పాప్‌ స్టార్‌తో క్రిస్‌ గేల్‌! | Gayle Meets Pop Star Rihanna In West Indies Dressing Room | Sakshi
Sakshi News home page

పాప్‌ స్టార్‌తో క్రిస్‌ గేల్‌!

Published Tue, Jul 2 2019 3:36 PM | Last Updated on Tue, Jul 2 2019 3:44 PM

Gayle Meets Pop Star Rihanna In West Indies Dressing Room - Sakshi

చెస్టర్‌ లీ స్ట్రీట్‌:  వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా రివ‌ర్‌ సైడ్ స్టేడియంలో సోమ‌వారం వెస్టిండీస్‌-శ్రీలంక జట్ల మధ్య జ‌రిగిన మ్యాచ్‌కు అనుకోని అతిథి హాజ‌ర‌య్యారు. బార్బోడాస్‌ వెండితెర‌పై త‌ళుకులీనుతున్న రిహానా మ్యాచ్‌ను చూడటానికి వచ్చి అభిమానుల్ని అలరించారు. స్టార్ న‌టిగా, సింగ‌ర్‌గా టాప్ మోడ‌ల్‌గా ఉన్న ఆమె.. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో స్టేడియంలో సంద‌డి చేశారు. అభిమానులతో సెల్ఫీ దిగారు. ఫొటోల‌కు ఫోజులిచ్చారు. ప్రధానంగా వెస్టిండీస్ క్రికెట‌ర్ల బ్యాటింగ్‌ను తిల‌కిస్తూ చాలాసేపు వీఐవీ బాక్స్‌లో గ‌డిపారు. మ్యాచ్ మొత్తానికి ఆమె స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు.

మ్యాచ్ ముగిసిన అనంత‌రం క్రిస్ గేల్‌, బ్రాత్‌వైట్‌ల‌ను క‌లుసుకున్నారు. స్వ‌యంగా ఆమె వెస్టిండీస్ క్రికెట‌ర్ల‌ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లారు. క్రిస్‌గేల్‌ను క‌లుసుకున్నారు. అత‌నితో ఫొటో దిగారు. వెస్టిండీస్ వ‌న్‌డౌన్ బ్యాట్స్‌మెన్ పూరన్ సిక్స‌ర్‌తో సెంచ‌రీ మార్క్‌ను అందుకున్న త‌రువాత‌ అత‌నికి ఫ్ల‌యింగ్ కిస్ ఇచ్చారు. ఆ స‌మ‌యంలో ఆమె హావ‌భావాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జ‌ట్టు ప‌రాజ‌యం పాలైంది. శ్రీలంక నిర్దేశించిన 338 ప‌రుగుల ల‌క్ష్యాన్ని అందుకోలేక‌పోయింది. ల‌క్ష్యాన్ని ఛేదించ‌డానికి వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్లు అసాధార‌ణంగా పోరాడారు. ప్ర‌త్యేకించి- వ‌న్‌డౌన్ బ్యాట్స్‌మెన్ పూర‌న్ స్ఫూర్తిదాయ‌క‌మైన ఇన్నింగ్ ఆడాడు. ఓ ద‌శ‌లో మ్యాచ్‌ను వెస్టిండీస్ వైపు తిప్పుకొన్నాడు కూడా. దుర‌దృష్టం వెంటాడింది. ల‌క్ష్యానికి చేరువ‌గా వెళ్లిన స‌మ‌యంలో పూర‌న్ అవుట్ అయ్యాడు. ఫ‌లితంగా మ్యాచ్ వెస్టిండీస్ చేజారింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement