Kolkata Knight Riders
-
CSK Vs KKR: చెపాక్‌లో చెన్నై చిత్తుగా...
ఐపీఎల్ చరిత్రలో తొలిసారి వరుసగా ఐదో పరాజయం... మొదటిసారి సొంతగడ్డ చెపాక్ మైదానంలో వరుసగా మూడో ఓటమి... ధోని కెపె్టన్సీ పునరాగమనంలో సీఎస్కే మరింత పేలవ ప్రదర్శన కనబర్చింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) పదునైన బౌలింగ్ ముందు చేతులెత్తేసిన సీఎస్కే భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫటాఫట్‌గా 61 బంతుల్లోనే లక్ష్యాన్ని అందుకున్న కోల్‌కతా రన్‌రేట్‌ను ఒక్కసారిగా పెంచుకొని దూసుకుపోయింది. చెన్నై: ఐపీఎల్ 18వ సీజన్లో ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. సొంత మైదానంలో బ్యాటింగ్ వైఫల్యంతో జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. శుక్రవారం జరిగిన ఈ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులే చేయగలిగింది. శివమ్ దూబే (29 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, విజయ్‌శంకర్ (21 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించాడు. అనంతరం కోల్‌కతా 10.1 ఓవర్లలో 2 వికెట్లకు 107 పరుగులు సాధించి గెలిచింది. సునీల్ నరైన్ (18 బంతుల్లో 44; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) శుభారంభంతో మరో 59 బంతులు మిగిలి ఉండగానే విజయం జట్టు సొంతమైంది. పేలవ బ్యాటింగ్... ఓపెనర్లు కాన్వే (12), రచిన్ (4) ఒకే స్కోరు వద్ద వెనుదిరగ్గా... రెండు సార్లు అదృష్టం కలిసొచ్చిన విజయ్ శంకర్ కొన్ని పరుగులు రాబట్టాడు. 0, 20 పరుగుల వద్ద అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌లను నరైన్, వెంకటేశ్ అయ్యర్ వదిలేశారు. రాహుల్ త్రిపాఠి (16) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఆ తర్వాత చెన్నై 9 పరుగుల తేడాతో అశ్విన్ (1), జడేజా (0), దీపక్ హుడా (0), ధోని (1) వికెట్లను కోల్పోయింది. 71/6 వద్ద బ్యాటింగ్ కుప్పకూలే పరిస్థితి ఉండటంతో చెన్నై ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బ్యాటర్ హుడాను తీసుకు రాగా, అతనూ డకౌటయ్యాడు. వరుసగా 63 బంతుల పాటు జట్టు ఫోర్ కొట్టలేకపోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా...మరో ఎండ్‌లో నిలబడిన దూబే తన 20వ బంతికి గానీ తొలి ఫోర్ కొట్టలేకపోయాడు. చివరి ఓవర్లో అతను మరో రెండు ఫోర్లు కొట్టడంతో ఎట్టకేలకు స్కోరు 100 పరుగులు దాటింది. చకచకా లక్ష్యం వైపు... ఛేదనలో కోల్‌కతాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. క్వింటన్ డికాక్ (16 బంతుల్లో 23; 3 సిక్స్‌లు), నరైన్ ధాటిగా ఆడుతూ 26 బంతుల్లోనే 46 పరుగులు జోడించారు. ఖలీల్ ఓవర్లో డికాక్ 2 సిక్స్‌లు బాదగా, అశ్విన్ ఓవర్లో నరైన్ ఫోర్, సిక్స్ కొట్టాడు. ఖలీల్ తర్వాత ఓవర్లో కేకేఆర్ 2 సిక్స్‌లు, ఫోర్‌తో 18 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 71 పరుగులకు చేరింది. ఆపై అశ్విన్ ఓవర్లో నరైన్ మరో 2 సిక్స్‌లు బాదాడు. విజయానికి 19 పరుగుల దూరంలో నూర్ అహ్మద్ అతడిని అవుట్ చేసినా... అజింక్య రహానే (17 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), రింకూ సింగ్ (12 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి పని పూర్తి చేశారు. ధోని అవుటా...నాటౌటా! ఎప్పటిలాగే అభిమానులు ఎదురు చూసేలా చేసీ చేసీ చివరకు 9వ స్థానంలో ధోని బ్యాటింగ్‌కు దిగాడు. నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతను నరైన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్ అవుట్‌గా ప్రకటించగా ఈ నిర్ణయంపై ధోని ‘రివ్యూ’ కోరాడు. బంతి బ్యాట్‌ను దాటుతున్న సమయంలో ‘స్నికో’లో కాస్త కదలిక కనిపించినా... టీవీ అంపైర్ వినోద్ శేషన్ దీనిని లెక్కలోకి తీసుకోకుండా అవుట్‌గా ఖాయం చేశాడు. దీనిపై ఫోర్త్ అంపైర్ తన్మయ్ శ్రీవాత్సవను కలిసి చెన్నై కోచ్ ఫ్లెమింగ్ తన అసంతృప్తిని ప్రదర్శించడం కనిపించింది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి) రహానే (బి) హర్షిత్ 4; కాన్వే (ఎల్బీ) (బి) అలీ 12; త్రిపాఠి (బి) నరైన్ 16; విజయ్ శంకర్ (సి) అలీ (బి) వరుణ్ 29; శివమ్ దూబే (నాటౌట్) 31; అశ్విన్ (సి) అరోరా (బి) హర్షిత్ 1; జడేజా (సి) డికాక్ (బి) నరైన్ 0; హుడా (సి) అరోరా (బి) వరుణ్ 0; ధోని (ఎల్బీ) (బి) నరైన్ 1; నూర్ (సి) వరుణ్ (బి) అరోరా 1; అన్షుల్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 103. వికెట్ల పతనం: 1–16, 2–16, 3–59, 4–65, 5–70, 6–71, 7–72, 8–75, 9–79. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–31–1, మొయిన్ అలీ 4–1–20–1, హర్షిత్ రాణా 4–0–16–2, వరుణ్ చక్రవర్తి 4–0–22–2, సునీల్ నరైన్ 4–0–13–3. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) అన్షుల్ 23; నరైన్ (బి) నూర్ 44; రహానే (నాటౌట్) 20; రింకూ సింగ్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (10.1 ఓవర్లలో 2 వికెట్లకు) 107. వికెట్ల పతనం: 1–46, 2–85. బౌలింగ్: ఖలీల్ 3–0–40–0, అన్షుల్ 2–0–19–1, అశ్విన్ 3–0–30–0, నూర్ 2–0–8–1, జడేజా 0.1–0–9–0. ఐపీఎల్లో నేడులక్నో x గుజరాత్ వేదిక: లక్నోమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి హైదరాబాద్ x పంజాబ్ వేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
CSK Vs KKR: సునీల్ నరైన్ అరుదైన ఫీట్.. రెండో బౌలర్‌గా రికార్డు
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ బంతితో మ్యాజిక్ చేశాడు. తన స్పిన్ మయాజాలంతో సీఎస్కే బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అతడిని ఆడటం ఎవరి తరం కాలేదు. త్రిపాఠి, రవీంద్ర జడేజా, ధోని వంటి కీలక వికెట్లను పడగొట్టి సీఎస్కేను దెబ్బతీశాడు.నరైన్ తన నాలుగు ఓవర్లలో కోటాలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో సునీల్ నరైన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో సీఎస్కే అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా నరైన్ రికార్డులెక్కాడు.సునీల్ ఇప్పటివరకు చెన్నై జట్టుపై 26 వికెట్లు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ స్పిన్నర్ హార్బజన్ సింగ్(24) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో భజ్జీ రికార్డును సునీల్ బ్రేక్ చేశాడు.ఈ అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ(31) ఉన్నాడు. ఐపీఎల్లో సీఎస్కేపై అత్యధిక వికెట్లు బౌలర్లు వీరే31 - లసిత్ మలింగ26 - సునీల్ నరైన్24 - హర్భజన్ సింగ్ 22 - పీయూష్ చావ్లా103 పరుగులకే..ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సీఎస్కే.. కేకేఆర్ బౌలర్ల దాటికి 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(31 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. విజయ్ శంకర్(29) కాస్త ఫర్వాలేదన్పించాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు వైభవ్ ఆరోరా, మోయిన్ అలీ తలా వికెట్ సాధించారు. -
సీఎస్కేను చిత్తు చేసిన కేకేఆర్..
Csk vs KKR Live Updates: సీఎస్కేను చిత్తు చేసిన కేకేఆర్..చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 10.1 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో సునీల్ నరైన్(18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డికాక్(23 ), రహానే(20 నాటౌట్), రింకూ సింగ్(15 నాటౌట్) రాణించారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(31 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. విజయ్ శంకర్(29) కాస్త ఫర్వాలేదన్పించాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు వైభవ్ ఆరోరా, మోయిన్ అలీ తలా వికెట్ సాధించారు.దూకుడుగా ఆడుతున్న కేకేఆర్..104 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్ డికాక్(9), సునీల్ నరైన్(9) ఉన్నారు.103 పరుగులకే పరిమితమైన సీఎస్కేచెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్ల దాటికి సీఎస్కే బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. ఏ ఒక్క బ్యాటర్ కూడా కేకేఆర్ బౌలర్లను సరిగ్గా ఎదుర్కోలేకపోయాడు. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(31 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. విజయ్ శంకర్(29) కాస్త ఫర్వాలేదన్పించాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు వైభవ్ ఆరోరా, మోయిన్ అలీ తలా వికెట్ సాధించారు.సీఎస్కే ఎనిమిదో వికెట్ధోని రూపంలో సీఎస్కే ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ధోని.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 8 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది.72 పరుగులకే 7 వికెట్లు ..సీఎస్కే 72 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అశ్విన్(1), రవీంద్ర జడేజా(0), దీపక్ హుడా(0) వరుస క్రమంలో ఔటయ్యారు.కష్టాల్లో సీఎస్కే..చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. 65 పరుగులకే సీఎస్కే నాలుగు వికెట్లు కోల్పోయింది. 29 పరుగులు చేసిన విజయ్ శంకర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔట్ కాగా.. త్రిపాఠి(16) సునీల్ నరైన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.సీఎస్కే రెండో వికెట్ డౌన్రచిన్ రవీంద్ర రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రవీంద్ర.. హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. సీఎస్కే తొలి వికెట్ డౌన్..డెవాన్ కాన్వే రూపంలో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన కాన్వే.. మోయిన్ అలీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.3 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 16/0టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో డెవాన్ కాన్వే(12), రచిన్ రవీంద్ర(4) పరుగులతో ఉన్నారు.ఐపీఎల్-2025లో మరో రసవత్తర పోరుకు తేరలేచింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. స్పెన్సార్ జాన్సన్ స్దానంలో మోయిన్ అలీ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోని వ్యవహరిస్తున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా దూరం కావడంతో ధోని తిరిగి పగ్గాలు చేపట్టాడు. రుతురాజ్ స్ధానంలో రాహుల్ త్రిపాఠి తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లుసీఎస్కేతో మ్యాకోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తిచెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ(కెప్టెన్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్చ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ -
సీఎస్కేతో మ్యాచ్.. కేకేఆర్ స్టార్ ఓపెనర్ పై వేటు! అతడి ఎంట్రీ?
ఐపీఎల్-2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో కేకేఆర్ తలపడనుంది. గత మ్యాచ్‌లో లక్నోపై అనుహ్య ఓటమి చవిచూసిన కేకేఆర్.. ఇప్పుడు సీఎస్కేపై గెలిచి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతున్న స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్‌పై వేటు వేయాలని కేకేఆర్ మేనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అతడి స్దానంలో అఫ్గానిస్తాన్ ఓపెనర్ రెహ్మతుల్లా గుర్బాజ్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. అదేవిధంగా సీఎస్కేతో మ్యాచ్‌కు పేసర్ స్పెన్సర్ జాన్సెన్ను కూడా కేకేఆర్ పక్కన పెట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. చెపాక్ పిచ్ ఎక్కువగా స్పిన్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో స్పిన్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీని తుది జట్టులోకి తీసుకురావాలని కేకేఆర్ కోచ్ అండ్ కెప్టెన్ భావిస్తున్నట్లు వినికిడి. కాగా ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్‌కతా 4 పాయింట్లతో ఆరో స్ధానంలో కొనసాగుతోంది. మరోవైపు సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోని తిరిగి బాధ్యతలు చేపట్టాడు. రెగ్యూలర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలగడంతో ధోని మరోసారి చెన్నై జట్టును నడిపించనున్నాడు. సీఎస్కేకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన సూపర్ కింగ్స్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. రుతురాజ్ స్ధానంలో రాహుల్ త్రిపాఠి తుది జట్టులో వచ్చే ఛాన్స్ ఉంది.తుది జట్లు(అంచనా)కేకేఆర్రెహ్మతుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, మొయిన్ అలీ, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిసీఎస్కేరచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్చదవండి: PSL 2025: వరుస షాక్‌లు.. పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్ -
ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై రాత మారిపోదు!
మహేంద్ర సింగ్ ధోని మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ (CSK)సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గ్వైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్-2025 (IPL 2025)లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కావడంతో ఈ మార్పు అనివార్యమైంది. గువాహాటిలో గత నెల 30న రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా రుతురాజ్ మోచేతికి గాయమైంది. అయితే దానికి చికిత్స కొనసాగిస్తూ అతడు మరో రెండు మ్యాచ్‌లు ఆడాడు. కానీ.. నొప్పి తీవ్రం కావడంతో పరీక్షలు చేయగా మోచేతికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది.కేకేఆర్‌తో మ్యాచ్లోఫలితంగా ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ ధోని (MS Dhoni) కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టనున్నాడు. సొంత మైదానం చెపాక్‌లో జరిగే శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ధోని విధుల్లో చేరనున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ఒకప్పటి సీఎస్కే స్టార్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై జట్టు రాత మారదని అభిప్రాయపడ్డాడు.మీరెలా ముందుకు వెళ్లగలరు?‘‘జట్టులో ఎన్నో లోపాలు ఉన్నాయి. ముందుగా వాటిని సరిచేయాలి. అంతేగానీ ధోనిని తిరిగి కెప్టెన్‌గా చేసినందు వల్ల పరిస్థితులు వాటికవే చక్కబడిపోవు. రుతు లాంటి కీలక బ్యాటర్ స్థానాన్ని ఎవరితో మీరు భర్తీ చేస్తారు? ఈ లోటును ఎలా పూడ్చుకుంటారు?.. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను ఎక్కడి నుంచి తెస్తారు?డెవాన్ కాన్వే పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రిటైర్డ్ అవుట్ కావడానికి ముందు 69 పరుగులు చేశాడు. ఇక రచిన్ ఆరంభం నుంచే పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి సమయంలో రుతు లాంటి సాలిడ్ బ్యాటర్ లేకుండా మీరెలా ముందుకు వెళ్లగలరు?’’ అని రాబిన్ ఊతప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో సీఎస్కే యాజమాన్యాన్ని ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా గతేడాది సీఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న ధోని.. తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్‌ను ప్రకటించాడు. అయితే, అతడి సారథ్యంలో చెన్నై గొప్పగా రాణించలేకపోతోంది. ఐపీఎల్-2024లో రుతు సేన పద్నాలుగు మ్యాచ్‌లకు ఏడు గెలిచింది. అయితే, ఆర్సీబీతో కీలక మ్యాచ్‌లో ఓడి ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటి బాటపట్టింది.తొమ్మిదో స్థానంలోఇక ఐపీఎల్-2025లోనూ ఆరంభ మ్యాచ్‌లో ముంబై గెలిచిన చెన్నై.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.ఇదిలా ఉంటే.. సీఎస్కే టీమ్‌కు కర్త, కర్మ, క్రియగా ఉన్న ధోని 2008–2023 మధ్య 235 మ్యాచ్‌లలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ‘తలా’ నాయకత్వంలో 5 సార్లు జట్టు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. 2022లో ధోని స్థానంలో రవీంద్ర జడేజాను చెన్నై యాజమాన్యం కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అయితే టోర్నీ మధ్యలో అతడు 8 మ్యాచ్‌ల తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ధోనియే బాధ్యతలు తీసుకున్నాడు. 2024 సీజన్ నుంచి జట్టు సారథ్య బాధ్యతలు రుతురాజ్‌కు అప్పగించారు. అతడి కెప్టెన్సీలో టీమ్ 19 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 8 గెలిచి, 11 ఓడింది. చదవండి: IPL 2025: పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!? -
ఎవరైనా అతడికి కాస్త మర్యాద నేర్పండి: సెహ్వాగ్‌పై ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్-2025 (IPL 2025) కామెంట్రీ సందర్భంగా ‘జాట్’ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అతడు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో అభిమానులు సైతం వీరూ భాయ్‌పై మండిపడుతున్నారు. సెహ్వాగ్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని... ఇప్పటికైనా తన తప్పిదాన్ని గుర్తించి వెంటనే క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025 సీజన్లో హర్యాన్వీ కామెంటేటర్ల జాబితాలో సెహ్వాగ్‌కు కూడా స్థానం దక్కింది. తనదైన శైలిలో మ్యాచ్ ఫలితాలు, ఆటగాళ్లు, జట్ల ఆటతీరును విశ్లేషిస్తూ చణుకులు విసిరే వీరూ భాయ్.. ఈసారి మాత్రం కాస్త శ్రుతిమించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మంగళవారం నాటి మ్యాచ్ సందర్భంగా సెహ్వాగ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.అంత గొప్పగా ఏమీ పనిచేయవు‘‘ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్తాన్‌లలో నివసించే జాట్లు భిన్నంగా ఉంటారు. వారి భాష కూడా వేరుగా ఉంటుంది. అయితే, అందరూ జాట్లే. అందరి మెదళ్లు అంత గొప్పగా ఏమీ పనిచేయవు’’ అని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. కాగా సెహ్వాగ్ కూడా జాట్ సామాజిక వర్గానికి చెందినవాడే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన వర్గం గురించి తానే హాస్యం పండించేందుకు చేసిన ప్రయత్నం కాస్తా వికటించి.. విమర్శలు, వివాదానికి దారితీసింది.ఎవరైనా అతడికి కాస్త మర్యాద నేర్పించండిసెహ్వాగ్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. ‘‘వయసు మీద పడుతుంటే హుందాగా వ్యవహరించాల్సింది పోయి.. మరీ ఇలా చీప్ జోకులు వేస్తూ దిగజారిపోవాలా? ఎవరైనా అతడికి కాస్త మర్యాద నేర్పించండి. సొంత సామాజిక వర్గం పట్ల చులకన భావం ఎందుకు?నిజానికి మీకే కాస్త బుర్ర తక్కువ. అందుకే ఇలాంటి తలతిక్క జోకులు వేస్తున్నారు. జాట్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’’ అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే, సెహ్వాగ్ మాత్రం ఇంత వరకు తన వ్యాఖ్యలపై స్పందించలేదు.విధ్వంసకర ఓపెనర్గాకాగా టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన వీరేందర్ సెహ్వాగ్ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్ తరఫున మొత్తంగా 431 ఇన్నింగ్స్‌లో కలిపి 16892 పరుగులు సాధించాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్లలో వీరూ సభ్యుడు. రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్లో ఆడిన 46 ఏళ్ల ఈ ఢిల్లీ బ్యాటర్.. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.చదవండి: అనుకున్నది ఒకటి.. మా వాళ్లు చేసిందొకటి.. అందుకే ఓడిపోయాం: సంజూ -
‘కేకేఆర్‌ను వదిలెయ్ రింకూ.. వాళ్లకు ఆ అర్హత లేదు’!
ఈడెన్ గార్డెన్స్‌లో.. మంగళవారం సాయంత్రం.. పరుగుల వరద పారిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌దే పైచేయి అయింది. ఐడెన్ మార్క్రమ్ (28 బంతుల్లో 47), మిచెల్ మార్ష్ (48 బంతుల్లో 81)మెరుపులు మెరిపిస్తే... నికోలస్ పూరన్ (36 బంఉతల్లో 87 నాటౌట్) పూనకం వచ్చినట్లు రెచ్చిపోయాడు.ఫలితంగా లక్నో భారీ స్కోరు చేయగా... కొండంత లక్ష్యఛేదనలో రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ (35 బంతుల్లో 61)తో పోరాడినా కోల్‌కతా నైట్ రైడర్స్ విజయానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇరు జట్లు కలిసి 45 ఫోర్లు... 25 సిక్స్‌లతో రెచ్చిపోవడంతో ఓవరాల్‌గా మ్యాచ్‌లో 472 పరుగులు నమోదయ్యాయి. తాజా సీజన్లో లక్నోకు ఇది మూడో విజయం కాగా... కోల్‌కతాకు మూడో పరాజయం! ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నాయకత్వ బృందంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు. కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ ఎందుకిలా ఉందో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నాడు. పవర్ హిట్టర్‌గా పేరొందిన రింకూ సింగ్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు.‘‘రమణ్‌దీప్ సింగ్‌ను ఐదో స్థానంలో పంపించారు. అంగ్క్రిష్ రఘువన్షీని ఆరో స్థానంలో ఆడించారు. కానీ రింకూ సింగ్‌ను లోయర్ ఆర్డర్‌కి పంపేశారు. ఇప్పటికీ కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్‌పై నేను ఒక అవగాహనకు రాలేకపోతున్నా.చేతులు జోడించి అడుగుతున్నావిజయానికి ఇంకో ఐదు లేదా ఏడు బంతులే మిగిలి ఉన్నాయనుకుంటే.. అప్పుడు కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఎలా తీసుకుంటారు. చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. దయచేసి రింకూ సింగ్‌ను కాస్త టాప్‌లోకి ప్రమోట్ చేయండి. లెఫ్ట్- రైట్ కాంబినేషన్లు ప్రతిసారీ వర్కౌట్ కావు.ఆఖర్లో హర్షిత్ రాణా అతడికి స్ట్రైక్ ఇచ్చి ఉంటే.. మీరు నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయే వారు కాదు’’ అని ఆకాశ్ చోప్రా కేకేఆర్ మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు. గెలిచే మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకున్నారని విమర్శించాడు.కాగా లక్ష్య ఛేదనలో నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చిన రమణ్‌దీప్ సింగ్(1), అంగ్క్రిష్ రఘువన్షీ (5) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో కేకేఆర్ విజయ సమీకరణం 28 బంతుల్లో 62గా మారిన వేళ.. అప్పుడు రింకూను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు.ఈ క్రమంలో 15 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 38 పరుగులతో అజేయంగా నిలవగా.. అతడి కంటే ముందు అంటే ఏడోస్థానంలో వచ్చిన ఆండ్రీ రసెల్ (7) మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక ఆఖర్లో రింకూకు జతకలిసిన పేసర్ హర్షిత్ రాణా 9 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేశాడు. అప్పటికే ఓవర్లు పూర్తి కావడంతో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో కేకేఆర్ పరాజయాన్ని మూటగట్టుకుంది.కేకేఆర్‌ను వదిలేయ్ రింకూఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా స్పందించగా.. అభిమానులు సైతం రింకూ సింగ్ ఆటను చంపేస్తున్నారంటూ అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. రింకూ కేకేఆర్ జట్టును వదిలి వెళ్లిపోవాలని.. కోల్‌కతా ఫ్రాంఛైజీకి అతడిని తమతో అట్టిపెట్టుకునే అర్హత లేదంటూ ఘాటు కామెంట్లు చేస్తున్నారు. కాగా కేకేఆర్ వల్లే రింకూ వెలుగులోకి వచ్చి.. టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రింకూను కేకేఆర్ రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది.చదవండి: PBKS Vs CSK: గ్లెన్ మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన బీసీసీఐ!Thorough entertainment at the Eden Gardens 🏟 🍿And it's the Rishabh Pant-led @LucknowIPL that prevail in a thrilling run fest 🥳They bag 2️⃣ crucial points with a 4️⃣-run victory over #KKR 👏Scorecard ▶ https://t.co/3bQPKnxnJs#TATAIPL | #KKRvLSG pic.twitter.com/31clVQk1dD— IndianPremierLeague (@IPL) April 8, 2025 -
ఇంతకంటే చెత్తగానే ప్రవర్తించారు.. అతడు చేసిన తప్పేంటి?
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ (Digvesh Singh Rathi)కి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అండగా నిలిచాడు. రాఠీ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వ్యవహరిస్తున్న తీరు సరికాదని విమర్శించాడు. కాగా ఢిల్లీకి చెందిన దిగ్వేశ్‌ను ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో లక్నో రూ. 30 లక్షల ధరకు కొనుగోలు చేసింది.25 ఏళ్ల ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్‌పై నమ్మకంతో సీజన్లో తమ తొలి మ్యాచ్‌లోనే తుదిజట్టులో అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా అరంగేట్రంలోనే దిగ్వేశ్ రెండు వికెట్లు తీసి మేనేజ్మెంట్ అంచనాలు నిజం చేశాడు.‘నోట్‌బుక్’ సంబరాలుఆ తర్వాత కూడా రాణించిన దిగ్వేశ్ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు వైరల్ అయింది. బ్యాటర్‌ను అవుట్ చేయగానే.. అతడి దగ్గరికి వెళ్లి నోట్‌బుక్‌లో వికెట్ నంబర్ రాసుకుంటున్నట్లుగా కాస్త అతిగా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ పాలక మండలి.. ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ జరిమానా విధించింది.మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్ పాయింట్ జత చేసింది. ఇక ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా కూడా దిగ్వేశ్ రాఠీ మరోసారి ఇదే రీతిలో వికెట్ తీసిన సంబరాన్ని సెలబ్రేట్ చేసుకోగా.. ఈసారి మ్యాచ్ ఫీజులో యాభై శాతం కోత విధించడంతో పాటు మరో డీమెరిట్ పాయింట్ అతడి ఖాతాలో చేరింది. మూడోసారి ఇది రిపీట్ అయితే.. మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పచ్చిక మీద సంతకంఈ నేపథ్యంలో తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో మాత్రం దిగ్వేశ్ తన శైలిని మార్చుకున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో వికెట్ తీసిన అనంతరం ‘నోట్ బుక్’ సంబరాలతో జరిమానా ఎదుర్కొన్న అతడు.. ఈ మ్యాచ్‌లో తన ఆరాధ్య ప్లేయర్ సునీల్ నరైన్ వికెట్ తీసిన అనంతరం భిన్నంగా సంబరాలు జరుపుకొన్నాడు. ఏడో ఓవర్ రెండో బంతికి నరైన్‌ను అవుట్ చేసిన అనంతరం నేల మీద కూర్చొని పచ్చిక మీద సంతకం పెట్టాడు.Apne idol ka hi chalaan kaat diya 😌😂 pic.twitter.com/HuoxZJj1DX— Lucknow Super Giants (@LucknowIPL) April 8, 2025ఇంతకంటే చెత్తగానే ప్రవర్తించారు.. అతడు చేసిన తప్పేంటి?ఈ పరిణామాలపై కామెంటేటర్ సైమన్ డౌల్ స్పందించాడు. ‘‘ఇలాంటి జరిమానాలను జట్టు యాజమాన్యం కడుతుంది. నాకైతే ఇదేమీ నచ్చడం లేదు. నిజానికి అతడు సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు చూసి నాకు ముచ్చటేసింది. అసలు అతడు చేసిన తప్పేంటి?ఇంతకంటే చెత్తగానే ప్రవర్తించారు.. అతడు చేసిన తప్పేంటి?భారత క్రికెటర్లలో చాలా మంది సీనియర్లు ఇంతకంటే అధ్వానంగా సెలబ్రేట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్లకు మాత్రం ఎప్పుడూ జరిమానా వేయలేదు. కానీ ఈ యువ ఆటగాడి పట్ల మాత్రం ఎందుకు ఈ వివక్ష?.. నోట్‌బుక్ సంబరాలను తప్పుపట్టడం ఎంత మాత్రం సరికాదు’’ అని డౌల్ క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇప్పటి వరకు ఐపీఎల్లో ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న దిగ్వేశ్ సింగ్ రాఠీ ఏడు వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు.. లక్నో జట్టు ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్‌లలో మూడు గెలిచింది.చదవండి: ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్ -
గొప్పగా బ్యాటింగ్ చేశాం.. కానీ మా బౌలర్లలో ఆ ఇద్దరు మాత్రం...
ఐపీఎల్-2025 (IPL 2025)లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు మరో పరాజయం ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఎదురైన ఈ చేదు అనుభవం పట్ల కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.గొప్పగా బ్యాటింగ్ చేశాం..లక్నో చేతిలో ఓటమి అనంతరం స్పందిస్తూ.. ‘‘టాస్ సమయంలో నేను చెప్పినట్లుగానే.. ఈ వికెట్ 40 ఓవర్లపాటు బ్యాటర్లకు అనుకూలించింది. మేము కూడా మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాం. ఇదొక గొప్ప మ్యాచ్.కానీ చివర్లో విజయానికి మేము కేవలం నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాం. 230 పరుగులకి పైగా స్కోరును ఛేదించే క్రమంలో కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. నిజంగా బ్యాటింగ్‌కు ఇది అత్యుత్తమ పిచ్.కానీ మా బౌలర్లలో ఆ ఇద్దరు మాత్రం...నిలదొక్కుకునేందుకు మా బ్యాటర్లు కాస్త ఇబ్బందిపడినా.. తర్వాత కుదురుకున్నారు. మధ్య ఓవర్లలో మా బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారని చెప్పవచ్చు. అయితే, సునిల్ నరైన్ బౌలింగ్ చేసే సమయంలో ఇబ్బంది పడ్డాడు. నిజానికి మిడిల్ ఓవర్లలో సునిల్, వరుణ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. కానీ ఈరోజు మా బౌలర్లకు ఏదీ పెద్దగా కలిసి రాలేదు’’ అని అజింక్య రహానే పేర్కొన్నాడు. బౌలర్లు ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.పూరన్ వీరంగంకాగా ఈడెన్ గార్డెన్స్‌లో మంగళవారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికోలస్ పూరన్ (36 బంతుల్లో 87 నాటౌట్; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు), మిచెల్ మార్ష్ (48 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకాలతో చెలరేగారు.మరోవైపు.. మార్క్రమ్ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో పేసర్ హర్షిత్ రాణా రెండు, రసెల్ ఒక వికెట్ దక్కించుకున్నారు.స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్ మాత్రం ఈసారి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. వరుణ్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 31 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. మరోవైపు.. నరైన్ మూడు ఓవర్ల బౌలింగ్‌లో 38 పరుగులు ఇచ్చుకున్నాడు.కేకేఆర్ మెరుపులు సరిపోలేదుఇక లక్ష్య ఛేదనలో కెప్టెన్ అజింక్య రహానే (35 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో మెరవగా... వెంకటేశ్ అయ్యర్ (29 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్), సునీల్ నరైన్ (13 బంతుల్లో 30; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్ (15 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకుండా పోయింది.చదవండి: IPL 2025: ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా GAME ON, courtesy of the skipper 👊🫡Ajinkya Rahane notches up his 2️⃣nd 5️⃣0️⃣ of #TATAIPL 2025! 🙌#KKR need 90 runs in 8 overs.Updates ▶ https://t.co/3bQPKnwPTU#KKRvLSG | @KKRiders | @ajinkyarahane88 pic.twitter.com/1556wwfFfg— IndianPremierLeague (@IPL) April 8, 2025 -
KKR VS LSG Updates: ఉత్కంఠపోరులో కేకేఆర్ ఓటమి..
ఉత్కంఠ పోరులో కేకేఆర్ ఓటమి..ఐపీఎల్-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 4 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేయగల్గింది. కేకేఆర్ బ్యాటర్లలో అజింక్య రహానే(61) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్(38), వెంకటేశ్ అయ్యర్(45), సునీల్ నరైన్(30) పోరాడారు. లక్నో బౌలర్లలో ఆకాష్ దీప్, శార్ధూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. అవేష్ ఖాన్,బిష్ణోయ్, దిగ్వేష్ తలా వికెట్ సాధించారు.రసవత్తరంగా కేకేఆర్-లక్నో మ్యాచ్ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో-కేకేఆర్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. కేకేఆర్ విజయానికి ఆఖరి ఓవర్లో 24 పరుగులు కావాలి. క్రీజులో రింకూ సింగ్(24), హర్షిత్ రానా(5) ఉన్నారు.కేకేఆర్ ఆరో వికెట్ డౌన్..వెంకటేశ్ అయ్యర్ రూపంలో కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన అయ్యర్.. ఆకాష్దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రింకూ సింగ్ వచ్చాడు. 16 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 185/6గా ఉంది. ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్త్వరగా లక్ష్యాన్ని చేరుకుందామనే తొందరలో కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. ఆ జట్టు 173 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి రఘువంశీ (5) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 173/5గా ఉంది. నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్13.6వ ఓవర్- 166 పరుగుల వద్ద రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి రమన్‌దీప్ సింగ్ (1) ఔటయ్యాడు.మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్ఇన్నింగ్స్ 13వ ఓవర్లో వరుసగా ఐదు వైడ్లు వేసిన శార్దూల్ ఠాకూర్ ఆ ఓవర్ చివరి బంతికి అతి కీలకమైన రహానే (61) వికెట్ తీశాడు. 13 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 162/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ గెలవాలంటే 42 బంతుల్లో మరో 77 పరుగులు మాత్రమే చేయాలి. వాతావరణం బౌలర్లకు ఏమాత్రం సహకరించడం లేదు. బంతి అస్సలు నియంత్రణలో ఉండటం లేదు. టార్గెట్ 239.. 10 ఓవర్లలో 129 పరుగులు చేసిన కేకేఆర్239 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ కూడా ధీటుగా జవాబిస్తుంది. 10 ఓవర్లలోనే ఆ జట్టు 129 పరుగులు (2 వికెట్ల నష్టానికి) చేసింది. రహానే (47), వెంకటేశ్ అయ్యర్ (24) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్6.2వ ఓవర్- పవర్ ప్లేలో అదరగొట్టిన కేకేఆర్ (90/1) ఆతర్వాతి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. దిగ్వేష్ రాఠీ సునీల్ నరైన్‌ను (30) బోల్తా కొట్టించాడు. రహానేకు (36) జతగా వెంకటేశ్ అయ్యర్ క్రీజ్‌లోకి వచ్చాడు. టార్గెట్ 239.. విధ్వంసం సృష్టిస్తున్న కేకేఆర్ బ్యాటర్లుభారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఆదిలోనే డికాక్ వికెట్ కోల్పోయినప్పటికీ.. సునీల్ నరైన్ (30), రహానే (18) విధ్వంసం సృష్టిస్తున్నారు. వీరిద్దరి ధాటికి కేకేఆర్ 5 ఓవర్లలో ఏకంగా 73 పరుగులు చేసింది. టార్గెట్ 239.. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్2.3వ ఓవర్- 239 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్లో 16 పరుగులిచ్చిన ఆకాశ్‌దీప్ అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చి డికాక్‌ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. సునీల్ నరైన్‌కు (15) జతగా రహానే క్రీజ్‌లోకి వచ్చాడు.మార్ష్, పూరన్ విధ్వంసం.. లక్నో భారీ స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ చేసింది. మార్ష్ (48 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), పూరన్ (36 బంతుల్లో 87 నాటౌట్; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా 2, రసెల్ ఓ వికెట్ తీశారు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పూరన్‌పూరన్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 16.4 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 192/2గా ఉంది. పూరన్‌తో పాటు అబ్దుల్ సమద్ (2) క్రీజ్‌లో ఉన్నాడు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో.. మార్ష్ ఔట్15.2వ ఓవర్- 81 పరుగుల వద్ద మిచెల్ మార్ష్ ఔటయ్యాడు. రసెల్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.సెంచరీకి చేరువవుతున్న మార్ష్15 ఓవర్ల అనంతరం లక్నో స్కోర్ 170/1గా ఉంది. మార్ష్ (47 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీకి చేరువవుతున్నాడు. మరో ఎండ్‌లో పూరన్ కూడా ధాటిగా ఆడుతున్నాడు. పూరన్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. దంచి కొడుతున్న మార్ష్‌హాఫ్ సెంచరీ పూర్తయ్యాక మార్ష్ మరింత స్పీడ్ పెంచాడు. వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నాడు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 138/1గా ఉంది. మార్ష్ 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. పూరన్ 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి మార్ష్‌కు జతగా ఉన్నాడు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో10.2వ ఓవర్- 99 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి మార్క్రమ్ ఔటయ్యాడు. హర్షిత్ రాణా మార్క్రమ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మిచెల్ మార్ష్ (34 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. మార్ష్‌కు జతగా పూరన్ క్రీజ్‌లోకి వచ్చాడు. ధాటిగా ఆడుతున్న లక్నో ఓపెనర్లునిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన లక్నో ఓపెనర్లు ఆతర్వాత గేర్ మార్చారు. మార్క్రమ్ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (23 బంతుల్లో 34; ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో 7 ఓవర్ల అనంతరం లక్నో స్కోర్ 72/0గా ఉంది. గేర్ మార్చిన మార్క్రమ్‌ఇన్నింగ్స్ ప్రారంభంలో నిదానంగా ఆడిన మార్క్రమ్ స్పెన్సర్ జాన్సన్ వేసిన నాలుగో ఓవర్లో గేర్ మార్చాడు. ఆ ఓవర్లో అతను 2 బౌండరీలు, సిక్సర్ సహా 18 పరుగులు రాబట్టాడు. 5 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 43/0గా ఉంది. మార్క్రమ్తో పాటు (28) మార్ష్ (13) క్రీజ్‌లో ఉన్నాడు. ఆచితూచి ఆడుతున్న లక్నో ఓపెనర్లుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిదానంగా ఆడుతుంది. ఓపెనర్లు ఎయిడెన్ మార్క్రమ్ (9), మిచెల్ మార్ష్ (11) ఆచితూచి ఆడుతున్నారు. 3 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 20/0గా ఉంది. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 8) కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నేటి మ్యాచ్ కోసం కేకేఆర్ ఓ మార్పు చేసింది. మొయిన్ అలీ స్థానంలో స్పెన్సర్ జాన్సన్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో లక్నో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ప్రస్తుతం కేకేఆర్, లక్నో పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు తలో 4 మ్యాచ్‌లు ఆడి రెండింట గెలిచి, రెండిట ఓడాయి. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరుకు ఐదు మ్యాచ్‌ల్లో తలపడగా.. లక్నో 3, కేకేఆర్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తుది జట్లు..కేకేఆర్: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరాలక్నో: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్‌కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠి -
చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్..
ఐపీఎల్-2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తిరిగి విన్నింగ్ ట్రాక్‌లోకి వచ్చింది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 201 పరుగుల భారీ లక్ష్య చేధనలో కేకేఆర్ చతకలపడింది. కేకేఆర్ బౌలర్ల దాటికి సన్‌రైజర్స్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్ అయింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కమిందు మెండిస్ (20 బంతుల్లో 27), నితీశ్ కుమార్ రెడ్డి (19) కాసేపు క్రీజులో నిలదొక్కుకున్నారు. కేకేఆర్ బౌలర్లలో పేసర్ వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి తలా మూడు వికెట్లు పడగొట్టి ఎస్ఆర్హెచ్ పతనాన్ని శాసించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది.నరైన్ అరుదైన రికార్డు..ఈ మ్యాచ్‌లో కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కేకేఆర్ తరపున తన 200వ వికెట్‌ను నరైన్ అందుకున్నాడు. తద్వారా టీ20 క్రికెట్లో ఒకే జట్టు తరపున అత్యధిక వికెట్లు సాధించిన రెండో ప్లేయర్‌గా నరైన్ నిలిచాడు.సునీల్ నరైన్ ఐపీఎల్ ఆరంభం నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కే ఆడుతున్నారు. సునీల్ కేకేఆర్ తరుపన ఇప్పటివరకు ఐపీఎల్లో 182 , ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20)లో 18 వికెట్లు తీశాడు. మొత్తంగా 200 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ క్రికెట్ క్లబ్ నాటింగ్‌హామ్‌షైర్ బౌలర్ సమిత్ పటేల్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఇప్పటివరకు నాటింగ్‌హామ్‌షైర్ తరపున పటేల్ 208 వికెట్లు పడగొట్టాడు. పటేల్, నరైన్ తర్వాతి స్ధానంలో హాంప్‌షైర్ బౌలర్ క్రిస్ వుడ్ 199 ఉన్నాడు. ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ లసిత్ మలింగ 195 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. -
సన్‌రైజర్స్ పరాజయాల ‘హ్యాట్రిక్’
గత ఐపీఎల్ సీజన్ రన్నరప్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఓడింది. తొలి పోరులో మెరుపు బ్యాటింగ్‌తో భారీ విజయం సాధించిన టీమ్ అదే బ్యాటింగ్ వైఫల్యాలతో వరుసగా మూడో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. 2024 ఫైనలిస్ట్‌ల మధ్య జరిగిన సమరంలో చివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌దే పైచేయి అయింది. సొంత మైదానంలో ముందుగా బ్యాటింగ్‌లో చెలరేగి భారీ స్కోరు సాధించిన కేకేఆర్ ఆపై చక్కటి బౌలింగ్‌తో రైజర్స్‌ను నిలువరించింది. ఛేదనలో 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ ఆపై కోలుకోలేకపోయింది. కోల్‌కతా: మూడు రోజుల క్రితం ముంబై చేతిలో చిత్తుగా ఓడి పట్టికలో చివరి స్థానానికి పడిపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) వెంటనే భారీ విజయాన్ని అందుకుంది. ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా 80 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (29 బంతుల్లో 60; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), అంగ్కృష్ రఘువంశీ (32 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... కెప్టెన్ అజింక్య రహానే (27 బంతుల్లో 38; 1 ఫోర్, 4 సిక్స్‌లు), రింకూ సింగ్ (17 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. రఘువంశీ, రహానే మూడో వికెట్‌కు 51 బంతుల్లోనే 81 పరుగులు జోడించగా... వెంకటేశ్, రింకూ ఐదో వికెట్‌కు 41 బంతుల్లోనే 91 పరుగులు జత చేయడం విశేషం. అనంతరం రైజర్స్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... 20 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్ ఆట ముగిసింది. కీలక భాగస్వామ్యాలు... నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ మూడు భిన్న దశల్లో సాగింది. ఓపెనర్లు డికాక్ (1), నరైన్ (7) విఫలం కావడంతో 16 పరుగులకే జట్టు 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రహానే, రఘువంశీ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 53 పరుగులకు చేరింది. అన్సారీ ఓవర్లో రఘువంశీ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన తర్వాత అదే ఓవర్లో రహానే వెనుదిరిగాడు. 43 పరుగుల వద్ద నితీశ్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రఘువంశీ 30 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే అతను అవుటయ్యాడు. ఇక్కడ కేకేఆర్ బ్యాటింగ్ కొద్దిసేపు తడబడింది. వరుసగా 18 బంతుల పాటు బౌండరీ రాలేదు. 15 ఓవర్లలో జట్టు స్కోరు 122/4. సన్‌రైజర్స్ పట్టు బిగిస్తున్నట్లు కనిపించిన దశలో ఆఖరి 5 ఓవర్లలో కోల్‌కతా ఆటను మార్చేసింది. వెంకటేశ్, రింకూ ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించారు. హర్షల్ ఓవర్లో రింకూ వరుసగా 3 ఫోర్లు కొట్టగా, సిమర్జిత్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 17 పరుగులు వచ్చాయి. కమిన్స్ వేసిన 19వ ఓవర్లో వెంకటేశ్ వరుస బంతుల్లో 4, 6, 4, 4తో పండగ చేసుకున్నాడు. 25 బంతుల్లోనే అతని హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆఖరి 5 ఓవర్లలో జట్టు 78 పరుగులు సాధించింది. టపటపా... ఛేదనలో రైజర్స్ ఇన్నింగ్స్ పేలవంగా మొదలైంది. తొలి 13 బంతుల్లోనే హెడ్ (4), అభిషేక్ శర్మ (2), ఇషాన్ కిషన్ (2) వెనుదిరిగారు. ఆ తర్వాత నితీశ్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా పేలవ షాట్ ఆడి అవుట్ కాగా, కమిందు మెండిస్ (20 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఎక్కువసేపు నిలవలేదు. క్లాసెన్ కొద్దిసేపు పోరాడినా అది ఏమాత్రం సరిపోలేదు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) అన్సారీ (బి) కమిన్స్ 1; నరైన్ (సి) క్లాసెన్ (బి) షమీ 7; రహానే (సి) క్లాసెన్ (బి) అన్సారీ 38; రఘువంశీ (సి) హర్షల్ (బి) మెండిస్ 50; వెంకటేశ్ (సి) అనికేత్ (బి) హర్షల్ 60; రింకూ సింగ్ (నాటౌట్) 32; రసెల్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–14, 2–16, 3–97, 4–106, 5–197, 6–200. బౌలింగ్: షమీ 4–0–29–1, కమిన్స్ 4–0–44–1, సిమర్జీత్ సింగ్ 4–0–47–0, జీషాన్ అన్సారీ 3–0–25–1, హర్షల్ 4–0–43–1, కమిందు మెండిస్ 1–0–4–1 సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) రాణా (బి) వైభవ్ అరోరా 4; అభిషేక్ (సి) వెంకటేశ్ (బి) రాణా 2; ఇషాన్ కిషన్ (సి) రహానే (బి) వైభవ్ అరోరా 2; నితీశ్ రెడ్డి (సి) నరైన్ (బి) రసెల్ 19; కమిందు (సి) (సబ్) అనుకూల్ (బి) నరైన్ 27; క్లాసెన్ (సి) మొయిన్ అలీ (బి) వైభవ్ అరోరా 33; అనికేత్ (సి) వెంకటేశ్ (బి) వరుణ్ 6; కమిన్స్ (సి) రాణా (బి) వరుణ్ 14; హర్షల్ (సి అండ్ బి) రసెల్ 3, సిమర్జీత్ (బి) వరుణ్ 0; షమీ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (16.4 ఓవర్లలో ఆలౌట్) 120. వికెట్ల పతనం: 1–4, 2–9, 3–9, 4–44, 5–66, 6–75, 7–112, 8–114, 9–114, 10–120. బౌలింగ్: వైభవ్ అరోరా 4–1–29–3, హర్షిత్ రాణా 3–0–15–1, వరుణ్ చక్రవర్తి 4–0–22–3, ఆండ్రీ రసెల్ 1.4–0–21–2, నరైన్ 4–0–30–1. ఐపీఎల్లో నేడులక్నో X ముంబై వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: తీరు మారని ఎస్ఆర్హెచ్.. ఓటముల్లో హ్యాట్రిక్
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటుమల పరంపర కొనసాగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ సన్‌రైజర్స్ ప్లేయర్లు తేలిపోయారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కోత్కతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(50), రింకూ సింగ్(32), రహానే(38) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమ్మిన్స్, షమీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ తలా వికెట్ సాధించారు.చేతులేత్తేసిన బ్యాటర్లు..అనంతరం 201 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఎస్ఆర్హెచ్ 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(33), మెండిస్(27) పర్వాలేదన్పించగా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ(2), హెడ్(4), ఇషాన్ కిషన్(2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, వరుణ్ చక్రవర్తి తలా మూడు వికెట్లు సాధించగా.. రస్సెల్ రెండు, హర్షిత్ రాణా, నరైన్ ఒక్క వికెట్ సాధించారు. ఈ మెగా టోర్నీలో ఎస్ఆర్హెచ్కు వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. -
ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన కేకేఆర్..
KKR vs SRH Live Updates: ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి..ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 201 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఎస్ఆర్హెచ్ 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(33), మెండిస్(27) పర్వాలేదన్పించగా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ(2), హెడ్(4), ఇషాన్ కిషన్(2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, వరుణ్ చక్రవర్తి తలా మూడు వికెట్లు సాధించగా.. రస్సెల్ రెండు, హర్షిత్ రాణా, నరైన్ ఒక్క వికెట్ సాధించారు. ఈ మెగా టోర్నీలో ఎస్ఆర్హెచ్కు వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్‌హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన క్లాసెన్.. వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్..7 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజులో ప్యాట్ కమ్మిన్స్(14), హర్షల్ పటేల్(1) ఉన్నారు.12 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 84/612 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 6 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(13), ప్యాట్ కమ్మిన్స్(6) ఉన్నారు.ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ డౌన్‌నితీశ్ కుమార్ రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన నితీశ్ కుమార.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.7 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో కమిందు మెండిస్(22), క్లాసెన్(1) ఉన్నారు.కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 9 పరుగులకే 3 వికెట్లుకష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 9 పరుగులకే 3 వికెట్లు 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ తడబడుతోంది. కేవలం 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ట్రావిస్ హెడ్(4), ఇషాన్ కిషన్(2), అభిషేక్ శర్మ(2) తీవ్ర నిరాశపరిచారు. ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ ఆరోరా రెండు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా ఓ వికెట్ సాధించారు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్.. హెడ్ ఔట్201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు భారీ షాక్ తగిలింది. 4 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. తొలి ఓవర్లోనే వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ వచ్చాడు.చెలరేగిన కేకేఆర్ బ్యాటర్లు.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ ఎంతంటే?ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కోత్కతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(50), రింకూ సింగ్(32), రహానే(38) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమ్మిన్స్, షమీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ తలా వికెట్ సాధించారు.దూకుడుగా ఆడుతున్న కేకేఆర్..17 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(20), రింకూ సింగ్(24) ఉన్నారు.కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్‌రఘువన్షి రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన రఘువన్షి.. కమిందు మెండిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్(5), రింకూ సింగ్(3) ఉన్నారు.కేకేఆర్ మూడో వికెట్.. రహానే ఔట్‌అజింక్య రహానే రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన రహానే.. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో రఘువన్షి(49), వెంకటేష్ అయ్యర్(1) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న రహానే, రఘువంశీఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ నిలకడగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో అంగ్క్రిష్ రఘువంశీ(26), అజింక్య రహానే(29) ఉన్నారు.కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో క్వింటన్ డికాక్(1) ఔట్ కాగా.. రెండో ఓవర్లో మహ్మద్ షమీ బౌలింగ్‌లో సునీల్ నరైన్(7) ఔటయ్యాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో రహానే(1), రఘువంశీ(1) ఉన్నారు.ఐపీఎల్-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. తుది జట్టులోకి కమిందు మెండిస్, సిమర్జీత్ సింగ్ వచ్చారు.తుది జట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), కమిందు మెండిస్, సిమర్జీత్ సింగ్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ.కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి -
SRH vs KKR: గెలుపు బాటలోకి ఎవరో!
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో తిరిగి గెలుపు బాట పట్టేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు సిద్ధమవుతున్నాయి. తొలి పోరులో భారీ బాదుడుతో రికార్డులు తిరగరాసిన రైజర్స్... ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో దాన్ని కొనసాగించలేకపోయింది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న పోరులో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను సన్‌రైజర్స్ ఢీకొంటుంది. బ్యాటింగ్ లైనప్ హిట్టర్లతో దట్టంగా ఉన్నప్పటికీ... టాపార్డర్ నిలకడలేమి హైదరాబాద్ జట్టును ఇబ్బంది పెడుతోంది. రాజస్తాన్ రాయల్స్‌తో మొదటి మ్యాచ్‌లో గెలిచిన ఆరెంజ్ ఆర్మీమ... ఆ తర్వాత వరుసగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడింది. 3 మ్యాచ్‌లాడి 2 పాయింట్లతో ఉన్న రైజర్స్ ఎనిమిదో స్థానంలో ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నా... వారంతా సమష్టిగా రాణించలేకపోవడమే ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు కోల్‌కతా జట్టు పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆ జట్టు... స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమవుతోంది. ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లోనే గెలిచి, రెండింటిలో ఓడిన కేకేఆర్ 2 పాయింట్లతో పట్టిక అట్టడుగున ఉంది. గత సీజన్లో ఈ రెండు జట్ల మధ్యే జరిగిన ఫైనల్లో కోల్‌కతా గెలిచి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకోగా... దానికి బదులు తీర్చుకోవాలని ఆరెంజ్ ఆర్మీ ప్రణాళికలు రచిస్తోంది. కలిసికట్టుగా కదంతొక్కితేనే... ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్... ఇలా చెప్పుకుంటూ పోతే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. ఎలాంటి బౌలింగ్ దాడినైనా దంచికొట్టగల సామర్థ్యం రైజర్స్ బ్యాటర్ల సొంతం. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇది నిరూపితమైంది. అయితే వీరంతా కలిసికట్టుగా రాణించాల్సిన అవసరముంది. రైజర్స్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే అజేయ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్... తర్వాతి 2 మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా... ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి తొలి రెండు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించాడు. అభిషేక్ శర్మ నుంచి మెరుపులు కరువు కాగా.. క్లాసెన్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. అంచనాలు లేకుండా సీజన్ ఆరంభించిన అనికేత్ వర్మ ధాటిగా ఆడుతుండటం రైజర్స్‌కు కలిసి వస్తోంది. నైట్ రైడర్స్ ప్రధాన బలమైన స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటే మరోసారి భారీ స్కోర్లు ఖాయమే. ప్యాట్ కమిన్స్, షమీ, హర్షల్ పటేల్ బౌలింగ్ భారం మోయనున్నారు. బెంగాల్ తరఫున ఈ మైదానంలో లెక్కకు మిక్కిలి దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన షమీ కీలకం కానున్నాడు. స్పిన్నర్ల బలంతోనే... గతేడాది వేలంలో కోల్‌కతా వదిలేసుకున్న ప్రధాన ఆటగాళ్లంతా వేర్వేరు ఫ్రాంఛైజీల తరఫున రాణిస్తుంటే... కేకేఆర్ మాత్రం లయ అందిపుచ్చుకోలేక ఇబ్బంది పడుతోంది. సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే కెపె్టన్సీలో స్పిన్నే బలంగా నైట్‌రైడర్స్ బరిలోకి దిగుతోంది. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, మొయిన్ అలీలపై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. డికాక్, రఘువంశీ, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్‌తో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నా... వీరంతా ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన డికాక్... ముంబైతో పోరులో తేలిపోయాడు. ఇక భారీ ధర పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్ అయ్యర్ నుంచి ఆ జట్టు మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. రింకూ సింగ్, రసెల్ ఫినిషర్లుగా విఫలమవుతుండటం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. బౌలింగ్‌లో హర్షిత్ రాణా తప్ప చెప్పుకోదగ్గ పేసర్ లేకపోవడం కూడా కేకేఆర్‌కు ప్రతిబంధకమే కాగా... స్పిన్ యూనిట్ మాత్రం బలంగా ఉంది. మరి సొంతగడ్డపై కేకేఆర్ స్పిన్నర్లు చెలరేగుతారా లేక రైజర్స్ బ్యాటర్లు దుమ్మురేపుతారా చూడాలి! తుది జట్లు (అంచనా) సన్‌రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్ ), హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, షమీ, సిమర్జీత్ సింగ్, జంపా. కోల్‌కతా నైట్‌రైడర్స్: రహానే (కెప్టెన్ ), డికాక్, నరైన్, రఘువంశీ, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.28 ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు. 19 మ్యాచ్‌ల్లో నైట్‌రైడర్స్ గెలుపొందగా... 9 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ విజయం సాధించింది. -
IPL 2025: ముంబై బోణీ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ జట్టు 18వ సీజన్లో గెలుపు బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో సోమవారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఎడంచేతి వాటం యువ పేస్ బౌలర్ అశ్వని కుమార్ ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లో చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టాడు. పంజాబ్‌కు చెందిన అశ్వని తన ప్రతిభతో ముంబై జట్టుకు ఈ సీజన్లో తొలి విజయాన్ని అందించాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 16.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. 23 ఏళ్ల అశ్వని 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. కోల్‌కతాను తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు. అనంతరం ముంబై ఇండియన్స్ జట్టు ఆద్యంతం దూకుడుగా ఆడింది. కేవలం 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్ ఆటతీరుతో అజేయ అర్ధ సెంచరీ సాధించాడు. ముంబై గెలుపుతో ప్రస్తుత సీజన్లో మొత్తం 10 జట్లూ పాయింట్ల ఖాతా తెరిచినట్టయింది. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి భారతీయ బౌలర్‌గా ఘనత వహించిన అశ్వని కుమార్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. తడబడుతూనే... కోల్‌కతాకు శుభారంభం లభించలేదు. తొలి ఓవర్లో నరైన్ (0)ను బౌల్ట్ డకౌట్ చేయగా... రెండో ఓవర్లో డికాక్ (1)ను దీపక్ చహర్ పెవిలియన్‌కు పంపించాడు. మూడో ఓవర్లో అశ్వని తాను వేసిన తొలి బంతికే కెప్టెన్ రహానేను అవుట్ చేశాడు. అశ్వని వేసిన వైడ్ బంతిని రహానే వేటాడి భారీ షాట్ ఆడగా... డీప్ మిడ్‌వికెట్ వద్ద తిలక్ వర్మ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దాంతో కోల్‌కతా 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోల్‌కతాను ఆదుకుంటాడని భావించి వెంకటేశ్ అయ్యర్ (3) మళ్లీ నిరాశపరచగా... క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడిన రఘువంశీ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) పాండ్యా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దాంతో 7 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా సగంజట్టు పెవిలియన్ చేరింది. ఈ దశలో ఆరో వికెట్‌కు 29 పరుగులు జోడించి... క్రీజులో నిలదొక్కుకున్నట్లు కనిపించిన రింకూ సింగ్ (14 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్), మనీశ్ పాండే (14 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్)లను అశ్వని ఒకే ఓవర్లో అవుట్ చేయడంతో కోల్‌కతా కోలుకోలేకపోయింది. చివరి ఆశాకిరణం రసెల్ (5)ను అశ్వని 13వ ఓవర్లో బౌల్డ్ చేయడంతో కోల్‌కతా స్కోరు 100 దాటుతుందా లేదా అనుమానం కలిగింది. అయితే రమణ్‌దీప్ సింగ్ (12 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) పుణ్యమాని కోల్‌కతా స్కోరు వంద దాటింది. 17వ ఓవర్లో చివరి వికెట్‌గా రమణ్‌దీప్ వెనుదిరగడంతో కోల్‌కతా ఇన్నింగ్స్ ముగిసింది. రోహిత్ విఫలం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ శర్మ (12 బంతుల్లో 13; 1 సిక్స్) తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. రోహిత్ అవుటైనా మరోవైపు రికెల్టన్ తన ధాటిని కొనసాగించడంతో ముంబైకు ఏ దశలోనూ ఇబ్బంది కాలేదు. విల్ జాక్స్ (17 బంతుల్లో 16; 1 సిక్స్)తో రికెల్టన్ రెండో వికెట్‌కు 45 పరుగులు జోడించాడు. జాక్స్ అవుటయ్యాక వచ్చిన సూర్యకుమార్ (9 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో 13వ ఓవర్లోనే ముంబైను లక్ష్యానికి చేర్చాడు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: క్వింటన్ డికాక్ (సి) అశ్వని కుమార్ (బి) దీపక్ చహర్ 1; సునీల్ నరైన్ (బి) బౌల్ట్ 0; అజింక్య రహానే (సి) తిలక్ వర్మ (బి) అశ్వని కుమార్ 11; అంగ్క్రిష్ రఘువంశీ (సి) నమన్ ధీర్ (బి) హార్దిక్ పాండ్యా 26; వెంకటేశ్ అయ్యర్ (సి) రికెల్టన్ (బి) దీపక్ చహర్ 3; రింకూ సింగ్ (సి) నమన్ ధీర్ (బి) అశ్వని కుమార్ 17; మనీశ్ పాండే (బి) అశ్వని కుమార్ 19; ఆండ్రీ రసెల్ (బి) అశ్వని కుమార్ 5; రమణ్‌దీప్ సింగ్ (సి) హార్దిక్ పాండ్యా (బి) సాంట్నెర్ 22; హర్షిత్ రాణా (సి) నమన్ ధీర్ (బి) విఘ్నేశ్ 4; స్పెన్సర్ జాన్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (16.2 ఓవర్లలో ఆలౌట్) 116. వికెట్ల పతనం: 1–1, 2–2, 3–25, 4–41, 5–45, 6–74, 7–80, 8–88, 9–99, 10–116. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4–0–23–1, దీపక్ చహర్ 2–0–19–2, అశ్వని కుమార్ 3–0–24–4, హార్దిక్ పాండ్యా 2–0–10–1, విఘ్నేశ్ పుథుర్ 2–0–21–1, మిచెల్ సాంట్నెర్ 3.2–0–17–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) హర్షిత్ రాణా (బి) రసెల్ 13; రికెల్టన్ (నాటౌట్) 62; విల్ జాక్స్ (సి) రహానే (బి) రసెల్ 16; సూర్యకుమార్ యాదవ్ (నాటౌట్) 27; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (12.5 ఓవర్లలో 2 వికెట్లకు) 121. వికెట్ల పతనం: 1–46, 2–91. బౌలింగ్: స్పెన్సర్ జాన్సన్ 2–0–14–0, హర్షిత్ రాణా 2–0–28–0, వరుణ్ చక్రవర్తి 3–0–12–0, రసెల్ 2.5–0–35–2, సునీల్ నరైన్ 3–0–32–0. -
రికెల్టన్, సూర్య మెరుపులు.. బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వాఖండే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(40 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖరిలో సూర్యకుమార్ యాదవ్(7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. రోహిత్ శర్మ(13) మరోసారి నిరాశపరిచాడు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు. నాలుగేసిన అశ్వినీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. ముంబై ఇండియన్స్ బౌలర్ల దాటికి కేవలం 16.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో అరంగేట్ర పేసర్ అశ్వినీ కుమార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. దీపక్ చాహర్ రెండు, బౌల్ట్, శాంట్నర్, హార్దిక్, విఘ్నేష్ తలా వికెట్ సాధించారు. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(26) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: IPL 2025: ఐపీఎల్ అరంగేట్రంలోనే సరికొత్త చరిత్ర.. ఎవరీ అశ్వినీ కుమార్? -
ఐపీఎల్ అరంగేట్రంలోనే సరికొత్త చరిత్ర.. ఎవరీ అశ్వినీ కుమార్?
ముంబై ఇండియన్స్ మరో యువ సంచలానాన్ని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన యువ పేస్ బౌలర్ అశ్వనీ కుమార్.. తన తొలి మ్యాచ్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2025లో భాగంగా వాఖండే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అశ్వనీ కుమార్ నిప్పలు చేరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో కేకేఆర్ బ్యాటర్లను చుక్కలు చూపించాడు. రహానే, రింకూ సింగ్, రస్సెల్ వంటి స్టార్ బ్యాటర్లను ఈ యువ పేసర్ బోల్తా కొట్టించాడు. తన తొలి బంతికే కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానేను ఔట్ చేసి తన డెబ్యూను ఘనంగా చాటుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్వినీ కుమార్.. కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఎవరీ అశ్వినీ కుమార్ అని నెటిజన్లు తెగవేతికేస్తున్నారు.ఎవరీ అశ్వినీ కుమార్..?అశ్వనీ కుమార్ పంజాబ్‌కు చెందిన ఎడమచేతి వాటం పేసర్. 23 ఏళ్ల అశ్వనీ కుమార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పంజాబ్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడికి అద్భుతమైన యార్కర్లు, బౌన్సర్లు వేసే సత్తా ఉంది. డెత్ బౌలింగ్‌లో కూడా అతడు రాణించగలడు. గతేడాది పంజాబ్ వేదికగా జరిగిన షేర్ ఈ పంజాబ్ టీ20 ట్రోఫీలో అశ్వనీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో ముంబై ఇండియన్స్ సౌట్ల దృష్టిలో పడ్డాడు. ఈ టోర్నీలో డెత్ బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 మెగా వేలంలో అశ్వని కుమార్‌ను ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. గత ఏడాది ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నప్పటికీ అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అశ్విని కుమార్ 2022లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరపున టీ20 అరంగేట్రం చేశాడు. ఆ టోర్నీలో 4 టీ20లు ఆడి మూడు వికెట్లు పడగొట్టాడు. అశ్వనీ పంజాబ్ తరపున 2 ఫస్ట్-క్లాస్, 4 లిస్ట్-ఎ మ్యాచ్‌లు కూడా ఆడాడు.👉ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో చెలరేగిన అశ్వినీ కుమార్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టిన ఫస్ట్ ఇండియన్ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా అరంగేట్రంలో ముంబై ఇండియన్స్ తరుపన తొలి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్‌గా అశ్వినీ నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో అల్జారీ జోషఫ్ ఉన్నాడు.చదవండి: PAK vs NZ: 'వారిని బూట్లతో కొట్టాలి.. పాక్ క్రికెట్‌ను నాశనం చేశారు' -
కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్..
MI vs KKR live Updates And highlights: ఐపీఎల్-2025లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్..ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వాఖండే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(40 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖరిలో సూర్యకుమార్ యాదవ్(7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.దూకుడుగా ఆడుతున్న రికెల్టన్10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో ర్యాన్ రికెల్టన్(45), విల్ జాక్స్(12) ఉన్నారు.ముంబై ఇండియన్స్ తొలి వికెట్ డౌన్..రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజులో రికెల్టన్(31), విల్ జాక్స్(8) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ముంబై ఓపెనర్లుముంబై ఇండియన్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. క్రీజులో రికెల్టన్(29), రోహిత్ శర్మ(13) ఉన్నారు.2 ఓవర్లకు ముంబై స్కోర్: 15/02 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(12), రికెల్టన్(1) ఉన్నారు.116 పరుగులకే 10 వికెట్లు..16.2 ఓవర్లో శాంట్నర్ బౌలింగ్‌లో రమణ్ దీప్ సింగ్ వికెట్ కోల్పోయాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 117పరుగులు చేయాల్సి ఉంది. 97 పరుగులకే 9 వికెట్లు.. హర్షిత్ రాణా ఔట్97 పరుగుల వద్ద కేకేఆర్ తన తొమ్మిదవ వికెట్‌ను కోల్పోయింది. హర్షిత్ రాణా (4) పరుగులకే ఔటయ్యాడు. విఘ్నేష్ వేసిన 14వ ఓవర్లో పెవీలియన్ బాట పట్టాడు. 88 పరుగులకే 8 వికెట్లు.. రసెల్ ఔట్88 పరుగుల వద్ద కేకేఆర్ తన ఎనిమిదో వికెట్ ను కోల్పోయింది. రసెల్(5) ఔటయ్యాడు. అశ్వనీ కుమార్ వేసిన 13 ఓవర్ లో రసెల్ పెవిలియన్ చేరాడు. అశ్వనీ కుమార్ వేసిన ఆ ఓవర్ నాల్గో బంతికి రసెల్ బౌల్డ్ అయ్యాడు.80 పరుగులకే 7 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో కేకేఆర్రింకూ సింగ్(17), మనీష్ పాండే(19)లు వరుసగా పెవిలియన్ చేరారు. అశ్వనీ కుమార్ వేసిన 11 ఓవర్ లో వీరిద్దరూ పెవిలియన్ చేరారు. 11 ఓవర్ మూడో బంతికి రింకూ సింగ్ అవుట్ కాగా, ఆ ఓవర్ చివరి బంతికి పాండే పెవిలియన్ చేరాడు.కష్టాల్లో కేకేఆర్.. 45 పరుగులకే 5 వికెట్లు ముంబై ఇండియన్స్ బౌలర్లు నిప్పులు చేరుగుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. 45 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రఘువంశీ(26) రూపంలో కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది.కేకేఆర్ మూడో వికెట్ డౌన్..ముంబై ఇండియన్స్ బౌలర్లు నిప్పులు చేరుగుతున్నారు. అజింక్య రహానే రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రహానే.. అశ్వని కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది.కేకేఆర్ రెండో వికెట్ డౌన్..క్వింటన్ డికాక్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన డికాక్.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 26 పరుగులు చేసింది. క్రీజులోకి రఘువన్షి(9), అజింక్య రహానే(12) ఉన్నారు.కేకేఆర్ తొలి వికెట్ డౌన్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే బిగ్‌షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో సునీల్ నరైన్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి అజింక్య రహానే వచ్చాడు.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే (కెప్టెన్), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ పుత్తూర్. -
ఐపీఎల్-2025లో నేడు (మార్చి 31) బిగ్ ఫైట్.. ముంబై ఇండియన్స్ ఖాతా తెరిచేనా..?
ఐపీఎల్-2025లో ఇవాళ (మార్చి 31) బిగ్ ఫైట్ జరుగనుంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ వారి సొంత మైదానం వాంఖడేలో ఢీకొట్టనుంది. ఈ సీజన్లో ఇంకా బోణీ కొట్టని ముంబై ఇండియన్స్ సొంత అభిమానుల మధ్య ఖాతా తెరవాలని పట్టుదలగా ఉంది. ఎంఐ తొలి రెండు మ్యాచ్‌ల్లో సీఎస్కే, గుజరాత్ చేతుల్లో పరాజయంపాలైంది. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు సీజన్‌ను ఓటమితో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో చిత్తైంది. రెండు మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఘన విజయం సాధించి బోణీ కొట్టింది.హెడ్ టు హెడ్ రికార్డ్స్..కేకేఆర్‌పై ముంబైకు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ రెండు జట్లు తలపడిన 34 సందర్భాల్లో 23 సార్లు ముంబై విజయం సాధించింది. కేవలం 11 మ్యాచ్‌ల్లో మాత్రమే కేకేఆర్ గెలుపొందింది. అయితే ఇరు జట్లు చివరిగా తలపడిన 6 సందర్భాల్లో మాత్రం కేకేఆర్ 5 సార్లు జయకేతనం ఎగురవేసింది. చివరిగా వాంఖడేలో తలపడిన మ్యాచ్‌లో కూడా కేకేఆర్‌నే విజయం వరించింది. 12 ఏళ్ల తర్వాత కేకేఆర్ ముంబైని వారి సొంత ప్రేక్షకుల మధ్య ఓడించింది.బలాబలాల విషయానికొస్తే.. ఈ సీజన్లో ఇరు జట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇరు జట్లలో భారీ హైప్ ఉన్న ఆటగాళ్లు ఉన్నా ఫలితం కనిపించడం లేదు. ముంబైతో పోలిస్తే కేకేఆర్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఓ మ్యాచ్ కూడా గెలిచింది.బ్యాటింగ్‌నే ప్రధాన ఆయుధంగా నమ్ముకున్న ముంబై ఇండియన్స్‌ను ఆ జట్టు బ్యాటర్లు పూర్తిగా నిరాశపరుస్తున్నారు. రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నారు. బౌలింగ్‌లో హార్దిక్ గత మ్యాచ్‌లో పర్వాలేదనిపించినా బ్యాటర్‌గా తేలిపోయాడు. నమన్ ధీర్ గత సీజన్లో వచ్చిన హైప్‌ను రీచ్ కాలేదు. యువ ఆటగాడు రాబిన్ మింజ్‌కు అవకాశాలిస్తే రెండు మ్యాచ్‌ల్లో తేలిపోయాడు. బ్యాటర్‌గా దీపక్ చాహర్ తొలి మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. బ్యాటర్‌గా సత్తా చాటేందుకు మిచెల్ సాంట్నర్‌కు సరైన అవకాశం లభించలేదు. బౌలింగ్ విషయానికొస్తే.. బౌల్ట్, సాంట్నర్ స్థాయికి తగ్గట్టు రాణించలేదు. దీపక్ చాహర్ పర్వాలేదనిస్తున్నాడు. ఆంధ్ర కుర్రాడు సత్యనారాయణ రాజు తేలిపోయాడు. తొలి మ్యాచ్‌లో విజ్ఞేశ్ పుతుర్ అద్భుతంగా బౌలింగ్ చేసినా రెండో మ్యాచ్‌లో అతన్ని ఆడించలేదు.కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టుకు కూడా బ్యాటింగే ప్రధాన బలం. బౌలింగ్ డిపార్ట్మెంట్లో వరుణ్ చక్రవర్తి కాస్త అనుభవజ్ఞుడిలా కనిపిస్తాడు. తొలి మ్యాచ్‌లో బ్యాట్‌తో, బంతితో సత్తా చాటిన సునీల్ నరైన్ అస్వస్థత కారణంగా రెండో మ్యాచ్ ఆడలేదు. తొలి మ్యాచ్‌లో అర్ద సెంచరీతో రాణించిన రహానే రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డికాక్ సెంచరీకి చేరువై ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. డికాక్ ఫామ్‌లోకి రావడం కేకేఆర్‌కు శుభసూచకం. రాయల్స్‌తో మ్యాచ్‌లో నరైన్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన మొయిన్ అలీ బంతితో సత్తా చాటాడు. వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్‌లు తమపై పెట్టిన పెట్టుబడికి న్యాయం చేయలేకపోతున్నారు. రసెల్, రమన్‌దీప్‌కు సరైన అవకాశాలు రావాల్సి ఉంది. బౌలింగ్‌లో స్పెన్సర్ జాన్సన్ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. యువ పేసర్లు హర్షిత్ రాణా, వైభవ్ అరోరా పర్వాలేదనిపించారు.నేటి మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు రాణిస్తే ఆ జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. అయితే ముంబైని వారి సొంత ఇలాకాలో ఓడించడం అంత ఈజీ కాదు. రోహిత్, సూర్యకుమార్ చెలరేగితే ముంబైకి పట్టపగ్గాలు ఉండవు.తుది జట్లు (అంచనా)..ముంబై: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుతుర్, సత్యనారాయణ రాజుకేకేఆర్: క్వింటన్ డి కాక్, వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, సునీల్ నరైన్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ,అంగ్క్రిష్ రఘువంశీ -
RR VS KKR: మొయిన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.. క్రెడిట్ బౌలర్లకే దక్కుతుంది: రహానే
ధనాధన్ బ్యాటింగ్ విన్యాసాలతో తొలి ఐదు రోజులు జోరుగా సాగిన ఐపీఎల్ 2025 ఆరో రోజు చప్పబడింది. గౌహతి వేదికగా కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నిన్న (మార్చి 26) జరిగిన మ్యాచ్ పేలగా సాగింది. ఛేదనలో కేకేఆర్ ఓపెనర్ డికాక్ (61 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్ ఆడినా మ్యాచ్‌లో అంత మజా రాలేదు. మ్యాచ్ ఏకపక్షంగా సాగడంతో అభిమానులు బోర్ ఫీలయ్యారు. మ్యాచ్ ఇంత చప్పగా సాగడానికి పిచ్‌తో పాటు గౌహతిలో వాతావరణం కారణం. పిచ్ నుండి బ్యాటర్లకు పెద్దగా సహకారం లభించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపింది. మొత్తంగా రాయల్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ సునాయాసంగా ఛేదించింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. కేకేఆర్ బౌలర్లు రెచ్చిపోవడంతో అతి కష్టం మీద 151 పరుగులు చేసింది (9 వికెట్ల నష్టానికి). మొయిన్ అలీ (4-0-23-2), వరుణ్ చక్రవర్తి (4-0-17-2), హర్షిత్ రాణా (4-0-36-2), వైభవ్ అరోరా (4-0-33-2) రాయల్స్ బ్యాటర్లను బాగా కట్టడి చేశారు. స్పిన్నర్లు మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి ఆదిలోనే వికెట్లు తీసి రాయల్స్‌పై ఒత్తిడి తెచ్చారు. ఓ దశలో రాయల్స్ కనీసం 120 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఎలాగో ముక్కిమూలిగి చివరికి 150 పరుగుల మార్కును తాకగలిగింది. రాయల్స్ బ్యాటర్లలో ధృవ్ జురెల్ (33) టాప్ స్కోరర్‌గా కాగా.. జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 25, సంజూ శాంసన్ 13, జోఫ్రా ఆర్చర్ 16 పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో కేకేఆర్ కూడా నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. పవర్ ప్లేలో ఆ జట్టు 41 పరుగులు మాత్రమే చేసిన ఓపెనర్‌గా వచ్చిన మొయిన్ అలీ (12 బంతుల్లో 5) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ డికాక్ బాధ్యతాయుతంగా ఆడి, కెప్టెన్ రహానే (18), రఘువంశీ (22 నాటౌట్) సహకారంతో కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. కేకేఆర్ మరో 15 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో (కేకేఆర్ బ్యాటింగ్ చేస్తుండగా) మంచు ప్రభావం కారణంగా రాయల్స్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆ జట్టు తరఫున హసరంగ ఒక్కడే వికెట్ (రహానే) తీయగలిగాడు. మొయిన్ అలీ రనౌటయ్యాడు.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ ఇలా అన్నాడు. తొలి ఆరు ఓవర్లలో మేము బాగా బౌలింగ్ చేసాము. మిడిల్ ఓవర్లు కూడా కీలకమైనవే. స్పిన్నర్లు పరిస్థితులను నియంత్రించిన విధానం బాగుంది. మొయిన్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతను చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఆటగాళ్లు నిర్భయంగా ఆడాలని కోరుకునే ఫార్మాట్ ఇది. వారికి స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటున్నాము.క్రెడిట్ మా బౌలింగ్ యూనిట్‌కు దక్కుతుంది. వారు ప్రతి బంతికి వికెట్ తీయాలనే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మొయిన్. మొయిన్ ఓ నాణ్యమైన ఆల్‌రౌండర్. గతంలో కూడా అతను ఓపెనింగ్ చేశాడు. బ్యాట్‌తో అతను ఆశించిన సఫలత సాధించలేకపోయినా.. బంతితో రాణించిన విధానం పట్ల సంతోషంగా ఉంది. ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాగా, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో భంగపడ్డ విషయం తెలిసిందే. కేకేఆర్ నెక్స్ట్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఢీకొటుంది. ఈ మ్యాచ్ మార్చి 31న వాంఖడేలో జరుగనుంది. -
KKR Vs RR: డికాక్ ధమాకా
ఐపీఎల్లో పరుగుల వరద పారిన రెండు వరుస మ్యాచ్‌ల తర్వాత ఆ జోరుకు కాస్త విరామం. పొడిగా, బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని పిచ్‌పై సాగిన మ్యాచ్‌లో సీజన్లో తక్కువ స్కోరు నమోదు కాగా, డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) పైచేయి సాధించి తొలి విజయాన్ని నమోదు చేసింది. వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ కట్టుదిట్టమైన స్పిన్‌తో ముందుగా రాజస్తాన్‌ను నైట్‌రైడర్స్ తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. ఆ తర్వాత డికాక్ దూకుడైన బ్యాటింగ్‌తో లక్ష్యఛేదనను సునాయాసం చేసేశాడు. 15 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ విజయాన్నందుకుంది. అన్ని రంగాల్లో విఫలమైన రాజస్తాన్ రాయల్స్ తమ ‘హోం గ్రౌండ్’లో పేలవ ప్రదర్శనతో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. గువహాటి: డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ ఐపీఎల్ సీజన్లో గెలుపు బోణీ చేసింది. గత మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన నైట్‌రైడర్స్ బుధవారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ధ్రువ్ జురేల్ (28 బంతుల్లో 33; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, యశస్వి జైస్వాల్ (24 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ (15 బంతుల్లో 25; 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై వరుణ్, మొయిన్ అలీ 8 ఓవర్లలో 40 పరుగులకే 4 వికెట్లు తీసి రాయల్స్‌ను దెబ్బ కొట్టారు. వైభవ్ అరోరా, హర్షిత్ కూడా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం కోల్‌కతా 17.3 ఓవర్లలో 2 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్వింటన్ డికాక్ (61 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. సునీల్ నరైన్ అనారోగ్యం కారణంగా మ్యాచ్‌కు దూరం కావడంతో మొయిన్ అలీకి కోల్‌కతా చోటు కల్పించగా, ఫారుఖీ స్థానంలో రాజస్తాన్ జట్టులోకి హసరంగ వచ్చాడు.సమష్టి వైఫల్యం... రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆసాంతం ఒకే తరహాలో సాదాసీదాగా సాగింది. ఆశించిన స్థాయిలో దూకుడైన బ్యాటింగ్ లేకపోగా, ఒక్కటీ సరైన భాగస్వామ్యం రాలేదు. జైస్వాల్ ధాటిగానే మొదలు పెట్టినా... మరోవైపు సంజు సామ్సన్ (11 బంతుల్లో 13; 2 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేదు. ‘లోకల్ బాయ్’ పరాగ్ తన తొలి 7 బంతుల్లో 2 సిక్సర్లు బాది అభిమానులను ఆకట్టుకున్నాడు. వరుణ్ ఓవర్లోనూ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్స్ బాదిన అతను...అదే ఓవర్లో మరో షాట్‌కు ప్రయత్నించి వెనుదిరగడంతో మైదానంలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత హసరంగ (4)ను ముందుగా పంపిన ప్రయోగం ఫలితం ఇవ్వకపోగా, నితీశ్ రాణా (9 బంతుల్లో 8), శుభమ్ దూబే (12 బంతుల్లో 9; 1 ఫోర్) కూడా విఫలమయ్యారు. 67/1తో మెరుగైన స్థితిలో కనిపించిన రాజస్తాన్ 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి 82/5కి చేరింది. దాంతో ‘ఇంపాక్ట్ సబ్’గా అదనపు బ్యాటర్‌ను శుభమ్ దూబే రూపంలో ఏడో స్థానంలో బరిలోకి దింపింది. అయితే ఒత్తిడిలో అతనూ ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో జురేల్ కొన్ని చక్కటి షాట్లతో జట్టును ఆదుకున్నాడు. హర్షిత్ రాణా వరుస ఓవర్లలో అతను రెండేసి ఫోర్లు కొట్టాడు. అయితే హర్షిత్ తన తర్వాతి ఓవర్లో జురేల్, ప్రమాదకర బ్యాటర్ హెట్‌మైర్ (8 బంతుల్లో 7; 1 ఫోర్)లను వెనక్కి పంపించాడు. చివర్లో ఆర్చర్ (7 బంతుల్లో 16; 2 సిక్స్‌లు) కొట్టిన రెండు సిక్సర్లతో రాజస్తాన్ స్కోరు 150 పరుగులు దాటింది. డికాక్ మెరుపులు... ఛేదనలో డికాక్ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. పవర్‌ప్లేలో జట్టు స్కోరు 40 పరుగులు కాగా, డికాక్ ఒక్కడే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 పరుగులు సాధించాడు. మరోవైపు కేకేఆర్ తరఫున ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన మొయిన్ అలీ (5) రనౌట్ కావడంతో జట్టు మొదటి వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ అజింక్య రహానే (15 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయినా, డికాక్ జోరుతో స్కోరు వేగంగా సాగిపోయింది. 35 బంతుల్లోనే డికాక్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అతనికి గెలుపు దిశగా అంగ్కృష్ రఘువంశీ (17 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) సహకరించాడు. దూకుడు తగ్గించని డికాక్ శతకం దిశగా దూసుకుపోయాడు. చివరి 3 ఓవర్లలో నైట్‌రైడర్స్ విజయానికి 17 పరుగులు, డికాక్ సెంచరీకి 19 పరుగులు అవసరం కాగా, ఆర్చర్ ఓవర్లో డికాక్ ఒక ఫోర్, 2 సిక్స్‌లు బాదినా... చివరకు 97 వద్దే అతను ఆగిపోవాల్సి వచ్చింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) హర్షిత్ రాణా (బి) అలీ 29; సామ్సన్ (బి) అరోరా 13; పరాగ్ (సి) డికాక్ (బి) వరుణ్ 25; నితీశ్ రాణా (బి) అలీ 8; హసరంగ (సి) రహానే (బి) వరుణ్ 4; జురేల్ (బి) హర్షిత్ రాణా 33; శుభమ్ (సి) రసెల్ (బి) అరోరా 9; హెట్‌మైర్ (సి) రఘువంశీ (బి) హర్షిత్ రాణా 7; ఆర్చర్ (బి) జాన్సన్ 16; తీక్షణ (నాటౌట్) 1; తుషార్ దేశ్‌పాండే (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–33, 2–67, 3–69, 4–76, 5–82, 6–110, 7–131, 8–138, 9–149. బౌలింగ్: స్పెన్సర్ జాన్సన్ 4–0–42–1, వైభవ్ అరోరా 4–0–33–2, హర్షిత్ రాణా 4–0–36–2, మొయిన్ అలీ 4–0–23–2, వరుణ్ 4–0–17–2. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: మొయిన్ అలీ (రనౌట్) 5; డికాక్ (నాటౌట్) 97; రహానే (సి) దేశ్‌పాండే (బి) హసరంగ 18; రఘువంశీ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17.3 ఓవర్లలో 2 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–41, 2–70. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 2.3–0–33–0, మహీశ్ తీక్షణ 4–0–32–0, రియాన్ పరాగ్ 4–0–25–0, సందీప్ శర్మ 2–0–11–0, హసరంగ 3–0–34–1, నితీశ్ రాణా 1–0–9–0, తుషార్ 1–0–7–0.ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X లక్నోవేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
KKR Vs RR: డికాక్ వన్ మ్యాన్ షో.. రాజస్తాన్‌ను చిత్తు చేసిన కేకేఆర్
ఐపీఎల్-2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి విజయం సాధించింది. గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపొందింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కోల్‌కతా విజయంలో క్వింటన్ డికాక్ కీలక పాత్ర పోషించాడు.ఓపెనర్‌గా బరిలోకి దిగిన డికాక్ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. 60 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 8ఫోర్లు, 5 సిక్స్‌లతో 97 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రఘువంశీ(22), రహానే(18) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో హసరంగా ఒక్కడే ఓ వికెట్ సాధించగా.. మరో వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది.చెతులేత్తేసిన బ్యాటర్లు..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కేకేఆర్ స్పిన్నర్ల దాటికి రాజస్తాన్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వి జైశ్వాల్(29), రియాన్ పరాగ్(25) పరుగులతో రాణించారు. కాగా రాజస్తాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.చదవండి: IPL 2025: డికాక్ మాస్టర్ మైండ్.. హెల్మెట్‌ను తీసి మరి! వీడియో వైరల్ -
చెలరేగిన డికాక్.. రాజస్తాన్‌పై కేకేఆర్ ఘన విజయం
KKR vs RR Live Updates And Highlights: రాజస్తాన్‌పై కేకేఆర్ ఘన విజయంగౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కోల్‌కతా విజయంలో క్వింటన్ డికాక్ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన డికాక్ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. 61 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 8ఫోర్లు, 5 సిక్స్‌లతో 97 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రఘువంశీ(22), రహానే(18) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో హసరంగా ఒక్కడే ఓ వికెట్ సాధించగా.. మరో వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. 16 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 125/216 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(79), రఘువంశీ(20) పరుగులతో ఉన్నారు.10 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 70/010 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(45), రహానే(18) ఉన్నారు.5 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 35/05 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్ డికాక్(30), మొయిన్ అలీ(4) ఉన్నారు.రాణించిన కేకేఆర్ బౌలర్లు.. గౌహతి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వి జైశ్వాల్(29), రియాన్ పరాగ్(25) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు.17 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 123/617 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో ధ్రువ్ జురెల్(32), హెట్‌మైర్(2) పరుగులతో ఉన్నారు.పీకల్లోతు కష్టాల్లో రాజస్తాన్..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ తడబడుతోంది. కేవలం 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి రాజస్తాన్ కష్టాల్లో పడింది. కేకేఆర్ స్పిన్నర్లు రాజస్తాన్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో ధ్రువ్ జురెల్, శుభమ్ దూబే ఉన్నారు.రాజస్తాన్ మూడో వికెట్ డౌన్యశస్వీ జైశ్వాల్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన జైశ్వాల్.. మెయిన్ అలీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 71/3రాజస్తాన్ రెండో వికెట్ డౌన్..రియాన్ పరాగ్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన పరాగ్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి నితీష్ రాణా వచ్చాడు. 8 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 67/2రాజస్తాన్ తొలి వికెట్ డౌన్..సంజూ శాంసన్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన సంజూ శాంసన్.. వైభవ్ అరోరా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 4 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 34/12 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 14/0టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ రెండో ఓవర్ ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్(7), సంజూ శాంసన్(7) ఉన్నారు.ఐపీఎల్-2025లో సెకెండ్ రౌండ్ మొదలైంది. రెండో రౌండ్ తొలి మ్యాచ్‌లో గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌కు కేకేఆర్ స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్దానంలో మెయిన్ అలీ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు రాజస్తాన్ తుది జట్టులోకి ఫరూఖీ స్ధానంలో హసరంగా వచ్చాడు.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తిరాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ -
ఐపీఎల్-2025లో నేడు (మార్చి 26) మరో బిగ్ ఫైట్.. ఏ జట్టు బోణీ కొడుతుంది..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (మార్చి 26) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్.. రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ సీజన్లో కేకేఆర్, రాయల్స్ తమతమ తొలి మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యాయి. కేకేఆర్.. ఆర్సీబీ చేతిలో, రాయల్స్ సన్‌రైజర్స్ చేతిలో పరాజయం పాలయ్యాయి.డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్ ఆర్సీబీతో మ్యాచ్‌లో తడబడింది. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అంచనాలను అందుకోలేకపోయింది. బ్యాటింగ్‌లో కొత్త కెప్టెన్ అజింక్య రహానే పర్వాలేదనిపించగా.. సునీల్ నరైన్ ఆల్‌రౌండర్‌గా రాణించాడు. డికాక్, వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్ నిరాశపరిచారు. భారీ అంచనాల మధ్యలో బరిలోకి దిగిన వరుణ్ చక్రవర్తి తేలిపోయాడు. ఆర్సీబీ బ్యాటర్లు వరుణ్‌ను ఆటాడుకున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ అరోరా, మరో పేసర్ స్పెన్సర్ జాన్సన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. హర్షిత రాణాను ప్రత్యర్ధి బ్యాటర్లు ఉతికి ఆరేశారు. మొత్తంగా తొలి మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో విఫలమైన కేకేఆర్ నేడు రాయల్స్‌తో జరుగబోయే మ్యాచ్‌లో సత్తా చాటాలని భావిస్తుంది.రాయల్స్ విషయానికొస్తే.. ఈ జట్టు బ్యాటర్లు సన్‌రైజర్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ కూడా సత్తా చాటారు. గాయం కారణంగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్, వికెట్ కీపర్ దృవ్ జురెల్ మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడ్డారు. హెట్‌మైర్, శుభమ్ దూబే కూడా ధనాధన్ బ్యాటింగ్ చేశారు. భారీ అంచనాలకు కలిగిన యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, నితీశ్ రాణా మాత్రం నిరాశపరిచారు. బౌలరల్లో జోఫ్రా ఆర్చర్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అతను 4 ఓవర్లలో ఏకంగా 76 పరుగులిచ్చాడు. ఫజల్ హక్ ఫారూకీ, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే కూడా ఊహించిన దానికంటే ఎక్కువ పరుగులు ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ చిచ్చరపిడుగుల ముందు రాయల్స్ బౌలర్లు తేలిపోయారు. కేకేఆర్‌తో జరుగబోయే నేటి మ్యాచ్‌లో బౌలింగ్ లోపాలను అధిగమించాలని రాయల్స్ భావిస్తుంది.హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికొస్తే.. ఇరు జట్లకు ఇప్పటివరకు 30 మ్యాచ్‌ల్లో తలపడగా.. తలో 14 మ్యాచ్‌లు గెలిచాయి. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇరు జట్ల మధ్య చివరిసారి జరిగిన మ్యాచ్ రద్దైంది. ఆ మ్యాచ్ కూడా నేటి మ్యాచ్ జరుగబోయే గౌహతిలో జరగాల్సి ఉండింది. దీనికి ముందు గత సీజన్లోనే జరిగిన మరో మ్యాచ్‌లో కేకేఆర్ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాయల్స్ చివరి బంతికి ఛేదించింది. ఆ మ్యాచ్‌లో జోస్ బట్లర్ సూపర్ సెంచరీ చేసి రాయల్స్‌ను గెలిపించాడు. అదే మ్యాచ్‌లో కేకేఆర్ తరఫున సునీల్ నరైన్ కూడా శతక్కొట్టాడు. పూర్తి జట్లు..కోల్‌కతా నైట్ రైడర్స్: క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, అజింక్య రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అన్రిచ్ నోర్జే, మనీశ్ పాండే, వైభవ్ అరోరా, అనుకూల్ రాయ్, లవ్నిత్ సిసోడియా, చేతన్ సకారియా, రహ్మానుల్లా గుర్బాజ్, మయాంక్ మార్కండే, రోవ్‌మన్ పావెల్, మొయిన్ అలీరాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్(కెప్టెన్), దృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్హాక్ ఫరూఖీ, సంజూ శాంసన్, కునాల్ సింగ్ రాథోడ్, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ, క్వేనా మఫాకా, వనిందు హసరంగ, యుధ్వీర్ సింగ్ చరక్, అశోక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ -
‘ఇక్కడి నుంచి త్వరగా పారిపో అని విరాట్ సర్ చెప్పారు’
సెలబ్రిటీలను ఆరాధ్య దైవంగా భావించే యువత మన దేశంలో చాలా మందే ఉన్నారు. క్రికెటర్లు, సినీ నటులను చూసేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడతారు. ఈ క్రమంలో.... ఒక్కోసారి తొందరపాటు చర్యలు, అత్యుత్సాహం కారణంగా జైలు పాలుకావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. పద్దెమినిదేళ్ల రితూపర్నో పఖిరా కూడా ఈ కోవకే చెందుతాడు.భారత్‌లో క్రికెట్ కూడా ఓ మతం లాంటిది. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ (Rohit Sharma).. ఇలా టీమిండియా దిగ్గజాలను దేవుళ్లలా భావించే ఫ్యాన్స్ కోకొల్లలు. వారిలో ఒకడే రితూపర్నో. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025 ఆరంభ మ్యాచ్ సందర్భంగా తన అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లిని చూసేందుకు ఈడెన్ గార్డెన్స్‌లోకి దూసుకువచ్చాడు.ఒకరోజు జైలులోఈ రన్‌మెషీన్ పాదాలకు నమస్కరించి.. అతడిని ఆలింగనం చేసుకుని జన్మధన్యమైనట్లు తరించాడు. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న భద్రతా సిబ్బంది పరుగుపరుగున వచ్చి రితూపర్నోను మైదానం నుంచి తీసుకుని వెళ్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి ఒకరోజు జైలులో ఉంచినట్లు సమాచారం. అనంతరం.. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. ఓ షరతు మీద రితూపర్నోకు బెయిల్ మంజూరు చేశారు. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం ఈడెన్ గార్డెన్స్ వైపు వెళ్లకుండా ఉండాలని మెజిస్ట్రేట్ రితూపర్నోకు కండిషన్ విధించారు. PC: BCCI/IPLపశ్చాత్తాపం లేదుఅయితే, అతడి వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు. బెయిలు మీద బయటకు వచ్చిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లి పాదాలను తాకగానే ఆయన నా భుజాలు పట్టుకుని పైకి లేపారు. నా పేరేమిటని అడిగారు.ఇక్కడి నుంచి త్వరగా పారిపో అని చెప్పారు. అంతేకాదు.. నా పట్ల కాస్త సౌమ్యంగా వ్యవహరించాలని భద్రతా సిబ్బందికి చెప్పారు కూడా. నన్ను కొట్టవద్దని వారికి పదే పదే చెప్పారు. ఎలాగైనా ఆరోజు మైదానంలోకి వెళ్లాలని నేను ముందుగానే ప్రణాళికలు రచించుకున్నా.ఈ విషయంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నా దేవుడి పాదాలు తాకే అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నా’’ అని రితూపర్నో చెప్పడాన్ని బట్టి అతడి మానసిక పరిపక్వత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.పెద్ద మనసుతో క్షమించండిఅయితే, రితూపర్నో తల్లి మాత్రం తన కుమారుడు తెలియక చేసిన తప్పును క్షమించాలని న్యాయ వ్యవస్థను వేడుకుంటున్నారు. ‘‘విరాట్ కోహ్లిని ఆరాధిస్తాడు. వాడికి ఆయన దేవుడితో సమానం. అందుకే ఇలాంటి పని చేశాడు.వాడి వయసు, కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని పోలీసులు, న్యాయమూర్తి నా కుమారుడి తప్పులను పెద్ద మనసుతో క్షమించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. కాగా రితూపర్నో 12వ ఏట నుంచి జమాల్‌పూర్‌లో ఉన్న నేతాజీ అథ్లెటిక్స్ క్లబ్లో క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కాగా రితూపర్నో మైదానంలోకి దూసుకువచ్చి.. కోహ్లి కాళ్లు మొక్కడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించిన తీరు విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.శుక్లా తీరుపై విమర్శలు‘‘కోహ్లి క్రేజ్ ఇలా ఉంటుంది’’ అని రాజీవ్ శుక్లా ట్వీట్ చేయగా.. ‘‘భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? ఒకవేళ ఆ వ్యక్తి సాధారణ పౌరుడు కాకుండా.. ఓ ఆటంకావాదో అయి ఉంటే కోహ్లి పరిస్థితి ఏమిటి? ఆటగాళ్లకు సరైన భద్రత కల్పించండి. అలాగే ఇలాంటి యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకునేందుకు ఆస్కారం ఇవ్వకండి’’ అని నెటిజన్లు చురకలు అంటించారు.కాగా ఐపీఎల్-2025 కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో అంగరంగ వైభవంగా శనివారం మొదలైంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులతో అజేయంగా నిలిచి బెంగళూరును గెలిపించాడు.ఐపీఎల్-2025: కోల్‌కతా వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు👉కోల్‌కతా- 174/8 (20)👉ఆర్సీబీ- 177/3 (16.2)👉ఫలితం- ఏడు వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఆర్సీబీ గెలుపుచదవండి: విఘ్నేశ్ పుతూర్‌ను ‘సన్మానించిన’ నీతా అంబానీ.. పాదాలకు నమస్కరించిన స్పిన్నర్ -
’పాటిదార్‌ను తక్కువగా అంచనా వేశాను.. రహానే ఆ ట్రిక్ మిస్సయ్యాడు’
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్‌గా టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానేకు శుభారంభం లభించలేదు. అతడి సారథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ తమ తొలి మ్యాచ్‌లోనే ఘోర ఓటమిని చవిచూసింది. ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.ఇక కేకేఆర్ సారథిగా అజింక్య రహానే ఈ మ్యాచ్‌తో తన ప్రయాణం మొదలుపెట్టగా.. ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌కు కూడా ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. అయితే, సీనియర్ అయిన రహానే.. పాటిదార్ పన్నిన వ్యూహాల ముందు తేలిపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్ ఆరంభంలో తాను పాటిదార్‌ను తక్కువగా అంచనా వేశానని.. అయితే, రహానే తన చెత్త నిర్ణయాలతో అతడి ముందు తలవంచాడని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘రజత్ పాటిదార్ కెప్టెన్‌గా రాణించగలడా? అనే సందేహం ఉండేది.కేకేఆర్‌తో మ్యాచ్‌లో తొలి మూడు ఓవర్లు ఆర్సీబీకి బాగానే సాగింది. కానీ నాలుగో ఓవర్లో పాటిదార్.. రసిఖ్ సలామ్‌ను తీసుకువచ్చాడు. ఐదో ఓవర్లో కృనాల్ పాండ్యాను బరిలోకి దించాడు. దయచేసి ఇలా చేయకు పాటిదార్ అని మనసులో అనుకుంటూనే ఉన్నాను.రహానే బ్యాట్‌తో చెలరేగడంతో కేకేఆర్ పది ఓవర్లలో వంద పరుగుల మార్కు అందుకుంది. నిజానికి ఆ జట్టు 200కు పైగా స్కోరు చేయాల్సింది. కానీ పాటిదార్ వ్యూహాలు అప్పుడే పని చేయడం మొదలుపెట్టాయి. తొలి పది ఓవర్లలో పాటిదార్‌కు కెప్టెన్‌గా అసలు మార్కులేమీ వేయలేకపోయాను.నిజానికి ఆర్సీబీ బలహీనత స్పిన్నర్లు. కానీ కృనాల్ సేవలను పాటిదార్ ఉపయోగించుకున్న తీరు అద్బుతం. స్పిన్నర్లనే జట్టుకు బలంగా మార్చాడు. కృనాల్ తొలి ఓవర్లో భారీగా పరుగులు ఇచ్చినా.. తర్వాత మూడు వికెట్లు తీశాడు. సూయశ్ లూజ్ బాల్స్ వేసినా.. రసెల్ రూపంలో కీలక వికెట్ దక్కించుకున్నాడు.దీంతో కేకేఆర్ కనీసం 175 పరుగుల మార్కు కూడా దాటలేకపోయింది. నేను పాటిదార్ గురించి ఏమనుకున్నానో.. అది రహానే విషయంలో నిజమైంది. నిజానికి నరైన్‌ను ఆరంభంలోనే బౌలింగ్ చేయించాల్సింది. ఆర్సీబీ బ్యాటర్లు పరుగులు పిండుకుంటున్నా.. నరైన్‌ను రహానే ఆలస్యంగా పిలిపించడం ప్రభావం చూపింది.రహానే ట్రిక్ మిస్సయ్యాడు. దానిని ఆర్సీబీ క్యాష్ చేసుకుంది. కెప్టెన్‌గా పాటిదార్ హిట్టయితే.. రహానే మాత్రం గతంలో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉన్నా తేలిపోయాడు. ఇక బ్యాటర్‌గానూ పాటిదార్ అదరగొట్టాడు. సునిల్ నరైన్ బౌలింగ్‌లో అతడు మూడు సిక్సర్లు బాదడం మామూలు విషయం కాదు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని నరైన్ బౌలింగ్‌ను చాలాసార్లు ఎదుర్కొన్నారు. అయితే, ముగ్గురూ కలిసి అతడి బౌలింగ్‌లో కేవలం నాలుగు సిక్సర్లే కొట్టారు. అయితే, పాటిదార్ మాత్రం ఇక్కడే తన సుప్రిమసీ చూపించాడు. కెప్టెన్‌గా గొప్ప ఆరంభం అందుకున్నాడు’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు. కాగా రహానే గతంలో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్(ఇప్పుడు లేదు), రాజస్తాన్ రాయల్స్ జట్లకు సారథిగా పనిచేశాడు.ఐపీఎల్-2025: కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లుకేకేఆర్- 174/8 (20)ఆర్సీబీ- 177/3 (16.2)ఫలితం: ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్‌పై ఆర్సీబీ గెలుపు -
ఈడెన్‌లో మెరుపులతో మొదలు
డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త సీజన్‌ను ఓటమితో మొదలు పెట్టింది. సొంతగడ్డ ఈడెన్ గార్డెన్స్‌లో ఆడిన మ్యాచ్‌లోనూ శుభారంభం చేయలేకపోయింది. బ్యాటింగ్‌లో రహానే, నరైన్ మెరుపులతో ఒక దశలో 200 సాధించగలదనిపించిన టీమ్ ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.ఆర్సీబీ బౌలర్లు కేకేఆర్‌ను సరైన సమయంలో నిలువరించడంలో సఫలమయ్యారు. ఆ తర్వాత సాల్ట్, కోహ్లి మెరుపు ఓపెనింగ్‌తో విజయానికి బాటలు వేసుకున్న బెంగళూరు ఆశావహ దృక్పథంతో తమ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. మరో 22 బంతులు మిగిలి ఉండగానే గెలిచిన మ్యాచ్‌తో రజత్ పాటీదార్ కెపె్టన్‌గా శుభారంభం చేశాడు. కోల్‌కతా: ఐపీఎల్ తొలి పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైచేయి సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అజింక్య రహానే (31 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా... సునీల్ నరైన్ (26 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), అంగ్కృష్ రఘువంశీ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. రహానే, నరైన్ రెండో వికెట్‌కు 55 బంతుల్లోనే 103 పరుగులు జోడించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (3/29) కీలక సమయంలో 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం బెంగళూరు 16.2 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లి (36 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా...తొలి సారి కెప్టెన్‌గా వ్యవహరించి రజత్ పాటీదార్ (16 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా దూకుడుగా ఆడాడు. భారీ భాగస్వామ్యం... 10 ఓవర్లలో 107 పరుగులు...ఇన్నింగ్స్ తొలి భాగంలో కోల్‌కతా బ్యాటింగ్ జోరింది. డి కాక్ (4) మొదటి ఓవర్లోనే వెనుదిరిగిన తర్వాత రహానే, నరైన్ కలిసి చెలరేగిపోయారు. సలామ్ ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లు బాదిన రహానే...కృనాల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అదే ఓవర్లో సిక్స్‌తో నరైనా కూడా జత కలిశాడు. దయాళ్ ఓవర్లో కూడా ఇదే తరహాలో రహానే 2 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోయాడు. సుయాశ్ ఓవర్లో సిక్స్‌తో 25 బంతుల్లోనే రహానే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా...చివరి రెండు బంతులను రహానే సిక్స్, ఫోర్‌గా మలిచాడు. సలామ్ తర్వాతి ఓవర్లో కూడా 4, 6 కొట్టిన నరైన్ అదే ఊపులో చివరి బంతికి అవుటయ్యాడు. ఇక్కడే కేకేఆర్ ఇన్నింగ్స్ మలుపు తిరిగింది. ఒక్కసారిగా చెలరేగిన బెంగళూరు బౌలర్లు ప్రత్యర్థిపై పట్టు సాధించారు. 16 పరుగుల తేడాతో రహానే, వెంకటేశ్ అయ్యర్ (6) వెనుదిరగ్గా...ఐదు పరుగుల వ్యవధిలో భారీ హిట్టర్లు రింకూ సింగ్ (12), ఆండ్రీ రసెల్ (4) వికెట్లను జట్టు కోల్పోయింది. దాంతో అంచనాలకు అనుగుణంగా భారీ స్కోరును సాధించలేకపోయింది. దూకుడుగా దూసుకుపోయి... ఛేదనలో బెంగళూరు చెలరేగిపోయింది. ఇన్నింగ్స్ తొలి బంతినే ఫోర్‌గా మలచిన సాల్ట్ ఘనంగా మొదలు పెట్టగా, అతనికి కోహ్లి తోడవడంతో టీమ్ లక్ష్యం దిశగా సునాయాసంగా దూసుకుపోయింది. అరోరా ఓవర్లో సాల్ట్ 2 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టగా, కోహ్లి మరో ఫోర్ బాదడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. నైట్‌రైడర్స్ ఎంతో ఆశలు పెట్టుకున్న వరుణ్ చక్రవర్తికి తొలి ఓవర్లో బాగా దెబ్బ పడింది. వరుస బంతుల్లో సాల్ట్ 4, 6, 4, 4 బాదడంతో పరిస్థితి అంతా ఆర్సీబీకి అనుకూలంగా మారిపోయింది. జాన్సన్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాది తానూ తగ్గలేదని కోహ్లి చూపించగా, 25 బంతుల్లో సాల్ట్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. తక్కువ వ్యవధిలో సాల్ట్, పడిక్కల్ (10) వికెట్లు తీసి కోల్‌కతా కాస్త ఊరట చెందినా...తర్వాత వచ్చిన పాటీదార్ కూడా బౌండరీల వర్షం కురిపించాడు. రాణా ఓవర్లోనే అతను ఏకంగా 4 ఫోర్లు కొట్టడం విశేషం. 30 బంతుల్లో విరాట్ హాఫ్ సెంచరీ సాధించాడు. చివర్లో వరుసగా 6, 4 కొట్టి లివింగ్‌స్టోన్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించాడు. స్కోరు వివరాలుకోల్కాత నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) జితేశ్ (బి) హాజల్‌వుడ్ 4; నరైన్ (సి) జితేశ్ (బి) సలామ్ 44; రహానే (సి) సలామ్ (బి) పాండ్యా 56; వెంకటేశ్ (బి) పాండ్యా 6; రఘువంశీ (సి) జితేశ్ (బి) దయాళ్ 30; రింకూ (బి) పాండ్యా 12; రసెల్ (బి) సుయాశ్ 4; రమణ్‌దీప్ (నాటౌట్) 6; హర్షిత్ (సి) జితేశ్ (బి) హాజల్‌వుడ్ 5; జాన్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–4, 2–107, 3–109, 4–125, 5–145, 6–150, 7–168, 8–173. బౌలింగ్: హాజల్‌వుడ్ 4–0–22–2, యశ్ దయాళ్ 3–0–25–1, రసిఖ్ సలామ్ 3–0–35–1, కృనాల్ పాండ్యా 4–0–29–3, సుయాశ్ శర్మ 4–0–47–1, లివింగ్‌స్టోన్ 2–0–14–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జాన్సన్ (బి) వరుణ్ 56; కోహ్లి (నాటౌట్) 59; పడిక్కల్ (సి) రమణ్‌దీప్ (బి) నరైన్ 10; పటీదార్ (సి) రింకూ (బి) అరోరా 34; లివింగ్‌స్టోన్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (16.2 ఓవర్లలో 3 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–95, 2–118, 3–162. బౌలింగ్: వైభవ్ అరోరా 3–0–42–2, స్పెన్సర్ జాన్సన్ 2.2–0–31–0, వరుణ్ చక్రవర్తి 4–0–43–1 హర్షిత్ రాణా 3–0–32–0, సునీల్ నరైన్ 4–0–27–1. సందడిగా ప్రారంభోత్సవంతొలి మ్యాచ్‌కు ముందు ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు జరిగాయి. షారుఖ్ ఖాన్ వ్యాఖ్యానంతో ఈ కార్యక్రమం మొదలు కాగా...ఆ తర్వాత ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ తన పాటతో అలరించింది. అనంతరం దిశా పటాని తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. సింగర్ కరణ్ ఔజ్లా ఆమెకు జత కలిశాడు. చివర్లో షారుఖ్ చిత్రం ‘పఠాన్’లోని సూపర్ హిట్ పాటకు అతనితో కలిసి విరాట్ కోహ్లి వేసిన స్టెప్పులు హైలైట్‌గా నిలిచాయి. తొలి ఐపీఎల్ నుంచి ఇప్పటి వరకు ఆడుతున్న విరాట్ కోహ్లికి బీసీసీఐ ప్రత్యేక ‘18’ జ్ఞాపికను అందించింది. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X రాజస్తాన్ వేదిక: హైదరాబాద్ మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి చెన్నై X ముంబైవేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
RCB Vs KKR: సాల్ట్, కోహ్లి విధ్వంసం.. కేకేఆర్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆరంభంలోనే క్వింటన్ డికాక్ వికెట్ కోల్పోయినప్పటికి కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే(31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56), సునీల్ నరైన్(26 బంతుల్లో 44) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.వీరితో పాటు రఘువంశీ(30) పరుగులతో రాణించాడు. డికాక్‌తో పాటు వెంకటేశ్ అయ్యర్(6), అండ్రీ రస్సెల్(4), రింకూ సింగ్(12) తీవ్ర నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లతో సత్తాచాటగా.. హాజిల్ వుడ్ రెండు, రసీఖ్ ధార్ సలీం, యశ్‌దయాల్ తలా వికెట్ సాధించారు.కోహ్లి, సాల్ట్ విధ్వంసం..175 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(59 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్‌సాల్ట్(31 బంతుల్లో 56), పాటిదార్(16 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. పవర్‌ప్లేలో కోహ్లి, సాల్ట్ చాలా దూకుడుగా ఆడారు.వీరిద్దరి విధ్వంసం ఫలితంగా ఆర్సీబీ స్కోర్ ఆరు ఓవర్లలోనే 80 పరుగులు దాటేసింది. ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా,సునీల్ నరైన్ తలా వికెట్ సాధించారు. ఆర్సీబీ స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆప్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: IPL 2025: కృనాల్ సూపర్ బాల్.. రూ.23 కోట్ల ఆటగాడికి ఫ్యూజ్‌లు ఔట్! వీడియో -
RCB Vs KKR: అజింక్య రహానే విధ్వంసం.. కేవలం 25 బంతుల్లోనే! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో తొలి హాఫ్ సెంచరీ నమోదైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. తొలి ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన రహానే.. ఆరంభం నుంచే ఆర్సీబీ బౌలర్లపై విరుచుపడ్డాడు.తనదైన శైలిలో స్టైల్లో షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రహానే కేవలం 25 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 31 బంతులు ఎదుర్కొన్న రహానే.. 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.రహానే అరుదైన రికార్డు..కాగా ఈ మ్యాచ్‌తో రహానే ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే మూడు ఫ్రాంచైజీలకు సారథిగా వ్యవహరించిన తొలి భారత ఆటగాడిగా రహానే రికార్డులకెక్కాడు. రహానే తొలిసారిగా 2017 ఐపీఎల్ సీజన్లో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ (RPS) జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఆ తర్వాత ఐపీఎల్-2019లో రాజస్తాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించిన రహానే.. ఇప్పుడు మళ్లీ కేకేఆర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. దీంతో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఐపీఎల్-2025లో మెగా వేలంలో రహానేను కేవలం రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి రౌండ్లో అమ్ముడుపోని రహానే ఆఖరి రౌండ్లో కేకేఆర్ సొంతం చేసుకుంది. Proud of You My Man Sir AJINKYA RAHANE 🥹❤️🫡 pic.twitter.com/VeNXSmW2n1— Malay 🇮🇳❤ (@malay_chasta) March 22, 2025 -
ఐపీఎల్-2025 తొలి మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ: తుదిజట్లు ఇవే!?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తాజా సీజన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్‌తో శనివారం తెరలేవనుంది. ఇందుకు ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదిక. ఇక ఈసారి ఈ రెండు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి.గతేడాది తమను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్‌ను వదిలేసిన కోల్‌కతా.. ఈసారి వెటరన్ ప్లేయర్ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. మరోవైపు.. బెంగళూరు ఫ్రాంఛైజీ అనూహ్య రీతిలో రజత్ పాటిదార్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇక మెగా వేలం-2025 నేపథ్యంలో జట్లలోనూ భారీ మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్లు, కొత్త జట్లతో కేకేఆర్- ఆర్సీబీ ఏమేరకు సత్తా చాటుతాయనేది ఆసక్తికరంగా మారింది. తొలి మ్యాచ్‌లో గెలుపొంది సీజన్లో శుభారంభం అందుకోవాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.వర్షం ముప్పు లేనట్లే?మరోవైపు.. వర్షం ఈ మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తుందన్న వార్తల నడుమ.. కోల్‌కతాలో వాన తెరిపినిచ్చిందని, ఎండ కూడా కాస్తోందన్న తాజా సమాచారం సానుకూలాంశంగా పరిణమించింది. మరి క్యాష్ రిచ్ లీగ్-2025 ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లో కేకేఆర్, ఆర్సీబీ తుదిజట్లు ఎలా ఉండబోతున్నాయో చూద్దామా?కేకేఆర్ మరోసారి స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్‌ను ఓపెనర్‌గా కొనసాగించనుండగా.. అతడికి జోడీగా సౌతాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్ బరిలోకి దిగడం ఖాయమైనట్లు కనిపిస్తోంది. మూడో స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్, నాలుగో స్థానంలో కెప్టెన్ రహానే ఆడనున్నారు.కోహ్లికి జోడీగా సాల్ట్!వీరితో పాటు రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, రమణ్‌దీప్ సింగ్‌లతో కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగానే ఉంది. మరోవైపు.. ఆర్సీబీ తరఫున సూపర్‌స్టార్ విరాట్ కోహ్లితో పాటు ఫిల్ సాల్ట్ ఓపెనింగ్‌కు రానున్నాడు. వీరితో పాటు లియామ్ లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ బ్యాటింగ్ విభాగంలో కీలకం కానున్నారు.ఇక బౌలర్ల విషయానికొస్తే.. కేకేఆర్‌కు పేసర్లు హర్షిత్ రాణాతో పాటు వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్‌లు.. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి సేవలు అందించనున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా అంగ్క్రిష్ రఘువన్షీ బరిలోకి దిగే అవకాశం ఉంది.అదే విధంగా.. ఆర్సీబీ పేస్ దళం టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్, యశ్ దయాళ్, జోష్ హాజిల్‌వుడ్‌లతో పటిష్టంగా కనిపిస్తోంది. ఆర్సీబీ తరఫున స్పిన్నర్ సూయశ్ శర్మ లేదంటే స్వప్నిల్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే అవకాశం ఉంది.కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ తుదిజట్లు (అంచనా)కేకేఆర్సునిల్ నరైన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, రమణ్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.ఇంపాక్ట్ ప్లేయర్: అంగ్క్రిష్ రఘువన్షీ.ఆర్సీబీఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాళ్. చదవండి: ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి ఉండదు: ‘లక్నో’పై నెటిజన్లు ఫైర్ -
అతడిని ఆపటం ఎవరితరం కాలేదు: భారత మాజీ క్రికెటర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో డిఫెండింగ్ చాంపియన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్ బరిలోకి దిగనుంది. తాజా సీజన్లో తొలి మ్యాచ్‌లో భాగంగా సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శనివారం తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. కోల్‌కతా స్టార్ సునిల్ నరైన్ (Sunil Narine) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లో అందరి కళ్లు నరైన్‌పైనే ఉన్నాయని.. ఈసారి కూడా గతేడాది మాదిరి అతడు రాణిస్తే కేకేఆర్‌కు తిరుగు ఉండదని పేర్కొన్నాడు. బ్యాట్‌తో, బంతితో రాణించగల ఈ వెస్టిండీస్ ఆటగాడు మరోసారి కోల్‌కతాకు కీలకం కాబోతున్నాడని ఆకాశ్ చోప్రా (Aakash Chopra) పేర్కొన్నాడు.పవర్ ప్లేలో ధనాధన్ ఇన్నింగ్స్తోకాగా గతేడాది కేకేఆర్ చాంపియన్‌గా నిలవడంలో సునిల్ నరైన్‌ది కీలక పాత్ర. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఓపెనర్‌గా బరిలోకి దిగి పరుగుల సునామీ సృష్టించాడు. పవర్ ప్లేలో ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టి కేకేఆర్ విజయాలకు బాట వేశాడు. గత సీజన్లో పద్నాలుగు ఇన్నింగ్స్‌లో మొత్తంగా 488 పరుగులు సాధించాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్. 180.74 స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టి కేకేఆర్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ఓపెనర్ సునిల్ నరైన్. నాలుగు ఓవర్లపాటు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయగలడు కూడా! అయితే, ఈసారి బ్యాట్‌తో ఎలా విజృంభిస్తాడన్నది ఆసక్తికరం.అతడిని ఆపటం ఎవరితరం కాలేదుగతేడాది కేకేఆర్ విజయాలను నిర్దేశించింది అతడే! అతడి అద్భుత ప్రదర్శన కారణంగా కేకేఆర్ రాత మారిపోయింది. నరైన్ బ్యాట్ నుంచి సెంచరీ కూడా జాలువారింది. ముఖ్యంగా పవర్‌ప్లేలో నిలకడైన బ్యాటింగ్‌తో పరుగులు రాబట్టిన తీరు అద్బుతం.టీ20 క్రికెట్‌కు ఏం కావాలో నరైన్ అది చేసి చూపించాడు. పరుగులు రాబట్టుకుంటూ పోయాడు. అతడిని ఆపటం ఎవరితరం కాలేదు. బౌలర్లు ఎన్ని వ్యూహాలు మార్చినా నరైన్‌ను కట్టడి చేయలేకపోయారు. సునిల్ నరైన్ ఈసారి కూడా అలాగే రాణిస్తే కేకేఆర్‌కు తిరుగు ఉండదు’’ అని పేర్కొన్నాడు. ఆర్సీబీ స్పిన్నర్లే కీలకంఇక తొలి మ్యాచ్‌లో కేకేఆర్- ఆర్సీబీ తలపడనున్న నేపథ్యంలో.. ‘‘ఆర్సీబీ స్పిన్నర్లు ఎలా బౌలింగ్ చేస్తారన్న అంశం మీదే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. కృనాల్ పాండ్యా, సూయశ్ శర్మలతో పాటు లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బెతెల్ ప్రదర్శనే ఆర్సీబీకి కీలకం కానుంది.ఇక కేకేఆర్‌కు ఈసారి మిచెల్ స్టార్క్ లేడు. అతడి స్థానంలో స్పెన్సర్ జాన్సన్ లేదంటే అన్రిచ్ నోర్జే ఆడతారు. బ్యాటర్ల విషయానికొస్తే ఫిల్ సాల్ట్, శ్రేయస్ అయ్యర్‌లను కేకేఆర్ కోల్పోయింది. నరైన్.. క్వింటన్ డికాక్ లేదంటే రహ్మనుల్లా గుర్బాజ్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. టాపార్డర్ రాణిస్తేనే కోల్‌కతాకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.చదవండి: నమ్మశక్యం కాని ఇన్నింగ్స్.. అతడి బ్యాటింగ్ అద్భుతం: కివీస్ కెప్టెన్ -
‘ఫాస్ట్ బౌలర్ల మాదిరి బౌలింగ్ దేనికి? ఆ మాత్రం ధైర్యం లేదా?’
నవతరం స్పిన్నర్ల తీరును భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ (Harbhajan Singh) విమర్శించాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో చాలా మంది స్పిన్నర్లు తమ సహజత్వానికి భిన్నంగా బౌలింగ్ చేస్తున్నారన్నాడు. బంతిని స్పిన్ చేసేందుకు బదులు.. డిఫెన్సివ్‌గా ఆడేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని విమర్శలు గుప్పించాడు.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025 సీజన్ శనివారం ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్‌కు తెరలేవనుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో గత పదిహేడు ఎడిషన్లలో స్పిన్నర్లు కేవలం మూడుసార్లు మాత్రమే పర్పుల్ క్యాప్ గెలుచుకున్నారు.ఇమ్రాన్ తాహిర్, ప్రజ్ఞాన్ ఓజా తర్వాత.. 2022లో అత్యధిక వికెట్ల వీరుడిగా టీమిండియా లెగ్‌బ్రేక్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఈ ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఫాస్ట్ బౌలర్ల మాదిరి బౌలింగ్ దేనికి? ఆ మాత్రం ధైర్యం లేదా?‘‘టీ20లలో.. మరీ ముఖ్యంగా ఐపీఎల్లో చాలా మంది స్పిన్నర్లు ఫాస్ట్ బౌలర్ల మాదిరి బౌలింగ్ చేస్తున్నారు. బంతిని స్పిన్ చేసేందుకు ఏమాత్రం ప్రయత్నించడం లేదు. అసలు బ్యాటర్లపై అటాకింగ్ చేయడమే లేదు. వికెట్లు తీయాలనే తాపత్రయం వారిలో కరువైంది.వికెట్లు తీసే విషయంలో స్పిన్నర్లు కాస్త ధైర్యం చూపించాలి. ప్రతిసారీ ఆత్మరక్షణ ధోరణితో ఉండటం సరికాదు’’ అని భజ్జీ స్పిన్నర్ల తీరును విమర్శించాడు. ఇండియా టుడేతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. తన బౌలింగ్ శైలి ఫాస్ట్ బౌలర్ల మాదిరి ఉంటుంది కాబట్టి తాను కేవలం వన్డే, టీ20లు ఆడతానని.. టెస్టులకు సరిపడనని ఇటీవలే పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్-2025 సీజన్లో బంతిపై సెలైవా (లాలాజలం) ఉపయోగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అనుమతించిన విషయం తెలిసిందే.ఐపీఎల్-2025 కెప్టెన్ల సమావేశం తర్వాత.. వారి అంగీకారంతో ఈ మేరకు సెలైవా ఉపయోగంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం ఐసీసీ నిబంధనలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.స్వాగతించదగ్గ విషయంఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. ‘‘బౌలర్లు సెలైవా ఉపయోగించేందుకు అనుమతి లభించడం స్వాగతించదగ్గ విషయం. అంతర్జాతీయ క్రికెట్లోనూ ఇదే మాదిరి లాలాజలంతో బంతిని నునుపు చేసేందుకు అనుమతి వస్తే.. పేసర్లు బంతిని మరింత స్వింగ్ చేయగలుగుతారు. స్పిన్నర్లకు కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు.కాగా కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అప్పట్లో లాలాజలంతో బంతిని రుద్దకుండా ఐసీసీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. హర్భజన్ సింగ్ టీమిండియా తరఫున టెస్టుల్లో 417, వన్డేల్లో 269, టీ20లలో 25 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో 163 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆఫ్ స్పిన్నర్ 150 వికెట్లు కూల్చాడు.చదవండి: నమ్మశక్యం కాని ఇన్నింగ్స్.. అతడి బ్యాటింగ్ అద్భుతం: కివీస్ కెప్టెన్ -
KKR Vs RCB: వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే పరిస్థితి?
మెగా క్రికెట్ సమరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ సీజన్‌కు శనివారం తెరలేవనుంది. తారల సందడితో ఈడెన్ గార్డెన్స్‌లో క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌ను ఆరంభించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)- ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య పోరుతో ఈ క్రీడా సంబరం మొదలుకానుంది.పొంచి ఉన్న వర్షం ముప్పుఅయితే, ఆరంభ వేడుకలతో పాటు మ్యాచ్‌కు వర్షం అడ్డుతగిలే అవకాశం ఉంది. ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం కోల్‌కతాలో శనివారం భారీ వాన పడే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల తర్వాత వర్షం ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.దీంతో సాయంత్రం 6.20 నిమిషాల నుంచి 6.45 నిమిషాల వరకు జరగాల్సిన ప్రారంభోత్సవ వేడుకల ఏర్పాట్లు సజావుగా సాగడం కష్టమే. సాయంత్రం ఆరు గంటల తర్వాత వర్షం పడే అవకాశం 25 శాతం ఉందని ఆక్యూవెదర్ పేర్కొంది. టాస్ సమయానికి అంటే ఏడు గంటల సమయంలో పదిశాతం వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఇక రాత్రి పదకొండు గంటల తర్వాత ఇందుకు డెబ్బై శాతం ఆస్కారం ఉన్నట్లు వెల్లడించింది.రెండు రోజులుగా వానఈ నేపథ్యంలో కేకేఆర్- ఆర్సీబీ మధ్య ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్ సాఫీగా సాగడం కష్టమే అనిపిస్తోంది. కోల్‌కతాలో గత రెండు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో కేకేఆర్- ఆర్సీబీ ప్రాక్టీస్ మ్యాచ్‌లకు అంతరాయం కలిగింది. మరోవైపు.. శుక్రవారం కూడా వాన పడగా.. ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్‌స్టాఫ్ కవర్లతో మైదానాన్ని కప్పి ఉంచారు.అంతేకాదు.. ఎప్పటికప్పుడు మైదానం నుంచి నీటిని క్లియర్ చేసేందుకు డ్రైనేజీ సిస్టమ్ సిద్ధంగానే ఉంది. అయితే, ఎడతెరిపిలేని వర్షం పడితే మాత్రం మ్యాచ్ జరగడం సాధ్యం కాదు. మరి వర్షం వల్ల కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏమిటి?జరిగేది ఇదే..ప్లే ఆఫ్స్, ఫైనల్ మాదిరి ఐపీఎల్ గ్రూప్ దశ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉండదు. అయితే, వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యమైతే.. మ్యాచ్ ముగియడానికి నిర్ణీత సమయం కంటే అరవై నిమిషాల అదనపు సమయం ఇస్తారు.ఫలితం తేల్చేందుకు ఇరుజట్లు కనీసం ఐదు ఓవర్లపాటు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఐదు ఓవర్ల మ్యాచ్‌కు కటాఫ్ టైమ్ రాత్రి 10.56 నిమిషాలు. అర్ధరాత్రి 12.06 నిమిషాల వరకు మ్యాచ్‌ను ముగించేయాల్సి ఉంటుంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ మరీ ఆలస్యమైతే ఓవర్ల సంఖ్యను తగ్గించే అవకాశం కూడా ఉంటుంది.ఇంత చేసినా ఫలితం తేలకుండా.. మ్యాచ్ రద్దు చేయాల్సి వస్తే ఇరుజట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అయితే, టైటిల్ రేసులో నిలిచే క్రమంలో ఈ ఒక్క పాయింట్ కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే.. ఇటు కేకేఆర్.. అటు ఆర్సీబీ అభిమానులు మ్యాచ్ సజావుగా సాగాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 ఆరంభ వేడుకలో శ్రేయా ఘోషాల్, కరణ్ ఔజ్లా, దిశా పటాని తదితరులు ఆట, పాటలతో అలరించేందుకు సిద్ధమయ్యారు.చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే!A little rain won’t stop us! 🌧 The ground’s got its cozy cover, and the drainage system will be ready to save the day 𝘒𝘺𝘶𝘯𝘬𝘪 𝘠𝘦𝘩 𝘐𝘗𝘓 𝘩𝘢𝘪, 𝘺𝘢𝘩𝘢𝘯 𝘴𝘢𝘣 𝘱𝘰𝘴𝘴𝘪𝘣𝘭𝘦 𝘩𝘢𝘪!#IPLonJioStar 👉 SEASON OPENER #KKRvRCB | SAT, 22nd March, 5:30 PM | LIVE on… pic.twitter.com/UwdonS9FeN— Star Sports (@StarSportsIndia) March 21, 2025 -
నేటి నుంచి పరుగుల పండుగ
2008 మండు వేసవిలో ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తలపడ్డాయి. ఈ మొదటి పోరులో మెకల్లమ్ తన మెరుపు బ్యాటింగ్‌తో అగ్గి పుట్టించాడు. 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 158 పరుగులు చేసి అతను అంటించిన మంట ఆ తర్వాత అంతకంతా పెరిగి దావానంలా మారి అన్ని వైపులకు వ్యాపించిపోయింది. టి20 క్రికెట్లో ఉండే బ్యాటింగ్ ధమాకా ఏమిటో అందరికీ చూపించేసింది. ఐపీఎల్ అంటే క్రికెట్ మాత్రమే కాదని... అంతకు మించిన వినోదమని సగటు అభిమాని ఆటతో పాటు ఊగిపోయేలా చేసింది ఈ లీగ్. ఐపీఎల్లో 17 సీజన్లు ముగిసిపోయాయి. ఇన్నేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. లీగ్‌లో ఆటగాళ్లు మారగా, కొన్ని నిబంధనలూ మారాయి. దిగ్గజాలు స్వల్పకాలం పాటు తామూ ఓ చేయి వేసి తప్పుకోగా, తర్వాతి తరం ఆటను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆటలో ఎన్ని మార్పులు వచి్చనా మారనిది లీగ్‌పై అభిమానం మాత్రమే. ఇన్ని సీజన్లలో కలిపి 1030 మ్యాచ్‌లు జరిగినా ఇప్పటికీ అదే ఉత్సాహం. అంతర్జాతీయ మ్యాచ్‌కంటే వేగంగా సీట్లు నిండిపోతుండగా, ఆటగాళ్ల రాక సినిమా ట్రైలర్‌లా కనిపిస్తోంది. ఇలాంటి వీరాభిమానం మధ్య ఐపీఎల్ 18వ పడిలోకి అడుగు పెడుతోంది. కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్–2025కు రంగం సిద్ధమైంది. నేడు మొదలు కానున్న 18వ సీజన్ 65 రోజుల పాటు జోరుగా సాగనుంది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. 2008 తర్వాత ఇరు జట్ల మధ్య సీజన్ తొలి మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 69 లీగ్ మ్యాచ్‌లు, ఆపై 4 ‘ప్లే ఆఫ్స్’ సమరాల తర్వాత మే 25న ఇదే మైదానంలో జరిగే ఫైనల్ పోరుతో టోర్నీ ముగుస్తుంది. గత మూడు సీజన్ల తరహాలోనే ఇప్పుడు కూడా 10 జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొదటి మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రేయా ఘోషాల్, కరణ్ ఔజ్లా, దిశా పటాని ఆట, పాటలతో కూడిన ప్రత్యేక ప్రారంబోత్సవ కార్యక్రమం కూడా జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ప్రేమించే లీగ్ మళ్లీ వచ్చిన నేపథ్యంలో టోర్నీకి సంబంధించిన పలు విశేషాలు... 300 దాటతారా! ఐపీఎల్లో ఇప్పటి వరకు టీమ్ అత్యధిక స్కోరు 287 పరుగులు. గత ఏడాది బెంగళూరుపై సన్‌రైజర్స్ ఈ స్కోరు సాధించింది. ఐపీఎల్లో మొత్తం 250కు పైగా స్కోరు10 సార్లు నమోదైతే ఇందులో ఎనిమిది 2024లోనే వచ్చాయి. కొత్త సీజన్లో ఇలాంటి మరిన్ని మెరుపు ప్రదర్శనలు రావచ్చని అంతా భావిస్తున్నారు. బ్యాటర్లు జోరు సాగితే తొలిసారి లీగ్‌లో 300 స్కోరు కూడా దాటవచ్చు.2008 నుంచి 2025 వరకు... ఐపీఎల్ తొలి సీజన్లో జట్టుతో ఉండి ఈసారి 18వ సీజన్లో కూడా బరిలోకి దిగబోయే ఆటగాళ్లు 9 మంది ఉండటం విశేషం. ధోని, కోహ్లి, రోహిత్, మనీశ్ పాండే, రహానే, అశ్విన్, జడేజా, ఇషాంత్ శర్మ, స్వప్నిల్ సింగ్ ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో కోహ్లి ఒక్కడే ఒకే ఒక జట్టు తరఫున కొనసాగుతున్నాడు. ఇందులో 34 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ ప్రస్థానం భిన్నం. 2008లో ముంబై టీమ్‌తో ఉన్నా... 2016లో పంజాబ్ తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. మొత్తంగా 5 సీజన్లే అవకాశం దక్కించుకున్న అతను 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. రోహిత్, కోహ్లి మళ్లీ టి20ల్లో... గత ఏడాది టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత ఈ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ పలికారు. ఇప్పుడు వారి టి20 ఆటను చూసే అవకాశం మళ్లీ ఐపీఎల్‌లోనే కలగనుంది.ఆ ఒక్కటీ అడక్కు! ఐపీఎల్ రాగానే ఎమ్మెస్ ధోనికి ఇదే ఆఖరి సీజనా అనే చర్చ మళ్లీ మొదలవుతుంది! గత నాలుగేళ్లుగా అతను ‘డెఫినెట్లీ నాట్’ అంటూ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నాడు. లీగ్‌లో బ్యాటర్‌గా ధోని ప్రభావం దాదాపు సున్నాగా మారిపోయింది. అతని స్థాయి ఆట ఎంతో కాలంగా అస్సలు కనిపించడం లేదు. తప్పనిసరి అయితే తప్ప బ్యాటింగ్‌కు రాకుండా బౌలర్లను ముందుగా పంపిస్తున్నాడు. ఒక రకంగా టీమ్ 10 మందితోనే ఆడుతోంది! అయితే చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఆటగాడిగా ఎలా ఉన్నా అతను మైదానంలో ఉంటే చాలు అని వారు భావిస్తున్నారు. అధికారికంగా కెప్టెన్ కాకపోయినా జట్టును నడిపించడంలో, వ్యూహాల్లో, టీమ్‌కు పెద్ద దిక్కుగా అతనికి అతనే సాటి. ఫిట్‌గానే ఉన్నాడు కాబట్టి అతను తనకు నచ్చినంత కాలం ఆడతాడేమో.2025 లీగ్ వివరాలు» మొత్తం 13 వేదికల్లో టోర్నీ జరుగుతుంది. 7 టీమ్‌లకు ఒకే ఒక హోం గ్రౌండ్ ఉండగా... 3 జట్లు రెండు వేదికలను హోం గ్రౌండ్లుగా ఎంచుకున్నాయి. ఢిల్లీ తమ మ్యాచ్‌లను ఢిల్లీతోపాటు విశాఖపట్నంలో, పంజాబ్ తమ మ్యాచ్‌లను ముల్లన్‌పూర్‌తో పాటు ధర్మశాలలో, రాజస్తాన్ తమ మ్యాచ్‌లను జైపూర్‌తో పాటు గువాహటిలో ఆడుతుంది. » ఐపీఎల్ ప్రదర్శనను బట్టే 10 టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో చెన్నై, కోల్‌కతా, రాజస్తాన్, బెంగళూరు, పంజాబ్ ఉండగా... గ్రూప్ ‘బి’లో ముంబై, హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. ప్రతీ టీమ్ తమ గ్రూప్‌లోని మిగతా 4 జట్లతో రెండు మ్యాచ్‌ల చొప్పున (8 మ్యాచ్‌లు), మరో గ్రూప్‌లో ఒక జట్టుతో రెండు మ్యాచ్‌లు (2), మిగతా నాలుగు టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ (4) ఆడతాయి. అందరికీ సమానంగా 14 మ్యాచ్‌లు వస్తాయి. వీటిలో 7 సొంత గ్రౌండ్లలో ఆడతాయి. » కొత్త సీజన్లో కొన్ని మార్పులు కూడా వచ్చాయి. బంతిని షైన్ చేసేందుకు ఉమ్మి (సలైవా)ను వాడేందుకు అనుమతినిచ్చారు. హైట్‌కు సంబంధించిన వైడ్లు, ఆఫ్ సైడ్ వైడ్లను తేల్చేందుకు కూడా డీఆర్ఎస్ సమయంలో ‘హాక్ ఐ’ ని ఉపయోగిస్తారు. స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే కెప్టెన్లపై జరిమానా వేయడాన్ని, సస్పెన్షన్ విధించడాన్ని తొలగించారు. దానికి బదులుగా డీ మెరిట్ పాయింట్లు విధిస్తారు. రాత్రి మ్యాచ్‌లలో మంచు ప్రభావం ఉందని భావిస్తే రెండో ఇన్నింగ్స్ సమయంలో 10 ఓవర్ల తర్వాత ఒక బంతిని మార్చేందుకు అవకాశం ఇస్తారు. ఇప్పటి వరకు బంతి దెబ్బ తిందని భావించి మార్చే విచక్షణాధికారం అంపైర్లకే ఉండేది. అయితే ఇప్పుడు ఫీల్డింగ్ కెపె్టన్ బంతి మార్చమని కోరవచ్చు. » అన్ని మ్యాచ్‌లు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలవుతాయి. మొత్తం షెడ్యూల్లో 12 రోజులు మాత్రం ఒకే రోజు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. అప్పుడు తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.» గత ఏడాదితో పోలిస్తే ఐదు టీమ్‌లు కొత్త కెపె్టన్లతో బరిలోకి దిగుతున్నాయి. అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్), రిషభ్ పంత్ (లక్నో సూపర్ జెయింట్స్), శ్రేయస్ అయ్యర్ (పంజాబ్ కింగ్స్), అజింక్య రహానే (కోల్‌కతా నైట్‌రైడర్స్), రజత్ పాటీదార్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ఆయా టీమ్‌లకు తొలిసారి సారథులుగా వ్యవహరించనున్నారు. నిషేధం కారణంగా ముంబై తొలి మ్యాచ్‌కు పాండ్యా స్థానంలో సూర్యకుమార్... గాయం నుంచి సామ్సన్ కోలుకోకపోవడంతో రాజస్తాన్ రాయల్స్ తొలి మూడు మ్యాచ్‌లకు రియాన్ పరాగ్‌కెప్టెన్లుగా మైదానంలోకి దిగుతారు. వేలంలో రూ. 27 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించిన రిషభ్ పంత్‌పై ఇప్పుడు ఆటగాడిగా, కెప్టెన్‌గా అందరి దృష్టీ ఉంది.ఐపీఎల్ విజేతలు (2008 నుంచి 2024 వరకు)2008 రాజస్తాన్ రాయల్స్ 2009 డెక్కన్ చార్జర్స్ 2010 చెన్నై సూపర్ కింగ్స్ 2011 చెన్నై సూపర్ కింగ్స్ 2012 కోల్‌కతా నైట్‌రైడర్స్ 2013 ముంబై ఇండియన్స్ 2014 కోల్‌కతా నైట్‌రైడర్స్ 2015 ముంబై ఇండియన్స్ 2016 సన్‌రైజర్స్ హైదరాబాద్ 2017 ముంబై ఇండియన్స్ 2018 చెన్నై సూపర్ కింగ్స్ 2019 ముంబై ఇండియన్స్ 2020 ముంబై ఇండియన్స్ 2021 చెన్నై సూపర్ కింగ్స్ 2022 గుజరాత్ టైటాన్స్ 2023 చెన్నై సూపర్ కింగ్స్ 2024 కోల్‌కతా నైట్‌రైడర్స్ -
కోల్‌కతా- లక్నో మ్యాచ్.. కీలక మార్పు
ఐపీఎల్-2025 షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్-లక్నో సూపర్ జైయింట్స్ మధ్య ఏప్రిల్ 6న జరగాల్సిన మ్యాచ్‌ను గౌహతికి తరలించారు. అదే రోజు శ్రీ రామ నవమి ఉండటంతో భద్రత కల్పించలేమని కోల్‌కతా పోలీసులు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు తెలియజేశారు.ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తో బెంగాల్ క్రికెట్ బోర్డు చర్చింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ పాలకమండలి వేదికను గౌహతికి మార్చింది.ఈ వేదిక మార్పును బీసీసీఐ కూడా ఆమోదించింది. కాగా రామ నవమి వేడుకల కారణంగా కోల్‌కతాలో ఐపీఎల్ మ్యాచ్‌లను రీ షెడ్యూల్ చేయడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది కూడా ఏప్రిల్ 17న జరగాల్సిన కోల్‌కతా వేదికగా కేకేఆర్-రాజస్తాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను రామ నవమి కారణంగా.. ఒకరోజు ముందు (ఏప్రిల్ 16న) నిర్వహించారు.ఇందుకోసం మరో మ్యాచ్‌ను బీసీసీఐ రీ షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. వాస్తవానికి గౌహతిలోని అస్సాం క్రికెట్ అసోషియేషన్ స్టేడియం రాజస్తాన్ రాయల్స్‌కు సెకెండ్ హోం గ్రౌండ్‌గా ఉంది. రాజస్తాన్ టీమ్ ఈ వేదికలో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మైదానంలో రాజస్తాన్ మార్చి 26న కేకేఆర్‌తో, మార్చి 30న చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది.కాగా ఈ మెగా ఈవెంట్ మొత్తం 13 వేదికల్లో జరగనుంది. ఐపీఎల్-18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి.చదవండి: CT 2025: ‘రూ. 739 కోట్ల నష్టం’.. పాక్ క్రికెట్ బోర్డు స్పందన ఇదే! -
KKR Vs RCB: ఐపీఎల్ తొలి మ్యాచ్.. ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!?
ఐపీఎల్-2025 సీజన్‌కు రంగం సిద్దమైంది. మార్చి 22న ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, ఆర్సీబీ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది.ప్రస్తుతం కోల్‌కతా నగరం "ఆరెంజ్ అలర్ట్"లో ఉంది. ఈ క్యాష్‌రిచ్ లీగ్ ప్రారంభం రోజున, అంటే మార్చి 22 (శనివారం) గరిష్టంగా 80 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అక్కడి వాతవారణ శాఖ పేర్కొంది. శనివారం ఉదయం నుంచి పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచే ఛాన్స్ ఉంది.ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అంతకంటే ముందు అక్కడ వర్షం కురిసే సూచనలు కన్పిస్తున్నాయి. అదేవిధంగా ఈడెన్‌గార్డెన్స్‌లో ఐపీఎల్-18వ సీజన్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ ఓపెనింగ్ సెర్మనీకి కూడా ఆటంకం కలిగే అవకాశముంది.కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ రోజున వర్ష శాతం అంచనా(అక్యూ వెదర్ ప్రకారం)7-8PM- 10%8-9 PM- 50%9-10PM-70%10-11 PM- 70%కేకేఆర్: అజింక్యా రహానే (కెప్టెన్), రింకు సింగ్, క్వింటన్ డి కాక్, రహ్మానుల్లా గుర్బాజ్, అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, అన్రిచ్ నార్ట్జే, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, స్పెన్సర్ జాన్సన్, లవ్‌నీత్ సిసోడియా, అనుకుల్ రాయ్, మొయిన్ అలీ, చేతన్ సకారియాఆర్సీబీ: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భాండాగే, జాకబ్ బెతేల్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికార, లుంగి ఎన్గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాథీచదవండి: IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. బౌలర్లకు పండగే? -
కోల్'కథ' ఎంతవరకు!
ఏ జట్టయినా విజయవంతమైన కూర్పును కొనసాగించాలనుకుంటుంది... కానీ కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం అందుకు విభిన్నమైన ప్రణాళికలతో అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. దశాబ్దకాలం తర్వాత తమ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించిన కెపె్టన్ శ్రేయస్ అయ్యర్‌ను వేలానికి వదిలేసుకున్న నైట్‌రైడర్స్... ఓ మామూలు ఆటగాడి కోసం భారీగా ఖర్చు పెట్టింది. జాతీయ జట్టుకు దూరమైన సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేకు పిలిచి మరీ జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే ఎన్ని మార్చినా కోర్ గ్రూప్‌ను మాత్రం కదల్చని కోల్‌కతా... డిఫెండింగ్ చాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకునేందుకు సై అంటోంది! ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మాత్రమే ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండేళ్లు చాంపియన్‌గా నిలిచాయి. నైట్‌రైడర్స్ ఈసారి తమ గెలుపు ‘కథ’ను ఎంతవరకు తీసుకెళ్తుందనేది ఆసక్తికరం కానుంది! –సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చెరో ఐదుసార్లు ట్రోఫీ చేజిక్కించుకోగా... ఆ తర్వాత అత్యధికంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) మూడుసార్లు విజేతగా నిలిచింది. 2012, 2014, 2024లో కేకేఆర్ ట్రోఫీ హస్తగతం చేసుకుంది. గతేడాది ఐపీఎల్ వేలంలో ‘కోర్ గ్రూప్’ను తిరిగి కొనసాగించిన ఫ్రాంచైజీ... జట్టుకు మూడోసారి కప్పు అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆ్రస్టేలియా స్టార్ పేసర్ స్టార్క్‌ను మాత్రం వదిలేసుకుంది. పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 23 కోట్ల 75 లక్షలు ఖర్చు చేసి ఆశ్చర్యపరిచిన యాజమాన్యం... కోటిన్నర ప్రాథమిక ధరతో కొనుగోలు చేసుకున్న సీనియర్ బ్యాటర్ అజింక్య రహానేకు అనూహ్యంగా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. వేలంలో ఒక్కో జట్టు అత్యధికంగా 25 మందిని ఎంపిక చేసుకునే అవకాశం ఉండగా... కేకేఆర్ 21 మందినే తీసుకుంది. సిక్సర్ల వీరుడు రింకూ సింగ్‌కు రూ. 13 కోట్లు... ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి, వెస్టిండీస్ టి20 స్పెషలిస్ట్‌లు రసెల్, నరైన్‌లకు రూ. 12 కోట్లు చొప్పున అందించి అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీ... హర్షిత్ రాణా, రమణ్‌దీప్‌లను రూ. 4 కోట్లతో కొనసాగించింది. ఆరుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంటే దాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంది. నరైన్‌పై భారీ అంచనాలు... సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రకాంత్ పండిత్ కేకేఆర్‌కు కోచ్‌గా వ్యవహరిస్తుండగా... గతేడాది జట్టుకు మెంటార్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ ... టైటిల్ గెలిచిన అనంతరం టీమిండియా హెడ్ కోచ్‌గా వెళ్లిపోయాడు. ఇప్పుడతడి స్థానంలో విండీస్ మాజీ ఆటగాడు డ్వేన్ బ్రావో మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబై, చెన్నై జట్లు మాత్రమే వరుసగా రెండు సీజన్లు విజేతగా నిలిచాయి. ఇప్పుడు కోల్‌కతా ముందు అలాంటి అరుదైన అవకాశం మూడోసారి ఉంది. వెస్టిండీస్ స్పిన్ ఆల్‌రౌండర్ నరైన్‌ను ఓపెనర్‌గా దింపి మెరుగైన ఫలితాలు రాబట్టిన కేకేఆర్ ఈసారి కూడా అదే ప్లాన్ అనుసరిస్తుందనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికిన నరైన్... కేకేఆర్ తరఫున అటు స్పిన్నర్‌గా ఇటు ఓపెనర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత సీజన్లో 488పరుగులు, 17 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. గుర్బాజ్, నరైన్ ఇన్నింగ్స్ ఆరంభించడం ఖాయమే కాగా... అజింక్య రహానే, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్ సింగ్ మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు రానున్నారు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, నరైన్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా కీలకం కానున్నారు. రహానే రాణించేనా? డిఫెండింగ్ చాంపియన్‌గా మరింత బాధ్యతగా ఉండాల్సిన కేకేఆర్... తన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచింది. కప్పు అందించిన కెపె్టన్‌ను వదిలేసుకోవడం... తుదిజట్టులో ఉంటాడో లేదో నమ్మకంగా చెప్పలేని ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పగించడం... వెరసి సీజన్ ఆరంభానికి ముందే వార్తల్లో నిలిచింది. ఫామ్‌లేమికి తోడు వయసు మీదపడుతున్న కారణంగా భారత జట్టుకు దూరమైన రహానే మరి కేకేఆర్‌ను ఎలా నడిపిస్తాడో చూడాలి. వెంకటేశ్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా... ఆస్థాన ఆటగాళ్లు రసెల్, నరైన్ కేకేఆర్‌కు ప్రధాన బలంకానున్నారు. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఈ ఇద్దరు జట్టుకు చేకూర్చే విలువ మాటల్లో చెప్పలేనిది. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబర్చిన వరుణ్ చక్రవర్తిపై భారీ అంచనాలు ఉన్నాయి. నోర్జే, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, రావ్మన్ పావెల్, వైభవ్ అరోరాతో పేస్ విభాగం బలంగానే ఉన్నా... వీరు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలి. విదేశీ ఆటగాళ్ల కోటాలో నరైన్, రసెల్, గుర్బాజ్ తుది జట్టులో ఉండటం పక్కా కాగా... నాలుగో ప్లేయర్‌గా నోర్జే, మొయిన్ అలీలలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు: రహానే (కెప్టెన్), రింకూ సింగ్, డికాక్, గుర్బాజ్, రఘువంశీ, పావెల్, మనీశ్ పాండే, లవ్నిత్ సిసోడియా, వెంకటేశ్ అయ్యర్, అనుకూల్ రాయ్, మొయిన్ అలీ, రమణ్‌దీప్, రసెల్, నోర్జే, వైభవ్, మయాంక్ మార్కండే, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, నరైన్, వరుణ్, చేతన్ సకారియా. అంచనా: డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న కేకేఆర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో నాణ్యమైన ప్లేయర్లు ఉన్న కోల్‌కతా... స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తే ఫైనల్‌కు చేరడం పెద్ద కష్టం కాదు. రహానే జట్టును ఎలా నడిపిస్తాడనేది కీలకం. -
‘అందుకే ఆర్సీబీ టైటిల్ గెలవలేదు.. ఈసారి ఆరెంజ్ క్యాప్ అతడికే’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభ ఎడిషన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు టైటిల్ కోసం పోరాడుతూనే ఉంది. కానీ పదిహేడు సీజన్లుగా ఆర్సీబీ కల మాత్రం నెరవేరడం లేదు. విరాట్ కోహ్లి (Virat Kohli) వంటి సూపర్ స్టార్ జట్టుతో ఉండటం వల్ల భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించగలిగింది కానీ.. ఇప్పటి వరకు ట్రోఫీని అందుకోలేకపోయింది.ఇందుకు ప్రధాన కారణం.. బెంగళూరు ఫ్రాంఛైజీ ఆటగాళ్లందరినీ సమానంగా చూడకపోవటమే అంటున్నాడు ఆ జట్టుకు ఆడిన షాబాద్ జకాతి. గతంలో రెండుసార్లు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ భారత స్పిన్నర్.. అనంతరం ఆర్సీబీకి కూడా ఆడాడు. 2014లో బెంగళూరు తరఫున.. కోహ్లి కెప్టెన్సీలో ఒక్క మ్యాచ్ ఆడిన షాదాబ్ జకాతి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఇది జట్టుగా ఆడాల్సిన ఆట..పదిహేడేళ్లుగా ఆర్సీబీకి టైటిల్ అందని ద్రాక్షగా ఉండటానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఇది జట్టుగా ఆడాల్సిన ఆట. మనం ట్రోఫీలు గెలవాలని బలంగా కోరుకుంటే.. జట్టంతా ఐకమత్యంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది.చెన్నై జట్టు పటిష్టంగా ఉండటానికి కారణం.. టీమిండియాలోని ప్రధాన ప్లేయర్లు ఆ టీమ్‌తో కొనసాగడం. అంతేకాదు.. ఆ జట్టులోని విదేశీ క్రికెటర్లు కూడా అంకితభావంతో ఆడతారు. ఒక జట్టు విజయవంతం కావాలంటే.. కూర్పు సరిగ్గా ఉండాలి. నేను ఆర్సీబీకి ఆడుతున్నపుడు.. ఆ ఫ్రాంఛైజీ కేవలం ఇద్దరు- ముగ్గురు ఆటగాళ్లపై మాత్రమే దృష్టి సారించేది.నమ్మకం, సహోదర భావం లేదుయాజమాన్యం, డ్రెసింగ్‌రూమ్ వాతావరణానికి పొంతనే ఉండేది కాదు. నిజానికి ఆ జట్టులో మంచి మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ.. వారి మధ్య పరస్పర నమ్మకం, సహోదర భావం లోపించినట్లు అనిపిస్తుంది. సీఎస్కేలో మాదిరి ఆర్సీబీ ఆటగాళ్లు ఒకరితో ఒకరు మమేకం కాలేదనేది నా భావన’’ అని జకాతి స్పోర్ట్స్‌కీడాతో పేర్కొన్నాడు.గెలిచేది ఆ జట్టేఇక ఈసారి ప్లే ఆఫ్స్ చేరే జట్లపై తన అంచనా తెలియజేస్తూ.. ‘‘కోల్‌కతా నైట్ రైడర్స్ ఈసారి కూడా క్వాలిఫై అవుతుంది. చెన్నై కూడా బలంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్లతో పాటు గుజరాత్ కూడా టాప్-4లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.అయితే, నాలుగో జట్టుగా లక్నో ఉంటుందా? లేదా ఢిల్లీ వస్తుందా? అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేను. ఈసారి ఢిల్లీ జట్టు బాగుంది. కాబట్టి ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరినా ఆశ్చర్యం లేదు.అంతేకాదు.. ఢిల్లీ ఈసారి టైటిల్ గెలుస్తుందని నాకు అనిపిస్తోంది’’ అని షాదాబ్ జకాతి వెల్లడించాడు. ఇక ఆర్సీబీ ఈసారి ప్లే ఆఫ్స్ చేరే సూచనలు కనిపించడం లేదన్న అతడు.. విరాట్ కోహ్లి కోసమైనా వారు ట్రోఫీ గెలిస్తే బాగుండని పేర్కొన్నాడు.ఆరెంజ్ క్యాప్ అతడికేఇక ఈసారి కోహ్లి లేదంటే.. రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్)అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలుస్తారని జకాతి అంచనా వేశాడు.ఇక పర్పుల్ క్యాప్‌ను పేసర్ జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్) దక్కించుకుంటాడని జోస్యం చెప్పాడు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ (ఢిల్లీ క్యాపిటల్స్), యజువేంద్ర చహల్ (పంజాబ్ కింగ్స్)కు ఈ అవకాశం ఉందని పేర్కొన్నాడు.చదవండి: IPL: అప్పుడు బాల్ బాయ్.. ఇప్పుడు టైటిల్ గెలిచిన కెప్టెన్!.. హ్యాట్సాఫ్ -
IPL: వారెవ్వా..! అప్పుడు బాల్ బాయ్.. ఇప్పుడు టైటిల్ గెలిచిన కెప్టెన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఒకప్పుడు బాల్ బాయ్‌గా ఉన్న పిల్లాడు.. కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. అంతేనా.. టైటిల్ గెలిచిన మొనగాడు కూడా అతడు!.. అంతేకాదండోయ్.. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడు కూడా! ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది.. అవును.. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer).సారథిగా సూపర్ హిట్ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో భారత్ ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించిన శ్రేయస్.. ప్రస్తుతం ఐపీఎల్-2025 సన్నాహకాల్లో మునిగిపోయాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా జట్టును ఫైనల్ వరకు చేర్చిన ఈ ముంబైకర్.. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపాడు. గౌతం గంభీర్ తర్వాత కోల్‌కతాకు ట్రోఫీ అందించిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు.అయితే, మెగా వేలానికి ముందు శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌తో తెగదెంపులు చేసుకోగా.. పంజాబ్ కింగ్స్ అతడిని ఏకంగా రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసి.. పగ్గాలు అప్పగించింది. పంజాబ్ టైటిల్ కలను తీర్చాలని గత ప్రదర్శనను పునరావృతం చేస్తూ ఈసారి పంజాబ్ టైటిల్ కలను ఎలాగైనా తీర్చాలని శ్రేయస్ పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జియోహాట్‌స్టార్‌తో ముచ్చటించిన ఈ కెప్టెన్ సాబ్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.అప్పుడు బాల్ బాయ్‌ని‘‘మా వీధిలో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేసేవాళ్లం. అప్పట్లో (2008) నేను ముంబై అండర్-14 జట్టుకు ఆడుతున్నాడు. ముంబై జట్టులో ఉన్న పిల్లలందరినీ ఐపీఎల్లో బాల్ బాయ్స్‌గా తీసుకువెళ్లారు.నేను కాస్త బిడియస్తుడిని. ఎవరితోనూ ఎక్కువగా కలవను. అయినా సరే.. అదృష్టవశాత్తూ వారిలో ఒకడిగా నాకూ అవకాశం దక్కింది. అప్పట్లో నా ఫేవరెట్ క్రికెటర్ రాస్ టేలర్‌ను దగ్గరగా చూడాలని అనుకునేవాడిని.సర్.. నేను మీకు వీరాభిమానినిఅనుకోకుండా ఆరోజు అవకాశం వచ్చింది. ఆయన దగ్గరకు వెళ్లి.. ‘సర్.. నేను మీకు వీరాభిమానిని’ అని చెప్పాను. ఆయన నా మాటలకు నవ్వులు చిందించడంతో పాటు థాంక్యూ కూడా చెప్పారు. అలా మన అభిమాన క్రికెటర్లను కలిసినపుడు గ్లోవ్స్ లేదంటే బ్యాట్ అడగటం పరిపాటి. నాకూ ఆయనను బ్యాట్ అడగాలని అనిపించినా సిగ్గు అడ్డొచ్చింది.ఓ మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన మా పక్కకు వచ్చి కూర్చుని.. మ్యాచ్ ఆస్వాదిస్తున్నారా అని అడిగారు. అవును.. మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పాను. అప్పట్లో ఇర్ఫాన్ భాయ్ క్రేజ్ తారస్థాయిలో ఉండేది. పంజాబ్ జట్టులోని అందగాళ్లలో ఆయనా ఒకరు. యువీ పాను కూడా అప్పుడు దగ్గరగా చూశాం. ఈ జ్ఞాపకాలు నా మనసులో ఎల్లప్పుడూ నిలిచిపోతాయి’’ అని శ్రేయస్ అయ్యర్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు.2015లో ఎంట్రీకాగా ఐపీఎల్ తొలి సీజన్ 2008లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా తాను రాస్ టేలర్ (RCB)ని తొలిసారి కలిసినట్లు అయ్యర్ వెల్లడించాడు. కాగా శ్రేయస్ అయ్యర్ 2015లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. నాటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున తన తొలి మ్యాచ్ ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటి వరకు ఐపీఎల్లో 115 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు.మొత్తంగా 3127 పరుగులు సాధించడంతో పాటు కెప్టెన్‌గా టైటిల్ సాధించాడు. ప్రస్తుతం పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్ మార్చి 25న గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌తో తాజా సీజన్‌ను మొదలుపెట్టనున్నాడు.చదవండి: వాళ్లను చూస్తేనే చిరాకు.. బుమ్రా, రబడ మాత్రం వేరు: డేల్ స్టెయిన్ -
అతడిపై నిషేధం.. బీసీసీఐ నిర్ణయం సరైందే: కేకేఆర్ స్టార్
హ్యారీ బ్రూక్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయాన్ని ఇంగ్లండ్ వెటరన్ ఆటగాడు మొయిన్ అలీ (Moeen Ali) సమర్థించాడు. రెండేళ్ల పాటు ఈ ఇంగ్లండ్ యువ బ్యాటర్‌పై నిషేధం విధించడం తప్పేమీ కాదని పేర్కొన్నాడు. ఆటగాళ్లు అకస్మాత్తుగా ‘తప్పుకోవాలనే’ నిర్ణయం తీసుకోవడం వల్ల జట్టు కూర్పు దెబ్బతింటుందని అభిప్రాయపడ్డాడు.ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బకాగా ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌పై బీసీసీఐ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అతడు రాబోయే రెండు సీజన్ల పాటు ఐపీఎల్లో పాల్గొనకుండా ఈ నిషేధం అమలుకానుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎంపికైన బ్రూక్.. మార్చి 22 నుంచి జరిగే ఐపీఎల్ 18వ సీజన్ (IPL 2025)లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ సీజన్ ఐపీఎల్ నుంచి తప్పుకొంటున్నట్లు బ్రూక్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు చేపట్టింది.ఐపీఎల్లో ఈ ఏడాది సవరించిన నిబంధనల ప్రకారం.. ఎవరైనా విదేశీ ఆటగాడు వేలంలో తన పేరు నమోదు చేసుకొని అమ్ముడైన తర్వాత సీజన్‌కు అందబాటులో ఉండాల్సిందే. గాయం తప్ప ఇతరత్రా కారణాలను సాకులుగా చెబితే కుదరదు. నిబంధన ప్రకారమేఇలా సీజన్ నుంచి అనూహ్యంగా తప్పుకొన్న ఆటగాళ్లను రెండు సీజన్ల పాటు వేలంలో.. అలాగే లీగ్‌లో పాల్గొనకుండా నిషేధం విధిస్తారు. ఈ మేరకు ఐపీఎల్ నియమావళిలో నిబంధనలు పొందుపరిచారు. తాజా నిబంధన ప్రకారమే హ్యారీ బ్రూక్‌పై చర్యలు తీసుకున్నట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా 2025, 2026 సీజన్లలో బ్రూక్ పాల్గొనేందుకు వీలుండదు. ఈ మేరకు సదరు క్రికెటర్‌తో పాటు, ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కు సమాచారం ఇచ్చారు. నిజానికి బ్రూక్ ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదు. నానమ్మ మృతి కారణం చూపుతూగతేడాది కూడా తన నానమ్మ మృతి కారణం చూపుతూ ఏకంగా లీగ్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ క్రికెట్‌కే తన ప్రాధాన్యత అని స్వదేశంతో భారత్ (జూన్‌లో)తో జరిగే సిరీస్‌కు ముందు పూర్తిస్థాయి ఉత్తేజంతో అందుబాటులో ఉండేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థిస్తాఈ పరిణామాల నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మొయిన్ అలీ మాట్లాడుతూ.. ‘‘ఇదేమీ కఠిన నిర్ణయం కాదు. బీసీసీఐ ఎందుకు ఇలా వ్యవహరించిందో నేను అర్థం చేసుకోగలను. బ్రూక్ ఒక్కడే కాదు.. చాలా మంది గతంలో ఇలాగే చేశారు.తమకు నచ్చినపుడు తిరిగి వచ్చి ఆర్థికంగా లబ్ది పొందారు. అయితే, వారికి ఇదంతా బాగానే ఉన్నా.. సదరు ఆటగాళ్లను కొన్న ఫ్రాంఛైజీలకు నష్టం జరుగుతుందనేది కాదనలేని వాస్తవం. ఒక్క ఆటగాడి వల్ల జట్టు కూర్పు, వ్యూహాలు, ప్రణాళికలు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.అకస్మాత్ మార్పుల వల్ల అంతా గందరగోళమైపోతుంది. హ్యారీ బ్రూక్‌ను కొనుక్కున్న జట్టు అతడి స్థానాన్ని సరైన ఆటగాడితో భర్తీ చేయాలనే చూస్తుంది. కానీ అది సాధ్యం కావచ్చు.. కాకపోవచ్చు. కాబట్టి వారు తమ ప్రణాళికలను అందుకు తగ్గట్లుగా మార్చుకోవాల్సి ఉంటుంది.ఆదిల్ రషీద్ సైతంగాయం వల్ల సీజన్ నుంచి తప్పుకొంటే ఎవరూ తప్పుబట్టరు. బోర్డు కూడా ఇందుకు మినహాయింపు ఇస్తుంది. కానీ ఇలా వేరే కారణాలు చూపుతూ అర్ధంతరంగా తప్పుకోవడం ఏమాత్రం సరికాదు’’ అని మొయిన్ అలీ బ్రూక్ తీరును విమర్శించాడు. ఇంగ్లండ్ క్రికెటర్ ఆదిల్ రషీద్ కూడా మొయిన్ అలీ తరహాలోనే బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థించడం విశేషం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 మెగా వేలంలో మొయిన్ అలీని కోల్‌కతా రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.చదవండి: IPL 2025: ఓపెనర్లుగా కోహ్లి, సాల్ట్.. ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవెన్ ఇదే..? -
IPL 2025: చరిత్రకు అడుగు దూరంలో రహానే..
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి.ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా వెటరన్, కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ చరిత్రలోనే మూడు ఫ్రాంచైజీలకు సారథిగా వ్యవహరించిన తొలి భారత ఆటగాడిగా రహానే రికార్డులకెక్కనున్నాడు.కేకేఆర్ ఫ్రాంచైజీ ఇటీవలే తమ కెప్టెన్‌గా రహానేను ఎంపిక చేసింది. రహానే కేకేఆర్‌ను గతేడాది ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ స్ధానాన్ని భర్తీ చేయనున్నాడు. అదేవిదంగా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కోల్‌కతా జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.మూడోసారి..రహానే తొలిసారిగా 2017 ఐపీఎల్ సీజన్లో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ (RPS) జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఓ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ గైర్హజారీలో పూణే జట్టును రహానే నడిపించాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2018లో రాజస్థాన్ రాయల్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే.. స్మిత్‌పై ఏడాది పాటు నిషేధం విధించడంతో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.తర్వాతి ఐపీఎల్-2019లో హాఫ్ సీజన్ వరకు ఆర్ఆర్ జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే స్మిత్ తిరిగి రావడంతో కెప్టెన్సీ నుంచి రహానే తప్పుకున్నాడు. 2019 ప్రపంచ కప్‌కు సిద్ధం కావడానికి స్మిత్ తన స్వదేశానికి వెళ్లిపోవడంతో రహానే మళ్లీ రాజస్తాన్ రాయల్స్ బాధ్యతలు చేపట్టాడు.ఆ తర్వాతి సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్,చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రహానే ఆటగాడిగానే కొనసాగాడు. ఐపీఎల్-2025లో మెగా వేలంలో రహానేను కేవలం రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి రౌండ్లో అమ్ముడుపోని రహానే ఆఖరి రౌండ్లో కేకేఆర్ సొంతం చేసుకుంది.చదవండి: PAK vs NZ: మళ్లీ అదే కథ.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్ -
ఒకప్పుడు టీమిండియా ప్లేయర్.. కట్‌చేస్తే! ఇప్పుడు ఆ జట్టు నెట్ బౌలర్‌గా
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ చేతన్ సకారియా ఆన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. రూ. 75 లక్షల బేస్‌ప్రైస్‌తో వచ్చిన సకారియాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే వేలంలో సకారియా అమ్ముడుపోనప్పటికి.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం భాగం కానున్నాడు.ఐపీఎల్-18వ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నెట్‌బౌలర్‌గా సకారియా తన సేవలను అందించనున్నాడు. కాగా సకారియా గత సీజన్లో కేకేఆర్కే ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా అతడికి ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అతడిని కేకేఆర్ విడిచిపెట్టింది. ఇప్పుడు నెట్‌బౌలర్‌గా అదే జట్టుతో సకారియా కొనసాగనున్నాడు. కాగా చేతన్ సకారియా ఇటీవల మణికట్టు గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చాడు. ఈ క్రమంలో ముంబైలో జరిగిన ఓ టీ20 టోర్నమెంట్లో సకారియా మెరుగ్గా రాణించి కేకేఆర్ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ దృష్టిలో పడ్డాడు. దీంతో అతడిని నెట్ బౌలర్‌గా కేకేఆర్ తమ జట్టులోకి తీసుకుంది. భరత్ అరుణ్ పర్యవేక్షణలో తన స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకోవడానికి చేతన్‌కు ఇదొక మంచి అవకాశం. అదేవిధంగా రహానే, రస్సెల్ వంటి క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను సకారియా పంచుకోనున్నాడు.మూడే మూడు మ్యాచ్‌లు..చేతన్ సకారియా భారత్ తరపున 2021లో శ్రీలంకపై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో ఇప్పటివరకు రెండు టీ20లు, ఒక వన్డే ఆడాడు. అదేవిధంగా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, కేకేఆర్‌కు సకారియా ప్రాతినిథ్యం వహించాడు.2021 సీజన్లో సకారియా రాజస్తాన్ తరపున 14 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే భారత సెలక్టర్లు నుంచి సకారియా పిలుపును అందుకున్నాడు. కానీ అంతర్జాతీయ స్థాయిలో సకారియా తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఇక ఐపీఎల్లో 19 మ్యాచ్‌లు ఆడిన చేతన్.. 20 వికెట్లు సాధించాడు.ఐపీఎల్-2025కు కేకేఆర్ జట్టు: రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు), క్వింటన్ డి కాక్ (రూ. 3.60 కోట్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (రూ. 200 కోట్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (రూ. 5 కోట్లు. కోటి), అంగ్క్రిష్ రఘువంశీ (రూ. 3 కోట్లు), వైభవ్ అరోరా (రూ. 1.80 కోట్లు), మయాంక్ మార్కండే (రూ. 30 లక్షలు), రోవ్‌మన్ పావెల్ (రూ. 1.50 కోట్లు), మనీష్ పాండే (రూ. 75 లక్షలు), స్పెన్సర్ జాన్సన్ (రూ. 2.80 కోట్లు), ఎ. 30 లక్షల రూపాయలు. రహానె (రూ. 1.50 లక్షలు), అనుకుల్ రాయ్ (రూ. 40 లక్షలు), మొయిన్ అలీ (రూ. 2 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 75 లక్షలు).చదవండి: హార్దిక్ పాండ్యా కంటే అతడు ఎంతో బెటర్: పాక్ మాజీ కెప్టెన్ -
KKR SWOT: అతడిపై భారం!.. బలాలు, బలహీనతలు ఇవే
గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) విజేతగా నిలిచింది కోల్‌కతా నైట్ రైడర్స్(KKR). తద్వారా మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇక ఈసారి లీగ్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర(RCB)తో కేకేఆర్ తలపడనుంది. సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్‌లో మార్చి 22న ఈ మ్యాచ్ జరుగనుంది.అయితే, గత సంవత్సరం జట్టుని ముందుండి నడిపించిన శ్రేయస్ అయ్యర్ ఈసారి తప్పుకోవడంతో అతని స్థానంలో అనుభవజ్ఞుడైన అజింక్య రహానే బాధ్యతలు స్వీకరించాడు. దీనితో నైట్ రైడర్స్ కొత్త తరహా జట్టుతో ఈ సారి రంగ ప్రవేశం చేయబోతోంది. నైట్ రైడర్స్‌పై ఒత్తిడి ఈ నేపథ్యంలో మళ్ళీ టైటిల్ నిలబెట్టుకోవాలన్న ఆశాభావంతో ఉన్న నైట్ రైడర్స్‌పై సహజంగానే ఒత్తిడి ఉంటుంది. మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు బ్యాటింగ్ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్‌ను రూ.23.75 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. ఫ్రాంఛైజీ అతనికి వైస్ కెప్టెన్‌గా అదనపు బాధ్యతను కూడా అప్పగించింది.ఇక బంగ్లాదేశ్‌లో ఫాస్ట్ బౌలింగ్ విప్లవానికి బీజాలు నాటడంలో విజయం సాధించిన వెస్టిండీస్ మాజీ పేసర్ ఒట్టిస్ గిబ్సన్‌ను నైట్ రైడర్స్ ఇటీవల తమ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. అతడు రావడం ప్లస్ పాయింట్తాజాగా దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ అన్రిచ్ నోర్జే జట్టులో చేరుతున్నట్టు జట్టు అధినేత, నటుడు షారుఖ్ ఖాన్ రెండ్రోజుల క్రితం ప్రకటించాడు. 2025 వేలంలో నైట్ రైడర్స్ రూ. 6.50 కోట్లకు నోర్జేను తిరిగి కొనుగోలు చేసింది.ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫ్రాంచైజీలోకి వచ్చిన నోర్జే అనుభవం, అపార వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉంది. ఇంకా జట్టులో సునీల్ నరైన్, ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ విజయంలో కీలక భూమిక వహించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వంటి సీనియర్లు ఉన్నారు. వీరితో పాటు వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, ఉమ్రాన్ మాలిక్ వంటి వర్ధమాన బౌలర్లతో బలీయంగానే కనిపిస్తోంది. రహానేకు కెప్టెన్‌గా బాధ్యతలు.. గొ ప్ప రికార్డు లేదుఐపీఎల్లో కెప్టెన్‌గా అత్యుత్తమ రికార్డులు లేనందున రహానేపై పెద్ద భారమే కనిపిస్తోంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కు 24 మ్యాచ్‌లలో నాయకత్వం వహించిన రహానే వాటిలో తొమ్మిది మ్యాచ్‌లలో మాత్రమే విజయాన్ని రుచిచూశాడు. 15 మ్యాచ్‌లలో ఓడిపోయాడు. ఐపీఎల్లో కెప్టెన్‌గా రహానే రికార్డు ఏ విధంగానూ ఆశాజనకంగా లేదు.ఇక వ్యక్తిగతంగా చూస్తే రహానే 25 మ్యాచ్‌ల్లో ఆడి 25.34 సగటుతో 583 పరుగులు మాత్రమే చేశాడు. అతను హైదరాబాద్ వేదికపై 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో తన అత్యధిక స్కోరు 70 ని నమోదు చేసుకున్నాడు. కానీ రహానెకి నైట్ రైడర్స్ కొత్త ఫ్రాంచైజీ ఏమీ కాదు. 2022లో నైట్ రైడర్స్ కి ప్రాతినిధ్యం వహించిన రహానే ఏడు మ్యాచ్‌ల్లో 103.90 స్ట్రైక్ రేట్‌తో 133 పరుగులు చేశాడు. కాబట్టి గొప్ప రికార్డులేమీ లేని కెప్టెన్ ఉండటం ఒక బలహీనతగా పరిణమించింది అనడంలో సందేహం లేదు.వేలంలో నైట్ రైడర్స్ ఎలా రాణించింది?వేలానికి ముందు వెంకటేష్ అయ్యర్‌ను విడుదల చేసిన తర్వాత, నైట్ రైడర్స్ అతన్ని అధిక ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్లో అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకరైన ఇంగ్లాండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్‌ను తిరిగి కొనుగోలు చేయడానికి కూడా ప్రయత్నించింది. సాల్ట్ లేకపోయినా, నైట్ రైడర్స్ వద్ద క్వింటన్ డి కాక్, రహ్మానుల్లా గుర్బాజ్ల రూపంలో ఇద్దరు మంచి వికెట్టుకీపర్లు ఉన్నారు. సన్‌రైజర్స్ జట్టు నుంచి తప్పుకున్న తర్వాత తన కెరీర్‌ను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఉమ్రాన్ మాలిక్‌ను కూడా నైట్ రైడర్స్ కనుగోలుచేసింది.ఐపీఎల్ 2025 వేలంలో కొన్న ఆటగాళ్లు:వెంకటేష్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (రూ. 2 కోట్లు), క్వింటన్ డి కాక్ (రూ. 3.60 కోట్లు), ఆంగ్క్రిష్ రఘువంశీ (రూ. 3 కోట్లు), అన్రిచ్ నార్ట్జే (రూ. 6.50 కోట్లు), వైబ్హవ్ 8 కోట్లు. మయాంక్ మార్కండే (రూ. 30 లక్షలు), రోవ్‌మన్ పావెల్ (రూ. 1.50 కోట్లు), మనీష్ పాండే (రూ. 75 లక్షలు), స్పెన్సర్ జాన్సన్ (రూ. 2.80 కోట్లు), లువ్నిత్ సిసోడియా (రూ. 30 లక్షలు), అజింక్యా రహానె (రూ. 30 లక్షలు), అనీక్లీ ఎ. 4 లక్షలు (రూ. 1.50 లక్షలు), అనూక్లీ రోయ్ లక్షలు (రూ. 1.50 లక్షలు), 2 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 75 లక్షలు).ప్రధాన ఆటగాళ్లు:వరుణ్ చక్రవర్తి: ఛాంపియన్స్ ట్రోఫీలో తొమ్మిది వికెట్లతో రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నైట్ రైడర్స్ తరఫున 82 వికెట్లు తీసిన వరుణ్ ఈ సీజన్లో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.సునీల్ నరైన్: వెస్టిండీస్ ఆల్ రౌండర్ గత సీజన్లో అత్యంత విలువైన ఆటగాడిగా అవార్డు గెలుచుకున్న నరైన్ 17 వికెట్లు పడగొట్టడమే కాకుండా, 34.85 సగటుతో 488 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.ఆండ్రీ రస్సెల్: ఆండ్రీ రస్సెల్ దశాబ్ద కాలంగా నైట్స్ తరఫున కీలక ఆటగాడిగా ఉన్నాడు. అందువల్ల యాజమాన్యం అతనిపై విశ్వాసం చూపించింది. గత సంవత్సరం రస్సెల్ 222 పరుగులు చేసి 19 వికెట్లు పడగొట్టి, నైట్ రైడర్స్ టైటిల్ సాధనలో కీలక పాత్ర పోషించాడు.అజింక్య రహానే: అజింక్య రహానేకు చాలా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ లో అపార అనుభవం ఉంది.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా? -
ట్రోఫీ గెలిచినా.. కోరుకున్న గుర్తింపు దక్కలేదు: శ్రేయస్ అయ్యర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో అత్యధిక టైటిళ్లు గెలిచిన కెప్టెన్లుగా రోహిత్ శర్మ(Rohit Sharma), మహేంద్ర సింగ్(MS Dhoni) కొనసాగుతున్నారు. ముంబై ఇండియన్స్‌ను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత హిట్‌మ్యాన్‌కు దక్కగా.. అతడి తర్వాత ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన సారథిగా ధోని చరిత్రకెక్కాడు. చెన్నై సూపర్ కింగ్స్ నాయకుడిగా ఈ ఫీట్ నమోదు చేశాడు.విన్నింగ్ కెప్టెన్ల జాబితాలోఇక గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)ను విజేతగా నిలపడం ద్వారా మరో టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ కూడా విన్నింగ్ కెప్టెన్ల జాబితాలో చోటు సంపాదించాడు. గౌతం గంభీర్ తర్వాత కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలిపిన రెండో సారథిగా నిలిచాడు. అతడి సారథ్యంలో కోల్‌కతా గతేడాది అద్భుత విజయాలు సాధించింది.లీగ్ దశలో పద్నాలుగింట తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి టాపర్‌గా ప్లే ఆఫ్స్ చేరిన కేకేఆర్.. క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. టైటిల్ పోరులోనూ మరోసారి సన్‌రైజర్స్‌తో తలపడి పైచేయి సాధించి.. విజేతగా అవతరించింది. దీంతో ఓవరాల్‌గా మూడోసారి కేకేఆర్ ఈ క్యాష్ రిచ్‌లీగ్‌లో విన్నర్‌గా నిలిచింది.అయితే, ఈ విషయంలో తనకు రావాల్సినంత గుర్తింపు దక్కలేదంటున్నాడు శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్లో టైటిల్ సాధించినా తను కోరుకున్నట్లుగా ఏదీ జరుగలేదని పేర్కొన్నాడు. కాగా శ్రేయస్ ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నమెంట్లో ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 243 పరుగులతో టీమిండియా తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.తద్వారా భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్రశసంలు అందుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో కేకేఆర్‌ను విజేతగా నిలిపినప్పటికీ వేలానికి ముందు ఫ్రాంఛైజీ శ్రేయస్ అయ్యర్‌ను రిటైన్ చేసుకోలేదు. దీంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 మెగా వేలంలో పాల్గొన్న శ్రేయస్ అయ్యర్ ఊహించని ధరకు అమ్ముడయ్యాడు. పంజాబ్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. కేకేఆర్‌తో పోటీపడి అయ్యర్‌ను భారీ ధరకు తమ సొంతం చేసుకుంది. ఐపీఎల్-2025లో తమ కెప్టెన్‌గా నియమించింది.కోరుకున్న గుర్తింపు దక్కలేదుఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత శ్రేయస్ అయ్యర్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ‘‘ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత కూడా నేను కోరుకున్నంత.. నాకు దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదని అనిపిస్తోంది. అయితే, వ్యక్తిగతంగా నా ప్రదర్శన, కెప్టెన్సీ పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను.ఎవరూ లేనపుడు కూడా మనం సరైన, న్యాయమైన దారిలో వెళ్తేనే విలువ. వ్యక్తిగా మనకు అన్నింటికంటే నిజాయితీ అతి ముఖ్యమైనది. అలాగని నాకు ఎవరి మీదా అసహనం, అసంతృప్తి లేదు. ఐపీఎల్ ఆడినందు వల్లే చేదు జ్ఞాపకాల నుంచి బయటపడ్డాను. అదృష్టవశాత్తూ టైటిల్ కూడా గెలిచి మనుపటిలా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాను’’ అని శ్రేయస్ అయ్యర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.క్రెడిట్ మొత్తం అతడి ఖాతాలోకే కాగా ప్రస్తుతం టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న గంభీర్ గతేడాది కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరించాడు. కోల్‌కతా టైటిల్ గెలిచిన క్రెడిట్ మొత్తం అతడి ఖాతాలోకే వెళ్లిందన్నది బహిరంగ రహస్యమే. ఈ విజయం తర్వాతే అతడిని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రధాన కోచ్‌గా నియమించింది. ఒక్కసారి కూడా కోచ్‌గా పని చేసిన అనుభవం లేకపోయినా గంభీర్‌పై నమ్మకం ఉంచింది. అయితే, టెస్టుల్లో అతడి మార్గదర్శనంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఓడిన భారత్.. చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం విజేతగా నిలిచింది.చదవండి: CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా వెస్టిండీస్ దిగ్గజం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఓటిస్ గిబ్సన్‌ను సహాయక కోచ్‌గా ఎంపిక చేసుకుంది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుండగా... వెస్టిండీస్ మాజీ పేసర్ గిబ్సన్ కేకేఆర్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 650కి పైగా వికెట్లు పడగొట్టిన 55 ఏళ్ల గిబ్సన్... 1995 నుంచి 99 మధ్య వెస్టిండీస్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం కోచింగ్ వైపు మళ్లిన గిబ్సన్... ఇంగ్లండ్ జాతీయ జట్టుకు రెండు పర్యాయాలు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు.2010–14 మధ్య వెస్టిండీస్ హెడ్ కోచ్‌గా, 2017–19 మధ్య దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన గిబ్సన్ అనుభవం తమ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ భావిస్తోంది. ప్రస్తుతం కోల్‌కతా జట్టుకు చంద్రకాంత్ పండిత్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా... బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కార్ల్ క్రో పనిచేస్తున్నారు. గంభీర్ అనంతరం వెస్టిండీస్ మాజీ ఆటగాడు డ్వేన్ బ్రేవో కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. -
IPL 2025: కొత్త కెప్టెన్ పేరును ప్రకటించిన కేకేఆర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ కీలక ప్రకటన చేసింది. తమ కొత్త కెప్టెన్‌గా టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే(Ajinkya Rahane)ను నియమించినట్లు సోమవారం ప్రకటించింది. అదే విధంగా.. వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer)కు కూడా కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది.‘‘అజింక్య రహానే వంటి ఆటగాడు.. తన అనుభవం, పరిణతితో గొప్ప నాయకుడు అవుతాడని చెప్పేందుకు మేము సంతోషిస్తున్నాం. ఇక వెంకటేశ్ అయ్యర్ కూడా కేకేఆర్ నాయకత్వ విభాగంలో భాగంగా ఉంటాడు. వీరిద్దరు కలిసి కేకేఆర్ మరోసారి చాంపియన్‌గా నిలిచేందుకు.. టైటిల్ నిలబెట్టుకునేందుకు సహకారం అందిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాం’’ అని కోల్‌కతా ఫ్రాంఛైజీ తమ ప్రకటనలో పేర్కొంది. కాగా ఐపీఎల్-2025లో కేకేఆర్‌కు రహానే కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్‌గా వెంకటేశ్ అయ్యర్ సేవలు అందించనున్నాడు.గతేడాది శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోకాగా గౌతం గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014లో చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా జట్టు.. పదేళ్ల తర్వాత గతేడాది మరోసారి ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. టీమిండియా మిడిలార్డర్ స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ పద్నాలుగింట తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్స్ చేరింది.క్వాలిఫైయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించి ఫైనల్ చేరుకున్న కోల్‌కతా.. ఫైనల్లోనూ ఇదే ఫలితం పునరావృతం చేసింది. ప్యాట్ కమిన్స్ బృందాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి విజేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్(26 బంతుల్లో 52 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడి మరో 57 బంతులు మిగిలి ఉండగానే జట్టు విజయాన్ని ఖరారుచేశాడు.విన్నింగ్ కెప్టెన్‌ను కోల్పోయిఅయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు శ్రేయస్ అయ్యర్‌తో పాటు వెంకటేశ్ అయ్యర్ కేకేఆర్ ఫ్రాంఛేజీని వీడగా.. వెంకటేశ్‌ను కోల్‌కతా మళ్లీ భారీ ధర పెట్టి దక్కించుకుంది. అతడి కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేసింది. అయితే, శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేయడంతో కేకేఆర్ తమ విన్నింగ్ కెప్టెన్‌ను కోల్పోయింది. ఇదిలా ఉంటే.. రూ. 1.50 కోట్లతో అజింక్య రహానేను కొనుక్కున్న కేకేఆర్ అతడిని సారథిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా పనిచేసిన రహానే.. దేశవాళీ క్రికెట్లో ముంబైకి విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు 185 మ్యాచ్‌లు ఆడిన రహానే రెండు శతకాల సాయంతో 4642 పరుగులు చేశాడు. మరోవైపు.. వెంకటేశ్ అయ్యర్ 50 మ్యాచ్‌లలో 1326 రన్స్ సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, 11 అర్థ శతకాలు ఉన్నాయి.ఐపీఎల్-2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు, ఏ ఆటగాడు ఎంత ధరపలికాడంటే..రింకూ సింగ్ (రూ. 13 కోట్లు) సునిల్ నరైన్ (రూ. 12 కోట్లు) ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు) వరుణ్ చక్రవర్తి (రూ. 12 కోట్లు) హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు) రమణ్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు) వెంకటేశ్ అయ్యర్ (రూ.23.75 కోట్లు) ఆన్రిచ్ నోర్జే (రూ.6.50 కోట్లు) క్వింటన్ డికాక్ (రూ.3.60 కోట్లు) అంగ్కృష్ రఘువన్షీ(రూ.3 కోట్లు) స్పెన్సర్ జాన్సన్ (రూ. 2.80 కోట్లు) రహ్మనుల్లా గుర్బాజ్ (రూ.2 కోట్లు) మొయిన్ అలీ (రూ. 2 కోట్లు) వైభవ్ అరోరా (రూ.1.80 కోట్లు) రోవ్‌మన్ పావెల్ (రూ.1.50 కోట్లు) అజింక్య రహానే (రూ. 1.50 కోట్లు) మనీశ్ పాండే (రూ. 75 లక్షలు) ఉమ్రన్ మాలిక్ (రూ. 75 లక్షలు) అనుకూల్ రాయ్ (రూ. 40 లక్షలు) మయాంక్ మర్కండే (రూ. 30 లక్షలు) లవ్నిత్ సిసోడియా (రూ. 30 లక్షలు) చదవండి: BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్‌గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ -
IPL 2025: కేకేఆర్ కెప్టెన్‌గా నేను రెడీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితాలో వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer) మూడో స్థానంలో ఉన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) తరఫున గతేడాది రాణించిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌ను.. వేలంపాటకు ముందు ఫ్రాంఛైజీ వదిలేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో రూ. 2 కోట్ల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చిన అతడి కోసం కేకేఆర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీపడ్డాయి.ఈ క్రమంలో ఏకంగా రూ. 23.75 కోట్లకు కోల్‌కతా వెంకటేశ్ అయ్యర్‌ను తమ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు పగ్గాలు అప్పగించేందుకు యాజమాన్యం సుముఖంగా ఉందనే వార్తలు వస్తున్నాయి.కెప్టెన్ అనే ట్యాగ్ అవసరం లేదుఈ విషయంపై వెంకటేశ్ అయ్యర్ స్వయంగా స్పందించాడు. నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మనసులోని మాటను వెల్లడించాడు. కెప్టెన్‌గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘కచ్చితంగా.. నేను వందశాతం సిద్ధంగా ఉన్నాను. నిజానికి కెప్టెన్సీ అనేది ఒక ట్యాగ్ మాత్రమే.నాయకుడిగా ఉండటం అనేది మాత్రం గొప్ప విషయం. డ్రెసింగ్‌రూమ్‌లో లీడర్ ఉండాలంటే కెప్టెన్ అనే ట్యాగ్ అవసరం లేదని నేను నమ్ముతాను. మన ప్రదర్శనతో సహచర ఆటగాళ్లకు స్ఫూర్తినివ్వాలి. మైదానం లోపలా, వెలుపలా రోల్ మోడల్లా ఉండాలి. మధ్యప్రదేశ్ జట్టులో నేను ప్రస్తుతం అదే పాత్ర పోషిస్తున్నాను.గళం విప్పే స్వేచ్ఛ ఉన్నపుడేమధ్యప్రదేశ్ జట్టుకు నేనేమీ కెప్టెన్‌ను కాదు. అయితే, నా అభిప్రాయాలకు, సూచనలకు అక్కడి నాయకత్వం విలువనిస్తుంది. నాకు అలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం. మనం జట్టులోకి కొత్తగా వచ్చామా.. మనల్ని వాళ్లు రూ. 20 లక్షలు లేదంటే రూ. 20 కోట్లు పెట్టి కొనుగోలు చేశారా అన్నది ముఖ్యం కాదు.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా మన గళం విప్పే స్వేచ్ఛ ఉన్నపుడే అంతా బాగుంటుంది’’ అని వెంకటేశ్ అయ్యర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో చెప్పుకొచ్చాడు.కాగా ఐపీఎల్-2021 సీజన్లో కేకేఆర్ తరఫున క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు వెంకటేశ్ అయ్యర్. మొదట కేకేఆర్ అతడిన రూ.20లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే, ఆ ఎడిషన్‌లో అద్బుతంగా రాణించడంతో 2022 వేలానికి ముందు రూ. 8 కోట్లకు అయ్యర్‌ను రిటైన్ చేసుకుంది. ఆ తర్వాత మరో రెండేళ్ల పాటు తమ జట్టుకే ప్రాతినిథ్యం వహించిన వెంకటేష్‌ను ఐపీఎల్-2025 వేలంలోకి విడిచిపెట్టి.. భారీ ధరకు తిరిగి జట్టులో చేర్చుకుంది. కాగా ఐపీఎల్లో వెంకటేష్ ఇప్పటివరకు ఆడిన 50 మ్యాచ్‌లలో 1326 పరుగులు చేశాడు.శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోఇదిలా ఉంటే.. గతేడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, వేలానికి ముందు అతడు జట్టును వీడగా.. పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో కేకేఆర్ కెప్టెన్సీ పోస్టు ఖాళీ కాగా.. వెంకటేశ్ అయ్యర్‌తో పాటు అజింక్య రహానే కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్- ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్-2025 సీజన్‌కు తెరలేవనుంది. చదవండి: Ind vs NZ: ‘కివీస్‌తో మ్యాచ్‌లో అతడికి విశ్రాంతి ఇవ్వండి’ -
IPL 2025: కోల్‌కతా X బెంగళూరు
న్యూఢిల్లీ: వేసవిలో క్రీడాభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్‌కు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం అధికారికంగా ప్రకటించింది. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ టోర్నీకి తెర లేవనుంది. మే 25వ తేదీన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లోనే జరిగే ఫైనల్‌తో టోర్నీకి తెర పడుతుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మొత్తం 9 మ్యాచ్‌లు (7 లీగ్ మ్యాచ్‌లు, రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు)... విశాఖపట్నంలో రెండు మ్యాచ్‌లు (ఢిల్లీ క్యాపిటల్స్) జరుగుతాయి. » 13 వేదికల్లో 10 జట్ల మధ్య 65 రోజులపాటు నిర్వహించే ఐపీఎల్ 18వ సీజన్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో 70 లీగ్ మ్యాచ్‌లు... నాలుగు ప్లే ఆఫ్ (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2, ఫైనల్) మ్యాచ్‌లు ఉన్నాయి. మొత్తం 10 జట్లు సొంత నగరాలతో పాటు... మూడు ఫ్రాంచైజీలు (ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్) తమ హోం మ్యాచ్‌లను రెండో వేదికపై కూడా ఆడాలని నిర్ణయించుకున్నాయి. » ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ సీజన్‌ను విశాఖపట్నంలో మొదలు పెడుతుంది. వైజాగ్‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా జరిగే రెండు మ్యాచ్‌ల్లో (మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో; మార్చి 30న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బరిలో దిగుతుంది. రాజస్తాన్ రాయల్స్ రెండు మ్యాచ్‌లను గువాహటిలో, పంజాబ్ కింగ్స్ జట్టు తమ మూడు మ్యాచ్‌లను ధర్మశాలలో ఆడనున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్లో ఒకే రోజు రెండు మ్యాచ్‌ల చొప్పున 12 సార్లు జరగనున్నాయి. » సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో ఆడనుంది. ఈ సీజన్లో మొత్తం హైదరాబాద్ వేదికగా 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 20న క్వాలిఫయర్–1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్‌లకు కూడా హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. క్వాలిఫయర్–2తో పాటు తుదిపోరు కోల్‌కతాలో జరగనున్నాయి. » లీగ్‌లో 10 జట్లు అయినప్పటి నుంచి జట్లను ఈసారి కూడా రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్–1లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్... గ్రూప్–2లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్‌లోని ఒక జట్టు తమ గ్రూప్‌లోని మిగతా నాలుగు జట్లతో రెండుసార్లు చొప్పున ఆడుతుంది. రెండో గ్రూప్‌లోని నాలుగు జట్లతో ఒక్కోసారి, మిగిలిన మరో జట్టుతో రెండుసార్లు తలపడుతుంది. » ‘డబుల్ హెడర్’ ఉన్న రోజు తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి... రెండో మ్యాచ్ యధావిధిగా రాత్రి గం. 7:30 నుంచి జరుగుతాయి. ఒకే మ్యాచ్ ఉన్న రోజు మ్యాచ్ రాత్రి గం. 7:30 నుంచి జరుగుతుంది. -
ఐపీఎల్-2025 షెడ్యూల్ ఖారారు! తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
క్రికెట్ ప్రేమికులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్(IPL 2025) 18వ సీజన్ షెడ్యూల్‌ను పాలక మండలి ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానునున్నట్లు సమాచారం. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ మొదటి మ్యాచ్‌లో మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. అదే రోజు ఆదివారం చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతుంది. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన 12 రోజుల తర్వాత ఐపీఎల్ మొదలవుతుంది.మే 25న ఫైనల్‌కు కూడా కోల్‌కతానే వేదిక కానుండగా... క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే జరుగుతాయి. పది జట్లు పాల్గొనే ఈ టోర్నీలో పది టీమ్‌ల సొంత మైదానాలతో పాటు రెండు ఇతర వేదికలు (ధర్మశాల, గువహటి) కలిపి మొత్తం 12 చోట్ల లీగ్‌ను నిర్వహిస్తారు.రాజస్తాన్ రాయల్స్ టీమ్‌కు గువహటి తమ రెండో సొంత వేదిక కాగా...ప్రతీ ఏడాదిలాగే ఈ సారి కూడా పంజాబ్ కింగ్స్ తమ మూడు హోం మ్యాచ్‌లను ధర్మశాలలో ఆడుతుంది. అయితే ఐపీఎల్ వర్గాల నుంచి మాత్రం అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారింగా షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది.ఆర్సీబీ కెప్టెన్‌గా పాటిదార్..తాజాగా ఆర్సీబీ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్‌గా మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్‌ను ఎంపిక చేసింది. అంతా విరాట్ కోహ్లి తిరిగి ఆర్సీబీ పగ్గాలు చేపడతాడని భావించారు. కానీ అందుకు కోహ్లి సముఖత చూపలేదని, పాటిదార్ పేరును సూచించినట్లు తెలుస్తోంది. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడతారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు ఫ్రాంచైజీలు గత సీజన్లో తమ కెప్టెన్లగా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌ను మెగా వేలంలోకి విడిచిపెట్టాయి. అయ్యర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. పంత్ లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా నియమితుడయ్యాడు.చదవండి: ఆఖరి బంతికి ఢిల్లీ గెలిచింది -
కేకేఆర్‌కు భారీ షాక్.. రూ.23 కోట్ల ఆటగాడికి గాయం
ఐపీఎల్-2025కు సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు భారీ షాక్ తగలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, మధ్యప్రదేశ్ కీలక ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ గాయపడ్డాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో భాగంగా గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా కేరళలతో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా అయ్యర్ కుడి కాలి చీలమండకు గాయమైంది.దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడుతూ కిందపడిపోయాడు. వెంటనే ఫిజియో చికిత్స అందించినప్పటికి అయ్యర్ నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో అతడు ఫిజియో సాయంతో మైదాన్ని వీడాడు. సాధరణంగా చీలమండ గాయానికి గురైన ఆటగాళ్లు పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతోంది. ఈ క్రమంలో అయ్యర్ మిగిలిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా వెంకటేశ్ తాజా గాయం కేకేఆర్ అభిమానులకు ఆందోళనకు గురిచేస్తుంది. గత సీజన్లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన అయ్యర్.. ఈసారి క్యాష్ రిచ్ లీగ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే ఐపీఎల్‌కు ఇంకా దాదాపుగా రెండు నెలల సమయం ఉన్నందున అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధించే అ వకాశముంది. ఒకవేళ అతడి ఫిట్నెస్ సాధించిక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమైతే కేకేఆర్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.23.75 కోట్ల భారీ ధర వెచ్చించి మరి వెంకటేశ్‌ను కేకేఆర్ సొంతం చేసుకుంది.కష్టాల్లో మధ్యప్రదేశ్..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు మధ్యప్రదేశ్ 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో ప్రస్తతం కెప్టెన్ శుబ్మ్ శర్మ(42 నాటౌట్), కుమార్ కార్తికేయ(10) ఉన్నారు. కేరళ పేసర్ నిదేష్ 4 వికెట్లు పడగొట్టి ఎంపీని దెబ్బతీశాడు. అతడితో పాటు సక్సేనా, సరేవత్ తలా వికెట్ సాధించారు.చదవండి: Dinesh Karthik: ఇప్పటికైనా అతడికి జట్టులో ఛాన్స్ ఇస్తారా? లేదా? -
IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు తమ కొత్త కెప్టెన్ పేరును ప్రకటించింది. ఐపీఎల్-2025 సీజన్‌కు గానూ టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)ను తమ సారథిగా ఎంపిక చేసుకుంది. కాగా క్యాష్ రిచ్ లీగ్‌లో కెప్టెన్‌గా ఈ ముంబై బ్యాటర్‌కు మంచి అనుభవం ఉంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లకు అతడు నాయకుడిగా వ్యవహరించాడు.కోల్‌కతాకు టైటిల్ అందించిఇక గతేడాది ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన 30 ఏళ్ల శ్రేయస్ అయ్యర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే, మెగా వేలం-2025(IPL Mega Auction 2025)కి ముందు కోల్‌కతా ఫ్రాంఛైజీ అతడిని రిటైన్ చేసుకుంటుందని విశ్లేషకులు భావించగా.. శ్రేయస్ మాత్రం జట్టుతో బంధాన్ని తెంచుకునేందుకే ఇష్టపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడు రూ. 2 కోట్ల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చాడు.భారీ ధర.. ఈ చాంపియన్ కెప్టెన్‌ను దక్కించుకునేందుకు పాత జట్టు కోల్‌కతా తొలుత రంగంలోకి దిగగా.. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తగ్గేదేలే అన్నట్లు ధరను పెంచుకుంటూ పోయాయి. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన వేలం పాటలో ఆఖరికి పంజాబ్ నెగ్గింది. రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 26 కోట్ల 75 లక్షలు పెట్టి శ్రేయస్ అయ్యర్‌ను కొనుగోలు చేసింది. తాజాగా అతడికి పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.నమ్మకాన్ని నిలబెట్టుకుంటాఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్‌తో మరోసారి కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా చూస్తున్నా. జట్టులో నైపుణ్యానికి కొదవలేదు. ఇప్పటికే నిరూపించుకున్న ఆటగాళ్లతో పాటు ప్రతిభావంతులు చాలా మంది అందుబాటులో ఉన్నారు.పంజాబ్ కింగ్స్ జట్టుకు తొలి ఐపీఎల్ టైటిల్ అందించేందుకు నావంతు కృషి చేస్తా’ అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇక.. ప్రధాన కోచ్ పాంటింగ్ మాట్లాడుతూ ‘శ్రేయస్‌కు ఆటపై మంచి అవగాహన ఉంది. కెప్టెన్‌గా ఇప్పటికే నిరూపించుకున్నాడు. గతంలో అతడితో కలిసి పనిచేశా. సీజన్ కోసం ఆతృతగా చూస్తున్నా’ అని అన్నాడు.కాగా ఇటీవల శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 2024లో రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలు గెలిచిన ముంబై జట్టులో శ్రేయస్ అయ్యర్ సభ్యుడు. అంతేకాదు.. ఇటీవల అతడి కెప్టెన్సీలో ముంబై టీమ్ దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ టైటిల్ గెలిచింది.సూపర్ ఫామ్లోఅదే విధంగా.. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ శ్రేయస్ అయ్యర్ భారీ శతకాలతో దుమ్ములేపాడు. తదుపరి అతడు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశం ఉంది. అయితే, అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడే భారత జట్టులో మాత్రం అయ్యర్‌కు చోటు దక్కలేదు. కాగా శ్రేయస్ అయ్యర్ చివరిసారిగా గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు.గతేడాది ఫ్లాప్ షోఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్ ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ఇక గత సీజన్లో శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. గాయం వల్ల అతడు ఆదిలోనే తప్పుకోగా.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ జట్టును ముందుకు నడిపించాడు. అయితే, పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ పంజాబ్ కేవలం ఐదే గెలిచి.. తొమ్మిదో స్థానంతో సీజన్‌ను ముగించింది. చదవండి: వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ.. సంచలనం సృష్టించిన ముంబై బ్యాటర్𝐒𝐡𝐫𝐞𝐲𝐚𝐬 𝐈𝐲𝐞𝐫 ➡️ 𝐓𝐡𝐞 𝐜𝐡𝐨𝐬𝐞𝐧 𝐨𝐧𝐞! ©️♥️#CaptainShreyas #SaddaPunjab #PunjabKings pic.twitter.com/EFxxWYc44b— Punjab Kings (@PunjabKingsIPL) January 12, 2025 -
అతడు 12 కోట్లకే దొరికేవాడు.. ఇషాన్ కూడా చీప్.. అయినా ఎందుకిలా?
ఐపీఎల్ మెగా వేలం-2025లో కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహం తనకు ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. అతడి కంటే ఇషాన్ కిషన్ తక్కువ ధరకు వచ్చేవాడని.. అయినప్పటికీ ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయలేదని కేకేఆర్ నిర్ణయాలను విమర్శించాడు.మూడో ఆటగాడిగాసౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటిరోజే వెంకటేశ్ అయ్యర్ కోసం కేకేఆర్ కళ్లు చెదిరే మొత్తం ఖర్చు చేసింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన మూడో ఆటగాడిగా వెంకటేశ్ నిలిచాడు.ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘వేలానికి ముందు ఇద్దరు అయ్యర్ల(శ్రేయస్, వెంకటేశ్)ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేకపోయింది. వారి డిమాండ్‌ను బట్టి వేలంలో ఒక్కరినే దక్కించుకోలగలదని తెలుసు. అయితే, వాళ్లకు ఇప్పుడు కెప్టెన్ అవసరం ఉంది. అయినప్పటికీ వెంకీ కోసం వాళ్లు భారీగా ఖర్చు పెట్టారు.ఇందులో వెంకీ రెండింటికీ సరిపోడుఒక్క ఆటగాడి కోసమే రూ. 23.75 కోట్లు వెచ్చించారు. కెప్టెన్ ఆప్షన్ లేదంటే.. ప్రత్యేక నైపుణ్యాలున్న ఆటగాడి కోసం ఎవరైనా ఇంత భారీగా ఖర్చు చేయొచ్చు. కానీ.. ఇందులో వెంకీ రెండింటికీ సరిపోడు. విశ్వాసపాత్రులుగా ఉండటం చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం అంటారు.అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్ కూడా చీప్ ఇక్కడ అది నిజమే అనిపిస్తోంది. ఒక్కడి కోసం ఇంత మొత్తం పెట్టినపుడు.. ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఇక్కడ అదే జరిగింది. మీకు ఓపెనర్ కావాలని అనుకుంటే... ఫిల్ సాల్ట్(ఆర్సీబీ) కోసం పోటీపడి రూ. 12 కోట్లకు సొంతం చేసుకోవాల్సింది. లేదంటే కేఎల్ రాహుల్(ఢిల్లీ) కోసం రూ. 14 కోట్లకు పైగా వెచ్చించాల్సింది. అదీ కాకపోతే ఇషాన్ కిషన్(సన్‌రైజర్స్) కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాడు.అతడు కూడా మంచి ఓపెనర్. అయినప్పటికీ మీరెందుకు వెంకటేశ్ కోసం రూ. 20 కోట్లకు పైగా ఎందుకు ఖర్చు చేశారో అర్థం కావడం లేదు’’ అని చోప్రా కేకేఆర్ వ్యూహాలను విమర్శించాడు. కాగా వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. అతడు పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. కానీ అతడి బౌలింగ్ గణాంకాలు మాత్రం అంతంతమాత్రమే. ఇప్పటి వరకు ఐపీఎల్లో మొత్తంగా 50 మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్ అయ్యర్ 1326 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీయగలిగాడు.కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలపడంలోఐపీఎల్-2024లో కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలపడంలో వెంకటేశ్ అయ్యర్‌ది కీలక పాత్ర. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్లో 26 బంతుల్లోనే 52 పరుగులతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(6*)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే, వేలానికి ముందు కేకేఆర్ వీరిద్దరిని విడిచిపెట్టాల్సి వచ్చింది. దీంతో వెంకీని తిరిగి దక్కించుకునే అవకాశం రాగా.. శ్రేయస్ అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో వెంకటేశ్ అయ్యర్ 13 ఇన్నింగ్స్‌లో కేవలం 370 రన్స్ చేశాడు.చదవండి: వేలం ముగిసింది.. ఇక మిగిలింది అదే!.. ఏ జట్టులో ఎవరు? ఎవరి పర్సులో ఎంత? ఎన్ని ఖాళీలు -
అతడొక విధ్వంసక బ్యాటర్.. అందుకే కొనుక్కున్నాం: ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ డీకే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ కోసం ఈసారి భారీ మొత్తమే ఖర్చుపెట్టింది. సౌదీ అరేబియా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం-2025లో అనూహ్య రీతిలో అతడి కోసం రూ. 11.50 కోట్లు ధారపోసింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సాల్ట్ కోసం.. తొలుత ముంబై ఇండియన్స్‌తో పోటీపడిన ఆర్సీబీ.. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో తలపడింది.ధరను ఏకంగా రూ. 8 కోట్ల పెంచి కేకేఆర్‌కు సవాలు విసిరింది. అయినప్పటికీ కోల్‌కతా వెనుకంజ వేయలేదు. రూ. 10 కోట్ల వరకు వచ్చింది. అయితే, ఆ తార్వత ఆర్సీబీ ఏకంగా ధరను రూ. 11.50 కోట్లకు పెంచగా కేకేఆర్ తప్పుకొంది. దీంతో సాల్ట్ ఆర్సీబీ సొంతమయ్యాడు.అతడొక విధ్వంసర బ్యాటర్.. పవర్ ప్లేలో..అయితే, సాల్డ్ కోసం అంతమొత్తం వెచ్చించడం సరైందేనా అన్న చర్చల నడుమ ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తిక్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘‘ఫిల్ సాల్ట్.. అతడి గురించి ఏమని చెప్పాలి?!... అతడొక విధ్వంసర బ్యాటర్. పవర్ ప్లేలో ఏ బౌలర్ బౌలింగ్‌నైనా చితక్కొట్టగలడు.అలాంటి ఆటగాడు మా జట్టులో సానుకూలాంశం. ఆర్సీబీకి ఎలాంటి ప్లేయర్ కావాలో.. ఫిల్ అలాంటివాడే’’ అని డీకే సాల్ట్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా ఆర్సీబీ జితేశ్ శర్మ రూపంలో మరో వికెట్ కీపర్ కోసం రూ. 11 కోట్ల ఖర్చుపెట్టిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సాల్ట్, జితేశ్లలో ఎవరు కీపింగ్ చేస్తారనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘టోర్నీ మొదలైన తర్వాతే మేము ఈ విషయంపై సరైన నిర్ణయానికి రాగలము. అత్యుత్తమ ఆటగాడినే మేము ఎంచుకుంటాము’’ అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. మూడు సెంచరీలుకాగా ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు 38 టీ20లు ఆడిన ఫిల్ సాల్ట్ సగటున 36.86తో 1106 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేటు 165.32. అతడి ఖాతాలో మూడు అంతర్జాతీయ టీ20 సెంచరీలతో పాటు నాలుగు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి.ఇక ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్లో సాల్ట్ 268 మ్యాచ్‌లు పూర్తి చేసకుని 155కు పైగా స్ట్రైక్‌రేటుతో 6517 రన్స్ సాధించాడు సాల్ట్. ఇందులో మూడు సెంచరీలు, 41 ఫిఫ్టీలు ఉన్నాయి. గతేడాది కేకేఆర్‌కు ఆడిన సాల్ట్ 12 మ్యాచ్‌లలో కలిపి.. నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 435 పరుగులు చేశాడు.రాయల్ చాలెంజర్స్ బెంగళూరురిటెన్షన్స్: విరాట్ కోహ్లి (రూ. 21 కోట్లు) ,రాజత్ పటిదార్ (రూ.11 కోట్లు) ,యశ్ దయాళ్ (రూ. 5 కోట్లు) వేలంలో కొన్నప్లేయర్లుహాజల్వుడ్ (రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) భువనేశ్వర్ (రూ.10.75 కోట్లు) లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు) రసిక్ ధార్ (రూ.6 కోట్లు) కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు) టిమ్ డేవిజ్ (రూ. 3 కోట్లు) జాకబ్ బెథెల్ (రూ. 2.60 కోట్లు) సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు) పడిక్కల్ (రూ. 2 కోట్లు) తుషార (రూ. 1.60 కోట్లు) రొమరియో (రూ. 1.50 కోట్లు ఇన్‌గిడి (రూ. 1 కోటి) స్వప్నిల్ సింగ్ (రూ.50 లక్షలు) మనోజ్ (రూ. 30 లక్షలు) మోహిత్ రాఠి (రూ. 30 లక్షలు) అభినందన్ (రూ. 30 లక్షలు) స్వస్తిక్ చికార (రూ. 30 లక్షలు) చదవండి: Mohammed Siraj: బిగ్‌బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే! -
వెంకటేశ్ అయ్యర్, నరైన్ కాదు.. కేకేఆర్ కెప్టెన్‌గా అతడే!?
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. ఈ మెగా వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు తమకు కావల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ముఖ్యంగా కెప్టెన్లు రిటైన్ చేసుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ ఫ్రాంచైజీలు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ఢిల్లీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టే అవకాశముండగా.. పంజాబ్ కింగ్స్ సారథిగా శ్రేయస్ అయ్యర్ ఎంపిక కావడం దాదాపు ఖారారైంది. అదే విధంగా లక్నో సూపర్ జెయింట్స్ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కానీ కేకేఆర్, ఆర్సీబీ పరిస్థితులు వేరు. తొలుత ఆర్సీబీ రాహుల్‌ను సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలు అప్పగిస్తుందని అంత భావించారు. మరోవైపు కేకేఆర్ రిషబ్ పంత్‌పై కన్నేసిందని వార్తలు వినిపించాయి. కానీ వేలంలో ఈ రెండూ జరగలేదు. దీంతో ఈ రెండు ఫ్రాంచైజీల కెప్టెన్లగా ఎవరు ఎంపిక అవుతారని అభిమానుల ఆతృతగా ఎదురు చూస్తున్నారు.కేకేఆర్ కెప్టెన్‌గా రహానే..!అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా వెటరన్ అజింక్య రహానే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు పగ్గాలను రహానే అప్పగించాలని కేకేఆర్ మేనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వేలంలో ఆఖరి నిమిషంలో అజింక్య రహానేను కోల్‌కతా కొనుగోలు చేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తొలి రోజు వేలంలోకి వచ్చిన రహానేను దక్కించుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కానీ రెండో రోజు వేలంలో ఆఖరి రౌండ్లో కనీస ధర రూ.1.75 కోట్లకు నైట్ రైడర్స్ కైవసం చేసుకుంది. కాగా కేకేఆర్ జట్టులో సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ వంటి ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. వీరిద్దరూ గత కొన్ని సీజన్లగా కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే వీరిద్దరూ కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటకి కేకేఆర్ ఫ్రాంచైజీ మాత్రం రహానే వైపే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వెంకటేశ్ అయ్యర్‌ను ఏకంగా రూ.23.75 కోట్ల భారీ ధర వెచ్చించి మరి తిరిగి కేకేఆర్ సొంతం చేసుకుంది.దీంతో అతడికే కేకేఆర్ తమ జట్టు పగ్గాలు అప్పగిస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ అతడి కెప్టెన్‌గా అనువభవం లేనుందన కేవలం ఆల్‌రౌండర్‌గానే కొనసాగనున్నట్లు సమాచారం. కాగా రహానే గతంలో కేకేఆర్‌కు కూడా ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: IPL 2025: రిషభ్ పంత్ భావోద్వేగం.. ఎమోషనల్ నోట్ వైరల్ -
వెంకటేష్ అయ్యర్‌కు జాక్ పాట్.. ఏకంగా రూ. 23.75 కోట్లు
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఊహించని ధర పలికాడు. అయ్యర్‌ను ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అయ్యర్ కోసం కేకేఆర్, ఆర్సీబీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. ఆఖరికి ఆర్సీబీ పోటీ నుంచి తప్పుకోవడంతో అయ్యర్‌ను కోల్‌కతా సొంతం చేసుకుంది. గత సీజన్లో కూడా వెంకటేష్ అయ్యర్ కేకేఆర్కే ప్రాతినిథ్యం వహించాడు. అయితే వేలానికి ముందు అతడిని కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు.కాగా వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్-2021 సీజన్లో కేకేఆర్ తరపునే అరంగేట్రం చేశాడు. తొలుత అతడిని రూ.20లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అద్బుతంగా రాణించడంతో 2022 వేలానికి ముందు రూ. 8 కోట్లకు అయ్యర్‌ను రిటైన్ చేసుకుంది.ఆ తర్వాత రెండు సీజన్ల పాటు తమ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వెంకటేష్‌ను ఐపీఎల్-2025 వేలంలోకి కేకేఆర్ విడిచిపెట్టింది. మళ్లీ ఇప్పుడు ఏకంగా 23.75 కోట్లు వెచ్చించి మరి కొనుగోలు చేసింది. ఐపీఎల్లో వెంకటేష్ ఇప్పటివరకు 50 మ్యాచ్‌లు ఆడి 1326 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఓసెంచరీ, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి, -
ఖరీదైన ఇంటిని కొన్న రింకూ సింగ్.. ఎన్ని కోట్లంటే?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌ను రూ. 13 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫ్రాంచైజీ నుంచి భారీగా సొమ్ము రావడంతో రింకూ సింగ్ ఎట్టకేలకు తన సొంతంటి కలను నేరవేర్చుకున్నాడు.అలీఘర్‌లోని ఓజోన్ సిటీలో ఖరీదైన విల్లాను రింకూ సింగ్ కొనుగోలు చేశాడు. 500 చదరపు గజాల స్థలం గల ఇంటిని రూ. 3.5 కోట్ల భారీ మొత్తం వెచ్చించి రింకూ సొంతం చేసుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఒకప్పుడు ఇదే ఓజోన్ సిటీలోని రింకూ తండ్రి గ్యాస్ సిలిండర్లు వేసి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఇప్పుడు అదే సొసైటీలో కొడుకు విల్లాను కొనుగోలు చేసి తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. దీంతో రింకూపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది కాదా సక్సెస్ అని రింకూను కొనియాడుతున్నారు.ఒకే ఓవర్లో 5 సిక్సర్లు..కాగా ఐపీఎల్-2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ పేసర్ యశ్‌దయాల్ బౌలింగ్‌లో ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది రింకూ ఓవర్ నైట్‌స్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత భారత జట్టులోకి రింకూ ఎంట్రీ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో కూడా రింకూ తన మార్క్‌ను చూపించాడు. కాగా ఐపీఎల్ 2024 సీజన్ రింకూ సింగ్‌కు రూ. 55 లక్షల వేతనం మాత్రమే వచ్చేది. కానీ తన అద్బుతప్రదర్శనలతో రింకూ ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడు.ఈ ఏడాది నుంచి అతడు రూ. 13 కోట్లు అందుకుంటాడు. కేకేఆర్ అంటిపెట్టుకున్న వారిలో రింకూనే టాప్ రిటెన్షన్ కావడం గమనార్హం. రింకూ సింగ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సన్నద్దమవుతున్నాడు.చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ -
కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్‌గా బ్రావో
న్యూఢిల్లీ: టి20 క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో తన సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలికాడు. 2025 ఐపీఎల్ సీజన్ నుంచి అతను కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) టీమ్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. గత ఏడాది ఈ బాధ్యతలు నిర్వర్తించిన గౌతమ్ గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్‌గా వెళ్లగా, అతని స్థానంలో బ్రావోను ఎంచుకున్నట్లు కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. నైట్‌రైడర్స్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిత్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌లతో కలిసి అతను పని చేస్తాడు. కేకేఆర్ టీమ్ యాజమాన్యానికి చెందిన ఇతర టి20 జట్లు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్, అబుదాబి నైట్‌రైడర్స్‌లకు కూడా ఇన్చార్జ్గా ఉండేలా ఈ గ్రూప్‌తో బ్రావో దీర్ఘకాలిక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ ప్రకటనకు ముందు రోజే గురువారం తాను ఆటగాడిగా అన్ని స్థాయిల నుంచి రిటైర్ అవుతున్నట్లు బ్రావో ప్రకటించాడు. ఐపీఎల్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన బ్రావో 2011 నుంచి 2022 వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడు. మధ్యలో రెండేళ్లు చెన్నైపై నిషేధం ఉన్న సమయంలో అతను గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సీఎస్కే తరఫున ఆడిన 10 సీజన్లలో 3 సార్లు టైటిల్ గెలిచిన జట్టులో అతను ఉన్నాడు. రిటైర్ అయ్యాక గత రెండు సీజన్లు చెన్నైకే బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన బ్రావో ఇప్పుడు ఆ జట్టుకు దూరమయ్యాడు. -
సీఎస్కేకు బై బై.. కేకేఆర్ మెంటార్‌గా వెస్టిండీస్ లెజెండ్
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కొత్త మెంటార్ వచ్చేశాడు. తమ జట్టు మెంటార్‌గా వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావోను కేకేఆర్ మెనెజ్‌మెంట్ నియమించింది. గత రెండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన బ్రావో.. ఇప్పుడు కేకేఆర్‌తో జతకట్టాడు. గత సీజన్లో కోల్‌కతా మెంటార్‌గా పనిచేసిన గౌతం గంభీర్ స్ధానాన్ని ఈ కరేబియన్ లెజెండ్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని కేకేఆర్ అధికారికంగా ధ్రువీకరించింది. మా కొత్త మెంటార్, డిజే 'సర్ ఛాంపియన్' బ్రావోకు హాలో చెప్పండి. ఛాంపియన్ సిటీకి స్వాగతిస్తున్నాము కేకేఆర్ ఎక్స్‌లో రాసుకొచ్చింది.నైట్‌రైడర్స్‌తో ప్రత్యేక బంధం..కాగా బ్రావో ఐపీఎల్లో ఎప్పుడూ కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించినప్పటకి.. నైట్‌రైడర్స్ యాజమాన్యంతో అతడికి మంచి అనుబంధం ఉంది. 2013 నుంచి 2020 వరకు సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2023 సీజన్లో కూడా టీకేఆర్కు బ్రావో ప్రాతినిథ్యం వహించాడు. కాగా కేకేఆర్, టీకేఆర్ ఇరు ఫ్రాంచైజీల యాజమాన్యం ఒక్కరే కావడం విశేషం.ప్రొఫెషనల్ క్రికెట్‌కు విడ్కోలు..కాగా అన్ని రకాల క్రికెట్‌కు బ్రావో విడ్కోలు పలికాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 అనంతరం ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటానని సీజన్ ఆరంభంలోనే వెల్లడించాడు. కానీ దురదృష్టవశాత్తూ టోర్నీ మధ్యలో గాయపడడంతో.. సీజన్ మొత్తం ఆడకుంటానే తన కెరీర్‌ను ముగించాడు. -
శ్రేయస్ అయ్యర్‌కు షాక్.. కేకేఆర్ కెప్టెన్‌గా సూర్యకుమార్!?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు అన్ని ఫ్రాంచైజీలు కీలక మార్పులు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న మెగా వేలం కోసం ఆయా జట్లు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.ఇప్పటికే ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కోతా నైట్‌రైడర్స్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఐపీఎల్-2024లో తమ జట్టును ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కేకేఆర్ యాజమాన్యం విడిచిపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కేకేఆర్ కెప్టెన్‌గా సూర్యకుమార్..?గౌతం గంభీర్ తర్వాత కేకేఆర్‌కు టైటిల్ అందించిన రెండో కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. అయితే మెంటార్‌గా పనిచేసిన గౌతం గంభీర్.. ఇప్పుడు భారత ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టడంతో తమ కెప్టెన్ కూడా మార్చాలని కేకేఆర్ భావిస్తున్నట్లు వినికిడి.ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకోవాలని కేకేఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. అందుకు బదులుగా కేకేఆర్ అయ్యర్‌ను ముంబైకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు ఫ్రాంచైజీల మధ్య డీల్ కుదిరినట్లు సమాచారం. సూర్యకు అయ్యర్ స్ధానంలో తమ జట్టు పగ్గాలని అప్పగించాలని కేకేఆర్ ప్లాన్ చేస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా గంభీర్ స్ధానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మెంటార్ బాధ్యతలు చేపట్టనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.చదవండి: AUS vs ENG: లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘన విజయం -
గంభీర్ స్ధానంలో దక్షిణాఫ్రికా లెజెండ్..?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ కోలకతా నైట్‌రైడర్స్ కొత్త మెంటార్ వేటలో పడింది. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ మెంటార్ పనిచేసిన గౌతం గంభీర్.. భారత హెడ్‌కోచ్‌గా వెళ్లిపోవడంతో ఆ పోస్ట్ ఖాళీ అయింది. దీంతో గంభీర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు కేకేఆర్ యాజమాన్యం తమ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే మెంటార్ రేసులో ఇప్పటికే కుమార సంగర్కర, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్లు వినిపించగా.. తాజాగా ఈ లిస్ట్‌లోకి దక్షిణాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కల్లిస్ పేరు చేరింది. ‘సంగ్బాద్ ప్రతిదిన్’ రిపోర్ట్ ప్రకారం.. కేకేఆర్ మెంటార్ రేసులో సంగర్కకర, పాంటింగ్ కంటే కల్లిస్ ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.కల్లిస్కు కేకేఆర్ ఫ్రాంచైజీతో మంచి అనుబందం ఉంది. ఈ దిగ్గజ ఆల్‌రౌండర్ గతంలో గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ తరపున రెండు సీజన్ల పాటు ఆడాడు. అంతేకాకుండా కేకేఆర్ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్గానూ కల్లిస్ పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే కేకేఆర్ యాజమాన్యం కల్లిస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.చదవండి: IPL 2025: డుప్లెసిస్పై వేటు..? ఆర్సీబీ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ఆటగాడు! -
గంభీర్ అవుట్.. శ్రీలంక క్రికెట్ దిగ్గజానికి ఛాన్స్?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు శ్రీలంక మాజీ కెప్టెన్, రాజస్తాన్ రాయల్స్ టీమ్ డైరెక్టర్ కుమార సంగక్కర కొత్త ఫ్రాంచైజీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. రాజస్తాన్ రాయల్స్ హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియామకం దాదాపుగా ఖారారు కావడంతో.. టీమ్ డైరెక్టర్‌గా ఉన్న సంగక్కర ఆ ఫ్రాంచైజీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.స్పోర్ట్స్ టుడే రిపోర్టు ప్రకారం.. ఐపీఎల్ 2025లో సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా సంగక్కర బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమైనట్లు వినికిడి. ఇప్పటికే అతడితో కేకేఆర్ ఫ్రాంచైజీ చర్చలు జరిపినట్లు స్పోర్ట్స్ టుడే తమ కథనంలో పేర్కొంది. కాగా గత సీజన్లో కేకేఆర్ మెంటార్‌గా పనిచేసిన గౌతం గంభీర్.. ఆఫ్రాంచైజీని వీడి భారత్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో అతడి స్ధానాన్ని ఇంకా ఎవరితో కేకేఆర్ మెనెజ్‌మెంట్ భర్తీ చేయలేదు. ఈ క్రమంలోనే సంగక్కరతో కేకేఆర్ మెనెజ్‌మెంట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ శ్రీలంక క్రికెట్ దిగ్గజం స్ట్రోక్‌ప్లే, మైండ్ గేమ్‌కు పెట్టింది పేరు. అతడి నేతృత్వంలోనే ఐపీఎల్-2022లో రాజస్తాన్ ఫైనల్‌కు చేరింది. -
IPL 2025: అయ్యర్‌పై వేటు?.. కేకేఆర్ కెప్టెన్‌గా సూర్య?!
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చే ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మారనున్నాడా? ఏకంగా కేకేఆర్ సారథిగా బాధ్యతలు చేపట్టబోతున్నాడా? ఇలా అయితే.. శ్రేయస్ అయ్యర్ పరిస్థితి ఏమిటి? అంటూ సోషల్ మీడియాలో చర్చకు తెరతీశారు ఈ ఇద్దరు క్రికెటర్ల అభిమానులు. ఓ స్పోర్ట్స్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణం.హార్దిక్ రాకతోనే గందరగోళం!ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 2012లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్.. రెండేళ్ల తర్వాత కేకేఆర్‌లో చేరాడు. టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సారథ్యంలో 2014లో టైటిల్ గెలిచిన కేకేఆర్ జట్టులో అతడు సభ్యుడు. అయితే, తగినన్ని అవకాశాలు రాకపోవడంతో 2017లో కోల్‌కతా ఫ్రాంఛైజీని వీడి.. తిరిగి ముంబై గూటికి చేరాడు సూర్య.అప్పటి నుంచి ముంబై జట్టులో పాతుకుపోయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అంచెలంచెలుగా ఎదిగాడు. వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా సత్తా చాటి.. అనూహ్య రీతిలో టీమిండియా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో రోహిత్ శర్మపై వేటు వేసి అతడి స్థానంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ తన సారథిగా ప్రకటించిన విషయం తెలిసిందే.వాస్తవానికి.. ముంబై జట్టులో రోహిత్ గైర్హాజరీలో సూర్య కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ తర్వాత అతడే ముంబై పగ్గాలు చేపడతాడని విశ్లేషకులు భావించారు. అంతేకాదు.. మరో సీనియర్, టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా కూడా కెప్టెన్సీ అవకాశం ఉందని అంచనా వేశారు.అందుకే ముంబైని వీడాలనుకుంటున్నాడా?అయితే, ముంబై యాజమాన్యం మాత్రం భారీ ధరకు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్‌ను ట్రేడ్ చేసుకుని మరీ కెప్టెన్‌ను చేసింది. ఫలితంగా జట్టు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగా రోహిత్ శర్మకు మద్దతుగా బుమ్రా, సూర్య నిలవగా.. హార్దిక్ సీనియర్ల సపోర్టు లేక ఒంటరయ్యాడు. ఈ క్రమంలో ఒత్తిడిలో చిత్తై కెప్టెన్‌గా పూర్తిగా విఫలమయ్యాడు.ఇక హార్దిక్ రాకతో సందిగ్దంలో పడిన సూర్య.. ముంబై జట్టును వీడేందుకు సిద్ధపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేకేఆర్ ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌ను సంప్రదించిందని.. తమ జట్టులోకి వస్తే కెప్టెన్‌గా నియమిస్తామని ఆఫర్ చేసిందని ఓ వ్యక్తి వీడియో విడుదల చేశాడు. అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా.. సూర్య, శ్రేయస్ అయ్యర్ అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.కేకేఆర్ సారథి అయితే బాగుంటుంది!సూర్య మళ్లీ కేకేఆర్ గూటికి చేరి కెప్టెన్ అయితే బాగుంటుందని అతడి ఫ్యాన్స్ అంటుండగా.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో పదేళ్ల తర్వాత జట్టుకు ట్రోఫీ అందించిన శ్రేయస్‌ను తప్పించడం సరికాదని అతడి మద్దతుదారులు అంటున్నారు. ఇవన్నీ వట్టి వదంతులేనని.. నిరాధార వ్యాఖ్యలను నమ్మాల్సిన అవసరం లేదని కొట్టిపారేస్తున్నారు. శ్రేయస్‌ను కేకేఆర్ రిటైన్ చేసుకోవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.అయితే, ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉన్న సూర్య పట్ల కేకేఆర్ నిజంగా మొగ్గు చూపితే.. శ్రేయస్ వేలంలోకి వస్తాడని.. అతడిని ముంబై కొనుగోలు చేసే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. కాగా సూర్య ఇప్పటి వరకు ఓవరాల్‌గా 150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 3594 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 24 అర్ధ శతకాలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లలోనూ 4 శతకాలు బాదిన రికార్డు సూర్యకు ఉంది. 🚨𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐞𝐫 𝐑𝐮𝐦𝐨𝐮𝐫𝐬 🚨👀 KKR management unofficially contacted SKY for KKR captaincy from next year .( Rohit Juglan from Revzsports)pic.twitter.com/ClEVeuqcb4— KKR Vibe (@KnightsVibe) August 24, 2024 -
ఒకవేళ అదే జరిగితే ఆర్సీబీకి ఆడుతా: రింకూ సింగ్
ఐపీఎల్-2025 మెగా వేలానికి బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఇంకా ఆటగాళ్ల రిటెన్షన్ రూల్స్‌పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం ఇంకా ఎటువంటి ఆధికారిక ప్రకటన చేయలేదు.వాస్తవానికి మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు గరిష్టంగా ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకొని మిగతా ఆటగాళ్లను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని గత నెలలో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్‌లో కూడా ఆయా ఫ్రాంచైజీలు ప్రస్తావించాయి. కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం ఆయా ఫ్రాంచైజీల అభ్యర్ధననను తిరష్కరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మెగా వేలాన్ని ఈ ఏడాది చివరలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టే ఆయా ఫ్రాంచైజీలు కూడా తమ జట్టులో సమూల మార్పులు దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఆర్సీబీకి ఆడాలని ఉంది: రింకూ ఇక ఐపీఎల్ మెగా వేలం వార్తల నేపథ్యంలో టీమిండియా ఫినిషర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్ తన మనసులోని మాటను బయట పెట్టాడు. ఒకవేళ కేకేఆర్ అతడిని రిటైన్ చేసుకోపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడాలన్న తన కోరికను రింకూ వ్యక్తపరిచాడు. విరాట్ కోహ్లి ఆర్సీబీలో ఉన్నందున ఆ ఫ్రాంచైజీకి ఆడాలనకుంటున్నట్లు అతడు తెలిపాడు.కాగా తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి రింకూ కేకేఆర్ తరపున ఆడుతున్నాడు. కొన్ని సీజన్లలో అతడిని కోల్‌కతా వేలంలోకి విడిచిపెట్టినప్పటకి తిరిగి మళ్లీ సొంతం చేసుకుంది. ఆ జట్టు ఫినిషర్‌గా రింకూ మారాడు. అయితే ఈ ఏడాది సీజన్లతో కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలిచినప్పటకి రింకూ మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో కేకేఆర్ తరపున 45 మ్యాచ్‌లు ఆడిన రింకూ 143.34 స్ట్రైక్ రేటుతో 893 పరుగులు చేశాడు. -
ముంబై ఇండియన్స్ కాదు.. నా ఫేవరేట్ ప్రత్యర్ధి ఆ జట్టే: కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆదివారం(ఆగస్టు 18)తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో విరాట్ సరదాగా ముచ్చటించాడు. ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ నుంచి పలు ప్రశ్నలు కోహ్లికి ఎదురయ్యాయి. తన ఫేవరేట్ క్రికెటర్లను ఎంచుకోమని ఎంఎస్ ధోని, ఎబీ డివిలియర్స్ పేర్లు అప్షన్స్ ఇవ్వగా.. కోహ్లి ఇద్దరూ కూడా తనకు ఇష్టమైన వారేనని తెలివగా సమాధనమిచ్చాడు. ఆ తర్వాత తనకు ఇష్టమైన షాట్ ఫ్లిక్ లేదా కవర్ డ్రైవ్? అని అడగ్గా.. అందుకు కవర్ డ్రైవ్ తన ఫేవరేట్ షాట్ అని చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ఐపీఎల్లో తన ఫేవరేట్ ప్రత్యర్ధి జట్టు ఏదన్న ప్రశ్న కోహ్లికి ఎదురైంది. అందుకు అప్షన్స్గా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు కాస్త సమయం తీసుకున్న కోహ్లి.. ఆలోచించి కేకేఆర్‌ను తనకు ఇష్టమైన ప్రత్యర్ధిగా ఎంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా భారత జట్టుతో పాటు ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కూడా విరాట్ రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగతున్నాడు. 2008 తొలి సీజన్ నుంచి ఆర్సీబీలోనే కోహ్లి ఉన్నాడు.తొట్టతొలి సీజన్ నుంచి ఒక ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడు కోహ్లినే. ఇక ఐపీఎల్లో కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్ అంటే అభిమానలకు పండగే. ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు హోరహోరీగా జరుగుతాయి. ఇప్పటివరకు ఇరు జట్లు 34 మ్యాచ్‌ల్లో తలపడగా.. కేకేఆర్ 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఆర్సీబీ 14 సార్లు గెలుపొందింది. -
IND vs SL: 'గంభీర్ భయ్యా వల్లే ఇదంతా.. నేను అతడికి రుణపడి ఉంటా'
ఐపీఎల్ స్టార్, యువ పేసర్ హర్షిత్ రాణా బంపరాఫర్ తగిలింది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు భారత సెలక్టర్లు హర్షిత్ రాణాకు పిలుపునిచ్చారు. లంకతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారత జట్టులో రాణాకు చోటు దక్కింది. భారత వన్డే జట్టులో రాణాకు చోటు దక్కడం ఇదే తొలిసారి.జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు రాణా ఎంపికైనప్పటికి అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు శ్రీలంక పర్యటనలోనైనా భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయాలని ఈ ఢిల్లీ యువ పేసర్ ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే తను స్దాయికి చేరుకోవడంలో ప్రస్తుత భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్‌ది కీలక పాత్ర అని హర్షిత్ తెలిపాడు. కాగా గంభీర్, రాణా ఇద్దరూ ఢిల్లీ క్రికెట్‌కు ఆడి వచ్చిన వారే కావడం గమనార్హం. అంతేకాకుండా ఐపీఎల్లో గంభీర్ మెంటార్‌గా పనిచేసిన కేకేఆర్ జట్టులో రాణా సభ్యునిగా ఉన్నాడు."నేను ఎప్పుడూ నా కష్టాన్నే నమ్ముకుంటాను. కానీ కొన్ని సార్లు సీనియర్ జట్లలో చోటుదక్కినప్పడు ఒక్కడినే రూమ్‌లోని కూర్చోని బాధపడేవాడిని. నా ఈ అద్భుత ప్రయాణంలో నేను ముగ్గురికి కృతజ్ఝతలు తెలపాలనకుంటున్నాను. అందులో ఒకరు మా నాన్న. నేను ఈ స్ధాయికి చేరుకోవడానికి ఆయన ఎంతగానే కృషి చేశారు. ఆ తర్వాత వ్యక్తిగత కోచ్ అమిత్ భండారీ ( ఢిల్లీ మాజీ పేసర్). భండారీ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇక అందరికంటే గంభీర్ భయ్యాకు నేను రుణపడి ఉంటాను. ఆట పట్ల నా ఆలోచన విధానం గంభీర్ భయ్యా వల్లే మారింది. ఆయనలాంటి వ్యక్తితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. మనకు ఎంత టాలెంట్ ఉన్నప్పటకి ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉండాలి. అప్పుడే మనం విజయం సాధించలగము. గంభీర్‌ను చూసి ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో నేను నేర్చుకున్నాను. గౌతీ భయ్యా నాతో ఎప్పుడూ చెప్పేది ఒక్కటే విషయం. నేను నిన్ను నమ్ముతున్నాను, కచ్చితంగా నీవు విజయం సాధిస్తావని నాతో చెప్పేవారు" న్యూస్ 18తో మాట్లాడుతూ రాణా పేర్కొన్నాడు.ఐపీఎల్లో అదుర్స్..ఐపీఎల్-2024లో హర్షిత్ రానా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధిలను ముప్పుతిప్పలు పెట్టాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేసి తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చేవాడు. కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలవడంలో రానా కీలక పాత్ర పోషించాడు.ఓవరాల్‌గా ఈ ఏడాది ఐపీఎల్లో 13 మ్యాచ్‌లు ఆడిన రానా 19 వికెట్లు పడగొట్టి.. కేకేఆర్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కూడా 7 మ్యాచ్‌లు ఆడిన రానా.. 28 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఇక శ్రీలంక పర్యటన జూలై 27 నుంచి ప్రారంభం కానుంది. -
సూర్య కెప్టెన్‌గానూ సరైనోడే: గంభీర్ ఆరోజు ఏమన్నాడంటే!
‘‘మేము అతడిని ఎల్లప్పుడూ నాయకుడి లక్షణాలున్న ఆటగాడిగానే పరిగణిస్తాం. అందుకు తగ్గట్లుగానే అతడిని తీర్చిదిద్దుతాం. కేకేఆర్‌కు, మిగతా ఫ్రాంఛైజీలకు ఉన్న తేడా ఇదే. అతడు వీలైనంత త్వరగా పరిణతి సాధించాలనే మేము కోరుకుంటున్నాం.మైదానంలో మరింత చురుగ్గా కదులుతూ.. భావోద్వేగాలను నియంత్రించుకోగలగాలి. వ్యక్తిగా, ఆటగాడిగా అతడికి మంచి భవిష్యత్తు ఉంటుందని కచ్చితంగా చెప్పగలను’’--టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ గురించి ప్రస్తుత హెడ్ కోచ్ గౌతం గంభీర్ 2015లో అన్న మాటలివి. నాడు గౌతం గంభీర్ ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ హోదాలో ఉండగా.. సూర్య కూడా కేకేఆర్కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఈ క్రమంలో సూర్యను కేకేఆర్ వైస్ కెప్టెన్‌గా ప్రకటిస్తూ గంభీర్ చేసిన వ్యాఖ్యలే ఇవి. అయితే, ఆ తర్వాత రెండేళ్లకు గంభీర్, సూర్య.. ఇద్దరూ కోల్‌కతా జట్టును వీడారు.సూర్య ముంబై ఇండియన్స్‌కు వెళ్లిపోగా.. గంభీర్ ఢిల్లీ డేర్‌డెవిల్స్(ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) పగ్గాలు చేపట్టాడు. అలా ఇద్దరి దారులు వేరయ్యాయి. సూర్య ముంబై జట్టుతో చేరిన తర్వాత వరల్డ్‌క్లాస్ బ్యాటర్‌గా ఎదిగాడు.అదొక్కటే చేయలేకపోయానుటీమిండియాలో ఎంట్రీ ఇచ్చి ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు. మరోవైపు.. ఢిల్లీ ఫ్రాంఛైజీతో పొసగకపోవడంతో గంభీర్ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు.తాను కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో సూర్య ప్రతిభను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయానని.. అదొక్కటే తన కెరీర్లో రిగ్రెట్‌గా మిగిలిపోయిందని గౌతీ ఓ సందర్భంలో చెప్పాడు.కాలం గిర్రున తిరిగింది. తొమ్మిదేళ్ల తర్వాత గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితుడు కాగా.. సూర్య టీమిండియా టీ20 కెప్టెన్ రేసులో ముందుకు దూసుకువచ్చాడు.సూర్యకే గంభీర్ ఓటు రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో అతడు పోటీ పడుతున్నాడు. కెప్టెన్ నియామకం విషయంలో గంభీర్ అభిప్రాయం కూడా కీలకం కానుంది.ఈ నేపథ్యంలో గతంలో సూర్యను ఉద్దేశించి గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హార్దిక్‌ను కాదని.. సూర్య వైపే అతడు మొగ్గుచూపుతాడనే ప్రచారం నేపథ్యంలో ఈ కామెంట్స్‌ను ప్రస్తావిస్తున్నారు నెటిజన్లు.కాగా శ్రీలంకతో జూలై 27 నుంచి మొదలుకానున్న టీ20 సిరీస్‌తో కోచ్‌గా గంభీర్ ప్రస్థానం మొదలు కానుంది. ఈ సిరీస్ నుంచే సూర్య పూర్తిస్థాయి కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చదవండి: భారీ రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్.. ఇంకో 160 పరుగులు చేస్తే -
సైనా నెహ్వాల్‌కు సారీ చెప్పిన కేకేఆర్ స్టార్.. అసలేం జరిగిందంటే?
కోల్‌కతా నైట్ రైడర్స్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీపై తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ను రఘువంశీ అవహేళన చేయడమే ఇందుకు కారణం. అయితే తన తప్పు తెలుసుకున్న ఈ యువ క్రికెటర్.. సైనా నెహ్వాల్‌కు క్షమాపణలు కూడా తెలిపాడు.అసలేం జరిగిందంటే..?బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్‌బాల్ వంటి క్రీడలు శారీరకంగా చాలా కష్టమైనవని, కానీ అభిమానులు మాత్రం ఇతర క్రీడల కంటే క్రికెట్‌కే ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తారని సైనా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యనించింది."సైనా ఏం చేస్తుందో, రెజ్లర్లు, బాక్సర్లు, నీరజ్ చోప్రా ఏం చేస్తున్నారని అందరూ తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రీడాకారుల గురించి దాదాపుగా అందరికీ తెలుసు. ఎందుకంటే మేము మేము మంచి ప్రదర్శనలు కనబరిచి తరచుగా వార్తాపత్రికలలో వస్తుంటాం. మా లాంటి క్రీడాకారుల వల్ల భారత్‌కు గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉంది. కానీ మన దేశంలో మాత్రం క్రీడా సంస్కృతి పెద్దగా లేదు. అందరి దృష్టి క్రికెట్‌పైనే ఉంటోందని కొన్నిసార్లు బాధేస్తుంది. క్రికెట్‌కు మిగితా క్రీడలకు చాలా తేడా ఉంది. క్రికెట్‌తో పోలిస్తే బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, ఇతర క్రీడలు శారీరకంగా చాలా కఠినమైనవి. షటిల్ తీసుకొని సర్వ్ చేసేంత సమయం కూడా ఉండదు. అతి కష్టం మీద ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది. కానీ క్రికెట్లో మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు. అయినప్పటకి క్రికెట్టే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తుందని" అని నిఖిల్ సింహా పోడ్కాస్ట్లో సైనా నెహ్వాల్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో సైనా వ్యాఖ్యలపై స్పందించిన రఘువంశీ వివాదస్పద ట్వీట్(ఎక్స్) చేశాడు. ‘‘బుమ్రా 150 కి.మీ వేగంతో ఆమె తలపైకి బౌన్సర్ బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం’’ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. దీంతో అతడిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. వెంటనే తన తప్పును గ్రహించిన రఘువంశీ తన చేసిన పోస్ట్‌ను డిలీట్ చేశాడు. ఆమె సారీ చెబుతూ మరో పోస్ట్ చేశాడు.అందరూ నన్ను క్షమించండి. నా వ్యాఖ్యలను సరదగా తీసుకుంటారు అనుకున్న. కానీ తర్వాత ఆలోచిస్తే ఆర్ధంలేని జోక్‌లా అన్పించింది. నేను నా తప్పును గ్రహించాను. అందుకే హృదయపూర్వకంగా క్షమాపణలు తెలుపుతున్నానని ఎక్స్‌లో రఘువంశీ మరో పోస్ట్ చేశాడు. కాగా 2024 ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున అరంగేట్రం చేసిన రఘువంశీ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తం 10 ఇన్నింగ్స్ ఆడి.. 115.24 స్ట్రైక్ రేట్‌తో 163 పరుగులు చేశాడు. Saina Nehwal Stoodup and Spoken Some Harsh Facts 🔥 pic.twitter.com/gaF9fSROXc— Gems of Shorts (@Warlock_Shabby) July 11, 2024 -
KKR: ద్రవిడ్ కాదు.. కోల్‌కతా కొత్త మెంటార్‌గా దిగ్గజ బ్యాటర్?
కోల్‌కతా నైట్ రైడర్స్.. ఐపీఎల్‌లోని విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరొందింది. ముంబై ఇండియన్స్(5), చెన్నై సూపర్ కింగ్స్(5) తర్వాత అత్యధిక టైటిల్స్ సాధించిన రెండో జట్టుగా నిలిచింది.టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014 సీజన్లలో ట్రోఫీ గెలిచిన కోల్‌కతా(కేకేఆర్).. ఈ ఏడాది చాంపియన్‌గా నిలిచింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐపీఎల్-2024 విజేతగా అవతరించింది.ఈ విజయంలో కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో పాటు మెంటార్‌గా వ్యవహరించిన గంభీర్ పాత్ర కూడా కీలకం. ఈ నేపథ్యంలోనే అతడు టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపిక కావడం విశేషం.అందుకే రాహుల్ ద్రవిడ్ స్థానంలోఇంతవరకు శిక్షకుడిగా పనిచేసిన అనుభవం లేకపోయినా కేకేఆర్ విజయం సాధించిన తీరుతో బీసీసీఐ గౌతీపై నమ్మకం ఉంచింది. అందుకే రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని అతడితో భర్తీ చేసింది. శ్రీలంకతో సిరీస్ సందర్భంగా గౌతీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.ఈ నేపథ్యంలో కేకేఆర్ జట్టు కొత్త మెంటార్ ఎవరా అని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గంభీర్ స్థానంలో ద్రవిడ్ ఈ బాధ్యతలు స్వీకరిస్తాడని ఇన్నాళ్లుగా ప్రచారం జరగగా.. తాజాగా కొత్త పేరు తెరమీదకు వచ్చింది.కేకేఆర్ మెంటార్‌గా సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ జాక్వెస్ కలిస్ కేకేఆర్ మెంటార్‌గా రానున్నాడని సమాచారం. అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారించిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఐపీఎల్‌లోనూ సత్తా చాటిన విషయం తెలిసిందే.కేకేఆర్ 2012, 2014లో టైటిల్ గెలిచిన జట్టులో కలిస్ సభ్యుడు. గంభీర్ కెప్టెన్సీలో కోల్‌కతాకు ఆడిన ఈ కేప్‌టౌన్ స్టార్.. 2015లో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కొత్త అవతారం ఎత్తాడు.అనంతరం నాలుగు సీజన్ల పాటు కేకేఆర్ హెడ్ కోచ్‌గానూ వ్యహరించాడు. ఈ పదవి నుంచి వైదొలిగన తర్వాత సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కలిస్ నియమితుడయ్యాడు.ఈ నేపథ్యంలో తమతో సుదీర్ఘ అనుబంధం ఉన్న జాక్వెస్ కలిస్‌తో తిరిగి జట్టు కట్టేందుకు కేకేఆర్ యాజమాన్యం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గంభీర్ స్థానంలో కలిస్‌ను తమ మెంటార్‌గా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. చదవండి: హెడ్ కోచ్ గంభీర్‌కు షాకిచ్చిన బీసీసీఐ!.. ఏమిజరిగిందంటే? -
రోహిత్ భయ్యా నన్ను మాట్లాడనివ్వలేదు: కేకేఆర్ మాజీ కెప్టెన్
‘‘గతేడాది నేను కెప్టెన్‌గా ఉన్న సమయంలో రోహిత్ భయ్యా దగ్గరకు వెళ్లి నా మనసులో చెలరేగుతున్న అలజడి గురించి పంచుకున్నాను. రెండు మ్యాచ్‌లు గెలిచాం.. రెండు మ్యాచ్‌లు ఓడిపోయాం.నాకేమీ అర్థం కావడం లేదు భయ్యా అన్నాను. అప్పుడు.. ‘నితీశ్.. ఇంతకీ కెప్టెన్సీ అంటే ఏమనుకుంటున్నావు? అని అడిగాడు.వెంటనే నా మనసులో ఉన్నదంతా కక్కేయాలని.. ఏదో చెప్పేందుకు ప్రయత్నించాను. కానీ.. రోహిత్ భయ్యా నన్ను మాట్లాడనివ్వలేదు.‘కెప్టెన్సీ అంటే అసలేమీ లేదు. బౌలర్లను మారుస్తూ.. ఫీల్డర్లనూ అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి మార్చడం అంతే. ఫలితం నీకు అనుకూలంగా వచ్చిందనుకో.. నువ్వు బాగానే ఉంటావు.ఒకవేళ నువ్వు ఆశించినది జరగలేదనుకో.. నువ్వు ఎంత మంచిగా కెప్టెన్సీ చేసినా ఎవరూ నీ గురించి మాట్లాడుకోరు. కాబట్టి నిన్ను నువ్వు మెరుగుపరచుకుంటూ.. నీ ఆట, నైపుణ్యాలపై దృష్టి పెట్టి ముందుకు సాగాలంతే.ఏ విషయాన్నైనా క్లిష్టంగా భావించనంత వరకు అంతా బాగానే ఉంటుంది. నువ్వు తెలివైన, తేలికైన మార్గాన్నే ఎంచుకోవాలి’ అని భయ్యా నాతో అన్నాడు.ఆరోజు నన్ను నేను సమాధానపరచుకునేలా నాలో స్ఫూర్తి నింపాడు’’ అని కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ నితీశ్ రాణా గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.కాగా గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ గతేడాది ఐపీఎల్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో నితీశ్ రాణా కేకేఆర్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. బ్యాటర్‌గా ఫర్వాలేదనిపించినా కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడు.కేకేఆర్ తరఫున 14 మ్యాచ్‌లు ఆడి 413 పరుగులు చేసిన నితీశ్ రాణా.. జట్టును ప్లే ఆఫ్స్ మాత్రం చేర్చలేకపోయాడు. ఈ క్రమంలో ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్ తిరిగి రాగా.. కేకేఆర్ మేనేజ్మెంట్ అతడిని మళ్లీ కెప్టెన్‌గా నియమించింది.అయితే, తాను కేకేఆర్ సారథిగా ఉన్న సమయంలో వరుస వైఫల్యాల నేపథ్యంలో నాటి ముంబై ఇండియన్స్ కెప్టెన్, ప్రస్తుత టీమిండియా సారథి రోహిత్ శర్మ విలువైన సూచనలు , సలహాలు ఇచ్చాడని నితీశ్ రాణా చెప్పుకొచ్చాడు. టీఆర్ఎస్ పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా ఐపీఎల్-2024లో కేవలం రెండు మ్యాచ్‌లు ఆడిన నితీశ్ 42 పరుగులు చేయగలిగాడు. అయితే, కేకేఆర్ ఈసారి చాంపియన్‌గా నిలవడంతో ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా మధుర జ్ఞాపకాలు సొంతం చేసుకున్నాడు. -
కోహ్లికి కూడా ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా? కేకేఆర్ స్టార్ రిప్లై వైరల్
ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణా. జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు.ఈ మెగా టోర్నీలో హర్షిత్ మొత్తంగా 13 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. తద్వారా తాజా సీజన్లో కేకేఆర్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా.. వరుణ్ చక్రవర్తి(21 వికెట్లు) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.కాగా ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఆటతోనే కాకుండా.. తనదైన వైల్డ్ సెలబ్రేషన్స్‌తోనూ అందరి దృష్టిని ఆకర్షించాడు హర్షిత్ రాణా. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా మయాంక్ అగర్వాల్ వికెట్ తీసిన తర్వాత ఫ్లైయింగ్ కిస్‌తో సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ 22 ఏళ్ల రైటార్మ్ పేసర్.మ్యాచ్ ఫీజులో 60 శాతం మేర కోతఈ నేపథ్యంలో బీసీసీఐ హర్షిత్‌ను మందలించింది. మరోసారి ఇలాగే అతి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ.. మ్యాచ్ ఫీజులో 60 శాతం మేర కోత విధించింది.ఇక ఆ తర్వాత హర్షిత్ రాణా మరోసారి ఇలా ఏ బ్యాటర్‌కు సెండాఫ్ ఇవ్వలేదు. అయితే, అతడి ప్రవర్తనపై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.భయ్యాతో మాట్లాడానుతాజాగా శుభాంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ హర్షిత్ రాణా ఈ విషయంపై స్పందించాడు. ‘‘నేను ఉద్దేశపూర్వకంగా ఆరోజు మయాంక్ భయ్యాకు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వలేదు. మయాంక్ భయ్యా బంతిని గాల్లోకి లేపగానే తన దగ్గరగా వెళ్లాను.ఆ సమయంలో వికెట్ సెలబ్రేట్ చేసుకునే క్రమంలో సరదాగా అలా చేశాను. కెమెరామెన్ కూడా నా వైపే ఫోకస్ చేశాడు. ఆ తర్వాత నేను ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మయాంక్ భయ్యాను కలిశాను.తనను అగౌరవపరిచే ఉద్దేశం నాకు లేదని చెప్పాను. ఆయన కూడా అర్థం చేసుకున్నాడు. మా ఇద్దరి మధ్య అవగాహన కుదిరింది’’ అని హర్షిత్ రాణా పేర్కొన్నాడు.విరాట్ కోహ్లికి కూడా ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా? ఈ క్రమంలో విరాట్ కోహ్లి విషయంలో కూడా ఇలాగే చేస్తావా అంటూ హోస్ట్ ప్రశ్నించగా.. ‘‘నేను ముందు చెప్పినట్లుగా.. కావాలని ఏదీ చేయను. ఆర్సీబీ మ్యాచ్‌లో కూడా నేను ఫ్లైయింగ్ కిస్ ఇస్తే చూడాలని చాలా మంది అనుకున్నారు.నన్ను చాలెంజ్ చేశారు. కానీ కోహ్లిని నేను ఎన్నటికీ టీజ్ చేయను. ఆయన పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది. కోహ్లి భయ్యా ఒక్కడే కాదు.. ప్రతి ఒక్క ఆటగాడిని నేను గౌరవిస్తాను.ఏదేమైనా కోహ్లి ముందు మాత్రం ఇలా అస్సలు చేయను’’ అని హర్షిత్ రాణా బదులిచ్చాడు. కాగా లీగ్ దశలో దుమ్ములేపిన కేకేఆర్.. ఫైనల్లో సన్‌రైజర్స్‌ను ఓడించి 2024 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. తద్వారా మూడో ట్రోఫీని అందుకుంది. ఇక విజయానంతరం కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ సైతం ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.చదవండి: ఐపీఎల్ సృష్టికర్త కుమార్తె.. వేల కోట్లకు వారసురాలు! ఆమె ప్రత్యేకత ఇదే! -
పెళ్లి పీటలెక్కిన టీమిండియా క్రికెటర్.. (ఫొటోలు)
-
పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్.. ఫొటో వైరల్
టీమిండియా క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ పెళ్లి పీటలెక్కాడు. తన చిరకాల ప్రేయసి శృతి రఘునాథన్ మెడలో ఆదివారం మూడు ముళ్లు వేశాడు. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నడుమ వెంకీ- శృతిల పెళ్లి సంప్రదాయ పద్ధతిలో వైభవోపేతంగా జరిగినట్లు తెలుస్తోంది.కాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 1994, డిసెంబరు 25న జన్మించాడు వెంకటేశ్ అయ్యర్. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. అంచెలంచెలుగా ఎదిగి టీమిండియాలో స్థానం సంపాదించాడు.టీమిండియా తరఫున అరంగేట్రంభారత్ వేదికగా 2021లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన వెంకీ.. మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు.తన అంతర్జాతీయ కెరీర్లో వెంకటేశ్ ఇప్పటి వరకు.. 2 వన్డే, 9 టీ20 మ్యాచ్‌లు ఆడి వరుసగా 24, 133 పరుగులు సాధించాడు. టీ20 ఫార్మాట్లో 5 వికెట్లు పడగొట్టాడు.ఇక ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వెంకటేశ్ అయ్యర్.. రైటార్మ్ మీడియం పేసర్ కూడా! అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే హార్దిక్ పాండ్యా వారసుడంటూ ప్రశంసలు అందుకున్నాడు.రాణించలేక అవకాశాలు కరువుకానీ అంచనాలు అందుకోలేక చతికిలపడి.. నిరాశజనక ప్రదర్శనతో టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్లో కేకేఆర్ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు వెంకటేశ్ అయ్యర్. మొత్తంగా 13 ఇన్నింగ్స్ ఆడి 370 పరుగులు సాధించాడు.ఐపీఎల్-2024 ఫైనల్లో అదరగొట్టిముఖ్యంగా ఫైనల్లో ఒంటిచేత్తో కేకేఆర్‌ను గెలిపించి చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి 26 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు.ఆఖరి వరకు అజేయంగా నిలిచి కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు.ఈ క్రమంలో మరోసారి టీమిండియా తలుపులు తట్టే అవకాశం దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడిలా వ్యక్తిగత జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ఆరంభించాడు వెంకటేశ్ అయ్యర్. అతడి శ్రీమతి శృతి రఘునాథన్ నిఫ్ట్(NIFT) నుంచి ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నట్లు సమాచారం. కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో ఆమె పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గతేడాది నవంబరులో ఈ జంటకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.చదవండి: జీవితంలో కష్టాలు సహజం.. ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా -
అతడు గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకురావచ్చా? అని అడిగాడు: గంభీర్
ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచిన విషయం విధితమే. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కేకేఆర్.. టోర్నీ అసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచి ముచ్చటగా మూడో సారి టైటిల్‌ను ముద్దాడింది.అయితే కేకేఆర్ విజేతగా నిలవడంలో ఆ జట్టు మెంటార్ గౌతం గంభీర్ ది కీలక పాత్ర. కేకేఆర్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన గౌతీ.. ఈసారి మెంటార్‌గా ట్రోఫీని అందించాడు. అయితే ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్ విజేతగా కేకేఆర్ నిలిచిన అనంతరం గంభీర్ ఇంటర్వ్యూలతో బీజీబీజీగా ఉన్నాడు. తాజాగా ఎన్డీటీవీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్.. కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నరైన్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, తను ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడడని గంభీర్ చెప్పుకొచ్చాడు.కాగా సునీల్ నరైన్ తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి కేకేఆర్ ఫ్రాంచైజీలోనే కొనసాగుతున్నాడు. ఈ ఏడాది సీజన్లో నరైన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఓపెనర్‌గా వచ్చి ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు.ఓవరాల్‌గా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సునీల్.. కేకేఆర్ మూడోసారి ఛాంపియన్‌గా నిలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. అయితే నరైన్‌ను ఓపెనర్‌గా పరిచయం చేసింది గౌతం గంభీర్‌నే. 2012 సీజన్లో నరైన్‌ను ఓపెనర్‌గా పరిచియం చేసి విజయవంతమైన గంభీర్.. సారథిగా కేకేఆర్‌కు తొలి టైటిల్‌ను అందించాడు.నా గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీఎల్‌కు తీసుకురావచ్చా?"నాది, సునీల్ నరైన్ మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది. అదే విధంగా మేము ఇద్దరం కూడా పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వము. ఐపీఎల్-2012 సీజన్లో తొలిసారి నరైన్‌తో నాకు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో జై పూర్లో మా ప్రాక్టీస్‌ను ముగించుకుని లంచ్ చేసేందుకు సిద్దమయ్యాం.. ఈ క్రమంలో నరైన్‌కు లంచ్‌కు పిలిచాను. నాకు ఇప్పటికి బాగా గుర్తు ఉంది. నేను పిలవగానే అతను చాలా సిగ్గుపడ్డాడు. లంచ్ సమయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. నా గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీఎల్‌కు తీసుకురావచ్చా? అని అడిగాడు. నరైన్ తన మొదటి సీజన్లో చాలా సైలెంట్‌గా ఉన్నాడు. కానీ నరైన్ ఇప్పుడు ఒకప్పుడులా లేడు. అతడితో నేను ఎదైనా మాట్లాడవచ్చు. సునీల్ కూడా నాతో స్వేఛ్చగానే మాట్లాడుతాడు. నేను ఎప్పుడు అతడిని సహచరుడిగా, స్నేహితుడిగా చూడలేదు. సునీల్ నా సొంత సోదరుడిలా భావించాను. తనకు ఏ అవసరమోచ్చినా నేను ముందుంటాను. అదే విధంగా నాకు ఏ సమస్య ఉన్నా తను కూడా ముందుంటాడు. మేము ఆడంబరంగా ఉండం. కానీ మా బాధ్యతను 100 శాతం నిర్వర్తించేందుకు అన్ని విధాలగా ప్రయత్నిస్తామని" ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు. -
టీమిండియా హెడ్‌కోచ్‌గా కాదు!.. గంభీర్ వ్యాఖ్యలు వైరల్
టీమిండియా కొత్త కోచ్ ఎవరన్న అంశంపై భారత క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తొలుత విదేశీ కోచ్‌ల పేర్లు వినిపించగా.. ఐపీఎల్-2024 ఫైనల్ తర్వాత మాత్రం ఇండియన్నే ఈ పదవి చేపట్టనున్నాడనే అభిప్రాయాలు బలపడ్డాయి.రాహుల్ ద్రవిడ్ స్థానంలో మాజీ ఓపెనర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ ఈ బాధ్యతలు స్వీకరించనున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఐపీఎల్ తాజా సీజన్ ఫైనల్ అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా గౌతీతో సుదీర్ఘ చర్చలు జరపడం.. గంభీర్ సైతం హెడ్‌కోచ్ పదవి పట్ల ఆసక్తిగా ఉన్నాడనే వార్తలు ఇందుకు ఊతమిచ్చాయి.అయితే, తాజాగా గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. తాను భారత ప్రధాన కోచ్ పదవి చేపట్టడం లేదని గంభీర్ ఒక రకంగా స్పష్టం చేశాడు. ఇంతకీ గౌతీ ఏమన్నాడంటే..‘‘కేకేఆర్ మూడో ట్రోఫీ గెలిచింది కాబట్టి.. డ్రెస్సింగ్‌రూం వాతావరణం మొత్తం సంతోషంతో నిండిపోయిందని మీరు అంటున్నారు. అయితే, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కంటే మేము ఇంకా రెండు టైటిళ్లు వెనుకబడి ఉన్నాం.ఈ సీజన్ బాగా సాగింది. అయితే, ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలవాలంటే మేమింకా మూడుసార్లు చాంపియన్లుగా నిలవాలి. అందుకు ఎంతో కఠినంగా శ్రమించాల్సి ఉంటుంది.కాబట్టి మా తదుపరి మిషన్.. అదే. కేకేఆర్‌ను మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్‌గా చేయగలగాలి. అంతకంటే గొప్ప అనుభూతి నాకు మరొకటి ఉండదు. అయితే, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది’’ అని స్పోర్ట్స్‌కీడా ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు.ఈ వ్యాఖ్యలను బట్టి గంభీర్ కేకేఆర్‌తో తన ప్రయాణం కొనసాగిస్తాడని స్పష్టమవుతోంది. ఇక టీమిండియా హెడ్ కోచ్‌గా ఉండాలంటే ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, ఇతర జట్లతో సదరు వ్యక్తికి సంబంధం ఉండకూడదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేకేఆర్ మెంటార్‌గా కొనసాగేందుకే గంభీర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
మమ్మల్ని గర్వపడేలా చేశారు.. అందరికి ధన్యవాదాలు: కావ్య మారన్
ఐపీఎల్-2024 సీజన్ రన్నరప్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీ ఆద్యంతం అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలకమైన ఫైనల్లో మాత్రం చేతులేత్తేసింది. చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. మరోవైపు కేకేఆర్ ముచ్చటగా మూడో సారి ట్రోఫీని ముద్దాడింది. ఇక ఎస్ఆర్హెచ్ ఓటమి అనంతరం ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ భావోద్వేగానికి లోనయ్యారు. కావ్య స్టాండ్స్‌లో తమ ఆటగాళ్ల పోరాటాన్ని అభినందిస్తూ కన్నీటి పర్యంతమైంది.ఆటగాళ్లను ఓదార్చిన కావ్య..అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కావ్య అంతటి బాధలోనూ సన్‌రైజర్స్ డ్రెస్సింగ్ రూమ్‌ను సందర్శించింది. తమ జట్టు ఆటగాళ్లకు కావ్య ధైర్యం చెప్పి ఓదార్చింది. "మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు. ఈ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. మీ ఆటతో టీ20 క్రికెట్‌కు కొత్త ఆర్ధం చెప్పారు. అందరూ మన గురించి మాట్లాడేలా చేశారు. ఈ రోజు మనం ఓడిపోవాలని రాసి పెట్టింది. కాబట్టి మనం ఓడిపోయాం. కానీ మన బాయ్స్ అంతా అద్బుతంగా ఆడారు.బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో బాగా రాణించారు. అందరికి ధన్యవాదాలు. అదే విధంగా మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు స్టేడియం వచ్చిన అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు" అంటూ డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చిన స్పీచ్‌లో కావ్య పేర్కొంది. -
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
ఐపీఎల్ వేలం మొదలు... స్టేడియంలో తన జట్టును ఉత్సాహపరచడం.. గెలిచినపుడు చిన్న పిల్లలా సంబరాలు చేసుకోవడం.. ఓడినపుడు అంతే బాధగా మనసు చిన్నబుచ్చుకోవడం..అంతలోనే ఆటలో ఇవన్నీ సహజమే కదా అన్నట్లుగా ప్రత్యర్థిని అభినందిస్తూ చప్పట్లు కొట్టడం.. ఇలా ప్రతీ విషయంలోనూ ఆమె ఓ ప్రత్యేక ఆకర్షణ. క్యాష్ రిచ్ లీగ్‌ను ఫాలో అయ్యే వాళ్లలో చాలా మందికి ఆమె కంటే క్రష్.ఆమె మ్యాచ్ వీక్షించడానికి వచ్చిందంటే చాలు.. ఆద్యంతం తను పలికించే హావభావాలు.. స్టాండ్స్‌లో చుట్టుపక్కల వారితో తను మెదిలే విధానం.. ఆనాటి హైలైట్స్‌లో ముఖ్యమైనవిగా నిలుస్తాయనడం అతిశయోక్తి కాదు.తను నవ్వితే అభిమానులూ నవ్వుతారు. తను భావోద్వేగంతో కంటతడి పెడితే తామూ కన్నీటి పర్యంతమవుతారు. ఐపీఎల్-2024 ఫైనల్ సందర్భంగా ఇలాంటి దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఆమె పేరేంటో అర్థమైపోయిందనుకుంటా.. యెస్.. కావ్యా మారన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఓనర్.వేల కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలుదేశంలోనే అతి పెద్ద మీడియా గ్రూపులో ఒకటైన సన్ టీవీ గ్రూప్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్- కావేరీ మారన్ దంపతుల ఏకైక కుమార్తె. వేల కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు.తమిళనాడులోని చెన్నైలో ఆగష్టు 6, 1992లో జన్మించారు కావ్య. అక్కడే స్టెల్లా మేరీ కాలేజీలో బీకామ్ చదివిన ఆమె.. 2016లో ఇంగ్లండ్‌లోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు.తల్లిదండ్రులు ఇద్దరూ వ్యాపారవేత్తలే కావడంతో కావ్య కూడా అదే బాటలో పయనిస్తున్నారు. 2018లో సన్‌రైజర్స్ సీఈఓగా ఎంట్రీ ఇచ్చిన కావ్య.. అంతకంటే ముందే సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్ఎం రేడియోలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.తీవ్ర స్థాయిలో విమర్శలుఇక ఐపీఎల్లో వేలం మొదలు కెప్టెన్ నియామకం వరకు అన్ని విషయాల్లోనూ భాగమయ్యే కావ్యా మారన్.. ఈ ఏడాది అనుకున్న ఫలితాలు రాబట్టడంలో సఫలమయ్యారు. కానీ.. సీజన్ ఆరంభంలో మాత్రం తీవ్ర విమర్శల పాలయ్యారు కావ్య.ఆస్ట్రేలియా కెప్టెన్, వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ప్యాట్ కమిన్స్ కోసం ఏకంగా.. రూ. 20.50 కోట్లు ఖర్చు చేయడం.. అతడిని కెప్టెన్‌గా నియమించడం, బ్రియన్ లారా స్థానంలో డానియల్ వెటోరీని కోచ్‌గా తీసుకురావడం వంటి నిర్ణయాలను మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు.ఇప్పటికే ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, గ్లెన్ ఫిలిప్స్ వంటి వాళ్లు జట్టులో ఉండటంతో తుదిజట్టు కూర్పు ఎలా ఉంటుందో అంటూ ఎద్దేవా చేశారు. పేపర్ మీద చూడటానికి జట్టు బాగానే కనిపిస్తున్నా.. మైదానంలో తేలిపోవడం ఖాయమంటూ విమర్శించారు.సంచలన ప్రదర్శనఅయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సన్‌రైజర్స్ ఈసారి అద్భుతాలు చేసింది. గతేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన హైదరాబాద్ ఈసారి సంచలన ప్రదర్శనతో ఫైనల్ చేరింది.విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా నిలిచి లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులు సృష్టించింది. అయితే, తుదిమెట్టుపై కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.చెన్నై వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం.. కేకేఆర్ ఏకపక్షంగా గెలవడంతో కావ్యా మారన్ కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీళ్లు కారుస్తూనే కేకేఆర్‌ను అభినందించారు కూడా!ఈ నేపథ్యంలో కావ్య మంచి మనసును కొనియాడుతూ ఆమె అభిమానులు సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో సన్ నెట్వర్క్ మాజీ ఉద్యోగిగా చెప్పుకొన్న ఓ నెటిజన్ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.ఆమెను ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు మాత్రమే!‘‘తన తలిదండ్రుల కంటే కూడా కావ్య ఎంతో గొప్ప వ్యక్తి. మంచి మనసున్న అమ్మాయి. కానీ ఎందుకో తనకు ఎక్కువగా ఫ్రెండ్స్ ఉండరు. సన్ మ్యూజిక్, ఎస్ఆర్హెచ్ మినహా ఇతర కంపెనీ బాధ్యతలేవీ తల్లిదండ్రులు ఆమెకు అప్పగించరు.ఇది కూడా ఆమెను ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు మాత్రమే!ఐపీఎల్ వేలం సమయంలో కావ్య గురించి చాలా మంది జోకులు వేశారు. కానీ క్రికెట్ పట్ల తనకున్న ప్యాషన్ వేరు. వేలం నుంచి ఫైనల్ దాకా ప్రతి విషయంలోనూ తనదైన ముద్ర వేయగలిగింది. తను కోరుకున్న ఫలితాలు రాబట్టింది.కావ్య మిలియనీర్ అయినప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్(సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్‌ను బహిరంగంగానే తిట్టడం)లా కాదు. ఫైనల్లో తమ జట్టు ఓటమిపాలైనా కన్నీళ్లు దిగమింగుకుంటూ నవ్వడానికి ప్రయత్నించిన గొప్ప హృదయం ఉన్న వ్యక్తి’’ అని సదరు నెటిజన్ పేర్కొన్నారు.ఒంటరితనమా? ఎందుకు?తన పోస్టులో సదరు నెటిజన్ కావ్య ఒంటరితనం నుంచి విముక్తి పొందడం కోసమే ఈ వ్యాపకాలు అంటూ పేర్కొనడం చర్చనీయాంశమైంది. తోబుట్టువులు, స్నేహితులు(ఎక్కువగా) లేరు కాబట్టి ఇలా అన్నారా?లేదంటే 32 ఏళ్ల కావ్య వ్యక్తిగత జీవితంలో ఏమైనా దెబ్బతిన్నారా? అనే చర్చ జరుగుతోంది. కాగా కావ్య ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నారు. గతంలో.. తమిళ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌తో కావ్య పేరును ముడిపెట్టే ప్రయత్నం చేశారు గాసిప్‌రాయుళ్లు.అయితే, అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది. మరికొన్ని సైట్లు మాత్రం కావ్య ఓ బిజినెస్‌మేన్‌తో గతంలో ప్రేమలో ఉన్నారని కథనాలు ఇచ్చాయి. కానీ.. అవి కూడా రూమర్లే! ప్రస్తుతానికి కావ్య తన కెరీర్, తన తండ్రి వ్యాపారాలను ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న విషయాల మీద మాత్రమే దృష్టి సారించారని సమాచారం.సౌతాఫ్రికాలో దుమ్ములేపుతూఅందుకు తగ్గట్లుగానే ఆమె అడుగులు సాగుతున్నాయి. కేవలం ఐపీఎల్‌లోనే కాకుండా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ కావ్య కుటుంబానికి ఫ్రాంఛైజీ ఉంది. సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ పేరిట నెలకొల్పిన ఈ జట్టుకు ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్. 2023 నాటి అరంగేట్ర సీజన్లో, ఈ ఏడాది కూడా సన్‌రైజర్స్‌కు అతడు టైటిల్ అందించాడు. సౌతాఫ్రికాలో వరుసగా రెండుసార్లు ట్రోఫీ సాధించిన సన్‌రైజర్స్.. ఐపీఎల్-2024లో ఆఖరి పోరులో ఓడి టైటిల్ చేజార్చుకుంది. -
శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించిన కేకేఆర్.. మూడో సారి ట్రోఫీని ముద్దాడింది. కేకేఆర్ మూడో సారి టైటిల్ సాధించడంలో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ది కీలక పాత్ర. అయ్యర్ వ్యక్తిగత ప్రదర్శన పరంగా పర్వాలేదన్పంచటప్పటకి.. సారథిగా మాత్రం జట్టును అద్భుతంగా నడిపించాడు. అయ్యర్ కెప్టెన్సీ 100కు 100 మార్కులు పడాల్సిందే. తన వ్యూహాలతో ప్రత్యర్ధి జట్లను అయ్యర్ చిత్తు చేశాడు. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రం ఓడిపోయిందంటే అయ్యర్ కెప్టెన్సీ ఏ విధంగా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు అయ్యర్‌కు ఏది కలిసిరాలేదు. బీసీసీఐ ఆదేశాలను దిక్కరించడంతో జట్టులో చోటుతో పాటు వార్షిక కాంట్రాక్ట్ ను కూడా కోల్పోయాడు. అయితే పడిలేచిన కేరటంలా తన కెప్టెన్సీ మార్క్‌ను చూపించాడు. జట్టును విజయ పథంలో నడిపిస్తూ ఏకంగా టైటిల్‌ను అందించాడు. ఈ ఏడాది సీజన్లో శ్రేయస్ 14 ఇన్నింగ్స్‌ల్లో 351 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అయ్యర్‌పై భారత మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రేయస్‌ను కెప్టెన్‌గా చాలా మంది తక్కువగా అంచనా వేశారని ఉతప్ప అభిప్రాయపడ్డాడు. "శ్రేయస్ అయ్యర్‌కు అద్బుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అతడు భవిష్యత్తులో కచ్చితంగా భారత జట్టు కెప్టెన్ అవుతాడు. నా వరకు అయితే ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో శుబ్‌మన్ గిల్ కంటే అయ్యరే ముందుంటాడు. అతడు జట్టును నడిపించే విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడు ఈ ఏడాది సీజన్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడు. అయ్యర్.. గౌతమ్ గంభీర్, చంద్రకాంత్ పండిట్, అభిషేక్ నాయర్ దిగ్గజాలతో కలిసి పనిచేశాడు. కాబట్టి ఆ అనుభవం శ్రేయస్‌కు కచ్చితంగా కలిసిస్తోంది. ఈ ఏడాది సీజన్‌కు ముందు అయ్యర్ పరిస్ధితి అంతగా బాగోలేదు. ఫిట్నెస్ లోపించడంతో జట్టులో చోటు కూడా కోల్పోయాడు. వెన్ను నొప్పితో బాధపడుతూనే అయ్యర్ ఆడుతున్నాడు. ముఖ్యంగా సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడం, వరల్డ్‌కప్ చోటు దక్కకపోవడం అయ్యర్‌ను మానసికంగా దెబ్బతీశాయి. అయినప్పటకి అయ్యర్ తన బాధను దిగమింగుకుని కేకేఆర్‌ను ఛాంపియన్స్‌గా నిలిపాడని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉతప్ప పేర్కొన్నాడు. -
SRH: ‘హృదయం ముక్కలైంది.. బాధ పడొద్దు మామయ్యా’! ఫొటో వైరల్
ఐపీఎల్-2024 సీజన్ ఆసాంతం విధ్వంసకర బ్యాటింగ్‌తో దుమ్ములేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అసలు సమయం వచ్చేసరికి చేతులెత్తేసింది. ఏదైతే తమ బలం అనుకుందో అదే బలహీనతగా మారిన వేళ ప్రత్యర్థి ముందు తలవంచింది.ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్‌లో పెట్టనికోటగా ఉన్న ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అనూహ్య రీతిలో పూర్తిగా విఫలం కావడంతో 113 పరుగులకే కుప్పకూలింది. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ల దెబ్బకు అభిషేక్ శర్మ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులకే నిష్క్రమించగా.. పరుగుల విధ్వంసానికి మారుపేరుగా నిలిచిన హెడ్ మరీ ఘోరంగా డకౌట్ అయ్యాడు.వీరితో పాటు వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(13 బంతుల్లో 9) కూడా త్వరగానే పెవిలియన్ చేరగా.. మిగతా వాళ్లలో ఐడెన్ మార్క్రమ్(20), హెన్రిచ్ క్లాసెన్(17 బంతుల్లో 16), కెప్టెన్ ప్యాట్ కమిన్స్(19 బంతుల్లో 24) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు.ఈ క్రమంలో ఐపీఎల్ ఫైనల్లోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డు తన పేరిట లిఖించుకుంది సన్‌రైజర్స్. ఈ సీజన్లో ఏకంగా 287 పరుగులతో లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ప్రశంసలు అందుకున్న కమిన్స్ బృందం.. ఫైనల్లో ఇలా తేలిపోయింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ హృదయం ముక్కలైంది.ఇక ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కేకేఆర్ సన్‌రైజర్స్‌ను ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచింది. ఏకపక్ష విజయంతో ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.ఈ నేపథ్యంలో కేకేఆర్ శిబిరంలో సంతోషాలు వెల్లివిరియగా.. సన్‌రైజర్స్ క్యాంపు నిరాశలో కూరుకుపోయింది. జట్టు యజమాని కావ్యా మారన్ ఓటమిని జీర్ణించుకోలేక కన్నీళ్లు పెట్టుకోగా.. ఆటగాళ్లు కూడా ఇంచుమించు ఇదే స్థితికి చేరుకున్నారు.ఇక ఈ సీజన్లోనే అత్యధిక సిక్సర్లు(42) బాదిన సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ సమయంలో అభిషేక్ చిన్నారి మేనకోడలు అమైరా చేసిన పని నెటిజన్ల మనసు దోచుకుంది.‘‘ఏం కాదులే మామయ్య’’ అన్నట్లుగా అభిషేక్‌ను హత్తుకున్న అమైరా అతడిని ఓదార్చింది. తర్వాత ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అభిషేక్ రెండో అక్క కోమల్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా పంజాబ్‌కు చెందిన అభిషేక్ శర్మ తండ్రి రాజ్‌కుమార్ శర్మ కూడా క్రికెటర్. దేశవాళీ క్రికెట్ ఆడిన ఆయన తన కుమారుడికి మొదటి కోచ్. ఇక అభిషేక్ తల్లి పేరు మంజు శర్మ. అభిషేక్‌కు ఇద్దరు అక్కలు సానియా, కోమల్ ఉన్నారు. పెద్దక్క సానియా శర్మ కూతురే ఈ అమైరా!Tough day, Never give up 😔Win or lose part of the game!Chin up guys, you fought hard. ♥️ #KKRvsSRHFinal #IPLFinal #IPL2024 pic.twitter.com/ar96np1klB— Dr. Komal Sharma (@KomalSharma_20) May 26, 2024Such a sweet moment heartwarming hug Amayra encouraging his uncle. 🫂So proud of you bhaiya ❤️🥹#KKRvsSRH #IPL2024 pic.twitter.com/DlE62WtaZu— Dr. Komal Sharma (@KomalSharma_20) May 26, 2024 -
గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
కోల్‌కతా నైట్ రైడర్స్ పదేళ్ల తర్వాత మరోసారి ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. క్యాష్ రిచ్ లీగ్‌లో మూడోసారి టైటిల్ గెలిచి ట్రోఫీని ముద్దాడింది. పదిహేడో ఎడిషన్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచిన శ్రేయస్ అయ్యర్ సేన.. ఫైనల్లోనూ సత్తా చాటింది.చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఐపీఎల్-2024 విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ క్యాంపు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లతో సహా ఫ్రాంఛైజీ యజమానులు షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా కుటుంబాలు ఈ సంతోషంలో పాలుపంచుకున్నాయి.విజయం పరిపూర్ణం.. వారే కారణంఇదిలా ఉంటే.. గతేడాది పేలవంగా ఆడి ఏడో స్థానానికి పరిమితమైన కేకేఆర్.. ఈసారి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. సమిష్టి కృషితో టైటిల్ సాధించింది. లీగ్ దశలో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ తొమ్మిది విజయాలు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది.క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్‌ను ఓడించి ఫైనల్ చేరిన కేకేఆర్.. ఆఖరి మెట్టుపై అదే ప్రత్యర్థిని మరోసారి బోల్తా కొట్టించి విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. అయితే, కేకేఆర్ సక్సెస్ వెనుక మెంటార్ గౌతం గంభీర్‌దే కీలక పాత్ర అని ఆటగాళ్లతో పాటు మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు.గంభీర్‌ను మెంటార్‌గా రప్పించడం ద్వారా ఆటగాళ్ల ఆలోచనా తీరులో మార్పు వచ్చిందని.. గెలుపునకు బాట వేసిందని కొనియాడుతున్నారు. ఇది కొంతవరకు వాస్తవమే. అయితే, గంభీర్ ఒక్కడే కాదు కేకేఆర్ విజయానికి ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో పాటు అసిస్టెంట్ కోచ్‌లు అభిషేక్ నాయర్, భరత్ అరుణ్‌లు కూడా ప్రధాన కారణం.ఆరు రంజీ ట్రోఫీలు.. ఇప్పుడిలా మరో టైటిల్దేశవాళీ క్రికెట్ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్న చంద్రకాంత్ పండిట్.. శిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటారని పేరు. అనుకున్న ఫలితాలను రాబట్టేందుకు ఆటగాళ్లతో ఎంత హార్డ్‌వర్క్ చేయించడానికైనా ఆయన వెనుకాడరని ప్రతీతి.ఇక గంభీర్ రూపంలో మరో దిగ్గజం చంద్రకాంత్ పండిట్‌కు తోడు కావడంతో ఆయన పని మరింత సులువైంది. మూడు వేర్వేరు జట్లకు కోచ్‌గా వ్యహరించి.. ఆరు రంజీ ట్రోఫీలు గెలిచిన శిక్షకుడిగా పేరొందిన చంద్రకాంత్ ఖాతాలో తొలిసారి ఐపీఎల్ టైటిల్ కూడా చేరింది.వాళ్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన అభిషేక్ నాయర్కేకేఆర్ గెలుపులో టీమిండియా మాజీ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్‌ది కూడా కీలక పాత్ర. ముఖ్యంగా ఇండియన్ కోర్కు సంబంధించి అతడే పూర్తి బాధ్యత తీసుకున్నట్లు సమాచారం.అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్లేయర్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వారు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా అభిషేక్ తీర్చిదిద్దాడు. ఫైనల్ తర్వాత కేకేఆర్ స్టార్లు లీడింగ్ వికెట్ టేకర్ వరుణ్ చక్రవర్తి, ఫైనల్ టాప్ స్కోరర్ వెంకటేశ్ అయ్యర్ చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం.‘‘అభిషేక్ నాయర్‌కు కచ్చితంగా క్రెడిట్ దక్కాల్సిందే. కొంతమంది పేర్లు పెద్దగా వెలుగులోకి రావు. కానీ.. నా వరకు అభిషేక్ విషయంలో అలా జరగకూడదనే కోరుకుంటా. ఈ ప్రపంచంలోని అన్ని రకాల ప్రశంసలకు అతడు అర్హుడు’’ అని వెంకటేశ్ అయ్యర్ అభిషేక్ నాయర్‌పై అభిమానం చాటుకున్నాడు.ఆ శక్తి మరెవరో కాదుఇక కేకేఆర్ విజయాల్లో బౌలింగ్ విభాగానిదే ప్రధాన పాత్ర అనడంలో సందేహం లేదు. ఫైనల్లో సన్‌రైజర్స్‌ను 113 పరుగులకే ఆలౌట్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించారు కేకేఆర్ బౌలర్లు. స్పిన్నర్లు, పేసర్లు కలిసి ఈ సీజన్ ఆద్యంతం అద్భుతంగా రాణించారు. వారి వెనుక ఉన్న శక్తి పేరు భరత్ అరుణ్.𝙏𝙝𝙚 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜 𝙤𝙛 𝙀𝙪𝙥𝙝𝙤𝙧𝙞𝙖 🏆Celebrating @KKRiders' triumph in 𝙎𝙍𝙆 style ⭐️😎#TATAIPL | #KKRvSRH | #Final | #TheFinalCall | @iamsrk pic.twitter.com/OmvXa9GtJx— IndianPremierLeague (@IPL) May 27, 2024చదవండి: BCCI- IPL 2024: వారికి భారీ మొత్తం.. బీసీసీఐ కీలక ప్రకటన -
IPL 2024: వారికి భారీ నజరానా.. బీసీసీఐ కీలక ప్రకటన
పొట్టి క్రికెట్ ప్రేమికులకు రెండున్నర నెలలుగా వినోదం అందించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌కు ఆదివారంతో తెరపడింది. చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.ప్యాట్ కమిన్స్ బృందాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి పదేళ్ల తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్ చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్‌కు రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీ దక్కగా.. రన్నరప్ సన్‌రైజర్స్‌కు రూ. 12.5 కోట్లు అందాయి. ICYMI! That special run to glory 💫💜Recap the #Final on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/qUDfUFHpka— IndianPremierLeague (@IPL) May 26, 2024అన్సంగ్ హీరోలకు భారీ నజరానాఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్ పదిహేడో సీజన్ ఇంతగా విజయవంతం కావడం వెనుక ఉన్న ‘అన్సంగ్ హీరో’లకు భారీ మొత్తం కానుకగా ప్రకటించారు.గ్రౌండ్స్‌మెన్, పిచ్ క్యూరేటర్లకు రూ. 25 లక్షల చొప్పున బహుమతిగా అందించనున్నట్లు ఎక్స్ వేదికగా జై షా వెల్లడించారు. ‘‘తాజా టీ20 సీజన్‌ను ఇంతగా సక్సెస్ కావడానికి గ్రౌండ్ సిబ్బంది నిర్విరామంగా పనిచేయడమూ కారణమే.వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా అద్భుతమైన పిచ్‌లను తయారు చేయడంలో వారు సఫలమయ్యారు. అందుకే గ్రౌండ్స్‌మెన్, క్యూరేటర్ల శ్రమను గుర్తించి వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించాం.ఈ సీజన్లో రెగ్యులర్‌గా ఐపీఎల్ మ్యాచ్‌లు సాగిన 10 వేదికల సిబ్బందికి ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు, అదనంగా సేవలు అందించిన మూడు వేదికల సిబ్బందికి రూ. 10 లక్షల చొప్పున అందజేస్తాం. మీ కఠిన శ్రమ, అంకితభావానికి థాంక్యూ’’ అని జై షా సోమవారం ట్వీట్ చేశారు.వేదికలు ఇవేకాగా ఐపీఎల్-2024 సీజన్లో ముంబై(ముంబై ఇండియన్స్), ఢిల్లీ(ఢిల్లీ క్యాపిటల్స్), చెన్నై(చెన్నై సూపర్ కింగ్స్), కోల్‌కతా(కోల్‌కతా నైట్ రైడర్స్), చండీఘర్(పంజాబ్ కింగ్స్), హైదరాబాద్(సన్‌రైజర్స్), బెంగళూరు(ఆర్సీబీ), లక్నో(లక్నో సూపర్ జెయింట్స్), అహ్మదాబాద్(గుజరాత్ టైటాన్స్), జైపూర్(రాజస్తాన్ రాయల్స్)లలో రెగ్యులర్‌గా మ్యాచ్‌లు జరగగా.. గువాహటి(రాజస్తాన్ రాయల్స్), విశాఖపట్నం(ఢిల్లీ క్యాపిటల్స్), ధర్మశాల(పంజాబ్ కింగ్స్) మైదానాల్లోనూ మ్యాచ్‌లు నిర్వహించారు.చదవండి: SRH: అందుకే ఓడిపోయాం.. మా వాళ్లు మాత్రం సూపర్: కమిన్స్The unsung heroes of our successful T20 season are the incredible ground staff who worked tirelessly to provide brilliant pitches, even in difficult weather conditions. As a token of our appreciation, the groundsmen and curators at the 10 regular IPL venues will receive INR 25…— Jay Shah (@JayShah) May 27, 2024 -
SRH: అందుకే ఓడిపోయాం.. మా వాళ్లు మాత్రం సూపర్: కమిన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముచ్చటగా మూడోసారి ఫైనల్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చెన్నై వేదికగా జరిగిన తుదిపోరులో పేలవ ప్రదర్శనతో పరాజయం పాలైంది. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.గతేడాదితో పోలిస్తే ఈ సీజన్ ఆసాంతం అద్భుతంగా ఆడినా అసలు మ్యాచ్‌లో చేతులెత్తేసింది. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిన కమిన్స్ బృందం ఫైనల్లో మాత్రం తుస్సుమనిపించింది.అందుకే ఓడిపోయాంఈ నేపథ్యంలో కేకేఆర్ చేతిలో ఘోర పరాజయంపై సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ విచారం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థి జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసిందని కితాబులు ఇచ్చాడు. తమ బ్యాటర్లు సీజన్ ఆరంభం నుంచి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నారని.. అయితే, చెన్నై వికెట్‌ను అంచనా వేయడంలో తాము విఫలమయ్యామని పేర్కొన్నాడు.‘‘వాళ్లు అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. స్టార్కీ(మిచెల్ స్టార్క్) మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేశాడు. ఈ మ్యాచ్‌లో మా ఆట తీరు అస్సలు బాగాలేదు. బౌండరీలు రాబట్టానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాం. గత వారం అహ్మదాబాద్(క్వాలిఫయర్-1)లోనూ వాళ్ల బౌలర్లు అద్భుతంగా ఆడారు. కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం వాళ్లకు ఇవ్వాల్సిందే. ఈ వికెట్ స్వభావాన్ని మేము పసిగట్టలేకపోయాం. కనీసం 160 పరుగులు స్కోరు చేసినా కనీస పోటీ ఉండేది’’ అని కమిన్స్ పేర్కొన్నాడు.మా వాళ్లు మాత్రం సూపర్అదే విధంగా.. ‘‘ఏదేమైనా.. ఈ సీజన్లో మాకు అనేక సానుకూలాంశాలు ఉన్నాయి. మా వాళ్లు సూపర్‌గా బ్యాటింగ్ చేశారు. మూడుసార్లు 250 పరుగుల మేర స్కోరు చేశాం.తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ మ్యాచ్‌ను మాకు అనుకూలంగా మార్చివేశారు. హైదరాబాద్‌లో అభిమానులు మాకు పూర్తి మద్దతుగా నిలిచారు.ఈ సీజన్ మొత్తం అద్భుతంగా సాగింది. ఈసారి చాలా మంది కొత్త ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం వచ్చింది. భువీ, నట్టు, జయదేవ్‌లతో పాటు చాలా మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో మమేకమయ్యాను.సాధారణంగా టీమిండియాతో మ్యాచ్ అంటే మొత్తం నీలిరంగుతో స్టేడియం నిండిపోతుంది. అయితే, ఇప్పుడు ఇక్కడ ప్రేక్షకులు మా(నా)కు మద్దతుగా నిలవడం కొత్త అనుభూతినిచ్చింది’’ అని ప్యాట్ కమిన్స్ తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు.ఐపీఎల్-2024 ఫైనల్: కేకేఆర్ వర్సెస్ సన్‌రైజర్స్👉వేదిక: చెపాక్ స్టేడియం.. చెన్నై👉టాస్: సన్‌రైజర్స్.. బ్యాటింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 113 (18.3)👉కేకేఆర్ స్కోరు: 114/2 (10.3)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసి చాంపియన్‌గా కేకేఆర్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మిచెల్ స్టార్క్👉ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: సునిల్ నరైన్.చదవండి: IPL 2024: ఎస్ఆర్హెచ్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య! వీడియో వైరల్ ICYMI! That special run to glory 💫💜Recap the #Final on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/qUDfUFHpka— IndianPremierLeague (@IPL) May 26, 2024 -
ఛాంపియన్ కోల్ కతా
-
కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
కోల్కత్తా: ఐపీఎల్-17(2024)లో విజేతగా నిలిచిన కోల్కత్తా నైట్‌రైడర్ జట్టును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు. ఈ ఐపీఎల్ సీజన్లో రికార్డులు బద్దలు కొట్టినందుకు ప్లేయర్స్‌కు వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు.కాగా, మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా..‘కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంతో బెంగాల్ అంతటా సంబరాలు మిన్నంటాయి. ఈ ఐపీఎల్ సీజన్లో రికార్డు బద్దలు కొట్టినందుకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీని వ్యక్తిగతంగా అభినందించాలనుకుంటున్నాను. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. Kolkata Knight Riders' win has brought about an air of celebration all across Bengal.I would like to personally congratulate the players, the support staff and the franchise for their record breaking performance in this season of the IPL.Wishing for more such enchanting…— Mamata Banerjee (@MamataOfficial) May 26, 2024 ఇక, ఐపీఎల్-17 సీజన్లో కేకేఆర్ అద్భుత ఆటతీరును కనబరిచింది. సీజన్ ప్రారంభం నాటి నుంచి దూకుడుగా ఆడుతూ టేబుట్ టాపర్‌గా నిలిచింది. చివరగా ఫైనల్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి 114 లక్ష్యాన్ని కేవలం పదో ఓవర్లోనే పూర్తి చేసింది. కాగా, ఈ సీజన్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా కేకేఆర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ నిలిచాడు. ICYMI! That special run to glory 💫💜Recap the #Final on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/qUDfUFHpka— IndianPremierLeague (@IPL) May 26, 2024 📽️ 𝗥𝗔𝗪 𝗥𝗘𝗔𝗖𝗧𝗜𝗢𝗡𝗦Moments of pure joy, happiness, jubilation, and happy tears 🥹 What it feels to win the #TATAIPL Final 💜Scorecard ▶️ https://t.co/lCK6AJCdH9#KKRvSRH | #Final | #TheFinalCall | @KKRiders pic.twitter.com/987TCaksZz— IndianPremierLeague (@IPL) May 26, 2024 -
IPL 2024: కేకేఆర్‌దే 'కిరీటం' (ఫొటోలు)
-
IPL 2024: కోల్‌కతాకే కిరీటం
సన్‌రైజర్స్ అభిమానులకు తీవ్ర వేదన... లీగ్ దశలో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఐపీఎల్‌కు కొత్త పాఠాలు నేర్పిన టీమ్ అదే బ్యాటింగ్ వైఫల్యంతో చివరి మెట్టుపై చతికిలపడింది. 8 బంతుల వ్యవధిలో అభిషేక్ శర్మ, హెడ్ లాంటి హిట్టర్లు వెనుదిరగ్గా... క్లాసెన్‌కు కూడా కాలం కలిసిరాని వేళ జట్టంతా కుప్పకూలింది. ఏ మూలకూ సరిపోని 114 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ 63 బంతుల్లోనే ఛేదించేసి సంబరాలు చేసుకుంది. దశాబ్ద కాలం తర్వాత మూడో టైటిల్ అందుకొని సగర్వంగా నిలిచింది. ఎనిమిదేళ్ల తర్వాత ట్రోఫీ గెలవాలని ఆశించిన హైదరాబాద్ 2018 తరహాలో ఫైనల్‌కే పరిమితమై నిరాశలో మునిగింది. ఆసాంతం బ్యాటర్లు చెలరేగిన 2024 టోర్నీ చివరకు బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ముగిసింది. విజేతగా నిలిచిన కోల్‌కతాకు రూ. 20 కోట్లు... రన్నరప్ హైదరాబాద్ జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. చెన్నై: పదేళ్ల తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) మళ్లీ ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం చెపాక్ మైదానంలో ఏకపక్షంగా సాగిన ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ పోరులో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో ఇదే అత్యల్ప స్కోరు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (19 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. అనంతరం నైట్‌రైడర్స్ 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసి గెలిచింది. వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), రహ్మానుల్లా గుర్బాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 45 బంతుల్లో 91పరుగులు జోడించి జట్టును గెలిపించారు. సమష్టి వైఫల్యం... తొలి ఓవర్లో స్టార్క్ వేసిన అద్భుత బంతికి అభిõÙక్ శర్మ (2) క్లీన్‌బౌల్డ్ కావడంతో మొదలైన సన్‌రైజర్స్ పతనం వేగంగా సాగింది. కోల్‌కతా కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ఏ దశలోనూ హైదరాబాద్ తిరిగి కోలుకోలేకపోయింది. హెడ్ (0) తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ ఆడిన తొలి బంతికి అవుటై మరో డకౌట్ ఖాతాలో వేసుకున్నాడు. త్రిపాఠి (13 బంతుల్లో 9; 1 ఫోర్) ఈసారి ఆదుకోలేకపోగా, నితీశ్ రెడ్డి (10 బంతుల్లో 13; 1 ఫోర్, 1 సిక్స్), షహబాజ్ (7 బంతుల్లో 8; 1 సిక్స్), అబ్దుల్ సమద్ (4) విఫలమయ్యారు. మరోవైపు మార్క్రమ్ (23 బంతుల్లో 20; 3 ఫోర్లు) పరుగులు తీయడానికి ఇబ్బంది పడగా... క్లాసెన్ (17 బంతుల్లో 16; 1 ఫోర్) కూడా భారీ షాట్లు ఆడలేకపోయాడు. 14 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోరు 90/7. క్లాసెన్ క్రీజ్‌లో ఉండటంతో చివరి 6 ఓవర్లలోనైనా ఎక్కువ పరుగులు సాధించవచ్చని రైజర్స్ ఆశించింది. అయితే తర్వాతి బంతికే అతను బౌల్డ్ కావడంతో ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో కమిన్స్ కొన్ని పరుగులు జత చేసి స్కోరును 100 దాటించాడు. ఫటాఫట్... స్వల్ప ఛేదనలో కేకేఆర్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. నరైన్ (2 బంతుల్లో 6; 1 సిక్స్) ఆరంభంలోనే వెనుదిరిగినా... వెంకటేశ్, గుర్బాజ్ వేగంగా జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లారు. భువనేశ్వర్ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టిన వెంకటేశ్, ఆ తర్వాత నటరాజన్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6, 4 బాది లక్ష్యాన్ని మరింత సులువగా మార్చేశాడు. 24 బంతుల్లోనే వెంకటేశ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయానికి 12 పరుగుల దూరంలో గుర్బాజ్ అవుటైనా... వెంకటేశ్, కెపె్టన్ శ్రేయస్ (3 బంతుల్లో 6 నాటౌట్; 1 ఫోర్) కలిసి ఆట ముగించారు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (బి) స్టార్క్ 2; హెడ్ (సి) గుర్బాజ్ (బి) వైభవ్ అరోరా 0; త్రిపాఠి (సి) రమణ్‌దీప్ (బి) స్టార్క్ 9; మార్క్రమ్ (సి) స్టార్క్ (బి) రసెల్ 20; నితీశ్ కుమార్ రెడ్డి (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ రాణా 13; క్లాసెన్ (బి) హర్షిత్ రాణా 16; షహబాజ్ (సి) నరైన్ (బి) వరుణ్ 8; సమద్ (సి) గుర్బాజ్ (బి) రసెల్ 4; కమిన్స్ (సి) స్టార్క్ (బి) రసెల్ 24; జైదేవ్ ఉనాద్కట్ (ఎల్బీ) (బి) నరైన్ 4; భువనేశ్వర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (18.3 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–2, 2–6, 3–21, 4–47, 5–62, 6–71, 7–77, 8–90, 9–113, 10– 113. బౌలింగ్: స్టార్క్ 3–0–14–2, వైభవ్ అరోరా 3–0–24–1, హర్షిత్ రాణా 4–1–24– 2, నరైన్ 4–0–16–1, రసెల్ 2.3–0– 19–3, వరుణ్ చక్రవర్తి 2–0–9–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (ఎల్బీ) (బి) షహబాజ్ 39; నరైన్ (సి) షహబాజ్ (బి) కమిన్స్ 6; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 52; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (10.3 ఓవర్లలో 2 వికెట్లకు) 114. వికెట్ల పతనం: 1–11, 2–102. బౌలింగ్: భువనేశ్వర్ 2–0– 25–0, కమిన్స్ 2–0–18–1, నటరాజన్ 2–0– 29–0, షహబాజ్ 2.3–0–22–1, ఉనాద్కట్ 1–0–9–0, మార్క్రమ్ 1–0–5–0. ఐపీఎల్–17 బౌండరీ మీటర్ మొత్తం సిక్స్‌లు: 1260 మొత్తం ఫోర్లు: 2174 -
ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కేకేఆర్.. ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్-2024 సీజన్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఆదివారం చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఈ ఏడాది సీజన్ ముగిసింది. ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది.తుదిపోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసిన కేకేఆర్.. ముచ్చటగా మూడో సారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక విజేతగా నిలిచిన కేకేఆర్ ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకుంది, రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ టీమ్ ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.విజేతకు ఎన్ని కోట్లంటే?ఛాంపియన్స్‌గా నిలిచిన కేకేఆర్‌కు ప్రైజ్‌మనీ రూపంలో రూ.20 కోట్లు లభించాయి. అదేవిధంగా రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్కు రూ.13 కోట్లు ప్రైజ్‌మనీ దక్కింది. ఇక మూడో స్థానంలో నిలిచిన రాజస్తాన్ రాయల్స్‌కు రూ.7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఆర్సీబీకి .రూ. 6.5కోట్లు అందాయి.⇒ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన విరాట్ కోహ్లికి రూ.15లక్షల నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 61.75 సగటుతో 741 పరుగులు చేశాడు.⇒పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన హర్షల్ పటేల్‌కు రూ.15లక్షల నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన హర్షల్.. 24 వికెట్లు పడగొట్టాడు.⇒ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన నితీష్ కుమార్ రెడ్డికి, ప్లేయర్ ఆఫ్‌ది సీజన్ అవార్డు విన్నర్ సునీల్ నరైన్‌కు చెరో రూ. 10లక్షల ప్రైజ్‌మనీ లభించింది.⇒అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన సునీల్ నరైన్ రూ.12 లక్షల నగదు బహుమతి అందుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్లో16 మ్యాచ్‌లు నరైన్.. 488 పరుగులతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు. -
ఎస్ఆర్హెచ్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2024 రన్నరప్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. దీంతో ముచ్చటగా మూడో సారి టైటిల్‌ను ముద్దాడాలన్న హైదరాబాద్ కల నేరవేరలేదు. ఇక ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ పరంగా తీవ్ర నిరాశపరిచింది. బౌలింగ్ విషయం పక్కన పెడితే బ్యాటింగ్‌లో అయితే మరింత దారుణ ప్రదర్శన కనబరిచింది. కేకేఆర్ బౌలర్ల దాటికి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కనీసం ఏ ఒక్క ఆటగాడైనా జట్టు కోసం ఆడినట్లు అన్పించలేదు. వచ్చామా వెళ్లామా అన్నట్లు ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ కొనసాగింది. ఈ క్రమంలో 113 పరుగులకే ఎస్ఆర్హెచ్ కుప్పకూలింది. తద్వారా ఓ చెత్త రికార్డును ఎస్ఆర్హెచ్ తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్లో అతి తక్కువ స్కోర్ చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. అంతకుముందు ఈ చెత్త రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. సీఎస్కే 2013 ఫైనల్లో ముంబైపై 125 రన్స్ చేసింది. తాజా మ్యాచ్‌తో ముంబైను ఎస్ఆర్హెచ్ను అధిగమించింది. -
ఎస్ఆర్హెచ్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఈ ఏడాది సీజన్ ఆద్యంతం ఎస్ఆర్హెచ్ అదరగొట్టనప్పటికి ఫైనల్లో మాత్రం తేలిపోయింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పరంగా దారుణ ప్రదర్శన కనబరిచింది. కేకేఆర్ బౌలర్లలో దాటికి సన్‌రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. అనంతరం సన్‌రైజర్స్ విధించిన 114 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 10. 3 ఓవర్లలో ఊదిపడేసింది. నరైన్ (6) రెండో ఓవర్లోనే ఔట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (39), వెంకటేశ్ అయ్యర్ (52 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి తమ జట్టుకు మూడో టైటిల్‌ను అందించారు.కన్నీళ్లు పెట్టుకున్న కావ్య..ఇక ఎస్ఆర్హెచ్ ఓటమి అనంతరం ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ భావోద్వేగానికి లోనయ్యారు. సీజన్ మొత్తం ఎస్ఆర్హెచ్ ఆడే మ్యాచ్‌లకు హాజరై తన జట్టును సపోర్ట్ చేసిన కావ్యకు ఫైనల్ మ్యాచ్‌లో తీవ్ర నిరాశ ఎదురైంది. సీజన్ అసాంతం ఎంతో సందడి చేసిన కావ్య పాపం.. ఫైనల్లో తమ జట్టు ఓడిపోయాక కన్నీళ్లు పెట్టుకున్నారు. తొలుత స్టాండ్స్‌లో నిలబడి తమ జట్టు పోరాటాన్ని చప్పట్లు కొడుతూ అభినందించిన కావ్య.. వెంటనే వెనక్కి తిరిగి వెక్కివెక్కి ఏడ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A season to be proud of 🧡#KKRvSRH #IPLonJioCinema #IPLFinalonJioCinema pic.twitter.com/rmgo2nU2JM— JioCinema (@JioCinema) May 26, 2024 -
ఫైనల్లో ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి.. ఐపీఎల్ 2024 విజేతగా కేకేఆర్
ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసిన కేకేఆర్.. ముచ్చటగా మూడో సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఏక పక్షంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది.కుప్పకూలిన ఎస్ఆర్హెచ్..టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ కేకేఆర్ బౌలర్ల దాటికి గజగజ వణికింది. కేకేఆర్ బౌలర్లు చెలరేగడంతో సన్‌రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ పేసర్లు మిచెల్ స్టార్క్, ఆరోరా ఆరంభంలోనే ఎస్ఆర్హెచ్ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్ మూడు వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వీరిద్దరితో పాటు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(24) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మార్క్రమ్(20), క్లాసెన్(16) పరుగులు చేశారు.అయ్యర్, గుర్బాజ్ విధ్వంసం..అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ గుర్భాజ్ (39) పరుగులు చేయగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(52 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ప్యాట్ కమ్మిన్స్, షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో తలా వికెట్ సాధించారు. -
IPL 2024: ఫైనల్లో ఎస్ఆర్హెచ్ చిత్తు.. ఛాంపియన్స్‌గా కేకేఆర్
IPL 2024 SRH vs KKR Final Live Updates: ఫైనల్లో ఎస్ఆర్హెచ్ చిత్తు.. ఛాంపియన్స్‌గా కేకేఆర్‌ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసిన కేకేఆర్.. ముచ్చటగా మూడో సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఏక పక్షంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ గుర్భాజ్ (39) పరుగులు చేయగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(52 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ పేసర్లు మిచెల్ స్టార్క్, ఆరోరా ఆరంభంలోనే ఎస్ఆర్హెచ్ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్ మూడు వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వీరిద్దరితో పాటు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(24) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మార్క్రమ్(20), క్లాసెన్(16) పరుగులు చేశారు.కుప్పకూలిన ఎస్ఆర్హెచ్..టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ కేకేఆర్ బౌలర్ల దాటికి గజగజ వణికింది. కేకేఆర్ బౌలర్లు చెలరేగడంతో సన్‌రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ పేసర్లు మిచెల్ స్టార్క్, ఆరోరా ఆరంభంలోనే ఎస్ఆర్హెచ్ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్ మూడు వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వీరిద్దరితో పాటు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(24) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మార్క్రమ్(20), క్లాసెన్(16) పరుగులు చేశారు.అయ్యర్, గుర్బాజ్ విధ్వంసం..అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ గుర్భాజ్ (39) పరుగులు చేయగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(52 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.కేకేఆర్ రెండో వికెట్ డౌన్..గుర్బాజ్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన గుర్భాజ్.. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కేకేఆర్ విజయానికి ఇంకా 8 పరుగులు కావాలి.విజయం దిశగా కేకేఆర్..114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 6 ఓవర్లు మగిసే సరికి వికెట్ నష్టానికి కేకేఆర్ 72 పరుగులు చేసింది. క్రీజులో గుర్భాజ్(21), వెంకటేశ్ అయ్యర్(40) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ డౌన్..114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన సునీల్ నరైన్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది.113 పరుగులకే కుప్పకూలిన ఎస్ఆర్హెచ్చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్.. కేకేఆర్ బౌలర్ల దాటికి 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ పేసర్లు మిచెల్ స్టార్క్, ఆరోరా ఆరంభంలోనే ఎస్ఆర్హెచ్ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్ మూడు వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వీరిద్దరితో పాటు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(24) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మార్క్రమ్(20), క్లాసెన్(16) పరుగులు చేశారు. కాగా ఐపీఎల్ చరిత్రలో ఇదే లోయెస్ట్ టార్గెట్ కావడం గమనార్హం.16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 98/8ఎస్ఆర్హెచ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన క్లాసెన్.. హర్షిత్ రానా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులో ఉనద్కట్ వచ్చాడు. 16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 98/8పీకల్లోతు కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 77 పరుగులకే 7 వికెట్లుఎస్ఆర్హెచ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 77 పరుగులకే సన్‌రైజర్స్ 7 వికెట్లు కోల్పోయింది. చక్రవర్తి బౌలింగ్‌లో షాబాజ్ అహ్మద్ ఔట్ కాగా.. రస్సెల్ బౌలింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సమద్ సైతం ఔటయ్యాడు. క్రీజులో క్లాసెన్(13), కమ్మిన్స్ 4 పరుగులతో ఉన్నారు. 13 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 82/7పీకల్లోతు కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 62 పరుగులకే 5 వికెట్లు62 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన మార్క్రమ్.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి షాబాజ్ అహ్మద్ వచ్చాడు.నాలుగో వికెట్ డౌన్నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన నితీష్ కుమార్.. హర్షిత్ రానా బౌలింగ్‌లో ఔటయ్యాడు.కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 21 పరుగులకే 3 వికెట్లుటాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ కష్టాల్లో పడింది. 21 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి.. స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.హెడ్ ఔట్..ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్ గోల్డెన్ డక్‌గా వెనదిరిగాడు. వైబవ్ ఆరోరా బౌలింగ్‌లో హెడ్.. వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ రెండు వికెట్లు నష్టానికి 15 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ త్రిపాఠి(7), మార్క్రమ్(4) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్హెచ్కు బిగ్ షాక్.. అభిషేక్ ఔట్‌టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్‌ను ఎస్ఆర్హెచ్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.ఐపీఎల్-2024లో ఫైనల్ పోరుకు రంగం సిద్దమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ టైటిల్ పోరులో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఎస్ఆర్హెచ్ ఒకే ఒక మార్పు చేసింది. తుది జట్టులోకి సమద్ స్ధానంలో ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ వచ్చాడు.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిసన్రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ -
ఎస్ఆర్హెచ్ కప్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లలేదు: భారత మాజీ ఓపెనర్
ఐపీఎల్-2024లో ఫైనల్ పోరుకు మరి కొన్ని తెరలేవనుంది. చెపాక్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా టైటిల్ విజేతను ఎంచుకున్నాడు. కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలుస్తుందని చోప్రా జోస్యం చెప్పాడు. అయితే ఎస్ఆర్హెచ్ను తక్కువ అంచనా వేయద్దని, ఆ జట్టు టైటిల్‌ను సొంతం చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లలేదని చోప్రా చెప్పుకొచ్చాడు."ఎస్ఆర్హెచ్-కేకేఆర్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఈ మ్యాచ్ వన్‌సైడ్ గేమ్ అయితే కాదు. కేకేఆర్‌కు గెలిచే ఛాన్స్ ఉంది. అయితే హైదరాబాద్ గట్టీ పోటీ ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఒకవేళ సన్‌రైజర్స్ కప్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లలేదు. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఎస్ఆర్హెచ్కు ఇది మూడో ఫైనల్ కాగా.. కేకేఆర్‌కు నాలుగో ఫైనల్. ఇరు జట్లు టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో హెడ్ కంటే అభిషేక్ శర్మ కీలకంగా మారనున్నాడు. ఎందుకంటే ప్రత్యర్ధి జట్టులో లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ ఉండడంతో హెడ్‌కు మరోసారి కష్టాలు తప్పవు.బౌలింగ్‌లో ప్యాట్ కమ్మిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ చెలరేగితే కేకేఆర్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయవచ్చు. ముఖ్యంగా రాహుల్ త్రిపాఠి ఫామ్‌ల ఉండడం సన్‌రైజర్స్ కలిసొచ్చే ఆంశం. కానీ అతడు రిస్క్‌తో కూడిన షాట్లు ఆడుతున్నాడు. అది అన్ని సమయాల్లో జట్టుకు మంచిది కాదు. ఎస్ఆర్హెచ్ సమిష్టిగా రాణిస్తే మరోటైటిల్ను తమ ఖాతాలో వేసుకోవచ్చు" అని తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు -
ఫైనల్లో తలపడనున్న SRH, KKR జట్లు
-
IPL 2024: రైజర్స్ VS రైడర్స్
గత మూడు సీజన్లలో ఎనిమిది, ఎనిమిది, పదో స్థానం... సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఇది. గత రెండు సీజన్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏడో స్థానానికి పరిమితం. ఐపీఎల్ ఈ ఏడాది ఆరంభానికి ముందుకు ఇరు జట్ల రికార్డు చూస్తే ఈ రెండు టీమ్‌లు ఫైనల్ చేరతాయని ఎవరూ ఊహించలేదు. కానీ అద్భుత ప్రదర్శనలతో రైజర్స్, రైడర్స్ అంచనాలు తిరగరాశాయి. అదరగొట్టే బ్యాటింగ్, రికార్డు ప్రదర్శనలతో హైదరాబాద్ ప్రస్థానం సాగితే... అన్ని రంగాల్లో చెలరేగి కోల్‌కతా అగ్రస్థానంతో ముందుకు దూసుకెళ్లింది. అన్ని అవరోధాలను దాటిన తర్వాత ఇప్పుడు అసలైన అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది. పదేళ్ల క్రితం చివరిసారి విజేతగా నిలిచిన కోల్‌కతా తమ మూడో టైటిల్‌పై గురి పెడితే... ఎనిమిదేళ్ల క్రితం చాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్ రెండో ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో చెపాక్ మైదానంలో ఎవరిది పైచేయి కానుందనేది ఆసక్తికరం. చెన్నై: ఐపీఎల్–17లో రెండు నెలలకు పైగా హోరాహోరీగా సాగిన సమరాల తర్వాత టోర్నీ విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. లీగ్ మాజీ చాంపియన్లు మరో ట్రోఫీ వేటలో సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి. చిదంబరం స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడతాయి. తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌నే ఓడించి దర్జాగా తుది పోరుకు అర్హత సాధించిన కోల్‌కతా దానిని పునరావృతం చేసేందుకు సిద్ధంగా ఉంది. మరో వైపు గత మ్యాచ్‌తో పాటు అంతకు ముందు లీగ్ దశలో కూడా కేకేఆర్ చేతిలో ఓడిన హైదరాబాద్ ఈ సారి మాత్రం వెనక్కి తగ్గకుండా తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది. శుక్రవారం ప్రతికూల పరిస్థితుల మధ్య ఇదే మైదానంలో క్వాలిఫయర్–2లో రాజస్తాన్‌ను ఓడించడంతో రైజర్స్ టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. మార్పులు చేస్తారా! ఫైనల్ కోసం హైదరాబాద్ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. టాప్–3లో హెడ్, అభిõÙక్, త్రిపాఠి ఖాయం. గత మూడు మ్యాచ్‌లుగా భారీ స్కోరు బాకీ ఉన్న హెడ్ ఫైనల్లో చెలరేగితే నిలువరించడం కష్టం. అదే విధంగా అభిõÙక్ కూడా మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌లలో దూకుడైన బ్యాటింగ్‌తో తానేంటో త్రిపాఠి నిరూపించుకున్నాడు. ఎప్పటిలాగే భారీ షాట్లతో క్లాసెన్ మిడిలార్డర్లో ఉన్నాడు. అయితే ఇద్దరు దేశవాళీ బ్యాటర్లు నితీశ్ రెడ్డి, సమద్‌లు మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. నాలుగో విదేశీ ఆటగాడిగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో రైజర్స్ మేనేజ్మెంట్లో గందరగోళం కొనసాగుతోంది. మార్క్రమ్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోతుండగా, లీగ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఫిలిప్స్‌ను తీసుకోవడం కూడా దాదాపు అసాధ్యం. పిచ్‌ను బట్టి క్వాలిఫయర్‌లో షహబాజ్ను అనూహ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా చేసుకొచ్చి టీమ్ మంచి ఫలితం సాధించింది. అయితే ఈ పిచ్‌ను స్పిన్‌కు అంతగా అనుకూలించేది కాకపోవడంతో పాటు ప్రత్యర్థి టీమ్‌లో నలుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లు ఉన్నారు. కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ పేస్ బౌలింగ్‌లో తమ బాధ్యత నిర్వర్తించగలరు. మార్పుల్లేకుండా... కోల్‌కతా మాత్రం ఎలాంటి సందేహం లేకుండా క్వాలిఫయర్–1 ఆడిన టీమ్‌నే కొనసాగించనుంది. మొదటినుంచి చివరి ఆటగాడి వరకు అందరూ ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. ఓపెనర్లుగా నరైన్, గుర్బాజ్ సత్తా చాటగలరు. ఆ తర్వాత వరుసగా వెంకటేశ్, శ్రేయస్, రాణా జట్టు భారం మోస్తారు. చివర్లో రింకూ, రసెల్ విధ్వంసం సృష్టించగల సమర్థులు. కేకేఆర్ బౌలింగ్ కూడా సమతూకంగా ఉంది. స్టార్క్ ఫామ్‌లో ఉంటే ఏం జరుగుతుంతో గత మ్యాచ్‌లో హైదరాబాద్‌కు అర్థమైంది. హర్షిత్, అరోరాలాంటి యువ పేసర్లు కూడా రాణిస్తుండగా... స్పిన్నర్ వరుణ్ ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. తుది జట్ల వివరాలు (అంచనా) సన్‌రైజర్స్: కమిన్స్ (కెపె్టన్), హెడ్, అభిõÙక్, త్రిపాఠి, మార్క్రమ్, క్లాసెన్, నితీశ్ రెడ్డి, సమద్, భువనేశ్వర్, ఉనాద్కట్, నటరాజన్, షహబాజ్/ మర్కండే. నైట్‌రైడర్స్: శ్రేయస్ (కెపె్టన్), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్, రింకూ, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్, హర్షిత్, వరుణ్, వైభవ్. పిచ్, వాతావరణం రెండో క్వాలిఫయర్ మ్యాచ్ నల్లరేగడి మట్టితో కూడిన పిచ్‌పై జరిగి స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. కానీ ఫైనల్‌ను ఎర్రమట్టితో కూడిన మరో పిచ్‌ను నిర్వహిస్తున్నారు. దాంతో బ్యాటింగ్‌కు అనుకూలించి భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. శనివారం సాయంత్రం వర్షం కురిసినా...మ్యాచ్ రోజు చిరు జల్లులకు మాత్రమే అవకాశం ఉంది. ఏదైనా ఇబ్బంది ఎదురైనా రిజర్వ్ డే ఉంది. -
వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్ విజేత ఎవరంటే?
ఐపీఎల్-2024 ఫైనల్ పోరుకు సర్వం సిద్దమైంది. ఆదివారం(మే 26) చెపాక్ స్టేడియం వేదికగా ఈ టైటిల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. తొలి క్వాలిఫయర్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచిన సంగతి తెలిసిందే. అనంతరం రెండో క్వాలిఫయర్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్.. ఫైనల్‌కు పోరు అర్హత సాధించింది.ఈ క్రమంలో కేకేఆర్ మూడో టైటిల్‌పై కన్నుయేగా.. ఎస్ఆర్హెచ్ రెండో సారి టైటిల్‌ను ముద్దాడాలని భావిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్ లీగ్ దశలో పలు మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఆఖరి 8 లీగ్ మ్యాచ్‌ల్లో మూడు వర్షంతో రద్దయ్యాయి. ఆదివారం కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ సైతం రద్దు అయింది.ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించి రద్దు అయితే పరిస్థితి ఏంటి అని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.ఫైనల్‌కు రిజర్వ్ డే..ఇక బీసీసీఐ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కేటాయించింది. ఆదివారం(మే 26) నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదులు కాకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఒకవేళ మ్యాచ్ ప్రారంభమై ఆగిపోతే.. ఆదివారం ఎక్కడనైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు. ఒకవేళ సోమవారం కూడా మ్యాచ్‌ను నిర్వహించేందుకు అవకాశం లేకుంటే.. పాయింట్ల పట్టికలో టాపర్‌గా ఉన్న కేకేఆర్‌ను విజేతగా ప్రకటిస్తారు. కాగా కనీసం సూపర్ ఓవర్ నిర్వహించేందుకు భారత కాలమానం ప్రకారం రాత్రి 1:20 వరకు సమయం ఉంటుంది. కాగా గతేడాది సీజన్ ఫైనల్ మ్యాచ్ ఫలితం రిజర్వ్ డే రోజునే తేలింది. -
IPL 2024 Final: ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు!?
క్రికెట్ అభిమానులను రెండు నెలల పాటు అలరించిన ఐపీఎల్-2024 తుది దశకు చేరుకుంది. ఆదివారం(మే 26) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ట్రోఫీని ముద్దాడాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ హైవోల్ట్‌జ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓటమికి బదులు తీర్చుకోవాలని ఎస్ఆర్హెచ్ భావిస్తోంది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్‌కు తమ ప్లేయింగ్ ఎల్వెన్లో ఒకే మార్పు చేయాలని ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిడిలార్డర్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ స్దానంలో కివీ స్టార్ గ్లెన్ ఫిలిప్స్‌ను అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సీజన్లో ఫిలిప్స్‌కు కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఛాన్స్ ఇవ్వలేదు. క్వాలిఫయర్-2కు అయినా ఫిలిప్స్‌కు ఛాన్స్ దక్కుతుందని అంతా భావించారు. కానీ ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్ అతడిని కాదని మార్క్రమ్ ఛాన్స్ ఇచ్చింది. మార్క్రమ్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.ఈ క్రమంలోనే మార్క్రమ్పై వేటు వేసి ఫిలిప్స్‌కు ఛాన్స్ ఇవ్వాలని మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరోవైపు కేకేఆర్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనున్నట్ల వినికిడి.సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు అంచనా: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, జయదేవ్ ఉనద్కత్ -
ఐపీఎల్ ఫైనల్‌కు ముందు ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం..
ఐపీఎల్-2024లో తుది పోరుకు రంగం సిద్దమైంది. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ పోరులో ఎలాగైనా గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనల్ మ్యాచ్ ముందు తమ జట్టు ఆటగాళ్లు ఎటువంటి గాయాల బారిన పడకుండా ఉండడానికి శనివారం తమ ప్రాక్టీస్ సెషన్‌ను ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్ రద్దు చేసింది. చెన్నైలో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ఎస్ఆర్హెచ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిందూస్తాన్ టైమ్స్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే ఎస్ఆర్హెచ్ ఫైనల్ పోరులో కేకేఆర్‌తో అమీతుమీ తెల్చుకోనుంది.కాగా శుక్రవారం చెపాక్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించి.. ఫైనల్ పోరకు అర్హత సాధించింది.చదవండి: T20 World Cup: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. బట్లర్ దూరం! కొత్త కెప్టెన్ ఎవరంటే? -
సన్‌రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్‌దే: ఆసీస్ లెజెండ్
ఐపీఎల్-2024 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం(మే26) చెన్నైలోని చెపాక్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. క్వాలిఫయర్ 1లో ఎస్ఆర్హెచ్పై విజయం సాధించి కేకేఆర్ తుది పోరుకు అర్హత సాధించగా.. సన్‌రైజర్స్ క్వాలిఫయర్-2లో రాజస్తాన్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ విజేతను ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడెన్ అంచనా వేశాడు. కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలుస్తుందని హేడెన్ జోస్యం చెప్పాడు. "ఫైనల్లో ఎస్ఆర్హెచ్పై కేకేఆర్ విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు ఉంది. ఫైనల్‌కు ముందు కేకేఆర్‌కు మూడు రోజుల విశ్రాంతి లభించింది. ఈ వ్యవధిలో ఎస్ఆర్హెచ్ బలాలు, బలహీనతలపై కేకేఆర్ స్పెషల్ ఫోకస్ చేసింటుంది.అంతేకాకుండా క్వాలిఫయర్-1లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన కాన్ఫిడెన్స్ కూడా కేకేఆర్‌కు కలిసిస్తోందని నేను భావిస్తున్నాను.అంతేకాకుండా చెపాక్‌లోని ఎర్రమట్టి పిచ్‌పై నరైన్,వరుణ్ చక్రవర్తి బంతితో మ్యాజిక్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి నావరకు అయితే కేకేఆర్‌దే ట్రోఫీ అని" స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్‌లో హేడన్ పేర్కొన్నాడు. -
IPL 2024: సూపర్ సన్‌రైజర్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ అసలు సత్తాను మరోసారి ప్రదర్శించింది. తొలి క్వాలిఫయర్‌లో పేలవ ఆటతో ఓటమి పాలైన జట్టు రెండో క్వాలిఫయర్‌కు వచ్చేసరికి అన్ని అ్రస్తాలతో చెలరేగింది. ఫలితంగా ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. బ్యాటింగ్‌లో హెడ్, అభిõÙక్, మార్క్రమ్ విఫలమైనా... క్లాసెన్, త్రిపాఠి ఆదుకోవడంతో హైదరాబాద్ మెరుగైన స్కోరు సాధించగలిగింది. ఆ తర్వాత బౌలర్లు చెలరేగి ప్రత్యర్థి బ్యాటర్లను పూర్తిగా కట్టిపడేశారు. బెంగళూరుతో ఎలిమినేటర్‌లో కూడా దాదాపు ఇదే స్కోరును తడబడుతూనే ఛేదించిన రాజస్తాన్ ఈసారి మాత్రం కుప్పకూలింది. చెపాక్ మైదానంలో ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లు షహబాజ్, అభిõÙక్ శర్మ కలిసి 47 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి రాయల్స్ కథను ముగించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక తొలి క్వాలిఫయర్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయమూ వచి్చంది. రెండో టైటిల్ వేటలో ఆదివారం కోల్‌కతాతో సమరానికి సన్‌రైజర్స్ సిద్ధంగా ఉంది. చెన్నై: ఐపీఎల్–17 ఫైనల్ సమరం కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ 36 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 50; 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... రాహుల్ త్రిపాఠి (15 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులే చేయగలిగింది. ధ్రువ్ జురేల్ (35 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), మినహా అంతా విఫలమయ్యారు. రాణించిన త్రిపాఠి... ఓపెనర్ అభిషేక్ (12) తొలి ఓవర్లోనే వెనుదిరగ్గా... హెడ్ తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. అయితే త్రిపాఠి దూకుడైన ఇన్నింగ్స్‌తో స్కోరును పరుగెత్తించాడు. అశి్వన్ ఓవర్లో వరుసగా 4, 4, 6 బాదిన అతను, బౌల్ట్ ఓవర్లోనూ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి అదే జోరులో తర్వాతి బంతికి అవుటయ్యాడు. అదే ఓవర్లో మార్క్రమ్ (1) కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో రాయ ల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో హెడ్, క్లాసెన్ కూడా భారీ షాట్లు ఆడటంలో విఫలమయ్యారు. ఫలితంగా వరుసగా 29 బంతుల పాటు బౌండరీనే రాకపోగా, హెడ్ కూడా అవుటయ్యాడు. చహల్ వరుస బంతుల్లో నితీశ్ రెడ్డి (5), సమద్ (0)లను అవుట్ చేసి మరింత దెబ్బ తీశాడు. మరోవైపు 33 బంతుల్లో క్లాసెన్ అర్ధసెంచరీ పూర్తయింది. 18 ఓవర్లు ముగిశాక స్కోరు 163/6 కాగా క్లాసెన్ ఉండటంతో రైజర్స్ మరిన్ని పరుగులు ఆశించింది. అయితే 19వ ఓవర్ తొలి బంతికి క్లాసెన్ బౌల్డ్ కావడంతో ఆఖరి 11 బంతుల్లో 12 పరుగులే వచ్చాయి. టపటపా... ఛేదనలో రాయల్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. టామ్ కోలర్ (10) ప్రభావం చూపలేకపోగా, 5 ఓవర్లలో 32 పరుగులే వచ్చాయి. అయితే భువనేశ్వర్ వేసిన ఆరో ఓవర్లో యశస్వి జైస్వాల్ సిక్స్, 3 ఫోర్లతో చెలరేగడంతో రాజస్తాన్ దారిలో పడినట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది. 13 పరుగుల వ్యవధిలో జట్టు 3 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ముందుకొచ్చి షాట్లు ఆడే క్రమంలో యశస్వి, సామ్సన్ (10), పరాగ్ (6) వెనుదిరిగారు. అశి్వన్ (0) డకౌట్ కాగా, ఆశలు పెట్టుకున్న హెట్‌మైర్ (4) కూడా చేతులెత్తేశాడు. 39 బంతుల్లో 84 పరుగులు చేయాల్సిన స్థితిలో విండీస్ బ్యాటర్ల నుంచి రాజస్తాన్ అద్భుతం ఆశించింది. కానీ హెట్‌మైర్ (4), పావెల్ (6) విఫలం కావడంతో జట్టు గెలుపు ఆశలు కోల్పోయింది. మరోవైపు జురేల్ పోరాడినా అది ఏమాత్రం సరిపోలేదు.స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) అశి్వన్ (బి) సందీప్ శర్మ 34; అభిõÙక్ శర్మ (సి) కోలర్ (బి) బౌల్ట్ 12; త్రిపాఠి (సి) చహల్ (బి) బౌల్ట్ 37; మార్క్రమ్ (సి) చహల్ (బి) బౌల్ట్ 1; క్లాసెన్ (బి) సందీప్ 50; నితీశ్ రెడ్డి (సి) చహల్ (బి) అవేశ్ 5; సమద్ (బి) అవేశ్ 0; షహబాజ్ (సి) జురేల్ (బి) అవేశ్ 18; కమిన్స్ (నాటౌట్) 5; ఉనాద్కట్ (రనౌట్) 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–13, 2–55, 3–57, 4–99, 5–120, 6–120, 7–163, 8–170, 9–175. బౌలింగ్: బౌల్ట్ 4–0–45–3, అశి్వన్ 4–0–43–0, సందీప్ 4–0–25–2, అవేశ్ 4–0–27–3, చహల్ 4–0–34–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) సమద్ (బి) షహబాజ్ 42; టామ్ కోలర్ (సి) త్రిపాఠి (బి) కమిన్స్ 10; సామ్సన్ (సి) మార్క్రమ్ (బి) అభిõÙక్ 10; పరాగ్ (సి) అభిషేక్ (బి) షహబాజ్ 6; జురేల్ (నాటౌట్) 56; అశ్విన్ (సి) క్లాసెన్ (బి) షహబాజ్ 0; హెట్‌మైర్ (బి) అభిషేక్ 4; పావెల్ (సి) అభిõÙక్ (బి) నటరాజన్ 6; బౌల్ట్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–24, 2–65, 3–67, 4–79, 5–79, 6–92, 7–124. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–33–0, కమిన్స్ 4–0–30–1, నటరాజన్ 3–0–13–1, ఉనాద్కట్ 1–0–5–0, షహబాజ్ 4–0–23–3, అభిషేక్ 4–0–24–2, మార్క్రమ్ 1–0–10–0.2: డెక్కన్ చార్జర్స్ జట్టు తర్వాత ఐపీఎల్ టోరీ్నలో గత సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడున నిలిచి తర్వాతి సీజన్లో ఫైనల్‌కు చేరిన రెండో జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. 2023 లో సన్‌రైజర్స్ చివరి స్థానంలో నిలిచింది. 2008 తొలి సీజన్లో డెక్కన్ చార్జర్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి 2009లో అగ్రస్థానంలో నిలవడంతోపాటు విజేతగా కూడా అవతరించింది.3: ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. 2016లో తొలిసారి విజేత అయింది. 2018లో రన్నరప్‌గా నిలిచింది. -
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే
ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కేకేఆర్.. ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ విజయంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా శ్రేయస్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను సారథిగా శ్రేయస్ ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంచైజీ వదులుకోవడంతో కేకేఆర్ జట్టుతో జత కట్టిన అయ్యర్.. మరోసారి తన కెప్టెన్సీ మార్క్ చూపించి ఫైనల్‌కు తీసుకెళ్లాడు. దీంతో ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఏ కెప్టెన్‌కు ఈ ఘనత సాధ్యం కాలేదు. కాగా ఈ ఏడాది సీజన్లో కేకేఆర్‌ను అయ్యర్ అద్భుతంగా నడిపించాడు. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో తొమ్మిదింట విజయాలతో పాయింట్ల పట్టికలో కేకేఆర్‌ను అగ్రస్ధానంలో నిలిపాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో శ్రేయస్ కెప్టెన్సీ పరంగా మాత్రమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా దుమ్ములేపాడు.చదవండి: USA vs BAN: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. యూఎస్ఏ సంచలన విజయం -
Qualifier 1: సన్‌రైజర్స్ విఫలం.. ఫైనల్ చేరిన కేకేఆర్
-
IPL 2024 KKR Vs SRH: వాళ్ల వల్లే గెలిచాం.. ఫైనల్లోనూ మేమే: శ్రేయస్ అయ్యర్
‘‘చాలా చాలా సంతోషంగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరు తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించారు. మా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నాను. ఈరోజు మేము ఏం చేయగలమో అదే చేసి చూపించాం. కీలకమైన ఈ మ్యాచ్‌లో మా జట్టులోని ప్రతి ఒక్క బౌలర్ తమ బాధ్యతను నెరవేర్చారు.వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇలాంటి వైవిధ్యమైన బౌలింగ్ లైనప్ ఉంటే కెప్టెన్ పని సులువవుతుంది. మా బౌలర్లంతా అద్భుతంగా రాణించారు. ఇక ముందు కూడా మా ప్రదర్శన ఇలాగే ఉంటుందని భావిస్తున్నా.ఈరోజు గుర్బాజ్ తన తొలి మ్యాచ్ ఆడాడు. ఓపెనర్‌గా మాకు శుభారంభమే అందించాడు. ఇదే జోరులో మరింత ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉన్నాం. ఫైనల్లోనూ మా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం’’ అని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు.ఐపీఎల్-2024లో తుదిపోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. కాగా లీగ్ దశలో పద్నాలుగింట తొమ్మిది విజయాలతో టాపర్‌గా నిలిచిన కేకేఆర్.. క్వాలిఫయర్-1లోనూ సత్తా చాటింది.అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జయభేరి మోగించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు కేకేఆర్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు.సీజన్ ఆసాంతం విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడిన సన్‌రైజర్స్‌కు షాకిస్తూ 159 పరుగులకే కుప్పకూల్చారు. మిచెల్ స్టార్క్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునిల్ నరైన్, ఆండ్రీ రసెల్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ క్రమంలో నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 14 బంతుల్లో 23, సునిల్ నరైన్ 16 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేయగలిగారు.అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్, నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ సన్‌రైజర్స్ ఫీల్డర్ల తప్పిదాల కారణంగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆకాశమే హద్దుగా చెలరేగారు. వెంకటేశ్ 28 బంతుల్లో 51, శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 58 పరుగులతో దుమ్ములేపారు.వీరిద్దరి విజృంభణతో 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి కేకేఆర్ 164 పరుగులు సాధించింది. సన్‌రైజర్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఫైనల్లో అడుగుపెట్టింది.ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రేయస్ అయ్యర్ జట్టు ప్రదర్శన పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. అదే విధంగా.. మైదానంలో వెంకటేశ్ అయ్యర్‌తో తన కమ్యూనికేషన్ గురించి చెబుతూ.. ‘‘నిజానికి నాకు తమిళ్ మాట్లాడటం రాదు. అయితే, ఎదుటివాళ్లు మాట్లాడింది అర్థం చేసుకోగలను. వెంకీ తమిళ్లోనే మాట్లాడతాడు. నేను అతడికి హిందీలో బదులిస్తాను’’ అని తెలిపాడు.What a memorable 𝗞𝗻𝗶𝗴𝗵𝘁 for the men in purple 💜Unbeaten half-centuries from Venkatesh Iyer 🤝 Shreyas IyerThe celebrations continue for the final-bound @KKRiders 😎Scorecard ▶️ https://t.co/U9jiBAlyXF#TATAIPL | #KKRvSRH | #Qualifier1 | #TheFinalCall pic.twitter.com/xBFp3Sskqq— IndianPremierLeague (@IPL) May 21, 2024 -
KKR Vs SRH: కోల్‌కతాకే ‘ఫైనల్’ సత్తా
ఈ సీజన్లో 7 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగుసార్లు 200 పైచిలుకు స్కోర్లను అవలీలగా చేసింది. ఎనిమిదోసారి మాత్రం ‘సన్’ బృందం రైజింగ్ కాలేదు. కీలకమైన ప్లే ఆఫ్స్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ పూర్తి ఓవర్లు ఆడకుండానే 159 పరుగులకే కుప్పకూలింది. రెండో క్వాలిఫయర్ ఉందన్న ధీమానో లేదంటే ఓడినా పోయేదేం లేదన్న అలసత్వమో గానీ హైదరాబాద్ బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సులువుగా ఫైనల్ దారి చూపారు. ఆద్యంతం పక్కా ప్రణాళికతో ఆడిన కోల్‌కతా ముందుగా బంతితో సన్‌రైజర్స్‌ను కట్టడి చేసి... ఆ తర్వాత బ్యాట్‌తో మెరిపించి 160 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లలోనే ఛేదించేసి దర్జాగా నాలుగోసారి ఐపీఎల్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. అహ్మదాబాద్: ‘ప్లే ఆఫ్స్’ దశ వరకు తగిన ప్రదర్శన చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఇంకో అవకాశం కోసం ఎదురుచూడకుండా ఐపీఎల్ 17వ సీజన్లో నేరుగా ఫైనల్‌కు అర్హత సంపాదించింది. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. లీగ్ దశలో భీకరమైన ఫామ్ కనబరిచిన సన్‌రైజర్స్ మాత్రం కీలకమైన దశలో నిర్లక్ష్యంగా ఆడి ఓడింది. ఫైనల్ బెర్త్ కోసం ఆ జట్టు రెండో క్వాలిఫయర్ కోసం నిరీక్షించనుంది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి (35 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు. అనంతరం కోల్‌కతా 13.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్ (28 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సన్‌రైజర్స్ బౌలర్ల భరతం పట్టి మూడో వికెట్‌కు కేవలం 44 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం జోడించడం విశేషం. గతంలో కోల్‌కతా జట్టు 2012, 2014లలో టైటిల్ సాధించి, 2021లో రన్నరప్‌గా నిలిచింది. ఆది నుంచే కష్టాల్లో... అసలైన మ్యాచ్‌లో స్టార్క్ బంతితో నిప్పులు చెరిగాడు. రెండో బంతికే ట్రవిస్ హెడ్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అభిషేక్ శర్మ (3)ను కూడా సింగిల్ డిజిట్‌కే వైభవ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఫామ్‌లో ఉన్న నితీశ్ కుమార్ రెడ్డి (9), షహబాజ్ (0)లను స్టార్క్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. దాంతో సన్‌రైజర్స్ 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50కి చేరింది.మెల్లిగా ఈ కష్టాల నుంచి గట్టెక్కుతున్న సమయంలో 8, 9, 10 ఓవర్లు సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌కు ఊరటనిచ్చాయి. హర్షిత్ వేసిన 8వ ఓవర్లో రాహుల్ త్రిపాఠి సిక్సర్‌తో 12 పరుగులొచ్చాయి. నరైన్ తొమ్మిదో ఓవర్లో త్రిపాఠి బౌండరీ బాదితే... క్లాసెన్ 6, 4 కొట్టడంతో 18 పరుగుల్ని రాబట్టుకుంది. రసెల్ పదో ఓవర్లో ఇద్దరు చెరో ఫోర్ కొట్టడంతో మరో 12 పరుగులు రావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 92/4 స్కోరు చేసింది. వరుణ్ దెబ్బతో.... ఇంకేం ఓవర్‌కు 9.2 రన్‌రేట్‌తో గాడిలో పడుతోందనుకుంటున్న తరుణంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దెబ్బకొట్టాడు. అతను వేసిన 11వ ఓవర్లో త్రిపాఠి బౌండరీతో జట్టు స్కోరు 100కు చేరింది. కానీ ఆఖరి బంతికి క్లాసెన్ అవుటయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కు 62 పరుగుల విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత కాసేపటికే 5 పరుగుల వ్యవధిలోనే త్రిపాఠి, సన్విర్ (0), సమద్ (16), భువనేశ్వర్ (0) ఇలా నాలుగు వికెట్లను కోల్పోయిన సన్‌రైజర్స్ 126/9 స్కోరు వద్ద ఆలౌట్‌కు సిద్ధమైపోయింది. ఈ దశలో కెపె్టన్ కమిన్స్ (24 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. అదరగొట్టిన ‘అయ్యర్’లు బౌలింగ్‌లోనూ హైదరాబాద్ తేలిపోవడం, ఫీల్డర్లు క్యాచ్‌లు నేలపాలు చేయడంతో నైట్‌రైడర్స్‌కు లక్ష్యఛేదన మరింత సులువైంది. ఓపెనర్లు గుర్బాజ్ (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సునీల్ నరైన్ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యారు. 67 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఒక్క వికెట్టు పడలేదు. వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ వచ్చిన లైఫ్‌లను సద్వినియోగం చేసుకొని హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో 9.4 ఓవర్లలోనే కోల్‌కతా స్కోరు వందకు చేరింది. లక్ష్యంవైపు చకచకా పరుగులు తీసింది. వెంకటేశ్ 28 బంతుల్లో, శ్రేయస్ 23 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. వెంకటేశ్, శ్రేయస్ ధాటికి కోల్‌కతా 38 బంతులు మిగిలుండగానే విజయతీరానికి చేరింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) స్టార్క్ 0; అభిõÙక్ శర్మ (సి) రసెల్ (బి) వైభవ్ 3; త్రిపాఠి (రనౌట్) 55; నితీశ్ కుమార్ రెడ్డి (సి) గుర్బాజ్ (బి) స్టార్క్ 9; షహబాజ్ (బి) స్టార్క్ 0; క్లాసెన్ (సి) రింకూ సింగ్ (బి) వరుణ్ 32; సమద్ (సి) శ్రేయస్ (బి) హర్షిత్ 16; సన్వీర్ (బి) నరైన్ 0; కమిన్స్ (సి) గుర్బాజ్ (బి) రసెల్ 30; భువనేశ్వర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 0; విజయకాంత్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–0, 2–13, 3–39, 4–39, 5–101, 6–121, 7–121, 8–125, 9–126, 10–159. బౌలింగ్: స్టార్క్ 4–0–34–3, వైభవ్ 2–0–17–1, హర్షిత్ 4–0–27–1, నరైన్ 4–0–40–1, రసెల్ 1.3–0–15–1, వరుణ్ చక్రవర్తి 4–0–26–2. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) విజయకాంత్ (బి) నటరాజన్ 23; నరైన్ (సి) విజయకాంత్ (బి) కమిన్స్ 21; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 51; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 58; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (13.4 ఓవర్లలో 2 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–44, 2–67. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–28–0, కమిన్స్ 3–0–38–1, నటరాజన్ 3–0–22–1, విజయకాంత్ 2–0–22–0, హెడ్ 1.4–0–32–0, నితీశ్ రెడ్డి 1–0–13–0. -
అదే మా కొంపముంచింది.. వీలైనంత త్వరగా మర్చిపోవాలి: కమ్మిన్స్
హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎస్ఆర్హెచ్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్ఆర్హెచ్ ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి(55) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్ క్లాసెన్(32), కమ్మిన్స్(30) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు , రస్సెల్,నరైన్, హర్షిత్ రనా, ఆరోరా తలా వికెట్ సాధించారు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ ఊదిపడేసింది. కేకేఆర్ 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 58 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(51 నాటౌట్), గుర్భాజ్(23) పరుగులతో రాణించారు. ఇక క్వాలిఫయర్1లో ఓటమి పాలైన ఎస్ఆర్హెచ్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. మే 24న జరగనున్న క్వాలిఫయర్-2లో ఆర్సీబీ లేదా రాజస్తాన్‌తో తలపడనుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో విఫలమయ్యాని కమ్మిన్స్ తెలిపాడు.మా ఓటమికి కారణమిదే: కమ్మిన్స్"ఈ ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే మాకు ఇంకా ఫైనల్స్‌కు చేరేందుకు ఛాన్స్ ఉంది. సెకెండ్ క్వాలిఫయర్‌లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాము.ప్రస్తుత టీ20 క్రికెట్లో ఏ రోజు ఏమి జరుగుతుందో అంచనా వేయలేం. మేము ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తో, అనంతరం బౌలింగ్‌లో కూడా రాణించలేకపోయాము. ఈ పిచ్‌పై బ్యాటింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ఉపయోగించాలని నిర్ణయించాం. అందుకే సన్వీర్‌కు ఛాన్ప్ ఇచ్చాం. కానీ మా ప్లాన్ బెడిసి కొట్టింది. కానీ కేకేఆర్ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. ప్రారంభంలో పిచ్ బౌలర్లకు కాస్త అనుకూలించింది. కానీ తర్వాత మాత్రం పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించింది. ఇక క్వాలిఫయర్-2 మ్యాచ్ చెన్నైలో ఆడనున్నాం. చెన్నె వికెట్ మాకు సరిగ్గా సరిపోతుందని నేను భావిస్తున్నారు. కాబట్టి ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉందంటూ" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. -
SRH Vs KKR: పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్‌లో కావ్య మారన్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో సనరైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్ ఆడాడు. విధ్వంసకర ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శరక్మ విఫలమైన చోట.. త్రిపాఠి తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ఐదో వికెట్‌కు క్లాసెన్‌తో కలిసి 62 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవరాల్‌గా 35 బంతులు ఎదుర్కొన్న త్రిపాఠి 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేశాడు.అయ్యో రాహుల్..అయితే ఈ మ్యాచ్‌లో మంచి టచ్‌లో కన్పించిన త్రిపాఠిని దురదృష్టం వెంటాడింది. అనూహ్య రీతిలో త్రిపాఠి రనౌటయ్యాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన సునీల్ నరైన్ బౌలింగ్‌లో తొలి బంతిని సమద్ భారీ సిక్స్ మలిచాడు. అదే ఓవర్లో రెండో బంతిని సమద్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. పాయింట్లో ఉన్న రస్సెల్ అద్బుతంగా డైవ్ చేస్తూ బంతిని ఆపాడు. అయితే షాట్ ఆడిన వెంటనే సమద్ నాన్‌స్ట్రైక్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠితో ఎటువంటి సమన్వయం లేకుండా సింగిల్ కోసం ప్రయత్నించాడు. త్రిపాఠి మాత్రం బంతిని చూస్తూ మిడిల్ పిచ్‌లోనే ఉండిపోయాడు. ఈ క్రమంలో రస్సెల్ బంతిని వికెట్ కీపర్ గుర్బాజ్ అందజేయగా.. అతడు స్టంప్స్‌ను గిరాటేశాడు. కాగా ఔటైన అనంతరం త్రిపాఠి భావోద్వేగానికి లోనయ్యాడు. పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో మెట్లపై కూర్చోని కన్నీరు పెట్టుకున్నాడు. ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్యా మారన్ సైతం షాక్‌కు గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Dre-Russ produces a piece of magic 🔥💜#IPLonJioCinema #TATAIPL #KKRvSRH #TATAIPLPlayoffs #AndreRussell pic.twitter.com/eaZRQNkes5— JioCinema (@JioCinema) May 21, 2024 -
KKR Vs SRH Photos: ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)
-
SRH Vs KKR: స్టార్క్ సూపర్ డెలివరీ.. హెడ్‌కు ఫ్యూజ్‌లు ఔట్
ఐపీఎల్-2024 సీజన్ మొత్తం అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్.. కీలక మ్యాచ్‌లో మాత్రం నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో హెడ్ డకౌటయ్యాడు.కేకేఆర్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బంతితో హెడ్‌ను బోల్తా కొట్టించాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన స్టార్క్ రెండో బంతిని మిడిల్ స్టంప్‌ను టార్గెట్ చేస్తూ గుడ్‌లెంగ్త్ డెలివరీ సంధించాడు. ఆ బంతిని హెడ్ ఆఫ్‌సైడ్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ప్యాడ్, బ్యాట్ గ్యాప్ మధ్యలో నుంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన హెడ్‌కు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అంతేకాకుండా హెడ్ ఔట్‌కాగానే కేకేఆర్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Starc sets the tone for Qualifier 1 with a ripper! 🔥#IPLonJioCinema #TATAIPL #KKRvSRH #TATAIPLPlayoffs #IPLinBengali pic.twitter.com/3AJG5BvZwT— JioCinema (@JioCinema) May 21, 2024 -
సన్‌రైజర్స్ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన కేకేఆర్
IPL 2024: KKR vs SRH ipl qualifier 1 live updates:సన్‌రైజర్స్ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన కేకేఆర్‌ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్.. 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 58 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(51 నాటౌట్), గుర్భాజ్(23) పరుగులతో రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్, నటరాజన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్ఆర్హెచ్ ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి(55) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్ క్లాసెన్(32), కమ్మిన్స్(30) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు , రస్సెల్,నరైన్, హర్షిత్ రనా, ఆరోరా తలా వికెట్ సాధించారు.రెండో వికెట్ డౌన్... నరైన్ ఔట్67 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన సునీల్ నరైన్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన రెహ్మతుల్లా గుర్భాజ్.. నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(12), నరైన్(12) పరుగులతో రాణించారు.దూకుడుగా ఆడుతున్న కేకేఆర్..160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో గుర్భాజ్(12), సునీల్ నరైన్(9) పరుగులతో ఉన్నారు.నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన ఎస్ఆర్హెచ్..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్ఆర్హెచ్ ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి(55) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్ క్లాసెన్(32), కమ్మిన్స్(30) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు , రస్సెల్,నరైన్, హర్షిత్ రనా, ఆరోరా తలా వికెట్ సాధించారు.14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 123/7సన్‌రైజర్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 14వ ఓవర్ వేసిన సునీల్ నరైన్ బౌలింగ్‌లో తొలుత రాహల్ త్రిపాఠి(55) రనౌట్ కాగా.. ఆ తర్వాతి బంతికే సన్వీర్ సింగ్ ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.ఐదో వికెట్ డౌన్‌హెన్రిచ్ క్లాసెన్ రూపంలో సన్‌రైజర్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన క్లాసెన్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 115/5నిలకడగా ఆడుతున్న క్లాసెన్, త్రిపాఠి10 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(30), రాహుల్ త్రిపాఠి(45) పరుగులతో ఉన్నారు.నిప్పులు చెరుగుతున్న స్టార్క్.. కష్టాల్లో ఎస్‌ఆర్‌హెచ్‌టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కష్టాల్లో పడింది. కేకేఆర్ పేసర్ మిచెల్ స్టార్క్ దాటికి కేవలం 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. 6 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ త్రిపాఠి(24), హెన్రిచ్ క్లాసెన్(5) ఉన్నారు.రెండో వికెట్ డౌన్.. అభిషేక్ ఔట్‌అభిషేక్ శర్మ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన అబిషేక్.. ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. 4 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ త్రిపాఠి(220, నితీష్ కుమార్(4) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్.. హెడ్ ఔట్‌టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్.. తొలి ఓవర్ వేసిన స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి రాహుల్ త్రిపాఠి వచ్చాడు. తొలి ఓవర్ ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది.ఐపీఎల్-2024లో తొలి క్వాలిఫయర్‌కు రంగం సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్-1లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కేకేఆర్ ఒక మార్పుతో బరిలోకి దిగగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. కేకేఆర్ జట్టులోకి ఫిల్ సాల్ట్ స్ధానంలో గుర్భాజ్ వచ్చాడు. ఈ మ్యాచ్‌లో విజయంలో సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది. తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తిసన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్ -
ప్రపంచకప్ జట్టులో దక్కని చోటు.. రింకూ ఆసక్తికర వ్యాఖ్యలు
సానుకూల దృక్పథం ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయవంతంగా ముందుకు సాగవచ్చంటున్నాడు టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్. టైమ్ బాగాలేదంటూ కాలం వృథా చేసే మనిషిని కాదని.. దేవుడు తనకు అన్నీ ఇచ్చాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం తనకు రోజులు బాగానే గడుస్తున్నాయని తెలిపాడు.క్రికెటర్‌గా జూనియర్ లెవల్లో ఎన్నో ట్రోఫీలు గెలిచానన్న రింకూ సింగ్.. ఈసారి ప్రపంచకప్‌ను ముద్దాడే అవకాశం తనకు తప్పక వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా మొదలయ్యే టీ20 ప్రపంచకప్-2024 కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టులో రింకూ సింగ్‌కు చోటు దక్కలేదు. ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్‌గా మాత్రమే అతడిని ఎంపిక చేశారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో రింకూకు అన్యాయం జరిగిందంటూ పలువురు మాజీ క్రికెటర్లు సెలక్షన్ కమిటీ తీరును తప్పుబట్టారు.అయితే, తాను మాత్రం ప్రతికూల పరిస్థితుల్లోనూ పాజిటివీతోనే ఉంటానని రింకూ సింగ్ అంటున్నాడు. ‘‘సాకులు వెదుక్కునే వాళ్లే టైమ్ బాగాలేదని చెప్తూ ఉంటారు. నాకు అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నాయి కాబట్టి మన టైమ్ బాగున్నట్లే కదా.టీమిండియా వరల్డ్‌కప్ ఫైనల్లో ఓడిపోయినపుడు చాలా మంది ఏడ్చారు. ఏదేమైనా గతాన్ని మరిచి ముందుకు సాగాల్సి ఉంటుంది! నిజానికి నేను జూనియర్ లెవల్లో ట్రోఫీలు గెలిచాను. కానీ సీనియర్ లెవల్లో ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు.అయితే, ఈసారి టీ20 ప్రపంచకప్ రూపంలో మెగా టోర్నీలో భాగం కాబోతున్నాను. ఈసారి వరల్డ్‌కప్‌ను నా చేతుల్లోకి తీసుకుంటాననే అనుకుంటున్నా. మేజర్ ఈవెంట్లో ట్రోఫీ గెలవాలన్నది ప్రతి ఒక్క క్రికెటర్ కల’’ అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కేకేఆర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూ ఈ ఏడాది 11 ఇన్నింగ్స్ ఆడి కేవలం 168 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం అతడు క్వాలిఫయర్-1 ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. అహ్మదాబాద్‌లో మంగళవారం జరుగనున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే: పాక్ లెజెండ్ View this post on Instagram A post shared by IPL (@iplt20) -
SRH Vs KKR: ఫైనల్ చేరడమే మిగిలింది: కమిన్స్ పోస్ట్ వైరల్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన ఆట తీరుతో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు(287) నమోదు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడ్డ దుస్థితి నుంచి.. ఈసారి ఏకంగా ఫైనల్ రేసులో నిలిచే స్థాయికి చేరుకుంది. కనీసం ప్లే ఆఫ్స్ చేరినా చాలంటూ ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఎదురుచూస్తున్న వేళ.. విధ్వంసకర ఆట తీరుతో ఏకంగా క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. ఇంకొక్క ఆటంకం దాటితే చాలు.. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా అర్హత సాధించే అవకాశం ముంగిట నిలిచింది. ప్రధాన కారణాలు ఇవేఇక ఈ సీజన్లో సన్‌రైజర్స్ అద్భుత విజయాలకు ప్రధాన కారణం విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ్యూహాలు, కోచ్ డానియల్ వెటోరీ ప్రణాళికలు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సారథిగా కమిన్స్ జట్టును గెలుపు బాట పట్టించడంలో పూర్తిగా విజయవంతమయ్యాడు.ప్రత్యర్థి జట్ల వ్యూహాలను చిత్తు చేస్తూ మైదానంలో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగి సన్‌రైజర్స్ విన్‌రైజర్స్‌గా మార్చడంలో సఫలమయ్యాడు ఈ పేస్ బౌలర్. ఒత్తిడి నెలకొన్న సమయాల్లోనూ ఏమాత్రం సహనం కోల్పోకుండా ఆటగాళ్లకు అండగా నిలుస్తూ ఫలితాలు రాబడుతున్నాడు. ఫ్రాంఛైజీ తన కోసం ఖర్చు పెట్టిన రూ. 20.50 కోట్లకు పూర్తి న్యాయం చేస్తూ పైసా వసూల్ ప్రదర్శన ఇస్తున్నాడు.మరో అవకాశం కూడా ఉందిఇక కమిన్స్ సారథ్యంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సన్‌రైజర్స్ క్వాలిఫయర్-1లోనూ ఇదే జోష్ కనబరిస్తే.. టైటిల్‌కు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలుస్తుంది.ఒకవేళ కేకేఆర్‌తో ఈ మ్యాచ్‌లో ఓడినా క్వాలిఫయర్-2 రూపంలో కమిన్స్ బృందానికి మరో అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎలా చూసినా ఈసారి సన్‌రైజర్స్‌కు ఫైనల్ చేరేందుకు సానుకూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు.ఫైనల్స్‌లో అడుగుపెట్టడమే తరువాయిఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా సొంతమైదానం ఉప్పల్‌లో సన్‌రైజర్స్ ఆదివారం.. ఈ సీజన్ లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్ ఆడింది. పంజాబ్ కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.అనంతరం కేకేఆర్- రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ రద్దు కావడంతో రెండో స్థానాన్ని మరింత పదిలం చేసుకుని క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో కమిన్స్ స్పందిస్తూ.. ‘‘ఉప్పల్‌లో మరో అద్భుతమైన రోజు. మాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. ఇక మనం ఫైనల్స్‌లో అడుగుపెట్టడమే తరువాయి’’ అని అభిమానులను ఉత్సాహపరిచాడు.ఈసారి కచ్చితంగా తుదిపోరుకు అర్హత సాధిస్తామని ఈ సందర్భంగా కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా కేకేఆర్- సన్‌రైజర్స్ మధ్య క్వాలిఫయర్-1కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇదే గడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే: పాక్ లెజెండ్ Locked and loaded for Qualifier 1 🔥💪#PlayWithFire #KKRvSRH pic.twitter.com/nkTpipX0I8— SunRisers Hyderabad (@SunRisers) May 21, 2024 -
KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే!
ఐపీఎల్-2024లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్ చేరే తొలి జట్టును ఖరారు చేసే క్వాలిఫయర్-1లో మాజీ చాంపియన్లు కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మంగళవారం తలపడనున్నాయి.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజెండరీ పేసర్ వసీం అక్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. కేకేఆర్ చాలా ప్రమాదకర జట్టు అంటూ ప్రత్యర్థి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను హెచ్చరించాడు.అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణం‘‘పాయింట్ల పట్టికలో కేకేఆర్ అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణం వారి బౌలింగ్ లైనప్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల సమర్థులు ఆ జట్టులో ఉన్నారు.అలాంటి బౌలర్లు ఉన్న జట్టు ఏదైనా కచ్చితంగా విజయాలు సాధిస్తుంది. ఈ సీజన్లో ఇప్పటికే వరుణ్ చక్రవర్తి 18, హర్షిత్ రాణా 16, ఆల్‌రౌండర్లు ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్ చెరో 15, మిచెల్ స్టార్క్ 12 వికెట్లు పడగొట్టారు.ప్రమాదకర జట్టు ముఖ్యంగా ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల స్టార్క్ ఉండటం వారికి ప్రధాన బలం. కేకేఆర్ ఎలాంటి హడావుడి లేకుండా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో.. ఫైనల్ చేరేందుకు అర్హతలు ఉన్న ప్రమాదకర జట్టు అని కచ్చితంగా చెప్పగలను.ఇక ఈ జట్టులో ఉన్న ప్రతి ఒక్క బ్యాటర్ కూడా కీలక సమయంలో ఏదో ఒక మ్యాచ్‌లో రాణిస్తూనే ఉన్నాడు. దూకుడుగా ఆడుతున్నట్లుగా కనిపిస్తున్నా ఎక్కడా అతి విశ్వాసం ప్రదర్శించరు’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.కోల్‌కతా నైట్ రైడర్స్‌కే ఎక్కువ అవకాశాలుక్వాలిఫయర్-1 నేపథ్యంలో ఫైనల్ చేరే తొలి జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఓపెనర్ ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్) జట్టుకు దూరం కావడం కచ్చితంగా ప్రభావం చూపుతుందని వసీం అక్రం అభిప్రాయపడ్డాడు. కాగా వసీం అక్రం గతంలో కేకేఆర్ జట్టుతో కలిసి పనిచేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో తమ ఆరంభ మ్యాచ్‌లో కేకేఆర్- సన్‌రైజర్స్ పరస్పరం తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల స్వల్ప తేడాతో రైజర్స్‌ను ఓడించింది.చదవండి: MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది.. అయితే: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్ -
IPL 2024: ఫైనల్ వేటలో ఎవరిదో జోరు!
అహ్మదాబాద్: గత రెండు నెలలుగా పది జట్ల పోరు ‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా సాగింది. మెరుపులు, ధనాధన్ ధమాకాలతో ఐపీఎల్ 17వ సీజన్ మరింత మజాను పంచింది. ఇప్పుడు నాలుగు జట్ల సమరం ఫైనల్ దిశగా జరగనుంది. ముందుగా మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్‌లో జోరు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... రెండుసార్లు (2012, 2014) చాంపియన్ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో తలపడనుంది. 2016లో ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సన్‌రైజర్స్ ప్రస్తుత సీజన్లో భీకరమైన ఫామ్ దృష్ట్యా టైటిల్ వేటలో ముందంజ వేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కోల్‌కతా తక్కువేం కాదు... తగ్గేలా లేనేలేదు! ఈ సీజన్లో కేవలం 3 మ్యాచ్‌లే ఓడిన నైట్‌రైడర్స్ ఎవరికి సాధ్యం కానీ 9 విజయాల్ని సాధించి పాయింట్ల పట్టికలో ‘టాప్’లో నిలిచింది. అటు బౌలింగ్, బ్యాటింగ్‌లో సమతూకంగా ఉన్న కేకేఆర్ రెండో క్వాలిఫయర్‌దాకా చాన్స్ తీసుకోకుండా ఫైనల్ బెర్త్ సాధించాలని ఆశిస్తోంది. సన్ తుఫాన్‌కు ఎదురేది? సన్‌రైజర్స్ కొట్టిన కొట్టుడు... దంచిన దంచుడు... 200 పైచిలుకు లక్ష్యమైనా మాకేంటని ఛేదించిన వైనం చూస్తే హైదరాబాద్‌కు ఎదురు నిలవడం ఏ జట్టుకైనా కష్టమే! దంచేసే ఓపెనర్ హెడ్ డకౌటైన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 215 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించి టాప్–2లోకి దూసుకొచ్చింది. అభిషేక్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు పదేపదే చుక్కలు చూపిస్తున్నారు. ఈ జట్టు బలం బ్యాటింగే! అయితే నిలకడ లేని బౌలింగ్‌తోనే అసలు సమస్యంతా! బౌలర్ల వైఫల్యం వల్లే 277/3, 287/3, 266/7 లాంటి రికార్డు స్కోర్లు నమోదు చేసినా భారీ తేడాతో ఏ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. కెపె్టన్ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ సహా బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తేనే సన్‌రైజర్స్‌కు విజయం సులువవుతుంది. ఫైట్ రైడర్స్ ఫిల్ సాల్ట్–సునీల్ నరైన్ ఓపెనింగ్ జోడీ మెరుపులతో కోల్‌కతా నైట్‌రైడర్స్ కాస్తా ఫైట్‌రైడర్స్‌గా మారింది. కీలకమైన మ్యాచ్‌లో సాల్ట్ (స్వదేశానికి తిరుగుముఖం) లేకపోయినప్పటికీ బ్యాటింగ్ బలం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, రసెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్ ఇలా ఎనిమిదో వరుస వరకు తిరుగులేని బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు కోల్‌కతా. ప్రత్యేకించి రసెల్, రింకూ, రమణ్‌దీప్‌లైతే స్పెషలిస్టు హిట్టర్లు. టాప్–3 విఫలమైన ప్రతీసారీ జట్టును నడిపించారు. బౌలింగ్‌లో అనుభవజు్ఞడైన స్టార్క్, నరైన్, రసెల్‌లతో పాటు హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలు నైట్‌రైడర్స్ విజయాల్లో భాగమవుతున్నారు. ఇక నైట్‌రైడర్స్ మ్యాచ్ ఆడి పది రోజులవుతోంది. ఈ నెల 11న ముంబై ఇండియన్స్‌పై మొదట 157/7 స్కోరే చేసినా... ప్రత్యరి్థని 139/8కు కట్టడి చేసి 18 పరుగులతో గెలిచింది. తర్వాత గుజరాత్, రాజస్తాన్‌లతో జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. దీంతో ఆటగాళ్లంతా ‘మ్యాచ్ ఆకలి’ మీదున్నారు. తప్పకుండా ఇరుజట్ల మధ్య హోరాహోరీ సమరం గ్యారంటీ! జట్లు (అంచనా) హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిõÙక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్, షహబాజ్, సమద్, సన్వీర్, భువనేశ్వర్, విజయకాంత్, నటరాజన్. కోల్‌కతా: శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్ రాణా, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్, అనుకుల్/వైభవ్. పిచ్, వాతావరణం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆరు మ్యాచ్‌ల్ని పరిశీలిస్తే... పిచ్ బౌలర్లకు, బ్యాటర్లకు సమాన అవకాశాలు కల్పించింది. మూడు మ్యాచ్‌ల్లో 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. తక్కువ స్కోర్ల మ్యాచ్ (గుజరాత్ 89 ఆలౌట్; ఢిల్లీ 92/4) కూడా ఇక్కడే నమోదైంది. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.26: ఐపీఎల్లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్, నైట్‌రైడర్స్ జట్లు ముఖాముఖిగా 26 సార్లు తలపడ్డాయి. 17 మ్యాచ్‌ల్లో నైట్‌రైడర్స్... 9 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ గెలుపొందాయి. ఈ సీజన్లో ఈ రెండు జట్లు ఒకసారి పోటీపడగా నైట్‌రైడర్స్ నాలుగు పరుగుల తేడాతో నెగ్గింది. నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు 228, అత్యల్ప స్కోరు 116 కాగా... సన్‌రైజర్స్‌పై నైట్‌రైడర్స్ అత్యధిక స్కోరు 208, అత్యల్ప స్కోరు 101. -
KKR Vs RR: వర్షంతో కోల్‌కతా, రాజస్తాన్ మ్యాచ్ రద్దు
గువాహటి: ఈ ఐపీఎల్ సీజన్లో లీగ్ దశలోని చివరి మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్‌ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వాన అడ్డుగా నిలిచింది. రాత్రి పదిన్నరకు వర్షం తెరిపినిచ్చినట్లే కనిపించడంతో మైదానం పరిస్థితుల్ని పరిశీలించిన ఫీల్డు అంపైర్లు అనిల్ చౌదరి, సాయిదర్శన్ ఎట్టకేలకు 7 ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వెంటనే టాస్ కూడా వేయగా... కోల్‌కతా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆటగాళ్లు బరిలోకి దిగడమే తరువాయి అని ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూడగా ... మళ్లీ వానొచ్చి మ్యాచ్ రాతను మార్చింది. కటాఫ్ సమయం రాత్రి 10.56 గంటలకు చేసేదేమీ లేక అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాజస్తాన్, కోల్‌కతా చెరో పాయింట్‌తో సరిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో రద్దయిన నాలుగో మ్యాచ్ ఇది. దీంతో ఇప్పటికే అగ్రస్థానాన్ని ఖాయం చేసుకున్న నైట్‌రైడర్స్‌కు ఏ నష్టం లేదు. కానీ వారం క్రితం దాకా ‘టాప్’లో కొనసాగిన రాజస్తాన్ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. హైదరాబాద్, రాజస్తాన్ జట్లు 17 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచినా... మెరుగైన రన్‌రేట్ కారణంగా హైదరాబాద్‌కు రెండో స్థానం ఖరారైంది. ఆఖరి పోరులో నెగ్గి కనీసం రెండో స్థానంలో నిలిచి క్వాలిఫయర్–1, ఓడితే క్వాలిఫయర్–2 ఆడాల్సిన రాజస్తాన్ చివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఎలిమినేటర్‌లో పోరాడాల్సిన పరిస్థితి వచి్చంది. -
KKR Vs RR: రాజస్తాన్, కేకేఆర్ మ్యాచ్ రద్దు.. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హ్యాపీ
ఐపీఎల్-2024లో భాగంగా గౌహతి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. గౌహతిలో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. అయితే మధ్యలో వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ను 7 ఓవర్లకు కుదించారు. టాస్ కూడా పడింది. కానీ మళ్లీ వర్షం తిరుగుముఖం పట్టడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇక ఈ మ్యాచ్ రద్దు కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్ధానాన్ని సుస్ధిరం చేసుకుంది. అయితే రాజస్తాన్ ఖాతాలో కూడా 17 పాయింట్లు ఉన్నప్పటకి.. ఆ జట్టు కంటే ఎస్ఆర్హెచ్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. ఈ క్రమంలోనే రాజస్తాన్ జట్టు ఎస్ఆర్హెచ్ను పాయింట్ల పట్టికలో అధిగమించలేకపోయింది.మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ 19 పాయింట్లతో అగ్రస్ధానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్స్‌కు కేకేఆర్, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్ చేరాయి. మే 21న జరగనున్న తొలి క్వాలిఫియర్‌లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు తలపడునున్నాయి. మే 22న ఎలిమినేటర్‌లో ఆర్సీబీ, రాజస్తాన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. -
IPL 2024: గుజరాత్ అవుట్
అహ్మదాబాద్: సొంతగడ్డపైనే గుజరాత్ టైటాన్స్ పుట్టి మునిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలనే పట్టుదలతో ఉన్న నిరుటి రన్నరప్ టైటాన్స్ ఆశల్ని భారీ వర్షం ముంచేసింది. తెరిపినివ్వని వానతో నరేంద్ర మోదీ స్టేడియం తడిసిముద్దయ్యింది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్గానైనా నిర్వహించేందుకు గ్రౌండ్ సిబ్బంది చాలా కష్టపడింది. కానీ ఆగినట్లే ఆగిన వాన మళ్లీ చినుకు చినుకుగా పడటంతో నిర్వాహకులు చేసేదేమీలేక తుది నిర్ణయం తీసుకోవాల్సి వచి్చంది. నిజానికి రాత్రి 10 గంటలైనా అసలు టాస్ వేసేందుకే అవకాశం లేకపోయింది. చివరిసారిగా రాత్రి 10.36 గంటలకు మైదానాన్ని పరిశీలించిన ఫీల్డు అంపైర్లు నవ్‌దీప్ సింగ్, నిఖిల్ పట్వర్దన్ మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించగా, ఆటగాళ్లు పరస్పర కరచాలనంతో మైదానంలోని ప్రేక్షకుల్ని పలుకరిస్తూ డ్రెస్సింగ్ రూమ్‌వైపు నడిచారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వర్షంవల్ల రద్దయిన తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. పటిష్టస్థితిలో కోల్‌కతా ఫలితం తేలని మ్యాచ్‌తో టాప్–2 స్థానాలు మాత్రం తేలిపోయాయి. మ్యాచ్ రద్దుతో వచి్చన ఒక పాయింట్‌తో కోల్‌కతా 19 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్ మిగిలున్న ఆఖరి మ్యాచ్‌లో ఓడినా... తొలి రెండు స్థానాల్లో ఉండటం ఖాయమైంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న రాజస్తాన్ రాయల్స్ తమ రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ ఒకవేళ గెలిస్తే 20 పాయింట్లతో అగ్రస్థానంలోకి ఎగబాకుతుంది. అప్పుడు నైట్‌రైడర్స్ రెండో స్థానానికి పడిపోయినా ఎలిమినేటర్ ఆడే పరిస్థితి అయితే రాదు. ఐపీఎల్‌లోకి ప్రవేశించిన గత రెండేళ్ల నుంచి ఫైనల్ చేరిన గుజరాత్ ఈసారి ఇంకో మ్యాచ్ మిగిలున్నా... లీగ్ దశలోనే ని్రష్కమించనుంది. 2022లో టైటిల్ గెలిచిన టైటాన్స్ గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచిన టైటాన్స్ ఖాతాలో 11 పాయింట్లున్నాయి. ఒకవేళ ఆఖరిపోరు గెలిచినా... 13 పాయింట్లవద్దే ఆగిపోతుంది. అయితే పట్టికలో ఇప్పటికే కోల్‌కతా (19), రాజస్తాన్ (16), చెన్నై (14), హైదరాబాద్ (14) ముందు వరుసలో ఉండటంతో గుజరాత్ ఖేల్ లీగ్‌తోనే ముగిసింది. -
వర్షం ఎఫెక్ట్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షర్ఫాణమైంది. ఎడతరిపి లేని వర్షం కారణంగా టాస్ పడకుండానే ఈ మ్యాచ్ రద్దు అయింది. సాయంత్రం నుంచే అహ్మదాబాద్‌లో వర్షం కురుస్తోంది. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. ఇరు జట్లకూ చేరో పాయింట్ లభించింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ ఐదింట విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్ధానంలో నిలిచింది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పటికే తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే . ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ తొమ్మిదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. -
KKR Vs MI: కేకేఆర్ ఆల్‌రౌండర్‌కు బిగ్ షాక్.. మ్యాచ్ పీజులో 50 శాతం కోత
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ రమణదీప్ సింగ్‌కు ఐపీఎల్ మెనెజ్‌మెంట్ బిగ్ షాకిచ్చింది. ఐపీఎల్-2024లో భాగంగా శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదిగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రమణ్‌దీప్ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2ని ఉల్లంఘించి లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. తన తప్పును రమణ్ దీప్ అంగీకరించాడని, మ్యాచ్ రిఫరీ విధించిన జరిమానాను సైతం అంగీకరించినట్టు ఐపీఎల్ పేర్కొంది. లెవల్ 1 స్థాయి ఉల్లంఘనకు మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్. దీనికి ఆటగాడు కట్టుబడి ఉండాల్సిందే. క్రికెట్ పరికరాలు లేదంటే, స్టంప్స్‌ను బ్రేక్ చేయడం, గ్రౌండ్ పరికరాలు లేదంటే ఫిక్చర్లు, ప్రకటనల బోర్డులను డామేజ్లకు చేయడం వంటి ఆర్టికల్ 2.2 కిందకు వస్తాయి. ఇక ఈ మ్యాచ్‌లో రమణ్ దీప్ 8 బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబైపై 18 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. -
KKR Vs MI: సునీల్ నరైన్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు డకౌట్లగా వెనుదిరిగిన ప్లేయర్‌గా నరైన్ నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌటైన నరైన్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో నరైన్ ఇప్పటివరకు 44 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఇంతకుముందు ఈ చెత్త రికార్డు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అలెక్స్ హెల్స్ పేరిట ఉండేది. హెల్స్ 43 సార్లు డకౌటయ్యాడు. తాజా మ్యాచ్‌తో హెల్స్‌ను నరైన్ అధిగమించాడు. అదే విధంగా ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన రెండో ఆటగాడిగా పియూష్ చావ్లా సరసన సునీల్ నరైన్ నిలిచాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 16 సార్లు ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ డకౌటయ్యాడు. దీంతో పాటు మరో రికార్డును కూడా నరైన్ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్( అంతర్జాతీయ, లీగ్‌లు)లో 550 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా సునీల్ నరైన్ నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 625 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ 574 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. -
చాలా బాధగా ఉంది.. ఆ తప్పే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తీరు ఏ మాత్రం తీరలేదు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఈ ఏడాది సీజన్లో ముంబైకు ఇది తొమ్మిదో ఓటమి కావడం గమనార్హం. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై.. ఆఖరి మ్యాచ్‌లలోనూ తమ మార్కును చూపించలేకపోతుంది. ఈ మ్యాచ్‌లో 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. నిర్ణీత 16 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ(32) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ (21 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ రాణా (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని హార్దిక్ తెలిపాడు."ఈ ఓటమిని జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. లక్ష్య చేధనలో మాకు అద్బుతమైన ఆరంభం లభించినప్పటికి మేము సద్వినియోగపరుచుకోలేకపోయాము. వాతవారణ పరిస్ధితుల కారణంగా పిచ్ కొంచెం మేము అనుకున్నదాని కంటే కొంచెం భిన్నంగా ఉంది. అయితే బ్యాటింగ్‌కు మరి అంత కష్టమైన వికెట్(ఈడెన్ పిచ్) అయితే కాదు. పరిస్థితులకు తగ్గట్టు మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. 158 పరుగుల టార్గెట్ అనేది మరి అంత పెద్ద లక్ష్యమేమి కాదు. తొలుత మేము బౌలింగ్ చేసే టప్పుడు మా బౌలర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. బంతి బౌండరీకి వెళ్లిన ప్రతీసారి పూర్తిగా తడిగా మారి వెనుక్కి వచ్చేది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రత్యర్ధి బ్యాటర్లు బౌండరీలను అలవోకగా బాదారు.ఇక మా చివరి మ్యాచ్ కోసం ప్రత్యేక ప్రణాళికలలు ఏమీ లేవు. వీలైనంతవరకు టోర్నీని విజయంతో ముగించేందుకు ప్రయ"త్నిస్తాము. ఏదమైనప్పటికి ఈ ఏడాది సీజన్లో మా స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు. -
MI Vs KKR: బుమ్ బుమ్ బుమ్రా.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ బాల్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ మరో ఓటమి చవి చూసింది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (21 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ రాణా (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, ఆరోరా, రస్సెల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంచలన బంతితో మెరిశాడు. అద్భుతమైన బంతితో కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన బుమ్రా తొలి బంతినే నరైన్‌కు అద్భుతమైన ఇన్-స్వింగింగ్ యార్కర్‌గా సంధించాడు.బుమ్రా వేసిన బంతికి నరైన్ దగ్గర సమధానమే లేకుండా పోయింది. నరైన్ బ్యాట్ కిందకు దించే లోపే బంతి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన నరైన్ బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వరల్డ్‌క్రికెట్‌లో యార్కర్ల కింగ్ అంటూ బుమ్రాను పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన నాలుగు ఓవర్ల కోటాలో 39 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. Jasprit Bumrah is my happiness.pic.twitter.com/wvLPZSbhs5— R A T N I S H (@LoyalSachinFan) May 11, 2024 -
‘ప్లేఆఫ్స్’కు కోల్‌కతా
కోల్‌కతా: ఈ సీజన్ ఐపీఎల్లో ‘ప్లే ఆఫ్స్’ చేరిన తొలి జట్టుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. శనివారం జరిగిన పోరులో కోల్‌కతా 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. భారీ వర్షం వల్ల మ్యాచ్ చాలా ఆలస్యంగా మొదలవడంతో 16 ఓవర్లకు కుదించారు. ముందుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (21 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), నితీశ్ రాణా (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. అనంతరం ముంబై ఇండియన్ 16 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. ఇషాన్ కిషన్ (22 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్‌వర్మ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మెరిపించిన వెంకటేశ్ ఇన్నింగ్స్ తొలిబంతికే సిక్సర్ బాదిన సాల్ట్ (6)ను ఐదో బంతికే తుషార అవుట్ చేయగా, మరో ప్రమాదకర ఓపెనర్ సునీల్ నరైన్ (0) బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో వెంకటేశ్ 4, 6, 4 బాదాడు. కానీ మరుసటి ఓవర్లోనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7)ను అన్షుల్ బౌల్డ్ చేసి ముంబై శిబిరాన్ని మురిపించాడు. పవర్‌ప్లే 5 ఓవర్లలో నైట్‌రైడర్స్ 45/3 స్కోరు చేసింది. ఆరో ఓవర్లో జట్టు స్కోరు 50 దాటగా... నితీశ్ రాణా, వెంకటేశ్‌ల దూకుడుతో కోల్‌కతా ఇన్నింగ్స్ పుంజుకుంది. వెంకటేశ్ ధాటికి చావ్లా అడ్డుకట్ట వేయగా, రసెల్ (14 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాకతో నైట్‌రైడర్స్ 10.2 ఓవర్లలో వంద పరుగులు దాటింది. అడపాదడపా బౌండరీలతో జట్టు స్కోరును పెంచుతున్న నితీశ్ రాణాను తిలక్ వర్మ చక్కని త్రో రనౌట్ చేయగా, ఓవర్ వ్యవధిలో రసెల్ మెరుపులకు చావ్లా కళ్లెం వేశాడు. తర్వాత ఆఖరి ఓవర్లలో రింకూ సింగ్ (12 బంతుల్లో 20; 2 సిక్స్‌లు), రమణ్‌దీప్ సింగ్ (8 బంతుల్లో 17 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)లు కూడా ధాటిని ప్రదర్శించడంతో ప్రత్యర్థి ముందు కష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. రాణించిన ఇషాన్ ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (24 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) ముంబైకి చక్కని ఆరంభాన్నే ఇచ్చారు. ఓ వైపు రోహిత్ కుదురుగా ఆడుతుంటే మరోవైపు కిషన్ చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్లతో స్కోరు వేగాన్ని పెంచాడు. 5 ఓవర్ల పవర్‌ప్లేలో ముంబై 59/0 స్కోరు చేసింది.అయితే ఇంత చక్కని శుభారంభానికి కోల్‌కతా స్పిన్నర్లు తూట్లు పొడిచారు. వరుస ఓవర్లలో నరైన్, ఇషాన్‌ను... రోహిత్‌ను వరుణ్ అవుట్ చేయడంతో ముంబై రూటు మారింది. రసెల్ బంతినందుకొని హిట్టర్లు సూర్యకుమార్ (11), టిమ్ డేవిడ్ (0)లను అవుట్ చేయడంతోనే ముంబై లక్ష్యానికి దూరమైంది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అన్షుల్ (బి) తుషార 6; నరైన్ (బి) బుమ్రా 0; వెంకటేశ్ (సి) సూర్యకుమార్ (బి) చావ్లా 42; శ్రేయస్ (బి) అన్షుల్ 7; నితీశ్ రనౌట్ 33; రసెల్ (సి) అన్షుల్ (బి) చావ్లా 24; రింకూ సింగ్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 20; రమణ్‌దీప్ నాటౌట్ 17; స్టార్క్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (16 ఓవర్లలో 7 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–6, 2–10, 3–40, 4–77, 5–116, 6–125, 7–148. బౌలింగ్: తుషార 3–0–31–1, బుమ్రా 4–0–39–2, అన్షుల్ 3–0–24–1, హార్దిక్ 3–0–32–0, పియూశ్ చావ్లా 3–0–28–2. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) రింకూ (బి) నరైన్ 40; రోహిత్ (సి) నరైన్ (బి) వరుణ్ 19; సూర్యకుమార్ (సి) రమణ్‌దీప్ (బి) రసెల్ 11; తిలక్‌వర్మ (సి) సాల్ట్ (బి) హర్షిత్ 32; హార్దిక్ (సి) వైభవ్ (బి) వరుణ్ 2; డేవిడ్ (సి) శ్రేయస్ (బి) రసెల్ 0; నేహల్ రనౌట్ 3; నమన్ (సి) రింకూ (బి) హర్షిత్ 17; అన్షుల్ నాటౌట్ 2; చావ్లా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (16 ఓవర్లలో 8 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–65, 2–67, 3–87, 4–91, 5–92, 6–117, 7–136, 8–137 బౌలింగ్: వైభవ్ 2–0–16–0, స్టార్క్ 1–0–11–0, హర్షిత్ 3–0–34–2, నరైన్ 3–0–21–1, వరుణ్ 4–0–17–2, రసెల్ 3–0–34–2. ఐపీఎల్లో నేడుచెన్నై X రాజస్తాన్‌వేదిక: చెన్నైమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి బెంగళూరు X ఢిల్లీవేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై పోరు.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. కోల్‌కతా ఓ మార్పు చేసింది. రఘువంశీ స్ధానంలో నితీష్ రానా వచ్చాడు. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న కేకేఆర్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని భావిస్తోంది. 11 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా.. ఎనిమిదింట విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై అయితే ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్ధానంలో నిలిచింది.ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారకోల్కతా నైట్ రైడర్స్ : ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి -
కేకేఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్‌కు వర్షం అడ్డంకి..
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. ఈడెన్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం కురుస్తోంది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. 7 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా వర్షం కారణంగా ఆలస్యమైంది. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న కేకేఆర్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని భావిస్తోంది.11 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా.. ఎనిమిదింట విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై అయితే ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్ధానంలో నిలిచింది. -
అత్యుత్తమ ఓనర్ అతడే.. ఓ ఎమోషన్: గంభీర్ వ్యాఖ్యలు వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విజయవంతమైన కెప్టెన్లలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఒకడు. రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్), మహేంద్ర సింగ్ ధోని(చెన్నై సూపర్ కింగ్స్) చెరో ఐదుసార్లు టైటిల్ గెలవగా.. గంభీర్ రెండుసార్లు ట్రోఫీ అందుకున్నాడు.కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 2012, 2014 సీజన్లలో చాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంఛైజీకి మారినా స్థాయికి తగ్గట్లు రాణించలేక క్యాష్ రిచ్ లీగ్‌కు గంభీర్ గుడ్‌బై చెప్పాడు. మళ్లీ ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా రీఎంట్రీ ఇచ్చాడు గౌతీ.అయితే, తాజా ఎడిషన్ నేపథ్యంలో మెంటార్‌గా సొంతగూటికి చేరుకున్నాడు గంభీర్. అతడి మార్గదర్శనంలో కేకేఆర్ మరోసారి టైటిల్ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న కోల్‌కతా ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఇదిలా ఉంటే.. కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్‌తో తనకున్న అనుబంధం గురించి గౌతం గంభీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘అతడితో నా బంధం ఎంతో అద్భుతమైనది. నాతో కలిసి పనిచేసిన ఫ్రాంఛైజీ ఓనర్లలో అత్యుత్తమ వ్యక్తి అతడు.కేవలం నిరాడంబరంగా ఉంటాడని మాత్రమే నేను ఈ మాట చెప్పడం లేదు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే తత్వం అతడిది. క్రికెటింగ్ విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోడు.స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వాతావరణం కల్పిస్తాడు. అలాంటి ఓనర్ ఉండటం నిజంగా అదృష్టం. నా ప్రతీ నిర్ణయంపై నమ్మకం ఉంచి.. నాకు మద్దతుగా నిలిచాడు.అందుకే ఫలితాలతో సంబంధం లేకుండా మా అనుబంధం ఇన్నేళ్లుగా కొనసాగుతోంది. 2011 నుంచి అతడితో నా బంధం ఇలాగే ఉంది. ఎస్ఆర్కే ఓ ఎమోషన్ అని అందరూ చెప్తారు. అయితే, అతడితో పాటు నాకు కేకేఆర్ కూడా ఓ ఎమోషనే! పరస్పరం నమ్మకం ఉంటేనే ముందుకు వెళ్లగలుగుతాం’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.కాగా లక్నో సూపర్ జెయింట్స్ సంజీవ్ గోయెంకా ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను బహిరంగంగానే తిట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్నో యాజమాన్యంతో కలిసి పనిచేసిన గంభీర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
అలా అయితేనే ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్.. ఆ రెండు జట్లు కన్ఫామ్!?
చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ తర్వాత ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ కింగ్స్ టాప్-4 రేసు నుంచి నిష్క్రమించగా.. వరుస విజయాలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సీఎస్కేపై తాజా విజయంతో గుజరాత్ టైటాన్స్ ఆశలను సజీవం చేసుకున్నాయి.మరోవైపు ఈ రెండు జట్ల కంటే మెరుగైన స్థితిలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్‌పై కన్నేశాయి. ఇక ఇప్పటికే రన్‌రేటు పరంగా అన్ని జట్ల కంటే పటిష్ట స్థితిలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్(16 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రాజస్తాన్ రాయల్స్(16 పాయింట్లు) రెండో స్థానం ఆక్రమించింది.మూడో స్థానం కోసం జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్(12 పాయింట్లు)ను వెనక్కి నెట్టి.. సన్‌రైజర్స్ హైదరాబాద్(14 పాయింట్లు) ముందుకు దూసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌నకు సంబంధించిన కొన్ని సమీకరణలు ఇలా ఉన్నాయి.కేకేఆర్.. టాప్ఇప్పటికే టాప్-1లో ఉన్న కేకేఆర్ శనివారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. సొంతమైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సేన ముంబైని ఓడించిందంటే మరో రెండు పాయింట్లు ఖాతాలో పడతాయి.ఫలితంగా 18 పాయింట్లతో కేకేఆర్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలుస్తుంది. అలా కాక ముంబైతో కాకుండా గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్‌తో మిగిలిన మ్యాచ్‌లలో ఏ ఒక్కటి గెలిచినా బెర్తు ఖాయమే!అయితే, ఇక్కడో మెలిక ఉంది. రాజస్తాన్, సీఎస్కే, సన్‌రైజర్స్ లేదా లక్నో ఈ జట్లలో మూడు 18 పాయింట్లు సాధిస్తేనే కేకేఆర్ ప్రయాణం సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా ముంబైతో మ్యాచ్‌లో ఓడినా రాజస్తాన్‌పై మాత్రం కచ్చితంగా గెలవాలి.రాజస్తాన్.. రైట్ రైట్చెన్నై, పంజాబ్, కేకేఆర్ రూపంలో రాజస్తాన్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి గెలిచినా, కేకేఆర్, సీఎస్కే, లక్నో/సన్రైజర్స్లలో ఏ జట్టు 18 పాయింట్లు సాధించినా రాజస్తాన్ బెర్త్ ఖరారవుతుంది.టాప్-2లో నిలవాలంటే కేకేఆర్‌ను మాత్రం ఓడించడం తప్పనిసరి.సన్‌రైజర్స్ రైజ్ అవ్వాలంటే!సన్‌రైజర్స్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌ల రూపంలో ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బ తీసేందుకు ప్రత్యర్థులు సిద్ధంగా ఉన్నాయి.ఈ రెండు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ గెలిస్తే సన్‌రైజర్స్ టాప్-4కు అర్హత సాధిస్తుంది. ఏ ఒక్కటి ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పని దుస్థితి ఎదురవుతుంది.చెన్నై చమక్ అనాలంటే!డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించింది. కానీ ఆ తర్వాత పడుతూ లేస్తూ ప్రస్తుతం 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఓటమి తర్వాత సీఎస్కే కాస్త డీలా పడింది. ప్రస్తుతం సీఎస్కేకు రాజస్తాన్, ఆర్సీబీలతో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.ఈ రెండింటిలోనూ గెలిస్తేనే సీఎస్కే ప్రయాణా సాఫీగా సాగుతుంది. లేదంటే.. లేదంటే ఢిల్లీ, లక్నోతో సీఎస్కే పోటీపడాల్సి ఉంటుంది. అయితే, రన్‌రేటు పరంగా సీఎస్కే ప్రస్తుతం ఆ రెండు జట్ల కంటే మెరుగ్గా ఉండటం ఊరటనిచ్చే అంశం.ఢిల్లీ దబాంగ్ అనిపించుకోవాలంటే..ఆరంభంలో అపజయాలు ఎదురైనా తిరిగి పుంజుకుని ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మిగిలిన మ్యాచ్‌లలో గెలవడం సహా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.లక్నో హ్యాట్రిక్ కొట్టాలంటే..ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో లక్నో హ్యాట్రిక్ కొట్టాలంటే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లలో తప్పక గెలవాలి. ప్రస్తుతం 12 పాయింట్లతో చెన్నై, ఢిల్లీతో సమానంగా ఉన్నా రన్‌రేటు పరంగా వెనుకబడి ఉంది రాహుల్ సేన.కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవడంతో పాటు ప్రస్తుతం టాప్-4లో ఉన్న కేకేఆర్, రాజస్తాన్, సన్‌రైజర్స్, చెన్నై వీలైనన్ని మ్యాచ్‌లు ఓడిపోతేనే లక్నో ఆశలు సజీవంగా ఉంటాయి.ఆర్సీబీ, గుజరాత్ పరిస్థితి ఇదీ!ఆర్సీబీకి ఢిల్లీ, సీఎస్కేలతో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండూ కచ్చితంగా గెలిచి.. నెట్ రన్‌రేటు పరంగా మిగతా జట్ల కంటే మెరుగపడటం సహా ఇతర జట్ల ఫలితాల కోసం వేచి చూడాలి. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికే!గుజరాత్ టైటాన్స్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. కేకేఆర్, సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లలో ఏ ఒక్కటి ఓడినా ప్రయాణం ముగిసినట్లే. రెండూ గెలిస్తే అప్పుడు ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్ రేటు తదితర అంశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. -
రోహిత్ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో!
ఐపీఎల్-2024లో కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి.. హార్దిక్ పాండ్యాను సారథి చేసినందుకు భారీ మూల్యమే చెల్లించింది.తాజా ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. కాగా రోహిత్ శర్మను కెప్టెన్‌గా తప్పించిన నాటి నుంచే అభిమానులు మేనేజ్మెంట్పై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను మైదానం లోపల, వెలుపలా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అందుకు తగ్గట్లుగానే అతడు ఏమాత్రం రాణించలేకపోతున్నాడు. ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానేపాండ్యా సారథ్యంలో ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి.. ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకొంది.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ వాతావరణం అస్సలు బాగా లేదని.. రోహిత్, హార్దిక్‌లకు మద్దతుగా జట్టు రెండు వర్గాలుగా విడిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ కన్నీళ్లుస్టార్ ఆటగాళ్ల మధ్య విభేదాల వల్లే ముంబై పరిస్థితి ఇలా మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో వైఫల్యం తర్వాత రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా ఉన్న వీడియో వీటికి మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో హిట్‌మ్యాన్ ముంబై ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ పేస్ లెజెండ్ వసీం అక్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ముంబైని వీడతాడువచ్చే ఏడాది రోహిత్ శర్మ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడితే చూడాలని ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి వచ్చే ఏడాది రోహిత్ శర్మ ముంబైతో కొనసాగకపోవచ్చు.అతడు కేకేఆర్‌లోకి రావాలని కోరుకుంటున్నాను. అక్కడ గౌతీ(గంభీర్) మెంటార్షిప్లో.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది.గొప్ప ఆటగాడుఈడెన్ గార్డెన్స్ పిచ్ మీద రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అతడొక గొప్ప ప్లేయర్. అతడు కేకేఆర్‌లోకి వస్తే చాలా చాలా బాగుంటుంది’’ అని వసీం అక్రం తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటికే పదకొండు మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కేకేఆర్ ప్రదర్శను ఈ సందర్భంగా కొనియాడాడు కూడా!చదవండి: SRH: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. ప్రపంచంలోనే తొలి టీ20 జట్టుగా.. -
విమానం దారి మళ్లింపు... వారణాసిలో కోల్‌కతా జట్టు
న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లకు సోమవారం రాత్రి కునుకు లేకుండా గడిచింది. క్రికెటర్లు ప్రయాణించిన విమానం లక్నో నుంచి కోల్‌కతాకు బయలుదేరాల్సి ఉండగా... ప్రతికూల వాతావరణంతో పలుమార్లు దారి మళ్లించారు. వారి చార్టర్ ఫ్లయిట్‌ను తొలుత గువాహటికి మళ్లించారు. అక్కడి నుంచి కోల్‌కతాకు క్లియరెన్స్ రావడంతో టేకాఫ్ అయిన విమానానికి మళ్లీ వాతావరణం ఏమాత్రం అనుకూలించలేదు. దీంతో ఉన్నపళంగా ఫ్లయిట్‌ను వారణాసి ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించాల్సి వచి్చంది. అలా తీవ్రమైన ప్రయాణ బడలిక, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల మధ్య ఆటగాళ్లు సోమవారమంతా వారణాసిలోని హోటల్లో గడపాల్సి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం తర్వాత తమ విమాన ప్రయాణం ఉండటంతో ఈలోపు కోల్‌కతా జట్టు క్రికెటర్లు వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం తర్వాత నైట్‌రైడర్స్ జట్టు కోల్‌కతాకు చేరుకోగలిగింది. ఈ నెల 11న సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. -
Play Offs: స్టార్ ఓపెనర్ దూరం?... కేకేఆర్‌కు ఓ గుడ్‌న్యూస్!
ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇప్పటికే ఆడిన పదకొండు మ్యాచ్‌లలో ఏకంగా ఎనిమిది గెలిచి పదహారు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది శ్రేయస్ అయ్యర్ సేన.కేకేఆర్ ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, సునిల్ నరైన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఆల్‌రౌండర్ నరైన్ 11 ఇన్నింగ్స్‌లో 461, సాల్ట్ 429 పరుగులు సాధించారు.అతడు దూరం!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ స్టార్ ఫిలిప్ సాల్ట్ త్వరలోనే కేకేఆర్‌ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వదేశంలో పాకిస్తాన్‌తో మే 22 నుంచి టీ20 సిరీస్ నేపథ్యంలో.. అతడు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ దశలో కేకేఆర్‌కు దూరమవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ నిజంగా అదే జరిగితే కేకేఆర్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లే! అయితే, ఇలాంటి సమయంలో అఫ్గనిస్తాన్ ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ శుభవార్తతో ముందుకు వచ్చాడు. త్వరలోనే తాను కేకేఆర్‌తో చేరనున్నట్లు వెల్లడించాడు.PC: IPLతల్లి అనారోగ్యం కారణంగానేకాగా 2023లో కేకేఆర్‌లో అడుగుపెట్టిన గుర్బాజ్ 11 మ్యాచ్‌లు ఆడి 227 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు కూడా ఉండటం విశేషం. ఇక ఈ ఏడాది సాల్ట్- నరైన్ జోడీ కారణంగా అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.ఈ క్రమంలో ఇటీవలే గుర్బాజ్ స్వదేశానికి తిరిగి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు రహ్మనుల్లా గుర్బాజ్.త్వరలోనే వస్తాను‘‘మా అమ్మ అనారోగ్యం దృష్ట్యా ఐపీఎల్ నుంచి కాస్త విరామం తీసుకున్నాను. త్వరలోనే కేకేఆర్ కుటుంబాన్ని కలుస్తాను. మా అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. తనకోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు’’ అని గుర్బాజ్ పేర్కొన్నాడు.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. ఏకపక్ష విజయం అన్న మాటలకు కేకేఆర్ సరైన నిర్వచనం ఇచ్చిందని.. విధ్వంసకర ఆట తీరును కళ్లకు కట్టిందని ఆకాశానికెత్తాడు.లక్నో గల్లీకి వెళ్లి గల్లీ క్రికెట్లో మాదిరి వారిని మట్టికరిపించిన తీరు అద్భుతమంటూ కేకేఆర్‌ను కొనియాడాడు. కాగా సొంత మైదానంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది.సంచలన ఇన్నింగ్స్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(14 బంతుల్లో 32), సునిల్ నరైన్(39 బంతుల్లో 81) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. ఏడో నంబర్ బ్యాటర్ రమణ్ దీప్ సింగ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.కేవలం ఆరు బంతుల్లోనే 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన లక్నోను కేకేఆర్ 137 పరుగులకే కుప్పకూల్చింది. పేసర్లు హర్షిత్ రాణా(3/24, రసెల్(2/17), మిచెల్ స్టార్క్(1/22).. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(3/30), సునిల్ నరైన్(1/22) లక్నో బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశారు.ఏకపక్ష విజయం ఫలితంగా కేకేఆర్ లక్నోపై ఏకంగా 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఐపీఎల్లో లక్నోకు ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘లక్నో గల్లీకి వెళ్లి గల్లీ క్రికెట్ మాదిరే వారిని చిత్తు చేసింది కేకేఆర్. ఏకపక్ష విజయం ఎలా ఉంటుందన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.SRH అని ఎవరన్నారు?లక్నోకు తమ రెండున్నరేళ్ల ప్రయాణంలో అతిపెద్ద ఓటమిని రుచి చూపించింది. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత విధ్వంసకర జట్టు అని ఎవరు చెప్పారు?ఎస్ఆర్హెచ్ కాదు! అది కేకేఆర్ మాత్రమే’’ అని ఆకాశ్ చోప్రా శ్రేయస్ అయ్యర్ సేనకు కితాబులిచ్చాడు. ఇప్పటికే కేకేఆర్ ఆరుసార్లు 200 పరుగుల స్కోరు దాటిందని.. కోల్‌కతా కంటే ప్రమాదకర జట్టు ఇంకేది ఉందని టేబుల్ టాపర్‌ను ప్రశంసించాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు(287) సాధించిన జట్టుగా సన్‌రైజర్స్ ఈ ఎడిషన్ సందర్బంగా అరుదైన రికార్డు సాధించిన విషయం తెలిసిందే.చదవండి: అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. వసీం అక్రం కౌంటర్High-Fives in the @KKRiders camp 🙌With that they move to the 🔝 of the Points Table with 16 points 💜Scorecard ▶️ https://t.co/CgxfC5H2pD#TATAIPL | #LSGvKKR pic.twitter.com/0dUMJLasNQ— IndianPremierLeague (@IPL) May 5, 2024 -
KKR Vs LSG: నరైన్ మెరుపులు
లక్నో: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ టోరీ్నలో ఎనిమిదో విజయం నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 98 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గతంలో రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా తాజా విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచి్చంది. రాజస్తాన్, కోల్‌కతా జట్లు 16 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ... మెరుగైన రన్‌రేట్‌తో కోల్‌కతా టాప్ ర్యాంక్‌ను అందుకుంది. టాస్ గెలిచి లక్నో జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు సాధించింది. ఓపెనర్ సునీల్ నరైన్ (39 బంతుల్లో 81; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరిపించాడు. ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్), రమణ్‌దీప్ సింగ్ (6 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడారు. అనంతరం 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన లక్నో జట్టు 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. స్టొయినిస్ (21 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ మరోసారి కోల్‌కతా జట్టుకు శుభారంభాన్నిచ్చారు. తొలి బంతి నుంచే వీరిద్దరు లక్నో బౌలర్ల భరతం పట్టారు. మోసిన్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో నరైన్ చెలరేగిపోయాడు. వరుసగా మూడు ఫోర్లతోపాటు ఒక సిక్స్ కూడా బాదడంతో ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. ఐదో ఓవర్లో సాల్ట్ అవుట్‌కాగా, పవర్‌ప్లే ముగిసేసరికి కోల్‌కతా 70 పరుగులు సాధించింది. పవర్‌ప్లే తర్వాత కూడా నరైన్ తన జోరు కొనసాగించాడు. 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టొయినిస్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో నరైన్ మూడు సిక్స్‌లు కొట్టాడు. రవి బిష్ణోయ్ వేసిన 12వ ఓవర్లో ఒక సిక్స్ కొట్టిన నరైన్ ఆ తర్వాత మరో భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. నరైన్ వెనుదిరిగాక... శ్రేయస్, రమణ్‌దీప్ దూకుడును కొనసాగించడంతో కోల్‌కతా స్కోరు 230 దాటింది.స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) రాహుల్ (బి) నవీనుల్ 32; నరైన్ (సి) సబ్–పడిక్కల్ (బి) బిష్ణోయ్ 81; రఘువంశీ (సి) రాహుల్ (బి) యు«ద్వీర్ 32; రసెల్ (సి) సబ్–గౌతమ్ (బి) నవీనుల్ 12; రింకూ సింగ్ (సి) స్టొయినిస్ (బి) నవీనుల్ 16; శ్రేయస్ అయ్యర్ (సి) రాహుల్ (బి) యశ్ ఠాకూర్ 23; రమణ్‌దీప్ సింగ్ (నాటౌట్) 25; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 235. వికెట్ల పతనం: 1–61, 2–140, 3–167, 4–171, 5–200, 6–224.బౌలింగ్: స్టొయినిస్ 2–0–29–0, మోసిన్ ఖాన్ 2–0–28–0, నవీనుల్ హక్ 4–0–49–3, యశ్ ఠాకూర్ 4–0–46–1, కృనాల్ పాండ్యా 2–0–26–0, రవి బిష్ణోయ్ 4–0–33–1, యు«ద్వీర్ సింగ్ 2–0–24–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) రమణ్‌దీప్ (బి) హర్షిత్ 25; అర్షిన్ (సి) రమణ్‌దీప్ (బి) స్టార్క్ 9; స్టొయినిస్ (సి) హర్షిత్ (బి) రసెల్ 36; దీపక్ హుడా (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 5; పూరన్ (సి) సాల్ట్ (బి) రసెల్ 10; బదోని (సి) స్టార్క్ (బి) నరైన్ 15; టర్నర్ (సి అండ్ బి) వరుణ్ 16; కృనాల్ పాండ్యా (సి) సాల్ట్ (బి) హర్షిత్ 5; యు«ద్వీర్ (సి) రసెల్ (బి) వరుణ్ 7; బిష్ణోయ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షిత్ 2; నవీనుల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 137. వికెట్ల పతనం: 1–20, 2–70, 3–77, 4–85, 5–101, 6–109, 7–125, 8–129, 9–137, 10–137.బౌలింగ్: వైభవ్ 2–0–21–0, స్టార్క్ 2–0–22–1, నరైన్ 4–0–22–1, హర్షిత్ రాణా 3.1–0–24–3, వరుణ్ చక్రవర్తి 3–0–30–3, రసెల్ 2–0–17–2. -
KKR Vs LSG: నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు.నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫిల్ సాల్ట్(32), రఘువంశీ(32), రమణ్ దీప్ సింగ్(6 బంతుల్లో 25) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్- హాక్ మూడు వికెట్లు పడగొట్టగా.. బిష్ణోయ్, యుద్దవీర్, యష్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు. -
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
ఐపీఎల్-2024లో మరో కీలక సమరానికి రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు లక్నో యువ పేసర్ మయాంక్ యాదవ్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో యష్ ఠాకూర్ వచ్చాడు. మరోవైపు కేకేఆర్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది .తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్ -
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. శుక్రవారం వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ముంబై సంక్లిష్టం చేసుకుంది. వాంఖడేలో కేకేఆర్ చేతిలో ముంబై జట్టు ఓడిపోవడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ క్రమంలో ముంబై జట్టును విజయం పథంలో నడిపించలేక విఫలమవుతున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం హార్దిక్ పాండ్యా కెప్టెన్స్‌పై మండిపడ్డాడు. "ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. పేపర్‌పై ముంబై జట్టు చాలా బలంగా ఉంది. కానీ మైదానంలో మాత్రం పూర్తిగా తేలిపోతున్నారు.ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురుస్తోంది. బౌలింగ్‌లో ముంబైకి మంచి ఆరంభం లభించింది. 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కేకేఆర్ కష్టాల్లో పడింది.అటువంటి సమయంలో 6వ బౌలర్‌గా నమన్ ధీర్ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? చావ్లాతో ఫుల్ ఓవర్ల కోటాను పూర్తి చేయలేదు. మనీష్ పాండే, వెంకటేష్ అయ్యర్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి కేకేఆర్‌కు మంచి స్కోర్ అందించారు. క్రికెట్లో ఏ జట్టుకైనా కెప్టెన్సీ చాలా ముఖ్యం. కాబట్టి కెప్టెన్సీ విషయంలో మేనేజ్మెంట్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం ముంబై జట్టు ఒక యూనిటీగా ఆడడం లేదు. హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించడం ముంబై ఆటగాళ్లకు సైతం ఇష్టం లేనట్లుందని" స్టార్‌స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు. -
అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్‌కు ఉన్న అజేయ రికార్డు శుక్రవారం బద్దలైంది. సొంత మైదానం వాంఖడేలో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి ముంబై కేకేఆర్ ముందు తలవంచింది. శ్రేయస్ అయ్యర్ సేన చేతిలో 24 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.అంతేకాదు ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిస్తూ పరాజయానికి గల కారణాలు విశ్లేషించాడు.ఓటమికి కారణం అదే ‘‘మేము భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. టీ20లలో భాగస్వామ్యాలు నిర్మించలేకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.మా ఓటమికి కారణం ఒక్కటనీ చెప్పలేను. చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మా బౌలర్లు ఈరోజు అద్భుతంగా రాణించారు.నిజానికి తొలి ఇన్నింగ్స్ తర్వాత వికెట్ మరింత మెరుగైంది. తేమ కూడా ఉంది. అనుకున్న ఫలితం రాబట్టేందుకు మా వంతు కృషి చేశాం.సవాళ్లంటే ఇష్టంఏదేమైనా చివరి వరకు పోరాడుతూనే ఉండాలని నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటా. కఠిన పరిస్థితులు ఎదురవ్వడం సహజం.సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగితేనే మనల్ని మనం మరింత మెరుగుపరచుకోగలుగుతాం’’ అని పేర్కొన్నాడు. కేకేఆర్ చేతిలో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు.పూర్తిగా విఫలంకాగా ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు(2/44) తీయగలిగాడు. అయితే, బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక కేకేఆర్ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శన(4/33)తో దుమ్ములేపాడు.ముంబై వర్సెస్ కేకేఆర్ స్కోర్లు👉టాస్: ముంబై.. తొలుత బౌలింగ్👉కేకేఆర్ స్కోరు: 169 (19.5)👉ముంబై స్కోరు: 145 (18.5)👉ఫలితం: ముంబైపై 24 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వెంకటేశ్ అయ్యర్(కేకేఆర్- 52 బంతుల్లో 70 రన్స్)👉ముంబై ఇండియన్స్ టాప్ స్కోరర్: సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56 రన్స్)A memorable win for @KKRiders 🥳They wrap up a solid performance to get past the #MI challenge 💜 💪Scorecard ▶️ https://t.co/iWTqcAsT0O#TATAIPL | #MIvKKR pic.twitter.com/YT6MGSdPkj— IndianPremierLeague (@IPL) May 3, 2024 -
MI vs KKR : ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా విజయం (ఫొటోలు)
-
పుష్కర కాలం తర్వాత...
ముంబై: వాంఖెడే మైదానంలో 12 సంవత్సరాల తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) మెరిసింది. 2012లో చివరిసారిగా ఈ వేదికపై ముంబై ఇండియన్స్ జట్టును ఓడించిన కోల్‌కతా ఇప్పుడు మళ్లీ గెలుపు బావుటా ఎగురవేసింది. శుక్రవారం జరిగిన ఈ పోరులో కేకేఆర్ 24 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. వెంకటేశ్ అయ్యర్ (52 బంతుల్లో 70; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... మనీశ్ పాండే (31 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ముంబై 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, కోల్‌కతా పేసర్ స్టార్క్‌కు 4 వికెట్లు దక్కాయి. ఆదుకున్న వెంకటేశ్... కోల్‌కతా ఇన్నింగ్స్‌లో 6.1 ఓవర్లు ముగిసేసరికే సగం జట్టు అవుట్! తుషార బౌలింగ్ జోరుతో మొదలైన జట్టు పతనం వేగంగా సాగింది. తన తొలి ఓవర్లోనే సాల్ట్ (5)ను అవుట్ చేసి శుభారంభం అందించిన తుషార... రెండో ఓవర్లో రఘువంశీ (13), శ్రేయస్ అయ్యర్ (6)లను వెనక్కి పంపాడు. పాండ్యా తొలి ఓవర్లోనే నరైన్ (8) కూడా పెవిలియన్ చేరగా, రింకూ సింగ్ (9) విఫలమయ్యాడు. ఈ దశలో వెంకటేశ్, పాండే కలిసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆశించిన స్థాయిలో భారీ షాట్లు కొట్టకపోయినా ఇన్నింగ్స్ కుప్పకూలిపోకుండా వీరు కాపాడారు. ఆరో వికెట్‌కు 62 బంతుల్లో 83 పరుగులు జత చేసిన అనంతరం పాండే వెనుదిరిగాడు. సమన్వయలోపంతో రసెల్ (7) రనౌట్ కావడం చివరి ఓవర్లలో కేకేఆర్ స్కోరింగ్ అవకాశాలను దెబ్బ తీసింది. 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న వెంకటేశ్ తర్వాతి 16 బంతుల్లో 20 పరుగులే చేయగా... ఆఖరి 5 ఓవర్లలో 41 పరుగులే చేసి నైట్‌రైడర్స్ 5 వికెట్లు చేజార్చుకుంది. సూర్యకుమార్ అర్ధసెంచరీ... ఛేదనలో ముంబై కూడా తడబడింది. కేకేఆర్ బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఇషాన్ కిషన్ (13), నమన్ (11), రోహిత్ శర్మ (11) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 10 పరుగుల వ్యవధిలో తిలక్ వర్మ (4), నేహల్ వధేరా (6), హార్దిక్ పాండ్యా (1) కూడా వెనుదిరిగారు. అయితే ఈ దశలో సూర్యకుమార్ దూకుడైన బ్యాటింగ్ ముంబై విజయంపై ఆశలు రేపింది. అరోరా వేసిన ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్ బాదిన సూర్య 30 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. విజయానికి 28 బంతుల్లో 50 పరుగులు కావాల్సిన స్థితిలో సూర్య అవుట్ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివర్లో టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) కొంత పోరాడినా లాభం లేకపోయింది. 19వ ఓవర్లో స్టార్క్ 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) తిలక్ (బి) తుషార 5; నరైన్ (బి) పాండ్యా 8; రఘువంశీ (సి) సూర్యకుమార్ (బి) తుషార 13; శ్రేయస్ (సి) డేవిడ్ (బి) తుషార 6; వెంకటేశ్ (బి) బుమ్రా 70; రింకూ సింగ్ (సి అండ్ బి) చావ్లా 9; పాండే (సి) (సబ్) బ్రెవిస్ (బి) పాండ్యా 42; రసెల్ (రనౌట్) 7; రమణ్‌దీప్ (సి) కొయెట్జీ (బి) బుమ్రా 2; స్టార్క్ (బి) బుమ్రా 0; అరోరా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 169. వికెట్ల పతనం: 1–7, 2–22, 3–28, 4–43, 5–57, 6–140, 7–153, 8–155, 9–155, 10–169. బౌలింగ్: తుషార 4–0–42–3, బుమ్రా 3.5–0–18–3, కొయెట్జీ 2–0–24–0, పాండ్యా 4–0–44–2, నమన్ 3–0–25–0, చావ్లా 3–0–15–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (బి) స్టార్క్ 13; రోహిత్ శర్మ (సి) పాండే (బి) నరైన్ 11; నమన్ (బి) వరుణ్ 11; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) రసెల్ 56; తిలక్ (సి) నరైన్ (బి) వరుణ్ 4; వధేరా (బి) నరైన్ 6; పాండ్యా (సి) పాండే (బి) రసెల్ 1; డేవిడ్ (సి) శ్రేయస్ (బి) స్టార్క్ 24; కొయెట్జీ (బి) స్టార్క్ 8; చావ్లా (సి) నరైన్ (బి) స్టార్క్ 0; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 145. వికెట్ల పతనం: 1–16, 2–38, 3–46, 4–61, 5–70, 6–71, 7–120, 8–144, 9–144, 10–145. బౌలింగ్: అరోరా 3–0–35–0, స్టార్క్ 3.5–0–33–4, వరుణ్ 4–0–22–2, నరైన్ 4–0–22–2, రసెల్ 4–0–30–2. ఐపీఎల్లో నేడుబెంగళూరు X గుజరాత్ వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
ఐపీఎల్-2024లో దాదాపుగా ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. దీంతో తమ ప్లే ఆఫ్ అవకాశాలను ముంబై మరింత సంక్లిష్టం చేసుకుంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(56) ఒక్కడే పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు పడగొట్టగా.. సునీల్ నరైన్, రస్సెల్, చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. 169 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో అయ్యర్ 70 పరుగులు చేశాడు. అయ్యర్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మనీష్ పాండే కూడా తన వంతు పాత్ర పోషించాడు. 31 బంతులు ఎదుర్కొన్న పాండే 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 పరుగులు చేశాడు. ఇక ముంబై బౌలర్లలోతుషారా, బుమ్రా తలా 3 వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు, చావ్లా ఒక్క వికెట్ సాధించారు. ఇక ఈ ఏడాది సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన కేవలం 3 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించిన ముంబై.. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో నిలిచింది. -
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 169 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.52 బంతుల్లో 70 పరుగులు చేసిన అయ్యర్.. కేకేఆర్ ఫైటింగ్ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన కేకేఆర్‌ను అయ్యర్ తన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. అయ్యర్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మనీష్ పాండే కూడా తన వంతు పాత్ర పోషించాడు.31 బంతులు ఎదుర్కొన్న పాండే 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 పరుగులు చేశాడు. ఇక ముంబై బౌలర్లలో తుషారా, బుమ్రా తలా 3 వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు, చావ్లా ఒక్క వికెట్ సాధించారు. -
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కీలక పోరుకు సిద్దమైంది. వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో కేకేఆర్ తమ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ముంబై మాత్రం ఒకే ఒక మార్పు చేసింది. ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ స్ధానంలో నమాన్ ధీర్ వచ్చాడు. కాగా ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో ఉన్న ముంబై.. ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే.తుది జట్లుముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారకోల్కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి -
కేకేఆర్‌తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
ఐపీఎల్-2024లో డూఆర్‌డై మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ సిద్దమైంది. శుక్రవారం (మే 3) వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ముంబై ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ముంబై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో 54 పరుగులు సాధిస్తే.. కేకేఆర్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ డేవిడ్ వార్నర్‌ను రోహిత్ అధిగమిస్తాడు. కాగా ఇప్పటివరకు కేకేఆర్‌పై 32 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 1040 పరుగులు చేశాడు. ఈ జాబితాలో వార్నర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఇప్పటివరకు కేకేఆర్‌పై 32 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 1093 పరుగులు చేశాడు. అదే విధంగా హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్‌లో మరో 39 పరుగులు చేస్తే.. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు.ఈ జాబితాలో రోహిత్ ప్రస్తుతం 6526 పరుగులతో నాలుగో స్ధానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ ఐపీఎల్లో ఇప్పటివరకు 6564 పరుగులు చేశాడు. -
గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
టీమిండియా తరఫున రెండు ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో భాగమైన గౌతం గంభీర్.. ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చాలా కాలం పాటు ప్రాతినిథ్యం వహించిన ఈ మాజీ ఓపెనర్ ఎన్నో రికార్డులు సాధించాడు.అంతేకాదు కెప్టెన్‌గా కేకేఆర్‌ను రెండుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. 2012, 2014 సీజన్లలో ట్రోఫీ గెలిచి సత్తా చాటాడు గంభీర్. ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంఛైజీకి మారినా కెరీర్ సాఫీగా సాగకపోవడంతో ఆటకు వీడ్కోలు పలికాడు గౌతీ.ఈ క్రమంలో గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా వ్యవహరించిన ఈ బీజేపీ ఎంపీ.. తాజా ఎడిషన్‌లో మళ్లీ కేకేఆర్ గూటికి చేరాడు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు.ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో తనకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఆటగాడి పేరు ఈ సందర్భంగా వెల్లడించాడు.‘‘క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ కాదు... ఐపీఎల్లో కెప్టెన్‌గా ఉన్నపుడు నన్ను భయపెట్టిన ఒకే ఒక్క బ్యాటర్ రోహిత్ శర్మ. అతడు బరిలో ఉన్నాడంటే ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి.ఎందుకంటే రోహిత్ శర్మను ఆపడం ఎవరితరం కాదు. అందుకే అతడి కోసం తప్ప మరే ఇతర బ్యాటర్ కోసం కూడా నేను ఇన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. ఒక్కోసారి రాత్రుళ్లు నిద్రపోకుండా మరీ వ్యూహాలు రచించిన సందర్భాలు ఉన్నాయి’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.కాగా ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో కేకేఆర్ శుక్రవారం తలపడనున్న తరుణంలో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుత సీజన్లో కేకేఆర్ ఆడిన తొమ్మిదింట గెలిచి రెండో స్థానంలో ఉండగా.. ముంబై పదింట కేవలం మూడు గెలిచి తొమ్మిదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. -
T20 WC జట్టులో నో ఛాన్స్.. రింకూతో రోహిత్ సీరియస్ డిస్కషన్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా టోర్నీలో టీమిండియాకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు.సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది జనవరిలో అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్ ద్వారా విరాట్ కోహ్లితో పాటు రోహిత్ అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు అతడి గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ భారత జట్టును ముందుకు నడిపించారు.అయితే, అనుభవానికే పెద్ద పీట వేసిన బీసీసీఐ ఐసీసీ టోర్నీలో మాత్రం రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉంటాడని ప్రకటించింది. అందుకు అనుగుణంగానే అతడి సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది.రాహుల్‌పై వేటు.. రింకూకు మొండిచేయిహార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్‌గా ఛాన్స్ ఇచ్చిన సెలక్టర్లు.. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌పై వేటు వేశారు. అదే విధంగా.. కచ్చితంగా వరల్డ్‌కప్ ఆడతాడనుకున్న నయా ఫినిషర్ రింకూ సింగ్‌కు కూడా మొండిచేయి చూపారు.ఈ విషయం గురించి గురువారం రోహిత్ శర్మతో కలిసి ప్రెస్మీట్లో పాల్గొన్న బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందిస్తూ.. ఇందుకు గల కారణం వెల్లడించాడు. అదనపు బౌలర్ అవసరం ఉన్నందు వల్లే దురదృష్టవశాత్తూ రింకూకు చోటివ్వలేకపోయామని తెలిపాడు.రింకూతో రోహిత్ సీరియస్ డిస్కషన్ఈ క్రమంలో రోహిత్ శర్మ రింకూతో ముచ్చటించిన వీడియో వైరల్‌గా మారింది. ఐపీఎల్-2024లో భాగంగా రోహిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.వాంఖడే వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌కు ముందు కేకేఆర్ ప్రాక్టీస్ చేస్తుండగా హిట్‌మ్యాన్ అక్కడికి వెళ్లాడు. కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్‌తో పాటు రింకూ, మెంటార్ గౌతం గంభీర్‌తో మమేకమయ్యాడు. రోహిత్‌ను చూడగానే రింకూ నవ్వుతూ పలకరించాడు.ఆ తర్వాత రోహిత్ రింకూతో సీరియస్‌గా డిస్కస్ చేసినట్లు కనిపించింది. బహుశా వరల్డ్‌కప్ ఈవెంట్ గురించే హిట్‌మ్యాన్ మాట్లాడి ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు. కాగా వరల్డ్‌కప్-2024 జట్టుతో పాటు రింకూ రిజర్వ్ ప్లేయర్‌గా ప్రయాణించనున్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో పాల్గొనే టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.Match Hitman ke ghar rakhoge toh mehman nawazi ke liye Hitman khud aayega na 😎🫶#MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 | @ShreyasIyer15 | @rinkusingh235 | @KonaBharat | @GautamGambhir pic.twitter.com/6W9VRKbZBs— Mumbai Indians (@mipaltan) May 2, 2024 -
DC Vs KKR: రిషభ్ పంత్‌దే తప్పు.. అతడి వల్లే ఓటమి!
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తీరును ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తప్పుబట్టాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి అనంతరం అతడు చేసిన వ్యాఖ్యలను విమర్శించాడు. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై పరుగులు రాబట్టడంలో విఫలమైన తరుణంలో పంత్ తన నిర్ణయాన్ని సమర్థించుకోవడం ఏమీ బాలేదన్నాడు.పవర్‌ప్లే ముగిసేసరికిఐపీఎల్-2024లో సోమవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ కేకేఆర్‌ను ఢీకొట్టింది. టాస్ గెలిచిన పంత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లతో మొదలు పెట్టినా... పృథ్వీ షా (13) ఎక్కువసేపు నిలవలేదు.స్టార్క్ తర్వాతి ఓవర్లోనే వరుసగా 6, 4 కొట్టిన జేక్ ఫ్రేజర్ (12) తర్వాతి బంతికి వెనుదిరగడంతో ఢిల్లీకి ఆశించిన ఆరంభం లభించలేదు. షై హోప్ (6) విఫలం కాగా... హర్షిత్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అభిషేక్ పొరేల్ (18) కూడా జోరు కొనసాగించలేకపోయాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 67 పరుగులకు చేరింది.కెప్టెన్ రిషభ్ పంత్ (20 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా తనదైన శైలిలో ఆడలేకపోవడంతో క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో ఎలాంటి మెరుపులు కనిపించలేదు. 18 పరుగుల వద్ద తాను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను హర్షిత్ వదిలేయడంతో బతికిపోయిన పంత్ దానిని వాడుకోలేకపోయాడు.కుల్దీప్ చక్కటి షాట్లుఎనిమిది పరుగుల వ్యవధిలో పంత్, స్టబ్స్ (4), అక్షర్ (15) వెనుదిరగ్గా... 101/7 వద్ద ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసేలా కనిపించింది. అయితే కుల్దీప్ కొన్ని చక్కటి షాట్ల(26 బంతుల్లో 35)తో చివరి వరకు నిలబడటంతో క్యాపిటల్స్ 150 పరుగులు దాటగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. కేవలం మూడు వికెట్లు నష్టపోయి 16.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీని మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సారథి పంత్ మాట్లాడుతూ.. ‘‘తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం మంచి ఆప్షనే. కాకపోతే మా బ్యాటింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.రిషభ్ పంత్‌దే తప్పు.. అతడి వల్లే ఓటమి!ఇక్కడ 180 -210 పరుగులు స్కోరు చేయవచ్చు. కాకపోతే ఈరోజు మాత్రం కాస్త పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేది’’ అని పేర్కొన్నాడు.ఈ మేరకు పంత్ చేసిన వ్యాఖ్యలపై మైకేల్ క్లార్క్ స్పందిస్తూ.. ‘‘ఓటమి తర్వాత పంత్ మాట్లాడిన తీరుతో నేను ఏకీభవించను. ఒకవేళ గెలిచి ఉంటే ఆ నిర్ణయం(టాస్) సరైందిగా ఉండేది.ఓడిపోయారు కాబట్టి తప్పును అంగీకరించాల్సిందే. ఇలాంటి పిచ్‌పై పంత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని కచ్చితంగా తప్పు చేశాడనే నా అభిప్రాయం. వాళ్లు కేవలం పది పరుగులు కాదు.. తక్కువలో తక్కువ యాభై పరుగులు వెనుకబడి ఉన్నారు.ఎందుకంటే లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు ఇంకా 3.3 ఓవర్లు మిగిలే ఉన్నాయన్న విషయం మరవొద్దు. చేతిలో ఏడు వికెట్లు కూడా ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ కనీసం 200 పరుగులు చేయాల్సింది’’ అని అభిప్రాయపడ్డాడు. A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024 -
షారుఖ్ ఖాన్ చర్యతో ఆశ్చర్యపోయిన గంగూలీ.. వెంటనే..
కోల్‌కతా నైట్ రైడర్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.అంతేకాదు.. ఆప్యాయంగా దాదాను ముద్దాడి అభిమానం చాటుకున్నాడు. షారుఖ్ చర్యతో తొలుత ఆశ్చర్యపోయిన గంగూలీ.. తర్వాత అతడిని హత్తుకుని హర్షం వ్యక్తం చేశాడు.ఐపీఎల్-2024లో భాగంగా సోమవారం నాటి మ్యాచ్‌లో కేకేఆర్- ఢిల్లీ తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కేకేఆర్ బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(3/16) అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకోగా.. పేసర్లలో మిచెల్ స్టార్క్(1/43), వైభవ్ అరోరా(2/29), హర్షిత్ రాణా(2/28), స్పిన్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్(1/24) రాణించారు.వీరిలో స్టార్క్ ఒక్కడు ధారాళంగా పరుగులు ఇచ్చాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ధనాధన్ ఇన్నింగ్స్(33 బంతుల్లో 68) సొంతగడ్డపై ఢిల్లీ మీద ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ వెనుక నుంచి వెళ్లి ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీని హత్తుకున్నాడు. వెంటనే బుగ్గ మీద ముద్దు పెట్టి ఆప్యాయత ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. the way Shah Rukh Khan ran up to Sourav Ganguly to hug and kiss him, such a wholesome moment, KKR reunion 💜 pic.twitter.com/9I0yenj0V4— sohom (@AwaaraHoon) April 29, 2024 కాగా ఐపీఎల్-2024లో కేకేఆర్‌కు తొమ్మిదింట ఇది ఆరో విజయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ పదకొండింటికి ఐదు మాత్రమే గెలిచి ఆరో స్థానంలో ఉంది. A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024 -
చరిత్ర సృష్టించిన సాల్ట్.. గంగూలీ రికార్డు బ్రేక్
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ పరుగుల వరద పారించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.మిగతా బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బందిపడిన చోట.. సాల్ట్ 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో ఏకంగా 68 పరుగులు రాబట్టాడు. తద్వారా ఢిల్లీ విధించిన 154 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కేకేఆర్ 16.3 ఓవర్లలోనే ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.ఇక తన అద్భుత ఇన్నింగ్స్ ద్వారా ఫిలిప్ సాల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న రికార్డును సాల్ట్ బద్దలు కొట్టాడు. ఢిల్లీ డైరెక్టర్‌గా ఉన్న గంగూలీ ముందే సాల్ట్ ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. ఐపీఎల్ సీజన్లో ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు1. ఫిలిప్ సాల్ట్- ఆరు ఇన్నింగ్స్‌లో 344 రన్స్- 20242. సౌరవ్ గంగూలీ- ఏడు ఇన్నింగ్స్‌లో 331 రన్స్- 20103. ఆండ్రీ రసెల్- ఏడు ఇన్నింగ్స్‌లో 311 రన్స్- 20194. క్రిస్ లిన్- తొమ్మిది ఇన్నింగ్స్‌లో 303 రన్స్- 2018.కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్లువేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా, సోమవారంటాస్: ఢిల్లీ.. బ్యాటింగ్ఢిల్లీ స్కోరు: 153/9 (20)కేకేఆర్ స్కోరు: 157/3 (16.3)ఫలితం: ఢిల్లీపై ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వరుణ్ చక్రవర్తి(కేకేఆర్)- 4 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 16 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు.టాప్ స్కోరర్ ఆఫ్ ది మ్యాచ్: ఫిలిప్ సాల్ట్(68).A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024 -
ఐపీఎల్-2024 : ఢిల్లీపై కోల్‌కతా అద్భుత విజయం (ఫొటోలు)
-
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్
సొంత మైదానంలో మూడు రోజుల క్రితం 261 పరుగులు చేసి కూడా ఓడి షాక్‌కు గురైన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) తర్వాతి మ్యాచ్‌లోనే తేరుకుంది. అదే ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈసారి చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యరి్థపై పైచేయి సాధించింది. బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన కేకేఆర్ ఆ తర్వాత పెద్దగా శ్రమ లేకుండా లక్ష్యాన్ని ఛేదించింది. మరోవైపు ఢిల్లీ గడ్డపై గత రెండు మ్యాచ్‌లు గెలిచి మళ్లీ దారిలో పడినట్లు కనిపించిన క్యాపిటల్స్ పేలవ బ్యాటింగ్‌తో తమ ఓటమికి బాట వేసుకుంది. కోల్‌కతా: పరుగుల వరద పారుతున్న ఐపీఎల్లో మరో చిన్న విరామం. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు స్వల్ప స్కోరుకే ఆట ముగించగా... ప్రత్యర్థి సులువుగానే లక్ష్యం చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (26 బంతుల్లో 35 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. కోల్‌కతా లెగ్ స్పిన్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఢిల్లీని కట్టడి చేశాడు. అనంతరం కోల్‌కతా 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 68; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... శ్రేయస్ అయ్యర్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (23 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 57 పరుగులు జోడించి మ్యాచ్‌ను ముగించారు. ఢిల్లీ బ్యాటర్లలో టెయిలాండర్ కుల్దీప్ యాదవ్(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్ ఆరోరా, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా కేకేఆర్ బౌలర్లు ఎక్స్‌ట్రాస్ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారుభారీ భాగస్వామ్యం... ఛేదనలో తొలి బంతి నుంచే సాల్ట్ దూకుడు మొదలైంది. లిజాడ్ వేసిన మొదటి ఓవర్లో సాల్ట్ 2 ఫోర్లు, సిక్స్ బాదగా మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఆపై 15 పరుగుల వద్ద సాల్ట్ ఇచి్చన క్యాచ్‌ను లిజాడ్ వదిలేశాడు. ఖలీల్ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్ బాదిన సాల్ట్ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 6 ఓవర్లలో కేకేఆర్ 79పరుగులు సాధించింది. అయితే అక్షర్ తన తొలి రెండు ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేయగా, రింకూ సింగ్ (11) విఫలమయ్యాడు. అయితే ‘అయ్యర్’ ద్వయం ఇబ్బంది లేకుండా ఆడి మరో 21 బంతులు మిగిలి ఉండగానే గెలిపించింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) సాల్ట్ (బి) అరోరా 13; జేక్ ఫ్రేజర్ (సి) వెంకటేశ్ (బి) స్టార్క్ 12; పొరేల్ (బి) హర్షిత్ 18; హోప్ (బి) అరోరా 6; పంత్ (సి) శ్రేయస్ (బి) వరుణ్ 27; అక్షర్ (బి) నరైన్ 15; స్టబ్స్ (సి) సాల్ట్ (బి) వరుణ్ 4; కుశాగ్ర (సి) సాల్ట్ (బి) వరుణ్ 1; కుల్దీప్ (నాటౌట్) 35; సలామ్ (సి) శ్రేయస్ (బి) హర్షిత్ 8; లిజాడ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–17, 2–30, 3–37, 4–68, 5–93, 6–99, 7–101, 8–111, 9–140. బౌలింగ్: స్టార్క్ 3–0–43–1, అరోరా 4–0–29–2, హర్షిత్ 4–0–28–2, నరైన్ 4–0–24–1, వరుణ్ చక్రవర్తి 4–0–16–3, రసెల్ 1–0–10–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (బి) అక్షర్ 68; నరైన్ (సి) ఫ్రేజర్ (బి) అక్షర్ 15; రింకూ (సి) కుల్దీప్ (బి) లిజాడ్ 11; శ్రేయస్ (నాటౌట్) 33; వెంకటేశ్ (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16.3 ఓవర్లలో 3 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–79, 2–96, 3–100. బౌలింగ్: లిజాడ్ 3–0–38–1, ఖలీల్ అహ్మద్ 3–0–28–0, సలామ్ 2.3–0–30–0, అక్షర్ పటేల్ 4–0–25–2, కుల్దీప్ 4–0–34–0. . -
కుల్దీప్ యాదవ్ ఫైటింగ్ నాక్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్ల దాటికి ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆఖరిలో స్పిన్నర్ కుల్దీప్ కీలక ఇన్నింగ్స్ ఆడడటంతో ఢిల్లీ.. 150 ప్లస్ మార్క్‌ను దాటగల్గింది. 26 బంతులు ఎదుర్కొన్న కుల్దీప్.. 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో కుల్దీప్‌దే టాప్ స్కోర్ కావడం విశేషం. కెప్టెన్ పంత్ రిషబ్ పంత్ 27 పరుగులతో పర్వాలేదన్పించాడు.ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్ ఆరోరా, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా కేకేఆర్ బౌలర్లు ఎక్స్‌ట్రాస్ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారు. -
ఢిల్లీతో మ్యాచ్.. కేకేఆర్ స్టార్ బౌలర్ రీ ఎంట్రీ! తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో మరో కీలక పోరుకు తెరలేచింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు దూరమైన పృథ్వీ షా తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు కేకేఆర్ రెండు మార్పులు చేసింది. తుది జట్టులోకి మిచెల్ స్టార్క్, వైభవ్ ఆరోరా వచ్చారు. ఇక పాయింట్ల పట్టికలో కేకేఆర్ రెండో స్ధానంలో కొనసాగుతుండగా.. ఢిల్లీ ఆరో స్ధానంలో ఉంది.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, లిజాద్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్ -
కోహ్లి స్ట్రైక్‌రేటుపై గంభీర్ వ్యాఖ్యలు.. వైరల్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో తనకు ఎలాంటి విభేదాలు లేవని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. మీడియా అత్యుత్సాహం వల్లే తమ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందిందని పేర్కొన్నాడు.అదే విధంగా ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి కూడా గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా కోహ్లి- అప్పటి లక్నో మెంటార్ గంభీర్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వీరిద్దరి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, తాజా సీజన్లో కేకేఆర్ మెంటార్‌గా అవతారమెత్తిన గంభీర్.. ఇటీవలి మ్యాచ్ సందర్భంగా కోహ్లిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు.గొడవ పడితే చూడాలనిఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఓ షోలో విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ‘‘మేము ఇద్దరం గొడవ పడితే చూడాలని అనుకునే వాళ్లే ఎక్కువగా ఉంటారు. వాళ్లను ఈ వీడియోలు నిరాశపరిచి ఉంటాయి’’ అని చమత్కరించాడు.ఈ విషయంపై తాజాగా స్పందించిన గౌతం గంభీర్ కోహ్లి వ్యాఖ్యలతో ఏకీభవించాడు. టీఆర్పీ రేటింగ్‌ల కోసమే మీడియా ఇలాంటివి ఎక్కువగా ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను, విరాట్ కోహ్లి ఎలాంటి వాళ్లమో, తమ మధ్య అనుబంధం ఎలా ఉంటుందో వారికి తెలియదన్న గౌతీ.. వీలైతే పాజిటివిటీని పెంచే అంశాలను చూపించాలన్నాడు.ఎవరికి వారే ప్రత్యేకంతాను, కోహ్లి పరిణతి చెందిన వ్యక్తులం కాబట్టి ఇలాంటి వాటి గురించి ఎక్కువగా పట్టించుకోమని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి జరుగుతున్న చర్చలపై స్పందిస్తూ.. ‘‘ప్రతి ఒక్క ఆటగాడు భిన్నంగా ఉంటాడు.మాక్స్వెల్ ఆడినట్లు కోహ్లి ఆడకపోవచ్చు. కోహ్లి తీరుగా మాక్స్వెల్ షాట్లు బాదలేకపోవచ్చు. పదకొండు మంది సభ్యులున్న జట్టులో ఎవరికి వారే ప్రత్యేకం. బ్యాటింగ్ ఆర్డర్లో 1- 8 వరకు విధ్వంసకర బ్యాటర్లు అందుబాటులో ఉంటే స్కోరు 300 కావొచ్చు లేదంటే 30 పరుగులకే ఆలౌట్ కావచ్చు.జట్టును గెలిపించినపుడు స్ట్రైక్‌రేటు 100 ఉన్నా బాగానే అనిపిస్తుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం 180 స్ట్రైక్‌రేటు కూడా మన కంటికి కనిపించదు. మ్యాచ్ జరిగే వేదిక, పిచ్ పరిస్థితి, ప్రత్యర్థి జట్టు.. ఇలా భిన్న అంశాలపై స్ట్రైక్‌రేటు ఆధారపడి ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు’’ అంటూ విరాట్ కోహ్లికి గంభీర్ మద్దుతుగా నిలిచాడు. కాగా ఈ సీజన్లో కోహ్లి ఆడిన 9 మ్యాచ్‌లలో కలిపి 145.76 స్ట్రైక్‌రేటుతో 430 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.