టీ20 వరల్డ్‌కప్ 2024 విజయానంతరం భారత క్రికెట్ బృందం బార్బడోస్‌లోనే (ఫైనల్ మ్యాచ్‌కు వేదిక) ఇరుక్కుపోయింది. అట్లాంటిక్‌లో ఉద్భవించిన 'బెరిల్' హరికేన్ కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో టీమిండియా బార్బడోస్‌లోనే ఉండిపోయింది. హరికేన్ ప్రభావం తగ్గి విమాన సర్వీసులు పునరుద్ధరించబడితే రేపటి కల్లా టీమిండియా ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది.
బార్బడోస్‌లో భారత బృందం హిల్టన్‌లో బస చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం టీమిండియా ఇవాళ (జులై 1) ఉదయం 11 గంటలకంతా భారత్‌లో ల్యాండ్ కావల్సి ఉండింది. భారత రూట్ మ్యాప్ బార్బడోస్ నుంచి న్యూయార్క్‌కు.. న్యూయార్క్ నుంచి దుబాయ్‌కు.. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకునేలా ఉండింది. అయితే బెరిల్ హరికేన్ టీమిండియా రిటర్న్ ప్లాన్లు దెబ్బతీసింది.
ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి రెండోసారి జగజ్జేతగా నిలిచిన టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. భారత ఆటగాళ్లు ఢిల్లీలో ల్యాండ్ కాగానే ఘన స్వాగతం పలకాలని ప్లాన్లు చేసుకున్నారు. భారత ప్రభుత్వం సైతం వరల్డ్‌కప్ హీరోలను ఘనంగా స్వాగతం పలకాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది.
భారత్‌లోకి ఎంటర్ కాగానే టీమిండియా హీరోలను ఊరేగింపుగా తీసుకెళ్లాలని ప్లాన్లు చేసుకుంది. ఈ తంతు అనంతరం భారత క్రికెట్ బృందం ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది. ప్రధాని నివాసంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం ఉండనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బీసీసీఐ నిన్న వరల్డ్‌కప్ గెలిచిన భారత బృందానికి రూ. 125 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. ఈ స్థాయి భారీ మొత్తాన్ని క్రికెట్ చరిత్రలో ఏ జట్టు అందుకుని ఉండకపోవచ్చు. బీసీసీఐ తమ హీరోల గౌరవార్దం ఈ భారీ నగదు నజరానాను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment