chris gayle
-
సచిన్ కాదు!.. నంబర్ వన్ వన్డే బ్యాటర్ అతడే: సెహ్వాగ్
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గురించే చర్చ. ఈ వన్డే ఫార్మాట్ టోర్నమెంట్ కోసం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో సెమీ ఫైనలిస్టులు, ఫైనల్స్ చేరే జట్లు, విజేతపై తమ అంచనాలు తెలియజేస్తూ సందడి చేస్తున్నారు.సచిన్ టెండ్కులర్కు రెండో స్థానంఈ నేపథ్యంలో భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) వన్డే క్రికెట్లో టాప్-5 ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లు వీరేనంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇందులో తన సహచర ఓపెనర్, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండ్కులర్(Sachin Tendulkar)కు వీరూ భాయ్ రెండో స్థానం ఇవ్వడం విశేషం. మరి ఆ మొదటి ప్లేయర్ ఎవరంటారా?!..అప్పుడే తొలిసారిగా చూశానుచాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ నేపథ్యంలో క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘నా ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ వన్డే బ్యాటర్లలో క్రిస్ గేల్ ఐదో స్థానంలో ఉంటాడు. అతడు గొప్ప బ్యాటర్. గొప్ప ఓపెనర్ కూడా! 2002-03లో టీమిండియా వెస్టిండీస్‌కు వెళ్లింది. నాటి ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో గేల్ మూడు శతకాలు బాదాడు.అంతర్జాతీయ స్థాయిలో ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో బ్యాక్ ఫుట్ షాట్లతో సిక్సర్లు బాదిన క్రికెటర్‌ను నేను అప్పుడే తొలిసారిగా చూశాను’’ అని సెహ్వాగ్ గేల్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇక నాలుగో స్థానంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌కు చోటిచ్చిన వీరూ భాయ్.. ‘‘డివిలియర్స్ బ్యాటింగ్ చేసే విధాననం నాకెంతో ఇష్టం. సిక్సర్లు కొట్టడంలో అతడిదొక ప్రత్యేక శైలి’’ అని పేర్కొన్నాడు.అతడిని చూసే నేర్చుకున్నాఅదే విధంగా.. పాకిస్తాన్ మాజీ స్టార్ ఇంజమామ్ ఉల్ హక్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆసియాలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో ఇంజమామ్ ఒకడు. అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. మ్యాచ్‌ను ఎలాగోలా తన ఆధీనంలోకి తెచ్చుకునేవాడు.చివరిదాకా ఇన్నింగ్స్ ఎలా కొనసాగించాలో నేను అతడిని చూసే నేర్చుకున్నా. ఓవర్‌కు ఏడు లేదంటే ఎనిమిది పరుగులు రాబట్టడం అప్పట్లో చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే, ఇంజమామ్ మాత్రం మంచినీళ్లు తాగినంత సులువుగా ఇన్నింగ్స్ ఆడేవాడు. ఎవరి బౌలింగ్‌లో ఎప్పుడు సిక్సర్లు కొట్టాలన్న విషయంపై అతడికి స్పష్టమైన అవగాహన ఉండేది’’ అని సెహ్వాగ్ కొనియాడాడు.సింహంతో కలిసి వేటకు వెళ్తున్నట్లుఇక సచిన్ టెండుల్కర్ గురించి సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరికి అభిమాన క్రికెటర్.. నాకు ఆదర్శమూర్తి అయిన సచిన్ టెండుల్కర్ గురించి చెప్పాలంటే.. ఆయనతో కలిసి బ్యాటింగ్‌కు వెళ్తుంటే... అడవిలో సింహంతో కలిసి వేటకు వెళ్తున్నట్లు ఉండేది.అప్పుడు ప్రతి ఒక్కరి కళ్లు ఆ సింహంపైనే ఉండేవి. నేను సైలెంట్‌గా నా పనిచేసుకుపోయేవాడిని’’ అని అభిమానం చాటుకున్నాడు. ఇక వన్డేల్లో అత్యుత్తమ బ్యాటర్లలో విరాట్ కోహ్లికి అగ్రస్థానం ఇచ్చిన సెహ్వాగ్.. ‘‘నంబర్ వన్ విరాట్ కోహ్లి. సరైన సమయంలో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడటం అతడికి వెన్నతో పెట్టిన విద్య.అతడొక ఛేజ్‌మాస్టర్. ఆరంభంలో ఉన్న కోహ్లికి.. ఇప్పటి కోహ్లికి చాలా తేడా ఉంది. రోజురోజుకు అతడు మరింత పరిణతి చెందుతున్నాడు. 2011-12 తర్వాత మాత్రం సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. ఫిట్నెస్, ఆటలో నిలకడ.. ఈ రెండింటిలో తనకు తానే సాటి. అద్భుతమైన ఇన్నింగ్స్‌కు అతడు పెట్టింది పేరు’’అని రన్‌మెషీన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.వీరేంద్ర సెహ్వాగ్ ఆల్‌టైమ్ బెస్ట్ టాప్-5 క్రికెటర్లు1. విరాట్ కోహ్లి(ఇండియా)2. సచిన్ టెండుల్కర్(ఇండియా)3. ఇంజమామ్ -ఉల్ -హక్(పాకిస్తాన్)4. ఏబీ డివిలియర్స్(సౌతాఫ్రికా)5. క్రిస్ గేల్(వెస్టిండీస్).చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
వరల్డ్‌క్లాస్ ప్లేయర్.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ వారికే: క్రిస్ గేల్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో విజేతగా ఎవరన్న అంశంపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(Chris Gayle) తన అంచనా తెలియజేశాడు. ఈసారి టీమిండియానే టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. కాగా 2013లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్.. 2017లో ఫైనల్ చేరింది.తటస్థ వేదికపై రోహిత్ సేనఅయితే, నాటి టైటిల్ పోరులో దాయాది పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మరోసారి ఈ వన్డే ఫార్మాట్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకోగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు నిరాకరించింది.ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)తో ఈ విషయం గురించి చర్చించగా.. తటస్థ వేదికపై రోహిత్ సేన మ్యాచ్‌లు ఆడేలా హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది. అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలుత ఈ ప్రతిపాదనకు అంగీకరించకపోయినా.. ఐసీసీ చర్యలకు ఉపక్రమించడంతో దిగివచ్చింది. దీంతో దుబాయ్ వేదికగా టీమిండియా తమ మ్యాచ్‌లు ఆడేందుకు మార్గం సుగమమైంది.రెండు గ్రూపులుమరోవైపు.. పాకిస్తాన్‌లోని రావల్పిండి, కరాచి, లాహోర్ నగరాలను వేదికలుగా ఎంపిక చేశారు. ఇక ఈ టోర్నీకి ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ అర్హత సాధించగా.. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉండగా.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి.ఇక ఫిబ్రవరి 19న పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా మ్యాచ్‌తో చాంపియన్స్ ట్రోఫీ-2025కి తెరలేవనుంది. మరోవైపు.. టీమిండియా ఫిబ్రవరి 20న ఈ ఐసీసీ ఈవెంట్లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. లీగ్ దశలో తొలుత బంగ్లాదేశ్‌తో తలపడనున్న రోహిత్ సేన.. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. అనంతంర మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడుతుంది.ఐసీసీ టోర్నీలలో అద్భుతంగాకాగా సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్-2023లో ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై తడబడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దాదాపు లక్ష మందికి పైగా ప్రేక్షకుల నడుమ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై.. టైటిల్‌ను చేజార్చుకుంది. అయితే, అనంతరం టీ20 ప్రపంచకప్-2024లో ఆఖరి వరకు జైత్రయాత్ర కొనసాగించి చాంపియన్‌గా అవతరించింది.ఇదే జోరులో చాంపియన్స్ ట్రోఫీలోనూ అడుగుపెట్టనున్న రోహిత్ సేనకు.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ మంచి సన్నాహకంగా ఉపయోగపడుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలుత నాగ్‌పూర్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. కటక్‌లో జరిగిన రెండో వన్డేలోనూ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఇక రెండో వన్డే సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చి.. విధ్వంసకర శతకం(90 బంతుల్లో 119 రన్స్) బాదడం టీమిండియాకు అతిపెద్ద సానుకూలాంశంగా పరిణమించింది.అతడొక వరల్డ్‌క్లాస్ ప్లేయర్ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడిన విండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియానే ఫేవరెట్. టైటిల్ గెలిచే జట్టు ఇదే’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ.. ‘‘అతడొక వరల్డ్‌క్లాస్ ప్లేయర్. వన్డేల్లో డబుల్ సెంచరీలు చేసిన ఘనత అతడిది. హిట్‌మ్యాన్ అతడు. వన్డేల్లో నా సిక్సర్ల రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో విఫలమైనా మెగా టోర్నీలో మాత్రం తప్పక రాణిస్తాడు’’ అని క్రిస్ గేల్ విశ్వాసం వ్యక్తం చేశాడు.చదవండి: IPL 2025: కొత్త యాజమాన్యం చేతిలోకి గుజరాత్ టైటాన్స్! -
క్రిస్ గేల్‌ను అధిగమించిన రోహిత్.. ప్రపంచ రికార్డుకు గురి
తాను బ్యాట్ ఝులిపిస్తే ప్రత్యర్థి జట్టు బౌలర్ల పరిస్థితి ఎలా ఉంటుందో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి నిరూపించాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి.. బౌండరీలు, సిక్స్‌ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రో‘హిట్’.. వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్(Chris Gayle) సిక్సర్ల రికార్డును బద్దలుకొట్టాడు. అంతేకాదు.. అరుదైన ప్రపంచ రికార్డుకు మరింత చేరువయ్యాడు.కాగా గత కొంతకాలంగా బ్యాటింగ్ కష్టాలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ.. కటక్ వన్డేతో ఫామ్‌లోకి వచ్చేశాడు. ఇంగ్లండ్(India vs England)తో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో డెబ్బై ఆరు బంతుల్లోనే శతకమార్కును అందుకుని.. తన వన్డే కెరీర్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో పన్నెండు ఫోర్లతో పాటు.. ఏడు సిక్స్‌లు ఉన్నాయి.రెండో స్థానానికి ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ రెండోస్థానానికి చేరుకున్నాడు. క్రిస్ గేల్‌ను అధిగమించి షాహిన్ ఆఫ్రిది తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 267 వన్డేలు పూర్తి చేసుకున్న రోహిత్ 338 సిక్స్‌లు బాదాడు.మరోవైపు.. వెస్టిండీస్ తరఫున 301 వన్డేల్లో గేల్ 331 సిక్సర్లు కొట్టాడు. ఇక పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది 351 సిక్స్‌లతో వన్డేల్లో అత్యధిక సిక్సర్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. అతడి ప్రపంచ రికార్డుకు రోహిత్ శర్మ ఇంకా కేవలం పదమూడు సిక్స్‌ల దూరంలో ఉన్నాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్‌గా టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ ఇప్పటికే అత్యధిక సిక్సర్ల వీరుడిగా అవతరించిన విషయం తెలిసిందే. అతడి ఖాతాలో ఏకంగా 631 సిక్స్‌లు ఉన్నాయి. రోహిత్ వన్డేల్లో 338, టీ20లలో 205, టెస్టుల్లో 88 సిక్స్‌లు బాదాడు.సిరీస్ కైవసంకాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడుతున్న టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలుత సూర్యకుమార్ బృందం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకోగా.. మరో వన్డే మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను రోహిత్ సేన 2-0తో కైవసం చేసుకుంది. కటక్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. బట్లర్ బృందాన్ని 304 పరుగులకు ఆలౌట్ చేసింది.ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ... మొత్తంగా తొంభై బంతుల్లో 119 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ మెరుపు అర్ధ శతకం(52 బంతుల్లో 60) రాణించగా.. శ్రేయస్ అయ్యర్(44), అక్షర్ పటేల్(41 నాటౌట్) మరోసారి రాణించారు.ఈ క్రమంలో 44.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. హిట్ షోతో అలరించిన రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య బుధవారం ఆఖరి వన్డే జరుగుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్‌ను దాటేసి.. -
మళ్లీ బరిలోకి దిగనున్న క్రిస్ గేల్
విండీస్ విధ్వంసకర ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (Chris Gayle) మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఫిబ్రవరి 22 నుంచి భారత్‌లో జరుగనున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (International Masters League) అరంభ ఎడిషన్‌లో (2025) గేల్ విండీస్ తరఫున బరిలోకి దిగుతాడు. ఈ టోర్నీలో గేల్‌తో పాటు సౌతాఫ్రికా మాజీ పేసర్ మఖాయా ఎన్తిని (Makhaya Ntini), ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ (Monty Panesar) బరిలోకి దిగనున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లకు చెందిన మాజీలు, దిగ్గజాలు ఈ టోర్నీలో పాల్గొంటారు.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో భారత్‌కు సచిన్ టెండూల్కర్, శ్రీలంకకు కుమార సంగక్కర, వెస్టిండీస్‌కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్‌కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నారు. ఈ టోర్నీలో ఇండియన్ మాస్టర్స్‌కు ప్రాతినిథ్యం వహించేందుకు యువరాజ్ సింగ్ ఇటీవలే తన సమ్మతిని తెలిపాడు.ఈ టోర్నీ మొత్తం మూడు వేదికల్లో నిర్వహించబడుతుంది. మొదటి ఐదు మ్యాచ్‌లు నవీ ముంబైలో జరుగనుండగా.. ఆతర్వాతి ఆరు మ్యాచ్‌లకు రాజ్‌కోట్ వేదిక కానుంది. చివరి ఏడు మ్యాచ్‌లతో పాటు నాకౌట్ మ్యాచ్‌లు రాయ్‌పూర్‌లో జరుగనున్నాయి.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆరంభ ఎడిషన్ రౌండ్ రాబిన్ పద్దతిలో జరుగనుంది. ఈ దశలో ప్రతి జట్టు మిగతా ఐదు జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది. రౌండ్ రాబిన్ దశ అనంతరం మొదటి నాలుగు స్థానాల్లో ఉండే జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌లో విజేతలు మార్చి 16న రాయ్‌పూర్‌లో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.ఈ టోర్నీలోని మ్యాచ్‌లన్నీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి. కలర్స్ సినీప్లెక్స్ (SD & HD), కలర్స్ సినీప్లెక్స్ సూపర్‌హిట్స్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లో శ్రీలంక.. భారత జట్టుతో తలపడుతుంది.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో భారత జట్టు (అంచనా): సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శిఖర్ ధవన్, రాహుల్ శర్మ, నమన్ ఓఝా, స్టువర్ట్ బిన్నీ, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి, సౌరభ్ తివారి, ప్రజ్ఞాన్ ఓఝా -
చరిత్రపుటల్లోకెక్కిన పోలార్డ్
విండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పోలార్డ్ పొట్టి క్రికెట్లో ఓ అరుదైన ఘనత సాధించాడు. పోలీ టీ20 ఫార్మాట్లో 900 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో పోలార్డ్‌కు ముందు క్రిస్ గేల్ మాత్రమే 900 సిక్సర్ల మార్కును తాకాడు. గేల్ 463 మ్యాచ్‌ల్లో 1056 సిక్సర్లు బాదగా.. పోలార్డ్ తన 690వ మ్యాచ్‌లో 900 సిక్సర్ల మార్కును తాకాడు.టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు..క్రిస్ గేల్ 1056 (463 మ్యాచ్‌లు)కీరన్ పోలార్డ్ 901 (690 మ్యాచ్‌లు)ఆండ్రీ రసెల్ 727 (529 మ్యాచ్‌లు)నికోలస్ పూరన్ 593 (376 మ్యాచ్‌లు)కొలిన్ మున్రో 550 (434 మ్యాచ్‌లు)కాగా, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో (ILT20 2025) భాగంగా డెసర్ట్ వైపర్స్‌తో నిన్న (జనవరి 16) జరిగిన మ్యాచ్‌లో పోలీ 900 సిక్సర్స్ క్లబ్లో చేరాడు. ఈ మ్యాచ్‌లో పోలార్డ్ (ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్) 23 బంతుల్లో 2 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. ఎంఐ ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో పోలార్డే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పోలార్డ్ మెరిసినా ఎంఐ ఎమిరేట్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో కుసాల్ పెరీరా 33, ముహమ్మద్ వసీం 18, టామ్ బాంటన్ 15, నికోలస్ పూరన్ 15, పోలార్డ్ 36, మౌస్లీ 15, రొమారియో షెపర్డ్ 16 (నాటౌట్), అకీల్ హొసేన్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. డెసర్ట్ వైపర్స్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ 2, డేవిడ్ పేన్, వనిందు హసరంగ, డాన్ లారెన్స్ తలో వికెట్ పడగొట్టారు.160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వైపర్స్ మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ఫకర్ జమాన్ (52 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించి వైపర్స్‌ను గెలిపించాడు. ఆఖర్లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలెక్స్ హేల్స్ 34, సామ్ కర్రన్ 28 పరుగులు చేసి వైపర్స్ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. డాన్ లారెన్స్ (5), ఆజమ్ ఖాన్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో జహూర్ ఖాన్, డాన్ మౌస్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్ సలామ్‌ఖీల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో వైపర్స్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. -
వారెవ్వా!.. యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు
సిడ్నీ టెస్టు సందర్భంగా టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు రాబట్టిన భారత్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు.ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)తో టీమిండియా ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా తొలి టెస్టులో గెలిచిన భారత్.. అనంతరం అడిలైడ్‌లో ఓడి, బ్రిస్బేన్‌లో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అనంతరం మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. 1-2తో వెనుకబడింది.ఈ క్రమంలో చావో రేవో తేల్చుకునేందుకు సిడ్నీ వేదికగా ఆసీస్‌తో ఈ సిరీస్‌లో ఆఖరిదైన ఐదో టెస్టు శుక్రవారం మొదలుపెట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కంగారూలను 181 పరుగులకే కట్టడి చేసి.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.స్టార్క్‌కు చుక్కలు చూపించిన జైసూఇక వచ్చీ రావడంతో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc)కు చుక్కలు చూపించాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన అతడి బౌలింగ్‌లో చితకబాదాడు. మొదటి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయిన జైసూ.. తర్వాత వరుసగా మూడు బంతులను బౌండరీకి తరలించాడు. తద్వారా పన్నెండు పరుగులు పించుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఐదో బంతిని వదిలేశాడు.మళ్లీ ఓవర్లో ఆఖరి బంతికి మాత్రం జైస్వాల్ తన ప్రతాపం చూపించాడు. వైడ్ ఆఫ్ దిశగా వచ్చిన బంతిని ఎక్స్ ట్రా కవర్ వేదికగా ఫోర్ బాదాడు. ఈ క్రమంలో మొదటి ఓవర్లోనే జైస్వాల్ పదహారు పరుగులు రాబట్టాడు. తద్వారా టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు(ఆరు బంతుల్లో 16 పరుగులు) చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్అంతకుముందు 2005లో వీరేంద్ర సెహ్వాగ్ తొలి ఓవర్లో 13 పరుగులు రాబట్టాడు. అనంతరం.. 2023లో రోహిత్ శర్మ సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. అయితే, సిడ్నీ టెస్టు సందర్భంగా జైస్వాల్ వీరిద్దరి పేరిట సంయుక్తంగా ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు జైస్వాల్. టెస్టుల్లో తొలి ఓవర్లోనే నాలుగు ఫోర్లు బాదిన క్రికెటర్‌గా మైకేల్ స్లాటర్, క్రిస్ గేల్ సరసన నిలిచాడు.టెస్టుల్లో తొలి ఓవర్లోనే అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్లుగా ప్రపంచ రికార్డు👉మైకేల్ స్లాటర్- 2001లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- బర్మింగ్‌హామ్- నాలుగు ఫోర్లు- 18 పరుగులు👉క్రిస్ గేల్- 2012లో వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్, ఆంటిగ్వా- నాలుగు ఫోర్లు- 16 పరుగులు👉యశస్వి జైస్వాల్- 2024లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, సిడ్నీ- నాలుగు ఫోర్లు- 16 పరుగులు.పంత్ దూకుడు.. రెండో రోజు పరిస్థితి ఇదీఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి టీమిండియా 32 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన నాలుగు పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ఓవరాల్‌గా 145 పరుగుల లీడ్‌లో ఉంది. జైస్వాల్ 35 బంతుల్లో 22 పరుగులు సాధించగా.. కేఎల్ రాహుల్(13), శుబ్‌మన్ గిల్(13), విరాట్ కోహ్లి(6) మరోసారి విఫలమయ్యారు.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న రిషభ్ పంత్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 29 బంతుల్లోనే యాభై పరుగులతో మెరుపు అర్ధ శతకం సాధించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 61 పరుగులు చేశాడు. కమిన్స్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.ఇక పంత్ అవుటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ నెమ్మదించింది. నితీశ్ రెడ్డి నాలుగు పరుగులకే నిష్క్రమించగా.. రవీంద్ర జడేజా(39 బంతుల్లో 8), వాషింగ్టన్ సుందర్(17 బంతుల్లో 6) పరుగులతో అజేయంగా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు, కమిన్స్, బ్యూ వెబ్‌స్టర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: IND vs AUS: పంత్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డుSometimes JaisWall, sometimes JaisBall! 🔥Another #YashasviJaiswal 🆚 #MitchellStarc loading? 🍿👀#AUSvINDOnStar 👉 5th Test, Day 2 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/W4x0yZmyO9— Star Sports (@StarSportsIndia) January 4, 2025 -
కివీస్ పేసర్ భారీ హిట్టింగ్.. క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డు సమం
తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న న్యూజిలాండ్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును సౌథీ సమం చేశాడు. కివీస్ జట్టు సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడుతోంది.మరో మ్యాచ్ మిగిలి ఉండగానేఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో పర్యాటక ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం నామమాత్రపు మూడో టెస్టు మొదలైంది.లాథమ్, సాంట్నర్ ఫిఫ్టీలుహామిల్టన్లోని సెడాన్ పార్కులో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌తో శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ (135 బంతుల్లో 63; 9 ఫోర్లు), మిచెల్ సాంట్నర్ (54 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.మరోవైపు.. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (44; 9 ఫోర్లు), విల్ యంగ్ (42; 10 ఫోర్లు) రాణించారు. అయితే, ఒక దశలో 172/2తో పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్... మిడిలార్డర్ వైఫల్యంతో 231/7కు పరిమితమైంది. రచిన్ రవీంద్ర (18), డరైన్ మిషెల్ (14), టామ్ బ్లన్‌డెల్ (21), గ్లెన్ ఫిలిప్స్ (5) విఫలమయ్యారు.చెలరేగిన సౌథీమరికాసేపట్లో ఇన్నింగ్స్ ముగియడం ఖాయమే అనుకుంటున్న దశలో ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ చెలరేగాడు. ఈ మ్యాచ్‌తో టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకనున్న టిమ్ సౌథీ (10 బంతుల్లో 23; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా దుమ్ము రేపడంతో న్యూజిలాండ్ మూడొందల మార్కు దాటగలిగింది. వీరిద్దరి ధాటికి కివీస్ టి20 తరహాలో చివరి 8 ఓవర్లలో 76 పరుగులు రాబట్టడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్, గస్ అట్కిన్సన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.టెస్టు క్రికెట్లో భారీ సిక్స్‌లకు పెట్టింది పేరైన సౌథీకాగా టెస్టు క్రికెట్లో భారీ సిక్స్‌లకు పెట్టింది పేరైన సౌథీ ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో... క్రిస్ గేల్ (98 సిక్స్‌లు)తో సమంగా నాలుగో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో ఉన్నది వీరేఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (133 సిక్స్‌లు) అగ్ర స్థానంలో ఉండగా... న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ (107 సిక్స్‌లు), ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (100 సిక్స్‌లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు.ఇక టీమిండియా నుంచి వీరేంద్ర సెహ్వాగ్ (91 సిక్స్‌లు), రోహిత్ శర్మ (88 సిక్స్‌లు) ఈ జాబితాలో వరుసగా ఆరో, ఏడో స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ తరఫున 107వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న సౌథీ... ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.ఇంగ్లండ్ 143 ఆలౌట్ఆదివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కివీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 143 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ ఆట పూర్తయ్యేసరికి 32 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 340 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
టీ20 క్రికెట్ పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా పదకొండు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌ను అధిగమించి.. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.పాక్‌కు చేదు అనుభవంసౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా బాబర్ ఆజం ఈ ఘనత సాధించాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లింది. ఈ పర్యటన టీ20 సిరీస్‌తో మొదలుకగా.. పాక్‌కు చేదు అనుభవం ఎదురైంది.డర్బన్‌లో జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ప్రొటీస్ జట్టు చేతిలో 11 పరుగుల తేడాతో ఓడిన పాకిస్తాన్.. సెంచూరియన్‌లో శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. సౌతాఫ్రికా చేతిలో ఏడు వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది పాక్.సయీమ్ ఆయుబ్ ధనాధన్ ఇన్నింగ్స్ వృథాఓపెనర్ సయీమ్ ఆయుబ్(57 బంతుల్లో 98 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌కు తోడు.. బాబర్ ఆజం(20 బంతుల్లో 31), ఇర్ఫాన్ ఖాన్(16 బంతుల్లో 30) రాణించడంతో భారీ స్కోరు సాధించింది. అయితే, సౌతాఫ్రికా బ్యాటర్లలో రీజా హెండ్రిక్స్ సూపర్ సెంచరీ(63 బంతుల్లో 117), రాసీ వాన్ డెర్ డసెన్(38 బంతుల్లో 66) అద్భుత అర్ధ శతకం కారణంగా పాక్‌కు ఓటమి తప్పలేదు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఘనంగా(31, 3 ఫోర్లు, ఒక సిక్సర్)నే ఇన్నింగ్స్‌ను ఆరంభించినా.. దానిని భారీ స్కోరుగా మలుచుకోలేకపోయాడు. అయినప్పటికీ పొట్టి ఫార్మాట్లో అతడు అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.గేల్ ప్రపంచ రికార్డును బద్దలుసౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా బాబర్ ఆజం షార్టెస్ట్ క్రికెట్లో ఓవరాల్‌గా 11,020 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో గేల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. పదకొండు వేల పరుగుల మార్కును అందుకోవడానికి గేల్‌కు 314 ఇన్నింగ్స్ అవసరమైతే.. బాబర్ 298 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. అయితే, ఓవరాల్‌గా మాత్రం అంతర్జాతీయ, ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో గేల్ యూనివర్సల్ బాస్‌గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 14562 టీ20 రన్స్ ఉన్నాయి.టీ20 క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్‌లో 11000 పరుగులు సాధించిన ఆటగాళ్లు1. బాబర్ ఆజం- 298 ఇన్నింగ్స్2. క్రిస్ గేల్- 314 ఇన్నింగ్స్3. డేవిడ్ వార్నర్- 330 ఇన్నింగ్స్4. విరాట్ కోహ్లి- 337 ఇన్నింగ్స్.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
టీ20ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ.. గేల్, పంత్ రికార్డులు బద్దలు
టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదైంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ ఆటగాడు ఉర్విల్ పటేల్.. 28 బంతుల్లోనే (త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో) శతక్కొట్టాడు. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇది సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కాగా.. భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో ఇది ఫాస్టెస్ట్ సెంచరీగా రికార్డైంది.గేల్, పంత్ రికార్డులు బద్దలుటీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీని చేరుకునే క్రమంలో ఉర్విల్.. క్రిస్ గేల్, రిషబ్ పంత్‌ల రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20ల్లో గేల్ 30 బంతుల్లో శతక్కొట్టగా.. పంత్ 32 బంతుల్లో సెంచరీ బాదాడు.సాహిల్ చౌహాన్ పేరిట ఫాస్టెస్ట్ సెంచరీపొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. చౌహాన్ ఈ ఏడాదే సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో శతక్కొట్టాడు. ఉర్విల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కేవలం ఒక్క బంతితో మిస్ అయ్యాడు.భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీటీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రిషబ్ పేరిట ఉండగా.. తాజాగా ఉర్విల్ పంత్ రికార్డును బద్దలు కొట్టాడు. త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో 35 బంతులు ఎదుర్కొన్న ఉర్విల్ 7 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.లిస్ట్-ఏ క్రికెట్లోనూ ఫాస్టెస్ట్ సెంచరీభారత్ తరఫున లిస్ట్-ఏ క్రికెట్లోనూ సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉర్విల్ పేరిటే ఉంది. 2023 నవంబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ పేరిట ఉంది. 2010లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్ 40 బంతుల్లో సెంచరీ బాదాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. శ్రీదమ్ పాల్ (57) అర్ద సెంచరీతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో నగస్వల్లా అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన గుజరాత్ 10.2 ఓవర్లలోనే (2 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఉర్విల్ సునామీ శతకంతో విరుచుకుపడగా.. ఆర్య దేశాయ్ (38) మరో ఎండ్ నుంచి ఉర్విల్‌కు సహకరించాడు.ఎవరీ ఉర్విల్ పటేల్..?26 ఏళ్ల ఉర్విల్ బరోడాలోని మెహసానాలో జన్మించాడు. 2018లో అతను బరోడా తరఫున టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది అతను లిస్ట్-ఏ క్రికెట్లోకి కూడా అడుగుపెట్టాడు. అయితే ఆతర్వాత ఉర్విల్‌కు ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసేందుకు ఆరేళ్లు పట్టింది. ఉర్విల్ గతేడాదే రంజీల్లోకి అడుగుపెట్టాడు.గుజరాత్ టైటాన్స్ వదిలేసింది..!ఉర్విల్‌ను 2023 ఐపీఎల్ సీజన్ వేలంలో గుజరాత్ టైటాన్స్ 20 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్లో ఉర్విల్‌కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. ఉర్విల్‌ను గుజరాత్ టైటాన్స్ 2025 మెగా వేలానికి ముందు వదిలేసింది. రెండు రోజుల కిందట జరిగిన మెగా వేలంలో ఉర్విల్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఉర్విల్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. తాజా ఇన్నింగ్స్ నేపథ్యంలో ఫ్రాంచైజీలు మనసు మార్చుకుంటాయేమో వేచి చూడాలి. -
LLC 2024: క్రిస్ గేల్ ఊచకోత.. ధావన్ మెరుపులు (వీడియో)
విండీస్ దిగ్గజం క్రిస్ గేల్, భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటకి తమలో ఏమాత్రం జోరుతగ్గలేదని మరోసారి నిరూపించారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ)2024లో గేల్, ధావన్ మెరుపులు మెరిపించారు.ఈ లీగ్‌లో గుజరాత్ గ్రేట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఇద్దరూ లెజెండరీ క్రికెటర్లు.. శుక్రవారం కోనార్క్ సూర్యాస్ ఓడిశా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగారు. కోనార్క్ జట్టు కెప్టెన్ టాస్ గెలిచి తొలుత గుజరాత్ టీమ్‌ను బ్యాటింగ్ ఆహ్హనించాడు.గుజరాత్ గ్రేట్స్ ఓపెనర్ మోర్నీ వ్యాన్ వాయక్(2)ను ఆదిలోనే పేసర్ వినయ్ కుమార్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గేల్..ధావన్‌తో కలిసి ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.గేల్ 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 పరుగులు చేయగా.. ధావన్ 24 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరితో ప్రసన్న(31) పరుగులతో రాణించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ గ్రేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు చేసింది.అనంతం 142 పరుగుల లక్ష్యంతో దిగిన కోనార్క్ కేవలం 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోనార్క్ బ్యాటర్లలో మునివీరా(47) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓబ్రియన్(43) పరుగులతో రాణించాడు.Chris Gayle 🤝 Shikhar Dhawan. 🔥- Gabbar and universe Boss together in the LLC. 🤯 pic.twitter.com/N8r4pbtQ3f— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2024 -
చరిత్ర సృష్టించిన పూరన్
విండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ టీ20ల్లో ఓ అరుదైన సిక్సర్ల రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భీకర ఫామ్‌లో ఉన్న పూరన్.. టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 150 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో ఏడు సిక్సర్లు బాదిన పూరన్ ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో 63 ఇన్నింగ్స్‌లు ఆడి 151 సిక్సర్లు బాదాడు. పూరన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఇప్పటివరకు 21 సిక్సర్లు బాదాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో పూరన్ తర్వాతి స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2015లో 135.. 2012లో 121 సిక్సర్లు బాదాడు.పేట్రియాట్స్‌తో మ్యాచ్‌లో 43 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 93 పరుగులు చేసిన పూరన్.. మరో అరుదైన ఘనత కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. పూరన్ ఈ ఏడాది టీ20ల్లో 2022 పరుగులు చేశాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మొహమ్మద్ రిజ్వాన్ పేరిట ఉంది. రిజ్వాన్ 2021లో 48 ఇన్నింగ్స్‌ల్లో 2036 పరుగులు చేశాడు. పూరన్ తర్వాతి స్థానంలో అలెక్స్ హేల్స్ ఉన్నాడు. హేల్స్ 2022లో 61 మ్యాచ్‌లు ఆడి 1946 పరుగులు చేశాడు.సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ (పూరన్ జట్టు) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్ (61 బంతుల్లో 93; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కైల్ మేయర్స్ (30 బంతుల్లో 60; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో చెలరేగారు.అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించడంతో 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పూరన్‌తో పాటు జేసన్ రాయ్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.కాగా, ఈ మ్యాచ్ గెలుపుతో సంబంధం లేకుండా నైట్‌రైడర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. నైట్‌రైడర్స్‌తో పాటు సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్, బార్బడోస్ రాయల్స్ ఈ సీజన్ ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఈ సీజన్ నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయ్యాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు అక్టోబర్ 1, 2, 4 తేదీల్లో జరుగనున్నాయి. అక్టోబర్ 6న ఫైనల్ జరుగుతుంది. చదవండి: రాణించిన గబ్బర్.. అయినా డీకే జట్టు చేతిలో ఓటమి -
అశ్విన్ దృష్టిలో బెస్ట్ ఐపీఎల్ టీం ఏది?
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఆల్‌టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించాడు. ఈ జట్టుకు కెప్టెన్ కమ్ వికెట్‌కీపర్‌గా ఎంఎస్ ధోనిని ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. వన్‌డౌన్‌లో సురేశ్ రైనా, నాలుగో స్థానం కోసం సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేశాడు. ఐదో స్థానంలో ఏబీ డివిలియర్స్, ఆరో స్థానంలో ధోని, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా సునీల్ నరైన్, రషీద్ ఖాన్, పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా పేర్లను ప్రకటించాడు.అశ్విన్ తన ఆల్‌టైమ్ ఫేవరెట్ ఐపీఎల్ జట్టులో విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌కు చోటు కల్పించకపోవడం ఆసక్తికరం. అశ్విన్ తన జట్టులో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లను కూడా ఎంపిక చేయలేదు. భారత జట్టు మాజీ ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్‌కు చెందిన యూట్యూబ్ (చీకీ చీకా) ఛానల్‌తో మాట్లాడుతూ అశ్విన్ ఈ విషయాలను వెల్లడించాడు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం లేదు. ఆయా రాష్ట్రాల్లో లోకల్ టోర్నీలు జరుగుతున్నాయి. త్వరలో దులీప్ ట్రోఫీ మొదలుకానుంది. అనంతరం బంగ్లాదేశ్ భారత్‌లో పర్యటిస్తుంది. ఆటగాళ్లంతా కచ్చితంగా దులీప్ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ప్రదర్శనల ఆధారంగానే బంగ్లా సిరీస్‌కు జట్టు ఎంపిక జరుగవచ్చు. ఏది ఎలా ఉన్నా అశ్విన్ మాత్రం భారత టెస్ట్ జట్టులో తప్పక ఉంటాడు. -
క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన రోహిత్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్, రోహిత్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వన్డేల్లో ఈ ఇద్దరు చెరో 331 సిక్సర్లు బాదారు. ఈ జాబితాలో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది (351) టాప్‌లో ఉన్నాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్ తర్వాతి స్థానంలో జోస్ బట్లర్ ఉన్నాడు. బట్లర్ ఖాతాలో ప్రస్తుతం 170 సిక్సర్లు ఉన్నాయి. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ గేల్ రికార్డును సమం చేశాడు.ఈ మ్యాచ్‌లో రోహిత్ 20 బంతుల్లో ఓ సిక్సర్, 6 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. రోహిత్ ఓ మోస్తరు స్కోర్‌తో రాణించినా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59), కమిందు మెండిస్ (23 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటై 110 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), సుందర్ (30), విరాట్ కోహ్లి (20), రియాన్ పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఈ మ్యాచ్‌లో ఓటమితో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌పై విజయం సాధించింది. -
IND VS SL 3rd ODI: హిట్‌మ్యాన్ మరో రెండు సిక్సర్లు కొడితే..!
శ్రీలంకతో మూడో వన్డేకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో రెండు సిక్సర్లు కొడితే.. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్‌ను (294 ఇన్నింగ్స్‌ల్లో 331 సిక్సర్లు) వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 330 సిక్సర్లు (256 ఇన్నింగ్స్‌ల్లో) ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు పాక్ మాజీ షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 369 ఇన్నింగ్స్‌ల్లో 351 సిక్సర్లు బాదాడు.కాగా, లంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్.. గేల్ పేరిట ఉండిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు బాదిన రోహిత్.. ఛేదనలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గేల్ 177 సిక్సర్లు కొడితే.. రోహిత్ 179 సిక్సర్లు బాదాడు. ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్ రెండు మ్యాచ్‌ల్లో రెండు మెరుపు హాఫ్ సెంచరీలు చేశాడు.తొలి వన్డేలో 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసిన రోహిత్.. రెండో వన్డేలో 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. రోహిత్ రెండు వన్డేల్లో మెరిసినా భారత్ ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేకపోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో శ్రీలంక సంచలన విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో భారత్ రోహిత్ అందించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేక ఓటమిపాలైంది. సిరీస్‌లో మూడో వన్డే ఆగస్ట్ 7న జరుగనుంది. -
క్రిస్ గేల్ ఊచకోత..వయసు మీద పడినా అదే జోరు
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 44 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గడం లేదు. కెరీర్ ఉన్నతిలో ఎలా విధ్వంసం సృష్టించాడో, లేటు వయసులోనే అదే తరహాలో రెచ్చిపోతున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ది బౌలర్లను చీల్చిచెండాడు. కేవలం 40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. ఫలితంగా వెస్టిండీస్ ఛాంపియన్స్.. సౌతాఫ్రికా ఛాంప్స్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.THE CHRIS GAYLE SHOW IN WCL. 🐐70 (40) with 4 fours and 6 sixes - the vintage Universe Boss at the Edgbaston Stadium, he's hitting them cleanly. 🌟 pic.twitter.com/jM5O2Lt7uo— Mufaddal Vohra (@mufaddal_vohra) July 8, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఆష్వెల్ ప్రిన్స్ (46 నాటౌట్), డేన్ విలాస్ (44 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి 20, నీల్ మెక్కెంజీ 0, జాక్ కలిస్ 18, జస్టిన్ ఓంటాంగ్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. విండీస్ బౌలర్లలో జేసన్ మొహమ్మద్ 2, శామ్యూల్ బద్రీ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. క్రిస్ గేల్, చాడ్విక్ వాల్టన్ (29 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో 19.1 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డ్వేన్ స్మిత్ 22, జోనాథన్ కార్టర్ 6, ఆష్లే నర్స్ 0 పరుగులకు ఔట్ కాగా..వెర్నన్ ఫిలాండర్ 2, లాంగ్వెల్డ్త్, మెక్ కెంజీ తలో వికెట్ పడగొట్టారు.కాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆరు జట్లు (పాకిస్తాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా) పాల్గొంటున్న విషయం తెలిసిందే. జులై 3న ప్రారంభమైన ఈ టోర్నీలో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు జరిగాయి. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఆతర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఉన్నాయి. అన్ని జట్లలో దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన రో'హిట్'మ్యాన్ శర్మ.. రికార్డులు బద్దలు
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో నిన్న (జూన్ 27) జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో తాను చేసిన 57 పరుగుల్లో 6 ఫోర్లు బాదిన హిట్‌మ్యాన్.. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక బౌండరీలు బాదిన (43 మ్యాచ్‌ల్లో 113) ఆటగాడిగా శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే (111) రికార్డును బద్దలు కొట్టాడు. ఇదే మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కూడా బాదిన రోహిత్.. క్రిస్ గేల్ (63) తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో 50 సిక్సర్లు మార్కు తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు (22) బాదిన ఆటగాడిగా.. భారత కెప్టెన్‌గా 5000 పరుగుల మైలురాయిని దాటిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక సిక్సర్లుక్రిస్ గేల్- 63రోహిత్ శర్మ- 50జోస్ బట్లర్- 43డేవిడ్ వార్నర్- 40యువరాజ్ సింగ్- 33విరాట్ కోహ్లి- 33టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక బౌండరీలురోహిత్ శర్మ- 113జయవర్దనే- 111విరాట్- 105వార్నర్- 103తిలకరత్నే దిల్షన్- 101భారత కెప్టెన్‌గా అత్యధిక పరుగులువిరాట్- 12883ధోని- 11207అజహారుద్దీన్- 8095గంగూలీ- 7643రోహిత్- 5012ఐసీసీ నాకౌట్స్‌లో అత్యధిక సిక్సర్లురోహిత్ శర్మ- 22క్రిస్ గేల్- 21ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (57), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) భారత విజయంలో కీలకపాత్రలు పోషించారు. భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
టీ20 వరల్డ్‌కప్‌లో సిక్సర్ల సునామీ.. మనోళ్లు ఒక్కరూ లేరు!
అమెరికాతో మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ షాయీ హోప్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు.కేవలం 39 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఎనిమిది సిక్స్‌ల సాయంతో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో భాగంగా అమెరికాతో మ్యాచ్‌లో ఈ మేరకు పరుగుల విధ్వంసం సృష్టించాడు.ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ టోర్నీలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఐదో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. టీ20 ఫార్మాట్ అంటే పూనకం వచ్చినట్లుగా బ్యాట్‌తో రెచ్చిపోయే విండీస్ వీరుల జాబితాలో చేరాడు.ఇక బార్బడోస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ అమెరికాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. అద్బుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న విండీస్ స్పిన్నర్ రోస్టన్ చేజ్(3/19) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ బ్యాటర్ల సిక్సర్ల హవాఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదింది వీరే👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 11.. ఇంగ్లండ్ మీద👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 10.. సౌతాఫ్రికా మీద👉ఆరోన్ జోన్స్(అమెరికా)- 10.. కెనడా మీద👉రిలీ రొసోవ్(సౌతాఫ్రికా)-8.. బంగ్లాదేశ్ మీద👉నికోలస్ పూరన్(వెస్టిండీస్)-8.. అఫ్గనిస్తాన్ మీద👉షాయీ హోప్(వెస్టిండీస్)-8.. అమెరికా మీద..టీ20 వరల్డ్‌కప్‌లో ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు👉నికోలసన్ పూరన్(వెస్టిండీస్)- 17(2024 ఇప్పటి వరకు)👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 16(2012)👉మార్లన్ సామ్యూల్స్- 15(2012)👉షేన్ వాట్సన్- 15(2012). చదవండి: టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీకి సిద్ధం.. ఆ సిరీస్ నాటికి! View this post on Instagram A post shared by ICC (@icc) -
టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. కేవలం 27 బంతుల్లోనే.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు
టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ 27 బంతుల్లోనే శతక్కొట్టాడు. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇది వేగవంతమైన శతకం. పురుషులు, మహిళలు, అంతర్జాతీయ స్థాయి.. ఇలా ఏ విభాగంలో చూసినా ఇదే వేగవంతమైన సెంచరీ. అంతర్జాతీయ టీ20ల్లో నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లాప్టీ ఈటన్ నమోదు చేసిన ఫాస్టెస్ట్ సెంచరీని సాహిల్ చౌహాన్ కేవలం నాలుగు నెలల్లో బద్దలు కొట్టాడు. లాఫ్టీ ఈటన్ ఈ ఏడాది (2024) ఫిబ్రవరి 27న నేపాల్‌పై 33 బంతుల్లో శతక్కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో సాహిల్ సెంచరీకి ముందు ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20 ఫార్మాట్ మొత్తంలో చూసినా ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. సాహిల్‌కు ముందు ఈ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ 2013 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడుతూ పూణే వారియర్స్‌పై 30 బంతుల్లో శతక్కొట్టాడు. తాజాగా సాహిల్ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. సైప్రస్‌తో మ్యాచ్‌లో ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న సాహిల్ 144 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 18 సిక్సర్లు ఉన్నాయి. పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో (ఓ ఇన్నింగ్స్‌లో) ఓ బ్యాటర్ సాధించిన అత్యధిక సిక్సర్లు ఇవే. సాహిల్ సునామీ శతకంతో విరుచుకుపడటంతో సైప్రస్‌పై ఎస్టోనియా ఘన విజయం సాధించింది. -
నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. గేల్ రికార్డు బ్రేక్
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా పూరన్ రికార్డులకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగులు చేసిన పూరన్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. పూరన్ ఇప్పటివరకు విండీస్ తరపున 91 టీ20లు ఆడి 1914 పరుగులు చేశాడు. పూరన్ కెరీర్లో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. విండీస్ తరపున 79 మ్యాచ్‌లు ఆడిన గేల్ 1899 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో గేల్ అల్‌టైమ్ రికార్డును పూరన్ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌పై 13 పరుగుల తేడాతో విండీస్ విజయం సాధించింది.దీంతో సూపర్-8కు కరేబియన్ జట్టు అర్హత సాధించింది. అదే విధంగా విండీస్ చేతిలో ఓటమి చవిచూసిన కివీస్.. తమ సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
T20 World Cup 2024: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన క్రిస్ గేల్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా ఇవాళ (జూన్ 9) భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తేలికపాటి జల్లులు, ఔట్ ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా టాస్ అరగంట ఆలస్యమైంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:50 గంటలకు ప్రారంభమైంది.ఈ మ్యాచ్‌లో భారత్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించగా.. పాక్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఓ మార్పు చేసింది. పాక్.. వికెట్‌కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్‌కు పక్కన పెట్టి ఇమాద్ వసీంను తుది జట్టులోకి తీసుకుంది.Hitman Rohit Sharma signs Universe Boss Chris Gayle's jacket ahead of #INDvPAK clash in New York.📸: Diseny + Hotstar pic.twitter.com/aNnV3WNCE6— CricTracker (@Cricketracker) June 9, 2024సందడి చేసిన క్రిస్ గేల్..మ్యాచ్ ప్రారంభానికి ముందు విండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ న్యూయార్క్ మైదానంలో సందడి చేశాడు. ఈ సందర్భంగా గేల్ ధరించిన తెలుపు రంగు సూట్ ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. గేల్ ధరించిన సూట్‌పై (రెండు చేతులపై) భారత్, పాకిస్తాన్ జెండా రంగులు అందరినీ ఆకట్టుకున్నాయి. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ప్రత్యేకత గుర్తుగా గేల్ ఈ తరహా డ్రస్ ధరించినట్లు తెలుస్తుంది. గేల్ తన సూట్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, చహల్ తదితరుల ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నాడు. గేల్.. భారత ఆటగాళ్లతో సందడి చేసిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్ -
T20 World Cup 2024: క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన డేవిడ్ వార్నర్
ఆసీస్ వెటరన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్ చరమాంకంలో ఓ అద్భుత రికార్డు నెలకొల్పాడు. పొట్టి క్రికెట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (సెంచరీలు కలుపుకుని) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఒమన్‌తో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్సర్) మెరిసిన వార్నర్.. టీ20ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ రికార్డు సాధించే క్రమంలో వార్నర్ విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌ను అధిగమించాడు. ఒమన్‌పై హాఫ్ సెంచరీ కలుపుకుని వార్నర్ ఖాతాలో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉండగా.. గేల్ పేరిట 110 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు నమోదై ఉన్నాయి. వార్నర్ కేవలం 378 ఇన్నింగ్స్‌ల్లో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్ల మార్కు తాకగా.. గేల్‌కు 110 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసేందుకు 455 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ జాబితాలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మూడో స్థానంలో (105), పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నాలుగో స్థానంలో (101) ఉన్నారు.కాగా, బార్బడోస్ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. స్టోయినిస్ (36 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాట్‌తో చెలరేగిన స్టోయినిస్ బంతితోనూ (3-0-19-3) రాణించాడు. స్టోయినిస్‌తో పాటు జంపా (4-0-24-2), ఇల్లిస్ (4-0-28-2), స్టార్క్ (3-0-20-2) కూడా సత్తా చాటడంతో ఒమన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 36 పరుగులు చేసిన అయాన్ ఖాన్ ఒమన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
T20 WC: సిక్సర్ల సునామీ.. క్రిస్ గేల్ తర్వాత ఒకే ఒక్కడు!
టీ20 ప్రపంచకప్-2024లో యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు శుభారంభం చేసింది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో కెనడాపై సంచలన విజయం సాధించింది.డలాస్ వేదికగా ఆదివారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) జరిగిన ఈ మ్యాచ్‌లో కెనడాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. అంతర్జాతీయ టీ20లలో తమ అత్యధిక పరుగుల ఛేదనను నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. View this post on Instagram A post shared by ICC (@icc)ఇక ఈ విజయంలో యూఎస్ఏ వైస్ కెప్టెన్ ఆరోన్ జోన్స్దే కీలక పాత్ర. కెనడా విధించిన 195 పరుగుల లక్ష్య ఛేదనలో అమెరికా జట్టు ఆరంభంలోనే తడబడింది. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు స్టీవెన్ టేలర్(0), కెప్టెన్ మొనాక్ పటేల్(16) వికెట్లు కోల్పోయింది.ఆరోన్ జోన్స్ సంచలన ఇన్నింగ్స్ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్(46 బంతుల్లో 65)తో కలిసి ఆరోన్ జోన్స్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 40 బంతుల్లోనే 94 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక స్ట్రైకురేటు 235తో ఈ మేరకు పరుగుల విధ్వంసం సృష్టించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లతో పాటు ఏకంగా పది సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఆరోన్ జోన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) క్రిస్ గేల్ తర్వాత ఒకే ఒక్కడు!యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్‌గా ఆరోన్ జోన్స్ చరిత్రకెక్కాడు. కాగా యూఎస్ఏ విజయంలో కీలక పాత్ర పోషించి.. తొమ్మిదో ఎడిషన్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తొలి ఆటగాడిగానూ నిలిచాడు.టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు👉క్రిస్ గేల్- 11- ఇంగ్లండ్ మీద- 2016లో..👉క్రిస్ గేల్- 10- సౌతాఫ్రికా మీద- 2007లో..👉ఆరోన్ జోన్స్- 10- కెనడా మీద- 2024లో..👉రిలీ రొసోవ్- 8- బంగ్లాదేశ్ మీద- 2022లో. View this post on Instagram A post shared by ICC (@icc)చదవండి: జీవితంలో కష్టాలు సహజం.. ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా -
జోస్ బట్లర్ వీరోచిత సెంచరీ.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ 8 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. ఈ మ్యాచ్‌లో బట్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. ఈ విజయంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ కీలక పాత్ర పోషించాడు. ఓటమి తప్పదనుకున్న చోట బట్లర్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఆరంభంలో తడబడింది. వరుస క్రమంలో జైశ్వాల్, సంజూ శాంసన్ వికెట్లు కోల్పోయి రాజస్తాన్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పరాగ్‌తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అనంతరం పరాగ్, అశ్విన్, హెట్‌మైర్ వరుస క్రమంలో ఔటయ్యారు. దీంతో రాజస్తాన్ ఓటమి ఖాయమైందని అంతా భావించారు. కానీ క్రీజులో ఉన్న బట్లర్ మాత్రం తన పట్టును విడలేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి తన జోరును కొనసాగించాడు. తన హాఫ్ సెంచరీ పూర్తియ్యాక కేకేఆర్ బౌలర్లను బట్లర్ ఊచకోత కోశాడు. ఆఖరివరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 60 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 107 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. క్రిస్ గేల్ రికార్డు బద్దలు ఓవరాల్‌గా బట్లర్‌కు ఇది ఏడో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా బట్లర్ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం గేల్(6 సెంచరీలు) రికార్డును జోస్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో తొలి స్ధానంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి(8) ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానంలో బట్లర్(7) నిలిచాడు. Like this tweet if u witnessed jos Buttler Alone warrior century knock Jos the boss you absolutely beauty #KKRvRR | #IPL2024 pic.twitter.com/EpWGnD1OOL — 𝑃𝑖𝑘𝑎𝑐ℎ𝑢☆•° (@11eleven_4us) April 16, 2024 -
IPL 2024: యూనివర్సల్ బాస్‌తో కన్నడ బ్యూటీ.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)
-
IPL 2024: గేల్ రికార్డు సమం చేసిన బట్లర్.. రాహుల్ తర్వాత..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టడంతో (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. నిన్నటి సెంచరీతో క్యాష్ రిచ్ లీగ్‌లో సెంచరీల సంఖ్యను ఆరుకు పెంచుకున్న బట్లర్.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌తో (6) కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని షేర్ చేసుకున్నాడు. బట్లర్ తన వందో ఐపీఎల్ మ్యాచ్‌లో వంద కొట్టడం మరో విశేషం. ఐపీఎల్ చరిత్రలో బట్లర్‌కు ముందు కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. రాహుల్ సైతం తన వందో మ్యాచ్‌లో శతక్కొట్టాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి పేరిట ఉంది. బట్లర్ నిన్న సెంచరీ చేసిన మ్యాచ్‌లోనే విరాట్ కూడా సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో విరాట్ ఐపీఎల్ సెంచరీల సంఖ్య ఎనిమిదికి చేరింది. మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) కదంతొక్కడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. డుప్లెసిస్ (44) రాణించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ తన సెంచరీ పూర్తి చేసేందుకు 67 బంతులు తీసుకుని విమర్శలపాలయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఇది స్లోయెస్ట్ సెంచరీ కావడమే విరాట్‌పై విమర్శలకు కారణం. అశ్విన్ (4-0-28-0), చహల్ (4-0-34-2) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విరాట్ వేగంగా పరుగులు సాధించలేకపోయాడు. పిచ్ కూడా విరాట్ బ్యాటింగ్ సమయంలో స్పిన్నర్ల పక్షాన ఉండింది. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. బట్లర్ సుడిగాలి శతకంతో విరుచుకపడటంతో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. బట్లర్‌తో పాటు సంజూ శాంసన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రాయల్స్ విజయానికి ఆరు బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన తరుణంలో బట్లర్ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసి మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. తాజా ఓటమితో ఆర్సీబీ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. -
IPL 2024: రసెల్ సిక్సర్ల సునామీ.. గేల్ రికార్డు బద్దలు
ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ల సునామీ (25 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) సృష్టించిన రసెల్.. ఐపీఎల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లను (1322 బంతుల్లో) పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రసెల్‌కు ముందు ఈ రికార్డు క్రిస్ గేల్ (1811 బంతుల్లో) పేరిట ఉండేది. రసెల్, గేల్ తర్వాత అత్యంత వేగంగా 200 సిక్సర్లు పూర్తి చేసిన ఘనత కీరన్ పోలార్డ్‌కు (2055) దక్కింది. ఈ జాబితాలో టాప్-3 ఆటగాళ్లు విండీస్ వీరులే కావడం విశేషం. ఈ మ్యాచ్‌తో సిక్సర్ల సంఖ్యను 202కు పెంచుకున్న రసెల్.. క్యాష్ రిచ్ లీగ్‌లో 200 సిక్సర్ల మైలురాయిని తాకిన తొమ్మిదో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రసెల్‌కు ముందు గేల్ (357), రోహిత్ శర్మ (257), ఏబీ డివిలియర్స్ (251), ధోని (239), విరాట్ కోహ్లి (235), వార్నర్ (228), పోలార్డ్ (223), రైనా (203) ఈ మార్కును తాకిన వారిలో ఉన్నారు. కాగా, సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రసెల్ బ్యాటింగ్ విన్యాసాలకు హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్ (4-0-33-3) తోడు కావడంతో కేకేఆర్ చిరస్మరణీయ విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌కు చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే కీలకమైన క్లాసెన్ వికెట్‌తో పాటు షాబాజ్ అహ్మద్ వికెట్లు పడగొట్టి కేకేఆర్‌ను గెలిపించాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్‌రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54), రసెల్ (64) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్ (63; 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించినప్పటికీ సన్‌రైజర్స్ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
అక్కడా.. ఇక్కడా ఆర్సీబీ ఆటగాళ్లదే డామినేషన్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (ఐపీఎల్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ జట్టునే అధికంగా ఇష్టపడతారు. ఆర్సీబీ ప్రాతినిథ్యం వహించిన, వహిస్తున్న క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి ఆటగాళ్ల రేంజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఆర్సీబీ క్రేజ్ కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ జట్టు ఆటగాళ్ల క్రేజ్ మహిళల ఐపీఎల్‌లోనూ (డబ్ల్యూపీఎల్) ఇదే రేంజ్లో ఉంది. డబ్ల్యూపీఎల్‌లోనూ ఆర్సీబీ టైటిల్ సాధించకపోయినా విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తాజా డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరి తమ తొలి టైటిల్‌పై అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తుంది. నేడు జరుగబోయే ఫైనల్లో స్మృతి మంధన నేతృత్వంలోని ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఆర్సీబీ కేవలం క్రేజ్ విషయంలోనే తోపు కాదని గణంకాలు సూచిస్తున్నాయి. ఐపీఎల్, డబ్ల్యూపీల్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ గణాంకాలు ఆర్సీబీ ఆటగాళ్ల పేరిటే ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు (175) క్రిస్ గేల్ పేరిట ఉండగా.. మహిళల ఐపీఎల్లో ఈ రికార్డు ఆర్సీబీకే చెందిన సోఫీ డివైన్ (99) పేరిట ఉంది. బౌలింగ్ విషయానికొస్తే.. ఐపీఎల్లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/12) ఆర్సీబీ బౌలర్ అల్జరీ జోసఫ్ పేరిట ఉండగా.. డబ్ల్యూపీఎల్‌లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/15) ఎల్లిస్ పెర్రీ పేరిట ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ డామినేషన్ ఏ రేంజ్లో సాగుతుందో ఇట్టే అర్దమవుతుంది. -
ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ హీరోలు వీరే.. 2024 సీజన్లో ఎవరు..?
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి మరో 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మార్చి 22న ఈ సీజన్ తొలి మ్యాచ్ జరుగనుంది. ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. సీజన్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ టాప్ రికార్డు అయిన ఆరెంజ్ క్యాప్‌పై (అత్యధిక పరుగులు) ఓ లుక్కేద్దాం. ఐపీఎల్ తొలి ఎడిషన్ (2008) నుంచే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఐపీఎల్ తొలి ఆరెంజ్ క్యాప్‌ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆటగాడు షాన్ మార్ష్ సొంతం చేసుకున్నాడు. ఆ సీజన్లో మార్ష్ 11 మ్యాచ్‌ల్లో సెంచరీ, 5 హాఫ్ సెంచరీల సాయంతో 616 పరుగులు చేసి సీజన్ టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 2009 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మాథ్యూ హేడెన్ ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. ఆ సీజన్లో హేడెన్ 12 మ్యాచ్‌ల్లో 5 అర్దసెంచరీల సాయంతో 572 పరుగులు చేశాడు. 2010 ఎడిషన్ విషయానికొస్తే.. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 15 మ్యాచ్‌ల్లో 618 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అనంతరం 2011, 2012 సీజన్లలో ఆర్సీబీ ఆటగాడు క్రిస్ గేల్ వరుసగా రెండు సార్లు (608, 733) ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకోగా.. 2013లో సీఎస్కే ఆటగాడు మైక్ హస్సీ (733), 2014లో కేకేఆర్ రాబిన్ ఉతప్ప (660), 2015లో సన్‌రైజర్స్ డేవిడ్ వార్నర్ (562) ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. 2016లో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి (973) లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు (ఒక సీజన్లో) చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకోగా.. 2017లో సన్‌రైజర్స్ వార్నర్ (692), 2018లో సన్‌రైజర్స్ కేన్ విలియమ్సన్ (735), 2019లో వార్నర్ (692) ముచ్చటగా మూడో సారి, 2020లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కేఎల్ రాహుల్ (670), 2021లో సీఎస్కే రుతురాజ్ గైక్వాడ్ (635), 2022లో రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్లర్ (863), 2023లో గుజరాత్ టైటాన్స్ శుభ్‌మన్ గిల్ (890) ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నారు. మరి ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుచుకుంటారో కామెంట్లో తెలియజేయండి. -
బాబర్ ఆజమ్ విధ్వంసం.. టీ20ల్లో 11వ శతకం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజమ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో బాబర్.. 59 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 63 బంతులను ఎదుర్కొన్న బాబర్.. 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 111 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబర్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. సైమ్ అయూబ్ (38) కాస్త పర్వాలేదనిపించగా.. మొహమ్మద్ హరీస్ (2), హసీబుల్లా ఖాన్ (0), పాల్ వాల్టర్ (19), రోవ్‌మన్ పావెల్ (8) విఫలమయ్యారు. ఆఖర్లో ఆసిఫ్ అలీ (17 నాటౌట్) వేగంగా పరుగులు సాధించాడు.ఈ మ్యాచ్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 42 బంతులు తీసుకున్న బాబర్.. ఆతర్వాతి హాఫ్ సెంచరీని కేవలం 21 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2, నసీం షా, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, పొట్టి క్రికెట్లో 11వ సెంచరీ (284 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసుకున్న బాబర్.. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీల రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఈ ఫార్మాట్లో గేల్ అత్యధికంగా 22 సెంచరీలు (463 మ్యాచ్‌ల్లో) చేశాడు. -
క్రిస్ గేల్ ఊచకోత.. 46 బంతుల్లోనే 10 సిక్సర్ల సాయంతో..!
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో వెస్టిండీస్ మాజీ ఆటగాడు, తెలంగాణ టైగర్స్ ప్లేయర్ క్రిస్ గేల్ చెలరేగిపోయాడు. వీవీఐపీ ఉత్తర్‌ప్రదేశ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్ గేల్ సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఎదుర్కొన్న యూనివర్సల్ బాస్.. 3 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేశాడు. గేల్ విధ్వంకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయినప్పటికీ.. తెలంగాణ టైగర్స్ విజయం సాధించలేకపోవడం కొసమెరుపు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తర్‌ప్రదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో రికార్డు స్థాయిలో 269 పరుగులు (నాలుగు వికెట్ల నష్టానికి) చేసింది. పవన్ నేగి విధ్వంసకర శతకంతో (56 బంతుల్లో 139; 16 ఫోర్లు, 8 సిక్సర్లు), అన్షుల్ కపూర్ (45 బంతుల్లో 71; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్దశతకంతో విజృంభించారు. ఆఖర్లో కెప్టెన్ సురేశ్ రైనా (13 బంతుల్లో 27; 5 ఫోర్లు) మెరుపు వేగంతో పరుగులు చేశాడు. Chris Gayle masterclass in the IVPL. 🔥pic.twitter.com/v3ggELI13K— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2024 అనంతరం అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తెలంగాణ టైగర్స్.. క్రిస్ గేల్ రెచ్చిపోయినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. గేల్ ఔటైన తర్వాత ఆఖర్లో శశకాంత్ రెడ్డి (39), కమలేశ్ (46 నాటౌట్) తెలంగాణను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ నిర్ధేశించిన లక్ష్యానికి తెలంగాణ 46 పరుగుల దూరంలో నిలిచిపోయింది. యూపీ బౌలర్లలో క్రిస్ మోఫు 5 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ ఏడాదే కొత్తగా ప్రారంభమైన ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) ఫిబ్రవరి 23న మొదలైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ లీగ్‌లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ లాంటి స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. -
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ 2024.. జట్ల వివరాలు
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) తొలి ఎడిషన్ గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా ఇవాల్టి (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్‌లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇవాళ జరుగనున్న తొలి మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ నేతృత్వంలోని ముంబై ఛాంపియన్స్.. క్రిస్ గేల్ సారథ్యంలోని తెలంగాణ టైగర్స్‌తో తలపడుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో డబుల్ హెడర్ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ 2 గంటలకు, రాత్రి మ్యాచ్ ఏడు గంటలకు ప్రారంభమవుతాయి. ఈ టీ20 లీగ్‌ను డీడీ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్స్తో పాటు ఫ్యాన్‌కోడ్‌లో వీక్షించవచ్చు. ఈ మెగా ఈవెంట్లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్‌తో పాటు హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు. జట్ల వివరాలు.. రాజస్థాన్ లెజెండ్స్: ప్రవీణ్ కుమార్ (కెప్టెన్), ఏంజెలో పెరీరా, సీక్కుగే ప్రసన్న, పర్వీందర్ అవానా, లఖ్వీందర్ లఖా, దీపక్ మోహన్ కుక్కర్, సంజయ్ బామెల్, ఇషాన్ మల్హోత్రా, తరుణ్ కుమార్, గౌరవ్ సచ్‌దేవా, రవి కుమార్ అరోరా, లక్ష్మణ్ సింగ్, ముఖేష్ శర్మ, నరేష్ గహ్లోత్, రోహిత్ ఝలానీ, డాక్టర్ సతీష్ జైన్, నరేంద్ర కుమార్ మీనా, అమన్ వోహ్రా తెలంగాణ టైగర్స్: క్రిస్ గేల్ (కెప్టెన్), రికార్డో పావెల్, దిల్షన్ మునవీర, సుదీప్ త్యాగి, మన్‌ప్రీత్ గోనీ, మల్లికార్జున్ జగితి, రవి కుమార్, ఉమామేశ్ జి, కొడమర్తి కమలేష్, రాఘవ అమ్మిరెడ్డి, డాక్టర్ గిరి, తోట చంద్రశేఖర్, కేసరి శ్రీకాంత్, జె జగదీష్ రెడ్డి, ఎం రాజకృష్ణ, అభిజీ కదమ్, అహ్మద్ క్వాద్రీ, సమీర్ షేక్, గోవింద రాజు వీవీఐపీ ఉత్తర ప్రదేశ్: సురేష్ రైనా (కెప్టెన్), డాన్ క్రిస్టియన్, క్రిస్ ఎంఫోఫు, రజత్ భాటియా, అనురీత్ సింగ్, పర్విందర్ సింగ్, భాను సేథ్, రోహిత్ ప్రకాష్ శ్రీవాస్తవ, మిరతుంజయ్, కెఎస్ రాణా, జోగిందర్ సింగ్, వినోద్ విల్సన్, అన్షుల్ కపూర్, పర్వీన్ తహప్పర్, రాజేందర్ బిష్త్, దామోదర్ రెడ్కర్ , ప్రదీప్ కుమార్ పింటు, చంద్ర శేఖర కె, మోను కుమార్ ముంబై ఛాంపియన్స్: వీరేంద్ర సెహ్వాగ్ (కెప్టెన్), ఫిల్ మస్టర్డ్, అభిషేక్ జున్‌జున్‌వాలా, పీటర్ ట్రెగో, పంకజ్ సింగ్, గౌరంగ్ అగర్వాల్, ముఖేష్ సైనీ, అమిత్ సనన్, వినయ్ యాదవ్, నిర్వాన్ అత్రి, ప్రశాంత్ ఎ తగాడే, విజయ్ సింగ్, ఇక్బాల్ అబ్దుల్లా, విశ్వజిత్సిన్హ్ సోలన్సిన్హ్ సోలన్వాలా, సింగ్, అజయ్ సింగ్, మొహమ్మద్ జావేద్ మన్సూరి, విక్రమ్ భాస్కర్, కపిల్ మెహతా రెడ్ కార్పెట్ ఢిల్లీ: హర్షల్ గిబ్స్ (కెప్టెన్), అస్గర్ ఆఫ్ఘన్, తిసారా పెరీరా, ఇమ్రాన్ తాహిర్, అభిమన్యు మిథున్, రాజీవ్ త్యాగి, జితేంద్ర కుమార్, షాజిల్ బి, కపిల్ రాణా, విక్రమ్ ధనరాజ్ బాత్రా, బాబూరావ్ యాదవ్, అషు శర్మ, యుజ్వేందర్ సింగ్, అమిత్ శర్మ, ఆశిస్ శర్మ, మన్విన్దర్ శర్మ బిస్లా, రాకేష్ టాండేల్, విక్రాంత్ యాదవ్, అమిత్ తోమర్ ఛత్తీస్‌గఢ్ వారియర్స్: యూసుఫ్ పఠాన్ (కెప్టెన్), స్టువర్ట్ బిన్నీ, మునాఫ్ పటేల్, నమన్ ఓజా, డ్వేన్ స్మిత్, అమిత్ పాల్, రోహిత్ కుమార్ ధృవ్, ధీరజ్ జి నర్వేకర్, ఆశిష్ శర్మ, మహ్మద్ కలీం ఖాన్, అనిమేష్ శర్మ, అభిషేక్ తామ్రాకర్, జతిన్ సహాయ్ సక్సేనా, సుశాంత్ శుక్లా, సుశాంత్ శుక్లా గిరి, షాదాబ్ జకాతి, హర్‌ప్రీత్ సింగ్, క్రాంతి కుమార్ వర్మ, రూపేష్ నాయక్ -
ఫిబ్రవరి 23 నుంచి వెటరన్ ఐపీఎల్.. తెలంగాణ కెప్టెన్‌గా క్రిస్ గేల్
విధ్వంసకర బ్యాటర్లు వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, హెర్షల్ గిబ్స్, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్ మరోసారి విధ్వంసానికి రెడీ అంటున్నారు. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే వెటరన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వీరు మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు. తొలిసారి నిర్వహించబడుతున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 23న ప్రారంభమై మార్చి 3న ముగుస్తుంది. తొలుత ఈ టోర్నీని డెహ్రడూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించాలని అనుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల వేదికను గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు మారుస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్‌లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఫిబ్రవరి 23న జరుగునున్న తొలి మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ నేతృత్వంలోని ముంబై ఛాంపియన్స్.. క్రిస్ గేల్ సారథ్యంలోని తెలంగాణ టైగర్స్‌తో తలపడుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో డబుల్ హెడర్ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ 2 గంటలకు, రాత్రి మ్యాచ్ ఏడు గంటలకు ప్రారంభమవుతాయి. ఈ టీ20 లీగ్‌ను డీడీ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్స్తో పాటు ఫ్యాన్‌కోడ్‌లో వీక్షించవచ్చు. ఈ మెగా ఈవెంట్లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్‌తో పాటు హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు. -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో భాగంగా కరాచీ కింగ్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 21) జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్ (పెషావర్ జల్మీ) ఈ రికార్డును సాధించాడు. బాబర్‌కు ముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ ఈ మార్కును తాకేందుకు 285 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. బాబర్ కేవలం 271 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్, గేల్ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (299 మ్యాచ్‌లు), డేవిడ్ వార్నర్ (303), ఆరోన్ ఫించ్ (327) ఉన్నారు. ఓవరాల్‌గా టీ20ల్లో 10000 పరుగుల మార్కును ఇప్పటివరకు 12 మంది (బాబర్ సహా) క్రాస్ చేశారు. పాక్ తరఫున షోయబ్ మాలిక్, బాబర్ ఆజమ్ ఈ ఘనతను సాధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 10,000 పరుగుల మార్కును తాకిన బాబర్ 51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబరే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. బాబర్ ఒక్కడే రాణించడంతో 154 పరుగులకు ఆలౌటైంది. బాబర్‌తో పాటు రోవ్‌మన్ పావెల్ (39), ఆసిఫ్ అలీ (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. పెషావర్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు (సైమ్ అయూబ్, జీషన్, సలాంకీల్) డకౌట్లయ్యారు. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, హసన్ అలీ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ సామ్స్ 2, షోయబ్ మాలిక్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఫ్యాన్స్‌కు ఇక పండగే.. క్రిస్ గేల్ రీ ఎంట్రీ! తెలంగాణ కెప్టెన్‌గా
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మరోసారి మెరుపులు మెరిపించేందుకు సిద్దమయ్యాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో తెలంగాణ టైగర్స్ జట్టుకు క్రిస్ గేల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని క్రిస్ గేల్ స్వయంగా వెల్లడించాడు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు తొమ్మిది రోజుల పాటు డెహ్రడూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ టోర్నీ జరుగనుంది. "నాపై నాకున్న నమ్మకం, అభిమానుల హర్ష ద్వనిలు నన్ను మళ్లీ బ్యాట్ పట్టేలా చేస్తున్నాయి. వెటరన్ ప్రీమియర్ లీగ్ ద్వారా మీ యూనివర్సల్ బాస్ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. దిగ్గజ ఆటగాళ్లలతో మళ్లీ ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఐవీపీఎల్కు సిద్దమవ్వండి" అంటూ గేల్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. గేల్‌తో పాటు భారత మాజీ క్రికెటర్లు సుదీప్ త్యాగీ, మన్‌ప్రీత్ గోనీ, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రికార్డో పోవెల్ తెలంగాణ టైగర్స్ తరఫున బరిలోకి దిగనున్నారు. మొత్తం ఎన్ని జట్లు అంటే? ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు భాగం కానున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్‌లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టీ20 లీగ్‌ను డీడీ స్పోర్ట్స్‌తో పాటు యూరోస్పోర్టస్ ఛానెల్లో అభిమానులు వీక్షించవచ్చు. కాగా వీరేంద్ర సెహ్వాగ్, మునాఫ్ పటేల్, సురేశ్ రైనా, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్, యూసఫ్ పఠాన్, హెర్షల్ గిబ్స్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా ఈ టోర్నీలో భాగం కానున్నట్లు సమాచారం. -
చరిత్రకు ఆరు పరుగుల దూరంలో కోహ్లి.. కొడితే!
Ind vs Afg 3rd T20- Virat Kohli On Cusp Of Becoming...: సమకాలీన క్రికెటర్లకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఇప్పటికే ఎన్నెన్నో ఘనతలు సాధించాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20 సందర్భంగా ఈ రన్‌మెషీన్‌ను మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. రీఎంట్రీలో దూకుడుగా కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత దాదాపు పద్నాలుగు నెలల విరామం అనంతరం కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. మొహాలీ వేదికగా తొలి టీ20తోనే బరిలోకి దిగాల్సి ఉండగా.. కూతురు వామిక పుట్టినరోజు(జనవరి 11) నేపథ్యంలో ఆ మ్యాచ్‌కు దూరంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో ఇండోర్‌లో ఆదివారం నాటి రెండో టీ20 సందర్భంగా రంగంలోకి దిగిన విరాట్ కోహ్లి.. 16 బంతుల్లో 29 పరుగులతో ఆకట్టుకున్నాడు. క్రీజులో ఉన్నది కాసేపే అయినా దూకుడుగా ఆడుతూ అఫ్గన్ బౌలర్లపై విరుచుకుపడుతూ అభిమానులకు వినోదాన్ని పంచాడు. ఐపీఎల్ హోం గ్రౌంగ్లో సిక్స్‌తో ఆరంభిస్తే ఇక ఇప్పటికే ఈ సిరీస్‌ను టీమిండియా 2-0తో గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులో బుధవారం నాటి నామమాత్రపు మూడో టీ20కి ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. విరాట్ కోహ్లికి ఐపీఎల్లో హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి ఆరు పరుగులు సాధిస్తే.. టీ20 ఫార్మాట్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో క్రిస్ గేల్(14562), షోయబ్ మాలిక్(12993), కీరన్ పొలార్డ్(12430) తర్వాతి స్థానాల్లో నిలుస్తాడు. Indore ✈️ Bengaluru#TeamIndia in town for the 3⃣rd & final T20I 👏 👏#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/xKKRi6yf9W — BCCI (@BCCI) January 15, 2024 పొట్టి ఫార్మాట్లో అన్నీ కలిపి దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ(టీ20) ట్రోఫీలో భాగమైన కోహ్లి.. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సహా టీమిండియాకు ఆడుతూ.. అన్నీ కలిపి పొట్టి ఫార్మాట్లో పదకొండు వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ స్థాయిలో టీ20లలో 4037 పరుగులు సాధించిన విరాట్ కోహ్లి నంబర్ వన్(అత్యధిక రన్స్) బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అదే విధంగా.. ఐపీఎల్‌లోనూ 7263 రన్స్‌తో హయ్యస్ట్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. చదవండి: లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి.. -
Viral Video: క్రిస్ గేల్ ఏం చేశాడో చూడండి..!
విండీస్ క్రికెట్ యెధుడు, విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ గతకొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నా సోషల్‌మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉన్నాడు. యూనివర్సల్ బాస్ తరుచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటాడు. తాజాగా గేల్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో గేల్ వచ్చీపోయే వాహదారుల గ్యాస్ బిల్లులు కడుతూ, వారితో సెల్ఫీలు దిగుతూ, సరదాగా కనిపించాడు. అచ్చం గేల్లానే ఉన్న ఓ వ్యక్తి ఈ తంతు మొత్తాన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. Chris Gayle paid everyone's gas bill at the gas station. - The universal boss, Gayle...!!! 🐐pic.twitter.com/ATTqhGpahx — Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2024 గేల్ లాంటి జాలీ స్పోర్ట్స్ పర్సన్‌తో సెల్ఫీ దిగడమే ఎక్కువనుకుంటే, గ్యాస్ బిల్లులు కూడా అదనంగా కలిసొచ్చాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో గేల్ మైకంలో ఉండి ఇలా చేస్తున్నట్లున్నాడని అంటున్నారు. ఏదిఏమైనా ఏదో ఒక సరదా పని చేసి సోషల్మీడియాకెక్కడం గేల్‌కు అలవాటే. అందుకే అతనికి విశ్వవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 44 ఏళ్ల గేల్ క్రికెట్లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకుని రికార్డుల రారాజుగా కీర్తించబడుతున్నాడు. పొట్టి ఫార్మాట్లో గేల్ ఇప్పటికీ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అలాగే సిక్సర్లకు సంబంధించిన పలు రికార్డులు కూడా గేల్ ఖాతాలో ఉన్నాయి. గేల్ ఐపీఎల్లో ఏకంగా 6 సెంచరీలు బాది ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలో జరిగే దాదాపు ప్రతీ లీగ్‌లోనూ గేల్ పాల్గొన్నాడు. గేల్‌కు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌తో పాటు టెస్ట్ ఫార్మాట్లో కూడా ఘనమైన రికార్డే ఉంది. ఈ ఫార్మాట్లో అతను 103 టెస్ట్‌లు ఆడి రెండు ట్రిపుల్ సెంచరీలు సహా 15 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు బాదాడు. గేల్ వన్డేల్లో 25, టీ20ల్లో 2 సెంచరీలు చేశాడు. గేల్‌కు క్రికెట్ చరిత్రలోనే అత్యంత జాలీ క్రికెటర్‌గా పేరుంది. -
చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్.. రోహిత్, గేల్‌కు కూడా సాధ్యం కాని ఘనత సొంతం
పొట్టి ఫార్మాట్లో యూఏఈ కెప్టెన్, పాకిస్తాన్ ఆటగాడు ముహమ్మద్ వసీం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఏ ఆటగాడికి సొంతం కాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో 100 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో సిక్సర్ల వీరులుగా పేరున్న రోహిత్ శర్మ, క్రిస్ గేల్ సైతం ఈ ఫీట్ సాధించలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన రెండో టీ20లో వసీం ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదిన వసీం.. 2023 క్యాలెండర్ ఇయర్లో 100 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది మొత్తం 47 అంతర్జాతీయ టీ20లు ఆడిన వసీం.. 101 సిక్సర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో వసీం తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఘనత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ ఈ ఏడాది టీ20ల్లో 80 సిక్సర్లు (35 మ్యాచ్‌ల్లో) బాదాడు. ఈ విభాగంలో ఆ తర్వాతి రెండు స్థానాలు కూడా రోహిత్ శర్మ పేరిటే ఉన్నాయి. 2019, 2018 క్యాలెండర్ ఇయర్స్‌లో హిట్‌మ్యాన్ వరుసగా 78, 74 సిక్సర్లు బాదాడు. ఈ విభాగంలో ఐదో స్థానంలో టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. స్కై 2022లో 74 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో వీరి తర్వాత యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2012లో 26 మ్యాచ్‌ల్లో 59 సిక్సర్లు కొట్టాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో ముహమ్మద్ వసీం 32 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 53 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో యూఏఈ సంచలన విజయం సాధించింది. వసీంతో పాటు ఆర్యన్ లక్రా (63 నాటౌట్) కూడా అర్ధసెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ఆఫ్ఘనిస్తాన్ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటై, 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముహమ్మద్ జవాదుల్లా (4/26), అలీ నసీర్ (4/24) ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ నబీ (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో యూఏఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 2న జరుగనుంది. -
గర్జించిన గంభీర్.. క్రిస్ గేల్ పోరాటం వృధా
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్లో మరో రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. గుజరాత్ జెయింట్స్-ఇండియా క్యాపిటల్స్ మధ్య నిన్న (డిసెంబర్ 6) జరిగిన మ్యాచ్ చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై ఇండియా క్యాపిటల్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. క్రిస్ గేల్ (55 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), కెవిన్ ఓబ్రెయిన్ (33 బంతుల్లో 57ప 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో పోరాడినప్పటికీ గుజరాత్‌ను గెలిపించలేకపోయారు. క్యాపిటల్స్ నిర్ధేశించిన లక్ష్యానికి గుజరాత్ 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. గర్జించిన గంభీర్.. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ (30 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో కిర్క్ ఎడ్వర్డ్స్ (26), కెవిన్ పీటర్సన్ (26), రికార్డో పావెల్ (28), బెన్ డంక్ (30), చిప్లి (35) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. గుజరాత్ బౌలర్లలో ఎమ్రిట్, రజత్ భాటియా చెరో 2 వికెట్లు.. శ్రీశాంత్, లడ్డా, ప్రసన్న తలో వికెట్ దక్కించుకున్నారు. Gambhir 🤝 Knock-out game. Captain Gambhir lead by example in LLC.....!!!!!pic.twitter.com/ZN6edPYZtb— Johns. (@CricCrazyJohns) December 6, 2023 గేల్ పోరాటం వృధా.. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. క్రిస్ గేల్, కెవిన్ ఓబ్రెయిన్ పోరాడినప్పటికీ విజయతీరాలకు చేరలేకపోయింది. గేల్, ఓబ్రెయిన్ క్రీజ్‌లో ఉండగా.. గుజరాత్ గెలుపు సునాయాసమేనని అంతా అనుకున్నారు. అయితే ఆ జట్టు ఆఖరి 3 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. గేల్, ఓబ్రెయిన్లకు ఇతరుల నుంచి సహకారం లభించకపోవడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 211 పరుగులు మాత్రమే చేయగలిగింది. జాక్ కల్లిస్ (11), రిచర్డ్ లెవి (11), అభిషేక్ ఝున్‌ఝున్‌వాలా (13) విఫలమయ్యారు. క్యాపిటల్స్ బౌలర్లలో రస్టీ థీరన్, ఈశ్వర్ పాండే చెరో 2 వికెట్లు.. ఫిడేల్ ఎడ్వర్డ్స్, ఇసురు ఉడాన తలో వికెట్ దక్కించుకున్నారు. -
మళ్లీ మొదలెట్టిన క్రిస్ గేల్.. అవకాశం వచ్చినా సెంచరీ చేయలేకపోయిన సిమన్స్
విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ చాలాకాలం తర్వాత మళ్లీ బ్యాట్ ఝులిపించాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్లో భాగంగా భిల్వారా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. ఈ టోర్నీలో గుజరాత్ జెయింట్స్‌కు ఆడుతున్న గేల్.. భిల్వారా కింగ్స్‌తో నిన్న (నవంబర్ 22) జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఫలితంగా గుజరాత్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేస్తూ 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. జెయింట్స్ ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి (28), అభిషేక్ ఝున్‌ఝున్‌వాలా (24), ఖురానా (24 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. జాక్ కలిస్ (14), కెవిన్ ఓబ్రెయిన్ (11), కెప్టెన్ పార్థివ్ పటేల్ (8) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. భిల్వారా బౌలర్లలో రాహుల్ శర్మ, జెసల్ కరియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. బార్న్‌వెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఒక్క పరుగుతో సెంచరీ మిస్.. గుజరాత్ నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమై 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కింగ్స్ ఇన్నింగ్స్‌లో లెండిల్ సిమన్స్ (61 బంతుల్లో 99 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. కింగ్స్ గెలవాలంటే ఆఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా సిమన్స్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. కనీసం రెండు పరుగులు చేయగలిగినా సిమన్స్ సెంచరీ పూర్తి చేసుకునే వాడు. కింగ్స్ ఇన్నింగ్స్‌లో తిలకరత్నే దిల్షన్ (1), యూసఫ్ పఠాన్ (5), కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జెయింట్స్ బౌలర్లలో రయాద్ ఎమ్రిట్, ఈశ్వర్ చౌదరీ చెరో 2 వికెట్లు, శ్రీశాంత్, లడ్డా, రజత్ భాటియా తలో వికెట్ దక్కించుకున్నారు. టోర్నీలో భాగంగా ఇవాళ (నవంబర్ 23) ఇండియా క్యాపిటల్స్, అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. -
హర్భజన్ మాయాజాలం.. కలిస్, గేల్ మెరుపులు వృధా
లెజెండ్ లీగ్ క్రికెట్ 2023 ఎడిషన్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో నిన్న (నవంబర్ 20) జరిగిన మ్యాచ్‌లో మణిపాల్ టైగర్స్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్.. హ్యామిల్టన్ మసకద్జ (37), తిసార పెరీరా (32), రాబిన్ ఉతప్ప (23) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. జెయింట్స్ బౌలర్లలో రజత్ భాటియా 3, ట్రెంట్ జాన్స్టన్ 2, ఎమ్రిట్, ఈశ్వర్ చౌదరీ, లడ్డా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జెయింట్స్.. పర్వీందర్ అవానా (3-0-19-4), హర్భజన్ సింగ్ (4-1-14-2), తిసార పెరీరా (2-0-6-2) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులకే పరిమితమైంది. క్రిస్ గేల్ (24 బంతుల్లో 38; 7 ఫోర్లు, సిక్స్), జాక్ కలిస్ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు), పార్థివ్ పటేల్ (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, సిక్స్) జెయింట్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. లీగ్‌లో భాగంగా ఇవాళ (నవంబర్ 21) సథరన్ సూపర్ స్టార్స్, అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. -
వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర.. ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
CWC 2023- Ind vs NZ- Rohit Sharma Record: వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యధిక సిక్సర్ల వీరుడిగా వెస్టిండీస్ స్టార్ క్రిస్‌గేల్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ముంబై వేదికగా టీమిండియా తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడుతోంది. వాంఖడేలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. కివీస్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ భారత్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఈ క్రమంలో తొలి ఓవర్ నాలుగో బంతికి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో తొలి బౌండరీ బాదిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. మూడో ఓవర్ మూడో బంతికి సిక్సర్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత మరో మూడు సిక్స్‌లు బాదాడు. దీంతో ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 27కు చేరుకుంది. ఈ క్రమంలో వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్‌ను వెనక్కి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక న్యూజిలాండ్‌లో మ్యాచ్‌లో.. మొత్తంగా 28 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 47 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. పవర్ ప్లేలో దూకుడు ప్రదర్శించిన హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌కు.. తొమ్మిదో ఓవర్ రెండో బంతి వద్ద తెరపడింది. కివీస్ పేసర్ టిమ్ సౌథీ బౌలింగ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరాడు. వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్లు ►27 - రోహిత్ శర్మ (2023) ►26 - క్రిస్ గేల్ (2015) ►22 - ఇయాన్ మోర్గాన్ (2019) ►22 - గ్లెన్ మ్యాక్స్‌వెల్ (2023) ►21 - ఏబి డివిలియర్స్ (2015) ►21 - క్వింటన్ డికాక్ (2023) చదవండి: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా, గెలుపు మనదే? View this post on Instagram A post shared by ICC (@icc) -
Rohit-Gayle: జెర్సీలపై 45.. వారికి నచ్చేది మాత్రం 6..!
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకంతో (84 బంతుల్లో 131; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించిన రోహిత్ శర్మ, టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ శతకంతో హిట్‌మ్యాన్ పలు ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టాడు. ఇందులో అత్యధిక సిక్సర్ల రికార్డు ముఖ్యమైనది. విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉన్న ఈ రికార్డును రోహిత్ నిన్నటి మ్యాచ్‌లో అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో కలిపి గేల్ 553 సిక్సర్లు సాధించగా.. రోహిత్ ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో ఈ సంఖ్యను అధిగమించాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 556 సిక్సర్లు ఉన్నాయి. The 45s love their 6⃣s 👍 pic.twitter.com/5FHEP0xEwL — ESPNcricinfo (@ESPNcricinfo) October 12, 2023 హిట్‌మ్యాన్ తన రికార్డును బద్దలుకొట్టిన నేపథ్యంలో గేల్ అతనికి శుభాకాంక్షలు తెలిపాడు. ఇందుకు రోహిత్ థ్యాంక్స్ చెబుతూ.. 4, 5 మన జెర్సీలపై ఉండే సంఖ్యలు.. మన ఫేవరెట్ మాత్రం 6 అంటూ తన సోషల్‌మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ ఇద్దరు సిక్సర్ల వీరుల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇది చూసి వారి అభిమానులు మురిసిపోతున్నారు. కాగా, రోహిత్, క్రిస్ గేల్లు 45 సంఖ్య జెర్సీలు ధరిస్తారన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. హష్మతుల్లా షాహిది (80), అజ్మతుల్లా ఒమర్జాయ్(62) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆడుతూపాడుతూ 35 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్ సెంచరీతో కదంతొక్కగా.. కోహ్లి (55 నాటౌట్), ఇషాన్ కిషన్ (47), శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్) రాణించారు. -
గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలి!; రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
Rohit Sharma on Chris Gayle’s record In in international cricket: వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డు తాను బద్దలు కొడితే బాగానే ఉంటుందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. అయితే, ఇలాంటి విషయాల గురించి తాను ఎక్కువగా ఆలోచించని పేర్కొన్నాడు. కాగా 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ ముంబై బ్యాటర్.. ఒకప్పుడు జట్టులో చోటు కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి. ఓపెనర్‌గా ప్రమోటై.. హిట్‌మ్యాన్‌గా రోహిత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చొరవతో ఓపెనర్‌గా ప్రమోట్ అయిన రోహిత్.. హిట్‌మ్యాన్‌గా మారిపోయాడు. అద్భుతమైన ఆట తీరుతో అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా టీమిండియా కెప్టెన్ అయ్యాడు. వన్డేల్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడు డబుల్ సెంచరీలు బాది చరిత్రకెక్కాడు. అరుదైన రికార్డు ముంగిట రోహిత్ అంతేకాదు.. సిక్సర్ల విషయంలోనూ టీమిండియా బ్యాటర్లందరి కంటే ముందే ఉన్నాడు. అంతర్జాతీయ టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో వరుసగా.. 77, 280, 182 సిక్స్‌లు బాదాడు హిట్‌మ్యాన్. ఈ క్రమంలో.. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్-2023 వంటి మెగా ఈవెంట్ల నేపథ్యంలో అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. యూనివర్సల్ బాస్ సిక్సర్ల రికార్డుపై కన్నేసిన హిట్‌మ్యాన్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ తన పేరిట ప్రపంచ రికార్డు లిఖించుకున్నాడు. 483 మ్యాచ్‌లలో యూనివర్సల్ బాస్ ఏకంగా 553 సిక్స్‌లు బాదాడు. కాగా క్రిస్ గేల్ రికార్డును అధిగమించేందుకు రోహిత్ కేవలం 15 సిక్స్‌ల దూరంలో ఉన్నాడు. అస్సలు అనుకోలేదు ఈ నేపథ్యంలో.. క్రికెట్ జర్నలిస్టు విమల్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒకవేళ ఇది సాధ్యమైతే అరుదై రికార్డుగా మిగిలిపోతుంది. అయినా క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొడతానని అస్సలు అనుకోలేదు. ఇలాంటి వాటి గురించి ఆలోచించడం ఫన్నీగా ఉంటుంది’’ అని హిట్‌మ్యాన్ వ్యాఖ్యానించాడు. 539 సిక్సర్లతో రెండో స్థానంలో రోహిత్ కాగా ఆసియా కప్-2023లో భాగంగా నేపాల్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆరు సిక్స్‌లు బాదిన విషయం తెలిసిందే. శ్రీలంకలోని పల్లకెలెలో జరిగిన మ్యాచ్‌లో 59 బంతుల్లో 74 పరుగులతో అజేయంగా నిలిచిన రోహిత్.. టీమిండియాను 10 వికెట్ల తేడాతో గెలిపించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ వన్డే టోర్నీలో టీమిండియా తదుపరి పాకిస్తాన్‌తో కొలంబోలో తలపడనుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు రోహిత్ శర్మ మొత్తంగా 446 మ్యాచ్‌లు ఆడి 539 సిక్స్‌లు బాదాడు. చదవండి: సచిన్ కంటే ఇంజమామ్ గొప్ప.. కోహ్లి కంటే బాబర్ బెటర్.. ఏంటిది? చెత్తగా.. -
క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్
విండీస్‌తో నిన్న (ఆగస్ట్ 14) జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో టీమిండియా హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. 50 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాదిన సూర్యకుమార్.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను అధిగమించాడు. 50 టీ20 ఇన్నింగ్స్‌ల తర్వాత స్కై ఖాతాలో 104 సిక్సర్లు ఉండగా.. గేల్ పేరిట 103 సిక్సర్లు ఉన్నాయి. ఈ జాబితాలో విండీస్ ఆటగాడు ఎవిన్ లెవిస్ 111 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. లెవిస్, స్కై, గేల్ల తర్వాత కివీస్ కొలిన్ మున్రో (92), ఆరోన్ ఫించ్ (79) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 50 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ స్కై నాలుగో స్థానంలో ఉన్నాడు. విండీస్‌తో ఐదో టీ20లో 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసిన సూర్యకుమార్.. 50 ఇన్నింగ్స్‌ల అనంతరం 1841 పరుగులు చేసి ఈ విభాగంలో విరాట్ కోహ్లి (1943), బాబర్ ఆజమ్ (1942), మహ్మద్ రిజ్వాన్ (1888) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో స్కై తర్వాత కేఎల్ రాహుల్ (1751) ఐదో స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఫ్లోరిడా పిచ్‌పై బ్యాటర్ల నిర్లక్ష్యం, పసలేని బౌలింగ్ కారణంగా భారత్ ఐదో టీ20లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ల సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (4/31) భారత్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. ఫలితంగా భారత్ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను (2-3) కూడా కోల్పోయింది. ఈ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌ను తృటిలో చేజార్చుకుంది. -
లంక ప్రీమియర్ లీగ్‌లో సెంచరీ.. చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్
లంక ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా గాలే టైటాన్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 7) జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (59 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) పొట్టి క్రికెట్లో (అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌లు) అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో 10 శతకాలు బాదిన రెండో బ్యాటర్ రికార్డుల్లోకెక్కాడు. Maiden LPL century for Babar Azam 👏 📸: Fan Code pic.twitter.com/S0KaiJmuAh — CricTracker (@Cricketracker) August 7, 2023 బాబర్‌కు ముందు విధ్వంకర వీరుడు, విండీస్ యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. గేల్ తన 463 మ్యాచ్‌ల టీ20 కెరీర్లో ఏకంగా 22 శతకాలు బాది ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 2005 నుంచి 2022 వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని టీ20 లీగ్‌ల్లో పాల్గొన్న గేల్ 22 సెంచరీలతో పాటు 88 హాఫ్‌సెంచరీలు బాది 14562 పరుగులు చేశాడు. Kasun Rajitha ends Babar Azam's masterclass. Colombo Strikers need a miracle to win the game. pic.twitter.com/btIUW54X9p — CricTracker (@Cricketracker) August 7, 2023 ఇందులో గేల్ 2013 ఐపీఎల్లో పూణే వారియర్స్‌పై చేసిన 175 నాటౌట్ (66 బంతుల్లో) అత్యధికంగా ఉంది. గేల్ తర్వాతి స్థానంలో ఉన్న బాబర్ 2012 నుంచి నేటి వరకు 264 టీ20లు ఆడి 10 సెంచరీలు 77 హాఫ్ సెంచరీల సాయంతో 9412 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్, బాబర్‌ల తర్వాత క్లింగర్ (206 మ్యాచ్‌ల్లో 5960 పరుగులు, 8 సెంచరీలు), డేవిడ్ వార్నర్ (11695 పరుగులు, 8 సెంచరీలు), విరాట్ కోహ్లి (11965, 8), ఆరోన్ ఫించ్ (11392, 8) తొలి ఆరు స్థానాల్లో ఉన్నారు. Meet the duo with over ten or more centuries each in T20s🥶 pic.twitter.com/Wnkl8cn2SV — CricTracker (@Cricketracker) August 7, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. గాలే టైటాన్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 7) జరిగిన మ్యాచ్‌లో కొలొంబో స్టయికర్స్ ఆటగాడు విశ్వరూపం ప్రదర్శించాడు. మెరుపు శతకంతో విధ్వంసం సృష్టించాడు. భారీ ఛేదనలో (189) పూనకాలు వచ్చినట్లు ఊగిపోయిన పాక్ కెప్టెన్.. ప్రత్యర్ధి బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోశాడు. కేవలం 57 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా కొలొంబో స్ట్రయికర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
ఆల్‌టైమ్ బెస్ట్ టీ20 జట్టు ఇదే.. !
టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ తెచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి అందరికీ తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో పని చేసే ఈ అధునాతన చాట్‌బోట్.. మిషన్ లెర్నింగ్ సాంకేతికతతో పని చేస్తూ, టెక్స్ట్ రూపంలో యూజర్లు అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా సెకెన్ల వ్యవధిలో వివరమైన సమాధానం ఇస్తుంది. ఈ టూల్ తన బ్యాక్ ఎండ్‌లో ఉన్న అపారమైన డేటా బేస్ సాయంతో యూజర్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, కోడింగ్, ఆరోగ్యం, క్రీడలు, రాజకీయాలు, వంటకాలు, లైఫ్‌స్టైల్.. ఇలా ఏ విషయానికి సంబంధించి ప్రశ్నలు అడిగినా చాట్ జీపీటీ ఇట్టే సమాధానం చెబుతుంది. ఈ ఏఐ టూల్ క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలకు కూడా ఠక్కున సమాధానం చెబుతుంది. టీ20 క్రికెట్లో ఆల్‌టైమ్ బెస్ట్ జట్టు ఏది అని చాట్ జీపీటీని అడిగితే.. క్రిస్ గేల్, రోహిత్, కోహ్లి, ధోనిలతో కూడిన 11 మంది సభ్యుల పేర్లను చెప్పింది. జట్టు కూర్పు విషయంలో ఈ టూల్ అచ్చం మనిషిలా ఆలోచించి సమతూకమైన జట్టును ప్రకటించింది. బ్యాటింగ్ ఆర్డర్ నుంచి స్పిన్నర్లు, పేసర్లు, వికెట్‌కీపర్.. ఇలా ఓ పర్ఫెక్ట్ జట్టుకు ఉండాల్సిన వనరులన్నిటినీ చాట్ జీపీటీ అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో సమకూర్చింది. ఈ జట్టుకు చాట్ జీపీటీ ధోనిని కెప్టెన్ కమ్ వికెట్‌కీపర్‌గా ఎన్నుకుంది. ఓపెనర్లుగా క్రిస్ గేల్, రోహిత్ శర్మలను ఎంపిక చేసిన చాట్ జీపీటీ.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి, నాలుగో స్థానంలో ఏబీ డివిలియర్స్, ఐదో ప్లేస్‌లో మ్యాక్స్‌వెల్, ఆతర్వాత ధోని, ఆల్‌రౌండర్ కోటాలో షాహిద్ అఫ్రిది, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రషీద్ ఖాన్, పేసర్లుగా లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, డేల్ స్టెయిన్‌లను ఎంచుకుంది. క్రికెట్ విశ్లేషకులు సైతం ఎంచుకోలేని పర్ఫెక్ట్ టీ20 జట్టును చాట్ జీపీటీ ఎంపిక చేయడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత సమతూకంతో కూడిన జట్టును ఎంపిక చేయడం మనిషి వల్ల కాదని కామెంట్లు చేస్తున్నారు. -
శివాలెత్తిన సికందర్ రజా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో..!
జింబాబ్వే టీ10 లీగ్‌లో ఆ దేశ స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజా చెలరేగిపోయాడు. హరారే హరికేన్స్‌తో నిన్న (జులై 24) జరిగిన మ్యాచ్‌లో శివాలెత్తిపోయిన రజా (బులవాయో బ్రేవ్స్ కెప్టెన్).. లీగ్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (15 బంతుల్లో) కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 21 బంతులను ఎదుర్కొన్న రజా.. 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. రజాకు కోబ్ హెఫ్ట్ (23 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తోడవ్వడంతో బులవాయో బ్రేవ్స్ 135 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలుండగానే ఊదేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్.. భారత వెటరన్ రాబిన్ ఉతప్ప (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), విండీస్ వీరుడు ఎవిన్ లివిస్ (19 బంతుల్లో 49; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), ఫెరియెరా (21 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ఇర్ఫాన్ పఠాన్ (9 బంతుల్లో 18 నాటౌట్; 4 ఫోర్లు) చెలరేగిపోవడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టగా.. ప్యాట్రిక్ డూలీ 2, తిస్కిన్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 135 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రేవ్స్.. సికందర్ రజా, కోబ్ హెఫ్ట్, వెబ్‌స్టర్ (12 నాటౌట్; ఫోర్, సిక్స్) విజృంభించడంతో 9.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రేవ్స్ ఇన్నింగ్స్‌లో బెన్ మెక్‌డెర్మాట్ (8) నిరాశపరచగా.. హరికేన్స్ బౌలర్లలో మహ్మద్ నబీ, నండ్రే బర్గర్ తలో వికెట్ పడగొట్టారు. ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు యూనివర్సల్ బాస్‌దే.. టీ10 క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. అబుదాబీ టీ10 లీగ్ 2021 సీజన్లో బాస్ 12 బంతుల్లో 50 కొట్టాడు. అంతకుముందు ఇదే లీగ్ 2018 సీజన్లో ఆఫ్ఘన్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్ కూడా 12 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. -
WC 2023: గొప్ప బ్యాటర్వే! కానీ నీకసలు బుర్ర లేదు..
ICC ODI World Cup 2023: వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్‌గేల్‌పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ‘‘ఎందుకిలా మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు’’ అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు ఓ కారణం ఉంది. అదేంటంటే.. ఇటీవలే వన్డే ప్రపంచకప్-2023 షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్ అక్టోబరు 5న మొదలు కానున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి జూన్ 27 ప్రకటన చేసింది. ఈ క్రమంలో ఐసీసీ టోర్నీలో ఫేవరెట్లు, సెమీ ఫైనలిస్టులపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. భారత్, పాక్‌తో పాటు ఆ రెండు జట్లు ఇందులో భాగంగా కరేబియన్ లెజెండ్ క్రిస్ గేల్ సైతం టాప్-4 జట్లను ఎంచుకున్నాడు. ‘‘ఫేవరెట్ ఎవరన్నది తెలియదు గానీ.. సెమీ ఫైనలిస్టులను మాత్రం అంచనా వేయగలను. ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా.. ఈ నాలుగు సెమీస్ చేరగలవు’’ అని పేర్కొన్నాడు. ఇక్కడి దాకా అంతబాగానే ఉన్నా. వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా కీలక క్రికెటర్లు ఎవరన్న అంశంపై క్రిస్ గేల్ ఇచ్చిన జవాబే అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ‘‘ఈసారి ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ఇండియాకు కీలకం కానున్నారు’’ అని తెలిపాడు. అతడికేమో గాయం.. ఇక కాగా టీమిండియా ప్రధాన పేసర్ బుమ్రా.. వెన్ను నొప్పి కారణంగా నెలల తరబడి జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు.. టీ20లలో నెంబర్ 1 బ్యాటర్‌గా నిలిచిన సూర్య వన్డే రికార్డు అంతంత మాత్రమే. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 23 వన్డేలు ఆడిన సూర్యకుమార్ చేసిన మొత్తం పరుగులు 433. అత్యధిక స్కోరు 64. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మేటి ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మను కాదని.. గేల్.. బుమ్రా, సూర్య పేర్లను చెప్పడం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో ‘‘గొప్ప బ్యాటర్‌వి. కానీ నీకసలు బుర్ర లేదు’’ అంటూ గేల్‌ను ట్రోల్ చేస్తున్నారు. చదవండి: WC 2023: వెస్టిండీస్‌కు ఊహించని షాకిచ్చిన స్కాట్లాండ్! మరీ ఘోరంగా.. -
Virat Kohli: గేల్ రికార్డు సమం.. చరిత్రకెక్కడానికి ఇంకొక్కటి!
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో జూలు విదిల్చింది. కోహ్లి సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఆర్సీబీ సునాయాస విజయాన్ని ఖాతాలో వేసుకోవడమే గాక మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ తమ చివరి మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్లేఆఫ్‌లో అడుగుపెడుతుంది. ఇక మ్యాచ్‌లో శతకం సాధించిన కోహ్లి ఒక అరుదైన రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీల రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ ఐపీఎల్లో ఆరు శతకాలు సాధించాడు. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో కోహ్లి ఐపీఎల్లో ఆరో సెంచరీ సాధించి గేల్ రికార్డును సమం చేశాడు. కోహ్లి, గేల్ తర్వాత జాస్ బట్లర్ ఐదు శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక కోహ్లి మరొక సెంచరీ సాధిస్తే ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా చరిత్రకెక్కనున్నాడు. ఇక ఐపీఎల్లో ఒక మ్యాచ్‌లో రెండు శతకాలు నమోదు కావడం ఇది మూడోసారి. ఇంతకముందు 2016లో గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు కోహ్లి, డివిలియర్స్‌లు శతకాలు బాదారు. 2019లో డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో జంట ఆర్సీబీపై సెంచరీలతో చెలరేగగా.. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లో గురువారం ఎస్ఆర్హెచ్,ఆర్సీబీ మ్యాచ్‌లో.. మొదట క్లాసెన్ ఆర్సీబీపై .. అటుపై కోహ్లి ఎస్ఆర్హెచ్పై సెంచరీతో చెలరేగాడు. 💯 Bow down to the greatness of 👑 #ViratKohli 👏 He is now tied with Chris Gayle for the most #TATAIPL hundreds 🔥#SRHvRCB #IPLonJioCinema #IPL2023 #EveryGameMatters pic.twitter.com/OGxWztuhk6 — JioCinema (@JioCinema) May 18, 2023 చదవండి: ఉప్పల్‌లో మ్యాచ్ అంటే చెలరేగుతాడు.. కోహ్లి అరుదైన రికార్డు -
LSG VS PBKS: ఆ ఒక్కడే తప్పించుకున్నాడు.. అప్పుడు భువీ..!
ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం విధితమే. ఒక్కరు కూడా సెంచరీ చేయకపోయినా లక్నో బ్యాటర్లు ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ (257) నమోదు చేశారు. కైల్ మేయర్స్ (54), ఆయూష్ బదోని (43), స్టోయినిస్ (72), పూరన్ (45) విధ్వంసం ధాటికి పంజాబ్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. అయితే లక్నో బ్యాటర్ల బారి నుంచి ఒక్క పంజాబ్ బౌలర్ మాత్రం తప్పించుకున్నాడు. అతడే రాహుల్ చాహర్.ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించగా, రాహుల్ చాహర్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. తన కోటా 4 ఓవర్లను అద్భుతంగా బౌల్ చేసిన చాహర్.. 29 పరుగులు మాత్రమే ఇచ్చి, శివాలెత్తి ఉన్న లక్నో బ్యాటర్లను కట్టడి చేశారు. మరోవైపు మిగతా పంజాబ్ బౌలర్లు లక్నో బ్యాటర్ల ఊచకోతను విలవిలలాడిపోయారు. గుర్నూర్ సింగ్ బ్రార్ 3 ఓవర్లలో 42 పరుగులు, అర్షదీప్ సింగ్.. తన ఐపీఎల్ కెరీర్లో అత్యంత చెత్త గణాంకాలు (4-0-54-1), రబాడ 4 ఓవర్లలో 52 పరుగులు, సికందర్ రజా ఒక ఓవర్లో 17, సామ్ కర్రన్ 3 ఓవర్లలో 38, లివింగ్‌స్టోన్ ఒక ఓవర్లో 19 పరుగులు సమర్పించుకున్నారు. ఛేదనలో పంజాబ్ ఆటగాళ్ల ధాటికి లక్నో బౌలర్లు సైతం భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. యశ్ ఠాకూర్ (4/37), నవీన్ ఉల్ హాక్ (3/30) క్రమం తప్పకుండా వికెట్లు తీసి ప్రత్యర్ధి ఓటమిని ఖరారు చేశారు. రవి బిష్ణోయ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ, 2 కీలక వికెట్లు (అథర్వ టైడే (66), లివింగ్‌స్టోన్ (23)) తీశాడు. అప్పట్లో భువీ కూడా ఇంతే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ (ఆర్సీబీ- 263) నమోదైన మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో ఓ బౌలర్ ఆర్సీబీ బౌలర్ల బారి నుంచి తప్పించుకున్నాడు. నాటి మ్యాచ్‌లో పూణే బౌలర్లంతా విచ్చలవిడిగా పరుగులు సమర్పించుకుంటే.. ఒక్క భువనేశ్వర్ కుమార్ మాత్రం తాండవం చేస్తుండిన ఆర్సీబీ బ్యాటర్లను, ముఖ్యంగా అప్పటికే ఊగిపోతున్న క్రిస్ గేల్‌ను కట్టడి చేశాడు. ఆ మ్యాచ్‌లో భువీ 4 ఓవర్లు వేసి కేవలం 23 పరుగులు మాత్రమే ఇవ్వగా.. మిగతా బౌలర్లంతా 12 నుంచి 29 ఎకానమీ మధ్యలో పరుగులు సమర్పించుకున్నారు. -
ఐపీఎల్-2023లో బద్దలయ్యేందుకు రెడీగా రికార్డులివే..!
మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో పలు రికార్డులు బద్దలయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఆ రికార్డులేంటో ఓసారి లుక్కేద్దాం. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు: ఇప్పటివరకు ఈ రికార్డు విండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో పేరిట ఉంది. ఈ సీఎస్కే మాజీ ఆల్‌రౌండర్ 183 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ హైయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా చలామణి అవుతున్నాడు. ఈ రికార్డును రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. చహల్ ఖాతాలో ప్రస్తుతం 166 వికెట్లు ఉన్నాయి. రానున్న సీజన్లో అతను మరో 18 వికెట్లు తీస్తే బ్రావో రికార్డు బ్రేక్ అవుతుంది. అత్యధిక సెంచరీలు: ఐపీఎల్లో అత్యధిక సెంచరీల రికార్డు క్రిస్ గేల్ పేరిట నమోదై ఉంది. యూనివర్సల్ బాస్ ఖాతాలో 6 సెంచరీలు ఉండగా.. ఆర్ఆర్ జోస్ బట్లర్, ఆర్సీబీ విరాట్, పంజాబ్ రాహుల్, ఢిల్లీ వార్నర్ ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు రెడీగా ఉన్నారు. అత్యధిక సిక్సర్ల రికార్డు: రాబోయే సీజన్లో ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న సెకెండ్ హైయ్యెస్ట్ సిక్సర్స్ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. ఏబీడీ ఖాతాలో 251 సిక్సర్లు ఉండగా.. ఈ రికార్డును రోహిత్ శర్మ (240) బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో క్రిస్ గేల్ (357) ఉన్నాడు. అత్యధిక డక్స్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రానున్న సీజన్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది. హిట్‌మ్యాన్ మరో మ్యాచ్‌లో డకౌటైతే మన్దీప్ సింగ్ (14)ను అధిగమించి హోల్ అండ్ సోల్‌గా చెత్త రికార్డుకు ఓనర్ అవుతాడు. ఇవే కాకుండా రానున్న సీజన్లో పలువురు ఆటగాళ్లు ఐపీఎల్లో ఎవరికీ సాధ్యపడని పలు మైలురాళ్లను అధిగమించే అవకాశం ఉంది. అవేంటంటే.. అత్యధిక మ్యాచ్‌లు: సీఎస్కే సారధి ఎంఎస్ ధోని రానున్న ఐపీఎల్ సీజన్లో 250 మ్యాచ్‌ల మార్కును అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ధోని ఐపీఎల్లో 234 మ్యాచ్‌లు ఆడి టాప్‌లో ఉన్నాడు. అత్యధిక పరుగులు: ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ రానున్న సీజన్లో 7000 పరుగుల మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. కోహ్లి ఖాతాలో ప్రస్తుతం 6624 పరుగులుండగా.. ధవన్ ఖాతాలో 6244 రన్స్ ఉన్నాయి. అలాగే వార్నర్ (5881), రోహిత్ శర్మ (5879)లు 6000 పరుగుల క్లబ్లో చేరే అవకాశం ఉంది. అత్యధిక క్యాచ్‌లు: ఐపీఎల్లో ఇప్పటివరకు 97 క్యాచ్‌లు అందుకున్న రోహిత్ శర్మ, 93 క్యాచ్‌లు అందుకున్న విరాట్ కోహ్లి 100 క్యాచ్‌ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. ఈ రికార్డు సురేశ్ రైనా (109) పేరిట ఉంది. -
వెస్టిండీస్ క్రికెటర్ విధ్వంసకర శతకం.. కేవలం 39 బంతుల్లోనే!
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ జాన్సన్ చార్లెస్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో చార్లెస్ కేవలం 39 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించాడు. విండీస్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో కింగ్ ఔటయ్యక క్రీజులోకి వచ్చిన చార్లెస్.. మొదటి బంతి నుంచే ప్రోటీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఎదుర్కొన్న చార్లెస్ 118 పరుగులు చేశాడు. అతడు ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న ఈ కరీబియన్.. అనంతరం మరో 16 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను పూర్తిచేశాడు. ఇక 39 బంతుల్లో విధ్వంసకర శతకం సాధించిన చార్లెస్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. చార్లెస్ సాధించిన రికార్డులు ఇవే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతంగా సెంచరీ సాధించిన వెస్టిండీస్ క్రికెటర్‌గా చార్లెస్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఉండేది. 2016లో ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో గేల్ 47 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇక తాజా మ్యాచ్‌లో 39 బంతుల్లోనే సెంచరీ సాధించిన చార్లెస్.. గేల్ రికార్డు బ్రేక్ చేశాడు. ►అదే విధంగా విదేశీ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన విండీస్ క్రికెటర్‌గా చార్లెస్(118) నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు కూడా క్రిస్ గేల్ పేరిటే ఉండేది. 2007లో దక్షిణాఫ్రికా పైనే గేల్ 117 పరుగులు సాధించాడు. ►ఇక ప్రపంచ క్రికెట్లో టీ20ల్లో అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా చార్లెస్ నిలిచాడు .అంతకుముందు ప్రోటీస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. విండీస్ భారీ స్కోర్ ఇక చార్లెస్ అద్భుత ఇన్నింగ్స ఫలితంగా విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు సాధించింది. చార్లెస్‌తో పాటు ఓపెనర్ కైల్ మైర్స్ 51 పరగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరిలో షెపర్డ్ 18 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రోటీస్ బౌలరల్లో జానెసన్ మూడు వికెట్లు,పార్నెల్ రెండు వికెట్లు సాధించారు. -
ఐపీఎల్ తోపులు వీరే.. సింహభాగం రికార్డులు యూనివర్సల్ బాస్‌వే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ మరికొద్ది రోజుల్లో (మార్చి 31) ప్రారంభంకానున్న నేపథ్యంలో లీగ్‌లో ఇప్పటిదాకా నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం. అత్యధిక పరుగులు: విరాట్ కోహ్లి (ఆర్సీబీ తరఫున 223 మ్యాచ్‌ల్లో 6624 పరుగులు) అత్యధిక వ్యక్తిగత స్కోర్: క్రిస్ గేల్ (ఆర్సీబీ తరఫున పూణే వారియర్స్‌పై 66 బంతుల్లో 175 నాటౌట్) అత్యధిక సెంచరీలు: క్రిస్ గేల్ (6) అత్యధిక సగటు: కేఎల్ రాహుల్ (48.01) అత్యధిక స్ట్రయిక్ రేట్ (ఆండ్రీ రసెల్, 177.88) అత్యధిక హాఫ్ సెంచరీలు: డేవిడ్ వార్నర్ (55) ఫాస్టెస్ట్ ఫిఫ్టి (కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ 14 బంతుల్లో) ఫాస్టెస్ట్ సెంచరీ (క్రిస్ గేల్, పూణే వారియర్స్‌పై 30 బంతుల్లో) అత్యధిక ఫోర్లు (శిఖర్ ధవన్, 701) అత్యధిక సిక్సర్లు (క్రిస్ గేల్, 357) ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు (పాల్ వాల్తాటి, ఏబీ డివిలియర్స్-19) ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (క్రిస్ గేల్, 17) ఓ సీజన్లో అత్యధిక పరుగులు (విరాట్ కోహ్లి, 2016లో 973 పరుగులు) ఓ ఓవర్లో అత్యధిక పరుగులు (క్రిస్ గేల్, రవీంద్ర జడేజా-36 పరుగులు) అత్యధిక డకౌట్లు (రోహిత్ శర్మ, మన్దీప్ సింగ్-14) అత్యధిక వికెట్లు (డ్వేన్ బ్రావో- 183) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (అల్జరీ జోసఫ్- 6/12) అత్యుత్తమ ఎకానమీ (రషీద్ ఖాన్- 6.37) అత్యధిక మెయిడిన్లు (ప్రవీణ్ కుమార్-14) అత్యధిక డాట్ బాల్స్ (భువనేశ్వర్ కుమార్-1406) అత్యధిక సార్లు నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు (సునీల్ నరైన్-8 సార్లు) లీగ్ మొత్తంలో హ్యాట్రిక్‌లు: 21 అత్యధిక డిస్మిసల్స్ (వికెట్‌కీపర్‌గా): ధోని (170) అత్యధిక క్యాచ్‌లు (వికెట్‌కీపర్): ధోని (131) అత్యధిక స్టంపౌట్లు: ధోని (39) అత్యధిక క్యాచ్‌లు (ఫీల్డర్): సురేశ్ రైనా (109) ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు (ఫీల్డర్): నబీ (5) అత్యధిక మ్యాచ్‌లు: ధోని (234) కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు: ధోని (210) కెప్టెన్‌గా అత్యధిక విజయాలు: ధోని (123) అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు: ఏబీ డివిలియర్స్ (25) అత్యధిక టీమ్ స్కోర్: ఆర్సీబీ (263/3) అత్యల్ప టీమ్ స్కోర్: ఆర్సీబీ (49 ఆలౌట్) అత్యధిక టైటిల్స్: ముంబై ఇండియన్స్-5 -
క్రిస్ గేల్ వీరవిహారం.. వయసు పెరుగుతున్నా తగ్గేదేలేదంటున్న యూనివర్సల్ బాస్
విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ వయసు పెరుగుతున్నా ఏ మాత్రం తగ్గడం లేదు. బాస్.. గతంలో బంతిని ఎలా చెడుగుడు ఆడేవాడో ఇప్పుడు అదే రీతిలో చెలరేగుతున్నాడు. గేల్ 43 ఏళ్ల వయసులోనూ యువకుల తరహాలో భారీ షాట్లు ఆడి ఔరా అనిపిస్తున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 15) ఇండియా మహారాజాస్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి పాత రోజులు గుర్తు చేశాడు. అంతేకాక అతని జట్టు వరల్డ్ జెయింట్స్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. It’s the man with the moves!🏏👏 Ladies and Gentlemen, @henrygayle is the @officialskyexch Legend of the match! 🎉🔥#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/eht1CY7rP6 — Legends League Cricket (@llct20) March 15, 2023 వివరాల్లోకి వెళితే.. ఇండియా మహారాజాస్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్.. బ్రెట్ లీ (3-0-18-3), పోఫు (4-0-22-2), టీనో బెస్ట్ (4-0-27-2) చెలరేగడడంతో ప్రత్యర్ధిని 136 పరుగులకే కట్టడి చేసింది. మహారాజాస్ టీమ్‌లో సురేశ్ రైనా (41 బంతుల్లో 49; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకోగా.. బిస్లా (36), ఇర్ఫాన్ పఠాన్ (25) ఓ మోస్తరుగా రాణించారు. What a solid display!!! @WorldGiantsLLC pic.twitter.com/JYzOxr7K2q — Legends League Cricket (@llct20) March 15, 2023 అనంతరం బరిలోకి దిగిన వరల్డ్ జెయింట్స్.. క్రిస్ గేల్ (46 బంతుల్లో 57; 9 ఫోర్లు, సిక్స్) వీరవిహారం ధాటికి 18.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గేల్‌కు షేన్ వాట్సన్ (26), సమిత్ పటేల్ (12) సహకరించారు. మహారాజాస్ బౌలర్లలో యుసఫ్ పఠాన్ (4-0-14-2), ప్రవీణ్ తాంబే (4-0-22-1), హర్భజన్ సింగ్ (4-0-29-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టి తమ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఈ మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ జట్టుకు హర్భజన్ సింగ్ నాయకత్వం వహించాడు. గంభీర గైర్హాజరీలో భజ్జీ ఈ బాధ్యతలు చేపట్టాడు. Giants on top! A statement by the defending champions as we are close to the finals! 💪🏏@WorldGiantsLLC @henrygayle @AaronFinch5 @ShaneRWatson33 @BrettLee_58 @RossLTaylor #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/mvLoF2Ruos — Legends League Cricket (@llct20) March 15, 2023 లీగ్‌లో మహారాజాస్ ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిపోయి ఒక మ్యాచ్‌లో గెలవగా.. వరల్డ్ జెయింట్స్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయం.. ఆసియా లయన్స్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ ఓటమిని ఎదుర్కొన్నాయి. టోర్నీలో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇవాళ (మార్చి 16) వరల్డ్ జెయింట్స్, ఆసియా లయన్స్ తలపడనున్నాయి. Points Table Update after Match Day 5. Table has been toppled from top to bottom! World Giants made a huge jump to the top spot after today’s win with the Lions shifting down to second, and the Maharajas drops to third consequently.#SkyexchnetLLCMasters #YahanSabBossHain pic.twitter.com/hDHT1I9uVO — Legends League Cricket (@llct20) March 15, 2023 .@harbhajan_singh is still the @rariohq Boss Cap Holder for the most wickets!#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/EnVV0j2Rad — Legends League Cricket (@llct20) March 15, 2023 .@GautamGambhir still holds his ground as the @rariohq Boss Cap Holder for the highest runs. #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/3zKKssdcka — Legends League Cricket (@llct20) March 15, 2023 Grind, Giggles, and Greatness! Gayle! ⚡💪💥 The legend of the match spills the tea on today's performance, daily routine secrets, and getting ready for tomorrow's showdown! @henrygayle#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/SwpRB1gopG — Legends League Cricket (@llct20) March 15, 2023 -
కోహ్లి కాదు, గేల్ కాదు.. ఏబీడీ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్ అతడే..!
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఇటీవల తనకు ఎదురైన ఓ క్లిష్ట ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు. పొట్టి క్రికెట్లో ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవరు అని ఏబీడీని ప్రశ్నించగా.. అతను తన ఆప్త మిత్రుడు విరాట్ కోహ్లి పేరు కానీ, ఆర్సీబీ మాజీ సహచరుడు, విధ్వంసకర ఆటగాడు, విండీస్ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ పేరు కానీ చెప్పకుండా ఎవరూ ఊహించని విధంగా ఆఫ్ఘన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ పేరు చెప్పి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగల సత్తా ఉన్న రషీద్‌ను ఆల్‌టైమ్ గ్రేట్‌గా ప్రకటించడాన్ని సమర్ధించుకున్న ఏబీడీ.. రషీద్‌ను మ్యాచ్ విన్నర్‌గా పరిగణిస్తానని, మైదానంలో అతనో గర్జించే సింహమని కొనియాడాడు. రషీద్ ప్రతిసారి గెలవాలనుకుంటాడని, ఈ లక్షణమే అతన్ని ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా నిలబెట్టిందని అన్నాడు. టీ20ల్లో రషీద్‌కు మించిన బెస్ట్ ఆల్రౌండన్ను చూడలేదని చెప్పిన ఏబీడీ.. పొట్టి ఫార్మాట్లో అతను ప్రదర్శించే గట్స్‌కు సలామ్ కొట్టాడు. సూపర్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ తన మనసులో మాటను బయటపెట్టాడు. కాగా, రషీద్ ఖాన్.. 2017 ఐపీఎల్ సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన రషీద్.. 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్శించాడు. 2017 నుంచి 2021 వరకు ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహించిన రషీద్.. 5 ఎడిషన్లలో 93 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు వలస వెళ్లిన రషీద్.. ఈ సీజన్ మొత్తంలో 19 వికెట్లు పడగొట్టి, ఆ జట్టు టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 77 మ్యాచ్‌ల్లో 126 వికెట్లు పడగొట్టిన రషీద్.. 92 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 112 వికెట్లు దక్కించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న రషీద్.. ఐపీఎల్‌తో పాటు ప్రపంచం నలుమూలల్లో జరిగే వివిధ లీగ్‌ల్లో పాల్గొంటాడు. అతను పీఎస్ఎల్లో లాహోర్ ఖలందర్స్ తరఫున, బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
IPL: ఆల్‌టైం జట్టులో ఏబీడీకి చోటివ్వని టీమిండియా లెజెండ్! అతడికి బదులు..
Former Players All Time IPL XI: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా భారత్‌లో ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఇండియన్ ఫ్యాన్స్‌కు మరింత చేరువయ్యాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన ఆటతో క్రికెట్ ప్రేమికులను అలరించాడు. ఇక క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న ఏబీ డివిలియర్స్.. 170 ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తంగా 5162 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ అత్యధిక స్కోరు 133. ఇలా అద్భుత ప్రదర్శనతో తను ప్రాతినిథ్యం వహించిన జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించి.. ఐపీఎల్లో తనదైన ముద్ర వేసిన ఏబీడీకి టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన ఆల్‌టైం జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం. ఐపీఎల్-2023 నేపథ్యంలో జియోసినిమా షో లెజెండ్స్ లాంజ్‌లో క్రిస్ గేల్, సురేశ్ రైనా, పార్థివ్ పటేల్, రాబిన్ ఊతప్ప, స్కాట్ స్టైరిస్ వంటి మాజీ క్రికెటర్లతో కలిపి పాల్గొన్నాడు అనిల్ కుంబ్లే. డివిలియర్స్ కోసం తనను పక్కనపెట్టలేను ఈ సందర్భంగా... చర్చలో భాగంగా తమ ఆల్‌టైం ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌ను చెప్పాలని కోరగా.. కుంబ్లే.. డివిలియర్స్‌కు తన జట్టులో చోటు కష్టమని పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘నా జట్టుకు ఎంఎస్ ధోని కెప్టెన్. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. డివిలియర్స్ కోసం తనను పక్కనపెట్టలేను. ఇక ఆరోస్థానంలో పొలార్డ్‌ను ఆడిస్తా’’ అని కుంబ్లే చెప్పుకొచ్చాడు. నాలుగుసార్లు టైటిల్ గెలిచిన చెన్నై సారథి ధోనికే తన ఓటు అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఇతరుల్లో గేల్ ఓపెనర్‌గా తన పేరును తాను సూచించగా.. పార్థివ్ పటేల్ అతడికి జోడీగా విరాట్ కోహ్లిని ఎంపిక చేశాడు. ఈ చర్చలో భాగంగా ఆఖర్లో పొలార్డ్‌ను కాదని డివిలియర్స్‌కే చోటిచ్చారు మిగతా మాజీలు. లెజెండ్స్ ఎంపిక చేసిన ఆల్‌టైం ఐపీఎల్ జట్టు క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, సునిల్ నరైన్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ. చదవండి: Kieron Pollard: విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి! ICC ODI Rankings: నంబర్ వన్ బౌలర్‌గా సిరాజ్ -
డివిలియర్స్, క్రిస్ గేల్‌తో సూర్యకు పోలికా? అతడు ఎప్పుడో మించిపోయాడు
టీ20ల్లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సూర్య మెరుపు శతకం సాధించాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య తన మూడో అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. ఇక ఓవరాల్‌గా 51 బంతులు ఎదర్కొన్న ఈ ముంబైకర్.. 9 సిక్స్‌లు, 7 ఫోర్లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఈ టీ20 వరల్డ్ నెం1 బ్యాటర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో సూర్యను పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ప్రశంసలతో ముంచెత్తాడు. దిగ్గజ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్‌ను సూర్యకుమార్ మించిపోయాడు అని కనేరియా కొనియాడాడు. "ప్రపంచ క్రికెట్లో కొత్త యూనివర్స్ బాస్ వచ్చాడు. అతడు ఎవరో కాదు భారత విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్. సూర్య ఆట గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. నేను ముందే చెప్పాను ప్రపంచ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో సూర్య లిఖించుకుంటాడని. అతడు ఈ మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే 112 పరుగులు సాధించాడు. సూర్య లాంటి మరో ఆటగాడు ప్రపంచంలోనే ఉండడు. తరుచూ అందరూ సూర్యను డివిలియర్స్, క్రిస్ గేల్‌తో పోలుస్తున్నారు. కానీ, వారిద్దరూ కూడా సూర్య ముందు ప్రస్తుతం తేలిపోతారనడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటికే వారిద్దరిని తన ఆట తీరుతో సూర్యకుమార్ అధిగమించాడు. సూర్య తన విధ్వంసకర ఆటతో టీ20 క్రికెట్‌ను ఇప్పటికే వేరే స్థాయికి తీసుకువెళ్లాడు" అని కనేరియా తన యాట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: IND vs SL: సూర్యకుమార్ చేతికి ముద్దు పెట్టిన చాహల్.. వీడియో వైరల్ -
టీ20 వరల్డ్‌కప్‌ల్లో సెంచరీ హీరోలు వీరే.. భారత్ నుంచి ఒకే ఒక్కడు
దేశవాళీ, ఐపీఎల్ తరహా లీగ్‌ల్లో మూడంకెల స్కోర్‌ను చేరుకోవడం సర్వసాధారణమైపోయినప్పటికీ.. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం ఈ మార్కును చేరుకోవడం చాలా అరుదుగా చూశాం. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో అయితే సెంచరీ సాధించిన ఆటగాళ్ల సంఖ్యను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. పొట్టి ఫార్మాట్లో ప్రపంచకప్ మొదలైన నాటి నుంచి ఇవాల్టి (అక్టోబర్ 27) దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మ్యాచ్ వరకు కేవలం 10 శతకాలు మాత్రమే నమోదయ్యాయంటే నమ్మి తీరాల్సిందే. టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రొస్సో సాధించిన సుడిగాలి శతకం (56 బంతుల్లో 109; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో పదవ శతకంగా రికార్డయ్యింది. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ (117) తొలి శతకాన్ని నమోదు చేశాడు. 2007 ఇనాగురల్ టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాపై గేల్ శతకం బాదాడు. గేల్ తర్వాత పొట్టి ప్రపంచకప్‌లో రెండో శతకాన్ని టీమిండియా ఆటగాడు సురేశ్ రైనా బాదాడు. రైనా 2010 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై 101 పరుగులు సాధించాడు. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా తరఫున ఇప్పటివరకు మూడంకెల స్కోర్ సాధించిన ఆటగాడు రైనా ఒక్కడే కావడం విశేషం. వీరి తర్వాత మహేళ జయవర్ధనే (2010లో జింబాబ్వేపై 100), బ్రెండన్ మెక్కల్లమ్ (2012లో బంగ్లాదేశ్‌పై 123), అలెక్స్ హేల్స్ (2014లో శ్రీలంకపై 116 నాటౌట్), అహ్మద్ షెహజాద్ (2014లో బంగ్లాదేశ్‌పై 111 నాటౌట్), తమీమ్ ఇక్బాల్ (2016లో ఓమన్‌పై 103 నాటౌట్), క్రిస్ గేల్ (2016లో ఇంగ్లండ్‌పై 100 నాటౌట్), జోస్ బట్లర్ (2021లో శ్రీలంకపై 101 నాటౌట్), తాజాగా రిలి రొస్సో టీ20 ప్రపంచకప్‌ల్లో శతకాలు సాధించారు. -
T20 WC: టీ20 వరల్డ్‌కప్-2022.. రోహిత్ శర్మను ఊరిస్తున్న ఐదు అరుదైన రికార్డులు
T20 World Cup 2022- Rohit Sharma: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైంది. ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం (అక్టోబరు 16) నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటికే టీమిండియా సభ్యుడిగా పలుసార్లు ఈ మెగా టోర్నీ ఆడిన రోహిత్ శర్మ ఈసారి కెప్టెన్‌గా కొత్త హోదాలో బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో అద్భుత రికార్డు ఉన్న హిట్‌మ్యాన్‌ను ఊరిస్తున్న ఐదు రికార్డులను ఓసారి పరిశీలిద్దాం. 1.కెప్టెన్‌గా అరుదైన రికార్డు సాధించే అవకాశం యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ హిట్టర్ క్రిస్‌గేల్ 2010 ప్రపంచకప్‌లో తమ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఆ సందర్భంగా టీమిండియాతో మ్యాచ్‌లో 66 బంతులు ఎదుర్కొన్న అతడు 98 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో ఒక కెప్టెన్‌కు ఇదే అత్యధిక స్కోరు. ఇప్పుడు రోహిత్ శర్మకు ఈ అరుదైన రికార్డును బద్దలు కొట్టే సువర్ణావకాశం ముందుంది. టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగనున్న హిట్‌మ్యాన్ 99 లేదంటే ఏకంగా సెంచరీ సాధించాడంటే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన సారథిగా నిలుస్తాడు. 2. నాలుగో స్థానం నుంచి.. టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక లెజెండ్ మహేళ జయవర్దనేకు అత్యధిక పరుగుల వీరుడిగా రికార్డు ఉంది. మొత్తంగా ఐదుసార్లు ఈ ఐసీసీ ఈవెంట్ ఆడిన జయవర్ధనే 1016 పరుగులు సాధించాడు. విండీస్ హిట్టర్ క్రిస్‌గేల్ 965, తిలకరత్నె దిల్షాన్ 897 పరుగులతో అతడి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాన్ని రోహిత్ శర్మ ఆక్రమించాడు. ఇప్పటి వరకు 847 పరుగులు సాధించాడు. ఈసారి ప్రపంచకప్‌లో అతడు మొత్తంగా 169 పరుగులు సాధిస్తే అత్యధిక పరుగుల వీరుడిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. 3. ఈ రికార్డు లాంఛనమే! హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 2007లో టీమిండియా తరఫున తొలిసారి టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లు ఆడిన అతడు.. మరో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంటే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా నిలుస్తాడు. ధోని, గేల్, ముష్షికర్ రహీంలను దాటుకుని.. శ్రీలంక ఆటగాడు తిలకరత్నె దిల్షాన్(35 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డు బద్దలు కొడతాడు. ఎలాంటి ఆటంకాలు, గాయాల బెడద వంటివి లేకుండా రోహిత్ బరిలోకి దిగితే ఈ రికార్డు సాధించడం లాంఛనమే! ఇప్పటి వరకు టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు ►తిలకరత్నె దిల్షాన్-35 ►డ్వేన్ బ్రావో- 34 ►షోయబ్ మాలిక్- 34 ►ఎంఎస్ ధోని- 33 ►క్రిస్ గేల్-33 ►ముష్ఫికర్ రహీం- 33 ►రోహిత్ శర్మ- 33 4. బ్రెండన్ మెకల్లమ్ రికార్డు అధిగమించే అవకాశం న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ఇంగ్లండ్ ప్రస్తుత కోచ్ బ్రెండన్ మెకల్లమ్ టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో తన పేరిట అరుదైన రికార్డు లిఖించుకున్నాడు. 2012లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 58 బంతుల్లో 123 పరుగులు సాధించి.. అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. ఇక మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 65 బంతుల్లో 79 పరుగులు. 2010లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ఈ స్కోరు సాధించాడు. ఇక పొట్టి క్రికెట్లో ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్లో 4 సెంచరీలు నమోదు చేసిన హిట్‌మ్యాన్ .. మరో శతకం బాదడం సహా అదనంగా మరో 24 పరుగులు సాధిస్తే మెకల్లమ్‌ను అధిగమించే అవకాశం ఉంది. 5. ఇంకో మూడు సిక్స్‌లు కొడితే టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ శర్మ కచ్చితంగా బద్దలు కొట్టగల మరో రికార్డు ఇది. ఇప్పటి వరకు ఈ ఐసీసీ టోర్నీలో 31 సిక్సర్లు కొట్టిన హిట్‌మ్యాన్.. మరో మూడు సిక్స్‌లు బాదితే చాలు. ఈ మేజర్ ఈవెంట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. తద్వారా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డు(33 సిక్స్‌లు) బద్దలు కొడతాడు. అక్టోబరు 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ ఈ ఫీట్ నమోదు చేయాలని ఆశిస్తూ హిట్‌మ్యాన్‌కు ఆల్ ది బెస్ట్ చెబుదాం!! -సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: Ind Vs WA XI: రాహుల్ ఇన్నింగ్స్ వృథా.. కుప్పకూలిన మిడిలార్డర్.. టీమిండియాకు తప్పని ఓటమి -
T20 WC: టీమిండియా కాదు.. ఈసారి వరల్డ్‌కప్ ఫైనల్లో వెస్టిండీస్‌తో పోటీపడేది ఆ జట్టే!
T20 World Cup 2022- Final Prediction: ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్‌ను రెండుసార్లు ముద్దాడిన ఏకైక జట్టు వెస్టిండీస్. 2012, 2016లో ట్రోఫీని కైవసం చేసుకున్న విండీస్.. గతేడాది మాత్రం దారుణమైన ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12కు నేరుగా అర్హత సాధించలేకపోయింది. దీంతో పసికూనలతో క్వాలిఫైయర్స్ ఆడాల్సిన పరిస్థితి. ఇటీవలి కాలంలో కూడా పూరన్ బృందం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. టీమిండియా సహా పాకిస్తాన్, తాజాగా ఆస్ట్రేలియా తదితర జట్లతో జరిగిన టీ20 సిరీస్‌లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆసీస్‌తో ఫైనల్లో.. పొట్టి ఫార్మాట్లో విండీస్ కష్టాలు ఇలా ఉంటే అతడు మాత్రం తమ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందని జోస్యం చెప్పాడు. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తుదిపోరులో పోటీ పడుతుందంటూ గేల్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు దైనిక్ జాగరణ్తో ముచ్చటించిన యూనివర్సల్ బాస్.. ‘‘ఈసారి ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య ఫైనల్ జరుగుతుందనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. వెస్టిండీస్ జట్టులో ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని.. తమదైన రోజున చెలరేగి ఆడతారని చెప్పుకొచ్చాడు. అయితే, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రసెల్, డ్వేన్ బ్రావో వంటి ఆటగాళ్లు లేకపోవడం పెద్ద లోటు అన్న ఈ వెటరన్ ఓపెనర్.. ఫైనల్‌కు మాత్రం తమ జట్టు అర్హత సాధించే అవకాశం ఉందన్నాడు. కాగా క్రిస్ గేల్ ఇప్పటి వరకు ఆరు టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్లలో పాల్గొన్నాడు. ఇక ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీ జరుగనుంది. ఇందుకోసం పూరన్ బృందం ఇప్పటికే ఆతిథ్య దేశానికి చేరుకుంది. ఇదిలా ఉంటే.. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సహా టీమిండియా ఈసారి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లు కూడా గట్టి పోటీనిచ్చేందుకు సై అంటున్నాయి. ఈ నేపథ్యంలో క్రిస్‌గేల్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. టీ20 ప్రపంచకప్-2022 వెస్టిండీస్ జట్టు: నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, యానిక్ కరియా, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కైల్ మేయర్స్, ఒబెడ్ మెకాయ్, రేమాన్ రీఫర్, ఓడియన్ స్మిత్, షమార్ బ్రూక్స్. చదవండి: నిరాశ పరిచిన రోహిత్.. మరోసారి చెలరేగిన సూర్య కుమార్ -
విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ వచ్చేస్తున్నాడు..!
ఈనెల (సెప్టెంబర్) 16 నుంచి ప్రారంభంకానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) రెండో సీజన్ ఆడేందుకు విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ మరోసారి భారత్‌లో అడుగుపెట్టనున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ సారధ్యంలోని గుజరాత్ జెయింట్స్ యూనివర్సల్ బాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని గుజరాత్ జెయింట్స్ యాజమాన్యం అదానీ స్పోర్ట్స్‌లైన్ శనివారం అధికారికంగా దృవీకరించింది. పొట్టి క్రికెట్లో అనేక రికార్డులు కలిగిన గేల్ ఎల్ఎల్సీలో ఆడటం చాలా సంతోషంగా ఉందని లీగ్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు రామన్ రహేజా అన్నారు. కాగా, గేల్‌తో ఒప్పందానికి ముందే గుజరాత్ జెయింట్స్ 15 మంది సభ్యుల బృందాన్ని (రూ. 5.51కోట్లు ఖర్చుతో) ఎంపిక చేసుకుంది. డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం ఫ్రాంచైజీ పర్సులో (మొత్తం 8 కోట్లు) కొంత డబ్బు మిగిలి ఉండటంతో (రూ. 2.48 కోట్లు) గేల్‌తో ఒప్పందం చేసుకోవాలని యాజమాన్యం భావించింది. ఇందులో భాగంగా యునివర్సల్ బాస్‌తో సంప్రదింపులు జరిపి డీల్‌కు ఖాయం చేసుకుంది. సెహ్వాగ్, గేల్‌తో పాటు గుజరాత్ జెయింట్స్ జట్టులో డేనియల్ వెటోరీ, కెవిన్ ఓబ్రెయిన్, లెండిల్ సిమన్స్, అజంతా మెండిస్, గ్రేమ్ స్వాన్, మిచెల్ మెక్‌లాగెన్, రిచర్డ్ లెవి, క్రిస్ ట్రెమ్లెట్, పార్ధివ్ పటేల్ లాంటి అంతర్జాతీయ స్టార్లు ఉన్నారు. గుజరాత్ జెయింట్స్ జట్టు: వీరేంద్ర సెహ్వాగ్ (కెప్టెన్), పార్థివ్ పటేల్, క్రిస్ గేల్, ఎల్టన్ చిగుంబురా, క్రిస్ ట్రెమ్లెట్, రిచర్డ్ లెవి, గ్రేమ్ స్వాన్, జోగిందర్ శర్మ, అశోక్ దిండా, డేనియల్ వెటోరి, కెవిన్ ఓబ్రెయిన్, స్టువర్ట్ బిన్నీ, మిచెల్ మెక్‌లాగెన్, లెండిల్ సిమన్స్, మన్విందర్ బిస్లా, అజంతా మెండిస్. చదవండి: చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించి బిగ్ అప్డేట్.. కెప్టెన్ ఎవరంటే..? -
'మురళీధరన్, నరైన్ కాదు.. ప్రపంచ క్రికెట్లో నేనే బెస్ట్ స్పిన్నర్'
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ఫీల్డ్‌లో గానీ ఆఫ్‌ధి ఫీల్డ్‌లో గానీ ఎంతో ఉత్సహంగా ఉంటాడో ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మరో సారి గేల్ తన ఫన్నీ కామెంట్లతో వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం యూనివర్స్ బాస్ కరీబియన్ దీవులలో జరగబోయే సరికొత్త టోర్నీ 'సిక్స్టీ' లీగ్‌కు సిద్దమవుతున్నాడు. ఈ టోర్నీ టీ10 ఫార్మాట్లో జరగనుంది. ఈ లీగ్ బుధవారం(ఆగస్టు 24) నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూనివర్స్ బాస్ సరదా వాఖ్యలు చేశాడు. మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగు పేట్టేందుకు అతృతగా ఎదురుచూస్తున్నా అని ఈ సందర్భంగా గేల్ తెలిపాడు. ఈ టోర్నీలో బ్యాట్‌తో పాటు బాల్‌తో కూడా రాణించాలని అనుకుంటున్నట్లు గేల్ వెల్లడించాడు. అదే విధంగా ప్రపంచ క్రికెట్లో ఇప్పటి వరకు తనే అత్యత్తుమ స్పిన్నర్ అని గేల్ ఫన్నీ కామెంట్లు చేశాడు. "నా బౌలింగ్ సహజమైనది. నేను కచ్చితంగా ఈ టోర్నీలో బౌలింగ్ చేస్తాను. మీకు తెలుసా..? ప్రపంచ క్రికెట్లో నేనే ఇప్పటి వరకు గ్రేట్ స్పిన్నర్‌ని. ముత్తయ్య మురళీధరన్ కూడా నాలా బౌలింగ్ చేయలేకపోయాడు. అతని కంటే నేను తక్కువ ఎకనామీతో బౌలింగ్ చేశాను. అదేవిధంగా సునీల్ నరైన్ కూడా నా దగ్గరకు రాలేడు" అని సరదాగా గేల్ వాఖ్యనించాడు. "మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగు పెట్టేందుకు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నాను. గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉండడంతో ఇది నా అరంగేట్ర మ్యాచ్‌గా భావిస్తున్నాను. ఈ టోర్నీతో మళ్లీ నా రిథమ్‌ను తిరిగి పొందుతాను. ఈ టోర్నీ నన్ను మరికొంత కాలం క్రికెట్ ఆడేలా సహాయపడుతుందని" యూనివర్స్ బాస్ పేర్కొన్నాడు. కాగా గేల్ చివరగా టీ20 ప్రపంచకప్‌లో ఆడాడు. -
అఫ్రిదిని అధిగమించి, క్రిస్ గేల్‌కు చేరువైన హిట్‌మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డు దిశగా అడుగులు వేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో హిట్‌మ్యాన్ రెండో స్థానానికి ఎగబాకాడు. విండీస్‌తో నాలుగో టీ20లో మూడు సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్.. అన్ని ఫార్మాట్లలో సిక్సర్ల సంఖ్యను 477కు పెంచుకున్నాడు. ఈ క్రమంలో అతను పాక్ మాజీ పవర్ హిట్టర్ షాహిద్ అఫ్రిదిని (476 సిక్సర్లు) అధిగమించాడు. ఈ జాబితాలో విండీస్ విధ్వంసకర యోధుడు, యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్ మొత్తంలో 553 సిక్సర్లు బాదిన గేల్ పేరిట అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదై ఉంది. ఇదిలా ఉంటే, విండీస్‌తో నాలుగో టీ20లో టీమిండియా టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (14 బంతుల్లో 24; ఫోర్, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్‌కు మెరుపు ఆరంభాన్ని అందించినప్పటికీ.. స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్ 96/2గా ఉంది. దీపక్ హుడా (15 బంతుల్లో 19), రిషబ్ పంత్ (15 బంతుల్లో 16) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: టీమిండియాకు భారీ షాక్... గాయంతో స్టార్ బౌలర్ ఔట్..! -
క్రిస్ గేల్ అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ యునివర్స్ బాస్ మెరుపులు!
యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ సెకెండ్ సీజన్లో సందడి చేయనున్నాడు. ఈ విషయాన్ని జెండ్స్ లీగ్ క్రికెట్ నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు. గత కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న గేల్ మరోసారి తన బ్యాట్‌ను ఝుళిపించడానికి సిద్దమయ్యాడు. కాగా టీ20 క్రికెట్‌కే కింగ్‌గా ఉన్న గేల్ తన పేరిట ఎన్నో రికార్డులను లిఖించుకున్నాడు. టీ20ల్లో 10,000 పరుగులు, అత్యధిక సెంచరీలు, అత్యంత వేగవంతమైన సెంచరీ, అత్యధిక ఫోర్లు, సిక్స్‌లు వంటి చాలా రికార్డులు గేల్ ఖాతాలో ఉన్నాయి. కాగా వ్యక్తిగత కారణాలు వల్ల ఐపీఎల్-2022కు గేల్ దూరమయ్యాడు. ఇక లెజెండ్స్ లీగ్‌లో తను భాగంకానున్నట్లు గేల్ కూడా దృవీకరించాడు. "ఈ ప్రతిష్టాత్మకమైన లీగ్‌లో భాగం కావడం.. దిగ్గజాలతో కలిసి ఆడటం నాకు అపారమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. భారత్‌లోని మ్యాచ్ వేదికల వద్ద కలుద్దాం" అని ఒక ప్రకటనలో గేల్ పేర్కొన్నాడు. ఇక లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనుంది. ఈ టోర్నీకి కోల్‌కతా, లక్నో, ఢిల్లీ, జోధ్‌పూర్, కటక్,రాజ్‌కోట్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. లెజెండ్స్ లీగ్ రెండో సీజన్లో తొమ్మిది దేశాలకు చెందిన క్రికెట్ దిగ్గజాలు పాల్గొనున్నారు చదవండి: Asia Cup 2022: 'గతేడాది పాక్ చేతిలో ఓటమి భారత్‌ను బాగా డ్యామేజ్ చేసింది.. ఈ సారి మాత్రం' -
మరోసారి వార్తల్లోకి విజయ్ మాల్యా, ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ‘‘సూపర్ ఫ్రెండ్షిప్, బెస్ట్ అక్విజిషన్" అంటూ వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్‌తో ఉన్న ఫోటోను తాజాగా ట్వీట్ చేయడం విశేషంగా నిలిచింది. ‘‘క్రిస్టోఫర్ హెన్రీ గేల్ @హెన్రీగేల్, ‘యూనివర్స్ బాస్’ను కలుసుకోవడం అదృష్టం. ఆర్సీబీకి తీసుకున్నప్పటినుంచి మంచి స్నేహితుడు" అని మాజీ ఆర్సీబీ యజమాని మాల్యా పేర్కొన్నాడు. ఆర్సీబీకి గేల్‌ను కొనుగోలు చేయడం ఎప్పటికీ బెస్టే అంటూ రాసుకొచ్చాడు. ఈ పిక్ ఇపుడు ఇంటర్నెట్లో వైరల్ కావడం మాత్రమే కాదు చర్చనీయాంశంగా మారింది. Great to catch up with my good friend Christopher Henry Gayle @henrygayle , the Universe Boss. Super friendship since I recruited him for RCB. Best acquisition of a player ever. pic.twitter.com/X5Ny9d6n6t — Vijay Mallya (@TheVijayMallya) June 22, 2022 దీంతో ‘లిక్కర్ కింగ్ విత్ యూనివర్స్ బాస్’ అంటూ కమెంట్ చేస్తున్నారు. వాస్తవానికి ఆర్సీబీకి 2011-2017 వరకు ఆడాడు క్రిస్ గేల్. ఈ సందర్భంగా గేల్ పరుగుల సునామీ గురించి ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా కేవలం 30 బాల్స్‌లోనే సెంచరీ బాదిన మెమరబుల్ ఇన్నింగ్స్‌ను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు గేల్ 2011లో రీప్లేస్మెంట్ ప్లేయర్‌గా ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి, అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడిగా మారాడు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసింది లేదు. 2009, 2010లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కూడా ప్రాతినిధ్యం వహించిన గేల్ పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. అయితే, ఐపీఎల్ 2022 మెగా వేలానికి దూరంగా ఉన్నాడు. ఐపీఎల్లో 142 మ్యాచ్‌లు ఆడిన గేల్ 4965 పరుగులు చేశాడు. 148.96 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో లీగ్‌లో 39.72 సగటుతో ఉన్నాడు. 2013లో ఇప్పుడు ఆగిపోయిన పూణే వారియర్స్‌పై అజేయంగా 175 పరుగులతో సహా ఆరు సెంచరీలను నమోదు చేశాడు. టీ20లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. -
IPL: ఐపీఎల్ స్ట్రాంగెస్ట్ ఎలెవన్.. రోహిత్ శర్మకు అవమానం!
టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్ ఐపీఎల్లో తన ఆల్‌టైమ్ ఫేవరెట్ జట్టును ప్రకటించాడు. తన జట్టుకు ఎంఎస్ ధోనిని కెప్టెన్‌గా ఎంచుకున్న జాఫర్.. క్రిస్‌గేల్, మలింగ వంటి దిగ్గజాలకు చోటిచ్చాడు. అదే విధంగా ఆల్రౌండర్లుగా ఆండ్రీ రసెల్, హార్దిక్ పాండ్యాకు తన జట్టులో స్థానం కల్పించాడు. కాగా ఐపీఎల్-2022లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్లోనే ట్రోఫీని ముద్దాడింది. టోర్నీ ఆరంభానికి ముందు వరుస వైఫల్యాలతో విమర్శలకు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యాకు పూర్వవైభవం తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో ఐపీఎల్-2022తో పాటు మెగా టోర్నీలో తమ ఆల్‌టైమ్ ఫేవరెట్ జట్లను మాజీ ఆటగాళ్లు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా వసీం జాఫర్ క్రిక్ట్రాకర్స్ షోలో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఓపెనర్లుగా గేల్, కేఎల్ రాహుల్, వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి.. ఆ తర్వాతి స్థానాల్లో సురేశ్ రైనా, ధోని.. ఆల్రౌండర్లుగా రసెల్, పాండ్యా.. బౌలర్ల విభాగంలో రషీద్ ఖాన్, అశ్విన్/చహల్, బుమ్రా, మలింగాకు తన జట్టులో స్థానం ఇచ్చాడు. అయితే, ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మకు మాత్రం వసీం చోటివ్వలేదు. వసీం జాఫర్ ఆల్‌టైమ్ బెస్ట్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్: క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), ఆండ్రీ రసెల్, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్/యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ. చదవండి: Sachin Tendulkar Best XI Of IPL 2022: ఐపీఎల్ అత్యుత్తమ జట్టు ప్రకటన.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు నో ఛాన్స్..! -
ఆర్సీబీ మాజీ క్రికెటర్లకు అరుదైన గౌరవం
ఆర్సీబీ మాజీ క్రికెటర్లు ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్‌ను ఆ జట్టు యాజమాన్యం అరుదైన గౌరవంతో సత్కరించింది. ఆ జట్టు ఇటీవలే ఒక కార్యక్రమంలో హాల్ ఆఫ్ ఫేమ్‌ను పరిచయం చేసింది. ఆర్సీబీ తరపున సేవలందించిన క్రికెటర్లకు ఇందులో స్థానం దక్కనుంది. అయితే ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో తొలుత చేరిన క్రికెటర్లు.. ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ కావడం విశేషం. కొన్నేళ్ల పాటు తమ సేవలను ఆర్సీబీకి అందించినందుకు కృతజ్ఞతగా వారిని హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరుస్తున్నట్లు ఆర్సీబీ యాజమాన్యం ట్విటర్లో ప్రకటించింది. దానికి సంబంధించిన వీడియోనూ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో హాల్ ఆఫ్ ఫేమ్‌లో జాయిన్ అయిన ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్‌ను ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రస్తుత కెప్టెన్ డుప్లెసిస్, ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెసన్లు అభినందిస్తూ స్పీచ్ ఇచ్చారు. ఆ తర్వాత వారిద్దరికి ఆన్లైన్ వేదికగానే వారి పేర్లతో పాటు జెర్సీ నెంబర్ ఉన్న గోల్డ్ మెటల్ మొమొంటోతో సత్కరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో గేల్, డివిలియర్స్‌కు విడదీయరాని బంధం ఉంది. డివిలియర్స్ 184 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 5162 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ 142 మ్యాచ్‌లాడి 4965 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, 31 అర్థ సెంచరీలు ఉన్నాయి. చదవండి: Kane Williamson: ఇంకెంత కాలం విలియమ్సన్‌ను భరిస్తారు.. తుది జట్టు నుంచి తప్పించండి! Introducing the #RCB Hall of Fame: Match winners, Legends, Superstars, Heroes - you can go on and on about @ABdeVilliers17 and @henrygayle, two individuals who are responsible for taking IPL to where it is today. #PlayBold #WeAreChallengers #IPL2022 #ನಮ್ಮRCB #RCBHallOfFame pic.twitter.com/r7VUkxqEzP — Royal Challengers Bangalore (@RCBTweets) May 17, 2022 -
'సరైన గౌరవం దక్కలేదు'.. యునివర్సల్ బాస్ సంచలన వ్యాఖ్యలు
వెస్టిండీస్ స్టార్.. యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌కు గేల్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఐపీఎల్లో మధ్యలోనే వైదొలిగిన గేల్.. సుధీర్ఘకాలం బయోబబుల్‌లో ఉండలేకనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాగా ఈసారి మెగావేలంలో గేల్ పాల్గొనలేదు. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడేందుకు ప్రయత్నిస్తానని ఇటీవలే పేర్కొన్నాడు. తాజాగా ఐపీఎల్ 2022కు దూరంగా ఉండడం వెనుక గేల్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్ లో తనకు సముచిత గౌరవం లభించలేదని ఆరోపించాడు. ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేల్ మాట్లాడుతూ.. ''గత రెండేళ్లుగా ఐపీఎల్ లో నాతో వ్యవహరించిన తీరు సరిగా లేదు. ఐపీఎల్లో ఎన్నో ఘనతలు అందుకున్న తర్వాత కూడా దక్కాల్సిన గౌరవం దక్కకపోవడంతో బాధ కలిగింది. అయితే క్రికెట్ తర్వాత కూడా మనకు జీవితం ఉంటుంది.. అందుకే ఈసారి ఐపీఎల్‌కు దూరంగా ఉండాలనుకున్నా. ఎవరిని ఇబ్బందిపెట్టడం ఇష్టంలేకనే వేలంలోనూ పాల్గొనలేదు. అయితే వచ్చే ఐపీఎల్ సీజన్ ఆడే అవకాశం ఉంది. ఏ జట్టుకు ఆడుతానో తెలియదు కానీ.. నా అవసరం సదరు జట్టుకు కచ్చితంగా ఉంటుంది. ఐపీఎల్లో ఆర్సీబీ, కోల్‌కతా, పంజాబ్‌లకు ఆడినప్పటికి.. ఆర్సీబీ, పంజాబ్‌కు ఆడినప్పుడు బాగా ఎంజాయ్ చేశా. ఆర్సీబీతో నా అనుబంధం చాలా గట్టిది. ఆ జట్టుకు టైటిల్ అందించలేకపోవడం కాస్త బాధ కలిగించింది. కానీ ఐపీఎల్లో నా అత్యధిక స్కోరు ఆ జట్టు తరపునే సాధించడం సంతోషం కలిగించింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్లో గేల్ ట్రాక్ రికార్డు మాములుగా లేదు. ఇప్పటివరకు ఐపీఎల్లో 142 మ్యాచ్‌లు ఆడిన గేల్ 149 స్ట్రైక్‌రేట్‌తో 4965 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉండడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఆరు సెంచరీలు కొట్టిన ఆటగాడు గేల్ తప్ప మరొకరు లేదు. మరో విషయం ఏంటంటే.. ఐపీఎల్లో అత్యధిక స్కోరు గేల్ పేరిటే ఉంది. ఆర్సీబీ తరపున 2013లో పుణే వారియర్స్‌పై గేల్ ఆడిన 175 పరుగులు నాకౌట్ ఇన్నింగ్స్ ఇప్పటికి చెక్కుచెదరలేదు. చదవండి: Shimron Hetmyer: కీలక సమయంలో స్వదేశానికి రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఆటగాడు? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఎస్ఆర్హెచ్పై వార్నర్ అర్థశతకం.. ప్రపంచ రికార్డు బద్దలు
ఐపీఎల్ 2022లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సూపర్ హాఫ్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. తన పాత టీమ్ ఎస్ఆర్హెచ్పై వార్నర్ విరుచుకుపడిన తీరు అద్భుతమని చెప్పాలి. ఆరంభంలో ఇన్నింగ్స్ నెమ్మదిగా ఆరంభించిన వార్నర్.. ఆ తర్వాత గేర్ మార్చి ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్ ఓవరాల్‌గా 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. సెంచరీ అవకాశాన్ని మిస్ చేసుకున్నప్పటికి వార్నర్ పొట్టి ఫార్మాట్లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టి20 క్రికెట్లో అత్యధిక అర్థసెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా వార్నర్ నిలిచాడు. ఎస్ఆర్హెచ్పై చేసిన హాఫ్ సెంచరీ వార్నర్ ఖాతాలో 84వది. తద్వారా క్రిస్ గేల్(83 అర్థసెంచరీలు) పేరిట ఉన్న రికార్డును వార్నర్ బ్రేక్ చేశాడు. వార్నర్, గేల్ తర్వాత టీమిండియా మెషిన్‌గన్ విరాట్ కోహ్లి 77 హాఫ్ సెంచరీలతో మూడోస్థానంలో ఉన్నాడు. ఇక ఆసీస్ టి20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ 70 అర్థసెంచరీలతో నాలుగో స్థానంలో ఉండగా.. టీమిండియా టి20 కెప్టెన్ రోహిత్ శర్మ 69 హాఫ్ సెంచరీలతో జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. అంతేకాదు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లోనే వార్నర్ మరో రికార్డు అందుకున్నాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో మార్క్రమ్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా భారీ సిక్సర్ కొట్టిన వార్నర్.. టి20 క్రికెట్లో 400వ సిక్సర్‌ను పూర్తి చేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో క్రిస్ గేల్ 1056 సిక్సర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ మెరుపు ఇన్నింగ్స్ కోసం క్లిక్ చేయండి చదవండి: David Warner: సెంచరీ చేయకపోయినా పంతం నెగ్గించుకున్న వార్నర్! -
IPL: ఉమేశ్ యాదవ్ అరుదైన రికార్డు.. రోహిత్, గేల్‌లను అధిగమించి..
టీమిండియా సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ ఐపీఎల్-2022లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమేశ్.. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. ఇక తమ జట్టు మూడో మ్యాచ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు ఉమేశ్ యాదవ్. 4 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ కెప్టెన్ మాయంక్ అగర్వాల్, లివింగ్‌స్టోన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్ వికెట్లు తీశాడు. ఈ క్రమంలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు గానూ అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తద్వారా పంజాబ్‌పై తనకున్న ఘనమైన రికార్డును మరోసారి రిపీట్ చేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఒకే ప్రత్యర్థి జట్టుతో మ్యాచ్‌లో అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. రోహిత్ శర్మ, క్రిస్‌గేల్ వంటి స్టార్లను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించాడు. కాగా ఉమేశ్ యాదవ్‌కు పంజాబ్‌పై ఇది ఆరో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. అంతకుముందు యూసఫ్ పఠాన్ దక్కన్ చార్జర్స్‌పై 5 సార్లు, రోహిత్ శర్మ కేకేఆర్‌పై 5 సార్లు, క్రిస్‌గేల్ కేకేఆర్‌పై 5 సార్లు ఈ ఘనత సాధించారు. ఇక ఐపీఎల్-2022లో పంజాబ్‌తో కేకేఆర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఉమేశ్ విజృంభణకు తోడు ఆండ్రీ రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చదవండి: IPL 2022 KKR Vs PBKS: నేనేం చేయగలనో నాకు తెలుసు.. క్రికెట్ ఆడేది అందుకే: రసెల్ A thumping win for @KKRiders 💪 💪 The @ShreyasIyer15 -led unit returns to winning ways as they beat #PBKS by 6⃣wickets👏 👏 Scorecard ▶️ https://t.co/JEqScn6mWQ #TATAIPL | #KKRvPBKS pic.twitter.com/UtmnpIufGJ — IndianPremierLeague (@IPL) April 1, 2022 -
IPL: క్రిస్ గేల్ వచ్చేస్తున్నాడు..!
IPL 2022: ఐపీఎల్లో అత్యధిక సెంచరీల వీరుడు, కరీబియన్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.. ఈ ఏడాది (2022) ఐపీఎల్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఫామ్ లేమి, వయో భారం రిత్యా అతను ఐపీఎల్ 2022 మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకోలేదు. అయితే, యూనివర్సల్ బాస్ తాజాగా ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్‌ను బట్టి చూస్తే అతను ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. వర్క్ జస్ట్ స్టార్ట్.. లెట్స్ గో.. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ప్రిపరేషన్స్ మొదలెట్టేశా.. అంటూ వర్కవుట్స్ చేస్తున్న వీడియోను గేల్ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన అతని అభిమానులు.. బాస్ విల్ బి బ్యాక్ అంటూ తెగ సంబురపడిపోతున్నారు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్లో గేల్‌తో పాటు మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మెరుపులు లేకపోవడంతో అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. తాజాగా గేల్ ఐపీఎల్ రీఎంట్రీ విషయంపై క్లూ ఇవ్వడంతో, ఏబీ అభిమానులు కూడా తమ ఫేవరెట్ క్రికెటర్ రీఎంట్రీ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు ఏబీ తన ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు గేల్ సైతం టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకుంటాడన్న ప్రచారం జోరుగా సాగింది. యూనివర్సల్ బాస్.. తన ఐపీఎల్ కెరీర్లో 142 మ్యాచ్‌ల్లో 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 4965 పరుగులు చేశాడు. ఇందులో 405 ఫోర్లు, 357 సిక్సర్లు ఉన్నాయి. pic.twitter.com/jdXhGaclHQ — Addicric (@addicric) March 29, 2022 చదవండి: అత్యంత విలువైన సెలబ్రిటీగా కోహ్లినే టాప్ -
హెడ్ కోచ్‌గా క్రిస్ గేల్.. ఏ జట్టుకో తెలుసా?
వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ క్రిస్ గేల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. వచ్చే ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తానని గేల్ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్-2022 లో కరాచీ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కరాచీ కింగ్స్ ఒకే ఒక విజయం సాధించింది. కరాచీ కింగ్స్‌కు బాబర్ ఆజాం సారథిగా ఉన్నాడు. "వచ్చే సీజన్లో కరాచీ కింగ్స్‌కు నేను కొత్త ప్రధాన కోచ్‌ని అవుతాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు" అని గేల్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఫార్చ్యూన్ బారిషల్ జట్టుకు యూనివర్స్ బాస్ ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఐపీఎల్-2022కు కూడా క్రిస్ గేల్ దూరంగా ఉన్నాడు. 79 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన గేల్ 1899 పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా తన టీ20 కేరిర్‌లో 445 మ్యాచ్‌లు ఆడిన గేల్ 14,321 పరుగులు చేశాడు. 2013 ఐపీఎల్ సీజన్లో కేవలం 66 బంతుల్లో 175 పరుగులు చేసి యూనివర్స్ బాస్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి గేల్ తప్పుకోవాలని భావిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: 19 ఫోర్లు..2 సిక్స్‌లు.. సెంచరీతో చెలరేగిన సన్‌రైజర్స్ ఆటగాడు! -
IPL 2022 Auction: వీరేమో దూరం.... వాళ్లకు భారీ డిమాండ్!
IPL 2022 Mega Auction: ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం.... ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడాలని ప్రపంచంలోని ప్రతి క్రికెటర్ కోరుకుంటానడంలో అతిశయోక్తి లేదు. ఇక మెగా వేలం వచ్చిందంటే కోట్లలో డబ్బు కొల్లగొట్టే అవకాశం. అయితే, కొంతమంది కీలక ఆటగాళ్లు ఈ సారి వేలానికి దూరమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న పలువురు క్రికెటర్లు వేర్వేరు కారణాలతో ఈ సీజన్ ఐపీఎల్ ఆడరాదని నిర్ణయించుకున్నారు. వీరిలో క్రిస్ గేల్, బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, కైల్ జేమీసన్, స్యామ్ కరన్, జాయ్ రిచర్డ్సన్, డాన్ క్రిస్టియాన్, క్రిస్ వోక్స్, మాట్ హెన్రీ చెప్పుకోదగ్గ ఆటగాళ్లు. ఇక మెగా వేలంలో డిమాండ్ ఉన్న క్రికెటర్లు ఎవరంటే! ఐపీఎల్లో గత రికార్డు, ప్రస్తుతం జట్ల అవసరాలు, భవిష్యత్తు... ఇలా అన్నీ చూస్తే వేలంలో కొందరు ఆటగాళ్లకు భారీ మొత్తం దక్కే అవకాశం కనిపిస్తోంది. విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్, కెప్టెన్సీ అర్హతలు ఉన్న శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపింగ్ హిట్టర్లు ఇషాన్ కిషన్, క్వింటన్ డి కాక్, టాప్ లెగ్ స్పిన్నర్ చహల్, ఫాస్ట్ బౌలర్ కగిసో రబడలకు మంచి డిమాండ్ ఉంది. మిగతా భారత ఆటగాళ్లలో దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ కోసం ఫ్రాంచైజీలు ఎగబడటం ఖాయం. ఇప్పటి వరకు టీమిండియాకు ఆడని అన్క్యాప్డ్ ప్లేయర్లలో భారీ షాట్లు ఆడే తమిళనాడు ప్లేయర్ షారుఖ్ ఖాన్, యువ పేసర్ అవేశ్ ఖాన్‌లపై అందరి దృష్టీ ఉంది. చదవండి: IND vs WI 3rd ODI: మొన్న ప్రపంచ రికార్డు.. ఈరోజేమో మరీ ఇలా.. నిరాశపరిచావు కదా! -
అత్యుత్తమ టి20 జట్టు ఎంపిక.. సొంత జట్టు ఆటగాళ్లకు నో చాన్స్
శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ తిసార పెరీరా తన 11 మందితో కూడిన అత్యుత్తమ టి20 జట్టును ప్రకటించాడు. అయితే ఆశ్యర్యంగా తన సొంత జట్టు నుంచి ఒక్క ఆటగాడికి కూడా పెరీరా చోటు ఇవ్వకపోవడం విశేషం. పెరీరా ప్రకటించిన 11 మందిలో నలుగురు టీమిండియా నుంచి.. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు చొప్పున.. అఫ్గానిస్తాన్ నుంచి ఒక ఆటగాడిని ఎంపిక చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని కెప్టెన్‌గా.. వికెట్‌కీపర్‌గా ఎంపిక చేశాడు. ఇక క్రిస్ గేల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా.. విరాట్ కోహ్లి మూడో స్థానంలో.. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, డేవిడ్ మిల్లర్లకు మిడిలార్డర్లో చోటు కల్పించాడు. ఇక స్పిన్నర్లుగా రషీద్ ఖాన్, సునీల్ నరైన్‌లను ఎంపిక చేసిన పెరీరా.. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్, షాన్ టైట్లను ఏంచుకున్నాడు. పెరీరా టి20 అత్యుత్తమ జట్టు: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, AB డివిలియర్స్, డేవిడ్ మిల్లర్, ఎంఎస్ ధోని(కెప్టెన్ & వికెట్ కీపర్), రషీద్ ఖాన్, సునీల్ నరైన్, జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్, షాన్ టైట్ చదవండి: Suranga Lakmal: టీమిండియతో సిరీస్ ఆఖరు.. రిటైర్ కానున్న స్టార్ క్రికెటర్ కాగా తిసారా పెరీరా శ్రీలంక తరపున 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన పెరీరా లంక తరపున 166 వన్డేల్లో 2338 పరుగులతో పాటు 175 వికెట్లు, 84 టి20ల్లో 1204 పరుగులు.. 61 వికెట్లు, 6 టెస్టుల్లో 203 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీశాడు. 2014 టి20 ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక జట్టులో పెరీరా సభ్యుడిగా ఉన్నాడు. వన్డేలు, టి20ల్లో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్‌గా పెరీరా చరిత్ర సృష్టించాడు. ఇక ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పెరీరా.. సౌతాఫ్రికాతో వన్డే మ్యాచ్‌లో రాబిన్ పీటర్సన్ బౌలింగ్‌లో ఒక ఓవర్లో 35 పరుగులు కొట్టి కొత్త రికార్డు సృష్టించాడు. మే 3, 2021న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పెరీరా 2017-19 మధ్య కాలంలో అన్ని ఫార్మాట్లకు లంక కెప్టెన్‌గా వ్యవహరించాడు. -
వేలంలో పాల్గొనాలంటూ స్టార్ ఆటగాడికి ఫోన్‌కాల్..
ఐపీఎల్ 2022 మెగావేలంకు సంబంధించిన ఫైనల్ లిస్టు మంగళవారం విడుదలైంది. ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న మెగావేలానికి 590 మంది క్రికెటర్లు షార్ట్‌లిస్ట్ అయ్యారు. బెంగళూరు వేదికగా జరగనున్న వేలంలో వీరిని ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందో చూడాలి. అయితే ఈసారి వెస్టిండీస్ స్టార్ క్రికెటర్.. విధ్వంసకర ఆటగాడు.. యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉండనున్నాడు. అందుకే ఈసారి వేలంలో తన పేరును కూడా రిజిస్టర్ చేసుకోలేదు. అయితే క్రిక్‌బజ్ నిర్వహించిన సర్వేలో రెండు ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొనబోతున్న 590 మంది ఫైనల్ లిస్టులో గేల్ పేరును చేర్చాలని భావించినట్లు సమాచారం. చదవండి: ఆర్సీబీతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనైన కోహ్లి గేల్ పంబాబ్ కింగ్స్‌తో పాటు ఆర్సీబీకి ఎక్కువకాలం ఆడాడు. బహుశా ఈ రెండు ఫ్రాంచైజీలే గేల్‌ను సంప్రదించి ఈసారి వేలంలో పాల్గొనాలని.. తాము కొనుగోలు చేస్తామని ఫోన్ చేసినట్ల తెలిసింది. అయితే గేల్ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడని.. వేలంలో ఈసారి తాను పాల్గొనబోయేది లేదని.. ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నట్లు సమాచారం. గేల్‌తో పాటు బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్‌లకు కూడా ఫోన్ కాల్స్ వెళ్లినట్లు.. కానీ వీరిద్దరు ఈసారి ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇక ఈసారి 590 మంది క్రికెటర్లు వేలానికి షార్ట్‌లిస్ట్ అయినట్లు బీసీసీఐ మంగళవారం వెల్లడించింది. ఇందులో 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా... 355 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు, ఏడుగురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. ఇక టీమిండియా నుంచి శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, అజింక్య రహానే, సురేశ్ రైనా, యజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ తదితర స్టార్ ప్లేయర్లు రేసులో నిలిచారు. అదే విధంగా అఫ్గనిస్తాన్ నుంచి 17, ఆస్ట్రేలియా నుంచి 47, బంగ్లాదేశ్ నుంచి 5, ఇంగ్లండ్ నుంచి 24, ఐర్లాండ్ నుంచి 5, న్యూజిలాండ్ నుంచి 24, దక్షిణాఫ్రికా నుంచి 33, శ్రీలంక నుంచి 23, వెస్టిండీస్ నుంచి 34, జింబాబ్వే నుంచి ఒకరు, నమీబియా నుంచి ముగ్గురు, నేపాల్ నుంచి ఒకరు, స్కాట్లాండ్ నుంచి ఇద్దరు, అమెరికా నుంచి ఒకరు వేలంలో పాల్గొననున్నారు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటన విడుదల చేశారు. చదవండి: IPL 2022 Auction Players List: మెగా వేలంలో పాల్గొనబోయేది వీళ్లే: బీసీసీఐ -
ప్రధాని మోదీ నుంచి పర్సనల్ మెసేజ్: క్రిస్ గేల్
విండీస్ హార్డ్ హిట్టర్.. యునివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కు ఇండియా అంటే ప్రత్యేకమైన అభిమానం.ఈ విషయాన్ని ఇంతకముందు చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా గేల్ భారత క్రికెట్ అభిమానులకు మరింత చేరువయ్యాడు. తాజాగా జనవరి 26న భారత్ 73వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా క్రిస్ గేల్ భారతీయులకు తన స్టైల్లో శుభాకాంక్షలు తెలిపాడు. చదవండి: Kohli Vs BCCI: కోహ్లి,గంగూలీ ఒకసారి ఫోన్లో మాట్లాడుకోండి: కపిల్ దేవ్ ''భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పంపిన పర్సనల్ మెసేజ్‌తో ఈరోజు నిద్ర లేచా. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారతీయులకు ఇవే నా శుభాకాంక్షలు. మోదీతో పాటు దేశ ప్రజలతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మీ దేశ క్రికెటర్లతో కలిసి ఐపీఎల్ సహా ఇతర క్లబ్ క్రికెట్లో కలిసి ఆడడం గౌరవంగా భావిస్తుంటా. కంగ్రాట్స్ ఫ్రమ్ యునివర్సల్ బాస్'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. దీనిలో ఆర్సీబీ తరపున 91 మ్యాచ్‌ల్లో 3420 పరుగులు సాధించాడు. కోహ్లి, డివిలియర్స్ తర్వాత ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా గేల్ నిలిచాడు. అయితే ఈసారి ఐపీఎల్లో మాత్రం గేల్ మెరుపులు మిస్ కానున్నాయి. ఐపీఎల్ మెగావేలానికి సంబంధించి ప్లేయర్ల వేలం జాబితాలో గేల్ రిజిస్టర్ చేసుకోలేదు. ఈ కారణంగా గేల్ వేలానికి దూరమయ్యాడు. ఇక క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్ తరపున 103 టెస్టులు, 301 వన్డేలు, 79 టి20లు ఆడాడు. చదవండి: Neeraj Chopra: నీరజ్ చోప్రాకు విశిష్ట పురస్కారం I would like to congratulate India on their 73rd Republic Day. I woke up to a personal message from Prime Minister Modi @narendramodi reaffirming my close personal ties with him and to the people of India. Congratulations from the Universe Boss and nuff love 🇮🇳🇯🇲❤️🙏🏿 — Chris Gayle (@henrygayle) January 26, 2022 -
ఈ ఏడాది ఐపీఎల్‌కి దూరంగా కానున్న స్టార్ ప్లేయర్లు వీరే..!
Most Of England Players Including Gayle To Skip IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్‌కి ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు సామూహికంగా డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ సారి జరగబోయే మెగా వేలంలో మొత్తం 1214 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. కొందరు ఇంగ్లండ్ క్రికెటర్లు మాత్రం లీగ్‌పై అనాసక్తి కనబర్చారు. వేలం కోసం 30 మంది ఇంగ్లండ్ ప్లేయర్లు రిజిస్టర్ చేసుకోగా.. జో రూట్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, సామ్ కర్రన్ వంటి స్టార్ క్రికెటర్లు దూరంగా ఉన్నారు. అయితే బెయిర్ స్టో, టామ్ కర్రన్, ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్ వంటి ప్లేయర్లు ఐపీఎల్ వేలం కోసం తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. మరోవైపు వెస్టిండీస్ స్టార్ బ్యాటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సైతం క్యాష్ రిచ్ లీగ్‌కు డుమ్మా కొట్టాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి లీగ్‌లో కొనసాగుతున్న గేల్.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అతను ఐపీఎల్ మెగా వేలం కోసం తన పేరు నమోదు చేసుకోలేదని సమాచారం. కాగా, వీరితో పాటు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా ఐపీఎల్‌పై అనాసక్తి కనబర్చాడు. తొలుత అతను లీగ్‌లో పాల్గొంటానని ప్రకటించినప్పటికీ.. నిర్ణీత గడువు సమయానికి పేరును నమోదు చేసుకోలేదు. ఇదిలా ఉంటే, వేలంలో పాల్గొనబోయే 1214 మంది ఆటగాళ్లలో 896 మంది భారతీయ క్రికెటర్లు కాగా.. 318 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో 270 మంది క్యాప్డ్ (జాతీయ జట్టు తరఫున ఆడినవారు), 903 మంది అన్క్యాప్డ్ (జాతీయ జట్టుకు ఆడని వారు), 41 మంది అసోసియేట్ ప్లేయర్లు ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా ఆస్ట్రేలియా(59)కు చెందిన వారు కాగా, ఆ తర్వాత సౌతాఫ్రికా (48), శ్రీలంక (36), ఇంగ్లండ్ (30), న్యూజిలాండ్ (29), అఫ్ఘానిస్థాన్ (20) దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. నేపాల్ (15), యూఎస్ఏ (14), నమీబియా (5), ఒమన్ (3), భూటాన్ (1), యూఏఈ (1), నెదర్లాండ్స్ (1), స్కాట్లాండ్ వంటి అసోసియేట్ దేశాల ఆటగాళ్లు సైతం మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చదవండి: IPL 2022: మెగా వేలంలో కోట్లు కొల్లగొట్టేది వీళ్లే.. -
క్రిస్ గేల్‌కు ఘోర అవమానం..!
Chris Gayle: విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కు ఘోర అవమానం జరిగింది. సొంతగడ్డపై టీ20లకు వీడ్కోలు పలకాలనుకున్న తన ఆకాంక్షను ఆ దేశ క్రికెట్ బోర్డు బేఖాతరు చేసింది. త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరగనున్న టీ20 సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన విండీస్ జట్టులో చోటు కల్పించకుండా అతన్ని అవమానపర్చింది. ఇప్పటికే వన్డేలు, టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన గేల్.. తన సొంత మైదానమైన సబీనా పార్క్‌లో తన చివరి టీ20 మ్యాచ్ ఆడి క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతానని గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. విండీస్ క్రికెట్ బోర్డు తాజా నిర్ణయంతో గేల్.. తన సమీప భవిష్యత్తులో టీ20లు ఆడే అవకాశం లేదు. దీంతో అతను టీ20 రిటైర్మెంట్ అంశంపై పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విండీస్.. జనవరి 16న ఐర్లాండ్‌తో ఏకైక టీ20, ఆతర్వాత జనవరి 22 నుండి 30 వరకు ఇంగ్లండ్‌తో 5 టీ20లు ఆడనుంది. ఇదిలా ఉంటే, గేల్ తన టీ20 కెరీర్లో మొత్తం 452 మ్యాచ్‌ల్లో 145.4 స్ట్రైక్‌రేట్‌తో 14,321 పరుగులు సాధించి, ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పొట్టి క్రికెట్లో గేల్ 87 హాఫ్ సెంచరీలు, 22 సెంచరీలు బాదాడు. చదవండి: కోహ్లి-రోహిత్‌ల మధ్య విభేదాలా..? అలాంటి వార్తలు విని నవ్వుకునేవాడిని..! -
క్రికెట్లో అడుగుపెట్టనున్న ఉసేన్ బోల్ట్.. ఏ లీగ్‌లో ఆడనున్నాడంటే!
Usain Bolt set to play T20 cricket..?: ఎనిమిది సార్లు ఒలింపిక్ బంగారు పతక విజేత, జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ త్వరలో తన కలను సాకారం చేసుకోనున్నాడు. చిన్నతనం నుంచి తనకు ఇష్టమైన క్రికెట్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) లో త్వరలో నిర్వహించబోతున్న ఓ టీ20 లీగ్ లో బోల్ట్ పాల్గోనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ భారత డిజిటల్ స్పోర్ట్స్ ఛానల్ ఈ లీగ్ కోసం బోల్ట్‌ను సంప్రదించున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరికొద్దిరోజుల్లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది. కాగా బోల్ట్ ఎనిమిది సార్లు ఒలిపింక్స్‌లో బంగారు పతక విజేతగా నిలిచాడు. అదే విధంగా 2009 బెర్లిన్‌లో జరిగిన ఐఏఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్లను 9.58 సెకన్లలో పూర్తి చేశాడు. ఇదే ప్రస్తుతం ప్రపంచ రికార్డును కలిగి ఉంది. కాగా ఇటీవల రన్నింగ్ నుంచి బోల్ట్ రిటైర్మ్మెంట్ ప్రకటించాడు. అయితే చాలా సందర్బాల్లో క్రికెట్ అంటే ఇష్టమని బోల్ట్ తెలిపాడు . తన తండ్రి కోరికకు తలొగ్గి రన్నింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నానని, క్రికెట్ ఎప్పుడూ తన ‘ఫస్ట్ లవ్’ అని బోల్ట్ చాలా సందర్బాల్లో వెల్లడించాడు. కాగా క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ సూపర్ స్టార్లు జమైకాకు చెందినవారే. చదవండి: Ben Stokes 56 Number Armband: 56వ నెంబర్‌తో బరిలోకి.. నాన్నకు ప్రేమతో -
బౌలర్లకు చుక్కలు చూపించిన క్రిస్ గేల్.. కేవలం 23 బంతుల్లోనే..
Chris Gayle Smashed 52 Runs In Just 23 balls 58 In Abu Dhabi T10 league: అబుదాబి వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో క్రిస్‌గేల్ మరోసారి చెలరేగాడు. శుక్రవారం బంగ్లా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ కేవలం 23 బంతుల్లో అజేయంగా 53 పరుగులు సాధించి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ టోర్నీలో యూనివర్సల్ బాస్ టీమ్ అబుదాబికు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గేల్ సుడిగాలి ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. అయితే క్రిస్ గేల్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ తన జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా టైగర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 131 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ అబుదాబి ఆరంభంనుంచే వికెట్లు కోల్పోతూ వచ్చింది. అయితే నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గేల్ ఒక్క సారిగా మ్యాచ్‌పై ఆశలు పెంచాడు. సిక్స్‌లు, ఫోర్లు తో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే అఖరి ఓవర్లో 19 పరుగుల కావల్సిన నేపథ్యంలో గేల్ కేవలం ఒక్క సిక్స్ మాత్రమే బాదాడు. దీంతో 11 పరుగుల తేడాతో టీం అబుదాబిపై బంగ్లా టైగర్స్ విజయం సాధించింది. చదవండి: Ban Vs Pak Test Match: అరె ఇద్దరూ ఒకేసారి పరిగెత్తారు.. ఇద్దరూ ఒకేసారి డైవ్ చేశారు.. ఆఖరికి