సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న (ఆగస్ట్ 27) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో విండీస్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో మ్యాచ్‌ను అక్కడితో ఆపేశారు.
అనంతరం వర్షం తగ్గుముఖం పట్టాక డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన విండీస్ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 116 పరుగులుగా నిర్ధారించారు. 116 పరుగుల లక్ష్యాన్ని విండీస్ కేవలం 9.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.
రాణించిన షెపర్డ్
తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. రికెల్టన్ (27), మార్క్రమ్ (20), ట్రిస్టన్ స్టబ్స్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి రాణించాడు. అకీల్ హొసేన్, మాథ్యూ ఫోర్డ్ తలో వికెట్ పడగొట్టారు.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్ దుబారాగా బంతులు వేస్ట్ చేశాడు. హెండ్రిక్స్ 20 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ఆఖర్లో స్టబ్స్ వేగంగా పరుగులు చేయడంతో సౌతాఫ్రికా 100 పరుగుల మార్కును దాటగలిగింది. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ తన కోటా రెండు ఓవర్లలో ఓ మెయిడిన్ వేశాడు.
సిక్సర్ల వర్షం కురిపించిన పూరన్
109 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. నికోలస్ పూరన్ (13 బంతుల్లో 35; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (24 బంతుల్లో 42 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), షిమ్రోన్ హెట్‌మైర్ (17 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో సునాయాసంగా విజయతీరాలకు చేరింది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో పూరన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సిరీస్‌లో అతను 205.17 స్ట్రయిక్‌రేట్‌తో 12 సిక్సర్లు బాదాడు.
Comments
Please login to add a commentAdd a comment