ఆంటిగ్వా: క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) 2021–22 సీజన్‌కు కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. గతేడాది మొత్తం 22 మంది ఆటగాళ్లకు కాంట్రాక్ట్ దక్కగా... ఈసారి మాత్రం 18 మందికే చోటు దక్కింది. కొత్త కాంట్రాక్ట్ 2021 జూలై 1 నుంచి 2022 జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. ఆల్ ఫార్మాట్ కాంట్రాక్ట్ (టెస్టు, వన్డే, టి20)ను జేసన్ హోల్డర్ మాత్రమే దక్కించుకున్నాడు.
తొలిసారిగా ఎన్‌క్రుమా బ్యానర్, జోషువా డ సిల్వా, అకీలా హుసీన్, కైల్ మేయర్స్‌లకు సీడబ్ల్యూఐ చోటు కల్పించింది. ఇటీవల టెస్టు కెప్టెన్సీని చేపట్టిన క్రెయిగ్ బ్రాత్‌వైట్ (టెస్టు ఫార్మాట్‌లో), డారెన్ బ్రావో (వన్డే ఫార్మాట్‌లో)లు తిరిగి కాంట్రాక్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. అయితే వైట్‌బాల్ (వన్డే, టి20) కాంట్రాక్ట్ నుంచి హెట్‌మైర్, షెల్డన్ కాట్రెల్... ఆల్ ఫార్మాట్ కాంట్రాక్ట్ నుంచి రోస్టన్ చేజ్‌లకు ఈసారి కాంట్రాక్ట్ దక్కలేదు.
కాంట్రాక్ట్ ప్లేయర్ల జాబితా
ఆల్ ఫార్మాట్ కాంట్రాక్ట్ (టెస్టు, వన్డే, టి20): జేసన్ హోల్డర్. రెడ్ బాల్ కాంట్రాక్ట్ (టెస్టు): క్రెయిగ్ బ్రాత్‌వైట్, జెర్మయిన్ బ్లాక్‌వుడ్, ఎన్‌కుమ్రా బ్యానర్, కార్న్‌వాల్, జోషువాడ సిల్వా, షానన్ గాబ్రియెల్, కైల్ మేయర్స్, కీమర్ రోచ్. వైట్‌బాల్ కాంట్రాక్ట్ (వన్డే, టి20): కీరన్ పొలార్డ్, ఫాబియాన్ అలెన్, డారెన్ బ్రావో, షై హోప్, అకీలా హుసీన్, ఎవిన్ లూయిస్, అల్జారీ జోసెఫ్, నికోలస్ పూరన్, హెడెన్ వాల్ష్ జూనియర్.
Comments
Please login to add a commentAdd a comment