Romario Shepherd
-
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. విండీస్‌కు ఘోర పరాభవం
వెస్టిండీస్ గడ్డపై బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు దుమ్ములేపింది. టీ20 ఫార్మాట్లో తొలిసారి విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తద్వారా వన్డే సిరీస్‌లో ఎదురైన వైట్‌వాష్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. రెండు టెస్టు, మూడు వన్డే, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది.టీ20లను విజయంతో ఆరంభించిటెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసిన బంగ్లా జట్టు.. వన్డేల్లో మాత్రం 3-0తో చిత్తుగా ఓడింది. అయితే, టీ20 సిరీస్‌లో మాత్రం ఆది నుంచే సత్తా చాటిన లిటన్ దాస్ బృందం.. తొలి రెండు మ్యాచ్‌లలో వరుసగా ఏడు, ఇరవై ఏడు పరుగుల తేడాతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ నెగ్గింది.జాకెర్ అలీ ధనాధన్ ఇక సెయింట్ విన్సెంట్ వేదికగా నామమాత్రపు మూడో టీ20లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ లిటన్ దాస్ విఫలం కాగా.. పర్వేజ్ హుసేన్ ఇమాన్(39) మెరుగ్గా ఆడాడు. మిగతా వాళ్లలో మెహదీ హసన్ మిరాజప్ 29 రన్స్ చేయగా.. జాకెర్ అలీ ధనాధన్ బ్యాటింగ్‌తో దంచికొట్టాడు.జాకెర్ అలీ మొత్తంగా 41 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 189 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ రెండు, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్, గుడకేశ్ మోటీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.రొమారియో షెఫర్డ్ ఒక్కడేఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. రొమారియో షెఫర్డ్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ జాన్సన్ చార్ల్స్ 23, వికెట్ కీపర్ నికోలస్ పూరన్ 15 రన్స్ చేశాడు. మిగతావాళ్లంతా పూర్తిగా విఫలం కావడంతో.. 16.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే విండీస్ ఆలౌట్ అయింది.బంగ్లా బౌలర్లలో రిషాద్ హొసేన్ మూడు వికెట్లతో చెలరేగగా.. టస్కిన్ అహ్మద్, మెహదీ హసన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. తాంజిమ్ హసన్ సకీబ్, హసన్ మహమూద్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.జాకెర్ అలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. మెహదీ హసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఇక మూడో టీ20లో విండీస్‌ను 80 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్‌కు.. టీ20లలో ఆ జట్టును వైట్‌వాష్ చేయడం ఇదే తొలిసారి. తద్వారా లిటన్ దాస్ బృందం బంగ్లా తరఫున సరికొత్త చరిత్ర సృష్టించింది.చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు -
సిక్సర్ల వర్షం కురిపించిన పూరన్.. సౌతాఫ్రికాను క్లీన్ స్వీప్ చేసిన వెస్టిండీస్
సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న (ఆగస్ట్ 27) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో విండీస్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో మ్యాచ్‌ను అక్కడితో ఆపేశారు. అనంతరం వర్షం తగ్గుముఖం పట్టాక డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన విండీస్ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 116 పరుగులుగా నిర్ధారించారు. 116 పరుగుల లక్ష్యాన్ని విండీస్ కేవలం 9.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.రాణించిన షెపర్డ్తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. రికెల్టన్ (27), మార్క్రమ్ (20), ట్రిస్టన్ స్టబ్స్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి రాణించాడు. అకీల్ హొసేన్, మాథ్యూ ఫోర్డ్ తలో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్ దుబారాగా బంతులు వేస్ట్ చేశాడు. హెండ్రిక్స్ 20 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ఆఖర్లో స్టబ్స్ వేగంగా పరుగులు చేయడంతో సౌతాఫ్రికా 100 పరుగుల మార్కును దాటగలిగింది. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ తన కోటా రెండు ఓవర్లలో ఓ మెయిడిన్ వేశాడు.సిక్సర్ల వర్షం కురిపించిన పూరన్109 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. నికోలస్ పూరన్ (13 బంతుల్లో 35; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (24 బంతుల్లో 42 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), షిమ్రోన్ హెట్‌మైర్ (17 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో సునాయాసంగా విజయతీరాలకు చేరింది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో పూరన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సిరీస్‌లో అతను 205.17 స్ట్రయిక్‌రేట్‌తో 12 సిక్సర్లు బాదాడు. -
రాణించిన రొమారియో షెపర్డ్.. ఫైనల్లో టొరంటో నేషనల్స్
గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో టొరంటో నేషనల్స్ ఫైనల్స్‌కు చేరింది. నిన్న (ఆగస్ట్ 10) జరిగిన క్వాలిఫయర్-2లో ఆ జట్టు బ్రాంప్టన్ వోల్వ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వోల్వ్స్.. నిక్ హాబ్సన్ (51 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. వోల్వ్స్ ఇన్నింగ్స్‌లో కోబ్ హెర్ఫ్ట్ 1, డేవిడ్ వార్నర్ 13, జాక్ జార్విస్ 20, వెబ్‌స్టర్ 8, మున్సే 26, అఖిల్ కుమార్ 7, ఆండ్రూ టౌ 6, హర్మన్దీప్ సింగ్ 0 పరుగులకు ఆలౌట్ కాగా.. థామస్ డ్రాకా 1 పరుగుతో అజేయంగా నిలిచాడు. టొరంటో బౌలర్లలో రొమారియో షెపర్డ్ 4 వికెట్లు తీసి వోల్వ్స్‌ను దారుణంగా దెబ్బకొట్టగా.. జతిందర్‌పాల్ 2, బెహ్రెన్‌డార్ఫ్, జునైద్ సిద్దిఖీ తలో వికెట్ పడగొట్టారు.142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టొరంటో నేషనల్స్.. కొలిన్ మున్రో (36), మొహమ్మద్ నవాజ్ (24 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఉన్ముక్త్ చంద్ 19, ఆండ్రియస్ గౌస్ 18, డస్సెన్ 14, అర్మాన్ కపూర్ 4 పరుగులు చేసి ఔట్ కాగా.. రొమారియో షెపర్డ్ 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. వోల్వ్స్ బౌలర్లలో అఖిల్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆండ్రూ టై, వెబ్‌స్టర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇవాళ రాత్రి (9:30 గంటలకు) జరిగే ఫైనల్లో టొరంటో నేషనల్స్.. మాంట్రియాల్ టైగర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. -
ఫిల్ సాల్ట్ ఊచకోత.. ఒకే ఓవర్లో 30 పరుగులు! వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2024లో సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. 181 పరుగుల లక్ష్య చేధనలో సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కరేబియన్ బౌలర్లకు సాల్ట్ చుక్కలు చూపించాడు.ముఖ్యంగా విండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్‌ను ఊచకోత కోశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన షెపర్డ్ బౌలింగ్‌లో సాల్ట్ 4,6,4,6,6,4 బాది ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. దీంతో మ్యాచ్ స్వరూపం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న సాల్ట్.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా విండీస్‌పై టీ20ల్లో సాల్ట్‌కు ఘనమైన రికార్డు ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో సాల్ట్ ఇప్పటివరకు 26 ఇన్నింగ్స్‌ల్లో 844 పరుగులు చేయగా అందులో 50 శాతానికి పైగా విండీస్‌పై బాదినవే కావడం విశేషం.విండీస్‌పై ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌లు ఆడిన సాల్ట్ 487 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో విండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది.చదవండి: T20 WC: అఫ్గాన్‌తో మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పు! సిరాజ్‌కు నో ఛాన్స్ View this post on Instagram A post shared by ICC (@icc) -
IPL 2024 DC Vs MI Pics: ట్రిస్టన్ స్టబ్స్ పోరాటం వృథా..ముంబై తొలి విజయం (ఫొటోలు)
-
రొమారియో షెపర్డ్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు రొమారియో షెపర్డ్ మెరుపులు మెరిపించాడు. ఈ ఏడాది సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న షెపర్డ్ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా ఢిల్లీ పేసర్ అన్రిచ్ నోర్జేకు అయితే షెపర్డ్ చుక్కలు చూపించాడు. ముంబై ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన నోర్జే బౌలింగ్‌లో 4 సిక్స్‌లు, రెండు ఫోర్లతో రొమారియా ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 10 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రొమారియో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన షెపర్డ్.. ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్‌తో ఆడిన ఆటగాడిగా షెపర్డ్ రికార్డులకెక్కాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో షెపర్డ్ 390.0 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(373.3) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కమ్మిన్స్ ఆల్‌టైమ్ రికార్డును రొమారియో బ్రేక్ చేశాడు. 𝗕𝗹𝗼𝗰𝗸𝗯𝘂𝘀𝘁𝗲𝗿 𝗙𝗶𝗻𝗶𝘀𝗵 🔥 On Display: The Romario Shepherd show at the Wankhede 💪 Watch the match LIVE on @JioCinema and @starsportsindia 💻📱#TATAIPL | #MIvDC pic.twitter.com/H63bfwm51J — IndianPremierLeague (@IPL) April 7, 2024 -
విధ్వంసం.. ఒకే ఓవర్ లో 4,6,6,6,4,6! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు రొమారియో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. 7వ స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షెపర్డ్ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా ఢిల్లీ పేసర్ అన్రిచ్ నోర్జేను ఈ కరేబియన్ ఉతికారేశాడు. ముంబై ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన నోర్జే బౌలింగ్‌లో 4 సిక్స్‌లు, రెండు ఫోర్లతో రొమారియా ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 10 బంతులు మాత్రమే ఎదుర్కొన్న షెపర్డ్.. 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఇన్నాళ్లు ఎక్కడ వున్నావు అన్న అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది సీజన్లో రొమారియో షెపర్డ్‌కు ఇదే తొలి మ్యాచ్. ఐపీఎల్-2024 వేలానికి ముందు షెపర్డ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ముంబై ట్రేడ్ చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(49) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టిమ్ డేవిడ్(45), ఇషాన్ కిషన్(42), హార్దిక్ పాండ్యా(39), రొమారియో షెపర్డ్(38) పరుగులతో రాణించారు. 𝗕𝗹𝗼𝗰𝗸𝗯𝘂𝘀𝘁𝗲𝗿 𝗙𝗶𝗻𝗶𝘀𝗵 🔥 On Display: The Romario Shepherd show at the Wankhede 💪 Watch the match LIVE on @JioCinema and @starsportsindia 💻📱#TATAIPL | #MIvDC pic.twitter.com/H63bfwm51J — IndianPremierLeague (@IPL) April 7, 2024 -
ఎప్పుడూ షూ కూడా వేసుకోలేదు: ‘ఎంఐ’ పవర్ హిట్టర్
‘‘నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. అందుకే ఎంత వీలైతే అంత నిరాడంబరంగా ఉండేందుకు ప్రయత్నిస్తా. ఇక్కడిదాకా చేరుకునే క్రమంలో నా ప్రయాణం ఎంత కష్టతరంగా సాగిందో నాకు తెలుసు. కాళ్లకు బూట్లు లేకుండానే స్కూలుకు వెళ్లిన రోజులు ఉన్నాయి. నేనే కాదు.. బరాకరాలో 99 శాతం పిల్లలు ఎప్పుడూ నాలాగే కనీసం చెప్పుల్లేకుండా వెళ్లాల్సి వచ్చేది. నిజం చెప్పాలంటే.. బరాకరాలో ప్రయాణం మొత్తం నదుల మీదే సాగుతుంది. అక్కడ కాంక్రీట్ రోడ్డులు ఉండవు. మొత్తం అంతా బురదమయమే. అంతా సవ్యంగా ఉన్న రోజు కుదిరితే పడవలో ప్రయాణం చేసేవాళ్లం’’ అంటూ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ బాల్యంలో పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్నాడు. పవర్ హిట్టింగ్ ఎలా సాధ్యం? పేదరికం నుంచి వచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం కఠినంగా శ్రమించడమేనని పేర్కొన్నాడు. అదే విధంగా పవర్ హిట్టర్‌గా పేరొందడం గురించి మాట్లాడుతూ.. ‘‘మంచి బ్యాట్ ఉండి.. మనం బలంగా ఉంటే తొలి బంతి నుంచే భారీ షాట్లు కొట్టవచ్చు(నవ్వుతూ). కొన్నిసార్లు అది సాధ్యపడకపోవచ్చు. సరైన సమయంలో సరైన బంతిని బాదితేనే దానిని సిక్సర్‌గా మలిచే అవకాశం ఉంటుంది. ఫినిషర్ల నుంచి ప్రతి ఒక్కరు భారీ షాట్లు ఆశిస్తారు. అందుకు తగ్గట్లుగా ఆడుతూనే వికెట్ పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది’’ అని రొమారియో షెఫర్డ్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు. వెస్టిండీస్ తరఫున సత్తా చాటుతూ కాగా 1994లో గయానాలో జన్మించిన రొమారియో షెఫర్డ్ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని.. 2019లో వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేశాడు. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగి పవర్ హిట్టర్‌గా పేరొందాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 31 వన్డేలు, 35 టీ20 మ్యాచ్‌లు ఆడాడు ఈ పేస్ ఆల్‌రౌండర్. విండీస్ తరఫున వన్డేల్లో 400 పరుగులు చేయడంతో పాటు 27 వికెట్లు పడగొట్టిన రొమారియో షెఫర్డ్.. టీ20లలో 317 రన్స్ చేసి 37 వికెట్లు తీశాడు. ఆరంభంలో భారీ ధరకు అమ్ముడుపోయి.. ఇప్పుడిలా ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన రొమారియో షెఫర్డ్‌ను 2022 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 7.75 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అయితే, తర్వాత అతడిని ఎస్ఆర్హెచ్ వదిలేయగా.. లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. కానీ ఐపీఎల్-2024కు ముందు లక్నో నుంచి ముంబై ఇండియన్స్ రొమారియో షెఫర్డ్‌ను రూ. 50 లక్షల ధరకు ట్రేడ్ చేసుకుంది. PC: MI ఇక ఇప్పటి వరకు ఐపీఎల్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన రొమారియో షెఫర్డ్ 58 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. మార్చి 22న ఐపీఎల్ 2024 ఆరంభం కానుండగా.. మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. "Ahmedabad chalo!" 🫡💙 The boys have reached the 📍 for their season opener 🏟️#OneFamily #MumbaiIndians pic.twitter.com/cUgkx6Lkyf — Mumbai Indians (@mipaltan) March 22, 2024 చదవండి: IPL 2024: షెడ్యూల్, వేదికలు, పది జట్లు.. పూర్తి వివరాలు -
కళ్లు చెదిరే క్యాచ్.. రొమారియో షెపర్డ్ అద్భుత విన్యాసం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ ఆటగాడు, విండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. ఖుల్నా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనాముల్ హక్ కొట్టిన షాట్‌ను షెపర్డ్ అద్భుత క్యాచ్‌గా మలిచాడు. షొహిదుల్ ఇస్లాం బౌలింగ్‌లో షెపర్డ్ రివర్స్‌లో పరిగెడుతూ బౌండరీ లైన్ సమీపంలో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. What an unbelievable catch by Romario Shepherd. 🔥pic.twitter.com/YG8MtmP4Qy — Mufaddal Vohra (@mufaddal_vohra) February 20, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. తంజిద్ హసన్ (116) మెరుపు సెంచరీ చేసి ఛాలెంజర్స్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. 58 బంతుల్లో శతక్కొట్టిన తంజిద్.. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 65 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్‌లో తంజిద్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఆఖర్లో టామ్ బ్రూస్ (23 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. ముహమ్మద్ వసీం (1), సైకత్ అలీ (18), రొమారియో షెపర్డ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. టైగర్స్ బౌలర్లలో వేన్ పార్నెల్, నసుమ్ అహ్మద్, జేసన్ హోల్డర్, ముకిదుల్ ఇస్లాం తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టైగర్స్...షువగటా హోమ్ (3/25), బిలాల్ ఖాన్ (2/13), సలావుద్దీన్ (1/15), షొహిదుల్ ఇస్లాం (1/18), రొమారియో షెపర్డ్ (1/25), నిహాదుజ్జమాన్ (1/29) ధాటికి 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటై 65 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టైగర్స్ ఇన్నింగ్స్‌లో అనాముల్ హక్ (35), షాయ్ హోప్ (31), జేసన్ హోల్డర్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. నమ్మశక్యం కాని రీతిలో..!
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అద్భుతం చోటు చేసుకుంది. విండీస్ ఆటగాడు, జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అందుకున్నాడు. నిన్న (జనవరి 15) డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో సూపర్ జెయింట్స్ ఓపెనర్ బ్రీట్జ్కీ కొట్టిన షాట్‌ను రొమారియో షెపర్డ్ నమ్మశక్యంకాని రీతిలో క్యాచ్‌గా మలిచాడు. ROMARIO SHEPHERD.... THAT'S AN ABSOLUTE SCREAMER...!!! 🤯 pic.twitter.com/riWEILas3w — Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2024 షెపర్డ్ కొన్ని అడుగుల పాటు గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకుని క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశాడు. ఇది చూసిన వారు తాము చూస్తున్నది నిజమేనా అని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. బౌలర్ నండ్రే బర్గర్ అయితే ఈ క్యాచ్‌కు చూసి కొద్దిసేపటి వరకు అలాగే షాక్‌లో ఉండిపోయాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. ఈ క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇదేందయ్యా ఇది నేనెప్పుడు చూడలా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రొమారియో షెపర్డ్ కళ్లు చెదిరే క్యాచ్‌తో అలరించినప్పటికీ ఈ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు సూపర్ జెయింట్స్ చేతిలో 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. స్వల్ప ఛేదనలో సూపర్ కింగ్స్ బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలమై ఓటమిని కొనితెచ్చుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో హెన్రిచ్ క్లాసెన్ (64) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. లిజాడ్ విలియమ్స్ (4/26) సూపర్ జెయింట్స్ పతనాన్ని శాశించాడు. అనంతరం రీస్ టాప్లే (3/19), రిచర్డ్ గ్లీసన్ (2/22), కేశవ్ మహారాజ్ (2/17) చెలరేగడంతో సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 108 పరుగులకు మాత్రమే పరిమితమైంది. రీజా హెండ్రిక్స్ (38), మొయిన్ అలీ (36) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లీగ్‌లో భాగంగా ఇవాళ (జనవరి 16) ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ తలపడనున్నాయి.