టీ20 ప్రపంచకప్-2024
T20 World Cup 2024
-
45 ఏళ్లలో ఇదే తొలిసారి.. టీమిండియా ఒక్కటీ గెలవలేదు!
గతేడాది టీమిండియాకు మధుర జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాల్నీ మిగిల్చింది. పొట్టి ఫార్మాట్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత జట్టు.. దాదాపు పదిహేడేళ్ల తర్వాత మరోసారి టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024) గెలిచింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007లో తొట్టతొలి పొట్టి కప్ గెలుచుకున్న భారత్.. మళ్లీ 2024లో రోహిత్ కెప్టెన్సీలో ట్రోఫీని ముద్దాడింది.చాంపియన్లుగా వీడ్కోలుఅయితే, ఈ మెగా టోర్నీలో టీమిండియా టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli)లతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఇకపై వీరు కేవలం ఫ్రాంఛైజీ క్రికెట్లో మాత్రమే టీ20 ప్రేమికులను అలరించనున్నారు.ఇక.. ఐసీసీ టోర్నమెంట్ తర్వాత శుబ్‌మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేను టీ20 సిరీస్‌లో చిత్తు చేసింది టీమిండియా. ఇక భార టీ20 జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిష్క్రమించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అతడి స్థానాన్ని అధికారికంగా భర్తీ చేశాడు. సూర్య సారథ్యంలో తొలిసారి శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు 3-0తో ఆతిథ్య జట్టును క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ దుమ్ములేపింది.సౌతాఫ్రికా గడ్డపై సత్తా చాటిన సూర్య సేనఆ తర్వాత సౌతాఫ్రికా గడ్డపై కూడా సూర్య సేన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. పొట్టి ఫార్మాట్ సంగతి ఇలా ఉంటే.. టెస్టుల్లో ఆరంభంలో అదరగొట్టిన రోహిత్ సేన.. ఆ తర్వాత మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 4-1తో గెలిచిన భారత్.. బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.మర్చిపోలేని వైట్‌వాష్ పరాభవంఅయితే, స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవం ఎదుర్కొంది. పర్యాటక జట్టు చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురై చరిత్రలోనే తొలిసారిగా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రత్యర్థి చేతిలో క్లీన్‌స్వీప్ అయిన జట్టుగా రోహిత్ సేన చెత్త రికార్డు మూటగట్టుకుంది.ఆసీస్‌తో సిరీస్లోనూఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఈ వైఫల్యాలను కొనసాగిస్తోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లిన భారత్.. తొలి టెస్టులో గెలుపొందినా.. ఆ తర్వాత అదే ఫలితాన్ని పునావృతం చేయలేకపోయింది.అడిలైడ్‌లో ఓడి.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. అలా చేదు అనుభవంతో గతేడాదిని ముగించింది.ఒక్క వన్డే కూడా గెలవలేదుఇదిలా ఉంటే.. 2024లో భారత జట్టుకు ఎదురైన మరో ఘోర అవమానం ఏమిటంటే.. గతేడాది టీమిండియా ఒక్కటంటే ఒక్క వన్డే కూడా గెలవలేదు.శ్రీలంక పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో ఓ మ్యాచ్‌ను టై చేసుకున్న రోహిత్ సేన.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. తద్వారా దాదాపు రెండు దశాబ్దాల అనంతరం లంకతో వన్డే ద్వైపాక్షిక సిరీస్‌లో ఓటమిని చవిచూసింది. ఇలా ఓ ఏడాదిలో వన్డేల్లో భారత్ ఒక్కటి కూడా గెలవకపోవడం 45 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1979లోనే టీమిండియా ఇలాంటి అనుభవమే ఎదుర్కొంది. అదీ విషయం!! వచ్చే ఏడాది మరింత బిజీఇక ఆసీస్‌తో సిడ్నీ టెస్టుతో 2025ను మొదలుపెట్టనున్న టీమిండియా.. తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఇందులో ఐదు టీ20లతో పాటు మూడే వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననున్న భారత జట్టు.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ నాలుగు టెస్టులు ఆడుతుంది. తదుపరి బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లతోనూ సిరీస్‌లు ఆడాల్సి ఉంది.చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
Rewind 2024: విండీస్‌లో ‘విన్’.. మనూ సూపర్... చెస్‌లో పసిడి కాంతులు
ఏడాది గడిచింది. క్రీడల్లో గెలుపోటములు సహజం. కానీ సమానమంటే మాత్రం కానేకాదు. ఎందుకంటే కప్, రన్నరప్... విజేత, పరాజిత... స్వర్ణం, రజతం... ఒకటి కావు. ఒక రంగులో ఉండవు. ఒక రూపం ఉండదు. అదెప్పటికీ ప్రత్యేకం... అపురూపం!చాంపియన్‌కు, టైటిల్‌కు, ట్రోఫీకి ఉండే విలువే వేరు. నేటితో గడిచిపోయే ఈ యేడాది స్పోర్ట్స్ డైరీలో మరుపురాని విజయాలెన్నో, చిరస్మరణీయ క్షణాలెన్నో ఉన్నాయి. ఓ ప్రపంచకప్ విజయం. ‘పారిస్’లో పతకాల ప్రతాపం. పారాలింపిక్స్‌లో అయితే పతకాల తోరణం!చెస్‌లో ప్రపంచ చాంపియన్లు, ఒలింపియాడ్‌లో స్వర్ణాలు. ఇవన్నీ కూడా సొంతగడ్డపై కాదు... విదేశాల్లోనే విజయకేతనం! ఇది కదా భారత క్రీడారంగానికి శుభ వసంతం... ఏడాది ఆసాంతం! పట్టుదలకు పట్టం, ప్రతిభకు నిదర్శనం... మన క్రీడాకారుల విజయగర్జన. కొత్తేడాదికి సరికొత్త ప్రేరణ. విండీస్‌లో ‘విన్ ఇండియా’ కపిల్‌దేవ్ సారథ్యంలో 1983లో తొలి వన్డే వరల్డ్‌కప్ గెలిచిన చాలా ఏళ్లకు మళ్లీ ధోనీ బృందం 2011లో భారత్‌కు రెండో వన్డే ప్రపంచకప్ ముచ్చట తీర్చింది. అంతకంటే ముందు ఆరంభ టీ20 ప్రపంచకప్ (2007)ను ధోని సారథ్యంలోని యువసేన గెలుచుకొస్తే... 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ సేన ఈ ఏడాది(T20 World Cup 2024) కరీబియన్ గడ్డపై రెండో టీ20 కప్‌ను అందించింది.ప్రతీ మ్యాచ్‌లో భారత్ గర్జనకు ప్రత్యర్థులు తలవంచారు. అయితే దక్షిణాఫ్రికాతో ఫైనల్ మాత్రం కాస్త భిన్నంగా జరిగింది. కోహ్లి ఫైనల్లో రాణించడంతో భారత్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యం కఠినమైందో, క్లిష్టమైందో కాకపోవడం .. క్లాసెన్ అప్పటికే ఐపీఎల్‌తో దంచికొట్టిన ఫామ్‌లో ఉండటంతో మ్యాచ్‌ను సఫారీ చేతుల్లోకి తెచ్చాడు.దాదాపు బంతులు, పరుగులు సమంగా ఉన్న దశలో క్లాసెన్‌ను హార్దిక్ అవుట్ చేశాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో బుమ్రా, యువ పేసర్ అర్ష్‌దీప్ పరుగుల్ని ఆపేశారు. సూర్యకుమార్ చరిత్రలో నిలిచే క్యాచ్... ఇలా ప్రతిఒక్కరు కడదాకా పట్టుబిగించడంతో భారత్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.మను భాకర్... సూపర్పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుకున్నారు. అరడజను పతకాలైతే పట్టారు. కానీ స్వర్ణమే లోటు! బహుశా వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) (100 గ్రాముల అధిక బరువు) అనర్హతకు గురి కాకుంటే రెజ్లింగ్‌లో పసిడి పట్టేదేమో! షూటర్ మను భాకర్(Manu Bhaker) టోక్యోలో ఎదురైన నిరాశను అధిగమించేలా పారిస్ ఒలింపిక్స్‌ను చిరస్మరణీయం చేసుకుంది.ఒకే ఒలింపిక్స్‌లో ‘హ్యట్రిక్’ పతకం, అరుదైన ఘనత చేజారినా... ఆమె రెండు కాంస్య పతకాలు సాధించింది. మళ్లీ స్వర్ణం తెస్తాడని గంపెడాశలు పెట్టుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టాడు. స్వప్నిల్ కుసాలే (షూటింగ్), అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్) కాంస్యాలు నెగ్గారు.హాకీ ఆటకు ఒలింపిక్స్‌లో పునర్వైభవం మొదలైనట్లుంది. వరుస ఒలింపిక్స్‌లో మన పురుషుల జట్టు కాంస్యం సాధించింది. షట్లర్ లక్ష్యసేన్, లిఫ్టర్ మీరాబాయి చాను, షూటర్ అర్జున్ బబుతా త్రుటిలో ఒలింపిక్ పతకాన్ని (కాంస్యం) కోల్పోయారు. ఓవరాల్‌గా 206 మందితో కూడిన భారత బృందం ఒక రజతం, ఐదు కాంస్య పతకాలతో సంతృప్తికరంగా ఈవెంట్‌ను ముగించింది. ‘పారా’లో ఔరా అనేలా మన ప్రదర్శన పారాలింపియన్ల పట్టుదలకు వైకల్యం ఓడిపోయింది. 84 మందితో పారిస్‌కు వెళ్లిన మన బృందం 29 పతకాలతో కొత్త చరిత్ర లిఖించింది. పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచిన భారత్ మునుపెన్నడు గెలవనన్నీ పతకాల్ని చేజిక్కించుకుంది. ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 13 కాంస్యాలు గెలుచుకుంది.అవని లెఖరా, సుమిత్ అంటిల్, మరియప్పన్ తంగవేలు, శీతల్ దేవి, నితీశ్ కుమార్, ప్రవీణ్ కుమార్, నవ్‌దీప్ సింగ్, హర్విందర్ సింగ్, ధరంవీర్ తదితరులు పతకాల పంట పండించారు. చదరంగంలో ‘పసిడి ఎత్తులు’భారత్‌లో చెస్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విశ్వనాథన్ ఆనంద్! ఆ తర్వాత మరెంతో మంది గ్రాండ్‌మాస్టర్లు వచ్చారు. కానీ అతనిలా భారత చదరంగంలో నిలిచిపోలేదు. అయితే ఈ ఏడాది మాత్రం చదరంగంలో స్వర్ణ చరిత్రను ఆవిష్కరించింది.చెస్ ఒలింపియాడ్, క్యాండిడేట్స్ టోర్నీ (ప్రపంచ చాంపియన్‌తో తలపడే ప్రత్యర్థిని ఖరారు చేసే ఈవెంట్), ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్ వీటన్నింటా మనదే జేగంట! ఓ రకంగా 2024 భారత చెస్ గడిల్లో తీపిగీతలెన్నో గీసింది. బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో దొమ్మరాజు గుకేశ్, అర్జున్ ఇరిగేశి, విదిత్ గుజరాతి, ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణ... ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, వైశాలి, తానియా సచ్‌దేవ్‌లతో కూడిన భారత బృందం విజయంతో పుటలకెక్కింది.క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన దొమ్మరాజు గుకేశ్(D Gukesh) ఇటీవల క్లాసికల్ ఫార్మాట్లో సరికొత్త ప్రపంచ చాంపియన్‌గా ఆవిర్భవించాడు. అనుభవజ్ఞుడు, డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) ఎత్తుల్ని చిత్తుచేసి అతిపిన్న వయసులో జగజ్జేతగా గుకేశ్ కొత్త రాత రాశాడు. న్యూయార్క్‌లో తెలుగుతేజం, వెటరన్ ప్లేయర్ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో రెండోసారి విజేతగా నిలిచింది. –సాక్షి క్రీడా విభాగం -
Sophie Devine: డివైన్ కల తీరగా...
2010 మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్.. కేవలం 107 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చేరువగా వచ్చిన న్యూజీలండ్ 3 పరుగుల స్వల్ప తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. చివరి వరకు పోరాడిన సోఫీ డివైన్ జట్టును గెలిపించలేక కన్నీళ్ల పర్యంతమైంది. 2024 మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్.. 32 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి న్యూజీలండ్ టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇక్కడా సోఫీ డివైన్ కన్నీళ్లను ఆపడం ఎవరి వల్లా కాలేదు. కానీ ఈసారి ఆమె విజేత స్థానంలో ఉంది. ఈ రెండు సందర్భాల మధ్య ఏకంగా 14 సంవత్సరాల అంతరం ఉంది. 21 ఏళ్ల వయసులో ఓటమిని తట్టుకోలేక ఏడ్చేసిన సోఫీ డివైన్ ఇప్పుడు 35 ఏళ్ల వయసులో సారథిగా, ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకుంది.దేశం తరఫున రెండు వేర్వేరు క్రీడల్లో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో సోఫీ డివైన్ కూడా ఉంది. న్యూజీలండ్ జట్టు తరఫున అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లు ఆడిన ఆమె ఆపై క్రికెటర్‌గా సత్తా చాటి ఇప్పుడు ఆ దేశం తరఫున అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. చిన్నప్పటి నుంచి క్రీడలంటే బాగా ఇష్టపడేది. అందుకే ఆ దేశంలో అంతా పడిచచ్చే రగ్బీ క్రీడాకారిణి కావాలనుకుంది. అయితే 11 ఏళ్ల వయసులో స్కూల్లో క్రికెట్ జట్టులో అవకాశం దక్కడంతో అటు వైపు మళ్లింది. ఆపై మూడేళ్ల పాటు క్రికెట్‌పైనే దృష్టి పెట్టింది. తన స్కూల్, కాలేజీలకు చెందిన అబ్బాయిల జట్టు తరఫునే డివైన్ ఆడేది. మరోవైపు అదే కాలేజీ తరఫున అబ్బాయిల హాకీ టీమ్‌లోకి కూడా ఎంపిక కావడం విశేషం. దాంతో దాదాపు సమానంగా రెండు క్రీడల్లో ఆమె ప్రస్థానం మొదలైంది. 14 ఏళ్ల వయసులో మహిళల సీనియర్ హాకీ టీమ్ తరఫున సత్తా చాటడంతో 2009 జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం వచ్చింది. అయితే తండ్రి ఉద్యోగం కారణంగా ఆమె కుటుంబం వెలింగ్టన్ నుంచి క్రైస్ట్‌చర్చ్ వెళ్లిపోగా కెరీర్ పరంగా కీలక దశలో ఏదో ఒక ఆటను ఎంచుకోవాల్సిన తరుణం వచ్చింది. దాంతో హాకీకి గుడ్‌బై చెప్పిన డివైన్ క్రికెట్‌పైనే పూర్తి దృష్టి పెట్టింది. పిన్న వయస్కురాలిగా..క్రికెటర్‌గా డివైన్ పడిన శ్రమ వృథా కాలేదు. పేస్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె మూడేళ్లపాటు రాష్ట్ర జట్టు కాంటర్బరీ తరఫున సత్తా చాటింది. దాంతో 17 ఏళ్ల వయసులోనే న్యూజీలండ్ టీమ్‌లో స్థానం లభించింది. అతి పిన్న వయసులో ఇలాంటి అవకాశం దక్కించుకున్న ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న డివైన్‌కు ఈ వార్త తెలిసే సమయంలో ఆమె కాలేజీ పరీక్షలు రాస్తోంది. ఒక్కసారి టీమ్‌లోకి వచ్చాక మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. అటు బౌలింగ్‌తో పాటు ఇటు దూకుడైన బ్యాటింగ్‌లో కూడా తన ముద్ర చూపించడంతో 2009 టి20 వరల్డ్ కప్‌లో ఆడే కివీస్ టీమ్‌లోకి ఎంపికైంది. ఈ టోర్నమెంట్లో కివీస్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ తర్వాత ఒక్కొక్కరుగా సీనియర్లు ఆటకు దూరం అవుతుండగా.. తమ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించి భవిష్యత్ తారగా గుర్తింపు తెచ్చుకున్నవారిలో డివైన్ ప్రత్యేకతే వేరు. 15 ఏళ్ల వయసులోనే తాను టైప్ 1 డయాబెటిస్తో బాధపడినా పట్టుదల, తగిన డైటింగ్‌తో దాని ప్రభావం తన మీద పడకుండా ఆ ప్రతికూలతను అధిగమించింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో..పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటర్‌గా తన ఆటను అద్భుతంగా మార్చుకోవడంతో డివైన్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక సమయంలో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆమె తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఓపెనర్ స్థాయికి ఎదగడం విశేషం. ఒకసారి బ్యాటర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బ్యాటింగ్‌లో తన భారీ షాట్లతో పలు సంచలనాలు సృష్టించింది. 2013 వన్డే వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాపై 131 బంతుల్లో 145 పరుగులు, అంతర్జాతీయ మహిళల టి20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (18 బంతుల్లో), పాకిస్తాన్‌పై ఒక వన్డేలో బాదిన 9 సిక్సర్లు ఆమె ధాటిని తెలియజేశాయి. ఓవరాల్‌గా మహిళల టి20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (36 బంతుల్లో) రికార్డు డివైన్ పేరిటే ఉండగా అటు పురుషుల, మహిళల అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 6 మ్యాచ్‌లలో కనీసం అర్ధ సెంచరీ సాధించిన రికార్డు ఆమె సొంతం. మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నీలో డివైన్ ఖాతాలో ఏకంగా 4 శతకాలు ఉండటం మరో విశేషం. సారథిగా నడిపించి..దుబాయ్‌లో జరిగిన టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు న్యూజీలండ్ జట్టు వరుసగా 10 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో అడుగుపెట్టినప్పుడు ఆ జట్టుపై ఎలాంటి కనీస అంచనాలు కూడా లేవు. సహజంగానే టీమ్‌లో వాతావరణం గంభీరంగా ఉండేది. అలాంటి సమయంలో డివైన్ జట్టు సహచరుల్లో స్ఫూర్తి నింపింది. ‘వరల్డ్ క్రికెట్లో ఏదీ సులువుగా రాదు. 14 ఏళ్ల తర్వాత కూడా నేను ప్రపంచ కప్ కల కంటున్నానంటే ఏదీ అసాధ్యం కాదనే నమ్మకంతోనే! ఫలితం గురించి ఆలోచించవద్దు. ఓడినా నాలాగా మీకు భవిష్యత్తులో మళ్లీ అవకాశం వస్తుంది’ అని చెప్పింది. ఆ గ్రూప్ నుంచి ఆసీస్‌తో పాటు భారత్ మాత్రమే సెమీస్ చేరుతుందని అంతా భావించారు. అయితే డివైన్ మాత్రం తొలి మ్యాచ్‌లో భారత్‌తో గెలిస్తే చాలు.. అంతా మారిపోతుందని నమ్మింది. భారత్‌పై తానే అర్ధసెంచరీతో గెలిపించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది. ఆమె చెప్పినట్లు నిజంగానే ఆపై కివీస్ ఎదురులేకుండా దూసుకుపోయింది. వరల్డ్ కప్ విజేతగా నిలిచే వరకు సోఫీ డివైన్ టీమ్ ఆగిపోలేదు. ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
T20 WC: మనసులోనే శపిస్తున్నావని తెలుసు: సంజూతో రోహిత్!
టీ20 ప్రపంచకప్-2024 జట్టుకు ఎంపికైనా.. ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్. రిషభ్ పంత్ తిరిగి జట్టులోకి వచ్చిన కారణంగా ఈ వికెట్ కీపర్‌ను ఈవెంట్ ఆసాంతం బెంచ్‌కే పరిమితం చేసింది మేనేజ్మెంట్. అయితే, ఈ ఐసీసీ టోర్నమెంట్లో రోహిత్ సేన చాంపియన్‌గా నిలవడంతో వరల్డ్‌కప్ గెలిచిన సభ్యుల జాబితాలో మాత్రం సంజూ తన పేరును లిఖించుకోగలిగాడు.ఈ నేపథ్యంలో తాజాగా గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న సంజూ శాంసన్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. సౌతాఫ్రికాతో ఫైనల్‌కు ముందు తనకు మేనేజ్మెంట్ నుంచి మెసేజ్ వచ్చిందని.. మెగా మ్యాచ్‌కు సిద్ధంగా ఉండాలని యాజమాన్యం చెప్పినట్లు తెలిపాడు. అయితే, ఆఖరి నిమిషంలో తన అదృష్టం తారుమారైందని.. పాత జట్టుతోనే టైటిల్ మ్యాచ్ ఆడాలనే నిర్ణయం తీసుకున్నారని సంజూ పేర్కొన్నాడు.ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ తన దగ్గరకు వచ్చి మాట్లాడిన మాటలను ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. జర్నలిస్టు విమల్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఫైనల్‌కు ముందు వార్మప్ మ్యాచ్ ఆడుతున్నపుడు రోహిత్ నన్ను పక్కకు తీసుకువెళ్లి మాట్లాడాడు.జట్టు నుంచి నన్ను తప్పిస్తూ ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో వివరించాడు. ‘నేను ఇలా ఎందుకు చేశానో నీకు అర్థమైంది కదా!.. ఆఖరి నిమిషంలో ఇలా కూడా జరుగుతుందని నీకు తెలుసు కదా! ఇది సహజమైన ప్రక్రియే!’ అని నాతో అన్నాడు. అందుకు బదులిస్తూ.. ‘ముందుగా మ్యాచ్ గెలవాలి.ఇప్పుడు మీ దృష్టి మొత్తం మ్యాచ్ మీదే పెట్టండి. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం’ అని చెప్పాను. అయితే, నిమిషం తర్వాత మళ్లీ నా దగ్గరకు వచ్చాడు. ‘మనసులో నాకు శాపనార్థాలు పెడుతున్నావని నాకు తెలుసు. నాకు తెలిసి నువ్వు సంతోషంగా లేవు. మీ మైండ్‌లో ఇంకేదో విషయం ఉందనిపిస్తోంది’ అన్నాడు.అప్పుడు నేను.. ‘ఓ ఆటగాడిగా మ్యాచ్ ఆడాలని నేను ఆశపడటం సహజం. మీ నిర్ణయాన్ని మాత్రం పూర్తిగా గౌరవిస్తున్నాను. మ్యాచ్ ఆడలేకపోయాననే పశ్చాత్తాపం నాకు ఉంటుంది. మీ లాంటి గొప్ప లీడర్‌తో వరల్డ్‌కప్ ఫైనల్ ఆడలేకపోతున్నాననే బాధ ఉంటుంది. అదొక్కటే నా మెదడును తొలిచివేస్తుంది’ అని అన్నాను’’ అంటూ సంజూ శాంసన్ నాటి విషయాలు గుర్తు చేసుకున్నాడు.‘‘ఏదేమైనా ఫైనల్‌కు సిద్ధంగా ఉండాలని ముందుగానే చెప్పడంతో నేను మానసికంగా రెడీ అయిపోయా. అయితే, టాస్కు ముందు పాత జట్టునే కొనసాగించాలని నిర్ణయించారు. కాస్తత నిరాశకు గురైనా.. పర్లేదు. ఇలాంటివి సహజమే అని సరిపెట్టుకున్నా. అయితే, టాస్ పడటానికి ముందు కూడా రోహిత్ శర్మ నా దగ్గరకు వచ్చి.. నాకోసం పది నిమిషాలు కేటాయించడం మామూలు విషయం కాదు. అతడి స్థానంలో వేరే వాళ్లు ఉంటే ఇలా చేసే వారు కాదేమో’’ అని సంజూ శాంసన్ రోహిత్‌పై ప్రశంసలు కురిపించాడు. చదవండి: ఓవర్ వెయిట్..! టీమిండియా ఓపెనర్‌కు ఊహించని షాక్? -
మహిళల టి20 ప్రపంచకప్ విశ్వవిజేతగా న్యూజిలాండ్ (ఫొటోలు)
-
T20 WC: పాక్‌పై గెలిచి సెమీస్‌కు న్యూజిలాండ్.. భారత్ ఇంటికి
దుబాయ్: టి20 వరల్డ్ కప్‌లో భారీ అంచనాలతో వెళ్లిన భారత మహిళల బృందం కథ లీగ్ దశలోనే ముగిసింది. తమ అదృష్టాన్ని ఇతర జట్ల చేతిలో పెట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్‌కు కలిసి రాలేదు. గ్రూప్ ‘ఎ’ చివరి పోరులో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ నెగ్గితేనే భారత్ ముందంజ వేసే అవకాశం ఉండగా... కివీస్ ఆ అవకాశం ఇవ్వలేదు. లీగ్ దశలో మూడో విజయంతో ఆ జట్టు దర్జాగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 54 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ముందుగా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగా... పాక్ 11.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. 2 కీలక వికెట్లు తీసిన ఎడెన్ కార్సన్ (2/7) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. ఈ గ్రూప్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లూ గెలిచి ఆ్రస్టేలియా ఇప్పటికే సెమీస్ చేరగా, కివీస్‌కు రెండో స్థానం ఖాయమైంది. రెండు విజయాలకే పరిమితమైన భారత్ టోర్నీ నుంచి ని్రష్కమించింది. గెలిపించిన బౌలర్లు... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. నెమ్మదైన పిచ్‌పై ఎవరూ దూకుడుగా ఆడలేకపోవడంతో పరుగులు వేగంగా రాలేదు. సుజీ బేట్స్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, హ్యాలిడే (22), సోఫీ డివైన్ (19), ప్లిమ్మర్ (17) కీలక పరుగులు జోడించారు. పాక్ బౌలింగ్ మెరుగ్గా ఉన్నా... టీమ్ ఫీల్డింగ్ దెబ్బ తీసింది. పాక్ ఫీల్డర్లు ఏకంగా 8 క్యాచ్‌లు వదిలేయడంతో కివీస్ 100 పరుగులు దాటగలిగింది. అనంతరం పాక్ పేలవమైన బ్యాటింగ్‌తో చేతులెత్తేసింది. సులువైన లక్ష్యం ముందున్నా ఆ జట్టు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వకపోగా, కివీస్ బౌలర్లు సెమీస్ స్థానం కోసం బలంగా పోరాడారు. పాక్ జట్టులో ఫాతిమా సనా (21), మునీబా (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. పవర్‌ప్లే లోపే 5 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు... 12 బంతుల వ్యవధిలో చివరి 5 వికెట్లు చేజార్చుకుంది. -
W T20 WC: కథ మళ్లీ మొదటికి...
‘నా దృష్టిలో టి20ల్లో ఇదే భారత అత్యుత్తమ జట్టు. 15 మందిలో 12 మందికి ప్రపంచ కప్ ఆడిన అనుభవం ఉంది. అందరికీ తమ బాధ్యతలు బాగా తెలుసు. వారి సత్తాపై నాకు బాగా నమ్మకముంది’... వరల్డ్ కప్ కోసం బయల్దేరే ముందు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేసిన వ్యాఖ్య ఇది. కానీ తుది ఫలితం చూస్తే మాత్రం అందరికీ నిరాశ కలిగింది. ప్లేయర్‌గా 9వ ప్రయత్నంలో కూడా వరల్డ్ కప్ ట్రోఫీ లేకుండానే హర్మన్ ముగించింది. వరుసగా గత మూడు టి20 వరల్డ్ కప్‌లలో సెమీస్, ఫైనల్, సెమీస్... ఇదీ మన ప్రదర్శన. టీమ్ బలాబలాలు, ఫామ్, ర్యాంక్‌ను బట్టి చూసుకుంటే మన జట్టు మహిళల క్రికెట్లో కచ్చితంగా టాప్–4లో ఉంటుంది. కాబట్టి మరో చర్చకు తావు లేకుండా కనీసం సెమీఫైనల్ అయినా చేరుతుందని అందరూ అంచనా వేశారు. తర్వాతి రెండు నాకౌట్ మ్యాచ్‌ల సంగతేమో కానీ... సెమీస్ గురించి ఎవరికీ సందేహాలు లేవు. ఆటగాళ్లలో దూకుడు, ఆత్మవిశ్వాసమే కనిపించలేదుగత రెండు సీజన్లుగా పూర్తి స్థాయిలో సాగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాణించి అవకాశం దక్కించుకున్న యువ ప్లేయర్లు జట్టును మరింత పటిష్టంగా మార్చారు. ఇలాంటి స్థితిలో వరల్డ్ కప్‌లో జట్టు ప్రదర్శన ఆశ్చర్యం కలిగించింది. అసలు ఆటగాళ్లలో దూకుడు, ఆత్మవిశ్వాసమే కనిపించలేదు. పైగా యూఏఈలో వాతావరణం, పిచ్‌లు భారత్‌కు అనుకూలం అంటూ జరిగిన ప్రచారంతో హర్మన్ బృందం ఫేవరెట్‌గా మారింది. కొన్ని రోజుల క్రితమే ఆసియా కప్ ఫైనల్లో భారత్ అనూహ్యంగా శ్రీలంక చేతిలో ఓడింది. అయితే ఆ మ్యాచ్ ఒక ‘అరుదైన పరాజయం’గానే అంతా భావించారు. ఎందుకంటే ఫైనల్‌కు ముందు ఆ టోర్నీలో మన జట్టు అద్భుతంగా ఆడింది. కాబట్టి దాని ప్రభావం వరల్డ్ కప్‌పై ఉండకపోవచ్చు అని కూడా అంతా భావించారు. గ్రూప్ ‘ఎ’ నుంచి ఆస్ట్రేలియా తర్వాత రెండో జట్టుగా భారత్ సెమీస్ చేరే అవకాశం కనిపించింది. అయితే తొలి పోరులో న్యూజిలాండ్ చేతిలో 58 పరుగులతో చిత్తుగా ఓడటంతోనే అంతా తలకిందులైంది. ఆసీస్ ముందు తలవంచిసెమీస్లో స్థానం కోసం మనతో పోటీ పడే జట్టుపై గెలవకపోవడమే చివరకు దెబ్బ తీసింది. ఆ తర్వాత పాక్‌పై 106 పరుగుల లక్ష్యాన్ని అందుకునేందుకు కూడా 18.5 ఓవర్లు తీసుకోవడం మన బలహీన ఆటను గుర్తు చేసింది. ఆపై శ్రీలంకను 82 పరుగులతో చిత్తు చేసినా... ఆసీస్ ముందు తలవంచాల్సి వచ్చింది. నాలుగో వికెట్‌కు హర్మన్, దీప్తి 55 బంతుల్లోనే 63 పరుగులు జోడించి గెలుపు దిశగా సాగుతున్న మ్యాచ్‌లో కూడా చివరకు మన జట్టు తలవంచింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో హర్మన్ స్ట్రైక్ రొటేట్ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఈ టోర్నీలో ఓవరాల్‌గా లంకపై మినహా మన ఆటతీరు అతి సాధారణంగా కనిపించింది.హర్మన్ ఒక్కతే రెండు అర్ధసెంచరీలు చేయగా... టాప్–5లో మిగతా నలుగురు పూర్తిగా విఫలమయ్యారు. స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన కూడా మూడు కీలక మ్యాచ్‌లలో కనీస ప్రదర్శన ఇవ్వలేదు. షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. బ్యాటింగ్‌తో పోలిస్తే మన బౌలింగ్ మెరుగ్గా అనిపించింది. అరుంధతి రెడ్డి, రేణుక సింగ్ చెరో 7 వికెట్లతో ఆకట్టుకోగా... ఆశా శోభన రాణించింది. అయితే సమష్టి వైఫల్యం కివీస్, ఆసీస్‌తో మ్యాచ్‌లలో దెబ్బ తీసింది. సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన ఫిట్నెస్ క్యాంప్, స్కిల్ క్యాంప్‌లు చాలా బాగా జరిగాయని కోచ్ అమోల్ మజుందార్ చెప్పాడు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ముగ్ధ బవరే కూడా జట్టుతో ఉంది. కానీ తాజా ఫలితం చూస్తే అతను మెరుగుపర్చాల్సిన అంశాలు చాలా ఉన్నాయనేది స్పష్టం. –సాక్షి క్రీడా విభాగం -
వరుసగా విఫలమవుతున్నా ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్న హర్మన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఐసీసీ తాజాగా విడుదల చేసి టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. హర్మన్ ఇటీవలికాలంలో తరుచూ విఫలమవుతున్నా నాలుగు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకుంది. హర్మన్ శ్రీలంకకు చెందిన హర్షిత సమరవిక్రమతో కలిసి సంయుక్తంగా 12వ స్థానాన్ని షేర్ చేసుకుంది. ఈ ఇద్దరి ఖాతాలో 610 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.హర్మన్ తాజాగా పాక్‌తో జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో 29 పరుగులతో అజేయంగా నిలిచింది. దీనికి ముందు ఆమె న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగులు మాత్రమే చేసి ఔటైంది. ఈ మ్యాచ్‌లో హర్మన్ కెప్టెన్‌గానూ విఫలమైంది. భారత్ ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. మిగతా భారత క్రికెటర్ల విషయానికొస్తే.. స్మృతి మంధన ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోగా.. జెమీమా రోడ్రిగెజ్ రెండు స్థానాలు కోల్పోయి 20వ స్థానానికి చేరింది. బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ రెండు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోగా.. రేణుకా సింగ్ ఐదో స్థానాన్ని కాపాడుకుంది. మరో ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 29వ స్థానానికి చేరుకుంది.ఓవరాల్‌గా చూస్తే.. బ్యాటింగ్‌లో బెత్ మూనీ, తహిళ మెక్‌గ్రాత్, లారా వోల్వార్డ్ట్ టాప్-3లో కొనసాగుతుండగా.. బౌలింగ్‌లో సోఫీ ఎక్లెస్టోన్, సదియా ఇక్బాల్, సారా గ్లెన్ టాప్-3లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. హేలీ మాథ్యూస్, ఆష్లే గార్డ్నర్, మేలీ కెర్ టాప్-3లో ఉన్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ రేపు (అక్టోబర్ 9) జరుగబోయే మ్యాచ్‌లో శ్రీలంకతో పోటీపడనుంది. సెమీస్ రేసులో ముందుండాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పనిసరిగా గెలవాలి. ఈ మ్యాచ్‌లో గెలిచినా టీమిండియా సెమీస్‌కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు. భారత్ తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. తదుపరి భారత్ పాకిస్తాన్‌పై గెలిచినా నెట్ రన్‌రేట్ ఇంకా మైనస్‌లోనే ఉంది. మొత్తంగా భారత్ సెమీస్‌కు చేరాలంటే తదుపరి గ్రూప్ మ్యాచ్‌లన్నీ గెలవాల్సి ఉంటుంది. చదవండి: నవంబర్ 17 నుంచి దిగ్గజాల క్రికెట్ లీగ్.. టీమిండియా కెప్టెన్‌గా సచిన్ -
వరల్డ్‌కప్ ఫైనల్లో పంత్ మాస్టర్ ప్లాన్.. అలా మేము గెలిచాం: రోహిత్
టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో రిషభ్ పంత్ వేసిన మాస్టర్ ప్లాన్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు. మోకాలి గాయం పేరిట పంత్ ఆలస్యం చేయడం వల్ల సౌతాఫ్రికాను దెబ్బకొట్టగలిగామని పేర్కొన్నాడు. అయితే, తాము చాంపియన్లుగా నిలవడానికి ఇదొక్కటే కారణం కాదని.. సమిష్టి ప్రదర్శనతో ట్రోఫీ గెలిచామని తెలిపాడు.ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓడించికాగా ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు పదకొండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ ఐసీసీ టోర్నీలో జయభేరి మోగించింది. తుదిపోరులో సౌతాఫ్రికాను ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓడించి టైటిల్ గెలిచింది.అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం టీమిండియా వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌గా కొనసాగుతున్న రోహిత్.. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో గెలిచాడు. తదుపరి న్యూజిలాండ్‌తో టెస్టులతో బిజీ కానున్నాడు.తన తెలివితేటల్ని చక్కగా అమలు చేశాడుఈ క్రమంలో రోహిత్ శర్మ కపిల్ శర్మ షోకు హాజరైన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా వరల్డ్‌కప్ ఫైనల్ నాటి ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. ‘‘అప్పటికి సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేయాల్సిన పటిష్ట స్థితిలో ఉంది. అంతకంటే కాస్త ముందు మాకు చిన్న విరామం దొరికింది.అప్పుడే పంత్ తన తెలివితేటల్ని చక్కగా అమలు చేశాడు. అతడి మోకాలికి గాయమైనట్లుగా కనిపించాడు. ఫిజియోథెరపిస్టులు వచ్చి అతడి మోకాలికి కట్టుకట్టారు. నిజానికి అప్పుడు సౌతాఫ్రికా మంచి రిథమ్‌లో ఉంది. త్వరత్వరగా బ్యాటింగ్ ముగించేయాలని చూసింది.అయితే, పంత్ చేసిన పనివల్ల సౌతాఫ్రికా మొమెంటమ్ కాస్త నెమ్మదించేలా చేయగలిగాం. వారి ఊపును కాస్త నిలువరించగలిగాం. ఆ సమయంలో బంతిని దబాదబా బాదేయాలని కాచుకుని ఉన్నారు బ్యాటర్లు. అయితే, పంత్ వల్ల వారి రిథమ్‌ను మేము బ్రేక్ చేయగలిగాం.పంత్ అకస్మాత్తుగా కింద పడిపోయాడునేను ఫీల్డింగ్ సెట్.. చేస్తూ బౌలర్లతో మాట్లాడుతున్న సమయంలో పంత్ అకస్మాత్తుగా కింద పడిపోవడం గమనించాను. ఫిజియోథెరపిస్ట్ వచ్చి చికిత్స చేశారు. మ్యాచ్ త్వరగా మొదలుపెట్టాలని క్లాసెన్ చూస్తున్న సమయంలో ఇలాంటి ఘటన వారిని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు.అయినా, మేము గెలవడానికి ఇదొక్కటే ప్రధాన కారణం అని చెప్పను. అయితే, విజయానికి దారితీసిన పరిస్థితుల్లో ఇదొకటి. పంత్ సాబ్ మైదానంలో ఇలా తన స్మార్ట్‌నెస్ చూపిస్తూ.. మాకు మేలు చేస్తూ ఉంటాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. పంత్ వల్ల జరిగిన ఆలస్యానికి జరిమానా ఎదుర్కోవడానికి కూడా తాము రిస్క్ చేసినట్లు తెలిపాడు.పాండ్యా చేసిన అద్భుతంకాగా సౌతాఫ్రికా విజయానికి 30 పరుగుల దూరంలో ఉన్నపుడు విధ్వంసకర వీరులు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నారు. అయితే, హార్దిక్ పాండ్యా పదిహేడో ఓవర్లో తొలి బంతికి క్లాసెన్(52)ను వెనక్కి పంపడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక ఆఖరి ఓవర్లోనూ హార్దిక్ అద్భుతం చేశాడు. మిల్లర్(21)తో పాటు టెయిలెండర్లు కగిసో రబడ(3), అన్రిచ్ నోర్జే(1)లను అవుట్ చేసి భారత్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొమ్మిది పరుగులకే పరిమితం కాగా.. పంత్ డకౌట్ అయ్యాడు. కోహ్లి 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.చదవండి: ఐపీఎల్లో ఆ జట్టుకు కెప్టెన్‌గా సూర్య?.. స్పందించిన ‘స్కై’Captain Rohit Sharma revealed the untold story of Rishabh Pant when India needed to defend 30 runs in 30 balls. Two Brothers ! 🥺❤️pic.twitter.com/EmqIrrCFb3— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 (@IamHydro45_) October 5, 2024 -
T20 World Cup 2024: 3836 రోజుల తర్వాత దక్కిన విజయం..!
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్పై బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయం బంగ్లాదేశ్ ఆటగాళ్లకు చాలా ప్రత్యేకం. ఈ గెలుపుతో బంగ్లా ఆటగాళ్లు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టడంతో పాటు 3836 రోజుల సుదీర్ఘ విరామానంతరం ఓ టీ20 వరల్డ్‌కప్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయం అనంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్లు చాలా భావోద్వేగానికి లోనయ్యారు. 10 ఏళ్ల అనంతరం వరల్డ్‌కప్‌లో లభించిన విజయం కావడంతో బంగ్లా కెప్టెన్ నిగార్ సుల్తానా కన్నీరు పెట్టుకుంది. బంగ్లాదేశ్ చివరి సారి 2014 టీ20 వరల్డ్‌కప్‌లో విజయం సాధించింది. నాడు బంగ్లాదేశ్ ఐర్లాండ్‌పై 17 పరుగుల తేడాతో గెలుపొందింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ వరుసగా 16 టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో ఓడింది. నాలుగు ఎడిషన్లలో (2016, 2018, 2020, 2023) ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు.An emotional win 💯Bangladeshi skipper Nigar Sultana reacts after a streak breaking victory 🙌 👇https://t.co/aarEGSWApL— Cricket.com (@weRcricket) October 3, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టీ20 వరల్డ్‌కప్ 2024లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. షార్జా వేదికగా నిన్న (అక్టోబర్ 3) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. 36 పరుగులు చేసిన శోభన మోస్తరీ టాప్ స్కోరర్‌గా నిలువగా.. శాంతి రాణి (29), ముర్షిదా ఖాతూన్ (12), నిగార్ సుల్తానా (18), ఫాతిమా ఖాతూన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. తాజ్ నెహర్ 0, షోర్నా అక్తెర్ 5, రీతూ మోనీ 5 పరుగులు చేయగా.. రబేయా ఖాన్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచింది. స్కాట్లాండ్ బౌలర్లలో సస్కియా హోర్లీ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైస్, ఒలివియా బెల్, కేథరీన్ ఫ్రేసర్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 120 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రీతూ మోనీ 2, రబేయా ఖాన్, మరుఫా అక్తెర్, నహిదా అక్తెర్, ఫాహిమా ఖాతూన్ తలో వికెట్ తీసి స్కాట్లాండ్ను కట్టడి చేశారు. స్కాట్లాండ్ సారా బ్రైస్ (49 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేథరీన్ బ్రైస్ (11), ఐల్సా లిస్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.చదవండి: బోణీ బాగుండాలి -
లంక బౌలర్ల విజృంభణ.. 116 పరుగులకే కుప్పకూలిన పాక్
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయారు. లంక బౌలర్లు మూకుమ్మడిగా రాణించిన పాక్‌ను నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. లంక బౌలర్ల ధాటికి 116 పరుగులకు ఆలౌటైంది. సుగంధిక కుమారి, ఉదేషిక ప్రభోదని, చమారీ ఆటపట్టు తలో మూడు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. కవిష దిల్హరి ఓ వికెట్ తీసింది. పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఫాతిమా సనా 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. నిదా దార్ (23), మునీబా అలీ (11), సిద్రా అమిన్ (12), ఒమైమా సొహైల్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. గుల్ ఫెరోజా (2), తుబా హసన్ (5), అలియా రియాజ్ (0), డయానా బేగ్ (2), సదియా ఇక్బాల్ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఇదిలా ఉంటే, ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్పై బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.చదవండి: బంగ్లాదేశ్‌తో తొలి టీ20.. తెలుగు కుర్రాడికి అవకాశం లేనట్లే..! -
T20 World Cup 2024: బోణి కొట్టిన బంగ్లాదేశ్
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. ఇవాళ (అక్టోబర్ 3) జరిగిన మెగా టోర్నీ ఓపెనర్‌లో బంగ్లా మహిళల జట్టు స్కాట్లాండ్పై 16 పరుగుల తేడాతో గెలుపొందింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. 36 పరుగులు చేసిన శోభన మోస్తరీ టాప్ స్కోరర్‌గా నిలువగా.. శాంతి రాణి (29), ముర్షిదా ఖాతూన్ (12), నిగార్ సుల్తానా (18), ఫాతిమా ఖాతూన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. తాజ్ నెహర్ 0, షోర్నా అక్తెర్ 5, రీతూ మోనీ 5 పరుగులు చేయగా.. రబేయా ఖాన్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచింది. స్కాట్లాండ్ బౌలర్లలో సస్కియా హోర్లీ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైస్, ఒలివియా బెల్, కేథరీన్ ఫ్రేసర్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 120 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రీతూ మోనీ 2, రబేయా ఖాన్, మరుఫా అక్తెర్, నహిదా అక్తెర్, ఫాహిమా ఖాతూన్ తలో వికెట్ తీసి స్కాట్లాండ్ను కట్టడి చేశారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో సారా బ్రైస్ (49 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేథరీన్ బ్రైస్ (11), ఐల్సా లిస్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ గ్రూప్-బిలో అగ్రస్థానానికి చేరుకుంది. మెగా టోర్నీలో ఇవాళ మరో మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-ఏలో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. షార్జా వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. చదవండి: Irani Cup 2024: సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్ -
బాబర్‌కు ఇప్పుడైనా సిగ్గు వచ్చింది: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజంపై ఆ దేశ మాజీ బౌలర్ సికందర్ బఖ్త్ ఘాటు విమర్శలు చేశాడు. ఇప్పటికైనా బాబర్‌కు సిగ్గు వచ్చిందని.. అందుకే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైనపుడే ఈ పని చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.వరుస వైఫల్యాలుకాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాక్ జట్టు పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో అఫ్గనిస్తాన్ చేతిలో తొలిసారి వన్డే పరాజయం చవిచూసిన బాబర్ బృందం.. సెమీస్ కూడా చేరుకుండానే నిష్క్రమించింది. దీంతో మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తగా బాబర్ ఆజం టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.తిరిగి వన్డే, టీ20 కెప్టెన్‌గా ఈ క్రమంలో టెస్టు జట్టుకు షాన్ మసూద్‌ను నాయకుడిగా ఎంపిక చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. టీ20 పగ్గాలను ఫాస్ట్ బౌలర్ షాహిన్ ఆఫ్రిదికి అప్పగించింది. అయితే, వీరిద్దరు ఆరంభం నుంచే కెప్టెన్లుగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి ముందు షాహిన్‌పై వేటు వేసిన పీసీబీ.. బాబర్ ఆజంను తిరిగి వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమించింది.తాజాగా మరోసారి రాజీనామాఅయితే, అమెరికా- వెస్టిండీస్‌లో జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శన కనబరిచింది. పసికూన అమెరికా చేతిలో ఓడటమే గాక.. కనీసం సూపర్-8 దశకు కూడా అర్హత సాధించకుండానే ఇంటిబాట పట్టింది. జూన్‌లో ఈ టోర్నీ ముగిసిన నాటి నుంచి బాబర్ ఆజం.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అతడు బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించాడు.ఇప్పటికైనా అతడికి సిగ్గు వచ్చిందిబ్యాటింగ్పై దృష్టి పెట్టే క్రమంలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు బాబర్ ప్రకటించాడు. ఈ విషయంపై స్పందించిన సికందర్ బఖ్త్.. ‘‘ఇప్పటికైనా అతడికి సిగ్గు వచ్చింది. నిజానికి వరల్డ్‌కప్‌లో మా జట్టు ఓడిన నాడు.. అంటే జూన్ 16నే అతడు ఈ నిర్ణయం తీసుకోవాల్సింది.బోర్డు అతడిని రిజైన్ చేయమని చెప్పిందిఅప్పుడే కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సింది. దేశం మొత్తం ఇదే కోరుకుంది. కానీ అతడు మొండిగా ప్రవర్తించాడు. తను తాను ఓ కింగ్‌లా ఊహించుకోవడం బాబర్‌కు అలవాటు. తన ఆట తీరు బాగా లేకున్నా.. బాగుందనే ఫీలవుతాడు. అయితే, బోర్డు అతడిని రిజైన్ చేయమని చెప్పింది. అందుకే ఇప్పటికైనా కెప్టెన్సీని వదులుకున్నట్లు ప్రకటించాడు’’ అని పేర్కొన్నాడు.ఇంటా, బయటా వరుస ఓటములు.. అయినాకాగా టెస్టులకు షాన్ మసూద్‌నే సారథిగా కొనసాగించడంపై కూడా సికందర్ బఖ్త్ విమర్శలు చేశాడు. ఇంటా, బయటా వరుస టెస్టు సిరీస్‌లలో ఓటములనే బహుమతిగా ఇస్తున్న ఆటగాడు కెప్టెన్‌గా ఉండటం దురదృష్టకరమంటూ పెదవి విరిచాడు. కాగా పాకిస్తాన్ తరఫున 1976- 1989 వరకు సికందర్ బఖ్త్ అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 26 టెస్టుల్లో 67, వన్డేల్లో 33 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.చదవండి: ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను టీమిండియా కాపీ కొట్టింది: వాన్ -
టీ20 వరల్డ్‌కప్.. కామెంటేటర్ల జాబితా విడుదల
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024కు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. మెగా టోర్నీ కోసం వ్యాఖ్యాతల ప్యానెల్‌ను ఐసీసీ ఇవాళ (అక్టోబర్ 2) విడుదల చేసింది. కామెంటేటర్ల జాబితాలో వరల్డ్‌కప్ విన్నర్లు మెల్ జోన్స్, లిసా స్థాలేకర్, స్టేసీ ఆన్ కింగ్, లిడియా గ్రీన్వే, కార్లోస్ బ్రాత్‌వైట్‌లకు చోటు దక్కింది. వీరితో పాటు కేటీ మార్టిన్, డబ్ల్యూవీ రామన్, సనా మిర్ వరల్డ్‌కప్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. భారత్ నుంచి అంజుమ్ చోప్రా, మిథాలీ రాజ్‌లకు కామెంటేటర్ల ప్యానెల్లో చోటు దక్కింది. అంజుమ్, మిథాలీ మెగా టోర్నీ మొత్తానికి ఎక్స్పర్ట్స్ ఇన్సైట్స్ అందిస్తారు. వ్యాఖ్యాతల ప్యానెల్లో వెటరన్లు ఇయాన్ బిషప్, కస్ నాయుడు, నాసిర్ హుసేన్, నతాలీ జెర్మనోస్, అలీసన్ మిచెల్, ఎంపుమలెలో ఎంబాగ్వా, లారా మెక్గోల్డ్రిక్ కూడా ఉన్నారు.కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న ఆడుతుంది. దుబాయ్ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో కలిసి గ్రూప్-ఏలో పోటీపడుతుంది. గ్రూప్-బిలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. చదవండి: Irani Cup 2024: సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్ -
టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ అఫీషియల్స్ పేర్ల ప్రకటన
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 మ్యాచ్ అఫీషియల్స్ పేర్లను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 24) ప్రకటించింది. ఈ జాబితాలో పది మంది అంపైర్లు, ముగ్గురు మ్యాచ్ రిఫరీలు ఉన్నారు.మ్యాచ్ రిఫరీలు: షాండ్రే ఫ్రిట్జ్, జీఎస్ లక్ష్మి, మిచెల్ పెరీరాఅంపైర్లు: లారెన్ అజెన్‌బాగ్, కిమ్ కాటన్, సారా దంబనేవానా, అన్నా హారిస్, నిమాలి పెరెరా, క్లైర్ పోలోసాక్, వృందా రతి, స్యూ రెడ్‌ఫెర్న్, ఎలోయిస్ షెరిడాన్, జాక్విలిన్ విలియమ్స్కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ అక్టోబర్ 3 నుంచి షార్జా, దుబాయ్ వేదికలుగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ మొత్తం 18 రోజుల పాటు సాగనుంది. ఇందులో 23 మ్యాచ్‌లు జరుగనున్నాయి. అక్టోబర్ 20న దుబాయ్‌లో జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీ పడతాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక పోటీపడనుండగా.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా తలపడనున్నాయి.బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌తో (అక్టోబర్ 3) టోర్నీ మొదలు కానుండగా.. భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న (న్యూజిలాండ్) ఆడనుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్ వేదికగా జరుగనుంది.చదవండి: డేవిడ్ మలాన్ విధ్వంసం.. 25 బంతుల్లోనే..! -
టీ20 వరల్డ్‌కప్ కోసం శ్రీలంక జట్టు ప్రకటన
మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల శ్రీలంక క్రికెట్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 20) ప్రకటించారు. ఈ జట్టుకు చమారీ ఆటపట్టును కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 38 ఏళ్ల వెటరన్ స్పిన్నర్ ఇనోకా రణవీర వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకుంది. యువ ఓపెనర్ విష్మి గుణరత్నే, మిడిలార్డర్ బ్యాటర్లు కవిషా దిల్హరి, హర్షిత సమరవిక్రమ జట్టులో చోటు నిలబెట్టుకున్నారు.కాగా, టీ20 వరల్డ్‌కప్-2024 కోసం ఇప్పటివరకు తొమ్మిది దేశాలు (భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక) తమతమ జట్లను ప్రకటించాయి. స్కాట్లాండ్ ఒక్కటి జట్టును ప్రకటించాల్సి ఉంది. ప్రపంచకప్ గ్రూప్-ఏలో భారత్, శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పోటీపడనున్నాయి. గ్రూప్-బిలో స్కాట్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి. వరల్డ్‌కప్ మ్యాచ్‌లు అక్టోబర్ 3 నుంచి మొదలవుతాయి. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ తలపడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న (న్యూజిలాండ్‌తో) ఆడనుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న జరునుంది. షార్జా, దుబాయ్ వేదికలుగా టీ20 వరల్డ్‌కప్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 20న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.టీ20 ప్రపంచ కప్ 2024 కోసం శ్రీలంక జట్టు: చమారీ ఆటపట్టు (కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, హాసిని పెరీరా, అనుష్క సంజీవని, సచినీ నిసంసాలా, ఉదేశిక ప్రబోధనీ, ఇనోషి ఫెర్నాండో, అచిని కులసూర్య, ఇనోకా రణవీర, శశిని గింహని, అమా కాంచన, సుగందిక కుమారి [ట్రావెలింగ్ రిజర్వ్: కౌశిని నుత్యాంగన]చదవండి: భారత బౌలర్ల విజృంభణ.. 149 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్ -
టీ20 వరల్డ్‌కప్.. వారికి టికెట్లు 'ఫ్రీ'
యూఏఈ వేదికగా జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 టికెట్ల రేట్ల వివరాలను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 11) వెల్లడించింది. టికెట్ల ప్రారంభ ధరను కేవలం ఐదు దిర్హామ్‌లు (సుమారు రూ. 100)గా నిర్ణయించింది. యువతలో క్రీడను ప్రోత్సహించేందుకు 18 ఏళ్లలోపు వారికి టికెట్లు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. టికెట్ల ధరల ప్రకటన సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై టీ20 వరల్డ్‌కప్ యొక్క లేజర్ షోను ప్రదర్శించబడింది.కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్టు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. 18 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి గ్రూప్‌లో జట్టు మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల అనంతరం తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి.గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు ఉండగా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్ పోటీపడతాయి. ఈ టోర్నీలో 20 లీగ్ మ్యాచ్‌లు దుబాయ్, షార్జా వేదికగా జరుగుతాయి. అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్ షార్జాలో జరుగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న దుబాయ్‌లో జరుగనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) ఆడనుంది. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్‌లో జరుగనుంది.చదవండి: టీ20 వరల్డ్‌కప్ కోసం న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. -
కౌన్ బనేగా కరోడ్‌పతిలో టీ20 వరల్డ్‌కప్‌నకు సంబంధించిన ప్రశ్న
ఇటీవలికాలంలో కౌన్ బనేగా కరోడ్‌పతి టీవీ షోలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. తొలి ఐదారు ప్రశ్నల్లో ఏదో ఒకటి క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నే ఉంటుంది. తాజాగా జరిగిన ఓ ఎడిసోడ్లోనూ క్రికెట్‌కు సంబంధించిన ఓ ప్రశ్న వచ్చింది. 40000 రూపాయల కోసం ఎదురైన ఆ ప్రశ్న ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. కింది నాలుగు ఆప్షన్స్‌లో ఎవరూ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు సభ్యులు కాదు..? ఈ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. ఏ-కుల్దీప్ యాదవ్, బి-రవీంద్ర జడేజా, సి-రవిచంద్రన్ అశ్విన్, డి-సూర్యకుమార్ యాదవ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. A cricket related question in KBC for 40,000 INR. pic.twitter.com/GF3Lc3Kal6— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2024కాగా, కౌన్ బనేగా కరోడ్‌పతి అనేది దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నిర్వహించే టీవీ షో. ఇందులో కంటెస్టెంట్స్ కంప్యూటర్ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకు వారి నిర్దిష్ట పారితోషికం లభిస్తుంది.వరల్డ్ ఛాంపియన్‌గా భారత్ఇదిలా ఉంటే, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై జయకేతనం ఎగురవేసి రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. త్వరలో బంగ్లాదేశ్ సిరీస్ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ కమిట్మెంట్స్ లేకపోవడంతో భారత ఆటగాళ్లు ఖాళీగా ఉన్నారు. ఈ నెల 19 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. తొలి టెస్ట్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి.. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్డెంబర్ 27 నుంచి మొదలుకానుంది. అనంతరం అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా మూడు టీ20లు జరుగనున్నాయి.చదవండి: తలో స్థానం మెరుగుపర్చుకున్న రోహిత్, జైస్వాల్, విరాట్ -
ద్రవిడ్ రీ ఎంట్రీ.. ప్రకటించిన ఐపీఎల్ ఫ్రాంఛైజీ
టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పునరాగమనం చేయనున్నాడు. వచ్చే సీజన్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనునున్నాడు. రాయల్స్ యాజమాన్యం ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘టీమిండియా లెజండరీ, ప్రపంచకప్ గెలిపించిన కోచ్ రాజస్తాన్ రాయల్స్‌లోకి సంచలన రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు’’ అంటూ రాయల్స్ సీఈవో జేక్ లష్ మెక్రమ్‌తో ద్రవిడ్ దిగిన ఫొటోను షేర్ చేసింది.సరికొత్త సవాళ్లకు సిద్ధంఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత.. సరికొత్త సవాళ్లకు సిద్ధం కావాలని భావించాను. అందుకు రాయల్స్‌తో జతకట్టడం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు’’ అని పేర్కొన్నాడు. కాగా.. ‘‘ద్రవిడ్‌తో సంప్రదింపులు ఫలప్రదంగా ముగిశాయి. త్వరలోనే అతను కోచ్ బాధ్యతలు చేపట్టడం ఖాయం’’ అని ఇటీవల రాయల్స్ ఫ్రాంఛైజీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇప్పుడు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ద్రవిడ్‌తో పాటు టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ విక్రం రాథోడ్‌ను కూడా కోచింగ్ సిబ్బందిలోకి తీసుకోవాలని రాయల్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.గతంలో సారథిగాకాగా ద్రవిడ్ ఐపీఎల్లో రాజస్తాన్‌కు సేవలందించడం ఇదే తొలిసారి కాదు. 2012, 2013 ఎడిషన్లలో రాయల్స్ కెప్టెన్‌గా వ్యహరించిన ద్రవిడ్ రిటైర్మెంట్ అనంతరం.. ఆ జట్టు మెంటార్‌గా రెండేళ్లు పని చేశాడు. అనంతరం 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాడు.ఆ తర్వాత.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ‘హెడ్’గా నియమితుడైన ద్రవిడ్.. ఐపీఎల్‌కు దూరమయ్యాడు. అనంతరం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపికైన ఈ కర్ణాటక ప్లేయర్ రెండున్నరేళ్లపాటు ఆ విధులు నిర్వర్తించాడు. అతడి హయాంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2022 సెమీస్, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-2023 ఫైనల్, వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ చేరింది.వరల్డ్ కప్ విన్నర్అయితే, టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న అతడి కల నెరవేరింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్‌ల కాంబినేషన్లో టీమిండియా కరీబియన్ గడ్డపై ఈ ఏడాది పొట్టి ఫార్మాట్ కప్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ద్రవిడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. నిజానికి ద్రవిడ్ పదవీ కాలం కూడా గత ఏడాది వన్డే ప్రపంచకప్‌తోనే ముగిసింది. అయినా.. ఈ మెగా టోర్నీ ముగిసే వరకు కోచ్‌గా సేవలు అందించి.. ఐసీసీ టైటిల్‌తో తన ప్రయాణం ముగించాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఇప్పటి వరకు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ డైరెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాజస్తాన్‌కు సంబంధించిన బార్బడోస్ రాయల్స్... కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో, పార్ల్ రాయల్స్... సౌతాఫ్రికా20 టోర్నీల్లో పాల్గొంటున్నాయి. ఆయా లీగ్‌లలో విజయాలే లక్ష్యంగా సహాయ సిబ్బందిలో దిగ్గజాలను నియమించుకుంటోంది రాయల్స్.చదవండి: బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్.. ఎట్టకేలకు.. -
మెంటలోడు అనుకుంటారని భయపడ్డా: ద్రవిడ్
ఎన్నో కఠిన సవాళ్లు దాటిన తర్వాతే తాము ప్రపంచకప్‌ను కైవసం చేసుకోగలిగామని టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. భారత్ టీ20 వరల్డ్‌కప్-2024 చాంపియన్‌గా అవతరించగానే తమ సంబరాలు అంబరాన్నంటాయని.. తాను సైతం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యానని పేర్కొన్నాడు. ఆ సమయంలో భావోద్వేగాలు నియంత్రించుకోలేక ఆటగాళ్లతో కలిసి తాను చిన్నపిల్లాడిలా గంతులు వేశానని తెలిపాడు.అయితే, ఇందుకు సంబంధించిన దృశ్యాలు తన కుమారుల కంటపడకుండా ఉండేందుకు విఫలయత్నం చేశానంటూ ద్రవిడ్ నవ్వులు చిందించాడు. కాగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2024లో మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది టీమిండియా. అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచి.. పదకొండేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. విమర్శించిన నోళ్లే ప్రశంసల వర్షం కురిపించాయి..ఫలితంగా కెప్టెన్‌గా రోహిత్ ఖాతాలో తొలి టైటిల్ చేరగా... హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రయాణానికి విజయవంతమైన ముగింపు లభించింది. దీంతో... 2022లో జట్టు వైఫల్యానికి కారణమని వీళ్లిద్దరిని విమర్శించిన నోళ్లే ప్రశంసల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో.. జట్టు కప్ అందుకోగానే ద్రవిడ్ కూడా ఎన్నడూ లేని విధంగా ఉద్వేగానికి లోనవుతూ.. ఆటగాళ్లతో కలిసి సందడి చేశాడు. ఎప్పుడూ గంభీరంగా కనిపించే ఈ మాజీ కెప్టెన్‌ను అలా చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. నాకు పిచ్చిపట్టిందని సందేహ పడతారనుకున్నాఈ విషయం గురించి తాజాగా ప్రస్తావనకు రాగా రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ.. ‘‘మేమంతా ఎంతో కష్టపడిన తర్వాత దక్కిన ఫలితం అది. అలాంటపుడు మా సంతోషం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకు నిదర్శనమే నాటి సెలబ్రేషన్స్. ఎంతో గొప్పగా సంబరాలు చేసుకున్నాం. అయితే, ఈ వీడియోను నా కుమారులు చూడకూడదని జాగ్రత్త పడ్డాను. ఎందుకంటే.. నన్ను వాళ్లిలా చూశారంటే నాకు పిచ్చి పట్టిందేమోనని వాళ్లు సందేహపడతారేమోనన్న భయం వెంటాడింది(నవ్వుతూ). నిజానికి నేనెప్పుడూ మా వాళ్లకు కూల్‌గా ఉండాలని చెబుతాను.గెలుపైనా.. ఓటమైనా తొణకకుండా ఉంటూ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని వాళ్లకు హితబోధ చేస్తూ ఉంటాను. అలాంటిది నేనే అంతగా సెలబ్రేట్ చేసుకున్నానంటే ఆ విజయానికి ఉన్న విలువ అటువంటిది. కోచ్‌గా నా చివరి మ్యాచ్ అలా ముగిసిందుకు సంతోషంగా ఉన్నాను. అదే ఆఖరి మ్యాచ్ కావడం కూడా నయమైంది. లేదంటే.. మీరు చెప్పేదొకటి.. చేసేదొకటి(సెలబ్రేషన్స్ విషయంలో) అని మా జట్టు సభ్యులు నన్ను ఆటపట్టించేవారు’’ అంటూ చిరు నవ్వులు చిందించాడు. సియట్ అవార్డు వేడుక సందర్భంగా హిందుస్తాన్ టైమ్స్‌తో రాహుల్ ద్రవిడ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా ద్రవిడ్ కుమారులు కూడా క్రికెటర్లేనన్న విషయం తెలిసిందే. పెద్ద కొడుకు సమిత్ ఇటీవలే అండర్-19 భారత జట్టుకు ఎంపికయ్యాడు. చిన్న కొడుకు అన్వయ్ సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇక ద్రవిడ్ స్థానంలో ప్రస్తుతం గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: పతనం దిశగా పాక్.. అసలు ఈ జట్టుకు ఏమైంది?.. బంగ్లా రికార్డులివీ -
టీ20 వరల్డ్‌కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. జట్టులో శేషనీ నాయుడు
యూఏఈ వేదికగా జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (సెప్టెంబర్ 3) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా లారా వోల్వార్డ్ట్ ఎంపికైంది. వోల్వార్డ్ట్ కెప్టెన్‌గా ఇది తొలి వరల్డ్‌కప్. గత టీ20 ప్రపంచకప్‌లో సూన్ లస్ సౌతాఫ్రికాను ముందుండి నడిపించింది. ఆ టోర్నీలో సౌతాఫ్రికా ఫైనల్ వరకు చేరింది. అనంతరం సూన్ లస్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో వోల్వార్డ్ట్ సౌతాఫ్రికా టీ20 జట్టు పగ్గాలు చేపట్టింది. రానున్న వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో సూన్ లస్, అయాబొంగా ఖాకా, మారిజాన్ కాప్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్ వంటి సీనియర్లతో పాటు అయాండా హ్లూబి, అన్నరీ డెర్క్సెన్ వంటి యువ ప్లేయర్స్ కూడా చోటు దక్కించుకున్నారు. సౌతాఫ్రికా వరల్డ్‌కప్ బృందంలో 18 ఏళ్ల యువ లెగ్ స్పిన్నర్ శేషనీ నాయుడు కూడా చోటు దక్కించుకుంది. అండర్-19 స్థాయిలో అద్భుత ప్రదర్శనల కారణంగా శేషనీ నాయుడు వరల్డ్‌కప్ జట్టులోకి వచ్చింది. ఇదే జట్టు వరల్డ్‌కప్‌కు ముందు పాకిస్తాన్‌తో జరిగే మూడో మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొంటుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 16-20 వరకు జరుగనుంది.వరల్డ్‌కప్ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో సౌతాఫ్రికా గ్రూప్-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో బంగ్లాదేశ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 3న మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడతాయి. భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) ఆడుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్‌లో జరుగనుంది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఏడు దేశాలు తమ జట్లను ప్రకటించాయి.సౌతాఫ్రికా: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), అన్నేకే బాష్, తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నరీ డెర్క్సెన్, మైకే డి రిడర్, అయాండా హ్లూబి, సినాలో జాఫ్తా, మారిజాన్ కాప్, అయాబొంగా ఖాకా, సూన్ లస్, నాన్కులుకెకు మ్లాబా, శేషనీ నాయుడు, తుమీ సెఖుఖునే, క్లో ట్రయాన్ట్రావెలింగ్ రిజర్వ్: మియాన్ స్మిట్స్కాట్లాండ్: కేథరీన్ బ్రైస్ (కెప్టెన్), క్లో ఏబెల్, అబ్బి అయిట్కెన్ డ్రమ్మండ్, ఒలీవియా బెల్, సారా బ్రైస్, డార్సీ కార్టర్, ప్రియానాజ్ ఛటర్జీ, కేథరీన్ ఫ్రేసర్, సస్కియా హార్లీ, లోర్నా జాక్ బ్రౌన్, ఐల్సా లిస్టర్, అబ్తహా మక్సూద్, మెగాన్ మెక్‌కోల్, హన్నా రెయినీ, రేచల్ స్లేటర్పాకిస్తాన్: ఆలియా రియాజ్, సదాఫ్ షమాస్, ఇరమ్ జావెద్, సిద్రా ఆమీన్, ఒమైమా సొహైల్, నిదా దార్, గుల్ ఫెరోజా, మునీబా అలీ, ఫాతిమా సనా (కెప్టెన్), సష్రా సంధు, డయానా బేగ్, సయెదా అరూబ్ షా, తుబా హసన్, తస్మియా రుబాబ్ఆస్ట్రేలియా: ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఆష్లే గార్డ్నర్, తహిల మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, ఎల్లిస్ పెర్రీ, అన్నాబెల్ సథర్‌ల్యాండ్, గ్రేస్ హ్యారిస్, జార్జియా వేర్హమ్, అలైసా హీలీ (కెప్టెన్), బెత్ మూనీ, డార్సీ బ్రౌన్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షట్, తైలా వ్లేమింక్ఇండియా: స్మృతి మంధన, దయాళన్ హేమలత,జెమీమా రోడ్రిగెజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, ఎస్ సజనా, పూజా వస్త్రాకర్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, రిచా ఘోష్, యస్తికా భాటియా, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, రాధా యాదవ్ఇంగ్లండ్: మైయా బౌచియర్, డేనియెల్ వ్యాట్, అలైస్ క్యాప్సీ, హీథర్ నైట్ (కెప్టెన్), సోఫీ డంక్లీ, డేనియెల్ గిబ్సన్, ఫ్రేయా కెంప్, నాట్ సీవర్ బ్రంట్, బెస్ హీత్, ఆమీ జోన్స్, లారెన్ బెల్, చార్లోట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, సారా గ్లెన్, లిన్సే స్మిత్వెస్టిండీస్: నెరిస్సా క్రాఫ్టన్, హేలీ మాథ్యూస్ (కెప్టెన్), డియాండ్రా డొట్టిన్, జైదా జేమ్స్, స్టెఫానీ టేలర్, ఆలియా అలెన్, చినెల్ హెన్రీ, అష్మిని మునీసర్, షెమెయిన్ క్యాంప్‌బెల్, చెడీన్ నేషన్, అఫీ ఫ్లెయర్, కరిష్మ రామ్హరాక్, మ్యాండీ మంగ్రూ, క్వియానా జోసఫ్, షమీలియా కాన్నెల్ -
టీ20 వరల్డ్‌కప్ కోసం స్కాట్లాండ్ జట్టు ప్రకటన
యూఏఈ వేదికగా జరుగనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల స్కాట్లాండ్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 2) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా కేథరీన్ బ్రైస్ ఎంపికైంది. వరల్డ్‌కప్‌లో స్కాట్లాండ్ గ్రూప్-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో బంగ్లాదేశ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 3న మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడతాయి. భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) ఆడుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్‌లో జరుగనుంది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఐదు దేశాలు తమ జట్లను ప్రకటించాయి.స్కాట్లాండ్: కేథరీన్ బ్రైస్ (కెప్టెన్), క్లో ఏబెల్, అబ్బి అయిట్కెన్ డ్రమ్మండ్, ఒలీవియా బెల్, సారా బ్రైస్, డార్సీ కార్టర్, ప్రియానాజ్ ఛటర్జీ, కేథరీన్ ఫ్రేసర్, సస్కియా హార్లీ, లోర్నా జాక్ బ్రౌన్, ఐల్సా లిస్టర్, అబ్తహా మక్సూద్, మెగాన్ మెక్‌కోల్, హన్నా రెయినీ, రేచల్ స్లేటర్పాకిస్తాన్: ఆలియా రియాజ్, సదాఫ్ షమాస్, ఇరమ్ జావెద్, సిద్రా ఆమీన్, ఒమైమా సొహైల్, నిదా దార్, గుల్ ఫెరోజా, మునీబా అలీ, ఫాతిమా సనా (కెప్టెన్), సష్రా సంధు, డయానా బేగ్, సయెదా అరూబ్ షా, తుబా హసన్, తస్మియా రుబాబ్ఆస్ట్రేలియా: ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఆష్లే గార్డ్నర్, తహిల మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, ఎల్లిస్ పెర్రీ, అన్నాబెల్ సథర్‌ల్యాండ్, గ్రేస్ హ్యారిస్, జార్జియా వేర్హమ్, అలైసా హీలీ (కెప్టెన్), బెత్ మూనీ, డార్సీ బ్రౌన్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షట్, తైలా వ్లేమింక్ఇండియా: స్మృతి మంధన, దయాళన్ హేమలత,జెమీమా రోడ్రిగెజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, ఎస్ సజనా, పూజా వస్త్రాకర్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, రిచా ఘోష్, యస్తికా భాటియా, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, రాధా యాదవ్ఇంగ్లండ్: మైయా బౌచియర్, డేనియెల్ వ్యాట్, అలైస్ క్యాప్సీ, హీథర్ నైట్ (కెప్టెన్), సోఫీ డంక్లీ, డేనియెల్ గిబ్సన్, ఫ్రేయా కెంప్, నాట్ సీవర్ బ్రంట్, బెస్ హీత్, ఆమీ జోన్స్, లారెన్ బెల్, చార్లోట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, సారా గ్లెన్, లిన్సే స్మిత్వెస్టిండీస్: నెరిస్సా క్రాఫ్టన్, హేలీ మాథ్యూస్ (కెప్టెన్), డియాండ్రా డొట్టిన్, జైదా జేమ్స్, స్టెఫానీ టేలర్, ఆలియా అలెన్, చినెల్ హెన్రీ, అష్మిని మునీసర్, షెమెయిన్ క్యాంప్‌బెల్, చెడీన్ నేషన్, అఫీ ఫ్లెయర్, కరిష్మ రామ్హరాక్, మ్యాండీ మంగ్రూ, క్వియానా జోసఫ్, షమీలియా కాన్నెల్ -
మొదటిరోజు హార్దిక్- రోహిత్ మాట్లాడుకోలేదు.. ఆ తర్వాత
‘‘టీమిండియా ప్రాక్టీస్ చేసిన మొదటిరోజు నేను నెట్స్ వద్దకు వెళ్లాను. అప్పుడు హార్దిక్- రోహిత్ దూరదూరంగా ఉండటం గమనించాను. నిజానికి ఆరోజు వారు మాట్లాడుకోలేదు. అయితే, రెండో రోజు నుంచి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వాళ్లిద్దరు ఒకరికొకరు చేరువగా వచ్చారు.ఓ మూలన కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. నిజానికి అక్కడ కెమెరా కూడా లేదు. వాళ్లిద్దరినీ అలా చూసి నేను నమ్మలేకపోయాను. జట్టు ప్రయోజనాల కోసం ఆటగాళ్లు తమ మధ్య విభేదాలు ఉన్నా వాటిని పక్కనపెట్టి కలిసికట్టుగా ముందుకు సాగుతారని అప్పుడే నాకు కళ్లకు కట్టినట్లయింది.ఆ తర్వాత మూడు రోజుల పాటు రోహిత్, హార్దిక్ కలిసే బ్యాటింగ్ చేశారు. హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్నపుడు రోహిత్ దగ్గరుండి పర్యవేక్షించాడు. వారిని అలా చూస్తే ముచ్చటేసింది’’ అంటూ స్పోర్ట్స్ జర్నలిస్టు విమల్ కుమార్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అనుబంధం గురించి తెలిపాడు.కారణం అతడేటీ20 ప్రపంచకప్-2024 సమయంలో రోహిత్- హార్దిక్ కలిసిపోయి మునుపటిలా ఉండటానికి హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కారణమని పేర్కొన్నాడు. ఈ విషయంలో ఆయనకే క్రెడిట్ ఇవ్వాలని.. ద్రవిడ్ చొరవ వల్లే డ్రెస్సింగ్ రూం వాతావరణం అంత చక్కగా ఉందన్నాడు. టీమిండియా ఆటగాళ్ల మధ్య విభేదాలంటూ వచ్చే వార్తలు నిజం కావని వారిని దగ్గరగా చూసిన తర్వాతే తనకు అర్థమైందన్నాడు విమల్ కుమార్. టూ స్లాగర్స్ అనే యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.అందుకే విభేదాలు?ఐపీఎల్-2024కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై ఇండియన్స్.. ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. దీంతో హిట్‌మ్యాన్ అభిమానులు తీవ్రస్థాయిలో హార్దిక్‌పై మండిపడ్డారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. మరోవైపు.. హార్దిక్ సైతం మైదానంలో రోహిత్ ఫీల్డింగ్ పొజిషన్‌ను పదే పదే మారుస్తూ కాస్త అతి చేశాడు. ఈ క్రమంలో రోహిత్ కూడా హార్దిక్ తీరు పట్ల అసంతృప్తికి గురైనట్లు వార్తలు వచ్చాయి.కలిసిపోయారుఈ నేపథ్యంలో తాజా సీజన్లో ముంబై దారుణంగా ఓడిపోవడంతో ఆటగాళ్ల మధ్య సఖ్యత లోపించడమే ఇందుకు కారణమనే విమర్శలు వచ్చాయి. అయితే, టీ20 ప్రపంచకప్-2024లో సీన్ మారింది. రోహిత్ కెప్టెన్‌గా.. హార్దిక్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి ఐసీసీ టైటిల్ సాధించింది. ఇందులో రోహిత్‌తో పాటు ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాత్ర కూడా కీలకం. ఇక అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్లో టీమిండియాతో పాటే ఉన్న విమల్ కుమార్ తాజాగా రోహిత్- హార్దిక్ జట్టు కోసం కలిసిపోయారంటూ పాజిటివ్ కామెంట్స్ చేశాడు. -
Women's T20 World Cup 2024: ఇదిగో మన బలగం..!
సాక్షి క్రీడా విభాగం: గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీల్లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. మెగా టోర్నీల్లో మంచి ఆరంభాలు లభించినా... చివరి దశకు వచ్చేసరికి ఒత్తిడిని తట్టుకోలేక రిక్తహస్తాలతో వెనుదిరుగుతోంది. ఆ అడ్డంకిని అధిగమించి ముందడుగు వేసి ప్రపంచ చాంపియన్‌గా అవతరించేందుకు మన మహిళల జట్టుకు మరో అవకాశం వచ్చింది. అక్టోబర్ 3 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనున్న ఈ జట్టులో అనుభవానికి, యువతరానికి సమాన ప్రాధాన్యత కల్పించారు. పురుషుల జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... ఇటీవల టి20 ప్రపంచకప్ సాధించగా... ఇప్పుడదే బాటలో మహిళల జట్టు కూడా జగజ్జేతగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మెగా టోర్నీకి ఎంపిక చేసిన మన ప్లేయర్ల బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే... అంతర్జాతీయ టి20ల్లో 173 మ్యాచ్‌లు ఆడిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అందరికంటే సీనియర్ కాగా.. వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్మృతి మంధాన 141 మ్యాచ్‌ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. వీరిద్దరి తర్వాత స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 117 మ్యాచ్‌లు ఆడగా.. జెమీమా రోడ్రిగ్స్ 100 మ్యాచ్‌లు ఆడింది. ఇక అండర్-19 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు విజేతగా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించిన విధ్వంసక ఓపెనర్ షఫాలీ వర్మతో పాటు వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా కీలకం కానున్నారు. మొత్తం 10 జట్లు పాల్గొంటున్న ప్రపంచకప్‌లో... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంకతో కలిసి భారత్ గ్రూప్ ‘బి’ నుంచి పోటీ పడనుంది. మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో హర్మన్ బృందం తొలి మ్యాచ్‌లో తలపడనుంది. అనంతరం అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడుతుంది. జట్టులో స్పిన్నర్లకు కొదవ లేకున్నా... పేస్ ఆల్‌రౌండర్ల లోటు కనిపిస్తోంది. శ్రేయంక పాటిల్, యస్తికా భాటియాను ఎంపిక చేసినా... గాయాల నుంచి పూర్తిగా కోలుకుంటేనే వీరిద్దరు జట్టుతో కలిసి యూఏఈ బయలుదేరుతారు. ఇక ట్రావెల్ రిజర్వ్‌లుగా తనూజ కన్వర్, ఉమా ఛెత్రీ, సైమా ఠాకూర్ ఎంపికయ్యారు. ----హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్)మ్యాచ్‌లు 173పరుగులు 3426అత్యధిక స్కోరు 103సగటు 28.08సెంచరీలు 1అర్ధ సెంచరీలు 12వికెట్లు 32---స్మృతి మంధాన (వైస్ కెప్టెన్)మ్యాచ్‌లు 141పరుగులు 3493అత్యధిక స్కోరు 87సగటు 28.86అర్ధ సెంచరీలు 26---షఫాలీ వర్మమ్యాచ్లు 81పరుగులు 1948అత్యధిక స్కోరు 81సగటు 25.63అర్ధ సెంచరీలు 10---యస్తికా భాటియామ్యాచ్లు 19పరుగులు 214అత్యధిక స్కోరు 36సగటు 16.46---దీప్తి శర్మమ్యాచ్లు 117పరుగులు 1020అత్యధిక స్కోరు 64సగటు 23.72అర్ధ సెంచరీలు 2వికెట్లు 131---జెమీమా రోడ్రిగ్స్మ్యాచ్లు 100పరుగులు 2074అత్యధిక స్కోరు 76సగటు 30.50అర్ధ సెంచరీలు 11---రిచా ఘోష్మ్యాచ్లు 55పరుగులు 860అత్యధిక స్కోరు 64*సగటు 28.66అర్ధ సెంచరీలు 1---పూజ వస్త్రకర్మ్యాచ్లు 70వికెట్లు 57అత్యుత్తమ ప్రదర్శన 4/13సగటు 21.24ఎకానమీ 6.36---అరుంధతి రెడ్డిమ్యాచ్లు 29వికెట్లు 21అత్యుత్తమ ప్రదర్శన 2/19సగటు 34.66ఎకానమీ 7.92---రేణుక సింగ్మ్యాచ్లు 47వికెట్లు 50అత్యుత్తమ ప్రదర్శన 5/15సగటు 22.02ఎకానమీ 6.40---హేమలతమ్యాచ్లు 23పరుగులు 276అత్యధిక స్కోరు 47సగటు 16.23వికెట్లు 9---ఆశా శోభనమ్యాచ్లు 3వికెట్లు 4ఉత్తమ ప్రదర్శన 2/18సగటు 20.50ఎకానమీ 7.45---రాధ యాదవ్మ్యాచ్లు 80వికెట్లు 90ఉత్తమ ప్రదర్శన 4/23సగటు 19.62ఎకానమీ 6.55---శ్రేయాంక పాటిల్మ్యాచ్లు 12వికెట్లు 16ఉత్తమ ప్రదర్శన 3/19సగటు 18.75ఎకానమీ 7.14---సజన సజీవన్మ్యాచ్లు 9పరుగులు 30అత్యధిక స్కోరు 11సగటు 10.00 -
T20 WC 2024: ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. సీనియర్లపై వేటు
మహిళల టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోసం ఇంగ్లండ్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. యూఏఈ వేదికగా జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్ కోసం ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యుల వివరాలను మంగళవారం వెల్లడించింది. వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే జట్టులో ముగ్గురు ప్లేయర్లకు తొలిసారిగా చోటిచ్చింది.సీనియర్లపై వేటుహీథర్ నైట్ కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ బెస్ హీత్, ఆల్‌రౌండర్ ఫ్రేయా కెంప్, రైటార్మ్ పేసర్ డేనియెల్ గిబ్సన్లకు జట్టులో స్థానం కల్పించింది. గత ఎడిషన్‌లో ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్న వీరు ఈసారి ప్రధాన జట్టులోకి రావడం విశేషం. అయితే, అనూహ్యంగా సీనియర్లు కేట్ క్రాస్, టామీ బీమౌంట్లపై వేటు పడింది. కాగా ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ మహిళా టీ20 జట్టు సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. గత నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ అద్భుత విజయాలు సాధించింది.సూపర్ ఫామ్‌లో ఇంగ్లండ్ఆఖరిగా.. న్యూజిలాండ్‌తో రెండు, ఇండియా, పాకిస్తాన్‌తో ఒక్కో మ్యాచ్‌లో గెలుపు బావుటా ఎగురవేసింది. ఈ క్రమంలో వరల్డ్‌కప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఇంగ్లండ్ ఈసారి బరిలోకి దిగనుంది. ఇక జట్టు ప్రకటన సందర్భంగా హెడ్‌కోచ్ జాన్ లూయీస్ మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన, యువ ఆటగాళ్లతో తమ జట్టు సమతూకంగా ఉందని పేర్కొన్నాడు.ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకే పెద్దపీట వేశామని.. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ కొందరిపై వేటు పడిందన్న లూయీస్.. యూఏఈ పరిస్థితులకు తగ్గట్లుగా రాణించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని తెలిపాడు. వరల్డ్‌కప్ అంటేనే ప్రత్యేకమైన ఈవెంట్ అని.. ఇందుకు తాము సన్నద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. కాగా గత ఎడిషన్‌లో ఇంగ్లండ్ మహిళా జట్టు గ్రూప్ స్టేజ్‌లో అజేయంగా నిలిచింది.ముందుగానే అబుదాబికి హీథర్ బృందంఅయితే, ఆతిథ్య సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడి ఇంటిబాట పట్టింది. ఈసారి ఆ తప్పులను పునరావృతం చేయకుండా ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. కాగా మహిళా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీని బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సి ఉండగా.. అక్కడ అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో వేదికను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు మార్చారు.అక్టోబరు 3 నుంచి ఈ ఈవెంట్ ఆరంభం కానుండగా.. ఇంగ్లండ్ సెప్టెంబరు 13- 14 వరకు అబుదాబిలో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. షార్జా వేదికగా అక్టోబరు 5న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ద్వారా ప్రపంచకప్-2024 ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్-2024 కోసం ఇంగ్లండ్ మహిళా జట్టుహీథర్ నైట్ (కెప్టెన్), లారెన్ బెల్, మాయా బౌచియర్, ఆలిస్ క్యాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లే, సోఫీ ఎక్లెస్టోన్, డేనియల్ గిబ్సన్, సారా గ్లెన్, బెస్ హీత్, అమీ జోన్స్, ఫ్రేయా కెంప్, నాట్ స్కివర్-బ్రంట్, లిన్సే స్మిత్, డానీ వ్యాట్.చదవండి: యూఏఈలో అక్టోబర్ 3 నుంచి 20 వరకు టోర్నీ టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన