టీమిండియా యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. దక్షిణాప్రికాతో వన్డే సిరీస్‌కు అయ్యర్‌ని బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫి, విజయ్ హాజరే ట్రోఫిలో అయ్యర్ అద్భుతంగా రాణించాడు. ఇక టీ20ల్లో భారత తరుపున అరంగేట్రం చేసిన అయ్యర్.. మూడు మ్యాచ్‌ల్లో 36 పరుగులుతోపాటు, మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. కాగా భారత వన్డే జట్టులో చోటు దక్కడం పట్ల అయ్యర్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలో రానున్న దక్షిణాప్రికా పర్యటనలో మరోసారి తనుఎంటో నిరూపించుకోవడానికి అయ్యర్ సిద్దం అవుతున్నాడు. ఇక భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకూడదని, రిలాక్స్‌గా ఉండాలని అయ్యర్ తెలిపాడు.
"నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటాను. దక్షిణాప్రికా పిచ్‌లు ఎక్కువగా బౌన్స్‌కు అనుకులస్తాయి. బౌన్స్ పిచ్‌లపై ఒక బౌలర్, ఫీల్డర్, బ్యాటర్‌గా నా పాత్రను ఎలా నిర్వహించాలో నేను అన్ని విధాల సన్నద్దం అవుతున్నాను. నేను దక్షిణాఫ్రికాకు చేరుకున్న వెంటనే ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటాను. ప్రస్తుతం నా దృష్టి అంతా దక్షిణాఫ్రికా పర్యటనపైనే ఉంది" అని అయ్యర్ పేర్కొన్నాడు. ఇక భారత్- దక్షిణాప్రికా మధ్య తొలి వన్డే జనవరి 19న ప్రారంభం కానుంది.
దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), చహల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా(వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment