Nalgonda
-
‘ఇక్కడ ఇద్దరు మంత్రులున్నా ఏం లాభం?’
నల్లగొండ జిల్లా : జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా ఏం లాభమని విమర్శించారు బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ఉండి కూడా ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలు జరపలేదని తప్పుబట్టారు. నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయంలో జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ‘ రైతులు అన్ని విషయాల్లో మోసపోయారు. రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగొళ్లు లేవు. మంత్రులు కమిషన్ లు తింటూ దళారులకు అమ్ముడుపోయారు. జిల్లాలో ధాన్యానికి మద్దతు ధర రావడం లేదు. నల్లగొండ లో ఓ మంత్రికి సోయి లేదు. కమీషన్లు దందాలో నిమగ్నమయ్యాడు. ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టి భయపెడుతున్నారు. మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ నిబంధనలు ప్రకారం నడుచుకోవాలి కానీ కాంగ్రెస్ కార్యకర్తలగా మాట్లాడొద్దు’ అని సూచించారు జగదీష్ రెడ్డి. -
డ్రమ్ము నెట్టు.. నీరు పట్టు!
చందంపేట : ఈ ఫొటో చూడగానే పిల్లలు, పెద్దలు ఆడుకుంటున్నారు అనుకుంటే పొరబడినట్లే. ఓ కుటుంబం వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి నీటిని తెచ్చుకునేందుకు వెళ్తుందంటే నమ్మశక్యంగా లేదు కదూ. కానీ ఇది నిజమే. మండుటెండలో నెత్తిన బిందె పెట్టుకొని మోసుకెళ్లాల్సిన పని లేకుండా ఆర్టీడీ సంస్థ వారు చెంచుల కోసం ప్రత్యేకంగా ఈ పరికరాన్ని తయారు చేయించారు. ఈ పరికరం ద్వారా ఓ డ్రమ్మును ముందుకు నెట్టుకుంటూ వెళ్లి నీటిని నింపుకొని తీసుకెళ్లొచ్చు. చందంపేట మండలంలోని పాత తెల్దేవర్పల్లిలో సుమారు పది కుటుంబాలకు ఆర్టీడీ సంస్థ నెట్టుకుంటూ వెళ్లే ఈ డ్రమ్ములను అందజేసింది. పాత తెల్దేవర్పల్లి గ్రామంలో ప్రస్తుతం వేసవి కావడంతో నీటి ఎద్దడి నెలకొంది. దీంతో డ్రమ్ముతో కూడిన ఈ పరికరాన్ని గ్రామస్తులు అర కిలోమీటర్ మేర ఇలా నెట్టుకుంటూ వెళ్లి గ్రామ సమీపంలోని బోరు వద్ద నీటిని తెచ్చుకుంటున్నారు. -
చి‘వరి’ దశలో నీరందేనా..!
వెంటనే స్పందించాలి డిండి ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేసిన పంట పొలాలు ఎండి పోకుండా చూడాలి. పంట చివరిదశ వరకు నీరందించే విషయంపై ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలి. – బద్దెల బచ్చలు, రైతు, డిండి నీటిని పొదుపుగా వాడుకోవాలి డిండి ప్రాజెక్టు నుంచి సాగుకు విడుదల చేసిన నీటిని రైతులు వృథా కాకుండా పొదుపుగా వాడాలి. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు 45 రోజుల వరకు సరిపోతుంది. – ఎలమందయ్య, ఈఈ, డిండి ప్రాజెక్టు డిండి : యాసంగి సీజన్లో సాగు చేసిన వ్యవసాయ పొలాలకు పంట చివరి దశ వరకు సాగు నీరు అందుతుందో లేదో అని డిండి ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులోని నీటి మట్టం రోజురోజుకు తగ్గుతుండటం, ఎగువ ప్రాంతమైన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి నీరురాకపోవడంతో సాగు ప్రశ్నార్థకౖంగా మారింది. గతేడాది వానాకాలంలో సమృద్ధిగా కురిసిన వర్షాలకు డిండి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగుపోసింది. దీంతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయకట్టులో ఆరుతడి పంటలకు నీటిని విడుదల చేశారు. కానీ 75 శాతం వరకు రైతులు వరి సాగు చేశారు. దీంతో నీటి వాడకం ఎక్కువ కావడంతో ప్రాజెక్టులో నీరు వేగంగా తగ్గిపోయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 36 అడుగులు డిండి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 36 అడుగులు(2.5 టీఎంసీలు)కాగా.. ఎడమ కాలువ ద్వారా 12,500 ఎకరాలు, కుడి కాలువ ద్వారా 250 ఎకరాల్లో యాసంగి సాగుకు వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజక్టులో 22 అడుగుల(ఒక టీఎంసీలు) నీరు మాత్రమే నిల్వ ఉంది. పంటలు చేతికి రావాలంటే ఇంకా రెండు నెలలు పడుతుంది. ప్రస్తుతం ఉన్న నీరు నెల రోజులకు మాత్రమే సరిపోతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా డిండి ప్రాజెక్టులోకి నీటిని తరలించి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. ఎకరం పొలం కూడా ఎండొద్దు : ఎమ్మెల్యే బాలునాయక్ డిండి ప్రాజెక్టు కింద సాగు చేసిన పొలాలకు నీరందించే విషయంపై గురువారం ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ స్థానిక నీటి పారుదల శాఖా అతిథి గృహంలో ఇరిగేషన్ శాఖా అధికారులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు వృథా కాకుండా పంట చివరిదశ వరకు అందించేలా పక్కా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఒక్క ఎకరం కూడా ఎండకుండా చూడాలన్నారు. ఫ డిండి ప్రాజెక్టులో 22 అడుగులకు తగ్గిన నీటి మట్టం ఫ పంటలు చేతికి రావాలంటే రెండు నెలలపాటు నీటి అవసరం ఫ నెల రోజులకే సరిపోనున్న ప్రస్తుత నిల్వ ఫ ఆందోళన చెందుతున్న రైతులు -
జగ్జీవన్‌రామ్ జయంతిని విజయవంతం చేయాలి
నల్లగొండ : నల్లగొండలో ఈ నెల 5న నిర్వహించనున్న బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని విజయవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఒక ప్రకటనలో కోరారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు నల్లగొండ ఎన్జీ కాలేజీ ఎదురుగా నిర్వహించనున్న జయంతి ఉత్సవాలకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎస్సీ, ఇతర అన్ని సంఘాల నాయకులు, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఒకేషనల్ పరీక్షకు 37 మంది గైర్హాజరునల్లగొండ : పదో తరగతి ఒకేషనల్ పరీక్షలు గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 28 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 2,597 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 2,560 మంది హాజరయ్యారు. 37 మంది గైర్హాజరైనట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలిమాడుగులపల్లి : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి పి.శ్రవణ్‌కుమార్ అన్నారు. గురువారం మాడ్గులపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎ–గ్రేడ్ వరి ధాన్యం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2320, సాధారణ రకానికి రూ.2300 ఇస్తోందని.. సన్న రకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తుందని తెలిపారు. రైతులు 17శాతం తేమ ఉండేలా నాణ్యతా ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధరతోపాటు బోనస్ పొందాలన్నారు. కార్యక్రమంలో ఏఓ శివరాంకుమార్, ఏఈఓలు శిరీష, వేణుగోపాల్, పార్వతి, రైతులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం చేసి తులసీ దళాలతో అర్చించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
వైద్య వృత్తికి ప్రత్యేక గుర్తింపు
నల్లగొండ టూటౌన్ : దేశంలో ఏ రంగంలో రాని గుర్తింపు కేవలం ఒక వైద్యవృత్తిలో మాత్రమే లభిస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎస్ఎల్బీసీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆవరణలో గురువారం రాత్రి నిర్వహించిన 2019–25 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డేలో ఆయన ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండ మెడికల్ కాలేజిలో ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్న యువ డాక్టర్లు.. పీజీ పూర్తి చేసిన తర్వాత నల్లగొండ గడ్డ మీద ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆకాక్షించారు. అత్యవసర సమయంలో ప్రజలు తలుచుకునేది వైద్యులను మాత్రమేని.. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించి వారి మన్ననలు పొందాలని కోరారు. ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా పని చేయాలన్నారు. ప్రభుత్వ సర్వీస్‌ల్లో చేరి రోగులకు వైద్యం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైద్య, విద్యా రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆరోగ్యశ్రీ కింద వైద్య పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. వివిద రాష్ట్రాల నుంచి వచ్చి ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎక్కడ వైద్యం అందించినా నల్లగొండ గడ్డకు పేరు తీసుకురావాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రోగులకు వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకుంటేనే వైద్యులకు కూడా తృప్తి ఉంటుందన్నారు. విదేశాల్లో పైచదువులు చదివినా తిరిగి దేశానికి, నల్లగొండ ప్రాంతానికి వచ్చి పని చేయాలని కోరారు. ఏ డిపార్టుమెంట్లో పని ఆలస్యం జరిగినా ఇబ్బంది అంతగా ఉండదని, వైద్యంలో మాత్రం అప్పటికప్పుడే స్పందించి వైద్యం అందిస్తేనే రోగులకు మేలు చేకూరుతుందన్నారు. అనంతరం ఎంబీబీఎస్, ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్న 142 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, దేవరకొండ ఏఎస్పీ మౌనిక, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీవాణి, వైస్ ప్రిన్సిపాల్ రామచంద్ర, సూపరింటెండెంట్ అరుణకుమారి, ప్రొఫెసర్లు శివకుమార్, రాజేంద్రకుమార్, స్వరూపరాణి, బద్రీనారాయణ, రాధాకృష్ణ, పుష్ప, వందన, ఉషశ్రీ, యామిని, అయేషా పాల్గొన్నారు. ఫ యువ డాక్టర్లంతా పేదలకు సేవలందించాలి ఫ ఎవరైనా ఆపదలో తలుచుకునేది వైద్యులనే.. ఫ పీజీ పూర్తి చేసిన తర్వాత నల్లగొండ ప్రజలకు సేవ చేయాలి ఫ మెడికల్ కళాశాల గ్రాడ్యుయేషన్ డేలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
డిగ్రీ ప్రాక్టికల్స్ బహిష్కరణ
రామగిరి(నల్లగొండ) : మహత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బుధవారం నుంచి ప్రారంభం కావాల్సిన ప్రాక్టికల్ పరీక్షలు ప్రైవేట్ కాలేజీల్లో నిలిచిపోయాయి. గడిచిన నాలుగేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనందుకు నిరసనగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం, వేతనాలు ఇవ్వడం లేదని అధ్యాపకులు పరీక్షలను బహిష్కరించారు. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం ప్రాక్టికల్ పరీక్షలు యథావిధిగా జరిగాయి. యూనివర్సిటీ పరిధిలో 60 కళాశాలలు ఉండగా మొదటి దశలో 30 కళాశాలలో బుధవారం నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. ప్రభుత్వ, గురుకుల కాలేజీల్లో మినహా అన్ని ప్రైవేట్ కాలేజీల్లో పరీక్షలు బహిష్కరించారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల అయ్యేంతవరకు పరీక్షలను బహిష్కరిస్తామని ప్రైవేటు కళాశాలల యాజమాన్యం, లెక్చరర్లు అంటున్నారు. వైద్యులు ప్రజలకుఅందుబాటులో ఉండాలిచింతపల్లి : గ్రామీణ ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ సూచించారు. బుధవారం చింతపల్లి మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట డాక్టర్ వంశీకృష్ణ ఉన్నారు. యువజన కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేయాలినల్లగొండ : జిల్లాలో యువజన కాంగ్రెస్ పటిష్టతకు ప్రతి కార్యకర్తా కృషి చేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జి పొన్నం తరుణ్‌గౌడ్ అన్నారు. బుధవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో మేకల ప్రమోద్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ కార్యనిర్వాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకుడు ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కోరారు. సమావేశంలో హరిప్రసాద్, కొర్రా రామ్‌సింగ్, తొర్పునూరి శ్రీకాంత్‌గౌడ్, మణిమద్దె పరమేష్, మామిడి కార్తీక్, అబ్బనబోయిన రాముయాదవ్ పాల్గొన్నారు. ఆస్తి పన్ను ముందస్తు చెల్లిస్తే రాయితీనల్లగొండ టూటౌన్ : ఎర్లీబర్డ్ స్కీం కింద ఆస్తి పన్ను ముందస్తు చెల్లించి ఐదు శాతం రాయితీ సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీకి పాత బకాయిలేనివారు 2025–26 సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను ఈ నెల 30వ తేదీలోగా చెల్లించి ఐదు శాతం రాయితీ పొందాలని కోరారు. -
ఉత్సవాలను విజయవంతం చేయాలి
నల్లగొండ : బాబు జగ్జీవన్‌రామ్, డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 5న బాబు జగ్జీవన్‌రామ్, 14న అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా హాజరయ్యే వారికి వేసవి దృష్ట్యా తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలని కోరారు. రోడ్డు విస్తరణలోతొలగించిన జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ విగ్రహాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, కోటేశ్వరరావు, పత్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి -
‘కేంద్రం నిధులతో సన్న బియ్యం’
నల్లగొండ టూటౌన్ : సన్న బియ్యం ఇస్తున్నామని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సన్న బియ్యం ఇస్తున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్‌రెడ్డి అన్నారు. ‘సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది’ పేరుతో రూపొందించిన పోస్టర్‌ను బుధవారం నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో వారు ఆవిష్కరించి మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నిజాలు తెలుసుకోకుండా సన్న బియ్యం తామే ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కరోనా సమయం నుంచి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో పేదలందరికీ ఉచితంగా బియ్యం ఇస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా అబద్ధాలు చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. సమావేశంలో నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, పల్లెబోయిన శ్యాంసుందర్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, చింత ముత్యాలరావు, రావెళ్ల కాశమ్మ, జగ్జీవన్ పాల్గొన్నారు. -
రాజీవ్ యువ వికాసానికి నేరుగా దరఖాస్తులు
నల్లగొండ : రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల పరిధిలోని 8 కార్పొరేషన్ల పరిధిలో రుణాలు పొందేందుకు ఇక నేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకున్నారు. అయితే సర్వర్ ఇబ్బందులతో పాటు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకునే విషయంలో ఇబ్బంది ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు గడువును ఈ నెల 14 వరకు పొడిగించింది. ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో.. గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీఓ కార్యాలయాల్లోని ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల వారు మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ల్లో దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. ఆయా కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలను కూడా సిద్ధం చేశారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సాగనుంది. గతంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారు ఆయా హార్డ్ కాపీలను ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఫ ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు ఆయా శాఖల పరిధిలో వచ్చిన దరఖాస్తులు ఇలా..ఎస్సీ 7154ఎస్టీ 3823బీసీ 13,463మైనార్టీ 1194 ఎంబీసీ 49బీసీ ఫెడరేషన్ 118 క్రిిస్టియన్ మైనార్టీ 69ఈబీసీ 437 మొత్తం 26,357 -
పురోగతిలో రాష్ట్రంలో రెండోస్థానం
నల్లగొండ అగ్రికల్చర్ : నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)టర్నోవర్‌తో పాటు లాభాలను గడించడంలో పురోగతిని సాధించి రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచిందని చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం బ్యాంకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సంవత్సరంలో రూ.30 కోట్ల లాభాల్లో ఉండగా ప్రస్తుత ఏడాదిలో రూ.42.31 కోట్లకు పెరిగిందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు టర్నోవర్ రూ.2300 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.3వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకోగా రూ.2800 కోట్లకు చేరిందని, నెల రోజుల్లో లక్ష్యం చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. డీసీసీబీ పుట్టిన నాటి నుంచి ఎన్నడూ లేనివిధంగా పురోగతి సాధించిందన్నారు. రైతులకు రూ.115 కోట్ల పంటరుణాలు ఇచ్చామని. రూ.100 కోట్ల డిపాజిట్లను సేకరించామని తెలిపారు. బంగారు ఆభరణాలపైరూ. 623.91 కోట్ల రునాలు ఇచ్చామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఇళ్ల నిర్మాణం కోసం భూమి తనఖాను పెట్టుకుని రూ.35 లక్షల వరకు రుణాలను ఇవ్వడంతో పాటుగా రైతుల పిల్లల విదేశీ ఉన్నత చదువుల కోసం విరివిగా రుణాలను ఇస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ద్వారా కోళ్లు, గొర్రెలు పెంపకానికి రుణాలు అందిస్తుమన్నారు. బ్యాంకు విస్తరణ కోసం ఉమ్మడి జిల్లాలో అదనంగా తిప్పర్తి, ఆత్మకూరు, గరిడేపల్లి, నారాయణపూర్, దామరచర్లలో నూతన బ్రాంచీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇంకా మరో ఆరు బ్రాంచీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. పీఏసీఎస్‌ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయించడం ద్వారా వాటిని ఆర్ధికంగా బలోపేతం చేస్తున్నామన్నారు. బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తున్న ఉద్యోగులు, సహకరిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలను తెలియజేశారు. సమావేశంలో సీఈఓ కె.శశంకర్రావు, డీజీఎం నర్మద, ఉపేందర్‌రావు, ఏజీఎం కురవానాయక్, డైరెక్టర్లు పాశం సంపత్‌రెడ్డి, గుడిపాటి సైదులు పాల్గొన్నారు. డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి -
ముగిసిన పదో తరగతి పరీక్షలు
నల్లగొండ : పదో తరగతి పరీక్షలు బుధవారంతో ముగిసాయి. మార్చి 21న ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 2న సాంఘిక శాస్త్రం పరీక్షతో పూర్తయ్యాయి. బుధవారం జరిగిన పరీక్షకు మొత్తం 18666 మంది విద్యార్థులు హాజరుకావల్సి ఉండగా.. 18,628 మంది హాజరయ్యారు. 38 మంది గైర్హాజరయ్యారు. 99.79 శాతం హాజరు నమోదైందని అధికారులు తెలిపారు. లిటిల్‌ఫ్లవర్ స్కూల్లో ఏర్పాట్లు.. పదో తరగతి పరీక్షలు ముగియడంతో ఈ నెల 7వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం జరుగనుంది. ఇతర జిల్లాల నుంచి నల్లగొండకు 2 లక్షలకుపైగా పేపర్లు రానున్నాయి. ఏ జిల్లా నుంచి వచ్చే విషయం ఎవరికీ తెలియదు. నల్లగొండలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో మూల్యాంకనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. 7వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం -
ప్రత్యేక ప్రజావాణి వాయిదా
నల్లగొండ : కలెక్టరేట్లో గురువారం నిర్వహించనున్న ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి వృద్ధులు, దివ్యాంగులు గురువారం కలెక్టరేట్‌కు రావద్దని పేర్కొన్నారు. సీపీఓగా మాన్యానాయక్నల్లగొండ : నల్లగొండ ముఖ్య ప్రణాళిక అధి కారి (సీపీఓ)గా మాన్యానాయక్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ఆయనకు జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. ప్రస్తుతం ఆయన ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు పదోన్నతి ఇవ్వడంతోపాటు నల్లగొండ సీపీఓగా పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన గూడ వెంకటేశ్వర్లు వికారాబాద్‌కు బదిలీ అయ్యారు. -
మూసీకి పూడిక ముప్పు
0.74 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గుదల కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) గతేడాది హైడ్రోగ్రాఫిక్, రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో నిర్వహించిన సర్వే మూసీకి పూడిక ముప్పును గుర్తించింది. దేశ వ్యాప్తంగా 87 జలాశయాలు పూడిక కారణంగా వేగంగా నీటినిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయని సీడబ్ల్యూసీ పేర్కున్న సర్వేలో మూసీ జలాశయం ఉంది. మూసీ జలాశయంలో ఇప్పటికే 15.32 శాతం మేర పూడిక ఉందని, పరిరక్షణ చర్యలు తప్పవని ఈ సర్వే సూచించింది. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి 2024 వరకు 0.74 టీఎంసీల సామర్థ్యం తగ్గిపోయింది. ఫలితంగా నీటినిల్వ సామర్థ్యం 3.72 టీఎంసీలకు, ఆయకట్టు 33 వేల ఎకరాలకు పడిపోయిందని సీడబ్ల్యూసీ సర్వే పేర్కుంది. ప్రాజెక్టులో పూడిక తొలగించి పూర్తిస్థాయిలో నీటి నిల్వకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మూసీ ఆయకట్టు రైతులు కోరుతున్నారు. కేతేపల్లి : ఉమ్మడి జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ జలాశయానికి పూడిక ముప్పు ముంచుకొస్తోంది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) గతేడాది నిర్వహించిన సర్వే మూసీకి పూడిక ముప్పును గుర్తించింది. ప్రాజెక్టు నిర్మించిన తొలినాళ్లలో నాలుగు నియోజకవర్గాల్లోని 42 వేల ఎకరాలకు పైగా సాగునీరు, సూర్యాపేట పట్టణానికి తాగునీరు అందించారు. పూడిక పేరుకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నేడు 30 వేల ఎకరాలకు కూడా సాగు నీటిని అందించలేని దుస్థితికు చేరుకుంది. 1987లో స్కవర్ గేట్ల మూసివేత.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ అడవుల్లో పుట్టిన మూసీ నది హైదరాబాద్, యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా 240 కిలోమీటర్లు ప్రవహిస్తూ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మూసీనదిపై సూర్యాపేట మండలం సోలిపేట వద్ద రెండు గుట్టల మద్యన రూ.2.20 కోట్ల వ్యయంతో 30 గేట్లతో 1963లో ప్రాజెక్టు నిర్మించారు. 645 అడుగులు(4.83 టీఎంసీలు) నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి వచ్చే వరదనీటితో చెత్తచెదారం, మట్టిని ఎప్పటికప్పుడు బైటకు విడుదల చేసేందుకు అప్పటి ఇంజనీర్లు ప్రాజెక్టు అడుగు భాగాన 10 స్కవర్‌గేట్లు, మధ్యలో 8 రెగ్యులేటర్ గేట్లు, పైభాగంలో 12 క్రస్ట్‌గేట్లతో ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టుకు అడుగు భాగంలో ఉండే స్కవర్‌గేట్లు తరుచుగా మరమ్మతులకు గురవుతుండటంతో 1987లో కాంక్రీట్ వేసి వాటిని శాశ్వతంగా మూసివేశారు. దీంతో ప్రాజెక్టులో పేరుకపోయిన పూడికను వరదనీటితో పాటు బైటకు పంపించేందుకు ఉన్న ఏకై క మార్గం మూసుకుపోయింది. వరద నీటితో పూడిక చేరిక.. మూసీ నదికి వరదలు వచ్చినపుడు ఉప నదులు, వాగులు, వంకల ప్రవాహాలతో ఇసుక, ఒండ్రుమట్టి జలాశయంలో చేరుతున్నాయి. వరదలు అధికంగా వచ్చే సమయంలో నీటి ఉధృతితో తీరాలు కోతకు గురై చెట్లు, మట్టి కొట్టుకొచ్చి ఏటా జలాశయంలో చేరడం కూడా పూడికకు కారణమవుతోంది. ఫ తగ్గుతున్న నీటి నిల్వ సామర్థ్యం ఫ కేంద్ర జల సంఘం సర్వేలో వెల్లడి -
అర్హులందరికీ పట్టాలు ఇస్తాం
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : అర్హులైన రైతులందరికీ త్వరలోనే పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పట్టాల పంపిణీపై స్థానిక ఎమ్మెల్యే జైవీర్రెడ్డితో కలిసి సమీక్షించారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా పట్టాల పంపిణీకి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే.. కలెక్టర్‌ను కోరారు. త్వరలోనే అసైండ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేసి పట్టాలు పంపిణీ చేపడుతామని తెలిపారు. వివా దంలో లేని భూములకు సంబంధించిన పట్టాలు మొదటగా పంపిణీ చేస్తామన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలో ప్రభుత్వ సంస్థలకు భూమి కేటాయింపు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జెడ్పీ మాజీ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, తహసీల్దార్ అనిల్ ఉన్నారు. -
యువ తేజం
5వ తేదీన జిల్లా పోలీస్ కార్యాలయంలో మెగా జాబ్‌మేళా సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉద్యోగ, ఉపాధి అవకాశల్లేక, పక్కదారి పడుతున్న యువతను సన్మార్గంలో నడిపించేలా జిల్లా పోలీసు శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యువత సమాజంలో గౌరవంగా బతికేలా చూసేందుకు ‘యువ తేజం’ పేరుతో జిల్లాలో పోలీసు శాఖ మొదటిసారిగా మెగా జాబ్‌మేళా నిర్వహిస్తోంది. యువతకు ఏదో ఒక ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించే ఉద్దేశంతో ఎస్పీ శరత్చంద్ర పవార్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. వివిధ కంపెనీలతో మాట్లాడి, వారిని ఒప్పించి ఈనెల 5వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. యువత పక్కదారి పట్టకుండా.. జిల్లాలో పదో తరగతి, ఆపైన ఇంటర్, బీఏ, బీటెక్, బీబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ తదితర కోర్సులు చేసిన యువతలో కొందరు పక్కదారులు పడుతున్న వారు ఉన్నారు. మరికొందరు చదువుకున్నా అవకాశాలు లభించని వారు ఉన్నారు. తాగుడు, ఇతరత్రా మత్తు పదార్థాలకు బానిసైన వారు కూడా ఉన్నారు. యువత ఖాళీగా ఉండటం వల్ల వ్యససాలకు బానిసై పక్కదారులు పడుతోది. తద్వారా నేరాలు పెరిగిపోవడంతో ఆ కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. యువత ఖాళీగా ఉండవద్దనే ఆలోచనలతో పాటు, నేరాలను అరికట్టేందుకు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ నిర్ణయించారు. రూ.13 వేలకు తగ్గకుండా వేతనం.. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ తదితర కోర్సులు పూర్తి చేసిన వారంతా అర్హులే. వారికి వివిధ రంగాల్లో అవకాశాలు కల్పించేలా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మార్కెటింగ్, బ్యాంకింగ్ సేల్స్, కాల్‌సెంటర్, ఇతరత్రా కంపెనీల్లో ఉపాధి అవకాశాలు లభించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎంపికైన వారికి ఆయా కంపెనీలు కనీస వేతనం రూ.13 వేలకు తగ్గకుండా ఇవ్వనున్నాయి. ఈ జాబ్‌మేళాలో పాల్గొనాలనుకునే వారంతా సమీప పోలీస్స్టేషన్లలో వెంటనే పేరు నమోదు చేసుకొని, 5వ తేదీన జాబ్ మేళాకు హాజరు కావచ్చు. జాబ్‌మేళాకు వందకుపైగా కంపెనీలు.. డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, ఎంబీఏ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా పెద్ద ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ జాబ్ మేళాలో విప్రో, ఫాక్స్‌కాన్, హెచ్‌సీఎల్, క్యూబ్ కన్సల్టింగ్, హెడ్ఎఫ్సీ, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు, హెటిరో, అపోలో ఫార్మసీ తదితర ఫార్మా కంపెనీలు, సన్‌షైన్, ఏఐజీ హాస్పిటల్స్ తదితర ఐటీ, రిటైల్, హెల్త్కేర్రంగాలకు చెందిన వందకు పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. వాటిల్లో యువతకు అవకాశాలు లభించనున్నాయి.ఫవందకు పైగా కంపెనీలు, 2500 మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యం ఫ టెన్త్ ఆపైన చదివినవారు అర్హులు.. డిగ్రీ, బీటెక్, పీజీ వారికి ప్రత్యేక అవకాశాలు ఫ యువత సన్మార్గంలో నడిచేలా ఎస్పీ శరత్చంద్ర పవార్ వినూత్న ఆలోచనగంజాయికి బానిసైన వారు పాల్గొనేలా.. జిల్లాలోని నిరుద్యోగ యువతతోపాటు నల్లగొండ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాతబస్తీ తదితర ప్రాంతాల్లో చదువుకున్న యువతతోపాటు జిల్లాలో గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువతపై పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టి సారించి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ముఖ్యంగా పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించిన దాదాపు 400 మంది జాబ్‌మేళాలో పాల్గొనేలా చేసి వారికి ఉపాధి అవకాశాలు లభించేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక నల్లగొండ పాతబస్తీలో ప్రతి వార్డు నుంచి 20 మంది జాబ్‌మేళాకు హాజరయ్యేలా చూడనున్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
జి ఎడవెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, ఇన్చార్జి డీఎస్ఓ హరీష్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, డీసీఓ పత్యానాయక్, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీలు నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, మందడి రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అబ్బగోని రమేష్ గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, కూసుకుంట్ల రాజిరెడ్డి, భిక్షంయాదవ్, భారత వెంకటేశం, దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి, కేసాని వెంకట్‌రెడ్డి, కొరివి శంకర్, పోలె విజయ్, గౌని నరేష్, రామకృష్ణ పాల్గొన్నారు. -
విద్యాశాఖలో పరస్పర బదిలీలు
నల్లగొండ : విద్యాశాఖలో పరస్పర బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో నల్లగొండ జిల్లా నుంచి 24 మంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు బదిలీ అవుతుండగా.. వేరే జిల్లాల నుంచి నల్లగొండకు 24 మంది ఉపాధ్యాయులు రానున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల విభజన తర్వాత జోన్లను విభజించింది. ఆ సందర్భంలో జోన్ల వారీగా బదిలీలు చేయడంతో నల్లగొండ జిల్లాకు చెందినవారు నుంచి ఇతర జిల్లాలకు పెద్ద ఎత్తున బదిలీలు అయ్యారు. ఇతర జిల్లాల నుంచి కూడా నల్లగొండ జిల్లాకు పెద్ద ఎత్తున బదిలీపై వచ్చారు. దీంతో వారంతా కుటుంబాలకు దూరంగా ఉంటున్నామని తమను సొంత జిల్లాలకు బదిలీ చేయాలంటూ ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పరస్పర బదిలీలకు అవకాశం ఇచ్చింది. దీంతో ఇతర జిల్లాల్లో పని చేస్తున్న వారు నల్లగొండ జిల్లాకు బదిలీపై వస్తే వారి స్థానంలో నల్లగొండ జిల్లాలో పని చేస్తున్న వారు ఇతర జిల్లాలకు బదిలీ కానున్నారు. కలిసి దరఖాస్తు చేసుకున్న వారినే.. పరస్పర బదిలీలకు సంబంధించి ఇరువురు కలిసి దరఖాస్తు చేసుకున్న వారి బదిలీలను మాత్రమే ప్రభుత్వం ఆమోదించింది. దీంతో నల్లగొండ జిల్లా నుంచి భువనగిరి, సూర్యాపేట, మేడ్చల్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, ఆసిఫాబాద్ జిల్లాలకు 24 మంది ఉపాధ్యాయులు వెళ్లనున్నారు. వారి స్థానంలో నల్లగొండ జిల్లాకు 24 మంది ఇతర జిల్లాల నుంచి రానున్నారు. ఫ జిల్లా నుంచి వెళ్లనున్న 24 మంది ఫ అదే సంఖ్యలో నల్లగొండ జిల్లాకు రానున్న ఉపాధ్యాయులు -
రోడ్డుపై మార్కింగ్ పెయింట్
కనగల్ : నల్లగొండ నుంచి కనగల్ మండల కేంద్రం వరకు రోడ్డు మార్కింగ్ పెయింట్ పనులు కొనసాగుతున్నాయి. ఈ రోడ్డుపై ఇప్పటి వరకు మార్కింగ్ లేకపోవడంతో వాహనదారులు అడ్డగోలుగా, అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడ్డారు. ప్రమాదాల నివారణకు అధికారులు మార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్కింగ్ పెయింట్ రోడ్డుపై సులభంగా కనిపిస్తుంది. దీంతో ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొంటున్నారు. కనగల్ వద్ద మార్కింగ్ పెయింట్ వేస్తున్న కూలీలు -
నేనూ సన్నబియ్యం అన్నం తింటా
ఎన్నో ఏళ్లుగా దొడ్డు బియ్యాన్నే తింటున్నా. మార్కెట్లో సన్నబియ్యం కొనలేక నెలకు నాకు వచ్చే ఆరు కిలోల దొడ్డు బియ్యాన్ని తినాల్సి వచ్చేది. దొడ్డు బియ్యంతో వండుకున్న అన్నం తిని పనులకు వెళ్లేదాన్ని. అక్కడ అంతా సన్నబియ్యంతో వండుకున్న అన్నం తినేవారు. నేను మాత్రం దొడ్డు అన్నం తినాలంటే కొంత ఇబ్బందిగా ఉండేది. ఈ రోజు రేషన్ దుకాణంలో సన్నబియ్యం పంపిణీ చేశారు. అందరిలాగే నేను ఈ రోజు నుంచి సన్నబియ్యంతో వండుకున్న అన్నం తింటాను. ఎంతో ఆనందంగా ఉంది. – ఈద లక్ష్మమ్మ, పెద్దవూర -
క్రికెట్లో ఉచిత శిక్షణ
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీ నుంచి ఔట్‌డోర్ స్టేడియంలో క్రికెట్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అసోసియేషన్ సెక్రటరీ అమీనుద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 నుంచి 19 సంవత్సరాలలోపు బాల బాలికలకు శిక్షణ ఇస్తామని, ఇతర వివరాలకు 9885717996 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. కేవీలో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణనల్లగొండ : నల్లగొండలోని కేంద్రియ విద్యాలయంలో 2వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు ఈ నెల 2 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను కేంద్రియ విద్యాలయ కార్యాలయంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి 12 వరకు పొందాలని పేర్కొన్నారు. పూరించిన దరఖాస్తులను ఈ నెల 11లోగా విద్యాలయంలో అందజేయాలని తెలిపారు. టెన్త్, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కేంద్రియ నిబంధనల ప్రకారం అర్హత ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు వెబ్సైట్ www.nalgonda.kvs.gov.inలో చూడవచ్చని పేర్కొన్నారు. సమాజ సేవలో భాగస్వాములు కావాలిరాజాపేట: విద్యార్థులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఎన్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కోఆర్డిరేటర్ ప్రొఫెసర్ డాక్టర్ నర్సింహగౌడ్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్‌స్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి అన్నారు. మంగళవారం రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్ఆర్ కళాశాల విద్యార్థుల ఎన్ఎస్ఎస్ శిక్షణ శిబిరంలో భాగంగా ఏడవ రోజు గ్రామంలో మొక్కలు నాటడం, ప్రయాణికుల షెల్టర్‌కు రంగులు వేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కమటం రమేష్, ప్రోగ్రాం ఆఫీసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హనుమంతుడికి ఆకుపూజ యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు. -
కందుల కొనుగోలుకు కొర్రీలు
కొండమల్లేపల్లి : కందులు సాగు చేసిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. పంట సాగు.. పంట విస్తీర్ణం వంటి వివరాలు నమోదు చేసుకున్న రైతుల కందులు మాత్రమే కొనుగోలు కేంద్రంలో కొంటామంటూ కొర్రీలు పెడుతుండడంతో కందిసాగు చేసిన రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. వ్యవసాయ అధికారుల జాబితాలో పేర్లున్న రైతులు.. దళారులకు సహకరిస్తుండడంతో అసలు రైతులు నష్టపోతున్నారు. మార్చి 7న కేంద్రాలు ప్రారంభం జిల్లాలో 10 వ్యవసాయ మార్కెట్ కేంద్రాలు ఉండగా కొండమల్లేపల్లి, హాలియాలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుల్లో మార్చి 7వ తేదీన కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కొనుగోలు కేంద్రాల్లో కొండమల్లేపల్లి, గుర్రంపోడు, పెద్దఅడిశర్లపల్లి, చింతపల్లి, తిరుమలగిరిసాగర్, హాలియా, పెద్దవూర తదితర ప్రాంతాల నుంచి రైతులు కందులు విక్రయించుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఈసారి వ్యవసాయ అధికారుల జాబితాలో పేర్లు ఉన్న రైతుల కందులు మాత్రమే కొనుగోలు చేస్తామంటూ కేంద్రం నిర్వాహకులు చెబుతుండడంతో ఆరుగాలం కష్టించి కంది సాగు చేసిన రైతులు తమ కందులు కూడా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. అదనంగా కేజీ తూకం.. సాధారణంగా రైతులు తమ వద్ద ఉన్న కందులను ఎండబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తారు. కానీ కేంద్రం నిర్వాహకులు కందులను నిల్వ చేయాల్సి ఉంటుదని చెప్తూ 50 కేజీలకు బదులు 51 కేజీల తూకం వేస్తున్నారు. వ్యవసాయ అధికారుల తీరుపై విమర్శలు.. రైతులు వారి భూ విస్తీర్ణంతోపాటు ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేశారన్న వివరాలను వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేయించుకోవాలి. ఇందుకు గాను ఏఓ స్థాయి అధికారి లేదా ఏఈఓ క్షేత్రస్థాయిలో పంటలను స్వయంగా పరిశీలించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. కానీ అప్పట్లో రైతులే తమ వద్దకు వచ్చి వివరాలు నమోదు చేయించుకోవాని వ్యవసాయ అధికారులు సూచించారు. చాలా మంది రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై వివరాలను నమోదు చేయించుకోలేదు. ఇప్పుడు జాబితాలో పేరు లేకపోవడంతో ప్రభుత్వ కేంద్రంలో కందులు కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు.ఫ రైతులకు శాపంగా వ్యవసాయ అధికారుల నిబంధనలు ఫ కొత్త దందాకు తెరలేపిన దళారులు ఫ గతంలో నిల్వ చేసిన కందులు సైతం కేంద్రంలో విక్రయాలు ఫ నష్టపోతున్న రైతులు కందులు కొనడం లేదు నా కున్న ఏడెకరాల్లో కంది సాగు చేశాను. వ్యవసాయ అధికారులు ఆరు ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నట్లు నమోదు చేయడంతో.. ఆ ఆరు ఎకరాల కందులు మాత్రమే కొంటున్నారు. మిగతా ఎకరం భూమిలో పండిన కందులు కొనడం లేదు. దీంతో 8 క్వింటాళ్ల కందులు అమ్ముకోలేని పరిస్థితి ఉంది. – అంజన్‌రావు, రైతు జిన్నాయిచింత, గుర్రంపోడు మండలం రైతుల కందులనే కొనుగోలు చేస్తున్నాం కొండమల్లేపల్లి, హాలియాలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 481 మంది రైతుల నుంచి 11,323 బ్యాగుల్లో 5631.50 క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశాం. వ్యవసాయ అధికారులు చేపట్టిన సర్వేకు సంబంధించి లిస్టులో పేరున్న రైతుల నుంచి మాత్రమే కందులను కొనుగోలు చేస్తున్నాం. దళారులకు తావివ్వకుండా రైతులకు మేలు చేసే విధంగా కొనుగోళ్లు చేపడుతున్నాం. – జ్యోతి, మార్కెట్ డీఎం, నల్లగొండ నిల్వ ఉంచిన కందుల విక్రయం వ్యవసాయ అధికారుల జాబితాలో పేరు లేని రైతుల వద్ద నుంచి దళారులు కందులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. వారు వ్యవసాయ అధికారుల జాబితాలో పేరున్న రైతులతో ఒప్పందం చేసుకొని వారికి కొంత ముట్టజెప్పి వారి ద్వారా ప్రభుత్వ కేంద్రంలో కందులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఆరుగాలం కష్టపడ్డ రైతులు నష్టపోతున్నారు. ఇక, గతంలో తమ వద్ద నిల్వ ఉంచిన కందులను సైతం దళారులు ప్రభుత్వ కేంద్రంలో అమ్ముతున్నారు. కానీ వ్యవసాయ అధికారులు మాత్రమ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. -
చరిత్రలో నిలిచిపోయే పథకం
కనగల్ : సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవమని, ఇది చరిత్రలో నిలిచిపోయే పథకమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం కనగల్ మండలం జి.ఎడవెల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. గ్రామంలో రూ.4.63 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేదలు కూడా పెద్దల మాదిరిగానే సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు, రైతు భరోసా, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. ఉచిత బస్సు సౌకర్యం కోసం ఇప్పటివరకు రూ.4000 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత ప్రభుత్వం దక్షిణ తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రకు నీళ్లు తీసుకెళ్లిందని, ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.4,518 కోట్లు కేటాయించామని, దురదష్టవశాత్తు ప్రస్తుతం పనులు ఆగిపోయాయన్నారు. సంవత్సరంలోగా టన్నెల్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎడవెల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈనెల 7న బక్కతాయికుంట, నర్సింగ్‌బట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రైతులు సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించాలన్నారు. ఫ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
కొన్నిచోట్లే సన్నబియ్యం!
మొదటి రోజు అన్ని గ్రామాల్లో ప్రారంభం కాని పథకం ఎమ్మెల్యేల సమయం తీసుకుని.. ఈనెల 2వ తేదీ తరువాత అన్ని గ్రామాల్లో పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేడుతున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో ఈనెల 4వ తేదీన ఎమ్మెల్యే బాలునాయక్ ప్రారంభించనున్నారు. నకిరేకల్ నియోజవకర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో 2వ తేదీన ప్రారంభించనున్నారు. భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్‌పోచంపల్లి తదితర మండలాల్లో ఈనెల 3వ తేదీన ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి పంపిణీని ప్రారంభించాక ప్రజలకు బియ్యం పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రేషన్‌కార్డులు కలిగిన పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకం మొదటి రోజు కొన్ని గ్రామాల్లోనే ప్రారంభమైంది. ఇప్పటి వరకు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇవ్వగా, ఇటీవల హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పంపిణీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో వివిధ నియోజకవర్గాల పరిధిలో సన్న బియ్యం పంపిణీని మంగళవారం కొన్ని చోట్ల మంత్రి, ఎమ్మెల్యేలు, మరికొన్ని చోట్ల ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. సూర్యాపేట జిల్లాలో పెద్దమొత్తంలో పంపిణీ కొనసాగగా, యాదాద్రి, నల్లగొండ జిల్లాలో మాత్రం పంపిణీ కొన్ని మండలాల్లోనే ప్రారంభంమైంది. అయితే.. ఆయా నియోజకవర్గాల్లో ఈ నెల 2, 3, 4 తేదీల్లో ఎమ్మెల్యేల నేతృత్వంలో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోజు అంతంత మాత్రంగానే.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎమ్మెల్యేల సమయాన్ని బట్టి ప్రారంభించేలా చర్యలు చేపట్టడంతో మొదటి రోజు ఉమ్మడి జిల్లాలో అన్ని రేషన్ దుకాణాల్లో ఈ పథకం ప్రారంభం కాలేదు. నల్లగొండ జిల్లాలోని కనగల్ మండలం జి.ఎడవల్లిలో, యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టలో మంగళవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి, మునుగోడు నియోజకవర్గంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి పంపిణీ ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ని అన్ని మండలాల్లో బియ్యం పంపిణీ ప్రారంభం కాలేదు. నల్లగొండ జిల్లాలో మంత్రి, ఎమ్మెల్యేతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు కొన్ని చోట్ల మాత్రమే ప్రారంభించారు. ఇక సూర్యాపేట జిల్లాలో అన్ని నియోజవకర్గాల్లో పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించగా, సూర్యాపేట, కోదాడలో ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. తుంగతర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రారంభించారు. సూర్యాపేట జిల్లాలో 610 రేషన్ షాపులకు గాను మంగళవారం 585 రేషన్ షాపుల్లో 51,000 మంది రేషన్ కార్డుదారులకు 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఇక యాదాద్రి జిల్లాలో 515 షాపులకు గాను 80 షాపుల్లోనే బియ్యం పంపిణీని ప్రారంభించారు. ఫ సూర్యాపేట జిల్లాలో అత్యధిక రేషన్ దుకాణాల్లో పంపిణీ ఫ నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో నామమాత్రంగానే.. ఫ ఎమ్మెల్యేలు ఇచ్చే సమయాన్ని బట్టి ప్రారంభిస్తామంటున్న అధికారులు ఫ సన్న బియ్యం పంపిణీపై ప్రజల్లో సానుకూల స్పందన -
ఫ ట్యాంకర్లకు గిరాకీ..
వాటర్ ట్యాంకర్లకు గిరాకీ పెరిగింది.వరి చేలు చేతికొచ్చే దశలో భూగర్భ జలాలు అండుగంటి పంటలు ఎండిపొతున్నాయి. దీంతో పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు కొత్తగా బోర్లు వేస్తుండగా మరికొంత మంది గ్రామాల్లోని ట్యాంకర్ల ద్వారా నీటి తెచ్చి పంటలను కాపాడుకుంటున్నారు. ఇలా ప్రతి గ్రామంలో రైతులు ట్యాంకర్ల ద్వారా పంటలకు నీరు అందిస్తుండడంతో ట్యాంకర్ల యజమానులకు ఉపాధి లభిస్తోంది. వీరు ఒక్క ట్యాంకర్‌కు రూ.800 నుంచి రూ.1000 తీసుకుంటున్నారు. రోజుకు 8 నుంచి 10 ట్యాంకర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇలా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసి పంట పండిస్తే పెట్టుబడులు కూడా రావని రైతులు ఆవేదన చెందుతున్నారు. – మునుగోడు -
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి కాన్వాయ్కి ప్రమాదం
సాక్షి, నల్గొండ జిల్లా: నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని స్కార్పియో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. గుర్రంపోడు మండలం చేపూర్ గ్రామ సమీపంలో ఘటన జరిగింది. ఎవరికి ఏమీ కాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. గుర్రంపోడు ఆలయ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు జైవీర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలువేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చిట్యాల పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా గల జంక్షన్ ఎదుట సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మునుగోడు మండలం చొల్లేడు గ్రామానికి చెందిన పరమేష్ బైక్‌పై చిట్యాలకు కూరగాయలు కొనుగోలు చేయడానికి వచ్చాడు.తిరుగు ప్రయాణంలో చిట్యాల పట్టణంలోని పోలీస్‌స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై జంక్షన్ దాడుతుండగా హైదరాబాద్ నుంచి నార్కట్‌పల్లి వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. పరమేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. -
ఇరువర్గాల మధ్య ఘర్షణ, కేసులు నమోదు
హుజూర్నగర్ (చింతలపాలెం) : ఇద్దరు యువకులు మధ్య క్రికెట్ విషయంలో మొదలైన తగువు ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. గృహోపకరణాలు, మోటారు సైకిళ్లనుఽ ధ్వంసం చేసుకున్నారు. ఈ సంఘటన చింతలపాలెం మండలం కిష్టాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టాపురం గ్రామానికి చెందిన యువకులు సుల్తాన్, జమాల్సైదా ఇద్దరు స్నేహితులు. క్రికెట్ విషయంలో ఇరువురి మధ్య తగవు జరిగింది. ఇది పెద్దలకు చేరడంతో వారు సర్దిచెప్పి పంపే క్రమంలో ఓ పార్టీకి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో గ్రామస్తుడు చప్రాసి సైదాకు గాయాలు కావడంతో ఇరువర్గాల వారు ఒకరి ఇళ్లపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురి ఇళ్లలోని ఫ్రిజ్‌లు, టీవీలు, మంచాలు ధ్వంసమయ్యాయి. రెండు బైకులు పూర్తిగా.. మరో 3 బైకులు ఽస్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో ఇరువురికి బలంగా, మరో నలుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. గాయాలైనవారిని కోదాడ, ఖమ్మం ఆస్పత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి ఆధ్వర్యంలో ఇరువర్గాలకు చెందిన దాదాపు 20 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అంతిరెడ్డి తెలిపారు. -
సస్నబియ్యం పంపిణీకి నేడు మంత్రి రాక
నల్లగొండ : కనగల్ మండలం జి.ఎడవెల్లి గ్రామంలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మంగళవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రానున్నారు. హెలికాప్టర్ ద్వారా మంగళవారం ఉదయం 11 గంటలకు కనగల్ మండలం జిఎడవల్లికి చేరుకుంటారు. ఆ గ్రామంలో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తారు. అనంతరం మంత్రి అదే మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు యాదాద్రి భువనగిరి జిల్లాకు హెలికాప్టర్ ద్వారా బయల్దేరి వెళతారు.నేడు చిత్రకళా నిలయం ప్రారంభంనాగార్జునసాగర్ : నందికొండలోని హిల్‌కాలనీలో ‘దాసి సుదర్శన్’ చిత్రకళా నిలయాన్ని మంగళవారం ప్రారంభించనున్నట్లు సముహ సెక్యులర్ రైటర్స్ ఫోరం జిల్లా కన్వీనర్ కస్తూరి ప్రభాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ స్మారక చిత్రకళా నిలయాన్ని హైదరాబాద్ ఆర్టిస్ట్ సొసైటీ అధ్యక్షుడు ఎం.వీ రమణారెడ్డి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సుదర్శన్ పలు రంగాల్లో అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం జాతీయ అవార్డును ఇచ్చిందని తెలిపారు. చిత్రకళా నిలయం ప్రా రంభోత్సవానికి కవులు, కళాకారులు, ఆర్టిస్టులు, రచయితలు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తు న హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఖైదీలకు న్యాయ సహాయం అందిస్తాంరామగిరి(నల్లగొండ) : లీగల్ సెల్ ద్వారా ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. జిల్లా జైలును సోమవారం ఆయన సందర్శించి ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో లీగల్ సెల్ సెక్రెటరీ మంజుల సూర్యవర్, జైల్ సూపరింటెండెంట్ జి.ప్రమోద్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు ఎన్.భీమార్జున్‌రెడ్డి, డిప్యూటీ జైలర్ ఎం.నరేష్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపుపై రాయితీనల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీల్లో ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధిచిన ఆస్తి పన్ను మొత్తం ఏప్రిల్ నెలాఖరులోగా చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తించనుంది. ఈ రాయితీ ద్వారా భవానానికి ఉన్న ఆస్తి పన్నులో ఐదు శాతం తగ్గనుంది. భవనాల యజమానులంలా రాయితీని సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ శివరాంరెడ్డి కోరారు.90 శాతం వడ్డీ రాయితీకి ముగిసిన గడువుమున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిల వడ్డీపై 90 శాతం మాఫీ గడువు మార్చి 31 అర్ధరాత్రితో ముగిసింది. మార్చి చివరివారంలో వడ్డీ మాఫీ అవకాశం కల్పించడంతో చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. 15 రోజుల ముందే వడ్డీ మాఫీ అవకాశం కల్పిస్తే ఆస్తిపన్ను బకాయి ఉన్నవారు పూర్తిగా చెల్లించే అవకాశం ఉండేదని పలువురు పేర్కొంటున్నారు.వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనరామగిరి(నల్లగొండ) : కేంద్ర ప్రభుత్వం మైనార్టీల హక్కులను భంగం కలిగించేలా పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లు– 2024ను వ్యతిరేకిస్తూ నల్లగొండ ఈద్గా వద్ద సీసీఎం మైనార్టీ నాయకులు నల్ల రిబ్బన్ ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సయ్యద్ హశం, జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ.సలీం మాట్లాడుతూ ఈ సవరణ బిల్లు మతపరమైన హక్కులకు, వక్ఫ్ ఆస్తుల రక్షణకు విఘాతం కలిగిస్తుందన్నారు. కేంద్ర తెచ్చే ఈ చట్టం ఆస్తులను రక్షించడం కోసం కాదని, ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకునే కుట్ర అని విమర్శించారు. ఈ నిరసనలో నాయకులు దండెంపల్లి సత్తయ్య ఊట్కూరి మధుసూదన్‌రెడ్డి ఎగ్బాల్ సాజిద్, అడ్వకేట్ నజీరుద్దీన్, కనగల్ మాజీ ఎంపీపీ కరీం పాషా, మాజీ కౌన్సిలర్ ఇంతియాజ్, ఖలీల్, ఎగ్బాల్, అజీజ్, సోయబ్, అఖిల్, షకీల్ పాల్గొన్నారు. -
గిరిపుత్రుల ప్రతిభ
విద్యార్థుల ప్రతిభను గుర్తించా అఖిల్, తరుణ్‌ల ప్రతిభను గుర్తించాను. వారికి వచ్చిన ఆలోచనతో ఎలక్ట్రికల్ నానో ట్రాక్టర్‌ను రైతుల కోసం రూపొందించాలని నిర్ణయించుకున్నాం. మినీ వాహనాన్ని తయారు చేసి బ్యాటరీని అమర్చి అంతర పంటలకు ఉపయోగపడే విధంగా రూపొందించాం. విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి నిరంతరం కృషి చేస్తా. – కోట నవీన్‌కుమార్, ఉపాధ్యాయుడు ఫ ఎలక్ట్రికల్ నానో ట్రాక్టర్ రూపొందించిన గిరిజన విద్యార్థులు ఫ రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్న తరుణ్, అఖిల్యాదగిరిగుట్ట: వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాన్ని రూపొందించి తమ ప్రతిభను చాటుకున్నారు ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి ఆదర్శ పాఠశాలకు చెందిన పదో తరగతి గిరిజన విద్యార్థులు బానోతు తరుణ్, లునావత్ అఖిల్. తమకు చదువు చెబుతున్న ఉపాధ్యాయుడు కోట నవీన్ కుమార్‌ను గైడ్‌గా చేసుకుని చోటా ప్యాకెట్ బడా ధమాకా పేరుతో ఎలక్ట్రికల్ నానో ట్రాక్టర్ తయారు చేసి రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే.. లూనావత్ అఖిల్, బానోతు తరుణ్‌లు ఉపాధ్యాయుడు కోట నవీన్ కుమార్ సహకారంతో 2024 జనవరిలో ఎలక్ట్రికల్ నానో ట్రాక్టర్‌ను తయారు చేసేందుకు ప్రయత్నం ప్రారంభించారు. దీనిని పూర్తి చేసి అదే సంవత్సరం సెప్టెంబర్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి ఎగ్జిబిషన్లో ప్రదర్శించగా.. రాష్ట్ర స్థాయికి ఎంపిక అయింది. అదేవిధంగా జనవరి 7న హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ యూత్ ఫెస్టివల్లో ప్రదర్శించగా జాతీయ స్థాయికి ఎంపికై ంది. వికసిత్ భారత్‌లో భాగంగా జనవరి 10, 11, 12తేదీల్లో ఢిల్లీలో జరిగిన యంగ్ ఇండియా ఫెస్టివల్లో ఈ పరికరాన్ని ప్రదర్శించారు. నానో ట్రాక్టర్ పనితీరు.. బ్యాటరీతో నడిచే మినీ ఎలక్ట్రికల్ నానో ట్రాక్టర్‌ను పాత పనిముట్లతో రూపొందించారు. అంతర పంటలు వేసుకునేందుకు ఉపయోగపడే విధంగా దీనిని రూపొందించారు. చిన్న, సన్నకారులు రైతులు అతి తక్కువ పెట్టుబడితో వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఈ నానో ట్రాక్టర్‌ను వినియోగించవచ్చు. -
మూసీ.. అడుగంటుతోంది!
కేతేపల్లి: మండల పరిధిలోని మూసీ రిజర్వాయర్ వేగంగా అడుగంటుతోంది. దాదాపు ఆరు నెలల నుంచి వర్షాలు లేకపోవడం.. ప్రస్తుతం ఎండలు ముదరడానికితోడు ప్రాజెక్టు ఆయకట్టులోని పంటలకు రెండు కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ రిజర్వాయర్‌లో రోజు రోజుకూ నీటిమట్టం తగ్గుతోంది. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీటిమట్టం 623.50 అడుగులకు పడిపోయింది. 33 వేల ఎకరాలకు సాగునీరు.. మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టులో పరిధిలోని నకిరేకల్, సూర్యాపేట, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 42 గ్రామాల్లో 33 వేల ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. గత ఏడాది జూన్‌లో మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో వానాకాలం, యాసంగి సీజన్లో రెండు పంటలకు నీటిని విడుదల చేశారు. గత డిసెంబర్ 20నుంచి యాసంగి పంట సాగుకు మూసీ కుడి, ఎడమ కాల్వలకు అధికారులు మొదటి విడత నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఆయా కాల్వలకు చివరిదైన నాలుగవ విడత నీటి విడుదల కొనసాగుతోంది. కుడి కాల్వకు 201 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 147 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రోజూ 20 క్యూసెక్కుల నీటివృథా! ఆవిరి, స్పీకేజీ, లీకేజీ రూపంలో ప్రతిరోజూ 20 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. ఆయకట్టులో ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి వరిపంట కోతకు రావడంతో ఒకట్రెండు రోజుల్లో కాల్వలకు నీటి విడుదలను నిలిపి వేయనున్నారు. 4.46టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 0.75 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. మరో ఎనిమిది అడుగుల నీరు తగ్గితే నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంటుంది. 615(0.5 టీఎంసీలు) అడుగులకు నీటిమట్టం చేరితే దుర్వాసన, ఒండ్రుతో కూడిన నీరు మాత్రమే రిజర్వాయర్‌లో ఉంటుంది. కనీసం పశువులు తాగేందుకు కూడా వీలుండదు. మరో రెండు నెలలు గడిస్తే గాని వర్షాలు కురిసి రిజర్వాయర్‌లోకి నీరు వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు ప్రాజెక్టులో నీరు పూర్తిగా అడుగంటే ప్రమాదముందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత యాసంగి సీజన్ వరిపంట చేతికొచ్చే వరకు నీరందిస్తారోలేదోనని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు ప్రస్తుతం 623.50 అడుగులకు పడిపోయిన నీళ్లు ఫ నీటిమట్టం తగ్గితే డెడ్ స్టోరేజీకి.. -
మత సామరస్యానికి నల్లగొండ ప్రతీక
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా మత సామరస్యానికి ప్రతీక అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఆయన సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఈద్గా వద్ద ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు అంతా కలిసిమెలిసి ఉండాలన్నారు. పట్టణంలోని దర్గాలు, ఈద్గాల అభివృద్ధికి తాను ఎంతో కృషి చేస్తున్నానని తెలిపారు. ఇటీవల నల్లగొండ పట్టణంలో నిర్వహించిన ఇస్తేమాలో సుమారు 40 నుంచి 50 వేల మంది పాల్గొన్నా ఎలాంటి సమస్య లేకుండా సౌకర్యాలు కల్పించామన్నారు. లతీఫ్ సాబ్ దర్గాకు రూ.100 కోట్లతో ఘాట్ రోడ్ నిర్మిస్తున్నామని చెప్పారు. లతీఫ్ షాప్ గుట్ట నుంచి బ్రహ్మంగారి గుట్ట వరకు రోప్ వే, బ్రహ్మంగారి గుట్టకు కూడా వేరే ఘాట్ రోడ్ వేయిస్తున్నామని తెలిపారు. రూ.500 కోట్లతో నల్లగొండకు కొత్త బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నామని.. వారం రోజుల్లో పనులు మొదలవుతాయన్నారు. ఎంజీయూ, మెడికల్ కళాశాల, కలెక్టరేట్ తదితర ప్రభుత్వ సంస్థల్లో అవుట్సోర్సింగ్, కాంటాక్ట్ పద్ధతిపై చేపట్టే నియామకాల్లో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేలా కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం మీద ధ్వేషంతో వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించాలని చూస్తోందని విమర్శించారు. అనంతరం ముస్లిం మత పెద్ద మౌలానా ఎహసనొద్దీన్ను మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఎస్పీ శరత్‌చంద్రపవార్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, ఈద్గా కమిటీ చైర్మన్ డాక్టర్ హఫీజ్ ఖాన్ తదితరులు ఉన్నారు. ఫ వక్ఫ్ బోర్డ్డు చట్టాలను మార్చాలని చూస్తున్న కేంద్రం ఫ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
ఆఖరి రోజు 110 రిజిస్ట్రేషన్లు
రంజాన్ రోజున కూడా పనిచేసిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులునల్లగొండ : ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు సోమవారం కాస్త పెరిగాయి. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు ప్రభుత్వం లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) కింద మార్చి 31వ తేదీవరకు ఫీజు చెల్లించేవారికి 25 శాతం రాయితీ ఇచ్చింది. ఆ అవకాశాన్ని పలువురు సద్వినియోగం చేసుకున్నారు. రంజాన్ పండుగ సెలువు దినం అయినా.. సోమవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేశాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మార్చి 29వ తేదీవరకు 1,418 ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్కాగా.. సోమవారం మాత్రం 110 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ కాకపోవడం గమనార్హం. ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లింపు.. అనుమతి లేని వెంచర్లు, వ్యవసాయ భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆయా ప్రాంతాల విలువను బట్టి ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ ఇచ్చింది. మార్చి 31వ తేదీ వరకు గడువు విధించింది. దీంతో గడిచిన నెల రోజుల నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు మున్సిపాలిటీ, పంచాయతీల్లో ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోనివారు.. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించడంతోపాటు రిజిస్ట్రేషన్లు కూడా చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం.. ఎల్ఆర్ఎస్ ఫీజుపై రాయితీ గడువు మార్చి 31వ తేదీతో ముగుస్తుండడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకుంటారని భావించిన ప్రభుత్వం రంజాన్ సెలవు దినం రోజున కూడా కార్యాలయాలను తెరిచి ఉంచింది. దీంతో సోమవారం ఉమ్మడి జిల్లా పరిధిలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 110 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. గడిచిన నెల రోజుల్లో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకున్న రిజిస్ట్రేషన్ల కంటే చివరి రోజు కాస్త పెరిగాయి. దీంతో ప్రభుత్వానికి ఒక పక్క ఎల్ఆర్ఎస్ ఫీజు ద్వారా, రిజిస్ట్రేషన్ రూపంలో ఆదాయం సమకూరింది.ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ వివరాలు సబ్ రిజిస్ట్రార్ మార్చి 3వ మొత్తం కార్యాలయం 29వరకు తేదీన రిజిస్ట్రేషన్లు భువనగిరి 114 8 152బీబీనగర్ 132 8 140 చౌటుప్పల్ 25 5 30 మోత్కూర్ 30 0 30 రామన్నపేట 38 6 44 యాదగిరిగుట్ట 225 8 233 చండూరు 23 0 23దేవరకొండ 72 0 72 మిర్యాలగూడ 81 0 81నల్లగొండ 68 0 68నకిరేకల్ 65 48 113నిడమనూరు 81 4 85హుజూర్నగర్ 26 1 27కోదాడ 159 1 160సూర్యాపేట 249 21 270మొత్తం 1,418 110 1,528ఫ మార్చి 29వ తేదీ వరకు 1,418 ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ ఫ సాధారణ రోజులతో పోలిస్తే సోమవారం కాస్త ఎక్కువగా.. ఫ నల్లగొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిల్ఐదు కార్యాలయాల్లో నిల్.. అయితే సోమవారం ఐదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. వాటిలో మోత్కూర్, చండూరు, దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. చివరి రోజు అధికంగా నకిరేకల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో 48 డాక్యుమెంట్లు, సూర్యాపేటలో 21 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. -
డీజిల్ ట్యాంక్ లీకై రేంజ్ రోవర్ కారు దగ్ధం
నార్కట్‌పల్లి : రేంజ్ రోవర్ కారు డీజిల్ ట్యాంకు లీకేజీ కావడంతో మంటలు ఎగిసిపడి కారు దగ్ధమైంది. ఈ ఘటన సోమవారం నార్కట్‌పల్లి– అద్దంకి హైవేపై నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు వద్ద జరిగింది. హైదరాబాద్‌కు చెందిన శివప్రసాద్, శివకుమార్, గోవర్ధన్‌లు ముగ్గురు స్నేహితులు కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. సోమవారం అద్దంకి వద్ద పెట్రోల్ బంక్‌లో రేంజ్ రోవర్ కారుకు పెట్రోల్ పోయించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు సమీపంలోకి రాగానే రేంజ్ రోవర్ కారు డీజిల్ ట్యాంక్ లీకై చిన్నచిన్న మంటలు రావడంతో కారులో ప్రయాణిస్తున్న యువకులు గుర్తించారు. అప్రమత్తమైన ఆ యువకులు కారును రోడ్డు పక్కన నిలిపి కారులో నుంచి బయటకు వచ్చారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సంఘటన స్థలం వద్దకు చేరుకున్న ఆగ్ని మాపక సిబ్బంది ఎగిసిన పడుతున్న మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు చాలా వరకు కాలిపోయింది. నార్కట్‌పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ ఘటనా స్థలం వద్దకు చేరుకుని పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కారులో నుంచి సురక్షితంగా బయటపడిన యువకులు -
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ బస్సు కండక్టర్
చౌటుప్పల్ : ప్రయాణికురాలు మరిచి పోయి బ్యాగును గుర్తించిన కండక్టర్ కంట్రోలర్‌కు అప్పగించి నిజాయితీని చాటుకుంది. వివరాలు.. దిల్సుఖ్నగర్ బస్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం ప్రయాణికులతో చౌటుప్పల్‌కు వస్తోంది. ఓ ప్రయాణికురాలు దిల్‌సుఖ్‌నగర్‌లో బస్సు ఎక్కి కండక్టర్ ప్రవీణ వద్ద చౌటుప్పల్‌కు టికెట్ తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చౌటుప్పల్‌లో బస్సు దిగి వెళ్లిపోయింది. అయితే బస్సులో బ్యాగు ఉండడాన్ని కండక్టర్ గుర్తించి దాన్ని చౌటుప్పల్ బస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన కంట్రోలర్ నాగేష్కు అప్పగించింది. సాయంత్రం తిరిగి వచ్చిన ఆ ప్రయాణికురాలు కంట్రోలర్‌ను సంప్రదించింది. తన బ్యాగు, అందులోని వివరాలను తెలియజేసింది. కంట్రోలర్ విచారించి బ్యాగు ఆమెదే అని నిర్దారించుకున్నాడు. అదే బస్సు సాయంత్రం బస్‌స్టేషన్‌కు వచ్చిన సమయంలో కండక్టర్ ప్రవీణతో కలిసి బ్యాగును అప్పగించాడు. అందులో 15 తులాల వెండి ఆభరణాలు, నడుము వడ్డాణంతోపాటు నగదు ఉన్నాయి. కాగా ప్రయాణికురాలి బ్యాగును నిజాయితీగా అప్పగించిన కండక్టర్ ప్రవీణతోపాటు కంట్రోలర్ నాగష్ను పలువురు అభినందించారు. -
రేవంత్ భాషలో మార్పు లేదు
సూర్యాపేటటౌన్ : సీఎం రేవంత్‌రెడ్డి భాషలో ఎలాంటి మార్పు రాలేదని, సీఎం అనే సోయి లేకుండా హుజూర్నగర్ సభలో దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా.. కేసీఆర్ మాట లేకుండా సీఎం సభ సాగట్లేదన్నారు. సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు ఓటేశారు తప్ప రేవంత్‌రెడ్డి మూర్ఖత్వపు మాటలకు కాదన్నారు. కాళేశ్వరాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే మూడు రోజుల్లో నీళ్లు ఇచ్చి చూపిస్తామని చెప్పినా ఎలాంటి స్పందన లేదన్నారు. మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయని, పంట పొలాల వద్ద కన్నీరు పెడుతున్నారని పేర్కొన్నారు. కడుపుమండిన రైతులు, మహిళలు ప్రభుత్వానికి, రేవంత్‌కు శాపనార్ధాలు పెడుతున్నారని అన్నారు. హుజూర్నగర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని ప్రదర్శించారన్నారు. సీఎం పద్ధతి, భాష మార్చుకోవాలని, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాది కొన్న సన్న వడ్లు ఎన్ని.. ఇచ్చిన బోనస్ ఎంతో సమాధానం చెప్పాలన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి సమీక్షలు చేయలేదని, అసలు కొనుగోలు చేస్తారా లేదా తెలియదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై వెంటనే ఒక ప్రకటన చేయాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నిబంధనలు తుంగలో తొక్కి నీళ్లు తీసుకుపోతుంటే ఇక్కడి ప్రభుత్వానికి సోయిలేదన్నారు. ఫ హుజూర్నగర్ సభలో అజ్ఞానాన్ని ప్రదర్శించారు ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శ -
నల్లగొండ
గిరిపుత్రుల ప్రతిభ గిరిజన విద్యార్థులు ఎలక్ట్రిక్ నానో ట్రాక్టర్ తయారు చేసి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.కష్టానికి ఫలితం గ్రూప్–1 ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కష్టపడి చదివి ప్రతిభ చూపారు. 7ఆంధ్రాలో అమ్మకం తెలంగాణలో చోరీ చేసిన వస్తువులను ఆంధ్రప్రదేశ్‌లో విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025- 8లో -
తెలంగాణలో చోరీ.. ఆంధ్రాలో అమ్మకం
త్రిపురారం : పగలు గ్రామాల్లో రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో ట్రాక్టర్లు, ట్రాలీలు, కల్టివేటర్లు, వీల్స్ దొంగిలించి తెలంగాణ రాష్ట్రం దాటించి ఆంధ్రప్రదేశ్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్న నలుగురు దొంగల ముఠాను త్రిపురారం పోలీసులు పట్టుకున్నారు. సోమవారం త్రిపురారం పోలీస్ స్టేషన్లో హాలియా సీఐ జనార్దన్‌గౌడ్, ఎస్ఐ వై.ప్రసాద్‌తో కలిసి మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు వివరాలు వెల్లడించారు. నిడమనూరు, త్రిపురారం మండలాల్లో ట్రాక్టర్లు, ట్రాలీలు, వ్యవసాయ పరికరాల దొంగతనాలు పెరగడంతో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. ఆదివారం త్రిపురారం మండలంలోని అంజనపల్లి గ్రామ శివారులో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా వేముల నాగరాజు తన స్వరాజ్ ట్రాక్టర్‌పై కల్టివేటర్, ఆఫ్ వీల్స్, ట్రాక్టర్ గొర్రు వేసుకుని వస్తున్నాడు. ట్రాక్టర్ ముందు పల్సర్ బైక్‌పై పాల్తి తండాకు చెందిన డేగావత్ బాబునాయక్, ట్రాక్టర్ వెనకాల తిప్పర్తి మండలంలోని రామారం గ్రామానికి చెందిన ఎరకల శివ, బొర్రాయిపాలెం గ్రామానికి చెందిన గద్దల రాజీవ్ పల్సర్ బైక్‌పై వెళ్తున్నారు. త్రిపురారం ఎస్ఐ ప్రసాద్‌కు అనుమానం వచ్చి వారిని ఆపి విచారించడంతో వ్యవసాయ పరికరాలు దొంగిలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. అంజనపల్లి గ్రామానికి చెందిన వేముల నాగరాజు పాల్తితండాకు చెందిన డేగావత్ బాబునాయక్, ఎరకల శివ, గద్దల రాజీవ్, బొంత శంకర్, ఓగ్గు నవీన్‌ల సహకారంతో దొంగతనాలకు పాల్పడుతున్నామని ఒప్పుకున్నారు. దొంగిలించిన వాహనాలు, వస్తువులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మి వచ్చిన డబ్బులు నలుగురు పంచుకున్నట్లు ఒప్పుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. దొంగతనానికి గురైన ట్రాక్టర్లు, ట్రాలీలు, వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేసిన వారిని నుంచి స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. దొంగతనానికి గురైన సమయలో బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదు ప్రకారం వారి వస్తువులను వారికి అప్పజెప్పనున్నారు. నిందితులను పట్టుకున్న హాలియా సీఐ జనార్దన్ గౌడ్ టీం త్రిపురారం ఎస్ఐ వై ప్రసాద్, పీసీఆర్ శ్రీనివాస్, పీసీఎస్ శ్రీను, హెచ్‌జీ చాంద్ పాష, హెచ్‌జీ నర్సింహ, పీసీలు నవీన్‌రెడ్డి, రాము, రాంబాబు, మణిరత్నం పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ‘సాక్షి’కి బాధితులు అభినందనలుత్రిపురారం మండల వ్యాప్తంగా దొంగతనాలు పెరగడంతో ఈ నెల 19వ తేదీన సాక్షి దినపత్రికలో త్రిపురారంలో దొంగల భయం అనే కథనం ప్రచురితమైంది. స్పందించిన ఎస్పీ మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు పర్యవేక్షణలో హాలియా సీఐ జనార్దన్ గౌడ్‌తో త్రిపురారం ఎస్ఐ వై ప్రసాద్ సిబ్బందితో ఓ టీం ఏర్పాటు చేశారు. వారు నలుగురు దొంగలను అరెస్ట్ చేసి దొంగతానికి గురైన వాహనాలు, పని ముట్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. త్రిపురారం మండలంలో జరుగుతున్న దొంగతనాలపై సాక్షి దినపత్రిక వెలుగులోకి తేవడంతో బాధితులు సాక్షి కి అభినందనలు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ట్రాక్టర్లు, ట్రాలీలు, కల్టివేటర్లు, వ్యవసాయ పరికరాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు -
మద్యం మత్తులో ఎలుకల మందు తాగిన వ్యక్తి మృతి
హుజూర్నగర్ : మద్యం మత్తులో ఎలుకల మందు తాగిన వ్యక్తి మృతి చెందిన సంఘటన హుజూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్టణంలోని సీతారాంనగర్ కాలానికి చెందిన అలకుంట్ల భిక్షం (39) కొద్ది రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 29 బాగా మద్యం సేవించిన భిక్షం.. భార్యను భయపెట్టాలనే ఉద్దేశంతో ఎలుకల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే తాను ఎలాంటి మందు తాగలేదని చెప్పడంతో భిక్షంను ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం భిక్షం ఇంటి వద్ద వాంతులు చేసుకున్నాడు. దీంతో అతడిని స్థానిక ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆదివారం మెరుగైన చికిత్స నిమిత్తం అతడిని ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. భిక్షంకు భార్య నిరోషా, ఇద్దరు కూతుళ్లు స్రవంతి, మనీషా ఉన్నారు. సోమవారం పెద్ద కుమార్తె డేరంగుల స్రవంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కష్టానికి ఫలితం.. ర్యాంకులు సొంతం
పేదింట మెరిసిన విద్యాకుసుమంమునగాల: రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో మునగాల మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన మేడం సుజాత–వెంకన్న దంపతుల కుమార్తె శ్రావ్య 516.5 మార్కులతో రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. శ్రావ్య ప్రాథమిక, హైస్కూల్ విద్య మఠంపల్లి మండలంలోని గురుకుల విద్యాలయం, కోదాడ పట్టణంలోని వైష్ణవి పాఠశాలలో చదివింది. ఇంటర్ కోదాడలోని లక్ష్య జూనియర్ కళాశాలలో, బీటెక్ జేఎన్టీయూ సుల్తాన్‌పూర్‌లో చదివింది. అనంతరం హైదరాబాద్‌లో ఉండి సొంతంగా గ్రూప్–1కు ప్రిపేర్ అయి పరీక్షలకు హాజరైంది. రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంకు సాధించిన శ్రావ్యకు డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయని పలువురు విద్యావేత్తలు తెలిపారు. రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన శ్రావ్యను గ్రామస్తులు అభినందించారు.ఎన్ని ఉద్యోగాలు వచ్చినా వదిలేసి..భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కొత్తపల్లి ఖుషీల్వంశీ సత్తాచాటాడు. 496 మార్కులతో జనరల్ ర్యాంక్‌లో 63వ స్ధానంలో, రిజర్వేషన్లో రాష్ట్రంలో మూడో స్ధానంలో నిలిచాడు. సీపీఐ మాస్‌లైన్ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్–రేణుక సంతానమైన ఖుషీల్వంశీ ఇప్పటికే ఎస్ఐతోపాటు యూపీఎస్సీలో ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్, మిలటరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. కానీ ఏ ఉద్యోగంలో జాయిన్ కాలేదు. ఎలాగైనా కలెక్టర్‌గా ప్రజలకు సేవలందించాలనే తపనతో తన చదువును కొనసాగించాడు. గతేడాది జరిగిన యూపీఎస్సీలో సెంట్రల్ పోలీస్ అసిస్టెంట్ కమాండో (డీఎస్పీ)గా ఎంపికయ్యాడు. ఏప్రిల్ 19న జాయిన్ కావాల్సి ఉండగా ఇంతలోనే గ్రూప్–1 ఫలితాలు వచ్చాయి.రాష్ట్రస్థాయిలో 257వ ర్యాంక్ సాధించిన సందీప్తిరుమలగిరి : మండల కేంద్రానికి చెందిన పత్తి సందీప్‌కుమార్ గ్రూప్–1 ఫలితాల్లో 468.5 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలో 257వ ర్యాంక్, మల్టీజోన్–2 లో (ఎస్సీ) రిజర్వేషన్లో 15వ ర్యాంకు సాధించాడు. సందీప్‌కుమార్ 2020వ సంవత్సరంలో బీటెక్ పూర్తి చేశాడు. అప్పటి నుంచి సివిల్స్‌కు శిక్షణ తీసుకుంటున్నాడు. ఒక సంవత్సరం ఢిల్లీలో శిక్షణ తీసుకున్న అనంతరం హైదరాబాదులో ప్రిపేర్ అవుతున్నాడు. తండ్రి వెంకటాద్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, తల్లి లలిత హెల్త్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పని చేస్తున్నారు. భవిష్యత్‌లో సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని సందీప్ తెలిపాడు. ఈ విజయం తన అమ్మానాన్నలదే అని పేర్కొన్నారు. ప్రస్తుతం వచ్చిన ర్యాంకు ప్రకారం డీఎస్పీ కానీ సీటీఓ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ గ్రూప్–1 కు ఎంపిక ● గ్రూప్ –1లో 384 ర్యాంక్ సాధించిన వట్టె రాజశేఖర్‌రెడ్డి మేళ్లచెరువు : ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన వట్టె రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రస్థాయిలో 384 వ ర్యాంక్ సాధించినట్లు పేర్కొన్నారు. చిన్నతనంలోనే తండ్రి మృతిచెందగా తల్లి విద్యావలంటీర్‌గా విధులు నిర్వహిస్తూ ఇద్దరు కుమారులను కష్టపడి చదివించింది. మొదటి కుమారుడైన రాజశేఖర్‌రెడ్డి ముందునుంచి చదువులో ప్రతిభ కనబరిచేవాడు. పదో తరగతి వరకు మేళ్లచెరువు మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించాడు. బాసర ట్రిపుల్‌ఐటీలో బీటెక్ పూర్తి చేశారు. సొంతంగా చదువుతూ పది సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలు రాశాడు. ఇటీవల గ్రూప్–4 లో ర్యాంకు సాధించి కోదాడ మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రాజశేఖర్‌రెడ్డి గ్రూప్–1 సాధించడంపై గ్రామస్తులు అభినందించారు. -
ఏఎమ్మార్పీ కాల్వలో పడి వ్యక్తి గల్లంతు
పెద్దఅడిశర్లపల్లి : ప్రమాదవశాత్తు ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో పడి వ్యక్తి గల్లంతైన సంఘటన గుడిపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. గుడిపల్లి ఎస్ఐ నర్సింహలు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలంలోని సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వట్టెపు అంజయ్య(35) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం సాయత్రం సమీప బంధువు అయిన ఎల్ల య్యతో కలిసి గ్రామ శివారులోని ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో స్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తు కాలు జారి కాల్వలో పడిపోయాడు. అంజయ్యను వెంటనే ఎల్లయ్య రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే అంజయ్య గల్లంతయ్యాడు. దీంతో అంజయ్య కుటుంబ సభ్యులకు, గుడిపల్లి పోలీసులకు ఎల్లయ్య సమాచారం అందించాడు. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నీటి విడుదలను నిలిపివేయించారు. గాలింపు చర్యలు చేపట్టగా రాత్రి వరకు మృతదేహం ఆచూకీ లభ్యం కాలేదు. -
డీజిల్ లీకై రేంజ్ రోవర్ కారు దగ్ధం
నార్కట్‌పల్లి: రేంజ్ రోవర్ కారు డీజిల్ ట్యాంకు లీకేజీ కావడంతో మంటలు ఎగిసిపడి కారు దగ్ధమైంది. ఈ ఘటన సోమవారం నార్కట్‌పల్లి– అద్దంకి హైవేపై నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు వద్ద జరిగింది. హైదరాబాద్‌కు చెందిన శివప్రసాద్, శివకుమార్, గోవర్ధన్ ముగ్గురు స్నేహితులు కలిసి గుంటూరులో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. సోమవారం అద్దంకి వద్ద పెట్రోల్ బంక్‌లో రేంజ్ రోవర్ కారుకు పెట్రోల్ పోయించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. చెర్వుగట్టు సమీపంలోకి రాగానే కారు డీజిల్ ట్యాంక్ లీకై చిన్నచిన్న మంటలు రావడాన్ని గుర్తించిన వారు కారును రోడ్డు పక్కన నిలిపి బయటకు వచ్చారు. వెంటనే అగి్నమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు చాలా వరకు కాలిపోయింది. నార్కట్‌పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
సొంతంగా సన్నద్ధమై..
కొండమల్లేపల్లి: రోజుకు 14 గంటల ప్రిపరేషన్, తల్లిదండ్రుల ప్రోత్సాహం గ్రూప్ –1లో సెలెక్ట్ అయ్యేలా చేసింది. కొండమల్లేపల్లికి చెందిన ఎల్లెబోయిన రుచిత టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 47వ ర్యాంక్ సాధించింది. మండల కేంద్రానికి చెందిన ఎల్లెబోయిన రవి, శోభ దంపతుల కుమార్తె రుచిత తన ప్రాథమిక విద్యాభ్యాసం కొండమల్లేపల్లిలోనే కొనసాగింది. డిగ్రీ అనంతరం ఢిల్లీలో ఆరు నెలల పాటు సివిల్స్ కోచింగ్ తీసుకుంది. తరువాత హైదరాబాద్‌లో ఉంటూ సొంతంగా సివిల్స్‌కు సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్–1 ఉద్యోగ నియామకంలో రుచిత జనరల్ ర్యాంకింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 47వ ర్యాంక్ సాధించింది. ప్రజలకు సేవ చేస్తా..చిన్ననాటి నుంచి కలెక్టర్ కావాలనే ఆశయంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యా. ఢిల్లీలో తీసుకున్న కోచింగ్‌తో పోటీ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలో ఒక అవగాహన వచ్చింది. స్వతహాగా గ్రూప్స్‌కు సిద్ధమయ్యా. తాజాగా వెలువడిన గ్రూప్–1 జనరల్ ర్యాంకింగ్స్‌లో 47వ ర్యాంక్ సాధించడం పట్ల సంతోషంగా ఉంది. డిప్యూటీ కలెక్టర్ లేదా డీఎస్సీ వచ్చే అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నాను. ఏదేమైనా ఉద్యోగంలో చేరాక నావంతుగా పేదలకు సేవ చేస్తా. – ఎల్లెబోయిన రుచిత -
ఇంటి వద్దే ఉండి ప్రిపేర్ అయి..
అర్వపల్లి: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన మాండ్ర నరేష్ గ్రూప్– 1 ఫలితాల్లో 466 మార్కులు పొంది రాష్ట్ర స్థాయిలో 290 ర్యాంక్ సాధించాడు. నరేష్ సోదరుడు రమేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా నరేష్ చిన్నతనంలోనే గ్రూప్– 1లో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించాడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన అన్నాదమ్ముళ్లు తాత, నానమ్మల దగ్గర ఉంటూ పెరిగారు. నరేష్ 10వ తరగతి వరకు తిమ్మాపురం జెడ్పీహెచ్ఎస్లో చదవుకొని ఇంటర్ సూర్యాపేటలో పూర్తిచేశాడు. హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తిచేసి ఇంటివద్ద ఉంటూ గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యాడు. ర్యాంక్‌ను బట్టి గ్రూప్ –1 అధికారిగా ఎంపికకానున్నారు. -
నిరంతరం శ్రమించి..
మిర్యాలగూడ : దామరచర్ల మండలం దుబ్బతండాకు చెందిన తెజావత్ అశోక్ గ్రూప్– 1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 124వ ర్యాంకు సాధించాడు. తెజావత్ లక్ష్మణ్, బూరి దంపతుల కుమారుడైన అశోక్ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ప్రభుత్వం హైదరాబాద్‌లోని రాజేందర్‌నగర్‌లో ఎస్టీ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందాడు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష రాయగా ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రభుత్వ విడుదల చేసిన గ్రూప్– 1 పరీక్షలో ర్యాంక్ సాధించాడు. ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న తన తల్లిదండ్రుల కోరిక మేరకు కష్టపడి చదివానని తెలిపాడు. -
నృసింహుడికి రాబడి ఎక్కువే..
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం శ్రీవిశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం యాదగిరి క్షేత్రంలో ఉగాది పచ్చడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శ్రీస్వామి అమ్మవార్లకు నివేదించారు. ఇక సాయంత్రం ముఖ మండపంలో శ్రీస్వామి వారి సేవను అలంకరించి మాడ వీధుల్లో ఊరేగించారు. తూర్పు రాజగోపురం ఎదుట మాడవీధిలో శ్రీస్వామి అమ్మవార్లను అధిష్టించి పంచాంగానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆస్థాన సిద్ధాంతి గౌరిభట్ల సత్యనారాయణశర్మ పంచాంగాన్ని పఠించి, భక్తులకు, అధికారులకు, అర్చకులకు వినిపించారు. శ్రీ యాదగిరి నృసింహస్వామిది తుల రాశి కాగా ఈ ఏడాది శ్రీస్వామి వారికి 11 ఆదాయం, 05 వ్యయం, శ్రీలక్ష్మీ అమ్మవారిది సింహరాశి కాగా ఆదాయం 11, వ్యయం 11గా పేర్కొన్నారు. ఉగాది విశిష్టతను ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు వివరించారు. వేడుకల్లో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు, అర్చకులు, పండితులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో వైభవంగా ఉగాది వేడుకలు స్వామి వారి ఆదాయం 11,వ్యయం 5, అమ్మవారికి ఆదాయం 11, వ్యయం 11 -
సొంతంగా సన్నద్ధమై..
కొండమల్లేపల్లి: రోజుకు 14 గంటల ప్రిపరేషన్, తల్లిదండ్రుల ప్రోత్సాహం గ్రూప్ –1లో సెలెక్ట్ అయ్యేలా చేసింది. కొండమల్లేపల్లికి చెందిన ఎల్లెబోయిన రుచిత టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 47వ ర్యాంక్ సాధించింది. మండల కేంద్రానికి చెందిన ఎల్లెబోయిన రవి, శోభ దంపతుల కుమార్తె రుచిత తన ప్రాథమిక విద్యాభ్యాసం కొండమల్లేపల్లిలోనే కొనసాగింది. డిగ్రీ అనంతరం ఢిల్లీలో ఆరు నెలల పాటు సివిల్స్ కోచింగ్ తీసుకుంది. తరువాత హైదరాబాద్‌లో ఉంటూ సొంతంగా సివిల్స్‌కు సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్–1 ఉద్యోగ నియామకంలో రుచిత జనరల్ ర్యాంకింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 47వ ర్యాంక్ సాధించింది. ప్రజలకు సేవ చేస్తా..చిన్ననాటి నుంచి కలెక్టర్ కావాలనే ఆశయంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యా. ఢిల్లీలో తీసుకున్న కోచింగ్‌తో పోటీ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలో ఒక అవగాహన వచ్చింది. స్వతహాగా గ్రూప్స్‌కు సిద్ధమయ్యా. తాజాగా వెలువడిన గ్రూప్–1 జనరల్ ర్యాంకింగ్స్‌లో 47వ ర్యాంక్ సాధించడం పట్ల సంతోషంగా ఉంది. డిప్యూటీ కలెక్టర్ లేదా డీఎస్సీ వచ్చే అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నాను. ఏదేమైనా ఉద్యోగంలో చేరాక నావంతుగా పేదలకు సేవ చేస్తా. – ఎల్లెబోయిన రుచిత -
ఓ పక్క విధులు నిర్వహిస్తూనే.. గ్రూప్స్‌కు సన్నద్ధమై..
నల్లగొండ: నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం బోయగూడ గ్రామానికి చెందిన భగవంత్‌రెడ్డి, జయమ్మల కుమారుడు నాగాార్జున్రెడ్డి. టెన్త్ వరకు రాజవరం ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. ఇంటర్, డిగ్రీ హాలియాలోని ప్రైవేట్ కాలేజీల్లో పూర్తి చేశారు. చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే నాగార్జునరెడ్డి వ్యవసాయంలో తల్లిదండ్రులు చేసే కష్టం చూసి కష్టపడి చదివి ఉన్నతస్థాయికి చేరుకున్నాడు. ఇంటర్ తర్వాత టీటీసీ పూర్తి చేసిన ఆయన 2006 డీఎస్సీలో 7వ ర్యాంకు సాధించాడు. 2011లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగంలో 6వ జోన్ పరిధిలో మొదటి రాంకర్గా నిలిచాడు. 2012లో గ్రూప్–2కు ఎంపికయ్యాడు. నిడమనూరు, నల్లగొండ, హుజూర్నగర్ తహసీల్దార్‌గా పనిచేశాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ –1 ఫలితాల్లో 900 మార్కులకు గాను 488 మార్కులు సాధించాడు. ఓ పక్క విధులు నిర్వహిస్తూనే మరోపక్క ఉద్యోగాలు సాధిస్తూ వచ్చాడు. -
నేడు ఈద్ – ఉల్– ఫితర్
భువనగిరిటౌన్: పవిత్ర రంజాన్ మాసం ముగిసింది. శవ్వాల్ నెల ప్రారంభ సూచిగా ఆదివారం సాయంత్రం నెలవంక దర్శనం ఇవ్వడంతో ముస్లింలు రంజాన్‌కు సిద్ధమయ్యారు. సోమవారం ఈద్– ఉల్– ఫితర్ నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈమేరకు ఈద్గాలు, మసీదులను ముస్తాబు చేశారు. ఈద్–ఉల్–ఫితర్ చరిత్ర..నెల రోజులపాటు రంజాన్ దీక్షలు పాటించిన ముస్లింలు పవిత్ర మాసం అనంతరం షవ్వాల్ నెల మొదటి రోజు నిర్వహించుకునే పండుగే ఈద్–ఉల్–ఫితర్. నమాజ్ చేసిన అనంతరం ఇష్రాఖ్ సమయం ప్రారంభమైన తర్వాత ఈద్–ఉల్–ఫితర్ రెండు రకాలుగా నమాజ్ చేస్తారు. ఫిత్రా దానం ఈద్– ఉల్ – ఫితర్ రోజున ప్రార్థనలకు ముందు పేదలకిచ్చే దానమే ఫిత్రా. సమాజంలోని నిరుపేదలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ఈ దానం చేస్తారు. పావు తక్కువ రెండు కిలోల గోధుమల తూకానికి సరిపడా పైకాన్ని నిరుపేదలకు దానం చేయాలి. ఈద్– ఉల్– ఫితర్ నమాజ్ ప్రత్యేకం ఈద్– ఉల్– ఫితర్ నమాజ్ కోసం ఈద్గాలు, మసీదులను ముస్తాబు చేశారు. ఫజర్ నమాజ్ అనంతరం ఇష్రాఖ్ నమాజ్ సమయం ప్రారంభమైన తర్వాత నమాజ్ చేస్తారు. ఇమామ్‌లు ఈద్– ఉల్– ఫితర్ గురించి ఉపదేశించి నియమాలు వివరిస్తారు. నమాజ్ అనంతరం ఖుద్బాను పఠిస్తారు. ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ముగిసిన ముస్లింల ఉపవాస దీక్షలు ప్రత్యేక ప్రార్థనలకు ముస్తాబైన ఈద్గాలు -
100వ ర్యాంకు సాధించిన ఏఓ
సంస్థాన్ నారాయణపురం: గ్రూప్– 1 ఫలితాల్లో సంస్థాన్ నారాయణపురం మండల వ్యవసాయధికారిణి వర్షితరెడ్డి ప్రతిభ చాటారు. బీఎస్సీ (అగ్రికల్చర్) పూర్తి చేసిన సంవత్సరంలోనే నాలుగు ఉద్యోగాలు సాధించింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఈ ఉద్యోగాలు సాధించడం విశేషం. ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 100వ ర్యాంకును సాధించింది. ఈమె 10వ తగరతి వరకు విద్యాభ్యాసం వికారాబాద్‌లో, ఇంటర్ హైదారబాద్‌లో, బీఎస్సీ(అగ్రికల్చర్) ఏపీలోని మహానందిలోని సాగింది. గ్రూప్స్ కోసం పక్కా ప్లానింగ్‌తో చదవానని పేర్కొంది. సత్తాచాటిన జువేరియా మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డ కాలనీకి చెందిన జువేరియా గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 166వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు మౌజంఅలీ, అమీనాబి రెండవ కూతురైన జువేరియా హైదరాబాద్ కోటి ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసింది. గ్రూప్–1 ఫలితాల్లో 465.5 మార్కులు సాధించింది. ప్రతిరోజు 10–12 గంటలు చదువు కొనసాగించానని, ఎక్కడ కోచింగ్ తీసుకోకుండానే గ్రూప్–1 సాధించడం సంతోషంగా ఉందని తెలిపింది. -
‘ఎల్ఆర్ఎస్’కు సర్వర్ డౌన్
సాఫీగానే కొనసాగిస్తున్నాం.. నెట్ సమస్య వచ్చినా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ సాఫీగానే కొనసాగిస్తున్నాం. కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుదారుల స్టేటస్ చూసి అప్లోడ్ చేస్తున్నాం. తప్పులు ఉన్నవారివి కూడా సరిచేస్తున్నాం. – కృష్ణవేణి, అసిస్టెంట్ సిటీప్లానర్, నల్లగొండఫ ఆన్లైన్ ఫీజు చెల్లింపు ప్రక్రియలో అవాంతరాలు ఫ ఒక్కో దరఖాస్తుకు గంటకుపైనే సమయం ఫ నీలగిరిలో దరఖాస్తుదారుల నిరీక్షణ ఫ తప్పుల సవరణలోనూ సిబ్బందికి ఇబ్బందులు నల్లగొండ టూటౌన్: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) క్రమబద్ధీకరణ ప్రక్రియకు సర్వర్ల సతాయింపుతో తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 25 శాతం ఫీజు రాయితీ గడువు ఈనెల 31వ తేదీ వరకే ఉంది. దీంతో ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు ప్లాట్ల యజమానులు, గతంలో దరఖాస్తు చేసుకున్న వారు అధిక సంఖ్యలో నీలగిరి మున్సిపాలిటీ కార్యాలయానికి తరలి వస్తున్నారు. కానీ సాంకేతిక సమస్యల కారణంగా సర్వర్ సక్రమంగా పనిచేయడం లేదు. ఫలితంగా మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ ఉద్యోగులు, దరఖాస్తుదారులకు తలనొప్పిగా మారింది. గంట సమయంలో కూడా ఒక్క దరఖాస్తుదారుడి ప్లాట్‌కు సంబంధించిన పత్రాలు అప్లోడ్ కాకపోవడంతో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపునకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సర్వర్ రాకపోవడంతో ఆశించిన స్థాయిలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ సాగడం లేదని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుదారులు గంటల తరబడి కార్యాలయంలో వేచి చూడలేక వెనుదిరుగుతున్న పరిస్థితి నెలకొంది. తప్పులు సరిచేసేందుకూ నానా పాట్లు గత ఐదేళ్ల క్రితం ఎల్ఆర్ఎస్ కోసం రూ.వెయ్యి ఫీజు చెల్లించిన ప్లాట్ల యజమానులు కొందరు ప్రైవేట్ నెట్ సెంటర్లలో దరఖాస్తులు చేసుకున్నారు. అప్పట్లో నెట్ సెంటర్ల నిర్వాహకులు దరఖాస్తుదారుల పేర్లు, ఇంటి పేర్లు, ప్లాట్ల విస్తీర్ణం తప్పుగా నమోదు చేసినవి చాలానే ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తప్పులు సరిచేయడానికి మున్సిపల్ అధికారులకు ఎడిట్ ఆప్షన్ సౌకర్యం కల్పించింది. తప్పులు సరిచేయడానికి కూడా సర్వర్లు సరిగా రాకపోవడంతో నానా పాట్లు పడాల్సి వస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు చెల్లించనివారు అధిక సంఖ్యలో.. నీలగిరి పట్టణంలో 36,129 మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 28వేల వరకు దరఖాస్తులకు అనుమతి లభించింది. వీరిలో కేవలం 1,831 మంది మాత్రమే ఫీజు చెల్లించారు. మిగతా వారు ఫీజు చెల్లించడానికి ఆసక్తి చూపడంలేదు. అసంపూర్తి పత్రాలు, గ్రీన్ బెల్ట్ ప్రాంతాలు, ఇండస్ట్రీస్ ప్రాంతాల నుంచి వచ్చిన 8,400 దరఖాస్తులను పక్కన పెట్టారు. మిగతా దరఖాస్తుదారుల ప్రక్రియ కొనసాగుతుంది. సర్వర్లు, దరఖాస్తు చేసిన సమయంలో దొర్లిన తప్పుల కారణంగా ఈనెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం లేదనే చెప్పాలి. నీలగిరిలో ఎల్ఆర్ఎస్ వివరాలు వచ్చిన దరఖాస్తులు 36,129అనుమతించినవి 28,000 ఫీజు చెల్లించినవారు 1,831 -
ఉగాది పురస్కారాలు అభినందనీయం
ఫ ఉగాది వేడుకరామగిరి (నల్లగొండ) : దాశరథి శత జయంతి సందర్భంగా సాహితీ మేఖల సంస్థ ఉగాది కవి సమ్మేళనం – ఉగాది పురస్కారాలు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలో సాహితీ మేఖల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పున్నమి అంజయ్య రచించిన నీలగిరి కవుల చరిత్ర–2వ భాగం పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దాశరథి తొలి కావ్యం ‘అగ్నిధార’ను ప్రచురించిన ఘనత సాహితీ మేఖల సంస్ధదే కావడం నల్లగొండ జిల్లాకు గర్వకారణమన్నారు. సుందర దేశికులు రచించిన సత్యం శివం సుందరం పుస్తకాన్ని డాక్టర్ ఎం.పురుషోత్తమాచార్య ఆవిష్కరించారు. పున్నమి అంజయ్య రచించిన పున్నా శతకాన్ని సూలూరు శివ సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఉగాది పురస్కారాలను అందజేశారు. పురస్కారాలు అందుకున్న వారిలో ప్రొఫెసర్ రుద్ర సాయిబాబ (శతాధిక పుస్తక రచయిత), సూలూరి శివ సుబ్రహ్మణ్యం (పద్య కవిత్వం), శిరంశెట్టి కాంతారావు (కథ/నవల), చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్, కాసాల నర్సిరెడ్డి (సింగర్), ఎల్వి.కుమార్ (సేవా రంగం), నాగార్జున సత్యనారాయణ శర్మ (ఆధ్యాత్మిక సేవా రంగం) ఉన్నారు. రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు మేరెడి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కవి సమ్మేళనంలో కవులు మునాస వెంకట్, చొలేటి ప్రభాకర్, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, మోత్కూరు శ్రీనివాస్, అద్దంకి లక్ష్మయ్య, కత్తుల శంకర్, బొల్ల ప్రవీణ్, జయాకర్, రాపోలు అరుణ జ్యోతి, విశ్వనాథుల యాదయ్య, రమేష్, మిట్టపల్లి పాండురంగయ్య, మంచుకొండ చిన భిక్షమయ్య, పెందోట సోము పాల్గొన్నారు. అనంతరం దేవులపల్లి నాగరాజు శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. -
మంత్రి కోమటిరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు
నల్లగొండ : రంజాన్ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం.. ఉపవాసం, ప్రార్థన, దానం, సేవా స్ఫూర్తి వంటి అత్యున్నత విలువలకు ప్రతీకగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. రంజాన్ పండుగను క్రమశిక్షణతో, ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. నేడు మంత్రి కోమటిరెడ్డి రాక సోమవారం రంజాన్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి నల్లగొండకు రానున్నారు. నల్లగొండలోని ఈద్గాను సందర్శించి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపనున్నారు. అనంతరం పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ బయల్దేరి వెళ్తారు. అర్చకుడికి ఉగాది పురస్కారంకనగల్: దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయ అర్చకుడు నాగోజు మల్లాచారి ఉగాది పురస్కారం అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉగాది పురస్కారాలను అందజేసింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్య, కమిషనర్ శ్రీధర్ చేతుల మీదుగా మల్లాచారి పురస్కారం అందుకున్నారు. నృసింహుడికి సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, అర్చన జరిపించారు. అనంతరం ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
ధాన్యంలో ఘనత
ఉద్దండుల గడ్డ.. ముఖ్యమంత్రి పర్యటన సాగిందిలా.. హుజూర్నగర్, హుజూర్‌నగర్‌రూరల్ : ● సాయంత్రం 5.56 గంటలకు హుజూర్‌నగర్‌లోని ఫణిగిరి గుట్ట వద్ద మోడల్‌కాలనీ ప్రదేశంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యింది. ● 5.57 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డికి సీఎస్ శాంతికుమారి, కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ● 6.00 గంటలకు మోడల్ కాలనీలో ఇళ్లను ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించారు. ● 6.16 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి.. మోడల్ కాలనీ నుంచి రాజీవ్ సభా ప్రాంగణానికి కాన్వాయ్‌లో మంత్రులతో కలిసి బయలుదేరారు. ● 6.22 గంటలకు సభా వేదికపైకి మంత్రులతో కలిసి సీఎం రావడంతో ప్రజలు హర్షధ్వానాలు, కేరింతలు కొట్టారు. ● 6.25 గంటలకు తెలంగాణ గీతాలాపన చేశారు. ● 6.32 గంటలకు సభా వేదికపైనే సీఎం, మంత్రులు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ● మంత్రి ఉత్తమ్ ప్రసంగం మధ్యలో కోదాడ, హుజూర్నగర్ పేర్లు చెప్పిన సమయంలో నాయకులు, కార్యకర్తల డ్యాన్స్‌లు, ఈలలు, చప్పట్లతో సభా ప్రాంగణం మార్మోగింది. ● 6.55 గంటలకు సీఎం ప్రసంగం ప్రారంభమైంది. ● ప్రసంగం మధ్యలో సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రి ఉత్తమ్ పేరు చెప్పడంతో సభా ప్రాంగణం హర్షధ్వానాలతో దద్దరిల్లింది. ● రాత్రి 7.28 గంటలకు సీఎం ప్రసంగం ముగిసింది. ● 33 నిమిషాల పాటు ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగింది. ● సీఎంను వేంకటేశ్వరస్వామి ఫొటో, జ్ఞాపిక, నాగలి, బంజారా టోపీలతో ఘనంగా సన్మానించారు. ● రాత్రి 7.40 గంటలకు సభ ముగిసింది. సభావేదిక పైనుంచి అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిఫ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి అత్యధికం ఫ సన్నబియ్యం పథకంతో హుజూర్నగర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఫ పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం ఫ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి ఫ హుజూర్‌నగర్‌లో అగ్రికల్చర్ కాలేజీ.. కోదాడలో నవోదయ పాఠశాల ఫ మిర్యాలగూడ, దేవరకొండకు ‘యంగ్ ఇండియా’ స్కూళ్లు ఫ ఉమ్మడి జిల్లాపై సీఎం వరాల జల్లు హుజూర్నగర్, హుజూర్నగర్ రూరల్ : భూమి కోసం, భుక్తి కోసం విముక్తి కోసం పోరాటాలు చేసిన వీరులగడ్డ నల్లగొండ జిల్లా. అన్ని రంగాలలో ఉద్దండులు ఉన్న ఈ జిల్లా.. సన్నరకం ధాన్యాన్ని పండించడంలోనూ ఘనత సాధించింది అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 లక్షల ఎకరాలలో వరి పండిస్తున్నారని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రైస్‌మిల్లులు ఎక్కువగా ఉన్నది నల్లగొండ జిల్లాలోనే అని ఆయన చెప్పారు. ఆదివారం హుజూర్‌నగర్‌లో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన రేషన్ కార్డుదారులకు 6 కిలోల ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చే సిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజనూ కొనాలని నిర్ణయించిందని, సన్న వడ్లకు ప్రోత్సాహకంలో భాగంగా 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, బోనస్, రుణమాఫీ కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాకే ఎక్కువగా వచ్చిందని చెప్పారు. సన్నబియ్యం పథకం ప్రారంభానికి వేదికై న హుజూర్నగర్.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని సీఎం అన్నారు. టన్నెల్ పనులు కొనసాగిస్తాం..ఇటీవల ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం చోటుచేసుకున్న నేపథ్యంలో టన్నెల్ భవిష్యత్‌పై నీలి నీడలు కుమ్ముకోగా ఆ పనులను కొనసాగిస్తామని, టన్నెల్ పనులను పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హుజూర్‌నగర్‌లో అగ్రికల్చర్ కాలేజీని మంజూరు చేస్తామని, కోదాడకు జవహర్ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేస్తానని సీఎం చెప్పారు. ఈ సందర్బంగా మిర్యాలగూడకు యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూల్ కావాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దేవరకొండకు యంగ్ ఇండియా స్కూల్ కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరగా.. వాటిని ఇస్తానని అయితే అక్కడికి వెళ్లినప్పుడు ప్రకటిస్తానని సీఎం పేర్కొన్నారు. అలాగే హుజూర్నగర్ నియోజకవర్గంలో 2,160 సింగిల్ బెడ్రూం ఇండ్లకు రూ.60 కోట్లు మంజూరు చేశానని, అవి త్వరలోనే పూర్తవుతాయని అన్నారు. జిల్లాలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయిస్తామని సీఎం తెలిపారు. కృష్టపట్టె ప్రాంతం చైతన్యానికి మారుపేరని, కోదాడ హుజూర్నగర్ కాంగ్రెస్‌కు కంటచుకోటని కార్యకర్తలు నిరూపించారని ఆయన అన్నారు. రావి నారాయణరెడ్డిని అత్యంత మెజార్టీతో గెలిపించింది నల్లగొండేనని, అదే విధంగా ఎంపీ ఎన్నికల్లో రఘువీర్‌రెడ్డిని 5.60 లక్షల మెజార్టీతో గెలిపించారని, దక్షిణ భారత దేశంలోనే ఇది అత్యధిక మెజార్టీ అని అన్నారు. కోదాడ, హుజూర్నగర్ నుంచి లక్ష చొప్పన మెజార్టీ వస్తుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబితే తాను నమ్మలేదని, అది నిరూపించారని సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీలు కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల రావు, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బీర్ల ఐలయ్య, మందుల సామేల్, వేముల వీరేశం, బాలు నాయక్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, మీర్ అలీఖాన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సెక్రటరీ డీఎస్ చౌహాన్, ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీష్, విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, ఎస్పీ నరసింహ పాల్గొన్నారు.బహిరంగ సభ విజయవంతం పేదలకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభం సందర్భంగా ఆదివారం హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతమైంది. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో కాంగ్రెస్ నాయకుల్లో జోష్ నెలకొంది. ఈ సభకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తుండటంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభను జయప్రదం చేయడంలో సఫలీకృతులయ్యారు. పట్టణంలోని ప్రధాన రోడ్లు, సభా ప్రాంగణంలో సీఎం రేవంత్‌రెడ్డి, భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, మూడురంగుల తోరణాలతో పట్టణం త్రివర్ణ మయంగా మారింది. సభకు వచ్చిన జనం కూడా కాంగ్రెస్ జెండాలు, కండువాలు వేసుకుని రావడంతో అంతా మూడురంగుల మయమైంది. రెండు నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామం, గిరిజన తండాల నుంచి ప్రజలు అనుకున్నదానికంటే ఎక్కువగా హాజరయ్యారని నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. సభ ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలు అలరించాయి. మీఊరి కోడలు .. మాఊరి ఆడబిడ్డ ‘మీ ఊరి కోడలు.. మా ఊరి ఆడబిడ్డ’ అని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిని ఉద్దేశించి సభలో సీఎం రేంవత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తొలుత సభావేదికపైకి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే పద్మావతి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. మోడల్ కాలనీని సందర్శించిన సీఎం హుజుర్నగర్ పట్టణంలోని సీతారామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీని సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన సీఎం, మంత్రులకు సీఎస్ శాంతికుమారి, జిల్లా కలెక్టర్ తేజస్నంద్లాల్పవార్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అక్కడ ఇళ్లను సీఎం.. మంత్రి ఉత్తమ్‌తో కలిసి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల తీరును సీఎంకు రాష్ట్ర హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ విరించారు. 135 బ్లాక్‌లు చేపట్టి 2,160 ఇళ్లను నిర్మించినట్లు సీఎంకు తెలిపారు. అత్యధికంగా ఒకే చోట అన్ని హంగులతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. పార్క్, కమ్యూనిటీ హాల్, మార్కెట్ వంటి సౌకర్యాలు చేపట్టినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలోనే ఇంత భారీగా సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించడం ఇదే మొదటిసారి అని, పట్టణానికి అతి సమీపంలో ఉండడం, ప్రజల అవసరాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని ఆయన సీఎంకు తెలిపారు. -
సన్నబియ్యం చరిత్రాత్మకం: సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సన్న బియ్యం పథకం దేశ చరిత్రలోనే నిలిచిపోతుందని, ఆ చరిత్రకు హుజూర్నగర్ వేదికగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఏ సీఎం వచ్చినా ఈ పథకాన్ని రద్దు చేయలేరని చెప్పారు. ఆనాడు ఇందిరాగాంధీ రోటీ, కప్డా, మకాన్ అనే నినాదంతో పేద వారికి కడుపు నిండా అన్నం, గుడ్డ, ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో 25 లక్షల ఎకరాలను పేదలకు పంచారని గుర్తుచేశారు. దాంతో పేదల్లో చైతన్యం వచ్చి పెద్ద ఎత్తున పంటలు పండించారని, నేడు అదే స్ఫూర్తితో తెలంగాణలో పెద్ద ఎత్తున పంటలు పండిస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు పేదలు.. పండుగ నాడే కాకుండా ప్రతిరోజూ తెల్ల బువ్వ తినాలనే ఉద్దేశంతో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి రూ.1.90కు కిలో బియ్యం పథకం తెచ్చారని, అయితే ఎన్నికల కారణంగా అది అమలు కాలేదని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ రూ.2కు కిలో బియ్యం పథకాన్ని 1983లో ప్రారంభించారని..ఆనాడు మొదలు పెట్టిన దొడ్డు బియ్యం పంపిణీ పథకమే ఇప్పటివరకు కొనసాగిందని అన్నారు. అయితే దొడ్డు బియ్యం పేదల కడుపు నింపడం లేదని ఆలోచించి, పేదలంతా తినేలా తాము సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టామని వివరించారు. ఇక నుంచి 3.10 కోట్ల మందికి సన్న బియ్యం ఇచ్చి ప్రతిరోజూ పండుగలా పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తెచ్చామని చెప్పారు. ఉగాది సందర్భంగా ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహరంగ సభలో మాట్లాడారు. నల్లగొండ గడ్డకు ఎంతో చరిత్ర ‘ఈ పథకాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన, పద్మావతిరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రారంభించడం హర్షించదగిన విషయం. ఈ ప్రాంతం పోరాటాలకు మారు పేరు. ఎందరో మహనీయులు భూమి కోసం భుక్తి కోసం, విముక్తి కోసం ఇక్కడి నుంచే పోరాటాలు చేశారు. రావి నారాయణరెడ్డిని నెహ్రూ కంటే అత్యధిక మెజార్టీతో గెలిపించిన చరిత్ర కూడా నల్లగొండ గడ్డకే ఉంది. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నల్లగొండ ఎంపీని గెలిపించింది కూడా నల్లగొండ బిడ్డలే. ఇలాంటి చోట ప్రారంభించిన ఈ సన్న బియ్యం పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పథకం ద్వారా 3.10 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. మిల్లర్లు, దళారుల చేతుల్లోకి దొడ్డు బియ్యం ‘ప్రభుత్వం 3 కోట్ల మందికి దొడ్డు బియ్యం ఇస్తుంటే, ఆ పథకం మిల్లర్ల మాఫియా, దళారుల చేతిలోకి వెళ్లిపోయి, రూ.10 వేల కోట్ల దోపిడీ జరుగుతోంది. పేదలు దొడ్డు బియ్యం తినలేక, రూ.10కు కిలో అమ్ముకుంటుంటే మిల్లర్లు కొనుగోలు చేసి, రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికే కిలో రూ.30కి అమ్ముతున్నారు. పేదలకు దొడ్డు బియ్యం ఉపయోగ పడటం లేదనే సన్న బియ్యం ఇస్తున్నాం..’ అని రేవంత్ తెలిపారు. రైతులను వరి వద్దన్న కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో పండించారు ‘రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన, 80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్.. ఏనాడైనా పేదలకు సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన చేశారా? మీరు వరి వేస్తే ఉరేసుకున్నట్లేనని, మేం వడ్లు కొనమని చెప్పిన ఆయన.. ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో వడ్లనే పండించారు. ఆ వడ్లను క్వింటాల్‌కు రూ.4,500 చొప్పున చెల్లించి కావేరీ సీడ్స్ అనే కంపెనీ కొనుగోలు చేసింది. రైతులు పండించిన ధాన్యాన్ని రూ.2 వేలకు కొనేవారు దిక్కులేక వాళ్లు ఉరేసుకుంటుంటే, ఆయన పండించిన ధాన్యాన్ని క్వింటాల్‌కు అంత ధర పెట్టి కొన్నారంటే అవి వడ్లా లేదా బంగారమా? చెప్పాలి..’ అని సీఎం అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను పక్కనబెట్టారు ‘నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు నాగార్జునసాగర్ సహా అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ తెచ్చింది. జిల్లా కాంగ్రెస్ నేతలు పోరాటం చేసి ఎస్ఎల్బీసీ టన్నెల్ వంటి పథకాలు సాధించుకున్నారు. కానీ కేసీఆర్ వాటిని పక్కన పెట్టారు. 44 కిలోమీటర్ల సొరంగం అప్పట్లోనే 34 కిలోమీటర్లు పూర్తయింది. ఏటా ఒక్క కిలోమీటర్ తవ్వినా బీఆర్ఎస్ కాలంలోనే సొరంగం పూర్తయ్యేది. 3.5 లక్షల ఎకరాలకు నీరు పారేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి టన్నెల్ పనులు ప్రారంభించాం. రూ.లక్ష కోట్లతో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలిపోయింది. ఈ విషయంలో కేసీఆర్‌కు ఉరేసినా తప్పులేదు..’ అంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు నాకు పోలికేంటి..? ‘2006లో జెడ్పీటీసీగా రాజకీయం మొదలుపెట్టిన నేను ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్సీ అయ్యా. 2018లో కేసీఆర్ నాపై కక్షగట్టి ఎమ్మెల్యేగా ఓడించినా ప్రజలు ఆశీర్వదించి ఎంపీగా గెలిపించారు. ఢిల్లీకి వెళితే సోనియాగాంధీ పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. అదే నన్ను సీఎంను చేసింది. కేసీఆర్‌కు నాకు పోలికేంటి? మా ఇద్దరికి నందికి, పందికి ఉన్నంత తేడా ఉంది. నేను రుణమాఫీ చేశా. రైతుబంధును పెంచా. కేసీఆర్ ఎగ్గొట్టిన రైతుబంధు రూ.7,625 కోట్లు..మా ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రైతుల ఖాతాల్లో వేశాం. 15 నెలల కాలంలో రుణమాఫీ కింద రూ.21 వేల కోట్లు, రైతు భరోసా కింద రూ.12 వేల కోట్లు వేశాం. సన్న వడ్లకు రూ.1,200 కోట్లు బోనస్ ఇచ్చాం. రైతులకు పంగనామం పెట్టిన కేసీఆర్ నన్ను పోల్చుకోవడమేంటి? మేం రైతుల గుండెల్లో శాశ్వతంగా నిలిచేలా కార్యక్రమాలు చేశాం. ఒకరోజు వెనుకా ముందూ అయినా ఇచ్చిన హామీలను అమలు చేస్తాం..’ అని సీఎం స్పష్టం చేశారు. సభలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, ఎంపీలు కుందూరు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఐదుగురి అరెస్ట్
నకిరేకల్: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఐదుగురిని శనివారం సాయంత్రం రిమాండ్‌కు తరలించామని నల్లగొండ జిల్లా నకిరేకల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 21న నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రంలో ఓ యువకుడు తెలుగు ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాద్యమాల్లో వైరల్ చేసిన విషయం విధితమే. ఈ ఘటనలో మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఈ నెల 23న చిట్ల ఆకాష్, బండి శ్రీను, గుడుగుంట్ల శంకర్, బ్రహ్మదేవర రవిశంకర్, ఓ బాలుడుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కేసు తదుపరి విచారణ అనంతరం శనివారం నకిరేకల్‌కు చెందిన పోగుల శ్రీరాముల, తలారి అఖిల్‌కుమార్, ముత్యాల వంశీ, పల్స అనిల్‌కుమార్, పళ్ల మనోహర్‌ను శనివారం రిమాండ్‌కు పంపామని, ఓ బాలుడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. రిమాండ్ చేసినవారిలో ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు బీఆర్ఎస్, ఒకరు బీజేపీకి చెందిన వారుగా గుర్తించామని పేర్కొన్నారు. -
ప్రతిపక్ష పార్టీలపై వివక్ష తగదు: కాంగ్రెస్ ఎంపీ లేఖ
ఢిల్లీ : ప్రతిపక్ష పార్టీలపై చూపెడుతున్న వివక్షపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారాయన. లోక్‌సభ స్పీకర్‌కు ఆయన రాసిన లేఖలో సారాంశం ఇలా ఉంది.. లోక్‌సభలో ఉపసభాపతి నియామకం జరగకపోవడం2019 నుండి ఉపసభాపతి పదవి ఖాళీగా ఉంది. రాజ్యాంగంలోని 93వ అధికరణం ప్రకారం ఎన్నిక జరగాల్సి ఉండగా ఉపసభాపతి లేకపోవడం ఒక ప్రమాదకరమైన దృష్టాంతాన్ని ఏర్పరుస్తోంది, ఇది సభ నిష్పక్షపాతతను మరియు పనితీరును ప్రభావితం చేస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశాన్ని నిరాకరించడంప్రోటోకాల్ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత వేదికపై నిలబడినప్పుడు వారికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాల్సిన సంప్రదాయాన్ని పదేపదే పట్టించుకోవడం లేదు. ఇది గత పార్లమెంటరీ ప్రవర్తనలకు భిన్నంగా ఉండటమే కాకుండా, సభలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తగ్గిస్తుంది. ప్రతిపక్ష నేతలు మరియు ఎంపీల మైక్రోఫోన్లు ఆఫ్ చేయడంప్రతిపక్ష ఎంపీలు పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకురాగానే వారి మైక్రోఫోన్లు ఆఫ్ చేయడం ఒక సాధారణ ఘటనగా మారిపోయింది, అయితే అధికార పక్ష సభ్యులు మాత్రం స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని పొందుతున్నారు. ఈ విధానం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కడమే అవుతుంది. సభానిర్వహణ సలహా కమిటీ (BAC) నిర్ణయాలను పట్టించుకోకపోవడంప్రభుత్వం BACలోని ఇతర పక్షాలతో సంప్రదించకుండా, వారికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. గత వారం గౌరవ ప్రధానమంత్రి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సభలో ప్రవేశపెట్టడం ఇందులో భాగమే.5)బడ్జెట్ మరియు వివిధ మంత్రిత్వ శాఖలకు గ్రాంట్ల కోసం డిమాండ్ చర్చలో కీలక మంత్రిత్వ శాఖలను మినహాయించడం: ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను బడ్జెట్ కేటాయింపులు మరియు గ్రాంట్ల కోసం డిమాండ్ చర్చల నుండి మినహాయిస్తున్నారు. ఇది ఆర్థిక నిర్ణయాలపై పార్లమెంటరీ పర్యవేక్షణను తగ్గిస్తోంది.193వ నియమం ప్రకారం చర్చల్లో కోతఅత్యవసరమైన ప్రజా సమస్యలపై ఓటింగ్ లేకుండా చర్చించేందుకు అనుమతించే 193వ నియమాన్ని ఇప్పుడు చాలా అరుదుగా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా దేశానికి అత్యంత ప్రాధాన్యమైన అంశాలపై బాధ్యత వహించకుండా తప్పించుకుంటున్నారు.పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో జోక్యంపార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు స్వతంత్రంగా పనిచేసి నిపుణులకు చట్టపరమైన పర్యవేక్షణను అందించాలి. అయితే, స్పీకర్ కార్యాలయం కమిటీ నివేదికల్లో సవరణలు సూచించిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీని వల్ల వాటి స్వతంత్రత దెబ్బతింటోంది.వాయిదా తీర్మానాలను నిర్లక్ష్యం చేయడం మరియు తిరస్కరించడంగతంలో జీరో అవర్ లో చర్చకు అనుమతించే వాయిదా తీర్మానాలను ఇప్పుడు పట్టించుకోవడం లేదు. వాటిని తక్షణమే తిరస్కరిస్తున్నారు. ఇది అత్యవసరమైన జాతీయ సమస్యలను ప్రస్తావించే ఎంపీల హక్కులను పరిమితం చేస్తోంది.ప్రైవేట్ సభ్యుల బిల్లులు మరియు తీర్మానాలను నిర్లక్ష్యం చేయడంప్రైవేట్ సభ్యుల బిల్లులు మరియు తీర్మానాలు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. కార్యనిర్వాహక అధికారానికి బయట ఉన్న ఎంపీలు చట్టాలను ప్రతిపాదించే అవకాశాన్ని కల్పిస్తాయి. అయితే, వీటిపై తగినంత చర్చకు సమయం ఇవ్వకపోవడ వల్ల చట్టసభలో చర్చలు కుదించబడుతున్నాయి.సంసద్ టీవీప్రతిపక్ష ఫ్లోర్ లీడర్లు మరియు ఎంపీలు మాట్లాడినప్పుడు లోక్ సభ అధికారిక టీవీ ఛానల్ సంసద్ టీవీ వారి ముఖాలను చూపకుండా కెమెరా యాంగిల్‌ను మార్చడం ఒక సర్వసాధారణ ఘటనగా మారింది. ఇది పార్లమెంటరీ కార్యకలాపాల పారదర్శకతను దెబ్బతీస్తుంది. సభా కమిటీకమిటీల ఏర్పాటు మరియు ఛైర్మన్ నియామకంపై ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.సంప్రదింపుల కమిటీ సమావేశాలు: సంప్రదింపుల కమిటీ సమావేశాలు క్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అయితే, అనేక కమిటీలు నిబంధనలకు విరుద్ధంగా క్రమం తప్పకుండా సమావేశం కావడం లేదు.ఈ పరిణామాలు తీవ్రమైన ఆందోళనకు కారణమయ్యాయి మరియు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు సమగ్రతను పరిరక్షించేందుకు తక్షణ సవరణ చర్యలు అవసరమని సూచిస్తున్నాయి. పార్లమెంటరీ న్యాయం, పారదర్శకత, పార్లమెంటరీ ప్రమాణాలకు కట్టుబడటాన్ని పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మేము తమరికి విజ్ఞప్తి చేస్తున్నాము. -
మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
నల్లగొండ : మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం నల్లగొండలోని మదీనా మసీదులో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ఆయన పాల్గొన్నారు. అ సందర్భంగా మాట్లాడుతూ మదీన మసీద్ ర్యాంప్ అభివృద్ధి, వాటర్ ప్లాంట్ ఏర్పాటు, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్ష పదవిని ముస్లింలకే ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, మదీన మసీదు పెద్దలు మౌలానా తదితరులు పాల్గొన్నారు. -
సన్న బియ్యం సరిపోయేనా!
ప్రభుత్వ కేంద్రాల్లో మొదలుకాని సన్న ధాన్యం కొనుగోళ్లు కొన్ని నెలలకు సరిపోయే నిల్వలు.. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. హాస్టళ్లకు, మధ్యాహ్న భోజన పథకానికి ఇప్పటివరకు సన్న బియ్యం ఇస్తుండగా ఇకపై రేషన్ కార్డుదారులకు కూడా సన్న బియ్యమే ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సన్న ధాన్యం కొన్ని నెలలు పంపిణీ చేసేందుకు సరిపోతాయి. రానున్న రోజుల్లో సన్న బియ్యం సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా పెద్దమొత్తంలో సన్న బియ్యం సేకరించి పెట్టుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఏ బియ్యం అయినా తినాలంటే కనీసంగా 3 నెలల నుంచి 6 నెలల వరకు మగ్గాల్సి ఉంటుంది. లేదంటే ముద్ద అవడం ఖాయమని అధికారులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు పంపిణీ చేసే బియ్యం రెండు సీజన్ల ముందటివి అయితేనే ప్రయోజనకరమని, అందుకు అనుగుణంగా సన్న బియ్యం కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేసి పంపిణీ చేస్తే ఉపయోగమని పేర్కొంటున్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ప్రభుత్వ పరంగా సన్న ధాన్యం కొనుగోళ్లు ఇంకా మొదలు కాలేదు. ఇప్పటికే వరి కోతలు పెద్దమొత్తంలో జరుగుతుండగా, రైతులు సన్న ధాన్యాన్ని మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. మిల్లర్లు కొంటున్న దాంట్లో ఎక్కువ మొత్తంలో సన్న ధాన్యమే ఉండగా, సాధారణ రకం (దొడ్డు) అంతంత మాత్రంగానే ఉంటోంది. మరోవైపు ప్రభుత్వం ఉగాది నుంచి పేదలకు సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉన్న సన్న ధాన్యమంతా మిల్లర్లు కొనుగోలు చేస్తే భవిషత్లో పేదలకు సన్న బియ్యం సరఫరాలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం నెలకొంది. దొడ్డు ధాన్యం కేంద్రాలు ప్రారంభం... రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొదట ప్రారంభమయ్యాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండలోని ఆర్జాలబావి, తిప్పర్తి మండల కేంద్రంలో రెండు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మిగతా ప్రాంతాల్లోనూ ఒకొక్కటిగా కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. కానీ, ఎక్కడా సన్నధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. సన్నాలు కొంటున్న మిల్లర్లు.. సన్న ధాన్యానికి 71 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో మిల్లర్లు సన్న ధాన్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం కొనుగోళ్లపై దృషి పెట్టలేదు. గత వానాకాలం సీజన్లో 74,393 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేసింది. ఈసారి 81,933 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మిల్లర్లు మాత్రం 3,60,208 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కొంటారని అంచనా వేసింది. అయితే.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తే ఆరబెట్టడం వంటి సమస్యలతో రైతులు మిల్లులవైపే వెళ్తున్నారు. ఫ ఇప్పటికే సన్న ధాన్యాన్ని జోరుగా కొంటున్న మిల్లర్లు ఫ గతేడాది ప్రభుత్వం కొన్న సన్న ధాన్యం 74,393 మెట్రిక్ టన్నులు ఫ ఈసారి 81,933 మెట్రిక్ టన్నులు కొనాలని లక్ష్యం ఫ ఇలాగైతే ప్రజా పంపిణీకి సరిపోయేలా సన్న బియ్యం అందుతాయా? యాసంగిలో ధాన్యం దిగుబడి అంచనా వివరాలు (లక్షల మెట్రిక్ టన్నుల్లో)దిగుబడి అంచనా 12.14మార్కెట్‌కు వచ్చేది 11.26దొడ్డు దాన్యం 6.84సన్న ధాన్యం 4.42 మిల్లర్లు కొనేది 5.68కేంద్రాలకు వచ్చేది 5.57 కొనుగోలు కేంద్రాలు 375 -
వేసవిలో పండ్ల తోటలకు పొంచి ఉన్న ముప్పు
గుర్రంపోడు: వేసవిలో పండ్లతోటలకు అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. 20 ఏళ్లపాటు దిగుబడులు ఇచ్చే బత్తాయి, నిమ్మలాంటి తోటలు అగ్ని ప్రమాదాలకు గురైతే రైతులు ఆర్థికంగా కోలుకోవడం కష్టమే. ప్రతియేటా వేసవిలో జరుగుతున్న అగ్రిప్రమాదాలతో కాలిన పండ్లతోటలకు నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నా పరిహారం అందిన దాఖలాలు లేవు. ఇటీవల కొప్పోలు గ్రామంలో ఓ రైతు చెత్తను తగలబెట్టేందుకు నిప్పు పెట్టగా వ్యాపించి పక్కనే ఉన్న బత్తాయి తోటలోని 70 చెట్లు కాలిపోయాయి. రైతులు వేసవిలో జాగ్రత్తలు పాటించి అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను ప్రాంతీయ ఉద్యానవనశాఖాధికారి మురళి వివరించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫ మోటార్ల సర్వీస్ వైర్లు, కేబుల్ వైర్లు అతుకులు లేకుండా చూసుకోవాలి. నేల మీద వైర్లు లేకుండా చూసుకోవాలి. వేడిమికి షార్ట్‌సర్క్యూట్‌తో ఎండిన ఆకులు నిప్పంటుకుంటాయి. ఫ విద్యుత్ సర్వీసు వైర్లు, ఫ్యూజుల నుంచి స్టార్టర్ వరకు గల వైరు నాసిరకంగా ఉంటే లోవోల్టేజీతో వేడెక్కి కాలిపోయి మంటలు అంటుకుని వ్యాపించే అవకాశం ఉంది. – స్టార్టర్ డబ్బాలు నేలపై అడ్డంగా ఉంచడం వల్ల ఎలుకలు దూరి వైర్లు కత్తిరించడం వల్ల షార్ట్‌సర్క్యూట్ జరిగి పక్కనే గల ఎండు ఆకులకు మంటలు అంటుకుంటాయి. ఫ తోటల్లో కరెంట్ స్తంభాల మధ్య లూజ్ లైన్ లేకుండా చూసుకోవాలి. లూజ్‌లైన్ల వల్ల గాలిదుమారాలకు తీగలు ఒకదానికొకటి తగిలి నిప్పురవ్వలు నేలపైబడి గడ్డి అంటుకునే ప్రమాదం ఉంది. ఫ తోటల్లో చెట్ల మధ్యలో వేసవికి ముందే దన్నుకోవాలి. కలుపు మందులు వాడితే ఎండిన గడ్డిని పీకేయాలి. వేసవిలో తోటల్లో చెత్తకు నిప్పుపెట్టకూడదు. ఫ తోటల చుట్టూ జీవకంచె ఉంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు అదుపులో ఉండేందుకు కంచె మధ్యలో ఎడం ఉండేలా ఖాళీ స్థలం ఉంచుకోవాలి. తోట గెట్ల వెంట గడ్డి వాములు ఉంచకూడదు. ఫ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తోటల్లో అంతరకృషి లేకుండా ఎండు గడ్డి బాగా ఉంటే డ్రిప్ లాటరల్ పైపులు కాలిపోయి తీవ్ర నష్టం జరుగుతుంది. -
ముక్తాపూర్‌లో జానపద పాట చిత్రీకరణ
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్‌లో శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం, పంటపొలాల మధ్య శుక్రవారం జాజిరి జాజిరి అనే జానపద పాటను చిత్రీకరించారు. ఎన్ఎస్ మ్యుజిక్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ పాటలో చిత్రీకరణలో డ్యాన్సర్లు జాను లిరి, కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు. నమ్రత్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామానికి చెందిన నిర్మాత నూకల అశోక్ యాదవ్ మాట్లాడుతూ బావ, మరదలు మధ్య జరిగే సరసాలతో జానపద పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. -
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
మునగాల: మండలంలోని నారాయణగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గురువారం రాత్రి సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై కూసుమంచి శివారులోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్ జానీపాషా(30)గ్రామపంచాయతీలో సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం తన అత్తగారి ఊరైన ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం లాలాపురం గ్రామానికి బైక్‌పై వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈక్రమంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో జానీపాషా తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఐదేళ్ల లోపు వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడు మృతిమునుగోడు: గీతకార్మి కుడు తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి మునుగోడు మండలంలోని గూడపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దేశిడి అంజయ్య గౌడ్ (65) గీతకార్మికుడు. రోజుమాదిరిగా గురువారం సాయంత్రం గ్రామ శివారులోని తాటి చెట్టు ఎక్కుతుండగా కాలుజారి పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారైలు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు. టిప్పర్ దగ్ధంమోత్కూరు: మరమ్మతులకు తీసుకెళ్తున్న టిప్పర్ లారీ ఇంజన్లో ఆకస్మికంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మోత్కూరు ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణం హనుమాన్‌నగర్‌లోని ఏమిరెడ్డి జలేందర్రెడ్డికి చెందిన టిప్పర్ లారీ మరమ్మతులకు గురికాగా డ్రైవర్ వేముల వెంకటేషం అమ్మనబోలు గ్రామం నుంచి మోత్కూరు మీదుగా ఉప్పల్‌కు తీసుకెళ్తున్నాడు. మోత్కూరు మండలంలోని పొడిచేడు, అనాజిపురం గ్రామాల మధ్య ఇంజన్లో ఒకేసారి మంటలు వ్యాపించాయి. వాహనం పక్కకు నిలుపుతుండగానే మంటలు చెలరేగి టిప్పర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. -
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామికి గజవాహన సేవ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం విశేష పర్వాలు కొనసాగాయి. ఉదయం ఆలయంలో నిత్య కల్యాణంలో భాగంగా శ్రీస్వామివారిని గజ వాహనంపై ప్రథమ ప్రాకార మండపంలో ఊరేగించారు. సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ఆలయ తిరు, మాడ వీధుల్లో సేవోత్సవం చేపట్టారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టించి ఊంజలి సేవోత్సవం నిర్వహించారు. రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి సన్నిధిలో ఈ నెల 30 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు శ్రీసీతారామచంద్ర స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ భాస్కర్‌రావు శుక్రవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 5న రాత్రి 8గంటలకు శ్రీసీతారామచంద్రస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం, 6న శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం, 7న శ్రీసీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేక మహోత్సవం, రాత్రి 8గంటలకు శ్రీస్వామి వారి డోలోత్సవం, 8న శ్రీసత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 9న నిత్య పూజలు ఉంటాయని తెలిపారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చౌటుప్పల్ రూరల్: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేట గ్రామ శివారులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లి మండలం జాలాల్పూర్ గ్రామానికి చెందిన గుండ్ల యాదయ్య(68) రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామంలో ఉంటున్న తన పెద్దకుమార్తె ఇంటికి టీవీఎస్ ఎక్సెల్‌పై వెళ్లి వస్తున్నాడు. తుఫ్రాన్‌పేట గ్రామ శివారులోని దండుమైలారం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారి ఎక్కుతుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో యాదయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి అల్లుడు మోర సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చల్లా యాదవరెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణంసూర్యాపేటటౌన్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సూర్యాపేట మండల పరిధిలోని రాజనాయక్ తండా సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జాజిరెడ్డిగూడెం మండలం అడివెంల గ్రామానికి చెందిన పేరెల్లి అంజయ్య– మల్లమ్మల కుమారుడు సతీష్(26) సూర్యాపేట నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తున్నాడు. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికి గాయాలుచౌటుప్పల్ రూరల్: రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం చౌటుప్పల్ మండలంలోని ఖైతాపురం గ్రామ స్టేజి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం చెన్నపల్లికి చెందిన పొట్ట శ్రీనివాసులు, జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామానికి చెందిన వేపూరి రామస్వామి గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో నివాసముంటూ పెయింటింగ్ పనులు చేస్తున్నారు. శుక్రవారం చౌటుప్పల్‌లో ఓ ఇంటికి పెయింటింగ్ వేయడానికి చౌటుప్పల్ కు బైక్‌పై వస్తున్నారు. ఖైతాపురం గ్రామ స్టేజి సమీపానికి రాగానే ఎదురుగా రాంగ్రూట్లో మరో బైక్ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పొట్ట శ్రీనివాసులు, వేపూరి రామస్వామి గాయపడ్డారు. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చల్లా యాదవరెడ్డి తెలిపారు. -
బాలికపై అత్యాచారయత్నం
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): బతుకుదెరువు కోసం ఇటుకబట్టీలో పని చేయడానికి వచ్చిన బాలికపై ఇటుకబట్టీ యజమాని అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాత సూర్యాపేట శివారులో వెంగమాంబ బాలాజీ ఇటుకబట్టీ యజమాని గోగినేని వెంకటరమణ ఇటుకల తయారీ కోసం కొందరు కూలీలను ఒడిశా నుంచి తీసుకువచ్చాడు. బుధవారం మద్యం మత్తులో ఉన్న వెంకటరమణ అక్కడే పనిచేస్తున్న బాలికను చాక్లెట్ ఇస్తా అని పిలిచి అత్యాచారయత్నం చేశాడు. బాలిక భయంతో కేకలు వేస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఒడిశా నుంచి వచ్చిన కూలీలు వెంకటరమణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బాలిక కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రీకాంత్ గౌడ్ ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఇటుక బట్టి యజమాని వెంకటరమణను అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. శుక్రవారం బాలికను భరోసా సెంటర్‌కు తరలించి వాంగ్మూలం రికార్డ్ చేశారు. ఈమేరకు వెంకటరమణపై పోక్సో, లేబర్ యాక్ట్, జువైనల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
మునుగోడు: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మునుగోడు మండలంలోని కిష్టాపురం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అరూరి సాయిలు– నాంచారమ్మ కుమారుడు అరూరి శివకుమార్(25) గత కొద్ది రోజులుగా అదే గ్రామంలోని బొమ్మకంటి నర్సింహకు చెందిన ట్రాక్టర్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 26వ తేదీన ట్రాక్టర్‌తో ఓ రైతు పత్తి కట్టె తొలగించేందుకు వెళ్లి తిరిగి రాలేదు. గమనించిన ట్రాక్టర్ ఓనర్ పత్తికట్టె తొలగించిన రైతు భూమి వద్దకు వెళ్లి చూశాడు. అక్కడ ట్రాక్టర్ మాత్రమే ఉండడంతో దానిని తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా అతడి ఆచూకీ కోసం గ్రామంలోని పరిసర ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికారు. శుక్రవారం సంస్థాన్‌నారాయణపురం మండలం గుజ్జ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ఓ రైతు భూమిలో మృతదేహం చెట్టుకు వేలాడుతుండడంతో కిష్టాపురం గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు శివకుమార్‌గా గుర్తించారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత బాధ ఏమీలేదని, తమ కుమారుడిని ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఇరుగు రవి తెలిపారు. ఇదిలా ఉండగా.. శివకుమార్ ఓ ఫైనాన్స్ కంపెనీలో తీసుకున్న డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సిబ్బంది 26న అతడి ఇంటికి వచ్చారని, ఈ విషయం తెలిసి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఎండోస్కోపిక్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
బీబీనగర్: వెన్నెముక వ్యాధితో బాధపడుతున్న రోగులు ఎయిమ్స్ వైద్య కళాశాలలోని అందిస్తున్న అత్యాధునిక సర్జరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ మహేశ్వర్ లక్కిరెడ్డి, స్పైన్ సర్జన్ డాక్టర్ సయ్యద్ ఇఫ్తేకర్ కోరారు. ఎయిమ్స్‌లోని ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ సేవలను అందుబాటులోకి తెచ్చిన సందర్భంగా వారు శుక్రవారం దీనిని సంబంధించిన వివరాలు వెల్లడించారు. రోగులు త్వరగా కోలుకునే విధంగా వెన్నెముక శస్త్ర చికిత్సలో కొత్త శకాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్న వారికి ఎండోస్కోప్ సాయంతో చిన్నకోతల ద్వారా సర్జరీ చేయొచ్చని తెలిపారు. -
రెవెన్యూ వ్యవస్థలో నూతనోత్సాహం
సాక్షి,యాదాద్రి : ప్రజా ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంతో రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో నూతనోత్సాహం వచ్చిందని తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. శుక్రవారం యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరిలోని వివేరా హోట్‌లో టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున గ్రామ పరిపాలన అధికారులను నియామకం చేయడం వలన రైతులకు రెవెన్యూ సేవలు చేరువ కావడంతో పాటు రెవెన్యూ ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయన్నారు. దీంతో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం 10,954 మంది గ్రామ పాలన అధికారులను వ్యక్తిగత ఆప్షన్ల ద్వారా నియామకం చేసిందన్నారు. ప్రజా ప్రభుత్వ సహకారంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను సాధించామన్నారు. అలాగే గతంలో ధరణిలో తహసీల్దార్లకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాలు లేని కారణంగా రైతుల సమస్యలు సత్వరం పరిష్కరించే పరిస్థితి లేదన్నారు. కానీ త్వరలోనే అమల్లోకి రాబోతున్న భూ భారతి చట్టం ద్వారా అధికారాల వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందన్నారు. క్షేత్రస్థాయికి రెవెన్యూ సేవలు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చేప్పట్టిన భూ సంస్కరణలతో ఏకంగా భూ సమస్యల పరిష్కార వేదిక జిల్లా కేంద్రానికి చేరడంతో రైతుల ఇబ్బందులు వర్ణనాతీతం. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మళ్లీ గ్రామీణ స్థాయి రెవెన్యూ వ్యవస్థ క్రమంగా బలోపేతం అవుతుందని లచ్చిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యకారుడు ఏపూరి సోమన్న ఆట,పాటలు సభికులను ఉత్సాహపర్చాయి. ఆత్మీయ సమ్మేళనంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, కోశాధికారి వెంకట్ రెడ్డి, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, కోశాధికారి మల్లేశం, పూర్వపు వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేందర్ రావు, భువనగిరి ఆర్డీఓ కష్ణారెడ్డి, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, ఎస్డీసీ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథం, టీజీటీఏ సెక్రటరీ జనరల్ పూల్ సింగ్, టీజీటీఏ మహిళా విభాగం అధ్యక్షులు పి.రాధ, టీజీటీఏ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ చిల్ల శ్రీనివాస్, టీజీఆర్ఎస్ఏ మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత చౌహాన్, టీజీఆర్ఎస్ఏ సీసీఎల్ఏ విభాగం అధ్యక్షులు కష్ణ చైతన్య, టీజీటీఏ నల్లగొండ జిల్లా అధ్యక్షులు పి. శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ జీ. దశరథ, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఆర్. అమీన్ సింగ్, జనరల్ సెక్రటరీ బి. రామకష్ణ రెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, నల్లగొండ జిల్లా తహసీల్దార్లు, టీజీఆర్ఎస్ఏ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఎస్.కుమార్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ రామకష్ణ, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎం. రాంరెడ్డి, జనరల్ సెక్రటరీ బి.కట్లమయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కె. వెంకట్ రెడ్డి, జనరల్ సెక్రటరీ బి.పల్లవి ఉమ్మడి జిల్లాల నుంచి తరలివచ్చిన రెవెన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఫ తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి -
ఆగి ఉన్న గూడ్స్ ఆటోను ఢీకొన్న లారీ
చౌటుప్పల్ రూరల్: టైర్ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన గూడ్స్ ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడింది. దీంతో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం చౌటుప్పల్ మండలంలోని బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజి సమీపంలో హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడ్స్ ఆటో కొబ్బరిబొండాల లోడ్‌తో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుంచి ఘట్కేసర్కు వెళ్తోంది. చౌటుప్పల్ మండలంలోని బొరోళ్లగూడెం గ్రామ సమీపంలో ఆటో టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి టైరు తీస్తున్నాడు. ఈక్రమంలో కలకత్తా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ వెనుక నుంచి వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కోనసీమ జిల్లా రాజోలు మండలం గూడపల్లికి చెందిన ఆటో డ్రైవర్ మామిడిశెట్టి విజయనర్సింహకు తీవ్రగాయాలయ్యాయి. లారీ డ్రైవర్ మహేష్‌కు చేతి వేళ్లు తెగి గాయాలయ్యాయి. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఆటో డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి, లారీ డ్రైవర్‌ను చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గూడ్స్ ఆటో యజమాని జోగి పల్లంశెట్టి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చల్లా యాదవరెడ్డి తెలిపారు. ఫ ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలు -
బకాయి చెల్లించకుంటే.. భవనం జప్తు
వడ్డీ మాఫీ సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ చేసింది. పన్ను బకాయి పడ్డ వారంతా వెంటనే పన్ను చెల్లించి వడ్డీ మాఫీ సద్వినియోగం చేసుకోవాలి. పన్ను చెల్లించకుంటే బకాయి ఉన్నవారి ఆస్తులు జప్తు చేస్తాం. –సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్నల్లగొండ టూటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను పాత బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ చేయడంతో మున్సిపల్ యంత్రాంగం మొండి బకాయిలపై దృష్టి సారించింది. వడ్డీమాఫీకి సంబంధించి విధివిధానాలు గురువారం నుంచి అమల్లోకి రావడంతో మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి తిరిగి పన్ను వసూలు చేస్తున్నారు. నీలగిరి మున్సిపాలిటీలో దాదాపు 100 మంది ఉద్యోగులు, సిబ్బంది ఆస్తి పన్ను వసూలు కోసం కాలనీలన్నీ తిరుగుతున్నారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు జప్తులు చేయాలని ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మిర్యాలగూడ, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో ఆస్తులు జప్తులు చేసిన విషయాన్ని సైతం ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. 40 వేల వరకు భవనాలు ఉన్న నీలగిరి పట్టణంలో ఇంకా రూ.30 కోట్ల వరకు ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ చేసే ప్రక్రియకు ప్రభుత్వం మార్చి నెలాఖరులో ఉత్తర్వులు ఇవ్వడంతో సమయం కూడా తక్కువగా ఉంది. ఈ నెల 31లోగా మొత్తం ఆస్తి పన్ను చెల్లిస్తేనే 90 శాతం వడ్డీ మాఫీ వర్తించనుంది. మొండి బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేయాలని ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మొండి బకాయిలు రూ.7 కోట్లు.. నీలగిరి మున్సిపాలిటీలో కొందరు బడాబాబులు కొన్ని సంవత్సరాల నుంచి ఆస్తి పన్ను చెల్లించకుండా మొండికేస్తున్నారు. మొండి బకాయిదారులందరు కమర్షియల్ వ్యాపారం చేసేవారు కావడం గమనార్హం. వాళ్లు వ్యాపారం చేసి లక్షల రూపాయలు వెనకేసుకుంటూ కూడా ఆస్తి పన్ను చెల్లించకుండా రాజకీయ నేతల ద్వారా ఒత్తిళ్లు తెస్తున్నారు. కానీ ఈ ఏడాది మున్సిపల్ ఉన్నతాధికారులు ఆస్తి పన్ను వసూలుపై సీరియస్‌గా ఉండడంతోపాటు మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులకు మెమోలు ఇస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. నీలగిరి పట్టణంలో మొండి బకాయిదారులు 70 మందికి పైగానే ఉన్నారు. వీరంతా లక్షల్లో పన్ను బకాయి పడి ఉన్నారు. ఈ 70 మంది రూ.7.50 కోట్లకు పైగానే ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. పాత బకాయిల వడ్డీని 90 శాతం మాఫీ చేయడంతో వీరికి కూడా భారం తగ్గిందనే చెప్పాలి. పన్ను చెల్లించడానికి వీరికి వెసులుబాటు కూడా ఉంది. ఫ నీలగిరి మున్సిపాలిటీలో రూ.7 కోట్ల మొండి బకాయిలు ఫ రేపటి నుంచి ఆస్తుల జప్తునకు శ్రీకారం చుట్టనున్న మున్సిపాలిటీ ఫ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన స్పెషల్ ఆఫీసర్శనివారం నుంచి జప్తులు.. ఆస్తి పన్ను వడ్డీపై 90 శాతం మాఫీ కావడంతో బకాయిదారులు కొందరు వాయిదా పెట్టినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. రెడ్ నోటీస్‌లు అందుకున్న 70 మంది మొండి బకాయిదారులు శుక్రవారంలోగా ఆస్తి పన్ను చెల్లించకుంటే శనివారం వారి ఆస్తులు జప్తు చేయాలని యంత్రాంగం నిర్ణయించింది. వాణిజ్య వ్యాపారాలకు వినియోగిస్తున్న భవనాలను సీజ్ చేయడంతోపాటు నల్లా కనెక్షన్ కట్ చేయనున్నారు. అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ అనుమతితో విద్యుత్ సరఫరా కూడా కట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీల్లో బకాయిదారుల ఇళ్ల ఎదుట చప్పుట్లు ఉద్యోగుల నిరసన లాంటి కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. శనివారం నుంచి జిల్లా కేంద్రంలో కూడా మొండి బకాయిలు చెల్లించని వారి భవనాల వద్ద నిరసన తెలపడంతోపాటు ఆస్తులు జప్తులు చేయనున్నారు. -
మహిళా సంఘాలు బలోపేతం కావాలి
నల్లగొండ : స్వయం సహాయక మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. స్వయం సహాయక మహిళా సంఘాలపై గురువారం హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈఓ దివ్య ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు, పాఠశాల విద్యార్థుల యూనిఫాం, పెట్రోల్ బంకుల నిర్వహణ తదితర కార్యక్రమాల వల్ల స్వయం సహాయక మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఐకేపీ ద్వారా యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచాలన్నారు. కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చే కమీషన్ మొత్తంలో 10 శాతం జిల్లా సమాఖ్యలు, 90శాతం గ్రామ సమాఖ్యలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. సదరం క్యాంపులు డేటాను ఎప్పటికప్పుడు పూర్తి చేసేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలన్నారు. ఆసరా పింఛన్లకు సంబంధించిన లబ్ధిదారులు చనిపోతే వారి పేర్లను జాబితాలో తొలగించాలని.. భాగస్వామికి అర్హత ఉంటే పింఛన్ మంజూరు చేయాలన్నారు. మండల, నియోజకవర్గాల స్థాయిలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు మహిళా సంఘాలు సిద్ధం కావాలన్నారు. ఈ పెట్రోల్ బంకుల వద్ద రెస్టారెంట్, మాల్స్ నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీసీ లొల్లిని జయప్రదం చేయాలి
నల్లగొండ టౌన్ : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 2న ఢిల్లీలో జరిగే బీసీ లొల్లి కార్యక్రమంలో జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ శాసనసభలో బిల్లును ఆమోదించించేందుకు సహకరించిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ బిల్లులో ముస్లింలను చేర్చడాన్ని తప్పుపడుతూ ఈ బిల్లును కేంద్రం ఆమోదించకుండా అడ్డుపడాలని బీజేపీ చూస్తోందన్నారు. ఏప్రిల్ 25వ తేదీలోగా బీసీ బిల్లు ఆమోదిస్తే విజయోత్సవ సభ పెడతామని, లేకపోతే బీజేపీపై యుద్ధం ప్రకటిస్తామన్నారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కంది సూర్యనారాయణ, నల్ల సోమమల్లయ్య, దాసోజు విశ్వనాథం, నకిరెకంటి కాశయ్యగౌడ్, గోలి విజయ్‌కుమార్, గుండ కోటప్ప, పసుపులేటి సీతారాములు, చిక్కుళ్ల రాములు, ఆదినారాయణ, శంకర్‌గౌడ్, సైదులుగౌడ్, మధుయాదవ్, లింగయ్య, భాస్కర్‌గౌడ్ పాల్గొన్నారు. ఫ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ -
నల్లగొండ బార్ అసోసియేషన్ ఎన్నికలు
రామగిరి (నల్లగొండ) : నల్లగొండ బార్ అసోసియేషన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. అధ్యక్ష, ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీతో ఇతర పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. గురువారం పలువురు నామినేషన్లను దాఖలు చేశారు. ఏప్రిల్ 4వ తేదీన ఓటింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్లను లెక్కించి కమిటీలను ప్రకటించనున్నారు. రెన్యువల్ చేసుకోవాలినల్లగొండ : జిల్లాలోని ప్రైవేట్ డీఈడీ కాలేజీ యాజమాన్యాలు 2025–26 విద్యా సంవత్సరం నుంచి 2028–29 విద్యా సంవత్సరానికి రెన్యువల్ చేసుకోవాలని డైట్ ప్రిన్సిపాల్ నర్సింహ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.లక్ష డీడీ లేదా బ్యాంకు చెక్కు రూపంలో ద చైర్పర్సన్ ఆప్ ద అఫిలియేషన్ కమిటీ అండ్ ద డీఎస్ఈ తెలంగాణ హైదరాబాద్ పేరున చెల్లించాలని సూచించారు. చెల్లించిన ఫీజు వివరాలతో పాటు ప్రతిపాదనలు ఈ నెల 31లోగా ఎస్సీఈఆర్టీ హైదరాబాద్ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యంహాలియా : రైతుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. హాలియా వ్యవసాయ మార్కెట్లో నిర్వహిస్తున్న కందుల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించి రైతులతో కొద్దిసేపు ముచ్చటించారు. కందుల మార్కెట్‌ను ఉపయోగించుకొని ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర క్వింటా రూ.7550 పొందారని ఆయ సూచించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జానారెడ్డిని మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి కాకునూరి నారాయణగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుందూరు వెంకట్‌రెడ్డి, గౌనీ రాజా రమేష్‌యాదవ్, కోట నాగిరెడ్డి, మార్కెట్ సూపర్వైజర్ ఖలీల్, సిబ్బంది సత్యనారాయణ, రామాంజి, సురేష్ తదితరులు ఉన్నారు. ఏప్రిల్ 4 వరకు పింఛన్ల పంపిణీనల్లగొండ : ఆసరా పింఛన్లను ఏప్రిల్ 4వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళలకు పింఛన్లను ఆయా పోస్టాపీస్‌లలో అందజేయనున్నట్లు తెలిపారు. మెరిట్‌లిస్ట్ విడుదల నల్లగొండ టౌన్ : కాంట్రాక్టు పాలియేటివ్ కేర్ స్టాఫ్‌నర్సు పోస్టుల నియామకాల ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌ను డీఎంహెచ్ఓ కార్యాలయం నోటీసు బోర్డు, వెబ్సైట్ www.nalgonda. nic.inలో ఉంచినట్లు సిబ్బంది గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లిస్టుపై అభ్యంతరాలు ఉంటే 29లోగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో రాత పూర్వకంగా సమర్పించాలని పేర్కొన్నారు. -
కేంద్రాలపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు
తిప్పర్తి : ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా.. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం తిప్పర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తెచ్చిన ధాన్యాన్ని మ్యాశ్చర్ వచ్చిన వెంటనే కాంటా వేయాలన్నారు. కొనుగోలు కేంద్రంలో తాగునీటి వసతి ఏర్పాటు చేయాలన్నారు. రైతులు ధాన్యాన్ని పొలం వద్దే ఆరబెట్టుకుని కేంద్రాలకు తెవాలన్నారు. ఆయన వెంట సివిల్ సప్లయ్ డీఎం హరిష్, డీసీఓ పాత్యానాయక్, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, తహసీల్దార్ పరుశురాములు, ఎంపీడీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఈఓ భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
సీఎం సభ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
హుజూర్నగర్: ముఖ్యమంత్రి సభకు వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈనెల 30న హుజూర్‌నగర్‌లో జరగనున్న సీఎం సభా స్థలి ఏర్పాట్లను పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌తో కలిసి మంత్రి ఉత్తమ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సభకు వచ్చే ప్రజలకు నీడ ఉండేలా హ్యాంగర్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. మజ్జిగ ప్యాకెట్లు, చల్లని తాగునీరు అందించాలన్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించి వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చూడాలన్నారు. పార్కింగ్ స్థలాలకు అప్రోచ్ రోడ్లు శుక్రవారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తదుపరి మంత్రి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేసారు. సన్నబియ్యం పంపిణీ ప్రారంభానికి లబ్ధిదారులను ఎంపిక చేసి సిద్ధంగా ఉంచాలని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమం లెడ్ స్క్రీన్లను ప్రజలు తిలంకించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ పి.రాంబాబు, ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, వేణుమాధవరావు పాల్గొన్నారు. ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
పల్లెలకు పాలనాధికారులు
జీపీఓ పేరుతో కొత్త పోస్టులు మంజూరు జీపీఓ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం గ్రామ పాలనాధికారి పోస్టుల నియామకాల కోసం పూర్వ వీఆర్ఏ, వీఆర్‌ఓల్లో తిరిగి మాతృసంస్థకు వచ్చేందుకు ఆసక్తి ఉన్నవారి నుంచి ఈ ఏడాది జనవరిలోనే దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఆహ్వానించింది. జిల్లా వ్యాప్తంగా మంది 370 మంది జీపీఓ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో.. ఎంత మందిని నియమిస్తారనేది ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. నల్లగొండ : గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ పటిష్టానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రజలకు రెవెన్యూ సేవలు అందించేలా గ్రామ పాలనాధికారి(జీపీఓ) పేరుతో ఉద్యోగులను నియమించేందుకు సిద్ధమైంది. ఇది వరకు గ్రామాల్లో సేవలందించిన వీఆర్ఓ, వీఆర్ఏల వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసి వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే. తిరిగి వారు పూర్వ సంస్థలో చేరేందుకు అవకాశం కల్పించింది. తిరిగి రెవెన్యూ శాఖలో చేరేందుకు జిల్లా వ్యాప్తంగా 370 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారి నియామకానికి సంబంధించిన విధివిధానాలు ఖరారు కాలేదు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా.. అయితే గత ప్రభుత్వ హయాంలో ఇతర శాఖల్లో వీఆర్ఓలు, వీఆర్ఏలను సర్దుబాటు చేశారు. ఇందులో 2022 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం 390 మంది వీఆర్ఓలు రెవెన్యూతో పాటు 37 శాఖల్లో, 2023 ఆగస్టులో 850 మంది వీఆర్ఏలను ఎనిమిది శాఖల్లో సర్దుబాటు చేశారు. దీంతో గ్రామాల్లో భూ సర్వేలు, భూమి హక్కులు, విద్యార్హత ధ్రువపత్రాల జారీ, విచారణలు, సంక్షేమ పథకాల అర్హుల గుర్తింపు, విపత్తుల సమాచారం అందజేయడం, తదితర వాటిపై ప్రభావం చూపింది. ఫలితంగా కొన్నింటిని పంచాయతీ కార్యదర్శులతో చేయిస్తున్నారు. ఆ వ్యవస్థ రద్దయ్యాక.. రెవెన్యూ పరంగా గ్రామాల్లో భూ సమస్యలు, సంక్షేమ పథకాల అర్హుల గుర్తింపు, ఇతర సర్వేలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచేలా ఆర్థిక శాఖ జీపీఓ పోస్టులు మంజూరు చేసింది. గ్రామాల వారీగానేనా..! ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థలో మళ్లీ గ్రామ పరిపాలన అధికారులను నియమిస్తోంది. అయితే గ్రామ పంచాయతీల వారీగా నియమిస్తుందా.. లేక రెవెన్యూ గ్రామాల వారీగానా, క్లస్టర్ల వారీగానా అనే విషయం ఇంకా తేలలేదు. గ్రామ పంచాయతీల వారీగా నియమిస్తే జిల్లాలో 844 మంది, రెవెన్యూ గ్రామాల వారీగా అయితే 566 మంది, క్లస్టర్ల వారిగా నియమిస్తే 340 మంది నియమించే అవకాశం ఉంటుంది. ఏ ప్రాతిపదికన నియమిస్తుందనే విషయం ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే గతంలో వీఆర్ఏలు, వీఆర్ఓలు గ్రామాల వారీగా ఉన్నందున అదే విధంగా నియమిస్తారనే చర్చ సాగుతోంది. ఫ రెవెన్యూ వ్యవస్థ పటిష్టానికి పూనుకున్న ప్రభుత్వం ఫ పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏలకు అవకాశం ఫ జిల్లాలో 370 మంది తిరిగి వచ్చేందుకు దరఖాస్తు ఫ నియామకాలపై కొరవడిన స్పష్టత -
నాకేపాపం తెలియదు.. ప్రశ్నాపత్రం లీకేజీలో నా పాత్రలేదు..
శాలిగౌరారం: నాకేపాపం తెలియదు.. ప్రశ్నాపత్రం లీకేజీలో నా పాత్రలేదు.. పరీక్షా కేంద్రంలో కిటికీ పక్కన ఉన్న నన్ను కిటికీలో నుంచి గుర్తుతెలియని వ్యక్తి బెదిరించి నా ముందున్న ప్రశ్నాపత్రాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసుకున్నాడు. నన్ను అన్యాయంగా డిబార్ చేశారు. నా డిబార్‌ను రద్దు చేసి పరీక్షలకు అనుమతించాలి అని నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిని బల్లెం ఝాన్సీలక్ష్మి బుధవారం రాష్ట్ర హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తల్లిదండ్రులు బుధవారం రాత్రి ‘సాక్షి’కి వెల్లడించారు. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, నల్లగొండ జిల్లా విద్యాధికారి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ సెక్రటరీ, నకిరేకల్‌లోని పరీక్ష కేంద్రం చీఫ్ సూపరిండెంట్లను ప్రతివాదులుగా పేర్కొంటూ న్యాయవాది కర్ణాకర్‌రెడ్డి ద్వారా లంచ్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశామని ఝాన్సీలక్ష్మి తల్లిదండ్రులు చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తమ పిటిషన్‌ను విచారించి ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీచేశారని చెప్పారు. ఈ నెల 21న ఎస్సెస్సీ పరీక్ష ప్రారంభం కాగా పరీక్షలు ప్రారంభమైన పావుగంటకే నకిరేకల్‌లోని సోషల్ వెల్పేర్ గురుకుల పాఠశాల పరీక్షా కేంద్రంలో తెలుగు ప్రశ్నాపత్రం లీకై నకిరేకల్, శాలిగౌరారం మండలాలలోని యువకుల వాట్సాప్‌లలో చక్కర్లు కొట్టిన విషయం విదితమే. ప్రశ్నాపత్రం లీకై న సంఘటనను సీరియస్‌గా తీసుకున్న విద్యాశాఖ అధికారులు బాధ్యులను గుర్తించి నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ప్రశ్నాపత్రం క్రమసంఖ్య నెంబర్ ఆధారంగా విద్యార్థిని ఝాన్సీలక్ష్మిని గుర్తించిన అధికారులు.. ఆమెను పరీక్షలకు హాజరు కాకుండా డిబార్ చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీలో పాల్గొన్న యువకులపై పోలీసులు కేసు నమోదు చేయడంతోపాటు కొందరిని రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. -
అందరి నోట.. రాజగోపాల్‌రెడ్డి మాట!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పదిహేను నెలల నిరీక్షణ అనంతరం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కబోతోందన్న వార్త మంగళవారం అందరి నోటా వినిపించింది. శాసనసభ హాలు, లాబీల్లోనూ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని పలు వురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అభినందనలు తెలిపారు. శాసనసభ ఎన్నికలకు ముందు అధిష్టానం ఇచ్చిన హామీతో రాజగోపాల్‌రెడ్డి తిరిగి సొంత పార్టీకి చేరుకున్నారు. మునుగోడు నుంచి ఆయన విజయం సాధించడంతో పాటు భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించిన బాధ్యతను పక్కాగా నిర్వర్తించారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా మంత్రి పదవి ఖాయమన్న భరోసా రాజగోపాల్‌రెడ్డి వర్గీయుల్లో ఉంది. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో తనకు అధిష్టానం ఏ పదవి అప్పగించినా బాధ్యతతో నిర్వహిస్తానని రాజగోపాల్‌రెడ్డి మంగళవారం మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. అయితే ఆయన అనుచరులు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆయన అభిమానులు మాత్రం రాజగోపాల్‌రెడ్డికి హోంమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. -
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి
చింతపల్లి: గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడం వల్లే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. చింతపల్లి మండల కేంద్రంలోని పీహెచ్‌సీని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. వైద్యసేవలు, ఇతర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొందరు ఇన్ పేషెంట్లు, అవుట్ పేషంట్లతో మాట్లాడి ఏ సమస్యతో ఆసుపత్రికి వచ్చారని అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటనే ఆరోగ్యంగా ఉంటారన్నారు. అంతకుముందు స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసి పిల్లలతో ముఖాముఖి మాట్లాడారు. తరగతి గదిలోకి వెళ్లి వారి విద్యా సామర్థ్యాలను తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆ తర్వాత ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశమై మండలంలో తాగునీటి సరఫరా, తదితర అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. హరిజనపురంలో కొత్త వాటర్ ట్యాంకు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ రమాకాంత్ శర్మ, వైద్యాధికారి శ్రీదేవి, మిషన్ భగీరథ ఏఈ ఇక్బాల్ తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫ చింతపల్లి పీహెచ్సీ తనిఖీ -
రేషన్ షాపులకు సన్నబియ్యం
ఫ ఇప్పటికే 15 శాతం చేరవేత ఫ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తికి యంత్రాంగం చర్యలు ఫ 30న సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభం నల్లగొండ: రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఉమ్మడి జిల్లాలోనే ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 30న సూర్యాపేట జిల్లా మట్టపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా జిల్లా యంత్రాంగం గోదాముల నుంచి రేషన్ షాపులకు సన్న బియ్యం సరఫరా ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో ఎఫ్ఎస్సీ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఆరు, ఏఎఫ్ఎస్సీ కార్డుదారులకు 35, అన్నపూర్ణ కార్డుదారులకు కార్డుకు 10 కిలోల చొప్పున రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇవ్వనున్నారు. ప్రతినెలా 8,877.999 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ షాపులకు పౌరసరఫరాల శాఖ అందించనుంది. 30లోగా పూర్తిచేసేలా.. ఈనెల 30న ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీని ప్రా రంభించనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు సన్న బియ్యాన్ని రేషన్ షాపులకు తరలిస్తున్నారు. ఇప్పటికే 15 శాతం బియ్యం రేషన్ షాపులకు చేరుకున్నాయి. అధిక వాహనాలను ఏర్పాటు చేసి 30 లోగానే పూర్తి స్థాయిలో బియ్యాన్ని రేషన్ షాపులకు చేరవేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తూకం వేసి ఇవ్వాలంటున్న డీలర్లు ఇన్నాళ్లూ ప్రభుత్వం దొడ్డు బియ్యాన్ని రేషన్ షాపుల్లో పేదలకు అందిస్తూ వచ్చింది. వచ్చే నెల నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనుంది. అయితే ఇన్నాళ్లూ దొడ్డురకం బియ్యాన్ని తూకం వేయకుండానే 50 కిలోల బస్తా చొప్పున లెక్కించి రేషన్ షాపులకు ఎన్ని క్వింటాళ్ల బియ్యం ఇవ్వాలో అలాట్మెంట్ ఇచ్చేవారు. ఈ క్రమంలో ఒక్కో బస్తాకు రెండు కిలోల చొప్పున తరుగు వస్తుందని, దీంతో తాము నష్టపోవాల్సి వస్తుందని, గోదాముల వద్ద తూకం వేసి ఇవ్వాలని డీలర్లు ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నా హమాలీలు, యంత్రాల కొరత కారణంగా అమలు చేయడం లేదు. అయితే వచ్చే నెల నుంచి అన్ని రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తే కార్డుదారులంతా తీసుకుంటారని, తమకు బస్తాలు తూకం వేసి ఇవ్వకపోతే బస్తాకు 2 కిలోల చొప్పున ఒక లోడ్‌కు 2, 3 క్వింటాళ్ల వరకు తరుగు వచ్చి నష్టపోతామని రేషన్ డీలర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా ప్రభుత్వంలోనైనా తూకం వేసి ఇవ్వాలని బుధవారం కలెక్టరేట్లో జరిగిన చర్చల్లో సివిల్ సప్లయ్ డీఎం హరీష్‌కు రేషన్ డీలర్లు విన్నవించారు. రేషన్ కార్డులు 4,66,552 యూనిట్లు 13,85,506 ప్రతినెలా పంపిణీ చేసే బియ్యం 8,877.999 మెట్రిక్ టన్నులు తూకం వేసి ఇవ్వాలి రేషన్ బియ్యం తూకం వేసి ఇవ్వాలని కొంత కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయినా స్పందన లేదు. ప్రస్తుతం సన్న బియ్యం ఇవ్వనున్న నేపథ్యంలో గోదాముల వద్దే బస్తాలు తూకం వేసి తరుగు రాకుండా, డీలర్లు నష్టపోకుండా చూడాలి. – నాగరాజు, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు తరుగు రాకుండా చూస్తాం రేషన్ బియ్యం తూకంలో తేడా వస్తుందని మా దృష్టికి డీలర్లు తీసుకొచ్చారు. గోదాముల్లో తూకం వేసే ఇవ్వాలని చెప్పాం. డీలర్ల కోరిక మేరకు కొంతకాలం బయట వే బ్రిడ్జిపై తూకం వేసి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. బస్తాల్లో తరుగు రాకుండా చూస్తాం. – హరీష్, పౌర సరఫరాల శాఖ డీఎం, ఇన్చార్జి డీఎస్ఓ నల్లగొండ -
నవోదయ ఫలితాలు విడుదల
జవహర్ నవోదయ విద్యాలయం(జేఎన్వీ) ఆరు, తొమ్మిది తరగతుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పర్యావరణాన్ని కాపాడేలా.. పర్యావరణాన్ని కాపాడేలా పంటలు సాగుచేయాలని కంపాసాగర్ కేవీకే కోఆర్డినేటర్ శ్రీనివాసరావు అన్నారు.- 8లోవేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులునల్లగొండ టూటౌన్: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కుంభం నర్సిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 14ఏళ్లలోపు బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్, హ్యాండ్ బాల్, అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి పది వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడా శిక్షణ నిర్వాహకులకు గౌరవ వేతనంగా ఒక్కో శిబిరానికి రూ.4 వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. క్రీడా వివరాలు, గ్రామం, నిర్వహణ ప్రదేశం తెలియపరుస్తూ పూర్తి వివరాలతో వచ్చేనెల 5వ తేదీలోగా జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 9440072854 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. స్కూళ్లలో ఒకరోజు శాస్త్రవేత్త నల్లగొండ: విద్యార్థులను బాల శాస్త్రవేత్తలుగా ప్రోత్సహించేందుకు అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఒకరోజు శాస్త్రవేత్త కార్యక్రమాన్ని నిర్వహించాలని డీఈఓ భిక్షపతి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులతో విద్యార్థులను ప్రత్యక్షంగా లేదా వర్చువల్ విధానంలో మాట్లాడించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి నివేదికను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏప్రిల్ 5లోగా సంబంధిత వెబ్సైట్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి లక్ష్మీపతిని సంప్రదించాలని కోరారు. -
కేటీఆర్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు.. కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఈనెల 21వ తేదీన జరిగిన పదో తరగతి తెలుగు పేపరు–1 లీకేజీ వ్యవహారంలో అరెస్టయిన బండి శ్రీను తన కారు డ్రైవర్ అని, బండి శ్రీనును తానే ప్రోత్సహించి నేరానికి ఉసిగొల్పినట్లుగా ఒక టీవీ చానల్‌తోపాటు, ఒక యూట్యూబ్ చానల్లో తప్పుడు ప్రచారం చేశారని నకిరేకల్ మండలం మర్రూరు గ్రామానికి చెందిన, తాటికల్ పీఏసీఎస్ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకుడు నకిరేకంటి నరేందర్ పోలీసులకు ఈనెల 24న ఫిర్యాదు చేశారు. బండి శ్రీను తన కారు డ్రైవర్ కాదని, ఎస్సీ కులానికి చెందిన తనను అవమానించేలా, తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా, తన రాజకీయ జీవితానికి కలంకం అంటగట్టేలా ఆ చానళ్లు తప్పుడు ప్రచారం చేశాయని పేర్కొన్నారు. నిజానిజాలను నిర్ధారించుకోకుండా.. కేటీఆర్, కొణతం దిలీప్ ట్విట్టర్లో ఫార్వర్డ్ చేశారని, వారంతా కుమ్మకై ్క ఈ పని చేసినందున తగిన చర్యలు చేపట్టాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ● అదే కేసులో అరెస్టయిన చిట్ల ఆకాష్ తన కారు డ్రైవర్ అంటూ ఓ టీవీ చానల్‌తోపాటు యూట్యూబ్ చానల్ తప్పుడు ప్రసారం చేశాయని నకిరేకల్ మున్సిపల్ ఛైర్పర్సన్ చౌగోని రజిత ఈనెల 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిట్ల ఆకాష్ తన కారు డ్రైవర్ కాదని పేర్కొన్నారు. పైగా ఆ నేరానికి పాల్పడేలా తానే ఉసిగొలిపినట్లు తప్పుడు వార్తను ఇచ్చారని పేర్కొన్నారు. సమాజంలో తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా, తన రాజకీయ జీవితానికి కలంకం అంటగట్టేలా ఆ వార్తలు ఇచ్చారని వివరించారు. నిజానిజాలను నిర్ధారించుకోకుండా క్రిషాంక్, కేటీఆర్, దిలీప్ ట్విట్టర్లో ఫార్వర్డ్ చేశారని, వారిపై తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ● ఈ కేసులోనే అరెస్టయిన ప్రైవేటు ఉపాధ్యాయుడు గుడుగుండ్ల శంకర్.. తాను నకిరేకల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల యజమానితో కుమ్మకై ్క పేపర్ లీకేజీకి పాల్పడినట్లు టీవీ చానల్‌తోపాటు రెండు యూట్యూబ్ చానళ్లలో తప్పుడు వార్త ప్రసారం చేశారని ఉగ్గిడి శ్రీనివాస్ ఈనెల 25న ఫిర్యాదు చేశారు. ఆ వార్తల్లో నిజాలను నిర్ధారించుకోకుండా కేటీఆర్, క్రిషాంక్, దిలీప్ ట్విట్టర్లో ఫార్వర్డ్ చేశారని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితానికి కలంకం అంటగట్టాలని చూశారని, వారిపై చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయా చానళ్లలోపాటు కేటీఆర్, క్రిషాంక్, దిలీప్‌పై పోలీసులు వేర్వేరు కేసులను నమోదు చేశారు. ప్రజల్లో ఆందోళన కలిగించే ఉద్ధేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, పుకార్లను వ్యాప్తి చేయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీలను లక్ష్యంగా చేసుకొని వారిపై ద్వేషం పెంచేలా ప్రచారం చేసినందుకు గాను ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులను నమోదు చేసినట్లు వేర్వేరు ఎఫ్ఐఆర్లలో పోలీసులు వివరించారు. ఈ సెక్షన్ల కింద కేసు.. నకిరేకల్ మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు మన్నెం క్రిశాంక్ (ఏ1), కేటీఆర్(ఏ2), దీలీప్ కూమార్‌పై (ఏ3) బీఎన్ఎస్ 353(1)(సీ), 353(2) కింద కేసు నమోదు చేశారు. అలాగే ఉగ్గిడి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవే సెక్షన్ల కింద కొణతం దిలీప్ (ఏ1), మన్నెం క్రిషాంక్ (ఏ2), కేటీఆర్‌పై (ఏ3), ఒక యూట్యూబ్ చానల్ ఎండీ (ఏ4), మరో యూట్యూబ్ చానల్ యాజమాన్యం (ఏ5)పై కేసులు నమోదు చేశారు. ఇక తాటికల్ పీఏసీఎస్ డైరెక్టర్ నకిరేకంటి నరేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పై సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద కేటీఆర్ (ఏ1), కొణతం దిలీప్ (ఏ2), టీవీ, యూట్యూబ్ చానళ్ల మేనేజ్మెంట్పై (ఏ3) కేసులు నమోదు చేశారు. -
ఆస్తిపన్ను వడ్డీపై 90 శాతం మాఫీ
నల్లగొండ టూటౌన్: మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిల వడ్డీపై 90 శాతం మాఫీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని సంవత్సరాల నుంచి ఆస్తిపన్ను చెల్లించకుండా బకాయి పడ్డవారు ఈనెల 31లోగా మొత్తం ఆస్తిపన్ను చెల్లిస్తే 90 శాతం వడ్డీ రాయితీ అవకాశం కల్పించింది. ఇప్పటికే వడ్డీతో సహా ఆస్తిపన్ను చెల్లించిన వారికి వచ్చే ఏడాది 90 శాతం వడ్డీ తగ్గించనున్నారు. వెంటనే ఆస్తిపన్ను చెల్లించి వడ్డీ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనిచాలని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కోరారు. -
ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్చార్జి డీడీగా ప్రేమ్‌కరణ్‌రెడ్డి
నల్లగొండ: జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రేమ్‌కరణ్‌రెడ్డి నియమితులయ్యారు. జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేస్తున్న ప్రేమ్‌కరణ్‌రెడ్డికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఆయన ఇన్చార్జి డీడీగా బాధ్యతలు స్వీకరించారు. పదో తరగతి పరీక్షకు 29 మంది గైర్హాజరునల్లగొండ: జిల్లాలో 105 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం గణితం పరీక్షకు మొత్తం 18,666 మంది విద్యార్థులకు గాను, 18,637 మంది హాజరయ్యారు. 29 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ భిక్షపతి తెలిపారు. దేవరకొండ ఆసుపత్రిలో కాయకల్ప బృందందేవరకొండ: దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన కాయకల్ప బృందం సందర్శించింది. డాక్టర్ ప్రభు నేతృత్వంలోని బృందం సభ్యులు ఇన్‌పేషెంట్, అవుట్ పేషెంట్, డయాలసిస్, మాతా శిశుసంరక్షణ కేంద్రం, జనరల్ ఓపి, మెటర్నటీ, ఎమర్జెన్సీ విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలు, పరిశుభ్రత, నిర్వహణ, సిబ్బంఇ వివరాలు తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ బృందం అందించే నివేదిక ప్రకారం ఆసుపత్రిని కాయకల్ప అవార్డుకు ఎంపిక చేయనున్నారు. వారివెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ రవిప్రకాశ్, వైద్యులు కృష్ణ, రంజిత్, సిబ్బంది ఉన్నారు. గోదాముల నిర్మాణానికి సబ్సిడీ ఇవ్వాలినల్లగొండ టౌన్: ప్రాథమిక సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యం నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణానికి సబ్సిడీల సదుపాయం కల్పించాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. బుధవారం తమిళనాడు రాష్ట్రం చైన్నెలోని ఎఫ్‌సీఐ రీజనల్ కార్యాలయంలో సౌతిండియా ఎఫ్‌సీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెజింత లాజరస్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదాముల నిర్మాణం వల్ల రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిల్వ ఉంచుకుని ధర ఎక్కువగా ఉన్నప్పుడు అమ్ముకుని లాభాలు ఆర్జించడానికి వీలుగా ఉంటుందని తెలిపారు. రైతులు దళారీల బారిన పడకుండా మద్దతు ధర పొందే అవకాశం ఉంటుందని ఈడీకి వివరించారు. మెరుగైన వైద్యం అందించాలిచిట్యాల: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. చిట్యాల మండలం వెలిమినేడు పీహెచ్‌సీని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, డ్రగ్స్ స్టోర్, స్టాక్ రిజిస్టర్, కాన్పుల రూమ్‌ను పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం ఆసుపత్రి సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని, పిల్లలకు సకాలంలో టీకాలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ఉబ్బు నర్సింహ, సీహెచ్ఓ కల్యాణచక్రవర్తి, హెల్త్ సూపర్వైజర్లు శ్యామల, లక్ష్మి, వీరారెడ్డి, స్టాప్ నర్స్ ప్రసన్నకుమారీ, ఫార్మాసిస్ట్ హేమ, వైద్య సిబ్బంది వరలక్ష్మి, త్రివేణి, లక్ష్మి, పద్మావతి, మహేందర్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. -
కేటీఆర్‌పై కేసు నమోదు
సాక్షి, నల్లగొండ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. నల్లగొండ జిల్లాలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రజిత ఫిర్యాదు మేరకు నకిరేకల్ పోలీసులు కేటీఆర్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ వ్యవహారంలో నిందితులతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ తమపై కేటీఆర్ ట్వీట్ చేశారని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రజిత తెలిపారు. దీనికి సంబంధించి.. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ రజిత.. కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలో కేటీఆర్‌తో పాటు క్రిషాంక్, కొణతం దిలీప్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. నిందితుడు చిట్ల ఆకాష్ తన డ్రైవర్ అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఆమె ఫిర్యాదుతో నకిరేకల్ పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేటీఆర్‌పై రెండు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. పేపర్ లీకేజీ ఘటనలో ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 🚨A Shocking Case of SSC Paper Leak as well as Nexus for Top Rankings - Congress leaders involved with Private School Management to send the SSC 10th Class Examination First Day Question paper through Whatsapp Groups...While 15 people have been involved,only 6 have been… pic.twitter.com/XHBScJBrY7— Dr.Krishank (@Krishank_BRS) March 24, 2025 -
మమ్మల్ని విడిచిపోయినవా బిడ్డా.. నేను బాపు ఏమైపోవాలి..
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తాను పదో తరగతి పరీక్షలు బాగా రాయలేకపోతున్నా అనే కారణంగా ఆవేదనకు గురైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు. మార్కులే జీవితమా బిడ్డా.. ఎందుకు ఇలా చేశావ్ బిడ్డా.. అంటూ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు.వివరాల ప్రకారం.. నల్లగొండలోని కట్టంగూరులో విద్యార్థిని పూజిత భార్గవి స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇప్పటికే పదో తరగతి పరీక్షలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పరీక్షలు రాసింది. మూడు పరీక్షలు సరిగా రాయలేదని ఆందోళన చెందింది. ఈ క్రమంలో తాను పరీక్షలు రాయలేకపోతున్నాని ఆవేదనకు గురైంది. తాను ఫేయిల్ అవుతానేమో అనుకుని.. భయాందోళనతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. -
టెన్త్ తెలుగు పేపర్ లీకేజీలో 13 మంది పాత్ర
నకిరేకల్: పదోతరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 13 మంది పాత్ర ఉందని, అందులో 11 మందిని అదుపులోకి తీసుకున్నట్టు నల్ల గొండ డీఎస్పీ శివరాంరెడ్డి చెప్పారు. మంగళవారం డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కేంద్రంలో ఈ నెల 21న పదోతరగతి తెలుగు పరీ క్ష ప్రారంభమైన అరగంట తర్వాత ప్రశ్నపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొడుతూ డీఈఓకు చేరింది. వెంటనే ఆయన ఎంఈవో నాగయ్యకు ఫోన్ చేయగా, నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరిలో 11 మందిని స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. ఆ రోజు(21న) ప్లాన్ ప్రకా రం ఏ–1 చిట్ల ఆకాశ్, ఏ–3 చిట్ల శివ, ఒక బాలుడు కలిసి గురుకుల పాఠశాల వద్దకు స్కూటీపై వెళ్లారు. గేట్ వద్ద అప్పటికే పోలీసులు ఉండటంతో లోప లకు వెళ్లడానికి వారికి వీలు కాలేదు. దీంతో ఆ ముగ్గురు వెనుక వైపునకు వెళ్లారు. అక్కడ ఏ–11 రాహుల్ ఉన్నాడు. బాలుడు పరీక్ష కేంద్రం ఒకటో అంతస్తులోని రూమ్ నంబరు 8 వద్దకు చేరుకున్నా డు. ఆ గదిలో పరీక్ష రాస్తున్న తనకు పరిచయ మున్న విద్యార్థిని ఉండటంతో ప్రశ్నపత్రం చూపించమని సైగ చేయగా, అతని వెనకాల మరో ఇద్దరు కూడా అక్కడకు చేరుకున్నారు. అయితే రాహుల్‌తో ఉన్న పరిచయం మేరకు ఆ విద్యార్థిని వెంటనే ఆ బాలుడికి ప్రశ్నపత్రం చూపించింది. ఆ బాలుడు తన ఫోన్లో ప్రశ్నపత్రం ఫొటో తీసుకొని కిందకు దిగాడు. ఆ బాలుడు తీసిన ఆ ఫొటో పేపర్‌ను మిగతా నిందితులు ఒకరి నుంచి ఒకరికి పంపుకున్నారు. ఆ పేపర్లో ఉన్న ప్రశ్నలకు.. ఏ–4 అయిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు గుడుగుంట్ల శంకర్ సమాధానాలు తయారు చేయగా, వాటిని రవిశంకర్ జెరాక్స్ షాప్‌లో జెరాక్స్ తీసుకున్నారు. నిందితులు సమాధాన పత్రాలను వారికి తెలిసిన వారికి ఇవ్వడానికి పరీక్ష కేంద్రానికి వెళ్లగా, అక్కడ పోలీసులను చూసి దొరికి పోతామేమోనని వెళ్లిపోయారు. ఈ కేసుపై పోలీసులు 13 మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, పేపర్ లీకేజీ వ్యవహారాన్ని బయటపెట్టారని డీఎస్పీ శివరాంరెడ్డి వివరించారు. బంధువుల పిల్లల కోసం... నకిరేకల్‌కు చెందిన చిట్ల ఆకాశ్, చిట్ల శివ, గుడుగుంట్ల శంకర్, బి.రవిశంకర్, బండి శ్రీనుతో పాటు ఓ బాలుడిని ఈ నెల 23న రిమాండ్‌కు పంపామని డీఎస్పీ చెప్పారు. పోగుల శ్రీరాములు, తలారి అఖిల్‌కుమార్, ముత్యాల వంశీ, పల్స అనిల్‌కుమార్, పల్ల మనోహర్‌ను విచారిస్తున్నామన్నారు. రాహుల్‌తోపాటు మరోబాలుడు పరారీలో ఉన్నారని చెప్పారు. తమ బంధువుల పిల్లలు పదోతరగతిలో ఎక్కువ మార్కులు సాధించాలని కొంతమంది ఆకతాయిలు ఇదంతా చేశారన్నారు.కూతురి పరీక్ష.. తల్లిదండ్రులే ఇన్విజిలేటర్లుకోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయ దంపతులు ఇన్విజిలేషన్ నిర్వహిస్తున్న కేంద్రంలోనే.. వారి కూతురు పరీక్ష రాయటం వివాదాస్పదంగా మారింది. తాము ఇన్విజిలేషన్ నిర్వహించే పరీక్ష కేంద్రాల్లో సంతానం పరీక్ష రాయటం లేదని.. ఉపాధ్యాయులు పరీక్షలకు ముందే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.అలాంటి డిక్లరేషన్ ఇచ్చి కూడా.. తమ కూతురు పరీక్ష రాసే కేంద్రంలోనే ఉపాధ్యాయ దంపతులు ఇన్విజిలేషన్ చేశారు. దీనిపై ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం తెలపడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇది ఉన్నతాధికారులతోపాటు కలెక్టర్ దృష్టికి కూడా వెళ్లడంతో.. ఉపాధ్యాయ దంపతులను పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. -
కృత్రిమ మేధతో నాణ్యమైన విద్య
నల్లగొండ: కృత్రిమ మేధ సాయంతో నాణ్యమైన విద్యను అందుతుందని డీఈఓ భిక్షపతి అన్నారు. మంగళవారం నల్లగొండ మండలంలోని చందనపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో కృత్రిమ మేధ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి సామర్థ్యం మదింపు చేసి వారి స్థాయికి తగిన విధంగా తెలుగు, ఆంగ్ల పదాలు, వాక్యాలు, గణిత సమస్యలను సాధించడంలో ఏఐ సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఆర్.రామచంద్రయ్య, హెచ్ఎం ఎం.రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. బోధనా సిబ్బందికి ఇంటర్వ్యూలునల్లగొండ టౌన్ : నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు పద్ధతిన బోధనా సిబ్బంది నియామకానికి మంగళవారం కలెక్టరేట్లో సర్టిఫికెట్ పరిశీలన, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలకు 15 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను మెడికల్ కళాశాల వెబ్సైట్లో ఉంచుతామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణి తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర, డాక్టర్ వినీలారాణి, డాక్టర్ మాతృ పాల్గొన్నారు. ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలినల్లగొండ టూటౌన్ : విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎంఎస్ఎంఈ సంస్థ ప్రతినిధి జె.కోటేశ్వర్రావు సూచించారు. మంగళవారం ఎంజీయూలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ లాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపయోగపడతాయని తెలిపారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి మాట్లాడుతూ విద్యార్థులు నలుగురికి ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయిలో ఉండేలా ఆలోచన చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అరుణప్రియ, సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రేమ్‌సాగర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. చెర్వుగట్టు హుండీ ఆదాయం రూ.32,28,760నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కానుకల హుండీలను మంగళవారం లెక్కించారు. 41 రోజుల్లో రూ.32,28,760 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారి నవీన్‌కుమార్ తెలిపారు. కార్యక్రమానికి సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది శ్రీనివాస్‌రెడ్డి, నర్సిరెడ్డి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపికనల్లగొండ టూటౌన్ : నెల్లూరు జిల్లా సింహపురి విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 30న నిర్వహించనున్న జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొనే మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం మహిళా జట్టును మంగళవారం ఎంపిక చేశారు. ఎంజీయూ పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలలకు చెందిన అక్షయ, రవళి, రేష్మా, శ్రావణి ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ హరీష్‌కుమార్, ప్రొఫెసర్ సోమలింగం, మురళి, శ్రీనివాస్‌రెడ్డి, శ్యాంసుందర్, నాగిరెడ్డి, పృథ్వీరాజ్, అజయ్ పాల్గొన్నారు. -
పోలీస్ ఆడిటోరియంలో ఇఫ్తార్ విందు
నల్లగొండ టూటౌన్ : రంజాన్ మాసం సందర్భంగా జిల్లా పోలీస్ ఆడిటోరియంలో మంగళవారం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ పాల్గొని ముస్లింలకు తెలిపి మాట్లాడారు. ముస్లిం పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఎంతో భక్తితో నెలరోజుల పాటు ఉపవాసాలు చేస్తారన్నారని పేర్కొన్నారు. అనంతరం వారు ముస్లింలకు బిర్యానీ వడ్డించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీలు శివరాంరెడ్డి, రాజశేఖర్ రాజు, లక్ష్మినారాయణ, శ్రీనివాసులు, జయరాజు తదితరులు పాల్గొన్నారు. -
పారితోషికం పైసలేవి?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వేలో విధులు నిర్వర్తించిన సిబ్బందికి ఇంత వరకు పారితోషికంఅందలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఆ డబ్బులను ఇవ్వగా, నల్లగొండలో ఇప్పటివరకు అందకపోవడంతో విధులు నిర్వర్తించిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే ముగిసి నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు ఆ డబ్బులు ఎందుకు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 9 వేల మంది ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. నవంబర్లోనే పూర్తయినా.. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే చేపట్టింది. జిల్లాలోని 33 మండలాల పరిధిలోని 868 గ్రామ పంచాయతీలు, ఏడు మున్సిపాలిటీల్లో ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల (కేజీబీవీ) టీచర్లు, అధ్యాపకులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంఆర్సీ సిబ్బంది, ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులు విధులు నిర్వర్తించారు. సర్వే పర్యవేక్షణ కోసం మండల స్థాయిలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులను సూపర్వైజర్లుగా, మండల ప్రత్యేక అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించి ఈ సర్వే చేయించారు. గత ఏడాది నవంబరు 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేశారు. ఇలా ఒక్కో ఎన్యుమరేటర్ రోజుకు 150 ఇళ్ల వరకు సర్వే చేశారు. ఆ వివరాలను వెబ్సైట్లో నమోదు చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. వారి నేతృత్వంలో ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేశారు. బ్యాంకు ఖాతాల వివరాలు ఎప్పుడో ఇచ్చినా.. సర్వే విధుల్లో పాల్గొన్న ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్ల బ్యాంకు ఖాతాల వివరాలను అప్పట్లోనే అందజేశారు. సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్‌కు రూ.10 వేలు, సూపర్వైజర్కు రూ.12 వేలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో ఫారం నమోదు చేసినందుకు రూ.25 చొప్పున గౌరవ వేతనం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 490 మంది సూపర్వైజర్లు, 4,060 మంది ఎన్యుమరేటర్లు, 4,012 మంది ఆపరేటర్లు ఈ విధులను నిర్వరించారు. ఆ సర్వే పూర్తయి నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు డబ్బులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ కులగణన సర్వే చేసి నాలుగు నెలలు అవుతున్నా పట్టించుకోని ప్రభుత్వం ఫ ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అందని డబ్బులు ఫ జిల్లా వ్యాప్తంగా దాదాపు 9 వేల మంది ఎదురుచూపు పారితోషికం వెంటనే విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కులగణన సర్వేను చేయించింది. ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వే పూర్తయి నాలుగు నెలలు గడిచిపోయింది. జిల్లాలో విధులు నిర్వర్తించిన వారికి ఇంతవరకు గౌరవ వేతనం చెల్లించలేదు. పక్కనున్న సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో చెల్లించారు. ఇక్కడే ఎందుకు చెల్లించడం లేదో అర్థం కావడం లేదు. ప్రభుత్వం వెంటనే ఆ డబ్బులను విడుదల చేయాలి. – పెరుమాళ్ల వెంకటేశం, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
30న హుజూర్‌నగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి
సన్నబియ్యం పంపిణీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి హుజూర్నగర్ : ఈనెల 30న ఉగాది పర్వదినం నాడు హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ● 30న సాయంత్ర 5 గంటలకు సీఎం హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి బయలుదేరుతారు. ● 5.45 గంటలకు హుజూర్నగర్ శివారులోని రామస్వామి గుట్ట వద్ద హెలిపాడ్‌లో దిగి అక్కడ నిర్మాణంలో ఉన్న 2వేల సింగల్ బెడ్రూం ఇళ్ల మోడల్ కాలనీని పరిశీలిస్తారు. ● అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి హుజూర్నగర్ పట్టణంలోని బహిరంగ సభా ప్రాంగణం సమీపంలోగల హెలిపాడ్‌లో 6.15 గంటలకు సీఎం దిగుతారు. ● 6.15 గంటలనుంచి 7.30 గంటల వరకు సభా వేదికపై నుంచి సీఎం రేవంత్‌రెడ్డి సన్న బియ్యం పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ● తదుపరి ప్రజలనుద్దేశించి సీఎం మాట్లాడతారు. ● రాత్రి 7.30 గంటలకు సీఎం హుజూర్నగర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరుతారు ● రాత్రి 9.45కి హైదరాబాద్‌కు చేరుకుంటారు. -
రైతు భరోసాకు నిరీక్షణ
నల్లగొండ అగ్రికల్చర్ : యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. రైతు భరోసాను ప్రతి సీజన్లో ఎకరానికి రూ.7500 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. కమిటీల పేరతో కాలయాపన చేసి వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా ఇవ్వలేదు. ఇక, యాసంగి సీజన్ నుంచి ఎకరానికి రూ.6 వేల చొప్పున ఇస్తామని చెప్పి జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా నిధుల జమచేయడం ప్రారంభించింది. దశల వారీగా డబ్బులు ఖాతాల్లో జమ చేసింది. మూడు విడుతలు కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,76,694 మంది రైతుల (మూడెకరాలలోపు) ఖాతాల్లో మొత్తం రూ.202,48,72,111 ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. 5,60,810 మంది పాస్‌బుక్కులు ఉన్న రైతులు.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,60,801 మంది పట్టాదార్ పాస్‌బుక్కులు కలిగిన రైతులు ఉన్నారు. వారందరికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుబంధు పేరుతో రెండు సీజన్లకు కలిపి రూ.10 వేలు ఖాతాల్లో జమయ్యేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధును రైతు భరోసాగా పేరును మార్చి ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే సాగుకు యోగ్యం కాని భూములు 12,040 ఎకరాలను గుర్తించి మిగిలిన భూములకు రైతు భరోసాను అమలు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు మూడెకరాలలోపు భూమి ఉన్న 2,76,694 మందికి మాత్రమే రైతుభరోసా నిధులు జమచేసింది. మూడెకరాలకుపైగా ఉన్న సుమారు 3.30 లక్షల మంది రైతులు రైతుభరోసా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వారికి ఎప్పుడు ఇస్తారో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఫ రెండు నెలలైనా మూడు ఎకరాలలోపు రైతులకే అందని సొమ్ము ఫ ఆందోళనలో మూడెకరాల పైన భూమి ఉన్న రైతులు ఫ సీజన్ ముగిసినా ఎప్పుడిస్తారోనని ఎదురుచూపులు మూడు దశలలో రైతు భరోసా జమ ఇలా... విడత రైతులు జమైన డబ్బు(రూ.లలో) మొదటి 35,568 46,93,19,160 రెండవ 1,55,232 88,42,80,319 మూడవ 85,894 67,12,72,632 మొత్తం 2,76,694 202,48,72,111 -
టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కదలిక
నకిరేకల్ : రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారాన్ని జిల్లా పోలీసు, రెవెన్యూ, విద్యా శాఖ అధికారులు కొలిక్కి తెచ్చారు. బంధువుల పిల్లలకు ఎక్కవ మార్కుల వచ్చేలా చేయడం కోసమే ఇదాంతా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సాక్షి వరస కథనాలతో పాటు.. మంగళవారం సాక్షిలో ‘ప్రశ్నపత్రం లీకేజీలో ఎవరి పాత్ర ఎంత?’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంతో.. జిల్లా పోలీస్ శాఖ లీకేజీ వ్యవహరాన్ని బట్టబయలు చేసింది. మంగళవారం నల్లగొండలో డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ లీకేజీపై వ్యవహారంపై నిష్పక్షపాతంగా.. పారదర్శకంగా విచారణ కొనసాగుతోందని ప్రకటించారు. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత ఉందో అనే అంశాలను వెల్లడించారు. ఫ ‘సాక్షి’ వరుస కథనాలకు స్పందించిన యంత్రాంగంఫ వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీజిరాక్స్ సెంటర్లకు నోటీసులు.. నకిరేకల్ తహసీల్దార్ ఆదేశాల మేరకు స్థానిక సీఐ రాజశేఖర్ పట్టణంలోని జిరాక్స్ సెంటర్లకు నోటీస్‌లు జారీ చేశారు. పరీక్ష సమయం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జిరాక్స్ సెంటర్లు బంద్ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన జిరాక్స్ సెంటర్లపై చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక పట్ట ణంలో నాలుగు పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ నిఘా పెంచారు. ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. -
ప్రజా సమస్యలను పరిష్కరించాలి
మిర్యాలగూడ : ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలో భారీ ర్యాలీ, తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 సంవత్సరాల నుంచి మిర్యాలగూడ నియోజకవర్గంలోని పేదలకు ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదన్నారు. ప్రభుత్వం వెంటనే అర్హులైన పేదలను గుర్తించి ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. ధాన్యం క్వింటాకు రూ.2800 చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు రవినాయక్, మల్లు గౌతంరెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, గాదె పద్మమ్మ, తిరుపతి రామ్మూర్తి, సత్యనారాయణరావు, పిల్లుట్ల సైదులు, మల్లయ్య, రమేష్, రామకృష్ణ, రమేష్, నగేష్ పాల్గొన్నారు. -
వెంటాడి వేటాడి..తండ్రిని చంపించిన కన్న కూతురు
సూర్యాపేటటౌన్: గ్రామంలో ఆధిపత్యం కోసం మామను అతికిరాతంగా హత్య చేయించాడు సొంత అల్లుడు. నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యగౌడ్ హత్య కేసులో 13 మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ విలేకరులకు వెల్ల డించారు. చక్రయ్యగౌడ్ ఆధిపత్యం సహించలేక..మెంచు చక్రయ్యగౌడ్ గ్రామంలో పెద్దమనిషిగా చలామణి అవుతూ గ్రామ సర్పంచ్‌గా కూడా పనిచేశాడు. అతడికి ఐదుగురు కుమార్తెలు సంతానం. తన మూడో కుమార్తె కనకటి సునీతను కూడా సర్పంచ్‌గా, మూడో అల్లుడు కనకటి వెంకన్నను పీఏఏసీఎస్ చైర్మన్‌గా చేశాడు. అల్లుడు కనకటి వెంకన్న పీఏసీఎస్ చైర్మన్ అయిన్నప్పటి నుంచి నూతనకల్ మండలంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం ఉండటం వెంకన్న వర్గీయులు సహించలేకపోయారు. చక్రయ్యగౌడ్కు వ్యతిరేకంగా వెంకన్న వర్గీయులు ఒక గ్రూపుగా ఏర్పడడంతో వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2023లో చక్రయ్యగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024లో కనకటి వెంకన్న కూడా కాంగ్రెస్‌లోకి వచ్చాడు. అయినప్పటికీ గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో ఎలాగైనా మామ చక్రయ్యగౌడ్ను అడ్డు తొలగించుకోవాలని కనకటి వెంకన్న నిర్ణయించుకున్నాడు.బొడ్రాయి మహోత్సవంలో హత్యకు పథకం.. ఈ నెల 13న మిర్యాల గ్రామంలో బొడ్రాయి మహోత్సవం జరిగింది. గతంలో కనకటి వెంకన్న ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగేవి, చక్రయ్యగౌడ్ ఈసారి ఉత్సవాలను తన ఆధ్వర్యంలో జరపాలని బహిరంగంగా ప్రకటించడంతో వెంకన్న తట్టుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా చక్రయ్యగౌడ్ను హత్య చేయాలని తన వర్గీయులను కొంతమందిని వెంకన్న పురమాయించాడు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం చక్రయ్యగౌడ్ తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తుండగా.. అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్య, ఐదో అల్లుడు కనకటి లింగయ్యతో పాటు వెంకన్న అనుచరులైన కనకటి శ్రవణ్, కనకటి శ్రీకాంత్, గంధసిరి వెంకటేష్, పెద్దింటి మధు, పెద్దింటి గణేష్ అడ్డగించి మారణాయుధాలు, వెదురు కరల్రతో చక్రయ్యగౌడ్పై దాడి చేసి హత్య చేశారు. ఇదంతా దూరంగా నుంచి గమనిస్తున్న వెంకన్న చక్రయ్యగౌడ్పై దాడి జరిగగానే అతడు చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి అందరూ పారిపోయారు. ఈ హత్యపై నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోమవారం ఉదయం తుంగతుర్తి పరిధిలో వాహనాల తనిఖీల్లో భాగంగా.. చక్రయ్యగౌడ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్యతో పాటు హత్యకు కుట్ర పన్నిన మూడో అల్లుడు కనకటి వెంకన్న, వెంకన్న భార్య సునీత, మొదటి కుమార్తె కనకటి స్వరూప, ఐదో కుమార్తె కనకటి కల్యాణితో పాటు దిండిగల నగేశ్, జక్కి పరమేష్, మన్నెం రమేశ్, కనకటి వెంకన్న అలియాస్ మొండి వెంకన్న, కనకటి శ్రావ్య, కనకటి/వర్దెల్లి అనూష, జక్కి స్వప్న, భారీ సతీష్ రెండు కార్లలో వెళ్తుండగా పోలీసులు అదపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. చక్రయ్యగౌడ్ను హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఒక కర్ర, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 42 మందిపై కేసు నమోదైందని, దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న ఏడుగురు నిందితుల్లో కనకటి ఉప్పలయ్య మినహా మిగతా ఆరుగురు గతంలోనే కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం.కస్టడీ పిటీషన్ వేసి దర్యాప్తు చేస్తాంఈ హత్య కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ఎవరినీ వదిలిపెట్టకుండా కచ్చితమైన ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు పారదర్శకంగా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కస్టడీ పిటిషన్ వేసి నిందితులను కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులకు ఎస్పీ రివార్డు అందజేశారు. ఈ కేసు ఛేదించిన సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ డి. శ్రీను, ఎస్ఐలు మహేంద్రనాథ్, ఎం. వీరయ్య, ఆర్. క్రాంతికుమార్‌ను ఎస్పీ అభినందించారు. -
తెలంగాణ కళాకారులతో దొడ్డి కొమురయ్య సినిమా
హుజూర్నగర్: తెలంగాణలోని అన్ని జిల్లాల కళాకారులతో దొడ్డి కొమురయ్య జీవిత చర్రితపై సినిమా నిర్మిస్తున్నట్లు సినీ దర్శకుడు సేనాపతి అన్నారు. సోమవారం హుజూర్నగర్ వచ్చిన ఆయన స్థానిక కళాకారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గొప్ప చరిత్ర కలిగిన దొడ్డి కొమరయ్య జీవితాన్ని తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా నేటి తరం యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మాణానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. తెలంగాణ కళాకారులకు ఈ సినిమాలో అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో కళాకారులు ఎస్. శ్రీనివాస్, జి. దీప, కె. బాబు, డి. శ్రీనివాస్, నరసింహచారి, బి. గోవిందరావు, కె. రవి, పి. వెంకటేశ్వర్లు, ఎం. సైదులు, డి. బాబురావు తదితరులు పాల్గొన్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్సూర్యాపేటటౌన్: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను సూర్యాపేట టౌన్ సీఐ వీరరాఘవులు విలేకరులకు వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం సూర్యాపేట టౌన్ ఎస్ఐ సైదులు, పోలీస్ సిబ్బంది కలిసి సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో సూర్యాపేట పట్టణానికి చెందిన దాసరి సిద్దార్ధ, మహ్మద్ ఉమర్ బైక్‌పై ఒక కిలో 200 గ్రాముల గంజాయితో కోదాడ నుంచి సూర్యాపేటకు వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. పార్ట్‌టైం జాబ్ పేరుతో మోసం● డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు భువనగిరి: పార్ట్‌టైం జాబ్ పేరుతో ఓ వ్యక్తి వద్ద సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేశారు. భువనగిరి రూరల్ ఎస్హెచ్ఓ సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గూడూరు మండలానికి చెందిన గోసాల శ్యామల్రావు ఏడాది క్రితం బతుకుదెరువు కోసం భువనగిరి మండలం రాయగిరి గ్రామానికి వలస వచ్చాడు. ప్రస్తుతం సూపర్వైజర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 15న పార్ట్‌టైం జాబ్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తూ ఒక లింక్ ఓపెన్ చేశాడు. అందులో తన వివరాలను నమోదు చేశాడు. తర్వాత తన ఫోన్లోని వాట్సాప్‌కు వచ్చిన వీడియోను చూసి లైక్ చేసి షేర్ చేశాడు. అనంతరం ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాందించవచ్చని చెప్పి కొన్ని టాస్క్‌లు ఇచ్చారు. టాస్క్‌లో భాగంగా వారు పంపిన వెబ్సైట్లో డబ్బులు డిపాజిట్ చేస్తే 30శాతం లాభం వస్తుందని చెప్పారు. దీంతో శ్యామల్రావు మొదట రూ.1000 డిపాజిట్ చేయగా.. రూ.1500 రిటర్న్స్ వచ్చాయి. ఈవిధంగా ఈ నెల 18వ తేదీ నాటికి రూ.1,92,000 డిపాజిట్ చేశాడు. తర్వాత డబ్బులు రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి 1930 కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. -
భార్య మందలించిందని మనస్తాపంతో..
● అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లిన భర్తమిర్యాలగూడ టౌన్: మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తను భార్య మందలించడంతో మనస్తాపానికి గురైన భర్త అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం అవంతీపురంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మ య్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం అవంతీపురం గ్రామానికి చెందిన పర్వతం రమణ నిత్యం మద్యం తాగి ఇంటికి వెళ్తున్నాడు. ఈ నెల 18వ తేదీ రాత్రి కూడా మద్యం తాగి ఇంటికి వెళ్లడంతో.. మద్యం ఎందుకు తాగి వచ్చావు అంటూ భార్య యశోద నిలదీసింది. దీంతో మనస్తాపానికి గురైన రమణ అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో బయటకు వెళ్లి తిరిగిరాలేదు. రమణ కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతడి భార్య యశోద ఈ నెల 21వ తేదీన మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిపెద్దఅడిశర్లపల్లి: భూతగాదాల నేపథ్యంలో పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం మల్లాపురం గ్రామానికి చెందిన నేతాల సత్తయ్య(48) ఈ నెల 11వ తేదీన భూతగాదాల నేపథ్యంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య సాలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యగుర్రంపోడు: ఆర్థిక ఇబ్బందులతో గడ్డిమందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం వద్దిరెడ్డిగూడెంలో జరిగింది. ఎస్ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. వద్దిరెడ్డిగూడేనికి చెందిన మేకల నాగిరెడ్డి(39) తనకున్న 9ఎకరాల భూమిలో బత్తాయి తోటతో పాటు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో నాగిరెడ్డి ఆదివారం పొలం వద్ద గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి భార్య మేకల సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
నిందితులకు శిక్ష పడితేనే ప్రజలకు నమ్మకం
నల్లగొండ : ప్రతి కేసులోనూ నిందితులకు శిక్ష పడితేనే.. ప్రజలకు పోలీస్‌శాఖపై నమ్మకం పెరుగుతుందని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టు కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచడం, తప్పు చేసిన నిందితులకు శిక్ష పడే విధంగా చేసినప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు. కోర్టు అధికారులు, ప్రాసిక్యూటర్ల సమన్వయంతో న్యాయ సలహాలు తీసుకుని పనిచేయాలన్నారు. కేసు తుదిదశలో సాక్షులు, నిందితులు, బాధితులను సమయానికి కోర్టులో హాజరుపరిచేలా చూసుకోవాలన్నారు. సంవత్సరకాలంలో జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో ఒకరికి ఉరిశిక్ష, 17 మందికి జీవిత ఖైదు విధించడం అభినందనీయమన్నారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన ప్రాసిక్యూటర్లను, కోర్టు డ్యూటీ అధికారులను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు శివరాంరెడ్డి, డీఎస్పీ రాజశేఖరరాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శ్రీవాణి, అఖిల, వెంకటేశ్వర్లు, జవహర్లాల్, రంజిత్‌కుమార్, డీసీఆర్బీ సీఐ శ్రీనునాయక్, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు స్వీకరణ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌డేలో ఎస్పీ శరత్చంద్ర పవార్ బాదితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జిదారులతో ఎస్పీ మాట్లాడి వారి సమస్యను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్‌శాఖను మరింత చేరువ చేయాలని, స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి చట్టపరంగా వారికి న్యాయం జరిగే విధంగా చూడాలని సూచించారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలి
రామగిరి(నల్లగొండ): ఉన్నత విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాలను పెంచాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఓఎస్డీ ప్రొఫెసర్ జి.అంజిరెడ్డి అన్నారు. నల్లగొండ ఎన్జీ కళాశాలలో సోమవారం జరిగిన అకడమిక్ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు అతిగా సెల్ఫోన్లు వినియోగిస్తూ తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తప్పులు లేకుండా, భావం చెడకుండా ఒక వాఖ్య రాయలేని స్థితిలో నేటి విద్యార్థులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంజీయూ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ రేఖ మాట్లాడుతూ ఆడ్ ఆన్ కోర్సుల్లో భాగంగా కత్రిమ మేధను చేర్చాలని సూచించారు. రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించి భవిష్యత్తుకు పునాదులు వేయాలని సూచించారు. ఎన్జీ కాలేజీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు తన గురువు డాక్టర్ వీరయ్య పేరున ఏటా గోల్డ్ మెడల్ ఇస్తారని ప్రకటించారు. అలాగే మరో రెండు బంగారు గోల్డ్ మెడల్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన డాక్టర్ అంతటి శ్రీనివాస్, వెంకట్‌రెడ్డిని అభినందిచారు. ఈ సందర్భంగా ఇండస్ట్రియలిస్ట్ శ్రీధర్‌రెడ్డి ఎస్జీ కళాశాలకు కంప్యూటర్లు అందజేస్తానన్నారు. 2025–2026 విద్యా సంవత్సరంలో అమలయ్యే పలు కీలక నిర్ణయాలను తీసుకున్న ఈ సమావేశంలో అకడమిక్ కౌన్సిల్ చైర్మన్, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పరంగి రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రాణాధికారి బత్తిని నాగరాజు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ప్రసన్నకుమార్, అధ్యాపకులు మునిస్వామి, భట్టు కిరీటం, వెల్దండి శ్రీధర్, అనిల్ బొజ్జ, జ్యోత్స్న, శివరాణి, సావిత్రి పాల్గొన్నారు. -
చక్రయ్యను అల్లుళ్లే అంతమొందించారు
సూర్యాపేటటౌన్: గ్రామంలో ఆధిపత్యం కోసం మామను అతికిరాతంగా హత్య చేయించాడు సొంత అల్లుడు. నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యగౌడ్ హత్య కేసులో 13 మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ విలేకరులకు వెల్ల డించారు. చక్రయ్యగౌడ్ ఆధిపత్యం సహించలేక.. మెంచు చక్రయ్యగౌడ్ గ్రామంలో పెద్దమనిషిగా చలామణి అవుతూ గ్రామ సర్పంచ్‌గా కూడా పనిచేశాడు. అతడికి ఐదుగురు కుమార్తెలు సంతానం. తన మూడో కుమార్తె కనకటి సునీతను కూడా సర్పంచ్‌గా, మూడో అల్లుడు కనకటి వెంకన్నను పీఏఏసీఎస్ చైర్మన్‌గా చేశాడు. అల్లుడు కనకటి వెంకన్న పీఏసీఎస్ చైర్మన్ అయిన్నప్పటి నుంచి నూతనకల్ మండలంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం ఉండటం వెంకన్న వర్గీయులు సహించలేకపోయారు. చక్రయ్యగౌడ్కు వ్యతిరేకంగా వెంకన్న వర్గీయులు ఒక గ్రూపుగా ఏర్పడడంతో వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2023లో చక్రయ్యగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024లో కనకటి వెంకన్న కూడా కాంగ్రెస్‌లోకి వచ్చాడు. అయినప్పటికీ గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో ఎలాగైనా మామ చక్రయ్యగౌడ్ను అడ్డు తొలగించుకోవాలని కనకటి వెంకన్న నిర్ణయించుకున్నాడు. బొడ్రాయి మహోత్సవంలో హత్యకు పథకం.. ఈ నెల 13న మిర్యాల గ్రామంలో బొడ్రాయి మహోత్సవం జరిగింది. గతంలో కనకటి వెంకన్న ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగేవి, చక్రయ్యగౌడ్ ఈసారి ఉత్సవాలను తన ఆధ్వర్యంలో జరపాలని బహిరంగంగా ప్రకటించడంతో వెంకన్న తట్టుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా చక్రయ్యగౌడ్ను హత్య చేయాలని తన వర్గీయులను కొంతమందిని వెంకన్న పురమాయించాడు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం చక్రయ్యగౌడ్ తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తుండగా.. అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్య, ఐదో అల్లుడు కనకటి లింగయ్యతో పాటు వెంకన్న అనుచరులైన కనకటి శ్రవణ్, కనకటి శ్రీకాంత్, గంధసిరి వెంకటేష్, పెద్దింటి మధు, పెద్దింటి గణేష్ అడ్డగించి మారణాయుధాలు, వెదురు కరల్రతో చక్రయ్యగౌడ్పై దాడి చేసి హత్య చేశారు. ఇదంతా దూరంగా నుంచి గమనిస్తున్న వెంకన్న చక్రయ్యగౌడ్పై దాడి జరిగగానే అతడు చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి అందరూ పారిపోయారు. ఈ హత్యపై నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోమవారం ఉదయం తుంగతుర్తి పరిధిలో వాహనాల తనిఖీల్లో భాగంగా.. చక్రయ్యగౌడ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్యతో పాటు హత్యకు కుట్ర పన్నిన మూడో అల్లుడు కనకటి వెంకన్న, వెంకన్న భార్య సునీత, మొదటి కుమార్తె కనకటి స్వరూప, ఐదో కుమార్తె కనకటి కల్యాణితో పాటు దిండిగల నగేశ్, జక్కి పరమేష్, మన్నెం రమేశ్, కనకటి వెంకన్న అలియాస్ మొండి వెంకన్న, కనకటి శ్రావ్య, కనకటి/వర్దెల్లి అనూష, జక్కి స్వప్న, భారీ సతీష్ రెండు కార్లలో వెళ్తుండగా పోలీసులు అదపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. చక్రయ్యగౌడ్ను హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఒక కర్ర, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 42 మందిపై కేసు నమోదైందని, దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న ఏడుగురు నిందితుల్లో కనకటి ఉప్పలయ్య మినహా మిగతా ఆరుగురు గతంలోనే కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం. మామ ఆధిపత్యం భరించలేక హత్యకు పథకం రచించిన మూడో అల్లుడు సహకరించిన ముగ్గురు కుమార్తెలు, మరో ఇద్దరు అల్లుళ్లు 13మంది నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కస్టడీ పిటీషన్ వేసి దర్యాప్తు చేస్తాం ఈ హత్య కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ఎవరినీ వదిలిపెట్టకుండా కచ్చితమైన ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు పారదర్శకంగా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కస్టడీ పిటిషన్ వేసి నిందితులను కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులకు ఎస్పీ రివార్డు అందజేశారు. ఈ కేసు ఛేదించిన సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ డి. శ్రీను, ఎస్ఐలు మహేంద్రనాథ్, ఎం. వీరయ్య, ఆర్. క్రాంతికుమార్‌ను ఎస్పీ అభినందించారు. -
ప్రశ్నపత్రం లీకేజీలో ఎవరి పాత్ర ఎంత?
బాధితురాలా? నిందితురాలా? ఇన్ని లోపాలకు కారణమైన వారిపై చర్యలు చేపట్టకుండా ప్రశ్నపత్రం ఫొటో తీసుకునేందుకు సహకరించిందంటూ బాలిక ఝాన్సీలక్ష్మిని డిబార్ చేయడం అనేక విమర్శలకు తావిస్తోంది. ప్రతిభావంతులైన పిల్లలు కూడా పదో తరగతి పరీక్షలు అంటేనే భయపడతారు. పరీక్ష కేంద్రంలోకి వచ్చాక ఎలా రాయాలన్న ఆందోళనలోనే ఉంటారు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి రాయితో కొడతానని బెదిరించి ప్రశ్నపత్రం ఫొటో తీసుకుంటే అందుకు బాలిక సహకరించినట్టా? విద్యార్థిని నుంచి ఫొటో తీసుకొని వెళ్లి, జవాబులను మళ్లీ ఆమెకు తెచ్చి ఇచ్చారా? ఈ విషయం విద్యాశాఖ అధికారులే చెప్పాలి. ఆ బాలిక బాధితురాలా? నిందితురాలా? అన్నది తేల్చాల్సి ఉంది. ఇవేమీ చెప్పకుండా, అసలు భద్రతాలోపం, పర్యవేక్షణ వైఫల్యాలకు కారణమైన వారిపై చర్యలు చేపట్టకుండా, ఆ బాలికను డిబార్ చేయడంపై విద్యార్థిని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పైగా ఈ సంఘటన జరిగిన నాలుగు రోజులకు (సోమవారం) మండల విద్యాధికారి ఈ సంఘటనపై ప్రకటన జారీ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఫ విద్యా, పోలీసు, రెవెన్యూ శాఖల వైఫల్యమే కారణమా! ఫ ప్రశ్నపత్రం ఫొటో తీసుకునేందుకు సహకరించిందంటూ బాలిక డిబార్ ఫ మరి.. బయటి వ్యక్తి పరీక్ష కేంద్రంలోని రావడానికి కారణమైన వారిపై చర్యలేవీ? ఫ అనుమానాలకు తావిస్తోన్న అధికారుల తీరు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పదో తరగతి తెలుగు పేపరు–1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి అసలు బాధ్యులు ఎవరు? ఎవరిని బలి చేశారన్న చర్చ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈనెల 21వ తేదీన ఉదయం లీకై న తెలుగు ప్రశ్నపత్రం శాలిగౌరారంలో యువకుల వాట్సాప్‌లలో సర్క్యూలేట్ అయ్యేంత వరకు ప్రశ్నపత్రం బయటకు వచ్చిన విషయాన్ని అధికారులు గుర్తించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. విద్యాశాఖ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం, భద్రతా వైఫల్యమే ప్రశ్నపత్రం లీకేజీకి కారణమనే చర్చ సాగుతోంది. పైగా ప్రశ్నపత్రం ఫొటో తీసుకునేందుకు సహకరించిందంటూ విద్యార్థిని ఝాన్సీలక్ష్మిని డిబార్ చేయడం అనేక విమర్శలకు కారణం అవుతోంది. గోడ దూకి ఎలా వచ్చాడు? సాధారణంగానే టెన్త్, ఇంటర్ పరీక్షల సమయంలో 144 సెక్షన్‌ను విధిస్తారు. పరీక్ష కేంద్రం పరిసరాల్లో ఇది అమల్లో ఉంటుంది. ఆ సమయంలో బయటి వ్యక్తి ఒకరు పాఠశాల ప్రహరిగోడ దూకి ఆవరణలోని వచ్చారంటే భద్రత వైఫల్యమే కారణమనే చర్చ సాగుతోంది. అంతేకాదు సదరు వ్యక్తి తరగతి గది వరకు వచ్చి మరీ కిటికీలోనుంచి విద్యార్థిని ప్రశ్నపత్రం ఫొటో తీసుకొని వెళ్లాడంటే లోపం ఎక్కడుందన్న విషయాన్ని విచారణలో పట్టించుకోవడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు స్థానిక పోలీసులు ఈ పరీక్షలకు సీరియస్‌గా తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం ఒకరిద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే పరీక్ష కేంద్రం వద్ద బందోబస్తుకు ఉంచినట్లుగా తెలుస్తోంది. భద్రత కల్పించడంలో స్థానిక పోలీసులు విఫలం అయ్యారని, ఆ విషయాన్ని పక్కన పెట్టి విచారణ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పరీక్ష కేంద్రం వద్ద పోలీసు భద్రత పటిష్టంగా ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిరాక్స్ కేంద్రాలు ఎలా తెరిచారు? పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాన్ని సెల్‌ఫోన్‌తో ఫొటో తీయగా, అందులోని ప్రశ్నలకు అనుగుణంగా ఒకే పేపరులో వచ్చేలా జవాబులను సిద్ధం చేసి స్థానికంగా జిరాక్స్ తీశారు. పరీక్షలు సమయంలో అంతటా జిరాక్స్ సెంటర్లను మూసేస్తారు. కానీ నకిరేకల్, శాలిగౌరారంలో జిరాక్స్ కేంద్రాలు ఎలా తెరిచి ఉంచారు? దానికి బాధ్యులు ఎవరన్నది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నకిరేకల్ : ‘పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీలో నాకు ఏ పాపం తెలియదు.. నన్న డిబార్ చేశారు. నాకు పరీక్ష రాసే అవకాశం కల్పించాలి. లేకుంటే నాకు చావే శరణ్యం’ అని పదో తరగతి విద్యార్థిని బల్లెం ఝాన్సీలక్ష్మి తన ఆవేదన వెలిబుచ్చిది. నకిరేకల్‌లో ఈ నెల 21 పదో తరగతి తెలుగు పేపర్ లీకై .. ప్రశ్నపత్రం వాట్సప్‌లలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రమేయం ఉందంటూ.. అధికారులు విద్యార్థిని ఝాన్సీలక్ష్మిని డిబార్ చేశారు. ఇప్పుడు ఆ విద్యార్థినిని మిగతా పరీక్షలకు అనుమతించడం లేదు. దీంతో ఆమె సోమవారం తన తల్లిదండ్రుల వెంకన్న, శోభతో కలిసి విలేకరుల ముందు తన గోడును వెల్లబోసుకుంది. తాను నకిరేకల్‌లోని శ్రీకృష్ణవేణి పాఠశాలలో నర్సరీ నుంచి పదో తరగతి వరకు చదువుకున్నానని, తాను క్లాస్‌లో టాపర్‌నని చెప్పింది. తీరా పది పరీక్షలు రాస్తున్న తరుణంలో ఎవరో ఆకతాయిలు తాను పరీక్ష రాస్తున్న గది వద్దకు తనను బెదిరించి ప్రశ్నపత్రం ఫొటోలు తీసుకున్నారని చెప్పింది. పేపర్ చూపించకుంటే రాయితో కొడతామని బెదిరించారని, ఆ సమయంలో భయపడి ప్రశ్నపత్రం చూపించానని, తన పక్కన ఉన్న విద్యార్థులు కూడా ఏం కాదులే చూపించు అన్నారని పేర్కొంది. పేపర్ ఫొటో తీసేందుకు సహకరించాననే ఆరోపణలతో తనను అధికారులు డీబార్ చేశారని చెప్పింది. ‘నా డిబార్‌ను రద్దు చేయండి.. నన్ను ఏ సెంటర్‌లోనైనా కూర్చోబెట్టి పరీక్ష రాయించినా.. రాస్తాను. ఎవరో చేసిన దానికి నన్ను బలిచేశారు. దయచేసి నాకు పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వండి’ అని ఝాన్సీలక్ష్మి వేడుకుంది. పరీక్షలకు అనుమతివ్వకపోతే చావే శరణ్యమని కన్నీటిపర్యంతమైంది. జిల్లా విద్యాధికారులు, పోలీసులు మానవత్వంతో కనికరించి తనకు అవకాశం ఇవ్వాలని కోరింది. నన్ను అన్యాయంగా డిబార్ చేశారుఫ పరీక్ష రాసే అవకాశం ఇవ్వండి ఫ విద్యార్థిని ఝాన్సీలక్ష్మి -
నల్లగొండ
ఇఫ్తార్ 6–34 (మంగళవారం సాశ్రీశ్రీ) సహర్ 4–54 (బుధవారం ఉశ్రీశ్రీ)అల్లుళ్లే అంతమొందించారు గ్రామంలో ఆధిపత్యం కోసం మామను అతికిరాతంగా హత్య చేయించారుసొంత అల్లుళ్లు. 7- 8లోమంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025లక్ష్యం సాధించే వరకు.. లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. దాన్ని సాధించే వరకు విశ్రమించొద్దని గ్రూప్–2 స్టేట్ టాపర్ హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. - 8లో -
టెన్త్ పరీక్షకు 158 మంది గైర్హాజరు
నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా 105 కేంద్రాల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు సోమవారం 158 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సోమవారం జరిగిన ఆంగ్లం పరీక్షకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 18,679 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 18,521 మంది హాజరయ్యారు. 158 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. 28న రైతు సత్యాగ్రహంనల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని కలెక్టరేట్ ఎదుట ఈ నెల 28న రైతు సత్యాగ్రహం నిర్వహించనున్నట్లు బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం వెంకట్‌రెడ్డి, గుడుగుంట్ల సాయన్నగౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐకేపీ కేంద్రాలు ప్రారంభించడంతో పాటు దొడ్డు ధాన్యానికి రూ.500 బోనస్, రైతు భరోసా, ఎండిన పొలాలకు ఎకరాకు రూ.30 వేలు నష్టపరిహారం ఇవ్వాలని సత్యగ్రహం చేపడుతున్నట్లు తెలిపారు. సాగర్ ఆసుపత్రిని సందర్శించిన కాయకల్ప బృందంనాగార్జునసాగర్ : సాగర్ కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రిని సోమవారం కాయకల్ప బృందం పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలోని వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా, ఏరియా ఆస్పత్రులను ఈ బృందం ఏటా పరిశీలిస్తుంది. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలు, పరిశుభ్రత, ఆస్పత్రి నిర్వహణ, పరిసరాలు, సిబ్బంది విధి నిర్వహణను పరిశీలించి నివేదికలను ఉన్నత స్థాయి అధికారులకు అందజేస్తుంది. నివేదికల ఆధారంగా ప్రమాణాలు పాటిస్తూ వైద్యసేవలు అందిస్తున్న ఆస్పత్రులను ఎంపిక చేసి అవార్డులను అందజేస్తారు. అందులో భాగంగా కొల్లాపూర్ ఏరియా ఆస్పత్రి డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒక బృందం సాగర్ ఏరియా ఆస్పత్రిని సందర్శించి పరిశీలించింది. వీరితో పాటు స్థానిక కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ హరికృష్ణ, వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది తదితరులు ఉన్నారు. నెల్వలపల్లి హెచ్ఎం సస్పెన్షన్చింతపల్లి : విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రధానోసాధ్యాయుడిని విధుల తొలగిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చింతపల్లి మండల పరిధిలోని నెల్వలపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వేణుగోపాలు విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు మహిళా ఉపాధ్యాయులను మానసిక వేధించడం, పాఠశాల నిబంధనలు పాటించకపోవడం, రికార్డులు సరిగా నిర్వహించడం లేదు. దీనిపై మండల విద్యాధికారి అంజయ్య అధికారులకు నివేదిక అందజేయడంతో ఆయనను విధుల నుంచి తొలగించారు. క్షయ రహిత జిల్లాగా మారుద్దాంనల్లగొండ టౌన్ : క్షయ రహిత జిల్లా కోసం సమష్టిగా కృషి చేద్దామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్షయ నివారణ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక టీఎన్జీవో భవన్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీబీపై ప్రజల్లో విరివిగా అవగాహన కలిగించాలన్నారు. టీబీ లక్షణాలుంటే జిల్లా కేంద్రంలోని టీబీ సెంటర్లో పరీక్షలు చేయించుకుని సక్రమంగా మందులను వాడితే పూర్తిగా నయమవుతుందన్నారు. అనంతరం జిల్లా క్షయ నివారణ కేంద్రం రివర్నిమ్స్ ఆస్పత్రి సంయుక్తంగా జిల్లాస్థాయిలో విద్యార్థులు నిర్వహించిన ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వాణిశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ దామెర యాదయ్య, డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, కేస రవి, అరుంధతి, బ్లెస్సీ, ఇస్తార్, రవిప్రసాద్, హరికృష్ణ, రమేష్, రాఘవేందర్‌రెడ్డి, నాగిల్ల మురళి, కళ్యాణ చక్రవర్తి, నర్సింగ్ కాలేజి విద్యార్థినులు పాల్గొన్నారు. -
యూజీసీ మార్గదర్శకాలను రద్దు చేయాలి
రామగిరి(నల్లగొండ) : యూజీసీ – 2025 మార్గదర్శకాలను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అనిల్ అబ్రహం డిమాండ్ చేశారు. ఎంఫిల్, పీహెచ్డీ ఇంక్రిమెంట్ల రద్దుకు వ్యతిరేకంగా సోమవారం ఎన్జీ కళాశాల ఎదుట అసిస్టెంట్ ప్రొఫెసర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్‌కు పీహెచ్డీ తప్పనిసరి చేయడం సరికాదన్నారు. నూతన విద్యా విధానం–2020పై నిష్ణాతులైన ప్రొఫెసర్లను చర్చకు ఆహ్వానించి విధి విధానాలను ఖరారు చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, డాక్టర్ అనిల్ బొజ్జ, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ పరంగి రవికుమార్, డాక్టర్ అంతటి శ్రీనివాస్, సీఓఈ బత్తిని నాగరాజు, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్న కుమార్, అధ్యాపకులు ముని స్వామీ, కిరీటం, శ్రీధర్, సుధాకర్, మల్లేశం, జ్యోత్స్న, భాగ్యలక్ష్మి, శంకర్ తదితరులున్నారు. -
రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవికి లైన్ క్లియర్ అయినట్లు తెలిసింది. దీంతో జిల్లాకు మరో మంత్రి పదవి దక్కబోతోంది. మంత్రివర్గ విస్తరణపై సోమవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, భారీ నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించారు. ఇందులో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవితోపాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతో రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. అయితే, వివిధ కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు కూడా మంత్రి పదవి వస్తుందన్న నమ్మకంతో ఆయన అనుచరులు ఉన్నారు. అయితే, రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వబోతున్నందున బాలు నాయక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవులు ఉండగా, మూడో మంత్రి పదవి రాజగోపాల్‌రెడ్డికి దక్కనుంది. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫ ఉమ్మడి జిల్లాకు మూడో మంత్రి ఫ బాలునాయక్‌కు డిప్యూటీ స్పీకర్ ఫ ఢిల్లీ చర్చల్లో దాదాపుగా ఖరారు -
తెలంగాణ కళాకారులతో దొడ్డి కొమురయ్య సినిమా
హుజూర్నగర్: తెలంగాణలోని అన్ని జిల్లాల కళాకారులతో దొడ్డి కొమురయ్య జీవిత చర్రితపై సినిమా నిర్మిస్తున్నట్లు సినీ దర్శకుడు సేనాపతి అన్నారు. సోమవారం హుజూర్నగర్ వచ్చిన ఆయన స్థానిక కళాకారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గొప్ప చరిత్ర కలిగిన దొడ్డి కొమరయ్య జీవితాన్ని తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా నేటి తరం యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మాణానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. తెలంగాణ కళాకారులకు ఈ సినిమాలో అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో కళాకారులు ఎస్. శ్రీనివాస్, జి. దీప, కె. బాబు, డి. శ్రీనివాస్, నరసింహచారి, బి. గోవిందరావు, కె. రవి, పి. వెంకటేశ్వర్లు, ఎం. సైదులు, డి. బాబురావు తదితరులు పాల్గొన్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్సూర్యాపేటటౌన్: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను సూర్యాపేట టౌన్ సీఐ వీరరాఘవులు విలేకరులకు వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం సూర్యాపేట టౌన్ ఎస్ఐ సైదులు, పోలీస్ సిబ్బంది కలిసి సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో సూర్యాపేట పట్టణానికి చెందిన దాసరి సిద్దార్ధ, మహ్మద్ ఉమర్ బైక్‌పై ఒక కిలో 200 గ్రాముల గంజాయితో కోదాడ నుంచి సూర్యాపేటకు వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. పార్ట్‌టైం జాబ్ పేరుతో మోసం● డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు భువనగిరి: పార్ట్‌టైం జాబ్ పేరుతో ఓ వ్యక్తి వద్ద సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేశారు. భువనగిరి రూరల్ ఎస్హెచ్ఓ సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గూడూరు మండలానికి చెందిన గోసాల శ్యామల్రావు ఏడాది క్రితం బతుకుదెరువు కోసం భువనగిరి మండలం రాయగిరి గ్రామానికి వలస వచ్చాడు. ప్రస్తుతం సూపర్వైజర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 15న పార్ట్‌టైం జాబ్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తూ ఒక లింక్ ఓపెన్ చేశాడు. అందులో తన వివరాలను నమోదు చేశాడు. తర్వాత తన ఫోన్లోని వాట్సాప్‌కు వచ్చిన వీడియోను చూసి లైక్ చేసి షేర్ చేశాడు. అనంతరం ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాందించవచ్చని చెప్పి కొన్ని టాస్క్‌లు ఇచ్చారు. టాస్క్‌లో భాగంగా వారు పంపిన వెబ్సైట్లో డబ్బులు డిపాజిట్ చేస్తే 30శాతం లాభం వస్తుందని చెప్పారు. దీంతో శ్యామల్రావు మొదట రూ.1000 డిపాజిట్ చేయగా.. రూ.1500 రిటర్న్స్ వచ్చాయి. ఈవిధంగా ఈ నెల 18వ తేదీ నాటికి రూ.1,92,000 డిపాజిట్ చేశాడు. తర్వాత డబ్బులు రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి 1930 కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. -
టాటా ఏస్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరికి గాయాలు
కొండమల్లేపల్లి: టాటా ఏస్ వాహనాన్ని కారు ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలం జోగ్యతండా వద్ద సోమవారం జరిగింది. పెద్దఅడిశర్లపల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు కొండమల్లేపల్లి మండలం జోగ్యతండా సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి హైదరాబాద్ నుంచి కొండమల్లేపల్లి వైపు కుక్కర్లు, మిక్సీలు తదితర సామగ్రితో వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ డ్రైవర్ మల్లేష్ కాలు విరగడంతో చికిత్స నిమిత్తం అతడిని స్థానికులు దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రామ్మూర్తి తెలిపారు. హత్య కేసులో నిందితుడికి పదేళ్లు జైలుశిక్ష భువనగిరి: భార్యాభర్తను హత్య కేసిన కేసులో నిందితుడికి పదేళ్లు జైలుశిక్ష, రూ.20వలే జరిమానా విధిస్తూ భువనగిరి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి జయరాజు సోమవారం తీర్పు వెలువరించారు. భువనగిరి రూరల్ ఎస్హెచ్ఓ సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం తుక్కాపురం గ్రామానికి చెందిన రాసాల బస్వయ్య గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2023 అక్టోబర్ 13వ తేదీన బస్వయ్య తన ఇంటి వద్ద ఉన్న గొర్రెల దొడ్డి నుంచి గొర్రెలను మేపేందుకు తోలుకెళ్తున్నాడు. ఈ క్రమంలో బస్వయ్య ఇంటి పక్కనే ఉంటున్న రాసాల రాజమల్లు తన ఇంటి ముందు నుంచి గొర్రెలను తోలుకపోవడం వల్ల దుమ్ము లేచి ఇబ్బందులు పడుతున్నామని బస్వయ్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటామాట పెరిగి రాజమల్లు అక్కడే ఉన్న పారతో బస్వయ్య తలపై కొట్టాడు. అదే సమయంలో అడ్డుగా వచ్చిన బస్వయ్య భార్య తిరుపతమ్మ తలపై కూడా కొట్టాడు. దీంతో బస్వయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. తిరుపతమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతుడి అల్లుడు గంగనమోని శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి సీఐ సత్యనారాయణ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును విచారణలో భాగంగా జడ్జి సాక్ష్యాధారాలు పరిశీలించి రాజమల్లుకు పదేళ్లు జైలు, రూ.20వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. -
కిరాణా షాపు యజమానికి టోకరా
నకిరేకల్: సరుకులు కొనేందుకు కిరాణ దుకాణం వద్దకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి షాపు యాజమాని ఫోన్ తీసుకుని ఫోన్ పే ద్వారా రూ.90వేలు ట్రాన్స్ఫర్ చేసుకుని పరారయ్యాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో ఆదివారం రాత్రి జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని మూసీ రోడ్డులో మంచుకొండ రాధాకిషన్ నిర్వహిస్తున్న కిరాణ షాప్‌కు ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి వచ్చారు. తనకు కావల్సిన సరుకుల లిస్ట్‌ను షాపు యాజమాని మంచుకొండ రాధాకిషన్‌కు ఇచ్చాడు. షాపు యాజమాని సరుకులు కట్టే పనిలో నిమగ్నం కాగా.. ఇంటికి ఫోన్ చేసి ఇంకా ఏమైనా సరుకులు కావాలా అని అడుగుతానని సదరు వ్యక్తి రాధాకిషన్ ఫోన్ అడిగాడు. దీంతో రాధాకిషన్ తన ఫోన్‌ను సదరు వ్యక్తికి ఇచ్చాడు. ఫోన్ తీసుకున్న గుర్తుతెలియని వ్యక్తి మూడు సార్లు రూ.90వేలు ఫోన్ పే ద్వారా వేరే నంబర్‌కి డబ్బులు పంపే ప్రయత్నం చేశాడు. పాస్వర్డ్ తెలియకపోవడంతో మూడు సార్లు ట్రాన్‌శాక్షన్ ఫెయిల్ అని పడింది. నాల్గోసారి సరైన పాస్వర్డ్ నమోదు చేయడంతో రూ.90 వేలు రేష్మాదేవి పేరుతో ఉన్న అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ అయ్యాయి. అనంతరం సదరు వ్యక్తి ఫోన్‌ను షాపు యాజమాని రాధాకిషన్‌కు ఇచ్చి.. నేను చికెన్ తెచ్చుకుని వస్తా సరుకులు కట్టి బిల్ చేసి పెట్టండని అక్కడ నుంచి ఉడాయించాడు. సదరు వ్యక్తి అరగంట అయినా రాకపోవడంతో రాధాకిషన్ తన భార్య లక్ష్మికి విషయం చెప్పాడు. అనుమానం వచ్చి రాధాకిషన్ ఫోన్‌ను అతడి భార్య చెక్ చేయగా.. రూ.90 వేలు ట్రాన్స్ఫర్ అయినట్లు మెసేజ్ కనిపించింది. దీంతో ఆదివారం రాత్రి రాధాకిషన్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసును సైబర్ క్రైంకు బదిలీ చేశారు. ప్రస్తుతం సైబర్ క్రైం వారు కేసు విచారణ చేస్తున్నారు. సరుకుల కొనేందుకు వచ్చి ఫోన్ పే ద్వారా రూ.90వేలు ట్రాన్స్ఫర్ చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేవించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి దరఖాస్తులను జాప్యం చేయకుండా పరిష్కరించాలన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే.. ఎందుకు కాలేదో ఫిర్యాదుదారులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. అనంతరం కలెక్టర్ వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘దర్తీ ఆబ జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్’ పథకం కింద తిరుమలగిరి సాగర్ మండలం, రంగుండ్ల తండాలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. తండాలో జల్ జీవన్ కింద పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా 10 మీటర్ల లోతున వాన నీటి కట్టడాలను చేపట్టాలని సూచించారు. గ్రామంలో అన్ని ప్రభుత్వ సంస్థల్లో సోలార్ లైట్లు, 10 హెచ్‌పీ సోలార్ పంప్, పబ్లిక్ టాప్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రంగుండ్లలో చేపట్టే పనులు ఇతర తండాలకు మోడల్‌గా నిలవాలని సూచించారు. 52 గిరిజన తండాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్‌రెడ్డి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
లక్ష్యం సాధించే వరకు విశ్రమించొద్దు
కోదాడ: లక్ష్యాన్ని నిర్ధేశించుకొని.. దానిని సాధించే వరకు విశ్రమించొద్దని గ్రూప్–2 స్టేట్ టాపర్ నారు హరవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రూప్–2లో తొలి ప్రయత్నంలోనే రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించిన కోదాడకు చెందిన హరవర్ధన్‌రెడ్డి విజయ ప్రస్థానం ఆయన మాటల్లోనే.. అక్కడ పుట్టి.. ఇక్కడ పెరిగామా స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కంభం. మా నాన్న నారు రవణారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడిగా ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహించేవారు. ప్రాథమిక విద్య ఖమ్మంలో, ఇంటర్మీడియట్ విజయవాడలో చదివాను. తాడేపల్లిగూడెం ఎన్ఐటీలో ఇంజనీరింగ్(సీఎస్సీ) పూర్తిచేశాను. ప్రస్తుతం మా నాన్న కోదాడ కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. మా నాన్నే నాకు స్ఫూర్తి..మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మా నాన్న కష్టపడి చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నాను. ఎన్ఐటీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కు కూడా ప్రయత్నించలేదు. తొలి ప్రయత్నంలోనే విజయం2021 నుంచి గ్రూప్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టాను. ముందు సివిల్స్ కోసం ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను. ఆ సమయంలోనే గ్రూప్–1, గ్రూప్ – 2 నోటిఫికేషన్లు రావడంతో సివిల్స్ వదిలేసి గ్రూప్స్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టాను. మొదట ఈ రెండింటికి ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పటికీ ఆ తర్వాత కేవలం గ్రూప్–2 పైనే పూర్తిగా దృష్టి సారించాను. రోజుకు 10 గంటలు చదివి తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచాను. సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నాపోటీ పరీక్షలకు సిద్ధమవ్వడం ఒక యుద్ధంలాంటిది. యుద్దంలో ఆయుధాలు ఎంత ముఖ్యమో పోటీ పరీక్షలకు ప్రమాణిక పుస్తకాలు అంత ముఖ్యం. దీంతో పాటు సొంతంగా నోట్స్ తయారు చేసుకోవడం కూడా చాలా అవసరం. ఇండియన్ హిస్టరీ కోసం నిధి సింఘానియా పుస్తకం, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వి. ప్రశాశ్ పుస్తకం, సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం ఎన్సీఈఆర్టీ పుస్తకాలను చదివాను. కరెంట్ అఫైర్స్ కోసం కాంపిటీటివ్ వెబ్‌సైట్స్‌తో పాటు దినపత్రికలను చదివాను. ఓపిక ఉంటేనే విజయం సొంతంపోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఓపిక ఉండాలి. పరీక్షలు సుదీర్ఘకాలం సాగవచ్చు లేదా వాయిదా పడవచ్చు. ఇలాంటి సమయంలో సమన్వయం కోల్పోవద్దు. ఆశాజనకంగా ప్రయత్నించాలి. ఒకేసారి ఎక్కువ పరీక్షలకు సిద్ధమవ్వకుండా ఒకే పరీక్షపై దృష్టి పెట్టాలి. దానిని సాధించిన తర్వాత ఇతర పరీక్షల వైపు వెళ్లవచ్చు. గ్రూప్–1, సివిల్స్‌కు సన్నద్ధమవుతా..ప్రస్తుత మార్కులతో డిప్యూటీ తహసీల్దార్ లేదా రాష్ట్ర సచివాలయంలో ఏఎస్ఓ ఉద్యోగాన్ని ఎంచుకుంటాను. దీనిలో శక్తి వంచన లేకుండా సేవలందిస్తాను. భవిష్యత్తులో గ్రూప్–1, సివిల్స్ కోసం ప్రిపరేషన్ కొనసాగిస్తాను. పోటీ పరీక్షలకు ఓపికతో సన్నద్ధమవ్వాలి గ్రూప్–2 స్టేట్ టాపర్ హరవర్ధన్‌రెడ్డి -
లయన్స్ క్లబ్ గవర్నర్‌గా రేపాల మదన్మోహన్
నల్లగొండ : ఉమ్మడి జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్‌గా రేపాల మదన్మోహన్, డిస్ట్రిక్ట్–1 వైస్ గవర్నర్‌గా కేవీ ప్రసాద్, డిస్ట్రిక్ట్–2 వైస్ గవర్నర్‌గా కోడె సతీష్‌కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం నల్లగొండలో జిల్లా గవర్నర్ ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన లయన్స్ క్లబ్ వార్షికోత్సవంలో వీరిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గట్టమనేని బాబురావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అన్ని ప్రాంతాల్లో విస్తరించాలని సమాజ సేవే పరమావదిగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దీపక్ బట్టాచార్య, రాజిరెడ్డి, నరేందర్‌రెడ్డి, తీగల మోహన్‌రావు, గోలి అమరేందర్‌రెడ్డి, బీమయ్య, శివప్రసాద్, కేవీ.ప్రసాద్, కోటేశ్వర్రావు, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
బకాయిలు రూ.13.31 కోట్లు
నల్లగొండ టూటౌన్: నీలగిరి పట్టణంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. పట్టణంలో 96 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, 300 రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. 2024– 25కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను రూ.1.43 కోట్ల 15 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను రూ.6.20 కోట్ల 15 లక్షలు చెల్లించాల్సి ఉంది. ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను చెల్లించని కారణంగా పాత బకాయిలతో కలిసి మొత్తం రూ.13 కోట్ల32లక్షల 38 వేలు ఉంది. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను చెల్లింపు కోసం ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నా ఇతర వాటికి దుబారా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నోటీసులు జారీ చేసిన అధికారులు మార్చి 31 నాటికి పట్టణంలో వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు టార్గెట్ పెట్టడంతో బకాయిదారుల జాబితా తయారు చేసి నోటీసులు అందజేశారు. అదేవిధంగా పట్టణంలో ఉన్న 96 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, 300 రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు పంపించారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా సకాలంలో ఆస్తి పన్ను చెల్లించకుంటే ఆస్తి పన్నుపై అపరాధరుసుం చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయం పట్టించుకోకుండా సంబంధిత శాఖల అధికారులు వ్యవహిస్తుండడంతో ఆయా శాఖలకు సైతం భారం అవుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు కావడంతో ఆస్తి పన్ను చెల్లించాలని మున్సిపల్ సిబ్బంది సైతం గట్టిగా అడగలేని పరిస్థితి నెలకొంది. బకాయిలపై కలెక్టర్ దృష్టి సారిస్తేనే వసూలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ నీలగిరి పట్టణంలో ఆస్తి పన్ను చెల్లించని ప్రభుత్వ కార్యాలయాలు ఫ నోటీసులు జారీ చేసిన మున్సిపల్ యంత్రాంగం ఆస్తి పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు బకాయి లేకుండా వెంటనే ఆస్తి పన్ను చెల్లించాలి. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చెల్లించడం ద్వారా వారికి అపరాధ రుసుం పడదు. ప్రతి ఆరు నెలలకు ఒక సారి పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. – సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ -
సీఎం సభా ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
ఉగాది పర్వదినాన సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా హుజూర్‌నగర్‌లో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభం సందర్భంగా నిర్వహించే సభా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్టకు వెళ్లే రోడ్డులో సీఎం సభా ప్రాంగణ ఏర్పాటుకు మంత్రి జిల్లా అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం సభ ఏర్పాట్లపై జిల్లా అధికారులలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీకి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నర్సింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, ఇరిగేషన్ సీఈ రమేష్‌బాబు, ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, సీఐ చరమందరాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, నాయకులు యరగాని నాగన్న, సీహెచ్ లక్ష్మీనారాయణరెడ్డి, తన్నీరు మల్లిఖార్జున్, కోతి సంపత్‌రెడ్డి, శివరాంయాదవ్, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
హుజూర్నగర్, పాలకవీడు: ఉమ్మడి జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పాలకవీడు మండలం జాన్‌పహాడ్ దర్గా వద్ద నిర్వహించిన కందూరు కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు. అనంతరం స్థానిక డక్కన్ సిమెంట్ పరిశ్రమ అతిథి గృహంలో రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వెంకట్‌రెడ్డితో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ, డిండి, నెల్లికల్లు, నాగార్జునసాగర్ ఎడుమ కాల్వ, ఏఎంఆర్‌కు మరమ్మతులు చేయిస్తామని అన్నారు. ఇటీవలే గంధమల్ల ప్రాజెక్టుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలో దాని పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని ప్రజాపాలనతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి చెప్పారు. రోడ్ల అభివృద్ధిలో నంబర్ వన్‌గా ఉంచుతాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిరోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధిలో ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలో నంబర్ వన్‌గా ఉంచుతామని అన్నారు. రూ.వెయ్యి కోట్లతో రైల్వే బ్రిడ్జ్‌లు, రూ.140 కోట్లతో దామరచర్ల వద్ద బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్ర మంత్రి అనుమతి ఇచ్చారని కోమటిరెడ్డి తెలిపారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు రూ.200 కోట్లు కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వం పదేళ్లు పెండింగ్‌లో ఉంచిందని, మేము అధికారంలోకి రాగానే పూర్తిచేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభించామన్నారు. దేవాదుల ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామన్నారు. దక్షిణ తెలంగాణలో 36 అసెంబ్లీ సీట్లకు కాంగ్రెస్ 32 గెలిచిందని..ప్రజలు మావైపు ఉన్నారనేందుకు ఇది నిదర్శనమన్నారు. ఇవన్నీ తెలియకుండా బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పదేళ్లు అధికారం ఇస్తే ఏమీ చేయని వారు పన్నెండు నెలలకే కొంపలు మునిగినట్లు మామీద పడుతున్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో అన్ని రోడ్లు బీటీగా మారుస్తామని, ఏప్రిల్ రెండవ వారంలో టెండర్లు పిలువనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వివరించారు. జాతీయ రహదారులను సైతం విస్తరించేలా కృషి చేస్తున్నామన్నారు. తొలుత హెలిపాడ్ వద్ద మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మందుల సామేలు, వేముల వీరేశం, బాలునాయక్, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పాడి అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, భూక్యాగోపాల్, మాళోతు మోతీలాల్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రజా పాలనతో విప్లవాత్మక మార్పులు ఫ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫ జాన్‌పహాడ్ పరిధిలో మంత్రి కోమటిరెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష ఫ హుజూర్‌నగర్‌లో సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన -
నేడు నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం నల్లగొండకు రానున్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9 గంటలకు నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 9.30 గంటలకు ఆర్జాలబావిలో, 10.30 గంటలకు తిప్పర్తిలో ధాన్యం కొనుగోలలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నల్లగొండ నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్తారు. రైతు సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలంచింతపల్లి : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ విమర్శించారు. ఆదివారం చింతపల్లిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ జిల్లా 15వ మహాసభలో ఆమె మాట్లాడారు. భూమి, భుక్తి, రైతు సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నడిపిన చరిత్ర తెలంగాణ రైతు సంఘానికి ఉందన్నారు. దేశంలో వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారం కోసం స్వామినాథన్ కమిషన్ సూచనలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు ఎండీ.మోహినుద్దీన్, కార్యదర్శి గిరిజ రామచంద్రయ్య, సుదర్శన్‌రెడ్డి, పోలె వెంకటయ్య, ఉజ్జిని అంజల్‌రావు పాల్గొన్నారు. ఆర్థిక పరిస్థితి బాగలేదనడం సరికాదునల్లగొండ : ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విషయం తేల్చకుండా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేదనడం సరికాదని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల పీఆర్సీ గడువు ముగిసిందని, పీఆర్సీ రిపోర్టు వెంటనే తీసుకుని అమలు చేయాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి కేవలం 7.57 శాతం కేటాయించడం సరికాదన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశం, ప్రధాన కార్యదర్శి పి.వెంకులు, ఉపాధ్యక్షుడు పి.ఏడుకొండలు, ఎం.పుష్పలత, ఎన్.గోపి, ఎం.నాగయ్య, టి.వెంకటేశ్వర్లు, జగతి, రాహెల్కుమారి, అంజయ్య, ఖుర్షిద్‌మియా పాల్గొన్నారు. ఫ్లెక్సీ మెటీరియల్‌పై పన్నులు రద్దుచేయాలినల్లగొండ : కేంద్ర ప్రభుత్వం ఫ్లెక్సీ మెటీరియల్‌పై వేసిన పన్నులను రద్దు చేయాలని ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్‌రెడ్డి కోరారు. ఆదివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్లెక్సీ, ప్రింటింగ్ యజమానులను కాపాడాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు చిలుకూరి జగన్నాథ్ మాట్లాడుతూ రెండు రోజులుగా షాపులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్రింటింగ్ రేట్లు పెంచక తప్పడం లేదన్నారు. కార్యక్రమంలో కల్లూరి నగేష్‌గౌడ్, రామగిరి వెంకన్న, సురేష్, చంద్రశేఖర్, సిరాజుద్దీన్, శ్రీధర్, హరీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
మూల్యాంకనంలో నిబంధనలకు పాతర!
నల్లగొండ : ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనంలో బోర్డు నిబంధనలకు అధికారులు పాతర వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సీనియర్లను కాదని జూనియర్లకే అన్ని బాధ్యతలు అప్పగిస్తున్నారని తెలిసింది. పేపర్ వాల్యుయేషన్‌లో జూనియర్ కళాశాలల అధ్యాపకులకే బాధ్యతలు అప్పగిస్తూ గురుకుల, మోడల్ అధ్యాపకులు సీనియర్లు ఉన్నా.. వారికి అవకాశం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదని.. తాగు నీటిని కూడా ఇంటి నుంచే తెచ్చుకుంటున్నామని పలువురు అధ్యాపకులు చెబుతున్నారు. సీనియర్లను కాదని జూనియర్లకు బాధ్యతలు నల్లగొండలోని కోమడిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మొదటి వాల్యువేషన్ పూర్తికాగా.. ఆదివారం నుంచి రెండో విడతను ప్రారంభించారు. అయితే అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. వారిపై చీప్ ఎగ్జామినర్లు, సబ్జెక్టు ఎక్స్‌పర్ట్‌లతోపాటు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ల బాధ్యతలు ఉంటాయి. అయితే బోర్డు నిబంధనల ప్రకారం అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ (ఏసీఓ) బాధ్యతలు జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఇవ్వాలి. కానీ ఇక్కడ జూనియర్ లెక్చరర్లకు అప్పగించారు. ఆయా విషయంలో అనుభవం ఉన్నవారినే సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లుగా నియమించాలి.. కానీ 25 ఏళ్ల సీనియర్లను కాదని.. జూనియర్ లెక్చరర్లకే ఆ బాధ్యతలు అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి. చీఫ్ ఎగ్జామినర్ల నియామకంలోనూ అదే తీరుగా వ్యవహరించారని అధ్యాపకులు పేర్కొంటున్నారు. కొరవడిన మౌలిక సదుపాయాలు.. నల్లగొండలోని మూల్యాంకనం కేంద్రంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. తాగునీరు లేకపోగా కనీసం రూమ్‌లు శుభ్రంగా ఉంచడం లేదని, టాయ్లెట్లు కూడా సక్రమంగా లేవని అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఫ జూనియర్లకు అందలం.. సీనియర్లకు మొండి చేయి ఫ ప్రిన్సిపాళ్లకు ఇవ్వాల్సిన ఏసీఓ పోస్టులు జూనియర్లకు అప్పగింత ఫ సబ్జెక్టు ఎక్స్పర్ట్ బాధ్యతలు కూడా జూనియర్లకే.. ఫ కేంద్రంలో కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదని అధ్యాపకుల ఆవేదన నిబంధనలు పాటిస్తున్నాం మూల్యాకనంలో ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారమే విధులు కేటాయించాం. అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ల నియామకాలకు సంబంధించి ప్రిన్సిపాళ్లు రాకపోవడంతోనే జూనియర్ లెక్చరర్లకు అవకాశం కల్పించాం. మూల్యాంకనంలో ప్రభుత్వ, ఇటీవల రెగ్యులర్ అయిన లెక్చరర్లకే అవకాశం మొదట ఇస్తున్నాం. ఆ తర్వాత మోడల్ స్కూల్, గురుకుల అధ్యాపకులకు ఇస్తాం. చీఫ్ ఎగ్జామినర్లు, సబ్జెక్టు ఎక్స్‌పర్ట్‌ల విషయంలో సీనియర్లు లేనప్పుడే జూనియర్లకు అవకాశం ఇస్తున్నాం. మూల్యాంకన కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. మూ ల్యాంకనానికి అవకాశం రాని కొందరు అధ్యాపకులే ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారు. – దస్రూనాయక్, డీఐఈఓ -
మహిళా రైతులకే వ్యవసాయ యాంత్రీకరణ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘వ్యవసాయ యాంత్రీకరణ’లో తొలిసారిగా మహిళా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్టవ్యాప్తంగా 10,812 యూనిట్లు అందజేసేందుకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. రూ.24.90 కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అంటే...ఈనెల 31వ తేదీలోగా పథకాన్ని అమలు చేయాలని ఆదేశించింది. మొత్తంగా 14 రకాల పరికరాలను వ్యవసాయ యాంత్రీకరణ కింద అందజేయాలని నిర్ణయించింది. దీంతో క్షేత్రస్థాయిలో జిల్లాల్లో వ్యవసాయశాఖ లబ్ధిదారులను గుర్తించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఏడేళ్ల తర్వాత పునరుద్ధరణ రాష్ట్రంలో రైతుబంధు అమల్లోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ యాంత్రీకరణతోపాటు విత్తనాలపై సబ్సిడీలు ఆగిపోయాయి. 2018 నుంచి రైతులకు యాంత్రీకరణ పనిముట్లను అందజేసే కార్యక్రమాన్ని నిలిపివేసింది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీ ఉండేది. ప్రస్తుతం అందరికీ 50 శాతం సబ్సిడీతో ఈ యాంత్రీకరణ పరికరాలను అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతేకాదు వాటిని విక్రయించే సంస్థలను కూడా ఖరారు చేసింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించిన రైతులు 50 శాతం సబ్సిడీతో ఆయా పరికరాలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని వివరించింది. అయితే ప్రస్తుతం సమయం తక్కువగా ఉండటంతో లబ్దిదారుల ఎంపిక అధికారులకు తలనొప్పిగా మారింది. 14 రకాల యాంత్రీకరణ పరికరాలు వ్యవసాయ పనుల్లో రైతులకు దోహదపడే 14 రకాల యంత్ర పరికరాలను 50 శాతం సబ్సిడీతో మహిళా రైతులకు అందజేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా చేతిపంపులు, పవర్ స్ప్రేయర్లు, డ్రోన్లు, రోటోవేటర్లు, విత్తనాలు/ఎరువులు వేసే పరికరాలు, ట్రాక్టర్‌తో దమ్ము చేసే పరికరాలు, పవర్టిల్లర్లు, ఎద్దులతో బోదలు పోసే పరికరాలు, ట్రాక్టర్లతో బోదలుపోసే పరికరాలు, పవర్వీడర్స్, బ్రష్‌కట్టర్స్, ట్రాక్టర్లు, మొక్కజొన్న కోత పరికరాలు, గడ్డిచుట్టే పరికరాలను సబ్సిడీతో కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. -
Telangana: మరోసారి బర్డ్ ఫ్లూ విజృంభణ
నల్లగొండ అగ్రికల్చర్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతోది. వ్యాధి వ్యాప్తి పెరిగి లక్షలాది బ్రాయిలర్, లేయర్ కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. బర్డ్‌ఫ్లూ సోకడంతో ఇప్పటికే భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెం, చౌటుప్పల్ మండటం నేలపట్లలోని పలు పారాల్లోని వేలాది కోళ్లను అధికారులు పూడ్చి వేయించారు. ప్రస్తుతం చిట్యాల మండలం ఏపూరు సమీపంలోని కోళ్ల పారాల్లో వ్యాధి నిర్ధారణ కావడంతో కోళ్లను పూడ్చి వేయిస్తున్నారు. జిల్లా పశు వైద్య సంవర్థక శాఖ అధికారులు అప్రమత్తమై బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్ల పారాలకు సమీప ప్రాంతాల్లో 3 కిలో మీటర్ల దూరం వరకు రెడ్ జోన్‌గా ప్రకటించారు. అక్కడి పరిసర ప్రాంతాలకు వ్యక్తులు, ఇతర వాహనాలు రానీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.భోపాల్ ల్యాబ్‌లో తనిఖీలు..చిట్యాల మండలం ఏపూరు సమీపంలోని కోళ్లఫారాల్లో పశు సంవర్థక శాఖ తనిఖీలు నిర్వహించి శాంపిల్స్‌ను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించగా కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు అంచనాకు వచ్చారు. వాటి శాంపిళ్లను భోపాల్‌లోని నేషనల్ లెవెల్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజ్ సెంటర్‌కు పంపారు. ఫలితాల్లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో జిల్లా పశు సంవర్థక శాఖ అప్రమత్తమైంది. ఇక్కడి కోళ్ల పారాల్లోని సుమారు 2 లక్షల లేయర్ కోళ్లతో పాటు వేలాది గుడ్లను, టన్నుల కొద్దీ పీడ్ను జేసీబీలతో గుంతలు తీయించి పూడ్చివేయిస్తున్నారు.52 ఆర్ఆర్టీ బృందాలు ఏర్పాటు..ఉమ్మడి జిల్లాలో బర్డ్‌ఫ్లూ ఉధృతి నేపథ్యంలో జిల్లా పశు సంవర్థక శాఖ 52 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను (ఆర్ఆర్టీ) ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో డాక్టర్‌తో పాటు ఐదుగురు సిబ్బందిని నియమించింది. కోళ్ల శాంపిల్స్‌ను సేకరించేందుకు వీరందరికీ ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఎక్కడైనా బర్డ్‌ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నాయనే సమాచారం అందిన వెంటనే ఈ బృందాలు అక్కడికి వెళ్లి పీపీఈ కిట్లను ధరించి శాంపిల్స్ సేకరించి భోపాల్ ల్యాబ్‌కు పంపనున్నారు.బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా చూస్తాం చిట్యాల: బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పశుసంవర్థకశాఖ జేడీ డాక్టర్ రమేష్ పేర్కొన్నారు. చిట్యాల మండలం ఏపూరు పరిధిలోని వీఎస్ఆర్ కోళ్ల ఫారాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఆనంతరం గుండ్రాంపల్లి గ్రామంలోని పశు వైద్యాశాలలో విలేకరులతో మాట్లాడారు. ఏపూరు వీఎస్ఆర్ కోళ్ల ఫారాల్లో బర్డ్‌ఫ్లూ రావటంతో సుమారు రెండు లక్షల కోళ్లను నిర్మూలించనున్నట్లు తెలిపారు. మిగిలి ఉన్న కోళ్ల దాణా కాల్చివేయటంతో పాటు కోళ్లఫారాలను పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయాలని యజమానులకు ఆదేశాలిచ్చామని తెలిపారు. బర్డ్‌ఫ్లూ నిర్ధారణకుగాను డివిజన్‌కు ఒక ప్రత్యేక పశువైద్య బృందాన్ని ఏర్పాటు చేసి కోళ్ల ఫారాలను తనిఖీ చేస్తున్నామన్నారు. బర్డ్‌ఫ్లూ సోకని చికెన్‌ను ఎలాంటి అనుమానాలు లేకుండా తీసుకోవచ్చునని సూచించారు. సమావేశంలో చిట్యాల, ఉరుమడ్ల పశువైద్యాధికారులు అభినవ్, అమరేందర్ పాల్గొన్నారు. -
సౌర విద్యుత్ అవగాహన సదస్సు గందరగోళం
నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న పీఎం కుసుమ్ కాంపోనెంట్ ఏ పథకంపై శనివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం గందరగళంగా మారింది. ఈ పథకం కింద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం నిర్వహించే సదస్సును నల్లగొండలోని విద్యుత్ ఎస్ఈ చాంబర్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ అధికారులతో పాటు నెడ్‌క్యాప్ అధికారి, లీడ్ బ్యాంకు అధికారులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో అక్కడ చాంబర్ సరిపోక.. అధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు. పైగా విద్యుత్ శాఖ ఎస్ఈ కూడా ఈ సమావేశానికి రాలేదు. అవగాహన సదస్సు కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాని ఫొటో కూడా పెట్టకపోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో చేసేది లేక అధికారులు సమావేశాన్ని రద్దు చేసి సాయంత్రం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేశారు. రూ.2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ సోలార్ ప్లాంట్లపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు అనువజ్ఞులైన అధికారులు కూడా లేరు. దీంతో సదస్సును నామమాత్రంగా ముగించారంటూ రైతులు, నాయకులు ఆరోపించారు. పథకంపై అవగాహన కల్పించలేనప్పుడు సమావేశం పెట్టడం దేనికంటూ ప్రశ్నించారు. కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, నెడ్ క్యాప్ అధికారి పాండురంగారావు పాల్గొన్నారు. -
పరీక్షలు సజావుగా నిర్వహించాలి
హాలియా : పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం హాలియా పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆమె ఎస్పీ శరత్చంద్ర పవార్‌తో కలిసి తనిఖీ చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలతో పాటు కేంద్రంలో సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద భద్రతను పకడ్బందీగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితిలోనూ ఇతరులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించవద్దని పేర్కొన్నారు. వారి వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, డీఎస్పీ రాజశేఖరరాజు, సీఐ జనార్దన్‌గౌడ్, ఎంఈఓ కృష్ణమూర్తి, ఎస్ఐ సతీష్‌రెడ్డి ఉన్నారు. 39 మంది గైర్హాజరు నల్లగొండ : పదో తరగతి పరీక్షల రెండోరోజు శనివారం జిల్లా వ్యాప్తంగా 39 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 105 పరీక్ష కేంద్రాల్లో శనివారం జరిగిన పరీక్షకు మొత్తం 18,553 మంది విద్యార్థులకుగాను, 18,514 మంది హాజరయ్యారు. 39 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నకిరేకల్‌లో పోలీస్ పహారా నడుమ పరీక్షలు
నకిరేకల్: పేపర్ లీకేజీతో సమస్యత్మకంగా మారిన నకిరేకల్ పట్టణంలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ పహారా నడుమ శనివారం పరీక్షలు జరిగాయి. పట్టణంలోని నాలుగు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీసులు పహారా కాశారు. ప్రత్యేకించి శుక్రవారం ప్రశ్నపత్రం లీకేజీ అయిన ఎస్సీ గురుకుల సెంటర్‌కు చీఫ్ సూపరింటెండెంట్‌గా నకిరేకల్ మండలం మంగళపల్లి జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం వీరారెడ్డి, డిపార్ట్మెంటల్ అధికారిగా కట్టంగూరు మండలం మునుకుంట్ల జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం షమీదాబేగంను నియమించారు. ఈ కేంద్రంలో జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్, నల్లగొండ ఎంఈఓ అరుంధతి మకాం వేసి పర్యవేక్షించారు. నకిరేకల్ తహసీల్దార్ జమురుద్దీన్, ఎంఈఓ నాగయ్య పరీక్ష కేంద్రాలను సందర్శించారు. నకిరేకల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐలు సురేష్, లచ్చిరెడ్డి సిబ్బందితో గస్తీ నిర్వహించారు. నాలుగు కేంద్రాల్లో మొత్తం 747 మంది విద్యార్థులకు గాను 745 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇద్దరు గైర్హాజరయ్యారు. షోకాజ్ నోటీసులు జారీ.. నకిరేకల్‌లో గురుకల పాఠశాల పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌గా ఉన్న పోతులు గోపాల్, డిపార్ట్మెంటల్ అధికారి రామ్మోహన్‌రెడ్డిని శుక్రవారమే విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సంజాయిషీ ఇవ్వాలని కోరుతూ శనివారం వారికి జిల్లా విద్యాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పేపర్ లీక్ అయిన గది ఇన్విజిలేటర్‌గా ఉన్న ఇదే గురుకుల పాఠశాలలో టీజీటీ సుధారాణిని శుక్రవారమే సస్పెండ్ చేశారు. -
ఫ్లై ఓవర్లు నిర్మించాలని పాదయాత్ర
మిర్యాలగూడ : అద్దంకి– నార్కట్‌పల్లి రహదారిపై మిర్యాలగూడ బైపాస్‌లో ఫ్లైఓవర్ బ్రిడ్జిలను వెంటనే నిర్మించాలని సీపీఎం ఆధ్వర్యంలో శనివారం బైపాస్‌లోని వై జంక్షన్ వద్ద నుంచి నందిపాడు చౌరస్తా మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ వై జంక్షన్, నందిపాడు చౌరస్తా, రవీంద్రనగర్ క్రాస్‌రోడ్డు, చింతపల్లి బైపాస్, ఈదులగూడ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తామని ఆరు నెలల క్రితం మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారని, కానీ ఇంతవరకు పనులను మొదలు పెట్టలేదన్నారు. వెంటనే పనులు ప్రారంభించకుంటే నిరాహార దీక్షలు చేపతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, జగదీశ్చంద్ర, గాదె పద్మ, రవినాయక్, గౌతంరెడ్డి, మంగారెడ్డి తదితరులున్నారు. -
సైనికదళంలో ఉద్యోగాలకు దరఖాస్తులు
నల్లగొండ : భారత సైనిక దళంలో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ పథకం కింద జనరల్, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్మెన్గా చేరవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల పురుష అభ్యర్థులు పూర్తి వివరాలను www.joi nindianarmy.nic.in వెబ్సైట్లో చూసుకోవచ్చని ఆమె తెలిపారు. మానసిక దివ్యాంగులకు అండగా న్యాయ వ్యవస్థ రామగిరి (నల్లగొండ) : మానసిక దివ్యాంగులకు న్యాయవ్యవస్థ అండగా ఉంటుందని జిల్లా జడ్జి ఎం.నాగరాజు అన్నారు. శనివారం నల్లగొండలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మానసిక దివ్యాంగుల హక్కుల రక్షణకు నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మానసిక దివ్యాంగులకు న్యాయసేవాధికార సంస్థ ఉచిత న్యాయ సహాయం అందిస్తుందన్నారు. వారి హక్కులను న్యాయస్థానాల ద్వారా కాపాడుతామన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బండి దీప్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిరిగిరి వెంకట్‌రెడ్డి, గిరి లింగయ్యగౌడ్, నిమ్మల బీమార్జున్‌రెడ్డి, లెనిన్‌బాబు, ప్రసాద్, శివరామకృష్ణ, వెంకటరెడ్డి, స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు. ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్మేళానల్లగొండ : నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం కార్తీకేయ సెక్యూరిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఈ జాబ్‌మేళాకు ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 200 మంది విద్యార్థినులు హాజరయ్యారు. యాపిల్ సంస్థలో విడిభాగాలను సమకూర్చే ఉద్యోగాలకు విద్యార్థినులను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.17,200 వేతనం, ఉచిత హాస్టల్, క్యాంపస్ వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్, టీఎస్ కేసి కోఆర్డినేటర్ రాంరెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ సుదర్శన్‌రెడ్డి, గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సుంకరి రాజారామ్, ఆయేషా, ప్లేస్మెంట్ నిర్వాహకులు కెఎన్‌డి.మూర్తి, రేణుక పాల్గొన్నారు. భూగర్భ జలశాఖను సంప్రదించాలినార్కట్పల్లి : బోర్లు వేయాలనుకునే వారు ముందుగా భూగర్భ జలశాఖను సంప్రదిస్తే బోరువెల్ పాయింట్ కోసం శాసీ్త్రయంగా సర్వే చేస్తుందని జిల్లా భూగర్భ జల శాఖ అధికారి కె.రేవత్ పేర్కొన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా శనివారం నార్కట్‌పల్లి మండలం నెమ్మాని గ్రామంలో గల రైతువేదిక వద్ద జిల్లా భూగర్భ శాఖ–ప్రతిభ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ‘భూగర్భ జలాల సంరక్షణ–నీటి వినియోగం’పై ఏర్పా టు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి అనంతరెడ్డి, మండల ప్రత్యేకాధి కారి చరితారెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్రావు, ఎంపీడీఓ ఉమేష్, ఏఓ గౌతమ్, శ్వేత, మానస, రజని, కుమార్, లక్ష్మయ్య, రాకేష్‌రెడ్డి, జావెద్, నర్సింహ, మహేష్, యాదగిరి ఉన్నారు. -
మహిళలకే పనిముట్లు
మహిళా రైతులకు వ్యవసాయ యాంత్రీకరణలబ్ధిదారుల ఎంపిక కత్తిమీద సాము.. 2018 నుంచి వ్యవసాయ యాంత్రికరణ పథకం నిలిచిపోయింది. దీంతో రైతులు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ పఽథకాన్ని పునరుద్ధరించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాయితీ పరికరాల కోసం మహిళా రైతుల నుంచి తీవ్ర పోటీ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో లబ్ధిదారుల ఎంపిక వ్యవసాయ శాఖ అధికారులకు కత్తిమీది సాములా మారనుంది. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన రైతులను గుర్తించి ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఫ ఈ నెలాఖరు వరకు గ్రౌండింగ్ చేయాలని ఆదేశాలు ఫ నియోజకవర్గాల వారీగా యూనిట్లు, నిధుల కేటాయింపు ఫ 50 శాతం రాయితీపై అందజేత నల్లగొండ అగ్రికల్చర్ : వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను మహిళా రైతులకు రాయితీపై అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 13 రకాల యాంత్రీకరణ పరికరాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం జిల్లాకు కోటి 81 లక్షల 36 వేల నిధులను కేటాయించడంతో పాటు 820 వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను ఇవ్వాలని నిర్ణయించింది. వీటన్నింటిని 50 శాతం రాయితీలో మహిళా రైతులకు మాత్రమే ఇవ్వాలని నిబంధన విధించడంతో పాటు ఈ నెలాఖరులోగా గ్రౌండింగ్ చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్వవసాయ శాఖ అన్ని నియోజకవర్గాల వారీగా పరికరాలను, నిధులను కలెక్టర్ ఇలా త్రిపాఠి అనుమతిలో కేటాయించారు. మండలాల వారీగా మహిళా రైతులను ఎంపిక చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా పరికరాలు, నిధుల ఇలా.. (రూ.లక్షల్లో..) నియోజకవర్గం పరికరాలు నిధులు నాగార్జునసాగర్ 138 31.70 దేవరకొండ 134 30.05 మిర్యాలగూడ 139 27.83 మునుగోడు 119 22.44 నకిరేకల్ 129 29.35 నల్లగొండ 140 36.83 తుంగతుర్తి (శాలిగౌరారం) 21 3.16 మొత్తం 820 181.36లబ్ధిదారులను ఎంపిక చేస్తాం వ్యవసాయ యాంత్రికరణ పరికరాల గ్రౌండింగ్‌ను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నియోజక వర్గాల వారీగా పరికరాలతో పాటు నిధుల కేటాయింపు పూర్తి చేశాం. త్వరలో మహిళా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి పరికరాల గ్రౌండింగ్ చేస్తాం. – పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓ● -
బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా చూస్తాం
చిట్యాల: బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పశుసంవర్థకశాఖ జేడీ డాక్టర్ రమేష్ పేర్కొన్నారు. చిట్యాల మండలం ఏపూరు పరిధిలోని వీఎస్ఆర్ కోళ్ల ఫారాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఆనంతరం గుండ్రాంపల్లి గ్రామంలోని పశు వైద్యాశాలలో విలేకరులతో మాట్లాడారు. ఏపూరు వీఎస్ఆర్ కోళ్ల ఫారాల్లో బర్డ్‌ఫ్లూ రావటంతో సుమారు రెండు లక్షల కోళ్లను నిర్మూలించనున్నట్లు తెలిపారు. మిగిలి ఉన్న కోళ్ల దాణా కాల్చివేయటంతో పాటు కోళ్లఫారాలను పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయాలని యజమానులకు ఆదేశాలిచ్చామని తెలిపారు. బర్డ్‌ఫ్లూ నిర్ధారణకుగాను డివిజన్‌కు ఒక ప్రత్యేక పశువైద్య బృందాన్ని ఏర్పాటు చేసి కోళ్ల ఫారాలను తనిఖీ చేస్తున్నామన్నారు. బర్డ్‌ఫ్లూ సోకని చికెన్‌ను ఎలాంటి అనుమానాలు లేకుండా తీసుకోవచ్చునని సూచించారు. సమావేశంలో చిట్యాల, ఉరుమడ్ల పశువైద్యాధికారులు అభినవ్, అమరేందర్ పాల్గొన్నారు. -
ప్రత్యేక ప్రజావాణి దరఖాస్తులపై శ్రద్ధ చూపాలి
నల్లగొండ : వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణిలో కలెక్టర్‌కు 74 మంది దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొంతమంది జిల్లా అధికారులు, ఆర్డీఓలు దరఖాస్తుపై స్పెషల్ గ్రీవెన్స్ అని రాస్తే త్వరగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయన్, ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్ రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్ పాల్గొన్నారు. పరిహారం పెంచేలా చూడండి మాకు నలుగురు కొడుకులు. ప్రతి నెలా ఒకొక్కరు రూ.2500 చొప్పున 10 వేలు కొడుకులు ఇస్తున్నారు. చిన్న కొడుకు చనిపోయాడు. ఇప్పుడు రూ.7500 వస్తున్నాయి. అయితే పెద్ద కొడుకు టీచర్ అయినా ప్రతి నెల ఆలస్యంగా ఇస్తున్నాడు. కెనడాలో ఉండే కొడుకు, హైదరాబాద్‌లో ఉండే కొడుకు సమయానికి పంపిస్తున్నారు. కానీ ఆ రూ.7500 మా మందులకే సరిపోవడం లేదు. ఒకొక్కరి నుంచి రూ.5 వేల చొప్పున ఇప్పించాలి. – కేసాని లింగారెడ్డి–పద్మ, కొడతాలపల్లి, త్రిపురారం మండలం నా బిడ్డ భూమి తీసుకుంది.. పట్టించుకోవడం లేదు నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. 7 ఎకరాల 23 గుంటల భూమి ఉంది. నా కొడుకులే 7 ఎకరాల భూమిని నా బిడ్డకు అమ్మారు. 23 కుంటల భూమిని నా పేరున ఉంచారు. నన్ను చూసుకుంటానని చెప్పి ఆ 23 కుంటల భూమిని కూడా నా కూతురే పట్టా చేయించుకుంది. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అడిగితే తిడుతోంది. కొడుకుల వద్దకు పోతే భూమి బిడ్డకు ఇచ్చావు అని పట్టించుకోవడం లేదు. – లింగయ్య, చిన్నకాపర్తి, చిట్యాల మండలంపింఛన్ ఇప్పించండి నేను దివ్యాంగుడిని. మా అమ్మ కూడా మానసిక దివ్యాంగురాలు. నాన్న లేడు. అమ్మకు గతంలో వృద్ధాప్య పింఛన్ వచ్చింది. ప్రస్తుతం ఆగిపోయింది. దాంతో మాకు కుటుంబం గడవడం కష్టంగా ఉంది. మా అమ్మకు పింఛన్ ఇప్పించాలి. – సాలోజు నాగయ్య, తడకమళ్ల, మిర్యాలగూడ మండలం ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
అందాల భామలకు ఆతిథ్యం! యాదగిరిగుట్టకు ప్రపంచ సుందరీమణులు
అందాల భామలకు అతిథ్యమిచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో మే 7 నుంచి 31 వరకు 72వ ఎడిషన్ మిస్ వరల్డ్–2025 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీలకు 140 దేశాల నుంచి మూడు వేల మంది అందాల భామలు, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. వారిద్వారా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. అందులో భాగంగా అందాల భామలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి, యాదగిరిగుట్ట, నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఇలా వివిధ దేశాల అందాల భామలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావడం ద్వారా ఆయా ప్రాంతాలకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. మే 15న ఇక్కత్ వస్త్రాలతో ర్యాంప్‌వాక్..ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతీయంగా పేరుగాంచిన భూదాన్‌పోచంపల్లికి మిస్‌వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే 15వ తేదీన రానున్నారు. వీరు ఇక్కడి చేనేత కార్మికులతో ముఖాముఖి మా ట్లాడుతారు. అనంతరం మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలిస్తారు. తరువాత చేనేత చీరలు ధరించి ర్యాంప్‌వాక్ చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. మిస్‌వరల్డ్ పోటీల ఈవెంట్లను నిర్వహించే పోచంపల్లి ఇక్కత్వస్త్రాల విశిష్టతను వీడియోగ్రఫీ చేస్తున్నారు. ఫలితంగా చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మరింత పేరును తీసుకురావడమే ఈవెంట్ల ముఖ్య ఉద్దేశమని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ పేర్కొంటోంది. ఇప్పటికే అనేక ఫ్యాషన్ ఈవెంట్లకు వేదికైన పోచంపల్లికి ఇప్పుడు మరోసారి ప్రపంచ సుందరీమణులు వస్తుండడంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ ఖ్యాతి పొందనుంది.ఇటీవలే యాదగిరి క్షేత్రాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా ఇటీవల యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని మిస్ వరల్డ్ –2024 క్రిస్టినా పిస్కోవా సందర్శించారు. ఆలయం అద్భుతమని కొనియాడారు. వాస్తు శిల్పం, ప్రశాంతమైన పరిసరాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం యాదగిరి క్షేత్రాన్ని తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశమని ఆమె పేర్కొన్నారు. ఆమె ప్రకటనతో మే 15న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందెగత్తెలంతా యాదగిరి క్షేత్ర సందర్శనకు వచ్చి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందనున్నారు. విజయ విహార్‌లో విడిదిప్రపంచదేశాల బౌద్ధులను ఆకర్షించేందుకు నాగార్జునసాగర్‌లోని కృష్ణానది తీరంలోని బుద్దవనాన్ని ప్రపంచ అందెగత్తెలు మే 12న సందర్శనున్నారు. బౌద్దుల చరిత్ర, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని వారు తెలుసుకోనున్నారు. వారికి ఇక్కడి బౌద్ధసంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా గుర్తింపు దక్కేలా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మిస్‌వరల్డ్ పోటీదారులు సాగర్‌లో ఇక్కడ విడిది చేయడానికి గాను విజయవిహార్లోని గదులను ఆధునీకరిస్తున్నారు. రూ.5 కోట్ల వ్యయంతో అన్ని హంగులు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆయా పనులు ప్రారంభించారు. వారి విడిదికి సకల హంగులు కల్పిస్తూ.. విజయ విహార్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ, నల్లగొండ కలెక్టర్, ఉన్నతాధికారులు నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో సమావేశం నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక నగరికి.. మే 15వ తేదీనే అందాల భామలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడ గడపనున్నారు. వారు 15వ తేదీన హైదరాబాద్ నుంచి నేరుగా యాదగిరికొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి యాదగిరి క్షేత్రానికి వస్తారు. విష్ణు పుష్కరిణిలో సంకల్ప పూజలు చేసి, ప్రధానాలయం సమీపంలో ఉన్న అఖండ దీపారాధన పూజల్లో పాల్గొంటారు. శ్రీస్వామి వారి దర్శనం తర్వాత ప్రధానాలయ పునః నిర్మాణాన్ని మిస్ వరల్డ్ పోటీ దారులు పరిశీలించి, ఇక్కడే ఒక డాక్యుమెంటరీ సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. మిస్ వరల్డ్ పోటీదారులతో యాదగిరిక్షేత్ర వైభవం ప్రపంచ స్థాయికి వెళ్లనుంది. (చదవండి: -
తెలంగాణలో బర్డ్‌ఫ్లూ కలకలం.. 40వేల కోళ్ల మృతి
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ పరిధిలో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. గ్రామంలోని పిట్ట సుదర్శన్‌రెడ్డికి చెందిన పౌల్ట్రీఫామ్‌లో.. ఈ నెల 12న 500 కోళ్లు మృతి చెందాయి. దీనిపై సుదర్శన్‌రెడ్డి ఇచి్చన సమాచారం మేరకు పశువైద్యాధికారులు.. చనిపోయిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు పంపించారు. వారు వాటిని మధ్యప్రదేశ్, భోపాల్‌లోని హై సెక్యూరిటీ వీబీఆర్ఐ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ నమూనాలను పరీక్షించగా కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారణయ్యింది. దీంతో శుక్రవారం జిల్లా పశుసంవర్థక, వైద్య, రెవెన్యూ, పోలీస్‌శాఖ అధికారులు ఆ పౌల్ట్రీఫామ్‌ను సందర్శించారు. అక్కడ పశు వైద్యాధికారులు, సిబ్బంది మొత్తం 32 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లుగా ఏర్పడి.. పీపీఈ కిట్లు ధరించి.. ఫాంలోని 40వేల కోళ్లను చంపి మూటగట్టి సమీపంలో గుంతతీసి పూడ్చిపెట్టారు. సుమారు 19 వేల గుడ్లను సైతం పూడ్చారు. దీనిపై యాదాద్రి జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ జానయ్య విలేకరులతో మాట్లాడుతూ.. ఫాంలోని 90 టన్నుల ఫీడ్‌తో పాటు కోళ్ల పెంటను సైతం దహనం చేస్తామని తెలిపారు. కోళ్లఫాం నుంచి కిలోమీటర్ పరిధిలో పూర్తి స్థాయిలో శానిటేషన్ చేస్తామని తెలిపారు. మూడు నెలల వరకు పౌల్ట్రీ ఫామ్‌ను సీజ్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల తరువాతే తిరిగి పౌల్ట్రీఫామ్‌ను నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దోతిగూడెంలో బర్డ్‌ఫ్లూ వల్ల ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని కోరారు. -
పేపర్లు తారుమారు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి, నెట్వర్క్: పదోతరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు విద్యార్థులు భాషా పరీక్ష రాశారు. టెన్త్ పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకోగా, తొలి పరీక్షకు 4.95 లక్షల మంది హాజరయ్యారు. హాజరుశాతం 99.67గా నమోదైంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ఆ సెంటర్లో విద్యార్థులు పరీక్ష ముగిశాక కూడా 45 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. వాట్సాప్‌లో ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టిన విషయమై పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ గందరగోళం సృష్టించడానికే వదంతులు ప్రచారం చేశారన్నారు. వికారాబాద్, తాండూర్లలో సంస్కృతం పేపర్‌కు బదులుగా తెలుగు ప్రశ్నపత్రం ఇచ్చారు. అయితే దీనిని ఆలస్యంగా గుర్తించి అధికారులు మళ్లీ సంస్కృతం పేపర్ ఇచ్చి పరీక్ష రాయించారు. మంచిర్యాలలోనూ తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు. దీంతో విద్యార్థులు రెండు గంటలు ఆలస్యంగా పరీక్ష రాయాల్సి వచ్చింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని, ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని టెన్త్ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. నకిరేకల్ నుంచి లీక్ అయ్యిందా ! పదోతరగతి పరీక్ష ప్రారంభమైన 20 నిమిషాలకే నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని యువకుల వాట్సాప్‌లలో టెన్త్ తెలుగు ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టింది. అందులోని ప్రశ్నలకు అనుగుణంగా టెస్ట్ పేపర్లలోని జవాబు పత్రాలతో యువకులు హల్చల్ చేశారు. జవాబులన్నీ ఒకే పేపర్లో వచ్చేవిధంగా జిరాక్స్‌లు తీసి స్థానిక పరీక్ష కేంద్రాల్లోకి పంపించేందుకు హల్చల్ చేశారు. అయితే బందోబస్తులో ఉన్న పోలీసులు విషయం తెలియక పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు అనుగుణంగా జిరాక్స్ తీసిన జవాబుల ప్రతులు ఆ సమయంలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు చేరాయా? లేదా? ప్రశ్నపత్రం వాట్సాప్‌లో ఎక్కడెక్కడికి వెళ్లిందన్నది తేలాల్సి ఉంది. ప్రశ్నపత్రం లీకేజీ విషయంపై అధికారులు శాలిగౌరారం, నకిరేకల్ పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం గోప్యంగా విచారణ జరిపారు. బయటకు వచ్చిన ఆ ప్రశ్నపత్రం నకిరేకల్‌లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి లీక్ అయినట్టు తెలిసింది. దీనికి బాధ్యుడైన వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. 45 నిమిషాల పాటు పరీక్ష కేంద్రాల్లోనే విద్యార్థులు ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో విద్యార్థులను పరీక్ష ముగింపు సమయం గడిచినా, 45 నిమిషాల వరకు శాలిగౌరారంలోని పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపించలేదు. లీకైన పేపర్ ఫొటోతో పరీక్ష కేంద్రాల్లోని విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రాలతో సరిపోల్చి చూశారు. లీకైన పేపర్ సీరియల్ నంబరుతో మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాల్లోని పేపర్ సీరియల్ నంబర్లతో పోల్చి చూశారు. లీకైన టెన్త్ తెలుగు ప్రశ్నపత్రం సీరియల్ నంబరు 1495550గా అధికారులు గుర్తించారు. విచారణ తర్వాత మధ్యాహ్నం 1:15 గంటలకు ఉన్నతాధికారుల ఆదేశంతో విద్యార్థులను బయటకు పంపిచారు. సీరియల్ నంబరు వేరుగా ఉన్నా, అందులోని ప్రశ్నలకు, విద్యార్థులకు అందజేసిన ప్రశ్నాపత్రాల్లోని ప్రశ్నలకు మధ్య తేడా ఏమీ లేదని అధికారులు గుర్తించినట్టు తెలిసింది. లీకేజీ ఘటనలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నకిరేకల్‌లో నివాసముంటున్న ఆ ఉపాధ్యాయుడు తన కుమార్తె కోసమే ఈ చర్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపామని నల్లగొండ డీఈవో భిక్షపతి పేర్కొన్నారు. పరీక్షల సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ రామ్మోహన్‌రెడ్డిలను పరీక్ష విధుల నుంచి తొలగించారు. ఒక ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు. నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో పదో తరగతి తెలుగు పేపరు లీకేజీ ఘటనలోనే వారిపై చర్యలు చేపట్టినట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. సంస్కృతం బదులు తెలుగు పేపర్ వికారాబాద్ జిల్లా తాండూరులోని టీజీఎస్ఆర్ బాలికల గురుకులానికి చెందిన టెన్త్ విద్యార్థి నాగలక్షి్మతోపాటు మరో విద్యార్థి పట్టణంలోని శివసాగర్ కేంద్రంలో పరీక్ష రాసేందుకు వెళ్లారు. అయితే తమకు సంస్కృతం ప్రశ్నపత్రానికి బదులు తెలుగు ప్రశ్నపత్రం ఇచ్చారని చెప్పినా, ఇదే మీ పేపర్ అంటూ ఆ విద్యార్థులతో బలవంతంగా పరీక్ష రాయించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు తమ తప్పిదాన్ని గుర్తించిన ఇని్వజిలేటర్లు ఆ ఇద్దరు విద్యార్థులతో 3 గంటల వరకు సంస్కృతం పేపర్ రాయించారు. తాండూరులోని ఫ్రంట్‌లైన్ ఎగ్జామ్ సెంటర్లోనూ తెలంగాణ గురుకుల పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థి అంకితతో సంస్కృతం బదులు తెలుగు పేపర్ రాయించారు. గంట తర్వాత అసలు విషయం తెలుసుకొని సంస్కృతం పేపర్ అందజేశారు. తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రం మంచిర్యాల బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలోకి మొదటిరోజు ప్రశ్నపత్రం బదులు.. రెండోరోజు ప్రశ్నపత్రాలు రావడంతో గందరగోళం నెలకొంది. అధికారుల తప్పిదంతో విద్యార్థులు రెండు గంటల ఆలస్యంగా పరీక్ష రాశారు. తొలిరోజు తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రాలు ఉన్నట్టు గుర్తించి, మళ్లీ 20 బాక్సులను వెతికి తెలుగు ప్రశ్నపత్రం తీసుకొచ్చేలోపు సమయం వృథా అయ్యింది. ఈ ఘటనపై కలెక్టర్ కుమార్ దీపక్ వివరణ ఇస్తూ. ట్రంకు బాక్సులో రెండో రోజు ప్రశ్నపత్రాలు ఉన్నట్టు, ప్రశ్నపత్రాల కవర్ తెరవకుండానే గుర్తించామని, మొదటి రోజు ప్రశ్నపత్రం ఏ బాక్సులో ఉందో వెతికేందుకు గంటన్నర సమయం పట్టిందని, విద్యార్థులు ఆ సమయం నష్టపోకుండా పరీక్షకు 3 గంటలు యథావిధిగా కల్పించామన్నారు. రెండో రోజు పరీక్ష పత్రం లీక్ కాలేదని, పోలీసుస్టేషన్లో భద్రంగా ఉందన్నారు. పరీక్ష సజావుగా నిర్వహించని కారణంగా పరీక్ష కేంద్రం చీప్ సూపరింటెండెంట్ సప్థర్ అలీఖాన్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ పద్మజలను సస్పెండ్ చేసి, వీరిస్థానంలో మరొకరికి బాధ్యతలు ఇచ్చామన్నారు. కేంద్రాలకు వెళ్లడమూ ఓ పరీక్షే సాక్షి, నాగర్‌కర్నూల్/కన్నాయిగూడెం: నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు రోజూ పరీక్షలు రాసేందుకు 25 కి.మీ దూరంలోని దోమలపెంటకు రావాల్సి వస్తోంది. అటవీమార్గం గుండా ఉన్న రహదారిపై ఆర్టీసీ బస్సులో వెళ్లేందుకు గంటన్నర, తిరిగి వచ్చేందుకు గంటన్నర సమయం పడుతోంది. దీంతో ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా, 6.30 గంటలకే వటవర్లపల్లి వద్ద బయలుదేరి, రానూపోనూ కలపి మొత్తం 50 కి.మీ. ప్రయాణించి పరీక్షలు రాస్తున్నారు. కన్నీటి పరీక్ష మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం ముత్తపూర్ గ్రామానికి చెందిన మంచర్ల మల్లయ్య గురువారం రాత్రి అనారోగ్యంతో చనిపోయాడు. శుక్రవారం ఉదయం ఓ వైపు అంతిమ సంస్కారాలు జరుగుతుండగానే ఆయన కూతురు శ్రీలత పరీక్షకు హాజరైంది. – నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకాల్ గ్రామానికి చెందిన పాలెం అంజన్న శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ బాధతోనూ ఆయన కూతురు అంజలి పరీక్ష రాశారు. – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కల్తిరామయ్యగుంపు గ్రామానికి చెందిన కనపటి వీరస్వామి(45) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన ఇద్దరు కుమార్తెలు హర్షిత, ప్రియ రొంపేడులోని బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. తండ్రి చనిపోయిన విషయం పరీక్ష రాశాక కూతుళ్లకు చెప్పారు. ఇంటికి చేరుకున్నాక ‘నాన్నా.. లే.. నాన్నా..’అంటూ వారు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. అనారోగ్యాన్ని లెక్క చేయకుండా... సిద్దిపేట/రామగుండం – సిద్దిపేటకు చెందిన శ్వేత కేజీబీవీ మిట్టపల్లిలో 10వ తరగతిలో చదువుతోంది. ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కింద పడటంతో కాలు విరిగింది. శుక్రవారం ఉదయం రంగధాంపల్లి పరీక్ష కేంధ్రానికి వద్దకు శ్వేత అంబులెన్స్‌లో వచ్చింది. స్ట్రెచర్ పైనే బంధువుల సాయంతో పరీక్ష రాసింది. – పెద్దపల్లి జిల్లా అంతర్గాం టీటీఎస్ జెడ్పీ హైసూ్కల్లో శుక్రవారం పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థి నందన్‌వర్మ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. ప్రథమ చికిత్స అందించిన తర్వాత ఆయన పర్యవేక్షణలో విద్యార్థి పరీక్ష రాశాడు. పరీక్ష పూర్తయ్యాక 108 అంబులెన్స్‌లో అదే పీహెచ్‌సీకి తరలించి వైద్యం అందించారు. బాలుడు కోలుకున్నట్టు డాక్టర్ తెలిపారు. -
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
నాంపల్లి : గ్రామాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం ఆమె నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. రాత్రి వేళ రోగులకు అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. అనంతరం స్థానిక కస్తూరిభా గాంధీ విద్యాలయాన్ని తనిఖీ చేశారు. డైనింగ్ హల్, వంట గదులను పరిశీలించారు. హస్టల్, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ దేవ్‌సింగ్, ఎంపీడీఓ శ్రీనివాసశర్మ, వైద్యులు భవాని, తరుణ్, ఎంపీఓ ఝాన్సీ, సూపర్వైజర్ అంజలి ఉన్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజు రాయితీపై ప్రచారం చేస్తాం నల్లగొండ : ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం డిస్కౌంట్‌పై మరోసారి ప్రచారం చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే రెండుసార్లు లే అవుట్ డెవలపర్స్‌తో సమావేశాలు నిర్వహించామని తెలిపారు. 1002 మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారని, వారికి ప్రొసీడింగ్స్ ఇచ్చామన్నారు. చిన్న చిన్న సమస్యలను అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈ నెల 31వ తేదీలోగా నూరు శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీపీఓ వెంకయ్య, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
టెన్త్ పరీక్షలకు 40 మంది గైర్హాజరు
నల్లగొండ : పదో తరగతి పరీక్ష శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 105 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం జరిగిన తెలుగు పరీక్షకు 18,511 మంది విద్యార్థులకుగాను 18,471 మంది పరీక్షకు హాజరయ్యారు. 40 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్లగొండ, గుర్రంపోడు తదితర ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. డీఈఓ, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడి పరీక్షకు హాజరైన విద్యార్థులు, ఏర్పాట్ల వివరాలను తెలుసుకున్నారు. ఆమె వెంట డీఈఓ భిక్షపతి తదితరులు ఉన్నారు. ఫ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి -
చెత్త వేయకుండా.. కొత్త ఆలోచన
రోడ్ల వెంట చెత్త వేసే ప్రాంతాల్లో.. మొక్కలు, ముగ్గులు నల్లగొండ టూటౌన్ : రోడ్ల వెంట ఎక్కడపడితే చెత్త వేయకుండా నీలగిరి మున్సిపల్ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. చెత్త వేస్తున్న రోడ్లను గుర్తించిన మున్సిపల్ సిబ్బంది, ఉద్యోగులు అక్కడ మొక్కలు నాటి నీళ్లు పోసి వాటిని పెంచుతున్నారు. మొక్కల చుట్టూ టైర్లు అమర్చడం, అక్కడ ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దడంతో చెత్త వేయకుండా నివారించే ప్రయత్నం చేస్తున్నారు. కాలనీల్లోనూ మొక్కలు నాటడం మేలు.. నీలగిరి పట్టణ పరిధిలోని కొన్ని కాలనీల్లో చెత్తను రోడ్ల వెంట, జనవాసాల మధ్య వేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పట్టణంలోని అలాంటి ప్రాంతాలను గుర్తించి అక్కడకూడా మొక్కలు నాటి వాటి చుట్టూ టైర్లు పెట్టి ముగ్గులు వేయడం ద్వారా చూడడానికి అందంగా కనిపిస్తుంది. ప్రజలు కూడా చైతన్యం అయి అక్కడ చెత్త వేయడానికి ఎవరూ సాహసించరు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఈ విధానానికి శ్రీకారం చుట్టాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు. -
కలెక్టరేట్ ఎదుట వీఓఏల ధర్నా
నల్లగొండ టౌన్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.20 వేల వేతనం అమలు చేయాలని వీఓఏల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. వివిధ కారణాలతో తొలగించిన వీఓఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో చిలుముల దుర్గయ్య, సులోచన, పోలె సత్యనారాయణ, కె.చంద్రకళ, మంగమ్మ, సువర్ణ, నగేష్, సురేష్, సైదమ్మ, పుష్పలత, పాపయ్య, లక్ష్మి, నాగమణి పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్న మిస్‌వరల్డ్ పోటీదారులు
ఇటీవలే యాదగిరి క్షేత్రాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా ఇటీవల యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని మిస్ వరల్డ్ –2024 క్రిస్టినా పిస్కోవా సందర్శించారు. ఆలయం అద్భుతమని కొనియాడారు. వాస్తు శిల్పం, ప్రశాంతమైన పరిసరాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం యాదగిరి క్షేత్రాన్ని తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశమని ఆమె పేర్కొన్నారు. ఆమె ప్రకటనతో మే 15న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందెగత్తెలంతా యాదగిరి క్షేత్ర సందర్శనకు వచ్చి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందనున్నారు. ఫ మే 12న నాగార్జునసాగర్‌కు, 15న పోచంపల్లి, యాదగిరిగుట్టకు రానున్న ప్రపంచ సుందరీమణులు ఫ ఇక్కడి ప్రాంతాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా తెలంగాణ పర్యాటకశాఖ ప్రణాళికవిజయ విహార్‌లో విడిది ప్రపంచదేశాల బౌద్ధులను ఆకర్షించేందుకు నాగార్జునసాగర్‌లోని కృష్ణానది తీరంలోని బుద్దవనాన్ని ప్రపంచ అందెగత్తెలు మే 12న సందర్శనున్నారు. బౌద్దుల చరిత్ర, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని వారు తెలుసుకోనున్నారు. వారికి ఇక్కడి బౌద్ధసంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా గుర్తింపు దక్కేలా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మిస్‌వరల్డ్ పోటీదారులు సాగర్‌లో ఇక్కడ విడిది చేయడానికి గాను విజయవిహార్లోని గదులను ఆధునీకరిస్తున్నారు. రూ.5 కోట్ల వ్యయంతో అన్ని హంగులు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆయా పనులు ప్రారంభించారు. వారి విడిదికి సకల హంగులు కల్పిస్తూ.. విజయ విహార్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ, నల్లగొండ కలెక్టర్, ఉన్నతాధికారులు నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 18న యాదగిరి క్షేత్రంలో క్రిస్టినా పిస్కోవా మే 15వ తేదీనే అందాల భామలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడ గడపనున్నారు. వారు 15వ తేదీన హైదరాబాద్ నుంచి నేరుగా యాదగిరికొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి యాదగిరి క్షేత్రానికి వస్తారు. విష్ణు పుష్కరిణిలో సంకల్ప పూజలు చేసి, ప్రధానాలయం సమీపంలో ఉన్న అఖండ దీపారాధన పూజల్లో పాల్గొంటారు. శ్రీస్వామి వారి దర్శనం తర్వాత ప్రధానాలయ పునః నిర్మాణాన్ని మిస్ వరల్డ్ పోటీ దారులు పరిశీలించి, ఇక్కడే ఒక డాక్యుమెంటరీ సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. మిస్ వరల్డ్ పోటీదారులతో యాదగిరిక్షేత్ర వైభవం ప్రపంచ స్థాయికి వెళ్లనుంది. ఆధ్యాత్మిక నగరికి.. -
టెన్త్ ప్రశ్నపత్రం లీక్‌పై గోప్యంగా విచారణ
నకిరేకల్, శాలిగౌరారం : పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలు ప్రారంభమైన 15 నిముషాలకే తెలుగు ప్రశ్నపత్రం లీకై ంది. లీకై న ప్రశ్నాపత్రం ఏకంగా శాలిగౌరారానికి చెందిన పలువురి యువకుల వ్యక్తిగత వాట్సాప్‌లలో చక్కర్లు కొట్టడంతో యువకులు ఆ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు సంబంధించిన జవాబులను టెస్ట్‌పేపర్‌లోని నుంచి చించి వాటిని ఒకే పేపర్లో వచ్చేవిధంగా జిరాక్స్‌లు తీసి స్థానిక పరీక్ష కేంద్రాల్లోకి పంపించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద హల్చల్ చేశారు. టెన్త్ తెలుగు పేపర్ లీకై న విషయం శాలిగౌరారంలో వెలుగులోకి రావడంతో అధికారులు మండలకేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు చేరుకుని ప్రశ్నాపత్రం లీకై న సంఘటనపై గోప్యంగా విచారణ జరిపారు. మండలకేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, తహశీసీల్దార్ యాదగిరి, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఎంఈఓ సైదులు చేరుకొని విచారణ జరిపారు. అనంతరం నకిరేకల్‌కు చేరుకొని నకిరేకల్‌లోని గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రాన్ని నల్లగొండ ఆర్డీఓతో పాటు డీఈఓ భిక్షపతి, తహసీల్దార్ జమురుద్దీన్, ఎంఈఓ నాగయ్య విచారణ జరిపారు. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి పరీక్ష కేంద్రంలోని విద్యార్థిని నుంచి ప్రశ్నపత్రం ఫొటో తీసుకొని వెళ్లినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న ముగ్గురు ఇనిజిలెటర్లను విధుల్లోనుంచి రిలీవ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులు, సిబ్బందిపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. చీఫ్ సూపరింటెండెంట్‌ను, డిపార్ట్మెంటల్ ఆఫీసర్‌ను పరీక్ష విధుల నుంచి తొలగించింది. ఒక ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. 45 నిమిషాలు ఆలస్యంగా విద్యార్థులు బయటకు.. పరీక్ష సమయం 12.30 గంటలకు ముగిసినప్పటికీ అధికారులు శాలిగౌరారంలోని పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నాపత్రం లీకై న సంఘటనపై విచారణ జరుపడంతో 1.15 గంటలకు విద్యార్థులను బయటికి పంపారు. లీకై న పేపర్ ఫొటోతో పరీక్ష కేంద్రాల్లో క్షుణ్ణంగా విచారణ జరిపారు. వాట్సప్‌లో లీకై న పేపర్ సీరియల్ నెంబర్‌ను, మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాల్లోని పేపర్ సీరియల్ నంబర్లను సరి చూశారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసిన తర్వాతా ఉన్నతాధికారుల ఆదేశంతో విద్యార్థులను బయటకు పంపిచారు. -
జీజీహెచ్‌లో వార్డుల తనిఖీ
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోని వార్డులను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులను పలుకరించి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగుల అభిప్రాయాలతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి వైద్యులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అన్వేష్, పాల్గొన్నారు. సర్వీస్ రూల్స్‌పై ఉద్యోగులకు అవగాహననల్లగొండ : పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల కింద జూనియర్ అసిస్టెంట్లుగా నియమితులైన ఉద్యోగులకు శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వీస్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఉద్యోగాలు పొందిన వారు అన్ని రూల్స్ తెలుసుకుని ఉద్యోగంలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ బి.శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పు రాంబాబు, నాయకులు కె.నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేత్రపర్వంగా ఊంజల్ సేవోత్సవం యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజల్ సేవ నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన నాధ స్వరం వినిపించారు. ఇక ప్రధానాలయంలోనూ సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, అర్చన, ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవామూర్తులకు నిత్యకల్యాణంతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. -
రాష్ట్ర స్థాయి వికసిత్ భారత్‌కు 10మంది ఎంపిక
రామగిరి(నల్లగొండ): స్థానిక ఎన్జీ కళాశాలలో చేపట్టిన ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు గురువారం ముగిశాయి. నల్లగొండ, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి పాల్గొన్న విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 10 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి పాల్గొనగా.. న్యాయమూర్తులుగా పర్యావరణ వేత్త సురేష్ గుప్త, సామాజిక వేత్త దుచ్చర్ల సత్యనారాయణ, రిటైర్డ్ లెక్చరర్ విజయ్ కుమార్, నెహ్రూ యువకేంద్రం జిల్లా యువ అధికారి ప్రవీణ్ సింగ్ శిరీష వ్యవహరించారు. తెలుగుశాఖ అధ్యక్షుడు డాక్టర్ వెల్దండి శ్రీధర్, ఎన్ిసీసీ కేర్ టేకర్ సుధాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు . -
కేసీఆర్ లేకపోతే తెలంగాణే లేదు
సూర్యాపేటటౌన్ : ‘కేసీఆర్.. పార్టీ పెట్టి సునామీ సృష్టించారు... కేసీఆరే లేకపోతే తెలంగాణ లేదు.. ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న వారికి ఆ పదవులే రాకపోయేవి’ అని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభ విజయవంతానికి గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, మరో వైపు చంద్రబాబు లాంటి వారి సవాళ్ల మధ్య కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం సాహసం చేసి పార్టీ పెట్టారన్నారు. 14 ఏళ్లు సుదీర్ఘపోరాటం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. కేసీఆర్ మోకాలు ఎత్తుకు కూడా సరిపోని వాళ్లు ఆయన గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.5లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే.. ఇప్పుడు ఇక్కడ నీళ్ల మంత్రి ఉన్నా చుక్కనీరు తేలేకపోతున్నారని, దీంతో పంటలు ఎండిపోయి రైతులు గోసపడుతున్నారన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగితే ఒక మంత్రి పోయి చాపల కూర చేయించుకొని తింటున్నాడని విమర్శించారు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు ఒక్కొక్క గ్రామం నుంచి బండ్లు కట్టుకుని తరలిరావాలని కోరారు. ఈ సభ చూస్తే కాంగ్రెస్, బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలన్నారు. వరంగల్ బహిరంగ సభ తర్వాత వెంటనే సభ్యత్వ నమోదుతోపాటు గ్రామ మండల కమిటీలు ఏర్పాటు చేసుకుందామన్నారు. ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాలు చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఏడాదిని పోరాట నామ సంవత్సరంగా పిలుచుకుందామని అన్నారు. దేశానికి కేసీఆరే దిక్సూచి: జగదీష్‌రెడ్డి దేశానికి దిక్సూచిలా కేసీఆర్ నిలుస్తారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వెనుకబాటును చూసి చలించి గులాబీ జెండా ఎత్తారని, ఒక్కడిగా బయలుదేరి నేడు సముద్రంలా మారారని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం వెనుకబాటుకు గురవుతోందని, ఇక్కడ ఆయన శిష్యుడు రేవంత్ అదే బాటలో పయనిస్తున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ వచ్చే నెల 27న జరిగే వరంగల్ బహిరంగ సభకు భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలిరావాలన్నారు. అంతకు ముందు జనగామ క్రాస్‌రోడ్డు నుంచి పార్టీ కార్యాలయం వరకు కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కరరావు, రవీంద్రకుమార్, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 14 ఏళ్లు పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించారు ఫ బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి జిల్లాలో 2.5లక్షల ఎకరాలకు సాగునీరిచ్చాం ఫ ఇప్పుడు ఇక్కడ నీళ్ల మంత్రి ఉన్నా చుక్కనీరు తేలేకపోతుండు ఫ సూర్యాపేట సన్నాహక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
లాంగెస్ట్ రోడ్ నెట్‌వర్క్‌లో రెండో స్థానంలో నల్లగొండ
రాష్ట్రంలో అత్యధిక దూరం రోడ్ నెట్వర్క్ కలిగిన జిల్లాల్లో రంగారెడ్డి ప్రథమ స్థానంలో ఉండగా, నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,11,775.56 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉండగా, రంగారెడ్డిలో 7,932.14 కిలోమీటర్లు ఉంది. నల్లగొండలో 7,766.92 కిలోమీటర్లు ఉంది. కీలకమైన రోడ్డు డెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో నల్లగొండను ఒకటిగా తీసుకుంది. లతీఫ్ సాహెబ్ గుట్ట – బ్రహ్మంగారిమఠం, శివాలయం వరకు రూ.140 ఘాట్ రోడ్డును నిర్మించబోతోంది. రూ.236 కోట్లతో యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్ నుంచి నార్కట్‌పల్లి అద్దంకి హైవేకు లింక్ చేస్తూ సీసీరోడ్డు వేస్తోంది. -
పరిశ్రమల ద్వారా యాదాద్రికి రూ.5598 కోట్ల పెట్టుబడులు
టీఎస్ ఐపాస్ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి పరిశ్రమలు ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఐదో స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా నిలువగా, నల్లగొండ 12వ స్థానంలో నిలిచింది. సూర్యాపేట 23వ స్థానంలో నిలిచింది. యాదాద్రి జిల్లాలో 1032 పరిశ్రమలు ఏర్పాటు ద్వారా రూ.5598 కోట్ల పెట్టుబడులు రాగా, 34,876 మందికి ఉపాధి లభించింది. నల్లగొండ జిల్లాలో 693 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.4344 కోట్ల పెట్టుబడులు రాగా, 17,220 మందికి ఉపాధి లభించింది. సూర్యాపేట జిల్లాలో 330 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.5207 కోట్ల పెట్టుబడులు లభించగా, 10,439 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఒక్క సంవత్సరంలోనే..2024–25 ఆర్థిక సంవత్సరంలో యాదాద్రి జిల్లాలో 93 కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాగా రూ.222 కోట్ల పెట్టుబడులు వచ్చి 1666 మందికి ఉపాది లభించింది. నల్లగొండలో 56 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.955 కోట్ల పెట్టుబడులు రాగా, 2053 మందికి ఉపాధి లభించింది. సూర్యాపేట జిల్లాలో 26 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.67 కోట్లు రాగా, 516 మందికి ఉపాధి లభించింది. విద్యుత్ కనెక్షన్లలో టాప్ -
సమస్యల పరిష్కారమే ఎజెండా
నల్లగొండ టౌన్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడమే కమ్యూనిస్టుల ఎజెండా అని సీపీఐ జాతీయ సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికై న నెల్లికంటి సత్యంను గురువారం పార్టీ కార్యాలయంలో సన్మానించారు. ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పల్లా దేవేందర్‌రెడ్డి, పల్లా నర్సింహారెడ్డి, ఉజ్జిని రత్నాకర్‌రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్, వీరస్వామి, వెంకటేశ్వర్లు, నర్సింహ, వెంకటేశ్వర్లు, రామచంద్రం, శ్రీనివాస్, ధనుంజయ, అక్బర్, యాదగిరి, ఎల్వీ యాదవ్, యాదయ్య, పంకజ్‌యాదవ్ పాల్గొన్నారు. -
నల్లగొండ
ఇఫ్తార్ 6–32 (శుక్రవారం సాశ్రీశ్రీ) సహర్ 4–57 (శనివారం ఉశ్రీశ్రీ)చోరీ ముఠా అరెస్ట్ వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్లు, కరెంట్ తీగలను చోరీ చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. Iసాగర్ డ్యాం సందర్శించిన సీఈ సాగర్ డ్యాం ఎడమ వైపున అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా చీఫ్ ఇంజనీర్ అజయ్‌కుమార్ సందర్శించారు. శుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025- IIలో -
మూల్యాంకనం తేదీలో మార్పు
నల్లగొండ: ఇంటర్మీడియట్ తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సివిక్స్ పరీక్షలకు సంబంధించి ఈ నెల 22న జరగాల్సిన మూల్యాంకనం 21వ తేదీ (శుక్రవారం)కి మార్చినట్లు డీఐఈఓ దస్రూ నాయక్ గురువారం తెలిపారు. ఎగ్జామినర్లు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి నల్లగొండ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు ఉపకార వేతనాల మంజూరు కోసం ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు కోటేశ్వర్రావు గురువారం తెలిపారు. విద్యార్థులు telanga naepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు వారి బ్యాంకు ఖాతాను ఆధార్ నంబర్‌తో సీడింగ్ చేయించుకోవాలని సూచించారు. బడ్జెట్లో ప్రాధాన్యత రంగాలను విస్మరించారు నల్లగొండ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రాధాన్యత రంగాలను విస్మరించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. గురువారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో నిర్వహించిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో అంకెలు కేటాయించారే తప్ప ప్రజల అవసరాలకు అనుగుణంగా అమలు చేయడం లేదన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ, సాగునీటి, గ్రామీణ పట్టణాభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉన్నాయన్నారు. జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నాగార్జున అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి ఐలయ్య, మల్లేష్, శ్రీశైలం, ప్రభావతి, లక్ష్మీనారాయణ, హశం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి 25న ఇంటర్వ్యూలు నల్లగొండ: నల్లగొండ డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఈ నెల 25న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి గురువారం తెలిపారు. అభ్యర్థులకు ఆరోగ్య, వ్యాయామ విద్య బోధించేందుకు ఎంపీఈడీ, దృశ్యకళలు, ప్రదర్శన కళలు బోధించేందుకు ఎంపీఏ/ఎంఎఫ్ఎ/బీఎఫ్ఎ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా, ఫొటోతో నల్లగొండ డైట్ కళాశాలలో ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. వివరాలకు 99499 93723 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రి సందర్శన మర్రిగూడ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాయకల్ప పీర్ అసెస్మెంట్ స్టేట్ టీం సభ్యులు గురువారం మర్రిగూడ సీహెచ్‌సీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి భవనం, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. టీం సభ్యురాలు డాక్టర్ స్వప్నరాథోడ్ ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. సీహెచ్‌సీలో మరికొంత మంది వైద్యులు, సిబ్బంది అవసరం ఉందని వారిని నియమిస్తే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీం సభ్యులు మంజుల, సమీనా, సూపరింటెండెంట్ శంకర్‌నాయక్, గణేష్, పాల్గొన్నారు. ముగిసిన ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలునల్లగొండ: ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. కెమిస్ట్రీ– 2, కామర్స్– 2 పరీక్షకు సంబంధించి జిల్లాలో మొత్తం 12,894 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 12,504 మంది హాజరయ్యారు. 390 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ తెలిపారు. -
ఎగుమతుల్లో ఆరో స్థానంలో యాదాద్రి జిల్లా
సరుకుల ఎగుమతుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఆరో స్థానంలో నిలువగా, మెదక్ ఏడో స్థానంలో, నల్లగొండ 8వ స్థానంలో నిలిచింది. 41.42 శాతం ఎగుమతులతో మొదటి స్థానంలో రంగారెడ్డి, 17.60 శాతంతో రెండో స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల నిలిచాయి. 15.42 శాతం ఎగుమతులతో సంగారెడ్డి మూడో స్థానంలో, 13.51 శాతంతో హైదరాబాద్ నాలుగో స్థానంలో, 2.82 శాతంతో మహబూబ్‌నగర్ ఐదో స్థానంలో నిలిచాయి. 2.04 శాతంతో యాదాద్రి భువనగిరి ఆరో స్థానంలో నిలువగా, 1.38 శాతంతో మెదక్ ఏడో స్థానంలో, 1.07 శాతం ఎగుమతులతో నల్లగొండ 8వ స్థానంలో నిలిచింది. రాష్ట్రం నుంచి అయ్యే ఎగుమతుల్లో ఈ జిల్లాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. -
ప్రజల కోసం కలిసి పనిచేద్దాం
నల్లగొండ టౌన్: కమ్యూనిస్టులు పదవుల కోసం గాక ప్రజల కోసం పోరాడతారని అలాంటి వారితో కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై న సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డితో కలిసి గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా సత్యంను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇరవై ఏళ్లు నిరంతరం ప్రజల కోసం పని చేసిన సత్యంను ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం మంచి నిర్ణయమన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి కలిసి పని చేద్దామన్నారు. కార్యక్రమంలో పల్లా నర్సింహారెడ్డి, ఉజ్జిని రత్నాకర్‌రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, పల్లా దేవేందర్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్, వీరస్వామి పాల్గొన్నారు. ఫ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్లగొండ: రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశంలో ఆమె మాట్లాడారు. రహదారులపై ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పోలీస్ శాఖ సూచనల మేరకు ప్రమాదాలు జరగకుండా జాతీయ రహదారులు, ఆర్అండ్బీ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ శరత్ చంద్రపవార్ మాట్లాడుతూ.. మిషన్ ఆధార్ పేరున రహదారుల దగ్గర్లో ఉన్న గ్రామాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేసిన పోలీస్, ఆర్అండ్బీ, జాతీయ రహదారుల సంస్థ అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు. -
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
నల్లగొండ: పదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తిరిగి ఏప్రిల్ 4వ తేదీన ముగియనున్నాయి. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా 105 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 18,825 మంది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులకు 5 నిమిషాల సడలింపు అవకాశం కల్పించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని డీఈఓ భిక్షపతి తెలిపారు.ఫ పరీక్ష రాయనున్న 18,825 మంది -
105 కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు
ఫ హాజరుకానున్న 18,525 మంది విద్యార్థులు ఫ జవాబులు రాసేందుకు క్యూఆర్ కోడ్‌తో కూడిన 24 పేజీల బుక్లెట్ ఫ పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ భద్రత ‘సాక్షి’తో డీఈఓ భిక్షపతి నల్లగొండ : ‘పదో తరగతి పరీక్షలు ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీన జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 105 కేంద్రాలు ఏర్పాటు చేశాం. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు కన్వర్జేషన్ మీటింగ్ నిర్వహించి పరీక్ష కేంద్ర వద్ద అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి’ అని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. 144 సెక్షన్ అమలు పదో తరగతి పరీక్షలు జిల్లాలో 18,825 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 18666 మంది రెగ్యులర్, 259 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. ఇందుకోసం జిల్లాలో మొత్తం 105 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తాం. ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ పేపర్లు మాత్రం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తాం. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నాం.. పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తాం. సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించాం. బుక్లెట్పై క్యూఆర్ కోడ్.. పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు జవాబులు రాసేందుకు గతంలో మెయిన్ ఆన్సర్ షీట్, అడిషనల్ షీట్లు ఇచ్చేవారు. ఈసారి వాటి స్థానంలో 24 పేజీల బుక్లెట్ అందిస్తున్నాం. ఆ బుక్లెట్పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. 986 మంది ఇన్విజిలేటర్లు జిల్లా వ్యాప్తంగా 986 మంది ఇన్విజిలేటర్లు, ఆరు ఫ్లయింగ్ స్క్యాడ్ బృందాలు ఏర్పాటు చేశాం. అందులో విద్యాశాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉంటారు. చీఫ్ సూపరింటెండెంట్లు 105 మంది, డిపార్టుమెంట్ అధికారులు 105 మంది ఉంటారు. సిట్టింగ్ స్క్యాడ్గా 13 మందిని ఏర్పాటు చేశాం. 13 సీ సెంటర్లు.. పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతంలో ట్రెజరీ ఆఫీస్, పోలీస్ స్టేషన్, పోస్టాఫీస్ లేని వాటిని సీ సెంటర్లుగా గుర్తించాం. ఈ పరీక్ష కేంద్రాలవారు ఇతర సెంటర్‌వారు ప్రశ్నపత్రాలు పెట్టే పోస్టాఫీస్‌ల్లోనే వారి పేపర్లను ఉంచుతారు. అక్కడ నుంచి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి పరీక్ష పూర్తయిన తర్వాత అదే పోస్టాఫీస్‌లో అప్పజెప్పాలి. కస్టోడియన్లు, జాయింట్ కస్టోడియన్లు పరీక్ష కేంద్రాలకు పేపర్లు తీసుకురావడంతోపాటు తిరిగి పోస్టాఫీస్‌లకు తీసుకెళ్లాలి. ప్రతి పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ రూమ్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ప్రశ్నపత్రాలను ఆ సీసీ కెమెరాల ముందే ఓపెన్ చేస్తాం. ప్రతి పరీక్ష కేంద్రంలో ఎంఈఓ, ఎస్ఐ ఫోన్ నంబర్లను రాసి ఉంచాం. డీఈఓ ఆఫీస్‌లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశాం. 45 నిమిషాల ముందుగానే కేంద్రంలోకి.. విద్యార్థులు హాల్ టికెట్ తీసుకున్న తర్వాత పరీక్షకు ముందు రోజే సెంటర్‌కు వెళ్లి చూసుకోవాలి. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందునుంచే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తాం. హాల్‌టికెట్, పెన్ను, పెన్సిల్, పరీక్ష ప్యాడ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. దివ్యాంగులు, చేతులు పనిచేయనివారు పరీక్షలు రాసేందుకు స్క్రైబ్‌లుగా.. 9వ తరగతి విద్యార్థులను ఏర్పాటు చేస్తాం. -
రైతులు మెట్ట పంటలు వేయాలి
చిట్యాల : తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడి ఇచ్చే మెట్ట పంటలు, పండ్లు తోటలు, కూరగాయాల సాగు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. చిట్యాల మున్సిపాలిటీ శివారులోని రైతు కొంతం సత్తిరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కూరగాయాలు, మామిడి, పుచ్చకాయల సాగును పరిశీలించారు. కూరగాయాలు, పుచ్చకాయల సాగులో తీసుకుంటున్న జాగ్రత్తలు, నీటి వాడకం, దిగుబడి, ఖర్చులు, ఆదాయం, మార్కెటింగ్ వివరాలను ఆమె రైతు సత్తిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కొద్దిపాటి నీటితో సేంద్రియ పద్ధతిలో కూరగాయాలు, పండ్ల తోటలను సాగు చేస్తున్నట్లు రైతు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో ఉన్న నీటి వనరులను ఉపయోగించుకుని రైతులు సూక్ష్మసేద్యం, బింధు సేద్యం ద్వారా పంటలను సాగుచేసి ఆర్థికాభివృద్ధి చెందాలని సూచించారు. వచ్చే వానాకాలం వరికి ప్రత్యామ్నాయ పంటలను పండించేందుకు రైతులను సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు. కుంటల్లో నీటి నిల్వకు చర్యలు తీసుకోవాలి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో పోతరాజు కుంట, చౌటకుంటలో పూడిక తీసి నీటి నిల్వలకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పట్టణానికి దూరంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఏఓ శ్రవణ్‌కుమార్, ఉద్యానవన శాఖాధికారి అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, ఎంపీడీఓ ఎస్పీ.జయలక్ష్మి, డీటీ విజయ, ఏఓలు గిరిబాబు, శ్రీను, హార్టికల్చర్ అధికారి శ్వేత, ఏఈఓలు కృష్ణకుమారి, మనిషా, వాసుదేవరెడ్డి, ఏపీఓ శ్రీలత, రైతులు యాస సంజీవరెడ్డి, లింగారెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, జిట్ట బొదయ్య, అజిత్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నల్లగొండ
ఇఫ్తార్ 6–33 (గురువారం సాశ్రీశ్రీ) సహర్ 4–58 (శుక్రవారం ఉశ్రీశ్రీ)రైతాంగాన్ని కాపాడాలి కృష్ణాలో నీటిలో హక్కులను సాధించి మన రైతాంగాన్ని కాపాడాలని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి కోరారు. - IIలోIస్ఫూర్తిదాయకం నీ ఘనత భారతీయ సంతతికి చెందిన సునీత విలియమ్స్ వ్యోమగామిగా సాధించిన విజయాలు యువతకు ఆదర్శం.- IVలోగురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025 -
బ్లాక్ స్పాట్స్‌లో సర్వీస్ రోడ్లు నిర్మించాలి
నకిరేకల్, కట్టంగూర్ : హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణ కోసం సర్వీస్ రోడ్లు నిర్మించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు. నకిరేకల్‌లోని పద్మానగర్ జంక్షన్ వద్ద, కట్టంగూర్‌లో నల్లగొండ క్రాస్ రోడ్డు, కురుమర్తి క్రాస్ రోడ్డును బుధవారం ఆయన చౌదరి కంపెనీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ మూడు చోట్ల సర్వీస్ రోడ్లు లేక ప్రజలు రాంగ్రూట్లో ప్రయాణించడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారని గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు నిర్మించాలని, హైవేపై అన్ని జంక్షన్ల వద్ద హైమాస్ట్ లైట్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అమర్చాలని ఆదేశించారు. రాత్రి వేళ్ల రహదారిపై వాహనాలు నిలిపి ఉండకుండా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరాంరెడ్డి, శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, కట్టంగూర్ ఎస్ఐ రవీందర్, హైవే రెసిండింట్ ఇంజనీర్లు కిషన్‌రావు, జోగేంద్ర, చౌదరి కంపెనీ మేనేజర్ నాగకృష్ణ, రాంకుమార్, సంజీవచౌదరి, పోలిశెటి అంజయ్య తదితరులు ఉన్నారు. ఫ ఎస్పీ శరత్ చంద్రపవార్ -
సాగునీటికి పెద్దపీట
ప్రాజెక్టులకు రూ.1600 కోట్లు కేటాయింపు ఫ గతేడాది కంటే ఈ బడ్జెట్లో నిధులు ఎక్కువే.. ఫ కొనసాగనున్న ఎస్ఎల్బీసీ, ముందుకు సాగనున్న డిండి ఫ ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాలువల ఆధునీకరణకు నిధులు ఫ నాగార్జునసాగర్ డ్యాం పెండింగ్ పనులకు మోక్షం ఫ ఎంజీ యూనివర్సిటీ అభివృద్ధికి పైసా కేటాయించని ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో గతేడాది కంటే కాస్త ఎక్కువ నిధులే కేటాయించింది. ప్రధాన ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ముఖ్యంగా డిండి ఎత్తిపోతల పథకానికి, శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) వంటి ప్రాజెక్టులకు నిధులు పెంచింది. నాగార్జునసాగర్ కింద పలు పెండింగ్ పనులు, ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల పనులకు మోక్షం లభించే అవకాశం ఉంది. మొత్తంగా నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులకు ప్రగతి పద్దు కింద రూ.1600 కోట్లు (1599.90) కేటాయించింది. సూర్యాపేట జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ స్టేజ్–2, మూసీ ప్రాజెక్టు కింద పలు పనులకు గతేడాదిలాగే నిధులను ఇచ్చిన ప్రభుత్వం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాజెక్టులకు ప్రత్యేకంగా బడ్జెట్లో కేటాయింపులను చూపించలేదు. బస్వాపూర్, గంధమల్లకు కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిధులు వచ్చే అవకాశం ఉంది. బూనాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలకు ఇటీవల అనుమతి ఇచ్చిన రూ.266.65 కోట్లను వినియోగిస్తామని బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులపై ఆశలు జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపును పెంచడంతో రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్‌లెట్‌లో ఇటీవల ప్రమాదం చోటు చేసుకోవడం.. ఇప్పటికీ సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే, ఈ బడ్జెట్లో ఎస్ఎల్బీసీ, ఏఎంఆర్పీ కింద నిధుల కేటాయింపు పెంపుతో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు కొనసాగుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టుకు గతే ఏడాది రూ.800 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.900 కోట్లను (899.90) కేటాయించింది. ఇందులో ప్రధాన కాలువల కోసం రూ. 578.81 కోట్లు కేటాయించగా, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలకు రూ.201.19 కోట్లు, పునరావాసం, పరిహారం (ఆర్ అండ్ ఆర్) కోసం రూ.120 కోట్లు కేటాయించింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు నీటిని అందించేందుకు బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును ప్రారంభించినట్లు భట్టి విక్రమార్క బడ్జెట్లో ప్రసంగంలో పేర్కొన్నారు. దానిద్వారా 94 గ్రామాల్లో లక్ష ఎకరాలకు, 107 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు నీటిని అందిస్తామని చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టు ఏఎఆర్పీలో భాగం అయినందున దీనికింద చేయాల్సిన కాలువల పనులకు కూడా ఈ నిధులనే వినియోగించే అవకాశం ఉంది. జీతాలకే రూ.35 కోట్లు మహాత్మాగాంధీ యూనివర్సిటీకి గతేడాదిలో వేతనాల కోసమే ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. ప్రగతి పద్దు కింద ఎలాంటి నిధులివ్వకపోవడంతో యూనివర్శిటీలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. వివిధ పనులను చేపట్టేందుకు, కొత్త కోర్సులన ప్రవేశపెట్టేందుకు, ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు, భవనాల నిర్మాణం, మౌలికసదుపాల కల్పన తదితర పనులకు రూ.309 కోట్లు కావాలని యూనివర్సిటీ ప్రతిపాదించినా పైసా ఇవ్వలేదు. ఇక నాగార్జునసాగర్‌లో బుద్ధుని వారసత్వ ప్రాంతీయ మ్యూజియం ఏర్పాటు కోసం రూ.1.15 కోట్లు కేటాయించింది. అలాగే బుద్ధవనం ప్రాజెక్టుకు రూ.3 కోట్లు కేటాయించింది.నాగార్జునసాగర్‌కు పెరిగిన నిధులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో వివిధ పనుల కోసం గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌ను భారీగా పెంచింది. గతేడాది బడ్జెట్లో రూ.96.07 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం ఈసారి వాటిని రూ.297.95 కోట్లకు పెంచింది. ఆ నిధులతో డ్యాం సంబంధిత, ప్రధాన పనులు, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులను చేపడతామని ప్రకటించింది. అయితే నాగార్జునసాగర్ కింద గతంలో మంజూరు చేసిన దాదాపు 15 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులను ఈ బడ్జెట్లో ప్రస్తావించలేదు.