breaking news
KL Rahul
-
IND vs ENG: 500కు పైగా పరుగులు చేశాడు.. సంకుచిత బుద్ధి!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మరోసారి విమర్శల పాలైంది. ‘‘ఇంత సంకుచిత బుద్ధి ఎందుకు?. అసలు మిమ్మల్ని ఎవరు ఆ పోస్టు పెట్టమన్నారు’’ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. విషయం ఏమిటంటే.. టీమిండియా ఇటీవల ఇంగ్లండ్ (IND vs ENG)తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడిన విషయం తెలిసిందే.ఇంగ్లండ్ గడ్డ మీద జరిగిన ఈ ఐదు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు 2-2తో సమం చేసింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే బ్యాటర్‌గా చిరస్మరణీయ రికార్డులు సాధించిన శుబ్‌మన్ గిల్ (Shubman Gill).. సారథిగానూ మంచి మార్కులే కొట్టేశాడు. మరోవైపు.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్‌లతో పాటు పేసర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ కూడా అదరగొట్టారు.నిలకడగా రాణించిన ఏకైక ఆటగాడుఅయితే, ఈ సిరీస్ ఆసాంతం నిలకడగా రాణించిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్. ఐదు టెస్టుల్లో కలిపి 53.20 సగటుతో ఈ కర్ణాటక ఆటగాడు 532 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.హెడింగ్లీలో తొలి టెస్టులో 137 పరుగులు సాధించిన కేఎల్ రాహుల్.. లార్డ్స్‌లో 100 పరుగులు చేశాడు. ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో 55, ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో 90 పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ (754), జో రూట్ (537) తర్వాత మూడో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.రాహుల్ ఫొటో లేకుండానే..అసలు విషయానికి వస్తే.. లక్నో సూపర్ జెయింట్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో శుక్రవారం ఓ పోస్టు పెట్టింది. ‘‘యుగాల పాటు నిలిచిపోయే ఫొటో ఆల్బమ్’’ అంటూ టీమిండియా ఆటగాళ్లతో కూడిన ఫొటోలను షేర్ చేసింది. అయితే, ఇందులో ఎక్కడా కేఎల్ రాహుల్ లేడు.ఒక్కటీ దొరకలేదా?ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కర్ణాటకకు చెందిన దొడ్డ గణేశ్ లక్నో యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘ఇలా చేయడం అస్సలు బాలేదు. చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది.ఓపెనర్‌గా వచ్చి కొత్త బంతిని ఎదుర్కొని 500కు పైగా పరుగులు చేసిన ఆటగాడి ఫొటో మాత్రం మీకు దొరకలేదా?’’ అంటూ దొడ్డ గణేశ్ ప్రశ్నించాడు. నెటిజన్లు ఇందుకు స్పందిస్తూ.. ‘‘అంతే సార్.. వాళ్లకు గొప్పగా ఆడినవాళ్లు కనబడరు. అయినా లక్నోకు ఇలా చేయడం అలవాటే. వాళ్ల ఓనర్ సంజయ్ గోయెంకానే వారికి ఆదర్శం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.గతేడాది లక్నోను వీడిన రాహుల్కాగా ఐపీఎల్-2022 సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎల్ఎస్జీకి కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మూడేళ్లపాటు అదే జట్టుతో కొనసాగిన అతడు రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు. అయితే, గతేడాది లక్నో పేలవ ప్రదర్శన నేపథ్యంలో సంజీవ్ గోయెంకా అందరిముందే కేఎల్ రాహుల్‌ను తిట్టడం విమర్శలకు దారితీసింది. అనంతరం రాహుల్ జట్టును వీడి.. ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు.అయితే, టీమిండియా తరఫున అతడు గొప్పగా చాటినా లక్నో తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసే ఫొటోల్లో అతడిపై వివక్ష చూపించడం.. వారి సంకుచిత బుద్ధికి నిదర్శనం అని కేఎల్ రాహుల్ అభిమానులు మండిపడుతున్నారు.చదవండి: చెవికి అతికించి.. ఛీ!.. ఇలా చేశావేంటి?.. హ్యారీ బ్రూక్ చర్య వైరల్This is getting embarrassing. Couldn’t get a picture of an opener who played the new ball and scored 500+ runs 🤷♂️ https://t.co/fGhFFuOWi3— Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) August 8, 2025 -
‘విరాట్ భయ్యా అరుస్తూనే ఉన్నాడు.. నాకేమో భయం’
టెస్టుల్లో అరంగేట్రం సందర్భంగా తనకు ఎదురైన అనుభవం గురించి టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana) తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఓవైపు తనను భయపెడుతుంటే.. మరోవైపు.. విరాట్ భయ్యా, రాహుల్ భయ్యా తనను ‘ఆందోళన’కు గురిచేశారంటూ సరదా విషయాలు పంచుకున్నాడు.తొలి వికెట్‌గా అతడుకాగా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు ద్వారా హర్షిత్ రాణా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో అతడు బంతితో రంగంలోకి దిగాడు. ట్రవిస్ హెడ్ (11) రూపంలో తన తొలి అంతర్జాతీయ వికెట్ దక్కించుకున్న ఈ రైటార్మ్ పేసర్.. జిడ్డు ఇన్నింగ్స్‌తో క్రీజులో పాతుకుపోయిన మిచెల్ స్టార్క్ (112 బంతుల్లో 26)ను కూడా వెనక్కి పంపించాడు.నాకు ఇది గుర్తుండిపోతుందిఈ క్రమంలో హర్షిత్.. స్టార్క్‌కు బౌన్సర్ సంధించగా.. బంతి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. దీంతో కంగారుపడ్డ హర్షిత్.. అంతా ఒకేనా అన్నట్లు స్టార్క్‌కు సైగ చేశాడు. ఇందుకు బదులుగా.. ‘‘నేను నీకంటే ఫాస్ట్‌గా బౌల్ చేయగలను. నాకు ఇది గుర్తుండిపోతుంది’’ అంటూ స్టార్క్ సరదాగా వ్యాఖ్యానించాడు.చచ్చానురా దేవుడా!ఈ విషయం గురించి హర్షిత్ రాణా తాజాగా మాట్లాడుతూ.. ‘‘చాలా సేపటి తర్వాత ఆరోజు నేను స్టార్క్‌కు బౌన్సర్ వేశాను. అతడు స్లెడ్జ్ చేయగానే.. నేను నవ్వేశాను. కానీ.. తిరిగి బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నపుడు.. ‘చచ్చానురా దేవుడా!.. ఇక ఇప్పుడు అతడు నాకు కూడా బౌన్సర్సే వేస్తాడు’ అని భయపడ్డాను.కొట్టు.. ఇంకా కొట్టుఇంతలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ భయ్యా, కేఎల్ భాయ్.. ‘సేమ్ స్పాట్లో అతడికి మళ్లీ బంతి తగిలేలా బౌలింగ్ వెయ్’ అని అరుస్తూనే ఉన్నారు. నేనేమో.. ‘భయ్యా మీరైతే అతడి బౌలింగ్‌లో సులభంగానే ఆడేస్తారు. మరి నా పరిస్థితి ఏమిటి?అనుకున్నదే జరిగిందిఅతడు కూడా నన్ను హెల్మెట్‌పై బంతితో కొడతాడు’ అని మనసులోనే అనుకున్నా. అనుకున్నట్లుగానే రెండో టెస్టులో స్టార్క్ బాల్‌ను నా హెల్మెట్ మీదకు వేశాడు’’ అని బీర్‌బైసెప్స్ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ చాంపియన్‌గా నిలవడంలో స్టార్క్, హర్షిత్‌లు కీలక పాత్ర పోషించారు.ఇక పెర్త్ టెస్టులో హర్షిత్ రాణా మొత్తంగా నాలుగు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలోని టీమిండియా ఆస్ట్రేలియాను ఏకంగా 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అయితే, ఐదు మ్యాచ్‌ల బోర్డర్- గావస్కర్ ట్రోఫీని మాత్రం 1-3తో చేజార్చుకుంది. చదవండి: AUS vs ENG: అతడికి ఇక నిద్రలేని రాత్రులే!.. వార్నర్ ఓ జోకర్!Mitch Starc offers a little warning to Harshit Rana 😆#AUSvIND pic.twitter.com/KoFFsdNbV2— cricket.com.au (@cricketcomau) November 23, 2024 -
IND vs ENG: అతడొక అండర్రేటెడ్ ప్లేయర్: సచిన్ టెండుల్కర్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravnidra Jadeja) బ్యాట్‌తో అదరగొట్టాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy) ఆసాంతం నిలకడగా బ్యాటింగ్ చేశాడు. కీలక సమయాల్లో తానున్నానంటూ జట్టును ఆదుకున్నాడు.మొత్తంగా ఐదు టెస్టుల్లో కలిపి జడ్డూ 516 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం.. ఐదు అర్ధ శతకాలు ఉండటం విశేషం. అంతేకాదు జడ్డూ ఈ సిరీస్‌లో ఏడు వికెట్లు కూడా పడగొట్టడం గమనార్హం. ఇలా ఇంగ్లండ్‌తో సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేయడంలో తన వంతు పాత్రను జడేజా సమర్థవంతంగా పూర్తి చేశాడు.అతడు ఓ అండర్రేటెడ్ ప్లేయర్ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) రవీంద్ర జడేజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వెటరన్ ఆల్‌రౌండర్ అద్భుతంగా ఆడినా రావాల్సినంత గుర్తింపు దక్కడం లేదని పేర్కొన్నాడు. ‘‘అతడు ఓ అండర్రేటెడ్ ప్లేయర్ అనే చెప్తాను.క్రెడిట్ దక్కడం లేదుజట్టు కోసం అతడు ఎంతో కష్టపడతాడు. తన వంతుగా పరుగులు రాబడతాడు. వికెట్లు తీస్తాడు. కానీ అతడికి ఎక్కువగా క్రెడిట్ దక్కడం లేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో బ్యాటర్‌గా చిరస్మరణీయ ప్రదర్శన కనబరిచాడు.ఈ ఒక్క సిరీస్ అనే కాదు.. గతంలోనూ చాలా సార్లు జట్టుకు అవసరమైన వేళ నేనున్నానంటూ వచ్చి.. ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు’’ అని సచిన్ టెండుల్కర్ జడ్డూపై ప్రశంసల వర్షం కురిపించాడు.కేఎల్ రాహుల్ అత్యుత్తమ ప్రదర్శనఅదే విధంగా.. కేఎల్ రాహుల్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘కేఎల్ రాహుల్ అత్యుత్తమ ప్రదర్శనను మరోసారి ఈ సిరీస్‌లో చూశాను. అతడు చక్కగా డిఫెండ్ చేసుకోవడంతో పాటు.. వీలు చిక్కినప్పుడల్లా తనవైన షాట్లతో అలరించాడు. ఏ బంతిని ఆడాలో.. దేనిని వదిలేయాలో అతడికి తెలుసు. కొన్నిసార్లు తన ప్లానింగ్‌తో బౌలర్లనే బోల్తా కొట్టించాడు కూడా’’ అని సచిన్ టెండుల్కర్ రాహుల్‌ను కొనియాడాడు.కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడింది. తొలుత లీడ్స్‌లో ఓటమిపాలైన గిల్ సేన.. ఎడ్జ్‌బాస్టన్‌లో మాత్రం చారిత్రాత్మక విజయం సాధించింది. అనంతరం లార్డ్స్ టెస్టులో ఓడిన భారత జట్టు.. మాంచెస్టర్ టెస్టును డ్రా చేసింది. అయితే, చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరిదైన ఓవల్ టెస్టులో మాత్రం అదరగొట్టింది. ఓటమి ఖాయమనుకున్న వేళ ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఇక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లోనూ భారత్‌కు ఇదే తొలి సిరీస్ అన్న విషయం తెలిసిందే. చదవండి: Dhruv Jurel: అతడికి నువ్వెందుకు చెప్పలేదు? గిల్‌తో సిరాజ్.. కొంప మునిగేదే! -
IND vs ENG: టీమిండియా నుంచి ఆరుగురు.. గిల్‌కు చోటు లేదు!
ఐదు టెస్టులు.. ఇరవై ఐదు రోజులు.. ఆద్యంతం ఆసక్తికరం.. ఆఖరి టెస్టు.. ఆఖరి రోజు వరకు ఉత్కంఠ రేపిన పోరు.. టెస్టు క్రికెట్ ప్రేమికుల మది దోచుకున్న సిరీస్.. అదే ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ.. భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరు 2-2తో సమంగా ముగిసింది.లీడ్స్‌లో ఇంగ్లండ్, ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా గెలవగా.. లార్డ్స్‌లో ఆతిథ్య జట్టు జయభేరి మోగించింది. అనంతరం మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు డ్రా కాగా.. ఆఖరిదైన ఓవల్ టెస్టులో టీమిండియా ఆరు పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను డ్రా చేసింది. సిరాజ్ మేజిక్అయితే, ఇరుజట్లు కూడా ఆఖరి నిమిషం వరకు పోరాడిన తీరు అద్భుతం. చివరకు చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పేసర్ మహ్మద్ సిరాజ్ తొమ్మిది వికెట్లతో సత్తా చాటి టీమిండియా విజయాన్ని ఖరారు చేయడం అభిమానులను ఖుషీ చేసింది.ఇదిలా ఉంటే.. ఈ మెగా సిరీస్‌కు సంబంధించి ఇంగ్లండ్- ఇండియా నుంచి అత్యుత్తమ తుదిజట్టును ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తాజాగా ఎంపిక చేశాడు. తన జట్టులో ఓపెనర్లుగా టీమిండియా జోడీకి స్థానం ఇచ్చిన ఈ లెజెండరీ బౌలర్.. మిడిలార్డర్లో మాత్రం ఇంగ్లండ్‌కే పెద్దపీట వేశాడు.అదనపు భారాన్నీ తానే మోశాడుఇక ఆల్‌రౌండర్ జాబితాలో వాషింగ్టన్ సుందర్‌కూ చోటిచ్చిన బ్రాడ్.. పేస్ దళంలో జోఫ్రా ఆర్చర్‌తో పాటు టీమిండియా ద్వయాన్ని కూడా ఎంపిక చేశాడు. ఓవరాల్‌గా తన జట్టులో ఆరుగురు భారత ఆటగాళ్లు, ఐదుగురు ఇంగ్లండ్ ప్లేయర్లకు చోటిచ్చాడు. అయితే, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, 754 పరుగులు సాధించిన భారత సారథి శుబ్‌మన్ గిల్‌కు మాత్రం అతడు స్థానం కల్పించలేదు.ఈ సందర్భంగా సిరాజ్‌ను ప్రత్యేకంగా అభినందించాడు స్టువర్ట్ బ్రాడ్. ‘‘ప్రతిసారి బంతిని అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. బాధ్యతంతా తన మీదే వేసుకున్నాడు. బుమ్రా గైర్హాజరీలో అదనపు భారాన్నీ తానే మోశాడు. పేస్ దళాన్ని ముందుండి నడిపించాడు. సిరాజ్ ఉండటం భారత జట్టును మరింత పటిష్టం చేస్తుంది’’ అంటూ స్టువర్ట్ బ్రాడ్ సిరాజ్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో పదకొండు వందలకు పైగా బంతులు వేసిన సిరాజ్ 23 వికెట్లు కూల్చాడు. తద్వారా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ-2025లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ 2025 టెస్టు సిరీస్- స్టువర్ట్ బ్రాడ్ కంబైన్డ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదేయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, జోఫ్రా ఆర్చర్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: మా బ్యాటర్లు భయపడ్డారు.. కానీ అతడు ఉండుంటే గెలిచేవాళ్లం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
ENG VS IND 5th Test: కోహ్లిని దాటేసిన రాహుల్
టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపుతున్నాడు. బ్యాటింగ్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో 532 పరుగులు చేసి సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో రాహుల్ ఫీల్డర్‌గానూ సత్తా చాటాడు. 5 మ్యాచ్‌ల్లో 6 క్యాచ్‌లు (ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ ఇంకా కొనసాగుతుంది) పట్టాడు. స్లిప్స్‌లో రాహుల్ చాలా అలర్ట్‌గా ఉంటూ ఇంగ్లండ్ బ్యాటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు.KL RAHUL HAS BEEN FANTASTIC IN SLIPS...!!! 💪 pic.twitter.com/juvyI9uH5R— Johns. (@CricCrazyJohns) August 3, 2025ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో రాహుల్ బెన్ డకెట్ (ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో) క్యాచ్ పట్టడంతో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని అధిగమించాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ కోహ్లిని వెనక్కు నెట్టాడు. ఇంగ్లండ్‌లో కోహ్లి టెస్ట్‌ల్లో 25 క్యాచ్‌లు పడితే.. తాజాగా రాహుల్ తన క్యాచ్‌ల సంఖ్యను 26కు పెంచుకున్నాడు. ఈ విభాగంలో సునీల్ గవాస్కర్ (35), రాహుల్ ద్రవిడ్ (30) మాత్రమే రాహుల్ ముందున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ మోస్తరుగా ఆడుతుంది. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27) ఔట్ కాగా.. జో రూట్ (23), బ్రూక్ (38) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే ఇంకా 210 పరుగులు చేయాలి. అదే భారత్ గెలుపుకు కేవలం 6 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) కావాలి. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
టీమిండియా సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు సమం
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు సందర్భంగా టీమిండియా (IND vs ENG 5th Test) సరికొత్త చరిత్ర లిఖించింది. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక శతకాలు బాదిన జట్ల జాబితాలో చేరింది. తద్వారా ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్ల సరసన నిలిచి ప్రపంచ రికార్డు సమం చేసింది. అయితే, విదేశీ గడ్డ మీద ఈ ఘనత సాధించిన రెండో టీమ్‌గా మరో అరుదైన ఫీట్ నమోదు చేసింది.కాగా టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో ఇప్పటికే నాలుగు పూర్తి కాగా.. ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఓవల్ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను 2-2తో సమం చేయగలదు.జైసూ సెంచరీఇక ఈ మ్యాచ్‌లో శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సెంచరీ సాధించాడు. 127 బంతుల్లో శతక మార్కును అందుకున్నాడు. మొత్తంగా 164 బంతులు ఎదుర్కొని 118 పరుగులు సాధించి నిష్క్రమించాడు. కాగా అతడి టెస్టు కెరీర్లో ఇది ఆరో సెంచరీ.. ఈ సిరీస్‌లో రెండోది.12 సెంచరీలు అదే విధంగా.. జైసూ శతకంతో ఈ సిరీస్‌లో టీమిండియా తరఫున ఇప్పటికి 12 సెంచరీలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మూడు జట్లకు మాత్రమే ఈ ఘనత సాధ్యంకాగా.. తాజాగా టీమిండియా కూడా చరిత్ర పుటల్లోకెక్కింది. ఇదిలా ఉంటే.. 75/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా.. టీ బ్రేక్ సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ 25, రవీంద్ర జడేజా 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. జైస్వాల్ శతకం (118), ఆకాశ్ దీప్ అర్ధ శతకం (66)తో అదరగొట్టారు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్-2025లో ఇప్పటి వరకు శతకాలు బాదింది వీరేయశస్వి జైస్వాల్- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్, ది ఓవల్- లండన్)శుబ్‌మన్ గిల్- 4 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్, ఎడ్జ్‌బాస్టన్- బర్మింగ్‌హామ్, ఓల్డ్ ట్రఫోర్డ్- మాంచెస్టర్ )రిషభ్ పంత్- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్)కేఎల్ రాహుల్- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్, లార్డ్స్- లండన్)రవీంద్ర జడేజా- 1 సెంచరీలు (ఓల్డ్ ట్రఫోర్డ్- మాంచెస్టర్)వాషింగ్టన్ సుందర్- 1 సెంచరీలు (ఓల్డ్ ట్రఫోర్డ్- మాంచెస్టర్)ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్లుఆస్ట్రేలియా- 1955లో వెస్టిండీస్ వేదికగా ఆతిథ్య జట్టు మీద- ఐదు టెస్టుల్లో- 12 సెంచరీలుపాకిస్తాన్- 1982/83లో సొంతగడ్డపై టీమిండియా మీద ఆరు టెస్టుల్లో- 12 సెంచరీలుసౌతాఫ్రికా- 2003/04లో సొంతగడ్డపై వెస్టిండీస్ మీద నాలుగు టెస్టుల్లో- 12 సెంచరీలుటీమిండియా- 2025లో ఇంగ్లండ్ వేదికగా ఆతిథ్య జట్టు మీద- 12 సెంచరీలుచదవండి: IND vs ENG: నేనైతే ఆకాశ్‌కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్ 𝘾𝙚𝙣𝙩𝙪𝙧𝙮 𝙖𝙜𝙖𝙞𝙣𝙨𝙩 𝙖𝙡𝙡 𝙤𝙙𝙙𝙨 🥶🗣 #YashasviJaiswal completes a dramatic knock to bring up his 6th International Test century in style! 🔥#ENGvIND 👉 5th TEST, DAY 3 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/3V6YCy3sHy pic.twitter.com/ezdwfz3oYi— Star Sports (@StarSportsIndia) August 2, 2025 -
గైక్వాడ్‌పై వేటు.. సీఎస్కే కెప్టెన్‌గా టీమిండియా స్టార్! అతడిపై కూడా కన్ను?
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ టి నటరాజన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడా? అంటే అవునానే అంటున్నారు క్రికెట్ నిపుణులు. వచ్చే ఏడాది సీజన్ ముందు నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి సీఎస్కే ట్రేడ్ చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ తమిళనాడు ఫాస్ట్ బౌలర్ సీఎస్కే క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతుండడం ట్రేడ్ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. సీఎస్కే ట్రైనింగ్ జెర్సీని నటరాజన్ ధరించి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఐపీఎల్-2025 వేలంలో నటరాజన్‌ను రూ. 10.75 కోట్ల భారీ ధరకు ఢిల్లీ కొనుగోలు చేసింది.దీంతో అతడికి కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే ఆడే అవకాశం లభించింది. మిచెల్ స్టార్క్, చమీరా, ముఖేష్ కుమార్ వంటి స్టార్ పేసర్లు ఉండడంతో అతడు ఎక్కువ భాగం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని ఢిల్లీ కూడా వదులుకోవడానికి సిద్దంగా ఉంది.2017లో అరంగేట్రం..ఈ తమిళనాడు పేసర్ 2017లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర సీజన్లో ఆరు మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా 2018, 2019 సీజన్లకు నట్టు దూరమయ్యాడు. తిరిగి మళ్లీ ఐపీఎల్-2020 ఎస్ఆర్హెచ్తో జతకట్టాడు. ఆరెంజ్ ఆర్మీతో ఐదేళ్ల పాటు తన ప్రయణాన్ని కొనసాగించాడు.అయితే గత సీజన్ మెగా వేలానికి ముందు అతడిని సన్‌రైజర్స్ విడిచిపెట్టింది. దీంతో అతడు ఢిల్లీ జట్టులోకి వచ్చాడు. ఇప్పటివరకు 63 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన నటరాజన్.. 67 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. నటరాజన్ గత నాలుగేళ్లగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. టీమిండియా తరపున 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గాయాల కారణంగా అతడు భారత జట్టులో చోటు కోల్పోవల్సి వచ్చింది.కేఎల్ రాహుల్‌పై కన్ను..?అదేవిధంగా మరో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై కూడా సీఎస్కే కన్నేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు రాహుల్‌ను సీఎస్కే ట్రేడ్ చేసుకోవాలని భావిస్తుందంట. రుతురాజ్‌పై వేటు వేసి రాహుల్‌కు తమ జట్టు పగ్గాలను అప్పగించాలని సీఎస్కే యాజమాన్యం యోచిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రాహుల్ రూ.14 కోట్ల భారీ ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది. రాహుల్ తన ధరకు తగ్గ న్యాయం చేశాడు. గత సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడి 539 పరుగులతో ఢిల్లీ తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: అతడొక లెజెండ్.. కానీ అలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు: భారత స్టార్ బౌలర్ -
చూస్తూ ఊరుకోవాలా? అంపైర్‌పై కేఎల్ రాహుల్ ఫైర్! వీడియో వైరల్
ది ఓవల్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో ఆటతో పాటు మాటలు కూడా హైలెట్‌గా నిలుస్తున్నాయి. రెండో రోజు ఆట సందర్బంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను ఔట్ చేసిన అనంతరం ఆకాష్ దీప్ అతడి భుజంపై చెయ్యి వేసి మరి సెంఢాప్ ఇవ్వడం.. మైదానంలో ప్రశాంతంగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే జో రూట్, ప్రసిద్ధ్ కృష్ణతో గొడవపడడం వంటి సంఘటనలు జరిగాయి. అంతేకాకుండా భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సైతం ఆన్‌ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేనతో మాటల యుద్దానికి దిగాడు.అసలేమి జరిగిందంటే?ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 22వ ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో జో రూట్.. ఐదో బంతిని థర్డ్ మ్యాన్ మీదుగా బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో రూట్ వైపు చూస్తూ ప్రసిద్ద్ ఏదో అన్నాడు. దీంతో రూట్ కూడా బదులుగా కృష్ణపై సీరియస్ అయ్యాడు.అంతేకాకుండా రూట్ అంపైర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ప్రసిద్ద్ మద్దతుగా కేఎల్ రాహుల్ నిలిచాడు. గొడవ దేని గురించి అని తెలుసుకోవడానికి కుమార్ ధర్మసేనతో రాహుల్ మాట్లాడాడు. కానీ ధర్మసేన ఇచ్చిన సమాధానంపై కేఎల్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో కాసేపు అంపైర్‌తో రాహుల్ వాదించాడు. ఆ తర్వాత ఎవరి ఫీల్డింగ్ స్దానాలకు వారు వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది.అంపైర్-రాహుల్ మధ్య జరిగిన సంభాషణ ఇదే..రాహుల్: మమ్మల్ని ఏం చేయమంటారు? నిశ్శబ్దంగా ఉండమంటారా?ధర్మసేన: ఏ బౌలర్ అయినా నీ దగ్గరికి వచ్చి గొడవ పడితే నీకు నచ్చుతుందా రాహుల్? ప్రసిద్ద్ అలా చేయడం కరక్ట్ కాదు. మనం అలా ప్రవర్తించకూడదు.రాహుల్: అవతలి వ్యక్తి మమ్మల్ని దూషిస్తే.. చూస్తూ ఊరుకోవాలా? బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఇంటికి వెళ్లమంటారా?ధర్మసేన: మ్యాచ్ ముగిశాక మనం మాట్లాడదాం. నువ్వు అలా మాట్లాడడం మాత్రం సరికాదుఈ సంభాషణంతా స్టంప్ మైక్‌లో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(51), ఆకాష్ దీప్(4) ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్..🔥"You want us to just bat, bowl & go home?"🔥KL Rahul BLASTS at umpire Dharmasena in fiery defence of Prasidh Krishna! 😤⚡Tension hits the roof as Rahul says, "What do you want us to do, keep quiet?" 🗣️💥Captain steps up. Drama unfolds. Cricket gets REAL! 🏏🔥#KLRahul… pic.twitter.com/KaID8ddhda— Nihar Ranjan (@Niharra98749805) August 1, 2025 -
ENG VS IND 5th Test: ఆటను శాసించిన బౌలర్లు
లండన్: అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్టు రసకందాయంగా జరుగుతోంది. రెండో రోజును ఇరు జట్ల బౌలర్లు శాసించారు. దీంతో ఒక్క రోజే 15 వికెట్లు నేలకూలాయి. ముందుగా భారత్ తొలి ఇన్నింగ్స్ ఇలా మొదలవగానే అలా 224 పరుగుల వద్ద ముగిసింది. మరోవైపు జోరుగా మొదలైన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ అంతే జోరుగా కుప్పకూలింది. 92 పరుగుల వరకు వికెట్ కోల్పోని ఆతిథ్య జట్టు 247 పరుగులకే ఆలౌటైంది. కేవలం 23 పరుగుల ఆధిక్యమే లభించగా... అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట నిలిచే సమయానికి 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. రాహుల్ (7), సాయి సుదర్శన్ (11) వెనుదిరగ్గా... యశస్వి జైస్వాల్ (49 బంతుల్లో 51 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడి అజేయ అర్ధ శతకంతో నిలిచాడు. జైస్వాల్‌తో ఆకాశ్‌దీప్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. జైస్వాల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లు ఇంగ్లండ్ ఫీల్డర్లు వదిలేయడం కలిసొచ్చింది. ప్రస్తుతం టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. 34 బంతుల్లోనే ముగిసె... రెండో రోజు ఆట మొదలైన కొద్దిసేపటికే భారత్ ఆలౌటైంది. 204/6 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మిగిలిన నాలుగు వికెట్లను తొలి అర గంటలోనే కోల్పోయింది. మూడో ఓవర్లోనే ఓవర్‌నైట్ స్పెషలిస్ట్ బ్యాటర్ కరుణ్ నాయర్‌ను (109 బంతుల్లో 57; 8 ఫోర్లు) టంగ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 218 పరుగుల వద్ద ఏడో వికెట్ పడింది. ఆ తర్వాత 6 పరుగుల వ్యవధిలోనే అట్కిన్సన్... వాషింగ్టన్ సుందర్ (55 బంతుల్లో 26; 3 ఫోర్లు), సిరాజ్ (0), ప్రసిధ్ కృష్ణ (0) వికెట్లను పడగొట్టాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 69.4 ఓవర్లలో 224 వద్ద ముగిసింది. రెండో రోజు భారత్ కేవలం 20 పరుగులే చేయగలిగింది. అట్కిన్సన్కు ఐదు వికెట్లు దక్కాయి. ఓపెనింగ్ జోరులో... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ దూకుడుగా మొదలైంది. క్రాలీ, డకెట్ పేసర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు. సిరాజ్ మూడో ఓవర్లో క్రాలీ 2 ఫోర్లు కొడితే... ఆకాశ్‌దీప్ ఓవర్లో డకెట్ మూడు ఫోర్లు బాదాడు. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఇలా ఎవరిని విడిచిపెట్టకుండా యథేచ్చగా ఆడేశారు. బౌండరీలు, సిక్స్‌లతో వన్డేను తలపించే ‘పవర్ ప్లే’లా సాగిన ఓపెనింగ్ జోరుతో ఇంగ్లండ్ 12 ఓవర్లలోనే 92 పరుగులు చేసింది. ఈ దూకుడుకు మరుసటి ఓవర్లో డకెట్ (38 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను అవుట్ చేయడం ద్వారా ఆకాశ్‌దీప్ బ్రేకులేశాడు. 15వ ఓవర్లో ఇంగ్లండ్ వందకు చేరగా, క్రాలీ 42 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. 109/1 స్కోరు వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. రెండో సెషన్లో బౌలర్ల హవా ఆ తర్వాత కూడా బజ్‌బాల్ ఆట ఆడిన క్రాలీని ప్రసి«ద్‌కృష్ణ పెవిలియన్ చేర్చాడు. ఇక్కడి నుంచి బౌలింగ్ ప్రతాపం మొదలైంది. సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విలువైన వికెట్లను పడేశాడు. పోప్ (22; 4 ఫోర్లు), జో రూట్ (29; 6 ఫోర్లు), బెథెల్ (6)లను వరుస విరామాల్లో సిరాజ్ అవుట్ చేయడంతో 196 పరుగుల వద్ద 5 వికెట్లను కోల్పోయింది. జట్టు స్కోరు 200 దాటాక స్మిత్ (8), ఓవర్టన్ (0)లను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు. 215/7 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది. టెయిలెండర్ల అండతో 57 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన బ్రూక్‌ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. తొలి రోజు ఫీల్డింగ్‌లో భుజానికి గాయమైన వోక్స్ ఈ మ్యాచ్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో 9 వికెట్లకే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టుకు 23 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.జట్టునుంచి బుమ్రా విడుదలఐదో టెస్టుకు దూరమైన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను బీసీసీఐ జట్టు నుంచి విడుదల చేసింది. దీని వల్ల అతను ఈ టెస్టు జరిగే సమయంలో టీమ్‌తో పాటు ఉండాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్‌లో ముందుగా అనుకున్నట్లుగానే 3 టెస్టులే ఆడిన బుమ్రా 14 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాత వచ్చే నెలలో భారత్ ఆసియా కప్ టి20 టోర్నీ ఆడనుంది. బుమ్రా ఇందులో ఆడతాడా లేదా అనే విషయంపై సెలక్టర్లు తర్వాత నిర్ణయం తీసుకుంటారు.స్కోరు వివరాలు భారత్ తొలిఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్ 2; రాహుల్ (బి) వోక్స్ 14; సుదర్శన్ (సి) స్మిత్ (బి) టంగ్ 38; గిల్ రనౌట్ 21; కరుణ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) టంగ్ 57; జడేజా (సి) స్మిత్ (బి) టంగ్ 9; జురేల్ (సి) బ్రూక్ (బి) అట్కిన్సన్ 19; సుందర్ (సి) ఓవర్టన్ (బి) అట్కిన్సన్ 26; ఆకాశ్‌దీప్ నాటౌట్ 0; సిరాజ్ (బి) అట్కిన్సన్ 0; ప్రసి«ద్‌కృష్ణ (సి) స్మిత్ (బి) అట్కిన్సన్ 0; ఎక్స్‌ట్రాలు 38; మొత్తం (69.4 ఓవర్లలో ఆలౌట్) 224. వికెట్ల పతనం: 1–10, 2–38, 3–83, 4–101, 5–123, 6–153, 7–218, 8–220, 9–224, 10–224. బౌలింగ్: వోక్స్ 14–1–46–1, అట్కిన్సన్ 21.4–8–33–5, టంగ్ 16–4–57–3, ఓవర్టన్ 16–0–66–0, బెథెల్ 2–1–4–0. ఇంగ్లండ్ తొలిఇన్నింగ్స్: క్రాలీ (సి) జడేజా (బి) ప్రసిధ్ 64, డకెట్ (సి) జురేల్ (బి) ఆకాశ్‌దీప్ 43; ఒలీ పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 22; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 29; బ్రూక్ (బి) సిరాజ్ 53; బెథెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 6; స్మిత్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్ 8; ఓవర్టన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రసిధ్ 0; అట్కిన్సన్ (సి) ఆకాశ్‌దీప్ (బి) ప్రసిధ్ 11; టంగ్ నాటౌట్ 0; వోక్స్ అబ్సెంట్ హర్ట్; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (51.2 ఓవర్లలో ఆలౌట్) 247. వికెట్ల పతనం: 1–92, 2–129, 3–142, 4–175, 5–195, 6–215, 7–215, 8–235, 9–247. బౌలింగ్: సిరాజ్ 16.2–1–86–4, ఆకాశ్‌దీప్ 17–0–80–1, ప్రసి«ద్‌కృష్ణ 16–1–62–4, జడేజా 2–0–11–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ బ్యాటింగ్ 51; రాహుల్ (సి) రూట్ (బి) టంగ్ 7; సుదర్శన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్ 11; ఆకాశ్‌దీప్ బ్యాటింగ్ 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (18 ఓవర్లలో 2 వికెట్లకు) 75. వికెట్ల పతనం: 1–46, 2–70. బౌలింగ్: అట్కిన్సన్ 6–2–26–1, టంగ్ 7–1–25–1, ఓవర్టన్ 5–1–22–0. -
ఆకాశ్ దీప్ ఆన్ ఫైర్.. పక్కకు లాక్కెళ్లిన కేఎల్ రాహుల్.. వీడియో
ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ (Ben Duckett) బజ్‌బాల్ ఆటతో భారత బౌలర్లకు స్వాగతం పలికారు. టీ20 ఫార్మాట్ తరహాలో ర్యాంప్, స్కూప్ షాట్లతో చెలరేగిపోయారు. వీరిద్దరి జోరును నిలువరించేందుకు టీమిండియా పేసర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు.ఈ క్రమంలో డకెట్ అత్యుత్సాహం ప్రదర్శించగా.. ఆకాశ్ దీప్ (Akash Deep) అద్భుతమైన బంతితో అతడిని బోల్తా కొట్టించాడు. రివర్స్ స్కూప్ షాట్ ఆడేందుకు అతడు చేసిన ప్రయత్నం విఫలమైంది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 13 ఓవర్లో బౌలింగ్‌కు దిగిన ఆకాశ్ దీప్.. ఐదో బంతిని ఫుల్ డెలివరీగా సంధించాడు. అయితే, బంతిని అంచనా వేయడంలో పొరపడ్డ డకెట్.. రివర్స్ స్కూప్ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) చేతుల్లో పడింది. దీంతో హాఫ్ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో డకెట్.. 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటై వెనుదిరగాల్సి వచ్చింది.డకెట్ భుజంపై చెయ్యి వేసిన ఆకాశ్ దీప్.. ఇక డకెట్ అవుట్ కాగానే.. ‘సాధించాను’ అన్నట్లుగా ఆకాశ్ దీప్ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అనంతరం క్రీజును వీడుతున్న డకెట్ భుజంపై చెయ్యి వేసి.. అతడితో ఏదో అన్నాడు. పక్కకు లాక్కెళ్లిన రాహుల్ఇందుకు సదరు బ్యాటర్ కూడా సమాధానం ఇచ్చినట్లు కనిపించింది. ఇంతలో కేఎల్ రాహుల్ వచ్చి ఆకాశ్ దీప్‌ను అక్కడి నుంచి తీసుకువెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య గురువారం నిర్ణయాత్మక ఐదో టెస్టు ఓవల్ మైదానంలో మొదలైంది. టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 224 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ధనాధన్అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ భోజన విరామ సమయానికి 16 ఓవర్లలో వికెట్ నష్టాననికి 109 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్‌కు వెళ్లేప్పటికి ఓపెనర్ జాక్ క్రాలీ 52, వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ ఓలీ పోప్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. క్రాలీతో కలిసి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన డకెట్.. 38 బంతుల్లో 43 పరుగులు చేసి వెనుదిరిగాడు.ఇక ఐదు టెస్టుల సిరీస్‌లో లీడ్స్‌లో ఇంగ్లండ్ గెలుపొందగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ గెలిచింది. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఆతిథ్య జట్టు విజయం సాధించగా.. మాంచెస్టర్ టెస్టు డ్రా అయింది. ఆఖరిదైన ఐదో టెస్టులో టీమిండియా తప్పక గెలవాలి. లేదంటే.. ఇంగ్లండ్‌కు సిరీస్ సమర్పించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది.చదవండి: బిక్కముఖం వేశాడు.. జైసూ ఎప్పటికీ సాయి సుదర్శన్ కాలేడు: అశ్విన్AKASHDEEP REACTION AFTER GETTING BEN DUCKETT. 🤣#akashdeep #benduckett #INDvsENG pic.twitter.com/mZQ8SRNc91— Ritika Singh (@Ritikasinggh) August 1, 2025 -
KL Rahul: గత 11 ఏళ్లలో ఒకే ఒక్కడు..!
కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జులై 31) మొదలైన ఐదో టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 40 బంతులు ఎదుర్కొని బౌండరీ సాయంతో 14 పరుగులు చేసి ఔటైన రాహుల్.. ఈ సిరీస్‌లో తానెదుర్కొన్న బంతుల సంఖ్యను వెయ్యి (1000) దాటించాడు. తద్వారా గత 11 ఏళ్ల ఓ టెస్ట్ సిరీస్‌లో 1000 బంతులు ఎదుర్కొన్న ఏకైక భారత ఓపెనింగ్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో భారత ఓపెనర్‌గా నిలిచాడు. రాహుల్‌కు ముందు మురళీ విజయ్, సునీల్ గవాస్కర్ మాత్రమే ఈ ఘనత సాధించారు.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ లంచ్ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు (23 ఓవర్లలో) చేసింది. సాయి సుదర్శన్ (25), శుభ్‌మన్ గిల్ (15) క్రీజ్‌లో ఉన్నారు. వర్షం అంతరాయం కలిగించడంతో లంచ్ బ్రేక్‌ను కాస్త ముందుగానే తీసుకున్నారు. వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా లంచ్ తర్వాత కూడా ఆట ఆలస్యమవుతుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు కూడా వరుణుడు అడ్డు తగిలాడు. దీంతో టాస్ కూడా ఆలస్యమైంది.ఆదిలోనే ఎదురుదెబ్బలుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) జట్టు స్కోర్ కనీసం 50 పరుగులు కూడా దాటించకుండానే పెవిలియన్‌కు చేరారు. జట్టు స్కోర్ 10 పరుగుల వద్ద జైస్వాల్‌ను అట్కిన్సన్, 38 పరుగుల స్కోర్ వద్ద రాహుల్‌ను క్రిస్ వోక్స్ బోల్తా కొట్టించారు.చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ ఈ ఇన్నింగ్స్‌లో ఓ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా సునీల్ గవాస్కర్ రికార్డును ఛేదించాడు.1978/79 వెస్టిండీస్ సిరీస్‌లో గవాస్కర్ భారత కెప్టెన్‌గా 732 పరుగులు చేయగా.. ప్రస్తుత సిరీస్‌లో గిల్ 737* పరుగుల వద్ద బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.చెరో నాలుగు మార్పులుఈ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో నాలుగు మార్పులు చేశాయి. భారత్ తరఫున రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి రాగా.. ఇంగ్లండ్ తరఫున బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి వచ్చారు.ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ సిరీస్‌ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్ ఎగరేసుకుపోతుంది. తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్‌కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
అతడు టీమిండియాకు ఎంపికైన తర్వాత.. 15 మంది అరంగేట్రం!
జాతీయ జట్టు తరఫున ఆడాలని ప్రతి ఒక్క ఆటగాడు కోరుకుంటాడు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం వస్తే అంతకంటే గొప్పదేమీ లేదంటూ గర్వపడతాడు. అయితే, క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran)కు మాత్రం ఇప్పట్లో ఈ కల నెరవేరేలా కనిపించడం లేదు.961 రోజులుగా నిరీక్షణటీమిండియాకు ఆడాలన్న అభిమన్యు ఆశయానికి వరుసగా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికైన నాటి నుంచి ఇప్పటికి 961 రోజులుగా అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అరంగేట్రం చేసేందుకు కళ్లు కాయేలా ఎదురుచూస్తున్నాడు. కానీ మేనేజ్మెంట్ ఇంత వరకు కనికరించనేలేదు.పదిహేను మంది ఆటగాళ్ల అరంగేట్రంతాజాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లోనూ ఒక్క మ్యాచ్‌లో కూడా అభిమన్యును ఆడించలేదు. అయితే, అభిమన్యు టెస్టుల కోసం సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్న తర్వాత.. పదిహేను మంది ఆటగాళ్లు అతడి కంటే ముందే అరంగేట్రం చేయడం గమనార్హం.బంగ్లాదేశ్‌తో 2022 నాటి టెస్టు సిరీస్ సందర్భంగా రోహిత్ శర్మ గాయపడటంతో.. అతడి స్థానంలో అభిమన్యుకు సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. కానీ తుదిజట్టులో స్థానం కల్పించలేదు. ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి కూడా ఎంపికైనప్పటికీ ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఆడే ఛాన్స్ దక్కలేదు.ఆ లిస్టు ఇదేఅయితే, కేఎస్ భరత్ (2023), సూర్యకుమార్ యాదవ్ (2023), యశస్వి జైస్వాల్ (2023), ఇషాన్ కిషన్ (2023), ముకేశ్ కుమార్ (2023), ప్రసిద్ కృష్ణ (2023), రజత్ పాటిదార్ (2024), సర్ఫరాజ్ ఖాన్ (2024), ధ్రువ్ జురెల్ (2024), ఆకాశ్ దీప్ (2024), దేవ్‌దత్ పడిక్కల్ (2024), నితీశ్ కుమార్ రెడ్డి (2024), హర్షిత్ రాణా (2024), సాయి సుదర్శన్ (2025), అన్షుల్ కంబోజ్ (2025)లు మాత్రం ఇప్పటికే టెస్టుల్లో అరంగేట్రం చేశారు.అందుకే నో ఛాన్స్!వీరిలో యశస్వి జైస్వాల్ టెస్టు జట్టు ఓపెనర్‌గా పాతుకుపోగా.. రోహిత్ శర్మ రిటైరైన తర్వాత అతడి స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేశాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటన నాటి నుంచే జైస్వాల్- రాహుల్ ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్నారు. దీంతో ఓపెనింగ్ బ్యాటర్ అయిన అభిమన్యుకు నిరాశ తప్పడం లేదు.కాగా దేశవాళీ క్రికెట్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిమన్యు ఈశ్వరన్ ఇప్పటి వరకు 103 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 27 శతకాలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 7841 పరుగులు సాధించాడు. చివరగా ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో అనధికారిక టెస్టులో భారత్-ఎ తరఫున బరిలోకి దిగి 11, 80 పరుగులు సాధించాడు.అభిమన్యుతో పాటు వీరిద్దరు కూడాకాగా ఇంగ్లండ్‌తో టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడుతున్న టీమిండియా 1-2తో వెనుకబడి ఉంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో గురువారం మొదలైన ఐదో టెస్టులో గెలిస్తేనే సిరీస్‌ను 2-2తో సమం చేయగలుగుతుంది.ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌లో అభిమన్యుతో పాటు పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు కూడా అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. మరోవైపు.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఇంగ్లండ్ పర్యటనను ముగించనున్నాడు.చదవండి: Jacob Bethell: ఐదో టెస్టులో కొత్త సూపర్‌స్టార్‌ని చూస్తాం: అశ్విన్ -
ENG VS IND 5th Test: టీమిండియాకు భారీ షాక్‌లు
భారత్, ఇంగ్లండ్ మధ్య లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇవాళ (జులై 31) ఐదో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) జట్టు స్కోర్ కనీసం 50 పరుగులు కూడా దాటించకుండానే పెవిలియన్‌కు చేరారు. జట్టు స్కోర్ 10 పరుగుల వద్ద జైస్వాల్‌ను అట్కిన్సన్, 38 పరుగుల స్కోర్ వద్ద రాహుల్‌ను క్రిస్ వోక్స్ బోల్తా కొట్టించారు.20 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోర్ 56/2గా ఉంది. సాయి సుదర్శన్ (18), శుభ్‌మన్ గిల్ (6) క్రీజ్‌లో ఉన్నారు.కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో నాలుగు మార్పులు చేశాయి. భారత్ తరఫున రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి రాగా.. ఇంగ్లండ్ తరఫున బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి వచ్చారు.ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ సిరీస్‌ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్ ఎగరేసుకుపోతుంది. తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్‌కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
IPL 2026: రహానేపై వేటు.. కేకేఆర్ కెప్టెన్‌గా టీమిండియా ఓపెనర్!
టీమిండియా స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఐపీఎల్-2026కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుందన్నది ఆ వార్త సారాంశం. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఈ కర్ణాటక ఆటగాడిని రూ.14 కోట్ల భారీ ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది. రాహుల్ తన ధరకు తగ్గ న్యాయం చేశాడు. గత సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడి 539 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.కేకేఆర్ అట్టర్ ప్లాప్..అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్ 14 మ్యాచ్‌లు ఆడి కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్ధానంలో నైట్‌రైడర్స్ నిలిచింది.ఈ క్రమంలోనే రాహుల్‌ను ఎలాగైనా ట్రేడ్ చేసుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని కేకేఆర్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేకేఆర్ ప్రస్తుత జట్టులో భారత వికెట్ కీపర్ ఒక్కరు కూడా లేరు. జట్టులోని ఇద్దరు కీపర్లు(క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్భాజ్) విదేశాలకు చెందినవారే.అయినా వీరిద్దరూ తమ స్ధాయికి తగ్గప్రదర్శన చేయడంలో విఫలమయ్యారు. అందుకే రాహుల్‌ను తీసుకుంటే కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా ఉపయోగపడతాడని కేకేఆర్ యోచిస్తోంది. కానీ రాహుల్ వంటి అద్బుతమైన ఆటగాడిని ట్రేడ్ చేసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పుకొంటుందో లేది వేచి చూడాలి. మరోవైపు చంద్రకాంత్ పండిత్ కేకేఆర్ హెడ్‌కోచ్‌కు రాజీనామా చేశాడు. అతడి స్ధానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను ప్రధాన కోచ్‌గా నియమించేందుకు కేకేఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఐపీఎల్-2026 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో జరిగే అవకాశముంది.చదవండి: టీమిండియా అద్భుత పోరాటం.. కానీ ఓ చెత్త రికార్డు.. ప్రపంచంలోని తొలి జట్టుగా.. -
‘కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు.. అందుకు కారణం అదే’
బ్యాటింగ్ ఆర్డర్లో టీమిండియా యాజమాన్యం తరచూ మార్పులు చేయడం సరికాదని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నిక్ కాంప్టన్ (Nick Compton) అన్నాడు. మేనేజ్మెంట్ నిలకడలేమితనం కారణంగా ఆటగాళ్లు ఇబ్బంది పడతారని.. ఇది వారి ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు. ఇందుకు కేఎల్ రాహుల్ నిదర్శనం అని కాంప్టన్ తెలిపాడు.కాగా టెస్టుల్లో కేఎల్ రాహుల్ (KL Rahul) గత కొన్నాళ్లుగా వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే కొన్నిసార్లు ఓపెనర్‌గా.. మరికొన్నిసార్లు మిడిలార్డర్ బ్యాటర్‌గా బరిలోకి దిగాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (Border- Gavaskar Trophy)లో ఓపెనర్‌గా వచ్చిన అతడు.. రోహిత్ రాకతో మళ్లీ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతోఇక ఇంగ్లండ్ పర్యటనకు ముందే రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ స్థానం సుస్థిరమైంది. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇంగ్లండ్ గడ్డ మీద అద్భుత ఆట తీరుతో ఈ కర్ణాటక బ్యాటర్ ఆకట్టుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ నిక్ కాంప్టన్ మాట్లాడుతూ.. రాహుల్ పట్ల టీమిండియా మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టాడు. ‘‘ఇంగ్లండ్ జట్టును చూడండి. జో రూట్ ఎల్లప్పుడూ నాలుగో స్థానంలోనే బ్యాటింగ్ చేస్తాడు.ఓపెనర్లు కూడా మారరు. కానీ టీమిండియాలో శుబ్‌మన్ గిల్ ఓసారి మూడో స్థానంలో ఆడతాడు. ఇంకోసారి మరెవరో.. మళ్లీ గిల్ తిరిగి వస్తాడు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.అందుకే రాహుల్ వరుసగా విఫలమయ్యాడుఇక కేఎల్ రాహుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అతడిని అటూ.. ఇటూ మారుస్తూనే ఉన్నారు. ఫలితంగా అతడి ప్రదర్శన ప్రభావితం అయింది. రాహుల్ వరుసగా విఫలమయ్యాడు.నిజానికి అతడు ప్రతిభావంతుడైన ఆటగాడు. ఇప్పుడు సత్తా చాటుతున్నాడు. అయినా కరుణ్ నాయర్ వంటి ఆటగాళ్ల విషయంలో టీమిండియా త్వరత్వరగా నిర్ణయాలు మార్చేసుకోవడం సరికాదు. ఇంగ్లండ్ జట్టులో ఎవరిపై అంత తేలికగా వేటు వేయరు.సాయి సుదర్శన్ టాలెంట్ ప్లేయర్. కానీ అతడిని తప్పించి కరుణ్ నాయర్‌ను తీసుకురావడం.. మళ్లీ కోసం కరుణ్ నాయర్‌పై వేటు వేసి అతడిని తప్పించడం సరికాదు. సెలక్షన్లో నిలకడ లేకపోవడం వల్ల జట్టు నిర్మాణం దెబ్బతింటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాంప్టన్ రెవ్‌స్పోర్ట్స్‌తో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.రెండు శతకాలుకాగా ఇంగ్లండ్‌తో టెస్టుల్లో తిరిగి ఓపెనర్‌గా వస్తున్న కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు చేసిన పరుగులు వరుసగా.. 42, 137, 2, 55, 100, 39, 46, 90.ఇక ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియాపై ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. ఆఖరిదైన ఐదో టెస్టులో గెలిస్తేనే గిల్ సేన సిరీస్‌ను 2-2తో సమం చేయగలుగుతుంది. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో సాయి సుదర్శన్‌ను మూడో స్థానంలో ఆడించిన యాజమాన్యం.. రెండు, మూడో టెస్టుల్లో ఆ స్థానంలో కరుణ్ నాయర్‌ను పంపింది. ఇక నాలుగో టెస్టులో తిరిగి సాయిని పిలిపించిన సెలక్టర్లు.. కరుణ్‌పై వేటు వేశారు. మరోవైపు.. విరాట్ కోహ్లి రిటైర్మెంట్ నేపథ్యంలో కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. అంతకుముందు అతడు వన్‌డౌన్‌లో వచ్చేవాడు.చదవండి: WCL 2025: స్టువర్ట్ బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్ మెరుపులు.. సెమీస్‌లో ఇండియా -
మాంచెస్టర్ టెస్ట్ హీరోలు.. కేఎల్ రాహుల్‌కు క్రెడిట్ ఇవ్వని ఎల్ఎస్జీ
మాంచెస్టర్ టెస్ట్‌లో వీరోచితంగా పోరాడి ఇంగ్లండ్ గెలుపును అడ్డుకున్న టీమిండియా హీరోలు కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. అభిమానులు, విశ్లేషకులు, వారు, వీరు అన్న తేడా లేకుండా అందరూ పై నలుగురిని కొనియాడుతున్నారు. ఈ మ్యాచ్‌లో 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ (నాలుగో రోజు).. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్ (0), సాయి సుదర్శన్ (0) వికెట్లు కోల్పోయింది.ఈ దశలో కేఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (103) న భూతో న భవిష్యతి అన్న రీతిలో బ్యాటింగ్ చేసి మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించారు. ఆతర్వాత వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) వీరోచిత శతకాలు బాది మ్యాచ్‌ను డ్రా చేశారు.పై నలుగురిలో గిల్, జడ్డూ, సుందర్ సెంచరీలు చేయగా.. రాహుల్ తృటిలో ఆ మార్కును చేజార్చుకున్నాడు. స్టోక్స్ అద్బుతమైన బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రాహుల్ మూడంకెల స్కోర్‌ను చేరుకోలేకపోయాడు. రాహుల్ సెంచరీ చేయకపోయినా, చారిత్రక ఇన్నింగ్స్ ఆడి, ఇంగ్లండ్ గెలుపును అడ్డుకునేందుకు తొలి మెట్టు పేర్చాడు.అంకెల విషయాన్ని పక్కన పెడితే సున్నాకే 2 వికెట్లు కోల్పోయిన దశలో గిల్‌తో పాటు రాహుల్ ప్రదర్శించిన పోరాటపటిమ చరిత్రలో నిలిచిపోతుంది. మూడంకెల స్కోర్ అందుకోలేకపోయాడన్న విషయం తప్పించి, సెంచరీలు చేసిన గిల్, జడ్డూ, సుందర్‌తో పాటు రాహల్‌ను కూడా వేనోళ్ల పొగడాల్సిందే.The men who made it happen 🫡 pic.twitter.com/6zST20o0Dp— Lucknow Super Giants (@LucknowIPL) July 28, 2025ఇదిలా ఉంటే, ఐపీఎల్లో రాహుల్ మాజీ ఫ్రాంచైజీ అయిన లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం అతని ఇన్నింగ్స్‌ను విస్మరించి, మిగతా ముగ్గురికి క్రెడిట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇవాళ (జులై 28) ఉదయం ఎల్ఎస్జీ తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాలను నుంచి పోస్ట్ చేస్తూ.. The men who made it happen అంటూ గిల్, జడ్డూ, సుందర్‌కు మాత్రమే క్రెడిట్ ఇచ్చింది. ఇందులో రాహుల్ ప్రస్తావన లేకపోవడాన్ని క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. రాహుల్ అంటే ఎందుకంత చిన్న చూపు అంటూ ఎల్ఎస్జీకి అక్షింతలు వేస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మ్యాచ్ భారత్ నుంచి చేజారకుండా ఉండటంలో రాహుల్‌ది కూడా ప్రధానపాత్ర అని అతని అభిమానులు అంటున్నారు. కాగా, ఎల్ఎస్జీ యాజమాన్యానికి రాహుల్ విషయంలో ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. రాహుల్ తమ ఫ్రాంచైజీని వదిలి ఢిల్లీకి వెళ్లాడన్న అక్కసుతో వీలు చిక్కినప్పుడల్లా ఇలాగే ప్రవర్తిస్తుంటుంది. -
జడేజా, సుందర్ వీరోచిత శతకాలు.. డ్రాగా ముగిసిన నాలుగో టెస్ట్
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ (నాలుగో రోజు).. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్ (0), సాయి సుదర్శన్ (0) వికెట్లు కోల్పోయినప్పటికీ వీరోచితంగా పోరాడింది.తొలుత కేఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (103) అద్భుతంగా బ్యాటింగ్ చేసి మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించగా.. ఆతర్వాత వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) వీరోచిత శతకాలు బాది మ్యాచ్‌ను డ్రా చేశారు. సుందర్-జడేజా జోడీ ఐదో వికెట్‌కు అజేయమైన 203 పరుగులు జోడించింది. ఫలితంగా భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లండ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (150), బెన్ స్టోక్స్ (141) భారీ శతకాలతో కదంతొక్కగా.. జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, బుమ్రా, సుందర్ తలో 2, అన్షుల్ కంబోజ్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, రిషబ్ పంత్ 54, శార్దూల్ ఠాకూర్ 41 రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లు తీశాడు.నాలుగో టెస్ట్ డ్రా కావడంతో సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిపత్యం 2-1తో కొనసాగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జులై 31 నుంచి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో ఒకటి, మూడు మ్యాచ్‌లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. -
పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. నిలబడిందా అద్భుతమే..!
మాంచెస్టర్ టెస్ట్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. చివరి రోజు భారత్ తొలి సెషన్లోనే ఓవర్‌నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (103) వికెట్లు కోల్పోయింది.ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. బెన్ స్టోక్స్ అద్భుతమైన బంతితో రాహుల్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. రికార్డు సెంచరీ పూర్తి చేసిన వెంటనే శుభ్‌మన్ గిల్ కూడా పెవిలియన్‌కు చేరాడు.జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ నాలుగో వికెట్‌గా (222 పరుగుల వద్ద) వెనుదిరిగాడు. లంచ్ విరామం సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. సుందర్ (21), రవీంద్ర జడేజా క్రీజ్‌లో ఉన్నారు.ఈ మ్యాచ్‌లో భారత్ గట్టెక్కడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలి ఉండగా.. భారత్ 6 వికెట్లను నిలుపుకోవాలి. సుందర్, జడేజా తర్వాత పంత్ బ్యాటింగ్‌కు వస్తాడని తెలుస్తుంది. ఈ ముగ్గురు ఔటైతే భారత్ ఖేల్ ఖతం అయినట్లే.ఈ మ్యాచ్‌లో ఓడితే భారత్ సిరీస్‌ను కూడా కోల్పోతుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌ను భారత్ డ్రా చేసుకునే అవకాశం లేదు.స్కోర్ వివరాలు..భారత్ తొలి ఇన్నింగ్స్- 358 ఆలౌట్ (సాయి సుదర్శన్ 61, జైస్వాల్ 58, పంత్ 54, స్టోక్స్ 5/72)ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 669 ఆలౌట్ (రూట్ 150, స్టోక్స్ 141, రవీంద్ర జడేజా 4/143)భారత్ రెండో ఇన్నింగ్స్- 223/4 (ఐదో రోజు లంచ్ విరామం సమయానికి) -
చరిత్ర సృష్టించిన రాహుల్-గిల్ జోడీ.. ప్రపంచంలోనే
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టును డ్రాగా ముగించేందుకు టీమిండియా పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.311 పరుగుల లోటుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే క్రిస్ వోక్స్ బిగ్ షాకిచ్చాడు. ఒకే ఓవర్లో వరుస బంతుల్లో యశస్వి జైశ్వాల్(0), సాయిసుదర్శన్(0) పెవిలియన్‌కు పంపాడు. భారత్ సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో నాలుగో రోజే భారత కథ ముగుస్తుందని అంతా భావించారు.కానీ కేఎల్ రాహుల్(87 బ్యాటింగ్), శుబ్‌మన్ గిల్(78 నాటౌట్) తమ అద్బుత బ్యాటింగ్‌తో అడ్డుగోడగా నిలిచారు. వీరిద్దరూ 62 ఓవర్లు పాటు తమ వికెట్‌ను కోల్పోకుండా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో గిల్-రాహుల్ జోడీ పలు అరుదైన ఘనతలను తమ పేరిట లిఖించుకున్నారు.తొలి జోడీగాఒక టెస్టు మ్యాచ్‌లో 'సున్నా' పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత థర్డ్ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా గిల్-రాహుల్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఈ రికార్డు దిగ్గజాలు మొహిందర్ అమర్నాథ్, గుండప్ప విశ్వనాథ్ పేరిట ఉండేది.1977లో ఆస్ట్రేలియాపై ఇటువంటి పరిస్థితుల్లో వీరిద్దరూ మూడో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే తాజా మ్యాచ్‌లో మూడో వికెట్‌కు 174 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రాహుల్-గిల్ జంట 49 ఏళ్ల తర్వాత ఈ రేర్ ఫీట్‌ను బ్రేక్ చేసింది.కాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రస్తుత టెస్టు సిరీస్‌లో శుబ్‌మన్ గిల్, రాహుల్ ఇద్దరూ 500 పరుగుల మార్క్‌ను దాటేశారు. ఈ సిరీస్‌లో గిల్ ఇప్పటివరకు 697 పరుగులు చేయగా.. రాహుల్ 508 రన్స్ చేశాడు. విదేశీ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు భారత బ్యాటర్లు 500కు పైగా పరుగులు చేయడం గత 54 ఏళ్లలో ఇదే మొదటిసారి. వీరికంటే ముదు 1970-71 విండీస్ పర్యటనలో భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, దిలీప్ సర్దేశాయ్ ఈ ఫీట్ సాధించారు. ఆ సిరీస్‌లో సునీల్ గవాస్కర్ (774), దిలీప్ సర్దేశాయ్ (642) పరుగులు చేశారు.చదవండి: IND vs ENG: షాకింగ్.. 'జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే రిటైర్మెంట్' -
ఇంగ్లండ్‌కు టీమిండియా సవాల్ విసురుతుందా? ఆఖరి రోజు ఎవరిది?
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా పోరాడుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.ఈ సమయంలో జట్టును కెప్టెన్ శుబ్‌మన్ గిల్(167 బంతుల్లో 78 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (210 బంతుల్లో 87; 8 ఫోర్లు), విరోచిత పోరాటంతో ఆదుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడపించారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు నష్టానికి 174 పరుగులు చేసింది. ప్రస్తుతం గిల్ సేన 137 పరుగులు వెనుకంజలో ఉంది.టీమిండియా సవాల్ విసురుతుందా?కాగా మాంచెస్టర్ టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. కేవలం ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలూండడంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలుతుందా? లేదా డ్రా ముగిస్తుందా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆఖరి రోజు ఆటలో తొలి సెషన్ టీమిండియాకు చాలా కీలకం కానుంది.ఇంగ్లండ్‌కు టార్గెట్ నిర్దేశించాలని భారత జట్టు భావిస్తే కచ్చితంగా మొదటి సెషన్లో వికెట్లు ఏమీ కోల్పోకుండా కాస్త దూకుడుగా ఆడాలి. ఇంగ్లండ్‌కు 200 పైగా టార్గెట్ ఇవ్వాలన్న టీమిండియా ఖచ్చితంగా టీ బ్రేక్ వరకు అయినా బ్యాటింగ్ చేయాలి. అంటే వన్డే తరహాలో తమ బ్యాటింగ్‌ను కొనసాగించాలి.ఒకవేళ తొలి సెషన్లో టీమిండియా వికెట్లు కోల్పోతే డ్రా కోసం వెళ్తే బెటర్ అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గాయపడిన రిషబ్ పంత్ బ్యాటింగ్ వచ్చినా, క్రీజులో నిలదొక్కకుంటాడో లేదా అన్నది ప్రశ్నార్ధంగా మారింది.అతడు కాలి పాదం గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. పంత్ క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లకు వెళ్లే అవకాశముంది. ఆ ప్రయత్నంతో పంత్ వికెట్ కోల్పోయిన ఆశ్చర్యపోన్కర్లలేదు. ఆ తర్వాత రవీంద్ర జడేజా ప్రతిఘటించే అవకాశమున్నప్పటికి, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్ ఎప్పుడూ ఎలా ఆడుతారో చెప్పలేం. కాబట్టి టీమిండియా మొత్తం ఆశలన్నీ క్రీజులో ఉన్న శుబ్‌మన్ గిల్, రాహుల్‌పైనే ఉన్నాయి. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ వీలైనంత త్వరగా భారత్‌ను ఆలౌట్ చేయాలని పట్టుదలతో ఉంది.చదవండి: కివీస్‌దే ముక్కోణపు టోర్నీ -
0/2 నుంచి 174/2 వరకు...
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు ఏకంగా 311 పరుగుల ఆధిక్యం అప్పగించేశాం. లక్ష్యం నిర్దేశించడం సంగతి తర్వాత... ముందు ఈ లోటును ఎలా పూడ్చాలా అనే ఆందోళన... రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి స్కోరు 0/2... మిగిలిన అరవైకి పైగా ఓవర్లను ఆడగలరా అనే సందేహం. నాలుగో రోజే కుప్పకూలి మ్యాచ్‌ను అప్పగించేస్తారేమో అనిపించింది. కానీ రాహుల్, గిల్ అసాధారణ రీతిలో గట్టిగా నిలబడ్డారు. ఆరంభంలో కాస్త తడబడ్డా ఏకాగ్రత చెదరకుండా రెండు సెషన్లు పట్టుదలగా ఆడారు. ఏకంగా 62.1 ఓవర్ల పాటు వికెట్ ఇవ్వకుండా రోజును ముగించారు. అయితే ప్రమాదం ఇంకా పూర్తిగా దాటిపోలేదు. మరో 137 పరుగులు వెనుకంజలో ఉన్న జట్టు ప్రస్తుతానికి మ్యాచ్‌ను రక్షించుకునేందుకు బాటలు వేసుకుంది. ఆపై ఎన్ని పరుగులు చేసి ఇంగ్లండ్‌కు సవాల్ విసరగలదా అనేది చూడాలి.మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓటమి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్న భారత్ సురక్షిత స్థితికి చేరుతోంది. మ్యాచ్ నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (210 బంతుల్లో 87; 8 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (167 బంతుల్లో 78 బ్యాటింగ్; 10 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (198 బంతుల్లో 141; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రవీంద్ర జడేజాకు 4 వికెట్లు దక్కాయి. 22.1 ఓవర్లలో 125 పరుగులు... నాలుగో రోజు ఇంగ్లండ్ మెరుపు బ్యాటింగ్‌తో భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. స్టోక్స్ చాలా కాలం తర్వాత చెలరేగిపోగా, బ్రైడన్ కార్స్ (54 బంతుల్లో 47; 3 ఫోర్లు 2 సిక్స్‌లు), డాసన్ (26) అండగా నిలిచారు. ఆట ఆరంభంలోనే డాసన్‌ను బుమ్రా బౌల్డ్ చేసినా... స్టోక్స్, కార్స్ భాగస్వామ్యంతో ఇంగ్లండ్ దూసుకుపోయింది. సిరాజ్ బౌలింగ్‌లో లెగ్‌సైడ్ దిశగా కొట్టిన బౌండరీతో 164 బంతుల్లో స్టోక్స్ సెంచరీ పూర్తయింది. రెండేళ్ల తర్వాత, 35 ఇన్నింగ్స్‌లలో స్టోక్స్‌కు ఇది తొలి శతకం కావడం విశేషం. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన స్టోక్స్ తర్వాతి 34 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు రాబట్టడం విశేషం. మరో ఎండ్‌లో కార్స్ కూడా భారత బౌలర్లపై ధాటిని చూపించాడు.తొమ్మిదో వికెట్‌కు స్టోక్స్, కార్స్ కేవలం 95 బంతుల్లోనే 97 పరుగులు జోడించడం విశేషం. ఎట్టకేలకు జడేజా బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి స్టోక్స్ వెనుదిరగ్గా... తన తర్వాతి ఓవర్లో కార్స్‌ను అవుట్ చేసి జడేజా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగించాడు. 2015 తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో నలుగురు భారత బౌలర్లు తలా 100కు పైగా పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి. భారీ భాగస్వామ్యం... భారత జట్టు ఇన్నింగ్స్ పేలవంగా మొదలైంది. వోక్స్ వేసిన తొలి ఓవర్లో స్కోరు బోర్డుపై ‘సున్నా’ పరుగులు ఉండగానే వరుస బంతుల్లో జైస్వాల్ (0), సాయి సుదర్శన్ (0) వెనుదిరిగారు. అయితే ఆ తర్వాత రాహుల్, గిల్ చక్కటి భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. రెండో సెషన్లో ఆరంభంలో కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొన్నా... ఆ తర్వాత వీరిద్దరు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చూడచక్కటి షాట్లతో అలరించారు. 46 పరుగుల వద్ద గల్లీలో డాసన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన గిల్ 77 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.26 ఓవర్ల రెండో సెషన్లో భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. టీ విరామం తర్వాత కూడా గిల్, రాహుల్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడారు. పరుగుల రాక కాస్త తగ్గినా ప్రమాదం కూడా ఏమీ కనిపించలేదు. ఒక దశలో వరుసగా 21.4 ఓవర్ల పాటు బౌండరీనే రాలేదు! 137 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే ఆ తర్వాత వీరిద్దరు స్వేచ్ఛగా ఆడారు. ఈ జోడీని విడదీసేందుకు ఇంగ్లండ్ బౌలర్లను మార్చి మార్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. అప్పుడప్పుడు కొన్ని చక్కటి బంతులు ఇబ్బంది పెట్టినట్లుగా అనిపించినా భారత్‌కు నష్టం జరగలేదు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 358; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) రాహుల్ (బి) జడేజా 84; డకెట్ (సి) (సబ్) జురేల్ (బి) కంబోజ్ 94; పోప్ (సి) రాహుల్ (బి) సుందర్ 71; రూట్ (స్టంప్డ్) (సబ్) జురేల్ (బి) జడేజా 150; బ్రూక్ (స్టంప్డ్) (సబ్) జురేల్ (బి) సుందర్ 3; స్టోక్స్ (సి) సుదర్శన్ (బి) జడేజా 141; స్మిత్ (సి) (సబ్) జురేల్ (బి) బుమ్రా 9; డాసన్ (బి) బుమ్రా 26; వోక్స్ (బి) సిరాజ్ 4; కార్స్ (సి) సిరాజ్ (బి) జడేజా 47; ఆర్చర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 38; మొత్తం (157.1 ఓవర్లలో ఆలౌట్) 669.వికెట్ల పతనం: 1–166, 2–197, 3–341, 4–349, 5–499, 6–515, 7–528, 8–563, 9–658, 10–669.బౌలింగ్: బుమ్రా 33–5–112–2, కంబోజ్ 18–1–89–1, సిరాజ్ 30–4–140–1, శార్దుల్ 11–0–55–0, జడేజా 37.1–0–143–4, సుందర్ 28–4–107–2. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) రూట్ (బి) వోక్స్ 0; రాహుల్ (బ్యాటింగ్) 87; సుదర్శన్ (సి) బ్రూక్ (బి) వోక్స్ 0; గిల్ (బ్యాటింగ్) 78; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (63 ఓవర్లలో 2 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–0, 2–0. బౌలింగ్: వోక్స్ 15–3–48–2, ఆర్చర్ 11–2–40–0, కార్స్ 10–2–29–0, డాసన్ 22–8–36–0, రూట్ 5–1–17–0.⇒ 3 టెస్టుల్లో 7 వేలకు పైగా పరుగులు చేసి 200కు పైగా వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. గతంలో గ్యారీ సోబర్స్, జాక్ కలిస్ మాత్రమే ఈ ఘనత సాధించారు.⇒ 5 ఒకే టెస్టులో సెంచరీ సాధించడంతో పాటు ఐదు వికెట్లు కూడా తీసిన ఐదో కెప్టెన్ స్టోక్స్. గతంలో అట్కిన్సన్, సోబర్స్, ముస్తాక్ మొహమ్మద్, ఇమ్రాన్ ఖాన్లకు మాత్రమే ఇది సాధ్యమైంది.⇒1 టెస్టుల్లో బుమ్రా ఒక ఇన్నింగ్స్‌లో 100కు పైగా పరుగులివ్వడం ఇదే మొదటి సారి. అతను తన కెరీర్లో 48వ టెస్టు ఆడుతున్నాడు. -
IND vs ENG: ముగిసిన నాలుగవ రోజు ఆట.. భారత్ స్కోరు ఎంతంటే..
Update: నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 87(210), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 78(167)తో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కంటే టీమిండియా 137 పరుగులు వెనుకబడి ఉంది.ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం సాధించాడు. వీరిద్దరి పోరాట పటిమ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వంద పరుగుల మార్కు దాటింది. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా బుధవారం నాలుగో టెస్టు మొదలైన విషయం తెలిసిందే.ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46)లు రాణించగా.. సాయి సుదర్శన్ (61), రిషభ్ పంత్ (54) అర్ధ శతకాలు సాధించారు. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ 41 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ ఐదు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్ మూడు, క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం.. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఇందుకు దీటుగా బదులిచ్చి ఏకంగా 669 పరుగులు సాధించింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (84), బెన్ డకెట్ (94)లు బజ్‌బాల్‌తో దుమ్ములేపగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (71) అద్భుత అర్థ శతకం సాధించాడు. జో రూట్ (150), కెప్టెన్ బెన్ స్టోక్స్ (141) భారీ శతకాలు బాదారుఫలితంగా ఏకంగా 669 పరుగులు సాధించిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. భారత రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అన్షుల్ కంబోజ్, మహ్మద్ సిరాజ్‌లకు చెరో వికెట్ దక్కింది.ఈ క్రమంలో శనివారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకాలు బాదిన ఓపెనర్ యశస్వి జైస్వాల్, వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈసారి డకౌట్‌గా వెనుదిరిగారు.టీమిండియా ఇన్నింగ్స్‌లో నాలుగో బంతికి జైసూను, ఐదో బంతిని సాయిని ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ వెనక్కి పంపించాడు. ఇలా తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయన భారత జట్టును కెప్టెన్ గిల్, కేఎల్ రాహుల్ ఆదుకున్నారు. డ్రింక్స్ బ్రేక్ సమయానికి గిల్ 71, రాహుల్ 68 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫలితంగా 54 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. -
శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అర్ధ శతకం (52)తో మెరిశాడు. మాంచెస్టర్‌లో శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 77 బంతుల్లో యాభై పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా టెస్టుల్లో గిల్‌కు ఇది ఎనిమిదో హాఫ్ సెంచరీ.కాగా లీడ్స్‌లో శతక్కొట్టిన గిల్.. ఎడ్జ్‌బాస్టన్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ బాదిన విషయం తెలిసిందే. అయితే, ప్రఖ్యాత లార్డ్స్' మైదానంలో జరిగిన మూడో టెస్టులో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగులే చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులకే పరిమితమయ్యాడు.ఇక మాంచెస్టర్ టెస్టులోనూ మొదటి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సాబ్ 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, తాజాగా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 52 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ 30 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 29 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే ఇంకా 225 పరుగులు వెనుకబడి ఉంది. అంతకు ముందు ఓపెనర్ యశస్వి జైస్వాల్, వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగారు.ఇంగ్లండ్ 669కాగా మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46)లతో పాటు సాయి సుదర్శన్ (61), రిషభ్ పంత్ (54), శార్దూల్ ఠాకూర్ (41) రాణించారు.అయితే, భారత బౌలర్ల వైఫల్యం కారణంగా ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (84), బెన్ డకెట్ (94)లతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (71) అద్భుత అర్థ శతకం సాధించాడు. జో రూట్ (150), కెప్టెన్ బెన్ స్టోక్స్ (141) భారీ సెంచరీలతో మెరిశారు. ఫలితంగా ఏకంగా 669 పరుగులు సాధించిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. అన్షుల్ కంబోజ్, మహ్మద్ సిరాజ్‌లు చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. -
Fact Check: కరుణ్ నాయర్ నిజంగానే ఏడ్చాడా..?
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మూడో రోజు ఆట సాగుతున్న వేల ఓ ఆసక్తికర ఫోటో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ ఫోటోలో టీమిండియా బ్యాటర్ కరుణ్ నాయర్ బాధపడుతూ (ఏడుస్తూ) ఉన్నట్లు కనిపించగా.. సహచరుడు కేఎల్ రాహుల్ అతన్ని ఓదారుస్తున్నట్లు కనిపించాడు. ఈ ఫోటో సోషల్‌మీడియాలో కొద్ది క్షణాల్లోనే వైరలైంది. ఇది చూసి క్రికెట్ అభిమానులు కరుణ్‌ను నాలుగో టెస్ట్ నుంచి తప్పించినందుకు ఏడుస్తున్నాడంటూ, బాధలో ఉన్న అతన్ని అతని ఆప్తమిత్రుడు కేఎల్ రాహుల్ ఓదారుస్తున్నాడంటూ ఊహించుకోవడం మొదలు పెట్టారు. దీనిపై ఫ్యాక్ట్ చేయగా అది నిజం కాదని తెలిసింది. వాస్తవానికి ఆ ఫోటో లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ సందర్భంగా తీసిందని తేలింది. కరుణ్, రాహుల్ లార్డ్స్ బాల్కనీలో కూర్చున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో నాలుగో టెస్ట్ నుంచి తప్పించినందుకు కరుణ్ ఏడుస్తున్నాడన్న ప్రచారం ఫేక్ అని తేలిపోయింది.కాగా, కరుణ్ నాయర్ దేశవాలీ క్రికెట్లో అద్భుతాలు చేసి ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో క్రికెట్ ఒక్క ఛాన్స్ అంటూ కరుణ్ చేసిన ఓ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరలైంది. ఎట్టకేలకు భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి ఇంగ్లండ్ పర్యటనలో తొలి మూడు టెస్ట్‌లు ఆడే అవకాశం దక్కించుకున్న కరుణ్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక జట్టులో (నాలుగో టెస్ట్) స్థానం కోల్పోయాడు. కరుణ్ స్థానంలో మేనేజ్మెంట్ నాలుగో టెస్ట్‌లో సాయి సుదర్శన్‌కు అవకాశం ఇవ్వగా అతను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో బరిలోకి దిగి బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనతో సాయి సుదర్శన్ భారత జట్టులో నంబర్-3 స్థానాన్ని ఖాయం చేసుకున్నాడని ప్రచారం మొదలైంది. ఇది పరోక్షంగా కరుణ్ కెరీర్ ముగిసినట్లేనన్న సంకేతాలిస్తుంది. కెరీర్ ముగిసిపోయిందన్న బాధలో కరుణ్ ఏడుస్తున్నాడని అభిమానులు అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. వాస్తవానికి కరుణ్ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం చాలా పెద్ద తప్పిదం. ప్రస్తుత పరిస్థితుల్లో అతని మరో అవకాశం రావడం దాదాపుగా అసాధ్యం. ఒకవేళ సాయి సుదర్శన్ కూడా తదుపరి మ్యాచ్‌ల్లో విఫలమైనా కరుణ్‌కు మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే తిలక్ వర్మ, సర్ఫరాజ్ ఖాన్ లాంటి యువకులతో పాటు శ్రేయస్ అయ్యర్ టెస్ట్ జట్టులో స్థానంలో కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కరుణ్ కెరీర్ ముగిసిందనే చెప్పుకోవాలి.ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసేసింది. రూట్ రికార్డు సెంచరీతో ఆ జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 499 పరుగులు చేసి 141 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రూట్ 150, జేమీ స్మిత్ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, శార్దూల్ ఠాకూర్ 41 భారత ఇన్నింగ్స్‌లో ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
ఏడ్చేసిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్.. ఇక గుడ్‌బై!?
టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (Karun Nair)కు చేదు అనుభవమే మిగిలింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేసిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. సత్తా చాటలేకపోయాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టు (Ind vs Eng)తో రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్.. మొదటి ప్రయత్నంలోనే డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు.రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఇరవై పరుగులు మాత్రమే చేయలిగిన 33 ఏళ్ల కరుణ్.. రెండో టెస్టులోనూ తేలిపోయాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో వరుసగా 31, 26 పరుగులు చేశాడు. లార్డ్స్ టెస్టులో మాత్రం అతడు కాస్త ఫర్వాలేదనిపించాడు. వన్‌డౌన్‌లో వచ్చి 62 బంతులు ఎదుర్కొని 40 పరుగులు చేశాడు.పాత కథే పునరావృతంరెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ పాత కథే పునరావృతం. కేవలం 14 పరుగులే చేసి కరుణ్ నాయర్ నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో అతడి ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇప్పటికే మూడు అవకాశాలు ఇచ్చినా కరుణ్ తనను తాను నిరూపించుకోలేకపోయాడని.. ఇకనైననా అతడి స్థానంలో యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్లు పెరిగాయి.వేటు పడిందిఅందుకు తగ్గట్లుగానే నాలుగో టెస్టులో కరుణ్ నాయర్‌పై వేటువేసిన యాజమాన్యం.. సాయి సుదర్శన్‌కు పిలుపునిచ్చింది. మాంచెస్టర్ మ్యాచ్‌లో తనకు వచ్చిన అవకాశాన్ని ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సద్వినియోగం చేసుకున్నాడు. 151 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 61 పరుగులు సాధించాడు. తద్వారా భారత తొలి ఇన్నింగ్స్‌లో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.ఒకవేళ సాయి ఇలాగే అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటే.. కరుణ్ నాయర్‌కు చెక్ పడిందనే చెప్పవచ్చని నవజ్యోత్ సింగ్ సిద్ధు వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరుణ్ నాయర్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఏడ్చేసిన కరుణ్ .. ఓదార్చిన రాహుల్.. బ్లూ జెర్సీ వేసుకున్న కరుణ్ నాయర్ ఏడుస్తున్నట్లుగా కనిపిస్తుండగా.. టీమిండియా ఓపెనర్, కరుణ్ చిన్ననాటి స్నేహితుడు కేఎల్ రాహుల్ అతడి ఓదారుస్తున్నట్లుగా ఉంది. ఇది చూసిన అభిమానులు కరుణ్ నాయర్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఇక గుడ్‌బై!?కాగా టీమిండియా చివరగా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడింది. నాడు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనకు ముందు విరాట్ కోహ్లిని ఆలింగనం చేసుకున్నట్లుగా ఉన్న ఫొటోలతో.. కరుణ్ ఫొటో పోలుస్తున్నారు. కాగా ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే అశూ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో గురువారం నాటి రెండో ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ కేవలం రెండు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.చదవండి: సిరాజ్‌ను కాదని అతడికి బంతినిస్తారా? బుమ్రాకు ఏమైంది?: పాంటింగ్ ఫైర్ -
ENG VS IND 4th Test Day 1: కష్టాల్లో భారత్
మాంచెస్టర్ టెస్ట్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. 140 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ (46), యశస్వి జైస్వాల్ (58) శుభారంభాన్ని అందించి ఔట్ కాగా.. శుభ్‌మన్ గిల్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. 46 పరుగుల వ్యవధిలో భారత్ 3 కీలకమైన వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సాయి సుదర్శన్ (26), రిషబ్ పంత్ (3) భారత్‌ను పటిష్ట స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.భారత్ కోల్పోయిన వికెట్లలో రాహుల్ వికెట్ క్రిస్ వోక్స్‌కు.. జైస్వాల్ వికెట్ లియామ్ డాసన్‌కు.. శుభ్‌మన్ గిల్ వికెట్ బెన్ స్టోక్స్‌కు దక్కింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్‌లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ సిరీస్‌లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్‌కు డు ఆర్ డైగా మారింది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
ENG VS IND 4th Test: దిగ్గజాల సరసన కేఎల్ రాహుల్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జులై 23) మొదలైన తొలి టెస్ట్‌లో టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 28 పరుగుల వద్ద రాహుల్ ఇంగ్లండ్ గడ్డపై 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఐదో భారత బ్యాటర్‌గా.. రెండో భారత ఓపెనర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రాహుల్‌కు ముందు దిగ్గజ బ్యాటర్లు సచిన్ టెండూల్కర్ (1575), రాహుల్ ద్రవిడ్ (1376), సునీల్ గవాస్కర్ (1152), విరాట్ కోహ్లి (1096) మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో గవాస్కర్ ఒక్కరే ఓపెనర్.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో రాహుల్ 46 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జాక్ క్రాలేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. రాహుల్ ఔటయ్యే సమయానికి (30 ఓవర్లు) భారత్ స్కోర్ 94/1గా ఉంది. యశస్వి జైస్వాల్ 45 పరుగులతో కొనసాగుతుండగా.. అతనికి జతగా సాయి సుదర్శన్ క్రీజ్‌లోకి వచ్చాడు.భీకరమైన ఫామ్‌లో రాహుల్ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో రాహుల్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 421 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్‌లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ సిరీస్‌లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్‌కు డు ఆర్ డైగా మారింది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
ENG VS IND 4th Test Day 1: నిలకడగా ఆడుతున్న భారత ఓపెనర్లు
భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా ఇవాళ (జులై 23) నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి నిలకడగా ఆడుతుంది. లంచ్ విరామం సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 40, యశస్వి జైస్వాల్ 36 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.తొలి సెషన్ అంతా కష్టపడినా ఇంగ్లండ్ బౌలర్లకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. లంచ్ సమయానికి బెన్ స్టోక్స్ వారి స్పిన్ అస్త్రం లియామ్ డాసన్‌ను బరిలోకి దించలేదు. పేసర్లు క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్ తలో 8 ఓవర్లు బౌలింగ్ చేశారు. స్టోక్స్, బ్రైడన్ కార్స్ తలో 5 ఓవర్లు వేశారు. బౌలర్లను ఎంత మార్చినా స్టోక్స్‌కు ఎలాంటి ఫలితం రాలేదు. రాహుల్, జైస్వాల్ ఎంతో పట్టుదలతో బ్యాటింగ్ చేస్తున్నారు. నిదానంగా ఆడుతున్నా, చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్‌లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ సిరీస్‌లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్‌కు డు ఆర్ డైగా మారింది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
రాహుల్ గొప్పగా ఆడుతున్నాడు
న్యూఢిల్లీ: నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకున్న భారత బ్యాటర్ కేఎల్ రాహుల్... ఇంగ్లండ్ పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. మరో మూడు నాలుగేళ్ల పాటు అతడు ఇదే జోరు కొనసాగించే అవకాశం ఉందని రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘అండర్సన్–టెండూల్కర్’ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రాహుల్ 62.50 సగటుతో 375 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ప్రస్తుతం సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, జేమీ స్మిత్ తర్వాత నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ... ‘రాహుల్ తన బ్యాటింగ్ శైలిలో స్వల్ప మార్పులు చేసుకున్నాడు. బ్యాటింగ్ స్టాన్స్‌తో పాటు డిఫెన్స్ ఆడే తీరులో మరింత మెరుగయ్యాడు. దీంతో పరుగులు చేయడం అతడికి మరింత సులువవుతోంది. దీంతో పాటు బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ అయ్యే అవకాశాలు చాలా వరకు తగ్గాయి. గతంలో ఇలా చాలా సార్లు అతడు అవుటయ్యేవాడు. నైపుణ్యం పరంగా రాహుల్ చాలా మెరుగ్గా ఉన్నాడు. ఈ సిరీస్‌లో బంతి ఎక్కువ స్వింగ్ అయిన దాఖలాలు లేవు. ఒకవేళ అనుకోకుండా ఏదైన బంతి అనూహ్యంగా దూసుకొచి్చనా దాన్ని ఎదుర్కొనేందుకు రాహుల్ సిద్ధంగా ఉన్నాడు. ఇదే తీరు కొనసాగితే మరి కొన్నేళ్ల పాటు రాహుల్ అత్యున్నత స్థాయి ప్రదర్శన కొనసాగించగలడు. ఈ సిరీస్‌లో అతడి బెస్ట్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం రాహుల్ కెరీర్ అత్యుత్తమ దశలో ఉంది. ఇలాగే సాగితే మరెన్నో శతకాలు అతడి ఖాతాలో చేరతాయి.మున్ముందు టీమిండియా స్వదేశంలో చాలా మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో కెరీర్ ముగించే సమయానికి అతడి టెస్టు సగటు 50కి చేరువవడం ఖాయం’ అని వివరించాడు. జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 61 టెస్టులు ఆడిన 33 ఏళ్ల రాహుల్ 35.26 సగటుతో 3632 పరుగులు చేశాడు. అందుటో 10 శతకాలు, 18 అర్ధ శతకాలు ఉన్నాయి. -
ఇదేం పద్ధతి?.. ఎవరి కోసం ఇదంతా?!: గావస్కర్ ఫైర్
లార్డ్స్ టెస్టులో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ (KL Rahul) అవుటైన తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాహుల్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని విమర్శించాడు. భారత బౌలర్ల విషయంలో ఒకలా.. ఇంగ్లండ్ బౌలర్ల విషయంలో మరోలా వ్యవహరించడం సరికాదన్నాడు. పక్షపాతంగా ఉండే టెక్నాలజీ ఎవరి కోసమంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా మూడో టెస్టులో ఇంగ్లండ్ విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ తడబడుతోంది. 58/4 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాటి ఆఖరిదైన ఐదో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియాకు వరుస షాకులు తగిలాయి. కీలక బ్యాటర్ రిషభ్ పంత్ (9) జోఫ్రా ఆర్చర్ సంధించిన సూపర్ డెలివరీకి బౌల్డ్ కాగా.. ఆ వెంటనే కేఎల్ రాహుల్ (39) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) బౌలింగ్‌లో బంతి రాహుల్ ప్యాడ్‌ను తగిలినట్లు అనిపించగా.. ఇంగ్లండ్ గట్టిగా అప్పీలు చేసింది. అయితే, ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దీంతో స్టోక్స్ రివ్యూకు వెళ్లగా.. థర్డ్ అంపైర్ లెగ్ బిఫోర్ వికెట్‌గా ప్రకటించడంతో రాహుల్ క్రీజును వీడాల్సి వచ్చింది.రీప్లేలో బంతి రాహుల్ ప్యాడ్‌ను తగిలినట్లుగా కనిపించినప్పటికీ.. బ్యాట్‌ను కూడా తాకినట్లుగా మరో శబ్దం వినిపించింది. అయితే, ముందుగా బ్యాట్‌ను తాకిందా లేదంటే ప్యాడ్‌ను తాకిందా అనేది స్పష్టంగా తేలలేదు. అయితే, బాల్ ట్రాకింగ్‌లో మాత్రం బంతి స్టంప్స్‌ను ఎగురగొట్టినట్లుగా తేల్చిన థర్డ్ అంపైర్.. రాహుల్‌ను అవుట్‌గా ప్రకటించాడు.అసలు ఇదేం టెక్నాలజీఈ విషయంపై కామెంటేటర్ సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘ఏంటో.. ఈసారి ఆశ్చర్యకరంగా ఈసారి ఎక్కువగా బౌన్స్ అవ్వనేలేదు. భారత బౌలర్లు బౌలింగ్ చేస్తున్నపుడు మాత్రం.. రివ్యూల్లో బాల్స్ అన్నీ స్టంప్స్ మీదుగా వెళ్లిపోయినట్లుగా కనిపించాయి. అసలు ఇదేం టెక్నాలజీ అని నేను ప్రశ్నిస్తున్నా’’ అంటూ ఫైర్ అయ్యాడు.భారత్ తడ‘బ్యా’టుకాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టులో ఆఖరి రోజైన సోమవారం ఫలితం తేలనుంది. భోజన విరామ సమయానికి టీమిండియా 39.3 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి 81 పరుగుల దూరంలో ఉండగా.. ఇంగ్లండ్ గెలుపునకు కేవలం రెండు వికెట్లు తీస్తే చాలు.భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0), కరుణ్ నాయర్ (14), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (6) పూర్తిగా విఫలం కాగా.. నైట్ వాచ్‌మన్ ఆకాశ్ దీప్ (1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. రిషభ్ పంత్ (9), వాషింగ్టన్ సుందర్ (0), నితీశ్ కుమార్ రెడ్డి (13) నిరాశపరచగా.. ప్రస్తుతానికి భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ 39 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.చదవండి: IND vs ENG: సిరాజ్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ -
IND vs ENG 3rd Test: లార్డ్స్ టెస్టు.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు ఓటమి దిశగా పయనిస్తోంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత జట్టు 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆఖరి రోజు ఆట తొలి సెషన్లో టీమిండియాకు వరుస షాక్‌లు తగిలాయి.తొలుత ఆర్చర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్(9) క్లీన్ బౌల్డ్ కాగా.. కేఎల్ రాహుల్(39) స్టోక్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్.. ఆర్చర్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 58/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్ కేవలం 24 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. టీమిండియా విజయానికి ఇంకా 108 పరుగులు కావాలి. క్రీజులో జడేజా(10),నితీశ్ కుమర్ రెడ్డి(1) ఉన్నారు. భారత్ ఆశలన్నీ వీరిద్దరిపైనే ఉన్నాయి. ఒకవేళ ఇద్దరిలో ఎవరు ఔటైనా గిల్ సేనకు ఓటమి తప్పదు.చదవండి: లార్డ్స్‌లో గెలిచేది మేమే.. లంచ్ తర్వాత విజయ లాంఛనం: వాషీ -
ENG VS IND 3rd Tests: స్వల్ప లక్ష్య ఛేదన.. తడబడుతున్న భారత్
లార్డ్స్ టెస్ట్‌లో భారత్ స్వల్ప లక్ష్య ఛేదనలో తడపడుతుంది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే టీమిండియా ఇంకా 135 పరుగులు చేయాలి. కేఎల్ రాహుల్ (33) క్రీజ్‌లో ఉన్నాడు. ఓవర్‌నైట్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన ఆకాశ్‌దీప్ (1) ఔట్ కావడంతో నాలుగో రోజు ఆట ముగిసింది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 0, కరుణ్ నాయర్ 14, శుభ్‌మన్ గిల్ 6 పరుగులకు ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకే కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. కీలకమైన రూట్ (40), జేమీ స్మిత్ (8), బెన్ స్టోక్స్ (33) వికెట్లతో షోయబ్ బషీర్ (2) వికెట్ తీసి ఇంగ్లండ్‌ను చావుదెబ్బకొట్టాడు. మరో ఎండ్ నుంచి బుమ్రా కూడా ఇంగ్లండ్ ఆటగాళ్లపై అటాక్ చేశాడు. టీ విరామం తర్వాత బుమ్రా క్రిస్ వోక్స్ (10), బ్రైడన్ కార్స్‌లను (1) క్లీన్ బౌల్డ్ చేశాడు.తొలి సెషన్లో సిరాజ్, నితీశ్ కుమార్, ఆకాశ్‌దీప్ చెలరేగిపోయారు. డకెట్ (12), ఓలీ పోప్‌ను (4) సిరాజ్ పెవిలియన్‌కు పంపగా.. జాక్ క్రాలేను (22) నితీశ్, హ్యారీ బ్రూక్‌ను (23) ఆకాశ్‌దీప్ ఔట్ చేశారు.ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తరఫున రూట్ (104), జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) సత్తా చాటగా.. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100), పంత్ (74), జడేజా (72) రాణించారు. బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పతనాన్ని శాశించగా.. సిరాజ్, నితీశ్ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో క్రాలే 18, డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11, బెన్ స్టోక్స్ 44, క్రిస్ వోక్స్ 0, జోఫ్రా ఆర్చర్ 4 పరుగులకు ఔటయ్యారు. భారత తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, శుభ్‌మన్ గిల్ 16, నితీశ్ రెడ్డి 30, వాషింగ్టన్ సుందర్ 23, ఆకాశ్‌దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, ఆర్చర్, స్టోక్స్ తలో 2, కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. -
నా వల్లే అలా జరిగింది.. పంత్‌ను ఏమి అనొద్దు: కేఎల్ రాహుల్
లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్‌కు టీమిండియా ధీటైన జవాబు ఇచ్చింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేయగా.. టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకు ఆలౌటైంది. అయితే మూడో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్‌పై భారత్ ఆధిపత్యం చెలాయించింది.కానీ లంచ్ విరామానికి ముందు పంత్ వికెట్‌ను కోల్పోవడంతో కథ తారుమారైంది. అనవసరంగా రనౌట్ అయ్యి ఇంగ్లండ్‌కు తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. కేఎల్ రాహుల్, పంత్ మధ్య సమన్వయలోపం వల్ల భారత్ వికెట్ కోల్పోవల్సి వచ్చింది.అయితే లేని పరుగు కోసం పంత్ ప్రయత్నించి రనౌటయ్యాడు అని చాలా మంది విమర్శించారు. కానీ ఈ పూర్తి బాధ్యతను రాహుల్ తీసుకున్నాడు. లంచ్ బ్రేక్‌కు ముందు సెంచరీ సాధించాలనే తన ఆత్రుత అనవసర రనౌట్‌కు అవుట్‌కు దారితీసిందని వెల్లడించాడు."ఈ మ్యాచ్‌లో మా ఇద్దరి మధ్య చాలా సంభాషణలు జరిగాయి. వీలైతే లంచ్ విరామానికి ముందే సెంచరీ సాధిస్తానని నేను పంత్‌తో చెప్పాను. బషీర్ లంచ్ బ్రేక్‌కు ముందు చివరి ఓవర్ వేయడంతో సెంచరీ చేయడానికి మంచి అవకాశం భావించాను.అందుకే పంత్ నాకు సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వాలని ప్రయత్నించాడు. కానీ దురదృష్టవ శాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే ఆ ఓవర్లో తొలి బంతికి బౌండరీ బాదే అవకాశముండేది. కానీ నేను మిస్ చేసుకున్నాను. ఆ బంతికి కేవలం సింగిల్ మాత్రమే లభించింది. దీంతో పంత్ మళ్లీ నన్ను స్ట్రైక్‌లోకి తీసుకురావాలనకున్నాడు. అందుకే క్విక్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో అతడు రనౌట్ అవ్వాల్సి వచ్చింది. ఇది మా ఇద్దరికీ నిరాశ కలిగించింది. కానీ ఏ బ్యాటర్ కూడా ఈ విధంగా ఔట్ అవ్వాలని అనుకోరు. ఏదేమైనా ఆ రనౌట్ మా మూమెంటమ్‌ను దెబ్బతీసింది. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఇంగ్లండ్ తిరిగి గేమ్‌లోకి వచ్చింది"అని రాహుల్ మూడో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. ఆ తర్వాత షోయబ్ బషీర్ బౌలింగ్‌లోనే రాహుల్ 177 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసిఔటయ్యాడు. ఈ కర్ణాటక ఆటగాడు రిషబ్ పంత్‌తో కలిసి నాలగో వికెట్‌కు 140 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ గడ్డపై రాహుల్ సూపర్ సెంచరీ.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బ్రేక్ -
ఇంగ్లండ్ గడ్డపై రాహుల్ సూపర్ సెంచరీ.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బ్రేక్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్బుతమైన సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే యశస్వి జైశ్వాల్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వికెట్లు కోల్పోయిన భారత జట్టును.. తన సూపర్ పెర్ఫార్మెన్స్తో రాహుల్ ఆదుకున్నాడు.రిషబ్ పంత్‌తో కలిసి నాలగో వికెట్‌కు 140 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 177 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి రాహుల్ ఔటయ్యాడు. ఈ క్రమంలో రాహుల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.మూడో ప్లేయర్‌గా..సేనా( దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన మూడో ఏసియన్ బ్యాటర్‌గా రాహుల్ నిలిచాడు. రాహుల్‌కు ఇది సేనా దేశాల్లో 11వ ఫిప్టీ స్కోర్ కావడం విశేషం. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, బంగ్లా మాజీ ప్లేయర్ తమీమ్ ఇక్భాల్, సయీద్ అన్వర్ పేరిట సంయుక్తంగా ఉండేది.ఈ దిగ్గజ ఆటగాళ్లు తమ కెరీర్లో సేనా దేశాల్లో 10 సార్లు 50+ పరుగులు చేశారు. తాజా ఇన్నింగ్స్‌తో వీరిని కేఎల్ అధిగమించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో సునీల్ గవాస్కర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. అతడు 12 సార్లు 19 సార్లు ఏభైకి పైగా పరుగులు సాధించాడు. ఆ తర్వాత స్ధానంలో దిముత్ కరుణరత్నే(12) కొనసాగుతున్నాడు.ఇక లార్డ్స్ టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేయగా.. టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా రెండు పరుగులు చేసింది. -
అయ్యో రాహుల్.. సెంచరీ చేయగానే ఇలా అయిందేంటి?
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ (KL Rahul) శతకంతో మెరిశాడు. లార్డ్స్‌లో నిలకడైన ప్రదర్శనతో 176 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు ఉన్నాయి.కాగా రాహుల్‌కు ఇది టెస్టుల్లో పదో సెంచరీ కాగా.. ఇంగ్లండ్‌లో ఓవరాల్‌గా నాలుగోది. అదే విధంగా.. లార్డ్స్‌లో ఇది రెండోది కావడం విశేషం. తద్వారా దిలీప్ వెంగ్‌సర్కార్ తర్వాత లార్డ్స్ మైదానంలో రెండు శతకాలు సాధించిన రెండో భారత క్రికెటర్‌గా రాహుల్ చరిత్ర సృష్టించాడు.అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీ పూర్తైన వెంటనే రాహుల్ అవుటయ్యాడు. ఇంగ్లండ్ యువ బౌలర్ షోయబ్ బషీర్ స్పిన్ మాయాజాలంలో చిక్కుకున్న రాహుల్.. హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో నిరాశగా రాహుల్ క్రీజును వీడాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓడిన గిల్ సేన.. ఎడ్జ్‌బాస్టన్‌లో చారిత్రాత్మక విజయంతో ఆతిథ్య జట్టుపై ప్రతీకారం తీర్చుకుంది. ఇరుజట్ల మధ్య లండన్‌లోని లార్డ్స్‌లో మూడో టెస్టు జరుగుతుండగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టగా.. నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ తలా రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నారు.ఇక రెండో రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. 53 పరుగుల వ్యక్తిగత స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టిన కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తైన వెంటనే పెవిలియన్ చేరాడు. ఇక భారత బ్యాటర్లలో మిగతా వారిలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (13) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ 40 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ గిల్ (16) నిరాశపరచగా.. రిషభ్ పంత్ 74 పరుగులు చేశాడు. 74 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది.లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో సెంచరీ చేసిన భారత క్రికెటర్లు వీరే🏏దిలీప్ వెంగ్‌సర్కార్- 3🏏కేఎల్ రాహుల్-2🏏వినూ మన్కడ- 1🏏గుండప్ప విశ్వనాథ్- 1🏏రవిశాస్త్రి- 1🏏మహ్మద్ అజారుద్దీన్- 1🏏సౌరవ్ గంగూలీ- 1🏏అజిత్ అగార్కర్-1🏏రాహుల్ ద్రవిడ్-1🏏అజింక్య రహానే-1.చదవండి: IND vs ENG 1st Test: ఎంత పనిచేశావు వైభవ్.. నిన్నే నమ్ముకున్నాముగా At Lords, @klrahul delivered yet again, his 2nd century on this historic ground, becoming only the 2nd Indian to do so. #ENGvIND 👉 3rd TEST, DAY 3 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/YhqadvE3Be pic.twitter.com/IvPIBFIBKY— Star Sports (@StarSportsIndia) July 12, 2025 -
కేఎల్ రాహుల్ వల్లే నష్టం జరిగింది: ఇర్ఫాన్ పఠాన్ ఫైర్
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా రెండు ప్రధాన తప్పిదాలు చేసిందని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. వాటి వల్లే ఇంగ్లండ్ 350 కంటే ఎక్కువ పరుగులు చేయగలిగిందని అభిప్రాయపడ్డాడు.కేఎల్ రాహుల్ పొరపాటుతో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తీసుకున్న నిర్ణయం వల్లే ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు నిలువరించే వీలు లేకపోయిందని ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా లార్డ్స్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం మూడో టెస్టు మొదలైంది.టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, 251/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. బెన్ స్టోక్స్ (44), క్రిస్ వోక్స్ (0), సెంచరీ వీరుడు జో రూట్ (104)లను భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా త్వరత్వరగానే పెవిలియన్ చేర్చాడు.ఇలాంటి దశలో వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ (51), టెయిలెండర్ బ్రైడన్ కార్స్ (56) అద్భుత హాఫ్ సెంచరీలతో చెలరేగి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించారు. నిజానికి జేమీ స్మిత్ ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు.మరోవైపు.. రెండో రోజు ఆటలో కేవలం 63 డెలివరీలు సంధించిన తర్వాతనే బంతిని మార్చాలంటూ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పట్టుబట్టాడు. అప్పటికి బుమ్రా ఆ బంతితో బాగానే రాణిస్తున్నా.. గిల్ అంపైర్‌తో వాదనకు దిగి మరీ బంతిని మార్పించాడు. అయితే, దురదృష్టవశాత్తూ పాత బంతి కంటే అంపైర్ ఇచ్చిన కొత్త బంతి మరింత వాడినదానిలా ఉండటంతో టీమిండియాకు షాక్ తగిలింది. మొమెంటమ్ మారిపోయింది.ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘రెండోరోజు టీమిండియా చేసిన రెండు తప్పిదాల వల్ల ఇంగ్లండ్‌ను త్వరగా ఆలౌట్ చేసే అవకాశం చేజారింది. కేఎల్ రాహుల్ జేమీ స్మిత్ క్యాచ్ జారవిడవడమే అన్నిటికంటే పెద్ద తప్పు. అక్కడే మ్యాచ్ స్వరూపం మారిపోయింది.స్మిత్ ఐదు పరుగుల వద్ద ఉన్నపుడు రాహుల్ క్యాచ్ మిస్ చేశాడు. ఆ తర్వాత అతడు బ్రైడన్ కార్స్‌తో కలిసి అద్బుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒకవేళ రాహుల్ గనుక అప్పుడే క్యాచ్ అందుకుని ఉంటే ఇలా జరిగేది కాదు.ఇక రెండోది... అసలు బంతిని మార్చమని ఎందుకు అడిగారో అర్థం కాలేదు. అప్పటికే తొలి సెషన్లోనే మూడు వికెట్లు తీశారు. అలాంటపుడు బంతిని మార్చాల్సిన అవసరం ఏముంది? ఆ సమయంలో.. ఒకవేళ బంతి ఆకారం మారినా దానితో పెద్దగా వచ్చే నష్టం ఏముంది?ఓ బౌలర్‌గా చెప్తున్నా.. బంతి వల్ల మనకు ఏమాత్రం ఉపయోగం లేదనిపించినప్పుడు మాత్రమే మార్చమని అడుగుతాము. ఒకవేళ ఆ బంతి మరీ అంత చెత్తగా ఉండి ఉంటే మీకు ఉదయాన్నే మూడు వికెట్లు ఎలా దొరికేవి?.. అసలు బంతిని ఎందుకు మార్చమన్నారు?’’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా రెండో రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 43 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. -
టీమిండియా కొంపముంచిన కేఎల్ రాహుల్..
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్‌లో తీవ్ర నిరాశపరిచాడు. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్ జేమీ స్మిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను రాహుల్ విడిచిపెట్టాడు.87 ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్.. మూడో బంతిని స్మిత్‌కు బ్యాక్ ఆఫ్‌ది లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని స్మిత్ ఆఫ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. అయితే ఆ స్దానంలో రాహుల్ తన భుజం ఎత్తులో వచ్చిన బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇది చూసిన సిరాజ్ ఒక్కసారిగా షాకయ్యాడు.రాహుల్ తప్పిదానికి భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 5 పరుగుల దగ్గర ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న స్మిత్.. ఏకంగా 51 పరుగులు చేసి జట్టు స్కోర్ 350 రన్స్ దాటడంలో కీలక పాత్ర పోషించాడు.బ్రాడైన్ కార్స్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 80 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఒకవేళ రాహుల్ ఆ క్యాచ్‌ను పట్టి ఉంటే ఈపాటికే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసి ఉండేది. అయితే యాదృచ్ఛికంగా స్మిత్ తిరిగి సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 387 పరుగుల భారీ స్కోర్ చేయగల్గింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(104) సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. నితీశ్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IND vs ENG: జో రూట్ ప్రపంచ రికార్డు.. -
Ind vs Eng: పట్టుబిగించిన భారత్.. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబాటు!
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత్ సంపూర్ణ ఆధిపత్యం సాధించింది. ఆది నుంచి పట్టుబిగించిన గిల్ సేన.. ఆతిథ్య జట్టుకు కొండంత లక్ష్యాన్ని విధించింది. బ్యాటింగ్‌లో దుమ్ములేపిన టీమిండియా.. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 427/6 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.తద్వారా ఇంగ్లండ్ ముందు ఏకంగా 608 పరుగుల టార్గెట్ ఉంచింది. 64/1 ఓవర్ నైట్ స్కోరుతో టీమిండియా శనివారం తమ ఆట మొదలుపెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (269)తో చెలరేగిన భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ధనాధన్ దంచికొట్టాడు. 162 బంతుల్లో 161 పరుగులతో భారీ శతకం సాధించాడు.మిగతా వారిలో ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (55), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (65) అర్ధ శతకాలతో రాణించగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (69 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఆరు వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, షోయబ్ బషీర్ రెండేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, జో రూట్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు మహ్మద్ సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ జాక్ క్రాలే (0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు.ఇక మరో భారత పేసర్ ఆకాశ్ దీప్ మరో ఓపెనర్ బెన్ డకెట్ (25), జో రూట్ (6) వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 15, ఓలీ పోప్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆఖరిదైన ఐదో రోజు భారత్ మిగిలిన ఏడు వికెట్లు కూల్చి గెలుపొందాలని పట్టుదలగా ఉండగా.. విజయానికి 536 పరుగుల దూరంలో ఉన్న ఇంగ్లండ్ కనీసం డ్రా కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు-2025 (బుధవారం (జూలై 2)- ఆదివారం (జూలై 6))👉వేదిక: ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం, బర్మింగ్‌హామ్👉టాస్: ఇంగ్లండ్- మొదట బౌలింగ్👉భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు- 587 ఆలౌట్👉ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు- 407 ఆలౌట్ 👉భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం👉భారత్ రెండో ఇన్నింగ్స్- 427/6 డిక్లేర్డ్- తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని మొత్తం 607👉ఇంగ్లండ్ లక్ష్యం- 608👉శనివారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 72/3 (16). -
అదరగొట్టిన టీమిండియా.. ఇంగ్లండ్‌కు కొండంత లక్ష్యం
రెండో టెస్టులో టీమిండియా ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యం విధించింది. ఆతిథ్య జట్టుపై ఆద్యంతం పైచేయి సాధించిన భారత్.. ఏకంగా 608 పరుగుల టార్గెట్ ఇచ్చింది. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Torphy)లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు బుధవారం మొదలైంది.587 పరుగులుఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు స్కోరు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) భారీ ద్విశతకం (269) బాదగా.. రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. వీరితో పాటు వాషింగ్టన్ సుందర్ (42) కూడా రాణించాడు.ఇక ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, జోష్ టంగ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. మిగిలిన వారిలో కెప్టెన్ బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్స్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. మూడో రోజు ఆటలో భాగంగా 407 పరుగులకు ఆలౌట్ అయింది.హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) అద్భుత శతకాలతో 303 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో.. ఇంగ్లండ్ మేర స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో పేసర్లు మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగగా.. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌తో కలుపుకొని 180 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్.. ఓవర్ నైట్ స్కోరు 64/1 (13)తో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టింది.మరోసారి గిల్ దంచేశాడుఆట మొదలైన కాసేపటికే కరుణ్ నాయర్ (26) పెవిలియన్ చేరగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (55) అర్ధ శతకంతో రాణించాడు. ఇక గిల్ మరోసారి భారీ శతకం (161)తో దుమ్ములేపగా.. వికెట కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (65), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (69 నాటౌట్) అర్ధ శతకాలతో అదరగొట్టారు. నితీశ్ రెడ్డి (1) మరోసారి నిరాశపరచగా.. వాషింగ్టన్ సుందర్ జడేజాతో కలిసి 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.గిల్ భారీ శతకం పూర్తైన కాసేపటికి భారత్ తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 83 ఓవర్ల ఆటలో ఆరు వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 180 పరుగులకు ఈ మేర (427) స్కోరు జతచేసి... ప్రత్యర్థికి భారీ లక్ష్యం విధించింది. ఈ క్రమంలో శనివారం మూడో సెషన్ ఆఖర్లో లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. 108 ఓవర్లలో పనిపూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి ఆఖరి రోజు ఆట ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్‌ను టీమిండియా ఆలౌట్ చేస్తుందా? లేదంటే.. డ్రా చేసుకునేందుకు స్టోక్స్ బృందం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? అన్న విషయం తేలుతుంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. మరో ఆటగాడి శతకం.. భారత్ భారీ స్కోరు -
శెభాష్!.. మరోసారి శతక్కొట్టిన గిల్.. అరుదైన రికార్డు
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) తన కెరీర్లోనే అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ గడ్డ మీద వరుస శతకాలతో దుమ్ములేపుతున్నాడు. ఆతిథ్య జట్టుతో లీడ్స్ వేదికగా తొలి టెస్టులో గిల్ భారీ శతకం (147) బాదిన విషయం తెలిసిందే.అనంతరం బర్మింగ్‌హామ్‌లో బుధవారం మొదలైన రెండో టెస్టులోనూ శతక్కొట్టిన శుబ్‌మన్ గిల్.. దానిని డబుల్ సెంచరీగా మార్చాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 387 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 30 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 269 పరుగులు సాధించాడు. అయితే, కెరీర్లో సాధించిన తొలి ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మార్చడంలో గిల్ విఫలమయ్యాడు.జోష్ టంగ్ బౌలింగ్‌లో ఓలీ పోప్‌నకు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరడంతో.. అతడి భారీ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా గిల్ మరోసారి బ్యాట్ ఝులిపించాడు. యాభై ఏడు బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న కెప్టెన్ సాబ్.. 129 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకున్నాడు.భారీ ఆధిక్యంలో భారత్ఇదిలా ఉంటే.. 64/1 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కాసేపటికే వన్‌డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (26) వికెట్ కోల్పోయింది. అయితే, ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం(55)తో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీ (58 బంతుల్లో 65) సాధించాడు. ఇక గిల్ మరోసారి శతక్కొట్టగా.. 68 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. గిల్ సెంచరీ పూర్తి చేసుకునేసరికి, టీ బ్రేక్ సమయానికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (180)తో కలుపుకొని భారత్.. 484 పరుగుల భారీ లీడ్ సాధించింది.భారత రెండో బ్యాటర్‌గా..కాగా టెస్టు మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ.. మరో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన భారత రెండో బ్యాటర్‌గా గిల్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు భారత మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ 1971లొ పోర్ట్ ఆఫ్ స్పెయిన్వేదికగా వెస్టిండీస్‌పై ఈ ఘనత సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో గిల్ తొమ్మిదో ఆటగాడు.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టుషెడ్యూల్: బుధవారం (జూలై 2)- ఆదివారం (జూలై 6)వేదిక: ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్హామ్టాస్: ఇంగ్లండ్- తొలుత బౌలింగ్టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 587 ఆలౌట్ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 407 ఆలౌట్ టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్ -
కేఎల్ రాహుల్ అర్ధ శతకం.. పంత్ ధనాధన్
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అర్ధ శతకంతో మెరిశాడు. సంప్రదాయ ఫార్మాట్లో తన 18వ ఫిఫ్టీ నమోదు చేశాడు. కాగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బుధవారం రెండో టెస్టు మొదలైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తొలి రెండు రోజుల్లో టీమిండియా ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ 77 పరుగుల వద్ద ఉండగా మూడు వికెట్లు కూల్చి సత్తా చాటింది.ఇంగ్లండ్ 407 పరుగులకు ఆలౌట్అయితే, శుక్రవారం నాటి మూడో రోజు ఆటలో మాత్రం ఇంగ్లండ్ కుదురుకుంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) అద్భుత శతకాలతో రాణించి 303 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. అయితే, ఆ తర్వాత మరోసారి భారత బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో 180 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా శుక్రవారం ఆట పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 28 పరుగుల వద్ద నిష్క్రమించగా.. కేఎల్ రాహుల్ 28, కరుణ్ నాయర్ 7 పరుగులతో క్రీజులో నిలిచారు.కేఎల్ రాహుల్ అర్ధ శతకంఈ నేపథ్యంలో 64/1 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కరుణ్ నాయర్ (26) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. బైడన్ కార్స్ బౌలింగ్‌లో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు వికెట్ కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ఈ క్రమంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి నిలకడగా ఆడిన కేఎల్ రాహుల్ 78 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, కాసేపటికే జోష్ టంగ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. టంగ్ అద్భుత డెలివరీతో మిడిల్ స్టంప్ ఎగరగొట్టగా.. ఆశ్చర్యపోవడం రాహుల్ వంతైంది. కాగా మొత్తంగా 84 బంతులట్లో 55 పరుగులు చేసి రాహుల్ నిష్క్రమించగా.. రిషభ్ పంత్ గిల్‌కు జతయ్యాడు. ముప్పై ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్‌తో కలిపి 315కు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది.UPDATE: ఇక భోజన విరామ సమయానికి టీమిండియా 38 ఓవర్ల ఆటలో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. రిషభ్ పంత్ 35 బంతులలో 41, శుబ్‌మన్ గిల్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 357 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: IND vs ENG 2nd Test: నన్ను మూడో టెస్టులో ఆడిస్తారో?.. లేదో తెలియదు: టీమిండియా స్టార్ Must have taken an absolute peach to get KL out 😳Josh Tongue, you beauty 👌 #SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/gE7laUME3c— Sony Sports Network (@SonySportsNetwk) July 5, 2025 -
నిరాశపరిచిన రాహుల్.. మరో ఛాన్స్‌ను కూడా వృధా చేసుకున్న కరుణ్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.నిరాశపరిచిన రాహుల్తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 42, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (137) చేసిన రాహుల్ స్వల్ప స్కోర్‌కే ఔట్ కావడం టీమిండియా అభిమానులకు తీవ్రంగా నిరాశపరిచింది. విదేశాల్లో ఘనమైన ట్రాక్ రికార్డు కలిగిన రాహుల్‌కు ఎడ్జ్‌బాస్టన్ అచ్చిరాలేదు. గతంలోనూ అతను ఇక్కడ ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లో ఘోరంగా విఫలమయ్యాడు (13, 4).మరో ఛాన్స్‌ను కూడా వృధా చేసుకున్న కరుణ్రాహుల్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కరుణ్ నాయర్ ఆదిలో కాస్త ఇబ్బంది పడినా ఆతర్వాత కుదురుకున్నాడు. అయితే దురదృష్టవశావత్తు బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి 31 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో కరుణ్ మరో ఛాన్స్‌ను కూడా వృధా చేసుకన్నట్లైంది. 8 ఏళ్ల తర్వాత ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్.. ఆ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై, రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేశాడు. జైస్వాల్ ఖాతాలో మరో హాఫ్ సెంచరీరాహుల్, కరుణ్ ఔటైనా ఏమాత్రం ఒత్తిడికి గురి కాని యశస్వి జైస్వాల్ ఈ మధ్యలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు టెస్ట్‌ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు.తొలి రోజు లంచ్ విరామం సమయానికి భారత్ 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. జైస్వాల్ 62, శుభ్‌మన్ గిల్ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు.తొలి టెస్ట్‌లో ఇలా..కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది.ఛేదనలో బెన్ డకెట్ (149) సూపర్ సెంచరీ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. జాక్ క్రాలే (65), జో రూట్ (53 నాటౌట్), బెన్ స్టోక్స్ (33), జేమీ స్మిత్ (44 నాటౌట్) తలో చేయి వేశారు. భారత బౌలర్లు సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని పరుగులు చేశారు. ప్రసిద్ద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవీంద్ర జడేజాది కూడా అదే పరిస్థితి.ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్బుతంగా ఆడారు. అయినా సెకెండ్ ఇన్నింగ్స్‌లో బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదు శతకాలు నమోదైన ప్రయోజనం లేకుండా పోయింది.తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134) సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు. ఇంగ్లండ్ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్ (106) సెంచరీ చేయగా.. హ్యారీ బ్రూక్ (99) తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన చేసినప్పటికీ ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. -
ఆ రెండే కాదు.. మరో మూడు ఉన్నాయి.. గంభీర్‌పై పంత్ ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తీరు (Gautam Gambhir)పై స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో అద్భుత శతకాలు బాదిన ఆటగాడిని తక్కువ చేసినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. వేరే వాళ్లను ప్రశంసించడంలో తప్పులేదని.. కానీ అందుకోసం పంత్ గురించి అడిగిన ప్రశ్నకు ఇంతలా అసహనం వ్యక్తం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.విషయం ఏమిటంటే.. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఈ టూర్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన ప్రయాణం ఆరంభించాడు. ఇక ఈ సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరిగింది.ఐదు శతకాలుఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా మూడు సెంచరీలు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101)తో పాటు కెప్టెన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) కూడా శతకాలతో అలరించారు.ఇక రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (4), గిల్ (8) విఫలం కాగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (137), పంత్ (118) సెంచరీలు బాది.. జట్టును ఆదుకున్నారు. వీరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ఇంగ్లండ్‌కు 371 పరుగుల లక్ష్యం విధించగలిగింది.అయితే, ఆఖరి రోజు వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు శతకాలు బాదినా టీమిండియాకు పరాభవమే మిగిలింది. ఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా ఓటమిని చవిచూసింది.ఆ రెండే కాదు.. మరో మూడు ఉన్నాయిఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత జట్టు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. పంత్ ప్రదర్శన గురించి చెప్పాల్సిందిగా ఓ విలేకరి ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన గౌతీ.. ‘‘ఈ మ్యాచ్‌లో మనకు మరో మూడో సెంచరీలు కూడా ఉన్నాయి.అవి కూడా అతిపెద్ద సానుకూల అంశాలే. మీరు ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు. అయితే, యశస్వి బాదిన 100, కెప్టెన్‌గా అరంగేట్రంలోనే గిల్ చేసిన శతకం.. కేఎల్ రాహుల్ 100 గురించి కూడా మీరు ప్రస్తావించి ఉంటే ఇంకా సంతోషించేవాడిని.వీరు ఒక్కో సెంచరీ చేస్తే రిషభ్ పంత్ రెండు శతకాలు బాదాడు. ఒక్క టెస్టు మ్యాచ్‌లో ఐదు సెంచరీలు. నిజం చెప్పాలంటే.. ఇదొక గొప్ప ప్రదర్శన. ఏదేమైనా మీ ప్రశ్న ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది’’ అని కౌంటర్ ఇచ్చాడు.అంత అసహనం ఎందుకు?ఈ మేరకు గంభీర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా... పంత్ ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా పంత్ సాధించిన రికార్డులను ప్రస్తావిస్తూ గౌతీని విమర్శిస్తున్నారు. కాగా ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు శతకాలు బాదిన రెండో వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు ఆండీ ఫ్లవర్ ఈ ఘనత సాధించాడు.మరోవైపు.. ఇంగ్లండ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన ఏడో భారత బ్యాటర్‌గా పంత్ నిలిచాడు. అయితే, టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఓడటంతో అతడి వీరోచిత ప్రదర్శన వృథాగా పోయింది. ఇరుజట్ల మధ్య జూలై 2- 6 వరకు బర్మింగ్‌హామ్ వేదికగా రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్𝘈 𝘚𝘰𝘯𝘨 𝘰𝘧 𝘐𝘤𝘦 & 𝘍𝘪𝘳𝘦 𝘢𝘵 𝘏𝘦𝘢𝘥𝘪𝘯𝘨𝘭𝘦𝘺.🔥❄️@klrahul set the foundation with a composed and elegant century while @RishabhPant17’s quickfire hundred electrified the crowd with an explosive display of fearless strokeplay! 🤩WATCH FULL HIGHLIGHTS OF DAY 4… pic.twitter.com/MQ13EvHIae— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
గిల్ అసంతృప్తి.. జడ్డూ చర్య వైరల్!.. ఆఖరికి మేమే గెలిచాం!
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు (Ind vs Eng 1st Test)లో ఐదో రోజు తొలి సెషన్లో టీమిండియాకు కలిసిరాలేదు. లీడ్స్ (Leeds)లో భారత్ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు నిలకడగా ముందుకు సాగుతోంది. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ క్రీజులో పాతుకుపోగా.. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయారు.లంచ్ బ్రేక్‌కు వెళ్లేసరికి ఇలా..దీంతో.. ఓవర్ నైట్ స్కోరు 21/0తో మంగళవారం నాటి ఐదో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. భోజన విరామ సమయానికి ముప్పై ఓవర్ల ఆట పూర్తి చేసుకుని వికెట్ నష్టపోకుండా 117 పరుగులు సాధించింది. లంచ్ బ్రేక్‌కు వెళ్లేసరికి జాక్ క్రాలే 42, బెన్ డకెట్ 64 పరుగులతో క్రీజులో ఉన్నారు.శుబ్‌మన్ గిల్ అసంతృప్తిఇక ఎంతగా ప్రయత్నించినప్పటికీ క్రాలే, డకెట్‌ను అవుట్ చేయడం సాధ్యం కాకపోవడంతో భారత శిబిరంలో అసంతృప్తి నెలకొంది. బౌలర్లతో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కూడా అసంతృప్తికి లోనయ్యాడు. బంతి ఆకారం మారిందని, దానిని మార్చి కొత్త బంతి ఇవ్వాలని ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్లకు భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, సిరాజ్ తదితరులు విజ్ఞప్తి చేశారు.కెప్టెన్ గిల్ కూడా వారి వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా, నవ్వులు చిందిస్తూ బంతిని మార్చమని అడిగాడు. కానీ అంపైర్లు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. అయితే, టీమిండియా పట్టుబట్టడంతో గేజ్ టెస్టులో బంతి ఆకారం మారినట్లు తేలింది. దీంతో అంపైర్లు కొత్త బంతి ఇవ్వక తప్పని పరిస్థితి.జడ్డూ చర్య వైరల్ఈ నేపథ్యంలో భారత స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంపైర్ వద్దకు వెళ్లి.. ‘‘చూశారా.. మేము చెప్పింది నిజం.. ఆఖరికి మాదే విజయం’’ అన్నట్లుగా పిడికిలి మడిచి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు బదులుగా అంపైర్ కూడా నవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఏదేమైనా ఎట్టకేలకు కొత్త బంతిని తెచ్చుకోవడంలో టీమిండియా సఫలమైంది. ఇక భారమంతా బౌలర్లదే. ఇంగ్లండ్‌ను కట్టడి చేసి జట్టుకు విజయం అందించాల్సిన బాధ్యత వారిదే.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ సైతం బంతిని మార్చమని అంపైర్లను కోరగా.. నిరాశే ఎదురైంది. దీంతో అతడు తన చేతిలో ఉన్న బంతిని నేలకేసి కొట్టగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి మందలించింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది.ఇంగ్లండ్ వర్సెస్ భారత్ తొలి టెస్టు🏏షెడ్యూల్: జూన్ 20- 24🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్🏏భారత్ తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్🏏భారత్‌కు ఆరు పరుగుల ఆధిక్యం🏏భారత్ రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371🏏నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 21/0 (6) 🏏ఐదో రోజు భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 117/0.చదవండి: వసీం అక్రం, షేన్ వార్న్ కాదు!.. నన్ను భయపెట్టింది ఆ బౌలరే: గంగూలీ.@imjadeja is all fired up as the umpire allows #TeamIndia a ball change! 🔄💥Is a breakthrough around the corner? Will the next two sessions bring the wickets India needs? 👀#ENGvIND 1st Test Day 5 LIVE NOW Streaming on JioHotstar 👉 https://t.co/0K41uhrKJ5 pic.twitter.com/qKMYKc6gDl— Star Sports (@StarSportsIndia) June 24, 2025 -
పంత్ సెంచరీలపై అలా.. కేఎల్ రాహుల్ శతకంపై ఇలా! గోయెంకా పోస్ట్ వైరల్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant)పై ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka) ప్రశంసలు కురిపించారు. దూకుడైన ఆటకు మారుపేరంటూ పంత్ బ్యాటింగ్ తీరును కొనియాడారు. అదే సమయంలో.. భారత ఓపెనింగ్ బ్యాటర్, లక్నో మాజీ ఆటగాడు కేఎల్ రాహుల్‌ను కూడా సంజీవ్ గోయెంకా ప్రశంసించడం విశేషం.రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాలుకాగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య తొలి టెస్టులో రిషభ్ పంత్ శతకాలతో అదరగొట్టిన విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా తొలి ఇన్నింగ్స్‌లో 178 బంతులు ఎదుర్కొన్న ఈ ఐదో నంబర్ బ్యాటర్.. 12 ఫోర్లు, ఆరు సిక్సర్ సాయంతో.. 75కు పైగా స్ట్రైక్‌రేటుతో 134 పరుగులు సాధించాడు.ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ పంత్ దంచికొట్టాడు. 140 బంతుల్లోనే 118 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. స్ట్రైక్‌రేటు 84.29. తన అద్భుత శతక ఇన్నింగ్స్‌ల ద్వారా టీమిండియా పటిష్ట స్థితిలో నిలవడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు.అమోఘం.. రాహుల్‌కు కంగ్రాట్స్ ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని తమ కెప్టెన్ రిషభ్ పంత్‌ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘అమోఘం! రెండు వరుస సెంచరీలు.. దూకుడుకు మారుపేరుగా, బెదురులేని.. అద్భుత ఇన్నింగ్స్.టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్‌గా చరిత్ర.. సూపర్’’ అంటూ క్లాప్ ఎమోజీలు జత చేశారు. అదే సమయంలో మరో శతక వీరుడు కేఎల్ రాహుల్ పేరును కూడా గోయెంకా ప్రస్తావించడం వైరల్‌గా మారింది. ‘‘సెంచరీ చేసిన కేఎల్ రాహుల్‌కు కూడా శుభాకాంక్షలు’’ అని గోయెంకా ట్వీట్ చేశారు.కాగా 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో జట్టుకు మూడేళ్ల పాటు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2022, 2023లో వరుసగా రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు. కానీ 2024లో మాత్రం రాహుల్ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు.రాహుల్‌పై ఫైర్.. ఫ్రాంఛైజీని వీడిన స్టార్ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంకా మైదానంలో బహిరంగంగా రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇక ఈ పరిణామం తర్వాత అంటే.. 2025 మెగా వేలానికి ముందు రాహుల్ లక్నో ఫ్రాంఛైజీని వీడాడు.అనంతరం ఆక్షన్‌లో భాగంగా లక్నో రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు రిషభ్ పంత్‌ను కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించింది. అయితే, బ్యాటర్, కెప్టెన్‌గా ఈ సీజన్లో పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి పంత్ కేవలం 269 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉండటం చెప్పుకోదగ్గ అంశం.గెలుపునకు పది వికెట్ల దూరంలోఇక పంత్ సేన తాజా ఎడిషన్‌లో పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికే పరిమితమైంది. మరోవైపు.. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన కేఎల్ రాహుల్ పదమూడు మ్యాచ్‌లు ఆడి.. ఓ శతకం సాయంతో 539 పరుగులు సాధించడం విశేషం.ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా మారింది. ఆఖరిదైన ఐదో రోజు ఆటలో విజేత ఎవరన్నది తేలనుంది. భారత బౌలర్లు రాణించి పది వికెట్లు కూలిస్తే.. గిల్ సేనకు శుభారంభం లభిస్తుంది. మరోవైపు.. భారత్ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే ఇంగ్లండ్ మంగళవారం 350 పరుగులు చేయాలి. చదవండి: ‘లక్ష్మణ్‌ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’𝘈 𝘚𝘰𝘯𝘨 𝘰𝘧 𝘐𝘤𝘦 & 𝘍𝘪𝘳𝘦 𝘢𝘵 𝘏𝘦𝘢𝘥𝘪𝘯𝘨𝘭𝘦𝘺.🔥❄️@klrahul set the foundation with a composed and elegant century while @RishabhPant17’s quickfire hundred electrified the crowd with an explosive display of fearless strokeplay! 🤩WATCH FULL HIGHLIGHTS OF DAY 4… pic.twitter.com/MQ13EvHIae— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
బ్యాటింగ్‌కు అంత ఈజీగా లేదు.. విజయం మాదే: కేఎల్ రాహుల్
హెడింగ్లీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. 90/2తో నాలుగో రోజును ఆటను ప్రారంభించిన టీమిండియా.. అదనంగా 274 పరుగులు జోడించి తమ రెండో ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (137), రిషబ్ పంత్ (118) సెంచరీలతో చెలరేగారు.పంత్, రాహుల్ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 195 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వీరిద్దరూ ఔటయ్యాక టీమిండియా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 31 పరుగుల వ్యవధిలోనే భారత్ చివరి 6 వికెట్లు కోల్పోయింది.దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం జోడించి ఇంగ్లండ్ ముందు 371 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 21/0 స్కోరుతో నిలిచింది. ఇక ఈ మ్యాచ్ విజయంపై సెంచూరియాన్ కేఎల్ రాహుల్ థీమా వ్యక్తం చేశాడు.ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని రాహుల్ తెలిపాడు. మరోవైపు ఇంగ్లండ్ సైతం డ్రా కోసం కాకుండా గెలుపు కోసం ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ యువ సంచలనం జోష్ టంగ్ స్పష్టం చేశాడు."బ్లాక్‌బస్టర్ ముగింపు కోసం ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఫలితం తేలుతుంది. ఇంగ్లండ్ జట్టు కూడా డ్రా కోసం కాకుండా విజయం కోసం ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని వారు బహిరంగంగానే వెల్లడించారు. కాబట్టి వారు దూకుడుగా ఆడితే మాకు 10 వికెట్లు తీసేందుకు అవకాశం లభిస్తోంది. నాలుగో రోజు ఆటలో పిచ్ బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేదు. బంతి కాస్త ఆగి వచ్చింది. రేపు(మంగళవారం) పిచ్ మరింత ట్రిక్కీగా మారవచ్చు. దీంతో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి" అని నాలుగో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో రాహుల్ పేర్కొన్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. ఇంగ్లండ్ తమ విజయానికి 350 పరుగులు దూరంలో ఉండగా.. టీమిండియా 10 వికెట్ల దూరంలో నిలిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.క్రీజులో జాక్ క్రాలీ (12 బ్యాటింగ్), బెన్ డకెట్ (9 బ్యాటింగ్) ఉన్నారు. అంతకముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (247 బంతుల్లో 137; 18 ఫోర్లు), రిషభ్ పంత్ (140 బంతుల్లో 118; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతక్కొట్టారు.ఈ టెస్టులో పంత్‌కు ఇది రెండో సెంచరీ. ఇక తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 6 పరుగుల ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 371 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో మరోసారి బౌలర్లకు మరోసారి కఠిన సవాలు తప్పదు. బుమ్రాకు తోడుగా సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ రాణించాల్సిన అవసరముంది.93 ఏళ్ల చరిత్రలోనే..ఇక ఈ లీడ్స్ టెస్టులో భారత జట్టు చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. ఒక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తరపున ఐదు సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. 1932 నుంచి టెస్టు క్రికెట్ ఆడుతున్న భారత జట్టు.. 93 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఫీట్‌ను అందుకుంది.గతంలో భారత్ తరపున ఒక టెస్టు మ్యాచ్‌లో నాలుగు సెంచరీలు నమోదైన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఐదు సెంచరీలు రావడం మొదటి సారి. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ సెంచరీలు చేయగా...రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, పంత్ శతకాలు బాదారు.అదేవిధంగా 1955 తర్వాత విదేశీ గడ్డపై ఒకే టెస్టు మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేసిన పర్యాటక జట్టుగా భారత్ నిలిచింది. 70 ఏళ్ల కిందట వెస్టిండీస్ టూర్లో ఒకే టెస్టులో ఐదుగురు ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళు మూడు అంకెల స్కోర్‌ను అందుకున్నారు.చదవండి: గుండెపోటుతో భారత మాజీ క్రికెటర్ కన్నుమూత -
విజయంపై గురి
భారత బ్యాటింగ్ దళం అంచనాలకు అనుగుణంగా తమ బాధ్యత ముగించింది. చివర్లో కొంత తడబాటు కనిపించినా...రాహుల్, పంత్ సెంచరీలతో చెలరేగి భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో ప్రత్యరి్థకి కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పుడు ఇక బౌలర్ల వంతు...బుమ్రా ఒక్కడే ఇంగ్లండ్ ఆట కట్టిస్తాడా...ఈసారి మేం కూడా అంటూ ఇతర బౌలర్లూ సహకరిస్తారా అనేది చూడాలి.చివరి రోజు 90 ఓవర్లలో 350 పరుగులు చేయాల్సిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడి ఛేదనకు మొగ్గు చూపుతుందా...లేక పరిస్థితి మారిపోతే కాస్త తగ్గి ‘డ్రా’కు ప్రయతి్నస్తుందా చూడాలి. మరోవైపు హెడింగ్లీ మైదానంలో ఆఖరి రోజు ఆటకు వాన ముప్పు కూడా ఉంది! లీడ్స్: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తర స్థితికి చేరింది. 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. జాక్ క్రాలీ (12 బ్యాటింగ్), బెన్ డకెట్ (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 96 ఓవర్లలో 364 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (247 బంతుల్లో 137; 18 ఫోర్లు) శతకం పూర్తి చేసుకోగా... రిషభ్ పంత్ (140 బంతుల్లో 118; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఈ టెస్టులో రెండో సెంచరీ సాధించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 195 పరుగులు జోడించారు. ఒకదశలో 333/4తో ఉన్న భారత్ 31 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయింది. తొలి సెషన్ నెమ్మదిగా... ఓవర్‌నైట్ స్కోరు 90/2తో నాలుగో రోజు ఆట కొనసాగించిన భారత్ అదే స్కోరు వద్ద కెపె్టన్ శుబ్‌మన్ గిల్ (8) వికెట్ కోల్పోయింది. దాంతో రాహుల్, పంత్ తొలి సెషన్లో చాలా జాగ్రత్తగా ఆడారు. 87 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఇంగ్లండ్ కూడా చక్కటి నియంత్రణతో బౌలింగ్ చేయడంతో పరుగులు అంత సులువుగా రాలేదు. 58 పరుగుల వద్ద రాహుల్ ఇచి్చన క్యాచ్‌ను బ్రూక్ వదిలేయడం జట్టుకు కలిసొచ్చింది. తొలి సెషన్లో భారత్ 24.1 ఓవర్లలో 63 పరుగులే చేయగలిగింది. పంత్, రాహుల్ జోరు... లంచ్ తర్వాత ఒక్కసారిగా భారత్ ఆట మారింది. బ్యాట్ ఝళిపించిన పంత్ దూకుడు పెంచి పరుగులు రాబట్టగా... రాహుల్ తనదైన శైలిలో చూడచక్కటి షాట్లతో అలరించారు. 83 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్ ఆ తర్వాత మరింత ధాటిగా ఆడుతూ తర్వాతి 25 బంతుల్లోనే 44 పరుగులు రాబట్టాడు. మరోవైపు 202 బంతుల్లో రాహుల్ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే పంత్ కూడా ఈ టెస్టులో రెండో సెంచరీని (130 బంతుల్లో) తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జోడీని విడదీసేందుకు తీవ్రంగా శ్రమించిన ఇంగ్లండ్ ఎట్టకేలకు 46.4 ఓవర్ల తర్వాత సఫలమైంది. శతకం పూర్తయిన తర్వాత రూట్ ఓవర్లో వరుసగా 4, 6, 4 బాదిన పంత్... బషీర్ వేసిన తర్వాతి ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. రెండో సెషన్లో భారత్ 27 ఓవర్లలోనే ఏకంగా 5.37 రన్‌రేట్‌తో 145 పరుగులు సాధించడం విశేషం. విరామానంతరం ఆట మళ్లీ మలుపు తిరిగింది. కార్స్ బౌలింగ్‌లో రాహుల్ బౌల్డ్ కాగా...కరుణ్ నాయర్ (20) మరో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. ఆ తర్వాత టంగ్ నాలుగు బంతుల్లో శార్దుల్ (4), సిరాజ్ (0), బుమ్రా (0)లను అవుట్ చేయగా... ప్రసిధ్ కృష్ణ (0) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా (40 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించగలిగాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 471; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) కార్స్ 4; రాహుల్ (బి) కార్స్ 137; సాయి సుదర్శన్ (సి) క్రాలీ (బి) స్టోక్స్ 30; గిల్ (బి) కార్స్ 8; పంత్ (సి) క్రాలీ (బి) బషీర్ 118; నాయర్ (సి అండ్ బి) వోక్స్ 20; జడేజా (నాటౌట్) 25; శార్దుల్ (సి) రూట్ (బి) టంగ్ 4; సిరాజ్ (సి) స్మిత్ (బి) టంగ్ 0; బుమ్రా (బి) టంగ్ 0; ప్రసిధ్ (సి) టంగ్ (బి) బషీర్ 0; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (96 ఓవర్లలో ఆలౌట్) 364. వికెట్ల పతనం: 1–16, 2–82, 3–92, 4–287, 5–333, 6–335, 7–349, 8–349; 9–349; 10–364. బౌలింగ్: వోక్స్ 19–4–45–1, కార్స్ 19–2–80–3, టంగ్ 18–2–72–3, బషీర్ 22–1–90–2, స్టోక్స్ 15–2–47–1, రూట్ 3–0–21–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బ్యాటింగ్) 12; డకెట్ (బ్యాటింగ్) 9; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 21. బౌలింగ్: బుమ్రా 3–0–9–0, సిరాజ్ 2–1–9–0, జడేజా 1–0–3–0. -
IND VS ENG 1st Test: శతక్కొట్టిన రాహుల్, పంత్.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం
తొలి టెస్ట్ లో టీమిండియా విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లండ్ బరిలోకి దిగింది. సోమవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే ఆఖరిదైన ఐదవ రోజు బౌలింగ్ లో సత్తా చాటి 10 వికెట్లు తీయాల్సి ఉంది. మరోవైపు విజయానికి ఇంగ్లండ్ కు 350 పరుగులు అవసరం.ఇంగ్లండ్ లక్ష్యం 371లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. నాలుగో రోజు భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (364) చేసి ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కేఎల్ రాహుల్ (137), రిషబ్ పంత్ (118) సెంచరీలతో కదంతొక్కారు. మిగతా భారత ఆటగాళ్లలో సాయి సుదర్శన్ 30, రవీంద్ర జడేజా 25 (నాటౌట్), యశస్వి జైస్వాల్ 4, శుభ్‌మన్ గిల్ 8, కరుణ్ నాయర్ 20, శార్దూల్ ఠాకూర్ 4, సిరాజ్ 0, బుమ్రా 0, ప్రసిద్ద్ కృష్ణ 0 పరుగులకు ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బషీర్ 2, వోక్స్, స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (101), శుభ్‌మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓలీ పోప్ (106) సెంచరీతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా బ్యాటర్లలో బెన్ డకెట్ 62, జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
IND VS ENG 1st Test: ఇంగ్లండ్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లీష్ నేలపై అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంతో రాహుల్ ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో రాహుల్ ఎంతో బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తూ ఈ రికార్డుతో పాటు మరిన్ని మైలురాళ్లను చేరుకున్నాడు.47 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన రాహుల్.. 202 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ విరామం అనంతరం రాహుల్ 137 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా కరుణ్ నాయర్ (20) క్రీజ్‌లో ఉన్నాడు. కడపటి వార్తలు అందేసరికి భారత్ స్కోర్ 332/4గా ఉంది. భారత్ 338 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.ఇదే ఇన్నింగ్స్‌లో మరో భారత ఆటగాడు రిషబ్ పంత్ (118) కూడా శతకొట్టాడు. పంత్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీతో (134) మెరిశాడు. ఈ మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించింది.తాజా సెంచరీతో రాహుల్ సాధించిన రికార్డులు..ఆసియా ఖండం బయట అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనర్ల జాబితాలో రాహుల్ రెండో స్థానంలో ఉన్నాడు. రాహుల్ తన కెరీర్లో 9 టెస్ట్ సెంచరీలు చేయగా.. అందులో ఆరు ఆసియా బయటే చేయడం విశేషం. భారత ఓపెనర్లలో సునీల్ గవాస్కర్ అత్యధికంగా ఆసియా బయట 15 సెంచరీలు చేశాడు. గవాస్కర్ తర్వాత రాహుల్ అత్యధికంగా 6, వీరేంద్ర సెహ్వాగ్ 4 సెంచరీలు చేశారు.ఇంగ్లండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన భారత్ ఓపెనర్లు..కేఎల్ రాహుల్-3విజయ్ మర్చంట్-2సునీల్ గవాస్కర్-2రవిశాస్త్రి-2రాహుల్ ద్రవిడ్-2లీడ్స్‌లో మూడో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రెండో పర్యాటక ఓపెనర్‌గా రికార్డు. రాహుల్‌కు ముందు (1955) సౌతాఫ్రికాకు చెందిన జాకీ మెక్‌గ్లూ లీడ్స్‌లో మూడో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.ఇంగ్లండ్ గడ్డపై ఆరో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడు. ఈ సెంచరీతో రాహుల్ ఇంగ్లండ్‌పై మూడు సెంచరీలు చేసినట్లైంది. భారత ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ (6), సచిన్ టెండూల్కర్ (4), దిలీప్ వెంగసర్కార్ (4), రిషబ్ పంత్ (4) మాత్రమే ఇంగ్లండ్ గడ్డపై రాహుల్ కంటే ఎక్కువ సెంచరీలు చేశారు. సౌరభ్ గంగూలీ రాహుల్‌తో సమానంగా 3 సెంచరీలు చేశాడు.SENA దేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ఐదో స్థానంలో ఉన్నాడు. రాహుల్ సేనా దేశాల్లో 6 సెంచరీలు చేశాడు. ఈ విభాగంలో సచిన్ టెండూల్కర్ (17), విరాట్ కోహ్లి (12), రాహుల్ ద్రవిడ్ (10), సునీల్ గవాస్కర్ (8) రాహుల్ కంటే ముందున్నారు. రాహుల్‌తో సమానంగా మహ్మద్ అజారుద్దీన్ సేనా దేశాల్లో 6 సెంచరీలు చేశాడు.కాగా, ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471, ఇంగ్లండ్ 465 పరుగులు చేసిన విషయం తెలిసిందే. భారత తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (101), శుభ్‌మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలు చేయగా.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్ (106) సెంచరీతో కదంతొక్కాడు. హ్యారీ బ్రూక్ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
IND VS ENG 1st Test: రెండో ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన పంత్.. అయితే ఈసారి..!
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 178 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 130 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ సారి పంత్ సెంచరీ చేసిన తర్వాత పల్టీ సెలబ్రేషన్స్ చేసుకోలేదు. స్టాండ్స్ నుంచి గవాస్కర్ పల్టీ కొట్టాలని అడిగినా పంత్ పెద్దగా పట్టించుకోలేదు. డబుల్ సెంచరీ తర్వాత అన్నట్లు సైగలు చేశాడు. తాజా సెంచరీతో టెస్ట్‌ల్లో పంత్ సెంచరీల సంఖ్య 8కి చేరింది. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులకు ఔటైన రాహుల్.. ఈసారి మరింత బాధ్యతాయుతంగా ఆడి కెరీర్లో తొమ్మిదో సెంచరీ పూర్తి చేశాడు. రాహుల్ 202 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో సెంచరీ మార్కును అందుకున్నాడు.నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే శుభ్‌మన్ గిల్ (8) వికెట్ కోల్పోయిన భారత్‌ను రాహుల్-పంత్ జోడీ ఆదుకుంది. ఈ ఇద్దరు ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ.. భారత్ పైచేయి సాధించే దిశగా తీసుకెళ్తున్నారు. ఈ జోడీ ఇప్పటికే నాలుగో వికెట్‌కు 172 పరుగులు జోడించింది. పంత్ సెంచరీ పూర్తయ్యే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ స్కోర్ 264/3గా ఉంది. రాహుల్ 112, పంత్ 100 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ ఆధిక్యం 270 పరుగులుగా ఉంది. భారత రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 4, సాయి సుదర్శన్ 30, గిల్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2, స్టోక్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు భారత్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ల్లో నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
భారత్-ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)
-
Ind vs Eng 1st Test: శతక్కొట్టిన కేఎల్ రాహుల్
ఇంగ్లండ్‌తో మొదటి టెస్టులో కేఎల్ రాహుల్ (KL Rahul) అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల వద్ద అవుటైన ఈ స్టార్ ఓపెనర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం శతకంతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ పెద్దన్నలా ఆదుకుని బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. 202 బంతుల్లో వంద పరుగుల మార్కును అందుకున్నాడు.రాహుల్ శతక ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా అదరగొడుతున్నాడు. సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా పంత్ కూడా సెంచరీ బాదాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో శుక్రవారం తొలి టెస్టు ఆరంభమైంది.టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (134) శతకాలతో చెలరేగడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది.ఇందుకు బదులుగా స్టోక్స్ బృందం తమ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేయగా.. భారత్‌కు ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగు పరుగులు మాత్రమే చేసి.. బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ పట్టుదలగా నిలబడగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు.ఇక నాలుగో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో రాహుల్- పంత్ నిలకడగా ఆడుతూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 69.4 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి పంత్ 100, రాహుల్ 112 పరుగులతో ఉన్నారు. టీమిండియా 270 పరుగుల ఆధిక్యంలో ఉంది.𝗖 𝗛 𝗔 𝗠 𝗣 𝗜 𝗢 𝗡 𝗦 𝗧 𝗨 𝗙 𝗙 🫡🙌🏻After missing out in the first innings, @klrahul makes it count in the second! A priceless century that puts #TeamIndia in a commanding position in the 1st Test! 🇮🇳#ENGvIND 1st Test Day 4 LIVE NOW Streaming on JioHotstar 👉… pic.twitter.com/FVrutSIABd— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
కేఎల్ రాహుల్ మాస్టర్ మైండ్.. జట్టు పీక్కున్న పాకిస్తాన్ సంతతి బౌలర్
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు పోటీపడగా (భారత్ 471, ఇంగ్లండ్ 465).. భారత్‌కే స్వల్ప ఆధిక్యం లభించింది. 6 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. నాలుగో రోజు లంచ్ విరామం తర్వాత 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. రాహుల్ 98, పంత్ 77 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ ఆధిక్యం 232 పరుగులుగా ఉంది.ఇదిలా ఉంటే, మూడో రోజు ఆటలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర పరిణామం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఎంత క్లాసీ ఆటగాడో అంతే తెలివిపరుడని మరోసారి రుజువు చేసుకున్నాడు. ఓ సందర్భంలో రాహుల్ తన మాస్టర్ మైండ్‌ను ఉపయోగించిన తీరును భారత క్రికెట్ అభిమానులు తెగ ప్రశంశిస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. మూడో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.అనంతరం రాహుల్‌కు తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన సాయి సుదర్శన్ జత కలిశాడు. సాయి సుదర్శన్ వచ్చీ రాగానే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన ఎత్తుగడలను మొదలుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై అప్పటికే ఒత్తిడిలో ఉన్న సాయి సుదర్శన్‌పై బెన్ తన స్పిన్ అస్త్రం, పాకిస్తానీ సంతతి ఆటగాడు షోయబ్ బషీర్‌ను ప్రయోగించాడు.ఈ సమయంలో రాహుల్ తన మాస్టర్ బుర్రను (సాయి సుదర్శన్‌ను అలర్ట్ చేసే క్రమంలో) ఉపయోగించాడు. సాయి సుదర్శన్‌తో హిందీ, ఇంగ్లీష్‌లో కాకుండా తమిళంలో సంభాషించాడు. పాకిస్తానీ సంతతి వాడైన షోయబ్ బషీర్‌కు హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడితే అర్దమవుతుందనే ఉద్దేశంతో రాహుల్ సాయితో తమిళంలో మాట్లాడాడు. రాహుల్ తనకు అర్దం కాని భాషలో మాట్లాడటం చూసి బషీర్ జట్టు పీక్కున్నాడు. కర్ణాటకు చెందిన రాహుల్‌కు కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలే కాకుండా తమిళం కూడా తెలుసని చాలామందికి తెలీదు. వాస్తవానికి ఈ ట్రిక్కు భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వాడేవారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడే సమయంలో వారికి ఇంగ్లీష్, హిందీ అర్దమవుతాయని ఆ ఇద్దరు దిగ్గజాలు మరాఠీలో మాట్లాడేవారు. తమ వ్యూహాలు ప్రత్యర్ధికి అర్దం కాకుండా భారత దిగ్గజాలు ఈ ఎత్తుగడను ఉపయోగించేవారు. తాజాగా రాహుల్ సచిన్, ద్రవిడ్ మాస్టర్ మైండ్స్‌ను ఫాలో అయ్యి క్రికెట్ అభిమానులచే శభాష్ అనిపించుకున్నాడు. -
KL Rahul: చూసి ఆడు పంత్.. నేనేమీ నిర్లక్ష్యపు షాట్లు ఆడటం లేదు!.. నువ్వే..
ఇంగ్లండ్ (Ind vs Eng)తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆచితూచి ఆడుతోంది. ఇప్పటికే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4), వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (30), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (8)ల వికెట్లను టీమిండియా కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట దశలో ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌లపై భారం పడింది.నాలుగో రోజు ఆటలో భాగంగా ఆదిలోనే గిల్ అవుట్ కావడంతో.. పంత్ రాహుల్ (KL Rahul)కు జతయ్యాడు. ఇద్దరూ కలిసి భోజన విరామ సమయానికి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.ఓవైపు కేఎల్ రాహుల్ కూల్‌గా తన పని తాను చేసుకుపోతుంటే.. రిషభ్ పంత్ (Rishabh Pant) మాత్రం తగ్గేదేలే అంటూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఈ క్రమంలో ముప్పై మూడవ ఓవర్లో మూడో బంతికి బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన పంత్.. అదృష్టవశాత్తూ క్యాచ్ అవుట్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బ్యాట్ ఎడ్జ్‌ను తాకిని బంతి ఫైన్-లెగ్ రీజన్లో గాల్లోకి లేవగా.. వికెట్ కీపర్, ఫస్ట్ స్లిప్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. దీంతో పంత్ బతికిపోయాడు.చూసి ఆడు.. నేనేమీ నిర్లక్ష్యఫు షాట్లు ఆడటం లేదుఈ నేపథ్యంలో రాహుల్ పంత్‌కు సలహా ఇచ్చాడు. ‘కాస్త చూసి ఆడు.. జాగ్రత్త’ అని హెచ్చరించాడు. అయితే, పంత్ ఇందుకు కాస్త దురుసుగానే సమాధానం ఇచ్చినట్లు అనిపించింది. ‘‘నేనేమీ నిర్లక్ష్యఫు షాట్లు ఆడటం లేదు. జాగ్రత్తగానే హిట్టింగ్ చేస్తున్నా’’ అని పంత్ పేర్కొన్నాడు. స్టంప్ మైకులో ఈ మాటలు రికార్డయ్యాయి.స్కోర్ చేయలేకపోతున్నాంఆ తర్వాత మరోసారి.. ‘‘బంతి పాతబడిపోయింది. మరీ ఆచితూచి ఆడటం వల్ల స్కోర్ చేసే అవకాశాన్ని మిస్ అయిపోతున్నాం’’ అని పంత్ పేర్కొనడం గమనార్హం. వీరికి సంభాషణను హైలైట్ చేస్తూ కామెంటేటర్లు హర్షా భోగ్లే, ఛతేశ్వర్ పుజారా నవ్వుకున్నారు. మరోవైపు.. టీమిండియా అభిమానులు రాహుల్ కూల్‌గానే పని పూర్తి చేస్తాడని ప్రశంసిస్తూనే.. పంత్ కాన్ఫిడెన్స్ వేరే లెవల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 54 ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టాననికి 175 పరుగుల వద్ద నిలిచింది. రాహుల్ 83, పంత్ 41 రన్స్‌తో ఆడుతున్నారు. ఇక 57వ ఓవర్ ముగిసే సరికి భారత్ 57 ఓవర్లలో 192 పరుగులు చేసింది. పంత్ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. రాహుల్ సెంచరీకి 15 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఇప్పటికే 100 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు. ఇక ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో లీడ్స్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు ఆరంభించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గిల్ సేన.. మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. ఇందుకు దీటుగా బదులిచ్చిన ఇంగ్లండ్ 465 పరుగులు సాధించింది. ఈ క్రమంలో ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా మెరుగ్గా ఆడి.. మంచి స్కోరు నమోదు చేస్తేనే ఆతిథ్య జట్టుకు సవాల్ విసరగలదు.UPDATE: Ind vs Eng 1st Test: శతక్కొట్టిన కేఎల్ రాహుల్చదవండి: ‘లక్ష్మణ్‌ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’Give us a day full of stump mic Pant, we won't complain! 🎙️ 🤭 #SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia | @RishabhPant17 pic.twitter.com/51XLsNwqu9— Sony Sports Network (@SonySportsNetwk) June 23, 2025 -
IND VS ENG 1st Test: సెహ్వాగ్ సరసన రాహుల్.. గవాస్కర్ ఒక్కడే మిగిలాడు..!
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. 47 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన రాహుల్.. 87 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. రాహుల్‌కు కెరీర్లో ఇది 18వ హాఫ్ సెంచరీ. SENA దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఓపెనర్‌గా అతనికిది తొమ్మిదో హాఫ్ సెంచరీ. ఈ హాఫ్ సెంచరీతో రాహుల్ భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మరో మాజీ ఓపెనర్ మురళీ విజయ్ రికార్డును సమం చేశాడు. భారత ఓపెనర్లుగా సెహ్వాగ్, మురళీ కూడా సేనా దేశాల్లో తలో 9 హాఫ్ సెంచరీలు చేశారు. ఈ విభాగంలో సునీల్ గవాస్కర్ ఒక్కడే ప్రస్తుతం రాహుల్ కంటే ముందున్నాడు. భారత ఓపెనర్‌గా గవాస్కర్ సేనా దేశాల్లో 19 హాఫ్ సెంచరీలు చేశాడు.సేనా దేశాల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన భారత ఓపెనర్లు:19 - సునీల్ గవాస్కర్ 57 ఇన్నింగ్స్‌లలో9* - కేఎల్ రాహుల్ 42 ఇన్నింగ్స్‌లలో9 - మురళీ విజయ్ 42 ఇన్నింగ్స్‌లలో9 - వీరేంద్ర సెహ్వాగ్ 49 ఇన్నింగ్స్లలోమ్యాచ్ విషయానికొస్తే.. ఓవర్‌నైట్ స్కోర్ 90/2 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికే (24.6వ ఓవర్) బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి భారత్ మూడో వికెట్ కోల్పోయింది.ఈ దశలో రిషబ్ పంత్ రాహుల్‌కు జత కలిశాడు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 153/3గా ఉంది. రాహుల్ 72, పంత్ 31 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ ఆధిక్యం 159 పరుగులుగా ఉంది. భారత రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (4) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (30) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు భారత్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ల్లో నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
అతడొక సూపర్ మ్యాన్.. 700 పరుగులు చేస్తాడు: సునీల్ గవాస్కర్
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. బ్యాటింగ్ పరంగా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాయి. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులు చేస్తే.. ఇంగ్లండ్ అందుకు సమాధానంగా 465 పరుగులు చేసింది. భారత్‌కు కేవలం 6 పరుగులు మాత్రమే ఆధిక్యం లభించింది.మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(47), శుబ్‌మన్ గిల్ ఉన్నారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నందున ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించక తప్పదు. అది జరగాలంటే భారత్ నాలుగో రోజు మొత్తం బ్యాటింగ్ చేయాలి.క్రీజులో పాతుకుపోయిన కేఎల్ రాహుల్ నుంచి భారీ ఇన్నింగ్స్‌ను భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్‌పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్‌లో అద్బుతమైన టాలెంట్ ఉందని అతడు కొనియాడాడు."కేఎల్ రాహుల్ టోటల్ టీమ్ మ్యాన్. జట్టుకు ఏ అవసరమున్న తను ముందుకు వస్తాడు. ఏ స్ధానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. ఓపెనర్‌గా, మిడిలార్డర్లో ఎక్కడైనా బ్యాటింగ్ చేసే సత్తా అతడికి ఉంది. అంతేకాకుండా వికెట్ కీపర్‌గా కూడా రాణించలగడు. పరిస్థితులకు తగ్గట్టు ఆడే టాలెంట్ అతడి వద్ద ఉంది.ఎటువంటి పరిస్థితులలోనైనా రాహుల్ చాలా ప్రశాంతంగా కన్పిస్తాడు. ప్రస్తుత తరంలో ఇటువంటి క్రికెటర్లు చాలా అరుదుగా ఉంటారు. అతడు ఏదైనా సాధించినప్పుడు సెలబ్రేషన్స్ కూడా పెద్దగా చేసుకోడు. నిజంగా అతడు చాలా గ్రేట్. రాహుల్‌లో అద్బుతమైన టాలెంట్ ఉంది.ఈ మ్యాచ్‌లో ఆఫ్‌సైడ్, లెగ్-సైడ్, ఫ్లిక్ వంటి మాస్టర్ క్లాస్ షాట్లు ఆడాడు. అతడి ఆట చూడటానికి చాలా అందంగా అనిపించింది. ఈ సిరీస్‌లో రాహుల్ బాగా రాణిస్తున్నాడన్న నమ్మకం నాకుంది. 5 టెస్టుల్లో కనీసం 700 పరుగులైనా చేస్తాడని" గవాస్కర్ జోస్యం చెప్పాడు.చదవండి: అతడిపై నమ్మకం లేనపుడు.. ఎందుకు ఎంపిక చేశారు?: భారత మాజీ క్రికెటర్ -
Ind vs Eng: వర్షం వల్ల ముందే ముగిసిన ఆట.. పూర్తి వివరాలు
India vs England 1st Test Day 3 Report: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆటకు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో నిర్ణీత సమయం కంటే కాస్త ముందుగానే అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆదివారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్ 23.5 ఓవర్లు ఆడి రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. అంతకు ముందు ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ కంటే 96 పరుగుల ఆధిక్యంలో ఉంది.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా శుక్రవారం మొదటి టెస్టు ఆరంభమైన విషయం తెలిసిందే. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. గిల్ సేన తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌట్ అయింది.భారత తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147)లతో పాటు.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీతో చెలరేగాడు. మిగతా వారిలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగేసి వికెట్లు కూల్చగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ ఒక్కో వికెట్ తీశారు.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు దీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. మరోవైపు.. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో ఆకట్టుకున్నారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది.భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సరికి మొత్తంగా 96 పరుగుల లీడ్‌లో ఉంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) ఈసారి నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 47, కెప్టెన్ గిల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
వాళ్లని మెచ్చుకో.. తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్!
టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌పై భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇంకా ‘కింగ్’ను కించపరిచేలా వ్యాఖ్యానాలు చేయడం ఎందుకని ఫైర్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే..?!భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి టెస్టు మొదలైన విషయం తెలిసిందే. లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. టీమిండియాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.రాహుల్, జైస్వాల్ జోరుఈ క్రమంలో ఓపెనర్లు కేఎల్ రాహుల్- యశస్వి జైస్వాల్ కలిసి భారత్‌కు శుభారంభం అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లీడ్స్‌లో టీమిండియా ఓపెనింగ్ జంటకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్, జైస్వాల్‌లను కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసించాడు. అవుట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్తున్న బంతులను వదిలేసి మంచి పనిచేశారంటూ కొనియాడాడు. అదే సమయంలో పరోక్షంగా కోహ్లిని ఉద్దేశించి విమర్శలు చేశాడు.వాళ్లని మెచ్చుకో.. తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్!‘‘ఓ మాజీ బ్యాటర్.. పదే పదే ఇలాంటి బంతుల వెనుక పడి.. తనను తాను చిక్కుల్లో పడేసుకునేవాడు’’ అంటూ కోహ్లి పేరు ప్రస్తావించకుండానే మంజ్రేకర్ పరోక్షంగా అతడిని విమర్శించాడు. ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులు మంజ్రేకర్‌పై మండిపడుతున్నారు.‘‘బాగా ఆడినందుకు రాహుల్- జైస్వాల్‌లను మెచ్చుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పటికీ కోహ్లి పేరును వాడుకోవడం ఎందుకు? అతడు రిటైర్ అయిపోయాడు. ఇప్పటికైనా అతడిని వదిలేయండి. మంజ్రేకర్ సాబ్.. మీ పేరు నలుగురి నోళ్లలో నానేందుకు ఇలా చేయడం సరికాదు’’ అని చురకలు అంటిస్తున్నారు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌ను టీమిండియా ఇంగ్లండ్‌తో పర్యటనతో ఆరంభించింది. ఈ సిరీస్‌కు ముందే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో రోహిత్ స్థానంలో శుబ్‌మన్ గిల్ కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.ఇక కోహ్లి, రోహిత్ చివరగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్టులు ఆడారు. నాటి టూర్లో కోహ్లి పదే పదే అవుట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్తున్న బంతులను ఆడే క్రమంలో అత్యధికసార్లు వికెట్ పారేసుకున్న విషయం తెలిసిందే.జైసూ హాఫ్ సెంచరీ..మ్యాచ్ విషయానికొస్తే.. భోజన విరామ సమయానికి ముందే కేఎల్ రాహుల్ 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అరంగేట్ర ఆటగాడు, మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సాయి సుదర్శన్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. 35 ఓవర్లు ముగిసే సరికి మరో ఓపెనర్ జైస్వాల్ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. కెప్టెన్ గిల్ 36 బంతుల్లో 33 పరుగులు సాధించాడు. జట్టు స్కోరు: 135/2 (35) . చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. ఈ శతాబ్దంలో ఒకే ఒక్కడు! -
కరుణ్‌తో కలిసి సుదీర్ఘ కాలం టీమిండియాకు ఆడాలి.. కేఎల్ రాహుల్ ఆశాభావం
భారత టెస్టు జట్టు సభ్యులైన కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి వివిధ వయో విభాగాల్లో ఈ కర్ణాటక మిత్రులు కలిసి ఆడారు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత రాహుల్, నాయర్లకు ఒకే టెస్టులో కలిసి ఆడే అవకాశం దక్కింది. టీమ్‌లో రాహుల్ రెగ్యులర్ మెంబర్ కాగా, ఎనిమిదేళ్ల తర్వాత నాయర్ పునరాగమనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమ స్నేహం చిరకాలం కొనసాగడంతో పాటు టీమిండియా తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు రాహుల్ చెప్పాడు.‘11 ఏళ్ల వయసులో ఇద్దరం ఒకేసారి క్రికెట్ ఆడటం ప్రారంభించాం. ఈ ప్రయాణం ఇప్పటికీ సాగుతోంది. ఇద్దరి కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. గత 2–3 ఏళ్లలో అద్భుతంగా ఆడి ఎన్నో ప్రతికూలతలను దాటి నాయర్ పునరాగమనం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్‌లో ఉండే పరిస్థితులు, సవాళ్ల గురించి మేము మాట్లాడుకున్నాం. మేమిద్దరం కలిసి భారత్ తరఫున సుదీర్ఘ కాలం ఆడాలని కోరుకుంటున్నా’ అని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రాహుల్, కరుణ్ సభ్యులుగా ఉన్నారు. ఈ ఇద్దరు ఇవాల్టి నుంచి (జూన్ 20) లీడ్స్ వేదికగా ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో ఆడటం దాదాపుగా ఖరారైంది. ఈ మ్యాచ్‌లో రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉండగా.. కరుణ్ మిడిలార్డర్లో ఐదు లేదా ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు రావచ్చు. విరాట్, రోహిత్‌ల టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత భారత బ్యాటింగ్ విభాగంలో రాహులే సీనియర్ సభ్యుడు. పైగా రాహుల్‌కు గత ఇంగ్లండ్ పర్యటనలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఓపెనర్‌గానే గత పర్యటనలో రాహుల్ సెంచరీ చేశాడు. ఇటీవలికాలంలో రాహుల్ పలు బ్యాటింగ్ స్థానాలు మారినా ఓపెనర్‌గా అయితే అతను పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. రాహుల్ ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ పర్వాలేదనిపించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్లో ఇరగదీశాడు.కరుణ్ విషయానికొస్తే.. గత రెండు దేశవాలీ సీజన్లలో పరుగుల వరద పారించిన ఇతగాడు.. తాజాగా ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించి మాంచి జోష్‌లో ఉన్నాడు. కరుణ్‌కు ఇంగ్లండ్ గడ్డపై ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. కౌంట్లీలో అతని పేరిట ఓ డబుల్ సెంచరీ, పలు సెంచరీలు ఉన్నాయి. కరుణ్ తనకు గుర్తింపు తెచ్చిన ట్రిపుల్ సెంచరీని ఇంగ్లండ్‌పైనే సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై, ఇంగ్లండ్‌పై ఘనమైన ట్రాక్ రికార్డు ఉండటంతో కరుణ్‌పై ఈ సిరీస్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. కరుణ్‌ను భారత క్రికెట్ అభిమానులు విరాట్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. దోస్తులు (రాహుల్, కరుణ్) నేటి నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఏమేరకు రాణిస్తారో చూడాలి. -
వినూత్న సవాళ్లను ఎదుర్కొన్న కేఎల్ రాహుల్, బెన్ స్టోక్స్.. వైరల్ వీడియో
జూన్ 20 నుంచి ప్రారంభం కాబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు భారత్, ఇంగ్లండ్‌కు చెందిన స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, బెన్ స్టోక్స్ పలు వినూత్న సవాళ్లను ఎదుర్కొన్నారు. అల్టిమేట్ క్రికెటింగ్ ఛాలెంజెస్ పేరుతో రెడ్ బుల్ సంస్థ ఈ పోటీలను నిర్వహించింది. ఇందులో రాహుల్, బెన్ నాలుగు కఠినమైన క్రికెటింగ్ ఛాలెంజ్‌లు ఎదుర్కొన్నారు. ఇవి వారి ఖచ్చితత్వం మరియు శక్తిని పరీక్షించేందుకు సరదాగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీల్లో ఇరువురు బౌలింగ్ యంత్రాలను నుంచి వచ్చే బంతులను ఎదుర్కొని సవాళ్లను స్వీకరించారు.మొదటి ఛాలెంజ్‌లో రాహుల్ ఓ భారీ ట్రక్‌పై బౌలింగ్ మిషన్ నుంచి వచ్చే పదునైన బంతులను ఎదుర్కొని భారీ షాట్ల ఛాలెంజ్‌ను ఫేస్ చేశాడు. ఈ ఛాలెంజ్‌లో రాహుల్ 8 బంతుల్లో కలిపి 500 మీటర్ల దూరం షాట్లు ఆడాలి. ఇందులో రాహుల్ చివరి బంతికి టార్గెట్‌ను రీచ్ అయ్యాడు.రెండో చాలెంజ్‌లో బెన్ స్టోక్స్ ఓ సరస్సులో బోటుపై నిలబడి నీటిపై తేలియాడుతున్న ఆరు టార్గెట్లను బంతులతో హిట్ చేయాలి. ఇది కచ్చితమైన లక్ష్య నిర్దేశంతో కూడిన సవాలు. మూడో ఛాలెంజ్‌లో రాహుల్, స్టోక్స్ ప్రత్యేకంగా రూపొందించిన గదుల్లోకి వివిధ రకాలైన ఛాలెంజ్‌లను ఎదుర్కొన్నారు.చివరిగా ఫైనల్ బాస్ పేరుతో ఇరువురికి ఓ కఠినమైన సవాలు ఎదురైంది. కదులుతూ, నిలకడగా ఉన్న లక్ష్యాలను బౌలింగ్ యంత్రాల నుంచి వచ్చే బంతులను ఎదుర్కొంటూ హిట్ చేయాలి. ఈ పోటీల్లో రాహుల్, స్టోక్స్ సమంగా రాణించారు. ఈ ఛాలెంజ్‌లకు సంబంధించిన వీడియో భారత్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకర్శిస్తుంది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. -
రాణించిన అభిమన్యు, రాహుల్
నార్తంప్టన్: ఓపెనర్ కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో కదంతొక్కగా... రెండో ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీతో రాణించాడు. దీంతో భారత్ ‘ఎ’ భారీ ఆధిక్యంపై కన్నేసింది. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (80; 10 ఫోర్లు), రాహుల్ (51; 9 ఫోర్లు) రెండో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (5), మిడిలార్డర్లో కరుణ్ నాయర్ (15; 3 ఫోర్లు) విఫలమయ్యారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ధ్రువ్ జురేల్ (6 బ్యాటింగ్), నితీశ్ రెడ్డి (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. క్రిస్ వోక్స్‌కు 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని భారత్ ప్రస్తుతం 184 పరుగులు ఆధిక్యంలో ఉంది. చేతిలో ఇంకా 6 వికెట్లున్నాయి. భారత్‌కు స్వల్ప ఆధిక్యం అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 192/3తో మూడో రోజు ఆదివారం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 327 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత్‌కు 21 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. క్రితంరోజు బ్యాటర్లలో జోర్డాన్ కాక్స్ (45; 7 ఫోర్లు) మెరుగ్గా ఆడగా, కెప్టెన్ జేమ్స్ ర్యూ (10) విఫలమయ్యాడు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 4 వికెట్లు దక్కాయి. -
India A vs England Lions: భారత్-ఎ బౌలర్లు విఫలం..
నార్తంప్టన్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టు బౌలర్లు తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్ధి బ్యాటర్లను ఔట్ చేసేందుకు భారత-ఎ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ లయన్స్ 46 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.క్రీజులో జోర్డాన్ కాక్స్(31),జేమ్స్ రెవ్(0) ఉన్నారు. టాపర్డర్ బ్యాటర్లు టామ్ హైన్స్(54), ఎమిలియో గే(71) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే ఇంకా 127 పరుగులు వెనకబడి ఉంది. భారత బౌలర్లలో ఇప్పటివరకు కాంబోజ్, కోటియన్, దేశ్‌పాండే తలా వికెట్ సాధించారు.ఇక అంతకుముందు భారత్-ఎ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. 319/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు.. అదనంగా 29 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత్ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్(116) టాప్ స్కోరర్‌గా నిలవగా..ధ్రువ్ జురేల్ (87 బంతుల్లో 52; 7 ఫోర్లు), కరుణ్ నాయర్ (71 బంతుల్లో 40; 4 ఫోర్లు), ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (57 బంతుల్లో 34; 5 ఫోర్లు) రాణించారు.ఇక ఇంగ్లండ్ బౌలర్లలో సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్ మూడు వికెట్లు పడగొట్టగా..జోష్ టంగ్, జార్జ్ హిల్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అనాధికారిక టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.చదవండి: ఆర్సీబీలోకి బుమ్రా, సూర్యకుమార్, పంత్: విజయ్ మాల్యా డ్రీమ్ టీమ్ -
IND-A vs ENG: 348 పరుగులకు భారత్-ఎ ఆలౌట్
నార్తంప్టన్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న రెండో అనాధికారిక భారత్-ఎ జట్టు బ్యాటర్లు రాణించారు. టాస్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. 319/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు.. అదనంగా 29 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఇండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 168 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 116 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాహుల్‌తో పాటు వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ (87 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... గత మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన కరుణ్ నాయర్ (71 బంతుల్లో 40; 4 ఫోర్లు), ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (57 బంతుల్లో 34; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్ మూడు వికెట్లు పడగొట్టగా..జోష్ టంగ్, జార్జ్ హిల్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అనాధికారిక టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.మరో 13 రోజుల్లో..ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు.. తొలి టెస్టు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు లేకుండా ఇంగ్లండ్‌కు వెళ్లిన టీమిండియా.. ప్రత్యర్ధి జట్టును ఎలా ఎదుర్కొంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. రోహిత్ శర్మ స్ధానంలో కొత్త టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే.ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాణించిన కరుణ్ నాయర్, జురెల్
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సహచర టీమిండియా సభ్యుల కంటే ముందుగానే ఇంగ్లండ్‌లో ల్యాండైన కేఎల్ రాహుల్ వచ్చీ రాగానే పని మొదలుపెట్టాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో ఇవాళ (జూన్ 6) ప్రారంభమైన రెండో అనధికారిక టెస్ట్‌లో అర్ద సెంచరీ పూర్తి చేసి సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్ 151 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. యశస్వి జైస్వాల్‌కు జతగా బరిలోకి దిగిన రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి చాలా సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. ఎలాంటి దూకుడైన షాట్లు ఆడకుండా, చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు తరలించి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.మరో ఎండ్‌లో జైస్వాల్ (17), కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (11) తక్కువ స్కోర్లకే ఔటైనా, తొలి అనధికారిక టెస్ట్‌లో డబుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ సహకారంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలి టెస్ట్ ఫామ్‌నే కొనసాగించిన కరుణ్ ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్ దిశగా సాగుతున్న వేల క్రిస్ వోక్స్ అతనికి అడ్డుకట్ట వేశాడు. వోక్స్ ఓ అద్భుతమైన బంతితో కరుణ్‌ను 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బీడబ్ల్యూ చేశాడు. కరుణ్ ఔటయ్యాక రాహుల్ ధృవ్ జురెల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్ట్‌లో రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటిన జురెల్.. రాహుల్‌తో కలిసి 50 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 55 ఓవర్ల అనంతరం భారత్-ఏ స్కోర్ 234/3గా ఉంది. భారత్-ఏ కోల్పోయిన మూడు వికెట్లు క్రిస్ వోక్స్ ఖాతాలనే పడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ లయన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పాపం సర్ఫరాజ్ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇచ్చేందుకు గత మ్యాచ్‌లో సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్‌ను తప్పించారు. సర్ఫరాజ్ తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో 92 పరుగులు చేశాడు. రాహుల్ ఓపెనర్‌గా రావడంతో కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ మూడో స్థానానికి డిమోట్ అయ్యాడు. బౌలింగ్ డిపార్ట్మెంట్లోనూ ఓ కీలక మార్పు జరిగింది. తొలి మ్యాచ్‌లో 3 వికెట్లతో రాణించిన ముకేశ్ కుమార్ స్థానంలో ఖలీల్ అహ్మద్‌ను బరిలోకి దించారు. అలాగే హర్ష్ దూబే స్థానంలో తనుశ్ కోటియన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో రెండో అనధికారిక టెస్ట్ కోసం భారత-ఏ జట్టు..యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్, అన్షుల్ కంబోజ్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్ -
కేఎల్ రాహుల్‌పై అందరి దృష్టి
నార్తంప్టన్: ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు ముందు... ఇంగ్లండ్ లయన్స్‌తో భారత ‘ఎ’ జట్టు రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. భారత జట్టుకు ఎంపికైన ఆటగాళ్లకు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్ మంచి ప్రాక్టీస్ కానుండగా... సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై అందరి దృష్టి నిలవనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం జట్టులో అందరికంటే అనుభవజ్ఞుడైన రాహుల్‌పై బాధ్యత పెరగగా... ఈ మ్యాచ్‌లో అతడు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి.టీమిండియా టెస్టు కెప్టెన్‌గా కొత్తగా ఎంపికైన శుబ్‌మన్ గిల్, యువ ఓపెనర్ సాయి సుదర్శన్ ఇంకా ఇంగ్లండ్‌కు చేరుకోకపోవడంతో ఆ ఇద్దరూ ఈ మ్యాచ్‌లో పాల్గొనడంలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం ఈరోజు లండన్ బయలు దేరనున్న మిగిలిన ఆటగాళ్లు ప్రాక్టీస్ అనంతరం ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ ఆడనున్నారు. తొలి అనధికారిక మ్యాచ్‌లో కరుణ్ నాయర్ డబుల్ సెంచరీతో కదం తొక్కగా... సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి అర్ధశతకాలు సాధించారు. ఈ నెల 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు జరగనుండగా... ప్రాక్టీస్ మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా తుది జట్టు ఎంపిక జరగనుంది. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఆరుగురు ఆటగాళ్లు ఇంగ్లండ్ లయన్స్‌తో తొలి అనధికారిక టెస్టులో పాల్గొనగా... పేసర్ ఆకాశ్ దీప్ ఈ మ్యాచ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ్రస్టేలియా పర్యటనలో అటు బంతితో ఇటు బ్యాట్‌తో ఆకట్టుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఈ ఏడాది ఐపీఎల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధనాధన్ షాట్లతో హాఫ్‌సెంచరీ చేసిన నితీశ్... బంతితోనూ సత్తాచాటాలని భావిస్తున్నాడు. తుది జట్టులో చోటు కోసం మరో పేస్ ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్‌తో నితీశ్ పోటీపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌కు కూడా బ్యాటింగ్ పిచ్ అందుబాటులో ఉంది. ఇంగ్లండ్ టెస్టు జట్టులో సభ్యులైన క్రిస్ వోక్స్, జోష్ టంగ్ లయన్స్ తరఫున రాణించాలని చూస్తున్నారు. -
ఇంగ్లండ్‌కు బయల్దేరిన కేఎల్ రాహుల్
త్వరలో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టాడు. రాహుల్ నిన్ననే ముంబై నుంచి లండన్‌కు బయల్దేరాడు. రాహుల్ లండన్‌లోని హీథ్రూ విమానాశ్రయంలో ల్యాండైన దృశ్యాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.రాహుల్ ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడతాడు. ఈ మ్యాచ్ కోసమే రాహుల్ చాలా ముందుగా లండన్‌లో ల్యాండయ్యాడు. ఈ మ్యాచ్ జూన్ 6న ప్రారంభం కానుంది. నార్తంప్టన్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం తనను ముందుగానే ఇంగ్లండ్‌కు పంపాలని రాహుల్ బీసీసీఐకి ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. భారత్‌లో వాతావరణం ప్రాక్టీస్‌కు అనువుగా లేదని, అందుకే తనకు లయన్స్‌తో మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వాలని రాహుల్ బీసీసీఐని కోరాడు. రాహుల్ కోరిక మేరకు బీసీసీఐ అతన్ని ముందుగానే లండన్‌కు పంపింది.ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు భారత్-ఏ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ నిన్ననే ముగిసింది. ఈ మ్యాచ్ డ్రా అయ్యింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లకు మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపికైన కరుణ్ నాయర్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ తృటిలో సెంచరీలు మిస్ అయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్, ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి అర్ద సెంచరీలతో రాణించారు.లయన్స్‌తో రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ తర్వాత భారత జట్టు ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ జూన్ 13 నుంచి 16 వరకు జరుగుతుంది. అనంతరం జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు జూన్ 5వ తేదీ తర్వాత లండన్‌కు బయల్దేరుతుంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్‌కు ముందే గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ సిరీస్‌కు ముందే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) -
కేఎల్ రాహుల్.. నీ కమిట్మెంట్కు సలాం..!
ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్‌కు చేరని జట్ల ఆటగాళ్లందరూ ప్రస్తుతం వారివారి పనుల్లో నిమగ్నమైపోయారు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత ఏ ఆటగాళ్లు ఇవాల్టి నుంచి ఇంగ్లండ్ లయన్స్‌తో తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత ఏ జట్టు రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఆతర్వాత టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఐపీఎల్ పూర్తయిన తర్వాత ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన టీమిండియా ఆటగాళ్లంతా ప్రాక్టీస్ మొదలుపెడతారు.కాగా, ఐపీఎల్లో తన జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఖాళీగా ఉన్న ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ బీసీసీఐని ఓ విషయం కోసం అభ్యర్దించినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఎంపికై, ప్రస్తుతం భారత్‌లోనే ఉన్న రాహుల్ ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ కోసం తనను ఎంపిక చేయాలని బీసీసీఐని కోరాడట.ప్రస్తుతం భారత్‌లో వాతావరణ పరిస్థితులు ప్రాక్టీస్‌కు అనుకూలంగా లేకపోవడంతో (వర్షాలు) లయన్స్‌తో టెస్ట్ మ్యాచ్ తన ప్రాక్టీస్‌కు ఉపయోగపడుతుందని రాహుల్ భావిస్తున్నాడట. ఇందుకే తనను లయన్స్‌తో రెండో టెస్ట్ మ్యాచ్‌కు ఎంపిక చేయాలని బీసీసీఐని కోరాడట. ఈ విషయంపై స్పందించిన అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రాహుల్‌కు రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. రాహుల్‌ను సోమవారం (జూన్ 2) లండన్‌కు బయల్దేరాల్సిందిగా ఆదేశించిందట.జాతీయ జట్టు తరఫున రాణించేందుకు రాహుల్ బీసీసీఐకి చేసిన విన్నపం గురించి తెలిసి భారత క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. రాహుల్ కమిట్మెంట్కు సలాం కొడుతున్నారు. స్టార్డమ్ ఉన్న ఇతర ఆటగాళ్లు ఖాళీ దొరికితే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని చూస్తారు. రాహుల్ మాత్రం తన దేశం తరఫున రాణించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాండంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంగ్లండ్ లయన్స్‌తో రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి నార్తంప్టన్ వేదికగా జరుగనుంది.ఇంగ్లండ్ లయన్స్‌తో టెస్ట్ మ్యాచ్‌లకు ఎంపిక చేసిన భారత-ఏ జట్టు..కరుణ్ నాయర్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, తనుశ్ కోటియన్, హర్ష్ దూబే, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, ఆకాశ్దీప్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
రాహుల్, అభిమన్యు, సుదర్శన్.. టీమిండియా ఓపెనర్ ఎవరు?
భారత కొత్త టెస్టు కెప్టెన్ ఎవరన్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. టీమిండియా కెప్టెన్‌గా అంతా ఊహించినట్లే శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. అయితే ఇప్పుడు టీమిండియా ఓపెనర్ ఎవరన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత ఇన్నింగ్స్‌ను జైశ్వాల్‌తో కలిసి ఎవరు ఆరభిస్తారన్న చర్చ నడుస్తోంది. భారత ఓపెనర్ స్దానం కోసం ముగ్గురు పోటీలో ఉన్నారు. వారే స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, తమిళనాడు సంచలనం సాయిసుదర్శన్, బెంగాల్ మాజీ కెప్టెన్ అభిమాన్యు ఈశ్వరన్. కేఎల్ రాహుల్ వైపే మొగ్గు..?మిగితా ఇద్దరితో పోలిస్తే రాహుల్‌కే భారత ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహుల్ ఒక సెల్ప్లెస్ ఆటగాడు. 2014లో అరంగేట్రం చేసినప్పటి నుంచి రాహుల్ ఓపెనర్‌గాను, మిడిలార్డర్లోనూ తన సేవలను అందించాడు. ఆఖరికి ఆరో స్ధానంలో కూడా బ్యాటింగ్ చేసిన సందర్బాలు ఉన్నాయి. గతంలో టెస్టుల్లో భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అనుభవం రాహుల్‌కు ఉంది. టెస్టుల్లో అతడికి ఓపెనర్‌గా రెండు సెంచరీలు ఉన్నాయి. 2018-21 కాలంలో టెస్టుల్లో టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. 18 ఇన్నింగ్స్‌లలో 37.31 సగటుతో 597 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 83 ఇన్నింగ్స్‌లలో 35.03 సగటుతో 2803 పరుగులు చేశాడు. అదేవిధంగా ఇంగ్లండ్ వంటి బౌన్సీ కండిషన్స్‌లో నిలకడగా బ్యాటింగ్ చేసే సత్తా కూడా రాహుల్‌కు ఉంది. దీంతో రాహుల్-జైశ్వాల్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే సూచనలు కన్పిస్తున్నాయి.సాయిసుదర్శన్ మరో అప్షన్..!ఒక వేళ కేఎల్ రాహల్‌ను మిడిలార్డర్లో ఆడించాలని టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తే.. యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ను ఓపెనర్‌గా పంపే అవకాశముంటుంది. సాయి సుదర్శన్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున సంచలనాలు సృష్టించాడు. వైట్ బాల్ క్రికెట్లోనూ కాదు రెడ్ బాల్ క్రికెట్లో కూడా సుదర్శన్‌ను తనను తాను నిరూపించుకున్నాడు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతడికి మెరుగైన రికార్డు ఉంది. 2022-25 కాలంలో 49 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్.. 39.93 సగటుతో 1957 పరుగులు చేశాడు. అందులో 7 హాఫ్ సెంచరీలు, 5 శతకాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా అతడికి ఉంది. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సర్రే తరపున ఆడాడు. ఈ తమిళనాడు బ్యాటర్ కౌంటీల్లో 8 ఇన్నింగ్స్‌లలో 35.12 సగటుతో 281 పరుగులు చేశాడు.అభిమన్యు ఈశ్వరన్..భారత జట్టు మెనెజ్‌మెంట్‌కు ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్ రూపంలో మరో అప్షన్ ఉంది. దశాబ్ద కాలంగా దేశీయ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్న ఈశ్వరన్.. ఇప్పటివరకు భారత జట్టు తరపున అరంగేట్రం చేయలేదు. పలుమార్లు భారత జట్టు ఎంపికైనా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కలేదు. ఒకవేళ ఇంగ్లండ్ టూర్లో అతడు అరంగేట్రం చేస్తే.. కచ్చితంగా జైశ్వాల్ ఓపెనింగ్ పార్టనర్ అభిమన్యు అనే చెప్పాలి. ఎందుకంటే అతడికి అపారమైన అనభవం ఉంది. ఇప్పటివరకు 101 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఈశ్వరన్.. 48.87 సగటుతో 7674 పరుగులు చేశాడు. అతడి పేరిట 27 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా ప్రధాన సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో ఇండియా-ఎ టీమ్ కెప్టెన్‌గా అభిమన్యు వ్యవహరించనున్నాడు. ఈ అనాధికారిక సిరీస్‌లో అభిమన్యు రాణిస్తే.. ప్రధాన సిరీస్‌లో కూడా అడే అవకాశముంది.చదవండి: Shreyas Iyer: కెప్టెన్ అవుతాడన్నారు.. కట్ చేస్తే! ఇప్పుడు టీమ్‌లోనే నో ఛాన్స్ -
టీమిండియా సారథిగా శుబ్‌మన్ గిల్ ఫిక్స్!.. వైస్ కెప్టెన్ ఎవరంటే?
టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ ఎవరన్న ఉత్కంఠకు మరో 24 గంటల్లో తెరపడనుంది. బీసీసీఐ శనివారం ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టుతో పాటు కొత్త టెస్టు కెప్టెన్ పేరును కూడా వెల్లడించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ పేరును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.అదేవిధంగా గిల్‌కు డిప్యూటీగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను నియమించాలని అజిత్ అగార్కర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇంగ్లండ్ పర్యటనకు స్టార్ పేసర్ మహ్మద్ షమీని పక్కన పెట్టాలని సెలక్టర్లు డిసైడనట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. షమీ తన మడమ గాయం కారణంగా లాంగ్ స్పెల్స్ వేసేందుకు ఇంకా సిద్దంగా లేనట్లు బీసీసీఐ వైద్య బృందం ధ్రువీకరించనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సాయిసుదర్శన్, కరుణ్ నాయర్లకు భారత టెస్టు జట్టులో చోటు ఖాయమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. జూన్ 20 నుంచి 24 లీడ్స్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. కాగా ఈ కీలక సిరీస్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు(అంచనా): శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్, దృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హర్షి దేష్, ప్రశీద్, షర్షి దేష్, ప్రశిద్ కుల్దీప్ యాదవ్.చదవండి: రూ.25 లక్షలు మోసపోయిన దీప్తీ శర్మ..? సహచర క్రికెటర్‌పై కేసు నమోదు -
ఢిల్లీ క్యాపిటల్స్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా
ఐపీఎల్-2025 (IPL 2025)ఆరంభంలో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు నిరాశే మిగిలింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా టాప్-4 నుంచి అధికారికంగా నిష్క్రమించగా.. ముంబై ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించింది.గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌తో పాటు ముంబై టైటిల్ పోరులో నిలిచింది. మరోవైపు.. ముంబై చేతిలో ఓడిపోయిన ఢిల్లీ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ సీజన్లో తొలి నాలుగు మ్యాచ్‌లలో గెలిచి కూడా.. ప్లే ఆఫ్స్ చేరని ఏకైక జట్టుగా నిలిచింది.వరుసగా నాలుగు విజయాలుకాగా ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ (Axar Patel) పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో తొలుత లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడ్డ ఢిల్లీ.. ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. మరుసటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టిన అక్షర్ సేన.. చెపాక్‌లో సీఎస్కేను 25 పరుగుల తేడాతో ఓడించింది. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇలా సీజన్‌లోని తొలి నాలుగు మ్యాచ్‌లలో గెలుపొందిన ఢిల్లీ.. ఆ తర్వాత అదే జోరును కనబరచలేకపోయింది.ముంబై చేతిలో అపుడూ ఓడిన ఢిల్లీముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన(ఏప్రిల్ 13) ఢిల్లీ సీజన్లో తొలి పరాజయం చవిచూసింది. అయితే, మరుసటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడ్డ ఢిల్లీ అదృష్టవశాత్తూ సూపర్ ఓవర్లో గెలుపొందింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన అక్షర్ సేన.. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్‌పై సీజన్లో రెండో విజయం సాధించింది.అయితే, ఆర్సీబీ మాత్రం ప్రతీకారం తీర్చుకుని ఢిల్లీలోనే ఢిల్లీ జట్టును ఓడించింది. అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలోనూ అక్షర్ సేన ఓడిపోయింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో గట్టెక్కింది. అనంతరం పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ మ్యాచ్ సాంకేతిక కారణాల (ఆపరేషన్ సిందూర్) వల్ల ఆగిపోయింది.ఆ తర్వాత గుజరాత్‌ను ఢీకొట్టిన ఢిల్లీ పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో మరోసారి ఓటమిని చవిచూసింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వాంఖడే వేదికగా ఢిల్లీ జట్టు.. హార్దిక్ సేనతో తలపడింది.సూర్య, నమన్ ధనాధన్టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (73 నాటౌట్), నమన్ ధీర్ (24 నాటౌట్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు వికెట్లు కూల్చగా.. దుష్మంత చమీర, ముస్తాఫిజుర్ రహ్మాన్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.లక్ష్య ఛేదనలో ఢిల్లీ విలవిలఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ చేతులెత్తేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (11), తాత్కాలిక కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (6).. వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్(6) దారుణంగా విఫలమయ్యారు. సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.మిగతా వారంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో 18.2 ఓవర్లలో కేవలం 121 పరుగులు మాత్రమే చేసి ఢిల్లీ ఆలౌట్ అయింది. దీంతో ముంబై చేతిలో 59 పరుగుల తేడాతో ఓడిపోయి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఇలా ఐపీఎల్ సీజన్ ఆరంభంలో వరుసగా తొలి నాలుగు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ.. ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటిబాట పట్టిన తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ అపవాదును మూటగట్టుకుంది. కాగా లీగ్‌లో తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ పంజాబ్‌తో తలపడనుంది.చదవండి: వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025 -
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్!?
ఐపీఎల్-2025లో బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా కీలక పోరులో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తమ ప్లే ఆశలను పదిలం చేసుకుంటుంది. నాలుగో స్ధానం కోసం ముంబై, ఢిల్లీ జట్లు పోటీపడుతున్నాయి.ఇక ఈ కీలక మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సమయంలో ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మోకాలికి గాయమైనట్లు సమాచారం. పేసర్ ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో బంతి రాహుల్ మోకాలికి బలంగా తాకినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో అతడు ప్రాక్టీస్ మధ్యలోనే నెట్స్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో రాహుల్ ఆడే అనుమానమే. ఇప్పటికే మిచెల్ స్టార్క్ సేవలను కోల్పోయిన ఢిల్లీకి.. రాహుల్ కూడా దూరమైతే గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. కాగా ఈ ఏడాది సీజన్లో రాహుల్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ సెంచరీతో మెరిశాడు.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముస్తాఫిజుర్ రెహమాన్, దుష్మంత చమీరా, సెడికుల్లా అటల్, త్రిష్వానా విజయ్ నాయర్, త్రిష్వానా విజయ్ నాయర్, త్రిష్వానా విజయ్ నాయర్ కుమార్, అజయ్ జాదవ్ మండల్, దర్శన్ నల్కండే, డోనోవన్ ఫెరీరా, మన్వంత్ కుమార్ -
IPL 2025: కేఎల్ రాహుల్.. ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్..!
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 18) రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ అజేయమైన సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో రాహుల్ పలు రికార్డులు సాధించాడు. కేవలం 60 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన రాహుల్.. ఓవరాల్‌గా 65 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 4 సిక్స్ సాయంతో 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్..!ఈ క్రమంలో రాహుల్ ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన రికార్డు సాధించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రాహుల్ తన ఐపీఎల్ కెరీర్లో పంజాబ్ తరఫున 2, లక్నో తరఫున 2, ఇప్పుడు ఢిల్లీ తరఫున ఓ సెంచరీ (మొత్తం 5) చేసి ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. తాజా సెంచరీతో తన టీ20 సెంచరీల సంఖ్యను ఏడుకు పెంచుకున్న రాహుల్.. పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు:8 - విరాట్ కోహ్లీ7 - జోస్ బట్లర్6 - క్రిస్ గేల్5 - కేఎల్ రాహుల్*4 - శుభ్‌మన్ గిల్4 - షేన్ వాట్సన్4 - డేవిడ్ వార్నర్పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు:విరాట్ కోహ్లీ - 9రోహిత్ శర్మ - 8అభిషేక్ శర్మ - 7కేఎల్ రాహుల్ - 7*ఫాస్టెస్ట్ ఇండియన్‌గా..ఈ మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసుకున్న భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు కింగ్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లికి ఈ మార్కు తాకేందుకు 243 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. రాహుల్ తన 224వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు.ఓవరాల్‌గా టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం (213 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్ధానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం(218) కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా కేఎల్ రాహుల్ (224), కోహ్లి (243), పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (244) ఉన్నారు.రికార్డు సెంచరీ చేసినా ఓడిన ఢిల్లీఈ మ్యాచ్‌లో రాహుల్ రికార్డు సెంచరీతో కదంతొక్కినా ఢిల్లీ ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ఢిల్లీపై విజయంతో గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఒకేసారి ఖరారయ్యాయి. నాలుగో బెర్త్ కోసం ఢిల్లీ, ముంబై, లక్నో పోటీ పడనున్నాయి. ఇవాళ (మే 19) సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో లక్నో ఓడితే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు ఢిల్లీ, ముంబై మాత్రమే రేసులో ఉంటాయి. అంతకుముందు సీఎస్కే, రాజస్థాన్, సన్‌రైజర్స్, కేకేఆర్ వరుసగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. -
కేఎల్ రాహుల్ విధ్వంసం.. 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో సూపర్ సెంచరీ
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో భాగంగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్ ఆఖరి వరకు ఆజేయంగా నిలిచాడు. తొలుత ఆచితూచి ఆడిన రాహుల్.. ఐదు ఓవర్ల తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. ఈ క్రమంలో కేవలం 60 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 65 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) రాణించారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.శుబ్‌మన్ గిల్‌ను దాటేసిన రాహుల్..ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో శుబ్‌మన్ గిల్, షేన్ వాట్సన్, డేవిడ్ వార్నర్‌లను రాహుల్ అధిగమించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన లిస్ట్‌లో రాహుల్(5) నాలుగో స్దానంలో నిలిచాడు. అగ్రస్ధానంలో విరాట్ కోహ్లి(8) కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే..8: విరాట్ కోహ్లీ7: జోస్ బట్లర్6: క్రిస్ గేల్5: కెఎల్ రాహుల్4: శుభ్‌మన్ గిల్4: షేన్ వాట్సన్4: డేవిడ్ వార్నర్ -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8,000 పరుగులు మైలు రాయిని అందుకున్న భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2025లో ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ రికార్డును రాహుల్ సాధించాడు. రాహుల్ 224 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి 243 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగుల మైలు స్టోన్‌ను అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో కోహ్లి రికార్డును కేఎల్ బ్రేక్ చేశాడు.ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం (213 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్ధానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం(218) కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా కేఎల్ రాహుల్, కోహ్లి, పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (244) ఉన్నారు.రాహుల్ సూపర్ సెంచరీ..ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు. రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. రాహుల్ అద్బుత ఇన్నింగ్స్ ఫలితంగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: రాజస్తాన్‌పై విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్ -
IPL 2025: ప్రమాదంలో విరాట్ పేరిట ఉన్న భారీ రికార్డు
ఐపీఎల్ పునఃప్రారంభం తర్వాత ఇవాళ (మే 18) రాత్రి జరుగబోయే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లో రికార్డుల రారాజు, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ భారీ టీ20 రికార్డు బద్దలయ్యే ప్రమాదముంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 33 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా విరాట్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు. విరాట్‌కు ఈ ఘనత సాధించేందుకు 243 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. రాహుల్‌కు 214వ ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ వచ్చింది. నేటి మ్యాచ్‌లో రాహుల్ 8000 పరుగులు పూర్తి చేస్తే, విరాట్ రికార్డుతో పాటు మరో రికార్డు కూడా సొంతమవుతుంది. యావత్ టీ20ల్లో అతి తక్కువ 8000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా రాహుల్ రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన ఘనత విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 213 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..క్రిస్ గేల్- 213 ఇన్నింగ్స్లుబాబర్ ఆజమ్- 218 ఇన్నింగ్స్లుకాగా, ఈ సీజన్లో రాహుల్ వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేసినప్పటికీ పర్వాలేదనిపించాడు. ఈ సీజన్లో రాహుల్ ఓసారి ఓపెనింగ్, రెండు మ్యాచ్‌ల్లో మూడో స్థానం, ఏడు మ్యాచ్‌ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి 47.63 సగటున, 142.63 స్ట్రయిక్‌రేట్‌తో 381 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రాహుల్ 10వ స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే నేడు గుజరాత్‌తో జరుగబోయే మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అత్యంత కీలకం. ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో (ఓ మ్యాచ్ రద్దైంది) 13 పాయింట్లు సాధించిన ఢిల్లీ పట్టికలో ఐదు స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం రెండు గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఇవాళ గుజరాత్‌ను ఢీకొట్టబోయే ఢిల్లీ.. ఆతర్వాతి మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ (మే 21), పంజాబ్ కింగ్స్‌తో (మే 24) తలపడాల్సి ఉంది. నేటి మ్యాచ్‌లో ఓడినా ప్లే ఆఫ్స్ రేసులో ఉండే ఢిల్లీ.. తదుపరి ముంబై, పంజాబ్‌తో జరుగబోయే మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది. -
IPL 2025: ఐపీఎల్ రీస్టార్ట్.. కేఎల్ రాహుల్‌కు ప్రమోషన్?
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్-2025 సీజన్ తిరిగి ప్రారంభానికి సిద్దమైంది. శనివారం(మే 17) చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ ఏడాది సీజన్ పునఃప్రారంభం కానుంది.ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ మెనెజ్‌మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో అగ్రస్థానానికి ప్రమోట్ చేయాలని ఢిల్లీ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇంకా మూడు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఢిల్లీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 13 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. ఈ మూడు మ్యాచ్‌లలో అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు విజయం సాధిస్తే.. ఎటువంటి సమీకరాణాలు లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది. ఈ క్రమంలో రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలని హెడ్ కోచ్ హేమంగ్ బదాని, మెంటార్ కెవిన్ పీటర్సన్ నిర్ణయం తీసుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను రాహుల్ ప్రారంభించే అవకాశముంది. ఈ ఏడాది సీజన్లో రాహుల్ 10 మ్యాచ్‌లలో ఆడాడు. కేవలం ఒక్క మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. రెండు సార్లు మూడో స్ధానంలో, మిగిలిన మ్యాచ్‌లలో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆరంభ మ్యాచ్‌లలో ఢిల్లీ ఇన్నింగ్స్‌ను జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్, డుప్లెసిస్ ప్రారంభించారు. ఆ తర్వాత ఫ్రెజర్ మెక్ గర్క్‌ను పేలవ ఫామ్ కారణంగా ఢిల్లీ మెనెజ్‌మెంట్ పక్కన పెట్టింది. దీంతో అతడి స్ధానంలో అభిషేక్ పోరెల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే డుప్లెసిస్ గాయం బారిన పడడంతో కరుణ్ నాయర్ కూడా ఓపెనర్‌గా వచ్చాడు. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీకి ఓపెనర్లు మాత్రం మంచి ఆరంభాన్ని అందించలేకపోయారు. ఇప్పుడు రాహులైనా ఢిల్లీకి మంచి ఆరంభాలను అందిస్తాడో లేదో వేచి చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మే 18న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. -
ఓపెనర్‌గా కేఎల్ రాహుల్.. నాలుగో స్థానంలో ‘కొత్త’ ఆటగాడు!
భారత టెస్టు జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు రాబోతున్నాయి. ఇన్నాళ్లుగా ఓపెనర్‌గా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మరోవైపు.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే దిగ్గజం విరాట్ కోహ్లి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.ఈ నేపథ్యంలో వీరిద్దరి స్థానాలు భర్తీ చేసే ఆటగాళ్లు ఎవరన్న అంశంపై చర్చ జరగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ (KL Rahul)- యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను కొనసాగించాలని సూచించాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లోఅయితే, నాలుగో స్థానానికి మాత్రం వసీం జాఫర్ కొత్త ఆటగాడిని ఎంపిక చేశాడు. కాగా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ జైసూతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. రోహిత్ తిరిగి వచ్చిన తర్వాత కూడా వీరే ఓపెనర్లుగా కొనసాగారు.ఈ నేపథ్యంలో వసీం జాఫర్ న్యూస్18తో మాట్లాడుతూ.. ‘‘బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో కేఎల్ రాహుల్- యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా రాణించారు. కాబట్టి కేఎల్ అదే స్థానంలో కొనసాగితే బాగుంటుంది. నిలదొక్కుకున్న జోడీని విడదీయడం వల్ల నష్టమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.నాలుగో స్థానంలో గిల్!ఇక శుభ్‌మన్ గిల్ విషయానికొస్తే.. అతడు వైట్ బాల్ క్రికెట్లో ఓపెనర్‌గా వస్తున్నాడు. కానీ టెస్టు క్రికెట్లో మాత్రం అతడిని మూడు నుంచి నాలుగో స్థానానికి పంపితే బాగుంటుంది.మూడో స్థానంలో సాయి సుదర్శన్‌ను ఆడించాలి. సుదీర్ఘకాలం వన్‌డౌన్‌లో ఆడిస్తే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. కాగా కేఎల్ రాహుల్ టీమిండియా తరఫున ఓపెనర్‌గా 83 ఇన్నింగ్స్‌లో 2803 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు శతకాలు ఉన్నాయి.ఓపెనర్లుగా ఇలాఇక నాలుగో స్థానంలో రెండు ఇన్నింగ్స్ ఆడిన కేఎల్.. 108 పరుగులు చేయగలిగాడు. మరోవైపు.. శుబ్‌మన్ గిల్ 30 ఇన్నింగ్స్‌లో మూడో స్థానంలో వచ్చి 1019 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా 29 ఇన్నింగ్స్‌లో 874 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇంత వరకు ఒక్కసారి కూడా నాలుగో స్థానంలో ఆడలేదు.కాగా రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిల నిష్క్రమణ తర్వాత టీమిండియా తొలిసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్లో తొలి సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లో తలపడనుంది. ఈ టూర్ నుంచి భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది.చదవండి: ‘మాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇలా’!.. మండిపడ్డ ప్రీతి జింటా.. -
తుదిజట్టులో చోటే కష్టం.. అలాంటి ఆటగాడు కెప్టెనా?
టీమిండియా టెస్టు జట్టు కొత్త కెప్టెన్ ఎవరు?.. జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించగలిగే సత్తా ఉన్న నాయకుడు ఎవరు?.. భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు పగ్గాలు అప్పగించాలని సునిల్ గావస్కర్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు.. ఇప్పటికే యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను సారథిగా నియమించడం లాంఛనమే అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గిల్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. టెస్టు తుదిజట్టులో చోటే కరువైన ఆటగాడు కెప్టెన్సీకి ఎలా అర్హుడు అవుతాడని ప్రశ్నించాడు.విదేశీ గడ్డపై గిల్ విఫలంకాగా 2020లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన గిల్.. ఇప్పటికి 32 మ్యాచ్‌లు ఆడాడు. 35.06 సగటుతో 1893 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు అర్ధ శతకాలు, ఐదు సెంచరీలు ఉన్నాయి. అయితే, సొంతగడ్డపై వైట్ జెర్సీలో రాణిస్తున్న గిల్‌కు విదేశాల్లో రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు.ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో గిల్ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొత్తంగా 93 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి చెత్త ప్రదర్శ కారణంగా మెల్బోర్న్ టెస్టులో ఆడించకుండా యాజమాన్యం వేటు వేసింది కూడా!తుదిజట్టులో చోటే కష్టం.. అలాంటి ఆటగాడు కెప్టెనా?అంతకు ముందు వెస్టిండీస్, సౌతాఫ్రికా పర్యటనల్లోనూ ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గిల్ వైఫల్యాలను ఎత్తి చూపాడు. ‘‘టెస్టు క్రికెట్లో అతడు ఇంకా పూర్తిగా నిలదొక్కుకోనేలేదు.మరి ఇప్పుడే కెప్టెన్‌గా ఎందుకు? జస్ప్రీత్ బుమ్రానే సారథిని చేయాలి. ఒకవేళ అతడు ఫిట్‌గా లేకుంటే కేఎల్ రాహుల్ లేదంటే రిషభ్ పంత్‌లలో ఒకరు భారత జట్టుకు నాయకుడిగా వ్యవహరించాలి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు.కేఎల్ రాహుల్ సరైనోడుఇక విరాట్ కోహ్లి రిటైర్మెంట్ నేపథ్యంలో కీలకమైన నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఆడించాలని చిక్కా ఈ సందర్భంగా సూచించాడు. కోహ్లి వదిలి వెళ్లిన స్థానానికి రాహుల్ మాత్రమే న్యాయం చేయగలగడని అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్లో భారత్‌కు అతడు విలువైన ఆటగాడని.. అతడికి జట్టులో స్థిరమైన స్థానం ఇవ్వాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు.కాగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువ రక్తంతో నిండిన జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా తొలుత ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. అన్నట్లు.. ఇంగ్లండ్ గడ్డ మీద శుబ్‌మన్ గిల్ మూడు టెస్టులు ఆడి 88 పరుగులు మాత్రమే చేశాడు!!చదవండి: Ind vs Eng: కుర్రాళ్లతో ఈ సిరీస్ ఆడటం కష్టం.. రహానే, పుజారా రీ ఎంట్రీ! -
కోహ్లి స్థానాన్ని భర్తీ చేసేదెవరు?.. ఛతేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు
దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్తో భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ శకం ముగిసింది. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఆడుతూ ఇన్నాళ్లూ ఈ రన్‌మెషీన్ కీలక బాధ్యతను తన భుజాల మీద మోశాడు. అయితే, ఇప్పుడు అతడు టెస్టులకు వీడ్కోలు పలకడంతో ఆ స్థానం ఖాళీ అయింది. మరి కోహ్లి ప్లేస్‌ను భర్తీ చేసేదెవరు?!ఈ విషయం గురించి టీమిండియా వెటరన్ బ్యాటర్, నయా వాల్ ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి వారసుడి గురించి ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని.. కనీసం రెండు సిరీస్‌ల తర్వాతే ఈ విషయంపై స్పష్టత వస్తుందన్నాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ..ఛతేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు‘‘నాలుగో స్థానంలో అత్యుత్తమ బ్యాటర్ ఉండాలి. అప్పుడే జట్టు నిలబడుతుంది. ప్రస్తుతం చాలా మంది టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. అయితే, వీరిలో నాలుగో స్థానంలో ఎవరు పూర్తిస్థాయిలో ఆడతారనేది ఇంగ్లండ్ పర్యటన తర్వాత తేలనుంది.ఎందుకంటే ఇంగ్లండ్ గడ్డ మీద నంబర్ ఫోర్లో రాణిస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు’’ అని పుజారా పేర్కొన్నాడు. కాగా సచిన్ టెండుల్కర్ నిష్క్రమణ తర్వాత కోహ్లి 99 సార్లు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.ఇక అజింక్య రహానే తొమ్మిది సార్లు, పుజారా ఏడు టెస్టుల్లో నాలుగో నంబర్ బ్యాటర్లుగా బరిలోకి దిగారు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, సాయి సుదర్శన్లకు కోహ్లి స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలో శుబ్‌మన్ గిల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘కొత్త బంతుల్ని ఎదుర్కోవడంలో శుబ్‌మన్ దిట్ట. గతంలో అతడు ఓపెనర్‌గా వచ్చేవాడు. ఆ తర్వాత మూడో స్థానానికి మారిపోవాల్సి వచ్చింది. అయితే, అతడు ఓల్డ్ బాల్‌ను ఎంత వరకు ఎదుర్కోగలడన్న విషయం కాలక్రమేణా తేలుతుంది. అప్పటిదాకా కోహ్లి స్థానాన్ని భర్తీ చేస్తూ.. దీర్ఘకాలంలో ఆ ప్లేస్‌లో కొనసాగే ఆటగాడు ఎవరో చెప్పడం కష్టతరమే అవుతుంది’’ అని పుజారా పేర్కొన్నాడు.రోహిత్ బాటలోనే కోహ్లికాగా మే తొలివారంలో కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పగా.. సోమవారం విరాట్ కోహ్లి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. వీరిద్దరు ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలిగారు. ఇక ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నారు.ఇదిలా ఉంటే కోహ్లి సారథ్యంలో 2021లో, రోహిత్ కెప్టెన్సీలో 2023లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన టీమిండియా.. ఈసారి మాత్రం నిరాశపరిచింది. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-1తో చేజార్చుకున్న రోహిత్ సేన డబ్ల్యూటీసీ 2025 ఫైనల్‌కు దూరమైంది.ఇక తదుపరి డబ్ల్యూటీసీ 2025-27 సీజన్లో మొదటగా టీమిండియా ఇంగ్లండ్‌తో తలపడనుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కోహ్లి, రోహిత్ లేకుండా తొలిసారి భారత జట్టు ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టబోతోంది. ఈ జట్టుకు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.చదవండి: కోహ్లి, రోహిత్ వన్డే వరల్డ్‌కప్-2027 ఆడరు: టీమిండియా దిగ్గజం -
గిల్ టీమిండియా కెప్టెన్ అయితే ధోనితో పాటు ఓ చెత్త రికార్డును షేర్ చేసుకుంటాడు..!
రోహిత్ శర్మ టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్ ముందున్నాడు. భారత సెలెక్టర్లు, బీసీసీఐ గిల్‌కు భారత టెస్ట్ జట్టు పగ్గాలు అప్పజెప్పేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. టెస్ట్‌ల్లో గిల్‌కు అంత మంచి ట్రాక్ రికార్డు లేనప్పటికీ.. బీసీసీఐ పెద్దలు అతనివైపే మొగ్గుచూపుతున్నారు. బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ఆప్షన్స్ ఉన్నా ఆల్ ఫార్మాట్ ఆటగాడని గిల్‌ను వెనకేసుకొస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. గిల్ సారథ్యంలోనే భారత్ కఠినమైన ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుందన్న విషయం స్పష్టమవుతుంది. మరో రెండు రోజుల్లో గిల్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో భేటి కానున్నాడని తెలుస్తుంది.ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసే భారత టెస్ట్ జట్టుకు గిల్ సారధిగా నియమితుడైతే టీమిండియా దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనితో కలిసి ఓ చెత్త రికార్డును షేర్ చేసుకుంటాడు. గడిచిన 30 సంవత్సరాల్లో 30 కంటే తక్కువ బ్యాటింగ్ సగటుతో సేనా దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) టీమిండియాకు నాయకత్వం వహించిన కెప్టెన్‌గా అపప్రదను మూటగట్టుకుంటాడు. ఈ జాబితాలో ధోనితో పాటు కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు.సేనా దేశాల్లో ధోని బ్యాటింగ్ సగటు 28.37 కాగా.. రాహుల్ బ్యాటంగ్ సగటు 29.60గా ఉంది. గిల్ విషయానికొస్తే.. సేనా దేశాల్లో అతని బ్యాటింగ్ సగటు ధోని, రాహుల్ కంటే అధ్వానంగా 25.70గా ఉంది. గిల్ టీమిండియా నయా టెస్ట్ కెప్టెన్‌గా నియమితుడైతే ధోని, రాహుల్‌తో పాటు పైన పేర్కొన్న చెత్త రికార్డును షేర్ చేసుకుంటాడు. టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన విరాట్టెస్ట్ క్రికెట్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన వారంలోపే విరాట్ కోహ్లి కూడా టెస్ట్‌లకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఇవాళ (మే 12) ఉదయం కోహ్లి టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటనను చేశాడు. బీసీసీఐలోని కొందరు పెద్దలు కోహ్లిని రిటైర్మెంట్ విషయంలో వెనక్కు తగ్గాలని కోరినా వినలేదని తెలుస్తుంది. గతేడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత పొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లి.. తాజాగా టెస్ట్‌లకు కూడా వీడ్కోలు పలికాడు. -
IND vs ENG: టీమిండియా కెప్టెన్‌గా అతడే ఉండాలి: అనిల్ కుంబ్లే
టెస్టుల్లో గత సిరీస్‌లలో వరుస పరాభవాలు చవిచూసిన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)-2025 ఫైనల్‌కు దూరమైంది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌ను విజయంతో ఆరంభించాలని పట్టుదలగా ఉంది. ఇక 2025-27 సీజన్లో భాగంగా తొలుత ఇంగ్లండ్ (India vs England)తో తలపడనుంది.ఇంగ్లండ్ వేదికగా జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. అయితే, ఈ కీలక సిరీస్‌కు రోహిత్ శర్మ (Rohit Sharma) అందుబాటులో ఉంటాడని.. అతడినే కెప్టెన్‌గా కొనసాగిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా రోహిత్ బుధవారం అధికారికంగా టెస్టులకు వీడ్కోలు పలికాడు.రేసులో నలుగురు!ఈ నేపథ్యంలో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వారసుడు ఎవరన్న అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ (Rishabh Pant)లకు అవకాశం ఇవ్వాలని కొంత మంది మాజీలు సూచిస్తుంటే.. మరికొంత మంది మాత్రం సీనియర్లైన కేఎల్ రాహుల్ లేదా పేస్‌దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు పగ్గాలు ఇవ్వాలంటున్నారు.కాగా బుమ్రా ఇటీవలి కాలంలో ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిపై పనిభారం పడకుండా ఉండేందుకు వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తొలగించాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మాత్రం బుమ్రాకు మద్దతుగా నిలిచాడు.టీమిండియా కెప్టెన్‌గా అతడే ఉండాలిఇంగ్లండ్తో సిరీస్‌కు బుమ్రాను కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐకి సూచించాడు. ఈ మేరకు.. ‘‘ఫాస్ట్ బౌలర్‌గా సుదీర్ఘకాలం కొనసాగడం అంత సులువేమీ కాదు. గాయాల బెడద వేధిస్తూనే ఉంటుంది.ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత చాన్నాళ్లు విరామం తీసుకున్న అనంతరం బుమ్రా మళ్లీ ఐపీఎల్‌తో తిరిగి ఆటలో అడుగుపెట్టాడు. అతడికి ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయన్న మాట వాస్తవమే.అయితే, కనీసం ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మాత్రం కెప్టెన్‌గా అతడికే బాధ్యతలు అప్పగించండి. ఆ తర్వాత ఫిట్నెస్ విషయంలో సమస్యలు తలెత్తితే ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోండి’’ అని కుంబ్లే ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు.కాగా బుమ్రాపై పనిభారం తగ్గించే క్రమంలో ఇంగ్లండ్‌లో అత్యధికంగా మూడు మ్యాచ్‌లలో మాత్రమే అతడిని ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కాబట్టి ఒకవేళ అతడిని కెప్టెన్‌ను చేస్తే.. మధ్యలోనే మరొకరిని సారథిగా నియమించాల్సి వస్తుందనే కారణంతో.. బుమ్రా పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదని సమాచారం.ఐదు టెస్టులూ ఆడకపోతే ఏంటి?అయితే, బుమ్రా నిజంగానే ఇంగ్లండ్‌లో ఐదు టెస్టులూ ఆడకపోవచ్చన్న కుంబ్లే.. కెప్టెన్‌గా నియమించేందుకు అదేమీ అడ్డుకాకపోవచ్చని పేర్కొన్నాడు. బుమ్రా గైర్హాజరీలో వైస్ కెప్టెన్ సారథిగా బాధ్యతలు తీసుకుంటాడని.. ఇందులో ఎలాంటి సమస్యా ఉండదని అభిప్రాయపడ్డాడు.కాగా బుమ్రా గతంలో ఇంగ్లండ్ పర్యటనలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్లో భాగంగా రోహిత్ శర్మ గైర్హాజరీలో సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. కెప్టెన్‌గా.. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్‌ను గెలిపించిన ఈ రైటార్మ్ పేసర్.. సిడ్నీ టెస్టులో మాత్రం జట్టుకు విజయం అందించలేకపోయాడు.ఇక టీమిండియా గత రెండు టెస్టు సిరీస్‌లలో ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురికావడం సహా.. ఆసీస్ పర్యటనలో పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(3-1)ని చేజార్చుకుంది. ఈ రెండు సిరీస్‌లలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా, ఆటగాడిగా పూర్తిగా విఫలమయ్యాడు.చదవండి: IPL 2025: ధనాధన్‌గా దూసుకొచ్చారు -
గిల్, బుమ్రా, పంత్ కాదు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే?
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చాడు. ఇకపై కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగనున్నట్లు హిట్‌మ్యాన్ తెలిపాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ టూర్‌కు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో కొత్త టెస్టు కెప్టెన్‌ను ఎంపిక చేసే పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది.కెప్టెన్సీ రేసులో స్టార్ ప్లేయర్లు శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. ప్రస్తుతం బుమ్రా.. టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కానీ గాయాల బెడద, వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతన్ని ఈ కెప్టెన్స్ రేసు నుంచి గ్రూప్ నుంచి తప్పించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు వినికిడి. తాజాగా ఈ జాబితాలోకి కేఎల్ రాహుల్ చేరినట్లు సమాచారం. కెప్టెన్‌గా తక్కువ అనుభవం ఉన్న గిల్, పంత్ కంటే సీనియర్ ప్లేయర్ అయిన రాహుల్‌కు పగ్గాలు అప్పగిస్తే బెటర్ అని సెలక్టర్లు భావిస్తున్నట్లు అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంగ్లండ్ సిరీస్ తర్వాత పూర్తి స్ధాయి కెప్టెన్‌ను నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కెప్టెన్‌గా రాహుల్..టెస్టు కెప్టెన్సీ పరంగా కేఎల్ రాహుల్‌కు అనుభవం ఉంది. గతంలో మూడు సార్లు టీమిండియాకు రాయల్ నాయకత్వం వహించాడు. 2022లో అతడి సారథ్యంలోనే బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. అదేవిధంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో కూడా రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్‌లో వ్యక్తిగత గణాంకాల పరంగా కూడా రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. ఇంగ్లండ్ గడ్డపై ఈ వికెట్ కీపర్ ఈ కీపర్-బ్యాటర్ 9 మ్యాచ్‌ల్లో 614 పరుగులు చేశాడు. ఈ టెస్టు పర్యటనకు బీసీసీఐ భారత జట్టును మే రెండో వారంలో ప్రకటించే అవకాశముంది.చదవండి: పీసీబీకి చావు దెబ్బ!.. రావల్పిండి స్టేడియంపై డ్రోన్ దాడి?.. PSLపై నీలినీడలు! -
‘అరంగేట్రం’లోనే అదుర్స్.. చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇంత వరకు ఏ వికెట్ కీపర్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఇషాన్‌ను వదిలివేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రూ. 11.25 కోట్ల భారీ ధరకు అతడిని కొనుగోలు చేసింది. ఇందుకు తగ్గట్లుగానే ఈ జట్టు తరఫున తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ ఇరగదీశాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి కేవలం 47 బంతుల్లోనే 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా రాజస్తాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.కానీ తర్వాత మాత్రం ఇషాన్ కిషన్ వరుసగా విఫలమయ్యాడు. ఒకానొక దశలో తుదిజట్టు నుంచి తప్పించాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో తొలిసారిగా అతడికి యాజమాన్యం వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించింది.హెన్రిచ్ క్లాసెన్ స్థానంలోహెన్రిచ్ క్లాసెన్‌ను బ్యాటర్‌గా రంగంలోకి దింపి.. అతడి స్థానంలో ఇషాన్‌ను తమ జట్టు వికెట్ కీపర్‌గా అరంగేట్రం చేయించింది. ఉప్పల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే షాకుల మీద షాకులు తగిలాయి. ఓపెనర్ కరుణ్ నాయర్‌ను డకౌట్ చేసిన రైజర్స్ సారథి, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్.. ఆ తర్వాత మరో ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ (3) వికెట్ తీశాడు.అనంతరం వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (8)ను కూడా వెనక్కి పంపించాడు. ఈ ముగ్గురూ కమిన్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి దాదాపుగా ఒకే రీతిలో అవుటయ్యాడు.టాప్-4 బ్యాటర్ల వికెట్లలో భాగమైఆ తర్వాత జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్ ఢిల్లీ స్టార్ కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను కూడా ఇషాన్ ఒడిసిపట్టాడు. తద్వారా ఢిల్లీ ఇన్నింగ్స్‌లో టాప్-4 బ్యాటర్ల వికెట్లలో భాగమై.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో ఇలా ఓ వికెట్ కీపర్ ప్రత్యర్థి జట్టుకు చెందిన నలుగురు టాప్ బ్యాటర్ల క్యాచ్ అందుకోవడం ఇదే తొలిసారి.ఇక ఓవరాల్‌గా ఐపీఎల్లో ఒకే ఇన్నింగ్స్‌లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ క్యాచ్‌లు అందకున్న 27వ ఆటగాడిగా ఇషాన్ నిలిచాడు. ఇందులోని వికెట్ కీపర్ల జాబితాలో అతడిది పదమూడో స్థానం కావడం గమనార్హం.ప్లే ఆఫ్స్ రేసు నుంచి అవుట్మ్యాచ్ విషయానికొస్తే.. టాపార్డర్ విఫలమైన వేళ మిడిలార్డర్లో కేఎల్ రాహుల్ (10), కెప్టెన్ అక్షర్ పటేల్ (6) కూడా నిరాశపరిచారు. అయితే ఆరు, ఎనిమిదో స్థానాల్లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ (41 నాటౌట్), అశుతోష్ శర్మ (41) రాణించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.అయితే, ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం పడింది. అవుట్‌ఫీల్డ్ మొత్తం తడిగా మారడంతో మ్యాచ్ కొనసాగే వీలు లేకపోవడంతో అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ రాగా.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మరోవైపు.. ఢిల్లీ ఆశలు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయి.చదవండి: ఆ ముఖంలో నవ్వే లేదు.. రహానే, కోహ్లి కావాలేమో? -
మతిపోయిందా?.. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయం తప్పు: షేన్ వాట్సన్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (SRH vs DC) అనుసరించిన వ్యూహాలను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ విమర్శించాడు.ప్లే ఆఫ్స్ చేరాలంటే కీలకమైన మ్యాచ్‌లోనూ ఓపెనింగ్ జోడీని మార్చడం తనను విస్మయానికి గురిచేసిందన్నాడు. ఢిల్లీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బుద్ధిలేని చర్యగా అభివర్ణించాడు.ఐపీఎల్-2025 (IPL 2025)లో ఢిల్లీ తరఫున జేక్ ఫ్రేజర్ మెగర్క్, అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, కేఎల్ రాహుల్ వేర్వేరు మ్యాచ్‌లలో ఓపెనర్లుగా వచ్చారు. తాజాగా సోమవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్ సందర్భంగా డుప్లెసిస్‌తో కలిసి కరుణ్ నాయర్ (Karun Nair) ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంభించాడు.బంతి పడటంతోనే క్యాపిటల్స్‌కు కష్టాలుఅయితే, బంతి పడటంతోనే క్యాపిటల్స్‌కు కష్టాలు మొదలయ్యాయి. మొదటి బంతికే కరుణ్ నాయర్ (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే డుప్లెసిస్ (3), అభిషేక్ పొరెల్ (8)లు కూడా వికెట్లను పారేసుకున్నారు. దీంతో క్యాపిటల్స్ 15 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఈ మూడు వికెట్లూ రైజర్స్ కెప్టెన్ కమిన్స్ ఖాతాలోనే పడ్డాయి. క్యాచ్‌లన్నీ కీపర్ ఇషాన్ కిషన్ చేతికే అందాయి.ఇక ఢిల్లీ ఈ షాక్ నుంచి తేరుకోకముందే హర్షల్ పటేల్ మరోదెబ్బ తీశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (6)ను అవుట్ చేశాడు. ఆఫ్ స్టంప్ మీదుగా వేసిన స్లో డెలివరీని షాట్ ఆడే ప్రయత్నం చేయగా అదికాస్తా కమిన్స్ చేతికి చిక్కింది. దీంతో పవర్ ప్లేలో ఢిల్లీ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. అప్పటికి క్యాపిటల్స్ స్కోరు 26/4. ఆ తర్వాత కూడా క్యాపిటల్స్ పరిస్థితిలో ఏమార్పు లేదు. ఇక ఢిల్లీ అండదండా కేఎల్ రాహులే అనుకునేలోపే ఈ స్టార్ మురిపెం కూడా అంతలోనే ముగిసింది.జయదేవ్ ఉనాద్కట్ తెలివైన బంతితో ఈ విలువైన వికెట్ తీసి ఢిల్లీని కోలుకోకుండా చేశాడు. ఆఫ్ స్టంప్ ఆవల దూసుకొచ్చిన బంతి రాహుల్ (10) బ్యాట్‌ను తాకుతూ ఇషాన్ కిషన్ చేతుల్లోకి వెళ్లింది. అప్పటివరకు పెవిలియన్ చేరిన ఐదుగురిలో అతనొక్కడిదే రెండంకెల స్కోరు కాగా... కనీసం మూడు పదుల స్కోరైన కాకముందే (29 పరుగులకే 5) ఢిల్లీ సగం వికెట్లను కోల్పోయింది. వికెట్ల జోరులో మెరుపుల్లేని మ్యాచ్‌లో ఎట్టకేలకు పదో ఓవర్లో ఒక సిక్స్ నమోదైంది. స్పిన్నర్ జిషాన్ బౌలింగ్‌లో విప్రాజ్ నిగమ్ భారీ సిక్సర్ బాదాడు. సగం ఓవర్లు ముగిశాక గానీ 11వ ఓవర్లో జట్టు స్కోరు కష్టంగా 50 పరుగులకు చేరింది. అశుతోశ్ వచ్చాకే... స్టబ్స్, విప్రాజ్ కుదురుకునే అవకాశాన్ని కూడా సన్‌రైజర్స్ ఫీల్డర్లు ఇవ్వలేదు. కొద్దిసేపటికే విప్రాజ్ (17 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) రనౌట్ కాగా... అశుతోష్ రాకతో స్కోరులో కాస్త వేగం పెరిగింది. అవతలి ఎండ్‌లో ఉన్నది హిట్టర్ స్టబ్సే అయినా జోరు పెంచింది మాత్రం అశుతోష్ మొదట్లో సింగిల్స్‌తో పరుగు... పరుగు పేర్చిన ఈ జోడీ తర్వాత ధాటిని ఆడింది. జీషాన్ 15వ ఓవర్లో అశుతోష్ రెండు భారీ సిక్సర్లతో అలరించాడు. తర్వాత హర్షల్ 17వ ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. స్టబ్స్ కూడా ఫోర్లతో వేగం అందుకోగా, డెత్ ఓవర్లో మరో సిక్స్ కొట్టిన అశుతోష్ ఆఖరి ఓవర్లో నిష్క్రమించాడు. ఇద్దరు కలిసి ఏడో ఓవర్‌కు 66 పరుగులు జోడించారు. ఈ జోడీ ఆడటం వల్లే ఢిల్లీ ఆలౌట్ నుంచి తప్పించుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగలిగింది.ఢిల్లీ క్యాపిటల్స్‌ది తప్పుడు నిర్ణయంఈ నేపథ్యంలో కామెంటేటర్ షేన్ వాట్సన్ మాట్లాడుతూ.. ‘‘ఎప్పటికప్పుడు ఏ కారణం లేకుండా.. నచ్చినట్లుగా ఓపెనింగ్ జోడీని మార్చడం సరికాదు. నిజంగా ఢిల్లీ వ్యూహం చూసి నేను ఆశ్చర్యపోయా.కరుణ్ నాయర్ ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి ఓపెనింగ్‌కు రావడం చూసి నాకు మతిపోయినంత పనైంది. ఇదొక చెత్త నిర్ణయం. ఢిల్లీ శిబిరం ఏం ఆలోచించి ఇలా చేసిందో గానీ.. ఇదైతే తప్పుడు నిర్ణయం.ఇలా చేయడం వల్ల జట్టులో ఎవరి పాత్ర ఏమిటన్నది ఆటగాళ్లకే తెలియకుండా పోతుంది. ఇలాంటి చర్యల వల్ల వాళ్లు కూడా అభద్రతాభావంలో కూరుకుపోతారు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయంం పంచుకున్నాడు.ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఎడతెరిపిలేని వర్షం వల్ల మ్యాచ్ రద్దై పోయింది. దీంతో ఢిల్లీకి అదృష్టం కలిసి రాగా.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మ్యాచ్ రద్దు కావడం వల్ల ఇరుజట్లకు చెరో పాయింట్ రాగా.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవమయ్యాయి.చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్Wickets ✅Catch ✅Captaincy ✅Pat Cummins is producing a perfect performance for #SRH in an important clash against #DC 🔥Updates ▶ https://t.co/1MkIwk4VNE#TATAIPL | #SRHvDC | @SunRisers | @patcummins30 pic.twitter.com/SbACH0yVcJ— IndianPremierLeague (@IPL) May 5, 2025 -
కేఎల్ రాహుల్‌ను కలిసిన బీఆఎర్ఎస్ ఎమ్మెల్యే.. కుమార్తెకు ఓ ‘గిఫ్ట్’!
ఐపీఎల్-2025 (IPL 2025)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (SRH vs DC)తో తలపడనుంది. సొంత మైదానం ఉప్పల్‌లో అక్షర్ సేనను కమిన్స్ బృందం ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సాంకేతికంగా రైజర్స్‌కు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఒకవేళ సోమవారం నాటి మ్యాచ్‌లో గనుక ఢిల్లీ చేతిలో ఓడితే.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తర్వాత ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన మూడో జట్టుగా సన్‌రైజర్స్ నిలుస్తుంది. ఈ క్రమంలో కీలక పోరు కోసం కమిన్స్ బృందం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.కేఎల్ రాహుల్‌ను కలిసిన బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేమరోవైపు.. ఢిల్లీ జట్టు కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు అన్ని విధాలా సన్నద్ధమైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను కలిశారు.ఈ సందర్భంగా తన కుమార్తె శ్రీనికను కూడా కౌశిక్ రెడ్డి వెంట తీసుకువెళ్లారు. ఇక రాహుల్ కూడా ప్రేమ పూర్వకంగా నవ్వుతూ వీరిని పలకరించాడు. అదే విధంగా.. శ్రీనిక తీసుకువచ్చిన టీ-షర్టుపై తన ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. అంతేకాదు ముగ్గురు కలిసి సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఫొటోలు కూడా దిగారు.ఇందుకు సంబంధించిన వీడియోను పాడి కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా ఇంతకు ముందు.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. అదే జట్టుకు ఆడుతున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను కూడా కౌశిక్ రెడ్డి కలిశారు.కాగా కౌశిక్ రెడ్డి కూడా క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. దేశీ క్రికెట్లో ఆయన హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు.అదరగొడుతున్న రాహుల్ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 సీజన్లో కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 371 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 93 నాటౌట్. ఇక ఢిల్లీ జట్టు పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరింట గెలిచి పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. కాగా తన భార్య అతియా శెట్టి తమ తొలి సంతానం ఇవారాకు జన్మనిచ్చిన నేపథ్యంలో రాహుల్ సీజన్లో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు.చదవండి: IPL 2025: ఈ పంత్ మనకొద్దు, పీకి పడేయండి సార్..! Had a great time with KL Rahul. I absolutely loved his outfit colour...PINK PERFECT 🩷@KLRAHUL@Kaushik @Shrinika@Cricket@PinkVibes pic.twitter.com/NI6Faiq5dD— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) May 5, 2025 -
క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ సరసన ప్రభ్‌సిమ్రన్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్ (PBKS vs LSG)తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) పరుగుల వరద పారించాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చితక్కొడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే, దురదృష్టవశాత్తూ శతకానికి తొమ్మిది పరుగుల దూరంలో ప్రభ్‌సిమ్రన్ ఆగిపోయాడు.అయితేనేం.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తన అద్బుత ఆట తీరుతో క్రిస్ గేల్, కేఎల్ రాహల్ (KL Rahul)సరసన నిలిచాడు. గతేడాది నిలకడైన ప్రదర్శన కనబరిచిన ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు భారీ ధరకు అట్టిపెట్టుకుంది. అతడి కోసం పర్సు నుంచి నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించింది.అందుకు తగ్గట్లుగానే ప్రభ్‌సిమ్రన్ ఈసారీ పైసా వసూల్ ప్రదర్శన ఇస్తున్నాడు. మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా లక్నోతో మ్యాచ్‌లోనూ అతడు బ్యాట్ ఝులిపించాడు. మొత్తంగా 48 బంతుల్లో ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 91 పరుగులు సాధించాడు.అయితే, దిగ్వేశ్ రాఠీ బౌలింగ్‌లో నికోలస్ పూరన్‌కు క్యాచ్ ఇవ్వడంతో ప్రభ్‌సిమ్రన్ ధనాధన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక అతడికి ఈ సీజన్లో ఇది ఓపెనర్‌గా వరుసగా మూడో అర్ధ శతకం కావడం విశేషం. తద్వారా పంజాబ్ కింగ్స్ తరఫున ఒకే సీజన్లో ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో ప్రభ్‌సిమ్రన్ చేరిపోయాడు.ఇక ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ ఇప్పటికి పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరు గెలిచింది. ఒకటి వర్షం కారణంగా రద్దైంది. ఈ క్రమంలో 13 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా లక్నోతో మ్యాచ్‌లోనూ గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకుపోతుంది.మరోవైపు.. ఈ సీజన్లో ఇప్పటికి (ఈ మ్యాచ్‌తో కలిపి) పదకొండు ఇన్నింగ్స్ ఆడిన ప్రభ్‌సిమ్రన్ 437 పరుగులు సాధించాడు. తద్వారా పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికి నాలుగు అర్థ శతకాలు ఉన్నాయి. ఇక లక్నోతో ఆదివారం నాటి మ్యాచ్‌లో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే నష్టపోయి 236 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో పాటు జోష్ ఇంగ్లిస్ (14 బంతుల్లో 30), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25 బంతుల్లో 45), శశాంక్ సింగ్ (15 బంతుల్లో 33 నాటౌట్), మార్కస్ స్టొయినిస్ (5 బంతుల్లో 15) దంచికొట్టారు.ఒక సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఓపెనర్‌గా వరుసగా అత్యధిక అర్ధ శతకాలు సాధించింది వీరేక్రిస్ గేల్ (2018)- మూడుకేఎల్ రాహుల్ (2018)- మూడుకేఎల్ రాహుల్ (2019)- మూడుకేఎల్ రాహుల్ (2020)- మూడుప్రభ్సిమ్రన్ సింగ్ (2025*) మూడు.Sent the ball to enjoy the view 🏔😍Shashank Singh and Prabhsimran Singh with an entertaining partnership tonight 💪Scorecard ▶ https://t.co/YuAePC273s#TATAIPL | #PBKSvLSG pic.twitter.com/9WqFWRd3zt— IndianPremierLeague (@IPL) May 4, 2025 -
ఇంటర్నేషనల్ బ్రాండ్‌కు గ్లోబల్ అంబాసిడర్‌గా కేఎల్ రాహుల్
ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ పాల్ & షార్క్‌కు (Paul & Shark) గ్లోబల్ అంబాసిడర్‌గా టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పాల్ & షార్క్ సంస్థ యాజమాన్యం ఇవాళ (మే 2) ప్రకటించింది. రాహుల్ లాంటి నిష్ణాతుడైన క్రికెటర్‌తో భాగస్వామ్యం పొందడం తమ సంస్థకు గర్వకారణమని పేర్కొంది. రాహుల్ పాల్ & షార్క్‌కు గ్లోబల్ అంబాసిడర్‌గా ఎంపికైన మొట్టమొదటి భారత అథ్లెట్.పాల్ & షార్క్ అనేది ఇటలీకి చెందిన లగ్జరీ దుస్తుల కంపెనీ. ఈ సంస్థను పాలో డిని అనే వ్యాపారవేత్త 1975లో స్థాపించాడు. దీని ప్రధాన కార్యాలయం వారెస్లో ఉంది. ఈ ఫ్యాషన్ బ్రాండ్ ప్రధానంగా లైఫ్‌స్టైల్ మరియు స్పోర్ట్‌వేర్ దుస్తులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ లోగోపై షార్క్ గుర్తు ఉంటుంది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 280 స్టోర్లు ఉన్నాయి. పాల్ & షార్క్ భారత్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ కంపెనీకి భారత్‌లో ప్రముఖ నగరాల్లో స్టోర్లు ఉన్నాయి.ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ 2025తో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్లో అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌కు ప్రధాన పోటీదారుగా ఉంటూ, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. ఈ జట్టు విజయాల్లో కేఎల్ రాహుల్‌ది కీలకపాత్ర. రాహుల్ ఈ సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడి 53 సగటున, 146.06 స్ట్రయిక్‌రేట్‌తో 371 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మే 5న హైదరాబాద్‌లో జరుగనుంది. -
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
ఐపీఎల్-2025 (IPL 2025)లో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 364 పరుగులు సాధించాడు. 60.66 సగటుతో 146.18 స్ట్రైక్‌రేటుతో మూడు అర్ధ శతకాల సాయంతో రాహుల్ ఈ మేర పరుగులు రాబట్టాడు.ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడని.. అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లకు సూచించాడు. కాగా ఐపీఎల్-2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది.ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానానికి ప్రమోట్ అయిన రాహుల్.. 39 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ కాస్త మెరుగ్గా ఆడి.. ఢిల్లీ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసిన ఢిల్లీ.. లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.బెంగళూరు జట్టు ఈ టార్గెట్‌ను 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు చేతిలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన పీటర్సన్.. రాహుల్ ఆట తీరు పట్ల మాత్రం సంతృప్తి వ్యక్తం చేశాడు.అతడే నా మొదటి ఎంపిక‘‘టీమిండియా తరఫున టీ20 క్రికెట్లో కేఎల్ రాహుల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలి. భారత జట్టులో చాలా మంది ఓపెనింగ్ బ్యాటర్లు ఉన్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్.. ఇలా ఎవరైనా టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయగలరు.అయితే, కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఆడుతున్న విధానం అమోఘం. నాలుగో స్థానంలో చక్కగా బ్యాటింగ్ చేయడం సహా.. వికెట్ కీపర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించగలడు. కాబట్టి టీమిండియా నంబర్ ఫోర్ బ్యాటర్, వికెట్ కీపర్‌గా అతడే మొదటి ఎంపిక’’ అని పీటర్సన్ పేర్కొన్నాడు.గతేడాది కాలంగా కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడుతున్నాడని.. ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో అదరగొట్టాడని పీటర్సన్ ప్రశంసించాడు. వేర్వేరు ఫార్మాట్లలో రాణించగల సత్తా అతడికి ఉందని.. సానుకూల దృక్పథమే రాహుల్‌కు బలంగా మారిందని పేర్కొన్నాడు. ఆట పట్ల అంకితభావం, నెట్స్‌లో శ్రమించే తీరు.. జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించే విధానం రాహుల్‌లో తనకు నచ్చాయని తెలిపాడు.చివరగా 2022లో టీమిండియా తరఫునకాగా 2016లో అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన కేఎల్ రాహుల్.. చివరగా 2022లో టీమిండియా తరఫున పొట్టి మ్యాచ్ ఆడాడు. టీ20 ప్రపంచకప్-2022 సందర్భంగా ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్ సందర్భంగా బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు.ఇక ఆ తర్వాత మళ్లీ భారత టీ20 జట్టుకు రాహుల్ ఎంపిక కాలేదు. అయితే, టెస్టుల్లో, వన్డేల్లో మాత్రం ఆడుతున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా టెస్టు ఆడిన ఈ కర్ణాటక బ్యాటర్.. చాంపియన్స్ ట్రోఫీ-2025 (వన్డే) గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో గతేడాది వరకు లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్.. మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీతో తెగదెంపులు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు అతడిని కొనుగోలు చేయగా.. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పైసా వసూల్ ప్రదర్శన ఇస్తున్నాడు.చదవండి: మా గురించి మీకేం తెలుసు?.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్ -
కేఎల్ రాహుల్‌పై కోహ్లి సీరియస్!.. ఇచ్చిపడేశాడు! వీడియో వైరల్
సొంతమైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఎదురైన పరాభవానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా అక్షర్ సేనను వారి హోం గ్రౌండ్లో ఓడించి లెక్క సరిచేసింది. ఇక అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli)- ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) మధ్య జరిగిన వాగ్వాదం హైలైట్ అయ్యింది.కేఎల్ రాహుల్ మరోసారిటాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆర్సీబీ.. ఢిల్లీని 162 పరుగులకు కట్టడి చేసింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (28), ఫాఫ్ డుప్లెసిస్ (22), ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34) రాణించగా.. కేఎల్ రాహుల్ (41) ఢిల్లీ ఇన్నింగ్స్‌లో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు కూల్చగా.. జోష్ హాజిల్‌వుడ్ రెండు, కృనాల్ పాండ్యా- యశ్ దయాళ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఢిల్లీ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.3 ఓవర్లలోనే ఛేదించింది.కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్ఫిల్ సాల్ట్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన జేకబ్ బెతెల్ (12) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ విరాట్ కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా (47 బంతుల్లో 73), టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19) ధనాధన్ దంచికొట్టి ఆర్సీబీ విజయాన్ని ఖరారు చేశారు.అయితే, లక్ష్య ఛేదన సమయంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లి - ఢిల్లీ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌తో వాదనకు దిగినట్లు కనిపించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్‌ను ఢిల్లీ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేశాడు. ఈ క్రమంలో తొలి బంతిని ఎదుర్కొన్న కోహ్లి సింగిల్ తీయగా.. మిగతా ఐదు బంతులను కృనాల్ పాండ్యా ఎదుర్కొన్నాడు.రాహుల్‌తో వాదనకు దిగిన కోహ్లి?!అయితే, ఆ ఓవర్లో మధ్యలోని నాలుగు బంతులు డాట్ కాగా.. ఆఖరి బంతికి మాత్రం కృనాల్ రెండు పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో మొత్తంగా ఎనిమిదో ఓవర్లో ఆర్సీబీకి కేవలం మూడు పరుగులే వచ్చాయి. ఈ క్రమంలో కోహ్లి- రాహుల్‌తో వాదనకు దిగిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షించాయి.కానీ వీరిద్దరి మధ్య వాగ్వాదం ఎందుకు జరిగిందన్న అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. ఈ క్రమంలో కామెంటేటర్, భారత మాజీ స్పిన్నర్ పీయూశ్ చావ్లా కోహ్లి- రాహుల్ మధ్య జరిగింది ఇదే అంటూ స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు తన అభిప్రాయం పంచుకున్నాడు.గట్టిగానే బదులిచ్చాడు‘‘ఫీల్డింగ్ సెట్ చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త ఎక్కువగానే సమయం తీసుకుంటోందని.. బహుశా ఇదే విషయమై కోహ్లి రాహుల్‌కు ఫిర్యాదు చేసి ఉంటాడు. అయితే, వికెట్ కీపర్ రాహుల్ కూడా తన జట్టుకు మద్దతుగా కాస్త గట్టిగానే బదులిచ్చాడు. వ్యూహంలో భాగంగానే తమ కెప్టెన్ ఇలా చేస్తున్నాడని చెప్పి ఉంటాడు’’ అని చావ్లా అభిప్రాయపడ్డాడు. ఇక బ్రాడ్‌కాస్టర్ షేర్ చేసిన వీడియోలో.. తాను వికెట్లకు నిర్ణీత దూరంలోనే ఉన్నానని రాహుల్ బదులిచ్చినట్లు కనిపించడం గమనార్హం.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ బెంగళూరుఢిల్లీ స్కోరు: 162/8 (20)ఆర్సీబీ స్కోరు: 165/4 (18.3)ఫలితం: ఢిల్లీపై ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కృనాల్ పాండ్యా. చదవండి: IPL 2025: అగ్రస్థానానికి దూసుకొచ్చిన ఆర్సీబీ.. టాప్ ప్లేస్‌లో కోహ్లి, హాజిల్‌వుడ్ Things are heating up in Delhi! 🔥#ViratKohli and #KLRahul exchange a few words in this nail-biting match between #DC and #RCB. 💪Watch the LIVE action ➡ https://t.co/2H6bmSltQD#IPLonJioStar 👉 #DCvRCB | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2, Star… pic.twitter.com/Oy2SPOjApz— Star Sports (@StarSportsIndia) April 27, 2025 -
'నెక్ట్స్ వేకేషన్ జమ్మూ కశ్మీర్‌లోనే'.. కేఎల్ రాహుల్ మామ సంచలన కామెంట్స్!
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సంచలన కామెంట్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తన వేకేషన్ను జమ్మూ కశ్మీర్‌లోనే ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. కాశ్మీర్ లోయలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి.. ఉగ్రవాదంపై పోరాటానికి భారతీయులంతా ఏకం కావాలని ఆయన కోరారు. ముంబయిలో జరిగిన లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు- 2025 వేడుకకు హాజరైన ఆయన పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కాశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగమని.. ఇలాంటి సమయంలోనే మనం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎవరూ కూడా భయానికి కానీ.. ద్వేషానికి కానీ లోనుకావద్దని దేశ ప్రజలను సునీల్ శెట్టి కోరారు.సునీల్ శెట్టి మాట్లాడుతూ.. "మనం మానవాళికి చేసే సేవే భగవంతుని సేవ. సర్వశక్తిమంతుడు అన్నీ చూసి ప్రతిస్పందిస్తాడు. ప్రస్తుతం మనం భారతీయులుగా ఐక్యంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. భయం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్న వారి వలలో మనం పడకూడదు. ఇలాంటి సమయంలోనే మనమంతా ఐక్యంగా ఉండాలి. కశ్మీర్ మనదే.. ఎల్లప్పుడూ మనదే అని వాళ్లకి మనం చూపించాలి. అందుకే కాశ్మీర్లో తన విహారయాత్రను ప్లాన్ చేసుకుంటున్నా. మీరు కూడా కశ్మీర్లో పర్యటించాలని భారతీయ పౌరులను కోరుతున్నా. ఒక పౌరుడిగా మనం ఈ పని చేయాలి. మన తదుపరి వేకేషన్ కశ్మీర్‌లోనే ఉండాలి. ఎందుకంటే మనం భయపడలేదని.. మనకు భయం లేదని వారికి చూపించాలి' అని పిలుపునిచ్చారు.ఇప్పటికే తాను అధికారులను సంప్రదించానని.. అవసరమైతే కశ్మీర్లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సునీల్ పేర్కొన్నాడు. తమ సినిమాలను సైతం అక్కడే షూటింగ్ నిర్వహిస్తామని అధికారులకు వివరించినట్లు వెల్లడించారు. ఎందుకంటే మన కశ్మీరీలు ఎప్పటికీ మనకు తోడుగా నిలుస్తారని సునీల్ శెట్టి అన్నారు. ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ ప్రాంతం నుంచి పర్యాటకులు తరలివెళ్లడంతో అక్కడి స్థానికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే సునీల్ శెట్టి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లోని బైసారన్ లోయ వద్ద పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు.. 26 మందిని హతమార్చారు. ఈ ఘటనతో యావత్ భారతదేశం షాకింగ్‌కు గురైంది. View this post on Instagram A post shared by Visitkashmirtravel In (@visitkashmirtravel.in) -
LSG VS DC: ఇది కదా ప్రతీకారమంటే.. లక్నో ఓనర్‌కు ఇచ్చి పడేసిన రాహుల్
గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకా తన పట్ల వ్యవహరించిన తీరుకు నాటి లక్నో కెప్టెన్, ప్రస్తుత ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ తనదైన శైలిలో బదులిచ్చాడు. నిన్న (ఏప్రిల్ 22) ఎల్ఎస్జీపై విజయానంతరం గొయెంకా కరచాలనం చేస్తూ తనతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. రాహుల్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. రాహుల్ చర్యకు గొయెంకా సహా మైదానంలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇదేంటబ్బా రాహుల్ ఇలా ప్రవర్తించాడని అనుకున్నారు.THE COMEBACK MAN - KL RAHUL. 🦁 pic.twitter.com/EQ67LvjLVl— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2025అయితే దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. గత సీజన్లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమి అనంతరం గొయెంకా రాహుల్‌ను బహిరంగంగా అవమానించాడు. అందరి ముందు నిలదీశాడు. గొయెంకా చర్యకు మనసు నొచ్చుకున్న రాహుల్ లక్నోను వీడి ఢిల్లీ పంచన చేరాడు. ఇప్పుడు అవకాశం రావడంతో లక్నో ఓనర్‌కు తన ఆటతీరుతోనే బుద్ది చెప్పాడు. తనను ఘోరంగా అవమానించిన గొయెంకాపై వారి సొంత మైదానంలోనే ప్రతీకారం తీర్చుకున్నాడు. Sanjeev Goenka tried to stop KL Rahul, but Rahul rejected any interaction. pic.twitter.com/1aQ68CIcic— Himanshu Pareek (@Sports_Himanshu) April 22, 2025నిన్న (ఏప్రిల్ 22) ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి ఢిల్లీని గెలిపించాడు. సిక్సర్‌తో మ్యాచ్ ముగించి గొయెంకాకు తానేమి చేయగలనో నిరూపించాడు. ఈ సీజన్లో లక్నోపై ఢిల్లీకి ఇది రెండో విజయం. వైజాగ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఢిల్లీ లక్నోను చిత్తు చేసింది. అయితే తన భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో రాహుల్ ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. సీజన్ ప్రారంభం నుంచే గొయెంకాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూసిన రాహుల్.. నిన్న అవకాశం రావడంతో తన దెబ్బను రుచి చూపించాడు. ఈ సీజన్లో రాహుల్ మాంచి కసితో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 323 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో రాహుల్ ఓ భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.ఎల్ఎస్జీలో రాహుల్ ప్రస్తానంలక్నో ఐపీఎల్ అరంగేట్రం నుంచి కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్.. తొలి రెండు సీజన్లలో (2022, 2023) ఆ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. అయితే గత సీజన్లో రాహుల్ లక్నోను ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. గత సీజన్లో నెమ్మదిగా ఆడుతున్నాడని కూడా రాహుల్‌పై విమర్శలు వచ్చాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్ (45), ఆయుశ్ బదోని (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. -
LSG VS DC: భారీ రికార్డులపై కన్నేసిన రాహుల్, కుల్దీప్
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 22) ఓ రసవత్తర మ్యాచ్ జరుగనుంది. టేబుల్ సెకెండ్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఐదో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లక్నో సొంత మైదానమైన అటల్ బిహారి వాజ్‌పేయ్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ రెండు భారీ రికార్డులపై కన్నేశారు. ఈ మ్యాచ్‌లో రాహుల్ 51 పరుగులు చేస్తే ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని తాకిన ఎనిమిదో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రాహుల్ ఖాతాలో 4949 పరుగులు (138 మ్యాచ్‌లు) ఉన్నాయి. ఇందులో 4 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.రాహుల్‌కు ముందు విరాట్ కోహ్లి (8326), రోహిత్ శర్మ (6786), శిఖర్ ధవన్ (6769), డేవిడ్ వార్నర్ (6565), సురేశ్ రైనా (5528), ధోని (5377), ఏబీ డివిలియర్స్ (5162) ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని తాకారు.కుల్దీప్ విషయానికొస్తే.. ఈ లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బౌలర్ లక్నోతో నేడు జరుగబోయే మ్యాచ్‌లో ఓ వికెట్ తీస్తే.. ఐపీఎల్లో 100 వికెట్ల మైలురాయిని చేరకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 27వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ ఇప్పటివరకు 214 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో చహల్ మినహా మరే బౌలర్ 200 వికెట్ల మార్కును తాకలేదు. టాప్-5లో పియూశ్ చావ్లా (192), భువనేశ్వర్ కుమార్ (189), సునీల్ నరైన్(187), రవిచంద్రన్ అశ్విన్ (185) ఉన్నారు.ప్రస్తుత సీజన్లో రాహుల్, కుల్దీప్ల ఫామ్‌ను చూస్తే నేడు లక్నోతో జరుగబోయే మ్యాచ్‌లో ఈ రికార్డులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో రాహుల్ 6 మ్యాచ్‌ల్లో 266 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో 11 స్థానంలో ఉండగా.. 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసిన కుల్దీప్ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.లక్నోపై సంచలన విజయం సాధించిన ఢిల్లీఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో లక్నోను ఢిల్లీ చివరి నిమిషంలో ఓడించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అశుతోష్ శర్మ (66 నాటౌట్), విప్రాజ్ నిగమ్ (39) వీరోచితమైన ప్రదర్శన కనబర్చి (లక్నో నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో) ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీని గెలిపించాడు. చివరి 7 ఓవర్లలో 94 పరుగులు చేయాల్సిన తరుణంలో (6 వికెట్లు కోల్పోయాక) ఈ జోడీ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి లక్నో చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. అశుతోష్ చివరి నిమిషం వరకు క్రీజ్‌లో ఉండి ఢిల్లీని గెలిపించాడు.ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగిన నేపథ్యంలో నేటి మ్యాచ్‌పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరే క్రమంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. నేటి మ్యాచ్‌తో లక్నో ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో లక్నో రాజస్థాన్ రాయల్స్‌ను ఊహించని విధంగా చివరి ఓవర్లో మట్టికరిపించి మాంచి ఊపు మీద ఉంది. ఢిల్లీ గత మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో భంగపడి కాస్త ఢీలాగా కనిపిస్తుంది.నేటి మ్యాచ్‌ను తుది జట్లు (అంచనా)లక్నో: ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (c & wk), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ / మయాంక్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠి, అవేష్ ఖాన్, ఆయుష్ బడోనిఢిల్లీ: అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, KL రాహుల్ (wk), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (c), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ/దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్, డోనోవన్ ఫెరీరా -
కేఎల్ రాహుల్ కామెంట్స్.. షాకైన పీటర్సన్!.. నా దోస్తులంతా ఇంతే..
ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) ప్రయాణం విజయవంతగా సాగుతోంది. అతడి మార్గదర్శనంలో.. అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ సరికొత్త ఉత్సాహంతో విజయపరంపర కొనసాగిస్తోంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.ఇక తమ ఏడో మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ శనివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో పోటీకి దిగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుండగా.. ఒకరోజు ముందే అక్కడికి చేరుకున్న అక్షర్ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది.సోదరా.. నీకు మెంటార్‌కు అర్థం తెలుసా?!.ఈ సందర్భంగా గుజరాత్ టైటాన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు సరదాగా ముచ్చటించుకున్నారు. ఈ క్రమంలో టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill).. ఢిల్లీ మెంటార్ పీటర్సన్ దగ్గరకు వచ్చి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.పరస్పరం క్షేమ, సమాచారాలు అడిగితెలుసుకున్న తర్వాత.. పీటర్సన్.. ‘‘సోదరా.. నీకు మెంటార్‌కు అర్థం తెలుసా?!.. ఇక్కడ ఉన్న వాళ్లలో ఒక్కరికి మెంటార్ అంటే తెలియనే తెలియదు’’ అని గిల్‌తో అన్నాడు.రెండు వారాల పాటు మాల్దీవుల పర్యటనవీరిద్దరి సంభాషణ మధ్యలో జోక్యం చేసుకున్న ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. పీటర్సన్‌కు ఊహించని షాకిచ్చాడు. ‘‘ఎవరైతే సీజన్ మధ్యలోనే రెండు వారాల పాటు మాల్దీవుల పర్యటనకు వెళ్తారో.. వారే మెంటార్’’ అంటూ రాహుల్ పీటర్సన్‌ను టీజ్ చేశాడు. దీంతో పీటర్సన్ బిక్కముఖం వేసుకుని చూసాడు.నా దోస్తులంతా ఇంతేఇందుకు.. ‘‘నా స్నేహితులంతా ఇంతే.. విషపూరితమైన వాళ్లు.. లక్ష్యం లేని వాళ్లు. ఎప్పుడూ ప్రతికూలంగానే మాట్లాడతారు.. పరుషంగా ఉంటారు.. నాకు కొత్త స్నేహితులు కావాలి.. కానీ అంత త్వరగా, సులువుగా దొరకరే..’’ అన్న పంక్తులతో సాగే BoyWithUke పాటను ఢిల్లీ అడ్మిన్ పీటర్సన్ ఇన్నర్ వాయిస్‌లా జతచేశారు.ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘థాంక్యూ కేఎల్.. మెంటార్ అంటే సరైన అర్థం ఏమిటో ఇప్పుడే చెప్పావు’’ అన్నట్లు క్యాప్షన్ ఇచ్చారు. కాగా కెవిన్ పీటర్సన్ 2009లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు.వ్యక్తిగత సెలవు మీదఆరంభంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన కెవిన్ పీటర్సన్.. సారథిగానూ వ్యవహరించాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి ప్రాతినిథ్యం వహించిన పీటర్సన్.. 17 మ్యాచ్‌లలో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అదే విధంగా రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్‌కు కూడా ఆడాడు.2016లో చివరగా ఐపీఎల్ ఆడిన 44 ఏళ్ల పీటర్సన్ మొత్తంగా క్యాష్ రిచ్ లీగ్‌లో 36 మ్యాచ్‌లు ఆడి 1001 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 2025లో మెంటార్ అవతారంలో తిరిగి ఢిల్లీ ఫ్రాంఛైజీతో జట్టు కట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదాని, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్, అసిస్టెంట్ కోచ్ మాథ్యూ మాట్లతో కలిసి పీటర్సన్ పనిచేస్తున్నాడు.ఇక ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ గెలుపొందిన తర్వాత.. వ్యక్తిగత సెలవు మీద పీటర్సన్ మాల్దీవుల పర్యటనకు వెళ్లాడు. ఫలితంగా ఏప్రిల్ 10న ఆర్సీబీతో మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండలేకపోయాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేఎల్ రాహుల్ పీటర్సన్‌ను ట్రోల్ చేయడం విశేషం.చదవండి: ఒక్కరికీ కామన్ సెన్స్ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?: సెహ్వాగ్ ఫైర్ Thanks KL, now we know what a mentor does 😂 pic.twitter.com/JXWSVJBfQS— Delhi Capitals (@DelhiCapitals) April 19, 2025 -
GT VS DC: డబుల్ సెంచరీ పూర్తి చేసిన కేఎల్ రాహుల్
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో సిక్సర్ల డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో భారత బ్యాటర్‌గా, ఓవరాల్‌గా 11వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 19) జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ ఈ ఘనత సాధించాడు. రాహుల్ ఐపీఎల్లో ఇప్పటిదాకా 129 ఇన్నింగ్స్‌లు ఆడి 200 సిక్సర్లు కొట్టాడు. రాహుల్‌కు ముందు భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (286), విరాట్ కోహ్లి (282), ఎంఎస్ ధోని (260), సంజూ శాంసన్ (216), సురేశ్ రైనా (203) సిక్సర్ల డబుల్ సెంచరీ పూర్తి చేశారు. ఓవరాల్‌గా రాహుల్‌కు ముందు క్రిస్ గేల్ (357), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, ఏబీ డివిలియర్స్ (251), డేవిడ్ వార్నర్ (236), కీరన్ పోలార్డ్ (223), సంజూ శాంసన్, ఆండ్రీ రసెల్ (212), సురేశ్ రైనా ఈ ఘనత సాధించారు.మ్యాచ్ విషయానికొస్తే.. అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగిన రాహుల్ 14 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన అభిషేక్ పోరెల్ (9 బంతుల్లో 18; 3 ఫోర్లు, సిక్స్), కరుణ్ నాయర్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దూకుడుగానే ఆడినప్పటికీ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. 10 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 1052గా ఉంది. అక్షర్ పటేల్ (15), ట్రిస్టన్ స్టబ్స్ (8) క్రీజ్‌లో ఉన్నారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టగా.. అర్షద్ ఖాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) కొనసాగుతుండగా.. గుజరాత్ మూడో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) ఉంది. పంజాబ్ రెండు (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు), ఆర్సీబీ నాలుగు (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) స్థానాల్లో ఉండగా.. లక్నో (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), కేకేఆర్ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), ముంబై ఇండియన్స్ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), రాజస్థాన్ రాయల్స్ (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), సన్‌రైజర్స్ (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), సీఎస్కే వరుసగా ఐదు నుంచి పది స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ గతేడాది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయిన అతియా శెట్టి బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది. ఆ తర్వాత దాదాపు మూడేళ్ల పాటు రాహుల్‌తో డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. వీరి వివాహా వేడుక ముంబయిలోని సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇటీవల పుట్టిన బిడ్డకు ఇప్పటి వరకు పేరు పెట్టలేదు. రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌తో బిజీగా ఉన్నారు.అయితే తాజాగా అతియాశెట్టి- కేఎల్ రాహుల్ తమ ముద్దుల కూతురికి నామకరణం చేశారు. ఈవారా విపుల రాహుల్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని అతియాశెట్టి శెట్టి సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాదు ఈ పేరుకు అర్థం కూడా చెప్పేసింది. ఈవారా అంటే దేవుని గిఫ్ట్ అని.. విపుల అంటే అమ్మమ్మ (అతియా శెట్టి వాళ్ల అమ్మమ్మ) (మనా శెట్టి తల్లి) పేరు వచ్చేలా ఆమెకు గౌరవంగా.. రాహుల్ అంటే పాపా(నాన్న) అని అర్థం వచ్చేలా పెట్టినట్లు వివరించింది.కాగా.. ఇటీవల అతియాశెట్టికి కూతురు పుట్టడంతో తాతయ్య సునీల్ శెట్టి ఆనందం వ్యక్తం చేశారు. తన మనవరాలు పుట్టిన తర్వాత తన జీవితం మారిపోయిందని అన్నారు. తనను చూసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని తెలిపారు. తన జీవితమంతా సినిమా చేస్తూ, వ్యాపారాలు చేసుకుంటూ గడిపానని.. ఈరోజు తన మనవరాలిని పట్టుకున్నంత ఆనందం ఎప్పుడూ కనిపించలేదని సునీల్ శెట్టి ఎమోషనల్ నోట్లో రాసుకొచ్చారు. తన మనవరాలి చేయి పట్టుకుని ఉన్న తన తల్లిని చూడటం కూడా జీవితాంతం గుర్తుండిపోయే అందమైన క్షణమని చెప్పారు. -
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
సినీ ప్రముఖులు, క్రీడాకారులు తమదైన రంగాలలో రాణిస్తూనే.. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే నటుడు సునీల్ శెట్టి.. ఆయన అల్లుడు & భారత్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇద్దరూ కలిసి థానే వెస్ట్‌లోని ఓవాలేలో 7 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలిసింది.ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (ఐజీఆర్) వెబ్సైట్ ప్రకారం.. ఈ భూమి విలువ రూ. 9.85 కోట్లు అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన లావాదేవీలన్నీ.. 2025 మార్చిలో జరిగాయి. ఈ భూమి ఆనంద్ నగర్, కాసర్వాడవలి మధ్య ఉంది. ఇది థానే వెస్ట్‌ను తూర్పు, పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవేకు సమీపంలో ఉండటం వల్ల వ్యాపార కనెక్టివిటీకి కూడా అనుకూలంగా ఉంటుంది.స్క్వేర్ యార్డ్స్ ప్రకారం.. స్టాంప్ డ్యూటీ ఖర్చులు రూ. 68.96 లక్షలు అని, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ. 30,000 అని తెలుస్తోంది.భారతదేశపు ప్రముఖ క్రికెటర్లలో ఒకరైన కేఎల్ రాహుల్.. జాతీయ జట్టు తరపున అన్ని ఫార్మాట్లలో ఆడారు. వైస్ కెప్టెన్‌గా పనిచేశారు మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో జట్లకు నాయకత్వం వహించారు. సియట్ టి20 ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ వంటి అవార్డులతో గుర్తింపు పొందిన రాహుల్, భారతదేశంలో అత్యధిక పరుగులు సాధించిన వారిలో ఒకరుగా ఉన్నారు.ఇదీ చదవండి: టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!ఇక నటుడు సునీల్ శెట్టి విషయానికి వస్తే.. ఈయన సుమారు 100 కంటే ఎక్కువ సినిమాలలో నటించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషికి రాజీవ్ గాంధీ అవార్డు దక్కింది. సినిమాల్లో మాత్రమే కాకూండా ఫిట్నెస్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ వెంచర్లలో కూడా సునీల్ శెట్టి రాణిస్తున్నారు. -
జిడ్డు బ్యాటింగ్!.. ఇలా అయితే కష్టం రాహుల్: పుజారా విమర్శలు
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ కేఎల్ రాహుల్ (KL Rahul) బ్యాటింగ్ తీరును భారత మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) విమర్శించాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాహుల్ జిడ్డు ఇన్నింగ్స్ ఆడాడని.. సీనియర్ ఆటగాడు ఇలా చేయడం తగదని పేర్కొన్నాడు. క్రీజులో కుదురుకున్న తర్వాతైనా ఈ కర్ణాటక క్రికెటర్ బ్యాట్ ఝులిపించాల్సిందని పుజారా అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్-2025 (IPL 2025)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఆరంభ మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత అందుబాటులోకి వచ్చిన రాహుల్ ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ తన విలువను చాటుకుంటున్నాడు. ఇప్పటికి ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 238 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఢిల్లీ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, రాజస్తాన్ రాయల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో మాత్రం కేఎల్ రాహుల్ స్లో ఇన్నింగ్స్ ఆడాడు. అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఆరంభంలోనే ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెగర్క్ (9) వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో వన్‌డౌన్‌లో వచ్చిన కరుణ్ నాయర్ రనౌట్ అయి డకౌట్‌గా వెనుదిరిగాడు.స్ట్రైక్ రేటు 118.75ఈ క్రమంలో మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ (37 బంతుల్లో 49) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకోగా.. నాలుగో స్థానంలో వచ్చిన రాహుల్ అతడికి సహకరించాడు. అయితే, క్రీజులో నిలదొక్కుకునేందుకు రాహుల్ చాలా సమయమే తీసుకున్నాడు. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేటు 118.75.ఇక జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో షార్ట్ డెలివరీని ఆడబోయి రాహుల్ బంతిని గాల్లోకి లేపగా.. మిడ్ వికెట్ పొజిషన్లో ఉన్న హెట్మెయిర్ వేగంగా పరిగెత్తుకుని వచ్చి క్యాచ్ అందుకున్నాడు. దీంతో రాహుల్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.షాట్ల ఎంపికలో జాగ్రత్త రాహుల్ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ గురించి ఛతేశ్వర్ పుజారా స్పందించాడు. ‘‘కేఎల్ సీనియర్ ఆటగాడు.. అతడు 15- 20 బంతులు ఆడాలని అనుకుని ఉంటాడు. ఆ తర్వాత బ్యాట్ ఝులిపిద్దామనుకున్నాడేమో!... కానీ నాకైతే అతడు కాస్త దూకుడుగా ఆడితే బాగుండు అనిపించింది.తను క్రీజులో కుదురుకున్నాడు.. పిచ్ పిరిస్థితులపై కూడా అవగాహన ఉంది. పరుగులు రాబట్టకపోతే కష్టమనీ తెలుసు. అయినా సరే ఎందుకో అతడు దూకుడుగా ఆడలేకపోయాడు. రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త మార్పు వచ్చింది.ఐపీఎల్లో తను ఓపెనర్‌గా వచ్చేవాడు. ఇప్పుడు మిడిలార్డర్లో వస్తున్నాడు. నిజానికి పవర్ ప్లేలో అతడి ఆట తీరు వేరేలా ఉండేది. ఏదేమైనా షాట్ల ఎంపికలో రాహుల్ ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే, అతి జాగ్రత్త పనికిరాదు.ఎంత సేపూ వికెట్ కాపాడుకోవడం కోసమేనా?కేవలం వికెట్ కాపాడుకునేందుకే అతడు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అలా కాకుండా తనదైన సహజశైలిలో రాహుల్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది’’ అని పుజారా అభిప్రాయపడ్డాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రాహుల్ అవుటైన తర్వాత.. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34 నాటౌట్), కెప్టెన్ అక్షర్ పటేల్ (14 బంతుల్లో 34) ధనాధన్ దంచికొట్టారు. ఫలితంగా ఢిల్లీ 20 ఓవర్లలో 188 పరుగులు చేయగలిగింది. లక్ష్య ఛేదనలో రాజస్తాన్ కూడా 188 పరుగులు చేసినా.. సూపర్ ఓవర్లో చెత్త బ్యాటింగ్‌తో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది.చదవండి: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?: షేన్ వాట్సన్ ఫైర్📁 TATA IPL↳ 📂 Super OverAnother day, another #TATAIPL thriller! 🤩Tristan Stubbs wins the Super Over for #DC in style! 🔥Scorecard ▶ https://t.co/clW1BIPA0l#DCvRR pic.twitter.com/AXT61QLtyg— IndianPremierLeague (@IPL) April 16, 2025𝙉𝙚𝙧𝙫𝙚𝙨. 𝘿𝙧𝙖𝙢𝙖. 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨! 😉A quick morning catch-up on that late-night Super-Over nail-biter! 🙌#TATAIPL | #DCvRR | @DelhiCapitals pic.twitter.com/QeKsfPmCyk— IndianPremierLeague (@IPL) April 17, 2025 -
DC Vs RR: ఢిల్లీ ‘సూపర్’ విక్టరీ
న్యూఢిల్లీ: ఉత్కంఠ ఊపేసిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఆధిక్యం చేతులు మారుతూ చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్... ఆఖరికి ‘సూపర్ ఓవర్’కు వెళ్లగా... అందులోనూ ఆకట్టుకున్న క్యాపిటల్స్ ఐపీఎల్ 18వ సీజన్లో ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై తొలి విజయం సాధించిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అందుకుంది. బుధవారం జరిగిన ఈ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ (37 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... కేఎల్ రాహుల్ (38; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (14 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు సరిగ్గా 188 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), నితీశ్ రాణా (28 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలు సాధించగా... సామ్సన్ (19 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఆఖర్లో తీవ్ర ఒత్తిడిలో ధ్రువ్ జురెల్ (17 బంతుల్లో 26; 2 సిక్స్‌లు), హెట్‌మైర్ (15 నాటౌట్; 1 ఫోర్) మెరుగైన ప్రదర్శన కనబర్చారు. స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘సూపర్ ఓవర్’ ఆడించారు. స్కోరు వివరాలు: ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెక్‌గుర్క్ (సి) జైస్వాల్ (బి) ఆర్చర్ 9; పొరెల్ (సి) పరాగ్ (బి) హసరంగ 49; కరుణ్ (రనౌట్) 0; రాహుల్ (సి) హెట్‌మైర్ (బి) ఆర్చర్ 38; స్టబ్స్ (నాటౌట్) 34; అక్షర్ (సి) జురెల్ (బి) తీక్షణ 34; అశుతోష్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–34, 2–34, 3–97, 4–105, 5–146. బౌలింగ్: ఆర్చర్ 4–0–32–2; తుషార్ 3–0–38–0; సందీప్ 4–0–33–0; తీక్షణ 4–0–40–1; హసరంగ 4–0–38–1; పరాగ్ 1–0–6–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్టార్క్ (బి) కుల్దీప్ 51; సామ్సన్ (రిటైర్డ్ హర్ట్) 31; పరాగ్ (బి) అక్షర్ 8; నితీశ్ రాణా (ఎల్బీ) స్టార్క్ 51; జురేల్ (రనౌట్) 26; హెట్‌మైర్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–76, 2–112, 3–161, 4–188. బౌలింగ్: స్టార్క్ 4–0–36–1; ముకేశ్ 3–0–31–0; మోహిత్ 4–0– 38–0; విప్రాజ్ 1–0–13–0; అక్షర్ 3–0–23–1; కుల్దీప్ 4–0–33–1; స్టబ్స్ 1–0–12–0. సూపర్ ఓవర్ సాగిందిలా...సూపర్ ఓవర్లో ఢిల్లీ తరఫున బౌలింగ్ చేసిన స్టార్క్... తన యార్కర్లతో ప్రత్యర్థిని కట్టిపడేశాడు. తొలి బంతికి పరుగులేమీ రాకపోగా... రెండో బంతికి హెట్‌మైర్ ఫోర్ కొట్టాడు. మూడో బంతికి సింగిల్ రాగా... నాలుగో బంతికి పరాగ్ ఫోర్ కొట్టాడు. ఆ బంతి నోబాల్ అని తేలగా... మరుసటి బంతికి పరాగ్ రనౌటయ్యాడు. ఐదో బంతికి రెండో పరుగు తీసే క్రమంలో జైస్వాల్ రనౌటవడంతో రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. ఛేదనలో తొలి బంతికి రెండు పరుగులు తీసిన రాహుల్... రెండో బంతిని బౌండరీకి తరలించాడు. మూడో బంతికి సింగిల్ రాగా... నాలుగో బంతికి స్టబ్స్ సిక్స్ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఐపీఎల్లో నేడుముంబై X హైదరాబాద్‌వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
హై-ఎండ్ కార్లు.. లగ్జరీ ప్రాపర్టీలు.. కేఎల్ రాహుల్ ఆస్తుల వివరాలు
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇందుకు తగ్గట్టుగానే క్రికెటర్ల బ్రాండింగ్ మార్కెట్ అధికంగా ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుణ్యమా అని వారి వ్యక్తిగత సంపాదన కూడా పెరుగుతోంది. దానికితోడు కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల బ్రాండ్ ప్రమోషన్ల కోసం భారీ మొత్తంలోనే ముట్టజెప్పుతున్నారు. దాంతో చాలామంది క్రికెటర్లు దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలనే చందంతో వయసురీత్యా ఎక్కువ రోజులు క్రికెట్లో కొనసాగకపోవచ్చనే భావన, భవిష్యత్తుపై భరోసాను దృష్టిలో ఉంచుకొని స్థిరాస్తులను కూడబెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టీమ్ లక్నో సుపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆస్తుల వివరాలతోపాటు తాను ఎండార్స్ చేస్తున్న బ్రాండ్ల సంగతుల గురించి తెలుసుకుందాం.భారత మోస్ట్ స్టైలిష్, నిలకడైన క్రికెటర్లలో ఒకరైన కేఎల్ రాహుల్ గత కొన్నేళ్లుగా ఆకట్టుకునే ఆర్థిక పోర్ట్‌ఫోలియోను నిర్మించారు. 2025 నాటికి ఆయన సందప నికర విలువ రూ.100 కోట్లు (సుమారు 12 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. బీసీసీఐ కాంట్రాక్టులు, ఐపీఎల్ వేతనాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, వ్యక్తిగత పెట్టుబడులు సహా పలు వనరుల నుంచి ఆయనకు సంపద సమకూరుతుంది.రాహుల్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో గ్రేడ్-ఏ ఒప్పందంలో భాగంగా సంవత్సరానికి రూ.5 కోట్లు వరకు సంపాదిస్తున్నాడు.గతంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రాహుల్ ప్రతి సీజన్‌కు సరాసరి రూ.16 కోట్ల పారితోషికం తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ తరఫున ఆడుతున్నారు.పూమా, రెడ్ బుల్, భారత్ పే, బోట్, టాటా నెక్సాన్, బియర్డో, క్యూర్.ఫిట్, నుమి.. వంటి ప్రధాన బ్రాండ్లను రాహుల్ ప్రమోషన్ చేస్తున్నారు. ఇది అతని ఆదాయానికి గణనీయంగా దోహదం చేస్తుంది.మెర్సిడెస్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ, ఆడీ మోడళ్లతో సహా హై-ఎండ్ కార్ల సేకరణతో పాటు బెంగళూరులో ఆయనకు లగ్జరీ ప్రాపర్టీలు ఉన్నాయి.ముంబైలోని కార్టర్ రోడ్లో సుమారు రూ.10 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కలిగి ఉన్నారు. రాహుల్-అతియా శెట్టి దంపతులకు బెంగళూరులో విలాసవంతమైన నివాసం కూడా ఉంది.ఇదీ చదవండి: డీజిల్‌కు తగ్గిన డిమాండ్.. ఎందుకంటే..మెటామాన్ అనే పెర్ఫ్యూమ్స్, జువెలరీ బ్రాండ్‌కు రాహుల్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు. అందులో తాను పెట్టుబడి కూడా పెట్టారు.అర్బన్ ఫ్యాషన్ బ్రాండ్ గల్లీ లైవ్ ఫాస్ట్‌కు రాహుల్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు.బోల్డ్ ఫిట్ అనే అథ్లెట్ దుస్తుల తయారీ కంపెనీలో రాహుల్ ఇన్వెస్ట్ చేశారు.రాహుల్ నిలకడైన గేమింగ్ ప్రదర్శన, నాయకత్వ బాధ్యతలు, బ్రాండ్ వాల్యూ పెరగడం వల్ల తన నికర విలువ క్రమంగా అధికమవుతోంది. భారత్‌లో క్రికెట్‌కు కమర్షియల్ అప్పీల్ పెరగడంతో రాబోయే కాలంలో తన సంపాదన మరింత పెరుగుతుందని తెలుస్తుంది. -
నా మనవరాలిని చూసిన ఆనందం.. నా సంపాదనలో కనిపించలేదు: సునీల్ శెట్టి
బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ గతేడాది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయిన అతియా శెట్టి బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది. ఆ తర్వాత దాదాపు మూడేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహా వేడుక ముంబయిలోని సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో గ్రాండ్‌గా జరిగింది.అయితే అతియాశెట్టి కూతురు పుట్టడంతో తాతయ్య సునీల్ శెట్టి ఆనందం వ్యక్తం చేశారు. తన మనవరాలు పుట్టిన తర్వాత తన జీవితం మారిపోయిందని అన్నారు. తనను చూసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని తెలిపారు. తన జీవితమంతా సినిమా చేస్తూ, వ్యాపారాలు చేసుకుంటూ గడిపానని.. ఈరోజు తన మనవరాలిని పట్టుకున్నంత ఆనందం ఎప్పుడూ కనిపించలేదని సునీల్ శెట్టి ఎమోషనల్ నోట్లో రాసుకొచ్చారు. తన మనవరాలి చేయి పట్టుకుని ఉన్న తన తల్లిని చూడటం కూడా జీవితాంతం గుర్తుండిపోయే అందమైన క్షణమని చెప్పారు.సునీల్ తన పోస్ట్‌లో రాస్తూ.. 'ఇటీవల తాతగా మారడం నాకు వర్ణించలేని అనుభూతి. ఇది ప్రపంచం ఇచ్చే స్వచ్ఛమైన ఆనందం. నేను దశాబ్దాలుగా వ్యాపారాలు నడుపుతున్నా. సినిమాలు చేస్తున్నా. నా జీవితంలో అర్ధవంతమైన పనిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నా. ఈ విషయంలో నేను గర్వపడుతున్నా. కానీ నేను నా మనవరాలిని పట్టుకున్నప్పుడు ఇవేమీ గుర్తుకు రాలేదు. ఇప్పుడు నా మనస్సు మంగుళూరులోని నా చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చింది. చెప్పులు లేకుండా పరిగెత్తడం, బహిరంగ మైదానంలో ఆడుకోవడం, ప్రేమ తప్ప మరేమీ లేకుండా చేసిన తాజా భోజనం తినడం నిజమైన ఆనందాన్ని ఇచ్చిందని' రాసుకొచ్చారు. నా కుమార్తె అతియా శెట్టి తల్లి కావడం చూస్తుంటే తన మనసుకు చాలా ప్రశాంతంగా ఉందని ఒక తండ్రిగా గర్వంగా కూడా ఉందని పోస్ట్ చేశారు. కాగా.. అతియా శెట్టికి మార్చి 24న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితేఇంకా పాప పేరును ప్రకటించలేదు. -
ముంబైతో మ్యాచ్.. అరుదైన రికార్డులకు చేరువలో రాహుల్
ఐపీఎల్-2025లో వరుస విజయాలతో దూసుకు పోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో కీలక పోరుకు సిద్దమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి తమ జైత్ర యాత్రను కొనసాగించాలని ఢిల్లీ భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను పలు అరుదైన రికార్డులను ఊరిస్తోంది. ముంబైతో మ్యాచ్‌లో రాహుల్ మరో మూడు సిక్స్‌లు కొడితే ఐపీఎల్లో 200 సిక్స్‌ల మైలు రాయిని అందుకుంటాడు. రాహుల్ ఇప్పటివరకు 135 మ్యాచ్‌లు ఆడి 197 సిక్స్‌లు బాదాడు. కేఎల్ మరో మూడు సిక్స్‌లు బాదితే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, సురేష్ రైనా వంటి దిగ్గజాల సరసన చేరుతాడు.ఒకే ఒక హాఫ్ సెంచరీ..అదే విధంగా ఈ మ్యాచ్‌లో రాహుల్ మరో 50 రన్స్ చేస్తే ముంబై ఇండియన్స్‌పై వెయ్యి ఐపీఎల్ పరుగులను పూర్తి చేసుకుంటాడు. రాహుల్ ఇప్పటివరకే ముంబై ఇండియన్స్‌పై 950 పరుగులు చేశాడు. రాహుల్ ప్రస్తుతం ఉన్న ఫామ్‌కు ఈ రికార్డులు బద్దలు అవ్వడం ఖాయమన్పిస్తోంది.గత మ్యాచ్‌లో ఆర్సీబీపై రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 53 బంతుల్లోనే 93 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అంతకుముందు సీఎస్కేపై హాఫ్ సెంచరీతో మెరిశాడు.ముంబైతో మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు(అంచనా): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్చదవండి: అక్కడ కూర్చుని మాట్లాడటం తేలికే.. ఇక్కడికి వస్తే తెలుస్తుంది: శార్దూల్ ఫైర్ -
టీ20 అంటేనే పరుగుల వరద.. కానీ: పిచ్ క్యూరేటర్పై డీకే అసంతృప్తి
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఫ్రాంఛైజీలు వర్సెస్ క్యూరేటర్లు అన్నట్లుగా వివాదాలు పుట్టుకొస్తున్నాయి. తొలుత కోల్‌కతా నైట్ రైడర్స్ఈడెన్ (KKR) గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) వంతు వచ్చింది. టీ20 క్రికెట్ అంటేనే పరుగుల వరదచిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తిక్.. క్యూరేటర్ తీరును విమర్శించాడు. ‘‘టీ20 క్రికెట్ అంటేనే పరుగుల వరద. లీగ్ ప్రచారకర్తలు, అభిమానులకు ఇదే ముఖ్యం. అభిమానులంతా బ్యాటర్లు బౌండరీలు బాదుతుంటే చూడాలని కోరుకుంటారు. ఇక్కడ తొలి రెండు మ్యాచ్‌ల కోసం మేము బ్యాటింగ్‌కు ఎక్కువగా అనుకూలించే పిచ్‌లు రూపొందించమని విజ్ఞప్తి చేశాం. కానీ.. చిన్నస్వామి స్టేడియంలో బ్యాటింగ్ చేయడమే కష్టంగా మారిపోయింది. ఈ పిచ్ బ్యాటర్లకు అంతగా అనుకూలించడం లేదు. ఈ వికెట్‌పై పరుగులు రాబట్టడం సవాలుతో కూడుకున్న పని. మేము ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఇదే పరిస్థితి.స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా కష్టమైపోయింది. ఇక ఇలాంటి చోట భారీ షాట్ ఆడాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే, టీ20 క్రికెట్లో షాట్లు బాదితేనే ఆడేవాళ్లకు, చూసేవాళ్లకు మజా. తప్పక చర్చిస్తాంపిచ్ తప్పకుండా మేము క్యూరేటర్‌తో చర్చిస్తాం. ఆయనపై మాకు నమ్మకం ఉంది. మాకోసం అత్యుత్తమ పిచ్ తయారు చేస్తారని ఆశిస్తున్నాం’’ అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు.పాటిదార్ నాయకత్వంలో రచ్చ గెలుస్తూ.. ఇంట ఇలాకాగా ఐపీఎల్-2025లో ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వచ్చాడు. రజత్ పాటిదార్ నాయకత్వంలో ఆర్సీబీ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది. అయితే, ఈ మూడూ ఇతర వేదికలపై గెలిచినవే. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ బెంగళూరు జట్టుకు చేదు అనుభవమే మిగిలింది.తొలుత గుజరాత్ టైటాన్స్ చేతిలో.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సొంతగడ్డపై పాటిదార్ సేన ఓటమిపాలైంది. గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ... నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.రహానే డైరెక్ట్గానేఇక ఢిల్లీ 17.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి.. లక్ష్యాన్ని ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ (53 బంతుల్లో 93 నాటౌట్) ఒంటి చేత్తో ఢిల్లీ జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశకు గురైన ఆర్సీబీ మేనేజ్మెంట్ ఈ మేరకు పిచ్ క్యూరేటర్‌ను తప్పుబట్టడం గమనార్హం.ఇక కేకేఆర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. హోం గ్రౌండ్లో కాస్త అడ్వాంటేజీ ఉంటుందనుకుంటే.. అక్కడే డిఫెండింగ్ చాంపియన్‌కు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. స్పిన్‌కు కాస్త అనుకూలించే పిచ్ తయారు చేయమని అడిగితే..క్యూరేటర్ తమ మాట వినడం లేదంటూ కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.చదవండి: RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్?!.. డీకేతో చర్చ.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది! Unbeaten. Unstoppable. Unmatched 🫡History for #DC as they win the first 4⃣ games on the trot for the maiden time ever in #TATAIPL history 💙Scorecard ▶ https://t.co/h5Vb7spAOE#TATAIPL | #RCBvDC | @DelhiCapitals pic.twitter.com/wj9VIrgzVK— IndianPremierLeague (@IPL) April 10, 2025 -
ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు.. మా ఓటమికి ప్రధాన కారణం అదే: పాటిదార్
రచ్చ గెలుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇంట మాత్రం మరోసారి పరాభవం ఎదుర్కొంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా ఈ సీజన్లో హోం గ్రౌండ్లో రెండో ఓటమిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) విచారం వ్యక్తం చేశాడు.ఓవర్ కాన్ఫిడెన్స్ కాదుఢిల్లీ చేతిలో ఓటమి అనంతరం స్పందిస్తూ.. ‘‘వికెట్ ఎప్పటికప్పుడు మారిపోయినట్లుగా అనిపించింది. నిజానికి ఇది బ్యాటింగ్ చేసేందుకు అనుకూలమైన పిచ్. కానీ మేమే సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయాం.మా జట్టులోని ప్రతి బ్యాటర్ కసితోనే ఆడతారు. వాళ్లది ఆత్మవిశ్వాసమే తప్ప.. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. అయితే, ఈరోజు 80/1 స్కోరు నుంచి 90/4కు పడిపోవటమన్నది ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదు.మా బ్యాటింగ్ లైనప్ పటిష్టమైనది. కానీ మేము ఈరోజు పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోయాం. అయితే, ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటం మాకు కాస్త ఊరట కలిగించే అంశం.మా ఓటమికి కారణం అదేఇక ఢిల్లీ ఇన్నింగ్స్ పవర్ ప్లేలో మా బౌలర్లు ఆడిన విధానం అద్భుతం. మాకు అది ఎంతో ప్రత్యేకమైనది. సొంత మైదానంలో కాకుండా వేరే మైదానాల్లోనే గెలుస్తామన్న అభిప్రాయాలతో మాకు పనిలేదు.వేదిక ఏదైనా విజయమే లక్ష్యంగా మేము బరిలోకి దిగుతాం’’ అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు. తమ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమేనని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025లో భాగంగా ఆర్సీబీ గురువారం ఢిల్లీతో తలపడింది.బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (17 బంతుల్లో 37), విరాట్ కోహ్లి (14 బంతుల్లో 22) రాణించగా.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (1) విఫలమయ్యాడు.రజత్ పాటిదార్ (23 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించగా.. లియామ్ లివింగ్‌స్టోన్ (4), జితేశ శర్మ (3) నిరాశపరిచారు. ఆఖర్లో కృనాల్ పాండ్యా (18 బంతుల్లో 18) నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలం కాగా.. టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 37 నాటౌట్) వేగంగా ఆడి స్కోరు 163 పరుగుల మార్కుకు తీసుకువచ్చాడు.పవర్ ప్లేలో మూడు వికెట్లు.. కానీఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఢిల్లీకి వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లలో ఫాఫ్ డుప్లెసిస్ (2)ను యశ్ దయాళ్, జేక్ ఫ్రేజర్ మెగర్క్(7)ను భువనేశ్వర్ కుమార్ వచ్చీ రాగానే పెవిలియన్‌కు పంపారు. వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (7)ను కూడా భువీ వెనక్కి పంపి మంచి బ్రేక్ ఇచ్చాడు.రాహుల్ రఫ్పాడించాడుఅయితే, కేఎల్ రాహుల్ విజృంభణతో అంతా తలకిందులైంది. నెమ్మదిగా మొదలుపెట్టిన ఈ లోకల్ బ్యాటర్.. మధ్య ఓవర్లలో దూకుడు పెంచాడు. మొత్తంగా 53 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్స్‌ల సాయంతో 93 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీని గెలుపుతీరాలకు చేర్చాడు. అతడికి తోడుగా ట్రిస్టన్ స్టబ్స్ (23 బంతుల్లో 38 నాటౌట్) రాణించాడు. ఈ క్రమంలో 17.5 ఓవర్లలో 169 పరుగులు సాధించిన ఢిల్లీ.. ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. అక్షర్ సేనకు ఈ సీజన్లో వరుసగా ఇది నాలుగో విజయం కాగా.. ఆర్సీబీ ఐదు మ్యాచ్‌లలో మూడు గెలవగలిగింది.ఐపీఎల్-2025: బెంగళూరు వర్సెస్ ఢిల్లీ👉టాస్: ఢిల్లీ.. మొదట బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 163/7 (20)👉ఢిల్లీ స్కోరు: 169/4 (17.5)👉ఫలితం: బెంగళూరుపై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు.చదవండి: RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్?!.. డీకేతో చర్చ.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది! POV: It's his home ground 😎🏡#TATAIPL | #RCBvDC | @klrahul | @DelhiCapitals pic.twitter.com/kV7utADWjU— IndianPremierLeague (@IPL) April 10, 2025 -
ఇది నా హోం గ్రౌండ్: కేఎల్ రాహుల్ సెలబ్రేషన్స్ వైరల్.. పాపం కోహ్లి!
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సీజన్ ఆరంభం నుంచి ఓటమన్నదే లేకుండా ముందుకు సాగుతున్న అక్షర్ సేన.. తాజాగా మరో విజయం సాధించింది. పటిష్ట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును వారి సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలోనే ఓడించింది.ఇందుకు ప్రధాన కారణం ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul). ఆర్సీబీ విధించిన 164 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆరంభంలోనే అక్షర్ సేన వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ (2), జేక్ ఫ్రేజర్-మెగర్క్ (7) పూర్తిగా విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్ పోరెల్ (7) కూడా చేతులెత్తేశాడు. దీంతో పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయి ఢిల్లీ విలవిల్లాడింది.ఆఖరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పాఇలాంటి తరుణంలో నేనున్నాంటూ కేఎల్ రాహుల్ అభయమిచ్చాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా.. మధ్య ఓవర్లలో మాత్రం దూకుడు పెంచి ఆర్సీబీ బౌలింగ్‌ను చితక్కొట్టాడు. ట్రిస్టన్ స్టబ్స్ (23 బంతుల్లో 38 నాటౌట్)తో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు.రాహుల్ మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 93 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అన్నట్లుగా సిక్సర్‌తో ఢిల్లీ విజయాన్ని ఖరారు చేశాడు. దీంతో ఢిల్లీ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటగా.. రాహుల్ తన విన్నింగ్ ఇన్నింగ్స్ సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు వైరల్‌గా మారింది."𝙏𝙝𝙞𝙨 𝙞𝙨 𝙢𝙮 𝙜𝙧𝙤𝙪𝙣𝙙" 🔥pic.twitter.com/gKtmfoFvlN— Delhi Capitals (@DelhiCapitals) April 10, 2025 ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా!బ్యాట్‌తో గ్రౌండ్లో గీత గీసిన రాహుల్.. ఆ తర్వాత జెండా పాతుతున్నట్లుగా బ్యాట్‌తో మైదానంపై కొట్టి.. ‘‘ఇది నా హోం గ్రౌండ్’’ అంటూ సైగ చేశాడు. నిజానికి రాహుల్ వికెట్ తీసేందుకు ఆర్సీబీ ప్రయత్నించి విఫలమైన వేళ.. ఇతర బ్యాటర్లను పెవిలియన్‌కు పంపిన సమయంలో మాత్రం కోహ్లి వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు.Kohli is seen celebrating the wicket, glancing at KL Rahul.After the win Rahul stared at Kohli and said "This Is My Home Ground" 🔥Look at Kohli's Reaction 😭😭 pic.twitter.com/uJmO74Jck5— Radha (@Radha4565) April 11, 2025 పాపం కోహ్లి!ఇందుకు కౌంటర్‌గానే రాహుల్ తన క్లాసీ ఇన్నింగ్స్ తర్వాత కోహ్లికి, ఆర్సీబీ అభిమానులను ఉద్దేశించి ఈ రకంగా రియాక్షన్ ఇచ్చాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆర్సీబీపై ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన కేఎల్ రాహుల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.ఈ సందర్భంగా.. ‘‘ఇది నా సొంత మైదానం.. నా ఇల్లు.. నాకంటే ఈ పిచ్ గురించి ఇంకెవరికి బాగా తెలుసు?.. నేను ఎప్పుడు ఇక్కడ ఆడినా.. బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదిస్తాను’’ అని రాహుల్ పేర్కొన్నాడు. కాగా బెంగళూరుకు చెందిన రాహుల్ ఆరంభంలో ఆర్సీబీకి ఆడాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ను.. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో ఢిల్లీకి ఇది వరుసగా నాలుగో విజయం కాగా.. ఆర్సీబీ ఇప్పటికి ఐదింట మూడు గెలిచింది. ఈ సీజన్లో ఢిల్లీకి అక్షర్ పటేల్.. బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ నాయకత్వం వహిస్తున్నారు.ఐపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ👉టాస్: ఢిల్లీ.. తొలుత బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 163/7 (20)👉ఢిల్లీ స్కోరు: 169/4 (17.5)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఢిల్లీ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కేఎల్ రాహుల్ (53 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 93 రన్స్ నాటౌట్).చదవండి: RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్?!.. డీకేతో చర్చ.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది!POV: It's his home ground 😎🏡#TATAIPL | #RCBvDC | @klrahul | @DelhiCapitals pic.twitter.com/kV7utADWjU— IndianPremierLeague (@IPL) April 10, 2025 -
RCB Vs DC: రాహుల్ గెలిపించాడు
బెంగళూరు: ఐపీఎల్ 18వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అజేయ ప్రదర్శన కొనసాగుతోంది. ఓటమి లేకుండా సాగుతున్న జట్టు వరుసగా నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన పోరులో ఢిల్లీ 6 వికెట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును ఓడించింది. సొంత మైదానంలో ఆడిన రెండో మ్యాచ్‌లోనూ ఆర్సీబీకి పరాజయం ఎదురుకాగా... తన సొంత నగరంలో మ్యాచ్‌ను గెలిపించిన అనంతరం ‘ఇది నా అడ్డా’ అన్నట్లుగా రాహుల్ విజయనాదం చేయడం విశేషం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫిల్ సాల్ట్ (17 బంతుల్లో 37; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. అనంతరం ఢిల్లీ 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగిపోగా, ట్రిస్టన్ స్టబ్స్ (23 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 55 బంతుల్లో అభేద్యంగా 111 పరుగులు జోడించారు. ఒకే ఓవర్లో 30 పరుగులు... ఇన్నింగ్స్‌లో తొలి 22 బంతులు ఆర్సీబీ విధ్వంసంతో 61 పరుగులు... చివరి 12 బంతుల్లో అదే తరహా దూకుడుతో 36 పరుగులు... మధ్యలో మిగిలిన 86 బంతుల్లో ఢిల్లీ బౌలర్ల ఆధిపత్యం... పేలవ బ్యాటింగ్‌తో బెంగళూరు చేసిన పరుగులు 66 మాత్రమే... జట్టు ఇన్నింగ్స్ ఇలా భిన్న పార్శ్వాలలో సాగింది. తొలి ఓవర్లో స్టార్క్ 7 పరుగులే ఇవ్వగా, అక్షర్ వేసిన రెండో ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16 పరుగులు వచ్చాయి. అయితే అసలు విధ్వంసం మూడో ఓవర్లో సాగింది. స్టార్క్ బౌలింగ్‌లో సాల్ట్ ఊచకోత కోశాడు. అతను 2 సిక్స్‌లు, 3 ఫోర్లు బాదగా, ఎక్స్‌ట్రాల రూపంలో మరో 6 పరుగులు వచ్చాయి. సాల్ట్ వరుసగా 6, 4, 4, 4 (నోబాల్), 6తో చెలరేగిపోయాడు. అయితే తర్వాతి ఓవర్లో ఆట ఒక్కసారిగా మలుపు తిరిగింది. అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి వెనక్కి రాలేక సాల్ట్ రనౌటయ్యాడు. ఆ తర్వాత బెంగళూరు వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు పరుగులు రావడం గగనంగా మారింది. అయితే అక్షర్ వేసిన 19వ ఓవర్లో డేవిడ్ 2 సిక్స్‌లు, ఫోర్ బాదడంతో 17 పరుగులు రాగా, ముకేశ్ వేసిన చివరి ఓవర్లోనూ అతను 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టడంతో 19 పరుగులు వచ్చాయి. కీలక భాగస్వామ్యం... ఛేదనలో ఢిల్లీ ఆరంభంలో తడబడింది. డుప్లెసిస్ (2), ఫ్రేజర్ (7), పొరేల్ (7) విఫలం కాగా, అక్షర్ (15) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ సమయంలో చక్కటి బౌలింగ్‌తో ఆర్సీబీ పైచేయి సాధించినట్లు కనిపించింది. అయితే రాహుల్, స్టబ్స్ భాగస్వామ్యంలో జట్టు గెలుపు దిశగా దూసుకుపోయింది. పిచ్ ఇబ్బందికరంగా ఉండటంతో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత వీరిద్దరు దూకుడు ప్రదర్శించారు.చివర్లో 6 ఓవర్లలో 65 పరుగులు అవసరం కాగా...రాహుల్, స్టబ్స్ కలిసి 7 ఫోర్లు 4 సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించారు. హాజల్‌వుడ్ ఓవర్లో రాహుల్ 3 ఫోర్లు, సిక్స్‌తో 22 పరుగులు రాబట్టడం మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (రనౌట్) 37; కోహ్లి (సి) స్టార్క్ (బి) నిగమ్ 22; పడిక్కల్ (సి) అక్షర్ (బి) ముకేశ్ 1; పాటీదార్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 25; లివింగ్‌స్టోన్ (సి) అశుతోష్ (బి) మోహిత్ 4; జితేశ్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 3; కృనాల్ (సి) అశుతోష్ (బి) నిగమ్ 18; డేవిడ్ (నాటౌట్) 37; భువనేశ్వర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–61, 2–64, 3–74, 4–91, 5–102, 6–117, 7–125. బౌలింగ్: స్టార్క్ 3–0–35–0, అక్షర్ 4–0–52–0, నిగమ్ 4–0– 18–2, ముకేశ్ 3–1–26–1, కుల్దీప్ 4–0–17–2, మోహిత్ 2–0–10–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: డుప్లెసిస్ (సి) పాటీదార్ (బి) దయాళ్ 2; ఫ్రేజర్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 7; పొరేల్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 7; రాహుల్ (నాటౌట్) 93; అక్షర్ (సి) డేవిడ్ (బి) సుయాశ్ 15; స్టబ్స్ (నాటౌట్) 38; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (17.5 ఓవర్లలో 4 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–9, 2–10, 3–30, 4–58. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–26–2, దయాళ్ 3.5–0– 45–1, హాజల్‌వుడ్ 3–0–40–0, సుయాశ్ 4–0–25 –1, కృనాల్ 2–0–19–0, లివింగ్‌స్టోన్ 1–0–14–0. ఐపీఎల్లో నేడుచెన్నై X కోల్‌కతావేదిక: చెన్నై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
రాహుల్ క్లాసీ ఇన్నింగ్స్.. ఢిల్లీ చేతిలో ఆర్సీబీ చిత్తు
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 164 పరుగుల టార్గెట్‌ను ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో చేధించింది.ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 60 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీ రాహుల్ తన క్లాసీ నాక్‌తో విజయతీరాలకు చేర్చాడు. 53 బంతులు ఎదుర్కొన్న రాహుల్..7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 93 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.రాహుల్‌తో పాటు స్టబ్స్(38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్, స్టబ్స్ ఐదో వికెట్‌కు ఆజేయంగా 111 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఆర్సీబీ బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు పడగొట్టినప్పటికి, ఆ తర్వాత మాత్రం తేలిపోయారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు, యశ్‌దయాల్, సుయాష్ శర్మ తలా వికెట్ సాధించారు.డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్... ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఆర్సీబీ అద్బుతమైన ఆరంభం లభించినప్పటికి మిడిల్ ఓవర్లలో బ్యాటర్లు చేతులేత్తేశారు. ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(37) పరుగులతో మెరుపు ఆరంభం ఇవ్వగా..టిమ్ డేవిడ్(18 బంతుల్లో 32, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. వీరిద్దరితో పాటు పాటిదార్(25), కోహ్లి(22) పర్వాలేదన్పించారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!? -
కేఎల్ రాహుల్ సూపర్ ఫిప్టీ.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ విన్
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో విజయ్ శంకర్ 69 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఎంఎస్ ధోని(30 నాటౌట్) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, స్టార్క్ తలా వికెట్ సాధించారు. సీఎస్కేకు ఇది వరుసగా మూడో ఓటమి కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు వరుసగా మూడో విజయం కావడం గమనార్హం.రాహుల్ సూపర్ ఫిప్టీ.. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 51 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు. రాహుల్‌తో పాటు పోరెల్(33), స్టబ్స్(24), రిజ్వీ(21) రాణించారు. సీఎస్కే బౌలర్లలో ఖాలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, పతిరానా తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: ధోని ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్నాడా? ఫ్యామిలీ ఫోటోలు వైరల్ -
కేఎల్ రాహుల్ అరుదైన ఫీట్.. గంభీర్ రికార్డు సమం
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ అద్భుతైన ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీని రాహుల్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. ప్రత్యర్ధి బౌలర్లను ఆ ఆట ఆడేసి కున్నాడు. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడిన రాహుల్, ఆ తర్వాత తన క్లాసీ బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. పోరెల్, అక్షర్ పటేల్, రిజ్వీ, స్టబ్స్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలను కేఎల్ నెలకొల్పాడు. 51 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77 పరుగులు చేసి ఆఖరి ఓవర్లో ఔటయ్యాడు. కాగా కేఎల్ రాహుల్‌కు సీఎస్కేపై ఇది ఆరో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా రాహుల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో సీఎస్కేపై అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన నాలుగో ఆటగాడిగా గౌతం గంభీర్ రికార్డును రాహుల్ సమం చేశాడు. గంభీర్ తన కెరీర్లో ఆరు సార్లు ఏభై పైగా పరుగులు చేయగా.. రాహుల్ కూడా సరిగ్గా ఆరు సార్లే ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. ఇక రేర్ ఫీట్ సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. వార్నర్ తన కెరీర్లో 9 సార్లు సీఎస్కేపై 6 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు. ఈ లిస్ట్‌లో వార్నర్ తర్వాతి స్దానాల్లో విరాట్ కోహ్లి(9), శిఖర్ ధావన్(8), గంభీర్(6), రాహుల్(6) ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(77)తో పాటు పోరెల్(33), స్టబ్స్(24), రిజ్వీ(21) రాణించారు. సీఎస్కే బౌలర్లలో ఖాలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, పతిరానా తలా వికెట్ సాధించారు.చదవండి: రూ. 18 కోట్లు! .. ఒక్క మ్యాచ్‌లోనూ రాణించలేదు.. అందరి కళ్లు అతడి మీదే.. -
CSK vs DC: సీఎస్కేపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
IPL 2025 CSK vs DC Updates: ఐపీఎల్-2025లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అప్డేట్స్ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయంచెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో విజయ్ శంకర్ 69 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఎంఎస్ ధోని(30 నాటౌట్) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, స్టార్క్ తలా వికెట్ సాధించారు.ఓటమి దిశగా సీఎస్కే..17 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. సీఎస్కే విజయానికి 18 బంతుల్లో 67 పరుగులు కావాలి. క్రీజులో విజయ్ శంకర్(51), ధోని(13) ఉన్నారు.సీఎస్కే ఐదో వికెట్ డౌన్రవీంద్ర జడేజా రూపంలో సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన జడేజా.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజులో ధోని(4), విజయ్ శంకర్(26) ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్శివం దూబే (15 బంతుల్లో 18) రూపంలో చెన్నై నాలుగో వికెట్ కోల్పోయింది. విప్రాజ్ బౌలింగ్‌లో దబే స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 65/4 (9.2). జడేజా క్రీజులోకి వచ్చాడు. శంకర్ 17 పరుగులతో ఉన్నాడు. పవర్ ప్లేలో చెన్నై స్కోరు: 46/3 (6)దూబే 5, శంకర్ 11 రన్స్‌తో ఉన్నారు.మూడో వికెట్ కోల్పోయిన చెన్నై5.3: విప్రాజ్ నిగమ్ బౌలింగ్‌లో ఓపెనర్ డెవాన్ కాన్వే (13) అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో చెన్నై మూడో వికెట్ కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా శివం దూబే క్రీజులోకి వచ్చీ రాగానే ఫోర్ బాదాడు. విజయ్ శంకర్ 11 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 45/3 (5.4) రెండో వికెట్ కోల్పోయిన చెన్నై2.3: కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో మెగర్క్కు క్యాచ్ ఇచ్చి రుతు 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. విజయ్ శంకర్ క్రీజులోకి వచ్చాడు. కాన్వే 5 రన్స్‌తో ఉన్నాడు. స్కోరు: 20/2 (2.3)తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే1.5: ముకేశ్ కమార్ బౌలింగ్ రచిన్ రవీంద్ర బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా ఆరు బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం మూడు పరుగులు చేసి నిష్క్రమించాడు. రుతురాజ్ గైక్వాడ్ క్రీజులోకి రాగా కాన్వే ఐదు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 15-1(2)ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు.. ఢిల్లీ స్కోరెంతంటే?చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మెరుగైన స్కోరు సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అక్షర్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కాగా తొలి ఓవర్లోనే ఓపెనర్ మెగర్క్ డకౌట్‌గా వెనుదిరిగినప్పటికీ.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నాడు.Kamaal KL! 😎🏏KL Rahul brings up a sublime fifty as he leads the charge for #DC, eyeing a historic win at Chepauk, their first since 2010! Watch LIVE action ➡ https://t.co/4Kn2OwL1UW #IPLonJioStar 👉 #CSKvDC, LIVE NOW on Star Sports 2, Star Sports 2 Hindi & JioHotstar pic.twitter.com/bSx5mXAuoh— Star Sports (@StarSportsIndia) April 5, 2025వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (20 బంతుల్లో 33) ఆది నుంచే దంచికొట్టగా.. రాహుల్ మాత్రం తొలుత ఆచితూచి ఆడాడు. అనంతరం కాస్త స్పీడు పెంచిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆఖరి ఓవర్లో.. 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.మిగతా వాళ్లలో కెప్టెన్ అక్షర్ పటేల్ (14 బంతుల్లో 21) , సమీర్ రిజ్వీ (15 బంతుల్లో 21), ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (12 బంతుల్లో 24 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఇక సీఎస్కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, మతీషా పతిరణ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు19.2:పతిరణ బౌలింగ్‌లో రాహుల్ (77) వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ధోని మ్యాజిక్.. ఐదో వికెట్ డౌన్19.3: పతిరణ బౌలింగ్‌లో అశుతోశ్ శర్మ (1) రనౌట్ అయ్యాడు. స్టబ్స్‌తో కలిసి పరుగు పూర్తి చేసుకున్న అశుతోశ్‌ను.. వికెట్ల వెనుక వేగంగా కదిలిన ధోని అద్బుత రీతిలో రనౌట్ చేసి వెనక్కి పంపాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ16.1: ఖలీల్ అహ్మద్ మరోసారి అద్భుతం చేశాడు. తొలి ఓవర్లో మేగర్క్ రూపంలో కీలక వికెట్ తీసిన ఈ పేస్ బౌలర్.. తాజాగా సమీర్ రిజ్వీని వెనక్కి పంపాడు.అహ్మద్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిజ్వీ పెవిలియన్ చేరాడు. అతడి స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 148/4 (16.2)15 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 138/3 (15)కేఎల్ రాహుల్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో అతడికి ఇది 38వ ఫిఫ్టీ. మరోవైపు సమీర్ రిజ్వీ నిలకడగానే ఆడుతున్నాడు. పదిహేను ఓవర్లు ముగిసే సరికి రాహుల్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేయగా.. రిజ్వీ 13 బంతుల్లో 19 రన్స్ చేశాడు.10.4: మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీఅక్షర్ పటేల్ రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో అక్షర్ బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ 21 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. స్కోరు: 90/3 (10.4). సమీర్ రిజ్వీ క్రీజులోకి వచ్చాడు.10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ స్కోరు: 82/2 అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్నారు. పది ఓవర్లు ముగిసే సరికి అక్షర్ 12 బంతుల్లో 20, రాహుల్ 23 బంతుల్లో 29 రన్స్‌తో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ6.5: జోరు మీదున్న పోరెల్‌కు జడేజా చెక్ పెట్టాడు. జడ్డూ బౌలింగ్‌లో పతిరణకు క్యాచ్ ఇచ్చి అతడు 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అక్షర్ పటేల్ క్రీజులోకి రాగా.. రాహుల్ 21 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 54/2 (6.5) పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ స్కోరు: 51/1 (6)పోరెల్ 32, రాహుల్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.నాలుగు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 32/1రాహుల్ 8, పోరెల్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.రెండు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 20/1 (2) ముకేశ్ బౌలింగ్‌లో చితక్కొట్టిన అభిషేక్ పోరెల్. 0,4, 6, 4, 4, 1. రాహుల్ ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు.తొలి ఓవర్లో ఒక్క పరుగు.. ఒక వికెట్‌ఖలీల్ అహ్మద్ చెన్నై బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. తొలి నాలుగు బంతులను డాట్ చేసిన ఖలీల్... ఐదో బంతికి మెగర్క్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆఖరి బంతికి అభిషేక్ పోరెల్ ఒక పరుగు చేశాడు. ఢిల్లీ స్కోరు: 1-1 (1)రుతు సారథ్యంలోనేఈ మ్యాచ్‌కు చెన్నై రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దూరమయ్యాడని.. అతడి స్థానంలో మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని నాయకుడిగా వ్యవహరిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే, గాయం నుంచి కోలుకున్న రుతు మైదానంలో అడుగుపెట్టడం గమనార్హం.ఫాఫ్ లేడుమరోవైపు.. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్.. తొలుత బ్యాటింగ్ చేయనున్నట్లు తెలిపాడు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ వికెట్ స్లోగా మారే అవకాశం ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో కూడా తాము ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. దురదృష్టవశాత్తూ ఫాఫ్ డుప్లెసిస్ ఫిట్‌గా లేడని.. అందుకే అతడి స్థానంలో సమీర్ రిజ్వీ తుదిజట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు.తుదిజట్లుచెన్నైరచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముకేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్‌శివం దూబే, జేమీ ఓవర్టన్, షేక్ రషీద్, కమలేశ్ నాగర్‌కోటిఢిల్లీజేక్ ఫ్రేజర్-మెగర్క్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్‌ముకేశ్ కుమార్, కరుణ్ నాయర్, దర్శన్ నాల్కండే, డొనోవాన్ ఫెరీరా, త్రిపురాణ విజయ్ -
ఇంటికి చేరుకున్న అతియా శెట్టి.. కేఎల్ రాహుల్ వారసురాలికి ఘనస్వాగతం!
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ సతీమణి అతియా శెట్టి ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈనెల 24న పాప తమ జీవితంలోకి అడుగుపెట్టిందని సంతోషం వ్యక్తం చేసింది. ఆ తర్వాత పలువురు సినీతారలు, అభిమానులు అతియా శెట్టి దంపతులకు అభినందనలు తెలిపారు.అయితే తాజాగా అతియా శెట్టి తన బిడ్డతో కలిసి ఇంటికి చేరుకుంది. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న సందర్భంగా గ్రాండ్ వెల్కమ్ లభించింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. పూలు, కుంకుమతో తనకు స్వాగతం పలికి ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అతియా పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఫోటోలో 'ఓం' దేవుడి పేరును కూడా ప్రస్తావించింది.కాగా.. అతియాశెట్టి, కేఎల్ రాహుల్ గతేడాది నవంబర్ 2024న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాము మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. రెండు వారాల క్రితమే అతియా శెట్టి తన ప్రసూతి ఫోటోషూట్ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. అంతకుముందు కేఎల్, అతియా 2019లో డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో జనవరి 2023లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి సన్నిహితులు, బాలీవుడ్ సినీతారలు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సునీల్ శెట్టి ఖండాలా ఫామ్‌హౌస్‌లో గ్రాండ్ వెడ్డింగ్ వేడుక జరిగింది. -
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్
ఐపీఎల్-2025 సీజన్ తమ తొలి మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ రెండో మ్యాచ్‌లో మార్చి 30న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీ జట్టుకు అదిరిపోయే వార్త అందింది.తొలి మ్యాచ్‌కు వ్యక్తిగత కారణాల వల్ల దూరమైన స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్.. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఆడనున్నాడు. రాహుల్ ఇప్పటికే ఢిల్లీ జట్టుతో కలిశాడు. కాగా ఇటీవలే రాహుల్ భార్య అతియా శెట్టి తొలి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు రాహుల్ దూరమయ్యాడు.రాహుల్ లేనిప్పటికి ఢిల్లీ బ్యాటర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ చేధించింది. ఇప్పుడు రాహుల్ కూడా అందుబాటులోకి రావడంతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారనుంది.ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.14 కోట్ల భారీ ధరకు రాహుల్‌ను ఢిల్లీ కొనుగోలు చేసింది. రాహుల్ గత మూడు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్‌కు సారథ్యం వహించాడు. అయితే ఫ్రాంచైజీ యాజమాన్యంతో విభేదాల వల్ల రాహుల్ బయటకు వచ్చేశాడు. ఈ క్రమంలో ఢిల్లీ గూటికి రాహుల్ చేరాడు. రాహుల్ తన ఐపీఎల్ కెరీర్లో 132 మ్యాచ్‌లు ఆడి 4683 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు ఉన్నాయి.లక్నో సూపర్ జెయింట్స్ జట్టుఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, మణిమారన్ సిద్ధార్థ్ బెంచ్: అబ్దుల్ సింగ్, సమద్, అక్గర్రాజ్, హిమ్మత్ కులకర్ణి, షమర్ జోసెఫ్, అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, మాథ్యూ బ్రీట్జ్కే, ఆర్యన్ జుయల్, యువరాజ్ చౌదరి, మయాంక్ యాదవ్ -
IPL 2025: పంత్‌కు లక్నో ఓనర్ క్లాస్..? రాహుల్ ఉదంతాన్ని గుర్తు చేసిన సీన్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మార్చి 24) జరిగిన రసవత్తర మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ షాకింగ్ ఓటమికి గురైంది. ఈ మ్యాచ్‌లో లక్నో గెలుపుకు సువర్ణావకాశాలు లభించినా ఒడిసి పట్టుకోలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేస్తూ అతి భారీ స్కోర్ చేసే అవకాశం (14 ఓవర్లలోనే 161 పరుగులు) వచ్చినా 209 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఛేదనలో 113 పరుగులకే 6 వికెట్లు తీసినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. ఆశుతోష్ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), విప్రాజ్ నిగమ్ (15 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఢిల్లీని గెలిపించారు.ఈ మ్యాచ్‌లో లక్నో ఓటమికి కెప్టెన్ పంత్ ప్రధాన కారకుడయ్యాడు. తొలుత బ్యాటింగ్‌లో 6 బంతులాడి డకౌట్ అయిన పంత్.. ఆతర్వాత ఛేదనలో అత్యంత కీలక సమయంలో స్టంపింగ్ మిస్ చేసి ఢిల్లీకి మ్యాచ్‌ను వదిలేశాడు. 9 వికెట్లు కోల్పోయిన ఢిల్లీకి చివరి ఓవర్లో గెలుపుకు 6 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి పంత్ మొహిత్ శర్మను స్టంపౌట్ చేసే సువర్ణావకాశాన్ని జారవిడిచాడు. ఆతర్వాతి బంతికి సింగిల్ తీసిన మోహిత్ అశుతోష్‌కు స్ట్రయిక్ ఇచ్చాడు. అప్పటికే జోష్‌లో ఉండిన అశుతోష్ మూడో బంతిని సిక్సర్‌గా మలిచి ఢిల్లీకి అపురూప విజయాన్నందించాడు.Bro ! Pant you lost the match here ! Misses the match stumping ! #LSGvsDC #IPL2025 #RishabhPant #starc #NupurSharma #kunalkamra #HarbhajanSingh #NicholasPooran #asutosh pic.twitter.com/BjzoJN0mQM— fart cat 🐱 smokimg🚬 (@gajendra87pal) March 24, 2025మ్యాచ్ అనంతరం లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా కెప్టెన్ పంత్ ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు కనిపించాడు. గొయెంకా-పంత్ వాడి వేడిగా చర్చిస్తున్నట్లు కనిపించే దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. వారి మధ్య సంభాషణ గతేడాది కేఎల్ రాహుల్ ఉదంతాన్ని గుర్తు చేసింది. గత సీజన్లో ఎస్ఆర్హెచ్ చేతిలో ఓటమి అనంతరం గొయెంకా నాటి కెప్టెన్ రాహుల్‌ను దుర్భాషలాడినట్లు ప్రచారం జరిగింది. తాజా ఓటమి తర్వాత గొయెంకా పంత్‌పై కూడా అదే రేంజ్లో ఫైరయ్యాడని టాక్ నడుస్తుంది. ఈ ఘటన కారణంగానే రాహుల్ లక్నోను వీడాడన్నది కాదనలేని సత్యం. ఈ విషయంపై రాహుల్ ఎక్కడా నోరు విప్పకపోయినా ఆ సీన్ చూసిన జనాలకు విషయం ఇట్టే అర్దమవుతుంది. Once a toxic Manager always a toxic Manager #DCvLSGRishabh Pant #KLRahul Sanjiv Goenka pic.twitter.com/MmFZ4MlCRq— Ex Bhakt (@exbhakt_) March 24, 2025రాహుల్‌ను కాదనుకునే పంత్‌ను తెచ్చిపెట్టుకున్న గొయెంకా ఇప్పుడు అతనితోనూ అలాగే ప్రవర్తిస్తున్నట్లున్నాడు. ఇదే రిపీటైతే పంత్ కూడా వచ్చే సీజన్లో లక్నోకు టాటా చెప్పడం ఖాయం. కాగా, పంత్‌ను గొయెంకా ఈ సీజన్ మెగా వేలంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర (రూ. 27 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకున్నాడు. పంత్ గత సీజన్ వరకు ఢిల్లీకి ఆడాడు. ఢిల్లీతో ఉన్న అనుబంధం ఇంకా తగ్గలేదో ఏమో మరి, ఈ మ్యాచ్‌లో పంత్ తన స్థాయి మేరకు రాణించలేకపోయాడు. ఇదే కొనసాగితే పంత్ మహా కోపిష్టి అయిన గొయెంకా చేతిలో మున్ముందైనా అవమానాలకు గురి కావల్సి ఉంటుంది. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ను వైజాగ్‌లో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ మార్చి 30న మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. -
విశాఖలో ఐపీఎల్ మ్యాచ్.. అభిమానుల సందడే సందడి (ఫొటోలు)
-
రాహుల్ తండ్రయ్యాడు...
కేఎల్ రాహుల్ ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ ఢిల్లీ తరఫున తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. వ్యక్తిగత కారణాలతో మ్యాచ్‌కు దూరమైనట్లు ముందుగా ఫ్రాంచైజీ ప్రకటించింది. మ్యాచ్ సాగుతున్న సమయంలో రాహుల్ శుభవార్త ట్వీట్ చేశాడు. తమకు అమ్మాయి పుట్టినట్లు రాహుల్, అతియా శెట్టి ప్రకటించారు. 2023 జనవరిలో వీరిద్దరి పెళ్లి జరిగింది. -
తండ్రైన కేఎల్ రాహుల్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అతియా శెట్టి
బాలీవుడ్ భామ అతియా శెట్టి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు పాప పుట్టారని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రి అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ స్టార్ జంటకు అభినందనలు చెబుతున్నారు. పలువురు సినీతారలు సైతం కంగ్రాట్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. గతంలోనే అతియాశెట్టి గర్భంతో ఉన్నట్లు రాహుల్ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ఏడాదిలోనే మా ఇంటికి అందమైన ఆశీర్వాదం రాబోతుందని పోస్ట్ చేశారు.కాగా.. అతియా శెట్టి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. అతియా శెట్టి చివరిసారిగా 2019లో వచ్చిన చిత్రం 'మోతీచూర్ చక్నాచూర్'లో కనిపించింది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఆమె మొదట 2015లో 'హీరో' మూవీ ద్వారా సూరజ్ పంచోలి సరసన బాలీవుడ్లో అడుగుపెట్టింది. అర్జున్ కపూర్ నటించిన 'ముబారకన్' సినిమాలో అతియా కీలక పాత్ర పోషించింది.కేఎల్, అతియా శెట్టి ప్రేమ వివాహంఅయితే కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. కేఎల్ రాహుల్, అతియా శెట్టిల వివాహం 2023, జనవరి 23న ముంబయిలోని ఫామ్‌హౌస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో బాలీవుడ్ సినీతారలు, పలువురు క్రికెటర్ల సందడి చేశారు. View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) -
ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి ఉండదు: ‘లక్నో’పై నెటిజన్లు ఫైర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ ఇంకొకటి ఉండదంటూ క్రికెట్ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు పెట్టి కొనుకున్నాం కాబట్టి.. ఆటగాళ్ల భావోద్వేగాలతో ఆడుకోవచ్చనే సంస్కృతికి వీడ్కోలు పలకాలని హితవు పలుకుతున్నారు.భారీ ధరకు కొనుగోలుఅసలేం జరిగిందంటే.. ఐపీఎల్ మెగా వేలం-2025లో లక్నో యాజమాన్యం సౌతాఫ్రికా హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ (David Miller)ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన ఈ విధ్వంసకర వీరుడు ఆక్షన్‌లోకి రాగా.. రూ. 7.5 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది.ఇక మార్చి 22న ఐపీఎల్ తాజా ఎడిషన్ ఆరంభం కానుండగా.. మార్చి 24న లక్నో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరుజట్లు విశాఖకు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే.. లక్నో ఫ్రాంఛైజీ డేవిడ్ మిల్లర్‌తో ఓ ఇంటర్వ్యూయర్ జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇందులో ఓ వ్యక్తి.. మీ కెరీర్లో బిగ్గర్ హార్ట్‌బ్రేక్ ఏది? అంటూ మిల్లర్‌ను ప్రశ్నించాడు. బిగ్గర్ హార్ట్‌బ్రేక్ ఏది? నవ్వుతూ ప్రశ్నలుఇందులో.. ‘‘గుజరాత్ టైటాన్స్ తరఫున 2023 ఫైనల్లో ఓటమి.. 2014లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ ఓటమి.. లేదంటే.. వరల్డ్‌కప్-2019, 2021లలో సౌతాఫ్రికా గ్రూప్ దశలోనే నిష్క్రమించడం.. లేదా టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో ఓటమి.. అదీ కాదంటే వన్డే వరల్డ్‌కప్-2023 సెమీస్‌లో ఓటమి.. లేదంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. వీటిల్లో మీ హృదయాన్ని ముక్కలు చేసిన సంఘటన ఏది?’’ అంటూ బోలెడన్ని ఆప్షన్లు కూడా ఇచ్చాడు.అంతేకాదు.. సదరు వ్యక్తి నవ్వుతూ ఈ ప్రశ్నలు అడగటం గమనార్హం. ఇందుకు మిల్లర్ బాధగా, దిగాలుగా ముఖం పెట్టుకుని సమాధానాలు ఇచ్చాడు. అయితే, ఇంటర్వ్యూయర్ మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లక్నో.. ‘ఇకపై మిల్లర్‌కు ఇలాంటి బాధలు ఉండవు’ అంటూ తాము ఈసారి టైటిల్ గెలవబోతున్నట్లు క్యాప్షన్ ఇచ్చింది.ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి లేదుమిలియన్కు పైగా వ్యూస్ సాధించిన ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘ఇది వినోదం కాదు.. ఓ ఆటగాడిని మానసికంగా వేధించడం లాంటిది. ఓటములను గుర్తుచేస్తూ అతడి మనసును మరింత బాధపెట్టడం సరికాదు. వీడియోలు సృజనాత్మకంగా ఉండాలి గానీ.. ఇలా ఆటగాడి మనసును నొప్పించేలా ఉండకూడదు.డబ్బులు పెట్టి కొన్నారు కాబట్టి ఆటగాళ్లంతా తాము చెప్పినట్లు నడచుకోవాలనే లక్నో యాజమాన్యం అహంభావ వైఖరికి ఇది నిదర్శనం. గత సీజన్లో కేఎల్ రాహుల్‌ను అవమానించిన తీరును మేము ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఐపీఎల్లో ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి లేదు’’ అంటూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.రాహుల్ పట్ల అదే తీరుకాగా గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా.. అప్పటి తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై మైదానంలోనే అరిచేశాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు విస్తృతంగా వైరల్ కాగా.. గోయెంకాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.ఇక ఈ పరిణామాల నేపథ్యంలో కేఎల్ రాహుల్ లక్నోను వీడి వేలంలోకి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. మరోవైపు.. మరో టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు కొన్న లక్నో.. కెప్టెన్‌గా అతడికి పగ్గాలు అప్పగించింది. చదవండి: నమ్మశక్యం కాని ఇన్నింగ్స్.. అతడి బ్యాటింగ్ అద్భుతం: కివీస్ కెప్టెన్Manifesting zero heartbreaks for Miller bhai this season 🤞 pic.twitter.com/4zd5FbtblW— Lucknow Super Giants (@LucknowIPL) March 20, 2025 -
IPL 2025: రాహుల్ రానట్టేనా?
విశాఖ స్పోర్ట్స్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో తమ తొలి మ్యాచ్ ఆడేందుకు లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ) జట్టు విశాఖపట్నం చేరుకుంది. శుక్రవారం ప్రత్యేక విమానంలో లక్నో నుంచి జట్టు విశాఖకు వచ్చింది. వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 24వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఎల్ఎస్జీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్ విశాఖ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఈసారి ఎల్ఎస్జీ జట్టు కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్ ప్రారంభించగా, ఎల్ఎస్జీ జట్టు శనివారం ప్రాక్టీస్ చేయనుంది. ఎల్ఎస్జీ జట్టుకు మెంటర్‌గా జహీర్ ఖాన్, హెడ్ కోచ్‌గా లాంగర్, సహాయ కోచ్‌లుగా జాంటీ రోడ్స్, ప్రవీణ్ తంబే, లాన్స్ క్లుసెనర్ వంటి వారు ఉన్నారు. జట్టులో వికెట్ కీపర్లుగా ఆర్యన్, నికోలస్ అందుబాటులో ఉన్నారు. ఆల్రౌండర్లుగా మార్క్రమ్, మార్ష్, షాబాజ్ ఉండగా, బ్యాటింగ్‌లో ఆయుష్, డేవిడ్ మిల్లర్, సమద్ తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్‌లో రవి బిష్ణోయ్, ఆవేష్, ఆకాష్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా సిద్ధార్థ్ లేదా అర్షిన్ ఆడే అవకాశం ఉంది. అయితే మయాంక్, మోషిన్, ఆవేష్ గాయా ల కారణంగా జట్టుకు అందుబాటులో ఉండటంపై సందేహాలు ఉన్నాయి. ప్రాక్టీస్ సెషన్ తర్వాత బౌలింగ్ విభాగంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరు జట్లు గ్రూప్–2లో ఉన్నాయి. గత సీజన్లో ఇరు జట్లు కూడా లీగ్ దశలోనే నిష్క్రమించాయి.రాహుల్ రానట్టేనా?కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు కె.ఎల్.రాహుల్ ఇంకా విశాఖ చేరుకోలేదు. దీంతో ఆయన విశాఖలో జరిగే రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం అనుమానమే.! దీంతో ఎల్ఎస్జీతో జరిగే తొలి మ్యాచ్‌లో ఢిల్లీ తరపున ఫెరీరా వికెట్ కీపర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. గత సీజన్లో రాహుల్ లక్నో జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. -
కొత్త వ్యూహంతో.. అక్షర్‌పై ఆశలతో ఢిల్లీ క్యాపిటల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయిన అతి కొద్ది జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఒకటి. గత సీజన్లో వరుసగా పరాజయ పరంపరతో ప్రారంభించి మొదటి అయిదు మ్యాచ్ లలో నాలుగింటిలో ఓటమి చవిచూసి.. చివరికి ఆరో స్థానంతో ముగించింది ఢిల్లీ. అయితే, ఈసారి జట్టు స్వరూపాన్నే మార్చేసింది. గత సీజన్ కెప్టెన్ భారత్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant)ను రికార్డు స్థాయిలో రూ 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కనుగోలు చేసిన తర్వాత కొత్త వ్యూహానికి తెరతీసింది.అనుభవజ్ఞుడైన భారత్ వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ (KL Rahul), దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ వంటి సీనియర్లను కొనుగోలు చేసింది. కానీ గతంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌కి కెప్టెన్ గా వ్యవహరించిన కెఎల్ రాహుల్ ఢిల్లీ పగ్గాలు చేపట్టేందుకు అంత ఆసక్తి చూపించకపోవడంతో ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో రాణించిన మరో యువ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్‌లోనూ మార్పులుఢిల్లీ బ్యాక్‌రూమ్ సిబ్బందిలో కూడా మార్పులు చేశారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్థానంలో భారత్ మాజీ ఆల్ రౌండర్ హేమాంగ్ బదానీని ప్రధాన కోచ్‌గా నియమించారు. భారత మాజీ బ్యాటర్ విశాఖపట్నంకి చెందిన వై వేణుగోపాలరావు కొత్త క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌ను మెంటార్‌గా, మాథ్యూ మోట్‌ను అసిస్టెంట్ కోచ్‌గా, మునాఫ్ పటేల్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించారు.సీనియర్లకు మళ్ళీ జట్టులో చోటుఅయితే ఢిల్లీ జట్టులో చాలా మంది గత సీజన్ ఆటగాళ్లు మళ్లీ జట్టు లో కొనసాగుతున్నారు. గత సీజన్ లో ప్రాతినిధ్యం వహించిన అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్లను రెటైన్ చేసారు. వేలంలో ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్‌ను తిరిగి కొనుగోలు చేశారు. పేసర్ ముఖేష్ కుమార్ కూడా గత సీజన్ లో ఢిల్లీ తరపున ఆడాడు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించిన కరుణ్ నాయర్ కూడా గతంలో ఈ ఫ్రాంచైజీ తరపున ఆడారు.గత సీజన్లో తమ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌తో ఢిల్లీ సమస్యలను ఎదుర్కొంది. ఈ కారణంగా బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేశారు. ఆస్ట్రేలియా కి చెందిన సీనియర్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ (రూ 11.75 కోట్లు), టి నటరాజన్ (రూ 10.75 కోట్లు), ముఖేష్ కుమార్ (రూ 8 కోట్లు) , మోహిత్ శర్మ (రూ 2.20 కోట్లు)లను తీసుకువచ్చారు. ఇక స్పిన్ విభాగం లో కుల్దీప్ మరియు అక్షర్ పటేల్ ఉన్నారు.ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ జట్టు నుంచి తప్పుకోవడం ఢిల్లీ క్యాపిటల్స్ ని కొంత దెబ్బతీసింది. అయితే ఢిల్లీ కొత్త జట్టు కొత్త కెప్టెన్, కొత్త వ్యూహం తో ఈసారి రంగ ప్రవేశం చేస్తోంది. అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 24 (సోమవారం)న విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-విడిసిఏ క్రికెట్ స్టేడియంలో రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్ తో తమ ఐపీఎల్ 2025 సీజన్‌ని ప్రారంభిస్తుంది. విశాఖపట్నం ని తన రెండో హోమ్ గ్రౌండ్ గా ఎంచుకున్న ఢిల్లీ తన మొదటి రెండు హోమ్ మ్యాచ్‌లను ఇక్కడే ఆడుతుంది.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లో ప్రధాన ఆటగాళ్ళుజేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ఆస్ట్రేలియా కి చెందిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ 2023 నుండి టీ20లలో పవర్‌ప్లేలో అత్యధిక స్ట్రైక్ రేట్ (168.04) ఉన్న బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (184.8), అభిషేక్ శర్మ (181.47) ల తర్వాత మూడో స్థానం లో ఉన్నాడు. 21 ఏళ్ల ఈ యువ బ్యాటర్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 234.04 స్ట్రైక్ రేట్‌తో 330 పరుగులు సాధించాడు. ఈ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అతడిని కొనుగోలు చేసింది.కెఎల్ రాహుల్మాజీ లక్నౌ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఇటీవల ఛాంపియన్ ట్రోఫీ లో తన అసాధారణ ప్రతిభతో భారత్ జట్టుకి విజయాలు చేకూర్చి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సీజన్లో రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఓపెనింగ్ చేయనున్నాడు. ఐపీఎల్ లో బాగా నిలకడ రాణిస్తున్న బ్యాటర్లలో ఒకడిగా పేరు పొందిన రాహుల్ 132 మ్యాచ్‌లు ఆడి 135 స్ట్రైక్ రేట్‌తో 37 అర్ధ సెంచరీలు, నాలుగు సెంచరీలతో 4,683 పరుగులు సాధించాడు.ఫాఫ్ డు ప్లెసిస్అపార అనుభవం ఉన్న ఈ దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ఈ సీజన్ లో ఓపెనర్ గాను, ఢిల్లీ క్యాపిటల్స్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఫాఫ్ 145 ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆడాడు. 140 స్ట్రైక్ రేట్‌తో 37 అర్ధ సెంచరీ లతో 4571 పరుగులు చేశాడు.కరుణ్ నాయర్దేశవాళీ క్రికెట్ లో సెంచరీలతో రికార్డుల మోత మోగించిన కరుణ్ నాయర్ మళ్ళీ ఐపీఎల్ లో ఢిల్లీ తరపున రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విదర్భ రంజీ ట్రోఫీ విజయంలో కరుణ్ నాయర్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్స్‌లో 120 , 80 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 700 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. 76 ఐపీఎల్ మ్యాచ్‌లతో, దాదాపు 130 స్ట్రైక్ రేట్‌తో 10 అర్ధ సెంచరీలతో 1,496 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్లో అతని స్థిరత్వం ఢిల్లీ కి కీలకం.అక్షర్ పటేల్కొత్త కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన అక్షర్ పటేల్ తన జట్టును ఫైనల్స్‌కు తీసుకెళ్లాలని పట్టుదలతో ఉన్నాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ తరపున బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ రాణించిన అక్షర్ పటేల్ కి కెప్టెన్ గా పెద్ద అనుభవం లేదు. అయితే తన నైపుణ్యంతో రాణించగల సామర్థ్యముంది. అక్షర్ ఇంతవరకు 150 ఐపీఎల్ మ్యాచ్‌లలో, 130 స్ట్రైక్ రేట్‌తో మూడు అర్ధ సెంచరీలతో 1,653 పరుగులు చేశాడు. 8 కంటే తక్కువ ఎకానమీతో 123 వికెట్లతో సాధించిన అక్షర్ జట్టుకు సరైన సమతుల్యతను ఇస్తాడనడంలో సందేహం లేదు.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకెఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, ట్రిస్టియన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, మిచెల్ స్టార్క్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, ఫాఫ్ డుప్లెసిస్, ముఖేష్ కుమార్, దర్శన్ నల్కాండే, విప్ రాజ్ నిగమ్, దుష్మంత చమీరా, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ. -
IPL 2025: మరోసారి తన బ్యాటింగ్ స్థానాన్ని త్యాగం చేయనున్న కేఎల్ రాహుల్..?
జట్టు ప్రయోజనాల కోసం కేఎల్ రాహుల్ మరోసారి తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా, మూడో నంబర్ ఆటగాడిగా, 4, 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ చేసిన రాహుల్.. ఐపీఎల్-2025లో తన కొత్త జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కోసం నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఐపీఎల్లో ఓపెనర్‌గా మంచి సక్సెస్ సాధించిన రాహుల్.. జట్టు అవసరాల దృష్ట్యా ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయనున్నాడు. రాహుల్ మిడిలార్డర్ బ్యాటింగ్‌కు వస్తాడన్న విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ సూచనప్రాయంగా వెల్లడించింది. జట్టు ఏదైనా ప్రయోజనాలే ముఖ్యమనుకునే రాహుల్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీని సైతం వద్దనుకున్నాడు. సాధారణ ఆటగాడిగా కొనగేందుకే ఇష్టపడ్డాడు. రాహుల్ కాదనుకుంటే అక్షర్ పటేల్‌ను ఢిల్లీ కెప్టెన్సీ వరిచింది. అక్షర్ జూనియర్ అయినా అతని అండర్లో ఆడేందుకు రాహుల్ సుముఖత వ్యక్తం చేశాడు.గత మూడు సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ వద్దనుకుంటే ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అక్కును చేర్చుకుంది. రాహుల్‌ను డీసీ మేనేజ్మెంట్ రూ. 14 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సీజన్ మెగా వేలంలో తన సహచరులంతా (శ్రేయస్, పంత్) భారీ మొత్తాలు దక్కించుకున్నా రాహుల్ ఏ మాత్రం బాధపడటం లేదు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమంటున్నాడు.రాహుల్ మిడిలార్డర్లో వస్తే జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఫాఫ్ డుప్లెసిస్ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేస్తారు. అభిషేక్ పోరెల్ లేదా కరుణ్ నాయర్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతారు. రాహుల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగితే అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ ఆతర్వాతి స్థానాల్లో వస్తారు. ఢిల్లీ ఈ సీజన్లో హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటి. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. బ్యాటింగ్‌లో అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్.. బౌలింగ్‌లో దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి. నటరాజన్, మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్‌లతో ఆ జట్టు అత్యంత బలీయంగా కనిపిస్తుంది. ఈ జట్టును చూసి ఇప్పటికే చాలా మంది విశ్లేషకులు ఈ సీజన్లో ఢిల్లీ టైటిల్ సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. మరి కొత్త సారథి అక్షర్ పటేల్ అండర్లో ఢిల్లీ తమ తొలి టైటిల్ గెలుస్తుందేమో చూడాలి. ఈ సీజన్లో ఢిల్లీ మే 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌తో తమ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. ఈ మ్యాచ్ వైజాగ్‌లో జరుగనుంది. ఈ సీజన్ మార్చి 22న కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌తో మొదలవుతుంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ జట్టు..అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి. నటరాజన్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, త్రిపురణ విజయ్ -
కంగ్రాట్స్ బాపు.. నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది: రాహుల్
ఐపీఎల్-2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్‌గా నియమించింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత కేఎల్ రాహల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని భావించింది.కానీ అందుకు రాహుల్ సుముఖత చూపకపోవడంతో అక్షర్‌కు తమ జట్టు పగ్గాలను ఢిల్లీ యాజమాన్యం అప్పగించింది. ఐపీఎల్‌లలో అక్షర్ పటేల్ ఓ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండడం ఇదే తొలిసారి. కాగా అక్షర్ 2019 నుంచి డీసీ జట్టుతో కొనసాగుతున్నాడు.ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రూ. 16.50 కోట్ల భారీ ధర వెచ్చించి అక్షర్‌ను ఢిల్లీ రిటైన్ చేసుకుంది. అదేవిధంగా అక్షర్ పటేల్ ప్రస్తుతం భారత జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. టీ20ల్లో అతడికి బీసీసీఐ సెలక్టర్లు వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు.ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అక్షర్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. భారత్ టైటిల్ కైవసం చేసుకోవడంలో అక్షర్ది కీలక పాత్ర. . టీమిండియా తరఫున అక్షర్ పటేల్ 71 టీ20 మ్యాచ్‌లు ఆడిన అక్షర్ పటేల్ 535 పరుగులతో పాటు, 71 వికెట్లు కూడా తీసుకున్నాడు. 150 ఐపీఎల్ మ్యాచ్‌లలో 1653 పరుగులు చేసి 123 వికెట్లు తీసుకున్నాడు.రాహుల్ విషెస్..ఇక కెప్టెన్‌గా ఎంపికైన అక్షర్ పటేల్‌కు తన సహచర ఆటగాడు కేఎల్ రాహుల్‌కు అభినందనలు తెలిపాడు. "కంగ్రాట్స్ బాపు(అక్షర్ పటేల్). ఈ సరికొత్త ప్రయాణంలో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నా వంతు సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది" అని రాహుల్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.కాగా రాహుల్ గత మూడు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్‌కు నాయకత్వం వహించాడు. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రాహుల్‌ను లక్నో ఫ్రాంచైజీ విడుదల చేసింది. అతడి స్ధానంలో డైనమిక్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసి లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టు కెప్టెన్సీ అప్పగించింది.చదవండి: స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. చిన్నారి మృతి -
KL Rahul: టాపార్డర్‌లో ఆడటమే ఇష్టం
న్యూఢిల్లీ: టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడమే సౌకర్యవంతంగా ఉంటుందని భారత సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. టీమిండియా తరఫున ఇటీవలి కాలంలో మిడిలార్డర్లో బరిలోకి దిగుతున్న రాహుల్... చాంపియన్స్ ట్రోఫీలో వికెట్ కీపింగ్‌తో పాటు ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఆకట్టుకున్నాడు. వన్డేల్లో నయా ఫినిషర్‌గా సేవలందిస్తున్న రాహుల్... చాంపియన్స్ ట్రోఫీలో 174 పరుగులు చేసి టీమిండియా మూడోసారి టైటిల్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. భారత జట్టు తరఫున ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే రాహుల్... చాంపియన్స్ ట్రోఫీలో అక్షర్ పటేల్ తర్వాత ఆరో ప్లేస్‌లో క్రీజులోకి అడుగుపెట్టి తన క్లాసిక్ గేమ్‌తో ఆకట్టుకున్నాడు. కాగా, మరో వారం రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కానున్న నేపథ్యంలో రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి టాపార్డర్‌లోనే ఆడుతున్నా. 11 ఏళ్ల వయసులో మంగళూరులో తొలి మ్యాచ్ నుంచి టీమిండియాకు ఎంపికయ్యే వరకు దాదాపు ‘టాప్’లోనే బ్యాటింగ్ చేశా. అదే నాకు సౌకర్యవంతంగా ఉంటుంది. క్రికెట్ జట్టు క్రీడ. టీమ్ అవసరాలకు తగ్గట్లు ఆడాల్సి ఉంటుంది. జట్టు ఏం కోరుకుంటుందో అది అందివ్వడం ఆటగాడిగా నా బాధ్యత. కెరీర్ ఆరంభం నుంచే అదే కొనసాగిస్తున్నా’ అని రాహుల్ అన్నాడు. పలు అంశాలపై రాహుల్ మనోగతం అతడి మాటల్లోనే... » ఐపీఎల్లో భాగంగా గతంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు సారథిగా వ్యవహరించాను. ఈసారి వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది. అయితే గతంలో కెప్టెన్‌గా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి కేవలం ఆటగాడిగానే కొనసాగాలని అనుకుంటున్నాను. » ఐపీఎల్ వేలం చాలా అంశాలతో ముడిపడి ఉంటుంది. గత మూడు సీజన్లలో సారథిగా జట్టును నడిపించా. అదే సమయంలో కోర్ టీమ్‌ను తయారు చేసుకోవడంపై కూడా దృష్టి పెట్టా. దీంతో ఎంతో ఒత్తిడి ఉండేది. వేలం అంటే ఆటగాడి కెరీర్‌కు సంబంధించింది. అదే సమయంలో ఫ్రాంచైజీలు వేరే విధంగా ఆలోచిస్తాయి. ఆటగాడి భవితవ్యం వేలంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఒత్తిడి తప్పదు. » ఐపీఎల్ వేలం సమయంలో నేను కూడా ఒత్తిడికి గురయ్యాను. అయితే ఈసారి కేవలం ఆటగాడిగానే ఆడాలనుకుంటున్నాను. కెరీర్లో ఇదే సరైన నిర్ణయం అనుకుంటున్నా. చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా. » ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగం కావడం ఆనందంగా ఉంది. ఫ్రాంచైజీ సహ యజమాని పార్థ్ జిందాల్‌తో మంచి స్నేహం ఉంది. ఆట గురించే కాకుండా అనేక విషయాలపై మేము సుదీర్ఘంగా చర్చించుకుంటాం. క్రికెట్‌పై అమితాసక్తితో పాటు చక్కటి అవగాహన ఉంది. మంచి జట్టు అందుబాటులో ఉంది. కొత్త ఫ్రాంచైజీతో కలిసి ప్రయాణించేందుకు ఆసక్తిగా చూస్తున్నా. » కొత్త జట్టులో అడుగుపెట్టినప్పుడు ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టడం సహజం. ప్రస్తుతం నా పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, స్టార్క్ వంటి ఆటగాళ్లతో చక్కటి అనుబంధం ఉంది. వారితో కలిసి టీమ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తా. జట్టులో అటు అనుభవజు్ఞలు, ఇటు యువ ఆటగాళ్లు మెండుగా ఉన్నారు. ఇలాంటి ప్రతిభావంతులతో కలిసి ఆడేందుకు ఉత్సుకతతో ఉన్నాను. » సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉంటేనే సుదీర్ఘకాలం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగవచ్చు. కెరీర్లో ఎన్నో ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. వాటన్నింటిని అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నా. వెనక్కి తిరిగి చూసుకుంటే వాటన్నింటికంటే ఈ ప్రయాణమే అద్భుతంగా అనిపిస్తోంది. ఇక భవిష్యత్తుపై దృష్టి పెట్టా. ఇప్పటి వరకు నేర్చుకున్న దానిని ప్రణాళికాబద్ధంగా అమలు పరచడంపై దృష్టి పెడతా. జట్టుకు వీలైనన్ని ఎక్కువ విజయాలు సాధించిపెట్టడమే నా లక్ష్యం. -
CT 2025: కేఎల్ రాహుల్, శ్రేయస్‌లకు దక్కని చోటు.. కెప్టెన్‌గా అతడు!
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ ఆథర్టన్ తన.. ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ప్రకటించాడు. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురికి మాత్రమే స్థానమిచ్చిన అతడు.. కేఎల్ రాహుల్‌ను విస్మరించాడు. అంతేకాదు శ్రేయస్ అయ్యర్‌ను కూడా పక్కనపెట్టాడు.ఇక ఓపెనింగ్ జోడీగా అఫ్గనిస్తాన్ యువ స్టార్ ఇబ్రహీం జద్రాన్(Ibrahim Zadran), న్యూజిలాండ్ యంగ్‌స్టర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra)లను మైఖేల్ ఆథర్టన్ ఎంచుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ ఇంగ్లిస్‌ను ఎంపిక చేసుకున్న ఈ మాజీ సారథి.. కెప్టెన్‌గా కివీస్ నాయకుడు మిచెల్ సాంట్నర్‌కు స్థానమిచ్చాడు.అత్యుత్తమ ఇన్నింగ్స్ అతడిదేఇక గ్రూప్ దశలోనే తమ జట్టు నిష్క్రమించినప్పటికీ జో రూట్‌కు ఈ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో ఆథర్టన్ చోటు కట్టబెట్టాడు. ఇంగ్లండ్ నుంచి ఒకే ఒక్క ఆటగాడిగా రూట్‌కు ఈ మాజీ బ్యాటర్ స్థానం ఇచ్చాడు. తన జట్టు ఎంపిక గురించి మైఖేల్ ఆథర్టన్ స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీలో నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ జద్రాన్ బ్యాటింగ్ నుంచి వచ్చింది.అందుకే రచిన్ రవీంద్రతో పాటు ఓపెనింగ్ జోడీగా జద్రాన్‌ను ఎంచుకున్నా. ఇక వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి, రూట్ నాలుగో స్థానంలో ఉండాలి. వికెట్ కీపర్ బ్యాటర్‌గా నా ఓటు జోష్ ఇంగ్లిస్కే. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతడు అద్భుత నైపుణ్యాలు కనబరిచాడు.సారథి అతడేఇక ఆరోస్థానంలో ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్కు నేను స్థానం ఇస్తాను. అతడు బ్యాట్‌తో బాల్‌తో రాణించగలడు. అతడు జట్టులో ఉంటే సమతూకంగా ఉంటుంది. ఇక నా ఏడో ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్. మిచెల్ సాంట్నర్‌ను నా జట్టుకు కెప్టెన్‌గా ఎంచుకుంటాను. ఇద్దరు సీమర్లు మహ్మద్ షమీ, మ్యాట్ హెన్రీలకు చోటిస్తా. సాంట్నర్‌తో పాటు మరో స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తిని ఎంచుకుంటా’’ అని మైఖేల్ ఆథర్టన్ వెల్లడించాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ మార్చి 9న దుబాయ్‌లో ముగిసింది. ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించి విజేతగా అవతరించింది. ఈ వన్డే టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ ఆడగా.. వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ ఆడాయి.రాహుల్,శ్రేయస్ అదరగొట్టారుఇక ఈ మెగా టోర్నీలో అఫ్గన్ ఓపెనర్ జద్రాన్ ఇంగ్లండ్‌పై వీరోచిత శతకం బాదాడు. 117 పరుగులు సాధించి టోర్నీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. మరోవైపు.. రచిన్ రెండు శతకాల సాయంతో 263 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. కోహ్లి పాకిస్తాన్‌పై అజేయ శతకం చేయగా.. షమీ బంగ్లాదేశ్‌పై, వరుణ్ న్యూజిలాండ్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు. అయితే, టీమిండియా మిడిలార్డర్లో దిగి కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్(243 రన్స్), కేఎల్ రాహుల్(140 రన్స్)లకు మాత్రం ఆథర్టన్ చోటివ్వకపోవడం గమనార్హం. కాగా ఇంగ్లండ్ తరఫున ఆథర్టన్ 115 టెస్టులు, 54 వన్డేలు ఆడాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.మైఖేల్ ఆథర్టన్ ఎంచుకున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ -2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్:ఇబ్రహీం జద్రాన్, రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లి, జో రూట్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.చదవండి: BGT: ‘నేను జట్టులో ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ’ -
అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా మొదలు.. తాజాగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు ఇందుకు నిదర్శనం. అయితే, ఒకప్పుడు టీమిండియా స్టార్‌గా వెలిగి.. ఇప్పుడు జట్టులో చోటే కరువైన ప్లేయర్ ఇషాన్ కిషన్(Ishan Kishan).సెలక్టర్లు అతడిని పట్టించుకోవడం లేదుజాతీయ జట్టు ఓపెనర్‌గా చిన్న వయసులోనే ఓ వెలుగు వెలిగిన 26 ఏళ్ల ఇషాన్.. క్రమశిక్షణా రాహిత్యం వల్ల బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. ఫలితంగా టీమిండియాలో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం ఓపెనింగ్ స్థానంతో పాటు వికెట్ కీపర్‌గానూ సెలక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదు.కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సంజూ శాంసన్ కీపర్ల కోటాలో పాతుకుపోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు ఓపెనింగ్ జోడీగా శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఆయా ఫార్మాట్లలో కొనసాగుతున్నారు. అయితే, ఇషాన్ కిషన్‌కు ఐపీఎల్-2025 రూపంలో సువర్ణావకాశం వచ్చిందంటున్నాడు భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా. రూ. 11.25 కోట్లకు కొనుగోలుక్యాష్ రిచ్ లీగ్ పద్దెమినిదవ ఎడిషన్‌లో సత్తా చాటితే మరోసారి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించవచ్చని పేర్కొన్నాడు. కాగా గతేడాది వరకు ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ఇషాన్‌ను మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీ వదిలేసింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అతడిని ఏకంగా రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది.అయితే, రైజర్స్ జట్టులో ఇప్పటికే విధ్వంసకర ఓపెనింగ్ జోడీగా ట్రవిస్ హెడ్- అభిషేక్ శర్మ తమ స్థానాలు సుస్థిరం చేసుకున్నారు. గతేడాది జట్టు ఫైనల్ వరకు చేరడంలో ఈ ఇద్దరిది కీలక పాత్ర. కాబట్టి ఇషాన్ కిషన్‌కు ఓపెనర్‌గా ఛాన్స్ రాదు. టాపార్డర్‌లోనే ఉండాలంటే.. అతడు మూడో స్థానంలో ఆడాల్సిన పరిస్థితి.ఎవరూ కనీసం మాట్లాడటం లేదుఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ఇషాన్ కిషన్‌కు మరోసారి గొప్ప అవకాశం వచ్చింది. కారణమేదైనా టీమిండియా సెలక్టర్లు అతడిని అస్సలు పట్టించుకోవడం లేదు. రంజీల్లో ఆడి తనను తాను నిరూపించుకున్నాడు. పరుగులు చేశాడు.అయినా సరే అతడి ప్రాధాన్యాన్ని సెలక్టర్లు గుర్తించడం లేదు. అతడి గురించి ఎవరూ కనీసం మాట్లాడటం లేదు. జాతీయ జట్టులో స్థానం కోసం చేయాల్సిందంతా చేస్తున్నాడు. కానీ.. అసలు అతడి పేరు కూడా తెరమీదకు రావడం లేదు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడం అందరికీ సాధ్యం కాదు.కానీ ఇషాన్ ఆ పని చేసి చూపించాడు. భారీ సిక్సర్లు బాదగల సమర్థత, మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పగల సత్తా అతడికి ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ అతడిని మూడో స్థానంలో ఆడించేందుకు తీసుకుందని తెలిసి నేను ఆశ్చర్యపోయాను.సద్వినియోగం చేసుకుంటేఓపెనర్ల కోటా ఖాళీ లేదు కాబట్టి వాళ్లకూ వేరే ఆప్షన్ లేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో వేరే స్థానంలో ఆడి పరుగులు రాబట్టడం అంత తేలికేమీ కాదు. అయితే, ఇషాన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అతడికి తిరుగు ఉండదు.ప్రస్తుతం టీమిండియలో బ్యాటర్ల స్థానాలు ఫిక్స్‌డ్‌గా ఏమీ లేవు. ఏస్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నాడు. కాబట్టి ఇషాన్ ఐపీఎల్-2025లో సత్తా చాటితే కచ్చితంగా టీమిండియాలోకి రాగలడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్ ఆరంభం కానుండగా.. సన్‌రైజర్స్ మార్చి 23న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. రాజస్తాన్ రాయల్స్‌తో హైదరాబాద్ వేదికగా తలపడనుంది.చదవండి: టీమిండియా ఆడకుంటే రూ. 45 కోట్ల నష్టం! -
ప్రపంచ క్రికెట్లో భారత్ ఒక్కటే అలా చేయగలదు.. రాహుల్‌ను ఎంత పొగిడినా తక్కువే: స్టార్క్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజయానంతరం టీమిండియాపై ఆసీస్ స్పీడ్‌గన్ మిచెల్ స్టార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. వ్యక్తిగత కారణాల చేత ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్న స్టార్క్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత క్రికెట్‌ను, టీమిండియా కీలక సభ్యుడు కేఎల్ రాహుల్‌ను ఆకాశానికెత్తాడు. ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం భారత్ ఒక్కటే ఒకే రోజు మూడు ఫార్మాట్లలో మూడు వేర్వేరు జట్లను బరిలోకి దించగలదని అన్నాడు. టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియాపై.. వన్డేల్లో ఇంగ్లండ్‌పై.. టీ20ల్లో సౌతాఫ్రికాపై ఒకే రోజు మూడు వేర్వేరు జట్లను బరిలోకి దించినా భారత జట్లు గట్టి పోటీ ఇవ్వగలవని కితాబునిచ్చాడు. భారత్ మినహా ప్రపంచ క్రికెట్లో ఏ దేశానికి ఒకే రోజు మూడు వేర్వేరు జట్లను బరిలోకి దించే సత్తా లేదని కొనియాడాడు.కేఎల్ రాహుల్‌ను ఆకాశానికెత్తిన స్టార్క్మిచెల్ స్టార్క్ టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై ప్రశంసల వర్షం కురింపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ ప్రదర్శనలు అద్భుతమని కొనియాడాడు. టీమిండియాకు రాహుల్ మిస్టర్ ఫిక్సిట్ లాంటి వాడని అన్నాడు. టీమిండియా అవసరాల కోసం అతను ఏమైన చేయగలడని కొనియాడాడు. ఓపెనర్‌గా, మిడిలార్డర్లో, ఆరో స్థానంలో, వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా, ఫీల్డర్‌గా.. ఇలా ఏ పాత్రలో అయినా రాహుల్ ఒదిగిపోగలడని కితాబిచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రాహుల్ తన ఐదో స్థానాన్ని అక్షర్ పటేల్‌కు త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతాలు చేశాడని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా గెలుపుకు రాహుల్ ప్రధాన కారకుడని పేర్కొన్నాడు. రాహుల్ లాంటి మల్టీ టాలెంటెడ్ ఆటగాడితో కలిసి ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు. కాగా, మిచెల్ స్టార్క్ ఈ ఏడాది ఐపీఎల్లో కేఎల్ రాహుల్‌తో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. స్టార్క్‌ను గతేడాది మెగా వేలంలో ఢిల్లీ రూ. 11.75 కోట్లు సొంతం చేసుకుంది. అంతకుముందు ఏడాది (2024) స్టార్క్ కేకేఆర్‌కు ఆడాడు. ఆ సీజన్ వేలంలో కేకేఆర్ స్టార్క్‌కు రికార్డు ధర (రూ. 24.75 కోట్లు) చెల్లించి సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో అత్యధిక ధర. ఐపీఎల్లో అత్యధిక ధర పొందిన ఆటగాడి రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉంది. పంత్‌ను ఈ సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఇదే సీజన్ వేలంలో ఐపీఎల్లో రెండో అత్యధిక ధర కూడా నమోదైంది. పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్‌కు రూ. 26.75 కోట్లు చెల్లించింది.ఐపీఎల్లో టాప్-5 పెయిడ్ ప్లేయర్స్రిషబ్ పంత్- 27 కోట్లు (లక్నో, 2025)శ్రేయస్ అయ్యర్- 26.75 కోట్లు (పంజాబ్, 2025)మిచెల్ స్టార్క్- 24.75 కోట్లు (కేకేఆర్, 2024)వెంకటేశ్ అయ్యర్- 23.75 కోట్లు (కేకేఆర్, 2025)పాట్ కమిన్స్- 20.50 కోట్లు (సన్‌రైజర్స్, 2024)2025 ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ జట్టు..ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, అషుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, దర్శన్ నల్కండే, అజయ్ జాదవ్ మండల్, త్రిపురణ విజయ్, అక్షర్ పటేల్, మన్వంత్ కుమార్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, డొనొవన్ ఫెరియెరా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, టి నటరాజన్, ముకేశ్ కుమార్ -
అతడు అద్భుతం.. కానీ ఆ విషయంలో అసంతృప్తి: భారత మాజీ బ్యాటర్
టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)పై భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ప్రశంసలు కురిపించాడు. ఈ ముంబైకర్ ఇప్పటికైనా తనలోని నైపుణ్యాలను గుర్తించాడని.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లో అతడు బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమని కొనియాడాడు.అయితే, న్యూజిలాండ్(India vs New Zealand)తో ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ అవుటైన తీరు మాత్రం తనకు నచ్చలేదంటూ దిలీప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా.. కేఎల్ రాహుల్(KL Rahul) ఆట తీరును సైతం ఈ మాజీ బ్యాటర్ ప్రశంసించాడు. అంతేకాదు.. ఐదుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలన్న సెలక్టర్ల నిర్ణయం సరైందని నిరూపితమైందంటూ మేనేజ్మెంట్ వ్యూహాలను మెచ్చుకున్నాడు.కాగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ మార్చి 9న ముగిసిన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడింది. న్యూజిలాండ్‌పై గెలుపొంది ట్రోఫీని ముద్దాడిఈ నేపథ్యంలో గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్లను చిత్తు చేసిన రోహిత్ సేన.. ఆఖరిగా న్యూజిలాండ్‌పై జయకేతనం ఎగురువేసింది. ఈ క్రమంలో గ్రూప్-ఎ టాపర్‌గా సెమీస్ చేరి.. అక్కడ ఆస్ట్రేలియాను ఓడించింది.ఈ క్రమంలో ఫైనల్లోనూ అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌పై గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది. ఈ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ అజేయంగా నిలిచి చాంపియన్‌గా అవతరించింది. ఈ విజయాల్లో మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్‌ది కీలక పాత్ర. ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి అతడు 243 పరుగులు చేసి.. భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. తనకు అచ్చొచ్చిన ఐదో స్థానంలో కాకుండా ఆరో స్థానంలో ఆడాల్సి వచ్చింది. అక్షర్ పటేల్ కోసం తన నంబర్‌ను త్యాగం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అద్భుతంగా రాణించాడు. మొత్తంగా 140 పరుగులు చేసిన ఈ కర్ణాటక ఆటగాడు.. ముఖ్యంగా ఆసీస్‌తో సెమీస్‌లో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.అయ్యర్ అద్భుతంఈ నేపథ్యంలో దిలీప్ వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ.. ‘‘అయ్యర్ అద్భుతంగా ఆడాడు. కానీ ఫైనల్లో అతడు అవుటైన విధానం నాకు అసంతృప్తిని మిగిల్చింది. తను ఆఖరి వరకు అజేయంగా నిలిచి విజయంతో ముగించి ఉంటే బాగుండేది. ఏదేమైనా ఇప్పటికైనా అతడు తన నైపుణ్యాలను గుర్తించి.. అందుకు న్యాయం చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు.ఇక కేఎల్ రాహుల్ గురించి కూడా ప్రస్తావిస్తూ.. ‘‘ఆరో నంబర్లో వచ్చి కూడా కొన్ని ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయినా.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ల కోసమని అక్షర్ పటేల్‌ను రాహుల్ స్థానమైన ఐదో నంబర్లో పంపడం నాకేమీ నచ్చలేదు’’ అని దిలీప్ వెంగ్‌సర్కార్ తెలిపాడు.సెలక్టర్లకు క్రెడిట్ ఇవ్వాలిఅదే విధంగా.. ‘‘టీమిండియా విజయంలో సెలక్టర్లకు తప్పకుండా క్రెడిట్ ఇవ్వాలి. ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్ శర్మ వైఫల్యం తర్వాత కూడా అతడిని కెప్టెన్‌గా కొనసాగించారు. అంతేకాదు.. చాంపియన్స్ ట్రోఫీలో ఐదుగురు స్పిన్నర్లను ఆడించాలన్న వారి నిర్ణయం కూడా సరైందని నిరూపితమైంది’’ అని దిలీప్ వెంగ్‌సర్కార్ బీసీసీఐ సెలక్షన్ కమిటీని ప్రశంసించాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత స్పిన్ దళంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో పాటు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. వీరిలో సుందర్ ఒక్కడే పూర్తిస్థాయిలో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇదిలా ఉంటే.. కివీస్‌తో ఫైనల్లో మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా షాట్‌కు యత్నించి రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.చదవండి: అదే జరిగితే బుమ్రా కెరీర్ ముగిసినట్లే: కివీస్ మాజీ పేసర్ స్ట్రాంగ్ వార్నింగ్ -
భార్య ఒడిలో కేఎల్ రాహుల్.. ‘ఓ బేబీ’ అంటూ బిడ్డ కోసం ఎదురుచూపులు (ఫొటోలు)
-
అక్షర్, రాహుల్ కాదు..? ఢిల్లీ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్!?
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే మరో క్రికెట్ పండగ అభిమానులను అలరించేందుకు సిద్దమైంది. ఐపీఎల్-2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోలకతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ ఏడాది క్యాష్‌రిచ్ లీగ్ సీజన్లో పాల్గోనే మొత్తం పది జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టేశాయి.ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగమైన భారత ఆటగాళ్లు సైతం ఒక్కొక్కరుగా తాము ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లతో చేరుతున్నారు. అయితే ఈ టోర్నీలో భాగమయ్యే పది జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఇంకా తమ కెప్టెన్ వివరాలను వెల్లడించలేదు. గతసీజన్ వరకు తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్‌ను ఐపీఎల్ మెగా వేలంలోకి ఢిల్లీ విడిచిపెట్టింది. దీంతో ఢిల్లీ కెప్టెన్ ఎంపిక ఇప్పుడు అనివార్యమైంది.నో చెప్పిన రాహుల్..ఈ క్రమంలో ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన కేఎల్ రాహుల్‌కు ఢిల్లీ తమ జట్టు పగ్గాలను అప్పగిస్తుందని అంతాభావించారు. అంతా అనుకున్నట్లే అతడిని కెప్టెన్‌గా ఎంపికచేసేందుకు ఢిల్లీ యాజమాన్యం ముందుకు వచ్చింది. కానీ రాహుల్ మాత్రం కెప్టెన్సీపై తనకు ఆసక్తి లేదని, కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతానని సున్నితంగా తిరష్కరించినట్లు తెలుస్తోంది. దీంతో భారత స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు చెపడాతడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.రేసులో డుప్లెసిస్..అయితే ఢిల్లీ కెప్టెన్సీ రేసులో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిట్సల్ మెనెజ్‌మెంట్ డుప్లెసిస్‌ను పేరును పరిశీలిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా డుప్లెసిస్‌కు కెప్టెన్‌గా చాలా అనుభవం ఉంది. గత మూడు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా డుప్లెసిస్ వ్యవహరించాడు. అతడు కెప్టెన్సీలో ఐపీఎల్-2022,24 సీజన్లలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఆర్హత సాధించింది. డుప్లెసిస్ కెప్టెన్‌గా కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా ఆకట్టుకున్నాడు. డుప్లెసిస్ పలు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో కూడా వ్యవహరిస్తున్నాడు. దీంతో అతడిని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఢిల్లీ భావిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీ కొత్త కెప్టెన్ ఎవరన్నదానిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.2025 ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ జట్టు..ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, అషుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, దర్శన్ నల్కండే, అజయ్ జాదవ్ మండల్, త్రిపురణ విజయ్, అక్షర్ పటేల్, మన్వంత్ కుమార్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, డొనొవన్ ఫెరియెరా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, టి నటరాజన్, ముకేశ్ కుమార్చదవండి: Hardik Pandya: ఈ విజయం ఆయనకే అంకితం.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం -
కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం..!
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. రాహుల్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించాడని సమాచారం. కెప్టెన్సీ చేపట్టే విషయంలో డీసీ యాజమాన్యం రాహుల్‌ను సంప్రదించగా.. సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని రాహుల్ మేనేజ్మెంట్కు స్పష్టం చేశాడట. దీంతో డీసీ యాజమాన్యం అక్షర్ పటేల్ పేరును కెప్టెన్‌గా ఖరారు చేసినట్లు సమాచారం. ఇవాళో రేపో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ సక్సెస్ అనంతరం డీసీ మేనేజ్మెంట్ అక్షర్ విషయంలో చాలా హ్యాపీగా ఉందని తెలుస్తుంది. అక్షర్‌ను డీసీ మేనేజ్మెంట్ మెగా వేలానికి ముందు రూ. 16.5 కోట్లకు రీటైన్ చేసుకుంది. కేఎల్ రాహుల్‌ను మెగా వేలంలో రూ. 14 కోట్లకు సొంతం చేసుకుంది. రాహుల్‌కు టీమిండియాతో పాటు ఐపీఎల్లో పంజాబ్, లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉండగా.. అక్షర్ కెప్టెన్‌గా ఎంపికైతే ఇదే అతనికి ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా తొలి అసైన్మెంట్ అవుతుంది. అక్షర్‌కు దేశవాలీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది.అక్షర్ గత సీజన్లో రిషబ్ పంత్ అందుబాటులో లేనప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించారు. అక్షర్ 2019 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే కొనసాగుతున్నాడు. అక్షర్ తన ఐపీఎల్ కెరీర్లో 150 మ్యాచ్‌లు ఆడి 1653 పరుగులు, 123 వికెట్లు తీశాడు. అక్షర్ బ్యాటింగ్ స్ట్రయిక్‌రేట్ 130.88గా ఉండగా.. బౌలింగ్ ఎకానమీ 7.28గా ఉంది. అక్షర్ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా కూడా పని చేశాడు. కాగా, గత సీజన్ వరకు కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్‌ను ఢిల్లీ వదిలేసుకున్న విషయం తెలిసిందే. మెగా వేలంలో పాల్గొన్న పంత్‌ను లక్నో రికార్డు ధరకు కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టింది.పలు మ్యాచ్‌లకు దూరం కానున్న రాహుల్..?ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుండగా.. ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న ఆడనుంది. వైజాగ్‌లో జరిగే పోరులో ఢిల్లీ..లక్నోతో తలపడనుంది. కాగా, ఈ సీజన్లో తొలి రెండు, మూడు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరం కానున్నాడని తెలుస్తుంది. రాహుల్ భార్య అతియా శెట్టి త్వరలో బిడ్డకు జన్మనివ్వనుందని సమాచారం. ఈ కారణంగానే రాహుల్ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ వద్ద పర్మిషన్ తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. రాహుల్-అతియాల వివాహాం 2023 జనవరిలో జరిగింది. ఈ జంట గతేడాది నవంబర్‌లో ప్రెగ్నెన్సీ విషయాన్ని బహిర్గతం చేసింది.2025 ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ జట్టు..ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, అషుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, దర్శన్ నల్కండే, అజయ్ జాదవ్ మండల్, త్రిపురణ విజయ్, అక్షర్ పటేల్, మన్వంత్ కుమార్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, డొనొవన్ ఫెరియెరా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, టి నటరాజన్, ముకేశ్ కుమార్ -
ఏకైక ‘శత్రువు’ను అతడు జయించేశాడు: భారత మాజీ క్రికెటర్
టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్(KL Rahul)పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) ప్రశంసలు కురిపించాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడాడని.. భారత్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గెలవడంలో అతడి పాత్ర మరువలేనిదని కొనియాడాడు. తన ‘శత్రువు’ని జయించి రాహుల్ తన విలువేమిటో మరోసారి చాటుకున్నాడని ప్రశంసించాడు.వికెట్ కీపర్ బ్యాటర్‌గా సేవలు అందిస్తున్న కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా, మిడిలార్డర్లో నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా యాజమాన్యం చెప్పినట్లుగా నడుచుకునే క్రమంలో ఎప్పుడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుందో అతడికే తెలియని పరిస్థితి.కూల్‌గా, పక్కా ప్రణాళికతోముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా అతడి సేవలను వాడుకున్న తీరు దారుణమని నవజ్యోత్ సింగ్ సిద్ధు లాంటి వాళ్లు బీసీసీఐని విమర్శించడం గమనార్హం. అయితే, కేఎల్ రాహుల్ మాత్రం తాను ఏ స్థానంలో ఆడినా కూల్‌గా, పక్కా ప్రణాళికతో ముందుకు సాగాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో భారత్ విజయం సాధించడానికి.. విరాట్ కోహ్లితో పాటు ఈ కర్ణాటక బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్ కూడా ప్రధాన కారణం. సెమీస్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో వచ్చి 34 బంతుల్లో 42 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక న్యూజిలాండ్‌తో ఫైనల్లోనూ అతడు అదరగొట్టాడు. 33 బంతుల్లో 34 పరుగులు సాధించి.. మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. నిజానికి వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో రాహుల్ రాణించాడు.అయితే, సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో నాటి ఫైనల్లోనూ అర్ధ శతకం సాధించాడు. అయితే, 107 బంతుల్లో కేవలం 66 పరుగులే చేయడంతో.. భారత్ ఓటమికి అతడి స్లో ఇన్నింగ్స్ కూడా ఓ కారణమని కొంతమంది విమర్శించారు. అయితే, చాంపియన్స్ ట్రోఫీలో అతడు తన శైలిని మార్చుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై దూకుడు ప్రదర్శిస్తూ సరైన షాట్ల ఎంపికతో పరుగులు రాబట్టి.. టీమిండియా గెలుపుల్లో భాగమయ్యాడు.ఏకైక ‘శత్రువు’ను అతడు జయించేశాడుఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడాడు.‘‘వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ నుంచి రాహుల్ ‘స్లో ఇన్నింగ్స్’ భారం మోస్తున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి అతడు మాట్లాడుతూ.. ఆ ఇన్నింగ్స్ తాలూకు చేదు అనుభవం తనను వేటాడుతూ.. పదే పదే పాత గాయాన్ని గుర్తు చేస్తుందని చెప్పాడు.ఇక ఇప్పుడు సెమీస్, ఫైనల్లో అతడి ప్రదర్శన వల్ల కచ్చితంగా సంతృప్తి పడి ఉంటాడు. నిజానికి కేఎల్ రాహుల్‌కు బౌలర్లు ‘శత్రువులు’ కారు. అతడికి ఉన్న ఏకైక ‘శత్రువు’ అతడి మెదడే. తన ఆలోచనా విధానం వల్లే అతడు ఒత్తిడిలో కూరుకుపోయి ఉంటాడు.అయితే, ఇప్పుడు ఆ భారాన్ని జయించి.. సంయమనం పాటిస్తూ చక్కటి షాట్లతో అలరించాడు. అతడి ప్రయాణం గొప్పగా సాగుతోంది’’ అని సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో వ్యాఖ్యానించాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో కేఎల్ రాహుల్ ఐదు మ్యాచ్‌లలో నాలుగు ఇన్నింగ్స్ ఆడి 140 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేటు 97.90. ఐసీసీ ప్రకటించిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్లేయింగ్ ఎలెవన్‌లోనూ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం సంపాదించాడు.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు View this post on Instagram A post shared by ICC (@icc) -
CT 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు
పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) ఎడిషన్ మార్చి 9న దుబాయ్‌లో ముగిసింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్‌తో తలపడ్డ టీమిండియా జయకేతనం ఎగురవేసి ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో మూడు.. సెమీస్, ఫైనల్ గెలిచి అజేయంగా ఈ వన్డే టోర్నమెంట్‌ను ముగించింది.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) తాజాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఈ పదకొండు మంది సభ్యుల జట్టులో భారత్ హవా కొనసాగింది. టీమిండియా నుంచి ఈ జట్టులో ఏకంగా ఐదుగురు క్రికెటర్లు స్థానం సంపాదించారు.పాకిస్తాన్‌కు మొండిచేయిమరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి గెలుపన్నదే లేకుండా నిష్క్రమించిన పాకిస్తాన్‌కు మొండిచేయి ఎదురైంది. అంతేకాదు.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్ల నుంచి కూడా ఒక్క ఆటగాడూ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. ఇక టీమిండియా తర్వాత న్యూజిలాండ్ నుంచి అత్యధికంగా నలుగురు ఐసీసీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నారు. అదే విధంగా అఫ్గనిస్తాన్ నుంచి ఇద్దరు ఇందులో ఉన్నారు. అయితే, ఇందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టుకు సారథిగా కివీస్ నాయకుడు మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు.నాలుగు వికెట్ల తేడాతో ఓడించికాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ పోటీపడగా.. టీమిండియా, కివీస్ సెమీస్ చేరాయి. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్ బరిలో దిగగా.. ఆసీస్, ప్రొటిస్ జట్లు సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి.ఈ క్రమంలో తొలి సెమీస్ మ్యాచ్‌లో భారత్- ఆసీస్‌ను... రెండో సెమీస్‌లో కివీస్ ప్రొటిస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో రోహిత్ సేన సాంట్నర్ బృందాన్ని నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో 76 పరుగులతో రాణించిన భారత సారథి రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. మొత్తంగా రెండు శతకాల సాయంతో 263 పరుగులు సాధించిన కివీస్ యువ ఆటగాడు రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), ఇబ్రహీం జద్రాన్(అఫ్గనిస్తాన్), విరాట్ కోహ్లి(ఇండియా), శ్రేయస్ అయ్యర్(ఇండియా), కేఎల్ రాహుల్(ఇండియా), గ్లెన్ ఫిలిప్స్(న్యూజిలాండ్), అజ్మతుల్లా ఒమర్జాయ్(అఫ్గనిస్తాన్), మిచెల్ సాంట్నర్(కెప్టెన్, న్యూజిలాండ్), మ్యాట్ హెన్రీ(న్యూజిలాండ్), వరుణ్ చక్రవర్తి(ఇండియా)12వ ఆటగాడు: అక్షర్ పటేల్(ఇండియా)చాంపియన్స్ ట్రోఫీ-2025లో వీరి ప్రదర్శన👉రచిన్ రవీంద్ర- రెండు శతకాల సాయంతో 263 రన్స్. స్పిన్ బౌలర్‌గానూ రాణించిన రచిన్. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపిక👉ఇబ్రహీం జద్రాన్- ఒక సెంచరీ సాయంతో 216 పరుగులు. ఇంగ్లండ్‌పై అఫ్గన్ గెలుపొందడంలో కీలక పాత్ర👉విరాట్ కోహ్లి- ఒక శతకం సాయంతో 218 పరుగులు. పాకిస్తాన్‌పై అజేయ సెంచరీ. వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల మార్కు అందుకున్న క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు.👉శ్రేయస్ అయ్యర్- రెండు అర్ధ శతకాల సాయంతో 243 రన్స్. టీమిండియా చాంపియన్‌గా నిలవడంతో కీలక మిడిలార్డర్ బ్యాటర్‌గా రాణింపు.👉కేఎల్ రాహుల్- 140 పరుగులు. వికెట్ కీపర్‌గానూ సేవలు.👉గ్లెన్ ఫిలిప్స్- 177 పరుగులు. రెండు వికెట్లు, ఐదు క్యాచ్‌లు.👉అజ్మతుల్లా ఒమర్జాయ్- 126 రన్స్, ఏడు వికెట్లు.👉మిచెల్ సాంట్నర్- 4.80 ఎకానమీతో తొమ్మిది వికెట్లు👉మహ్మద్ షమీ- 5.68 ఎకానమీతో తొమ్మిది వికెట్లు. ఇందులో ఓ ఫైవ్ వికెట్ హాల్.👉మ్యాట్ హెన్రీ- 5.32 ఎకానమీతో పది వికెట్లు👉వరుణ్ చక్రవర్తి- 4.53 ఎకానమీతో తొమ్మిది వికెట్లు👉అక్షర్ పటేల్- 4.35 ఎకానమీతో ఐదు వికెట్లు.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా.. అల్లుడిపై మామ ప్రశంసలు
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి ముద్దాడింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్‌గా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో భారత స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మరోసారి క్లాస్ ఇన్నింగ్స్ ఆడారు. చివరి వరకు క్రీజ్‌లో ఉండి టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపాడు. ఒక వైపు వికెట్స్ పడుతున్నా 34 పరుగుతులతో నాటౌట్‌గా నిలిచి విజయ తీరాలకు చేర్చాడు. దీంతో పాకిస్తాన్ హోస్ట్ చేసిన ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది.అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా గెలవడంపై బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన అల్లుడు కేఎల్ రాహుల్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు రాహుల్ ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇండియాకి విష్.. రాహుల్ కమాండ్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ సునీల్ శెట్టిని ప్రశంసిస్తున్నారు. అల్లుడికి మామ సపోర్ట్ చేయడాన్ని చూసి నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ అన్నా రాక్‌స్టార్.. టీమిండియాకు కాబోయే కెప్టెన్ అంటూ ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. 2027లో కేఎల్ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ గెలుస్తామంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. అల్లుడికి మామ సపోర్ట్ చేయడం గొప్ప విషయం.. మా నాన్న కూడా నాకు సపోర్ట్ చేయడు అంటూ ఓ నెటిజన్ ఫన్నీగా సునీల్ శెట్టి ట్వీట్‌కు స్పందించాడు. అతియాను పెళ్లాడిన కేఎల్ రాహుల్..బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని కేఎల్ రాహుల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు ఆ తర్వాత వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం అతియా శెట్టి గర్భంతో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారు. సునీల్ శెట్టి తాతగా ప్రమోట్ కానున్నారు. ఏప్రిల్‌లో అతియా శెట్టి, కేఎల్ రాహుల్ తమ బిడ్డకు స్వాగతం పలకనున్నారు. 🇮🇳 INDIA’S WISH !!!! Rahul’s COMMAND …… pic.twitter.com/SbllRkbUgP— Suniel Shetty (@SunielVShetty) March 9, 2025 -
మా స్పిన్నర్లు అద్భుతం.. అతడు ఒత్తిడిని చిత్తు చేశాడు: రోహిత్
పుష్కరకాలం తర్వాత టీమిండియా మరోసారి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)ని ముద్దాడింది. పాతికేళ్ల క్రితం న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని 2025 విజేతగా ఆవిర్భవించింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో కివీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సాంట్నర్ బృందంపై పైచేయి సాధించి అభిమానులకు కనులవిందు చేసింది.మా స్పిన్నర్లు అద్భుతంఈ నేపథ్యంలో విజయానంతరం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మాట్లాడుతూ సమిష్టి కృషి వల్లే గెలుపు సాధ్యమైందని సహచరులపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్లు చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆసాంతం అదరగొట్టారని కితాబులిచ్చాడు. అదే విధంగా తమకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.‘‘ఇది మా సొంత మైదానం కాదు. అయినప్పటికీ మాకు మద్దతుగా అభిమానులు ఇక్కడికి తరలివచ్చారు. మా హోం గ్రౌండ్ ఇదే అన్నంతలా మాలో జోష్ నింపారు. గెలుపుతో మేము వారి మనసులను సంతృప్తిపరిచాం.ఫైనల్లో మాత్రమే కాదు.. టోర్నీ ఆరంభం నుంచీ మా స్పిన్నర్లు గొప్పగా రాణించారు. దుబాయ్ పిచ్ స్వభావరీత్యా వారిపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ ఒత్తిడికి లోనుకాకుండా పనిపూర్తి చేశారు. వారి నైపుణ్యాలపై నమ్మకంతో మేము తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని నిరూపించారు. వారి బలాలను మాకు అనుకూలంగా మలచుకోవడంలో మేము సఫలమయ్యాం.అతడు ఒత్తిడిని చిత్తు చేశాడుఇక.. కేఎల్ రాహుల్(KL Rahul) గురించి చెప్పాలంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరిచేరనీయడు. అందుకే మేము అతడి సేవలను మిడిల్లో ఎక్కువగా ఉపయోగించుకున్నాం. ఈరోజు తను బ్యాటింగ్ చేస్తున్నపుడు పరిస్థితులు మాకు అంత అనుకూలంగా లేవు. అయినప్పటికీ అతడు ఏమాత్రం తడబడకుండా షాట్ల ఎంపికలో సంయమనం పాటించాడు.తనతో పాటు బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించేలా చక్కటి సహకారం అందిస్తాడు. తను సరికొత్తగా కనిపిస్తున్నాడు. నాణ్యమైన బౌలర్ఇక వరుణ్ టోర్నీ ఆరంభంలో ఆడలేదు. అయితే, న్యూజిలాండ్‌తో లీగ్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో మెరిసిన తర్వాత అతడి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. అతడొక నాణ్యమైన బౌలర్. ట్రోఫీ గెలవడంలో ప్రతి ఒక్క సభ్యుడు తమ వంతు పాత్ర పోషించారు’’ అని జట్టు ప్రదర్శన పట్ల రోహిత్ శర్మ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్‌వెల్(53 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షమీ, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు.ఇక లక్ష్య ఛేదనలో భారత్‌కు ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్(31) శుభారంభం అందించారు. విరాట్ కోహ్లి(1) విఫలం కాగా.. శ్రేయస్ అయ్యర్(48)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 76 పరుగుల వద్ద రోహిత్ స్టంపౌట్ కాగా.. అక్షర్ పటేల్(29), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9) వేగంగా ఆడి మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
నాణ్యమైన క్రికెటర్.. ఏ స్థానంలోనైనా అతడు ఆడతాడు: టీమిండియా కోచ్
భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul) విషయంలో యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ కర్ణాటక ఆటగాడి బ్యాటింగ్ స్థానాన్ని పదే పదే మార్చడం.. అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం గురించి భారత మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మాట్లాడుతూ.. స్పేర్ టైర్ కంటే కూడా దారుణంగా మేనేజ్మెంట్ అతడి సేవలను వాడుకుంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధంఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్(Sitanshu Kotak) స్పందించాడు. జట్టులో తన పాత్ర పట్ల కేఎల్ రాహుల్ సంతృప్తిగా ఉన్నాడని తెలిపాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. కాగా 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన కేఎల్ రాహుల్.. ఆరంభంలో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.అనంతరం ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను మిడిలార్డర్‌కు డిమోట్ చేశారు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా(India vs Australia)తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సందర్భంగా మళ్లీ ఓపెనర్‌గా పంపారు. ఇక ఇంగ్లండ్‌తో స్వదేశంలో ఇటీవలి వన్డే సిరీస్‌లో ఒక్కోసారి ఆరో స్థానంలో ఆడించారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ ఇదే కొనసాగిస్తున్నారు. వీలునుబట్టి ఐదో స్థానంలో కూడా ఆడిస్తున్నారు.అయితే, ఇలా పదే పదే తన బ్యాటింగ్ ఆర్డర్ మారుతున్నా కేఎల్ రాహుల్ సంతోషంగానే ఉన్నాడని కోచ్ సితాన్షు కొటక్ చెప్పడం విశేషం. ‘‘అతడు ఓపెనింగ్ చేయగలడు. నాలుగు లేదంటే ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. డిమాండ్‌ను బట్టి ఆరో స్థానంలోనూ ఆడతాడు.జట్టుకు ఏది అవసరమో అది చేస్తాడుపరిస్థితులకు తగ్గట్లుగా తనను తాను మార్చుకోవడం అతడికి ఇష్టం. జట్టులో తన పాత్ర పట్ల అతడు సంతృప్తిగా, సంతోషంగా ఉన్నాడు. రాహుల్ వంటి నాణ్యమైన బ్యాటర్ ఆరో స్థానంలో అందుబాటులో ఉండటం జట్టుకు అదనపు ప్రయోజనం.బ్యాటింగ్ ఆర్డర్ మార్పుల గురించి నేను తనతో మాట్లాడినపుడు తనకేమీ ఇబ్బంది లేదని చెప్పాడు. జట్టుకు ఏది అవసరమో అది చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని నాతో అన్నాడు’’ అని సితాన్షు కొటక్ వెల్లడించాడు. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఆదివారం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా వన్డేల్లో ఐదో స్థానంలో వచ్చి ఇప్పటి వరకు 31 ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్.. 1299 పరుగులు సాధించాడు. సగటు 56.47. ఇందులో రెండు శతకాలతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఆరో స్థానంలో రాహుల్ ఏడుసార్లు బ్యాటింగ్ చేసి 160 పరుగులు మాత్రమే చేయగలిగాడు.ఇదిలా ఉంటే.. కివీస్‌తో టైటిల్ పోరు గురించి సితాన్షు కొటక్ మాట్లాడుతూ.. ‘‘సీనియర్లు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. వాళ్లంతా కలిసికట్టుగా ఉంటూ.. ఆట గురించి చర్చిస్తూ ఉంటారు. ఏ జట్టుకైనా ఇంతకంటే విలువైన, గొప్ప విషయం మరొకటి ఉండదు.రోహిత్, విరాట్, హార్దిక్, షమీ, జడేజా.. జట్టులో ఉండటం సానుకూలాంశం. వాళ్లలో చాలా మందికి 15- 20 ఏళ్ల అనుభవం ఉంది. యువ ఆటగాళ్లు సీనియర్ల నుంచి ఎంతో నేర్చుకుంటున్నారు. ఫైనల్ విషయంలో మా జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదు’’ అని పేర్కొన్నాడు.చదవండి: CT 2025: వరుణ్‌తోనే పెను ముప్పు: కివీస్ కోచ్ -
అతడిని స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారు: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు(Navjot Singh Sidhu) మండిపడ్డాడు. అందరు ఆటగాళ్లను సమానంగా చూడాలని.. అభ్రతా భావంతో కుంగిపోయేలా చేయకూడదని హితవు పలికాడు. భారత తుదిజట్టులో కేఎల్ రాహుల్(KL Rahul)ను స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారంటూ సిద్ధు ఘాటు విమర్శలు చేశాడు.ఆరంభంలో ఓపెనర్‌గా కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆరంభంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను తర్వాత మిడిలార్డర్‌కు డిమోట్ చేశారు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా(India vs Australia)తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సందర్భంగా మళ్లీ ఓపెనర్‌గా పంపారు.టీ20లకు దూరంఇక వన్డే జట్టులో వికెట్ కీపర్‌గా.. మిడిలార్డర్ బ్యాటర్‌గా రాహుల్ సేవలు వినియోగించుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. టీ20ల నుంచి పూర్తిగా అతడిని పక్కనపెట్టింది. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రాహుల్‌కు కలిసివచ్చిన ఐదో స్థానంలో అక్షర్ పటేల్‌ను ప్రమోట్ చేసి.. ఆరో స్థానంలో అతడిని ఆడించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ ఇదే కొనసాగించింది.మారుస్తూనే ఉన్నారుఅయితే, తాను ఏ స్థానంలో వచ్చినా చాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ మాత్రం అదరగొడుతున్నాడు. గ్రూప్ దశలో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 47 బంతుల్లో 41 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను ఐదు, అక్షర్‌ను ఆరో స్థానంలో పంపగా.. రాహుల్‌కు ఆడే అవకాశం రాలేదు.ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మళ్లీ రాహుల్‌ను ఆరో స్థానంలో పంపగా.. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 29 బంతుల్లో 23 రన్స్ చేశాడు. అయితే, ఆస్ట్రేలియాతో కీలకమైన సెమీ ఫైనల్లో మాత్రం ఈ కర్ణాటక స్టార్ అదరగొట్టాడు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆరో స్థానంలో వచ్చిన రాహుల్ 34 బంతుల్లోనే 42 పరుగులతో అజేయంగా నిలిచి.. సిక్సర్‌తో జట్టు విజయాన్ని ఖరారు చేశాడు.అతడిని స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారుఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్‌పై ప్రశంసలు కురుస్తున్నా... జట్టులో తనకంటూ సుస్థిర స్థానం లేకపోవడం పట్ల నవజ్యోత్ సింగ్ సిద్ధు సానుభూతి వ్యక్తం చేశాడు. ‘‘కేఎల్ రాహుల్... మీకు తెలుసా?.. అదనంగా మన దగ్గర పెట్టుకునే టైర్ కంటే కూడా అధ్వాన్నంగా, దారుణంగా అతడిని మేనేజ్మెంట్ వాడుకుంటోంది.ఓసారి వికెట్ కీపర్‌గా మాత్రమే ఆడిస్తారు, ఓసారి ఓపెనర్‌గా రమ్మంటారు.. మరోసారి ఐదు.. ఆరు స్థానాలు.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ వస్తే.. మూడో నంబర్లో ఆడమంటారు. మీ రెగ్యులర్ ఓపెనర్లు అందుబాటులో లేకుంటే మళ్లీ ఇన్నింగ్స్ ఆరంభించమంటారు.వన్డేల్లో ఓపెనర్‌గా రావడం సులువే. కానీ టెస్టుల్లో మాత్రం కష్టం. ఏదేమైనా జట్టు కోసం అతడు నిస్వార్థంగా తన స్థానాన్ని త్యాగం చేస్తూనే ఉన్నాడు’’ అని భారత జట్టు మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.కాగా కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో 58 టెస్టులు, 84 వన్డేలు, 72 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో ఎనిమిది శతకాల సాయంతో 3257 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో ఏడు సెంచరీలు కొట్టి 3009 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇక టీ20లలోనూ రెండు శతకాలు నమోదు చేసిన రాహుల్ ఖాతాలో 2265 పరుగులు ఉన్నాయి.చదవండి: ‘లాహోర్‌లో ఫైనల్ జరిగితే బాగుండేది’.. బీసీసీఐ స్ట్రాంగ్ రియాక్షన్ -
మాట్లాడుకుంటూనే ఉండండి: రోహిత్-రాహుల్‌పై జడ్డూ అసహనం!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో జైత్రయాత్ర కొనసాగించిన భారత క్రికెట్ జట్టు.. ఫైనల్లోనూ గెలిచి విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. సమిష్టి ప్రదర్శనతో గ్రూప్ దశలో టాపర్‌గా నిలిచిన రోహిత్ సేన సెమీస్‌లోనూ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో గత కొంతకాలంగా భారత్‌కు చేదు అనుభవాలను మిగిల్చిన ఆస్ట్రేలియా(India vs Australia)ను ఓడించింది.కంగారూ జట్టును ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా చేసి చిరస్మరణీయ విజయంతో టీమిండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సరదా సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాట్లాడుకున్న మాటలు స్టంప్ మైకులో రికార్డు కాగా.. ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.264 పరుగులకు ఆసీస్ ఆలౌట్‌కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ మొదలుకాగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన దుబాయ్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి సెమీస్‌లో భాగంగా భారత్ మంగళవారం ఆసీస్ జట్టును ఢీకొట్టింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఈ క్రమంలో ఓపెనర్ కూపర్ కన్నోలి(0)ని డకౌట్ చేసి మహ్మద్ షమీ టీమిండియాకు శుభారంభం అందించగా.. విధ్వంసకర ఓపెనర్ ట్రవిస్ హెడ్(39)ను వరుణ్ చక్రవర్తి స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్(73)తో ఆకట్టుకోగా.. అలెక్స్ క్యారీ(61)అతడికి సహకరించాడు. అయితే, మిగతా వాళ్లు స్థాయికి తగ్గట్లు రాణించకపోవడంతో ఆసీస్ 49.3 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. 264 పరుగులు స్కోరు చేసింది.టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి రెండు, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. అయితే, జడ్డూ బౌలింగ్ చేసే సమయంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మాములుగా తనకు ఇచ్చిన సమయంలోపే ఓవర్లు ముగిస్తాడని జడేజాకు పేరుంది.జడేజా అసహనంఅయితే, కెప్టెన్ రోహిత్ , వికెట్ కీపర్ రాహుల్ వల్ల ఆలస్యం అవుతుందేమోనని జడ్డూ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. స్టంప్ మైకులో రికార్డైన సంభాషణ ప్రకారం.. జడేజా..‘‘బంతి అంతగా టర్న్ అవటం లేదు’’ అనగా.. రోహిత్ ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇంకో మూడు బాల్స్ వేయాల్సి ఉంది కదా. స్లిప్ తీసుకో. బంతి స్పిన్ అవ్వచ్చు’’ అని పేర్కొన్నాడు.మీరు చర్చలు జరుపుతూనే ఉండండిఇంతలో కేఎల్ రాహుల్ జోక్యం చేసుకుంటూ.. ‘‘ఇప్పటి వరకు ఒక్క బంతి మాత్రమే టర్న్ అయింది’’ అని పేర్కొన్నాడు. వీళ్ల చర్చలతో చిర్రెత్తిపోయిన జడేజా.. ‘‘మీరిద్దరు ఇలా మట్లాడుతూనే ఉండండి. ఈ వ్యవధిలోనే నేను మిగిలిన నా మూడు బంతులు వేసేస్తా’’ అని కౌంటర్ వేశాడు.ఇదిలా ఉంటే.. ఆసీస్ విధించిన 265 పరుగుల లక్ష్య ఛేదనను భారత్ మరో పదకొండు బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. విరాట్ కోహ్లి అర్ధ శతకం(84)తో అదరగొట్టగా.. శ్రేయస్ అయ్యర్(45), కేఎల్ రాహుల్(42 నాటౌట్) రాణించారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 28) కూడా తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 48.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన టీమిండియా.. ఆసీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో టైటిల్ పోరులో తలపడుతుంది.చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు!Jab tak baat hogi, ek aur over hojayegi! 🤣That’s the speed of #Jadeja – blink, and the over’s done! Some on field stump mic gold!#ChampionsTrophyOnJioStar 👉 🇮🇳🆚🇦🇺 LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!📺📱 Start Watching FREE on… pic.twitter.com/nsIpsZyAbb— Star Sports (@StarSportsIndia) March 4, 2025 -
నేను ఎంతగానో చెప్పాను.. అయినా నా మాట కోహ్లి వినలేదు: రాహుల్
భారత క్రికెట్ జట్టు రెండో సారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఆసీస్ నిర్ధేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో చేధించింది. కాగా భారత్ విజయంలో విరాట్ కోహ్లి కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. తృటిలో తన 52వ వన్డే సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 98 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 84 పరుగులు చేసిన కోహ్లి.. జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించాడు.అప్పటివరకు ఆచితూచి ఆడుతున్న కోహ్లి అనూహ్యంగా ఔట్ అవ్వడంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. నాన్‌స్ట్రైక్‌లో ఉన్న కేఎల్ రాహుల్ సైతం నిరాశచెందాడు. నేను కొడుతున్నా కదా భయ్యా అన్నట్లు రాహుల్ రియాక్షన్ ఇచ్చాడు. అయితే దీనిపై మ్యాచ్ అనంతరం రాహుల్ స్పందించాడు."నేను క్రీజులోకి వచ్చాక పది పన్నేండు బంతులు ఆడాక కోహ్లి వద్దకు వెళ్లి కాసేపు మాట్లాడాను. ఆఖరి వరకు క్రీజులోనే ఉండాలని తనకు చెప్పాను. నేను రిస్క్ తీసుకుని షాట్లు ఆడుతాను, ఏదో ఒక ఓవర్‌ను టార్గెట్ చేస్తాను అని చెప్పా. ఎందుకుంటే ఆ సమయంలో మాకు ఓవర్‌కు 6 పరుగులు మాత్రమే అవసరం. కానీ ఈ వికెట్‌పై ఓవర్‌కు ఎనిమిది పరుగులు సులువగా సాధించవచ్చు అన్పించింది. ఓవర్‌కు ఒక్క బౌండరీ వచ్చినా చాలు. కాబట్టి ఆ రిస్క్ నేను తీసుకుంటూ, నీవు కేవలం స్ట్రైక్ రోటేట్ చేస్తే చాలు అని చెప్పాను. కానీ కోహ్లి నా మాట వినలేదు. భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. బహుశా బంతి స్లాట్‌లో ఉందని భావించి ఆ షాట్ ఆడిండవచ్చు. కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో మైదానం వీడాల్సి వచ్చింది" అని రాహుల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: అదే మా కొంపముంచింది... లేదంటే విజయం మాదే: స్టీవ్ స్మిత్ -
గెలిపించినందుకు థాంక్యూ భయ్యా.. రాహుల్‌ను హగ్ చేసుకున్న ఫ్యాన్ (ఫొటోలు)
-
IND Vs NZ: కివీస్‌తో మ్యాచ్.. స్టార్ ప్లేయర్లకు రెస్ట్! విధ్వంసకర వీరుడి ఎంట్రీ?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత క్రికెట్ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్దమైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కూడా గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో సెమీస్‌లో అడుగుపెట్టాలని భారత జట్టు భావిస్తోంది.ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే గ్రూప్ టాపర్‌గా సెమీఫైనల్లో ఆ్రస్టేలియాతో తలపడుతుంది. ఓడితే సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు మెనెజ్‌మెంట్‌కు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక సూచనలు చేశాడు. తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లను కివీస్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడించాలని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు."కివీస్‌తో మ్యాచ్‌లో భారత్ తమ తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకోవాలి. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌లకు ఆడే అవకాశం ఇవ్వండి. మొదటి రెండు మ్యాచ్‌లకు వీరిద్దరూ బెంచ్‌కే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నించిండి. గెలిస్తే ఆస్ట్రేలియాతో ఆడుతారు. లేదంటే దక్షిణాఫ్రికాతో తలపడతారు. అంతేతప్ప ఓడినంతమాత్రాన భారత జట్టుకు పెద్దగా నష్టం లేదు. కాబట్టి నావరకు అయితే తుది జట్టులో మార్పులు చేస్తే బెటర్" అని మంజ్రేకర్ జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా కివీస్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చోటు చేసుకునే సూచనలు కన్పిస్తున్నాయి. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి మెనెజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జట్టులో వచ్చే అవకాశముంది. అదేవిధంగా కేఎల్ రాహుల్ స్ధానంలో రిషబ్ పంత్ జట్టులోకి రానున్నట్లు సమచారం.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుబ్‌మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్. న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్ ), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డార్లీ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్,హెన్రీ, రూర్కే.చదవండి: Champions Trophy: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి.. -
మళ్ళీ కోహ్లి హవా ... ఒక్క మ్యాచ్ తో మారిన తీరు
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు వరుకూ భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి క్రికెట్ కెరీర్ పై ఎన్నో విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ఘోర వైఫల్యం ఇందుకు ప్రధాన కారణం. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. ఒక్క మ్యాచ్ తో పరిస్థితి అంతా మారిపోయింది. గత ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ, భారత్ బ్యాటింగ్ లో తన మునుపటి వైభవాన్ని పునరుద్ధరించుకున్నాడు.పాకిస్తాన్ మ్యాచ్ అంటే విజృంభించి ఆడే కోహ్లీ ఇవేమీ కొత్తేమీ కాదు. అయితే న్యూజిలాండ్‌తో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్ కోహ్లీ కి చాల ప్రత్యేకం. ఇది కోహ్లీకి 300వ వన్డే మ్యాచ్. ఈ మైలురాయిని చేరుకున్న భారత్ ఆటగాళ్లలో కోహ్లీ ఏడవ వాడు. గతంలో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని వంటి హేమాహేమీలు ఈ రికార్డ్ సాధించిన వారిలో ఉన్నారు.రికార్డుల వేటలో కోహ్లి..కోహ్లీ తన 300వ వన్డేకు చేరుకుంటున్న తరుణంలో, భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రశంసలతో ముంచెత్తాడు. భారత క్రికెట్‌పై కోహ్లీ ప్రభావం ఎంత ఉందో మాటల్లో చెప్పడానికి చాలా కష్టం అని రాహుల్ ప్రశంసలతో ముంచెత్తాడు. రాహుల్ కోహ్లీని తానూ క్రికెట్లో ఎల్లప్పుడూ ఆరాధించే "ముఖ్యమైన సీనియర్ ఆటగాడు" అని ప్రశంసించాడు. "300 వన్డే మ్యాచ్‌లు... కోహ్లీ భారత క్రికెట్‌కు ఎంత గొప్ప సేవకుడో వ్యక్తీకరించడానికి మాటలు సరిపోవు" అని రాహుల్ మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించాడు.కోహ్లీ ఈ మ్యాచ్ తో మరో రికార్డ్ సాధించాలన్న ఆశయంతో ఉన్నాడు. 36 ఏళ్ల కోహ్లీ న్యూజిలాండ్‌పై 3000 కంటే ఎక్కువ అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరడానికి ఇంకా 85 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. గతంలో సచిన్ టెండూల్కర్ (3345), రికీ పాంటింగ్ (3145), జాక్వెస్ కల్లిస్ (3071) మరియు జో రూట్ (3068) తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న ఐదవ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. న్యూజిలాండ్‌పై కోహ్లీ ఇంతవరకూ 55 వన్డే మ్యాచ్‌ల్లో 47.01 సగటుతో 2915 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు మరియు 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి.కోహ్లీ పై బ్రేస్‌వెల్ ప్రశంసలు "ఇది చాలా పెద్ద విజయం" అని ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ సైతం కోహ్లీ మైలురాయి గురించి ప్రశంసలు గుప్పించాడు. "ఒక క్రికెటర్ కెరీర్లో 300 వన్డే మ్యాచ్ లు ఆడటం చాల గొప్ప విషయం. అదీ ఒకే ఫార్మాట్లో. కోహ్లీ తన తన కెరీర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాడనే దానికి ఇది నిదర్శనం అని నేను భావిస్తున్నాను." అని బ్రేస్‌వెల్ వ్యాఖ్యానించాడు.2023 ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కోహ్లీతో కలిసి బ్రేస్‌వెల్ ఆడాడు. అతనికి కోహ్లీ గురించి ప్రత్యక్ష అవగాహన ఉంది. "ఆర్సిబిలో అతను ప్రతి మ్యాచ్‌కు ఎలా సిద్ధమయ్యాడో నేను ప్రత్యక్షంగా చూశాను. భారత్ జట్టు లో చాల మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారు. అందులో కోహ్లీ ఒకడు. భారత్ తో ఎదురయ్యే సవాలు ఎదుర్కోవటానికి మేము ఏంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం," అని బ్రెసెవెల్ అన్నాడు.న్యూజిలాండ్ రికార్డ్ ఐసిసి టోర్నమెంట్లలో న్యూజిలాండ్ భారత్ పై ఆధిపత్యం చెలాయించింది. హెడ్-టు-హెడ్ రికార్డ్ లో న్యూజీలాండ్ 10-5 ( డబ్ల్యూ టి సి ఫైనల్‌తో సహా) తో ఆధిపత్యం లో ఉంది. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన వన్డేల్లో అయితే భారత్ 60-58 తో ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో భారత్ సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఆడటం అనుమానంగానే ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ షమీ కాలి మడమ నొప్పితో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.ఈ కారణంగా షమీ స్థానంలో ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను భారత్ ఈ మ్యాచ్ లో ఆడించే అవకాశముంది. న్యూజిలాండ్ లైనప్‌లో ఐదుగురు ఎడమచేతి వాటం బ్యాటర్ ఉండటం కూడా ఇందుకు ఒక కారణం. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్ పర్యవేక్షణలో అర్ష్‌దీప్ 13 ఓవర్లు ఫుల్ రన్-అప్‌తో బౌలింగ్ చేయగా, షమీ 6-7 ఓవర్లు మాత్రమే కుదించబడిన రన్-అప్‌తో బౌలింగ్ చేశాడు. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన మూడవ ఓవర్ వేసిన వెంటనే షమీ ఫిజియోల నుండి తన కుడి కాలుకు చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమైన సెమీ-ఫైనల్స్‌కు ముందు భారత్ షమీకి విరామం ఇచ్చే అవకాశం లేకపోలేదు.చదవండి: యువీ స్పిన్ మ్యాజిక్.. రాయుడు మెరుపులు! సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్ -
IND vs NZ: కివీస్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరం.. కెప్టెన్‌గా అతడు!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ఆఖరి లీగ్ మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. ఈ ఐసీసీ వన్డే టోర్నమెంట్లో ఇప్పటికే సెమీ ఫైనల్ చేరుకున్న రోహిత్ సేన.. న్యూజిలాండ్‌తో ఆదివారం నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రోహిత్‌కు రెస్ట్ ఇవ్వడమే మంచిదిపాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా హిట్‌మ్యాన్ పిక్కల నొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మైదానం వీడి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ ఫీల్డింగ్‌కు వచ్చాడు. అయితే, నొప్పి ఇంకా పూర్తిగా తగ్గలేదని తెలుస్తోంది. దుబాయ్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లోనూ అతడు బ్యాటింగ్ చేయలేకపోయాడు. దీంతో కివీస్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉండాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.సెమీస్ మ్యాచ్ మార్చి 4, 5 తేదీల్లోనే జరుగనున్న తరుణంలో రోహిత్‌కు విశ్రాంతిన్విడమే మంచిదని యాజమాన్యం కూడా భావిస్తున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. గిల్‌తో పాటు ఓపెనర్‌గా రాహుల్అయితే, గిల్ జ్వరంతో బాధపడుతున్నాడని వార్తలు రాగా.. ఆప్షనల్ నెట్ సెషన్లో అతడు గంటలపాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడంతో వాటికి చెక్ పడింది.ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ గనుక దూరమైతే గిల్‌కు ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే మరో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక గ్రూప్-‘ఎ’ నుంచి కివీస్ కూడా భారత్‌తో పాటు సెమీస్ చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 2 నాటి మ్యాచ్‌లో గెలిచి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సెమీ ఫైనల్ బరిలో దిగాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో గెలుపు ఆధారంగానే గ్రూప్-‘ఎ’ విజేతతో పాటు సెమీస్ ప్రత్యర్థి ఎవరన్నది తేలనుంది.కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలైంది. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి. అయితే, గ్రూప్-‘ఎ’లో వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడటంతో పాటు.. తమ మధ్య ఆఖరి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో పాక్- బంగ్లా కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించాయి. ఇక గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ ఇంటిబాటపట్టింది. ఇక ఈ టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్‌లు అన్నీ దుబాయ్‌లో ఆడుతోంది.చదవండి: అఫ్గన్ చేతిలో ఓటమి.. బట్లర్ సంచలన నిర్ణయం?! -
గిల్ సెంచరీ కోసం హాఫ్ సెంచరీని త్యాగం చేసిన రాహుల్.. అదే హార్దిక్ అయ్యుంటే..!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్‌కు జాకిర్ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్‌కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.అనంతరం శుభ్‌మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్‌ను గెలిపించాడు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో గిల్ సెంచరీ అనంతరం సోషల్‌మీడియాలో ఓ టాపిక్ హైలైట్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గిల్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడు. గిల్ సెంచరీ కోసం రాహుల్ చేసిన త్యాగాన్ని నెటిజన్లు ప్రశంశిస్తున్నారు. రాహుల్ స్వలాభం కోసం ఆడే ఆటగాడు కాదని కితాబునిస్తున్నారు. రాహుల్ గతంలో కూడా ఓ సందర్భంలో విరాట్ కోహ్లి సెంచరీ కోసం తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు హార్దిక్ పాండ్యాను విమర్శిస్తున్నారు. రాహుల్ స్థానంలో హార్దిక్ ఉంటే గిల్ సెంచరీ పూర్తయ్యేది కాదని అంటున్నారు. హార్దిక్ చాలా సెల్ఫిష్ ఆటగాడని.. మ్యాచ్ పూర్తి చేసేందుకు అతను తోటి వారి మైలురాళ్ల గురించి పట్టించుకోడని కామెంట్స్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వెస్టిండీస్‌లో తిలక్ వర్మ (49) హాఫ్ సెంచరీని పట్టించుకోకుండా హార్దిక్ సిక్సర్స్‌తో మ్యాచ్‌ను మిగించిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో గిల్ సెంచరీకి ముందు రాహుల్ ఎక్కడ ఔటవుతాడో, హార్దిక్ ఎక్కడ క్రీజ్‌లో వస్తాడో అని అని టెన్షన్ పడినట్లు చెబుతున్నారు. మొత్తానికి గిల్ అభిమానులు హార్దిక్‌ను ఏకి పారేసి, రాహుల్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో గిల్ సెంచరీకి సహకరించే క్రమంలో రాహుల్ చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్.. గిల్‌తో కలిసి ఐదో వికెట్‌కు అజేయమైన 87 పరుగులు జోడించి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ ఏమాత్రం తేడాగా ఆడిన ఫలితం వేరేలా ఉండేది. అప్పటికే భారత్.. రోహిత్, కోహ్లి, శ్రేయస్, అక్షర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. పిచ్ నుంచి కూడా బ్యాటర్లకు ఎలాంటి సహకారం లేదు. ఇలాంటి తరుణంలో రాహుల్ చాలా జాగ్రత్తగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వ్యక్తిగత ప్రయోజనాన్ని పక్కన పెట్టి గిల్ సెంచరీకి కూడా సహకరించాడు. రాహుల్ సహకారంతో గిల్ వన్డేల్లో తన ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్ కూడా చాలా బాధ్యతాయుతంగా ఆడాడు. గిల్ చివరి వరకు క్రీజ్‌లో నిలదొక్కుకోకపోయినా ఫలితం వేరేలా ఉండేది. బంగ్లాదేశ్ బౌలర్లు పిచ్ స్వభావానికి తగట్టుగా బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఏదిఏమైనా గిల్, రాహుల్ భాగస్వామ్యం భారత్‌ను గెలిపించింది. అంతకుముందు రాహుల్ కీపింగ్‌లోనూ అదరగొట్టాడు. మూడు అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకుని బెస్ట్ ఫీల్డర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. -
IND Vs BAN: చాంపియన్స్ ట్రోఫీ తొలి పోరులో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
ఆ ఇద్దరి విషయంలో అగార్కర్‌తో గంభీర్ గొడవ.. ఆఖరికి!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన జట్టు విషయంలో టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)- హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) మధ్య విభేదాలు తలెత్తాయా? ఇద్దరు ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చే అంశమై ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదా? అదే వాగ్యుద్దానికి దారి తీసిందా? అంటే జాతీయ మీడియా వర్గాల నుంచి అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.కాగా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరోసారి చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నమెంట్ మొదలుకానుంది. అయితే, భద్రతా కారణాల వల్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) టీమిండియాను అక్కడికి పంపడం లేదు. యశస్వి జైస్వాల్‌పై వేటుఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం తటస్థ వేదికైన దుబాయ్‌లో భారత్ తమ మ్యాచ్‌లు ఆడేందుకు ఐసీసీ అనుమతినిచ్చింది. ఇక ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు జనవరి 18న తమ ప్రాథమిక జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఫిబ్రవరి 11న ఫైనల్ టీమ్‌ను ఖరారు చేసింది. తొలుత ఈ జట్టులో స్థానం దక్కించుకున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై వేటు వేసిన యాజమాన్యం.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చింది. మొదటి ప్రాధాన్యం దక్కాలని గంభీర్ వాదనఅదే విధంగా వెన్నునొప్పి కారణంగా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టోర్నీకి దూరం కాగా.. హర్షిత్ రాణాను జట్టులో చేర్చింది. అయితే, వికెట్ కీపర్ విషయంలో మాత్రం గంభీర్- అగార్కర్ మధ్య తీవ్రమైన చర్చ జరిగినట్లు సమాచారం. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం... సీనియర్ అయిన కేఎల్ రాహుల్‌కు మొదటి ప్రాధాన్యం దక్కాలని గంభీర్ వాదించగా.. అగార్కర్ మాత్రం రిషభ్ పంత్‌కు పెద్దపీట వేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇక ఆఖరికి గంభీర్ తన మాటను నెగ్గించుకున్నట్లు ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ ద్వారా నిరూపితమైనట్లు తెలుస్తోంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల్లోనూ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా బరిలోకి దిగగా.. పంత్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. కాగా ఈ సిరీస్‌ను 3-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత గౌతం గంభీర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మా నంబర్ వన్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మాత్రమే అని చెప్పగలను.రిషభ పంత్‌కు కూడా అవకాశాలు వస్తాయి. అయితే, కేఎల్ రాహుల్ రికార్డు బాగుంది. అందుకే అతడి వైపు మొగ్గుచూపాం. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లను ఒకేసారి ఆడించలేము కదా!’’ అని పేర్కొన్నాడు. శ్రేయస్ అయ్యర్ విషయంలోనూఇక కేఎల్ రాహుల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ విషయంలోనూ గంభీర్.. అగార్కర్‌తో వాదనకు దిగినట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపిన ఈ ముంబై బ్యాటర్‌ను తప్పక ఎంపిక చేయాలని గౌతీ పట్టుబట్టగా.. అగార్కర్ మాత్రం అతడి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. ఇంగ్లండ్‌తో తొలి వన్డే తర్వాత శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి కూడా! తాను తొలుత తుదిజట్టులో లేనని.. విరాట్ కోహ్లి మోకాలి నొప్పి కారణంగానే తనకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కిందని శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు.ఏది ఏమైనా ఇంగ్లండ్‌తో వన్డేలో సిరీస్‌లో మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు వన్డేల్లో వరుసగా 59, 44, 78 పరుగులు సాధించాడు. ఇక జట్టుకూర్పులో తన నిర్ణయానికే కట్టుబడి ఉన్న గంభీర్.. అగార్కర్‌తో విభేదించినప్పటికీ ఘన విజయం సాధించడం జట్టుకు సానుకూలాంశంగా మారింది.అయితే, లెఫ్ట్- రైట్ కాంబినేషన్ల కోసం అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానానికి ప్రమోట్ చేసి.. కేఎల్ రాహుల్‌ను ఆరో నంబర్ ఆటగాడిగా పంపడం బెడిసికొట్టింది. దీంతో మూడో వన్డేలో కేఎల్ రాహుల్‌ను తన రెగ్యులర్ స్థానమైన ఐదో నంబర్లో పంపగా.. 29 బంతుల్లోనే 40 పరుగులతో దంచికొట్టాడు.చదవండి: చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ దూరం!? -
చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ దూరం!?
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya) షాట్ కారణంగా అతడి మెకాలి(Knee Injury)కి గాయమైంది. దీంతో పంత్ నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి అతడిని పరీక్షించాడు. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు ఈ వికెట్ కీపర్ బ్యాటర్ దూరం కానున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి.అయితే, పంత్ పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు సమాచారం. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో పంత్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్‌తో పాటు ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది.ఎడమ మోకాలికి బలంగా తాకిన బంతిఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. ఆదివారం తొలి సెషన్ జరుగగా.. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో అతడు బలంగా బాదిన బంతి పంత్ ఎడమ మోకాలికి తగిలింది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయిన ఈ యువ ఆటగాడు నొప్పితో విలవిల్లాడాడు.ఇంతలో అక్కడికి చేరుకున్న ఫిజియో కమలేశ్ జైన్ పంత్‌ను పరీక్షించాడు. హార్దిక్ పాండ్యా సైతం పంత్ దగ్గరకు వచ్చి అతడి పరిస్థితి ఎలా ఉందో అడిగితెలుసుకున్నాడు. అయితే, కాసేపటి తర్వాత ఈ వికెట్ కీపర్ సాధారణ స్థితికి చేరుకున్నాడు. తొలి దఫాలో బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లు నిష్క్రమించిన తర్వాత తాను కూడా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. దీనిని బట్టి పంత్ గాయం అంత తీవ్రమైనదని కాదని తేలిపోయింది.కాగా 27 ఏళ్ల రిషభ్ పంత్ తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికయ్యాడు. అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ జట్టులోనూ అతడికి స్థానం ఉన్నా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కలేదు. సీనియర్ కేఎల్ రాహుల్‌కు ప్రాధాన్యం ఇచ్చిన నాయకత్వ బృందం.. మూడు వన్డేల్లోనూ అతడినే ఆడించింది.పంత్ బెంచ్‌కే పరిమితం!ఫలితంగా చాంపియన్స్ ట్రోఫీ-2025 తుదిజట్టులోనూ పంత్‌కు అవకాశం రాదనే సంకేతాలు ఇచ్చినట్లయింది. అంతేకాదు.. కేఎల్ రాహుల్‌కు వన్డేల్లో ఉన్న రికార్డు దృష్ట్యా అతడినే ఈ ఐసీసీ టోర్నీ ఆసాంతం ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పంత్ బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. కాగా కేఎల్ రాహుల్ చివరగా ఐసీసీస వన్డే వరల్డ్‌కప్-2023లో 500 పరుగులు సాధించాడు. అందుకే ఈ మెగా టోర్నీలోనూ అతడికే వికెట్ కీపర్‌గా మొదటి ప్రాధాన్యం దక్కనుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పోటీ పడనున్నాయి. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. ఇక టీమిండియా ఫిబ్రవరి 20న దుబాయ్‌లో తమ తొలిమ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.చదవండి: CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్‌గా అతడే.. వికెట్ల వీరుడిగా ఆర్చర్! -
రాహుల్ పై 'గంభీర్' నమ్మకం.. ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుస్తాడా?
ఆస్ట్రేలియా పర్యటన లో ఘోర వైఫల్యం తర్వాత భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లో కొన్ని కీలకమైన మార్పులు చేసాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందు ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో ఇందుకోసం తన ఫార్ములా ని పరీక్షించేందుకు ఉపయోగించుకున్నాడు.భారత్ జట్టులోని కీలక బ్యాటర్ కూడా సొంత గడ్డపై మళ్ళీ తమ మునుపటి ఫామ్ ని అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ కి జట్టులోని ప్రధానబ్యాటర్లు అందరూ మానసికంగా సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్్ కోహ్లీ, ఓపెనర్ శుభమన్ గిల్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు పరుగులు సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.రాహుల్ వైపే గంభీర్ మొగ్గు..అయితే గంభీర్ తీసుకొచ్చిన మరో పెద్ద మార్పు. రిషబ్ పంత్ స్థానంలో భారత్ నెంబర్ 1 వికెట్ కీపర్ గా కె ఎల్ రాహుల్ ని ఎంచుకోవడం. రాహుల్ కి పంత్ కి చాలా వ్యత్యాసం ఉంది. ఇద్దరి బ్యాటింగ్ విధానంలో చాలా తేడా ఉంది. పంత్ భారీ షాట్లతో కొద్దిసేపటి లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉన్నవాడు. రాహుల్ అందుకు భిన్నంగా ఆచి తూచి ఆడతాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికి సమయం తీసుకుంటాడు. టెక్నికల్ గా రాహుల్ సమర్ధుడైన బ్యాటర్ అయినప్పటికీ, అతను స్వతహాగా ఆచి తూచి ఆడే స్వభావం గల బ్యాటర్.ఇక్కడ మ్యాచ్ లో పరిస్థితులని బట్టి వీరిద్దరినీ ఉపయోగించుకోవాలి. టాప్ ఆర్డర్ బ్యాటర్ బాగా రాణించి స్కోర్ బాగా చేసినట్టయితే,అలాంటి పరిస్థితుల్లో శరవేగంగా మరిన్ని పరుగులు సాధించడానికి పంత్ సరిగ్గా సరిపోతాడు. అయితే పంత్ బ్యాటింగ్ శైలి వల్ల అతను నిలకడ రాణించగలడన్న గ్యారెంటీ లేదు.కానీ రాహుల్ అందుకు భిన్నంగా, క్రీజులో నిలదొక్కుకుంటే తనదైన శైలిలో నేర్పుగా పరుగులు రాబట్టగలడు. ఇంత వైరుధ్యం గల ఇద్దరు వికెట్ కీపర్లలలో ఒకరిని ఎంచుకోవడం సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఇద్దరూ వ్యక్తిగతంగా ఎంతో సామర్ధ్యం గల బ్యాట్స్‌మన్. ఇలాంటి క్లిష్టమైన విషయంలో కోచ్ గంభీర్ తన ప్రధాన వికెట్ కీపర్ గా రాహుల్ నే ఎంచుకోవడం. ఎందుకంటె రాహుల్ చాల నిలకడైన బ్యాటర్ కావడమే.రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్అయితే ఈ నిర్ణయం చాల మందికి రుచించలేదు. ఇక్కడ మరో విషయం ఉంది. అది రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్. రాహుల్ సాధారణంగా టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి వస్తాడు. కానీ ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లోని తొలి రెండు వన్డేల్లో రాహుల్ ఆరో నెంబర్ బ్యాట్స్‌మన్ గా రంగంలోకి వచ్చాడు. “ప్రస్తుతానికి, కెఎల్ మాకు నంబర్ 1 వికెట్ కీపర్. ప్రస్తుతానికి అతను జట్టు తరపున అద్భుతంగా రాణిస్తున్నాడు" అని గంభీర్ అహ్మదాబాద్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. "జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నప్పుడు, ఇద్దరు వికెట్ కీపర్లను ఆడించడం సాధ్యం కాదు. భారత్ జట్టులోని ఇతర బ్యాట్స్‌మన్ నైపుణ్యం, వారి అపార అనుభవం దృష్ట్యా చూస్తే, ఇది సాధ్యమయ్యే విషయం కాదు. ఇక పంత్ విషయానికి వస్తే అతను అవకాశం వచ్చిన్నప్పుడు ఆడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతానికి నేను ఈ విషయం గురించి అంతే చెప్పగలను,," అని గంభీర్ తన నిర్ణయాన్ని తేటతెల్లం చేసాడు.ఎడమచేతి వాటం బౌలర్ అక్షర్ పటేల్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్ కి బ్యాటింగ్ కి పంపించాలన్న గంభీర్ తీసుకున్న నిర్ణయం కూడా చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఫలితంగా, మొదటి రెండు మ్యాచ్‌లలో రాహుల్ ప్రదర్శన నిరాశపరిచింది - మొదటి రెండు మ్యాచ్‌లలో రాహుల్‌లో కేవలం రెండు, పది పరుగులు మాత్రమే చేసాడు. చేసాడు. అయితే మూడో మ్యాచ్ లో రాహుల్ తనకి అనుకూలంగా ఉండే ఐదో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి 29 బంతుల్లో 40 పరుగులు చేశాడు.“రాహుల్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్ కి పంపించి అతనిని వృధా చేస్తున్నారు,” అని భారత మాజీ స్టంపర్ పార్థివ్ పటేల్ వ్యాఖ్యానించాడు. రికార్డులను చూడనని చెబుతూ గంభీర్ అలాంటి సూచనలను తోసిపుచ్చాడు. దుబాయ్‌లో రాహుల్ ఆరవ స్థానంలో కొనసాగాల్సి రావచ్చని కూడా గంభీర్ స్పష్టం చేశాడు. .రాహుల్ ప్రపంచ కప్ రికార్డ్ 2023 ప్రపంచ కప్ కి ముందు పంత్ గాయపడ్డాడు. ఆ దశలో రాహుల్ భారత్ జట్టు కి అండగా నిలిచి రాణించాడు. రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి 75.33 సగటుతో 452 పరుగులు చేశాడు భారత్ ఫైనల్ కి చేర్చడంలో కీలక భూమిక పోషించాడు.పైగా రాహుల్ భారత్ మిడిల్ ఆర్డర్‌ను పటిష్టంగా ఉంచాడు. ప్రస్తుతం కోచ్ గంభీర్ కూడా రాహుల్ నుంచి అదే ఆశిస్తున్నాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ని కూడా పటిష్టంగా ఉంచి జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ సాధించడంలో తోడ్పడుతాడని భావిస్తున్నాడు. మరి గంభీర్ వ్యూహం ఫలిస్తుందేమో చూడాలి. -
CT 2025: రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఆరంభానికి సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ వన్డే మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇందులో పాల్గొనే ఎనిమిది జట్ల వివరాలు వెల్లడయ్యాయి. ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సైతం ఈ ఐసీసీ టోర్నీకి తొలుత ప్రకటించిన జట్టులో రెండు మార్పులతో టీమ్‌ను ఖరారు చేసింది.యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను ఈ జట్టు నుంచి తప్పించిన బీసీసీఐ(BCCI).. అతడి స్థానంలో ఐదో స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)ని జట్టులో చేర్చింది. అదే విధంగా.. స్టార్ బౌలర్, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఇంకా వెన్నునొప్పి నుంచి కోలుకోకపోవడంతో అతడి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను ఎంపిక చేసింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత తుదిజట్టుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనని ప్రకటించిన ఈ మాజీ బ్యాటర్.. అనూహ్యంగా వన్డే వరల్డ్‌కప్-2023 హీరోలను మాత్రం పక్కనపెట్టాడు.అద్బుత ప్రదర్శనస్వదేశంలో 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆలస్యంగా అడుగుపెట్టినా అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు మహ్మద్ షమీ. మెగా ఈవెంట్లో ఏకంగా 24 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. అనంతరం చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు పద్నాలుగు నెలల తర్వాత పునరాగమనం చేశాడు.సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన టీ20, వన్డే సిరీస్‌లలో షమీ ఆడాడు. అయితే, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లలో ఈ బెంగాల్ పేసర్ స్థాయికి తగ్గట్లు రాణించలేదు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే వికెట్లు తీశాడు.మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా ఇంగ్లండ్‌తో వన్డేల్లో ఆకట్టుకోలేకపోయాడు. అయితే, అతడిని బ్యాటింగ్ ఆర్డర్లో డిమోట్ చేయడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. సాధారణంగా ఐదో స్థానంలో వచ్చే ఈ కర్ణాటక బ్యాటర్‌ను మేనేజ్మెంట్ ఆరో స్థానంలో పంపింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో తొలి రెండు వన్డేల్లో రాహుల్(2, 10) విఫలమయ్యాడు.రాహుల్ ధనాధన్ ఇన్నింగ్స్అయితే, మూడో వన్డే సందర్భంగా తన రెగ్యులర్ ప్లేస్‌లో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ ధనాధన్ ఇన్నింగ్స్(29 బంతుల్లో 40) ఆడాడు. ఇక అంతకుముందు వన్డే వరల్డ్‌కప్‌లోనూ రాహుల్ రాణించాడు. అయినప్పటికీ షమీతో పాటు కేఎల్ రాహుల్‌కు కూడా సురేశ్ రైనా తన చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటివ్వకపోవడం గమనార్హం.ఇక షమీని కాదని యువ పేసర్ హర్షిత్ రాణా వైపు మొగ్గు చూపిన సురేశ్ రైనా.. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ స్థానంలో రిషభ్ పంత్‌ను ఎంచుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో యాజమాన్యం రిషభ్ పంత్‌ను పూర్తిగా పక్కనపెట్టడం గమనార్హం.చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చాంపియన్స్ ట్రోఫీ-2025కి సురేశ్ రైనా ఎంచుకున్న తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్.చదవండి: ఆఖరికి అతడికి జట్టులో స్థానమే లేకుండా చేశారు: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
అహ్మదాబాద్‌లో అదరగొట్టిన భారత బ్యాటర్లు.. ఇదే తొలిసారి
ఇంగ్లండ్‌తో మూడో వన్డే(India vs England)లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఫలితంగా అహ్మదాబాద్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తద్వారా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ ఖాతాలో అతిపెద్ద స్కోరు(Highest ODI total) నమోదైంది. కాగా రోహిత్ సేన ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా నాగ్‌పూర్, కటక్ వన్డేల్లో ఇంగ్లండ్‌ను నాలుగేసి వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మూడో వన్డేలోనూ గెలిచి వైట్‌వాష్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది.అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆరంభంలోనే కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) వికెట్ రూపంలో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. గత వన్డేలో సెంచరీ(119)తో చెలరేగిన హిట్‌మ్యాన్ మూడో వన్డేలో మాత్రం ఒక్క పరుగే చేసి మార్క్‌వుడ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.ఎట్టకేలకు ఫామ్లోకిఈ నేపథ్యంలో మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు జతైన వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 55 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 52 పరుగులు చేశాడు. అప్పటికే, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. దానిని శతకంగా మార్చుకున్నాడు.గిల్ శతకంమొత్తంగా 102 బంతులు ఎదుర్కొన్న శుబ్‌మన్ గిల్ 14 ఫోర్లు, 3 సిక్స్‌లు బాది.. 112 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 78 రన్స్) అద్భుత అర్ధ శతకంతో మెరిశాడు. మరోవైపు.. తన రెగ్యులర్ స్థానమైన ఐదో నంబర్లో వచ్చిన కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.కేవలం 29 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి 40 పరుగులు సాధించాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. మిగతా వాళ్లలో ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా(17), అక్షర్ పటేల్(13), వాషింగ్టన్ సుందర్(14).. పేసర్లు హర్షిత్ రాణా(13), అర్ష్‌దీప్ సింగ్(2), కుల్దీప్ యాదవ్(1*) నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు.అవయవ దానం గురించిఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 356 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. పేసర్లు మార్క్ వుడ్ రెండు, గస్ అట్కిన్సన్ ఒకటి, పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ ఒక వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా- ఇంగ్లండ్ క్రికెటర్లు అవయవ దానం గురించి అవగాహన కల్పించే చేసే క్రమంలో గ్రీన్ ఆర్మ్ బ్యాండ్‌తో బరిలోకి దిగడం విశేషం.అహ్మదాబాద్‌లో వన్డేల్లో అత్యధిక స్కోర్లుసౌతాఫ్రికా వర్సెస్ ఇండియా- 2010లో 365/2ఇండియా వర్సెస్ ఇంగ్లండ్- 2025లో 356ఇండియా వర్సెస్ వెస్టిండీస్- 2002లో 325/5వెస్టిండీస్ వర్సెస్ ఇండియా- 2002లో 324/4 పాకిస్తాన్ వర్సెస్ ఇండియా- 2007లో 319/7.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డువారెవ్వా!.. శుబ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డు -
తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం!
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) తీరుపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్ విషయంలో గౌతీ అనుసరిస్తున్న వ్యూహాలు సరికావని విమర్శించాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel)ను ప్రమోట్ చేయడం బాగానే ఉన్నా.. అందుకోసం కేఎల్ రాహుల్(KL Rahul)ను బలి చేయడం సరికాదని హితవు పలికాడు.వరుసగా రెండింట గెలిచి.. సిరీస్ సొంతంకాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డేలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌లలో ఇప్పటికే రెండు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది రోహిత్ సేన. అయితే, ఈ సిరీస్‌లో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌ను కాదని సీనియర్ కేఎల్ రాహుల్‌కు పెద్దపీట వేసిన యాజమాన్యం.. బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం అతడిని డిమోట్ చేసింది.అతడికి ప్రమోషన్.. రాహుల్‌కు అన్యాయం?స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను ఐదో స్థానంలో ఆడిస్తూ.. కేఎల్ రాహుల్‌ను ఆరో నంబర్ బ్యాటర్‌గా పంపింది. ఈ క్రమంలో నాగ్‌పూర్, కటక్ వన్డేల్లో అక్షర్ వరుసగా 52, 41 నాటౌట్ పరుగులు చేయగా... రాహుల్ మాత్రం విఫలమయ్యాడు. తొలి వన్డేలో రెండు, రెండో వన్డేలో పది పరుగులకే పరిమితమయ్యాడు.ఇది చాలా దురదృష్టకరంఈ పరిణామాలపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. అయితే, కేఎల్ రాహుల్ పరిస్థితి చూసి నాకు బాధ కలుగుతోంది.ఇది చాలా దురదృష్టకరం. అక్షర్ పటేల్ 30, 40 పరుగులు చేస్తున్నాడు. మంచిదే.. కానీ కేఎల్ రాహుల్ పట్ల మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు అన్యాయం. ఐదో స్థానంలో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అందుకు అతడి గణాంకాలే నిదర్శనం.ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదుకాబట్టి.. హేయ్.. గంభీర్ నువ్వు చేస్తున్నది తప్పు. పరిస్థితులకు అనుగుణంగా అక్షర్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపవచ్చు. కానీ ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదు. ఇలాంటి వాటి వల్ల దీర్ఘకాలం ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నీకూ తెలుసు. కీలకమైన మ్యాచ్‌లో ఇలాంటి వ్యూహాలు బెడిసికొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.రిషభ్ పంత్ విషయంలోనూ ఇలాగే చేస్తారా?అక్షర్ పటేల్‌తో నాకు ఎలాంటి సమస్యా లేదు. అతడికి ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు ఇస్తున్నారు. కానీ అందుకోసం రాహుల్‌ను ఆరో నంబర్లో ఆడిస్తారా? అలాగే చేయాలని అనుకుంటే రిషభ్ పంత్‌ను కూడా ఆరోస్థానంలోనే పంపండి. రాహుల్ ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? వరల్డ్‌క్లాస్ ప్లేయర్‌గా పేరొందిన అద్భుతమైన ఆటగాడి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్ విధానాన్ని ఎండగట్టాడు. చదవండి: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన -
సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul) తీరుపై భారత దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏ ఆటగాడైనా జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించాలని హితవు పలికాడు. అలా కాకుండా ప్రతి ఒక్కరు స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తే ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ చురకలు అంటించాడు.కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్(India vs England ODIs)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య గురువారం నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే జరిగింది. 248 పరుగులుఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(26 బంతుల్లో 43), బెన్ డకెట్(29 బంతుల్లో 32)లు శుభారంభం అందించగా.. కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 52), జాకొబ్ బెతెల్(64 బంతుల్లో 51) అర్ధ శతకాలతో మెరిశారు.అయితే, భారత బౌలర్ల విజృంభణ కారణంగా మరెవరూ రాణించలేకపోయారు. ఫలితంగా 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణాతో పాటు రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు.అయ్యర్ మెరుపు అర్ధ శతకంఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), కెప్టెన్ రోహిత్ శర్మ(2) వికెట్లు కోల్పోగా.. శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ భారత ఇన్నింగ్స్ చక్కదిద్దారు. గిల్ పట్టుదలగా క్రీజులో నిలబడి కాస్త నెమ్మదిగానే ఆడగా.. అయ్యర్ మెరుపు అర్ధ శతకం(36 బంతుల్లో 59), అక్షర్ పటేల్(52) విలువైన హాఫ్ సెంచరీ చేసి నిష్క్రమించారు.ఈ దశలో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ శుబ్‌మన్ గిల్‌కు తోడయ్యాడు. అప్పటికి గిల్ సెంచరీకి 19 పరుగులు, టీమిండియా విజయానికి 28 పరుగులు కావాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో స్ట్రైక్‌లో ఉన్న రాహుల్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ కేఎల్ రాహుల్ వ్యవహారశైలిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. గిల్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు సహకరించే క్రమంలో రాహుల్ తన ఆటపై శ్రద్ధ పెట్టలేక నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడని మండిపడ్డాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘అతడు తన సహజశైలిలో ఆడాల్సింది.కానీ తన బ్యాటింగ్ పార్ట్నర్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు వీలు కల్పించే క్రమంలో అజాగ్రత్తగా వ్యవహరించాడు. అందుకు ఫలితంగా ఏం జరిగిందో చూడండి. ఇది టీమ్ గేమ్. కాబట్టి ఏ ఆటగాడు కూడా ఇలా చేయకూడదు. స్ట్రైక్ రొటేట్ చేసేందుకు ఏదో కొత్తగా ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఇది పూర్తిగా అతడు అనాసక్తితో ఆడిన షాట్’’ అని గావస్కర్ కేఎల్ రాహుల్ తీరును విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్‌లో గిల్ 96 బంతుల్లో 87 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.చదవండి: తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్ కాల్ తర్వాత..: శ్రేయస్ అయ్యర్