India Tour Of South Africa 2021
-
వారి కారణంగానే ఓడిపోయాం.. సంచలన వాఖ్యలు చేసిన షమీ
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తొలి సారి దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలని అడుగు పెట్టిన టీమిండియాకు మరోసారి నిరాశే ఎదరైంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ సంచలన వాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో భారత్ ఓడపోవడం తానను చాలా బాధించందని మహ్మద్ షమీ తెలిపాడు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో భారత బ్యాటింగ్ యూనిట్ పూర్తి స్ధాయిలో విఫలమయ్యందని షమీ చెప్పాడు. "మా బ్యాటర్లు కీలక సమయాల్లో విఫలమయ్యారు. దీని కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను మా జట్టును కోల్పోయింది. ఈ సిరీస్‌లో మా బౌలింగ్ యూనిట్ చాలా బాగా రాణించింది. కాబట్టి ప్రోటిస్ జట్టుకు భారత్ గట్టి పోటీ ఇచ్చింది. డిఫెండ్ చేయడానికి మాకు ఇంకా 50-60 పరుగులు ఉండి ఉంటే, మేము ఖచ్చితంగా చివరి రెండు టెస్టుల్లో గెలిచే అవకాశం కలిగి ఉండేవాళ్లం. త్వరలోనే మా జట్టు కోలుకుంటుందని నేను భావిస్తున్నాను" షమీ పేర్కొన్నాడు. ఇక సిరీస్‌లో రాహుల్ తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ అంతగా రాణించలేదు. -
IND vs SA: 'టీమిండియా అతడి సేవలను కోల్పోయింది.. అందుకే ఓడిపోయింది'
దక్షిణాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోయి టీమిండియా ఘోర పరాభావం పొందిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో విజయం సాధించిన భారత్.. చివరి రెండు టెస్టుల్లో ఓటమి చెంది సిరీస్‌ను అతిథ్య జట్టుకు అప్పగించింది. అదే విధంగా మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో ప్రోటిస్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో వెటరన్ దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సేవలను టీమిండియా కోల్పోయిందని స్టెయిన్ పేర్కొన్నాడు. “భారత్ ఖచ్చితంగా సర్ రవీంద్ర జడేజా లాంటి వారి సేవలను కోల్పోయింది. అతను అద్భుతమైన క్రికెటర్. అతను తన స్పిన్ మయాజాలంతో ఆటను మలుపు తిప్పగలడు. అదే విధంగా జడ్డూ.. బ్యాట్‌తో కూడా రాణించగలడు’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక భారత పేస్ బౌలింగ్ గురించి మాట్లాడూతూ.. ‘‘భారత్‌కు బౌలింగ్‌లో కొంత సమస్య ఉన్న మాట వాస్తవం. బుమ్రాకి బ్యాకప్‌గా ఒక మంచి బౌలర్ కావాలి. వారికి గంటకు 140-145 కిమీ స్పీడ్‌లో బౌలింగ్ చేయగల బౌలర్ అవసరం. ఇక టెస్టు సిరీస్‌లో షమీ కూడా అద్భుతంగా రాణించాడు" అని స్టెయిన్ పేర్కొన్నాడు. చదవండి: AUS vs SL: శ్రీలంక జట్టులో కీలక పరిణామం.. కోచ్‌గా లసిత్ మలింగ! -
కెప్టెన్‌గా అతడు ఏం చేశాడో నాకు తెలియడం లేదు..
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఓటమి చెందింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఇక భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్.. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో సారథిగా జట్టును విజయపథంలో రాహుల్ నడిపించలేక పోయాడు. ఈ క్రమంలో భారత కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. జట్టు క్లిష్ట పరిస్ధితుల్లో ఉన్నప్పుడు రాహుల్ వ్యూహాలను రచించడంలో విఫలమయ్యాడని గవాస్కర్ తెలిపాడు. “ఈ సిరీస్‌లో రాహుల్ కెప్టెన్‌గా పూర్తి స్ధాయిలో విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికా భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పుడల్లా రాహుల్ తన వ్యూహాలకు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేయకుండా ఆపడంలో రాహుల్ నిర్ణయాలు నాకు సంతృప్తి పరచలేదు. బహుశా అతడికి అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్‌గా అతడికి అంత అనుభవంలేక పోవడమే దీనికి కారణం కావచ్చు. ఇక బ్యాటింగ్‌లో కూడా రాహుల్ విఫలమయ్యాడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు. -
రాహుల్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు.. తొలి భారత కెప్టెన్‌గా..
దక్షిణాఫ్రికాతో జరిగిన అఖరి వన్డే లోను ఓటమి చెంది టీమిండియా ఘోర పరాభావం పొందింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్‌పై నాలుగు పరుగుల తేడాతో ప్రోటిస్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో అతిథ్య జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఇక టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. రోహిత్ గైర్హజరీలో కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. కెప్టెన్‌గా మెదటి మూడు వన్డేల్లో ఓడిన తొలి భారత ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. కాగా ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ తన తొలి మూడు వన్డేలు ఓడిపోలేదు. ఇక ఈ సిరీస్‌లో కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా రాహుల్ విఫలమయ్యాడు. -
ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన దక్షిణాఫ్రికా
కేప్‌టౌన్: రెండో వన్డేతో సిరీస్ పోయింది. ఇప్పుడు ఆఖరి ఓటమితో పరువు పోయింది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ నాలుగు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలై సిరీస్‌ను 0–3తో చేజార్చుకుంది. మొదట దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ డికాక్ (124; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. డసెన్ (52; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 283 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ ధావన్ (61; 5 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి (65; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. 32వ ఓవర్లో జట్టు స్కోరు 156 పరుగుల వద్ద కోహ్లి అవుట్ కావడంతోనే క్లీన్‌స్వీప్ ఖాయమైనప్పటికీ... దీపక్ చహర్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో గెలుపుబాట పట్టింది. 18 బంతుల్లో భారత్ విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో 48వ ఓవర్ తొలి బంతికి చహర్‌ను ఎన్గిడి బోల్తా కొట్టించడంతో టీమిండియా ఓడిపోయేందుకు ఎక్కువసేపు పట్టలేదు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) ధావన్ (బి) బుమ్రా 124; మలాన్ (సి) పంత్ (బి) చహర్ 1; బవుమా (రనౌట్) 8; మార్క్రమ్ (సి) సబ్–రుతురాజ్ (బి) చహర్ 15; డసెన్ (సి) శ్రేయస్ (బి) చహల్ 52; మిల్లర్ (సి) కోహ్లి (బి) ప్రసిధ్ కృష్ణ 39; ఫెలుక్వాయో (రనౌట్) 4; ప్రిటోరియస్ (సి) సూర్యకుమార్ (బి) ప్రసిధ్ కృష్ణ 20, కేశవ్ (సి) కోహ్లి (బి) బుమ్రా 6; మగాలా (సి) రాహుల్ (బి) ప్రసిధ్ కృష్ణ 0; ఎన్గిడి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 287. వికెట్ల పతనం: 1–8, 2–34, 3–70, 4–214, 5–218, 6–228, 7–272, 8–282, 9–287, 10–287. బౌలింగ్: దీపక్ చహర్ 8–0–53–2, బుమ్రా 10–0–52–2, ప్రసిధ్ కృష్ణ 9.5–0–59–3, జయంత్ యాదవ్ 10–0–53–0, చహల్ 9–0–47–1, శ్రేయస్ అయ్యర్ 3–0–21–0. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మలాన్ (బి) ఎన్గిడి 9; ధావన్ (సి) డికాక్ (బి) ఫెలుక్వాయో 61; కోహ్లి (సి) బవుమా (బి) కేశవ్ 65; పంత్ (సి) మగాలా (బి) ఫెలుక్వాయో 0; శ్రేయస్ అయ్యర్ (సి) ఫెలుక్వాయో (బి) మగాలా 26; సూర్యకుమార్ (సి) బవుమా (బి) ప్రిటోరియస్ 39; దీపక్ చహర్ (సి) ప్రిటోరియస్ (బి) ఎన్గిడి 54; జయంత్ (సి) బవుమా (బి) ఎన్గిడి 2; బుమ్రా (సి) బవుమా (బి) ఫెలుక్వాయో 12; చహల్ (సి) మిల్లర్ (బి) ప్రిటోరియస్ 2; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం ( 49.2 ఓవర్లలో ఆలౌట్) 283. వికెట్ల పతనం: 1–18, 2–116, 3–118, 4–156, 5–195, 6–210, 7–223, 8–278, 9–281, 10–283. బౌలింగ్: ఎన్గిడి 10–0–58–3, ప్రిటోరియస్ 9.2–0– 54–2, మగాలా 10–0–69–1, కేశవ్ మహరాజ్ 10–0–39–1, ఫెలుక్వాయో 7–0–40–3, మార్క్రమ్ 3–0–21–0. -
పోరాడి ఓడిన భారత్.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన దక్షిణాఫ్రికా
10:20 PM: సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా పోరాడి ఓడిపోయింది. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.2 ఓవర్లలో 283 పరుగుల వద్ద ఆలౌట్ కావడంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. దీపక్ చహర్ 54 పరుగులతో ఆఖర్లో ఆశలు రేపినప్పటికి చివరి నిమిషంలో ఔటవడంతో టీమిండియా ఓటమి ఖరారు అయింది. అంతకముందు శిఖర్ ధావన్ 61, కోహ్లి 65 రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఫెక్యలువాయో 3, లుంగీ ఎన్గిడి 3, డ్వేన్ ప్రిటోరియస్ 2 వికెట్లు తీశారు. 8:46 PM: కోహ్లి(65).. టీమిండియా నాలుగో వికెట్ డౌన్ విరాట్ కోహ్లి శతక దాహం ఈ మ్యాచ్‌లో కూడా తీరలేదు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి.. 65 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో బవుమాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 32 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 157/4గా ఉంది. క్రీజ్‌లో శ్రేయస్ అయ్యర్(16), సూర్యకుమార్ యాదవ్(1) ఉన్నారు. 8:15 PM: ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 116 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసి శతకం దిశగా సాగుతున్న శిఖర్ ధవన్(73 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్).. ఫెలుక్వాయో బౌలింగ్‌లో వికెట్‌కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదే ఓవర్లో టీమిండియాకు మరో షాక్ తగిలింది. పంత్ వచ్చీ రాగానే.. మగాలాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా టీమిండియా 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజ్‌లో కోహ్లి(43), శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. టార్గెట్ 288.. ఆదిలోనే టీమిండియాకు షాక్ 288 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(9).. ఎంగిడి బౌలింగ్‌లో మలాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా 18 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో ధవన్(9), కోహ్లి ఉన్నారు. 6: 04 PM: టీమిండియా టార్గెట్ 288 ఆఖరి ఓవర్లో ప్రసిద్ధ కృష్ణ చెలరేగడంతో దక్షిణాఫ్రికా చివరి రెండు వికెట్లు బంతుల వ్యవధిలో కోల్పోయింది. 49వ ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించిన మిల్లర్(39)..మూడో బంతికి క్యాచ్ ఔట్ కాగా, ఐదో బంతికి మగాలా.. కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 287 పరుగుల వద్ద ముగిసింది. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 3, బుమ్రా, దీపక్ చాహర్ తలో రెండు వికెట్లు, చహల్ ఓ వికెట్ పడగొట్టగా.. మార్క్రమ్ రనౌటయ్యాడు. సఫారీ బ్యాటర్లలో డికాక్(124) సెంచరీతో చెలరేగాడు. 5:56 PM: ఎనిమిదో వికెట్ డౌన్ భారీ స్కోర్ సాధిస్తామనుకున్న దక్షిణాఫ్రికా ఆశలపై టీమిండియా బౌలర్లు నీళ్లు చల్లారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. 48వ ఓవర్లో ప్రసిద్ధ కృష్ణ.. ప్రిటోరియస్(20)ను పెవిలియన్‌కు పంపగా, 49వ ఓవర్లో బుమ్రా.. కేశవ్ మహారాజ్(6)ను ఔట్ చేశాడు. ఫలితంగా ఆ జట్టు 49 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. క్రీజ్‌లో మిల్లర్(35), మగాలా ఉన్నారు. 5: 18 PM: ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. ఫెలుక్వాయో(4) రనౌట్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన త్రో కారణంగా దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 40.1వ ఓవర్లో ఫెలుక్వాయో(4) రనౌటయ్యాడు. క్రీజ్‌లో మిల్లర్(7), ప్రిటోరియస్ ఉన్నారు. 41 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 229/6గా ఉంది. 5:02 PM: డస్సెన్(52) ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా హాఫ్ సెంచరీ చేసిన వెంటనే డస్సెన్ ఔటయ్యాడు. 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద చహల్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 37 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 219/5గా ఉంది. క్రీజ్‌లో మిల్లర్(2), ఫెలుక్వాయో ఉన్నారు. 4: 52 PM: దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ డౌన్ 124 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సెంచరీ హీరో డికాక్ ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో ధవన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 36 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 216/4గా ఉంది. క్రీజ్‌లో డస్సెన్(51), డేవిడ్ మిల్లర్(1)ఉన్నారు. 4: 20 PM: డికాక్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా దక్షిణాఫ్రికా 31 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 174/3గా ఉంది. డికాక్.. 110 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసి 102 పరుగులతో కొనసాగుతున్నాడు. డస్సెన్ 46 బంతుల్లో 40 పరుగులతో డికాక్‌కు తోడుగా క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మలాన్(1), మార్క్రమ్(15), బవుమా(8) ఔటయ్యారు. టీమిండియా బౌలర్లు చాహర్ రెండు వికెట్లు పడగొట్టగా బవుమా రనౌటయ్యాడు. 3:36 PM: సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ మరోసారి అర్థశతకంతో మెరిశాడు. 60 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న డికాక్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం సౌతాఫ్రికా 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. 3: 06 PM: మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా భువనేశ్వర్ కుమార్ స్థానంలో జట్టులోకి వచ్చిన దీపక్ చాహర్ సత్తా చాటుతున్నాడు. తొలుత మలాన్‌ను పెవిలియన్‌కు పంపిన అతను.. 13 ఓవర్లో మరో వికెట్ పడగొట్టాడు. సబ్‌స్టిట్యూట్ ఆటగాడు రుతురాజ్ క్యాచ్ పట్టడంతో మార్క్రమ్(15) పెవిలియన్ బాట పట్టాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 70 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో డికాక్(42), డస్సెన్ ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 7వ ఓవర్లో దక్షిణాఫ్రికాకు మరో షాక్ తగిలింది. చాహర్ బౌలింగ్‌లో ఇన్ ఫామ్ బ్యాటర్, సఫారీ కెప్టెన్ బవుమా(12 బంతుల్లో 8) రనౌటయ్యాడు. కేఎల్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో సఫారీ కెప్టెన్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా ఆ జట్టు 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో డికాక్(26), మార్క్రమ్ ఉన్నారు. అంతకుముందు 3వ ఓవర్ తొలి బంతికే దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జన్నెమన్ మలాన్(1).. చాహర్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 1:40 PM: కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తుది సమరానికి టీమిండియా సిద్దమైంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్.. చివరి వన్డేలోనైనా నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో నాలుగు మార్పులతో భారత్ బరిలోకి దిగగా, ప్రోటిస్ ఒకే ఒక మార్పు చేసింది. జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్, సూర్యకుమార్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చారు. భారత తుది జట్టు: కెఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, జానేమన్ మలన్, ఎయిడెన్ మార్కరమ్, రసీ వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లూక్వాయో, మగాలా, కేశవ్ మహరాజ్, డ్వైన్ ప్రిటోరియస్, లుంగి ఎండ్వైన్ ప్రిటోరియస్గిడి. -
అరుదైన రికార్డుకు చేరువలో చాహల్.. తొలి బౌలర్‌గా!
India vs South Africa ODI: దక్షిణాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోయిన టీమిండియా అఖరి పోరుకు సిద్దమైంది. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న చివరి వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో భారత స్సిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో చాహల్ ఒక్క వికెట్ సాధిస్తే దక్షిణాఫ్రికా గడ్డపై ప్రోటిస్ జట్టుపై అత్యధిక వికెట్ల పడగొట్టిన బౌలర్‌గా నిలుస్తాడు. కాగా ఇప్పటికే 17 వికెట్లు పడగొట్టిన చాహల్.. కుల్దీప్ యాదవ్ (17)తో సమానంగా నిలిచాడు. అదే విధంగా మరో రెండు వికెట్లు సాధిస్తే.. వన్డేల్లో 100 వికెట్ల క్లబ్లో చాహల్ చేరుతాడు. ఇక టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్లో 3000 పరుగుల క్లబ్లో చేరడానికి 12 పరుగుల దూరంలో నిలిచాడు. చదవండి: Ind Vs Sa 3rd ODI: ధావన్‌కు విశ్రాంతి.. ఓపెనర్‌గా వెంకటేశ్.. భువీ వద్దు.. అతడే కరెక్ట్! -
దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. విరాట్ కోహ్లి దూరం!
South Africa vs India, 3rd ODI: కేప్‌టౌన్ వేదికగా దక్షిణాష్రికాతో అఖరి వన్డేలో ఆదివారం భారత్ తలపడనుంది. ఇప్పటికే రెండు వన్డే్ల్లో ఓటమి చెంది సిరీస్‌ను భారత్ కోల్పోయింది. టీమిండియా కనీసం చివరి వన్డేలోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. కాగా రెండు వన్డేల్లోనూ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఏమాత్రం ఆకట్టుకోకపోగా...హెడ్ కోచ్‌గా ప్రధాన ఆటగాళ్లతో తొలి పర్యటనలోనే రాహుల్ ద్రవిడ్‌కు కూడా సంతృప్తికర ఫలితం దక్కలేదు. అయితే చివరి మ్యాచ్‌లో భారత జట్టులో కీలక మార్పులు చేయున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు వన్డేల్లో విఫలమైన భువనేశ్వర్ కూమార్‌పై వేటు వేసి.. అతడి స్థానంలో దీపక్ చాహర్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అదే విధంగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతిని ఇచ్చి .. అతడి స్ధానంలో సూర్యకూమార్ యాదవ్ ఎంపిక చేసే ఆలోచనలో టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తొలి రెండు వన్డేల్లో విఫలమైన శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్‌పై కూడా వేటు పడే అవకాశం ఉంది. ఒక వేళ శ్రేయస్ అయ్యర్ దూరమైతే అతడి స్ధానంలో రుతురాజ్ గైక్వాడ్ జట్టులోకి రానున్నాడు. చదవండి: SA vs IND: చివరి వన్డేలో గెలిచి భారత్ పరువు నిలుపుకునేనా? -
దక్షిణాఫ్రికా అరుదైన రికార్డు.. 21 ఏళ్ల తర్వాత!
పార్ల్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. కాగా భారత్ నిర్ధేశించిన 288 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ప్రోటిస్ సునాయాసంగా ఛేదించింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు వికెట్ల పడగొట్టడంలో విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా విజయంలో ఓపెనర్లు మలాన్, డికాక్ కీలక పాత్ర పోషించారు. కాగా పార్ల్ వేదికగా వన్డే క్రికెట్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యధిక పరుగుల ఛేజింగ్ కావడం గమనార్హం. అంతకుముందు 2001లో శ్రీలంకపై 248 పరుగుల టార్గెట్‌ను సౌతాఫ్రికా చేధించింది. ఇక టెస్ట్, వన్డే సిరీస్‌లను కోల్పోయిన టీమిండియా.. కేప్ టౌన్ వేదికగా జనవరి 23న జరిగే చివరి వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. చదవండి: SA vs IND: 'భారత్ గెలవాలంటే అతడు జట్టులోకి రావాలి' -
వన్డేల్లో దక్షిణాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. తొలి ఆటగాడిగా
పార్ల్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో ప్రోటిస్ జట్టు కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయంలో ఓపెనర్లు మలాన్, డికాక్ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ ఓపెనింగ్ వికెట్‌కు 132 పరుగులు జోడించారు. మలాన్ 91 పరుగులు చేయగా, డికాక్ 78 పరుగులు సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ప్రోటిస్ ఓపెనర్ జననేమన్ మలన్ ప్రపంచ రికార్డు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 700 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మలన్ నిలిచాడు. మలన్ 12 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించగా, నెదర్లాండ్ ఆటగాడు టామ్ కూపర్ 13 ఇన్నింగ్స్‌లో 700 పరుగులు చేశాడు. ఇక టెస్ట్, వన్డే సిరీస్‌లను కోల్పోయిన టీమిండియా.. కేప్ టౌన్ వేదికగా జనవరి 23న జరిగే చివరి వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. చదవండి: హైదరాబాదీ ఆల్‌రౌండర్‌కి బంపర్ ఆఫర్.. భారత జట్టులో చోటు! -
రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి.. సిరీస్ సమర్పయామి
IND vs SA 2nd ODI : సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా పరాజయం పాలైంది. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది. మరో 10 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సౌతాఫ్రికా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో జానేమన్ మలన్ 91, క్వింటన్ డికాక్ 78, బవుమా 35 రాణించగా.. చివర్లో మార్ర్కమ్ 35 నాటౌట్, డసెన్ 34 నాటౌట్ మిగిలిన లాంచనాన్ని పూర్తి చేశారు. ఫ్లాట్‌గా ఉన్న వికెట్‌పై టీమిండియా బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేక చతికిలపడిపోయారు. భారత బౌలర్లలో బుమ్రా, భువనేశ్వర్, చహల్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆరంభంలోనే ధావన్(29), కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగినప్పటికి.. కేఎల్ రాహుల్(55), పంత్(85) పరుగులు చేయడంతో పాటు.. మూడో వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో టీమిండియా 183/2తో కోలుకున్నట్లే కనిపించింది. కానీ వెనువెంటనే పంత్, రాహుల్ ఔట్ కావడంతో టీమిండియా బ్యాటింగ్ తడబడింది. చివర్లో శార్దూల్ ఠాకూర్ 40 నాటౌట్ ఆకట్టుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్ షంసీ 2, మగల, మార్క్రమ్, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు. 9:10 PM: విజయం దిశగా సాగుతున్న దక్షిణాఫ్రికా వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 91 పరుగులు చేసిన ఓపెనర్ మలాన్‌ను బుమ్రా బౌల్డ్ చేయగా.. ఆ తర్వాత చహల్ బౌలింగ్‌లో బవుమా(35) కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 216 పరుగులతో ఆడుతోంది. ప్రొటీస్ విజయానికి ఇంకా 72 పరుగుల దూరంలో ఉంది. మార్క్రమ్, డసెన్‌లు క్రీజులో ఉన్నారు. 8:07 PM: టీమిండియా ఎట్టకేలకు వికెట్ సాధించింది. ఆరంభం నుంచి దూకుడు కనబరుస్తున్న సౌతాఫ్రికాను శార్దూల్ దెబ్బ తీశాడు. దాటిగా ఆడుతున్న డికాక్(78)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. 7:25 PM: 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా డికాక్ ఆరంభం నుంచి భారీ షాట్లు ఆడుతూ అర్థశతకం సాధించాడు. 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన డికాక్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. జానేమన్ మలన్ 40 పరుగులతో డికాక్‌కు సహకరిస్తున్నాడు. ప్రస్తుతం 17 ఓవర్లలో సౌతాఫ్రికా వికెట్ నష్టపోకుండా 109 పరుగులు చేసింది. 7:10 PM: 10 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. డికాక్ 48, జానేమన్ మలన్ 20 పరుగులతో ఆడుతున్నారు. 6:47 PM: 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. డికాక్ 29, జానేమన్ మలన్ 4 పరుగులతో ఆడుతున్నారు. 6:00 PM: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆరంభంలోనే ధావన్(29), కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగినప్పటికి.. కేఎల్ రాహుల్(55), పంత్(85) పరుగులు చేయడంతో పాటు.. మూడో వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో టీమిండియా 183/2తో కోలుకున్నట్లే కనిపించింది. కానీ వెనువెంటనే పంత్, రాహుల్ ఔట్ కావడంతో టీమిండియా బ్యాటింగ్ తడబడింది. చివర్లో శార్దూల్ ఠాకూర్ 40 నాటౌట్ ఆకట్టుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్ షంసీ 2, మగల, మార్క్రమ్, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు. 5:43 PM: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ 32, అశ్విన్ 11 పరుగులతో ఆడుతున్నారు. 4:57 PM: తబ్రైజ్ షంసీ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్(11) ఎల్బీగా వెనుదిరగడంతో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 11, శార్దూల్(0) ఆడుతున్నారు. 4:37 PM: టీమిండియా కేఎల్ రాహుల్(55), రిషబ్ పంత్(85) రూపంలో వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. 55 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ మగల బౌలింగ్‌లో డసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత షంసీ వేసిన 33వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించిన పంత్ మార్ర్కమ్కు చిక్కాడు. ప్రస్తుతం 33 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 4:14 PM: ధావన్, కోహ్లిలు ఔటైన తర్వాత కేఎల్ రాహుల్, పంత్ కలిసి టీమిండియా ఇన్నింగ్స్ నడిపిస్తున్నారు. ఈ క్రమంలో కేఎల్ అర్థశతకం సాధించాడు. అంతకముందు పంత్ 43 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కేఎల్ రాహుల్ 44 పరుగులతో ఆడుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా 29 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. 03:00 PM: టీమిండియా వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. ధావన్( 29) పరుగులు చేసి మరక్రామ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరగా, విరాట్ కోహ్లి కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. పంత్ 10, రాహుల్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. 02:25 PM: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతుంది. 5 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్ట పోకుండా 33 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాహల్(10), ధావన్(17) పరుగులతో ఉన్నారు. 1:40 PM: దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా తాడో పేడో తేల్చుకోవడానికిసిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్‌లో నిలవాలంటే తప్పనిసారిగా ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలి. ఇక ఈ మ్యాచ్‌లో ఎటు వంటి మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగింది. దక్షిణాఫ్రికా జట్టు ఒక మార్పుతో ఈ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ప్రోటిస్ జట్టు ముందుంజలో ఉంది. తుది జట్లు: టీమిండియా: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్. దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, జానేమన్ మలన్, ఎయిడెన్ మార్కరమ్, రసీ వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లూక్వాయో, మగాలా, కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షంషీ, లుంగి ఎంగిడి. చదవండి: యూసుఫ్ పఠాన్ తుపాన్ ఇన్నింగ్స్ .. కేవలం 40 బంతుల్లో.. -
కీలక పోరుకు సిద్దమైన టీమిండియా.. సిరీస్ సమం చేస్తారా?
2nd ODI vs SA: గత ఏడాదిని భారీ టెస్టు విజయంతో ఘనంగా ముగించిన భారత క్రికెట్ జట్టుకు ఈ ఏడాది ఇంకా గెలుపు బోణీ కాలేదు. దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా రెండు టెస్టులు ఓడటంతోపాటు తొలి వన్డేలో కూడా టీమిండియా చిత్తయింది. టెస్టు సిరీస్ కోల్పోయిన జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. దక్షిణాఫ్రికాతో నేడు జరిగే రెండో వన్డేలో భారత్ తలపడనుంది. తొలి వన్డే జరిగిన వేదికపైనే ఈ మ్యాచ్ కూడా నిర్వ హిస్తుండగా... ఇరు జట్లూ మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తుది ఫలితంలో ఏమైనా మార్పు ఉంటుందా లేక భారత్ వన్డే సిరీస్‌నూ అప్పగిస్తుందా చూడాలి. వెంకటేశ్‌కు మరో చాన్స్! తొలి వన్డేలో కెప్టెన్ కేఎల్ రాహుల్ వ్యూహాలు ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అంటూ తీసుకున్న వెంకటేశ్ అయ్యర్‌తో అతను ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. ముఖ్యంగా బవుమా, డసెన్ జోడీని విడగొట్టడంలో ప్రధాన బౌలర్లంతా విఫలమైనప్పుడు కూడా అలాంటి ప్రయత్నం చేయలేదు. బౌలింగ్ చేయనప్పుడు వెంకటేశ్కంటే రెగ్యులర్ బ్యాటర్ సూర్యకుమార్ సరైన ప్రత్యామ్నాయమని అనిపించింది. అయితే ఒక్క అరంగేట్రం మ్యాచ్‌తోనే వెంకటేశ్‌ను పక్కన పెట్టే అవకాశాలు తక్కువ. అతనికి మరో చాన్స్ లభించవచ్చని తెలుస్తోంది. సుదీర్ఘ కాలంగా టాప్–3 ప్రదర్శనతోనే విజయాలు దక్కించుకున్న భారత్‌కు మళ్లీ మిడిలార్డర్ సమస్యగా మారింది. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ కూడా రాణిస్తేనే జట్టుకు గెలుపు అవకాశాలు ఉంటాయి. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా కూడా రాహుల్‌కు ఇది కీలక మ్యాచ్ కానుంది. మరోవైపు తొలి వన్డేలో గెలుపుతో దక్షిణాఫ్రికా జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఇదే జోరులో మరో మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. టాప్–6లో మార్క్రమ్ మినహా అంతా ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. మార్క్రమ్ ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటాలని జట్టు కోరుకుంటోంది. ఆపై ఫెలుక్వాయో, జాన్సెన్ రూపంలో ఇద్దరు ఆల్‌రౌండర్లు టీమ్‌లో ఉన్నారు. చిన్న బౌండరీలు ఉన్న ఈ మైదానంలో భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం. చదవండి: క్రికెట్ అభిమానులుకు గుడ్ న్యూస్.. పాకిస్తాన్‌తో భారత్ తొలిపోరు -
ఎనిమిదేళ్ల తర్వాత బౌలింగ్‌లో చెత్త రికార్డు.. బ్యాటింగ్‌లో అదుర్స్
బోలాండ్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత మిడిలార్డర్‌తో పాటు, బౌలర్లు కూడా విఫలమయ్యారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ ఓ చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్ల కోటాలో 72 పరుగులు శార్దూల్ సమర్పించుకున్నాడు. కాగా ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గడ్డపై ప్రోటీస్ జట్టుపై వన్డేల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో భారత బౌలర్‌గా ఠాకూర్ నిలిచాడు. అంతకుముందు 2013లో మోహిత్ శర్మ 82 పరుగులతో తొలి స్ధానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో బాల్‌తో విఫలమైన ఠాకూర్ బ్యాట్‌తో అదరగొట్టాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఠాకూర్ అర్దసెంచరీ సాధించి ఆజేయంగా నిలిచాడు. కాగా వన్డేల్లో ఠాకూర్‌కి ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఇక భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే బోలాండ్ పార్క్ వేదికగా శుక్రవారం జరగనుంది. చదవండి: SA vs IND: మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం.. వాళ్లు బాగా ఆడారు! -
మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం.. వాళ్లు బాగా ఆడారు!
పెర్ల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆదిలోనే కెప్టెన్ రాహుల్ వికెట్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి భారత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే వీరిద్దరూ ఔటయ్యాక భారత జట్టు మిడిలార్డర్ కూప్పకూలింది. చివర్లో శార్ధుల్ ఠాకూర్ మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు సాధించింది. కాగా భారత మిడిలార్డర్ విఫలంపై ఓపెనర్ శిఖర్ ధావన్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. బోలాండ్ పార్క్‌లో వికెట్ చాలా నెమ్మదిగా ఉందని ధావన్ తెలిపాడు. 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత మిడిలార్డర్‌కు అంత సులభం కాదని అతడు అభిప్రాయపడ్డాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా బ్యాటర్లు టెంబా బావుమా, వాన్ డెర్ డుస్సేన్పై ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘మాకు మంచి ఆరంభం లభించింది. రాహుల్ వికెట్ కోల్పోయినా నేను, విరాట్.. స్కోర్ బోర్డును ముందుకు నడిపించాము. కానీ వికెట్ వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. మంచు ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు భారీ షాట్లు ఆడడం అంత సులభం కాదు. మేము ఈ మ్యాచ్‌లో సెంచరీ భాగస్వామ్యం కూడా నమోదు చేయలేకపోయాం. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం. అది మా బ్యాటింగ్ యూనిట్‌పై ప్రభావం చూపింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు టెంబా బావుమా, వాన్ డెర్ డుస్సేన్ అద్భుతంగా ఆడార’ని శిఖర్ ధావన్ అన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ధావన్ 79 పరుగులు సాధించాడు. ఇక భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే బోలాండ్ పార్క్ వేదికగా శుక్రవారం జరగనుంది. చదవండి: ఒక వైపు కెప్టెన్, వైస్ కెప్టెన్‌కి పాజిటివ్.. అయినా టీమిండియా ఘన విజయం.. -
ఎనిమిదేళ్ల తర్వాత అరుదైన రికార్డు సాధించిన సౌతాఫ్రికా..
టీమిండియాతో తొలి వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు బావుమా, వండర్ డుస్సేన్ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో వికెట్‌కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కాగా టీమిండియాపై సౌతాఫ్రికా ఇదే నాలుగో వికెట్ అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. అంతకు ముందు సెంచూరియన్‌లో 2013లో డికాక్, డివిలియర్స్ నాలుగో వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతే కాకుండా ఇది ఓవరాల్‌గా రెండో అత్యధిక భాగస్వామ్యం కూడా. అంతకుముందు 2000లో కోచి వేదికగా తొలి వికెట్‌కు కిర్ట్సెన్ - గిబ్స్ 235 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు బావుమా(110), వండర్ డుస్సేన్(129) సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ ఒక వికెట్ సాధించాడు. చదవండి: మ్యాక్స్‌వెల్ ఊచకోత .. 41 బంతుల్లో సెంచరీ.. ఏకంగా 24 ఫోర్లు, 4 సిక్స్‌లు! -
టీమిండియా ఆల్‌రౌండర్‌కు బంఫర్ ఆఫర్.. ఐదేళ్ల తర్వాత!
SA vs IND: టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు సుందర్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో మరో ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్‌ను సుందర్‌కి బ్యాకప్‌గా ఉంచునున్నట్లు తెలుస్తోంది. కాగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు జయంత్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు భారత జట్టుతోనే ఉన్నాడు. కానీ ఇప్పటివరకు అతడు కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఒకవేళ వన్డేలకు సుందర్ దూరమైతే మరోసారి జయంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. కాగా 2016లో న్యూజిలాండ్‌పై వన్డేల్లో అరంగేట్రం చేసిన జయంత్ యాదవ్.. ఇప్పటి వరకు ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ గాయం కారణంగా దక్షిణాఫ్రికా దూరం కావడంతో జయంత్‌కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయం అనిపిస్తోంది. ఇక భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జనవరి 19 న జరగనుంది. అదే విధంగా టీమిడియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం కావడంతో కేఎల్ రాహుల్ వన్డేలకు సారథ్యం వహించనున్నాడు. చదవండి: WTC 2021-23 Points Table: టాప్-3 లో పాకిస్తాన్.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే! -
Ind Vs Sa 3rd Test: సిరాజ్ స్దానంలో ఉమేశ్.. తుది జట్లు ఇవే
తుది పోరులో దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోవడానికి భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమైన విరాట్ కోహ్లి తుది జట్టులోకి వచ్చాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా సిరాజ్ దూరం కావడంతో ఉమేశ్ యాదవ్‌కు స్ధానం దక్కింది. ఇక ఎటువంటి మార్పులు లేకుండానే దక్షిణాఫ్రికా బరిలోకి దిగింది. కాగా ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపించడంతో పాటు బౌన్స్ కారణంగా బ్యాట్స్‌మెన్ కూడా బాగా పరుగులు సాధించే అవకాశం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పొడిబారి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమమైన నిర్ణయం అనే చెప్పుకోవాలి. తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. చదవండి: Ind Vs Sa 3rd Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ -
IND vs SA 3rd Test Day 1: భారత్ 223 ఆలౌట్, దక్షిణాఫ్రికా 17/1
IND vs SA 3rd Test Updates: భారత్ 223 ఆలౌట్, దక్షిణాఫ్రికా 17/1 తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్(3)ను బుమ్రా ఔట్ చేశాడు. క్రీజ్‌లో మార్క్రమ్(8), కేశవ్ మహారాజ్(6) ఉన్నారు. 8: 46 PM: సఫారీ పేసర్ల విజృంభణ.. టీమిండియా 223 ఆలౌట్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో టీమిండియా నిరాశపరిచింది. సఫారీ పేసర్ల ధాటికి 223 పరుగులకే చాపచుట్టేసింది. కెప్టెన్ కోహ్లి(79) ఓంటరి పోరాటం చేయడంతో గౌరవప్రదమైన స్కోర్‌ను సాధించగలిగింది. సఫారీ బౌలర్లు రబాడ 4, మార్కో జన్సెన్ 3, ఒలీవియర్, ఎంగిడి, కేశవ్ మహారాజ్ తలో వికెట్ సాధించారు. కోహ్లి(79) ఔట్.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా క్రీజ్‌లో పాతుకుపోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(79) ఎట్టకేలకు ఔటయ్యాడు. రబాడ బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి 211 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. క్రీజ్‌లో ఉమేశ్ యాదవ్, షమీ ఉన్నారు. టీమిండియా ఎనిమిదో వికెట్ డౌన్ డ్రింక్స్ బ్రేక్‌కు ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. రబాడ బౌలింగ్‌లో బుమ్రా డకౌటయ్యాడు. ఫలితంగా టీమిండియా 210 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో కోహ్లి(78), ఉమేశ్ యాదవ్ ఉన్నారు. శార్ధూల్ ఔట్ రెండో టెస్ట్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించిన శార్ధూల్ ఠాకూర్(12) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. వచ్చీ రాగానే భారీ షాట్లతో విరుచుకుపడిన అతను.. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో కీగన్ పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 205 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో కోహ్లి(73), బుమ్రా ఉన్నారు. జన్సెన్ విజృంభణ.. 175 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా దక్షిణాఫ్రికా యువ పేసర్ మార్కో జన్సెన్ విజృంభణతో టీమిండియా 175 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. అశ్విన్ 2 పరుగులు మాత్రమే చేసి జన్సెన్ బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లో కోహ్లి(56), శార్ధూల్ ఠాకూర్ ఉన్నాడు. 167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా మార్కో జన్సెన్ టీమిండియాపై మరోసారి ప్రతాపం చూపుతున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇదివరకే కీలకమైన పుజారా వికెట్ పడగొట్టిన అతను.. రిషబ్ పంత్(27)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. దీంతో టీమిండియా 167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి(50), అశ్విన్ క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 116 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. రహానే(9) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. రబాడ బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి రహానే ఔటయ్యాడు. క్రీజ్‌లో విరాట్ కోహ్లి(29), పంత్ ఉన్నారు. టీమిండియా మూడో వికెట్ డౌన్ క్రీజ్‌లో నిలదొక్కుకున్నట్లు కనిపించిన పుజారా 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మార్కో జన్సెన్ బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా 95 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో కోహ్లి(17), రహానే ఉన్నారు. 5: 06 PM: టీమిండియా స్కోరు: 85/2 (34.3). పుజారా 35, కోహ్లి 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రొటిస్ బౌలర్లు రబడ, ఒలివర్ చెరో వికెట్ తీశారు. 4: 00 PM: లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 75/2 (28). కోహ్లి 15, పుజారా 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. 3: 36 PM: టీమిండియా ప్రస్తుత స్కోరు: 53/2 (22.1). కెప్టెన్ కోహ్లి 5, పుజారా 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 2: 53 PM: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్‌ను రబడ అవుట్ చేశాడు. స్కోరు: 33/2. విరాట్ కోహ్లి, పుజారా క్రీజులో ఉన్నారు. 2: 48 PM: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. కేఎల్ రాహుల్ అవుట్. ఒలివర్ బౌలింగ్‌లో టీమిండియా ఓపెనర్ రాహుల్ పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్ వెరెన్కు క్యాచ్ ఇచ్చి 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. పుజారా క్రీజులోకి వచ్చాడు. 2: 30 PM: కేఎల్ రాహుల్ 12, మయాంక్ అగర్వాల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు 31/0. మూడో టెస్టులో రెండు మార్పులతో భారత జట్టు బరిలోకి దిగింది. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన విరాట్ కోహ్లి.. విహారి స్ధానంలో జట్టులోకి రాగా, సిరాజ్ స్థానంలో ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక దక్షిణాఫ్రికా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తుది సమరానికి భారత్ సిద్దమైంది. ఒక్కో టెస్టు గెలిచి భారత్, దక్షిణాఫ్రికా 1–1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. తొలి సారి సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ సాధించి చరిత్ర సృష్టించాలన్న పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. చదవండి: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. సూపర్ మ్యాన్‌లా.. వీడియో వైరల్! -
కోహ్లి వచ్చేశాడు.. భారత్ చరిత్ర సృష్టించేనా?
కేప్‌టౌన్: ‘ఫ్రీడం ట్రోఫీ’లో విజేతను తేల్చే సమరానికి సమయమైంది. ఒక్కో టెస్టు గెలిచి భారత్, దక్షిణాఫ్రికా 1–1తో సమంగా ఉన్న స్థితిలో నేటినుంచి జరిగే మూడో టెస్టులో గెలిచే జట్టు సిరీస్‌ను సొంతం చేసుకోనుంది. 2018లో ఇక్కడే జరిగిన సిరీస్‌లో భారత్ తొలి రెండు టెస్టులు ఓడి సిరీస్ కోల్పోయిన అనంతరం మూడో టెస్టును నెగ్గి ఆధిక్యాన్ని 1–2కు తగ్గించింది. ఇప్పుడు దానికంటే భిన్నమైన పరిస్థితుల్లో చివరి టెస్టు నిర్ణాయకంగా మారడం విశేషం. ఈ టెస్టు గెలిస్తేనే సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గాలన్న భారత జట్టు కల నెరవేరుతుంది. మరి కోహ్లి ఈ ఫీట్‌ను సాధించి తన ఖాతాలో చారిత్రాత్మక రికార్డును జమ చేసుకుంటాడో చూడాలి! సిరాజ్ అవుట్... భారత తుది జట్టులో రెండు మార్పులు జరగడం ఖాయమైంది. వెన్ను నొప్పితో రెండో టెస్టుకు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లి పూర్తి ఫిట్‌గా మారి ఈ మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. దాంతో హైదరాబాద్ బ్యాటర్ హనుమ విహారిపై వేటు పడటం దాదాపు ఖాయమైంది. వాండరర్స్‌లో విహారి మంచి ప్రదర్శనే కనబర్చినా...అనుభవం, పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికిప్పుడు పుజారా, రహానేలలో ఒకరిపై వేటు వేసి విహారిని ఎంపిక చేసే అవకాశాలు కనిపించడం లేదు. పైగా గత టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో వీరిద్దరు కీలక అర్ధ సెంచరీలతో ఫామ్‌లోకి వచ్చారు. మరో వైపు తొడ కండరాల గాయంతో రెండో టెస్టులో తీవ్రంగా ఇబ్బంది పడిన హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్‌నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. నిజాయితీగా చెప్పాలంటే భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణమైంది. కాబట్టి ఈ టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించగలిగితేనే బౌలర్లపై నమ్మకం ఉంచవచ్చు. ఓపెనర్లు రాహుల్, మయాంక్ మరోసారి శుభారంభం అందించాల్సి ఉండగా...పుజారా, రహానే తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. కోహ్లినుంచి కూడా జట్టు ఒక భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. మార్పుల్లేకుండానే... కెప్టెన్ ఎల్గర్ దుర్బేధ్యమైన ఆటతో జట్టు భారం మోస్తుండగా, మరో ఓపెనర్ మార్క్రమ్ రాణించాల్సి ఉంది. కీగన్ పీటర్సన్ కూడా బాగానే ఆడుతున్నా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. మిడిలార్డర్లో వాన్ డర్ డసెన్ ఇంకా తడబడుతూనే ఉండటం దక్షిణాఫ్రికాను ఇబ్బంది పెడుతోంది. తెంబా బవుమా మాత్రం చక్కటి ప్రదర్శన కనబరిస్తూ సిరీస్‌లో కీలక ఆటగాడిగా మారాడు. ఒక్కసారిగా జట్టు పేస్ బలంగా మారిపోయింది. రబడ ఫామ్‌లోకి రావడంతో పాటు జాన్సెన్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటం భారత్‌ను ఇబ్బంది పెట్టవచ్చు. చదవండి: Ind Vs Sa 3rd Test: మాకు అశ్విన్ ఉన్నాడు.. అద్భుతాలు చేస్తాడు.. జడేజాను మిస్సవడం లేదు: కోహ్లి -
IND vs SA 3rd Test: ద్రవిడ్‌పై కోహ్లి 'పైచేయి' సాధించేనా?
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగునున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆడడం దాదాపు ఖాయమైంది. జొహాన్స్‌బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌కు గాయం కారణంగా కోహ్లి దూరమైన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాదించింది. దీంతో మూడు టెస్ట్‌ల సిరీస్ 1-1తో సమమైంది. ఇక మూడో టెస్ట్‌కు ముందు ఓ అరుదైన రికార్డు కోహ్లిని ఊరిస్తుంది. దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా సచిన్ సచిన్ టెండూల్కర్(1161), రాహుల్ ద్రవిడ్(624) పరుగులతో ఉన్నారు. అయితే దక్షిణాఫ్రికాలో 611 పరుగులు చేసిన కోహ్లి.. ద్రవిడ్ రికార్డును అధిగమించడానికి కేవలం 14 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇక కోహ్లి తన కేరిర్‌లో 99వ టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. ఇక భారత్- దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్ట్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: Ind Vs Sa: హనుమ విహారికి నో ఛాన్స్.. పంత్‌కు అవకాశం... సిరాజ్ స్థానంలో అతడే! ఎందుకంటే.. -
'పంత్‌ని కొద్ది రోజులు పక్కన పెట్టండి.. అప్పుడే తెలిసి వస్తుంది'
జొహాన్స్ బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో నిర్లక్ష్యంగా ఆడి వికెట్ కోల్పోయిన రిషబ్ పంత్‌పై మాజీలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ కోవలో భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ కూడా చేరాడు. పంత్ మ్యాచ్ విన్నర్ అనడంలో సందేహం లేదని, కానీ రెండవ ఇన్నింగ్స్‌లో ఆ విధంగా అతడు బ్యాటింగ్ చేయలేదని మదన్ లాల్ తెలిపాడు. "పంత్‌ని పక్కన పెట్టవలసిన సమయం వచ్చింది. అతడి స్ధానంలో వృద్ధిమాన్ సాహాకు అవకాశం ఇవ్వాలి. అతడు పంత్ కంటే తెలివైన ఆటగాడు. అదే విధంగా అతడు అత్యుత్తమ వికెట్ కీపర్. . అయితే టెస్టు క్రికెట్లో పంత్ ఎలా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాడో అతడే నిర్ణయించుకోవాలి. కాబట్టి అతడికి కాస్త బ్రేక్ ఇవ్వాలి. పంత్ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ అనడంలో సందేహం లేదు. కానీ అతడు తన ఆటకు తగ్గట్లు రాణించడం లేదు. ఏ ఆటగాడైన జట్టు కష్ట పరిస్ధితుల్లో ఉన్నప్పుడు అదుకోవాలి" అని మదన్ లాల్ పేర్కొన్నాడు. ఇక భారత్-దక్షిణాఫ్రికా మధ్య అఖరి టెస్ట్ కేప్ టౌన్ వేదికగా జనవరి 11న ప్రారంభంకానుంది. ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. దీంతో మూడో టెస్ట్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: NZ vs BAN: ఇదేం ఫీల్డింగ్ రా బాబు.. ఒక బంతికి 7 పరుగులు.. వీడియో వైరల్! -
కోహ్లిని వెనకేసుకొచ్చిన వార్నర్..
గత రెండేళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి విషయమై ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ పరంగా కోహ్లి ప్రస్తుతం గడ్డు పరిస్థితలను ఎదుర్కొంటున్నప్పటికీ, అతను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని అన్నాడు. తన బ్యాటింగ్ నైపుణ్యంతో ఎన్నో వ్యక్తిగత రికార్డులతో పాటు టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు అందించిన రన్ మెషీన్‌కు బ్యాటింగ్‌లో విఫలమయ్యే హక్కు, అధికారం రెండూ ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఆటగాడు ఫామ్ కోల్పోవడం సహజమని, కోహ్లి విషయంలోనూ అదే జరిగిందని, యంత్రంలా పరుగులు చేసేందుకు అతనేమీ రోబో కాదని వెనకేసుకొచ్చాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి సెంచరీ సాధించి రెండేళ్లు పూర్తైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతను పరిమిత ఓవర్ల కెప్టెన్సీని కోల్పోవడంతో పాటు ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అతని ర్యాంకు క్రమంగా దిగజారుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లికి జట్టులో చోటు సైతం ప్రశ్నార్ధకంగా మారింది. చదవండి: Ashes: స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు... బ్రాడ్‌మన్ వంటి దిగ్గజాలతో పాటుగా -
హైదరాబాద్ క్రికెటర్‌పై ద్రవిడ్ కీలక వాఖ్యలు..
హైదరాబాద్ బ్యాటర్ హనుమ విహారి దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. కోహ్లి గాయం కారణంగా వచ్చిన అవకాశాన్ని అతను సమర్థంగా వినియోగించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా ఎగసిన బంతికి అతను అవుట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో కీలక పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ విషయాన్ని భారత్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అంగీకరించాడు. అయినా సరే విహారికి తుది జట్టులో చోటు ఖాయం కాదని అతను పరోక్షంగా చెప్పాడు. కోహ్లి కోలుకొని టీమ్‌లోకి వస్తే విహారిని పక్కన పెట్టడం ఖాయమని సంకేతమిచ్చాడు. విహారితో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా రెగ్యులర్‌గా అవకాశాలు దక్కించుకునేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశాడు. ‘విహారి రెండు ఇన్నింగ్స్‌లలో చక్కగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో దురదృష్టకర రీతిలో అవుటైన అతను రెండో ఇన్నింగ్స్‌లో తన ఆటతో జట్టులో ఆత్మవిశ్వాసం నింపాడు. అయ్యర్ కూడా ఆడిన రెండు టెస్టుల్లో ఆకట్టుకున్నాడు. తాము ఎప్పుడు బరిలోకి దిగినా బాగా ఆడగలమని వారు నిరూ పించారు. అయితే ఇప్పటికిప్పు డే కాకుండా మున్ముందు వారికి తగిన అవకాశాలు లభిస్తాయి’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. చదవండి: MS Dhoni: పాక్ పేసర్‌కు ధోని స్పెషల్ గిఫ్ట్.. భావోద్వేగానికి గురైన క్రికెటర్.. దటీజ్ లెజెండ్! -
"ఆ విషయం గురించి పంత్‌తో మాట్లాడతాం"
జొహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో రిషభ్ పంత్ వికెట్ పారేసుకున్న తీరు విమర్శలపాలైంది. తాను ఎదుర్కొన్న మూడో బంతికే ముందుకు దూసుకొచ్చి షాట్ ఆడిన అతను డకౌటయ్యాడు. ఇది అతని సహజ శైలే అయినా ఆడిన సందర్భం తప్పని, దీనిపై పంత్‌తో మాట్లాడతామని ద్రవిడ్ అన్నాడు. ‘పంత్ ఎలా ఆడతాడనేది మనకందరికీ తెలుసు. అదే శైలితో అతను మంచి ఫలితాలు కూడా సాధించాడు. అయితే కొన్నిసార్లు పరిస్థితులను బట్టి కూడా షాట్లను ఎంపిక చేసుకోవాలి. ఈ విషయం గురించి అతనికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పని మేం చేస్తాం’ అని ద్రవిడ్ స్పష్టం చేశాడు. చదవండి: MS Dhoni: పాక్ పేసర్‌కు ధోని స్పెషల్ గిఫ్ట్.. భావోద్వేగానికి గురైన క్రికెటర్.. దటీజ్ లెజెండ్! -
టీమిండియాకు భారీ షాక్.. మూడో టెస్ట్‌కు స్టార్ బౌలర్ దూరం!
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ ఓటమి నుంచి కోలుకునే లోపే భారత్‌కు మరో భారీ షాక్. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయం కారణంగా మూడో టెస్ట్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో గాయపడిన సిరాజ్ ఇంకా కోలుకోనట్లు సమాచారం. ఈ క్రమంలో రెండో టెస్ట్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన భారత కోచ్ రాహుల్ ద్రవిడ్.. సిరాజ్ గాయంపై అప్డేట్ అందించాడు. "సిరాజ్ నెట్స్‌లో కష్టపడాలి. హామ్ స్ట్రింగ్ గాయం నుంచి వెంటనే కోలుకోవడం చాలా కష్టం. మొదటి ఇన్నింగ్స్‌లో గాయంతో సిరాజ్ దూరం కావడం మాకు ఒక పెద్ద ఎదురుదెబ్బ. అతడు గాయపడినప్పటికీ మూడో రోజు బౌలింగ్‌కు వచ్చాడు. ఒక వేళ కెప్టౌన్ టెస్ట్‌కు సిరాజ్ దూరమైతే, ఉమేష్, ఇషాంత్ రూపంలో మాకు మంచి బెంచ్ బలం ఉంది అని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఇక జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియాపై దక్షిణాఫ్రికా 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్ట్‌ల సిరీస్1-1తో సమమైంది. ఇక కేప్ టౌన్ వేదికగా జనవరి 11న ప్రారంభం కానున్న అఖరి టెస్ట్‌లో ఇరు జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. చదవండి: SA vs IND: కోహ్లి గాయంపై కీలక ప్రకటన చేసిన ద్రవిడ్..