Hurricane
-
Hurricane Milton: ముంచుకొస్తున్న మిల్టన్
టంపా(అమెరికా): అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర పశి్చమతీరంపై మిల్టన్ తుపాను విరుచుకుపడనుంది. బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయం తీరాన్ని దాటి జనావాసాలను అతలాకుతం చేయనుందన్న వార్త అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. గంటకు 260 కి.మీ.ల వేగంతో వీస్తున్న పెనుగాలులకుతోడు జాతీయ హరికేన్ కేంద్రం హెచ్చరికలతో అప్రమత్తమైన లక్షలాది మంది స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపా, సారాసోటా, సెయింట్ పీటర్స్బర్గ్ నగరాల ప్రజలు కొందరు సొంతిళ్లను విడిచి వెళ్లలేక, తుపానును ఎలా తట్టుకోవాలో తెలీక బిక్కుబిక్కుమంటున్నారు. దాదాపు 33 లక్షల మంది నివసించే టంపా బే ప్రాంతంలో హరికేన్ దారుణంగా విరుచుకుపడి వినాశనం సృష్టించనుందని వాతావరణశాఖ అంచనావేసింది. ఈ ప్రాంతంపై ఐదో కేటగిరీ హరికేన్ ఇంతటి భారీ స్థాయిలో విరుచుకుపడుతుండటం ఈ శతాబ్దంలోనే తొలిసారి అనే విశ్లేషణలు వెలువడ్డాయి. బుధవారం సాయంత్రానికి టంపా నగరానికి 485 కిలోమీటర్ల దూరంలో సముద్రంపై కేంద్రీకృతమైన హరికేన్ గంటకు కేవలం 22 కిలోమీటర్ల వేగంతో ఈశాన్యం దిశగా కదులుతోందని, తీరాన్ని తాకే సమయానికి కాస్తంత బలహీనపడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కుండపోత వర్షాలు హరికేన్ కారణంగా వెస్ట్ సెంట్రల్ ఫ్లోరిడా ప్రాంతమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం 18 అంగుళాల మేర వర్షపాతం నమోదుకావచ్చని తెలుస్తోంది. ద్వీపకల్పంలా ఉండే ఫ్లోరిడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జాగ్రత్తలు చెప్పింది. ఫ్లోరిడా నేషనల్ సెర్చ్, అండ్ రెసూ్క్క బృందాలు పెద్దమొత్తంలో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫ్లోరిడా రాష్ట్ర చరిత్రలో ఇంతటి భారీ ఆపరేషన్ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. హరికేన్ తీరాన్ని తాకితే దాదాపు 5,00,000 ఇళ్లు నాశనమవుతాయని ఓ అంచాన. జనం ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని టంపా సిటీ మేయర్ జన్ కాస్టర్ విన్నవించుకున్నారు. ‘‘మొండిపట్టుదలతో ఇంట్లోనే కూర్చుంటే అదే మీకు శవపేటికగా మారుతుంది’’అని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే హెలెన్ హరికేన్ సృష్టించిన విలయం నుంచి సమీప పుంటా గోర్డా సిటీ ఇంకా కోలుకోలేదు. నగర వీధుల్లో ఎక్కడా చూసినా పాడైన ఫరీ్నచర్లు, దుస్తులు, పుస్తకాలు, వస్తువులు కనిపిస్తున్నాయి. ‘‘మొన్నటి హెలెన్ హరికేన్ ధాటికే వీధుల్లోకి బుల్ షార్క్‌లు కొట్టుకొచ్చాయి. ఇప్పుడేం జరుగుతుందో’’అని స్థానిక అకౌంటెంట్ స్కౌట్ జానర్ ఆందోళన వ్యక్తంచేశారు. -
అమెరికా: మిల్టన్... తగ్గేదేలే!
గాలులు వీచే వేగం ఆధారంగా అమెరికాలోని నేషనల్ హరికేన్ సెంటర్ పలు తీవ్రతలను సూచిస్తూ హరికేన్లను వివిధ కేటగిరీలుగా వర్గీకరిస్తుంది. ఈ కొలమానం రూపకర్త హెర్బర్ట్ సఫిర్ అనే ఇంజినీర్. హరికేన్ సెంటర్ మాజీ డైరెక్టర్ రాబర్ట్ సింప్సన్ ఈ కొలబద్దను 1970ల నుంచి అమలుచేయడం ఆరంభించడంతో ‘సఫిర్-సింప్సన్ హరికేన్ విండ్ స్కేలు’గా దీన్ని పిలుస్తున్నారు. ఇప్పుడు దీనికి కాలం చెల్లినట్టే అనిపిస్తోంది. ఎంతోకాలంగా మారని ఈ పాత స్కేల్ మీద 1 నుంచి 5 వరకు మాత్రమే కేటగిరీలు ఉన్నాయి. దూసుకొస్తున్న ‘మిల్టన్’ హరికేన్ పుణ్యమాని ఇప్పుడు ఆ పాత ప్రమాణాన్ని సవరించి ‘కొత్త విభాగాలు’ ఏర్పాటు చేయాల్సిన అవసరమొచ్చినట్టే కనిపిస్తోంది.‘మిల్టన్’ హరికేన్ అతి వేగంగా.. అతి శక్తిమంతమైన కేటగిరి-5లోకి మారింది. కొద్ది గంటల్లోనే తీవ్రత స్థాయిని పెంచుకుని ‘మిల్టన్’ ఒక్కసారిగా కేటగిరి-2 నుంచి కేటగిరి-5లోకి దూకేసి ఫ్లోరిడాపై గురిపెట్టి ముందుకు కదులుతోంది. నిన్న ‘హెలెన్’ హరికేన్ దెబ్బకు అమెరికాలోని ఐదు రాష్ట్రాలు కకావికలమయ్యాయి. అవి నేటికీ తెప్పరిల్లలేదు. ఆ విపత్తు నుంచి తేరుకోకుండానే, కోలుకోకుండానే ఇప్పుడు మరోసారి మిల్టన్ రూపంలో ప్రమాదం చుట్టుముడుతోంది.మెక్సికో సింధుశాఖలో ‘మిల్టన్’ ఏర్పడింది. గంటకు 96 మైళ్ల వేగంతో ఓ మాదిరి గాలులు వీచే కేటగిరి-2 ఉష్ణమండల తుపాను స్థాయి నుంచి కేవలం రోజున్నర వ్యవధిలోనే గంటకు 180 మైళ్ళ (288 కి.మీ.) వేగంతో పెనుగాలులు ఉద్ధృతంగా వీస్తూ కేటగిరి-5 హరికేన్‌గా మిల్టన్ పరివర్తనం చెందింది. చూస్తుంటే మిల్టన్ దూకుడు తగ్గేట్టు లేదు. దీని ‘శక్తి’ ఇంకా పెరిగి కేటగిరి-6లోకి మారుతుందా? అంటే చెప్పలేం. ఎందుకంటే హరికేన్ల శక్తిస్థాయుల్ని కొలిచే గరిష్ఠ స్కేల్ ప్రమాణం కేటగిరి-5. కేటగిరి-6 అనేది సాంకేతికంగా ఇప్పటివరకు లేనే లేదు. అదొక సైద్ధాంతిక పరికల్పన మాత్రమే. అంటే ఊహాజనిత (Hypothetical) భావన. భావనలు, ఊహలు ఉన్నా, లేకపోయినా.. మిల్టన్ మాత్రం అతి త్వరలో కేటగిరి-6 హరికేన్ రేంజికి చేరుతుందని నిపుణుల అంచనా.గాలుల వేగం గంటకు 157 మైళ్ళు (252 కిలోమీటర్ల) దాటితే అది కేటగిరీ-5 హరికేన్ అవుతుంది. గంటకు 192 మైళ్ల (307 కిలోమీటర్ల) ప్రచండ వేగంతో గాలులు వీస్తే అది కేటగిరి-5 ‘అంతిమ హద్దు’ను దాటవేసినట్టే. 1980 నుంచి చూస్తే కేవలం 5 హరికేన్లు, టైఫూన్లు మాత్రమే కేటగిరి-5 కంటే ఎక్కువ తీవ్రతతో సంభవించాయి. కడపటి సమాచారం అందేసరికి.. వెచ్చటి గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలాల్లో గంటకు 9 మైళ్ళ వేగంతో కదులుతున్న ‘మిల్టన్’ హరికేన్ బుధవారం ‘తంపా అఖాతం’ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.ఫ్లోరిడా పశ్చిమ తీరంపై ప్రభావం అధికంగా ఉండవచ్చు. ఫ్లోరిడాలోని పలు ప్రాంతాల్లో ప్రజల్ని ఇళ్ళు ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. మనం బోయింగ్ 747 జెట్ విమానం ఇంజిన్ లోపల ఉంటే ఆ ‘హోరు’ ఎలా ఉంటుందో.. కేటగిరీ-5 హరికేన్ గర్జన అలా ఉంటుందని బ్రిటన్ పత్రిక ‘ది ఇండిపెండెంట్’ వర్ణించింది.- జమ్ముల శ్రీకాంత్(Credit: USA TODAY, CBS News, ABC News, The Independent (UK), The Australian). -
USA: హెలెన్ విధ్వంసం
ఫ్లోరిడా: అమెరికాను తాకిన భీకర హెలెన్ తుపాను ఫ్లోరిడాతో పాటు ఆగ్నేయ అమెరికాలో అపారమైన విధ్వంసం సృష్టించింది. జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియాల్లో వరదలు, ఇళ్లు కూలిన ఘటనల్లో 72 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగేలా ఉంది. వరద నష్టం 15 నుంచి 26 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. టెన్నెసీలోని యునికోయ్ కౌంటీ హాస్పిటల్లోకి వరద చేరడంతో మొత్తం 54 మంది భవనంపైకి చేరారు. వారిని హెలికాప్టర్ ద్వారా కాపాడారు. న్యూపోర్టు సమీపంలో జలాశయం పొంగిపొర్లుతుండటంతో 7 వేల మందిని తరలించారు. నార్త్ కరోలినాలో వందేళ్లలోనే రికార్డు స్థాయిలో వరదలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. అట్లాంటాలో 48 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 28.24 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇక్కడ 1878 తర్వాత ఈ స్థాయి వర్షం ఇదే మొదటిసారని జార్జియా వాతావరణ విభాగం ప్రకటించింది. వరదల ధాటికి పార్కు చేసిన కార్లన్నీ మునిగిపోయాయి. ఈ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఫ్లోరిడాలో పలు ప్రాంతాలకు చేరేందుకు పడవలే దిక్కయ్యాయి. ఫ్లోరిడా, జార్జియా, కరోలినాల్లో 30 లక్షల ఇళ్లు, వ్యాపారసంస్థలకు కరెంటు నిలిచిపోయింది. ఇటీవలి ఇడాలియా, డెబ్బీ తుపాన్లను మించిన నష్టం కలిగిందని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీ శాంటిస్ తెలిపారు. తుపాను తీవ్రత తగ్గినా కుండపోత కొనసాగుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. -
#HurricaneHelene : అమెరికాలో హరికేన్ విధ్వంసం (ఫొటోలు)
-
అమెరికాను వణికిస్తున్న హరికేన్ హెలెన్
వాషింగ్టన్: అమెరికాను హరికేన్ హెలెనా వణికిస్తోంది. మెక్సికో తీరం నుంచి అమెరికాలోని ఫ్లోరిడా దిశగా అతి తీవ్ర హరికేన్ హెలెన్ దూసుకెళ్తోందని యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్(ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. హెలెన్ హరికేన్ కేటగిరి-3 లేదా కేటగిరి-4 హరికేన్‌గా బలపడే అవకాశం ఉందని ఎన్‌హెచ్‌సీ అధికారులు చెబుతున్నారు.హరికేన్ హెలెన్ ఫ్లోరిడా సిటీపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫ్లోరిడాలోకి దాదాపు పది కౌంటీలపై హరికేన్ ప్రభావం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, ఇప్పటికే హరికేన్ ప్రభావంతో సిటీలో తీవ్రమైన గాలులతో కూడా వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో వరద నీటిలో కార్లు మునిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక, హెలెన్ ప్రభావంతో పెనుగాలులు, కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని అమెరికా వాతారణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. 🚨Storm surges up to 20 feet in Florida. #HurricaneHelene This is absolutely catastrophic…Prayers to anyone involved🙏pic.twitter.com/tD1LtlFFEd— WOLF News (@WOLF_News_) September 26, 2024 🚨🇲🇽HURRICANE HELENE UPDATEQuintana Roo, Mexico:- Massive flood and Material damage reported- Cancun hotel area severely affectedNo loss of life reportedAssessment and recovery efforts underway#HurricaneHelene #QuintanaRoo #Cancun #Hurricane #mexico pic.twitter.com/6vmlMY0qaV— Berkan Yılmaz (@Berk04790) September 26, 2024 🚨🇺🇲 UNC Asheville Flood Alert (University of North #Carolina at Asheville, 1 University Heights, #Asheville, NC - Flash flooding reported on campus- Students and staff advised to seek higher groundSTAY SAFE: Avoid flooded areas#UNCA #FlashFlood #Helene #HurricaneHelene… https://t.co/J0RtuUKJSR pic.twitter.com/R8wnLhUm2P— Weather monitor (@Weathermonitors) September 26, 2024ఇది కూడా చదవండి: న్యూక్లియర్ వార్‌కు సిద్ధం.. పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ -
T20 World Cup 2024: హరికేన్ ప్రభావం.. ఇంకా బార్బడోస్‌లోనే టీమిండియా
టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం మరుసటి రోజే (జూన్ 30) భారత్‌కు తిరిగి రావాల్సిన టీమిండియా.. హరికేన్ (గాలివాన) ప్రభావం కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లోనే ఇరుక్కుపోయింది. హరికేన్ తీవ్రరూపం దాల్చడంతో బార్బడోస్‌లోని విమానాశ్రయం మూసివేశారు. దీంతో భారత క్రికెటర్లు గత రెండు రోజులుగా హోటల్ రూమ్‌కే పరిమితమయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా కూడా భారత బృందంతో పాటే ఉన్నారు. Virat Kohli showing Hurricanes to Anushka Sharma on video call at Barbados. ❤️pic.twitter.com/PzZY3RmMMb— Tanuj Singh (@ImTanujSingh) July 2, 2024ప్రకృతి శాంతిస్తే టీమిండియా గురువారం ఉదయానికంతా భారత్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. భారత బృందం రిటర్న్ జర్నీ ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడింది. గాలివాన మధ్యమధ్యలో కాస్త ఎడతెరిపినిస్తూ మళ్లీ తీవ్రరూపం దాలుస్తుంది.బార్బడోస్‌లో భారత బృందం బస చేస్తున్న హోటల్లో నీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్నట్లు సమాచారం. బార్బడోస్ నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉంది. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి.. తన భార్య అనుష్క శర్మకు హరికేన్ తీవ్రతను ఫోన్లో చూపించాడు. మూడు రోజులైనా హరికేన్ తీవ్రత తగ్గకపోవడంతో భారత్‌లో ఉన్న క్రికెటర్ల ఆప్తులు ఆందోళన చెందుతున్నారు. టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. వరల్డ్‌కప్ విన్నింగ్ హీరోలకు ఘన స్వాగతం పలకాలని యావత్ భారత దేశం ఎదురుచూస్తుంది. కాగా, టీమిండియా 14 ఏళ్ల అనంతరం టీ20 వరల్డ్‌కప్‌ను తిరిగి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. బార్బడోస్‌లో జరిగిన ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగోసారి (1983, 2007, 2011, 2024) జగజ్జేతగా నిలిచింది. -
భీకర హరికేన్ ధాటికి అతలాకుతలమైన కరేబియన్ కంట్రీ బార్బడోస్ (ఫొటోలు)
-
బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో టీమిండియా రాక
Update: బార్బడోస్‌లో హరికేన్ ప్రభావం తగ్గడంతో టీమిండియా ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరనుంది. భారతకాలమానం ఇవాళ సాయత్రం 6 గంటలకు భారత బృందం ప్రత్యేక విమానంలో బార్బడోస్ నుంచి టేకాఫ్ కానుంది. టీమిండియా రేపు రాత్రి 7.45 గంటల ప్రాంతంలో ఢిల్లీలో ల్యాండ్ కానుంది.టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లో గాలివాన (హరికేన్) బీభత్సం ఇంకా కొనసాగుతుంది. హరికేన్ తీవ్రత కారణంగా విమానాశ్రయం మూసివేయడంతో భారత క్రికెట్ జట్టు బార్బడోస్‌లోనే ఇరుక్కుపోయింది. బార్బడోస్‌లో భారత బృందం పరిస్థితి దయనీయంగా ఉందని తెలుస్తుంది. మన వాళ్లు బస చేస్తున్న హోటల్లో నీరు, విద్యుత్ సరఫరా బంద్ అయినట్లు సమాచారం. బార్బడోస్ నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నట్లు తెలుస్తుంది. భారత ఆటగాళ్లంతా హోటల్‌కే పరిమితమయ్యారని సమాచారం.ప్రకృతి శాంతిస్తే టీమిండియా ఇవాళ (జులై 2) మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో స్వదేశానికి బయల్దేరవచ్చు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా కూడా భారత బృందంతో పాటే ఉన్నారు. మరోవైపు టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. వరల్డ్‌కప్ విన్నింగ్ హీరోలకు ఘన స్వాగతం పలకాలని యావత్ భారత దేశం ఎదురుచూస్తుంది. కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో టీమిండియా.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి, రెండో సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. -
T20 World Cup 2024: బార్బడోస్‌లో ఇరుక్కుపోయిన టీమిండియా
టీ20 వరల్డ్‌కప్ 2024 విజయానంతరం భారత క్రికెట్ బృందం బార్బడోస్‌లోనే (ఫైనల్ మ్యాచ్‌కు వేదిక) ఇరుక్కుపోయింది. అట్లాంటిక్‌లో ఉద్భవించిన 'బెరిల్' హరికేన్ కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో టీమిండియా బార్బడోస్‌లోనే ఉండిపోయింది. హరికేన్ ప్రభావం తగ్గి విమాన సర్వీసులు పునరుద్ధరించబడితే రేపటి కల్లా టీమిండియా ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. బార్బడోస్‌లో భారత బృందం హిల్టన్‌లో బస చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం టీమిండియా ఇవాళ (జులై 1) ఉదయం 11 గంటలకంతా భారత్‌లో ల్యాండ్ కావల్సి ఉండింది. భారత రూట్ మ్యాప్ బార్బడోస్ నుంచి న్యూయార్క్‌కు.. న్యూయార్క్ నుంచి దుబాయ్‌కు.. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకునేలా ఉండింది. అయితే బెరిల్ హరికేన్ టీమిండియా రిటర్న్ ప్లాన్లు దెబ్బతీసింది.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి రెండోసారి జగజ్జేతగా నిలిచిన టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. భారత ఆటగాళ్లు ఢిల్లీలో ల్యాండ్ కాగానే ఘన స్వాగతం పలకాలని ప్లాన్లు చేసుకున్నారు. భారత ప్రభుత్వం సైతం వరల్డ్‌కప్ హీరోలను ఘనంగా స్వాగతం పలకాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. భారత్‌లోకి ఎంటర్ కాగానే టీమిండియా హీరోలను ఊరేగింపుగా తీసుకెళ్లాలని ప్లాన్లు చేసుకుంది. ఈ తంతు అనంతరం భారత క్రికెట్ బృందం ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది. ప్రధాని నివాసంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం ఉండనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బీసీసీఐ నిన్న వరల్డ్‌కప్ గెలిచిన భారత బృందానికి రూ. 125 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. ఈ స్థాయి భారీ మొత్తాన్ని క్రికెట్ చరిత్రలో ఏ జట్టు అందుకుని ఉండకపోవచ్చు. బీసీసీఐ తమ హీరోల గౌరవార్దం ఈ భారీ నగదు నజరానాను ప్రకటించింది. -
తుపానులకు పేర్లు ఎందుకు? ఎవరు పెడతారు?
ఈ సంవత్సరంలో నాలుగో తుపాను ఇప్పుడు భారతదేశాన్ని చుట్టుముట్టేయడానికి సిద్ధంగా ఉందని వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ‘మిథిలీ’ తుపాను బీభత్సం మరువక ముందే ‘మిచాంగ్’ తుపాను విరుచుకుపడబోతోందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ‘మిచాంగ్’ తుపాను డిసెంబర్ 4న తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇంతకీ తుపానులకు పేర్లు ఎందుకు పెడతారు? వాటి మధ్య తేడాలేమైనా ఉంటాయా? హుద్‌హుద్.. తిత్లీ.. పెథాయ్ పేర్లు వేరైనా ఇవన్నీ మన దేశంలో విరుచుకుపడిన తుపానులే. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుపానులు సంభవించినప్పుడు వాటి మధ్య తేడా, ప్రభావాలను గుర్తించేందుకు వాటికి ఇలా పేర్లు పెడుతుంటారు. ఆగ్నేయాసియాలోని దేశాలే తుపానులకు పేర్లు పెడుతుంటాయి. ఉదాహరణకు తిత్లీ పేరును పాకిస్తాన్, గజను శ్రీలంక సూచించాయి. గతంలో ఒడిశా, పశ్చిమ బంగాలను వణికించిన తుపానుకు అంఫన్ అని పేరు పెట్టింది థాయ్‌లాండ్. అంఫన్ అంటే థాయిలాండ్ భాషలో ఆకాశం అని అర్థం. కనీసం 61 కిలోమీటర్ల వేగం కలిగిన గాలులతో కూడిన తుపాను సంభవించినప్పుడే వాటికి పేర్లు పెట్టడమనేది సంప్రదాయంగా వస్తోంది. అమెరికాలో తుపాన్లను టోర్నెడోలని, చైనాలో టైఫూన్స్, హిందూ మహాసముద్రంలో సంభవించే తుపాన్లను సైక్లోన్స్ అని పిలుస్తారు. ఆస్టేలియా పశ్చిమ తీరంలో సంభవించే తుపాన్లను విల్లీవిల్లీస్, వెస్ట్ ఇండీస్ దీవుల్లోని తుపాన్ల ను హరికేన్స్ అని అంటారు. ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుపానులకు పేర్లు పెట్టడం 2004 సెప్టెంబరు నుంచి మొదలైంది. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలోని బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుపాన్లకు పేర్లు పెడుతుంటారు. 2018లో ఈ జాబితాలో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ చేరాయి. దీంతో ఈ దేశాల సంఖ్య 13కు చేరుకుంది. నిసర్గా తుపానుకు బంగ్లాదేశ్, గతి తుపానుకు భారత్, నివార్‌కు ఇరాన్, బురేవికి మాల్దీవులు, తౌక్టేకి మయన్మార్, యాస్కి ఒమన్ పేర్లు పెట్టాయి. భారతదేశం.. గతితో పాటు తేజ్, మురాసు, ఆగ్, వ్యోమ్, జహర్, ప్రోబాహో, నీర్, ప్రభాజన్, ఘుర్ని, అంబుడ్, జలాధి, వేగా వంటి పేర్లను సూచించింది. వాతావరణ శాఖ నిబంధనల మేరకే ఈ పేర్లు పెట్టాల్సి ఉంటుంది. ఇవి ఉచ్ఛరించడానికి సులభంగా, ఎనిమిది అక్షరాలలోపే ఉండాలి. ఇవి ఎవరి భావోద్వేగాలను, విశ్వాసాలను దెబ్బతీయకూడని విధంగా ఉండాలి. తుపాన్లకు పేర్లు పెట్టడం వలన వాటిని గుర్తుపెట్టుకోవడం సులభమవుతుంది. ఆ తుపాను కదలికల మీద హెచ్చరికలు జారీ చేయడానికి వీలవుతుంది. ఒకేసారి రెండు, మూడు తుపానులు వచ్చిన పక్షంలో వాటిని గుర్తించడానికి అనువుగా ఉంటుంది. ఈ పేర్ల వలన ఏ తుపాను ఎప్పుడు వచ్చిందనేది గుర్తుపెట్టుకోవడం మరింత సులభమవుతుంది. ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడానికి ఈ విధానం అనువుగా ఉంటుంది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు? ఓడితే బాధ్యులెవరు? -
డెర్నా సిటీ మేయర్ అనుమానం
డెర్నా: వరదలు, రెండు డ్యామ్‌ల నేలమట్టంతో జనావాసాలపైకి జల ఖడ్గం దూసుకొచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన లిబియాలో పరిస్థితి కుదుటపడలేదు. డేనియల్ తుపాను మిగిలి్చన విషాదం నుంచి డెర్నా నగరం తేరుకోలేదు. అక్కడ ఇంకా వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. 5,500 మందికిపైగా చనిపోయారని అధికారులు ప్రకటించగా మృతుల సంఖ్య 20,000కు చేరుకోవచ్చని సిటీ మేయర్ అబ్దెల్ మోనియమ్ అల్ ఘైతీ అనుమానం వ్యక్తంచేశారు. -
అమెరికాలో ‘హిల్లరీ’ బీభత్సం
వాషింగ్టన్: అమెరికాలోని పలు రాష్ట్రాల్లో హిల్లరీ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను ధాటికి దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులు వీస్తున్నాయి. వర్షం కారణంగా పలు రహదారులు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ముఖ్యంగా దక్షిణ కాలిఫోరి్నయాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో వర్షం కురవడం 84 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అని స్థానిక అధికారులు వెల్లడించారు. తుపాను బీభత్సం సృష్టిస్తుండడంతో నెవెడాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తుపాను వల్ల ఏ మేరకు ఆస్తి నష్టం జరిగిందన్న దానిపై సర్వే ప్రారంభించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే డెత్ వ్యాలీలోని కొన్ని ప్రాంతాలు వరదల్లో చిక్కుకోవడం గమనార్హం. మరోవైపు దక్షిణ కాలిఫోరి్నయాలో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓజాయ్ సిటీకి ఈశాన్య దిక్కున ఆదివారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలియజేసింది. భూ అంతర్భాగంలో 4.8 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించినట్లు వెల్లడించింది. భూకంపానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాస్ఏంజెలెస్ నగర సమీపంలో భూమి రెండుసార్లు కంపించినట్లు అధికారులు గుర్తించారు. -
తీవ్ర తుపానుతో అమెరికా అతలాకుతలం.. 11 లక్షల ఇళ్లల్లో అంధకారం
వాషింగ్టన్: అమెరికాలోని తూర్పు తీర రాష్ట్రాలను భీకర తుపాను వణికిస్తోంది. బలమైన గాలులు, భారీ వర్షాలకు సంబంధించిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చనిపోయారు. విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. టెన్నెస్సీ నుంచి న్యూయార్క్ వరకు 10 రాష్ట్రాల్లోని 11 లక్షల నివాసాల్లో అంధకారం అలుముకుంది. సుమారు 3 కోట్ల మందిపై తుపాను ప్రభావం పడింది. తమ ప్రాంతంలోని విద్యుత్ లైన్లను మరమ్మతు చేసేందుకు కొన్ని రోజులు పట్టవచ్చని నాక్స్విల్లె యుటిలిటీ బోర్డ్ తెలిపింది. అలబామాలోని ఫ్లోరెన్స్‌లో సోమవారం పిడుగుపాటుకు ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సౌత్ కరోలినాలోని అండెర్సన్ కౌంటీలో చెట్టు కూలి పడటంతో ఓ బాలుడు(15) చనిపోయాడు. భారీ వర్షాలు, గంటకు 70 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీస్తుండటంతో విమాన, రోడ్డు రవాణా వ్యవస్థ స్తంభించింది. ఎనిమిది వేల విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. మరో 2,600 విమాన సర్వీసులు రద్దయ్యాయి. తూర్పు తీర ప్రాంతం వైపు రావాల్సిన విమానాలను దారి మళ్లించినట్లు ఫెడరల్ ఏవియేషన్ తెలిపింది. వందలాదిగా ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. చెట్లు కూలి రహదారులు, నివాసాలపై పడిపోయాయి. విధులకు హాజరైన ఉద్యోగులను తుపాను కారణంగా ముందుగానే ఇళ్లకు చేరుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవలి కాలంలో ఇంతటి తీవ్ర తుపాను ఇదేనని జాతీయ వాతావరణ విభాగం పేర్కొంది. -
టోర్నడో విధ్వంసం.. ఇళ్లు, భవనాలు నేలమట్టం.. దృశ్యాలు వైరల్
పారిస్: ఉత్తర ఫ్రాన్స్ ప్రాంతంలోని బిహుకోర్ట్ అనే గ్రామంలో మినీ టోర్నడో బీభత్సం సృష్టించింది. సుడిగాలి ధాటికి గ్రామంలోని పదుల సంఖ్యలో ఇళ్లు, భవనాలు ధ్వంసంమయ్యాయి. ఆ ప్రాంతంలో అకాలంగా వేడి వాతావరణం ఏర్పడి ఆ తర్వాత టోర్నడోగా మార్పు చెందినట్లు అధికారులు తెలిపారు. టోర్నడో విధ్వంసం దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బిహుకోర్టు గ్రామంపై గగనంలో ఆదివారం సాయంత్రం నల్లటి మేఘాలు కమ్ముకుని ఆ తర్వాత సుడిగాలి వీచినట్లు పలువురు సోషల్ మీడియాల్లో వీడియోలు షేర్ చేశారు. ఈ టోర్నడో బీభత్సంలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు పాస్ డీ కలాయిస్ ప్రాంత అధికార యంత్రాంగం తెలిపినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. కొన్ని సంవత్సరాలుగా టోర్నడోలు ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నాయని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Moment of the impact of the strong #tornado yesterday that hit the town #Bihucourt in Northern France, caused by a long-lived tornadic supercell. Video was taken by local resident Clèment Devulder (Link: https://t.co/EGTwl28C6a…)@KeraunosObs @pgroenemeijer @ReedTimmerAccu pic.twitter.com/vHK8urORLC — Unwetter-Freaks (@unwetterfreaks) October 24, 2022 A significant tornado hit northern France today causing major damage as Western Europe gets slammed by a substantial severe weather outbreak. 🎥 Credit: Robin Gpic.twitter.com/O7kfjQt85m — Colin McCarthy (@US_Stormwatch) October 23, 2022 ఇదీ చదవండి: పెళ్లైన మరుసటి రోజే డబ్బు, నగలతో వధువు పరార్.. వరుడికి ఫోన్ చేసి..! -
ఫ్లోరిడాలో హరికేన్ విలయం.. వరదలో కొట్టుకుపోయిన రూ. 8 కోట్ల కారు
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఇయన్ హరికేన్ ప్రళయం సృష్టిస్తోంది. హరికేన్ ప్రతాపానికి ఫ్లోరిడా రాష్ట్రంలోని తీర ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భయానక గాలులు, కుండపోత వర్షాలతో ఇళ్లన్నీ నీటమునిగాయి ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. రోడ్లన్నీ మునిగిపోయాయి. ఇంటి ముందు పార్క్చేసిన వాహనాలన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. 20 మంది వలసకారులతో కూడిన పడవ మునిగిపోవడంతో కొంతమంది అదృశ్యమైనట్లు యూఎస్ బార్డర్ పెట్రోలింగ్ అధికారులు తెలిపారు. హరికేన్ పరిస్థితిని లైవ్‌లో ని వివరిస్తన్న రిపోర్టర్లు కొట్టుకొని పోయినంతపనైంది. వీధుల్లోకి షార్క్‌లు కొట్టుకొని వచ్చిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇయన్ హరికేన్ కారణంగా ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ఇంటి గ్యారేజ్‌లో పార్క్ చేసిన ఓ ఖరీదైన కారు కొట్టుకుపోయింది. వరద ధాటికి కారు కొట్టుకుపోతున్న దృశ్యాలను స్వయంగా యాజమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మెక్లారెన్ కంపెనీకి చెందిన పీ1 సూపర్ కారు ఖరీదు అక్షరాలా 1 మిలియన్ డాలర్లు. ‘అంటే ఇండియాన్ కరెన్సీలో దాదాపు 8 కోట్లు). ఇంత ఖరీదైన లగ్జరీ నేపుల్స్ ప్రాంతంలో కారు వరద నీటిలో కట్టుకుపోయింది.ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇప్పటి వరకు వేలల్లో లైకులు వచ్చి చేరాయి. చాలా మంది నెటిజన్లు కొట్టుకుపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ‘నన్ను క్షమించండి, ఇది చాలా బాధాకరం. ఇలా జరిగినందుకు చాలా చింతిస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండాలి.. కారు పోతే మళ్లీ కొనుక్కోవచ్చు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఐఏఎస్ అధికారికి మూడేళ్లు జైలు -
Hurricane Ian: అమెరికాలో హరికేన్ బీభత్సం.. ఫొటోలు, వీడియోలు వైరల్
సెయింట్ పీటర్స్బర్గ్: అమెరికాలో ఇయన్ హరికేన్ ప్రతాపానికి ఫ్లోరిడా విలవిలలాడుతోంది. నైరుతి ఫ్లోరిడాలో హరికేన్ విధ్వంసం సృష్టిస్తోంది. గంటకి 241 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు నీట మునిగిపోయాయి. వీధుల్లోకి షార్క్‌లు కొట్టుకొస్తున్నాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోతున్నాయి. వంతెనలు కొట్టుకుపోతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానలతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 25 లక్షల మంది కరెంట్ లేక తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. అమెరికా చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన హరికేన్ ఇదేనని నేషనల్ హరికేన్ సెంటర్ వెల్లడించింది. టాంపా, ఒర్లాండో విమానాశ్రయాల్లో విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. వందల సంఖ్యలో మృతులు ఫ్లోరిడా కౌంటీ అధికారి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. సహాయం కోసం తమకు ఆగకుండా ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. అయితే కొన్ని కౌంటీలలోకి వెళ్లడానికి వీల్లేని పరిస్థితులున్నాయని తెలిపారు. ఇళ్లల్లోకి అయిదు అడుగుల మేరకు నీరు వచ్చి చేరినట్టుగా సమాచారం అందుతోందని చెబుతున్నారు. ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. హరికేన్ వార్తల్ని కవర్ చేస్తున్న విలేకరులు పెనుగాలల ధాటికి నిలువలేక ఒరిగిపోతున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి. విద్యుత్ లేకపోవడం, సెల్ టవర్లు పనిచెయ్యకపోతూ ఉండడంతో సహాయ చర్యలు అందించడం కత్తి మీద సాములా మారింది. జాతీయ రక్షణ సిబ్బంది దాదాపుగా 5 వేల మందిని సహాయం కోసం ఫ్లోరిడా పంపినట్టుగా రక్షణ శాఖ వెల్లడించింది. హరికేన్ విధ్వంసం సృష్టించే ప్రాంతాల్ని తిరిగి పునర్నిర్మిస్తామని అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. 😥#Ianflorida pic.twitter.com/ccDcKKruyV — Elisabeth M G Halle (@ElisabethMGHal1) September 30, 2022 Estas imágenes aéreas corresponden a la localidad de Kissimmee, donde se encuentran los parques de Disney y Universal. Las inundaciones son gravísimas. #IanHurricane #IanRescue #Ianflorida pic.twitter.com/WhWtvSY0Gx — Conexión Con El Tiempo (@conexiontiempo) September 29, 2022 PLEASE PRAY FOR US 🙏 WE ARE GETTING POUNDED IN FLORIDA …#HurricaneIan #Ian #Ianflorida pic.twitter.com/Cf18P0fC8y — RightofOpinion ® (@RightofOpinion) September 28, 2022 #Shockingmoment house floats away in Naples during #HurricaneIan #IanHurricane #Ianflorida pic.twitter.com/itIsTa37Iu — 6IX WORLD NEWS (@6ixworldnews) September 29, 2022 #Video | Destruction and devastation in Florida, after Hurricane Ian ripped through the region.#IanHurricane #Ian #FloridaStorm #HurricaneIan #FloridaHurricane #Storm #Watch #ViralVideo #NCIBNewsNetwork #Florida #Ian2022 #Ianflorida #Stormsurge #Hurricane pic.twitter.com/YyT7XKaGVt — NCIB NEWS NETWORK (@NCIB_INDIA_NEWS) September 29, 2022 Spectaculaire élévation du niveau de la mer causée par l'ouragan #Ian à Fort Myers, Floride. (La dépression cyclonique aspire littéralement l'eau). pic.twitter.com/K4LyMo1atP — Mac Lesggy (@MacLesggy) September 29, 2022 Ian's impact on Fort Myers Beach, Florida. This is of Estero Boulevard. Video: Loni Architects. #IanHurricane #ian #Ianflorida pic.twitter.com/8ZyiecLxzv — Me (@Winner96455) September 28, 2022 People risk their lives swimming in Fort Myers during #hurricaneian #HurricanIan #Ianflorida pic.twitter.com/Trb2OpUfQS — 6IX WORLD NEWS (@6ixworldnews) September 28, 2022 #Video | Catastrophic footage of hurricane Ian in Florida, USA! #IanHurricane #Ian #FloridaStorm #HurricaneIan #Storm #Watch #ViralVideo #NCIBNewsNetwork #Florida #Ian2022 #Ianflorida pic.twitter.com/b5eNfjY3cO — NCIB NEWS NETWORK (@NCIB_INDIA_NEWS) September 29, 2022 This is what it looks like in North Naples this morning. Several cars are displaced, several trees knocked down. We are safe and the other guests we’ve seen at our hotel our safe. We’ve all been checking on each other. @winknews #HurricaneIan #Ianflorida #CollierCounty pic.twitter.com/6ZwKz34wkF — Annette Montgomery (@AnnettemTV) September 29, 2022 -
బీభత్సం సృష్టించనున్న ఇయాన్ తుపాన్...బలమైన గాలులతో కూడిన వర్షం
అతి పెద్ద తుపాను బుధవారం రాత్రికే బలపడనుందని గురువారం తెల్లవారుజామున తాకే అవకాశం ఉందని నేషనల్ ఓషియానిక్ అట్మాస్పియర్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) హెచ్చరించింది. ఈ తుపాన్ అమెరికాలోని మెక్సికో గల్ఫ్ మీదుగా పయనించి ఫ్లోరిడా రాష్ట్రం వైపుగా ఏర్పడనున్నట్లు వెల్లడించింది. ఆ ప్రాంతంలో 1921 తర్వాత అదే స్థాయిలో ఈ తుపాను సంభవిస్తున్నట్లు పేర్కొంది. ఈ తుపానుకి ఇయాన్ తుపాన్‌గా నామకరణం చేశారు. ఈ ఇయాన్ తుపాను ఫ్లోరిడాలోని తుంబా ప్రాంతానికి తాకుతుందని తెలిపింది. ఇప్పటికే అమెరికాలోని క్యూబా ప్రాంతాన్ని ఈ తుపాన్ అంధకారంలోకి నెట్టినట్లు అధికారులు తెలిపారు. అదీగాక ఆ ప్రాంతంలో యూఎస్ జాతీయ తుఫాను కేంద్రం(ఎన్‌హెచ్‌సీ) ఐదవ ప్రమాదకర విపత్తుగా హెచ్చరికలు జారీ చేసింది. అంతేగాదు అక్కడ ఉన్న ప్రజలను తరలించే పనులను ముమ్మరంగా చేపట్టింది. పైగా గంటకు 250 కి.మీ దూరం నంచి బలమైన గాలులుతో కూడిన వర్షాలు వస్తాయని తెలిపింది. సుమారు రెండు అడుగుల మేర వర్షం కురిసే అవకాశ ఉందని అధికారులు భావిస్తున్నారు. రెండు రోజుల వరకు ఈ తుపాను ప్రభావం ఉంటుందని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ పేర్కొన్నారు. అధికారులు ఇప్పటికే సుమారు 2.5 మిలియన్ల మంది ప్రజలను తరలించినట్లు తెలిపారు. శాటిలైట్ సాయంతో సంగ్రహించిన ఐయాన్ తుపాన్ బలపడుతున్న వీడియోని నేషనల్ ఓషియానిక్ అట్మాస్పియర్ అడ్మినిస్ట్రేషన్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. As #HurricaneIan churns near Cuba, #GOESEast can see its distinct eye as well as #lightning flashing around the storm.#Ian is a major Category 3 #hurricane that is continuing to strengthen in the southeastern Gulf of Mexico. Latest: https://t.co/FYrreOueMf pic.twitter.com/Rh85xqu0Rt — NOAA Satellites (@NOAASatellites) September 27, 2022 (చదవండి: మిసైల్ దూకుడు పెంచిన ఉత్తరకొరియా.. షాక్‌లో యూఎస్, దక్షిణ కొరియా) -
AP: తుపాను ముప్పు తప్పినట్టే కానీ..
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: బంగాళాఖాతంలో పరిస్థితులు సహకరించకపోవడంతో రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పింది. కానీ.. భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలుల ప్రభావం ఉంటుంది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్ర స్తుతం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి రాగల 36 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం.. తీవ్ర వాయుగుండంగా బలపడుతూ ఈ నెల 18 నాటికి నైరుతి బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్–తమిళనాడు తీరాలకు సమీపించనుంది. ఇది తుపానుగా మారకుండా తీవ్ర వాయుగుండం లేదా వాయుగుండంగా బలహీన పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం నుంచి రాష్ట్రంలో మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. భారీ, అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాలివి ► మంగళవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక ట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయి. ► 17న ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, వైఎస్సార్, కర్నూలు, అనం తపురం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం. ► 18న ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం. ► 19నవిజయనగరం, విశాఖపట్నం,ఉభయ గోదా వరి, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం. 18 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు ► సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. 16వ తేదీ నుంచి 18 వరకు తీరం వెంబడి గంటకు గరిష్టంగా 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 18 వరకు మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. అనంత జిల్లా గాండ్లపెంట మండలంలో 235 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
ఇడా తుపాను దెబ్బకు 46 మంది మృతి
న్యూయార్క్: అమెరికాలో ఇడా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మేరీలాండ్ నుంచి కనెక్టికట్ ప్రాంతం వరకు ఇడా సృష్టించిన విలయంలో దాదాపు 46 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. పలువురు ప్రజల ఇళ్లు, వాహనాలు నీటమునిగాయి. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇడా దెబ్బకు పలు ప్రాంతాల్లో నదులు పొంగి ఉత్పాతాలు సృష్టించాయి. ఈ తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో 23 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. పరిస్థితులను అధ్యక్షుడు జోబైడెన్ సమీక్షిస్తున్నారు. జోరున కురుస్తున్న వానతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొవిడ్ బాధితులతో పాటు అత్యవసర చికిత్సలు అవసరమైనవారి కోసం చాలా చోట్ల జనరేటర్లతో ఆసుపత్రులను నిర్వహించాల్సి వచి్చంది. అత్యవసర సహాయం కోసం ఏర్పాటు చేసిన 911 సేవలకూ ఆటంకాలు ఎదురయ్యాయి. చాలా చోట్ల చెట్లు కూలిపోవడంతో పాటు ఇళ్ల కప్పులు ధ్వంసమయ్యాయి. తుపాను కారణంగా ష్కైల్‌కిల్ నదికి 100ఏళ్లలో ఎన్నడూ రానంత వరద వచి్చంది. వాన, గాలి కారణంగా అధికారిక సహాయ చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. -
న్యూయార్క్‌లో తుపాను బీభత్సం
న్యూయార్క్: అమెరికా ఈశాన్య రాష్ట్రాలను ‘ఇదా’ తుపాను అతలాకుతలం చేస్తోంది. న్యూయార్క్, న్యూ జెర్సీ, పెన్సిల్వేనియాలలో మొత్తంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. తుపాను సృష్టించిన విలయం ధాటికి న్యూయార్క్ రాష్ట్రంలో అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ)ని గవర్నర్ క్యాథీ హోచల్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. న్యూ ఇంగ్లండ్ (కనెక్టికట్, మెయిన్, మసాచుసెట్స్, న్యూ హాంప్‌షైర్, రోడ్ ఐలాండ్, వెర్మోంట్ రాష్ట్రాలున్న ప్రాంతం)లోనూ తుపాను ప్రభావం పెరుగుతోంది. మరిన్ని భీకర సుడిగాలులు దూసుకొచ్చే ప్రమాదముందని వార్తలొచ్చాయి. ఒక్క న్యూయార్క్‌లోనే రెండేళ్ల బాలుడు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూజెర్సీలో ఒకరు మరణించారని పోలీసులు చెప్పారు. సబ్వే స్టేషన్లలోకి వర్షపు నీరు చేరడంతో అన్ని సర్వీస్‌లను రద్దుచేశారు. సబ్వేలో సీట్లపై నిలబడే నగరవాసులు ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో దర్శనమిచ్చాయి. ఇళ్లలోకి విద్యుత్ సరఫరా నిలిచిపోయి దాదాపు 10 లక్షల మంది ప్రజలు అంధకారంలో ఉంటున్నారు. సెంట్రల్ పార్క్‌లో రికార్డుస్థాయి వర్షపాతం ‘న్యూయార్క్ సిటీలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించాం’ అని న్యూయార్క్‌లోని అమెరికా జాతీయ వాతావరణ శాఖ ప్రకటించింది. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత సెంట్రల్ పార్క్‌లో బుధవారం రాత్రి ఒక్క గంటలోనే రికార్డుస్థాయిలో 8.91 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. న్యూజెర్సీలోనూ తుపాను కారణంగా భారీస్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. సుడిగాలుల ధాటికి దక్షిణ న్యూజెర్సీ కౌంటీలో చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మొత్తం 21 కౌంటీల్లో ఎమర్జెన్సీ విధించారు. పెన్సిల్వేనియాలో వరదల పట్టణంగా పేరున్న జాన్స్టౌన్ దగ్గరున్న ఆనకట్ట పొంగి పొర్లే ప్రమాదం పొంచి ఉంది. న్యూజెర్సీ, పెన్సిల్వేనియాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి లక్షలాది ఇళ్లలో అంధకారం అలముకుంది. సబ్వే స్టేషన్లోకి దూసుకొస్తున్న వరద నీరు; అపార్ట్మెంట్ సెల్లార్ నుంచి వృద్ధుడిని రక్షిస్తున్న దృశ్యం -
Hurricane Ida: అంతరిక్షం నుంచి భీకర ప్రళయ దృశ్యాలు
-
Cyclone Yaas: ముంచుకొస్తున్న తుపాన్
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం రాత్రి వాయుగుండంగా మారింది. అది సోమవారం ఉదయానికి మరింత బలపడి తుపాన్‌గా మారనుంది. రాగల 24 గంటల్లో అతి తీవ్ర తుపాన్‌గా మారుతుందని విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఇది.. పోర్టుబ్లెయిర్‌కు ఉత్తర దిశలో 560 కి.మీ దూరంలో, ఒడిశా బాలాసోర్‌కు ఆగ్నేయ దిశగా 590 కి.మీ, పశ్చిమ బెంగాల్ దిఘాకు ఆగ్నేయ దిశగా 670 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ 26వ తేదీ ఉదయం ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గర్లో బంగాళాఖాతం ప్రాంతాలకు చేరుకుంటుంది. అనంతరం పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రయాణించి.. పారాదీప్ – సాగర్ ఐలాండ్స్ వద్ద 26వ తేదీ సాయంత్రం లేదా రాత్రి తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని తీరం వెంబడి రాబోయే నాలుగు రోజుల పాటు గంటకు గరిష్టంగా 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. రాష్ట్రంపై తుపాన్ ప్రభావం పెద్దగా ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. కోస్తా, రాయలసీమల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని, వడగాలులు వీస్తాయని నిపుణులు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో టెక్కలి, పాతపట్నం, పమిడిలో 4 సెంమీ, కళింగపట్నం, వీరఘట్టం, యలమంచిలి, కైకలూరు, నర్సీపట్నం, భీమవరం, విజయనగరంలో 3 సెంమీ వర్షపాతం నమోదైంది. భారీగా సహాయక సామాగ్రి సిద్ధం ► భారత రక్షణ దళాలు తుపాన్ సహాయక చర్యలకు సిద్ధమయ్యాయి. భారత వాయుదళం (ఎయిర్‌ఫోర్స్) 950 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) బృందాలతో పాటు జామ్‌నగర్, వారణాసి, పాట్నా, అరక్కోణం నుంచి 70 టన్నుల సహాయక సామాగ్రిని కోల్‌కతా, భువనేశ్వర్, పోర్టుబ్లెయిర్‌కు పంపించారు. ► 15 ఎయిర్క్రాఫ్టŠస్ ద్వారా వీటిని ఆయా ప్రాంతాలకు ఎయిర్ ఫోర్స్ అధికారులు పంపించారు. మరో 16 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్సŠ, 26 హెలికాఫ్టర్లను సహాయక చర్యల కోసం పశ్చిమ తీరంలో సిద్ధంగా ఉంచారు. ► తుపాన్ ప్రభావిత ప్రాంతాలైన భువనేశ్వర్, కోల్‌కతాకు 10, పోర్ట్‌బ్లెయిర్‌కు 5 విపత్తు సహాయక బృందాలు తరలించారు. తూర్పు నౌకాదళం నుంచి 8 యుద్ధ నౌకలు, నాలుగు డైవింగ్ బృందాలు, 10 ఫ్లడ్ రిలీఫ్ కోలమ్స్‌ని తరలించారు. ► విశాఖలోని ఐఎన్ఎస్ డేగా నుంచి రెస్క్యూ బృందాలతో నేవల్ హెలికాఫ్టర్లు, ఇండియన్ ఆర్మీకి చెందిన మూడు ఇంజినీరింగ్ టాస్క్‌ఫోర్స్ బృందాలు తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. కోవిడ్ నేపథ్యంలో బాధితులకు ఆక్సిజన్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్మ్డ్ ఫోర్స్ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. అదనపు ఆక్సిజన్ నిల్వలు సిద్ధం సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం యాస్ తుపానుగా తీవ్రరూపు దాల్చే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒడిశా నుంచి అదనపు ఆక్సిజన్ నిల్వలను తెప్పిస్తున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా, ఆర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా చేస్తున్న మూడు ప్లాంట్లతోపాటు అన్ని ఆస్పత్రులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేట్టుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ► ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా రెండు రోజులుగా ఒడిశా నుంచి అదనపు ఆక్సిజన్ నిల్వలు తెప్పిస్తున్నాం. తద్వారా అన్ని జిల్లాల్లోనూ ఆక్సిజన్ బఫర్ నిల్వలు ఉండేట్టుగా చూస్తున్నాం. ►ఇప్పటికే ఒడిశాలోని రూర్కెలా నుంచి 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తెప్పించింది. సోమవారం నాటికి మరో 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వలు రైలు ద్వారా రానున్నాయి. ► రూర్కెలా, కళింగ నగర్, అంగూల్ నుంచి రోడ్డు మార్గంలో మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సవ్యంగా తీసుకువచ్చేందుకు ఒడిశా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ►ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి రెడ్‌క్రాస్ సొసైటీ తెప్పించిన 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఆదివారం విశాఖపట్నం పోర్ట్ వద్ద ప్రభుత్వానికి అందించింది. ►రిలయన్స్ ఇండస్ట్రీస్ గుజరాత్‌లోని జామ్ నగర్ ప్లాంట్ నుంచి 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ప్రత్యేక రైళ్ల ద్వారా సరఫరా చేసింది. ► తుపాన్ నేపథ్యంలో విశాఖపట్నంలోని స్టీల్‌ప్లాంట్, ఎలెన్‌బారీ ఇండస్ట్రీస్, శ్రీకాకుళంలోని లిక్వినాక్స్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మూడు ప్లాంట్ల ద్వారా 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ►సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసే 49 ఆక్సిజన్ రీఫిల్లర్లకు నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టింది. అన్ని ఆస్పత్రులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేట్టుగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అదనంగా జనరేటర్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. -
అసలైన జంతు ప్రేమికుడంటే ఇతనే!
మెక్సికో: నగరానికి చెందిన ఓ వ్యక్తి జంతువుల మీద తనకు ఎంత ప్రేమ ఉందో ప్రపంచానికి చాటాడు. ఏకంగా 300 కుక్కలకు పైగా తన ఇంటిలోనే ఆశ్రయమిచ్చాడు. మెక్సికోలో ఉన్న యుకసాన్ పీఠభూమిని హరికేన్ కారణంగా మూసి వేశారు. దీంతో వేల సంఖ్యలో జంతువులు ఆశ్రయాన్ని కోల్పోయాయి. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. రికార్డో పిమెంటల్ వాటన్నింటిని తన ఇంటికి తీసుకువచ్చి భద్రతను, ఆహారాన్ని అందిస్తున్నాడు. కేవలం కుక్కలు మాత్రమే కాకుండా వందల సంఖ్యలు పిల్లులు, పిట్టలు కూడా ఇంట్లో ఉన్నారు. తన కూతురి గదిని, కొడుకు గదిని కూడా ఈ జంతువులతో నింపేశాడు. దీని గురించి రికార్డో మాట్లాడుతూ, అవును, వీటి కారణంగా ఇళ్లంతా వాసన వస్తుంది. అయినప్పటికీ వీటి భద్రత ముందు నాకు అది పెద్ద విషయం అనిపించడం లేదు అని పేర్కొన్నాడు. ఇక వాటి పోషణ తనకు కష్టమవుతుందని, 10, 15 కుక్కలకు అయితే ఆహారాన్ని అందించగలను కానీ ఇన్ని జంతువులకు అంటే కష్టమని రికార్డో తెలిపారు. అందుకే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని కోరుతూ కుక్కలతో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. దానిని చూసిన వారందరూ ప్రపంచవ్యాప్తంగా వేల డాలర్లను పంపిస్తున్నారు. ఇలా జంతువులను ఆదుకోవడానికి సాయం చేస్తున్న వారందరికి రికార్డో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చదవండి: కుక్కల బోనులో బంధిస్తారు... చితకబాదుతారు! -
తుపాన్‌ను ఎదిరించి వచ్చావంటూ హగ్స్...
-
తుపాన్‌ను ఎదిరించి వచ్చావంటూ హగ్స్...
అమెరికా: ఫ్లోరిడాకు చెందిన టెకారా తన కుటుంబంతో కలిసి గ్రాండ్ బహామాలోని ఫ్రీపోర్ట్‌ను సందర్శించడానికి వెళ్లారు. అదే సమయంలో డోరియా తుఫాను వారు వెళ్లిన ప్రదేశాన్ని చుట్టుముట్టింది. దీంతో ఇక భూమిపై నూకలు చెల్లినట్టే అని భయపడిపోయినప్పటికీ ఎలాగోలా తుపాను బారి నుంచి వారంతా తప్పించుకున్నారు. విలువైన వస్తువులు పోయాయే తప్ప కుటుంబంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత తొలిసారిగా సోమవారం టెకారా తన కుమారుడు మకై సిమోన్స్‌ను స్కూలుకు తీసుకెళ్లింది. అక్కడ తోటి విద్యార్థులు మకైపై కురిపించిన ప్రేమకు ఆ తల్లికి నోటమాట రాలేదు. డోరియా తుపాను నుంచి మకై క్షేమంగా బయటపడటంతో మిగతా పిల్లలందరూ పరుగున వచ్చి మకైను హత్తుకున్నారు. అతనేమయ్యాడో అని బెంగ పెట్టుకున్న అతని ఫ్రెండ్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. స్నేహితులు అందరూ అతన్ని ఎంతో మిస్ అయ్యాం అని చెప్పడంతో వారి ప్రేమకు మకై కన్నీరు పెట్టుకున్నాడు. ఈ భావోద్వేగ క్షణాలను అక్కడే ఉన్న అతని తల్లి టెకరా కాప్రన్ వీడియో తీసి ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘తుపానును ఎదుర్కొన్న తర్వాత మొదటిసారి నా కొడుకుని స్కూల్‌కు తీసుకెళ్లాను. అక్కడ అతని స్నేహితులు వాడిపై కురిపించిన ప్రేమ అందరి మనసులను దోచింది.’ అని క్యాప్షన్‌ను జోడించింది. మకైను ‘అందరూ ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు, అండగా నిలిచారు. ఒక తల్లిగా నాకు ఇది చాలు’ అని ఆమె పేర్కొన్నారు. -
బహమాస్‌లో హరికేన్ బీభత్సం
-
బహమాస్‌లో హరికేన్ విధ్వంసం
నసావు (బహమాస్): డోరియన్ హరికేన్ గురువారం అమెరికా తూర్పు తీరాన్ని తాకింది. దీని ప్రభావం వల్ల బలమైన ఈదురుగాలతో కూడిన వర్షం పడుతుండటంతో బహమాస్‌లో విధ్వంసం సృష్టించి దాదాపు 20 మంది ప్రాణాలను బలిగొంది. ఆ తర్వాత ఇది అమెరికా తూర్పు తీరం వైపు కదిలింది. హరికేన్ ధాటికి దక్షిణ కరోలినా తీరంలో ఉన్న చార్లెస్టన్లోని దిగువ ప్రాంతాలు నీట మునిగాయి. మోకాలు లోతు వరకు వరద నీరు ప్రవహిస్తుండటంతో చిన్న చిన్న పడవల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. 185 కిలోమీటర్ల వేగంతో గాలులు.. కేటగిరీ 3 హరికేన్ చార్లెస్టన్కు ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో ఈ తుపాన్ ఉందని నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. ఉత్తరం వైపు కదులుతున్న ఈ తుపాన్ కారణంగా గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. దీంతో కరోలినా, జార్జియా రాష్ట్రాలతోపాటు హరికేన్ ప్రభావిత ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశాలిచ్చారు. వందల సంఖ్యల్లోని ఇళ్లపై కప్పులు ఎగిరిపోవడంతోపాటు కార్లు మునిగిపోయాయన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’
-
అమెరికాను వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’
చికాగో : అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. రాకీ పర్వతాల నుంచి భారీగా వీస్తున్న చలిగాలుల ధాటికి 25 రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. గంటకు 148 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల కారణంగా కొలరాడో, నెబ్రస్కా, డకోటాల్లోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హిమపాతం కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. పాఠశాలలు మూతపడ్డాయి. మరికొన్నిచోట్ల హిమపాతంతోపాటు పిడుగులు కూడా పడుతుండటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కొన్ని లక్షల కుటుంబాలు చీకట్లో మగ్గిపోయాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంచు తుపానుపై అధికారిక హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా తుపానును ‘బాంబ్ సైక్లోన్’గా వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల వాహనాలు జారిపోవడం, ఒకదానితో మరొకటి ఢీకొన్న ఘటనలు చోటుచేసుకున్నాయి. హిమపాతం కారణంగా కొలరాడోలోని డెన్వర్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. విమానాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో 1,339 విమాన సర్వీసులు రద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి ప్రజలను రక్షించి ఆసుపత్రులకు తరలించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉండటంతో అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకున్నారు. న్యూమెక్సికోలో వీచిన బలమైన గాలులకు ఒక రైలుకు చెందిన 26 బోగీలు వంతెనపై నుంచి పడిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. -
ఆట వెనుక ఆట
కనిపించే ఆట వెనుక కనిపించని ఆట.. ‘ఇన్సైడ్ ఎడ్జ్’స్వార్థమే ఆ ఇన్సైడ్ గేమ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్!పంచ్‌లు ఉండవు. పవర్ ఉంటుంది. మాటలు ఉండవు. మనీ ఉంటుంది.ఎవరూ క్రిమినల్స్ కాదు.అలాగని ఎవరూ హీరోలు కాదు. చూడండి.. కళ్లు బైర్లు కమ్మే కుట్రలు కుహకాల ఐపీఎల్! ఇన్సైడ్ ఎడ్జ్అమెజాన్ (ప్రైమ్ వీడియో) ఇండియా నెట్వర్క్ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్: ఫర్హాన్ అఖ్తర్ డైరెక్టర్: కరణ్ అన్షుమన్ విడుదల: జూలై 10, 2017 జరీనా మాలిక్, విక్రాంత్ ధవన్ పాత్రలు ప్రీతి జింతా, నెస్ వాడియాలను జ్ఞప్తికి తెస్తాయి. అరవింద్ వశిష్ట్, వాయు రాఘవన్, దేవేంద్ర మిశ్రా, కేజీ రఘునాథ్ రోల్స్.. ధోనీ, విరాట్ కొహ్లీ, శ్రీశాంత్ క్యారెక్టర్స్‌ను రిఫ్లెక్ట్ చేస్తాయి. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. ముంబై మావరిక్స్, హరియాణా హరికేన్స్ తలపడ్తున్నాయి. ముంబై మావరిక్స్ బలమైన జట్టు..దేశంలో ఏ ఐపీఎల్ జట్టుతో పోల్చుకున్నా! కాని ఈ మ్యాచ్‌లో ముంబై మావరిక్స్కు గట్టి పోటీ ఇస్తోంది హరియాణా హరికేన్స్. ఫస్ట్ బ్యాటింగ్ ఆ జట్టుదే. ఏ బంతినైనా బౌండరీ దాటించేస్తున్నారు బాట్స్మెన్. బాక్స్‌లో కూర్చొని మ్యాచ్ చూస్తున్న ముంబై మావరిక్స్ ఓనర్స్ జరీనా మాలిక్ (రీచా చద్దా), విక్రాంత్ «ధవన్ (వివేక్ ఆనంద్ ఒబేరాయ్) మొహాల్లో ఆందోళనేమీ లేదు. క్యాచ్ మిస్ అయినప్పుడు ‘‘షిట్’’ అని, బ్యాట్స్‌మన్ క్రీజ్‌లోకి వచ్చాక బాల్ వికెట్‌కి తగిలినప్పుడు ‘‘ప్చ్’’ అనే నిట్టూర్పులు తప్ప. ముంబై మావరిక్స్ పేలవమైన బౌలింగ్ మీద పెదవి విరిచేస్తున్నారు కామంటేటర్స్. గ్యాలరీలో ఉన్న మావరిక్స్ టీమ్ ఎనలిస్ట్ రోహిణీ రాఘవన్ (సయానీ గుప్తా) కలవర పడుతోంది. మాటిమాటికీ గ్రౌండ్లోకి వెళ్లి కెప్టెన్ వాయు రాఘవన్ (తనూజ్ విర్వాని)ని నిలదీస్తోంది.. ‘‘వాట్స్ గోయింగ్ ఆన్?’’అంటూ. యంగ్ బౌలర్, పందొమ్మిదేళ్ల ప్రశాంత్ కనౌజియా (సిద్ధాంత్ చతుర్వేది)నూ బెదిరిస్తోంది.. ‘‘ఎన్ని రన్స్ ఇస్తున్నావో అర్థమవుతోందా? ఏమైంది మీ అందరికీ?’ అంటూ. ఆమె ఆరాటం చూసి ఎద్దేవాగా నవ్వుతున్నాడు దేవేంద్ర మిశ్రా (అమిత్ సియాల్). ఆఫ్టర్ ది బ్రేక్.. సెకండ్ ఇన్నింగ్స్.. ముంబై మావరిక్స్ బ్యాటింగ్‌కి దిగింది. మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ వాయు రాఘవన్ వచ్చేవరకు పెద్దగా స్కోర్ కాలేదు. వాయు రాఘవన్ బాక్స్‌లో ఉన్న తమ ఓనర్ జరీనా మాలిక్‌ను చూశాడు. పెదవులు విడివడకుండా నవ్వింది ఆమె. పక్కనే ఉన్న విక్రాంత్‌ని కూడా చూశాడు రాఘవన్. వంకరగా నవ్వాడు విక్రాంత్. ఆడటం మొదలుపెట్టాడు. అంతకుముందు హరియాణా హరికేన్స్ గెలుపు మీద లక్షల్లో పందెం కాసిన విక్రాంత్ అదే జోరును కంటిన్యూ చేస్తున్నాడు. ముంబై మావరిక్స్ ఓటమి మీద కోట్లకు పెంచాడు పందెం పైకాన్ని. గ్యాలరీలో రోహిణీకి అయోమయం. వాయు తప్ప నెమ్మదినెమ్మదిగా మిగిలిన బాట్స్మెన్ అవుటవుతున్నారు. రెండు బంతుల్లో ఫోర్ రన్స్ చేయాలి. ఒక బంతి పడనే పడింది. నో రన్. రోహిణీ శ్వాస ఆగినంత పనైంది. బౌలర్ వ్యూహం పన్నాడు. ఫీల్డర్స్ అంతా దగ్గరగా వచ్చారు. వాయు బ్యాట్ ఎత్తాడు. రోహిణీ ఎనాలిసిస్ స్టార్ట్ చేసింది. పడబోయేది ఏ బాల్? వాయు అవుటవనున్నాడా.. రన్ తీయనున్నాడా అని. బౌలర్ పరిగెడుతున్నాడు పిచ్ వైపు. బ్యాట్‌ను నేలకు టచ్ చేస్తూ బౌలర్ కదలికలను గమనిస్తున్నాడు వాయు. ఉత్కంఠతతో శ్వాసను బిగబట్టిన రోహిణీ మొహంలో నవ్వు.. ఆమె మాట.. వాయూ బ్యాట్ ఒకేసారి పలికాయి.. ఫోర్.....!రోహిణీ ఆనందం పట్టలేక పిచ్‌లోకి పరిగెత్తుకొచ్చింది. జరీనా చప్పట్లలో గెలుపు ధ్వనించింది. విక్రాంత్ మొహం వాడిపోయింది. బెట్ కాసిన కోట్లు గంగలో కలిశాయి. ఆయన్ని నమ్మి డబ్బులు పెట్టిన వాళ్ల దవడలు, పిడికిళ్లు బిగుసుకున్నాయి. ప్రశాంత్, హమిష్ మెక్కాల్ (ఎడ్వర్డ్ సన్నేబ్లిక్) హై ఫైవ్ ఇచ్చుకున్నారు. ‘‘దిస్ ఈజ్ మై టీమ్ మిస్టర్ «ధవన్’’ అంటూ చిరుదరహాసంతో వెళ్లిపోయింది జరీనా. అప్పుడొచ్చొంది మిస్టరీ ఉమన్ (నటాషా సూరీ) విక్రాంత్ దగ్గరికి ‘‘నీ మీద భాయ్ చాలా కోపంగా ఉన్నాడు’’ అంటూ. ఎట్ ది ఎండ్ జరీనా తనను మోసం చేసిందన్న కోపం, అవమానంతో విక్రాంత్ ..జరీనా ప్రాణంలా చూసుకునే కుక్కను చంపేస్తాడు. ఆమెనూ చంపబోతుంటే అప్పటిదాకా విక్రాంత్‌కి కుడిభుజంగా ఉన్న వ్యక్తి వచ్చి జరీనాను కాపాడ్తాడు. ముంబై మావరిక్స్ టీమ్ మెంబర్స్ సంతకాలు చేసిన బ్యాట్ తీసుకుంటుంది జరీనా.. విక్రాంత్‌ను కొట్టడానికి. ఇక్కడితో ఇన్సైడ్ ఎడ్జ్ ఫస్ట్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఈ సీజన్లో విక్రాంత్ ఎంట్రీ, ఎగ్జిట్ మధ్య ఏం జరిగింది? అది తొమ్మిది ఎపిసోడ్ల కథ మనీ, పవర్, సెక్స్, అండర్ వరల్డ్ మాఫియా.. బిహైండ్ బౌండరీగా ఉన్న ఐపీఎల్ ప్లేని కళ్లకు కడ్తుంది ‘‘ఇన్సైడ్ ఎడ్జ్’’. కాని ఒక డిస్క›్లయిమర్.. కుటుంబమంతా కూర్చోని చూడదగ్గది కాదు. క్రికెట్ ఆట కన్నా ఒక వ్యాపారం. రాజకీయం కూడా. ఐపీఎల్ ట్రెండ్ క్రీజ్‌లోకి రాగానే ఆ సంస్కృతిని విస్తృతపరిచింది. ఐపీఎల్ మీద పెట్టుబడి పెట్టి.. క్రీడాకారుల గ్లామర్‌ను ఇంకో గ్రాఫ్‌కి మళ్లించింది. గెలిచినా డబ్బే. ఓడినా డబ్బే! బెట్టింగ్‌లు, అమ్మాయిలు, పార్టీలు.. ఫేమ్ కన్నా ఎక్కువ కిక్నిస్తాయనే క్యాచ్ విసిరింది. పట్టుకున్నవాడు పడిపోతాడు.మిస్ చేసినవాడు బాధ పడ్తాడు. వల అని తెలుసుకున్నవాడు అసల్లేకుండా పోతాడు. ఆటే ముఖ్యమని నమ్మినవాడు జట్టుకే దూరమవుతాడు. ఇదే ఇన్సైడ్ ఎడ్జ్ బాటమ్ లైన్. డిటైల్డ్‌గా.. హీరోయిన్గా అవకాశాలు అడుగంటుతున్న సమయంలో ఐపీఎల్ పగ్గాలు పట్టుకుంటుంది జరీనా మాలిక్. ముంబై మావరిక్స్కి కో ఓనర్‌గా. ప్రతి మ్యాచ్‌లో గ్యాలరీ నుంచి టీమ్‌ను ఉత్సాహపరుస్తుంటుంది. కెప్టెన్ అరవింద్ వశిష్ట్ (అంగద్ బేడీ). నిజాయితీ గల డిపెండబుల్ కెప్టెన్. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా ఆ ప్రభావం తన ఆట మీద, కెప్టెన్సీ పైనా పడనివ్వకుండా టీమ్ విజయం కోసం పాటుపడ్తుంటాడు. బెట్టింగ్స్‌కి లొంగక, తన యజమానికి వ్యతిరేకంగామారి చివరకు జట్టు నుంచి ఉద్వాసనకు గురవుతాడు. కోచ్.. నిరంజన్ సూరి (సంజయ్ సూరి) ఒకప్పటి ఏస్ ప్లేయర్. ఎప్పుడో ఇండియన్ క్రికెట్ టీమ్‌లో ఆడుతున్నప్పుడు పడ్డ కక్కుర్తికి తర్వాత ఐపీఎల్లో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. విక్రాంత్ ధవన్.. వరల్డ్స్ లీడింగ్ స్పోర్ట్స్మేనేజ్మెంట్కంపెనీకి యజమాని. ముంబై మావరిక్స్లోనూ పెట్టుబడి పెట్టి ఒక భాగస్వామిగా మారుతాడు. ఆయనతో ముందు అగ్రిమెంట్ చేసుకున్న జరీనా.. తర్వాత అతని ప్రవర్తనతో భీతిల్లి అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలనుకుంటుంది. అది గ్రహించిన విక్రాంత్ ఆమె చేతిలో ఉన్న అరకొరా సినిమా చాన్స్లనూ లాగేసి, ఫీల్డ్‌లో ఐసోలేట్ అయ్యేలా చేస్తానని భయపెట్టడమే కాక చిన్న ట్రయల్ కూడా వేస్తాడు. దాంతో అయిష్టంగానే అగ్రిమెంట్‌ను ఇంప్లిమెంట్ చేస్తుంది జరీనా. అండర్ వరల్డ్ డా¯Œ అండదండలతో ముంబై మావరిక్స్ను బెట్టింగ్ బరిలో పెడ్తాడు. డబ్బు యావ ఉన్న స్పిన ్నర్ దేవేంద్ర మిశ్రా (అమిత్ సియాల్)ను ఎరగా మారుస్తాడు. వికెట్ కీపర్ కేఆర్ రఘునాథ్ (మనూజ్ శర్మ) ను గ్రిప్‌లో పెడ్తాడు. నిరంజన్ సూరీకీ కబురు పంపిస్తాడు. అలాంటి పనులు చేయనని నిక్కచ్చిగా చెప్పిన సూరీకి గతంలో అతను చేసిన తప్పును గుర్తు చేస్తాడు. చేసేది లేక విక్రాంత్‌తో చేతులు కలపాల్సి వస్తుంది సూరీకి. తర్వాత రియల్ మావరిక్స్, పరుగుల చీతా.. అనే ట్రాక్ రికార్డ్... మోస్ట్ ఇండిసిప్లీన్డ్, ఉమనైజర్, అన్ పంక్చువల్ అనే ఆఫ్ పిచ్ రిమార్క్స్ ఉన్న వాయు రాఘవన్ మీదా దృష్టిపెడ్తాడు. కాని వాయు దారికి రాడు. వదిలేసి జట్టులో అందరికన్నా చిన్నవాడు, ఫాస్ట్ బౌలర్, గ్రామీణ యువకుడు అయిన ప్రశాంత్ కనౌజియాను లాగాలనుకుంటాడు. ఆ పని దేవేంద్ర మిశ్రాకు అప్పగిస్తాడు. అప్పటికే ప్రశాంత్‌ను కులం పేరుతో వెక్కిరిస్తూ, అర్బన్ లైఫ్ స్టయిల్ లేదని విపరీతంగా వేధిస్తుంటాడు దేవేంద్ర మిశ్రా. అసలే ఇంగ్లిష్ రాదని ఆత్మన్యూనతతో కుంగిపోతున్న ప్రశాంత్‌కు దేవేంద్ర మిశ్రా ర్యాగింగ్ నరకాన్ని తలపిస్తుంటుంది. ఇవన్నీపడలేక ఊరెళ్లిపోవాలని ప్రశాంత్ అనుకుంటున్నప్పుడే దేవేంద్ర మిశ్రా బెట్టింగ్ గురించి చెప్పి.. జరగబోయే మ్యాచ్‌లో సరిగా ఆడొద్దని వార్న్ చేస్తాడు. విన్న ప్రశాంత్ అవాక్కవుతాడు. అందులో కోచ్ సూరీ సర్ కూడా షామిల్ అయ్యాడని తెలిసి ఖంగు తింటాడు. మొత్తమ్మీద ఆ మ్యాచ్ ఓడిపోతారు. ఇవేవీ తెలియని జరీనా.. తన జట్టు ఓడినందుకు బాధపడుతుంది. హరియాణా హరికేన్స్‌తో మ్యాచ్‌కంటే ముందు.. జట్టు ఓడిపోగానే కోచ్ సూరి అపరాధభావంతో కుమిలిపోతుంటాడు. ఏమైనా సరే ఇలాంటివి తన వల్ల కాదని చెప్పాలని విక్రాంత్ దగ్గరకు వెళ్తాడు. చెప్తాడు. అయినా బలవంతం చేస్తే మీడియా ముందు బయటపెట్టేస్తాననీ వార్నింగ్ ఇస్తాడు సూరి . అతని మాటను విన్నట్టే నటిస్తాడు. ఈ క్రమంలోనే జరీనా తన సినిమా ప్రివ్యూకి ముంబై మావరిక్స్ను పిలుస్తుంది. పార్టీ కూడా ఇస్తుంది. ఆ పార్టీకి కెప్టెన్ అరవింద్ రాడు. భార్యతో సమయం గడిపి, కాపురం నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉండి. అదే విషయాన్ని ప్రివ్యూలో ఉన్న సూరీకి మెస్సేజ్ చేస్తాడు.. ‘‘అంతా బాగుంటుంది అన్నావ్.. ఏమీ బాగాలేదు. వస్తున్నాను.ఉండు’’ అని. కాసేపటికి సూరీ బిల్డింగ్ టెర్రస్ పైకి వెళ్తాడు. అక్కడ విక్రాంత్ ఉంటాడు. మామూలుగా మాట్లాడినట్టే మాట్లాడి సూరీని పై నుంచి కిందకు తోసి చంపేస్తాడు. అది కెప్టెన్ అరవింద్ మీదకు వచ్చేలా.. వాయు అందులో భాగస్వామేమో అన్నట్టుగా.. నేపథ్యాన్ని పన్నుతాడు విక్రాంత్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది. ఈలోపే హరియాణా హరికేన్స్‌తో మ్యాచ్ ఉంటుంది. అప్పుడే రోహిణీ, కెప్టెన్ అరవింద్, జరీనాకు.. విక్రాంత్ ముంబై మావరిక్స్ను బెట్టింగ్‌కి తాకట్టు పెట్టాడని అర్థమవుతుంది. వాయూకి ఉన్న బ్యాడ్ రిమార్క్స్‌తో బ్లాక్ మెయిల్ చేసి వాయూని బెట్టింగ్‌కి ఒప్పిస్తాడు విక్రాంత్. విక్రాంత్‌ను భరించాల్సిన అవసరం లేదని జరీనాకు ఎదురుతిరుగుతాడు అరవింద్. తనకు సపోర్ట్‌గా హమిష్, ప్రశాంత్‌ను కలుపుకుంటాడు. జరీనా మెదడులో వేరే ప్లాన్ ఉంటుంది. అందులో భాగంగానే చివరి క్షణంలో అరవింద్ మీద అటాక్ జరిగి అతను హోటల్ గదిలోనే స్పృహతప్పి పడిపోతాడు. అరవింద్ స్థానంలో వాయు రాఘవన్ కెప్టెన్ అవుతాడు. అతని సారథ్యంలో ప్రశాంత్, హమీష్లు జట్టు ఓనర్ విక్రాంత్‌ను, జతగాడు దేవేంద్ర మిశ్రాను నమ్మించి మోసం చేస్తారు.. హరియాణా హరికేన్స్ మీద ముంబై మావరిక్స్ విజయ డంకా మోగిస్తారు. ఇదంతా జరీనా ప్లాన్! పవర్ ప్లే, బన్నీ, ఇన్నర్ సర్కిల్, రాంగ్ ఫూట్, అవే గేమ్, ఓపెనింగ్ బిడ్, ఫో, కారిడార్ ఆప్ అన్సర్టెనిటీ, హ్యామర్ ప్రైజ్, మాగ్జిమమ్.. పేర్లతో పది ఎపిసోడ్స్‌గా సాగుతుంది ఇన్సైడ్ ఎడ్జ్. అమేజాన్ ప్రైమ్‌లో ఉంది. చూడొచ్చు. – సరస్వతి రమ -
కొడుకును కాపాడాలనుకుంది.. కానీ
నార్త్ కరోలినా : అమెరికాలో బీభత్సం సృష్టించిన ఫ్లోరెన్స్ హారికేన్ దాటి నుంచి కొడుకును రక్షించుకోలేక పోయిన ఓ తల్లిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తుపాను కొనసాగుతున్న సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించి చిన్నారి ప్రాణాలు తీసిందనే కారణంతో ఆమెపై అభియోగాలు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర కరోలినాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తర రోలినాకు చెందిన దజియా లీ చార్లెట్ అనే మహిళ తన ఏడాది కొడుకుతో పాటు అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు కారులో బయల్దేరింది. అయితే ఆ సమయంలో హారికేన్ ప్రభావం తీవ్రంగా ఉందని హెచ్చరించినా వినకుండా మూసి ఉన్న రహదారి గుండా కారును పోనిచ్చింది. ఈ క్రమంలో వరద ఉధృతి తీవ్రమవడంతో ఓ చోట కారును నిలిపివేసింది. అక్కడి నుంచి బయటపడే క్రమంలో తన చిన్నారిని ఎత్తుకుని కారులో నుంచి దిగింది. కానీ ప్రమాదవశాత్తు ఈ ఆ చిన్నారి వరదలో పడి కొట్టుకుపోయాడు. మరుసటి రోజు చిన్నారి శవాన్ని పోలీసులు వెలికితీశారు. సెప్టెంబరు 16న జరిగిన ఈ ఘటనలో చార్లెట్‌కు 16 నెలల శిక్ష విధించే అవకాశం ఉందని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ యూనియన్ కంట్రీ షెరిఫ్ ఆఫీస్ అధికారులు పేర్కొన్నారు. (అమెరికాలో ఫ్లోరెన్స్ విధ్వంసం) కాగా చార్లెట్‌పై కేసు నమోదు చేయడంపై ఆఫ్రికన్ అమెరికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తన బిడ్డను కాపాడుకునే క్రమంలో దురదృష్టవశాత్తు అతడు ప్రాణాలు కోల్పోతే..తప్పంతా ఆమెదేనన్నట్లు ప్రచారం చేయడం, శిక్ష పడేలా చూస్తామనడం నల్లజాతీయుల పట్ల వివక్షకు నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. బిడ్డ ప్రాణాలతో చెలగాటమాడిన ఆ మహిళకు తగిన శాస్తి జరిగిందని, అమెరికా చట్టాలు ఇటువంటి విషయాల్లో ఎవరినీ ఉపేక్షించవని మరికొందరు చార్లెట్‌ను వ్యతిరేకిస్తున్నారు. -
మెక్సికోకు హరికేన్ ‘విల్లా’ ముప్పు
మెక్సికో సిటీ: పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అత్యంత ప్రమాదకరమైన విల్లా హరికేన్ మెక్సికో వైపుగా ప్రయాణిస్తోంది. క్రమంగా శక్తిని పుంజుకుంటున్న విల్లా.. సోమవారం నాటికి(స్థానిక కాలమానం ప్రకారం) కేటగిరి–5 హరికేన్‌గా రూపాంతరం చెందే అవకాశముందని అమెరికా జాతీయ హరికేన్ కేంద్రం తెలిపింది. విల్లా హరికేన్ ప్రభావంతో మెక్సికో తీరంలో ఇప్పటికే గంటకు 249 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. మెక్సికోలొని కబోకోరియంటెస్ నగరానికి నైరుతి దిశలో 315 కి.మీ దూరంలో విల్లా హరికేన్ కేంద్రీకృతమై ఉందంది. ఈ హరికేన్ మెక్సికో పశ్చిమ తీరంపై పెను ప్రభావం చూపనుంది. దీని ప్రభావంతో మెక్సికోలోని పలు ప్రాంతాల్లో 30 నుంచి 46 సెం.మీ మేర వర్షం కురవనుంది. -
ఊపిరాగిన ఉద్దానం!
ఉద్దానం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తిత్లీ తుపాను దెబ్బకు ఉద్దానం ఊపిరాగింది. 30 ఏళ్లుగా చెట్టుతో పెనవేసుకున్న బంధం ఒక్కసారిగా నేలమట్టమైంది. కూకటివేళ్లతో కూలిపోయిన జీడి, కొబ్బరి చెట్ల వద్దే రైతన్న గుండె పగిలేలా రోదిస్తున్నాడు. బిక్కచచ్చి బావురుమంటున్నాడు. ఊళ్లన్నీ శ్మశానాన్ని తలపిస్తున్నాయి. ‘చెట్లు కాదు.. మా ప్రాణాలే పోయాయి’ అంటూ పల్లె జనం ఘొల్లుమంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు, పలాస, టెక్కలి మండలాల్లో ఏ ఊరుకెళ్ళినా ఇదే పరిస్థితి. మచ్చుకు ఒక్క చెట్టయినా కన్పించని దారుణమైన విషాదం నుంచి రైతన్న కోలుకోవడం లేదు. తాతలనాడు వేసుకున్న చెట్లు.. పసిపిల్లల్లా పెంచుకున్న వనాలను గుండె చెదిరిన రైతన్న గుర్తుచేసుకుంటూ గగ్గోలు పెడుతున్నాడు. ఉపాధి పోయి ఊళ్లొదిలే పరిస్థితిని చూస్తూ కుమిలిపోతున్నాడు. (అన్నమోరామ‘చంద్రా’!) గుండె పగిలే దుఃఖం వజ్రపుకొత్తూరు మండల పరిధిలోని పూడి, రెయ్యిపాడు, ఆర్ఎం పురంతో పాటు అన్ని గ్రామాల్లోనూ 90 శాతానికిపైగా జీడి, కొబ్బరి తోటలే ఉన్నాయి. రైతులు, రైతు కూలీలకు ఇవే జీవనాధారం. ఎన్నో ఏళ్లుగా వాళ్లకు వలసలు అంటే ఏంటో తెలీదు. తిత్లీ తుపాను దెబ్బకు ఒక్క చెట్టూ మిగల్లేదు. రెయ్యిపాడుకు చెందిన ఎం. తిరుపతిరావు ఐదెకరాల్లో జీడి, కొబ్బరి సాగుచేస్తున్నాడు. తండ్రి కాలంలో వేసిన చెట్లు నెలకు రూ.30వేల ఆదాయమిస్తున్నాయని చెప్పాడు. ‘ఐదెకరాలూ కొట్టుకుపోయిందయ్యా.. ఏం చెయ్యాలి’.. అంటూ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తిరుపతిరావును ఓదార్చడం ఎవరివల్లా కావడంలేదని ఆయన బంధువు వెంకటరమణ తెలిపాడు. ‘ఆయనేం చేసుకుంటాడో? ఏమవుతాడో?’ అని ఇంటిల్లిపాదీ కుమిలిపోతున్నారని చెప్పాడు. మద్దెల హరినారాయణ అక్కడ జీడి పరిశ్రమ నడుపుతున్నాడు. అతనూ ఓ రైతే. అతన్ని కదిలించినా ఆవేదన తన్నుకొచ్చింది. ‘ఒక్కో చెట్టూ లక్షలు చేస్తుంది. మళ్లీ అంత చెట్టు కావాలంటే ఏళ్లు పడుతుంది. మాకా ఓపిక లేదు.. అంత శక్తీ లేదు. మా నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ఒక్కో వ్యక్తికీ రూ.20 లక్షలిచ్చినా కోలుకోలేం’ అని బావురుమన్నాడు. ప్రతీ రైతన్నదీ ఇదే ఆవేదన. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆదుకోకపోతే ఆత్మహత్యలే.. నిన్నటిదాకా ఈ ప్రాంతంలో ఆకాశాన్ని తాకి, పచ్చగా రెపరెపలాడిన కొబ్బరి చెట్లు.. ఏపుగా ఎదిగిన జీడి చెట్లు తిత్లీ దెబ్బకు పూర్తిగా నేల కొరిగాయి. కూలిన చెట్లను రంపంతో ముక్కలుగా కోస్తుంటే అక్కడ రైతన్న వేదన హృదయ విదారకంగా ఉంది. ఊళ్లకు ఊళ్లే ఎడారిగా మారిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వాళ్లు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మళ్లీ మొక్కనాటి, పెంచి పెద్దచెయ్యాలనుకుంటున్నారు. కానీ, వారికి సాయం కావాలి. మళ్లీ ఉద్యానవనం పెంచడానికి ప్రభుత్వం కనీసం ఆరేళ్ల పాటు సాయం చేస్తే తప్ప కోలుకోలేమని ఇక్కడి రైతులు చెబుతున్నారు. రైతును ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమయ్యే దుస్థితి రావచ్చని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒక్కరూ పలకరించలేదు మా గుండెలు మండిపోతున్నాయి. హుద్‌హుద్ తుపాను వస్తే విశాఖను ఆదుకున్నారట. ఎక్కడో కూర్చుని చెప్పడం కాదు. ఇక్కడికి రావాలి. రైతు కష్టాన్ని చూడాలి. నిజాయితీగా ఆదుకునే ఆలోచన చేయాలి. మేం సర్వనాశనమయ్యాం. ఒక్కరూ రాలేదు. పిల్లల్లా పెంచుకున్న చెట్లు కూలిపోయాయి. రోడ్డున పడ్డాం. ఓదార్చే దిక్కేలేదు. – మద్దెల పాపయ్య, రెయ్యిపాడు, జీడి, కొబ్బరి రైతు అధికారులు ఎవరూ రావడంలేదు రైతుకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. రెండు రోజులుగా అదేదీ కన్పించడం లేదు. అధికారులు అస్సలు రావడంలేదు. కూలిన చెట్లను రైతులే తొలగించుకుంటున్నారు. కానీ, అన్ని సహాయ చర్యలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులను పంపితే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. లేకపోతే ఉద్దానం ఆవేశం ఏంటో ప్రభుత్వం చూస్తుంది. – సాంబమూర్తి, సీపీఎం మండల నాయకుడు, వజ్రపుకొత్తూరు -
అమెరికాపై హరికేన్ మైఖేల్ పంజా
-
శాంతిస్తోన్న హరికేన్ మైఖేల్
పనామా సిటీ: అమెరికాలోని ఫ్లోరిడా తీరాన్ని హరికేన్ మైఖేల్ వణికించింది. గంటకు 155 మైళ్ల వేగంతో వీచిన గాలులు తీరప్రాంత వాసులను బెంబేలెత్తించాయి. వందేళ్లలో ఈ ప్రాంతంలో ఇంతటి విపత్తు సంభవించటం ఇదే తొలిసారని తెలిపారు. ప్రచండ గాలుల ధాటికి చెట్లు, స్తంభాలు దెబ్బకు కూలిపోయాయి. తీరం దాటే సమయంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోను వణికించింది. ఆ ప్రాంతంలో అనేక ఇళ్లు నీటి మునిగాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలిపోయాయి. ప్రస్తుతానికి హరికేన్ ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొంతమేర బలహీనపడి కేటగిరీ 4 నుంచి కేటగిరీ–1 తుపానుగా మారింది. అయినా దీని ప్రభావంతో ఇప్పటికీ 90 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. హరికేన్ తీరం దాటే సమయంలో వీచిన గాలులు మెక్సికో బీచ్ ప్రాంతంలో తీవ్ర బీభత్సం సృష్టించినట్లు స్థానికులు తెలిపారు. హరికేన్ కారణంగా తల్లాహసీ ప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. 20 కౌంటీల్లోని సుమారు 3,75,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ ఎత్తున వరదనీరు ఇళ్లల్లోకి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే ఫ్లోరిడాలో పర్యటించనున్నట్లు ప్రకటించారు. -
అమెరికాలో విజృంభిస్తున్న మైఖేల్ హరికేన్
పనామా సిటీ: అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో మైఖేల్ హరికేన్ తీవ్రరూపం దాలుస్తోంది. అత్యంత ప్రమాదకర కేటగిరీ–4 తుపానైన మైఖేల్ ధాటికి గాలులు ఉధృతంగా వీస్తుండటంతోపాటు సముద్రంలో అలలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయని అధికారులు చెప్పారు. బుధవారం సాయంత్రానికి (అమెరికా కాలమానం ప్రకారం) తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉందని మయామిలోని జాతీయ తుపాను కేంద్రం అంచనా వేసింది. ప్రస్తుతం గంటకు 230 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయనీ, పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారొచ్చని తుపాను కేంద్రం హెచ్చరించింది. సముద్రపు అలలు 14 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడొచ్చనీ, కొన్ని ప్రాంతాల్లో 30 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదవ్వొచ్చని తెలిపింది. ఇలాంటి తుపానును గతంలో తామెప్పుడూ చూడలేదని స్థానికులు కొందరు చెబుతున్నారు. మైఖేల్ హరికేన్ అత్యంత విధ్వంసకరంగా మారొచ్చనీ, ఫ్లోరిడాకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. -
ఫిలిప్పీన్స్‌లో భారీ టైఫూన్
హాంకాంగ్/బీజింగ్ /న్యూబెర్న్: శక్తిమంతమైన టైఫూన్ మంగ్‌ఖుట్ ఫిలిప్పీన్స్‌లో పెను విధ్వంసం సృష్టించింది. మంగ్‌ఖుట్ ప్రభావంతో ఉత్తర ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలు, వరదలు సంభవించడంతో 64 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 36 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం ఈ టైఫూన్ క్రమంగా చైనా, హాంకాంగ్‌లపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో చైనాలోని గ్వాంగ్డాంగ్, గ్వాంగ్షీ, హైనన్, గ్వెజో ప్రావిన్సులతో పాటు హాంకాంగ్‌లో గంటకు 162 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు కుంభవృష్టి కురుస్తోంది. ఈ టైఫూన్ కారణంగా చైనాలో ఇప్పటివరకూ ఇద్దరు చనిపోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. దీంతో చైనా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్సుపై ఈ టైఫూన్ తీవ్ర ప్రభావం చూపొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో 24.5 లక్షల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేటకు వెళ్లిన 48,000 పడవలను వెనక్కు రప్పించారు. హైనన్ ప్రావిన్సులో 632 పర్యాటక ప్రాంతాలను, తీరప్రాంత రెస్టారెంట్లను మూసివేసిన అధికారులు, రెండు విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన 400 సర్వీసులను రద్దుచేశారు. సూపర్మార్కెట్లకు పోటెత్తిన ప్రజలు.. మంగ్‌ఖుట్ టైఫూన్ విధ్వంసం మరిన్ని రోజులు కొనసాగుతుందన్న భయంతో ప్రజలు సూపర్మార్కెట్ల నుంచి భారీగా ఆహారపదార్థాలను కొనుగోలు చేశారు. దీంతో షాపుల ముందు భారీ క్యూలు దర్శనమిచ్చాయి. చైనాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మకావూలో 20,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమెరికాలో 13కు చేరుకున్న మృతులు.. ఫ్లోరెన్స్ హరికేన్‌తో అతలాకుతలం అవుతున్న అమెరికాలో మృతుల సంఖ్య 13కు చేరుకుంది. ప్రస్తుతం దీని తీవ్రత ‘ఉష్ణ మండల తుపాను’ స్థాయికి తగ్గినప్పటికీ వర్షాలు పడుతూనే ఉన్నాయని అధికారులు తెలిపారు. ఉత్తర కరోలినాలో కుంభవృష్టి కొనసాగుతోందనీ, కొన్ని ప్రాంతాల్లో 90 సెం.మీ మేర వర్షం కురిసిందని వెల్లడించారు. అమెరికా ఉత్తర కరోలినా రాష్ట్రంలోని ఎంగిల్హార్డ్ పట్టణాన్ని ముంచెత్తిన హరికేన్ ఫ్లోరెన్స్ వరద నీరు -
అమెరికాలో ఫ్లోరెన్స్ విధ్వంసం
విల్మింగ్టన్: అమెరికా తూర్పుతీరాన్ని తాకిన ఫ్లోరెన్స్ హరికేన్ విధ్వంసం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులన్నీ పొంగిపొర్లుతుండటంతో భారీగా వరద పోటెత్తుతోంది. ఫ్లోరెన్స్ కారణంగా ఇప్పటివరకూ అమెరికాలో ఏడుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. తుపాను కారణంగా ట్రెంట్, నూస్ నదులు పొంగిపొర్లుతుండటంతో ఉత్తర కరోలినాలోని న్యూబెర్న్ పట్టణంలో చాలా మంది 10 అడుగుల ఎత్తైన వరదలో చిక్కుకున్నట్లు వెల్లడించారు. న్యూబెర్న్ నుంచి ఇప్పటివరకూ 400 మందిని రక్షించామనీ, మిగిలినవారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బలమైన ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. కాగా, ఫ్లోరెన్స్ హరికేన్ తీవ్రత ‘ఉష్ణమండల తుపాను’ స్థాయికి తగ్గినప్పటికీ గంటకు 112 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయనీ, కుంభవృష్టి సంభవిస్తుందని జాతీయ హరికేన్ కేంద్రం(ఎన్‌హెచ్‌సీ) ప్రకటించింది. మరోవైపు ఈ విషయమై ఉత్తర కరోలినా గవర్నర్ రాయ్ కూపర్ స్పందిస్తూ.. ‘ఫ్లోరెన్స్ విధ్వంసం మరో 2–3 రోజులు కొనసాగే అవకాశముంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 7.6 లక్షల మంది చీకట్లో మగ్గుతుండగా, 21,000 మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఫ్లోరెన్స్ ప్రభావంతో కుంభవృష్టి కురవడంతో పాటు అకస్మాత్తుగా వరదలు పోటెత్తే ప్రమాదముంది. ఈ విషయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. ఫ్లోరెన్స్ దెబ్బకు అతలాకుతలమైన ప్రాంతాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటిస్తారని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తర కరోలినా, వర్జీనియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని దాదాపు 17 లక్షల మంది ప్రజలను అధికారులు ఇప్పటికే ఆదేశించారు. ఫ్లోరెన్స్ సహాయక చర్యల్లో పాల్గొంటున్న అమెరికా విపత్తు నిర్వహణా సంస్థ(ఫెమా)ను అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు. ఫిలిప్పీన్స్ అతలాకుతలం మనీలా: మంగ్‌ఖుట్ టైఫూన్ ప్రభావంతో ఫిలిప్పీన్స్‌లోని ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. దీని కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకూ 12 మంది దుర్మరణం చెందగా, ఆరుగురు గల్లంతయ్యారు. గంటకు 170 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. సహాయక చర్యల కోసం రెండు సీ–130 హెర్క్యులస్ విమానాలతో పాటుæహెలికాప్టర్లను అందు బాటులో ఉంచారు. 50 లక్షల మందిపై టైఫూన్ ప్రభావం చూపుతోంది. -
ఫ్లోరెన్స్.. కేటగిరీ–4 తుపాను
విల్మింగ్టన్: అమెరికాకు పెనుముప్పుగా పొంచి ఉన్న కేటగిరీ–4 భీకర తుపాను ఫ్లోరెన్స్ గంటకు 225 కి.మీ. వేగంతో కరోలినా తీరానికి చేరువగా వచ్చింది. అప్రమత్తమైన తీర ప్రాం తంలోని ప్రజలు నిత్యావసరాలను వెంట తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. నీరు, ఆహారం, ఇతర తినుబండారాలు కొనేందుకు ప్రజలు మార్ట్ల ముందు బారులు తీరారు. చాలా దుకాణాల్లో ఇప్పటికే సరుకు నిల్వలు అయిపోయాయి. గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం హరికేన్ తూర్పు తీరాన్ని తాకొచ్చని అంచనా. ఆ తరువాత దాని ఉధృతి తగ్గి 30–60 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసే అవకాశాలున్నట్లు హెచ్చరించారు. దీని ఫలితంగా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవడంతో పాటు, పర్యావరణం మీద కూడా భారీ ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుపాను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అత్యంత ప్రమాదకర కేటగిరీ–4కు చెందిన హరికేన్లు తూర్పు తీరాన్ని తాకడం అరుదని ఐరాస పేర్కొంది. -
అమెరికాను వణికిస్తున్న హరికేన్ ఫ్లోరెన్స్
-
వాషింగ్టన్లో ‘ఫ్లోరెన్స్’ ఎమర్జెన్సీ
వాషింగ్టన్: అమెరికా తూర్పు తీరాన్ని హరికేన్ ‘ఫ్లోరెన్స్’ తాకనుందన్న అంచనాల నడుమ రాజధాని వాషింగ్టన్లో మంగళవారం తుపాను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వాషింగ్టన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు, వరదలు తలెత్తే ముప్పు ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. తక్షణమే అమల్లోకి వచ్చిన ఎమర్జెన్సీ 15 రోజుల పాటు అమల్లో ఉంటుందని, హరికేన్‌ను ఎదర్కొనేందుకు అన్ని వనరులతో సిద్ధంగా ఉన్నామని వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌసర్ చెప్పారు. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 10 లక్షల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర, దక్షిణ కరోలినా, వర్జీనియా, మేరీల్యాండ్ రాష్ట్రాల్లో కూడా తుపాను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వాషింగ్టన్లో చివరిసారిగా 2016లో తుపాను ఎమర్జెన్సీని ప్రకటించారు. -
దూసుకొస్తున్న ‘ఫ్లోరెన్స్’
మియామి: అట్లాంటిక్ మహా సముద్రంలో ఏర్పడిన ‘ఫ్లోరెన్స్’ హరికేన్ అగ్రరాజ్యం అమెరికాను కలవరపెడుతోంది. ప్రస్తుతం అమెరికా తూర్పు తీరంవైపు కదులుతున్న ఈ కేటగిరి–1 హరికేన్ క్రమంగా శక్తి పుంజుకుంటోందని జాతీయ హరికేన్ కేంద్రం(ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి నాటికి ఇది కేటగిరి–4 హరికేన్‌గా రూపాంతరం చెందే అవకాశముందని వెల్లడించింది. దీని కారణంగా అమెరికా తూర్పుతీరంలో ఉన్న రాష్ట్రాల్లో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ప్రభావంతో కొండ చరియలు విరిగిపడతాయని హెచ్చరించింది. ప్రస్తుతం బెర్ముడాకు 1,100 కి.మీ ఆగ్నేయంగా ఈ హరికేన్ కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. అమెరికా తూర్పు తీరంలో ఫ్లోరెన్స్ విధ్వంసం 2–3 రోజుల పాటు కొనసాగవచ్చని ఎన్‌హెచ్‌సీ తెలిపింది. ఉత్తర కరోలీనా, వర్జీనియా, దక్షిణ కరోలీనా రాష్ట్రాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించే అవకాశముందని వెల్లడించింది. ఉత్తర, దక్షిణ కరోలీనా రాష్ట్రాల మధ్య హరికేన్ గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం తీరం దాటే అవకాశముందంది. ప్రస్తుతం అట్లాంటిక్ సముద్రంలో కొత్తగా ఐజాక్, హెలెన్ హరికేన్లు ఏర్పడినప్పటికీ, ఇవి అమెరికా తీరంవైపు రావడానికి వారం రోజులు పడుతుందని తెలిపింది. ఫ్లోరెన్స్ హరికేన్‌ను ఎదుర్కొనేందుకు దక్షిణ కరోలినా, వర్జీనియా, ఉత్తర కరోలినా రాష్ట్రాలు ఎమర్జెన్సీని ప్రకటించాయి. -
గాలిలో అతలాకుతలమైన విమానాలు
-
బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం
-
బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో కోస్తా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం దక్షిణ ఆగ్నేయ దిశగా పూరికి 370కిలోమీటర్లు, ఒరిస్సా చాంద్‌బలికి దక్షిణంగా 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్లు అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం ఉత్తరం వాయువ్యదిశగా పయనిస్తోందని, నేటి అర్థరాత్రి లేదా రేపు తెల్లవారుజామున పూరీ చాంద్‌బలీ మధ్య ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న 18గంటల్లో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో రానున్న24 గంటలపాటు కోస్తాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల మత్సకారులకు ఇప్పటికే ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్సకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని సూచించారు. తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారే అవకాశం చాలా తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. వాయుగుండం కారణంగా ఇప్పటికే ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా కోస్తా జిల్లాల వ్యాప్తంగా చెదురుమదురుగా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయ సహకారాల కోసం కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు కలెక్టరేట్ కార్యాలయం : 1800-4250-0002 గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ : 0891-2569335 -
అమెరికాను భయపెట్టిన ‘నేట్’
న్యూ ఆర్లియన్స్: అమెరికాను వణికించిన నేట్ హరికేన్ బలహీనపడి మిసిసిపి, అలబామా రాష్ట్రాల మధ్య ఆదివారం ఉదయం (భారత కాలమానం) రెండోసారి తీరాన్ని తాకింది. భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పినా తీర ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో అలలు కొనసాగుతాయని అమెరికా జాతీయ హరికేన్ కేంద్రం హెచ్చరించింది. నేట్ హరికేన్ తీవ్రతను ఉష్ణమండల తుఫాను స్థాయికి తగ్గించినా హెచ్చరికల్ని మాత్రం కొనసాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి మిసిసిపి రాష్ట్రంలోని మెరిడియన్ నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన హరికేన్ ప్రభావంతో గంటకు 73 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. మిసిసిపి–అలబామా రాష్ట్రాల తీర ప్రాంతాలతో పాటు ఫ్లోరిడా రాష్ట్రంలోని వాల్టన్ కౌంటీలో భారీ అలలు ఎగసిపడవచ్చని, వరదలు సంభవించే ప్రమాదముందని, ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. గత నెలలో హరికేన్ ఇర్మా.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రాన్ని, కరీబియన్ దీవుల్లో కనీవిని ఎరుగని విధ్వంసం సృష్టించింది. -
ఒకే వేదికపై అమెరికా మాజీ అధ్యక్షులు
టెక్సాస్ : తుపాను బాధితులకు అండగా నిలిచేందుకు ఐదుగురు అమెరికా మాజీ అధ్యక్షులు ఒకే వేదికమీదకు రానున్నారు. ఐదుగురు అమెరికా మాజీ అధ్యక్షులు టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో 'వన్ అమెరికా అప్పీల్' కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రకృతి పగబట్టిందా? అన్న రీతిలో అమెరికాపై ఇటీవల మూడు తుపానులు విజృంభించి ఎందరినో నిరాశ్రయులను చేసింది. హార్వే, ఇర్మా, మారియా హరీకేన్‌ల దాటికి అమెరికా కకావికలమై భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. బాధితులను ఆదుకోవడానికి భారీగా విరాళాల సేకరణ లక్ష్యంగా అమెరికా మాజీ అధ్యక్షులు జిమ్మీ కార్టర్, జార్జి హెచ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, జార్జి డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామాలు అక్టోబర్ 21న రీడ్‌అరెనాలో జరగనున్న 'వన్ అమెరికా అప్పీల్' కాన్సార్ట్‌లో పాల్గొననున్నారు. ఈ మేరకు టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలోని కాలేజీ క్యాంపస్ స్టేడియంలోని హెచ్ డబ్ల్యూ ప్రెసిడెన్షియల్ లైబ్రెరీ ఓ ప్రకటన విడుదల చేసింది. మాజీ అధ్యక్షులతోపాటూ పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనన్నారు. గాస్పియల్ సింగర్స్ గట్లిన్ సోదరులు, పాప్ సింగర్స్ రాబర్ట్ ఎర్ల్ కీన్, లిలే లోవెట్, అలబామా కంట్రీ గ్రూప్, లీ గ్రీన్‌వుడ్‌లు తమ గాత్రంతో అతిధులను అలరించనున్నారు. టెక్సాస్, ఫ్లోరిడా, కరేబియన్లలో తుపానుబారిన పడిన వారి సంక్షేమం కోసం చేపట్టిన 'వన్ అమెరికా అప్పీల్' కార్యక్రమానికి రావడానికి అంగీకరించిన ప్రతి ఒక్కరికి జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడంతో పాటూ, బాధితులకు పునరావాస ఏర్పాట్లపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాతలు ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. సేకరించిన నిధులు బుష్ లైబ్రెరీ ఆధ్వర్యంలో లావాదేవీలు జరపనున్నారు. -
ప్రాణం విడిచిన షాలిని సింగ్
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ నగరాన్ని వణికించిన హరికేన్ హార్వీ మరో భారతీయ విద్యార్థినిని పొట్టన పెట్టుకుంది. అక్కడి విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థిని షాలిని సింగ్ (25) పోరాడి ఓరాడారు. భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకుని , ఆందోళనకర పరిస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షాలిని గత రాత్రి ప్రాణాలు విడిచారు. నీటిలో కొట్టుకుపోతున్న నిఖిల్ భాటియా, షాలిని సింగ్‌ను కాపాడి ఆసుపత్రికి తరలించి, అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఇద్దరూ మరణించడం విషాదాన్ని సృష్టించింది. తీవ్రంగా గాయపడిన నిఖిల్భాటియా ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవల విభాగంలో చిక్సిత పొందుతూ మృతి చెందారు. కాగా ఢిల్లీకి చెందిన షాలిని సింగ్ గత నెలలో మాత్రమే అమెరికాకు వెళ్లారు. డెంటల్ సర్జరీలో డిగ్రీ చేసిన ఆమె ఎ ఏం యూనివర్శిటీలో పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. భాటియాతో కలిసి బ్రేయాన్ లేక్‌లో స్విమ్మింగ్ చేస్తూ హఠాత్తుగా ప్రమాదంలో చిక్కుకున్నారు. భారీ వర్షాలతో బీభత్సం సృష్టించిన ఉదంతంలో 200మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్న సంగతి తెలిసిందే -
హరికేన్ బీభత్సం టెక్సాస్ అతాలాకుతలం
-
భారతీయులకు ‘హార్వీ’ కష్టాలు
హూస్టన్: అమెరికాలో హార్వీ హరికేన్ ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలకు తోడు భారీ వరదలు టెక్సాస్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా టెక్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్‌లోకి వరద నీరు చొచ్చుకురావడంతో దాదాపు 200 మంది భారతీయ విద్యార్థులు క్యాంపస్‌లో చిక్కుకున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీటర్లో తెలిపారు. షాలిని, నిఖిల్ భాటియా అనే విద్యార్థులను ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పారు. అక్కడి భారత కాన్సుల్ జనరల్ అనుపమ్ రే సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలకు బోట్లు అవసరం కావడంతో, విద్యార్థులకు బోట్ల ద్వారా ఆహారం అందించాలన్న తమ ప్రతిపాదనను అమెరికా తీరరక్షక దళం తిరస్కరించిందన్నారు.మరోవైపు స్థానిక అధికారులు మాట్లాడుతూ వర్సిటీలో చిక్కుకున్న విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. స్థానిక భారతీయ అమెరికన్లు బాధితులకు ఆహారం, ఇతర వస్తువులు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. హార్వీ హరికేన్ ప్రభావంతో అతలాకుతలం అవుతున్న లూసియానా రాష్ట్రంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. హార్వీ ఉధృతికి ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న టెక్సాస్ రాష్ట్రాన్ని ట్రంప్ మంగళవారం సందర్శిస్తారని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి శాండర్స్ తెలిపారు. -
టెక్సాస్‌లో వరద బీభత్సం..
-
టెక్సస్‌ను వణికించి హార్వీ తుఫాను
హోస్టన్: అమెరికాలోనే గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యంత భారీ తుఫాను టెక్సస్ రాష్ట్రాన్ని వణికించింది. హార్వీ తుఫాను సమయంలో గరిష్టంగా గంటకు 195 కి.మీ వేగంతో గాలలు వీచాయి. చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. విమానాలు రద్దయ్యాయి. పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. దాదాపు రెండున్నర లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం పడింది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాబోయే వారం రోజుల్లో 40 అంగుళాల వర్షం కురవచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
900కు చేరిన మృతుల సంఖ్య
కరీబియన్ దీవుల్లో మాథ్యూ తుఫాను సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఒక్క హైతీలోనే 900 మందికి పైగా మృతి చెందారని అధికారులు తాజాగా వెల్లడించారు. హైతీ పశ్చిమ ప్రాంతంలో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాలతో మాథ్యూ హరికేన్ సృష్టించిన బీభత్సానికి వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో సుమారు 62,000 మంది తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. 2010లో సంభవించిన భూకంపం నుంచి ఇప్పుడిప్పడే కోలుకుంటున్న హైతీకి మాథ్యూ తుఫాను పెను నష్టం కలిగించింది. కొంతమేర బలహీనపడిన ఈ తుఫాను ఇప్పుడు అమెరికాపై ప్రభావం చూపుతోంది. ఫ్లోరిడాలో దీని దాటికి నలుగురు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. ఫ్లోరిడాతో పాటు జార్జియా, సౌత్ కరోలినా ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
ఫ్లోరిడాలో మాథ్యూ దాటికి ముగ్గురు మృతి
వాషింగ్టన్: మాథ్యూ హరికేన్ అమెరికాపై ప్రభావం చూపుతోంది. గంటకు 175 కిలోమీటర్ల వేగంతో ఫ్లోరిడా తీరాన్ని తాకిన ఈ హరికేన్ వాయువ్య దిశగా కదులుతోంది. ఈ తుఫాను దాటికి ఫ్లోరిడాలో ఇప్పటివరకూ ముగ్గురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. హరికేన్ కారణంగా సకాలంలో వైద్యం అందక ఇద్దరు మృతిచెందగా.. చెట్టుకూలి మీదపడటంతో మరో మహిళ మృతిచెందారని అధికారులు తెలిపారు. 5 పాయింట్ల తుఫాను సూచిలో కేటగిరి 5 తుఫానుగా కరీబియన్ దీవులపై విరుచుకుపడిన మాథ్యూ హరికేన్ క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం 2 పాయింట్ల కేటగిరిలో చేర్చిన ఈ హరికేన్ అమెరికాలో ప్రభావం చూపుతోంది. దీని దాటికి వేలాది విమానాలు నిలిచిపోయాయి. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినాలలో ఎమర్జెన్సీ ప్రకటించారు. సుమారు 10 లక్షల ఇళ్లకు కరెంట్ కట్ చేశారు. డిస్నీ వరల్డ్, యూనివర్సల్ స్టూడియోస్, సీ వరల్డ్ పర్యాటక కేంద్రాలను తుఫాను కారణంగా మూసేశారు. అమెరికాలోకి ప్రవేశించడానికి ముందు మ్యాథ్యూ హరికేన్ కరీబియన్ దీవుల్లో తీవ్రనష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హైతీలో సుమారు 400 మంది హరికేన్ దాటికి మృత్యువాతపడ్డారు. ఇక్కడ ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రొగ్రాం(డబ్ల్యూఎఫ్‌పీ) ఆధ్వర్యంలో సహాయకచర్యలు చేపడుతోంది. -
20 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు
వాషింగ్టన్: అత్యంత శక్తిమంతమైన మాథ్యూ హరికేన్ అమెరికాను వణికిస్తోంది. మరికొన్ని గంటల్లో ఈ తుఫాను ఫ్లోరిడాను తాకనున్న నేపథ్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. హరికేన్ విధ్వంసానికి గురయ్యే ప్రాంతంలోని సుమారు 2 మిలియన్ల ప్రజలను ఖాళీ చేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీచేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాలలో ఎమర్జెన్సీని ప్రకటించారు. కరీబియన్ దీవుల్లోని హైతీలో మ్యాథ్యూ హరికేన్ పెను విధ్వంసం సృష్టించింది. అక్కడ 350 మంది మృతికి కారణమైన ఈ హరికేన్.. కాస్త బలహీనపడి నాలుగో కేటగిరీ నుంచి మూడో కెటగిరీకి మారి అమెరికాలోకి ప్రవేశిస్తోంది. అయినప్పటికీ ఇది పెను విధ్వంసం సృష్టించే తుఫానుగా అమెరికా వాతావరణ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే దీని ప్రభావంతో ఫ్లోరిడా తూర్పుతీరంలో బలమైన గాలులు వీస్తున్నట్లు స్థానికులు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీని ప్రభావంతో జార్జియా, సౌత్ కరోలినాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. -
హమ్మయ్యా...నౌక బయలుదేరింది
ప్రయాణికులకు మూడు రోజులు నరకం చూపించిన ఎం.వి.స్వరాజ్‌దీప్ నౌక ఎట్టకేలకు శనివారం ఉదయం పదిగంటలకు విశాఖ పోర్టు నుంచి అండమాన్‌కు బయలుదేరింది. ఈనెల 18నే బయలుదేరాల్సిన ఈ నౌక తుపాను కారణంగా మూడు రోజులుగా విశాఖ పోర్టులోనే నిలిచిపోయింది. నౌక సిబ్బంది సహా 1200 మంది మూడు రోజులుగా ఓడలోనే ఉండిపోయారు. డబ్బులు అయిపోయి.. ఆహారం అందక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తుపాను విశాఖ తీరం దాటడంతో వాతావరణం నౌక ప్రయాణానికి అనుకూలంగా మారింది. -
టెక్సాస్‌లో వరద బీభత్సం..
-
మెక్సికోకు తప్పిన భారీ హరికేన్ ముప్పు
మెక్సికో: మెక్సికో పసిఫిక్ తీర ప్రాతంలో ఏర్పడిన 'ప్యాట్రీసియా' హరికేన్ ఉత్తర ప్రాంతానికి చేరే సమయానికి బలహీన పడడంతో భారీ ముప్పు తప్పింది. శుక్రవారం గంటకు 325 కిలోమీటర్ల వేగంతో ఉన్న హరికేన్ పర్వతాలను తాకుతూ బలహీనపడడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ముందుగానే హరికేన్ ప్రమాదాన్ని అంచనావేసిన మెక్సికో ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. హరికేన్ ప్రభావానికి తీరప్రాంతంలో మత్స్యకారుల గ్రామాలలోని కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. 2013లో ఫిలిప్పైన్స్‌లో ఏర్పడిన హయాన్ హరికేన్ గంటకు 315 కిలోమీటర్ల వేగంతో పెను విధ్వంసం సృష్టించి 7,350 మంది మృతికి కారణమైంది. ప్యాట్రీసియా హరికేన్ అంతకన్నా భలమైనదిగా ఏర్పడినప్పటికీ తీరం దాటే సమయానికి క్రమేణా బలహీన పడడంతో మెక్సికోకు పెనుముప్పు తప్పింది. -
మెక్సికోలో హరికేన్..
-
నేడే విడుదల!
మనకు సినిమా ఇష్టమైన వినోదం. కానీ చాలా దేశాల్లో అదొక అరుదైన, ఖరీదైన వినోదం. యెమెన్ కూడా అలాంటి వాటిలో ఒకటి. ఆ దేశంలోని ప్రముఖ నగరం అదెన్‌లో ఉన్న ఏకైక థియేటర్ ‘హరికేన్’లో ప్రస్తుతం ఆడుతున్న సినిమాలు పోస్టర్లివి. దశాబ్దాల కిందట విడుదలైన బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలను ఆ థియేటర్లలో విడుదల చేస్తుంటారు. థియేటర్లను నడపగల వ్యాపారవేత్తలు, సినిమాలను విడుదల చేయగల డిస్ట్రిబ్యూటర్లే కాదు.. తరచూ టికెట్ కొని సినిమాలకు వెళ్లగల ప్రజలు కూడా లేరక్కడ. సినిమా వారికంత ఖరీదైన వినోదం మరి! -
తుపానుకు ముందు... ఎస్సెమ్మెస్
న్యూఢిల్లీ: తుపాను, సునామీ లాంటి వాతావరణ ఉపద్రవాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి ఎస్సెమ్మెస్‌ల ద్వారా హెచ్చరించే కొత్త విధానాన్ని కేంద్రం గురువారం ప్రారంభించింది. గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దీనిని ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎస్సెమ్మెస్ ద్వారా కేవలం సమాచారమివ్వడమే కాకుండా ఉపద్రవాల సమయంలో ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై సూచనలు కూడా ఇస్తారని పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి ఒక ఏడాది సమయం పడుతుందన్నారు. ఎస్సెమ్మెస్ హెచ్చరికలు కావాలనుకునే వారు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని ఆయన తెలిపారు. -
ఇంకెన్నాళ్లీ అంధకారం
విద్యుత్ పునర్నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం సిబ్బంది మధ్య సమన్వయం కరువు ఇంటి కనెక్షన్ల కోసం చేతివాటం జిల్లాలోని చిన్న పట్టణాలకే ఇంకా జరగని సరఫరా కరెంటు గురించి మర్చిపోయిన పల్లెవాసులు చోడవరం: తుఫాన్ వచ్చి 12 రోజులు గడిచిపోయింది. గ్రామీణ జిల్లాలోని చిన్న పట్టణాలకు కూడా ఇంకా విద్యుత్ సరఫరా రాలేదు. ఇక పల్లెల్లో ప్రజలు కరెంటు ఊసే మరిచిపోయారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే వందలాది గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయ న్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ లైన్ల మరమ్మతులు, పుననిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. ఎక్కడి స్తంభాలు అక్కడే ఉన్నాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చిన సహాయక సిబ్బంది పనులు నిమగ్నమైతే కొందరు స్థానిక సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వందలాది మంది కూలీలను, సిబ్బందిని లైన్ల పునర్నిర్మాణ పనులకు తరలించారు. స్థానిక సిబ్బందితో కలిసి వీరు పనిని వేగవంతం చేయాలనే ఆదేశాలున్నాయి. కొందరు నిర్లక్ష్యం వల్ల పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. లైన్లు వేసిన చోట్ల గృహ, వ్యాపార కనెక్షన్లు ఎక్కడికక్కడ కలపాల్సి ఉండగా ఇందులోనూ సిబ్బం ది చేతివాటం ప్రద ర్శిస్తున్నారనే ఆరోపణ వెల్లువెత్తుతున్నాయి. చోడవరం పట్టణంలో ఇటువంటి పరిస్థితి పలుచోట్ల కనిపించింది. స్థానిక శివాలయం వీధిలో లైన్ల పనులు పూర్తికాగా ఇంటి కనెక్షన్లు కొన్ని కలిపి, మరికొన్ని వదిలేయడంతో బాధిత వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యంత్రాలు, సిబ్బంది ఎక్కువగా ఉన్నా కొన్ని చోట్ల స్తంభాలు, ఇతర విద్యుత్ సామగ్రి కొరత ఉండటం వల్ల పనులు మందకొడిగా సాగుతున్నాయి. స్థానిక సిబ్బంది, ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందికి మధ్య సమన్వయం కొరవడంతో ప్రణాళికా బద్ధంగా పనులు సాగడం లేదు. కొన్ని చోట్ల పక్కలైన్లు వేసి ఆ దగ్గరలోనే ఉన్న స్తంభాలను పునరుద్ధరించడం లేదు. కిందపడి ఉన్న స్తంభాలు వైర్లు తొలగింపు పనికూడా జరగలేదు. ఓ పక్క లైన్లు వేస్తున్నప్పటికీ కొన్ని చోట్ల వైర్లపై విరిగిపడిన చెట్ల కొమ్మలను కూడా తొలగించక పోవడం వల్ల పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. ఏ వీధిలో ఎన్ని స్తంభాలు పడ్డాయో నమోదుచేసిన అధికారులు లారీలపై వచ్చిన స్తంభాలను అవసరమైన చోట్ల దించకుండా ఒకే చోట ఎక్కువ స్తంభాలు దించి అక్కడ నుంచి క్రేన్ల సాయంతో తెస్తున్నారు. దీనివల్ల సమయం వృథా అయి పనుల్లో జాప్యం, శ్రమ చోటుచేసుకుంటున్నాయి. చోడవరం పట్టణంతోపాటు పరిసర గ్రామాలు, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట, మాడుగుల, కె.కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ మండలాల్లో కూడా ఎక్కడా పూర్తిగా లైన్లు పునరుద్ధరించిన దాఖలాలు లేవు. ఏఈలు, లైన్ఇన్స్పెక్టర్ల పనితీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు పర్యవేక్షణ కూడా నామమాత్రంగానే ఉందని, దీనివల్ల పునరుద్ధరణ పనులు వేగంగా జరగడంలేదని జనం ధ్వజమెత్తుతున్నారు. ఇంకెంతకాలం చీకట్లో ఉండాలని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మరో పక్క జనరేటర్ల ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో దుకాణదారులు, వ్యాపాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
సోలార్ లాంతర్లు త్వరలో పంపిణీ
మొదటి విడతగా 4 వేలు 10 వేల ఇళ్లల్లో కాంతులు నెడ్‌క్యాప్ ద్వారా అందజేత విశాఖపట్నం సిటీ : తుపానుకు నష్టపోయిన గిరిజనులకు సోలార్ లాంతర్లు రెండు మూడు రోజుల్లో పంపిణీకి విశాఖ నెడ్‌క్యాప్ ప్రయత్నిస్తోంది. రూ. 1.7 కోట్ల వ్యయం తో దాదాపు 10 వేల ఇళ్ల ల్లో సోలార్ విద్యుత్ కాంతులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా 4 వేల లాంతర్లను పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి అందించాలని నిర్ణయించారు. అంతకన్నా ముందుగా ఆయా లాంతర్లకు ఛార్జింగ్ పెట్టుకునేందుకు అవసరమైన ప్యానెల్స్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. పాడేరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో 0.5 కిలోవాట్ ప్యానెల్స్ 20, విశాఖ దరి ఎండాడ అంధుల పాఠశాల, డాక్టర్ రెడ్నం సూర్యప్రసాదరావు ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాలల్లో ఒక్కో కిలో వాట్ ప్యానెల్స్ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మునగపాక మండలం తోటాడ గ్రామంలోని షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహంలో విద్యుత్ లేని కారణంగా 6 సోలార్ లాంతర్లు అందిస్తున్నారు. చింతపల్లి, డుంబ్రిగుడ, జీకే వీధి వంటి ప్రాంతాల్లో ఆయా మండల రెవెన్యూ అధికారులు, ఎండీవోల ద్వారా వీటిని గిరిజనులకు అందించాలని పేర్కొన్నారు. ఒక్కో లాంతర్ ఖరీదు కేంద్ర ప్రభుత్వ ధర మేరకు దాదాపు రూ. 1700గా వుంటుంది. ప్రభుత్వం ప్రకటించినట్టుగా 10 వేల లాంతర్లను తయారీ సంస్థల నుంచి ఆర్డర్‌పై కొనుగోలుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న 4 వేల లాంతర్లను మొదటి విడతగా పంపిణీకి సమాయత్తమవుతున్నారు. అన్నింటినీ ఒకే సారి పంపిణీ చేయనందున ఉన్న వాటిని పంపిణీ చేస్తే వచ్చే వాటిని తర్వాత వినియోగదారులకు అందించవచ్చని నెడ్ క్యాప్ మేనేజింగ్ డెరైక్టర్ ఎం. కమలాకర్ బాబు చెప్పారు. లాంతర్ల పంపిణీ ఎలా చేయాలనే దానిపై నెడ్‌క్యాప్ జిల్లా అధికారి పి.వి. రామరాజు, ఇతర అధికారులతో ఆయన ఆదివారం సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు సోలార్ లాంతర్లు అందే వరకూ ప్రణాళికయుతంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. -
ఆక్రందన.. ఆవేదన
తుఫాన్ బాధితుల అష్టకష్టాలు సాయం అందక, వేదన తీరక జనం అగచాట్లు అన్ని చోట్లా అక్రమాలు, అన్యాయాలు అందని నీరు, ఆహార పొట్లాలు సామాన్యుల్లో ఆగ్రహావేశాలు సుడిగాలి గొడ్డలి వేటు తగిలిన విశాఖజిల్లా తెప్పరిల్లడానికి అష్టకష్టాలూ పడుతోంది. అస్తవ్యస్తమైన జనజీవనం తేరుకోవడానికి అన్నిశక్తులూ కూడదీసుకుంటోంది. అందుకు దోహదపడాల్సిన పాలనావ్యవస్థ మాత్రం అట్టడుగు వర్గాల ప్రజలకు అందుబాటులో లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. సాయం ఆశించిన స్థాయిలో అందడం లేదన్న ఆక్రందన ఆగ్రహంగా రూపాంతరం చెందుతోంది. సాయం పక్కదారి పడుతోందన్న నిరసన నలుదిశలా వ్యక్తమవుతోంది. మరోవైపున కీలకమైన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అవరోధాలు దాటుకుంటూ నెమ్మదిగా సాగుతూ ఉండగా నీటి సమస్య మాత్రం అదే స్థాయిలో అవస్థలు పెడుతోంది. సాక్షి, విశాఖపట్నం : గంటలు రోజులవుతున్నాయి. పెనుతుఫాన్ తాకిడి కారణంగా నెలకొన్న దుర్భర పరిస్థితులు అతి నెమ్మదిగా తిరుగుముఖం పడుతున్నాయి. అయితే అనేక ఈ సంక్షోభ పరిస్థితిలో అందాల్సిన సాయం ఆశించిన స్థాయిలో లేదన్న నిరాశానిస్పృహలు ఎల్లెడలా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తుఫాన్ కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న అట్టడుగు వర్గాల వారి అవస్థలు ఇప్పటికీ చెప్పనలవికాకుండా ఉన్నాయి. ఆహారం కోసం, నీటి కోసం వీరు చేస్తున్న దీనాలాపాలు జిల్లా నలుమూలలా ప్రతిధ్వనిస్తున్నాయి. ఖర్చు భరించగలిగే వారి పరిస్థితి కాస్త ఫర్వాలేదనిపించినా, రెక్కాడితే కాని డొక్కాడని వారి పరిస్థితులే దయనీయంగా ఉన్నాయి. చాలా చోట్ల సాయం పక్కదారి పడుతుం డడంతో బాధితుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. తుఫాన్ అనంతరం మత్స్యకార ప్రాంతాలు, మురికివాడల్లో పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆహార పొట్లాలతో వాహనం వస్తే చాలు ఎగబడి లాక్కునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఇంటికీ ఆహారం-మంచినీళ్లు యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేస్తామన్న ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతోంది. వేలాది మంది బాధితులు ఆహార పొట్లాల కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నా ఫలితం లేకుండా ఉంది. ఆహారం అందడం లేదన్న ఆవేదన అందరి నుంచి వినిపిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి తరలించిన నిత్యావసరాల పంపిణీ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే లు తమ అనుచరులకు కట్టబెట్టడంతో వారు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఏలూరు ఎంపీ, దెందులూరు ఎమ్మెల్యేలు పంపించిన నిత్యావసరాలు, కాయగూరలను విశాఖ వెంకోజీ పాలెంలో స్థానిక నాయకులు తమకు నచ్చిన ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ చేస్తుండడం తో అక్కడివారు మండిపడ్డారు. దాంతో పంపిణీని నిలిపేశారు. కలెక్టరేట్‌కు తరలించిన ఆహార పొట్లాలు అందక జాలరిపేట, రెల్లివీధివాసులు శాపనార్ధాలు పెడుతుండడంతో పోలీసులు కల్పించుకుని వారిని చెదరగొట్టారు. జిల్లాలో శిథిలాల తొలగింపు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంది. జాతీయ రహదారిపై, ప్రధాన రహదారులపై పను లు జోరుగా సాగుతున్నాయి. కానీ అంతర్గత రహదారులు, మారు మూల ప్రాంతాల్లో నేలకొరిగిన వృక్షాలు, విద్యుత్ స్తంభాల తొలగింపు పనులు ప్రభుత్వం చెబుతున్నట్టుగా చకచకా సాగడం లేదు. ఉన్నత వర్గాల వారుంటున్న ప్రాంతాలకిస్తున్న ప్రాధాన్యాన్ని సందుగొందులు, మురికివాడలకు ఇవ్వడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. బాధితులను అందరి కంటే ముందుగా ఆదుకోవాల్సిన అధికారులు పత్తా లేకుండా పోయారన్న ఆక్షేపణ వినిపిస్తోంది. మరొక పక్క రాష్ర్టంలోని 12 కార్పొరేషన్లతో పాటు 50 మున్సిపాల్టీల నుంచి సుమారు ఏడువేల మంది కార్మికులొచ్చినా వారికి ఏం చేయాలో చెప్పేవారే లేకుండా పోయారు. వారిని పట్టిం చుకునే వారూ లేరు. గోపాలపట్నం, గాజువాక ప్రాంతాల్లో అతికష్టమ్మీద విద్యుత్ సరఫరాను పునరుద్దరించగలిగారు. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కాస్త తగ్గింది. నిత్యావసరాల ధరలు అందుబాటులోకి వచ్చినా సక్రమంగా లభించడం లేదు. దాదాపు అన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. అంతా నష్టాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు. ఎవరూ పట్టించుకోలేదు.. మామిడిచెట్టుకూలిపోయి ఇల్లుమొత్తం ధ్వంసమైంది. నేను, నా కుమార్తెలు మొండిగోడల మధ్యే కాలం గడుపుతున్నాం. ఎవరూ పట్టించుకోలేదు. చెట్టు తొలగించలేదు. ఆహార పొట్లాలు కూడా లభించలేదు. - మీనాక్షమ్మ, ఊర్వశి సెంటర్, గౌరీనగర్ మంచినీళ్లు లేవు.. నాలుగురోజులుగా మంచినీళ్లందక చాలా ఇబ్బందులు పడుతున్నాం. బోర్లు పనిచేయడం లేదు. నల్లాల్లో మంచినీళ్లు రావడం లేదు. ట్యాంకర్లు ఎప్పుడొస్తున్నాయో తెలియడం లేదు. మా గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. - రత్నమాల, మహిళా సంఘం నాయకురాలు, కైలాసపురం ఆహారపొట్లాలేవీ? అక్కయ్యపాలెం గోలీలిపాలెంలో 200 కుటుంబాలకు పైగా ఉంటున్నాం. నాలుగు రోజులుగా ఏ ఒక్కరూ మాసందులోకి తొంగిచూడలేదు. ఆహార పొట్లాలు కాదు కదా కనీసం మంచినీళ్లు కూడా పంపిణీ చేయలేదు. - ఎన్.రమ, గోలీలిపాలెం -
విమానాలతో హరికేన్ల అంచనా!
వాషింగ్టన్: విమానాల ద్వారా హరికేన్(పెనుతుపాను)లను అంచనా వేసేందుకు ఉపయోగపడే కొత్త జీపీఎస్ వ్యవస్థను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధిపర్చారు. ‘జిస్మోస్ (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇన్స్ట్రుమెంట్ సిస్టమ్ ఫర్ మల్టిస్టాటిక్ అండ్ అకల్టేషన్ సెన్సింగ్)’గా పేరుపెట్టిన ఈ జీపీఎస్ వ్యవస్థను అన్ని సాధారణ విమానాలకూ అమర్చి అవి ప్రయాణించే మార్గాల్లో గాలిలో తేమ, ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితులను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం జీపీఎస్ ఉపగ్రహ సంకేతాలను ఉపయోగించుకుని వాతావరణ సమాచారాన్ని నేలపై అక్కడక్కడా స్థిరంగా ఉండే జీపీఎస్ రిసీవర్ల ద్వారా సేక రించి అంచనా వేస్తున్నారు. అయితే ఉపగ్రహాలపై జీపీఎస్ రిసీవర్లను అమర్చ డం ఖర్చుతో కూడుకున్నది కావడంతోపాటు మహాసముద్రాలపై ముఖ్యంగా హరికేన్ల వంటివి ఏర్పడిన చోట వాతావరణం అంచనా కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో జిస్మోస్ వ్యవస్థను విమానాలకు అమర్చితే అవి సముద్రాలపై ఎగురుతున్నప్పుడు అక్కడి వాతావరణ అంశాల సమాచారం అందుతుందని, దీంతో హరికేన్ల వంటి వాటి ముప్పును, తీవ్రతను ముందుగానే అంచనా వేసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక ఫ్రిజ్ అంత సైజులో ఉన్న ఈ వ్యవస్థను బూట్లు ప్యాక్‌చేసే అట్టపెట్టె అంత సైజుకు తగ్గించేందుకు వారు కసరత్తు చేస్తున్నారు.