టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. పొట్టి వరల్డ్‌కప్‌లో 17 ఏళ్ల తర్వాత భారత్ విశ్వవిజేతగా నిలవడంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన బుమ్రా.. టీమిండియాకు పదేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని అందించాడు.
ఈ మెగా టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 4.17 ఏకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు వరించింది. అయితే టీ20 వరల్డ్‌కప్ విజయం తర్వాత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్‌కు విడ్కోలు పలికేశారు.
ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా కూడా టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడా ఏమో అని అభిమానులు తెగ టెన్ష పడుతున్నారు. తాజాగా బుమ్రా వాంఖడే వేదికగా జరిగిన కార్యక్రమంలోతన రిటైర్‌మెంట్ ప్లాన్‌పై స్పందించాడు. ఇప్పటిల్లో తనకు రిటైర్ అయ్యే ఆలోచన లేదని బుమ్రా తెలిపాడు.
"నా రిటైర్మెంట్‌కు ఇంకా చాలా సమయం ఉంది. నేను ఇప్పుడే నా కెరీర్‌ను ప్రారంభించాను. ఈ మెగా టోర్నీ విజయంలో నా వంతు పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉంది. టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలవడం చాలా గర్వంగా ఉంది.
నా ఫీలింగ్స్‌ను మాటల్లో చేప్పలేకపోతున్నాను. ఈ వాంఖడే మైదానం నా జీవితంలో చాలా ప్రత్యేకమైనది. అండర్-19 కుర్రాడిగా ఇక్కడికి వచ్చా. ముంబై వీధులన్నీ ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయాయి. ఇటువంటి ఘన స్వాగతం నేను ఎప్పుడూ చూడలేదు.
భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా కష్టమైంది. ఇప్పటికి నేను ఓ యువ క్రికెటర్‌గానే భావిస్తున్నాను. మేము ఈ వరల్డ్‌కప్‌లో సీనియర్ ఆటగాళ్లు, కుర్రాళ్లతో కలిసి భారత జట్టు బరిలోకి దిగింది. ప్రతీ మ్యాచ్‌లోనూ 100 శాతం ఎఫెక్ట్ పెట్టి విజయం సాధించాము.
రోహిత్, విరాట్ మన లక్ష్యం ఏంటనే దానిపై స్పష్టతతో ఉన్నారు. దేశానికి కీర్తి తీసుకొచ్చేందుకు అన్ని విధాల మేము ప్రయత్నిస్తాం. నా కెరీర్‌లో వరల్డ్ కప్‌ను ఎప్పుడూ గెలవలేదు. ఈ విజమం మాకు మరింత స్పూర్తినిచ్చిందని" బీసీసీఐతో బుమ్రా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment