స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు సెప్టెంబర్ 12న చెన్నైలో సమావేశం కానుంది.
ఈ నెల 13 నుంచి ఆరు రోజుల పాటు చెపాక్‌లో ఏర్పాటు చేసిన ప్రీ ట్రైనింగ్ క్యాంపులో భారత జట్టు పాల్గోనుంది. ఇక ఈ సిరీస్ కోసం ఇప్పటికే 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌తో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పునరాగమనం చేయనున్నాడు.
అదే విధంగా మరో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా దాదాపు 7 నెలల తర్వాత భారత్ తరపున టెస్టుల్లో ఆడనున్నాడు.బంగ్లాతో సిరీస్‌కు రాహుల్‌కు కూడా చోటు దక్కింది. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో రాహుల్ భాగమయ్యాడు.
అయితే హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గాయపడిన రాహుల్.. సిరీస్ మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత అతడి స్ధానాన్ని యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌తో బీసీసీఐ భర్తీ చేసింది. సర్ఫరాజ్ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.
రెండు అర్ధ సెంచరీలతో సత్తాచాటి శెభాష్ అన్పించుకున్నాడు. అయితే బంగ్లాతో సిరీస్‌కు సర్ఫరాజ్, రాహుల్‌కు ఇద్దరికి జట్టులో చోటు దక్కింది. దీంతో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరికి చోటు దక్కుతుందా అన్నది అందరి మొదడలను తొలుస్తున్న ప్రశ్న.
రాహుల్‌కు ఛాన్స్.. సర్ఫరాజ్‌కు నో ఛాన్స్
అయితే సర్ఫరాజ్ కంటే రాహుల్ వైపే టీమిండియా మెనెజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాహుల్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా సర్ఫరాజ్‌ను బెంచ్‌కే పరిమితం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. జట్టు వ్యూహాలు, ఆలోచనలు బయటి వ్యక్తులకు ఆర్ధం కాకపోవచ్చు. ఇంగ్లండ్ సిరీస్‌లో మధ్యలో మేము అతడిని తప్పించలేదు. అతడు గాయ పడ్డాడు. అందుకే అతడు ఆ సిరీస్‌కు దూరమయ్యాడు.
తను గాయపడటానికి ముందు హైదరాబాద్‌లో 86 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఫామ్‌లోకి తిరిగి రావడం జట్టుకు కలిసొచ్చే ఆంశం. ఆస్ట్రేలియాలో రాబోయే సవాళ్లకు మేనేజ్‌మెంట్ అతడిని సిద్దం చేస్తోంది.
సర్ఫరాజ్ సైతం తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కానీ తుది జట్టులో చోటు కోసం కాస్త ఎదురు చూడక తప్పదు. ఏదైనా అవకాశముంటే అతడికే తొలి ప్రాధన్యత ఇస్తామని పీటీఐతో బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.
చదవండి: #Joe Root: చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment