West Indies cricket
-
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ వెనక్కి
వెస్టిండీస్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విండీస్ మహిళ క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంది. వెస్టిండీస్ క్రికెట్ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు డాటిన్ తెలిపింది. కాగా 2022లో జట్టులో అంతర్గత విభేదాలు వల్ల డాటిన్ అంతర్జాతీయ విడ్కోలు పలికింది.అయితే ఈ ఏడాది ఆక్టోబర్‌లో బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా.. డాటిన్ తన రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకుంది. "అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ గర్వంగానే భావిస్తాను. క్రికెట్ వెస్టిండీస్ ప్రెసిడెంట్ డాక్టర్. కిషోర్ షాలోతో చర్చలు అనంతరం నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. తిరిగి విండీస్ జెర్సీని ధరించేందుకు సిద్దమయ్యాను. మళ్లీ జట్టులో తిరిగి చేరేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను.వెస్టిండీస్ మహిళల జట్టుకు అన్ని ఫార్మాట్లలో నా వంతు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తాను. నా నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని డాటిన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక 2008లో డాటిన్ విండీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్లో 146 వన్డేలు, 126 టీ20ల్లో విండీస్‌కు ప్రాతినిధ్యం వహించింది. అదే విధంగా తొలి టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో డాటిన్ భాగంగా ఉంది. -
సునీల్ నరైన్ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ వెనక్కి!?
వెస్టిండీస్ మాజీ క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ సునీల్ నరైన్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నరైన్ తన అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు తిరిగి జాతీయ జట్టుకు ఆడేందుకు నరైన్ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విండీస్ క్రికెట్‌తో పాటు ఆ జట్టు టీ20 కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ సైతం నరైన్‌ను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయంపై విండీస్ క్రికెట్ నుంచి కానీ నరైన్ నుంచి కానీ ఇప్పటవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా నరైన్ ప్రస్తుతం ఐపీఎల్-2024 సీజన్లో దుమ్ములేపుతున్నాడు. ఆటు బ్యాట్‌తోనూ ఇటు బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌గా వస్తున్న నరైన్ ప్రత్యర్ధి జట్లపై విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన నరైన్.. 276 పరుగులు చేశాడు. ఆటు బౌలింగ్‌లోనూ 7 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడినిటీ20 వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్లో భాగం చేయాలని విండీస్ క్రికెట్ ప్లాన్ చేస్తోంది. కాగా నరైన్ గతేడాది నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు విండీస్ తరపున చివరి మ్యాచ్ 2019లో ఆడాడు. -
కీలక పదవిలో బ్రియాన్ లారా.. గాడిన పెట్టేందుకేనా!
వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారాను కీలక పదవి వరించింది. దశ దిశ లేకుండా ఉన్న విండీస్ జట్టును గాడిన పెట్టేందుకు లారాను పర్ఫార్మెన్స్ మెంటార్(Performance Mentor)గా బాధ్యతలు అప్పజెప్పింది. కొన్నాళ్లుగా విండీస్ జట్టు ప్రదర్శన నాసిరకంగ తయారైంది. చిన్న జట్ల చేతిలోనూ అనూహ్యంగా పరాజయాలు చవిచూస్తూ అవమానాలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే విండీస్‌ను గాడిన పెట్టేందుకే లారాను ఈ పదవికి ఎంపిక చేసినట్లు క్రికెట్ వెస్టిండీస్(సీడబ్ల్యూఐ) పేర్కొంది. మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టు, బోర్డు అకాడమీ కోసం పనిచేయనున్నాడు. ఆటగాళ్లకు వ్యూహాత్మక సలహాలను అందించడంలో, వారి గేమ్ సెన్స్‌ను మెరుగుపరచడంలో ప్రధాన కోచ్‌లకు సహాయం చేయడమే లారా పని అని బోర్డు తెలిపింది. ''ఆస్ట్రేలియాలోని ఆటగాళ్లు, కోచ్‌లతో సమయం గడిపాను. సీడబ్ల్యూఐతో చర్చించాను. గేమ్ విషయంలో ఆటగాళ్లకు సహాయం చేయగలనని నేను నమ్ముతున్నా. అలాగే వారి వ్యూహాలను మరింత విజయవంతంగా అమలు చేసేలా సాయం చేయగలను. వారితో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నా'' అని లారా పేర్కొన్నాడు. వచ్చే వారంలో జింబాబ్వే, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జరగనుంది. ముందుగా టెస్ట్ టీమ్ తో కలిసి లారా పనిచేయనున్నాడు. క్రికెట్లో దిగ్గజంగా పేరు పొందిన లారా తన కెరీర్లో విండీస్ తరపున 131 టెస్టులు ఆడి 52.88 సగటుతో 11,953 పరుగులు చేశాడు. వన్డేల్లో 10,405 పరుగులు కొట్టాడు. 2004లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో ఒకే ఇన్నింగ్స్ లో 400 పరుగులు కొట్టి రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ లో 400 రన్స్(క్వాడ్రపుల్ సెంచరీ) కొట్టింది లారా ఒక్కడే. 19 ఏళ్లు దాటినా ఇప్పటికి లారా రికార్డు చెక్కుచెదరలేదు. Brian Lara joins the West Indies management as a performance mentor.#BrianLara #WestIndies pic.twitter.com/CnRGFffyWc — 100MB (@100MasterBlastr) January 27, 2023 చదవండి: మహిళల టి20 వరల్డ్‌కప్: కివీస్‌పై గెలుపు.. ఫైనల్లో భారత్ క్రిస్టియానో రొనాల్డోకు అవమానం.. -
క్రికెటర్ జీవితాన్ని మార్చిన పీఈటీ టీచర్
విండీస్ క్రికెటర్ రోవ్‌మెన్ పావెల్ హార్డ్హిట్టర్గా మాత్రమే మనకు పరిచయం. అయితే పావెల్ క్రికెటర్‌గా మారడానికి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అతని జీవిత చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అథ్లెట్‌గా మెరవాల్సినోడు ఇవాళ క్రికెటర్‌గా రాణించడం వెనుక తన స్కూల్ పీఈటీ టీచర్ కార్ల్టన్ సోలన్ పాత్ర ఎంతో ఉందట. ఈ విషయాన్ని రోవ్‌మెన్ పావెల్ స్వయంగా వివరించాడు. జమైకాలోని ఓల్డ్ హర్బర్‌లో జన్మించిన రోవ్‌మెన్ పావెల్‌కి తండ్రి లేడు. తల్లి, సోదరితో పెరిగిన పావెల్, చిన్నతరంలో కడుపునిండా తినడానికి కూడా ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని, అతను చాలా కింది నుంచి పైకి వచ్చాడు... పేదరికాన్ని జయించడానికి ఆటను ఎంచుకున్నాడు. స్కూల్ చదువుతున్నప్పుడే తన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేస్తానని వాళ్ల అమ్మకి ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకోవడానికే క్రికెటర్‌గా మారాడు. ఇదే విషయమై పావెల్ స్పందిస్తూ.. ''నా పీఈటీ టీచర్ కార్ల్టన్ నేను క్రికెట్ ఆడటం గమనించేవాడు. అయితే నేను ఓసారి ట్రాక్ అండ్ ఫీల్డ్ ట్రైనింగ్ కు వెళ్లా. అక్కడ ఆయన కూడా ఉన్నాడు.. నువ్వు ఇక్కడికెందుకు వచ్చావ్..? బహుశా నువ్వు ఇక్కడికి రావడం ఇదే చివరిసారి అనుకుంటా. నువ్వు క్రికెట్ చాలా బాగా ఆడతావు. ఈ ట్రాక్ అండ్ ఫీల్డ్ ను వదిలేయ్. ఇది నీకు సెట్ అవదు. నా మాట వినకుండా నువ్వు మళ్లీ ఇక్కడ గనక కనబడితే కొట్టడం గ్యారంటీ. నువ్వు రెండింటి (క్రికెట్, ట్రాక్ అండ్ ఫీల్డ్) మీద దృష్టి సారిస్తానంటే కుదరదు. అలా చేస్తే దేనిమీద వంద శాతం దృష్టి పెట్టలేవు'' అంటూ వివరించాడు. ఆయన సూచనతోనే పావెల్ క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నానని తెలిపాడు. ఇక 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన రోవ్‌మెన్ పావెల్ విండీస్ తరపున 45 వన్డేలు, 55 టి20 మ్యాచ్‌లు ఆడాడు. కాగా పావెల్ ఖాతాలో వన్డేల్లో ఒక సెంచరీ, టి20ల్లో ఒక సెంచరీ ఉండడం విశేషం. -
టీ20 మ్యాచ్‌ను‘లాక్’ చేసిన లగేజ్!
కొన్నిసార్లు ఎలా లాక్ అవుతామో మనకే తెలీదు కదా.. ఉదయం లేచిన దగ్గర్నుంచీ సాయంత్రం పడుకునే వరకూ ఏదో బిజీ. ఈ బిజీ జీవితంలో ఒకటి అనుకుంటే మరొకటి అవుతూ ఉంటుంది. అరే ఆ పని అనుకున్నాం అది కాలేదు.. నిమిషాల్లో అయిపోయే పని కూడా కాలేదే అనుకుంటూ ఒకింత ఆశ్చర్యానికి లోను కావడమే కాకుండా అదే ఆలోచన వైపు కూడా పరుగులు తీస్తాం. ఆపై తలచినదే జరుగుతుందా అని మనకు మనమే సరిపెట్టుకుంటూ ఉంటాం. ఆ సమయాల్లో మనకు మనమే లాక్ అయిపోయినట్లు అనిపిస్తోంది. రోజులో ఎక్కడో చోట లాక్ అయిపోయి.. వినోదంలో భాగమైన క్రికెట్ మ్యాచ్‌ను చూద్దామనకునే విషయంలో కూడా ఇలా జరిగితే.. అంటే ఫలానా సమయానికి మ్యాచ్ చూద్దామని స్టేడియానికి వచ్చో, లేక టీవీల ముందు కూర్చునో ఆ సమయానికి మ్యాచ్ ఆరంభం కాకపోతే అరే ఏంటిది అనుకుంటాం. సాంకేతిక కారణాల వలనో, వాతావరణం అనుకూలించకో జరిగితే దాని కోసం వెయిట్ చేస్తాం. మరి లగేజ్ రాలేదని మ్యాచ్ షెడ్యూల్ ముందుకు వెళితే.. ఈ మేనేజ్మెంట్ నిర్వహణ ఏంటిరా నాయనా.. అని తిట్టుకుంటాం. ఇప్పుడు ఇదే జరిగింది భారత్-వెస్టిండీస్ మ్యాచ్‌కు. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా సోమవారం రెండో టీ20 ఆడాల్సి ఉంది భారత్. అయితే ముఖ్యమైన లగేజ్ సమయానికి రాలేదని భారత కాలమాన ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు ఆరంభమయ్యే మ్యాచ్‌ను పది గంటలకు పొడిగించారు. ఈ రెండో టీ20 సెయింట్ కిట్స్‌లో జరుగుతుండగా అభిమానులంతా మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరొకవైపు మ్యాచ్ అప్డేట్స్ కోసం మీడియా కూడా ఆత్రంగానే ఎదురుచూస్తోంది. ఆ సమయంలో వెస్టిండీస్ క్రికెట్ నుంచి అధికారిక సందేశం విడుదల చేశారు. ‘ట్రినిడాడ్ నుంచి రావాల్సిన ముఖ్యమైన క్రికెటర్ల లగేజ్ ఇంకా సెయింట్ కిట్స్‌కు రాలేదు. ఫలితంగా మ్యాచ్‌ను రెండు గంటల పాటు వెనక్కి జరపకతప్పడం లేదు. దీనికి చింతిస్తున్నాం. అంతా అర్ధం చేసుకోవాలి’ అనే ఒక మెసేజ్ పంపింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. అంటే భారత కాలమాన ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 10 గంటలకు ఆరంభిస్తామనే సంకేతాలు పంపింది. కాకపోతే ఒక అంతర్జాతీయ మ్యాచ్‌ను ఈ కారణంతో ఆలస్యం చేస్తారా అనే సందేహం సగటు అభిమానిలో మొదలైంది. అందులోనూ ట్రినిడాడ్‌లో తొలి టీ20 శుక్రవారం జరిగితే రెండో టీ20కి కూడా లగేజ్ రాకపోవడం ఏంటనే ప్రశ్న తలెత్తింది. ఇక్కడ విండీస్ క్రికెట్ మేనేజ్మెంట్ నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఇక్కడ ఒక పర్యాటక జట్టును కష్టపెట్టడమే కాదు.. ప్రేక్షకుల్లో కూడా విసుగు తెప్పించే పని చేశారు విండీస్ పెద్దలు. ఇది సీరియస్ అంశమే. మ్యాచ్ టైమ్ షెడ్యూల్‌ను లగేజ్ కారణంగా పొడిగించడం అంటే చాలా వాటికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న విండీస్ బోర్డుకు మ్యాచ్ ఆలస్యం అంశం మరింత ఇరకాటంలో పడేసిందనే చెప్పాలి. దీనిపై ఇప్పటికిప్పుడు బీసీసీఐ ఏమీ స్పందించకపోయినా దీనిపై పూర్తి వివరణ కోరే అవకాశాలు లేకపోలేదు. -
ఎట్టకేలకు గెలుపు రుచి చూసిన విండీస్..
టీమిండియాతో సోమవారం ఆలస్యంగా జరిగిన రెండో టి20 వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. కాగా తొలి టీ20 జరిగిన ట్రినిడాడ్ నుంచి ఇరు జట్ల లగేజీ సెయింట్ కిట్స్‌కి చేరడంలో జాప్యం చోటు చేసుకోవడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు విండీస్ క్రికెట్ తెలిపింది. "అనివార్య పరిస్ధితుల కారణంగా ట్రినిడాడ్ నుంచి సెయింట్ కిట్స్‌కి రావల్సిన ఇరు జట్ల లగేజీ ఆలస్యంగా వచ్చింది. దీంతో భారత్-విండీస్ మధ్య జరగాల్సిన రెండో టీ20 రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12:30 గంటల(భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలు)కు ప్రారంభమవుతుంది. అభిమానులు, స్పాన్సర్లు, ప్రసార భాగస్వాములుకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నాం" అని క్రికెట్ వెస్టిండీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో విజయం సాధించిన భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. చదవండి: Rashid Latif: "పాకిస్తాన్ చేసిన తప్పే ఇప్పుడు భారత్ చేస్తోంది.. అది మంచిది కాదు " *CWI STATEMENT* Delayed start time for 2nd Goldmedal T20I Cup match, powered by Kent Water Purifiers | New Start Time: 12:30PM AST (11:30am Jamaica/10pm India)https://t.co/q1J5FBdZAh https://t.co/dy59uajSr8 — Windies Cricket (@windiescricket) August 1, 2022 -
Jason Holder: అన్ని ఫార్మాట్లలో హోల్డర్...
ఆంటిగ్వా: క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) 2021–22 సీజన్‌కు కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. గతేడాది మొత్తం 22 మంది ఆటగాళ్లకు కాంట్రాక్ట్ దక్కగా... ఈసారి మాత్రం 18 మందికే చోటు దక్కింది. కొత్త కాంట్రాక్ట్ 2021 జూలై 1 నుంచి 2022 జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. ఆల్ ఫార్మాట్ కాంట్రాక్ట్ (టెస్టు, వన్డే, టి20)ను జేసన్ హోల్డర్ మాత్రమే దక్కించుకున్నాడు. తొలిసారిగా ఎన్క్రుమా బ్యానర్, జోషువా డ సిల్వా, అకీలా హుసీన్, కైల్ మేయర్స్లకు సీడబ్ల్యూఐ చోటు కల్పించింది. ఇటీవల టెస్టు కెప్టెన్సీని చేపట్టిన క్రెయిగ్ బ్రాత్‌వైట్ (టెస్టు ఫార్మాట్లో), డారెన్ బ్రావో (వన్డే ఫార్మాట్లో)లు తిరిగి కాంట్రాక్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. అయితే వైట్‌బాల్ (వన్డే, టి20) కాంట్రాక్ట్ నుంచి హెట్‌మైర్, షెల్డన్ కాట్రెల్... ఆల్ ఫార్మాట్ కాంట్రాక్ట్ నుంచి రోస్టన్ చేజ్‌లకు ఈసారి కాంట్రాక్ట్ దక్కలేదు. కాంట్రాక్ట్ ప్లేయర్ల జాబితా ఆల్ ఫార్మాట్ కాంట్రాక్ట్ (టెస్టు, వన్డే, టి20): జేసన్ హోల్డర్. రెడ్ బాల్ కాంట్రాక్ట్ (టెస్టు): క్రెయిగ్ బ్రాత్‌వైట్, జెర్మయిన్ బ్లాక్‌వుడ్, ఎన్కుమ్రా బ్యానర్, కార్న్‌వాల్, జోషువాడ సిల్వా, షానన్ గాబ్రియెల్, కైల్ మేయర్స్, కీమర్ రోచ్. వైట్‌బాల్ కాంట్రాక్ట్ (వన్డే, టి20): కీరన్ పొలార్డ్, ఫాబియాన్ అలెన్, డారెన్ బ్రావో, షై హోప్, అకీలా హుసీన్, ఎవిన్ లూయిస్, అల్జారీ జోసెఫ్, నికోలస్ పూరన్, హెడెన్ వాల్ష్ జూనియర్. -
కెరీర్ బెస్ట్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు..
గుయానా: బౌలింగ్ యాక్షన్‌పై విమర్శలు ఎదుర్కొన్న వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ అంతర్జాతీయ క్రికెట్లో ఘనంగా పునరాగమనం చేశాడు. వన్డేల్లో కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో నరైన్ సూపర్ స్పెల్‌తో రాణించడంతో వెస్టిండీస్ నాలుగు వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు నరైన్ (6/27) ధాటికి 46.5 ఓవర్లలో 188 పరుగులకు చాపచుట్టేశారు. దక్షిణాఫ్రికా జట్టులో రోసౌ (61) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ రాణంచలేకపోయారు. నరైన్ క్రమం తప్పకుండా వికెట్లు తీసి సఫారీలను కోలుకోనీకుండా చేశాడు. అనంతరం 189 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 6 వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు మిగిలుండగా సాధించింది. పొలార్డ్ (67) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో పాటు ఆస్ట్రేలియా పాల్గొంటోంది. గత నవంబర్‌లో శ్రీలంకతో వన్డే సిరీస్‌లో నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఐసీసీ ఆదేశాల మేరకు నరైన్ బౌలింగ్ యాక్షన్‌ను సరిచేసుకున్న నరైన్ ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చాడు. -
'మా బోర్డు కంటే బీసీసీఐ నయం'
కోల్‌కతా: వెస్టిండీస్ డాషింగ్ ఆల్‌రౌండర్ డ్వెన్ బ్రావో, కెప్టెన్ డారెన్ స్యామీ తరహాలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై విమర్శలు ఎక్కుపెట్టాడు. వెస్టిండీస్ బోర్డు కంటే బీసీసీఐ చాలా మద్దతుగా నిలిచిందని బ్రావో అన్నాడు. విండీస్ బోర్డు పగ్గాలు సరైన వ్యక్తుల చేతిలో లేవని బ్రావో విమర్శించాడు. టి-20 ప్రపంచ కప్ గెలిచినా బోర్డు అధికారులు లేదా డైరెక్టర్లు తమకు ఫోన్ కూడా చేయలేదని చెప్పాడు. తాము ప్రపంచ కప్ గెలుస్తామని బోర్డు అధికారులు నమ్మలేదని, గెలవాలని కోరుకోలేదని వ్యాఖ్యానించాడు. తమ బోర్డు కంటే బీసీసీఐ ఎక్కువ ఉపయోగపడిందన్నాడు. ఈ ఏడాది తమకు అంతర్జాతీయ టి-20 మ్యాచ్‌లు తక్కువగా ఉన్నాయని చెప్పాడు. జీతాల విషయంలో విండీస్ బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. -
సంతకం చేస్తేనే ప్రపంచకప్ కు....
కవిండీస్ క్రికెటర్లకు బోర్డు హెచ్చరిక చెల్లింపులపై ముదిరిన సంక్షోభం కింగ్స్టన్: దాదాపు ఏడాదిన్నర క్రితం వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య చెల్లింపుల విషయంలో రాజుకున్న వివాదం ఇంకా ఆరలేదు. ఇప్పుడు టి20 ప్రపంచకప్‌కు ముందు కూడా మళ్లీ అదే కారణంతో ఇరు వర్గాల మధ్య సమస్య తీవ్రమైంది. ప్రపంచకప్ కోసం ఎంపికైన 15 మంది ఆటగాళ్లు కూడా బోర్డు ప్రతిపాదించిన అన్ని నిబంధనలను అంగీకరిస్తూ కాంట్రాక్ట్‌పై సంతకం చేయాలని సీఈఓ మైకేల్ ముర్హెడ్ ఆటగాళ్లకు హెచ్చరిక జారీ చేశారు. అందుకు ఆదివారం తుది గడువుగా నిర్దేశించారు. అయితే బోర్డు చెబుతున్న మొత్తం చాలా తక్కువని, ఇది దుర్మార్గమంటూ జట్టు కెప్టెన్ స్యామీ తమ అసంతృప్తిని తెలియజేస్తూ లేఖ రాయడంతో పరిస్థితి ముదిరింది. తమ వేతనాలను 80 శాతం తగ్గించారని... డబ్బులు పెంచకపోతే కుదరదని స్యామీ అంటున్నాడు. ప్రస్తుత నిబంధనల్లో ఒక్క మార్పూ చేయమని, అవసరమైతే ఈ ఆటగాళ్లను తప్పించి ద్వితీయ శ్రేణి జట్టును పంపించడానికైనా తాము సిద్ధమని ముర్హెడ్ గట్టిగా చెప్పడంతో వరల్డ్‌కప్‌కు గేల్, బ్రేవోలాంటి స్టార్లు దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. -
గేల్ పరుగుల తుఫాన్‌కు బ్రేక్
కింగ్స్టన్: వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ పరుగుల తుఫానుకు మూడు నెలలు బ్రేక్ పడనుంది. గేల్ వెన్నునొప్పి కారణంగా మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంకానున్నాడు. గేల్ శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. 'వెన్నునొప్పికి శస్త్రచికిత్స చేయించుకుంటున్నా. కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. రెండు మూడు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉంటా. డిసెంబర్లో మళ్లీ వస్తాను' అని క్రిస్ గేల్ చెప్పాడు. ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరపున ఆడుతున్న గేల్ పరుగుల తుఫాన్‌తో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌తో పాటు ఇతర టి-20 లీగ్‌ల్లోనూ గేల్ రాణించాడు. -
టెస్టులకు డ్వెన్ బ్రావో గుడ్ బై
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వెన్ బ్రావో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గత నాలుగేళ్లుగా బ్రావో టెస్టులు ఆడటం లేదు. అతని కెరీర్లో 40 టెస్టులు, 147 వన్డేలు ఆడాడు. టెస్టుల నుంచి వైదొలగి పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగనున్నట్టు ప్రకటించాడు. ఈ విషయం గురించి వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో చర్చించినట్టు వెల్లడించాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో మరో ఏడాది పాటు ఒప్పందం ఉంది. కాగా వన్డే ప్రపంచ కప్ జట్టుకు బ్రావో ఎంపిక కాలేదు.