Sunil Narine
-
స్టోయినిస్ ఆల్‌రౌండ్ షో.. సునీల్ నరైన్ మాయాజాలం (3-0-3-3)
గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినిస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ టోర్నీలో సర్రే జాగ్వర్స్కు ప్రాతనిథ్యం వహిస్తున్న స్టోయినిస్.. టోరంటో నేషనల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తో ఆతర్వాత బంతితో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాగ్వర్స్.. స్టోయినిస్ హాఫ్ సెంచరీతో (37 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. జాగ్వర్స్ ఇన్నింగ్స్‌లో కైల్ మేయర్స్ (27), విరన్‌దీప్ సింగ్ (23 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సునీల్ నరైన్ (2), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (18), శ్రేయస్ మొవ్వ (4), మొహమ్మద్ నబీ (13) నిరాశపరిచారు. టోరంటో బౌలర్లలో రోహిద్ ఖాన్, జునైద్ సిద్దిఖీ తలో రెండు వికెట్లు, రొమారియో షెపర్డ్, జతిందర్‌పాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టోరంటో.. స్టోయినిస్ (4-1-19-3), సునీల్ నరైన్ (3-0-3-3), మొహమ్మద్ నబీ (2-0-6-2), బెన్ లిస్టర్ (3-0-14-1), హర్మీత్ సింగ్ (2.1-0-18-1) దెబ్బకు 17.1 ఓవర్లలో 81 పరుగులకు ఆలౌటైంది. టోరంటో ఇన్నింగ్స్‌లో ఉన్ముక్త్ చంద్ (21), డస్సెన్ (15), కిర్టన్ (11), రోహిత్ పౌడెల్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. భారీ హిట్టర్లు రోస్టన్ ఛేజ్ (8), కొలిన్ మున్రో (4), రొమారియో షెపర్డ్ దారుణంగా విఫలమయ్యారు.కాగా, గ్లోబల్ టీ20 కెనడా అనే టోర్నీ కెనడా వేదికగా జరిగే క్రికెట్ లీగ్. ఈ లీగ్‌లోనూ మిగతా లీగ్‌లలో లాగే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెటర్లు పాల్గొంటారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు (మాంట్రియాల్ టైగర్స్, టోరంటో నేషనల్స్, సర్రే జాగ్వర్స్, బ్రాంప్టన్ వోల్వ్స్, బంగ్లా టైగర్స్, వాంకోవర్ నైట్స్) పాల్గొంటాయి. లీగ్ మ్యాచ్‌ల అనంతరం తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి. ప్రస్తుత సీజన్ ఈనెల 25న మొదలైంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో మాంట్రియల్ టైగర్స్ టాప్‌లో ఉంది. ఈ లీగ్‌లో డేవిడ్ వార్నర్, మార్కస్ స్టోయినిస్, సునీల్ నరైన్, కార్లోస్ బ్రాత్‌వైట్, మొహమ్మద్ ఆమిర్, మొహమ్మద్ నబీ, కైల్ మేయర్స్, క్రిస్ లిన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, టిమ్ సీఫర్ట్, నవీన్ ఉల్ హక్, షకీబ్ అల్ హసన్, రహ్మానుల్లా గుర్బాజ్, డస్సెన్, కొలిన్ మున్రో, రొమారియో షెపర్డ్ లాంటి టీ20 స్టార్లు పాల్గొంటున్నారు. -
అతడు గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకురావచ్చా? అని అడిగాడు: గంభీర్
ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచిన విషయం విధితమే. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కేకేఆర్.. టోర్నీ అసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచి ముచ్చటగా మూడో సారి టైటిల్‌ను ముద్దాడింది.అయితే కేకేఆర్ విజేతగా నిలవడంలో ఆ జట్టు మెంటార్ గౌతం గంభీర్ ది కీలక పాత్ర. కేకేఆర్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన గౌతీ.. ఈసారి మెంటార్‌గా ట్రోఫీని అందించాడు. అయితే ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్ విజేతగా కేకేఆర్ నిలిచిన అనంతరం గంభీర్ ఇంటర్వ్యూలతో బీజీబీజీగా ఉన్నాడు. తాజాగా ఎన్డీటీవీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్.. కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నరైన్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, తను ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడడని గంభీర్ చెప్పుకొచ్చాడు.కాగా సునీల్ నరైన్ తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి కేకేఆర్ ఫ్రాంచైజీలోనే కొనసాగుతున్నాడు. ఈ ఏడాది సీజన్లో నరైన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఓపెనర్‌గా వచ్చి ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు.ఓవరాల్‌గా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సునీల్.. కేకేఆర్ మూడోసారి ఛాంపియన్‌గా నిలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. అయితే నరైన్‌ను ఓపెనర్‌గా పరిచయం చేసింది గౌతం గంభీర్‌నే. 2012 సీజన్లో నరైన్‌ను ఓపెనర్‌గా పరిచియం చేసి విజయవంతమైన గంభీర్.. సారథిగా కేకేఆర్‌కు తొలి టైటిల్‌ను అందించాడు.నా గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీఎల్‌కు తీసుకురావచ్చా?"నాది, సునీల్ నరైన్ మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది. అదే విధంగా మేము ఇద్దరం కూడా పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వము. ఐపీఎల్-2012 సీజన్లో తొలిసారి నరైన్‌తో నాకు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో జై పూర్లో మా ప్రాక్టీస్‌ను ముగించుకుని లంచ్ చేసేందుకు సిద్దమయ్యాం.. ఈ క్రమంలో నరైన్‌కు లంచ్‌కు పిలిచాను. నాకు ఇప్పటికి బాగా గుర్తు ఉంది. నేను పిలవగానే అతను చాలా సిగ్గుపడ్డాడు. లంచ్ సమయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. నా గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీఎల్‌కు తీసుకురావచ్చా? అని అడిగాడు. నరైన్ తన మొదటి సీజన్లో చాలా సైలెంట్‌గా ఉన్నాడు. కానీ నరైన్ ఇప్పుడు ఒకప్పుడులా లేడు. అతడితో నేను ఎదైనా మాట్లాడవచ్చు. సునీల్ కూడా నాతో స్వేఛ్చగానే మాట్లాడుతాడు. నేను ఎప్పుడు అతడిని సహచరుడిగా, స్నేహితుడిగా చూడలేదు. సునీల్ నా సొంత సోదరుడిలా భావించాను. తనకు ఏ అవసరమోచ్చినా నేను ముందుంటాను. అదే విధంగా నాకు ఏ సమస్య ఉన్నా తను కూడా ముందుంటాడు. మేము ఆడంబరంగా ఉండం. కానీ మా బాధ్యతను 100 శాతం నిర్వర్తించేందుకు అన్ని విధాలగా ప్రయత్నిస్తామని" ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు. -
ఐపీఎల్ 2024 అవార్డు విన్నర్లు వీరే..!
ఐపీఎల్ 2024 సీజన్ నిన్నటితో (మే 26) ముగిసింది. ఫైనల్లో కేకేఆర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి విజేతగా ఆవిర్భవించింది. ఐపీఎల్లో కేకేఆర్‌కు ఇది మూడో టైటిల్. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌కు పదేళ్ల నిరీక్షణ అనంతరం మరో టైటిల్‌ను అందించాడు.కేకేఆర్ పేసర్ స్టార్క్ ఫైనల్లో అద్భుతమైన గణంకాలతో సత్తా చాటి కేకేఆర్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సునీల్ నరైన్ మూడోసారి మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లను అందుకున్నారు. మరికొందరు ఆటగాళ్లు వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నారు. ఐపీఎల్ 2024 ఛాంపియన్స్- కేకేఆర్రన్నరప్- సన్‌రైజర్స్ హైదరాబాద్ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు)- విరాట్ కోహ్లి (ఆర్సీబీ, 15 మ్యాచ్‌ల్లో 741 పరుగులు)పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు)- హర్షల్ పటేల్ (పంజాబ్, 14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు)మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్- సునీల్ నరైన్ (కేకేఆర్, 14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు, 17 వికెట్లు)ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్- నితీశ్ కుమార్ రెడ్డి (సన్‌రైజర్స్ హైదరాబాద్)ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- మిచెల్ స్టార్క్ (కేకేఆర్, 3-0-14-2)ఎలెక్ట్రిక్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్- జేక్ ఫ్రేసర్ మెక్‌గుర్క్ (ఢిల్లీ)గేమ్ ఛేంజర్ ఆఫ్ ద సీజన్- సునీల్ నరైన్ (కేకేఆర్)పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్- రమణ్‌దీప్ సింగ్ (కేకేఆర్)ఫెయిర్ ప్లే అవార్డు- సన్‌రైజర్స్ హైదరాబాద్విన్నర్ ప్రైజ్‌మనీ- రూ. 20 కోట్లు (కేకేఆర్)రన్నరప్ ప్రైజ్‌మనీ- రూ. 12.5 కోట్లు (సన్‌రైజర్స్) -
ఐపీఎల్ 2024 ప్రైజ్ మనీ ఎవరికి ఎన్ని కోట్లు ?
-
IPL 2024: 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు
కేకేఆర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ఎవరికీ సాధ్యంకాని అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు అత్యంత విలువైన ఆటగాడి అవార్డు (MVP) అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2012.. తన డెబ్యూ సీజన్లో తొలిసారి ఈ అవార్డు అందుకున్న నరైన్.. 2018 సీజన్లో.. తాజాగా 2024 సీజన్లో అత్యంత విలువైన ఆటగాడి అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టిన నరైన్.. 2018 సీజన్లో 357 పరుగులు, 17 వికెట్లు.. 2012 సీజన్లో 24 వికెట్లు పడగొట్టాడు.ఈ సీజన్లో మెంటార్ గంభీర్ చొరవతో ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన నరైన్.. సుడిగాలి ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ సీజన్లో నరైన్ బ్యాట్ నుంచి సెంచరీ, 3 అర్దసెంచరీలు జాలువారాయి. సీజన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నరైన్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో నరైన్ బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 11వ స్థానంలో నిలిచాడు.ఇదిలా ఉంటే, కేకేఆర్ ఐపీఎల్లో తమ మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. నిన్న (మే 26) జరిగిన 2024 సీజన్ ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్‌గా అవతరించింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ (3-0-14-2, 2 క్యాచ్‌లు) ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మెరుపు వీరులు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా విఫలమయ్యారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. -
IPL 2024: కేకేఆర్ వెనుక 'గంభీరం'
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈ సీజన్లో ఆధ్యాంతం అద్భుత విజయాలు సాధించిన కేకేఆర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ అన్ని రంగాల్లో సత్తా చాటి పదేళ్ల తర్వాత మరోసారి ఐపీఎల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.Shreyas Iyer handed the Trophy to Rinku Singh for celebration.- The Leader. 👌 pic.twitter.com/V8Pb55ZPQX— Johns. (@CricCrazyJohns) May 26, 2024ఆటగాళ్లతో సమానమైపాత్ర..ఈ సీజన్లో కేకేఆర్ విజయాల్లో ఆటగాళ్ల పాత్ర ఎంత ఉందో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ పాత్ర కూడా అంతే ఉంది. ఈ సీజన్‌తోనే కేకేఆర్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్.. ఆ జట్టు సాధించిన ప్రతి విజయంలోనూ తనదైన ముద్ర వేశాడు.Third most successful IPL franchise in league history - KKR. pic.twitter.com/bYnKkbujXi— Johns. (@CricCrazyJohns) May 26, 2024పేరుకు తగ్గట్టుగానే గంభీరంగా..ఆన్ ఫీల్డ్ అయినా.. ఆఫ్ ద ఫీల్డ్ అయినా గంభీరంగా కనిపించే గంభీర్ పేరుకు తగ్గట్టుగానే కేకేఆర్ విజయాల్లో గంభీరమైన పాత్ర పోషించాడు. గంభీర్ తనకు మాత్రమే సాధ్యమైన సాహసోపేతమైన నిర్ణయాలతో కేకేఆర్‌ను గెలుపుబాట పట్టించాడు. గంభీర్ ఆధ్వర్యంలో కేకేఆర్ ఈ సీజన్లో కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. Gautam Gambhir with IPL Trophy. ❤️ pic.twitter.com/LI2HLwEpiH— Johns. (@CricCrazyJohns) May 26, 2024నరైన్ సక్సెస్ వెనుక కూడా గంభీరుడే..సునీల్ నరైన్‌కు ఓపెనర్‌గా ప్రమోషన్ ఇచ్చి సత్ఫలితాలు రాబట్టిన ఘనత గంభీర్‌దే. అలాగే ఫైనల్స్ హీరో మిచెల్ స్టార్క్‌ను దక్కించుకోవడంలోనూ గంభీరే ప్రధానపాత్ర పోషించాడని అంతా అంటారు. యువ పేసర్లు హర్షిత్ రాణా, వైభవ్ అరోరాలను ప్రోత్సాహించడంలోనూ.. వెటరన్ ఆండ్రీ రసెల్‌ను వెనకేసుకురావడంలోనూ గంభీర్‌దే ప్రధానమైన పాత్ర. SUNIL NARINE - The MVP of IPL 2024. Greatest of KKR...!!!!! pic.twitter.com/1IBdxl1qRk— Johns. (@CricCrazyJohns) May 26, 2024శ్రేయస్‌ను వెన్నుతట్టి.. వెంకటేశ్‌పై విశ్వాసముంచి..శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్‌లపై విశ్వాసముంచి వారి నుంచి సత్ఫలితాలు రాబట్టిన ఘనత కూడా గంభీర్‌కే దక్కుతుంది. రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి లాంటి లోకల్ టాలెంట్లకు కూడా గంభీర్ అండగా నిలిచాడు. ఇలా ఏరకంగా చూసుకున్నా కేకేఆర్‌కు పూర్వవైభవం దక్కడంలో గంభీర్ పాత్ర ప్రధానమైందనడంలో ఎలాంటి సందేహాం లేదు.KKR players taking Gautam Gambhir in their shoulders. 👌 pic.twitter.com/XspysKKbiM— Johns. (@CricCrazyJohns) May 26, 2024సొంత అభిమానులచే ఛీత్కారాలు ఎదుర్కొన్న స్థాయి నుంచి..గడిచిన ఆరు సీజన్లలో పేలవ ప్రదర్శనతో సొంత అభిమానల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్న కేకేఆర్.. గంభీర్ రాకతో ఒక్కసారిగా నూతనోత్సాహాన్ని అందుకుని టైటిల్ ఎగరేసుకుపోయింది.షారుఖ్ పట్టుబట్టి మరీ..కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ ఈ సీజన్ కోసం గంభీర్‌ను పట్టుబట్టి మరీ ఒప్పించి లక్నో సూపర్ జెయింట్స్ నుంచి పిలిపించుకున్నాడు. మెంటార్‌గా గంభీర్‌కు కేకేఆర్ కొత్తేమో కానీ ఆటగాడిగా, కెప్టెన్‌గా గంభీర్ కేకేఆర్ అభిమానులకు సుపరిచితుడు. ఈ సీజన్లో మెంటార్‌గా కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన గంభీర్.. 2012, 2014 సీజన్లలో కెప్టెన్‌గా కేకేఆర్‌కు టైటిల్స్ అందించాడు. Gautam Gambhir & King of Indian Cinema Shah Rukh Khan with IPL Trophy 💜- The Frame for KKR legacy. pic.twitter.com/pfrFw9prKe— Johns. (@CricCrazyJohns) May 27, 2024కేకేఆర్ కెప్టెన్‌గా గంభీర్ ప్రస్తానం దీనితోనే ఆగిపోలేదు. గంభీర్ నేతృత్వంలో కేకేఆర్ 2016, 2017 సీజన్లలోనే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. దీనికి ముందు 2011 సీజన్లోనూ గంభీర్ సారథ్యంలో కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. కేకేఆర్ కెప్టెన్‌గా ఏడు సీజన్ల పాటు కొనసాగిన గంభీర్ ఈ జట్టును రెండుసార్లు ఛాంపియన్‌గా.. మూడు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు.. రెండు సీజన్లలో (2013, 2015) లీగ్ దశ వరకు విజయవంతంగా నడిపించాడు. తాజాగా మెంటార్‌గా బాధ్యతలు చేపట్టి తన ఆధ్వర్యంలో మూడోసారి కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. Shah Rukh Khan kissing Gautam Gambhir 💜- SRK brings back Gambhir again and he has written a great comeback story. pic.twitter.com/gcAjm1S2Bh— Johns. (@CricCrazyJohns) May 26, 2024షారుఖ్ విశ్వాసాన్ని నిలుపుకున్నాడు..కేకేఆర్ బాస్ షారుఖ్‌కు తనపై అపార విశ్వాసమున్నట్లు గంభీరే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు. ఈ నమ్మకాన్ని నిలుపుకుంటూ గంభీర్ పదేళ్ల తర్వాత తిరిగొచ్చి కేకేఆర్‌కు టైటిల్‌ను అందించాడు. తాజాగా కేకేఆర్ టైటిల్ గెలిచిన అనంతరం షారుఖ్ ఖాన్ గంభీర్ నుదిటిపై ముద్దు పెట్టుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన చిత్రాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. -
KKR Vs MI: సునీల్ నరైన్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు డకౌట్లగా వెనుదిరిగిన ప్లేయర్‌గా నరైన్ నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌటైన నరైన్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో నరైన్ ఇప్పటివరకు 44 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఇంతకుముందు ఈ చెత్త రికార్డు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అలెక్స్ హెల్స్ పేరిట ఉండేది. హెల్స్ 43 సార్లు డకౌటయ్యాడు. తాజా మ్యాచ్‌తో హెల్స్‌ను నరైన్ అధిగమించాడు. అదే విధంగా ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన రెండో ఆటగాడిగా పియూష్ చావ్లా సరసన సునీల్ నరైన్ నిలిచాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 16 సార్లు ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ డకౌటయ్యాడు. దీంతో పాటు మరో రికార్డును కూడా నరైన్ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్( అంతర్జాతీయ, లీగ్‌లు)లో 550 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా సునీల్ నరైన్ నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 625 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ 574 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. -
KKR Vs LSG: నరైన్ మెరుపులు
లక్నో: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ టోరీ్నలో ఎనిమిదో విజయం నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 98 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గతంలో రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా తాజా విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచి్చంది. రాజస్తాన్, కోల్‌కతా జట్లు 16 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ... మెరుగైన రన్‌రేట్‌తో కోల్‌కతా టాప్ ర్యాంక్‌ను అందుకుంది. టాస్ గెలిచి లక్నో జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు సాధించింది. ఓపెనర్ సునీల్ నరైన్ (39 బంతుల్లో 81; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరిపించాడు. ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్), రమణ్‌దీప్ సింగ్ (6 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడారు. అనంతరం 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన లక్నో జట్టు 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. స్టొయినిస్ (21 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ మరోసారి కోల్‌కతా జట్టుకు శుభారంభాన్నిచ్చారు. తొలి బంతి నుంచే వీరిద్దరు లక్నో బౌలర్ల భరతం పట్టారు. మోసిన్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో నరైన్ చెలరేగిపోయాడు. వరుసగా మూడు ఫోర్లతోపాటు ఒక సిక్స్ కూడా బాదడంతో ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. ఐదో ఓవర్లో సాల్ట్ అవుట్‌కాగా, పవర్‌ప్లే ముగిసేసరికి కోల్‌కతా 70 పరుగులు సాధించింది. పవర్‌ప్లే తర్వాత కూడా నరైన్ తన జోరు కొనసాగించాడు. 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టొయినిస్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో నరైన్ మూడు సిక్స్‌లు కొట్టాడు. రవి బిష్ణోయ్ వేసిన 12వ ఓవర్లో ఒక సిక్స్ కొట్టిన నరైన్ ఆ తర్వాత మరో భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. నరైన్ వెనుదిరిగాక... శ్రేయస్, రమణ్‌దీప్ దూకుడును కొనసాగించడంతో కోల్‌కతా స్కోరు 230 దాటింది.స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) రాహుల్ (బి) నవీనుల్ 32; నరైన్ (సి) సబ్–పడిక్కల్ (బి) బిష్ణోయ్ 81; రఘువంశీ (సి) రాహుల్ (బి) యు«ద్వీర్ 32; రసెల్ (సి) సబ్–గౌతమ్ (బి) నవీనుల్ 12; రింకూ సింగ్ (సి) స్టొయినిస్ (బి) నవీనుల్ 16; శ్రేయస్ అయ్యర్ (సి) రాహుల్ (బి) యశ్ ఠాకూర్ 23; రమణ్‌దీప్ సింగ్ (నాటౌట్) 25; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 235. వికెట్ల పతనం: 1–61, 2–140, 3–167, 4–171, 5–200, 6–224.బౌలింగ్: స్టొయినిస్ 2–0–29–0, మోసిన్ ఖాన్ 2–0–28–0, నవీనుల్ హక్ 4–0–49–3, యశ్ ఠాకూర్ 4–0–46–1, కృనాల్ పాండ్యా 2–0–26–0, రవి బిష్ణోయ్ 4–0–33–1, యు«ద్వీర్ సింగ్ 2–0–24–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) రమణ్‌దీప్ (బి) హర్షిత్ 25; అర్షిన్ (సి) రమణ్‌దీప్ (బి) స్టార్క్ 9; స్టొయినిస్ (సి) హర్షిత్ (బి) రసెల్ 36; దీపక్ హుడా (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 5; పూరన్ (సి) సాల్ట్ (బి) రసెల్ 10; బదోని (సి) స్టార్క్ (బి) నరైన్ 15; టర్నర్ (సి అండ్ బి) వరుణ్ 16; కృనాల్ పాండ్యా (సి) సాల్ట్ (బి) హర్షిత్ 5; యు«ద్వీర్ (సి) రసెల్ (బి) వరుణ్ 7; బిష్ణోయ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షిత్ 2; నవీనుల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 137. వికెట్ల పతనం: 1–20, 2–70, 3–77, 4–85, 5–101, 6–109, 7–125, 8–129, 9–137, 10–137.బౌలింగ్: వైభవ్ 2–0–21–0, స్టార్క్ 2–0–22–1, నరైన్ 4–0–22–1, హర్షిత్ రాణా 3.1–0–24–3, వరుణ్ చక్రవర్తి 3–0–30–3, రసెల్ 2–0–17–2. -
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కేకేఆర్ తమ ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకున్నట్లే. కేకేఆర్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 16.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి తలా మూడు వికెట్ల పడగొట్టగా.. రస్సెల్ రెండు, స్టార్క్, నరైన్ చెరో వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(36) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫిల్ సాల్ట్(32), రఘువంశీ(32), రమణ్ దీప్ సింగ్(6 బంతుల్లో 25) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్- హాక్ మూడు వికెట్లు పడగొట్టగా.. బిష్ణోయ్, యుద్దవీర్, యష్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు. -
KKR Vs LSG: నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు.నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫిల్ సాల్ట్(32), రఘువంశీ(32), రమణ్ దీప్ సింగ్(6 బంతుల్లో 25) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్- హాక్ మూడు వికెట్లు పడగొట్టగా.. బిష్ణోయ్, యుద్దవీర్, యష్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు. -
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2024లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన మార్క్‌ను చూపించలేకపోతుకున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం వాఖండే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ నిరాశపరిచాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన హిట్‌మ్యన్.. కేకేఆర్ బౌలర్లను ఎదుర్కోవడానికి తీవ్రంగా కష్టపడ్డాడు.ఈ క్రమంలో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాగా ఐపీఎల్లో నరైన్ బౌలింగ్‌లో రోహిత్ ఔట్ కావడం ఇది ఎనిమిదో సారి.దీంతో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔట్ అయిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అంతకుముందు రోహిత్ శర్మ స్పిన్నర్ అమిత్ మిశ్రా చేతిలో కూడా 7 సార్లు ఔటయ్యాడు. రోహిత్ పాటు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, రిషబ్ పంత్, రహానే కూడా 7 సార్లు ఒకే బౌలర్ చేతిలో ఔటయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్‌పై కేకేఆర్ 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
KKR vs PBKS: టీ20లలో సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఇదే తొలిసారి
ఈడెన్ గార్డెన్స్‌లో శుక్రవారం పరుగుల వరద పారింది. కోల్‌కతా నైట్ రైడర్స్- పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు బౌలర్లపై కనికరం లేకుండా విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతూ కురిపించిన ఫోర్లు, సిక్సర్ల వర్షంలో మైదానం తడిసి ముద్దైంది.ఇరు జట్లు పోటాపోటీగా హిట్టింగ్ చేస్తూ 37 ఫోర్లు.. 42 సిక్సర్లు బాదడంతో ఏకంగా 523 పరుగుల స్కోరు నమోదైంది. అయితే, ఈ పరుగుల యుద్ధంలో పంజాబ్ కింగ్స్ పైచేయి జయకేతనం ఎగురువేసింది. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది.ఐపీఎల్-2024లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(37 బంతుల్లో 75)- సునిల్ నరైన్(32 బంతుల్లో 71) దుమ్ములేపగా.. వన్‌డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(39) రాణించాడు.వీరితో పాటు రసెల్(12 బంతుల్లో 24), శ్రేయస్ అయ్యర్(10 బంతుల్లో 28) ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, 17 సిక్స్‌లు నమోదయ్యాయి.ఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 18.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 54), జానీ బెయిర్ స్టో (48 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో 108(నాటౌట్)), రీలీ రోసో(16 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్స్‌ల సాయంతో 26), శశాంక్ సింగ్(28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 68 నాటౌట్) దుమ్ములేపారు.ఈ నేపథ్యంలో పంజాబ్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 24 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ క్రమంలో పంజాబ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు బ్రేక్ చేసింది. ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా.. రైజర్స్ పేరు చెరిపేసి ఆ ఘనతను తన పేరిట లిఖించుకుంది. ఇటీవల రైజర్స్ ఆర్సీబీ మీద 22 సి👉క్స్లు బాదింది.ఇక సిక్సర్ల విషయంలో పంజాబ్ ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో రెండోస్థానంలో నిలిచింది. ఆసియా క్రీడలు-2023లో భాగంగా నేపాల్ జట్టు మంగోలియా మీద 26 సిక్స్‌లు కొట్టింది.ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక సిక్స్‌లు, సాధించిన జట్లు👉24- పంజాబ్ కింగ్స్- కేకేఆర్ మీద- కోల్‌కతాలో- 2024👉22- సన్‌రైజర్స్- ఆర్సీబీ మీద- బెంగళూరులో- 2024👉22- సన్‌రైజర్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మీద- ఢిల్లీలో- 2024👉21- ఆర్సీబీ- పుణె వారియర్స్ మీద- బెంగళూరు- 2013 .పురుషుల టీ20లలో అత్యధిక సిక్సర్లు నమోదైన టాప్-3 మ్యాచ్‌లు👉42- కేకేఆర్- పంజాబ్- కోల్‌కతా- 2024👉38- సన్‌రైజర్స్- ముంబై ఇండియన్స్- హైదరాబాద్- 2024👉38- ఆర్సీబీ- సన్‌రైజర్స్- బెంగళూరు- 2024🎥 Ruthless Hitting 💥Will #PBKS get this over the line? 🤔83 runs required from 42 deliveries‼️Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvPBKS pic.twitter.com/MvCvQQxmoe— IndianPremierLeague (@IPL) April 26, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టీ20 వరల్డ్‌కప్‌లో రీఎంట్రీపై విండీస్ వీరుడి స్పందన ఇదే..!
విండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ టీ20 వరల్డ్‌కప్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తాడని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై నరైన్ తాజాగా స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడం అసాధ్యమని స్పష్టం చేశాడు. రీఎంట్రీకి డోర్లు మూసుకుపోయాయని అన్నాడు. ఇటీవలికాలంలో తన ప్రదర్శనలు సంతృప్తినిచ్చాయని తెలిపాడు. టీ20 వరల్డ్‌కప్ ఆడాలనే అభిమానుల ప్రతిపాదనను గౌరవిస్తానని అన్నాడు. అయితే అందుకు ఓకే మాత్రం చెప్పలేనని వివరించాడు. వరల్డ్‌కప్ ఆడే విండీస్ జట్టుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని.. విండీస్ వీరులు మరో టైటిల్‌కు అర్హులేనంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. నరైన్ టీ20 వరల్డ్‌కప్‌లో ఆడటంపై బహిరంగ ప్రకటన చేయడంతో విండీస్ క్రికెట్ బోర్డు ఓ అంచనాకు వచ్చింది. నరైన్‌ను టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలని ఒప్పించేందుకు తాను గతకొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని విండీస్ టీ20 జట్టు కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, నరైన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బంతితో పాటు బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ మెరపు శతకంతో (56 బంతుల్లో 109) విరుచుకుపడ్డాడు. ఈ సీజన్లో నరైన్ 7 మ్యాచ్‌ల్లో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 286 పరుగులు చేశాడు. 9 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ సీజన్లో కేకేఆర్ సాధించిన విజయాల్లో నరైన్ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించాడు. నరైన్ ఈ సీజన్లోనే రెండు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. నరైన్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నప్పటి నుంచి అతని ఫేట్ మారిపోయింది. ఓపెనర్‌గా అతను స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ భారీ స్కోర్లు చేస్తున్నాడు. నరైన్‌ను ఓపెనర్‌గా పంపడం కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ ప్రతిపాదన. గతంలోనూ గంభీర్ నరైన్‌ను ఓపెనర్‌గా పంపి సత్ఫలితాలు సాధించాడు. 35 ఏళ్ల నరైన్ 2019లో చివరిసారిగా వెస్టిండీస్‌కు ఆడాడు. అతను 2023లో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. తాజా బ్యాటింగ్ ఫామ్ నేపథ్యంలో నరైన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ కోసం చాలామంది వెటరన్ క్రికెటర్లు రిటైర్మెంట్ నిర్ణయాలను వెనక్కు తీసుకున్నారు. పాక్ ఆటగాళ్లు ఇమాద్ వసీం, మొహహ్మద్ ఆమిర్ టీ20 వరల్డ్‌కప్ కోసం యూ టర్న్ తీసుకున్నారు. -
సునీల్ నరైన్ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ వెనక్కి!?
వెస్టిండీస్ మాజీ క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ సునీల్ నరైన్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నరైన్ తన అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు తిరిగి జాతీయ జట్టుకు ఆడేందుకు నరైన్ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విండీస్ క్రికెట్‌తో పాటు ఆ జట్టు టీ20 కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ సైతం నరైన్‌ను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయంపై విండీస్ క్రికెట్ నుంచి కానీ నరైన్ నుంచి కానీ ఇప్పటవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా నరైన్ ప్రస్తుతం ఐపీఎల్-2024 సీజన్లో దుమ్ములేపుతున్నాడు. ఆటు బ్యాట్‌తోనూ ఇటు బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌గా వస్తున్న నరైన్ ప్రత్యర్ధి జట్లపై విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన నరైన్.. 276 పరుగులు చేశాడు. ఆటు బౌలింగ్‌లోనూ 7 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడినిటీ20 వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్లో భాగం చేయాలని విండీస్ క్రికెట్ ప్లాన్ చేస్తోంది. కాగా నరైన్ గతేడాది నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు విండీస్ తరపున చివరి మ్యాచ్ 2019లో ఆడాడు. -
IPL 2024: రెండు సెంచరీలకు విలువ లేకుండా చేసిన బట్లర్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర ఆటగాడు జోస్ బట్లర్ హవా కొనసాగుతుంది. ఈ సీజన్లో అతను 6 మ్యాచ్‌ల్లో 2 సెంచరీల సాయంతో 250 పరుగులు చేసి సీజన్ లీడింగ్ రన్‌స్కోరర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. నిన్న (ఏప్రిల్ 16) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో (60 బంతుల్లో 107 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగిన బట్లర్.. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 36 బంతుల్లో 96 పరుగులు చేయాల్సిన దశలో బట్లర్ వీర ఉతుకుడు ఉతికి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ శతకంతో ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్న బట్లర్.. ఎవరూ గమనించని ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బట్లర్ సెంచరీలు చేసిన రెండు సందర్భాల్లో ప్రత్యర్ధి జట్టులోని బ్యాటర్లు కూడా శతకాలు చేశారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అజేయ శతకంతో (113) చెలరేగగా.. నిన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరైన్ (109) సెంచరీతో కదంతొక్కాడు. ఈ రెండు సందర్భాల్లో బట్లర్ మెరుపు శతకాలతో సునామీలా విరుచుకుపడి ప్రత్యర్ధి ఆటగాళ్లు చేసిన సెంచరీలకు విలువ లేకుండా చేశాడు. పోతే.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో విజయవంతమైన లక్ష్య ఛేదనలో సెంచరీ చేసిన బట్లర్.. ఐపీఎల్ హిస్టరీలో మూడు సార్లు ఛేజింగ్‌లో సెంచరీలు చేసి ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీతో (7) బట్లర్ ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్‌ను (6) వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో విరాట్ (8) టాప్‌లో ఉన్నాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో బట్లర్ మెరుపు సెంచరీతో విరుచుకుపడటంతో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం సాధించింది. బట్లర్ సెంచరీతో కేకేఆర్ ఆటగాడు నరైన్ చేసిన సెంచరీ వృధా అయ్యింది. -
T20 WC: బతిమిలాడుతున్నా వినడం లేదు.. ఇక వాళ్లదే భారం!
ఐపీఎల్ 2024.. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో చేసిన పరుగులు 276.. పడగొట్టిన వికెట్లు ఏడు(7/165).. కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్ నమోదు చేసిన గణాంకాలివి. రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో 35 ఏళ్ల ఈ వెస్టిండీస్ ఆటగాడు కుర్రాళ్ల కళ్లు చెదిరే రీతిలో అద్బుతమైన షాట్లతో అలరించాడు. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా ఇరగదీస్తున్నాడు విధ్వంసకర శతకంతో విరుచుకుపడి తన ఆటలో పస తగ్గలేదని మరోసారి నిరూపించాడు. కేకేఆర్‌కు దొరికిన విలువైన ఆస్తి అంటూ నీరాజనాలు అందుకుంటున్నాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. 𝐍𝐚𝐫𝐢𝐧𝐞, naam toh suna hi hoga 😉 He scores his maiden 💯 in T20s at the iconic Eden Gardens 🏟️#KKRvRR #TATAIPL #IPLonJioCinema #SunilNarine | @KKRiders pic.twitter.com/TKFSFsc3Lp — JioCinema (@JioCinema) April 16, 2024 కేవలం పరుగుల తీయడానికే పరిమితం కాని ఈ రైటార్మ్ స్పిన్నర్.. రెండు వికెట్లు పడగొట్టాడు. అలాగే ఓ క్యాచ్ కూడా అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు క్యాచ్, వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 12 నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నా ఇక ఈ వెటరన్ ఆల్‌రౌండర్ ప్రతిభకు వెస్టిండీస్ కెప్టెన్, రాజస్తాన్ రాయల్స్ హిట్టర్ రోవ్‌మన్ పావెల్ కూడా ఫిదా అయ్యాడు. నరైన్‌ను ఎలాగైనా ఒప్పించి ఈసారి వరల్డ్‌కప్‌లో ఆడించే ప్రయత్నం చేస్తామంటున్నాడు. కేకేఆర్‌పై రాజస్తాన్ విజయంలో తన వంతు పాత్ర పోషించిన పావెల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘గత 12 నెలలుగా నేను నరైన్ చెవిలో జోరీగలా మొత్తుకుంటూనే ఉన్నాను. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోమని అడుగుతున్నాను. కానీ అతడు ఏదో దాస్తున్నాడు. ఎవరితోనూ తన మనసులోని భావాలు పంచుకోవడం లేదు. ఈ విషయం గురించి ఇప్పటికే కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్‌లతో చర్చించాను.ప్రపంచకప్ జట్టు ఎంపిక కంటే ముందే వీళ్లు అతడి మనసులో ఏముందో కనిపెట్టగలరనే అనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. విండీస్‌లో ఈసారి వరల్డ్‌కప్ జూన్ 1 నుంచి వెస్టిండీస్- అమెరికా వేదికగా మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024లో సునిల్ నరైన్ ఆడించడమే తన లక్ష్యమని రోవ్‌మన్ పావెల్ ఈ సందర్భంగా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో చెప్పుకొచ్చాడు. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో పావెల్ 13 బంతుల్లో 26 పరుగులు చేసి నరైన్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో 29 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న నరైన్.. మరో 20 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. 2023లో రిటైర్ అయిన నరైన్ 2012, 2014 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో వెస్టిండీస్ తరఫున బరిలోకి దిగిన సునిల్ నరైన్.. 2019 నుంచి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో.. 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే ఫ్రాంఛైజీ క్రికెట్లో మాత్రం ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. చదవండి: #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అసలు ఆ ఓవర్లో అన్ని పరుగులిస్తావా?.. స్టార్క్‌పై ఆగ్రహం
#Starc: కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. కోట్లు పెట్టి కొన్నందుకు అతడి వల్ల జట్టుకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందని సొంత జట్టు అభిమానులే ఫైర్ అవుతున్నారు. కాగా ఐపీఎల్-2024 వేలంలో భాగంగా కేకేఆర్ మిచెల్ స్టార్క్ కోసం మిగతా ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ అతడిని సొంతం చేసుకుంది. ఇందుకోసం ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఈ ఆసీస్ స్టార్ రికార్డులకెక్కాడు. కానీ అందుకు తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేకపోతున్నాడు. పదిహేడో ఎడిషన్‌లో తొలి రెండు మ్యాచ్‌లో వికెట్లు తీయలేకపోయిన స్టార్క్.. ఆ తర్వాత గాడిలో పడ్డట్లే కనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై రెండు.. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. అసలు ఆ ఓవర్లో అన్ని పరుగులిస్తావా? అయితే.. రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో మరోసారి విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన స్టార్క్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఏకంగా 50 పరుగులు లీక్ చేశాడు. ముఖ్యంగా కీలకమైన పద్దెనిమిదవ ఓవర్లో 18 పరుగులు ఇవ్వడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక కేకేఆర్ మిగిలిన బౌలర్లలో స్పిన్నర్లు సునిల్ నరైన్ (2/30), వరుణ్ చక్రవర్తి (2/36) మెరుగ్గా ఆడగా.. స్టార్క్‌తో పాటు పేస్ విభాగంలో వైభవ్ అరోరా(1/45), హర్షిత్ రాణా (2/45) భారీగా పరుగులు ఇచ్చారు. అయితే, వీరిద్దరు వికెట్లు కూడా తీశారు. కానీ ఎంతో అనుభవం ఉన్న స్టార్క్ ఒక్క వికెట్ కూడా తీయలేక చతికిలపడ్డాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతికి సింగిల్ తీసిన సెంచరీ వీరుడు జోస్ బట్లర్ రాజస్తాన్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. పైసా వసూల్ మాత్రమే.. ప్రదర్శన లేదు ఫలితంగా వరుస విజయాలతో జోరు మీదున్న కేకేఆర్‌కు ఓటమి ఎదురైంది. ఈ క్రమంలో స్టార్క్ విమర్శకుల టార్గెట్‌గా మారాడు. స్టార్క్ కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి ఉంటే కేకేఆర్‌కు భంగపాటు తప్పేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నెట్టింట అయితే.. అతడిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ‘‘రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టి కొంటే పైసా వసూల్ మాత్రమే.. ప్రదర్శన లేదు’’ అంటూ స్టార్క్‌పై సెటైర్లు వేస్తున్నారు. అయితే, అతడి ఫ్యాన్స్ మాత్రం అండగా నిలుస్తూ.. కీలక సమయంలో రాణించి తన విలువేంటో చాటుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు: ►వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►కేకేఆర్ స్కోరు: 223/6 (20) ►రాజస్తాన్ స్కోరు: 224/8 (20) ►ఫలితం: రెండు వికెట్ల తేడాతో కేకేఆర్‌పై రాజస్తాన్ విజయం Another Last Over Thriller 🤩 A Jos Buttler special guides @rajasthanroyals over the line and further extends their lead at the 🔝 🙌 🙌 Scorecard ▶️ https://t.co/13s3GZLlAZ #TATAIPL | #KKRvRR pic.twitter.com/d3FECR81X1 — IndianPremierLeague (@IPL) April 16, 2024 చదవండి: ఐపీఎల్ చరిత్రలో తొలి జట్టుగా రాజస్తాన్ ఆల్‌టైమ్ రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. అందుకే వరుణ్ చేతికి బంతి!
రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్ ఆద్యంతం తమను భావోద్వేగాల డోలికలో ఊగిసలాడేలా చేసిందని.. కానీ తమకు ఈ పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు. ఏదేమైనా ఈ ఓటమిని అంగీకరించక తప్పదన్న శ్రేయస్.. టోర్నీ మధ్యలో ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఒక రకంగా మంచిదైందని పేర్కొన్నాడు. లోపాలు సరిచేసుకుని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగే వీలుంటుందన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్బుతంగా రాణించిన సునిల్ నరైన్ గురించి ప్రస్తావిస్తూ.. కేకేఆర్‌కు దొరికిన అత్యంత విలువైన ఆస్తి నరైన్ అని ప్రశంసించాడు. అదే విధంగా ఆఖరి ఓవర్లో బంతిని కావాలనే వరుణ్ చక్రవర్తికి ఇచ్చానన్న శ్రేయస్ అయ్యర్.. ఫలితం రాబట్టలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. On Display: 𝗘𝗳𝗳𝗼𝗿𝘁𝗹𝗲𝘀𝘀 𝗛𝗶𝘁𝘁𝗶𝗻𝗴 😍 Sunil Narine smacking it with perfection👌👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvRR | @KKRiders pic.twitter.com/yXC3F5r1SY — IndianPremierLeague (@IPL) April 16, 2024 అందుకే వరుణ్ చేతికి బంతి జోస్ బట్లర్‌ను నిలువరించేందుకు తాము అనుసరించి వ్యూహాలు ఫలించలేదని పేర్కొన్నాడు. కచ్చితంగా గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో ఓడిపోవడం బాధగా ఉందని శ్రేయస్ అయ్యర్ అసంతృప్తిని వెళ్లగక్కాడు. అయితే ఓటమినే తలచుకుంటూ కూర్చోలేమని.. తదుపరి మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతామని శ్రేయస్ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా సొంతమైదానంలో కేకేఆర్‌కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో కోల్‌కతా రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఈ సీజన్లో కేకేఆర్‌కు ఇది రెండో ఓటమి. An Impactful Innings 😍 🔝 class effort from a 🔝 player ft. Jos Buttler Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvRR | @rajasthanroyals pic.twitter.com/5vz2qLIC7Z — IndianPremierLeague (@IPL) April 16, 2024 నరైన్ సుడిగాలి ఇన్నింగ్స్ వృథా ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్ 56 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్స్‌ల సాయంతో 109 పరుగులు సాధించాడు. అదే విధంగా.. రెండు వికెట్లు కూడా పడగొట్టాడు ఈ స్పిన్ ఆల్‌రౌండర్. అయితే, రాయల్స్ స్టార్ జోస్ బట్లర్ అజేయ శతకం కారణంగా నరైన్సుడిగాలి ఇన్నింగ్స్ వృథాగా పోయింది. వాళ్లిద్దరి వల్లే ఓటమి 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 14 ఓవర్ల తర్వాత రాజస్తాన్ ఆరు వికెట్లు నష్టపోయి కేవలం 128 పరుగులకే పరిమితమైన వేళ బట్లర, రోవ్‌మన్ పావెల్‌తో కలిసి దూకుడుగా ఆడాడు. పావెల్ మెరుపు ఇన్నింగ్స్(13 బంతుల్లో 26)తో ఆకట్టుకోగా.. సెంచరీ వీరుడు బట్లర్(60 బంతుల్లో 107) ఆఖరి ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఆఖరి బంతికి సింగిల్ తీసి రాజస్తాన్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు. అలా నమ్మశక్యంకాని రీతిలో కేకేఆర్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్ పైవిధంగా స్పందించాడు. బట్లర్, రోవ్‌మన్ పావెల్ అద్భుతంగా ఆడారని వారిద్దరికి క్రెడిట్ ఇచ్చాడు. చదవండి: ఐపీఎల్ చరిత్రలో తొలి జట్టుగా రాజస్తాన్ ఆల్‌టైమ్ రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వీరోచిత శతకంతో రాజస్తాన్‌ను గెలిపించిన బట్లర్ (ఫొటోలు)
-
KKR Vs RR Highlights: రాయల్స్‌కు బట్లర్ జోష్
కోల్‌కతా: కోల్‌కతాతో మ్యాచ్‌లో రాజస్తాన్ విజయలక్ష్యం 224...14 ఓవర్ల తర్వాత 128/6తో అసాధ్యంగా కనిపించింది. చివరి 6 ఓవర్లలో 96 పరుగులు కావాలి! ఈ దశలో బట్లర్ 42 పరుగుల వద్ద ఉన్నాడు. కానీ బట్లర్‌తో పాటు పావెల్ బ్యాటింగ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. వరుసగా 6 ఓవర్లలో 17, 17, 16, 18, 19, 9 పరుగుల చొప్పున రాబట్టిన రాయల్స్ విజయాన్ని అందుకుంది. ఇందులో బట్లర్ 6 ఫోర్లు, 5 సిక్స్‌లు బాదగా...పావెల్ 1 ఫోర్, 3 సిక్స్‌లు బాదాడు. ఆఖరి ఓవర్లో తొలి బంతినే సిక్స్‌గా కొట్టి 55 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్న బట్లర్... సింగిల్ తీయకుండా ఆఖరి బంతి దాకా నిలబడి గెలిపించాడు. 15వ ఓవర్లో 36 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన బట్లర్ తర్వాత సంచలన ఇన్నింగ్స్ ఆడిన మరో 21 బంతుల్లోనే వందకు చేరుకున్నాడు. దీంతో మంగళవారం జరిగిన పోరులో రాజస్తాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అనూహ్య విజయం సాధించింది. తొలుత నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (56 బంతుల్లో 109; 13 ఫోర్లు, 6 సిక్స్‌లు) తొలి సెంచరీ సాధించాడు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసి గెలిచింది. జోస్ బట్లర్ (60 బంతుల్లో 107 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. పావెల్ (13 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిపించాడు. నరైన్ ధనాధన్ ఫిల్ సాల్ట్ (10) లైఫ్‌ను సద్వినియోగం చేసుకోకపోగా, రఘువంశీ (18 బంతుల్లో 30; 5 ఫోర్లు) రాణించాడు. ఓపెనర్ నరైన్ 4, 6తో జట్టు పవర్‌ప్లేలో 56/1 స్కోరు చేసింది. సగం ఓవర్లు (10) ముగిసేసరికి నైట్‌రైడర్స్ సరిగ్గా 100/1 స్కోరు చేసింది. నరైన్ సిక్సర్‌తో 29 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఆ మరుసటి ఓవర్లో కుల్దీప్ సేన్... రఘువంశీ ఆట ముగించడంతో రెండో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (7), రసెల్ (13) జతయినా... పెద్ద స్కోర్లేమీ చేయలేకపోయారు. కానీ నరైన్ ఫోర్లు, సిక్స్‌లతో తన ఆటతీరును కొనసాగించాడు. చహల్ 16వ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదేయడంతో ఆ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. దీంతోనే అతని సెంచరీ 49 బంతుల్లో పూర్తయ్యింది. 18వ ఓవర్లో బౌల్ట్ యార్కర్‌తో నరైన్ పోరాటానికి ముగింపు పలికాడు. రింకూ సింగ్ (9 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుపులతో నైట్‌రైడర్స్ 200 పైచిలుకు స్కోరు చేసేసింది. బట్లర్ మెరుపులతో... ఓపెనర్ యశస్వి జైస్వాల్ (9 బంతుల్లో 19; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడిన అది కాసేపే కావడం, టాపార్డర్‌లో కెప్టెన్ సంజూ సామ్సన్ (12) చెప్పుకోదగ్గ స్కోరే చేయలేకపోవడం రాజస్థాన్ లక్ష్యఛేదనపై ప్రభావం చూపింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఓపెనింగ్ చేసిన బట్లర్ క్రీజును అట్టిపెట్టుకున్నాడు. కానీ ధాటిగా ఆడలేకపోయాడు. రియాన్ పరాగ్ (14 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడే క్రమంలో వికెట్ కోల్పోగా... ధ్రువ్ జురెల్ (2), అశ్విన్ (8), హెట్‌మైర్ (0) చేతులెత్తేయడంతో 121 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అండ్ (బి) అవేశ్ 10; నరైన్ (బి) బౌల్ట్; రఘువంశీ (సి) అశ్విన్ (బి) కుల్దీప్ సేన్ 30; శ్రేయస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 11; రసెల్ (సి) జురెల్ (బి) అవేశ్ 13; రింకూసింగ్ నాటౌట్ 20; వెంకటేశ్ (సి) జురెల్ (బి) కుల్దీప్ సేన్ 8; రమణ్‌దీప్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం ( 20 ఓవర్లలో 6 వికెట్లకు) 223. వికెట్ల పతనం: 1–21, 2–106, 3–133, 4–184, 5–195, 6–215. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4–0–31–1, అవేశ్ ఖాన్ 4–0–35–2, కుల్దీప్ సేన్ 4–0–46–2, చహల్ 4–0–54–1, అశ్విన్ 4–0–49–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) వెంకటేశ్ (బి) వైభవ్ 19; బట్లర్ నాటౌట్ 107; సామ్సన్ (సి) నరైన్ (బి) హర్షిత్ 12; పరాగ్ (సి) రసెల్ (బి) హర్షిత్ 34; జురెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నరైన్ 2; అశ్విన్ (సి) రఘువంశీ (బి) వరున్ 8; హెట్‌మైర్ (సి) శ్రేయస్ (బి) వరుణ్ 0; పావెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నరైన్ 26; బౌల్ట్ రనౌట్ 0; అవేశ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–22, 2–47, 3–97, 4–100, 5–121, 6–121, 7–178, 8–186. బౌలింగ్: స్టార్క్ 4–0–50–0, వైభవ్ 3–0–45–1, హర్షిత్ రాణా 4–0–45–2, నరైన్ 4–0–30–2, వరుణ్ 3–0–36–2, రసెల్ 1–0–17–0. ఐపీఎల్లో నేడు గుజరాత్ X ఢిల్లీ వేదిక: అహ్మదాబాద్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే
వెస్టిండీస్ మాజీ ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ సునీల్ నరైన్ విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ సెంచరీతో కదం తొక్కాడు. ఓపెనర్‌గా వచ్చిన నరైన్.. రాజస్తాన్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో కేవలం 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 56 బంతులు ఎదుర్కొన్న నరైన్ 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. కాగా నరైన్‌కు ఇది తన కెరీర్లోనే తొలి సెంచరీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన నరైన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. నరైన్ సాధించిన రికార్డులు ఇవే.. ►ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో సెంచరీతో పాటు క్యాచ్, వికెట్ పడగొట్టిన తొలి ప్లేయర్‌గా నరైన్ రికార్డులకెక్కాడు. కాగా 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎవరికి ఈ ఘనత సాధ్యం కాలేదు. ►ఐపీఎల్ చరిత్రలో ఐదు వికెట్ల హాల్‌తో పాటు సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు. 2012 ఐపీఎల్ సీజన్లో ఇదే ఈడెన్‌గార్డెన్స్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై నరైన్ 5 వికెట్లతో ,చెలరేగాడు. ►ఐపీఎల్లో హ్యాట్రిక్‌తో పాటు సెంచరీ కూడా సాధించిన మూడో ప్లేయర్‌గా సునీల్ నరైన్ నిలిచాడు. 2013 ఐపీఎల్ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై నరైన్ హ్యాట్రిక్ తీశాడు. ఇప్పుడు సెంచరీ చేయడంతో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వాట్సన్ ఉన్నారు. ►ఐపీఎల్లో 100 వికెట్లతో పాటు సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కూడా నరైన్ రికార్డు సృష్టించాడు. నరైన్ ఇప్పటివరకు ఐపీఎల్లో 170 వికెట్లు పడగొట్టాడు. -
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ అద్బతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో నరైన్ విధ్వంసం సృష్టించాడు. నరైన్ రాజస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడిని ఆపడం రాజస్తాన్ బౌలర్ల తరం కాలేదు. ఈ క్రమంలో కేవలం 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 56 బంతులు ఎదుర్కొన్న సునీల్.. 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. కాగా నరైన్‌కు ఇది తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. అదేవిధంగా ఐపీఎల్ సెంచరీ చేసిన మూడో కేకేఆర్ ఆటగాడిగా నరైన్ రికార్డులకెక్కాడు. అంతేకాకుండా ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో ఆటగాడిగా నరైన్(109) నిలిచాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం బ్రెండన్ మెక్కల్లమ్(158) తొలి స్ధానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్(109)తో పాటు రఘువంశీ(30), రింకూ సింగ్(20) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్‌ఖాన్, కుల్దీప్ సేన్ తలా రెండు వికెట్లు సాధించగా.. చాహల్, బౌల్ట్ తలా వికెట్ పడగొట్టారు. Sunil Narine is so good with the bat, bro makes Gautam Gambhir smile #KKRvRR pic.twitter.com/t96frzwSP7 — Shayarcaster (@shayarcaster) April 16, 2024 -
IPL 2024 GT VS PBKS: శుభ్‌మన్ గిల్ కిర్రాక్ ఇన్నింగ్స్.. సీజన్ టాప్ స్కోర్
పంజాబ్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 4) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కిర్రాక్ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ అయ్యాక తొలి హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్లో గిల్ తొలిసారి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 48 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. SHUBMAN GILL HAS THE HIGHEST INDIVIDUAL SCORE IN IPL 2024. ⭐🔥 pic.twitter.com/Rl8Yv0gHlo — Johns. (@CricCrazyJohns) April 4, 2024 ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై సునీల్ నరైన్ చేసిన 85 పరుగులు గిల్ ఇన్నింగ్స్‌కు ముందు సీజన్ టాప్ స్కోర్‌గా ఉండింది. గంటల వ్యవధిలోనే గిల్..నరైన్ స్కోర్‌ను అధిగమించి సీజన్ టాప్ స్కోరర్‌గా అవతరించాడు. MAGIC HANDS OF CAPTAIN GILL. 👌🔥pic.twitter.com/ZvJrDpRhVR — Johns. (@CricCrazyJohns) April 4, 2024 పంజాబ్‌తో మ్యాచ్‌లో గుజరాత్ ఓటమిపాలైనప్పటికీ గిల్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. ఈ ఇన్నింగ్స్‌లో గిల్ చూడచక్కటి షాట్లు ఆడాడు. గిల్ కొట్టిన సిక్సర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గిల్ సునాయాసంగా బంతులను బౌండరీ లైన్ పైకి తరలించాడు. ఐపీఎల్లో గిల్ బ్యాట్ నుంచి జాలువారిన క్లాసీ ఇన్నింగ్స్‌లో ఇది ఒకటి. A Shubman Gill fan doing his trademark move at the yesterday's match.👌 pic.twitter.com/3iFcZ2uA0r— CricketMAN2 (@ImTanujSingh) April 5, 2024 కాగా, పంజాబ్‌తో మ్యాచ్‌లో గిల్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగినప్పటికీ.. శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) అంతకంటే మెరుగైన ఇన్నింగ్స్‌లు ఆడి పంజాబ్‌ను గెలిపించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్‌మన్ గిల్ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (35) రెచ్చిపోవడంతో పంజాబ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో గుజరాత్‌ను వెనుక్కునెట్టి ఐదో స్థానానికి చేరుకుంది. -
IPL 2024: ఐపీఎల్‌పై అవాక్కులు చవాక్కులు పేలిన పాక్ మాజీ ఆటగాడు
భారత క్రికెట్‌పై, క్రికెటర్లపై అక్కసు వెళ్లగక్కడం పాకిస్తాన్ క్రికెటర్లకు పరిపాటిగా మారింది. సందర్భం ఏదైనా సరే పాక్ ప్రస్తుత, మాజీలు భారత క్రికెట్‌పై నోరుపారేసుకుంటుంటారు. తాజాగా ఓ పాక్ మాజీ భారత క్రికెట్లో అంతర్బాగమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై అవాక్కులు చవాక్కులు పేలాడు. 34 ఏళ్ల పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్ ఐపీఎల్‌ను, ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లను ఉద్దేశిస్తూ ఓర్వలేని కామెంట్లు చేశాడు. ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ను జునైద్ చులకన చేసే ప్రయత్నం చేశాడు. In IPL batting is so easy on these flat pitches, Sunil Narine has scored a total of 155 in his international T20 career and today he has scored 85 as an opener. The team total is 272.#KKRvsDC #IPL2024 — Junaid khan (@JunaidkhanREAL) April 3, 2024 ఐపీఎల్లో (భారత్‌లో) ఫ్లాట్ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం చాలా సులువని.. అంతర్జాతీయ కెరీర్ (టీ20ల్లో) మొత్తంలో 155 పరుగులు చేసిన నరైన్ ఒక్క ఇన్నింగ్స్‌లోనే 85 పరుగులు చేయడమే ఇందుకు నిదర్శనమని ట్విటర్ వేదికగా అర్దంపర్దం లేని కామెంట్లు చేశాడు. It's sad to see leagues are being prioritised over the team that gave them all the respect. 11/12 senior players are not available for an international series.#PAKvNZ #pakistan https://t.co/MlPrSycxNb — Junaid khan (@JunaidkhanREAL) April 3, 2024 జునైద్ ఈ ట్వీట్ చేయకముందు న్యూజిలాండ్ క్రికటర్లను సైతం అవమానిస్తూ ఓ ట్వీట్ చేశాడు. న్యూజిలాండ్ క్రికెటర్లకు జాతీయ జట్టు ప్రయోజనాల కంటే ఐపీఎలే ముఖ్యమైందని కామెంట్ చేశాడు. కివీస్ సీనియర్లు జాతీయ జట్టుకు అందుబాటులో ఉండకుండా ఐపీఎల్ ఆడేందుకు చెక్కేశారని అన్నాడు. జునైద్ చేసిన ఈ కామెంట్స్‌పై భారత క్రికెట్ అభిమానులు స్పందించేందకు సైతం ఇష్టపడటం లేదు. పాక్ క్రికెటర్లకు భారత క్రికెట్‌ను ఆడిపోసుకోకపోతే నిద్ర పట్టదు, తిండి సహించదని చురకలంటిచి వదిలేస్తున్నారు. కాగా, పాకిస్తాన్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును నిన్న ప్రకటించారు. ఐపీఎల్ కారణంగా ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచ్ సాంట్నర్,కేన్ విలియమ్సన్ లాంటి సీనియర్ ఆటగాళ్లు పాక్ సిరీస్‌లో పాల్గొనడం లేదు. ఈ కారణంగానే జునైద్ ఐపీఎల్‌పై అవాక్కులు చవాక్కులు పేలాడు. పాక్ క్రికెటర్లకు ఐపీఎల్లో ప్రవేశం లేదన్న విషయం తెలిసిందే. 34 ఏళ్ల జునైద్ 2011-19 మధ్యలో పాక్ తరఫున 22 టెస్ట్‌లు, 76 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. ఇందులో అతను 189 వికెట్లు పడగొట్టాడు. -
IPL 2024 DC VS KKR: రసెల్ రికార్డును సమం చేసిన నరైన్
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నరైన్ కేకేఆర్ తరఫున ఈ అవార్డు అందుకోవడం ఇది 14వసారి. కేకేఆర్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న రికార్డు ఆండ్రీ రసెల్ (14) పేరిట ఉండగా.. నిన్నటి మ్యాచ్‌తో నరైన్ రసెల్ రికార్డును సమం చేశాడు. రసెల్, నరైన్ ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో 10, 11 స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడి ఢిల్లీ డేర్‌డెవిల్స్, ఆర్సీబీ తరఫున 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఏబీడీ తర్వాత క్రిస్ గేల్ (22), రోహిత్ శర్మ (19), డేవిడ్ వార్నర్ (18), ఎంఎస్ ధోని (17), విరాట్ కోహ్లి (17), షేన్ వాట్సన్ (16), యూసఫ్ పఠాన్ (16) అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. రసెల్, నరైన్‌తో సమానంగా సురేశ్ రైనా, కీరన్ పోలార్డ్ కూడా 14 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. కాగా, ఢిల్లీతో మ్యాచ్‌లో నరైన్‌తో పాటు యువ ఆటగాడు రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) రెచ్చిపోవడంతో కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది. 273 పరుగుల భారీ లక్ష్యాన్నిఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసి, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రిషబ్ పంత్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్‌ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వార్నర్ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్, పోరెల్, అక్షర్ డకౌట్లయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌల్ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2, రసెల్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో కేకేఆర్ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. ఢిల్లీ తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. -
IPL 2024 : విశాఖలో కోల్‌కతా బ్యాటర్ల విధ్వంసం (ఫొటోలు)
-
విశాఖలో పరుగుల సంద్రం
సరిగ్గా వారం రోజుల క్రితం... గత బుధవారం హైదరాబాద్ గడ్డపై సన్‌రైజర్స్ భీకర బ్యాటింగ్‌తో ఐపీఎల్లో అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఇప్పుడు ఈ బుధవారం విశాఖపట్నం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ అదే తరహా పరుగుల విధ్వంసరచన చేసింది. రికార్డు స్కోరుకు చేరువగా వచ్చి త్రుటిలో దానిని అందుకోలేకపోయినా ... ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోరును కోల్‌కతా సాధించింది. సునీల్ నరైన్, అంగ్కృష్ రఘువంశీ, రసెల్ ఇందులో కీలక పాత్ర పోషించారు... ఆ తర్వాత భారీ స్కోరు చూసి ముందే తలవంచిన ఢిల్లీ లక్ష్యానికి చాలా దూరంలో ఆగిపోయింది. కోల్‌కతా ఖాతాలో హ్యాట్రిక్ విజయం చేరగా... ఢిల్లీ మళ్లీ ఓటమి బాట పట్టింది. సాక్షి, విశాఖపట్నం: మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) తాజా సీజన్ ఐపీఎల్లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన పోరులో కేకేఆర్ 106 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ (277) తర్వాత ఇదే రెండో అత్యధిక స్కోరు. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేయగా... అంగ్కృష్ రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అంతే జోరుతో అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 48 బంతుల్లోనే 104 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడు కేకేఆర్‌కు భారీ స్కోరును అందించింది. అనంతరం ఢిల్లీ 17.2 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ రిషభ్ పంత్ (25 బంతుల్లో 55; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ (32 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. శతక భాగస్వామ్యం... తొలి ఓవర్లో ఎక్స్‌ట్రాల రూపంలోనే 7 పరుగులతో కేకేఆర్ ఇన్నింగ్స్ ఆరంభం కాగా... తర్వాతి రెండు ఓవర్లలో సాల్ట్ (12 బంతుల్లో 18; 4 ఫోర్లు), నరైన్ కలిసి 25 పరుగులు రాబట్టారు. అయితే రైడర్స్ అసలు జోరు ఇషాంత్ వేసిన నాలుగో ఓవర్లో మొదలైంది. నరైన్ వరుసగా 6, 6, 4, 0, 6, 4 బాది ఏకంగా 26 పరుగులు సాధించడం విశేషం. సాల్ట్ వెనుదిరిగిన తర్వాత నరైన్‌తో రఘువంశీ జత కలిశాక కోల్‌కతా మరింత వేగంగా దూసుకుపోయింది. సలామ్ ఓవర్లో నరైన్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 88 పరుగులకు చేరింది. 21 బంతుల్లోనే నరైన్ అర్ధ సెంచరీ పూర్తయింది. అక్షర్ కూడా వేసిన ఒక్క ఓవర్లో 18 పరుగులు సమర్పించుకున్నాడు. సుమీత్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన రఘు... సలామ్ ఓవర్లో రెండు సిక్సర్లతో చెలరేగాడు. ఎట్టకేలకు 13వ ఓవర్లో మార్‡్ష ఈ జోడీని విడదీశాడు. టి20ల్లో తన అత్యధిక స్కోరు సాధించిన నరైన్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకోగా... మరోవైపు 25 బంతుల్లో రఘు హాఫ్ సెంచరీని అందుకున్నాడు. రఘువంశీ కూడా వెనుదిరిగిన తర్వాత రసెల్ తన స్థాయిని ప్రదర్శిస్తూ బౌండరీలతో చెలరేగుతూ స్కోరును 200 పరుగులు దాటించాడు. శ్రేయస్ అయ్యర్ (18) అవుటైన తర్వాత నోర్జే ఓవర్లో 3 సిక్స్‌లు, ఫోర్ బాది రింకూ సింగ్ (8 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) పండగ చేసుకున్నాడు. ఈ ఓవర్లో మొత్తం 25 పరుగులు వచ్చాయి. మరో 14 పరుగులు చేస్తే ఐపీఎల్లో అత్యధిక స్కోరు నమోదు చేసే లక్ష్యంతో చివరి ఓవర్లో కేకేఆర్ బ్యాటింగ్‌కు సిద్ధమైంది. అయితే ఇషాంత్ అద్భుత యార్కర్‌తో తొలి బంతికే రసెల్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆ ఆశలకు తెర పడింది. పంత్ మెరుపులు... భారీ ఛేదనలో ఢిల్లీ తడబడింది. 12 పరుగుల వ్యవధిలో ఆ జట్టు తొలి 4 వికెట్లు కోల్పోయింది. పృథ్వీ షా (10), మార్‡్ష (0), పొరేల్ (0), వార్నర్ (18) ప్రభావం చూపలేకపోవడంతో గెలుపుపై నమ్మకం ఇక్కడే సడలింది. అనంతరం కొద్ది సేపు పంత్ మెరుపు బ్యాటింగ్ క్యాపిటల్స్ అభిమానులకు ఆనందం పంచింది. తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్‌గా మలచిన అతను రసెల్ ఓవర్లో మరో 2 సిక్స్‌లు బాదాడు. ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్ వేసిన 12వ ఓవర్లో పంత్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4, 4, 4తో అతను 28 పరుగులు రాబట్టడం విశేషం. అయితే తర్వాతి ఓవర్లోనే అతను వెనుదిరగడంతో ఢిల్లీ మిగతా ఆట లాంఛనమే అయింది. స్టబ్స్ కూడా కొంత పోరాడినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) స్టబ్స్ (బి) నోర్జే 18; నరైన్ (సి) పంత్ (బి) మార్‡్ష 85; రఘువంశీ (సి) ఇషాంత్ (బి) నోర్జే 54; రసెల్ (బి) ఇషాంత్ 41; శ్రేయస్ అయ్యర్ (సి) స్టబ్స్ (బి) అహ్మద్ 18; రింకూ (సి) వార్నర్ (బి) నోర్జే 26; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 5; రమణ్‌దీప్ (సి) పృథ్వీ షా (బి) ఇషాంత్ 2; స్టార్క్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 272. వికెట్ల పతనం: 1–60, 2–164, 3–176, 4–232, 5–264, 6–264, 7–266. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–43–1, ఇషాంత్ శర్మ 3–0–43–2, నోర్జే 4–0–59–3, సలామ్ 3–0–47–0, సుమీత్ 2–0–19–0, అక్షర్ 1–0–18–0, మార్‡్ష 3–0–37–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (బి) స్టార్క్ 18; పృథ్వీ షా (సి) వరుణ్ (బి) వైభవ్ 10; మార్‡్ష (సి) రమణ్‌దీప్ (బి) స్టార్క్ 0; పొరేల్ (సి) నరైన్ (బి) వైభవ్ 0; పంత్ (సి) శ్రేయస్ (బి) వరుణ్ 55; స్టబ్స్ (సి) స్టార్క్ (బి) వరుణ్ 54; అక్షర్ (సి) (సబ్) పాండే (బి) వరుణ్ 0; సుమీత్ (సి) (సబ్) పాండే (బి) నరైన్ 7; సలామ్ (సి) సాల్ట్ (బి) వైభవ్ 1; నోర్జే (సి) శ్రేయస్ (బి) రసెల్ 4; ఇషాంత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (17.2 ఓవర్లలో ఆలౌట్) 166. వికెట్ల పతనం: 1–21, 2–26, 3–27, 4–33, 5–126, 6–126, 7–159, 8–159, 9–161, 10–166. బౌలింగ్: స్టార్క్ 3–0–25–2, వైభవ్ 4–0–27–3, రసెల్ 1.2–0–14–1, నరైన్ 4–0–29–1, వరుణ్ చక్రవర్తి 4–0–33–3, వెంకటేశ్ 1–0–28–0. ఐపీఎల్లో నేడు గుజరాత్ X పంజాబ్ వేదిక: అహ్మదాబాద్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
విధ్వంసం సృష్టించిన కేకేఆర్ యువ బ్యాటర్.. శుభ్‌మన్ గిల్ తర్వాత..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా కేకేఆర్ తరఫున శుభ్‌మన్ గిల్ తర్వాత అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శుభ్‌మన్ 18 ఏళ్ల 237 రోజుల వయసులో (2018 సీజన్) సీఎస్కేపై హాఫ్ సెంచరీ చేయగా.. రఘువంశీ 18 ఏళ్ల 303 రోజుల వయసులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అర్దసెంచరీ సాధించాడు. రఘువంశీకి ఐపీఎల్లో ఇది తొలి ఇన్నింగ్స్ కావడం విశేషం. Innovative! Maiden IPL Fifty for Angkrish Raghuvanshi ✨ Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #DCvKKR pic.twitter.com/72oQQZIDbd — IndianPremierLeague (@IPL) April 3, 2024 ఈ ఇన్నింగ్స్‌కు ముందు అతను ఓ మ్యాచ్ ఆడినా అందులో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కేకేఆర్ తరఫున అరంగేట్రం ఇన్నింగ్స్‌లో ఆరో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగానూ రఘువంశీ రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 27 బంతులు ఎదుర్కొన్న రఘువంశీ 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో రఘువంశీతో పాటు సునీల్ నరైన్ సైతం విధ్వంసం సృష్టించాడు. నరైన్ కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. వీరిద్దరి ఊచకోత ధాటికి ఢిల్లీ బౌలర్లు వణికిపోయారు. వీరిద్దరు ఔటయ్యాక రసెల్ భారీ షాట్లు ఆడటం మొదలుపెట్టాడు. రసెల్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేసి క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. అతనికి జతగా శ్రేయస్ అయ్యర్ (12) ఉన్నాడు. నరైన్, రఘువంశీ, రసెల్ ధాటికి కేకేఆర్ 16వ ఓవర్లోనే 200 పరుగుల మార్కును దాటింది. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో వేగవంతమై 200. 17 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 224/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదో ఓవర్లో ఫిలిప్ సాల్ట్ (18) ఔటయ్యాడు. నోర్జే బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి సాల్ట్ పెవిలియన్‌కు చేరాడు. కాగా, ప్రస్తుత సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కేకేఆర్ మరో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది. అండర్-19 వరల్డ్‌కప్ హీరో.. 18 ఏళ్ల రఘువంశీ భారత అండర్-19 జట్టు వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. 2022 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో రఘువంశీ భారత్ తరఫున లీడింగ్ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. -
IPL 2024, DC VS KKR: సునీల్ నరైన్ ఊచకోత
ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ శివాలెత్తిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. నరైన్ విధ్వంసం ధాటికి కేకేఆర్ 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది. నరైన్‌కు జతగా యువ ఆటగాడు రఘువంశీ (14 బంతుల్లో 31; 4 ఫోర్లు, సిక్స్) క్రీజ్‌లో ఉన్నాడు. రఘువంశీ కూడా చెలరేగి ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా నరైన్ దూకుడు కొనసాగుతుంది. Sunil Narine is in some form! 🔥 pic.twitter.com/326qICPqWl — Mufaddal Vohra (@mufaddal_vohra) April 3, 2024 నరైన్ 28 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. నరైన్ ఇషాంత్ శర్మ, రసిక్ సలామ్ అక్షర్ పటేల్‌లకు చుక్కలు చూపించాడు. ఇషాంత్ వేసిన నాలుగో ఓవర్లో మూడు సిక్సర్లు సహా 26 పరుగులు పిండుకున్న నరైన్.. రసిర్ వేసిన 6వ ఓవర్లో మూడు ఫోర్ల సాయంతో 18, అక్షర్ వేసిన 8వ ఓవర్లో 2 సిక్సర్ల సాయంతో 19 పరుగులు రాబట్టాడు. THE DESTRUCTION OF SUNIL NARINE...!!!!- He smashed 6,6,4,0,6,4 in an over against Ishant Sharma..!!! 🔥 pic.twitter.com/i9vkivM2NH— CricketMAN2 (@ImTanujSingh) April 3, 2024 ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదో ఓవర్లో ఫిలిప్ సాల్ట్ (18) ఔటయ్యాడు. నోర్జే బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి సాల్ట్ పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుత సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కేకేఆర్ మరో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది. -
IPL 2024: ఆర్సీబీ ఓటమిపై స్పందించిన కోహ్లి.. ఇలా అయితే!
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరో ఓటమి ఎదురైంది. ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ.. తిరిగి పుంజుకుని పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. కానీ మళ్లీ పాత కథను పునరావృతం చేస్తూ సొంత మైదానంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో పరాజయం పాలైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ విషయంపై స్పందించిన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. జట్టులో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశాడు. స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాం కాబట్టే ఓడిపోయామని.. కచ్చితంగా తిరిగి పుంజుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఒక్కడే రాణించిన విషయం తెలిసిందే. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ రన్‌మెషీన్.. 59 బంతుల్లో 83 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో కనీసం ఒక్కరు కూడా 35 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆర్సీబీ 182 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ 16.5 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఫిలిప్ సాల్ట్(30), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సునిల్ నరైన్(47), వెంకటేశ్ అయ్యర్(50) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆర్సీబీ విధించిన టార్గెట్‌ను ఉఫ్‌మని ఊదేసింది. ఫలితంగా బెంగళూరుకు రెండో పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో డ్రెసింగ్ రూంలో ‘ఆర్సీబీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న కోహ్లి సహచర ఆటగాళ్లను ఉద్దేశించి ప్రసంగించాడు. ‘‘ఈరోజు ఎంత కఠినంగా గడిచిందో మనందరికీ తెలుసు. నిజానికి మనం ఇంతకంటే గొప్పగా ఆడేవాళ్లం. కానీ.. అలా జరిగిపోయింది. జట్టుగా మనం పటిష్టంగా ఉన్నామనే ధైర్యంతో ముందుకు సాగాలి. మన నైపుణ్యాల పట్ల నమ్మకం ఉంచాలి. అలా అయితేనే మనం తిరిగి పుంజుకోగలం. సరైన మార్గంలో లక్ష్యం దిశగా పయనించగలం’’ అని కోహ్లి స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్ తాజా సీజన్లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఆర్సీబీ బ్యాటర్ కోహ్లి 181 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్‌ను మరోసారి(ప్రస్తుతానికి) కైవసం చేసుకున్నాడు. అతడి తర్వాతి స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్(2 మ్యాచ్‌లలో 143 రన్స్) ఉన్నాడు. చదవండి: IPL 2024: కోహ్లి, గంభీర్‌కు ఆస్కార్ ఇవ్వాలి: టీమిండియా దిగ్గజం 2️⃣ high quality shots 2️⃣ maximum results Predict Virat Kohli's final score tonight 👇 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Match Updates ▶️ https://t.co/CJLmcs7aNa#TATAIPL | #RCBvKKR | @RCBTweets pic.twitter.com/WUuarIrM2m — IndianPremierLeague (@IPL) March 29, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
#KKR: ఆర్సీబీపై మా విజయానికి కారణం అదే: అయ్యర్
చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్‌పై ఆ జట్టు సారథి శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. ఓపెనర్‌గా వచ్చి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని కొనియాడాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు గొప్ప ఆరంభం అందించాడని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా కేకేఆర్ శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. అయితే, ఆరంభంలో బౌలర్లకు కాస్త అనుకూలించిన బెంగళూరు పిచ్‌పై.. సెకండాఫ్‌లో బ్యాటర్లు రెచ్చిపోయారు. ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(20 బంతుల్లో 30) మెరుగ్గా రాణించగా.. మరో ఓపెనర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సునిల్ నరైన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ 2 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 47 పరుగులు చేశాడు. A quick-fire 47 off just 22 deliveries 💥💥 An entertaining opening act from Sunil Narine comes to an end 👏👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvKKR pic.twitter.com/s0dNMzrL80 — IndianPremierLeague (@IPL) March 29, 2024 ఇక వన్‌డౌన్‌లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్ 30 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 39, రింకూ సింగ్ 5 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన కేకేఆర్ ఆర్సీబీపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా పదిహేడో ఎడిషన్‌లో వరుసగా రెండో గెలుపు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ఆట తీరుపై హర్షం వ్యక్తం చేశాడు. వికెట్ బౌలర్లకు పెద్దగా అనుకూలించడం లేదని ఆండ్రీ రసెల్ చెప్పాడని.. పిచ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి తమకు సూచనలు ఇచ్చాడని తెలిపాడు. ఈ క్రమంలో సునిల్ నరైన్‌ను ఓపెనర్‌గా పంపాలా వద్దా అన్న అంశంపై చర్చలు జరిపామని.. ఆఖరికి ఓపెనర్‌గానే బరిలోకి దించామని పేర్కొన్నాడు. జట్టులో తన పాత్ర ఏమిటో నరైన్‌కు స్పష్టంగా తెలుసని అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో రసెల్ నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మరోవైపు నరైన్ 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. Venkatesh F-IYER 🔥🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvKKR pic.twitter.com/2EeUvGTR8J — IndianPremierLeague (@IPL) March 29, 2024 ఇక వరుసగా రెండో గెలుపుపై స్పందిస్తూ.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. టోర్నీలో మున్ముందు ఇంకెన్నో సాధించాల్సి ఉందని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. కాగా కేకేఆర్ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. విశాఖపట్నంలో బుధవారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. చదవండి: #Kohli: పాపం.. కోహ్లి ఒక్కడు ఏం చేయగలడు? -
IPL 2024 RCB VS KKR: చరిత్ర సృష్టించనున్న సునీల్ నరైన్
ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మార్చి 29) జరుగబోయే మ్యాచ్‌తో కేకేఆర్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ చరిత్ర సృష్టించనున్నాడు. ఈ మ్యాచ్‌తో నరైన్ టీ20ల్లో 500 మ్యాచ్‌ల మైలురాయిని తాకబోతున్నాడు. ప్రపంచ క్రికెట్లో కేవలం ముగ్గురు మాత్రమే నరైన్‌కు ముందు ఈ మైలురాయిని తాకారు. వీరిలో కీరన్ పోలార్డ్ అందరికంటే ఎక్కువగా 660 మ్యాచ్‌లు ఆడగా.. డ్వేన్ బ్రావో 573, షోయబ్ మాలిక్ 542 మ్యాచ్‌లు ఆడారు. టీ20ల్లో అత్యంత అరుదైన క్లబ్లో చేరబోతున్న నరైన్.. ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు 499 మ్యాచ్‌లు ఆడి 536 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 3736 పరుగులు చేశాడు. 2011లో టీ20 ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన నరైన్ చాలా రికార్డుల్లో భాగంగా ఉన్నాడు. టీ20ల్లో అత్యధిక మెయిడిన్లు (30) వేసిన బౌలర్‌గా.. టీ20ల్లో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా (536).. కనీసం 2000 బంతులు బౌల్ చేసిన వారిలో రెండో అత్యధిక ఎకానమీ రేట్ (6.10) కలిగిన బౌలర్‌గా.. పవర్ ప్లేల్లో నాలుగో అత్యుత్తమ స్ట్రయిక్‌రేట్ (155.05) కలిగిన బ్యాటర్‌గా.. టీ20ల్లో అత్యధిక టైటిళ్లలో (10) భాగమైన నాలుగో ఆటగాడిగా పలు రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం కొదమ సింహాల్లా పోరాడనున్నాయి. కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మట్టికరిపించి జోష్‌లో ఉండగా.. ఆర్సీబీ తమ చివరి మ్యాచ్‌లో (రెండోది) పంజాబ్ కింగ్స్‌కు షాకిచ్చి నూతనోత్సాహంతో ఉరకలేస్తుంది. -
సునీల్ నరైన్ సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్‌బై
వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆదివారం(నవంబర్ 5) సోషల్ మీడియా వేదికగా నరైన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. 35 ఏళ్ల నరైన్.. తన కెరీర్లో అంతర్జాతీయంగా 65 వన్డే, 51 టీ20, 6 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 165 వికెట్లు పడగొట్టాడు. 2012 టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన వెస్టిండీస్ జట్టులో నరైన్ భాగంగా ఉన్నాడు. నరైన్ చివరగా విండీస్ తరపున 2019లో ఆడాడు. అప్పటినుంచి జట్టుకు సునీల్ దూరంగా ఉన్నాడు. అదే విధంగా నరైన్ తన చివరి టెస్టు 2013లో ఆడగా.. వన్డే మ్యాచ్ 2016లో ఆడాడు. నరైన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికినప్పటికీ.. ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం కొనసాగనున్నాడు. "వెస్టిండీస్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించినందుకు చాలా గర్వంగా ఉంది. నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని తెలియజేస్తున్నాను. నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన క్రికెట్ వెస్టిండీస్, కోచింగ్ సిబ్బంది, అభిమానులకు ధన్యవాదాలు" అని నరైన్ తన రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నరైన్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sunil Narine (@sunilnarine24) చదవండి: చాలా సంతోషంగా ఉంది.. బర్త్‌డే రోజునే! అదొక కల: విరాట్ కోహ్లి -
ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన ఓ వ్యక్తి..!
న్యూఢిల్లీ వేదికగా ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియం స్టాండ్స్‌లో కూర్చున్న ఓ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్శించాడు. అచ్చం విండీస్ క్రికెటర్ సునీల్ నరైన్‌ను పోలిన ఈ వ్యక్తిని చూసి జనాలు ఆశ్చర్యపోయారు. వ్యక్తిని పోలిన వ్యక్తులు ఉంటారని తెలుసు కానీ, మరీ ఇంతటి దగ్గరి పోలికలా అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఒక్క సైజ్ తప్పించి స్టాండ్స్‌లో తారసపడ్డ వ్యక్తి అన్ని కోణాల్లో సునీల్ నరైన్ కార్బన్ కాపీలా ఉన్నాడు. అతని హెయిర్ స్టైల్, మీసకట్టు, గడ్డం, చెవికి పోగు, మెడపై టాటూ.. ఇలా ఏ యాంగిల్లో చూసినా సదరు వ్యక్తి సునీల్ నరైన్‌కు డిట్టో టు డిట్టోలా ఉన్నాడు. ఆ వ్యక్తి సునీల్ నరైన్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్ జట్టు కేకేఆర్ జెర్సీ ధరించి ఉండటం మరో విశేషం. అచ్చుగుద్దినట్లు సునీల్ నరైన్‌లా ఉన్న ఈ వ్యక్తి ఎవరో, ఏ ప్రాంతానికి చెందిన వాడో తెలియలేదు. మొత్తానికి సునీల్ నరైన్ డూప్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆఖర్లో ఇక్రమ్ అలీఖిల్ (66 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (28), రషీద్ ఖాన్ (23), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (28) రాణించడంతో ఆ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4-0-41-0), మార్క్ వుడ్ (9-0-50-2), సామ్ కర్రన్ (4-0-46), రీస్ టాప్లే (8.5-1-52-1) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. ఆదిల్ రషీద్ (10-1-42-3), లియామ్ లివింగ్‌స్టోన్ (10-0-33-1), జో రూట్ (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. అనంతరం 285 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బెయిర్‌స్టోను (2) ఫజల్ హక్ ఫారూఖీ.. రూట్‌ను (11) ముజీబ్.. మలాన్‌ను నబీ ఔట్ చేశారు. 12.4 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 68/3గా ఉంది. హ్యారీ బ్రూక్ (12), జోస్ బట్లర్ క్రీజ్‌లో ఉన్నారు. -
CPL 2023: క్రికెట్లో తొలిసారి రెడ్ కార్డ్ ప్రయోగం.. తొలి బాధితుడిగా..!
క్రికెట్లో తొలిసారి రెడ్ కార్డ్ జారీ చేయబడింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో భాగంగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న (ఆగస్ట్ 27) జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్‌కు అంపైర్ రెడ్ కార్డ్ చూపించి, మైదానాన్ని వీడాల్సిందిగా ఆదేశించాడు. దీంతో రెడ్ కార్డ్ కారణంగా మైదానం వీడిన తొలి క్రికెటర్‌గా సునీల్ నరైన్ చరిత్రపుటల్లోకెక్కాడు. Red Card in cricket. So apparently, captain gets to pick who they have to send out of the field. Dhoni might have a lot of options if this comes in IPL.pic.twitter.com/gycU62MmAF — Silly Point (@FarziCricketer) August 28, 2023 స్లో ఓవర్‌రేట్ కారణంగా జట్టులో ఎవరో ఒక ఆటగాడు మైదానం వీడాల్సి ఉండటంతో, అప్పటికే తన కోటా ఓవర్లు పూర్తి చేసుకున్న సునీల్ నరైన్ పేరును ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ ప్రతిపాదించగా.. ఫీల్డ్ అంపైర్ నరైన్‌కు రెడ్ కార్డ్ చూపించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత ఎడిషన్‌లోనే తొలిసారి క్రికెట్లో ఈ రెడ్ కార్డ్ రూల్ అమల్లోకి వచ్చింది. ఫుట్‌బాల్‌లో ఈ రెడ్ కార్డ్ విధానాన్ని మనం తరుచూ చూస్తుంటాం. అయితే క్రికెట్లో మాత్రం ఇదే తొలిసారి. ఫుట్‌బాల్‌లో ఓ ఆటగాడు కఠినమైన ఫౌల్కు పాల్పడినప్పుడు రిఫరీ అతనికి రెడ్ కార్డ్ చూపించి, మైదానాన్ని వీడాల్సిందిగా ఆదేశిస్తాడు. అయితే క్రికెట్లో ఫుట్బాల్లోలా కాకుండా స్లో ఓవర్ రేట్‌కు పెనాల్టీగా ఈ రెడ్ కార్డ్‌ను ఇష్యూ చేస్తారు. ఓ ఇన్నింగ్స్‌లో 3 సార్లు నిర్ధేశిత సమయంలో ఓవర్‌ను పూర్తి చేయకపోతే, రెడ్ కార్డ్‌ను జారీ చేస్తారు. తొలిసారి నిర్ధేశిత సమయంలో ఓవర్‌ను పూర్తి చేయకపోతే ఓ ఫీల్డర్‌ను (ఐదో ఫీల్డర్), రెండో సారి అదే రిపీటైతే మరో ఫీల్డర్‌ను (ఆరో ఫీల్డర్) 20 యార్డ్స్ సర్కిల్‌లోకి తీసుకరావాల్సి ఉంటుంది. ఇక ఇదే మూడోసారి రిపీటైతే మాత్రం జట్టులోకి ఓ ఆటగాడు మైదానాన్ని వీడాల్సి ఉంటుంది. నిన్నటి మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 17, 18, 19వ ఓవర్లను కోటా సమయంలో పూర్తి చేయకపోవడంతో అంపైర్ ఆ జట్టులోని ఓ ఫీల్డర్‌ను మైదానం వీడాల్సిందిగా ఆదేశించాడు. దీంతో నైట్‌రైడర్స్ 10 మంది ఆటగాళ్లతోనే చివరి ఓవర్ కొనసాగించింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌పై ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్.. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (38 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లతో రాణించగా.. బ్రావో 2 వికెట్లు పడగొట్టాడు. 179 పరుగుల లక్ష్యఛేదనలో నికోలస్ పూరన్ (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కీరన్ పోలార్డ్ (16 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోవడంతో నైట్‌రైడర్స్ 17.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. సెయింట్ కిట్స్ బౌలర్లలో బోష్ 3, ముజరబానీ ఓ వికెట్ పడగొట్టారు. -
నరైన్ ఆల్‌రౌండ్ షో.. మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన విండీస్ ప్లేయర్
మెన్స్ హండ్రెడ్ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ బోణీ కొట్టింది. లండన్ స్పిరిట్‌తో నిన్న (ఆగస్ట్ 2) జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ షోతో (20-9-14-2 & 5 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 13 నాటౌట్) ఓవల్‌ను విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్.. నాథన్ సౌటర్ (3/34), సునీల్ నరైన్ (2/14), గస్ అట్కిన్సిన్ (1/22), టామ్ కర్రన్ (1/22), సామ్ కర్రన్ (1/31) ధాటికి నిర్ణీత 100 బంతుల్లో 131 పరుగులకు ఆలౌటైంది. రొస్సింగ్టన్ (21 బంతుల్లో 39, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మాథ్యూ వేడ్ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు), కెప్టెన్ లారెన్స్ (17 బంతుల్లో 24; 4 ఫోర్లు, సిక్స్) రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం 132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్ మరో బంతి మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్ జాక్స్ (6 బంతుల్లో 11; 2 ఫోర్లు), జోర్డన్ కాక్స్ (21 బంతుల్లో 22; 2 ఫోర్లు), సామ్ కర్రన్ (28 బంతుల్లో 34; 5 ఫోర్లు), సామ్ బిల్లింగ్స్ (15 బంతుల్లో 25; 2 ఫోర్లు, సిక్స్) రాణించగా.. ఆఖర్లో సునీల్ నరైన్ (5 బంతుల్లో 13 నాటౌట్; ఫోర్, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌తో ఇన్విన్సిబుల్స్‌ను గెలిపించాడు. లండన్ బౌలర్లలో డేనియల్ వార్రాల్, జోర్డన్ థాంప్సన్, నాథన్ ఇల్లిస్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ క్రిట్చీల్లీ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన నరైన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
తీరు మార్చుకోని నైట్‌రైడర్స్.. కొనసాగుతున్న పేలవ ప్రదర్శన.. ఐపీఎల్లో కాస్త నయం..!
ఫ్రాంచైజీ క్రికెట్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అనుబంధ జట్ల పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. గతేడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో (సీపీఎల్) మొదలైన నైట్‌రైడర్స్ వైఫల్యాల పరంపర.. అమెరికా వేదికగా ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్లోనూ (ఎంఎల్సీ) కంటిన్యూ అవుతుంది. 2022 సీపీఎల్‌ను ఆఖరి స్థానంతో ముగించిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్.. ఆతర్వాత జరిగిన ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లోనూ (ఐఎల్టీ20) చివరాఖరి స్థానంలోనే (అబుదాబీ నైట్‌రైడర్స్) నిలిచింది. అనంతరం జరిగిన ఐపీఎల్-2023లో కాస్త పర్వాలేదనిపించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (7వ స్థానం).. ప్రస్తుతం జరుగుతున్న ఎంఎల్‌సీలో మరోసారి తమకెంతో అచ్చొచ్చిన ఆఖరి స్థానంలో (లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్) నిలిచి, లీగ్ దశలోనే పోటీ నుంచి నిష్క్రమించింది. సునీల్ నరైన్ సారధ్యంలో ఎంఎల్‌సీలో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడిన నైట్‌రైడర్స్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, టేబుల్ టాపర్ సియాటిల్ ఆర్కాస్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కూడా నైట్‌రైడర్స్ అతికష్టం మీద నెగ్గింది. రిలీ రొస్సో (38 బంతుల్లో 78 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నైట్‌రైడర్స్ ఈ మ్యాచ్‌లో గెలవగలిగింది. 6 జట్లు పాల్గొన్న ఎంఎల్సీ-2023 సీజన్‌ను ఆఖరి స్థానంతో ముగించింది. కాగా, నైట్‌రైడర్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రాంచైజెస్ను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నటి జూహి చావ్లా, వ్యాపారవేత్త జై మెహతా, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే, అయినా..! లీగ్ క్రికెట్లో నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీల ప్రస్తానాన్ని గమనిస్తే, అన్ని జట్లలో ప్రపంచంలోని విధ్వంసకర ఆటగాళ్లు మెజారిటీ శాతం ఉన్నారు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ దగ్గర నుంచి ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ వరకు అన్ని నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీల్లో భారీ హిట్టర్లు ఉన్నారు. సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌లో కీరన్ పోలార్డ్, మార్టిన్ గప్తిల్, సునీల్ నరైన్, నికోలస్ పూరన్, డ్వేన్ బ్రేవో, రిలీ రొస్సో, ఆండ్రీ రసెల్ ఉండగా.. ఐపీఎల్లో నితీశ్ రాణా, రింకూ సింగ్, జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, రహ్మానుల్లా గుర్భాజ్, జాన్సన్ చార్లెస్, శార్దూల్ ఠాకూర్ తదితరులు ఉన్నారు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ విషయానికొస్తే.. ఈ జట్టులో సునీల్ నరైన్, కొలిన్ ఇంగ్రామ్, బ్రాండన్ కింగ్, ఆండ్రీ రసెల్ లాంటి హార్డ్ హిట్టర్లు ఉండగా.. మేజర్ లీగ్ క్రికెట్లో జేసన్ రాయ్, రిలీ రొస్సో, మార్టిన్ గప్తిల్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ తదితరులు నైట్‌రైడర్స్ జట్టులో ఉన్నారు. ప్రతి నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీలో ఈ స్థాయిలో మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పటికీ ఈ ఫ్రాంచైజీ ఏ లీగ్‌లోనూ ఛాంపియన్ కాలేకపోతుంది. కనీసం టాప్ జట్లలో ఒకటిగా కూడా నిలువలేకపోతుంది. ఐపీఎల్లో రెండుసార్లు విజేతగా నిలిచిన నైట్‌రైడర్స్ ఆ తర్వాత ఏ లీగ్‌లోనూ ఆ స్థాయిలో రాణించలేకపోతుంది. దీంతో నైట్‌రైడర్స్ ఫ్యాన్స్ తెగ హర్టై పోతున్నారు. మరో పక్క ఇదే ఫ్రాంచైజీ క్రికెట్లో సూపర్ కింగ్స్ జట్లు మాత్రం దూసుకుపోతున్నాయి. ఈ లీగ్‌లో అయినా ఆ జట్టు మినిమం గ్యారెంటీగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఎంఎల్‌సీలోనూ ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. -
ప్రత్యర్థిని చితక్కొట్టినా తప్పని ఓటమి.. వరుసగా నాలుగోది
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023)లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసిన నైట్ రైడర్స్ ఖాతా తెరవలేకపోతుంది. తాజాగా వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యింది. నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్(37 బంతుల్లో 70 నాటౌట్, 6 ఫోర్లు, ఆరు సిక్సర్లు ) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రసెల్ 70 నాటౌట్, రిలీ రొసౌ 41 పరుగులు మినహా మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రత్యర్థి బౌలర్లలో హెన్రిక్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్ రెండు, నెత్రావల్కర్, అకిల్ హొసెన్‌లు చెరొక వికెట్ తీశారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో అందరు బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఓపెనర్లు మాథ్యూ స్కాట్(43 పరుగులు), ఆండ్రీస్ గౌస్(40 పరుగులు) చేయగా.. గ్లెన్ పిలిప్స్ 29, ఒబెస్ పియనర్ 26 పరుగులు నాటౌట్ జట్టును గెలిపించాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్, అలీ ఖాన్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపాలు తలా ఒక వికెట్ తీశారు. కాగా వాషింగ్టన్ ఫ్రీడమ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. నైట్‌రైడర్స్ నాలుగు పరాజయాలతో ఆఖరి స్థానంలో ఉంది. THE DRE RUSS SHOW!🌟 What a WAY to bring up his FIFTY AND BEYOND!📈 1⃣4⃣5⃣/4⃣ (17.0) pic.twitter.com/EBPLKpQ13u — Major League Cricket (@MLCricket) July 20, 2023 And that closes the first game in Morrisville 😁 The Washington Freedom 🔵 🔴 score 2️⃣ points, ending the tournament for the LA Knight Riders who drop to 0-4 😔 #MLC2023 pic.twitter.com/sOKjJHdmkA — Major League Cricket (@MLCricket) July 21, 2023 A disappointing season for LAKR, but one man has shined bright ✨ throughout. Andre Russell picks up today's Player of the Match for his 7️⃣0️⃣* (3️⃣7️⃣)#MLC2023 pic.twitter.com/BU3ZCxbfdh — Major League Cricket (@MLCricket) July 21, 2023 చదవండి: దాయాదుల సమరం.. ఆసుపత్రి బెడ్లను కూడా వదలడం లేదు! Indian Football Team: ఫిఫా ర్యాంకింగ్స్.. టాప్-100లో భారత జట్టుకు చోటు -
మాథ్యూ వేడ్ వీరవిహారం.. రసెల్, నరైన్ మెరుపులు వృధా
మేజర్ లీగ్ క్రికెట్-2023 సీజన్లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్‌తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యునికార్న్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ మాథ్యూ వేడ్ (41 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ 2 సిక్సర్లు, బౌండరీతో 20 పరుగులు, స్టోయినిస్ 37 (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోరె ఆండర్సన్ 39 పరుగులు (20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశారు. కెప్టెన్ ఫించ్ 12 పరుగులతో (10 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లు పడగొట్టగా.. అలీ ఖాన్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. ఆరంభంలో జేసన్ రాయ్ (21 బంతుల్లో 45; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), నితీశ్ కుమార్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్).. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (26 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సునీల్ నరైన్ (17 బంతుల్లో 28 నాటౌట్; 3 సిక్సర్లు) రాణించినప్పటికీ నైట్‌రైడర్స్ విజయతీరాలకు చేరలేకపోయింది. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌లో రిలీ రొస్సో (8) నిరాశపరిచాడు. యునికార్న్స్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్, బిష్ణోయ్, ఆండర్సన్ తలో వికెట్ చేజిక్కించుకున్నారు. ఈ ఓటమితో నైట్‌రైడర్స్ లీగ్‌లో హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ మేజర్ లీగ్ క్రికెట్ సీజన్ 2023లో ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది. -
కేకేఆర్ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా సునీల్ నరైన్..
అగ్రరాజ్యం అమెరికా తొలిసారిగా నిర్వహిస్తున్న ఫ్రాంచైజీ టోర్నీ మేజర్ లీగ్ క్రికెట్‌కు సర్వం సిద్దమైంది. జూన్ 13న డల్లాస్ వేదికగా టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ టోర్నీ షురూ కానుంది. కాగా ఐపీఎల్‌లోని నాలుగు ప్రధాన ప్రాంఛైజీలు ఎంఎల్‌సీలో జట్లను సొంతం చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ లు ఎంఎల్‌సీలో ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. న్యూయార్క్ ఫ్రాంచైజీని దక్కించుకోగా.. సీఎస్కే మాదిరిగానే ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్.. టెక్సాస్ టీమ్ ను కొనుగోలు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ లాస్ ఏంజెల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయగా ఢిల్లీ క్యాపిటల్స్:.. సియాటెల్ ను దక్కించుకుంది. లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ కెప్టెన్‌గా సునీల్ నరైన్ ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ఎంపికయ్యాడు. ఐపీఎల్లో కేకేఆర్‌కు గత కొన్ని సీజన్లగా నరైన్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా కరీబియన్ ప్రీమియర్ లీగ్, యూఏఈ టీ20 లీగ్‌లో కేకేఆర్ సొంతం చేసుకున్న ప్రాంఛైజీల తరపున నరైన్ ఆడుతున్నాడు. యూఏఈ టీ20 లీగ్‌లో అబుదాబి నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా కూడా నరైన్ కొనసాగుతున్నాడు. అయితే అతడి సారథ్యంలోని నైట్‌రైడర్స్ జట్టు నిరాశపరిచింది. అయినప్పటికీ అతడికి ఉన్న అనుభవం దృష్ట్యా మరోసారి జట్టు పగ్గాలు కేకేఆర్ మెనెజ్‌మెంట్ అప్పగించింది. లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ జట్టులో అతడితో పాటు లాకీ ఫెర్గూసన్, జాసన్ రాయ్ ,ఆండ్రీ రస్సెల్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. చదవండి: IND vs IRE: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. టీమిండియాలోకి ఎవరూ ఊహించని ఆటగాడు! -
బ్యాట్ ఝులిపించిన సునీల్ నరైన్.. 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో విధ్వంసం
టీ20 బ్లాస్ట్‌లో భాగంగా ఎసెక్స్‌తో నిన్న (జులై 2) జరిగిన మ్యాచ్‌లో విండీస్ ఆటగాడు, సర్రే ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో (4-0-42-1) తేలిపోయిన నరైన్.. బ్యాటింగ్‌లో రాణించి అజేయమైన మెరుపు అర్ధసెంచరీతో (37 బంతుల్లో 78 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరిశాడు. నరైన్ బ్యాట్‌తో విజృంభించినా, అతని జట్టు సర్రే మాత్రం విజయం సాధించలేకపోయింది. కెప్టెన్ క్రిస్ జోర్డన్ (4-0-23-1) మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ (4-0-45-1), ఆసీస్ పేసర్ సీన్ అబాట్ (4-0-47-1) సహా అంతా విఫలమయ్యారు. ఫెరోజ్ ఖుషి (35 నాటౌట్), డేనియల్ లారెన్స్ (58), మైఖేల్ కైల్ పెప్పర్ (75) ఎసెక్స్కు గెలిపించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. సునీల్ నరైన్ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. నరైన్‌తో పాటు సర్రే ఆటగాళ్లు విల్ జాక్స్ (23), జేసన్ రాయ్ (28), జేమీ ఓవర్టన్ (23), టామ్ కర్రన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఎసెక్స్ బౌలర్లలో డేనియల్ సామ్స్, ఆరోన్ బియర్డ్, సామ్ కుక్, హార్మర్, స్నేటర్, పాల్ వాల్టర్ తలో వికెట్ పడగొట్టారు. ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి గెలిపించాడు.. అనంతరం బరిలోకి దిగిన ఎసెక్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ చివరి బంతికి విజయం సాధించింది. సీన్ అబాట్ బౌలింగ్‌లో ఫెరోజ్ ఖుషీ ఆఖరి బంతికి సిక్సర్ బాది ఎసెక్స్‌ను గెలిపించాడు. -
Viral Video: ఆహా.. ఏమా మాయాజాలం, కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్సీ క్లీన్ బౌల్డ్
IPL 2023 KKR VS RCB: ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్ 7) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్ (4-0-16-2), వరుణ్ చక్రవర్తి (3.4-0-15-4), సుయాశ్ శర్మ (4-0-30-3) ఆర్సీబీని కకావికలం చేశారు. వీరి ధాటికి ఆర్సీబీ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ICYMI - TWO outstanding deliveries. Two massive wickets. Sunil Narine & Varun Chakaravarthy get the #RCB openers early on. Follow the match - https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCB pic.twitter.com/GvL1U1GRWW — IndianPremierLeague (@IPL) April 6, 2023 ముఖ్యంగా సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి.. విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్‌లను క్లీన్ బౌల్డ్ చేసిన తీరు మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. నరైన్ బౌలింగ్‌లో కోహ్లి, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో డుప్లెసిస్ ఒకే రీతిలో క్లీన్ బౌల్డ్ కాగా.. చక్రవర్తి బౌలింగ్‌లో మ్యాక్సీ, హర్షల్ పటేల్ కూడా ఇంచుమించు అలాగే బౌల్డ్ అయ్యారు. కేకేఆర్ స్పిన్నర్ల మాయాజాలానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు ఆహా.. ఏమా మాయాజాలం అని కామెంట్లు పెడుతున్నారు. Varun Chakravarthy was absolutely unplayable in that spell! 3.4-0-15-4 🔥🔥pic.twitter.com/jvhyU8fOdS — Prasenjit Dey (@CricPrasen) April 6, 2023 ఇదిలా ఉంటే, చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా నైట్‌రైడర్స్ 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో శార్దుల్ ఠాకూర్ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) శివాలెత్తగా.. గుర్బాజ్ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీని.. వరుణ్ చక్రవర్తి (4/15), సునీల్ నరైన్ (2/16), ఇంపాక్ట్ ప్లేయర్ సుయశ్ శర్మ (3/30) దారుణంగా దెబ్బకొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డెప్లెసిస్ (23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
సునీల్ నరైన్ మ్యాజిక్ .. దెబ్బకు కోహ్లి ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం 123 పరుగులకే కుప్పకూలింది. కేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లతో ఆర్సీబీ వెన్ను విరచగా.. సుయాష్ శర్మ మూడు, నరైన్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఒక్క వికెట్ సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(23) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా తొలి మ్యాచ్‌లో దుమ్మురేపిన విరాట్ కోహ్లి.. ఈ మ్యాచ్‌లో మాత్రం కేవలం 21 పరుగులు చేశాడు. సునీల్ నరైన్ సూపర్ డెలివరీ.. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఓ అద్భుతమైన బంతితో విరాట్ కోహ్లిని బోల్తా కొట్టించాడు. నరైన్ వేసిన బంతికి కోహ్లి దగ్గర సమాధానమే లేకుండా పోయింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసి పటిష్టంగా కన్పించింది. ఈ క్రమంలో కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా.. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ చేతికి బంతి అందించాడు. రాణా నమ్మకాన్ని నరైన్ వమ్ము చేయలేదు. తన వేసిన మొదటి ఓవర్ నాలుగో బంతికే కోహ్లిని క్లీన్ బౌల్డ్ చేశాడు. నరైన్ వేసిన ఆఫ్‌బ్రేక్ బంతిని కోహ్లి లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి అనూహ్యంగా టర్న్ అయ్యి వికెట్లను గిరాటేసింది. అది చూసిన కోహ్లి బిత్తిరి పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా సునీల్ నరైన్‌కు ఇది 150వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. చదవండి: IPL 2023: కోహ్లికి డ్యాన్స్ నేర్పించిన షారుక్.. వీడియో వైరల్ ICYMI - TWO outstanding deliveries. Two massive wickets. Sunil Narine & Varun Chakaravarthy get the #RCB openers early on. Follow the match - https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCB pic.twitter.com/GvL1U1GRWW — IndianPremierLeague (@IPL) April 6, 2023 -
మ్యాచ్ ప్రారంభానికి ముందే సునీల్ నరైన్ రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ గురువారం ఆర్సీబీతో మ్యాచ్‌తో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్ నరైన్‌కు 150వది కావడం విశేషం. ఈ క్రమంలోనే నరైన్ ఐపీఎల్లో సింగిల్ ఫ్రాంచైజీ తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో చేరిపోయాడు. ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లి(225 మ్యాచ్‌లు-ఆర్సీబీ) టాప్‌లో కొనసాగుతుండగా.. సీఎస్కే తరపున 206 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక పొలార్డ్(189 మ్యాచ్‌లు- ముంబై ఇండియన్స్) మూడో స్తానంలో.. సురేశ్ రైనా(176 మ్యాచ్‌లు- సీఎస్కే), ఏబీ డివిలియర్స్( 156 మ్యాచ్- ఆర్సీబీ) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఓవర్సీస్ ఆటగాళ్ల జాబితాలో నరైన్ చోటు సంపాదించాడు. 189 - కీరన్ పొలార్డ్ అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత వరుసగా ఏబీ డివిలియర్స్ (184 మ్యాచ్‌లు), డేవిడ్ వార్నర్-164 మ్యాచ్‌లు, సునీల్ నరైన్- 150* మ్యాచ్‌లు, షేన్ వాట్సన్-145 మ్యాచ్‌లు ఉన్నారు. ఇక మరో కేకేఆర్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌కు ఇది వందో ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. చదవండి: 'నమ్మకంతో రిటైన్ చేసుకున్నారు.. తిరిగిచ్చేయాలి' -
అయ్యర్ దూరం.. కేకేఆర్ కెప్టెన్ అతడేనా..?
ఐపీఎల్-2023 సీజన్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమైన సంగతి తెలిసిందే. అయ్యర్ గత కొంత కాలంగా వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగానే ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరంగా ఉన్న అయ్యర్.. మూడో టెస్టుకు జట్టుతో కలిశాడు. అయితే అహ్మదాబాద్ వేదికగా ఆసీస్‌తో జరిగిన ఆఖరి టెస్టులో అయ్యర్ గాయం మళ్లీ తిరిగి బెట్టింది. దీంతో అతడు నాలుగో టెస్టులో బ్యాటింగ్ కూడా రాలేదు. ఈ క్రమంలో అతడు ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా తన వెన్నుముక సంబంధిత సమస్యకు సర్జరీ చేయించుకోవాలని అయ్యర్‌ను నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం సూచించింది. ఒక వేళ సర్జరీ జరిగితే అతడు దాదాపు ఏడాది వరకు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అదే విధంగా ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనుండంతో అయ్యర్ ఎన్సీఏ సలహాను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే అయ్యర్ ప్రస్తుతం డాక్టర్ల సలహా మెరకు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఏదిఏమైనప్పటికీ అయ్యర్ ఈ ఏడాది ఐపీఎల్‌కు మాత్రం దూరంగా ఉండనున్నాడు. కేకేఆర్ కెప్టెన్‌గా శార్దూల్ ఠాకూర్.. ఇక ఈ ఏడాది సీజన్‌కు అయ్యర్ దూరం కావడంతో కేకేఆర్ తమ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే పనిలో పడింది. కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్లు శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్ ఉన్నారు. అయితే టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. కేకేఆర్ జట్టు మేనెజ్మెంట్ శార్దూల్ ఠాకూర్ వైపు మెగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఐపీఎల్-2023 మినీ వేలంకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా శార్దూల్‌ను ఢిల్లీ కొనుగోలు చేసింది. మరోవైపు యూఏఈ టీ20లీగ్‌లో కేకేఆర్ ఫ్రాంచైజీ అబుదాబి నైట్‌రైడర్స్ కు సారథ్యం వహించిన సునీల్ నరైన్ దారుణంగా విఫలమయ్యాడు. అతడు కెప్టెన్సీలోని నైట్‌రైడర్స్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో నరైన్‌ను కాదని శార్దూల్‌కే తమ జట్టు పగ్గాలు అప్పజెప్పాలని కేకేఆర్ దృఢ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ కొత్త కెప్టెన్ పేరును ఒకట్రెండు రోజుల్లో కేకేఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్1న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. చదవండి: BCCI: భువనేశ్వర్‌కు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. ఇక మర్చిపోవడమే! -
శ్రేయస్ అయ్యర్ దూరం.. కేకేఆర్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్!
ఐపీఎల్-2023కు కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ దూరమైన సంగతి తెలిసిందే. వెన్ను గాయంతో బాధపడుతున్న అయ్యర్.. సర్జరీ కోసం లండన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఐపీఎల్‌తో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు దూరం కానున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ సారథిగా ఎవరు వ్యవహరిస్తున్నది అందరి మెదడులను తొలుస్తున్న ప్రశ్న. కాగా కోల్‌కతా కెప్టెన్సీ రేసులో స్టార్ ఆల్‌రౌండర్లు షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, రస్సెల్ ఉన్నారు. అయితే కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం సునీల్ నరైన్ వైపే మెగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఐపీఎల్ చరిత్రలో అత్యంత అనుభవజ్ఞుడైన విదేశీ క్రికెటర్లలో సునీల్ నరైన్ ఒకడు. అతడు ఇప్పటివరకు ఐపీఎల్లో 148 మ్యాచ్‌లు ఆడాడు. అదే విధంగా కేకేఆర్ జట్టులో సీనియర్ ఆటగాడిగా కూడా నరైన్ ఉన్నాడు. అతడు కేకేఆర్ తరపున 170 వికెట్లు సాధించాడు. అదే విధంగా యూఏఈ టీ20 లీగ్‌లో కోల్‌కతా ప్రాంఛైజీ అబుదాబి నైట్ రైడర్స్ కెప్టెన్‌గా కూడా నరైన్ వ్యవహరించాడు. అయితే ఈ టోర్నీలో అబుదాబి నైట్ రైడర్స్ ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. అయినప్పటికీ నరైన్‌కు అనుభవం దృష్ట్యా అతడికే మరోసారి తమ జట్టు పగ్గాలు అప్పజెప్పాలని కేకేఆర్ జట్టు మేనేజ్మెంట్ తెలుస్తోంది. ఇక ఐపీఎల్-16వ సీజన్ మార్చి31 నుంచి ప్రారంభం కానుంది. కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్1న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. చదవండి: IPL 2023: ఐపీఎల్‌కు దూరమైనా పంత్‌కు అరుదైన గౌరవం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం! -
సునీల్ నరైన్ సంచలనం.. 7 ఓవర్లు.. 7 మెయిడెన్లు.. 7 వికెట్లు
ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు వెస్టిండీస్ వెటరన్ ఆల్‌రౌండర్, కేకేఆర్ స్టార్ ఆటగాడు సునీల్ నరైన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా ట్రినిడాడ్ అండ్ టొబాగో క్రికెట్ బోర్డ్ ప్రీమియర్‌షిప్ డివిజన్ I మ్యాచ్‌లో నరైన్ సంచలన ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో క్వీన్స్ పార్క్ క్రికెట్ క్లబ్ Iకు నరైన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా ఆదివారం పోర్ట్-ఆఫ్-స్పెయిన్ వేదికగా క్లార్క్ రోడ్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్.. కనీసం ఒక్క పరుగు ఇవ్వకుండా 7 వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన నరైన్ 7 మెయిడన్లతో 7 వికెట్లు పడగొట్టాడు. నరైన అద్భుత ప్రదర్శన కారణంగా ప్రత్యర్ధి జట్టు కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లో క్వీన్స్ పార్క్ క్రికెట్ క్లబ్.. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. ఇక ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన సునీల్ నరైన్.. 31 వికెట్లు పడగొట్టాడు. అందులో మూడు ఐదు వికెట్ల హాల్స్ ఉన్నాయి. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. సూర్యకుమార్ వద్దు! అతడే సరైనోడు -
ఉత్తమ కెప్టెన్‌గా రోహిత్.. కోహ్లి, బుమ్రాలకు అవార్డులు, ధోనికి మొండిచెయ్యి
తొట్ట తొలి ఐపీఎల్ వేలం (2008 ఫిబ్రవరి 20) జరిగి 15 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ సంస్థ.. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో భాగస్వామ్యంలో ఐపీఎల్ ఇన్క్రెడిబుల్ అవార్డులను అనౌన్స్ చేసింది. మొత్తం ఆరు విభాగాల్లో విజేతలను ప్రకటించిన స్టార్ స్పోర్ట్స్-ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో.. ఐపీఎల్ చరిత్రలో ఉత్తమ కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను ఎంపిక చేసింది. రోహిత్ 2013-22 మధ్యలో ముంబై ఇండియన్స్‌ను 5 సార్లు ఛాంపియన్‌గా నిలిపినందున అతన్ని ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినట్లు స్టార్ స్పోర్ట్స్-ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో సంయుక్త ప్రకటన చేశాయి. కెప్టెన్‌గా రోహిత్ 143 మ్యాచ్‌ల్లో 56.64 విన్నింగ్ పర్సంటేజ్‌తో 79 సార్లు ముంబై ఇండియన్స్‌ను విజేతగా నిలిపాడు. ఈ విభాగంలో గౌతమ్ గంభీర్, ఎంఎస్ ధోని, లేట్ షేన్ వార్న్ నామినేట్ అయినప్పటికీ హిట్‌మ్యాన్‌నే అవార్డు వరించింది. ఉత్తమ బ్యాటర్ కేటగిరి విషయానికొస్తే.. ఈ విభాగంలో ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, సురేశ్ రైనా నామినేట్ కాగా.. ఏబీడీని అవార్డు వరించింది. మిప్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్.. 2008-21 మధ్యకాలంలో 184 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీల సాయంతో 39.71 సగటున 5162 పరుగులు చేశాడు. ఏబీడీ.. 2016 సీజన్లో ఆర్సీబీ తరఫున 168.97 స్ట్రయిక్ రేట్‌తో 687 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఓ సీజన్లో ఉత్తమ బ్యాటింగ్ కేటగిరిలో విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ పోటీ పడగా.. కోహ్లి విజేతగా నిలిచాడు. కోహ్లి.. 2016 సీజన్లో ఆస్సీబీ తరఫున 152.03 స్ట్రయిక్ రేట్‌తో 973 పరుగులు సాధించాడు. ఐపీఎల్ మొత్తంలో ప్రభావవంతమైన క్రికెటర్ కేటగిరిలో సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, షేన్ వాట్సన్, రషీద్ ఖాన్ నామినేట్ కాగా.. ఈ అవార్డు ఆండ్రీ రసెల్‌ను వరించింది. ఉత్తమ బౌలర్ కేటగిరిలో రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, సునీల్ నరైన్, యుజ్వేంద్ర చహల్ నామినేట్ కాగా.. బుమ్రా విజేతగా నిలిచాడు. ఐపీఎల్ సీజన్లో ఉత్తమ ప్రదర్శన కేటగిరి విషయానికొస్తే.. ఈ విభాగంలో సునీల్ నరైన్ (2012), రషీద్ ఖాన్ (2018), జోఫ్రా ఆర్చర్ (2020), యుజ్వేంద్ర చహల్ (2022) నామినేట్ కాగా.. చహల్‌ను ఈ అవార్డు వరించింది. -
దుబాయ్ ప్రీమియర్ లీగ్ మొదలైంది.. తొలి మ్యాచ్‌లోనే నైట్ రైడర్స్‌కు షాక్
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్), బీబీఎల్ (బిగ్‌బాష్ లీగ్, ఆస్ట్రేలియా), బీపీఎల్ (బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్), పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్), ఎస్ఏ 20 (సౌతాఫ్రికా టీ20 లీగ్) తరహాలోనే యూఏఈ వేదికగా మరో టీ20 లీగ్ ప్రారంభమైంది. అంతర్జాతీయ స్టార్లతో నిండిన ఈ లీగ్‌కు ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్ టీ20)గా నామకరణం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్ తరహాలోనే ఈ లీగ్‌లోనూ 6 జట్లు పోటీపడుతున్నాయి. One for the history books 📖@Dubai_Capitals WIN THE FIRST #DPWorldILT20 GAME 👏 #ALeagueApart #DCvADKR pic.twitter.com/l4Z5GXPVxr — International League T20 (@ILT20Official) January 13, 2023 నిన్న (జనవరి 13) జరిగిన లీగ్ ఇనాగురల్ మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్, అబుదాబీ నైట్ రైడర్స్ జట్లు తలపడగా.. దుబాయ్ క్యాపిటల్స్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. రాబిన్ ఉతప్ప (33 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ రోవమన్ పావెల్ (29 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. జో రూట్ (21 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సికందర్ రజా (17 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. భానుక రాజపక్స (9), యూసప్ పఠాన్ (6) విఫలమయ్యారు. రవి బొపారా (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్), ఇసురు ఉడాన (3 బంతుల్లో 11 నాటౌట్; ఫోర్, సిక్స్) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. నైట్ రైడర్స్ బౌలర్లలో రవి రాంపాల్, అలీ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్.. రజా అకీఫుల్లా ఖాన్ (2/20), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (2/16), రోవమన్ పావెల్ (2/15), ఇసురు ఉడాన (1/14), హజ్రత్ లుక్మా్న్ (1/27), సికందర్ రజా (1/17) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (38 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (12 బంతుల్లో 12; ఫోర్) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. కొలిన్ ఇంగ్రామ్ (1), బ్రాండన్ కింగ్ (8), జవార్ ఫరీద్ (9), సునీల్ నరైన్ (4), కాన్నర్ (3), అకీల్ హొస్సేన్ (3), ఫహాద్ నవాజ్ (1) దారుణంగా విఫలమయ్యారు. రవి రాంపాల్ (6), అలీ ఖాన్ (6) అజేయంగా నిలిచారు. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ (జనవరి 14) ముంబై ఎమిరేట్స్ (ముంబై ఇండియన్స్ యాజమాన్యం), షార్జా వారియర్స్ (క్యాప్రి గ్లోబల్) జట్లు తలపడనున్నాయి. About time you plan your schedule as ours is all set. 34 action packed matches from 13th Jan 2023 💥 Teams are ready to duel for the glorious ILT20 trophy. Catch all the action live with @ilt20onzee Check out the #ILT20 schedule.#ALeagueApart pic.twitter.com/dVINE7FIEu — International League T20 (@ILT20Official) November 29, 2022 ఐఎల్ టీ20 లీగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు.. షెడ్యూల్.. జనవరి 13 నుంచి మొదలయ్యే ఈ లీగ్ ఫిబ్రవరి 12న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. 6 జట్లు పాల్గొనే ఈ లీగ్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు జరుగుతాయి. Ready to conquer! 🏆 The captains and the trophy, a glimpse of the final destination before the tournament begins 🤩 #DPWorldILT20 #ALeagueApart pic.twitter.com/IC88z9Qu59 — International League T20 (@ILT20Official) January 12, 2023 ఎలా చూడాలి.. ఐఎల్ టీ20 లీగ్‌ను జీ నెట్‌వర్క్స్‌లోని 10 ఛానల్లలో ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో వీక్షించవచ్చు. జీ సినిమా (ఎస్డీ, హెచ్డీ), జీ అన్మోల్ సినిమా, జీ తిరాయ్, జీ బంగ్లా సినిమా, జీ జస్ట్ (ఎస్డీ, హెచ్డీ), పిక్చర్స్ హెచ్డీ, ఫ్లిక్స్ (ఎస్డీ, హెచ్డీ) ఛానల్‌లతో పాటు ఇదే సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో చూడవచ్చు. The BIGGEST movie star in the world meets the BIGGEST T20 League 🤩 2023 will indeed start with a BANG because @iamsrk has joined #ALeagueApart 🔥 Book your tickets now; https://t.co/MXQYHlHN5j#DPWorldILT20 #SRK #ShahRukhKhan pic.twitter.com/fXUP0P6XaV — International League T20 (@ILT20Official) January 7, 2023 టీమ్స్, ఓనర్స్ .. ఎంఐ ఎమిరేట్స్ (ముంబై ఇండియన్స్) అబుదాబి నైట్ రైడర్స్ (కోల్‌కతా నైట్ రైడర్స్) డెసర్ట్ వైపర్స్ (గ్లేజర్ ఫ్యామిలీ) దుబాయ్ క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) గల్ఫ్ జెయింట్స్ (అదానీ గ్రూప్) షార్జా వారియర్స్ (క్యాప్రి గ్లోబల్) కెప్టెన్లు.. ఎంఐ ఎమిరేట్స్ - కీరన్ పొలార్డ్/ డ్వేన్ బ్రావో అబుదాబి నైట్ రైడర్స్ - సునీల్ నరైన్ డెసర్ట్ వైపర్స్ - కొలిన్ మున్రో దుబాయ్ క్యాపిటల్స్ - రొవమన్ పావెల్ గల్ఫ్ జెయింట్స్ - జేమ్స్ విన్స్ షార్జా వారియర్స్ - మొయిన్ అలీ లీగ్‌లో పాల్గొనే కీలక ఆటగాళ్లు.. సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, రోవమన్ పావెల్, షిమ్రోన్ హెట్మెయర్, ఆండ్రీ రసెల్, పాల్ స్టిర్లింగ్, మొయిన్ అలీ, సికందర్ రజా, రాబిన్ ఉతప్ప, యూసఫ్‌పఠాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, జో రూట్, క్రిస్ జోర్డాన్, జేమ్స్ విన్స్, దసున్ షనక, వనిందు హసరంగ, ట్రెంట్ బౌల్ట్ తదితరులు -
కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలక నిర్ణయం..! అబుదాబి కెప్టెన్‌గా సునీల్ నరైన్
యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్ తొలి సీజన్ వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ లీగ్‌లో అబుదాబి నైట్ రైడర్స్ కెప్టెన్‌గా వెస్టిండీస్ విధ్వంసకర ఆల్ రౌండర్ సునీల్ నరైన్ నియమితుడయ్యాడు. కాగా అబుదాబి నైట్ రైడర్స్ ప్రాంఛైజీని ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని ఐపీఎల్ సీజన్ల నుంచి సునీల్ నరైన్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి అబుదాబి జట్టు పగ్గాలు కేకేఆర్ యాజమాన్యం అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఇక టీ20 క్రికెట్లో సునీల్ నరైన్ అద్భుతమైన ఆటగాడు. అతడికి 400 పైగా టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. కాగా అబుదాబి నైట్ రైడర్స్ జట్టులో నరైన్‌తో పాటు ఆండ్రీ రస్సెల్, రవి రాంపాల్, అకేల్ హొస్సేన్, రేమాన్ రీఫర్, కెన్నార్ లూయిస్ వంటి విండీస్ ఆటగాళ్లు ఉన్నారు. ఇక కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం సునీల్ నరైన్ స్పందించాడు. "అబుదాబి నైట్ రైడర్స్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్దంగా ఉన్నాను. ఇది ఒక కొత్త సవాలు. ఎందుకంటే ఇప్పడు నేను నా బ్యాటింగ్, బౌలింగ్‌పై కాకుండా జట్టు మొత్తం ఆటతీరుపై దృష్టిపెట్టాలి. నాకు నైట్ రైడర్స్ గ్రూపుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. చాలా ప్రాంఛైజీలో లీగ్‌ల్లో నైట్ రైడర్స్‌కు సంబంధించిన జట్లు ఉన్నాయి. ప్రతీ చోటా వాళ్ల జట్టులో నేను భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇక యూఏఈలో నేను చాలా క్రికెట్ ఆడాను. అక్కడి పరిస్థితులు బాగా తెలుసు. కాబట్టి జట్టును విజయ పథంలో నడిపించడానికి ప్రయత్నిస్తాను అని సునీల్ నరైన్ పేర్కొన్నాడు. చదవండి: IND Vs BAN: పాపం శ్రేయస్ అయ్యర్.. తృటిలో సెంచరీ మిస్! -
IPL 2023: ఆ ఫ్రాంచైజీలకు వారిపై ఎంత నమ్మకమో.. దారుణంగా విఫలమైనా..!
కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగబోయే ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలం కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదలయ్యాయి. వేలంలో ప్రక్రియలో భాగంగా ఆటగాళ్లను అట్టిపెట్టుకుని, వదిలించుకునే ప్రాసెస్ రెండు రోజుల కిందటే (నవంబర్ 15) పూర్తయ్యింది. ఇక మిగిలింది మినీ వేలం ప్రక్రియ మాత్రమే. వచ్చే నెలలో జరిగే ఈ తంతులో ఆయా ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్లతో పాటు కొత్త ఆటగాళ్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఐపీఎల్ 16వ ఎడిషన్ భారత్ వేదికగా 2023 మార్చి 20-మే 28 మధ్యలో జరుగనున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే, గత సీజన్లో ఆశించిన మేరకు రాణించలేకపోయినా కొందరు ఆటగాళ్లను ఆయా ప్రాంచైజీలు అట్టిపెట్టుకోవడం విశేషం. 2022 సీజన్లో దారుణంగా విఫలమైన వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్), సునీల్ నరైన్ (కేకేఆర్), మాథ్యూ వేడ్ (గుజరాత్ టైటాన్స్), షారుఖ్ ఖాన్ (పంజాబ్ కింగ్స్), రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్)లపై సంబంధిత ఫ్రాంచైజీలు పూర్తి నమ్మకంతో వారిని కొనసాగించేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. గత రెండు సీజన్లుగా కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటేశ్ అయ్యర్, 2021 సీజన్లో అద్భుతాలు చేసినప్పటికీ.. గత సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. 2022 సీజన్లో అతనాడిన 12 మ్యాచ్‌ల్లో 107.69 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. పార్ట్ టైమ్ ఆల్‌రౌండర్ అయిన అయ్యర్ సీజన్ మొత్తంలో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. సునీల్ నరైన్ విషయానికొస్తే.. కేకేఆర్కే ప్రాతినిధ్యం వహించే ఈ విండీస్ ఆల్‌రౌండర్ గత సీజన్లో దారుణంగా నిరాశపరిచాడు. 2022 సీజన్లో అతను ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 71 పరుగులు మాత్రమే చేసి, 9 వికెట్లు పడగొట్టాడు. 11 ఏళ్ల తర్వత ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆసీస్ వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్.. 2022 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన వేడ్.. 113.77 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 157 పరుగులు మాత్రమే చేశాడు. వేడ్‌కు 2011 ఐపీఎల్ సీజన్లో ఏమంత మెరుగైన రికార్డు లేదు. ఆ సీజన్లో 3 మ్యాచ్‌లు ఆడిన అతను 66.66 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. 2022 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఏకంగా 9 కోట్ల పెట్టి దక్కించుకున్న షారుఖ్ ఖాన్.. గత సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడి 108 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 117 పరుగులు మాత్రమే చేసి ఫ్రాంచైజీ అతనిపై పెట్టుకున్న ఆశలను అడియాశలు చేశాడు. అండర్-19 వరల్డ్‌కప్ ద్వారా వెలుగులోకి వచ్చి 2019 సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రియాన్ పరాగ్, గత సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఘోరంగా విఫలమయ్యాడు. ఆ సీజన్లో 17 మ్యాచ్‌లు ఆడిన పరాగ్ 138. 64 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 183 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. పై పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్లు గత సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ.. సంబంధిత జట్లు వారిపై విశ్వాసం వ్యక్తం చేసి మరో అవకాశాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా భారీ ధర పెట్టి సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రియాన్ పరాగ్‌లను వారి ఫ్రాంచైజీలు రిలీజ్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చదవండి: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే! -
చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా నిన్న (నవంబర్ 6) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు (10) సంధించిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసిన భువీ.. ఆ ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మొయిడిన్ చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్ల రికార్డును సహచరుడు జస్ప్రీత్ బుమ్రాతో కలిసి షేర్ చేసుకున్న భువీ.. తాజాగా ఈ అరుదైన రికార్డను తన పేరిట లఖించుకున్నాడు. ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్లో అత్యధిక మెయిడిన్ ఓవర్ల రికార్డు విండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ పేరటి ఉంది. నరైన్ టీ20ల్లో మొత్తం 27 మెయిడిన్ ఓవర్లు బౌల్ చేశాడు. అతని తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఉన్నాడు. షకీబ్ ఖాతాలో 23 మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. వీరి తర్వాత విండీస్ లెగ్ స్పిన్నర్ శ్యాముల్ బద్రీ (21), భువనేశ్వర్ కుమార్ (21) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా పేసు గుర్రం బుమ్రా 19 మెయిడిన్లతో ఆరో ప్లేస్‌లో ఉన్నాడు. ఇదిలా ఉంటే, నిన్న జింబాబ్వేపై గెలుపుతో టీమిండియా గ్రూప్-2లో అగ్రస్థానంతో సెమీస్‌కు చేరుకుంది. ఈ గ్రూప్ నుంచి సెమీస్‌కు చేరిన రెండో జట్టుగా పాక్ నిలిచింది. అటు గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి. నవంబర్ 9న జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్-పాకిస్తాన్‌లు.. ఆమరుసటి రోజు (నవంబర్ 10) జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్ల మధ్య నవంబర్ 13న ఫైనల్ జరుగుతుంది. -
'మురళీధరన్, నరైన్ కాదు.. ప్రపంచ క్రికెట్లో నేనే బెస్ట్ స్పిన్నర్'
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ఫీల్డ్‌లో గానీ ఆఫ్‌ధి ఫీల్డ్‌లో గానీ ఎంతో ఉత్సహంగా ఉంటాడో ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మరో సారి గేల్ తన ఫన్నీ కామెంట్లతో వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం యూనివర్స్ బాస్ కరీబియన్ దీవులలో జరగబోయే సరికొత్త టోర్నీ 'సిక్స్టీ' లీగ్‌కు సిద్దమవుతున్నాడు. ఈ టోర్నీ టీ10 ఫార్మాట్లో జరగనుంది. ఈ లీగ్ బుధవారం(ఆగస్టు 24) నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూనివర్స్ బాస్ సరదా వాఖ్యలు చేశాడు. మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగు పేట్టేందుకు అతృతగా ఎదురుచూస్తున్నా అని ఈ సందర్భంగా గేల్ తెలిపాడు. ఈ టోర్నీలో బ్యాట్‌తో పాటు బాల్‌తో కూడా రాణించాలని అనుకుంటున్నట్లు గేల్ వెల్లడించాడు. అదే విధంగా ప్రపంచ క్రికెట్లో ఇప్పటి వరకు తనే అత్యత్తుమ స్పిన్నర్ అని గేల్ ఫన్నీ కామెంట్లు చేశాడు. "నా బౌలింగ్ సహజమైనది. నేను కచ్చితంగా ఈ టోర్నీలో బౌలింగ్ చేస్తాను. మీకు తెలుసా..? ప్రపంచ క్రికెట్లో నేనే ఇప్పటి వరకు గ్రేట్ స్పిన్నర్‌ని. ముత్తయ్య మురళీధరన్ కూడా నాలా బౌలింగ్ చేయలేకపోయాడు. అతని కంటే నేను తక్కువ ఎకనామీతో బౌలింగ్ చేశాను. అదేవిధంగా సునీల్ నరైన్ కూడా నా దగ్గరకు రాలేడు" అని సరదాగా గేల్ వాఖ్యనించాడు. "మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగు పెట్టేందుకు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నాను. గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉండడంతో ఇది నా అరంగేట్ర మ్యాచ్‌గా భావిస్తున్నాను. ఈ టోర్నీతో మళ్లీ నా రిథమ్‌ను తిరిగి పొందుతాను. ఈ టోర్నీ నన్ను మరికొంత కాలం క్రికెట్ ఆడేలా సహాయపడుతుందని" యూనివర్స్ బాస్ పేర్కొన్నాడు. కాగా గేల్ చివరగా టీ20 ప్రపంచకప్‌లో ఆడాడు. -
కేకేఆర్ ఫ్యామిలీలోకి ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ యూఈఏ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20లో అబుదాబి నైట్‌రైడర్స్ జట్టును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 14 మందితో కూడిన అబుదాబి నైట్‌రైడర్స్(ఏడీకేఆర్)జట్టును కేకేఆర్ యాజమాన్యం మంగళవారం తమ ట్విటర్లో ప్రకటించింది. ప్రస్తుతం ఐపీఎల్లో కేకేఆర్‌కు ఆడుతున్న ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్‌లు యూఏఈ టి20లీగ్‌లోనూ అబుదాబి నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరితో పాటు ఇంగ్లండ్ స్టార్ జానీ బెయిర్ స్టో, ఐర్లాండ్ విధ్వంసకర ఆటగాడు పాల్ స్టిర్లింగ్, లంక క్రికెటర్లు చరిత్ అసలంక, లాహిరు కుమారాలు ఉన్నారు.. కొలిన్ ఇంగ్రామ్, అకిల్ హొసేన్లు కూడా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. ''క్రికెట్లో ప్రపంచవ్యాప్తంగా మా అడుగులు పడడం గొప్ప అచీవ్మెంట్ అన్ని చెప్పొచ్చు. ఐపీఎల్లో కేకేఆర్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో టీకేఆర్.. తాజాగా ఐఎల్టి20లో ఏడీకేఆర్. కేకేఆర్ జట్టులో ఉన్న ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్‌లు ఏడీకేఆర్లో ఉండడం మాకు సానుకూలాంశం. ఇక కేకేఆర్ ఫ్యామిలీలోకి బెయిర్ స్టోకు స్వాగతం. ఐఎల్టి20లో ఏడీకేఆర్ తరపున బెయిర్ స్టో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాలని కోరుకుంటున్నాం. అలాగే లంక క్రికెటర్లు చరిత్ అసలంక, లాహిరు కుమారా.. ఐర్లాండ్ స్టార్ పాల్ స్టిర్లింగ్లకు కూడా గ్రాండ్ వెల్కమ్. కొలిన్ ఇంగ్రామ్, అకిల్ హొసేన్, రవి రాంపాల్ సహా ఇతర క్రికెటర్లకు కూడా స్వాగతం. ఐఎల్టి20 ద్వారా మేం గ్లోబల్ క్రికెట్లో విజయవంతమయ్యే ప్రయత్నంలో ఉన్నాం. ఆల్ ది బెస్ట్ అబుదాబి నైట్‌రైడర్స్ టీం(ఏడీకేఆర్)'' అంటూ ముగించాడు. యూఏఈ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టి20(ఐఎల్టీ20) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరకు జరగనుంది. ఐఎల్టి 20 కోసం అబుదాబి నైట్ రైడర్స్ జట్టు: సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, జానీ బెయిర్‌స్టో, పాల్ స్టిర్లింగ్, లహిరు కుమార, చరిత్ అసలంక, కోలిన్ ఇంగ్రామ్, అకేల్ హోసేన్,రేమాన్ రీఫర్, ఎస్ ప్రసన్న, రవి రాంపాల్, కెన్నార్ లూయిస్,అలీ ఖాన్, బ్రాండన్ గ్లోవర్ Welcome to the family, Knights 💜 https://t.co/mFNyF7a94T — KolkataKnightRiders (@KKRiders) August 16, 2022 చదవండి: MI Emirates: 'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్‌పై కన్నేశారు -
'ఆడమని ఎవరిని అడుక్కోం'.. విండీస్ కోచ్; రసెల్ స్ట్రాంగ్ కౌంటర్
వెస్టిండీస్ క్రికెటర్లు తమ దేశానికంటే బయటి దేశాలు నిర్వహించే లీగ్స్‌లోనే ఎక్కువగా కనబడుతుంటారు. కారణం డబ్బు. విండీస్‌కు ఆడితే వచ్చే డబ్బుతో పోలిస్తే.. ప్రైవేట్ లీగ్స్‌లో ఆ డబ్బు రెండింతల కంటే ఎక్కువుంటుంది. అందుకే క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్ , ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. మొత్తంగా చెప్పాలంటే.. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న వివిధ క్రికెట్ లీగ్స్ అందరికంటే ఎక్కువగా కనబడేది కరేబియన్ క్రికెటర్లే. మన ఐపీఎల్‌తోనూ వారికి విడదీయరాని బంధం ఉంది. డబ్బులు ఎక్కువొస్తాయంటే అవసరమైతే జాతీయ జట్టుకు ఆడే విషయాన్ని పక్కకుబెట్టడం విండీస్ ఆటగాళ్ల నైజం. అందుకే టి20 ఫార్మాట్లో రెండుసార్లు చాంపియన్ అయినప్పటికి ఆ జట్టులో ఎప్పుడు నిలకడ ఉండదు. ఈ మధ్య కాలంలో అది మరోసారి నిరూపితమైంది. ఇటీవలే భారత్‌తో జరిగిన టి20 సిరీస్‌లో 4-1 తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే విండీస్ జట్టు కోచ్ ఫిల్ సిమ్మన్స్ రెండు రోజుల క్రితం దేశానికంటే విదేశీ లీగ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న కొందరు క్రికెటర్లపై వ్యంగ్యంగా స్పందించాడు. ''వెస్టిండీస్ కోసం కాస్త ఆడండయ్యా అంటూ మేము ప్లేయర్లను అడుక్కోవాలని అనుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌లు ఆడుతున్న ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ తదితర స్టార్లు.. జాతీయ జట్టుకు ముఖం చాటేస్తున్నారు. అక్టోబర్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ జట్టులో అత్యుత్తమ ప్లేయర్లను బరిలోకి దించడానికి బోర్డు తీవ్రంగా కష్టపడుతున్నప్పటికీ.. చాలా మంది క్రికెటర్లు డబ్బు కోసం ఫ్రాంచైజీ లీగ్‌కే మొగ్గు చూపుతున్నారు. ఇంకొంతమంది గాయాలతో జట్టుకు అందుబాటులో ఉండట్లేదంటూ అబద్దాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. దీంతో మాకు వేరే మార్గం లేకుండా పోయింది.. ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరు. స్టార్ ప్లేయర్లు తన జాతీయ జట్టు కోసం ఆడాలని తాపత్రాయపడితే మార్పు వస్తుందని నమ్ముతున్నా. అందుకు తగ్గట్లు వాళ్లు కొన్ని లీగ్‌లను వదులుకుంటే తప్పితే మేము ఏం చేయలేని పరిస్థితి'' అని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా విండీస కోచ్ ఫిల్ సిమ్మన్స్ చేసిన వ్యాఖ్యలపై విండీస్ సీనియర్ ప్లేయర్ ఆండ్రీ రసెల్ కాస్త ఘూటుగానే స్పందించాడు. ఫిల్ సిమ్మన్స్ ఆర్టికల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ''ఇలాంటిది వస్తుందని నాకు ముందే తెలుసు.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సైలెంట్‌గా ఉండడమే ఉత్తమం..'' అంటూ క్యాప్షన్ జత చేసి కోపంతో ఉన్న ఎమోజీలను షేర్ చేశాడు. రసెల్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రసెల్ వెస్టిండీస్ తరపున 67 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఆఖరిసారిగా వెస్టిండీస్ తరపున టి20 ప్రపంచకప్ 2021లో పాల్గొన్నాడు. అయితే యూఏఈ వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్‌లో వెస్టిండీస్ దారుణ ప్రదర్శన కనబరిచింది. రసెల్ మాత్రమే కాదు సునీల్ నరైన్ కూడా 2019 నుంచి జాతీయ జట్టుకు రెగ్యులర్‌గా అందుబాటులో ఉండడం లేదు. గాయాల సాకు చెప్పి డబ్బులు బాగా వచ్చే ఐపీఎల్, బిగ్‌బాష్ లీగ్, కరేబియన్ లీగ్‌ల్లో ఆడుతూ బిజీగా గడుపుతున్నారు. View this post on Instagram A post shared by Andre Russell🇯🇲 Dre Russ.🏏 (@ar12russell) చదవండి: MI Emirates: 'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్‌పై కన్నేశారు Dwayne Bravo: 600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. టి20 క్రికెట్లో తొలి బౌలర్‌గా -
పొలార్డ్ నిర్ణయం నన్ను షాక్‌కు గురిచేసింది: సునీల్ నరైన్
వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని అందరని షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు, కేకేఆర్ విధ్వంసకర ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ .. కీరన్ పొలార్డ్ ఆకస్మిక రిటైర్మెంట్ పట్ల నిరాశను వ్యక్తం చేశాడు.అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న పొలార్డ్ ఇకపై దేశవాళీ టోర్నీల్లో మాత్రం ఆడనున్నాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున పొలార్డ్ ఆడుతున్నాడు. పొలార్డ్ విండీస్ తరపున 123 వన్డేలు, 101 టీ20ల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. "పొలార్డ్ తీసుకున్న నిర్ణయం నన్ను షాక్‌కు గురి చేసింది. అయితే అతడు మరి కొంత కాలం విండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఉంటే బాగుండేది. అతడు జట్టుకు చేయవలిసింది ఇంకా చాలా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న పొలార్డ్.. తన భవిష్యత్తులో ఏ టోర్నమెంట్లో ఆడినా అద్భుతంగా రాణించాలని ఆశిస్తున్నాను" నరైన్ అని పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: లంక యువ పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఆడమ్ మిల్నే స్థానంలో సీఎస్కేలోకి ఎంట్రీ -
150వ మ్యాచ్‌లో డైమండ్ డక్.. విలన్‌గా మారిన ఆరోన్ ఫించ్
ఐపీఎల్ 2022లో కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కేకేఆర్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఒక ఊహించని పరిణామం జరిగింది. 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. లేని పరుగు కోసం ప్రయత్నించిన ఫించ్.. ఓపెనర్ నరైన్‌ను రనౌట్ చేశాడు. ఐపీఎల్లో 150వ మ్యాచ్ ఆడుతున్న నరైన్ ఆరంభంలోనే మెరుపు ఇన్నింగ్స్ ఆడి స్కోరు సాధించాలన్న కల తీరకుండా ఫించ్ అతనికి అడ్డుపడ్డాడు. Courtesy: IPL Twitter విషయంలోకి వెళితే.. బౌల్ట్ వేసిన తొలి ఓవర్ తొలి బంతిని ఫించ్ కవర్స్ దిశగా ఆడాడు. అయితే షాట్ కొట్టిన వెంటనే సింగిల్‌కు కాల్ ఇచ్చాడు. రిస్క్ అని తెలిసినా పరిగెత్తాడు. అప్పటికే బంతిని అందుకున్న హెట్‌మైర్ బులెట్ వేగంతో డైరెక్ట్ త్రో విసిరాడు. నరైన్ సగం క్రీజు దాటేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో నరైన్ డైమండ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. డైమండ్ డక్ అంటే ఒక్క బంతి ఆడకుండానే వెనుదిరగడం. బహుశా ఐపీఎల్లో నరైన్‌దే తొలి డైమండ్ డక్ అనుకుంటా. కాగా నరైన్ ఔట్ విషయంలో ఫించ్‌ను తప్పుబట్టారు. తొలి బంతికే ఎందుకంత తొందర.. నరైన పాలిట ఫించ్ విలన్ అయ్యాడు అంటూ కామెంట్స్ చేశారు. అయితే నరైన్‌ను ఔట్ చేశానన్న బాధ కలిగిందేమో తెలియదు గాని ఆ తర్వాత ధాటిగా ఆడడం మొదలుపెట్టాడు. 25 బంతుల్లోనే ఫిప్టీ మార్క్‌ను అందుకున్నాడు. ఫించ్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత 28 బంతుల్లో 58 పరుగులు చేసి ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో కరుణ్ నాయర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చదవండి: IPL 2022: సీజన్లో రెండో సెంచరీ అందుకున్న బట్లర్.. పలు రికార్డులు బద్దలు సునీల్ నరైన్ డైమండ్ డకౌట్ కోసం క్లిక్ చేయండి -
భీకర ఫామ్‌లో కేకేఆర్ ప్లేయర్..8 సిక్సర్లు, 3 ఫోర్లతో విధ్వంసం
కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆటగాడు, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ భీకరమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022)లో మొదలైన అతని విధ్వంసకర ప్రదర్శన.. ప్రస్తుతం జరుగుతున్న ట్రినిడాడ్ టీ10 లీగ్‌లోనూ కొనసాగుతుంది. బీపీఎల్‌లో భాగంగా ఓ మ్యాచ్‌లో 16 బంతుల్లో అర్ధశతకం(5 ఫోర్లు, 6 సిక్సర్లతో 57 పరుగులు), ఆమరుసటి మ్యాచ్‌లో 23 బంతుల్లో అర్ధశతకం (5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 57 పరుగులు) సాధించిన నరైన్.. తాజాగా ట్రినిడాడ్ లీగ్‌లో 22 బంతుల్లో 8 సిక్సర్లు, 3 ఫోర్లతో అజేయమైన 68 పరుగులు చేసి ఐపీఎల్ 2022కి ముందు ప్రత్యర్ధి జట్లకు సవాలు విసురుతున్నాడు. ఈ లీగ్‌లో స్కోవా కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నరైన్... కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి తన జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కోవా కింగ్స్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది. లియోనార్డో జూలియన్ 9 బంతుల్లో 21 పరుగులు చేసి ఔటైన అనంతరం.. నరైన్, జేసన్ మహ్మద్ (33 బంతుల్లో 11 సిక్సర్ల సాయంతో 93 పరుగులు)తో కలిసి ప్రత్యర్ధి (కవాలియర్స్) బౌలర్లను ఊచకోత కోశాడు. అనంతరం కవాలియర్స్ జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసి దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. కింగ్స్ బౌలర్లలో రేమండ్ 2 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాశించాడు. ఇదిలా ఉంటే, ఇదే లీగ్‌లో నరైన్ కంటే ముందు విండీస్ హిట్టర్లు నికోలస్ పూరన్, ఎవిన్ లూయిస్ కూడా విధ్వంసం సృష్టించారు. పూరన్.. లెదర్‌బ్యాక్ జెయింట్స్ తరఫున ఆడుతూ కేవలం 37 బంతుల్లో అజేయమైన శతకం (10 సిక్సర్లు, 6 ఫోర్లతో 101 పరుగులు) సాధించగా, మరో మ్యాచ్‌లో ఎవిన్ లూయిస్ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 17 బంతులు ఎదుర్కొన్న లూయిస్ ఏకంగా 8 సిక్సర్లు బాదాడు.కాగా, విండీస్ బ్యాటర్ల తాజా ఫామ్ చూసి వారిని సొంతం చేసుకున్న ఐపీఎల్ జట్లు తెగ సంబురపడిపోతున్నాయి. విండీస్ యోధులు ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని ఆయా ఫ్రాంచైజీలు ఆకాంక్షిస్తున్నాయి. చదవండి: IPL 2022: సునీల్ నరైన్ ఊచకోత.. సంబురాల్లో కేకేఆర్ -
IPL 2022: సునీల్ నరైన్ ఊచకోత.. సంబురాల్లో కేకేఆర్
Sunil Narine: వెస్టిండీస్ ఆటగాడు, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ భీకరమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022)లో కొమిల్లా విక్టోరియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ విండీస్ ఆల్‌రౌండర్ ఆకాశమే హద్దుగా చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నాడు. లీగ్‌లో భాగంగా బుధవారం చటోగ్రామ్ ఛాలెంజర్స్‌తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ (57 పరుగులు) ఆడిన నరైన్.. శుక్రవారం ఫార్చూన్ బారిషల్‌తో జరిగిన ఫైనల్లోనూ అదే తరహాలో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న కొమిల్లా విక్టోరియన్స్ జట్టు బీపీఎల్ 2022 ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన నరైన్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 57 పరుగులు స్కోర్ చేశాడు. దొరికిన బంతిని దొరికనట్లు బాధడమే పనిగా పెట్టుకున్న అతను.. లీగ్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తక్కువ బంతుల్లో అర్ధ శతకం నమోదు చేశాడు. చదవండి: 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ.. 6 సిక్స్‌లు.. 5 ఫోర్లు.. యూవీ రికార్డు జస్ట్ మిస్! ఫలితంగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన కొమిల్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఫార్చూన్ జట్టు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు నరైన్ భీకరమైన ఫామ్ ఉండటంతో కేకేఆర్ ఫ్రాంచైజీ సంబురాల్లో మునిగి తేలుతుంది. ఈ ఏడాది మెగా వేలానికి ముందు కేకేఆర్ అతన్ని 6 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. 5️⃣ 1️⃣ runs in just 2️⃣ 1️⃣ balls! We love to see it! 😍 The ball has been bouncing off #SunilNarine’s bat and landing in the stands. 📺 Watch the action LIVE from the final of #BBPL2022 on #Fancode 👉 https://t.co/kIiCjX0tXl#BPLonFanCode pic.twitter.com/oBCCUU4aWS — FanCode (@FanCode) February 18, 2022 చదవండి: IPL 2022: రూ.100 కోట్లతో సునీల్ నరైన్ సరికొత్త రికార్డు -
13 బంతుల్లోనే అర్ధ సెంచరీ.. 6 సిక్స్‌లు.. 5 ఫోర్లు.. యూవీ రికార్డు జస్ట్ మిస్!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో బుధవారం జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో చటోగ్రామ్ ఛాలెంజర్స్‌తో కొమిల్లా విక్టోరియన్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో కొమిల్లా బ్యాటర్ సునీల్ నరైన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 16 బంతుల్లో 57 పరుగులు చేసి ప్రత్యర్ధి బౌలర్లను నరైన్ ఊచకోత కోశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. కాగా సునీల్ నరైన్ కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నరైన్ రికార్డుల కెక్కాడు. ఇక నరైన్ కన్నా ముందు ఇంగ్లండ్ బ్యాటర్ మార్కస్ ట్రెస్కోతిక్ 13 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. అయితే నరైన్.. యువరాజ్ సింగ్ రికార్డును తృటిలో కోల్పోయాడు. కాగా 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై కేవలం 12 బంతుల్లోనే యువరాజ్ అర్ధ సెంచరీ సాధించాడు. యవీతో పాటు క్రిస్ గేల్, హజ్రతుల్లా జాజాయ్ 12 బంతుల్లోనే అర్ధ శతకాలు సాధించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన చటోగ్రామ్ ఛాలెంజర్స్ 19.1 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. చటోగ్రామ్ బ్యాటర్లలో మెహది హసన్(44), అక్బర్ అలీ(33), పరగులుతో రాణించారు. ఇక కొమిల్లా బౌలర్లలో షాహిదుల్ ఇస్లాం, మొయిన్ అలీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఇక 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కొమిల్లా.. కేవలం 12.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కొల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. చదవండి: 13 బంతుల్లో సునామీ ఇన్నింగ్స్... బంతితోను బ్యాటర్లకు చుక్కలు.. సీఎస్కే ఫ్యాన్స్‌కు ఇక..! OMGHBFUEBFIOEBV... Brb, collecting our jaws from the floor! 🤯 📺 WATCH THE FASTEST-EVER 50 IN THE HISTORY OF #BPL ON #FANCODE 👉 https://t.co/zQb7mURAnc#BPLonFanCode #BBPL2022 @SunilPNarine74 pic.twitter.com/SJcxCojRg1 — FanCode (@FanCode) February 16, 2022 -
IPL 2022: రూ.100 కోట్లతో సునీల్ నరైన్ సరికొత్త రికార్డు
కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ఆటగాడు.. విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్లో కొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో విదేశీ ప్లేయర్‌గా రూ.100 కోట్ల మార్క్‌ను అందుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. 2012లో కేకేఆర్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేసిన సునీల్ నరైన్ వరుసగా 10వ ఏడాది కేకేఆర్ తరపున ఐపీఎల్ 2022 సీజన్లో ప్రాతినిధ్యం వహించనున్నాడు. చదవండి: ధోని తర్వాత సీఎస్కేకు కెప్టెన్ అయ్యేది ఆ ఆటగాడే! మెగావేలానికి ముందు ఫ్రాంచైజీలు రిటైన్ జాబితాను ప్రకటించాయి. కేకేఆర్ ఫ్రాంచైజీ సునీల్ నరైన్(రూ.6 కోట్లు)తో పాటు ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్(రూ.12 కోట్లు), వరుణ్ చక్రవర్తి(రూ. 8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్(రూ. 8 కోట్లు) తమ వద్దనే ఉంచుకుంది. కాగా కేకేఆర్ రిటైన్ జాబితాను ప్రకటించక ముందు సునీల్ నరైన్ ఐపీఎల్ ద్వారా తాను ఆడిన 10 సీజన్లు కలిపి రూ.95.6 కోట్లు సంపాదించాడు. తాజాగా కేకేఆర్ నరైన్‌ను రూ. 6 కోట్లుకు రిటైన్ చేసుకోవడంతో అతని సంపాదన విలువ రూ. 100 కోట్లు దాటింది. ఇక కేకేఆర్ తరపున సునీల్ నరైన్ 134 మ్యాచ్‌ల్లో 958 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 143 వికెట్లు తీశాడు. ఇంతకమందు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ మాత్రమే ఐపీఎల్లో రూ.100 కోట్లు సంపాదన చూసిన తొలి విదేశీ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సంపాదన జాబితాలో నరైన్ కంటే ముందు ఐదుగురు మాత్రమే ఉన్నారు. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని(రూ.152.8 కోట్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (రూ.146.6 కోట్లు) రెండోస్థానంలో.. విరాట్ కోహ్లి(ఆర్సీబీ, రూ. 143.2 కోట్లు), సురేశ్ రైనా( సీఎస్కే, రూ .110. 7 కోట్లు), ఏబీ డివిలియర్స్( ఆర్సీబీ, రూ. 102.5 కోట్లు) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. చదవండి: వెంకటేశ్ అయ్యరా మజాకా.. అప్పుడు 20 లక్షలు.. ఇప్పుడు 8 కోట్లు -
T20 WC 2021: బాగా రాణిస్తున్నాడు.. జట్టులో చోటు మాత్రం కష్టమే
Sunil Narine Wont Include In West Indies T20 Sqaud.. అక్టోబర్ 17 నుంచి టి20 ప్రపంచకప్ 2021 ప్రారంభం కానున్న సందర్భంగా అన్ని జట్లు తమ సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఆయా దేశాలు తమ జట్లలో ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవచ్చవని.. అక్టోబర్ 15వ తేదీ వరకు చివరి అవకాశం ఉందని ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. కాగా టి20 ప్రపంచకప్‌కు సంబంధించి విండీస్ జట్టుకు సునీల్ నరైన్ ఎంపిక కాలేదు. అయితే ఐపీఎల్ 2021 సీజన్లో కేకేఆర్ తరపున ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు. ముఖ్యంగా ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన నరైన్ బౌలింగ్‌లో 4 వికెట్లు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో 26 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా కేకేఆర్ తరపున 8 మ్యాచ్‌లాడి 6.12 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. దీంతో నరైన్ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న కరీబియన్ ఫ్యాన్స్ విండీస్ టి20 ప్రపంచకప్ జట్టులో చోటు కల్పించాలని పెద్ద ఎత్తున కోరారు. చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో అనూహ్య మార్పు.. అయితే వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ నరైన్ బాగా రాణిస్తున్నప్పటికీ విండీస్ జట్టులో చోటు దక్కడం కష్టమే అని తెలిపాడు. ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో పొలార్డ్ మాట్లాడాడు. '' ఐపీఎల్ 2021 జరుగుతున్న యూఏఈ గడ్డపై నరైన్ బాగా రాణిస్తున్నాడు. నరైన్ మొదట నాకు మంచి స్నేహితుడు. ఆ తర్వాత అతనొక వరల్డ్ క్లాస్ క్రికెటర్. అయితే ప్రస్తుతం టి20 ప్రపంచకప్‌కు జట్టుకు ఎంపికైన 15 మంది ప్రత్యేక శైలి కలిగిన వారే. ఇప్పుడున్న పరిస్థితుల్లో జట్టును మార్చి నరైన్‌కు అవకాశం ఇవ్వలేము. అయితే ఎంపిక నా చేతుల్లో ఉండదు. సెలెక్టర్లు నన్ను సంప్రదిస్తే నరైన్ పేరు కచ్చితంగా పేర్కొంటా. కానీ ఆ అవకాశం లేకపోవచ్చు.'' అని చెప్పుకొచ్చాడు. ఇక టి20 ప్రపంచకప్‌లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ సూపర్ 12లో గ్రూఫ్ 1లో ఉంది. విండీస్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 23న ఇంగ్లండ్‌తో ఆడనుంది. చదవండి: T20 World Cup 2021: హార్దిక్ అన్‌ఫిట్.. జట్టులోకి మరో ఆల్‌రౌండర్! Chris Gayle: ఆ క్రికెటర్‌పై గౌరవం చచ్చిపోయింది.. గేల్ సంచలన వ్యాఖ్యలు -
'మిస్టరీ' అంటారు.. మరి ఇన్నేళ్లుగా ఎలా ఆడుతున్నాడు
Gautam Gambhir Lauds Sunil Narine.. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కేకేఆర్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నరైన్ అందరు ఇంకా మిస్టరీ స్పిన్నర్‌గానే చూస్తున్నారని.. మరి ఇన్నేళ్లుగా క్వాలిటి బౌలింగ్ ఎలా చేస్తున్నాడంటూ ప్రశ్నించాడు. కాగా సోమవారం ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. ముందు బౌలింగ్‌లో 4 వికెట్లు తీసిన నరైన్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో కీలక దశలో 3 సిక్సర్లు బాది జట్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నరైన్ ప్లేఆఫ్స్ మెరిసిన రెండుసార్లు కేకేఆర్ ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. చదవండి: David Warner: వచ్చే సీజన్లో ఎస్ఆర్హెచ్కే ఆడాలని ఉంది.. కానీ Courtesy: IPL Twitter ఈ సందర్భంగా గంభీర్ నరైన్ ఆటతీరుపై స్పందించాడు. '' సునీల్ నరైన్ విషయంలో మిస్టరీ అనే పదం ఇప్పటికి వినిపిస్తుండడం నన్ను ఆశ్చర్చపరిచింది. మిస్టరీ అనే పదం కంటే క్వాలిటీ అనే పదం నరైన్‌కు ఎందుకు ఉపయోగించరో అర్థం కాదు. నరైన్ బౌలింగ్ మిస్టరీగానే ఉంటే ఇన్నేళ్ల పాటు విండీస్ తరపున క్రికెట్ ఎలా ఆడుతున్నాడు. కోహ్లి, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్‌లు నరైన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యారు. ఇన్నేళ్లు ఎలా అతని బౌలింగ్‌లో వెనుదిరిగారో ఇప్పుడు కూడా అలానే ఔట్ అయ్యారు. దీనిలో కొత్త విషయం ఎక్కడుంది. నరైన్ బౌలింగ్‌లో ఆ ముగ్గురు ఇప్పటికీ ఆడలేకపోతున్నారనేదానిపై మరోసారి క్లారిటీ వచ్చింది. టాప్‌క్లాస్ బ్యాట్స్‌మెన్‌ను వెనక్కి పంపగల సత్తా నరైన్‌కు ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. Courtesy: IPL Twitter ఇక కేకేఆర్ గంభీర్ కెప్టెన్సీలోనే రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 2012, 2014లో టైటిల్ గెలిచిన గంభీర్ సేనలో సునీల్ నరైన్ కీలకపాత్ర పోషించాడు. 2012 సీజన్లో 24 వికెట్లు తీసిన నరైన్.. 2014 సీజన్లో 21 వికెట్లు తీశాడు. తాజా సీజన్లో(ఐపీఎల్ 2021) 14 వికెట్లతో వరుణ్ చక్రవర్తి తర్వాత కేకేఆర్ తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు. ఇక కేకేఆర్ రేపు(అక్టోబర్ 13) ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్ 2 ఆడనుంది. చదవండి: Sunil Narine: ఆ ముగ్గురిని ఔట్ చేయడం ఇది రెండోసారి మాత్రమే -
Sunil Narine: ఆ ముగ్గురిని ఔట్ చేయడం ఇది రెండోసారి మాత్రమే
Sunil Narine Was Only 2nd Bowler Dismiss RCB Trio.. ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేకేఆర్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ మ్యాచ్ హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. మొదట బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో మూడు సిక్సర్లతో 26 పరుగులు చేసి గేమ్ చేంజర్‌గా నిలిచాడు. అయితే ఇదే మ్యాచ్‌లో ఆర్సీబీ త్రయం కోహ్లి, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్‌ను పెవిలియన్ చేర్చిన నరైన్ ఒక కొత్త రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో ఒకే మ్యాచ్‌లో ఈ త్రయాన్ని ఒక బౌలర్ వెనక్కి పంపడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్‌ప్రీత్ బార్ కోహ్లి, మ్యాక్స్‌వెల్, ఏబీలను వెనక్కి పంపిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇక కేకేఆర్ అక్టోబర్ 13న ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్ 2 ఆడనుంది. ఇప్పటికే సీఎస్కే జట్టు ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2021: ఐపీఎల్ రేటింగ్స్.. బీసీసీఐకి బ్యాడ్‌న్యూస్ ఐపీఎల్లో నరైన్ అందుకున్న కొన్ని రికార్డులు పరిశీలిస్తే.. ►ఐపీఎల్లో నరైన్ ప్లేఆఫ్స్‌లో రాణించిన రెండు సందర్భాల్లోనూ కేకేఆర్ ఐపీఎల్ టైటిల్‌ను గెలవడం విశేషం. ఇక మూడో టైటిల్ కోసం కేకేఆర్ వేట కొనసాగుతుంది. ►ఐపీఎల్ చరిత్రలో లీడింగ్ వికెట్ టేకర్ జాబితాలో నరైన్ ముందు వరుసలో ఉన్నాడు. 132 మ్యాచ్‌ల్లో 141 వికెట్లు పడగొట్టాడు. ► ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ ఎకానమీ కలిగిన బౌలర్లలో నరైన్ అగ్రభాగంలో ఉన్నాడు. చదవండి: IPL 2021: లాస్ట్ బాల్ సిక్స్ కొడితే ఆ మజా వేరు pic.twitter.com/ITc0bcd44c — Cricsphere (@Cricsphere) October 11, 2021 pic.twitter.com/4duozs0Vnk — Cricsphere (@Cricsphere) October 11, 2021 -
నరైన్ సూపర్ బౌలింగ్.. అయ్యర్‌కు బొమ్మ కనపడింది
Sunil Narine Super Bowling.. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడుతుంది. 16 ఓవర్ల ఆట ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఇక విషయంలోకి వెళితే.. 24 పరుగులు చేసిన ఓపెనర్ శిఖర్ ధావన్ ఫెర్గూసన్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ తొలి బంతి నుంచే ఇబ్బంది పడ్డాడు. ఇన్నింగ్స్ 7వ ఓవర్ సునీల్ నరైన్ వేశాడు. ఓవర్ రెండో బంతిని ఆఫ్స్టంఫ్ అవతల వేయడంతో అయ్యర్ బంతిని వదిలేశాడు. అయితే అనూహ్యంగా టర్న్ అయిన బంతి ఆప్‌స్టంప్ వికెట్‌ను ఎగురగొట్టింది. దీంతో బిత్తరపోయిన అయ్యర్ కాసేపు అలాగే నిల్చుండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Ishan Kishan: కోహ్లి పట్టుకోగానే దుఃఖం ఆపుకోలేకపోయాడు.. అందుకేనా! వార్నర్ స్థానంలో వచ్చాడు.. డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు -
కేకేఆర్..అది మీకే టైమ్ వేస్ట్: గావస్కర్
అహ్మదాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 154 పరుగులకే పరిమితమైన సంగతి తెలిసిందే. శుబ్‌మన్ గిల్(43), రసెల్(45 నాటౌట్)లు మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఈ స్కోరును ఢిల్లీ అవలీలగా ఛేదించడంతో కేకేఆర్‌కు మరో ఓటమి తప్పలేదు. ఇది కేకేఆర్‌కు ఐదో ఓటమి కాగా రెండే విజయాలు సాధించింది. ఈ సీజన్లో కేకేఆర్ వరుసగా విఫలం కావడంతో దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆ జట్టులోని లోపాల్ని ఎత్తిచూపాడు. ప్రధానంగా మిడిల్ ఆర్డర్లో కేకేఆర్ ఘోరంగా విఫలం కావడంతోనే భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతుందని విమర్శించాడు. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్టాడిన గావస్కర్.. అహ్మదాబాద్‌లో పిచ్ మంచి బ్యాటింగ్ ట్రాక్. మరి కేకేఆర్ బ్యాటింగ్ చేయడానికి ఎందుకు అపసోపాలు పడింది. నిజాయితీగా చెప్పాలంటే ఆ జట్టులో ఎక్కువమంది క్లాస్ బ్యాట్స్‌మెన్ లేరు. గిల్‌ను తప్పించి చూడండి.. మోర్గాన్ క్లాస్ బ్యాట్స్‌మన్ కాదు. రసెల్ 5 కానీ, 6 స్థానాల్లో వస్తున్నాడు. దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను ప్రమోట్ చేయడం లేదు. చాలామంది డగౌట్లో కూర్చొని చూస్తున్నారు. వారు ఎందుకు బ్యాటింగ్‌కు రావడం లేదో అర్థం కావడం లేదు. ఒకసారి కేకేఆర్ బ్యాటింగ్‌ను చూడండి. సునీల్ నరైన్ 4 లేదా 5 స్థానంలో బ్యాటింగ్‌కు రావడం కేకేఆర్‌కు వేస్ట్ అఫ్ టైమ్. అతని బ్యాటింగ్‌లో ఆ స్థానంలో రావడంలో అర్థం లేదు. కేకేఆర్ తుది జట్టులో నరైన్ ఉన్నప్పుడు ఆర్డర్లో ముందుగా దింపడమే మంచింది. అప్పుడు కనీసం కొన్ని షాట్లైన కనెక్ట్ అవుతాయి’ అని తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నరైన్ ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. -
వరుణ్ పాంచ్ పటాకా
వరుణ్ చక్రవర్తి (4–0–20–5) ... ఈ మ్యాచ్‌కు ముందు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో తీసిన వికెట్లు 7. ఒక మ్యాచ్‌లో గరిష్టంగా పడగొట్టిన వికెట్లు 2. అందుకే ఈ మ్యాచ్‌లోనూ అతనిపై పెద్దగా అంచనాల్లేవు. కానీ ఒక స్పెల్ అతన్ని అందరూ గుర్తుంచుకునేలా చేసింది. బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించింది. పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించింది. బ్యాటింగ్‌లో నరైన్, నితీశ్ రాణా మెరుపులు... వరుణ్ చక్రవర్తి మాయాజాలం కోల్‌కతాకు ఘనవిజయాన్ని అందించాయి. అబుదాబి: బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ టి20 టోర్నీలో ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోన్న ఢిల్లీ క్యాపిటల్స్‌పై 59 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఓపెనర్ నితీశ్ రాణా (53 బంతుల్లో 81; 13 ఫోర్లు, 1 సిక్స్), సునీల్ నరైన్ (32 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 56 బంతుల్లోనే 115 పరుగుల్ని జోడించి మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. నోర్జే, రబడ, స్టొయినిస్ తలా 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుణ్ చక్రవర్తి (5/20) మాయాజాలానికి దాసోహమైంది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (38 బంతుల్లో 47; 5 ఫోర్లు), రిషభ్ పంత్ (33 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. కమిన్స్ 3 వికెట్లు పడగొట్టాడు. తడబాటు... కోల్‌కతా ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలైంది. దూకుడుగా ఆడే ప్రయత్నంలో శుభ్‌మన్ గిల్ (9) రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. నితీశ్ రాణా క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నిస్తుండగా... నోర్జే అద్భుత యార్కర్‌కు త్రిపాఠి (13) వద్ద సమాధానం లేకపోయింది. ఈ రెండు వికెట్లను దక్కించుకున్న నోర్జే పవర్‌ప్లేలో కోల్‌కతాను 36/2తో కట్టడి చేశాడు. దినేశ్ కార్తీక్ (3) కూడా చేతులెత్తేశాడు. ఎదురు దాడి... ఈ దశలో క్రీజులోకి వచ్చిన నరైన్ ఎదురుదాడి చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో వరుసగా 6,4 బాదాడు. రాణా కూడా బ్యాట్ ఝళిపించడంతో తుషార్ 18 పరుగుల్ని సమర్పించుకున్నాడు. ఈ ఓవర్లో నరైన్ రెండు ఫోర్లు, రాణా సిక్సర్ ఢిల్లీపై ఆధిపత్యం చాటుకున్నారు. బౌలర్ ఎవరైనా బాదడమే లక్ష్యంగా పెట్టుకున్న వీరిద్దరూ చకచకా పరుగులు సాధించారు. ఓవర్లో కనీసం రెండు బౌండరీలు ఉండేలా వీరి విధ్వంసం సాగింది. ఈ క్రమంలో తొలుత 35 బంతుల్లో నితీశ్ అర్ధసెంచరీ అందుకున్నాడు. స్టొయినిస్ బౌలింగ్‌లో దూకుడు పెంచిన నరైన్ 6, 4 బాది అర్ధసెంచరీకి చేరువయ్యాడు. అశ్విన్ ఓవర్లో ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న అతను 24 బంతుల్లోనే ఆ మార్క్‌ను అందుకున్నాడు. 4, 6తో 15 పరుగులు పిండుకున్నాడు. తర్వాత కాసేపటికే నరైన్‌ను అవుట్ చేసి రబడ ఈ జోడీని విడదీశాడు. కానీ మరో ఎండ్‌లో రాణా మాత్రం తడబడలేదు. అదే ఓవర్లో ఓ బౌండరీ బాదిన రాణా నోర్జే బౌలింగ్‌లో మరో ఫోర్‌తో ధాటి కొనసాగించాడు. మోర్గాన్ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. రబడ బౌలింగ్‌లో 6,4 బాదాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుస బంతుల్లో వీరిద్దరినీ అవుట్ చేసిన స్టొయినిస్ కోల్‌కతాను 200లోపే కట్టడి చేశాడు. ఆరంభంలోనే షాక్... భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. రహానే (0)ను అవుట్ చేసిన కమిన్స్ ప్రమాదకరంగా కనిపించాడు. అనుకున్నట్లే మూడో ఓవర్లో అద్భుత బంతితో ధావన్ (6) ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసిన కమిన్స్ కోల్‌కతా శిబిరంలో ఆనందాన్ని నింపాడు. మరోవైపు ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను శ్రేయస్ భుజానికెత్తుకున్నాడు. దీంతో పవర్‌ప్లేలో ఢిల్లీ కూడా కోల్‌కతా చేసిన స్కోరే సాధించింది. పంత్ జతగా అయ్యర్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వికెట్‌కు ప్రాధాన్యమిచ్చిన వీరిద్దరూ ఆచితూచి బౌండరీలు బాదుతూ పరుగులు జోడించారు. వరుణ్ తిప్పేశాడు... ఈ జంట క్రీజులో కుదురుకుంటోన్న సమయంలో వరుణ్ తొలిసారిగా బంతిని అందుకున్నాడు. వేసిన రెండో బంతికే పంత్‌ను పెవిలియన్ చేర్చాడు. సిక్స్ కొట్టి జోరు కనబరిచిన హెట్‌మైర్ (10), క్రీజులో పాతుకుపోయిన శ్రేయస్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి మ్యాచ్ గతిని మార్చేశాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 110/5 తో నిలిచింది. ఢిల్లీ విజయ సమీకరణం 30 బంతుల్లో 85 పరుగులుగా ఉండగా 16వ ఓవర్లో మళ్లీ బంతినందుకున్న వరుణ్ తొలి బంతికి స్టొయినిస్ (6), ఐదో బంతికి అక్షర్ (9)లను అవుట్ చేసి ఢిల్లీని దెబ్బ తీశాడు. ఆ తర్వాత ఢిల్లీ కోలుకోలేకపోయింది. చివరి రెండు ఓవర్లలో రబడ (9)ను కమిన్స్, తుషార్ (1)ను ఫెర్గూసన్ అవుట్ చేసి కోల్‌కతాకు ఘనవిజయాన్ని అందించారు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) అక్షర్ పటేల్ (బి) నోర్జే 9; నితీశ్ రాణా (సి) తుషార్ (బి) స్టొయినిస్ 81; రాహుల్ త్రిపాఠి (బి) నోర్జే 13; దినేశ్ కార్తీక్ (సి) పంత్™ (బి) రబడ 3; సునీల్ నరైన్ (సి) రహానే (బి) రబడ 64; మోర్గాన్ (సి) రబడ (బి) స్టొయినిస్ 17; కమిన్స్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 194. బౌలింగ్: 1–11, 2–35, 3–42, 4–157, 5–194, 6–194. బౌలింగ్: తుషార్ దేశ్‌పాండే 4–0–40–0, నోర్జే 4–0–27–2, రబడ 4–0–33–2, అక్షర్ పటేల్ 1–0–7–0, స్టొయినిస్ 4–0–41–2, రవిచంద్రన్ అశ్విన్ 3–0–45–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: రహానే (ఎల్బీడబ్ల్యూ) (బి) కమిన్స్ 0; ధావన్ (బి) కమిన్స్ 6; శ్రేయస్ అయ్యర్ (సి) నాగర్కోటి (బి) వరుణ్ 47; రిషభ్ పంత్ (సి) గిల్ (బి) వరుణ్ 27; హెట్‌మైర్ (సి) రాహుల్ త్రిపాఠి (బి) వరుణ్ 10; స్టొయినిస్ (సి) రాహుల్ త్రిపాఠి (బి) వరుణ్ 6; అక్షర్ పటేల్ (బి) వరుణ్ 9; రబడ (సి) రాహుల్ త్రిపాఠి (బి) కమిన్స్ 9; రవిచంద్రన్ అశ్విన్ (నాటౌట్) 14; తుషార్ దేశ్‌పాండే (సి) మోర్గాన్ (బి) ఫెర్గూసన్ 1; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–0, 2–13, 3–76, 4–95, 5–95, 6–110, 7–112, 8–132, 9–135. బౌలింగ్: కమిన్స్ 4–0–17–3, ప్రసిధ్ కృష్ణ 2–0–19–0, కమలేశ్ నాగర్కోటి 2–0–11–0, ఫెర్గూసన్ 4–0–30–1, నరైన్ 4–0–37–0, వరుణ్ చక్రవర్తి 4–0–20–5. అంకితం! నితీశ్ రాణాకు అత్యంత ఆత్మీయుడైన అతని మామ సురీందర్ మార్వా గురువారం మరణించారు. మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించిన అనంతరం ఆయన పేరుతో ఉన్న కేకేఆర్ జెర్సీని ప్రదర్శిస్తూ రాణా ఇలా నివాళి అర్పించాడు. -
నరైన్‌కు గ్రీన్‌సిగ్నల్.. కానీ
అబుదాబి: వెస్టిండీస్ వివాదాస్పద స్పిన్నర్ సునీల్ నరైన్ ఈ ఐపీఎల్ సీజన్లో సందేహాస్పదంగా బౌలింగ్ చేస్తున్నాడనే కారణంతో అతన్ని పక్కకు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతనిపై నిషేధం విధించకుండా యాక్షన్‌ను సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పించింది ఐపీఎల్ మేనేజ్మెంట్. దాంతో కొన్ని రోజులుగా తన బౌలింగ్ యాక్షన్‌పై తీవ్ర కసరత్తులు చేశాడు నరైన్. తన యాక్షన్‌ను సరిచేసుకుని మంచి ఫలితాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే సస్పెన్షన్ కాలంలో సునీల్ నరైన్ బౌలింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీని ఐపీఎల్ సస్పెక్ట్ బౌలింగ్ యాక్షన్ కమిటీ పర్యవేక్షించింది. ఆ వీడియో ఫుటేజ్‌ను కేకేఆర్ యాజమాన్యం సదరు కమిటీ ఇవ్వడంతో దాన్ని పరిశీలించారు. పలు కోణాల్లో, స్లో మోషన్లో నరైన్ యాక్షన్‌ను పరిశీలించిన కమిటీ.. నరైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఫుటేజ్‌ను పరిశీలించామని, బంతిని బౌల్ చేసే సమయంలో సునీల్ నరైన్ ఎల్బో బెండ్ మీదుగా చేతిని లేపడం.. ఐసీసీ పరిధికి లోబడే ఉన్నట్లు గుర్తించినట్లు కమిటీ వెల్లడించింది. అయితే ప్రస్తుత వీడియోల్లో కనిపించే విధంగానే ఐపీఎల్ టోర్నీలో కూడా బౌలింగ్ చేయాల్సి ఉంటుందని కమిటీ ఆదేశించింది. దీనికి భిన్నంగా బౌలింగ్ వేస్తే మాత్రం సస్పెన్షన్‌ను ఎదుర్కునే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈరోజు(ఆదివారం) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు నరైన్ అందుబాటులోకి రాలేదు. వచ్చే మ్యాచ్‌లో నరైన్ ఆడే అవకాశం మెండుగా ఉంది. -
నరైన్ యాక్షన్‌పై కేకేఆర్ సీరియస్ లుక్!
అబుదాబి: ప్రస్తుత ఐపీఎల్లో కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్‌పై మరోసారి సందేహాలు రావడంతో ఒక మ్యాచ్‌కు దూరమయ్యాడు. కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై సందేహాలు వచ్చాయి. దీనిపై మ్యాచ్ తర్వాత అంపైర్లు.. నరైన్ యాక్షన్‌పై అనుమానం వ్యక్తం చేశారు. అటు తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌కు నరైన్ దూరమయ్యాడు. ఇక్కడ నరైన్‌పై ఎటువంటి నిషేధం విధించకపోయినా కేకేఆర్ ముందస్తు వ్యూహంతో నరైన్‌ను ఆ మ్యాచ్‌లో ఆడించలేదు. కాగా, రేపు(గురువారం) ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో నరైన్ ఆడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (బిషప్ టీమ్‌లో ఏడుగురు భారత క్రికెటర్లు..!) కీలక బౌలర్ అయిన నరైన్ బౌలింగ్ యాక్షన్ నిజంగానే నిబంధనల్ని అతిక్రమించి ఉంటే అతను శాశ్వతంగా ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమవుతాడు. దాంతో అతని బౌలింగ్ యాక్షన్ సరిచేసే పనిలో పడింది కేకేఆర్ ఫ్రాంచైజీ. ఈ మిస్టరీ స్పిన్నర్ కేకేఆర్ జట్టులో కీలక ఆటగాడు కావడంతో సీరియస్‌గా దృష్టిసారించారు. ఈ క్రమంలోనే ఆ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్ కార్ల్ క్రో.. నరైన్ యాక్షన్‌ను సరిచేయడానికి నడుంబిగించారు. కొన్ని రోజులుగా నరైన్ చేత నెట్స్‌లో విపరీతంగా ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. అసలు విరామం లేకుండా నరైన్ బౌలింగ్ యాక్షన్‌ను పరిశీలిస్తున్నారు. కీలక బౌలర్ అయిన నరైన్‌ను సాధ్యమైనంత తొందరగా రంగంలోకి దింపడమే పనిగా పెట్టుకుంది కేకేఆర్. 2014-15 సీజన్లో నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా అతనితో కలిసి కార్ల్ క్రో పనిచేశాడు. ఇప్పుడు మరొకసారి అతని బౌలింగ్‌పై అనుమానాలు రావడంతో నరైన్ అత్యధిక సమయం నెట్స్‌లోనే గడుపుతున్నాడు. డేటా ఎనాలిస్ట్ల సాయంతో నరైన్ బౌలింగ్‌లోని కొన్ని ప్రధాన కోణాల్ని పరిశీలిస్తున్నారు. దాంతో ముంబైతో మ్యాచ్‌లో నరైన్ ఆడటం అనుమానమే. ఒకవేళ ఆడి మళ్లీ బౌలింగ్ యాక్షన్‌పై సందేహాలు వస్తే మాత్రం అప్పుడు వివాదం మరింత పెద్దది కావొచ్చు. ఏమైనా లోపాలు ఉంటే సరిచేసుకుని బరిలోకి దిగితేనే మంచిదనే వ్యూహంతో కేకేఆర్ ముందుకు వెళుతుంది. ఈ సీజన్లో నరైన్ బౌలింగ్ వేసిన గత వీడియోలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. 2012 నుంచి ఇప్పటివరకూ సునీల్ నరైన్ 115 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. అయితే నరైన్ బౌలింగ్‌పై 2015 చివరిసారి ఫిర్యాదు అందిన తర్వాత బౌలింగ్ యాక్షన్ సరిచేసుకుని మళ్లీ క్రికెట్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాడు. అప్పట్నుంచి ఇప్పటివరకూ 68 ఐపీఎల్ గేమ్‌లను నరైన్ ఆడాడు. 2014లో జరిగిన ఛాంపియన్స్ లీగ్‌లో రెండు సార్లు అతడిపై ఫిర్యాదులు వచ్చాయి. తన బౌలింగ్ కారణంగా 2015లో జరిగిన ప్రపంచ కప్‌కు దూరమయ్యాడు. -
నరైన్ బౌలింగ్‌పై కేకేఆర్ అధికారిక ప్రకటన
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో తన బౌలింగ్ యాక్షన్‌తో వెస్టిండీస్ స్పిన్నర్, కేకేఆర్ ఆటగాడు సునీల్ నరైన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై సందేహాలు వచ్చాయి. దీనిపై మ్యాచ్ తర్వాత అంపైర్లు.. నరైన్ యాక్షన్‌పై అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి నరైన్ బౌలింగ్ చేయవచ్చని, ఒకవేళ ఫిర్యాదు వస్తే మాత్రం సస్పెన్షన్ ఖాయమని అధికారులు తెలిపారు. దీనిపై కేకేఆర్ తాజాగా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘ ప్రస్తుత ఐపీఎల్లో నరైన్ ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడాడు. మరి అప్పుడు ఏ ఒక్క అధికారి నరైన్ బౌలింగ్‌పై అనుమానం వ్యక్తం చేయలేదు. ఇది మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. త్వరలోనే దీనిపై ఒక ప్రతిపాదన వస్తుంది. ఈ విషయంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వేగవంతమైన చర్యలు తీసుకోవడాన్ని అభినందిస్తున్నాము’ అని కేకేఆర్ తెలిపింది. ఈరోజు(సోమవారం) ఆర్సీబీతో కేకేఆర్ తలపడనుంది. కానీ ఈ మ్యాచ్‌లో నరైన్ ఆడతాడా.. లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. (పంత్ ఆడటంపై స్పష్టత లేదు: అయ్యర్) 2012 నుంచి ఇప్పటివరకూ సునీల్ నరైన్ 115 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. అయితే నరైన్ బౌలింగ్‌పై 2015 చివరిసారి ఫిర్యాదు అందిన తర్వాత బౌలింగ్ యాక్షన్ సరిచేసుకుని మళ్లీ క్రికెట్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాడు. అప్పట్నుంచి ఇప్పటివరకూ 68 ఐపీఎల్ గేమ్‌లను నరైన్ ఆడాడు. 2014లో జరిగిన ఛాంపియన్స్ లీగ్‌లో రెండు సార్లు అతడిపై ఫిర్యాదులు వచ్చాయి. తన బౌలింగ్ కారణంగా 2015లో జరిగిన ప్రపంచ కప్‌కు దూరమయ్యాడు. అంతేకాదు అదే ఏడాదిలో జరిగిన ఐపీఎల్లో కూడా ఇలాంటి ఫిర్యాదులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఫలితంగా ఐసీసీ ఆ ఏడాది నవంబర్‌లో అతడిని సస్పెండ్ చేసింది. ప్రస్తుతం నరైన్ బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని తేలితే మాత్రం అతనిపై మరొకసారి వేటు తప్పదు. (ఇది చెన్నై సూపర్ కింగ్స్ కాదు!) -
సునీల్ నరైన్‌కు వార్నింగ్!
దుబాయ్: కోల్‌కతా ఆటగాడు సునీల్ నరైన్‌కు అంపైర్లు వార్నింగ్ ఇచ్చారు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడి బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉందని మ్యాచ్ అనంతరం అంపైర్లు తెలిపారు. ప్రస్తుతం నరైన్ బౌలింగ్ చేయవచ్చని, మరోసారి తన బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు వస్తే ఈ సీజన్ ఐపీఎల్ నుంచి సస్పెండ్ చేస్తారన్నారు. కోల్‌కతా జట్టులో నరైన్ కీలక ఆటగాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా మెరిపించగలడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివర్లో రెండు కీలక ఓవర్లు వేశాడు. పంజాబ్ 18 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. ఆ సమయంలో 18వ ఓవర్ వేసిన నరైన్ కేవలం రెండు పరుగులు ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇంతకు ముందూ ఇలాగే... నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు రావడం కొత్తేమి కాదు. 2014లో జరిగిన ఛాంపియన్స్ లీగ్‌లో రెండు సార్లు అతడిపై ఫిర్యాదులు వచ్చాయి. తన బౌలింగ్ కారణంగా 2015లో జరిగిన ప్రపంచ కప్‌కు దూరమయ్యాడు. అంతేకాదు అదే ఏడాదిలో జరిగిన ఐపీఎల్లో కూడా ఇలాంటి ఫిర్యాదులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఫలితంగా ఐసీసీ ఆ ఏడాది నవంబర్‌లో అతడిని సస్పెండ్ చేసింది. ఈ సారి తన బౌలింగ్ వైఖరిని మార్చుకోకపోతే వేటు తప్పదు. -
ఈ నరైన్‌కు ఏమైంది !
ఢిల్లీ: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో సునిల్ నరైన్ ఒక కీలక ఆటగాడు. బౌలింగ్‌లో తన స్పిన్ మాయాజాలంతో జట్టుకు అనేక విజయాలు అందించాడు. ఎన్నో మ్యాచుల్లో ఓపెనర్‌గా జట్టుకు మంచి ఆరంభానిచ్చాడు. అలాంటిది ఈ సీజన్లో అతడి పేలవ ప్రదర్శన ఆ జట్టును కలవరపెడుతుంది. ఓపెనర్‌గా ఆడిన నాలుగు మ్యాచుల్లో (9, 0, 15, 3) చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చలేదు. బౌలింగ్‌లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. కోల్‌కతా జట్టు కెప్టెన్ దినేశ్ కార్తిక్ మాత్రం నరైన్‌ను సమర్థించాడు. బుధవారం చెన్నైతో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు. 'నరైన్ మా జట్టులో కీలక ఆటగాడు. ఒక ఆటగాడిగా అతడిని చూసి గర్వపడుతున్నాను. రెండు మూడు పేలవ ప్రదర్శనలతో ఆటగాడి సామర్థ్యం తగ్గిపోదు. అతడిపై పూర్తి నమ్మకం ఉంది. రాహుల్ త్రిపాఠిని ఓపెనర్‌గా పంపించి నరైన్‌పై ఒత్తిడి తగ్గించాం. రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు' అని కార్తిక్ పేర్కొన్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచులో నరైన్ స్థానంలో రాహుల్ త్రిపాఠి ఓపెనింగ్ చేశాడు. చెన్నైపై 10 పరుగుల తేడాతో నెగ్గడంలో రాహుల్ ఇన్నింగ్స్ కీలకం. 51 బంతుల్లో 81 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా మూడో స్థానానికి చేరుకుంది. (ఇదీ చదవండి: ఎంఎస్ ధోని ఫన్నీ వాక్) -
టీ20లో టాప్ 5 బౌలర్లు వీళ్లే !
ఢిల్లీ: షేన్ వాట్సన్.. క్రికెట్ ప్రపంచంలో ఒక్క గొప్ప ఆల్‌రౌండర్. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా తన బ్యాట్‌తో విజృంభించగల ఆటగాడు. బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ తన సత్తా చూపగలడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పినా, ఫ్రాంచైజీల్లో ఇంకా తన ఆటను కొనసాగిస్తున్నాడు. ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పటికీ ప్రత్యర్థి జట్లకు తను ఒక టార్గెట్ బ్యాట్స్‌మెన్. తన కెరీర్లో ఎంతో మంది మేటి బౌలర్ల్‌ను ఎదుర్కున్నాడు. అలాంటి బ్యాట్స్‌మెన్‌కు టీ20లో టాప్ 5 బౌలర్లు ఎవరో తెలుసా... వాట్సన్ తన టాప్-5 టీ20 బౌలర్ల జాబితాలో లసిత్ మలింగ మొదటి స్థానంలో ఉన్నాడు. టీ20లో అతడు అత్యుత్తమ బౌలర్ అని వాట్సన్ అన్నాడు. మలింగ వేసే 'యార్కర్స్' ఏ బౌలర్ వేయలేడని, భవిష్యత్తులో కూడా అలాంటి బౌలర్‌ను చూడకపోవచ్చని కితాబిచ్చాడు. ఇక రెండో బౌలర్ షాహిద్ అఫ్రిది పేరు చెప్పాడు. షాహిద్ ఒక విధ్వంసకర బ్యాట్స్‌మెన్ అయినా, టీ20లో అతడు మంచి బౌలర్ అని పేర్కొన్నాడు. వికెట్లు తీయడకమే కాకుండా పరుగులు ఇవ్వకుండా కట్టడిచేయగల సత్తా ఉన్న బౌలర్ అని అన్నాడు. ప్రతి జట్టులో అలాంటి ఒక బౌలర్ ఉండాలని కోరుకుంటారని తెలిపాడు. ఇక మూడో స్థానంలో జస్ప్రిత్ బుమ్రా పేరు చెప్పాడు. ప్రస్తుత కాలంలో అతడు అత్యుత్తమ బౌలర్ అని, అద్భుతమైన యార్కర్స్ వేస్తాడని తెలిపాడు. బంతి వేగంతో పాటు స్వింగ్ చేయగల సామర్థ్యం ఉన్న బౌలరని...అతడి బౌలింగ్‌లో ఆడడం 'ఛాలెంజింగ్'గా ఉంటుందని పేర్కొన్నారు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో వెస్టిండీస్ ఆటగాళ్లు డ్వైన్ బ్రావో, సునిల్ నరైన్ పేర్లను తెలిపాడు. (ఇదీ చదవండి: ఆ క్రెడిట్ అంతా వారిదే: డుప్లెసిస్) -
'నరైన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటాం'
షార్జా : ఐపీఎల్ 13వ సీజన్ లో శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో కేకేఆర్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో ఎంపిక సరిగా లేకపోవడం కూడా కేకేఆర్ ఓటమికి పరోక్ష కారణంగా చెప్పవచ్చు. ఈ సీజన్లో శుబ్‌మన్ గిల్‌తో కలిసి సునీల్ నరైన్ ఓపెనింగ్ మొదలుపెట్టడం నుంచి కార్తీక్ బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమవుతుండడం.. జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న మోర్గాన్ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగడం.. ఓపెనర్ స్థానంలో రావాల్సిన రాహుల్ త్రిపాఠిని ఎనిమిదో స్థానంలో పంపడం లాంటివి చెప్పుకుంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. (చదవండి : పేరు మాత్రమే పంత్.. కానీ పనులు మాత్రం) ముఖ్యంగా కేకేఆర్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌గా వచ్చిన సునీల్ నరైన్ పూర్తిగా విఫలమవుతూ వస్తున్నాడు. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి నరైన్.. 87.09 స్ట్రైక్‌రేట్.. 6.75 సగటుతో బ్యాటింగ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి సునీల్ నరైన్ కేకేఆర్‌కు ఎంపికైంది బౌలింగ్ కోటాలోనే. అతను ఐపీఎల్లో 124 వికెట్లు తీశాడు. పలు సీజన్లలో ఓపెనర్‌గా వచ్చి కొన్ని మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు గానీ పూర్తిస్థాయి ఓపెనర్‌గా మాత్రం ఎప్పుడు కాలేకపోయాడు. అయినా కొన్ని సీజన్లుగా కేకేఆర్ జట్టు అతన్నే ఓపెనర్‌గా పంపిస్తుంది. ఈ సీజన్లోనూ అతనిపై నమ్మకముంచి ఓపెనర్‌గా పంపినా ఆదిలోనే అతను ఔటవుతుండడంతో భారం పడినట్లవుతుంది. దీంతో పాటు నరైన్ అటు బౌలింగ్‌లోనూ తేలిపోతున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కేవలం రెండే ఓవర్లు వేసిన నరైన్ 26 పరగులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కొన్ని మ్యాచ్‌లకు ఓపెనర్ స్థానంలో మరొకరిని పంపిస్తే కేకేఆర్‌కు శుభారంభాలు దక్కుతాయి. (చదవండి : ‘అతను కెప్టెన్ పగ్గాలు చేపట్టినా ఆశ్చర్యం లేదు’) అయితే ఇదే విషయమై కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ స్పందించాడు. ' ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు నాకు ఎలాంటి ఆలోచన లేదు. అయితే టాప్ ఆర్డర్‌ను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని గ్రహించాను. ఓపెనింగ్ విషయమై ఒకసారి కోచింగ్ స్టాఫ్‌తో మాట్లాడిన తర్వాత నరైన్‌పై ఒక నిర్ణయం తీసుకుంటాము. నరైన్‌పై తనకు ఇంకా నమ్మకముందని.. ఒక్క మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ పడిందంటే మిగతావాటిలో రెచ్చిపోయే అవకాశం ఉంది. ఇక రసెల్‌ను బ్యాటింగ్ అవకాశం ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నిస్తామని.. అలాగే మోర్గాన్ బ్యాటింగ్ ఆర్డర్‌పై రానున్న మ్యాచ్‌లో మార్పు చూసే అవకాశం ఉంది. నిజానికి నా వైఫల్యం కూడా జట్టుకు భారంగా మారింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మోర్గాన్, త్రిపాఠి, నితీష్ రాణాలు చక్కగా బ్యాటింగ్ చేశారు. మా బౌలర్లు కొన్ని సిక్స్‌లు అధనంగా సమర్పించుకోవడంతో మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అయితే 18 పరుగులతో ఓటమి పాలవడం కాస్త బాధ అనిపించింది. అంటూ తెలిపాడు. కాగా కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్‌ను అక్టోబర్ 7న సీఎస్కేతో తలపడనుంది. -
‘ఎక్కడైనా బెస్ట్ బౌలర్ అతడే’
దుబాయ్: కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున అటు ఓపెనర్‌గానూ, ఇటు ప్రధాన స్పిన్నర్‌గాను కీలక పాత్ర పోషిస్తున్న సునీల్ నరైన్‌పై ఆ జట్టు మెంటార్ డేవిడ్ హస్సీ ప్రశంసలు కురిపించాడు. కేకేఆర్‌కు నరైన్ కీలక ఆటగాడంటూ కొనియాడాడు. అసలు నరైన తమ జట్టులో ఉండటం అదృష్టమన్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా అత్యుత్తమ బౌలింగ్ చేసే బౌలర్ అన్నాడు. ప్రత్యేకంగా వరల్డ్ టీ20 బౌలర్లలో నరైన్ ఒకడన్నాడు. ‘ నరైన్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తాడు. (చదవండి: ఐపీఎల్.. బలాబలాలు తేల్చుకుందాం!) బౌలింగ్‌లో స్పిన్ మ్యాజిక్‌తో కీలక వికెట్లు సాధిస్తూ మంచి బ్రేక్ ఇస్తూ ఉంటాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎక్కడైనా బ్రేక్ ఇవ్వడంలో నరైన్‌ది ప్రత్యేక స్థానం. కేకేఆర్ జట్టులో నరైన్ ఉండటం మా అదృష్టం.జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉంటే కెప్టెన్ డీకే(దినేశ్ కార్తీక్)కు వెంటనే గుర్తుచ్చొ బౌలర్ నరైన్. ఈసారి ఐపీఎల్లో కూడా నరైన్‌దే కీలక పాత్ర. హోరాహోరీ పోరులో నరైన్‌దే పైచేయి అవడం యం.యూఏఈలో స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటం నరైన్‌కు కలిసొచ్చే అంశం’ అని హస్సీ తెలిపాడు. కేకేఆర్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ నరైన్. 119 మ్యాచ్‌ల్లో 140 వికెట్లు సాధించాడు. గతేడాది ఐపీఎల్లో నరైన్ 12 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్‌లో 166.27తో 143 పరుగులు సాధించాడు.ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ రెండుసార్లు టైటిల్‌ను గెలుచుకుంది. గౌతం గంభీర్ సారథ్యంలో కేకేఆర్ 2012, 2014ల్లో టైటిల్‌ను ముద్దాడింది. అయితే ఆ తర్వాత 2016, 17, 18ల్లో ప్లేఆఫ్స్‌కు చేరినా టైటిల్‌ను మాత్రంసాధించలేకపోయింది. -
‘ఆ బౌలర్‌తో బ్యాట్స్‌మెన్‌కు చుక్కలే’
న్యూఢిల్లీ: ఎప్పుడూ క్రికెట్‌కు సంబంధించిన విశ్లేషణలతొ నిత్యం వార్తల్లో ఉండే భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్, తాజాగా ఐపీఎల్ 2020లో (సెప్టెంబర్ 19) ఓ బౌలర్ ప్రమాదకరంగా మారనున్నట్లు తెలిపారు. శనివారం గంభీర్ ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ ఈ నెల 19నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020లో వెస్టిండీస్‌కు చెందిన సునీల్ నరెన్తో బ్యాట్స్మెన్లకు ఇబ్బందులు తప్పవని అభిప్రాపడ్డాడు. నరెన్ తన స్పిన్ మాయాజాలంతో బ్యాట్సమెన్లకు చుక్కలు చూపనున్నాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020లో సునీల్ నరెన్ కేకేఆర్ తరుపున ఆడునున్నాడు. కాగా సునీల్ నరైన్ బౌలింగ్ రన్‌టైమ్‌లో అతని వ్యూహాన్ని బ్యాట్స్‌మెన్ పసిగట్టడం అంత ఈజీ కాదని తెలిపాడు. అయితే యూఏఈ వికెట్లపై సునీల్ నరైన్ గ్రిప్ దొరికిందంటే చాలు అతను దూసుకెళ్తాడని పేర్కొన్నాడు. కాగా అఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ పేస్‌తో బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బంది పెడితే, సునీల్ నరైన్ అన్యూహ్య బంతులతో బ్యాట్సమెన్కు సవాలు విసురుతాడని గౌతం గంభీర్ పేర్కొన్నాడు. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ గంభీర్ కెప్టెన్సీలో రెండు ఐపీఎల్(2012, 2014) టైటిళ్లను గెలుపొందిన విషయం తెలిసిందే. (చదవండి: ‘బౌన్సర్లతో బెంబేలెత్తించా’) -
నరైన్, పొలార్డ్‌లకు పిలుపు
సెయింట్‌జాన్స్: చాలాకాలం తర్వాత ‘మిస్టరీ స్పిన్నర్’ సునీల్ నరైన్ వెస్టిండీస్ టి20 జట్టుకు ఎంపికయ్యాడు. భారత్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు గాను తొలి రెండు మ్యాచ్‌లకు మంగళవారం ప్రకటించిన జట్టులో అతడితో పాటు ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌కు చోటుదక్కింది. నరైన్ విండీస్ తరఫున రెండేళ్ల క్రితం చివరి టి20 ఆడాడు. మొత్తం 14 మంది సభ్యుల జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఆంథోని బ్రాంబెల్ ఒక్కడే కొత్తముఖం. ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్ సారథ్యం వహిస్తాడు. గాయంతో ప్రపంచ కప్ మధ్యలో తప్పుకొన్న మరో స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ అందుబాటులోకి రాగా... విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అందుబాటులో ఉండనని ప్రకటించాడు. అతడి స్థానంలో ఎడంచేతి వాటం ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. వచ్చే ఏడాది జరుగనున్న టి20 ప్రపంచ కప్‌ను నిలబెట్టుకునే ప్రణాళికల్లో భాగంగా సమతూకమైన జట్టును ఎంపిక చేసినట్లు వెస్టిండీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ రాబర్ట్ హేన్స్ తెలిపారు. సిరీస్‌లో భాగంగా తొలి రెండు టి20లు ఆగస్ట్ 3, 4 తేదీల్లో ఫ్లోరిడా (అమెరికా)లోని లాడర్‌హిల్‌లో జరుగుతాయి. ఆగస్ట్ 6న మూడో టి20కి గయానా ఆతిథ్యం ఇవ్వనుంది. తొలి రెండు టి20లకు విండీస్ జట్టు: కార్లోస్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), సునీల్ నరైన్, కీమో పాల్, ఖారీ పియర్, కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్, అంథోని బ్రాంబెల్ (వికెట్ కీపర్లు), రోవ్‌మన్ పావెల్, ఆండ్రీ రసెల్, ఒషాన్ థామస్, జాన్ క్యాంప్‌బెల్, షెల్డన్ కాట్రెల్, షిమ్రన్ హెట్‌మైర్, ఎవిన్ లూయిస్. -
గేల్ దూరం.. పొలార్డ్‌కు చోటు
ఆంటిగ్వా: వచ్చే నెల తొలి వారంలో టీమిండియాతో ఆరంభమయ్యే ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20లకు వెస్టిండీస్ జట్టును ప్రకటించారు. 14 మందితో కూడిన విండీస్ జట్టును సెలక్టర్లు మంగళవారం ఎంపిక చేశారు. ఇందులో కీరోన్ పొలార్డ్, సునీల్ నరైన్‌లకు చోటు కల్పిస్తూ విండీస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండేళ్ల క్రితం చివరిసారి టీ20 ఆడిన నరైన్.. ఎట్టకేలకు తిరిగి చోటు దక్కించుకున్నాడు. కాగా, టీ20 స్సెషలిస్టు క్రిస్ గేల్ మాత్రం టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. కెనడా గ్లోబల్ టీ20 లీగ్ కారణంగా గేల్ అందుబాటులో ఉండటం లేదని విండీస్ బోర్డు స్పష్టం చేసింది. కాగా, వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ఆంథోని బ్రాంబెల్ అంతర్జాతీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఇప్పటివరకూ 12 టీ20 మ్యాచ్‌లతో పాటు 46 లిస్ట్-ఏ గేమ్‌లు ఆడిన బ్రాంబెల్‌కు అవకాశం కల్పించారు. అదే సమయంలో మూడు అంతర్జాతీయ టీ20లు ఆడిన ఖారీ పైర్రేతో పాటు జాన్ క్యాంప్‌బెల్‌కు చోటు దక్కింది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ ఉన్న తరుణంలో ఇప్పట్నుంచే జట్టును సమతూకంలో ఉంచాలనే భావించే యువకులకు అవకాశం కల్పిస్తున్నామని సెలక్షన్ కమిటీ తాత్కాలిక చైర్మన్ రాబర్ట్ హేన్స్ తెలిపారు.(ఇక్కడ చదవండి: విండీస్‌తో ఆడే భారత జట్టు ఇదే) భారత్‌తో తొలి టీ20లకు విండీస్ జట్టు ఇదే.. కార్లోస్ బ్రాత్‌వైట్(కెప్టెన్), జాన్ క్యాంప్‌బెల్, ఎవిన్ లూయిస్, హెట్మెయిర్, నికోలస్ పూరన్, కీరోన్ పొలార్డ్, రావ్‌మాన్ పావెల్, కీమో పాల్, సునీల్ నరైన్, షెల్డాన్ కాట్రెల్, ఓష్నీ థామస్, ఆంథోని బ్రాంబెల్, ఆండ్రీ రసెల్, ఖారీ పైర్రీ -
రాజస్తాన్ చిత్తు చిత్తుగా..
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్థానిక సవాయ్ మాన్ సింగ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఆధిపత్యమే నడిచింది. మొదట బౌలింగ్‌లో రాజస్తాన్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేయగా.. అనంతరం బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించింది. సమిష్టి కృషితో ఆకట్టుకున్న కేకేఆర్ ఆతిథ్య రాజస్తాన్‌పై అతిసునాయసంగా గెలిచింది. రాజస్తాన్ నిర్దేశించిన 140 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. మరో 37 బంతులు మిగిలుండగానే కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఛేదనలో సునీల్ నరైన్(47), క్రిస్ లిన్(50) బ్యాట్ ఝుళిపించారు. అయితే వీరిద్దరు వెంటవెంటనే ఔటైనప్పటికీ ఊతప్ప(26), గిల్(6)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడి జట్టుకు విజయాన్నందించారు. రాజస్తాన్ బౌలర్లలో శ్రేయాస్ గోపాల్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. కేకేఆర్ బౌలర్ల కట్టుదిట్టం టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు శుభారంభం లభించలేదు. కెప్టెన్ అజింక్యా రహానే(5) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం జోస్ బట్లర్‌తో కలిసి స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడి 72 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత బట్లర్(37) భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. అయితే స్మిత్ మాత్రం నిలకడగా ఆడాడు. రాహుల్ త్రిపాఠీతో కలిసిన ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలోనే స్మిత్ హాఫ్ సెంచరీ సాధించాడు. రాజస్తాన్ స్కోరు 105 పరుగుల వద్ద త్రిపాఠి(6) ఔట్ అయ్యాడు. కాగా, స్మిత్(73 నాటౌట్; 59 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) చివర వరకూ క్రీజ్‌లో ఉండటంతో రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేకేఆర్ బౌలర్లలో గర్నీ రెండు వికెట్లు సాధించగా, ప్రసిద్ద్ క్రిష్ణకు వికెట్ దక్కింది. -
మన ‘నరైన్’
ఒంగోలు టౌన్: వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ చేస్తే క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సింపుల్‌గా బౌలింగ్ చేస్తాడు. క్రీజ్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఉన్నప్పటికీ తన స్పిన్ మాయాజాలంతో బోల్తా కొట్టిస్తాడు. చివరకు మ్యాచ్ రూపురేఖలనే మార్చేస్తాడు. పొట్టి ఫార్మాట్ అయిన టీ–20లో అయితే నరైన్ బాల్‌తో చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. నాలుగు ఓవర్లతో తాను ప్రాతినిధ్యం వహించే జట్టువైపు మ్యాచ్ తిరిగేలా చేస్తాడు. సునీల్ నరైన్ లాంటి బౌలర్ మన దగ్గరా ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. ప్రకాశం జట్టు బరిలోకి దిగితే ఆ బౌలర్ తప్పకుండా ఉండాల్సిందే. ప్రత్యర్థి జట్టులో భీకరమైన ఫామ్ కొనసాగించే బ్యాట్స్‌మన్ ఉన్నా ఆ బౌలర్ కూల్‌గా బోల్తా కొట్టించి మ్యాచ్‌ను తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకాశం జట్టు వైపు తిప్పుతూ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ దృష్టిలో పడ్డాడు. అతనే పాశం నవీన్. స్టేట్ ప్రాబబుల్స్‌కు ఎంపిక ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అండర్–16 అంతర్ జిల్లాల క్రికెట్ మ్యాచ్‌లో ప్రకాశం జిల్లా తరఫున ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 35 వికెట్లు తీశాడంటే నవీన్ బౌలింగ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రకాశం జట్టు లీగ్ స్థాయి నుంచి ఫైనల్స్‌కు చేరడంలో నవీన్ కీలకంగా వ్యవహరించాడు. నెల్లూరుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ ప్రారంభంలో దురదృష్టవశాత్తు నవీన్ గాయపడి మ్యాచ్‌కు దూరమవడంతో అతని విలువేమిటో జట్టు మొత్తానికి తెలిసొచ్చింది. ఫైనల్స్‌లో నవీన్ బరిలోకి దిగకపోవడం, నెల్లూరు జట్టు దూకుడుకు పగ్గాలు వేసే బౌలర్ లేకపోవడంతో ప్రకాశం జట్టు రన్నరప్‌తో సరిపుచ్చుకోవలసి వచ్చింది. ఆ మ్యాచ్‌లో నవీన్ ఆడి ఉంటే ప్రకాశం జట్టు విజయం సాధించి ఉండేదని జిల్లాకు చెందిన సీనియర్ క్రికెటర్లు వ్యాఖ్యానించడం చూస్తే ఆ బౌలర్ ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. నేపథ్యం లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన నవీన్ బౌలింగ్‌కు దిగితే అతని ఖాతాలో వికెట్లు పడాల్సిందే. అంతగా తన బౌలింగ్ మాయాజాలంతో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తుంటాడు. ఒంగోలుకు చెందిన నవీన్ తండ్రి పాశం సుదర్శన్ ఇరిగేషన్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి అనూరాధ గృహిణి. స్థానిక రవీంద్రభారతి స్కూల్లో పదో తరగతి పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతూ విజయనగరంలోని చింతలవలసలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అప్పటి వరకు గల్లీ క్రికెట్ ఆడుతూ వచ్చిన నవీన్ జిల్లాకు చెందిన సీనియర్ క్రికెటర్ల దృష్టిలో పడ్డాడు. బరిలోకి దిగితే వికెట్లు పడాల్సిందే.. 2014 నుంచి ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీఎస్ ప్రసాద్, కె.సుధాకర్, బి.చంద్రశేఖర్ కోచింగ్‌లో రోజురోజుకూ రాటుదేలుతూ 2015లో ప్రకాశం అండర్–14 జట్టుకు ఎంపికయ్యాడు. 2016లో జరిగిన అంతర్ జిల్లాల మ్యాచ్‌లో చిత్తూరుపై ఏడు వికెట్లు, తూర్పుగోదావరిపై మూడు వికెట్లు, విశాఖపట్నంపై మూడు వికెట్లు తీసిన నవీన్ అండర్–14 రాష్ట్ర ప్రాబబుల్స్ జట్టులో స్థానం సంపాదించాడు. 2017లో జరిగిన అండర్–16 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో అనంతపురంపై ఎనిమిది వికెట్లు, కర్నూలు జట్టుపై పదకొండు వికెట్లు, కడప జట్టుపై 11 వికెట్లు, గుంటూరు జిల్లాపై ఏడు వికెట్లు తీశాడు. మొత్తం 38 వికెట్లు తీసిన నవీన్ అండర్–16 స్టేట్ ప్రాబబుల్స్ జట్టులో చోటు సంపాదించాడు. ఇటీవల నిర్వహించిన అండర్–16 ప్లేట్ గ్రూప్ అంతర్ జిల్లాల క్రికెట్ మ్యాచ్‌లో శ్రీకాకుళంపై మూడు వికెట్లు, గుంటూరుపై ఎనిమిది వికెట్లు, నెల్లూరుపై రెండు వికెట్లు, పశ్చిమ గోదావరిపై తొమ్మిది వికెట్లు, విజయనగరంపై ఏడు వికెట్లు తీశాడు. విశాఖతో జరిగిన సెమీఫైనల్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగాడు. తన ప్రతిభను గుర్తించిన కోచ్‌లు, సహకరించిన క్రికెట్ ప్రకాశం కార్యదర్శి చింతపల్లి ప్రతాప్కుమార్కు నవీన్ కృతజ్ఞతలు తెలిపాడు. భారత జట్టు ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌తో.. క్రికెటే నా ఊపిరి క్రికెట్ అంటే నాకు ప్రాణం. ముందుగా రాష్ట్ర జట్టులో చోటు సంపాదించాలి. ఆ తర్వాత రంజీ ట్రోఫీ, టీ–20 మ్యాచ్‌లు ఆడాలని ఉంది. మంచి ప్రతిభ కనబరచి జాతీయ జట్టులో స్థానం సంపాదించాలన్నదే నా లక్ష్యం. – నవీన్