
మంచి ఆరోగ్యం కోసం తినాల్సిన వాటి గురించి సదా ఆరోగ్య నిపుణులు ద్వారా వింటుంటాం. అయితే అవి మన వల్ల కాదని, ఇష్టం లేదనో లేక ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పక్కన పెట్టేస్తాం. కానీ కొన్ని రకాల నట్స్ మాత్రం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వాటిని మన డైట్‌లో భాగం చేసుకుంటే చాలామటుకు ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాంటి వాటిల్లో ఒకటి బాదంపప్పు. బరువుతగ్గేందుకు, వ్యాధినిరోధక శక్తిని పెండచడంతో దీనికి సాటి మరొకటి లేదని నొక్కి చెబుతున్నారు నిపుణులు. పైగా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవో పరిశోధనాత్మకంగా వివరించి చెప్పారు. అవేంటంటే..!.
గుండె ఆరోగ్యం: ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలోనూ, డయాస్టొలిక్ రక్తపోటును కొద్దిగా తగ్గించడంలో సహాయపడుతుంది. పైగా మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.
బరువు నిర్వహణ: రోజూ కనీసం 50 గ్రాముల బాదం తీసుకుంటే బరువు పెరగమని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. బరువు తగ్గాలనుకున్న వారికి ఇది మంచి హెల్ప్ అవుతుందని అన్నారు.
గట్‌హెల్త్: బాదం ప్రయోజనకరమైన గట్ బాక్టీరియాను పెంచుతుంది. జీవక్రియ ఆరోగ్యానికి సహాయపడుతుంది.
బ్లడ్ షుగర్: బాదం ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, హెచ్‌బీఏ1సీస్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇవేగాక బాదంలో మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే పోషకాలు అధికంగా ఉన్నందున రోజవారి ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు.
ప్రస్తుతం తమ అధ్యయనాలు బాదం ప్రయోజనాలను బలంగా హైలెట్ చేశాయని అందువల్ల ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తమ డైట్‌లో భాగం చేసుకోవాలని సూచించారు. ఇక వాటి పూర్తి ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని తెలిపారు నిపుణులు.
(చదవండి: సలుపుతున్న రాచపుండు! చివరి దశలోనే ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు)