England vs West Indies, 3rd Test Day 1: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో వెస్టిండీస్ బ్యాటర్లు బ్రాత్‌వైట్ (61; 8 ఫోర్లు), హోల్డర్ (59; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 75.1 ఓవర్లలో 282 పరుగుల వద్ద ఆలౌటైంది. మిడిలార్డర్‌లో జొషువా సిల్వా (49; 3 ఫోర్లు) కూడా రాణించాడు.
ఒక దశలో 76/1గా ఉన్న విండీస్ 115/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. అనంతరం జొషువా, హోల్డర్‌లు ఆరో వికెట్‌కు 109 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. వోక్స్ (3/69) ఈ జోడీని విడగొట్టి విండీస్ పతనానికి శ్రీకారం చుట్టాడు. అట్కిన్సన్ (4/67) కీలకమైన వికెట్లు తీసి విండీస్ ఆట కట్టించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్.. తొలి రోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్లకు 38 పరుగులు చేసింది.
2-0తో సిరీస్ కైవసం
కాగా మూడు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య ఇంగ్లండ్ విజయభేరి మోగించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మూడో టెస్టులోనైనా గెలిచి క్లీన్‌స్వీప్ గండం నుంచి తప్పించుకోవాలని వెస్టిండీస్ పట్టుదలగా ఉంది. అందుకు అనుగుణంగానే బర్మింగ్‌హాంలో అడుగులు వేస్తోంది.
తుదిజట్లు
ఇంగ్లండ్
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్.
వెస్టిండీస్
క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాసన్ హోల్డర్, జాషువా డా సిల్వా (వికెట్ కీపర్), అల్జారీ జోసెఫ్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్.
Comments
Please login to add a commentAdd a comment