Liton Das
-
టీ20ల్లో అరుదైన ప్రదర్శన.. రికార్డుల వెల్లువ
టీ20ల్లో అరుదైన ప్రదర్శన నమోదైంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025లో భాగంగా దర్బార్ రాజ్షాహీతో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు ఢాకా క్యాపిటల్స్ ఆటగాళ్లు (తంజిద్ హసన్ తమీమ్, లిటన్ దాస్) సెంచరీలు చేశారు. టీ20ల్లో ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది తొమ్మిదో సారి.టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు సెంచరీలు చేసిన సందర్భాలు..కెవిన్ ఓ'బ్రియన్ & హమీష్ మార్షల్ vs మిడిల్సెక్స్, ఉక్స్బ్రిడ్జ్, 2011విరాట్ కోహ్లీ & ఎబి డివిలియర్స్ vs గుజరాత్ లయన్స్, బెంగళూరు, 2016అలెక్స్ హేల్స్ & రిలీ రోసౌ vs చిట్టగాంగ్ వైకింగ్స్, చట్టోగ్రామ్, 2019డేవిడ్ వార్నర్ & జానీ బెయిర్‌స్టో vs ఆర్సిబి, హైదరాబాద్, 2019సబావూన్ డేవిజి & డిలాన్ స్టెయిన్ vs బల్గేరియా, మార్సా, 2022లాచ్లాన్ యమమోటో-లేక్ & కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ vs చైనా, మోంగ్ కోక్, 2024శుభ్‌మన్ గిల్ & బి సాయి సుదర్శన్ vs CSK, అహ్మదాబాద్, 2024సంజు సామ్సన్ & తిలక్ వర్మ vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్, 2024తాంజిద్ హసన్ తమీమ్ & లిట్టన్ దాస్ vs దర్బార్ రాజ్షాహి, సిల్హెట్, 2025మ్యాచ్ విషయానికొస్తే.. దర్బార్ రాజ్షాహీతో జరిగిన మ్యాచ్‌లో ఢాకా క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసి రికార్డు స్కోర్ చేసింది. తంజిద్ హసన్ (64 బంతుల్లో 108; 6 ఫోర్లు, 8 సిక్సర్లు), లిటన్ దాస్ (55 బంతుల్లో 125 నాటౌట్; 10 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో ఢాకా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 254 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్.ఈ మ్యాచ్‌లో లిటన్ దాస్ 44 బంతుల్లో శతక్కొట్టాడు. బీపీఎల్‌లో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టును నిన్ననే ప్రకటించారు. ఈ జట్టులో లిటన్ దాస్‌కు చోటు దక్కలేదు. తనను జట్టు నుంచి తప్పించిన రోజే దాస్ సెంచరీతో కదంతొక్కడం విశేషం.ఈ మ్యాచ్‌లో లిటన్ దాస్, తంజిద్ హసన్ తొలి వికెట్‌కు 241 పరుగులు జోడించారు. బీపీఎల్ చరిత్రలో ఏ వికెట్‌కు అయినా ఇదే అత్యధిక భాగస్వామ్యం. టీ20 క్రికెట్ చరిత్రలో ఏ వికెట్‌కు అయినా ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. టీ20ల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు జపాన్ ఆటగాళ్లు యమమోటో, కడోవాకీ పేరిట ఉంది. ఈ జోడీ 2024లో చైనాతో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన 258 పరుగులు జోడించింది. ఢాకా క్యాపిటల్స్ నిర్దేశించిన 255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దర్బార్ రాజ్‌షాహీ చేతులెత్తేసింది. ఆ జట్టు 15.2 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఢాకా క్యాపిటల్స్ 149 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఇదే భారీ విజయం. ఈ సీజన్లో ఢాకా క్యాపిటల్స్‌కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్‌కు ముందు ఢాకా క్యాపిటల్స్ ఆరు మ్యాచ్‌లు ఆడగా.. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేకపోయింది. -
అందుకే నాపై వేటు వేశారు.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో నో ప్లేస్!
స్టార్ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌తో పాటు సీనియర్ బ్యాటర్ లిటన్ దాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం ప్రకటించిన బంగ్లాదేశ్ జట్టులో వీరికి చోటు దక్కలేదు. షకీబ్ విషయానికొస్తే.. సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా సస్పెన్షన్‌కు గురైన అతడిని సెలెక్టర్లు ఈ ఐసీసీ టోర్నీకి పరిగణించలేదు. ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన 37 ఏళ్ల షకీబ్... చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పుకొంటానని ఇదివరకే వెల్లడించాడు.అయితే, తాజాగా బంగ్లాదేశ్ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయంతో షకీబ్ అంతర్జాతీయ కెరీర్ ఇక ముగిసినట్లే. షకీబ్‌తో పాటు ఫామ్‌లేక తంటాలు పడుతున్న సీనియర్ బ్యాటర్ లిటన్ దాస్‌కు కూడా నిరాశే ఎదురైంది. గత 13 మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధశతకం కూడా సాధించని లిటన్ దాస్... గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 6, 1, 0, 0, 2, 4, 0 పరుగులు చేశాడు. దీంతో అతడిని ఈ టోర్నీకి ఎంపిక చేయలేదు.అందుకే నాపై వేటు వేశారుఈ విషయంపై స్పందించిన లిటన్ దాస్ తనపై వేటు పడటానికి గల కారణాన్ని వెల్లడించాడు. ‘‘గతంలో నేను ఎన్నెన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడాను. అయితే, ఇప్పుడు జీరో నుంచి మళ్లీ మొదలుపెట్టాల్సి వచ్చింది. నేను ఇకపై మరింత కఠినంగా శ్రమించాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం.అయినా, చాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపికకు ముందే నాకొక స్పష్టమైన సందేశం వచ్చింది. అయితే, సెలక్టర్ల నుంచి నేరుగా రాలేదు. కానీ.. ఈ జట్టులో చోటు దక్కదని తెలుసు. నేను బాగా ఆడటం లేదు కాబట్లే నన్ను టీమ్ నుంచి తప్పించారు. ఇందులో దాచాల్సింది, సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. అందరి విషయంలోనూ సాధారణంగా జరిగేదే ఇది.కొత్త ఇన్నింగ్స్ ఆరంభిస్తాఏదేమైనా నేను నా ఆటను మెరుగుపరచుకోవాల్సి ఉంది. రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవు గానీ.. నేను మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయను. అయినా... నేను ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. నిలకడైనా ఆట తీరుతో కొత్త ఇన్నింగ్స్ ఆరంభిస్తా’’ అని 30 ఏళ్ల లిటన్ దాస్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు. కాగా గతనెల(డిసెంబరు 2024)లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో లిటన్ దాస్ బంగ్లాదేశ్‌కు చివరగా ఆడాడు.ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభంకాగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న చాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) శుక్రవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టీమ్‌కు నజ్ముల్ హుసేన్ షాంటో సారథ్యం వహిస్తుండగా... ముష్ఫికర్ రహీం, మహ్ముదుల్లా, ముస్తాఫిజుర్ వంటి సీనియర్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. కాగా పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుండగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది.ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్.. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్‌లతో కలిసి గ్రూప్-‘బి’లో ఉంది. మరోవైపు.. టీమిండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా గ్రూప్-‘ఎ’ నుంచి పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా టీమిండియాతో తలపడనుంది.తదుపరి.. రావల్పిండి వేదికగా ఫిబ్రవరి 24న న్యూజిలాండ్‌తో, ఫిబ్రవరి 27న అదే వేదికపై పాకిస్తాన్‌తోనూ బంగ్లాదేశ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఈ టోర్నీలో మార్చి 4న తొలి సెమీఫైనల్ దుబాయ్‌లో జరుగనుండగా.. మార్చి 5న రెండో సెమీ ఫైనల్‌కు లాహోర్ ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 9న ఫైనల్ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు కాగా.. మార్చి 10 రిజర్వ్ డేగా ఖరారు చేశారు..బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హుసేన్ షాంటో (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హృదయ్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, మహ్ముదుల్లా, జాకీర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్ హుసేన్, తస్కీన్ అహ్మద్, ముస్తఫిజుర్ రహమాన్, పర్వేజ్ హుసేన్, నసుమ్ అహ్మద్, తన్జిమ్ హసన్, నహిద్ రాణా.చదవండి: ఇదెక్కడి ఫామ్ రా సామీ.. 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటిస్తారా..? -
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడిపై వేటు
పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (జనవరి 12) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా నజ్ముల్ హొస్సేన్ షాంటో నియమితుడయ్యాడు. షాంటో గాయం కారణంగా ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. షాంటో గైర్హాజరీలో విండీస్ పర్యటనలో మెహిది హసన్ మిరాజ్ బంగ్లా కెప్టెన్‌గా వ్యవహరించాడు. విండీస్‌తో సిరీస్‌ను బంగ్లాదేశ్ 0-3 తేడాతో కోల్పోయింది.షాంటోతో పాటు గాయాల బారిన పడ్డ ముష్ఫికర్ రహీం, తౌహిద్ హృదోయ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఛాంపియన్స్ ట్రోఫీతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో స్టార్ ఆటగాడు లిటన్ దాస్‌కు చోటు దక్కలేదు. విండీస్ పర్యటనలో చెత్త ప్రదర్శనల (3 మ్యాచ్‌ల్లో 6 పరుగులు) కారణంగా దాస్ జట్టులో చోటు కోల్పోయాడు. దాస్‌పై వేటు వేసినట్లు బంగ్లా చీఫ్ సెలెక్టర్ ఘాజీ అష్రఫ్ హొస్సేన్ తెలిపాడు. లిటన్ దాస్ గైర్హాజరీలో జాకెర్ అలీ బంగ్లా వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపడతాడని అష్రఫ్ అన్నాడు.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో లిటన్ దాస్‌తో పాటు షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, అఫీఫ్ హొస్సేన్‌లకు కూడా చోటు దక్కలేదు. షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, అఫీఫ్ హొస్సేన్ కూడా విండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌లో వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యారు.బంగ్లా జట్టు పేస్ విభాగం యువకులు, సీనియర్లతో (నహీద్ రాణా, తంజిమ్ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్) సమతూకంగా ఉంది. స్పిన్ విభాగాన్ని లెగ్ స్పిన్నర్ రిషద్ హొస్సేన్ లీడ్ చేస్తాడు. రిషద్‌తో పాటు స్పిన్ విభాగంలో మెహిది హసన్, నసుమ్ అహ్మద్ ఉన్నారు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే.. నజ్ముల్, ముష్ఫికర్, మహ్మదుల్లా, సౌమ్య సర్కార్ లాంటి సీనియర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు.గత వారం జరిగిన బౌలింగ్ అసెస్మెంట్ టెస్ట్‌లో ఫెయిల్ అయిన షకీబ్ అల్ హసన్ చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. సీనియర్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడని తొలుత ప్రచారం జరిగింది. ఇటీవలే తమీమ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో బంగ్లా సెలెక్టర్లు ఇతన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్.. భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో కలిసి గ్రూప్-ఏలో ఉంది. బంగ్లా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న టీమిండియాతో ఆడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టు..నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హృదోయ్, మహ్మదుల్లా, మెహిదీ హసన్, జాకర్ అలీ అనిక్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సకీబ్, నహిద్ రాణా, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ -
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. విండీస్‌కు ఘోర పరాభవం
వెస్టిండీస్ గడ్డపై బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు దుమ్ములేపింది. టీ20 ఫార్మాట్లో తొలిసారి విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తద్వారా వన్డే సిరీస్‌లో ఎదురైన వైట్‌వాష్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. రెండు టెస్టు, మూడు వన్డే, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది.టీ20లను విజయంతో ఆరంభించిటెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసిన బంగ్లా జట్టు.. వన్డేల్లో మాత్రం 3-0తో చిత్తుగా ఓడింది. అయితే, టీ20 సిరీస్‌లో మాత్రం ఆది నుంచే సత్తా చాటిన లిటన్ దాస్ బృందం.. తొలి రెండు మ్యాచ్‌లలో వరుసగా ఏడు, ఇరవై ఏడు పరుగుల తేడాతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ నెగ్గింది.జాకెర్ అలీ ధనాధన్ ఇక సెయింట్ విన్సెంట్ వేదికగా నామమాత్రపు మూడో టీ20లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ లిటన్ దాస్ విఫలం కాగా.. పర్వేజ్ హుసేన్ ఇమాన్(39) మెరుగ్గా ఆడాడు. మిగతా వాళ్లలో మెహదీ హసన్ మిరాజప్ 29 రన్స్ చేయగా.. జాకెర్ అలీ ధనాధన్ బ్యాటింగ్‌తో దంచికొట్టాడు.జాకెర్ అలీ మొత్తంగా 41 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 189 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ రెండు, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్, గుడకేశ్ మోటీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.రొమారియో షెఫర్డ్ ఒక్కడేఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. రొమారియో షెఫర్డ్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ జాన్సన్ చార్ల్స్ 23, వికెట్ కీపర్ నికోలస్ పూరన్ 15 రన్స్ చేశాడు. మిగతావాళ్లంతా పూర్తిగా విఫలం కావడంతో.. 16.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే విండీస్ ఆలౌట్ అయింది.బంగ్లా బౌలర్లలో రిషాద్ హొసేన్ మూడు వికెట్లతో చెలరేగగా.. టస్కిన్ అహ్మద్, మెహదీ హసన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. తాంజిమ్ హసన్ సకీబ్, హసన్ మహమూద్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.జాకెర్ అలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. మెహదీ హసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఇక మూడో టీ20లో విండీస్‌ను 80 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్‌కు.. టీ20లలో ఆ జట్టును వైట్‌వాష్ చేయడం ఇదే తొలిసారి. తద్వారా లిటన్ దాస్ బృందం బంగ్లా తరఫున సరికొత్త చరిత్ర సృష్టించింది.చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు -
Ban vs Afg ODIs: బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా అతడే
అఫ్గనిస్తాన్‌తో వన్డేలకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో పాల్గొననున్న పదిహేను మంది సభ్యుల పేర్లను శనివారం వెల్లడించింది. ఈ క్రమంలో నజ్ముల్ హుసేన్ షాంటోనే కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు స్పష్టమైంది. కాగా ఇటీవల పాకిస్తాన్ గడ్డపై చారిత్రాత్మక టెస్టు సిరీస్ సాధించిన బంగ్లాదేశ్ సారథిగా రికార్డులకెక్కాడు షాంటో.టెస్టులకు, టీ20లకు వేరే కెప్టెన్లు!అయితే, ఆ తర్వాత భారత పర్యటనలో టెస్టుల్లో 2-0తో క్లీన్‌స్వీప్ సహా.. స్వదేశంలో సౌతాఫ్రికాలో చేతిలోనూ టెస్టు సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్‌కు గురైంది బంగ్లాదేశ్. ఈ నేపథ్యంలో షాంటో కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, బంగ్లా బోర్డు అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ షాంటో వన్డే సారథిగా కొనసాగేలా ఒప్పించినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడినే సారథిగా కొనసాగిస్తున్నట్లు తాజా ప్రకటనతో వెల్లడైంది. మరోవైపు.. టెస్టులకు మెహదీ హసన్ మిరాజ్, టీ20లకు టస్కిన్ అహ్మద్ లేదంటే తౌహీద్ హృదోయ్ సారథ్యం వహించనున్నట్లు తెలుస్తోంది.అఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ పర్యటనఇదిలా ఉంటే.. వన్డే సిరీస్ ఆడేందుకు అఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ పర్యటనకు రానుంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య షార్జా వేదికగా నవంబరు 6, నవంబరు 9, నవంబరు 11 తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత కాలమానం ప్రకారం బంగ్లా- అఫ్గన్ మ్యాచ్‌లు సాయంత్రం ఐదు గంటలకు ఆరంభం కానున్నాయి.ఇక.. అఫ్గన్‌తో వన్డే సిరీస్ ఆడే జట్టులో పేసర్ సషీద్ రాణా తొలిసారి చోటు దక్కించుకోగా.. లిటన్ దాస్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక తంజీమ్ అహ్మద్ సైతం భుజం నొప్పి వల్ల విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే, సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సెలక్షన్‌కు అందుబాటులో ఉండలేదని బంగ్లా బోర్డు అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ తెలిపాడు.అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుసౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, జకీర్ హసన్, నజ్ముల్ హుసేన్ షాంటో(కెప్టెన్), ముష్ఫికర్ రహీం, మహ్మదుల్లా రియాద్, తౌహీద్ హృదోయ్, జాకెర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్(వైస్ కెప్టెన్), రిషాద్ హొసేన్, నసూం అహ్మద్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, నషీద్ రాణా. -
గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో రోహిత్ సంచలన క్యాచ్!
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుత రీతిలో ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టి అభిమానులకు కనువిందు చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా భారత క్రికెట్ జట్టు సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో గెలుపొంది.. 1-0తో ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేన.. ప్రస్తుతం కాన్పూర్‌లో రెండో మ్యాచ్ ఆడుతోంది.233 పరుగులకు బంగ్లా ఆలౌట్శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో గ్రీన్ పార్క్ స్టేడియంలో టాస్ గెలిచిన టీమిండియా.. బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, వర్షం కారణంగా తొలి రోజు 35 ఓవర్ల ఆటే సాధ్యపడగా.. రెండు, మూడో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దై పోయింది. ఈ క్రమంలో సోమవారం వరణుడు కరుణించడంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ 74.2 ఓవర్లలో 233 పరుగులు చేసి ఆలౌట్ అయింది.అయితే, బంగ్లా ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అందుకు సింగిల్ హ్యాండెడ్ క్యాచ్ సహచరులతో పాటు.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లనూ ఆశ్చర్యపరిచింది. 50వ ఓవర్లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన బంతిని బంగ్లా బ్యాటర్ లిటన్ దాస్ బౌండరీకి తరలించాలనే యోచనతో షాట్ బాదినట్లు కనిపించింది. ఒక్క ఉదుటున పైకెగిరి ఒంటిచేత్తో క్యాచ్ఈ క్రమంలో 30 యార్డ్ సర్కిల్ లోపలి ఫీల్డింగ్ పొజిషన్లో ఉన్న రోహిత్.. తన తల మీదుగా వెళ్తున్న బంతిని ఒక్క ఉదుటన పైకెగిరి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో సిరాజ్‌తో పాటు లిటన్ దాస్, భారత ఫీల్డర్లు నమ్మలేమన్నట్లుగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. అలా లిటన్‌దాస్(13) రూపంలో బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా మూడు, సిరాజ్ రెండు, ఆకాశ్ దీప్ రెండు వికెట్లు దక్కించుకోగా.. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించిన టీమిండియా 55 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మెహది హసన్ మిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ 23 పరుగుల వద్ద నిష్క్రమించాడు.చదవండి: పూరన్ సుడిగాలి శతకంHits blinks Out! ☝🏻🥳 #IndvBan #WhistlePodupic.twitter.com/A32vPxSlyP— Chennai Super Kings (@ChennaiIPL) September 30, 2024 -
అతడు అలా చేస్తే.. నేనిలాగే చేస్తా: లిటన్దాస్కు పంత్ కౌంటర్
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ 631 రోజుల తర్వాత తొలిసారి టెస్టు బరిలో దిగాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా వైట్ జెర్సీలో మెరిశాడు. పునరాగమనంలో 52 బంతులు ఎదుర్కొన్న పంత్ 39 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, దూకుడుకు మారుపేరైన ఈ 26 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్.. తొలిరోజే బంగ్లా క్రికెటర్‌కు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన తీరు అభిమానులను ఆకర్షించింది.కీలక బ్యాటర్లు విఫలంచెన్నై వేదికగా గురువారం మొదలైన టెస్టులో రోహిత్ శర్మ(6), శుబ్‌మన్ గిల్(0), విరాట్ కోహ్లి(6) పూర్తిగా విఫలమయ్యారు. బంగ్లా యువ పేసర్ హసన్ మహమూద్ ధాటికి భారత్ 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన వేళ.. పంత్ క్రీజులోకి వచ్చాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ గాడినపెట్టే ప్రయత్నం చేశాడు.సులువైన పరుగులకు వీలుకాని పిచ్‌పై ఎదుర్కొన్న తొలి 15 బంతుల్లో రెండు ఫోర్లు చేసి టచ్‌లోకి వచ్చాడు. అనంతరం జైస్వాల్‌తో కలిసి సింగిల్స్ రాబట్టే క్రమంలో.. బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిటన్ దాస్ పంత్‌పై అసహనం ప్రదర్శించాడు. ఇందుకు పంత్ బదులిస్తూ.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.లిటన్‌దాస్ అసహనంజైస్వాల్ బంతిని గల్లీ దిశగా బాది సింగిల్ కోసం పంత్‌ను పిలిచాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్లమన్నట్లుగా సైగ చేశాడు. అప్పటికే ఫీల్డర్ బంతిని స్టంప్స్ వైపు విసరగా.. పంత్ ప్యాడ్స్‌ను తాకినట్లు కనిపించింది. అయితే, ఓవర్ త్రో కావడంతో వేగంగా ఇద్దరూ కలిసి పరుగు పూర్తి చేశారు. ఈ క్రమంలో భారత్‌కు పరుగు రావడంపై లిటన్ దాస్ అసహనం ప్రదర్శించాడు. పంత్ ప్యాడ్లను తాకినా పరిగెత్తి రన్ పూర్తి చేయడం ఏమిటన్నట్లుగా చూశాడు.అతడు అలా చేస్తే నేనిలాగే చేస్తాఇందుకు పంత్ బదులిస్తూ.. ‘‘మరి అతడేం చేశాడో చూడవా? అతడు నన్ను ఎందుకు కొడుతున్నాడు?’’ అని ఫీల్డర్‌ను ఉద్దేశించి లిటన్దాస్తో అన్నాడు. ఇందుకు స్పందనగా.. ‘‘అతడు కొట్టాలి కాబట్టి కొట్టాడు’’ అని లిటన్ దాస్ పేర్కొనగా.. ‘‘అందుకే నేను పరుగు తీయాలి కాబట్టి తీస్తున్నా’’ అని పంత్ కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో 50 ఓవర్లు పూర్తయ్యేసరికిటీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.చదవండి: Eng vs Aus: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. తొలి వన్డేకు ముగ్గురు స్టార్లు దూరం!Argument between liton das & rishabh pant.Rishabh : "usko feko na bhai mujhe kyu mar rhe ho" pic.twitter.com/cozpFJmnX3— PantMP4. (@indianspirit070) September 19, 2024 -
గణపతి పూజ చేసిన బంగ్లాదేశ్ క్రికెటర్.. ఫొటోలు వైరల్
-
Pak Vs Ban: చెలరేగిన బంగ్లా పేసర్లు.. పాక్ 172 ఆలౌట్
టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి పాకిస్తాన్‌పై విజయం సాధించిన బంగ్లాదేశ్ జట్టు... అదే జోరులో సిరీస్ చేజిక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అద్వితీయ ఆట తీరుతో రెండో టెస్టులో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా పాకిస్తాన్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌట్ చేసింది.చెలరేగిన బంగ్లా పేసర్లుబంగ్లా రైటార్మ్ పేసర్లు హసన్ మహమూద్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నషీద్ రాణా 4 వికెట్లు కూల్చాడు. మరో కుడిచేతి వాటం పేసర్ టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పాక్ బ్యాటర్లలో ఎనిమిదో స్థానంలో వచ్చిన ఆఘా సల్మాన్ 47 పరుగులతో అజేయంగా ఉండటంతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ షాన్ మసూద్ 28, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 43 పరుగులతో రాణించారు. మిగతా వాళ్లంతా కనీసం ఇరవై పరుగుల మార్కు దాటలేక చతికిలపడ్డారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేసిన బంగ్లాదేశ్.. టీ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ విజయానికి 148 పరుగుల దూరంలో నిలిచింది.లిటన్ దాస్ వీరోచిత ఇన్నింగ్స్కాగా పాకిస్తాన్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 78.4 ఓవర్లలో 262 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఓవర్‌నైట్ స్కోరు 10/0తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్. పాకిస్తాన్ పేసర్ల ధాటికి 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్‌ను లిటన్ దాస్ ఆదుకున్నాడు. ఎదురుదాడితో వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. మెహదీ హసన్ మిరాజ్‌తో కలిసి చక్కటి భాగస్వామ్యం నమోదు చేసి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. లిటన్ దాస్ 228 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 138 పరుగులు చేసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ దాటిగా పరుగులు రాబట్టాడు. అతడికి ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ (124 బతుల్లో 78; 12 ఫోర్లు, ఒక సిక్సర్) చక్కటి సహకారం అందించాడు. ఖుర్రమ్ షెహజాద్‌కు 6 వికెట్లువీరిద్దరూ ఏడో వికెట్‌కు 165 పరుగులు జోడించడంతో బంగ్లాదేశ్ మెరుగైన స్కోరు చేయగలిగింది. కెప్టెన్ నజ్ముల్ షాంటో (4), మోమినుల్ హక్ (1), ముష్ఫికర్ రహీమ్ (3), షకీబ్ అల్ హసన్ (2), జాకీర్ హసన్ (1), షాద్మన్ ఇస్లామ్ (10) విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 6, మీర్ హమ్జా, సల్మాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 9 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (3), నైట్ వాచ్‌మన్ ఖుర్రం షెహజాద్ (0) అవుటయ్యారు. గెలిస్తే సరికొత్త చరిత్రబంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 2 వికెట్లు పడగొట్టాడు. చేతిలో 8 వికెట్లు ఉన్న పాకిస్తాన్ ఓవరాల్‌గా 21 పరుగుల ఆధిక్యంలో సంపాదించింది. అయితే, సోమవారం నాటి ఆటలో భాగంగా బంగ్లాదేశ్.. ఆతిథ్య పాక్‌కు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవనీయలేదు. 172 పరుగులకే ఆలౌట్ చేసి మరోసారి షాకిచ్చింది.ఇక వర్షం కారణంగా పాక్-బంగ్లా తొలిరోజు(శుక్రవారం) ఆట తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా పాకిస్తాన్ సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో అనూహ్య రీతిలో తొలి టెస్టులో గెలుపొందిన బంగ్లాదేశ్.. రావల్పిండి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.కాగా పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులు స్కోరు చేసింది. -
లిటన్ దాస్ వీరోచిత శతకం
రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్ వీరోచితంగా పోరాడి సెంచరీ చేశాడు. 26 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన లిటన్ దాస్.. 228 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 138 పరుగులు చేసి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. దాస్.. మెహిది హసన్ మిరజ్‌తో (78) కలిసి ఏడో వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేయడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసింది. దాస్, మిరజ్ వీరోచితంగా పోరాడటంతో బంగ్లాదేశ్ పాకిస్తాన్‌కు ధీటుగా జవాబిచ్చింది.పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు బంగ్లాదేశ్ 12 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. పాక్ పేసర్ ఖుర్రమ్ షెహజాద్ ఆరు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించగా.. మీర్ హమ్జా, అఘా సల్మాన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్, మిరజ్‌తో పాటు షద్మాన్ ఇస్లాం (10), హసన్ మహమూద్ (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. సైమ్ అయూబ్ (58), షాన్ మసూద్ (57), అఘా సల్మాన్ (54) అర్ద సెంచరీలతో రాణించారు. బ్యాట్‌తో రాణించిన మిరజ్ బంతితోనూ (5/61) చెలరేగాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3, నిహద్ రాణా, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ పడగొట్టారు. -
26 పరుగులకే 6 వికెట్లు.. బంగ్లా బ్యాటర్ల ప్రపంచ రికార్డు
రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ జట్టు పతనం అంచుల వరకు పోయి తిరిగి నిలదొక్కుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గౌరవప్రదమైన స్కోర్ దిశగా సాగుతుంది. లిటస్ దాస్ (86 నాటౌట్), మెహిది హసన్ మిరజ్ (78) ఏడో వికెట్‌కు 165 పరుగులు జోడించి బంగ్లాదేశ్ పతనాన్ని అడుకున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 30లోపు పరుగులకే 6 వికెట్లు కోల్పోయి అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా లిటన్-మిరజ్ జోడీ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 18 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా.. బొన్నర్-జాషువ డసిల్వ జోడీ ఏడో వికెట్‌కు 100 పరుగులు జోడించింది. లిటన్-మిరజ్ జోడీ 165 పరుగుల భాగస్వామ్యానికి ముందు ఇదే ప్రపంచ రికార్డుగా ఉండింది.మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు మూడో సెషన్ సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. లిటన్ దాస్ 88, హసన్ మహమూద్ ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు బంగ్లాదేశ్ ఇంకా 74 పరుగులు వెనుకపడి ఉంది. పాక్ పేసర్ ఖుర్రమ్ షెహజాద్ ఆరు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. మీర్ హమ్జా 2 వికెట్లు పడగొట్టాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్, మిరజ్‌తో పాటు షద్మాన్ ఇస్లాం (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. సైమ్ అయూబ్ (58), షాన్ మసూద్ (57), అఘా సల్మాన్ (54) అర్ద సెంచరీలతో రాణించారు. బ్యాట్‌తో రాణించిన మిరజ్ బంతితోనూ (5/61) చెలరేగాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3, నిహద్ రాణా, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ పడగొట్టారు. -
వారెవ్వా అర్ష్‌దీప్.. ఏమైనా బాల్ వేశాడా? చూస్తే మైండ్ బ్లాంక్
టీ20 వరల్డ్‌కప్-2024 ప్రధాన టోర్నీకు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా సత్తాచాటింది. న్యూయర్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 60 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.రిషబ్ పంత్ 32 బంతుల్లో 53 పరుగులు, హార్దిక్ పాండ్యా 40(నాటౌట్) పరుగులతో రాణించారు. అయితే లక్ష్య ఛేదనలో బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగల్గింది.సూపర్ డెలివరీ..ఇక ఈ వార్మాప్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్‌ను అర్ష్‌దీప్ ఔట్ చేసిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. బంగ్లా ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ తొలి బంతిని లిటన్ దాస్‌కు బ్యాకప్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆఫ్‌సైడ్ పడిన బంతి ఒక్కసారిగా టర్న్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. అర్ష్‌దీప్ వేసిన బంతికి లిటన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది.ఇది చూసిన లిటన్ దాస్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు అర్ష్‌దీప్ ప్రధాన టోర్నీలో కూడా కొనసాగించాలని కామెంట్లు చేస్తున్నారు.pic.twitter.com/Co5twCgaJc— Reeze-bubbly fan club (@ClubReeze21946) June 1, 2024 -
బెన్నీ హోవెల్ వీర బాదుడు.. లిటన్ దాస్ పోరాటం వృధా
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో సిల్హెట్ స్ట్రయికర్స్ ఆటగాడు బెన్నీ హోవెల్ (ఇంగ్లండ్) వీర బాదడు బాదాడు. కొమిల్లా విక్టోరియన్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్.. హోవెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో హోవెల్ మినహా మిగతా ఆటగాళ్లు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. కెన్నార్ లెవిస్ 33, జాకిర్ హసన్ 18, షాంటో 12, యాసిర్ అలీ 2, కెప్టెన్ మిథున్ 28 పరుగులు చేశారు. విక్టోరియన్స్ బౌలర్లలో సునీల్ నరైన్ పొదుపుగా (4-1-16-2) బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టగా.. రషీద్ హొసేన్ 2, ముస్ఫిక్ హసన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో విక్టోరియన్స్ చివరివరకు పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. లిటన్ దాస్ (85) విక్టోరియన్స్‌ను గెలిపించేందుకు సకల ప్రయత్నాలు చేశాడు. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (23) కూడా తనవంతు ప్రయత్నించినప్పటికీ విక్టోరియన్స్ గెలవలేకపోయింది. లక్ష్యానికి 13 పరుగుల దూరంలో (165/6) నిలిచిపోయి, ఓటమిపాలైంది. విక్టోరియన్స్ కీలక ఆటగాళ్లు జాన్సన్ చార్లెస్ (17), మొయిన్ అలీ (0) విఫలమయ్యారు. స్ట్రయికర్స్ బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ 3, సమిత్ పటేల్, షఫీకుల్ ఇస్లాం, బెన్నీ హోవెల్ తలో వికెట్ పడగొట్టారు. -
న్యూజిలాండ్‌లో బంగ్లాదేశ్ సంచలనాలు: మొన్న అలా.. ఇప్పుడిలా!
New Zealand vs Bangladesh, 1st T20I: న్యూజిలాండ్ గడ్డపై బంగ్లాదేశ్ వరుస విజయాలతో సత్తా చాటుతోంది. మూడో వన్డేలో కివీస్‌ను చిత్తు చేసి చరిత్ర సృష్టించి బంగ్లా... మొదటి టీ20లో సంచలన విజయం సాధించింది. తద్వారా న్యూజిలాండ్‌లో తొలి టీ20 గెలుపు నమోదు చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రస్తుతం కివీస్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఆధిపత్యాన్ని 2-1కు తగ్గిస్తూ ఆఖరి మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. గెలుపు జోష్‌లో టీ20 సిరీస్‌ను మొదలుపెట్టిన బంగ్లా.. నేపియర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. స్పిన్నర్ మెహదీ హసన్ రెండు, షోరిఫుల్ ఇస్లాం వరుస వికెట్లు తీసి.. కివీస్‌ను ఆరంభంలోనే దెబ్బకొట్టారు. టాపార్డర్‌ను కకావికలం చేశారు. వీరిద్దరి దెబ్బకు ఓపెనర్లు ఫిన్ అలెన్(1), సీఫర్ట్(0).. డారిల్ మిచెల్(14), గ్లెన్ ఫిలిప్స్(0) పూర్తిగా విఫలమై పెవిలియన్ చేరారు. మిగిలిన వాళ్లలో జిమ్మీ నీషం 48, కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 23 పరుగులతో రాణించగా.. నిర్నీత 20 ఓవర్లలో కివీస్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ 42 పరుగులు(నాటౌట్), నాలుగో నంబర్ బ్యాటర్ సౌమ్య సర్కార్ 22 పరుగులతో మెరుగ్గా ఆడారు. వీరిద్దరి తోడు మెహదీ హసన్ 16 బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 18.4 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసింది బంగ్లాదేశ్. తద్వారా న్యూజిలాండ్ గడ్డ మీద పొట్టి ఫార్మాట్లో తొలి విజయాన్ని నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో టీ20 జరుగనుంది. చదవండి: #Virat kohli: విరాట్ కోహ్లికి ఘోర అవమానం! మండిపడుతున్న ఫ్యాన్స్ -
మాకు నీతులు చెప్పడం కాదు.. అద్దంలో చూసుకోండి: భారత మాజీ క్రికెటర్ ఫైర్
Ban vs NZ 2nd ODI- So please don’t teach us: బంగ్లాదేశ్ తాత్కాలిక కెప్టెన్ లిటన్ దాస్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మండిపడ్డాడు. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో ఇష్ సోధి విషయంలో అతడు వ్యవహరించిన తీరును తప్పుబట్టాడు. ఇలాంటివి చేసి నువ్వేం నిరూపించాలనుకుంటున్నావంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023కి ముందు కివీస్ బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో వర్షం కారణంగా తొలి వన్డేలో ఫలితం తేలలేదు. ఇక ఢాకా వేదికగా శనివారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 86 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. బాల్ విసరకముందే క్రీజును వీడి తద్వారా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో మంగళవారం నాటి మూడో వన్డే బంగ్లాదేశ్‌కు కీలకంగా మారింది. ఇదిలా ఉంటే.. రెండో వన్డేలో బంగ్లా బౌలర్ హసన్ మహ్మూద్ బంతి విసరకముందే నాన్ స్ట్రైకర్ ఇష్ సోధి క్రీజును వీడగా రనౌట్(మన్కడింగ్) చేసిన విషయం తెలిసిందే. వెనక్కి పిలిచిన బంగ్లా కెప్టెన్ దీంతో ఇష్ సోధి తన బ్యాట్‌ను క్లాప్ చేస్తూ ముందుకు సాగాడు. అయితే, కెప్టెన్ లిటన్ దాస్ కలుగజేసుకుని సోధిని వెనక్కిపిలిచాడు. ఈ క్రమంలో బౌలర్‌ను హగ్ చేసుకున్నాడు కివీస్ ప్లేయర్ ఇష్ సోధి. ఆ సమయంలో 17 పరుగుల వద్ద ఉన్న అతడు.. 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లిటన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇక సోధిని వెనక్కి పిలిపించిన వీడియో నెట్టింట వైరల్‌కాగా బంగ్లాదేశ్ క్రీడాస్ఫూర్తి అంటూ ప్రశంసలు కురిశాయి. ఈ విషయంపై తాజాగా స్పందించిన కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. మాకు నీతులు చెప్పడం ఆపండి ‘‘మీకేమైనా ప్రాబ్లం ఉందా? నాకైతే రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి.. అసలు నువ్వు(బ్యాటర్) ముందుగానే క్రీజు ఎందుకు దాటావు? పాశ్చాత్య క్రికెట్ ప్రపంచం ఎల్లపుడూ క్రీడాస్ఫూర్తి గురించి మాట్లాడుతూ ఉంటుంది కదా.. 60కేఎంపీహెచ్ పరిమితి ఉన్న చోటు కూడా 120 కేఎంపీహెచ్‌తో బౌలింగ్ చేయడం.. తర్వాత పొరపాటుగా జరిగిపోయిందని బుకాయించడం. మీరు తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కదా.. నిబంధనలు అందరికీ ఒకే విధంగా ఉంటాయి. కచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే. కాబట్టి ఇకపైనైనా మాకు నీతులు చెప్పడం మానేయండి. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి ముందు’’ అని ఆకాశ్ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వేం నిరూపించాలనుకుంటున్నావు? అదే విధంగా.. ‘‘ఫీల్డింగ్ టీమ్ కెప్టెన్ రనౌట్ అయిన ప్లేయర్‌ను వెనక్కి పిలవడమేమిటి? ఎవరో ఏదో అనుకుంటారని ఇలా చేస్తారా? అసలు నువ్వేం నిరూపించాలనుకుంటున్నావు? నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్లడం క్రీడాస్ఫూర్తి అనిపించుకోదు. అర్థమైందా?’’ అని లిటన్ దాస్‌కు ఆకాశ్ చోప్రా చురకలు అంటించాడు. కాగా గతంలో ఇదే తరహాలో క్రీజును ముందే వీడిన నాన్ స్ట్రైకర్‌ను టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేసినపుడు, దీప్తి శర్మ ఇంగ్లండ్‌లో ఇలాగే రనౌట్ చేసినందుకు పాశ్చాత్య దేశాల క్రికెటర్లు మన్కడింగ్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధం అంటూ గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, కొంతకాలం క్రితం ఈ పదాన్ని తొలగిస్తూ ఇలా అవుట్ కావడం రనౌట్ కిందకే వస్తుందని ఐసీసీ స్పష్టం చేసింది. అయినప్పటికీ తాను అవుట్ కాగానే సోధి బ్యాట్‌ను క్లాప్ చేయడం, లిటన్ దాస్ అతడిని వెనక్కిపిలిపించడం వంటి విషయాలు ఆకాశ్ చోప్రాకు ఆగ్రహం తెప్పించడంలో తప్పులేదు. Ish Sodhi was run out at the non strikers end by Hasan Mahmud. The third umpire checked and gave OUT! But when Sodhi started walking out, skipper Litton Das and Hasan Mahmud called him back again. What a beautiful scene! Lovely spirit of the game. The hug at the end was wonderful… pic.twitter.com/GvrpjXcJwB — SportsTattoo Media (@thesportstattoo) September 23, 2023 -
బంగ్లాదేశ్‌కు గుడ్‌న్యూస్! కెప్టెన్‌గా లిటన్ దాస్..
Bangladesh vs New Zealand ODI Series: ప్రపంచకప్-2023 టోర్నీకి ముందు బంగ్లాదేశ్.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఐసీసీ ఈవెంట్‌కు ముందు పటిష్ట కివీస్ జట్టుతో మూడు మ్యాచ్‌లలో తలపడనుంది. సెప్టెంబరు 21 నుంచి ఈ వన్డే సిరీస్ షురూ కానుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్, మహ్మదుల్లా రియాద్ పునరాగమనం చేయడం ఖాయమైంది. గుడ్‌న్యూస్.. అతడు వచ్చేశాడు వెన్నునొప్పితో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన తమీమ్ రాక బంగ్లాకు శుభవార్తగా పరిణమించింది. ఇక అక్టోబరు 5 నుంచే వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానున్న తరుణంలో కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు. కివీస్‌తో సిరీస్‌కు కెప్టెన్‌గా లిటన్ దాస్ దీంతో సొంతగడ్డపై లిటన్ దాస్ కివీస్‌తో సిరీస్‌కు సారథ్యం వహించనున్నాడు. ఇక ఆసియా కప్-2023 సందర్భంగా గాయపడిన బ్యాటర్ నజ్ముల్ హొసేన్ షాంటో పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. మేజర్ టోర్నీ ముందున్న దృష్ట్యా అతడికి కూడా రెస్ట్ ఇచ్చారు. ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్ల ఎంపిక ఇక మహ్మద్ నయీం, ఆఫిఫ్ హొపేస్, షమీమ్ హొసేన్లను తప్పించిన మేనేజ్మెంట్.. అన్క్యాప్డ్ ప్లేయర్లు జాకీర్ హసన్, సయ్యద్ ఖలీద్ అహ్మద్, రిషద్ హుస్సేన్‌కు న్యూజిలాండ్‌తో ఆడే జట్టులో చోటిచ్చింది. అందుకే షకీబ్ దూరం జట్టు ప్రకటన సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సెలక్టర్ మిన్హాజుల్ అబెదిన్ మాట్లాడుతూ.. ప్రపంచకప్‌నకు ముందు న్యూజిలాండ్‌తో సిరీస్ తమకు సన్నాహకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ఇక మెగా ఈవెంట్‌కు ముందు మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకే కెప్టెన్ సహా ఇతర ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినట్లు పేర్కొన్నాడు. టీమిండియా గెలుపొందిన జోష్‌లో బంగ్లా ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2023లో షకీబ్ అల్ హసన్ బృందం మెరుగ్గా ఆడకపోయినప్పటికీ.. సూపర్-4 చివరి మ్యాచ్‌లో ఏకంగా టీమిండియానే ఓడించింది. అనూహ్య రీతిలో అద్భుత ఆటతీరుతో రోహిత్ సేనకు షాకిచ్చి 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది జోష్‌లో ఉంది. మరోవైపు ఇంగ్లండ్ పర్యటనలో 3-1తో న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు లిటన్ దాస్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, అనముల్ హక్ బిజోయ్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, నురుల్ హసన్ సోహన్, మెహీది హసన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్ సకీబ్, తాంజిద్ హసన్ తమీమ్, జాకీర్ హసన్, రిషద్ హుస్సేన్, సయ్యద్ ఖలీద్ అహ్మద్. చదవండి: ఆర్సీబీ పేసర్‌కు లక్కీ ఛాన్స్! టీమిండియాలో చోటు.. బీసీసీఐ ప్రకటన Ind vs SL: అభిమానులకు చేదువార్త! లంకను తక్కువ అంచనా వేస్తే అంతే ఇక! -
ఆసియాకప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్..
ఆసియాకప్-2023 ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ లిట్టన్ దాస్ అనారోగ్యం కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. గత కొన్ని రోజుల నుంచి లిట్టన్ దాస్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానాన్ని మరో వికెట్ కీపర్ బ్యాటర్ అనముల్ హక్ బిజోయ్‌ను బంగ్లాదేశ్ సెలక్టర్లు భర్తీ చేశారు. అనముల్ హక్ బుధవారం బంగ్లా జట్టుతో కలవనున్నాడు. దురదృష్టవశాత్తూ లిట్టన్ దాస్ ఆసియాకప్‌కు దూరమయ్యాడు. అతడి స్ధానంలో మేము అనాముల్ హక్కు అవకాశం ఇచ్చాము. అనాముల్ దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు ఎప్పుడూ మా దృష్టిలో ఉంటాడు. లిట్టన్ లేక పోవడంతో మాకు వికెట్ కీపింగ్ చేయగల టాప్-ఆర్డర్ బ్యాటర్ అవసరమైంది. దీంతో అనాముల్ జట్టులోకి వచ్చాడని బంగ్లా సెలక్షన్ కమిటీ చైర్మెన్ మిన్హాజుల్ అబెదిన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 44 వన్డేలు ఆడిన అనాముల్ హక్.. 1254 పరుగులు సాధించాడు. ఒక ఆసియాకప్‌లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 30న శ్రీలంకతో తలపడనుంది. ఆసియాకప్‌కు బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హుస్సేన్ , మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, నసుమ్ అహ్మద్, షక్ మహ్మద్, షక్ మహ్మద్ తాంజిద్ హసన్ తమీమ్, తంజిమ్ హసన్ సాకిబ్, అనముల్ హక్ బిజోయ్ చదవండి: Asia Cup 2023: అతడు మళ్లీ వస్తాడన్న గ్యారంటీ లేదు.. కిషన్ వచ్చినా గానీ? -
IPL 2023: లిటన్ దాస్ స్థానంలో బిగ్ హిట్టర్.. ఇక
IPL 2023- KKR: కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ జాన్సన్ చార్లెస్ చేరనున్నాడు. బంగ్లా ఆటగాడు లిటన్‌దాస్ కుటుంబ సభ్యుల ఆరోగ్య అత్యవసర పరిస్థితి దృష్ట్యా స్వదేశం పయనమయ్యాడు. దీంతో ఐపీఎల్-2023 మిగతా సీజన్ కోసం అతని స్థానంలో చార్లెస్‌ను రూ.50 లక్షల కనీస ధరకు కోల్‌కతా తీసుకుంది. ఈ మేరకు కేకేఆర్ గురువారం ప్రకటన విడుదల చేసింది. బిగ్ హిట్టర్ ‘‘ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ దృష్ట్యా లిటన్‌దాస్ ఏప్రిల్ 28న స్వదేశం బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిపోయాడు. అతడు, అతడి కుటుంబ సభ్యులు బాగుండాలని మేము ప్రార్థిస్తున్నాం’’ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో చార్లెస్‌ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా జాన్సన్ చార్లెస్ విండీస్ తరఫున 41 అంతర్జాతీయ టి20లు ఆడి.. 971 పరుగులు చేశాడు. అదే విధంగా.. 2012, 2016 టి20 ప్రపంచకప్‌లు గెలిచిన కరీబియన్ జట్టులో చార్లెస్ సభ్యుడుగా ఉన్నాడు. అంతేగాక ఈ వికెట్ కీపర్ బ్యాటర్ పొట్టిఫార్మాట్లో మొత్తంగా 224 మ్యాచ్‌లు ఆడి.. 5600 పరుగులు సాధించాడు. బిగ్ హిట్టర్‌గా పేరొందిన చార్లెస్ రాకతో కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టం కానుంది. రైజర్స్పై విజయం ఇదిలా ఉంటే.. గురువారం సన్‌రైజర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కేకేఆర్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో నాలుగో గెలుపు నమోదు చేసి పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: డెత్ ఓవర్లలో 'కింగ్' అనిపించుకుంటున్న రింకూ సింగ్ నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్ దక్కకుండా చేస్తాడు: ఇషాన్ కిషన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కేకేఆర్‌కు గుడ్ న్యూస్.. విధ్వంసకర బ్యాటర్ వచ్చేస్తున్నాడు..!
ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి ముందే కీలక ఆటగాళ్లు దూరమై, సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలై నానా తంటాలు పడుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఇవాళ (ఏప్రిల్ 5) ఓ గుడ్‌న్యూస్ మరో బ్యాడ్‌న్యూస్ తెలిసింది. విధ్వంసకర బ్యాటర్, ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది కేకేఆర్ యాజమాన్యం. బేస్‌ప్రైజ్ రూ. 1.5 కోట్లకు అదనంగా మరో 1.3 కోట్లు (2.8 కోట్లు) చెల్లించి రాయ్‌ను సొంతం చేసుకుంది కేకేఆర్ మేనేజ్మెంట్. ఐపీఎల్లో 2017, 2018, 2021 సీజన్లు ఆడిన రాయ్.. చివరిసారిగా 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ కెరీర్లో 13 మ్యాచ్‌లు ఆడిన రాయ్ 129 స్ట్రయిక్‌రేట్‌తో 329 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. బ్యాడ్‌న్యూస్ ఏంటంటే.. గత కొన్ని సీజన్లుగా ఏదీ కలిసి రాక, ప్లేఆఫ్స్‌కు చేరేందకు కూడా అష్టకష్టాలు పడుతున్న కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సీజన్ మొత్తానికే దూరంగా కానున్నాడని తెలిసే లోపే మరో కీలక ఆటగాడు షకీబ్ అల్ హసన్ బాంబు పేల్చాడు. షకీబ్ కూడా సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడం లేదని ప్రకటించాడు. అంతర్జాతీయంగా ఉన్న కమిట్మెంట్లు, వ్యక్తిగత కారణాల చేత ఐపీఎల్-2023కు అందుబాటులో ఉండటం కుదరదని షకీబ్ పేర్కొన్నాడు. మరోవైపు బంగ్లాదేశ్‌కే చెందిన లిటన్ దాస్ కూడా ఏప్రిల్ 10 వరకు ఉండటం లేదు. ఐర్లాండ్‌తో టెస్ట్ సిరీస్ కారణంగా లిటన్ 10వ తేదీ వరకు ఫ్రాంచైజీని గడువు కోరినట్లు సమాచారం. కాగా, శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో నితీశ్ రాణా కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతలు మోస్తున్న విషయం తెలిసిందే. రాణా సారథ్యంలో పంజాబ్ కింగ్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన కేకేఆర్.. డవ్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భానుక రాజపక్ష (50), కెప్టెన్ శిఖర్ ధవన్ (40) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన కేకేఆర్ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్థతిలో పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు. -
IPL 2023: కేకేఆర్‌కు షాకిచ్చిన బంగ్లా బోర్డు! తప్పుకొన్న షకీబ్.. ఆ స్టార్ బ్యాటర్ కూడా
IPL 2023- KKR- Shakib Al Hasan- ఢాకా: బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఈ ఏడాది ఐపీఎల్‌నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు షకీబ్ ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. ఐర్లాండ్‌తో మార్చి 31న టి20 సిరీస్ ముగిసిన తర్వాత షకీబ్ తమ జట్టుతో కలుస్తాడని కేకేఆర్ యాజమాన్యం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. అయితే మంగళవారం నుంచి ఐర్లాండ్‌తో బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ ఆడనుండగా... మే 9–14 మధ్య కెమ్స్ఫోర్డ్లో మూడు వన్డేల్లో బంగ్లా, ఐర్లాండ్ తలపడతాయి. ఇదే కారణంతో మరో బంగ్లా ఆటగాడు, కేకేఆర్ సభ్యుడే అయిన లిటన్ దాస్ కూడా ఐపీఎల్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వేలం సమయంలో తమ ఆటగాళ్లు పూర్తి స్థాయిలో కాకపోయినా, కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారని బంగ్లా బోర్డు ప్రకటించగా, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. షకీబ్ దూరమైతే కోల్‌కతా టీమ్‌లో ఆరుగురు విదేశీ ఆటగాళ్లే ఉంటారు. ఇక ఐపీఎల్-2023లో పంజాబ్‌తో తొలి మ్యాచ్ ఆడిన కేకేఆర్ ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చదవండి: ధోనితో అట్లుంటది మరి.. 20వ ఓవర్ అంటే పూనకాలే! వీడియో వైరల్ వరుసగా రెండు సిక్సర్లు.. ఐపీఎల్లో ధోని అరుదైన రికార్డు -
BAN Vs IRE: ఊచకోత.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. అయినా ప్రతిసారీ..
Bangladesh vs Ireland, 2nd T20I: ‘‘అత్యంత వేగంగా 50 పరుగుల మార్కును అందుకున్నందుకు సంతోషంగా ఉంది. అయితే, నేనెప్పుడూ రికార్డుల గురించి ఆలోచించను. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై త్వరత్వరగా పరుగులు రాబట్టుకోవాలని మాత్రమే అనుకున్నా’’ అని బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ అన్నాడు. ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన రెండో టీ20లో లిటన్ దాస్ ఫాస్టెస్ ఫిఫ్టీ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఐరిష్ ఆటగాళ్ల బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ.. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో 16 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. అదరగొట్టారు.. రోనీ ఏం తక్కువ కాదు.. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 41 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 202కు పైగా స్ట్రైక్‌రేటుతో 83 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రోనీ తాలూక్దార్(23 బంతుల్లో 44 పరుగులు)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరు కలిసి పవర్‌ప్లేలో 73 పరుగులు సాధించారు. తొలి వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం నమెదు చేశారు. వర్షం అడ్డంకి కారణంగా 17 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ 202 రన్స్ స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ తడబడింది. ప్రతిసారీ పవర్‌ప్లేలో 70-80 అంటే బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఐదు వికెట్లు తీసి.. ఐరిష్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. దీంతో 77 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఓటమిపాలు కాగా.. సిరీస్ 2-0తో బంగ్లా సొంతమైంది. ఈ నేపథ్యంలో లిటన్ దాస్ మాట్లాడుతూ.. ‘‘మెరుగైన ప్రదర్శన కనబరిస్తే తప్పకుండా విజయాలు వరిస్తాయి. ఇంతకంటే బాగా ఆడాలంటే కాస్త కష్టమే. ఎందుకంటే ప్రతిసారి పవర్‌ప్లేలో 70-80 పరుగులు రాబట్టలేము కదా! ఒకవేళ ఇదే జోరు కొనసాగితే మాత్రం మాకంటే సంతోషించే వాళ్లు ఎవరుంటారు? గత రెండు మ్యాచ్‌లలో అత్యుత్తమంగా రాణించాం. అందుకే వరుస విజయాలు సాధ్యమయ్యాయి. ఇదే జోష్‌ను కొనసాగిస్తూ ముందుకు సాగుతాం’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో షకీబ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్- ఐర్లాండ్ మధ్య నామమాత్రపు మూడో టీ20 శుక్రవారం (మార్చి 31) జరుగనుంది. చదవండి: IPL 2023: ముంబై ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ దూరం! కెప్టెన్‌గా సూర్యకుమార్ -
దుమ్ములేపిన లిటన్ దాస్! ఐదేసిన షకీబ్.. మరో సిరీస్ కూడా..
Bangladesh vs Ireland, 2nd T20I: ఐర్లాండ్‌తో రెండో టీ20లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. చట్టోగ్రామ్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. వర్షం కారణంగా బంగ్లాదేశ్- ఐర్లాండ్ రెండో టీ20 మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పర్యాటక ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లా ఓపెనర్లు లిటన్ దాస్(83), రోనీ తాలుక్దార్(44) అద్భుతంగా రాణించారు. వీరికి తోడు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 38 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 17 ఓవర్లలో ఆతిథ్య బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు స్కోరు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌కు బంగ్లా కెప్టెన్ షకీబ్ చుక్కలు చూపించాడు. ఐదు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. షకీబ్ దెబ్బకు ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. పేసర్ టస్కిన్ అహ్మద్ సైతం అద్భుతంగా రాణించాడు. ఐరిష్ స్టార్ ఓపెనర్, కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ వికెట్‌తో శుభారంభం అందించిన అతడు మొత్తంగా 3 వికెట్లతో సత్తా చాటాడు. బంగ్లా బౌలర్ల విజృంభణతో నిర్ణీత 17 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన ఐర్లాండ్ కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన షకీబ్ అల్ హసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా అంతకుముందు వన్డే సిరీస్‌ను కూడా బంగ్లా గెలుచుకున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్ రెండో టీ20 స్కోర్లు బంగ్లాదేశ్- 202/3 (17) ఐర్లాండ్- 125/9 (17) చదవండి: David Warner: సన్‌రైజర్స్‌ది తెలివి తక్కువతనం.. అందుకే వార్నర్‌ను వదులుకుని! ఈసారి.. ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్ జట్టులో సూర్యకు చోటు ఖాయం! ఒక్క సిరీస్‌లో విఫలమైనంత మాత్రాన.. -
చరిత్ర సృష్టించిన లిటన్ దాస్.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. 16 ఏళ్ల రికార్డు బద్దలు
Bangladesh vs Ireland, 2nd T20I: బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున టీ20 ఫార్మాట్లో అత్యంత వేగవంతంగా అర్ధ శతకం పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఐర్లాండ్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు. 16 ఏళ్ల రికార్డు బద్దలు చట్టోగ్రామ్ వేదికగా జరిగిన రెండో టీ20 సందర్భంగా 18 బంతుల్లో 50 పరుగులు మార్కును అందుకున్నాడు. తద్వారా మహ్మద్ అష్రాఫుల్ పేరిట ఉన్న రికార్డును లిటన్ దాస్ బద్దలు కొట్టాడు. కాగా 2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆష్రాఫుల్ 20 బంతులో హాఫ్ సెంచరీ చేశాడు. జొహన్నస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ఈ ఘనత సాధించాడు 41 బంతుల్లో ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2022 ఈవెంట్లో టీమిండియాతో మ్యాచ్‌లో 21 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుని.. ఆష్రాఫుల్ తర్వాతి స్థానంలో నిలిచాడు లిటన్ దాస్. తాజా మ్యాచ్‌తో అతడిని అధిగమించాడీ వికెట్ కీపర్ బ్యాటర్. ఇక ఐర్లాండ్‌తో రెండో టీ20లో మొత్తంగా 41 బంతులు ఎదుర్కొన్న లిటన్ దాస్ 10 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 83 పరుగులు చేశాడు. లిటన్ దాస్‌కు తోడు మరో ఓపెనర్ రోనీ టాలూక్దర్ 44 పరుగులతో రాణించగా.. 202 పరుగుల భారీ స్కోరు చేసింది బంగ్లాదేశ్. వర్షం కారణంగా 17 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో బంగ్లా గెలుపొందింది. చదవండి: Rashid Khan: వరల్డ్ నంబర్ 1 రషీద్! పాక్‌పై చెలరేగి టాప్-3లో అతడు.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఖుషీ David Warner: సన్‌రైజర్స్‌ది తెలివి తక్కువతనం.. అందుకే వార్నర్‌ను వదులుకుని! ఈసారి.. -
కోహ్లి సైగ చేశాడు.. సిరాజ్ అనుకరించాడు; ఒళ్లు మండినట్టుంది
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి టెస్టులో మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్న సిరాజ్ ఆరంభంలోనే బంగ్లాను దెబ్బతీశాడు. అయితే సిరాజ్ లిటన్‌దాస్‌ను పెవిలియన్ పంపించడానికి ముందు ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. టీ విరామం తర్వాత 14వ ఓవర్ సిరాజ్ వేశాడు. తొలి బంతిని గంటకు 140 కిమీవేగంతో విసరగా.. లిటన్‌దాస్ టచ్ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో సిరాజ్ లిటన్‌ను ఏదో అన్నాడు. సిరాజ్ అన్నది అర్థంగాక అతని వెనకాల కొద్దిదూరం వచ్చి ''ఏంటి మళ్లీ చెప్పు..'' అంటూ తన చెవి దగ్గర చేయి పెట్టి సైగ చేశాడు. లిటన్ చర్యతో సిరాజ్ చిర్రెత్తిపోయాడు. ఆ తర్వాత బంతిని సిరాజ్ స్టంప్స్‌కు టార్గెట్ చేస్తూ విసిరాడు. లైన్ అండ్ లెంగ్త్‌తో వచ్చిన బంతి లిటన్ బ్యాడ్ బాటమ్ ఎడ్జ్‌కు తాకి వికెట్లను గిరాటేసింది. అంతే లిటన్ పెవిలియన్ వెళ్తుండగా.. సిరాజ్ మొదట తన వేలుని మూతిపై ఉంచాడు. ఆ తర్వాత కోహ్లి చేసిన సైగ చూసిన సిరాజ్.. చెవి దగ్గరు చేతిని పెట్టి ఏంటి మళ్లీ చెప్పు అన్నట్లుగా లిటన్ దాస్వైపు చూశాడు. కానీ లిటన్ దాస్ ఏమీ అనలేక అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 404 పరుగులకు ఆలౌట్ అయింది. పుజారా 90 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. శ్రేయాస్ అయ్యర్ 86, అశ్విన్ 58 పరుగులు, కుల్దీప్ యాదవ్ 40 పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్, మెహదీ హసన్‌లు చెరో నాలుగు వికెట్లు తీయగా.. ఎబాదత్ హొసెన్, ఖలీల్ అహ్మద్‌లు చెరొక వికెట్ తీశారు. Test cricket is special with Virat Kohli. What a moment! pic.twitter.com/QM8isNqUl9 — Mufaddal Vohra (@mufaddal_vohra) December 15, 2022 చదవండి: అశ్విన్ హాఫ్ సెంచరీ.. కేఎల్ రాహుల్ కంటే వెయ్యి రెట్లు బెటర్ అంటున్న ఫ్యాన్స్ -
Ind Vs Ban: పోరాడి ఓడిన భారత్.. సిరీస్ బంగ్లాదేశ్‌దే
India tour of Bangladesh, 2022- Bangladesh vs India, 2nd ODI Updates: పోరాడి ఓడిన భారత్.. సిరీస్ బంగ్లాదేశ్‌దే బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. ఇక 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. బారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 82 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గాయం కారణంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ అఖరిలో బ్యాటింగ్‌కు వచ్చి పోరాడనప్పటకీ జట్టును గెలిపించలేకపోయాడు. 27 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. ఇక బంగ్లా బౌలర్లలో ఎబాడోత్ హుస్సేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మెహది హసన్ రెండు, ముస్తిఫిజర్, మహ్మదుల్లా తలా వికెట్ సాధించారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్ 213 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ఎబాదట్ హేస్సేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో రోహిత్(20), సిరాజ్ ఉన్నారు. 46 ఓవర్ వేసిన ఎబాదట్ హేస్సేన్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్ సాయంతో 16 పరుగలు రాబట్టాడు. గాయంతో రోహిత్ బాధపడుతన్నప్పటికీ అద్భుతమైన పోరాట పటిమ కనబరుస్తున్నాడు. భారత విజయానికి 24 బంతుల్లో 41 పరుగులు కావాలి. ఆరో వికెట్ కోల్పోయిన భారత్ 189 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 56 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. ఎబాదట్ హేస్సేన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. అయ్యర్ ఔట్ అద్భుతంగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ వికెట్‌ను భారత్ కోల్పోయింది. 82 పరుగులు చేసిన అయ్యర్.. మెహదీ హసన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. భారత విజయానికి 90 బంతుల్లో 100 పరుగులు కావాలి. క్రీజులో అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్ ఉన్నారు. అయ్యర్ హాఫ్ సెంచరీ ఓ వైపు వికెట్లు కోల్పోతున్నప్పటికీ శ్రేయస్ అయ్యర్ మాత్రం పోరాడతున్నాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీని కూడా అయ్యర్ పూర్తి చేసుకున్నాడు. 25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అయ్యర్(50), అక్షర్ పటేల్(21) పరుగులతో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. రాహుల్ ఔట్ 65 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన రాహుల్.. మెహదీ హసన్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. 17 ఓవర్లకు టీమిండియా స్కోర్: 60/3 17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(11), శ్రేయస్ అయ్యర్(23) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 39 పరుగులు వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో లిటన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 8 ఓవర్లకు టీమిండియా స్కోర్:34/2 8 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(12), వాషింగ్టన్ సుందర్(8) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్ 13 పరుగులు వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన ధావన్.. ముస్తిఫిజర్ రెహ్మన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. భారత్‌కు బిగ్ షాక్.. విరాట్ కోహ్లి ఔట్ 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లి వికెట్‌ను భారత్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన కోహ్లి ఎబాదత్ హోస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. రాణించిన మిరాజ్, మహ్మదుల్లా టీమిండియాతో రెండో వన్డేలో బంగ్లాదేశ్ మెరుగైన స్కోరు చేయగలిగింది. 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన బంగ్లాను మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్ ఆదుకున్నారు. ఆరో స్థానంలో వచ్చిన మహ్మదుల్లా 77 పరుగులు చేయగా.. మిరాజ్ ఆఖరి బంతి వరకు అజేయంగా నిలిచి సెంచరీ 4పూర్తి చేసుకున్నాడు. దీంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. సిరాజ్‌కు రెండు, సుందర్‌కు మూడు, ఉమ్రాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఏడో వికెట్ డౌన్ 46.1: చాలా సమయం తర్వాత భారత్‌కు వికెట్ లభించింది. అద్బుత ంగా ఆడుతున్న మహ్మదుల్లా, మిరాజ్ జోడీని ఉమ్రాన్ మాలిక్ విడదీశాడు. ఉమ్రాన్ బౌలింగ్‌లో మహ్మదుల్లా(77) రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో బంగ్లా ఏడో వికెట్ కోల్పోయింది. నాసూమ్ అహ్మద్, మిరాజ్ క్రీజులో ఉన్నారు. బంగ్లా స్కోరు: 231/7 (47) మెరిసిన మహ్మదుల్లా మహ్మదుల్లా హాఫ్ సెంచరీతో మెరిశాడు. 41 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ స్కోరు- 178-6 మిరాజ్ అర్ధ శతకం రెండో వన్డేలో బంగ్లా బ్యాటర్ మిరాజ్ అర్ధ శతకంతో మెరిశాడు. అతడికి తోడుగా మహ్మదుల్లా(46) రాణిస్తున్నాడు. వీరిద్దరి నిలకడైన ఆటతో 39 ఓవర్లలో బంగ్లా 167 పరుగులు చేయగలిగింది. భారత జట్టు బౌలర్లను మార్చినా ఏ ఒక్కరు కూడా ఈ జోడీని విడదీయలేకపోతున్నారు. నిలకడగా మిరాజ్ మిరాజ్ నిలకడగా ఆడుతున్నాడు. 35 ఓవర్లు ముగిసే సరికి 45 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మహ్మదుల్లా(35)తో కలిసి బంగ్లా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నాడు. 35 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు-149/6 30 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 124/6 మహ్మదుల్లా 26, మిరాజ్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా మొదటి వన్డేలో బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించిన మిరాజ్.. ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. నిలకడగా ఆడుతున్న మహ్మదుల్లా, మిరాజ్ ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లాను మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 28 ఓవర్లు ముగిసే సరికి మహ్మదుల్లా 21, మిరాజ్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఎట్టకేలకు 100 పరుగుల మార్కు భారత బౌలర్ల విజృంభణతో టాప్, మిడిలార్డర్ కుదేలు కాగా.. బంగ్లా 26 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు నష్టపోయి 100 పరుగుల మార్కును అందుకోగలిగింది. ఇప్పటి వరకు సుందర్‌కు మూడు, సిరాజ్‌కు రెండు, ఉమ్రాన్‌కు ఒక వికెట్ దక్కాయి. సుందర్ మ్యాజిక్! 18.6: వాషింగ్టన్ సుందర్ అద్భుతం చేశాడు. ముష్ఫికర్‌ను పెవిలియన్‌కు పంపిన మరుసటి బంతికే అఫిఫ్ హొసేన్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో బంగ్లా ఆరో వికెట్ కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. 19 ఓవర్లలో బంగ్లా స్కోరు: 69-6 ఐదో వికెట్ ఢమాల్ 18.5: ముష్ఫికర్ రహీం రూపంలో బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ముష్ఫికర్.. ధావన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సుందర్‌కు ఇది రెండో వికెట్. షకీబ్ అవుట్! 16.6: భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. ఇప్పటికే సిరాజ్ రెండు వికెట్లు కూల్చగా.. ఉమ్రాన్ అద్భుత బంతితో షాంటోను బౌల్డ్ చేశాడు. ఇక 17వ ఓవర్ చివరి బంతికి షకీబ్(8)ను అవుట్ చేసిన వాషింగ్టన్ సుందర్ సైతం ఖాతా తెరిచాడు. దీంతో బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లలో బంగ్లా స్కోరు: 66-4 మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 52 పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. 21 పరుగుల చేసిన షాంటోను ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్‌చేశాడు. వారెవ్వా సిరాజ్ బంగ్లాతో రెండో వన్డేలో భారత బౌలర్లు ఆది నుంచి కట్టడిగా బౌలింగ్ చేస్తున్నారు. రెండో ఓవర్లోనే వికెట్ తీసిన సిరాజ్ వికెట్.. పదో ఓవర్లో బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్‌ను బౌల్డ్ చేశాడు. మరోవైపు.. తన మొదటి 2 ఓవర్లలో శార్దూల్ 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీపక్ చహర్ 3 ఓవర్లు బౌల్ చేసిన 12 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. దీంతో 10 ఓవర్లలో బంగ్లా 2 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. రెండో వికెట్ డౌన్ 9.2: సిరాజ్ మరోసారి బంగ్లాను దెబ్బకొట్టాడు. కెప్టెన్ లిటన్ దాస్(7)ను బౌల్డ్ చేసి రెండో వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. షకీబ్, షాంటో క్రీజులో ఉన్నారు. ►ఐదు ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 23/1 తొలి వికెట్ కోల్పోయిన బంగ్లా 1.5: అనముల్ హక్ రూపంలో బంగ్లా తొలి వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అనముల్(11) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. షాంటో క్రీజులోకి వచ్చాడు. కెప్టెన్ లిటన్ దాస్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాడు. రెండు ఓవర్లు ముగిసే సరికి బంగ్లా స్కోరు: 11-1 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుక్ను బంగ్లాదేశ్ టీమిండియాతో రెండో వన్డేలో బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. తొలి వన్డేలో బౌలింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు... బుధవారం నాటి మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపింది. రోహిత్ సేనను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. యువ స్పిన్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ స్థానంలో అక్షర్ పటేల్, పేసర్ కుల్దీప్ సేన్ స్థానంలో కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌కు తుది జట్టులో చోటు దక్కింది. కాగా కుల్దీప్ మొదటి వన్డేతో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్- టీమిండియా ఢాకా వేదికగా రెండో వన్డేలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉండగా.. కచ్చితంగా గెలిచి స్వదేశంలో గత సిరీస్ ఫలితాన్ని పునరావృతం చేయాలని బంగ్లా ఉవ్విళ్లూరుతోంది. తుది జట్లు: భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్. బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిటన్ దాస్(కెప్టెన్), అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, ఇబాదత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్. చదవండి: Ind A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్ Ind Vs Ban 2nd ODI: కచ్చితంగా గెలుస్తాం.. అతడు ప్రపంచంలోనే గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు!