సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో ఇంగ్లండ్‌పై గేల్ సాధించిన పరుగులు 1632. ఈ క్రమంలోనే శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరా(1625) రికార్డును అధిగమించాడు. ఇప్పటివరకూ వన్డేల్లో అత్యధిక పరుగుల సాధించిన రికార్డు కుమార సంగక్కరా పేరిట ఉండగా, దాన్ని గేల్ బ్రేక్ చేశాడు. అయితే వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు సాధించడానిక గేల్‌కు పట్టిన ఇన్నింగ్స్‌లు 34 కాగా, సంగక్కరాకు 41 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ జాబితాలో గేల్, సంగక్కరాల తర్వాత స్థానంలో వివ్ రిచర్డ్స్(1619), రికీ పాంటింగ్(1598), మహేలా జయవర్థనే(1562)లు ఉన్నారు.
ఇదిలా ఉంచితే, విండీస్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఆదిలోనే ఎవిన్ లూయిస్(2) వికెట్‌ను కోల్పోయింది. క్రిస్ వోక్స్ వేసిన మూడో ఓవర్ ఆఖరి బంతికి లూయిస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా నాలుగు పరుగుల వద్ద విండీస్ తొలి వికెట్‌ను చేజార్చుకుంది. ఆ తరుణంలో గేల్‌కు జత కలిసిన షాయ్ హోప్ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకుంది. అయితే జట్టు స్కోరు 54 పరుగుల వద్ద ఉండగా గేల్(36; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment