షకీబ్ అల్ హసన్ (PC: BCCI/IPL)
IPL 2023- KKR- Shakib Al Hasan- ఢాకా: బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఈ ఏడాది ఐపీఎల్‌నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు షకీబ్ ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. ఐర్లాండ్‌తో మార్చి 31న టి20 సిరీస్ ముగిసిన తర్వాత షకీబ్ తమ జట్టుతో కలుస్తాడని కేకేఆర్ యాజమాన్యం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.
అయితే మంగళవారం నుంచి ఐర్లాండ్‌తో బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ ఆడనుండగా... మే 9–14 మధ్య కెమ్స్‌ఫోర్డ్‌లో మూడు వన్డేల్లో బంగ్లా, ఐర్లాండ్ తలపడతాయి. ఇదే కారణంతో మరో బంగ్లా ఆటగాడు, కేకేఆర్ సభ్యుడే అయిన లిటన్ దాస్ కూడా ఐపీఎల్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
వేలం సమయంలో తమ ఆటగాళ్లు పూర్తి స్థాయిలో కాకపోయినా, కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారని బంగ్లా బోర్డు ప్రకటించగా, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. షకీబ్ దూరమైతే కోల్‌కతా టీమ్‌లో ఆరుగురు విదేశీ ఆటగాళ్లే ఉంటారు. ఇక ఐపీఎల్-2023లో పంజాబ్‌తో తొలి మ్యాచ్ ఆడిన కేకేఆర్ ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
చదవండి: ధోనితో అట్లుంటది మరి.. 20వ ఓవర్ అంటే పూనకాలే! వీడియో వైరల్
వరుసగా రెండు సిక్సర్లు.. ఐపీఎల్‌లో ధోని అరుదైన రికార్డు
Comments
Please login to add a commentAdd a comment