10:20 PM: సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా పోరాడి ఓడిపోయింది. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.2 ఓవర్లలో 283 పరుగుల వద్ద ఆలౌట్ కావడంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. దీపక్ చహర్ 54 పరుగులతో ఆఖర్లో ఆశలు రేపినప్పటికి చివరి నిమిషంలో ఔటవడంతో టీమిండియా ఓటమి ఖరారు అయింది. అంతకముందు శిఖర్ ధావన్ 61, కోహ్లి 65 రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఫెక్యలువాయో 3, లుంగీ ఎన్గిడి 3, డ్వేన్ ప్రిటోరియస్ 2 వికెట్లు తీశారు.
8:46 PM: కోహ్లి(65).. టీమిండియా నాలుగో వికెట్ డౌన్
విరాట్ కోహ్లి శతక దాహం ఈ మ్యాచ్‌లో కూడా తీరలేదు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి.. 65 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో బవుమాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 32 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 157/4గా ఉంది. క్రీజ్‌లో శ్రేయస్ అయ్యర్(16), సూర్యకుమార్ యాదవ్(1) ఉన్నారు.
8:15 PM: ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
116 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసి శతకం దిశగా సాగుతున్న శిఖర్ ధవన్(73 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్).. ఫెలుక్వాయో బౌలింగ్‌లో వికెట్‌కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదే ఓవర్‌లో టీమిండియాకు మరో షాక్ తగిలింది. పంత్ వచ్చీ రాగానే.. మగాలాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా టీమిండియా 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజ్‌లో కోహ్లి(43), శ్రేయస్ అయ్యర్ ఉన్నారు.
టార్గెట్ 288.. ఆదిలోనే టీమిండియాకు షాక్
288 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(9).. ఎంగిడి బౌలింగ్‌లో మలాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా 18 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో ధవన్(9), కోహ్లి ఉన్నారు.
6: 04 PM: టీమిండియా టార్గెట్ 288
ఆఖరి ఓవర్‌లో ప్రసిద్ధ కృష్ణ చెలరేగడంతో దక్షిణాఫ్రికా చివరి రెండు వికెట్లు బంతుల వ్యవధిలో కోల్పోయింది. 49వ ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించిన మిల్లర్(39)..మూడో బంతికి క్యాచ్ ఔట్ కాగా, ఐదో బంతికి మగాలా.. కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 287 పరుగుల వద్ద ముగిసింది. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 3, బుమ్రా, దీపక్ చాహర్ తలో రెండు వికెట్లు, చహల్ ఓ వికెట్ పడగొట్టగా.. మార్క్రమ్ రనౌటయ్యాడు. సఫారీ బ్యాటర్లలో డికాక్(124) సెంచరీతో చెలరేగాడు.
5:56 PM: ఎనిమిదో వికెట్ డౌన్
భారీ స్కోర్ సాధిస్తామనుకున్న దక్షిణాఫ్రికా ఆశలపై టీమిండియా బౌలర్లు నీళ్లు చల్లారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. 48వ ఓవర్‌లో ప్రసిద్ధ కృష్ణ.. ప్రిటోరియస్(20)ను పెవిలియన్‌కు పంపగా, 49వ ఓవర్‌లో బుమ్రా.. కేశవ్ మహారాజ్(6)ను ఔట్ చేశాడు. ఫలితంగా ఆ జట్టు 49 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. క్రీజ్లో మిల్లర్(35), మగాలా ఉన్నారు.
5: 18 PM: ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. ఫెలుక్వాయో(4) రనౌట్
శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన త్రో కారణంగా దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 40.1వ ఓవర్లో ఫెలుక్వాయో(4) రనౌటయ్యాడు. క్రీజ్‌లో మిల్లర్(7), ప్రిటోరియస్ ఉన్నారు. 41 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 229/6గా ఉంది.
5:02 PM: డస్సెన్(52) ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
హాఫ్ సెంచరీ చేసిన వెంటనే డస్సెన్ ఔటయ్యాడు. 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద చహల్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 37 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 219/5గా ఉంది. క్రీజ్‌లో మిల్లర్(2), ఫెలుక్వాయో ఉన్నారు.
4: 52 PM: దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ డౌన్
124 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సెంచరీ హీరో డికాక్ ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో ధవన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 36 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 216/4గా ఉంది. క్రీజ్‌లో డస్సెన్(51), డేవిడ్ మిల్లర్(1)ఉన్నారు.
4: 20 PM: డికాక్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా దక్షిణాఫ్రికా
31 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 174/3గా ఉంది. డికాక్.. 110 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసి 102 పరుగులతో కొనసాగుతున్నాడు. డస్సెన్ 46 బంతుల్లో 40 పరుగులతో డికాక్‌కు తోడుగా క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మలాన్(1), మార్క్రమ్(15), బవుమా(8) ఔటయ్యారు. టీమిండియా బౌలర్లు చాహర్ రెండు వికెట్లు పడగొట్టగా బవుమా రనౌటయ్యాడు.
3:36 PM: సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ మరోసారి అర్థశతకంతో మెరిశాడు. 60 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న డికాక్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం సౌతాఫ్రికా 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.
3: 06 PM: మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
భువనేశ్వర్ కుమార్ స్థానంలో జట్టులోకి వచ్చిన దీపక్ చాహర్ సత్తా చాటుతున్నాడు. తొలుత మలాన్‌ను పెవిలియన్‌కు పంపిన అతను.. 13 ఓవర్‌లో మరో వికెట్ పడగొట్టాడు. సబ్‌స్టిట్యూట్ ఆటగాడు రుతురాజ్ క్యాచ్ పట్టడంతో మార్క్రమ్(15) పెవిలియన్ బాట పట్టాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 70 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో డికాక్(42), డస్సెన్ ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
7వ ఓవర్‌లో దక్షిణాఫ్రికాకు మరో షాక్ తగిలింది. చాహర్ బౌలింగ్‌లో ఇన్ ఫామ్ బ్యాటర్, సఫారీ కెప్టెన్ బవుమా(12 బంతుల్లో 8) రనౌటయ్యాడు. కేఎల్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో సఫారీ కెప్టెన్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా ఆ జట్టు 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో డికాక్(26), మార్క్రమ్ ఉన్నారు. అంతకుముందు 3వ ఓవర్ తొలి బంతికే దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జన్నెమన్ మలాన్(1).. చాహర్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
1:40 PM: కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తుది సమరానికి టీమిండియా సిద్దమైంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్.. చివరి వన్డేలోనైనా నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో నాలుగు మార్పులతో భారత్ బరిలోకి దిగగా, ప్రోటిస్ ఒకే ఒక మార్పు చేసింది. జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్, సూర్యకుమార్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చారు.
భారత తుది జట్టు: కెఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, జానేమన్ మలన్, ఎయిడెన్ మార్కరమ్, రసీ వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లూక్వాయో, మగాలా, కేశవ్ మహరాజ్, డ్వైన్ ప్రిటోరియస్, లుంగి ఎండ్వైన్ ప్రిటోరియస్గిడి.
Comments
Please login to add a commentAdd a comment