venkatesh iyer
-
కేకేఆర్‌కు భారీ షాక్.. రూ.23 కోట్ల ఆటగాడికి గాయం
ఐపీఎల్-2025కు సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు భారీ షాక్ తగలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, మధ్యప్రదేశ్ కీలక ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ గాయపడ్డాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో భాగంగా గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా కేరళలతో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా అయ్యర్ కుడి కాలి చీలమండకు గాయమైంది.దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడుతూ కిందపడిపోయాడు. వెంటనే ఫిజియో చికిత్స అందించినప్పటికి అయ్యర్ నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో అతడు ఫిజియో సాయంతో మైదాన్ని వీడాడు. సాధరణంగా చీలమండ గాయానికి గురైన ఆటగాళ్లు పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతోంది. ఈ క్రమంలో అయ్యర్ మిగిలిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా వెంకటేశ్ తాజా గాయం కేకేఆర్ అభిమానులకు ఆందోళనకు గురిచేస్తుంది. గత సీజన్లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన అయ్యర్.. ఈసారి క్యాష్ రిచ్ లీగ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే ఐపీఎల్‌కు ఇంకా దాదాపుగా రెండు నెలల సమయం ఉన్నందున అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధించే అ వకాశముంది. ఒకవేళ అతడి ఫిట్నెస్ సాధించిక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమైతే కేకేఆర్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.23.75 కోట్ల భారీ ధర వెచ్చించి మరి వెంకటేశ్‌ను కేకేఆర్ సొంతం చేసుకుంది.కష్టాల్లో మధ్యప్రదేశ్..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు మధ్యప్రదేశ్ 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో ప్రస్తతం కెప్టెన్ శుబ్మ్ శర్మ(42 నాటౌట్), కుమార్ కార్తికేయ(10) ఉన్నారు. కేరళ పేసర్ నిదేష్ 4 వికెట్లు పడగొట్టి ఎంపీని దెబ్బతీశాడు. అతడితో పాటు సక్సేనా, సరేవత్ తలా వికెట్ సాధించారు.చదవండి: Dinesh Karthik: ఇప్పటికైనా అతడికి జట్టులో ఛాన్స్ ఇస్తారా? లేదా? -
నితీశ్ రెడ్డి ఒక్కడే కాదు.. అతడూ జట్టులో ఉండాలి!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్ ముంగిపునకు వచ్చింది. ఈ మెగా ఈవెంట్లో టీమిండియా తమ చివరి టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టి.. ఇప్పటికి నాలుగు టెస్టులు పూర్తి చేసుకుంది.పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో గెలిచి శుభారంభం చేసిన టీమిండియా.. తదుపరి అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం ఓడిపోయింది. అనంతరం బ్రిస్బేన్‌లో మూడో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న భారత జట్టు.. మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టులో దారుణంగా విఫలమైంది. ఆతిథ్య జట్టు చేతిలో 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంఫలితంగా ఆసీస్ టీమిండియాపై 2-1తో ఆధిక్యంలో నిలవగా.. రోహిత్ సేన డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటికే సౌతాఫ్రికా టైటిల్ పోరుకు అర్హత సాధించగా.. ఆస్ట్రేలియాకు మార్గం సుగమమైంది. ఏదేమైనా ఆసీస్‌లో టీమిండియా వైఫల్యం కొనసాగుతున్నప్పటికీ ఓ ఆణిముత్యం లాంటి ఆటగాడు దొరకడం సానుకూలాంశం.నితీశ్ రెడ్డి.. ఆణిముత్యం లాంటి ఆటగాడు అతడు మరెవరో కాదు.. నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy). ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తొలి టెస్టు నుంచే బ్యాట్ ఝులిపిస్తున్నాడు. మెల్బోర్న్ టెస్టులో ఏకంగా శతకం(114)తో సత్తా చాటాడు. తద్వారా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో అత్యంత పిన్న వయసులోనే సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా 21 ఏళ్ల నితీశ్ రెడ్డి చరిత్ర సృష్టించాడు.ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ రెడ్డి టీమిండియా టెస్టు జట్టుతో పాతుకుపోవడం ఖాయమంటూ భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో టెస్టుల తర్వాత.. టీమిండియా 2025లో తొలుత ఇంగ్లండ్‌తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది.నితీశ్ రెడ్డితో పాటు అతడినీ ఎంపిక చేయండి!అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 పూర్తి చేసుకుని.. జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నితీశ్ రెడ్డితో పాటు ఇంగ్లండ్ టూర్‌కు మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేయాలని మేనేజ్మెంట్కు సూచించాడు.‘‘మెల్బోర్న్ టెస్టు భారత క్రికెట్‌కు అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్‌ను ఇచ్చింది.. అతడి పేరు నితీశ్ కుమార్ రెడ్డి. ఐపీఎల్లో హైదరాబాద్ ఫ్రాంఛైజీ తరఫున అదరగొట్టడం ద్వారా భారత క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన ఈ కుర్రాడు.. నిజానికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అంత గొప్ప ఏమీ ఆడలేదు. క్రెడిట్ మొత్తం వారికేఅయినప్పటికీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. అతడి బృందం నితీశ్ రెడ్డిపై నమ్మకం ఉంచినందుకు వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. సెలక్టర్ల నమ్మకాన్ని ఈ అబ్బాయి నిలబెట్టుకున్నాడు. ఇక మరో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer)పై కూడా సెలక్టర్లు దృష్టి సారించాలి.అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం మరో సానుకూలాంశం. అయితే, బౌలింగ్ నైపుణ్యాలను కాస్త మెరుగుపరచుకోవాలి. అతడికి ఇప్పటికే ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉంది. కాబట్టి అక్కడ అతడు టెస్టుల్లో రాణించగలడు’’ అని సునిల్ గావస్కర్ స్పోర్ట్స్ స్టార్‌కు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.కౌంటీల్లో ఆడిన వెంకటేశ్కాగా 2024లో ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా లంకాషైర్‌కు ప్రాతినిథ్యం వహించాడు వెంకటేశ్ అయ్యర్. మూడు మ్యాచ్‌లు ఆడి 116 పరుగులు చేశాడు. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు తొమ్మిది టీ20లు, రెండు వన్డేలు ఆడిన వెంకటేశ్ అయ్యర్.. ఆయా ఫార్మాట్లలో 133, 24 పరుగులు చేశాడు. అదే విధంగా అంతర్జాతీయ టీ20లలో ఐదు వికెట్లు తీయగలిగాడు.చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? -
బంతితో రాణించిన వెంకటేశ్ అయ్యర్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ ఆటగాడు, టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ బంతితో రాణించాడు. ఢిల్లీతో ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ రెండు ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అయ్యర్‌తో పాటు కుమార్ కార్తికేయ (3-0-23-1), ఆవేశ్ ఖాన్ (4-0-36-1), త్రిపురేశ్ సింగ్ (3-0-18-1) వికెట్లు తీయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. అనుజ్ రావత్ (33 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ప్రియాన్ష్ ఆర్య 29, యశ్ ధుల్ 11, ఆయుశ్ బదోని 19, హిమ్మత్ సింగ్ 15, మయాంక్ రావత్ 24, హర్ష్ త్యాగి 9 (నాటౌట్) పరుగులు చేశారు. ఇదిలా ఉంటే, ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో బరోడాపై ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శాశ్వత్ రావత్ (33), కృనాల్ పాండ్యా (30), శివాలిక్ శర్మ (26 నాటౌట్), అథీత్ సేథ్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హార్దిక్ పాండ్యా 5 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.159 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రహానే (56 బంతుల్లో 98; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) రఫ్ఫాడించడంతో 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. రహానేకు జతగా శ్రేయస్ అయ్యర్ (46) కూడా కాసేపు మెరుపులు మెరిపించాడు.భీకర ఫామ్‌లో రహానేముంబై వెటరన్ అజింక్య రహానే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న రహానే.. ఈ టోర్నీలో గత ఆరు మ్యాచ్‌ల్లో ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు.గత ఆరు మ్యాచ్‌ల్లో రహానే చేసిన స్కోర్లు..- 52(34) vs మహారాష్ట్రపై- 68(35) vs కేరళపై - 22(18) vs సర్వీసెస్‌పై- 95(53) vs ఆంధ్రపై- 84(45) vs క్వార్టర్ ఫైనల్లో విదర్భపై- 98(57) vs సెమీస్‌లో బరోడాపై -
SMAT: టీమిండియా స్టార్ల మెరుపులు.. సెమీస్ చేరిన జట్లు, షెడ్యూల్
ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్ తదితరులు ఈ టోర్నీలో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఇక ఈ టీ20 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. మధ్యప్రదేశ్, బరోడా, ముంబై, ఢిల్లీ జట్లు టాప్-4లో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్స్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ టైమింగ్స్ తదితర అంశాలను గమనిద్దాం. అంతకంటే ముందు.. ఈ నాలుగు జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన తీరుపై ఓ లుక్కేద్దాం.పృథ్వీ షా, సూర్యాంశ్, శివమ్ దూబే మెరుపులు గ్రూప్ ‘ఇ’ టాపర్‌గా క్వార్టర్స్‌లో అడుగు పెట్టిన ముంబై అదే జోరు కొనసాగిస్తూ విదర్భను మట్టికరిపించింది. ఆలూరులో బుధవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో విదర్భపై గెలుపొందింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన విదర్భ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అథర్వ తైడె (41 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్), అపూర్వ్ వాంఖడె (33 బంతుల్లో 51; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించగా... శుభమ్ దూబే (19 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసి గెలిచింది.సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... పృథ్వీ షా (26 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి బంతి నుంచే ఓపెనర్లు విరుచుకుపడటంతో 7 ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 83 పరుగులు చేసింది.కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5), సూర్యకుమార్ యాదవ్ (9) విఫలం కాగా... ఆఖర్లో శివమ్ దూబే (37 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), సూర్యాంశ్ (36 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది.వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షోఆలూరు: పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (33 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు; 2/23) ఆకట్టుకోవడంతో... సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట సౌరాష్ట్ర 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు చేసింది. చిరాగ్ జానీ (45 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో మధ్యప్రదేశ్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. అరి్పత్ గౌడ్ (42; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ రజత్ పాటిదార్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. చివర్లో హర్‌ప్రీత్ సింగ్ (9 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి జట్టును గెలిపించాడు.హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, 3 క్యాచ్‌లు బెంగళూరు: బెంగాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బరోడా 41 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ చేరింది. బరోడాకు ఆడుతున్న భారత స్టార్ హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టడంతోపాటు 3 క్యాచ్‌లు తీసుకున్నాడు. మొదట బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.శాశ్వత్ రావత్ (40; 1 ఫోర్, 3 సిక్స్‌లు), అభిమన్యు సింగ్ (37; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. బెంగాల్ బౌలర్లలో షమీ, కనిష్క్ సేత్, ప్రతీప్తా ప్రమాణిక్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగాల్ తడబడింది. 18 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండర్ షహబాజ్ అహ్మద్ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. బరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, లుక్మన్ మెరివాలా, అతిత్ సేత్ తలా మూడేసి వికెట్లు పడగొట్టారు. అనూజ్ అదుర్స్బెంగళూరు: వికెట్ కీపర్ అనూజ్ రావత్ (33 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసకర అర్ధశతకంతో చెలరేగడంతో ఢిల్లీ జట్టు ముస్తాక్ అలీ టోర్నీ సెమీఫైనల్‌కు చేరింది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీ జట్టు 19 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్ జట్టుపై నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసింది.అనూజ్ రావత్‌తో పాటు ఓపెనర్లు యశ్ ధుల్ (42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రియాన్ష్ ఆర్య (44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో ఉత్తరప్రదేశ్ జట్టు 20 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. యువ ఆటగాడు ప్రియం గార్గ్ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో పోరాడగా... రింకూ సింగ్ (10), నితీశ్ రాణా (2) విఫలమవడంతో ఉత్తరప్రదేశ్‌కు పరాజయం తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3... ఆయుష్ బదోనీ, సుయాశ్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సెమీ ఫైనల్స్ షెడ్యూల్, వేదిక, టైమింగ్స్తొలి సెమీ ఫైనల్:👉ముంబై వర్సెస్ బరోడా- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం- డిసెంబరు 13(శుక్రవారం)- ఉదయం 11 గంటలకు ఆరంభం.రెండో సెమీ ఫైనల్: 👉మధ్యప్రదేశ్ వర్సెస్ ఢిల్లీ- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం- డిసెంబరు 13(శుక్రవారం)- సాయంత్రం 4.30 నిమిషాలకు ఆరంభం.ఇప్పటి వరకు అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు సాధించింది వీరేసకీబుల్ గనీ ఈ సీజన్లో 353 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్‌గా ఉండగా.. కరణ్ లాల్ 338, అభిషేక్ పోరెల్ 335, అజింక్య రహానే 334, తిలక్ వర్మ 327 పరుగులు సాధించారు.మరోవైపు.. జగ్జీత్ సింగ్ 18 వికెట్లతో టాప్ బౌలర్‌గా ఉండగా.. కుమార్ కార్తికేయ 15, ముకేశ్ చౌదరి 15చ శ్రేయస్ గోపాల్ 14, కేవీ శశికాంత్ 14 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: బుమ్రా తర్వాత బెస్ట్ బౌలర్.. భీకర ఫామ్‌లో ఆర్సీబీ పేసర్ -
వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షో.. సెమీస్‌లో మధ్యప్రదేశ్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ అడుగుపెట్టింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 6 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసిన మధ్యప్రదేశ్.. తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. సౌరాష్ట్ర బ్యాటర్లలో చిరాగ్ జాని(80) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్విక్ దేశాయ్917), మన్కడ్916) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. త్రిపురేష్ సింగ్, రాహుల్ బాథమ్, శుక్లా తలా వికెట్ సాధించారు.అదరగొట్టిన అర్పిత్, అయ్యర్.. అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని మధ్యప్రదేశ్ 4 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. మధ్యప్రదేశ్ బ్యాటర్లలో ఓపెనర్ అర్పిత్ గౌడ్(42) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరితో పాటు హర్‌ప్రీత్ సింగ్ భాటియా(9 బంతుల్లో 22) మెరుపు మెరిపించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కట్, అనుకుర్ పన్వార్, జాని తలా వికెట్ సాధించారు. కాగా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. మరోవైపు సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ ప్రత్యర్ధి ఎవరో బెంగాల్, బరోడా మ్యాచ్‌తో తేలనుంది.చదవండి: PAK vs SA: షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు.. -
డాక్టర్ కానున్న కేకేఆర్ స్టార్ ప్లేయర్
కేకేఆర్ ప్రామిసింగ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ త్వరలోనే డాక్టర్ కానున్నాడు. 2018లో ఎంబీఏ పూర్తి చేసిన అయ్యర్.. త్వరలోనే ఫైనాన్స్‌లో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టర్ వెంకటేశ్ అయ్యర్‌గా పిలిపించుకుంటానంటున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో అయ్యర్ ఈ విషయాన్ని వెల్లడించాడు.ఇంటర్వ్యూ సందర్భంగా అయ్యర్ మాట్లాడుతూ.. ఓ క్రికెటర్ 60 సంవత్సరాల వరకు క్రికెట్ ఆడలేడు. అయితే విద్య మాత్రం చనిపోయేంతవరకూ మనతోనే ఉంటుంది. బాగా చదువుకుంటే మైదానంలోనూ, నిజ జీవితంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. యువ క్రికెటర్లు చదువుకు కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తానని అన్నాడు.కాగా, వెంకటేశ్ అయ్యర్‌కు ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత బెంగళూరులోని ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయితే అయ్యర్ క్రికెట్ కోసం ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో వెంకటేశ్ అయ్యర్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.23.75 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.కెప్టెన్సీ రేసులో అయ్యర్ఐపీఎల్ 2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో వెంకటేశ్ అయ్యర్ కీలకపాత్ర పోషించాడు. అయినా మెగా వేలానికి ముందు కేకేఆర్ అతన్ని రిలీజ్ చేసింది. అయితే మెగా వేలంలో కేకేఆర్ ఊహించని విధంగా అయ్యర్‌పై భారీ మొత్తం వెచ్చింది తిరిగి సొంతం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌ను వీడటంతో ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ కెప్టెన్ పోస్ట్ ఖాళీగా ఉంది. వచ్చే సీజన్ కోసం కేకేఆర్ కెప్టెన్సీ రేసులో వెంకటేశ్ అయ్యర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయ్యర్ నాలుగు సీజన్ల పాటు కేకేఆర్‌తో ఉన్నాడు.మరోవైపు కేకేఆర్ కెప్టెన్సీ కోసం అయ్యర్‌తో పాటు అజింక్య రహానే కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. మెగా వేలంలో కేకేఆర్ రహానేను 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. కెప్టెన్సీ కట్టబెట్టేందుకే కేకేఆర్ యాజమాన్యం రహానే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రహానేకు కెప్టెన్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రహానే టీమిండియాను విజయవంతంగా ముందుండి నడిపించాడు. దేశవాలీ క్రికెట్లోనూ రహానే ముంబై జట్టును విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు. -
అతడు 12 కోట్లకే దొరికేవాడు.. ఇషాన్ కూడా చీప్.. అయినా ఎందుకిలా?
ఐపీఎల్ మెగా వేలం-2025లో కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహం తనకు ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. అతడి కంటే ఇషాన్ కిషన్ తక్కువ ధరకు వచ్చేవాడని.. అయినప్పటికీ ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయలేదని కేకేఆర్ నిర్ణయాలను విమర్శించాడు.మూడో ఆటగాడిగాసౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటిరోజే వెంకటేశ్ అయ్యర్ కోసం కేకేఆర్ కళ్లు చెదిరే మొత్తం ఖర్చు చేసింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన మూడో ఆటగాడిగా వెంకటేశ్ నిలిచాడు.ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘వేలానికి ముందు ఇద్దరు అయ్యర్ల(శ్రేయస్, వెంకటేశ్)ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేకపోయింది. వారి డిమాండ్‌ను బట్టి వేలంలో ఒక్కరినే దక్కించుకోలగలదని తెలుసు. అయితే, వాళ్లకు ఇప్పుడు కెప్టెన్ అవసరం ఉంది. అయినప్పటికీ వెంకీ కోసం వాళ్లు భారీగా ఖర్చు పెట్టారు.ఇందులో వెంకీ రెండింటికీ సరిపోడుఒక్క ఆటగాడి కోసమే రూ. 23.75 కోట్లు వెచ్చించారు. కెప్టెన్ ఆప్షన్ లేదంటే.. ప్రత్యేక నైపుణ్యాలున్న ఆటగాడి కోసం ఎవరైనా ఇంత భారీగా ఖర్చు చేయొచ్చు. కానీ.. ఇందులో వెంకీ రెండింటికీ సరిపోడు. విశ్వాసపాత్రులుగా ఉండటం చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం అంటారు.అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్ కూడా చీప్ ఇక్కడ అది నిజమే అనిపిస్తోంది. ఒక్కడి కోసం ఇంత మొత్తం పెట్టినపుడు.. ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఇక్కడ అదే జరిగింది. మీకు ఓపెనర్ కావాలని అనుకుంటే... ఫిల్ సాల్ట్(ఆర్సీబీ) కోసం పోటీపడి రూ. 12 కోట్లకు సొంతం చేసుకోవాల్సింది. లేదంటే కేఎల్ రాహుల్(ఢిల్లీ) కోసం రూ. 14 కోట్లకు పైగా వెచ్చించాల్సింది. అదీ కాకపోతే ఇషాన్ కిషన్(సన్‌రైజర్స్) కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాడు.అతడు కూడా మంచి ఓపెనర్. అయినప్పటికీ మీరెందుకు వెంకటేశ్ కోసం రూ. 20 కోట్లకు పైగా ఎందుకు ఖర్చు చేశారో అర్థం కావడం లేదు’’ అని చోప్రా కేకేఆర్ వ్యూహాలను విమర్శించాడు. కాగా వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. అతడు పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. కానీ అతడి బౌలింగ్ గణాంకాలు మాత్రం అంతంతమాత్రమే. ఇప్పటి వరకు ఐపీఎల్లో మొత్తంగా 50 మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్ అయ్యర్ 1326 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీయగలిగాడు.కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలపడంలోఐపీఎల్-2024లో కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలపడంలో వెంకటేశ్ అయ్యర్‌ది కీలక పాత్ర. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్లో 26 బంతుల్లోనే 52 పరుగులతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(6*)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే, వేలానికి ముందు కేకేఆర్ వీరిద్దరిని విడిచిపెట్టాల్సి వచ్చింది. దీంతో వెంకీని తిరిగి దక్కించుకునే అవకాశం రాగా.. శ్రేయస్ అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో వెంకటేశ్ అయ్యర్ 13 ఇన్నింగ్స్‌లో కేవలం 370 రన్స్ చేశాడు.చదవండి: వేలం ముగిసింది.. ఇక మిగిలింది అదే!.. ఏ జట్టులో ఎవరు? ఎవరి పర్సులో ఎంత? ఎన్ని ఖాళీలు -
కేకేఆర్ ఖరీదైన ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ అందమైన భార్య (ఫోటోలు)
-
వెంకటేష్ అయ్యర్‌కు జాక్ పాట్.. ఏకంగా రూ. 23.75 కోట్లు
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఊహించని ధర పలికాడు. అయ్యర్‌ను ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అయ్యర్ కోసం కేకేఆర్, ఆర్సీబీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. ఆఖరికి ఆర్సీబీ పోటీ నుంచి తప్పుకోవడంతో అయ్యర్‌ను కోల్‌కతా సొంతం చేసుకుంది. గత సీజన్లో కూడా వెంకటేష్ అయ్యర్ కేకేఆర్కే ప్రాతినిథ్యం వహించాడు. అయితే వేలానికి ముందు అతడిని కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు.కాగా వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్-2021 సీజన్లో కేకేఆర్ తరపునే అరంగేట్రం చేశాడు. తొలుత అతడిని రూ.20లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అద్బుతంగా రాణించడంతో 2022 వేలానికి ముందు రూ. 8 కోట్లకు అయ్యర్‌ను రిటైన్ చేసుకుంది.ఆ తర్వాత రెండు సీజన్ల పాటు తమ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వెంకటేష్‌ను ఐపీఎల్-2025 వేలంలోకి కేకేఆర్ విడిచిపెట్టింది. మళ్లీ ఇప్పుడు ఏకంగా 23.75 కోట్లు వెచ్చించి మరి కొనుగోలు చేసింది. ఐపీఎల్లో వెంకటేష్ ఇప్పటివరకు 50 మ్యాచ్‌లు ఆడి 1326 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఓసెంచరీ, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి, -
IPL 2025: కేకేఆర్ విడిచిపెట్టింది.. సెంచరీలతో విరుచుకుపడ్డారు..!
ఐపీఎల్ ఫ్రాంచైజీలు అక్టోబర్ 31న తాము రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. ఈ జాబితాలో చాలామంది స్టార్ ఆటగాళ్ల పేర్లు మిస్ అయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ రింకూ సింగ్ (రూ. 13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 12 కోట్లు), సునీల్ నరైన్ (రూ. 12 కోట్లు), ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు), హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు), రమన్‌దీప్ సింగ్‌ను (రూ. 4 కోట్లు) అట్టిపెట్టుకుని.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా మిగతా ఆటగాళ్లనంతా వేలానికి వదిలేసింది.కేకేఆర్ రిటైన్ చేసుకున్న జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మిచెల్ స్టార్క్, వెంకటేశ్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు మనసు నొచ్చుకున్నారు. వెంకటేశ్ అయ్యర్ తన మనసులోని మాటను సోషల్‌మీడియాలో షేర్ చేసుకున్నాడు. కేకేఆర్ వదిలిపెట్టిన తర్వాత జరుగుతున్న తొలి రంజీ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ తన ప్రతాపాన్ని చూపాడు. రంజీల్లో మధ్యప్రదేశ్‌కు ఆడే వెంకటేశ్ అయ్యర్.. బీహార్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 113 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.కేకేఆర్ తనను వదిలేసిందన్న కోపమో ఏమో కానీ ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ చాలా పట్టుదలగా ఆడి సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా సవాలు విసిరాడు. తానెంత విలువైన ఆటగాడినో అన్న విషయాన్ని వెంకటేశ్ అయ్యర్ ఫ్రాంచైజీలకు తెలియజేశాడు.మరోవైపు కేకేఆర్ వదిలేసిన మరో అయ్యర్ కూడా ఇవాళ శతకొట్టాడు. కేకేఆర్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో 164 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్రస్తుత రంజీ సీజన్లో శ్రేయస్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. తాజా ప్రదర్శనల నేపథ్యంలో ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్‌కు మాంచి గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది. -
వెంకటేశ్ అయ్యర్ అద్బుత బౌలింగ్: ఉత్కంఠ పోరులో విజయం
భారత క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ వన్డే కప్ టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. వొర్సెస్టెర్‌షైర్ జట్టుతో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లంకాషైర్ను గెలుపు తీరాలకు చేర్చాడు. వెంకీ కారణంగా మూడు పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన లంకాషైర్ విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.25 పరుగులుఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ వన్డే కప్ టోర్నీలో భాగంగా బుధవారం లంకాషైర్- వొర్సెస్టెర్షైర్తో తలపడింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వొర్సెస్టెర్‌షైర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన లంకాషైర్ నిర్ణీత 50 ఓవర్లలో 237 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ జోష్ బొహానన్ 87 పరుగులతో ఆకట్టుకోగా.. మిడిలార్డర్లో బాల్డర్సన్ అర్ద శతకంతో మెరిశాడు. వీరితో పాటు వెంకటేశ్ అయ్యర్ 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన వొర్సెస్టెర్‌షైర్ ఆదిలోనే టాపార్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన కెప్టెన్ జేక్ లిబి 83 పరుగులతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగా.. మిడిలార్డర్ బ్యాటర్ టామ్ టేలర్ 41 పరుగులతో అతడికి సహకారం అందించాడు. ఆఖరల్లో టామ్ హిన్లే 24 పరుగులతో జట్టును లక్ష్యానికి చేరువగా తీసుకువచ్చాడు.మూడు పరుగులా? రెండు వికెట్లా?ఈ క్రమంలో 49వ ఓవర్లో బంతిని అందుకున్న లంకాషైర్ పేస్ బౌలర్ వెంకటేశ్ అయ్యర్ అద్భుతం చేశాడు. వొర్సెస్టెర్‌షైర్ గెలుపునకు మూడు పరుగుల దూరంలో ఉండగా.. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్న సమయంలో.. రెండు వికెట్లూ తనే పడగొట్టాడు. ఓవర్ ఐదో బంతికి హిన్లేను అవుట్ చేసిన వెంకటేశ్.. ఆరో బంతికి హ్యారీ డేర్లీని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 234 పరుగుల వద్దే వొర్సెస్టెర్‌షైర్ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఫలితంగా మూడు పరుగుల స్వల్ప తేడాతో లంకాషైర్ విజయం సాధించింది.టీమిండియాలో చోటు కరువుఇక వెంకటేశ్ అయ్యర్ లాస్ట్ ఓవర్ థ్రిల్లర్‌కు సంబంధించిన వీడియోను లంకాషైర్ సోషల్‌మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ ఆరు ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఈ సీజన్లో లంకాషైర్‌కు దక్కిన రెండో గెలుపు ఇది. మొత్తంగా ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే గెలిచి టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఇక మధ్యప్రదేశ్‌కు చెందిన వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రైటార్మ్ మీడియం పేసర్ కూడా అన్న సంగతి తెలిసిందే.టీమిండియా తరఫున తొమ్మిది టీ20లు, రెండు వన్డేలు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. ఆయా ఫార్మాట్లలో 133, 24 పరుగులు చేశాడు. టీ20లలో ఐదు వికెట్లు తీశాడు. అయితే, 2022 తర్వాత భారత జట్టులో అతడికి స్థానం కరువైంది. ఈ నేపథ్యంలో కౌంటీలో ఆడేందుకు నిర్ణయించుకున్న వెంకటేశ్.. ఐదువారాల పాటు లంకాషైర్‌కు ప్రాతినిథ్యం వహించేందుకు ఒప్పందం కుదరుర్చుకున్నాడు. ఆ జట్టు తరఫున ఐదు ఇన్నింగ్స్ ఆడి కేవలం 68 పరుగులు చేశాడు. మూడు వికెట్లు తీయగలిగాడు.3️⃣ runs required to win.2️⃣ wickets needed…Over to you, @venkateshiyer! 😍🌹 #RedRoseTogether https://t.co/CfuDnk44Oo pic.twitter.com/gNTFO2M6ml— Lancashire Cricket (@lancscricket) August 14, 2024 -
వెంకటేశ్ అయ్యర్ కీలక నిర్ణయం
టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. లంకాషైర్ జట్టుతో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రైటార్మ్ మీడియం పేసర్ కూడా!ఐపీఎల్-2024 ఫైనల్లో సత్తా చాటిఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అరంగేట్రం చేసిన వెంకీ.. గత నాలుగు సీజన్లుగా అదే జట్టుతో కొనసాగుతున్నాడు. కీలక సమయాల్లో రాణిస్తూ జట్టులోని ప్రధాన ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగిన ఈ ఇండోర్ క్రికెటర్.. ఐపీఎల్-2024 ఫైనల్లో సత్తా చాటాడు.సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(6- నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పదేళ్ల తర్వాత కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు వెంకటేశ్ అయ్యర్.హార్దిక్ పాండ్యా వారసుడంటూ ప్రశంసలు.. కానీఐపీఎల్లో సత్తా చాటుతున్న సమయంలో(2021)నే టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు వెంకీ. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా వారసుడిగా నీరాజనాలు అందుకున్నాడు వెంకటేశ్ అయ్యర్.టీమిండియా తరఫున ఇంత వరకు తొమ్మిది టీ20లు, రెండు వన్డేలు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. ఆయా ఫార్మాట్లలో 133, 24 పరుగులు చేశాడు. టీ20లలో ఐదు వికెట్లు తీశాడు. అయితే, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగి రావడంతో వెంకీకి అవకాశాలు కరువయ్యాయి. ఈ క్రమంలో 2022లో చివరిసారిగా అతడు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.రీఎంట్రీపై దృష్టిఐపీఎల్-2024లో సత్తా చాటిన వెంకటేశ్ అయ్యర్.. రీఎంట్రీపై కన్నేశాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో(ఫస్ట్‌క్లాస్)నూ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐదువారాల పాటు లంకాషైర్‌తో కాంట్రాక్ట్ చేసుకున్నాడు. అనంతరం భారత్‌కు తిరిగి వచ్చి దులిప్ ట్రోఫీలో భాగం కానున్నాడు.కౌంటీల్లో ఆడటం గురించి వెంకటేశ్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘లంకాషైర్ గొప్ప చరిత్ర ఉన్న జట్టు. ఫారూఖ్ ఇంజనీర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వాషింగ్టన్ సుందర్ లంకాషైర్‌కు ఆడారు. ఇప్పుడు నేను కూడా ఆ జాబితాలో చేరబోతున్నా’’ అని హర్షం వ్యక్తం చేశాడు.చదవండి: IND vs SL: గంభీర్ కొత్త ప్రయోగం.. స్పిన్నర్‌గా మారిన హార్దిక్ పాండ్యా -
ఈ అందమైన జంట ఎవరో గుర్తుపట్టారా? డ్రీమీ వెడ్డింగ్ పిక్స్.. ఫ్యాన్స్ ఫిదా
-
పెళ్లి పీటలెక్కిన టీమిండియా క్రికెటర్.. (ఫొటోలు)
-
పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్.. ఫొటో వైరల్
టీమిండియా క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ పెళ్లి పీటలెక్కాడు. తన చిరకాల ప్రేయసి శృతి రఘునాథన్ మెడలో ఆదివారం మూడు ముళ్లు వేశాడు. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నడుమ వెంకీ- శృతిల పెళ్లి సంప్రదాయ పద్ధతిలో వైభవోపేతంగా జరిగినట్లు తెలుస్తోంది.కాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 1994, డిసెంబరు 25న జన్మించాడు వెంకటేశ్ అయ్యర్. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. అంచెలంచెలుగా ఎదిగి టీమిండియాలో స్థానం సంపాదించాడు.టీమిండియా తరఫున అరంగేట్రంభారత్ వేదికగా 2021లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన వెంకీ.. మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు.తన అంతర్జాతీయ కెరీర్లో వెంకటేశ్ ఇప్పటి వరకు.. 2 వన్డే, 9 టీ20 మ్యాచ్‌లు ఆడి వరుసగా 24, 133 పరుగులు సాధించాడు. టీ20 ఫార్మాట్లో 5 వికెట్లు పడగొట్టాడు.ఇక ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వెంకటేశ్ అయ్యర్.. రైటార్మ్ మీడియం పేసర్ కూడా! అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే హార్దిక్ పాండ్యా వారసుడంటూ ప్రశంసలు అందుకున్నాడు.రాణించలేక అవకాశాలు కరువుకానీ అంచనాలు అందుకోలేక చతికిలపడి.. నిరాశజనక ప్రదర్శనతో టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్లో కేకేఆర్ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు వెంకటేశ్ అయ్యర్. మొత్తంగా 13 ఇన్నింగ్స్ ఆడి 370 పరుగులు సాధించాడు.ఐపీఎల్-2024 ఫైనల్లో అదరగొట్టిముఖ్యంగా ఫైనల్లో ఒంటిచేత్తో కేకేఆర్‌ను గెలిపించి చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి 26 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు.ఆఖరి వరకు అజేయంగా నిలిచి కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు.ఈ క్రమంలో మరోసారి టీమిండియా తలుపులు తట్టే అవకాశం దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడిలా వ్యక్తిగత జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ఆరంభించాడు వెంకటేశ్ అయ్యర్. అతడి శ్రీమతి శృతి రఘునాథన్ నిఫ్ట్(NIFT) నుంచి ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నట్లు సమాచారం. కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో ఆమె పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గతేడాది నవంబరులో ఈ జంటకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.చదవండి: జీవితంలో కష్టాలు సహజం.. ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా -
ఇప్పుడు అతడు మారిపోయాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!
ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ అద్బుత ప్రదర్శన కనబరిచాడు. కేకేఆర్ మూడో సారి ఛాంపియన్స్‌గా నిలవడంలో వెంకటేష్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. కీలకమైన క్వాలిఫయర్-1, ఫైనల్లోనూ అయ్యర్ అదరగొట్టాడు. క్వాలిఫయర్-1లో 52 పరుగులు చేసిన అయ్యర్.. ఫైనల్లో 52 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో ఓవరాల్‌గా 13 ఇన్నింగ్స్‌లో వెంకటేష్ అయ్యర్.. 46.25 సగటుతో 370 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో వెంకటేష్ అయ్యర్‌పై భారత మాజీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. గత సీజన్‌తో పోలిస్తే అయ్యర్ తన బ్యాటింగ్ టెక్నిక్‌ను మెరుగుపరుచుకున్నాడని సునీల్ గవాస్కర్ కొనియాడాడు. ఈ ఏడాది సీజన్లో వెంకటేష్ అయ్యర్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు."గత సీజన్‌తో పోలిస్తే అతడి బ్యాటింగ్ స్టైల్లో మార్పు కన్పించింది. అతడు ఆలోచించి సరైన టెక్నిక్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. అయ్యర్ బౌలింగ్ కూడా చేయడం మొదలు పెడితే, మరోసారి భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అతడొక మంచి ఫీల్డర్ కూడా. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టుకు ఇటువంటి లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అవసరం. అతడికి బౌలింగ్ చేసే కూడా సత్తా ఉంది. కాబట్టి అతడు కొంచెం కష్టపడితే మళ్లీ భారత జెర్సీ ధరించవచ్చు. భారత తరపున అరంగేట్రం చేసిన తర్వాత అయ్యర్‌లో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కన్పించింది. అందుకే జట్టులో అతడి స్ధానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్(2023)లో కూడా పెద్దగా రాణించలేకపోయాడు. ముంబై ఇండియన్స్‌పై సెంచరీ చేసినప్పటికి.. మిగితా మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు. అతడు క్రీజులోకి వచ్చిన వెంటనే భారీ షాట్లకు ప్రయత్నించి తన వికెట్‌ను సమర్పించుకునేవాడు.కానీ ఇప్పుడు అతడి మైండ్ సెట్ మారింది అంటూ" స్టార్ స్పోర్ట్స్ షోలో సన్నీ పేర్కొన్నాడు. కాగా 2022లో భారత జట్టు తరపున అరంగేట్రం చేసిన అయ్యర్.. తనకు ఇచ్చి అవకాశాలను సద్వినియోగపరుచుకోలేకపోయాడు. వరుసగా విఫలమకావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. -
IPL 2024: ఓ పక్క స్టార్క్.. మరోపక్క అయ్యర్..!
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా అవతరించింది. నిన్న జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడో ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ (3-0-14-2), వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరెంజ్ ఆర్మీని చెడుగుడు ఆడుకున్నారు. వీరికి రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1), రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా తోడవ్వడంతో కేకేఆర్ సునాయాస విజయం సాధించింది.క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ వీరిద్దరే.. నిన్నటి ఫైనల్లో సన్‌రైజర్స్‌ను డామేజ్ చేసిన స్టార్క్, వెంకటేశ్ అయ్యర్లు ఇదే సన్‌రైజర్స్‌ను క్వాలిఫయర్-1లోనూ ముప్పుతిప్పలు పెట్టారు. నాటి మ్యాచ్‌లోనూ స్టార్క్ అద్భుతమైన గణాంకాలు (4-0-34-3) నమోదు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపిక కాగా.. వెంకటేశ్ అయ్యర్ సైతం ఫైనల్లోలానే మెరుపు ఇన్నింగ్స్‌తో (28 బంతుల్లో 51 నాటౌట్) విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరు పోటీపడి మరీ సన్‌రైజర్స్‌పై దండయాత్ర చేసి వారికి టైటిల్ దక్కకుండా చేశారు.సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన స్టార్క్ కీలకమైన ప్లే ఆఫ్స్‌లో ఫామ్‌లోని వచ్చి కేకేఆర్ పాలిట గెలుపు గుర్రంగా మారగా.. వెంకటేశ్ అయ్యర్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఓ మోస్తరు ప్రదర్శనలతో అలరించాడు. ప్లే ఆఫ్స్‌లో తిరుగులేని అయ్యర్.. నిన్నటి ఫైనల్‌తో వెంకటేశ్ అయ్యర్ ప్లే ఆఫ్స్ హీరో అని మరోసారి నిరూపించుకున్నాడు. అయ్యర్‌కు ప్లే ఆఫ్స్‌లో ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ (55, 50, 51*, 52*). ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాకు దక్కుతుంది. రైనా ప్లే ఆఫ్స్‌లో ఏడు 50కి పైగా స్కోర్లు సాధించాడు.ఫైనల్స్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మెరుపు వీరులు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. -
IPL 2024 KKR Vs SRH: వాళ్ల వల్లే గెలిచాం.. ఫైనల్లోనూ మేమే: శ్రేయస్ అయ్యర్
‘‘చాలా చాలా సంతోషంగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరు తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించారు. మా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నాను. ఈరోజు మేము ఏం చేయగలమో అదే చేసి చూపించాం. కీలకమైన ఈ మ్యాచ్‌లో మా జట్టులోని ప్రతి ఒక్క బౌలర్ తమ బాధ్యతను నెరవేర్చారు.వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇలాంటి వైవిధ్యమైన బౌలింగ్ లైనప్ ఉంటే కెప్టెన్ పని సులువవుతుంది. మా బౌలర్లంతా అద్భుతంగా రాణించారు. ఇక ముందు కూడా మా ప్రదర్శన ఇలాగే ఉంటుందని భావిస్తున్నా.ఈరోజు గుర్బాజ్ తన తొలి మ్యాచ్ ఆడాడు. ఓపెనర్‌గా మాకు శుభారంభమే అందించాడు. ఇదే జోరులో మరింత ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉన్నాం. ఫైనల్లోనూ మా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం’’ అని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు.ఐపీఎల్-2024లో తుదిపోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. కాగా లీగ్ దశలో పద్నాలుగింట తొమ్మిది విజయాలతో టాపర్‌గా నిలిచిన కేకేఆర్.. క్వాలిఫయర్-1లోనూ సత్తా చాటింది.అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జయభేరి మోగించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు కేకేఆర్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు.సీజన్ ఆసాంతం విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడిన సన్‌రైజర్స్‌కు షాకిస్తూ 159 పరుగులకే కుప్పకూల్చారు. మిచెల్ స్టార్క్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునిల్ నరైన్, ఆండ్రీ రసెల్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ క్రమంలో నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 14 బంతుల్లో 23, సునిల్ నరైన్ 16 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేయగలిగారు.అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్, నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ సన్‌రైజర్స్ ఫీల్డర్ల తప్పిదాల కారణంగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆకాశమే హద్దుగా చెలరేగారు. వెంకటేశ్ 28 బంతుల్లో 51, శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 58 పరుగులతో దుమ్ములేపారు.వీరిద్దరి విజృంభణతో 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి కేకేఆర్ 164 పరుగులు సాధించింది. సన్‌రైజర్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఫైనల్లో అడుగుపెట్టింది.ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రేయస్ అయ్యర్ జట్టు ప్రదర్శన పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. అదే విధంగా.. మైదానంలో వెంకటేశ్ అయ్యర్‌తో తన కమ్యూనికేషన్ గురించి చెబుతూ.. ‘‘నిజానికి నాకు తమిళ్ మాట్లాడటం రాదు. అయితే, ఎదుటివాళ్లు మాట్లాడింది అర్థం చేసుకోగలను. వెంకీ తమిళ్లోనే మాట్లాడతాడు. నేను అతడికి హిందీలో బదులిస్తాను’’ అని తెలిపాడు.What a memorable 𝗞𝗻𝗶𝗴𝗵𝘁 for the men in purple 💜Unbeaten half-centuries from Venkatesh Iyer 🤝 Shreyas IyerThe celebrations continue for the final-bound @KKRiders 😎Scorecard ▶️ https://t.co/U9jiBAlyXF#TATAIPL | #KKRvSRH | #Qualifier1 | #TheFinalCall pic.twitter.com/xBFp3Sskqq— IndianPremierLeague (@IPL) May 21, 2024 -
అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్‌కు ఉన్న అజేయ రికార్డు శుక్రవారం బద్దలైంది. సొంత మైదానం వాంఖడేలో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి ముంబై కేకేఆర్ ముందు తలవంచింది. శ్రేయస్ అయ్యర్ సేన చేతిలో 24 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.అంతేకాదు ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిస్తూ పరాజయానికి గల కారణాలు విశ్లేషించాడు.ఓటమికి కారణం అదే ‘‘మేము భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. టీ20లలో భాగస్వామ్యాలు నిర్మించలేకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.మా ఓటమికి కారణం ఒక్కటనీ చెప్పలేను. చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మా బౌలర్లు ఈరోజు అద్భుతంగా రాణించారు.నిజానికి తొలి ఇన్నింగ్స్ తర్వాత వికెట్ మరింత మెరుగైంది. తేమ కూడా ఉంది. అనుకున్న ఫలితం రాబట్టేందుకు మా వంతు కృషి చేశాం.సవాళ్లంటే ఇష్టంఏదేమైనా చివరి వరకు పోరాడుతూనే ఉండాలని నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటా. కఠిన పరిస్థితులు ఎదురవ్వడం సహజం.సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగితేనే మనల్ని మనం మరింత మెరుగుపరచుకోగలుగుతాం’’ అని పేర్కొన్నాడు. కేకేఆర్ చేతిలో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు.పూర్తిగా విఫలంకాగా ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు(2/44) తీయగలిగాడు. అయితే, బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక కేకేఆర్ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శన(4/33)తో దుమ్ములేపాడు.ముంబై వర్సెస్ కేకేఆర్ స్కోర్లు👉టాస్: ముంబై.. తొలుత బౌలింగ్👉కేకేఆర్ స్కోరు: 169 (19.5)👉ముంబై స్కోరు: 145 (18.5)👉ఫలితం: ముంబైపై 24 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వెంకటేశ్ అయ్యర్(కేకేఆర్- 52 బంతుల్లో 70 రన్స్)👉ముంబై ఇండియన్స్ టాప్ స్కోరర్: సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56 రన్స్)A memorable win for @KKRiders 🥳They wrap up a solid performance to get past the #MI challenge 💜 💪Scorecard ▶️ https://t.co/iWTqcAsT0O#TATAIPL | #MIvKKR pic.twitter.com/YT6MGSdPkj— IndianPremierLeague (@IPL) May 3, 2024 -
MI vs KKR : ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా విజయం (ఫొటోలు)
-
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 169 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.52 బంతుల్లో 70 పరుగులు చేసిన అయ్యర్.. కేకేఆర్ ఫైటింగ్ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన కేకేఆర్‌ను అయ్యర్ తన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. అయ్యర్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మనీష్ పాండే కూడా తన వంతు పాత్ర పోషించాడు.31 బంతులు ఎదుర్కొన్న పాండే 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 పరుగులు చేశాడు. ఇక ముంబై బౌలర్లలో తుషారా, బుమ్రా తలా 3 వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు, చావ్లా ఒక్క వికెట్ సాధించారు. -
వెంకటేశ్ అయ్యర్ గాయంపై అప్డేట్!..అందుకే ఆ సెలబ్రేషన్!
ఐపీఎల్-2024ను పేలవంగా ఆరంభించిన వెంకటేశ్ అయ్యర్.. తాజా మ్యాచ్‌లో మాత్రం దంచికొట్టాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఈ కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ దుమ్ములేపాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతూ అభిమానులను అలరించాడు. ఎదుర్కొన్న 30 బంతుల్లోనే 50 పరుగులతో సత్తా చాటాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా వెంకటేశ్ అయ్యర్ వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఈ క్రమంలో అతడిని స్కానింగ్‌కు పంపించారు. ఈ నేపథ్యంలో గాయంపై అప్డేట్ అందించిన అయ్యర్.. ‘‘కండరాలు పట్టేసినట్లు అనిపించింది. ఎందుకైనా మంచిదని స్కానింగ్‌కు వెళ్లాను. ఈ రోజు మ్యాచ్ అద్భుతంగా సాగింది. మరో ఎండ్‌లో సునిల్ నరైన్ నుంచి గొప్ప సహకారం లభించింది. ఈరోజు క్రెడిట్ మొత్తం నరైన్‌కు ఇవ్వాల్సిందే. మాపై ఏమాత్రం ఒత్తిడి పడకుండా చూసుకున్నాడు. విజయానికి అతడు పునాదులు వేస్తే.. మేము పని పూర్తిచేశాం’’ అని పేర్కొన్నాడు. వెన్నునొప్పి గురించి పెద్దగా ఆందోళన అక్కర్లేదని తెలిపాడు. ఇక హాఫ్ సెంచరీ నేపథ్యంలో తన ‘కిస్’ సెలబ్రేషన్ గురించి చెబుతూ.. ‘‘నాకు కాబోయే భార్య కూడా ఈరోజు మ్యాచ్‌కు వచ్చింది. నా ఇన్నింగ్స్‌లో ఆమెకూ క్రెడిట్ ఇవ్వాలని భావించాను’’ అని వెంకటేశ్ అయ్యర్ నవ్వులు చిందించాడు. కాగా గతేడాది నవంబరులో వెంకటేశ్ అయ్యర్‌కు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఫ్యాషన్ డిజైనర్ అయిన శృతి రఘునాథన్‌తో అతడు నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. శుక్రవారం బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సునిల్ నరైన్ (22 బంతుల్లో 47 పరుగులు) అద్భుతంగా రాణించాడు. చదవండి: IPL 2024: రూ.11 కోట్లు తీసుకున్నాడు.. కట్ చేస్తే! ఆర్సీబీని నిండా ముంచేశాడు A well deserved 50 for Venkatesh Iyer in just 29 deliveries 💪🫡‼️#KKRvRCB pic.twitter.com/IDDmCiFjNu — Kolkata Knight Riders Universe (@KKRUniverse) March 29, 2024 -
#KKR: ఆర్సీబీపై మా విజయానికి కారణం అదే: అయ్యర్
చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్‌పై ఆ జట్టు సారథి శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. ఓపెనర్‌గా వచ్చి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని కొనియాడాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు గొప్ప ఆరంభం అందించాడని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా కేకేఆర్ శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. అయితే, ఆరంభంలో బౌలర్లకు కాస్త అనుకూలించిన బెంగళూరు పిచ్‌పై.. సెకండాఫ్‌లో బ్యాటర్లు రెచ్చిపోయారు. ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(20 బంతుల్లో 30) మెరుగ్గా రాణించగా.. మరో ఓపెనర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సునిల్ నరైన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ 2 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 47 పరుగులు చేశాడు. A quick-fire 47 off just 22 deliveries 💥💥 An entertaining opening act from Sunil Narine comes to an end 👏👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvKKR pic.twitter.com/s0dNMzrL80 — IndianPremierLeague (@IPL) March 29, 2024 ఇక వన్‌డౌన్‌లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్ 30 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 39, రింకూ సింగ్ 5 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన కేకేఆర్ ఆర్సీబీపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా పదిహేడో ఎడిషన్‌లో వరుసగా రెండో గెలుపు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ఆట తీరుపై హర్షం వ్యక్తం చేశాడు. వికెట్ బౌలర్లకు పెద్దగా అనుకూలించడం లేదని ఆండ్రీ రసెల్ చెప్పాడని.. పిచ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి తమకు సూచనలు ఇచ్చాడని తెలిపాడు. ఈ క్రమంలో సునిల్ నరైన్‌ను ఓపెనర్‌గా పంపాలా వద్దా అన్న అంశంపై చర్చలు జరిపామని.. ఆఖరికి ఓపెనర్‌గానే బరిలోకి దించామని పేర్కొన్నాడు. జట్టులో తన పాత్ర ఏమిటో నరైన్‌కు స్పష్టంగా తెలుసని అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో రసెల్ నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మరోవైపు నరైన్ 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. Venkatesh F-IYER 🔥🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvKKR pic.twitter.com/2EeUvGTR8J — IndianPremierLeague (@IPL) March 29, 2024 ఇక వరుసగా రెండో గెలుపుపై స్పందిస్తూ.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. టోర్నీలో మున్ముందు ఇంకెన్నో సాధించాల్సి ఉందని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. కాగా కేకేఆర్ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. విశాఖపట్నంలో బుధవారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. చదవండి: #Kohli: పాపం.. కోహ్లి ఒక్కడు ఏం చేయగలడు? -
సచిన్ అంతటి వాడవుతాడు.. పోలికలే కొంపముంచుతున్నాయి! ఇప్పుడు..
ఓ ప్లేయర్ అద్భుతంగా ఆడుతూ ఉంటే.. ఆ క్రీడలో దిగ్గజాలతో పోలిక పెట్టి మాట్లాడుతూ విశ్లేషణలు సహజం. అయితే, కొన్నిసార్లు ఆ పోలిక వాళ్లకు చేకూర్చే మేలు కంటే.. నష్టమే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కొంతమంది టీమిండియా యువ క్రికెటర్ల విషయంలో ఇలాగే జరిగింది. ప్రస్తుతం.. అంతర్జాతీయ టీ20లలో రింకూ సింగ్ అదరగొడుతున్న తరుణంలో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో అతడి ఆట తీరును పోలుస్తున్నారు విశ్లేషకులు. ధోని స్టైల్లో మ్యాచ్ ముగిస్తున్న తీరుకు ఫిదా అవుతూ నయా ఫినిషర్ వచ్చేశాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఇప్పుడే ధోని వారసుడిగా ట్యాగ్ వేసి రింకూపై ఒత్తిడి పెంచొద్దనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడుతున్న రింకూపై ఇలాంటి ప్రశంసలు ఒత్తిడి పెంచే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. హార్దిక్ వారసుడంటూ.. గతంలో వెంకటేశ్ అయ్యర్, పృథ్వీ షా విషయంలో ఇలాంటి పోలికలు కొంపముంచాయంటూ వారి పేర్లను ఉదాహరిస్తున్నారు. కాగా ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వెంకటేశ్ అయ్యర్.. ఐపీఎల్ 2021లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగలడంటూ ప్రశంసల వర్షం కురిసింది. గాయాల బెడదతో సతమతమవుతున్న పాండ్యా కెరీర్ సందిగ్దంలో పడిన సమయంలో వెంకటేశ్ అతడి వారసుడిగా భారత జట్టులో చోటు ఖాయం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జట్టులో చోటే కరువు కానీ.. పాండ్యా రీఎంట్రీ ఇచ్చి.. వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగిన తర్వాత వెంకటేశ్ అయ్యర్‌కు జట్టులో స్థానమే కరువైంది. గతేడాది ఫిబ్రవరిలో చివరగా వెంకటేశ్ టీమిండియా తరఫున ఆడాడు. సచిన్ అంతటి వాడవుతాడు ఇక పృథ్వీ షా.. ఈ ముంబై బ్యాటర్ దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న సమయంలోనే దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్తో పోలిక తెచ్చారు విశ్లేషకులు. భవిష్యత్తులో కచ్చితంగా టీమిండియా ఓపెనర్‌గా అద్భుతాలు చేస్తాడని ఈ అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్‌ను కొనియాడారు. తన కెప్టెన్సీలో ఆడిన వాళ్లు స్టార్లు.. అతడేమో ఇలా కానీ.. సీన్ రివర్స్ అయింది.. పృథ్వీ కెప్టెన్సీలో ఆడిన శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ భారత జట్టులో తమ స్థానం సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా శుబ్‌మన్ ఇప్పటికే మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా పాతుకుపోయి.. భావి భారత జట్టు కెప్టెన్‌గా, తదుపరి సూపర్‌స్టార్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, పృథ్వీ షాకు టీమిండియాలో ఎంట్రీ కాదు.. కనీసం ఐపీఎల్లో అయినా స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు దక్కడం లేదు. వరుస వైఫల్యాలతో చతికిలపడ్డ పృథ్వీని గాయాలు వేధిస్తుండటంతో దెబ్బమీద దెబ్బ పడుతోంది. అతడు మళ్లీ భారత జట్టులో పునరాగమనం చేయడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు రింకూ విషయంలో ఇలా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ రింకూ సింగ్. అనేక కష్టనష్టాలకోర్చి క్రికెటర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ మేనేజ్మెంట్ దృష్టిలో పడటంతో అతడి దశ తిరిగింది. అంచెలంచెలుగా ఎదిగి టీమిండియా స్థాయికి ఇంటింటికీ సిలిండర్లు మోస్తూ తండ్రి సంపాదిస్తే.. తాను స్వీపర్‌గా పనిచేసేందుకు కూడా సిద్ధపడి కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్న రింకూ.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆటను మాత్రం వీడలేదు. అంచెలంచెలుగా ఎదిగి తాజా ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాది కేకేఆర్‌ను గెలపించిన తీరు నభూతో అనిపించింది. ఈ క్రమంలో.. 2023, ఆగష్టులో ఐర్లాండ్‌తో టీ20 సందర్భంగా అతడు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. నయా ఫినిషర్‌గా కితాబులు ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్న రింకూ.. మొత్తంగా 7 మ్యాచ్‌లు ఆడి 216.95 స్ట్రైక్‌రేటుతో 128 పరుగులు సాధించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ధోనితో పోలిక తెస్తూ రింకూ ఆట తీరును కొనియాడుతూ తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు మాజీ క్రికెటర్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే వన్డే క్రికెట్లోనూ అతడు అడుగుపెడతాడని జోస్యం చెబుతున్నారు. పోలికలు వద్దు.. మద్దతు ముఖ్యం అయితే, మరికొంత మంది మాత్రం.. రింకూను ఇప్పుడు ప్రశంసిస్తున్న వాళ్లు కష్టకాలంలో అతడికి అండగా నిలబడితే చాలని.. పోలికలకు బదులు నైతికంగా మద్దతునివ్వడం అతి ముఖ్యమని పేర్కొంటున్నారు. రింకూ ధోని స్థాయికి ఎదిగే సత్తా ఉన్నవాడే అయినా కెరీర్ ఆరంభంలోనే పోలికలు తెచ్చి అతడిపై అనవసరపు ఒత్తిడి పెంచొద్దని హితవు పలుకుతున్నారు. కాగా పటిష్ట ఆసీస్‌తో ఇప్పటి వరకు ఆడిన రెండు టీ20లలో రింకూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా.. 22(14 బంతుల్లో), 31(9 బంతుల్లో) పరుగులు సాధించాడు. చదవండి: క్రికెటర్లు అలా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు.. నేనైతే 2011లో: గంభీర్ -
టీమిండియా యువ క్రికెటర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?!
Venkatesh Iyer Engagement Pics: టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ తన అభిమానులుకు శుభవార్త చెప్పాడు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తనకు నిశ్చితార్థమైన విషయాన్ని తెలియజేస్తూ.. కాబోయే శ్రీమతితో దిగిన ఫొటోలు పంచుకున్నాడు. ఈ మేరకు.. ‘‘నా జీవితంలో తదుపరి అధ్యాయానికి నాంది’’ అంటూ మంగళవారం ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ సహా హర్‌ప్రీత్ బ్రార్ తదితరులు వెంకటేశ్‌ను విష్ చేశారు. ఫ్యాషన్ డిజైనర్! కాగా వెంకటేశ్ అయ్యర్‌కు కాబోయే భార్య పేరు శృతి రఘునాథన్. పీఎస్జీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో బీకామ్ చదివిన శృతి.. నిఫ్ట్(NIFT) నుంచి ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. టీమిండియా తరఫున అరంగేట్రం చేసి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించిన వెంకటేశ్ అయ్యర్.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. స్వదేశంలో 2021లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. మరుసటి ఏడాది వన్డేల్లోనూ అరంగ్రేటం చేశాడు. ఇక ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన 28 ఏళ్ల అయ్యర్‌కు కొన్నాళ్లుగా భారత జట్టులో చోటు కరువైంది. కాగా తన అంతర్జాతీయ కెరీర్లో వెంకటేశ్ ఇప్పటి వరకు.. 2 వన్డే, 9 టీ20 మ్యాచ్‌లు ఆడి వరుసగా 24, 133 పరుగులు సాధించాడు. టీ20 ఫార్మాట్లో 5 వికెట్లు పడగొట్టాడు. చదవండి: గెలుపోటములు సహజం.. అదొక్కటే విషాదం! కోహ్లిని ఓదార్చిన సచిన్ View this post on Instagram A post shared by Venkatesh R Iyer (@venky_iyer) -
తేలిపోయిన వెంకటేశ్ అయ్యర్.. రెచ్చిపోయిన రింకూ సింగ్
దేశవాలీ వన్డే టోర్నీ దియోదర్ ట్రోఫీ-2023 ఇవాల్టి (జులై 24) నుంచి ప్రారంభమైంది. టోర్నీలో భాగంగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో ఈస్ట్ జోన్-సెంట్రల్ జోన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తేలిపోయిన వెంకటేశ్ అయ్యర్.. రెచ్చిపోయిన రింకూ సింగ్ తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్ నిర్ణీత 50 ఓవర్లు ఆడి 207 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ (8) సహా టాపార్డర్ అంతా విఫలం కాగా.. శివమ్ చౌదరీ (22), కర్ణ శర్మ (32) సహకారంతో రింకూ సింగ్ (63 బంతుల్లో 54; ఫోర్, 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. కష్ట సమయంలో బరిలోకి దిగిన రింకూ సింగ్.. శివమ్ చౌదరీ, కర్ణ శర్మలతో చెరో 50 ప్లస్ భాగస్వామ్యాలు నెలకొల్పి స్కోర్ 200 దాటేలా చేశాడు. అనంతరం ఆరో వికెట్‌గా రింకూ వెనుదిరగడంతో సెంట్రల్ జోన్ పతనం ఆరంభమైంది. ఆ జట్టు మరో 31 పరుగులు జోడించి ఆఖరి 4 వికెట్లు కోల్పోయింది. ఈస్ట్ జోన్ బౌలర్లలో మురసింగ్, ఆకాశ్ దీప్, షాబాజ్ అహ్మద్ తలో 3 వికెట్లు పడగొట్టగా... ఉత్కర్ష్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రాణించిన ఉత్కర్ష్ సింగ్.. ఈస్ట్ జోన్ సునాయాస విజయం అనంతరం 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఈస్ట్ జోన్.. అభిమన్యు ఈశ్వరన్ (38), ఉత్కర్ష్ సింగ్ (89), సుభ్రాన్షు్ సేనాపతి (33 నాటౌట్) రాణించడంతో 46.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా గెలుపొందింది. సెంట్రల్ జోన్ బౌలర్లలో కర్ణ్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. అదిత్య సర్వటే ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023లో సత్తా చాటిన (కేకేఆర్ తరఫున 14 మ్యాచ్‌ల్లో 59.25 సగటున 149.52 స్ట్రయిక్‌రేట్‌తో 474 పరుగులు) రింకూ సింగ్.. ఆసియా క్రీడల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. గత ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన రింకూ రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. అదే ఫామ్‌ను రింకూ ప్రస్తుతం దేశవాలీ టోర్నీల్లోనూ కొనసాగిస్తున్నాడు. -
ఎందుకిలా చేశావు ధోని భయ్యా! మిస్టర్ కూల్ ఆన్సర్‌తో దిమ్మతిరిగిపోయింది!
MS Dhoni- IPL 2023: మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నైపుణ్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మాస్టర్‌మైండ్‌తో ఊహించని రీతిలో ఫీల్డింగ్ సెట్ చేసి.. ఓడిపోతామనుకున్న మ్యాచ్‌లోనూ గెలిపించడంలో తనకు తానే సాటి. అందుకే ఈ మిస్టర్ కూల్ టీమిండియాతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ అత్యంత విజయవంతమైన సారథిగా పేరొందాడు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేంద్రుడు.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఏకంగా ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక యువ ఆటగాళ్లకు రోల్ మోడల్ అయిన ధోని గురించి టీమిండియా బ్యాటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి మిస్టర్ కూల్ కెప్టెన్సీని హైలైట్ చేశాయి. నమ్మశక్యంకాని రీతిలో ఇటీవల రాజ్ షమన్ పాడ్‌కాస్ట్‌లో వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది ఐపీఎల్లో జరిగిన సంఘటన గురించి చెబుతాను. నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ థర్డ్‌మ్యాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న వ్యక్తికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాను. నమ్మశక్యంకాని రీతిలో అవుట్ కావడంతో వెంటనే వెనక్కి తిరిగి చూడగా.. సదరు ఫీల్డర్ ఉండాల్సిన చోట కాకుండా వేరే చోట ఉన్నట్లు అనిపించింది. నిజానికి అతడు మరికాస్త కుడివైపునకు నిల్చోవాల్సింది. అది చూసి నేను షాకయ్యా. వెంకటేశ్ అయ్యర్ భయ్యా ఎందుకిలా చేశావు? మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ విషయం గురించి ధోనిని అడిగాను. ‘‘భయ్యా. ఇలా ఎందుకు చేశారు?’’ అన్నపుడు.. నేను షాట్ కొట్టగానే ఫీల్డింగ్ అలా సెట్ చేసినట్లు చెప్పాడు. అందుకు నేను వావ్ అనకుండా ఉండలేకపోయాను. అసలు అంత తక్కువ సమయంలో అలా ఎలా ఆలోచిస్తారో అర్థంకాక తలపట్టుకున్నా. నిజానికి క్రికెట్లో యాంగిల్స్ గురించి అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎవరిని ఎక్కడ ప్లేస్ చేస్తే అనుకున్న ఫలితం రాబట్టగలమో తెలుస్తుంది. ధోని స్ట్రెంత్ అదే’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2023లో వెంకటేశ్ అయ్యర్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఆడిన 14 మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా 404 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో అతడి అత్యధిక స్కోరు 104. ఇక ధోని సారథ్యంలోని సీఎస్కే రిజర్వ్ డే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఐదోసారి చాంపియన్‌గా అవతరించింది. చదవండి: చరిత్ర సృష్టించిన షాహీన్ అఫ్రిది.. పొట్టి క్రికెట్లో తొలి బౌలర్‌గా రికార్డు 42 మ్యాచ్‌ల వరకు ఒక్కసారి కూడా లేదు.. ఆతర్వాత వరుసగా 3 సార్లు 'ఆ ఘనత' -
తొలి ఓవర్లోనే 26 పరుగులు.. అంతమంది ఉన్నా! తప్పు చేశాను! మరేం పర్లేదు..
IPL 2023 KKR Vs RR- Yashasvi Jaiswal: 6.. 6.. 4.. 4.. 2.. 4.. తొలి ఓవర్లోనే 26 పరుగులు.. ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘోర పరాభవం ఎదుర్కోబోతోందనడానికి సంకేతం.. మిస్టీరియస్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, స్పిన్‌తో మాయ చేయగల అనుభవజ్ఞుడైన సునిల్ నరైన్.. కొత్తవాడే అయినా తనదైన ముద్రవేయగలుగుతున్న సూయశ్ శర్మ.. అతడి తోడుగా అనుకూల్ రాయ్.. జట్టులో ఇంత మంది స్పిన్ బౌలర్లు ఉన్నా.. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా మాత్రం చెత్త ప్రయోగంతో ముందుకు వచ్చాడు. సీజన్ ఆరంభం నుంచి దంచికొడుతున్న యశస్వి జైశ్వాల్ కోసం పార్ట్ టైమ్ స్పిన్నర్‌ను దింపితే బాగుంటుందంటూ తానే స్వయంగా రంగంలో దిగాడు. అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. దంచికొట్టిన యశస్వి.. అదే జోరులో నితీశ్ పుణ్యమా అని 6 బంతుల్లోనే 26 పరుగులు రాబట్టిన యశస్వి 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 47 బంతుల్లో 98 పరుగులతో చెలరేగి రాజస్తాన్‌కు భారీ విజయం అందించాడు. ఈ నేపథ్యంలో నితీశ్ రాణా నిర్ణయంపై కేకేఆర్ ఫ్యాన్స్ సైతం మండిపడుతున్నారు. తప్పు చేశాను! ఈ క్రమంలో ఓటమి అనంతరం కేకేఆర్ సారథి నితీశ్ స్పందిస్తూ.. ‘‘యశస్వి జైశ్వాల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈరోజు అతడిది. తను ఏం చేయాలని కోరుకున్నాడో ఆ పని పూర్తి చేశాడు. టోర్నీ ఆరంభం నుంచే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న అతడిని కట్టడి చేయడానికి పార్ట్ స్పిన్నర్‌ను పంపితే బాగుంటుందని భావించా. కానీ నా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయా. ఏదేమైనా అతడి ఇన్నింగ్స్ అద్భుతం’’ అని మొదటి ఓవర్ తానే వేయాలన్న తన నిర్ణయానికి చింతించాడు. మరేం పర్లేదు.. దురదృష్టవశాత్తూ ఇలా అయితే, కేకేఆర్ స్టార్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ మాత్రం నితీశ్ రాణాకు మద్దతుగా నిలిచాడు. ‘‘నితీశ్ బంతితోనూ మాయ చేయగల సమర్థుడు. తన కెరీర్లో కొన్ని కీలకమైన వికెట్లు తీశాడు. లెఫ్టాండర్ క్రీజులో ఉన్నపుడు స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించడం మంచి ఆప్షన్. కానీ దురదృష్టం మమ్మల్ని వెక్కిరించింది. ఒకవేళ నితీశ్ తొలి ఓవర్లోనే వికెట్ తీసి ఉంటే అది మాస్టర్‌స్ట్రోక్ అయ్యేది. అయినా ఆటలో ఇవన్నీ సహజం. ఒక్కోసారి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి’’ అని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ 57 పరుగులతో కేకేఆర్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ 17 బంతుల్లో 22 పరుగులు సాధించాడు. కాగా లెఫ్టాండ్ బ్యాటర్ అయిన నితీశ్.. రైట్ ఆర్మ్బ్రేక్ స్పిన్నర్ కూడా! కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా టాస్: రాజస్తాన్ - బౌలింగ్ కేకేఆర్ స్కోరు: 149/8 (20) రాజస్తాన్ స్కోరు: 151/1 (13.1) విజేత: రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యశస్వి జైశ్వాల్. చదవండి: రనౌట్ విషయంలో సంజూ భాయ్ నాతో ఏమన్నాడంటే: యశస్వి జైశ్వాల్ గెలుపు జోష్‌లో ఉన్న రాజస్తాన్‌కు బిగ్ షాక్.. బట్లర్‌కు భారీ జరిమానా! The Yashasvi effect❤️🔥 - FASTEST 50 in #TATAIPL history!! 🤯💪#KKRvRR #IPL2023 #IPLonJioCinema | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/WgNhYJQiUN — JioCinema (@JioCinema) May 11, 2023 150 runs chased down in just 13.1 overs. @rajasthanroyals have won this in a jiffy with Yashasvi Jaiswal smashing an incredible 98* from just 47 balls. Scorecard - https://t.co/jOscjlr121 #TATAIPL #KKRvRR #IPL2023 pic.twitter.com/2u0TiGPByI — IndianPremierLeague (@IPL) May 11, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
క్లిష్ట పరిస్థితుల్లో తానున్నాంటూ బాధ్యత తీసుకున్నాడు! అందరికీ సాధ్యం కాదు!
IPL 2023 KKR- Venkatesh Iyer: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణాపై ఆ జట్టు ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ తానున్నానంటూ సారథిగా బాధ్యతలు భుజాన వేసుకున్నాడని కొనియాడాడు. కెప్టెన్‌గా జట్టులోని ఆటగాళ్ల గౌరవం, అభిమానం పొందాడని.. అతడి విజయాల పట్ల సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. అయ్యర్ దూరం కావడంతో ఐపీఎల్-2023కు ముందు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్ సందర్భంగా వెన్ను నొప్పి తిరగబెట్టడంతో టీమిండియాకు దూరమైన అతడు.. ఐపీఎల్ తాజా ఎడిషన్ మొత్తానికీ అందుబాటులో లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్ స్థానంలో నితీశ్ రాణాకు కేకేఆర్ పగ్గాలు అప్పగిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటన చేసింది. అతడెందుకని విమర్శలు కెప్టెన్సీ రేసులో సీనియర్ సునిల్ నరైన్, శార్దూల్ ఠాకూర్ పేర్లు వినిపించినప్పటికీ.. మేనేజ్మెంట్ రాణా వైపు మొగ్గు చూపడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఈ క్రమంలో నరైన్, సౌథీ వంటి సీనియర్లను కాదని రాణాను సారథిగా నియమించడం సరికాదంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే, దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ జట్టును ముందుండి నడిపిస్తున్న నితీశ్ రాణాకు అతడి అభిమానులు మద్దతుగా నిలిచారు. కౌంటర్ అటాక్‌తో అతడిని విమర్శిస్తున్న వాళ్లకు సమాధానమిచ్చారు. ఇలాంటి పరిస్థితుల నడుమ కేకేఆర్ పగ్గాలు చేపట్టాడు నితీశ్ రాణా. బ్యాటర్‌గా రాణిస్తున్నాడు బ్యాటర్‌గా రాణిస్తున్నప్పటికీ.. కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయడంలో విఫలమవుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో కేకేఆర్ కేవలం నాలుగింట మాత్రమే గెలుపొంది పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో తప్పక గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరుకోలేదు. ఈ నేపథ్యంలో నితీశ్ రాణా గురించి ఆ జట్టు ఓపెనర్, సెంచరీ వీరుడు వెంకటేశ్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో మే 8 నాటి మ్యాచ్ నేపథ్యంలో ఇండియా టుడే ముచ్చటించాడు అయ్యర్. ఈ సందర్భంగా కెప్టెన్ నితీశ్ రాణా, కోచ్ చంద్రకాంత్ పండిట్ గురించి ప్రశ్న ఎదురైంది. చందూ సర్ కోచ్‌గా రావడం సంతోషం ఇందుకు బదులిస్తూ.. ‘‘గతంలో చందూ సర్‌తో మూడేళ్లపాటు కలిసి ప్రయాణం చేశాను. ఇప్పుడు ఆయనే ఐపీఎల్ కోచ్‌గానూ రావడం బాగుంది. ఈ విషయంలో నాకు సంతోషంగానూ.. గర్వంగానూ ఉంది. ఇక నితీశ్ రాణా విషయానికొస్తే.. శ్రేయస్ అయ్యర్ గాయపడిన సమయంలో జట్టును నడిపించేందుకు అతడు ముందుకు వచ్చాడు. శ్రేయస్ సేవలు కోల్పోయి జట్టు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ బాధ్యత తను తీసుకున్నాడు. అతడికి సాధ్యమైంది నా వరకు కెప్టెన్‌గా అతడు బాగానే రాణిస్తున్నాడు. డ్రెస్సింగ్ రూంలో ప్రతీ ఆటగాడితో మమేకం అవుతాడు. అందరూ అతడి పట్ల ఎంతో గౌరవంగా ఉంటారు. కెప్టెన్‌గా అందరితో కలిసిపోవడం కొంతమందికే సాధ్యమవుతుంది. రాణా కూడా వారిలో ఒకడు’’ అని మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్లో వెంకటేశ్ ఇప్పటి వరకు 303 పరుగులు చేయగా.. నితీశ్ రాణా 275 పరుగులు సాధించాడు. చదవండి: సన్‌రైజర్స్ విజయంపై డేవిడ్ వార్నర్ ట్వీట్! మెచ్చుకున్నాడా? లేదంటే.. -
జట్టు నిండా విధ్వంసకర వీరులే.. అయినా గెలుపు కోసం అష్టకష్టాలు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో విధ్వంసకర వీరులతో నిండి, లోతైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టు ఏది అంటే..? నిస్సంకోచంగా కేకేఆర్ పేరే చెప్పాలి. ఆ జట్టులో తొమ్మిదో నంబర్ ఆటగాడి వరకు అందరూ మెరుపులు మెరిపించగల సమర్ధులే. టాపార్డర్, మిడిలార్డర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి ఊచకోత ఏ రేంజ్లో ఉంటందో ఇదివరకే చూశాం. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో (205) ఐదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన రింకూ సింగ్.. చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించిన వైనాన్ని క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మరచిపోలేదు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో (ఇంపాక్ట్ ప్లేయర్‌గా) బరిలోకి దిగిన వెంకటేశ్ అయ్యర్ (51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 104).. సిక్సర్ల సునామీ సృష్టించి, 15 ఏళ్ల తర్వాత కేకేఆర్ తరఫున రెండో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఏడో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్.. పూనకం వచ్చినట్లు ఊగిపోగి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రింకూ సింగ్ గురించి చెప్పాల్సి వస్తే.. ఈ యువ ఆటగాడు మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చి దాదాపు ప్రతి మ్యాచ్‌లో విలయం సృష్టిస్తున్నాడు. కెప్టెన్ నితీశ్ రాణా సైతం అప్పర్ మిడిలార్డర్లో అడపాదడపా మెరుపులు మెరిపిస్తున్నాడు. లేట్‌గా జట్టులో చేరిన జేసన్ రాయ్.. తాజాగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో ఐదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన జేసన్.. కేవలం 26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో మెరుపు అర్ధసెంచరీ చేశాడు. వీరు మాత్రమే కాక ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ లాంటి బిగ్ గన్స్ కేకేఆర్‌లో ఉండనే ఉన్నారు. వీరు ఈ సీజన్లో ఇప్పటివరకు పేలలేదు కాని, వీరిదైన రోజున వీరి ఆపడం దాదాపుగా అసంభవమని చెప్పాలి. అయితే, ఇంత పటిష్టమైన, విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ కలిగిన కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉండటం ఆ జట్టు అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తుంది. లోపం ఒక్కడ ఉందో ఫ్యాన్స్ అంచనా వేయలేకపోతున్నారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నప్పటికీ, గెలుపు వాకిట ఆగిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు సీనియర్ల విశ్లేషణ మేరకు.. కేకేఆర్ బ్యాటింగ్‌లో పటిష్టంగానే ఉన్నప్పటికీ, జట్టుగా ఒక్క మ్యాచ్‌లో కూడా వారు కలిసికట్టుగా ఆడింది లేదు. ఓ జట్టు గెలవాలంటే ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు ఆడితే సరిపోదు. బ్యాటింగ్‌తో పాటు అన్ని విభాగాల్లో జట్టుగా రాణించాల్సి ఉంటుంది. ఈ సీజన్లో కేకేఆర్ బ్యాటర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మ్యాచ్‌ల్లో అంతా వన్ మ్యాన్ షో నే సాగింది. కేకేఆర్ బౌలింగ్ విషయానికొస్తే.. ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, టిమ్ సౌథీ, ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, యువ స్పిన్నర్ సుయాష్లతో కూడిన ఆ జట్టు బౌలింగ్ సైతం పటిష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో వీరు కూడా కలిసికట్టుగా రాణించింది లేదు. ఇక టీ20ల్లో అత్యంత కీలకమైన ఫీల్డింగ్ విభాగంలోనూ కేకేఆర్ పటిష్టంగానే ఉంది. నితీశ్ రాణా, రింకూ సింగ్ లాంటి వరల్డ్‌క్లాస్ ఫీల్డర్లు ఆ జట్టులో ఉన్నారు. ఇన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. కేకేఆర్ దాదాపుగా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నా, గెలుపు కోసం శ్రమిస్తుంది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న కేకేఆర్.. కలిసికట్టుగా ఆడితే మాత్రం వీరిని ఆపడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ముంబై ఫటాఫట్... మెరిసిన ఇషాన్, సూర్యకుమార్.. 17.4 ఓవర్లలోనే
ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ తాజా ఐపీఎల్ సీజన్లో ఫామ్‌లోకి వచ్చేసింది. ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై... వరుసగా రెండో విజయంతో ప్రత్యర్థి జట్లకు ప్రమాద సంకేతాలు పంపించింది. సొంత మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఇషాన్, సూర్య, తిలక్ వర్మ ధనాధన్ ఆటతో చెలరేగడంతో 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై 14 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. అంతకుముందు కోల్‌కతా బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ తన ఐపీఎల్ కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసినా చివరకు అతని వీరోచిత ప్రదర్శన వృథా అయింది. ముంబై: లక్ష్యం పెద్దదైనా... ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ముంబై ఇండియన్స్ అనుకున్న ఫలితం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అస్వస్థతతో ముంబై జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దిగకపోవడంతో సూర్యకుమార్ ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. టాస్ గెలిచిన సూర్య ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వెంకటేశ్ అయ్యర్ (51 బంతుల్లో 104; 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) ముంబై బౌలర్లను చితగ్కొట్టి సెంచరీ చేశాడు. అనంతరం ముంబై 17.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు సాధించి గెలిచింది. ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 58; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), సూర్యకుమార్ (25 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో ముంబై విజయంలో కీలకపాత్ర పోషించారు. రోహిత్ శర్మ (13 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (25 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (13 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. గతంలో సచిన్ కూడా ముంబై ఇండియన్స్ తరఫునే ఆడటంతో ఐపీఎల్ టోర్నీ ఆడిన తండ్రీ, కొడుకులుగా సచిన్, అర్జున్ గుర్తింపు పొందారు. ఇదే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ప్లేయర్ దువాన్ జాన్సెన్ కూడా అరంగేట్రం చేశాడు. దువాన్ కవల సోదరుడు మార్కో జాన్సెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడు తున్నాడు. ఐపీఎల్లో ఆడిన తొలి కవల సోదర ద్వయంగా మార్కో, దువాన్ గుర్తింపు పొందింది. ఆరంభం నుంచే... భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు బౌలర్ మెరిడిత్ స్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చిన రోహిత్ శర్మ, మరో ఓపెనర్ ఇషాన్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. శార్దుల్ వేసిన రెండో ఓవర్లో ఇషాన్ 4,4,6 బాదగా... మొత్తం 16 పరుగులు వచ్చాయి. ఉమేశ్ యాదవ్ వేసిన మూడో ఓవర్లో రోహిత్ 4, ఇషాన్ 4,6తో చెలరేగగా... 17 పరుగులు వచ్చాయి. నరైన్ నాలుగో ఓవర్లో రోహిత్, ఇషాన్ ఏకంగా 22 పరుగులు రాబట్టారు. దాంతో ముంబై 4 ఓవర్లు పూర్తయ్యే సరికి 57/0తో నిలిచింది. స్పిన్నర్ సుయశ్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టిన రోహిత్ అదే ఓవర్ ఐదో బంతికి అవుటయ్యాడు. అనంతరం ఇషాన్‌తో సూర్య జతకలిశాడు. వీరిద్దరు అదే జోరును కొనసాగించారు. పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 72/1తో నిలిచింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఏడో ఓవర్లో రెండో బంతిని సిక్స్‌గా మలిచిన ఇషాన్ తర్వాతి బంతికి బౌల్డయ్యాడు. ఎనిమిది ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై 90/2తో గెలుపుదిశగా సాగింది. ఇషాన్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చి న తిలక్, సూర్యతో కలిసి ముంబైను ముందుకు నడిపించారు. ఫెర్గూసన్ వేసిన 11వ ఓవర్లో సూర్య రెండు సిక్స్‌లు కొట్టాడు. రసెల్ వేసిన 13వ ఓవర్లో సూర్య, తిలక్ 17 పరుగులు సాధించారు. ముంబై 13 ఓవర్లకే 147/2తో విజయానికి 39 పరుగుల దూరంలో నిలిచింది. సుయశ్ వేసిన 14వ ఓవర్లో తిలక్ వర్మ పెవిలియన్ చేరాడు. క్రీజులో వచ్చి న టిమ్ డేవిడ్. రెండు సిక్స్‌లతో తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు. ముంబై గెలుపునకు 10 పరుగులు ఉన్నాయనగా సూర్య.. ఆ తర్వాత వధేరా అవుటైనా టిమ్ డేవిడ్ మిగతా పనిని పూర్తి చేశాడు. 2008 తర్వాత... అంతకుముందు వెంకటేశ్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్‌తో 2008 ఐపీఎల్ తొలి సీజన్ తర్వాత మళ్లీ ఈ టోర్నీ లో కోల్‌కతా బ్యాటర్ సెంచరీని నమోదు చేయడం విశేషం. 2008లో బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో బ్రెండన్ మెకల్లమ్ (158 నాటౌట్; 10 ఫోర్లు, 13 సిక్స్‌లు) భారీ సెంచరీ చేశాడు. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఒకవైపు వికెట్లు పడుతున్నా...మరోవైపు వెంకటేశ్ ఒక్కడే పోరాటం చేశాడు. ఫోర్లు, సిక్స్‌లతో అదరగొట్టాడు. 49 బంతుల్లో అతను సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మెరిడిత్ బౌలింగ్‌లో స్కూప్ షాట్ కొట్టిన వెంకటేశ్ షార్ట్ థర్డ్‌మ్యాన్ వద్ద జాన్సెన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) జాన్సెన్ (బి) చావ్లా 8; జగదీశన్ (సి) షోకీన్ (బి) గ్రీన్ 0; వెంకటేశ్ అయ్యర్ (సి) జాన్సెన్ (బి) మెరిడిత్ 104; నితీశ్ రాణా (సి) రమణ్‌దీప్ సింగ్ (సబ్) (బి) షోకీన్ 5; శార్దుల్ ఠాకూర్ (సి) తిలక్ వర్మ (బి) షోకీన్ 13; రింకూ సింగ్ (సి) నేహల్ వధేరా (బి) జాన్సెన్ 18; రసెల్ (నాటౌట్) 21; నరైన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1–11, 2–57, 3–73, 4–123, 5–159, 6–172. బౌలింగ్: అర్జున్ టెండూల్కర్ 2–0–17–0, కామెరాన్ గ్రీన్ 2–0–20–1, దువాన్ జాన్సెన్ 4–0–53–1, పీయూష్ చావ్లా 4–0–19–1, హృతిక్ షోకీన్ 4–0–34–2, మెరిడిత్ 4–0–40–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) ఉమేశ్ యాదవ్ (బి) సుయశ్ 20; ఇషాన్ కిషన్ (బి) వరుణ్ 58; సూర్యకుమార్ యాదవ్ (సి) గుర్బాజ్ (బి) శార్దుల్ 43; తిలక్ వర్మ (బి) సుయశ్ 30; టిమ్ డేవిడ్ (నాటౌట్) 24; నేహల్ వధేరా (సి) గుర్బాజ్ (బి) ఫెర్గూసన్ 6; గ్రీన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.4 ఓవర్లలో 5 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–65, 2–87, 3–147, 4–176, 5–184. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 2–0–19–0, శార్దుల్ ఠాకూర్ 2–0–25–1, సునీల్ నరైన్ 3–0–41–0, సుయశ్ శర్మ 4–0–27–2, వరుణ్ చక్రవర్తి 4–0–38–1, ఫెర్గూసన్ 1.4–0–19–1, రసెల్ 1–0–17–0. ఐపీఎల్లో నేడు బెంగళూరు vs చెన్నై (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
సాయపడడంలోనూ మనోడు ముందువరుసలోనే!
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్.. తెలుగుతేజం నంబూరి తిలక్ వర్మ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. వరుస అర్థసెంచరీలతో రాణించిన తిలక్ వర్మ ప్రస్తుతం ముంబై జట్టులో కీలక బ్యాటర్‌గా ఉన్నాడు. తాజాగా ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ తనలోని క్రీడాస్పూర్తిని బయటపెట్టాడు. విషయంలోకి వెళితే.. కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్బంగా నాలుగో ఓవర్లో కామెరున్ గ్రీన్ వేసిన బంతిని వెంకటేశ్ అయ్యర్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. మిస్ అయిన బంతి మోకాలికి బలంగా తగిలింది. దీంతో నొప్పితో అయ్యర్ విలవిల్లాడాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన తిలక్ వర్మ వెంకటేశ్ అయ్యర్ బాధను చూసి తట్టుకోలేక అతని కాలికున్న ప్యాడ్‌ను తొలగించి మోకాలికి మర్దన చేశాడు. తిలక్ వర్మ చర్యతో వెంకటేశ్ అయ్యర్‌కు కాస్త ఉపశమనం కలిగింది. ఆ తర్వాత ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. ఇక తిలక్ వర్మ తన చర్యతో సోషల్ మీడియాలో మరోసారి హీరోగా మారాడు. తిలక్ వర్మ చేసిన పనికి అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ''తిలక్ వర్మ మంచి బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు.. సాయపడడంలోనూ ముందు వరుసలో ఉంటాడు..'' అంటూ కామెంట్ చేశారు. మోకాలి గాయం బాధిస్తున్నా నొప్పిని భరిస్తూనే వెంకటేశ్ అయ్యర్ శతకంతో చెలరేగాడు. సీజన్లో రెండో సెంచరీ కాగా.. అయ్యర్‌కు ఐపీఎల్లో ఇదే తొలి సెంచరీ. అయితే అయ్యర్ సెంచరీ వృథాగా మారింది. మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో కేకేఆర్‌పై విజయాన్ని సాధించింది. చదవండి: వెంకీ శతకం.. 'కింగ్' ఖాన్ కూతురు ఏం చేసిందంటే? -
వెంకీ శతకం.. 'కింగ్' ఖాన్ కూతురు ఏం చేసిందంటే?
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ శతకంతో మెరిశాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అయ్యర్ సెంచరీ మార్క్ సాధించాడు. ఈ సీజన్లో ఇది రెండో సెంచరీ కాగా.. కేకేఆర్ తరపున ఇది రెండో ఐపీఎల్ సెంచరీ మాత్రమే. ఇంతకముందు ఐపీఎల్ తొలి సీజన్ 2008లో బ్రెండన్ మెక్కల్లమ్(158*పరుగులు) మాత్రమే కేకేఆర తరపున సెంచరీ సాధించాడు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత వెంకటేశ్ అయ్యర్ తన తొలి ఐపీఎల్ శతకంతో మెరవడమే కాదు.. కేకేఆర్ తరపున సెంచరీ బాదిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక 49 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో శతకం మార్క్ అందుకున్న వెంకటేశ్ అయ్యర్ ఆ తర్వాత మరో నాలుగు పరుగులు చేసి 104 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అయితే సెంచరీ చేసిన వెంటనే వెంకీ చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శతకం సాధించగానే రెండు చేతులతో బ్యాట్‌ను పట్టుకొని భారతీయ సంప్రదాయ పద్దతిలో మొక్కుతూ కనిపించాడు. ఆ తర్వాత కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ ఈ సెంచరీ మీకోసమే అన్నట్లుగా గెస్టర్ ఇచ్చాడు.. మరి ఆ సైగ ఎవరికి ఇచ్చాడా అని తిరిగిచూస్తే ఎదురుగా కింగ్ ఖాన్.. షారుక్ కూతురు సుహానా ఖాన్ కనిపించింది.వెంకీ అలా చేయగానే ఆమె నవ్వుతూ చప్పట్లతో అభినందించడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై, కేకేఆర్ మ్యాచ్ ఏమో గానీ ఇరుజట్లలో కీలకపాత్రల్లో ఉన్న సచిన్ టెండూల్కర్, షారుక్ ఖాన్ల ముద్దుల తనయలు ఈ మ్యాచ్‌లో ప్రత్యక్షమయ్యారు. ఒక ఎండ్‌లో సచిన్ కూతురు సారా టెండూల్కర్.. మరో ఎండ్‌లో షారుక్ కూతురు సుహానా ఖాన్లు తమ జట్లను ఎంకరేజ్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక అర్జున్ టెండూల్కర్ కూడా ఇవాళ్లి మ్యాచ్‌తో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. History Created... #venkateshiyer is the 2nd player to score 100 for KKR. 🔥🔥 What a Innings 🔥💪#KKRvMIpic.twitter.com/jiemQWEXkN — 𝐁𝐀𝐁𝐀 𝐘𝐀𝐆𝐀 (@yaga_18) April 16, 2023 చదవండి: #venkateshIyer: నొప్పిని భరిస్తూనే.. -
#venkateshIyer: నొప్పిని భరిస్తూనే..
ఐపీఎల్ 16వ సీజన్లో రెడో శతకం నమోదైంది. కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. 49 బంతుల్లో 9 సిక్సర్లు, ఐదు ఫోర్ల సాయంతో సెంచరీ మార్క్ అందుకున్న వెంకటేశ్ అయ్యర్‌కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. అయితే ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో కాలికి దెబ్బ తగిలింది. కామెరాన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 4 ఓవర్లో గుడ్‌లెంగ్త్‌తో వచ్చిన డెలివరీని స్కూప్ ఆడే ప్రయత్నంలో బంతి మోకాలికి గట్టిగా తగిలింది. దీంతో వెంకటేశ్ అయ్యర్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఈ నేపథ్యంలో ఫిజియో వచ్చి పరిశీలించి చికిత్స చేశాడు. అయితే అదే సమయంలో ముంబై ఆటగాడు తిలక్ వర్మ వెంకటేశ్ అయ్యర్ కాలికి మర్దన చేసి క్రీడాస్పూర్తిని చాటుకోవడం విశేషం. ఇక నొప్పి బాధిస్తున్నా వెంకటేశ్ అయ్యర్ తన దూకుడును ఏమాత్రం ఆపలేదు. చూస్తుండగానే ఫిఫ్టీ మార్క్ అందుకున్న వెంకటేశ్ అయ్యర్.. 90 పరుగులకు చేరుకోవడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. అయితే 90 నుంచి వంద మార్క్ అందుకోవడానికి మాత్రం కాస్త కష్టపడాల్సి వచ్చింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సింగిల్స్ తీస్తూ సెంచరీకి చేరువయ్యాడు. ఈ క్రమంలో అతను నొప్పితో బాధపడుతున్నట్లు కనిపించింది. అయితే గాయం పెద్దగా లేకపోవడం ఊరట అని చెప్పొచ్చు. బంతి కాలికి బలంగా తగలడంతో నొప్పి కాస్త ఎక్కువే ఉందని.. ఎలాగూ ఇంపాక్ట్ కింద డగౌట్ కూర్చుంటా కాబట్టి నొప్పి తగ్గే అవకాశం ఉంది. అని తొలి ఇన్నింగ్స్ అనంతరం చెప్పుకొచ్చాడు. చదవండి: Nitish Rana Vs Hrithik Shokeen: గెలికి మరీ తిట్టించుకోవడం అంటే ఇదే! -
వెంకటేశ్ అయ్యర్ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం
ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 16) జరుగుతున్న మ్యాచ్‌లో (మధ్యాహ్నం 3:30 గంటలకు) కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతి నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అయ్యర్.. కేవలం 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంకర శతకం బాదాడు. ఐపీఎల్లో అయ్యర్‌కు ఇది తొలి శతకం కాగా.. కేకేఆర్ తరఫున కేవలం రెండవది మాత్రమే. అరంగేట్రం సీజన్ తొలి మ్యాచ్‌లో బ్రెండన్ మెక్కల్లమ్ (158 నాటౌట్) బాదిన సెంచరీ ఒక్కటే ఇప్పటివరకు కేకేఆర్ తరఫున నమోదై ఉంది. అంటే 15 ఏళ్ల తర్వాత కేకేఆర్ తరఫున ఐపీఎల్లో రెండో సెంచరీ నమోదైందన్న మాట. కాగా, కేకేఆర్ ఇన్నింగ్స్‌లో బ్యాటర్లంతా కలిపి కేవలం 3 ఫోర్లు (శార్దూల్ 1, రింకూ 2) కొడితే, ఒక్క వెంకటేశ్ అయ్యరే 5 బౌండరీలు, 9 సిక్సర్లు బాదడం విశేషం. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (8), జగదీశన్ (0), నితీశ్ రాణా (5), శార్దూల్ ఠాకూర్ (13) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. అయ్యర్‌కు జతగా రింకూ సింగ్ (18) క్రీజ్‌లో ఉన్నాడు. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్ 2 వికెట్లు పడగొట్టగా.. కెమరూన్ గ్రీన్, పియూష్ చావ్లా తలో వికెట్ దక్కించుకున్నారు. -
అర్జున్ టెండూల్కర్‌ను చెడుగుడు ఆడుకున్న వెంకటేశ్ అయ్యర్
ముంబైలోని వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 16) జరుగుతున్న మ్యాచ్‌లో (మధ్యాహ్నం 3:30 గంటలకు) క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి ఓవర్ బౌల్ చేసిన అర్జున్.. కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేసినప్పటికీ, తన రెండో ఓవర్లో మాత్రం వెంకటేశ్ అయ్యర్ చేతికి చిక్కి బలయ్యాడు. Photo Credit : IPL Website ఈ ఓవర్లోనూ తొలి రెండు బంతులకు పరుగులేమీ ఇవ్వని అర్జున్.. ఆ తర్వాత బంతిని వైడ్ వేసి, ఆ వెంటనే వరుసగా 2 పరుగులు, 0, బౌండరీ, సిక్సర్ సమర్పించుకున్నాడు. ఈ ఓవర్లో అయ్యర్ ధాటికి మొత్తంగా 13 పరుగులు సమర్పించుకోవడంతో కెప్టెన్ సూర్యకుమార్ అర్జున్ను బౌలింగ్ నుంచి తప్పించి డ్యూయాన్ జన్సెన్కు బంతిని అప్పజెప్పాడు. కాగా, సుదీర్ఘకాలంగా (రెండేళ్లుగా) ఐపీఎల్ ఎంట్రీ కోసం ఎదురుచూసిన అర్జున్‌కు ఓ మోస్తరు ప్రారంభమైతే లభించింది. ఎన్నో అంచనాల నడుమ కుటుంబ సభ్యుల సమక్షంలో బరిలోకి దిగిన అర్జున్ తొలి ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి పర్వాలేదనించాడు. అయితే రెండో ఓవర్లో మాత్రం అర్జున్ కాస్త తడబడ్డాడు. తన కోటా ఓవర్లు మొత్తం పూర్తయితే కాని అతను బౌలింగ్‌పై ఓ అంచనాకు రాలేని పరిస్థితి. ఇక్కడ ఓ గమనించదగ్గ విషయం ఏంటంటే.. అర్జున్ తొలి బంతి నుంచి రన్అప్తో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. అతని శైలి ఆశిష్ నెహ్రాను తలపించినప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం వేగం లోపించింది. అతను బౌల్ చేసిన 13 బంతులు 130కిమీ వేగం లోపే ఉన్నాయి. ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. 8.1 ఓవర్ల తర్వాత 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్భాజ్ (8), జగదీశన్ (0), నితీశ్ రాణా (5) ఔట్ కాగా.. వెంకటేశ్ అయ్యర్ (22 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. -
ఇంపాక్ట్ ప్లేయర్ల ఇంపాక్ట్ ఎంత.. ఏ జట్టు ఎక్కువ లాభపడింది..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ అనే ఆప్షన్ ప్రస్తుత ఎడిషన్ (2023) నుంచే మొదలైన విషయం తెలిసిందే. ఈ సరికొత్త నిబంధన ప్రకారం టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు ఐదుగురు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ల జాబితాను ప్రకటిస్తారు. వీరిలో ఒకరిని సంబంధిత జట్టు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వినియోగించుకుంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు, వికెట్ పడిన తర్వాత, బ్యాటర్ రిటైర్ అయిన తర్వాత, ఓవర్ పూర్తయిన సందర్భాల్లో పరిచయం చేయవచ్చు. ప్రస్తుత సీజన్లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌ల్లో అన్ని జట్లు ఈ అప్షన్‌ను విజయవంతంగా వినియోగించుకున్నాయి. లీగ్‌లో మున్ముందు అన్ని జట్లు ఈ ఆప్షన్‌ను ఇంకా బెటర్‌గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. లీగ్‌లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌ల్లో కేకేఆర్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్‌ను సక్సెసఫుల్గా వాడుకుందని చెప్పాలి. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్ సుయాశ్ శర్మ స్థానంలో వెంకటేశ్ అయ్యర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించి, సక్సెస్ సాధించింది. ఆ మ్యాచ్‌లో అయ్యర్ 40 బంతుల్లో 83 పరుగులు చేసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో వివిధ జట్లు వినియోగించుకున్న ఇంపాక్ట్ ప్లేయర్ల వివరాలు.. గుజరాత్ వర్సెస్ సీఎస్కే: అంబటి రాయుడు స్థానంలో తుషార్ దేశ్‌పాండే, కేన్ విలియమ్సన్ స్థానంలో సాయి సుదర్శన్ పంజాబ్ వర్సెస్ కేకేఆర్: వరుణ్ చక్రవర్తి స్థానంలో వెంకటేశ్ అయ్యర్, భానుక రాజపక్ష స్థానంలో రిషి ధవన్ లక్నో వర్సెస్ డీసీ: ఆయుష్ బదోని స్థానంలో కృష్ణప్ప గౌతమ్, ఖలీల్ అహ్మద్ స్థానంలో అమాన్ ఖాన్ సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్: ఫజల్హక్ ఫారూఖీ స్థానంలో అబ్దుల్ సమద్, యశస్వి జైస్వాల్ స్థానంలో నవ్‌దీప్ సైనీ ఆర్సీబీ వర్సెస్ ముంబై: సూర్యకుమార్ యాదవ్ స్థానంలో బెహ్రెన్‌డార్ఫ్ సీఎస్కే వర్సెస్ లక్నో: ఆవేశ్ ఖాన్ స్థానంలో బదోని, రాయుడు స్థానంలో తుషార్ దేశ్‌పాండే ఢిల్లీ వర్సెస్ గుజరాత్: సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో ఖలీల్‌అహ్మద్, జాషువ లిటిల్ ప్లేస్‌లో విజయ్ శంకర్ రాజస్థాన్ వర్సెస్ పంజాబ్: చహల్ ప్లేస్‌లో దృవ్ జురెల్, ప్రభ్‌సిమ్రన్ స్థానంలో రిషి ధవన్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ: వెంకటేశ్ అయ్యర్ స్థానంలో సుయాశ్ శర్మ, సిరాజ్ప్లేస్లో అనూజ్ రావత్ లక్నో వర్సెస్ సన్‌రైజర్స్: రాహుల్ త్రిపాఠి ప్లేస్‌లో ఫజల్హక్ ఫారూకీ, అమిత్ మిశ్రా స్థానంలో బదోని రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ: ఖలీల్ అహ్మద్ స్థానంలో పృథ్వీ షా, బట్లర్ ప్లేస్‌లో మురుగన్ అశ్విన్ ముంబై వర్సెస్ సీఎస్కే: టిమ్ డేవిడ్ స్థానంలో కుమార్ కార్తికేయ, దీప్ చాహర్ స్థానంలో రాయుడు గుజరాత్ వర్సెస్ కేకేఆర్: సాయి సుదర్శన్ స్థానంలో జాషువ లిటిల్, సుయాశ్ ప్లేస్‌లో వెంకటేశ్ అయ్యర్ సన్‌రైజర్స్ వర్సెస్ పంజాబ్: ప్రభ్‌సిమ్రన్ స్థానంలో సికందర్ రజా ఆర్సీబీ వర్సెస్ లక్నో: అమిత్ మిశ్రా స్థానంలో బదోని, అనూజ్‌రావత్ ప్లేస్‌లో కర్ణ్ శర్మ ఢిల్లీ వర్సెస్ ముంబై: పృథ్వీ షా స్థానంలో ముకేశ్ కుమార్ సీఎస్కే వర్సెస్ రాజస్థాన్: బట్లర్ స్థానంలో జంపా, మగాలా ప్లేస్‌లో రాయుడు -
V ఫర్ వెంకటేశ్ అయ్యర్, V ఫర్ విధ్వంసం
-
Venkatesh Iyer: ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి విధ్వంసం
ఐపీఎల్ 16వ సీజన్లో తొలిసారి 'ఇంపాక్ట్ ప్లేయర్' ముద్ర కనబడింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు జరిగితే ఒక్క మ్యాచ్‌లోనూ ఇంపాక్ట్ ప్లేయర్ సరైన ప్రభావం చూపించింది లేదు. బౌలింగ్‌లో ఇంపాక్ట్ ప్రభావం కనిపించినా బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా లేదనే చెప్పుకోవాలి. తాజాగా కేకేఆర్ మాత్రం తొలిసారి బ్యాటింగ్‌లో వెంకటేశ్ అయ్యర్‌ను ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా సరైన సమయంలో వాడింది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ విధ్వంసం సృష్టించాడు. 40 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్లో వెంకటేశ్అయ్యర్కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఇక వెంకటేశ్ అయ్యర్ మాత్రం తన వింటేజ్ ఆటను చూపించాడు. గుజరాత్ విధించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడానికి కావాల్సిన ఇంపాక్ట్‌ను వెంకటేశ్ సరిగ్గా అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కేకేఆర్ సంచలన విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో రింకూ సింగ్ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. మధ్యలో రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తీసినప్పటికి రింకూ సింగ్ తన విధ్వంసంతో మ్యాచ్‌ను గుజరాత్ నుంచి లాగేసుకున్నాడు. -
చాలా ఊహించుకున్నా.. హార్ధిక్ రీ ఎంట్రీతో ఆశలన్నీ అడియాశలయ్యాయి..!
యూఏఈ వేదికగా జరిగిన 2021 ఐపీఎల్ సెకెండ్ లెగ్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, అట్టడుగు స్థానంలో ఉన్న కేకేఆర్‌ను ఫైనల్ దాకా తీసుకెళ్లిన యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ చాలామందికి గర్తుండే ఉంటాడు. ఆ సీజన్లో బ్యాట్‌తోనూ బంతితోనూ మెరుపులు మెరిపించి, టీమిండియాకు సరికొత్త ఆశాకిరణంలా అగుపించిన ఈ మధ్యప్రదేశ్ కుర్రాడు ఈ మధ్యకాలంలో టార్చ్ లైట్ పెట్టి వెతికినా కనిపించడం లేదు. దీంతో చాలామంది భారత క్రికెట్ అభిమానులు ఈ యువ ఆల్‌రౌండర్‌కు ఏమైందని, ఎక్కడికెళ్లిపోయాడని ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెంకటేశ్ అయ్యరే స్వయంగా సోషల్‌మీడియా ముందుకు వచ్చాడు. తను ఎక్కడికీ పోలేదని. దేశవాలీ టోర్నీల్లో బిజీగా ఉన్నానని తనను గుర్తు చేసుకున్న అభిమానులను పలకరించాడు. టీమిండియాలో తన జాడ లేదని కొందరు అభిమానులు అతన్ని ప్రశ్నించగా.. జట్టుతో అతను ట్రావెల్ చేసిన కొద్దిపాటి జర్నీని షేర్ చేసుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత టీమిండియా తరఫున తనకు అవకాశాలు వచ్చినప్పటికీ.. తను అనుకున్న రీతిలో ఓపెనర్‌గా బరిలోకి దిగలేకపోయానని, జట్టు తనను ఫినిషర్ పాత్రలో వాడుకోవాలని భావించిందని, ఆ పాత్రకు నేను న్యాయం చేయలేకపోయానని చెప్పుకొచ్చాడు. తనకు దొరికిన కొద్దిపాటి అవకాశాల్లో అడపాదడపా రాణించినప్పటికీ.. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేయలేకపోయానని, ఈ లోపు హార్ధిక్ పాండ్యా టీమిండియాలోకి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడని తెలిపాడు. ఐపీఎల్-2022, ఆసియా కప్, వరల్డ్‌కప్ సక్సెస్‌లతో హార్ధిక్ జట్టులో పాతుకుపోయాడని, అతని హవాలో తాను కనుమరుగయ్యానని వాపోయాడు. జట్టుకు ఎంపికైన సమయంలో కోచ్, కెప్టెన్ తనకు వీలైనన్ని అవకాశాలిస్తామని ప్రామిస్ చేశారని, ఈ లోపే హార్ధిక్ కుదురుకోవడంతో తన అవసరం వారికి లేకుండా పోయిందని అన్నాడు. దేశవాలీ టోర్నీల్లో రాణించినప్పటికీ సెలెక్టర్లు తనను పరిగణలోకి తీసుకోలేదని, టీ20 వరల్డ్‌కప్‌లో తన సత్తాను నిరూపించుకోవాలని చాలా కలలు కన్నానని, కానీ తన టైమ్ బాగాలేక ఇలా ఉండిపోయానని తన గోడును వెల్లబుచ్చుకున్నాడు. కాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల వెంకటేశ్ అయ్యర్.. ఐపీఎల్ 2021లో 10 మ్యాచ్‌ల్లో 129 స్ట్రయిక్ రేట్‌తో 370 పరుగులు చేసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అనంతరం టీమిండియాలో చోటు దక్కించుకుని 2 వన్డేలు, 9 టీ20 ఆడాడు. అయితే అతనికి లోయర్ మిడిలార్డర్లో అవకాశాలు రావడంతో పెద్దగా రాణించలేక, జట్టుకు దూరమాయ్యడు. -
IPL 2023: ఆ ఫ్రాంచైజీలకు వారిపై ఎంత నమ్మకమో.. దారుణంగా విఫలమైనా..!
కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగబోయే ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలం కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదలయ్యాయి. వేలంలో ప్రక్రియలో భాగంగా ఆటగాళ్లను అట్టిపెట్టుకుని, వదిలించుకునే ప్రాసెస్ రెండు రోజుల కిందటే (నవంబర్ 15) పూర్తయ్యింది. ఇక మిగిలింది మినీ వేలం ప్రక్రియ మాత్రమే. వచ్చే నెలలో జరిగే ఈ తంతులో ఆయా ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్లతో పాటు కొత్త ఆటగాళ్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఐపీఎల్ 16వ ఎడిషన్ భారత్ వేదికగా 2023 మార్చి 20-మే 28 మధ్యలో జరుగనున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే, గత సీజన్లో ఆశించిన మేరకు రాణించలేకపోయినా కొందరు ఆటగాళ్లను ఆయా ప్రాంచైజీలు అట్టిపెట్టుకోవడం విశేషం. 2022 సీజన్లో దారుణంగా విఫలమైన వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్), సునీల్ నరైన్ (కేకేఆర్), మాథ్యూ వేడ్ (గుజరాత్ టైటాన్స్), షారుఖ్ ఖాన్ (పంజాబ్ కింగ్స్), రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్)లపై సంబంధిత ఫ్రాంచైజీలు పూర్తి నమ్మకంతో వారిని కొనసాగించేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. గత రెండు సీజన్లుగా కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటేశ్ అయ్యర్, 2021 సీజన్లో అద్భుతాలు చేసినప్పటికీ.. గత సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. 2022 సీజన్లో అతనాడిన 12 మ్యాచ్‌ల్లో 107.69 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. పార్ట్ టైమ్ ఆల్‌రౌండర్ అయిన అయ్యర్ సీజన్ మొత్తంలో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. సునీల్ నరైన్ విషయానికొస్తే.. కేకేఆర్కే ప్రాతినిధ్యం వహించే ఈ విండీస్ ఆల్‌రౌండర్ గత సీజన్లో దారుణంగా నిరాశపరిచాడు. 2022 సీజన్లో అతను ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 71 పరుగులు మాత్రమే చేసి, 9 వికెట్లు పడగొట్టాడు. 11 ఏళ్ల తర్వత ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆసీస్ వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్.. 2022 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన వేడ్.. 113.77 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 157 పరుగులు మాత్రమే చేశాడు. వేడ్‌కు 2011 ఐపీఎల్ సీజన్లో ఏమంత మెరుగైన రికార్డు లేదు. ఆ సీజన్లో 3 మ్యాచ్‌లు ఆడిన అతను 66.66 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. 2022 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఏకంగా 9 కోట్ల పెట్టి దక్కించుకున్న షారుఖ్ ఖాన్.. గత సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడి 108 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 117 పరుగులు మాత్రమే చేసి ఫ్రాంచైజీ అతనిపై పెట్టుకున్న ఆశలను అడియాశలు చేశాడు. అండర్-19 వరల్డ్‌కప్ ద్వారా వెలుగులోకి వచ్చి 2019 సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రియాన్ పరాగ్, గత సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఘోరంగా విఫలమయ్యాడు. ఆ సీజన్లో 17 మ్యాచ్‌లు ఆడిన పరాగ్ 138. 64 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 183 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. పై పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్లు గత సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ.. సంబంధిత జట్లు వారిపై విశ్వాసం వ్యక్తం చేసి మరో అవకాశాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా భారీ ధర పెట్టి సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రియాన్ పరాగ్‌లను వారి ఫ్రాంచైజీలు రిలీజ్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చదవండి: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే! -
టీమిండియా ఆల్‌రౌండర్‌కు గాయం.. టోర్నీ నుంచి ఔట్!
టీమిండియా యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ గాయం కారణంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022 నుంచి తప్పుకున్నాడు. ఈ టోర్నీలో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అయ్యర్.. ప్రాక్టీస్ చేస్తుండగా అతడి చీలమండకి తీవ్ర గాయమైంది. ఈ క్రమంలో టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల మొత్తానికి అయ్యర్ దూరమయ్యాడు. కాగా ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మూడు మ్యాచ్‌లు ఆడిన అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రైల్వేస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అయ్యర్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తొలుత 62 పరుగులతో ఆజేయంగా నిలిచిన వెంకటేశ్.. బౌలింగ్‌లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక తన గాయానికి సంబంధించిన అప్డేట్ను సోషల్ మీడియా వేదికగా అయ్యర్ అందించాడు. "చీలమండ గాయం కారణంగా సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాను. త్వరలో మళ్లీ మైదానంలోకి అడుగుపెడతానని ఆశిస్తున్నాను. నేను జట్టుకు దూరమైన్పటికీ.. మా బాయ్స్ ఈ టోర్నీలో అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నాను" అని సోషల్ మీడియాలో అయ్యర్ పోస్ట్ చేశాడు. కాగా ఐపీఎల్-2021లో అద్భుతమైన ప్రదర్శన చేసిన అయ్యర్‌కు భారత జట్టులో చోటు దక్కింది. అయితే జట్టులో మాత్రం తన స్థానాన్ని అయ్యర్ సుస్థిరం చేసుకోలేకపోయాడు. ఇప్పటి వరకు టీమిండియా తరపున 9 టీ20లు, రెండు వన్డేల్లో అయ్యర్ ప్రాతినిథ్యం వహించాడు. View this post on Instagram A post shared by Venkatesh R Iyer (@venkatesh -
వెంకటేశ్ అయ్యర్‌కు గాయం.. నొప్పితో విలవిల్లాడుతూ! అంబులెన్స్ వచ్చినప్పటికీ!
దులీప్ ట్రోఫీలో భాగంగా వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్లో ఓ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో గాయపడ్డాడు. వెస్ట్ జోన్ పేసర్ చింతన్ గజా వేసిన ఓవర్లో అయ్యర్ బౌలర్ దిశగా ఢిపెన్స్ ఆడాడు. వెంటనే బంతిని అందుకున్న గజా.. అయ్యర్ వైపు బంతిని త్రో చేశాడు. అయితే బంతి నేరుగా అయ్యర్ మెడకు బలంగా తాకింది. దీంతో అయ్యర్ తీవ్ర నొప్పితో గ్రౌండ్లో విలవిలాడాడు. ఫిజియో వచ్చి వైద్యం అందించినప్పటికీ అతడి నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో అతడిని తీసుకువెళ్లడాననికి అంబులెన్స్ కూడా గ్రౌండ్లోకి వచ్చింది. అయితే అయ్యర్ మాత్రం నెమ్మదిగా నడుస్తునే ఫీల్డ్‌ను వదిలాడు. ఈ ఘటన అతడు 6 పరుగులు వద్ద బ్యాటింగ్ చేస్తుండగా చోటుచేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో రిటైర్ హార్ట్‌గా వెనుదిరిగిన అయ్యర్ తిరిగి మళ్లీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతడి గాయం తీవ్రమైనది కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతోన్నాయి. Unpleasant scene here. Venkatesh Iyer has been hit on the shoulder as Gaja throws the ball defended ball back at the batter. Venkatesh is down on the ground in pain and the ambulance arrives. #DuleepTrophy pic.twitter.com/TCvWbdgXFp — Dhruva Prasad (@DhruvaPrasad9) September 16, 2022 చదవండి: IPL 2023: పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా ట్రెవర్ బేలిస్! -
క్రికెటర్‌తో లవ్? క్లారిటీ ఇచ్చిన ప్రియాంక జవాల్కర్!
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్, యంగ్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే! మొన్నామధ్య ప్రియాంక తన ఎదురుగా కూర్చున్న వ్యక్తిని కనిపించీ కనిపించనీయకుండా ఫొటో తీసి నెట్టింట షేర్ చేసింది. అంతేకాదు ఆ పోస్ట్‌కు అతడే.. అంటూ హార్ట్ ఎమోజీ షేర్ చేయడంతో నెట్టింట దుమారం చెలరేగింది. అతడు మరెవరో కాదు ఆటగాడు వెంకటేశ్ అయ్యరే అంటూ పలువురూ కామెంట్లు చేశారు. ఇక ఈ ఫొటో వైరల్ కావడంతో ప్రియాంక మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే తాజాగా ఈ హీరోయిన్ తనపై వస్తున్న పుకార్లపై స్పందించింది. మరోసారి ఆ ఫొటోను షేర్ చేస్తూ.. ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి ఫొటో మాకు ఓ పనిలో సాయం చేయడానికి వచ్చాడు. బాయ్‌ఫ్రెండ్ అంటూ వార్తలు వస్తుండటంతో ఏంటి సంగతని మా అమ్మ అడుగుతోంది. దయచేసి అలాంటివి రాయడం ఇంక ఆపేయండి అని సూచించింది. చదవండి: ఉరివేసుకుని నటుడి ఆత్మహత్య.. కారణం ఏంటంటే ? ప్రేమ వివాహానికి రెడీ అవుతున్న హీరో రామ్, త్వరలో ప్రకటన?! -
ప్రియుడితో హీరోయిన్? పక్కా ఆ క్రికెటరే అంటున్న ఫ్యాన్స్!
క్రికెటర్స్ హీరోయిన్ల మీద మనసు పారేసుకోవడం కొత్తేమీ కాదు. ఎంతోమంది కథానాయికలు క్రికెటర్లతో ప్రేమాయణం నడిపారు. అందులో కొందరు ఓ అడుగు ముందుకేసి ఆ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకువెళ్లారు. ఈ లిస్టులో అనుష్క శర్మ- విరాట్ కోహ్లి, నటాషా - హార్దిక్ పాండ్యా, సంగీత- అజారుద్దీన్, సాగరిక - జహీర్ ఖాన్, హెజెల్ కీచ్ - యువరాజ్ సింగ్ వంటి వారు ఎన్నో జంటలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కొంతకాలంగా యంగ్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్, టాలీవుడ్ కథానాయిక ప్రియాంక జవాల్కర్ లవ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ మధ్య ప్రియాంక షేర్ చేసిన పిక్కు వెంకటేశ్ కామెంట్ చేయడం, దానికి ఆ హీరోయిన్ రిప్లై ఇవ్వడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే! అప్పటినుంచీ వీరిద్దరినీ ముడిపెడుతూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే తాజాగా ప్రియాంక జవాల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫొటోలు షేర్ చేసింది. కానీ ఆ ఫొటోలను తీస్తున్న వ్యక్తిని నేరుగా చూపించకుండా వెనుక నుంచి చూపించింది. ఈ పోస్ట్‌కు అతడే.. అంటూ హార్ట్ ఎమోజీ జత చేసి క్యాప్షన్ ఇవ్వడంతో అభిమానులు రెచ్చిపోయారు. అతడెవరో కాదు వెంకటేశ్ అయ్యరే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం అది మా వెంకటేశేనా? మా అన్న కాకపోతే ఇంకెవరు? కొంపతీసి మావాడికి హ్యాండ్ ఇచ్చేశావా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) చదవండి: సొంత అన్న పెళ్లికి నాగశౌర్య డుమ్మా! నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ చిందులు.. వీడియో వైరల్ -
IPL 2022: గత సీజన్లో అదరగొట్టారు.. కోట్లు కొట్టేశారు.. ఈసారి అట్టర్ ఫ్లాఫ్!
IPL 2022: ఐపీఎల్ లాంటి టీ20 టోర్నమెంట్లో ఎప్పుడు ఎవరు అదరగొడుతారు? ఎప్పుడు ఎవరు డీలా పడతారు? ఏ జట్టు పైచేయి సాధిస్తుందన్న విషయాలను అంచనా వేయడం కాస్త కష్టమే! ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవగా.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. పొట్టి ఫార్మాట్లో ఫామ్‌ను కొనసాగిస్తూ ముందుకు సాగటం కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. ఒక సీజన్లో అదరగొట్టిన వాళ్లు.. మరో ఎడిషన్‌లో ఏమాత్రం ప్రభావం చూపకపోవచ్చు. లేదంటే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసీస్ డేవిడ్ వార్నర్‌లా గతంలో ఫామ్‌లేమితో ఇబ్బంది పడిన వాళ్లు తిరిగి విజృంభించనూ వచ్చు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2021లో అదరగొట్టి.. 2022 ఎడిషన్‌లో చతికిలపడ్డ టాప్-5 ఆటగాళ్లు ఎవరో ఓసారి గమనిద్దాం. PC: IPL/BCCI మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ ఐపీఎల్-2021లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 12 ఇన్నింగ్స్‌లలో కలిపి 441 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ శతకాలు ఉండటం విశేషం. ఇక పంజాబ్ తరఫున గత ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా మయాంక్ నిలిచాడు. అయితే, తాజా సీజన్లో పరిస్థితులు మారాయి. 12 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుని పంజాబ్ కెప్టెన్‌గా అతడిని నియమించింది ఫ్రాంఛైజీ. కానీ కెప్టెన్సీ భారం మోయలేక మయాంక్ చేతులెత్తేశాడు. బ్యాటర్‌గానూ విఫలమయ్యాడు. ఐపీఎల్-2022లో ఆడిన 12 మ్యాచ్‌లలో కలిపి 195 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మయాంక్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ పెద్దగా రాణించింది కూడా లేదు. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కేవలం ఆరు గెలిచి ఏడో స్థానంలో ఉంది. PC: IPL/BCCI వెంకటేశ్ అయ్యర్ దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన మధ్యప్రదేశ్ యువ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత సీజన్ రెండో అంచెలో వరుస అవకాశాలు దక్కించుకున్న వెంకటేశ్.. 10 ఇన్నింగ్స్‌లలో 370 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియాలోనూ చోటు దక్కించుకున్నాడు. హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగల ఆల్‌రౌండర్‌గా ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఐపీఎల్-2022లో అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. వరుస వైఫల్యాలతో ఒకానొక సమయంలో తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఇక మొత్తంగా ఈ సీజన్లో 12 ఇన్నింగ్స్ ఆడిన అతడు కేవలం 182 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 50 నాటౌట్. తనను రిటైన్ చేసుకునేందుకు ఫ్రాంఛైజీ ఖర్చు చేసిన 8 కోట్లకు న్యాయం చేయలేకపోయాడు. PC: IPL/BCCI కీరన్ పొలార్డ్ వెస్టిండీస్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ హిట్టర్ కీరన్ పొలార్డ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2010 నుంచి ముంబై జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ విండీస్ మాజీ కెప్టెన్ గత సీజన్లో 245 పరుగులు చేశాడు. చెన్నైపై సంచలన ఇన్నింగ్స్(34 బంతుల్లో 87 పరుగులు నాటౌట్) ఆడాడు. కట్ చేస్తే ఐపీఎల్-2022లో పరిస్థితి తలకిందులైంది. 6 కోట్లకు ముంబై రిటైన్ చేసుకుంటే స్థాయికి తగ్గట్లు రాణించలేక అతడు డీలా పడ్డాడు. ఆడిన 11 మ్యాచ్‌లలో కలిపి పొలార్డ్ చేసిన స్కోరు 144. ఇక వరుసగా పొలార్డ్ నిరాశపరిచిన నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే తలంపుతో అతడిని తుది జట్టు నుంచి తప్పించారు. PC: IPL/BCCI హర్షల్ పటేల్ గత ఐపీఎల్ ఎడిషన్‌లో అదరగొట్టే ప్రదర్శనతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్. ఆడిన 15 మ్యాచ్‌లలో 8.14 ఎకానమీతో 32 వికెట్లు పడగొట్టి ‘పర్పుల్’ పటేల్ అని కితాబులందుకున్నాడు. ఆర్సీబీని ప్లే ఆఫ్స్ చేర్చడంలో హర్షల్ కీలక పాత్ర పోషించాడు. అయితే, రిటెన్షన్‌లో వదిలేసిన్పటికీ మెగా వేలంలో ఆర్సీబీ అతడ కోసం 10.75 కోట్లు వెచ్చించింది. కానీ తాజా సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 12 మ్యాచ్‌లలో అతడు తీసినవి 18 వికెట్లు. గతేడాది పోలిస్తే ఈసారి పెద్దగా రాణించలేదనే చెప్పాలి. PC: IPL/BCCI వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత ఐపీఎల్ సీజన్లో 17 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ అద్భుత ప్రదర్శనతో యూఏఈ వేదికగా సాగిన రెండో అంచెలో కోల్‌కతా నైట్‌రైడర్స్ అదరగొట్టింది. ఏకంగా ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో వరుణ్‌ను 8 కోట్లకు రిటైన్ చేసుకుంది కేకేఆర్. కానీ అతడు ధరకు తగ్గ న్యాయం చేయలేకపోయాడు. దీంతో తుదిజట్టు నుంచి తప్పించి హర్షిత్ రాణా వంటి కొత్త ఆటగాళ్లకు అవకాశమిచ్చారు. ఐపీఎల్-2022లో వరుణ్ చక్రవర్తి 11 ఇన్నింగ్స్‌లో కలిపి తీసిన వికెట్ల సంఖ్య- 6. చదవండి👉🏾IPL 2022: సన్‌రైజర్స్ చేసిన అతిపెద్ద తప్పిదం అదే.. అందుకే ఇలా: సెహ్వాగ్ చదవండి👉🏾IPL 2022: యార్కర్లతో అదరగొట్టాడు.. చివరి మ్యాచ్‌లోనైనా అవకాశమివ్వండి! -
'అప్పటివరకు బాగానే.. ఇషాన్ చెప్పగానే ఔటయ్యాడు'
ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కీలక సమయంలో విజయం సాధించిన కేకేఆర్ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. బ్యాటింగ్ లైనఫ్ విఫలంతో కేకేఆర్ వరుస పరాజయాలు నమోదు చేసింది. అయితే ఈసారి మాత్రం కేకేఆర్‌కు మంచి ఆరంభం లభించింది. గత సీజన్లో దుమ్మురేపిన వెంకటేశ్ అయ్యర్ ఈసారి దారుణంగా నిరాశపరిచాడు. కాగా తొలిసారి అతను తన ప్రదర్శనతో మెరిశాడు. 24 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. అజింక్య రహానేతో(24 బంతుల్లో 25; 3 ఫోర్లు) కలిసి తొలి వికెట్‌కు 34 బంతుల్లోనే 60 పరుగులు జోడించి శుభారంభం అందించాడు. రహానే ఔటైనప్పటికి నితీష్ రానాతో కలిసి మంచి ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. మురుగన్ అశ్విన్, డేనియల్ సామ్స్, రిలే మెరిడిత్ ఇలా ఎవరు బౌలింగ్‌కు వచ్చినా అయ్యర్ ఉతికి ఆరేస్తున్నాడు. ఇదంతా గమనించిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ లాభం లేదనుకొని రంగంలోకి దిగాడు. సీరియస్‌గా బ్యాటింగ్ చేస్తున్న వెంకటేశ్ అయ్యర్ దగ్గరకు వచ్చి ఏదో వ్యాఖ్యలు చేశాడు. దానికి అయ్యర్ కూడా నవ్వుతూ బదులిచ్చాడు. అయితే ఆ తర్వాతి బంతికే వెంకటేశ్ అయ్యర్ ఔటయ్యాడు. కుమార్ కార్తికేయ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్ నాలుగో బంతిని కవర్స్ దిశగా షాట్ ఆడే ప్రయత్నంలో డేనియల్ సామ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. ''అంతవరకు బాగానే ఆడాడు.. ఇషాన్ వచ్చి చెప్పగానే ఔటయ్యాడు.. ఏదో మతలబు జరిగింది'' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (24 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), నితీశ్ రాణా (26 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్లుగా నిలిచింది. ఐపీఎల్లో బుమ్రా తన అత్యుత్తమ ప్రదర్శన (5/10) నమోదు చేశాడు. అనంతరం ముంబై 17.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. చదవండి: Rohit Sharma: థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం.. రోహిత్ శర్మ ఔట్‌పై వివాదం -
అప్పుడు హీరోలా కనిపించాడు; ఇప్పుడు విలన్.. ఎందుకిలా!
వెంకటేశ్ అయ్యర్.. గత ఐపీఎల్ సీజన్ ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్ 14వ సీజన్లో తొలి అంచె పోటీల్లో వెంకటేశ్ అయ్యర్ పెద్దగా అవకాశాలు లభించలేదు. అయితే కరోనా బ్రేక్ తర్వాత జరిగిన రెండో అంచె పోటీల్లో మాత్రం దుమ్ములేపాడు. కేకేఆర్ ఫస్టాఫ్‌లో రెండే మ్యాచ్‌లు గెలిచి అసలు ప్లేఆఫ్ చేరుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే వెంకటేశ్ అయ్యర్ రాకతో కేకేఆర్ ఆట స్వరూపమే మారిపోయింది. ఎవరు ఊహించని విధంగా ఫైనల్ చేరిన కేకేఆర్ ఆఖరి మెట్టుపై బోల్తా పడి రన్నరప్‌గా నిలిచింది. సీఎస్కేతో ఫైనల్లో ఓడినప్పటికి కేకేఆర్ తన ఆటతీరుతో ఆకట్టుకుంది. అందుకు ప్రధాన కారణం వెంకటేశ్ అయ్యర్ అని చెప్పొచ్చు. ఆ సీజన్లో ఓపెనర్‌గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్ ఆరంభం నుంచే దూకుడైన ఆటతీరు కనబరిచాడు. మొత్తంగా 10 ఇన్నింగ్స్‌ల్లో 128.47 స్ట్రైయిక్ రేటుతో 41.11 యావరేజ్‌తో 370 పరుగులు చేశాడు వెంకటేశ్ అయ్యర్. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి... బౌలింగ్‌లోనూ 3 వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండర్‌గా మెప్పించాడు. Courtesy: IPL Twitter గత సీజన్ ప్రదర్శన కారణంగా వెంకటేశ్ అయ్యర్‌ని ఏకంగా రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది కోల్కత్తా నైట్‌రైడర్స్. అయితే ఈ సీజన్లో అయ్యర్ ఘోర ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ సీజన్లో 9 మ్యాచులు ఆడిన వెంకటేశ్ అయ్యర్ కేవలం 132 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ముంబై ఇండియన్స్‌పై 41 బంతుల్లో చేసిన 50 పరుగులు మినహాయిస్తే... మిగిలిన 8 మ్యాచ్‌లు కలిపి 82 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్లో తన ప్రదర్శనతో హీరో అనిపించుకున్న వెంకటేశ్ అయ్యర్.. ఈ సీజన్లో కాస్త విలన్‌గా తయారయ్యాడు. Courtesy: IPL Twitter గత సీజన్ ఆరంభంలోనే బౌలర్లపై విరుచుకుపడిన వెంకటేశ్ అయ్యర్ అదే స్పీడును ఇప్పుడు మాత్రం చూపెట్టలేక చతికిలపడుతున్నాడు. కేకేఆర్‌కు ఇది ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 పరుగులు రావాల్సిన చోట సింగిల్ మాత్రమే తీసి వెంకటేశ్ అయ్యర్ స్ట్రైక్ ఉంచుకున్నాడు. అయ్యర్ చేసిన ఈ పొరపాటు మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఆ తర్వాతి ఓవర్లో 4 వికెట్లు తీసి హ్యాట్రిక్‌తో మెరిసిన చహల్ కోల్‌కతాను విజయానికి దూరం చేశాడు. గత సీజన్లో విఫలమయిన హార్ధిక్ పాండ్యా ఈసారి కెప్టెన్‌గా, ఫీల్డర్‌గా, బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా దూసుకుపోతుంటే... వెంకటేశ్ అయ్యర్ మాత్రం టీమిండియా ఎంట్రీ తర్వాత ఉన్న నమ్మకాన్ని కాస్తా కోల్పోయినట్టు కనిపిస్తున్నాడు. చదవండి: IPL 2022: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్.. తీవ్ర దిగ్బ్రాంతిలో లక్నో సూపర్ జెయింట్స్ Shreyas Iyer: మా ఓటమికి కారణం అదే.. మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే! -
గతేడాది హీరోలు జీరోలవుతున్నారా.. ఏమైంది వీళ్లకు?!
ఐపీఎల్ పేరుకు క్యాష్ రిచ్ లీగ్ అయినా.. ఎంతో మంది ప్రతిభావంతమైన ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చింది. ఐపీఎల్ 2021 సీజన్లో రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్, పృథ్వీ షా, యశస్వి జైశ్వాల్, నితీష్ రాణాలు తమ జట్ల తరపున చాలా బాగా రాణించారు. అందుకే వీరిని మెగావేలంలో రిలీజ్ చేయకుండా తమతోనే అట్టిపెట్టుకుంది. మరి గతేడాది హీరోలుగా నిలిచిన వీళ్లు ఈసారి మాత్రం జీరోలుగా మిగిలిపోనున్నారా.. ఎందుకంటే ఇంతవరకు మనం ఆశించిన ఆటతీరు పైన చెప్పుకున్న ఐదుగురిలో ఒక్కసారి కూడా కనబడలేదు. ఒకవేళ లీగ్ ఇప్పుడే కదా ప్రారంభమైంది అనుకున్నా.. మరి రాబోయే మ్యాచ్‌ల్లోనైనా మెరుస్తారా అంటే అది చెప్పలేని పరిస్థితి. మరి వీళ్ల గురించి ఒకసారి తెలుసుకుందాం. -సాక్షి, వెబ్‌డెస్క్ రుతురాజ్ గైక్వాడ్(సీఎస్కే) Courtesy: IPL Twitter ఐపీఎల్ 2021 సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్. గత సీజన్లో విజేతగా నిలిచిన సీఎస్కే వెనుక రుతురాజ్ పాత్ర మరువలేనిది. 16 మ్యాచ్‌లాడిన రుతురాజ్ 635 పరుగులు సాధించి సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా పేరు పొందాడు. ఈ సీజన్లో మాత్రం ఇప్పటివరకు పూర్తిగా నిరాశపరిచాడు. సీఎస్కే ఆడిన మూడు మ్యాచ్‌లు కలిపి రుతురాజ్ రెండు పరుగులు మాత్రమే చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రుతురాజ్ గోల్డెన్ డక్ అయ్యాడు. 25 ఏళ్ల రుతురాజ్ సరిగ్గా రాణించకపోవడంతో సీఎస్కే తొలి ఆరు ఓవర్లలో భారీ స్కోరు చేయడంలో విఫలమవుతుంది. ఇదే రుతురాజ్ గత సీజన్లో పవర్ ప్లేలో చెలరేగి ఆడడంతో సీఎస్కే ప్రతీ మ్యాచ్‌లోనూ మంచి స్కోరు లభించింది. అయితే రుతురాజ్ ఐపీఎల్ ప్రారంభానికి ముందు వరుసగా గాయాల బారీన పడ్డాడు. టీమిండియా ఆడిన పలు సిరీస్‌లు ఎంపికైనప్పటికి గాయాలతో దూరం కావడమో లేక బెంచ్‌కే పరిమితం అయ్యేవాడు. మరి రాబోయే మ్యాచ్‌ల్లోనైనా రుతురాజ్ రాణించాలని ఆశిద్దాం వెంకటేశ్ అయ్యర్(కేకేఆర్) Courtesy: IPL Twitter గతేడాది ఐపీఎల్ సీజన్లో వెంకటేశ్ అయ్యర్ పెను సంచలనం. సీజన్ ఆరంభంలో పెద్దగా రాణించని అయ్యర్.. రెండో అంచె పోటీల్లో కేకేఆర్‌కు వెన్నుముకగా మారాడు 10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనతో టీమిండియాలోకి ఎంపికైన వెంకటేశ్ అయ్యర్ వెస్టిండీస్, శ్రీలంకతో జరిగిన సిరీస్‌ల్లో మోస్తరుగా రాణించాడు. అయితే ఐపీఎల్లో మరోసారి కీలకం అవుతాడనుకుంటే పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. ఇప్పటివరకు కేకేఆర్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్ వరుసగా 16,10,3 పరుగులు చేశాడు. యశస్వి జైశ్వాల్(రాజస్తాన్ రాయల్స్) Courtesy: IPL Twitter గతేడాది రాజస్తాన్ రాయల్స్ జట్టుగా విఫలమైనప్పటికి యశస్వి జైశ్వాల్ మాత్రం సక్సెస్ అయ్యాడు. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్న యశస్వి జైశ్వాల్ 10 మ్యాచ్‌ల్లో 148 స్ట్రైక్‌రేట్‌తో 249 పరుగులు సాధించాడు. అయితే ఈ సీజన్లో మాత్రం జైశ్వాల్ అంతగా రాణించలేకపోతున్నాడు. మూడు మ్యాచ్‌లు కలిపి 25 పరుగులు మాత్రమే చేశాడు. అయితే రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో అంచనాలకు మించి రాణిస్తుండడం.. బట్లర్ లాంటి స్టార్ ఆటగాడు ఫామ్‌లో ఉండంతో పెద్దగా కనబడడం లేదు. కానీ యశస్వి జైశ్వాల్ ఓపెనర్‌గా తన మార్క్ చూపించాల్సిన అవసరం చాలా ఉంది పృథ్వీ షా(ఢిల్లీ క్యాపిటల్స్) Courtesy: IPL Twitter 2018 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా యంగ్ కెప్టెన్‌గా పృథ్వీ షా అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ నేపథ్యంలోనే 2018లో జరిగిన వేలంలో పృథ్వీని ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. 2021 సీజన్లో పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఘనమైన ఆరంభాలు ఇచ్చాడు. 15 మ్యాచ్‌ల్లో 479 పరుగులు చేసిన పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్‌కు పవర్ ప్లేలో భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటింగ్‌తో అలరించిన పృథ్వీ ఈసారి మాత్రం అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 38,10 పరుగులు చేసిన పృథ్వీ అనవసరంగా వికెట్ పారేసుకుంటున్నాడు. డేవిడ్ వార్నర్ జట్టులోకి వస్తే పృథ్వీ షా చోటు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. నితీష్ రాణా(కేకేఆర్) Courtesy: IPL Twitter టీమిండియాలో చోటు దక్కకపోయినా కొన్నేళ్ళుగా నితీష్ రాణా ఐపీఎల్లో మాత్రం కేకేఆర్‌కు కీలకంగా మారాడు. గత సీజన్లో 17 మ్యాచ్‌ల్లో 383 పరుగులు సాధించాడు. కానీ ఈసారి మాత్రం మూడు మ్యాచ్‌ల్లో 21,10,0 పరుగులు చేశాడు. రాణా ఫామ్‌లోకి రావాలని కేకేఆర్ బలంగా కోరుకుంటుంది. చదవండి: Shikar Dhawan: 'లవ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసింది.. కోహినూర్ డైమండ్‌ను మిస్సయ్యావు!' IPL 2022: దుమ్మురేపుతున్న టీమిండియా అన్క్యాప్డ్ ఆటగాళ్లు.. భవిష్యత్తు వీళ్లదే -
ఐపీఎల్ 2022: 8 మ్యాచ్‌ల హైలైట్స్
-
టాలీవుడ్ హీరోయిన్, ఈ యంగ్ క్రికెటర్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్?
ఓ యంగ్ క్రికెటర్ టాలీవుడ్ హీరోయిన్‌పై మనసు పారేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకి వారెవంటే టాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా జవాల్కర్ యంగ్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్. వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ దర్శనమిస్తున్నాయి. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఉగాది సందర్భంగా ప్రియాంక షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కు వెంకటేశ్ అయ్యర్ కామెంట్ చేశాడు. దీనికి ప్రియాంక ఇచ్చిన రిప్లై చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రామ్ చరణ్ గొప్ప మనసు, ఆర్ఆర్ఆర్ టీం ఒక్కొక్కరికి తులం బంగారం.. కాగా ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తనకు సంబంధించిన గ్లామరస్, హాట్‌లుక్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తు ఉంటుంది. ఈ క్రమంలో ఉగాది సందర్భంగా ఆమె తన ఫొటోలను షేర్ చేస్తూ ‘బూ’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రియాంక ఈ ఫొటోలో క్రీమ్ కలర్ షోల్డర్ కట్ టాప్ ధరించి కర్టన్ వెనకాల కుర్చోని ఉంది. ఈ ఫొటోకి వెంకటేశ్ అయ్యర్ క్యూట్ అంటూ కామెంట్ చేశాడు. అతడి కామెంట్‌కు ప్రియాంక హు? యూ? అంటూ రిప్లై ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చదవండి: బంజారాహిల్స్ రేవ్ పార్టీ: వివరణ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్ ‘మీ ఓవరాక్షన్ ఆపండి మాకు అంతా తెలుసు, మీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో కూడా అవుతున్నారు’, ‘ఏంటి ఇది వెంకటేశ్ భయ్యా.. ఏం జరుగుతుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆయన ఎవరో తెలియదా ఇండియన్ క్రికెటర్, నెక్ట్ జనరేషన్‌కు కాబోయే క్రికెట్ సూపర్ స్టార్’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరికొందరూ ప్రియాంక వెంకటేశ్ అయ్యర్‌ని క్యూట్ అంటుందంటూ స్పందిస్తున్నారు. చూస్తుంటే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లున్నారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. కాగా ప్రియాంకా జవాల్కర్ విజయ్ దేవరకొండతో టాక్సివాలా మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ఎస్ఆర్ కల్యాణ మండపం, తిమ్మరుసు వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkkar) -
IPL 2022: తొలివారంలో అట్టర్ ఫ్లాప్ అయిన 11 మంది ఆటగాళ్లు వీరే!
క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ తాజా సీజన్ ఆరంభమై వారం రోజులు దాటింది. ఏప్రిల్ 1 నాటికి ఎనిమిది మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో లో స్కోరింగ్ మ్యాచ్‌లతో పాటు.. ఆఖరి ఓవర్ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. వ్యక్తిగతంగా కొంతమంది ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. భారీ అంచనాలతో ఐపీఎల్-2022 బరిలో దిగిన వారు ఆరంభ మ్యాచ్‌లలో కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేక చతికిలపడ్డారు. ఆ ఆటగాళ్లు ఎవరో ఓసారి గమనిద్దాం. రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్-2021 సీజన్లో అత్యధిక పరుగుల వీరుడు. ఈ చెన్నై సూపర్‌కింగ్స్ ఓపెనర్ ఏకంగా 635 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. దేశవాళీ టోర్నీలు విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో భారీ అంచనాలతో ఐపీఎల్-2022లో అడుగుపెట్టాడు. కానీ తన స్థాయికి తగ్గట్టు రాణించలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆరంభ మ్యాచ్‌లో డకౌట్ అయిన రుతురాజ్, లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు చేశాడు. వెంకటేశ్ అయ్యర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున గత సీజన్ రెండో అంచెలో అదరగొట్టాడు ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు. తద్వారా టీమిండియాలో చోటు దక్కించుకోగలిగాడు. ఇక ఐపీఎల్-2021 ప్రదర్శన నేపథ్యంలో కేకేఆర్ అతడిని 8 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. అయితే, ఆరంభ మ్యాచ్‌లలో ఈ యువ ఆల్‌రౌండర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. సీఎస్కేతో మొదటి మ్యాచ్‌లో ఈ ఓపెనర్ 16 పరుగులు చేశాడు. ఆర్సీబీపై 10, పంజాబ్‌పై కేవలం 3 పరుగులు మాత్రమే సాధించాడు. బౌలింగ్‌లోనూ ప్రభావం చూపలేదు. అనూజ్ రావత్ ఆర్సీబీ యువ ఆటగాడు సైతం ఆరంభ మ్యాచ్‌లలో తేలిపోయాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఘనంగానే ఇన్నింగ్స్ ఆరంభించినా రాహుల్ చహర్‌కు దొరికిపోయి వికెట్ సమర్పించుకున్నాడు. 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి అనూజ్ రావత్ సగటు స్కోరు 10.5. మనీష్ పాండే లక్నో సూపర్‌జెయింట్స్ ఆటగాడు మనీశ్ పాండేకు ఈ సీజన్లో మంచి ఆరంభం దక్కలేదు. ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో మొత్తం కలిపి కేవలం 11 పరుగులు చేశాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో 5, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 6 పరుగులు సాధించాడు. నికోలస్ పూరన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎన్నో ఆశలతో నికోలస్ పూరన్‌ను మెగా వేలంలో కొనుగోలు చేసింది. గత సీజన్లో విఫలమైనా అతడిపై నమ్మకం ఉంచి జట్టులోకి తీసుకుంది. ఇక ఇటీవల జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో రాణించిన ఈ విండీస్ వికెట్ కీపర్బ్యాటర్.. ఐపీఎల్-2022ను ఘనంగా ఆరంభించలేకపోయాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో డకౌట్ అయిన పూరన్.. పూర్ పర్ఫామెన్స్తో అభిమానులను నిరాశపరిచాడు. లియామ్ లివింగ్‌స్టోన్ మెగా వేలం-2022లో భాగంగా 11.5 కోట్ల భారీ ధర చెల్లించి పంజాబ్ కింగ్స్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ ఇంగ్లండ్ క్రికెటర్ ఘనంగా తన ఆగమనాన్ని చాటలేకపోయాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కలిపి 38 పరుగులు చేశాడు. రాజ్ బవా భారత అండర్-19 వరల్డ్‌కప్ ప్లేయర్ రాజ్ బవా ఐసీసీ మెగా ఈవెంట్లో అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని 2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. మిడిలార్డర్లో భాగమైన ఈ యువ ఆటగాడు.. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే డకౌట్ అయి చేదు అనుభవం మూటగట్టుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో 14వ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన రాజ్ బవా విఫలమయ్యాడు. ఇక కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 బంతులు ఎదుర్కొని 11 పరుగులు సాధించగలిగాడు. డానియెల్ సామ్స్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన బౌలింగ్ ఆల్‌రౌండర్ డానియెల్ సామ్స్ 57 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా 18వ ఓవర్లో ఢిల్లీ బ్యాటర్లు మొత్తంగా 24(6,1,6,4,1,6) పరుగులు సాధించి తమ జట్టుకు విజయం అందించారు. హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగలడని భావించిన ముంబై యాజమాన్యానికి ఆరంభ మ్యాచ్‌లో విఫలమై షాకిచ్చాడు డానియెల్ సామ్స్. జస్ప్రీత్ బుమ్రా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను 12 కోట్ల రూపాయలకు ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంది. జట్టుకు ప్రధానమైన ఈ బౌలర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. 3.2 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, ఆరంభం ఘనంగా లేకపోయినప్పటికీ ఈ అనువజ్ఞుడైన ఆటగాడు తప్పక రాణించగలడని విశ్లేషకుల అభిప్రాయం. నాథన్ కౌల్టర్‌నైల్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. 61 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సత్తా చాటింది. అయితే, ఈ విజయంలో నాథన్ తన వంతు పాత్ర పోషించలేకపోయాడు. 3 ఓవర్లు బౌలింగ్ వేసిన ఈ బౌలర్ ఏకంగా 48 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. శివమ్ మావి కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు శివమ్ మావి. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు దక్కించుకున్న అతడు.. 4 ఓవర్లు బౌలింగ్ వేసి 35 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక ఆర్సీబీతో మ్యాచ్‌లో జట్టులో స్థానం కోల్పోయిన శివమ్ మావి.. పంజాబ్‌తో మ్యాచ్‌లో జట్టులోకి వచ్చాడు. అయితే, రెండు ఓవర్లలోనే 39 పరుగులు ఇచ్చుకుని విఫలమయ్యాడు. అయితే, ఒక వికెట్ మాత్రం తీయగలగడం గమనార్హం. అయితే, ఆరంభ మ్యాచ్‌లలో ఈ ఆటగాళ్లు విఫలమైనప్పటికీ రానున్న మ్యాచ్‌లలో తమదైన శైలిలో రాణించి అభిమానులను ఆకట్టుకోవాలని కోరుకుందాం. A thumping win for @KKRiders 💪 💪 The @ShreyasIyer15 -led unit returns to winning ways as they beat #PBKS by 6⃣wickets👏 👏 Scorecard ▶️ https://t.co/JEqScn6mWQ #TATAIPL | #KKRvPBKS pic.twitter.com/UtmnpIufGJ — IndianPremierLeague (@IPL) April 1, 2022 -
IPL 2022: వెంకటేశ్ అయ్యర్‌కు ప్రత్యేక సందేశం పంపిన WWE సూపర్ స్టార్
Venkatesh Iyer Receives Special Message From Seth Rollins: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ అందింది. అతను ఎంతో అభిమానించే క్రికెటేతర వ్యక్తి వెంకటేశ్ అయ్యర్‌కు ప్రత్యేక సందేశం పంపాడు. ఇంతకీ ఆ మెసేజ్ పంపిన వ్యక్తి ఎవరు..? ఆ మెసేజ్‌లో ఏముంది..? వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెంకటేశ్ అయ్యర్ మాట్లాడుతూ.. తాను డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ సెథ్ రోలిన్స్‌ను వీరభిమానినని తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ ఛాంపియన్ రోలిన్స్.. ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి కొద్ది గంటల ముందు తన ఫ్యాన్ వెంకటేశ్ అయ్యర్‌ను సర్ప్రైజ్ చేశాడు. వెంకటేష్.. మై ఫ్రెండ్. నేను సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్. మీరు నా అభిమాని కావడంలో ఆశ్చర్యం లేదు. నా మిత్రమా, ప్రస్తుతం మీ ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉంది. ఈ కప్ గెలవడం కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. కష్టపడి ఆడు.. అంటూ వీడియో సందేశం పంపాడు. ఈ వీడియోను WWE India తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరలవుతోంది. రోలిన్స్ గతంలో డీన్ఆంబ్రోస్, రోమన్ రెయిన్స్‌తో కలిసి షీల్డ్ గ్రూప్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. .@WWERollins’ message for @KKRiders' @venkateshiyer ahead of #IPL2022. #WrestleMania #MeraWrestleMania #WWEonSonyIndia pic.twitter.com/xtjmx269Hs — WWE India (@WWEIndia) March 25, 2022 మరోవైపు, ఐపీఎల్ 15వ సీజన్లో తొలి మ్యాచ్‌కు ముందు తన ఆరాధ్య రెజ్లర్ నుంచి స్పెషల్ మెసేజ్ అందటంతో కేకేఆర్ ఆల్‌రౌండర్ ఉబ్బితబ్బుబ్బి అవుతున్నాడు. ఈ బూస్టప్ డోస్‌తో క్రితం ఏడాది మాదిరే ఈ సీజన్లోనూ రెచ్చిపోవాలని భావిస్తున్నాడు. అయ్యర్ గత సీజన్లో 10 మ్యాచ్‌ల్లో 41.11 సగటుతో 370 పరుగులు చేసి, కేకేఆర్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఇవాళ (మార్చి 26) డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు 26 సార్లు తలపడగా, సీఎస్కే 17, కేకేఆర్ 8 సందర్భాల్లో విజయాలు సాధించాయి. చదవండి: IPL 2022: చెన్నై, కేకేఆర్ ఆటగాళ్లను ఊరిస్తున్న ఆ అరుదైన రికార్డులేంటో చూద్దాం..! -
Avesh Khan: ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి బాబూ! అయ్యర్‌తో స్టెప్పులు ఇరగదీసిన ఆవేశ్ ఖాన్
Avesh Khan- Venkatesh Iyer: టీమిండియా యువ పేసర్ ఆవేశ్ ఖాన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తనకు సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటాడు. ఈ క్రమంలో నెటిజన్లను ఊపేస్తున్న అరబిక్ కుతూ పాటకు తనదైన శైలిలో స్టెప్పులేశాడు. సహచర క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి డాన్స్ అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆవేశ్ ఖాన్ ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘‘ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి బాబూ.. ఇద్దరు డాన్స్ చించేశారు. స్టెప్పులతో అదరగొట్టారు. మీ డాన్స్ విజయ్ ఫ్యాన్స్‌కు తప్పక నచ్చుతుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'బీస్ట్'లోని అరబిక్ కుతూ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ యువ క్రికెటర్ల విషయానికొస్తే.. ఐపీఎల్ మెగా వేలం- 2022లో భాగంగా కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్ ఆవేశ్ ఖాన్‌ను 10 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. మరోవైపు.. వెంకటేశ్ అయ్యర్ విషయానికొస్తే.. అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు టీమిండియా తరఫున అరంగేట్రం చేశారు. పేసర్‌గా ఆవేశ్ ఖాన్, ఆల్‌రౌండర్‌గా అయ్యర్ తమ కెరీర్‌కు బాటలు వేసుకుంటున్నారు. చదవండి: IPL 2022: కప్ గెలుస్తారో లేదో తెలీదు.. మా మనసులు దోచుకున్నారు View this post on Instagram A post shared by Avesh Khan (@aavi.khan) -
రాకెట్ వేగంతో దూసుకొచ్చిన సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్
ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా విధ్వంసకర బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్లు రాకెట్ వేగంతో దూసుకొచ్చారు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనలకు గాను ఈ ఇద్దరు ర్యాంకింగ్స్‌లో ఒక్కసారిగా పైకి ఎగబాకారు. ఈ సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన సూర్యకుమార్ 35 స్థానాలు ఎగబాకి 21వ స్థానానికి చేరుకోగా, వెంకటేష్ అయ్యర్ ఏకంగా 203 స్థానాలు మెరుగుపర్చుకుని 115వ స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండు స్థానాలు దిగజారి ఆరో స్థానానికి పడిపోగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 10వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పాక్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌లు తొలి రెండు స్థానాలను కాపాడుకున్నారు. ఇక బౌలర్లు, ఆల్ రౌండర్ల విషయానికొస్తే.. ఈ విభాగపు టాప్-10 జాబితాల్లో ఏ ఒక్క టీమిండియా క్రికెటర్‌కు కూడా చోటు దక్కలేదు. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 20వ ర్యాంక్‌కే అత్యుత్తమం. చదవండి: ఐపీఎల్లో అన్‌సోల్డ్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం.. ఆ వెనుకే 7.75 కోట్ల ఆటగాడు! -
టీమిండియాకు ఆల్ రౌండర్ దొరికేశాడు..దుమ్ము రేపుతున్నాడుగా!
స్వదేశంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ సిరీస్‌లో టీమిండియాకు ఆల్‌రౌండర్ లోటును వెంకటేశ్ అయ్యర్ తీర్చాడు. ఈ సిరీస్‌లో వెంకటేశ్ అయ్యర్ బ్యాట్‌తోను, బంతితోను అద్భుతంగా రాణించాడు. మూడు మ్యాచ్‌లు ఆడిన అయ్యర్ 92 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆదివారంజరిగిన అఖరి టీ20లో 19 బంతుల్లో 35 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు కూడా పడగొట్టాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ తన పవర్ హిట్టింగ్తో అకట్టుకుంటున్నాడు. తొలి టీ20లో ఇన్నింగ్స్ అఖరిలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్.. 13 బంతుల్లో 24 పరుగులతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అదే విధంగా రెండో టీ20లో కూడా 18 బంతుల్లో 33 పరుగులు కూడా సాధించాడు. అయ్యర్ ఇదే ఫామ్ కొనసాగిస్తే.. టీమిండియాకు సరైన ఆల్‌రౌండర్ దొరికినట్టే. అంతే కాకుండా జట్టులో హార్ధిక్ పాండ్యా స్ధానాన్ని భర్తీ చేసే ఆటగాడు దొరికేశాడని క్రికెట్ నిపుణులు, మాజీలు అభిపప్రాయపడుతున్నారు. ఇక గతేడాది న్యూజిలాండ్‌పై టీ20ల్లో భారత తరుపున అయ్యర్ అరంగేట్రం చేశాడు. చదవండి: Ind Vs Wi T20 Series- Pollard: అతడు వరల్డ్ క్లాస్ ప్లేయర్.. అందరూ తనను చూసి నేర్చుకోవాలి: పొలార్డ్ -
T20 WC 2022: హార్దిక్ పాండ్యా పని అయిపోయింది! ప్రపంచకప్ జట్టులో అతడికి చోటు ఖాయం!
‘‘నిజానికి అతడిని ఓపెనర్‌గా చూశాం. కానీ అనూహ్యంగా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం చూసి ఆశ్చర్యపోయాను. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలోనైనా సరే అతడు ఆడుతున్న తీరు, ఫినిష్ చేస్తున్న విధానం అత్యద్భుతం. అంతేనా.. మెరుగ్గా బౌలింగ్ చేస్తూ అవసరమైన సమయంలో ముఖ్యమైన వికెట్లు కూడా పడగొడుతున్నాడు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. భారత యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. కచ్చితంగా ప్రపంచకప్ జట్టులో అతడు స్థానం సంపాదించుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో వెంకటేశ్ అయ్యర్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. కోల్‌కతా వేదికగా జరిగినన మూడు మ్యాచ్‌లలో కలిసి 92 పరుగులు చేశాడు. చివరి రెండు మ్యాచ్‌లలో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగిన అతడు 24, 35 పరుగులతో అజేయంగా నిలిచాడు. బౌలర్‌గానూ మెరుగ్గా రాణించాడు. ముఖ్యంగా మూడో మ్యాచ్‌లో 2.1 ఓవర్లు బౌలింగ్ వేసిన వెంకటేశ్... ముఖ్యమైన 2 వికెట్లు పడగొట్టాడు. విండీస్ కెప్టెన్ పొలార్డ్, జేసన్ హోల్డర్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ... వెంకటేశ్ అయ్యర్ ప్రదర్శనను కొనియాడాడు. అదే విధంగా సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానాన్ని అతడు భర్తీ చేస్తాడని, రానున్న ఐసీసీ మెగా ఈవెంట్లలో జట్టులో స్థానం పొందే విషయంలో పాండ్యా కంటే ఓ అడుగు ముందే ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు... ‘‘ప్రస్తుత ఫామ్‌ను చూస్తుంటే హార్దిక్ పాండ్యా కంటే వెంకటేశ్ అయ్యర్ చాలా మెరుగ్గా ఉన్నాడు. హార్దిక్ బౌలింగ్ చేస్తాడో లేదో ఇప్పుడే చెప్పలేం. ఐపీఎల్లో రాణించడం ఇప్పుడు అతడి అత్యంత కీలకం. ఏదేమైనా టీ20 ప్రపంచకప్ రేసులో మాత్రం వెంకటేశ్ హార్దిక్ కంటే ముందే ఉంటాడు’’ అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. చదవండి: Ind Vs Wi T20 Series- Pollard: అతడు వరల్డ్ క్లాస్ ప్లేయర్.. అందరూ తనను చూసి నేర్చుకోవాలి: పొలార్డ్ -
Ind Vs Wi 3rd T20: వాళ్లు జట్టులో లేకున్నా గెలిచాం.. సంతోషం: రోహిత్ శర్మ
ఆఖర్లో ఉత్కంఠ రేపిన మూడో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయం పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేసి గెలుపొందడం సంతోషాన్నిచ్చిందన్నాడు. కీలక ఆటగాళ్లు లేకుండానే విండీస్ వంటి జట్టుపై ఆధిపత్యం కనబరచడం మామూలు విషయం కాదని, జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. ఆఖరి నామమాత్రపు ఆఖరి టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ వంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే టీమిండియా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్.. ఇషాన్ కిషన్‌కు జోడీగా ఓపెనింగ్ చేయగా... శ్రేయస్ అయ్యర్ వన్‌డౌన్‌లో వచ్చాడు. రోహిత్ శర్మ నాలుగు, సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చారు. ఇక ఆరో స్థానంలో బరిలోకి దిగిన వెంకటేశ్ అయ్యర్ 35 పరుగులతో అజేయంగా నిలవడమే గాకుండా... ఛేదనలో 2 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. హర్షల్ పటేల్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్ సైతం అద్భుతంగా రాణించడంతో భారత్ గెలుపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో విజయానంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... ‘‘లక్ష్య ఛేదనలో విజయవంతమైన జట్టులో భాగమైన చాలా మంది ఆటగాళ్లు లేకుండా మేము బరిలోకి దిగాం. మిడిలార్డర్లో మార్పులు చేశాం. వ్యూహాలను పక్కాగా అమలు చేశాం. యువ జట్టుతో లక్ష్యాన్ని ఛేదించడం సంతోషకరం. ఒత్తిడిలోనూ బౌలర్లు రాణించిన విధానం ప్రశంసనీయం. విండీస్ లాంటి బలమైన జట్టుపై సమష్టి ప్రదర్శనతో విజయం సాధించడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు. మూడో టీ20- స్కోర్లు: టీమిండియా- 184/5 (20) వెస్టిండీస్- 167/9 (20) చదవండి: Rahul Dravid-Wriddhiman Saha: సాహా వ్యాఖ్యలపై స్పందించిన ద్రవిడ్... అతడంటే నాకు గౌరవం ఉంది.. కానీ కాస్త.. 𝐓𝐇𝐀𝐓. 𝐖𝐈𝐍𝐍𝐈𝐍𝐆. 𝐅𝐄𝐄𝐋𝐈𝐍𝐆 ☺️ ☺️ What a performance this has been by the @ImRo45 -led #TeamIndia to complete the T20I series sweep! 🏆 👏#INDvWI | @Paytm pic.twitter.com/L04JzVL5Sm — BCCI (@BCCI) February 20, 2022 -
జోష్ మీదున్న టీమిండియాకు దెబ్బ.. రెండో టి20కి ఆ ఇద్దరు డౌటే!
India Vs West Indies 2nd T20: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో 6 వికెట్ల తేడాతో గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియాకు షాక్ తగిలే అవకాశం ఉంది.ఫీల్డింగ్ సమయంలో ఆల్‌రౌండర్లు దీపక్ చహర్, వెంకటేశ్ అయ్యర్లు గాయాల బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. రెండో టి20 మ్యాచ్‌కు వీరు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు టి20 సిరీస్ నుంచి ఔటైన సంగతి తెలిసిందే. వీరు కూడా దూరమైతే టీమిండియా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. చదవండి: సూర్య మాటకు కట్టుబడిన వెంకటేశ్ అయ్యర్.. వీడియో వైరల్ విషయంలోకి వెళితే.. విండీస్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో కెప్టెన్ పొలార్డ్ స్వ్కేర్‌లెగ్ దిశగా ఆడాడు. బంతిని ఆపే ప్రయత్నంలో చహర్ కుడిచేతికి గాయమయింది. దీంతో తన కోటా ఓవర్లు పూర్తి కాకుండానే డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లిపోయాడు. మూడు ఓవర్లు వేసిన చహర్ 28 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. చహర్ మిగిలిన ఓవర్‌ను హర్షల్ పటేల్ పూర్తి చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు అవకాశం రాలేదు. అయితే గాయం తీవ్రతను బట్టి చహర్ రెండో వన్డే ఆడేది లేనిది తెలుస్తుంది. ఇక మరో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కూడా ఫీల్డింగ్ సమయంలో గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో పొలార్డ్ కొట్టిన షాట్‌ను ఆపే క్రమంలో జారిపడడంతో అయ్యర్ కుడిచేతికి గాయం అయింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ 13 బంతుల్లో 24 పరుగులు చేసి టీమిండియాకు విజయం అందించాడు. కాగా వీరిద్దరికి స్కానింగ్ నిర్వహించి.. వచ్చే ఫలితాలను బట్టి రెండో టి20కి అందుబాటులో ఉంటారా.. దూరమవుతారా అనేది ఆసక్తిగా మారింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ ఫిబ్రవరి 18న ఈడెన్ గార్డెన్స్ వేదికగానే జరగనుంది. చదవండి: అరంగేట్రంలో రవి బిష్ణోయి రికార్డు.. కల నిజమైంది.. కానీ ఇది అస్సలు ఊహించలేదు! -
సూర్య మాటకు కట్టుబడిన వెంకటేశ్ అయ్యర్.. వీడియో వైరల్
వెస్టిండీస్‌తో తొలి టి20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచి భోణీ కొట్టింది. సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్లు కడదాకా నిలిచి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ(40), ఇషాన్ కిషన్(35) శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన కోహ్లి(17 పరుగులు) చేసి ఔటయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కీపర్ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాలని భావించాడు. కానీ పంత్ నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకోవడంతో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయింది. చదవండి: బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్' అని అపవాదు.. ఇప్పుడది పటాపంచలు ఈ దశలో యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. వెంటనే సూర్యకుమార్.. అయ్యర్‌తో.. ''వెంకీ మనం మ్యాచ్ గెలవాలి.. జాగ్రత్తగా ఆడు'' అని చెప్పడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. సూర్య మాటకు వెంకటేశ్ అయ్యర్ కట్టుబడి ఆడాడు. చివరి వరకు నిలబడిన అయ్యర్ 13 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 24 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఇక సూర్యకుమార్ (18 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 34 పరుగులు నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చదవండి: రోహిత్ ఆగ్రహానికి గురైన రవి బిష్ణోయ్.. తొలి మ్యాచ్ కదా వదిలేయ్ అంతకముందు బౌలింగ్‌లో రవి బిష్ణోయ్ మెరిశాడు. తన తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేసిన బిష్ణోయ్.. 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అతనికి తోడు మిగతా బౌలర్లు రాణించడంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (43 బంతుల్లో 61,4 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. .@surya_14kumar and Venkatesh Iyer take #TeamIndia home with a 6-wicket win in the 1st T20I. Scorecard - https://t.co/dSGcIkX1sx #INDvWI @Paytm pic.twitter.com/jfrJo0fsR3 — BCCI (@BCCI) February 16, 2022 pic.twitter.com/aq54dBrDtN — Sports Hustle (@SportsHustle3) February 16, 2022 -
వెంకటేశ్ అయ్యర్‌కు అంత సీన్ లేదు.. గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు
Gautam Gambhir Comments On Venkatesh Iyer: టీమిండియా యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌పై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వెంకటేశ్ అయ్యర్‌కు వన్డే క్రికెట్ ఆడే మెచ్యూరిటీ లేదని, అలాంటి ఆటగాడిని కేవలం నాలుగు, ఐదు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో రాణించాడని టీమిండియాకు ఎంపిక చేస్తే ఇలాగే ఉంటుందని ఫైరాయ్యాడు. దక్షిణాఫ్రికాతో తొలి రెండు వన్డేల్లో వెంకటేశ్ అయ్యర్ ఆశించిన మేరకు రాణించకపోగా.. అతని స్థానం టీమిండియా గెలుపు అవకాశాలను ప్రభావితం చేసిందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. వెంకటేశ్ అయ్యర్ ఆటతీరును చూస్తే వన్డే క్రికెట్ ఆడేంత సీన్ లేదని స్పష్టంగా తెలుస్తుందని, అతన్ని వన్డే జట్టు నుంచి తప్పించి, టీ20 జట్టులో అవకాశం ఇచ్చి చూడాలని సెలెక్టర్లకు సూచించాడు. అలాగే అతన్ని వాడుకోవడంలో జట్టు కెప్టెన్ సైతం పూర్తిగా విఫలమయ్యాడని.. ఓపెనర్‌గా, ఆల్‌రౌండర్‌గా రాణించిన ఆటగాడిని కేవలం మిడిలార్డర్ బ్యాటర్‌గా ఎలా పరిగణిస్తారని, ఇది జట్టు కెప్టెన్ అనాలోచిత నిర్ణయమని ధ్వజమెత్తాడు. మరోవైపు, ఐపీఎల్ అనేది టీమిండియాకు ఎంట్రీ ప్లాట్‌ఫామ్ కాదని, డబ్బులు తీసుకున్నప్పుడు ఫ్రాంచైజీకి పెర్ఫార్మ్ చేయాలనే ప్రతి ఆటగాడు ఆలోచించాలని, తాను ఐపీఎల్ ఆడే రోజుల్లో సహచర్లుకు ఇదే విషయాన్ని చెప్పేవాడినని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. కాగా, వెంకటేశ్ అయ్యర్ గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ తరఫున 10 ఇన్నింగ్స్‌ల్లో 370 పరుగులు చేసి ఆ జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో పాటు ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫిలోనూ రాణించిన కారణంగా బీసీసీఐ అతన్ని టీమిండియాకు ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికాతో రెండు వన్డేల్లో అతను కేవలం 24 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. చదవండి: ఐపీఎల్ 2022ను మా దేశంలో నిర్వహించండి.. ఇక్కడైతే ఖర్చులు చాలా తక్కువ..! -
అతడిని తుది జట్టు నుంచి తప్పించడంలో అర్థం లేదు... అసలేంటి ఇదంతా?
Ind vs Sa 3rd ODI: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డే నుంచి యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్‌ను తప్పించడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. అతడికి తుది జట్టులో చోటు కల్పించకపోవడం తనను విస్మయానికి గురిచేసిందన్నాడు. కేవలం రెండు అవకాశాలు మాత్రమే ఇచ్చి తన ప్రతిభ గురించి అంచనాకు రావడం సరికాదని పేర్కొన్నాడు. కాగా టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో వెంకటేశ్ అయ్యర్ తొలిసారిగా వన్డే జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పర్ల్ వేదికగా సాగిన మొదటి మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. కానీ రెండు పరుగులకే అవుట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. ఇక రెండో వన్డేలో 22 పరుగులు చేసిన ఈ యువ ఆల్‌రౌండర్ ... 5 ఓవర్లు బౌలింగ్ చేసి 28 పరుగులు ఇచ్చాడు. ఇక తొలి రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా పరాజయం పాలై... సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నామమాత్రపు ఆఖరి వన్డేలో వెంకటేశ్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ‘‘మూడో వన్డేలో వెంకటేశ్ అయ్యర్ లేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇలా చేయడంలో ఏమాత్రం అర్థం లేదు. రెండుసార్లు ఆడించారు. అందులో ఒకసారి బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చారు. ఆ తదుపరి మ్యాచ్‌కే తప్పించేశారు. అంతేనా ఇక? ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగారు. అయ్యర్‌ను తప్పించడం అస్సలు సరికాదు’’ అని మండిపడ్డాడు. కాగా ఆతిథ్య దక్షిణాఫ్రికా 2-1 తేడాతో టెస్టు సిరీస్, 2-0 తేడాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడో వన్డేలోనూ విజయం సాధించి వైట్‌వాష్ చేయాలని భావిస్తుండగా... కనీసం ఒక్క వన్డే అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని రాహుల్ బృందం ఆరాటపడుతోంది. ఈ క్రమంలో ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. సూర్యకుమార్ యాదవ్‌తో పాటు జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చహర్ తుదిజట్టులోకి వచ్చారు. చదవండి: IND Vs SA: కేఎల్ రాహుల్ సూపర్ త్రో.. బవుమా రనౌట్ -
Ind Vs Sa: ధావన్‌కు రెస్ట్.. వెంకటేశ్‌తో ఓపెనింగ్.. భువీ వద్దు.. అతడే కరెక్ట్!
Ind Vs Sa 3rd Final ODI: చరిత్ర సృష్టించాలన్న పట్టుదలతో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియాకు టెస్టు సిరీస్ ఘోర పరాభవమే మిగిల్చింది. కనీసం వన్డే సిరీస్ సొంతం చేసుకుని ఆ లోటు తీర్చుకుందామని భావిస్తే అందులోనూ భంగపాటే. దీంతో ప్రొటిస్ జట్టుతో జరుగనున్న నామమాత్రపు మూడో వన్డేకు రాహుల్ సేన సిద్ధమవుతోంది. ఆదివారం నాటి ఆఖరి మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ భారీ మార్పులతో బరిలోకి దిగితేనే ఫలితం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా మరికొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు సంజయ్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ... ‘‘శిఖర్ ధావన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. తను రెడీమేడ్ ఆప్షన్. ఎప్పుడు కావాలంటే అప్పుడు సిద్ధంగా ఉంటాడు. అయితే, తన స్థానంలో అలాంటి మరో ఆటగాడిని తయారుచేసుకోవాలి కదా. కాబట్టి ధావన్‌కు విశ్రాంతినిచ్చి వెంకటేశ్ అయ్యర్‌ను ఓపెనర్‌గా దింపితే బాగుంటుంది. కాబట్టి మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్‌ను చేర్చుకోవచ్చు. ఇక బౌలర్ల విషయానికొస్తే.... భువనేశ్వర్ కుమార్ స్థానంలో దీపక్ చహర్‌ను తీసుకోవాలి. శ్రీలంకలో అతడి బౌలింగ్‌ను చూశాం. మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఇక జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని భావిస్తే... సిరాజ్ లేదంటే ప్రసిద్‌కృష్ణను ఎంపిక చేసుకోవాలి. అశ్విన్‌ను పక్కనపెట్టి జయంత్ యాదవ్‌ను తీసుకోవాలి. తను 10 ఓవర్లు బౌల్ చేయగలడు. బ్యాటింగ్ కూడా చేస్తాడు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: SA vs IND: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. విరాట్ కోహ్లి దూరం! -
'బులెట్ వేగం'తో మార్క్రమ్ను దెబ్బకొట్టిన వెంకటేశ్ అయ్యర్
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా డెబ్యూ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ సూపర్ త్రోతో మెరిశాడు. అతని దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఎయిడెన్ మార్ర్కమ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ నాలుగో బంతిని మార్క్రమ్ మిడాఫ్ దిశగా ఆడాడు. రిస్క్ అని తెలిసినప్పటికి బవుమాకు సింగిల్‌కు కాల్ ఇచ్చాడు. దీంతో మార్ర్కమ్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోకి చేరుకునేలోపే వెంకటేశ్ అయ్యర్ బంతిని అందుకొని డైరెక్ట్ త్రో వేశాడు. క్రీజుకు కొన్ని ఇంచుల దూరంలో మార్క్రమ్ ఉండగా.. అప్పటికే బంతి వికెట్లను గిరాటేయడం బిగ్స్క్రీన్పై కనిపించింది. ఇంకేముంది మార్క్రమ్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. చదవండి: డబుల్ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన బౌలర్ ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన టెస్టు సిరీస్‌లో మార్క్రమ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మూడు టెస్టులు కలిపి కేవలం 76 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే తొలి వన్డేలో 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయినప్పుడు క్రీజులోకి వచ్చిన మార్క్రమ్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. రిస్క్ అని తెలిసినా అనవసర పరుగుకు యత్నించి చేజేతులా మార్క్రమ్ రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. చదవండి: కోహ్లి భయ్యా.. నేనెవరి వికెట్ తీయాలో చెప్పవా?: చహల్ భావోద్వేగం Aiden Markram wicket !! #SAvsIND #venkateshiyer pic.twitter.com/H3RlkwZHEl — Jalaluddin Sarkar (Thackeray) 🇮🇳 (@JalaluddinSark8) January 19, 2022 -
సరిపోని ధావన్, కోహ్లి, శార్దూల్ మెరుపులు.. తొలి వన్డేలో ఓటమి
IND vs SA 1st ODI: సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేయగలిగింది. శిఖర్ ధావన్(75), విరాట్ కోహ్లి(51), శార్ధూల్ ఠాకూర్(50 నాటౌట్) రాణించినప్పటికి వారి మెరుపులు సరిపోలేదు. దీనికి తోడూ మిగతా బ్యాట్స్‌మన్ విఫలం కావడంతో టీమిండియా పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, తబ్రైజ్ షంసీ, ఆండీ ఫెలుక్యావో తలా రెండు వికెట్లు తీశారు. ఇక రెండో వన్డే శుక్రవారం జరగనుంది. అంతకముందు టాస్ గెలిచి సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్వింటన్ డికాక్, జానెమన్ మలన్‌లు నిరాశపరిచారు. తర్వాత వచ్చిన డికాక్ 27 పరుగులు చేసి ఔటయ్యాడు.ఒక దశలో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికాని కెప్టెన్ బావుమా 143 బంతుల్లో 8 ఫోర్లతో సహాయంతో 110 పరుగులు చేశాడు. వాండర్ డస్సెన్ 96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 129 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరు సెంచరీలతో చెలరేగడంతో నాలుగో వికెట్‌కి 204 రికార్డు పరుగుల భాగస్వామ్యం నమోదైంది. వీరిద్దరి మెరుపులతో సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ సాధించారు. 8: 57 PM: ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా టీమిండియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. కేవలం 7 పరుగుల వ్యవధిలో ముగ్గురు బ్యాటర్లు పెవిలియన్‌కు చేరారు. 181 పరుగుల వద్ద అయ్యర్, పంత్ ఔట్ కాగా, 188 పరుగుల స్కోర్ వద్ద అరంగేట్రం ఆటగాడు వెంకటేశ్ అయ్యర్(7 బంతుల్లో 2) ఔటయ్యాడు. దీంతో అప్పటి దాకా విజయం దిశగా సాగిన టీమిండియా ఓటమి బాట పట్టింది. 36 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 188/6. క్రీజ్‌లో అశ్విన్(4), శార్ధూల్ ఠాకూర్ ఉన్నారు. 8: 46 PM: తడబడుతున్న భారత్.. 181 పరుగులకే సగం వికెట్లు డౌన్ నిలకడగా ఆడుతూ విజయం దిశగా సాగుతున్న టీమిండియాకు వరుస షాక్‌లు తగిలాయి. మూడు బంతుల వ్యవధిలో శ్రేయస్ అయ్యర్(17), పంత్(16)లు ఔటయ్యారు. తొలుత 33.5వ ఓవర్లో 181 పరుగుల వద్ద ఎంగిడి బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ పెవిలియన్‌కు చేరగా... అదే స్కోర్ వద్ద మరుసటి ఓవర్ తొలి బంతికే పంత్.. ఫెలుక్వాయో బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి స్టంప్ అవుటయ్యాడు. దీంతో సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. 8:16 PM: టీమిండియా మూడో వికెట్ డౌన్.. కోహ్లి(51) ఔట్ రెండేళ్లకుపైగా ఉన్న శతక దాహాన్ని ఈ మ్యాచ్‌లో ఎలాగైనా తీర్చుకుంటాడని భావించిన కోహ్లి(51).. హాఫ్ సెంచరీ మార్కు దాటగానే ఔటయ్యాడు. షంషి బౌలింగ్‌లో బవుమాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా టీమిండియా 152 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో పంత్(4), అయ్యర్ ఉన్నారు. 8:02 PM: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా సెట్ బ్యాటర్ శిఖర్ ధవన్ ఔటయ్యాడు. 84 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 79 పరుగులు చేసిన గబ్బర్.. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా టీమిండియా 138 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 26 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 140/2గా ఉంది. క్రీజ్‌లో కోహ్లి(44), పంత్(1) ఉన్నారు. 7:15 PM: గబ్బర్ హాఫ్ సెంచరీ.. నిలకడగా టీమిండియా చాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన శిఖర్ ధవన్(55 బంతుల్లో 54; 8 ఫోర్లు).. తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. సమయోచితంగా ఆడుతూ అర్ధ శతకం సాధించాడు. ఫలితంగా టీమిండియా 15 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజ్‌లో గబ్బర్‌కు తోడుగా విరాట్ కోహ్లి(18 బంతుల్లో 13; ఫోర్) ఉన్నాడు. 07:02 PM: 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన ఓపెనర్ రాహుల్ మార్క్రమ్ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 46 పరుగులతో ఆడుతుంది. 06:02 PM: టాస్ గెలిచి సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్వింటన్ డికాక్, జానెమన్ మలన్‌లు నిరాశపరిచారు. తర్వాత వచ్చిన డికాక్ 27 పరుగులు చేసి ఔటయ్యాడు.ఒక దశలో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికాని కెప్టెన్ బావుమా 143 బంతుల్లో 8 ఫోర్లతో సహాయంతో 110 పరుగులు చేశాడు. వాండర్ డస్సెన్ 96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 129 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరు సెంచరీలతో చెలరేగడంతో నాలుగో వికెట్‌కి 204 రికార్డు పరుగుల భాగస్వామ్యం నమోదైంది. వీరిద్దరి మెరుపులతో సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ సాధించారు. 5: 43 PM: IND vs SA 1st ODI: నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 110 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బవుమా ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 48.1 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 272/4గా ఉంది. క్రీజ్‌లో డస్సెన్(86 బంతుల్లో 109), మిల్లర్ ఉన్నారు. 5: 21 PM: బవుమా శతకం, డస్సెన్ విధ్వంసం.. భారీ స్కోర్ దిశగా దక్షిణాఫ్రికా సఫారీ కెప్టెన్ టెంబా బవుమా(133 బంతుల్లో 100; 7 ఫోర్లు) కెరీర్లో రెండో శతకాన్ని నమోదు చేశాడు. మరో ఎండ్‌లో డస్సెన్(77 బంతుల్లో 93; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టిస్తూ సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 45 ఓవర్ల తర్వాత 3 నష్టానికి 245 పరుగులు చేసింది. బవుమా- డస్సెన్ జోడీ నాలుగో వికెట్‌కు 177 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేసి, జట్టును భారీ స్కోర్ దిశగా నడిపిస్తుంది. 4: 42 PM: బవుమా, డస్సెన్ అర్ధ శతకాలు.. దక్షిణాఫ్రికా స్కోర్ 175/3 68 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను కెప్టెన్ బవుమా(101 బంతుల్లో 78; 7 ఫోర్లు), డస్సెన్(49 బంతుల్లో 54; 4 ఫోర్లు, సిక్స్) అర్ధ శతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 100 పరుగులకు పైగా జోడించి జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. 35 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 181/3గా ఉంది. 3: 24 PM: మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. 68 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. వెంకటేశ్ అయ్యర్ కళ్లు చెదిరే త్రోతో మార్క్రమ్(11 బంతుల్లో 4)ను రనౌట్ చేశాడు. క్రీజ్‌లో బవుమా(23), డస్సెన్ ఉన్నారు. డికాక్ క్లీన్ బౌల్డ్ డ్రింక్స్ అనంతరం తొలి బంతికి సఫారీ జట్టుకు భారీ షాక్ తగిలింది. క్రీజ్‌లో కుదురుకుంటున్న స్టార్ ప్లేయర్ డికాక్ (41 బంతుల్లో 27; 2 ఫోర్లు)ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో బవుమా(17), మార్క్రమ్ ఉన్నారు. 2: 21 PM: తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా ►బుమ్రా బౌలింగ్‌లో మలన్.. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. టీమిండియా పేసు గుర్రం అద్భుత అవుట్స్వింగర్కు బలైపోయి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు: 19/1 (4.2). 2: 01 PM: దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్వింటన్ డికాక్, జానేమన్ మలన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. 1: 35 PM: టీమిండియాతో స్వదేశంలో జరుగుతున్న మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. బ్యాటింగ్ ఎంచుకుని రాహుల్ సేనను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. ఇక టీమిండియా యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని కెప్టెన్ కేఎల్ రాహుల్ ధ్రువీకరించాడు. కాగా కేఎల్ రాహుల్‌కు వన్డే కెప్టెన్‌గా ఇదే తొలి అవకాశం. తుది జట్లు: టీమిండియా: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్. దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, జానేమన్ మలన్, ఎయిడెన్ మార్కరమ్, రసీ వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లూక్వాయో, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షంషీ, లుంగి ఎంగిడి. చదవండి: Ind Vs Sa ODIs: కోహ్లి భయ్యా.. నేనెవరి వికెట్ తీయాలో చెప్పవా?: చహల్ భావోద్వేగం -
ధావన్‌కు షాక్... ఓపెనర్‌గా వెంకటేశ్ అయ్యర్!
Ind Vs Sa 1st ODI: సఫారీ గడ్డపై వన్డే పోరుకు టీమిండియా సిద్ధమవుతోంది. గత పర్యటన తాలూకు ఫలితాలు పునరావృతం చేసి దక్షిణాఫ్రికాపై విజయం సాధించాలనే ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా సిరీస్‌కు దూరం కావడంతో కేఎల్ రాహుల్ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. సారథిగా రాహుల్‌కు ఇదే తొలి వన్డే. మరోవైపు సుదీర్ఘ కాలం తర్వాత కెప్టెన్ అన్న ట్యాగ్ లేకుండా విరాట్ కోహ్లి బరిలోకి దిగడం ఇదే తొలిసారి. దీంతో పర్ల్ వేదికగా జరుగనున్న మొదటి వన్డే మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో క్రీడా విశ్లేషకులు తుది జట్టు కూర్పుపై అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా ఓపెనింగ్ జోడీ ఎవరన్న అంశంపై చర్చిస్తున్నారు. ఇక మీడియాతో మాట్లాడిన రాహుల్.. రోహిత్ గైర్హాజరీలో తాను ఓపెనింగ్ చేయడం ఖాయమని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్... రాహుల్‌కు జోడీగా శిఖర్ ధావన్‌ను ఎంచుకున్నాడు. అయితే, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మాత్రం వెంకటేశ్ అయ్యర్‌కు అవకాశం ఇచ్చాడు. జట్టులో ఆరుగురు బౌలర్లు ఉంటే బాగుంటుందని సూచించాడు. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన అతడు... ‘‘శిఖర్ ధావన్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వాలి. కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌తో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. ఏడోస్థానంలో జయంత్ యాదవ్ రావాలి. అశ్విన్ జట్టులోకి రావాలి’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా 2018 పర్యటనలో భాగంగా భారత్ 4-1 తేడాతో వన్డే సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి వన్డే- సంజయ్ మంజ్రేకర్ ఎంచుకున్న జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, జయంత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్). చదవండి: Ind Vs Sa 1st ODI: భారీ స్కోరుకు అవకాశం.. టాస్ గెలిస్తే... -
Venkatesh Iyer: వేలంలో రెండు రౌండ్లపాటు నన్ను ఎవరూ పట్టించుకోలేదు.. ఆ తర్వాత
Venkatesh Iyer Comments: ‘‘గతేడాది ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించాను. ఏ జట్టుకు ఆడినా గెలుపునకై నా వంతు కృషి చేస్తాను. ఈ క్రమంలోనే కేకేఆర్ నన్ను వేలంలో కొనుగోలు చేసింది. నిజానికి రెండు రౌండ్ల పాటు నేను అన్‌సోల్డ్(కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపలేదు)గా మిగిలిపోయాను. చివరి రౌండ్లో కేకేఆర్ నన్ను కొనుగోలు చేసింది. వారికి నా ధన్యవాదాలు. ఒకవేళ కేకేఆర్ నన్ను ఎంచుకుని ఉండకపోతే.. నేను ఇక్కడ ఉండేవాడినే కాదు’’ అని టీమిండియా యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ గతాన్ని నెమరువేసుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ మినీ వేలం-2021లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ వెంకటేశ్‌ను కొన్న సంగతి తెలిసిందే. 20 లక్షల రూపాయలు వెచ్చింది అతడిని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో యూఏఈ వేదికగా జరిగిన రెండో అంచెలో వెంకటేశ్ అత్యద్భుతంగా రాణించాడు. 10 ఇన్నింగ్స్ ఆడిన ఈ ఓపెనర్ 370 పరుగులు సాధించాడు. అంతేకాదు కేకేఆర్ అనూహ్యంగా పుంజుకుని ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో దేశవాళీ టీ20 టోర్నీ, ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా అతడు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ సిరీస్‌తో టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టీమిండియా పర్యటన నేపథ్యంలో తొలిసారిగా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇలా అతడి దశ తిరిగిపోయింది. ఈ నేపథ్యంలో జర్నలిస్టు బోరియా మజుందార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేశ్ తన కెరీర్‌లోని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘ఒక్కసారి కేకేఆర్ క్యాంపులో అడుగుపెట్టిన తర్వాత.. నాకంటూ ఓ గుర్తింపు వచ్చిందనుకున్నా. నా జీవితానికి సంబంధించి ఇదో కీలక మలుపు. మొదటి దశలో అవకాశం రాలేదు. అయినా కేకేఆర్ యాజమాన్యం నాపై నమ్మకం ఉంచింది. యూఏఈలో ఆడే అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 20- 30 ఏళ్ల తర్వాత కూడా చెప్పుకోదగ్గ స్టోరీ ఇది. నిజంగా నా జీవితంలో ఇదెంతో ప్రత్యేకమైనది’’ అని కేకేఆర్ ఫ్రాంఛైజీ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో భాగంగా కోల్‌కతా అయ్యర్‌ను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఏకంగా 8 కోట్లు ఖర్చు చేసింది. చదవండి: WTC Points Table: దక్షిణాఫ్రికా చేతిలో పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియాకు మరో షాక్.. Virat Kohli: ఆ కారణంగానే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా..! Enjoyed speaking to @venkateshiyer Love his attitude. Wants to matches for India and isn't satisfied with just being there. That's what matters. @KKRiders YT link https://t.co/8p4DgbZckR Congrats to him on 50 over selection and wish you all a safe and healthy 2022. pic.twitter.com/8308liOBRE — Boria Majumdar (@BoriaMajumdar) January 1, 2022 -
Ind Vs Sa: నెట్స్‌లో చెమటోడుస్తున్న టీమిండియా ఆటగాళ్లు..
Ind Vs Sa ODI Series: టెస్టు సిరీస్‌లో పరాజయంతో టీమిండియాకు నిరాశే మిగిలింది. దక్షిణాఫ్రికా గడ్డపై ట్రోఫీని ముద్దాడాలన్న కల తీరాలంటే మరో సిరీస్ వరకు వేచిచూడాల్సిందే. ఏదేమైనా గతం గతః... ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలి. ఇదిలా ఉండగా... జనవరి 19 నుంచి ఆరంభం కానున్న వన్డే సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకున్న వన్డే జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఓవైపు శుక్రవారం... టెస్టు స్పెషలిస్టులు మూడో టెస్టు నాలుగో రోజు ఆటతో బిజీగా ఉంటే... వన్డే ఆటగాళ్లు ప్రాక్టీసు చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తూ... మొదటి రోజు.. బాయ్స్‌తో కఠినమైన శిక్షణ అంటూ క్యాప్షన్ జతచేశాడు. భువనేశ్వర్ కుమార్, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, ప్రసిద్ క్రిష్ణ, వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చాహల్ తదితరులు ధావన్‌తో కలిసి ఫొటోకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. కాగా వన్డే సిరీస్‌లో భాగంగా... జనవరి 19, 21, 23 తేదీల్లో మూడు మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. ఇక 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్‌లో ఓడినప్పటికీ.. పడిలేచిన కెరటంలా కోహ్లి సేన వన్డే సిరీస్‌లో భారీ విజయం(4-1) సాధించి సత్తా చాటింది. మరి... ఈసారి కేఎల్ రాహుల్ సారథ్యంలోని జట్టు ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. కాగా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో ప్రొటిస్‌తో వన్డే సిరీస్‌కు రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, యజువేంద్ర చాహల్, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, ప్రసిద్ క్రిష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, నవదీప్ సైనీ. Training Day 1 ✅ Strong session with the boys 👍🇮🇳 pic.twitter.com/TT027kSR1t — Shikhar Dhawan (@SDhawan25) January 14, 2022 Gabbar in nets 🏏 pic.twitter.com/i61HaF9QPA — Himalayan Guy (@RealHimalayaGuy) January 15, 2022 -
"బౌన్స్ పిచ్‌లపై ఆడటానికి సిద్ధంగా ఉన్నా"
టీమిండియా యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. దక్షిణాప్రికాతో వన్డే సిరీస్‌కు అయ్యర్‌ని బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫి, విజయ్ హాజరే ట్రోఫిలో అయ్యర్ అద్భుతంగా రాణించాడు. ఇక టీ20ల్లో భారత తరుపున అరంగేట్రం చేసిన అయ్యర్.. మూడు మ్యాచ్‌ల్లో 36 పరుగులుతోపాటు, మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. కాగా భారత వన్డే జట్టులో చోటు దక్కడం పట్ల అయ్యర్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలో రానున్న దక్షిణాప్రికా పర్యటనలో మరోసారి తనుఎంటో నిరూపించుకోవడానికి అయ్యర్ సిద్దం అవుతున్నాడు. ఇక భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకూడదని, రిలాక్స్‌గా ఉండాలని అయ్యర్ తెలిపాడు. "నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటాను. దక్షిణాప్రికా పిచ్‌లు ఎక్కువగా బౌన్స్‌కు అనుకులస్తాయి. బౌన్స్ పిచ్‌లపై ఒక బౌలర్, ఫీల్డర్, బ్యాటర్‌గా నా పాత్రను ఎలా నిర్వహించాలో నేను అన్ని విధాల సన్నద్దం అవుతున్నాను. నేను దక్షిణాఫ్రికాకు చేరుకున్న వెంటనే ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటాను. ప్రస్తుతం నా దృష్టి అంతా దక్షిణాఫ్రికా పర్యటనపైనే ఉంది" అని అయ్యర్ పేర్కొన్నాడు. ఇక భారత్- దక్షిణాప్రికా మధ్య తొలి వన్డే జనవరి 19న ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), చహల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా(వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ -
విజయ్ హజారే ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్ లక్ష్యంగా...
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో నాకౌట్ సమరానికి వేళయింది. లీగ్ దశలో ప్రతి గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన ఐదు జట్లు (విదర్భ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్తాన్)... ప్లేట్ గ్రూప్ టాపర్ త్రిపుర మధ్య నేడు మూడు ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో త్రిపురతో విదర్భ... రెండో మ్యాచ్‌లో కర్ణాటకతో రాజస్తాన్... మూడో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌తో ఉత్తర్‌ప్రదేశ్ ఆడతాయి. విజేత జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుతాయి. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన వెంకటేశ్ అయ్యర్ మధ్యప్రదేశ్ తరఫున ఆడనున్నాడు. లీగ్ దశలో గ్రూప్ టాపర్లుగా నిలిచిన హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, సౌరాష్ట్ర, కేరళ, సర్వీసెస్ జట్లు నేరుగా క్వార్టర్స్ చేరుకున్నాయి. -
"హార్ధిక్ పాండ్యా స్ధానాన్ని భర్తీ చేసే ఆటగాడు దొరికేశాడు"
టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా గత కొద్ది కాలంగా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్-2021లో హార్ధిక్ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్యా అతడి అంతర్జాతీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జట్టులో స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్‌గా ఉన్న హార్ధిక్ స్ధానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్న అందరిలో మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా యువ ఆల్‌రౌండర్ వెంకేటేశ్ అయ్యర్ పేరును భారత మాజీ ఆటగాడు సబా కరీం తెరపైకి తీసుకొచ్చాడు. జట్టులో హార్ధిక్ స్ధానాన్ని భర్తీ చేసే సత్తా అయ్యర్‌కు ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. విజయ్ హాజారే ట్రోఫీలో వెంకేటేశ్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్నాడని అతడు కొనియాడాడు. అదే విధంగా రోహిత్ శర్మ, రాహుల్‌కు బ్యాకప్ ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేయాలని అతడు సూచించాడు. "వైట్-బాల్ ఫార్మట్‌లో వెంకటేష్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ బారత సీనియర్ జట్టు జట్టులోకి ఎంపిక అవుతారని నేను భావిస్తున్నాను. 2023 ప్రపంచకప్ దృష్ట్యా ఈ ఇద్దరు ఆటగాళ్లు వీలైనంత త్వరగా జట్టులో భాగం కావాలి. రోహిత్ శర్మ, రాహుల్‌కు బ్యాకప్ ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం ఇవ్వాలి. మరోవైపు, విజయ్ హజారే ట్రోఫీలో 5 స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా స్థానంలో అయ్యర్ సరైన ఆటగాడు" అని కరీమ్ యూట్యాబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో వెంకటేశ్ అయ్యర్.. 112, 71, 151 పరుగులతో సత్తాచాటాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ కూడా హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసి నాలుగు మ్యాచ్‌ల్లోనే ఏకంగా 435 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. చదవండి: 6 Wickets In A Over: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒకే ఓవర్లో ఆరు వికెట్లు -
Venkatesh Iyer: శతక్కొట్టాక రజనీ స్టైల్లో ఇరగదీశాడు..
Rajinikanth Birthday: సూపర్ స్టార్ రజనీకాంత్ 71వ జన్మదినాన్ని(డిసెంబర్ 12) పురస్కరించుకుని టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఛాతీపై టాటూ వేసుకుని వినూత్న శైలిలో శుభాకాంక్షలు తెలుపగా.. ఐపీఎల్ 2021 స్టార్ వెంకటేశ్ అయ్యర్ తనదైన శైలిలో తలైవాకు బర్త్ డే విషెస్ చెప్పాడు. విజయ్ హజారే ట్రోఫీ 2021-22లో భాగంగా చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టిన(151) అయ్యర్.. ఆ ఫీట్‌ను సాధించగానే రజనీ స్టైల్లో సెల్యూట్ చేసి, గ్లాసెస్ పెట్టుకున్నట్లు ఇమిటేట్ చేశాడు. Our Sunday couldn't get any better! 😍 Can you decode @ivenkyiyer2512's celebration? 🤔#VijayHazareTrophy #MPvUTCA #KKR #AmiKKR #CricketTwitterpic.twitter.com/7wpLMKEJ44 — KolkataKnightRiders (@KKRiders) December 12, 2021 ఈ వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తమ ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, బాషా సినిమాలో రజనీ కళ్లద్దాలను స్టైల్ గా తిప్పుతూ పెట్టుకోవడం అందరికీ తెలిసిందే. ఇది రజనీకి ఐకానిక్ స్టైల్‌గా మారడమే కాకుండా.. సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ చేసింది. నేను తలైవా వీరాభిమానిననే.. వెంకటేశ్ అయ్యర్ రజనీకాంత్‌కు వీరాభిమాననంటూ గతంలో ఓ సందర్భంగా చెప్పాడు. తాను తలైవా భక్తుడినని.. ఆయన సినిమాలన్నీ తప్పక చూస్తానని.. రజనీ ఓ లెజెండ్ అని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా వెంకటేశ్ అయ్యర్ చెప్పాడు. ఇదిలా ఉంటే, విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వెంకటేశ్ అయ్యర్ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. తాజాగా చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ 113 బంతుల్లో 151 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో వెంకటేశ్ అయ్యర్‌కు భారత వన్డే జట్టు(దక్షిణాఫ్రికా పర్యటన) నుంచి పిలుపు రావడం ఖాయమని తెలుస్తోంది. చదవండి: టీమిండియా క్రికెటర్ ఛాతిపై రజనీకాంత్ టాటూ.. -
India tour of South Africa: వన్డే జట్టులోకి వెంకటేశ్ అయ్యర్!
టీమిండియా యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు మరో బంపరాఫర్ తగిలే అవకాశం ఉంది. దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వెంకటేశ్ అయ్యర్ దుమ్మురేపుతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీతో మెరిసిన అయ్యర్ తాజాగా నాలుగో మ్యాచ్‌లో మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు. చత్తీస్‌ఘర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ 133 బంతుల్లో 151 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. చదవండి: Vijay Hazare Trophy: రుతురాజ్ హ్యాట్రిక్ సెంచరీ.. దుమ్మురేపుతున్న మహారాష్ట్ర తాజా ప్రదర్శనతో వెంకటేశ్ అయ్యర్.. సౌతాఫ్రికా టూర్ నేపథ్యంలో బీసీసీఐ త్వరలో ఎంపిక చేయనున్న వన్డే టీమ్‌లో ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ ద్వారా టీమిండియాలో అడుగుపెట్టిన వెంకటేశ్ అయ్యర్ త్వరలో వన్డే జట్టులోనూ ఆడే అవకాశం లభించనుంది. ఒకవేళ వెంకటేశ్ అయ్యర్ దక్షిణాఫ్రికా టూర్‌కు ఎంపికై రాణిస్తే ఆల్‌రౌండర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్నట్లే. ఇక ఇటీవలీ కాలంలో వెంకటేశ్ అయ్యర్ ప్రదర్శన చూసుకుంటే.. ►ఐపీఎల్ 2021 సీజన్: 10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు, 3 వికెట్లు ►సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: 5 మ్యాచ్‌లు 155 పరుగులు.. 5 వికెట్లు ►ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టి20 సిరీస్: 3 మ్యాచ్‌ల్లో 36 పరుగులు.. 1 వికెట్ ►విజయ్ హజారే ట్రోఫీ: ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 348 పరుగులు.. 6 వికెట్లు 1⃣0⃣0⃣ up & going strong! 💪 💪@ivenkyiyer2512 continues his superb run of form. 👏 👏 #MPvUTCA #VijayHazareTrophy pic.twitter.com/iiow2ATC2n — BCCI Domestic (@BCCIdomestic) December 12, 2021 -
సెంచరీలతో చెలరేగిన రుతురాజ్, వెంకటేశ్ అయ్యర్
Ruturaj Gaikwad And Venkatesh Iyer Smash Centuries Vijay Hazare Trophy.. దేశవాలీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్లు దుమ్మురేపారు. కేరళతో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తరపున కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ మెరుపు సెంచరీతో ఆకట్టుకోగా.. మహారాష్ట్ర తరపున కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ సాధించి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఐపీఎల్ 2021 సీజన్లో రుతురాజ్ సీఎస్కే తరపున ఆడగా.. వెంకటేశ్ అయ్యర్ కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ లిస్ట్ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రుతురాజ్‌ను(రూ.6 కోట్లు) సీఎస్కే రిటైన్ చేసుకోగా.. వెంకటేశ్ అయ్యర్‌ను(రూ.8 కోట్లు) కేకేఆర్ తమ దగ్గరే అట్టిపెట్టుకుంది. చదవండి: Rohit Sharma: ఒకప్పుడు జట్టులో చోటే దక్కలేదు.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్.. త్వరలోనే టెస్టులకు కూడా! మ్యాచ్‌ల విషయానికి వస్తే.. మహారాష్ట్ర, చత్తీస్‌ఘర్ పోరులో.. తొలుత బ్యాటింగ్ చేసిన చత్తీస్‌ఘర్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మహారాష్ట్రను రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో నడించాఇ మ్యాచ్‌లో రుతురాజ్ 143 బంతుల్లో 154 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అతని దాటికి మహారాష్ట్ర 47 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. కాగా రుతురాజ్‌కు ఈ సీజన్లో రెండో సెంచరీ కావడం విశేషం. మరోవైపు కేరళతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మధ్య ప్రదేశ్ ఇన్నింగ్స్‌లో వెంకటేశ్ అయ్యర్(84 బంతుల్లో 112, 7 ఫోర్లు, 4 సిక్సర్లు), శుభమ్ శర్మ(67 బంతుల్లో 82, 9 ఫోర్లు, ఒక సిక్సర్) చెలరేగడంతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 329 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కేరళ 49.4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌట్ అయింది. చదవండి: Vijay Hazare Trophy: హైదరాబాద్‌కు వరుసగా రెండో విజయం.. ఆంధ్రకు మాత్రం -
IPL 2022: అయ్యరా మజాకా.. అప్పుడు 20 లక్షలు.. ఇప్పుడు 8 కోట్లు..!
IPL 2022 Retention: KKR Venkatesh Iyer Received 4000 Percent Hike In Salary: ఒక్కసారి క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోతే చాలు మినిమమ్ లక్షాధికారి అయిపోవచ్చు. అదే.. ఆడే అవకాశం రావడం.. అందునా ప్రతీ మ్యాచ్‌లో అద్భుతంగా రాణిస్తే ఇంక చెప్పేదేముంటుంది. కోట్లు కొల్లగొట్టేయచ్చు. ప్రతిభను నిరూపించుకుంటే చాలు కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఎగబడతాయి. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన ఎంతో మంది క్రికెటర్లు ఈ లీగ్ ద్వారా ధనవంతులైపోయారు. ఐపీఎల్ మెగా వేలం-2022 నేపథ్యంలో వెంకటేశ్ అయ్యర్‌ను రిటెన్షన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ వెచ్చించిన మొత్తమే ఈ ప్రస్తావనకు కారణం. వెంకటేశ్ అయ్యర్‌ను కేవలం 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది కేకేఆర్. అయితే, ఐపీఎల్-2021లో భాగంగా యూఏఈ వేదికగా సాగిన రెండో అంచెలో అతడు అత్యద్భుతంగా రాణించడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. 10 ఇన్నింగ్స్ ఆడిన ఈ స్టార్ ఓపెనర్ 370 పరుగులు చేశాడు. జట్టు ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడిని రిటైన్ చేసుకునేందుకు నిర్ణయించుకున్న ఫ్రాంఛైజీ.. ఏకంగా 8 కోట్లు ఖర్చు చేసింది. దీంతో వెంకటేశ్ అయ్యర్ సాలరీ దాదాపు 40 రెట్లు(4000%) పెరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ అయ్యర్ గనుక వేలంలోకి వస్తే రికార్డులు బద్దలయ్యేవి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా వెంకటేశ్ ఇటీవలి న్యూజిలాండ్ సిరీస్‌తో టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20లలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాను ఆల్‌రౌండర్‌ను అని, జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్ రిటెన్షన్ విషయానికొస్తే.. కేకేఆర్ ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు), సునీల్ నరైన్ (రూ. 6 కోట్లు)ను కొనసాగిస్తామని ప్రకటించింది. ఇందుకోసం 42 కోట్లు ఖర్చు చేయగా.. కోల్‌కతా పర్సులో ఇంకా 48 కోట్ల రూపాయలు ఉన్నాయి. చదవండి: IPL 2022 Retention- Auction: కోట్ల ఖర్చు.. మెగా వేలం.. ఆ ఫ్రాంఛైజీ పర్సులో 72 కోట్లు.. మరి మిగిలిన జట్ల వద్ద ఎంతంటే! -
అతడు వేలానికి వస్తే, రికార్డులు బద్ధలు కావాల్సిందే..
Irfan Pathan feels KKRs all rounder Venkatesh Iyer can become a hot pick at a mega auction: ఐపీఎల్ 14వ సీజన్లో అదరగొట్టిన కేకేఆర్ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్‌పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఒక వేళ అయ్యర్‌ను కోల్‌కతా రీటైన్ చేసుకోపోతే.. రానున్న మెగా వేలంలో అయ్యర్‌కు భారీ ధర దక్కనుందని పఠాన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల లిస్టును నవంబర్ 30 న సమర్పించునున్నాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆయా జట్లు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాలి. ఆ జాబితాలో కచ్చితంగా ఒక విదేశీ ఆటగాడు ఉండాలి. "కేకేఆర్‌లో రస్సెల్, సునీల్ నరైన్ స్టార్ ఆల్ రౌండర్లుగా ఉన్నారు. వాళ్లు ఎన్నో అద్బుతమైన విజయాలు ఆ జట్టుకు అందించారు. కావున వాళ్లు ఇద్దరినీ వేలానికి విడుదల చేయడానికి కేకేఆర్ ఇష్టపడకపోవచ్చు. కానీ రస్సెల్, సునీల్ నరైన్ ప్రస్తుతం ఫామ్‌లో లేరు. అయితే వాళ్లకు తమదైన రోజున మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించగల సత్తా ఉంది. మరోవైపు కేకేఆర్ లాకీ ఫెర్గూసన్ గురించి ఆలోచించవచ్చు. అతడు కొత్త బంతితో యార్కర్లను బౌలింగ్ చేయడంలో దిట్ట. ప్యాట్ కమ్మిన్స్ కంటే లూకీ ఫర్గూసన్‌ని అట్టిపెట్టుకుంటే మంచిది అని" పఠాన్ పేర్కొన్నాడు. ఇక మూడో ఆటగాడి గురించి మాట్లాడూతూ.. శుభ్‌మన్ గిల్‌ను కోల్‌కతా రీటైన్ చేసుకునే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్ గత సీజన్లో అద్బుతంగా రాణించాడు. నాలుగో స్థానం కోసం వరుణ్ చక్రవర్తి లేదా నితీష్ రానా గురించి కేకేఆర్ ఆలోచిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం నాలుగవ ఆటగాడిగా వెంకటేష్ అయ్యర్‌ను రీటైన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే అతడు బ్యాట్‌తోను, బాల్‌తో రాణించగలడు. ఒక వేళ అయ్యర్ వేలం లోకి వెళ్తే.. అతడిని దక్కించుకోవడానికి చాలా జట్లు పోటీ పడతాయి అని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. చదవండి: Ind vs Nz: అతడు రంగన హెరాత్‌ను గుర్తు చేశాడు: బ్రాడ్ హాగ్ -
Venkatesh Iyer: ప్రమాదంలో పాండ్యా కెరీర్.. ఆల్‌రౌండర్‌గా సిద్ధమన్న అయ్యర్
Unclarity Over Hardik Pandya’s Future- Venkatesh Iyer Is Ready to Mould Himself in Indian Team Batting Order: ‘‘నేను ఆల్‌రౌండర్‌ను.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాల్లోనూ రాణించాల్సి ఉంటుంది. నన్ను ఏ స్థానంలో ఆడించినా పర్లేదు. ఒకవేళ తుదిజట్టులో ఉన్నట్లయితే ఆల్‌రౌండర్‌గా నా బాధ్యతను నెరవేరుస్తా’’ అన్నాడు టీమిండియా యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌తో ఈ కేకేఆర్ ఓపెనింగ్ స్టార్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మూడు టీ20 మ్యాచ్‌లలోనూ ఆడే అవకాశం దక్కించుకున్న వెంకటేశ్... బ్యాటర్(4,12 నాటౌట్, 20 రన్స్)గా అంతగా ఆకట్టుకోలేదు. బౌలర్‌గానూ తన మార్కు చూపలేకపోయాడు. ఆఖరి టీ20లో మాత్రం ఒక వికెట్ తీశాడు. అయితే, ఒత్తిడిని జయిస్తే అయ్యర్ అద్భుతాలు చేయగలడని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా బౌలర్‌గా విఫలమవుతున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో అయ్యర్ మంచి ఆప్షన్ అని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన వెంకటేశ్ అయ్యర్... ‘‘ఒక క్రికెటర్‌గా ఎలాంటి సవాళ్లకైనా నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి రెడీగా ఉంటాను. మూడో స్థానం లేదంటే ఐదో స్థానం.. మిడిలార్డర్ లేదంటే లోయర్ ఆర్డర్.. ఎక్కడ బ్యాటింగ్‌కు పంపినా సరే... పరుగులు చేయగలను. బౌలర్‌గానూ నా వంతు పాత్ర పోషించగలను. దేశం కోసం ఆడుతున్నపుడు జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా నన్ను నేను సంసిద్ధం చేసుకుంటాను’’ అంటూ జట్టులో తను ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. చదవండి: Ind Vs NZ Test Series: మెనూ వివాదంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ Venkatesh Iyer: 'రోహిత్ భయ్యా.. ద్రవిడ్ సర్‌కు చాలా థ్యాంక్స్' -
'రోహిత్ భయ్యా.. ద్రవిడ్ సర్‌కు చాలా థ్యాంక్స్'
Venkatesh Iyer Thanks To Rohit Sharma And Rahul Dravid.. కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్ ద్వారా టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో 4,12 నాటౌట్, 20 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌లో పెద్దగా మెరుపులు లేకపోయినప్పటికి అరంగేట్రంలో మంచి మార్కులే సంపాదించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్ అవకాశం రాని వెంకటేశ్ చివరి టి20లో మాత్రం బౌలింగ్ చేసి ఆడమ్ మిల్నేను ఔట్ చేసి తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు. ఈ సందర్భంగా వెంకటేశ్ అయ్యర్ తనకు అవకాశమిచ్చిన రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఒక లేఖ రాసుకొచ్చాడు. చదవండి: Virat Kohli: 732 రోజులు.. సెంచరీ కోసం పరితపిస్తున్నాడు! ''న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌ను 3-0 తేడాతో గెలిచిన తర్వాత రోహిత్ భయ్యా నా దగ్గరకు వచ్చి ట్రోఫీ ఇచ్చాడు. విన్నింగ్ ట్రోఫీని పట్టుకోవడం ఆ క్షణంలో కాస్త ఎమోషనల్‌గా అనిపించింది. ట్రోఫీ అందుకోవడం గర్వంగా ఫీలయ్యా. సీనియర్ ఆటగాళ్లతో పాటు కెప్టెన్ రోహిత్ భయ్యా.. కోచ్ ద్రవిడ్ సర్ చక్కగా సహకరించారు. ఇక ట్రోఫీ అందిస్తూ రోహిత్ భయ్యా.. వెల్డన్.. గుడ్జాబ్.. కీప్ ఇట్ అప్ అని చెప్పడం సంతోషం కలిగించింది. ఇక డెబ్యూ మ్యాచ్‌లో క్యాప్ అందుకున్న తర్వాత రోహిత్ భయ్యా విలువైన సూచనలు.. సలహాలు అందించాడు. ఒక కెప్టెన్‌గా తను ఏం చేయాలో అది చేసి మాకు ధైర్యం ఇవ్వడం ఎన్నటికి మరిచిపోను అంటూ'' చెప్పుకొచ్చాడు. చదవండి: KL Rahul: కివీస్‌తో టెస్టుకు ముందు బిగ్‌షాక్.. గాయంతో కేఎల్ రాహుల్ ఔట్ -
Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది.. కానీ ఆ తప్పు చేస్తాడని..
IND vs NZ 2021 Rare Error on Rohit Sharma Captaincy Part Says Aakash Chopra: న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు వెంకటేశ్ అయ్యర్. కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. అయితే, తుదిజట్టులోకి ఆల్‌రౌండర్‌గా ఎంపికైన అయ్యర్‌కు బౌలింగ్ చేసే అవకాశం మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ... ‘‘ఫాస్ట్‌బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా వెంకటేశ్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నామన్న టీమిండియా అతడిని ఆరోస్థానంలో ఆడించింది. కానీ.. తనకు బౌలింగ్ చేసే అవకాశం మాత్రం ఇవ్వలేదు. నిజానికి రోహిత్ కెప్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాంటి తన నుంచి ఇలాంటి అరుదైన తప్పిదాన్ని ఊహించలేదు. నిజంగా తను నన్ను ఆశ్చర్యపరిచాడు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ‘‘టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని... ఫస్టాఫ్‌లో వాళ్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు.. కచ్చితంగా తన(వెంకటేశ్ అయ్యర్) చేతికి బంతిని ఇవ్వాల్సింది. కనీసం ఒకటి లేదంటే రెండు ఓవర్లు వేయించాల్సింది. ఎందుకంటే అప్పటికే చహర్, సిరాజ్ కాస్త ఇబ్బంది పడుతున్నారు’’ అని ఆకాశ్ చోప్రా వివరించాడు. ఇక భువనేశ్వర్ కుమార్ ఫామ్‌లోకి రావడం సంతోషంగా ఉందన్న ఆకాశ్ చోప్రా.. పాత, కొత్త బంతులతో తను రాణించాడని ప్రశంసించాడు. అశ్విన్, భువీ వంటి అనుభవజ్ఞులు కేవలం 47 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టడం సంతోషంగా ఉందన్నాడు. కాగా జైపూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 62 పరుగులతో రాణించిన సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక బౌలర్లలో భువీకి 2, దీపక్ చహర్‌కు ఒకటి, సిరాజ్‌కు ఒకటి, అశ్విన్ 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. స్కోర్లు: న్యూజిలాండ్- 164/6 (20) ఇండియా- 166/5 (19.4) చదవండి: Suryakumar Yadav: కోహ్లి నాకోసం త్యాగం చేశాడు... అయినా ఏ స్థానంలో వచ్చినా -
'నా కల నెరవేరింది'.. వెంకటేశ్ అయ్యర్ ఎమోషనల్
Venkatesh Iyer Emotional After Debut For Team India In T20Is.. కేకేఆర్ స్టార్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న టి20 మ్యాచ్‌లో టీమిండియా తరపున టి20ల్లో 93వ ఆటగాడిగా అరంగేట్రం చేశాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు వెంకటేశ్ అయ్యర్ ఎమోషనల్ అయ్యాడు. ''దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది ప్రతీ ఒక్కరికి ఒక కల. ఈరోజుతో నా కల నెరవేరింది. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తా. ఇక కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో ఆడేందుకు మంచి ఉత్సాహంతో ఉన్నా. ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగుతున్న నేను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఇక బౌలింగ్‌లోనూ చేయి అందించడానికి ఎదురుచూస్తున్నా. స్వదేశంలో సొంత ప్రేక్షకుల మధ్య ఆడడం కొత్త అనుభూతినిస్తుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. https://t.co/Qud6f60uhQ — varun seggari (@SeggariVarun) November 17, 2021 The grin says it all! 😊 A moment to cherish for @ivenkyiyer2512 as he makes his #TeamIndia debut. 👏 👏#INDvNZ @Paytm pic.twitter.com/2cZJWZBrXf — BCCI (@BCCI) November 17, 2021