India vs bangladesh live updates and highlights:
బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘన విజయం
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో భారత్ తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేయగల్గింది.
బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విరాట్ కోహ్లి(37), పంత్(36), శివమ్ దూబే(34) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టాంజిమ్ హసన్, రిషద్ హోస్సేన్ తలా రెండు వికెట్లు సాధించారు.
వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 16వ ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో షాంటో(40) ఔట్ కాగా.. 17వ ఓవర్‌లో అర్ష్‌దీప్ బౌలింగ్‌లో జకీర్ అలీ ఔటయ్యాడు.
నాలుగో వికెట్ డౌన్..
98 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది.
మూడో వికెట్ డౌన్..
బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన హృదయ్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో షాంటో(37), షకీబ్(5) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ డౌన్..
66 పరుగుల వద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన టాంజిద్ హసన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి హృదయ్ వచ్చాడు. 11 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్: 76/2
తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన లిట్టన్ దాస్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు.
క్రీజులోకి నజ్ముల్ హోస్సేన్ శాంటో వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో టాంజిద్(27), శాంటో(7) పరుగులతో ఉన్నారు.
3 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్: 16/0
197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజులో టాంజిద్ హసన్(14), లిట్టన్ దాస్(2) పరుగులతో ఉన్నారు.
అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. టీమిండియా భారీ స్కోర్
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విరాట్ కోహ్లి(37), పంత్(36), శివమ్ దూబే(34) రాణించారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో టాంజిమ్ హసన్, రిషద్ హోస్సేన్ తలా రెండు వికెట్లు సాధించారు.
ఐదో వికెట్ డౌన్.. దూబే ఔట్
18 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా(28), అక్షర్ పటేల్(1) పరుగులతో ఉన్నారు. కాగా ఐదో వికెట్‌గా శివమ్ దూబే(34) వెనుదిరిగాడు.
నాలుగో వికెట్ డౌన్.. పంత్ ఔట్
110 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన రిషబ్ పంత్.. రిషద్ హోస్సేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు టీమిండియా స్కోర్: 110/4
టీమిండియా మూడో వికెట్ డౌన్.. సూర్య ఔట్
టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. విరాట్ ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా(6) పెవిలియన్‌కు చేరాడు. టాంజిమ్ హసన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 9 ఓవర్లకు టీమిండియా స్కోర్: 80/3
రెండో వికెట్ డౌన్.. విరాట్ కోహ్లి ఔట్
71 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. టాంజిమ్ హసన్ సకిబ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
8 ఓవర్లకు టీమిండియా స్కోర్: 71/1
8 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(37), రిషబ్ పంత్(9) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
39 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు.
3 ఓవర్లకు టీమిండియా స్కోర్: 29/0
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(11), రోహిత్ శర్మ(12) పరుగులతో ఉన్నారు.
టీ20 వరల్డ్‌కప్-2024 సూపర్-8లో భాగంగా ఆంటిగ్వా వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ సూపర్-8 పోరులో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. బంగ్లాదేశ్ మాత్రం ఒక మార్పు చేసింది. ఈ మ్యాచ్‌కు బంగ్లా పేసర్ టాస్కిన్ ఆహ్మద్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో టాంజిమ్ హసన్ సకిబ్ వచ్చాడు.
తుది జట్లు
బంగ్లాదేశ్: తాంజిద్ హసన్, లిట్టన్ దాస్(వికెట్ కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, మహేదీ హసన్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment