
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు ఏ మాత్రం మారలేదు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమి పాలైంది. మరోసారి సీఎస్‌కే బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులకే పరిమితమైంది.
సీఎస్‌కే బ్యాటర్లలో శివమ్ దూబే(31 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. విజయ్ శంకర్(29) కాస్త ఫర్వాలేదన్పించాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు కీలక మూడు వికెట్లు పడగొట్టి సీఎస్‌కే పతనాన్ని శాసించాడు. నరైన్‌తో పాటు హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు, వైభవ్ ఆరోరా, మోయిన్ అలీ తలా వికెట్ సాధించారు. కెప్టెన్ ధోని(1) సైతం తీవ్రనిరాశపరిచాడు.
సునీల్ నరైన్ విధ్వంసం..
అనంతరం 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 10.1 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో సునీల్ నరైన్(18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డికాక్(23 ), రహానే(20 నాటౌట్), రింకూ సింగ్(15 నాటౌట్) రాణించారు.
సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలా వికెట్ సాధించారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన సునీల్ నరైన్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా సీఎస్‌కేకు వరుసగా ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం.
చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని.. ఐపీఎల్ హిస్టరీలోనే