jason holder
-
వెస్టిండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ దూరం
బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ వెస్టిండీస్ ప్రకటించింది. ఈ జట్టుకు క్రైగ్ బ్రాత్‌వైట్ సారథ్యం వహించనున్నాడు. బ్రాత్‌వైట్ డిప్యూటీగా జాషువ డి సిల్వా ఎంపికయ్యాడు.అయితే ఈ సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ భుజం గాయం కారణంగా దూరమయ్యాడు. గత కొంతకాలంగా హోల్డర్ భుజం గాయంతో బాధపడుతున్నాడు. బంగ్లా సిరీస్ సమయానికి కోలుకుంటాడని అంతా భావించారు. కానీ అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో సెలక్టర్లు జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు విండీస్ దేశీవాళీ టోర్నీ యునైటెడ్ సూపర్50 కప్‌లో మూడు సెంచరీలు సాధించిన జస్టిన్ గ్రీవ్స్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. అదేవిధంగా స్పిన్నర్ కెవిన్ సింక్లైర్ కూడా జట్టులోకి వచ్చాడు. నవంబర్ 22 నుంచి ఆంటిగ్వా వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. విండీస్ ప్రస్తుతం స్వదేంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది.బంగ్లాతో టెస్టులకు విండీస్ జట్టు: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జాషువా డా సిల్వా (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, కీసీ కార్టీ, జస్టిన్ గ్రీవ్స్, కవెమ్ హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, మికిల్ లూయిస్, అండర్సన్ ఫిలిప్, కెమర్ రోచ్, జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, జోమెల్, జోమెల్ వారికన్ చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
Eng Vs WI: మరోసారి మెరిసిన అట్కిన్సన్
England vs West Indies, 3rd Test Day 1: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో వెస్టిండీస్ బ్యాటర్లు బ్రాత్‌వైట్ (61; 8 ఫోర్లు), హోల్డర్ (59; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 75.1 ఓవర్లలో 282 పరుగుల వద్ద ఆలౌటైంది. మిడిలార్డర్లో జొషువా సిల్వా (49; 3 ఫోర్లు) కూడా రాణించాడు.ఒక దశలో 76/1గా ఉన్న విండీస్ 115/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. అనంతరం జొషువా, హోల్డర్లు ఆరో వికెట్‌కు 109 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. వోక్స్ (3/69) ఈ జోడీని విడగొట్టి విండీస్ పతనానికి శ్రీకారం చుట్టాడు. అట్కిన్సన్ (4/67) కీలకమైన వికెట్లు తీసి విండీస్ ఆట కట్టించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్.. తొలి రోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్లకు 38 పరుగులు చేసింది. 2-0తో సిరీస్ కైవసంకాగా మూడు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య ఇంగ్లండ్ విజయభేరి మోగించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మూడో టెస్టులోనైనా గెలిచి క్లీన్‌స్వీప్ గండం నుంచి తప్పించుకోవాలని వెస్టిండీస్ పట్టుదలగా ఉంది. అందుకు అనుగుణంగానే బర్మింగ్‌హాంలో అడుగులు వేస్తోంది.తుదిజట్లుఇంగ్లండ్జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్.వెస్టిండీస్క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాసన్ హోల్డర్, జాషువా డా సిల్వా (వికెట్ కీపర్), అల్జారీ జోసెఫ్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్. -
టీ20 వరల్డ్‌కప్ 2024కు ముందు వెస్టిండీస్‌కు భారీ షాక్
స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్‌కప్ 2024కు ముందు ఆతిథ్య వెస్టిండీస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ సందర్భంగా హోల్డర్ గాయపడినట్లు తెలుస్తుంది. హోల్డర్ స్థానాన్ని రిజర్వ్ ఆటగాడు ఓబెద్ మెక్‌కాయ్‌తో భర్తీ చేయనున్నట్లు విండీస్ చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ తెలిపాడు. ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్లో హోల్డర్ లాంటి అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ లేకపోవడం తమ జట్టుకు పెద్ద లోటే అవుతుందని హేన్స్ అభిప్రాయపడ్డాడు. మెక్కాయ్ హోల్డర్ స్థానానికి న్యాయం చేస్తాడని హేన్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్లైన వెస్టిండీస్ ప్రస్తానం జూన్ 2న మొదలవుతుంది. విండీస్ తమ తొలి మ్యాచ్‌లో పపువా న్యూ గినియాతో తలపడుతుంది. విండీస్ గ్రూప్-సిలో పపువా న్యూ గినియా, న్యూజిలాండ్, ఉగాండ, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో తలపడుతుంది.టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం విండీస్ జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), అల్జరీ జోసెఫ్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, షాయ్ హోప్, ఆండ్రీ రస్సెల్, రొమారియో షెపర్డ్, ఒబెడ్ మెక్కాయ్, అకీల్ హోసేన్, గుడకేష్ మోటీ, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్రిజర్వ్ ప్లేయర్లు: కైల్ మేయర్స్, మాథ్యూ ఫోర్డ్, ఫాబియన్ అలెన్, హేడెన్ వాల్ష్, ఆండ్రీ ఫ్లెచర్ -
వెస్టిండీస్ టీ20 జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడు రీ ఎంట్రీ
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును తమ జట్టును క్రికెట్ వెస్టిండీస్ ప్రకటించింది. దాదాపు రెండేళ్ల పాటు జాతీయ జట్టుకు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్‌కు ఇంగ్లండ్ సిరీస్ కోసం విండీస్ సెలక్టర్లు పిలుపునిచ్చారు. రస్సెల్ చివరగా వెస్టిండీస్ తరపున 2021లో ఆస్ట్రేలియాపై టీ20 మ్యాచ్ ఆడాడు. ఇటీవల కాలంలో రస్సెస్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండంతో మళ్లీ సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకున్నారు. అదే విధంగా ఇంగ్లండ్‌తో వన్డేలకు దూరమైన స్టార్ ఆటగాళ్లు జాసన్ హోల్డర్, నికోలస్ పూరన్ లు టీ20 జట్టులో మాత్రం చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు రోవ్‌మన్ పావెల్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. షాయ్ హోప్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. డిసెంబర్ 12న బార్బోడేస్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటికే ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో వెస్టిండీస్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో టీ20లకు విండీస్ జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్. చదవండి: ENG vs WI: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్.. 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి -
టీమిండియాతో టెస్టు సిరీస్.. ప్రణాళికలు సిద్దం చేసిన విండీస్! ముందుగానే స్వదేశానికి
వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్ ప్రయాణం జింబాబ్వే వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్స్‌లోనే ముగిసిన సంగతి తెలిసిందే. స్కాట్లాండ్ చేతిలో ఓటమిపాలైన విండీస్ అధికారికంగా వన్డే వరల్డ్‌కప్ రేసు నుంచి నిష్క్రమించింది. క్వాలిఫయర్స్‌లో విండీస్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలివున్నాయి. జూలై 5న ఒమన్, శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం స్వదేశంలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు కరీబియన్ జట్టు సిద్దం కానుంది. దీంతో భారత్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధం కావడానికి స్టార్ ఆటగాళ్లు జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్‌లను ముందుగానే స్వదేశానికి విండీస్ క్రికెట్ బోర్డు రప్పించింది. ఈ క్రమంలో వీరిద్దరూ ఒమన్, శ్రీలంక జరగనున్న చివరి క్వాలిఫయర్ మ్యాచ్‌లకు దూరమయ్యారు. విండీస్ జట్టు ప్రస్తుతం ట్రినిడాడ్‌లో తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తోంది. వీరిద్దరూ నేరుగా విండీస్ జట్టుతో కలవనున్నారు. జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్ ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ నుంచి ముందుగానే స్వదేశానికి బయలుదేరనున్నారు. వారు కరేబియన్‌కు తిరిగి రానుందున చివరి రెండు సూపర్ సిక్స్ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. భారత్‌తో టెస్టు సిరీస్‌కు వారిపై వర్క్‌లోడ్‌ను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని విండీస్ క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా జూలై 12 నుంచి డెమినికా వేదికగా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే విండీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతోంది. ఇక టెస్టు సిరీస్ అనంతరం మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ జట్టు ఆతిథ్య విండీస్‌తో తలపడనుంది. భారత్‌తో టెస్టులకు వెస్టిండీస్ సన్నహాక జట్టు: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, ఎన్క్రుమా బోనర్, తగెనరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్. -
ఇప్పుడే అంతా అయిపోలేదు: జేసన్ హోల్డర్
-
WC 2023: ఇప్పుడే అంతా అయిపోలేదు.. వెస్టిండీస్ అద్భుతాలు చేయగలదు!
ICC Cricket World Cup Qualifiers 2023- SCO Vs WI: ‘‘ఇప్పుడేమీ అంతా ముగిసిపోలేదు. జట్టులో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. వెస్టిండీస్ క్రికెట్‌కు కచ్చితంగా మళ్లీ పూర్వవైభవం తీసుకురాగలరు. సీనియర్లుగా మేము చేయాల్సిందల్లా.. వాళ్ల నైపుణ్యాలను మెరుగుపరచుకునే దిశగా పూర్తిస్థాయిలో అండగా నిలవడమే! లోపాలు సరిదిద్దుకుని ముందుకు సాగాలి. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దాలి’’ అని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ అన్నాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే పడిలేచిన కెరటంలా తాము మళ్లీ క్రికెట్లో పూర్వస్థితికి చేరుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరీ ఘోరంగా రెండుసార్లు వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్.. ఈసారి కనీసం ప్రధాన పోటీకి కూడా అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయర్స్ సూపర్ సిక్సెస్ దశలో స్కాట్లాండ్ చేతిలో చిత్తుగా ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది. పసికూన చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన మాజీ చాంపియన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో విండీస్ ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పటి చాంపియన్స్ మరీ ఇంత అవమానకరంగా మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మళ్లీ అద్భుతాలు చేయగలం ఈ నేపథ్యంలో ఇప్పటికే జట్టులో బ్లేమ్ గేమ్ మొదలుకాగా.. 31 ఏళ్ల జేసన్ హోల్డర్ మాత్రం ఆశావహ దృక్పథంతో ఉండటం విశేషం. ఆటలో గెలుపోటములు సహజమేనని... అయితే, ఇప్పటికైనా లోపాలు సరిదిద్దుకునే అంశంపై దృష్టిసారించాలని పేర్కొన్నాడు. అదే విధంగా.. సరైన గైడెన్స్ ఉంటే యువ ఆటగాళ్లతో మళ్లీ అద్భుతాలు చేయవచ్చని పేర్కొన్నాడు. భేదాభిప్రాయాలు పక్కనపెట్టి సమష్టిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని 31 ఏళ్ల జేసన్ హోల్డర్ చెప్పుకొచ్చాడు. కాగా స్కాట్లాండ్తో మ్యాచ్‌లో 45 పరుగులతో విండీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన హోల్డర్.. స్కాట్లాండ్ ఓపెనర్ క్రిస్టోఫర్ మెక్బ్రిడే వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక జూలై 7న సూపర్ సిక్సెస్‌లో తమ చివరి మ్యాచ్ ఆడనున్న విండీస్.. జూలై 12 నుంచి టీమిండియాతో టెస్టు సిరీస్‌కు సిద్ధం కానుంది. స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ స్కోర్లు: టాస్: స్కాట్లాండ్- బౌలింగ్ వెస్టిండీస్- 181 (43.5) స్కాట్లాండ్- 185/3 (43.3) విజేత: ఏడు వికెట్ల తేడాతో స్కాట్లాండ్ గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బ్రాండన్ మెక్‌ములెన్ (3 వికెట్లు, 69 పరుగులు). చదవండి: రెండు ప్రపంచకప్‌లలో ఎదురేలేని గెలుపు! కానీ ఇప్పుడు.. విండీస్ దుస్థితికి కారణాలివే మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఒకవేళ అలా జరిగి ఉంటే: విండీస్ కెప్టెన్ -
వెస్టిండీస్ కొంపముంచాడు.. చెత్త బౌలింగ్‌తో! ఐపీఎల్లో కూడా అంతే
ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫియర్స్‌లో వెస్టిండీస్‌కు మరో ఘోర పరాభవం ఎదురైంది. హరారే వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై నెదర్లాండ్స్ సంచలన విజయం నమోదు చేసింది. సూపర్ ఓవర్లో ఫలితం తేలిన ఈ మ్యాచ్‌లో విండీస్ ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసినప్పటికి విజయం సాధించలేకపోయింది. విండీస్ బౌలర్లు విఫలం కావడంతో నెదర్లాండ్స్ కూడా నిర్ణీత ఓవర్లలో సరిగ్గా 374 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ ఫలితాన్ని సూపర్ ఓవర్లో తేల్చాల్సి వచ్చింది. హోల్డర్ చెత్త బౌలింగ్.. వాన్ బీక్ సూపర్ బ్యాటింగ్ ఇక సూపర్ ఓవర్లో విండీస్ తరపున బౌలింగ్ వేసేందుకు బంతిని హోల్డర్‌కు కెప్టెన్ హోప్ అందించాడు. హోప్ నమ్మకాన్ని హోల్డర్ వమ్ము చేశాడు. హోల్డర్ వేసిన సూపర్ ఓవర్లో నెదర్లాండ్స్ బ్యాటర్ వాన్ బీక్ బౌండరీల మోత మోగించాడు. 4,6,4,6,6,4 బాదాడు. దీంతో సూపర్ ఓవర్లో డచ్ జట్టు ఏకంగా 30 పరుగులు చేసింది. సూపర్ ఓవర్లో ఒక్క మంచి డెలివరీని కూడా హోల్డర్ సంధించలేకపోయాడు. ఫుల్ టాస్ లేదా సరైన స్లాట్‌లో బౌలింగ్‌లో చేయడంతో వాన్‌బీక్ బౌండరీల వర్షం కురిపించాడు. అనంతరం 31 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. కేవలం 8 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఈ ఘోర పరాభావాన్ని విండీస్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా హోల్డర్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. హోల్డర్‌కు బదులుగా జోషఫ్‌కు బౌలింగ్ ఇచ్చి ఉంటే కచ్చితంగా విండీస్ విజయం సాధించేదాని పోస్టులు చేస్తున్నారు. హోల్డర్ తన చెత్త బౌలింగ్‌తో విండీస్ కొంపముంచాడు అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్లో కూడా అంతే.. ఇక హోల్డర్ గత కొంతకాలంగా తన స్ధాయికి తగ్గట్టు రాణించడంలో విఫలమవతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కూడా దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన హోల్డర్.. 8 మ్యాచ్‌ల్లో 9.96 ఏకనామీతో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ముఖ్యంగా ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్‌లో విజయానికి ఆఖరి ఓవర్లో 17 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. హోల్డర్ తొలి మూడు బంతులకే 3 సిక్స్‌లు ఇచ్చి రాజస్తాన్‌కు ఓటమి మిగిల్చాడు. చదవండి: CWC Qualifiers 2023: చరిత్ర సృష్టించిన నెదార్లాండ్స్ ఆటగాడు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా! Jason Holder, the man, the myth, the legend! pic.twitter.com/5I8QrCoTfO — Shivani Shukla (@iShivani_Shukla) June 26, 2023 -
Ind Vs WI: విండీస్‌కు కష్టాలు! సందిగ్దంలో టీమిండియాతో టెస్టు సిరీస్!
West Indies Vs India: వెస్టిండీస్- టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌ల షెడ్యూల్లో మార్పు చోటు చేసుకోనుందా? జూలై 12న మొదలు కావాల్సిన టెస్టు సిరీస్ ఆలస్యం కానుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. వెస్టిండీస్ ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. జూన్ 18న జింబాబ్వే వేదికగా సీడబ్ల్యూసీ(క్రికెట్ వరల్డ్ కప్) క్వాలిఫయర్స్ మొదలైంది. ఇక తమ తొలి మ్యాచ్‌లో అమెరికాతో తలపడ్డ విండీస్ 39 పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించి శుభారంభం చేసింది. ఈ క్రమంలో జూన్ 22న నేపాల్‌తో.. తదుపరి జూన్ 24న ఆతిథ్య జింబాబ్వేతో పోటీపడనుంది. గ్రూప్-ఏలో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్ కరేబియన్లకు కీలకం కానుంది. ఆ తర్వాత జూన్ 26న నెదర్లాండ్స్‌ను ఢీకొట్టనుంది విండీస్. సూపర్ సిక్సెస్‌లో అడుగుపెడితేనే ఈ క్రమంలో సూపర్ సిక్సెస్ స్టేజ్‌లో అడుగుపెట్టాలని భావిస్తున్న వెస్టిండీస్ అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ 29- జూలై 7 వరకు బిజీ అవుతుంది. ఇక ఈవెంట్ జూలై 9 నాటి ఫైనల్‌తో ముగియనుంది. రెండుసార్లు వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచిన వెస్టిండీస్ కచ్చితంగా ఫైనల్ చేరి భారత్ వేదికగా జరుగనున్న ప్రపంచకప్-2023కి అర్హత సాధించాలనే దృఢ సంకల్పంతో ఉంది. ఇదిలా ఉంటే.. మాజీ చాంపియన్ విండీస్ ఒకవేళ హరారే వేదికగా జరుగనున్న ఫైనల్ ఆడితే.. ఆ మ్యాచ్ ముగిసిన రెండ్రోజుల వ్యవధిలోనే టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంటుంది. నిజానికి వెస్టిండీస్ పరిమిత ఓవర్లు, రెడ్‌బాల్ క్రికెట్‌కు వేర్వేరు జట్లను ఆడిస్తుంది. ఆ నలుగురు అయితే, ఈసారి క్వాలిఫయర్స్ ఆడే జట్టులో జేసన్ హోల్డర్, కైలీ మేయర్స్, రోస్టన్ చేజ్, అల్జారీ జోసెఫ్ తదితర రెండు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు ఉన్నారు. వీరు నలుగురు యూఎస్ఏతో తొలి మ్యాచ్‌లో ఆడారు కూడా! ఈ క్రమంలో వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ ముగించుకుని జింబాబ్వే నుంచి విండీస్ చేరుకోవడానికే ఒకటిన్నర రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాతో టెస్టు సిరీస్ ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు క్రిక్‌బజ్ నివేదికలో పేర్కొంది. మాకు అదే ముఖ్యం ఈ విషయంపై వెస్టిండీస్ చీఫ్ సెలక్టర్ డెస్మాండ్ హెయిన్స్‌ను సంప్రదించగా.. ‘‘మేము ముందు వరల్డ్‌కప్ ఈవెంట్‌కు అర్హత సాధించాలి. ఆ తర్వాతే మిగతా అంశాలపై దృష్టి సారిస్తాం. మాకు వివిధ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి టెస్టు ప్లేయర్లపై భారం పడదు’’ అని పేర్కొన్నట్లు తెలిపింది. కాగా వెస్టిండీస్- భారత్ మధ్య జూలై 12- 24 వరకు రెండు టెస్టులు, జూలై 27- ఆగష్టు 1 వరకు మూడు వన్డేలు, ఆగష్టు 3- 13 వరకు ఐదు టీ20 మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు! ఆ కంపెనీ సీఈఓ.. రూ. 800 కోట్ల సామ్రాజ్యం! Ind Vs WI: ఆ ముగ్గురు దూరం.. యువ సంచలనం ఎంట్రీ! -
రాణించిన పూరన్, హోల్డర్.. పసికూనపై విండీస్ విజయం
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్-2023లో భాగంగా ఇవాళ (జూన్ 18) జరిగిన రెండో మ్యాచ్‌లో యూఎస్ఏపై వెస్టిండీస్ ఓ మోస్తరు విజయం సాధించింది. హరారేలోని తకషింగ స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో విండీస్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. విండీస్ ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించినప్పటికీ, వారికి విజయం అంత ఈజీగా దక్కలేదు. విండీస్‌తో పోల్చుకుంటే యూఎస్ఏ టీమ్ చాలా చిన్నదే అయినా అద్భుత పోరాటపటిమ కనబర్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌ను వారు మరో 3 బంతులు మిగిలుండగానే అలౌట్ చేశారు. విండీస్ జట్టులో గుర్తింపు పొందిన ఆటగాళ్లు చాలామంది ఉన్నప్పటికీ.. యూఎస్ఏ బౌలర్లు వారిని కట్టడి చేశారు. టీ20 స్పెషలిస్ట్‌లు అయిన బ్రాండన్ కింగ్ (0), కైల్ మేయర్స్ (2), రోవ్‌మన్ పావెల్ (0), కీమో పాల్ (4), అల్జరీ జోసఫ్ (3) ఆటలు యూఎస్ఏ బౌలర్ల ముందు సాగలేదు. స్టీవెన్ టేలర్, సౌరభ్ నేత్రావాల్కర్, కైల్ ఫిలిప్ తలో 3 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించారు. జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించడంతో విండీస్ 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ ఆటగాళ్లు 7 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేశారు. గజానంద్ సింగ్ (101 నాటౌట్) వీరోచిత శతకంతో పోరాడి విండీస్‌కు అంత సులువుగా విజయాన్ని దక్కనీయ లేదు. అతనికి ఆరోన్ జోన్స్ (23), షయాన్ జహంగీర్ (39), నోస్తుష్ కెంజిగే (34) సహకరించారు. విండీస్ బౌలర్లలో కైల్ మేయర్స్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు, జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఇవాళే జరిగిన మరో గ్రూప్-ఏ మ్యాచ్‌లో నేపాల్‌పై జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్-బిలో భాగంగా రేపు (జూన్ 19) శ్రీలంక-యూఏఈ.. ఐర్లాండ్-ఒమన్ జట్లు తలపడనున్నాయి. -
ఇదేమి చెత్త బౌలింగ్రా బాబు.. గల్లీ క్రికెటర్లు చాలా బెటర్
ఐపీఎల్-2023లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా రాజస్తాన్ పరాజయం చెందింది. 213 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో రాజస్తాన్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ చెత్త బౌలింగ్‌తో రాజస్తాన్ కొంపముంచాడు. ఆఖరి ఓవర్లో ముంబై విజయానికి 17 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బంతిని హోల్డర్ చేతికి వచ్చాడు. హోల్డర్ శాంసన్ నమ్మకాన్ని వమ్ముచేశాడు. వరుసగా మూడు సిక్స్‌లు ఇచ్చి రాజస్తాన్‌కు కాలరాత్రి మిగిల్చాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు బౌలింగ్ చేసిన హోల్డర్.. ఏకంగా 55 పరుగులు లిచ్చాడు. అతడి ఏకనామీ రేటు 15.70గా ఉండడం గమానార్హం. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం ఉన్న హోల్డర్ ఎటువంటి ప్రదర్శన చేయడం రాజస్తాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా హోల్డర్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఓ యాజర్ స్పందిస్తూ.. ఇదేమి చెత్త బౌలింగ్.. గల్లీ క్రికెటర్లు చాలా బెటర్ అంటూ కామెంట్ చేశాడు. చదవండి: #Rohit sharma: చాలా సంతోషంగా ఉంది.. అతడు భయపెట్టాడు..! భారత క్రికెట్‌కు చాలా మంచిది Tim David, take a bow 🔥 What a way to leave Wankhede and Sachin Tendulkar all smiles 😀#IPL2023 #TATAIPL #MIvRR #IPL1000 | @mipaltan @timdavid8 pic.twitter.com/evvQRJCEFu — JioCinema (@JioCinema) April 30, 2023 16 needed off the last over Jason Holder concedes 6 6 6 🤩 2 waist high full tosses King Jason immediately seeks the blessing of Lord Dinda 🙏 pic.twitter.com/xts2aaeRBQ — Dinda Academy (@academy_dinda) April 30, 2023 -
స్టన్నింగ్ క్యాచ్.. చెత్త రివ్యూతో పరువు తీసుకున్న బ్యాటర్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ మ్యాచ్‌లో స్టన్నింగ్ క్యాచ్ నమోదైంది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఇది చోటుచేసుకుంది. బౌల్డ్ వేసిన ఔట్ స్వింగర్‌ను అవనసరంగా గెలుక్కున్న రాహుల్ త్రిపాఠి మూల్యం చెల్లించుకున్నాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తాకింది. కీపర్‌కు, స్లిప్ ఫీల్డర్‌కు మధ్య గ్యాప్‌లో వెళ్తున్న బంతిని జేసన్ హోల్డర్ ఎడమవైపుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అయితే త్రిపాఠి రివ్యూకు వెళ్లి చేతులు కాల్చుకున్నాడు. బ్యాట్‌కు బంతి క్లియర్‌గా తగిలిందని తెలుస్తున్నా అనవసరంగా రివ్యూకు వెళ్లి పరువు తీసుకున్నాడు. బౌల్ట్ వేసిన బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి బౌన్స్ అయినప్పటికి.. అయితే బంతి బ్యాట్‌ను తగల్లేదనే ఉద్దేశంతో త్రిపాఠి రివ్యూకు వెళ్లి ఉంటాడు. ఇక జేసన్ హోల్డర్ క్యాచ్ సీజన్ ఆఫ్ ది క్యాచ్‌గా నమోదైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. Trent Boult is a beast in the Powerplay. pic.twitter.com/0nRX2295wc — Mufaddal Vohra (@mufaddal_vohra) April 2, 2023 చదవండి: ఇంతలా చెలరేగుతున్నా మనసు కరగడం లేదా! -
SA Vs WI: జేసన్ హోల్డర్ ఒంటరి పోరాటం.. అయినా పాపం!
South Africa vs West Indies, 2nd Test- జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 251 పరుగులకు ఆలౌటైంది. జేసన్ హోల్డర్ (117 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఇతర బ్యాటర్లలో కైల్ మేయర్స్ (29), రోస్టన్ ఛేజ్ (28), జొషువా డ సిల్వ (26) కొన్ని పరుగులు జోడించగలిగారు. సఫారీ బౌలర్లలో కోయెట్జీ 3 వికెట్లు పడగొట్టగా...రబడ, హార్మర్ చెరో 2 వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్‌లో 69 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ కోల్పోకుండా 4 పరుగులు చేసింది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 311/7తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 320 పరుగులకు ఆలౌటైంది. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్ సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. ఫిబ్రవరి 28న ఆరంభమైన టెస్టు సిరీస్‌లో భాగంగా ఆతిథ్య ప్రొటిస్ తొలి మ్యాచ్‌లో 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మార్చి 8న మొదలైన రెండో టెస్టులోనూ విండీస్‌పై బవుమా బృందానిదే పైచేయిగా ఉంది. ఇదిలా ఉంటే.. మార్చి 16-21 వరకు వన్డే, మార్చి 25-28 వరకు సౌతాఫ్రికా- వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ జరుగనుంది. చదవండి: Wanindu Hasaranga: పెళ్లి చేసుకున్న శ్రీలంక ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్! Steve Smith: అంతా బాగానే ఉంది కానీ.. ఇదేంటి స్మిత్! మరీ ఇలా.. కెరీర్లో ఇదే తొలిసారి! -
విండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్‌పై కన్నేసిన రాజస్తాన్!
ఐపీఎల్-2023 మినీవేలం సమయం దగ్గరపడడంతో ఆయా ప్రాంఛైజీలు తమ వ్యూహాలను రచించేందుకు సిద్దమవుతున్నాయి. మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరగనుంది. ఇక ఈ వేలంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌ను రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రాజస్తాన్ జట్టులో బట్లర్, శాంసన్, పడిక్కల్ వంటి అద్భుతమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ.. ఆల్‌రౌండర్ల లోపం మాత్రం సృష్టంగా ఈ ఏడాది సీజన్లో కన్పించింది. ఈ నేపథ్యంలో హోల్డర్ వంటి విధ్వంసక ఆల్‌రౌండర్‌ను జట్టులోకి తీసుకోవాలని రాజస్తాన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున హోల్డర్ ఆడాడు. కానీ మినీవేలంకు ముందు లక్నో హోల్డర్‌ను విడిచిపెట్టింది. ఐపీఎల్-2022లో 12 మ్యాచ్‌లు ఆడిన హోల్డర్ 14 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు రాజస్తాన్ రాయల్స్ 16 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. 9 మంది ప్లేయర్స్‌ను వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం రాజస్తాన్ పర్స్‌లో రూ. 13.2 కోట్లు ఉన్నాయి. రాజస్తాన్ రిటైన్ లిస్ట్ సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్ రాజస్తాన్ విడిచిపెట్టిన జాబితా అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా చదవండి: IND Vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! తుది జట్టు ఇదే? -
IPL 2023: ఫ్రాంచైజీలు అవమానకర రీతిలో వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగనున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు నిన్ననే (నవంబర్ 15) తమ రిటెన్షన్ లిస్ట్‌తో పాటు రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అయితే ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో కొందరిని అవమానకర రితీలో వదిలించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రిలీజ్ చేసిన ఆటగాళ్ల గత రికార్డులు, వారి సామర్ధ్యం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోని ఫ్రాంచైజీలు.. సదరు ఆటగాళ్ల గత సీజన్ ఫామ్, ప్రస్తుత ఫామ్‌ను మాత్రమే కొలమానంగా తీసుకుని, కనీసం ముందస్తు నోటీస్‌లు కూడా ఇవ్వకుండా తప్పించాయని సమాచారం. ఫ్రాంచైజీలు నోటీస్‌లు కూడా ఇవ్వకుండా రిలీజ్ చేయడంపై చాలా మంది ఆటగాళ్లు తీవ్ర మనస్థాపానికి గరయ్యారని ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ పేర్కొంది. ముఖ్యంగా కొందరు స్టార్ ఆటగాళ్లు, మెగా వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న ఆటగాళ్లు.. ఫ్రాంచైజీలు ఇలా అవమానకర రీతిలో తమతో వ్యవహరిస్తాయని ఊహించలేదని వాపోయినట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు.. సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (14 కోట్లు) పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (14 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్: నికోలస్ పూరన్ (10.75 కోట్లు) లక్నో సూపర్ జెయింట్స్: జేసన్ హోల్డర్ (8.75 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్: రొమారియో షెపర్డ్ (7.75 కోట్లు) ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా.. గుజరాత్ టైటాన్స్: రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జాసన్ రాయ్, వరుణ్ ఆరోన్. వీరిలో రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్‌లను కేకేఆర్ ట్రేడింగ్ చేసుకోగా, మిగిలిన ముగ్గురిని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం వేలానికి వదిలి పెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్: శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్దీప్ సింగ్. వీరిలో శార్దూల్ ఠాకూర్‌ను కేకేఆర్ చేసుకోగా, ఢిల్లీ యాజమాన్యం మిగిలిన ఆటగాళ్లను వేలానికి వదిలేసింది. రాజస్తాన్ రాయల్స్: అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా. వీరిలో డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ లాంటి అంతర్జాతీయ స్టార్లను ఆర్ఆర్ యాజమాన్యం చిన్నచూపు చూసింది. కేకేఆర్: పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్. వీరిలో పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, ఆరోన్ ఫించ్ వివిధ కారణాల చేత స్వతాహాగా లీగ్‌కు అందుబాటులో ఉండమని ప్రకటించగా.. అలెక్స్ హేల్స్, అజింక్య రహానే, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే లాంటి స్టార్లకు అవమానకర ఉద్వాసన తప్పలేదు. పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ. వీరలో కెప్టెన్‌గా ఉన్న మయాంక్ అగర్వాల్ అత్యంత దారుణ పరాభవం కాగా, ఒడియన్ స్మిత్ లాంటి విదేశీ ప్లేయర్‌ను ఫ్రాంచైజీ అస్సలు పట్టించుకోలేదు. ఆర్సీబీ: జేసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్. వీరిలో జేసన్ బెహ్రెండార్ఫ్ను కేకేఆర్ ట్రేడ్ చేసుకోగా.. రూథర్‌ఫోర్డ్‌కు బలవంతపు ఉద్వాసన తప్పలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్. ఈ ఫ్రాంచైజీనే అత్యధికంగా స్టార్ ఆటగాళ్లను తప్పించింది. కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్ లాంటి విదేశీ స్టార్లు తీవ్రంగా మనసు నొచ్చుకున్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్: వేలానికి ముందు అత్యధిక మంది ప్లేయర్లను వదిలిపెట్టిన ఫ్రాంచైజీ ఇదే. ఈ జట్టు కీరన్ పొలార్డ్, అన్మోల్ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్‌ను రిలీజ్ చేసింది. ఎంపై మేనేజ్మెంట్.. వీరిలో పోలార్డ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుని తృప్తి పరచగా.. డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, రిలే మెరెడిత్ టైమల్ మిల్స్ లాంటి ఆటగాళ్లకు అవమానం తప్పలేదు. లక్నో సూపర్ జెయింట్స్: ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్. వీరిలో ఆండ్రూ టై, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే లాంటి పేరున్న ఆటగాళ్లను యాజమాన్యం నిర్ధాక్షిణ్యంగా రిలీజ్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్: డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్. వీరిలో డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. క్రిస్ జోర్డాన్‌పై వేటు పడింది. -
మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఇదో గుణపాఠం.. పూరన్ కన్నీటి పర్యంతం!
ICC Mens T20 World Cup 2022 - West Indies vs Ireland- Nicholas Pooran: ‘‘ఈ ఓటమి తట్టుకోలేనిది. టోర్నమెంట్ ఆసాంతం మా బ్యాటింగ్ అస్సలు బాగాలేదు. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై కూడా కేవలం 145- 146 పరుగులకే పరిమితం కావడంతో బౌలర్ల పని మరింత కష్టంగా మారింది. మా వల్ల వాళ్లు పెద్ద సవాలునే ఎదుర్కోవాల్సి వచ్చింది’’ అంటూ వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ విచారం వ్యక్తం చేశాడు. తమపై విజయం సాధించి టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12కు అర్హత సాధించిన ఐర్లాండ్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. గ్రూప్-బిలో భాగమైన వెస్టిండీస్ సూపర్-12కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా భారీ మూల్యమే చెల్లించింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది ఈ మాజీ చాంపియన్. మాకిది గుణపాఠం ఈ నేపథ్యంలో విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ ఐర్లాండ్‌తో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తమ ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమేనన్నాడు. ఐర్లాండ్ అద్బుతంగా బ్యాటింగ్ చేసిందని, బౌలర్లు కూడా రాణించారని ప్రత్యర్థి జట్టును అభినందించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైనా జేసన్ హోల్డర్ బాగానే బౌలింగ్ చేశాడని.. బ్రాండన్ బ్యాటింగ్‌లో అదరగొట్టడం సానుకూల అంశాలని పేర్కొన్నాడు. ఐర్లాండ్ చేతిలో ఓటమి తమకో గుణపాఠమన్న పూరన్.. అభిమానులను తీవ్రంగా నిరాశపరిచామని విచారం వ్యక్తం చేశాడు. ఫ్యాన్స్‌ను వేదనకు గురిచేశామని.. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా తన ప్రదర్శన పట్ల చింతిస్తున్నట్లు పూరన్ తెలిపాడు. ఈ సందర్భంగా అతడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. రెండుసార్లు చాంపియన్ అయిన తమ జట్టు ఇలా నిష్క్రమించడాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలం కాగా నెదర్లాండ్స్ పర్యటన నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నికోలస్ పూరన్ అటు బ్యాటర్‌గా.. ఇటు సారథిగా ఆకట్టుకోలేక పోతున్నాడు. నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసినా.. బ్యాటర్‌గా మాత్రం పూరన్ దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్ చేతిలో పలు సిరీస్‌లలోనూ ఇదే తరహాలో పరాభవం మూటగట్టుకున్నాడు. వెస్టిండీస్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ స్కోర్లు: ►టాస్: వెస్టిండీస్- బ్యాటింగ్ ►వెస్టిండీస్ స్కోరు- 146/5 (20) ►ఐర్లాండ్ స్కోరు- 150/1 (17.3) ►ఫలితం: 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్ విజయం ►ఈ మ్యాచ్‌లో నికోలస్ పూరన్ స్కోరు: 11 బంతుల్లో ఒక సిక్సర్ సాయంతో 13 పరుగులు ►విండీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్ బ్రాండన్ కింగ్: 48 బంతుల్లో 62 పరుగులు నాటౌట్ ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: గరెత్ డిలానీ(ఐర్లాండ్- 4 ఓవర్లలో 16 పరుగులు మూడు వికెట్లు) చదవండి: T20 World Cup 2022: 'రిజ్వాన్, కోహ్లి, సూర్య కాదు.. అతడే ప్రపంచకప్ టాప్ రన్ స్కోరర్' T20 WC 2022: పాకిస్తాన్‌కు ఊహించని షాక్.. కీలక బ్యాటర్ తలకు గాయం.. ఆస్పత్రికి తరలింపు View this post on Instagram A post shared by ICC (@icc) -
Ind Vs WI: వాళ్ల వల్లే ఇదంతా! మరీ చెత్తగా! ఇకపై: విండీస్ కెప్టెన్
West Indies vs India, 2nd T20I: వన్డే సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా చేతిలో క్లీన్‌స్వీప్ అయిన వెస్టిండీస్.. మొదటి టీ20 మ్యాచ్‌లో పరాజయంతో మరింత కుంగిపోయింది. వన్డే మ్యాచ్‌లలో గట్టి పోటీనిచ్చినా తమకు కలిసి వచ్చిన టీ20 ఫార్మాట్లో మాత్రం తేలిపోయింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో విండీస్ బౌలర్లు తేలిపోయారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆఖరి నాలుగు ఓవర్లలో ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నారు. జేసన్ హోల్డర్ పందొమ్మిదో ఓవర్లో 21 పరుగులు ఇస్తే.. ఆఖరి ఓవర్లో ఒబెడ్ మెకాయ్ 15 పరుగులు ఇచ్చాడు. అతడి బౌలింగ్‌లో టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ వరుసగా 1,0,6,4,0,4 బాదాడు. ఈ నేపథ్యంలో రోహిత్ సేన 190 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఇక భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 122 పరుగులకే ఆతిథ్య జట్టు కథ ముగిసింది. ఫలితంగా 68 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. వాళ్లు పూర్తిగా నిరాశపరుస్తున్నారు! ఈ నేపథ్యంలో సోమవారం నాటి(ఆగష్టు 1) రెండో టీ20 ఆరంభానికి ముందు వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘గత కొంతకాలంగా మా తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎప్పటికప్పుడు మళ్లీ పాత కథే పునరావృతమవుతోంది. ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరుస్తున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మా ప్రదర్శన బాగుండటం లేదు. ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చాడు. లోపాలు సరిచేసుకుని ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది మేలో నికోలస్ పూరన్.. కీరన్ పొలార్డ్ నుంచి వెస్టిండీస్ పరిమితో ఓవర్ల జట్టు పగ్గాలు అందుకున్నాడు. నెదర్లాండ్స్ పర్యటనలో 3-0తో వన్డే సిరీస్ గెలిచాడు. అయితే, పాకిస్తాన్ టూర్లో ఘోర పరాభవం ఎదురైంది. వన్డే సిరీస్‌లో పాక్ చేతిలో పూరన్ బృందం 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఇక స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ గెలిచినా.. వన్డే సిరీస్‌లో బంగ్లా చేతిలో.. ఆ తర్వాత టీమిండియా చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. మొదటి రెండు వన్డేల్లో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 3 పరుగులు, 2 వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. చదవండి: IND VS WI: రెండో టీ20కి ముందు రోహిత్‌ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు -
భారత్‌తో టీ20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన... బంగ్లాను ఓడించిన అదే టీమ్‌తో!
India Vs West Indies 2022 T20 Series: టీమిండియా, న్యూజిలాండ్ జట్లతో వరుస టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్ సిద్ధమైంది. ఈ క్రమంలో భారత్, కివీస్‌లతో పొట్టి ఫార్మాట్ సిరీస్‌లకు 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ మేరకు క్రికెట్ వెస్టిండీస్.. జట్టు వివరాలకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. పరిమిత ఓవర్ల కెప్టెన్ నికోలస్ పూరన్ జట్టును ముందుండి నడిపించనుండగా.. రోవ్‌మన్ పావెల్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. కాగా పూరన్ బృందం ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, టీమిండియాతో వన్డే సిరీస్‌లో ఘోర పరాభవం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అదే జట్టుతో! అయితే, బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో మాత్రం విండీస్ అదరగొట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. హెట్మెయిర్, హోల్డర్ మినహా బంగ్లాతో తలపడిన అదే జట్టుతో టీమిండియాతో పొట్టి ఫార్మాట్ సిరీస్‌కు సిద్ధమైంది. సొంతగడ్డ మీద వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌తో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. We take all the vibes to the Brian Lara Cricket Stadium for the 1st T20I tomorrow!🇹🇹 Get your tickets⬇️ https://t.co/J6lTYXHYtX pic.twitter.com/JMTGyqzgfl — Windies Cricket (@windiescricket) July 28, 2022 కాగా విండీస్ రోహిత్ సేనతో శుక్రవారం(జూలై 29) తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధం కానుంది. ఆగష్టు 10 నుంచి 14 వరకు కివీస్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక నికోలస్ పూరన్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విండీస్ బిజీబిజీగా గడుపుతోంది. బిజీబిజీగా వెస్టిండీస్! నెదర్లాండ్స్ పర్యటనతో సారథిగా అతడి ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత పాకిస్తాన్‌కు టూర్‌కు వెళ్లిన వెస్టిండీస్.. తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడింది. ఆ తర్వాత టీమిండియాతో వన్డే సిరీస్ ముగించుకుని.. టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. అనంతరం న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. టీమిండియా, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో తలపడబోయే వెస్టిండీస్ జట్టు ఇదే: నికోలస్ పూరన్(కెప్టెన్), రోవ్‌మన్ పావెల్(వైస్ కెప్టెన్), బ్రూక్స్, డొమినిక్ డ్రేక్స్, షిమ్రన్ హెట్మెయిర్, జేసన్ హోల్డర్, అకీల్ హొసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైలీ మేయర్స్, ఒబెడ్ మెకాయ్, కీమో పాల్, రొమారియో షెఫర్డ్, ఒడియన్ స్మిత్, డెవాన్ థామస్, హైడెన్ వాల్ష్ జూనియర్. టీమిండియాతో విండీస్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూల్ ►మొదటి టీ20- జూలై 29- బ్రియన్ లారా స్టేడియం, టరౌబా, ట్రినిడాడ్ ►రెండో టీ20- ఆగష్టు 1- వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ ►మూడో టీ20- ఆగష్టు 2-వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ ►నాలుగో టీ20- ఆగష్టు 6- సెంట్రల్ బ్రొవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, ఫ్లోరిడా ►ఐదో టీ20- ఆగష్టు 7- సెంట్రల్ బ్రొవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, ఫ్లోరిడా ►మ్యాచ్ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూల్(West Indies Vs New Zealand T20 Series) ►మొదటి టీ20- ఆగష్టు 10- సబీనా పార్క్, జమైకా ►రెండో టీ20- ఆగష్టు 12- సబీనా పార్క్, జమైకా ►మూడో టీ20- ఆగష్టు 14- సబీనా పార్క్, జమైకా చదవండి: Gustav McKeon T20I Records: 18 ఏళ్ల వయసులో అదిరిపోయే రికార్డులు.. ఎవరీ క్రికెటర్? Shubman Gill: అప్పుడేమో ద్విశతకం! 91, 96, 98 నాటౌట్.. పాపం సెంచరీ గండం గట్టెక్కలేడా?! -
టీమిండియాతో వన్డే సిరీస్.. వెస్టిండీస్‌కు బిగ్ షాక్..!
టీమిండియాతో తొలి వన్డే ఓటమి నుంచి కోలుకోకముందే విండీస్‌కు మరో భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. కరోనా బారిన పడ్డ ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేకు ముందు హోల్డర్ కరోనా బారిన పడ్డాడు. దీంతో తొలి వన్డేకు హోల్డర్ దూరమయ్యాడు. ఇక ఇదే విషయాన్ని టాస్ సమయంలో విండీస్ కెప్టెన్ పూరన్ కూడా దృవీకరించాడు. "దురదృష్టవశాత్తు హోల్డర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. కాబట్టి మొదటి వన్డేకు దూరమయ్యాడు. అతడు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు" అని పూరన్ పేర్కొన్నాడు. అయితే అతడు మరో ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడు వన్డే సిరీస్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్, టెస్టు సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న హోల్డర్ తిరిగి భారత్‌తో సిరీస్‌కు జట్టులోకి వచ్చాడు. ఇక తొలి వన్డేలో అఖరి వరకు పోరాడిన విండీస్ మూడే పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆదివారం(జూలై24) జరగనుంది. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ తొలి వన్డే: ►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ►టాస్: విండీస్- బౌలింగ్ ►భారత్ స్కోరు: 308/7 (50 ఓవర్లు) ►వెస్టిండీస్ స్కోరు: 305/6 (50 ఓవర్లు) ►విజేత: భారత్.. 3 పరుగుల తేడాతో గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శిఖర్ ధావన్ (97 పరుగులు) ►అర్ధ శతకాలతో రాణించిన గిల్(64), శ్రేయస్ అయ్యర్(54) చదవండి: Shikhar Dhawan- Nicholas Pooran: సెంచరీ చేజారినందుకు బాధగా ఉంది! అసలైన గెలుపు మాదే! -
భారత్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన వెస్టిండీస్.. స్టార్ ఆల్‌రౌండర్ వచ్చేశాడు!
స్వదేశంలో టీమిండియాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు 13 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ ప్రకటించింది. ఇక గత కొన్ని నెలలగా జట్టుకు దూరంగా ఉన్న వెటరన్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా విండీస్ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. జూలై 22 న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. భారత్‌తో వన్డేలకు వెస్టిండీస్ జట్టు: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, రోవ్‌మన్ పావెల్, జేడెన్ సీల్స్ చదవండి: Virat Kohli: మారని ఆటతీరు.. వన్డే కెరీర్లో అత్యంత చెత్త రికార్డు -
IPL 2022: మొన్నటి దాకా బెంచ్‌కే పరిమితం.. ఇప్పుడేమో!
IPL 2022 LSG Vs DC: కృష్ణప్ప గౌతమ్.. ఐపీఎల్-2021 మినీ వేలంలో భాగంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన భారత అన్క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా రికార్డు ధర 9.25 కోట్లకు అతడిని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, మెగా వేలం-2022లో మాత్రం అతడికి నామమాత్రపు ధర దక్కింది. కోల్‌కతా, ఢిల్లీ ఫ్రాంఛైజీలు ఈ కర్ణాటక బౌలింగ్ ఆల్‌రౌండర్‌పై ఆసక్తి చూపగా... కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్ 90 లక్షలు ఖర్చు చేసి అతడిని కొనుగోలు చేసింది. కానీ.. లక్నో జట్టు ఆడిన తొలి మూడు మ్యాచ్‌లలో గౌతమ్‌కు ఆడే అవకాశం రాలేదు. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఈ టీమిండియా ఆటగాడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు మనీశ్ పాండే స్థానంలో గౌతమ్ జట్టులోకి వచ్చాడు. లక్నోకు కొరకరాని కొయ్యగా మారి బౌండరీలతో విరుచుకుపడ్డ ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా(34 బంతుల్లో 61 పరుగులు- 9 ఫోర్లు, రెండు సిక్సర్లు)ను పెవిలియన్‌కు పంపి బ్రేక్ ఇచ్చాడు. మొత్తంగా 4 ఓవర్ల కోటా పూర్తి చేసుకున్న గౌతమ్ 23 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. జట్టుకు అవసరమైన సమయంలో కీలక వికెట్ కూల్చి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గౌతమ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం లక్నో ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ మాట్లాడుతూ.. గౌతమ్ జట్టులోకి రావడం తమకు మేలు చేసిందని వ్యాఖ్యానించాడు. అతడు బంతితోనూ, బ్యాట్‌తోనూ రాణించగలడని కొనియాడాడు. ఆ 4 ఓవర్లు కీలకం.. స్పోర్ట్స్ కీడా మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘తనలో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల నైపుణ్యం దాగుంది. ఈ మ్యాచ్‌లో తను వేసిన నాలుగు ఓవర్లు మాకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చాయి. ముఖ్యంగా కీలకమైన వికెట్ తీసి, భారీ భాగస్వామ్యాన్ని అతడు బ్రేక్ చేయడం కలిసి వచ్చింది. టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎలా మొదలుపెట్టామన్నది ముఖ్యం కాదు.. ఎలా ముగించామన్నదే పరిగణనలోకి వస్తుంది. ఎవరి బౌలింగ్‌ను ఎవరు ఎప్పుడు చీల్చిచెండాడుతారో తెలియదు. కాబట్టి సంయమనంగా ఉంటూ ఛాన్స్ వచ్చినపుడు వికెట్ పడగొట్టడమే తెలివైన పని. నిజానికి నేను మొదటి ఓవర్ వేసిన తర్వాత బంతి ఎక్కువగా స్వింగ్ కావడం లేదని మా వాళ్లకు చెప్పాను. పవర్ ప్లేలో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయాలని భావించాము. మాకు మంచి స్పిన్నర్లు ఉన్నారు. రవి బిష్ణోయి అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. గౌతమ్ మొదటి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. మా ప్రణాళికలను మైదానంలో చక్కగా అమలు చేశాం. ఇది సమిష్టి విజయం’’ అని చెప్పుకొచ్చాడు. లక్నో సూపర్‌జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ స్కోర్లు: ఢిల్లీ- 149/3 (20) లక్నో- 155/4 (19.4) ఆరు వికెట్ల తేడాతో లక్నో విజయం చదవండి: IPL 2022: పంత్ చేసిన అతిపెద్ద తప్పిదం అదే.. అసలు ఇలా ఎందుకు చేశాడో? Young Badoni finishes things off in style.@LucknowIPL win by 6 wickets and register their third win on the trot in #TATAIPL. Scorecard - https://t.co/RH4VDWYbeX #LSGvDC #TATAIPL pic.twitter.com/ZzgYMSxlsw — IndianPremierLeague (@IPL) April 7, 2022 -
అదరగొట్టిన జడేజా.. టెస్టుల్లో మరోసారి నెంబర్‌వన్‌గా
ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి నెంబర్‌వన్‌గా నిలిచాడు. 385 పాయింట్లతో జడ్డూ తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్(357 పాయింట్లు) ఉన్నాడు. ఇటీవలే శ్రీలంకతో సిరీస్‌లో విశేషంగా రాణించిన జడేజా మార్చి 9న విడుదల చేసిన ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్స్ విభాగంలో నెంబర్‌వన్‌గా నిలిచాడు. దాదాపు వారం పాటు నెంబర్‌వన్‌గా ఉన్న జడేజా విండీస్ ఆల్‌రౌండర్ హోల్డర్‌కు మరోసారి కోల్పోయాడు. తాజాగా మరోసారి నెంబర్‌వన్‌గా నిలిచిన జడేజా, హోల్డర్‌కు మధ్య దాదాపు 28 పాయింట్ల వ్యత్యాసం ఉండడం విశేషం. మరో రెండు నెలల పాటు ఎలాంటి టెస్టు సిరీస్‌లు లేకపోవడంతో జడేజా కొన్నాళ్ల పాటు అగ్రస్థానంలో ఉండే అవకాశం ఉంది. ఇక మూడో స్థానంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(341 పాయింట్లు) ఉన్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అదరగొట్టాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో విశేషంగా రాణిస్తున్న బాబర్ మూడు స్థానాలు ఎగబాకి 799 పాయింట్లతో టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. మరో పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఆరు స్థానాలు ఎగబాకి వార్నర్‌తో కలిసి సంయుక్తంగా 11వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కరాచీ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 160.. రెండో ఇన్నింగ్స్‌లో 44 నాటౌట్‌తో ఆకట్టుకున్నాడు. ఇక ర్యాంకింగ్స్‌లో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. తొలి నాలుగు స్థానాల్లో ఉన్న లబుషేన్, రూట్, స్మిత్, విలియమ్సన్ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారి 754 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా.. కోహ్లి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల విభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 885 పాయింట్లతో తొలి స్థానాన్ని నిలుపుకోగా.. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ 850 పాయింట్లతో రెండో స్థానం.. బుమ్రా 830 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. చదవండి: Babar Azam: నిబంధనను పాతరేసిన పాక్ కెప్టెన్.. యాక్షన్ తీసుకోవాల్సిందే! క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. 🔹 Babar Azam enters top five of batting list 🔹 Pat Cummins makes gains in all-rounders’ chart Both Pakistan and Australia skippers move up in the weekly update of the @MRFWorldwide ICC Men’s Test Player Rankings 📈 Details ➡ https://t.co/nLJOeoGJVr pic.twitter.com/WYBZhDyN3A — ICC (@ICC) March 23, 2022 -
WI Vs Eng: రెండో టెస్టుకూ అదే జట్టు.. వీరసామికి మరో అవకాశం!
England Tour Of West Indies 2022- నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): చివరి రోజు వరకు ఆసక్తికరంగా సాగిన ఇంగ్లండ్, వెస్టిండీస్ తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసిన విషయం తెలిసిందే. 71 ఓవర్లలో 286 పరుగుల ఊరించే విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మ్యాచ్ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 147 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎన్క్రుమా బానర్ (38 నాటౌట్), జేసన్ హోల్డర్ (37 నాటౌట్), బ్రాత్‌వైట్ (33) రాణించారు. ఆతిథ్య జట్టు ఆరంభంలో దూకుడుగా ఆడి గెలుపు కోసం ప్రయత్నించింది. అయితే 8 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోవడంతో వెనక్కి తగ్గిన వెస్టిండీస్ ‘డ్రా’పై దృష్టి పెట్టింది. నాలుగో వికెట్ పడిన తర్వాత బానర్, హోల్డర్ ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా మరో 35.4 ఓవర్లు పట్టుదలగా నిలబడ్డారు. బానర్ 138 బంతులు ఆడగా, హోల్డర్ 101 బంతులు ఎదుర్కొన్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అభేద్యంగా 80 పరుగులు జోడించారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు బుధవారం(మార్చి 16) నుంచి బ్రిడ్జ్‌టౌన్‌లో జరుగనుంది. ఇక ఈ మ్యాచ్ పాత జట్టుతోనే బరిలోకి దిగుతామని విండీస్ సెలక్టర్ డెస్మండ్ హేన్స్ స్పష్టం చేశాడు. మొదటి టెస్టు జట్టులో భాగమైన 13 మంది ఆటగాళ్లను కొనసాగిస్తామని తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన బానర్‌పై హేన్స్ ప్రశంసలు కురిపించాడు. అతడి ఆట తీరు పూర్తి సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 355 బంతుల్లో 123 పరుగులు సాధించిన బానర్.. రెండో ఇన్నింగ్స్‌లో 38 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు వెస్టిండీస్ జట్టు: క్రెయిగ్ బ్రాత్‌వైట్(కెప్టెన్), బ్లాక్‌వుడ్(వైస్ కెప్టెన్), ఎన్క్రుమా బానర్, బ్రూక్స్, జాన్ కాంప్‌బెల్, జాషువా డి సిల్వా, జేసన్ హోల్డర్, అల్జారి జోసెఫ్, కైలీ మేయర్స్, వీరసామి పెరుమాల్, ఆండర్సన్ ఫిలిప్, కేమార్ రోచ్, జేడెన్ సీల్స్. కాగా భారత సంతతికి చెందిన వీరసామికి ఈ జట్టులో చోటు దక్కడం గమనార్హం. తొలి టెస్టు తుదిజట్టులో భాగమైన ఈ లెష్టార్మ్ స్పిన్నర్ 87 బంతులు ఎదుర్కొని 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. చదవండి: IND VS SL 2nd Test Day 2: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు This kind of resilience is priceless! Nkrumah Bonner takes our #MastercardPricelessMoment of the 1st Test. #WIvENG pic.twitter.com/nM5Di0iCtq — Windies Cricket (@windiescricket) March 12, 2022 Draw! A patient day of Test cricket comes to an end.👏🏿 #WIvENG #MenInMaroon pic.twitter.com/1LsYMQn2YW — Windies Cricket (@windiescricket) March 12, 2022 -
షారుఖ్ అంటే పిచ్చి.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన విండీస్ స్టార్ ఆల్‌రౌండర్
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనకు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ అంటే పిచ్చి అని, కింగ్ ఖాన్‌కు తాను వీరాభిమానినని, చాలామంది విండీస్ క్రికెటర్లలాగే తనకు కూడా భారత్ అంటే వల్లమాలిన అభిమానమని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ ద్వారా చాలామంది విండీస్ ఆటగాళ్లు భారత సంస్కృతి, సంప్రదాయాల పట్ల మక్కువ పెంచుకున్నారని, వారిలో తాను కూడా ఒకడినని తెలిపాడు. Who is @Jaseholder98’s favourite Bollywood actor and why does he love 𝑏ℎ𝑖𝑛𝑑𝑖? 😱 Find out about his love for 🇮🇳 in this segment only on #FanCode 👉 https://t.co/NhBMDBKJgN@windiescricket @LucknowIPL pic.twitter.com/wPj33CIAIh — FanCode (@FanCode) March 10, 2022 టీమిండియా స్టార్ క్రికెటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా తమ దేశ ఆటగాళ్లను కూడా భారతీయులు అమితంగా అభిమానిస్తారని.. క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో, పొలార్డ్ లాంటి విండీస్ ఆటగాళ్ల విషయంలో ఇది రుజువైందని పేర్కొన్నాడు. ఫ్యాన్ కోడ్ అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో హోల్డర్ భారత్‌తో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటూ, తన అభిరుచులు, ఇష్టమైన భారతీయ వంటకాలపై కూడా మాట్లాడాడు. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన భారతీయ వంటం బెండకాయ ఫ్రై (భిండి ఫ్రై) అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో జేసన్ హోల్డర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రూ.8.75 కోట్ల భారీ మొత్తానికి ఎల్ఎస్జీ హోల్డర్‌ను కొనుగోలు చేసింది. హోల్డర్ గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల తరఫున ఆడాడు. మార్చి 28న వాంఖడే వేదికగా ఎల్ఎస్జీ, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాయి. చదవండి: ఆర్సీబీ కెప్టెన్‌గా జాసన్ హోల్డర్.. రాయుడుతో పాటు.. రూ. 27 కోట్లతో భారీ స్కెచ్..! -
ఆర్సీబీ కెప్టెన్‌గా జాసన్ హోల్డర్.. రాయుడుతో పాటు.. రూ. 27 కోట్లతో భారీ స్కెచ్..!
ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం అసన్నమైంది. ఇప్పటికే 8 జట్లు తమ రీటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అదే విధంగా ఐపీఎల్లో కొత్తగా వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్,అహ్మదాబాద్ టైటన్స్ కూడా వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. ఈ మెగా వేలాన్ని ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా బీసీసీఐ నిర్వహించనుంది. ఇక రాయల్ ఛాలెంజర్ప్ బెంగళూరు విషయానికి వస్తే.. ఆ జట్టు వేలానికి ముందు విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను రీటైన్ చేసుకుంది. కాగా గత ఏడాది సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న మెగా వేలంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌ను దక్కించుకోవడం కోసం ఆర్సీబీ భారీ మొత్తాన్ని ఫిక్స్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా అతడితో పాటు అంబటి రాయుడు, రియాన్ పరాగ్‌లపై ఆర్సీబీ కన్నేసినట్లు తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్ప్ బెంగళూరు ఇంకా తమ పర్స్‌లో ఇంకా అత్యధికంగా 57 కోట్లను కలిగి ఉన్నారు. అయితే దీంట్లో హోల్డర్‌కి 12 కోట్లు, అంబటి రాయుడుకి 8 కోట్లు, రియాన్ పరాగ్కి 7 కోట్లు ఆర్సీబీ కెటాయించనట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ ఆటగాళ్లపై దాదాపు రూ.27 కోట్లు ఖర్చు చేస్తే.. ఆర్సీబీ పర్సులో ఇంకా రూ.28 కోట్లు మిగలనున్నాయి ఇక వేలంలో జాసన్ హోల్డర్‌ను సొంతం చేసుకుని కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని ఆర్సీబీ భావిస్తోన్నట్లు సమాచారం. చదవండి: Hardik Pandya: కీలక టోర్నీ నుంచి తప్పుకున్న హార్దిక్ పాండ్యా.. కారణం అదేనా? -
"టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం"
స్వదేశంలో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి టీమిండియా పర్యటనకు వెస్టిండీస్ బయలు దేరింది. కీరన్ పొలార్డ్ నేతృత్వంలోని విండీస్ జట్టు మంగళవారం రాత్రి భారత్‌కు చేరుకోనుంది. అనంతరం అహ్మదాబాద్‌లో 3 రోజుల పాటు క్వారంటైన్లో విండీస్ జట్టు గడపనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. స్వదేశంలో టీమిండియాను ఓడించిడం అంత సులువు కాదని, అయితే ప్రస్తుత కరీబియన్ జట్టుకు భారత్‌ను ఓడించే సత్తా ఉందని హోల్డర్ తెలిపాడు. "టీమిండియాతో సిరీస్ అతి పెద్ద సిరీస్‌గా భావిస్తున్నాను. ప్రపంచంలోనే భారత్ అత్యుత్తమ ఆల్‌రౌండ్ క్రికెట్ జట్టు. వాళ్ల గడ్డపై వారిని ఓడించడం అంత సులభం కాదు. గత రెండేళ్లుగా టీమిండియా స్వదేశంలో అధ్బుతంగా రాణిస్తుంది. కానీ ప్రస్తుత వెస్టిండీస్ జట్టుకు భారత్‌ను ఓడించే సత్తా ఉంది. గత ఏడాది స్వదేశంలో ఐర్లాండ్ చేతిలో ఓటమి తర్వాత మా జట్టు నిరాశకు గురైంది. ఇంగ్లండ్‌పై మా జట్టు బౌన్స్‌బ్యాక్ చేసి అద్భుతమైన విజయం సాధించింది. అదే విధంగా మా డ్రెసింగ్ రూమ్‌లో కూడా ఏటువంటి విభేదాలు లేవు" అని హోల్డర్ పేర్కొన్నాడు. ఇక భారత పర్యటనలో భాగంగా విండీస్ జట్టు మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. ఇక ఆహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6న తొలి వన్డే జరగనుంది. చదవండి: Rashid Khan: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన రషీద్ ఖాన్.. అదరగొట్టేశాడుగా! -
4 బంతుల్లో నాలుగు వికెట్లు.. సంచలనం సృష్టించిన జాసన్ హోల్డర్
Wi Vs Eng T20 Series: వెస్టిండీస్ కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్( 5వ టీ20)లో వెస్టిండీస్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 టీ20ల సిరీస్‌ను 3-2తో విండీస్ కైవసం చేసుకుంది. కాగా అఖరి ఓవర్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి జాసన్ హోల్డర్ విండీస్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక 180 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 162 పరుగులకే ఆలౌటైంది. వెస్టిండీస్ బౌలర్లు హోల్డర్(5), అకేల్ హోసేన్(4) వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జేమ్స్ విన్స్(55), బిల్లింగ్స్(41) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో కెప్టెన్ పొలార్డ్(41), రోవ్‌మన్ పావెల్(35), బ్రాండన్ కింగ్(34) పరుగులతో రాణించారు. కాగా ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డులు హోల్డర్‌కి దక్కాయి. చదవండి: జట్టు సీఈవోతో గొడవ.. ఏకంగా కెప్టెన్సీ నుంచే తీసేసారు! The 1st West Indian to take a T20I hat-trick! Jason Holder's performance takes our #MastercardPricelessMoment. #WIvENG pic.twitter.com/VwTp1qcYlV — Windies Cricket (@windiescricket) January 31, 2022 -
IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా విండీస్ ఆల్‌రౌండర్..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే చర్చ ఐపీఎల్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. కోహ్లి గతేడాది ఐపీఎల్ తర్వాత ఆర్సీబీ సారధ్య బాధ్యతల నుంచి వైదొలగడంతో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. కొందరు మ్యాక్స్‌వెల్ పేరును, మరికొందరు డేవిడ్ వార్నర్, మనీశ్ పాండేలను ప్రతిపాదించగా.. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్, మాజీ సన్‌రైజర్స్ ఆటగాడు జేసన్ హోల్డర్ ఆర్సీబీ కెప్టెన్ అయితే బాగుంటుందని సూచించాడు. హోల్డర్ ప్రతిపాదనను సమర్ధిస్తూ తన య్యూట్యూబ్ ఛానల్ వేదికగా అందుకు గల కారణాలను విశ్లేషించాడు. ఆర్సీబీ తమ డ్రాఫ్టెడ్ ఆటగాళ్లుగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, యువ బౌలర్ మహ్మద్ సిరాజ్‌లను అట్టిపెట్టుకున్నప్పటికీ వీరిలో ఎవరికి కూడా కెప్టెన్సీ అప్పగించే అవకాశం లేదంటూ పలు కారణాలను ఎత్తి చూపాడు. కోహ్లి సారధ్య బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు కాబట్టి అతను మళ్లీ ఆ బాధ్యతలను చేపట్టే అవకాశం లేదని, కెప్టెన్‌గా మ్యాక్స్‌వెల్‌కు సక్సెస్ రేట్ లేకపోవడంతో ఆర్సీబీ అతనివైపు మొగ్గు చూపే ఛాన్స్ లేదని, జట్టులో సీనియర్లను పెట్టుకుని సిరాజ్‌కు కెప్టెన్సీ ఇచ్చి ప్రయోగం చేసే ఆస్కారం లేదని వివరించాడు. ఈ క్రమంలో జేసన్ హోల్డర్ తన ఛాయిస్ ఎందుకని విశ్లేషిస్తూ.. అతనో మంచి ఆల్‌రౌండర్ అని, అతని కెప్టెన్సీలో విండీస్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడని, అనుభవంతో పాటు పొట్టి క్రికెట్‌కు కావల్సిన మెళకువలన్నీ అతని దగ్గరున్నాయని, పొట్టి క్రికెట్లో దిగ్గజ క్రికెటర్లందరినీ(గేల్, బ్రావో, పోలార్డ్, రసెల్) ఒకే తాటిపై నడిపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. హోల్డర్ అయితే ఆర్సీబీ లాంటి జట్టును సమర్ధవంతంగా నడిపించగలడన్న దానికి ఇన్ని కారణాలు ఉన్నాయని, అందుకే ఆర్సీబీ అతన్ని వేలంలో ఎలాగైనా సొంతం చేసుకుని సారధ్య బాధ్యతలు అప్పజెప్పాలని సూచించాడు. కోహ్లి, మ్యాక్స్‌వెల్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్న జట్టుకు శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధవన్, ఇషాన్ కిషన్‌లలో ఒకరిని కెప్టెన్‌గా ఎంపిక చేసే సాహసం ఆర్సీబీ యాజమాన్యం చేయకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా, హోల్డర్.. ఇప్పటివరకు 26 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 121 స్ట్రయిక్ రేట్‌తో 189 పరుగులు, 8.20 ఎకానమీతో 35 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. 8 మంది మృతి -
హోల్డర్ దెబ్బకు ఇంగ్లండ్ విలవిల.. విండీస్ ఘన విజయం
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్, కింగ్ కీలక పాత్ర పోషించారు. 104 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఒకే ఒక వికెట్ కోల్పోయి చేధించింది. విండీస్ బ్యాటర్లలో కింగ్(52), షాయ్ హోప్(20) పరుగులతో రాణించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 103 పరులకే కుప్పకూలింది. ఆరంభం నుంచే విండీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ విలవిలాడింది. కేవలం 41 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివర్లో రషీద్(22),జోర్డాన్(28) పరుగులతో రాణించడంతో ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోరైనా సాధించ గల్గింది. కాగా హోల్డర్ నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోర్డాన్(28), రషీద్(22) టాప్ స్కోరర్లగా నిలిచారు. కాగా యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురు దెబ్బ తగిలినట్లైంది. -
అతని కోసం ఆర్సీబీ పోటీ పడుతుంది.. కెప్టెన్‌గా అతనే సరైనోడు..
RCB will break the bank for Rahul Chahar in mega auction: ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు 8 ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రీటైన్ జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే.. విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌ను రీటైన్ చేసుకుంది. కాగా రానున్న మెగా వేలంలో ఆర్సీబీ.. లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తుందని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తమ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను అంటిపెట్టుకోనందున అతడి స్దానంలో చహర్‌ను భర్తీ చేయాలని భావిస్తున్నట్టు చోప్రా తెలిపాడు. “ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఆర్సీబీ కోనుగోలు చేయదు. మరో లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను సొంతం చేసుకోవడానికి ఆర్సీబీ సిద్దంగా ఉంది. ఎందుకంటే వాళ్ల హోం గ్రౌండ్లో లెగ్ స్పిన్నర్లకు తప్ప మిగితా స్పిన్నర్లుకు అంతగా రికార్డులు లేవు. అయితే రవి బిష్ణోయ్ కూడా ఓ అవకాశంగా వాళ్లకి ఉండవచ్చు, కానీ నేను మాత్రం రాహుల్ చాహర్‌ని తీసుకుంటారని అని భావిస్తున్నాను" అని చోప్రా పేర్కొన్నాడు. ఇక కాబోయే ఆర్సీబీ కెప్టెన్ గురించి మాట్లాడూతూ... "విండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌కు ఆర్సీబీ కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. ఆర్సీబీ రానున్న మెగా వేలంలో హోల్డర్ కొనుగోలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే అతడికి వెస్టిండీస్ జట్టుతో పాటు కరీబీయన్ లీగ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. అంతే కాకుండా అతడు తను ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని జట్లులో బాగా రాణిస్తున్నాడు" అని తన యూట్యూబ్ ఛానెల్లో చోప్రా తెలిపాడు. చదవండి: IPL 2021 Auction: ‘వేలంలో అతడి కోసం చాలా జట్లు పోటీ పడతాయి’ -
West Indies: ఒబెడ్ మెకాయ్ అవుట్... జట్టులోకి అతడు!
T20 World Cup 2021- Jason Holder as a replacement for Obed McCoy: వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. కాలి గాయం కారణంగా బౌలర్ ఒబెడ్ మెకాయ్ టోర్నీకి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని ఐసీసీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న హోల్డర్‌ను ప్రధాన జట్టులోకి అనుమతిస్తూ టెక్నికల్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు.. ‘‘కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో వివిధ జట్లు ఎక్స్ట్రా ప్లేయర్లతో ప్రయాణాలు చేస్తున్నాయి. ఇప్పటికే క్వారంటైన్లో ఉన్న రిజర్వు ప్లేయర్ హోల్డర్‌ను ప్రధాన జట్టులోకి అనుమతిస్తున్నాం’’ అని వెల్లడించింది. 27 టీ20లు ఆడిన అనుభవం విండీస్ మాజీ కెప్టెన్ జేసన్ హోల్డర్ తన కెరీర్లో ఇప్పటి వరకు 27 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో భాగంగా 201 పరుగులు చేయడంతో పాటుగా... 22 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వెస్టిండీస్ తరఫున 51 టెస్టులు, 121 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. టెస్టు క్రికెట్లో 137, వన్డే క్రికెట్లో 140 వికెట్లు తన పేరిట లిఖించుకున్నాడు. వరుస పరాజయాలతో విలవిల టీ20 వరల్డ్‌కప్-2021లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగిన వెస్టిండీస్‌కు ఘోర పరాజయాలు ఎదురవుతున్నాయి. సూపర్-12 రౌండ్లో భాగంగా తొలుత ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడి.. చెత్త రికార్డు మూటగట్టుకున్న పొలార్డ్ బృందం... దక్షిణాఫ్రికా చేతిలోనూ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడి.. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అక్టోబరు 29న బంగ్లాదేశ్‌తో వెస్టిండీస్ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. చదవండి: NAM VS SCO: టి20 ప్రపంచకప్ చరిత్రలో క్రేజీ ఓవర్ అంటున్న ఫ్యాన్స్! T20 World Cup: బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. అతడు టోర్నీ నుంచి అవుట్! -
Jason Holder: ఉమ్రాన్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాడు..!
Jason Holder Comments On Umran Malik: ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్ కోవిడ్ బారిన పడటంతో జట్టులోకి వచ్చాడు ఉమ్రాన్ మాలిక్. ఇటీవల కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అరంగేట్ర మ్యాచ్ ఆడిన ఈ జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్... ఈ సీజన్లోనే అత్యంత వేగవంతంగా(సుమారు గంటకు 153 కి.మీ.) బంతిని విసిరాడు. ఐపీఎల్-2021లో ఇప్పటి వరకు భారత్ తరఫున ఫాస్టెస్ట్ డెలివరీ చేసిన బౌలర్‌గా నిలిచి.. క్రీడా పండితుల దృష్టిని ఆకర్షించాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీకర్ భరత్(12)ను అవుట్ చేయడం ద్వారా.. క్యాష్ రిచ్ లీగ్‌లో తన తొలి వికెట్ నమోదు చేశాడు. 4 ఓవర్లు వేసిన ఉమ్రాన్.. 21 పరుగులు మాత్రమే ఇచ్చి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ నయా పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఉమ్రాన్ రాకతో తమ జట్టులో పేస్ విభాగం మరింత బలపడిందని.. నెట్స్‌లో పదునైన బంతులతో తమను బాగా ఇబ్బంది పెట్టినట్లు పేర్కొన్నాడు. ‘‘ప్రాక్టీసులో మాకు సవాలుగా నిలిచాడు. వేగంగా బంతులు విసరగలడు. ఎక్స్ట్రా పేస్ అనేది ఏ బౌలర్‌కైనా అదనపు బలం. అంతేకాదు.. ఎంత వేగంగా బంతిని విసిరినా అతడు నియంత్రణ కోల్పోడు. గత కొన్నేళ్లుగా ఎంతో మంది పేసర్లు వచ్చారు. కానీ... వారిలో చాలా మంది నిలకడలేమి ఆటతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఉమ్రాన్ మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తున్నాడు. తను కచ్చితంగా మెరుగ్గా రాణించగలడు’’ అని సహచర ఆటగాడిపై హోల్డర్ ప్రశంసలు కురిపించాడు. ఇక ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 4 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక జేసన్ హోల్డర్ విషయానికొస్తే... ఈ మ్యాచ్‌లో 16 పరుగులు చేయడం సహా.. ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. స్కోర్లు: హైదరాబాద్: 141/7 (20) బెంగళూరు: 137/6 (20) చదవండి: IPL 2021: నిజంగా గుండె పగిలింది.. కనీసం చివరి మ్యాచ్ అయినా ఆడనివ్వండి! There are fast bowlers, and then there is Umran Malik 🔥#OrangeArmy #OrangeOrNothing #IPL2021 pic.twitter.com/7J0w6yhlIW — SunRisers Hyderabad (@SunRisers) October 6, 2021 Still not over that win last night? Relive it all over again with our Matchday recap! ⏮#RCBvSRH #OrangeArmy #OrangeOrNothing #IPL2021 pic.twitter.com/lfDZdhbe6C — SunRisers Hyderabad (@SunRisers) October 7, 2021 -
దెబ్బకు దెబ్బ తీసిన విండీస్; పూరన్ కెప్టెన్ ఇన్నింగ్స్
బ్రిడ్జ్‌టౌన్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో వెస్డిండీస్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కరోనా కేసు నేపథ్యంలో ఒకరోజుకు వాయిదా పడిన మ్యాచ్ శనివారం జరిగింది. ఇక తొలి వన్డేలో దారుణ పరాజయం చవిచూసిన విండీస్ రెండో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. లోస్కోరింగ్గా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా విండీస్ స్పిన్నర్లు దాటికి 47.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. 100 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్‌ను వేస్ అగర్ 41, ఆడమ్ జంపా 36 , మాధ్యూ వేడ్ 36 పరుగులతో ఆదుకున్నారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ , అకియల్ హోసెన్ చెరో 3 వికెట్లు తీయగా.. కాట్రెల్ 2 వికెట్లు తీశాడు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో క్రీజ్‌లోకి దిగిన వెస్టిండీస్ టీమ్ తడబడింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ ఒక పరుగుకే అవుట్ అయ్యాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ డారెన్ బ్రావో ఖాతా తెరవలేకపోయాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జేసన్ మహమ్మద్ 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. పించ్ హిట్టర్ కీరన్ పొల్లార్డ్ సైతం రెండు పరుగులకే అవుట్ కావడంతో సొంతగడ్డపై వెస్టిండీస్‌కు మరో పరాభవం తప్పదనిపించింది. అప్పటికే క్రీజ్‌లో ఉన్న నికొలస్ పూరన్ సమయస్ఫూర్తితో ఆడాడు. 43 బంతుల్లో ఆరు ఫోర్లతో 38 పరుగులు చేసిన హోప్ అవుటైన తరువాత మళ్లీ కష్టాల్లో పడినట్టు కనిపించినప్పటికీ.. జేసన్ హోల్డర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. 69 బంతుల్లో 52 పరుగులు చేసిన హోల్డర్ స్టార్క్‌కు ఎల్బీగా వికెట్‌ను సమర్పించుకున్నాడు. అప్పటికే లక్ష్యానికి సమీపించడం, రిక్వైర్డ్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో విండీస్ నింపాదిగా లక్ష్యాన్ని అందుకుంది. 38 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 191 పరుగులు చేసింది. నికొలస్ పూరన్ 75 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 59 పరుగులు చేసి.. నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లు మిఛెల్ స్టార్క్ 3, ఆడమ్ జంపా 2, టర్నర్ ఒక వికెట్ తీసుకున్నారు. నికొలస్ పూరన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ రెండు జట్ల మధ్య మూడో వన్డే సోమవారం జరగనుంది. -
Jason Holder: అన్ని ఫార్మాట్లలో హోల్డర్...
ఆంటిగ్వా: క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) 2021–22 సీజన్‌కు కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. గతేడాది మొత్తం 22 మంది ఆటగాళ్లకు కాంట్రాక్ట్ దక్కగా... ఈసారి మాత్రం 18 మందికే చోటు దక్కింది. కొత్త కాంట్రాక్ట్ 2021 జూలై 1 నుంచి 2022 జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. ఆల్ ఫార్మాట్ కాంట్రాక్ట్ (టెస్టు, వన్డే, టి20)ను జేసన్ హోల్డర్ మాత్రమే దక్కించుకున్నాడు. తొలిసారిగా ఎన్క్రుమా బ్యానర్, జోషువా డ సిల్వా, అకీలా హుసీన్, కైల్ మేయర్స్లకు సీడబ్ల్యూఐ చోటు కల్పించింది. ఇటీవల టెస్టు కెప్టెన్సీని చేపట్టిన క్రెయిగ్ బ్రాత్‌వైట్ (టెస్టు ఫార్మాట్లో), డారెన్ బ్రావో (వన్డే ఫార్మాట్లో)లు తిరిగి కాంట్రాక్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. అయితే వైట్‌బాల్ (వన్డే, టి20) కాంట్రాక్ట్ నుంచి హెట్‌మైర్, షెల్డన్ కాట్రెల్... ఆల్ ఫార్మాట్ కాంట్రాక్ట్ నుంచి రోస్టన్ చేజ్‌లకు ఈసారి కాంట్రాక్ట్ దక్కలేదు. కాంట్రాక్ట్ ప్లేయర్ల జాబితా ఆల్ ఫార్మాట్ కాంట్రాక్ట్ (టెస్టు, వన్డే, టి20): జేసన్ హోల్డర్. రెడ్ బాల్ కాంట్రాక్ట్ (టెస్టు): క్రెయిగ్ బ్రాత్‌వైట్, జెర్మయిన్ బ్లాక్‌వుడ్, ఎన్కుమ్రా బ్యానర్, కార్న్‌వాల్, జోషువాడ సిల్వా, షానన్ గాబ్రియెల్, కైల్ మేయర్స్, కీమర్ రోచ్. వైట్‌బాల్ కాంట్రాక్ట్ (వన్డే, టి20): కీరన్ పొలార్డ్, ఫాబియాన్ అలెన్, డారెన్ బ్రావో, షై హోప్, అకీలా హుసీన్, ఎవిన్ లూయిస్, అల్జారీ జోసెఫ్, నికోలస్ పూరన్, హెడెన్ వాల్ష్ జూనియర్. -
జేసన్ హోల్డర్ వచ్చేశాడు..
చెన్నై: ఈ ఐపీఎల్ సీజన్లో పాల్గొనడానికి వెస్టిండిస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ భారత్‌లో అడుగుపెట్టాడు. సోమవారం చెన్నైకు చేరుకున్న హోల్డర్ ఎస్ఆర్హెచ్ జట్టుతో కలిశాడు. కాగా, వారం రోజులు క్వారంటైన్ ఉండి కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఎస్ఆర్హెచ్ స్వ్కాడ్‌లో కలుస్తాడు. ఈ నెల11వ తేదీన చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కేకేఆర్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. గత సీజన్ లో ఆరంభంలో రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన హోల్డర్.. దాదాపు సగం సీజన్ అయినపోయిన తర్వాత నుంచి వరుసగా తుది జట్టులో అవకాశం దక్కించుకుని ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఈ ఏడాది కూడా హోల్డర్‌పై భారీ ఆశలు పెట్టుకుంది డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. డెక్కన్ చార్జర్స్ నుంచి సన్‌రైజర్స్‌గా పేరు మార్చకున్న తర్వాత 2016లో టైటిల్ విజేతగా నిలిచింది. అప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ ప్రతీ సీజన్లో కనీసం ప్లే ఆఫ్‌కు చేరుకున్న జట్టుగా నిలిచింది. 2018 ఐపీఎల్ సీజన్లో కేన్ విలియమ్స్‌న్ కెప్టెన్సీలో ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్ సీఎస్కే చేతిలో ఓడి రన్నరఫ్‌గా నిలిచింది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బలమంతా కెప్టెన్ డేవిడ్ వార్నర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వార్నర్ తర్వాత బెయిర్ స్టో, విలియమ్సన్, మనీష్ పాండేలు స్టార్ ఆటగాళ్లు. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, రషీద్ ఖాన్, హోల్డర్లు కీలకం. గత సీజన్లో వార్నర్ సారథ్యంలోని ఎస్ఆర్హెచ్ జట్టు ఎన్నో కష్టాలు దాటుకుంటూ ప్లే ఆఫ్‌కు చేరుకున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడి ఇంటి బాట పట్టింది. ఈసారి వేలంలో కేదార్ జాదవ్ మినహా పెద్దగా చెప్పుకోదగ్గ ఆటగాళ్లను ఎవరిని కొనుగోలు చేయలేదు. ఎస్ఆర్హెచ్ స్వ్కాడ్ ఇదే.. పొలార్డ్‌ను మరిపిస్తున్నాడు.. ఆ సాహసం చేయలేను: కుంబ్లే -
శ్రీలంక 169 ఆలౌట్
నార్త్‌సౌండ్: వెస్టిండీస్ మాజీ కెప్టెన్, పేస్ బౌలర్ జేసన్ హోల్డర్ (5/27) నిప్పులు చెరగడంతో శ్రీలంక బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. ఫలితంగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 69.4 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను తొలుత కీమర్ రోచ్ (3/47) దెబ్బ తీయగా... అనంతరం జేసన్ హోల్డర్ హడలెత్తించడంతో శ్రీలంక ఇన్నింగ్స్‌కు తెర పడింది. లహిరు తిరిమన్నే (70; 4 ఫోర్లు), డిక్వెల్లా (32; 2 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ రెండో రోజు కడపటి వార్తలు అందే సమయానికి 67 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి ఆధిక్యం సంపాదించే దిశగా సాగుతోంది. -
అతన్ని వేలంలో ఎవరూ తీసుకోలేదు..
న్యూఢిల్లీ: ఐపీఎల్-2020 సీజన్ ప్రారంభంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట పడుతూ లేస్తూ సాగింది. కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్‌లలో గెలుపు ఖాయం అనుకున్న స్థితిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. కచ్చితంగా చివరి మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌లపై ఘన విజయాలు సాధించి ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఒకానొక దశలో టోర్నీ రేసు నుంచి తప్పుకునేలా కనిపించిన సన్‌రైజర్స్ .. పుంజుకుందంటే జాసన్ హోల్డర్ కూడా ఓ కారణం. ఆతడి చేరిక జట్టులో సమతూకం తీసుకువచ్చింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో జాసన్ హోల్డర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 4 ఓవర్లలో 25 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసిన హోల్డర్.. బ్యాటింగ్‌లో 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఛేజింగ్‌లో తీవ్ర ఒత్తిడిలో హోల్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. (గెలిపిస్తే బాగుండేది..కానీ పవర్ గేమ్ అదిరింది!) ఈ సీజన్లో 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన జాసన్ హోల్డర్ 14 వికెట్లు తీయడంతో పాటు 66 రన్స్ చేశాడు. అయితే గత ఏడాది జరిగిన ఐపీఎల్ 2020 వేలంలో హోల్డర్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. వెస్టిండీస్ కెప్టెన్‌గా ఉన్నహోల్డర్‌ను వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం పట్ల టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. జేమ్స్ నీశమ్, క్రిస్ మోరీస్, మొయిన్ అలీ లాంటి ఆల్రౌండర్లను తీసుకున్న ఫ్రాంచైజీలు హోల్డర్‌ను పక్కనబెట్టడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు. గౌతమ్ గంభీర్ ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ... ‘ వేలంలో జేమ్స్ నీషమ్, క్రిస్ మోరిస్, మొయిన్ అలీలను తీసుకున్నారు. కానీ జాసన్ హోల్డర్‌ను వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అంతర్జాతీయ జట్టుకు హోల్డర్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతడు రెగ్యులర్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. కొత్త బంతితో బాగా రాణిస్తాడు. పరుగులు చేస్తాడు. ఓవర్సీస్ ఆల్‌రౌండర్ నుంచి ఇంతకు మంచి ఏం ఆశించగలం. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాళ్లకు ఒత్తిడిని ఎదుర్కోవడం తెలుస్తుంది' అని పేర్కొన్నాడు. -
'సరైన టైంలో బ్రెయిన్ వాడాం.. మ్యాచ్ గెలిచాం'
దుబాయ్ : విండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్ ఐపీఎల్ 13వ సీజన్లో లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్గా అదరగొడుతున్నాడు. ఎస్ఆర్హెచ్ తరపున బరిలోకి దిగిన హోల్డర్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి జట్టు విజయాల్లో భాగంగా నిలిచాడు. అయితే విచిత్రమేంటంటే హోల్డర్ వచ్చిన తర్వాత లీగ్‌లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. కాగా శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో జేసన్ హోల్డర్ ఆల్‌రౌండ్ పాత్ర పోషించాడు. మొదట బౌలింగ్‌లో 3 వికెట్లు, తర్వాత బ్యాటింగ్‌లో 20 బంతుల్లో 24 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ విజయంలో కీలకంగా నిలిచి ఏకంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను వరించాడు ఈ సందర్భంగా కీలక మ్యాచ్‌లో విజయం సాధించనందుకు చాలా ఆనందంగా ఉందని హోల్డర్ పేర్కొన్నాడు.(చదవండి : వైరలవుతున్న మీమ్స్.. పాపం ఆర్సీబీ) 'సరైన సమయంలో మా బ్రెయిన్ వాడాం.. అందుకే ఆర్సీబీపై విజయం సాధించాం . మ్యాచ్‌కు ముందే ఎలా విజయం సాధించాలన్నదానిపై చాలా సేపు చర్చ జరిగింది. టాస్ గెలిస్తే బౌలింగ్ ఏంచుకొని ఆర్సీబీని తక్కువ స్కోరుకే కట్టడి చేయాలనుకున్నాం. అనుకున్నట్లే టాస్ గెలవడంతో మా బౌలర్లు సరైన సమయంలో బ్రెయిన్ వాడి.. తమ నైపుణ్యతను చూపించి వరుస విరామాల్లో వికెట్లు తీశారు. ఆ తర్వాత స్కోరు చేదనలో బ్యాట్స్మెన్ల పని సులువైంది. మెయిన్బౌలర్ భువనేశ్వర్ గైర్హాజరీలోనూ మా బౌలర్లు చక్కగా రాణిస్తున్నారు. (చదవండి : 'వాళ్లను చూస్తే 90లలో మమ్మల్ని చూసినట్లుంది') ముఖ్యంగా సందీప్ శర్మ తక్కువ ఎకానమితో వికెట్లు తీస్తుండడం.. నటరాజన్ యార్కర్లతో చెలరేగుతుండడం.. రషీద్ ఖాన్ లెగ్ స్నిన్ మహిమ.. నదీమ్ పేస్‌తో చెలరేగడం.. వెరసి మా బౌలింగ్ ఇప్పుడు అద్భుతంగా ఉంది. వీరికి తోడు తాజాగా నేను తోడవ్వడం కలిసివచ్చింది. నిజానికి గత కొన్నేళ్లుగా భుజం గాయాలతో పాటు పలు సర్జరీలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. ఐపీఎల్ పుణ్యమా అని ఈ సీజన్లో బాగానే ప్రాక్టీస్ లభించింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో కష్టపడితే చాలు.. మరోసారి ఫైనల్లో అడుగుపెడతాం. అని చెప్పుకొచ్చాడు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. -
ఐపీఎల్లో మద్దతు లేదు: హోల్డర్
అబుదాబి: నల్లజాతీయులపై జరుగుతున్న దాడులకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్(బీఎల్ఎమ్) ఉద్యమం జరుగుతుంటే ప్రస్తుత ఐపీఎల్లో దాని గురించి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం తీవ్ర నిరాశను కల్గించిందని వెస్టిండీస్ క్రికెటర్, ఎస్ఆర్హెచ్ ఆటగాడు జేసన్ హోల్డర్ పేర్కొన్నాడు. దీనికి క్రికెట్ వెస్టిండీస్ ఎంతో మద్దతుగా నిలుస్తుంటే కొన్ని చోట్ల దానికి ఊసే లేకపోవడం బాధకల్గిస్తుందన్నాడు. విండీస్ జట్టు తరఫున ప్రతిష్టాత్మక పీటర్ స్మిత్ అవార్డు స్వీకరణ సందర్భంగా హోల్డర్ వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడాడు. (గంభీర్.. ఇప్పుడేమంటావ్?) ఇక్కడ(ఐపీఎల్లో) బీఎల్ఎమ్ మాటే వినిపించడం లేదు. అసలు దాన్ని గుర్తించకపోవడం చాలా నిరాశ కల్గిస్తుంది. ఇంగ్లండ్‌లో విండీస్ మహిళా జట్టు ఆడినప్పుడు కూడా బీఎల్ఎమ్ లోగోలతో ఉద్యమాన్ని మద్దతు ప్రకటించారు. ఇది సుదీర్ఘ కాలంగా నడుస్తున్న సమస్య. ఇంకా చాలాదూరం పయనించాలి. అంతా ఒక్కటై సమానత్వం కోసం ఉద్యమిస్తేనే నల్లజాతీయులపై వివక్షను రూపు మాపవచ్చు. అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యానంతరం ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతోంది. క్రికెట్ మైదానంలో దానికి సంఘీభావాన్ని తెలుపుతూ ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగమయ్యేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విండీస్ జట్టుకు ప్రత్యేక అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్లో దాని ప్రస్తావనే లేకపోవడంపై హోల్డర్ తన మాటల ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశాడు. -
అదరహొల్డర్
తొలిరోజు వర్షం అడ్డుకుంది. కానీ రెండో రోజు వెస్టిండీస్ ఓ ఆటాడుకుంది. ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ను ఎక్కడికక్కడ కట్టడి చేసింది. కరీబియన్ బౌలర్లు ఎవరినీ క్రీజులో నిలువనీయలేదు. హోల్డర్, గాబ్రియెల్ల పేస్ ద్వయం క్రమం తప్పకుండా వికెట్లను పడగొట్టేసింది. కోవిడ్‌తో చాన్నాళ్ల తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్ సొంతగడ్డపైనే పరుగులు చేసేందుకు ఇంత కష్టపడుతుందని, క్రీజులో నిలిచేందుకు ఇన్ని పాట్లు పడుతుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. సౌతాంప్టన్: విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ (6/42) పేస్‌కు ఇంగ్లండ్ విలవిల్లాడింది. అతనికి తోడుగా షెనాన్ గాబ్రియెల్ (4/62) సత్తా చాటడంతో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 67.3 ఓవర్లలో 204 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ స్టోక్స్ (43; 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... బట్లర్ (35; 6 ఫోర్లు), డామ్ బెస్ (31 నాటౌట్; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ వెలుతురు లేమితో ఆట నిలిచే సమయానికి 19.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (20 బ్యాటింగ్), షై హోప్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. క్యాంప్‌బెల్ (28; 3 ఫోర్లు)ను అండర్సన్ ఔట్ చేశాడు. రెండో రోజు కూడా వర్షం అంతరాయం కలిగించినా చివరకు 69.2 ఓవర్ల ఆట సాగడం కొంత ఊరట. డెన్లీతో పతనం షురూ ఆట మొదలైన కాసేపటికే ఇంగ్లండ్‌కు ఆటుపోట్లు మొదలయ్యాయి. గురువారం 35/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ స్వల్ప వ్యవధిలోనే టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. గాబ్రియెల్ నిప్పులు చెరిగాడు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ డెన్లీ (18; 4 ఫోర్లు), రోరీ బర్న్స్ (30; 4 ఫోర్లు)లను తన వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో ఇంగ్లండ్ 51 పరుగులకే టాప్–3 వికెట్లను చేజార్చుకుంది. దీంతో ఇన్నింగ్స్ నడిపించే బాధ్యతను కెప్టెన్ స్టోక్స్ తన భుజాన వేసుకోగా... కూల్చేసే పనిని ప్రత్యర్థి కెప్టెన్ హోల్డర్ చేపట్టాడు. ఏమాత్రం కుదురుకునే అవకాశమివ్వకుండా... జాక్ క్రాలీ (10; 2 ఫోర్లు)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే ఒలీ పోప్ (12; 2 ఫోర్లు)ను కీపర్ క్యాచ్‌తో ఔట్ చేశాడు. ఇంగ్లండ్ స్కోరు 87/5. ఇంకా తొలిసెషన్ ముగియకముందే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అందరిన్నీ పొగొట్టుకుంది. వంద పరుగులు దాటాకా జట్టు స్కోరు 106/5 వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్లోనే ఆలౌట్ సెషన్ మారినా ఇంగ్లండ్ ఆటతీరేం మారలేదు. అలాగే హోల్డర్ జోరూ తగ్గలేదు. కెప్టెన్ స్టోక్స్, బట్లర్‌తో కలిసి వికెట్ల పతనానికి కాస్త అడ్డుకట్టవేసినా... పట్టు చిక్కించుకునేందుకు హోల్డర్‌కు ఎంతోసేపు పట్టలేదు. ఆరో వికెట్‌కు 67 పరుగులు జోడించాక... వాళ్లిద్దరితో పాటు ఆర్చర్(0)ను 3 పరుగుల వ్యవధిలోనే అతను పెవిలియన్ చేర్చాడు. తర్వాత జట్టు స్కోరును బెస్ 200 పరుగులు దాటించగలిగాడు. అండర్సన్(10)ను క్లీన్‌బౌల్డ్ చేసిన గాబ్రియెల్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. రెండో రోజు ఆటలో అంపైర్ల నిర్ణయాలు పేలవం. ఆరుసార్లు రివ్యూకు వెళ్లగా ఇందులో ఐదుసార్లు బౌలర్లకే అనుకూల ఫలితాలొచ్చాయి. ఒక్కసారి మాత్రమే అంపైర్ నిర్ణయం సరైందిగా తేలింది. సంక్షిప్త స్కోర్లు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 204 (స్టోక్స్ 43, బట్లర్ 35, బెస్ 31నాటౌట్; హోల్డర్ 6/42, గాబ్రియెల్ 4/62). వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 57/1 (బ్రాత్‌వైట్ బ్యాటింగ్ 20; క్యాంప్‌బెల్ 28) -
‘మాపై ప్రయోగం చేయడం లేదు’
లండన్: క్రికెట్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు సహకరించాలనే కారణంతోనే తమ వైపునుంచి ఆడేందుకు సిద్ధమయ్యామని వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ జేసన్ హోల్డర్ అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 కారణంగా తీవ్రమైన పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలో విండీస్ జట్టు మూడు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లటం అందరినీ ఆశ్చర్యపరచింది. ఇదో సాహసంగా తాము భావించడం లేదని, డబ్బులు కూడా అందుకు కారణం కాదని హోల్డర్ వ్యాఖ్యానించాడు. కరోనా కారణంగా ఒక్క ఇంగ్లండ్‌లోనే సుమారు 30 వేల మంది మృత్యువాత పడ్డారు. మాపై ప్రయోగాలు చేయించుకోవడానికి మేమేమీ ‘గినియా పిగ్’లం కాదు. ఎంతో మంది ఇప్పుడు క్రికెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ మేం ఇక్కడ ఆడటానికి రాలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వారు మాకు హామీ ఇచ్చారు. వాటి పట్ల సంతృప్తిగా ఉన్నాం. సిరీస్ ఆడటానికి డబ్బులు కారణం కాదు. హెల్త్ కేర్ వర్కర్లు ఇలాంటి విపత్తు సమయంలో అన్నింటికీ తెగించి పని చేస్తున్నారు. మనం అంత ప్రమాదంలోనైతే లేము కదా. అయినా ఏదో ఒక దశలో సాధారణ పరిస్థితులు తీసుకు రావాలంటే మొదటి అడుగు వేయాల్సిందే’ అని హోల్డర్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఉన్న వెస్టిండీస్ జట్టు మూడు వారాల హోం క్వారంటైన్ అనంతరం జూలై 8నుంచి జరిగే తొలి టెస్టు కోసం సౌతాంప్టన్ వెళుతుంది. -
‘పంజరంలో పావురం’ కాదల్చుకోలేదు..
ఆంటిగ్వా: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన జాసన్ హోల్టర్..తనకు అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడాలనే కోరిక ఉందనే విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల కీరోన్ పొలార్డ్‌ను పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపిక చేసి హోల్డర్‌ను టెస్టు సారథిగా మాత్రమే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. దాంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో తన స్థానం ఉండదేమోనని ఆందోళనలో ఉన్న హోల్డర్.. తనను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు పరిగణలోకి తీసుకోవాలని బోర్డుకు విన్నవించాడు. గత కొన్ని ఏళ్లుగా విండీస్ తరపున అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడుతున్నానని, ఇకపై కూడా ఆడాలనే కోరుకుంటున్నానని పేర్కొన్నాడు. (17 ఏళ్లకు ‘వరల్డ్‌కప్’ ఆరోపణలా?) తాను విండీస్ జట్టుకు టెస్టు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ మూడు ఫార్మాట్లలో ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. తన దృష్టి ఎప్పుడూ విండీస్ క్రికెట్‌పైనే ఉంటుందని, అది కేవలం టెస్టు క్రికెట్ మాత్రమే కాదన్నాడు. తాను పంజరంలో పావురంలా ఏ ఒక్క దానికో పరిమితం కాదల్చుకోలేదన్నాడు. విండీస్ క్రికెట్ అనేది వేర్వేరు సందర్భాల్లో పలు రకాలుగా రూపాంతరం చెందుతూ ఉంటుందన్నాడు. ఈ పజిల్లో ఆటగాళ్లంతా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడమే తమ కర్తవ్యమన్నాడు. అంతర్జాతీయ టెస్టు ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న హోల్డర్.. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్‌లో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం తమ క్రికెట్ జట్టులో బ్యాటింగ్ లోతు అసాధారణమని వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో పేర్కొన్న సంగతి తెలిసిందే. కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల తమ బ్యాటింగ్‌లో పూర్తి స్థాయి సామర్థ్యం బయటకు రావడం లేదని తెలిపిన బ్రేవో.. ఓవరాల్‌గా చూస్తే తమకున్న బ్యాటింగ్ వనరులు అమోఘమన్నాడు. 2016 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన జట్టు కంటే కూడా ప్రస్తుతం ఉన్న జట్టే సూపర్ అని బ్రేవో తెలిపాడు. ఇక పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపికైన పొలార్డ్ నిజాయితీ పరుడంటూ బ్రేవో ప్రశంసించాడు. గతంలోని కెప్టెన్ల వలే సెలక్టర్లు చెప్పిన దానికి తల ఊపే నైజం పొలార్డ్‌ది కాదని, కచ్చితమైన అభిప్రాయం చెప్పే వ్యక్తిత్వం అతని సొంతమన్నాడు.(పొలార్డ్‌లో నిజాయితీ ఉంది: బ్రేవో) -
బెంబేలెత్తించిన బుమ్రా
రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకపోతోంది. తొలి టెస్టులో విజయఢంకా మోగించిన కోహ్లి సేన.. రెండో టెస్టుపై పట్టు బిగించింది. దీంతో ఆతిథ్య వెస్టిండీస్‌కు వైట్‌వాష్ తప్పేలాలేదు. ముందుగా బ్యాట్స్‌మెన్ తమ విధులను సక్రమంగా నిర్వర్తించగా.. అనంతరం భారత బౌలర్లు విండీస్ బ్యాట్స్‌మెన్ పని పట్టారు. దీంతో ఆతిథ్య జట్టు ఫాలోఆన్ గండం ఎదుర్కొనే అవకాశం ఉంది. అద్భుతాలు జరిగితే తప్పా.. మూడో రోజే మ్యాచ్ ముగిసిపోయే అవకాశం ఉంది. కెరీర్ (ఓవల్) తొలి టెస్టులో కీలక అర్ధ సెంచరీ, మెల్బోర్న్లో ఓపెనర్‌గా ఆకట్టుకునే ప్రదర్శన, సిడ్నీలో సొగసైన ఆట... టెస్టు బ్యాట్స్‌మన్‌గా తన ప్రత్యేకతను ఐదు టెస్టుల్లోనే చూపించిన తెలుగు తేజం, ఆంధ్ర క్రికెటర్ గాదె హనుమ విహారి ఇప్పుడు ఆరో టెస్టులో తొలి సెంచరీతో సత్తా చాటాడు. ఆంటిగ్వాలో చేజారిన శతకాన్ని జమైకాలో అందుకొని గర్వంగా నిలిచాడు. మరోవైపు కెరీర్ 92వ టెస్టులో పేసర్ ఇషాంత్ శర్మ తొలి అర్ధ సెంచరీ సాధించడంతో రెండో టెస్టులో భారత్‌కు పట్టు చిక్కింది. విండీస్ బ్యాట్స్‌మెన్‌కు భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా నిద్రలేకుండా చేస్తున్నాడు. తొలి టెస్టులో ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడించిన బుమ్రా.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ రెచ్చిపోయాడు. సూపర్ బౌలింగ్ పర్ఫామెన్స్తో విండీస్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. హ్యాట్రిక్ సాధించి విండీస్ నడ్డివిడిచాడు. దీంతో టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో భారత బౌలర్‌గా.. విండీస్‌పై ఈ ఘనత అందుకున్న తొలి టీమిండియా బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. కింగ్స్టన్ (జమైకా) : తొలి టెస్టులో విండీస్‌కు తన పేస్ రుచి చూపించిన బుమ్రా.. రెండో టెస్టులోనూ ఆతిథ్య జట్టును కోలుకోనివ్వలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా టాప్-5 బ్యాట్స్‌మెన్ పనిపట్టాడు. ఇందులో ఓ హ్యాట్రిక్ ఉండటం విశేషం. బుమ్రా ధాటికి ఇద్దరూ బ్యాట్స్‌మెన్ పరుగులేమి చేయకుండా వెనుదిరగగా.. మరో ఇద్దరు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో ఆతిథ్య జట్టు పూర్తిగా కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 33 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హామిల్టన్(2 బ్యాటింగ్), కార్న్‌వాల్(4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా.. షమీ ఒక్క వికెట్ పడగొట్టాడు. విండీస్ ప్రధాన బ్యాట్స్‌మెన్ బ్రాత్‌వైట్(4), క్యాంప్‌బెల్2), డారెన్ బ్రేవో(4), బ్రూక్స్(0), రోస్టన్ ఛేజ్(0), హోల్డర్(18)లు బుమ్రా బౌలింగ్ ధాటికి బలయ్యారు. ఓ క్రమంలో 22 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న విండీస్‌ను హెట్మెయిర్(34) ఆదుకున్నాడు. అయితే ఈ ఆటగాడిని షమీ ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోనివ్వలేదు. ఓ సూపర్ బంతికి క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇప్పటికే టీమిండియా 329 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది. అంతకుముందు హనుమ విహారి (225 బంతుల్లో 111; 16 ఫోర్లు) శతకానికి తోడు ఇషాంత్ శర్మ (80 బంతుల్లో 57; 7 ఫోర్లు) కూడా బ్యాటింగ్‌లో సత్తా చాటడంతో వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. విహారి, ఇషాంత్ ఎనిమిదో వికెట్‌కు 112 పరుగులు జోడించడం విశేషం. మొదటి బంతికే... భారత్ రెండో రోజు ఆట పేలవంగా ప్రారంభమైంది. హోల్డర్ వేసిన తొలి బంతికే రిషభ్ పంత్ (27) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా (69 బంతుల్లో 16) పట్టుదలగా క్రీజ్‌లో నిలబడేందుకు ప్రయత్నించాడు. అయితే కార్న్‌వాల్ బౌలింగ్‌లో అనవసరంగా భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఈ దశలో ఇషాంత్ విహారికి అండగా నిలిచాడు. వీరిద్దరు తొలి సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. లంచ్ తర్వాత విహారిని వెనక్కి నెట్టి ఇషాంత్ దూసుకుపోయాడు. హోల్డర్, ఛేజ్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన అతను టెస్టుల్లో తన అత్యధిక స్కోరును అధిగమించాడు. అనంతరం 69 బంతుల్లో అర్ధసెంచరీ సాధించడంతో భారత డ్రెస్సింగ్‌రూమ్ హోరెత్తింది. వహ్వా విహారి... గత టెస్టులో త్రుటిలో శతకం చేజార్చుకున్న విహారి ఈ మ్యాచ్‌లో ఆ మైలురాయిని దాటాడు. తొలి రోజు ‘సున్నా’ వద్ద రోచ్ బౌలింగ్‌లో ఎల్బీ అప్పీల్ నుంచి తప్పించుకున్న అతను చూడచక్కటి బౌండరీలు కొట్టాడు. గాబ్రియెల్, రోచ్ ఓవర్లలో విహారి కొట్టిన రెండేసి ఫోర్లు హైలైట్‌గా నిలిచాయి. 42 పరుగుల వద్ద అతని మొదటి రోజు ఆట ముగిసింది. శనివారం ఆటలో అతను కొన్ని ఉత్కంఠభరిత క్షణాలను అధిగమించాడు. కొంత అదృష్టం కూడా ఆంధ్ర ఆటగాడికి కలిసొచ్చింది. హోల్డర్ వేసిన బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని వికెట్ల మీదుగా వెళ్లడంతో బతికిపోయిన అతను ఈ నాలుగు పరుగులతో 96 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 68 పరుగుల వద్ద కార్న్‌వాల్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాంప్‌బెల్ క్యాచ్ వదిలేశాడు. ఈ ఓవర్లో విహారి మూడు ఫోర్లు కొట్టడం విశేషం. కొద్ది సేపటికే 79 పరుగుల వద్ద హోల్డర్ బౌలింగ్‌లోనే అంపైర్ ఎల్బీగా ప్రకటించినా... రివ్యూలో ఫలితం అనుకూలంగా వచ్చింది. లంచ్ సమయానికి 158 బంతుల్లో 84 పరుగుల వద్ద నిలిచిన విహారి శతకానికి ముందు మళ్లీ కొంత ఒత్తిడికి గురయ్యాడు. అయితే చివరకు రోచ్ బౌలింగ్‌లో మిడాన్ దిశగా సింగిల్ తీయడంతో 200 బంతుల్లో విహారి తొలి సెంచరీ పూర్తయింది. గాల్లోకి పంచ్ విసిరి అతను తన భావోద్వేగాలను ప్రదర్శించాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 87/7 -
‘అందుకు మూల్యాన్ని చెల్లించుకున్నాం’
ట్రినిడాడ్: టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో తమ బ్యాటింగ్ విభాగం ఆకట్టుకున్నప్పటికీ బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలు కారణంగానే ఓటమి చెందామని వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ పేర్కొన్నాడు. ప్రధానంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను తమ వికెట్ కీపర్ షాయ్ హోప్ ఆరంభంలోనే వదిలేయడంతో అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నాడు. భారత్ ఛేజింగ్‌లో భాగంగా కీమో పాల్ వేసిన ఆరో ఓవర్లో కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను హోప్ జారవిడిచాడు. ఆపై చెలరేగిన కోహ్లి శతకంతో మెరిశాడు. ‘ మా బ్యాటింగ్ విభాగం ఆకట్టుకోవడంతో గౌరవప్రదమైన స్కోరును భారత్ ముందుంచాం. కానీ బౌలింగ్, ఫీల్డింగ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. కోహ్లి 11 పరుగుల వద్ద ఉండగా ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేయడం మాకు ప్రతికూలంగా మారింది. ఇటీవల కాలంలో ఫీల్డింగ్ తప్పిదాలు చేయడమే మాకు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది’ అని హోల్డర్ తెలిపాడు. నిన్నటి మ్యాచ్‌లో కోహ్లి 114 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. -
మరీ ఇంత నిర్లక్ష్యమా: హోల్డర్ ఫైర్
సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడిపోవడంపై వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇలా ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవడానికి తమ బ్యాట్స్‌మెన్ కారణమని విమర్శించాడు. నిలకడైన ఆట తీరుతో జట్టును మంచి స్థితిలో నిలవడానికి బదులు, నిర్లక్ష్యపు షాట్లతో ఔట్ కావడాన్ని ప్రధానంగా తప్పుబట్టాడు. మరి ఇంత దారుణమైన షాట్ల ఆడితే ఈ తరహా వైఫల్యాలే చూడాల్సి వస్తుందంటూ సహచరులకు చురకలు అంటించాడు. రాబోవు మ్యాచ్‌ల్లోనైనా నిర్లక్ష్యపు షాట్లను వదిలి మంచి భాగస్వామ్యాలను నమోదు చేయాలని సూచించాడు. ‘స్కోరు బోర్డుపై పోరాడటానికి సరిపడా పరుగులు లేవు. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూనే ఉన్నాం. స్కోరు బోర్డుపై సరైన భాగస్వామ్యమే లేదు. ఇందుకు కారణం తమ ఆటగాళ్లు నిర్లక్ష్యపు షాట్లే. ప్రధానంగా మధ్య ఓవర్లలో మ్యాచ్ మా చేతుల్లోంచి జారిపోయింది. ప్రతీ ఒక్క బ్యాట్స్‌మన్ మరింత బాధ్యతగా ఆడాలి. ఈ వరల్డ్‌కప్‌లో రెండు మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మన్ నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనబడింది’ అని హోల్డర్ మండిపడ్డాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ నిర్దేశించిన 213 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. -
నయా నాయకుడు
మొత్తంగా విజయ సారథిగా మారాడు! అతడే జాసన్ ఒమర్ హోల్డర్! వెస్టిండీస్ టెస్టు జట్టు కెప్టెన్! ఇంగ్లండ్‌పై తాజాగా సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడీ బార్బడోస్ ఆటగాడు. ఒకప్పుడు తనను తీవ్రంగా విమర్శించిన వారికి దీటైన ఆటతో సమాధానమిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో నయా నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. సాక్షి క్రీడా విభాగం కరీబియన్ క్రికెట్ జట్టంటేనే నాలుగు ముక్కలను ఒకచోటకు చేర్చిన పటం. ఆర్థిక సమస్యలు, ఆటగాళ్లలో అనైక్యత, ఒక దేశంగా బరిలో దిగుతున్నా మైదానంలో కనిపించని ఆ స్ఫూర్తి, ఎవరికి వారు ప్రపంచ వ్యాప్త లీగ్‌లతో బిజీ బిజీ! ఒకరిద్దరి మెరుపులు తప్ప రెండు దశాబ్దాలుగా ఆ జట్టు ప్రమాణాలు తిరోగమనంలోనే ఉన్నాయి. అలాంటిది ఇటీవల క్రమంగా మెరుగు పడుతోంది. తుది జట్టులో ఎవరుంటారో ఎవరుండరో అనే ఒకప్పటి అనిశ్చితి నుంచి బయట పడి కొంత కలసికట్టుగానూ కనిపిస్తోంది. ఈ మొత్తం ఘనతకు కారణంగా చెప్పుకోకున్నా అందులో కాస్త ఎక్కువ భాగం హోల్డర్‌కే దక్కుతుంది. ‘కెప్టెన్‌గా తగినవాడేనా?’ అంటూ అంతకుముందున్న డారెన్ సామీపై వచ్చినట్లే తనపైనా తలెత్తిన సందేహాలను పంటాపంచలు చేస్తున్నాడు. తన స్థిరమైన ప్రదర్శనతో‘అసలు కెప్టెన్ అంటూ ఒకడున్నాడు’ అని చెప్పుకొనే పరిస్థితి కల్పించాడతడు. దిగ్గజ ఆటగాడు గ్యారీ సోబర్స్ తర్వాత 45 ఏళ్లలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచిన తొలి వెస్టిండీస్ క్రికెటర్ హోల్డర్ కావడమే దీనికి నిదర్శనం. పరిస్థితులకు ఎదురొడ్డి... బంతిపై నియంత్రణతో పాటు ఎత్తును సద్వినియోగం చేసుకుంటూ బౌలింగ్ చేసే హోల్డర్ 2010 అండర్–19 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ తరఫున అత్యధిక వికెట్లు (13) పడగొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. లోయరార్డర్లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యంతో తర్వాతి ఏడాది బంగ్లాదేశ్ పర్యటనకు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 2014లో న్యూజిలాండ్‌పై అరంగేట్ర టెస్టులో అర్ధ సెంచరీతో పాటు రెండు వికెట్లు తీశాడు. 2015 ప్రపంచ కప్‌లో విండీస్ సారథి హోల్డరే. అయితే, జట్టులోని అప్పటి పరిస్థితుల కారణంగా తాను చేసేదేమీ లేకపోయింది. ఏడు మ్యాచ్‌ల్లో జట్టు మూడే గెలిచి ఇంటి ముఖం పట్టింది. ఆ సమయంలో సీనియర్లు తనను ఖాతరు చేయకున్నా వారిని హోల్డర్ వేలెత్తి చూపలేదు. కాలమే సమాధానం చెబుతుందన్నట్లు మందుకెళ్లాడు. ఇది నిజమే అన్నట్లు... ప్రతిభావంతులైనప్పటికీ అప్పటి ఆటగాళ్లంతా నేడు ఫామ్ కోల్పోయో, ప్రవర్తన బాగో లేకనో, మరే ఇతర కారణంతోనో జట్టుకు దూరమయ్యారు. పసిగట్టింది క్లయివ్ లాయిడ్... ప్రతిభకు లోటు లేని విండీస్ క్రికెట్‌ను పట్టి పీడిస్తున్న సమస్యలు అనేకం. ‘జట్టు కెప్టెన్‌గా ఎవరుండాలి’ అనేది కూడా వీటిలో ఒకటి. నలుగురైదుగురు ఆటగాళ్లు సారథ్యం కోసం పోటీ పడిన సందర్భాలూ గతంలో ఉన్నాయి. అలాంటిది, వన్డేలు (2013), టెస్టు (2015)ల్లో అరంగేట్రం చేసిన మరుసటి ఏడాదిలోనే హోల్డర్ కెప్టెన్ అయిపోయాడు. అయితే, ఈ నియామకం వెనుక వెస్టిండీస్ దిగ్గజ సారథి క్లయివ్ లాయిడ్ ముందుచూపు ఉంది. నిండా పాతికేళ్లు కూడా లేని యువకుడికి పగ్గాలప్పగించడం ఏమిటంటూ అందరూ విస్తుపోయారు. ఇది సింహాల ముందుకు పిల్లాడిని తోసినట్లుందని ఎద్దేవా చేశారు. కానీ, ‘వయసుకు మించిన పరిణతితో హోల్డర్‌లో ఏదో ప్రత్యేకత కనిపిస్తోంది’ అని లాయిడ్ నమ్మాడు. బౌలింగ్‌లోనో, బ్యాటింగ్‌లోనో పనికొస్తాడని భావించాడు. పరిస్థితుల కారణంగా మొదట్లో తడబడినా తర్వాత హోల్డర్ ఆ నమ్మకాన్ని క్రమంగా నిలబెట్టుకున్నాడు. జట్టు సభ్యులపై విశ్వాసం ఉంచుతూ సారథిగా ఎదిగాడు. నాలుగు నెలల క్రితం భారత్‌లో పర్యటన సందర్భంగానూ టీంపై అతడి ముద్ర స్పష్టంగా కనిపించింది. గాయంతో హోల్డర్ తొలి టెస్టు (రాజ్‌కోట్)కు దూరంగా కాగా ఆ మ్యాచ్‌లో విండీస్ ఇన్నింగ్స్ తేడాతో పరాజయం పాలైంది. హైదరాబాద్‌లో జరిగిన రెండో టెస్టు బరిలో దిగిన అతడు అర్ధ సెంచరీతో పాటు ఐదు వికెట్లూ పడగొట్టి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చాడు. దీంతో జట్టు కాస్తంతైనా నిలవగలిగింది. ప్రస్తుతం సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో హోల్డర్ సత్తా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తొలి టెస్టులో అజేయ డబుల్ సెంచరీతో, రెండో టెస్టులో బౌలింగ్‌లో మెరిశాడు. ఇదే క్రమంలో టెస్టు చర్రితలో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ద్విశతకం బాదిన మూడో బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. అప్పట్లో అతడి గురించి... ►జట్టులోకి ఎంపికే అసమంజసం అన్నారు... ►ఆటగాడిగా సామర్థ్యాన్ని శంకించారు... ►కెప్టెన్‌గా ప్రకటించినపుడైతే అంతా నవ్వుకున్నారు... మరిప్పుడు అతడు... ►నిలకడైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు... ►నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు... ►కకావికలుగా ఉండే కరీబియన్లను ఒకతాటిపైకి తెచ్చాడు... పొడగరి... సిగ్గరి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యంత పొడగరి హోల్డర్ (దాదాపు 6 అడుగుల 6 అంగుళాలు). మృదు స్వభావానికి తోడు చిరునవ్వు కూడా అంత తొందరగా నవ్వనంతటి సిగ్గరి. ఆఖరికి కెప్టెన్‌గా ప్రకటించిన సందర్భంలోనూ అతడి హావభావాల్లో పెద్దగా మార్పులు కనిపించ లేదు. మానసికంగా చూస్తే మాత్రం హోల్డర్ చాలా గట్టివాడు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఆ ప్రభావం ముఖంలో కనిపించనివ్వడు. మొండిగా పోరాడుతూ పోతుంటాడు. 2015 ఇంగ్లండ్ పర్యటనే ఇందుకు నిదర్శనం. 189 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు... 214 నిమిషాలు క్రీజులో నిలిచి కెరీర్ తొలి సెంచరీ బాది జట్టును గట్టెక్కించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో గాలి దిశకు అనుగుణంగా బంతులేయమని కెప్టెన్‌గా తను చేసిన సూచనలను బౌలర్లు పట్టించుకోలేదనే వార్తలు వచ్చాయి. మరొకరైతే, వీటిని విని వదిలేసేవారే. హోల్డర్ మాత్రం... ‘జాగ్రత్తగా వినండి. మా పేసర్లు కఠిన పరిస్థితులకు ఎదురొడ్డారు. నేనెప్పుడు కోరినా బంతిని అందుకుని తమ శక్తిమేర ప్రయత్నించాడు. ఎవరూ వెనక్కుతగ్గలేదు’ అంటూ గట్టిగా బదులిచ్చాడు. నాయకుడనిపించుకున్నాడు.. ఇంగ్లండ్‌పై తాజా సిరీస్ విజయాన్ని శనివారం మృతి చెందిన యువ పేసర్ అల్జారీ జోసెఫ్ తల్లికి అంకితమిస్తూ హోల్డర్ కెప్టెన్‌గా తన స్థాయిని పెంచుకున్నాడు. ఈ సందర్భంగా జోసెఫ్ అంకితభావంతో పాటు విజయ భావనలో ఆలోచించి ముందుకెళ్తుందంటూ విండీస్ జట్టు ఆటపైనా ప్రశంసలు కురిశాయి. ఇది అతడి జట్టే ఓపెనింగ్‌లో బ్రాత్‌వైట్, మిడిలార్డర్లో చేజ్, హోప్, హెట్‌మైర్‌తో పాటు హోల్డర్ తోడుగా పేసర్లు గాబ్రియెల్, రోచ్లతో విండీస్ టెస్టు జట్టు (ముఖ్యంగా పేస్ పిచ్‌లపై) బలంగా ఉంది. వీరంతా హోల్డర్ నేతృత్వంలోనే ఎదిగారు. నిలకడగానూ ఆడుతున్నారు. దీనిని కొనసాగిస్తే ఆ దేశ క్రికెట్ పునరుజ్జీవం చెందడం ఖాయం. -
ఐసీసీకి కామన్సెన్స్ ఉందా?: వార్న్
నార్త్‌సౌండ్: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌పై ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం విధించడాన్ని ఆసీస్ స్పిన్ దిగ్జజం షేన్ వార్న్ తీవ్రంగా తప్పుబట్టాడు. అసలు హోల్డర్‌పై నిషేధం విధించే ముందు ఐసీసీ కనీసం కామన్సెన్స్ లేకండా వ్యవహరించిందంటూ మండిపడ్డాడు. ఈ విషయంలో ఐసీసీ నిర్ణయాన్ని సవాల్ చేయాల్సిందిగా హోల్డర్‌కు సూచించాడు. ‘ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు మూడు రోజులు మించి జరగలేదు. అటువంటప్పుడు స్లో ఓవర్‌రేట్ అంటూ హోల్డర్‌పై మ్యాచ్ నిషేధం విధించడం నిజంగానే చెత్త నిర్ణయం. ఇక్కడ ఐసీసీ కనీసం ఇంగితం కూడా లేకుండా వ్యవహరించింది. హోల్డర్.. ఐసీసీ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లు’ అని వార్న్ పేర్కొన్నాడు. అదే సమయంలో ఇంగ్లండ్‌పై 10 వికెట్లతో రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను ఇంకో మ్యాచ్ ఉండగానే కైవసం చేసకున్న విండీస్‌ను వార్న్ అభినందించాడు. అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్ ఎంత బలమైనదో మరోసారి నిరూపించిందన్న వార్న్... ఇదే విజయ పరంపరను భవిష్యత్తులో కూడా కొనసాగించాలన్నాడు. ఇక్కడ చదవండి: వెస్టిండీస్ ఎన్నాళ్లకెన్నాళ్లకు.. -
హోల్డర్ డబుల్ సెంచరీ
బ్రిడ్జ్‌టౌన్: సొంత మైదానంలో కెప్టెన్ జాసన్ హోల్డర్ (229 బంతుల్లో 202 నాటౌట్; 23 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ డబుల్ సెంచరీకి తోడు వికెట్ కీపర్ షేన్ డౌరిచ్ (224 బంతుల్లో 116 నాటౌట్; 11 ఫోర్లు, సిక్స్) సెంచరీ బాదడంతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్... ఇంగ్లండ్‌కు అసాధ్యమైన 628 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనిని ఛేదించే క్రమంలో నాలుగో రోజు శనివారం ఇంగ్లండ్ టీ విరామానికి 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. ఓపెనర్లు రోరీ బర్న్స్ (84), జెన్నింగ్స్ (14), బెయిర్ స్టో (30), కెప్టెన్ జో రూట్ (15) ఔటయ్యారు. ఆ జట్టు ఇంకా 411 పరుగులు చేయాల్సి ఉంది. మరోవైపు శుక్రవారం విండీస్ రెండో ఇన్నింగ్స్‌ను 415/6 వద్ద డిక్లేర్ చేసింది. హోల్డర్, డౌరిచ్ ఏడో వికెట్‌కు అభేద్యంగా 295 పరుగులు జోడించడం విశేషం. -
చెలరేగిన హోల్డర్.. భారత్ 367 ఆలౌట్
సాక్షి, హైదరాబాద్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ 367 పరుగులకు ఆలౌట్ అయింది. విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ 5 వికెట్లతో భారత్ జోరుకు బ్రేక్ వేశాడు. 308/4 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 14 పరుగుల వ్యవధిలోనే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. తొలుత అజింక్యా రహానే (80) ఔట్ కాగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా డకౌట్‌గా వెనుదిరిగాడు. గత టెస్ట్‌లో సెంచరీతో ఆకట్టుకున్న జడేజా ఈ మ్యాచ్‌లోపూర్తిగా నిరాశపరిచాడు. మరొకొద్ది సేపటికే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రిషబ్ పంత్(92: 134 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను గాబ్రియల్ దెబ్బతీశాడు. దీంతో పంత్ మరోసారి శతకాన్ని చేజార్చుకుని పెవిలియన్ చేరాడు. గత రాజ్‌కోట్ టెస్ట్‌లో సైతం పంత్ 92 పరుగులకే వెనుదిరగడం గమనార్హం. చివర్లో అశ్విన్ టెయిలండర్లు కుల్దీప్(6), ఉమేశ్ యాదవ్(2), ఠాకుర్ (4) సాయంతో 45 పరుగులు జోడించాడు. చివర్లో అశ్విన్ (35) ఔట్ కావడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కోహ్లి సేనకు 56 పరుగుల ఆధిక్యం లభించింది. -
ఉప్పల్ స్టేడియంలో టెస్టు మ్యాచ్
టీమిండియాతో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో తలపడబోయే వెస్టిండీస్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కోర్ట్నీ బ్రౌన్ నేతృత్వంలోని సెలక్షన్ బోర్డు జాసన్ హోల్డర్ సారథ్యంలోని 15 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. అక్టోబర్‌లో కరీబియన్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా విండీస్ జట్టు టీమిండియాతో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. స్వదేశంలో జరిగిన సిరీస్‌లలో ఆకట్టుకున్న 36 ఏళ్ల సీనియర్ ఆటగాడు, టాపార్డర్ బ్యాట్స్‌మన్ డెవోనో స్మిత్‌కు జట్టులో చోటు దక్కలేదు. గాయం కారణంగా గత సిరీస్‌లకు దూరమైన సునీల్ ఆంబ్రిస్ తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా అద్భుతంగా రాణిస్తున్న జాసన్ హోల్డర్‌పై సెలక్షన్ కమిటీ ప్రశంసల వర్షం కురిపించింది. తొలి టెస్టు మ్యాచ్‌కు రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదిక కానుండగా.. రెండో టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. తొలి టెస్టు: అక్టోబర్ 3 నుంచి 8 వరకు, రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియం రెండో టెస్టు: అక్టోబర్ 12 నుంచి 16 వరకు, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం విండీస్ టెస్టు జట్టు: జాసన్ హోల్డర్ (కెప్టెన్), సునీల్ ఆంబ్రిస్, దేవేంద్ర బిషూ, బ్రాత్‌వైట్, రోస్టన్ చేస్, షేన్ డౌరిచ్, షెన్నాన్ గాబ్రియల్, జహ్మార్ హామిల్టన్, షిమ్రాన్ హెట్మెర్, షాయ్ హోప్, అల్జారీ జోసెఫ్, కీమో పాల్, కీరన్ పావెల్, కీమర్ రోచ్, జోమెల్ వరికన్. -
విండీస్‌దే సిరీస్
కింగ్స్టన్: వెస్టిండీస్ పేస్ బౌలింగ్ ధాటికి బంగ్లాదేశ్ కుప్పకూలింది. వరుసగా రెండో టెస్టులోనూ ఓటమి మూటగట్టుకుంది. శనివారం ముగిసిన రెండో టెస్టులో విండీస్ 166 పరుగుల తేడాతో గెలుపొంది 2–0తో సిరీస్ సొంతం చేసుకుంది. 335 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలో దిగిన బంగ్లాను విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ (6/59) బెంబేలెత్తించడంతో 42 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ షకీబుల్ హసన్ (54; 10 ఫోర్లు) ఒక్కడే పోరాడాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 19/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 45 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. షకీబ్ (6/33) ధాటికి విండీస్ విలవిల్లాడింది. హోల్డర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. -
కెరీర్ బెస్ట్ ర్యాంకులతో మెరిశారు..
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో శ్రీలంక బ్యాట్స్‌మన్ దిముత్ కరుణరత్నే, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జాసన్ హోల్డర్లు తమ కెరీర్ అత్యుత్తమ ర్యాంకులను సాధించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 158 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 60 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కరుణరత్నే 21 స్థానాలు ఎగబాకి 10వ స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ జరిగిన రెండో టెస్టులో మొత్తంగా 11 వికెట్లు సాధించి విండీస్ గెలుపులో ముఖ్య భూమిక పోషించిన హోల్డర్ తొమ్మిది స్థానాలు పైకి ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. ఇక టెస్టు ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హోల్డర్ తొలిసారి టాప్-5లో నిలిచాడు. ఇక జట్టు ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించగా, బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. -
తొలి ఆసియా దేశంగా
ఇమ్రాన్ ఖాన్, వసీం ఆక్రమ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని వంటి మహామహుల సారథ్యాలలోని జట్లు ఈ మైదానంలో విజయాన్ని సాధించలేకపోయాయి. టెస్ట్ ప్రారంభానికి ముందు ట్యాంపరింగ్ ఉదంతం.. కెప్టెన్ చండిమాల్‌పై వేటు.. ఒత్తిడిలో లంక యువ జట్టు.. సురంగ లక్మల్‌కు సారథ్య బాధ్యతలు.. సిరీస్‌లో వెనుకంజ.. టెస్టులో పలుమార్లు వర్షం అంతరాయం. ఇవన్నీ శ్రీలంక విజయానికి అడ్డంకి కాలేదు. ఆసియా జట్లకు కలగా ఉండే కింగ్స్టన్ ఓవల్ మైదానంలో గెలిచి శ్రీలంక చరిత్ర సృష్టించింది. బ్రిడ్జిటౌన్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. పేస్‌కు స్వర్గధామమైన కింగ్స్టన్ ఓవల్ మైదానంలో గెలిచిన తొలి ఆసియా దేశంగా శ్రీలంక చరిత్ర సృష్టించింది. చివరి టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సిరీస్‌లో విశేషంగా రాణించిన విండీస్ కీపర్ షేన్ డౌరిచ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ డేనైట్ టెస్టులో చివరకు విజయం లంకనే వరించింది. 144 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంకను హోల్డర్ దెబ్బతీశాడు, వరుసగా వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచాడు. దీంతో ప్రధాన బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ దశలో శ్రీలంక 81 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో డి పెరీరా (23 నాటౌట్), కుశాల్ పెరీరా (28 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు విజయాన్నందించారు. రెండో ఇన్నింగ్స్‌లో హోల్డర్ ఐదు వికెట్లు సాధించగా, కీమర్ రోచ్‌కు ఒక్క వికెట్ దక్కింది. చివరి టెస్టులో ఇరజట్ల స్కోర్ వివరాలు వెస్టిండీస్ : 204 & 93 శ్రీలంక : 154 & 144/6 -
'ఇలాగైతే కెప్టెన్ ఎవరైనా కష్టమే'
గ్రాస్ ఐలెట్:భారత్‌తో జరిగిన మూడో టెస్టులో తమ జట్టు ఘోర పరాజయం చెందడం పట్ల వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం పోరాడేతత్వం లేనప్పుడు ఆ జట్టుకు నాయకత్వం వహించడం అనేది చాలా కష్టమన్నాడు. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ బాధ్యతరహితంగా ఆడటమే తమ ఓటమి కారణమన్నాడు. తమ జట్టులో నిలకడ లోపించిన విషయం మూడో టెస్టులో చాలా స్పష్టంగా కనబడిందన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో మెరుగైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ, రెండో ఇన్నింగ్స్ లో పూర్తిగా చేతులెత్తేశామన్నాడు. 'వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ మరింత బాధ్యాతాయుతంగా ఆడాలి. ముఖ్యంగా టాపార్డర్ ఆటగాళ్లలో నిలకడ అవసరం. ఇంకా ఒక టెస్టు ఉండగానే సిరీస్ కోల్పోవడం చాలా బాధాకరం. మా అత్యంత పేలవ ప్రదర్శనతోనే టీమిండియాకు సిరీస్‌ను అప్పజెప్పాం. ఇలాగైతే జట్టుకు కెప్టెన్‌గా చేయడం చాలా కష్టం. ఒక్కసారి టీమిండియా జట్టును చూడండి. ఆ జట్టులో చాలా నిలకడ ఉంది. గత కొంతకాలంగా అత్యంత పటిష్టంగా, నిలకడగా ఉన్న జట్టు భారత క్రికెట్ జట్టు. ప్రస్తుతం విండీస్ జట్టులో చాలామంది యువకులు ఉన్నారు. మనల్ని మనం మెరుగుపరుచుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. ప్రతీ ఆటగాడు 20, 30 పరుగులకే పరిమితం కాకుండా, ఆయా స్కోర్లను హాఫ్ సెంచరీలుగా, సెంచరీలుగా మార్చేందుకు యత్నించండి'అని హోల్డర్ హితబోధ చేశాడు. నాలుగు టెస్టుల సిరీస్‌ను ఇంకా మ్యాచ్ ఉండగానే భారత్ 2-0 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడో టెస్టులో 237పరుగులతో విండీస్ పై జయభేరి మోగించిన భారత్.. కరీబియన్ గడ్డపై వరుసగా 'హ్యాట్రిక్' సిరీస్‌లను సాధించింది. -
'ఇదే ఫామ్‌ను కొనసాగించు'
కింగ్ స్టన్(జమైకా): నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన రెండో టెస్టును డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించిన వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్పై కెప్టెన్ జాసన్ హోల్డర్ ప్రశంసలు కురిపించాడు. ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఛేజ్ నమోదు చేయడం వల్లే తాము మ్యాచ్‌ను కాపాడుకున్నామని హోల్డర్ అభినందించాడు. ఈ తరహా ఇన్నింగ్స్‌ను ఒక మ్యాచ్‌కే పరిమితం చేయకుండా మిగతా మ్యాచ్‌ల్లో కూడా కొనసాగించాలన్నాడు. ప్రత్యేకంగా రెండో టెస్టును నిలబెట్టింది మాత్రం ఛేజ్ అని, ఇదే ఫామ్‌ను మిగిలి ఉన్న రెండు టెస్టుల్లో కొనసాగిస్తాడని హోల్డర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. దీంతో పాటు బ్లాక్ వుడ్, డోవ్రిచ్లను హోల్డర్ అభినందించాడు. ప్రత్యేకంగా తమ ఇన్నింగ్స్‌లో మూడు కీలక భాగస్వామ్యాలు నమోదు కావడంతో టెస్టు మ్యాచ్ పై పట్టు సాధించమన్నాడు. ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో ఛేజ్‌తో కలిసి బ్లాక్ వుడ్, డోవ్రిచ్లు జత చేసిన పరుగులు చాలా విలువైనవిగా హోల్డర్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో బౌలర్లపై బ్లాక్ వుడ్ విరుచుకుపడిన తీరు అమోఘంగా ఉందన్నాడు. అతను బ్యాటింగ్ కు వెళ్లే ముందు సహజ సిద్ధమైన ఆటను ఆడమని తాను చెప్పినట్లు హోల్డర్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. -
భారత్‌తో మ్యాచ్.. అంత ఈజీ కాదు!
తొలి టెస్టుతో పోల్చితే ఇప్పుడు జట్టు కాస్త బలోపేతం అయిందని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అంటున్నాడు. నేడు(శనివారం) ఇక్కడి సబీనా పార్క్ స్డేడియంలో రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో హోల్డర్ మీడియాతో మాట్లాడాడు. బౌలింగ్ విభాగం కొంత మెరుగ్గా కరిపించినా, భారత్ లాంటి జట్టుపై అంతగా ప్రభావం చూపిస్తామో లేదోనని హోల్డర్ అందోళన చెందుతున్నాడు. ఆటగాళ్ల ఫామ్ కూడా తమకు ప్రతికూలాంశమని, బ్యాటింగ్ లైనఫ్ కూడా అంత పటిష్టంగా లేదని విండీస్ కెప్టెన్ వెల్లడించాడు. ఇప్పటికీ తొలిటెస్టు ఇన్నింగ్స్ ఓటమిని విండీస్ జీర్ణించుకోలేకపోతోంది. కొన్ని పరిస్థితులలో విండీస్ సమిష్టిగా రాణిస్తే విజయం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. బౌలర్లు సుదీర్ఘ సెషన్లపాటు బంతులు వేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించాడు. రెండో టెస్టులో కెరీర్ ఆరంగేట్రం చేయనున్న యువ ఆల్ రౌండర్ అల్జారీ జోసెఫ్ గురించి తనకేం తెలియదన్నాడు. అతడి ఆట తాను ఎప్పుడూ చూడలేదని, అయితే సత్తామేరకు అతడు రాణించినందున జాతీయ జట్టులోకి వచ్చాడని పేర్కొన్నాడు. జట్టు అతడికి విలువైన సూచనలు ఇచ్చేందుకు సిద్ధమని.. అతడు రాణిస్తే జట్టుకు కాస్తయినా మేలు జరుగుతుంనది విండీస్ కెప్టెన్ హోల్డర్ వివరించాడు. -
'టీమిండియాకు ముందే లొంగిపోయాం'
ఆంటిగ్వా: టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా వైఫల్యం చెందడానికి తమ జట్టు పేలవ ప్రదర్శనే కారణమని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ స్పష్టం చేశాడు. తమ ఓటమిని ఓ వైపు ఉంచితే, అసలు పోరాటం అనేదే కనబరచకుండా వెనుదిరగడం తీవ్రంగా నిరాశకు గురి చేసిందన్నాడు. ఈ పరాజయానికి ప్రధాన కారణం బౌలింగ్‌లో పూర్తిగా వైఫల్యం చెందడమేనన్నాడు. 'టీమిండియాకు ముందే లొంగిపోయాం. అసలు తొలి ఇన్నింగ్స్‌లో మా బౌలింగ్ సరిగా లేదు. దాంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. అసలు ప్రత్యర్థి జట్టుపై ఎటువంటి ఒత్తిడి తేలేకపోయాం. ఓ మోస్తరుగా మాత్రమే బౌలింగ్‌లో రాణించాం. ఇది టెస్టు క్రికెట్ లో సరిపోదు. సుదీర్ఘమైన టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్ అనేది చాలా కీలకం. మా బౌలింగ్ చాలా మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టుకు రెండు సెంచరీలు చేసే అవకాశం ఇవ్వడం మా బౌలింగ్‌లో పసలేకపోవడాన్ని సూచిస్తుంది. తదుపరి మ్యాచ్ నాటికి భారత్ జట్టుకు గట్టి పోటీ ఇస్తామని భావిస్తున్నా'అని హోల్డర్ పేర్కొన్నాడు. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.రెండో ఇన్నింగ్స్ లో విండీస్ ను 231 పరుగులకే కుప్పకూల్చిన భారత్ ఇంకా రోజు ఆట మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో గెలిచింది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏడు వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించాడు. -
టీమిండియానే ఫేవరెట్
కరీబియన్ గడ్డపై వరుసగా మూడో సిరీస్ నెగ్గాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భావిస్తుండగా, ఎంత కష్టమైనా సరే మెరుగైన ప్రదర్శన ఇస్తామని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అంటున్నాడు. గతేడాది శ్రీలంక, దక్షిణాఫ్రికాలపై సిరీస్‌లు గెలిచిన టీమిండియా ఈ సిరీస్ నెగ్గితే కోహ్లీకి హ్యాట్రిక్ సిరీస్. వెస్టిండీస్ పై భారత్‌కు వరుసగా మూడో సిరీస్ విజయం అవుతుంది. నేటి(గురువారం) నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విండీస్ కెప్టెన్ హోల్డర్ కాస్త ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. గతంలో రెండు, మూడు మ్యాచ్ సిరీస్‌లు ఆడాను, కానీ నాలుగు టెస్టుల సిరీస్ ఇదే తనకు తొలిసారి అని హోల్డర్ పేర్కొన్నాడు. తమ జట్టులో ఎక్కువగా అనుభవంలేని ఆటగాళ్లు ఉన్నారని ఈ ఏడాది ఆస్ట్రేలియాతో సిరీస్ ఓటమికి కారణమని వెల్లడించాడు. ఆసీస్ సిరీస్ నుంచి కొన్ని పాఠాలను నేర్చుకున్నాం, అయితే ఇంకా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. ఇక్కడి పిచ్‌లు చాలా మందకొడిగా ఉంటాయని, వీటిపై రాణించాలంటే మరింత శ్రమించాల్సి ఉంటుందన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ ఇలా ఏ విభాగంలో చూసినా టీమిండియానే మెరుగ్గా కనిపిస్తోంది. -
' మాకు భారత్ తో టెస్టు సిరీస్ ఒక సవాల్'
బెసెటెరీ (సెయింట్ కిట్స్): తమతో జరిగే టెస్టు సిరీస్ లో టీమిండియాను నిలువరించడం అంత సులభం కాదని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ స్పష్టం చేశాడు. ప్రస్తుత విండీస్ జట్టులో ఎక్కువ మంది యువ క్రికెటర్లు ఉండటంతో పాటు అనుభవం కూడా తక్కువగా ఉండటంతో ఈ సిరీస్ లో తమకు ఒక సవాల్ ఎదురుకానుందన్నాడు. ' ఈ సిరీస్ మాకు కచ్చితంగా ఛాలెంజే. భారత క్రికెట్ జట్టులో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉండటంతో పాటు, నాణ్యమైన బౌలింగ్ కూడా ఉంది. ప్రస్తుతం భారత జట్టు టెస్టు ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉంది. దీంతో ఆ జట్టు నుంచి మాకు తీవ్ర పోటీ ఉంటుంది. మా జట్టులో అనుభవం లేదు. ఎక్కువ యువకులు ఉండటమే ఇందుకు కారణం'అని హోల్డర్ తెలిపాడు. తొలి ఇన్నింగ్స్ లో 90.0 ఓవర్లపాటు ఆడినట్లైతే భారత్ కు పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందన్నాడు. గత కొంతకాలంగా తమ జట్టు రోజంతా ఆడటంలో విఫలమవుతూ వస్తుందని, దాన్ని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హోల్డర్ అన్నాడు. -
కీలక మ్యాచ్‌కు హోలర్డ్ అనుమానం!
బ్రిడ్జిటౌన్: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరుగనున్న కీలక మ్యాచ్‌కు వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో హోల్డర్ గాయపడటంతో తదుపరి మ్యాచ్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో హోల్డన్ ఎడమ మోకాలికి గాయం అయ్యింది. తన గాయంపై మాట్లాడిన హోల్డర్.. తదుపరి మ్యాచ్‌లో పాల్గొనడంపై అనుమానం వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్‌లో పాల్గొనాలని అనుకుంటున్నా, కచ్చితంగా చెప్పలేనని పేర్కొన్నాడు. ఆసీస్ తో మ్యాచ్‌లో బాగా ఆడినప్పటికీ, ఓడిపోవడం నిరాశపరిచిందన్నాడు. ముక్కోణపు సిరీస్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. దీంతో వెస్టిండీస్-దక్షిణాఫ్రికాల మధ్య రేపు జరిగే మ్యాచ్ కీలకం కానుంది. -
'మా క్రికెట్ పిచ్ లు సరైన ప్రమాణాలతో లేవు'
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: తమ దేశంలోని క్రికెట్ పిచ్‌లు మరింత నాణ్యంగా తయారు కావాల్సిన అవసరం ఉందని వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ స్పష్టం చేశాడు. అసలు సిసలైన క్రికెట్ ను తమ దేశంలో ఆడాలంటే మాత్రం కచ్చితంగా పిచ్ లు నాణ్యంగా రూపొందించాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రస్తుత కరేబియన్ పిచ్ ల్లో ప్రమాణాలు ఏమాత్రం బాగోలేదని ఈ సందర్భంగా హోల్డర్ అభిప్రాయపడ్డాడు. ఇందుకు ప్రాంతీయంగా జరుగుతున్న సూపర్ -50 మ్యాచ్ ల్లో తక్కువ స్కోర్లు నమోదు కావడమే నిదర్శమన్నాడు. తమ పిచ్ లు జీవం కోల్పోయి చాలా స్లోగా టర్న్ అవుతూ ఉంటాయన్నాడు. కొన్ని సందర్భాల్లో స్పిన్నర్లు అనుకూలంగా ఉండే తమ పిచ్ లు.. బ్యాట్స్ మెన్ కు ఎంత మాత్రం సానుకూలంగా లేవన్నాడు. ఈ తరుణంలో తమ దేశ క్రికెట్ పిచ్ ల్లో మంచి క్రికెట్ జరుగుతుందని అనుకోవడం లేదన్నాడు. తమ దేశ క్రికెట్ లో మజా ను ఆస్వాదించాలంటే పిచ్ ల్లో మార్పులు చేయక తప్పదన్నాడు. -
విండీస్, ఇంగ్లండ్ తొలి టెస్టు డ్రా
నార్త్ సౌండ్ (అంటిగ్వా అండ్ బార్బుడా): జాసన్ హోల్డర్ (149 బంతుల్లో 103 నాటౌట్; 15 ఫోర్లు) కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేయడంతో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టును వెస్టిండీస్ డ్రా చేసుకుంది. సర్ వివియన్ రిచర్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... 438 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 129.4 ఓవర్లలో 7 వికెట్లకు 350 పరుగులు చేసింది. 98/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆఖరి రోజు ఆట కొనసాగించిన కరీబియన్ జట్టు ఓ దశలో 189 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. అయితే ఇంగ్లిష్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న హోల్డర్ కీలక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. రామ్‌దిన్ (57)తో కలిసి ఏడో వికెట్‌కు 105; రోచ్ (15 నాటౌట్)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 56 పరుగులు జోడించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన అండర్సన్.. ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. రెండో టెస్టు ఈనెల 21 నుంచి సెయింట్ జార్జ్‌లో జరుగుతుంది. -
షకీబ్ రికార్డును బ్రేక్ చేసిన హోల్డర్
వెస్టిండీస్ క్రికెట్ టీం కెప్టెన్ జాసన్ ఒమర్ హోల్డర్ ప్రపంచ రికార్డు సాధించాడు. శనివారం పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించడం ద్వారా హోల్డర్.. ప్రపంచ కప్‌లో జట్టుకు విజయాన్ని అందించిన అత్యంత పిన్నవయస్కుడైన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం హోల్డర్ వయసు 23 ఏళ్ల 108 రోజులు. ఇంతకు ముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పేరిట ఉండేది. 2011 ప్రపంచకప్‌లో ఇర్లాండ్ మీద బంగ్లాదేశ్ విజయం సాధించినప్పుడు షకీబ్ వయసు 23 ఏళ్ల 338 రోజులు. ఈ రికార్డు పట్ల సంతోషం వ్యక్తపరిచిన హోల్డర్.. తన సారథ్యంలో విండీస్ ఆడిన రెండు మ్యూచ్ల్లోనూ 300 పైచిలుకు పరుగులు సాధించడం ఆత్మవిశ్వాసం పెంచిందని వ్యాఖ్యానించాడు. ఐర్లాండ్‌తో ఓటమి కొద్దిగా బాధ కల్గించినా, పాక్ పై ఘనవిజయం ఆనందం కలిగించిందని తెలిపాడు.