కెరీర్ బెస్ట్తో రీ ఎంట్రీ ఇచ్చాడు.. | Sunil Narine scalps career-best 6-for on his return | Sakshi
Sakshi News home page

కెరీర్ బెస్ట్తో రీ ఎంట్రీ ఇచ్చాడు..

Published Sat, Jun 4 2016 8:40 AM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

కెరీర్ బెస్ట్తో రీ ఎంట్రీ ఇచ్చాడు..

కెరీర్ బెస్ట్తో రీ ఎంట్రీ ఇచ్చాడు..

గుయానా: బౌలింగ్ యాక్షన్పై విమర్శలు ఎదుర్కొన్న వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ అంతర్జాతీయ క్రికెట్లో ఘనంగా పునరాగమనం చేశాడు. వన్డేల్లో కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో నరైన్ సూపర్ స్పెల్తో రాణించడంతో వెస్టిండీస్ నాలుగు వికెట్లతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సఫారీలు నరైన్ (6/27) ధాటికి 46.5 ఓవర్లలో 188 పరుగులకు చాపచుట్టేశారు. దక్షిణాఫ్రికా జట్టులో రోసౌ (61) మినహా ఇతర బ్యాట్స్మెన్ రాణంచలేకపోయారు. నరైన్ క్రమం తప్పకుండా వికెట్లు తీసి సఫారీలను కోలుకోనీకుండా చేశాడు. అనంతరం 189 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 6 వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు మిగిలుండగా సాధించింది. పొలార్డ్ (67) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.

ఈ సిరీస్లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్తో పాటు ఆస్ట్రేలియా పాల్గొంటోంది. గత నవంబర్లో శ్రీలంకతో వన్డే సిరీస్లో నరైన్ బౌలింగ్ యాక్షన్పై ఫిర్యాదులు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఐసీసీ ఆదేశాల మేరకు నరైన్ బౌలింగ్ యాక్షన్ను సరిచేసుకున్న నరైన్ ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement