అండర్-19 ఆసియాకప్‌లో దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా బ్యాటర్లకు టీమిండియా బౌలర్లు చుక్కులు చూపించారు. భారత బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో కేవలం 198 పరుగులకే ఆలౌటైంది.
బంగ్లా బ్యాటర్లలో రిజాన్ హసన్(47) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షిహాబ్ (40), ఫరిద్ (39) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో యుధాజిత్ గుహా 2, చేతన్ శర్మ 2, హార్దిక్ రాజ్ 2.. కిరణ్, కేపీ కార్తికేయ, ఆయుష్ మాత్రే తలో వికెట్ తీశారు.
తుది జట్లు
బంగ్లాదేశ్
జవాద్ అబ్రార్, కలాం సిద్ధికి అలీన్, ఎండి అజీజుల్ హకీమ్ తమీమ్ (కెప్టెన్), మహ్మద్ షిహాబ్ జేమ్స్, ఎండి ఫరీద్ హసన్ ఫైసల్ (వికెట్ కీపర్), దేబాసిష్ సర్కార్ దేబా, ఎండి సమియున్ బసిర్ రతుల్, మరుఫ్ మృదా, ఎండి రిజాన్ హోసన్, అల్ ఫహాద్, ఇక్మోన్, ఇక్మోన్
భారత్
ఆయుష్ మత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆండ్రీ సిద్దార్థ్, మహమ్మద్ అమన్ (కెప్టెన్), కెపి కార్తికేయ, నిఖిల్ కుమార్, హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), కిరణ్ చోర్మలే, హార్దిక్ రాజ్, చేతన్ శర్మ, యుధాజిత్ గుహ
Comments
Please login to add a commentAdd a comment