వెస్టిండీస్ గడ్డపై బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు దుమ్ములేపింది. టీ20 ఫార్మాట్లో తొలిసారి విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తద్వారా వన్డే సిరీస్‌లో ఎదురైన వైట్‌వాష్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. రెండు టెస్టు, మూడు వన్డే, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది.
టీ20లను విజయంతో ఆరంభించి
టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసిన బంగ్లా జట్టు.. వన్డేల్లో మాత్రం 3-0తో చిత్తుగా ఓడింది. అయితే, టీ20 సిరీస్‌లో మాత్రం ఆది నుంచే సత్తా చాటిన లిటన్ దాస్ బృందం.. తొలి రెండు మ్యాచ్‌లలో వరుసగా ఏడు, ఇరవై ఏడు పరుగుల తేడాతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ నెగ్గింది.
జాకెర్ అలీ ధనాధన్
ఇక సెయింట్ విన్సెంట్ వేదికగా నామమాత్రపు మూడో టీ20లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ లిటన్ దాస్ విఫలం కాగా.. పర్వేజ్ హుసేన్ ఇమాన్(39) మెరుగ్గా ఆడాడు. మిగతా వాళ్లలో మెహదీ హసన్ మిరాజప్ 29 రన్స్ చేయగా.. జాకెర్ అలీ ధనాధన్ బ్యాటింగ్‌తో దంచికొట్టాడు.
జాకెర్ అలీ మొత్తంగా 41 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 189 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ రెండు, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్, గుడకేశ్ మోటీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
రొమారియో షెఫర్డ్ ఒక్కడే
ఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. రొమారియో షెఫర్డ్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ జాన్సన్ చార్ల్స్ 23, వికెట్ కీపర్ నికోలస్ పూరన్ 15 రన్స్ చేశాడు. మిగతావాళ్లంతా పూర్తిగా విఫలం కావడంతో.. 16.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే విండీస్ ఆలౌట్ అయింది.
బంగ్లా బౌలర్లలో రిషాద్ హొసేన్ మూడు వికెట్లతో చెలరేగగా.. టస్కిన్ అహ్మద్, మెహదీ హసన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. తాంజిమ్ హసన్ సకీబ్, హసన్ మహమూద్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
జాకెర్ అలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. మెహదీ హసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఇక మూడో టీ20లో విండీస్‌ను 80 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్‌కు.. టీ20లలో ఆ జట్టును వైట్‌వాష్ చేయడం ఇదే తొలిసారి. తద్వారా లిటన్ దాస్ బృందం బంగ్లా తరఫున సరికొత్త చరిత్ర సృష్టించింది.
చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు
Comments
Please login to add a commentAdd a comment