షకీబ్ రికార్డును బ్రేక్ చేసిన హోల్డర్ | west indies cricket caption jason world record | Sakshi
Sakshi News home page

షకీబ్ రికార్డును బ్రేక్ చేసిన హోల్డర్

Published Sat, Feb 21 2015 1:38 PM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

షకీబ్ రికార్డును బ్రేక్ చేసిన హోల్డర్

షకీబ్ రికార్డును బ్రేక్ చేసిన హోల్డర్

వెస్టిండీస్ క్రికెట్ టీం కెప్టెన్ జాసన్ ఒమర్ హోల్డర్ ప్రపంచ రికార్డు సాధించాడు. శనివారం పాకిస్థాన్ను చిత్తుగా ఓడించడం ద్వారా హోల్డర్.. ప్రపంచ కప్లో జట్టుకు విజయాన్ని అందించిన అత్యంత పిన్నవయస్కుడైన కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు.  ప్రస్తుతం హోల్డర్ వయసు 23 ఏళ్ల 108 రోజులు. ఇంతకు ముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పేరిట ఉండేది.

2011 ప్రపంచకప్లో ఇర్లాండ్ మీద బంగ్లాదేశ్ విజయం సాధించినప్పుడు షకీబ్ వయసు 23 ఏళ్ల 338 రోజులు.  ఈ రికార్డు పట్ల సంతోషం వ్యక్తపరిచిన హోల్డర్..   తన సారథ్యంలో విండీస్ ఆడిన రెండు మ్యూచ్ల్లోనూ 300  పైచిలుకు పరుగులు సాధించడం ఆత్మవిశ్వాసం పెంచిందని వ్యాఖ్యానించాడు.  ఐర్లాండ్తో ఓటమి కొద్దిగా బాధ కల్గించినా, పాక్ పై ఘనవిజయం ఆనందం కలిగించిందని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement