్లో మిలింద్ కుమార్ (18 నాటౌట్), శుభమ్ రంజనే (15 నాటౌట్) వేగంగా పరుగులు సాధించే ప్రయత్నం చేశారు. ఓర్కాస్ బౌలర్లలో హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్ తలో 2 వికెట్లు తీయగా.. మెక్కాయ్, వకార్ సలాంఖీల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ సీజన్లో టీఎస్కే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓ మోస్తరు స్కోర్లు చేసి అద్భుతంగా డిఫెండ్ చేసుకుంది. మూడు మ్యాచ్‌ల్లో టీఎస్కే విజయాల్లో నూర్ అహ్మద్ కీలకపాత్ర పోషించాడు. ఎంఐ న్యూయార్క్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి ఓ వికెట్ తీసిన నూర్.. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. తాజాగా ఓర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సత్తా చాటిన నూర్ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. నూర్ తాజాగా ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లోనూ ఇదే తరహా ప్రదర్శనలు (14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు) చేసినప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన విజయాలు సాధించలేకపోయింది. 2025 సీజన్లో ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది. -
ఐపీఎల్ 2025లో ఉసూరుమనిపించినా, ఎంఎల్‌సీలో ఇరగదీస్తున్న సూపర్ కింగ్స్
ఐపీఎల్ 2025లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ జట్టు సిస్టర్ ఫ్రాంచైజీ టెక్సాస్ సూపర్ కింగ్స్ మాత్రం ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్-2025లో అంచనాలకు మించి రాణిస్తూ సత్తా చాటుతుంది. టీఎస్కే ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.లాస్ ఏంజలెస్ నైట్ రైడర్స్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో టీఎస్కే 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సీజన్లో తమ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో సూపర్‌కింగ్స్ తరుపుముక్క నూర్ అహ్మద్ (4-0-25-4) చెలరేగిపోయాడు. ఫలితంగా సూపర్ కింగ్స్ ఓ మోస్తరు లక్ష్యాన్ని కూడా విజయవంతంగా కాపాడుకుంది.- 2 POTM with CSK.- 1 POTM with TSK.NOOR AHMAD IS RULING FOR SUPER KINGS FRANCHISE IN 2025 💛 pic.twitter.com/4BWZruY26Q— Johns. (@CricCrazyJohns) June 16, 2025ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్‌కింగ్స్.. డెవాన్ కాన్వే (22 బంతుల్లో 34; ఫోర్లు, సిక్స్), సాయితేజ ముక్కామల్ల (22 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), డారిల్ మిచెల్ (33 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), షుభమ్ రంజనే (19 బంతుల్లో 24; ఫోర్, సిక్స్), డొనొవన్ ఫెరియెరా (16 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ డుప్లెసిస్ (10 బంతుల్లో 8; సిక్స్) ఒక్కడే విఫలమయ్యాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో తన్వీర్ సంఘా 2, రసెల్, వాన్ ష్కాల్క్విక్ తలో వికెట్ తీశారు.అనంతరం కష్ట సాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. నూర్ అహ్మద్ మాయాజాలం ధాటికి 17.1 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూలింది. నూర్‌తో పాటు ఆడమ్ మిల్నే (3.1-0-8-2), స్టీఫెన్ విగ్ (3-0-25-2), డారిల్ మిచెల్ (3-0-20-1), జియా ఉల్ హక్ (3-0-28-1) కూడా రాణించారు. అరివీర భయంకరమైన బ్యాటర్లతో నిండిన నైట్‌రైడర్స్ బ్యాటింగ్ లైనప్ సూపర్ కింగ్స్ బౌలర్ల ధాటికి వణికిపోయింది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో వాన్ ష్కాల్క్విక్ (27) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అలెక్స్ హేల్స్ (25), ఉన్ముక్త్ చంద్ (22), మాథ్యూ ట్రంప్ (23), అలీ ఖాన్ (16 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ ఫ్లెచర్ 2, నితీశ్ కుమార్ 1, సైఫ్ బదార్ 0, ఆండ్రీ రసెల్ 1, సునీల్ నరైన్ 0 పరుగులకు ఔటయ్యారు. -
IPL 2025: తొలి సీజన్లోనే భారీ రికార్డు సొంతం చేసుకున్న ఆయుశ్ మాత్రే
సీఎస్కే యువ కెరటం ఆయుశ్ మాత్రే ఐపీఎల్ అరంగేట్రం సీజన్లోనే భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. సీఎస్కే తరఫున ఓ సీజన్లో అత్యధిక స్ట్రయిక్‌రేట్‌తో (కనీసం 200 పరుగులు) పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన మాత్రే 188.97 స్ట్రయిక్‌రేట్‌తో ఓ భారీ అర్ద సెంచరీ సాయంతో (94) 240 పరుగులు చేశాడు.ఇదే సీజన్లో మరో చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ కూడా 180 స్ట్రయిక్‌రేట్‌తో 225 పరుగులు చేశాడు. మాత్రే తర్వాత ఓ సీజన్లో అత్యధిక స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించిన సీఎస్కే ఆటగాడిగా బ్రెవిస్ నిలిచాడు. ఈ రికార్డు విభాగంలో మాత్రే, బ్రెవిస్ తర్వాత అజింక్య రహానే (2023 సీజన్లో 172.48 స్ట్రయిక్‌రేట్‌తో 326 పరుగులు), రవీంద్ర జడేజా (2020 సీజన్లో 1671.85 స్ట్రయిక్‌రేట్‌తో 232 పరుగులు), ఎంఎస్ ధోని (2013 సీజన్లో 162.89 స్ట్రయిక్‌రేట్‌తో 461 పరుగులు) ఉన్నారు. కాగా, గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (మే 25) జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 83 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సీజన్‌ను గెలుపుతో ముగించింది. అయినా సీజన్లో ఆఖరి స్థానంతోనే సరిపెట్టుకుంది. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే భారీ స్కోర్ (230/5) చేసింది. ఆయుశ్ మాత్రే (34), డెవాన్ కాన్వే (52), ఉర్విల్ పటేల్ (37), డెవాల్డ్ బ్రెవిస్ (57) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్.. సీఎస్కే బౌలర్లు చెలరేగడంతో 18.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ ఇలా తక్కువ స్కోర్‌కే చేతులెత్తేయడం ఈ సీజన్లో ఇదే మొదటిసారి. అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ తలో మూడు వికెట్లు తీసి గుజరాత్ పతనాన్ని శాశించారు. రవీంద్ర జడేజా 2, ఖలీల్ అహ్మద్, పతిరణ తలో వికెట్ తీశారు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ (41) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అర్షద్ ఖాన్ (20), శుభ్‌మన్ గిల్ (13), షారుఖ్ ఖాన్ (19), తెవాటియా (140, రషీద్ ఖాన్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. -
చెప్పింది వినరా?.. సహనం కోల్పోయిన ధోని.. పతిరణ, దూబేపై ఫైర్!
‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)కి కోపమొచ్చింది. తన ప్రియ శిష్యుడు మతీశ పతిరణ (Matheesha Pathirana) తీరు ‘తలా’కు విసుగుతెప్పించింది. దీంతో ధోని సీరియస్ లుక్ ఇవ్వగానే.. పతిరణ అలెర్ట్ అయిపోయాడు. కెప్టెన్ వ్యూహానికి అనుగుణంగా వ్యవహరించి.. అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలో సఫలమయ్యాడు. తద్వారా ‘తలా’ను ప్రసన్నం చేసుకోగలిగాడు. 230 పరుగులుఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ధోని సేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌కు సాయి సుదర్శన్ (28 బంతుల్లో 41) మరోసారి శుభారంభం అందించినా.. మరో ఓపెనర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (13) విఫలమయ్యాడు. జోస్ బట్లర్ (5), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (0) కూడా నిరాశపరిచారు. ఇలాంటి తరుణంలో సాయి సుదర్శన్‌తో కలిసి షారుఖ్ ఖాన్ నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు.గుజరాత్ ఇన్నింగ్స్‌లో శివం దూబే పదో ఓవర్ వేయగా.. తొలి రెండు బంతుల్లో రెండు ఫోర్లు రాబట్టిన సాయి సుదర్శన్.. మూడో బంతికి సింగిల్ తీశాడు. ఇక నాలుగో బంతికి షారుఖ్ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత షారుఖ్ సింగిల్ తీయగా.. ఆఖరి బంతికి సుదర్శన్ రెండు పరుగులు తీశాడు. దీంతో దూబే ఓవర్లో మొత్తంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు.చెప్పింది వినరా?.. సహనం కోల్పోయిన ధోని.. పతిరణ, దూబేపై ఫైర్!అయితే, ఈ ఓవర్లో ధోని ఫీల్డింగ్ సెట్ చేస్తున్న వేళ పతిరణ కాస్త నిర్లక్ష్యంగా కనిపించాడు. దీంతో తన ఆదేశాలను పట్టించుకోకుండా ఉన్న బౌలర్, ఫీల్డర్‌పై ధోని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా సీరియస్ లుక్ ఇచ్చాడు. ఇక మరుసటి ఓవర్లో రవీంద్ర జడేజా బంతితో రంగంలోకి దిగగా.. తొలి బంతికే షారుఖ్‌ను అవుట్ చేశాడు.ఫుల్ వైట్ అవుట్‌సైడ్ ఆఫ్ దిశగా చేసిన బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించిన షారుఖ్ ఖాన్ బంతిని గాల్లోకి లేపగా షార్ట్ థర్డ్‌మ్యాన్ దిశగా పయనించింది. ఈ క్రమంలో.. పతిరణ క్యాచ్ అందుకునే క్రమంలో తడబడ్డా.. ఎట్టకేలకు విజయవంతంగా పనిపూర్తి చేశాడు. దీంతో 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షారుఖ్ ఖాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఆ తర్వాత వచ్చిన వాళ్లలో రాహుల్ తెవాటియా 14, అర్షద్ ఖాన్ 20 పరుగులు చేశారు. ఈ క్రమంలో 18.3 ఓవర్లలో 147 పరుగులకే గుజరాత్ ఆలౌట్ అయింది. సీఎస్కే 83 పరుగుల తేడాతో గెలిచి.. సీజన్లో నాలుగో విజయం సాధించి గెలుపుతో ముగించింది. ఈ మ్యాచ్‌లో ధోని సహనం కోల్పోయిన తీరును కామెంటేటర్లు విశ్లేషించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసింది.కాగా ఈ మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌కు రాలేదు. ఓవరాల్‌గా ఈ సీజన్లో పదమూడు ఇన్నింగ్స్ ఆడిన ధోని 196 పరుగులు చేశాడు. ఇక సీఎస్కే పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన విషయం తెలిసిందే. చదవండి: Pat Cummins: ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసిందిWhen #CaptainCool lost his cool! 🥵A tactical masterclass & an uncanny #MSDhoni's moment - #CSK's last match this season had it all! 💛Watch the LIVE action ➡ https://t.co/XfCrZHriFf #IPLonJioStar 👉 #SRHvKKR | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/wxPM71McJI— Star Sports (@StarSportsIndia) May 25, 2025 -
#CSK: 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి
ఐపీఎల్-2025 సీజన్లో ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సీఎస్కే.. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాలలో విఫలమై అభిమానులను తీవ్ర నిరాశపరిచింది.తమ చెత్త ఆట తీరుతో మిగితా జట్ల కంటే ముందే ప్లే ఆఫ్స్ రేసు నిష్క్రమించింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే.. కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికి పరిమితమైంది.18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో పదివ స్దానంలో నిలవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఏ సీజన్లో కూడా సీఎస్కే ఆఖరి స్దానానికి పరిమితం కాలేదు. ఐదు సార్లు ఛాంపియన్, 9 సార్లు ఫైనల్‌కు చేరిన చెన్నైకు నిజంగా ఇది ఘోర పరాభావమే అని చెప్పాలి. కాగా ఈ ఏడాది సీజన్ తమ ఆఖరి మ్యాచ్‌లో మాత్రం సీఎస్కే అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో చెన్నై ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టి గుజరాత్‌కు ఊహించని షాక్ ఇచ్చింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్కే బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్(23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 57), డెవాన్ కాన్వే(35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆయూష్ మాత్రే(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34), ఉర్విల్ పటేల్(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం లక్ష్య చేధనలో గుజరాత్.. 18.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సాయిసుదర్శన్(41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. . సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ తలా మూడు వికెట్లు పడగొట్టి గుజరాత్‌ను దెబ్బతీయగా.. రవీంద్ర జడేజా రెండు, పతిరానా, ఖాలీల్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.చదవండి: ఇంకా ఫిట్‌గా ఉన్నాడా?.. అవును.. అయితే, ఎందుకు ఆడట్లేదు? -
ఫిట్‌గా ఉన్నాడా?.. అవును.. అయితే, ఎందుకు తప్పించుకుంటున్నాడు?
మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి ఆడుతున్న తలా.. ఇప్పటికీ క్యాష్ రిచ్ లీగ్‌లో కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఐదుసార్లు టైటిల్ అందించిన ఈ దిగ్గజ సారథి.. 43 ఏళ్ల వయసులో మరోసారి పగ్గాలు చేపట్టాడు. ఇక ఐపీఎల్-2025 (IPL 2025)లో ఐదు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ గాయం వల్ల దూరం కాగా.. తలా మరోసారి సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. అయితే, ఈసారి సీఎస్కే చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో తొలిసారి అట్టడుగున (పద్నాలుగు నాలుగే విజయాలు) పదో స్థానంలో నిలిచింది. అయితే, లీగ్ దశలో ఆఖరిదైన ఆదివారం నాటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించి సీజన్‌ను ముగించడం చెన్నై అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది.The 5⃣-time champs sign off from #TATAIPL 2025 with a convincing win 💛#CSK register a HUGE 83-run win over #GT 👏Updates ▶ https://t.co/P6Px72jm7j#GTvCSK | @ChennaiIPL pic.twitter.com/ey9uNT3IqP— IndianPremierLeague (@IPL) May 25, 2025 ఇక ఈ మ్యాచ్ ముందు నుంచే మరోసారి 43 ధోని రిటైర్మెంట్పై చర్చోపర్చలు జరిగాయి. ఇందులో భాగంగా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, ఆర్పీ సింగ్- ఆకాశ్ చోప్రా, సంజయ్ బంగర్ మధ్య వాడివేడి చర్చ జరిగింది.స్టార్ స్పోర్ట్స్ షోలో భాగంగా ఈ కామెంటేటర్లు ధోని భవితవ్యంపై సంభాషణ సాగించారు. రైనా, ఆర్పీ సింగ్ తలా ఇంకొన్నాళ్లు కొనసాగాలని పేర్కొంటే.. ఆకాశ్ చోప్రా, సంజయ్ బంగర్ మాత్రం ధోని లోయర్ ఆర్డర్లో రావడాన్ని తప్పు బడుతూ ఇక అతడు తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి చర్చ సాగిందిలా..ఆకాశ్ చోప్రా: ఒకవేళ ఎంఎస్ ధోని ‘అన్క్యాప్డ్’ (ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైన్ అయిన తర్వాత ఇలా ఐపీఎల్లో అందుబాటులో ఉండవచ్చు)ప్లేయర్ కాకపోయి ఉంటే.. ఈసారి కూడా సీఎస్కే జట్టుతో కొనసాగేవాడా?సురేశ్ రైనా: కచ్చితంగా.. పద్దెమినదేళ్లుగా అతడు జట్టుతో ఉన్నాడు. ఇంకా ఫిట్‌గా ఉన్నాడు. ఇప్పటికీ అత్యధిక సిక్సర్ల వీరుల జాబితాలో కొనసాగుతున్నాడు.ఆకాశ్ చోప్రా: మరి అతడు 7, 8, 9 స్థానాల్లో ఎందుకు బ్యాటింగ్‌కు వస్తున్నాడు. బ్యాటింగ్ పరంగా జట్టు చిక్కుల్లో పడిన వేళ.. కష్టాలు చుట్టుముట్టిన సమయంలోనూ టాపార్డర్‌లో ఆడవచ్చు కదా? అంతటి అనుభవం ఉన్న ఆటగాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? అసలు అతడు నిజంగానే ఫిట్‌గా ఉన్నాడా?సురేశ్ రైనా: ఆఖరి నాలుగు ఓవర్లలో ఆడటం ఎంఎస్‌కు సౌకర్యవంతంగా ఉంటుంది. అతడు ఫిట్‌గానే ఉన్నాడు. 44 ఏళ్లకు చేరువైనా.. ఇంకా వికెట్ కీపర్‌గా సేవలు అందిస్తున్నాడు. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఇంటర్వ్యూలో రానున్న టీ20 ప్రపంచకప్ జట్టు గురించి మాట్లాడాడు. శివం దూబే వంటి వాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు తనిలా చేస్తుండవచ్చు కదా!ఆర్పీ సింగ్: మోకాలి సర్జరీ తర్వాత ధోని కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. 20 ఏళ్లుగా కీపింగ్ చేస్తున్నాడు. కచ్చితంగా బ్యాటర్‌గానూ మరోసారి సత్తా చాటగలడు.ఇదిలా ఉంటే.. గుజరాత్ టైటాన్స్‌పై 83 పరుగుల తేడాతో గెలుపొందిన తర్వాత ధోని మాట్లాడుతూ.. తన రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తన ఆట ముగిసిపోయిందని చెప్పలేనని.. అదే విధంగా ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదని పేర్కొన్నాడు. రిటైర్మెంట్ విషయంలో నిర్ణయానికి ఇంకా సమయం ఉందని ధోని తెలిపాడు. కాగా ఈ సీజన్లో ధోని 14 మ్యాచ్‌లలో కలిపి 196 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: Pat Cummins: ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసిందిThings get a little heated in the studio during #TheBigDebate! 🔥What's your take on #CaptainCool's batting position this season? 💬Watch him #OneLastTime 👉 GTvCSK | SUN, 25th MAY, 2:30 PM on Star Sports Network & JioHotstar pic.twitter.com/uUWwUqK69I— Star Sports (@StarSportsIndia) May 25, 2025 -
ఆఖర్లో అదరహో
‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న జట్లు... తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌ల్లో దంచికొట్టాయి. గుజరాత్ టైటాన్స్‌తో పోరులో చెన్నై దుమ్మురేపి 230 పరుగులు చేస్తే... కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 278 పరుగులతో విరుచుకుపడింది. అంచనాల ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడిన ఈ రెండు జట్లు విజయాలతో సీజన్‌ను ముగించాయి. గుజరాత్‌తో పోరులో చెన్నై బ్యాటర్లు కాన్వే, బ్రెవిస్ హాఫ్ సెంచరీలతో విజృంభిస్తే... నైట్ రైడర్స్ బౌలర్లను క్లాసెన్, హెడ్ చీల్చి చెండాడారు. సీజన్ ఆరంభ పోరులో రాజస్తాన్ రాయల్స్‌పై 286 పరుగులు చేసి అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ... తమ ఆఖరి మ్యాచ్‌లో మరోసారి మూడొందలకు చేరువైంది. అభిషేక్ శర్మ, హెడ్ మెరుపులతో భారీ స్కోరుకు పునాది వేస్తే... క్లాసెన్ దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. మధ్యలో నిలకడలేమితో పరాజయాలు మూటగట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ... చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. న్యూఢిల్లీ: విధ్వంసకర ఆటతీరుతో ఐపీఎల్లో భారీ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సీజన్‌కు వీడ్కోలు పలికింది. ఆదివారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ 110 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. మొదట సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 105 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ శతకంతో కదంతొక్కగా... ట్రావిస్ హెడ్ (40 బంతుల్లో 76; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) దంచికొట్టాడు. బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడిన క్లాసెన్ 37 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూడా రాణించాడు. లక్ష్యఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్ 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. దంచుడే... దంచుడు మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ తొలి ఓవర్లో 2 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాతి నుంచి వెనుదిరిగి చూసుకోని రైజర్స్... ఫోర్లు, సిక్స్‌లతో మైదానాన్ని మోతెక్కించింది. రెండో ఓవర్లో హెడ్ సిక్స్‌తో ఖాతా తెరవగా... అభిషేక్ రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్లో 6, 4, 2, 6 బాదిన హెడ్... నాలుగో ఓవర్లో మరో మూడు ఫోర్లు కొట్టాడు. నోర్జే ఓవర్లో అభిషేక్ 2 ఫోర్లతో చెలరేగడంతో పవర్‌ప్లే ముగిసేసరికి రైజర్స్ 79 పరుగులు చేసింది. నరైన్ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన అభిషేక్... మరో షాట్ ఆడే ప్రయత్నంలో ఔట్ కాగా... క్లాసెన్ రాకతో విధ్వంసం మరో స్థాయికి చేరింది. ఒకవైపు హెడ్, మరోవైపు క్లాసెన్ బౌలర్‌తో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడటంతో... 10 ఓవర్లు ముగిసేసరికి ఆరెంజ్ ఆర్మీ 139/1తో నలిచింది. ఈ క్రమంలో హెడ్ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... హర్షిత్ ఓవర్లో 4, 6, ,6తో క్లాసెన్ 17 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ అందుకున్నాడు. హెడ్‌ను ఔట్ చేయడం ద్వారా నరైన్ ఈ జోడీని విడదీయగా ... ఇషాన్ కిషన్ వేగంగా ఆడలేకపోయాడు. నరైన్ ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టిన క్లాసెన్... వరుణ్‌కు అదే శిక్ష వేసి సెంచరీకి సమీపించాడు. రసెల్ ఓవర్లో 6, 4 కొట్టిన క్లాసెన్... అరోరా బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) రింకూ (బి) నరైన్ 32; హెడ్ (సి) రసెల్ (బి) నరైన్ 76; క్లాసెన్ (నాటౌట్) 105; ఇషాన్ కిషన్ (సి) నోర్జే (బి) వైభవ్ 29; అనికేత్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 278. వికెట్ల పతనం: 1–92, 2–175, 3–158. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–39–1; నోర్జే 4–0–60–0; హర్షిత్ రాణా 3–0–40–0; నరైన్ 4–0–42–2; వరుణ్ చక్రవర్తి 3–0–54–0; రసెల్ 2–0–34–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) మనోహర్ (బి) మలింగ 9; నరైన్ (బి) ఉనాద్కట్ 31; రహానే (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 15; రఘువంశీ (సి) నితీశ్ (బి) మలింగ 14; రింకూ (సి) నితీశ్ (బి) హర్ష్ దూబే 9; రసెల్ (ఎల్బీ) (బి) హర్ష్ దూబే 0; మనీశ్ పాండే (సి) మనోహర్ (బి) ఉనాద్కట్ 37; రమణ్‌దీప్ (బి) హర్ష్ దూబే 13; హర్షిత్ (సి అండ్ బి) మలింగ 34; వైభవ్ అరోరా (రనౌట్) 0; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 168. వికెట్ల పతనం: 1–37, 2–55, 3–61, 4–70, 5–70, 6–95, 7–110, 8–162, 9–162, 10–168. బౌలింగ్: కమిన్స్ 2–0–25–0; ఉనాద్కట్ 4–0–24–3; హర్షల్ 2–0–21–0; ఇషాన్ మలింగ 3.4–0– 31–3; హర్ష్ దూబే 4–0–34–3; నితీశ్ రెడ్డి 1–0–6–0; అభిషేక్ 2–0–25–0. 278/3 ఐపీఎల్లో ఇది మూడో అత్యధిక స్కోరు. తొలి రెండు స్థానాల్లోనూ సన్‌రైజర్స్ జట్టే ఉంది. 2024లో బెంగళూరుపై 287/5 స్కోరు చేసిన హైదరాబాద్... ఈ ఏడాది తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై 286/5 పరుగులు చేసింది. 37 సెంచరీకి క్లాసెన్ తీసుకున్న బంతులు. ఐపీఎల్లో ఇది మూడో వేగవంతమైన శతకం. క్రిస్ గేల్ (30 బంతుల్లో), వైభవ్ సూర్యవంశీ (35 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అహ్మదాబాద్: ఐపీఎల్ 18వ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయంతో ముగించింది. పాయింట్ల పట్టికలో చివరిదైన పదో స్థానంలో నిలిచిన ధోనీ బృందం... ఆదివారం తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై గెలుపొందింది. మొదట చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డెవాల్డ్ బ్రెవిస్ (23 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), కాన్వే (35 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అర్షద్ ఖాన్ వెసిన రెండో ఓవర్లో ఆయుశ్ చెలరేగి వరుసగా 2, 6, 6, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. క్రీజులో అడుగుపెట్టిన ప్రతీ బ్యాటర్ దంచికొట్టడమే పనిగా పెట్టుకోవడంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ చెరో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌తో ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా చర్చ సాగగా... మహీ తనకు అలవాటైన రీతిలో ‘వేచి చూద్దాం’ అని ముక్తాయించాడు. సంక్షిప్త స్కోర్లుచెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: 230/5 (20 ఓవర్లలో) (ఆయుశ్ 34; కాన్వే 52; ఉర్విల్ 37; బ్రెవిస్ 57, ప్రసిధ్ కృష్ణ 2/22) గుజరాత్ టైటాన్స్: 147 ఆలౌట్ (18.3 ఓవర్లలో) (సాయి సుదర్శన్ 41; అర్షద్ ఖాన్ 20, అన్షుల్ కంబోజ్ 3/13, నూర్ అహ్మద్ 3/21, జడేజా 2/17).ఐపీఎల్లో నేడుముంబై X పంజాబ్‌వేదిక: జైపూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో -
IPL: రిటైర్మెంట్పై ధోని కీలక వ్యాఖ్యలు
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఈ ఏడాది ఐపీఎల్ ఆఖరి సీజన్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన రిటైర్మెంట్ వార్తలపై ధోని స్పందించాడు. తన నిర్ణయాన్ని వెల్లడించడానికి ఇంకా సమయం ఉందని ధోని చెప్పుకొచ్చాడు.ఐపీఎల్-2025లో ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం ప్రెజేంటర్ ధోని తన రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి ప్రశ్నించాడు."వచ్చే సీజన్ ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి నాలుగు లేదా ఐదు నెలల సమయం ఉంది. రిటైర్మెంట్ విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రొఫెషనల్ క్రికెట్. ఏ ఆటగాడైనా ఫిట్‌గా ఉండి, ఆడాలనే తపన ఉన్నంత కాలం ఆడొచ్చు. ప్రదర్శన ఆధారంగా రిటైర్ అవ్వాలంటే, ప్రతీ ఆటగాడు 22 ఏళ్లకే వీడ్కోలు పలకాలి. నేను తిరిగి రాంఛీకి వెళ్లి ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతాను. ఆ తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. అయితే వచ్చే సీజన్‌కు తిరిగి వస్తాను అని చెప్పలేను.. అలా అని రానని చెప్పలేను. నాకు ఇంకా చాలా సమయముందని" 43 ఏళ్ల ధోని బదులిచ్చాడు. -
CSK Vs GT: సీఎస్కే ఆల్‌రౌండ్ షో.. కీలక మ్యాచ్‌లో గుజరాత్ చిత్తు
ఐపీఎల్-2025 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ అద్బుతమైన విజయంతో ముగించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 83 పరుగుల తేడాతో సీఎస్కే చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్కే ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్(23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 57), డెవాన్ కాన్వే(35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) సూపర్ హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. ఆయూష్ మాత్రే(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34), ఉర్విల్ పటేల్(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టగా.. సాయికిషోర్, రషీద్ ఖాన్, షారుఖ్ ఖాన్ తలా వికెట్ సాధించారు.సుదర్శన్ ఒక్కడే..అనంతరం లక్ష్య చేధనలో సీఎస్కే బౌలర్లు చెలరేగడంతో గుజరాత్.. 18.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సాయిసుదర్శన్(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 13 పరుగులు చేయగా.. స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ తలా మూడు వికెట్లు పడగొట్టి గుజరాత్‌ను దెబ్బతీయగా.. రవీంద్ర జడేజా రెండు, పతిరానా, ఖాలీల్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా ఈ ఓటమితో గుజరాత్ టైటాన్స్ టాప్-2 స్దానం ప్రమాదంలో పడింది. ఆర్సీబీ, పంజాబ్ తమ తదుపరి రెండు మ్యాచ్‌లలో గెలిస్తే గుజరాత్ మూడో స్ధానానికి పడిపోతుంది.చదవండి: IPL 2025: ప్లే ఆఫ్స్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ -
బ్రెవిస్, కాన్వే, మాత్రే మెరుపులు.. సీఎస్కే భారీ స్కోర్
ఐపీఎల్-2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న తమ ఆఖరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు జూలు విధిల్చారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 230 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్కే ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్(23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 57), డెవాన్ కాన్వే(35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. ఆయూష్ మాత్రే(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34), ఉర్విల్ పటేల్(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టగా.. సాయికిషోర్, రషీద్ ఖాన్, షారుఖ్ ఖాన్ తలా వికెట్ సాధించారు. కాగా ఈ ఏడాది సీజన్లో సీఎస్కేకే ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు ఏకంగా 15 సిక్సర్లు బాదారు. అదేవిధంగా గుజరాత్‌ను 121 పరుగులలోపు ఆలౌట్ చేస్తే పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానం నుంచి సీఎస్కే బయటపడుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సీఎస్కే పదో స్దానంలో ఉంది. -
ఆయూష్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 28 రన్స్! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్‌కు కింగ్స్‌కు ఆయుష్ మాత్రే రూపంలో ఒక అణిముత్యం దొరికింది. గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ స్దానంలో సీఎస్కే జట్టులోకి వచ్చిన ఆయూష్.. ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ సత్తాచాటాడు. ఈ యువ ఆటగాడు తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సీఎస్కేకు అద్బతమైన ఆరంభాలను అందించాడు. తాజాగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న సీఎస్కే ఆఖరి మ్యాచ్‌లోనూ మాత్రే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆయూష్ కేవలం 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. చెన్నై ఇన్నింగ్స్ 2 ఓవర్ వేసిన గుజరాత్ పేసర్ ఆర్షద్ ఖాన్‌ను మాత్రే ఊతికారేశాడు.ఓ ఓవర్లో మాత్రం మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. తొలి బంతికి రెండు పరుగులు తీసిన మాత్రే.. ఆ తర్వాత రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదాడు. ఆఖరి బంతిని కూడా స్టాండ్స్‌కు తరలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో సీఎస్కే బ్యాటర్‌గా మాత్రే నిలిచాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్దానంలో ఉన్నాడు. ఐపీఎల్-2021 సీజన్లో జడేజా.. హర్షల్ పటేల్ వేసిన ఓవర్లో ఏకంగా 36 పరుగులు సాధించాడు. ఇక మాత్రే విషయానికి వస్తే.. ఈ ఏడాది సీజన్లో 7 మ్యాచ్‌లు 240 పరుగులు చేశాడు.చదవండి: PBKS VS DC: అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రీతి జింటా#CaptainCool would be proud of that onslaught! 🤩#AyushMhatre smashes 28 runs off the 2nd over of the game. 💪Watch the LIVE action ➡ https://t.co/vroVQLpMts#Race2Top2 👉 #GTvCSK | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/jvoaHXixXD— Star Sports (@StarSportsIndia) May 25, 2025 -
నా వల్ల కాదని చెప్పి.. వెంటనే రిటైర్ అయిపో!
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) స్థాయికి తగ్గట్లు ఆకట్టులేకపోతున్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కలిపి ధోని కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 30 నాటౌట్.ఇక రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) గాయం కారణంగా దూరం కావడంతో ఐదు మ్యాచ్‌ల తర్వాత పగ్గాలు చేపట్టిన ధోని.. సీఎస్కేను మునుపటి విధంగా ముందుకు తీసుకువెళ్లలేకపోయాడు. ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది సీఎస్కే.అంతేకాదు.. ఆడిన పదమూడు మ్యాచ్‌లలో కేవలం మూడు మాత్రమే గెలిచి తమ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమయ్యే దుస్థితిలో నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ధోనిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు.నా వల్ల కాదు.. అని చెప్పి వెళ్లిపో‘‘ధోని వయసు పెరుగుతోంది. కాబట్టి ఆటగాడిగా అతడి నుంచి మనం ఎక్కువగా ఆశించడం కూడా తప్పే. అయితే, ఒక్కోసారి అతడి వల్ల బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు కూడా దెబ్బతింటోంది.ఒకవేళ నీకు హిట్టింగ్ ఆడటం కుదరకపోతే.. ‘ఇక నా వల్ల కాదు.. నేనిది చేయలేను’ అని జట్టును వీడిపోతే మంచిది. ధోని ఇలా చేయడమే మంచిది. ఒకవేళ అతడు ఇంకా ఇంకా కొనసాగుతూ... ఉంటే జట్టులో ఏ పాత్ర పోషిస్తాడు?మోకాలి నొప్పులు కూడాకెప్టెన్గా ఉంటాడా? వికెట్ కీపరా లేదంటా ఫినిషర్గానా?.. నిజాయితీ చెప్పాలంటే ధోనిలో క్రికెట్ ఆడే సత్తువ తగ్గిపోయింది. అతడిని మోకాలి నొప్పులు వేధిస్తున్నాయి. ఇకనైనా ధోని తప్పుకొంటే మంచిది’’ అని చిక్కా.. తలాకు సూచించాడు. 43 ఏళ్ల ధోని వీలైనంత త్వరగా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ధోని సేన ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని 17 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ సాయంతో 16 పరుగులు చేశాడు. రాజస్తాన్ ధనాధన్‌ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దంచికొట్టిన రాజస్తాన్.. 17.1 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 36), వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 57), సంజూ శాంసన్ (31 బంతుల్లో 41), ధ్రువ్ జురెల్ (12 బంతుల్లో 31 నాటౌట్) రాణించారు. కాగా ఐపీఎల్లో సీఎస్కేను అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోనిది. కానీ ఈసారి మాత్రం అతడికి సారథిగా ఘోర పరాభవం ఎదురైంది.చదవండి: MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?.. సమీకరణలు ఇలా..Jurel says that's how it's done 😎@rajasthanroyals sign off from #TATAIPL 2025 in an emphatic way 🩷Updates ▶ https://t.co/hKuQlLxjIZ #CSKvRR pic.twitter.com/F5H5AbcIVu— IndianPremierLeague (@IPL) May 20, 2025 -
వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) యువ బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రేలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడి లేకుండా నిర్భయంగా ఆడితే అనుకున్న ఫలితాలు అవే వస్తాయని పేర్కొన్నాడు. వైభవ్, ఆయుశ్లాంటి యువ ఆటగాళ్లకు తానిచ్చే సలహా ఇదే అని పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ.. చెన్నై జట్టు తరఫున ఆయుశ్ మాత్రే అరంగేట్రం చేశారు. హర్యానాకు చెందిన వైభవ్ ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 252 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర శతకం ఉంది.చెన్నైపై మెరుపు హాఫ్ సెంచరీఅదే విధంగా.. మంగళవారం నాటి మ్యాచ్‌లో చెన్నై (CSK vs RR)పై ఈ చిచ్చర పిడుగు మెరుపు హాఫ్ సెంచరీతో మెరిశాడు. 33 బంతుల్లో 57 పరుగులతో పద్నాలుగేళ్ల వైభవ్ రాణించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నైపై రాజస్తాన్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయుశ్ కూడా అదరగొట్టాడుమరోవైపు.. ఆయుశ్ మాత్రే రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 20 బంతుల్లో 43 పరుగులుతో దుమ్ములేపాడు. ఓవరాల్‌గా ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆయుశ్ మాత్రే 206 పరుగులు సాధించాడు. ఇక చెన్నై- రాజస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ధోని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు.ఒత్తిడికి లోనుకావద్దుఇదిలా ఉంటే.. రాజస్తాన్ చేతిలో ఓటమి తర్వాత సీఎస్కే సారథి ధోని మాట్లాడుతున్న సమయంలో వైభవ్, ఆయుశ్ వంటి యువ ఆటగాళ్లకు మీరిచ్చే సలహా ఏమిటనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నిలకడగా ఆడేందుకు వారు ప్రయత్నం చేయాలి.అయితే, 200కు పైగా స్ట్రైక్ రేటు మెయింటెన్ చేయాలని భావిస్తే నిలకడైన ఆట కాస్త కష్టమే. ఎలాంటి దశలోనైనా భారీ సిక్సర్లు బాదగల సత్తా వారికి ఉంది. అంచనాలు కచ్చితంగా ఉంటాయి. రోజురోజుకీ మరింత పెరుగుతాయి కూడా!కానీ ఎప్పుడూ ఒత్తిడికి లోనుకావద్దు. సీనియర్ ఆటగాళ్లు, శిక్షణా సిబ్బంది నుంచి సలహాలు తీసుకోండి. మ్యాచ్ సాగుతున్న తీరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. అద్భుతంగా ఆడుతున్న యువ ఆటగాళ్లందరికీ ఇదే నేనిచ్చే సలహా’’ అని ధోని పేర్కొన్నాడు.అందుకు ఓటమిఇక తమ ఓటమిపై స్పందిస్తూ.. మెరుగైన స్కోరు సాధించినప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామని ధోని విచారం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్ విఫలమైతే ఆ ప్రభావం లోయర్ ఆర్డర్‌పై పడుతుందని.. ఏదేమైనా ఒకటీ రెండు వికెట్లు అనవసరపు షాట్లతో పారేసుకోవడం వల్ల మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నాడు. తమ ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 42) మరోసారి అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు.ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు👉వేదిక: అరుణ్‌జైట్లీ స్టేడియం, ఢిల్లీ👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉చెన్నై స్కోరు: 187/8 (20)👉రాజస్తాన్ స్కోరు: 188/4 (17.1)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై రాజస్తాన్ గెలుపు.చదవండి: MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?Jurel says that's how it's done 😎@rajasthanroyals sign off from #TATAIPL 2025 in an emphatic way 🩷Updates ▶ https://t.co/hKuQlLxjIZ #CSKvRR pic.twitter.com/F5H5AbcIVu— IndianPremierLeague (@IPL) May 20, 2025 -
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆటలోనే కాదు.. పెద్దలను గౌరవించడంలోనూ ముందే ఉంటానని నిరూపించాడు. ఐపీఎల్-2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs RR)తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) పాదాలకు నమస్కరించడం ఇందుకు నిదర్శనం. కాగా ఈ సీజన్లో తమ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా రాజస్తాన్ సీఎస్కేతో మంగళవారం తలపడింది.ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై గెలుపొంది.. విజయంతో ముగించింది. మరోవైపు.. ధోని జట్టుకిది పదో పరాజయం కావడం గమనార్హం. టాస్ ఓడిన చెన్నై మొదట నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.ఆయుశ్ మాత్రే (20 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్), బ్రెవిస్ (25 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆకాశ్ మధ్వాల్, యుద్వీర్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసి గెలిచింది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మరోసారి మెరిపించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (31 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడాడు. ఆరంభంలో కుదేలైనా... చెన్నై ఆరంభంలోనే కాన్వే (10), ఉర్విల్ పటేల్ (0) వికెట్లను కోల్పోయింది. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే బౌండరీలతో అలరించాడు. పవర్‌ప్లేలో జట్టు పుంజుకుంటున్న తరుణంలో... ఆయుశ్ దూకుడుకు తుషార్ చెక్ పెట్టాడు. స్వల్ప వ్యవధిలో అశ్విన్ (13), జడేజా (1) వికెట్లను కోల్పోయిన చెన్నై 78/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఈ దశలో బ్రెవిస్, శివమ్ దూబే (32 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.వైభవ్ ధనాధన్లక్ష్య ఛేదనలో మొదట యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే దంచేశాడు. అతను అవుటైనప్పడు జట్టు స్కోరు 37/1. అందులో 36 జైస్వాల్‌వే! శాంసన్ వచ్చాకే వైభవ్ బ్యాట్‌కు పనిచెప్పాడు. భారీ సిక్సర్లతో విరుచుకు పడి 27 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే అశ్విన్ ఒకే ఓవర్లో శాంసన్, వైభవ్‌లను అవుట్ చేశాడు. పరాగ్ (3)ను నూర్ అహ్మద్ బౌల్తా కొట్టించాడు. అయితే చెన్నై పట్టుబిగించకుండా జురేల్ (12 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేయడంతో ఇంకా 2.5 ఓవర్లు మిగిలుండగానే రాజస్తాన్ గెలిచింది. మిస్టర్ కూల్ రియాక్షన్ ఇదీఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆనవాయితీ ప్రకారం చెన్నై- రాజస్తాన్ ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అయితే, వైభవ్ మాత్రం ఇందుకు భిన్నంగా.. చెన్నై సారథి ధోని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. మిస్టర్ కూల్ కూడా వైభవ్ వెన్నుతట్టి బాగా ఆడావు అన్నట్లుగా ప్రశంసించాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్‌కు చేదు అనుభవాలే మిగిలినా.. వైభవ్ రూపంలో ప్రతిభ గల ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లో ఓ సెంచరీ సాయంతో ఈ హర్యానా కుర్రాడు 252 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో పద్నాలుగు మ్యాచ్‌లలో రాజస్తాన్ కేవలం నాలుగు మాత్రమే గెలిచింది.చదవండి: IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు.. లక్నో వేదికగా ఆర్సీబీ మ్యాచ్‌లు 𝙈𝙤𝙢𝙚𝙣𝙩𝙨 𝙩𝙤 𝙘𝙝𝙚𝙧𝙞𝙨𝙝 😊This is what #TATAIPL is all about 💛🩷#CSKvRR | @ChennaiIPL | @rajasthanroyals pic.twitter.com/hI9oHcHav1— IndianPremierLeague (@IPL) May 20, 2025 -
వైభవ్ వీర విహారం.. సీఎస్కేపై రాజస్తాన్ ఘన విజయం
ఐపీఎల్-2025 సీజన్‌ను రాజస్తాన్ ఘన విజయంతో ముగించింది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 188 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.1 ఓవర్లలో ఛేదించింది.రాజస్తాన్ బ్యాటర్లలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్(41), ధ్రువ్ జురెల్(31 నాటౌట్), జైశ్వాల్(36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సీఎస్కే బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్, నూర్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.సీఎస్కే బ్యాటర్లలో ఆయూష్ మాత్రే(43), డెవాల్డ్ బ్రెవిస్(42), శివమ్ దూబే(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్, యుధ్వీర్ సింగ్ చరక్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. దేశ్‌పాండే, హసరంగా తలా వికెట్ సాధించారు. కాగా ఇరు జట్లు కూడా ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నిష్క్రమించాయి. -
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. కోహ్లి, రోహిత్ సరసన
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 350 సిక్సర్ల బాదిన జాబితాలోకి ధోని చేరాడు. ఐపీఎల్-2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఈ ఫీట్‌ను అందుకున్నాడు.. రియాన్ పరాగ్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదిన తలా.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ధోని ఇప్పటివరకు 403 టీ20 మ్యాచ్‌లు ఆడి సరిగ్గా 350 సిక్సర్లు బాదాడు. ఓవరాల్‌గా ఈ సాధించిన 34వ బ్యాటర్‌గా ధోని నిలిచాడు. ఈ జాబితాలో చేరిన నాలుగో భారత ఆటగాడిగా ధోని రికార్డులకెక్కాడు. అతడి కంటే ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ ఈ రికార్డు సాధించారు.ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్( 1,056 ) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో పోలార్డ్ (908), రసెల్ (747), పూరన్ (634), అలెక్స్ హేల్స్ (560), మున్రో (557), రోహిత్ (542), జోస్ బట్లర్ (537), మ్యాక్స్‌వెల్ (530) ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా ధోని తీవ్ర నిరాశపరిచాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని.. 17 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ సాయంతో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో ఆయూష్ మాత్రే(43), డెవాల్డ్ బ్రెవిస్(42), శివమ్ దూబే(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్, యుధ్వీర్ సింగ్ చరక్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. దేశ్‌పాండే, హసరంగా తలా వికెట్ సాధించారు. -
ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు.. లక్నో వేదికగా ఆర్సీబీ మ్యాచ్‌లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 షెడ్యూల్లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. ఈ ఏడాది సీజన్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆడాల్సిన ఆఖరి రెండు లీగ్ మ్యాచ్‌లను లక్నో మార్చారు. బెంగళూరులో భారీ వర్షాల కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్సీబీ తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో మే 23న సన్‌రైజర్స్ హైదరాబాద్, మే 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో బెంగళూరు వేదికగా తలపడాల్సి ఉంది. ఇప్పుడు రీ షెడ్యూల్ చేయడంతో ఈ రెండు మ్యాచ్‌లనీ లక్నో లోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో ఆర్సీబీ ఆడనుంది."ఐపీఎల్-2025లో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను లక్నోకు తరలించాము. బెంగళూరులో వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆర్సీబీ-లక్నో మ్యాచ్ కూడా అదే వేదికలో జరగనుంది" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఇప్పటికే బెంగళూరు వేదికగా ఆర్సీబీ-కేకేఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వేదికను భారత క్రికెట్ బోర్డు మార్చింది.మరోవైపు ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలను కూడా బీసీసీఐ ఖరారు చేసింది. మే 29న జరిగే క్వాలిఫయర్ 1, మే 30న జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లకు ముల్లాన్‌పుర్ ఆతిథ్యమిస్తుంది. క్వాలిఫయర్ 2 (జూన్ 1), ఫైనల్ (జూన్ 3) అహ్మదాబాద్‌లో జరుగుతాయి.చదవండి: ఆ యంగ్ క్రికెటర్‌కు నేను హాగ్ ఇవ్వలేదు: ప్రీతి జింటా -
సీఎస్కేపై రాజస్తాన్ గ్రాండ్ విక్టరీ..
IPL 2025 RR vs CSK Live Updates: విజయంతో ముగింపు..అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 188 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.1 ఓవర్లలో ఛేదించింది.రాజస్తాన్ బ్యాటర్లలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్(41), ధ్రువ్ జురెల్(31 నాటౌట్), జైశ్వాల్(36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.ఒకే ఓవర్లో రెండు వికెట్లురాజస్తాన్ రాయల్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. అశ్విన్ వేసిన 14 ఓవర్లో రెండో బంతికి సంజూ శాంసన్(41) ఔట్ కాగా.. ఆరో బంతికి సూర్యవంశీ(57) ఔటయ్యాడు. రాజస్తాన్ విజయానికి 33 బంతులు 57 పరుగులు కావాలి.సూర్యవంశీ ఫిప్టీ..రాజస్తాన్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 27 బంతుల్లోనే సూర్యవంశీ 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.11 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 110/111 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది. క్రీజులో సూర్యవంశీ(44), సంజూ శాంసన్(30) ఉన్నారు.రాజస్తాన్ తొలి వికెట్ డౌన్..యశస్వీ జైశ్వాల్ రూపంలో రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన జైశ్వాల్.. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది.రాణించిన మాత్రే, బ్రెవిస్.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే?అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటర్లు పర్వాలేదన్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో ఆయూష్ మాత్రే(43), డెవాల్డ్ బ్రెవిస్(42), శివమ్ దూబే(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్, యుధ్వీర్ సింగ్ చరక్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. దేశ్‌పాండే, హసరంగా తలా వికెట్ సాధించారు.బ్రెవిస్ ఔట్..డెవల్డ్ బ్రెవిస్ రూపంలో సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన బ్రెవిస్.. మధ్వాల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి ధోని వచ్చాడు. 15 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది12 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 126/512 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో దూబే(12), బ్రెవిస్(36) ఉన్నారు.రవీంద్ర జడేజా ఔట్..చెన్నై సూపర్ కింగ్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 7 ఓవర్లో హసరంగా బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్(12) ఔట్ కాగా.. ఆ తర్వాత యుద్ద్‌వీర్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా(1) ఔటయ్యారు.సీఎస్కే రెండో వికెట్ డౌన్..ఆయూష్ మాత్రే రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 19 బంతుల్లోనే 43 పరుగులు చేసిన మాత్రే.. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 68/3ఒకే ఓవర్లో రెండు వికెట్లు..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. సెకెండ్ ఓవర్ వేసిన యుద్ద్‌వీర్ సింగ్ బౌలింగ్‌లో డెవాన్ కాన్వే(10), ఉర్విల్ పటేల్(0) పెవిలియన్‌కు చేరారు. 3 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 20 పరుగులు చేసింది.ఐపీఎల్-2025లో ఢిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సీఎస్కే తుది జట్టులోకి డెవాన్ కాన్వే తిరిగొచ్చాడు. కాగా ఇరు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ఆయుష్ మ్హత్రే, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ఎంఎస్ ధోని(కెప్టెన్), అన్షుల్ కాంబోజ్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, క్వేనా మఫాకా, యుధ్వీర్ సింగ్ చరక్, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ మధ్వాల్ -
IPL 2025: మా వ్యూహాలు మార్చాల్సిన పనిలేదు: సీఎస్కే హెడ్‌కోచ్
తన దృష్టిలో ఎప్పటికీ అనుభవానికి పెద్ద పీట ఉంటుందని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. గతంలో సీనియర్లతోనే తాము వరుసగా టైటిల్స్ గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపవాదు మూటగట్టుకున్న సీఎస్కే.. పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది ఇప్పటికి ఆడిన 12 మ్యాచ్‌లలో కేవలం మూడు మాత్రమే గెలిచి దారుణంగా విఫలమైంది.సీనియర్లు విఫలంయువ ఆటగాళ్లు ఆయుశ్ మాత్రే, నూర్ అహ్మద్, డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) లాంటివారు రాణించినా... జట్టు నమ్ముకున్న సీనియర్లు పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా లీగ్‌లో ఎంతో అనుభవం ఉన్నా కనీస ప్రదర్శన ఇవ్వలేదు. అయితే తమ టీమ్ వైఫల్యానికి పలు కారణాలు ఉన్నాయని కోచ్ ఫ్లెమింగ్ అన్నాడు. అయితే, ఆటగాళ్ల వయసు ఇందుకు కారణం కాదని పేర్కొన్నాడు.అనుభవం అమూల్యమైంది‘ఆటగాళ్ల వయసు ఎంత ఎక్కువగా ఉందనేది నేను పట్టించుకోను. నా దృష్టిలో అనుభవం అమూల్యమైంది. గత కొన్నేళ్లలో మాకు అదే ఎన్నో విజయాలు అందించింది. ఈ సీజన్లో అది పని చేయకపోవచ్చు. ఫలితం అందరికీ నిరాశ కలిగించిన మాట వాస్తవమే కానీ వైఫల్యానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి’ అని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు.ఇన్నేళ్లుగా చెన్నై టీమ్ సీనియర్ల ఆటతో అనుసరిస్తున్న వ్యూహాలను ఇకపై కూడా మార్చాల్సిన అవసరం లేదని స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. ‘సీనియర్లపై నమ్మకం ఉంచడంతో పాటు ప్రతిభాన్వేషణ కూడా ఈ సమయంలో ముఖ్యం. జట్టులో యువ ఆటగాళ్లు ఉండాలని అందరూ అంటున్నారు. కానీ వారందరినీ వెతికి తెచ్చుకోవాలి కదా. జట్టులో వారు సరిపోతారో లేదో చూడాలి.అనుభవజ్ఞులతో కలిపి వారిని ఆడించాలి. ఈ సీజన్లో కొందరు కొత్త కుర్రాళ్లు చెలరేగడం నిజమే అయినా అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్ల ఆటగాళ్ల జాబితా చూస్తే ఐపీఎల్లో అనుభవం ఉన్నవారే కనిపిస్తారు. మాకు ఈ సీజన్ పెద్ద సవాల్‌గా నిలిచింది. ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం’ అని ఫ్లెమింగ్ వివరించాడు.చదవండి: IPL 2025: దిగ్వేష్ సింగ్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్! వీడియో వైరల్ -
IPL 2025: చరిత్ర సృష్టించిన ధోని
సీఎస్కే స్టాండ్ ఇన్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 200 మందిని ఔట్ చేయడంలో భాగమైన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. నిన్న (మే 7) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ క్యాచ్, ఓ స్టంపౌట్ చేసిన తర్వాత ధోని ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్లో సీఎస్కే, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీల తరఫున 276 మ్యాచ్‌లు ఆడిన ధోని 153 క్యాచ్‌లు, 47 స్టంపింగ్‌లు చేశాడు. ధోని తర్వాత దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్‌కీపర్‌గా ఉన్నాడు. డీకే.. ఢిల్లీ డేర్ డెవిల్స్, ఆర్సీబీ, కేకేఆర్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీల తరఫున 236 మ్యాచ్‌లు ఆడి 174 మందిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. ఇందులో 137 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు ఉన్నాయి. ధోని, డీకే తర్వాత అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్లలో వృద్దిమాన్ సాహా, రిషబ్ పంత్, రాబిన్ ఉతప్ప తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఐపీఎల్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్లు..200 - MS ధోని (CSK/RPS) - 153 క్యాచ్‌లు, 47 స్టంపింగ్‌లు174 - దినేష్ కార్తీక్ (DD/RCB/KKR/GL/MI/KXIP) - 137 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు113 - వృద్ధిమాన్ సాహా (GT/SRH/PBKS/CSK/KKR) - 87 క్యాచ్‌లు, 26 స్టంపింగ్‌లు100 - రిషబ్ పంత్ (DC/LSG) - 76 క్యాచ్‌లు, 24 స్టంపింగ్‌లు90 - రాబిన్ ఉతప్ప (KKR/CSK/RR/MI/RCB/PWI) - 58 క్యాచ్‌లు, 32 స్టంపింగ్లుఓవరాల్గా కూడా ధోనిదే అగ్రస్థానంఓవరాల్గా చూసినా పొట్టి క్రికెట్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్లలో ధోనినే మొదటి స్థానంలో ఉన్నాడు. యావత్ టీ20 ఫార్మాట్లో ధోని 316 మందిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. ధోని తర్వాత క్వింటన్ డికాక్ రెండో స్థానంలో ఉన్నాడు. డికాక్ తన టీ20 కెరీర్లో 307 డిస్మిసల్స్లో భాగమయ్యాడు.నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో ధోని ఎట్టకేలకు కెప్టెన్‌గా రెండో విజయాన్ని సాధించాడు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్కేకు ఈ సీజన్ల ఇది మూడో గెలుపు. ఈ గెలుపు వల్ల సీఎస్కేకు ఒరిగింది ఏమీ లేనప్పటికీ.. కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మాత్రం దెబ్బకొట్టింది. ఈ ఓటమితో కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ జట్టు ఇకపై ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కడం అనుమానమే. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 11 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. టాప్-5లో ఉన్న గుజరాత్ (16), ఆర్సీబీ (16), పంజాబ్ (15), ముంబై (14), ఢిల్లీ (13) కేకేఆర్ కంటే మెరుగైన పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ సీజన్లో సీఎస్కేతో పాటు సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ పోటీ నుంచి ఇదివరకే నిష్క్రమించాయి. లక్నో (10), కేకేఆర్ (11) కూడా నిష్క్రమణ అంచుల్లో ఉన్నాయి.నిన్నటి మ్యాచ్‌లో ధోని వికెట్‌కీపింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ రాణించి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కీపింగ్‌లో రఘువంశీ, నరైన్‌ను ఔట్ చేయడంలో భాగమైన ధోని.. ఛేదనలో కీలక సమయంలో సిక్సర్ కొట్టి తన జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ధోని ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి, చివరి దాకా క్రీజ్‌లో నిలబడ్డాడు. ఫలితంగా సీఎస్కే సీజన్లో మూడో విజయం నమోదు చేసింది. -
CSK Vs KKR: కోల్‌కతాకు చెన్నై ఝలక్
కోల్‌కతా: ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ కీలక పోరులో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ అవకాశాలపై దెబ్బ కొట్టింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై 2 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అజింక్య రహానే (33 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆండ్రీ రసెల్ (21 బంతుల్లో 38; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), మనీశ్ పాండే (28 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించగా...నూర్ అహ్మద్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం చెన్నై 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు సాధించింది. డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా...శివమ్ దూబే (40 బంతుల్లో 45; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఉర్విల్ పటేల్ (11 బంతుల్లో 31; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. పవర్‌ప్లేలోపే సగం వికెట్లు కోల్పోయి 60/5 వద్ద నిలిచిన చెన్నై ఓటమి ఇక లాంఛనమే అనిపించింది. కానీ బ్రెవిస్, దూబే పోరాడంతో పాటు చివర్లో ధోని (17 నాటౌట్) పట్టుదలగా నిలబడటంతో గెలుపు సాధ్యమైంది. తాజా ఫలితంతో కోల్‌కతా ‘ప్లే ఆఫ్స్’కు వెళ్లడం దాదాపు అసాధ్యంగా మారింది. మిగిలిన 2 మ్యాచ్‌లలో గెలిచి గరిష్టంగా 15 పాయింట్లకు చేరినా ముందుకెళ్లడం కష్టమే. సాంకేతికంగా రేసులో ఉన్నా... ఈసారి కథ ముగిసినట్లే! ఐపీఎల్లో నేడుపంజాబ్ X ఢిల్లీవేదిక: ధర్మశాలరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: బ్రెవిస్ విధ్వంసం.. కేకేఆర్‌పై సీఎస్కే విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 7) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి కేకేఆర్‌ను దెబ్బేశాడు. అన్షుల్ కంబోజ్, జడేజా తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రహానే (48), మనీశ్ పాండే (36 నాటౌట్), రసెల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే 60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. డెవాల్డ్ బ్రెవిస్ (52) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తన జట్టును తిరిగి గెలుపు ట్రాక్‌లో పెట్టాడు. మధ్యలో దూబే (45) బాధ్యతాయుతంగా ఆడి సీఎస్కే విజయతీరాలవైపు మళ్లించాడు. ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరమైన తరుణంలో అప్పటిదాకా కామ్‌గా ఉన్న ధోని (17 నాటౌట్) సిక్సర్ కొట్టి సీఎస్కేకు గెలుపుకు చేరువ చేశాడు. నాలుగో బంతికి కంబోజ్ బౌండరీ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఈ గెలుపు వల్ల సీఎస్కేకు ఒరిగేది ఏమీ లేనప్పటికీ కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బకొట్టింది. బ్రెవిస్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 30 పరుగులువైభవ్ అరోరా వేసిన 11వ ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్ శివాలెత్తిపోయాడు. 3 ఫోర్లు, 3 సిక్సర్లు సహా 30 పిండుకున్నాడు. ఈ ఒక్క ఓవర్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు ఓటమి ఖాయమనుకున్న సీఎస్కే ఒక్కసారిగా గెలుపు ట్రాక్‌లోకి వచ్చింది.బ్రెవిస్ 20 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. -
KKR vs CSK: నిలవాలంటే గెలవాలి
కోల్‌కతా: డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ భవితవ్యం ఈ మ్యాచ్‌లో తేలనుంది. ఐపీఎల్ 18వ సీజన్ ప్లేఆఫ్స్ రేసులో కోల్‌కతా ఉంటుందా లేదంటే లీగ్‌తోనే సరిపెట్టుకుంటుందా అనే విషయం నేడు చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. మరోవైపు ధోని బృందం ఇది వరకే లీగ్ నుంచి ని్రష్కమించింది. అయితే ఐపీఎల్ కెరీర్ చరమాంకంలో ఉన్న ధోని ఆటతీరును, లోయర్‌ఆర్డర్‌లో క్రీజులోకి వస్తున్న తీరును పరిశీలిస్తే ఈ సీజనే చివరిదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే జరిగితే... భారత విఖ్యాత స్టేడియం ఈడెన్ గార్డెన్స్‌లో తాను ఆడే ఆఖరి పోరును ధోని చిరస్మరణీయం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చెన్నైకి నామమాత్రమైనా... నైట్‌రైడర్స్‌కు కీలకమైన ఈ పోరు ఆసక్తికరంగా జరగడం ఖాయం. బ్యాటింగే కోల్‌కతా బలం కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు బ్యాటింగే బలం. ఇప్పటికే ఈ సీజన్లో నాలుగుసార్లు 200 పైచిలుకు పరుగుల్ని సాధించింది. లక్నోతో ఎదురైనా 239 పరుగుల భారీ లక్ష్యఛేదనలోనూ నైట్‌రైడర్స్ 4 పరుగుల తేడాతోనే ఓడింది. దీన్నిబట్టి చెప్పొచ్చు కోల్‌కతా బ్యాటర్ల బలమెంతో! తొలిదశను పక్కన బెడితే గత రెండు మ్యాచ్‌ల్లో చేసిన 200 ప్లస్ స్కోరు కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు ఎంత కష్టపడుతుందో సూచిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్లతో జరిగిన ఈ మ్యాచ్‌ల్లో ఏ ఒక్కరి విధ్వంసంతోనూ, ఒకరిద్దరి మెరుపు ఇన్నింగ్స్‌లతోనూ అంతపెద్ద స్కోరు సాధ్యమవలేదు. బ్యాటింగ్ ఆర్డర్ అంతా మూకుమ్మడిగా రాణించింది. గుర్బాజ్, కెపె్టన్ అజింక్య రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, రసెల్ అందరూ బ్యాట్లకు పని చెప్పారు. ఇక అంతకుముందు ఢిల్లీతో జరిగిన పోరులో ఏ ఒక్కరు కూడా అర్ధసెంచరీ సాధించలేదు. అయినాసరే టాపార్డర్ 20 ప్లస్ స్కోర్లు, రింకూ సింగ్ (36), టాప్‌స్కోరర్ రఘువంశీ (44) చేసిన పరుగులతోనే కోల్‌కతా సులువుగా 200 పైచిలుకు స్కోరును సాధించింది. బౌలింగ్‌లోనూ వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌ల స్పిన్ మ్యాజిక్ ప్రత్యర్థులను చుట్టేస్తుంది. వైభవ్ అరోరా, హర్షిత్ రాణాలు తమ పేస్ బౌలింగ్‌లో నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి సమష్టి ప్రదర్శన సొంతగడ్డపై ఈ మ్యాచ్‌లో కనబరిస్తే కోల్‌కతాకు ఎదురే ఉండదు. చెన్నైకిది చేదు సీజన్ ఐపీఎల్‌కే వన్నెతెచ్చిన టీమ్‌లలో చెన్నై ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన 17 సీజన్లలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే). 5 టైటిల్స్‌తో ముంబై ఇండియన్స్‌తో సమానంగా ఉన్నప్పటికీ... పదిసార్లు ఫైనల్ చేరిన (5సార్లు రన్నరప్) ఏకైక జట్టు సీఎస్కే. లీగ్ చరిత్రలో ఇంతటి ఘనచరిత్ర కలిగిన ధోని జట్టుకు ఈ సీజన్ అత్యంత చెత్తగా సాగుతోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడితే రెండంటే రెండే మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఏకంగా 9 పరాజయాలతో లీగ్ నుంచి ని్రష్కమించిన సూపర్‌కింగ్స్‌కు మిగిలిందల్లా మిగతా మ్యాచ్‌లు ఆడి గెలవడమే! జోరు మీదున్న కోల్‌కతాను ఆపుతుందా... మరో భంగపాటుతో అట్టడునే నిలుస్తుందో చూడాలంటే చీకటి పడేదాకా ఆగాల్సిందే!


