ఐపీఎల్-2025కు సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు భారీ షాక్ తగలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, మధ్యప్రదేశ్ కీలక ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ గాయపడ్డాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో భాగంగా గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా కేరళలతో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా అయ్యర్ కుడి కాలి చీలమండకు గాయమైంది.
దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడుతూ కిందపడిపోయాడు. వెంటనే ఫిజియో చికిత్స అందించినప్పటికి అయ్యర్ నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో అతడు ఫిజియో సాయంతో మైదాన్ని వీడాడు. సాధరణంగా చీలమండ గాయానికి గురైన ఆటగాళ్లు పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతోంది.
ఈ క్రమంలో అయ్యర్ మిగిలిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా వెంకటేశ్ తాజా గాయం కేకేఆర్ అభిమానులకు ఆందోళనకు గురిచేస్తుంది. గత సీజన్‌లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన అయ్యర్.. ఈసారి క్యాష్ రిచ్ లీగ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.
అయితే ఐపీఎల్‌కు ఇంకా దాదాపుగా రెండు నెలల సమయం ఉన్నందున అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించే అ వకాశముంది. ఒకవేళ అతడి ఫిట్‌నెస్ సాధించిక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమైతే కేకేఆర్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.23.75 కోట్ల భారీ ధర వెచ్చించి మరి వెంకటేశ్‌ను కేకేఆర్ సొంతం చేసుకుంది.
కష్టాల్లో మధ్యప్రదేశ్..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు మధ్యప్రదేశ్ 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో ప్రస్తతం కెప్టెన్ శుబ్‌మ్ శర్మ(42 నాటౌట్), కుమార్ కార్తికేయ(10) ఉన్నారు. కేరళ పేసర్ నిదేష్ 4 వికెట్లు పడగొట్టి ఎంపీని దెబ్బతీశాడు. అతడితో పాటు సక్సేనా, సరేవత్ తలా వికెట్ సాధించారు.
చదవండి: Dinesh Karthik: ఇప్పటికైనా అతడికి జట్టులో ఛాన్స్ ఇస్తారా? లేదా?
Comments
Please login to add a commentAdd a comment