England vs West Indies
-
లివింగ్‌స్టోన్ విధ్వంసకర సెంచరీ.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో ఇంగ్లండ్ సమం చేసింది. 329 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 47.3 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.లక్ష్య చేధనలో ఇంగ్లండ్ స్టాండింగ్ కెప్టెన్ లైమ్ లివింగ్ స్టోన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. లివింగ్ స్టోన్ 85 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 124 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో లివింగ్ స్టోన్‌తో పాటు సాల్ట్(59), బెతల్(55), సామ్ కుర్రాన్(52) హాఫ్ సెంచరీలతో మెరిశారు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్ 3 వికెట్లు పడగొట్టగా, జోషఫ్, ఛేజ్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ కెప్టెన్ హోప్(117) విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు కార్టీ(71), రుథర్ఫర్డ్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో టర్నర్, రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, అర్చర్, లివింగ్ స్టోన్ చెరో వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే నవంబర్ 6న బార్బోడస్ వేదికగా జరగనుంది. -
ఇంగ్లండ్ కెప్టెన్‌గా లియామ్ లివింగ్‌స్టోన్
వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. బట్లర్ గైర్హాజరీలో ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్‌గా లియామ్ లివింగ్‌స్టోన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ సిరీస్ కోసం బట్లర్ ప్రత్యామ్నాయ ఆటగాడిని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేయలేదు.కాగా, ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా బట్లర్ గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతను వన్డే, టీ20 జట్లకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని విండీస్‌తో సిరీస్‌కు బట్లర్‌ను తొలుత ఎంపిక చేశారు. అయితే బట్లర్ పూర్తిగా ఫిట్నెస్ సాధించకపోవడంతో ఈసీబీ అతన్ని జట్టు నుంచి తప్పించింది. బట్లర్ విండీస్‌తో తదుపరి జరుగబోయే టీ20 సిరీస్ సమయానికంతా పూర్తిగా కోలుకుంటాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది.వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ అక్టోబర్ 31, నవంబర్ 2, నవంబర్ 8 తేదీల్లో జరుగనుంది. అనంతరం నవంబర్ 9, 10, 14, 16, 17 తేదీల్లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లు విండీస్ వేదికగా జరుగనున్నాయి. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు ప్రస్తుతం పాక్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు..లియామ్ లివింగ్‌స్టోన్ (వన్డే జట్టు కెప్టెన్), విల్ జాక్స్, డాన్ మౌస్లీ, జేకబ్ బేతెల్, జేమీ ఓవర్టన్, సామ్ కర్రన్, ఫిలిప్ సాల్ట్, జాఫర్ చోహాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, రీస్ టాప్లే, జాన్ టర్నర్చదవండి: టీమిండియాకు గుడ్ న్యూస్ -
విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ రీఎంట్రీ
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన అక్టోబర్ 31న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్ తొలుత వన్డే సిరీస్ ఆడుతుంది. మూడు వన్డే మ్యాచ్‌లు అక్టోబర్ 31 (ఆంటిగ్వా), నవంబర్ 2 (ఆంటిగ్వా), నవంబర్ 6 (బార్బడోస్) తేదీల్లో జరుగనున్నాయి. అనంతరం నవంబర్ 9 (బార్బడోస్), 10 (బార్బడోస్), 14 (సెయింట్ లూసియా), 16 (సెయింట్ లూసియా), 17 (సెయింట్ లూసియా) తేదీల్లో ఐదు టీ20లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం 14 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఇవాళ (అక్టోబర్ 3) ప్రకటించారు. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లకు దూరంగా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ విండీస్‌తో సిరీస్‌లతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇంగ్లండ్ జట్టులో ముగ్గురు అన్ క్యాప్డ్ ప్లేయర్లకు చోటు దక్కింది. వీరిలో జాఫర్ చోహాన్ తొలిసారి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోగా.. జాన్ టర్నర్, డాన్ మౌస్లీ జాతీయ జట్టుకు మరోసారి ఎంపికయ్యారు. విండీస్‌తో సిరీస్‌లకు ఈ 14 మందితో పాటు మరో ఇద్దరిని కూడా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేయనుంది. ఆ ఇద్దరు పాకిస్తాన్‌తో టెస్ట్ సిరీస్‌తో ముగిసిన అనంతరం (అక్టోబర్ 28) జట్టుతో చేరతారు. బట్లర్ గైర్హాజరీలో ఇంగ్లండ్ జట్టు పగ్గాలు చేపట్టిన హ్యారీ బ్రూక్ ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. బ్రూక్‌తో పాటు మరో ఆటగాడు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టులో చేరతాడు.వెస్టిండీస్ వన్డే మరియు టీ20 సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్, జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, జాఫర్ చోహాన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్చదవండి: ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్: భారత స్పిన్ దిగ్గజం -
కేన్ విలియమ్సన్కు షాక్.. వరల్డ్ నంబర్ వన్‌గా రూట్
ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. కేన్ విలియమ్సన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన రూట్.. మరోసారి నంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్నాడు.సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తంగా 291 పరుగులతో రాణించిన రూట్.. ఇంగ్లండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో మొత్తంగా 872 రేటింగ్ పాయింట్లు సాధించి ప్రథమ స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో మరోసారి వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచాడు.కాగా ఈ 33 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్ తొలిసారిగా 2015 ఆగష్టులో అగ్రపీఠం కైవసం చేసుకున్నాడు. గతేడాది కూడా మొదటి ర్యాంకు సంపాదించాడు. ఇక తాజా టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజం, డారిల్ మిచెల్, స్టీవెన్ స్మిత్ టాప్-5లో కొనసాగుతున్నారు. భారత్ నుంచి రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపరచుకుని ఆరో ర్యాంకులో నిలిచాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు.ఐసీసీ మెన్స్ టెస్టు తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-5 ప్లేయర్లు1. జో రూట్(ఇంగ్లండ్)- 872 రేటింగ్ పాయింట్లు2. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 859 రేటింగ్ పాయింట్లు3. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 768 రేటింగ్ పాయింట్లు4. డారిల్ మిచెల్(న్యూజిలాండ్)- 768 రేటింగ్ పాయింట్లు5. స్టీవెన్ స్మిత్(ఆస్ట్రేలియా)- 757 రేటింగ్ పాయింట్లు. -
బెన్ స్టోక్స్ ఊచకోత.. టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి.. విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న (జులై 28) ముగిసిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో సత్తా చాటి పర్యాటక జట్టును చిత్తుగా ఓడించింది. మార్క్ వుడ్ (14-1-40-5) సెకెండ్ ఇన్నింగ్స్‌లో విండీస్‌ను కకావికలం (175 ఆలౌట్) చేశాడు. అనంతరం 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం 7.2 ఓవర్లలో ఛేదించింది. బెన్ స్టోక్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగి విండీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి నమోదు చేశాడు. గతంలో ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు ఇయాన్ బోథమ్ (28 బంతులు) పేరిట ఉండేది. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు పాక్ ఆటగాడు మిస్బా ఉల్ హక్ (21) పేరిట ఉంది. BEN STOKES - Fastest fifty in England Test history. 🔥🥶 pic.twitter.com/Lphj1mAap5— Johns. (@CricCrazyJohns) July 28, 2024మ్యాచ్ విషయానికొస్తే.. స్వల్ప లక్ష్య ఛేదనలో స్టోక్స్‌కు జతగా బెన్ డకెట్ (16 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు) కూడా చెలరేగాడు. ఓవర్‌నైట్ స్కోర్ 33/2 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన విండీస్.. మరో 142 పరుగులు జోడించి మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయింది (175 పరుగులకు ఆలౌట్). మార్క్ వుడ్ ఐదేసి విండీస్‌ను కుప్పకూల్చాడు. అట్కిన్సన్ 2, వోక్స్, షోయబ్ బషీర్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ బ్యాటర్లలో మికైల్ లూయిస్ (57), కవెమ్ హాడ్జ్ (55) హాఫ్ సెంచరీలు చేశాడు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (87) కెరీర్లో 63వ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ జేమీ స్మిత్ (95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. బెన్ స్టోక్స్ (54), క్రిస్ వోక్స్ (62) అర్ద సెంచరీలతో ఆకట్టుకున్నారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, జేడన్ సీల్స్ 3, షమార్ జోసఫ్ 2, గుడకేశ్ మోటీ ఓ వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (61), జేసన్ హోల్డర్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. జాషువ డసిల్వ (49) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 4, క్రిస్ వోక్స్ 3, మార్క్ వుడ్ 2, షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టారు. -
టెస్ట్ మ్యాచ్ అనుకున్నావా.. టీ20 అనుకున్నావా.. ఇంతలా బాదితే ఎలా..?
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (జులై 28) ముగిసిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటిన ఇంగ్లండ్ కేవలం రెండున్నర రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ఆట మూడో రోజు విండీస్‌ను 175 పరుగులకే ఆలౌట్ (సెకెండ్ ఇన్నింగ్స్) చేసిన ఇంగ్లండ్.. 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 7.2 ఓవర్లలోనే ఛేదించింది. ఛేదనలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన స్టోక్స్.. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. స్టోక్స్ వీరబాదుడు ధాటికి విండీస్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యం కళ్లు మూసుకుని తెరిచే లోగా హాం ఫట్ అయ్యింది. స్టోక్స్‌కు జతగా బరిలోకి దిగిన బెన్ డకెట్ (16 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు) సైతం మరో ఎండ్‌లో చెలరేగాడు. స్టోక్స్ బజ్‌బాల్ గేమ్‌ను చూసిన వారు "టెస్ట్ మ్యాచ్ అనుకున్నావా లేక టీ20 అనుకున్నావా" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓవర్‌నైట్ స్కోర్ 33/2 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన విండీస్.. మరో 142 పరుగులు జోడించి మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయింది. మార్క్ వుడ్ (5/40) ఐదేసి విండీస్‌ను కుప్పకూల్చాడు. అట్కిన్సన్ 2, వోక్స్, షోయబ్ బషీర్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ బ్యాటర్లలో మికైల్ లూయిస్ (57), కవెమ్ హాడ్జ్ (55) హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (61), జేసన్ హోల్డర్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. జాషువ డసిల్వ (49) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 4, క్రిస్ వోక్స్ 3, మార్క్ వుడ్ 2, షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 376 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (87) కెరీర్లో 63వ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ జేమీ స్మిత్ (95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. బెన్ స్టోక్స్ (54), క్రిస్ వోక్స్ (62) అర్ద సెంచరీలతో ఆకట్టుకున్నారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, జేడన్ సీల్స్ 3, షమార్ జోసఫ్ 2, గుడకేశ్ మోటీ ఓ వికెట్ పడగొట్టారు. -
రాణించిన రూట్, స్టోక్స్.. తృటిలో సెంచరీ చేజార్చుకున్న స్మిత్
బర్మింగ్హమ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టెయిలెండర్లు సత్తా చాటారు. ఫలితంగా ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (87) కెరీర్లో 63వ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ జేమీ స్మిత్ (95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. బెన్ స్టోక్స్ (54), క్రిస్ వోక్స్ (62) అర్ద సెంచరీలతో ఆకట్టుకున్నారు. జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 3, మార్క్ వుడ్ 0, ఓలీ పోప్ 10, హ్యారీ బ్రూక్ 2 నిరాశపర్చగా.. పదో నంబర్ ఆటగాడు గస్ అట్కిన్సన్ 21 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, జేడన్ సీల్స్ 3, షమార్ జోసఫ్ 2, గుడకేశ్ మోటీ ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఆలౌటైన అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 61 పరుగులు వెనుకపడి ఉంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (0), కిర్క్ మెక్కెంజీ (8) ఔట్ కాగా.. మికైల్ లూయిస్ (18), అలిక్ అథనాజ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (61), జేసన్ హోల్డర్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. జాషువ డసిల్వ (49) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 4, క్రిస్ వోక్స్ 3, మార్క్ వుడ్ 2, షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్‌ల్లో విజయం సాధించి, సిరీస్‌ను ఇదివరకే కైవసం చేసుకుంది. -
జో రూట్ అరుదైన ఘనత.. లారా ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఏడో బ్యాటర్‌గా జో రూట్ రికార్డులకెక్కాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 143 మ్యాచ్ (261 టెస్టు ఇన్నింగ్స్‌లు) లు ఆడిన రూట్ 11954 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉండేది. లారా 131 మ్యాచ్‌ల్లో 11953 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో లారా ఆల్‌టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(15,921) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. సచిన్ తర్వాతి స్ధానాల్లో రికీ పాంటింగ్(13,378), జాక్వెస్ కల్లిస్(13, 289), రాహుల్ ద్రవిడ్(13,288), అలిస్టర్ కుక్(12,472), కుమార్ సంగక్కర(12,400) ఉన్నారు. ఇక విండీస్‌తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రూట్ 87 పరుగులు చేసి ఔటయ్యాడు. రూట్ టెస్టు కెరీర్లో 32 సెంచరీలు కూడా ఉన్నాయి. -
Eng Vs WI: మరోసారి మెరిసిన అట్కిన్సన్
England vs West Indies, 3rd Test Day 1: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో వెస్టిండీస్ బ్యాటర్లు బ్రాత్‌వైట్ (61; 8 ఫోర్లు), హోల్డర్ (59; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 75.1 ఓవర్లలో 282 పరుగుల వద్ద ఆలౌటైంది. మిడిలార్డర్లో జొషువా సిల్వా (49; 3 ఫోర్లు) కూడా రాణించాడు.ఒక దశలో 76/1గా ఉన్న విండీస్ 115/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. అనంతరం జొషువా, హోల్డర్లు ఆరో వికెట్‌కు 109 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. వోక్స్ (3/69) ఈ జోడీని విడగొట్టి విండీస్ పతనానికి శ్రీకారం చుట్టాడు. అట్కిన్సన్ (4/67) కీలకమైన వికెట్లు తీసి విండీస్ ఆట కట్టించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్.. తొలి రోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్లకు 38 పరుగులు చేసింది. 2-0తో సిరీస్ కైవసంకాగా మూడు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య ఇంగ్లండ్ విజయభేరి మోగించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మూడో టెస్టులోనైనా గెలిచి క్లీన్‌స్వీప్ గండం నుంచి తప్పించుకోవాలని వెస్టిండీస్ పట్టుదలగా ఉంది. అందుకు అనుగుణంగానే బర్మింగ్‌హాంలో అడుగులు వేస్తోంది.తుదిజట్లుఇంగ్లండ్జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్.వెస్టిండీస్క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాసన్ హోల్డర్, జాషువా డా సిల్వా (వికెట్ కీపర్), అల్జారీ జోసెఫ్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్. -
తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
బర్మింగ్హమ్ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాల్టి నుంచి (జులై 26) మొదలయ్యే మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ఇంగ్లండ్ ఎలాంటి మార్పులు చేయలేదు. రెండో టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ జయకేతనం ఎగురవేసింది. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో.. రెండో టెస్ట్‌లో 241 పరుగుల తేడాతో విజయం సాధించింది.విండీస్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్ -
Eng vs WI: గాయపడ్డ బౌలర్.. ‘వికెట్ల వీరుడి’కి పిలుపు
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు నేపథ్యంలో వెస్టిండీస్ తమ జట్టులో ఓ మార్పు చేసింది. పేసర్ జెరెమా లూయీస్ స్థానంలో అకీం జోర్డాన్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటన విడుదల చేసింది.కాగా విండీస్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జూలై 10న ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభమైంది. లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన మొదటి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ ఆకాశమే హద్దుగా చెలరేగింది.చిత్తు చిత్తుగా ఓడిపర్యాటక వెస్టిండీస్‌ను ఏకంగా ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. ఇక నాటింగ్‌హామ్‌లో జూలై 18- 22 వరకు జరిగిన రెండో టెస్టులోనూ వెస్టిండీస్‌కు పరాభవమే ఎదురైంది. 241 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్‌ను 0-2తో ఇంగ్లండ్‌కు కోల్పోయింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జూలై 26 నుంచి నామమాత్రపు మూడో టెస్టు జరుగనుంది. బర్మింగ్‌హాంలోని ఎడ్జ్‌బాస్టన్ ఇందుకు వేదిక. ఇక ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో ముందడుగు వేయాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది.దురదృష్టంమరోవైపు.. ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. అయితే, ఇంతవరకూ టెస్టులాడని జెరెమీ లూయిస్‌కు విండీస్ ఈ సిరీస్ ద్వారా పిలుపునివ్వగా.. తొలి రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉన్నాడు. కానీ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.అయితే, మూడో టెస్టుకు ముందు అతడు గాయపడినట్లు విండీస్ బోర్డు తెలిపింది. తొడ కండరాల గాయం కారణంగా జెరెమా జట్టుకు దూరమైనట్లు తెలిపింది. అయితే, అతడు జట్టుతో పాటే ఉంటూ చికిత్స తీసుకుంటాడని తెలిపింది. జెరెమా స్థానంలో అకీమ్ జోర్డాన్ జట్టులోకి వచ్చినట్లు పేర్కొంది.లైన్ క్లియర్!కాగా 29 ఏళ్ల అకీమ్ జోర్డాన్ ఇంతవరకు టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. బార్బడోస్‌కు చెందిన ఈ ఫాస్ట్‌బౌలర్ ఫస్ట్‌క్లాస్ రికార్డు మెరుగ్గా ఉంది. 19 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 67 వికెట్లు తీశాడు. ప్రస్తుతం యూకేలోనే ఉన్న జోర్డాన్ జట్టుతో చేరినట్లు సమాచారం.ఇక విండీస్ పేస్ దళంలో అల్జారీ జోసెఫ్, జేడన్ సీల్స్, షమార్ జోసఫ్ అందుబాటులో ఉన్నారు. అయితే, తదుపరి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో వీరిలో ఒకరికి బోర్డు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అలా అయితే, జోర్డాన్ అరంగేట్రానికి మార్గం సుగమమవుతుంది. -
టెస్టుల్లో సచిన్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: వాన్
నాటింగ్‌హామ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 122 పరుగులు చేసిన రూట్.. ఇంగ్లండ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. రూట్‌కు ఇది 32వ టెస్టు సెంంచరీ కావడం విశేషం.ఈ నేపథ్యంలో రూట్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును రూట్ బ్రేక్ చేస్తాడని వాన్ అభిప్రాయపడ్డాడు."జో రూట్ మరి కొద్ది రోజుల్లోనే టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. అంతేకాదు టెస్టు క్రికెట్ హిస్టరీలో లీడింగ్ రన్‌స్కోరర్ అయిన సచిన్ టెండూల్కర్‌ను కూడా అధిగమించే సత్తా రూట్‌కు ఉంది. ఇప్పటికే సచిన్ రికార్డుకు రూట్ చేరవయ్యే వాడు. కానీ ఆ మధ్య కాలంలో రూట్ తన ఫామ్‌ను కోల్పోయి కాస్త ఇబ్బంది పడ్డాడు. నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ తన వికెట్‌ను కోల్పోయేవాడు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం అతడు అద్భుతంగా ఆడాడు. ఇప్పుడు మాత్రం అతడు తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. దూకుడుగా ఆడుతున్నాడు. ఇదే కొనసాగితే సచిన్ రికార్డును రూట్ బ్రేక్ చేసే అవకాశముందని" ది టెలిగ్రాఫ్ కోసం తన కాలమ్‌లో వాన్ రాసుకొచ్చాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రూట్ ప్రస్తుతం 8వ స్ధానంలో కొనసాగుతున్నాడు.260 ఇన్నింగ్స్‌లలో రూట్ ఇప్పటివరకు 11,940 పరుగులు చేశాడు. కాగా సచిన్ 329 టెస్టు ఇన్నింగ్స్‌లలో 15921 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. సచిన్ తర్వాతి స్ధానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(13378) ఉన్నాడు. -
బెన్ స్టోక్స్ డూప్.. వైరల్ వీడియో
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను పోలిన ఓ వ్యక్తి స్టాండ్స్‌లో తారసపడ్డాడు. సదరు వ్యక్తిని చూసి బెన్ స్టోక్స్ ఆశ్చర్యపోయాడు. గడ్డం, హెయిర్ స్టయిల్, ముఖ ఆకృతి తనలాగే ఉండటంతో స్టోక్స్ కళ్లప్పగించి చూశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.TWO BEN STOKES IN THE TEST MATCH....!!!! 🤯 pic.twitter.com/qU3kQm9Zyy— Johns. (@CricCrazyJohns) July 21, 2024ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ 241 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేయగా.. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 457, రెండో ఇన్నింగ్స్‌లో 143 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఓలీ పోప్ (121), హ్యారీ బ్రూక్ (109), జో రూట్ (122).. విండీస్ ఆటగాడు కవెమ్ హాడ్జ్ (120) సెంచరీలు చేశారు. సిరీస్‌లో నామమాత్రపు మూడో టెస్ట్ జులై 26న మొదలవుతుంది. -
ENG VS WI: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 241 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 400కు పైగా స్కోర్ చేసింది. 147 ఏళ్ల ఇంగ్లీష్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం తొలిసారి. ఇదే మ్యాచ్‌లో విండీస్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో 400కు పైగా స్కోర్ చేసింది.టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి..ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఒకటి, రెండు, మూడు ఇన్నింగ్స్‌ల్లో 400కు పైగా స్కోర్లు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేయగా.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 457, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 143 పరుగులు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. 385 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఐదేయడంతో (5/41) 143 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 400కు పైగా స్కోర్ చేయడంతో పాటు 41 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించిన విండీస్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసింది. బషీర్‌తో పాటు క్రిస్ వోక్స్ (2/28), అట్కిన్సన్ (2/49), మార్క్ వుడ్ (1/17) విండీస్ పతనాన్ని శాశించారు. విండీస్ ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్ (47), జేసన్ హోల్డర్ (37), మికైల్ లూయిస్ (17), జాషువ డసిల్వ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఇంగ్లండ్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (121), సెకెండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (51) చేసిన ఓలీ పోప్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో కవెమ్ హాడ్జ్ (120) సెంచరీతో ఆకట్టుకోగా.. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (109), జో రూట్ (122) సెంచరీలతో సత్తా చాటారు. -
ENG vs WI: భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్
నాటింగ్‌హామ్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (78 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు), బెన్ డకెట్ (92 బంతుల్లో 76; 11 ఫోర్లు), ఒలీ పోప్ (67 బంతుల్లో 51; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా...జో రూట్ (33 నాటౌట్) రాణించాడు. అంతకు ముందు వెస్టిండీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 351/5తో ఆట కొనసాగించిన విండీస్ 457 పరుగులకు ఆలౌటైంది. జోషువా డి సిల్వా (122 బంతుల్లో 82 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), షామర్ జోసెఫ్ (27 బంతుల్లో 33; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. వీరిద్దరు పదో వికెట్‌కు 78 బంతుల్లో 71 పరుగులు జోడించడం విశేషం. ప్రస్తుతం ఇంగ్లండ్ 207 పరుగులు ముందంజలో ఉంది. -
నిప్పులు చెరిగిన మార్క్ వుడ్.. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఓవర్
ఇంగ్లండ్ స్పీడ్ గన్ మార్క్ వుడ్ వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్ తొలి ఓవర్లో వుడ్ బుల్లెట్ లాంటి బంతులతో నిప్పులు వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలోనే ఇది ఫాస్టెస్ట్ ఓవర్‌గా (సగటున గంటకు 94.40 మైళ్ల వేగం) రికార్డైంది. ఈ ఓవర్లో (93.9, 96.1, 95.2, 92.2, 96.5, 95.2) వుడ్ ప్రతి బంతిని 90 మైళ్లకు పైగా వేగంతో సంధించాడు.Mark Wood is steaminnnnggg fireeeee 🔥 pic.twitter.com/DlQTEQFZ11— CricTracker (@Cricketracker) July 19, 2024వుడ్ తన మరుసటి ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో ఓ బంతిని ఏకంగా 97.1 మైళ్ల వేగంతో సంధించాడు. వుడ్ ఈ ఓవర్లోనూ (95, 93, 95, 96, 97.1, 94) ప్రతి బంతిని 90 మైళ్లకు పైగా వేగంతో విసిరాడు. వుడ్ సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున ఇంచుమించు ఇలాంటి వేగంతో ఓ ఓవర్ వేశాడు. 2023 జులై 19న ఆస్ట్రేలియాతో జరిగిన హెడింగ్లే టెస్ట్‌లో వుడ్ 92.8, 90.2, 92.5, 92.5, -, 91.6 మైళ్ల వేగంతో బంతులను సంధించాడు.M A R K W 🔥🔥Dpic.twitter.com/fJB1SdSpqI— CricTracker (@Cricketracker) July 19, 2024ప్రస్తుతం తరం బౌలర్లలో ఫాస్టెస్ట్ బౌలర్‌గా గుర్తింపు ఉన్న వుడ్.. తన కెరీర్లో ఫాస్టెస్ట్ బాల్‌ను 2022లో పాకిస్తాన్‌పై విసిరాడు. నాడు ముల్తాన్ టెస్ట్‌లో వుడ్ గంటకు 98 మైళ్ల వేగంతో బంతిని సంధించాడు. ఇదే అతని కెరీర్లో ఫాస్టెస్ట్ డెలివరీ. ఓవరాల్‌గా క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు పాక్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ పేరిట ఉంది. 2003 వరల్డ్‌కప్‌లో అక్తర్.. సౌతాఫ్రికాపై ఓ బంతిని 100.23 మైళ్ల వేగంతో సంధించాడు.19th July 2023: Mark Wood bowled one of the fastest overs at Old Trafford against Australia19th July 2024: Mark Wood bowled the fastest over ever by an England bowler at home.He's just unbelievable 🔥 pic.twitter.com/dR8Qv9m0cW— CricTracker (@Cricketracker) July 19, 2024మ్యాచ్ విషయానికొస్తే.. ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (121) సెంచరీ.. బెన్ డకెట్ (71), బెన్ స్టోక్స్ (69) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, జేడన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, కవెమ్ హాడ్జ్ తలో 2, షమార్ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు.రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్.. 46 ఓవర్ల అనంతరం 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ 48, మికైల్ లూయిస్ 21, కిర్క్ మెక్కెంజీ 11 పరుగులు చేసి ఔట్ కాగా..అలిక్ అథనాజ్ 48, కవెమ్ హాడ్జ్ 37 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, అట్కిన్సన్ ఓ వికెట్ పడగొట్టారు. వెస్టిండీస్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 246 పరుగులు వెనుకపడి ఉంది. -
విండీస్ ప్లేయర్ క్రేజీ సెలెబ్రేషన్స్
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (121) సెంచరీ.. బెన్ డకెట్ (71), బెన్ స్టోక్స్ (69) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, జేడన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, కవెమ్ హాడ్జ్ తలో 2, షమార్ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్.. లంచ్ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ 48, మికైల్ లూయిస్ 21, కిర్క్ మెక్కెంజీ 11 పరుగులు చేసి ఔట్ కాగా..అలిక్ అథనాజ్ 5, కవెమ్ హాడ్జ్ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, అట్కిన్సన్ ఓ వికెట్ పడగొట్టారు. వెస్టిండీస్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 327 పరుగులు వెనుకపడి ఉంది.The Crazy Celebration of Kevin Sinclair.🤯- ONE OF THE BEST CELEBRATION IN CRICKET. 🔥 pic.twitter.com/o9OZOwhSWu— Tanuj Singh (@ImTanujSingh) July 19, 2024సింక్లెయిర్ క్రేజీ సెలెబ్రేషన్స్ఈ మ్యాచ్ తొలి రోజు విండీస్ ఆటగాడు కెవిన్ సింక్లెయిర్.. హ్యారీ బ్రూక్ వికెట్ తీసిన ఆనందంలో వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్న వైనం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. సింక్లెయిర్.. బ్రూక్ ఔట్ అవ్వగానే గాల్లోకి పల్టీలు కొడుతూ క్రేజీగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. సింక్లెయిర్‌కు ఇలాంటి సెలబ్రేషన్స్ కొత్తేమీ కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన తన తొలి మ్యాచ్‌లోనూ ఇలాంటి సంబురాలే చేసుకున్నాడు. -
ఓలీ పోప్ సూపర్ సెంచరీ.. 416 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
నాటింగ్హమ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ అదరగొట్టింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 88.3 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో మిడిలార్డర్ బ్యాటర్ ఓలీ పోప్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.121 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌తో 121 పరుగులు చేశాడు. అతడితో పాటు బెన్ డకెట్ (71; 14 ఫోర్లు), స్టోక్స్ (69; 8 ఫోర్లు) రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోషఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. సింక్లైర్, సీల్స్, హోడ్జ్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అరుదైన ఫీట్ నమోదు చేసింది. ఇంగ్లండ్ 4.2 ఓవర్లలో 50 పరుగులు చేసి టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన జట్టుగా తమ పేరిటే ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. 1994లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ 4.3 ఓవర్లలో 50 పరుగులు సాధించింది. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (జులై 18) మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. కేవలం 4.2 ఓవర్లలో 50 పరుగుల మార్కును తాకింది. టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైన టీమ్ ఫిఫ్టి ఇదే. గతంలోనూ ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిటే ఉండింది. 1994లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4.3 ఓవర్లలో 50 పరుగుల మార్కును తాకింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-3 టీమ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టిలు ఇంగ్లండ్ పేరిటే నమోదై ఉన్నాయి. 2002లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 5 ఓవర్లలో ఫిఫ్టి కొట్టింది. టెస్ట్‌ల్లో ఇది మూడో వేగవంతమైన టీమ్ ఫిఫ్టి.Fifty-up in five overs!PS: First innings in a Test match 🤯pic.twitter.com/lPQnv883iv— CricTracker (@Cricketracker) July 18, 2024ప్రస్తుత మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున ఇది మూడో వేగవంతమైన అర్ద సెంచరీ. 1981-82లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఇయాన్ బోథమ్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ జానీ బెయిర్‌స్టో పేరిట రికార్డై ఉంది. 2022లో న్యూజిలాండ్‌పై బెయిర్‌స్టో 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ పేరిట ఉంది. 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మిస్బా కేవలం 21 బంతుల్లోనే అర్ద సెంచరీ బాదాడు.26 ఓవర్లలో 134/2ఈ మ్యాచ్‌లో డకెట్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో ఇంగ్లండ్ భారీ స్కోర్‌కు పునాది వేసుకుంది. డకెట్ ఓవరాల్‌గా 59 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో 71 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ (జాక్ క్రాలే డకౌట్).. డకెట్, ఓలీ పోప్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 26 ఓవర్ల తర్వాత (లంచ్ బ్రేక్) ఇంగ్లండ్ స్కోర్ 134/2గా ఉంది. పోప్ (47), రూట్ (13) క్రీజ్‌లో ఉన్నారు. క్రాలే వికెట్ అల్జరీ జోసఫ్‌కు.. డకెట్ వికెట్ షమార్ జోసఫ్‌కు దక్కింది. -
బెన్ డకెట్ మెరుపు హాఫ్ సెంచరీ
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (జులై 18) మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున ఇది మూడో వేగవంతమైన అర్ద సెంచరీ. 1981-82లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఇయాన్ బోథమ్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ జానీ బెయిర్‌స్టో పేరిట రికార్డై ఉంది. 2022లో న్యూజిలాండ్‌పై బెయిర్‌స్టో 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ పేరిట ఉంది. 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మిస్బా కేవలం 21 బంతుల్లోనే అర్ద సెంచరీ బాదాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. డకెట్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో భారీ స్కోర్‌కు పునాది వేసుకుంది. డకెట్ ఓవరాల్‌గా 59 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో 71 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ (జాక్ క్రాలే డకౌట్).. డకెట్, ఓలీ పోప్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 26 ఓవర్ల తర్వాత (లంచ్ బ్రేక్) ఇంగ్లండ్ స్కోర్ 134/2గా ఉంది. పోప్ (47), రూట్ (13) క్రీజ్‌లో ఉన్నారు. క్రాలే వికెట్ అల్జరీ జోసఫ్‌కు.. డకెట్ వికెట్ షమార్ జోసఫ్‌కు దక్కింది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇది రెండో మ్యాచ్. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌కు చివరి మ్యాచ్.ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అరంగేట్రం పేసర్ గస్ అట్కిన్సన్ చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో అదరగొట్టాడు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన ఆండర్సన్ పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒకటి, సెకెండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్వెస్టిండీస్ ప్లేయింగ్ XI: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాషువా డ సిల్వా (వికెట్‌కీపర్), జేసన్ హోల్డర్, గుడకేష్ మోటీ, అల్జరీ జోసెఫ్, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్ -
ఇటీవలే రిటైర్మెంట్: తిరిగి ఇంగ్లండ్ జట్టుతో చేరిన ఆండర్సన్
ఇంగ్లండ్ మాజీ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. మళ్లీ ఇంగ్లిష్ జట్టుతో మమేకం కానున్నాడు. ఈ దిగ్గజ పేసర్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తొలి టెస్టు అనంతరం(శుక్రవారం) ఆండర్సర్ ఆటగాడిగా తన కెరీర్ ముగిస్తున్నట్లు ప్రకటించాడు. లార్డ్స్ వేదికగా సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతడు.. అదే మైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడేశాడు.కొత్త పాత్రలో ఆండర్సన్ఇరవై ఒక్క సుదీర్ఘ టెస్టు కెరీర్లో ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ ఏకంగా 704 వికెట్లు పడగొట్టాడు. తద్వారా టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన మురళీధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708 వికెట్లు) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు ఆండర్సన్.ఇక అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరొందిన జేమ్స్ ఆండర్సన్ సేవలను వినియోగించుకోవాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావించింది. ఈ క్రమంలో అతడు ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.అప్పటి వరకేనా?వెస్టిండీస్‌తో మిగిలిన రెండు టెస్టులు ముగిసే వరకు అతడు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు తెలుస్తోంది. కాగా నాటింగ్‌హాం వేదికగా జూలై 18- 22 వరకు రెండో టెస్టు, జూలై 26- 30 వరకు ఇరు జట్ల మధ్య మూడో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక తొలి టెస్టులో విండీస్‌ను ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఓడించిన ఇంగ్లండ్ 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉంది. కాగా రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ ఇప్పటికే తమ తుదిజట్టును ప్రకటించింది. ఆండర్సర్ స్థానంలో మార్క్‌వుడ్ జట్టులోకి వచ్చాడు.వెస్టిండీస్‌లో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్. -
21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన ఆండర్సన్
దిగ్గజ ఫాస్ట్ బౌలర్, ఇంగ్లండ్ ప్లేయర్ జిమ్మీ ఆండర్సన్ 21 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. వెస్టిండీస్‌తో ఇవాళ (జులై 12) ముగిసిన టెస్ట్ మ్యాచ్ ఆండర్సన్ కెరీర్లో చివరిది. తన చివరి మ్యాచ్‌ను జిమ్మీ గెలుపుతో ముగించాడు. ఈ మ్యాచ్‌లో అతను నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.JIMMY ANDERSON FINAL MOMENTS ON THE FIELD IN INTERNATIONAL CRICKET. 🫡🌟pic.twitter.com/24uSZqeBOK— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024ఆండర్సన్.. మైదానంలో తన చివరి క్షణాల్లో చాలా ఎమోషనల్ అయ్యాడు. సహచరులు అతన్ని ఘనంగా పెవిలియన్‌కు సాగనంపారు. లార్డ్స్ స్టేడియం మొత్తం లేచి నిలబడి ఆండర్సన్‌ను చప్పట్లతో అభినందించింది. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఆండర్సన్ భార్య, సంతానం కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆండర్సన్ చివరి వికెట్ జాషువ డసిల్వ.THE FINAL WALK OF JIMMY ANDERSON IN INTERNATIONAL CRICKET. 🥹pic.twitter.com/N2GFFDgYYT— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 202441 ఏళ్ల ఆండర్సన్ తన టెస్ట్ కెరీర్లో 188 మ్యాచ్‌లు ఆడి 26.45 సగటున 704 వికెట్లు పడగొట్టాడు. 2003లో టెస్ట్ కెరీర్ ప్రారంభించిన ఆండర్సన్ ఆంతకుముందు ఏడాదే వన్డేల్లో అరంగేట్రం చేశాడు. వన్డేల్లో జిమ్మీ 194 మ్యాచ్‌లు ఆడి 269 వికెట్లు పడగొట్టాడు. ఆండర్సన్ ఇంగ్లండ్ తరఫున టీ20లు కూడా ఆడాడు. పొట్టి ఫార్మాట్లో కేవలం 19 మ్యాచ్‌లు ఆడిన జిమ్మీ 18 వికెట్లు పడగొట్టాడు. The final Test wicket of Jimmy Anderson.21 Years. 704 Wickets. Legend. 🫡pic.twitter.com/3iK85SYxBO— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024సుదీర్ఘ కెరీర్ లెక్కలేనన్ని మైలురాళ్లను అధిగమించిన ఆండర్సన్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా కీర్తించబడతాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఆండర్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. మురళీథరన్ (800), షేన్ వార్న్ (708) మాత్రమే ఆండర్సన్ కంటే ఎక్కువ టెస్ట్ వికెట్లు పడగొట్టారు. మూడు ఫార్మాట్లలో చూసినా మురళీథరన్ (1347), షేన్ వార్నే (1001) మాత్రమే ఆండర్సన్ (987) కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. దిగ్గజ బౌలర్ రిటైర్మెంట్ సందర్భంగా యావత్ క్రికెట్ ప్రపంచం అభినందనలు తెలుపుతుంది.A lovely tribute video by England Cricket for Jimmy Anderson. 🐐❤️pic.twitter.com/AAHXj4zTJx— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అరంగేట్రం పేసర్ గస్ అట్కిన్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 12 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన అట్కిన్సన్.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో విజృంభించాడు. అట్కిన్సన్ ధాటికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు.. రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకు కుప్పకూలింది.GUARD OF HONOUR FOR JIMMY ANDERSON. 🐐- The greatest ever of England cricket!pic.twitter.com/5ks2Iz8oEy— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ అట్కిన్సన్ (7/45), ఆండర్సన్ (1/26), క్రిస్ వోక్స్ (1/29), స్టోక్స్ (1/14) ధాటికి 121 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో మికైల్ లూయిస్ (27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 371 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. జాక్ క్రాలే 76, ఓలీ పోప్ 57, జో రూట్ 68, హ్యారీ బ్రూక్ 50, జేమీ స్మిత్ 70 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ 4, గుడకేశ్ మోటీ, జేసన్ హోల్డర్ తలో 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు.LORD'S AND FAMILY OF JIMMY ANDERSON GIVING HIM ONE FINAL STANDING OVATION. 🥹❤️ pic.twitter.com/HD3mG7MYK0— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024250 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్‌ను అట్కిన్సన్ మరోసారి దెబ్బకొట్టాడు. ఈ సారి అతను ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/61) విజృంభించడంతో విండీస్ 136 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్‌తో పాటు ఆండర్సన్ (3/32), స్టోక్స్ (2/25) రాణించారు. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మోటీ (31 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
12 వికెట్లతో చెలరేగిన అట్కిన్సన్.. విండీస్‌కు ఘోర పరాభవం
లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అరంగేట్రం పేసర్ గస్ అట్కిన్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 12 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన అట్కిన్సన్.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో విజృంభించాడు. అట్కిన్సన్ ధాటికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు.. రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకు కుప్పకూలింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ అట్కిన్సన్ (7/45), ఆండర్సన్ (1/26), క్రిస్ వోక్స్ (1/29), స్టోక్స్ (1/14) ధాటికి 121 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో మికైల్ లూయిస్ (27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 371 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. జాక్ క్రాలే 76, ఓలీ పోప్ 57, జో రూట్ 68, హ్యారీ బ్రూక్ 50, జేమీ స్మిత్ 70 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ 4, గుడకేశ్ మోటీ, జేసన్ హోల్డర్ తలో 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు.250 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్‌ను అట్కిన్సన్ మరోసారి దెబ్బకొట్టాడు. ఈ సారి అతను ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/61) విజృంభించాడు. అట్కిన్సన్‌తో పాటు ఆండర్సన్ (3/32), స్టోక్స్ (2/25) రాణించడంతో విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 136 పరుగులకు కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్‌లో మోటీ (31 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దిగ్గజ ఫాస్ట్ బౌలర్ ఆండర్సన్ తన సుదీర్ఘ కెరీర్‌ను గెలుపుతో ముగించాడు. -
చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. అరుదైన రికార్డు
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో ఇంత వరకు ఏ ఇంగ్లిష్ ఆటగాడికీ సాధ్యం కాని ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్ ప్రస్తుతం వెస్టిండీస్‌తో సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య బుధవారం తొలి టెస్టు మొదలైంది.తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకేఆతిథ్య జట్టు ఆది నుంచి ఆధిపత్యం కొనసాగిస్తూ ఇన్నింగ్స్ విజయంపై కన్నేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే వెస్టిండీస్‌ను ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. 371 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది.ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విండీస్ జట్టుకు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్, అరంగేట్ర బౌలర్ గుస్ అట్కిన్సన్, కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండేసి వికెట్లు కూల్చారు.ఇన్నింగ్స్ ఓటమి దిశగా విండీస్ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికే వెస్టిండీస్ ఆరు వికెట్లు కోల్పోయి 79 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా.. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే వెస్టిండీస్ మరో 171 పరుగులు చేయాలి. అయితే, ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.ఇదిలా ఉంటే.. విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ ఓపెనర్ మిక్లే లూయీస్(14), వన్‌డౌన్ బ్యాటర్ కిర్క్ మెకాంజీ(0) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్‌లోనూ మిక్లే లూయీస్(27) స్టోక్సే అవుట్ చేయడం విశేషం.చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. అరుదైన రికార్డుఈ క్రమంలో స్టోక్స్ టెస్టుల్లో అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఇంగ్లండ్ తరఫున ఆరు వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు రెండు వందలకు పైగా వికెట్లు తీసిన తొలి ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు.ఓవరాల్‌గా.. వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్, సౌతాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కలిస్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు.కాగా 103 టెస్టుల్లో స్టోక్స్ ఇప్పటి వరకు 6320 పరుగులు సాధించాడు. ఇందులో 13 సెంచరీలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 258. ఇక టెస్టుల్లో తీసిన వికెట్లు 201.ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో పేస్ ఆల్‌రౌండర్ స్టోక్స్ బంతితో రాణించినా.. బ్యాట్‌తో మ్యాజిక్ చేయలేకపోయాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు పరుగులే చేసి గుడకేశ్ మోటీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. చదవండి: KKR: ద్రవిడ్ కాదు.. కోల్‌కతా కొత్త మెంటార్‌గా దిగ్గజ బ్యాటర్?Kallis. Sobers. Stokes. Legends only, please. #EnglandCricket | #ENGvWI pic.twitter.com/zQADWlbOnJ— England Cricket (@englandcricket) July 11, 2024 -
శెభాష్ ఆండర్సన్.. వీడ్కోలు మ్యాచ్‌లో వరల్డ్ రికార్డు
తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ నిప్పులు చేరుగుతున్నాడు. లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆండర్సన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లో ఓ కీలక వికెట్ పడగొట్టిన ఆండర్సన్.. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆదిలోనే రెండు వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బతీశాడు. అయితే తన విడ్కోలు టెస్టులో ఆండర్సన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.టెస్టు క్రికెట్ చరిత్రలో 40,000 బంతులు వేసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా ఆండర్సన్ రికార్డులెక్కాడు. ఈ మ్యాచ్‌లో తన 10వ ఓవర్ వేసిన అనంతరం ఆండర్సన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 188 టెస్టులు ఆడిన ఆండర్సన్.. 6666. 5(40000 బంతులు) ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో ఆండర్సన్ నాలుగో స్ధానంలో ఉన్నాడు. ఈ జాబితాలో దిగ్గజ స్పిన్నర్లు ఆండర్సన్ కంటే ముందు అనిల్ కుంబ్లే(44039), షేన్ వార్న్(40850), ముత్తయ్య మురళీధరన్(40705) ఉన్నారు.అదేవిధంగా ఆండర్సన్ మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో విండీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా ఆండర్సన్ నిలిచాడు. ఆండర్సన్ ఇప్పటివరకు వెస్టిండీస్‌పై 90 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(89) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కపిల్ దేవ్ రికార్డును ఆండర్సన్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో గ్లెన్ మెక్‌గ్రాత్(110) తొలి స్ధానంలో ఉన్నాడు. Jimmy Anderson, there are no words 🤯 pic.twitter.com/bBRCS1uykD— England Cricket (@englandcricket) July 11, 2024