ప్రాణం విడిచిన షాలిని సింగ్
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ నగరాన్ని వణికించిన హరికేన్ హార్వీ మరో భారతీయ విద్యార్థినిని పొట్టన పెట్టుకుంది. అక్కడి విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థిని షాలిని సింగ్ (25) పోరాడి ఓరాడారు. భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకుని , ఆందోళనకర పరిస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షాలిని గత రాత్రి ప్రాణాలు విడిచారు.
నీటిలో కొట్టుకుపోతున్న నిఖిల్ భాటియా, షాలిని సింగ్‌ను కాపాడి ఆసుపత్రికి తరలించి, అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఇద్దరూ మరణించడం విషాదాన్ని సృష్టించింది. తీవ్రంగా గాయపడిన నిఖిల్‌భాటియా ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవల విభాగంలో చిక్సిత పొందుతూ మృతి చెందారు.
కాగా ఢిల్లీకి చెందిన షాలిని సింగ్ గత నెలలో మాత్రమే అమెరికాకు వెళ్లారు. డెంటల్ సర్జరీలో డిగ్రీ చేసిన ఆమె ఎ ఏం యూనివర్శిటీలో పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. భాటియాతో కలిసి బ్రేయాన్ లేక్‌లో స్విమ్మింగ్ చేస్తూ హఠాత్తుగా ప్రమాదంలో చిక్కుకున్నారు.
భారీ వర్షాలతో బీభత్సం సృష్టించిన ఉదంతంలో 200మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్న సంగతి తెలిసిందే