
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు తరలిరండి
దేవరకొండ: వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించ తలపెట్టిన బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం దేవరకొండ పట్టణంలో జరిగిన ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా వాడుకుంటున్నా జిల్లా మంత్రులు ఒక్కమాట కూడా మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం.. ఏపీ సీఎం చంద్రబాబు చేతుల్లోకి పోతుందని ఆరోపించారు. ఓ పక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఎండిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణకు సాధ్యంకాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. బంగారు తెలంగాణ కోసం బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ మోసగాళ్ల పార్టీ అని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రవీంద్రకుమార్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభకు తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు వడ్త్య రమేష్‌నాయక్, కేతావత్ బీల్యానాయక్, టీవీఎన్ రెడ్డి, కంకణాల వెంకట్‌రెడ్డి, పల్లా ప్రవీణ్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, గాజుల ఆంజనేయులు, రాఘవాచారి, సుభాష్‌గౌడ్, దస్రునాయక్, లోక్యానాయక్, ఆయా మండలాల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి