అమెరికాతో మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ షాయీ హోప్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు.
కేవలం 39 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఎనిమిది సిక్స్‌ల సాయంతో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో భాగంగా అమెరికాతో మ్యాచ్‌లో ఈ మేరకు పరుగుల విధ్వంసం సృష్టించాడు.
ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ టోర్నీలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఐదో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. టీ20 ఫార్మాట్ అంటే పూనకం వచ్చినట్లుగా బ్యాట్‌తో రెచ్చిపోయే విండీస్ వీరుల జాబితాలో చేరాడు.
ఇక బార్బడోస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ అమెరికాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. అద్బుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న విండీస్ స్పిన్నర్ రోస్టన్ చేజ్(3/19) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.
టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ బ్యాటర్ల సిక్సర్ల హవా
ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదింది వీరే
👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 11.. ఇంగ్లండ్ మీద
👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 10.. సౌతాఫ్రికా మీద
👉ఆరోన్ జోన్స్(అమెరికా)- 10.. కెనడా మీద
👉రిలీ రొసోవ్(సౌతాఫ్రికా)-8.. బంగ్లాదేశ్ మీద
👉నికోలస్ పూరన్(వెస్టిండీస్)-8.. అఫ్గనిస్తాన్ మీద
👉షాయీ హోప్(వెస్టిండీస్)-8.. అమెరికా మీద..
టీ20 వరల్డ్‌కప్‌లో ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు
👉నికోలసన్ పూరన్(వెస్టిండీస్)- 17(2024 ఇప్పటి వరకు)
👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 16(2012)
👉మార్లన్ సామ్యూల్స్- 15(2012)
👉షేన్ వాట్సన్- 15(2012).
చదవండి: టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీకి సిద్ధం.. ఆ సిరీస్ నాటికి!
Comments
Please login to add a commentAdd a comment